• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: COUNTRIES

సోషలిస్టు తాతయ్యకే మద్దతు అంటున్న అమెరికా మనవళ్లు !

19 Sunday Jan 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, capitalism or socialism, chin peng, Nicolás Maduro, Pedro Sanchez, Venezuela, Young People Embracing Socialism

Image result for generation z and millennials support to bernie sanders
ఎం కోటేశ్వరరావు
ఐరోపాను కమ్యూనిస్టు భూతం భయపెడుతున్నదని కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో వ్యాఖ్యానించారు. కమ్యూనిజాన్ని అంతం చేసి విజయం సాధించామని అమెరికా ప్రకటించుకుంది. కానీ ఇప్పుడు అక్కడే కమ్యూనిస్టు భూతం భయపెడుతోందంటే అతిశయోక్తి కాదు. సోషలిస్టు వ్యవస్ధలకు, కమ్యూనిస్టు సిద్దాంతానికి తగిలిన ఎదురు దెబ్బలు అనేక మందిని నిరాశకు గురి చేశాయి. సమాజం పారే నది వంటిది అనుకుంటే కొత్త నీరు వచ్చి పాత నీటిని వెనక్కు నెట్టేస్తుంది. అనేక దేశాల్లో జరుగుతున్న పరిణామాలు నిరాశకు గురైన వారిలో ఆశలు చిగురింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాలుగు ఖండాలలోని కొన్ని దేశాలలో ఇటీవలి పరిణామాలను ఒక్కసారి అవలోకిద్దాం, ఆలోచనలకు పదును పెడదాం.
అమెరికా పాలకవర్గాన్ని, దాన్ని ఆశ్రయించి బతికే పరాన్న జీవులైన మేథావులకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటి? చైనాతో వాణిజ్య యుద్దంలో ఏమి చేయలేక ఆయాస పడటమా, ప్రపంచంలో తమ పలుకుబడి తగ్గి ప్రతిఘటన పెరుగుతోందనే ఆందోళనా, మరొకటా, మరకొటా ? ఇవేవీ కాదు, తమ యువతరంలో పెట్టుబడిదారీ విధానం పట్ల దిగజారుతున్న విశ్వాసం, సోషలిజం పట్ల పెరుగుతున్న మక్కువ అంటే అతిశయోక్తి కాదు. అఫ్‌ కోర్సు అమెరికా ప్రచారాన్ని నమ్మి దాన్నే మెదళ్లకు ఎక్కించుకున్న వారు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిని కొత్త నీరు వెనక్కు నెట్టేస్తుంది.
జనవరి రెండవ వారంలో బ్రిటీష్‌ మార్కెట్‌ పరిశోధనా సంస్ధ ”యుగవ్‌ ” నిర్వహించిన ఒక సర్వేలో 23-38 సంవత్సరాల యువతరం( మిలీనియనల్స్‌)లో ప్రతి ఇద్దరిలో ఒకరు సోషలిజానికి మద్దతు ఇస్తున్నారని తేలింది. అంతకంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు గుండెలు బాదుకొనే అంశం ఏమంటే ఈ యువతలో 36శాతం మంది కమ్యూనిజానికి జై కొట్టడం. అమెరికన్లు ఏర్పాటు చేసిన అనేక సంస్ధలలో ‘కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌’ ఒకటి. దీని పనేమిటో చెప్పక్కర లేదు. ఆ సంస్ధ కార్యనిర్వాహక డైరెక్టర్‌ మరియాన్‌ స్మిత్‌ సర్వే వివరాల గురించి ఒక ప్రకటన చేశాడు.” సోషలిజం, కమ్యూనిజాల ప్రమాదాల గురించి చారిత్రాత్మక విస్మృతి ఈ నివేదికలో పూర్తిగా కనిపిస్తోంది. గత శతాబ్దిలో కమ్యూనిస్టు పాలకుల చేతుల్లో పది కోట్ల మంది బాధితులయ్యారనే చారిత్రాత్మక నిజం గురించి మన యువతరానికి తెలియ చెప్పనట్లయితే వారు మార్క్సిస్టు సిద్దాంతాలను అంగీకరిస్తే మనం ఆశ్చర్యపోనవసరం లేదు.” అన్నాడు. పది కోట్ల మందిని కమ్యూనిస్టులు చంపారనే తప్పుడు ప్రచారం నిత్యం ఇంటర్నెట్‌తో అనుబంధం ఉన్న యువతీ యువకులకు తెలియంది కాదు, అవన్నీ కట్టుకధలని కొట్టి పారవేస్తూ నేటి యువత సోషలిజం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారనే చారిత్రక సత్యాన్ని గుర్తించ నిరాకరిస్తున్నారు.
ప్రయివేటు ఆస్ధులన్నింటినీ రద్దు చేస్తే సమాజం మెరుగ్గా ఉంటుందని మిలీనియల్స్‌లో 22శాతం మంది, ఉన్నత విద్య ఉచితంగా అందించాలని జడ్‌ తరం(1997-2012 మధ్యలో పుట్టిన వారు)లో 45శాతం మంది భావిస్తున్నారని కూడా తాజా సర్వే వెల్లడించింది. ఇరవయ్యవ శతాబ్దపు సోషలిస్టు ప్రయోగాలను చూసిన తరువాత కూడా ఆ సోషలిస్టు భావజాలం ఇంకా ఆకర్షిస్తూనే ఉండటం, ప్రభుత్వ పాఠశాలలు, మీడియా, సాధారణ సంస్కృతి కారణంగా పెద్ద ఎత్తున సామాజీకరణ పెరగటంతో ఈ భావజాలం విశాల ఆమోదం పొందింది, ఇప్పుడది రానున్న తరాలకు ఒక పటిష్టమైన ఓటు తరగతిగా మారుతోంది, గతంలో సోషలిస్టు ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు విరుచుకుపడినట్లుగా అదే పద్దతుల్లో అమెరికా ఇప్పుడు చేయలేదు అని సర్వేపై విశ్లేషణ చేసిన ఒక రచయిత పేర్కొన్నాడు.
అమెరికాలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా సెనెటర్‌, తాను సోషలిస్టు అని చెప్పుకున్న బెర్నీ శాండర్స్‌ పోటీ పడ్డారు. చివరకు హిల్లరీ క్లింటన్‌ వైపు ఆ పార్టీ మొగ్గింది. తిరిగి ఈ సారి కూడా 78 సంవత్సరాల బెర్నీ శాండర్స్‌ పోటీ పడుతున్నారు. చివరకు ఏమి జరుగనుందో తెలియదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే గత ఎన్నికల్లో బెర్నీ శాండర్స్‌ రంగంలో లేనందుకు యువత నిరాశ చెందలేదు, తరువాత జరిగిన అనేక సర్వేలలో సోషలిజం పట్ల ఆకర్షితులౌతున్నవారి శాతం పెరుగుతోందే తప్ప తగ్గలేదు. ఎందుకీ పరిణామం అంటే పెట్టుబడిదారీ విధాన వైఫల్యం, దాని పట్ల మోజు తగ్గటమే కారణం. అయితే నాలుగు పదులు దాటిన వారిలో అత్యధికులు పెట్టుబడిదారీ విదానం పట్ల ఇంకా మొగ్గు చూపుతూనే ఉన్నారు. చదువుకోసం చేసిన రుణాలు గుదిబండలుగా మారటం, వేతనాల స్థంభన ముఖ్యమైన కారణాలుగా చెబుతున్నారు.జడ్‌ తరం, మిలీనియల్స్‌లో అత్యధికులు తాము సోషలిస్టు అభ్యర్ధికే ఓటు వేస్తామని ఎటు తిప్పి ఎటు ప్రశ్నించినా ప్రతి సర్వేలో చెబుతున్నారు.
సూపర్‌ మనీ అనే సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 1974 నుంచి 2017 మధ్యకాలంలో 24-34 సంవత్సరాల వారికి ద్రవ్యోల్బణ సవరింపు తరువాత వార్షిక సగటు నిజవేతనాలు 35,426 నుంచి 35,455 డాలర్లకు అంటే కేవలం 29 డాలర్లు మాత్రమే పెరిగాయి. అదే కాలంలో 35-44 సంవత్సరాల వారికి 2,900 డాలర్లు, 45-54 వారికి 5,400 డాలర్లు పెరిగాయి. పెరుగుతున్న జీవన వ్యయంతో పోల్చితే వేతనాల పెరుగుదల అన్ని వయస్సుల వారిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ యువతరంలో మరింత ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్‌ లోన్‌ హీరో సంస్ధ విశ్లేషణ ప్రకారం అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ట్యూషన్‌ ఫీజు 1980 -2018 మధ్య కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 213, ప్రయివేటు కాలేజీల్లో 129శాతం పెరిగింది. విద్యకోసం చేసిన రుణాల మొత్తం 1.5లక్షల కోట్ల డాలర్లు, అంటే సగటున 29,800 డాలర్లు. అప్పుచేసి డిగ్రీ సంపాదించి ఉద్యోగం పొంది రుణం తీర్చుదామని వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయని సగం మంది మిలీనియల్స్‌ అభిప్రాయపడుతున్నారు. నలభై సంవత్సరాలలో ఇండ్ల ధరలు నలభైశాతం పెరిగాయి. వాయిదాలు చెల్లించలేమనే భయంతో ఇళ్లు కొనుక్కోవటాన్ని కూడా వారు వాయిదా వేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నవారిని చూసిన తరువాత అసలు తమకు పిల్లలు వద్దని 13శాతం అమెరికన్లు భావిస్తున్నట్లు గతేడాది న్యూయార్క్‌ టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అన్ని రకాల జీవన వ్యయం పెరగటం, అందుకు అనుగుణ్యంగా ఆదాయాలు పెరగకపోవటంతో ఓటర్లు వామపక్ష భావజాల అభ్యర్దులవైపు మొగ్గుతున్నారని వ్యాఖ్యాతలు నిర్ధారణకు వస్తున్నారు.
డెమోక్రటిక్‌ పార్టీనేత బెర్నీ శాండర్స్‌ తన ప్రచారంలో ఆర్ధిక అసమానతల తగ్గింపు, అందరికీ వైద్యం, ధనికులపై పన్ను పెంపు వంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ ఇతర నేతలు కూడా ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య, విద్యార్ధి రుణాల రద్దు, పిల్లలందరికీ సామూహిక ఆరోగ్యబీమా వంటి అంశాలను ప్రస్తావించక తప్పటం లేదు. ట్రంప్‌ ప్రభుత్వం విద్యార్ధి రుణాల వ్యవస్ధను మౌలికంగా దెబ్బతీసిందని విమర్శిస్తూ ఆ విభాగంలో పని చేస్తున్న అధికారి ఏ వేయనె జాన్సన్‌ గతేడాది నవంబరులో రాజీనామా చేశాడు.
అమెరికా యువత సోషలిజం పట్ల మక్కువ చూపటానికి కారణం ఏమంటే కాలేజీల్లో ప్రొఫెసర్లలో ఎక్కువ మంది వామపక్ష భావాలు కలిగి ఉండటం అని కొంత మంది తడుముకోకుండా వెంటనే చెప్పేస్తారు. ఎక్కడైనా కొన్ని సంస్ధలలో ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు, యావత్‌ దేశమంతటా అదే పరిస్ధితి ఉందా ? స్వేచ్చా మార్కెట్‌ను సమర్ధించే ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ గ్లాసెర్‌ ఈ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేశారు. అనేక విధాలుగా ఆధునిక అమెరికా ఆర్ధిక వ్యవస్ధ యువత సంక్షేమానికి అనుగుణ్యంగా పని చేయటం లేదు. అనేక ప్రభుత్వ విధానాలు ఉద్యోగం పొందాలంటే ఆటంకంగా ఉన్నాయి, డబ్బు పొదుపు చేసుకోవాలన్నా , ఇల్లు కొనుక్కోవాలన్నా కుదరకపోవటం యువతరాన్ని ఆదర్శభావజాలం గురించి ఆలోచింపచేస్తున్నది, ఒకసారి సోషలిజం ఎలా ఉంటుందో ఎందుకు ప్రయత్నించి చూడకూడదు అనుకుంటున్నారని గ్లాసెర్‌ అంటున్నారు. ప్రచ్చన్న యుద్ద సమయంలో సోషలిజం గురించి చర్చ ఉండేది కాదు, ఎందుకంటే దాన్ని ఒక దుష్ట ప్రభుత్వంగా చూసి వ్యతిరేకించాము. సోవియట్‌ యూనియన్‌లో పేదరికం, అణచివేత కారణంగా ఆ వ్యవస్ధ ఆచరణ సాధ్యం కాదని భావించాము. ఆ జ్ఞాపకాలు లేనివారికి, ప్రస్తుతం 30 సంవత్సరాల లోపు ఉన్న అందరికీ అలాంటిది లేదు అని గ్లాసెర్‌ వాపోయాడు.

Image result for Pedro Sanchez
” స్పెయిన్‌లో మార్క్సిస్టు కమ్యూనిజం పునర్జన్మించింది ”
కమ్యూనిస్టు వ్యతిరేకులు పురోగామి శక్తుల ఉనికిని సహించలేకుండా ఉన్నారు.” బెర్లిన్‌ గోడ కూల్చివేతతో నాశనం అయిందనుకున్న మార్క్సిస్టు కమ్యూనిజం తిరిగి ఆవిర్భవించింది, స్పెయిన్‌లో పాలన సాగించటం ఖాయం, నవంబరులో సంకీర్ణ కూటమి ఎన్నికైనపుడు అనుకున్న లేదా విశ్వసించిన దాని కంటే పరిస్ధితి ఇప్పుడు మరింత తీవ్రంగా ఉంది ” అని స్పానిష్‌ బిషప్పుల సంఘం ఉపాధ్యక్షుడు కార్డినల్‌ ఆంటోనియో కానిజారెస్‌ లొవెరా వ్యాఖ్యానించాడు. ఈనెల 11న మత వెబ్‌ సైట్‌లో పోస్టు చేసిన లేఖలో ఈ అభిప్రాయాలను వెల్లడించాడు. వెనిజులా వంటి లాటిన్‌ అమెరికా దేశాల తప్పుల తడకలతో ఉన్న సోషలిస్టు విధానాలను దాదాపుగా స్పెయిన్‌ కాపీ చేస్తున్నదని భావిస్తున్నారు. స్పెయిన్‌ను స్పెయిన్‌గా ఉంచకుండా ఒక ప్రయత్నం జరుగుతోందని ఎంతో బాధతో చెబుతున్నా మరియు హెచ్చరిస్తున్నా. అంతర్యుద్ధం తరువాత నియంత్రత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మారాలన్న స్ఫూర్తి ఖాళీ అయింది, మరచిపోయారు. ఎల్లవేళలా విభజించే మరియు ఎన్నడూ ఐక్యం కానివ్వని భావజాలంతో నింపేస్తున్నారు అని ఆరోపించాడు. మరుసటి రోజు మరొక ఆర్చిబిషప్‌ జీసస్‌ శాంజ్‌ మాంటెస్‌ మరొక లేఖ రాస్తూ చరిత్రలో దేశం మరొక తీవ్ర పరిస్ధితిలోకి పోతున్నదని, వివిధ పద్దతుల్లో స్వేచ్చను పరిమితం చేస్తున్నారని ఆరోపించాడు.ఈ నెల ఎనిమిది పోడెమాస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సోషలిస్టు పార్టీ నేత పెడ్రో శాంఛెజ్‌ ప్రధానిగా పదవీ స్వీకారం చేస్తూ సాంప్రదాయకమైన శిలువ, బైబిల్‌ మీద ప్రమాణం చేసేందుకు తిరస్కరించాడు. పాఠశాల విద్య పాఠ్యాంశాల నుంచి మతాన్ని తొలగించటంతో సహా లౌకిక విధానాల అజెండాను అమలు జరుపుతామని ప్రకటించాడు. అంతే కాదు, గతంలో అక్రమంగా చర్చ్‌లకు దఖలు పరచిన ఆస్తులను జాతీయం చేస్తామని, విద్యార్ధులకు లైంగిక విద్యను బోధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యలు సహజంగానే చర్చ్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి సోషలిస్టు పార్టీ గతంలో కూడా అధికారంలోకి వచ్చింది. కొన్ని పురోగామి సంస్కరణలు తప్ప అదేమీ విప్లవకార్యాచరణను చేపట్టటం లేదు. అయినా మతం ఆగ్రహిస్తోంది.

Image result for chin peng
మలేసియాను భయపెట్టిన కమ్యూనిస్టు చితా భస్మం !
కమ్యూనిస్టు వ్యతిరేకులకు కమ్యూనిస్టులే కాదు చివరకు వారి చితా భస్మం కూడా భయపెడుతోందా ? అవును మలేషియాలో అదే జరిగింది. వృద్ధాప్యంతో మరణించిన పూర్వపు మలేషియా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్‌ పెంగ్‌ చివరి కోర్కె మేరకు ఆయన మరణించిన ఆరు సంవత్సరాల తరువాత థారులాండ్‌ నుంచి తెచ్చిన చితాభస్మాన్ని సముద్రంలోనూ, పెంగ్‌ సాయుధపోరాటం సాగించిన అడవుల్లోనూ గతేడాది సెప్టెంబరు 16న చల్లినట్లు ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఈ వార్తతో పాటు 1989లో సాయుధ పోరాటాన్ని విరమించి మూడు దశాబ్దాలు గడిచిన సందర్భంగా దానితో సంబంధం ఉన్న వారు, దాని గురించి తెలిసిన వారు మలేషియాలో కొన్ని చోట్ల సభలు జరిపారని మీడియా పేర్కొన్నది. వారిలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకే ముంది ఇవన్నీ మలేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని కఠినంగా అణచివేయాలని మాజీ పోలీసు, పారా మిలిటరీ అధికారుల సంఘాల నాయకత్వంలో ప్రదర్శనలు చేసి, చితాభస్మం తెచ్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే తొమ్మిది సంస్ధలకు చెందిన వారు ఆ సభలో పాల్గొన్నట్లు, వారి నుంచి పోలీసులు సంజాయిషీ కోరి నట్లు వార్తలు వచ్చాయి. బ్రిటీష్‌ పాలనలోని పూర్వపు మలయా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు. తరువాత స్వాతంత్య్రం వచ్చి మలయా, మలేషియాగా రెండు దేశాలు ఏర్పడిన తరువాత కమ్యూనిస్టులు మలేషియాలో విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 1968 నుంచి 1989వరకు పోరాడారు. ఆ ఏడాది మలేషియా సర్కార్‌తో పోరు విరమణకు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు పార్టీ నేత చిన్‌ పెంగ్‌ థారులాండ్‌లో ఆశ్రయం పొంది 2013లో అక్కడే 90 ఏండ్ల వయస్సులో మ రణించారు. ఒప్పందం మేరకు మలేషియాకు తిరిగి వచ్చేందుకు అనుమతించిన నేతలు తిరిగి పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అండతోనే పోలీసులు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.

(Reuters/edited by Ricardo Vaz for Venezuelanalysis.com)
పరువు పోగొట్టుకున్న వెనిజులా ప్రతిపక్ష నేత గుయడో !
గత సంవత్సరం లాటిన్‌ అమెరికా పరిణామాలను గుర్తుకు తెచ్చుకుంటే అరవైకి పైగా దేశాలు వెనిజులా అసలైన అధ్యక్షుడిగా గుర్తించిన జువాన్‌ గుయడో ఈనెల మొదటి వారంలో పరువు పోగొట్టుకొని అపహాస్యం పాలయ్యాడు. అధ్యక్షుడు మదురో ఎత్తుగడకు చిత్తయి గిలగిలా కొట్టుకుంటున్నాడు.2018 వెనిజులా ఎన్నికల్లో అధ్యక్షుడిగా సోషలిస్టు నికోలస్‌ మదురో ఎన్నికైనా, అంతకు ముందు పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లను తెచ్చుకోవటంలో సోషలిస్టు పార్టీ విఫలమైంది. దాంతో ప్రతిపనికీ ప్రతిపక్షం అడ్డం పడటంతో పాటు గతేడాది పార్లమెంట్‌ స్పీకర్‌గా ఉన్న ప్రతిపక్ష జువాన్‌ గుయడో తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. పొలో మంటూ అమెరికా కనుసన్నలలో నడిచే అరవైకిపైగా దేశాలు గుర్తింపును ప్రకటించాయి. మిలిటరీలో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చేసిన యత్నం కూడా విఫలమైంది. ఇదే మరొక దేశంలో అయితే అందుకు పాల్పడిన వారిని కాల్చివేయటం లేదా కటకటాల వెనుక ఉంచుతారు. జనం, మిలిటరీ, పోలీసు, పారా మిలిటరీ మద్దతు ఉన్న సోషలిస్టు మదురో అలాంటి చర్యలకు పాల్పడకుండా అతడి వలన ప్రమాదం లేదనే అంచనా, ఇతర కారణాలతో గుయడోను స్వేచ్చగా తిరగనిస్తున్నారు.
అమెరికాతో సహా దాని మిత్ర దేశాలన్నీ మదురోను ఇప్పటికీ అధ్యక్షుడిగా గుర్తించటం లేదు గానీ పార్లమెంట్‌ను గుర్తిస్తున్నాయి.ఈనెల ఐదున పార్లమెంట్‌ స్పీకర్‌ ఎన్నిక జరిగి, దానికి తిరిగి గుయడో ఎన్నికైతేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా కూటమి గుర్తింపు ఉంటుంది. గుయడోను తిరిగి ఎన్నుకొనే పరిస్ధితి లేదు. అయితే ఏదో ఒకసాకుతో పార్లమెంట్‌ను బహిష్కరిస్తే అధికారపక్షం నుంచి లేదా దాని మద్దతు ఉన్నవారు స్పీకర్‌ అవుతారు. గత ఏడాదిలో జరిగిన పరిణామాలలో ప్రతిపక్ష పార్టీలలో చీలిక వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని మదురో ప్రధాన ప్రతిపక్షాన్ని చావు దెబ్బతీశాడు. జనవరి ఐదో తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా భద్రతా దళాలు తనను పార్లమెంట్‌లో ప్రవేశించనివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ గుయడో కేకలు వేస్తూ తన మద్దతుదార్ల వీపుల మీద ఎక్కి పార్లమెంట్‌ గేట్‌ దూకుతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు ఫోజులిచ్చాడు. నిజానికి అతగాడి ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఎన్నికలో చీలిక పక్షనేతకు అధికారపక్షం మద్దతు ఇవ్వటంతో గుయడో ఓడిపోయాడు. తరువాత తన మద్దతుదారులతో తనకు వత్తాసు పలికే ఒక మీడియా కార్యాలయంలో స్పీకర్‌ ఎన్నిక తతంగాన్ని నిర్వహించి తిరిగి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. ఇది అమెరికాను కూడా ఇరకాటంలో పడేసింది. త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనాలా వద్దా అన్న మీమాంసలో ప్రతిపక్షాలు పడ్డాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పార్లమెంట్‌ ఎన్నికలకు దూరంగా ఉంటే సోషలిస్టులు దానిలో మెజారిటీ సాధించి మరింత బలపడతారు. విఫల తిరుగుబాట్ల నేపధ్యంలో పోటీ చేస్తే తిరిగి గెలుస్తామన్న ధైర్యమూ ప్రతిపక్షానికి లేదు.
పైన పేర్కొన్న పరిణామాలను చూస్తే దుష్ట పెట్టుబడిదారీ వ్యవస్ద దోపిడీ కొనసాగినంత కాలం, ఎదురు దెబ్బలు తగిలినా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు వాటిని తట్టుకొని ముందుకు పోతాయి, అంతకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నిరాశావాదులు అరగ్లాసు నీటిని చూసి అయ్యోపూర్తిగా నిండలేదే కూలబడితే, ఆశావాదులు సగం గ్లాసు నిండిందనే ధీమాతో ముందుకు పోతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాల మౌనం ఎందుకు ?

