• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Europe

పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !

26 Wednesday Aug 2026

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, UK, USA, Ycp

≈ Leave a comment

Tags

chandababu, China World Factory, Countries manufacturing share, Donald trump, Narendra Modi Failures, Niti Aayog, pavan kalyan, World Bank, world Trade, Xi Jinping

ఎం.కోటేశ్వరరావు

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసంలో మేడిన్ ఇండియా ( భారత తయారీ) వస్తువులు ప్రపంచంలో ప్రతి మూలకూ చేర్చటం లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. “ఉన్నమాట అన్నా వు ఎవ్వరు నేర్పిన మాటరా వేదంలా విలువైన మాట” అనే సినిమా పాటను గుర్తుచేశారు. పాడిందే పాడరా అన్నట్లుగా ఇలాంటి మాటలు ఎన్నిసార్లు చెబుతారు, దేశాన్ని ఎటువైపు తీసుకుపోతు న్నారన్నదే అసలైన సమస్య. ప్రధానిగా తొలి ఆగస్టు పదిహేను అంటే 2014 ప్రసంగంలో మేకిన్ ఇండియా(భారత్‌లో తయారీ) పిలుపునిచ్చారు. “రండి, భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఏ దేశంలోనైనా విక్రయిం చండి, కానీ వాటిని భారత్‌లోనే ఉత్పత్తి చేయాలి” అని విదేశీ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. అదే ఏడాది సెప్టెంబరు 25న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాదీ ఏదో ఒక సందర్భంగా ఇలాంటి పిలుపులిస్తూనే ఉన్నారు. కనుచూపు మేరలో కూడా ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపిం చటం లేదు, అయినా పదే పదే చెబుతున్నారంటే దాన్నే మనాలి? భారత తయారీ సప్తధారల్లో జరగాలని మోడీ చెప్పారు. చెప్పిన మాట చెప్పకుండా తన కార్యాలయం రాసిచ్చిన ఉపన్యాసాలను కొత్త కొత్త పదజాలంతో కాశీ మజిలీ కథల మాదిరి ఊకదంపుడుతో కొత్తవాటిని చెప్పటం తప్ప అడుగు ముందుకు పడటం లేదు. డ్రోన్ వ్యవస్థలను మనం అభివద్ధి చేయాలని, హైపర్‌సోనిక్ రక్షణ సాంకేతిక రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలని కూడా చెప్పారు. పన్నెండేండ్లుగా ఎవరు వద్దన్నారు.

ఇప్పటికే మనకంటే ఎంతో ముందున్న దేశాలు ఈ రంగాల్లో ఇంకా ముందుకు పోతాయి. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు దేశాన్ని తయారు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పోటీతత్వం లేకపోతే వర్తమానంలో ఏ దేశమూ పరుగులో నిలవలేదు. అందుకు అవసరమైనట్లుగా పని చేశామా లేదా అన్నదే ముఖ్యం. స్విడ్జర్లాండ్‌లోని లాసానే నగరంలో 1990లో ఐఎండి బిజినెస్ స్కూలు ఉంది. దాన్నొక ప్రతిష్టాత్మక సంస్థగా పరిగణిస్తున్నారు. ప్రతి ఏటా దేశాలను ఎంచుకొని పోటీతత్వ సూచికలను ప్రకటిస్తుంటుంది. తాజా 2026 నివేదిక ప్రకారం మన దేశం 44వ ర్యాంకులో ఉంటే చైనా పన్నెండవదిగా ఉంది. ప్రధాని చెబుతున్నట్లుగా 2047 నాటికి లేదా అంతకు ముందే మనదేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా? మోడీ చెప్పినట్లు మన వస్తువులన్నీ ప్రపంచంలో అన్ని మూలలకు ఎగుమతి అవుతాయా? మాటలు కోటలు దాటటం తప్ప చేతలు గడపదాటటం లేదనే లోకోక్తి తెలిసిందే. ఇతర దేశాలతో పోటీ పడకపోవటానికి కాంగ్రెస్, నెహ్రూ, గాంధీ కారణమని కాషాయ దళాలు చెబుతుంటాయి.2014 నుంచి అధికారం లో ఉన్న మోడీ ఏం చేశారన్నదే ప్రశ్న. తొలిసారిగా ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగురవేసినపుడు ఐఎండి నివేదిక ప్రకారం భారత్ 2013లో 40వదిగా, చైనా 21వ స్థానంలో ఉంది.

పైన చెప్పుకున్నట్లు తాజా సూచికల ప్రకారం 44-12 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచమంతటా తిరిగి యుపిఏ హయాంలో కోల్పోయిన దేశ ప్రతిష్టను తిరిగి తీసుకువచ్చా నని చెప్పిన తరువాత పరిస్థితి ఇది. చైనా ఎలా పెంచుకుందో, మనం ఎలా దిగజారామో దానికి కారకులు ఎవరో ఎవరిని అడిగినా చెబుతారు. ‘బుద్దులు భూములను ఏలుతుంటే రాతలు గాడిదలను కాస్తున్నాయనే’ లోకోక్తిని ఇక్కడ గుర్తు చేయకతప్పటం లేదు. మోడీ అధికారానికి వచ్చినపుడు కమ్యూనిస్టు చైనా నుంచి మనం 6,040 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకున్నాం, 2026 మార్చినెల నాటికి 13,160 కోట్ల డాలర్లకు పెరిగాయి, ఇదే సమయంలో చైనాతో వాణిజ్యలోటు 3,600-4,000 కోట్ల మధ్య ఉన్నది 11,200 కోట్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో దిగుమతులు, వాణిజ్యలోటు మరింతగా పెరగనున్నట్లు చెబుతున్నారు. బీజేపీ నేతలు చైనా నుంచి మనం సెల్‌ఫోన్ల దిగుమతులను తగ్గించాం చూశారా మోడీ ఘనత అంటూ అడ్డుసవాళ్లు విసురుతారు. ఎలక్ట్రానిక్స్ రంగం లో పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రాయితీ లిస్తున్నది గనుక అనేక కంపెనీలు మనదేశం లోనే ఫోన్లు తయారు చేస్తున్నందున దిగుమతు లు తగ్గినమాట నిజం, కానీ మొత్తంగా దిగుమతులు ఎందుకు పెరుగుతున్నట్లు ? మన వాణిజ్యలోటు పెరగటం అంటే ఏటా మనం చైనాకు అప్పనంగా అంత మొత్తాలను చెల్లిస్తున్నాం. ఎందుకీ పరిస్థితి ?

ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా ఒక భాగంగా ఉండాలని, వస్తువులను ఎగుమతి చేయాలని నిటి ఆయోగ్ నివేదికలు ఎప్పటికపుడు చెబుతూనే ఉన్నాయి. ఇదిగో ఫలానా రంగంలో అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనే 2047 నాటికి లక్ష్యాలను చేరాలంటే మొత్తం 62 అంశాల జాబితాను రూపొందించి వాటిలో 12 రంగాలను గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇన్నేండ్ల నుంచి ఎందుకు విఫలమ య్యామనే అంశాన్ని మోడీ ఎప్పుడైనా చెప్పారా? ఈ రంగాల్లోకి అత్యధికంగా ప్రయివేటు పెట్టు బడులు వస్తేనే లక్ష్యాన్ని సాధించగలమని నిటిఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి చెప్పారు. మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో జీడీపీలో 25-26 శాతం ప్రయివేటురంగ పెట్టు బడులు ఉండేవి, ఇటీవల 22 శాతానికి తగ్గాయి, అదీ కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఇతర రాయితీలిచ్చినప్పటికీ పెరగకపోగా తగ్గాయి. దేశంలో ఉన్న ప్రయివేటు రంగమే ముందుకు రాకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఎలా వస్తాయి? 2047 నాటికి దేశ జీడీపీని 30లక్షల కోట్లకు చేరుస్తామని చెబుతున్నారు. అందుకు గాను వచ్చే 20ఏండ్లు ఏటా పదిశాతంపైగా వాస్తవ వృద్ధి రేటు ఉండాలని ఆర్థికవేత్తలు చెబు తున్నారు. దానికి ప్రాతిపదిక ఉందా? అలా జరిగితే ఇలా జరిగితే లక్ష్యాలను సాధించటం కష్టమేమీ కాదని చెప్పేవారు కోకొల్లలు… తనదిగాకపోతే కాశీ వరకు తాటిపట్ట మీద దేకవచ్చాన్నడట వెనుకటికి ఎవడో.

ప్రపంచ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 28శాతం కాగా మనం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ మన వాటా మూడు శాతం దగ్గరే ఉంది. 2004లో చైనా వాటా పదిశాతం లోపుగానే ఉంది. విలువలో 625 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 4.66లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇక అమెరికా విషయానికి వస్తే ఇదే కాలలో 22శాతం నుంచి 17కు, ఐరోపా ప్రాంత వాటా తగ్గి 15శాతానికి పరిమితం కాగా జపాన్ ఐదుశాతం కలిగి ఉంది.ఇదే సమయంలో మన వాటా 1.6-1.8శాతం మధ్య ఉంది, అది 2014నాటికి రెండు శాతానికి చేరింది. మోడీ ఏలుబడిలో ఇప్పటివరకు మూడుశాతానికి పెరిగింది. అమెరికా, జపాన్, జర్మనీ మూడింటి కంటే ఎక్కువగా చైనా ఉత్పత్తి ఉంది. ఆశలు, ఊహలు, అడుక్కొనే విషయాల్లో పిసినారితనం ఉండకూ డదంటారు పెద్దలు.ఇలాంటి స్థితిలో ప్రపంచ కేంద్రంగా మనదేశాన్ని మారుస్తానని, మోడీ, ఆయన భజన బృందం లోని ఆకాశానికి నిచ్చెనలు వేసే చంద్రబాబు వంటి వారు చెబితే నమ్మేదెలా ? పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తే కొన్ని రంగాల్లో పురోగతి ఉండవచ్చు కానీ మా ఊర్లో మిరియాలు తాటికాయలంత అంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. కరోనా సమయంలో చైనాలోని కంపెనీలన్ని అక్కడి నుంచి దుకాణాలు ఎత్తేసి భారత్‌కు వస్తున్నట్లు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడా చప్పుడు చేయటం లేదు. ఉత్పాదక రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తే దిగుమతులపై ఆధార పడాల్సిన పనిలేదు, ఉద్యోగ సృష్టి జరుగుతుంది.

అమెరికా అంత అగ్రరాజ్యమే మా దేశంలో పెట్టుబడులు పెడతారా లేక మీ సంగతి చూడమంటారా అని బెదిరింపులకు దిగటం వెనుక పరమార్ధం ఇదే. చైనా ఇప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తుల మీద కేంద్రీకరిస్తోంది, అది కేంద్రీకరణ తగ్గించిన రంగాల్లో మనం బలపడవచ్చని నిటి ఆయోగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 2000 సంవత్సరంలో ఆరుశాతమే, 2030 నాటికి 45శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా తదితర ధనిక దేశాలు 1948లో సోవియట్ యూనియన్, చైనా లేకుండా 23 స్థాపక దేశాలతో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్(గాట్-పన్నులు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం) జరిగింది. దీనిలో భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. అది 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థగా మారింది. అయినప్పటికీ 2001 వరకు చైనాను దానిలో చేరకుండా అడ్డుకున్నారు.అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతూ చౌకగా అనేక ఉత్పత్తులను అందచేస్తున్న క్రమంలో తమ ప్రయోజనాల కోసం అడ్డుకున్నదేశాలే సభ్యత్వం ఇవ్వక తప్పలేదు. ఆ తరువాత బీజింగ్ వెనుదిరిగి చూడలేదు, ఎగుమతుల అవకాశాలు మరింతగా పెరిగాయి. నవీకరణతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ వచ్చాయి. మేడిన్ చైనా 2025 వంటి లక్ష్యాలు, అందుకు అవసరమైన విధానాలతో ముందుకు పోవటమే గాక అవసరమైన కార్మికశక్తి నైపుణ్యాల ను కూడా పెంచింది.

రవాణా సదుపాయాల మెరుగుదలకు విస్తరించిన రోడ్లు,రైలు, బుల్లెట్ రైళ్లను చూసి అవసరం లేకున్నా నిర్మించిందని విమర్శించిన వారే ఇప్పుడు ఔరా ఎంత ముందు చూపుతో చేశారని ముక్కున వేలేసుకుంటు న్నారు. నిజానికి మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వ పెట్టుబడులు తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటంతో స్థానికంగా కొనుగోలు శక్తికూడా పెరిగింది. తక్కువ ఖర్చులో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు నేడు ఎంతో లాభసాటిగా మారాయి.2010 నుంచి పారిశ్రామిక ఉత్పత్తికి దోహదం చేయటంలో చైనా ప్రధమ స్థానంలో కొనసాగు తోంది. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని ఆక్రమించాల ని చూశారు. ఇప్పుడది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించేందుకు పూనుకున్నారు. వారికి చైనా కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఏడుపు ఏమంటే ఇప్పటి వరకు ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా రానున్న రోజుల్లో సరఫరా కేంద్రంగా కూడా మారనున్నదని దోపిడీదార్లు భయ పడుతున్నారు. జపాన్ సుజుకీ కంపెనీ మనదేశం లో మారుతీ కార్లకు కీలక విడి భాగాలను అందిస్తున్నట్లే చైనా అను సరిస్తున్నది. దుస్తుల రంగంలో 2023 వివ రాలను చూసిన పుడు చైనా ముడిసరకు ఎగుమతులు 16, ఇంటర్‌మీడియెట్ ఉత్పత్తులు 21,పాక్షికంగా తయారైనవి 47, పూర్తిగా తయారైనవి 30శాతం ఉన్నాయి. వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి పలకల్లో పూర్తిగా తయారైనవి 54శాతం చొప్పున ఉన్నాయి.

విద్యుత్ వాహనాల లో 51శాతం పాక్షికంగా తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నది. ఇవన్నీ గిరాకీ మీద ఆధారపడి ఉన్నాయి.అనేక దేశాలు చైనా నుంచి విడి భాగాలను తెచ్చుకొని వాటితో పూర్తి వస్తువులను తయారు చేస్తున్నారు. అది లాభసాటిగా ఉన్నంత కాలం సాగుతుంది.చైనా లావాదేవీలన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకే జరుగుతున్నందున అమెరికా, మరికొన్ని దేశాలకు కడుపు మంటగా ఉంది. ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను కబళించేందుకు చూసిన శక్తులు నేడు అది విఫలమైందని, చైనా తొండి ఆట ఆడుతున్నదని అంటూ పూర్వపు రక్షణాత్మక విధానాలవైపు మళ్లుతున్నారు.పురాతన కాలంలో వివిధ దేశాల మధ్య వస్తు వ్యాపారం ఉన్నట్లు చరిత్రలో నమోదైంది. అయితే వర్తమానంలో ఎగుమతులు-దిగుమతుల క్రమం 1870లో ప్రారంభమైందని చెబుతు న్నారు. పారిశ్రామిక విప్లవం తరువాత వస్తూత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరగటంతో ఇది జరిగింది.

బ్రిటన్ ఎగుమతుల్లో ప్రధమ స్థానంలో ఉంది, ఒక దశలో అది ఎగుమతి చేసిన వాటిలో 42శాతం భారత ఉత్పత్తులు ఆక్రమించాయి.బ్రిటన్ తరువాత రెండవ స్థానంలో జర్మనీ హవా నడిచింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ముందుకు వచ్చింది .1980,90దశకాల్లో జపాన్ ఎలక్ట్రానిక్స్‌తో ప్రపంచాన్ని నింపివేసింది. నూతన సహస్రాబ్ది ప్రారంభం నుంచి చైనా అగ్రస్థానానికి చేరింది.1948లో ప్రపంచ వస్తు ఎగుమతుల విలువ కేవలం 59 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా 2025లో 26లక్షల కోట్ల డాలర్లు దాటింది.దానిలో చైనా వాటా ముందే చెప్పుకున్నట్లు 4లక్షల కోట్ల డాలర్లు దాటింది. నల్లమందు భాయీలని ప్రపంచం ఈసడించిన చైనీయులను పూర్తిగా మార్చి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాధించిన ఘనత ఇది! కాదంటారా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘మక్కా రక్షణ ఒప్పందం’ వెనుక మతలబేమిటి?

12 Wednesday Aug 2026

Posted by raomk in Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Islamic NATO, Mecca Joint Defence Agreement, pakistan, Saudi Arabia, Sunni NATO, Türkiye

కోటేశ్వరరావు

పెద్ద ఆర్భాటం, ముందస్తు హడావుడి లేకుండా సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఆగస్టు ఏడున సౌదీ, టర్కీ, పాకిస్తాన్ దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీన్ని ‘మక్కా ఒప్పందం’ అని కూడా పిలుస్తున్నారు. దీని పరిణామాలు, పర్యవసానాల గురించి ప్రపంచంలో చర్చ మొదలైంది. రక్షణ కోసం అమెరికాను ఆశ్రయిస్తే ప్రయోజనం లేదనే భావం తాజా పరిణామాలతో బలపడటంతో ఈ కొత్త కూటమి పురుడు పోసుకున్నట్లు తొలి స్పందనలొచ్చాయి. నమ్ముకున్న దేశాలను నట్టేట ముంచి స్వంత ప్రయోజనాల కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుందన్న విషయం తెలిసిందే. ఇజ్రాయిల్‌తో కలసి ఇరాన్‌పై దాడులు చేయించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అటు అమెరికా ఇటు యావత్ ప్రపంచంలో అపహాస్యం పాలైనా బుద్ది మారలేదు. అలాంటి వాడిని మన ప్రధాని నరేంద్రమోడీ వంటివారు ఇంకా జిగినీ దోస్తుగానే పరిగణిస్తున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తే మన వస్తువుల దిగుమతిపై వందశాతం అపరాధ సుంకాలు విధించేందుకు అమెరికా పార్లమెంటు ఎగువసభ సెనేట్ ఇప్పటికే తీర్మానించింది, ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదం పొందితే అమల్లోకి రానుంది. అయినా మోడీ నుంచి ఉలుకూపలుకూ లేదు.

అదేమిటంటే మౌనం కూడా ఒక దౌత్యమే, అది మోడీకే స్వంతం అని భజనపరులు కీర్తిస్తున్నారు. ఇరాన్ మీద తాము దాడులు చేసినపుడు అనేకమంది మరణించారని, గాయపడ్డారని వారందరికీ ఇరాన్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తాజాగా డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దాడులతో తమకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని టెహరాన్ పట్టుబడుతున్న పూర్వరంగంలో ట్రంప్ ఎదురుదాడికి దిగాడు. నవంబరు మూడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల గడువు సమీపిస్తున్నది. ఓటర్లకు ఏం చెప్పాలో తెలియక, ఏం మాట్లాడితే పరువు మరింత దిగజారుతుందో అర్ధంగాక ఎరక్కపోయి ఇరుక్కు పోయినట్లుగా ట్రంప్ జుట్టుపీక్కుంటున్నాడంటే అతిశయోక్తి కాదు. గాజాలో శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని, అమెరికా ప్రతిపాదించిన పదిహేను అంశాలను అమలు చేస్తామని, అక్కడ అధికారంలో ఉన్న హమాస్ సాయుధశక్తి చెబుతుండగా… అంగీకరించేది లేదని, గాజా నుంచి వైదొలగబోమని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. ఎందుకంటే అక్టోబరు 27న ఇజ్రాయిల్‌ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు స్వే‌చ్ఛగా జరుగుతాయా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. నెతన్యాహు అనుకూల మూకలు ఓటర్లను బెదిరిస్తున్నాయి.

