• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INTERNATIONAL NEWS

జర్నలిస్టుల ముసుగులో పోలీసులు- మీడియాలో కట్టు కథలు !

27 Tuesday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ap special asistance, ap special status, cia, fake news, fake stories, fake stories in media, FBI, journalism, journalist, Police agents as journalist, pope on journalism, popefrancis

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.

ఎం కోటేశ్వరరావు

     జర్నలిజం, జర్నలిస్టుల పాత్ర, తీరు తెన్నుల గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి రోజూ ఏదో ఒక మూల చర్చ జరుగుతూనే వుంది. ప్రసార మాధ్యమాల విస్తృతితో వారి సంఖ్య, కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మీడియాలో అనేక అవాంఛనీయ ధోరణులు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అవాంఛనీయ శక్తులు మీడియా రంగాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ప్రపంచాన్ని చాపమాదిరిగా చుట్టి తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచ పౌరులను తప్పుదారి పట్టించేందుకు తమ అజెండాను అమలు జరిపేందుకు కట్టుకధలు, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మీడియాలో కట్టుకథలను చొప్పించటం, అందుకు గాను గూఢచారులు, పోలీసులకు జర్నలిస్టుల ముసుగు వేయటం, జర్నలిస్టులను డబ్బుతో లొంగదీసుకొని వారి పేర్లతో కట్టుకధలను ప్రచారంలో పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి పరిణామాలపై విహంగ వీక్షణమిది.

   దర్యాప్తు సమాయాలలో ఎఫ్‌బిఐ(మన సిబిఐ మాదిరి) ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో పని చేయవచ్చని ఆ సంస్ధ ఇన్సపెక్టర్‌ జనరల్‌ తాజాగా ప్రకటించారు. ప్రధాన స్రవంతి మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా పోలీసు ఏజంట్లు ప్రవేశించి పని చేయటం కొత్త కాదని, ఎప్పటి నుంచో జరుగుతున్నదని కూడా వెల్లడించారు. అయితే ఎవరు జర్నలిస్టుల ముసుగులో వున్న పోలీసులో ఎవరు కాదో తెలియటం అంత సులభం కాదు. వివిధ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల పెద్ద సంఖ్యలో పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో మీడియాలో తిష్ట వేశారు.లేదా జర్నలిస్టులను తమ ఏజంట్లుగా మార్చుకొని తమ అజెండా, కార్యకలాపాలను వారితో నిర్వహిస్తున్నారు. కాబట్టి వార్త లేదా వాస్తవాలు పవిత్రం, వ్యాఖ్యలు మీ ఇష్టం అనేది ఇంకే మాత్రం చెల్లదు. పోలీసు ఏజంట్లు, అవాంఛనీయ శక్తులు మీడియాలో ప్రవేశించిన తరువాత వార్తలకున్న పవిత్రత ఎప్పుడో గంగలో కలిసింది. కనుక వాస్తవాల పేరుతో పచ్చి అవాస్తవాలు, వ్యాఖ్యల పేరుతో తమకు అనుకూలమైన కథనాలను ప్రచారంలో పెడుతున్నారన్నది జనం గ్రహించాలి. ఈ పని పోలీసులే కాదు, అధికారంలో వున్న రాజకీయ పార్టీలు కూడా గుండుగుత్తగా మీడియా సంస్ధలతో కుమ్మక్కు, కొనుగోలు చేసి తమ బాకాలుగా మార్చుకోవటం తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పార్టీ, ఏ వ్యక్తులు ఈ పని చేశారని ప్రశ్నించే వారికి చేయని ప్రధాన పార్టీ, వ్యక్తులు ఎవరు అందరూ చేశారన్నదే సమాధానం !

    రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ ‘ఆపరేషన్‌ మోకింగ్‌ బర్డ్‌ ‘ పేరుతో మీడియాలో తన ఏజంట్లను ప్రవేశపెట్టటానికి తెరతీసింది. అది నిధులిచ్చి వివిధ సంస్ధల పేరుతో కొన్ని పత్రికలను కూడా నడిపించింది. ఒక్క సిఐఏ మాత్రమే కాదు, ఎఫ్‌బిఐ కూడా అదే పనిచేసిందని కొద్ది రోజుల క్రితం ఆ సంస్ధ స్వయంగా ఏకంగా ఒక నివేదికనే విడుదల చేసింది. ఆసక్తి వున్న వారు ఆ లింక్‌లో పూర్తి నివేదిక చదవచ్చు.https://oig.justice.gov/reports/2016/o1607.pdf తన చర్యలను సమర్ధించుకొనేందుకు, నిజమే కదా అలాంటి సందర్బాలలో వాస్తవాలను బయట పెట్టటం, నిందితులను పట్టుకొనేందుకు ఏ పద్దతి అనుసరించినా తప్పేముంది అని జనం అనుకొనేందుకు వీలు కలిగించే అంశాలనే ఎఫ్‌బిఐ ఆ నివేదికలో పొందుపరచిందని వేరే చెప్పనవసరం లేదు. మచ్చుకు ఆ నివేదిక నుంచి అలాంటి వుదాహరణనే చూడవచ్చు.

    2007 జూన్‌లో ఒక 15 ఏండ్ల హైస్కూలు బాలుడు సియాటిల్‌ పట్టణ సమీపంలోని ఒక హైస్కూలు సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి వారం రోజుల పాటు ఇమెయిల్స్‌ పంపుతూ బాంబు బెదరింపులకు పాల్పడ్డాడట. ప్రతి రోజూ స్కూలును ఖాళీ చేయించటం తనిఖీ చేసి బాంబులేవీ లేవని నిర్ధారించుకోవటం జరిగింది. ఆ మెయిల్స్‌ ఎక్కడి నుంచి పంపుతున్నదీ పసిగట్టకుండా వుండేందుకు ఒక సారి ఒక దగ్గర నుంచి పంపిన మెయిల్‌ను మరొకసారి అక్కడి నుంచి కాకుండా వేరే చోటు నుంచి పంపాడట.దీంతో అతడిని పట్టుకోవటం పెద్ద సవాలుగా మారింది. ఎవరైనా ఏ కంప్యూటర్‌ నుంచి పని చేస్తున్నారో, అది ఎక్కడ వుందో తెలుసుకొనే ఒక రహస్య సాప్ట్‌వేర్‌ను జత చేసి అసోసియేటెడ్‌ ప్రెస్‌ (మన పిటిఐ, యుఎన్‌ఐ మాదిరి వార్తా సంస్ధ) ఎడిటర్‌ పేరుతో ఒక తప్పుడు వార్త, ఫొటోల లింక్‌లను సామాజిక మాధ్యమాలలోకి వదిలాడు. వాటిపై క్లిక్‌ చేసిన వారి చిరునామా ఆ లింక్‌లను పంపిన వారికి వెంటనే చేరి పోతుంది. ఆ వుచ్చులో పడిన ఆ కుర్రాడు దొరికిపోయి నిజాన్ని ఒప్పుకున్నాడట. ఆ నిందితుడిని ఎలా పట్టుకుందీ మీడియాకు చెప్పలేదు. అయితే దానిని పసిగట్టిన ఒక వెబ్‌సైట్‌ కొద్ది రోజుల తరువాత ఎలా పట్టుకుందీ వెల్లడించిందట. ఏడు సంవత్సరాల తరువాత సియాటిల్‌ టైమ్స్‌ అనే పత్రిక ఎఫ్‌బిఐ ఏజంటు జర్నలిస్టు ముసుగులో బాంబు బెదరింపులకు పాల్పడ్డ విద్యార్ధిని పట్టుకున్నట్లు వెల్లడించింది. తమ వార్తా సంస్ధ జర్నలిస్టు ముసుగులో ఎఫ్‌బిఐ ఏజంట్లు దర్యాప్తు చేయటాన్ని నిరసిస్తూ ఏపి వార్తా సంస్ధ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతో అనేక పత్రికలు ఎఫ్‌బిఐ ఎత్తుగడలను ప్రశ్నిస్తూ వార్తలు రాశాయి. ఒక వారం తరువాత ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు రాసిన లేఖలో సంస్ధ మార్గదర్శక సూత్రాల ప్రకారం అలాంటి పని చేయవచ్చని తమ చర్యను సమర్ధించుకున్నారు.

   దేశ రాజధాని, రాష్ట్ర రాజధానులు, ఇతర పెద్ద నగరాలలో అనేక మంది పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో విలేకర్ల సమావేశాలకు హాజరవుతుంటారు. ఎవరైనా అభ్యంతర పెడితే మౌనంగా వెళ్లిపోతారు. లేదా విలేకర్ల సమావేశాలు జరిగే చోట బయట వేచి వుండి విలేకర్ల వెంటపడి ఎవరేం చెప్పారో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు.అమెరికన్‌ ఎఫ్‌బిఐ చర్యలను నిరసిస్తూ రిపోర్టర్స్‌ కమిటీ ఫర్‌ ప్రీడమ్‌ ఆఫ్‌ ద ప్రెస్‌ ( పత్రికా స్వేచ్చ కోసం పని చేసే విలేకర్ల కమిటి ) మరో 25 సంస్ధల తరఫున ఒక లేఖ రాస్తూ ఎఫ్‌బిఐ చర్య జర్నలిస్టుల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, స్వతంత్రకు భంగం కలిగిస్తుందని అభ్యంతరం తెలిపింది. అయితే ఎఫ్‌బిఐ ఇలాంటి వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. జర్నలిస్టుల ముసుగులో తన ఏజంట్లు పనిచేసేందుకు వున్నతాధికారుల అనుమతి తీసుకోవాలంటూ ఒక చిన్న నిబంధన చేర్చి 2016 మార్గదర్శ సూత్రాలను తయారు చేసింది. అంటే తాను చేసే తప్పుడు పనులకు అధికారిక ముద్ర వేయటం, మరింత బరితెగించి చేయటం తప్ప మరొకటి కాదు.

     ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. పోలీసులు, గూఢచారులు అల్లే కట్టుకధలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారానికి విశ్వసనీయత కలిగించేందుకు జర్నలిస్టుల పేర్లను వాడుకోవటం కూడా జరుగుతోంది. జర్మనీలోని అతి పెద్ద పత్రికలలో ఒకటైన ఫ్రాంక్‌ఫర్టర్‌ అల్‌జెమినీ జీటుంగ్‌ పత్రికకు రెండు దశాబ్దాలకు పైగా సంపాదకుడిగా వున్న జర్మన్‌ జర్నలిస్టు డాక్టర్‌ యుడో అల్‌ కొటే రష్యాకు చెందిన ఆర్‌టి న్యూస్‌ అనే టీవీలో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించి వుద్యోగం పోగొట్టుకున్నాడు. గూఢచారులు తయారు చేసిన కధనాలను తన పేరుతో ప్రచురించాలని వత్తిడి చేశారని, దానిని తిరస్కరించినందుకు యాజమాన్యం వుద్యోగం నుంచి తొలగించింది. తనకు పిల్లలు లేనందున ఎవరూ తనను బెదిరించలేరంటూ అనేక విషయాలు వెల్లడించిన ఆ జర్నలిస్టు మాటల్లోనే ఏం జరిగిందో చూడండి.’ నేను పాతికేండ్లుగా జర్నలిస్టుగా వున్నాను. జనానికి నిజం చెప్పకుండా మోసం చేసేందుకు, అబద్దాలు చెప్పేందుకు నాకు శిక్షణ ఇచ్చారు. రష్యాతో యుద్ధానికి తలపడేందుకు గాను ఐరోపా పౌరుల ముంగిటికి కూడా యుద్ధాన్ని తెచ్చేందుకు జర్మన్‌, అమెరికన్‌ మీడియా గత కొద్ది నెలలుగా ప్రయత్నించటాన్ని చూశాను.గతంలో నేను చేసింది సరైంది కాదని ఇంకే మాత్రం దీనిని సహించకూడదని, ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాను. రష్యాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు, తిమ్మిని బమ్మిని చేసి జనాన్ని నమ్మించేందుకు గతంలో ప్రయత్నించాను. ఒక్క జర్మన్లనే కాకుండా యావత్‌ ఐరోపా వాసులను మోసం చేసేందుకు ముడుపులు తీసుకున్న నా సహజర్నలిస్టులు చేసింది కూడా సరైంది కాదని , తాను స్వయంగా సిఐఏ కధనాలను తన పేరుతో అందించానని తెలిపారు.ప్రధాన మీడియా సంస్ధలలోని జర్నలిస్టులను అవినీతి పరులుగా చేయటం పశ్చిమ దేశాల మీడియాలో అందరూ అంగీకరించే సిఐఏ రోజువారీ వ్యవహారం. ఎవరైనా అందుకు అంగీకరించకపోతే వారికి మరో చోట ఎక్కడా వుద్యోగాలు రానివ్వరు లేదా అర్ధంతరంగా ముగిసిపోతాయి. సిఐఏ అవినీతి గురించి బట్టబయలు చేస్తూ ‘జర్నలిస్టుల కొనుగోలు’ పేరుతో రాసిన పుస్తకానికి సంబంధించి సమీక్షలను జర్మనీలోని ప్రధాన పత్రికలలో రాకుండా అడ్డుకున్నారని కూడా తెలిపారు. తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తూ లిబియా అధ్యక్షుడు గడాఫీ విషవాయువుల ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నట్లు కట్టుకధలు ప్రచురించాలని 2011లో తనను అదేశించారని, ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో వార్తల సేకరణకు వెళ్లిన తాను విషవాయు దాడిలో గాయపడ్డానని సద్దాం హుస్సేన్‌ వుపయోగించిన విషవాయువుల గురించి రాయవద్దని కూడా చెప్పారని, ఆ సమయంలో సద్దాం అమెరికాకు స్నేహితుడిగా వుండటమే కారణమని పేర్కొన్నారు. అమెరికా నుంచి వెలువడై టైమ్స్‌ పత్రిక యాజమాన్య స్ధాయిలోనే సిఐఏ మనుషులు వున్నందున దశాబ్దాల తరబడి దానిలో సిఐఏ కధనాలు వెలువడేవని జర్మన్‌ జర్నలిస్టు వెల్లడించారు.

   కొన్ని సార్లు సమాచారాన్ని వక్రీకరించటానికి లేదా ఎంపిక చేసిన సమాచారాన్ని వార్తలుగా ఇచ్చేందుకు తమకు అమెరికా ప్రభుత్వం, విదేశీ ప్రభుత్వాలు డబ్బు చెల్లించేవని, ఆ సమాచారాన్ని వీక్షకులు, చదువరులకు ఎలా అందచేయాలో కూడా ప్రభుత్వాలే ఎడిట్‌ చేసి ఇచ్చేవని మూడు సార్లు ఎమ్మీ అవార్డు పొందిన జర్నలిస్టు అంబర్‌ లేయాన్‌ వెల్లడించారు.’ అనేక అంశాలకు సంబంధించి ఏం జరుగుతోందన్న మన అవగాహనను అనేక సార్లు పూర్తిగా అదుపు చేశారు. అందుకు పెద్ద వుదాహరణ ‘వుగ్రవాదంపై పోరు’ ఇంకా స్పష్టంగా అయితే వుగ్రవాదం గురించి తప్పుడు చిత్రీకరణ. వీటన్నింటికీ ఇస్లామిక్‌ తీవ్రవాదులే అనే దానికి అనుగుణంగా మా బుర్రలను తయారు చేశారు.అందుకు 9/11 మంచి వుదాహరణ. సామూహిక మారణాయుధాల పేరుతో మధ్యప్రాచ్యంపై దాడి చేయటాన్ని సమర్ధించుకొనేందుకు ఎవరైతే ఈ వుదంతాన్ని వుపయోగించుకొనేందుకు ప్రవర్తించారో వారే దానిని సృష్టించారు. జన్యుమార్పిడి ఆహారం, ఔషధాలు, పండిత చర్చలు మొదలైన వాటన్నింటికీ సంబంధించి వాటికి అనుగుణ్యంగా మన అవగాహనను మలిచారు ‘ అని ఆమె చెప్పారు. ప్రపంచ కార్పొరేట్‌, సామ్రాజ్యవాదుల చేతులలో మీడియా పురోగామి, సోషలిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక, ప్రచారదాడి అస్త్రంగా తయారైంది. లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదుల విధానాన్ని వ్యతిరేకిస్తున్న వెనెజులా వామపక్ష ప్రభుత్వం, అక్కడి అధికార సోషలిస్టు పార్టీకి వ్యతిరేకంగా మీడియా జరిపిన విషపు దాడి, వ్యాపింప చేసిన అవాస్తవాల గురించి స్పెయిన్‌కు చెందిన లాయర్‌, విశ్లేషకుడైన ఫెర్నాండో కసాడో ఒక గ్రంధమే రాశాడు. వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌, ఆయన భావజాలమైన 21వ శతాబ్దపు సోషలిజాన్ని ప్రపంచ మీడియా ప్రధమ శత్రువుగా ఎందుకు పరిగణిస్తోంది, నిజమైన వెనెజులాకు, మీడియా చిత్రిస్తున్నదానికి తేడా వుందేమిటి అన్న ఆలోచన ఫెర్నాండోకు కలిగి వివరాల్లోకి వెళ్లారు. అది ఒక పెద్ద పుస్తకంగా తయారైంది. దాని గురించి స్పుత్నిక్‌ అనే పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచ మీడియా తరచూ వాస్తవాలను వక్రీకరించి వాటినే ‘నిజాలు’గా జనం ముందుంచేందుకు పని చేస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయంటూ వాటిలో మొదటిది, ముఖ్యమైనది 21వ శతాబ్దపు సోషలిజంతో మీడియా సైద్ధాంతిక దాడికి పూనుకోవటం. బడా మీడియా అంతా కంపెనీల చేతుల్లో వుంది, వాటి ప్రధాన ప్రేరణ లాభాలు. ఈ కంపెనీలకు ఇతర కంపెనీలకు వున్న తేడా ఏమిటంటే ఇవి వస్తువులకు బదులు సమాచారాన్ని విక్రయిస్తాయి. బడా మీడియా సంస్ధలు తరచూ తమ సిద్ధాంతాలు, వాణిజ్య ప్రయోజనాలకు అదే విధంగా తమకు ప్రకటనలు ఇచ్చే వారి ప్రయోజనాలకు ముప్పు వచ్చినపుడు దాడులకు తెరతీస్తాయి. ‘ ఇరాక్‌ కంటే మరింత ప్రమాదకరమైనది వెనెజులా అంటే ఆశ్చర్యం ఎందుకు ?’ అనే శీర్షికతో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని చూడండి, ఇతర విషయాలతో పాటు ఇరాక్‌లో కంటే వెనెజులాలో ఎక్కువ మంది జనాన్ని చంపినట్లు దానిలో రాశారు. మీడియా సాయంతో అబద్దాలు నిజాలుగా మారిపోతున్నాయి. అటు వంటి తిమ్మిని బమ్మిని సమాచారం తరచుగా ప్రచురితమైతోంది. అత్యంత దారుణమైన విషయం ఏమంటే ఇటువంటి ప్రచారం పశ్చిమ దేశాల మీడియాతో పాటు లాటిన్‌ అమెరికా పత్రికలు కూడా చేస్తున్నాయి. కొంత మంది జర్నలిస్టులకు ఎలాంటి పక్షపాతం వుండదు, వారికి వాస్తవ పరిస్థితి తెలుసు, మంచి వేతనాలు, మెప్పు పొందాలంటే ఎడిటర్లు కోరుకున్నది తప్ప వాస్తవాలను రాసే అవకాశం వుండటం లేదు. ఇలాంటి ప్రచురణ సంస్ధల దృష్టి మరిన్ని లాభాలు, అందుకోసం సంచలనాత్మకతకు పాల్పడటం తప్ప తాము ప్రచురిస్తున్నది వాస్తవమా కాదా అనే దానితో వాటికి నిమిత్తం లేదు ‘ అని ఫెర్నాండో వ్యాఖ్యానించారు.

    కట్టు కథలు, సత్యదూరమైన అంశాలు పత్రికలు, టీవీలలోనే కాదు, సామాజిక మాధ్యమాలలో కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి.ప్రముఖ వ్యక్తుల బొమ్మలు పెట్టి వారి పేర్లతో కొటేషన్లు పెడతారు. వాటిలో వాస్తవం ఎంతో కూడా ఆలోచించ కుండా అనేక మంది వాటిని లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తుంటారు. అంతవరకైతే అదొక తీరు, దాని మీద వ్యాఖ్యానాలు, సంస్కార రహితమైన బూతు, తిట్లు విపరీతం. వుదాహరణకు అమెరికా పదహారవ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ 1861-65 మధ్య పదవిలో వున్నారు. ఆయనను 1965లో హత్య చేశారు. ఆయన బొమ్మతో ఒక కొటేషన్‌ పెట్టి వదిలారు. దానిలో ఇంటర్నెట్‌లో ఒక కొటేషన్‌, దాని పక్కనే ఒక బొమ్మ పెట్టిన వాటన్నింటినీ నమ్మ వద్దు అని రాసి వుంది. అది వాస్తవమే. అయితే ఆ విషయాన్ని అబ్రహాం లింకన్‌ చెప్పారని ఆయనకు ఆపాదించటమే నకిలీ. ఎందుకంటే ఆయన మరణించిన వంద సంవత్సరాల తరువాత ఇంటర్నెట్‌కు అంకురార్పణ జరిగింది. పాపం లింకన్‌కు ఇంటర్నెట్‌ అనే పదమే తెలిసి వుండదు. ఇలా అనేకం వున్నాయి. మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ ప్రయోగాలు అనేక జరుగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ గొప్పతనాన్ని గురించి చెప్పేందుకు ఒక ఫొటోను ప్రయోగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్బంగా గదులను శుభ్రం చేసిన ఒక నిరాండంబర వ్యక్తిగా చిత్రించే ప్రయత్నంలో భాగంగా అది జరిగింది. ఇలా చాలా చెప్పుకోవచ్చు.

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.సెప్టెంబరు 23న ఇటలీ జర్నలిజం గిల్డ్‌ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్పిత కధనాలు, గాలి వార్తలపై ఆధారపడి ఐరోపాకు వస్తున్న శరణార్ధుల వంటి మానవత్వ సంక్షోభ సమయాలలో వారికి వ్యతిరేకంగా రాస్తున్న వార్తలు ఒక రకమైన వుగ్రవాదం తప్ప మరొకటి కాదన్నారు. విమరశ న్యాయమైనదే,దుర్నడతలను ఆక్షేపించటానికి అది అవసరం కూడా అని నేను అంటాను, అయితే జర్నలిజం కొంత మంది వ్యక్తుల లేదా దేశాల మానవ వినాశకర ఆయుధం కాకూడదు. గాలి కబుర్ల అలవాటు వుగ్రవాదపు అలవాట్లలో ఒకటి. వుగ్రవాదుల మాదిరి నాశనం చేయటానికి గాలి కబుర్ల వారు మాటల బాంబులు వేస్తారు ‘ అని కూడా చెప్పారు.