02 Thursday Jan 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

China, Islam, Islam in China, Islamic Countries, Pope Francis, Religion in China

Image result for pope  china
ఎం కోటేశ్వరరావు
ఇటీవల చైనా గురించి మీడియాలో వస్తున్న అనేక అంశాలు చదువరులు, వీక్షకులను గందరగోళపరుస్తున్నాయి. వక్రీకరణలు, అవాస్తవాలను విశ్లేషణలు, వార్తల పేరుతో కుమ్మరిస్తున్నారు. వాటిలో కొన్నింటి మంచి చెడ్డల గురించి చూద్దాం. క్రైస్తవులను, ముస్లింలను అణిచి వేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై పోప్‌, ఇస్లామిక్‌ దేశాలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి అనే ప్రశ ్నలు అనేక మందిలో తలెత్తుతున్నాయి. జర్మనీలో యూదులను లక్ష్యంగా చేసుకున్న హిట్లర్‌ మాదిరి మన దేశంలో ముస్లింలు, క్రైస్తవ మైనారిటీలపై ప్రచార, భౌతిక దాడులకు పాల్పడుతున్న ఫాసిస్టు తరహా పరివార్‌ పట్ల మన దేశంలోని మీడియా మౌనం వహించటం లేదా సమర్దించటాన్ని చూస్తున్నాము.
‘ బైబిల్‌ మరియు ఖురాన్‌లను తిరగరాసేందుకు చైనా పూనుకుంది ‘ ఇది ఇటీవలి ముఖ్యమైన వార్త !
అంతేనా 2018లో చైనాలో బైబిల్‌ అమ్మకాలను నిషేధిస్తున్నారు అని ప్రచారం జరిగింది.చట్టబద్దమైన మార్గాల ద్వారా బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా ఏ మత గ్రంధాన్ని అయినా చైనీయులు తెప్పించుకోవచ్చు. అందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది, అది అన్ని దేశాలకు వర్తించే నిబంధనే. చైనా సర్కార్‌ దగ్గర నమోదు గానీ లేదా అనుమతి లేని పుస్తకాలు, పత్రికల మీద అక్కడి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. దాన్ని మతాల మీద దాడిగా చిత్రించారు. చైనాలో ఉన్న నిబంధనల ప్రకార బైబిళ్లను చర్చ్‌ల ద్వారానే తెప్పించుకోవాలి లేదా కొనుగోలు చేయాలి, పుస్తకాల దుకాణాల్లో అనుమతించరు. అక్కడి సామాజిక యాజమాన్య వ్యవస్ద ప్రకారం ఒక పుస్తకంగా ఒక్క బైబికే కాదు ఏ మత గ్రంధానికి పవిత్రతను ఆపాదించకూడదు. పశ్చిమ దేశాలను చైనా అనుకరించకపోతే దాన్ని మత వ్యతిరేకం, అణచివేతగా చిత్రిస్తున్నారు.

చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడుపదులు దాటింది. మావో సేటుంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాగానే క్రైస్తవ మత చర్చీలు, ఇస్లామిక్‌ మసీదులను కూల్చివేశారు, మతాలను నాశనం చేశారని ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అదే నిజమైతే ఒక్కరూ ఇప్పటికి మిగిలి ఉండేవారు కాదు. 1953లో హాన్స్‌ జాతీయులు 93.94శాతంగా మిగిలిన 6.06శాతం బౌద్ద, క్రైస్తవ, ముస్లిం తదితర మైనారిటీలు ఉన్నారు. అదే 2010 లెక్కల ప్రకారం 91.40, 8.60శాతాలుగా ఉన్నారు. అంటే మైనారిటీలు పెరిగారు. వీరిలో ముస్లిం యుఘీర్‌లు 0.62 నుంచి 0.76శాతానికి పెరిగారు. దీనికి కారణం మైనారిటీలకు జనాభా నియంత్రణ నిబంధనను వర్తింప చేయలేదు. మన దేశంలో బాబరీ మసీదును కూల్చివేసిన మతోన్మాదుల చర్యను ప్రపంచమంతా చూసింది గానీ, చైనా, రష్యా(కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు) ఇతర దేశాల్లో కమ్యూనిస్టులు ప్రార్ధనా స్ధలాలను కూల్చివేసిన దాఖలాలు లేవు. అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. రష్యాలో కమ్యూనిస్టుల అధికారం ముగిసిన తరువాత అనేక మంది అక్కడి చర్చ్‌లను చూసి ప్రభువా కమ్యూనిస్టులు చర్చ్‌లను కూల్చివేశారని చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి వ్యతిరేకించినందుకు మన్నించు అని ప్రార్ధించారంటే అతిశయోక్తి కాదు. కమ్యూనిస్టులు మత రాజకీయాలు చేయరు, మతాన్ని రాజకీయాల్లో అనుమతించరు.

Image result for famous churches in china
బైబిల్‌ విషయానికి వస్తే పాత నిబంధన, కొత్త నిబంధన అని ఆ మతాలకు చెందిన వారే రాసుకున్నారు. వాటిలో అనేక అంశాలను చొప్పించారని అనేక మంది విమర్శిస్తారు. వాటిని పక్కన పెడదాం. బైబిల్‌ రాసిన లేదా దేవుడు లేదా దేవుని కుమారుడు, దేవదూతలు ప్రవచించిన సమయానికి ప్రపంచంలో ఎక్కడా కమ్యూనిజం, దాని సిద్దాంతాల జాడలేదు. సోషలిజం, కమ్యూనిజాలకు క్రైస్తవం వ్యతిరేకం అని బైబిల్‌ లేదా ఖురాన్‌ లేదా మరొక మత గ్రంధంలో ఉన్న ఉన్న అంశాల మీద రాస్తున్న లేదా చేస్తున్న తప్పుడు భాష్యాలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. అలాంటి తప్పుడు వ్యాఖ్యానాలతో సోషలిజానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతూ ఉంటే అది తమ రాజ్యాంగానికి వ్యతిరేకం కనుక వాటి వ్యాప్తిని అరికట్టేందుకు చైనా చర్యలు తీసుకోవచ్చు. లేదా మత గ్రంధాల్లో ఉన్న అంశాలు కొన్ని సోషలిజం, కమ్యూనిజాలకు ఎలా వ్యతిరేకం కావో, సానుకూలమో వివరించి జనాల్లో ఉన్న పొరపాటు అవగాహనలను తొలగించేందుకు తమ రాజ్యాంగ లక్ష్యాలకు అనుకూలమైన భాష్యంతో పుస్తకాలను రాయాలని, చైనా లక్షణాలతో కూడిన మత వ్యవస్ధను నిర్మించాలని అక్కడి ప్రభుత్వం చెప్పిందే తప్ప, వాటిని తిరిగి రాయటం అంటూ ఎక్కడా ఉండదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా లేని మత పరమైన గ్రంధాలకు సమగ్ర భాష్యాలు రాయాలని, కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని నిరోధించాలని గతేడాది నవంబరులో జరిగిన చైనా మత వ్యవహారాల కమిటీ సమావేశంలో చెప్పారు తప్ప బైబిల్‌, ఖురాన్‌ అని ఎక్కడా చెప్పలేదు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి చెప్పినట్లుగా పశ్చిమ దేశాల మీడియా దానికి మత గ్రంధాల పేర్లను జోడించి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంది. ఈ సమావేశంలో వివిధ మతాలకు చెందిన వారు, నిపుణులు, ప్రజాప్రతినిధులు 16 మంది పాల్గొన్నారు. మతాలను, వ్యక్తిగత మత విశ్వాసాలను చైనా కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుంది తప్ప మతం, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగ పరమైన సోషలిజం, కమ్యూనిస్టు, మత రహిత లక్ష్యాలను వ్యతిరేకించే శక్తులను చైనాలో అనుమతించరన్నది స్పష్టం. మన దేశంలో మత వి శ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలలో సభ్యులుగా చేరవచ్చు. అలాంటి వారు అనర్హులు అనే నిబంధనలు లేవు.

Image result for why pope and islamic countries silence on china
” కైస్తవులను చైనా అణచివేస్తోంది, చర్చీలను కూల్చివేస్తోంది”
అంతే కాదు వాటికన్‌ను గుర్తించటం లేదు, వాటికన్‌ నియమించిన వారిని అరెస్టు చేస్తోంది, బిషప్పులను స్వంతంగా నియమించుకుంటోంది.ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంలో ఇదొకటి. ముందుగా తెలుసుకోవాల్సిన అంశం. వాటికన్‌ ఇంతవరకు కమ్యూనిస్టు చైనాను ఒక దేశంగానే గుర్తించలేదు. ఇప్పటికీ దాని దృష్టిలో చైనా అంటే తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మాత్రమే. కమ్యూనిస్టు పాలన ఏర్పడిన తరువాత ఒక్క పోప్‌ కూడా చైనా సందర్శనకు రాలేదు. అందువలన వాటికన్‌ అధికారాన్ని చైనా గుర్తించే ప్రశ్నే ఉదయించదు. రెండవది, చైనాలో ఉన్న క్రైస్తవులు తమ బిషప్పులను తామే నియమించుకుంటున్నారు అంటే అక్కడ క్రైస్తవులను అణచివేస్తే బిషప్పులు దేనికి ? అంటే అణచివేత కూడా వాస్తవం కాదు. మరి ఎవరిని అరెస్టు చేస్తున్నారు? చైనా సర్కార్‌ అనుమతి లేదా గుర్తింపు లేకుండా రహస్యంగా చర్చ్‌లను ఏర్పాటు చేస్తూ, రహస్య, చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని అరెస్టు చేస్తున్నారు. దేశవ్యతిరేక శక్తులను ఏ దేశంలో అయినా అదే చేస్తారు కదా ! సామాన్యులకు ఏసుక్రీస్తును ఆరాధించటానికి స్వేచ్చ ముఖ్యమా లేక వాటికన్‌ పెద్దలు చెప్పినట్లుగా చేయటం ముఖ్యమా ? ప్రపంచంలో అనేక దేశాలలో సాగుతున్న దోపీడీని, నియంతలను వాటికన్‌ లేదా క్రైస్తవం వ్యతిరేకించటం లేదు, సమసమాజం కోరుతున్న కమ్యూనిస్టులను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని వాటికన్‌ పెద్దలు కొందరికి ఉన్నా, అమెరికా కనుసన్నలలో పని చేసే కమ్యూనిస్టు వ్యతిరేక చైనా జాతీయుడైన జోసెఫ్‌ జెన్‌ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చివరికి వాటికన్‌ పెద్దలు కూడా రాజీపడి లొంగిపోతున్నారని, చైనాను సంతృప్తిపరచేందుకే ఎల్ల వేళలా పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇంతకాలం చైనాలో క్రైస్తవులను అణచివేస్తున్నారని చేసిన ప్రచారం వాటికన్‌కు తెలియంది కాదు. వాటి వెనుక ఉన్న నిజానిజాలు కూడా తెలుసు. అందువల్లనే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎందరు వ్యతిరేకించినప్పటికీ 2018లో పోప్‌ ఫ్రాన్సిస్‌ చైనాతో ఒప్పందం చేసుకున్నారు. చైనా నియమించిన బిషప్పులను కూడా గుర్తించారు. ఒప్పందం చేసుకుంటే ఇంతకాలం చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రహస్యంగా చర్చ్‌లను నిర్వహించిన నిజమైన విశ్వాసులను మోసం చేసినట్లే అని జోసెఫ్‌ జెన్‌ అన్నాడు. ఒప్పందం ప్రకారం రహస్యంగా ఉన్న చర్చ్‌లను వాటికన్‌ ప్రోత్సహించకూడదు.

Image result for why pope and islamic countries silence on china
” ముస్లింలను అణచివేస్తున్నారు, నిర్బంధ శిబిరాల్లో పెడుతున్నారు ”
చైనాలోని గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్ర జనాభా రెండు కోట్లు. అది చైనా వాయువ్య సరిహద్దులో ఉంది. ఒక స్వయం పాలిత ప్రాంత హౌదా కలిగి ఉంది. ఒక వైపు మంగోలియా, కిర్కిజిస్తాన్‌, కజకస్తాన్‌, తజికిస్తాన్‌, రష్యా, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్ధాన్‌,భారత్‌ సరిహద్దులుగా ఉంది. అయితే ఆక్సారు చిన్‌గా పిలుస్తూ మనది అని చెప్పుకుంటున్న ప్రాంతం గ్జిన్‌జియాంగ్‌లో భాగమైన తమది అని చైనా చెబుతోంది, అది ప్రస్తుతం చైనా అధీనంలో ఉన్న భారత-చైనా వివాదాస్పద ప్రాంతాలలో ఒకటి. ముస్లింలలో ఒక పెద్ద తెగ యుఘిర్‌కు చెందిన జనాభా దాదాపు 46శాతం ఉండటంతో దానిని యుఘిర్‌ రాష్ట్రం అని కూడా పిలుస్తారు.నలభైశాతం మంది హాన్‌ చైనా జాతీయులు, మిగిలిన వారు ఇతర ముస్లిం తెగలకు చెందిన వారున్నారు. కమ్యూనిస్టులు అధికారానికి రాక ముందు ఆ ప్రాంతంలోని యుద్ద ప్రభువులు నాటి కొమింటాంగ్‌ చైనా పాలకులకు వ్యతిరేకంగా సోవియట్‌ మద్దతుతో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారని చెబుతారు గానీ స్వతంత్ర దేశంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాలో అంతర్భాగంగానే ఉంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత ఇరుగు పొరుగు రాజ్యాలు, ఇతర విదేశీ జోక్యంతో కొంత మంది తప్పుదారి పట్టిన యుఘిర్‌లు కమ్యూనిస్టులు అధికారానికి రాకముందు కొంత కాలం తాము స్వతంత్ర దేశంగా ఉన్నామని, హాన్‌ జాతీయులు తమ మీద పెత్తనం చేస్తున్నారని, తమకు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చారు. కొన్ని ఉగ్రవాద చర్యలకు సైతం పాల్పడ్డారు. మనకు కాశ్మీర్‌ ఎలాంటి కీలక ప్రాంతమో చైనాకు అది అంత ముఖ్యమైనది. ఈ నేపధ్యంలో చైనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల గురించి చిలవలు పలవలుగా చిత్రిస్తున్నారు. ముస్లింలను అణచివేసేందుకు తీసుకున్న నిర్ణయాల పత్రాలు బయట పడ్డాయని కొన్ని పత్రికలు కథలు రాశాయి.
చైనా లక్షణాలతో సోషలిజాన్ని నిర్మిస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతున్నది. దీనిని కొంత మంది కమ్యూనిస్టులే అంగీకరించటం లేదు. ఆ పేరుతో అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్దను నిర్మిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు కూడా. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలను వారిని వ్యక్తం చేసుకోనివ్వటం తప్ప మరొక మార్గం లేదు. పెట్టుబడిదారీ విధానం అన్ని దేశాల్లో ఒకే మూసగా అభివృద్ది చెందలేదు. అలాగే సోషలిజాన్ని కూడా అభివృద్ధి చేయలేమని, ఏ దేశానికి ఆదేశ ప్రత్యేక పరిస్ధితులను గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు సోషలిజాన్ని నిర్మించే క్రమంలో దశల గురించి తెలియదు, చైనీయుల అవగాహన ప్రకారం అనేక ద శల్లో తమది ఒకటి అంటున్నారు. మొత్తంగా చూసినపుడు వారి దారి ఎటు అన్నదే ముఖ్యం.

