• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు

09 Wednesday Sep 2026

Posted by raomk in AP NEWS, CHINA, CPI(M), Current Affairs, Economics, Environment, Health, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, TDP, USA

≈ Leave a comment

Tags

AI data centers, AI’s environmental impacts, CHANDRABABU, China, Data Centers, Pollution

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర, సమగ్ర పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు జరిపి బహిర్గతం చేసేంత వరకు ఏఐ డేటా సెంటర్లకు అనుమతి ఇవ్వరాదని, ఇచ్చిన వాటిని అధ్యయనాలు చేసేంతవరకు నిలిపివేయాలంటూ ఏపీలోని విశాఖ పట్నంలో సెప్టెంబరు 6న జరిగిన జాతీయ సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. “విశాఖపట్నం ప్రకటన”ను ఆమోదించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీలో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వర్తమానంలో ఆర్థిక, సమాచార వ్యవస్థల్లో డేటా ఎంతో కీలకంగా మారింది. ఏదైనా కొత్త సమస్యలను సృష్టించకూడదన్నది పారిశ్రామిక విప్లవం నేర్పిన ఒక పెద్దపాఠం. పశ్చిమ దేశాల్లో కొన్ని పరిశ్రమల కాలుష్యం భరించరానిదిగా తయారుకావడంతో జనాల్లో వ్యతిరేకత, ఆరోగ్యం తదితర కారణాలతో ప్రభుత్వాలు అలాంటి వాటిని మూసివేయడం లేదా వేరే దేశాలకు తరలించాలని నిర్ణయించాయి. ఆ సంస్థలు ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడిన అధికారంలోని పెద్దలు పెట్టుబడులు, పరిశ్రమల రాక అంటూ ముద్దుపేర్లు తగిలించి తమ ఘనతగా గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో కొందరు రాజులు వలసవాదులకు మద్దతు ఇచ్చి దేశాన్ని వారికి ఎలా అప్పగించారో, ఆధునిక కాలంలో కొందరు పాలకులు వినాశకర పరిశ్రమలు, ఉత్పత్తులను అనుమతిస్తున్నారు.

ఉదాహరణకు ఇటలీలో మితేనీ రసాయన కర్మాగారంలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు తయారు చేశారు. దాని కాలుష్యంతో భూగర్భజలాలు కూడా కలుషితమయ్యాయి. సదరు ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లోటే పరశురామ్ అనే ప్రాంతానికి తరలించి అక్కడ కొత్త ఫ్యాక్టరీ పేరుతో ఏర్పాటు చేసి అదే రసాయనాలను ఉత్పత్తి చేశారు. చైనాకు సైతం అలాంటి కాలుష్యకారక పరిశ్రమలు వచ్చాయి. అయితే వాటి ముప్పును గ్రహించిన అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. పాతబడిన నౌకలను ధ్వంసం చేయటం, గ్రీన్ రీసైక్లింగ్ పేరుతో పశ్చిమ దేశాల్లో తయారైన వ్యర్థాలను 2018లో నిషేధించింది. కానీ మనవంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. గ్లైఫోసేట్ అనే కలుపు నివారణ రసాయనాన్ని అనేక దేశాల్లో నిషేధించినా మన దేశం అనుమతించింది. అది కలుపు మొక్కలతో పాటు పచ్చగా ఉండే ప్రతిదాన్నీ హరించడంతో పాటు దాన్ని కూడా తట్టుకొని బతికే కలుపు మొక్కలు విస్తరించటంతో చివరకు నిషేధించాల్సి వచ్చింది.

ఇటీవలి కాలంలో కాలుష్యకారక ఫ్యాక్టరీలు, ఉత్పత్తులతో పాటు డేటా సెంటర్లు కూడా పర్యావరణ సమస్యలను ముం దుకు తెస్తున్నాయి. దాంతో వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడి సర్కార్ విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయిస్తున్న గూగుల్ డేటా సెంటర్‌తో తలెత్తే పర్యావరణ ముప్పుపై ఎలాంటి నివేదికలు లేకుండా దొడ్డిదారిన దానికి అనుమతి ఇచ్చారు. అమెరికాను వదలి మనదేశానికి రావటం పెద్ద గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అసలు సంగతేమిటంటే అక్కడ ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటంతో ఇక్కడకు వస్తున్నాయి తప్ప మన మీద ప్రేమ కాదు. డెమాక్రాట్లు లేదా రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలు, పట్టణాలు-గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా ఆందోళనలు సాగుతున్నాయి. వాటి సమీప ప్రాంతాల్లోని వారిలో వ్యతిరేకుల సంఖ్య 42 నుంచి 75 శాతానికి పెరిగినట్లు ఆగస్టులో చేసిన ఒక సర్వేలో తేలింది. గాలప్ సర్వేలో 53 శాతం మంది అణు విద్యుత్ కేంద్రాల సమీపంలో నివసించటానికి మొగ్గు చూపగా, డేటా కేంద్రాల వద్ద ఉండేది లేదని 71 శాతం చెప్పటం గమనించాల్సిన అంశం. భూమితో పాటు ఆ కేంద్రాలను చల్లబరచేందుకు భారీ మొత్తంలో నీరు, విద్యుత్ అవసరం. గాలిలో కాలుష్యాన్ని పెంచుతాయి, వాతావరణం వేడెక్కుతుంది. అందుకే సమీపాల్లో నివసించేందుకు అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు అవసరమైన అనుమతుల కోసం స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు అందిస్తున్నట్లు ఫుడ్ అండ్ వాటర్ వాచ్ సంస్థ రాజకీయ డిప్యూటీ డైరెక్టర్ థామస్ మేయర్ చెప్పాడు.

మరోవైపు కృత్రిమ మేథ(ఏఐ)తో వచ్చే ప్రయోజనాల గురించి కొందరు నేతలు ఊరిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఏఐ బుడగ పేలిపోయి జూలై నెలలో స్టాక్ మార్కెట్‌లో 2.18 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఇలాంటి బుడగలు పేలితే మొత్తం ఆర్థిక వ్యవస్థల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమెరికాలో వందలాది సంస్థలతో “డేటా సెంటర్ల నిలిపివేత కూటమి” ఏర్పాటైంది. పర్యావరణ రక్షణ అంశంలో లోపభూయిష్టంగా ఉన్న అమెరికా ఏఐ చట్టాన్ని రక్షించాలంటూ డోనాల్డ్ ట్రంప్ మద్దతుతో కార్పొరేట్ సంస్థలు చేసిన యత్నాన్ని పర్యావరణ పరిరక్షణ సంస్థలు వమ్ము చేశాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లోని చట్టసభ సభ్యులు డేటా సెంటర్ల ఏర్పాటును వాయిదా వేయాలని తీర్మానాలు ప్రతిపాదిస్తున్నారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ దేశంలో తొలిసారి డేటా సెంటర్లు వద్దని తీర్మానం చేసిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో వీటి ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను గుర్తించారు. వీటి నిర్మాణానికి భారీ యంత్రాల వినియోగంతో ధ్వని కాలుష్యం పెరిగింది. డీజిల్ జనరేటర్లతో వేడి పెరుగుతున్నది, ఎయిర్ కండిషనర్లు నిరంతరం రొద పెడుతున్నాయి. ఈ కేంద్రాలలో రాత్రంతా వెలుగు ఉండటంతో పరిసరాల జనాల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని వెలుగు కాలుష్యం అంటున్నారు. కొన్ని కేంద్రాలు గ్యాస్‌తో నడుస్తూ కాలుష్యాలను విడుదల చేస్తున్నాయి.

ఒక అధ్యయనం ప్రకారం అమెరికాలోని మొత్తం డేటా సెంటర్ల కారణంగా 2030 నాటికి ఆరు లక్షల మందిలో ఆస్మా లక్షణాలు కనిపిస్తాయని, 1,300 మంది ముందుగానే చనిపోతారని, ఏటా ఆస్మాతో మరణిస్తున్నవారి కంటే మూడోవంతు మరణాలు పెరుగుతాయని, ప్రజారోగ్య రక్షణకు ఏటా అదనంగా 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తేలింది. ఒక పెద్ద సెంటర్‌లోని కంప్యూటర్ యంత్రాలను చల్లబరచేందుకు రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీరు(అమెరికా గాలన్ 3.8 లీటర్లకు సమానం) అవసరం. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో గూగుల్ సంస్థ ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, మరో ఆరింటిని నిర్మిస్తున్నట్లు 2025 నివేదిక ఒకటి వెల్లడించింది. అరిజోనా రాష్ట్రంలోని మరికోపా అనే ప్రాంతంలో నాలుగు కేంద్రాల కారణంగా భూగర్భజలాల కొరత ఉందంటూ 2023లోనే కొత్తగా ఇండ్ల నిర్మాణానికి అనుమతులు నిలిపివేశారు. డేటా కేంద్రాలకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం. వాటికోసం సరఫరా వ్యవస్థల నిర్మాణానికి ఖర్చు తడచిమోపెడు అవుతుంది. ఆ మొత్తాన్ని దామాషా ప్రకారం అయినా గృహ వినియోగదారుల మీద కూడా మోపుతారు, అది వారి మీద అదనపు బాదుడే. ఈ విధంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇరవై శాతం రేట్లు పెరిగాయి.

అంటే కార్పొరేట్ల లాభాల కోసం సాధారణ పౌరులు అదనపు భారం మోయాలి. పౌరుల నుంచి వ్యతిరేకత రావటంతో డేటా సెంటర్లు తమకు అవసరమైన విద్యుత్‌ను వారే ఉత్పత్తి చేసుకోవాలి లేదా స్థానికుల మీద భారం పడకుండా అదనపు చార్జీలు చెల్లించాలని రాష్ట్ర గవర్నర్ జోష్ షాప్రియో ప్రకటించాల్సి వచ్చింది. డేటా సెంటర్లు వద్దనే ఆందోళన ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. నెదర్లాండ్స్‌లోని జీవూల్డే అనే 22 వేల మంది ఉన్న పట్టణంలో మేటా 410 ఎకరాల ప్రభుత్వ భూమిలో 200 మెగావాట్ల కేంద్రాన్ని ప్రతిపాదించింది. ఆ పట్టణం మొత్తం వినియోగించే విద్యుత్‌కు రెండు రెట్లు ఈ కేంద్రానికి అవసరమని తేలడంతో అక్కడి జనాలు దాన్ని వ్యతిరేకించారు. నెదర్లాండ్స్ ప్రభుత్వమే డేటా సెంటర్లు 70 మెగావాట్లకు మించి పెట్టరాదని నిర్ణయించడంతో మేటా కేంద్రం రద్దయింది. తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డేటా సెంటర్‌ను వ్యతిరేకించిన వారే గెలిచారు. ఐర్లండ్‌లో వ్యతిరేకత కారణంగా యాపిల్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ల ప్రాజెక్టును రద్దు చేసుకుంది. జనాల అభ్యంతరాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అక్కడి డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం పదేండ్ల క్రితం దేశం మొత్తం వినియోగించే విద్యుత్‌లో కేవలం ఐదు శాతం ఉండగా, గతేడాది 23 శాతానికి చేరింది. 2034 నాటికి 31 శాతం కానుంది.

చిలీలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన కేంద్రంపై పర్యావరణ ప్రభావం గురించి తగిన నివేదిక ఇవ్వక పోవటంతో కోర్టు అడ్డుకున్నది. అదే గూగుల్ మరోచోట ఏర్పాటు చేయతలపెట్టిన కేంద్రాన్ని జనం అడ్డుకున్నారు. ధనిక దేశాల వారు వినోదం కోసం ఏఐ చిత్రాలను రూపొందించేందుకు మా నీటిని ఫణంగా పెట్టి డేటా కేంద్రాల నిర్మాణం అవసరం లేదని చిలీ నీటి హక్కుల సంస్థ ప్రతినిధి టానియా రోడ్రిగజ్ స్పష్టం చేశారు. ఉరుగ్వేలో గూగుల్ తలపెట్టిన కేంద్రానికి 20 లక్షల గ్యాలన్ల నీరు కావాలని తేలటంతో జనం వ్యతిరేకించారు. చివరకు చల్లబరిచేందుకు నీటిని వాడబోమంటూ చిన్న కేంద్రానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల్లో కూడా డేటా సెంటర్లకు వ్యతిరేకత పెరుగుతున్నది. డేటా సెంటర్లకు సంబంధించి కొన్ని అవాస్తవాలు-నిజాల గురించి చూద్దాం. అమెరికా అనుభవంలో నిర్మాణ సమయంలో ఉపాధి తప్ప పర్మినెంట్ ఉద్యోగాలు ఒక పెద్ద కేంద్రంలో 50 నుంచి 150 మందికి లభిస్తాయి. అవి కూడా భద్రతా సిబ్బంది, నిపుణులైన సాంకేతిక నిపుణులకే పరిమితం. అదనపు పెట్టుబడులు, అనుబంధ పరిశ్రమలు, ప్రభుత్వాలకు అదనపు పన్నులూ రావు, ప్రజల సొమ్ము వాటికి ఖర్చు చేస్తారు. స్థానిక వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. జార్జియా రాష్ట్రంలో 70 శాతం కేంద్రాలకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వలేదు.

ఈ కేంద్రాలను చల్లబరిచేందుకు ఉపయోగించే నీటిని తిరిగి విడుదల చేసినప్పుడు అవి వేడిగా ఉంటాయి. నీటి వనరులు, పర్యావరణాన్ని ప్రభావితం చేసే కొత్త సమస్యలను సృష్టిస్తాయి. చైనాలో కూడా పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లు ఉన్నాయి. అందుకే చైనా సముద్రాల్లో 35 మీటర్ల లోతులో తేలియాడే వాటిని ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. షాంఘై తీరంలో రెండువేల సర్వర్లు ఉన్న కేంద్రాన్ని 115 అడుగుల లోతులో ఏర్పాటు చేశారు. ఇలాంటి ఏర్పాట్ల వలన 90 శాతం ఇంధనం ఆదా అవుతుంది, అవసరమైన విద్యుత్‌లో 97 శాతం సమీపంలోని ఉపరితల గాలి మరల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. బ్రిటన్‌లో మైక్రోసాఫ్ట్ జరిపిన ప్రయోగంలో భూమి మీద ఏర్పాటు చేసిన వాటి కంటే నీటిలో వాటి వైఫల్యాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అయినా వాణిజ్యపరంగా ముందుకు పోలేదు. భూమి మీద ఏర్పాటు చేసే డేటా సెంటర్ల ప్రాజెక్టు మొత్తం విద్యుత్‌లో చల్లబరిచేందుకే 40 శాతం అవసరం కాగా, సముద్రాల్లో వాటికి అది అవసరం ఉండదు. విద్యుత్ వినియోగ సామర్థ్యం సముద్రాల్లో ఎక్కువని తేలింది. నీటి అవసరం ప్రత్యేకంగా ఉండదు. చల్లబరిచేందుకు అవసరమైన వ్యవస్థల ఖర్చు సముద్రంలో తక్కువ, భూమి అవసరం 90 శాతం తక్కువ. ఉపాధి పేరుతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి వారు భారీ మొత్తాల్లో అప్పనంగా సబ్సిడీలు ఇస్తున్నపుడు ఎవరైనా వాటిని ఎందుకు వదులుకుంటారు? ప్రత్యామ్నాయాల వైపు చూడటానికి వారేమైనా ప్రజల పక్షం వహించేవారా!

Share this:

  • Tweet
  • More
Like Loading...

భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!

04 Friday Sep 2026

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Anti RSS, BJP, Hinduthwa, Leftist Zohran Mamdani, Mohan Bhagwat, RSS, RSS anti Muslim, RSS chief Bhagwat’s NYC event, RSS Hypocrisy

ఎం కోటేశ్వరరావు


‘‘హిందువులు నిద్రలేస్తే ప్రపంచం మేల్కొన్నట్లే” ఇదీ అమెరికా, కెనడా, బ్రిటన్ పర్యటనలో భాగంగా కెనడాలోని టొరంటో నగరంలో జరిగిన సభలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్ భగవత్ చెప్పిన సుభాషితం. ఎంతో చక్కగా చెప్పారు, ఇంతకూ హిందువులు ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పకుండా అది జరిగితే, ఇదైతే అని చెప్పటం వల్ల ఉపయోగమేమిటి? నిద్ర లేవకుండా ఎవరు అడ్డుకున్నారు? భగవత్ మూడు దేశాల పర్యటన అన్ని చోట్లా తీవ్ర వివాదాన్ని రేపింది. అవి నోరున్న దేశాలు గనుక వార్తలు ప్రపంచవ్యాపితంగా వెళ్లాయి. మనదేశ మీడియాలో కూడా చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది బీజేపీ, తెరవెనుక ఉండి దాన్ని ఆడిస్తున్నది మాతృసంస్థ ఆరెస్సెస్‌ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి సంస్థ అధినేత పర్యటన అంటే ఒక రాజ్యాంగేతర శక్తి చేస్తున్నట్లే భావించాలి. తనను ఒక సాంస్కృతిక సంస్థగా కాషాయదళం చెప్పుకుంటుంది. కానీ, ప్రపంచానికి అది మేకతోలు కప్పుకున్న పులి, ఒక మతోన్మాద సంస్థగా అనేక మంది భావిస్తున్నారు. ఆ మచ్చను తుడిచివేసుకొనేందుకు వంద సంవత్సరాల క్రితం అది పుట్టినప్పటి నుంచీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.

భారత్ విశ్వగురువుగా మారింది తప్ప విశ్వశక్తి కాదని టొరొంటో సభలో ఆరెస్సెస్‌ అధినేత చెప్పారు. ప్రపంచ మిలిటరీ, జీడీపీలో అగ్రభాగాన ఉన్నందున అమెరికా ప్రపంచశక్తి అని భావిస్తే అదొకతీరు. మనం ఏ రంగంలో ముందున్నట్లు, గురువుగా ప్రపంచానికి నేర్పిందేమిటి? “హిందూ విశ్వ బంధు-స్నేహ బంధంతో ప్రపంచ ఆలింగనం” అనే ఇతివృత్తంతో కెనడియన్ హిందూస్ ఫర్ అవుట్‌రీచ్, రిలేషన్స్ అండ్ డైలాగ్(కోర్డ్) సంస్థ ఏర్పాటు చేసిన సభలో భగవత్ మాట్లాడుతూ భారత్ సూపర్ పవర్ కాదని, తన స్వంత వ్యక్తిత్వంతో ప్రపంచానికి సేవలు అందించిందని, భారత్ ఎదుగుదలను ఆధిపత్యంతో కాక సేవతో కొలవాలని అన్నారు. సేవ భారత జన్యుమూలాల్లోనే ఉందని, హిందువులు మేలుకొంటే ప్రపంచమే నిద్రలేచినట్లని చెప్పారు. ముస్లింలు, పార్సీలు, యూదులు, క్రైస్తవులు ఎక్కడైనా వేధింపు లకు గురైతే భారత్‌లో ఆశ్రయం దొరికిందని, భారత పూర్వీకులు దేశాలను ఆక్రమించేందుకు కాక జ్ఞానాన్ని పంచేందుకు విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు.ఇక్కడ సమస్య యావత్ ప్రపంచానికి మన పూర్వీకులు జ్ఞానం ప్రసాదిస్తే, అది మన వేదాలు, పురాణాల్లో నిక్షిప్తమై ఉంటే దాన్ని మనం వినియోగించుకోకుండా “మ్లేచ్చులకు” అందించి వారు విమానాలు, క్షిపణులను తయారు చేసేందుకు ఎందుకు సహకరించినట్లు? పారిశ్రా మిక విప్లవాన్ని, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉండి, సమాజాన్ని నిచ్చెనమెట్ల వివక్షా పూరితంగా ఎందుకు తయారు చేసుకున్నాం. సముద్రాలు దాటి ప్రయాణించిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎందుకు నిబంధనలు విధించినట్లు?