     మీడియా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే దాని పర్యవసానాలు ముందుగా ఫీల్డ్‌లో పని చేసే విలేకర్లు అనుభవిస్తారన్నది అనేకసార్లు రుజువైంది. దాడుల వుదంతాలు పెరగటం కూడా వాటిలో ఒకటి. యురి సైనిక కేంద్రంపై వుగ్రవాదుల దాడి తరువాత సెప్టెంబరు 20వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కొంత మంది జర్నలిస్టులు ఇళ్లకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న వాహనంపై మీడియా అని రాసి వుండటాన్ని చూసిన కొందరు నిరసనకారులు వాహనంపై దాడికి దిగారు. మీడియా రాజ్య ప్రచార సాధనంగా మారిందని, జర్నలిస్టులు నిజాలు దాస్తున్నారని జనం భావించటమే దీనికి కారణం తప్ప వేరు కాదు. కాశ్మీర్‌లో జర్నలిస్టులు అటు జనం ఇటు సైనిక, పోలీసుల మధ్య నలిగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అటు భద్రతా దళాలు జర్నలిస్టులను పాకిస్తానన లేదా వేర్పాటు వాద హురియతన ఏజంట్లని, ఇటు జనం ప్రభుత్వ ఏజంట్లని నిందిస్తున్నారు.మన రాష్ట్రంలో కూడా అనేక సందరా&భలలో తమ న్యాయమైన సమస్యలపై పోరాడుతున్నపుడు మీడియాలో వాటిని విస్మరించినా లేదా అప్రాధాన్యంగా ఇచ్చినా జర్నలిస్టులు కుమ్మక్కయ్యారని ఆరోపించటం లేదా విమరి&శంచటం చూస్తున్నాం.

     అవాంఛనీయ ఘటనలు ముఖ్యంగా వుగ్రవాద దాడులు, మత ఘర్షణలు జరిగినపుడు కొంత మంది వుగ్రవాదులను కాల్చి చంపామనో, విద్రోహులను పట్టుకున్నామనో పోలీసులు కల్పిత కథలు, సంఘటనలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే.అధికార యంత్రాంగం, అధికారంలో వున్న వారి పరువు పోకుండా చూడటం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. కొంత మంది అమాయకులను కాల్చి చంపి వుగ్రవాదులను హతమార్చామని చెప్పిన వుదంతాలు కూడా వున్నాయి. తమ రేటింగ్‌లను పెంచుకొనేందుకు చిలవలు పలవలుగా కొన్ని వుదంతాలపై మీడియా స్పందించటం కూడా తెలిసిందే. తమకు ఇష్టం లేని వార్తలను తొక్కి పెట్టటం అన్నది లేదా వివిధ కారణాలతో కొన్ని వార్తలకు ప్రాముఖ్యత కల్పించటం మన దేశంలో కూడా జరుగుతున్నది. దీనికి తాజా వుదాహరణ జమ్మూ-కాశ్మీర్‌లో యురి సైనిక స్ధావరంపై వుగ్రవాదులు దాడి జరిపి నిద్రమంచాల మీద వున్న 18 మంది సైనికులను చంపిన ఘటన గురించి తెలిసిందే. ఇలాంటి సమయాలలో దేశ పౌరుల్లో మనో నిబ్బరం కల్పించే పేరుతో ప్రభుత్వం పైన చెప్పిన మాదిరి కొన్ని కట్టుకధలను ప్రచారంలో పెట్టటం చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చేస్తుంది కనుక అంత వరకు ఆగటం ఎందుకు మనమే అలాంటి కట్టుకధలను ప్రచారంలో పెట్టి రేటింగ్స్‌ పెంచుకోవాలని కొన్ని మీడియా సంస్ధలు అలాంటి కట్టుకథనే వండి వడ్డించాయి.

    మన సైన్యంలోని ప్రత్యేక దళాలు ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతంలోకి రహస్యంగా ప్రవేశించి వుగ్రవాద స్ధావరాలపై దాడి చేసి 20 మంది వుగ్రవాదులను హతమార్చి బదులుకు బదులు తీర్చుకున్నాయంటూ టీవీ ఛానల్స్‌, పత్రికలు ఒక వార్తను ప్రచారంలో పెట్టాయి. నిజానికి అలా జరిగి వుంటే అదొక పెద్ద సమస్యగా మారి వుండేది. తామలాంటి దాడులు చేయలేదని మన సైన్యం ఒక ప్రకటన చేసింది. అయితే ఒక వెబ్‌సైట్‌ మాత్రం తాను రాసిన కథనం వాస్తవమేనని, వాస్తవాలను నిర్ధారించుకున్నానని చెప్పుకుంది. అదే వార్తను ప్రసారం చేసిన ఇతర మీడియా మాత్రం మిన్నకుండి పోయింది తప్ప అలాంటి దుస్సాహసానికి పాల్పడలేదు. యురి ఘటనతో మధ్యతరగతి, యువత ఆగ్రహంతో స్పందించటాన్ని అవకాశంగా తీసుకొని వారిని సంతృప్తిపరచే అనేక కథనాలను బడా మీడియా సంస్ధలు ప్రచారంలో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాని గురించి మల్లగుల్లాలు పడుతోంది తప్ప అసలు ఎలా జరిగిందో కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేకపోయింది. సైనిక శిబిరంలో గడ్డి దుబ్బులుగా పెరిగిందని, పక్కనే వున్న నది ద్వారా సరిహద్దులు దాటిన వుగ్రవాదులు దానిలో దాగి వుండి దాడులకు పాల్పడ్డారనే ఒక కథనాన్ని కూడా ప్రచారంలో పెట్టారు.

    మీడియా ఇటీవలి కాలంలో మరొక బాధ్యతను కూడా పుచ్చుకుంది. ఎవరు దేశ భక్తులో,ఎవరు దేశ ద్రోహులో, ఏది దేశ ద్రోహుల కేంద్రంగా వుందో కూడా ప్రకటించేస్తోంది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ(జెఎన్‌యు) విద్యార్ధి యూనియన్‌ మాజీ అధ్యక్షుడు కన్నయ్య, మరికొందరు విద్యార్ధులు, కొన్ని సంస్ధలను అలాగే జమ కట్టి నకిలీ వీడియోలను కూడా తయారు చేసి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ విశ్వవిద్యాలయం దేశద్రోహులకు మద్దతు ఇచ్చే శక్తులకు నిలయంగా మారిందని, దానిని మూసివేయాలని, అక్కడి విద్యార్ధినీ, విద్యార్ధులు మద్యం తాగుతూ, వ్యభిచారానికి పాల్పడుతున్నారని అందుకు నిదర్శనంగా మద్యం సీసాలు, నిరోధ్‌లు పెద్ద సంఖ్యలో కనిపించాయని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వాటి అనుబంధ సంస్ధల నేతల ఆరోపణలకు విశ్వసనీయత కలిగిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంలో మీడియాలోని మెజారిటీ సంస్ధలు తమ పంతు పాత్ర పోషించాయి. పాటు అనేక మంది విద్యార్దులపై తప్పుడు కేసులు పెట్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులలో వున్న విద్యార్ధులను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా వార్తలను సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై బిజెపి మద్దతుదారులైన లాయర్లు దాడికి పాల్పడిన వుదంతం కూడా తెలిసిందే. జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్నారంటూ మహిళాజర్నలిస్టులను కూడా వదల కుండా అవమానించిన ఘటనలు ఇంకా కళ్ల ముందున్నాయి.

    అలాంటి వుదంతానికి కేంద్ర బిందువుగా వున్న జెఎన్‌యు విశ్వవిద్యాయ విద్యార్ధి సంఘానికి సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో దేశభక్తులకు ప్రతినిధులుగా వున్నామని చెప్పుకున్న ఎబివిపి అభ్యర్ధులను విద్యార్ధులు చిత్తు చిత్తుగా ఓడించారు. వేర్పాటు వాదులు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశద్రోహులుగా ముద్రవేసిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ విద్యార్ధి సంఘాల కూటమికి ఘన విజయం చేకూర్చారు. ఈ వార్తను మీడియా మొత్తంగా తొక్కి పెట్టింది లేదా ఎవరూ గమనించని విధంగా అప్రాధాన్యంగా ఇచ్చింది. అదే అక్కడ ఎబివిపి గెలిచి వుంటే ఎంత హంగామా జరిగి వుండేదో వూహించుకోవచ్చు.

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే వుమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా వాగ్దానం చేసిన ప్రత్యేక తరగతి హోదా కల్పన విషయాన్నే చూద్దాం. దీనికి సంబంధించి కొన్ని పత్రికలలో, ఛానల్స్‌లో ఎన్ని కట్టుకధలు ప్రచురితం, ప్రసారమయ్యాయో చూశాము. కొన్ని రోజులు ప్రత్యేక హోదా గురించి కసరత్తు జరుగుతోందని, ప్రకటన వెలువడటమే తరువాయని కొన్ని కధలు. ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ బిజెపితో తెగతెంపులు చేసుకుంటుందని, ఏదో ఒకటి తేల్చుకోవాలని, తానిక ఢిల్లీ రానని చంద్రబాబు నాయుడు అల్టిమేటం ఇచ్చారని మరికొన్ని కథలు. ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి లేదా కొందరికి ప్రయోజనం కలిగించేందుకు వండి వార్చిన కధలన్నది జనానికి బాగా అర్ధమైంది. ప్రత్యేక హోదా వలన వచ్చే లాభాల గురించి చెప్పిన వారే తీరా దాన్ని ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత హోదా వలన ప్రయోజనం లేదని అంతకంటే మెరుగైనా పాకేజి వల్లనే ఎక్కువ ప్రయోజనమనే వార్తలు, వాదనలకు పెద్ద ఎత్తున చోటు కల్పించటాన్ని ఏమనాలి?

    మీడియాలో ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకూ పెరిగి పోతున్న కారణంగానే అది అందచేసే వార్తలకు విశ్వసనీయత వుండటం లేదు. ఒక కొత్త వార్తను ఒక ఛానల్‌ లేదా ఒక పత్రికలో చూసి నమ్మే పరిస్ధితులు అంతరించాయి. ఇది మీడియా సంస్ధల విశ్వసనీయతనే కాదు, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయి. కిరాయి రాతగాళ్లుగా జనం భావించే రోజులు దాపురించాయి. ఏ మీడియా సంస్ధలో పని చేస్తే దాని యాజమాన్య వైఖరికి అనుగుణంగా ఆ జర్నలిస్టుల రాతలూ, వాదనలూ మారిపోతుండటమే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. స్వతంత్ర భావాలు, తాము చూసిన దాన్ని వీక్షకులు, చదువరులకు అందించే పరిస్థితి లేదు. ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వుద్యోగానికి వుద్వాసన. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పట్ల విమర్శనాత్మక వ్యాఖ్యలు, వైఖరిని ప్రదర్శించిన కారణంగా ఒక సీనియర్‌ జర్నలిస్టును ఆ సంస్ధ నుంచి తొలగించేదాకా అధికారంలో వున్న పెద్దలు వత్తిడి చేశారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియాను ఒక లాభదాయకమైన వ్యాపారంగా భావించి పెట్టుబడులు పెట్టిన యాజమాన్యాలు ప్రభుత్వంతో వైరం తెచ్చుకొని తమ లాభాలను వదులుకోవటానికి సిద్ధంగా వుండవని వేరే చెప్పనవసరం లేదు. అందువల్లనే మీడియాలో జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో మిలాఖత్‌ అవుతున్న యాజమాన్యాలు చట్టాలను, వేతన సిఫార్సులను అమలు జరపకపోయినా,అసలు వేతనాలు చెల్లించకపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజకీయ నేతలు తమకు అనుకూలమైన వార్తలు రాయకపోతే యజమానులకు ఫిర్యాదులు చేస్తామనే బెదిరింపులు రాజధాని నుంచి మండల కేంద్రం వరకు వున్న విలేకరులకు ఏదో ఒక సందర్భంగా ఎదురై వుంటుందన్నది కాదనలేని సత్యం.

గమనిక:ఈ వ్యాసం అక్టోబరు నెల ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’లో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యన్‌ ఎన్నికల ఫలితాలు – ఓట్లు, సీట్ల మాయాజాలం

23 Friday Sep 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA

≈ Leave a comment

Tags

Communist Party of the Russian Federation, Duma, Duma elections, RUSSIA, Russia’s Duma, Russia’s Duma Elections

 

Image result for State Duma Building

ఎంకెఆర్‌

    గత ఆదివారం నాడు (సెప్టెంబరు 18న) రష్యన్‌ పార్లమెంట్‌ డ్యూమా ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీతో సహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ సగానికిపైగా సీట్లను కోల్పోగా అధికార పార్టీ స్వల్పంగా ఓట్ల శాతాన్ని పెంచుకొని మూడింట రెండువంతులకు సీట్లు పొందింది. అనేక మంది ఎందుకిలా జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. మొత్తం 450 స్ధానాలకు గాను 225 నియోజకవర్గ ప్రాతిపదిన, మిగిలిన 225 దామాషా ఓటింగ్‌ ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో గత పాతిక సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ శాతం ఓటింగ్‌ నమోదు కావటం ఒక కొత్త రికార్డు అయితే అధికార పక్షం ఐక్య రష్యా పార్టీ అంతకు ముందున్న 238 ను 343కు పెంచుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విధంగా విజయం సాధించటానికి మారిన ఎన్నికల పద్దతి, ఎన్నికలలో అక్రమాలే ప్రధాన కారణం అని ఫలితాల అనంతరం వెలువడుతున్న వార్తలు, విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికలలో అన్ని స్ధానాలూ దామాషా ప్రాతిపదికన పార్టీలకు కేటాయించారు. ఈ సారి సగం మాత్రమే వుండటం, అనేక మంది పోటీ పడిన కారణంగా మైనారిటీ ఓట్లతోనే అధికారపక్షం ప్రత్యక్ష ఎన్నికల విభాగంలో అత్యధిక సీట్లను గెలుచుకోవటం సాధ్యమైంది. సాధారణంగా ఓటింగు డిసెంబరులో జరుగుతుంది, అటువంటి దానిని అధికార పార్టీ పట్టుబట్టి సెప్టెంబరుకు మార్పించింది. తక్కువ ఓట్లు పోలు కావటానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. దీని కంటే ఎన్నికలు ఒక ప్రహసనమని భావించిన మెజారిటీ ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకత వున్నప్పటికీ ప్రతిపక్షాల మీద విశ్వాసం లేకపోవటం కూడా తోడై ఓటింగ్‌కు దూరంగా వున్నారు. మన దేశంలో మాదిరి ఓట్ల అమ్మకం, కొనుగోలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు కొద్ది వారాల ముందు లెవడా అనే ఏజన్సీ నిర్వహించిన ఒక సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు తమ ఓటును 5000 రూబుళ్లకు అమ్మేందుకు సుముఖంగా వున్నట్లు తేలింది. రష్యా జనాభాలో 2.3 కోట్ల మంది లేక 16శాతం దారిద్య్రరేఖ ప్రమాణం నెలకు 174 డాలర్ల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నవారు వున్నారు. గత ఎన్నికల మాదిరే ఈ ఎన్నికలలో కూడా అధికార పక్షం పాల్పడిన అక్రమాలు, అవినీతి గురించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓటర్ల కంటే బ్యాలట్‌ బాక్సులలో పడిన ఓట్లు ఎక్కువగా వున్నట్లు , కొన్ని చోట్ల అసలు ఓటర్లు లేకుండానే సిబ్బందే ఓట్లతో బాక్సులను నింపినట్లు తేలటం, మరికొన్ని చోట్ల దొంగ ఓట్లు వేసినట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ శాతాలను కూడా ప్రకటించటం వంటి అ క్రమాలు చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ ఫలితాలను రద్దు చేసినట్లు స్వయంగా రష్యా వార్తా సంస్ధ ఇటార్‌ -టాస్‌ పేర్కొన్నది. నిజానికి అవి సముద్రంలో కాకి రెట్ట వంటివి. ఈ సారి పార్లమెంట్‌కు ప్రజాస్వామిక సంస్కరణలకు వ్యతిరేకులైన పచ్చి మితవాదులు పాలక పక్షం నుంచి గణనీయంగా ఎన్నికైనట్లు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

    గత ఎన్నికల్లో పాల్పడిన అవినీతి కారణంగా ప్రపంచవ్యాపితంగా నగుబాట్ల పాలైన అధ్యక్షుడు పుతిన్‌ ఎన్నికలను పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా జరిపేందుంటూ ఎన్నికలకు ముందు మానవహక్కుల న్యాయవాదిగా గౌరవ మన్ననలను పొందిన ఎలా పాం ఫిలోవాను నియమించారు. అయినప్పటికీ దిగువ యంత్రాంగం మొత్తం అధికార పక్ష కనుసన్నలలో పనిచేసేదిగా వుండటంతో సైంటిఫిక్‌ రిగ్గింగ్‌ జరిపి అధికారపక్షం మెజారిటీ సీట్లను తెచ్చుకున్నది. అక్రమాల గురించి సామాజిక మీడియాలో కుప్పలు తెప్పలుగా వెల్లడిస్తున్నారు. తొమ్మిది ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అనేక పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలను రద్దు చేసినట్లు పాం ఫిలోవా గురువారం నాడు ప్రకటించారు. దర్యాప్తులో ఇంకా మరిన్ని అక్రమాలు వెల్లడయ్యే అవకాశం కూడా వుందన్నారు. పరిశీలక సంస్ధలలో ఒకటైన ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓయిసిడి) కూడా ఎన్నికలు సక్రమంగా జరగలేదని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వలేదని పేర్కొన్నది.

    గతంలో 2007 ఎన్నికలలో అధికార ఐక్య రష్యా గరిష్టంగా 315 సీట్లు , తరువాత కనిష్టంగా 2011లో 238 సీట్లు, తాజాగా 343 సీట్లు తెచ్చుకుంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1993లో జరిగిన తొలి ఎన్నికలలో నమోదైన 54.8శాతంమే ఇప్పటి వరకు కనిష్టంగా వుంది. అలాంటిది తాజా ఎన్నికలలో 48శాతానికి పడిపోయింది.అయితే ఇది కూడా ముందే చెప్పుకున్నట్లు ఓటర్ల కంటే ఎక్కువగా పడిన బ్యాలట్లను కూడా లెక్కిస్తే వచ్చిన సంఖ్య. అందువలన అంతకంటే తక్కువ మందే ఓటర్లు పాల్గొన్నట్లు చెబుతున్నవారు కూడా లేకపోలేదు. రాజధాని మాస్కో, మరో పెద్ద నగరమైన సెంట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 35, 33 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైనట్లు ప్రకటించారు.

    నాలుగు వందల యాభై స్ధానాలకు గాను అధికారపక్షం 343 పొందగా రెండవ పార్టీగా రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ 42, మూడవ పార్టీగా పచ్చిమితవాద పక్షం ఎల్‌డిపిఆర్‌ 39, న్యాయమైన రష్యా పార్టీ 23 గెలుచుకుంది. మరో రెండు పార్టీలు ఒక్కొక్క స్ధానం, నేరగాడిగా గతంలో ఇంటర్‌ పోల్‌ వెతికిన వ్యక్తి ఏకైక స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 225 సీట్లలో అధికారపక్షం 203 గెలుచు కుంది. ఒక పరిశీలకుడు సెర్గీ షిఫిలికిన్‌ చెప్పిన దాని ప్రకారం అధికార పక్షానికి వచ్చినట్లు చెబుతున్న ఓట్లలో 45శాతం లేదా కోటీ 20 లక్షల ఓట్లు బోగస్‌. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు 37శాతానికి మించి లేరు, ఈ లెక్కన పోలైన ఓట్లలో అధికారపక్షానికి వచ్చినట్లు చెబుతున్న 54 శాతం కాకుండా 40శాతమే వాస్తవ ఓట్లు అయి వుండాలి.

    గత మూడు ఎన్నికలలో వరుసగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం , సీట్లు ఎలా వున్నాయో దిగువ పట్టికలో చూస్తే అధికార పార్టీ ఎన్నికల విధానంలో ఎందుకు మార్పు తెచ్చిందో దాని కారణంగా ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడిందో అవగతం అవుతుంది.

ఏడాది        ఐక్య రష్యా       కమ్యూనిస్టు       ఎల్‌పిడిఆర్‌       జస్ట్‌ రష్యా

2007        64.30-315      11.57-57         8.14-40        7.74-38

2011        49.32-238      19.19-92        11.67-56      13.24-64

2016        54.19-343       13.34-42       13.16-39        6.23-23

         గత ఎన్నికలతో పోల్చితే కమ్యూనిస్టు పార్టీ , జస్ట్‌ రష్యా ఓట్ల శాతం తగ్గిందన్నది స్పష్టం. ఆ మేరకు అధికార పార్టీకి పెద్దగా పెరగపోయినా సీట్లు గణనీయంగా పెరగటానికి ఎన్నికల విధానంలో చేసిన మార్పే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దామాషా ప్రాతిపదికన కేటాయించిన 225 సీట్లలో ఐక్య రష్యాకు 140, కమ్యూనిస్టుపార్టీకి 35,ఎల్‌పిడిఆర్‌కు 34, జస్ట్‌ రష్యాకు 16 వచ్చాయి. నియోజకవర్గాలలో వరుసగా ఈ పార్టీలకు 203, ఏడు, ఏడు, ఐదు, మరో రెండు చిన్న పార్టీలకు ఒక్కొక్కటి దక్కాయి.ఒక స్వతంత్ర అభ్యర్ధి గెలిచాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆఫ్ఘనిస్తాన్‌కు మిలిటరీ సాయం అంటే తాలిబాన్లకు ఆహ్వానమే !