ఓటర్లుగా ఉన్న పాలస్తీనియన్లను ఓటింగ్‌కు రాకుండా అని ప్రయత్నాలూ చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారు వచ్చి నెతన్యాహుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతో ముందు, ఓటింగ్ రోజు అనేక విమానాలను కూడా రద్దు చేశారు. యూదు దురహంకారులను సంతుష్టీకరిం చేందుకు ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో పాలస్తీనియన్లపై దాడులను ఉధృతం చేశారు, వామపక్షాలను పోటీలో లేకుండా చేసేందుకు కూడా చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగా టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులు మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. మూడింటిలో ఏ ఒక్కదేశం మీదైనా ఎవరైనా దాడిచేస్తే అందరి మీద చేసినట్లుగా పరిగణించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కూటమిని “ముస్లిం నాటో-సున్నీ నాటో” అని కొందరు వర్ణించారు. మూడూ ఇస్లామిక్ దేశాలు కావటం, మతరీత్యా ఆ దేశాల్లో సున్నీలు అత్యధికులుగా ఉన్నందున అలా చెప్పారు. ఈ ఒప్పందం ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. దీనివలన ఎలాంటి ఫలితం ఉండదని చెబుతున్నవారూ లేకపోలేదు. దీర్ఘకాలం సాగుతున్న విబేధాలు, ప్రాంతీయ యుద్ధాల పూర్వరంగంలో అమెరికా రక్షణను నమ్ముకోకూడదన్నది ఒక ప్రధాన అంశంగా చెబుతున్నారు.

తాజా పశ్చిమాసియా సంక్షోభంలో గల్ఫ్, మధ్య ప్రాచ్య ప్రాంతంలోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ చేస్తున్న దాడులతో ఆయా దేశాల్లో తలెత్తిన ఆందోళన, అనిశ్చితి వాషింగ్టన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు అనే భయం పట్టుకుంది. దీంతో యుద్ధాన్ని నిలిపివేయాలని ఆ దేశాలు ట్రంప్ యంత్రాంగం మీద వత్తిడి తెస్తున్న సంగతి కూడా తెలిసిందే. అత్యాధునిక ఆయుధాలున్న అమెరికా దాడుల్లో ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ అనేక విధాలుగా దెబ్బతిన్నది వాస్తవమే అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ప్రతిదాడులు చేయటం వెనుక ఉన్న మర్మం పండితులకు అంతుబట్టటం లేదు. తిరుగులేని నిఘా వ్యవస్థలుగా పేరున్న ఇజ్రాయిల్‌ మొసాద్, అమెరికా సిఐఏకు సైతం ఇరాన్ ఆయుధాలు, వాటిని ప్రయోగిస్తున్న కేంద్రాలు ఎక్క‌డున్నాయో తెలియటం లేదు. గతేడాది అణుకేంద్రాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించినా అదంతా ఉత్త ప్రచారమే అని తరువాత తేలిపోయింది. అందుకే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనకు మక్కా ఒప్పందం ఒక ప్రతిరూపం అంటున్నారు. దీనిలో వెంటనే ఈజిప్టు చేరనుందని, తరువాత మరికొన్ని దేశాలు కూడా భాగస్వాములుగా చేరవచ్చని చెబుతున్నారు. దీని ఏర్పాటు వెనుక అమెరికా హస్తం ఉందని కూడా అను మానాలు వెల్లడవుతున్నాయి.తమ చేతికి మట్టి అంటకుండా ఇరాన్‌‌ను దెబ్బతీసేందుకు మరో ప్రయత్నంగా ఇది ఉన్నట్లు చెబుతున్నారు.

అది నిజమా కాదా అన్నది వెంటనే చెప్పలేము గానీ ఏం జరిగినా పోయేది అమెరికా ప్రతిష్ట, పెత్తనం అన్నది స్పష్టం. అమెరికా మీద అనేక దేశాలకు ఎందుకు విశ్వాసం సన్నగిల్లుతున్నది? ఇరాన్ అణుబాంబు తయారీ, క్షిపణి, నౌకాదళ సామర్ధ్యాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయిల్‌తో కలసి దాడులు చేస్తున్నట్లు తొలుత అమెరికా చెప్పింది. వాటన్నింటినీ నాశనం చేసినట్లు ఏప్రిల్ ఎనిమిది పెంటగన్ ప్రకటించింది. వైమానిక రక్షణ వ్యవస్థలను సంవత్సరాల తరబడి పనికిరాకుండా చేయటంతో పాటు మిలిటరీ పారిశ్రామిక సామర్ద్యాన్ని కూడా దెబ్బతీసినట్లు చెప్పింది. ఇన్ని కబుర్ల తరువాత వెల్లడైన వివరాల మేరకు అమెరికా 113 బిలియన్ డాలర్ల మేర ఆర్థికంగా నష్టపోయింది. దాని విలువైన 42 విమానాలు కూడా కూలిపోయాయి. మరణించిన లేదా గాయపడిన అమెరికా సైనికుల సంఖ్య తొమ్మిది వందలు దాటింది. ఆ ప్రాంతంలో యాభై వేల మంది తమ సైనికులు ఉన్నట్లు వెల్లడించటమే గాక ఆ తరువాత కూడా దాడులు కొనసాగించింది. ఫిబ్రవరి 28కి కొన్ని వారాల ముందు కతార్‌లో బహుళజాతి గగనతల, క్షిపణి రక్షణ విభాగాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రారంభించింది. దాని ద్వారా ముప్పు గురించి ముందే హెచ్చరించటం, ఎదుర్కొనేందుకు తాత్కాలిక పథకాల రచన, సమాచార అందచేత వంటి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు.

ఏడు దేశాల మిలిటరీ ప్రతినిధులు దానిలో భాగస్వాములన్నారు. తీరాచూస్తే ఇరాన్ చేసిన దాడులతో అది పనికిరాకుండా పోయింది. అమెరికా మరోచోటుకు తన కమాండ్ కేంద్రాన్ని మార్చుకుంది. నిజానికి కతార్‌లో అంతకుముందున్న కమాండ్ కేంద్రం నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా ఇతర దేశాలలో అమెరికా అనేక కార్యకలాపాలు నిర్వహించింది. ఇరాన్ దాడులతో ఆ ప్రాంతంలోని 15 అమెరికా మిలిటరీ కేంద్రాలలో కనీసం 228 మిలిటరీ నిర్మాణాలు, వాటిలో ఉన్న విమానాలు, రాడార్, సమాచార పరికరాలు, చమురు సంబంధిత ఏర్పాట్లు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఎంతో ఖరీదైన పేట్రియాట్, థాడ్, తోమహాక్ రక్షణ వ్యవస్థలన్నీ ఇరాన్ దెబ్బతో కరిగిపోయాయి. చివరకు దక్షిణ కొరియాలో ఉంచిన వాటిని కూడా పశ్చిమాసియాకు తరలించాల్సి వచ్చింది. వెంటనే అలాంటి వాటిని ఉత్పత్తి చేయాలని రక్షణ కాంట్రాక్టర్లను పెంటగన్ కోరిందని, వెంటనే సరఫరా చేయటం సాధ్యం కాదని వారు చేతులు ఎత్తివేసినట్లు వార్తలొచ్చాయి. కొన్నేండ్ల పాటు ఉత్పత్తికి సమయం తీసుకోవచ్చని కూడా నిపుణులు చెప్పారు. వీటన్నింటిని చూసిన తరువాత అమెరికాను నమ్ముకొని ఏ దేశమైనా నిశ్చింతగా ఉండగలదా? నాటో కూటమిలో సభ్య దేశమైన టర్కీ రెండవ పెద్ద మిలిటరీని కలిగి ఉంది.

గల్ఫ్‌లో చమురుతో సౌదీ అరేబియా ఆపార సంపద, పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఈ మూడూ కలిస్తే ఒక బలమైన శక్తిగా రూపొందే అవకాశం ఉందనే ఆలోచన మక్కా ఒప్పందం వెనుక ఉందన్నది ఒక అభిప్రాయం. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అయితే నాటో కూటమి లక్షణాలు దీనికి ఉన్నాయా అంటే లేవు. అందుకే కొందరు ఇది సంతకాలకే పరిమితం అంటున్నారు. నాటో మాదిరి ఒక ఏకీకృత మిలిటరీ కమాండ్, ఒక ప్రణాళిక, నిర్దిష్ట లక్ష్యం లేదు. తక్షణమే అలాంటి వాటిని ఏర్పాటు చేసే అవకాశాలూ కనిపించటం లేదు. ఐక్యరాజ్యసమితి ఆర్టికల్ 51 ప్రకారం ఉమ్మడి ఆత్మరక్షణ ఒప్పందంగా టర్కీ వర్ణించింది. గతేడాది సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దానిలో చేరే అవకాశం గురించి చర్చిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ జనవరి 29న చెప్పాడు. రక్షణ అవసరాల కోసం వెలుపలి దేశాల మీద ఆధారపడుతూ కొనసాగటం కంటే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవటం మంచిదన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రపంచ మిలిటరీ బలా బలాలను చూసినపుడు టర్కీ 9, పాకిస్తాన్ 14, సౌదీ 25వ స్థానాల్లో ఉన్నాయి. పందొమ్మిద వదిగా ఉన్న ఈజిప్టు కూడా కలిసే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలూ భిన్నదారుల్లో ప్రయాణిస్తున్నాయి.

అష్ట దరిద్రాలతో అల్లాడుతున్నప్పటికీ పాకిస్తాన్ అణుబాంబు లను తయారు చేసుకుంది తప్ప అన్న వస్త్రాలను జనాలకు సమకూర్చలేకపోతోంది. కీలకమైన ప్రాంతంలో ఉన్నందున భారత్, చైనాలకు వ్యతిరేకంగా ఒక స్థావరంగా ఉపయోగపడ నుందనే కుట్రలో భాగంగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలు దానికి అండగా ఉన్నాయి. ఇప్పుడు దాని ఆర్థిక ఇబ్బందులను సౌదీ తీరుస్తున్నది. పాకిస్తాన్ తన మిలిటరీ అవసరాల కోసం అత్యధికంగా చైనా మీద ఆధారపడుతున్నది. టర్కీ స్వంత మిలిటరీ పరిశ్రమలను కలిగి ఉంది. సౌదీ విషయానికి వస్తే అది పూర్తిగా అమెరికా మిలిటరీ ఉత్పత్తులపై ఆధార పడుతున్నది. ఐరోపా కేంద్రంగా పనిచేసే నాటో దేశాలు కొన్ని స్వయంగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తుండగా మరికొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. నాటో రక్షణ బడ్జెట్ పెంచాలని ఇటీవలి కాలంలో అమెరికా వత్తిడి తెస్తున్నది. ఇస్లామిక్ నాటోగా వర్ణితమౌతున్న కూటమిలో రక్షణ బడ్జెట్‌ను పెంచేందుకు పాకిస్తాన్‌కు అవకాశం లేదు. ఒక వైపు నాటోలో కొనసాగుతూ మరోవైపు మక్కా కూటమిలో చేరిన టర్కీ ఎంతమేరకు బడ్జెట్ కేటాయిస్తుందన్నది అనుమానమే.ఈ కూటమి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున మన దేశం పెద్దగా స్పందించలేదు, వేచి చూస్తున్నట్లు మాత్రమే ముక్తసరిగా వ్యాఖ్యానించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

11 Saturday Jul 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, China credibility, Chinese navy strategic missile, Donald trump, Narendra Modi Failures, US and China, US attack Iran, World Military Power, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో ఏం జరుగుతోంది ? రోజువారీ పరిణామాలను చూస్తే సామాన్యులకు అనేక విషయాలు అంతుపట్టటం లేదంటే అతిశయోక్తి కాదు.ఫిబ్రవరి 28న అమెరికా‘ఇజ్రాయెల్ జరిపిన ఏకపక్ష దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేని మరణించారు. తరువాత దాడులు కొనసాగిన కారణంగా అంత్యక్రియలను వాయిదా వేసి జూలై నాలుగు నుంచి తొమ్మిదవ తేదీ మధ్య పూర్తి చేశారు. రెండు కోట్ల మంది పౌరులు ఈ క్రతువులో పాల్గొన్నారు. ఇరాన్ బలప్రదర్శనగా దీన్ని టైమ్ పత్రిక వర్ణించింది. అంత్యక్రియల్లో వందకుపైగా దేశాల నేతలు, ఉన్నతస్థాయి ప్రతినిధి వర్గాలు పాల్గ్గొంటున్నట్లు వార్తలు.ఖమేని అంత్యక్రియల్లో పాల్గ్గొనేదేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా బెదిరించటంతో 13దేశాలు వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు.తొలుత సంతాపం కూడా ప్రకటించటానికి తటపటాయించిన మనదేశం తరఫున విదేశాంగశాఖ ఉపమంత్రి పవిత్ర మార్గరిటా నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం హాజరైంది. ఖమేనీ మరణానికి అధికారికంగా సంతాపం తెలిపితే ఎక్కడ అమెరికాకు కోపం వస్తుందో అని తటపటాయించిన మన కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల తరువాత సంతాప ప్రకటన చేసింది తప్ప అమెరికా చేసిన హత్యను ఇంతవరకు ఖండించలేదు. ఇరాన్ నేతలు, మిలిటరీ అధికారులు అందరూ ఒకేచోట దొరికినా తాము వారిని మట్టుబెట్టేందుకు పూనుకోలేదంటూ డోనాల్డ్ ట్రంప్ పిచ్చివాగుడుతో మరోసారి అమెరికా పరువు తీశాడు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మాట్లాడిన ట్రంప్ దేశానికి అతిపెద్ద ముప్పు కమÖ్యనిజం అని చెప్పాడు. ఇలాంటి వారందరినీ చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది. ఇండో‘పసిఫిక్ ప్రాంతం నిబంధనల ప్రాతిపదికన స్వేచ్చగా ఉండాలంటూ జపాన్ ప్రధాని సానే తకాచీతో కలసి ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.తన మిలిటరీ వ్యూహంలో భాగంగా మన భుజం మీద తుపాకిపెట్టి చైనాను కాల్చాలనుకున్నది అమెరికా .1947లో ప్రారంభించిన అమెరికా పసిఫిక్ కమండ్ పేరును 2018లో ట్రంప్ నాయకత్వంలో యంత్రాంగం అమెరికన్ ఇండోపసిఫిక్ కమాండ్‌గా మార్చింది. ఇపుడు అదే ట్రంప్ జూన్ నెలలో మనదేశం పేరును తొలగించి పాతపేరును పునరుద్దరించాడు.మన చిత్రపటాన్ని మార్చి ఆక్రమిత్ కాశ్మీరును పాక్ ప్రాంతంగా దానిలో ముద్రించాడు.ఏ రెండు దేశాలైనా జతకట్టవచ్చని అది మÖడో దేశానికి వ్యతిరేకంగా ఉండకూడదని మోడీతకాచీ భేటీ గురించి చైనా ప్రకటించింది. ఆ తరువాత తమకు వ్యతిరేకంగా ఎవరైనా పిచ్చివేషాలు వేస్తే సంగతి తేలుస్తామనే హెచ్చరికగా జూలై ఆరవ తేదీన చైనా జలాంతర్గామి నుంచి అణుక్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది.మార్చి నెల ఒకటవ తేదీ నుంచి మీడియాలో పశ్చిమాసియా సంక్షోభానికి పెద్ద పీటవేసి ఉక్రెయిన్ పరిణామాలను దాదాపుగా విస్మరించారు. తిరిగి ఈ వారంలో ఆ వార్తలు చోటు చేసుకున్నాయి. తాము నిర్దేశించిన మార్గానికి బదులు వేరుగా ప్రయాణించిన మÖడు నౌకలపై హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేయటంతో బుధవారం నుంచి తిరిగి అమెరికాఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఒప్పందం రద్దయిందని చెప్పిన ట్రంప్ సాంకేతిక చర్చలు కొనసాగుతాయంటూ మరోముక్తాయింపు ఇచ్చాడు. తిరిగి చర్చలంటూ వార్తలు. నవంబరు మÖడున జరిగే అమెరికా మధ్యంతర పార్లమెంటరీ ఎన్నికల వరకు ఇలాగే అమెరికా ఉల్లంఘనలు, ఇరాన్ ప్రతిస్పందనలతో గడిచే అవకాశం కనిపిస్తోంది.టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో వార్షిక సమావేశం వచ్చే ఏడాది సమావేశం గురించి ఎటూ తేల్చుకోకుండానే ముగిసింది. ఇది ఒక పెద్ద వైఫల్యం. ఇలా అనేక పరిణామాలు జరిగినప్పటికీ స్థలాభావం రీత్యా కొన్నింటిని మాత్రమే ఈ సందర్భంగా చూద్దాం.


