Tags
|
30 Saturday Jan 2016
Posted in Current Affairs, Health, INTERNATIONAL NEWS, Latin America, Readers News Service, USA, Women
Tags
|
29 Friday Jan 2016
Posted in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Readers News Service, Women
Tags
![]() |
| Most of China’s provinces and municipalities are planning to officially abolish late marriage leave, the rule that allowed some newlyweds to take extended holidays after their big day. [chinanews.com] |
Most of China’s provinces and municipalities are planning to officially abolish late marriage leave, the rule that allowed some newlyweds to take extended holidays. The latest move based on the newly-passed amendment to the Population and Family Planning Law has sparked much debate among experts and citizens including many young net users.
According to the new amendment to the Law which has been approved by the standing committee of the National People’s Congress, China’s top legislative body last December, citizens who marry and bear children at a later age can only get three days of marriage leave, instead of the previous 10 days or more, bringing the regulations into line with the rest of the population.
Quick Response from Local Officials
For now, Guangdong and Hubei provinces are among the quick responders to apply the new policy change. They have officially released the regulations on scrapping extra marriage leave, only giving three days off for newlyweds.
Beijing and Shandong Province issued the draft of the new family planning measures to solicit public opinions in early January, in which the extended leave for late marriage had been deleted.
Officials from the Shanghai Health and Family Planning Commission also confirmed it would also be removing such a clause in the new local regulations.
The legal age for marriage in China is 22 for men and 20 for women. Now, all couples get three days’ leave after tying the knot, whereas before, those who were 25 or 23 were eligible for extra time off. The additional leave was aimed at encouraging people to marry and raise children later in life according to previous family planning policy.
However, as China adopts fundamental changes to the policy and is nowadays encouraging couples to have two children, the State no longer wants to discourage people from marrying earlier.
Therefore, in the next step towards full adoption, China’s provinces, autonomous regions and municipalities have begun to amend and publish their own local population and family planning regulations based on the new Law.
For now, though, if the new regional regulations have not yet been released officially, couples who marry at an older age can still enjoy a holiday ranging from 10-23 days. For instance, those marrying at a later age in northwest China’s Gansu Province can even still get 30 days off and those in north China’s Shanxi Province have a similarly extended arrangement.
To catch the “last train” of late marriage leave, therefore, many young couples in China swarmed into registration offices to apply for their marriage certificates before the New Year.
Change Sparks Argument
The move of abolishing the extra leave has sparked argument among some netizens from various regions.
A commenter nicknamed Doudou complained, “As a woman born in the 80s, I encountered the one-child policy, college entrance exam reforms, overall two-child policy, abolishment of late marriage leave, postponed retirement, and what’s worse, as a college graduate majoring in medicine, I also encountered the medical treatment reforms. In the future, I have to support two children and four seniors.”
One netizen said that as the late marriage leave has been abolished, if there is no local amendment to the policy, the three-day holiday is only enough to hold a wedding ceremony, and thus they have to prepare in their spare time or ask their parents, relatives or friends for help, not to mention making time for the honeymoon.
On the other hand, some netizens and experts explained their agreement about the new policy, saying that it caters for the developmental direction of the country and is also beneficial for keeping China’s population stable and relieving the trend for an ageing demographic.
Experts said as the amendment to the family planning regulations in other provinces, autonomous regions and municipalities are still in process, the changes for late marriage leave can only be clear after the local standing committee review meetings. But based on the new regulations released in regions like Guangdong and Hubei provinces, abolishing the extra holiday has gone mainstream across the country.
Experts have suggested that it could be better to adopt a gradual way to abolish the extra leave, so that the public can have a period of time to get used to the changes.
(Source: ce.cn/Translated and edited by Women of China)
25 Monday Jan 2016
Posted in CPI(M), Current Affairs, Economics, Health, Left politics, NATIONAL NEWS, Women
Tags
CPI(M), National Family Health Survey 2015-16 (NFHS-4, NFHS_4 Tripura, Tripura, Tripura Left Front
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లేదా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలలో గానీ పాలకులు ఎంచుకున్న అభివృద్ధి మార్గాలలో ప్రభుత్వరంగంలోని ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రయివేటు రంగాన్ని పెంచి పోషించటం. పేదలకు ఆధునిక వైద్యం అందించే పేరుతో ప్రవేశపెట్టిన పధకాలన్నీ ఆచరణలో కార్పొరేట్ ఆసుపత్రుల యంత్రాలు వాటి యజమానులు, యంత్రాల వంటి వైద్యుల జేబులు నింపటానికి తోడ్పడుతున్నాయన్నది కాదనలేని సత్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రులలో 38,48 శాతాల చొప్పున కాన్పులు జరుగుతుంటే త్రిపురలో 69శాతం వున్నాయి. మేఘాలయను పాలించిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల శ్రద్ధ తీసుకోలేదు, కార్పొరేట్లు అక్కడికి వెళ్లవు గనుక అసలు ఆసుపత్రులలో జరిగే కాన్పులే 51శాతం వుండగా ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేవి 39శాతం మాత్రమే వున్నాయి. కుటుంబ ఆరోగ్యం, సంక్షేమం విషయాలలో త్రిపుర ఎంతో పురోగమించింది.
ఎం కోటేశ్వరరావు
కమ్యూనిస్టులు అనగానే అభివృద్ధి చేయరు,తమ వుద్యమాలను కొనసాగించేందుకు పేదలను, పేదరికాన్ని అలాగే వుంచాలని కోరుకుంటారు అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులు చేసే తప్పుడు ప్రచారాలలో ఒకటి. దశాబ్దాల తరబడి ఏనుగువంటి అమెరికా అష్టదిగ్బంధనం చేసినా ఎలుకపిల్లంతటి క్యూబాలో కమ్యూనిస్టుల నాయకత్వాన వైద్యరంగంలో సాధించిన విజయాలేమిటో ప్రజలందరికీ తెలిసిందే. మన దేశంలో రాష్ట్రాలు అంటే మున్సిపాలిటీల కింద లెక్క. అందునా త్రిపుర వంటి గిరిజన ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు తప్ప స్ధానికంగా ఆదాయం వచ్చే అవకాశాలు నామమాత్రం. అయినా త్రిపుర కుటుంబజీవన పరిస్ధితులను మెరుగు పరచటంలో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం సాధించిన విజయాలేమిటో ఒక్కసారి చూడండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడ జరుగుతున్నదేమిటో చూద్దాం. ఏడుగురు సోదరీ మణులుగా పిలిచే ఈశాన్య రాష్ట్రాలలో మేఘాలయ కూడా ఒకటి.అదీ వెనుకబడిన కొండ ప్రాంతమే. అక్కడ ఏ పార్టీ అయినా కమ్యూనిస్టులు కాని వారే పాలకులుగా వున్నారు.అక్కడి పరిస్ధితులు ఎలా వున్నాయో పోల్చుకుంటే కమ్యూనిస్టుల ప్రత్యేకత, జనం పట్ల జవాబుదారీతనం ఏమిటో తెలుస్తుంది. ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16కు సంబంధించి కొన్ని రాష్ట్రాల వివరాలను ప్రకటించింది.