18 Sunday Sep 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

Afghanistan, INDIA, military supplies, Narendra Modi, talibans

Image result for MI-24/25 attack helicopters

అమెరికా వుచ్చులోకి దేశాన్ని నెడుతున్న నరేంద్రమోడీ ప్రమాదకర క్రీడ

సత్య

     అమెరికాతోనూ, వుగ్రవాదులతో జట్టు కట్టి బాగుపడిన దేశం గానీ, ముప్పును తప్పించుకున్న నేతలు గానీ అరుదుగా కనిపిస్తారు. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు భింద్రన్‌ వాలే అనే ఖలిస్తాన్‌ వుగ్రవాదిని పెంచి పెద్ద చేసి ఇందిరా గాంధీ, ఒక దశలో తమిళ ఎల్‌టిటియి వుగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి తరువాత మారిన పరిస్థితుల్లో వారిని అణచివేతకు సైన్యాన్ని పంపి రాజివ్ గాంధీ వారి చేతుల్లోనే బలైన వుదంతం మన కళ్ల ముందే జరిగింది. తాలిబాన్లను తయారు చేసి చివరకు వారి చేతుల్లో చావు దెబ్బలు తిని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనలను వుపసంహరించుకున్న అమెరికా నిర్వాకాన్ని చూశాము. ఇంత జరిగాక వాటి నుంచి గుణపాఠాలేమీ తీసుకోకుండా నరేంద్రమోడీ సరికొత్త ప్రమాదకర క్రీడ మొదలు పెట్టారు. ఇప్పటివరకు మన దేశం అనుసరించిన విదేశాంగ విధానానికి భిన్నంగా స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవటం లేదా ఏర్పరుచుకోవటానికి బదులు ఇరుగు పొరుగు దేశాలతో గిల్లి కజ్ఞాలకు దిగి కొత్త ప్రమాదాలను కొని తెచ్చుకొనే విధంగా ఎన్‌డిఏకు మార్గదర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ దేశాన్ని ప్రమాదకర స్ధితిలోకి నెడుతోంది.

    కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఆప్ఘనిస్తాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల సాయం చేయటానికి నిర్ణయించుకకుంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ న్యూఢిల్లీ పర్యటన సందర్బంగా ఆ మొత్తాన్ని ప్రకటించారు .అందుకు గాను వెంటనే అమెరికా సర్కార్‌ మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తల వరదలో ముంచెత్తింది. సాయం ప్రకటించింది మన దేశం, లబ్ది పొందేది ఆఫ్ఘనిస్తాన్‌. మధ్యలో అమెరికా పొగడ్తలు ఎందుకు ? వాటిని చూసి మీడియాలోని మోడీ భక్తులు కొందరికి ఒంటి మీద బట్టలు ఎందుకు నిలవటం లేదు. అష్రాఫ్‌ మన దేశ పర్యటనకు ముందు తాలిబాన్లు ఒక ప్రకటన చేస్తూ తమను అణచేందుకు ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి భారత్‌ మిలిటరీ సాయం అందచేస్తున్నదని దానిని నిలిపివేయాలని వినతితో కూడిన హెచ్చరిక చేశారు.

     మన అవసరాల కోసం మనమే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ఎవరిస్తామంటే వారి దగ్గర అందిన కాడికి అప్పు చేస్తున్నాం కదా ? అటువంటపుడు మనం మరొక దేశానికి సాయం చేయటం ఏమిటి ? మనమే విదేశాల నుంచి మిలిటరీ ఆయుధాలు కొంటున్నాం కదా వాటిలో కొన్నింటిని ఆఫ్ఘనిస్తాన్‌కు ఇవ్వటం ఏమిటి ? ఈ ఏడాది మార్చి నెలాఖరుకు మన విదేశీ అప్పు 485.6 బిలియన్‌ డాలర్లు. దానిలోంచి లేదా మనం చేయి చాపి తెచ్చుకున్న మొత్తంలోంచి ఒక బిలియన్‌ డాలర్లు ఆఫ్ఘనిస్తాన్‌కు సాయంగా ఇస్తున్నాం. అంటే దాదాపు ప్రతి ఒక్కరం తలకు 60 రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు. తాజా వందకోట్లతో కలిసి ఇంతవరకు మొత్తం సాయం 200 కోట్ల డాలర్లకు చేరుకోనుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి, విద్య, వైద్య సాయం అందించటానికి అవసరమైన సాయం ఏ దేశానికి అందించినా ఎవరూ తప్పు పట్టరు. అయితే ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైట్‌ వెలిగినట్లు ఇలాంటి సాయాలను ఏ దేశం కూడా చివరికి చైనా వంటి సోషలిస్టు దేశాలు సైతం వుత్తి పుణ్యానికే చేయవు. ఏదో ఒక ప్రతిఫలం ఇంకా చెప్పాలంటే తనకు అవసరమైన వాటి కోసమో లేదా తన దగ్గరవున్న వస్తువులకు మార్కెట్‌ కోసమో, రాజకీయ ప్రయోజనం కోసమో ఏదో ఒక లక్ష్యం లేకుండా వుండదు. ఆప్ఘనిస్తాన్‌తో మనకు సరిహద్దు సంబంధాలు లేవు, పొరుగు దేశం కాదు, మధ్యలో పాకిస్తాన్‌ వుంది.ఈ నేపధ్యంలో మోడీ సర్కార్‌ ఆర్ధిక సాయానికే పరిమితం కాకుండా మిలిటరీ ఆయుధాలు ఎందుకు అందిస్తున్నట్లు ? ఎవరికైనా సందేహం కలగక తప్పదు. పోనీ ఆర్ధిక, మిలిటరీ సాయం అందించటం ద్వారా మనం ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి ? మన్‌కీ బాత్‌తో సహా ఎక్కడా మనకు చెప్పలేదు.

    మన దేశం గురించి చెప్పుకోవాలంటే గత రెండు దశాబ్దాలుగా చైనా తరువాత అత్యధిక సగటు వృద్ధి రేటుతో ముందుకు పోతున్న ఏకైక దేశం. అభివృద్ధి ఫలం అంతా కొద్ది మంది బిలియనీర్ల చేతుల్లోకి పోతున్నది. గత పది సంవత్సరాలలో ప్రపంచంలో బిలియనీర్లు సగటున 68శాతం వృద్ధి చెందితే మన దేశంలో 330 శాతం వుంది. ఇంత వేగంగా కొంత మంది చేతుల్లోకి డబ్బు చేరుతున్నది కనుకనే వారిని చూసి ప్రతివారూ ఏదో విధంగా తాము కూడా ఇలా చూసి అలా తిరిగే లోపల కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు. మన దగ్గర అణ్వాయుధాలున్నాయి వాటిని వుపయోగించలేము కనుక ఇతర ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము. అంతరిక్ష రంగంలో కూడా అనేక విజయాలు సాధించాము. పెద్ద మిలిటరీ, వైమానిక దళం వుంది. అయినా ధనిక దేశాల ముందు చేయి చాపుతున్నాం, మనకు వచ్చిన మొత్తంలో లేదా అప్పు చేసి కొంత మొత్తాన్ని మన దగ్గర చేయి చాచే వారికి ఇస్తున్నామన్న విషయం ‘నయా దేశ భక్తులతో’ సహా కొంత మందికి మింగుడు పడకపోవచ్చు. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2011లో మన దేశం చేయి చాస్తున్న వరుసలో ఆరవ స్ధానంలో వున్నాం. మనం 2011లో 3.2, 2012లో 1.6, 2013లో 2.4 బిలియన్‌ డాలర్లు తీసుకున్నాంhttps://thelogicalindian.com/story-feed/exclusive/know-everything-about-how-much-india-receives-and-donates-foreign-aid/  మన కంటే దరిద్రపు దేశాలకు ఇచ్చేందుకు 2015-16లో మన బడ్జెట్‌లో 1.6 బిలియన్‌ డాలర్లు కేటాయించాం.మనం చేస్తున్న సాయంలో భూటాన్‌కు గణనీయ మొత్తం ఇచ్చాం. ముందే చెప్పుకున్నట్లు ఎలాంటి ప్రయోజనం లేకుండా కాదు సుమా ! మన సాయంతో వారు హిమాలయ పర్వత ప్రాంతాలలో జల విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మిస్తారు, 2020 నాటికి మన దేశం వారి నుంచి పదివేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాం. భూటాన్‌ నుంచి విద్యుత్‌ తెచ్చుకుంటున్నాం, తెచ్చుకుంటాం మరి ఆప్ఘనిస్తాన్‌ నుంచి మోడీగారు ఏం తెస్తారు ? వుగ్రవాదాన్ని, తాలిబాన్లనా ?

   ఆఫ్ఘనిస్తాన్‌ అంటే చాలా మందికి తెలిసినట్లు వుండి వివరాలు లోతుగా తెలియని దేశం. రాబందులు ఆకాశంలో తిరుగుతుంటాయి, ఎక్కడ కళేబరం కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ప్రపంచంలో మిలిటరీ, ఆర్ధిక, రాజకీయంగా కీలక ప్రాంతాలుగా వున్న వాటిని తమ ఆధీనం చేసుకొనేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు కూడా నిత్యం అలాగే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌లో పాగావేసేందుకు పూనుకున్న సమయంలో దానిని పసిగట్టిన మిలిటరీలోని అభ్యుదయ వాదులైన అధికారులు తిరుగుబాటు చేసి దేశాధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ి పొరుగునే వున్న నాటి సోవియట్‌ యూనియన్‌ మద్దతు ఇవ్వటమే కాదు, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు, దానిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను అణచివేసేందుకు వారి ఆహ్వానం మేరకు మిలిటరీ సాయాన్ని కూడా పంపింది. ఆ ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రలో భాగంగానే అధికారంలో వున్న వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేశారు. అయితే మిలిటరీ అధికారులు కమ్యూనిజం పట్ల అభిమానం వున్నవారు నుక తాము కమ్యూనిస్టులం కాదని ఖండించలేదు. కమ్యూనిస్టుల కారణంగా ఇస్లాం మతానికి ముప్పు ఏర్పడింది, దానిని కాపాడుకోవాలంటే తాలిబాన్లుగా మారి ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికన్లు ఒక పధకం ప్రకారం రెచ్చగొట్టారు. అందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌కు అలాంటి వారిని తరలించి అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి సాయుధులను చేసి పంపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ముసుగులో తిష్ట వేయటానికి అమెరికా పూనుకుందన్న విషయం గ్రహించగానే మరో పొరుగు దేశం ఇరాన్‌ కూడా తన మద్దతుదారులను అక్కడ వుంచేందుకు అది కూడా తాలిబాన్లను తయారు చేసింది. మొత్తం మీద వారూ వీరూ తయారు చేసిన వారు అక్కడి వామపక్ష ప్రభుత్వానికి, వారికి సాయంగా వచ్చిన సోవియట్‌ సేనల మీద దాడులు, వత్తిడి తెచ్చి చివరకు వుపసంహరించుకొనే విధంగా, వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయటంలో జయప్రదం అయ్యారు. తరువాత ఆ తాలిబాన్లే అమెరికా, పాకిస్థాన్‌కు ఏకు మేకయ్యారు. వారిని నాశనం చేయటానికి అమెరికా సైన్యాన్ని దించి చావు దెబ్బలు తిన్నది, దేశాన్ని సర్వనాశనం చేసింది, చివరకు తాలిబాన్లను అదుపు చేయలేక ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సేనలను వుపసంహరించుకుంది. వుగ్రవాదులను గానీ, మరొక సంఘవ్యతిరేక శక్తుల అణచివేత గానీ ఆయా దేశాల అంతర్గత వ్యవహారం మాత్రమే. పొరుగువారు వెళ్లి ఆ పని చేయటం తగని పని. తమకు హాని చేసే వుగ్రవాదాన్ని రూపుమాపే శక్తి ఆ సమాజాలకు అంతర్గతంగానే వుంటుంది. కానీ అమెరికా ఆ పేరుతో అనేక దేశాలలో జోక్యం చేసుకొంటోంది, చావు దెబ్బలు తింటోంది. ఇప్పుడు వుగ్రవాద వ్యతిరేక పోరు, ఆప్ఘనిస్తాన్‌ పునరుద్దరణ పేరుతో అక్కడే తిష్టవేసింది. తాలిబాన్లను అణచివేసేందుకు తమతో పాటు ఇతర దేశాలు కూడా అన్ని రకాలుగా భాగం పంచుకోవాలని వత్తిడి తెస్తూ తన భారాన్ని తగ్గించుకుంటున్నది. ఆ వుచ్చులోకి భారత్‌ను లాగుతున్నది. నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి ముందు వెనుకలు చూడకుండా ఆ బాటలో ముందుకు పోతున్నది.

     ఆప్ఘనిస్తాన్‌ను అన్ని విధాలుగా నాశనం చేసింది అమెరికా, తామరతంపరగా తాలిబాన్లను సృష్టించి ప్రపంచంలో అనేక దేశాలకు వారిని ఎగుమతి చేసింది అమెరికా, గతంలో దేశ భక్తులుగా ప్రచారం చేసిన వారిని ఇప్పుడు టెర్రరిస్టులుగా చిత్రిస్తూ వారిపై పోరు, అభివృద్ధి పేరుతో జరిగే ఖర్చును ప్రపంచ దేశాలన్నీ పంచుకోవాలని వత్తిడి తెస్తోంది అమెరికా. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తాలిబాన్ల చేతిలో నాశనమైన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించేందుకు అంగీకరించి నిర్మించింది. దానిని నరేంద్రమోడీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పుడు మరొక వంద కోట్ల డాలర్ల సాయం ప్రకటించారు. ఇది కాకుండా ఇప్పటికే రష్యా తయారీ ఎంఐ-25 గన్‌షిప్‌ హెలికాప్టర్లను మూడింటిని పంపారు. మరొకదానిని పంపనున్నారు. తమకు మరిన్ని మారణాయుధాలు,ఎంఐ-35 గన్‌షిప్‌ హెలికాప్టర్లు కూడా కావాలని అక్కడి ప్రభుత్వం కోరుతున్నది. ఇలా ఆయుధాలు ఇవ్వటం ఇప్పటివరకు అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి భిన్నం. అమెరికా ఆదేశాల మేరకు తాలిబాన్లను తయారు చేసిన పాకిస్తాన్‌ తరువాత కాలంలో అమెరికా ఆదేశాల మేరకు ఆ తాలిబాన్లనే అణచివేయటం ప్రారంభించింది. తమ దేశంలో తలదాచుకున్న ఒసామాబిన్‌ లాడెన్‌ను హతమార్చటానికి అమెరికాకు తోడ్పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇప్పుడు ఐఎస్‌ వుగ్రవాదులు, తాలిబాన్లు కలిసి పాకిస్థాన్‌పై దాదాపు ప్రతి రోజూ దాడులు చేస్తున్నారు.దానికి తోడు ఆఫ్ఘన్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితి. చాలా ప్రాంతాలపై ప్రభుత్వానికి అదుపు లేదు. తాలిబాన్లదే పెత్తనం. తెగల వారీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిది ఆధిపత్యం. కాబూల్‌ గద్దెపై ఎవరుంటే ఆ తెగవారు చూసీ చూడనట్లు వుంటారు తప్ప మిగతావారు శత్రువులే. తమ అణచివేతకు తోడ్పడుతున్న పశ్చిమ దేశాలలో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులు దాడులకు పాల్పడటాన్ని చూస్తున్నాము. ఇప్పటికే పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులతో నిత్యం కాశ్మీర్‌ రావణకాష్టంలా మండుతున్నది. ఇప్పుడు తాలిబాన్‌ -ఐఎస్‌ తీవ్రవాదులను కూడా మోడీ సర్కార్‌ ఆహ్వానించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. మనదైన స్వతంత్ర విదేశాంగ విధానం మనకు వుండాలి తప్ప మరొక దేశం అది అమెరికా లేదా మరేదైనా దాని ప్రయోజనాలకు, ఎత్తుగడలకు అనుగుణంగా వుంటే నష్టపోయేది మనమే. ఇప్పటికైనా మించి పోయింది లేదు. మేలుకోవటం మంచిది. మొండిగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు ఎన్‌డిఏదే బాధ్యత అవుతుంది.

  చైనా ప్రభుత్వం సాయం చేస్తున్నదంటే అది ప్రభుత్వ రంగ కంపెనీలకు ఆర్డర్లు సంపాదించుకుంటున్నది. దాని ద్వారా వచ్చే లాభం, ప్రయోజనం ప్రజలకు చెందుతుంది. బిల్‌ గేట్స్‌ వంటి కార్పొరేట్లు అంద చేసే సాయం వారి కంపెనీలకు ఆర్డర్లకోసం వుపయోగపడుతుంది. అమెరికా,జపాన్‌, బ్రిటన్‌ ప్రభుత్వాలు చేసే సాయం ఆ దేశాలలోని కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు లంకె వుంటుంది. నరేంద్రమోడీ సర్కార్‌ వున్న ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం లేదా మూసివేతలకు పూనుకుంది. పెట్టుబడులు పెడుతున్నది ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీలే అంటే సాయం పేరుతో ఏటా బడ్జెట్‌ నుంచి కేటాయించే 160 కోట్ల డాలర్ల సాయంలో ఎక్కువ విదేశాలలో పెట్టుబడులు పెట్టే భారతీయ కార్పొరేట్లకు అందచేస్తున్న సబ్సిడీ అవుతుంది తప్ప మరొకటి కాదు. మన జనానికి సబ్సిడీలలో కోత, కార్పొరేట్లకు మోత !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆదివారం జరిగే రష్యన్‌ పార్లమెంటరీ ఎన్నికలు-ఒక పరిశీలన

16 Friday Sep 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA

≈ Leave a comment

Tags

Duma elections, KPRF, Russian Duma elections, Russian parliamentary elections

ఎంకెఆర్‌

     ఈ నెల పద్దెనిమిదవ తేదీన రష్యా పార్లమెంట్‌ డ్యూమా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారంటే ప్రస్తుతం అధికారంలో వున్న పుతిన్‌ నాయకత్వంలోని ఐక్య రష్యా(యునైటెడ్‌ రష్యా) పార్టీ అని దాదాపు మీడియా ఏకగ్రీవంగా చెబుతున్నది, అదే వాస్తవం అవుతుంది. ఎందుకంటే రెండవ పెద్ద పక్షంగా వున్న కమ్యూనిస్టు పార్టీకి అధికార పక్షానికి మధ్య తేడా చాలా వుంది. అయినప్పటికీ రష్యన్‌ ఎన్నికలు ఆసక్తిని కలిగించేవే. అనేక తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన పాతిక సంవత్సరాల తరువాత కూడా అక్కడ కమ్యూనిస్టులపై వేట సాగుతున్నది. కమ్యూనిస్టుల పాలనా కాలంలో సాగించిన నేరాల పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను తీవ్రంగా రెచ్చగొడుతున్నారు. రష్యాలో పరిస్థితి దానికి భిన్నంగా వున్నది. మిగతా తూర్పు ఐరోపా దేశాలలో అత్యధిక చోట్ల కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగయ్యాయి. రష్యాలో రెండవ పెద్ద పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టులే వున్నారు.

   ఇక 450 స్థానాలున్న పార్లమెంట్‌లో సగం స్ధానాలకు దామాషా ప్రాతినిధ్య పద్దతిలో, మిగిలినవి నియోజకవర్గ ప్రాతిపదికన జరుగుతాయి. ఏ పక్షమైనా ప్రభుత్వ ఏర్పాటుకు 226 సీట్లు సాధించాల్సి వుంది. రద్దయిన పార్లమెంట్‌లో ఐక్య రష్యాకు 238, ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీకి 92, ఫెయిర్‌ రష్యాకు 64, కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి 56 స్ధానాలున్నాయి. ఈ ఎన్నికలలో ఈ నాలుగుతోపాటు ఏదో ఒక ప్రాంతీయ శాసనసభలో ప్రాతినిధ్యం కలిగి వున్న కారణంగా పోటీకి అర్హత సాధించిన మరో పది పార్టీలు పోటీలో వున్నాయి. కనీసంగా ఐదుశాతం ఓట్లు సాధించిన పార్టీలకే దామాషా పద్దతిలో సీట్లను కేటాయిస్తారు. కమ్యూనిస్టు వ్యతిరేక పార్టీలుగా ప్రకటించుకున్నవాటితో పాటు వివిధ కమ్యూనిస్టు, సోషలిస్టు భావజాలం వున్న చిన్న పార్టీలు కూడా ఈ పధ్నాలుగులో వున్నాయి. గత ఎన్నికలలో కేవలం నాలుగు పార్టీలు మాత్రమే పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం పొందాయి. ఈ సారి ఫలితాలు ఎలా వుండేది ఆసక్తి కరం.

    ఈ ఎన్నికలలో ఎంపీలతో పాటు మన ముఖ్యమంత్రుల స్ధాయిలో వుండే ప్రాంతాల గవర్నర్లు, స్థానిక శాసనసభలు, మున్సిపల్‌ ప్రతినిధులను కూడా ఎన్నుకుంటారు.తొలిసారిగా ఒకే రోజు అన్ని ఎన్నికలు జరగనున్నాయి. నియోజకవర్గాల వారీ ఎన్నికలు జరిగే 225 సీట్లలో పోటీ చేసే పార్టీలు కనీసంగా మూడు శాతం ఓట్లు, లేదా పన్నెండు సీట్లు సాధిస్తే అవి ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వం నుంచి నిధులు పొందటానికి అర్హత సాధిస్తాయి. పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల దామాషా ప్రాతికన చెల్లించాల్సిన మొత్తాన్ని విడతలవారీ వచ్చే ఎన్నికల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏ పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్ధి అయినా కొత్తగా ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే నిర్ణీత సంఖ్యలో ఓటర్ల సంతకాలు సేకరించి ఎన్నికల కమిషన్‌కు అందచేసిన తరువాత నిబంధనల మేరకు వుంటే అనుమతిస్తారు. ఒక పార్టీ దేశంలోని 29 ప్రాంతాలు లేదా రాష్ట్రాల నుంచి రెండులక్షలు, ఒక అభ్యర్ది తన నియోజకవర్గంలోని మూడుశాతం ఓటర్ల సంతకాలను సేకరించాలి. గత పార్లమెంట్‌ ఎన్నికలలో కనీసంగా మూడు శాతం ఓట్లు లేదా ఏదేని ఒక ప్రాంతీయ శాసనసభలో ఒక్కరైనా ప్రాతినిధ్యం కలిగి వున్న పార్టీలకు సంతకాలతో పని లేదు. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి ఫిరాయించి దానిలో కొనసాగిన వారికి కూడా ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. గత ఎన్నికల నాటికి ఏడు పార్టీలు వుంటే ప్రస్తుతం 74కు పెరిగింది.