Image result for china islamic
సోషలిజం గురించే ఇలా ఉన్నపుడు ఇక మతాల గురించి చెప్పాల్సిందేముంది. ఎంతో సున్నితమైన అంశం, శత్రువులు కాచుకొని ఉంటారు. ఒక లౌకిక వ్యవస్దలో మతం పట్ల ఎలా వ్యవహరించాలి అన్నది ఒక ముఖ్యాంశం, అది కూడా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట(మన దేశంలో మాదిరి ఒకటో అరో రాష్ట్రంలో అధికారం పొందటం కాదు) మరింత సంక్లిష్టం. సోషలిస్టు సమాజ లక్ష్యం కలిగిన ఏ వ్యవస్దలో అయినా మతం దాని నిర్మాణానికి దోహదం చేసేదిగా ఉండాలి తప్ప వ్యతిరేకించేదిగా ఉండకూడదు. మత విశ్వాసాలు వ్యక్తి, కుటుంబానికి పరిమితం కావాలి తప్ప నా మతం చెప్పినట్లుగా పాలన నడవాలంటే కుదరదు. మతాలే దానికి అనుగుణ్యంగా మారాల్సి ఉంటుంది.అనేక దేశాల్లో అలా మారినపుడు సోషలిస్టు దేశాల్లో కుదరదంటే ఎలా ?
చైనాలోని ఎనిమిది ముస్లిం తెగల పెద్దలతో ప్రభుత్వం సమావేశం జరిపి సోషలిజానికి తగిన విధంగా ఇస్లాం మారాల్సిన అవసరం గురించి వివరించింది, అందుకు గాను ఐదు సంవత్సరాలలో శీఘ్రగతిన తెలియచెప్పేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారి ముందుంచింది. పశ్చిమ దేశాల మీడియా దీన్ని దొరకబుచ్చుకొని యుఘిర్‌లో ఉగ్రవాద నిర్మూలన చర్యలుగా కొందరు చిత్రీకరిస్తే మరి కొందరు ఆ పేరుతో మతాన్ని అణచివేసేందుకు పూనుకున్నట్లు రాశారు. అనేక దేశాల్లో మితవాద శక్తులు మత పెత్తనాన్ని తిరిగి పునరుద్దరించేందుకు, పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంశాన్ని మరచిపోకూడదు. మతపరమైన దేశాల్లో పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసిన తరువాత ప్రతి లౌకిక దేశం తన జాగ్రత్తలు తాను తీసుకోనట్లయితే అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌ ఎంత వేగంగా చొచ్చుకుపోతోందో దాన్ని వినియోగించుకొని మత శక్తులు అంతగా రెచ్చిపోవటాన్ని మనం చూస్తున్నాం. ఇదే పరిస్ధితి ప్రపంచమంతటా ఉంది. పోప్‌ జాన్‌ పాల్‌ 2 పోలెండ్‌లో సోషలిస్టు వ్యవస్ధ కూల్చివేతకు ఎలా చేతులు కలిపిందీ మనం చూశాము. వాటికన్‌ కేంద్రం ఉన్న ఇటలీ ఉప ప్రధాని మాటియో సల్వవినీ 2018 ప్రారంభంలో ఒక ప్రకటన చేశాడు.’ మన మీద దాడి జరుగుతోంది, మన సంస్కృతి, సమాజం, సంప్రదాయాలు, జీవన విధానానికి ముప్పు ఏర్పడింది.’ అని మాట్లాడితే ఒక మీడియా 2019లో మత యుద్ధాలు తిరిగి రానున్నాయని రాసింది. ఛాందసవాదం వెర్రి తలలు వేస్తోంది, అది మితవాద జాతీయ వాద భావనలను ముందుకు తెస్తోంది, హింసాకాండకు, సామాజిక అస్ధిరతకు కారణం అవుతోంది. ఈ అనుభవాలను ప్రతి దేశం తీసుకోవాలి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. చైనా దీనికి మినహాయింపుగా ఉండజాలదు.
సోషలిజానికి అనుగుణ్యంగా ఒక్క ఇస్లామే కాదు, చైనాలోని అన్ని మతాలూ మారాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అందుకు అనుగుణ్యమైన చర్యలు తీసుకొంటోంది. ఏ మతానికి మినహాయింపు లేదు. మన దేశంలో కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సంఘపరివార్‌ నేతల మాదిరి హిందూ మతానికి ఇతర మతాల నుంచి, లౌకిక వాదుల నుంచి ముప్పు వస్తోందని చెబుతన్నట్లుగా చైనాలో మెజారిటీ మతానికి ముప్పు వస్తోందని చెప్పటం లేదు. ఒక మైనారిటీ మతాన్నుంచి వస్తోందనే ముప్పును మరొక మెజారిటీ మతోన్మాదం అరికట్టలేదు, అది తన ఉన్మాదాన్ని జనం మీద రుద్దుతుంది. జనాన్ని అణచివేస్తుంది. 2018లో చైనా విడుదల చేసిన ఒక శ్వేత పత్ర సమాచారం ప్రకారం 20 కోట్ల మంది మతాన్ని నమ్మేవారున్నారు. ప్రభుత్వం వద్ద నమోదైన ప్రార్దనా స్ధలాలు 1,44,000 ఉన్నాయి. వాటిలో 3,80,000 మంది మత పరమైన క్రతువులు నిర్వహించే వారున్నారు. ఉగ్రవాద నిరోధ చర్యలు, మత పరమైన స్వేచ్చ పూర్తిగా భిన్నమైన అంశాలు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవటం, దాన్ని నివారించటం మత స్వేచ్చను అడ్డుకోవటం కాదు. మన దేశంలో సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారం మాదిరి ముస్లింలు మొత్తం ఉగ్రవాదులే అని లేదా అందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులుగా ఉన్నవారందరూ ముస్లింలే అనే తప్పుడు ప్రచారాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ చేయటం లేదు.
ముస్లిం దేశాలు చైనా చర్యను ఎందుకు ఖండించటం లేదు ?
చైనాలో ఒక రాష్ట్రంలోని ముస్లింలను ఇంతగా హింస పెడుతుంటే ఒక్క ముస్లిం దేశమూ ఖండిచదు ఎందుకు అని కొందరు సామజిక మాధ్యమం, మీడియాలో అమాయకంగా అడుగుతున్నట్లు కనిపిస్తారు. వారే వాటికి సమాధానం కూడా చెబుతారు.చైనాతో ఉన్న ఆర్దిక సంబంధాలే కారణం అన్నది అది. మరి అమెరికా ఎందుకు అంతగా గొంతు చించుకుంటున్నది, చైనాతో అందరి కంటే ఎక్కువ వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నది, చైనా దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు అప్పుగా తెచ్చుకున్నదీ అమెరికాయే కదా ? చైనా రాజకీయంగా, ఆర్ధికంగా తనకు నచ్చినట్లు లంగలేదు కనుక బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నది అనుకోవాలా ?
చైనా పదిలక్షల మంది యుఘిర్‌ ముస్లింలను నిర్బంధ శిబిరాల్లో పెట్టింది. దీనికి పశ్చిమ దే శాలూ, వాటి మీడియా చూపే ఆధారాలు లేవు, దగ్గరుండి సరిగ్గా లెక్క పెట్టినట్లు రాస్తున్నారు. కోటి మంది ముస్లింలు ఉన్న ప్రాంతంలో పది లక్షల మందిని నిర్భందిస్తే మిగిలిన వారంతా ఈ పాటికి పొరుగు దేశాలకు శరణార్దులుగా వెళ్లి ఉండాల్సింది. కానీ సరిహద్దుల్లో ఉన్న ఏ ఒక్క ముస్లిం దేశం, మరొక దేశం గానీ తమ దేశానికి అలాంటి సమస్య ఉన్నట్లు ఇంతవరకు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయలేదు. దాదాపు పదకొండువేల కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు కలిగిన ప్రాంతమది, తప్పించుకోకుండా కట్టడి చేయటం ఏ దేశానికైనా సాధ్యమేనా ? ఉపగ్రహ చిత్రాలంటూ పత్రికల్లో టీవీల్లో కొన్ని భవనాలను చూపుతారు, అవి ఏ భవనాలైనా కావచ్చు. చైనాలో జరుగుతున్నట్లు చెబుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికా తప్ప మరొక దేశం ఏదీ చొరవ తీసుకొని ఫిర్యాదు చేసేందుకు ఇంతవరకు ముందుకు రాలేదు.

Image result for pope  china
తామే తుమ్మి తామే తధాస్తు అనుకున్నట్లుగా తాము పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కారణంగా నిర్బంధ శిబిరాలను పెద్ద సంఖ్యలో మూసివేసిందని కూడా పశ్చిమ దేశాల వారు ప్రచారం చేస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా దేశ వ్యవస్ధకు అనుగుణ్యంగా వ్యవహరించాల్సిన తీరుతెన్నులను వివరించేందుకు పిల్లలు, యువతకు ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఏర్పాటు చేసింది. వాటిలో ఉగ్రవాదం, దానికి దూరంగా ఉండాల్సిన అవసరం, బతికేందుకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ వంటివి అన్నీ అక్కడ వున్నాయని చైనా అధికారులే చెబుతున్నారు. వాటిని శత్రువులు నిర్భంద శిబిరాలంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో నక్సల్స్‌గా మారి నేరాలు చేసిన వారిని పట్టిస్తే బహుమతులు ప్రకటించటం లేదా వారే లొంగిపోతే ప్రభుత్వాలు ఆర్దిక సాయం చేసి జనజీవన స్రవంతిలోకి తెచ్చే పధకాలను అమలు జరపటం తెలిసిందే. చైనా నిర్వహిస్తున్న అలాంటి పాఠశాలలను సందర్శించాలని అనేక దేశాల, దౌత్యవేత్తలు, జర్నలిస్టులను ఆహ్వానించింది. వారందరూ చైనా అనుకూలురు అని ఒక నింద. వాటిలో ఖురాన్‌ చదవ నివ్వటం లేదని, పంది మాంసం బలవంతంగా తినిపిస్తున్నారంటూ రంజుగా కథలు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సామాజిక, మానవతా పూర్వక, సాంస్కృతిక వ్యవహారాల కమిటీ ముందు గతేడాది అక్టోబరు 23 యుఘీర్స్‌పై జరుగుతున్నదాడులంటూ అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి 23దేశాలు ఫిర్యాదు చేశాయి,54దేశాలు చైనా తీసుకున్న చర్యలను సమర్ధించాయి. ఇస్లామిక్‌ దేశాలు పాలస్తీనియన్లు, మయన్మార్‌లో రోహింగ్యాల మీద జరుగుతున్న దాడులను ఖండించాయి గానీ, యుఘీర్స్‌ పట్ల కేవలం ఆందోళన మాత్రమే వ్యక్తం చేశాయని అమెరికన్లు కస్సుబుస్సుమంటున్నారు. పాలస్తీనియన్ల మీద జరుగుతున్నదాడులను అమెరికా ఎప్పుడైనా ఖండించిందా, ఖండించకపోగా ఐరాసలో ఇజ్రాయెల్‌ను సమర్దిస్తున్నది. సిరియాపై దాడికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పంపిన ఆల్‌ఖైదా ఉగ్రవాద ముఠాలలో యుఘీర్‌లు దొరికిపోయారు. వారిని అక్కడకు పంపిందెవరు చైనా వారా అమెరికన్లా ? ఆప్ఘన్‌ తాలిబాన్ల ముఠాలలో అనేక మంది యుఘీర్లు పట్టుబడ్డారు, వారిని తాలిబాన్లలోకి పంపిందెవరు ? ఈ విషయాలు ముస్లిం దేశాలకు తెలియవా ?చైనాను ఏమని విమర్శిస్తాయి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దిగుబడుల పెరుగుదలకు దున్నకం తగ్గించాలా !

26 Thursday Dec 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Agricultural, Reduced soil tilling, Smart Agriculture, soils, yields

Image result for could Reduced soil tilling helps both soils and yields

 

 

 

 

 

 

 

 

ఎం కోటేశ్వరరావు
భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని తమ అధ్యయనంలో తేలిందని తాజాగా కొందరు పరిశోధకులు చెప్పారు. రైతాంగం ముఖ్యంగా మన వంటి వర్ధమాన దేశాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటం ఒక అంశమైతే, పంట మార్కెటింగ్‌ మరొక అంశం. ప్రపంచ వాణిజ్య సంస్ద ఉనికిలోకి రాక ముందే ప్రపంచీకరణ, దానిలో భాగంగా నయా ఉదారవాద విధానాలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. మన దేశంలో ఆ విధానాలు అమలులోకి వచ్చిన 1991 తరువాత అంతకు ముందు తలెత్తినదాని కంటే వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం దానికి సూచికగానే ఆత్మహత్యలన్న విషయం తెలిసిందే. వ్యవసాయం గిట్టుబాటు కానందున అనేక మంది వ్యవసాయ మానివేస్తే, అంతకంటే ఎక్కువగా మరోపని లేక కౌలు రైతులు ఉనికిలోకి వచ్చారు. పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య, వాటి మీద పని చేసే వారి సంఖ్యా ఎక్కువే.
తాజా సమాచారం ప్రకారం మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నవారు 58శాతం ఉన్నారు.మన కంటే వెనుకబడిన, దారిద్య్రంతో మగ్గుతున్న దే శాలలో తప్ప మరే ఇతర వర్ధమాన దేశంలో ఇంత సంఖ్యలో లేరు. గడచిన ఆర్దిక సంవత్సరంలో 28.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశాము. 2015-16లో ఒక రైతు కుటుంబ సగటు ఆదాయం రూ.96,703ను 2022-23 నాటికి రూ.2,19,724 చేస్తామని నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ వాగ్దానం చేసింది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటి వరకైతే అంతుబట్టలేదు, నరేంద్రమోడీ ఇటీవలి కాలంలో దాని గురించి మాట్లాడటం లేదు. దీని గురించి మరో సందర్భంలో చూద్దాం. మన దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు, వందల, వేల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఐరోపా, అమెరికాల్లో ఉండే రైతుల సమస్యలు వేరుగా ఉంటాయి. అయితే దేశం ఏదైనా భూమి ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కడైనా ఒకటే. తగ్గుతున్న భూసారం, దెబ్బతింటున్న భూమి ఆరోగ్యం.ఈ సెగ మనకు తగిలిన కారణంగానే ఇప్పటికే మన రైతాంగానికి పది కోట్ల మేరకు భూ ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. ఒక మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఈ తరం సూపర్‌ తిండి తింటున్నది కనుకనే మా తరం మాదిరి గట్టిగా ఉండటం లేదని వృద్ధులు అనటం వింటాం. దానిలో పాక్షిక సత్యం లేకపోలేదు. ఈ అంశాలన్నీ ఒక ఎత్తయితే ఇటీవలి కాలంలో భూమి ఆరోగ్యం దిగజారుతోందన్న అంశాలు రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. భూ ఆరోగ్య బాగుకు అయ్యే ఖర్చుకూడా రైతుమీదే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇది మునిగే పడవకు గడ్డిపోచకూడా భారం మాదిరే అన్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా 2.4 కోట్ల ఎకరాల భూమి సారం లేనిదిగా తయారు అవుతున్నదన్నది ఒక అంచనా. ఇది ప్రపంచ ఆహార భద్రతను ప్ర శ్నార్దకం చేయటంతో పాటు భూమి మీద వత్తిడిని పెంచటంతో పాటు మన వంటి దేశాలలో రైతు మీద భారాన్ని కూడా మోపనుంది.
దీనికి రైతులు వ్యక్తిగతంగా చేయగలిగింది పరిమితం, ప్రభుత్వాలు మాత్రమే పరిష్కరించగలిగిన అంశం. వ్యవసాయ అభివృద్ధి, విస్తరణ, పరిశోధన బాధ్యతల నుంచి వైదొలిగే విధానాలు అనుసరిస్తున్న పాలకుల నుంచి ఏమి ఆశించగలమన్నది ఒక ప్రశ్న. ఈ నేపధ్యంలో ప్రపంచంలో ఏమి జరుగుతోంది, శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారో చూద్దాం. ఒక దేశంలో జరిగిన అధ్యయనాలు మరొక దేశానికి లేదా ప్రాంతానికి మక్కీకి మక్కీ వర్తించకపోవచ్చుగానీ, ఆయాదేశాల, ప్రాంతాలకు సంబంధించి ఏమి చేయాలన్నదానికి దారి చూపుతాయి.

Image result for could Reduced soil tilling helps both soils and yields
కొన్ని అంశాలు విపరీతంగా కూడా అనిపించవచ్చు, వాటి మంచి చెడ్డలను శాస్త్రవేత్తలు మాత్రమే వివరించగలరు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన పరిశోధన అంశాల సారం ఏమంటే భూమిని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిదానికీ దున్నకూడదు, ఎంత తక్కువ దున్నితే అంతగా భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుబడులు కూడా పెరుగుతాయని చెబుతున్నారు.1930దశకంలో అమెరికా, కెనడాలలో తీవ్రమైన దుమ్ము తుపాన్లు,వర్షాభావ పరిస్ధితులు ఏర్పడి, కొన్ని చోట్ల సాగు నిలిపివేయాల్సి వచ్చింది.కొంత కాలం దున్నకం నిలిపివేసిన తరువాత పంటల దిగుబడి అక్కడ పెరిగిందని, భూ ఆరోగ్య మెరుగుదల, దిగుబడుల పెరుగుదలకు దాన్నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.
రైతులు సాధారణంగా సాగుకు ముందు పాటు కలుపు మొక్కల తొలగింపుకు, ఎరువులు వేసే సమయంలోనూ దున్నటం, విత్తే సమయంలో దున్నటం తెలిసిందే. ఇలా ఎక్కువ సార్లు దున్ని భూమిలో కలుపు మొక్కలు లేకుండా చేయటం వలన స్వల్పకాలంలో దిగుబడులు పెరగవచ్చుగానీ దీర్ఘకాలంలో భూమి సారం తగ్గుతుందట.భూమికి మేలు చేసే బాక్టీరియా, ఇతర క్రిమి కీటకాలు అంతరిస్తున్నాయి. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) 2015నివేదిక ప్రకారం గత నాలుగు దశాబ్దాల కాలంలో మూడో వంతు సాగు భూమిలో సారం తగ్గిందట. పదే పదే భూమి దున్నకం, దాని పర్యవసానాల గురించి అమెరికాలోని సోయా, మొక్కజొన్న సాగు చేసే భూముల మీద చేసిన అధ్యయనం మేరకు ఎంత తక్కువగా దున్నితే అంత మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.తక్కువ సార్లు దున్నితే ఆరోగ్యకరమైన భూ యాజమాన్య పద్దతులను ప్రోత్సహించటంతో పాటు, కోతనిరోధం, నీటిని నిలుపుకోవటం మెరుగుపడుతుంది.యంత్రాలను వినియోగించకపోవటం లేదా పరిమితంగా దున్నటం ద్వారా గత సంవత్సరపు పంట కోసిన తరువాత మిగిలే సోయా, మొక్కజన్న దుబ్బులు కూడా భూమికి మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిమిత దున్నకపు పద్దతులను ప్రస్తుతం అమెరికా ఖండ దేశాలు, ఓషియానా ప్రాంతంలో 37 కోట్ల ఎకరాల్లో వినియోగిస్తున్నారు.పరిమిత దున్నక సాగు అమెరికా మొక్కజొన్న పొలాల్లో 2012-17 మధ్య పదిహేడు శాతం పెరిగింది. అయితే మొత్తం సాగులో ఇది 3.4శాతమే. అయితే దిగబడులు, లాభాలు తగ్గుతున్నాయని రైతాంగం ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. గతంలో ఈ పద్దతులను కొన్ని పరిశోధనా కేంద్రాల్లోనే అమలు జరిపారు, అక్కడ కూడా ఉత్పాకత మీద పడే ప్రభావం గాక భూసార మెరుగుదల గురించే కేంద్రీకరించారు.
స్టాన్‌ఫోర్డ్‌ బృందం ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలు, పరిమిత దున్నకపు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అధ్యయనానికి 2005 నుంచి 2016వరకు కంప్యూటర్లలో సేకరించిన సమాచారంతో పాటు ఉపగ్రహ చిత్రాలద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. దీనిలో పంటల దిగుబడులపై వాతావరణ మార్పులు, పంటల తీరు తెన్నులు, భూమి స్వభావం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలలో అధ్యయనానికి ఎంచుకున్న కేంద్రాల సమాచారాన్ని విశ్లేషించారు. దీర్ఘకాలం పాటు పరిమితంగా దున్నిన పొలాల్లో సగటున మొక్కజొన్న దిగుబడి 3.3, సోయా 0.74 శాతం చొప్పున ఎక్కువ సార్లు దున్నిన పొలాలతో పోల్చితే పెరిగినట్లు వెల్లడైంది. కొన్ని కేంద్రాల్లో ఈ దిగుబడులు గరిష్టంగా 8.1,5.8 శాతాల చొప్పున ఉన్నాయి. కొన్ని చోట్ల 1.3, 4.7 శాతాల చొప్పున మొక్కజన్న, సోయా దిగుబడులు తగ్గినట్లు కూడా గమనించారు. ఇంతటి తేడాలు రావటానికి భూమిలో నీరు, ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులు ప్రధానంగా పని చేసినట్లు వెల్లడైంది. ఎక్కువ సార్లు దున్నే ప్రాంతాలలో నేలలు పొడిబారటం, నీటిని నిలువ చేసే సామర్ధ్యం తగ్గగా తక్కువ సార్లు దున్నిన ప్రాంతాలలో నేలలో తేమ దిగుబడులు పెరిగేందుకు ఉపయోగపడింది.
అధ్యయనం వెల్లడైన ధోరణులను వెల్లడించింది తప్ప ఇంకా నిర్దిష్ట నిర్ధారణలకు రాలేదు. మరింత విస్తృత అధ్యయనాలు జరపాల్సి ఉంది.1980దశకం నుంచి ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.తక్కువ సార్లు దున్నిన చోట రైతులు పూర్తి స్ధాయిలో లబ్ది పొందేందుకు మొక్కజొన్న విషయంలో పదకొండు సంవత్సరాలు పడితే సోయా విషయంలో రెట్టింపు వ్యవధి తీసుకుంది. తక్కువసార్లు దున్నకం వలన భూమి సారం అభివృద్ధి చెందటం ఒకటైతే యంత్రాల వాడకం, వాటికి అవసరమయ్యే ఇంధనం, కార్మికుల ఖర్చు తగ్గింది. భూసారం పెరిగే కొలదీ దిగుబడులు పెరగటాన్ని గమనించారు.2017 అమెరికా వ్యవసాయ గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నట్లు, అమెరికాలోని పంటలు పండే భూమిలో 35శాతం వరకు తక్కువ సార్లు దున్నే పద్దతులను అనుసరిస్తున్నట్లు వెల్లడైంది. పరిశోధనా కేంద్రాల నుంచి వెల్లడైన సమాచారానికి, సాగు చేస్తున్న రైతాంగ అనుభవానికి అనేక మార్లు పొంతన కుదరకపోవటంతో రైతుల్లో పూర్తి విశ్వాసం ఇంకా ఏర్పడ లేదు. ఫలితంగా కొందరు రైతులు ఈ పద్దతికి మళ్లేందుకు ముందుకు రాని పరిస్ధితి కూడా ఉంది. తక్కువ ఉత్పాదకత ఉండే భూములను సారవంతవమైనవిగా మార్చవచ్చని క్వీన్‌లాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. స్ధానిక, గిరిజన తెగల సహకారంతో నిస్సారమైన భూములను చాలా చౌకగా, తక్కువ వ్యవధిలోనే పదిల పరచవచ్చంటున్నారు.
ప్రపంచ వ్యవసాయ రంగంలో తీవ్రమైన పోటీ, ఇటీవలి కాలంలో ఉత్పత్తుల ధరలపతనం వంటి అనేక అంశాలు కొత్త పరిశోధనలకు తెరలేపుతున్నాయి. అయితే ఇవి చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉండే మన వంటి వ్యవసాయ పరిస్దితులున్న చోట పరిశోధనల ఫలితాలను ఎలా వుపయోగించుకోవాలి, ఎలా వర్తింప చేసుకోవాలి అన్నది ఒక పెద్ద సవాలే. అయినా ఎంత మేరకు వీలైతే అంతమేరకు వినియోగించుకోవటం తప్ప మరొక మార్గం కనిపించటం లేదు.సూక్ష్మ వ్యవసాయం, మార్కెట్‌ పద్దతుల గురించి ప్రస్తుతం అనేక చోట్ల కేంద్రీకరిస్తున్నారు. గ్లోబల్‌ మార్కెట్‌ ఇన్‌సైట్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ అనే సంస్ధ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ప్రకారం 2025 నాటికి ప్రస్తుతం ఉన్న నాలుగు బిలియన్‌ డాలర్లుగా ఉన్న సూక్ష్మ వ్యయవసాయ మార్కెట్‌ పన్నెండు బిలియన్‌ డాలర్లవరకు పెరగవచ్చని అంచనా వేసింది.