గతంలో కొన్ని వివరాలు సేకరించలేదు కనుక కొన్నింటితో పోల్చుకోలేము కనుక ఆ పరిమితులను గమనంలో వుంచుకోవాలి. గత సర్వే 2005-06లో జరిగింది. వుమ్మడి ఆంధ్రప్రదేశ్ వివరాలు పదేళ్లనాటి సర్వే వివరాలని గమనించాలి. (వు.అ-వుమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపి-ప్రస్తుత ఆంధ్రప్రదేశ్)
ఏపి త్రిపుర తమిళనాడు
1.ఆరేళ్లకు పైబడిన పురుషులలో స్కూళ్లకు వెళ్ళిన వారు 62.0 81.9 77.2
2. పదిహేనేళ్ల లోపు జనాభా 23.7 24.5 23.3
3వెయ్యిమంది పురుషులకు మహిళలు 1020 998 1033
4.గత ఐదేళ్లలో పుట్టిన వెయ్యిమంది పురుషులకు మహిళలు 914 966 954
5.అయోడిన్ వుప్పు వాడుతున్నవారు 81.6 99.1 82.8
6.మెరుగైన మరుగుదొడ్డి వున్నవారు 53.6 61.3 52.2
7.మంచినీటి సౌకర్యం వున్నవారు 72.7 87.3 90.6
8 వంటకు గ్యాస్, విద్యుత్ వాడుతున్నవారు 62.0 31.9 73.0
9.మహిళా అక్షరాస్యులు 62.9 80.4 79.4
10.పురుష అక్షరాస్యులు 79.4 89.5 89.1
11. పదేళ్లకు పైగా చదువుకున్న మహిళలు 34.3 23.4 50.9
12. పద్దెనిమిదేళ్లకు ముందే వివాహమైన యువతులు 32.7 32.2 15.7
13.21ఏళ్లకు ముందే వివాహిత యువకులు 23.5 22.2 17.0
14.ప్రసవ సమయంలో పిల్లల మరణాలు 35 27 21
15.ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 41 33 27
16.ఏదో ఒక కుటుంబనియంత్రణ 69.5 64.1 53.3
17.మహిళలకు ఆపరేషన్లు 68.3 13.9 49.4
18.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవానికి అదనపు ఖర్చు రు. 2,138 4,412 2496
19.ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు 38.3 69.1 48.1
20.సిజేరియన్ ఆపరేషన్లు 40.1 20.5 34.1
21.ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లు 25.5 18.1 26.3
22.ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్లు 57.0 73.7 51.3
23.ఎత్తుకు సరిపడా బరువులేని మహిళలు 17.6 18.9 14.6
24.ఎత్తుకు సరిపడా బరువులేని పురుషులు 14.8 15.7 12.4
25.అధిక బరువున్న మహిళలు 33.2 16.0 30.9
26.అధిక బరువున్న పురుషులు 33.5 15.9 28.2
27.పిల్లలలో రక్త హీనత 58.6 48.3 50.7
28.మహిళలలో రక్త హీనత 60.0 54.5 55.1
29.పురుషులలో రక్త హీనత 26.9 24.7 20.6
30.స్త్రీలలో మద్యపానం 0.4 4.8 0.4
31.పురుషులలో మద్యపానం 34.9 57.6 46.7
32.స్త్రీలలో పొగతాగేవారు 2.3 42.2 2.2
33.పురుషులలో పొగతాగేవారు 26.8 67.8 31.7
34.మహిళలలో స్వంతంగా సెల్ వున్నవారు 36.2 43.9 62.0
35.బ్యాంకు ఖాతా వున్న మహిళలు 66.3 59.2 77.0
23 Saturday Jan 2016
Posted in AP NEWS, Current Affairs, Economics, Education, Health, NATIONAL NEWS, Women
Tags
పదేళ్లలో వూబకాయులు రెట్టింపు-రక్త హీనత తగ్గినా ఆందోళనకరమే-ఏపి పురుషులలో ఎక్కువ
రెండు తెలుగు రాష్ట్రాలలో వూబకాయ సమస్య వేగంగా పెరుగుతోంది. పది సంవత్సరాల క్రితం పొడువు కంటే ఎక్కువ బరువున్న స్త్రీ ,పురుషుల పట్టణ, గ్రామీణ ప్రాంతాల సగటు 17.7, 17.6 వుండగా ప్రస్తుతం ఏపిలో 33.2, 33.5, తెలంగాణాలో 28.1,24.1 శాతానికి పెరిగింది. రెండు చోట్లా పట్టణాలలో ప్రస్తుతం ఏపిలో 45.6, 44.4 చొప్పున స్రీ, పురుషులలో వూబకాయం శాతాలున్నాయి.అదే తెలంగాణాలో 39.5,31.9గా వున్నాయి.
రక్త హీనత విషయానికి వస్తే రెండు రాష్ట్రాలలోనూ గతంతో పోల్చితే కొంత మెరుగు పడినప్పటికీ ఇంకా అందోళనకర స్ధాయిలోనే వుంది. పిల్లలు, స్త్రీలలో 79.6,62.7 నుంచి ఏపిలో 58.6,60.2కు తెలంగాణాలో 60.7, 56.7తగ్గింది.పట్టణాలలో వూబకాయాలు ఎక్కువుంటే గ్రామాలలో రక్తహీనులు ఎక్కువగా వున్నారు.పురుషులలో పదేళ్లనాడు 17.6శాతం రక్త హీనత వుంటే ప్రస్తుతం ఏపిలో వారిశాతం 26.9కి పెరగ్గా , తెలంగాణాలో 15.4కు తగ్గింది.
జన జీవితంలోని కొన్ని సూచికలు
ఎం కోటేశ్వరరావు
అవిభక్త ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, వుద్రేకాలు తగ్గాయి. తాపీగా కాకపోయినా ఎవరి రాష్ట్రాన్ని వారు బాగు చేసుకోవాలంటే నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమిది. రాష్ట్రం బాగు చేసుకోవటం అంటే వేళ్లమీద లెక్కించదగిన కొన్ని పారిశ్రామిక కుటుంబాలు లేదా సంస్ధల ఆస్తులు పెరగటం కాదు. ప్రజల జీవన సూచికలు అభివృద్ధికి కొలబద్దలుగా అంగీకరిస్తే వాటిని బట్టి సమగ్రంగా గాకపోయినా కొంత మేరకు మనం ఎక్కడున్నామో అర్ధం చేసుకోవచ్చు. వాటిలో ఆరోగ్యం, మరికొన్ని సూచికలను ప్రమాణాలుగా ఐక్యరాజ్యసమితి తీసుకుంది. అందువలన అంతకంటే మెరుగైన కొలబద్దలు రూపొందే వరకు వాటితోనే మనం కొలవాల్సి వుంటుంది. కొత్త రాష్ట్రం తెలంగాణా జనంలో ఎన్నో ఆశలు, ఇంకా సజీవంగానే వున్నాయి. మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదు, రాదు అని అధికారికంగా చెప్పకపోయినా అక్కడి వారు మాట్లాడటం లేదంటే తెలుగుదేశం పార్టీ, బిజెపి, వారి కనుసన్నలలో మెలిగే మీడియా అంతకంటే ఎక్కువే ప్రయోజనం కలిగిస్తారని చెప్పిన మాటలను మరోసారి ప్రజలు నమ్మారని భావించాలి. ఎందుకంటే అమరావతి రాజధాని శంకుస్ధాపన సభకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కుండలో పార్లమెంట్ ప్రాంగణంలోని కాస్తంత మట్టి ,మురికి యమునా నది నీళ్లు తేవటమే మహాభాగ్యంగా భావించారు మరి. వారిలో కూడా ఇంకా ఆశలు అలాగే వున్నాయి.
అంధ్రవలస పాలకుల కారణంగా తెలంగాణా ప్రాంత ఆదాయానికి తగిన విధంగా అభివృద్ధి చెందలేదు కనుక ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది ప్రధాన నినాదాలలో ఒకటి. ఇంకా అనేకం వున్నాయనుకోండి, సందర్భం వచ్చినపుడు ముందు ముందు పరిశీలించుకుందాం. ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16కు సంబంధించి కొన్ని రాష్ట్రాల వివరాలను ప్రకటించింది. వాటిలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాలు వున్నాయి.తొలిసారిగా జిల్లాల వారీ అంచనాలను అందచేశారు.స్ధానిక భాషలోనే సమాచారాన్ని సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది మేనెల ఆరవ తేదీ నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు, తెలంగాణాలో ఫిబ్రవరి 23 నుంచి మే నెల తొమ్మిదవ తేదీవరకు సర్వే నిర్వహించారు. అందుకని తప్పుడు సమాచారం అందచేయటానికి లేదా అందించటానికి ఆస్కారం లేదు.
