• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

101 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎల్‌డిఎఫ్‌ ఆధిక్యత – వచ్చే ఎన్నికలలో నూతన అధ్యాయం !

20 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, Kerala BJP, Kerala CPI(M), Kerala Local Body Election Results 2020, LDF, UDF


ఎం కోటేశ్వరరావు
కేరళ స్ధానిక సంస్దల ఎన్నికలలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపి కూటములు రెండూ శబరిమల వివాదం, ప్రమాదవశాత్తూ ఏనుగు మృతి, బంగారం స్మగ్లింగ్‌ ఉదంతం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ కుమారులు కేసుల్లో ఇరుక్కొని అరెస్టు కావటాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, రాజకీయంగా సొమ్ము చేసుకొనేందుకు, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన నేపధ్యంలో సాధించిన విజయం సామాన్యమైంది కాదు.


ప్రాధమికంగా వెల్లడైన విశ్లేషణలను బట్టి కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు జరిపిన ఆహార కార్యక్రమం, కరోనా చికిత్సలో చూపిన ప్రత్యేక శ్రద్ద, అవకాశవాద రాజకీయాలకు పాల్పడకుండా మత శక్తుల పట్ల అనుసరించిన సూత్రబద్దవైఖరి జనామోదం పొందింది కనుకనే ఎల్‌డిఎఫ్‌ విజయం సాధ్యమైంది.పైన పేర్కొన్న అంశాలతో పాటు యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం) వర్గం కారణంగా దాని ప్రభావం కేరళ మధ్య జిల్లాల్లో విజయావకాశాలను పెంచింది. స్ధానిక సంస్ధల ఎన్నికలు కేరళలో సరికొత్త పరిణామాలకు తెరలేపినట్లు చెప్పవచ్చు. ప్రతిపక్షాలు చేసిన ప్రచారంతో ఊగిసలాడిన ఓటర్లు, గతంలో మద్దతుదార్లుగా ఉండి ఎల్‌డిఎఫ్‌కు దూరమైన వారు ఈ పరిణామంతో తిరిగి చేరువ కావచ్చు. ప్రజాభిప్రాయాన్ని మరింతగా కూడగట్టేందుకు వివిధ తరగతుల నుంచి సూచనలు పొందేందుకు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదమూడు జిల్లాల పర్యటన ఖరారైంది. మరొక జిల్లా కార్యక్రమాన్ని రూపొందించవలసి ఉంది. రానున్న రోజుల్లో ఎల్‌డిఎఫ్‌ మరిన్ని కార్యక్రమాలను రూపొందించి, అందరికంటే ముందుగానే ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దం అవుతోంది.


గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఒక సారి ఎల్‌డిఎఫ్‌ కూటమి అధికారానికి వస్తే మరోసారి యుడిఎఫ్‌ రావటం ఒక ఆనవాయితీగా మారింది. వచ్చే ఎన్నికలలో ఓటర్లు దానికి మంగళం పాడతారని ఇప్పటికే కొందరు వ్యాఖ్యానించటం ప్రారంభించారు. ఎన్నికల నాటికి అసాధారణ పరిస్దితులు ఏర్పడితే తప్ప ఎల్‌డిఎఫ్‌ ఇదే విజయ పరంపరను కొనసాగించవచ్చని, వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారానికి రావచ్చని భావిస్తున్నారు. తాజా ఎన్నికలలో కొత్తగా కేరళ కాంగ్రెస్‌(ఎం) వచ్చి చేరింది. ఎల్‌డిఎఫ్‌లోని కొన్ని పార్టీలు తమ సీట్ల గురించి ఆందోళన చెంది కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలలో సీట్ల పంపిణీ, ఐక్యంగా పని చేయటంలో అదెక్కడా కనిపించలేదు. ఇదే సర్దుబాటు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రతిపక్ష యూడిఎఫ్‌లో కుమ్ములాటలు బజారున పడ్డాయి. ఫ్రంట్‌కు ఎవరు నాయకత్వం వహించాలో, ఏమి చేయాలో రెండవ భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌కు మార్గనిర్దేశనం చేయటం కాంగ్రెస్‌ దుస్దితిని తెలియ చేస్తోంది. మరోవైపు మత అజెండాను ముందుకు తెచ్చినా భంగపడిన బిజెపి తాను తిరిగి గెలుచుకున్న పాలక్కాడ్‌ మున్సిపల్‌ కార్యాలయంపై శ్రీరాముడి చిత్రం ముద్రించిన కాషాయ జెండాను ఎగురవేయటం, దానికి అభ్యంతరం తెలపటంపై అది చేస్తున్న వాదనల ద్వారా తన అజెండాను మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు నిర్ణయించిందన్నది స్పష్టం.