   కమ్యూనిస్టుల పాలనా కాలంలో ఎన్నికలపై జనంలో పెద్ద ఆసక్తి వుండేది కాదని కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా దుమ్మెత్తి పోసేది. అది పాక్షిక సత్యం మాత్రమే. ఎందుకంటే మనకు మాదిరి డబ్బు,అక్రమాల వంటి ప్రలోభాలు వుండేవి కాదు కనుక సహజంగానే ఆసక్తి కలిగించవు. ఆదివారం నాడు జరగబోయే ఎన్నికల ఫలితం ముందే తెలిసినప్పటికీ, విసుగు పుట్టించేవని, పార్లమెంట్‌ అంటే రబ్బరు స్టాంపు తప్ప మరొకటి కాదని అనేక మంది వర్ణించినప్పటికీ ఓటు వేసేందుకు ఒక మహిళ ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందని, ప్రజాస్వామ్యం పట్ల అక్కడి వారిలో వున్న విశ్వాసానికి నిదర్శనమని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.ఆర్ధికంగా అనేక సమస్యలు తీవ్రంగా వున్నప్పటికీ వుక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని రష్యాలో విలీనం చేసిన 2014 నుంచి అధ్యక్షుడు పుతిన్‌ పలుకుబడి పెరిగిందని పరిశీలకులు చెబుతున్నారు.ఎన్నికల ప్రచారానికి అధికార పార్టీకే ఎక్కువ సమయం కేటాయించారనే విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో అధికార ఐక్య రష్యా పార్టీ చౌకబారు జిమ్మిక్కులకు పాల్పడిందని రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ (సిఆర్‌పిఎఫ్‌) విమర్శించింది. కమ్యూనిస్టు పార్టీ పేరుతో నకిలీ న్యూస్‌ పేపర్లను తయారు చేయటం, ప్రత్యర్ధుల అవకాశాలను దెబ్బతీసేందుకు డబ్బులిచ్చి కొందరు అభ్యర్ధులను రంగంలోకి దించటం వంటి అక్రమాలకు పాల్పడిందని పేర్కొన్నది. అనుమతించిన సంఖ్యకంటే తక్కువగా ఎన్నికల పర్యవేక్షకులను ఎన్నికల అధికారులు నియమించటం, జర్నలిస్టులకు ప్రవేశాలను పరిమితం చేయటం వంటి చర్యలకు కూడా పాల్పడ్డారని తెలిపింది. ప్రయివేటీకరించిన ప్రభుత్వ రంగ సంస్ధలు, సేవలను తిరిగి జాతీయం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ జవాబుదారీ తనం పెరగాలని, విద్య, ఆరోగ్యం, గృహాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయింపులు పెంచటం ద్వారా రష్యన్‌ కార్మికుల జీవితాలను మెరుగుపరచాలనే నినాదాలతో కూడిన పది అంశాల ప్రణాళికతో తాము పోటీ చేస్తున్నట్లు తెలిపింది.

     పోటీ చేస్తున్న పార్టీలలో అధికార ఐక్య రష్యా గత పాతిక సంవత్సరాలలో ఇంతవరకు ఒక్క సారి కూడా తన సభ్యుల సంఖ్యను వెల్లడించలేదు. ఎప్పటికప్పుడు సంఖ్య మారిపోతూ వుంటుందనే పేరుతో తప్పించుకుంటోంది. అనధికార అంచనా.పార్టీలో సభ్యులు కాని వారు కూడా ఆ పార్టీ అభ్యర్ధులుగా ఎన్నికలలో పోటీ చేయవచ్చు.అక్కడి రాజ్యాంగం ప్రకారం పార్టీ సభ్యులు కాని వారు యాభైశాతం కంటే లోపు పార్టీయేతరులను ఏ పార్టీ అయినా ఎన్నికలలో నిలవవచ్చు. అధికార పార్టీ ఎంపీలుగా ఇలాంటి వారు చాలా మంది వున్నారు.కమ్యూనిస్టు పార్టీ చైర్మన్‌గా వున్న గెన్నడీ జుగనోవ్‌ పూర్వపు సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. పచ్చిమితవాది జిరినోవస్కీ లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వున్న మరో పార్టీ ఫెయిర్‌ రష్యా అధికార ఐక్య రష్యాకు మద్దతుదారుగా వుంటుంది. దానితో రాజకీయంగా ఎలాంటి విబేధాలు లేవు. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న వాటిలో రష్యా కమ్యూనిస్టులు అనే పార్టీ ఒకటి. ఇది జుగనోవ్‌ నాయకత్వంలోని రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ నుంచి 2012లో చీలిన వారితో ఏర్పడింది. తాము మరింత మిలిటెంట్‌ పద్దతులలో పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించుకుంది. అంతకు ముందు ఆ పార్టీలోని కొందరు ఒక ప్రభుత్వేతర సంస్ధను నిర్వహించారు. మ్యూనిస్టు పార్టీ గురించి ఓటర్లలో గందర గోళం కలిగించేందుకు, ఓట్లను చీల్చేందుకు ఏర్పరచిన ఒక నకిలీ పార్టీ ఇదని రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ విమర్శించింది.

   మీడియాలో వస్తున్న వార్తలను బట్టి గత ఎన్నికలలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లడి కావటం, గతకొద్ది సంవత్సరాలుగా ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందులలో పడటం వంటి కారణాలతో పాటు అనేక మంది అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు పడటం వంటి కారణాలతో అధికార పక్షం అక్రమాలకు పాల్పడకుండానే క్రిమియాను రష్యాలో కలపటం వంటి కొన్ని చర్యలను చూపి ఓట్లు సాధించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. రెండవది దాని అధికారాన్ని సవాలు చేసే పార్టీ లేనందున అక్రమాలకు పాల్పడి చెడ్డపేరు ఎందుకు తెచ్చుకోవాలన్నది కూడా ఒక కారణంగా వినిపిస్తున్నది.

    ఎన్నికల విషయానికి వస్తే దామాషా విభాగంలో జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు 225 మందితో కూడిన అభ్యర్ధుల జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందచేయాల్సి వుంటుంది. నియోజకవర్గాల వారీ జరిగే ఎన్నికలలోఅధికార ఐక్య రష్యా 225 నియోజకవర్గాలకు గాను 18చోట్ల పోటీలో లేదు. మిగతా పార్టీల వివరాలు అందుబాటులో లేవు. ఫలితాలపై వస్తున్న వూహాగానాల ప్రకారం కమ్యూనిస్టులు గత పార్లమెంట్‌లో వున్న బలాన్ని నిలుపుకోవచ్చు, మిగతా రెండు పార్టీలు కోల్పోయే సీట్లను అధికార ఐక్య రష్యా కైవసం చేసుకొని తన బలాన్ని పెంచుకోవచ్చు లేదా ఇప్పుడున్న స్ధితిలోనే వుండవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పార్లమెంటరీ, మీడియా కుట్రలతో ప్రభుత్వాల కూల్చివేత !

13 Tuesday Sep 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ 1 Comment

Tags

Brazil, elected governments, Honduras, parliamentary and media coup, Parliamentary coup, Prague, Turkey

Image result for parliamentary and media coup against elected governments

సత్య

     గత కొద్ది వారాలుగా వివిధ ఖండాలలోని కొన్ని దేశాలలో జరిగిన పరిణామాలను పరిశీలించినపుడు పార్లమెంటరీ వ్యవస్ధలు, మీడియా సంస్ధలు, వ్యక్తుల పాత్రలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలు పరిహాసం పాలౌతున్నాయి, కుట్రలకు నిలయాలుగా మారుతున్నాయి. మీడియా ‘స్వతంత్ర’ సూచిక వేగంగా పడిపోతున్నది. ఏదో ఒక పక్షాన చేరి తారసిల్లటానికే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. చాలా కాలంగా కప్పుకున్న మేకతోళ్లను తీసి అవతల పడవేస్తున్నాయి. అందుకే గతంలో పత్రికలు పెట్టుబడిదారులకు పుట్టిన విష పుత్రికలు అని వర్ణించినపుడు విపరీత వ్యాఖ్యానంగా భావించిన వారు మీడియా పోకడలను చూసి ఇప్పుడు నిజమే అన్న నిర్ధారణలకు వస్తున్నారు. వర్గ సమాజంలో అటో ఇటో చేరకుండా తటస్థంగా వుండటం అసాధ్యమని, అదొక ముసుగు మాత్రమే అని కమ్యూనిస్టులు ఎప్పుడో చెప్పారు. ఎవరైనా తాము అటూ ఇటూ కాదు అని చెప్పారంటే మార్పును వ్యతిరేకించి వున్న వ్యవస్ధను వున్నట్లుగా వుంచాలని చెప్పటమే. పర్యవసానం ఆ వ్యవస్ధను కాపాడాలని కోరుకొనే వారికి మద్దతు ఇవ్వటమే. ముందే కూసిన కోయిల కూతలను పరిగణనలోకి తీసుకోనట్లే ఆ కమ్యూనిస్టులు అన్నీ ఇలాగే చెబుతారు అని తోసిపుచ్చిన వారు ఇప్పుడేమంటారో తెలియదు. ఏమన్నా అనకున్నా వాస్తవాలను ఎల్లకాలం దాయటం కష్టం.

      జూలై 15న ఐరోపాలోని టర్కీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు మిలిటరీలోని ఒక వర్గం విఫల తిరుగుబాటు చేసింది. కుట్రలో జర్నలిస్టులు కూడా వున్నట్లు తేలటంతో టర్కీ ప్రభుత్వం అనేక మంది ఇతర కుట్రదారులతో పాటు వంద మంది జర్నలిస్టులను కూడా అరెస్టు చేసింది. అమెరికాలో తిష్టవేసిన టర్కీ ముస్లిం ఇమాం ఫతుల్లా గులెన్‌ సిఐఏతో కలసి రూపొందించిన కుట్ర మేరకు సైనికాధికారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారన్న విషయం తెలిసిందే. కుట్రను విఫలం చేసిన తరువాత గులెన్‌కు మద్దతు ఇస్తున్న 130 మీడియా సంస్ధలు మూతపడ్డాయి. వందమంది వరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు. కొందరు విదేశాలకు పారిపోయారు. ఆగస్టు నెలాఖరులో బ్రెజిల్‌ పార్లమెంట్‌ అభిశంసన తీర్మానం ద్వారా ఆ దేశపు వామపక్ష వర్కర్స్‌ పార్టీ (పిటి)నేత అయిన దిల్మా రౌసెఫ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీన్ని ప్రజాస్వామిక కుట్రగా కొంత మంది వర్ణించారు. కుట్రల జాబితాలోకి కొత్త పదం చేరింది. ఈ ప్రజాస్వామిక కుట్రలో స్వతంత్ర పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొనే మీడియా ఒక ముఖ్యపాత్ర వహించిందన్న విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి. దీంతో ప్రభుత్వాల కూల్చివేత కుట్రదారుల్లో మీడియా అధిపతులు కూడా వుంటారని చేర్చాల్సి వుంది. ఈ వార్తలు చదువుతున్న సమయంలోనే బంగ్లాదేశ్‌లో వంగ బంధు ముజబుర్‌ రహ్మాన్‌ హత్య, ప్రభుత్వ కూల్చివేతలో భాగస్వామి అయ్యారనే నేరారోపణపై విచారణకు గురై వురి శిక్ష పడిన ఒక మీడియా అధిపతి మీర్‌ ఖాసిం అలీని 1971లో చేసిన నేరాలకు గాను సెప్టెంబరు మొదటి వారంలో వురి తీశారు. నేరం చేసి సమయంలో పాకిస్థాన్‌ అనుకూల విద్యార్ధి సంఘనేతగా వున్నప్పటికీ తరువాత కాలంలో ఒక పెద్ద వాణిజ్య, మీడియా అధిపతిగా ఎదిగాడు.

   అధికార రాజకీయాలు- ప్రభుత్వాలపై మీడియా అధిపతులు లేదా సంస్ధల ప్రమేయం లేదా పెత్తనం, ప్రభావం ఎలాంటిదో తెలుగువారికి చెప్పనవసరం లేదు. ఒక పార్టీకి వ్యతిరేకంగానో అనుకూలంగానో మాత్రమే కాదు, పార్టీ అంతర్గత విబేధాలలో కూడా జోక్యం చేసుకోవటాన్ని ఎన్‌టిరామారావుపై తెలుగుదేశంలో తిరుగుబాటు సందర్భంగా అందరూ చూశారు. కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండు పత్రికలపై బహిరంగంగానే విమర్శలు చేయగా తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఒక పత్రిక, ఛానల్‌ విలేకర్లను తమ పార్టీ సమావేశాలకు రావద్దని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక నేత లేదా పార్టీని కొన్ని పత్రికలు ఎలా పెంచి పెద్ద చేయవచ్చో, నచ్చనపుడు సదరు నేతను వ్యతిరేకించి ఎలా బదనాం చేయవచ్చో, అదే పార్టీలో అంతకంటే ఎక్కువగా తమకు వుపయోగపడతారనుకున్నపుడు ఇతర నేతలు, పార్టీలను ఎలా ప్రోత్సహిస్తారో ప్రత్యక్షంగా చూశారు, చూస్తున్నారు, భవిష్యత్‌లో కూడా చూస్తారు. మీడియా ఏకపక్షంగా వ్యవహరించినా లేక ఒక పక్షం వహించిందని జనం భావించినా ఏం జరుగుతుందో కాశ్మీర్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు, అక్కడి పరిస్థితిని జాతీయ మీడియా సంస్ధలు వక్రీకరిస్తున్నాయి లేదా వాస్తవాల ప్రాతిపదికన వార్తలను అందించటం లేదన్న విమర్శలు ఇటీవలికాలంలో పెరిగిపోయాయి. పార్లమెంటరీ అఖిలపక్ష బృందం పర్యటన సందర్భంగా కాశ్మీర్‌లోయలో కర్ప్యూను సడలించారు. ఆ సమయంలో ప్రెస్‌ అని స్టిక్కర్‌ పెట్టుకున్న వాహదారులపై అక్కడి నిరసనకారులు దాడులకు పాల్పడిన ఘటనలు జరిగాయి. కొంత మంది విలేకర్లు తాము జాతీయ మీడియాకు చెందినవారం కాదు, స్దానిక సంస్ధలలో పని చేస్తున్నామని చెప్పినా జర్నలిస్టులంటే జర్నలిస్టులే తప్పుడు రాతలు రాస్తారు, తప్పుడు దృశ్యాలను చూపుతారు అంటూ వరసపెట్టి దాడి చేసిన వుదంతాలు వున్నాయి. ఇది కాశ్మీర్‌కే పరిమితం కాదు, కొన్ని ఛానల్స్‌ లేదా పత్రికలకే పరిమితం కాబోదు. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆ సంస్థలలో పని చేసే జర్నలిస్టులకు రాబోయే రోజుల్లో తలెత్తనున్న ముప్పును ఇవి సూచిస్తున్నాయి.

   టర్కీలో కుట్ర నుంచి తప్పించుకున్న ఎర్డోగన్‌కు గతంలో మద్దతు ఇచ్చిన శక్తులే వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ మాదిరి టర్కీ, ఇరాక్‌, సిరియా తదితర దేశాలను చీల్చి ఆ ప్రాంతంలో కుర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలన్న పధకాన్ని అమలు జరిపేందుకు అమెరికా పూనుకుందన్న వార్తలతో రష్యన్లు ముందుగానే టర్కీని హెచ్చరించటంతో కుట్రను జయప్రదంగా తిప్పి కొట్టగలిగినట్లు చెబుతున్నారు. కుట్రకు పాల్పడిన వారిలో సైనికాధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులను టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసి రానున్న రోజుల్లో విచారణ జరిపి శిక్షలు విధించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అందువలన మీడియా పాత్ర ఏమిటనే చర్చ రాబోయే రోజుల్లో పెద్దగా జరగటం అనివార్యం.

   ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవటమా లేదా అన్న సమస్యపై జరిగిన ప్రజాభి ప్రాయసేకరణలో మీడియా ఎలా వ్యవహరించిందో చూశాము. చివరకు ప్రభుత్వ నిధులతో నడిచే బిబిసి కూడా ఒకవైపు మొగ్గింది. నిజానికి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో వర్గ సమస్య లేదు. కార్పొరేట్‌ శక్తుల లాభనష్టాల విషయంలో తలెత్తిన విభేధాలతో కొన్ని సంస్ధలు విడిపోవటానికి అనుకూలిస్తే మరికొన్ని వ్యతిరేకించాయి. నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీల అభ్యర్ధుల ఎన్నిక ప్రక్రియలో మీడియా సంస్ధలు ఎలా జోక్యం చేసుకున్నాయో, ఇప్పుడు అభ్యర్ధులు ఖరారైన తరువాత మొత్తంగా మీడియా రెండు శిబిరాలుగా చీలిపోవటాన్ని చూడవచ్చు. అసలు ఆ ఎన్నికలే కొంత మంది దృష్టిలో పెద్ద ప్రహసనం అయితే దానిలో మీడియా జోక్యం చేసుకొని తిమ్మినిబమ్మిని చేయటం, ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయటం కనిపిస్తుంది. లాటిన్‌ అమెరికాలో జరిగిన పరిణామాలలో మీడియా పాత్రను మరింత అధ్యయనం చేయాల్సి వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలలో అనేక మంది నియంతలను రంగంలోకి తెచ్చి తమ కార్పొరేట్‌ అనుకూల వ్యవస్ధలను ఏర్పాటు చేశారు. లాటిన్‌ అమెరికాలో దాదాపు ప్రతి దేశం సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలనలో మగ్గటమే గాక ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధల విధానాలైన నయావుదారవాద ప్రయోగశాలగా మార్చి వేశారు. ఈ క్రమాన్ని అక్కడి మీడియా మొత్తంగా బలపరచటమేగాక, నియంతలు, అభివృద్ధి నిరోధకులను సోపానాలుగా చేసుకొని ప్రతి దేశంలో మీడియా రంగంలో గుత్తాధిపతులు తయారయ్యారు. నీకిది నాకది అన్నట్లుగా నియంతలు, కార్పొరేట్లు, మీడియా అధిపతులు కుమ్మక్కై పంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారందరూ ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకొనేందుకు ఏకం అవుతారని కూడా వేరే చెప్పనవసరం లేదు.

   నయావుదారవాద విధానాలు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతి దేశంలోనూ సాయుధ, ప్రజా పోరాటాలు చెలరేగాయి. దాంతో నియంతలతో ఎల్లకాలం జనాన్ని అణచలేమని గ్రహించిన సామ్రాజ్యవాదం విధిలేని పరిస్థితుల్లో నియంతల స్ధానంలో ప్రజాస్వామ్య వ్యవస్ధల పునరుద్ధరణకు తలవంచక తప్పలేదు. దాంతో దాదాపు ప్రతి దేశంలోనూ ఎన్నికలు స్వేచ్చగా జరిగిన చోట నియంతలను వ్యతిరేకించిన, పోరాడిన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటిలో కొన్ని చోట్ల వామపక్ష శక్తులున్నాయి. క్రమంగా అనేక దేశాలలో అవి ఎన్నికల విజయాలు సాధించటం, పౌరులకు వుపశమనం కలిగించే చర్యలు తీసుకొని ఒకటికి రెండు సార్లు వరుసగా అధికారానికి వస్తుండటం, రాజకీయంగా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకోవటం, తమలో తాము సంఘటితం కావటానికి ప్రయత్నించటం వంటి పరిణామాలు అమెరికన్లకు నచ్చలేదు. దీంతో తిరిగి కుట్రలకు తెరలేపింది. గతంలో లేని విధంగా పార్లమెంటరీ కుట్ర, ప్రజాస్వామ్య ఖూనీలకు పాల్పడింది. వాటికి మీడియా సంస్ధలు వెన్నుదన్నుగా కత్తి చేయలేని పనిని కలంతో పూర్తి చేస్తున్నాయి.

Image result for parliamentary and media coup against elected manual zelaya

హొండురాస్‌ అధ్యక్షుడిని పక్కదేశం కోస్టారికాలో పడేశారు

     హొండూరాస్‌లో జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ దేశాధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యాడు. మితవాద వేదిక నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొని లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. మితవాద కూటమి నుంచి వామపక్ష వైఖరి తీసుకోవటం హొండురాస్‌ మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. విదేశాంగ విధానంతో పాటు అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. ఇంతకంటే ప్రజాస్వామిక ప్రతిపాదన మరొకటి వుండదు. కానీ జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుంటే అధ్యక్షుడు రాజ్యాంగాన్ని సవరించటానికి వీలుంది. రెండవది అధ్యక్షపదవికి ఎన్నిక జరిపే సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించటానికి జనం ఆమోదం కోసం ఓటింగ్‌ జరపాలని పెట్టినందున ఆ ఎన్నికలో ఓడిపోతే ఇంటికి పోవాలి, గెలిస్తే కొనసాగవచ్చు, రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగే సమస్యే అక్కడ తలెత్తలేదు.

    రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి ధిక్కరించటంతో జెలయా అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత జెలయా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని మీడియా బయటపెట్టకపోగా సక్రమమే అని చిత్రించి మద్దతు ఇచ్చాంది.

Image result for parliamentary  coup against elected governments

పరాగ్వేలో పేదల పక్షాన పనిచేయటమే తప్పిదమైంది

      రోమన్‌ కాథలిక్‌ బిషప్‌గా పని చేసిన ఫెర్నాండో అరిమిందో ల్యూగో మెండెజ్‌ పరాగ్వే అధ్యక్షుడిగా 2008-12 సంవత్సరాలలో పని చేశారు. చిన్నతనంలో రోడ్లపై తినుబండారాలను విక్రయించిన ల్యూగో కుటుంబానికి నియంతలను ఎదిరించిన చరిత్ర వుంది. దాంతో ల్యూగో సాధారణ విద్యనభ్యసించి ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్‌గా పని చేశారు. ఆ సందర్భంగా వచ్చిన అనుభవంతో ఆయన క్రైస్తవ ఫాదర్‌గా మారారు. ల్యూగోను ఈక్వెడార్‌లో పనిచేయటానికి పంపారు. అక్కడ పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పేదల విముక్తి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. అది గమనించిన పరాగ్వే పోలీసులు 1982లో స్వదేశానికి తిరిగి వచ్చిన ల్యూగోను దేశం నుంచి వెలుపలికి పంపి వేయాలని చర్చి అధికారులపై వత్తిడి తెచ్చారు. దాంతో ఐదు సంవత్సరాల పాటు రోమ్‌లో చదువుకోసం పంపారు. 1994లో బిషప్‌గా బాధ్మతలు స్వీకరించారు. ఎన్నికలలో పోటీ చేయటానికి వీలుగా తనను మతాధికారి బాధ్యతల నుంచి విడుదల చేసి కొంత కాలం సెలవు ఇవ్వాలని 2005లో కోరారు. చర్చి నిరాకరించింది, తరువాత పోటీ చేసి గెలిచిన తరువాత సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ఆయన భూ పోరాటాలను బలపరిచారు. అప్పటికే పేదల బిషప్పుగా పేరు తెచ్చుకున్న ల్యూగోను అంతం చేస్తామని బెదిరించినప్పటికీ లొంగలేదు. ఆయన తండ్రి నిరంకుశ పాలకులను ఎదిరించి 20 సార్లు జైలుకు వెళ్లటాన్ని ఆయన చూసి వున్నాడు. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.తాను వేతనం తీసుకోనని ప్రకటించాడు.తొలిసారిగా గిరిజన తెగల నుంచి ఒకరిని వారి వ్యవహారాల మంత్రిగా నియమించారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మాదిరి అవినీతి నిరోధం, భూ సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టారు.