పొగ, మద్యపానంలో స్త్రీలతో సహా తెలంగాణా టాప్
మద్యపానం విషయంలో తెలంగాణా రాష్ట్రం అగ్రస్ధానంలో వుంది. అక్కడ స్త్రీలలో సగటున 8.8శాతం మంది తాగుతుండగా గ్రామీణ ప్రాంతాలలో 14.3శాతం, పురుషులలో సగటున 53.9 శాతం వున్నారు. అదే ఏపి విషయానికి వస్తే స్త్రీలు 0.4, పురుషులు 34.9 శాతం వున్నారు. తెలంగాణాలో 2.8శాతం స్త్రీలు, 28.3శాతం పురుషులు పొగతాగుతుండగా ఏపీలో 2.3, 26.8శాతం వున్నారు
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కలసి వున్నపుడు జరిగిన కార్యక్రమాలు, వాటి పర్యవసానాలే ఈ సర్వేలో వెల్లడైన సమాచారానికి ప్రాతిపదికలు. ఎవరైనా ఏడాది కాలంలో మా ముఖ్యమంత్రి అల్లా వుద్దీన్ అద్బుత దీపం మాదిరి అభివృద్ధి చేశారు, ఆ ఘనత వారికే చెందాలి అని వాదిస్తే అలాంటి వారికి రెండు రాష్ట్రాలకు కలిపి రెండు రెళ్లు నాలుగు దండాలు. ఈ సర్వేకు సంబంధించి జాతీయ స్థాయి సూచికలు ఎలా వున్నాయి, వాటితో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటో పోల్చేందుకు ఇంకా మిగతా వివరాలు వెలువడలేదు. అందువలన దక్షిణాదిలో తమిళనాడుతో పోల్చితే రెండు రాష్ట్రాలలో కీలకమైన అభివృద్ధి సూచికలు ఇలా వున్నాయి. ఇది నిజమైన అభివృద్ధి కాదు అంటే వున్న పరిస్ధితి అనుకుందాం.గ్రామీణ, పట్టణాల మొత్తం,అంకెలు శాతాలలో వున్నాయి. మొత్తం 114 ప్ర శ్నలు వేసి సమాచారాన్ని రాబట్టారు. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా ఈ సమాచారాన్ని ఇస్తున్నాం. గతంలో వుమ్మడి రాష్ట్రంగా వున్నపుడు వెల్లడైన సూచికలతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సూచికలను పోల్చలేము. అందుకే అయితే వుమ్మడి రాష్ట్రంలో వున్న సూచికలతో పోల్చినపుడు రెండు ప్రాంతాలలోని తాజా పరిస్ధితులను బట్టి కొంతమేర అర్ధం చేసుకోవచ్చు. గతంలో కొన్ని వివరాలు సేకరించలేదు కనుక కొన్నింటితో పోల్చుకోలేము కనుక ఆ పరిమితులను గమనంలో వుంచుకోవాలి. గత సర్వే 2005-06లో జరిగింది. వుమ్మడి ఆంధ్రప్రదేశ్ వివరాలు పదేళ్లనాటి సర్వే వివరాలని గమనించాలి. (వు.అ-వుమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపి-ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, టిజి-తెలంగాణా, టిఎన్-తమిళనాడు)
వు.ఆ ఏపి టిజి టిఎన్
1.ఆరేళ్లకు పైబడిన పురుషులలో స్కూళ్లకు వెళ్ళిన వారు 62.0 62.2 77.2
2. పదిహేనేళ్ల లోపు జనాభా 23.7 25.0 23.3
3వెయ్యిమంది పురుషులకు మహిళలు 1020 1007 1033
4.గత ఐదేళ్లలో పుట్టిన వెయ్యిమంది పురుషులకు మహిళలు 914 874 954
5.అయోడిన్ వుప్పు వాడుతున్నవారు 81.6 95.8 82.8
6.మెరుగైన మరుగుదొడ్డి వున్నవారు 53.6 50.2 52.2
7.మంచినీటి సౌకర్యం వున్నవారు 72.7 77.6 90.6
8 వంటకు గ్యాస్, విద్యుత్ వాడుతున్నవారు 62.0 66.8 73.0
9.మహిళా అక్షరాస్యులు 62.9 65.2 79.4
10.పురుష అక్షరాస్యులు 79.4 83.4 89.1
11. పదేళ్లకు పైగా చదువుకున్న మహిళలు 21.9 34.3 43.3 50.9
12. పద్దెనిమిదేళ్లకు ముందే వివాహమైన యువతులు 54.8 32.7 25.7 15.7
13.21ఏళ్లకు ముందే వివాహిత యువకులు 34.0 23.5 23.9 17.0
14.ప్రసవ సమయంలో మరణాలు 35 28 21
15.ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 41 32 27
16.ఏదో ఒక కుటుంబనియంత్రణ 67.6 69.5 57.2 53.3
17.మహిళలకు ఆపరేషన్లు 68.3 54.2 49.4
18.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవానికి అదనపు ఖర్చు రు. 2,138 4,020 2496
20.సిజేరియన్ ఆపరేషన్లు 40.1 58.0 34.1
21.ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లు 25.5 40.6 26.3
22.ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్లు 57.0 74.9 51.3
23.ఎత్తుకు సరిపడా బరువులేని మహిళలు 30.8 17.6 23.1 14.6
24.ఎత్తుకు సరిపడా బరువులేని పురుషులు 24.8 14.8 21.4 12.4
25.అధిక బరువున్న మహిళలు 17.7 33.2 28.1 30.9
26.అధిక బరువున్న పురుషులు 17.6 33.5 24.2 28.2
27.పిల్లలలో రక్త హీనత 79.6 58.6 60.7 50.7
28.మహిళలలో రక్త హీనత 62.7 60.0 56.7 55.1
29.పురుషులలో రక్త హీనత 23.1 26.9 15.4 20.6
30.స్త్రీలలో మద్యపానం 0.4 8.8 0.4
31.పురుషులలో మద్యపానం 34.9 53.9 46.7
32.స్త్రీలలో పొగతాగేవారు 2.3 2.8 2.2
33.పురుషులలో పొగతాగేవారు 26.8 28.3 31.7
34.మహిళలలో స్వంతంగా సెల్ వున్నవారు 36.2 47.8 62.0
35.బ్యాంకు ఖాతా వున్న మహిళలు 66.3 59.7 77.0
18 Monday Jan 2016
Posted in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Religious Intolarence, Women
ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు?
ఎం కోటేశ్వరరావు
హిందూయిజాన్ని చులకనగా చూస్తున్నారని అనేక మంది వుద్రేకపడిపోతున్నారు. అంతకు ముందు లేని ఆసక్తిని కొందరు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇతర మైనారిటీ మతస్థులలో కూడా దానికి ప్రతి ధోరణి మొదలైంది. ఎవరికి వారు తమ మతచిహ్నాలను ప్రదర్శించుకోవటం ఎక్కువైంది. ఇతర విషయాలలో సమానత్వం, తోటి మనిషిగా చూడకపోయినా పేరు వరకు సమానత్వాన్ని పాటిస్తూ పేరు చివర కులాన్ని సూచించే తోకలను ఆడపిల్లలకూ తగిలించటం పెరిగి పోయింది (ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు పెరిగి పోతున్న కారణంగా ఇతర కులాల వారు ప్రేమించటం, తలిదండ్రులు అంగీకరించకపోవటం గొడవలు ఎందుకని ముందే ఆడపిల్లకు పేరు తగిలిస్తే ఇతర కులాల వారు వారివైపు చూడరని, ఎవరైనా చూసినా తోటి కులం లేదా తత్సమాన కులం వారే పూనుకుంటారనే వుద్ధేశ్యంతో ఇలా పెడుతున్నట్లు ఒక తల్లి వివరణ ఇచ్చింది). ఇది ప్రతి మారు మూల పల్లెలో కూడా కనిపిస్తోంది. ఏ తరానికి ఆ తరంలో తమ పబ్బం గడుపుకొనేందుకు ఆరోగ్యకర రాజకీయాలను వెనుకపట్టు పట్టించి కుల, మత రాజకీయాలను చొప్పించి తమ పబ్బం గడుపుకోవాలనే పాలకవర్గ శక్తుల ఎత్తుగడలు ఫలించిన పర్యవసానమే ఇది. సమాజంలో అస్థిత్వ ధోరణులు పెరగటం కూడా దీనికి తోడైంది.
ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి వుంది? ఇతర మతాల మాదిరి హిందూ మతాన్ని ఏ ఒక్కరో స్ధాపించలేదు లేదా ప్రబోధించలేదు. బైబిల్,ఖురాన్ మాదిరి ఈ మతానికి ఒక ప్రామాణిక గ్రంధం లేదు. అందువలన వేల సంవత్సరాల కాలంలో ఎవరికి అవసరమైన మేరకు వారు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి నట్లు , ఎలాగంటే గతేడాది జరిగిన గోదావరి పుష్కరాలకు వెళ్లేవారు తలా కాస్త మట్టి తీసుకువెళ్లి స్నానఘట్టాల దగ్గర వేయాలని ఒక పెద్దమనిషి ప్రబోధించినట్లుగా అనేక అంశాలను జొప్పించారు. చొప్పిస్తున్నారు. వేదాలలో కానరాని చాతుర్వర్ణ వ్యవస్ధ, మను ధర్మ శాస్త్రం, మహిళల పట్ల వివక్ష వంటి తిరోగమన అంశాలన్నీ మధ్యలో చొప్పించినవే అనే ఒక బలమైన అభిప్రాయం వుంది. ఒక జీవన విధానంగా హిందూయిజమంటే అందరూ కలసి మెలసి జీవించటం. కానీ జరుగుతోంది అందుకు విరుద్ధం. హిందూత్వ వాదులుగా, హిందూయిజాన్ని పరిరక్షించే వారిగా ఫోజు పెడుతూ ఇప్పుడు రంగంలో వున్న శక్తులు, వ్యక్తులు నిజానికి కుహనా హిందువులు, నిజమైన వారు కాదు. దాయిష్(ఐఎస్) వుగ్రవాదులు, తాలిబాన్లు నిజమైన ముస్లింలు ఎలా కాదో వీరు కూడా అదే కోవకు చెందినవారు.