Image result for could Reduced soil tilling helps both soils and yields
స్మార్ట్‌ ఫోన్ల మాదిరి స్మార్ట్‌ వ్యవసాయ పద్దతులకు గాను సమాచారాన్ని, సమాచార వ్యవస్ధలను వినియోగించుకొని రైతాంగానికి తోడ్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటల స్ధితిగతులను తెలుసుకొనేందుకు, కంప్యూటర్‌ వ్యవస్ధలతో పాటు డ్రోన్ల వినియోగం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సూక్ష్మ వ్యవసాయ పద్దతులంటే పరిమిత ప్రాంతాలలో సైతం ఎలాంటి పంటలను సాగు చేయాలి, ఎంత నీరు, ఎరువుల వినియోగం వంటి నిర్ధిష్ట సూచనలు చేసే వ్యవస్ద ఏర్పాటు. ఇందుకోసం 2017లో డచ్‌ ప్రభుత్వం పంటల సమాచార సేకరణకు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అవసరమైన నిధులను విడుదల చేసింది. గగనతలం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ద్రోన్స్‌, సెన్సర్లు, జిపిఎస్‌ వ్యవస్ధలు, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం 2025నాటికి 70శాతం వరకు ఉండవచ్చని అంచనా. మెరుగైన, పొదుపు పద్దతుల్లో నేల, నీటి వినియోగానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. రానున్న ఆరు సంవత్సరాలలో పరికరాలను గరిష్టంగా, జాగ్రత్తగా వినియోగించటం దగ్గర నుంచి సూక్ష్మ వ్యవసాయ సేవల వరకు మార్కెట్‌ పెరుగుదల రేటు 27శాతం ఉంటుందని అంచనా. పొలాల్లో ఎక్కడ ఏ లోపం ఉందో తెలుసుకొనేందుకు, వాటి నివారణకు తగు చర్యలను తీసుకొనేందుకు 3డి మాపింగ్‌తో సహా అనేక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.
అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో జరుపుతున్న పరిశోధనలన్నీ కార్పొరేట్‌ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో చేస్తున్నవే, వాటిని వినియోగించుకోగలిగింది కార్పొరేట్‌ సంస్ధలే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ ఫలితాలను మన వ్యవసాయ రంగానికి ఎలా వర్తింప చేయాలి, వినియోగించుకోవాలి అన్నది మన ప్రభుత్వాలు చేయాల్సిన పని. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధి వ్యవస్ధ, సిబ్బంది నియామకం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించిన ఫలితాల పర్యవసానాలను చూస్తున్నాము. యూరియా, క్రిమి, కీటక నాశనులను అవసరానికి మించి వాడుతున్నందున జరుగుతున్న నష్టాల గురించి చెబితే చాలదు, ఇతర ఎరువుల ధరలు ఆకా శాన్ని అంటిన కారణంగా సబ్సిడీ వున్నందున రైతాంగం యూరియాను ఎక్కువగా వాడుతున్నారన్నది తెలిసిందే. అందువలన రైతాంగాన్ని చైతన్యపరచటంతో పాటు, భూ సారం, ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవటం, అందుకు అవసరమైన సబ్సిడీలు, బడ్జెట్‌ కేటాయింపులు చేయటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అక్రమాల ట్రంప్‌కు అభిశంసన-మోడీ అభినందన !

25 Wednesday Dec 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump impeachment, Impeachment, Narendra Modi, US President impeachment

Image result for donald trump impeachment
ఎం కోటేశ్వరరావు
అమెరికాకు 1776లో స్వాతంత్య్రం వస్తే రాజ్యాంగం 1789 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు అధ్యక్షులను అభిశంసన ద్వారా గద్దె దించే ప్రయత్నాలు జరిగాయి. రెండు ప్రయత్నాలు విఫలం కాగా, ఒక అధ్యక్షుడు అభిశంసన ప్రక్రియ ప్రారంభానికి ముందే రాజీనామా చేశాడు. నాలుగవ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అతగాడి మీద వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి ఈ నెల 19న పార్లమెంట్‌ దిగువ సభ అమెరికన్‌ కాంగ్రెస్‌(ప్రజాప్రతినిధుల సభ) విచారణ జరిపి ట్రంప్‌ నేరం చేశాడంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అభిశంసన ప్రక్రియ ప్రకారం ఎగువ సభ సెనెట్‌ కూడా అభియోగాలపై విచారణ జరిపి నిజమే అని నిర్ధారిస్తే ట్రంప్‌ ఇంటికి పోవాల్సి ఉంటుంది.
ప్రజాప్రతినిదుల సభలోని 441 స్ధానాలకు గాను 435 మందికి ఓటింగ్‌ హక్కు ఉంటుంది. ప్రస్తుత ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ 198 స్దానాలు, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి 232, ఇతరులు ఒకరుండగా, నాలుగు స్దానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ప్రతిపక్షానికి చెందిన నాన్సీపెలోసీ స్పీకర్‌గా ట్రంప్‌ మీద అభిశంసన ప్రక్రియను ప్రారంభించటం, మెజారిటీ ఉంది కనుక ఆమోదం జరిగిపోయాయి.అయితే రిపబ్లికన్‌ పార్టీకి వంద స్ధానాలున్న సెనెట్‌లో 53 మంది సభ్యులుండగా ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి 45, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. సెనెట్‌ నిబంధనల ప్రకారం మూడింట రెండువంతుల మెజారిటీ కావాల్సి ఉన్నందున అసాధారణ పరిస్ధితి ఏర్పడి రిపబ్లికన్‌ పార్టీలో తిరుగుబాటు వంటివి జరిగితే తప్ప అభిశంసన వీగిపోవటం ఖాయం. ఎందుకంటే అలాంటి తీవ్ర పరిస్దితి, పరిణామాలేమీ ఇంతవరకు లేవు, సూచనలు కూడా కనిపించటం లేదు. ఈ కారణంగానే ఆ పనేదో త్వరగా కానివ్వండి అని ట్రంప్‌ సవాళ్లు విసురుతున్నాడు.
ట్రంప్‌ను అభిశంసించటానికి కారణాలు రెండు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో తనకు ప్రత్యర్ధి అవుతాడు అనుకున్న డెమోక్రటిక్‌ పార్టీ నేత జోబిడెన్‌, అతని కుమారుడి అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపి వారిని కేసులలో ఇరికించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడి మీద వత్తిడి తేవటం, ఆ క్రమంలో ఆ దేశానికి వాగ్దానం చేసిన మిలిటరీ సాయాన్ని తొక్కిపెట్టారన్నది ఒకటి. దీని మీద అభిశంసన ప్రక్రియను అడ్డుకొనేందుకు ప్రయత్నించటాన్ని మరొక అభియోగంగా విచారణ జరిపి నిర్ధారించారు. ఈ రెండూ అధికార దుర్వినియోగాలుగా పరిగణించారు. జనవరి ఏడవ తేదీన సెనెట్‌ విచారణ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. విచారణ ఎలా జరగాలన్న అంశంపై రెండు పార్టీల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వాదోపవాదాల నేపధ్యంలో ఆ రోజున ప్రారంభం కావచ్చు లేదా తరువాత అవుతుంది.
ఇంతవరకు ప్రజాప్రతినిదుల సభ స్పీకర్‌ తమకు అభియోగ అంశాల గురించి అధికారికంగా ఎలాంటి వర్తమానం పంపలేదని అందువలన తాము సెలవులను ఆనందంగా గడపటం తప్ప తాము చేసేదేమీ లేదని, విచారణ ఏ రోజున ప్రారంభమయ్యేది చెప్పలేనని సెనెట్‌ సభానాయకుడు మిచ్‌ మెకొనెల్‌ వ్యాఖ్యానించాడు. అయితే సెనేట్‌ వైపు నుంచి ఏం జరుగుతుందో తెలియకుండా తాము తమ ప్రతినిధుల నియామకం చేయలేమని ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పేర్కొన్నారు. ఇంతవరకు న్యాయసమ్మతంగా ఏమి జరుగుతుందో తమకు కనిపించటం లేదన్నారు. ప్రజాప్రతినిధుల సభలో సాక్ష్యం చెప్పటానికి నిరాకరించిన ట్రంప్‌ యంత్రాంగ అధికారులు నలుగురు సెనెట్‌ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఈ ప్రతిష్ఠంభనకు కారణంగా చెబుతున్నారు. వారిని రప్పించాలని, ట్రంప్‌ కార్యాలయం తొక్కిపెట్టిన కొన్ని పత్రాలను కూడా సమర్పించాలని కోరుతూ సెనెట్‌లో డెమోక్రటిక్‌ పార్టీ నేత చుక్‌ ష్కమర్‌ గతవారంలో మెకొనెల్‌కు లేఖ రాశారు. ముఖ్యాంశాలను ట్రంప్‌ దాచనట్లయితే ఎందుకు నిరాకరిస్తున్నారని విలేకర్లతో ప్రశ్నించారు. దీనిపై మెకొనెల్‌ ప్రతిస్పందిస్తూ విచారణపై తమకు అభ్యంతరం లేదని, గతంలో రెండు దశాబ్దాల క్రితం బిల్‌ క్లింటన్‌ మీద జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుపుతామని, న్యాయం అందరికీ ఒకటే కదా అన్నారు.
ఇక్కడే తిరకాసు ఉంది. క్లింటన్‌ విచారణ సమయంలో డెమోక్రాట్‌ సెనెటర్‌ చుక్‌ ష్కమర్‌ అప్పుడే సభలో కొత్తగా అడుగు పెట్టారు. ఆ సమయంలో మెకొనెల్‌ కూడా సభ్యుడే. ఆ సమయంలో విచారణ తీరుతెన్నులపై అప్పుడు తీసుకున్న వైఖరికి విరుద్దంగా రెండు పార్టీల వారూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అభియోగాల గురించి సెనెట్‌లో వాదోపవాదాలు ప్రారంభించటం, రాతపూర్వకంగా ప్రశ్నలను అనుమతించటానికి తగిన వ్యవధి ఇచ్చి వాటి ప్రాతిపదికగా సాక్షులను పిలవాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. బిల్‌ క్లింటన్‌ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా తాము అదే పద్దతి పాటిస్తామని రిపబ్లికన్లు చెబుతున్నారు. అయితే ముందుగానే ఫలానా వారిని సాక్షులుగా పిలవాలని డెమోక్రాట్లు ఇప్పుడు కోరుతున్నారు. క్లింటన్‌ విచారణ సమయంలో ప్రజాప్రతినిదుల సభలో అన్ని విషయాలు చర్చించినందున సెనెట్‌లో కొత్తగా సాక్షులను విచారించాల్సిందేమీ లేదని అప్పుడు డెమోక్రాట్లు వాదించగా రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కనీసం ముగ్గురు కొత్త సాక్షులను విచారించాల్సిందే అన్నారు. ఇప్పుడు విచారణలో కొత్తగా సాక్షులను పిలవాలని డెమోక్రాట్లు కోరుతుండగా అవసరం లేదని రిపబ్లికన్లు అంటున్నారు, దాన్ని నిర్ణయించటానికి సెనెట్‌లో అవసరమైన బలం రిపబ్లికన్లకు ఉంది కనుక ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నది వారి ఎత్తుగడ. తన వివాహేతర సంబంధాల గురించి బిల్‌ క్లింటన్‌ అసత్యాలు చెప్పారన్న ఆరోపణపై ఆయనను అభిశంసించారు,1999 ఫిబ్రవరి పన్నెండున క్లింటన్‌ నిర్దోషిగా సెనెట్‌ తీర్మానించింది.
అనేక దేశాలలో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం సర్వసాధారణంగా జరుగుతోంది. అమెరికా అందుకు మినహాయింపు కాదు. తమ బలాన్ని, చేసిన దాన్ని చెప్పుకోవటం కంటే ప్రత్యర్దుల బలహీనతలను ముందుకు తెచ్చి ఎదురుదాడి చేయటం ఇటీవలి కాలంలో పెరిగింది. డెమోక్రాటిక్‌ పార్టీనేత జోబిడెన్‌ కుమారుడు ఉక్రెయిన్‌కు చెందిన ఒక గ్యాస్‌ కంపెనీలో పని చేశాడు. ఆసమయంలో పాల్పడిన అక్రమాల వివరాలను తెప్పించుకొని ప్రత్యర్ధిని దెబ్బతీయాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ. పార్లమెంట్‌ ఆమోదించిన మేరకు ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం అందించాలంటే తనకు ఆ సమాచారాన్ని ఇవ్వాలని ట్రంప్‌ షరతు పెట్టాడు, ఒత్తిడి తెచ్చేందుకు గాను సాయం అందించకుండా తొక్కి పెట్టాడు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తీరు చూస్తే అంతర్జాతీయ స్ధాయిలో అగ్రనేతలు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం అవుతుంది.
జోబిడెన్‌, అతని కుమారుడి అక్రమాల గురించి సమాచారం సేకరించాలని ట్రంప్‌ ఎంతో ముందుగానే పధకం వేశాడన్నది స్పష్టం. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో జరిగిన ఎన్నికలలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా వ్లదిమిర్‌ జెలెనెస్కీ ఎన్నికయ్యాడు. అతడి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఐరోపా యూనియన్‌ రాయబారి, ఇంధన శాఖ మంత్రి, ఉక్రెయిన్‌ ప్రత్యేక దౌత్యవేత్తలు ముగ్గురూ తిరిగి వచ్చిన వెంటనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో కథ నడిపించవచ్చని ట్రంప్‌కు చెప్పారు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమై అనేక మలుపులు తిరిగింది.ఒక అవగాహన కుదిరిన తరువాత ట్రంప్‌-జెలెనిస్కీ ఫోన్‌ సంభాషణ జరిపారు. ఈ వివరాలను తెలుసుకున్న ఒక ఆకాశరామన్న ఫిర్యాదు చేశాడు. అది తెలిసిన సిఐఏ అధికారి ఒకరు తన ఉన్నతాధికారికి నివేదించాడు. చివరకు ఈ వార్త మీడియాలో వచ్చింది. వెంటనే తొక్కి పెట్టిన మిలటరీ సాయాన్ని విడుదల చేశారు. అధ్యక్షుడి అధికార దుర్వినియోగంపై అభిశంసన జరపాలని డెమోక్రాట్లు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు సెప్టెంబరు 24న విచారణకు శ్రీకారం చుట్టారు, డిసెంబరు 19న ప్రజాప్రతినిధుల సభలో అభి శంసన తీర్మానాన్ని ఆమోదించారు. విచారణకు హాజరైన సాక్షులు తమను ట్రంప్‌ ఎలా బెదిరించిందీ వివరించారు, విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించటాన్ని వెల్లడించారు. నాకిది నీకది అనే పద్దతుల్లో ట్రంప్‌-ఉక్రెయిన్‌ అధ్యక్షుడి మధ్య సంభాషణలు నడిచాయని తేలింది.

Image result for donald trump impeachment- narendra modi commendation
ప్రజాప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది.సెనెట్‌ ముందుకు రావటం, అది అక్కడ వీగిపోవటం లాంఛనమే. అందువలన ఒక వేళ ఆమోదం పొందితే, రాజ్యాంగంలో పేర్కొన్న వరుస ప్రకారం ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు అవుతారు. ఒక వేళ ఉపాధ్యక్షుడు లేకపోతే ఎవరు కావాలో ఒక జాబితా ఉంది, సెనెట్‌లో తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు గనుక ఆ వివరాలు అవసరం లేదు. సాంకేతికంగా ట్రంప్‌కు ఎలాంటి ఢోకాలేనప్పటికీ నైతికంగా ఇది పెద్ద ఎదురు దెబ్బ. అనేక సర్వేలలో ట్రంప్‌ పరిస్ధితి బాగోలేదని తేలినప్పటికీ పుంజుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. తాజాగా సిఎన్‌ఎన్‌ జరిపిన సర్వేలో ప్రతిపక్ష డెమోక్రాట్‌ జోబిడెన్‌కు 49శాతం మంది, ట్రంప్‌కు 44శాతం మద్దతు ఇస్తున్నారని వెల్లడైంది. అక్టోబరు కంటే ఐదు పాయింట్లు డెమోక్రాట్లకు తగ్గినట్లు పేర్కొన్నది. ప్రజాప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన కొద్ది గంటల్లో జరిపిన ఒక ఫోన్‌ సర్వేలో 53శాతం మంది ట్రంప్‌ అదికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు 51శాతం మంది అభిప్రాయ పడ్డారు.
ఈ అక్రమం వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికా సమాజంలోని పలు తరగతుల నుంచి తీవ్రమైన వత్తిడి, నిరసన వ్యక్తమైన కారణంగానే ప్రజాప్రతినిధుల సభ విచారణకు స్వీకరించాల్సి వచ్చిందనే అంశాన్ని మరచిపోరాదు. ప్రతిపక్షమే తేల్చుకుంటుందిలే అని ఉపేక్షించలేదు. ఇటీవలి కాలంలో అసంతృప్తికి గురవుతున్న యువత, వివిధ తరగతుల ప్రజానీకం వీధుల్లోకి వస్తున్నది.ట్రంప్‌ అక్రమాల గురించి మీడియాలో వెల్లడై అమెరికన్‌ సమాజంలో తీవ్ర నిరసన వ్యక్తమౌతున్న తరుణంలో మన ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లి హౌడీ మోడీ కార్యక్రమం పేరుతో ట్రంప్‌కు మద్దతు పలికి, తిరిగి అధికారానికి రావాలని కోరి వచ్చారు. అక్కడి భారతీయులందరూ ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని చెప్పారు. ఒక అధ్యక్షుడిగా మీకు డోనాల్ట్‌ ట్రంప్‌ వంటి మిత్రుడు మరొకరు లేరు అని చెప్పగలను అని నరేంద్రమోడీ చెప్పారు. దానికి ప్రతిగా నరేంద్రమోడీ భారత దేశ పిత అని ట్రంప్‌ కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. నీవెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు అన్న లోకోక్తి తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాటో కూటమిలో విబేధాలు-తొలిసారిగా చైనా బూచి !

10 Tuesday Dec 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

2019 NATO Summit, Brain death of NATO, China challenges and threats, London Londres, NATO 70th anniversary

Image result for 2019 NATO Summit : first time mentioned china challenge

ఎం కోటేశ్వరరావు
గతవారం, డిసెంబరు 3,4 తేదీలలో లండన్‌లో జరిగిన నాటో కూటమి 70వార్షికోత్సవ సమావేశ ముగింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్వహించాల్సిన పత్రికా గోష్టిని రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని నాటోలో ఉన్న సంక్షోభానికి నిదర్శనంగా వర్ణిస్తున్నారు. ఎందుకు రద్దు చేశారని విలేకర్లు ప్రశ్నిస్తే సమావేశ వివరాల గురించి రెండు రోజుల పాటు ఎన్నో వివరించారని, అందువలన ట్రంప్‌ కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు కనుక రద్దు చేసినట్లు తెలిపారు. అయితే అసలు విషయం ఏమంటే నాటో సభ్య రాజ్యాల మధ్య ఉన్న విబేధాలు మరింతగా ఎక్కడ బట్టబయలు అవుతాయో అన్న భయంతోనే ట్రంప్‌ కార్యక్రమాన్ని రద్దు చేశారని భావిస్తున్నారు. సమావేశం పూర్తిగా ముగియక ముందే ట్రంప్‌ వెళ్లిపోయారని కూడా వార్తలు వచ్చాయి. తొలిసారిగా నాటో చరిత్రలో చైనాను తొలిసారిగా ఒక బూచిగా చూపేందుకు ప్రయత్నం జరగటం ఈ సమావేశ విశేషం.
ఉత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ, దీన్నే ‘నాటో’ అంటారు. మొత్తం 29 దేశాలలో అమెరికా,కెనడా మినహా మిగిలిన 27 సభ్య రాజ్యాలూ ఐరోపా ఖండానికి చెందినవే.ఈ సంస్ధ 70వ వార్షికోత్సవం గతవారం లండన్‌లో జరిగింది.రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ను సోవియట్‌ కమ్యూనిస్టులు మట్టి కరిపించారు. అయినప్పటికీ జర్మనీ లేదా సోవియట్‌ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకోవాలని 1947లో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మరుసటి ఏడాది దాన్ని బెల్జియం, నెదర్లాండ్స్‌, లక్సెంబర్గ్‌లకు విస్తరించాయి.1949లో ఈ ఐదు దేశాలతో పాటు అమెరికా, కెనడా, ఇటలీ పోర్చుగల్‌, నార్వే, ఐస్‌లాండ్‌,డెన్మార్క్‌లను కూడా కలుపుకొని పన్నెండు దేశాలతో ‘నాటో’ ఏర్పడింది. తరువాత జర్మనీతో సహా మరో 17 దేశాలకు దాన్ని విస్తరించారు. ఇవిగాక దానిలో చేరాలనుకుంటున్న మరో ఐదు దేశాలను నాటో గుర్తించింది. శాంతికోసం కలసి పని చేస్తామనే సాకుతో మరో 21భాగస్వాములు అవుతున్నాయి, సంప్రదింపుల పేరుతో 15 దేశాలు నాటోతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ప్రపంచం మొత్తం వంద రూపాయలు మిలిటరీ ఖర్చు చేస్తుంటే నాటో దేశాల వాటా 70గా ఉంది. ఈ సంస్ధ సభ్య రాజ్యాలపై ఇతరులెవరన్నా దాడి చేస్తే ఉమ్మడిగా ఎదుర్కోవాలన్నది లక్ష్యం. ఇంతవరకు అలాంటి దాడులేవీ జరగకపోగా నాటో కూటమే ఇతర దేశాలపై దాడులకు, జోక్యానికి తెగబడింది.