    పేదలకు మద్దతు ఇచ్చి భూసంస్కరణలకు పూనుకున్న ల్యూగోను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరిగింది. దానిలో భాగంగా భూ ఆక్రమణ చేసిన పేదలను తొలగించేందుకు పోలీసులు కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్నారు.ఈ వుదంతం దేశంలో అభద్రతకు చిహ్నం అని ప్రచారం ప్రారంభించిన పార్లమెంట్‌ సభ్యులు ప్రజలకు భద్రత కల్పించాలంటే దేశాధ్యక్షుడిని తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. వారం రోజుల్లో పార్లమెంట్‌ వుభయ సభల్లో తీర్మానాలు చేసి తొలగించారు. వున్నత న్యాయ స్ధానం కూడా దానిని సమర్ధించింది. అక్కడి మీడియాకు దీనిలో ఎలాంటి తప్పు కనిపించలేదు.

   ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన బ్రెజిల్‌ వామపక్ష అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ ప్రజాస్వామ్య బద్దంగా పని చేయకపోవటమనే ఒక నేరాన్ని ఆపాదించి అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించారు. ప్రపంచంలో, లాటిన్‌ అమెరికా పరిణామాలలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది.మిలిటరీ కుట్ర, మరొక కుట్ర గురించి చరిత్రలో వుందిగానీ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య, మీడియా కుట్ర ‘ తోడు కావటం ఈ పరిణామంలో గమనించాల్సిన అంశం. అధ్యక్షురాలిపై ఎలాంటి అవినీతి, అక్రమాల కేసులు లేవు. అయినప్పటికీ అక్కడి మీడియా ఆమెను అవినీతిపరురాలిగా చిత్రించి జనాన్ని నమ్మేట్లు చేసింది. అభిమానించిన జనమే అనుమానించేట్లు చేయటాన్ని చూసి శకుని సైతం సిగ్గు పడేట్లు, తనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని తలపట్టుకునేట్లు చేసింది. ఎన్నికలను తొత్తడాన్ని చూశాము, ఎన్నికైన ప్రభుత్వాలను ఎంత సులభంగా కూలదోయవచ్చో చూస్తున్నాము. బ్రెజిల్‌ అధ్యక్షురాలిపై బాధ్యతా నిర్వహణలో వైఫల్యమనే నేరాన్ని ఆరోపించి పదవి నుంచి తొలగించటం ప్రజాస్వామ్యం, ప్రజాతీర్పును పరిహసించటమే. పార్లమెంట్‌ అనుమతి లేకుండా దిల్మా రౌసెఫ్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాలలో అలా ఖర్చు చేయటం తరువాత పార్లమెంట్‌ ఆమోదం పొందటం అన్నది అన్ని చోట్లా జరిగినట్లే అక్కడా జరిగింది. అటువంటి పద్దతులను నివారించాలంటే అవసరమైన నిబంధనలను సవరించుకోవచ్చు, రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. అసలు లక్ష్యం వామపక్ష అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించటం కనుక ఏదో ఒక సాకుతో ఆపని చేశారు. దొంగే దొంగ అని అరచి నట్లుగా అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్నవారే అధ్యక్షురాలిపై కుట్ర చేసి పార్లమెంట్‌, కోర్టులను వుపయోగించుకొని పదవి నుంచి తొలగించారు.ఈ క్రమం ప్రారంభమైనపుడే అనేక మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిశంసనకు ఎలాంటి ఆధారమూ లేదని ప్రకటించారు. అయినా జరిగిపోయింది.పాండవ పక్షపాతి కృష్ణుడికి ముందుగా వచ్చిన ధుర్యోదనుడిని తప్పించుకోవటానికి ముందుగ వచ్చితీవు, మున్ముందుకు అర్జును జూచితి అన్నట్లుగా దిల్మా రౌసెఫ్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన వారందరూ దాదాపు ఏదో ఒక అవినీతి కుంభకోణం కేసులలో వున్నవారే అయినా మీడియాకు అదేమీ కనిపించలేదు.

  వామపక్ష శక్తులు శక్తివంతమైన మీడియాతో ప్రారంభం నుంచి సర్దుకు పోయేందుకు ప్రయత్నించాయి. దాంతో తొలి రోజుల్లో ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా వున్న పత్రికలు అవకాశం దొరికనపుడల్లా వామపక్షాలపై ఒకరాయి విసురుతూ పని చేశాయి. లాటిన్‌ అమెరికాలోని కార్పొరేట్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదులు వామపక్ష శక్తులను అదికారం నుంచి తొలగించాలనుకున్నతరువాత మీడియా పూర్తిగా వాటితో చేతులు కలిపింది.మచ్చుకు బ్రెజిల్‌ మీడియా సంస్ధల నేపధ్యాన్ని చూస్తే అవి వామపక్షాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలోని మీడియా సంస్ధలన్నీ దాదాపు కుటుంబ సంస్థలే. బ్రెజిల్‌లోని రెడె గ్లోబో మీడియా సంస్ధ రాబర్ట్‌ మారినిహో కుటుంబం చేతుల్లో వుంది. 1980 దశకం నాటికే అధికారంలో వున్న మిలిటరీ నియంతల ప్రాపకంతో 75శాతం వీక్షకులు, చదువరులపై ఆధిపత్యం సాధించింది. నియంతల పాలన అంతరించిన తరువాత 1989లో జరిగిన తొలి ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలో పిటి పార్టీ నేత లూలా డిసిల్వాను ఓడించిన ఫెర్నాండో కాలర్‌కు ఈ సంస్ధకు చెందిన టీవీ గ్లోబో బహిరంగంగా మద్దతు ఇచ్చింది. 1990దశకంలో కొత్త సంస్ధలకు అవకాశ ం ఇచ్చినప్పటికీ దాని పట్టు తగ్గలేదు. వామపక్ష పిటి పార్టీ అధికారానికి వచ్చిన తరువాత కూడా 2005లో బ్రెజిల్‌ ప్రకటనల బడ్జెట్‌లో సగం మొత్తం దానికే వెళ్లింది. అయినప్పటికీ మీడియా తన కార్పొరేట్‌, సామ్రాజ్యవాద అనుకూల వైఖరులను ప్రదర్శించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ పూర్వరంగంలో మీడియా రంగాన్ని ప్రజాస్వామీకరించాలన్న అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చుతుండగా, గుత్త సంస్ధలుగా ఎదగకుండా ఆంక్షలు విధించాలని మరికొందరు చెబుతున్నారు. వర్గ వ్యవస్ధలో దోపిడీదారులకు ఒక ఆయుధంగా మీడియా వుపయోగపడుతున్నందున ప్రత్యామ్నాయ మీడియాను కూడా రూపొందించాలనే అభిప్రాయం కూడా వెల్లడి అవుతోంది. అయితే ఈ ప్రతిపాదనలేవీ నిర్ధిష్ట రూపం తీసుకోవటం లేదు.

గమనిక ఈ వ్యాసం ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి ‘ మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కాలేజీల్లో అగ్రస్థానంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక ‘

03 Saturday Sep 2016

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Che Guevara, communist manifesto, HONG KONG ELECTIONS, Kapernick, Karl Marx, lavish banquets, National Anthem Controversy, Norman Bethune

Image result for Original Communist Manifesto

ఎంకెఆర్‌

   అమెరికా పాలకవర్గం కమ్యూనిజాన్ని అంతం చేయాలని చూస్తున్నది. కానీ ప్రస్తుతం అక్కడి కళాశాలలోని ఆర్ధిక శాస్త్ర విద్యార్ధులు అధ్యయనం చేయాల్సిన పుస్తకాలంటూ సిఫార్సు చేసిన వాటిలో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం అగ్రస్థానంలో వుంది. ఆ గ్రంధాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ 1848లో రాసిన విషయం తెలిసిందే. ఓపెన్‌ సిలబస్‌ ప్రాజెక్టు(ఒపిఎస్‌) కింద నూతన సిలబస్‌ సమాచారాన్ని సేకరించగా ఈ విషయం వెల్లడైందని మార్కెట్‌ వాచ్‌ డాట్‌ కాంలో ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నారు. వివిధ వెబ్‌సైట్లు, సమాచారాన్నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ప్రచురణకు పాయింట్లను కేటాయించారు. ఒక పుస్తకం పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది, దానిని ఎన్నిసార్లు బోధించారు అనే లెక్కలను తీశారు. వాటి ప్రకారం కమ్యూనిస్టు ప్రణాళిక సంఖ్య 3,189 కాగా బోధనా పాయింట్లు 99.7 వచ్చాయి.మిగతా పుస్తకాలకంటే ఇవి రెండు, నాలుగు రెట్లు ఎక్కువ. కమ్యూనిస్టు ఆర్ధిక, సామాజిక బోధనల తరువాత కీనిసియన్‌ సిద్ధాంతాల ప్రచురణలు ఎక్కువగా వున్నాయి.ఆర్ధిక, ద్రవ్య విషయాలకు సంబంధించి అగ్రస్ధానంలో వున్న పది హేను పుస్తకాలలో పది కీనిసియన్‌ లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందినవే వున్నాయి. స్వేచ్చా మార్కెట్‌ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు అగ్రస్థానంలో రెండు మాత్రమే వున్నాయి. వాటిలో ఒక వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ అనే ఆడమ్‌ స్మిత్‌ రచన రెండవ స్ధానంలో, పెట్టుబడిదారీ విధానం మరియు స్వేచ్ఛ అనే మిల్టన్‌ ఫ్రైడ్‌ మాన్‌ గ్రంధం ఐదవ స్ధానంలో వుంది.http://www.marketwatch.com/story/communist-manifesto-among-top-three-books-assigned-in-college-2016-01-27

imrs.php

విలాస విందులు-చైనా కమ్యూనిస్టు పార్టీ ఆంక్షలు

   అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు విలాసవంతమైన విందులకు సభ్యులు దూరంగా వుండాలని ఆంక్షలు విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు విందు ఆహ్వానాలను అందుకున్నపుడు వాటికి ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో,ఎక్కడ జరుగుతోందో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. పార్టీ సభ్యులు, అధికారులు ఎలాంటి విందులకు హాజరు కాకూడదో తెలిపింది.అధికారులు ప్రయివేటు క్లబ్బులలో జరిగే విందులకు వెళ్లటాన్ని, ఇతరులను ఆహ్వానించటంపై నిషేధం విధించింది. అలాంటి 20 రకాల విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదని తెలిపింది.వివాహాలు, దినాలను విలాసవంతంగా నిర్వహించకూడదని సూచించింది. గ్జీ జింగ్‌ పింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా అవినీతిపై కేంద్రీకరించారు. ఇప్పుడు విలాసాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు దిగువ సూచనలు పాటించాలని ఆదేశించారు.

     భారీ ఎత్తున జరిపే విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదు. అధికార విధులతో సంబంధం లేని విందులు ఏర్పాటు చేయరాదు. అదే నగరం లేదా దేశంలోని ఇతర శాఖల వారిని ఆహ్వానించినపుడు ప్రజల సొమ్మును విందులకు ఖర్చు చేయరాదు.దిగువ స్ధాయి డిపార్ట్‌మెంట్లను విందులు ఏర్పాటు చేయమని అడగ కూడదు.అధికారిక విధులతో సంబంధం లేని విందులకు ఇతర నగరాలలో వెళ్లకూడదు. గ్రామశాఖలు ఏర్పాటు చేసే విందులను స్వీకరించరాదు. ప్రయివేటు కంపెనీలు ఏర్పాటు చేసే విందులకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్లాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును చెల్లించాలి. తమ భోజన ఖర్చు చెల్లించాలని ప్రయివేటు కంపెనీలను అడగ కూడదు. వాణిజ్య పర్యటనలలో ఇతర అధికారుల భోజనాలకు చెల్లించకూడదు. పొద్దు పోయిన తరువాత చేసే భోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. స్వప్రయోజనాలు ఇమిడి వున్న వ్యక్తుల నుంచి వచ్చే విందు ఆహ్వానాన్ని తిరస్కరించాలి. అలాంటి వాటి పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా వుండాలి. అధికారిక విధులకు అంతరాయం కలిగించే విందులకు వెళ్ల కూడదు. అధికారిక విధులతో నిమిత్తం లేని ఫంక్షన్లకు వచ్చిన అతిధులకు ప్రజల సొమ్మును వెచ్చించకూడదు. ప్రభుత్వ సంస్ధలు ఇచ్చే విందులకు ప్రయివేటు వ్యక్తులను పిలవ కూడదు, అలాంటి విందులలో విందు ఆడంబరంగా వుండకూడదు. ప్రయివేటు క్లబ్బులు, ఇతర ఖరీదైన ప్రాంతాలకు వెళ్లకూడదు. చిన్న బృందాలు, గ్యాంగులను ఏర్పాటు చేసేందుకు వుద్ధేశించిన విందులకు దూరంగా వుండాలి. నగదు బహుమతులు అందచేసే, అధికారులకు చెడ్డపేరు తెచ్చేందుకు అవకాశం వున్న విందులకు వెళ్లకూడదు.

Image result for Dr. Norman Bethune

నార్మన్‌ బెతూన్‌పై కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకుల కడుపు మంట

   ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజం అంతిరించి పోయిందంటూనే ఆదర్శ కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతగా భయపడుతున్నారు. ఎందుకంటే ఆదర్శవాదులు ధృవతారలుగా వెలుగుతూనే వుంటారు. చైనా విముక్తి, జపాన్‌ దురాక్రమణ వ్యతిరేకపోరాటంలో నిమగ్నమైన కమ్యూనిస్టులకు సాయపడేందుకు కెనడా నుంచి నార్మన్‌ బెతూన్‌, భారత్‌ నుంచి ద్వారకా నాధ్‌ శాంతారామ్‌ కొట్నీస్‌(డిఎన్‌ కొట్నిస్‌) వంటి ఎందరో ప్రాణాలకు తెగించి చైనా వెళ్లి సేవలు అందించారు.

   ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు ఆరు వరకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ చైనా పర్యటన జరుపుతున్నారు.ఆయన రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నార్మన్‌ బెతూన్‌ మెడల్‌ను బహుకరించింది. ఇలాంటిదే 1973లో తన తండ్రికి బహుకరించారని జస్టిన్‌ తన ఇస్‌స్టాగ్రామ్‌ పేజీలో వ్యాఖ్యానించారు. ఇంకేముంది కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవకాశం దొరికినట్లయింది. మాజీ ప్రధాని పిరే ఇలియట్‌ ట్రుడెవ్‌ అడుగుజాడల్లో ఆయన కుమారుడు జస్టిన్‌ కూడా చైనా తో సంబంధాల విషయంలో వ్యవహరిస్తున్నాడని చైనాలో మానవ హక్కుల హరణం గురించి తెలుసుకోవాలంటూ కాగితాలు, ఇంటర్నెట్‌ను ఖరాబు చేస్తున్నారు. నార్మన్‌ బెతూన్‌ అంటే కెనడాలో అత్యధికులకు అసలు తెలియదు, చైనాలో మాత్రం జాతీయ వీరుడు, ప్రతి స్కూలు పిల్లవాడికీ బెతూన్‌ పేరు తెలుసు. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన బెతూన్‌ కమ్యూనిస్టు కూడా. కెనడాలో వైద్యం వలన తన జీవితం ధన్యం కాదని గ్రహించిన ఆయన తొలుత స్పెయిన్‌ వెళ్లి అక్కడ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన అంతరుద్ధ్యంలో పాల్గొన్నాడు. తరువాత 1938లో చైనా వెళ్లి కమ్యూనిస్టు గెరిల్లా దళాలలో చేరి వారికి వైద్య చికిత్స అందించారు. ఆ సమయంలోనే మావోతో పరిచయం ఏర్పడింది. అయితే 1939లో జరిగిన ఒక ప్రమాదంలో బెతూన్‌ మరణించారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు సౌహార్ధ్రతకు ఒక ఆదర్శంగా బెతూన్‌ సేవలను పరిగణించి ఆయన గురించి స్కూలు పాఠ్యాంశాలలో చేర్చటంతో ఆయన పేరు ప్రతి చైనీయుడికీ సుపరిచితం అవుతోంది.

   1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి తిరస్కరించింది. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా పరిగణించి ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం కలిగించింది. అయితే అలా కొనసాగటం సాధ్యం కాని స్ధితిలో అమెరికా దిగి వచ్చి కమ్యూనిస్టు చైనాను గుర్తించక తప్పలేదు. దాంతో అప్పటి వరకు అమెరికాను అనుసరించిన కెనడా కూడా చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకొంది. 1973లో కెనడా ప్రధాని పిరే చైనా పర్యటన జరిపి మావోతో భేటీ అయ్యారు. ఆ పర్యటన సందర్భంగా నార్మన్‌ బెతూన్‌కు చైనాలో వున్న ఆదరణ, వున్నత స్ధానాన్ని గమనించారు.బెతూన్‌ది కెనడా, మాదీ కెనడా అన్నట్లుగా సంబంధాలను కలుపుకున్నారు.అప్పటి నుంచి కెనడాలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ, కమ్యూనిస్టు వ్యతిరేకులైనా చైనాతో సంబంధాల విషయంలో నార్మన్‌ బెతూన్‌ పేరును వుపయోగించుకుంటూనే వున్నారు.

   జపాన్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనాకు వెళ్లిన బెతూన్‌ కెనడా విలువలకు ద్రోహం చేశాడని అతడే మాత్రం ఆదర్శం కాదంటూ కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులు విషం చిమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం టొరోంటో సన్‌ అనే పత్రిక అధిపతి పీటర్‌ వర్తింగ్టన్‌ ఒక వ్యాఖ్యానం రాస్తూ ‘ మానవత్వానికి సాయం చేసేందుకు బెతూన్‌ చైనా వెళ్లలేదు, అక్కడ మావో కమ్యూనిస్టు పార్టీ సైన్యానికి తోడ్పడేందుకు మాత్రమే వెళ్లారు, సాధారణ రోగులకు బదులు గాయపడిన కమ్యూనిస్టు గెరిల్లాలకు చికిత్స చేసేందుకు మాత్రమే వెళ్లారు అని రాసిన విషయాన్ని ఇప్పుడు వుటంకిస్తూ ఆ విషయాన్ని ప్రధాని జస్టిన్‌ మరిచిపోకూడదని కమ్యూనిస్టు వ్యతిరేక రచయితలు వుద్బోధించారు. మానవ హక్కుల వుల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను ప్రధాని ఎలాగూ నిలదీయలేరు, కనీసం బెతూన్‌ను పొగిడుతూ నటించటం అయినా మానుకోవాలని కొందరు వ్యాఖ్యాతలు రాశారు.

కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తప్పేనా ?

    హాంకాంగ్‌ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదంటూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు దానినొక సమస్యగా ఓటర్ల ముందుంచేందుకు పూనుకున్నారు. హాంకాంగ్‌ విషయానికి వస్తే దానిదొక ప్రత్యేక పరిస్థితి. బ్రిటీష్‌ వారి కౌలు 99 సంవత్సరాల కౌలు గడువు ముగిసిన తరువాత మాతృదేశం చైనాలో ప్రాంతమది. అంతర్జాతీయ నౌకాశ్రయంగా, పెట్టుబడులు, వాణిజ్య కేంద్రంగా బ్రిటీష్‌ వారి ఏలుబడిలో రూపొందింది. దానిని విలీనం చేసే సందర్భంగా 1997వ సంవత్సరంలో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అదే మంటే చైనాలో అంతర్భాగమైనప్పటికీ యాభై సంవత్సరాల పాటు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న విధానంగా దీనిని వర్ణించారు. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, హాంకాంగ్‌లో పెట్టుబడిదారీ వ్యవస్ధ.దానికి అనుగుణ్యంగానే హాంకాంగ్‌ పాలక మండలి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ స్వయం పాలనా మండలికి అప్పగించింది.అయితే హాంకాంగ్‌ను ఎలాగైనా చైనా నుంచి విడదీయాలన్న దుర్బుద్ధితో సామ్రాజ్యవాదులు అనేక రకాలుగా అక్కడి పౌరులను రెచ్చగొడుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించే శక్తులు పాలకులుగా ఎన్నికైనప్పటికీ చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించటం లేదు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగే హాంకాంగ్‌లో 72లక్షల మంది జనాభా వున్నారు. దానికి ఎన్నికయ్యే పాలక మండలితో పాటు చైనా ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ మండలి ప్రత్యేకంగా వుంటుంది. హాంకాంగ్‌ తరఫున చైనాలో అధికారిక ప్రతినిధిగా అదే వుంటుంది. రోజువారీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకులు దానిలోని సభ్యులందరూ కమ్యూనిస్టులే అని అయితే బయటికి అలా చెప్పుకోరు అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఒప్పందానికి అనుగుణంగా హాంకాంగ్‌లోని సంస్ధలకు విశ్వాసం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.

కాస్ట్రోతో చేయి కలుపుతారు, ఆయన బొమ్మపై రాద్ధాంతం చేస్తారు

    అమెరికా పాలకులు క్యూబాను నాశనం చేయాలని, దాని అధినేత ఫిడెల్‌ కాస్ట్రోను అంతం చేయాలని ఎన్నో యత్నాలు చేసి సాధ్యంగాక చివరికి దిగి వచ్చి దౌత్య సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే మరోవైపు కాస్ట్రో బొమ్మతో వున్న టీ షర్టులను ధరించిన వారిపై మాత్రం రాద్ధాంతం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాజాగా ఫుట్‌బాల్‌ ఆటగాడు కోలిన్‌ కయోపెర్నిక్‌ తెలిపిన నిరసన తీరుతెన్నులపై పెద్ద రగడ చేస్తున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షకు నిరసనగా ఒక ఫుట్‌బాల్‌ పోటీ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు లేచి నిలబడలేదు.దానిపై నెల రోజుల తరువాత చెలరేగిన వివాదం గురించి మాట్లాడేందుకు గత వారంలో విలేకర్లతో మాట్లాడాడు.ఆ సందర్భంగా ఫిడెల్‌ కాస్ట్రో, అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖులతో కూడి వున్న టీ షర్టును వేసుకన్నాడు. దానిపై ‘భావ సారూప్యం వున్నవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ‘ అనే నినాదం రాసి వుంది.”Like Minds Think Alike.”)నల్ల, రంగు జాతీయులను అణచివేస్తున్నందుకు నిరసనగా తాను జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకుండా నిరసన తెలిపానని స్పష్టం చేశాడు. తనకు ఫుట్‌ బాల్‌ కంటే నిరసన ముఖ్యమని వేరే విధంగా ఆలోచిస్తే స్వార్ధం అవుతుందని అన్నాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా వేసుకున్న టీషర్టుపై ఫిడెల్‌ కాస్ట్రో బొమ్మ వుందంటే కయో పెర్నిక్‌ ఒక కమ్యూనిస్టు నియంతను సమర్ధించినట్లేనని ఒక పత్రికలో రాశారు. క్యూబా నుంచి ప్రవాసం వచ్చిన క్యూబన్‌-అమెరికన్లు కయో పెర్నిక్‌పై మండి పడుతున్నారుె. ఎందుకలా చేశాడంటూ మీడియాలో నిరసన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కయో పెర్నిక్‌ తల్లి పేద కుటుంబానికి చెందిన శ్వేత జాతి యువతి కాగా తండ్రి నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్‌.