స్ధానిక సంస్ధల ఎన్నికలలో అత్యధిక చోట్ల పార్టీలు పూర్తి మెజారిటీ సాధించాయి. మరికొన్ని చోట్ల ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్ధితి ఏర్పడింది. ఎన్నికైన సభ్యులు పాలకవర్గాలను ఎన్నుకొనేందుకు ఈ నెల 21, 22 తేదీలలో సమావేశం కానున్నారు. కీలకంగా మారిన వార్డు సభ్యులు ఏ వైఖరి తీసుకుంటారనేదానిని బట్టి కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలపై ఎవరి ఆధిపత్యం ఏర్పడ నుందో తేలుతుంది. ఇప్పటి వరకు స్పష్టమైన మెజారిటీలు వచ్చిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి. రెండు కార్పొరేషన్లలో పెద్ద పక్షంగా ఎల్‌డిఎఫ్‌ ఉంది. కేరళ ఎన్నికల నిబంధనల ప్రకారం హంగ్‌ ఏర్పడినపుడు అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలుత సీట్లు సంపాదించిన పార్టీలన్నీ పోటీ చేయవచ్చు. సగం కంటే ఎక్కువ మెజారిటీ ఎవరికీ రాకపోతే మొదటి రెండు స్దానాలలో ఉన్న పార్టీలు రెండవ సారి పోటీ చేయాల్సి ఉంటుంది. పోటీలో లేని పార్టీలు ఓట్లు వేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగానూ ఉండవచ్చు. అప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే పదవి దక్కుతుంది. కేరళలో ఉన్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో స్వతంత్రులు ఏ వైఖరి అయినా తీసుకోవచ్చు గానీ ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌, బిజెపి పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా మరొకర్ని బలపరిచే పరిస్ధితి లేదు. ఈ కారణంగానే రెండు కార్పొరేషన్లలో ఎల్‌డిఎఫ్‌ పెద్ద పక్షంగా అవతరించినందున అక్కడ కూడా వారే విజయం సాధిస్తారనే భావనతో మీడియాలో ఎల్‌డిఎఫ్‌ ఐదు మేయర్‌ స్దానాలను గెలుచుకున్నట్లు రాస్తున్నారు. జిల్లా పంచాయతీలలో ఒక చోట ఎల్‌డిఎఫ్‌ పెద్ద పార్టీగా అవతరించగా మరొక చోట రెండు కూటములకు సమానంగా స్ధానాలు వచ్చాయి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌×××యుడిఎఫ్‌×××ఎన్‌డిఏ×××ఇతరులు×××హంగ్‌××× మొత్తం
గ్రామపంచాయతీలు×× 514(-2) ×××321(-51) ××19(+5) ×× 23(+15) ×× 64 ××× 941
బ్లాక్‌ పంచాయతీలు×× 108(+20)××× 38(-24) ×× 0(0) ×× 0(-5) ×× 6 ××× 152
జిల్లా పంచాయతీలు×× 10(+3) ××× 2(-3) ×× 0(0) ×× 0(0) ×× 2 ××× 14
మున్సిపాలిటీలు ×××× 35 ××× 39 ×× 2(+1) ×× 3 ×× 7 ××× 86
కార్పొరేషన్లు ×××× 3 ××× 1 ×× 0(0) ×× 0 ×× 2 ××× 6
వివిధ స్ధానిక సంస్ధలలో వార్డుల వారీగా వచ్చిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌-××××యుడిఎఫ్‌×××××ఎన్‌డిఏ×××××ఇతరులు××× మొత్తం
గ్రామపంచాయతీలు×7,262(-361) ×5,893(-431) ×1,182(+249) ×1,620(+542) ×15,962
బ్లాక్‌ పంచాయతీలు ×1,266(+178) ××727(-190) ×× 37(+16) ×× 49(-4) ××× 2,080
జిల్లా పంచాయతీలు×× 212(+42) ××110(-35) ×× 2(-1) ××××× 6(+2) ×××× 331
మున్సిపాలిటీలు ××1,167(-96) ×× 1,173(-145) ×× 320(+84) ××416(+157) ××3,076
కార్పొరేషన్లు ××× 207(+11) ×× 120(-23 ×× 59(+8) ×× 27(+3) ××× 414
పై వివరాలను పరిశీలించినపుడు వెల్లడైన ధోరణులు ఇలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ రెండూ 792 స్ధానాలు కోల్పోగా వాటిలో ఇతరులు 542 సాధించగా బిజెపికి పెరిగింది 249, బ్లాక్‌ పంచాయతీలలో కాంగ్రెస్‌ కోల్పోయిన 190లో ఎల్‌డిఎఫ్‌ 178, బిజెపి 16 అదనంగా సాధించింది. మున్సిపల్‌ వార్డులలో ఎల్‌డిఎఫ్‌, యూడిఎఫ్‌ కోల్పోయిన 241 స్ధానాలలో ఇతరులు 157 పొందగా బిజెపి 84 అదనంగా సాధించింది. కార్పొరేషన్‌ వార్డులలో యుడిఎఫ్‌్‌ 23 కోల్పోగా ఎల్‌డిఎఫ్‌ 11, బిజెపి 8, ఇతరులకు మూడు అదనంగా వచ్చాయి. ఈ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌తో పాటు పది మున్సిపాలిటీలు, 40 గ్రామ పంచాయతీలలో విజయం సాధిస్తామని బిజెపి చెప్పుకున్నది. ఏమి జరిగిందో చూశాము. ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తామని చెప్పిన బిజెపి కంటే ఇతరులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లు కోల్పోయిన స్ధానాలను ఎక్కువగా పొందారు. శబరిమల ప్రాంతంలోని పండలం మున్సిపాలిటీని బిజెపి అదనంగా సంపాదించింది. స్ధానిక ఎన్నికలలో గతంలో గెలిచిన స్ధానాలను కొన్నింటిని పోగొట్టుకోవటం, కొత్తవాటిని సాధించిన ఉదంతాల గురించి ప్రతి పార్టీ పరిశీలన జరుపుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో లోటు పాట్లను సరి చేసుకొనేందుకు ప్రయత్నించటం సహజం.
గత 2015స్దానిక సంస్ధలు, 2016 అసెంబ్లీ, 2019లోక్‌సభ ఎన్నికలు, తాజా 2020 స్ధానిక సంస్ధల ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూటమి××××× 2015 ×××× 2016×××× 2019×××× 2020
ఎల్‌డిఎఫ్‌×××× 37.4 ×××× 43.48 ××× 36.29 ××× 41.6
యుడిఎఫ్‌×××× 37.2 ×××× 38.81 ××× 47.48 ××× 37.1
బిజెపి ××× 13.3 ×××× 14.96 ××× 15.64 ××× 14.5
ఇతరులు ×××× 12.1 ×××× 2.75 ××× —– ××× 6.8
పైన పేర్కొన్న వివరాల ప్రకారం గత నాలుగు ఎన్నికలలో బిజెపి ఓట్లశాతాలలో పెద్ద మార్పు లేదు.(2011 అసెంబ్లీ ఎన్నికలలో 138 స్ధానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి 6.06శాతం ఓట్లు వచ్చాయి) అయినా స్ధానిక ఎన్నికలలో గతం కంటే అదనంగా వచ్చిన కొన్ని స్ధానాలను చూపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ తమకు ఎల్‌డిఎఫ్‌కు మధ్యనే ఉంటుందని బిజెపి నేతలు చెప్పుకోవటం గమనించాల్సిన అంశం. శబరిమల ఉదంతం, బంగారం స్మగ్లింగ్‌ కేసులను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు అటు మతాన్ని, ఇటు కేంద్రంలోని అధికారాన్ని వినియోగించుకొని ఎల్‌డిఎఫ్‌పై బురద చల్లేందుకు చేసిన యత్నాలు బహిర్గతమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాల గురించి ఈ ఎన్నికలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కూటముల వారీ సాధించిన స్ధానాలు, 2019 లోక్‌ ఎన్నికలు, 2020 స్ధానిక ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరిది పై చేయిగా ఉందో దిగువ చూద్దాం. 2016 వివరాలలో బ్రాకెట్లలో ఉన్న అంకెలు అంతకు ముందు అసెంబ్లీ స్ధానాలతో పోల్చితే అదనంగా తెచ్చుకున్నవీ, కోల్పోయినవని గమనించాలి.
ఏడాది ××××××× ఎల్‌డిఎఫ్‌ ××××× యూడిఎఫ్‌×××××× బిజెపి
2016 ×××××× 91(+23) ×××××× 47(-25) ×××××× 1(+1)
2019××××××× 16 ×××××× 123 ×××××× 1
2020××××××× 101 ×××××× 38 ××××××× 1
గత లోక్‌ సభ ఎన్నికలలో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు చోట్ల బిజెపి రెండవ స్ధానంలో ఉంది, తాజా స్ధానిక ఎన్నికల్లో ఐదు చోట్ల రెండవ స్ధానంలో ఉంది.2016లో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఎంఎల్‌ఏగా గెలిచారు. లోక్‌సభ ఎన్నికలకూ ఇప్పటికీ పరిస్ధితిలో వచ్చిన మార్పును, కాంగ్రెస్‌కు తగిలిన పెద్ద ఎదురుదెబ్బనూ ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. 2015 స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి యుడిఎఫ్‌ అధికారంలో ఉంది. ప్రతిపక్ష ఎల్‌డిఎఫ్‌కు యుడిఎఫ్‌ మధ్య ఓట్ల తేడా అసెంబ్లీ ఎన్నికలలో యుడిఎఫ్‌ కంటే ఎల్‌డిఎఫ్‌ ఓట్ల శాతం కేవలం 0.2శాతమే ఎక్కువ. తాజా ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ అధికారంలో ఉండి, ప్రతిపక్షాలు ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా యుడిఎఫ్‌ కంటే 4.5శాతం ఓట్లు ఎక్కువగా తెచ్చుకుంది. కనుకనే 101 అసెంబ్లీ సెగ్మెంట్లలో పై చేయి సాధించింది. ఇదే ఆదరణను ఎల్‌డిఎఫ్‌ నిలుపు కుంటే కొన్ని సీట్లు అటూ ఇటూ అయినా తిరిగి 2021 ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కేరళలో ఎల్‌డిఎఫ్‌ కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ పాలనలో ప్రపంచ సూచికలన్నింటా పతనం ! పతనం !!