Image result for 2019 NATO Summit : first time mentioned china challenges and threats
ఏడు దశాబ్దాల నాటో కూటమి చరిత్రలో తొలిసారిగా తమ కూటమికి చైనా నుంచి తలెత్తుతున్న సవాళ్లంటూ లండన్‌ శిఖరాగ్ర సభ ప్రకటనలో పేర్కొనటం గమనించాల్సిన ముఖ్యపరిణామం. సంస్ద ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో రక్షణ ఖర్చులో రెండవ పెద్ద దేశంగా చైనా ఉంది, భవిష్యత్‌లో అగ్రరాజ్యాల మధ్య కుదిరే ప్రధాన ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో చైనాను కూడా భాగస్వామిని చేయాలి. దీనర్దం దక్షిణ చైనా సముద్రంలోకి నాటో వెళుతోందని కాదు. చైనా మన సమీపానికి వస్తోన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త శత్రువును నాటో సృష్టిస్తోందనటం వాస్తవం కాదు అని స్టోలెన్‌బర్గ్‌ చెప్పారు. ఎటు తిప్పి ఎటు చెప్పినా చైనా సంగతి చూడాలన్న దుష్ట ఆలోచన లండన్‌ సమావేశంలో చోటు చేసుకుంది.
కమ్యూ నిజం వ్యాప్తిని అరికట్టే ప్రధాన లక్ష్యంగా ముందుకు వచ్చిన నాటో కూటమి సోవియట్‌, తూర్పు ఐరోపా దే శాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసింది. ఇప్పుడు చైనా మీద కేంద్రీకరించాలని నిర్ణయించింది. అమెరికా-చైనా మధ్య సంబంధాలు దిగజారుతున్న నేపధ్యం, నాటో సారధి అమెరికాయే గనుక దాని ప్రమేయంతోనే తొలిసారిగా లండన్‌ సమావేశంలో చైనా ముప్పు గురించి ప్రస్తావించారు. దీన్నే పరిశీలకులు మరో ప్రచ్చన్న యుద్దంగా వర్ణిస్తున్నారు.ఈ ముఖ్యపరిణామాన్ని ప్రపంచ మీడియా కావాలనే విస్మరించిందా ? కొంత మంది అవుననే అంటుండగా మరి కొందరు నాటో కూటమి విబేధాలకు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా చైనా అంశం మరుగున పడిందని అన్నారు.
నాటోకు ప్రాణం ఉన్నా మెదడు చచ్చిందని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ అన్నాడు. నాటోది కాదు ఫ్రెంచి అధ్యక్షుడి మెదడే ప్రాణం లేనిదిగా మారిందని టర్కీనేత ఎర్డోగన్‌ తిప్పికొట్టాడు. నాటో నేతల మందుకొట్టే కార్యక్రమంలో కెనడా నేత జస్టిన్‌ ట్రుదెవ్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను పరిహాసాలాడాడు. దానికి ప్రతిగా కెనడాకు రెండు ముఖాలున్నాయంటూ ట్రంప్‌ జవాబిచ్చాడు. అగ్రరాజ్యాల నేతలు ఇలా మీడియాకు వినోదం పంచినప్పటికీ ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్ధికంగా తమకు సవాలు విసురుతున్న చైనా విషయాన్ని ప్రస్తావించటంలో మాత్రం ఒకే మాట మీద ఉన్నారు.అయితే చైనా విషయంలో నాటో నేతల్లో ఏకాభిప్రాయం లేదని ప్రకటనలో వినియోగించిన పదజాలం స్పష్టం చేసింది. అందుకే ఇలా పేర్కొన్నది.’ ప్రస్తుత పెరుగుతున్న చైనా ప్రభావం మరియు దాని అంతర్జాతీయ విధానాలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా విసురుతున్నాయి, వాటిని ఒక కూటమిగా ఐక్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
రష్యా ఇప్పుడు కమ్యూనిస్టు దేశం కానప్పటికీ పెట్టుబడిదారీ వ్యవస్ధలో మిగతా అగ్రరాజ్యాలకు అది మిలిటరీ, ఇతర సవాళ్లను విసరగలిగే స్ధితిలో ఉంది. ఆ కారణంగానే దాని ముంగిట్లోకి నాటోను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి ప్రతిగా చైనాతో భాగస్వామ్యాన్ని అది పెంచుకుంటున్నది. తాజాగా దాదాపు మూడువేల కిలోమీటర్ల పొడవు గ్యాస్‌పైప్‌లైన్‌తో సహా అనేక అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య ఉన్న నాలుగువేల కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దులో ఎలాంటి సమస్యలూ ప్రస్తుతం లేవు. నాటోలోని అనేక దేశాలలో గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలు- ప్రస్తుత చైనా వ్యవస్ధలను పోల్చుకొని చైనాతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. చైనాతో పోటీ-విబేధాలతో వచ్చే పర్యవసానాలను అంచనావేయటంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రపంచంపై ఆమెరికా ప్రభావం తగ్గుతుండటం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తగ్గినప్పటికీ అమెరికా ఇప్పటికీ ప్రపంచ అగ్రరాజ్యమే అన్నది గమనంలో ఉంచుకోవాలి.

Image result for 2019 NATO Summit : first time mentioned china challenge
తాజాగా అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ మూడు సంవత్సరాల ట్రంప్‌ పాలన తీరు తెన్నులపై వివిధ రంగాలకు చెందిన వారితో జరిపిన ఇంటర్వ్యూలలో మారుతున్న ప్రపంచ వ్యవస్ధలో అమెరికా కీలకపాత్ర పరిమితంగా ఉన్నట్లు తేలింది. లండన్‌ నాటో సమావేశాల్లో కూడా పెరుగుతున్న చైనా,తరుగుతున్న అమెరికా ప్రభావం గురించే గుసగుసలు సాగినట్లు మీడియా పేర్కొన్నది. గతంలో సన్నిహిత అనుయాయులుగా ఉన్న ఫ్రాన్స్‌,జర్మనీ, టర్కీ,ఈజిప్టు, పాకిస్ధాన్‌,మెక్సికో వంటి దేశాలు గత మూడు సంవత్సరాలలో మరింత దూరం జరిగాయి. కొన్ని సందర్భాలలో బహిరంగంగానే దానితో విబేధించాయి. దీర్ఘకాలంగా అమెరికాతో స్నేహంగా ఉన్న అనేక దేశాలు ఇటీవలి కాలంలో తరచుగా రష్యా , చైనాలవైపు చూస్తున్నాయి. టర్కీ, పాకిస్ధాన్‌, ఫిలిప్పీన్స్‌, ఈజిప్టు అందుకు ఉదాహరణలు.
ఐరోపాలో అమెరికా పాత్ర బలహీనపడితే రష్యా ప్రభావం అనివార్యంగా పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి వరకు నాటో ఖర్చులో సింహభాగాన్ని అమెరికా భరించేది. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇతర సభ్యరాజ్యాలు పెద్ద మొత్తంలో ఖర్చులను భరించే విధంగా వత్తిడి తెచ్చారు. తామెంత కాలం భారాన్ని మోస్తామని ప్రశ్నించారు. అలాంటపుడు అమెరికాతో నిమిత్తం లేకుండా తమ వ్యూహాలను తాము రచించుకుంటామని ఐరోపా దేశాలు చెబుతున్నాయి.నాటో రక్షణ ఖర్చును భరించేందుకు సభ్యదే శాల జిడిపిలో రెండుశాతం కేటాయింపులు జరపాలని అమెరికా వత్తిడి చేస్తోంది. అంత రక్షణ కోసం ఖర్చు పెట్టేబదులు ఆ మొత్తాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తే ఫలితం ఎక్కువ అని అనేక దే శాలు భావిస్తున్నాయి. వాణిజ్య యుద్ధాల నుంచి ఇరాన్‌ అణు సమస్య వరకు ఐరోపా చూడాల్సింది చైనా వైపు మాత్రమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఉత్తర సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ గురించి చెబుతూ నాటో మెదడు చచ్చిపోతోందనటానికి సూచిక అని ఎకనమిస్టు పత్రిక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఫసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం నుంచి అమెరికా వెనక్కు తగ్గటం ద్వారా ప్రత్యామ్నాయ స్వేచ్చా వాణిజ్య ఒప్పందంతో ముందుకు పోవటానికి చైనాకు అవకాశం ఇచ్చినట్లయిందని ఐరోపా నిపుణులు భావిస్తున్నారు.
ఒకవైపు అమెరికా ప్రభావం తగ్గుతున్నట్లు భావిస్తుండగా, ఆ దేశ నాయకత్వంలో అసహనం పెరిగిపోతోంది. విమర్శలను సహించలేని స్ధితి. నాటో సమావేశాల సందర్భంగా కోపెన్‌హాగన్‌ నగరంలో జరిగే ఒక కార్యక్రమంలో అమెరికాకు చెందిన నిపుణుడు స్టాన్లీ ఆర్‌ సోలన్‌ ప్రధాన వక్తగా ప్రసంగించాల్సి ఉంది. దానిని అమెరికా, డెన్మార్క్‌లోని ఒక సంస్ధ నిర్వహిస్తోంది. అయితే డెన్మార్క్‌లోని అమెరికా రాయబారి కార్లా శాండ్స్‌ ఒక రోజు ముందుగా వర్తమానం పంపుతూ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ట్రంప్‌ విధానాలను గతంలో సోలన్‌ విమర్శించటమే దీనికి కారణంగా పేర్కొన్నారు.
ఏడు దశాబ్దాల క్రితం అంటే రెండవ ప్రపంచ యుద్దం ముగిసేనాటికి అమెరికా తిరుగులేని అగ్రరాజ్యం.1945లో ఏకైక అణు శక్తి, ఆయుధాలను, ప్రపంచ జిడిపిలో సగం వాటా కలిగి ఉంది. ఇప్పుడు అది 15శాతానికి పడిపోయింది. ఉత్తర కొరియా వంటి చిన్న దేశం కూడా నేడు అణుశక్తిని కలిగి ఉంది.నాడు దుర్భరదారిద్య్రంతో ఉన్న చైనా నేడు అమెరికాను సవాలు చేసే స్ధాయికి ఎదుగుతోంది. ఒకనాడు అమెరికా ప్రపంచీకరణ ఛాంపియన్‌గా ఉంది, నేడు దానికి విరుద్దంగా అనేక ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది, ఏక పక్షంగా వైదొలుగుతోంది. ఈ నేపధ్యంలోనే నాటో సభలో ట్రంప్‌ వ్యవహరించిన తీరును చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్రతో బొలీవియా మొరేల్స్‌ నిష్క్రమణ-బ్రెజిల్‌ లూలా జైలు నుంచి విడుదల !

16 Saturday Nov 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Bolivia’s leader Evo Morales, Evo Morales, Former Brazilian President Luiz Inácio Lula da Silva, lula da silva

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail

ఎం కోటేశ ్వరరావు
గతవారంలో గమనించదగిన రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి తప్పుడు కేసుల్లో ఇరికించిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా కుట్రలో భాగంగా బొలీవియా మిలిటరీ తిరుగుబాటు చేయటంతో అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నతరువాత మరోసారి ఎన్నికై రాజీనామా చేసి దేశం వదలి మెక్సికోలో రాజకీయ ఆశ్రయం పొందారు.
పౌరుల రక్తపు మరకలను అంటించుకోవద్దని బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ దేశ అధికారులను హెచ్చరించారు. మిలిటరీ కుట్ర కారణంగా పదవికి రాజీనామా చేసి సోమవారం నాడు మెక్సికో చేరిన మొరేల్స్‌ నూతన ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తున్న తన మద్దతుదారులకు బాసటగా ఈ ప్రకటన చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్న సెనేట్‌ డిప్యూటీ స్పీకర్‌ జీనైన్‌ ఆంజెను తాము గుర్తించటం లేదంటూ లాపాజ్‌ పట్టణంలో పెద్ద ఎత్తున మొరేల్స్‌ మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. మూలవాసీ(స్ధానిక రెడ్‌ ఇండియన్‌ తెగలు) పతాకాలను చేబూని నిరసన తెలుపుతున్న నిరసనకారులు పలు చోట్ల పోలీసులతో తలపడినట్లు వార్తలు వచ్చాయి. అంజె ప్రభుత్వాన్ని గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది.ఈ చర్యను మెక్సికో సిటీలో ఉన్న ఇవో మొరేల్స్‌ ఖండించారు. శుక్రవారం నాడు మొరేల్స్‌ అనుకూల ప్రదర్శకులపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. మొరేల్స్‌ లేకుండానే మరోసారి ఎన్నికలు జరిపేందుకు నూతన పాలకులు తెరతీసినట్లు వార్తలు వచ్చాయి. బొలీవియాలో జరిపిన సైనిక కుట్రను డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారయుతంగా సమర్ధిస్తూ ఒక ప్రకటన చేశాడు.వెనెజులా, నికరాగువాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఇదొక హెచ్చరిక అని బెదిరించాడు.
మొరేల్స్‌ దేశం నుంచి పోయేట్లు చేసిన కుట్రలో శ్వేతజాతి దురహంకారి అయిన మితవాద ప్రతిపక్ష నేత లూయీస్‌ ఫెర్నాండో కమాచో పాత్ర కూడా ఉంది. మొరేల్స్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలను అతని మద్దతుదారులు నిర్వహించారు. వ్యవసాయ, సహజవాయు వాణిజ్యవేత్త అయిన కమాచో బొలీవియా అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు చూస్తున్నాడు. ఫాసిస్టు, క్రైస్తవ సంస్దలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. స్ధానిక తెగలను ద్వేషించటం, పురోగామి శక్తులు క్రైస్తవ మతవిరోధులని ప్రచారం చేయటంలో ముందున్నాడు.

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వాను సుప్రీం కోర్టు అనుమతి మేరకు ఏడాదిన్నర తరువాత జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి అక్రమాల కేసులో 2018 నుంచి పన్నెండు సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారంటూ తీర్పును సవాలు చేస్తూ పునర్విచారణకు దరఖాస్తు చేశారు. విచారణ పూర్తయ్యేంతవరకు నిందితుడు నిర్దోషే అని చెబుతున్న 1988నాటి రాజ్యాంగ నిబంధనను అంగీకరిస్తూ సుప్రీం కోర్టు తన గత తీర్పుకు భిన్నంగా నిర్ణయించటంతో లూలాను వెంటనే విడుదల చేశారు. లూలా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన మూడు సంవత్సరాల తరువాత తానున్న ఇంటి మరమ్మతులకు ఒక కంపెనీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిస సాయానికి అక్రమంగా మరమ్మతుల రూపంలో లంచం తీసుకున్నట్లు ఒక నేరగాడితో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. అసలు ఆ ఇల్లు లూలాది కాదు, అంతకు మించి మరమ్మతులు జరిగిన దాఖలాలు కూడా లేవని తేలింది. లూలా మీద చేసిన ఆరోపణల్లో ఇదొకటి. అమెరికా ప్రమేయంతో జరిగిన కుట్రలో సరిగ్గా గత ఎన్నికలకు ముందు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు కుట్ర చేశారు. ఫలితంగా చివరి నిమిషంలో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ నూతన అభ్యర్ధిని ప్రకటించాల్సి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయినా, పార్లమెంట్‌లో మెజారిటీ స్ధానాలు, రాష్ట్రాలలో మెజారిటీని దక్కించుకుంది.

Image result for evo morales disposed in a coup,
బొలీవియా విషయానికి వస్తే అక్కడ మరో కుట్రకు తెరలేపారు. అక్టోబరు 20న జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు వీధులకు ఎక్కాయి. అమెరికా దేశాల సంస్ధ ప్రతినిధులు గనుక అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇస్తే మరోసారి ఎన్నిక జరిపేందుకు తాను సిద్దమే అని మొరేల్స్‌ ముందుకు వచ్చాడు. అమెరికా కనుసన్నలలో పని చేసే ఆ సంస్ధ అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక ఇచ్చింది. ఆ మేరకు తిరిగి ఎన్నికలు జరుపుతానని ప్రకటించాడు. అయితే పదవిని వదులుకోవాలంటూ పోలీసులు, మిలిటరీ తిరుగుబాటు చేశారు. ఈ నేపధ్యంలో ప్రాణ రక్షణకు ఆయన మెక్సికో వెళ్లి ఆశ్రయం పొందారు.
బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల వలస లేదా స్ధానికేతరుల పాలన తరువాత 2006లో తొలిసారిగా స్ధానిక గిరిజన తెగలకు చెందిన ఇవో మొరేల్స్‌ సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పేరుతో పనిచేస్తున్న పార్టీ తరఫున అధికారానికి వచ్చాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, తాను గిరిజనుడిని, కార్మిక ఉద్యమ ఉద్యమ కార్యకర్తను, కోకా పండించే రైతును కావటమే తాను చేసిన పాపం అని రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించాడు. సోమవారం జరిగిన పరిణామాల్లో అధ్యక్ష భవన రక్షణ సిబ్బంది, పోలీసులు తమ విధులను బహిష్కరించారు. దేశంలో శాంతినెలకానాలంటే మొరేల్స్‌ గద్దె దిగాల్సిందేనని మిలిటరీ అధిపతి విలియమ్స్‌ కాలిమాన్‌ డిమాండ్‌ చేశాడు.
మొరేల్స్‌ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం గత పదమూడు సంవత్సరాలలో అక్కడి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాన్ని పైకి తెచ్చింది. గ్యాస్‌, ఖనిజాల ఎగుమతుల కారణంగా జిడిపి గణనీయంగా పెరిగింది. ప్రయివేటు రంగం చేతుల్లో ఉన్న సంపదలన్నింటినీ జాతీయం చేస్తానని ప్రకటించినప్పటికీ వాటి జోలికి పోలేదు.దేశ ంలోని సహజవనరులను వెలికి తీసి దారిద్య్ర నిర్మూలన వంటి సంక్షేమ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపింది. ఇటీవలి సంవత్సరాలలో వైద్యులు, గని కార్మికుల వంటి తరగతుల సమ్మెలు, ఇతర ఆందోళనల కారణంగా గతంలో ఆయనను బలపరచిన శక్తులు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దేశంలో పేదరిక నిర్మూలన, ఇతర సంక్షేమ చర్యలను తీసుకున్నప్పటికీ అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాలలో పెద్దగా మార్పులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి.