   అమెరికా జాతీయ గీతం జాతి వివక్షా పూరితమైనదనే విమర్శ ఎప్పటి నుంచో వుంది. దానిని రాసింది ఒక బానిస యజమాని. నల్లజాతి వారిని బానిసలుగా చేసి అమెరికా ఖండంలో వ్యాపారం చేసిన విషయం తెలిసినదే. ఆ గీతంపై గతంలో ఎందరో నిరసన తెలిపారు. అనేక మంది నల్లజాతి క్రీడాకారులు ఆ గీతాలాపన సందర్భంగా మాట్లాడుతూ వుండటమో, కాలో చేయో కదిలించటం, టోపీ తీయటం,పెట్టుకోవటం వంటి రూపాలలో నిరసన తెలపటం జరుగుతున్నది. తాను అమెరికా వ్యతిరేకిని కాదని, అమెరికా మరింత మెరుగ్గా తయారు కావటానికే ఈ నిరసన తెలిపినట్లు కయో పెర్నిక్‌ చెప్పాడు.తొలుత కూర్చుని నిరసన తెలిపిన అతను ఇప్పుడు మోకాళ్ల మీద నిలబడుతున్నాడు.1972లో జాకీ రాబిన్సన్‌ అనే బేస్‌బాల్‌ ఆటగాడు నిరసన తెలిపుతూ ‘నేను నిలబడను, జాతీయ గీతం పాడను, పతాకానికి వందనం చేయను, శ్వేతజాతి లోకంలో నేనొక నల్లజాతీయుడనని నాకు తెలుసు ‘ అని వ్యాఖ్యానించాడు.అంతకు ముందు ఇద్దరు నల్లజాతి ఒలింపిక్‌ రన్నర్లు జాతీయ గీతాలాపన సందర్భంగా నల్లజాతీయుల శక్తి చిహ్నంగా బిగించిన పిడికిలి చూపి నిరసన తెలిపారు.

చే గువేరాపై నోరు పారవేసుకున్న టర్కిష్‌ స్పీకర్‌

    ప్రముఖ విప్లవ కారుడు చే గువేరా ఒక హంతకుడు కనుక అతనినెవరూ అభిమానించకూడదని వ్యాఖ్యానించిన టర్కీ పార్లమెంట్‌ స్పీకర్‌ ఇస్మాయిల్‌ కర్మాన్‌ చర్యను ప్రపంచంలో అనేక మంది ఖండించారు.తమ ఆరాధ్యనేత అయిన చేగువేరాను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని క్యూబా డిమాండ్‌ చేసింది. ఒక యువజన బృందాన్ని వుద్ధేశించి ఆయన మాట్లాడుతుండగా వారిలో కొందరు చేగువేరా బొమ్మలున్న టీ షర్టులు ధరించి కనిపించటంతో స్పీకర్‌కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతనొక గెరిల్లా, బందిపోటు ,39 సంవత్సరాల వయస్సులోనే వురి తీసి చంపాడు, అతను అదర్శం కాకూడదు అని మాట్లాడాడు. క్యూబా నిరసన తెలపటంతో టర్కీ ప్రభుత్వం సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. తమ స్పీకర్‌ మార్క్సిస్టు వ్యతిరేకి కాదని, ఒక జాతీయ వాదిగా తమ దేశంలో వున్న వేలాది మందిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప క్యూబా సోషలిస్టు విప్లవంలో భాగస్వామి అయిన వారిని కాదని చెప్పేందుకు ప్రయత్నించారని వివరణ ఇచ్చింది. స్పీకర్‌ వ్యాఖ్యలు చేగువేరా చరిత్రను వక్రీకరించాయని క్షమాపణ చెప్పాల్సిందేనని టర్కీలో క్యూబా రాయబారి డిమాండ్‌ చేశారు. టర్కీలోని వామపక్ష పార్టీల కార్యకర్తలు చే గువేరా టీషర్టులు ధరించి దేశమంతటా స్పీకర్‌ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. పార్లమెంట్‌ ఎదుట చేసిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. టర్కీ పాలకపార్టీ ఏకెపి కమ్యూనిస్టు వ్యతిరేక, మతవాద పార్టీ అన్న విషయం తెలిసిందే. క్యూబాలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అభ్యర్ధనను క్యూబా సర్కార్‌ గతంలో అంగీకరించలేదు. అమెరికాను 1492లో కొలంబస్‌ కనుగొనక ముందే ముస్లింలు కనుగొన్నారని ఎర్డోగన్‌ వాదిస్తారు. కొలంబస్‌ డైరీలలో ఒక కొండ పక్కన గుమ్మటాలతో కూడిన ఒక భవనం గురించి వర్ణణ వుందని అది అక్కడి మసీదు గురించే అని టర్కీలోని కొందరు చెబుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లాటిన్‌ అమెరికాలో పార్లమెంటరీ, మీడియా కుట్ర !

03 Saturday Sep 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion

≈ Leave a comment

Tags

Brazil, Dilma Rousseff, Honduras, Impeachment of Dilma Rousseff, media coup, Paraguay, Parliamentary coup

ఎం కోటేశ్వరరావు

బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ అనుభవం నుంచి తీసుకోవాల్సిన గుణ పాఠాలు ఏమిటి ?

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం

నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

     అన్న శ్రీశ్రీ ఇప్పుడు బతికి వుంటే ప్రజాస్వామ్య కుట్ర గురించి చక్కటి కవిత అందించి వుండేవారు. వీరేశలింగం బ్రతికి వుంటే తాను రాసిన ప్రహసనాలకు ప్రజాస్వామ్యం గురించి కూడా రాసి జత చేసి వుండే వారు. లోకంలో దయామయుడైన భూస్వామి, మంచి పెట్టుబడిదారుడు, లోక కల్యాణం కోరుకొనే సామ్రాజ్యవాదీ వుండరు. ప్రజాస్వామ్యం కూడా నేతి బీరలో నెయ్యి వంటిదేనని ప్రతి తరానికి దానిని ప్రహసప్రాయంగా మార్చేవారు తెలియ చేస్తున్నారు. ఇప్పుడు బ్రెజిల్‌లో అదే జరిగింది, దోపిడీ శక్తులకు ఏ మాత్రం ప్రతిఘటన లేదా ప్రత్యామ్నాయాన్ని చూపినా వారు సహించరని స్పష్టం చేస్తూనే వున్నారు. పూలు, రంగుల పూసలు, నూలు దారాల స్థానంలో సింథటిక్‌ దారమో మరొకటో తప్ప దండ కూర్పులో ఎలాంటి మార్పు లేదు. మోటుగా వుండేవి, నాజూకుగా మారుతున్నాయి అంతే తేడా, పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు సేమ్‌ సేమ్‌ టు సేమ్‌. మేక పిల్లను తిన దలచుచున్న తోడేలు కథ మాదిరి సామ్రాజ్యవాదుల చర్యలు వున్నాయి. అందువలన వారి చర్యల చట్టబద్దత, న్యాయ సూత్రాల గురించి తర్కించటం వృధా ప్రయాస.

    ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన బ్రెజిల్‌ వామపక్ష అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ ప్రజాస్వామ్య బద్దంగా పని చేయకపోవటమనే ఒక నేరాన్ని ఆపాదించి అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించారు. ప్రపంచంలో, లాటిన్‌ అమెరికా పరిణామాలలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది.మిలిటరీ కుట్ర, మరొక కుట్ర గురించి చరిత్రలో వుందిగానీ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య, మీడియా కుట్ర ‘ తోడు కావటం ఈ పరిణామంలో గమనించాల్సిన అంశం. అధ్యక్షురాలిపై ఎలాంటి అవినీతి, అక్రమాల కేసులు లేవు. అయినప్పటికీ అక్కడి మీడియా ఆమెను అవినీతిపరురాలిగా చిత్రించి జనాన్ని నమ్మేట్లు చేసింది. అభిమానించిన జనమే అనుమానించేట్లు చేయటాన్ని చూసి శకుని సైతం సిగ్గు పడేట్లు, తనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని తలపట్టుకునేట్లు చేసింది. ఎన్నికలను తొత్తడాన్ని చూశాము, ఎన్నికైన ప్రభుత్వాలను ఎంత సులభంగా కూలదోయవచ్చో చూస్తున్నాము. బ్రెజిల్‌ అధ్యక్షురాలిపై బాధ్యతా నిర్వహణలో వైఫల్యమనే నేరాన్ని ఆరోపించి పదవి నుంచి తొలగించటం ప్రజాస్వామ్యం, ప్రజాతీర్పును పరిహసించటమే. పార్లమెంట్‌ అనుమతి లేకుండా దిల్మా రౌసెఫ్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాలలో అలా ఖర్చు చేయటం తరువాత పార్లమెంట్‌ ఆమోదం పొందటం అన్నది అన్ని చోట్లా జరిగినట్లే అక్కడా జరిగింది. అటువంటి పద్దతులను నివారించాలంటే అవసరమైన నిబంధనలను సవరించుకోవచ్చు, రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. అసలు లక్ష్యం వామపక్ష అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించటం కనుక ఏదో ఒక సాకుతో ఆపని చేశారు. దొంగే దొంగ అని అరచి నట్లుగా అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్నవారే అధ్యక్షురాలిపై కుట్ర చేసి పార్లమెంట్‌, కోర్టులను వుపయోగించుకొని పదవి నుంచి తొలగించారు.ఈ క్రమం ప్రారంభమైనపుడే అనేక మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిశంసనకు ఎలాంటి ఆధారమూ లేదని ప్రకటించారు. అయినా జరిగిపోయింది.

   లాటిన్‌ అమెరికాలో తన అజెండాను అమలు జరిపేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి వేసేందుకు సైనిక నియంతలను గద్దెపై కూర్చుండబెట్టింది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ద్వారా రూపొందించిన నయా వుదారవాద విధానాలకు ఆ ప్రాంతాన్ని ప్రయోగశాలగా వుపయోగించింది. అది వికటించి సైనిక నియంతలు, అమెరికా తొత్తు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వుద్యమించారు. దాంతో నియంతల స్ధానంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిపేందుకు అనివార్యంగా పాలకవర్గాలు దిగిరావాల్సి వచ్చింది. నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరులో పురోగామి వైఖరులు కలిగిన క్రైస్తవ మతాధికారులతో సహా అనేక శక్తులు ఏకం కావటం, ఎన్నికలలో నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరు సల్పిన శక్తులకు జనం పట్టం కట్టటంతో అనేక దేశాలలో వామపక్ష శక్తులు అధికారానికి వచ్చి ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపాయి. వాటికి ఎన్నిపరిమితులు వున్నప్పటికీ నయా వుదారవాద విధానాలతో సర్వం కోల్పోయిన జనానికి తక్షణ వుపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో సామాన్యజనం వాటికి మద్దతుగా నిలిచినందున బ్రెజిల్‌, వెనెజులా,బొలీవియా వంటి చోట్ల గతదశాబ్దన్నర కాలంలో జరిగిన ఎన్నికలన్నింటిలోనూ వామపక్ష శక్తులు విజయం సాధిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో సామ్రాజ్యవాదులు ఆ ప్రాంత దేశాలలో సరికొత్త కుట్రలకు తెరతీశారు. దానిలో భాగమే బ్రెజిల్‌ పరిణామాలు. దీని గురించి ఇంకా లోతుగా పరిశీలించాల్సి వుంది. అ క్రమంలో పలువురు విశ్లేషకులు తమ వైఖరుల నుంచి వెలిబుచ్చిన కొన్ని అంశాల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రయత్నించవచ్చు.

    సామ్రాజ్యవాదులు, వారి కనుసన్నలలో పని చేసే మీడియా స్వభావం గురించి తెలిసిన వారికి మీడియా నిరంతర కుట్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొద్ది మంది మేథావులు, పరిశీలకులు మాత్రమే వాటిని అర్ధం చేసుకుంటే చాలదు. సామాన్యుల వరకు తీసుకుపోవాల్సి వుంది.సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా మీడియా,చర్చి ఎలా పని చేసిందీ చూశాము, ఆ వ్యవస్ధలు దశాబ్దాల తరబడి కొనసాగి కూల్చివేతకు గురైన పూర్వరంగంలో లాటిన్‌ అమెరికా పరిణామాలను కూడా చూడాల్సి వుంది. సోషలిస్టు వ్యవస్ధలను కుట్రతో కూల్చివేయటం ఒకటైతే అందుకు అవకాశం ఇచ్చిన ఆ వ్యవస్ధలను నడిపిన కమ్యూనిస్టుపార్టీల లోపం కూడా అందుకు అవకాశం ఇచ్చిందన్నది వాస్తవం. ఇప్పుడు లాటిన్‌ అమెరికాలో కూడా అధికారానికి వచ్చిన వామపక్ష శక్తులు అదే పొరపాటు చేశాయా ?

    సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన తరువాతే లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారానికి రావటంతో కాడి పారేసిన అనేక మంది వామపక్ష కార్యకర్తలకు తిరిగి వూతం వచ్చింది. తమ కళ్ల ముందు సోషలిస్టు వ్యవస్థలను దెబ్బతీసిన శక్తులు తమను సహిస్తాయనే భ్రమలకు లోనయ్యాయా అన్నది కూడా పరిశీలించాల్సిన అంశమే. దోపిడీ శక్తులు నిరంతర కుట్రలు చేసి తమ వ్యతిరేకులను దెబ్బతీస్తారన్నది బహిరంగ రహస్యమైనప్పటికీ లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు దానిని పట్టించుకోలేదా ? జనాన్ని చైతన్య పరచలేదా ? వారేమైనా పొరపాట్లు చేశారా అన్నది ఆలోచించాల్సిన అంశమే. ఈ సందర్భంగా నిర్ధారణలకు రాకుండా కొన్ని పరిణామాలు, ధోరణులను చర్చ, పరిశీలనకు వీలుగా ఈ వ్యాసంలో అందించటం జరుగుతున్నది.పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం వున్న వారికి ‘పార్లమెంటరీ కుట్ర’ అన్న పదమే వింతగా అనిపించవచ్చు. నమ్మక పోవచ్చు కూడా, కానీ ఇది నిజం. బ్రెజిల్‌లో అదెలా జరిగిందో చూడబోయే ముందు హొండూరాస్‌, పరాగ్వేలో ఆ ప్రహసనం ఎలా జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకోవటం అవసరం.

హొండురాస్‌ అధ్యక్షుడిని పక్కదేశం కోస్టారికాలో పడేశారు

     హొండూరాస్‌లో జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ దేశాధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యాడు. మితవాద వేదిక నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొని లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. మితవాద కూటమి నుంచి వామపక్ష వైఖరి తీసుకోవటం హొండురాస్‌ మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. విదేశాంగ విధానంతో పాటు అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. ఇంతకంటే ప్రజాస్వామిక ప్రతిపాదన మరొకటి వుండదు. కానీ జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుంటే అధ్యక్షుడు రాజ్యాంగాన్ని సవరించటానికి వీలుంది. రెండవది అధ్యక్షపదవికి ఎన్నిక జరిపే సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించటానికి జనం ఆమోదం కోసం ఓటింగ్‌ జరపాలని పెట్టినందున ఆ ఎన్నికలో ఓడిపోతే ఇంటికి పోవాలి, గెలిస్తే కొనసాగవచ్చు, రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగే సమస్యే అక్కడ తలెత్తలేదు.

     రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి అ ధిక్కరించటంతో జెలయా అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత జెలయా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు.

Image result for parliamentary coup in paraguay

పరాగ్వేలో పేదల పక్షాన పనిచేయటమే తప్పిదమైంది

      రోమన్‌ కాథలిక్‌ బిషప్‌గా పని చేసిన ఫెర్నాండో అరిమిందో ల్యూగో మెండెజ్‌ పరాగ్వే అధ్యక్షుడిగా 2008-12 సంవత్సరాలలో పని చేశారు. చిన్నతనంలో రోడ్లపై తినుబండారాలను విక్రయించిన ల్యూగో కుటుంబానికి నియంతలను ఎదిరించిన చరిత్ర వుంది. ఆయన తండ్రిని ఇరవై సార్లు జైలులో పెట్టారు. దాంతో ల్యూగో సాధారణ విద్యనభ్యసించి ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్‌గా పని చేశారు. ఆ సందర్భంగా వచ్చిన అనుభవంతో ఆయన క్రైస్తవ ఫాదర్‌గా మారారు. ల్యూగోను ఈక్వెడార్‌లో పనిచేయటానికి పంపారు. అక్కడ పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పేదల విముక్తి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. అది గమనించిన పరాగ్వే పోలీసులు 1982లో స్వదేశానికి తిరిగి వచ్చిన ల్యూగోను దేశం నుంచి వెలుపలికి పంపి వేయాలని చర్చి అధికారులపై వత్తిడి తెచ్చారు. దాంతో ఐదు సంవత్సరాల పాటు రోమ్‌లో చదువుకోసం పంపారు. 1994లో బిషప్‌గా బాధ్మతలు స్వీకరించారు. ఎన్నికలలో పోటీ చేయటానికి వీలుగా తనను మతాధికారి బాధ్యతల నుంచి విడుదల చేసి కొంత కాలం సెలవు ఇవ్వాలని 2005లో కోరారు. చర్చి నిరాకరించింది. తరువాత పోటీ చేసి గెలిచిన తరువాత సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ఆయన భూ పోరాటాలను బలపరిచారు. అప్పటికే పేదల బిషప్పుగా పేరు తెచ్చుకున్న ల్యూగోను అంతం చేస్తామని బెదిరించినప్పటికీ లొంగలేదు. ఆయన తండ్రి నిరంకుశ పాలకులను ఎదిరించి 20 సార్లు జైలుకు వెళ్లటాన్ని ఆయన చూసి వున్నాడు. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.తాను వేతనం తీసుకోనని ప్రకటించాడు.తొలిసారిగా గిరిజన తెగల నుంచి ఒకరిని వారి వ్యవహారాల మంత్రిగా నియమించారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మాదిరి అవినీతి నిరోధం, భూ సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టారు.

    పేదలకు మద్దతు ఇచ్చి భూసంస్కరణలకు పూనుకున్న ల్యూగోను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరిగింది. దానిలో భాగంగా భూ ఆక్రమణ చేసిన పేదలను తొలగించేందుకు పోలీసులు కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్నారు.ఈ వుదంతం దేశంలో అభద్రతకు చిహ్నం అని ప్రచారం ప్రారంభించిన పార్లమెంట్‌ సభ్యులు ప్రజలకు భద్రత కల్పించాలంటే దేశాధ్యక్షుడిని తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. వారం రోజుల్లో పార్లమెంట్‌ వుభయ సభల్లో తీర్మానాలు చేసి తొలగించారు. వున్నత న్యాయ స్ధానం కూడా దానిని సమర్ధించింది.

   పరాగ్వే, హొండూరాస్‌లలో జరిగిన కుట్రలను ఎదుర్కోవటంలో వైఫల్యం, వామపక్ష శక్తుల బలహీనతలను గమనించిన సామ్రాజ్యవాదులు, మితవాద శక్తులు లాటిన్‌ అమెరికాలో పెద్దదైన బ్రెజిల్‌లో తమ కుట్రను జయప్రదంగా అమలు జరిపారు. చైనా, రష్యా, భారత్‌, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ ఆర్ధిక కూటమిని ఏర్పాటు చేయటంలో బ్రెజిల్‌ ప్రధాన పాత్ర వహించటం కూడా ఈ కుట్రకు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

     మూడు దేశాలలో జరిగిన పరిణామాల వెనుక అమెరికా,అంతర్జాతీయ కార్పొరేట్ల హస్తం వుంది. గతంలో మితవాద శక్తుల మధ్య వైరుధ్యాల కారణంగా చీలి వుండేవారు. ఇప్పుడు తమ వునికికే ముప్పు రావటంతో అన్ని రకాల మితవాదులు ఒకేతాటిపైకి వచ్చి వామపక్షాలను అధికారం నుంచి తొలగించటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి చట్ట సభలనే వేదికలుగా చేసుకున్నారు. ఇలాంటి కుట్రలను ఎక్కడైనా అమలు జరిపే అవకాశం వుంది. లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు ఈ కుట్రల గురించి తెలిసి వుండీ వాటిని ఎదుర్కోవటంలో ఎందుకు విఫలమయ్యాయన్నదే సమస్య. లాటిన్‌ అమెరికాలో అధికారంలోకి వచ్చిన వామపక్ష శక్తులందరూ క్యూబా మాదిరి కమ్యూనిస్టులు కాదు. వారందరి మధ్య అన్ని విషయాలలోనూ ఏకీభావం వున్నవారు కాదు. పార్టీల నిర్మాణం కూడా కమ్యూనిస్టు లేదా సంఘటిత పద్దతులలో జరగలేదు.కుట్రలను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్దత లేదు. బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ తీరుతెన్నులను ఒక్కసారి చూద్దాం. బ్రెజిల్‌తో సహా వామపక్ష శక్తులు గెలిచిన మెజారిటీ దేశాల పార్లమెంట్లలో మితవాద పార్టీలు లేదా వామపక్షాలను వ్యతిరేకించే శక్తులు మెజారిటీ కలిగి వుండటం ఈ కుట్రలు అమలు జరగటానికి అనువైన అవకాశాలు కల్పించింది. దీనితో పాటు వర్కర్స్‌పార్టీ చేసిన తప్పిదాలు కూడా మితవాద శక్తులు, మీడియాకు అవకాశాలనిచ్చాయి.