మనపూర్వీకులు ప్రపంచాన్ని చుట్టి జ్ఞానాన్ని అందిం చారని చెబుతున్న వారు ప్రయాణాలను నిషేధించిన బౌధాయన ధర్మశాస్త్రం, మనుస్మృతి గురించి ఏం చెబుతారు. సముద్రాలు దాటితే కుల భ్రష్టులౌతారు, ఆచారాలు మంటకలుస్తాయని చెప్పిన ఆంక్షల నేపథ్యంలో భగవత్ చెప్పిన పూర్వీకులు విదేశాలకు వెళ్లారంటే వారు తిరుగుబాటుదారులై ఉండాలి. అలాంటి వారిని పొగుడుతున్న కాషాయ దళాలు మరోవైపు మనుస్మృతిని విమర్శించే వారిని హిందూ వ్యతిరేకులు అని ఎందుకు నిందిస్తున్నట్లు? సనాతనాన్ని కాపాడాలి లేదా పునరుద్ధరిం చాలని చెబుతున్నవారు సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నట్లా, వెనక్కు నడపాలని చూస్తున్నారా? జనాలు ఊరూపేరులేని వాట్సాప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా స్వంత మెదళ్లకు పని పెట్టాలి. హిందూ అంటే మతం కాదు, జీవన విధానం అని చెబుతారు. “నేను హిందూ అని చెప్పినపుడు ఆ పదాన్ని ఒక నిర్దిష్ట భాష, ప్రత్యేక ఆరాధన రూపం, లేదా ఏ జీవన శైలితోనూ నిర్వచించకూడదు. హిందువులు అందరినీ గౌరవించాలి, అందరినీ ఆమోదించాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడాలి,” అని భగవత్ చెప్పారు. ఆచరణలో కాషాయ దళాలు అలాగే ఉన్నాయా? ఒకవైపు వసుధైక కుటుంబం అని చెబుతారు. మరోవైపు దేశంలో జనాభాను పెంచుతూ ముస్లింలు మెజారిటీగా మారేందుకు చూస్తున్నారని ఆరోపిస్తూ, హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని ప్రబోధించటం తెలీదా? దక్షిణ భారత్‌లో ఉన్న హిందువులు కుటుంబ నియంత్రణ ఎందుకు పాటిస్తున్నారు, ఉత్తర భారతంలోని వారు ఎందుకు ముందుకు రావటం లేదు? జనాభా నియంత్రణ అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

ప్రపంచ సగటు జననాల రేటు 2.23 కాగా, అంతకంటే తక్కువగా ఉన్న ముస్లిం దేశ సమాజాలు కూడా ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని మతపరంగా ముస్లింలతో నింపాలనే కుట్ర ఉంటే మాల్దీవులు, మలేషియా, బహరెయిన్, ఇరాన్, టర్కీ వంటి చోట్ల మనకంటే తక్కువగా జననాల రేటు ఎందుకు ఉన్నట్లు? ఏ దేశానికైనా జనాభా వృద్ధి రేటు 2.1గా ఉండాలన్నది ఆ రంగ నిపుణుల సిఫార్సు. మనదేశంలో సగటు రెండుగా ఉంది. ఇక మతాల వారీ చూస్తే ముస్లింలు 2.36, హిందువులు 1.94 ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 1992లో ముస్లింలలో 4.41గా ఉన్న పిల్లలు 2019-21 నాటికి 2.36కు తగ్గారు. ఇదే కాలంలో రెండు మతాల వారి మధ్య ఉన్న తేడా 1.11 నుంచి 0.42కు తగ్గింది. కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవారు, నమ్మేవారు దీనికి ఏ సమాధానం చెబుతారు? యావత్ ప్రపంచం ఒకే కుటుంబం అని మోహన్ భగవత్ సెలవిస్తారు. వారి రాజకీయ ప్రతినిధి బీజేపీ ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని చెబుతుంది. చట్టసభల ఎన్నికల్లో మాత్రం దేశంలో 15శాతంగా ఉన్న ముస్లిం సామాజిక తరగతిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా తమ అభ్యర్ధులుగా నిలపదు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అన్ని కులాలవారికీ ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని చెప్పే పార్టీ మత వివక్షతో అసలు అవకాశం కల్పించకపోవటాన్ని మతోన్మాదం లేదా మతవిభజనగాక ఏ పేరుతో పిలవాలి? మోహన్ భగవత్ పర్యటనకు మూడు దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక్కడ సమస్య వ్యక్తిగతం కాదు. భావజాలం, విద్వేష పూరిత వ్యాఖ్యలు, ఆచరణకు సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

ఆరెస్సెస్‌ సభతో కెనడాలో సామాజిక అశాంతి తలెత్తుతుందని, మైనారిటీలుగా ఉన్న ముస్లింలు, సిక్కులు, దళితులకు ముప్పు తలెత్తుతుందని ఎన్‌డిపి పక్ష ఎంపీలు ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. అక్కడి పౌర సమాజంలోని 267 సంస్థలు, బృందాలు కూడా భగవత్ ప్రవేశానికి అనుమతి ఇవ్వకూడదని, ఆరెస్సెస్‌ను నిషేధించాలని కోరాయి. దీనికి పోటీగా వందకుపైగా ఇండో-కెనడియన్ హిందూ సంస్థలు రాసిన లేఖలో ఆధారం లేకుండా నిషేధం విధించటం అన్యాయమైన రాజకీయ వత్తిడి అని, భగవత్ పర్యటనను అడ్డుకోవటమంటే కెనడా హిందూ సమాజం పట్ల వివక్ష చూపటమేనని పేర్కొన్నాయి. కెనడా మాజీ రక్షణ మంత్రితో సహా మరికొందరు ఆరెస్సెస్‌కు మద్దతు పలికారు. బ్రిటన్‌లో దక్షిణాసియా సంతతికి చెందినవారు, మానవహక్కుల బృందాలు పర్యటనను వ్యతిరేకించాయి. వసుధైక కుటుంబ ఉత్సవాల ముసుగులో అమెరికాలో ఏర్పాటు చేసిన మోహన్ భగవత్ పర్యటనపట్ల కూడా వ్యతిరేకత వెల్లడైంది. సభ జరిగిన మాడిసన్ స్క్వేర్ న్యూయార్క్ నగరంలో ఉంది. ఆ నగర మేయర్ జోహ్రాన్ మందానీ ఆరెస్సెస్‌ నేత పర్యటనకు తాను వ్యతిరేకమని, అయితే ఒక మేయర్‌గా భగవత్ కార్యక్రమాలను అడ్డుకొనే అధికారం తనకు లేదని చెప్పారు. జోహ్రాన్ తండ్రి గుజరాతీ మూలాలున్న అమెరికా పౌరుడు మహమ్మద్ మందానీ, తల్లి ప్రముఖ భారతీయ సినిమా దర్శకురాలు మీరా నాయర్. మూడు పదులు దాటిన జోహ్రాన్ న్యూయార్క్ నగరానికి తొలి ఇండియన్-అమెరికన్ మేయర్‌గా చరిత్రకెక్కారు.

అమెరికా పార్లమెంట్‌కు సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మతస్వేచ్చ అమెరికా కమిషన్ (యుఎస్‌సిఐఆ‌ర్‌ఎఫ్) అమెరికా ప్రభుత్వ అధికారులు భగవత్‌ను కలవరాదని కోరింది. ఆరెస్సెస్‌ ఉపసంఘాలు మతపరమైన మైనారిటీల మీద హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఆ సంస్థ నివేదికలో పేర్కొన్నది. ఈ సంస్థ పక్షపాతంతో కూడినదని, దానికి విశ్వసనీయత లేదని మన విదేశాంగ శాఖ ఆరెస్సెస్‌ను వెనుకేసుకు వచ్చింది. తీవ్ర వ్యతిరేకత తలెత్తిన నేపథ్యంలో సభా నిర్వహకుల ఎక్స్ ఖాతాను ఆ సంస్థ యాజమాన్యం నిలిపివేసి వత్తిడి తరువాత పునరుద్ధరించింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సభకు హాజరయ్యేవారికి సూచించింది. ఇలాంటి సంస్థలు ఎంతగా రెచ్చగొట్టినా ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు లేకుండా కార్యక్రమం ముగిసింది. ఆరెస్సెస్‌ వ్యాపింపచేస్తున్న పచ్చి అవాస్తవాలు ఎన్నో. జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సే అంతకు ముందే తమ సంస్థనుంచి వెళ్లిపోయి హిందూమహాసభలో చేరాడన్నది వాటిలో ఒకటి. అయితే గాడ్సే ఎప్పుడు ఆరెస్సెస్‌లో చేరిందీ, ఎప్పుడు వెళ్లిపోయిందీ ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఆ సంస్థ సభ్యత్వం రహస్యం. నాధూరామ్ గాడ్సే, అతని సోదరుడు గోపాల్ గాడ్సే ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తలని, వారెప్పుడూ సంస్థ నుంచి బయటకు పోలేదని కుటుంబ సభ్యులు పదే పదే స్పష్టం చేశారు.గోపాల్ గాడ్సే మనుమడు సాత్యకీ సావర్కర్ ఒక పరువు నష్టం కేసులో 2026 ఆగస్టు నెలలో పూనా కోర్టులో సాక్ష్యమిస్తూ అదే చెప్పాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సావర్కర్, గాడ్సే కుటుంబాలకు ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాల గురించి సాత్యకి చెప్పిన అంశాలను ప్రచురించింది. గాడ్సే కోర్టులో చేసిన వాదనలను పుస్తకరూపంలో అచ్చువేసి ప్రచారంలో పెడుతున్నది కాషాయ దళం తప్ప మరొక “దేశభక్తుడు” ఎవరూ కాదు. అయినా సరే గాడ్సేతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరెస్సెస్‌ పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. మోహన్ భగవత్ మూడు దేశాల పర్యటన సందర్భంగా ఆర్గనైజర్ పత్రికలో దాన్నే పునరుద్ఘాటించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !

26 Wednesday Aug 2026

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, UK, USA, Ycp

≈ Leave a comment

Tags

chandababu, China World Factory, Countries manufacturing share, Donald trump, Narendra Modi Failures, Niti Aayog, pavan kalyan, World Bank, world Trade, Xi Jinping

ఎం.కోటేశ్వరరావు

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసంలో మేడిన్ ఇండియా ( భారత తయారీ) వస్తువులు ప్రపంచంలో ప్రతి మూలకూ చేర్చటం లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. “ఉన్నమాట అన్నా వు ఎవ్వరు నేర్పిన మాటరా వేదంలా విలువైన మాట” అనే సినిమా పాటను గుర్తుచేశారు. పాడిందే పాడరా అన్నట్లుగా ఇలాంటి మాటలు ఎన్నిసార్లు చెబుతారు, దేశాన్ని ఎటువైపు తీసుకుపోతు న్నారన్నదే అసలైన సమస్య. ప్రధానిగా తొలి ఆగస్టు పదిహేను అంటే 2014 ప్రసంగంలో మేకిన్ ఇండియా(భారత్‌లో తయారీ) పిలుపునిచ్చారు. “రండి, భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఏ దేశంలోనైనా విక్రయిం చండి, కానీ వాటిని భారత్‌లోనే ఉత్పత్తి చేయాలి” అని విదేశీ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. అదే ఏడాది సెప్టెంబరు 25న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాదీ ఏదో ఒక సందర్భంగా ఇలాంటి పిలుపులిస్తూనే ఉన్నారు. కనుచూపు మేరలో కూడా ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపిం చటం లేదు, అయినా పదే పదే చెబుతున్నారంటే దాన్నే మనాలి? భారత తయారీ సప్తధారల్లో జరగాలని మోడీ చెప్పారు. చెప్పిన మాట చెప్పకుండా తన కార్యాలయం రాసిచ్చిన ఉపన్యాసాలను కొత్త కొత్త పదజాలంతో కాశీ మజిలీ కథల మాదిరి ఊకదంపుడుతో కొత్తవాటిని చెప్పటం తప్ప అడుగు ముందుకు పడటం లేదు. డ్రోన్ వ్యవస్థలను మనం అభివద్ధి చేయాలని, హైపర్‌సోనిక్ రక్షణ సాంకేతిక రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలని కూడా చెప్పారు. పన్నెండేండ్లుగా ఎవరు వద్దన్నారు.

ఇప్పటికే మనకంటే ఎంతో ముందున్న దేశాలు ఈ రంగాల్లో ఇంకా ముందుకు పోతాయి. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు దేశాన్ని తయారు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పోటీతత్వం లేకపోతే వర్తమానంలో ఏ దేశమూ పరుగులో నిలవలేదు. అందుకు అవసరమైనట్లుగా పని చేశామా లేదా అన్నదే ముఖ్యం. స్విడ్జర్లాండ్‌లోని లాసానే నగరంలో 1990లో ఐఎండి బిజినెస్ స్కూలు ఉంది. దాన్నొక ప్రతిష్టాత్మక సంస్థగా పరిగణిస్తున్నారు. ప్రతి ఏటా దేశాలను ఎంచుకొని పోటీతత్వ సూచికలను ప్రకటిస్తుంటుంది. తాజా 2026 నివేదిక ప్రకారం మన దేశం 44వ ర్యాంకులో ఉంటే చైనా పన్నెండవదిగా ఉంది. ప్రధాని చెబుతున్నట్లుగా 2047 నాటికి లేదా అంతకు ముందే మనదేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా? మోడీ చెప్పినట్లు మన వస్తువులన్నీ ప్రపంచంలో అన్ని మూలలకు ఎగుమతి అవుతాయా? మాటలు కోటలు దాటటం తప్ప చేతలు గడపదాటటం లేదనే లోకోక్తి తెలిసిందే. ఇతర దేశాలతో పోటీ పడకపోవటానికి కాంగ్రెస్, నెహ్రూ, గాంధీ కారణమని కాషాయ దళాలు చెబుతుంటాయి.2014 నుంచి అధికారం లో ఉన్న మోడీ ఏం చేశారన్నదే ప్రశ్న. తొలిసారిగా ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగురవేసినపుడు ఐఎండి నివేదిక ప్రకారం భారత్ 2013లో 40వదిగా, చైనా 21వ స్థానంలో ఉంది.

పైన చెప్పుకున్నట్లు తాజా సూచికల ప్రకారం 44-12 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచమంతటా తిరిగి యుపిఏ హయాంలో కోల్పోయిన దేశ ప్రతిష్టను తిరిగి తీసుకువచ్చా నని చెప్పిన తరువాత పరిస్థితి ఇది. చైనా ఎలా పెంచుకుందో, మనం ఎలా దిగజారామో దానికి కారకులు ఎవరో ఎవరిని అడిగినా చెబుతారు. ‘బుద్దులు భూములను ఏలుతుంటే రాతలు గాడిదలను కాస్తున్నాయనే’ లోకోక్తిని ఇక్కడ గుర్తు చేయకతప్పటం లేదు. మోడీ అధికారానికి వచ్చినపుడు కమ్యూనిస్టు చైనా నుంచి మనం 6,040 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకున్నాం, 2026 మార్చినెల నాటికి 13,160 కోట్ల డాలర్లకు పెరిగాయి, ఇదే సమయంలో చైనాతో వాణిజ్యలోటు 3,600-4,000 కోట్ల మధ్య ఉన్నది 11,200 కోట్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో దిగుమతులు, వాణిజ్యలోటు మరింతగా పెరగనున్నట్లు చెబుతున్నారు. బీజేపీ నేతలు చైనా నుంచి మనం సెల్‌ఫోన్ల దిగుమతులను తగ్గించాం చూశారా మోడీ ఘనత అంటూ అడ్డుసవాళ్లు విసురుతారు. ఎలక్ట్రానిక్స్ రంగం లో పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రాయితీ లిస్తున్నది గనుక అనేక కంపెనీలు మనదేశం లోనే ఫోన్లు తయారు చేస్తున్నందున దిగుమతు లు తగ్గినమాట నిజం, కానీ మొత్తంగా దిగుమతులు ఎందుకు పెరుగుతున్నట్లు ? మన వాణిజ్యలోటు పెరగటం అంటే ఏటా మనం చైనాకు అప్పనంగా అంత మొత్తాలను చెల్లిస్తున్నాం. ఎందుకీ పరిస్థితి ?

ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా ఒక భాగంగా ఉండాలని, వస్తువులను ఎగుమతి చేయాలని నిటి ఆయోగ్ నివేదికలు ఎప్పటికపుడు చెబుతూనే ఉన్నాయి. ఇదిగో ఫలానా రంగంలో అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనే 2047 నాటికి లక్ష్యాలను చేరాలంటే మొత్తం 62 అంశాల జాబితాను రూపొందించి వాటిలో 12 రంగాలను గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇన్నేండ్ల నుంచి ఎందుకు విఫలమ య్యామనే అంశాన్ని మోడీ ఎప్పుడైనా చెప్పారా? ఈ రంగాల్లోకి అత్యధికంగా ప్రయివేటు పెట్టు బడులు వస్తేనే లక్ష్యాన్ని సాధించగలమని నిటిఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి చెప్పారు. మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో జీడీపీలో 25-26 శాతం ప్రయివేటురంగ పెట్టు బడులు ఉండేవి, ఇటీవల 22 శాతానికి తగ్గాయి, అదీ కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఇతర రాయితీలిచ్చినప్పటికీ పెరగకపోగా తగ్గాయి. దేశంలో ఉన్న ప్రయివేటు రంగమే ముందుకు రాకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఎలా వస్తాయి? 2047 నాటికి దేశ జీడీపీని 30లక్షల కోట్లకు చేరుస్తామని చెబుతున్నారు. అందుకు గాను వచ్చే 20ఏండ్లు ఏటా పదిశాతంపైగా వాస్తవ వృద్ధి రేటు ఉండాలని ఆర్థికవేత్తలు చెబు తున్నారు. దానికి ప్రాతిపదిక ఉందా? అలా జరిగితే ఇలా జరిగితే లక్ష్యాలను సాధించటం కష్టమేమీ కాదని చెప్పేవారు కోకొల్లలు… తనదిగాకపోతే కాశీ వరకు తాటిపట్ట మీద దేకవచ్చాన్నడట వెనుకటికి ఎవడో.