Image result for evo morales disposed in a coup, protests
ఇవో మొరేల్స్‌కు వ్య తిరేకంగా జరిగిన కుట్రను ప్రతిఘటించాలని ఇరుగుపొరుగు సంఘాల ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. మొరేల్స్‌ అధికారంలోకి రాకముందు జరిగిన పోరాటాలలో ఈ సంస్ధ ప్రముఖపాత్ర పోషించింది. ఆత్మరక్షణ దళాలను ఏర్పాటు చేయాలని, ఎక్కడి కక్కడ ప్రతిఘటనకు పూనుకోవాలని కోరింది. ఎల్‌ ఆల్టో పట్టణంలో ఇలాంటి దళాల నాయకత్వంలో అనేక పోలీసు కార్యాలయాలను ఆక్రమించుకొని కొన్నింటిని దగ్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. 2005ఎన్నికలకు ముందు దేశంలో కార్పొరేట్‌ సంస్ధల ఆర్దిక ప్రయోజనాల రక్షణకు వాటి తరఫున పని చేసే రాజకీయ బృందాలు, సంస్ధలు ఉన్నాయి. అవి అవకాశవాద పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. అవి ప్రజల సమస్యలను పట్టించుకొనేవి కాదు. ఈ పూర్వరంగంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడిన పౌర సంస్ధలు జరిపిన పోరాటాలు వాటితో మమేకం కావటం ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయానికి బాటలు వేసింది.మొరేల్స్‌ నాయకత్వంలోని సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీ అవకాశవాద రాజకీయాలు, పొత్తులకు వ్యతిరేకంగా పని చేసింది. ఎన్నికలలో అభ్యర్ధులుగా దిగువ స్ధాయి నుంచి ఉద్యమాలలో పాల్గన్నవారే ఉండటంతో ఘనవిజయాలు సాధించారు.
అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల బొలీవియా సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఇవో మొరేల్స్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహించలేని శక్తులే తాజా కుట్రవెనుక వున్నట్లు భావిస్తున్నారు. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మొరేల్స్‌ అధికారానికి వచ్చిన కొత్తలో విదేశీ కంపెనీల చేతుల్లో వున్న గ్యాస్‌, చమురు కంపెనీలను జాతీయం చేశారు. అయితే విదేశీ కంపెనీలే ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాటిని వెలికి తీస్తున్నాయి. విద్యుత్‌ కార్లు, స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీల తయారీకి ఎంతో అవసరమైన లిథియం నిల్వలు బొలీవియాలో పుష్కలంగా ఉన్నాయి. వర్తమాన శతాబ్ది బంగారంగా ఈ ఖనిజాన్ని పరిగణిస్తున్నారు. కొద్ది సంవత్సరాలలో దీనికి డిమాండ్‌ మరింత పెరిగి కొరత ఏర్పడవచ్చని కార్పొరేట్‌ శక్తులు అంచనా వేశాయి. ప్రపంచంలో ఉన్న లిథియం నిల్వల్లో ఒక్క బలీవియాలోనే 25 నుంచి 45శాతం వరకు నిక్షిప్తమై ఉన్నట్లు అంచనా. దీన్ని ప్రభుత్వరంగంలో వెలికి తీసి వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ చర్యలను చేపట్టాలని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. జర్మన్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం వలన జనానికి పెద్దగా ప్రయోజనం చేకూరదని స్ధానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో గతవారంలో ఒప్పందాన్ని మొరేల్స్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
లాటిన్‌ అమెరికాలో సహజవనరుల దోపిడీని అరికట్టి జనానికి లబ్ది కలిగించే చర్యలు తీసుకొనే ఏ ప్రభుత్వాన్ని అమెరికా,కెనడా తదితర దేశాలు అంగీకరించటం లేదు. వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోటా పచ్చిమితవాద శక్తులు వాటికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటం వెనుక అమెరికా హస్తం ఉండటం బహిరంగ రహస్యం. బొలీవియాలో కూడా అదే జరిగింది. ధనికులు, మితవాద శక్తులు బలంగా ఉన్న శాంతా క్రజ్‌ ప్రాంతంలో ప్రతిపక్ష నేత ఫెర్నాండో కామాచో, ఇతరుల నాయకత్వంలో తాజా కుట్రకు తెరలేచింది. ఆదివారం నాడు మిలిటరీ, పోలీసు అధికారులు వారికి వంతపాడారు. మొరేల్స్‌ను గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.తొలుత కార్మికనేతగా ఎదిగిన చాపారే ప్రాంతానికి చేరుకున్న మొరేల్స్‌ అక్కడి నుంచి టీవీలో మాట్లాడుతూ నన్ను ఎన్నడూ వదలని నా జనం వద్దకు తిరిగి వచ్చాను, పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అంటూ తన రాజీనామాను ప్రకటించారు.
సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ పోలసీ రిసర్చ్‌ సంస్ద జరిపిన అధ్యయనం ప్రకారం మొరేల్స్‌ పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలన కార్యక్రమం విజయవంతమైందని తెలిపింది. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల ప్రాంతంలోని దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువగా బొలీవియా ఆర్ధిక ప్రగతి సాధించినట్లు పేర్కొన్నది. మొరేల్స్‌ అధికారానికి రాకముందు చమురు కంపెనీల నుంచి ఏటా 73.1కోట్ల డాలర్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. జాతీయం తరువాత అది 495 కోట్ల డాలర్లకు పెరిగింది.2018 నాటికి దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య 60 నుంచి 35శాతానికి తగ్గింది. దుర్భరదారిద్య్రంలో ఉన్న వారి సంఖ్య 38 నుంచి 15శాతానికి తగ్గింది. అయినప్పటికీ బలీవియా ఇప్పటికీ పేద దేశంగానే ఉంది. ఈ కారణంగా కొన్ని తరగతుల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి తలెత్తింది. దానిని సొమ్ము చేసుకొనేందుకు మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.
అక్టోబరులో జరిగిన ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక ముందే అమెరికా, లాటిన్‌ అమెరికాలోని ఇతర మితవాదశక్తుల నాయకత్వంలోని ప్రభుత్వాలు బొలీవియన్ల ఆకాంక్షలను ప్రతిబింబించని ఫలితాలను తాము గుర్తించబోమని ప్రకటించాయి. 2005కు ముందు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ప్రపంచ ఆర్ధిక సంస్ధలన్నీ మొరేల్స్‌ వ్యతిరేకులను బలపరిచాయి. సహజవనరులను జాతీయం చేయబోమని ప్రకటించిన శక్తులకు ప్రాతినిధ్యం వహించిన అధ్యక్షుడు కార్లోస్‌ మెసాకు మద్దతు ప్రకటించాయి. 2002లో ఇవో మొరేల్స్‌ అధ్యక్ష పదవికి పోటీచేసినపుడు మొరేల్స్‌ గెలిస్తే ఆర్ధిక సాయంలో కోత పెడతామని బెదిరించాయి. ఈ పూర్వరంగంలో మొరేల్స్‌కు వ్యతిరేకంగా ఎంతటి కుట్రకు తెరలేచిందో అర్దం చేసుకోవచ్చు.

Image result for evo morales disposed in a coup, protests
బొలీవియా పరిణామాల నేపధ్యంలో రాయిటర్స్‌ వార్తాసంస్ధ వెలువరించిన ఒక కథనాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది.బొలీవియా మాదిరి పరిణామాలు వెనెజులాలో పునరావృతం కావటానికి అక్కడి మిలిటరీ అడ్డుగా ఉందనే శీర్షికతో ఒక కథనాన్ని అందించింది. ఇవో మొరేల్స్‌ మాదిరి వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో రాజీనామా చేసేందుకు అక్కడి ప్రతిపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారని, అయితే ఒక కీలకాంశం దాన్ని కష్టతరం గావిస్తున్నదని ఆదివారనాడు బొలీవియా నిరసనకారుల పక్షాన మిలిటరీ చేరిన మాదిరి వెనెజులా మిలిటరీ వ్యవహరించటం లేదని పేర్కొన్నది. దేశంలో ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతున్నప్పటికీ 2014,17లో పెద్ద ఎత్తున నిరసన తలెత్తినా, 2018 ఎన్నికల్లో అక్కడి సోషలిస్టు పార్టీకి మిలటరీ మద్దతు ఇచ్చిందని రాయిటర్‌ పేర్కొన్నది.ఈ ఏడాది ఏప్రిల్‌ 30న అనేక మ ంది మిలిటరీ అధికారులు తిరుగుబాటు నేత గురుడోకు మద్దతు ఇచ్చారని అయితే ఉన్నతాధికారులు మదురోకు మద్దతు ఇవ్వటంతో తిరుగుబాటు విఫలమైందని తెలిపింది. వెనెజులా మిలిటరీలో తన వామపక్ష సైద్ధాంతిక భావజాలాన్ని మాజీ అధ్యక్షుడు ఛావెజ్‌ ఎక్కించారని బలీవియా మిలిటరీలో అలాంటి పరిస్ధితి లేదన్న ఒక ప్రొఫెసర్‌ అభిప్రాయాన్ని అది ఉటంకించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత – ఎవరు దేశ భక్తులు !

03 Sunday Nov 2019

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

BJP on RCEP, CPI(M) on RCEP, RCEP, RCEP INDIA, RCEP Narendra Modi, Regional Comprehensive Economic Partnership (RCEP)

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది.ఆయన అక్కడకు చేరుకొని ఎర్రతివాచీ స్వాగతం పొందారు. రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఆసియన్‌ దేశాల శిఖరాగ్ర సభ, ఆర్‌సిఇపి శిఖరాగ్ర సమావేశం జరగనున్నాయి. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.
పారదర్శకత గురించి కొందరు ఎంత ఎక్కువగా చెబుతారో అంత ఎక్కువగా తెరవెనుక పనులు చేస్తారనేది అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వారు చేసేది చెప్పరు-చెప్పింది చేయరు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని బిజెపి ఎన్నడూ చెప్పకుండా ఆ పని చేయటం అందుకు నిదర్శనం. ఆర్‌సిఇపి ఒప్పందం విషయంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ అదే పని చేస్తోందా ? 2017లో మోడీ ఏర్పాటు చేసిన నీతి అయోగ్‌ పత్రం కూడా ఒప్పందం మీద హెచ్చరికలు చేసింది. వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అలాంటి దాని గురించి పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపలేదు. నిజానికి ఈ ఒప్పందంలోని అంశాలు పెద్ద నోట్ల రద్దు వంటి రహస్యమైనవేమీ కాదు.ఏ ఏ అంశాలను అంగీకరిస్తే ఎలా నష్టం జరుగనుందో ఇప్పటికే చర్చ జరిగింది. ఏఏ వస్తువుల మీద మన దేశం పన్నులను ఎంతమేరకు తగ్గిస్తుంది, వేటిని మినహాయిస్తుంది అనేది వెల్లడి కావాల్సి ఉంది. వీటిి మీద ప్రభుత్వం తన వైఖరిని చెప్పలేదు, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. ఒప్పందాన్ని మన దేశం అంగీకరించరాదని కోరుతూ 250 రైతు సంఘాలతో కూడిన ఐక్యవేదిక ఆందోళనకు పిలుపు నిచ్చింది. సోమవారం నాడు ప్రదర్శనలు జరగనున్నాయి. సిపిఎం దీనికి మద్దతు ప్రకటించింది. సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేసింది. ఆరెస్సస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అయినా ఏ అంశాలను కేంద్రం అంగీకరించిందో, వేటిని వ్యతిరేకించిందో జనానికి ఇంతవరకు తెలియదు. అంగీకరించిన వాటితో ఎలా లబ్ది చేకూరనుందో, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమి చేయనుందో జనానికి చెప్పాలా లేదా ?

Image result for rcep
పదహారు దేశాలు, 360కోట్ల జనాభా వున్న ప్రాంతాలతో కూడిన ఈ ఒప్పందం ప్రపంచంలో అతి పెద్ద స్వేచ్చావాణిజ్య అవగాహనగా చరిత్రకెక్కనుంది.2012లో ప్రారంభమైన ఈ చర్చలు భారత్‌ సంతకం చేస్తే సోమవారం నాటితో మరో అధ్యాయానికి నాంది పలుకుతాయి. మన దేశానికి సంబంధించి రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఈ ఒప్పందం గురించి కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకపోవటం రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను బాహాటంగా ఉల్లంఘించటంతప్ప మరేమీ కాదని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. ఒప్పందంపై సంతకం చేయటానికి బదులు దాన్ని బహిర్గత పరచాలని, రైతులతో సంప్రదింపులు జరపాలని రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది.ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కేరళ తోటల రైతాంగం అందరికంటే ఎక్కువగా నష్టపోనుంది. ఈ కారణంగానే అక్కడి ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ వ్యతిరేకత తెలిపింది. ఇప్పటికే వియత్నాం నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న మిరియాల కారణంగా వాటి ధరలు దారుణంగా పడిపోయాయి. కొబ్బరి, రబ్బరు, పామ్‌ ఆయిల్‌, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర పంటలకు తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. ఇప్పటి వరకు అనేక దేశాలు చివరికి ఐరోపా యూనియన్‌-అమెరికా మధ్య స్వేచ్చావాణిజ్య ఒప్పందాల నుంచి కూడా వ్యవసాయాన్ని మినహాయించారు.

Image result for rcep
దేశీయ ఉత్పత్తిదారుల సామర్ధ్యాలను పెంచకుండా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తే ప్రతికూల ప్రభావాలు పడతాని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బిఐ) పరిశోధన నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.2018-19లో ఆర్‌సిఇపిలోని పదకొండు దేశాలతో మనకు వాణిజ్య లోటు 107.28 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇతర దేశాలతో కూడా కలిపి చూస్తే మొత్తంగా మన వాణిజ్య లోటు 184బిలియన్‌ డాలర్లు. ఆర్‌సిఇపి దేశాలకు మన ఎగుమతులు 21శాతం జరగ్గా మన దిగుమతులు ఈ దేశాల నుంచి 34శాతం వున్నాయి. మన వాణిజ్యం వ్యవసాయం, సంబంధిత ఉత్పత్తులు, దుస్తులు, ఆభరణాల వంటి వాటిలో మాత్రమే మిగులు ఉంది. మొత్తం వాణిజ్యంతో పోలిస్తే అది నామమాత్రమే. ఈ ఒప్పందంలో మన దేశం భాగస్వామి అయితే ఈ మిగులు కూడా హరించుకుపోయి లోటు ఇంకా పెరుగుతుందని ఎస్‌బిఐ నివేదిక చెప్పింది.
సంప్రదింపుల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మనం పాల ఉత్పత్తుల దిగుమతుల మీద పన్నులు తగ్గిస్తే అది మరింత నష్టదాయకమని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను మనం ఉపయోగించుకోవటం 25శాతానికి లోపుగానే ఉందని కూడా పేర్కొన్నది. అయితే ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా మన దేశానికి నష్టమే అని ఎగుమతులు కష్టమౌతాయని కూడా తెలిపింది.
ఆర్ధికవేత్త సూర్జిత్‌ ఎస్‌ భల్లా నాయకత్వంలోని హైలెవెల్‌ అడ్వయిజరీ గ్రూప్‌(హెచ్‌ఎల్‌ఏజి) బృందం ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకాలు చేయాలని సూచించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి నిరంతరం తెలియ చేస్తూ వాటిని ఉపయోగించుకోవాలని కోరింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ కోరిక మేర తన సిఫార్సులు, ఇతర అంశాల గురించి ఈనివేదికను రూపొందించారు. అయితే ఇది అందచేసే సమయానికే మన అధికారులు, మంత్రులు బ్యాంకాక్‌ తరలివెళ్లారు. ఒప్పందం మీద సంతకాలకు ఒక సాకుగా దీన్ని ఉపయోగించుకోనున్నట్లు కనిపిస్తోంది.
1991లో ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల కారణంగా మన వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం లక్షలాది మంది రైతుల బలవన్మరణాలకు కారణాలలో ప్రధానమైనది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో తలెత్తిన సమస్యలు ఇంకా అపరిషతృంగానే ఉన్నాయి. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ యోజన పేరుతో ఏటా ఆరువేల రూపాయల నగదు సాయాన్ని అందచేస్తున్నది. ఇదేమీ శాశ్వత పధకం కాదు. ఆర్‌సిఇపి ఒప్పందం అమలులోకి వస్తే మన వ్యవసాయ రంగ సంక్షోభం మరింత తీవ్రం కావటం అనివార్యం.అది గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తిని మరింత తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ఈ ఒప్పందానికి తెరలేపింది కాంగ్రెస్‌ అయితే బిజెపి తెర దించనుంది. రెండు పార్టీలూ దీన్నుంచి రాజకీయ లబ్దిపొందేందుకు చూస్తున్నాయి. అధికారంలో ఉండగా ఒప్పందానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. నవంబరు ఐదు నుంచి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చింది. అప్పుడేం చేశారని బిజెపి ఎద్దేవా చేస్తోంది తప్ప తన వైఖరి ఏమిటో చెప్పదు. ప్రతిపక్షంలో ఉండగా, ఇప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ ఈ ఒప్పందానికి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది తప్ప బిజెపిని ఒప్పించలేకపోయింది. ఈ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకించటం లేదమ్మా అంటూ బిజెపి నేతలు ఇతరుల మీద నెపాన్ని నెడుతున్నారు. మరీ ఎక్కువ లొంగిపోవద్దబ్బా అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద అసలు విషయం చెప్పకుండా గత నెల రోజులుగా కేంద్ర పాలకులు, అధికారపక్షం మీడియాకు లీకులతో కాలం గడిపింది.
ఇక మిగతా దేశాల విషయానికి వస్తే ఒక వేళ భారత్‌ సంతకం చేయకున్నా మనం ముందుకు పోవాల్సిందే అని మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ జూన్‌లోనే వ్యాఖ్యానించాడు. గణనీయంగా దిగుమతి పన్నులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఇండోనేషియా, మలేషియాల నుంచి వస్తున్న పామాయిల్‌ మన దుకాణాల్లో నిండిపోతోంది. ఈ ఒప్పందంలో చేరితే పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించవచ్చు, వ్యాపారులకు లాభాల పంట పండవచ్చుగానీ మన రైతాంగ పరిస్ధితి, మన దేశం నుంచి తరలిపోయే డబ్బు సంగతేమిటి? న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియాల నుంచి వచ్చే పాల ఉత్పత్తులతో పాల రైతాంగ పరిస్ధితి అగమ్యగోచరం. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పంట, ఉత్పత్తుల రైతాంగం ప్రభావితం అవుతారు. బిజెపి చెప్పే గోమాత పవిత్రత సంగతి ఎలా ఉన్నా ఆవుపాలతో రాజస్ధాన్‌లో ఇంకా అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి. పది కోట్ల మంది రైతులకు పాల రాబడి ఒక వనరుగా ఉన్నట్లు అంచనా.
ఇప్పుడు నరేంద్రమోడీకి మరో పెద్ద సమస్య వచ్చింది. ఆయన అంతర్జాతీయ నాయకుడని, అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నారని, పెద్ద ఆర్ధిక నిపుణుడన్నట్లుగా ఇంతకాలం ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహించే దేశాల ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆయన ప్రతిష్టకు దెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నవారు లేకపోలేదు. చేస్తే దేశీయంగా రైతాంగం, ఇతర తరగతుల ప్రజానీకం నుంచి వేరుపడిపోతే అసలుకే మోసం వస్తుంది అన్నది చెప్పుకోలేని సంశయం. ఒప్పందం మీద సంతకం చేస్తే చైనా, ఇతర దేశాల నుంచి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులే కాదు, అన్ని రకాల వస్తువులు వెల్లువలా మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. పోనీ ఈ ఒప్పందానికి దూరంగా అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో చేతులు కలిపితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని చూస్తే అవన్నీ కూడా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌- మాయింటి కొస్తే మాకేం తెస్తావ్‌ అనే రకాలు తప్ప మనకు సాయపడేవి కాదు. ఎగుమతి ఆధారిత అభివృద్ధి అనే ఒక దివాలా కోరు ఆర్ధిక విధానాన్ని అనుసరిస్తున్న (మేకిన్‌ ఇండియా అంటే అదే) మోడీ సర్కార్‌ ఈ ఒప్పందంలో చేరకపోతే మన ఎగుమతులు ఇంకా పడిపోయేందుకు దోహదం చేసినట్లు అవుతుంది. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధను రూపొందిస్తా అని చెప్పిన గొప్పల గురించి జనం అడిగితే పరిస్ధితి ఏమిటి అనే మనో వ్యాధి పట్టుకుంది. ఒప్పందంలో చేరక ముందే మన ఆర్ధిక వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. ఇక విదేశాల నుంచి వస్తు దిగుమతులు మరింత పెరిగితే మన పరిశ్రమలు, వ్యవసాయం మూతపడుతుంది. ఇప్పటికే 8.5శాతానికి చేరిన నిరుద్యోగం మరింత పెరుగుతుంది.

Image result for bjp cpim
ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా చేయాల్సింది చేశాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఆర్‌సిఇపిలో చైనాదే ప్రధాన పాత్ర. చైనా వస్తువులను బహిష్కరించండి అంటూ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది వారే. కనీసం చైనా నుంచి వచ్చే సగం వస్తువులనైనా అడ్డుకోవాలన్నది కొందరి వత్తిడి.అలాంటి చైనాతో కలసి ఒప్పందం చేసుకోవటం ఏమిటన్నది వారికి మింగుడుపడటం లేదు. ఈ విషయంలో నరేంద్రమోడీ తక్కువేమీ తినలేదు. వాణిజ్య, పారిశ్రామికవేత్తల వత్తిడికి లంగి తన కుర్చీని కాపాడుకొనేందుకు చైనాతో సయోధ్యకు ముందుకు పోక తప్పని స్ధితి.మన దేశంలోని కమ్యూనిస్టులు చైనా అనుకూలురనే ప్రచారం చేస్తున్నది కూడా కాషాయ దళాలే అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేస్తున్నారు. బిజెపి దేశభక్తి, స్వదేశీ అనుమానంలో పడింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లాటిన్‌ అమెరికాలో నయా ఉదారవాద విధానాలు-పర్యవసానాలు !

30 Wednesday Oct 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Argentina elections, Bolivarian Revolution, Latin America, Lenín Moreno, neoliberalism, Neoliberalism in Latin America

Image result for chilean protests

ఎం కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాలో ఒక వైపున ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాలు, మరోవైపున కొన్ని దేశాల్లో ఎన్నికలతో అక్కడి పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. చిలీ, ఉరుగ్వే,హైతీ, బొలీవియాలో ఆందోళనలు జరిగాయి. అర్జెంటీనా, బొలీవియా, ఈక్వెడోర్‌లో సాధారణ, కొలంబియాలో స్ధానిక సంస్దల ఎన్నికలు ముగిశాయి. చిలీ పాలకులు ఒక అడుగు దిగినా అక్కడి ఉద్యమం ఆగలేదు. ఉరుగ్వేలో ప్రభుత్వం రద్దు చేసిన సబ్సిడీలను, పెంచిన భారాలను వెనక్కు తీసుకుంటూ ఉద్యమకారులతో ఒక ఒప్పందం చేసుకోవటంతో తాత్కాలికంగా ఆందోళనలు ఆగాయి. స్థలాభావం రీత్యా ఉద్యమాలకు సంబంధించి మరో సందర్భంలో చర్చించుదాం. నాలుగు దేశాల్లో జరిగిన ఎన్నికల ప్రాధాన్యతను చూద్దాం.
నాలుగు సంవత్సరాల క్రితం మితవాద శక్తులు విజయం సాధించిన అర్జెంటీనాలో అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రజాతంత్ర లేదా వామపక్ష శక్తులు తిరిగి ఈ గద్దెనెక్కాయి. బొలీవియాలో వామపక్ష ఇవో మోరెల్స్‌ మరోసారి అధికారానికి వచ్చారు. ఉరుగ్వేలో అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ మెజారిటీకి అవసరమైన 50శాతం ఓట్లను సాధించలేదు, పెద్ద పార్టీగా అవతరించి వచ్చే నెలలో జరిగే అంతిమ పోటీకి సిద్దం అవుతోంది. కొలంబియాలో కొలంబియా విప్లవ సాయుధ శక్తులు(ఎఫ్‌వామపక్ష సాయుధ సంస్ధ (ఎఫ్‌ఏఆర్‌సి)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తరువాత జరిగిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని బగోటాతో సహా అనేక ప్రధాన పట్టణాలు, ప్రాంతాలలో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. కొన్ని దేశాలలో తలెత్తిన ఉద్యమాలు, కొన్ని దేశాలలో జరిగిన ఎన్నికలలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల విజయాల వెనుక ఉన్న అంశాలేమిటి, వాటిని ఎలా చూడాలన్నది ఒక ప్రశ్న.
అర్జెంటీనా ఎన్నికల ఫలితం వామపక్ష జనాకర్షకం వైపు మొగ్గుదలకు సూచిక అని ఒక విశ్లేషణ శీర్షిక. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అర్జెంటీనాలో సామాజిక న్యాయం కోరే న్యాయ పార్టీ పేరుతో ముందుకు వచ్చిన శక్తులు పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజాలకు భిన్నంగా తృతీయ మార్గం అనుసరిస్తామని చెప్పుకున్నాయి. ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఆ పార్టీకి చెందిన జువాన్‌ డోమింగో పెరోన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై ఒక వరవడికి నాంది పలకటంతో ఆ పార్టీని పెరోనిస్టు పార్టీ అని కూడా అంటారు. సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రత్యర్ధి పార్టీలు పెరోనిస్టులను నిరంకుశులని కూడా విమర్శిస్తారు. పెరోనిస్టు పార్టీ విధానాలతో విబేధించిన వారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడివడి వేరే పార్టీని ఏర్పాటు చేసిన మావోయిస్టులు ఈ ఎన్నికలలో విజయం సాధించిన పెరోనిస్టు పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. మొత్తంగా చూస్తే అర్జెంటీనాలో కమ్యూనిస్టుల బలం పరిమితం.