కొంత మంది చెబుతున్నట్లుగా హిందూయిజాన్ని ఎక్కువగా విమర్శిస్తున్నారనే వాదనలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు.కుహనా హిందుత్వ వాదులపై ఇంకా తగినంత లేదనేదే ఆందోళన కలిగించే అంశం.అసలు ఈ విమర్శ, ప్రతి విమర్శలకు కారణం ఏమిటి? ఎవరు దీనికి ఆద్యులు ? ఓటు బ్యాంకు రాజకీయాలు. స్ధిరమైన ఓటు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు కాంగ్రెస్, ఇతర కుహనా లౌకక పార్టీలు మైనారిటీలను బుజ్జగించేందుకు పూనుకున్నాయని పాడిందే పాడరా అన్నట్లు పాడుతోంది, ప్రచారం ప్రారంభించింది ఎవరు? ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం కింద పనిచేసే దాని అనుబంధ సంస్థలైన బిజెపి, ఏబివిపి, విశ్వహిందూపరిషత్ వంటివే కదా ! హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అన్న నినాదం కనిపించని గోడ,ఫ్లెక్సీ, బ్యానర్‌లు ఎక్కడైనా వున్నాయా ? రాజకీయంగా దిగజారటంతో పాటు దేశాన్ని జనాన్ని దివాలా తీయించే ఆర్ధిక విధానాలను అనుసరించిన కాంగ్రెస్ పోతున్న తన పట్టును నిలుపుకొనేందుకు అనుసరించని తప్పుడు పద్దతులు లేవు.వాటిలో మైనారిటీలను బుజ్జగించటం ఒకటి అనటం నిస్సందేహం. అంతేనా బింద్రన్‌వాలే వంటి వుగ్రవాదులను పెంచి పోషించిన దుష్ట చరిత్ర కూడా ఆ పార్టీకి వుంది. చివరికి ఆ బింద్రన్‌వాలా దయ్యం పట్టిన వారే ఇందిరా గాంధీని బలితీసుకొనేందుకు సాధనాలయ్యారు. కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తదితర వామపక్షాలు ఇలాంటి బుజ్జగింపు చర్యలకు వ్యతిరేకం అన్నది చరిత్ర చెప్పిన సత్యం. కాంగ్రెస్ మైనారిటీ మతాల వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే బిజెపి చేసిందేమిటి ? మొదట జనసంఘం అన్నారు, తరువాత దానిని జనతా పార్టీలో కలిపామన్నారు, దాన్నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని పెట్టామన్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ అధికారంలోకి రాకపోవటంతో హిందూమతానికి అన్యాయం జరుగుతోందని ఒకవైపు రెండోవైపు వివాదాస్పద బాబరీ మసీదు, రామజన్మభూమి వివాదాన్ని ముందుకు నెట్టింది. మెజారిటీ మతం వారిని బుట్టలో వేసుకొని అధికార అందలాలెక్కేందుకు ప్రయత్నించింది, అధికారానికి వచ్చిన తరువాత దానిని సుస్ధిరం చేసుకొనేందుకు గుజరాత్‌లో ఎలాంటి దారుణాలకు పాల్పడిందో, ఇప్పుడు దేశంలో ఏ విధంగా వ్యవహరిస్తోందో మనం చూస్తూనే వున్నాం. అందువలన ఆ విమర్శ చేయటానికి బిజెపి లేదా సంఘపరివార్‌కు, వారిని బలపరుస్తూ, కాంగ్రెస్ పద్దతులను మక్కీకి మక్కీ అనుసరించే తెలుగుదేశం, తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నైతిక హక్కు లేదు.
అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ?
ఈ దేశం హిందూ దేశమని, మతమార్పిడులు, పిల్లల్ని ఎక్కువ మందిని కనటం ద్వారా ఇతర మతాలు ముఖ్యంగా ముస్లింలు మెజారిటీగా మారేందుకు పెద్ద కుట్ర పన్నారని, హిందూయిజానికి ముప్పు వచ్చిందని ఆధారంలేని, ఊహాజనిత ప్రచారం ఎక్కువ చేసింది, చేస్తున్నదీ ఎవరు ? అది వాస్తవం కాదని చెప్పిన కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయశక్తులన్నింటినీ దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, విదేశీ సిద్ధాంతాలను పాటించేవారని తన యంత్రాంగం ద్వారా నిత్యం దాడులు చేస్తూ, జనాల బుర్రలను కలుషితం చేస్తున్నది ఎవరు ? సంఘపరివార్ కాషాయ కుహనా హిందుత్వ వాదులు కాదా ? ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు? బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ హిందూ మతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటాడా ?ఈ అంకెల ఆట అంతటితో ఆగలేదు. శ్యామల్ గోస్వామి అనే బిజెపి పెద్దమనిషి ఐదుగురు అంటే బదరికాశ్రమం శంకరాచార్య, శ్రీ వాసుదేవానంద సరస్వతి పదికి పెంచారు. మహిళంటే పిల్లల్ని కనే యంత్రాలనుకుంటున్నారా ? హిందూ మతాన్ని కాపాడి తరువాత ఏం చేస్తారు? వీరు పుట్టక ముందు నుంచి హిందూ మతాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు వీరు ? హిందూయిజానికి ప్రతినిధులమని స్వయంగా నిర్దేశించుకున్నవారే కదా ?చెప్పే వారికి బాధ్యత లేదా ? దేశం కంటే సన్యాసం ఎక్కువా ? లేదు అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ? యోగులు, సన్యాసుల గురించి వివేకానందుడు చెప్పిందేమిటి ? సన్యాసులకు ఒక మతం వుండకూడదు, అన్ని మతాల నుంచి మంచిని తీసుకోవాలి. ఇపుడు జరుగుతోందేమిటి ?
నేడు ప్రతి మతంలోనూ తాలిబాన్లు తలెత్తుతున్నట్లు ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం వుండే మన దేశాన్ని కూడా ఆ వైపు నడిపించటానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మతాలపై ముఖ్యంగా హిందూ మతంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. అది వికటిస్తే పర్యవసానాలు భిన్నంగా వుంటాయి. కొంత మంది ముందుకు తెస్తున్న కొన్ని వాదనలను పరిశీలిద్దాం.
ఇస్లాం వంటి వాటిని విమర్శించటానికి వారికి( హిందూమతాన్ని విమర్శించేవారికి) భయం, వణికిపోతారు.
మతాలన్నీ ఛాందసత్వంతో కూడుకున్నవే అన్నది ముందు గ్రహించాలి. వాటిలో సంస్కర్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా మతాలు, ఆచారాలను వ్యాఖ్యానిస్తుంటే ఛాందసులు వాటిని అలాగే వుంచటం లేదా వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నారు. కొన్ని దేశాలలో నూటికి 99శాతం ముస్లింలే వుంటారు. అయినా అక్కడ తాలిబాన్లు ఎందుకు పుట్టుకు వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడని ఛాందసులు షరియత్ పేరుతో మతోన్మాదులుగా మారుతున్నారు. మన సమాజంలో ఎప్పటి నుంచో వున్న ఆచారాల ప్రకారం ఇప్పటికీ దళితులు అంటరానివారే. రాజ్యాంగం దానిని నిషేధించింది. పాటిస్తే శిక్షార్హం అని చెప్పింది. ఆ హక్కును అమలు జరుపుకొనేందుకు ఎక్కడైనా దళితులు ప్రయత్నిస్తే అగ్రకులాలనబడేవారు దాడులకు తెగబడటాన్ని ఏమనాలి? హిందూ మతానికి చెందిన వారు హిందూమతాన్ని విమర్శిస్తే హిందూమతం వారే సహించటం లేదు. అటువంటుపుడు పూర్తిగా వివరాలు తెలియని అన్యమతాలను అన్యమతస్తులు విమర్శించటం సరైనది కాదు, సహేతుకంగా విమర్శించినా సహించే అవకాశం లేనపుడు ఏ మతానికి చెందిన వారు ఆ మతాన్ని విమర్శించటమే సరైనది. దాన్ని అంతవరకే పరిమితం చేయాలి.దీన్ని గురించి చౌకబారు అడ్డుసవాళ్లు విసిరే వారి వలలో పడాల్సిన అవసరం లేదు.దొంగబాబాలు, యోగినుల బండారాల గురించి అనేక సినిమాలలో ఎంతో చక్కగా చూపించారు, చూపుతున్నారు. కానీ ఎవరైనా ఒక బాబా లేదా యోగిని గురించి ప్రత్యక్షంగా విమర్శిస్తే వారిపైకి భౌతికదాడులకు జనాన్ని రెచ్చగొడుతున్న తీరు తెలిసిందే. నిజమైన విమర్శకులు శాంతి భద్రతల పరిస్ధితి తలెత్తాలని కోరుకోరు. మన దేశంలో నూటికి 80శాతం మంది హిందువులే గనక చర్చలలో కూడా ఆ వాటా అలాగే వుంటుంది. అందుకే మొత్తంగా దీనినే విమర్శించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు.అమెరికా,ఐరోపా వంటి దేశాలలో హేతువాదుల నుంచి 90శాతం విమర్శలు క్రైస్తవం మీద వుంటాయి తప్ప ఇతర మతాల మీద కాదు, ఇక్కడ కూడా అంతే.
తస్లీమా సస్రీన్, సాల్మన్ రష్డీలను వారు సహించటం లేదు అలాంటపుడు ఇక్కడ ఎందుకు సహించాలి?