ప్రపంచ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 28శాతం కాగా మనం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ మన వాటా మూడు శాతం దగ్గరే ఉంది. 2004లో చైనా వాటా పదిశాతం లోపుగానే ఉంది. విలువలో 625 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 4.66లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇక అమెరికా విషయానికి వస్తే ఇదే కాలలో 22శాతం నుంచి 17కు, ఐరోపా ప్రాంత వాటా తగ్గి 15శాతానికి పరిమితం కాగా జపాన్ ఐదుశాతం కలిగి ఉంది.ఇదే సమయంలో మన వాటా 1.6-1.8శాతం మధ్య ఉంది, అది 2014నాటికి రెండు శాతానికి చేరింది. మోడీ ఏలుబడిలో ఇప్పటివరకు మూడుశాతానికి పెరిగింది. అమెరికా, జపాన్, జర్మనీ మూడింటి కంటే ఎక్కువగా చైనా ఉత్పత్తి ఉంది. ఆశలు, ఊహలు, అడుక్కొనే విషయాల్లో పిసినారితనం ఉండకూ డదంటారు పెద్దలు.ఇలాంటి స్థితిలో ప్రపంచ కేంద్రంగా మనదేశాన్ని మారుస్తానని, మోడీ, ఆయన భజన బృందం లోని ఆకాశానికి నిచ్చెనలు వేసే చంద్రబాబు వంటి వారు చెబితే నమ్మేదెలా ? పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తే కొన్ని రంగాల్లో పురోగతి ఉండవచ్చు కానీ మా ఊర్లో మిరియాలు తాటికాయలంత అంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. కరోనా సమయంలో చైనాలోని కంపెనీలన్ని అక్కడి నుంచి దుకాణాలు ఎత్తేసి భారత్‌కు వస్తున్నట్లు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడా చప్పుడు చేయటం లేదు. ఉత్పాదక రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తే దిగుమతులపై ఆధార పడాల్సిన పనిలేదు, ఉద్యోగ సృష్టి జరుగుతుంది.

అమెరికా అంత అగ్రరాజ్యమే మా దేశంలో పెట్టుబడులు పెడతారా లేక మీ సంగతి చూడమంటారా అని బెదిరింపులకు దిగటం వెనుక పరమార్ధం ఇదే. చైనా ఇప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తుల మీద కేంద్రీకరిస్తోంది, అది కేంద్రీకరణ తగ్గించిన రంగాల్లో మనం బలపడవచ్చని నిటి ఆయోగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 2000 సంవత్సరంలో ఆరుశాతమే, 2030 నాటికి 45శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా తదితర ధనిక దేశాలు 1948లో సోవియట్ యూనియన్, చైనా లేకుండా 23 స్థాపక దేశాలతో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్(గాట్-పన్నులు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం) జరిగింది. దీనిలో భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. అది 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థగా మారింది. అయినప్పటికీ 2001 వరకు చైనాను దానిలో చేరకుండా అడ్డుకున్నారు.అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతూ చౌకగా అనేక ఉత్పత్తులను అందచేస్తున్న క్రమంలో తమ ప్రయోజనాల కోసం అడ్డుకున్నదేశాలే సభ్యత్వం ఇవ్వక తప్పలేదు. ఆ తరువాత బీజింగ్ వెనుదిరిగి చూడలేదు, ఎగుమతుల అవకాశాలు మరింతగా పెరిగాయి. నవీకరణతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ వచ్చాయి. మేడిన్ చైనా 2025 వంటి లక్ష్యాలు, అందుకు అవసరమైన విధానాలతో ముందుకు పోవటమే గాక అవసరమైన కార్మికశక్తి నైపుణ్యాల ను కూడా పెంచింది.

రవాణా సదుపాయాల మెరుగుదలకు విస్తరించిన రోడ్లు,రైలు, బుల్లెట్ రైళ్లను చూసి అవసరం లేకున్నా నిర్మించిందని విమర్శించిన వారే ఇప్పుడు ఔరా ఎంత ముందు చూపుతో చేశారని ముక్కున వేలేసుకుంటు న్నారు. నిజానికి మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వ పెట్టుబడులు తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటంతో స్థానికంగా కొనుగోలు శక్తికూడా పెరిగింది. తక్కువ ఖర్చులో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు నేడు ఎంతో లాభసాటిగా మారాయి.2010 నుంచి పారిశ్రామిక ఉత్పత్తికి దోహదం చేయటంలో చైనా ప్రధమ స్థానంలో కొనసాగు తోంది. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని ఆక్రమించాల ని చూశారు. ఇప్పుడది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించేందుకు పూనుకున్నారు. వారికి చైనా కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఏడుపు ఏమంటే ఇప్పటి వరకు ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా రానున్న రోజుల్లో సరఫరా కేంద్రంగా కూడా మారనున్నదని దోపిడీదార్లు భయ పడుతున్నారు. జపాన్ సుజుకీ కంపెనీ మనదేశం లో మారుతీ కార్లకు కీలక విడి భాగాలను అందిస్తున్నట్లే చైనా అను సరిస్తున్నది. దుస్తుల రంగంలో 2023 వివ రాలను చూసిన పుడు చైనా ముడిసరకు ఎగుమతులు 16, ఇంటర్‌మీడియెట్ ఉత్పత్తులు 21,పాక్షికంగా తయారైనవి 47, పూర్తిగా తయారైనవి 30శాతం ఉన్నాయి. వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి పలకల్లో పూర్తిగా తయారైనవి 54శాతం చొప్పున ఉన్నాయి.

విద్యుత్ వాహనాల లో 51శాతం పాక్షికంగా తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నది. ఇవన్నీ గిరాకీ మీద ఆధారపడి ఉన్నాయి.అనేక దేశాలు చైనా నుంచి విడి భాగాలను తెచ్చుకొని వాటితో పూర్తి వస్తువులను తయారు చేస్తున్నారు. అది లాభసాటిగా ఉన్నంత కాలం సాగుతుంది.చైనా లావాదేవీలన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకే జరుగుతున్నందున అమెరికా, మరికొన్ని దేశాలకు కడుపు మంటగా ఉంది. ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను కబళించేందుకు చూసిన శక్తులు నేడు అది విఫలమైందని, చైనా తొండి ఆట ఆడుతున్నదని అంటూ పూర్వపు రక్షణాత్మక విధానాలవైపు మళ్లుతున్నారు.పురాతన కాలంలో వివిధ దేశాల మధ్య వస్తు వ్యాపారం ఉన్నట్లు చరిత్రలో నమోదైంది. అయితే వర్తమానంలో ఎగుమతులు-దిగుమతుల క్రమం 1870లో ప్రారంభమైందని చెబుతు న్నారు. పారిశ్రామిక విప్లవం తరువాత వస్తూత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరగటంతో ఇది జరిగింది.

బ్రిటన్ ఎగుమతుల్లో ప్రధమ స్థానంలో ఉంది, ఒక దశలో అది ఎగుమతి చేసిన వాటిలో 42శాతం భారత ఉత్పత్తులు ఆక్రమించాయి.బ్రిటన్ తరువాత రెండవ స్థానంలో జర్మనీ హవా నడిచింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ముందుకు వచ్చింది .1980,90దశకాల్లో జపాన్ ఎలక్ట్రానిక్స్‌తో ప్రపంచాన్ని నింపివేసింది. నూతన సహస్రాబ్ది ప్రారంభం నుంచి చైనా అగ్రస్థానానికి చేరింది.1948లో ప్రపంచ వస్తు ఎగుమతుల విలువ కేవలం 59 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా 2025లో 26లక్షల కోట్ల డాలర్లు దాటింది.దానిలో చైనా వాటా ముందే చెప్పుకున్నట్లు 4లక్షల కోట్ల డాలర్లు దాటింది. నల్లమందు భాయీలని ప్రపంచం ఈసడించిన చైనీయులను పూర్తిగా మార్చి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాధించిన ఘనత ఇది! కాదంటారా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

19 Wednesday Aug 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

GDP growth, Global Wealth Report 2026, income inequality, Narendra Modi Failures, wealth inequality

ఎం కోటేశ్వరరావు

గడచిన పదేండ్లలో ప్రపంచ వృద్ధి రేటులో పెద్ద మార్పు లేదు. కానీ అదే సమయంలో కొంత మంది సంపద విపరీతంగా పెరిగింది. ధనవంతుల సంఖ్యలో కూడా అదే తీరు. పేదలు మరింతగా పేదలౌతున్నారు. ఎందుకిలా జరుగు తోంది? యుబిఎస్ అనే పెద్ద స్విస్ బ్యాంకు 2026 సంవత్సర ప్రపంచ సంపద నివేదికను ఇటీవలే విడుదల చేసింది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(వంద కోట్ల డాలర్లు, ప్రస్తుత విలువ ప్రకారం రూ.9,562 కోట్ల 34లక్షల,50వేలు) అంతకు మించి సంపద ఉన్నవారి సంఖ్య 2025లో ప్రపంచంలో 3,302 మంది ఉన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 383 మంది(13.1శాతం) పెరిగారు. వీరిలో వెయ్యి మందికి పైగా అమెరికా, 562 మంది చైనా, 211 మంది మనదేశంలో ఉన్నారు. తరువాత స్థానాల్లో జర్మనీ 193, రష్యాలో 122 మంది తేలారు. సగటున వీరి సంపద అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 25శాతం పెరిగింది. ప్రపంచ వృద్ధి రేటుకు ఎన్నోరెట్లు ఎక్కువ. దక్షిణ కొరియా, హంగరీలో పెరుగుదల రేటు రెట్టింపు కాగా, చిలీలో 80, చెక్, మెక్సికోలలో 60, బ్రెజిల్, గ్రీస్‌లలో యాభై శాతానికి మించి ఉంది. ఈ వివరాలు 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ సమాచారం మేరకు వెల్లడించారు. దక్షిణ కొరియాలో ఏడాది కాలంలో బిలియనీర్లు 31 నుంచి 52కు పెరిగారు.

అయితే ప్రపంచ మంతటా అలాగే ఉందా? కొన్ని దేశాల్లో స్ధిరంగా, కొన్నిచోట్ల తగ్గారు. చిలీలో పెరగకపోగా థాయ్‌లాండ్‌లో 25 నుంచి 22కు, సౌదీ అరేబియాలో19 నుంచి 16కు తగ్గారు. గతంలో లక్ష రూపాయల సంపద ఉంటే లక్షాధికారి అని పిలిచారు. ఇప్పుడు వారి స్థానంలో మిలియనీర్ (అంటే కనీసం పది లక్షలు)లు వచ్చారు. ఇది కూడా అమెరికన్ డాలర్లలో లెక్కవేస్తున్నారు. ఇలాంటి వారు గతేడాది 1.5శాతం మంది పెరిగారు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే రోజుకు 2,680 మంది కొత్తగా మిలియనీర్లు అయ్యారు. తూర్పు ఐరోపాలో ఈ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. గతేడాది మొత్తం పదిలక్షల మంది కొత్తగా మిలియనీర్ల జాబితాలో చేరితే వారిలో సగం మంది ఒక్క అమెరికాలోనే ఉన్నారు. ప్రపంచంలో అధిక సంపద ఉన్న దేశం అమెరికా అన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి జనాలందరూ ధన వంతులా అన్నది అసలు సమస్య. సగటు ఆదాయం, సగటు సంపదకూ, మధ్యగత రాబడి, సంపదకూ తేడా ఉంది. దాన్ని అర్ధం చేసుకుంటే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ అమెరికాలో ఉన్నాడు. అయితే అమెరికన్లందరూ ఎలన్ మస్క్‌లు కారు. మనదేశంలో అంబానీ, అదానీలు ఎలా ధనవంతులో జనం అందరి స్థితి అది కాదని తెలిసిందే. యుబిఎస్ నివేదిక 30 ధనిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాల గురించి సగటున ఒక వ్యక్తి సంపద ఎంత అని విశ్లేషించింది.

ఒక దేశ సంపద విలువను జనాభాతో భాగిస్తే సగటు ఎంతో తెలుస్తుంది. ఒకడి దగ్గర లక్ష, మరొకడి దగ్గర వెయ్యి రూపాయలుంటే సగటు ఇద్దరి రూ.50,500 అవుతుంది. లొట్టలేసుకుంటూ చెప్పే ఈ అంకెలతో రెండవ వాడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా! ఈ లెక్కన స్విట్జర్లాండ్ సగటు సంపదలో మొదటి స్థానంలో ఉంటే అమెరికా రెండవది. మీడియన్ సంపద (మధ్యగత)ను చూస్తే అదే అమెరికా 28వ స్థానానికి దిగజారింది.మరో మాటలో చెప్పాలంటే 27 దేశాలు మెరుగ్గా ఉన్నాయి. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఒక ఊరిలో పది మంది ఉంటే ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయను కుందాం. సగటున చూసినా, మధ్యగతంగా చూసినా వెయ్యి రూపాయలే ఉంటాయి. అంటే సంపద అందరి దగ్గరా సమంగా ఉన్నట్లు. అదే ఊరిలోని మరో పది మందిలో ఒకడి దగ్గర లక్ష ఉండి తొమ్మిది మంది వద్ద వెయ్యి ఉంటే సగటున ఒక్కొక్కరి దగ్గర 10,900 ఉన్నట్లు మధ్యగత సంపద వెయ్యే ఉంటుంది. రెండవదే వాస్తవం. అందుకే సగటు సంపదలో అమెరికా రెండవది, మధ్యగతంలో 28వది. మరో ఉదాహరణగా బ్రిటన్‌‌ను చూద్దాం. ముప్ఫయి దేశాల జాబితాలో సగటులో 21, మధ్యగతంలో 13వదిగా ఉంది. దీని అర్ధం ఏమిటంటే అమెరికా కంటే సాధారణ పౌరుల పరిస్థితి బ్రిటన్‌లో మెరుగ్గా ఉంది, అసమానతలు తక్కువగా ఉన్నట్లు. మరికొన్ని వివరాలను చూద్దాం.అమెరికన్ డాలర్ల ప్రాతిపదికన సంపద విలువ.

దేశం — మధ్యగత– సగటు– గినీ
చైనా — 27,273 — 75,731 — 70.9
భారత్ —3,755—– 16,500— 80.2
పాక్ ——2,076——- 5,226— 74.4
బంగ్లా—- 3,842——- 9,786— 75.0
నేపాల్— 1,685 ——4,672 —-77.6
శ్రీలంక —8,615—- 23,991—- 77.2

ఎగువన ఉన్న అంకెలు చెబుతున్నదేమిటి? గినీ కోయఫిషియంట్ ప్రాతిపదికన 0 నుంచి 100వరకు పాయింట్లను చూస్తే ఎంత తక్కువ ఉంటే అంతగా అసమానతలు తక్కువగా, ఎంత ఎక్కువ ఉంటే అంతగా ఎక్కువ ఉన్నట్లు పరిగణిస్తారు. ఇదే విధంగా సగటుతో పోల్చినపుడు మధ్యగత ఎక్కువగా ఉంటే జనాల రాబడి లేదా సంపద ఎక్కువగా ఉన్నట్లు. ఈ వివరాల ప్రకారం చైనాలో కూడా సంపద అసమానతలు ఉన్నాయి. మనదేశం, ఇతర ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే తక్కువగా గిని ఉందంటే అర్ధం అసమానతలు తక్కువగా ఉన్నట్లు పరిగణిస్తున్నారు. మనం అగ్ర స్థానంలో ఉన్నాం. అమెరికాలో 77 ఉంది. ప్రజాస్వామిక దేశాలలో ఇంతగా అసమానతలు ఉండటం ఏమిటి? అక్కడే తొలి ట్రిలియనీర్-ఎలన్‌మస్క్ అవతరించాడు. మన నేతలు జీడీపీ చూశారా ‘యుపిఏ హయాంకంటే మేం పెంచాం’ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. జీడీపీ అంటే సంపద కాదు, ఒక ఏడాదిలో వస్తువులు, సేవల ద్వారా సృష్టించిన ఉత్పత్తి విలువ. తాము 2024 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల స్థాయికి జీడీపీని పెంచుతామని మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంది. మోడీ అధికారంలోకి వచ్చినపుడు 2014లో 2.04లక్షల కోట్లుగా ఉన్నది 2026లో 4.15లక్షల కోట్లకు(అంచనా) చేరింది. ఇప్పుడు 2029 నాటికి ఐదు లక్షల కోట్లకు చేరుస్తామని కొత్త గడువు చెప్పారు.

సోవియట్ యూనియన్ రద్దయిన తరువాత రష్యాలో ఉన్న ప్రభుత్వ సంపదలన్నింటినీ కొంతమంది పెద్దలు కొట్టేశారు. అమెరికా నయా ఉదారవాద పెట్టుబడిదారీ మేధావులు ఇచ్చిన సలహాల మేరకు ఇది జరిగింది. పుతిన్ ఇతర నేతలు వారి సలహాను పాటించారు గనుక రష్యా పోటీకి రాకుండా ఉండేందుకు ధనికదేశాల్లో ఒకటిగా పరిగణించి రాజీమార్గంగా జి7 కూటమిని జి8గా కూడా మార్చారు. అయితే ఆ ప్రయోగం వికటించింది. ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్న దేశాలలో ఇప్పుడు రష్యా ఒకటి. ఇక గల్ఫ్ దేశాలలో ఐక్య అరబ్ రిపబ్లిక్(యుఏయి) అసమానతలు విపరీతంగా ఉన్న సమాజం. దాని జనాభాలో కేవలం 13శాతం మంది మాత్రమే పౌరులు, మిగిలిన వారంతా వలస కూలీలే. ఆధునిక బానిసదేశంగా దాన్ని పరిగణిస్తారు. సంపదల అసమానతల గురించి ఫ్రెంచి ఆర్థికవేత్త గాబ్రియెల్ జక్‌మాన్ చేసిన విశ్లేషణ ప్రకారం అమెరికాలో కేవలం 19 మంది ధనికుల వద్ద 14శాతం వరకు జాతీయ ఆదాయం పోగుపడింది. దాని చరిత్రలో ఎన్నడూ సంపద ఇలా కేంద్రీకతం కాలేదు.

పదిశాతం ధనికుల వద్ద 50 శాతం ఆదాయ వృద్ధి ఉండగా దిగువ 50శాతం మంది వద్ద 15 నుంచి 20శాతమే ఉన్నట్లు కూడా జక్‌మాన్ చెప్పాడు.అమెరికా ఆర్థిక వ్యవస్థ వినిమయ ఖర్చు మీద ఆధారపడేట్లు చేశారు. పదిశాతం మంది ధనికులు యాభై శాతం ఖర్చు చేస్తుండగా ఇటీవలి కాలంలో దిగువ 60శాతం వాటా తగ్గిపోతున్నట్లు తేలింది.పారిశ్రామిక వద్ధి తగ్గటం, దిగుమతుల మీద ఆధారపడటం, కార్మికులకు వేతనాల పెరుగుదల మందగించటంతో రాబడి తగ్గటం వంటి కారణాలు అత్యధికుల్లో వినిమయం పడిపోవటానికి దారి తీస్తున్నది.1950 దశకంలో అమెరికా జీడీపీలో ఉత్పాదకరంగం వాటా 25శాతం ఉండగా ఇప్పుడు పదిశాతానికి పడిపోయింది.ఫైర్ రంగం అంటే ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియలెస్టేట్ వాటా 1947లో పదిశాతం ఉండగా ఇప్పుడు 21శాతానికి చేరింది. ఈ రంగం వృద్ధి కార్పొరేట్ కంపెనీలు, వాటిలో పని చేసే నిపుణులకు తప్ప సాధారణ కార్మికులకు రాబడి పెరగదు. తలసరి జీడీపీ పెరగవచ్చుగానీ జనాల జీవన ప్రమాణాలు ఆమేరకు పెరగటం లేదు.