Image result for argentina new president
తాజా ఎన్నికల విషయానికి వస్తే 2015లో అధికారం కోల్పోయిన పెరోనిస్టు పార్టీ తిరిగి విజయం సాధించింది. గతంలో ఆ పార్టీలో తెరవెనుక ప్రముఖ పాత్ర వహించిన ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రస్తుత అధ్యక్షుడు మార్సియో మక్రీని తొలి దశ ఎన్నికల్లోనే ఓడించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నలభైశాతం ఓట్లు తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉన్న అభ్యర్ధికి రెండో స్ధానంలో వున్న వారికి పదిశాతం ఓట్ల తేడా ఉండాలి లేదా పోలైన ఓట్లలో 45శాతం తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉంటే ఎన్నికైనట్లు పరిగణిస్తారు. ప్రస్తుతం ఫెర్నాండెజ్‌ 48శాతం ఓట్లు సాధించి తొలి దశలోనే ఎన్నికయ్యారు. పెరోనిస్టు పార్టీకి చెందిన మాజీ దేశాధ్యక్షురాలు క్రిస్టినా కిర్చెనర్‌ వైఖరితో విబేధించి పార్టీకి దూరంగా ఉన్న ఫెర్నాండెజ్‌తో సర్దుబాటు చేసుకొని అధ్యక్ష అభ్యర్ధిగా, ఆమె ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఫెర్నాండెజ్‌ అధ్యక్షుడే అయినా అసలు సారధి క్రిస్టినా అనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. గత అనుభవాల రీత్యా ఫెర్నాండెజ్‌ తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తారని కూడా మరో అభిప్రాయం వెల్లడైంది.
లాటిన్‌ అమెరికా రాజకీయాల్లో నేడున్న పరిస్ధితుల్లో ఫెర్నాండెజ్‌ ఎన్నిక ప్రజాతంత్ర, పురోగామి శక్తులకు ఊపునిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. వెనెజులాలో వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న కుట్రలకు ఓడిపోయిన మార్సియో మక్రీ మద్దతు ఇచ్చాడు. తిరుగుబాటుదారు జువాన్‌ గురుడోను అధ్యక్షుడిగా గుర్తించిన వారిలో ఒకడు. ఇప్పుడు మదురో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఆర్ధికంగా ఉన్న ఇబ్బందులు, ఐఎంఎఫ్‌తో సంబంధాల కారణంగా అమెరికా వత్తిడికి తలొగ్గితే అనే సందేహం ఉండనే వుంటుంది. గతంలో అధికారంలో ఉన్న పెరోనిస్టు పార్టీ, మక్రీ సర్కారు కూడా సంక్షేమ చర్యల విషయంలో తప్పితే మొత్తంగా నయావుదారవాద విధానాలనే అనుసరించారు. అందువల్లనే గతంలో పెరోనిస్టు క్రిస్టినా సర్కార్‌ మీద జనంలో అసంతృప్తి తలెత్తింది. మక్రీ అనుసరించిన విధానాల కారణంగా జనజీవనం మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం 50శాతం, అభివృద్ధి సూచనలు కనుచూపు మేరలో కనపడటం లేదు, ఉపాధి తగ్గింది, దారిద్య్రం పెరిగింది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్‌, ఇతర సంస్ధలతో వందబిలియన్‌ డాలర్లకోసం గత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. దాన్ని తీసుకుంటే చిలీ, ఉరుగ్వే మాదిరి సంక్షేమ చర్యలు, సబ్సిడీలకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.
బొలీవియాలో అక్టోబరు 20న జరిగిన ఎన్నికల్లో ‘సోషలిజం దిశగా ఉద్యమం’ (మువ్‌మెంట్‌ టువార్డ్స్‌ సోషలిజం-మాస్‌) పార్టీ నేత ఇవో మొరేల్స్‌ మరోసారి ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ అనేక దేశాలు ఆ ఎన్నికను ఇంకా గుర్తించలేదు. అక్రమాలపై విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. అమెరికా దేశాల సంస్ధ అలాంటి విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మరోసారి ఎన్నికలు జరపటానికి తాను సిద్ధమే అని మొరేల్స్‌ ప్రకటించారు. ఆదివాసీలు మెజారిటీగా ఉన్న బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆ సామాజిక తరగతులకు చెందిన మొరేల్స్‌ దేశాధ్యక్షుడయ్యారు.ఒక ఉద్యమకారుడిగా ఉన్న సమయంలో పాలకపార్టీ, మాదక ద్రవ్యాల మాఫియా గూండాలు ఆయనమీద దాడి చేసి మరణించాడనుకొని వదలి వెళ్లారు. బతికి బయటపడి అనేక ఉద్యమాల తరువాత 2006లో అధికారానికి వచ్చారు. రాజ్యాంగంలో అనేక మార్పులు చేసి సామాన్య జనానికి సాధికారత కలిగించటంతో పాటు దారిద్య్ర నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. తొలి నుంచి ఆయనను అధికారం నుంచి తొలగించేందుకు అమెరికాతో చేతులు కలిపిన శక్తులను ఎదుర్కొని నిలిచారు. మొరేల్స్‌ గెలిస్తే తాము ఆ ఎన్నికను గుర్తించబోమని ప్రతిపక్షాలు ముందే ప్రకటించాయి. దానికి అనుగుణ్యంగానే విచారణ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి.

Image result for claudia lopez
కొలంబియా స్ధానిక సంస్ధల ఎన్నికల విషయానికి వస్తే దేశాధ్యక్ష పదవి తరువాత ప్రాధాన్యత కలిగిన రాజధాని బగోటా మేయర్‌గా వామపక్ష వాది క్లాడియా లోపెజ్‌ను ఎన్నుకున్నారు. ఆ నగర తొలి మహిళా మేయర్‌గా కూడా ఆమె చరిత్రకెక్కారు. మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది అయిన అల్వారో యురిబి ఒక ట్వీట్‌లో స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమ ఓటమిని అంగీకరిస్తూ మధ్యే, వామపక్ష వాదుల వైపు ఓటర్లు మొగ్గు చూపారని వ్యాఖ్యానించాడు. అవినీతి వ్యతిరేక ఆందోళనకారిణిగా పేరున్న లోపెజ్‌ ఒక జర్నలిస్టు. పారామిలిటరీ దళాల రాజకీయ జోక్యం గురించి పరిశోధనాత్మక కధనాలు వెల్లడించినందుకు ఆమెను చంపివేస్తామనే బెదిరింపులు రావటంతో 2013లో కొలంబియా వదలి విదేశాల్లో తలదాచుకున్నారు.2016లో ఎఫ్‌ఏఆర్‌సితో ఒప్పందం కుదిరిన తరువాత స్వదేశం వచ్చి రాజకీయ కార్యాకలాపాల్లో పాల్గొని 2018లో ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఉరుగ్వేలో 2005 నుంచి అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ పెద్ద పార్టీగా అధ్యక్ష ఎన్నికలలో ముందుకు వచ్చినప్పటికీ అవసరమైన సంఖ్యలో ఓట్లను తెచ్చుకోలేకపోయింది. సగానికి పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉండగా పార్టీ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 40.7శాతం వచ్చాయి. దీంతో నవంబరు 24న ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ జరగనుంది. మితవాద నేషనల్‌ పార్టీకి చెందిన లాకలే పౌ 29.7శాతం తెచ్చుకున్నాడు, మూడు, నాలుగు స్ధానాల్లో 12.8, 11.3శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్న మితవాద పార్టీలు లాకలేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఆ ఓటింగ్‌లో ఎలాంటి మార్పు లేనట్లయితే బ్రాడ్‌ఫ్రంట్‌ గెలిచే అవకాశం వుండదని విశ్లేషణలు వెలువడ్డాయి.2014 ఎన్నికల్లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు తొలి దశలో 49.45శాతం వచ్చాయి. తుది ఎన్నికల్లో 56శాతం తెచ్చుకుంది. ఈ సారి తొలి దశలో ఓట్లు గణనీయంగా తగ్గినందున అంతిమ ఫలితం గురించి ఉత్కంఠనెలకొన్నది.
నేషనల్‌, కొలరాడో మితవాద పార్టీల కూటమి 1830 నుంచి తిరుగులేని అధికారాన్ని చలాయించింది. 2005లో బ్రాడ్‌ఫ్రంట్‌ దానికి తెరదించింది. అయితే ఈ ఎన్నికల్లో శాంతి భద్రతలు, పౌరులకు భద్రత అంశాలతో పాటు ఎదుగూ బొదుగూ లేని ఆర్ధిక స్ధితి, ఏడున్నరశాతం ద్రవ్యోల్బణం, తొమ్మిదిశాతం నిరుద్యోగం కారణంగా బ్రాడ్‌ ఫ్రంట్‌ మద్దతు కొంత మేరకు దెబ్బతిన్నట్లు ఓట్ల వివరాలు వెల్లడించాయి. అయితే ఓటర్లు తిరిగి మితవాద శక్తులకు అధికారాన్ని అప్పగిస్తారా అన్నది చూడాల్సి వుంది.

Image result for neoliberalism and its consequences in latin america
లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో ప్రజా ఉద్యమాలు తలెత్తటానికి, కొన్ని చోట్ల వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగలటానికి, తిరిగి ఓటర్ల మద్దతు పొందటానికి ఆయా దేశాలలో అనుసరిస్తున్న నయా ఆర్ధిక విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్‌ అమెరికాలో దాదాపు అన్ని దేశాలలో వాటిని అమలు జరిపేందుకు గతంలో నియంతలను పాలకవర్గాలు ఆశ్రయించాయి. చిలీ వంటి చోట్ల వాటిని వ్యతిరేకించినందుకు కమ్యూనిస్టు అయిన సాల్వెడార్‌ అలెండీ వంటి వారిని హతమార్చేందుకు కూడా వెనుదీయలేదు. ప్రజాస్వామ్య ఖూనీ, సంక్షేమ చర్యలకు కోత, ప్రజల మీద భారాలు మోపటం, ఆర్ధిక వ్యవస్ధలను దివాలా తీయించిన పూర్వరంగంలో అక్కడ వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు నిర్వహించిన నిరంతర పోరాటాల కారణంగా జనం మద్దతు పొంది ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక దేశాలలో అధికారానికి వచ్చాయి. అయితే నయా వుదారవాద విధానాల పునాదులను పెకలించకుండా ఉన్నంతలో జనానికి మేలు చేకూర్చేందుకు ఆ ప్రభుత్వాలు పని చేసి వరుస విజయాలు సాధించాయి. అయితే పెట్టుబడిదారీ వ్యవస్ధలో వాటికి వున్న పరిమితుల కారణంగా జనంలో కొంతకాలానికి అసంతృప్తి తలెత్తటం, కొన్ని చోట్ల అవినీతి కారణంగా బ్రెజిల్‌, అర్జెంటీనా వంటి చోట్ల ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే అర్జెంటీనాలో ప్రత్యామ్నాయంగా వచ్చిన పాలకుల తీరు మరింతగా దిగజారటంతో తిరిగి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు పట్టం కట్టారు. ఈక్వెడోర్‌లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా 2007-17 అధ్యక్షుడిగా అనేక సంక్షేమ చర్యలు చేపట్టారు. అంతకుముందు పాలకులు చేసిన అప్పులతో తమకు సంబంధం లేదని ప్రకటించటమే కాదు, అంతర్జాతీయ కోర్టులలో వాదించి 60శాతం మేరకు అప్పును రద్దు చేయించారు.దారిద్రాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే 2017ఎన్నికలో వామపక్ష అభ్యర్ధిగా విజయం సాధించి లెనిన్‌ మొరెనో వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి దేశీయంగా, అంతర్జాతీయంగా నయావుదారవాద విధానాలు, రాజకీయ వైఖరులను అనుసరించి ప్రజాగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తప్పుడు కేసులతో రాఫెల్‌ కొరియాను అరెస్టు చేయించేందుకు ప్రయత్నించాడు. ప్రజల మీద భారాలు మోపేందుకు పూనుకోవటంతో తాజాగా అక్కడ ప్రజాందోళనలు తలెత్తాయి. విధిలేని స్ధితిలో తలగ్గాల్సి వచ్చింది. అందువలన లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు వర్గపోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయి, రాజీలేని విధానాలతో పాటు నయా వుదారవాద విధానాల బాటను వీడాల్సిన అవసరాన్ని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదంతో మరింత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వుంటుంది. దాన్ని ఎదుర్కొవటం తప్ప మరొక దగ్గరి దారి లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిరియాలో కొత్త పరిణామం – టర్కీ తాత్కాలిక కాల్పుల విరమణ !

20 Sunday Oct 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Syrian Kurds, Turkish military intervention in Syria, US support Turkey

Image result for turkey military offensive in syria
ఎం కోటేశ్వరరావు
రాజీ లేదా మారణహౌమం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే పౌరులే తమకు ముఖ్యమని, అందుకే సిరియా అధ్యక్షుడు అసాద్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో ఒక అవగాహనకు వచ్చినట్లు సిరియన్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌(ఎస్‌డిఎఫ్‌) ప్రధాన కమాండర్‌ మజులుమ్‌ అబ్దీ చెప్పారు. కొద్ది రోజులుగా టర్కీ దళాలు సిరియాలోని కర్దుల ఆధీనంలోని ప్రాంతాలపై దాడులు జరుపుతున్న పూర్వరంగంలో తాజా పరిణామం చేసుకుంది. ఒక వైపు టర్కీ దాడులు కొనసాగిస్తుండగా సిరియా-టర్కీ సరిహద్దుల్లో వుగ్రవాదులకు వ్యతిరేక పోరు పేరుతో దించిన తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది జరగ్గానే సిరియా అధ్యక్షుడితో ఎస్‌డిఎఫ్‌ ఒక అవగాహనకు వచ్చింది. వెంటనే సిరియా దళాలు ఆ ప్రాంతానికి తరలి వెళ్లి టర్కీ దాడులను అడ్డుకునేందుకు సిద్దం అయ్యాయి. ఈ పరిణామంతో యావత్‌ సిరియా ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్లు అయిందని, రష్యా, ఇరాన్‌ ఆ ప్రాంతంపై పై చేయి సాధించినట్లే అనే అభిప్రాయాలు వెల్లడి అవుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాల్లో ఇది మరొక మలుపు.
టర్కీ ప్రారంభించిన దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని ఒక ఒప్పందం కుదిరింది. ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని ప్రకటించారు. అయితే ఇది సమగ్రమైనది కాదని తేలిపోయింది. అమెరికా దీన్ని ముందుకు తెచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు పెనెస్‌ ప్రకటించినదాని ప్రకారం సిరియాలోని కర్దు ప్రాంతాలపై ఐదు రోజుల పాటు టర్కీ దాడులను నిలిపివేస్తుంది. అమెరికా తన వంతుగా ఆప్రాంతంలో ఉన్న కర్దు దళాలను అక్కడి నుంచి ఉపసంహరించే విధంగా అమెరికా పని చేస్తుంది. తమ దళాలు తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తాయి తప్ప శాశ్వతంగా కాదని మజులుమ్‌ అబ్దీ చెప్పారు. టర్కీ-సిరియా సరిహద్దులో 30కిలో మీటర్ల మేర ప్రాంతంలో వున్న తమ దళాలు కొన్ని చోట్ల నుంచి మాత్రమే వెనక్కు పోతాయి తప్ప పూర్తిగా కాదని స్పష్టం చేశారు. తమ దళాలు వెనక్కు వచ్చేందుకు ఒక నడవాను ఏర్పాటు చేయమని అడిగారని, ఇదే సమయంలో టర్కీ దళాలు అందుకు పూనుకోలేదని అన్నారు. మంగళవారం నాటికి కర్దు దళాల ఉపసంహరణ జరగనట్లయితే తిరిగి దాడులను ప్రారంభిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రకటించాడు.
సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలన్న అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌(పార్లమెంట్‌ దిగువ సభ) 354-60 ఓట్లతో తిరస్కరించింది. ఐఎస్‌ తీవ్రవాదుల మీద పోరులో అమెరికాకు కీలక మిత్రులుగా ఉన్న కర్దిష్‌ యోధుల పట్ల అనుచితంగా ప్రవర్తించటమే అని సిఐఏ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డేవిడ్‌ పెట్రాస్‌ వ్యాఖ్యానించాడు. తమకు పర్వతాలు తప్ప ఇతర మిత్రులు ఎవరూ లేరని కర్దులు ఎప్పుడూ చెబుతూ ఉంటారని అయితే అమెరికన్లు వారికి మిత్రులే అని ట్రంప్‌ చర్య విద్రోహం తప్ప వేరు కాదని అన్నారు. ఐఎస్‌పై పోరులో పదివేల మంది కర్దులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇప్పటి వరకు సిరియాలోని అమెరికా దళాలు ఐఎస్‌ వ్యతిరేక పోరులో ముందు పీఠీన లేవని పోరాడుతున్న వారికి సాయం చేసే పాత్ర పోషించాయని చెప్పారు.
అమెరికా దళాలు అర్ధంతరంగా ఖాళీ చేసిన సైనిక కేంద్రాన్ని రష్యన్‌ సేనలు స్వాధీనం చేసుకున్నాయని, అక్కడ చూస్తే అమెరికన్లు వదలి వెళ్లిన సగం సగం ఆహార పదార్దాలతో వున్న ప్లేటు బల్లలపై కనిపించాయని ఒక టీవీ పేర్కొన్నది. రష్యన్లు ఐఎస్‌ తీవ్రవాదుల పట్ల చాలా కఠినంగా ఉంటారని, ఇతర చోట్ల మాదిరే సిరియాలో కూడా వారిని చంపివేస్తారని డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌లో వ్యాఖ్యానించాడు.
పశ్చిమాసియాలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఎవరు ఎవరికి ఎప్పుడు మిత్రులుగా మారతారో, శత్రువులుగా తయారవుతారో తెలియని స్ధితి. ఈ ప్రాంతంలోని దేశాలు, అక్కడ వున్న సహజ సంపదలను కొల్లగొట్టటంతో పాటు మిలిటరీ రీత్యా పట్టుసాధించేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానాలు మారణహౌమాన్ని సృష్టిస్తూ శాంతిని లేకుండా చేస్తున్నాయి. తన లక్ష్యాల సాధనకు కర్దిస్ధాన్‌ ఏర్పాటుకు తోడ్పడతామని ఆశ చూపుతూ ఆ ప్రాంతంలోని కర్దులను అమెరికా పావులుగా వాడుకొంటున్నది. తామే ప్రవేశపెట్టిన ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో అ క్కడ తిష్టవేయాలని చూసిన అమెరికా, ఐరోపా యూనియన్‌, వాటితో చేతులు కలిపిన టర్కీ దేశాలకు తాజా పరిణామం పెద్ద ఎదురు దెబ్బ.
మజులుమ్‌ అబ్దీ చెప్పినదాని ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా సిరియా మీద దాడులకు దిగిన జీహాదీ లేదా ఐఎస్‌ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రమే కర్దులు పోరాడారు తప్ప టర్కీ, అమెరికా మిలిటరీ మీద ఒక్క తూటాను కూడా కాల్చలేదు. కర్దు ప్రాంతాలను ఆక్రమించిన ఐఎస్‌ తీవ్రవాదులను ఎదిరించేందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టర్కీ, అమెరికా రెండూ కర్దులకు ఆయుధాలిచ్చాయి. కర్దులు ఐఎస్‌ తీవ్రవాదులను సిరియాలో అదుపు చేశారు. ఇదే సమయంలో అమెరికా హామీ మేరకు దాని మాటలు నమ్మి టర్కీ తమ మీద దాడులకు దిగదనే భరోసాతో కర్దులు టర్కీ సరిహద్దులనుంచి వెనక్కు తగ్గారు. అయితే ప్రస్తుతం టర్కీ అదే ఐఎస్‌ తీవ్రవాదులకు ఆయుధాలిచ్చి సిరియా ప్రాంతాలను తిరిగి ఆక్రమించేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగుతున్నది. ఈ దశలో కూడా సిరియన్‌ కర్దులు అమెరికా మీద విశ్వాసం వుంచి టర్కీ మీద పలుకుబడిని వుపయోగించి సిరియా సమస్యను పరిష్కరించాలనే కోరుతున్నారు. అమెరికా అక్కడి నుంచి తన సైన్యాన్ని ఉపసంహరిస్తానని చెప్పటాన్ని కూడా వారు తప్పుపట్టటం లేదు. దాని ఇబ్బందులు దానికి వున్నాయని సరిపెట్టుకుంటున్నారు. టర్కీ దాడులు తీవ్రతరం కావటంతో విధిలేని పరిస్ధితుల్లో తమ జనాన్ని రక్షించుకొనేందుకు సిరియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మిలిటరీని దించేందుకు అంగీకరించామని మజులుమ్‌ అబ్దీ చెప్పారు. జనాన్ని రక్షిస్తామని సిరియా, రష్యా ప్రతినిధులు చెప్పటాన్ని కూడా మేము పూర్తిగా నమ్మటం లేదు. అసలు ఎవరిని నమ్మాలో తెలియటం లేదు, విధిలేని పరిస్ధితుల్లో అంగీకరించాము అన్నారు.
ఆదివారం నాడు కుదిరిన ఒప్పందం మేరకు కర్దు దళాల ఆధీనంలో వున్న రెండు పట్టణాల ప్రాంతాన్ని సిరియా సైన్యానికి అప్పగించారు. గత ఆరు రోజులుగా టర్కీ చేస్తున్న దాడులకు ఉత్తర సిరియాలో ఎందరు మరణించిందీ తెలియదు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదమూడువేల మంది ఐఎస్‌ తీవ్రవాదులను తాము బందీలుగా చేశామని కర్దులు ప్రకటించారు. కర్దుల ప్రాంతాలపై దాడుల కారణంగా అనేక వందల మంది ఐఎస్‌ తీవ్రవాదులు బందీల శిబిరాల నుంచి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. వారిని కర్దులే విడుదల చేశారని అమెరికన్‌ మీడియా చెబుతోంది. టర్కీ చర్యలను భారత్‌తో సహా అనేక దేశాలు ఖండించాయి. ఐరోపా యూనియన్‌ టర్కీ మీద ఆంక్షలను విధించాలని తలపెట్టినా దాని మీద వచ్చిన వత్తిడి కారణంగా సభ్యదేశాల విచక్షణకు వదలివేశారు. యుద్ద విమానాలతో సహా టర్కీ ఆయుధాలన్నీ అమెరికా, ఐరోపా దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నది. కర్దు తిరుగుబాటుదార్లను టర్కీ ఉగ్రవాదులుగా చిత్రిస్తోంది. సిరియా విముక్తి సేనపేరుతో వున్న ఐఎస్‌ తీవ్రవాదులను సిరియా విముక్తి ప్రదాతలుగా పరిగణిస్తోంది.
సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సేనలను వుపసంహరించుకుంటామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ టర్కీ వత్తిడికి లొంగిపోయిన ట్రంప్‌ ఆకస్మిక నిర్ణయం తీసుకోవటంతో కర్దులు హతాశులయ్యారు. అమెరికా తమను మోసం చేసిందని భావిస్తున్నారు. అందుకే వెంటనే రష్యా మధ్యవర్తిత్వంతో సిరియా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే గతంలో కర్దులను అణిచివేయటంలో సిరియా ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. ఇప్పుడు కర్దుల ఆధీనంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తరువాత మరోసారి అణచివేతకు పూనుకోవచ్చనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి.
ఇంతకాలం ఐఎస్‌ తీవ్రవాదులను అణచేందుకే ఉత్తర సిరియాలో వున్నామని ప్రకటించిన అమెరికా ఇప్పుడు అక్కడి నుంచి తప్పుకోవటం అంటే మొత్తంగా సిరియాను ప్రభుత్వానికి అప్పగించి తోకముడిచినట్లే అన్నది కొందరి వ్యాఖ్యానం. ఇదే సమయంలో టర్కీతో సిరియా యుద్ద పర్యవసానాలు ఎలా వుంటాయన్నది చూడాల్సి వుంది. తమ దేశంలో తలదాచుకున్న 20లక్షల మంది సిరియన్ల రక్షణ ప్రాంతాలను ఏర్పరచేందుకే తాము దాడులు చేస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ చెబుతున్నాడు.
పశ్చిమాసియాలో అనేక తెగలలో కర్దిష్‌ ఒకటి. పశ్చిమ, మధ్య ఆసియా ప్రాంతాలపై ఆధిపత్య పోరు లో సఫావిద్‌ – ఒట్టోమన్‌ సామ్రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఒప్పందాలు జరిగాయి. వాటిలో భాగంగా కర్దులు గణనీయంగా లేదా మెజారిటీ వున్న ప్రాంతాలు చీలిపోయాయి. సులభంగా అర్ధం చేసుకోవాలంటే నేటి టర్కీ, సిరియా, ఇరాన్‌, ఇరాక్‌ దేశాలలో ఈ ప్రాంతాలు వున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని ముక్కలు చేశారు. తరువాత వాటికి స్వాతంత్య్రం ఇచ్చే క్రమంలో యూదులకు ఇజ్రాయెల్‌ మాతృదేశంతో పాటు కర్దులకు ఆయా దేశాలలో స్వయం పాలిత ప్రతిపత్తి మంజూరును పరిశీలించాలని సామ్రాజ్యవాదులు సూచించారు. టర్కీ తప్ప మిగిలిన దేశాలు వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. టర్కీ అయితే తమ దేశంలో కర్దు అనే పదం వినపడకుండా చేసింది. చివరకు ఆ భాష మాట్లేవారిని కూడా వెంటాడి వేధించింది. కర్దులకు కొండ ప్రాంతాల టర్కులని పేరు పెట్టింది. ఈ నేపధ్యంలో కర్దు ప్రాంతాలలో అనేక తిరుగుబాట్లు జరిగాయి.పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ ఏర్పాటు నిర్ణయం జరగటం, స్వయంప్రతిపత్తి ప్రాంతాల డిమాండ్‌ను సక్రమంగా అమలు జరపకపోవటంతో అది 1945లో నాలుగుదేశాలలోని కర్దు ప్రాంతాలతో కర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలనే నినాదంగా మారింది.