గ్లోబల్ ఫైర్ పవర్ 2026 సూచిక ప్రకారం పది అగ్రశ్రేణి దేశాల్లో 0. 0741 (897)పాయింట్లతో అమెరికా ముందుండగా రష్యా 0.0791(964), చైనా 0.919(988), భారత్ 0.1346(1461), ఐదవ స్థానంలో 0.1642(2198)లో దక్షిణ కొరియా ఉంది. బ్రాకెట్లలో ఉన్న అంకెలు 2016నాటివి, ఆ ఏడాది పదవ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా తాజాగా ఐదుకు ఎగబాకింది గత విశ్లేషణల్లో చెప్పినట్లుగా ఇరాన్‌పై అమెరికా దాడి ప్రపంచంలో నూతన పరిణామాలకు నాంది పలికింది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్నుంచి చమురు కొనుగోలును చైనా నిలిపివేయలేదు. అనేక విధాలుగా ఆదుకుంది. ఈ పూర్వరంగంలోనే అనేక దేశాలు ఇప్పుడు విశ్వసనీయమైన దేశం ఏది అంటే అమెరికా బదులు చైనాను ఎంచుకుంటున్నాయి. కమÖ్యనిస్టు, బీజింగ్ వ్యతిరేకులకు ఇది మింగుడుపడని వ్యవహారం గనుక ఈ పరిణామాన్ని గుర్తించనట్లే వ్యవహరిస్తారు. గల్ఫ్‌లోని తన స్థావరాలనే దాడుల నుంచి కాపాడుకోలేని అమెరికా ఎంతో శక్తివంతమైన చైనా ఒక వేళ బలవంతంగా తైవాన్ విలీనానికి పాల్పడితే పరిస్థితి ఏమిటని అక్కడి వేర్పాటు వాదుల్లో ఆందోళన మొదలైంది.పెంటగాన్ తిరుగులేనిదని ఇప్పటి వరకు కన్న కలలు అమెరికా పరిమితులను వాస్తవంలోకి తెచ్చాయి.ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుందని కాదు గానీ ఒకవేళ జరిగితే చైనాను నివారించే సత్తా ఉందా అన్న ఆలోచనలో పడ్డారు. అమెరికా రక్షణపై ఆధారపడిన గల్ఫ్ దేశాలు ఇటీవలి పరిణామాల తరువాత దానితో సంబంధాల గురించి వెంటనే బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ పునరాలోచనలో పడ్డాయి. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలోని అమెరికా మిలిటరీ స్థావరాల గురించి చైనా, రష్యాలు అందించిన నిర్దిష్ట సమాచారం కారణంగానే ఇరాన్ వాటి మీద చావుదెబ్బతీసిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. ఈ పరిణామాన్ని అమెరికా ఊహించలేదు. ఇదే విధంగా అమెరికా కనుసన్నలలో నడిచే నాటో కూటమిలోని ఐరోపా దేశాల పరిస్థితీ అదే. తమ రక్షణకు తామే ఆయుధాలు కొనుగోలు చేసి ఏర్పాట్లు చేసుకుంటున్నపుడు అమెరికా పెత్తనం ఏమిటన్నది గతంలోనే కొందరు నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు మరింతగా మధనం జరగనుంది.

పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో అనే పదాన్ని చేర్చటంతొలగించటం ఒక సాధారణ వ్యవహారం కాదు. పేరు మార్పు చారిత్రాత్మక గుర్తింపును పునరుద్దరించటం తప్ప వేరు కాదని అమెరికా బుకాయిస్తున్నది.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచించనవసరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పియÖష్ గోయల్ వ్యాఖ్యానించారు.అసలు విషయం ఏమంటే చైనాకు వ్యతిరేకంగా మనదేశాన్ని నిలిపేందుకు 2018లో అమెరికా వేసిన బిస్కెట్ ఇండో అనే పదాన్ని చేర్చటం. గత ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన పరిణామాల్లో ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించిన అమెరికా కుంటిసాకుతో ఆ పేరును తొలగించింది.ఒక విధంగా ఇది మనలను బెదిరించటమే. మనదేశ పాలకవర్గానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సీతగీత దాటితే ఏమైందో తెలుసుగనుక చైనా వ్యవహారంలో కూడా అదే మాదిరి ప్రస్తుతం పరిధి దాటేందుకు సిద్దం కాదు. తరువాత ఎలా మారేదీ ఊహాజనితమే. అమెరికన్ ఏజన్సీల తప్పుడు సమాచారం, ప్రోత్సాహంతో గాల్వన్ లోయ ఉదంతం జరిగిందన్నది ఒక అభిప్రాయం. ఐదు సంవత్సరాల తరువాత అదే చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవటం వెనుక పాలకవర్గ ప్రయోజనాలు దాగున్నాయి.సైద్దాంతికంగా ఆరఎసఎస్ వైఖరి చైనా, కమÖ్యనిస్టు వ్యతిరేకం అయినప్పటికీ అది కూడా తెగేదాకా లాగకూడదని గ్రహించి పాలకవర్గ వాంఛలను ఆమోదించకతప్పలేదు.ఒక వైపు చైనాను వ్యతిరేకిస్తున్న జపాన్‌తో జట్టుకడుతూనే బీజింగ్ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఇది దేశంలో డ్రాగన్ దేశ వ్యతిరేక శక్తులకు చెంపదెబ్బవంటిది. గతంలో మాదిరి భారత పాలకవర్గం సోషలిస్టువ్యతిరేక శిబిరాల నుంచి లబ్ది పొందేందుకు ప్రయత్నించినట్లే ఇప్పుడు కూడా అదే గేమ్ ఆడుతున్నది.విద్యుత్ రంగంలో చైనాతో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శాశ్వతంగా అనుమతి ఇచ్చినట్లు కాదని పైకి బింకాలు పోతున్నప్పటికీ చైనా పెట్టుబడుల కోసం మనదేశం ఎంతగా తహతహలాడుతున్నది తెలుస్తోంది. గాల్వన్‌లోయ ఉదంతాల సమయంలో చైనా వ్యతిరేక మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు అన్నీ మÖసుకు కూర్చున్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలేవీ కూడా సైద్దాంతికంగా కమÖ్యనిస్టు అనుకూలమైనవి కాదు. కానీ వాటికి చైనా వస్తువులు కావాలి.కార్పొరేట్లకు లాభాలు సంపాదించి పెట్టాలనటంలో ఏకాభిప్రాయం ఉంది.ఈ కారణంగానే చైనా దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం మనదేశం చెబుతున్న లెక్కల ప్రకారం ఇరుదేశాల వాణిజ్యలావాదేవీల విలువ 151 బిలియన్ డాలర్లు కాగా చైనా లెక్కలు 156బి.డాలర్లు అంటున్నాయి. ఇది పెద్ద సమస్య కాదు గానీ చైనాతో మన వాణిజ్యలోటు 112 బిలియన్ డాలర్లు దాటింది, ఇదొక రికార్డు. మన మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత నినాదాలు, ఆచరణ వైఫల్యానికి ఇది నిదర్శనం.


కమÖ్యనిస్టు చైనా విషయంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు కారణంగానే పసిఫిక్ కమాండ్ పేరు మార్చారన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత పసిఫిక్ ప్రాంతంపై అదుపుకోసం కమÖ్యనిస్టు చైనా ఆవిర్భవించక ముందే 1947 జనవరి ఒకటిన అమెరికా కమాండ్ ఏర్పడింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి మనదేశ పశ్చిమ(అరేబియా) తీరం వరకు మిలిటరీతో సహా అనేక కార్యకలాపాల నిర్వహణ దాని లక్ష్యం.కొరియా, వియత్నాంపై దాడులు, ఇతర అనేక దేశాల్లో జోక్యం ఈ కమాండ్ పుణ్యమే. ఎనిమిది సంవత్సరాల క్రితం పేరు మార్చేందుకు సందర్భమేమీ లేనట్లే ఇప్పుడు పూర్వపు నామాన్ని తెరమీదకు తెచ్చేందుకూ సరైన కారణమేమీ లేదు. అమెరికా తన ప్రయోజనానికి ఏది మంచిదనుకుంటే అదే చేస్తుంది.మన దేశ పటాన్ని పాకిస్తాన్‌కు అనుకూలంగా మార్చినా అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే మన పాలకులకు చీమకుట్టినట్లు లేదు. జై భజరంగభళీ అంటూ చైనా, పాకిస్తాన్‌ల మీద వీధుల్లో వీరంగం వేసేవారెవరూ కిక్కురు మనలేదు. లెటర్‌హెడ్ మీద పేరు మార్చినంత మాత్రాన అంతా మారిపోయినట్లు కాదని అమెరికా రాయబారి వ్యాఖ్యానించాడు. అమెరికా మిలిటరీతో మన బంధం పూర్తి అయింది గనుక దాన్నుంచి బయటపడలేని స్థితి ఏర్పడిందని భావించిన తరువాత అమెరికా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.చిత్రం ఏమిటంటే ఇప్పుడు లేని ఇండో`పసిఫిక్ కమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నట్లు మనదేశం, జపాన్ చెబుతున్నాయి.జపాన్ అంటే అమెరికా తొత్తు గనుక అదేమైనా చెప్పుకోవచ్చు, మనం కూడా అంతేనా !


రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ చేతులెత్తేసిన తరువాత అమెరికా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయపెట్టింది. దాంతో నాటి సోవియట్ యÖనియన్,బ్రిటన్,ఫ్రాన్సు,చైనా, పాకిస్తాన్,మనదేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయాల్సి వచ్చింది.ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నట్లు చెబుతున్నారు.అణ్వాయుధాలేగాక ఆధునిక క్షిపణులతో అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. తద్వారా ఆయుధపోటీకి తెరలేపింది. ఆ క్రమంలో ప్రతిదేశం తన రక్షణ కోసం ఆయుధాలను తయారు చేసుకోక తప్పటం లేదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తాను అణ్వాయుధ క్షిపణి ప్రయోగం జరపనున్నట్లు అనేక దేశాలకు ముందుగానే సమయం, నిర్దేశిత లక్ష్యం గురించి చైనా తెలియచేసింది.సోమవారం నాడు మధ్యాహ్నం 12.01నిమిషాలకు అణునియంత్రిత జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం జరపగా 59 నిమిషాల్లో జయప్రదంగా ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. పసిఫిక్ సముద్రంలో నిజమైన బాంబులకు బదులు డమ్మీలతో ఆ ప్రయోగం జరిగింది. ఇలాంటి ప్రయోగాలు జరిపిన దేశాలలో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు మనది కూడా ఒకటి.వార్షిక మిలిటరీ శిక్షణలో భాగంగా తామీ పరీక్ష జరిపినట్లు చైనా చెప్పినప్పటికీ జపాన్ వంటి దేశాలు భిన్నంగా స్పందించాయి. జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా ప్రజాయుద్ధ ప్రతిఘటన 80వ వార్షికోత్సవం సందర్భంగా జులాంగ్(జెఎల్) జలాంతర్గామి ప్రయోగించిన క్షిపణిని చైనా తొలిసారిగా 2025 సెప్టెంబరు 3న ప్రదర్శించింది. ఎనిమిది నుంచి పదివేల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత ýక్ష్యాన్ని ఛేదించగల ఈ ఖండాంతర క్షిపణిని ఇప్పుడు పరీక్షించింది. గత రెండు సంవత్సరాలలో ఇలాంటి ప్రయోగాలు చేయటం రెండవసారి. సోవియట్, తరువాత రష్యా వద్ద కూడా ఇలాంటి అధునాతన వ్యూహాత్మక క్షిపణులు ఉన్న కారణంగానే అమెరికా అదుపులో ఉంది.ఇప్పుడు రష్యాకు చైనా కూడా తోడైంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్షిపణులను ప్రయోగించే జలాంతర్గాములు అమెరికా 14, రష్యా 13, చైనా 6, ఫ్రాన్సు 4, బ్రిటన్ 4, మనదేశం వద్ద మÖడు ఉన్నాయి. అన్ని దేశాలూ కొత్తగా మరికొన్నింటిని నిర్మించేక్రమంలో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆత్మరక్షణకు తప్ప ఎదుటి దేశాలపై దాడులు చేసేందుకు అవసరమైన మిలిటరీని కలిగి ఉండకూడదని ఆమోదించిన రాజ్యాంగాన్ని ఇప్పుడు జపాన్ మార్చుకొని తిరిగి ఆసియాలో ఒక సైనిక శక్తిగా మారేందుకు చూస్తున్నది. అలాంటి దేశంతో మనం చేతులు కలిపి చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటాన్ని గమనించాలి.ఈ పరిణామాలను చూస్తున్నపుడు అటు చైనా, ఇటు దాని వ్యతిరేక కూటమి దేశాలనూ సంతుష్టీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తున్నది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై అమెరికా దాడి : చర్చలు, కాల్పుల విరమణ నిరవధిక వాయిదా ?

22 Wednesday Apr 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, China, Donald trump, Hormuz mission, Iran nuclear weapon, Islamabad Talks, West Asia Crisis

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరుగుతాయని భావిస్తున్న రెండవ దఫా అమెరికా-ఇరాన్‌ చర్చలు నిరవధికంగా వాయిదా పడినట్లు వార్తలు. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ వినతి మేరకు కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు మంగళవారం నాడు ట్రంప్‌ ప్రకటించాడు. అయితే తమ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. నిర్ణీత వ్యవధిని పేర్కొనలేదు గనుక నిరవధికం అనుకుంటున్నారు. మాటమార్చి మరోసారి ఏ చెబుతాడో తెలియదు. చర్చలంటూనే వివిధ దేశాల్లో ఉన్న 14 మంది ఇరానియన్లు, సంస్థలపై కొత్తగా ఆంక్షలను ప్రకటించాడు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో ఇరాన్ను దారికి తేవాలని చూస్తే కుదిరేది కాదని చెప్పవచ్చు. ఇస్లామాబాద్‌ ప్రయాణ సన్నాహాలు చేసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వాయిదా వేసుకున్నాడు.బుధవారం నాడు చర్చలు జరుగుతాయనే అంచనాతోనే వేలాది మంది సిబ్బందితో పాక్‌ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. తమ మెడమీద కత్తి పెట్టి చర్చలంటే కుదిరేది కాదని టెహరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా గొంతెమ్మ కోరికలను ముందుకు తెస్తోందని, ఇలాంటి స్థితిలో చర్చలంటే సమయం వృధాతప్ప మరొకటి కాదంటూ చర్చలుకు వచ్చేది లేదని చెప్పకనే చెప్పింది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో అమెరికా దిగ్బంధనం ముగిసేవరకు మాటల్లేవని అన్నది. కాల్పుల విరమణ పొడిగింపు గురించి గురువారం ఉదయం వరకు ఇరాన్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ పేరుతో అమెరికా బలగాలను కూడగట్టుకుంటున్నదని గతంలోనే అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి మిలిటరీకి అనుకూలంగా టెహరాన్‌లో జనం వీధుల్లోకి వచ్చారు, ఈ సందర్భంగా ఒక ఆధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగ వాహనాన్ని ప్రదర్శించారు. ఇరాన్‌ వద్ద దాడులకు ఉపయోగించే డ్రోన్లు, క్షిపణులు ఇప్పటికీ వేలాదిగా ఉన్నాయని అమెరికా రక్షణశాఖ గూఢచార నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.మరోవైపు ప్రత్యర్ధుల క్షిపణులను కూల్చివేసే అమెరికా పేట్రియాట్‌ వ్యవస్థలు సగం ఖర్చయినట్లు చెబుతున్నారు.

మంగళవారం రాత్రి వరకు జరిగిన పరిణామాలను ఒకసారి నెమరు వేసుకుందాం. గడువు ముగిసేలోగా తాము చెప్పినట్లు ఒప్పందం జరగకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్‌ మరోమారు బెదిరించాడు.తాను విజయం సాధించినట్లు కూడా చెప్పుకున్నాడు.గడువు పొడిగించేది లేదన్నాడు.తాము ఇప్పటికే 27 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ చెప్పుకుంది.దీని వలన ఇరాన్‌ రోజుకు 50కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నదని ట్రంప్‌ చెప్పాడు.ఉభయ దేశాలూ కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు అమెరికన్‌ మిలిటరీ సెంట్రల్‌ కమాండ్‌ మాజీ అధిపతి డేవిడ్‌ పెట్రాస్‌ చెప్పాడు. ఒప్పందం కుదిరేట్లయితే స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే వచ్చి సంతకాలు చేస్తాడని లేదా వీడియో సమావేశంలో పాల్గ్గొంటారని మరోవైపు రాయిటర్స్‌ పేర్కొన్నది.ఉభయ పక్షాలు తమ తమ ఎత్తుగడలతో కొనసాగుతున్నాయి. ఆదివారం తమ నౌకను దిగ్బంధించటం ఓడదొంగల దుశ్చర్య వంటిదేనని ఇరాన్‌ పేర్కొన్నది.ఆ నౌకలో క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు చైనా నుంచి వచ్చాయని మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ పార్లమెంటు సభ్యురాలు నికీ హేలీ ఆరోపించారు.నిజమే నిజమే చాలా ప్రమాదకరంగా చైనా వ్యవహరిస్తోందంటూ అమెరికా అనుకూల మీడియా వ్యాఖ్యాతలు భజన ప్రారంభించారు. ఆ కంటెయినర్‌ నౌకతో తమకు సంబంధం లేదని అతిశయోక్తులు ప్రచారం చేస్తున్నారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఖండించాడు.ఒక వైపు అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండగానే ఇరాన్‌ నౌక ఒకటి హార్ముజ్‌ జలసంధి నుంచి ఓమన్‌ గల్ఫ్‌ వైపు ప్రయాణించినట్లు వార్తలు, మరో రెండు నౌకలు కూడా దాటినట్లు చెబుతున్నా, అవి ఏ దేశానివో స్పష్టం కాలేదు.

పశ్చిమాసియా సంక్షోభం బుధవారం నాటికి 54వ రోజులో ప్రవేశించింది. నాలుగు నుంచి ఆరువారాల్లో ఇరాన్ను నాశనం చేసి తమ లక్ష్యాలను సాధిస్తానని ప్రగల్భాలు పలికిన డోనాల్డ్‌ట్రంప్‌ పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అన్నట్లుగా ఉందంటే అతిశయోక్తి కాదు.శుద్ది చేసిన యురేనియం బాంబుల తయారీకి దగ్గరలో ఉందని ఒకసారి చెబుతారు.దాన్ని తమకు స్వాధీనం చేయాల్సిందే అంటారు. గతేడాది తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌ అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇప్పుడు వాటి నుంచి యురేనియాన్ని సేకరించటం చాలా కష్టం, దీర్ఘకాలం పడుతుందని సోమవారం నాడు ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ఇంతకు ముందు చైనా నుంచి భారీ విమానాల్లో ఆయుధాలు దిగాయని చీకట్లో బాణాలు వేసినట్లు ప్రచారం చేశారు.దానికి ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇప్పుడు క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు పంపుతున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు.నిజం ఏమిటి ? అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకలో ఏమున్నాయో తెలియదు. అమెరికన్లు చెప్పిన ప్రతిమాటను నమ్మాల్సిన అవసరం లేదు. అయితే బీజింగ్‌ నుంచి టెహరాన్‌కు రసాయనాలు పంపటం కొత్త కాదు, రహస్యమూ కాదు.మనతో సహా అనేక దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి,మనమూ కొన్ని రసాయనాలను ఎగుమతి చేస్తున్నాము. వాటిని దేనికి వినియోగించుకోవాలనే షరతులేమీ దిగుమతి చేసుకొనే దేశాలకు ఉండవు.ఉదాహరణకు అమెరికా కంపెనీలు చిప్స్‌ను ఎగుమతి చేస్తున్నాయి. వాటిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించవచ్చు, ఆయుధాల తయారీలో చొప్పించవచ్చు.చైనా సరఫరా చేస్తున్నదని చెబుతున్న రసాయనాలు కూడా అలాంటివే.ఉదాహరణకు చైనా నుంచి అమెరికాకు నచ్చని లేదా వ్యతిరేకించే దేశం చాకులను దిగుమతి చేసుకుంటే తమను పొడవటానికే అని నికీ హేలీ వంటి వారు గుండెలు బాదుకుంటారు. ఇదంతా అమెరికా ఆడించే నాటకంలో భాగం తప్ప మరొకటి కాదు.