ప్రపంచ ఇనీక్వాలిటీ లాబ్ (అసమానతల ప్రయోగశాల) సమాచారం ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఒక శాతం మంది చేతుల్లో 40.1శాతం సంపద పోగుపడగా రాబడిలో వారి వాటా 22.6శాతం ఉంది.(కొందరి అంచనా మేరకు 2022లో 25శాతం ఉంది) బ్రిటీష్ వారి ఏలుబడిలో 1922 నుంచి 1947 వరకు రాబడిలో ఎగువ ఒకశాతం వాటా 20-21శాతం మధ్య ఉందని అంచనా. అది స్వాతంత్య్రం తరువాత 1961నాటికి 13శాతానికి తగ్గింది.1991 నుంచి అమలు చేసిన నూతన ఆర్థిక విధానాల ఫలితంగా బ్రిటీష్ కాలం నాటి కంటే సంపద, రాబడి కేంద్రీకరణ ఎక్కువైంది. అమెరికాలో పాతకాలం నాటి రాక్‌ఫెల్లర్, ఫోర్డ్, జెపి మోర్గాన్ వంటి వారిని వెనక్కు నెట్టి ఇప్పుడు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బెర్గ్ వంటివారు ఎలా ముందుకు వచ్చారో మనదేశంలో టాటా, బిర్లా, గోయంకాలను దాటి అంబానీలు, అదానీలు దూసుకుపోవటాన్ని మనం చూడవచ్చు. ప్రపంచంలో ఆదాయ అసమానతల పెరుగుదల గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అమెరికాలో 2025 వివరాలను చూసినపుడు ఒక కంపెనీ సిఇఓ-కార్మికుడి వేతన వ్యత్యాసం ఆకాశానికి అంటినట్లు తేలింది. టెస్లా కంపెనీలో ఒక కార్మికుడి మధ్యగత ఆదాయం కంటే దాని అధిపతి ఎలన్ మస్క్‌కు 25లక్షల రెట్లు ఉందన్నది నమ్మలేని నిజం.

అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య ఎఎఫ్‌ఎల్-సిఐఓ వార్షిక వేతన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. స్టాండర్డ్ అండ్ పూర్ 500 కంపెనీల జాబితాను పరిశీలించినపుడు మధ్యగత వేతనంతో పోల్చితే ఉన్నతాధికారులకు 285రెట్లు అదనంగా ఇస్తున్నారు. ఇదే కంపెనీల సిఇఓల వేతనం 1,700శాతం ఎక్కువ. ఈ వ్యత్యాసం అన్ని రంగాలలో ఒకే విధంగా లేదు. ఉత్పాదకరంగంలో ఏడాదికి సగటున ఒక సిఇఓ 69.6 కోట్ల డాలర్లు పొందుతుండగా కార్మికుడు 93వేల డాలర్లు మాత్రమే తీసుకుంటున్నాడు.అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి అధికారానికి రావటానికి ముందు కంటే గతేడాది అతగాడి రాబడి 254 రెట్లు పెరిగింది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్సియల్ ట్రంప్ కుటుంబ క్రిప్టో కరెన్సీ కంపెనీ, దాన్నుంచి గతేడాది 220 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందాడు. ఈ మొత్తం ఒక సాధారణ అమెరికన్ కార్మికుడి రాబడితో పోల్చితే 43,154 రెట్లు ఎక్కువ. స్టాక్‌మార్కెట్‌లో మన కార్పొరేట్, పెద్ద కంపెనీల సిఇఓల వేతనం సాధారణ కార్మికుడి మధ్యగత వేతనం కంటే రెండువందల రెట్లు ఎక్కువ, అమెరికా తరువాత అంత తేడా ఉన్న ఘనత మనదే, ఎటువైపు పయనిస్తున్నట్లు!

Share this:

  • Tweet
  • More
Like Loading...

కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

15 Saturday Aug 2026

Posted by raomk in AP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Krishna Delta water crisis, Pulichinthala

డాక్టర్ కొల్లా రాజమోహన్,

 ‘ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం’గా పేరుపొందిన కృష్ణా డెల్టా నేడు తీవ్రమైన సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో (El Niño) ప్రభావం మరియు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో “ఈ సీజన్‌లో వరి పంట వేయవద్దు” అని ప్రభుత్వం జారీ చేసే సూచనలు డెల్టా రైతాంగాన్ని తీవ్రమైన దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి.2003 సంవత్సరంలో కృష్ణా డెల్టా లో రైతులు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొన్నారు.సాగు నీటి కోసం ఉద్యమం సాగించారు.ప్రకాశం బ్యారేజి పైన అతి పెద్ద ధర్నా నిర్వహంచారు.అతి తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధించారు. అప్పటికి పులిచింతల నిర్మించలేదు. పులిచింతల నిర్మించిన తరువాత కూడా కృష్ణా డెల్టా లో వరి పంట సాగుచేయవద్దనటం విచిత్రం గా వుంది.

1. కృష్ణా డెల్టా ప్రత్యేక పరిస్ధితులు – వరి వైపే రైతుల మొగ్గు ఎందుకు?

డెల్టా ప్రాంతంలో ప్రత్యామ్నాయ పంటలు వేయమని ప్రభుత్వం చెప్పడం కాగితం మీద సులువుగానే కనిపించినా, క్షేత్రస్థాయిలో ఉన్న భౌగోళిక పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి:

డెల్టా నేలలు ఎక్కువగా నల్లరేగడి నేలలు మరియు బంకమన్నునేలలు. ఈ ప్రత్యేక స్వభావం  వలన  భూమి నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుంటుంది. వరిపొలాలలో  నీరు నిల్వ వుండటంకోసం, పొలాలను గట్టులతో మడిగా ఏర్పాటు చేస్తారు., మడి లోనుండి మురుగు నీరు బయటకు మురుగు కాలువ లోనికి పంపటానికి వీలుగా ఏర్పాటు జరుగుతుంది.

 డ్రెయినేజ్ (మురుగు నీటి పారుదల) వ్యవస్ధ నిర్వహణ లోపం కారణంగా, కాలక్రమేణా కాలువలు, డ్రెయిన్లు పూడిపోవడం వల్ల సరైన నీటి పారుదల వ్యవస్థ లేదు. చిన్న వర్షం పడినా లేదా చిన్నపాటి తుఫాను వచ్చినా మాగాణి పొలాల్లో నీరు నిలిచిపోతుంది.

ప్రభుత్వం సూచించినట్లుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయటంవలన  నష్టం అపారంగా వుంటుంది. మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము వంటి ఆరుతడి పంటలు వేసినప్పుడు పొలంలో నీరు నిలిస్తే, వేరు కుళ్ళు తెగులు వచ్చి పంట క్షణాల్లో నాశనమవుతుంది. అందుకే రైతులు నీటిని తట్టుకునే వరి పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది.

2. ప్రభుత్వాల వద్ద ఉన్న అవకాశాలు & నీటి మేనేజ్మెంట్

ఎల్ నీనో ప్రభావం వలన తీవ్రమయిన వర్షాభావ పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కొన్నిచోట్ల అసలు వర్షాలు పడవు. మరి కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి. క్రిష్ణానది పరీవాహక ప్రాంతం చాలా పెద్దది. పరీవాహక ప్రాంతంలో కురుసిన వర్షపు నీటిని సద్వినియోగ పరచటంలోనే నిపుణుల యొక్క నైపుణ్యం, పరిపాలకుల సామర్ధ్యం ఇమిడి వుంటుది.

ఎగువన వర్షాలు లేకపోయినా, డెల్టాను ఆదుకోవడానికి అందుబాటులో ఉన్న ఇతర వనరులను సమర్థవంతంగా నిర్వహించాలనేది రైతుల ప్రధాన డిమాండ్:

పులిచింతల ప్రాజెక్టులో  లో 45 టీ యమ్ సీ ల నీటిని నిల్వచేయవచ్చని ప్రభుత్వం  చెప్తున్నది. పులిచింతల నిర్మాణం చేసేది, కృష్ణా డెల్టాలోని పంటల రక్షణ కోసమన్నారు. అదే ఉద్దేశ్యంతో కృష్ణా డెల్టాలోని ప్రజలు, రైతు నాయకులు పులిచింతల కోసం పోరాడి సాధించుకున్నారు. ప్రతికూల పరిస్ధితులలో, పులిచింతల నీటిని క్రిష్ణా డెల్టా పంటల రక్షణకుయోగిస్తామని పులిచింతల నిర్మాణం సమయంలో ప్రభుత్వాధినేతలు శెలవిచ్చారు. ఇపుడు మాటమార్చి, తాగునీటికోసం పులిచింతల అంటున్నారు. గతంలో లాగానే, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువులు నింపాలి.  మొట్టమొదట కట్టిన ప్రాజెక్టులకు వున్న (RIPARIAN RIGHTS ని ఉపయోగించుకోవాలి.  ఫైనుండి ప్రవహించినపుడు, నదీ తీర వాసులకు నీటిని వాడుకోవటానికి వున్న హక్కును ఉపయోగించుకోవాలి.  పూర్తి నీటి సామర్ధ్యం వరకు పులిచింతలలో నీటిని నింపి, అవసరమయినపుడు  క్రిష్ణా డెల్టా పంటల రక్షణకు ఉపయోగించుకోవాలి.అవసరమైతే వారబందీ పధతి ద్వారా లేక రేషన్ పధతి ద్వారా నీటిని అందించవచ్చు.

 గోదావరి నీటి సమర్థవంతంగా వినియోగించాలి. పట్టిసీమ ద్వారా గోదావరి నదిలో వరద నీరు ఉధృతంగా ఉన్నప్పుడు కృష్ణా డెల్టాకు నీటిని మళ్ళించి ప్రకాశం బ్యారేజీ ఆయకట్టును స్థిరీకరించవచ్చు.

 ఎగువ ప్రవాహాల సమన్వయం (Inflow Forecasting): మహారాష్ట్ర, కర్ణాటక (ఆల్మట్టి, నారాయణపూర్) ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినప్పుడు వచ్చే వరద నీటిని అంచనా వేసి, సాగర్ నుండి నీటి పంపిణీని ముందే ప్రణాళికాబద్ధంగా (Water Budgeting) నిర్వహించాలి.

 మౌలిక వసతుల పునరుద్ధరణ: ఇప్పటికిప్పుడు డ్రెయినేజ్ వ్యవస్థ మొత్తాన్ని ఆధునీకరించడం కష్టమే అయినా, ప్రధాన కాలువల్లో పూడికతీత, అడ్డంకుల తొలగింపు తక్షణమే చేపట్టడం ద్వారా మురుగు నీటి ముప్పును తగ్గించవచ్చు.

3). క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక మార్గాలు (మధ్యంతర పరిష్కారాలు)

ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకోవడానికి మరియు రైతులు పూర్తిగా నష్టపోకుండా ఉండటానికి సాంకేతిక, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న కొన్ని మార్గాలు:

1. వరి నేరుగా విత్తుట (Direct Seeded Rice – DSR):

 నారు పోసి, నీరు నిలబెట్టే సాంప్రదాయ పద్ధతికి స్వస్తి చెప్పి, డ్రమ్ సీడర్ లేదా గొర్రుతో నేరుగా విత్తుకోవడం.

 దీనివల్ల 30% వరకు నీరు, పెట్టుబడి వ్యయం ఆదా అవుతాయి.

2. స్వల్పకాలిక రకాల ఎంపిక:

 110-120 రోజుల్లో చేతికి వచ్చే తక్కువ నీటితో పండే వరి రకాలను సాగు చేయడం.

3. ఆరుతడి పంటలకు ఎత్తైన మడులు (Raised Bed Cultivation):

 మురుగు నీటి సౌకర్యం సరిగా లేని మాగాణుల్లో ఆరుతడి పంటలు వేయాల్సి వస్తే, బోదెలు (Raised Beds) చేసి పంటలు వేయడం ద్వారా నీరు నిలవకుండా కాపాడుకోవచ్చు.

4. సబ్సిడీ విత్తనాలు:& భీమా (Crop Insurance) అంశం

 రిస్క్ అనే ఆలోచన ఉన్నప్పటికీ, నీటి లభ్యత పై అనిశ్చితి స్ధితి కొనసాగుతున్నా వరి నారును సిధం చేస్తున్న రైతులను అభినందించాలి. ప్రోత్సహించాలి.అవసరమయిన అన్ని సహాయాలూ ప్రభుత్వం అందించాలి. .  భారీ రిస్క్ తీసుకుని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రీమియం కట్టి భీమా సౌకర్యాన్ని కలిగించాలి.. రైతులకు ఆర్థికంగా ఆ మాత్రం సహాయాన్ని ప్రభుత్వం చేయాలి. రైతు సేవా కేంద్రాల (RSK) ద్వారా డెల్టా భూములకు తగిన ఉచిత/సబ్సిడీ ప్రత్యామ్నాయ విత్తనాలను, సాంకేతిక సలహాలను ఉచితంగా అందించాలి.

5. దీర్ఘకాల ప్రణాలిక గా, వరద నీటిని  నిల్వ చేసుకునే ప్రయత్నాలను ముమ్మరంచేయాలి.అవనిగడ్డ ప్రాంతంలో రెండు చెక్ డామ్ లు కట్టటం ద్వారా 6.75 టీ.ఎమ్. సీ ల నీటిని నిల్వచేయటానికి అనుమతులు , ప్రణాళికలు సిధంగావున్నా ఆచణకు నోచుకోలేదు. పాలేరు, మున్నేరు పై రిజర్వాయర్ ల ద్వారా 5 టీ.ఎమ్. సీ ల నీటిని నిల్వచేయవచ్చని నిపుణులు సూచించినా ఆచరించలేదు.

ముగింపు

 పులిచింతల నీటిని క్రిష్ణా డెల్టా పంటల రక్షణకు వినియోగించాలి. మురుగు నీటి పారుదల వ్యవస్థ లోపాలు ఉన్నాయని తెలిసి పంట వద్దనడం కంటే,తక్షణ కాలువల పూడికతీత, మరియు తక్కువ నీటితో పండే నూతన సాగు పద్ధతులను ప్రోత్సహించడమే సరైన పరిష్కారం. గోదావరి–కృష్ణా జలాలను సరైన వాటర్ మేనేజ్ మెంట్ చేసి,సమన్వయంచేసి నీటిని రైతులకు అందించాలి. కృష్ణా డెల్టా రైతుకు సాగునీరు అనేది కేవలం వరి  పంట వేయాలా వద్దా అనే ప్రశ్న మాత్రమే కాదు, అది వారి జీవనాధారం. ఆంధ్ర ప్రజల ఆర్ధిక ప్రగతికి మూలాధారం. ప్రభుత్వం, రైతాంగం, రైతుసంఘాలు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే డెల్టాలో ఈ నీటి సంక్షోభాన్ని అధిగమించవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హైకోర్టు వ్యాఖ్య చెంపపెట్టు : గుజరాత్‌లో ఒక తల్లి విపరీత చర్య – మోడీ ఆదర్శ పాలన బండారం !

12 Wednesday Aug 2026

Posted by raomk in BJP, Current Affairs, Economics, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, Women

≈ Leave a comment

Tags

Gujarat High Court, Gujarat Hunger Matters, India Hunger Index, Justice H. D. Suthar, Lakhi Solanki, Narendra Modi Failures, Starvation In Gujarat

ఎం కోటేశ్వరరావు

“ ఆకలి ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడేట్లు చేసింది, ఇది సామÖహిక వైఫల్యం ” ఈ వ్యాఖ్య చేసింది గుజరాత్ హైకోర్టు న్యాయమÖర్తి హెచ్‌డి సుతార్. ఆ తల్లిది పన్నెండు సంవత్సరాల క్రితం ఒక ఆదర్శంగా వర్ణించి, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని అదే విధంగా మారుస్తానని వాగ్దానం చేసిన ప్రధాని నరేంద్రమోడీ స్వంతగడ్డ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 15 నుంచి 2014 మే 22వ తేదీ వరకు పని చేశారు. ఆ కాలాన్ని గుజరాత్ స్వర్ణయుగంగా కొందరు పరిగణిస్తారు. భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో మోడీ రాకతో వచ్చిందన్న బిజెపి ఎంపీ కంగన రనౌత్ చెప్పిందాని ప్రకారం గుజరాత్‌కు 2001లోనే వచ్చింది. మోడీ తరువాత అదే బిజెపి నేతల ఏలుబడిలో ఉంది. మోడీ కేంద్రంలో ప్రధానిగా రెండింజన్ల పాలన సాగిస్తున్నారు. అలాంటి చోట ఒక తల్లి తన రెండు సంవత్సరాల కుమార్తె (బేటీ పడావో, బేటీ బచావో నినాదం ఇచ్చిన తరువాత) ఆకలి తీర్చలేక పోయింది. అసహాయతకు లోనై ఏడుస్తున్న పసికందు నోరు మÖయించేందుకు ఒక దెబ్బవేసింది. అపస్మారకంలోకి పోవటంతో స్వయంగా ఆసుపత్రికి తీసుకుపోయింది.ఫలితం లేక ఆ బేటీ మరణించింది. కూతుర్ని చంపిన నేరానికి ఏడు నెలల గర్భిణిగా ఉన్న తల్లిని జైల్లో పెట్టారు. బెయిలు కోసం దరఖాస్తు చేస్తే గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. ఆ కేసులో హైకోర్టు విచారణలో న్యాయమÖర్తి ఆ తల్లికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు మీడియాలో పెద్దగా ప్రచారంలోకి రాలేదు, ఎందుకంటే అవి మోడీకే తగులుతాయి గనుక మÖసిపెట్టారు.

తనను దూషించిన జెన్ జి తరం యువతీ యువకులను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ గనుక అంత ఉదారత ప్రదర్శించారని దాన్ని కూడా ఆయన ప్రతిష్ట పెంచేందుకు ఉపయోగించిన వారిని దేశం చూసింది. అసలు క్షమాపణ చెప్పాల్సిన ప్రధానే క్షమించటం అనే విడ్డూరపు చర్యకు పాల్పడటం ఏమిటని కొందరు విమర్శించారు.కాసేపు దాని మంచి చెడ్డలను పక్కన పెడదాం. తన రాష్ట్రంలో ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడిన పరిస్థితులను కల్పించిన తన పాలనతీరు తెన్నులకు ఆ తల్లి ఉదంతం మీద మోడీ ఎందుకు స్పందించలేదు అన్నది అసలు సమస్య. సామÖహిక వైఫల్యం అన్న న్యాయమÖర్తి వ్యాఖ్య ప్రకారం దానిలో నరేంద్రమోడీ భాగం లేదా ? ఫ్రధాని లేదా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర బిజెపి నేతలెవరూ ఏ మాత్రం స్పందించలేదు. జూలై 20న ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేసిన వారు నరేంద్రమోడీని వ్యక్తిగా దూషించటం తనను ఎంతో కలచివేసిందని చెప్పిన జనసేనాని పవన్ కల్యాణ్‌లో సైతం ఎలాంటి స్పందన లేదు. అవునులే మోడీ వేరు, సామాన్యులు వేరు. అసలు ఆ తల్లి అలాంటి చర్యకు ఎందుకు పాల్పడినట్లు ? మన సమాజంలో భార్య, తలిదండ్రులను గాలికి వదిలేసే పెద్ద మనుషులను, అసలు తమకు వివాహమైనట్లే తెలియకుండా దాచేవారిని చూస్తున్నాము. సూరత్ ప్రాంతానికి చెందిన లఖీ సోలంకి ఇద్దరు బిడ్డల తల్లి, ఏడు నెలల గర్భంతో ఉంది. భర్త సముద్రం మీద పని చేసేందుకంటూ ఆరునెలల క్రితం ఆమెకు ఎలాంటి ఆదరువు చూపకుండా వెళ్లిపోయాడు. అతడు తిరిగి వస్తాడో రాడో తెలియదు,కడుపుతో ఉన్న ఆమెకు అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు కూడా లేవు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఇలాంటి స్థితిలో వివాహ బంధం లేకుండా మైత్రీ ఖరారు ఒప్పందంతో ఆమె ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఈ క్రమంలో ఆకలికి తాళలేక బిడ్డ ఈషా ఏడ్పులను తట్టుకోలేక 2026, మార్చినెల 19 తేదీన చేయిచేసుకుంది. ఈ ఉదంతం న్యాయమÖర్తి వ్యాఖ్యానించినట్లుగా దిక్కులేని కుటుంబాలు, వ్యక్తులు, వారి దారిద్య్రం, ఆకలి పట్ల సమాజ, ప్రభుత్వ చేతలు ఏమిటనే ప్రశ్నలను ముందుకు తెచ్చింది. ఏ ఇథియోపియానో, మరో ఆఫ్రికన్ దేశంలో ఈ ఉదంతం జరిగిందంటే అర్ధం చేసుకోవచ్చు.దేశం మొత్తం మీద సంపదలు కలిగిన ధనికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం గుజరాత్. విలువలు, వలువలు ఉన్నాయని చెప్పుకొనే సంఘపరివార్‌కు ఎంతో పట్టున్న ప్రాంతం.