     పదమూడు సంవత్సరాల వర్కర్స్‌ పార్టీ (పిటి) పాలనలో 30శాతం మంది జనాన్ని దారిద్య్ర రేఖ దిగువ నుంచి వెలుపలికి తెచ్చింది. నలభైశాతం మందిని మధ్య తరగతి స్దాయికి పెంచింది. ఇది మామూలు విషయం కాదు, అయినా జనం ఎందుకు మితవాద శక్తులకు వ్యతిరేకంగా ఎందుకు వీధులలోకి రావటం లేదు ? కుట్రలను గ్రహించలేకపోయారా లేక మీడియా, మితవాద శక్తుల ప్రచారాన్ని నమ్మి ఇతర పార్టీలు మెరుగైన పాలనను అందిస్తాయని ఆశపడుతున్నారా ? అవినీతి వ్యతిరేక పోరాట ఛాంపియన్‌గా ఒక నాడు జనం ముందున్న పార్టీ నేడు అవినీతికి నిలయమైందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. స్వతంత్ర కార్మిక సంఘాలు, విముక్తి సిద్ధాంతంతో స్పూర్తి పొందిన పురోగామి కాధలిక్‌ క్రైస్తవమతాధికారులు, నూతన వామపక్షం పేరుతో ముందుకు వచ్చిన యువతరం, భూమిలేని పేదల వుద్యమం కలయిక వర్కర్స్‌ పార్టీ విజయానికి బాటలు వేసింది. కమ్యూనిస్టు పార్టీ మాదిరి ఒకే కార్యక్రమం, ఆలోచనా ధోరణి కాకుండా బడా పెట్టుబడిదారులు కాకుండా భిన్న వైఖరులు కలిగిన, భిన్న తరగతుల వారి వేదికగా పిటి వుంది. సావోపోలో ఫోరం పేరుతో విడుదల చేసి ప్రకటనపై 46 పార్టీలు సంతకాలు చేశాయి. వాటి లక్ష్యం నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకత. దాని కొనసాగింపుగా సామాజిక వేదికల సమావేశాలు జరిగాయి. ఒకే వేదికపై భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు అవకాశం ఇవ్వటంతో అన్ని తరగతులను అకర్షించాయి.

    లాటిన్‌ అమెరికాలో సంపూర్ణంగా కాకపోయినా వర్గదృక్పధం, నయా వుదారవాద వ్యతిరేక విధానాలతో ముందుకు వచ్చిన శక్తులు అధికారానికి వచ్చాయి. తరువాత అవి వ్యవహరించిన తీరు అంతకు ముందు వాటి పోరాట లక్ష్యాలకు భిన్నంగా వుండటం కూడా సామ్రాజ్యవాదుల కుట్రలు, జనం నిర్లిప్తత, వ్యతిరేకతలకు తావిచ్చి వుండాలి. బ్రెజిల్‌లో 2002లో లూలా నాయకత్వంలో పిటి విజయం సాధించినప్పటికీ పార్లమెంట్‌ వుభయ సభలలో 17, 18శాతం స్దానాలు మాత్రమే దానికి వచ్చాయి. ఎన్నికలలో వాగ్దానం చేసిన మాదిరి పేదలకు అనుకూలమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపాలంటే అందుకు బడ్జెట్‌, పధకాలకు పార్లమెంట్‌ ఆమోదం అవసరం. తగినంత బలం లేని పిటి పార్టీ ఇతర పార్టీల ఎంపీలకు లంచాల రూపంలో ప్రతిఫలం చెల్లించి మద్దతు కూడగట్టింది. ఒక నాడు అవినీతి వ్యతిరేక ఛాంపియన్‌గా వున్న పార్టీ అటువంటి పనులకు పాల్పడటంద్వారా విమర్శలపాలైంది. లూలా, దిల్మా వంటి నేతలు అవినీతికి పాల్పడకపోయినప్పటికీ ఎంపీలకు ముడుపులు చెల్లించటాన్ని అనుమతించారు. దాని కొనసాగింపుగా అవినీతి ముద్రపడిన వారిని కూడా కొంతమందిని అభ్యర్ధులుగా నిలిపారు. కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు దిగువ స్ధాయి నుంచి శాఖల నిర్వహణ నిర్మాణంలో ఒక ప్రధాన అంశం. అలాంటిది 2005 నుంచి పిటీ శాఖల నిర్వహణను వదలివేసింది. దాంతో సైద్దాంతిక, రాజకీయ చర్చలు, ప్రాధమిక సభ్యుల భాగస్వామ్యం లేకుండా పోయాయి. దీనికి అనుగుణ్యంగానే సామాజిక వుద్యమాలు కూడా వెనుక పట్టు పట్టి అధికారం వుంది కనుక తమ మిలిటెన్సీని కోల్పోయాయి. భూ పోరాట వుద్యమాలు ప్రభుత్వంవైపు చూడటం మొదలు పెట్టాయి. పార్లమెంట్‌లో మెజారిటీ లేదు కనుక ప్రభుత్వం కూడా భూ సంస్కరణల గురించి అంతగా శ్రద్ధ చూపలేదు. వామపక్ష విశ్లేషకుడు పెరీ ఆండర్సన్‌ అభిప్రాయం మేరకు దారిద్య్ర నిర్మూలన పధకాలతో కూడిన మితవాద ఆర్ధిక విధానాలు, విదేశీ పెట్టుబడులకు అనుకూల వైఖరిని లూలా ప్రభుత్వం అనుసరించింది. నగదు బదిలి, స్కూలు పిల్లలకు వైద్య పరీక్షలు,ఇతర దారిద్య్రనిర్మూలన పధకాల అమలు వలన లూలా ఎంతో పేరు ప్రతిష్టలు గడించారు. పేదలు 50 నుంచి 30 మిలియన్లకు తగ్గారు. ఇదే సమయంలో సాధించిన అభివృద్ధి అందరికీ చేరేలా సంపదల పున:పంపిణీకి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. లూలా పాలనా కాలంలో వస్తువులకు డిమాండ్‌ వున్న రీత్యా ఎగుమతులు బాగా జరిగిక అనేక తరగతుల ఆదాయాలు కూడా పెరిగాయి. దాంతో 2008లో ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్య ప్రభావం బ్రెజిల్‌పై పెద్దగా పడలేదు.కానీ 2011 నుంచి దాని ప్రభావం మొదలైంది. అప్పటి నుంచి మితవాద శక్తులు వామపక్ష పాలనపై ధ్వజమెత్తటం ప్రారంభించాయి. దానికి తోడు ప్రజల అవసరాలకు తగినట్లుగా రవాణా, వైద్య సౌకర్యాలు మెరుగుపడకపోవటం, ఆర్ధిక మాంద్యం కారణంగా అభివృద్ధి రేటు పడిపోవటం ఇదే సమయంలో ప్రపంచ కప్‌, రియో ఒలింపిక్స్‌ భారం, వాటి ఏర్పాట్లకు గాను కొన్ని చోట్ల పేదలను ఖాళీ చేయించటం, కొన్ని ప్రాజెక్టుల అమలులో అవినీతి ఆరోపణలు మొత్తం మీద దిల్మా రౌసెఫ్‌ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సమయానికి చుట్టుముట్టాయి.

    సామాజిక, వామపక్ష వుద్యమ నిర్మాణాలు వెనుక పట్టుపట్టటం, గతంలో పిటికి మద్దతు ఇచ్చిన అనేక తరగతులు దూరం కావటం, ఆ స్ధానాన్ని మిత, మతవాద శక్తులు ఆక్రమించాయి. 2000-2010 సంవత్సరాల మధ్య చర్చ్‌లలో సభ్యులుగా చేరిన వారి సంఖ్య 61శాతం పెరిగింది. చట్ట సభలలో కూడా అదే మాదిరి ఈ శక్తుల ప్రాతినిధ్యం పెరిగింది. పురోగామి అస్తిత్వ వుద్యమాల స్ధానంలో మితవాద, మతవాద ధోరణులు బాగా పెరిగాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు లూలా, దిల్మాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ వారు అధినేతలుగా వున్నారు కనుక, కొందరు అధికార పార్టీ నేతలు దానిలో దొరకటం, అవినీతి సొమ్ము అధికార పార్టీ ఎన్నికల ఖర్చులకు, ఇతర అక్రమాలకు వినియోగించారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనికి మీడియా ప్రధాన పాత్ర వహించింది. అవకతవకలు జరిగిన సమయంలో దిల్మా ఆ సంస్ధ చైర్‌పర్సన్‌గా, సంబంధిత శాఖ మంత్రిగా వున్నారు. ఆ కుంభకోణం ఆమె రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత బయటకు రావటంతో మితవాద శక్తులు, మీడియా జనం ముందు ఆమెను దోషిగా నిలిపాయి. దానికి తోడు లోటు బడ్జెట్‌, ముందే చెప్పుకున్నట్లు పార్లమెంట్‌ అనుమతి లేకుండా పధకాలకు ఖర్చు చేయటం వంటి వాటిని అన్నింటినీ కలిపి ఆమెపై అభిశంసనకు కుట్ర చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తటంతో మధ్యతరగతిలో అసంతృప్తి, దూరం కావటం, ఇదే సమయంలో అభివృద్ధి రేటు పడిపోవటం, ఒలింపిక్స్‌కు మోయలేని భారం ఆర్ధిక వ్యవస్థపై పడటం, సామాజిక సేవలు, వుపాధి పధకాలపై కోత విధించటం వంటి చర్యలతో మధ్యతరగతితో పాటు పేదలలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. దాని ఫలితమే 2014 ఎన్నికలలో దిల్మా కొద్ది మెజారిటీతో ఎన్నికయ్యారు.

    రెండవ సారి ఎన్నికైన తరువాత వెంటనే తీసుకున్న నిర్ణయాలు కూడా దిల్మాను మరింతగా జనానికి దూరం చేశాయని పరిశీలకులు చెబుతున్నారు. అభివృద్ధి పెంపుదల, నిరుద్యోగాన్ని తగ్గిస్తారని ఆశలు పెట్టుకున్న యువతపై ఎన్నికలు జరిగిన మూడురోజుల్లోనే వడ్డీ రేట్ల పెంపుదల, ప్రజానుకూల సామాజిక పధకాల ‘కోతల రాయుడి ‘గా పేరు మోసిన మితవాది లెవీని అర్ధిక మంత్రిగా, భూసంస్కరణల వ్యతిరేకిగా, పర్యావరణ రక్షణను గాలికి వదలి భూస్వాముల ప్రయోజనాలకు కొమ్ముకాయటంలో సుపరిచితమైన కతియా అబెరును వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించటం వంటి చర్యలతో దిల్మా ప్రతిష్ట మరింతగా మసకబారింది. బ్రెజిల్‌ ఎదుర్కొంటున్న మాంద్యం సమస్యను పరిష్కరించటానికి నయావుదారవాద విధానాలే మార్గమనే వైఖరిని వీరి నియామకాల ద్వారా దిల్మా ప్రదర్శించినట్లు విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయాలపై పిటీ పార్టీలో చర్చ కూడా జరగలేదు.

    ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన వర్కర్స్‌ పార్టీ ప్రారంభంలో ఆ విధానాలతోనే పురోగతి సాధించి చివరకు ఆ ప్రపంచీకరణ విధానాల కారణంగానే ఇబ్బందులలో కూరుకుపోయింది.దీనికి కారణం పేదలకు సంక్షేమ పధకాలు, పేదరిక నిర్మూలన పధకాలు అమలు జరపటం తప్ప ఆర్ధిక వ్యవస్ధను మెజారిటీ పౌరులకు అనుకూలంగా మార్పు చేసే విధానాలను ప్రవేశపెట్టటంపై శ్రద్ద చూపలేదు. బడా బూర్జువా, కార్పొరేట్‌ భూస్వామ్య లేదా వ్యవసాయ కంపెనీల పునాదులు అలాగే వున్నాయి. 2011 నుంచి ఆర్ధిక మాంద్యం బ్రెజిల్‌ను క్రమంగా కుంగదీస్తూ వుండటంతో లూలా హయాంలో 4-5శాతం మధ్య వున్న వృద్ధి రేటు గత నాలుగు సంవత్సరాలలో 1.3శాతానికి పడిపోయింది. ప్రస్తుతం మాంద్యలో వుంది. పన్నెండు సంవత్సరాల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం ఈ ఏడాది నమోదైంది. నిరుద్యోగం బాగా పెరిగింది.ఇవన్నీ కూడా మితవాదుల చేతికి అస్త్రాలుగా మారాయి. ఎవరైతే పెట్రోలియం కంపెనీలో అక్రమాలకు పాల్పడ్డారో వారే దిల్మాపై అభిశంసనకు నాయకత్వం వహించినప్పటికీ జనంలో పెద్దగా స్పందన లేదంటే వర్కర్స్‌ పార్టీ జనానికి ఎంతగా దూరమైందో అర్ధం చేసుకోవచ్చు.

   బ్రెజిల్‌లో మితవాద శక్తులకు ఇంక ఎదురు వుండదా ? ఇది వూహాజనిత ప్రశ్న. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇంకా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూనే వుంది. నాయత్వం వహిస్తున్న అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఎలా బయట పడాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటువంటి స్థితిలో బ్రెజిల్‌లో తిష్టవేసిన మితవాద శక్తులు జనాన్ని మభ్య పెట్టేందుకు అనేక ఆశలు కల్పించటం సహజం. ఆచరణలో కార్పొరేట్‌ శక్తులకు మరింతగా దోచి పెట్టేందుకు ఇప్పటి వరకు అమలు జరిపిన సంక్షేమ చర్యలకు కోతపెట్టటం తప్ప మెరుగుపరిచే అవకాశం లేదు. నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంలో ముందున్న బ్రెజిల్‌ కార్మికవర్గం వాటిని సహిస్తుందా ? తగిన గుణపాఠాలను తీసుకొని తిరిగి పోరుబాట పట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోవటానికి ప్రయత్నిస్తుంది. తిరిగి సామాజిక శక్తులు మేలుకుంటాయి.కొత్త శక్తులు రంగంలోకి వస్తాయి, తమ ఆయుధాలకు మరింతగా పదును పెట్టుకుంటాయి. కొత్త వాటిని సమకూర్చుకుంటాయి. ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన ఎవరూ ప్రయాణాన్ని విరమించుకోరు, తగిలిన దెబ్బ తీవ్రతను బట్టి కొంత సేపు ఆగి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ప్రజా రధమైనా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

simplification and liberalisation of the Foreign Direct Investment Policy, 2016

31 Wednesday Aug 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

FDI, Foreign Direct Investment Policy, India Foreign Direct Investment Policy, India Foreign Direct Investment Policy 2016

Cabinet approves simplification and liberalisation of the Foreign Direct Investment Policy, 2016 in various sectors
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its ex-post-facto approval for the FDI policy amendments announced by the Government on 20th June, 2016. The FDI policy amendments are meant to liberalise and simplify the FDI policy so as to provide ease of doing business in the country leading to larger FDI inflows contributing to growth of investment, incomes and employment.  The details are as follows:

  1. Radical Changes for promoting Food Products manufactured/produced in India

It has now been provided that 100% FDI under government route for trading, including through e-commerce, is permitted in respect of food products manufactured and/or produced in India.

 Foreign Investment in Defence Sector up to 100%

Earlier FDI regime permitted 49% FDI participation in the equity of a company under automatic route. FDI above 49% was permitted through Government approval on case to case basis, wherever it is likely to result in access to modern and ‘state-of-art’ technology in the country. In this regard, the following changes have inter-alia been brought in the FDI policy on this sector:

  1. Foreign investment beyond 49% has now been permitted through government approval route wherever it is likely to result in access to modern technology or for other reasons to be recorded.
  2. FDI limit for defence sector has also been made applicable to Manufacturing of Small Arms and Ammunitions covered under Arms Act 1959.
  1. Review of Entry Routes in Broadcasting Carriage Services

FDI policy on Broadcasting carriage services has also been amended. New sectoral caps and entry routes are as under:

 

Sector/Activity New Cap and Route
5.2.7.1.1

(1)Teleports(setting up of up-linking HUBs/Teleports);

(2)Direct to Home (DTH);

(3)Cable Networks (Multi System operators (MSOs) operating at National or State or District level and undertaking upgradation of networks towards digitalization and addressability);

(4)Mobile TV;

(5)Headend-in-the Sky Broadcasting Service(HITS)

100%

 

Automatic

5.2.7.1.2 Cable Networks (Other MSOs not undertaking upgradation of networks towards digitalization and addressability and Local Cable Operators (LCOs))
Infusion of fresh foreign investment, beyond 49% in a company not seeking license/permission from sectoral Ministry, resulting in change in the ownership pattern or transfer of stake by existing investor to new foreign investor, will require FIPB approval 

 4.Pharmaceutical

The earlier FDI policy on pharmaceutical sector provides for 100% FDI under automatic route in greenfield pharma and FDI up to 100% under government approval in brownfield pharma. With the objective of promoting the development of this sector, 74% FDI under automatic route has been permitted in brownfield pharmaceuticals. FDI beyond 74% would be permitted through Government approval route.

  1. Civil Aviation Sector

(i)     The earlier FDI policy on Airports permitted 100% FDI under automatic route in Greenfield Projects and 74% FDI in Brownfield Projects under automatic route. FDI beyond 74% for Brownfield Projects is under government route.

(ii)   With a view to aid in modernization of the existing airports to establish a high standard and help ease the pressure on the existing airports, 100% FDI under automatic route has now been permitted in Brownfield Airport projects.

(iii) As per the earlier FDI policy, foreign investment up to 49% was allowed under automatic route in Scheduled Air Transport Service/ Domestic Scheduled Passenger Airline and regional Air Transport Service. This limit has now been raised to 100%, with FDI upto 49% permitted under automatic route and FDI beyond 49% through Government approval. For NRIs, 100% FDI will continue to be allowed under automatic route. Foreign airlines would continue to be allowed to invest in capital of Indian companies operating scheduled and  non-scheduled air-transport services up to the limit of 49% of their paid up capital.

 6.Private Security Agencies

The earlier policy permitted 49% FDI under government approval route in Private Security Agencies. Since Private Security Agencies are already required to get license under PSAR Act 2005, the requirement of putting them through another line of Government approvals through FIPB has now been done away with for FDI up to 49%.  Accordingly, FDI up to 49% is now permitted under automatic route in this sector. FDI beyond 49% and upto 74% is permitted through Government approval route.

  1. Establishment of branch office, liaison office or project office

For establishment of branch office, liaison office or project office or any other place of business in India if the principal business of the applicant is Defence, Telecom, Private Security or Information and Broadcasting, it has provided that approval of Reserve Bank of India would not be required in cases where FIPB approval or license/permission by the concerned Ministry/Regulator has already been granted.

  1. Animal Husbandry

As per FDI Policy 2016, FDI in Animal Husbandry (including breeding of dogs), Pisciculture, Aquaculture and Apiculture is allowed 100% under Automatic Route under controlled conditions. The requirement of ‘controlled conditions’ for FDI in these activities has now been done away with.

  1. Single Brand Retail Trading

Local sourcing norms have been relaxed up to three years, with prior Government approval, for entities undertaking Single Brand Retail Trading of products having ‘state­ of ­art’ and ‘cutting edge’ technology. For such entities, sourcing norms will not be applicable up to three years from commencement of the business i.e. opening of the first store for entities undertaking single brand retail trading of products having ‘state-of-art’ and ‘cutting-edge’ technology and where local sourcing is not possible. Thereafter, sourcing norms would be applicable.

 Background:

In last two years, Government has brought major FDI policy reforms in a number of sectors viz. Defence, Construction Development, Insurance, Pension Sector, Broadcasting Sector, Tea, Coffee, Rubber, Cardamom, Palm Oil Tree and Olive Oil Tree Plantations, Single Brand Retail Trading, Manufacturing Sector, Limited Liability Partnerships, Civil Aviation, Credit Information Companies, Satellites- establishment/operation and Asset Reconstruction Companies. Measures undertaken by the Government have resulted in increased FDI inflows at US$ 55.46 billion in financial year 2015-16, as against US$ 36.04 billion during the financial year 2013-14. This is the highest ever FDI inflow for a particular financial year. However, it was felt that the country has potential to attract far more foreign investment which can be achieved by further liberalizing and simplifying the FDI regime.

Accordingly, Union Government radically liberalized the FDI regime on 20th June, 2016 with the objective of providing major impetus to employment and job creation in India. This was the second major reform after the last radical changes announced in November, 2015. Changes introduced in the policy included increase in sectoral caps, bringing more activities under automatic route and easing of conditionalities for foreign investment. The amendments were aimed at further simplifying the regulations governing FDI in the country and make India an attractive destination for foreign investors. Most of the sectors with these changes have now been brought under automatic route for FDI, except a small negative list. The amendments have made India the most open economy in the world for FDI.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుగ్రవాదంపై పోరు పేరుతో బురఖాల నిషేధం

26 Friday Aug 2016

Posted by raomk in Communalism, Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Burkini, Burkini ban, Burkini cops, French Police, Nice, Nice Beach, swimsut, war on terror

ఎం కోటేశ్వరరావు

   మన దేశంలో అతివలపై అత్యాచారాలు జరగటానికి పశ్చిమ దేశాల వస్త్రధారణే కారణమని అందువల్లనే పట్టణాలలోనే ఎక్కువగా జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలలో లేవని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ఢిల్లీ నిర్భయ అత్యాచార వుదంతం సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఫాసిస్టు గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకొని సంఘపరివార్‌ నేతలు పనిగట్టుకొని ప్రచారం చేసే అసంఖ్యాక పచ్చి అబద్దాలలో ఇదొకటి. అసలు వెలుగులోకి రాని వుదంతాలే అత్యధికం కాగా పోలీసు రికార్డులకు ఎక్కిన వాటిలో 75శాతం గ్రామీణ ప్రాంతాలలో జరిగినవే అని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన మృణాల్‌ సతీష్‌ అధికారిక లెక్కలను విశ్లేషించి తేల్చారు. మోహన్‌ భగవత్‌ వంటి వారు చెప్పే పాశ్చాత్య వస్త్రధారణకు పెట్టింది పేరు ఫ్రాన్స్‌. అలాంటి దేశంలో ముఖం తప్ప ఒంటి నిండా బురిఖిని వేసుకొని సముద్ర తీరాలకు వచ్చే ముస్లిం మహిళల చేత బలవంతంగా వందలాది మంది ముందు విప్పించిన ఫ్రెంచి పోలీసుల నిర్వాకం తాజాగా చర్చనీయాంశం అయింది.దీని గురించి నిక్కర్‌ వాలాలేమంటారో తెలియదు.