తన నౌక ఎంవి టౌస్కాను ఓమన్‌ జలసంధిలో దిగ్బంధించిన తరువాత ఆ ఉదంతాన్ని విస్మరించి ఇరాన్‌ చర్చలకు వస్తుందని ఎవరూ భావించరు. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించే పరిస్థితి ఉండదు. అందుకే చర్చల తలుపులను పూర్తిగా మూసివేయకుండా ఎటూ తేల్చకుండా పరిణామాలను గమనిస్తున్నది. ఒప్పందం కుదిరితేనే ఇరాన్‌ నౌకలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తానంటూ ట్రంప్‌ పదే పదే ప్రకటనలు చేస్తున్నాడు. ఉభయదేశాలూ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయానికి ముగియనుండగా పొడిగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అమెరికా స్వాధీనంలో ఉన్న నౌక గత ఆరువారాల్లో రెండు సార్లు ఇరాన్‌-చైనాల మధ్య రాకపోకలు సాగించినట్లు చెబుతున్నారు. అయితే నౌకల తీరుతెన్నులను గమనించినపుడు ఒక దేశ రేవు నుంచి బయలు దేరిన అక్కడ నింపిన సరకులను మధ్యలో దించి మరోనౌక నుంచి తెచ్చిన వాటిని రవాణా చేయటం సాధారణంగా జరిగేదే. సదరు వస్తువులపై వేరే దేశాల తయారీ అనే స్టిక్కర్లు కూడా వేస్తారు. అసలు ఎక్కడ తయారైందనే ఆనవాలు లేకుండా లేదా మరోదేశ తయారీ అని ముద్రలు వేస్తారు. ఇరాన్‌ నౌకను ఒమన్‌ జలసంధిలో అమెరికా యుద్ద నౌక నుంచి ఆరుగంటలపాటు చేసిన హెచ్చరికలను నౌకా సిబ్బంది ఖాతరు చేయలేదు, ఇరాన్‌వైపు నడిపేందుకు చూశారు. దాంతో అమెరికా నౌకాదళం కాల్పులు జరిపి ఇంజన్‌ గది నుంచి సిబ్బంది బయటకు రావాలని హెచ్చరించింది. సిబ్బంది ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడకపోవటంతో నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఒకవేళ అమెరికా గనుక తిరిగి దాడులకు పాల్పడితే తమ దగ్గర ఉన్న కొత్త అస్త్రాలను బయటకు తీస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.

అమెరికా అనుసరించిన వైఖరితో హార్ముజ్‌ జలసంధి మీద ఇరాన్‌ పట్టుబిగిసిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నటికీ అణ్వాయుధాలను తయారు చేయకుండా చూడటమే తన లక్ష్యం అన్న ట్రంప్‌ గడచిన 54 రోజుల్లో రోజుకో కొత్త లక్ష్యాన్ని ప్రకటిస్తుండగా టెహరాన్‌ మొదటి నుంచి చెబుతున్నదానికే కట్టుబడి ఉంది.జలసంధి మీద ఇరాన్‌ అదుపు కలిగి ఉన్నప్పటికీ గతంలో దాన్ని ఒక ఆయుధంగా చేసుకోలేదు. అదే మాదిరి ఇప్పుడు కూడా ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్‌ వేసుకున్న అంచనాలు తప్పాయి.దాన్నే కాదు, ఎమెన్‌ జలసంధిని కూడా అవసరమైతే మూసివేయిస్తామని ఇరాన్‌ నేతలు ప్రకటించారు.అదే జరిగితే సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం ద్వారా హిందూమహా సముద్రంలోకి ప్రవేశించే రవాణా కూడా నిలిచిపోవటం అనివార్యం. ఇరాన్‌ వైఖరిని చూస్తుంటే రానున్న రోజుల్లో హార్ముజ్‌ను తన అదుపులో ఉంచుకొనేందుకు పూనుకున్నదని చెప్పవచ్చు.పట్టుసాధించటమేగాక అమెరికా దాడులతో తమకు కలిగిన నష్టాలను పూడ్చుకొనేందుకు ఆ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి సుంకం వసూలు చేసి పునరుద్దరణకు వినియోగిస్తామని కూడా ప్రకటించింది.పీపాకు ఒక డాలర్‌ వంతున పన్ను విధిస్తే ఒక్కో టాంకర్‌ ద్వారా ఇరవైలక్షల డాలర్ల రాబడి వస్తుంది.సాధారణ సమయంలో రోజుకు 120 నుంచి 150 నౌకలు ఆ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రపంచ వ్యాపితంగా వందల కోట్ల మంది జనాలను ఇబ్బందుల పాలు చేయటం తప్ప ఇంతవరకు అమెరికా సాధించిందేమీ లేదు.గతంలో అన్ని దుర్మార్గాల్లోనూ పాలుపంచుకున్న ఐరోపా మిత్రదేశాలు ఈసారి ముఖం చాటేశాయి.ఇరాన్‌ దాడులతో తాము కూడా నష్టపోతున్నప్పటికీ ప్రత్యక్ష పోరుకు దిగేందుకు గల్ఫ్‌ దేశాలు ఇప్పటి వరకు నిరాకరించాయి. రానున్న రోజుల్లో అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తే గల్ఫ్‌ దేశాలను కూడా ఎలా దెబ్బతీయగలదో ఇరాన్‌ నిరూపించింది.అది మరింత దూరం ప్రయాణించి దాడి చేసే క్షిపణులను రూపొందిస్తున్నది.ఈ రీత్యా కూడా పశ్చిమాసియాలో ఇరాన్‌ పట్టు పెరగనుంది.

పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తరువాత చైనా గురించి కూడా చర్చ జరుగుతున్నది.పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదంటూ ఆరోపణలు, ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు.అసలు కారకులైన అమెరికా, ఇజ్రాయెల్‌ను వదలి బీజింగ్‌పై కేంద్రీకరించటం ఒక ఎత్తుగడలో భాగమే. తన ఇంథన భద్రతా చర్యల్లో భాగంగా ఇరాన్‌, గల్ఫ్‌ దేశాలతో సఖ్యతతో ఉండటమే గాక పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతోంది.ఇరాన్‌-సౌదీ మధ్య ఉన్న దీర్ఘకాలిక విబేధాలను మధ్యవర్తిత్వంతో పరిష్కరించింది.అనేక దేశాలకు భరోసా ఇస్తున్నది. అమెరికా దుశ్చర్యలను ఖండిస్తున్నది తప్ప ఇరాన్‌ మీద పెద్దగా వత్తిడి తేవటం లేదు, భద్రతా మండలిలో దానికి అనుకూలంగా రష్యాతో కలసి వీటోను కూడా ప్రయోగించి రక్షించింది. తన ఇంథన భద్రతలో భాగం ఒకటో, రెండో దేశాలపై ఆధారపడటంలేదు. అమెరికా కుట్రలను ముందుగానే గ్రహించిన కారణంగా కొన్ని నెలల పాటు సరఫరా ఆగినా తట్టుకొనేందుకు అవసరమైన నిల్వలను చేసుకున్నది.ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత స్వల్పంగా చమురు ధరలను పెంచిన చైనా తాజాగా అంతకంటే ఎక్కువగా తగ్గించింది. మరోవైపు గల్ఫ్‌ దేశాలతో వాణిజ్య సంబంధాలను గణనీయంగా పెంచుకుంది. ఆ ప్రాంత దేశాలతో 2024లో 257 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను నిర్వహించింది. ఈ మొత్తం పశ్చిమదేశాలతో సాగించిన మొత్తం వాణిజ్యం కంటే ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా ఇరాన్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న తీరును చూసిన తరువాత పేద, వర్ధమాన దేశాల్లో చైనా పలుకుబడి పెరగటం, అమెరికా ప్రభావం తగ్గటం అనివార్యం !బ్‌ ూ్‌శీషసర

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత పరువు తీస్తున్నదెవరు : ఇప్పటికైనా ఆత్మగౌరవాన్ని మోడీ పునరుద్దరిస్తారా ? అసెంబ్లీ ఎన్నికల తరువాత రోజుకు రు.2,400 కోట్ల వడ్డింపు !

03 Friday Apr 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, BJP, Donald trump, Fuel Price in India, Iran Oil, Narendra Modi Failures, RSS, Russian oil

ఎం కోటేశ్వరరావు

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది ఒక లోకోక్తి. తనకు ఎదురులేదన్నట్లుగా నల్లేరు మీద బండిలా నడుస్తున్న నరేంద్రమోడీ పరిస్థితి అలాగే ఉందా ? కాలవైపరీత్యం గాకపోతే పొగిడిన మీడియా నోళ్లే అపహాస్యపు శీర్షికలు పెడతాయని ఎవరైనా ఊహించారా ! తాజాగా ఒక వార్త శీర్షిక ఇలా ఉంది. ” ఇరాన్‌ యుద్ధ పరిహాసం : ఏడు సంవత్సరాల్లో తొలిసారిగా టెహరాన్‌ నుంచి చమురు తెచ్చుకోనున్న భారత్‌ ”. ఆంగ్లలో ఐరనీ అనే పదానికి పరిహాసం, ఎగతాళి, గేలి ఇలా పర్యాయపదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇలాంటి శీర్షిక పెట్టటానికి కారకులు ఎవరు ? కచ్చితంగా నరేంద్రమోడీ తప్ప మరొకరు కాదు. అమెరికాను పక్కన పెట్టి హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు ఐరోపాలోని ధనిక దేశాలు ప్రారంభించిన ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌ కోరిక మేరకు 60దేశాల జాబితాలో మనం కూడా చేరాము. ఇది డోనాల్డ్‌ ట్రంప్‌కు కోపం తెప్పిస్తుందో ఏం పాడో, లేకపోతే ”అనుమతి” ఇచ్చాడా, ఏదైనా జరిగి ఉండవచ్చు, ఇంకా ఇలాంటి వాటిని ఎన్ని చూడాల్సి వస్తుందో ! ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత జరిగిన పరిణామాలను కాషాయదళాలు మింగా కక్కలేకుండా ఉన్నాయి. కడుపులో ఉన్న ఇరాన్‌ వ్యతిరేకతను వెల్లడించలేరు, ఇజ్రాయెల్‌, అమెరికా అనుకూలతను దాచుకోలేని ఒక మానసిక స్థితి,దీనికి చికిత్స లేదు.

ఒక నాడు మన దిగుమతుల్లో ఇరాన్‌ చమురు అగ్రభాగాన ఉంది. అలాంటిది 2019 నుంచి కొనుగోలు నిలిపివేశాము.మనకు ఎక్కడ లబ్ది ఉంటే అక్కడ కొనుక్కుంటాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో పోల్చితే ఇరాన్‌ చమురు ధర పెరిగిందనా, నాణ్యత పడిపోయిందనా ? ఎందుకు నిలిపివేసినట్లు, తిరిగి ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు ? జవాబుదారీ తనంలో ” ఘనత ” వహించిన పెద్దలు నోరు, మెదపరు, ఎందుకంటే దేశం కోసం-ధర్మం కోసం మౌనంగా ఉన్నాం అంటారు. ఏం జరిగినా నోర్మూసుకొని ఉండాలని ఏ సనాతన ధర్మం, ఏ పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. పాండవులకు అన్యాయం జరిగితే శ్రీకృష్ణుడి రాయబారం, సీతను తిరిగి తనవద్దకు పంపి యుద్ధాన్ని నివారించాలని వాలి కుమారుడు అంగదుడిని శాంతి సందేశంతో రావణుడి వద్దకు పంపిన రాముడు (ఇప్పుడు ఇరాన్‌ యుద్దంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తామన్న పాకిస్తాన్ను బ్రోకర్‌ అని చౌకబారుగా వర్ణించిన పెద్దలు ఇతిహాసాల్లో జరిగిందాన్ని కూడా అలాగే అంటారేమో ఖర్మ) గురించి చదువుకున్నాం.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు మనలను ఎవరూ నమ్మని కారణంగా ఎవరూ పిలవటం లేదు, పెద్దరికం వహించాలని కోరటం లేదు గనుక దళారీ అని కసి తీర్చుకున్నాం. ఇప్పుడు మరి 60దేశాల చొరవలో మన పాత్రను ఎలా వర్ణిస్తారో తెలియదు.

డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తే మనం మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అమెరికాను ”సంతుష్టీకరించేందుకు ” ప్రయత్నించాం. ఇప్పుడు అదే అమెరికా కావాలంటే ఇరాన్‌ చమురు కొనుక్కోవచ్చు అని చెప్పగానే ఉరుకులు పరుగులతో ఎగబడ్డాం.రెండూ మోడీ ఏలుబడిలోనే జరిగాయి.ఎంత ఆత్మగౌరవం ! ఇరాన్‌ నుంచి పింగ్‌ షన్‌ అనే చమురు టాంకరు ఆరులక్షల పీపాల చమురుతో బయలుదేరి గుజరాత్‌లోని వాడినర్‌ రేవుకు చేరనుందని వార్తలు.మన తీరుతెన్నులు చూస్తున్న ఇరాన్‌, ఇతర దేశాల దగ్గర మన గౌరవం పెరిగిందా తరిగినట్లా ? రష్యా చమురు సంగతి కూడా అంతే అనుకోండి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకోలేదా అని అడ్డు సవాళ్లు విసిరే వారు టెహరాన్‌ నుంచి ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. మతకోణం ఉందంటే ఉలిక్కిపడతారా ? అమెరికా ఆడించినట్లు ఆడి 145 కోట్ల దేశం పరువు ఎవరు తీశారు ? ఇరాన్‌ విషయంలో అమెరికా తన లక్ష్యాలను గుట్టుచప్పుడు కాకుండా మార్చుకుంది, హార్ముజ్‌ జలసంధి నుంచి మీ చమురు మీరు తెచ్చుకోండి మేం చేసేదేమీ లేదని చేతులెత్తేశాడు ట్రంప్‌. మనం మాత్రం అతగాడి తోకపట్టుకు నడిచి ఇప్పుడు వ్రతం చెడ్దా ఫలం దక్కని స్థితిలో పడ్డాం.ఏం గతంలో వద్దన్నారుగా ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని ఇరాన్‌ అనలేదు గనుక సరిపోయిందిగాని, అని ఉంటే ? అమెరికా మబ్బులను చూసి చేతిలోని ముంతలో నీరు పారపోసుకోకూడదని గ్రహిస్తారా ! అమెరికా మీద వ్యతిరేకతతో ఎత్తుగడగా భారత్‌ పట్ల ఇరాన్‌ అనుకూలంగా వ్యవహరించిందని, పోరు ముగిసిన తరువాత కూడా అదే విధంగా ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నాలుగవ తేదీన గుజరాత్‌ వాడినార్‌ రేవుకు చేరనుందని చెప్పిన ఇరాన్‌ నౌక మూడు రోజులుగా ప్రయాణ దిశ మార్చుకొని చైనా వైపు పయనిస్తున్నదని శుక్రవారం నాడు నౌకల కదలికలను నమోదు చేసే కెప్లర్‌ సంస్థ పేర్కొన్నది. అయితే వాణిజ్య నౌకలు ఎప్పుడు దిశమార్చుకుంటాయో తెలియదని నౌకనుంచి అందుతున్న సంకేతాలను బట్టి చివరకు అది ఎక్కడకు చేరేది చెప్పలేమని కూడా తెలిపింది. ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నకు రిటోలియా అనే సంస్థ చెప్పినదాని ప్రకారం గతంలో 30 నుంచి 60 రోజుల వరకు చెల్లింపులకు గడువు ఇచ్చేవారని, ఆ చమురును అమ్మింది ఎవరో, కొనుగోలు చేసింది ఎవరో కూడా వెల్లడి కాలేదని, ఇప్పుడు ఆ షరతులను కఠినతరం గావించటం కారణం కావచ్చంటున్నారు. చెల్లింపుల సమస్య పరిష్కారమైతే తిరిగి భారత్‌ వైపు ప్రయాణించవచ్చని కూడా రిటోలియా పేర్కొన్నది.వాడినార్‌లో రష్యా కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు చెందిన నయారాఎనర్జీ సంస్థ ఏడాదికి రెండు కోట్ల టన్నుల సామర్ధ్యం గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది.

తన రాజకీయ ప్రయోజనం, ఆధిపత్యం, ఇరాన్‌ చమురును కొల్లగొట్టేందుకు, ఇజ్రాయెల్‌ కోసం చేసే రాజకీయాల్లో భాగంగా టెహరాన్‌పై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసే వారి తాటవలుస్తామని ట్రంప్‌ బెదిరించాడు.చైనా మరికొన్ని దేశాలు ఖాతరు చేయకుండా దిగుమతులు చేసుకున్నాయి. అంతకు ముందు 2018-19లో మన దిగుమతి అవసరాల్లో 10-12శాతం అంటే 23-24 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. ట్రంప్‌ 2019లో ఆంక్షలు విధించటంతో ఆ ఏడాది మే నెల నుంచి క్రమంగా తగ్గించి 2019-20లో రెండు మిలియన్‌ టన్నులకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిలిపివేశాం. అంతకు ముందు మనదేశానికి రాయితీలతో పాటు అప్పుకూడా ఇచ్చింది. వాటినే నరేంద్రమోడీ యుపిఏ ప్రభుత్వం చేసిన చమురు అప్పును తాను తీర్చాల్సి వచ్చిందని ప్రచారం చేయటమే గాక ఆ పేరుతో సెస్సులు, ఇతర భారాలను మోపిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తరువాత రష్యా నుంచి కొనుగోలు చేశాము, దాని మీద కూడా ఆంక్షలు విధించటంతో గరిష్టంగా రోజుకు 20లక్షల పీపాల దిగుమతిని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సగానికి తగ్గించుకున్నాం. ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ట్రంప్‌ రష్యా , ఇరాన్‌ నుంచి చమురు తెచ్చుకోవచ్చు అంటూ మనకు ”అనుమతి” ఇచ్చాడు. ఇప్పుడు గతంలో ఇచ్చిన రాయితీని మనం కోల్పోయాము, మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఎందుకీ దుస్థితి ?