Image result for Syrian Kurds  fight
కర్దిస్ధాన్‌ సాధనకు నాలుగు దేశాలలో తలెత్తిన ఉద్యమాలు సాయుధ రూపం తీసుకున్నాయి. వాటిని అణచివేయటంలో ఏ దేశ పాలకులూ తక్కువ తినలేదు. ఇదే సమయంలో తన రాజకీయ, ఆధిపత్య ఎత్తుగడలలో భాగంగా అమెరికన్లు నాలుగు చోట్లా కర్దులకు మద్దతు ఇచ్చి వారి తిరుగుబాట్లను ప్రోత్సహించారు. వాటిలో కర్దిస్ధాన్‌ వర్కర్స్‌ పార్టీ(పికెకె) ప్రధాన సంస్ధగా ముందుకు వచ్చింది. టర్కీలో కర్దులపై అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్ధులు దీనిని ప్రారంభించారు.1984లో పూర్తి స్ధాయి తిరుగుబాటుగా మారింది.అనేక పరిణామాల తరువాత 2013లో పికెకె కాల్పుల విరమణ ప్రకటించింది. రెండు సంవత్సరాల తరువాత టర్కీ దాడులు, ఇతర పరిణామాల కారణంగా కాల్పుల విరమణ విరమించింది.
ఇరాక్‌, సిరియాలలో కర్దుల స్వయంపాలిత ప్రాంతాల ఏర్పాటును టర్కీ వ్యతిరేకించటమే కాదు, ఆ ప్రాంతాలలోని కర్దులపై తరచుగా దాడులు చేస్తున్నది. ఇరాకీ కర్దు ప్రాంతాలలో తనకు అనుకూలమైన ఉగ్రవాద బృందాలకు సాయం చేసి ఆ ప్రాంతంలో తన తొత్తులను ప్రతిష్టించాలని కూడా టర్కీ చూసింది. ఇప్పుడు అమెరికా,ఐరోపా యూనియన్‌ మద్దతుతో మరోసారి సిరియాలోని కర్దు ప్రాంతాలపై దాడులకు దిగుతున్నది, ఐఎస్‌ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చి సిరియాను అస్ధిరం చేయాలని చూస్తున్నది. మంగళవారంతో ఐదు రోజుల కాల్పుల విరమణ గడువు ముగియనున్నది. ఒప్పందానికి టర్కీ-కర్దులు తమవైన భాష్యాలు చెబుతున్నందున తిరిగి మరోసారి టర్కీ దాడులకు తెగబడుతుందా ? టర్కీని అమెరికా నివారిస్తుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం-మోడీ సర్కార్‌ 2024 ఓట్ల లెక్కలు !

19 Saturday Oct 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ASEAN, free trade agreement, RCEP, RCEP INDIA, Regional Comprehensive Economic Partnership

Image result for RCEPఎం కోటేశ్వరరావు
ఇప్పటి వరకు వెలువడిన సూచనలు, ధోరణులను బట్టి ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి)’ ఒప్పందంపై మన దేశం సంతకాలు చేసే అంశం చివరి నిమిషం వరకు ఉత్కంఠను కలిగించే అవకాశం వుంది. నవంబరు నాలుగవ తేదీన బ్యాంకాక్‌ సమావేశంలో సంతకాలు జరగనున్నాయి. దానికి మన ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం పునరాలోచన గురించి ఇంతవరకు ఎలాంటి వార్తలు లేవు. మన ఎగుమతిదార్లకు తగినన్ని రాయితీలు సంపాదించేందుకు ప్రయత్నించి ఒప్పందం మీద సంతకం చేయాలన్న వైఖరితో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమేరకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒప్పందం మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాల పూర్వరంగంలో మోడీ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అధికారిక అభిప్రాయాలు వెల్లడి కాలేదు.
ఎగుమతి, దిగుమతి వాణిజ్య లాబీయిస్టులు ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉండి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. మరోవైపు ఈ ఒప్పందం షరతులు అమలు జరిగితే ఇప్పటికే మన దేశ వ్యవసాయ, అనుబంధ రంగాలలో నెలకొన్న సంక్షోభం లేదా తీవ్ర సమస్యలు మరింతగా పెరిగే అవకాశం వుంది కనుక ఒప్పందంపై సంతకాలు చేయరాదని రైతు సంఘాలు మరోవైపున డిమాండ్‌ చేస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)లో భాగస్వాములు అయినప్పటికీ గత దశాబ్దకాలంగా అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకుంటున్నాయి. అనేక దేశాలు ద్విపక్ష ఒప్పందాలు, ప్రాంతీయ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దానిలో భాగమే ఆర్‌సిఇపి. గత ఐదు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ ప్రచార ఆర్భాటం తప్ప మన దేశం నుంచి ఎగుమతులను పెంచటంలో ఘోరంగా విఫలమైంది. ఆర్‌సిఇపి విషయానికి వస్తే దీనిలో ఆగేయ ఆసియాలోని బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్‌, మలేసియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ లాండ్‌, వియత్నాం(వీటిని ఆసియన్‌ దేశాలని కూడా అంటారు)లతో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలతో కూడిన కూటమి మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి 2012 నవంబరు నుంచి చర్చలు జరుగుతున్నాయి.

ఈ కూటమి ఆసియన్‌ దేశాల 2012 సమావేశంలో పురుడుపోసుకుంది.గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. తుది ఒప్పంద దశకు చేరుకుంది. పదహారు దేశాలలో 340 కోట్ల మంది జనాభా ఉన్నారు.2017 వివరాల ప్రకారం ప్రపంచ జిడిపిలో 39శాతం అంటే 49.5 లక్షల కోట్ల డాలర్ల వాటా వుంది. ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య కూటమి కానుంది.2050 నాటికి ఈ దేశాల జిడిపి 250లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. అందువలన ఇంత పెద్ద కూటమికి దూరంగా ఉండేందుకు మన దేశంలోని బడా కార్పొరేట్‌ సంస్ధలు ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించవు. గత అనుభవాలను గమనంలో వుంచుకొని రైతు సంఘాలు భయపడుతున్నట్లుగా రైతాంగాన్ని బలిపెట్టి అయినా వాణిజ్య, పారిశ్రామిక, సేవారంగాల కార్పొరేట్లు తమ ప్రయోజనాలకోసం కృషి చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు.చైనా నుంచి మరిన్ని రాయితీలను రాబట్టాలని అవి కేంద్రం మీద వత్తిడి చేస్తున్నాయి.

ఇక మన దేశం విషయానికి వస్తే ఈ ఒప్పందంలో భాగస్వామి అయితే సంభవించే నష్టాలేమిటి, కలిగే లాభాలేమిటి అన్న చర్చ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఆసియన్‌ దేశాలకు మన దేశం నుంచి 2018-19లో 9.56శాతం పెరిగి 37.47 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అయితే ఇదే సమయంలో దిగుమతులు 25.87శాతం పెరిగి 59.32 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం ఏ దేశానికీ క్షేమకరం కాదు. అందువలన వాణిజ్య మిగులు సంగతి తరువాత లోటును తగ్గించుకొనేందుకే మన ప్రయత్నాలన్నీ పరిమితం అవుతున్నాయి. సంప్రదింపుల ప్రారంభంలో అంటే 2010-11లో ఆసియన్‌ దేశాలతో మన వాణిజ్య లోటు 12 బిలియన్‌ డాలర్లు వుంటే 2018-19 నాటికి 22 బిలియన్లకు పెరిగింది.

ఆసియన్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) విషయానికి వస్తే మన దేశం 74శాతం వరకు పన్నులను రద్దు చేసేందుకు అంగీకరించగా ఇండోనేషియా 50, వియత్నాం 70శాతం మాత్రమే అంగీకరించాయి. ఇది మన కార్పొరేట్‌లను కలవర పెడుతున్నది.కనీసం చైనా కంటే పదిశాతం మేరకు అయినా మనకు అనుకూలంగా వుండాలని కోరుతున్నాయి. ఇతర దేశాలతో దాదాపు ఒప్పందం తుది దశలో ఉండగా చైనాతో ఇంకా ఆదశకు రాలేదు. ఇటీవల చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఈ అంశం మంత్రుల స్ధాయిలో చర్చించాలని అనుకున్నారు. మన దేశం కూటమిలో భాగస్వామి కాకుండా ప్రయోజనం లేదని భావించిన దేశాలు సంప్రదింపులకు గడువును పెంచాయి.

ఇటీవల నీతి ఆయోగ్‌ వివిధ కూటములు, దేశాలతో మన ఎగుమతులు, దిగుమతుల గురించి చేసిన సమీక్షలో ఒక్క శ్రీలంక విషయంలో తప్ప మిగిలిన అన్నింటి విషయంలో నష్టం తప్ప లాభం లేదని తేలింది. రెండు వైపులా జరిగే వాణిజ్యంలో 75శాతం మేరకు ఆర్‌సిఇపి స్వేచ్చా వాణిజ్య ఒప్పంద పరిధిలోకి వస్తాయి. మొత్తం పన్నెండువేల ఉత్పత్తులకు సంబంధించి తొమ్మిదివేల వరకు పన్నులను తగ్గించాల్సి వుంటుంది. పదమూడు వందల ఉత్పత్తులు పన్నుల నుంచి మినహాయింపు పొందిన జాబితాలో , 1800 వస్తువులు ఆచితూచి వ్యవహరించాల్సిన జాబితాలో ఉన్నాయి. మన దేశం మినహాయింపు జాబితాలో పదిశాతం వస్తువులను చేర్చగా అనేక దేశాలు అంతకంటే ఎక్కువ వస్తువులనే తమ జాబితాల్లో చేర్చాయి.

మూడు సంవత్సరాల క్రితం మతిమాలిన పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు లేకుండా జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ఇతర కారణాలతో దేశం ప్రస్తుతం రోజురోజుకూ మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈనేపధ్యంలో మోడీ సర్కార్‌ రాజకీయంగా తన లాభనష్టాలను లెక్కవేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, సేవా రంగాలను దెబ్బతీస్తుందని రైతు సంఘాలు, ఇతర సంస్ధలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. నవంబరులో ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరితే దాని అంశాలు 2021-22 నాటికి అమల్లోకి వస్తాయి. వాటి ప్రభావం 2023-24లో కనిపిస్తుంది. ఒక వేళ అది ప్రతికూలమైతే ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ ఏమిటన్నది బిజెపి తేల్చుకోలేకపోతున్నది.

Image result for RCEP

బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి ఒప్పందాలను అది వ్యతిరేకించింది, ముఖ్యంగా స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్ధ ఇప్పటికీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కారణంగా 2018లో మన దేశం 530 కోట్ల డాలర్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పటికే అనేక దేశాల మార్కెట్లు మనకు అందుబాటులో వున్నాయని, ఈ ఒప్పందం ద్వారా కొత్తగా సాధించేదేమిటి అన్న ప్రశ్నకు సరైన సమాధానం రావటం లేదు. పాడి, పామోలిన్‌ రైతాంగం తీవ్రంగా నష్టపోతారని బయటకు వచ్చిన పత్రాల సమాచారం వెల్లడిస్తున్నది.

ఆలిండియా కిసాన్‌సభ (ఎఐకెఎస్‌) రాగల పర్యవసానాల గురించి ఒక ప్రకటనలో రైతాంగాన్ని హెచ్చరించింది. దేశంలో పది కోట్ల రైతు కుటుంబాలకు పాడి పరిశ్రమ జీవనాధారంగా వుందని, పాలధరలో 71శాతం రైతాంగానికి చేరుతోందని పేర్కొన్నది. ప్రస్తుతం పాల వుత్పత్తుల దిగుమతులపై విధిస్తున్న 64శాతం పన్ను రద్దు చేస్తే దిగుమతులతో పాల ధర పతనం అవుతుందని హెచ్చరించింది. న్యూజిలాండ్‌ తన పాలవుత్పత్తుల్లో 93శాతం ఎగుమతులు చేస్తోందని, మన దేశంలో పాలపొడి కిలో 260 రూపాయల వరకు వుండగా న్యూజిలాండ్‌ నుంచి 160-170కే లభిస్తుందని కిసాన్‌ సభ పేర్కొన్నది.దేశంలోని వ్యవసాయ రంగంలో 85శాతం మంది రైతులు చిన్న సన్నకారేనని ఆర్‌సిఇపి ఒప్పందం వారి పాలిట శాపం అవుతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఆటోమొబైల్‌ తదితర అన్ని రంగాలూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత విదేశాల నుంచి దిగుమతి అయ్యే చౌకధరల వుత్పత్తులతో సమస్య మరింత తీవ్రం కావటం అనివార్యమని ఆయా రంగాల నిపుణులు ఇ్పటికే హెచ్చరించారు.

Image result for RCEP

ఈనెల 11,12 తేదీల్లో బ్యాంకాక్‌లో జరిగిన ఆర్‌సిఇపి మంత్రుల సమావేశంలో మన దేశం లేవనెత్తిన అంశాల కారణంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది. ముందే చెప్పుకున్నట్లు గతంలో కుదిరిన అవగాహన ప్రకారం ఒప్పందం అమలు జరిగితే సంభవించే ప్రతికూల ప్రభావంతో 2024 ఎన్నికల్లో దెబ్బతగులుతుందనే అంచనాతో ఒప్పందం అమలు సంవత్సరాన్ని 2014కు బదులు 2019గా మార్చాలని మన వాణిజ్య మంత్రి ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. గత రెండు సంవత్సరాల్లో మన పరిశ్రమల పరిరక్షణ చర్యల్లో భాగంగా సగటున దిగుమతులపై పన్నును 13 నుంచి 17శాతం వరకు పెంచారు. ఇప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తే వెంటనే పన్ను తగ్గించాల్సి వుంటుంది. వివిధ తరగతుల నుంచి వస్తున్న వత్తిళ్ల పూర్వరంగంలో మన దేశం గతంలో లేని కొన్ని కొత్త అంశాలను ఒప్పందంలో చేర్చాలని ప్రతిపాదించింది. దీని వెనుక రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తాము చివరి వరకు మన ప్రయోజనాల రక్షణకే ప్రయత్నించామని, విధిలేని స్ధితిలో సంతకాలు చేశామని చెప్పుకొనేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇదే సమయంలో మొత్తంగా మన ఆర్దిక వ్యవస్ధకే ముప్పు వస్తుందని భావిస్తే తమ షరతులకు అంగీకరించలేదనే మిషతో ఒప్పందానికి దూరంగా వుండవచ్చు. ఈ నేపధ్యంలోనే భారత్‌ లేవనెత్తిన అంశాలపై మిగతా సభ్య దేశాలను అంగీకరింపచేసే బాధ్యత భారతే తీసుకోవాలని కొన్ని దేశాలు ఈనెల రెండవ వారంలో జరిగిన సమావేశంలో ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి.ఇంకా పక్షం రోజులు వున్నందున హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్ర సర్కార్‌ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈనెల పది నుంచి 20వ తేదీ వరకు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. అయితే వాటికి పెద్దగా స్పందన వున్నట్లు మీడియాలో మనకు కనపించదు. పైన చెప్పుకున్నట్లు ఓట్ల లెక్కలు కేంద్ర పాలకులను ప్రభావితం చేస్తాయా? కార్పొరేట్ల వత్తిడిది పై చేయి అవుతుందా చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d