లఖీ సోలంకి ఉదంతాన్ని ఒక వ్యక్తి విషాదంగా చూడటానికి లేదు. దుర్భరదారిద్య్రంలో నివసిస్తున్న వారి రక్షణకు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాల వ్యవస్థ వైఫల్యానికి ప్రతిబింబం అని కోర్టు వ్యాఖ్యానించింది. బిజెపి చెప్పే రెండింజన్ల పాలనలో ఉన్న గుజరాత్ ప్రభుత్వానికి ఈ వ్యాఖ్య చెంపపెట్టు. తల్లి కొట్టిన దెబ్బలకే రెండేండ్ల కూతురు మరణించినట్లు పోస్టు మార్టం నివేదికలో చెప్పినందున ఇది చాలా తీవ్రమైన నేరం అంటూ పోలీసులు లఖీకి బెయిలు ఇవ్వరాదని వాదించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆమే స్వయంగా అపస్మారకంతో ఉన్న తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లిందని, చంపాలనే ఉద్దేశ్యం ఆమెకు లేదని కోర్టు చెప్పింది. తన కుమార్తె ఆకలిని తీర్చలేక వత్తిడికిలోనై బాధ్యతారహితంగా వ్యవహరించిందని కూడా వ్యాఖ్యానించింది. ఆ కుటుంబం దీర్ఘకాలం పాటు దారిద్య్రం, ఆకలికి లోనైందని పేర్కొన్నది. ఇంకా ఇలా చెప్పింది. ఈ కేసును కేవలం ఒక నేర అంశంగా చూడకూడదు. పేదల పట్ల సమాజ బాధ్యతను గుర్తు చేసింది. పుట్టుకతోనే ఎవరూ నేరగాండ్లు కాదు.దారిద్య్రం, ఆకలి అలాంటి తీవ్ర పరిస్థితులవైపు నెట్టేధంగా పరిస్థితిని కల్పిస్తాయి.ఇది కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదు సమాజ వైఫల్యం. సంక్షేమ పథకాల యంత్రాంగాల లోపాలు మరియు తీవ్ర కష్టాల్లో ఉన్న మహిళలు, పిల్లలను ఆదుకోవాల్సిన రాజ్యం యొక్క రాజ్యాంగ బాధ్యతలను కూడా ఎత్తి చూపింది.

ఈ సందర్భంగా న్యాయమÖర్తి సుతార్ ఆకలి, దారిద్య్రం, న్యాయం మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేందుకు అనేక సాహిత్య, తత్వశాస్త్రాలు,మత గ్రంధాలు చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ఆకలి తప్ప మానవుడు దుర్మార్గుడు కాదు అని సందేశమిచ్చిన గ్పుురాతీ రచయిత పన్నాలాల్ పటేల్ నవల, తన కుటుంబ ఆకలి తీర్చేందుకు ఒక వ్యక్తి రొట్టెను అపహరించిన ఇతివృత్తంతో రచన చేసిన విక్టర్ హ్యూగో, దుర్భర దారిద్య్రం జనాలను నేరాలవైపు ఎలా నెడుతుందో చెప్పిన చార్లెస్ డికెన్స్ రచనలను ప్రస్తావించారు. విప్లవాలు, నేరాలకు జన్మనిచ్చేది దారిద్య్రం అన్న గ్రీకు తత్వవేత్త అరిస్టోటిల్ చెప్పిన అంశాన్ని ఉటంకించారు.వివిధ మత గ్రంధాలు ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాలనే నీతి బోధనలను కూడా ప్రస్తావించారు. తినే ముందు ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటే పాపాల నుంచి విముక్తి అవుతారని భగవద్ గీత, ఆకలితో ఉన్న నాకు ఆహారాన్ని ఇవ్వు అన్న బైబిల్‌లోని ఏసుక్రీస్తు మాటలు, పొరుగువారు ఆకలితో ఉండగా కడుపునిండా తిని పడుకుంటే అలాంటి వారు నిజమైన విశ్వాసులు కాదన్న ఇస్లామిక్ బోధనలను ఉటంకించారు. కొంత మంది ఆకలితో ఇబ్బంది పడుతుంటే అది కేవలం సామాజిక వైఫల్యం మాత్రమే కాదు నైతిక, ఆధ్యాత్మిక వైఫల్యం కూడా అవుతుందని జస్టిస్ సుతార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45లో పేర్కొన్నట్లుగా పసితనంలో పిల్లల సంరక్షణ, విద్య రాజ్యం బాధ్యత అని కూడా న్యాయమÖర్తి చెప్పారు. అవి పిల్లల ప్రాధమిక హక్కులన్నారు. పౌష్టికాహారం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటం రాజ్యాంగ బాధ్యత అని వాటిని నెరవేర్చటంలో వైఫల్యం చెందినట్లు లఖీ సోలంకి కేసు వెల్లడించిందన్నారు. ఆకలిగొన్న వ్యక్తి ముందు రొట్టెను కోరతారు తప్ప వేదాంతాన్ని కాదనే మాటతో న్యాయమÖర్తి బెయిల్ ఉత్తరువును ముగించారు.

ఈ కేసు రెండింజన్ల పాలన, గుజరాత్ ఆదర్శ రాష్ట్రం అనే ప్రచార బండారాన్ని బట్టబయలు చేసింది.బిజెపి ఏలుబడిలో నెలకొన్న పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అవసరం.ప్రతి ఏటా దేశాల ఆకలి సూచికలను ప్రకటిస్తున్నారు.మన దేశానికి ఇస్తున్న సూచికలను మేం అంగీకరించం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది, పోనీ స్వంత సూచికలను వెల్లడిస్తున్నదా అదీ లేదు. ప్రపంచ ఆకలి సూచిక 2022లో మనదేశం 121 దేశాలలో 107వదిగా ఉంది. మనకంటే ఎగువన నైజీరియా 103, పాకిస్తాన్ 99వ స్థానంలో ఉంది. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్న నరేంద్రమోడీ సర్కార్ అంటూ డబ్బా కొట్టుకుంటున్న తరుణలో ఈ సూచిక వెలువడింది. తరువాత 2025లో 123 దేశాల్లో 102వదిగా ఉంది. అతల్ బిహారీ వాజ్‌పేయి ఏలుబడి 2000 సంవత్సరంలో నూటికి మన మార్కులు 38.1, తరువాత 2008లో 34.6, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2016లో 29.3, పదకొండు సంవత్సరాల పాలన తరువాత 2025లో 25.8 పాయింట్లు వచ్చాయి. ప్రపంచ సూచికల ప్రకారం 10 పాయింట్లలోపు ఉన్న దేశాల్లో తక్కువ ఆకలి, పది నుంచి ఇరవై పాయింట్ల మధ్య ఉంటే కాస్త మెరుగు, ఇరవై నుంచి 35 పాయింట్ల మధ్య ఉంటే తీవ్రం, 3550 మధ్య ఉంటే ఆందోళనకరం, అంతకు మించి ఉంటే మరింత ఆందోళనకర జాబితాలుగా దేశాలను వర్గీకరించారు. పన్నేండ్ల స్వర్ణయుగ పాలన తరువాత మనదేశం మÖడవ తరగతిలో అంటే తీవ్ర ఆకలి ఉన్న దేశంగా ఉంది.


హరిత విప్లవం తరువాత విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థితి నుంచి ఎగుమతి చేస్తున్నాం. అయితే జనం కడుపునిండా మÖడుపూటలా తింటే ఎగుమతికి అవకాశం ఉండదు. అలాంటి స్థితి లేని కారణంగానే మన దేశంలో “ కనిపించని ఆకలి ” ఉందని అనేక మంది వర్ణిస్తున్నారు. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నప్పటికీ, పోషకాహార లేమిని అంగీకరిస్తూ పోషణ్ అభియాన్ పేరుతో కేంద్రం ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. అయినప్పటికీ మన దేశం 2025 ప్రపంచ ఆకలి సూచికలో 123 దేశాలకు గాను 102వదిగా ఉంది, మనకంటే మరో 21 ఇంకా దరిద్రంలో ఉన్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యటానికి వచ్చేసరికి ఎద్దుల్లో అన్నట్లుగా బిజెపి వ్యవహారం ఉంది. రాజకీయంగా మాకు తిరుగులేదు అని చెప్పుకొనేందుకు మెజారిటీ రాష్ట్రాలలో తాము లేదా మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయని, తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమదే ఆధిపత్యం అని బిజెపి చెప్పుకుంటుంది.మరి దాని పాలిత రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచికల్లో అధోగతిలో ఎందుకు ఉన్నట్లు ? పన్నేండేండ్ల మోడీ స్వర్ణయుగ పాలన తరువాత దేశంలో ఉన్న పరిస్థితుల గురించి చూద్దాం.


జనాభాయే మనకు పెద్ద పెట్టుబడి అని నేతలు కబుర్లు చెబుతారు.దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ ఎప్పుడో చెప్పారు. మన మనుషులు ఎలా ఉన్నారు ? ఉన్న సమాచారం, అంచనాల ప్రకారం పైన చెప్పిన ఉచిత ధాన్యం, పోషణ్ కార్యక్రమం అమలు తరువాత కూడా దేశంలో 12శాతం మంది అంటే 17.2 కోట్ల మందికి పోషకాహారం లేదు. భావి భారత పౌరులుగా ఉండాల్సిన పిల్లల్లో ఐదేండ్ల లోపువారిలో 35శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు పెరగటం లేదు, అంటే వారికి పోషకాహారం లేదు. ఎత్తుకు తగ్గ బరువులేని వారు 18.7శాతం మంది ఉన్నారు, ఇలాంటి వారు ఎక్కువగా ఉన్న దేశాలలో మనది ఒకటి. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు అధిక బరువు, ఊబకాయం సమస్య కూడా పెరుగుతున్నది. ఆకలి జబ్బు కొందరికైతే అధిక తిండి మరో జబ్బు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే5 ప్రకారం పిల్లలు 67.1శాతం, 59.1శాతం మంది తరుణ వయస్సులో ఉన్న బాలికలు రక్తహీనతతో ఉన్నారు. పిల్లలను కనే వయస్సులో ఉన్న మహిళల్లో సగం మంది రక్తహీనతతో ఉన్నారు.ఇది కనిపించని ఆకలికి ఒక సూచిక అని చెప్పవచ్చు. ప్రపంచ ఆహార మరియు పోషకాహార ప్రపంచ స్థితి నివేదిక 2025లో చెప్పినదాని ప్రకారం మన దేశంలో 40.4శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి లేదు.అరవై శాతం మంది పట్టణ జనాభాకు ప్రొటీన్ల లోపం ఉంది. రెండు భారతాల దృశ్యం కనిపిస్తున్నది. ఒకటి పోషకాహారం లేని వారు, ఊబకాయం, అవసరానికి మించి బరువు పెరుగుల ఒక విచిత్రమైన స్థితి. మొత్తం మరణాల్లో అంటు వ్యాధులు కాని గుండె,మధుమేహం, కాన్సర్, శ్వాసకోశ సమస్యలతో మరణిస్తున్నవారు 6365శాతం మంది ఉన్నట్లు అంచనా.


నరేంద్రమోడీ ప్రత్యక్ష పాలనలో, ప్రధానిగా పని చేస్తున్న కాలంలోనే పైన చెప్పుకున్న లఖీ సోలంకి ఉదంతం జరిగింది. ఆమెకు సంక్షేమ పథకాలు అంది ఉంటే ఇంట్లో ఆహార సమస్య వచ్చి ఉండేది కాదు, బిడ్డను చేతులారా పొగొట్టుకొనేది కాదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర వనరుల నుంచి సేకరించిన సమాచారం మేరకు రాష్ట్రాల ఆకలి సూచికలను కూడా తయారు చేశారు. దేశాల సూచికల మాదిరే వంద మార్కులకు వచ్చిన వాటిని బట్టి వర్గీకరణ అదే మాదిరి చేశారు. దేశ జాతీయ సగటు మార్కులు 29 తీవ్ర ఆందోళనకరంగా ఆకలి ఉన్న రాష్ట్రాలు అంటే 35 కంటే ఎక్కువగా ఉన్నవాటిలో బీహార్,ఝార్కండ్, చత్తీస్‌ఘర్ ఉన్నాయి. ఇవి బిజెపి లేదా వారి మిత్రుడైన నితీష్ కుమార్ ఏలుబడిలో ఉన్నవే అని వేరే చెప్పనవసరం లేదు. దేశ సగటు 29 కంటే ఎక్కువ ఆకలి ఉన్నవాటిని ఆందోళనకర వర్గీకరణలో చేర్చారు, అవి గుజరాత్, ఉత్తర ప్రదేశ్, అసోం, ఒడిషా, మధ్య ప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్. ఒక మాదిరి అంటే 16 కంటే తక్కువ మార్కులు వచ్చిన సిక్కిం, పుదుచ్చేరి, కేరళ వంటివి ఉన్నాయి. తక్కువ ఆకలి ఉన్నది పన్నెండు కంటే తక్కువ వచ్చింది ఒక చండీఘర్ కేంద్ర పాలిత ప్రాంతమే. ఇలాంటి పరిస్థితి ఉన్నపుడు బిజెపి లేదా మోడీ దేశాన్ని పరుగులు పెట్టిస్తామంటే నమ్మేదెలా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !

15 Wednesday Jul 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

#US Lies, 2026 US Attack Iran, 2026 US Elections, Donald trump, Hormuz mission

ఎం కోటేశ్వరరావు

ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోంది గనుక నిరోధించేందుకు తాము దాడులకు దిగినట్లు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చినెల ప్రారంభంలో ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశాడు. అంతకు ముందు 2025లో కూడా దాడులు చేసి అణు స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరోసారి ఎనిమిది నెలలకే దాడులకు దిగాడు. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఇరాన్‌పై దాడులతో ట్రంప్ రేపిన చిచ్చును ఆరనివ్వకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు.జూలై 11న మరోసారి ప్రారంభమైన దాడులుప్రతిదాడులు గురువారం నాడు కూడా కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు. బుధవారం నాడు పరిస్థితిని సమీక్షించిన ట్రంప్, మంత్రులు, ఉన్నతాధికారులు దాడులను మరింత పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించారు. మిత్రదేశాల వినతి మేరకు హార్ముజ్ జలసంధిలో రాకపోకలు జరిపే నౌకల్లోని వస్తువుల విలువలో 20శాతం పన్ను వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ట్రంప్ చెప్పాడని వార్తలు వచ్చాయి.అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి కుట్రలకు వ్యతిరేకంగా 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఇంకా ముగియలేదు. ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చి పశ్చిమదేశాలు ఇంకా ఎగదోస్తూనే ఉన్నాయి.గత శతాబ్దిలో ఎనిమిది సంవత్సరాల పాటు ఇరాన్ఇరాక్ యుద్దం జరిగింది.అమెరికా తీరుతెన్నులు చూస్తుంటే ప్రస్తుత సంక్షోభం కూడా వాటి సరసన చేరుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కనీసంగా అమెరికా పార్లమెంటుకు నవంబరు మÖడవ తేదీన జరిగే ఎన్నికలు ముగిసేవరకైనా రిపబ్లికన్ పార్టీ ఓట్ల కోసం ట్రంప్, అక్టోబరు నెలలో ఇజ్రాయెల్‌లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీని గెలిపించేందుకు నెతన్యాహు లెబనాన్ మీద దాడులను కొనసాగించే వైఖరి కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతల దుర్మార్గాలకు ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు పడుతూ లేస్తూ మనవంటి దేశాలలో సామాన్యులను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. ఎప్పుడు స్టాక్‌మార్కెట్ కుప్పకూలుతుందో ఎందరు ఎంత సొమ్ము పోగొట్టుకుంటారో తెలియని అయోమయం నెలకొన్నది. సంక్షోభాలు, యుద్దాలు కొనసాగితే అమెరికా కార్పొరేట్లకు కాసుల పంట పండుతుంది. అందుకే అవి నిత్యం ఎక్కడో ఒక చోట చిచ్చు పెట్టేందుకు చూస్తుంటాయి.

అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకా ప్రయాణానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇరాన్‌కు అప్పగించారు. జూన్ 17న కుదిరిన ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు వాణిజ్య నౌకల రవాణా మీద ఎలాంటి సుంకాలు విధించకూడదు.దాన్లో భాగంగా ఏ నౌక అయినా తమకు వివరాలు తెలిపి, తాము సూచించిన మార్గంలో ప్రయాణించాలని ఇరాన్ ప్రకటించింది. అయితే కొన్ని నౌకలు దీనికి భిన్నంగా ఎటువైపు వెళ్లేదీ తెలియనివ్వకుండా సంకేతాలను పంపే వ్యవస్థలను కట్టివేసి ప్రయాణిస్తుండటంతో అలాంటి నౌకలు హెచ్చరికలను ఖాతరు చేయకపోవటంతో ఇప్పటికి మÖడు సార్లు కొన్ని నౌకల మీద ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. వాటిని సాకుగా చూపి అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దానికి ప్రతిగా గల్ఫ్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ కూడా ధీటుగా ప్రతిదాడులు చేస్తున్నది. ఈ క్రమంలో ఇరాన్‌తో ఇంక చర్చలేవీ లేవన్న ట్రంప్ వెంటనే మాట మార్చి సాంకేతిక అంశాలపై ఉంటాయని చెప్పాడు, పాకిస్తాన్, కతార్, ఈజిప్టు రంగంలోకి దిగి మరోసారి చర్చల కోసం రావాలని ఇరు పక్షాలనూ కోరుతున్నాయి. అదేమీ తేలకుండానే అమెరికా రెచ్చగొట్టుడు కారణంగా హార్ముజ్ జలసంధిని మరోసారి మÖసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.తాము కూడా దిగ్బంధనాన్ని తిరిగి కానసాగించి ఇరాన్‌కు నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించాడు. అంతే కాదు హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల మీద వాటిలోని సరకు విలువలో 20శాతం పన్ను విధిస్తానని ప్రకటించాడు. అంతకు ఇరాన్ పన్ను వసూలు చేస్తానని చెబితే వ్యతిరేకించిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆపని చేస్తానని చెప్పాడు. దాన్ని అమలు చేస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడి వెనక్కు తగ్గాడు తప్ప మరొకటి కాదు. న్పుింగా అమలు జరిగితే పరిస్థితి ఏమిటి ?ఉదాహరణకు ముడి చమురు ధర పీపా సగటున 80 డాలర్లకు కొనుగోలు చేశారనుకుందాం. ఒక టాంకరులో పట్టే చమురు విలువ 16 కోట్ల డాలర్లు. దీనిలో ఇరవై శాతం పన్ను అంటే 3.2 కోట్ల డాలర్లు చెల్లించాలి. అదే అంతకు ముందు ఇరాన్ చెప్పినదాని ప్రకారం పన్ను మొత్తం 20లక్షల డాలర్లు మాత్రమే.హార్ముజ్ జలసంధి అమెరికా చేతుల్లోకి పోతే మనం దిగుమతి చేసుకొనే చమురుకు 20శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఎంత ఖర్చు పెరిగినా జనం మీద మోపేదే గనుక మన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులెవరూ ట్రంప్ ప్రకటన మీద నోరెత్తలేదు.