తస్లీమా, సాల్మన్ రష్డీ మొరటు పద్దతులలో మత ఛాందసులను విమర్శించారు కనుక వారు దాడులకు తెగబడుతున్నారు.ఇక్కడ కూడా అదేపని చేస్తామంటారా? అలాంటపుడు వారికీ వీరికి తేడా ఏముంటుంది? ఇతరులను విమర్శించటం లేదని అడిగే హక్కు వారికి వుండదు. అహింస, విమర్శ, సహనం భారతీయ సంప్రదాయం. దాన్ని ముందు మనం కాపాడు కుందాం. ముందు మెజారిటీ జనం వాటిని పాటిస్తే అందుకు భిన్నంగా వ్యవహరించేవారిపై కూడా వత్తిడి పెరుగుతుంది. వారు కూడా తమ వైఖరిని మార్చుకుంటారు. ఇతర మతాల దేవతలు దేవుళ్లపై సద్విమర్శలు చేయటం వేరు, కించపరచటం వేరు. కించపరిస్తే జరిగేది కొట్లాటలే అని అనేక అనుభవాలు తెలిపాయి.
17 Sunday Jan 2016
Posted in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women
పశువులు పేడ వేస్తూ తిరుగుతున్నా వీధులలో అనుమతించారు తప్ప సాటి మనిషిని అంటరాని వారి పేరుతో వీధులలో తిరగనివ్వకుండా, ఒక వేళ తిరిగినా నోటికి ముంత, నడుములకు చీపుర్లు కట్టించి తిప్పిన రోజులు, వాటికి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఆచారం అనే ముద్దు పేర్లు తగిలించి అమలు జరిపిన రోజులు లేవా ?
ఎం కోటేశ్వరరావు
సామాజిక మీడియాలో ఇటీవలి కాలంలో మతాలను విమర్శించిన వారిని ముఖ్యంగా హిందూ మతాన్ని విమర్శించిన వారిపై కొందరు విరుచుకు పడుతున్నారు. విమర్శలు చేసే వారు రెండు రకాలు. ఒకటి గత వ్యాసంలో పేర్కొన్నట్లు తర్క బద్దమైన సైద్ధాంతిక విమర్శ, రెండవది ద్వేషంతో లేదా వుద్రేకంలో తెలియకుండానే మరో మతాన్ని కించపరిచే వ్యాఖ్యలతో సాగించే చర్చ. రెండవ తరగతిలో మొదటి వారిని మనం అదుపు చేయలేము. వుద్రేకంతో కించపరిచే వ్యాఖ్యలు చేసే వారు తమకు తెలియకుండానే ద్వేషంతో రెచ్చగొట్టే వారి వలలో పడుతున్నారని గ్రహించాలి. అందువలన వాటికి దూరంగా వుండాలి.
ప్రపంచంలో మతాల చరిత్రను చూస్తే ప్రతి మతం ప్రజలకు దూరమైనపుడు కొత్త మతాలు పుట్టుకు వచ్చాయి. యూదుమతంపై తిరుగుబాటుతో క్రైస్తవం, దానిపై తిరుగుబాటుతో ఇస్లాం అవతరించింది. వీటిలో కొన్ని వుప శాఖలు వున్నాయి. అందుకే వీటన్నింటినీ కలిపి అబ్రహానిక్ మతాలని పిలుస్తారు. ఎందుకంటే ఈ మతాలన్నింటా అబ్రహాం అనే దేవుడు లేదా పాత్ర వుంది. ప్రపంచంలో ఈ మతాలకు చెందిన వారు 54శాతం మంది వున్నారు. ఇతర మతాలకు చెందిన వారు 32శాతం, ఒక సంఘటిత మతం లేదా అసలు మతాన్ని పాటించని వారు 14శాతం వున్నారు. క్రైస్తవం, ఇస్లాం మతాలలో ఒకటి , రెండు స్థానాలలో వున్నాయి. శైవం, వైష్ణవంలో దేవతలు, రూపాలు, పేర్లు వేరైనా ఆదిపురుషుడు ఒకరే అన్నట్లుగా యూదు, క్రైస్తవంలో అబ్రహాం కాస్తా ఇస్లాంలోకి వచ్చే సరికి ఇబ్రహీంగా మారిపోయారు. అలాగే హిందూమతంగా చెప్పబడుతున్న మతాలపై తిరుగుబాటుగా జైనం, బౌద్ధం అవతరించింది.
వేదాలపై వేల సంవత్సరాల నాడే చార్వాకులు విమర్శలు చేశారు. ఒక మతం వునికిలో వుండగా మరొక మతం వచ్చిందంటే పాత మతంపై విమర్శలు , వ్యతిరేకత లేకుండా వుండవు. శైవులు-వైష్ణవులు ఎలా కొట్లాడుకున్నదీ మనకు తెలిసిందే. అందువలన హిందూ మతంపై విమర్శ అన్నది కొత్తగా వచ్చింది కాదు, బయటి వారు లేదా వ్యతిరేకులు, మతంపై విశ్వాసం లేనివారు గానీ ప్రారంభించింది అసలే కాదు
భోజపురి వంటి అనేక ప్రాంతీయ భాషలు హిందీతో సారూప్యత కలిగి వున్న కారణంగా వాటన్నింటినీ హిందీ అని పిలుస్తున్నట్లుగా హిందూమతంగా చెప్పబడే దానిలో శైవ,వైష్ణవం వంటి ప్రధాన స్రవంతి మతాలతో పాటు ఇతర అనేక చిన్న మతాలు సారూప్యత కలిగిన కారణంగా వాటన్నింటినీ కలిపి హిందూమతంగా లేదా ఇజంగా చెబుతున్నారు.భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలున్న ఈ మతాల తత్వశాస్త్రాలపై గతంలో పరస్పరం అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటికి మూలమైన వేదాలపై వేల సంవత్సరాల నాడే చార్వాకులు విమర్శలు చేశారు. ఒక మతం వునికిలో వుండగా మరొక మతం వచ్చిందంటే పాత మతంపై విమర్శలు , వ్యతిరేకత లేకుండా వుండవు. శైవులు-వైష్ణవులు ఎలా కొట్లాడుకున్నదీ మనకు తెలిసిందే. అందువలన హిందూ మతంపై విమర్శ అన్నది కొత్తగా వచ్చింది కాదు, బయటి వారు లేదా వ్యతిరేకులు, మతంపై విశ్వాసం లేనివారు గానీ ప్రారంభించింది అసలే కాదు. రామలీల వుత్సవాలు జరిపేవారు కొందరైతే రావణుడిని అభిమానించేవారు మరికొందరు. దేవతలు-దానవులు ఇలా ఎన్నో భిన్నత్వాలు వున్నాయి.జైన మతం దేవుడిని సృష్టికర్త లేదా విధ్వంసకుడిగా అంగీకరించదు, వాటిన్నింటినీ మన సమాజం అంగీకరించింది. అంటే విమర్శలను సహించింది. భారతీయ సంస్కృతిలో అదొక భాగం. అందువలన విమర్శలపై వుద్రేక పడేవారు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవటం మంచిది. గతంలో శైవం, వైష్ణవం పేరుతో దెబ్బలాడుకున్నవారు రాజీపడి అసలు మతాలను మొత్తంగా విమర్శించేవారిపై సమైక్యంగా ఇప్పుడు తమ దాడిని మొదలు పెట్టారు. ఈ విషయంలో ఇతర మతాలవారితో జెఎసిని ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు.
కుండ కింద మంట పెట్టగానే నీరు ఆవిరి కాదు. వుష్ణోగ్రత పెరిగి వంద డిగ్రీలు దాటిన తరువాతే నీరు తన రూపం మార్చుకొని కొత్త రూపం ధరించి ఆవిరిగా మారుతుంది. అలాగే సమాజ మార్పులకు అనుగుణంగా మతాలు, ఆచారాలు మారనపుడు వాటిలో సంస్కరణలు రావాలని కోరుకుంటారు. వాటిని అడ్డుకుంటే అవి తీవ్రమై కొత్త మతాల ఆవిర్బావానికి నాంది పలుకుతాయి. హిందూమతంలో బాల్యవివాహాలు, కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లలను అమ్ముకోవటం, పండు ముదుసలులకు పిన్నవయస్సు బాలికలనిచ్చి వివాహాలు చేయటం సాంప్రదాయంగా లేదా ఆచారంగా ఒక నాడు వున్నాయా లేవా ? పశువులు పేడ వేస్తూ తిరుగుతున్నా వీధులలో అనుమతించారు తప్ప సాటి మనిషిని అంటరాని వారి పేరుతో వీధులలో తిరగనివ్వకుండా, ఒక వేళ తిరిగినా నోటికి ముంత, నడుములకు చీపుర్లు కట్టించి తిప్పిన రోజులు వాటికి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఆచారం అనే ముద్దు పేర్లు తగిలించి అమలు జరిపిన రోజులు లేవా ? చాతుర్వర్ణ వ్యవస్ధ పేరుతో శూద్రులకు విద్యను దూరం చేయలేదా ? ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు, మనోభావాల పేరుతో ప్రస్తుతం విమర్శలను కూడా సహించలేక అసహనంతో రగిలి పోతున్నవారు పైన పేర్కొన్నవాటిని కూడా పునరుద్దరించాలని కోరుకుంటున్నారా ?