యుద్దం కారణంగా ఇప్పటికే జనం మీద భారాలు మోపటం ప్రారంభించారు,పవర్‌ పెట్రోల్‌, పరిశ్రమల్లో వాడే డీజిల్‌, ఇథనాల్‌ లేని పెట్రోలు, గృహ, వాణిజ్య గ్యాస్‌ ధరలను పెంచారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇప్పటికి ఇప్పుడు ఇరాన్‌ పోరు ముగిసినప్పటికీ ఇంథన ధరలు తగ్గే అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ హెచ్చరించింది. బ్రెంట్‌ రకం చమురు పీపా ధర 70 నుంచి 120 డాలర్ల వరకు పెరిగింది.మనం కొనుగోలు చేసే ముడి చమురు కూడా ఇదేవిధంగా పెరిగింది. సంక్షోభం ముగిసిన తరువాత పూర్వపు స్థితికి ధరలు దిగివస్తాయా ? జనం మీద భారం మోపటం లేదంటూనే మానసికంగా సిద్దం చేస్తున్నారు. చమురు మార్కెట్‌ కంపెనీలకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఎక్సయిజ్‌ పన్ను రద్దు చేశామని చెప్పారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) ద్వారా మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు వారాల్లో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 75శాతం పెరిగాయని తెలిపారు. అయినా కొనుగోలు ధరలకంటే తక్కువకే కంపెనీలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయని, పెట్రోలు మీద లీటరుకు రు.26, డీజిలు మీద 81.90 నష్టం వస్తున్నదని, రెండూ కలిపితే రోజుకు రు.2,400 కోట్ల మేర వాటికి నష్టం వస్తున్నదని పేర్కొన్నారు. ఆసియాలో 30 నుంచి 50, ఉత్తర అమెరికాలో 20, ఐరోపాలో 30శాతం ఇంథన ధరలు పెరిగినట్లు పెట్రోలియం శాఖా మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి భారీగా ధరలు పెంచటం రెండవది నష్టాలను ప్రభుత్వం భరించటం అంటూ రెండోదానికే ప్రధాని నిర్ణయించినట్లు చెప్పారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గ్యాస్‌ మీద నామమాత్ర సబ్సిడీ తప్ప పెట్రోలు, డీజిలు మీద సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు. సెస్సుల పేరుతో లక్షల కోట్ల భారం మోపారు. 2022కు ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆమేరకు పెంపు తగ్గితే తగ్గింపు అన్న విధానాన్ని అమలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా వినియోగదారులకు తగ్గించలేదు.ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికల తరువాత అసలు రంగు బయటపడుతుంది.ప్రతి రోజుకు వస్తున్న రు.2,400 కోట్లను ప్రభుత్వం భరించాలంటే నెలకు 72వేల కోట్లు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరిగాయని దిగుమతులు నిలిపివేసి రైతులను ఇబ్బంది పెట్టిన పాలకులను ఎవరైనా నమ్ముతారా ? గత పది సంవత్సరాల్లో దాదాపు 25లక్షల కోట్ల రూపాయలను అదనపు ఎక్సయిజ్‌, సెస్సుల రూపంలో వినియోగదారుల నుంచి పిండుకున్న ఘనత మరచిపోగలమా ?

రానున్న రోజుల్లో ముడిచమురు ధరల గురించి రాయిటర్స్‌ మార్చినెలలో జరిపిన విశ్లేషణలో 2026లో బ్రెంట్‌ రకం ముడి చమురు సగటున 82.85 డాలర్లు ఉంటుదని పేర్కొన్నారు.ఫిబ్రవరిలో చెప్పిన 63.85 డాలర్లకంటే ఇది 30శాతం ఎక్కువ. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున ఈ అంచనాలు మారిపోవచ్చు.ఏప్రిల్‌ 11వరకు రష్యా చమురు కొనుగోలుకు ట్రంప్‌ ” అనుమతి ” గడువు ఉంది.తరువాత ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో తెలియదు. మార్కెట్‌ చరిత్రను చూస్తే 2008లో ముడి చమురు ధర గరిష్టంగా 145 డాలర్లకు చేరింది.ఇరాన్‌ పోరు ఇంకా కొనసాగితే ఆ రికార్డును అధిగమించవచ్చని జోస్యం చెబుతున్నారు.సంక్షోభం మే మొదటి పక్షం వరకు కొనసాగితే 150 డాలర్లకు చేరవచ్చని జెపి మోర్గాన్స్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ మూడవ తేదీన పేర్కొన్నది.(మరికొన్ని సంస్థలు రెండువందల డాలర్లు అన్నాయి) అంతకు ముందు రోజు బ్రెంట్‌ రకం ధర 109 డాలర్లు ఉండగా సమీప భవిష్యత్‌లో 120-130 డాలర్ల మధ్య ఉండవచ్చని మోర్గాన్స్‌ అంచనా వేసింది. ఎలాంటి షరతులు లేకుండా హార్ముజ్‌ జలసంధిని ఒక వేళ ఈ రోజు తెరిచినా సరఫరా వ్యవస్థ పునరుద్దరణకు మూడు నుంచి ఆరునెలలు పడుతుందని చమురు రంగ నిపుణులు అంటున్నారు.దాడుల్లో జరిగిన నష్టాల తీవ్రత వెల్లడైన తరువాత మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే అంతా అనిశ్చితే, అస్పష్టతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !

18 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Hormuz mission, Narendra Modi Failures, NATO allies, Netanyahu, US attack Iran, Vladimir Putin

ఎం. కోటేశ్వరరావు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ ప్రారంభించిన దాడులు మంగళవారం నాడు పద్దెనిమిదవ రోజులో ప్రవేశించాయి. వాటికి దీటుగా టెహ్రాన్‌ కూడా ప్రతి దాడులతో బెంబేలెత్తిస్తున్నది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నౌకలకు రక్షణ కల్పించాలన్న ట్రంప్‌ కోరికను ఏ ఒక్క మిత్ర దేశం కూడా అంగీకరించలేదు. ఇది తమ యుద్ధం కాదని బయటకు చెప్పకుండానే ముఖం చాటేస్తుండటంతో ట్రంప్‌కు దిక్కుతోచక పిచ్చి ప్రేలాపనలకు దిగాడు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచీ కొంత మంది అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ పక్షాన చైనా, రష్యా ఎందుకు దాడుల్లో పాల్గ్గొనటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమతో కలసి దాడులకు పూనుకోవటంలేదని డోనాల్డ్‌ ట్రంప్‌ తన మిత్ర దేశాల మీద తిట్ల పురాణం ప్రారంభించాడు. చివరికి చైనా గనుక హార్ముజ్‌ జలసంధికి యుద్ధ నౌకలను పంపి ఇరాన్‌ను కట్టడి చేయకపోతే ఈ నెలాఖరులో బీజింగ్‌ పర్యటనను వాయిదా వేసుకుంటానని చైనాను కూడా బెదిరించాడు. మాకేం తొందరలేదు, వస్తే రా, లేకపోతే లేదు నీ ఇష్టం అన్నట్లుగా చైనా ఉంది. నాటోలో ఉన్న దేశాలే కాదు, ఇరాన్‌ దాడులకు గురవుతున్న గల్ఫ్‌ దేశాలు కూడా యుద్ధంలో దిగేందుకు అంగీకరించటం లేదు.

ఇరాన్‌పై దాడులు ఎప్పుడు ముగుస్తాయన్నది మరొక ప్రశ్న. ప్రారంభించిన అమెరికాకే దిక్కు తోచటం లేదు. ఇరాన్‌ వైపు నుంచి ఇలాంటి ప్రతిఘటన ఉంటుందని తనకెవరూ చెప్పలేదని, నెపాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా సలహాదారులు, నిఘా యంత్రాంగం మీద నెట్టేందుకు పూనుకున్నాడు. అయితే అలాంటిదేం లేదు, ముందుగానే ట్రంప్‌కు హెచ్చరికలు అందాయని వార్తలు. ఒకవైపు ఇరాన్‌లో వేలాది కేంద్రాలపై దాడులు చేశామని, దాని మిలిటరీ నడ్డి విరిచామని రోజూ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతుంటాడు. అదే నిజమైతే జరుగుతున్న క్షిపణి దాడుల సంగతేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. మొత్తంగా నాశనం చేశావని ఎలాగూ చెప్పావు కదా. ఇంక చేయాల్సిందేమీ లేదని గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించవచ్చు కదా అని ట్రంప్‌ మిత్రుడే బహిరంగంగా చెప్పిన తరువాత కూడా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎవరికైనా మదం తలకెక్కినపుడు హితవచనాలు రుచించవు. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గ్గొనే ఉద్దేశం తమకు లేదని జర్మనీ పేర్కొన్నది. హార్ముజ్‌ జలసంధిలో నౌకల రక్షణకు మిలటరీని పంపాలనే కోరిక తమకు లేదని స్పష్టం చేసింది. ఆసియాలో అమెరికా అనుయాయి దేశం దక్షిణ కొరియా, అక్కడ అమెరికాకు తొమ్మిది మిలిటరీ కేంద్రాలు, వాటిలో అన్ని దళాలకు చెందిన 25 వేల మంది సైనికులు ఉన్నారు. తాము కూడా హార్ముజ్‌కు నౌకాదళాన్ని పంపటం లేదని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. తమ దేశంలో నిల్వ ఉంచిన ఆయుధాలను పశ్చిమాసియాకు తరలించారని, దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర కొరియా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధించనున్నట్లు చెప్పాడు. నౌకలను పంపే అంశం పరిశీలనలో లేదని జపాన్‌ ప్రధాని తకాయిచి పార్లమెంటులో చెప్పారు. ఆస్ట్రేలియా కూడా అదే బాటలో ఉంది. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రి కాజా కలాస్‌ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న చర్యలను మార్చాలనే కోరిక ఇప్పటికైతే తమకు లేదని చెప్పాడు. బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ కూడా తమ దేశం విస్తృత యుద్ధంలోకి రాదని అన్నాడు.

ఇలావుండగా…యుద్ధ లక్ష్యాల గురించి ట్రంప్‌ మాట మార్చాడు. తాము ముడి చమురు కోసం ఇరాన్‌ మీద దాడి చేయలేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. హార్ముజ్‌ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా తమ మిత్ర దేశాల కోసమే దాడి చేసినట్లు మాట మార్చాడు. అందుకుగాను ఆ ప్రాంతంలో రక్షణ కోసం చైనా, జపాన్‌ వంటి దేశాలు యుద్ధ నౌకలను పంపాలని అన్నాడు. తమకు చమురు అవసరం లేదని, కావాల్సిన దానికంటే రెండింతల ఎక్కువ ఉందని, మా మంచి మిత్రుల కోసమే దాడి చేశామని అన్నాడు. నిజానికి ఇతర దేశాలను రక్షించాలని తప్ప మా కోసం దాడులు చేయటం లేదన్నాడు. తమ మిత్ర దేశాలు ముఖ్యంగా నాటో దేశాల వైఖరి ఆశాభంగం కలిగించిందని ట్రంప్‌ చెప్పాడు. మేం మాత్రం వారికోసం ఎల్లవేళలా ఉండాలి, కాని వారు మాత్రం మాకోసం రారు అంటూ బి-2 స్పిరిట్‌ బాంబరు బొమ్మను చూపుతూ హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు మాకు ఎవరి అవసరమూ లేదని ఊగిపోయాడు. తమకు సహకరించకపోతే నాటోకు రానున్నది చెడు కాలమన్నాడు.

ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి గల్ఫ్‌, ఇతర దేశాలను యుద్ధంలోకి లాగాలని అమెరికా తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్‌ వైపు నుంచి క్షిపణుల వర్షం కురుస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా దాడులకు గల్ఫ్‌ దేశాలు పూనుకోలేదు. అమెరికాను నమ్మి నిజంగా తమ దళాలను రంగంలోకి దింపితే తలెత్తే పర్యవసానాల గురించి పైకి చెప్పుకోవటం లేదుగానీ అవి తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పొద్దున లేస్తే ఇరాన్‌తో ముఖాముఖాలు చూసుకోవాల్సింది తామని…ఈ రోజు అమెరికా ఉంటుంది, రేపు వెళ్లిపోతుంది. తాము శాశ్వతంగా బలమైన ఇరాన్‌తో వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తప్పనిసరై అమెరికా స్థావరాలు ఉన్న కారణంగా కొన్ని ఆయుధాలను గల్ఫ్‌ దేశాల మీద ప్రయోగించాల్సి వస్తోంది తప్ప తమ కేంద్రీకరణ అంతా ఇజ్రాయిల్‌ మీదనే అని తాజాగా ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా యుద్ధ స్థావరాలున్న గల్ఫ్‌ దేశాల మీద దాడి చేస్తే అవి అమెరికాకు వ్యతిరేకంగా వ్యహరించాలనే ఎత్తుగడ ఉందని బహిరంగంగానే చెబుతున్నారు.

తాజా పరిణామాల్లో మరో ముఖ్యాంశం ఏమంటే ఇరాన్‌పై అమెరికా దాడి రష్యాకు పెట్రో డాలర్లను కురిపిస్తోంది. ట్రంప్‌ అనుకున్నదొకటి అవుతున్నది ఒకటి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని అన్ని దేశాలకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. నరేంద్రమోడీ సైతం ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఏ మాత్రం పసిగట్టినా ట్రంప్‌ బెదిరించగానే రష్యా నుంచి చమురు కొనుగోలును సగానికి సగం తగ్గించి ఉండేవారు కాదు. ఇప్పుడు పరువూ పోయింది. రష్యా నుంచి వచ్చే రాయితీ కూడా లేదని చెబుతున్నారు. చమురుపై ఆంక్షలతో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ నాలుగేళ్లుగా కొంత ఇబ్బంది పడినప్పటికీ భారత్‌ చైనా కొనుగోళ్లతో నిలిచింది. ఇటీవల ట్రంప్‌ బెదిరించటంతో మన దేశం సగానికి కొనుగోళ్లను తగ్గించింది. హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో అనేక దేశాల నుంచి ఒత్తిడి పెరగటంతో రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ”అనుమతి” ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రోజుకు 15 కోట్ల డాలర్ల మేర పుతిన్‌ సర్కార్‌కు రాబడి వస్తోంది.
పన్నెండు రోజుల తరువాత బ్రిక్స్‌ కూటమి అధ్యక్ష స్థానం (భారత్‌)…ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఖండించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్‌ నేతలతో మాట్లాడారు. ఆ తరువాతే మన దేశానికి ఎల్‌పిజి ని తీసుకువచ్చే మూడు ట్యాంకర్లను సురక్షితంగా హార్ముజ్‌ జలసంధి నుంచి ఇరాన్‌ అనుమతించింది. మన దేశంపై వచ్చిన ఒత్తిడి, వంట గ్యాస్‌ సెగ తగిలిన తరువాతగాని మన నేతలకు తత్వం తలకెక్కలేదని చెప్పవచ్చు!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

04 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Ali Hosseini Khamenei, BJP, China, Donald trump, Narendra Modi Failures, Netanyahu, us and israel attack iran, Vladimir Putin, West Asia Crisis