తమ దుష్ట చర్యలను సమర్ధించుకొనేందుకు అమెరికాఇజ్రాయెల్ కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయి.వాటిలో తాజాగా చెప్పిందేమిటంటే డోనాల్డ్ ట్రంప్‌ను అంతం చేసేందుకు ఇరాన్ కుట్ర చేసింది.తనను చంపేందుకు చూస్తున్నట్లు అంకారాలో జరిగిన నాటో సమావేశాల్లో డోనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పాడు.ఆ కుట్రను ఇజ్రాయెల్ నిఘావర్గాలు కనిపెట్టి ట్రంప్‌కు తెలియచేశాయట, మరి అమెరికా సిఐఏ ఏం చేస్తున్నట్లు ? జనం చేత ఇలాంటి పిట్టకతలను నమ్మించటం కూడా సులభమే, ఎందుకంటే తమ సుప్రీమ్ నేత, ఇతర ఉన్నత సైనికాధికారులను అకారణంగా చంపి, దాడులు చేస్తున్న తరువాత ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా ! బదులు తీర్చుకుంటామని నేతలు ప్రకటించిన నేపధ్యంలో అలాంటిదేదో జరిగి ఉంటుంది లెమ్మని సామాన్యులు అనుకోవటం సహజం. ఇరాన్ మీద అమెరికా దాడులు,దాని అధినేతలను లేపేస్తామని పదే పదే చెప్పటం, ఆంక్షలతో ఆర్థికంగా ఇబ్బుందులు పెట్టటం ఈ రోజు కొత్తగా ప్రారంభించినవి కాదు, 1979 నుంచి కొనసాగుతున్నాయి. అందువలన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు గనుక, జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలు తీసేందుకు ఇరాన్ ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘావర్గాలు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా ఇంతవరకు ఇరాన్ అలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.


రోజువారీ దాడులు, ప్రతిదాడులు ఎదుటి పక్షాన్ని ఏ విధంగా దెబ్బతీసిందీ ఆయా దేశాలు చేస్తున్న ప్రకటనల వార్తలు తెలిసిందే. ఇరాన్ అణు, మిలిటరీ సామర్ధ్యాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు ట్రంప్ ఇప్పటి వరకు నలభై నుంచి యాభైసార్ల వరకు చెప్పి ఉంటాడు. అయినా అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడులు ఎలా చేయగలుకుతున్నదన్న అంశం అనేక మందికి అంతుబట్టటం లేదు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు పుట్టుకు వస్తాడన్న లోకోక్తి తెలిసిందే. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు.మానవుడి పరిణామ క్రమంలో అవసరాలే అనేక నూతన ఆవిష్కరణలకు దోహదం చేశాయి. ఇది ఇరాన్‌కూ వర్తిస్తుంది. వియత్నాంపై రెండున్నర దశాబ్దాల పాటు జపాన్, ఫ్రాన్సు, అమెరికా సామ్రాజ్యవాదులు భీకరదాడులు చేశారు. వారి మిలిటరీ, ఆయుధ సామర్థ్యాన్ని గెరిల్లా పోరాటపద్దతులను అనుసరించి కమÖ్యనిస్టులు ఎదిరించి నిలవటమే కాదు, 1975లో అమెరికన్లు దొరికిన విమానాలు, హెలికాప్టర్లను పట్టుకొని పారిపోయేట్లు చేశారు.ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల చేతిలోనూ అమెరికాకు అదే పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇరాన్‌లో కూడా అమెరికాకు అదే జరుగుతోంది. అడవులు, కొండలు గుట్టల్లో గెరిల్లా పద్దతివేరు. సముద్రంలో కూడా ఇరాన్ ఆ విధానాన్ని అనుసరిస్తున్నది. ఆత్మరక్షణ`ప్రతిఘటన దాడి పద్దతులను అభివృద్ది చేసుకొన్నది.దీనికి ఇతర దేశాల అనుభవాలు నేర్పిన పాఠాలతో పాటు చైనా, రష్యా అందచేస్తున్న సహకారం కూడా తోడు కావటం, ఈ పరిణామాలను అమెరికా, ఇజ్రాయెల్ పసికట్టలేకపోవటం కనిపిస్తున్నది. గూఢచర్యంలో ఈ రెండు దేశాల తరువాతే మిగతావి అన్నట్లు అనేక మంది కీర్తించటం తెలిసిందే. అలాంటి తోపులనే ఇరాన్ తప్పుదారి పట్టించి తనను తాను కాపాడుకుంటున్నది, ప్రతిదాడులు చేయగలుకుతున్నది.తన డ్రోన్లు, క్షిపణులు ఎక్కడ ఉన్నదీ తెలియకుండా కాపాడుకోవటమే కాదు, ప్రయోగ కేంద్రాలను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ శత్రుల నిఘాను ఏమారుస్తున్నది.


ఇరాన్ నౌకా దళాన్ని రెండవ ప్రపంచ యుద్దానికి ముందు ఒకసారి నాశనం చేశారు, తరువాత మరోసారి విధ్వంసం కావించారు.తాజాగా మÖడవసారి అమెరికా మరికొంత నష్టం కలిగించింది. అయినా స్వల్ప ఖర్చుతో చిన్న పడవలతో హార్ముజ్ జలసంధిలో అమెరికాను ముప్పుతిప్పలు పెట్టటంలో ఇప్పటి వరకు ఇరాన్ జయప్రదమైంది. ఇరాక్‌తో ఎనిమిది సంవత్సరాలు జరిగిన యుద్ద సమయంలో చమురు టాంకర్లపై జరిగిన దాడులు ఒక పాఠాన్ని నేర్పాయి. శ్రీలంక మిలిటరీపై ఎల్‌టిటి తీవ్రవాదులు పడవలతో సాగించిన పోరు నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు రష్యా దాడులను ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్, పీపుల్స్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మారిటైమ్ మిలీషియా పేరుతో ఒక దళాన్ని ,చైనా నిర్వహిస్తున్నది.ఈ దళ సభ్యులు దక్షిణ చైనా సముద్రంలో రోజువారీ చేపలు పట్టేవారిగా, శత్రుదేశాల ఓడల కదలికల మీద నిఘావేసేవారిగా, అవసరమైతే చిన్న చిన్నదాడులు చేసేందుకు చైనా మిలిటరీ సహకారంతో నడిపిస్తున్న చిన్న చిన్న పడవల అనుభవమÖ ఇరాన్‌కు పనికి వచ్చింది. ఈ దళంలోని పడవలు చైనా తనవిగా చెబుతున్న సముద్ర జలాల్లో ప్రవేశించి చేపలు పడుతూ చైనా సార్వభౌమత్వాన్ని పదే పదే ఇతర దేశాలకు గుర్తు చేస్తుంటాయి,విదేశీ నౌకలకు చికాకులు కలిగిస్తుంటాయి. చైనా నౌకాదళం, తీరరక్షణ దళంతో పాటు దీన్ని చైనా మÖడవ సముద్ర శక్తిగా ఇతర దేశాలు వర్ణిస్తాయి.
1979లో తమ తొత్తు షాను గద్దె దించి అధికారానికి వచ్చిన ఇస్లామిక్ శక్తులను దెబ్బతీసేందుకు 1980లో ఇరాక్‌ను రెచ్చగొట్టిన అమెరికన్లు ఇరాన్ మీద దాడులు చేయించారు. అవి 1988 వరకు కొనసాగాయి. ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బతీయటం ఆ పోరు లక్ష్యాలలో ఒకటి. దానిలో భాగంగా టాంకర్ల మీద దాడులు,ప్రతిదాడులు జరగటంతో టాంకర్ల పోరుగా దాన్ని పిలిచారు. నాలుగు వందల చమురు టాంకర్ల మీద దాడులు జరగ్గా కొందరు సాధారణ పౌరులతో సహా రెండు వందల మందికి పైగా నావికులు మరణించారు. అప్పుడు కూడా హార్ముజ్ జలసంధిని దిగ్భంధనం చేసేట్లు ఇరాన్ను రెచ్చగొట్టినా ఆ నాడున్న పరిస్థితిలో అది జరగలేదు.ఇలా ఎన్నింటినో అధ్యయనం చేసిన ఇరాన్ హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారైంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డులకు ఒక అధినాయకత్వం ఉన్నప్పటికీ ప్రాంతీయ విభాగాలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసి శత్రువులను దెబ్బతీసేందుకు ఏ పద్దతి వీలైతే దాన్ని అమలు చేస్తే స్వేచ్చ ఇచ్చారు.శత్రువును దెబ్బతీయటమే అంతిమ లక్ష్యం. ప్రపంచ రవాణాలో పర్షియన్ గల్ఫ్ లేదా హార్ముజ్ జలసంధితో పాటు సూయజ్ కాలువ ద్వారా తూర్పు మధ్యధరా సముద్రంతో హిందూమహాసముద్రాన్ని కలిపే ఎర్ర సముద్రం కీలక పాత్ర పోషిస్తున్నది.హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం కావించేందుకు గతంలో ఇరాక్ ఎంతగానో రెచ్చగొట్టింది.అలా జరిగితే పశ్చిమ దేశాలన్నింటినీ రంగంలోకి దించాలన్నది అసలైన ఎత్తుగడ. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు, మిత్రదేశాలు అమెరికా కోసం చేతులు కాల్పుకొనేందుకు సిద్దంగా లేవని ఉక్రెయిన్ నేర్పిన అనుభవం, అదే హార్ముజ్ విషయంలో పునరావృతం అవుతుందని వేసిన అంచనా ఇలా ఎన్నో పరిణామాల పూర్వరంగంలో ఇరాన్ ముందుకు వచ్చి జలసంధిని దిగ్బంధనం కావించింది, అది టెహరాన్ ముందు చూపుకు నిదర్శనమైతే వాస్తవాలను గ్రహించలేక అహంకారానికి లోను కావటానికి అమెరికా తార్కాణంగా నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం ముగియటం అనివార్యం, అయితే ఎలా అన్నది ఊహించలేము !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !

11 Saturday Jul 2026

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

2027 UP poll, Ayodhya Ramalayam, BJP, Champat Rai, Hindu nationalism, Hindu Rashtra, Narendra Modi Failures, Ram Mandir, Ram mandir Theft, RSS, VHP, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు

తన సొమ్మును తన భక్తులే కాజేస్తుంటే దేవుడు, దేవతలు, దేవదూతలు ఎందుకు నిరోధించటం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే.....అది కూడా దైవలీý తప్ప మరొకటి కాదు, ఏ లడ్డులో ఏ కల్తీ జరపాలో, దేవుడి పేరుతో ఎలా మోసం చేయాలో, ఏ సొమ్ము ఎలా కొల్లగొట్టాలో ముందేరాసి పెట్టి ఉంటుంది, దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి, ఇది ఈ నాటిదా ! నిజాయితీపరులు వారి పని వారు చేయాలి, దొంగలు దొంగతనాలు చేయాలి, బ్రహ్మరాతను ఎవరూ మార్చలేరు. గుడినీ గుడిలో లింగాన్ని మింగేవారు వస్తారని పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.పాపం చేసిన వారు ఫలితాన్ని అనుభవించకతప్పదు. ఇదీ కర్మసిద్దాంతాన్ని నమ్ముతున్న భక్తుల స్పందన. అందరి తలరాత రాసిన పెద్దమనిషి కొందరికి దొంగతనం చేయాలని రాసిపెట్టిన వివక్ష ఎందుకు అన్నది హేతువాదుల ప్రశ్న. గుర్రాన్ని తొట్టి దగ్గరకు తీసుకువెళ్లగలం తప్ప దానిలో నీరు తాగించగలమా ! రాముడి సొమ్ము కొట్టేసిన ఉదంతం అనేక మందితో మాట్లాడిస్తున్నప్పటికీ దేవుడి అంశగా జన్మించినట్లు చెప్పుకున్న కారణంగానే నరేంద్రమోడీ నోరు తెరిపించటంలో సాక్షాత్తూ ఆ రాముడే ఏం చేయలేక కళ్లప్పగించి “మౌనం ”గా ఉండిపోయాడు. దేవుళ్ల మధ్య కూడా శాఖల వారీ విభజన జరిగి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదేమో ! ఓట్ల కోసం రాముడు కావాల్సి వచ్చింది,ఎన్నికల ప్రచారం కోసం సాష్టాంగ ప్రమాణం చేస్తున్న ఫొటోల నిమిత్తం అయోధ్య రామాలయం అవసరమైంది.కానీ దానిలో జరిగిన కుంభకోణం గురించి స్పందించటానికి నోరు రావటం లేదు. ఇలాంటి వారిని ఏం చేయాలో రాముడే ఆలోచించుకోవాలి. అక్రమాలపై ఎందుకు దేవుళ్లు, దేవతలు స్పందించటం లేదన్నది తరతరాలుగా నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదులు వేస్తున్న సమాధానం లేని ప్రశ్న. దేవతల లీలలు, మహిమల గురించి కథకథలుగా చెప్పుకుంటాం.దరిద్రం ఏమంటే ఇప్పుడు వారికి వచ్చిన కానుకల చోరీ గురించి అయోధ్య దర్యాప్తులో వెలువడుతున్న కథలుకతలు ఎన్నో వెలువడుతున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే మతం, దేవుళ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే తమ మనోభావాలను గాయపరిచారంటూ వీధుల్లో వీరంగానికి దిగే బాపతు తిరుపతి లడ్డు కేసు, రామాలయ కానుకల చోరీ గురించి ఎక్కడా కనిపించరేం. ఇది కూడా బ్రహ్మరాసిన రాతల పర్యవసానమే అని చెప్పేవారు ఉండవచ్చు. వారు రెండు రకాలు. ఒకటి దొంగలను సమర్ధించే మోసగాళ్లు, రెండవ రకం అమాయకులు.


ఇంకా గూగులమ్మ తల్లికి ఏ మతం, కులాన్ని అంటగట్టలేదు.అఫ్ కోర్సు తమ కంపెనీ ప్రయోజనాలు, వాటిని పరిరక్షించే నేతలు, పార్టీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ తల్లికూడా అలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధిస్తున్నదని చెబుతున్నారు.అయినా తనకు ఇబ్బందిలేని వాటిని అందిస్తున్నది.ప్రార్ధనా స్థలాల్లో భక్తులు, విశ్వాసులు ఇచ్చే కానుకలను కొట్టి వేయటం అన్ని చోట్లా జరుగుతున్నదని ఎవరు అడిగినా చెబుతుంది, కావాలంటే తెలుసుకోవచ్చు. మందిరాలు, మసీదులు, చర్చ్‌లు ఏవీ ఇలాంటి అక్రమాలకు దూరంగా లేవు.పేరు భిన్నంగా ఉండవచ్చు తప్ప ప్రతి చోటా కానుకల స్వీకరణ, వాటి అపహరణ జరుగుతూనే ఉంది. కనిపించని సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత.అయోధ్య ఉదంతంతో ఇప్పుడు జనాలకు పాత దొంగతనాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ మతం, దేవుళ్లను రాజకీయ అవసరాలకోసం వినియోగించుకొనే సంఘపరివార్ సంస్థలన్నింటినీ జనం అనుమానంతో చూసేందుకు దోహదం చేస్తున్నాయి. భక్తులందరూ దొంగలు కాదు గానీ దొంగలందరూ భక్తులే కావటం గమనించాల్సిన అంశం.ప్రతి మత ప్రార్ధనా మందిరంలో జరుగుతున్నది ఇదే.ఎందుకంటే విశ్వాసులు కానివారిని నియమించరు కదా ! దేవాలయాలను ప్రభుత్వ అదుపు నుంచి తొలగించాలని కోరుతున్న వారికి ఇప్పుడు నోట్లో పచ్చివెలక్కాయపడింది.ట్రస్టుల పేరుతో వాటిని నడిపే తమవారి నిర్వాకాలు వెలుగులోకి రావటంతో మింగా కక్కలేకుండా ఉన్నారు. ఇప్పుడు సంఘపరివార్ పెద్దల ఆందోళన దేవుడి సొమ్ము, నగలను కొట్టేయటం కాదు,కోట్లాది మంది భక్తుల్లో బిజెపి, విశ్వహిందూపరిషత్ వంటి తమ సంస్థల పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకాలు సడలిపోతే తమ హిందూత్వ అజెండాకే ముప్పు అన్నదే అసలు భయం. కొందరిని కొంతకాలం మోసం చేయగలం, అందరినీ ఎల్లాకాలం మభ్యపెట్టలేము కదా !


కానుకల చోరీ పూర్వరంగంలో అయోధ్య రామాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోరాదని విశ్వహిందూపరిషత్ చెబుతోంది. ఎందుకంటే అది తమ చేతుల్లోంచి పోతుందనే భయం. మా హిందూ దేవాలయం, కానుకలు ఇచ్చిందీ, దొంగతనం చేసిందీ మా హిందువులే కదా, మేం మేం చూసుకుంటాం అన్నట్లుగా దాని వైఖరి ఉంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రామాలయ ట్రస్టును తీసుకురాకూడదని చెబుతున్నారు.దీని అర్ధం ఏమిటి ? భవిష్యత్‌లో కూడా ఏం జరిగినా ఎవరూ ప్రశ్నించకూడదు, ఎంత పారదర్శకత ! తప్పనిసరై రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా చేయగా ఆహ్వానితుడు ఉడిపి ీVAటల్స్ గోపాలరావును ఆ జాబితా నుంచి తొలగించారు.వీరు ముగ్గరూ సంఘపరివార్ గుంపులోని వారే. నరేంద్రమోడీ ప్రవచించిన జవాబుదారీతనం,నేను తినను ఇతరులను తిననివ్వను అన్న చౌకీదార్ సంగతేమిటి ? యావత్ దేశాన్నీ కదలించిన ఈ ఉదంతం అసలు పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. సాగినంత కాలం సాగుతుంది తప్పదు. రామాలయంలో జరిగింది కుంభకోణం కాదు, చిన్న చోరీ మాత్రమే, అలాంటివి ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి గనుక పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.గోడీ మీడియా తప్పనిసరై ఈ కేసు గురించి వార్తలను ఇవ్వకతప్పటం లేదు. గతంలో ఆరోపణలు వచ్చినపుడు వాటన్నింటినీ మÖసిపెట్టింది, ఇప్పుడు సాధ్యం కావటం లేదు. నిజమే ప్రతి చిన్న చోరీ విచారణకు పోలీసులు కేసులు పెడతారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయవు కదా ! అయోధ్యలో జరిగింది చిన్న దొంగతనమే అయితే యోగి సర్కార్ సిట్‌ను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? అనేక మంది సంఘపరివార్ ప్రముఖులు తీవ్ర ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు ? చిన్న చోరీ అయితే అయోధ్య బార్ అసోసియేషన్ నిందితుల తరఫున వాదించకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ? ఆరోపణలకు గురైన ట్రస్టు సభ్యులు పట్టణం విడిచి వెళ్లాలని ఎందుకు డిమాండ్ చేసినట్లు ? కొందరు చెబుతున్న ఈ “ చిన్న ” ఉదంతం గురించి సమాధానం లేని “ పెద్ద ” ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.


దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తే అక్రమాలకు తావుండదని అర్ధం కాదు.పాలక మండళ్లు,అధికారులను ప్రశ్నించటానికి అవకాశం ఉంటుంది. సరైన సమాధానం చెబుతారా లేదా అన్నది పక్కన పెడితే కనీసం సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. అదే ప్రైవేటు ట్రస్టులైతే రామాలయం గతే ! కాశీ విశ్వనాధుడి ఆలయంలోని శివలింగం వద్ద 1983 జనవరి ఐదున 2.55కిలోల బంగారం మాయమైంది.దాని దర్యాప్తులో బయటపడిన లోపాల తరువాత మహంతుల(పూజారుల) అదుపు నుంచి తప్పించేందుకు కాశీ విశ్వనాధ ఆలయ చట్టం 1983చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ట్రస్టుకు అప్పగించారు. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆలయంలో చోరీ వార్తలు వెలువడగానే వారణాసిలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆయోధ్యలో అలాంటిదేమీ కనిపించటం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది బిజెపి గనుక, వీధుల్లోకి వచ్చేవారెవరుంటారు. కాశీ ఆలయచోరీ కేసులో నిందితులకు పదిహేడేళ్ల తరువాత 2000 సెప్టెంబరు ఏడున కోర్టు శిక్షలు విధించింది. గట్టి ఇనుప ఊచల కవచం మధ్య గర్భగుడిలో ఉన్న ఆ బంగారం చోరీ జరిగిన తీరు చూస్తే ఇంటి దొంగలపనే అని విచారణలో తేలింది. కవచ ద్వారాలను తెరిచినట్లు తప్ప పగలగొట్టిన ఆనవాళ్లు లేవు. ఆ సమయంలో గుడిలో ఉన్న ఇద్దరు పూజారులు తాము నిద్రించి ఉన్నట్లు చెప్పారు. పూజారుల ఏలుబడిలో గుడిలో నగదు,ఆస్తుల వివరాలు సక్రమంగా లేవని తేలింది.అంతా అడ్డగోలు వ్యవహారాలు నడిచాయి.ఆలయంపై వారసత్వ అధికారం ఎవరిదన్న కీచులాటలు కోర్టుకు ఎక్కగా వివాదం తేలేంతవరకు రోజువారీ రాబడిని కేసుల్లో ఉన్న పూజారులకు సమంగా పంచాలని 1950 దశకంలో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది.1983 చోరీతో పూజారుల హక్కులకు తెరపడింది.నాలుగు వందల సంవత్సరాల పాటు ఒక పూజారి కుటుంబం ఆలయాన్ని ఏలింది.వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుడు ప్రారంభించినట్లు చెబుతున్న వారసత్వ అర్చకత్వానికి లేదా మిరాసీదార్ల వ్యవస్థకు 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్థిపలికింది. లడ్డూ కల్తీ అంశం వెలుగులోకి వచ్చిన తరువాత కొందరు దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అయోధ్యలో జరిగిందాన్ని సమర్ధించుకొనేందుకు కాషాయ గుంపు నానా పాట్లు పడుతోంది.


నాలుగుదశాబ్దాలకు పైగా రామాలయం చుట్టూ రాజకీయాలను తిప్పి లబ్దిపొందిన కాషాయ దళాలకు తొలిసారిగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచిన ఉదంతం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియని స్థితి. రాముడిని, రామాలయాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు కానుకల కుంభకోణం నుంచి పెద్దగా లబ్దిపొందలేవని కొందరు వెంటనే ముక్తాయింపులు ఇవ్వటం ప్రారంభించారు.రామాలయ ఆందోళన ప్రారంభించిన వెంటనే బిజెపికి లబ్ది చేకూరలేదు. అదే విధంగా తమ మనోభావాలను బిజెపి పెద్దలు ఎలా దెబ్బతీశారో గ్రహించటానికి కూడా జనానికి సమయం పడుతుంది. దానికి నాంది పడింది.రాముడిని వీధుల్లోకి లాగింది మతవాదులు. వారి ప్రభావానికి లోనైన జనాన్ని దాన్నుంచి బయటపడవేసేందుకు ఎవరు ప్రయత్నించాలి ? మరింత మÖఢత్వంవైపు నెట్టేందుకు కాషాయ దళాలు చూస్తాయి.మతోన్మాద శక్తులు పెరగటానికి లౌకిక శక్తులే అవకాశం ఇచ్చాయంటూ కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారు.కొందరు నిజమే అనుకుంటున్నారు, ఇది ఆత్మన్యూనత తప్ప మరొకటి కాదు. దాని వలన ఉపయోగం లేదు. ప్రపంచంలో మత,వేర్పాటువాద, జాత్యహంకార, మితవాద శక్తులు పెరగటానికి అనువైన పరిస్థితులు ఉన్న కారణంగానే అవి రెచ్చిపోతున్నాయని గ్రహించటం అవసరం. రాముడు(అయోధ్య), కృష్ణుడు(మధుర),శివుడి(వారణాసి) ఆలయాల పేరుతో ప్రారంభించిన క్రీడను దాన్ని వ్యతిరేకించే శక్తులందరూ ముల్లును ముల్లుతోనే తీసినట్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కేరళ, తమిళనాడు వంటి చోట్ల కులవివక్షకు వ్యతిరేకంగా దేవాలయ ప్రవేశ ఉద్యమం ముందుకు వచ్చింది.దాని అర్ధం దానిలో పొల్గ్గొన్నవారు మతవాదులు కాదు, వివక్షను వ్యతిరేకించటం అసలు విషయం. ఆ ఉద్యమంలో ఉన్న ఏకె గోపాలన్ వంటి వారు ఎందరో తరువాత కమÖ్యనిస్టునేతలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో కులవివక్ష వ్యతిరేకపోరాట సంఘం నాయకత్వంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని సాగించిన యాంత్రల్లో సిపిఐ(ఎం) నేతలు పాల్గ్గొన్నారు. దీని అర్ధం మతపరమైన భావాలను ప్రోత్సహిస్తున్నట్లు కాదు. బిజెపి దేవుళ్లతో రాజకీయం చేసి లబ్ది పొందినట్లు భావించిన పవన్ కల్యాణ్ సనాతనవాది అవతారమెత్తి లబ్దిపొందేందుకు చూస్తున్నారు.తిరుమల లడ్డూ కల్తీ గురించి వెల్లడించటం ద్వారా తానే పెద్ద హిందూత్వవాదినని జనం ముందుకు వచ్చేందుకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం ఏమిటో తెలిసిందే.సున్నిత మనోభావాలతో కూడు కున్న అంశాల పట్ల మొరటుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు.అలా ప్రయత్నించిన కొందరు నాస్తికులు, హేతువాదులు, ఇతరులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో చూస్తున్నాము. ఏ ఇతిహాసాలు, పురాణాల నుంచి తిరోగమన భావాలను ముందుకు తెస్తున్నారో, వాటి నుంచే ఎదుర్కొనే ఆయుధాలను వెలికి తీయాల్సిన తరుణమిది.హిందూత్వ భావజాలం ఒక్క రోజులో ఎలా పెరగలేదో దాన్ని ఎదుర్కొనే భావాలు జనంలోకి వెళ్లటానికి సమయం పడుతుంది.మొక్కనాటగానే కాయలు కాయవు.


సుప్రీం కోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుతో బాబరీ మసీదు భూమి రామాలయానికి వచ్చింది.రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. అప్పటి నుంచి నరేంద్రమోడీ పురాతన “ పూజారి మహరాజు ” అవతారమెత్తి గత లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించుకొనేందుకు చూసినా భంగపడ్డారు. సంపూర్ణ మెజారిటీకి అవసరమైన సీట్లను బిజెపికి సంపాదించలేకపోయారు. చివరకు సదరు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఓడింది. వారణాసిలో మోడీ మెజారిటీ గణనీయంగా తగ్గింది.ఎవరెన్ని చెప్పినా అయోధ్య ఆలయ నిధులు, ఆభరణాల కుంభకోణం గురించి నోరు విప్పాల్సిన బాధ్యత మోడీ మీద ఉంది.తాను తినను ఇతరులను తిననివ్వను, చౌకీదారునని చెప్పిన పెద్ద మనిషి నోరు విప్పకపోతే ఎలా ! తిరుమల తిరుపతి అనుభవాన్ని చూసిన తరువాత ప్రముఖ దేవాలయాలన్నింటినీ లాభార్జనకోసం మతపరమైన విహార యాత్రల కేంద్రాలుగా(అఫ్ కోర్సు హిందూత్వశక్తులు తాము వ్యతిరేకించే మక్కా, మదీనా, జెరూసలెంలను చూసి కూడా స్ఫూర్తి పొందారు) మార్చాలని చూస్తున్నారు.అయోధ్యలో అవినీతి గురించి ఆరోపణలు రావటం ఇదే ప్రధమం కాదు, గతంలో అయోధ్య వివాదంలో అసలు పిటీషన్‌దార్లలో ఒకటైన నిర్మోహి అఖారా అనేక ఆరోపణలు చేసింది. రామాలయం పేరుతో దేశంలో, విదేశాల నుంచి విశ్వహిందూపరిషత్ వసూలు చేసిన నిధుల్లో పద్నాలుగు వందల కోట్లకు పైగా దుర్వినియోగం, స్వాహా చేసిందని మహంత్ సీతారామ్ ఆరోపించారు. తాజాగా రామాలయం కోసం రెండు కోట్లతో భూమి కొని దానికి రు.18.5 కోట్లు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని మÖసిపెట్టిన ఆరఎసఎస్`బిజెపికి ఇప్పుడు అది సాధ్యం కాదు. ఇంతకాలం కాషాయ దళాలు తప్పుడు ప్రచారం, అవాస్తవాలను ప్రచారం చేశాయి. ఇప్పుడు వాటిని వ్యతిరేకించే వారు అసలు విషయాలను జనంలోకి తీసుకుపోవాలి.నిజాలు నిలకడ మీద బుర్రల్లోకి ఎక్కుతాయి ! తొందరేమీ లేదు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

11 Saturday Jul 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, China credibility, Chinese navy strategic missile, Donald trump, Narendra Modi Failures, US and China, US attack Iran, World Military Power, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో ఏం జరుగుతోంది ? రోజువారీ పరిణామాలను చూస్తే సామాన్యులకు అనేక విషయాలు అంతుపట్టటం లేదంటే అతిశయోక్తి కాదు.ఫిబ్రవరి 28న అమెరికా‘ఇజ్రాయెల్ జరిపిన ఏకపక్ష దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేని మరణించారు. తరువాత దాడులు కొనసాగిన కారణంగా అంత్యక్రియలను వాయిదా వేసి జూలై నాలుగు నుంచి తొమ్మిదవ తేదీ మధ్య పూర్తి చేశారు. రెండు కోట్ల మంది పౌరులు ఈ క్రతువులో పాల్గొన్నారు. ఇరాన్ బలప్రదర్శనగా దీన్ని టైమ్ పత్రిక వర్ణించింది. అంత్యక్రియల్లో వందకుపైగా దేశాల నేతలు, ఉన్నతస్థాయి ప్రతినిధి వర్గాలు పాల్గ్గొంటున్నట్లు వార్తలు.ఖమేని అంత్యక్రియల్లో పాల్గ్గొనేదేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా బెదిరించటంతో 13దేశాలు వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు.తొలుత సంతాపం కూడా ప్రకటించటానికి తటపటాయించిన మనదేశం తరఫున విదేశాంగశాఖ ఉపమంత్రి పవిత్ర మార్గరిటా నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం హాజరైంది. ఖమేనీ మరణానికి అధికారికంగా సంతాపం తెలిపితే ఎక్కడ అమెరికాకు కోపం వస్తుందో అని తటపటాయించిన మన కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల తరువాత సంతాప ప్రకటన చేసింది తప్ప అమెరికా చేసిన హత్యను ఇంతవరకు ఖండించలేదు. ఇరాన్ నేతలు, మిలిటరీ అధికారులు అందరూ ఒకేచోట దొరికినా తాము వారిని మట్టుబెట్టేందుకు పూనుకోలేదంటూ డోనాల్డ్ ట్రంప్ పిచ్చివాగుడుతో మరోసారి అమెరికా పరువు తీశాడు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మాట్లాడిన ట్రంప్ దేశానికి అతిపెద్ద ముప్పు కమÖ్యనిజం అని చెప్పాడు. ఇలాంటి వారందరినీ చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది. ఇండో‘పసిఫిక్ ప్రాంతం నిబంధనల ప్రాతిపదికన స్వేచ్చగా ఉండాలంటూ జపాన్ ప్రధాని సానే తకాచీతో కలసి ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.తన మిలిటరీ వ్యూహంలో భాగంగా మన భుజం మీద తుపాకిపెట్టి చైనాను కాల్చాలనుకున్నది అమెరికా .1947లో ప్రారంభించిన అమెరికా పసిఫిక్ కమండ్ పేరును 2018లో ట్రంప్ నాయకత్వంలో యంత్రాంగం అమెరికన్ ఇండోపసిఫిక్ కమాండ్‌గా మార్చింది. ఇపుడు అదే ట్రంప్ జూన్ నెలలో మనదేశం పేరును తొలగించి పాతపేరును పునరుద్దరించాడు.మన చిత్రపటాన్ని మార్చి ఆక్రమిత్ కాశ్మీరును పాక్ ప్రాంతంగా దానిలో ముద్రించాడు.ఏ రెండు దేశాలైనా జతకట్టవచ్చని అది మÖడో దేశానికి వ్యతిరేకంగా ఉండకూడదని మోడీతకాచీ భేటీ గురించి చైనా ప్రకటించింది. ఆ తరువాత తమకు వ్యతిరేకంగా ఎవరైనా పిచ్చివేషాలు వేస్తే సంగతి తేలుస్తామనే హెచ్చరికగా జూలై ఆరవ తేదీన చైనా జలాంతర్గామి నుంచి అణుక్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది.మార్చి నెల ఒకటవ తేదీ నుంచి మీడియాలో పశ్చిమాసియా సంక్షోభానికి పెద్ద పీటవేసి ఉక్రెయిన్ పరిణామాలను దాదాపుగా విస్మరించారు. తిరిగి ఈ వారంలో ఆ వార్తలు చోటు చేసుకున్నాయి. తాము నిర్దేశించిన మార్గానికి బదులు వేరుగా ప్రయాణించిన మÖడు నౌకలపై హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేయటంతో బుధవారం నుంచి తిరిగి అమెరికాఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఒప్పందం రద్దయిందని చెప్పిన ట్రంప్ సాంకేతిక చర్చలు కొనసాగుతాయంటూ మరోముక్తాయింపు ఇచ్చాడు. తిరిగి చర్చలంటూ వార్తలు. నవంబరు మÖడున జరిగే అమెరికా మధ్యంతర పార్లమెంటరీ ఎన్నికల వరకు ఇలాగే అమెరికా ఉల్లంఘనలు, ఇరాన్ ప్రతిస్పందనలతో గడిచే అవకాశం కనిపిస్తోంది.టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో వార్షిక సమావేశం వచ్చే ఏడాది సమావేశం గురించి ఎటూ తేల్చుకోకుండానే ముగిసింది. ఇది ఒక పెద్ద వైఫల్యం. ఇలా అనేక పరిణామాలు జరిగినప్పటికీ స్థలాభావం రీత్యా కొన్నింటిని మాత్రమే ఈ సందర్భంగా చూద్దాం.


గ్లోబల్ ఫైర్ పవర్ 2026 సూచిక ప్రకారం పది అగ్రశ్రేణి దేశాల్లో 0. 0741 (897)పాయింట్లతో అమెరికా ముందుండగా రష్యా 0.0791(964), చైనా 0.919(988), భారత్ 0.1346(1461), ఐదవ స్థానంలో 0.1642(2198)లో దక్షిణ కొరియా ఉంది. బ్రాకెట్లలో ఉన్న అంకెలు 2016నాటివి, ఆ ఏడాది పదవ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా తాజాగా ఐదుకు ఎగబాకింది గత విశ్లేషణల్లో చెప్పినట్లుగా ఇరాన్‌పై అమెరికా దాడి ప్రపంచంలో నూతన పరిణామాలకు నాంది పలికింది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్నుంచి చమురు కొనుగోలును చైనా నిలిపివేయలేదు. అనేక విధాలుగా ఆదుకుంది. ఈ పూర్వరంగంలోనే అనేక దేశాలు ఇప్పుడు విశ్వసనీయమైన దేశం ఏది అంటే అమెరికా బదులు చైనాను ఎంచుకుంటున్నాయి. కమÖ్యనిస్టు, బీజింగ్ వ్యతిరేకులకు ఇది మింగుడుపడని వ్యవహారం గనుక ఈ పరిణామాన్ని గుర్తించనట్లే వ్యవహరిస్తారు. గల్ఫ్‌లోని తన స్థావరాలనే దాడుల నుంచి కాపాడుకోలేని అమెరికా ఎంతో శక్తివంతమైన చైనా ఒక వేళ బలవంతంగా తైవాన్ విలీనానికి పాల్పడితే పరిస్థితి ఏమిటని అక్కడి వేర్పాటు వాదుల్లో ఆందోళన మొదలైంది.పెంటగాన్ తిరుగులేనిదని ఇప్పటి వరకు కన్న కలలు అమెరికా పరిమితులను వాస్తవంలోకి తెచ్చాయి.ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుందని కాదు గానీ ఒకవేళ జరిగితే చైనాను నివారించే సత్తా ఉందా అన్న ఆలోచనలో పడ్డారు. అమెరికా రక్షణపై ఆధారపడిన గల్ఫ్ దేశాలు ఇటీవలి పరిణామాల తరువాత దానితో సంబంధాల గురించి వెంటనే బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ పునరాలోచనలో పడ్డాయి. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలోని అమెరికా మిలిటరీ స్థావరాల గురించి చైనా, రష్యాలు అందించిన నిర్దిష్ట సమాచారం కారణంగానే ఇరాన్ వాటి మీద చావుదెబ్బతీసిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. ఈ పరిణామాన్ని అమెరికా ఊహించలేదు. ఇదే విధంగా అమెరికా కనుసన్నలలో నడిచే నాటో కూటమిలోని ఐరోపా దేశాల పరిస్థితీ అదే. తమ రక్షణకు తామే ఆయుధాలు కొనుగోలు చేసి ఏర్పాట్లు చేసుకుంటున్నపుడు అమెరికా పెత్తనం ఏమిటన్నది గతంలోనే కొందరు నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు మరింతగా మధనం జరగనుంది.

పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో అనే పదాన్ని చేర్చటంతొలగించటం ఒక సాధారణ వ్యవహారం కాదు. పేరు మార్పు చారిత్రాత్మక గుర్తింపును పునరుద్దరించటం తప్ప వేరు కాదని అమెరికా బుకాయిస్తున్నది.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచించనవసరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పియÖష్ గోయల్ వ్యాఖ్యానించారు.అసలు విషయం ఏమంటే చైనాకు వ్యతిరేకంగా మనదేశాన్ని నిలిపేందుకు 2018లో అమెరికా వేసిన బిస్కెట్ ఇండో అనే పదాన్ని చేర్చటం. గత ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన పరిణామాల్లో ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించిన అమెరికా కుంటిసాకుతో ఆ పేరును తొలగించింది.ఒక విధంగా ఇది మనలను బెదిరించటమే. మనదేశ పాలకవర్గానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సీతగీత దాటితే ఏమైందో తెలుసుగనుక చైనా వ్యవహారంలో కూడా అదే మాదిరి ప్రస్తుతం పరిధి దాటేందుకు సిద్దం కాదు. తరువాత ఎలా మారేదీ ఊహాజనితమే. అమెరికన్ ఏజన్సీల తప్పుడు సమాచారం, ప్రోత్సాహంతో గాల్వన్ లోయ ఉదంతం జరిగిందన్నది ఒక అభిప్రాయం. ఐదు సంవత్సరాల తరువాత అదే చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవటం వెనుక పాలకవర్గ ప్రయోజనాలు దాగున్నాయి.సైద్దాంతికంగా ఆరఎసఎస్ వైఖరి చైనా, కమÖ్యనిస్టు వ్యతిరేకం అయినప్పటికీ అది కూడా తెగేదాకా లాగకూడదని గ్రహించి పాలకవర్గ వాంఛలను ఆమోదించకతప్పలేదు.ఒక వైపు చైనాను వ్యతిరేకిస్తున్న జపాన్‌తో జట్టుకడుతూనే బీజింగ్ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఇది దేశంలో డ్రాగన్ దేశ వ్యతిరేక శక్తులకు చెంపదెబ్బవంటిది. గతంలో మాదిరి భారత పాలకవర్గం సోషలిస్టువ్యతిరేక శిబిరాల నుంచి లబ్ది పొందేందుకు ప్రయత్నించినట్లే ఇప్పుడు కూడా అదే గేమ్ ఆడుతున్నది.విద్యుత్ రంగంలో చైనాతో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శాశ్వతంగా అనుమతి ఇచ్చినట్లు కాదని పైకి బింకాలు పోతున్నప్పటికీ చైనా పెట్టుబడుల కోసం మనదేశం ఎంతగా తహతహలాడుతున్నది తెలుస్తోంది. గాల్వన్‌లోయ ఉదంతాల సమయంలో చైనా వ్యతిరేక మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు అన్నీ మÖసుకు కూర్చున్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలేవీ కూడా సైద్దాంతికంగా కమÖ్యనిస్టు అనుకూలమైనవి కాదు. కానీ వాటికి చైనా వస్తువులు కావాలి.కార్పొరేట్లకు లాభాలు సంపాదించి పెట్టాలనటంలో ఏకాభిప్రాయం ఉంది.ఈ కారణంగానే చైనా దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం మనదేశం చెబుతున్న లెక్కల ప్రకారం ఇరుదేశాల వాణిజ్యలావాదేవీల విలువ 151 బిలియన్ డాలర్లు కాగా చైనా లెక్కలు 156బి.డాలర్లు అంటున్నాయి. ఇది పెద్ద సమస్య కాదు గానీ చైనాతో మన వాణిజ్యలోటు 112 బిలియన్ డాలర్లు దాటింది, ఇదొక రికార్డు. మన మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత నినాదాలు, ఆచరణ వైఫల్యానికి ఇది నిదర్శనం.


కమÖ్యనిస్టు చైనా విషయంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు కారణంగానే పసిఫిక్ కమాండ్ పేరు మార్చారన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత పసిఫిక్ ప్రాంతంపై అదుపుకోసం కమÖ్యనిస్టు చైనా ఆవిర్భవించక ముందే 1947 జనవరి ఒకటిన అమెరికా కమాండ్ ఏర్పడింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి మనదేశ పశ్చిమ(అరేబియా) తీరం వరకు మిలిటరీతో సహా అనేక కార్యకలాపాల నిర్వహణ దాని లక్ష్యం.కొరియా, వియత్నాంపై దాడులు, ఇతర అనేక దేశాల్లో జోక్యం ఈ కమాండ్ పుణ్యమే. ఎనిమిది సంవత్సరాల క్రితం పేరు మార్చేందుకు సందర్భమేమీ లేనట్లే ఇప్పుడు పూర్వపు నామాన్ని తెరమీదకు తెచ్చేందుకూ సరైన కారణమేమీ లేదు. అమెరికా తన ప్రయోజనానికి ఏది మంచిదనుకుంటే అదే చేస్తుంది.మన దేశ పటాన్ని పాకిస్తాన్‌కు అనుకూలంగా మార్చినా అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే మన పాలకులకు చీమకుట్టినట్లు లేదు. జై భజరంగభళీ అంటూ చైనా, పాకిస్తాన్‌ల మీద వీధుల్లో వీరంగం వేసేవారెవరూ కిక్కురు మనలేదు. లెటర్‌హెడ్ మీద పేరు మార్చినంత మాత్రాన అంతా మారిపోయినట్లు కాదని అమెరికా రాయబారి వ్యాఖ్యానించాడు. అమెరికా మిలిటరీతో మన బంధం పూర్తి అయింది గనుక దాన్నుంచి బయటపడలేని స్థితి ఏర్పడిందని భావించిన తరువాత అమెరికా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.చిత్రం ఏమిటంటే ఇప్పుడు లేని ఇండో`పసిఫిక్ కమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నట్లు మనదేశం, జపాన్ చెబుతున్నాయి.జపాన్ అంటే అమెరికా తొత్తు గనుక అదేమైనా చెప్పుకోవచ్చు, మనం కూడా అంతేనా !


రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ చేతులెత్తేసిన తరువాత అమెరికా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయపెట్టింది. దాంతో నాటి సోవియట్ యÖనియన్,బ్రిటన్,ఫ్రాన్సు,చైనా, పాకిస్తాన్,మనదేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయాల్సి వచ్చింది.ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నట్లు చెబుతున్నారు.అణ్వాయుధాలేగాక ఆధునిక క్షిపణులతో అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. తద్వారా ఆయుధపోటీకి తెరలేపింది. ఆ క్రమంలో ప్రతిదేశం తన రక్షణ కోసం ఆయుధాలను తయారు చేసుకోక తప్పటం లేదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తాను అణ్వాయుధ క్షిపణి ప్రయోగం జరపనున్నట్లు అనేక దేశాలకు ముందుగానే సమయం, నిర్దేశిత లక్ష్యం గురించి చైనా తెలియచేసింది.సోమవారం నాడు మధ్యాహ్నం 12.01నిమిషాలకు అణునియంత్రిత జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం జరపగా 59 నిమిషాల్లో జయప్రదంగా ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. పసిఫిక్ సముద్రంలో నిజమైన బాంబులకు బదులు డమ్మీలతో ఆ ప్రయోగం జరిగింది. ఇలాంటి ప్రయోగాలు జరిపిన దేశాలలో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు మనది కూడా ఒకటి.వార్షిక మిలిటరీ శిక్షణలో భాగంగా తామీ పరీక్ష జరిపినట్లు చైనా చెప్పినప్పటికీ జపాన్ వంటి దేశాలు భిన్నంగా స్పందించాయి. జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా ప్రజాయుద్ధ ప్రతిఘటన 80వ వార్షికోత్సవం సందర్భంగా జులాంగ్(జెఎల్) జలాంతర్గామి ప్రయోగించిన క్షిపణిని చైనా తొలిసారిగా 2025 సెప్టెంబరు 3న ప్రదర్శించింది. ఎనిమిది నుంచి పదివేల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత ýక్ష్యాన్ని ఛేదించగల ఈ ఖండాంతర క్షిపణిని ఇప్పుడు పరీక్షించింది. గత రెండు సంవత్సరాలలో ఇలాంటి ప్రయోగాలు చేయటం రెండవసారి. సోవియట్, తరువాత రష్యా వద్ద కూడా ఇలాంటి అధునాతన వ్యూహాత్మక క్షిపణులు ఉన్న కారణంగానే అమెరికా అదుపులో ఉంది.ఇప్పుడు రష్యాకు చైనా కూడా తోడైంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్షిపణులను ప్రయోగించే జలాంతర్గాములు అమెరికా 14, రష్యా 13, చైనా 6, ఫ్రాన్సు 4, బ్రిటన్ 4, మనదేశం వద్ద మÖడు ఉన్నాయి. అన్ని దేశాలూ కొత్తగా మరికొన్నింటిని నిర్మించేక్రమంలో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆత్మరక్షణకు తప్ప ఎదుటి దేశాలపై దాడులు చేసేందుకు అవసరమైన మిలిటరీని కలిగి ఉండకూడదని ఆమోదించిన రాజ్యాంగాన్ని ఇప్పుడు జపాన్ మార్చుకొని తిరిగి ఆసియాలో ఒక సైనిక శక్తిగా మారేందుకు చూస్తున్నది. అలాంటి దేశంతో మనం చేతులు కలిపి చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటాన్ని గమనించాలి.ఈ పరిణామాలను చూస్తున్నపుడు అటు చైనా, ఇటు దాని వ్యతిరేక కూటమి దేశాలనూ సంతుష్టీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తున్నది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

10 Friday Jul 2026

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

KG Basin gas/oil, KG Basin oil looty, Narendra Modi Failures, ONGC, Pro Corporate, Vedanta


డాక్టర్ కొల్లా రాజమోహన్



భారతదేశానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సహజ వనరులలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, ముఖ్యంగా కృష్ణా-గోదావరి (KG) బేసిన్ అత్యంత కీలకమైనవి. దేశ ఇంధన భద్రతలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇటీవల కాలంలో ఈ ప్రజా సంపదను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అడ్డగోలుగా ధారాదత్తం చేయడానికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను, పర్యావరణాన్ని విస్మరించి కేవలం రిలయన్స్, వేదాంత వంటి ప్రైవేటు సంస్థల లాభార్జనే ధ్యేయంగా చట్టాలను సవరించడం దేశీయ ఆర్థిక సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టుగా మారింది.  

1. ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024: కార్పొరేట్ అనుకూల చట్టం

దేశీయ చమురు, గ్యాస్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ది ఆయిల్ ఫీల్డ్స్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) సవరణ బిల్లు, 2024’ను తీసుకువచ్చింది. ఈ బిల్లు 2024 డిసెంబరు 3న రాజ్యసభలోనూ, 2025 మార్చి 12న లోక్‌సభలోనూ ఆమోదించబడింది. ఈ చట్టం పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు సాగిలపడే విధంగా రూపొందించబడింది.  

 క్రిమినల్ శిక్షల రద్దు – నేరరహితీకరణ (Ease of Doing Business): 1948 నాటి పాత చట్టం ప్రకారం, పర్యావరణానికి ముప్పు తెచ్చినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా నిందితులకు 6 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధనలు ఉండేవి. తప్పు చేసిన వారు సమాజంలో తలదించుకునేలా, భయం కలిగి ఉండేలా ఆ శిక్షలు ఉండేవి. కానీ, ప్రస్తుత సవరణ బిల్లు వ్యాపార వాతావరణాన్ని సులభతరం చేయడం (Ease of Doing Business) అనే పేరుతో జైలు శిక్షను పూర్తిగా రద్దు చేసింది. దీని స్థానంలో కేవలం ₹25 లక్షల జరిమానాను ప్రవేశపెట్టింది. వందల, వేల కోట్లు అక్రమంగా సంపాదించే కార్పొరేట్ శక్తులకు ఈ ₹25 లక్షల జరిమానా అత్యంత స్వల్పమైన మొత్తం. డబ్బుతో శిక్షను కొనుక్కునేందుకు, ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వమే ఈ చట్టం ద్వారా దారి చూపిస్తోంది.  

 ప్రభుత్వ మౌలిక సదుపాయాల లూటీ (Infrastructure Sharing): ఈ బిల్లు ప్రకారం, మన దేశ అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ONGC దశాబ్దాలుగా ఎంతో కష్టపడి, భారీ పెట్టుబడులతో ఏర్పాటు చేసుకున్న రిగ్గులు, పైప్‌లైన్లు, ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ సౌకర్యాలను ప్రైవేటు ఆపరేటర్లు చట్టబద్ధంగా ఉచితంగా వాడుకోవచ్చు. ఇది ప్రైవేట్ సంస్థల పెట్టుబడి, నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. అంటే, కష్టమంతా ప్రభుత్వ సంస్థది, లాభమంతా ప్రైవేట్ కంపెనీలది అన్నట్లుగా ఈ విధానం ఉంది.  

2. కృష్ణా జిల్లా కాజా బ్లాక్ వ్యవహారం – వేదాంతకు అయాచిత లబ్ధి

కృష్ణా జిల్లాలోని పామర్రు, కాజా బ్లాక్ పరిధిలో ONGC సంస్థ తన సొంత ఖర్చుతో విస్తృతంగా అన్వేషణ జరిపి, భారీగా హైడ్రోకార్బన్ నిల్వలను గుర్తించింది. ఆన్-షోర్‌లో 115 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ విలువైన బ్లాక్‌ను వెలికితీసేందుకు, ప్రభుత్వం ONGCని కాదని వేదాంత కంపెనీకి అనుమతులు మంజూరు చేసింది.  

₹650 కోట్ల పెట్టుబడితో 30,000 బారల్స్ క్రూడ్ ఆయిల్, 30 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తామని వేదాంత చెబుతోంది. ఒకవేళ అక్కడ చమురు దొరకకపోతే ఆ నష్టాన్ని భరించేది ONGC, కానీ నిక్షేపాలు దొరికిన తర్వాత అయాచితంగా లాభాలు పొందేది మాత్రం వేదాంత. దీనినే “ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్” (లాభాలు ప్రైవేటుకు, నష్టాలు జాతీయీకరణకు) అంటారు.  

3. స్థానిక ప్రజలకు, పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు

ఈ సవరణ బిల్లు మరియు ప్రైవేట్ సంస్థల ప్రవేశం వల్ల ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి, స్థానిక ప్రజల జీవనోపాధికి తీవ్రమైన నష్టం వాటిల్లనుంది:

 పర్యావరణ క్షీణత మరియు ఫ్రాకింగ్ (Fracking): ఈ బిల్లు ద్వారా సాంప్రదాయ గ్యాస్, ఆయిల్‌తో పాటు ‘షేల్ గ్యాస్’ (Shale Gas) వెలికితీతను సులభతరం చేశారు. షేల్ గ్యాస్ తీయడానికి వాడే ‘ఫ్రాకింగ్’ పద్ధతి వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతాయి, అంతేకాక భూమి కంపించే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఒకే అనుమతి (Single-Window) విధానం ద్వారా పర్యావరణ అనుమతులు వేగంగా ఇవ్వడం వల్ల పర్యావరణ రక్షణకు ఎటువంటి గ్యారంటీ లేకుండా పోయింది.  

 జీవనోపాధి దెబ్బతినడం: కాజా, కేజీ బేసిన్ లాంటి తీర ప్రాంతాలలో పైప్‌లైన్లు వేయడం, రిగ్గులు పెట్టడం వల్ల స్థానిక మత్స్యకారుల వేట దెబ్బతింటుంది. అలాగే బందరు కాలువ ద్వారా పొలాలకు నీరు పెట్టుకుంటున్న వ్యవసాయ భూములు కలుషితమై రైతులు తీవ్రంగా నష్టపోతారు.  

 వేదాంత కంపెనీ వివాదాల చరిత్ర: వేదాంత సంస్థకు పర్యావరణ విధ్వంసం చేసిన నల్లని చరిత్ర ఉంది. తమిళనాడు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ కాలుష్యానికి వ్యతిరేకంగా 2018లో స్థానికులు నిరసన చేసినప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించారు. ఒడిశాలోని నియంగిరి కొండల్లో బాక్సైట్ తవ్వకాల కోసం గిరిజనుల హక్కులను కాలరాచినందుకు 2013లో సుప్రీమ్ కోర్ట్ అక్కడ మైనింగ్‌ను నిషేధించింది. ఒడిశా ఝార్సుగూడ ప్లాంట్ టాక్సిక్ వ్యర్థాలు పొలాల్లోకి వదలడం, సెబీ (SEBI) చేత షేర్ల అవకతవకలపై నిషేధానికి గురికావడం, జంబియా దేశంలో పన్ను ఎగవేత, పర్యావరణ నష్టం కారణంగా గనుల జప్తును ఎదుర్కోవడం వంటి ఎన్నో వివాదాలు వేదాంత చుట్టూ ఉన్నాయి. అటువంటి సంస్థకు మన బందరు కాలువ, కాజా ప్రాంత పర్యావరణాన్ని అప్పగించడం అత్యంత ప్రమాదకరం.  

4. నార్వే దేశ నమూనా – మనకెందుకు సాధ్యం కాదు?

ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలలో ఒకటైన నార్వేలో సహజ వనరులు ప్రజల ఉమ్మడి ఆస్తిగా ఉన్నాయి. అక్కడ చమురు, గ్యాస్ ద్వారా వచ్చే లాభాలను ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా ప్రభుత్వ ఆధీనంలోని సార్వభౌమ నిధిలో జమ చేసి, ప్రజల ఉచిత విద్య, వైద్యం, సామాజిక భద్రతకు వాడుతున్నారు.

కానీ మన దేశంలో రిలయన్స్ వంటి కంపెనీలు కేజీ బేసిన్ లోని వనరులను వెలికితీసి ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాయి. రష్యా నుండి చౌకగా చమురు దిగుమతి చేసుకుని యూరప్‌కు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్న రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలకు మాత్రం గ్యాస్ కేటాయించడం లేదు. డబ్బులు తీసుకుని కూడా ఇవ్వకుండా, ఇక్కడి గ్యాస్‌ను 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు.  

5. న్యాయవ్యవస్థ నిర్వీర్యం – వివాదాల పరిష్కారం

ఈ కొత్త బిల్లు ప్రకారం వివాదాల పరిష్కారానికి కోర్టులకు ఎటువంటి అధికారమూ లేదు. కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ లేదా అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ఒక అధికారి మాత్రమే వివాదాలను పరిష్కరిస్తారు. అవినీతి వ్యవస్థలో ఇటువంటి అధికారులు ప్రజానుకూలంగా తీర్పులు ఇస్తారని భావించలేము. గతంలో ONGC వెలికితీసిన గ్యాస్‌ను రిలయన్స్ దొంగతనం చేసి అమ్ముకున్న వ్యవహారంలో ప్రభుత్వం, కోర్టులు ఏమీ చేయలేక చివరకు రాజీ పడమని సలహా ఇవ్వడమే దీనికి నిదర్శనం.  

సహజ వనరులు ప్రజల సొత్తు. ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాలు ఎప్పుడైనా ప్రజల ప్రయోజనాలకు లోబడి ఉన్నప్పుడే సమాజం పురోగమిస్తుంది. విలువైన ప్రజల సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడం వల్ల ప్రజలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోతారు. పాలకవర్గ పార్టీలు ఈ అన్యాయాన్ని విమర్శించకపోవడం శోచనీయం. మన ప్రయోజనాలను, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా చైతన్యవంతులై, కే జీ బేసిన్ గ్యాస్ ఆయిల్ సాధన సమితి వంటి వేదికల ద్వారా ఐక్యంగా, పోరాడవలసిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త: కన్వీనర్, కే జీ బేసిన్ గ్యాస్ ఆయిల్ సాధన సమితి, గుంటూరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d