బాబరీ వివాదంలో కోర్టు తీర్పులను తాము ఖాతరు చేయబోమని తమ విశ్వాసాలే తమకు ముఖ్యమనే వాదనను ముందుకు తేవటానికి షాబోనో కేసులో ముస్లిం మతశక్తుల వైఖరే స్ఫూర్తి.
తమ మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని చెప్పటంలో ఏ ఒక్క మతమూ తీసిపోలేదు. ఒకదాన్ని మరొకదానితో పోల్చి తమ చర్యలను సమర్ధించుకుంటున్నాయి. వుదాహరణకు షా బానో కేసునే తీసుకుందాం. విడాకులిచ్చిన తన భర్త భరణం చెల్లింపు గురించి మధ్యప్రదేశ్‌కు చెందిన షా బానో సుప్రీం కోర్టుకు వెళ్లింది.ఆ కేసులో ఆమె గెలిచింది. ఆ సందర్భంగా ఇస్లాం మత పెద్దలుగా వున్నవారు చేసిన వాదన ఏమిటి ? సుప్రీం కోర్టు తీర్పు ఖురాన్‌లో పేర్కొన్నదానికి అనుగుణంగా లేదు కనుక దానిని మేము అంగీకరించం అన్నారు. ముస్లిం ఛాందసుల వత్తిడికి లొంగిన కాంగ్రెస్ నేతలు 1986లో చట్ట సవరణ చేసి సుప్రీం కోర్టు తీర్పును నీరు గార్చారు. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఆ చర్యను విమర్శిస్తూ అది ఖురాన్‌కు వ్యతిరేకమని, చట్ట సవరణ తప్పని ఖండించారు. ముస్లింల సంతృప్తీకరణ చర్యగా బిజెపి దానిపై నానా యాగీ చేసింది. ఆ చట్ట సవరణను వుపయోగించుకొని మెజారిటీ పౌరుల సంతృప్తీకరణతో తానే సరికొత్త ఓట్ల రాజకీయానికి తెరతీసింది. బాబరీ మసీదు ప్రాంతంలోనే రాముడు పుట్టాడన్నది తమ విశ్వాసమని అందువలన బాబరీ మసీదు తాళాలు తీయాలి లేదా తామే పగలగొడతామని తన కనుసన్నలలో పనిచేసే విహెచ్‌పి ఇతర సంస్థలద్వారా ఆందోళనలకు ఆజ్యం పోసింది. బాబరీ వివాదంలో కోర్టు తీర్పులను తాము ఖాతరు చేయబోమని తమ విశ్వాసాలే తమకు ముఖ్యమనే వాదనను ముందుకు తేవటానికి షాబోనో కేసులో ముస్లిం మతశక్తుల వైఖరే స్ఫూర్తి. ఎందుకంటే ఖురాన్‌కు అనుగుణంగా ఆ తీర్పు లేదని వారు వాదించారు. ఇప్పుడు తమ విశ్వాసాలకు, ఆచారలకు, సంప్రదాయాలకు అనుగుణంగా లేనివాటిని అంగీకరించబోమని ఎబుతున్నారు. ఎద్దులను దారుణంగా హింసకు గురిచేసే మొరటు క్రీడ జల్లికట్టుపై సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని వమ్ము చేస్తూ జల్లికట్టు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటానికి, కాంగ్రెస్ హయాంలో షాబానో కేసును నీరు గార్చేందుకు చేసిన చట్ట సవరణకు పెద్ద తేడా ఏముంది ? ముస్లిం ఆచారాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ఆ మతశక్తులు కోరుతున్నట్లుగానే శబరిమల ఆలయంలో ఎప్పటి నుంచో వస్తున్న మహిళలకు ప్రవేశ నిషేధం కుదరదని కోర్టులు ఎలా నిర్ణయిస్తాయని ఇప్పుడు హిందూ మతశక్తులు ప్రశ్నిస్తున్నాయా లేదా ? అక్కడా అన్యాయానికి గురైందీ మహిళే, ఇక్కడా వివక్షకు గురవుతోందీ మహిళే.
షాబోనో కేసు తీర్పును నీరు గార్చటానికి కాంగ్రెస్ నేతలు చట్టసవరణ చేయటాన్ని నిరసిస్తూ నాడు కేంద్ర మంత్రిగా వున్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మంత్రి పదవికి, కాంగ్రెస్‌కూ రాజీనామా చేశారు.నేడు జల్లికట్టు కేసులో అలాంటిదేమీ లేకపోగా జల్లికట్టు క్షత్రియతకు, పౌరుషానికి ప్రతీక అని బిజెపి తమిళనాడు నేత గణేశన్ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం, జయలలిత వదిలే నాలుగు సీట్ల కోసం ఎద్దుల రాజకీయాలు తప్ప పౌరుషం పురుషులకేనా మహిళలకు అవసరం లేదా ? నిజానికి బిజెపికి చిత్తశుద్ధి వుంటే తరువాత తాను అధికారానికి వచ్చినపుడు లేదా ప్రస్తుతం పూర్తి మద్దతు వున్న స్దితిలో గానీ సుప్రీంకోర్టు తీర్పులను నీరుగార్చే అధికార దుర్వినియోగానికి తీసుకున్న చర్యలేమిటి ? కాంగ్రెస్ కనీసం పార్లమెంట్‌లో చట్టసవరణ చేసింది, మోడీ సర్కార్ ఆప్రజాస్వామిక తతంగం కూడా లేకుండా తన అధికారాన్ని వుపయోగించి జల్లికట్టు తీర్పును వమ్ము చేసేందుకు పూనుకుంది. అది తీసుకున్న నిర్ణయం దానికే పరిమితం అవుతుందా ? బిజెపి, సంఘపరివార్ సంస్ధలు చేస్తున్న వాదనలు, కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక అంతకంటే పెద్ద కుట్రకు నాంది పలికినట్లు చెప్పవచ్చు. రామజన్మభూమి ఆలయ వుద్యమం సందర్బంగా విశ్వాసం కోర్టులకు అతీతమని వాదించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖమంత్రిగా బిజెపి నాయకుడు కల్యాణసింగ్ బాబరీ మసీదును రక్షిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపారు. సంఘపరివార్ సేవకుడిగా దానిని వుల్లంఘించి 1992లో బాబరీ మసీదు కూల్చివేతకు సహకరించాడు. ప్రస్తుతం విశ్వహిందూపరిషత్ నేతగా వున్న ప్రవీణ్ తొగాడియా రామాలయం విశ్వాసానికి సంబంధించిందని, దాని నిర్మాణం కోసం పార్లమెంట్ ప్రతేక చట్టం చేయాలని చెబుతుండగా, సుబ్రమణ్యస్వామి వివాదాస్పద స్థలలోనే నిర్మాణం జరగాలని రెచ్చగొడుతున్నాడు. అందువలన ప్రస్తుతం కోర్టులో వున్న బాబరీ మసీదు వివాదంపై తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే దాన్ని వమ్ము చేసేందుకు అవసరమైతే చట్టం చేయాలని హిందూమతశక్తులు బహిరంగంగానే కోరుతున్నాయి. దీనిపై తీవ్రమైన చర్చ జరగాలా లేదా ? రాజ్యాంగానికి కట్టుబడి వుంటారా? దానికి అతీతంగా విశ్వాసాలు, ఆచారాల పేరుతో దాన్ని నీరుగారుస్తారా ?
అన్యమతాలపై విమర్శ చేసేటపుడు ఎంతో బాధ్యతా యుతంగా వుండాలి.అది వివాదాలు, కొట్లాటలకు దారితీయకూడదు. అందుకే ఇతర మతాలపై వ్యాఖ్యానించటానికి నిజమైన హిందువు బాధ్యతాయుతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు.అదే మతం తప్ప మరొక అజెండా,జెండా లేనివారు మతోన్మాద చితిపై ఓట్లు దండుకోవాలనుకునేవారి మాదిరి వ్యవహరించరు. అంతే తప్ప దమ్ము, ధైర్యమో మరొకటో లేక కాదు. అలాంటి వారికి ముంబై హైకోర్టు మార్గదర్శకాలు మరోసారి గుర్తు చేయకతప్పదు. ఈ దేశంలో నూటికి 80శాతంపైగా హిందువులు వున్నారు. అందువలన చర్చలో అదేమోతాదులో హిందూయిజంపైనే జరుగుతుంది. పరమత సహనం గల దేశంలో ఏ మతం వారు ఆమతం మంచి చెడ్డలను చర్చిస్తే అది సాధికారికంగా, విశ్వసనీయత వుంటుంది. లేకుంటే ముంబై పరమత న్యాయవాది ఇస్లాం, ముస్లింల గురించి రాసిన పుస్తకం నిషేధం, కోర్టుకు ఎక్కినట్లుగా, కోర్టు చెప్పిన అవాంఛనీయ పర్యవసానాలకు దారితీస్తుంది.