ఎం. కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28న అడ్డగోలుగా అమెరికా, ఇజ్రాయిల్‌ మిలిటరీ దళాలు ఇరాన్‌పై దాడులను ప్రారంభించాయి. ఆ దేశ సుప్రీమ్‌ నేత అయతుల్లా అలీ ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సీనియర్‌ నేతలను అనేక మందిని హత్య చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా తనకున్న సత్తామేరకు ఆత్మరక్షణ ఎదురు దాడులు చేస్తోంది. అమెరికా దాడుల ఆంతర్యం గురించి మీడియాలో రోజూ వస్తున్న వార్తల పూర్వ రంగంలో మరోసారి చెప్పనవసరం లేదు. అనేక కోణాల గురించి చర్చ జరుగుతున్నది.
ఇక అంతా వారే చేశారంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ మాజీ అధ్యక్షులైన బరాక్‌ ఒబామా, జో బైడెన్ల మీద విరుచుకుపడ్డాడు. వారిద్దరూ నిద్రపోయిన కారణంగానే ఇరాన్‌ అణుముప్పు తలెత్తిందని ఆరోపించాడు. ఈ పెద్దమనిషి టెహ్రాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా తప్పుకొని చేసిందేమిటి? తాను గనుక వైదొలగకపోతే ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు ఈపాటికే ఇరాన్‌ అణుబాంబులను తయారు చేసి ఉండేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగల ఆయుధాలను రూపొందించు కోవటం తమ హక్కని, ఇతరులకు అది లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సుదూర ప్రాంతాల లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను మనం కూడా తయారు చేస్తున్నాం. ఏదో ఒక రోజు ఇరాన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ గాకపోతే మరొకడు మనకూ వర్తింపచేయడని గ్యారంటీ ఏముంది ?
ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తే వాటిని ఇజ్రాయిల్‌ మీద ప్రయోగిస్తుందన్నది ఒక ఆరోపణ. మరి ఇజ్రాయిల్‌ ఎవరి మీద ప్రయోగించేందుకు అణుబాంబులను తయారు చేసినట్లు? అణ్వాయుధాలను రూపొందించిన వారందరూ ఎవరో ఒకరి మీద ప్రయోగించేందుకు అన్న అమెరికా అడ్డగోలు వాదనలను మన దేశంలోని కొందరు సమర్ధిస్తుంటారు. మరి మనం ఎవరి మీద వేసేందుకు రెండుసార్లు అణుపరీక్ష జరిపినట్లు? ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ కూడా బాంబులను కలిగి ఉన్నాయి వాటి గురించి అమెరికా మాట్లాడదేం! అనేక సార్లు ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ తమ ఏజంట్లను ప్రయోగించి దాడులు చేశాయి. అనేక మంది శాస్త్రవేత్తలను చంపివేశాయి. కాస్పియన్‌ సముద్రంలో ఇరాన్‌ సహజ వాయువు పైప్‌లైన్లను 2024 ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌ ధ్వంసం చేసింది. ఏప్రిల్‌ నెలలో సిరియా రాజధాని డెమాస్కస్‌ లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం మీద దాడికి ప్రతిగా ఇరాన్‌ ఎదురు దాడి చేసింది తప్ప…తర ఏ సందర్భంలోనూ ముందుగా అది టెల్‌అవీవ్‌ మీద దాడులు చేయలేదు.
అమెరికా, ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే దేశాలు, సాయుధ బృందాలకు ఇరాన్‌ సాయం చేయటం సరైంది కాదు కదా! ఈ వాదన చేస్తున్న వారు ఐరాస నిర్దేశించిన పాలస్తీనా ప్రాంతాలను తీర్మానం చేసిన మరుసటి రోజు నుంచే ఇజ్రాయిల్‌ ఎందుకు ఆక్రమించుకొని పాలస్తీనియన్లను ఆ ప్రాంతాల నుంచి తరిమివేస్తున్నట్లు? దానికి పశ్చిమ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు? తమ మాతృభూమి కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇస్తున్నది ఇరాన్‌, అడ్డుకొనే దుర్మార్గానికి ఆసరా ఇస్తున్నవి అమెరికా, దాని మిత్ర దేశాలు. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని అవి మావే అని చెబుతున్న ఇజ్రాయిల్‌ దుండగాలను సమర్ధిస్తున్నవారు ఏదోఒక సాకుతో మరో దేశాన్ని ఆక్రమించరనే హామీ ఏముంది? కెనడాను తమ 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్‌ అంటే తప్పు పట్టిన అదే కెనడా నేడు అమెరికా దుండగానికి, పాలస్తీనా ఆక్రమణలో ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నది. పాలస్తీనా ప్రాంతాలు తమ రక్షణకు హామీగా కావాలని యూదు దురహంకారులు చెబుతున్నట్లే అమెరికా రక్షణకు గ్రీన్‌లాండ్‌ అవసరం అంటున్న అమెరికా చర్యను విమర్శించిన ఫ్రాన్సు, బ్రిటన్‌, జర్మనీ ఇప్పుడు ఇరాన్‌పై దాడిని సమర్ధిస్తున్నాయి. తమ స్థావరాలను వినియోగించుకొని మరింత మంది పసిపిల్లలను చంపమని, గాజాను నాశనం చేసిన మాదిరి ధ్వంసం చేయమని చెబుతున్నట్లు కాదా!
చరిత్రలో యూదులకు అన్యాయం జరిగిందని, ఇజ్రాయిల్‌ బాధిత దేశం అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యూదులు నీచులంటూ మధ్యయుగాల్లోనే పశ్చిమాసియా ప్రాంతం నుంచి మధ్యయుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో తరిమివేశారు. నాజీ మూకలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దేశాల్లో ఊచకోత కోశాయి. వారికి న్యాయం చేసే పేరుతో మాతృభూమిగా ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారన్నది ఒక వాస్తవం. అదే సమయంలో పాలస్తీనా కూడా అవతరించాలని ఐరాస చేసిన నిర్ణయం గడచిన ఎనిమిది దశాబ్దాలుగా అమల్లోకి రాకపోతే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు ఎందుకు ప్రశ్నించరు? వారికి మాతృభూమి లేకనే ఇరుగు పొరుగు దేశాల్లో తల దాచుకుంటున్నారు. తమ దేశ ఏర్పాటు కోసం సాయుధ పోరాట మార్గాన్ని కొందరు చేపట్టారు. అలాంటి సంస్థలలో ఒకటైన హమాస్‌ 2023 అక్టోబరు ఏడున దాడి చేసి 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా పట్టుకోవటాన్ని ప్రపంచంలో ఎవరూ సమర్ధించలేదు. కానీ ఆ పేరుతో గాజాలో 70 వేల మందిని ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని హమాస్‌ చర్యను ఒకే గాటన కట్టటం ఏ విధంగా సమర్ధనీయం? మన దేశం పాలస్తీనా ఏర్పాటును పూర్తిగా సమర్ధించింది. కానీ ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లి హమాస్‌ దురాగతాన్ని ఖండించారు తప్ప ఇజ్రాయిల్‌ మారణకాండ గురించి పల్లెత్తు మాట అనలేదు. మానవత్వం గురించి కబుర్లు చెబితే ఎలా! దాడులు ప్రారంభమైన తరువాత ఇజ్రాయిల్‌, ఇతర దేశాలతో మాట్లాడారు తప్ప ఇరాన్‌ నేతలకు మోడీ ఎందుకు ఫోన్‌ చేయలేదు! పోనీ ఇరాన్‌ మన శత్రు దేశమా? కాదే, అమెరికా బెదిరించేవరకు 2019కు ముందు చమురు దిగుమతి చేసుకన్నాంగా !
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు, అందువలన అతగాడు మరణిస్తే సంతాపం తెలపాల్సిన అవసరం లేదు, ఖండించాల్సిన పని కూడా లేదంటున్నారు. పోనీ కాసేపు నిజమే అనుకుందాం. వెనిజులా అధ్యక్షుడు మదురో మన వ్యవహారాల్లో వేలు పెట్టలేదుగా, చమురు సరఫరా చేశాడుగా, అతన్ని అమెరికా కిడ్నాప్‌ చేస్తే ఎందుకు ఖండించలేదో ఎవరైనా చెప్పగలరా? ఆర్టికల్‌ 370 రద్దును ఖమేనీ వ్యతిరేకించాడని అంటున్నారు. ఆ మాటకు వస్తే చైనా కూడా వ్యతిరేకించింది, అయినా సీ జిన్‌పింగ్‌తో మోడీ చెట్టపట్టాలు వేసుకోలేదా? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును పాక్‌ పాలిత ప్రాంతమని, మన అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్‌ను భారత పాలిత ప్రాంతంగా అమెరికా వర్ణించింది. అంటే కాశ్మీరు మనది అని చెప్పకపోయినప్పటికీ అమెరికాతో సన్నిహితంగా మసలుతున్నాం. ఖమేని మరణానికి సంతాపం తెలపాలా లేదా అన్నది ఒక సమస్య. కచ్చితంగా చెప్పాలని ఎవరూ అనటం లేదు, అయితే హత్యను, ఇరాన్‌ మీద దాడిని ఖండించాలా లేదా, ఎందుకు నోరువిప్పటం లేదు! కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇరాన్‌ మన మిత్ర దేశమే అని చెబుతున్నారు కదా? ఎందుకుని వారితో మాట్లాడలేదు! ఈ వైఖరి ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే మనం అమెరికా చంకనెక్కాం, దాని హత్యాకాండను సమర్ధించాం అని కాదా !
ఇరాన్‌కు కోపం ఉంటే అమెరికా, ఇజ్రాయిల్‌ మీద తీర్చుకోవాలిగానీ గల్ఫ్‌ దేశాల మీద దాడులు చేయటం ఏమిటన్నది మరొక అతి తెలివి వాదన. ఒక వేళ తమ మీద దాడి చేస్తే అమెరికా వైమానిక స్థావరాలు, నౌకల మీద విరుచుకుపడతామని పదే పదే ఇరాన్‌ ముందే ప్రకటించింది. అలాంటపుడు గల్ఫ్‌ దేశాలు తమ గడ్డ మీద ఉన్న స్థావరాల నుంచి అమెరికన్లను ఎందుకు ఖాళీ చేయించలేదు. స్థావరాలు ఎందుకు అంటే అమెరికా పెట్టుబడులు ఆ ప్రాంతంలో ఉన్నాయి గనుక వాటిని రక్షించుకొనేందుకని అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లుగా సమర్ధిస్తున్నారు. అమెరికా పెట్టుబడులు మన దేశంలో, చైనాలో కూడా ఉన్నాయి, మరి వాటి రక్షణకు మిలిటరీ స్థావరాలను నెలకొల్పలేదేం! మనకు పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రం లోని డిగోగార్షియా దీవుల్లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉంది. అక్కడ ఏం పెట్టుబడులు ఉన్నట్లు ? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్లుగా సాకులు చెబుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లోని స్థావరాలను ఉపయోగించుకొని అమెరికా ఇప్పుడు ఇరాన్‌ మీద దాడులు చేస్తున్నది. అందుకే వాటిని టెహ్రాన్‌ లక్ష్యంగా చేసుకుంది తప్ప ఆ దేశాల మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం అంటే ముందు హతమయ్యేది నిజం. అందువలన ఏ మాట, చర్య వెనుక ఏ ప్రయోజనం దాగుందో జనం తెలుసుకోవాలి!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !

28 Wednesday Jan 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, World Military Power, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

77వ రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన సైనిక బలగాల సత్తాను ప్రదర్శించారు. న్యూఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిపిన కవాతును చూసి దేశం యావత్‌ పులకించిపోయింది.ప్రతి దేశం రిపబ్లిక్‌ దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర ముఖ్య ఉదంతాలు ఉంటే ఆరోజున ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించి తమ శక్తి ఇదని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలు, విశ్లేషణల్లో అతిశయోక్తులు దార్లాయి.ఈ నేపధ్యంలో ప్రపంచ మిలిటరీ బలం బలగాల గురించి పరిమితంగా అయినా ఒక్కసారి అవలోకనం చేసుకోవటం అవసరం. హిందూ మహాసముద్రం భారతదేశానిదే అని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఒక దేశ సరిహద్దు నుంచి 12 నాటికల్‌ మైళ్ల(ఒక్కో నాటికల్‌ మైలు 1.852 కిలోమీటర్లకు సమానం) వరకు ఆయా దేశాలకు సర్వహక్కులు ఉంటాయి.పన్నెండు నుంచి 24 నాటికల్‌ మైల్స్‌ వరకు కస్టమ్స్‌, వలసలు,కాలుష్యాలకు సంబంధించిన చట్టాలు అమలు చేసే అధికారం ఉంటుంది.రెండువందల నాటికల్‌ మైల్స్‌ వరకు సముద్ర ఉత్పత్తులు,ఆ పరిధిలో ఉన్న ఖనిజవనరులను తవ్వితీసుకొనే హక్కు ఆయాదేశాలకు ఉంటుంది. ఆపైన ఉండే ప్రాంతం అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. శ్రీలంక-భారత్‌ మధ్య దూరం 288 కిలోమీటర్లు మాత్రమే ఉన్నందున సమదూరంతో సరిహద్దుల నిర్ణయం జరిగింది. నిజానికి హిందూమహాసముద్రం అంటే మనదేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. పొడవు 9,600, వెడల్పు 7,600 కిలోమీటర్లు ఉంది.మనదేశానికి ఇది మూడువైపుల ఉంది. దీనిలో అందరికీ తెలిసిన అరేబియా సముద్రం, బంగాళాఖాతం,మరికొన్ని ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.వీటన్నింటినీ కలిపి హిందూ మహాసముద్రం అంటున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం వరకు విస్తరించి ఉంది.

మనదేశం వద్ద 1,500 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ నౌకలను దెబ్బతీసే సామర్ధ్యం గల దీర్ఘశ్రేణి క్షిపణి (ఎల్‌ఆర్‌-ఎఎస్‌హెచ్‌ఎం)తో చైనా,అమెరికా నౌకలను కూడా దెబ్బతీయగలవని విశ్లేషకుడు చెప్పారు. అది నిజమే, ఎప్పుడు యుద్ధం వచ్చినపుడు, ఎదుటి వారు దాడికి దిగనంతవరకు మాత్రమే.హిందూమహాసముద్ర అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన ఏ దేశనౌకనైనా వెంటనే పేల్చివేయటానికి ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అలాంటి క్షిపణులను తయారు చేసే దేశంగా మనం ఇటీవలనే సామర్ధ్యం సంపాదించుకున్నాం.మనకంటే బలమైన మిలిటరీ శక్తి ఉన్న విషయాన్ని దాచి ప్రపంచంలో మనకు ఎదురులేదని ఎవరైనా చెపితే అది వాట్సాప్‌ పాండిత్యం తప్ప మరొకటి కాదు. వర్తమాన బలా బలాల గురించి ఈ సందర్భంగా చూద్దాం.మన దగ్గర ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయోగించగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 ఉంది. ఇతర దేశాలలో మినిట్‌మాన్‌- అమెరికా క్షిపణి 13,000 కిమీ, రష్యాలో ఆర్‌ఎస్‌- 28 శాటమాన్‌ క్షిపణి పదకొండువేల కి.మీ, చైనా వద్ద డాంగ్‌ ఫెంగ్‌-41 రకం తొమ్మిదివేల కిలోమీటర్లు ప్రయాణించగలవి ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద గరిష్టంగా 15వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి తయారీలో ఉన్నట్లు ఊహాగానాలు. దాని వద్ద శక్తివంతమైన ద్రీర్ఘశ్రేణి క్షిపణులు ఉన్నకారణంగా తేడా వస్తే తన మిత్రదేశంగా ఉన్న జపాన్‌ మీద ప్రయోగించగలదనే భయంతోనే అమెరికా ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరిస్తున్నది. ఇలా ఒకరిని మించి ఒకరు తమ ఆయుధాలకు పదునుపెట్టుకుంటున్నారు.ఇప్పటికే ప్రపంచంలో చైనా నావికాదళశక్తిలో ఒకటవ స్థానంలో ఉంది. అమెరికా వద్ద అన్ని రకాల యుద్ధ నావలు 471 ఉండగా చైనా 1,025 భారత్‌ 290 మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అమెరికా వద్ద విమానవాహక యుద్ద నౌకలు 11, చైనా దగ్గర మూడు, భారత్‌ వద్ద రెండు ఉన్నాయి. ఈ పూర్వరంగంలో మనదేశం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయుధాలను తయారు చేసుకోవాల్సిందే అనటం నిర్వివాదాంశం. దీనిలో భాగంగానే అణ్వస్త్రాలను తయారు చేసుకొనే అవకాశాలను అట్టిపెట్టుకొని అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాం.గతంలో రెండుసార్లు మనం అణుపరీక్షలు జరిపినపుడు మిత్రదేశం అంటూనే మన మీద కక్షతో అమెరికా ఒక్కటే ఆంక్షలు విధించింది.శత్రువైరుధ్యాలు ఉన్నప్పటికీ చైనా అలాంటి చర్యలకు పాల్పడలేదు.

మానవాళికి ముప్పు తెచ్చే యుద్ధాలు వద్దనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. కానీ ఉన్మాదంతో కొందరు ఊగిపోతున్నారు. పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే మన తాజా క్షిపణి ధ్వని వేగం (గాలిలో గంటకు 1,225కిలోమీటర్లు) పది మాక్‌లంటే 12,250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని పావు గంటలోనే పని ముగిస్తుందని చెబుతున్నారు. ఇది మన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అయితే వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. రష్యా వద్ద 27 మాక్‌ల అవన్‌గార్డ్‌, చైనా వద్ద 27మాక్‌ల డిఎఫ్‌-41, అమెరికా దగ్గర ట్రైడెంట్‌ 24, మినిట్‌మాన్‌ 23,రష్యా వద్ద 20.64మాక్‌ల క్షిపణులు ఉన్నాయి. అందువలన మాదేవుడే అందరికీ అంటే ఎలా అంగీకరించటం లేదో ఇది కూడా అంతే. మన గొప్ప గురించి మనం చెప్పుకోవచ్చు తప్ప మనమే గొప్ప అంటే జనాలను తప్పుదారి పట్టించినట్లే. మన మిలిటరీ అజేయమే అయితే నరేంద్రమోడీ మన ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు వెనక్కు తీసుకురాలేదు, ఆపరేషన్‌ సింధూర్‌లో మరికొంత మందుకు పోయి ఉంటే పని జరిగేది కదా అని అనేక మంది అనుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం యుద్ధాల్లో కావాల్సింది ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలియచేసే పరిజ్ఞానం. ఉక్రెయిన్‌కు అలాంటి సత్తాలేనప్పటికీ పశ్చిమ దేశాలు అందచేసిన సమాచారంతో గడచిన నాలుగు సంవత్సరాలుగా రష్యాను అడ్డుకోవటమే గాక, కొన్ని దాడులు కూడా చేయగలుగుతున్నదంటే కారణం అదే. ఆపరేషన్‌ సింధూర్‌లో తొలి రోజు మనకు ఎదురుదెబ్బలు తగలటానికి కారణం పాకిస్తాన్‌కు పశ్చిమదేశాలు(అమెరికాతో సహా) అందించిన సమాచారమే కారణంగా కొందరు భావిస్తున్నారు.

అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మిలిటరీ అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహాలు అమెరికా వద్ద 247, చైనా 157, రష్యా 110,ఫ్రాన్స్‌ 17, ఇజ్రాయెల్‌ 12, ఇటలీ 10, మనదేశం 9, జర్మనీ 8,బ్రిటన్‌ 6, స్పెయిన్‌ 4 కలిగి ఉన్నాయి.అందువలన భూమి చుట్టూ తిరిగే అవి ఒకదాని వెనుక ఒకటి సమాచారాన్ని పసిగడితేనే 24గంటల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు.మిలిటరీతో సహా అన్ని అవసరాలకు గాను అమెరికా 5,176, బ్రిటన్‌ 653, చైనా 623, రష్యా 181, జపాన్‌ 88 కలిగి ఉండగా మనదేశం 62 కలిగి ఉంది. అయితే ఈ ఉపగ్రహాలు సేకరించే సమాచారం కూడా మిలిటరీ అవసరాలకు ఉపయోగపడుతుంది.ఈ కారణంగానే ప్రపంచంలో ఏమూల ఏమిజరిగినా అమెరికా ఇట్టే పసిగడుతున్నదంటే ఈ వ్యవస్థలే కారణం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రపంచానికి భద్రత లేదని, తనకు అన్ని వైపుల నుంచీ ముప్పు ఉన్నదని అమెరికా ప్రపంచాన్ని నమ్మించేందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నది. గ్రీన్‌లాండ్‌ ప్రాంతాన్ని తాము ఆక్రమిస్తామని చెప్పిన ట్రంప్‌ తమ దేశ రక్షణకు ఉన్న ” గోల్డెన్‌ డోమ్‌ ” వంటిదాన్నే ఆ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఏమిటిది అంటే గగనతలం నుంచి జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించటం.మన రామాయణ, మహాభారత కథలో అలాంటివి చూసే ఉంటారు. రాక్షసులు యాగాన్ని కొనసాగ నివ్వకుండా చేసేందుకు చూస్తే రక్షణగా రాముడిని నియమించిన సంగతి, మహాభారతంలో బాణాలతో అర్జునుడి పరాక్రమం తెలిసిందే.కొన్ని దశాబ్దాలకు ముందే అమెరికా హాలీవుడ్‌ స్టార్‌వార్స్‌పేరుతో సినిమాలు తీసింది. ఇప్పుడు నిజంగానే అలాంటి గగనతల యుద్ధాలు జరుగుతున్నాయా ? అమెరికా కనుసన్నలలో పని చేసే సంస్థలు, కొందరు వ్యక్తులు రష్యా, చైనా ఈ రంగంలో ముందున్నాయని, ప్రపంచానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్లుగా తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అంతా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం గనుక ఈ పోటీ గురించి చెబుతున్న అంశాలను అవుననీ, కాదని చెప్పలేము.