17 Thursday Dec 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India HDI, world indicators-India


ఎం కోటేశ్వరరావు


ఆరున్నర సంవత్సరాల క్రితం – అప్పటి ప్రధాని నరేంద్రమోడీ చిత్రాన్ని చూసిన వారికి ఇప్పుడు మోడీ పెరిగిన గడ్డం కొట్చొచ్చినట్లు కనిపిస్తుంది. అది వ్యక్తిగతం, దేనికి పెంచుతున్నారో తెలియదు-దేశానికి ఇబ్బంది లేదు. కానీ దానికి తగినట్లుగా ఆయన ఏలుబడిలో దేశ అభివృద్ది, ఇతర అనేక సూచికల విషయంలో పెరుగుదల లేకపోగా వెనక్కు పోతోంది, ఇది ఆందోళన కలిగించే అంశం. అన్నీ నెహ్రూయే చేశారు, అన్నింటికీ కాంగ్రెసే కారణం చెప్పుకొనేందుకు ఇంకే మాత్రం అవకాశం లేని విధంగా సూచికలు దర్శనమిస్తున్నాయి. మీరు చేసింది ఏమిటో చెప్పమని అడిగే రోజులు ప్రారంభమయ్యాయి. సామాజిక మాధ్యమ కాషాయ మరుగుజ్జులు(ట్రోల్స్‌) ఎగిరిపడటం ఇప్పటికే తగ్గింది, ఇంకా తగ్గనుంది.