16 Saturday Jan 2016
Posted in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women
మహారాష్ట్రలో శని ఆలయ ఆంక్షలు
ఈ దేవాలయానికి తొలిసారిగా ఒక మహిళను అధ్యక్షురాలిగా నియమించటం విశేషం.
ఎం కోటేశ్వరరావు
శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై విధించిన నిషేధం రాజ్యాంగ విరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. దానిపై తమ వాదనలను వినిపించేందుకు ఆ దేవస్థాన యాజమాన్యం సిద్దం అవుతోంది. దానిపై విచారణ జరిగి అంతిమ తీర్పు ఎలా వస్తుందో తెలియదు. కానీ మహిళలపట్ల వివక్షకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన కేసు దరఖాస్తును వుపసంహరించుకోవాలని లేకుంటే చంపివేస్తామని న్యాయవాదులకు వందలాది బెదిరింపులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుండగా మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లోని శని దేవాలయంలోని దేవత వేదికపైకి తమను అనుమతించాలంటూ ఒక స్వచ్ఛంద సంస్ధ భూమాత బ్రిగేడ్ నాయకత్వంలో దాదాపు 400 మంది మహిళలు రిపబ్లిక్ దినోత్సవం రోజున దేవాలయ ప్రవేశం చేస్తామని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సనాతన సంస్థ, హిందూ జనజాగృతి సమితి వాటి అనుబంధ మహిళా విభాగం రాణ రాగిణి శాఖ రెండువేల మంది మహిళలతో అడ్డుకుంటామని ప్రకటించి అక్కడ శాంతి భద్రతల పరిస్ధితులను సృష్టించేందుకు పూనుకున్నాయి. ఈ దేవాలయానికి తొలిసారిగా ఒక మహిళను దేవస్థాన అధ్యక్షురాలిగా నియమించటం విశేషం. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని వుల్లంఘించటాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించనని ఆమె ప్రకటించారు.

దేవస్థాన అధ్యక్షురాలు
మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నవారు చెబుతున్న కధనం ప్రకారం శని ప్రభువు వుగ్ర దేవత. దేవత నుంచి వెలువడే ప్రకంపనలు మహిళలకు హాని చేస్తాయి, అందువలన దేవత మండపం దగ్గరకు వారి ప్రవేశాన్ని నిరోధిస్తున్నారు తప్ప దేవాలయ ప్రాంగణంలో ప్రవేశానికి నిషేధం లేదని, లింగ వివక్ష సమస్యతో కాదని వాదిస్తున్నారు. పురుషులను కూడా మండపం ఎక్కటానికి అనుమతించటం లేదని దూరం నుంచే పూజలను అనుమతిస్తున్నామని, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని వుల్లంఘించటమంటే భక్తుల మనోభావాలను గాయపరచటమే అని వాదిస్తున్నారు. ఆధ్యాయాత్మిక కారణాలను చూడకుండా కేవలం ప్రచారం ఎత్తుగడగా కొందరు మహిళలను ప్రోత్సహిస్తున్నారని హిందూ జనజాగృతి సమితి ప్రతినిధి సునీల్ ఘన్‌వాట్ ఆరోపించారు.
నవంబరు నెలలో ఒక మహిళ శని దేవాలయ మండపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా దేవాలయ ట్రస్టీలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. దీనిపై రాష్ట్రంలోని పలు మహిళా సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆ చర్యకు నిరసనగా డిసెంబరులో పూనా కేంద్రంగా పనిచేసే భూమాత రానరాగిణి బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ నాయకత్వంలో మరో ముగ్గురు మహిళలు ప్రవేశించేందుకు పూనుకోగా ఆలయ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాము వచ్చే వారం సతారా నుంచి బయలు దేరి రిపబ్లిక్ డే నాటికి దేవాలయం వద్దకు చేరుకుంటామని తృప్తి చెప్పారు.అందరికీ సమాన హక్కులు ఇచ్చిన రాజ్యాంగం అమలులోకి వచ్చినందున ఆ రోజును ఎంచుకున్నట్లు చెప్పారు. వివిధ మహిళా సంఘాలు, బృందాలతో సమావేశాలు జరిపి ప్రచారం, చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు.
14 Thursday Jan 2016
Posted in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Women
Tags
ఎం కోటేశ్వరరావు
ఈ వారంలో జల్లికట్టు, శబరిమల ఆలయంలో యువతుల ప్రవేశ నిషేధంపై వెలువడిన కోర్టు తీర్పులు, నిర్ణయాలు సంచలనం కలిగించాయి.కోర్టు తీర్పులపై ఎప్పుడూ ఏకాభిప్రాయం వుండదు. గెలిచిన వాడు న్యాయమైన తీర్పు అంటే ఓడిన వాడు అన్యాయం అని ఆక్రోశిస్తాడు.ఏ తీర్పు అయినా అవి వ్యక్తులు లేదా ఒక సంస్ధ వివాదాలలో అయినా ఇచ్చిన తీర్పులు మెజారిటీ ప్రయోజనాలను కాపాడుతుందా లేదా ? సమాజాన్ని ముందుకు తీసుకుపోయేందుకు దారి చూపుతుందా లేదా అన్నదే గీటురాయిగా వుండాలి. ఆ విధంగా చూసుకున్నపుడు కొన్ని సందర్బాలలో కోర్టు తీర్పులు కూడా తిరోగామిగా వుండవచ్చు. అన్నింటినీ ఒకేగాటన కట్టలేము. అందువలన దేనికి దానిని విడిగా చూడాలి.
ఈ ప్రాతిపదికన చూసినపుడు జల్లికట్టు, శబరిమల కేసులలో నిర్ణయాలను పురోగమనవాదులు హర్షిస్తుండగా తిరోగమనవాదులు చిందులు వేస్తున్నారు. విపరీత భావాలు, ఆచరణ సాధ్యం కాని సంస్ధగా సుప్రీం కోర్టు మారిపోతున్నదని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు రానివ్వటంలేదో చెప్పాలని, నిషేధించటం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు దేవస్ధాన అధికారులను ప్రశ్నించింది. యువ న్యాయవాదులు వేసిన పదేళ్లనాటి ఒక కేసును కోర్టు విచారిస్తున్నది.ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం, ఆచారం, మనోభావాలను గాయపరచినట్లు , వాటిని ఒక్కరాత్రిలో మార్చివేయలేమని చెప్పటం తప్ప ఎలాంటి హేతుబద్దమైన సమాధానం మహిళల నిషేధాన్ని సమర్ధించేవారి వద్ద లేదు.
అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కనుక 10-50 మధ్య వయస్సు వున్న మహిళలు రుతుక్రమంలో వుంటారు కనుక వారిని ఆలయంలోకి అనుమతించటం’పాపం’ అని బోర్డు వాదిస్తున్నది. గతంలో అధికారంలో వున్న సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి దీనికంతటికీ కారణమైందని బోర్టు అధ్యక్షుడు ప్రయార్ గోపాల్‌కృష్ణన్ ఆరోపించారు. తిరువనంతపురంలోని అట్టుకల్ దేవీ ఆలయంలోకి పొంగలా పూజ చేసేందుకు పురుషులను అనుమతించరని, ఇలాగే ప్రతి దేవాలయానికి ఒక్కొక్క ఆచారం వుంటుందని, ఇది లింగవివక్ష సమస్య కాదు, సాంప్రదాయం అని వాదించారు. కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిందని విమర్శించారు. మహిళలను అనుమతించాలా లేదా అనేది భక్తులు నిర్ణయిస్తారని, తమ హక్కుల గురించి మహిళలు తేల్చుకుంటారు తప్ప కోర్టులపని కాదనే ఘనులు కూడా తయారయ్యారు. యధాతధ స్థితిని కొనసాగించాలని కోరాలని కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచో వున్న పాత ఆచారాన్ని తాము మార్చబోమని దేవాదాయశాఖ మంత్రి శివకుమార్ ప్రకటించారు. విశ్వహిందూ పరిషత్ వంటి సంస్ధలు ఇంక సరేసరి.