భూ కక్ష్యలో ఉపగ్రహాలను దెబ్బతీసే సాంకేతిక పరిజ్ఞానం(ఎసాట్‌) ప్రతిదేశం కలిగి ఉండాలని అందరూ చెబుతున్నారు. గగనతల కేంద్రంగా ఆయుధాలు కావాలని అమెరికా మిలిటరీ నిపుణులు బహిరంగంగానే చెప్పారు.ఈ విషయంలో రష్యన్లు, చైనీయులు తమ సామర్ధ్యాలను ఎంతో ఆధునికంగా కనపరుస్తున్నారని, దాన్ని కాదనలేమని బ్రిటన్‌లోని డుర్హామ్‌ విశ్వవిద్యాలయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సహడైరెక్టర్‌ బ్లెడిన్‌ బోవెన్‌ చెప్పాడు. నిజంగా అలాంటి వేదికలు ఇప్పుడు ఉన్నాయో లేదో చెప్పలేము గానీ అవసరమైన సాంకేతికతలను వారు చూపుతున్నారని అన్నాడు. ఒక ఉపగ్రహాన్ని నేరుగా దెబ్బతీయటం,ఇతరంగా కూల్చివేయటం వాటిలో ఒకటి.భూతలం నుంచి సముద్రాల్లో నౌకలను ముంచివేయటం, టెర్మినళ్లను దెబ్బతీయటం, ఎలక్ట్రానిక్స్‌ ద్వారా చేసేవన్నీ గగనతల పోరులో భాగమే అన్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పోరులో స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ వంటి ప్రైవేటు ఉపగ్రహసేవలను అందించేవారు రష్యన్ల ఆయుధాలను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని, సైబర్‌దాడులకు పాల్పడుతున్నారని, అదే విధంగా రష్యా నుంచి సంకేతాలను అడ్డుకోవటాన్ని గమనించినట్లు బోవెన్‌ చెప్పాడు. గగనతల దాడుల ఆయుధాలను తయారు చేయకూడదన్న ఒప్పందాల మేరకు నాడు సోవియట్‌ వెనక్కు తగ్గిందని ఇప్పుడు రష్యా తిరిగి పూనుకున్నట్లు కనిపిస్తున్నదని రాండ్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎం క్లింటాక్‌ ఆరోపించాడు. సాధారణంగా గగనతలంపై రష్యా పరిమితంగానే ఆధారపడుతుందని, అదే అమెరికా తన ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలకు గరిష్టంగా ఆధారపడుతున్నది. రోజువారీ ఉపగ్రహ ప్రయోగాలను చూస్తే చైనా కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నదని క్లింటాక్‌ చెప్పాడు. ముందే చెప్పుకున్నట్లు ట్రంప్‌ ప్రస్తావించిన ”గోల్డెన్‌ డోమ్‌ ” ఏర్పాటుకు 1983 నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రకటించిన స్ట్రాటజిక్‌ డిఫెన్స్‌ ఇనిషియేటివ్‌ నాంది. దీన్నే స్టార్‌వార్స్‌ అని పిలిచారు.దీనిలో గగనతలంలో ఉండే పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థ అణ్వాయుధాల నుంచి రక్షణ కల్పించలేదు గానీ ఇతరంగా ఎంతో ఉపయోగం అని బోవెన్‌ చెప్పాడు. గతంలో ఎదురైన అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించారని, గగనతలంలో అడ్డుకోవటం సంక్లిష్టమైనదని, వాటిని వేగంగా రూపొందించటం, పరీక్షించటం అంతతేలిక కాదని అంటున్నారు.

అంతరిక్ష రంగంలో మనదేశం అనేక విజయాలను సాధించింది. అయితే ఇంకా ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.చైనా తన సోషలిస్టు వ్యవస్థను కాపాడుకొనేందుకు అమెరికాతో పోటీ అని చెప్పకపోయినప్పటికీ మిలిటరీ రీత్యా బలాన్ని పెంచుకుంటున్నది, ఆర్థికంగా దానికా శక్తి ఉంది. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు మిలిటరీ మీద అవసరమైనదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.మనదేశం 109 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంటే (జిడిపి 4లక్షల కోట్ల డాలర్లు) చైనా 303 బిలియన్‌ డాలర్లు (జిడిపి 19లక్షల కోట్ల డాలర్లు) వెచ్చిస్తున్నది.అమెరికా 831 బిలియన్‌ డాలర్లు (జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు) కేటాయించింది.తన ఆయుధ ప రిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా వెచ్చిస్తున్నది, చైనా స్వంతంగా తయారు చేసుకొనేందుకు పూనుకుంది.మనం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తే ఓకే, మనం కూడా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే పోటీపడే ఆర్ధిక శక్తి ఉందా లేదా అన్నది ముందు చూసుకోవాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !

21 Wednesday Jan 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, EU vs US, Green Land, Greenland annexation By US, Narendra Modi Failures, NATO

ఎం కోటేశ్వరరావు

గ్రీన్‌లాండ్‌ కోసం అమెరికా ఎంత దూరం వెళుతుందో మీరు చూస్తారంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఐరోపా నేతలకు ఒక సవాలు విసిరాడు. దవోస్‌ ప్రపంచ వాణిజ్య వేదిక సమావేశాలకు వెళ్లే ముందు ట్రంప్‌ మాటలివి. గ్రీన్‌లాండ్‌లోని అమెరికా మిలిటరీ కేంద్రానికి ఒక యుద్ధ విమానం కూడా వచ్చిందన్న వార్తలు ఒకవైపు, ఏం చేయాలో తోచక ఐరోపా కూటమి మరోవైపు. ప్రపంచ పరిణామాలు సామాన్యుల ఊహకు అందకుండా మారుతున్నాయి. అనేక దేశాల, దేశాధినేతల బండారాలు బయటపెడుతున్నాయి.కడుపులో చల్ల కదలకుండా కాలు మీద కాలువేసుకు కూర్చుందామంటే కుదరదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అంటూ రెండు పక్షాలనూ సంతుష్టీకరించాలంటే జరిగేది కాదు. వెనెజులా మన మిత్రదేశమే, చౌకగా చమురు తెచ్చుకున్నాం, డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించగానే మానేశాం, ఆ దేశ అధ్యక్షుడు మదురో, సతీమణిని కిడ్నాప్‌ చేసినా తప్పని చెప్పలేకపోయాం.ఇరాన్‌ కూడా మనకు మిత్రదేశమే. మన రూపాయలు తీసుకొని చమురు విక్రయించింది.అమెరికా బెదిరించగానే అక్కడి నుంచీ కొనుగోలు నిలిపివేశాం. ఆ దేశం మీద దాడులు చేస్తాం, పాలకులను మార్చివేస్తామని పెద్దన్న అమెరికా బెదిరిస్తుంటే తగదని అనలేకపోయాం. ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో అక్కడ ఉన్న మనవారిని వెనక్కు రప్పించేందుకు, పుతిన్‌కు చెప్పి దాడులు ఆపించామని చెప్పుకున్నాం, ప్రత్యేక విమానాలు పంపి భారతీయులను స్వదేశానికి రప్పించాం. కానీ ఇరాన్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రమ్మని సుభాషితం మాత్రమే చెప్పాం తప్ప విమానాలు పంపి వెనక్కు తీసుకురాలేదు. కొన్ని సమయాల్లో కొందరు ఎలా ప్రవర్తిస్తారో గుర్తు చేసేందుకే ఇవి. ఈ సందర్భంగా అమెరికా బెదిరింపులపై ఐరోపా స్పందన గురించి విశ్లేషించుకుందాం.

డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో కమ్యూనిస్టు చైనా మీద పన్ను ఉగ్రవాదదాడులను ప్రారంభించగానే అనేక మంది సంతోషించారు.చైనా వస్తువుల ధరలు పెరిగితే అంతకంటే చౌకగా అమెరికాకు ఎగుమతి చేసి లాభం పొందవచ్చని డాలర్‌ కలలు కన్నారు. ఇప్పుడు అదే ట్రంప్‌ తన పరబేధాలు లేకుండా బస్తీమే సవాల్‌ అందరి సంగతి చూస్తా అంటూ కొరడా ఝళిపిస్తుంటే దిక్కు తోచక దిక్కులు చూస్తున్నారు.చైనా మూడు చేపల కథలో దీర్ఘదర్శి మాదిరి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతున్నది. ప్రస్తుతం ఐరోపా ఇరకాటంలో పడింది. మదురోను కిడ్నాప్‌ చేసి వెనెజులా చమురు సంపదలన్నింటినీ స్వంతం చేసుకుంటామన్నపుడు దానికి పట్టలేదు. ఇప్పుడు డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామనగానే ఐరోపా సమాఖ్యకు గొంతులో పచ్చివెలక్కాయపడినట్లయింది. ఆర్కిటిక్‌ సముద్రంలోని ఆ మంచుదీవిని అన్నమాట ప్రకారం స్వాధీనం చేసుకోకపోతే అమెరికన్ల దృష్టిలో ట్రంప్‌ చులకన అవుతాడు. ఆక్రమించుకుంటే ఐరోపా సమాఖ్య అభాసుపాలవుతుంది. ఆపరేషన్‌ ఆర్కిటిక్‌ ఎండ్యూరెన్స్‌( ఆర్కిటిక్‌ ప్రాంతానికి బాసట) పేరుతో పరిమిత వన్యాసాలు జరిపేందుకు గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా పన్నెండు దేశాలు మిలిటరీ అధికారులు, సిబ్బందిని పంపేందుకు నిర్ణయించాయి, కొన్ని దేశాల నుంచి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. నిజంగా అమెరికా దురాగతానికి దిగి బలవంతంగా స్వాధీనానికి పూనుకుంటే వారు చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదు. అయితే ఈ మాత్రానికే ఆగ్రహించిన ట్రంప్‌ ధిక్కారమును సైతునా అంటూ ఐరోపా దేశాల వస్తువుల మీద ఫిబ్రవరి ఒకటి నుంచి అదనపు సుంకాలు విధిస్తానని ప్రకటించాడు.

అయితే దీనికి ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై 108 బిలియన్‌ డాలర్ల మేర ప్రతి సుంకాలు విధించేందుకు ఆలోచిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది.తోటి నాటో దేశాన్ని మరో సభ్య దేశం ఆక్రమించుకోవటం ఏమిటి అని గట్టిగా ఖండించలేక ఆమోదించలేక ఇతర దేశాలు సతమతం అవుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ మా ఒక్కరి భద్రతకోసమే కాదు, ఐరోపా రక్షణకూ అవసరమే అని, తాము స్వాధీనం చేసుకోకపోతే రష్యా, చైనా ఆక్రమిస్తే మీకు అంగీకారమేనా అంటూ ట్రంప్‌ యంత్రాంగం ఎదురుదాడికి దిగింది. ఐరోపా యూనియన్‌ పరిస్థితిని చూస్తే అమెరికాను ఎదిరించే స్థితిలో లేదు. గత ఎనిమిది దశాబ్దాలుగా ఐరోపా రక్షణ బాధ్యత పేరుతో నాటో ఖర్చులో అధిక భాగం అమెరికా భరించింది. ఆ మేరకు పొదుపు మొత్తాలను పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాలకు మళ్లించిన ఐరోపా అనేక విధాలుగా రెండు ప్రపంచ యుద్ద నష్టాల నుంచి కోలుకున్నది. ఐరోపా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నది. ఉభయుల వాణిజ్యలావాదేవీల విలువ 2024లో 976 బిలియన్‌ డాలర్లు ఉండగా అమెరికా వస్తు ఎగుమతులు 370 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అందుకే దిగుమతి పన్ను అదనంగా వేస్తా అని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇది ఐరోపా బలహీనత కాగా అదే పరిస్థితి అమెరికాకూ ఉంది, 2015-19 సంవత్సరాలతో పోలిస్తే 2020-24 నాటికి అమెరికా నుంచి ఐరోపా దేశాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలు 28 నుంచి 52శాతానికి పెరిగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత ఇది జరిగింది. అందువలన మాతో తెగేదాకా లాగితే ఆయుధ దిగుమతులు తగ్గిస్తామని ఐరోపా సంకేతాలు పంపుతున్నది. అంతే కాదు చైనాతో లావాదేవీలు పెంచుకోవాల్సి వస్తుందని కూడా చెబుతున్నది. అందుకే దాగుడుమూతలాడుతున్నాయి. చైనా ప్రమాదాన్ని చూపి భారత్‌ను తన బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, అదే ఎత్తుగడతో రష్యాను చూపి ఐరోపాను తన అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నది. అందుకే అప్పుడప్పుడు మిత్రవైరుధ్యాలు తలెత్తినప్పటికీ వాటిని శత్రువుల స్థాయికి తీసుకువెళ్లకుండా రాజీపడుతున్నాయి. ఇది ఎల్లకాలమూ సాధ్యమౌతుందా ?

తన ఆర్థిక బలం, మిలిటరీ బలగాలను చూపి గరిష్టంగా లబ్దిపొందేందుకు, ప్రభావాన్ని మరింతగా పెంచుకొనేందుకు అమెరికా పూనుకుంది.అయితే బలహీనమైన అంశాల పట్ల కఠినంగా, బలమైన వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది ఐరోపా.దాన్లో భాగమే అమెరికా వస్తువులపై పన్ను వేస్తామని హెచ్చరించటంగా చెప్పవచ్చు. అట్లాంటిక్‌ దేవాల మధ్య ఇదొక తీవ్రమైన సంక్షోభానికి గుర్తు అని తాజా పరిణామాల గురించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. అంత తేలికగా అమెరికా వత్తిడికి ఐరోపా లొంగే అవకాశాలు లేవని కొందరు చెబుతున్నారు. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు ఇప్పటి వరకు ఐరోపా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ కావాల్సిందేనని ఆదివారం నాడు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మరోసారి చెప్పాడు. ఆ ప్రాంతం అమెరికాలో అంతర్భాగం గాకపోతే రక్షణ అసాధ్యమన్నాడు. రక్షణ పేరుతోనే క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటాన్ని విమర్శించేవారు గ్రీన్‌లాండ్‌ విలీనాన్ని ఎలా సమర్ధించుకుంటారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా తమ చర్య అందరికీ మంచిదని, యూరోపియన్స్‌ దీన్ని అర్ధంచేసుకుంటారని భావిస్తున్నా అని మాత్రమే బెసెంట్‌ చెప్పాడు. ట్రంప్‌ ఈ విషయంలో వెనక్కు తగ్గకపోతే అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందానికి ఐరోపా పార్లమెంటు ఆమోద ముద్రవేసే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. బలవంతంగా ఒప్పించటాన్ని వ్యతిరేకించే సమాఖ్య 2023 నాటి ఆయుధంతో అమెరికాను దెబ్బతీయాలని ఫ్రాన్సు పిలుపునిచ్చింది. ఒకవైపు అమెరికాను అడ్డుకోవాలని అంటున్న ఐరోపా దేశాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం లేదు. గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో మిలిటరీ విన్యాసాలకు దూరంగా ఉండాలని జర్మనీ నిర్ణయించింది. శుక్రవారం నాడు వచ్చిన జర్మనీ మిలిటరీ బృందం ఆదివారం నాడు వెనక్కి వెళ్లింది. అమెరికా వత్తిడి తప్ప మరొక కారణం లేదు. ఈ మిలిటరీ విన్యాసంలో పాల్గన్నదేశాల మీద ప్రత్యేకించి పన్నులు విధించాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి అన్నమాట ప్రకారం పన్నులు వేస్తారా లేక బేరసారాల కోసం వాయిదా వేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

ఐరోపా ప్రతిపన్ను హెచ్చరిక కూడా ఎత్తుగడలో భాగమే అంటున్నారు. అమెరికాతో తెగతెంపులు చేసుకుంటే ఎనిమిది దశాబ్దాలుగా అనుసరించిన విధానాలన్నింటినీ మార్చుకోవాల్సి ఉంటుంది. అది ఒక్క గ్రీన్‌లాండ్‌తోనే సమసిపోదు. మొత్తం నాటో కూటమి ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది.ప్రపంచ బలాబలాల్లో వచ్చే మార్పులు తమకు లాభదాయకమా లేక అమెరికాతో ఉంటేనే మంచిదా అన్న మధింపు జరిగిన తరువాత నిర్ణయాత్మక పరిణామాలు జరుగుతాయి తప్ప ఇప్పటికిప్పుడు జరిగే అవకాశాలు పరిమితం. అసలు గ్రీన్‌లాండ్‌తో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో ఐరోపా మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ఒక వ్యూహం అనుసరిస్తున్నదని చెబుతున్నారు. గతేడాది డిసెంబరులో జాతీయ భద్రతా వ్యూహం పేరుతో రూపొందించిన పత్రంలో ఐరోపా సమాఖ్యలో రాజకీయ స్వేచ్చను బలహీనపరుస్తున్నారని, రాజకీయ వ్యతిరేకతను, భావ ప్రకటనా స్వేచ్చను అణచివేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.మరోవైపు ఐరోపాలో ఇటీవలి కాలంలో తలెత్తిన మితవాద జాతీయోన్మాద శక్తులను అమెరికా ప్రోత్సహిస్తున్నట్లు ఈ విమర్శల మర్మం అంటున్నారు. విద్వేష ప్రసంగాలను అదుపు చేసే చర్యల్లో భాగంగా ఇంటర్నెట్‌లో చొప్పిస్తున్న వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకున్న సాంకేతిక విభాగ ఐరోపా మాజీ కమిషనర్‌ తియెరీ బ్రెటన్‌పై అమెరికా ఆంక్షలు విధించటం కూడా వత్తిడిలో భాగమే అంటున్నారు. అమెరికా కంపెనీల పట్ల నిబంధనలను చూసీచూడనట్లు పోవాలని, వాటికి అవకాశాలను పెంచాలని ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ వత్తిడి చేస్తున్నారు.అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలన్న ట్రంప్‌ ఏలుబడిలో అది మరింతగా బరితెగించినట్లు కనిపిస్తోంది. ఐరోపాను ఒక వలస ప్రాంతంగా చూస్తూ తన నిబంధనలను అక్కడ రుద్దాలని చూస్తోందని, అందుకుగాను ఎంతకైనా తెగిస్తోందని ఐరోపా వర్గాలు భావిస్తున్నాయి.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంతగా గతంలో ఎన్నడూ ఐరోపా పట్ల అమెరికా వ్యతిరేకత వెల్లడి కాలేదేని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు.తమను నాశనం చేయాలని వాషింగ్టన్‌ చూస్తున్నదని ఇనిస్టిట్యూట్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ నతాలీ టోసీ చెప్పారు. ఉదారవాద ప్రజాస్వామ్యం, ఐరోపా ఒక్కటి కావటం తమకు వ్యతిరేకంగా పరిగణిస్తున్నదని కూడా అన్నారు. నాటో అనుకూల ఐరోపా దేశాల్లో అమెరికా పట్ల పునరాలోచనకు నాంది పడింది.గ్రీన్‌లాండ్‌ గురించి అమెరికా చాలా కాలం క్రితమే తన వాంఛను వెల్లడించింది. డెన్మార్క్‌ మిలిటరీ గూఢచార సేవల విభాగం గత డిసెంబరులో తొలిసారి అమెరికా తమ జాతీయ భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించిందని ఒక నివేదికలో పేర్కొన్నది. తన మిత్రదేశాలను కూడా వదలకుండా అధిక పన్నులతో సహా ఆర్ధిక బలాన్ని వినియోగిస్తున్నదని, చివరికి మిలిటరీ ఫోర్సు వినియోగంలో కూడా వదలటం లేదని దానిలో ప్రస్తావించారు. ఈ పూర్వరంగంలోనే డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడరిక్సన్‌ తోటి నాటో సభ్యదేశంపై అమెరికా దాడికి దిగుతానని చెప్పటాన్ని గర్హించారు. భద్రత గురించి అమెరికా మీద అతిగా ఆధారపడటం మంచిది కాదని కొందరు నిపుణులు హెచ్చరించటం పెరుగుతోంది. ఇలా ఆధారపడిన కారణంగా స్వతంత్ర ఆత్మరక్షణ సామర్ధ్యం మీద ప్రభావం పడుతుందని, ఐరోపా మిలిటరీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రష్యా, చైనాల రక్షణ బడ్జెట్ల కంటే ఎక్కువగా 2025 ఐరోపా 447 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టినందున స్వతంత్ర మిలిటరీని ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదని ప్రశ్నిస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో యూరోలు ఖర్చు చేస్తే ప్రయోజనం లేదని, కీలకమైన గూఢచర్యం, నిఘా, భౌతిక పరిస్థితి వివరాలపై అమెరికా మీద ఆధారపడకతప్పదని, అనేక రంగాలలో ఐరోపా వెనుకబడి ఉందని మరికొందరు చెబుతున్నారు. అణ్వాయుధాలు తమ దగ్గర మాత్రమే సురక్షితంగా ఉంటాయని అమెరికన్లు భావిస్తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్సు దగ్గర ఉన్నవి అవాంఛనీయ శక్తుల చేతుల్లో పడకుండా చూసేందుకు గాను మొత్తం ఖండ సాంప్రదాయ రక్షణ సామర్ధ్యాలను 2027 నాటికి తమ అదుపులోకి తెచ్చుకోవాలని వాషింగ్టన్‌ కోరుకుంటున్నదని రాయిటర్స్‌ వార్తలో పేర్కొన్న అంశాలు ఐరోపాలో ఆందోళనకు గురిచేశాయి. మొత్తం మీద ఐరోపాలో అమెరికాతో సంబంధాల గురించి ఒక మధనం ప్రారంభమైంది, అది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో, ఏ రూపంలో ఉంటుందో చూడాల్సి ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