తాజా విషయానికి వస్తే 2019 ప్రపంచ దేశాల మానవాభివృద్ధి సూచికలను డిసెంబరు 15న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.(దీన్ని మీడియాలో 2020 సూచిక అని కూడా రాస్తున్నారు. గత ఏడాది సూచికను తదుపరి ఏడాదిలో ప్రకటిస్తారు) దీని ప్రకారం 189 దేశాలలో మన స్ధానం 129 నుంచి 131కి పడిపోయింది. 2014నుంచి చూస్తే 132-129 మధ్యనే ఉన్నది. ” అభివృద్దిలో మనతో పోటీ పడుతోంది ” అని కొందరు వర్ణించే చైనా ర్యాంకు 97 నుంచి 85కు పెరిగింది. మన బిజెపి నేతలు నిత్యం స్మరించే లేదా పోల్చుకొనే పాకిస్ధాన్‌ ర్యాంకు 156 నుంచి 154కు పెరిగింది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌ ర్యాంకు 141 నుంచి 133కు పెంచుకుంది. ఈ లెక్కన బంగ్లాదేశ్‌ మానవాభివృద్దిలో మనలను వెనక్కు నెట్టేందుకు ఎక్కువ కాలం పట్టదు. మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పేవారు వీటిని ఏమంటారో, అసలు వీటిని అంగీకరిస్తారో లేదో తెలియదు. మన యంత్రాంగం అందించిన గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని ఐక్యరాజ్యసమితి ఈ సూచికలను నిర్ణయిస్తుంది కనుక లెక్కల్లో తేడా అంటే కుదరదు. బ్రిక్స్‌ దేశాలలో మన దేశం 2018తో పోల్చితే (131) రెండు, రష్యా (52)మూడు స్ధానాల దిగువకు పడిపోయాయి. బ్రెజిల్‌ 84 యథాతధంగా ఉంది. చైనా రెండు స్దానాలను మెరుగుపరచుకొని 85కు, దక్షిణాఫ్రికా ఒక స్ధానం పెంచుకొని 114కు పెరిగింది.శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ ఒక్కో స్దానాన్ని పెంచుకున్నాయి.

అయితే తాజాగా కర్బన ఉద్గారాల విడుదల-వాటి ప్రభావాన్ని కూడా మానవాభివృద్ధి సూచికల నిర్ధారణలకు పరిగణనలోకి తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి) నిర్ణయించింది. వాటిని పరిగణనలోకి తీసుకుంటే మన సూచిక ఎనిమిది స్దానాల ఎగువన ఉంటుందని కూడా నివేదిక పేర్కొన్నది. ఇంతే కాదు అత్యంత ఎక్కువ మానవాభివృద్ధి జాబితాలో ఉన్న 50దేశాలు పూర్తిగా దిగువకు పడిపోతాయి. ఉదాహరణకు ఇప్పుడు మొదటి స్ధానంలో ఉన్న నార్వే పదిహేనవ స్దానానికి, చైనా 101వ స్దానానికి దిగజారుతాయి.ఆస్ట్రేలియా 72, అమెరికా 45, కెనడా 40 స్ధానాల దిగువకు చేరతాయి. అంటే ఇవన్నీ కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాలు. పరిశ్రమలు, చమురు వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అవి అంత ఎక్కువగా విడుదల చేస్తున్నాయి. కనుక మన స్ధానం మెరుగుపడుతుందని సంతోషించాలా ? పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉన్నామని విచారించాలా ? అందువలన కొత్త ప్రమాణాలతో కొత్త నివేదికలు వచ్చినపుడు వాటి మంచి చెడ్డలను చూద్దాం.