ఈ సమస్యపై కోర్టు తీరును వామపక్ష ప్రజాతంత్ర కూటమి స్వాగతించింది. దీనిపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అభిప్రాయ పడింది. తిరువాన్కూరు మాజీ రాజకుటుంబానికి చెందిన మహిళలు దేవాలయాన్ని సందర్శించినట్లు గట్టి ఆధారాలున్నాయని సిపిఎం నాయకుడైన మాజీ దేవాదాయ శాఖ మంత్రి సుధాకరన్ చెప్పారు. మహిళలు దేవాలయంలోకి ప్రవేశిస్తే దేవుడి బ్రహ్మచర్యం పోతుందని వాదించటంలో అర్ధం లేదని ఇదొక సామాజిక రుగ్మత అని కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వారు వాదిస్తున్నారు. గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయంలోకి ఇతర మతాలకు చెందిన వారికి ప్రవేశం లేదు, అయ్యప్పకు అటువంటి నిషేధం లేదు.వావర్ స్వామి అనే ఒక ముస్లిం అయ్యప్పకు ఎంతో ఇష్టమైన భక్తుడిగా ప్రాచుర్యంలో వుండటంతో అయ్యప్ప దేవాలయానికి వెళ్లే ముందు వావర్ స్వామి మసీదును కూడా భక్తులు సందర్శిస్తారు. హిందువులు పూజించేవారిలో హనుమాన్ కూడా ఒకరు. ఆయనా బ్రహ్మచారే. ఆయనకూ దేవాలయాలున్నాయి.వాటిలో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిషేధం లేదు, ఆయన బ్రహ్మచర్యం పోయిన దాఖలాలు లేవు. మరి అయ్యప్పకే ఆంక్షలు ఎందుకు?
2006లో కన్నడ సినీనటి జయమాల తాను కుర్రవయస్సులో వున్నపుడు అయ్యప్పస్వామి దేవాలయాన్ని సందర్శించినట్లు ప్రకటించటంతో మహిళలపై నిషేధం వెలుగులోకి వచ్చింది. జయమాల అలాంటి ప్రకటన చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచిందంటూ కేసును దాఖలు చేశారు.ఆమెకు మద్దతుగా అనేక మంది ముందుకు వచ్చారు. ఆ వుదంతం జరిగిన సమయంలోనే దేవాలయ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ యువ న్యాయవాదులు సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేశారు. నిషేధం రాజ్యాంగ బద్దం కాదని కోర్టు అభిప్రాయ పడటంతో ఈనెల 18న తమ వాదనలు వినిపిస్తూ దేవస్ధానం బోర్డు, కేరళ ప్రభుత్వం కూడా పిటీషన్లు దాఖలు చేయనున్నాయి.
రెండవ అంశం జల్లికట్టుపై నిషేధం. సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని పూర్వపక్షం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మొరటు క్రీడను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దానిపై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు కావటంతో జల్లికట్టును అనుమతించరాదని మరోసారి కోర్టు ఆదేశించింది.అయ్యప్ప ఆలయంలోకి మహిళలపై నిషేధం లింగవివక్ష సమస్య కాదని వితండ వాదం చేస్తున్నట్లుగానే జల్లికట్టులో ఎద్దుల పట్ల క్రూరంగా వ్యవహరించటం లేదని, అసలు ఇలాంటి పోటీలు, క్రీడలు లేనట్లయితే మన దేశంలో ఎద్దులను పెంచేవారే వుండరని, అసలా జాతే అంతరించి పోతుందనే అర్ధం లేని వాదనలు ముందుకు తెస్తున్నారు. జల్లికట్టును ఒక సాంస్కృతిక అంశంగా చూడాలని, మానవ ప్రాణాలు ఒక సమస్యగా తయారైతే తప్ప ఇలాంటి అంశాలపై తీర్పులు చెప్పటం కోర్టుల పని కాదని చెబుతున్నారు. ఒక వేళ దీనిని క్రూరమైన చర్యగా పరిగణిస్తే గుర్రపు పందాలలో గుర్రాలు కూడా గాయపడతాయని వాటిని నిషేధిస్తారా, ఇతర జంతు వధలను కూడా నిషేధించాల్సి వుంటుందన్న వాదనలు ముందుకు తెస్తున్నారు. క్రూరత్వ నిరోధ చట్టం మానవులు తయారు చేసింది తప్ప మరొకటి కాదని, రాజ్యాంగంలోని మౌలిక హక్కుల వంటిది కాదని కూడా అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు.కోర్టు వాదనల ప్రకారమైతే స్పెయిన్‌లో ఎద్దులతో యుద్ధాన్ని, అమెరికాలో కృతజ్ఞతల దినం రోజు టర్కీల వధను కూడా నిషేధించాల్సి వుంటుందని చివరికి మాంసం మానేసి పండ్లు, కూరగాయలు తినాల్సి వుంటుందని చెబుతున్నారు.అలాంటి వాదనలను ముందుకు తెచ్చేవారు ముందు వాటిపై తమ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా అడ్డు సవాళ్లు విసిరితే కుదరదు. సంప్రదాయం, ఆచారాలు మనోభావాల పేరుతో రెచ్చగొట్టటం గాక ఆరోగ్యకరమైన చర్చ జరిపితే ప్రయోజనం వుంటుంది. జైనులు నడిచేటపుడు తమ కాలికింద పడి జీవులు ఎక్కడ నలిగిపోతాయో అని రోడ్లు వూడ్చుకుంటూ పోయిన తరువాతే నడుస్తారు.మరి వారు మాంసం కోసం జంతువధ చేయటం తమ మనోభావాలను గాయపరచటం కనుక కుదరదు, మా సాంప్రదాయం కాదు అంటే కుదురుతుందా ?
14 Thursday Jan 2016
Posted in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Women
![]() |
| Mothers in Beijing, Shanghai and Shandong Province will have more days off work after giving birth under the new national policy encouraging couples to have a second child. [Xinhua] |
Mothers in Beijing, Shanghai and Shandong Province will have more days off work after giving birth under the new national policy encouraging couples to have a second child.
The amount of additional leave ranges from 30 to 60 days as many provincial-level regions are soliciting opinions from the public and will implement new regulations this year.
The three regions followed Guangdong Province, which was the first to overhaul maternity leave. From January 1, mothers giving birth in Guangdong will have 30 more days for maternity leave. Their husbands have five extra days compared with the original 10 to take care of their wives and babies.
On Friday, the Legal Affairs Office of Beijing released a draft amendment of the capital’s population and family planning regulation to solicit public opinion. The draft cancels the seven-day marriage holiday for older couples, and expands maternity leave from 98 days to 128 days for the mother. The draft for the first time gives the father 15 days off.
However, Shandong is planning to increase maternity leave by 60 days, according to a draft by the Legal Affairs Office of Shandong. Fathers will have seven days off.
According to the People’s Congress of Shanghai, mothers will have 30 extra days off in addition to the current 98 days. Their spouses have three days off.
“There should be clear regulations on maternity leave, including details on how many days mothers can take. Otherwise, mothers will face possible discrimination in employment,” said Zhai Zhenwu, professor of sociology and population studies at Renmin University of China in Beijing.
Also starting on January 1, newly married couples nationwide cannot get additional marriage holidays, as all have been deprived of privileges tied to late marriage, policies that gave extra days off for couples where the husband was older than 25 and the wife older than 23.
(Source: China Daily)
08 Friday Jan 2016
Posted in International, INTERNATIONAL NEWS, Readers News Service, USA, Women
Tags
It seems fitting that as we close out a year in which sexual fluidity was one of the most discussed topics, a new study finds that the number of adult Americans who identify as bisexual is on the rise.
That’s according to the Centers for Disease Control, which assessed sexual attitudes of more than 9,000 U.S. residents aged 18-44. The survey found that between 2011 and 2013, an increasing number of respondents reported same-sex sexual contact and bisexual self-identification.
As in other recent surveys, the CDC report found U.S. women outpaced men in reporting bisexuality. Two percent of men polled labeled themselves bisexual, up from 1.2 percent in the 2006-2010 survey. Women, at 5.5 percent, up from 3.9 percent in the previous poll, were nearly three times as likely to identify as bisexual than men.
Fittingly, the report notes an increase in the number of American women who report same-sex sexual contact. This was true of 14.2 percent of women polled in 2006-2010—a figure that rose to 17.4 in the most recent survey. Just 6.2 percent of men say they’ve had sexual contact with other men.
CNN notes that researchers identified some race-linked disparities among survey respondents. Hispanic and Latina women, at 11.2 percent, were least likely to have had sexual contact with other women. Conversely, 19.6 percent of white women and 19.4 percent of black women reported having had same-sex sexual contact.
In late 2015, a study at the University of Essex became somewhat controversial due to researchers’ determination that “100 percent heterosexual” women simply don’t exist. The study assessed women’s involuntary physical responses, such as pupil dilation, when shown sexually suggestive videos of both men and women. Overwhelmingly, women who identified as lesbian showed signs of arousal almost solely with images of women. But heterosexual women involved in the study responded to both.
“Even though the majority of women identify as straight, our research clearly demonstrates that when it comes to what turns them on, they are either bisexual or gay, but never straight,” said the study’s lead author Gerulf Rieger, in a statement that garnered a few interesting responses.
The 2014-2015 edition of the CDC study is slated for release this fall.