14 Wednesday Jan 2026

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, Denmark, Donald trump, Greenland annexation By US, NATO, RUSSIA, The Battle Over Greenland:

ఎం కోటేశ్వరరావు

ప్రస్తుతం డెన్మార్క్‌లో స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొనేందుకు అమెరికా రంగం సిద్దం చేసింది. ఆప్రాంతాన్ని తమ 51వ రాష్ట్రంగా స్వాధీనం చేసుకొనేందుకు అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధుల సభ సభ్యుడు రాండీ ఫైన్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టాడు.ఈ దురాగతాన్ని ఐక్యంగా అడ్డుకోవాలని డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ నిర్ణయించాయి. గతంలో వాణిజ్యం పేరుతో ఐరోపా సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్‌,డచ్‌, పోర్చుగీసు,ఫ్రాన్సు వంటి దేశాలు ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాయి. ఆక్రమంలో వాటి మధ్య యుద్ధాలు కూడా జరిగాయి.ఇప్పుడు తన భద్రతకు ముప్పు పేరుతో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా పావులు కదుపుతోంది. మాదకద్రవ్యాలను సరఫరా చేసే ముఠాకు నాయకుడంటూ తప్పుడు ప్రచారం చేసి వెనెజులా అధ్యక్షుడిని అపహరించింది. ఇరాన్‌లో ప్రజాందోళలను అణచివేస్తున్నందున జోక్యం చేసుకుంటామని బెదిరిస్తున్నది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఆర్కిటిక్‌ సముద్రంలో ఉన్న డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ దీవి తన రక్షణకు అవసరమంటూ దాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంది. అన్ని ఖండాలలో 800కు పైగా చిన్నా, పెద్ద మిలిటరీ కేంద్రాలు, లక్షలాది మంది సైన్యాన్ని మోహరించిన అమెరికా ఏ దేశం మీదనైనా దాడికి దిగదలుచుకుంటే కొన్ని గంటల్లోనే సైన్యాన్ని దించగలదు. అలాంటిది చిన్న దేశమైన క్యూబా మొదలు పెద్ద దేశమైన చైనా వరకు అన్నీ తన భద్రతకు ముప్పు తలపెట్టాయంటూ ఒక మైండ్‌ గేమ్‌(మానసిక క్రీడ) ఆడుతోంది. ఆ సాకుతో బెదిరింపులకు, ఆక్రమణలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చెప్పిన అనేక మధురమైన మాటలతో ఇంక పనిలేదు, అనుకున్న లక్ష్యాలు నెరవేరటం లేదంటూ కర్ర పుచ్చుకొని దందాకు పూనుకుంది. తనకు లొంగని వెనెజులా మీద దాడి చేసి అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అపహరించి విచారణ తతంగం ప్రారంభించింది. ఆ దేశానికి తానే తాత్కాలిక అధ్యక్షుడనని ట్రంప్‌ ప్రకటించుకున్నాడు. తదుపరి లక్ష్యాలుగా కెనడా,గ్రీన్‌లాండ్‌,ఇరాన్‌, మెక్సికో, కొలంబియా ఇలా జాబితాను పెంచుకుంటూ పోతోంది.

ఇరాన్‌ మీద గతేడాది భీకరదాడి జరిపినప్పటికీ అది సాధించిందేమీ లేదు. అణుస్థావరాలకు ఆవగింజంత నష్టం కూడా జరగలేదని తేలింది. అందువలన ఇప్పుడు మరోసారి దాడి జరగాలంటే అనేక అంశాలను మదింపు చేసుకోవాల్సి ఉంటుంది. అందువలన తొలుత గ్రీన్‌లాండ్‌తో ఆక్రమణ ప్రారంభం కావచ్చన్నది ఒక అభిప్రాయం. ఒక గుండా ముందుగా బలహీనులనే దాడికి ఎంచుకుంటాడు. దాని వలన రెండు ప్రయోజనాలు ఒకటి నా తడాఖా ఇట్లుంటది అని చూపుకోవచ్చు, మిగిలిన వారిని బెదిరించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తాను స్వాధీనం చేసుకోనట్లయితే రష్యా, చైనా ఆక్రమించుకుంటాయని అందువలన తానే ఆపని చేయనున్నట్లు ట్రంప్‌ ఒక అబద్దాన్ని చెప్పాడు. నిజానికి అలాంటి ఆరోపణలను ఏ దేశం లేదా వాటిని వ్యతిరేకించే మీడియా కూడా చేసేందుకు సాహసించలేదు.జనాలను తప్పుదారి పట్టించేందుకు ఒక పధకం ప్రకారం గోబెల్స్‌ను మించి ప్రచారాలు చేయటంలో అమెరికా పేరుమోసింది.ఆర్కిటిక్‌ సముద్రంలో అనేక దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి.ఎక్కడా దాపరికం లేదు, చైనా కూడా అదే చేస్తోంది. కానీ గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొనేందుకే అని బీజింగ్‌ మీద కథనాలు రాస్తున్నారు. ఆర్కిటిక్‌ సముద్రంలో మంచుకరిగి పోతున్నదని గత మూడుదశాబ్దాలుగా అనేక మంది చెబుతున్నారు, దాని పరిణామాలు, పర్యవసానాల గురించి పరిశోధనలు చేయటం ఆ ప్రాంత దేశాలైన నార్వే, డెన్మార్క్‌, స్వీడన్‌,ఐస్‌లాండ్‌, కెనడా, అమెరికా, రష్యా, ఫిన్లాండ్‌ దేశాలకే కాదు, యావత్‌ మానవాళికి అవసరం.అయితే అవి అంగీకరించిన అంతర్జాతీయ చట్టాలు, నిబంధనల మేరకు జరగాలి. ప్రస్తుతం వార్తలోకి ఎక్కిన గ్రీన్‌ లాండ్‌ దీవి డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం. అది డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసికి మధ్యలో రెండు దేశాలకు 3,200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రష్యాకు ఐదువేలు, చైనాకు ఎనిమిది, మనదేశానికి తొమ్మిదివేల కిలోమీటర్లు ఉంటుంది.గ్రీన్‌లాండ్‌ రాజధాని నుక్‌ పట్టణం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు 3,500 కిలోమీటర్ల దూరంలో ఉంటే అమెరికా నగరం న్యూయార్క్‌కు 2,900కి.మీ దూరంలో ఉంది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని చెబుతున్న అమెరికా, ఆర్కిటిక్‌ సర్కిల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రాంతంలో పరిశోధనలు చేసే హక్కు చైనాతో సహా ఏ దేశానికైనా ఉంటుందా లేదా ! ప్రచ్చన్న యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలో అమెరికా, సోవియట్‌ యూనియన్‌ కూడా అణుజలాంతర్గాములను మోహరించాయి. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతాన్ని ఒక యుద్ధ కార్యక్షేత్రంగా మార్చేందుకు అమెరికా పూనుకుంది. ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లో ఉన్న తన మిలిటరీ కేంద్రాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తనకు ఆ దీవి పూర్తిగా కావాలని, మర్యాదగా ఇస్తే సరి, లేకుంటే బలప్రయోగం చేయాల్సి వస్తుందని బెదిరింపులకు దిగింది. రష్యా, చైనా నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతానికి ముప్పు వచ్చిందని 2024లోనే అమెరికా ప్రచారం ప్రారంభించింది.

గ్రీన్‌లాండ్‌ ప్రాంతంపై అమెరికా కన్ను ఎందుకు ? ఆర్కిటిక్‌ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి, అక్కడి సర్వేలో తేలిన 34 రకాల్లో 25 విలువైన ఖనిజ జాబితాలో ఉన్నాయి. నౌకా రవాణా మార్గంగా ఉండటం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతం కావటంతో దాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని, చైనా, రష్యాలను మరింతగా ఇబ్బంది పెట్టాలన్నది అసలు లక్ష్యం.ఇదే జరిగితే ఐరోపా భద్రత, ప్రపంచ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో ఉంది, ఐరోపాలోని డెన్మార్క్‌లో భాగం అయినప్పటికీ స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ప్రపంచంలోని పెద్ద దీవి.జనాభా కేవలం 60వేల లోపే, వారు కూడా ఎక్కువగా చేపలవేట మీదే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాల నిర్వహణకు డెన్మార్క్‌తో అమెరికా రక్షణ ఒప్పందాలు చేసుకుంది. పర్యావరణ మార్పులతో మంచు కరిగిపోతుండటంతో నూతన నౌకా మార్గాలు ఏర్పడ్డాయి.ప్రయాణ దూరం తగ్గింది,ముడి చమురు, గ్యాస్‌, విలువైన ఖనిజాల వంటి లక్షల కోట్ల డాలర్ల విలువగల సహజవనరుల వెలికితీతకు మార్గం ఏర్పడింది.మిలిటరీ నిఘాకూడా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఆక్రమణను నిరోధించేందుకు అమెరికా ప్రవేశానికి డెన్మార్క్‌ అనుమతించింది. ఈ ప్రాంతాన్ని తమకు అమ్మాలని 1946లోనే వాషింగ్టన్‌ ప్రతిపాదించినప్పటికీ అంగీకరించలేదు.

ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియాలను దగ్గర చేసేందుకు సూయజ్‌ కాలువ మీదుగా కంటే ఆర్కిటిక్‌ ప్రాంతం అనువుగా ఉండటం, దూరం తగ్గటం, సమయం, ఖర్చు కూడా తగ్గుతుండటంతో ఇటీవలి కాలంలో నౌకా రవాణా పెరిగింది. చైనా, రష్యా నౌకలు సంచరిస్తున్నాయి. రష్యా నుంచి చైనాకు చమురు రవాణాకు ప్రత్యామ్నాయ నౌకా మార్గంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఆ నౌకల మీద నిఘాపెంచాలంటే అమెరికన్లకు ఈ దీవి ఎంతో అనువుగా ఉంటుంది.దీనితో పాటు ఉపగ్రహాలకూ అనువైన ప్రాంతం. ప్రస్తుతం కొన్ని రంగాలకు చమురు, బంగారం కంటే విలువైన ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా వీటిపై 90శాతం అదుపు కలిగి ఉంది, ఎవరు తోక ఝాడించినా వాటి ఎగుమతులు నిలిపివేసి ప్రతీకారం తీర్చుకుంటున్నది.అమెరికా కూడా దాని మీద ఆధారపడి ఉండటంతో ఎక్కడ అలాంటి వనరులుంటే వాటిని సొంతం చేసుకొనేందుకు అమెరికా పూనుకుంది. లిథియం, కోబాల్ట్‌,చమురు, గ్యాస్‌ పుష్కలంగా ఉన్నాయి.

గ్రీన్‌లాండ్‌ ఆక్రమణకు పూనుకుంటే ఐరోపా ఎలా స్పందిస్తున్న అంశాన్ని ఇప్పుడు అమెరికా మదింపువేస్తున్నది. నాటో ప్రారంభ దేశాలలో డెన్మార్క్‌ ఒకటి. ఇప్పుడు దాని స్వయం పాలిత ప్రాంతాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవటం అంటే నిబంధనలకు విరుద్దం. నాటో దేశాలన్నీ దాన్ని ఎదుర్కోవాలని నిబంధన ఉంది. అయితే గతంలో టర్కీ-గ్రీస్‌ మధ్య తలెత్తిన వివాదంలో నాటో నాయకత్వం చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా ? ఆదివారం నాడు బ్రిటన్‌, జర్మనీ నాయకత్వంలో కొన్ని దేశాల ప్రతినిధులు సమావేశమై ఆర్కిటిక్‌ ప్రాంత భద్రత గురించి మరింత సమన్వయంతో పని చేయాలని నిర్ణయించినట్లు వార్తలు. ఒక దేశసార్వభౌమత్వానికి వ్యతిరేకంగా అమెరికా చేసిన వ్యాఖ్యల పూర్వరంగంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కెనడా కూడా కోరింది. అయితే ముసుగులో కుమ్ములాట మాదిరి తప్ప నేరుగా అమెరికాను విమర్శించటానికి ఇంకా ముందుకు రావటం లేదు. తాము అమెరికన్లుగా మారటానికి సిద్ధంగా లేమని గ్రీన్‌లాండ్‌ ప్రధాని జేన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సెన్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక ప్రకటన చేశాయి. తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకుంటామని స్పష్టం చేశాయి.ఆర్కిటిక్‌ ప్రాంతంలో తమ వ్యతిరేకులను అడ్డుకోవటానికి ప్రాధాన్యత ఇస్తామని అమెరికా అధ్యక్ష భవనం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.అంతకు ముందు జనవరి నాలుగున ట్రంప్‌ స్వయంగా మాట్లాడుతూ గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో రష్యా, చైనా నౌకలు తిరుగుతున్నందున తమ జాతీయ భద్రతా అవసరాల రీత్యా ఆ ప్రాంతం తమకు కావాలని చెప్పాడు. ఎలా స్వాధీనం చేసుకోవాలా అన్నది అధ్యక్షుడు తన బృందంతో చర్చిస్తున్నాడని,మిలిటరీ వినియోగ అవకాశం ఎప్పుడూ ఉంటుందని అధ్యక్ష భవన ప్రకటన తేటతెల్లం చేసింది. 1979 నుంచి గ్రీన్‌లాండ్‌ డెన్మార్క్‌లో స్వయంపాలిత ప్రాంతంగా ఉంది, ప్రజాభిప్రాయ సేకరణ తరువాత స్వాతంత్య్రం ప్రకటించుకొనే అవకాశం కూడా 2009 నుంచి దానికి వచ్చింది. అయితే ఇంతవరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు.నిజానికి ట్రంప్‌ 2019లోనే గ్రీన్‌లాండ్‌ స్వాధీనం గురించి చెప్పాడు. ట్రంప్‌ వ్యాఖ్యలు వెలువడిన జనవరి నాలుగునే డెన్మార్క్‌ ప్రధాని మెటీ ఫ్రెడరిక్సన్‌ ఖండించారు.డెన్మార్క్‌ రాజరికంలోని మూడు ప్రాంతాలలో ఏ ఒక్కదానిని విలీనం చేసుకొనే హక్కు అమెరికా లేదని ఆమె పేర్కొన్నారు. ఫారో దీవి కూడా గ్రీన్‌లాండ్‌ వంటిదే అన్నారు, మరో దేశంగానే గాక చారిత్రకంగా సన్నిహితంగా ఉన్న దేశం మీద అమెరికా ఇలాంటి కోరికలను వెలిబుచ్చటం తగదన్నారు.

అమెరికా విస్తరణ కాంక్ష ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదు. కెనడా తమ 51వ రాష్ట్రం కావాలని గతంలోనే ట్రంప్‌ కోరిన సంగతి తెలిసిందే. అందువలన కెనడియన్లు కూడా అప్రమత్తం కావాలని అనేక మంది హెచ్చరిస్తున్నారు.గ్రీన్‌లాండ్‌తో పోల్చితే కెనడా పక్కనే ఉంటుంది, అక్కడ కూడా సహజ సంపదలు పుష్కలంగానే ఉన్న సంగతి తెలిసిందే.ప్రపంచంలో అధిక చమురు నిల్వలున్న దేశాల్లో నాలుగవదిగా ఉంది. బ్రిటన్‌ నుంచి రెండు దేశాలూ స్వాతంత్య్రం పొందినవే. గత రెండువందల సంవత్సరాల్లో లాటిన్‌ అమెరికాలో అమెరికన్లు జరపని కుట్ర లేదు, అనేక ప్రభుత్వాలను కూల్చివేశారు, అనేక మందిని హత్య చేయించారు. మొత్తం పశ్చిమార్ధగోళం తమకిందే ఉండాలని పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.చరిత్రలోకి చూస్తే కెనడాను ఆక్రమించుకొనేందుకు అమెరికా 1812లోనే ప్రయత్నించింది.1939వరకు కెనడాను ఆక్రమించాలనే మిలిటరీ వ్యూహాన్ని కొనసాగించి తరువాత ఉపసంహరించుకుంది, ట్రంప్‌కు ఆ గతం గుర్తుకు వచ్చి ఉంటుంది.కెనడా వర్తమాన చరిత్రను చూస్తే అన్ని అంశాల్లోనూ అమెరికాతో కలసి అనేక దాడుల్లో భాగస్వామిగా ఉంది.నాటో కూటమిలో కూడా చేరింది.అయితే కొన్ని సందర్భాలలో అమెరికా వైఖరితో విబేధించింది. అణ్వాయుధాల మోహరింపుకు అంగీకరించలేదు, వియత్నాంపై యుద్దాన్ని అంగీకరించలేదు. క్యూబా విషయంలో కూడా సానుకూలంగా ఉంది.చివరికి తన ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా రుద్దిన ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో మెక్సికోతో కలసి భాగస్వామి అయింది.గల్ఫ్‌వార్‌లో అమెరికాతో కలసిపనిచేసింది.వీటితో పాటు కొన్ని మిత్రబేధాలు ఉన్నాయి. అందుకే తాజా పన్ను ఉగ్రవాదాన్ని ట్రంప్‌ కెనడాకూ విస్తరించాడు.ఈ పూర్వరంగంలో చూసినపుడు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొంటే ఐరోపా, మిగతా ప్రపంచం ఎలా స్పందిస్తుందో చూసిన తరువాత కెనడాను కూడా తనదారికి తెచ్చుకుంటుందా ? చూద్దాం ! హొహొహొహొహొహొహొహొహొహొహొహొహొహొహొ

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d