Today’s @thetimes cartoon. #burkini #France

    ప్రపంచంలో తాలిబాన్లను, తాజాగా రంగంలోకి వచ్చిన ఐఎస్‌ తీవ్రవాదులను పెంచి పోషించటంలో అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రెంచి పాలకుల వాటా ఎక్కువన్నది అందరికీ తెలిసిందే. పాముకు పాలుపోసి పెంచి నంత మాత్రాన కాటు వేసే దాని సహజలక్షణం ఎక్కడికి పోతుంది. వుగ్రవాదం కూడా అలాంటిదే. పెంచి పోషించిన వారిపైనే తిరగబడుతుందని చరిత్రలో అనేక వుదంతాలు నిరూపించాయి. అదే విధంగా ఇప్పుడు ఈ ధనిక దేశాలు కూడా అనుభవిస్తున్నాయి.కొద్ది మంది వుగ్రవాదులను పట్టుకోవటం చేతగాని పాలకులు మొత్తం ముస్లింలందరూ వుగ్రవాదులే అని తప్పుడు ప్రచారం, వ్యతిరేక వున్మాదాన్ని రెచ్చగొట్టటంతో పాటు వుగ్రవాదంపై పోరులో భాగంగా బురిఖీ, బురఖాలపై దాడులకు దిగారు. (ముస్లిం మహిళలు విధిగా బురఖా వేసుకోవాలనే ఛాందస వాదాన్ని నేను బలపరచను, సామాజిక చైతన్యం, వ్యక్తిగత ఇష్టంపై వేషధారణ అధారపడి వుంటుందని, సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో దేనిని బలవంతంగా రుద్ద కూడదు అని భావించేవ్యక్తిని. అలా రుద్దితే ఈ దేశంలోని బ్రాహ్మలెవరూ షర్టూ పాంట్లూ వేసుకోకూడదు, వుద్యోగాలు చేయకూడదు, బిచ్చమెత్తుకొని జీవించాలి.మనువు నిర్ధేశించిన విధంగా మిగతా కులాల వారు కూడా ఇక్ష్వాకుల ముందు కాలం నాటికి పోవాల్సి వుంటుంది. అందువలన అలాంటి వాటికి వ్యతిరేకం అని ముందుగా స్పష్టం చేయదలచుకున్నాను.)

ఇటీవలనే ముగిసిన రియో ఒలింపిక్స్‌లో దుస్తుల నిబంధనలను పక్కప పెట్టి బీచ్‌ వాలీబాల్‌ పోటీలో బురఖాతో పాల్గొన్న ఈజిప్టు క్రీడాకారిణి దోవా ఎలఘోబాషి

    ఫ్రాన్స్‌ విషయానికి వస్తే బురిఖినిలపై నిషేధాన్ని సమర్ధించుకొనేందుకు నానా పాట్లు పడుతోంది. అక్కడి న్యాయవ్యవస్ధ కూడా పాలకవర్గానికి వంతపాడుతోంది. గతవారంలో ఒక బీచ్‌కు తన పిల్లలతో వచ్చిన ఒక ముస్లిం యువతిని ఆకస్మికంగా నలుగురు పోలీసులు చుట్టుముట్టారు. ఇసుకలో కూర్చుని వున్న ఆమెకు ఏం జరుగుతోందో తెలియలేదు.పోలీసులను చూడగానే భయంతో పిల్లలు ఏడవటం మొదలు పెట్టారు. నాలుగు వైపులా పోలీసులు నిల్చోవటంతో ఆమె ఎటూ తప్పుకొనే అవకాశం కూడా లేదు. తాను చేసిన తప్పేమిటో కూడా ఆమెకు తెలియలేదు. పోలీసులు ఎక్కడైనా ఒకటే కనుక లే ముందు బట్టలు విప్పు అన్నారు. నివ్వెర పోయింది, అదే వేసుకున్న బుర్ఖినీ విప్పు అన్నారు. (బికినీ,బుర్కాను కలిపి సముద్ర స్నానాలు చేసే సమయంలో ఒంటిని పూర్తిగా ప్పుతూ ధరించేందుకు రూపొందించిన ఈత వస్త్రం) చుట్టుపక్కల వారు పోలీసుల ఆదేశాలకు హర్షం వెలిబుచ్చుతూ చప్పట్లతో మరింతగా ప్రోత్సహిస్తున్నారు. అవమాన భారంతో బుర్కినీ విప్పటంతో పాటు అది వేసుకున్నందుకు జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. ఐరోపా అంటే స్వేచ్ఛా ప్రపంచం అనుకొనే వారికి దిమ్మదిరిగే వుదంతమిది. సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి తాలిబాన్ల దేశంలో బుర్ఖాలు వేసుకోకపోతే శిక్షిస్తారు, దాన్ని విమర్శించే ఫ్రాన్స్‌లో వేసుకున్నందుకు శిక్షిస్తారు.అంటే రెండు చోట్లా మహిళకు స్వాతంత్య్రం పూజ్యం అన్నమాట. ఒక వేళ నిషేధాన్ని వుల్లంఘిస్తే జరిమానా, హెచ్చరికతో సరిపెట్టవచ్చు, లేదా ఆ ప్రాంతం నుంచి పంపి వేయవచ్చు, అందుకు భిన్నంగా దుస్తులు విప్పించి, జరిమానా వేయటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

    ఫ్రాన్స్‌లో బుర్ఖినీ వేసుకోవటంపై ఇటీవల నిషేధం విధించారు. దానికి చూపుతున్న కారణాలు హాస్యాస్పదంగా వున్నాయి. బలవంతంగా బుర్ఖినీ విప్పించిన వుదంతం నైస్‌ పట్టణంలో జరిగింది.మరో 30 పట్టణాలలో ఇలాంటి నిషేధం విధించారు, దానిని కోర్టులు సమర్ధించాయి.తాజా వుదంతంపై తీవ్ర విమర్శలు చెలరేగటం, హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయటంతో వున్నత న్యాయ స్థానం నిషేధంపై సమీక్ష జరపాలని నిర్ణయించింది. ఫ్రెంచి చట్టాల ప్రకారం మహిళలు ధరించకూడని వాటిలో బుర్ఖినీ లేదు. గౌరవ ప్రదం కాని దుస్తులపై ఫ్రాన్స్‌లో నిషేధాలేమీ లేవు. నిబంధనలు స్పష్టంగా లేకపోవటాన్ని అవకాశంగా తీసుకొని ముస్లిం మహిళలను వేధించేందుకు ఫ్రెంచి పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. బుర్ఖినీ ధరించకపోయినా ఒంటి నిండా దుస్తులు, తలకు స్కార్ఫ్‌ చుట్టుకున్నందుకు పోలీసులు తనను అడ్డుకున్నారని మరో మహిళ తెలిపింది. దేశ ‘లౌకికత్వాన్ని’ కాపాడటంలో భాగంగా ఈ నిషేధం అన్నది ప్రభుత్వం చెప్పిన కారణాలలో ఒకటి. బుర్ఖినీ ధరించటం బానిసత్వానికి చిహ్నమని ప్రధాని మాన్యువల్‌ వాల్స్‌ వర్ణించారు. దేశం ‘సంస్కృతుల యుద్ధం’ (బ్యాటిల్‌ ఆఫ్‌ కల్చర్స్‌)లో చిక్కుకు పోయిందన్నారు.ఐఫోప్‌ అనే సంస్ధ నిర్వహించిన ఒక సర్వేలో 64శాతం మంది నిషేధాన్ని సమర్ధించారు. శరీరాన్ని పూర్తిగా కప్పి వేసే ఈత దుస్తులు ధరించటమంటే తీవ్రవాద ఇస్లామ్‌కు మద్దతు ఇచ్చే రెచ్చగొట్టుడు చర్యగా మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజీ వర్ణించాడు. కొన్ని పట్టణాలు పరిశుభ్రతా కారణంతో నిషేధించినట్లు పేర్కొన్నాయి. కోర్టులకు వివిధ నగరాలు సమర్పించిన సమర్ధింపు వాదనలలో బుర్ఖినీ ఈత దుస్తులు ప్రజా భద్రతకు ముప్పుగా పరిణమించినట్లు పేర్కొన్నాయి. అయితే అందుకు తగిన ఆధారాలను చూపకుండా భయాన్ని, అనుమానాలను వ్యక్తం చేశాయి.పూర్తిగా శరీరాన్ని కప్పే ఈత దుస్తులు ప్రజా భద్రతకు భంగం కలిగించినపుడు క్రైస్తవ సన్యాసినులు, సన్యాసులు పూర్తి శరీరాన్ని కప్పుతూ ధరించే దుస్తులతో ముప్పు రాదా అన్న ప్రశ్నకు సమాధానం లేదు.

    వేషధారణపై ఆంక్షలు, నిషేధాలు ఒక్క ఫ్రాన్స్‌కే పరిమితం కాదు. స్కూళ్లు, కాలేజీలలో, వాహనాలు నడిపేటపుడు ముఖాలకు మేలిముసుగులు ధరించటాన్ని జర్మనీ ప్రభుత్వం నిషేధించింది. కెనడాలో బురఖాల నిషేధం ఎన్నికల ప్రచార సమస్యగా ముందుకు వచ్చింది. లిబరల్‌ పార్టీ గెలవటంతో ఆప్రతిపాదనకు స్వస్తి పలికారు. జర్మనీ, ఫ్రాన్స్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో అక్కడి మితవాద పార్టీలు ముస్లిం,బురఖా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న పూర్వరంగంలో అధికారంలో వున్న పార్టీలు తాము కూడా అలాంటి చర్యలే తీసుకుంటున్నట్లు ఓటర్లను సంతుష్టపరిచేందుకు ఇలాంటి తిరోగామి చర్యలకు పాల్పడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయిదిత్‌ ఫొటోను చూసి భయపడిన కమ్యూనిస్టు వ్యతిరేకులు

14 Sunday Aug 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

1965 anti-communist purge, communist Aidit, Indonesian Communist Party (PKI)., PKI, victims of 1965

Netizens see face of communist Aidit, painting removed from Terminal 3

ఎం కోటేశ్వరరావు

   ఒకవైపు కమ్యూనిజం అంతరించి పోయింది, దాన్ని పూర్తిగా ఓడించి విజయం సాధించామని ప్రకటించిన పాతిక సంవత్సరాల తరువాత కమ్యూనిస్టు నేతల ఫొటోలను చూసి కూడా వ్యతిరేకులు ఎంతగా భయపడుతున్నారో, కమ్యూనిస్టు వ్యతిరేకతను తమ రాజకీయ ప్రయోజనానికి ఎలా వుపయోగించుకుంటున్నారో రెండు వుదాహరణలు వెల్లడిస్తున్నాయి.ఒకటి నియంత సుహార్తో హతమార్చిన ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ అధినేత డిఎన్‌ అయిదిత్‌ ఫొటో. రెండవది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా.

    ఇండోనేషియా రాజధాని జకర్తా సమీపంలో కొత్తగా నిర్మించిన సోకర్నో -హట్టా విమానాశ్రయంలోని మూడవ టెర్మినల్‌ 2017లో పూర్తి స్ధాయిలో వినియోగానికి రానుంది. ఇటీవలే పూర్తయి పాక్షికంగా రాకపోకలకు అనుమతించారు. ఆ టెర్మినల్‌ భవనం అలంకరణలో భాగంగా ఇండోనేషియా జాతీయ నాయకులుగా పరిగణించబడుతున్న వారి వందలాది ఫొటోలను ఏర్పాటు చేశారు. వాటిలో యాభై సంవత్సరాల క్రితం అమెరికా మార్గదర్శకత్వంలో జరిగిన సైనిక కుట్రలో హత్యకు గురైన కమ్యూనిస్టు పార్టీ నేత డిఎన్‌ అయిదిత్‌ మాదిరిగా వున్న ఒక చిత్రం కూడా వుంది. దాని కింద క్లుప్తంగా ఇలా రాసి వుంది.’ ఒక రంగస్థలంగా వున్న ఇండోనేషియా చర్చ ద్వారా వాస్తవాలను వెదికేందుకు అచంచలంగా నివేదిస్తోంది. ఒక సూత్రాన్ని రూపొందించేందుకు భావాలు జత కూడుతాయి . అది కేవలం రాజ్యం గురించే కాదు, జాతీయ ఐక్యత అనే ఒక ఆత్మగా రూపొందేందుకు భిన్న భాషలనుంచి భిన్నత్వాన్ని ఎలా రూపొందించాలన్నదాని గురించి కూడా వుంటుంది.’

     దీనికి ఎవరికి వారు తమదైన అర్ధాలు తీసుకున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు ఆ చిత్రాన్ని చూసి ఇంకేముంది ఇండోనేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీకి ప్రాణ ప్రతిష్ట జరిగిందని సామాజిక మీడియాలో గగ్గోలు పెట్టారు. దీనిపై గత శుక్రవారం నాడు విమానాశ్రయ నిర్వాహకులు స్పందించారు. కంపెనీ కార్పొరేట్‌ కార్యదర్శి అగస్‌ హర్యాదీ మాట్లాడుతూ ఆ చిత్రంలో వున్నది అయిదిత్‌ అని నిర్ధారణగా చెప్పలేము. దానిని నిర్ధారించుకొనే పనిలో వున్నాము. ఎందుకంటే కోంపాస్‌ డాట్‌ కాం పేర్కొన్నట్లు తొలి ప్రధాని సుతాన్‌ జహీర్‌ది కూడా కావచ్చు అన్నారు. ఇది చెప్పిన కొద్ది గంటలలోనే కంపెనీ డైరెక్టర& జొకో మూర్తజా మోద్‌జో ఒక ప్రకటన చేస్తూ ఆ చిత్రాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తొలుత దానిపై తెల్లని వస్త్రం కప్పి తరువాత పూర్తిగా తొలగించారు. ఐదు దశాబద్దుాల క్రితం ఇండోనేషియాలో జరిగిన కుట్రలో భాగంగా ఐదులక్షల మంది కమ్యూనిస్టులు, నియంత సుహార్తోను వ్యతిరేకించిన వారిని మిలిటరీ, వారితో చేతులు కలిపిన ఇస్లామిక్‌ సంస్ధల సాయుధులు హతమార్చిన విషయం తెలిసిందే. నాటి ఘటనలకు బాధ్యులైన వారిని శిక్షించాలని, వూచకోతపై క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిన నేపధ్యంలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకులు చెలరేగి పోతున్నారు.

   గతంలో జరిగినదానిని తవ్వటం గాయాలను కెలకటం తప్ప మరొక ప్రయోజనం వుండదని అందువలన వాటి గురించి మాట్లాడ కూడదని రిటైర్డ్‌ జనరల్‌ కికి శ్యాంకరీ వంటి వారు కమ్యూనిస్టు వ్యతిరేక గళం విప్పుతున్నారు. జాతీయ భావమైన పంచశీలకు విరుద్ధంగా దేశంలో తిరిగి కమ్యూనిజం, ఇతర భావజాలాలను వ్యాపింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జూన్‌లో జరిగిన ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సదస్సులో కికీ ఆరోపించాడు. ఒక మార్క్సిస్టు తప్పకుండా ఒక నాస్తికుడు అయి వుంటాడని, భూమిని దేవుడు సృష్టించలేదని చెప్పిన అరిస్టాటిల్‌, ప్లాటోల తత్వశాస్త్రం మార్క్సిజం వెనుక వున్నదని, కాబట్టి వారు దేవుడిని నమ్మరంటూ అరిగిపోయిన రికార్డును తిరిగి వినిపించాడు. కికీ రోత వాదనలను తత్వవేత్త, క్రైస్తవ పూజారి అయిన ఫ్రాంజ్‌ మెగ్నిస్‌ సుసేనో తిరస్కరించారు. కారల్‌ మార్క్స్‌ భావాలు అరిస్టోటిల్‌తో సంబంధం లేనివి,అరిస్టోటిల్‌ భావాలు నాస్తికత్వంతో నిమిత్తం లేనివి అన్నారు. మార్క్స్‌ పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించారని, దాన్ని కూలదోయాలని చెప్పాడన్నారు. తరువాత రష్యా నాయకుడు లెనిన్‌ ఆ పని చేసేందుకు ఒక విప్లవ పార్టీ అవసరాన్ని గురించి చెప్పారని అన్నారు. ‘మార్క్స్‌ విప్లవ పార్టీ గురించి మాట్లాడలేదు, కానీ లెనిన్‌ పార్టీపై కేంద్రీకరించారు, కేవలం సిద్ధాంతం మీదే కాదు విప్లవనిర్వణ గురించి కూడా చెప్పారు.కనుకనే అతను విప్లవకారులను తయారు చేశాడు, వారిని కమ్యూనిస్టులని పిలిచారు, కాబట్టి కమ్యూనిజం అంటే మార్క్‌, లెనిన్‌ సిద్దాంతాల కలయిక ‘ అని ఫ్రాంజ్‌ జకర్తాపోస్టుతో చెప్పారు. కికీ వక్రీకరణలను జర్నలిస్టు ఫెబ్రియానా ఫిర్దౌస్‌ తన ఫేస్‌ బుక్‌లో పోస్టు చేయటంతో అనేక మంది మాజీ జనరల్‌ కికీ కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నాడంటూ వ్యంగ్యంగా తీవ్ర విమర్శలు చేశారు. దాంతో మతశక్తులు ఫెబ్రియానాపై దాడికి దిగిన విషయం తెలిసిందే.

   రెండవ విషయం డోనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి గురించిన ప్రచారం. ట్రంప్‌ భార్య ఒక కమ్యూనిస్టా అంటూ అదొక పెద్ద రహస్యాన్ని బయట పెట్టినట్లుగా ఆదివారం నాడు ఒక వ్యాఖ్యాత ఏకంగా పెద్ద వ్యాసమే రాశాడు. మార్నింగ్‌ లెడ్జర్‌ అనే డాట్‌కామ్‌లో సౌనక్‌ ముఖోపాధ్యాయ అనే పెద్ద మనిషి ఆ పని చేశాడు.ఆమె కమ్యూనిస్టు అయి వుండటానికి పేర్కొన్న కారణాలు ఇలా వున్నాయి. ఆమె ఐరోపాలోని యుగోస్లావియాలో పుట్టింది.ఆ సమయంలో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం వుంది, కనుక తప్పకుండా ఆమె మ్యూనిస్టు భావజాలాన్ని అభిమానించి వుంటుంది కనుక కమ్యూనిస్టే అయి వుంటుందన్నది తర్కం. ఒక వేళ ట్రంప్‌ గనుక గెలిస్తే ఒక కమ్యూనిస్టు దేశంలో పుట్టిన మహిళ అమెరికాలో ప్రధమ మహిళగా తొలిసారిగా రికార్డుల కెక్కుతారట. ట్రంప్‌ కమ్యూనిస్టు పార్టీ పాలనలో వున్న చైనా అంటే సానుకూల వైఖరి వుండటం మరొక కారణమట. మోకాలికీ బోడి గుండుకు ముడిపెడుతూ రాసే మతిలేని రాతలు తప్ప మరొకటి కాదు. ట్రంప్‌ భార్య మెలినియా యుగోస్లావియాలో పుట్టినప్పటికీ మోడలింగ్‌ వృత్తి కోసం అమెరికా వచ్చింది.అక్కడే ఒక ఫ్రెంచి పత్రికకు నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత ఒక ఫ్యాషన్‌ షో సందర్భంగా పరిచయమైన ట్రంప్‌ను వివాహం చేసుకుంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీకి దిగటంతో ఆయన ప్రత్యర్ధులు ఆ పొటోలను ఈనెలలో తిరిగి ప్రచురింప చేయించి, ఇలాంటి ఆమెను ప్రధమ పౌరురాలిగా ఎలా అంగీకరిస్తామంటూ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఆమె తండ్రి కమ్యూనిస్టు కనుక ఆమె కూడా కమ్యూనిజాన్ని అభిమానించి వుంటుందంటూ ట్రంప్‌ను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టు వ్యతిరేకతను కూడా వాడుకోవటం దీని లక్ష్య ంగా వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగవసారి లూలా చారిత్రాత్మక విజయం ! దేశం వదలి పారిపోయిన ప్రత్యర్ధి బోల్సనారో !!
  • కాషాయ దళ పెంపుడు చిలుక – వామపక్షాలపై తస్లీమా నస్రీన్ అడ్డుసవాళ్లు !
  • ప్రజాకంటకుల మధ్య సమన్వయం ఉన్నపుడు వారిని వ్యతిరేకించేవారు అదే చేస్తే తప్పా !
  • కొలకతా కాళీ ఆలయంలో మాంసం తిన్న బిజెపి సనాతనులు ! ఎలా సమర్దించుకున్నారో తెలుసా !!
  • బ్రెట్టన్ ఉడ్ కవలల పొదుపు కత్తి – సంక్షేమ పధకాలకు ముంచుకువస్తున్న ముప్పు !

Recent Comments

pscknr's avatarpscknr on పశ్చిమబెంగాల్లో మహమ్మద్ ఘోరీ వ…
SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…

Archives

  • October 2026
  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగవసారి లూలా చారిత్రాత్మక విజయం ! దేశం వదలి పారిపోయిన ప్రత్యర్ధి బోల్సనారో !!
  • కాషాయ దళ పెంపుడు చిలుక – వామపక్షాలపై తస్లీమా నస్రీన్ అడ్డుసవాళ్లు !
  • ప్రజాకంటకుల మధ్య సమన్వయం ఉన్నపుడు వారిని వ్యతిరేకించేవారు అదే చేస్తే తప్పా !
  • కొలకతా కాళీ ఆలయంలో మాంసం తిన్న బిజెపి సనాతనులు ! ఎలా సమర్దించుకున్నారో తెలుసా !!
  • బ్రెట్టన్ ఉడ్ కవలల పొదుపు కత్తి – సంక్షేమ పధకాలకు ముంచుకువస్తున్న ముప్పు !

Recent Comments

pscknr's avatarpscknr on పశ్చిమబెంగాల్లో మహమ్మద్ ఘోరీ వ…
SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…

Archives

  • October 2026
  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగవసారి లూలా చారిత్రాత్మక విజయం ! దేశం వదలి పారిపోయిన ప్రత్యర్ధి బోల్సనారో !!
  • కాషాయ దళ పెంపుడు చిలుక – వామపక్షాలపై తస్లీమా నస్రీన్ అడ్డుసవాళ్లు !
  • ప్రజాకంటకుల మధ్య సమన్వయం ఉన్నపుడు వారిని వ్యతిరేకించేవారు అదే చేస్తే తప్పా !
  • కొలకతా కాళీ ఆలయంలో మాంసం తిన్న బిజెపి సనాతనులు ! ఎలా సమర్దించుకున్నారో తెలుసా !!
  • బ్రెట్టన్ ఉడ్ కవలల పొదుపు కత్తి – సంక్షేమ పధకాలకు ముంచుకువస్తున్న ముప్పు !

Recent Comments

pscknr's avatarpscknr on పశ్చిమబెంగాల్లో మహమ్మద్ ఘోరీ వ…
SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…

Archives

  • October 2026
  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    vedika
    Join 244 other subscribers

    Have a WordPress.com account? Log in now.

  • vedika
    View site in Reader
    Manage subscriptionsSign upLog in
    Report this content
    Collapse this bar
%d