ప్రస్తుతం మానవాభివృద్ధి సూచికల్లో ఆయా దేశాల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ప్రతిబింబిస్తున్నాయి. తాజా నివేదిక కరోనాతో నిమిత్తం లేని 2019వ సంవత్సరానిది. కరోనా ప్రభావం ఏ దేశాన్ని ఎక్కడ ఉంచుతుందో చూడాల్సి ఉంది. దానితో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న అంశాలను తీసుకొని మనం ఎక్కడ ఉన్నామో, పాలకులు మనలను ఎక్కడ ఉంచారో ఒకసారి అవలోకిద్దాం. 2018లో పిపిపి ప్రాతిపదికన మన తలసరి జాతీయ ఆదాయం 6,829 డాలర్లు కాగా 2019లో అది 6,681డాలర్లకు పడిపోయింది. ఐక్యరాజ్యసమితిలోని 189 దేశాలను మానవాభివృద్దిలో నాలుగు తరగతులుగా విభజించారు. వాటిలో అత్యంత అభివృద్ది చెందిన దేశాలుగా 0.957 – 0.804 పాయింట్ల మధ్య ఉన్న 66, అభివృద్ది చెందినవిగా 0.796 – 0.703 ఉన్న దేశాలు 53, మధ్యతరహా దేశాలలో 0.697-0.554 పాయింట్ల మధ్య ఉన్నవి 37, అంతకంటే తక్కువగా ఉన్న దేశాలు 33 ఉన్నాయి. వీటిలో మన దేశం మూడవ జాబితాలో ఉంది. మనతో పాటు మన కంటే ఎగువన భూటాన్‌, దిగువన వరుసగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, పాకిస్దాన్‌ ఉన్నాయి. మన కంటే ఎగువన అభివృద్ధి చెందిన దేశాలలో శ్రీలంక, చైనా ఉన్నాయి.


2000 సంవత్సరంలో ప్రణాళికా సంఘం విజన్‌ 2020 పేరుతో ఒక పత్రాన్ని రూపొందించి అభివృద్ధి ఎలా ఉండాలో, ఉంటుందో పేర్కొన్నది. ఈ ఇరవై సంవత్సరాలలో వాజ్‌పేయి హయాంను కూడా కలుపుకుంటే బిజెపి ఏలుబడి పది సంవత్సరాలు, కాంగ్రెస్‌ వాటా పదేండ్లు ఉంది. ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక మంది ఆర్ధికవేత్తలు చెప్పిందేమిటి ? రానున్న రెండు దశాబ్దాల కాలంలో జిడిపి వృద్ది రేటు 8.5-9శాతం మధ్య ఉంటుంది. దీంతో దారిద్య్రం పూర్తిగా తొలగిపోతుంది. ఎగువ మధ్య తరగతి జాబితాలోకి దేశం వెళుతుంది. ఇవేవీ నిజం కాలేదు. జనాభా పెరుగుదల గురించి వేసిన అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. ఈ రెండు దశాబ్దాలలో ఉపాధి రహిత అభివృద్ది మాత్రమే నమోదైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందేందుకు నైపుణ్యం కలిగిన 50 కోట్ల మంది కార్మికులు కావాలని చెప్పారు. రెండువేల సంవత్సరంలో నైపుణ్యం కలిగిన యువకులు రెండుశాతం ఉంటే 2019 నాటికి 4.4శాతానికి మాత్రమే పెరిగింది. అందరికీ ఉద్యోగాలు అన్న నినాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పెద్ద నోట్ల రద్దు, తగిన కసరత్తులేని జిఎస్‌టి అమలు వలన కోటీ పదిలక్షల ఉద్యోగాలు పోయాయి.


విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం, రద్దు చేయాలని కోరేవారు పెరుగుతున్నారు. గిరిజనులకు సంబంధించి జనాభాలో వారు ఎనిమిది శాతం ఉన్నప్పటికీ టీచర్లలో వారు 2.3శాతానికి మించి లేరు. నాణ్యమైన విద్య ఒక అంశమైతే మన జనాభాకు తగిన విధంగా విశ్వవిద్యాలయాలు పెరగలేదు.1998లో 229 ఉంటే ఇప్పుడు 993కు పెరిగాయి,2020 నాటికి మొత్తం 1500 కావాల్సి ఉంది. ప్రస్తుతం 18-24 సంవత్సరాల మధ్య వయస్సున్న వారిలో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే కాలేజీకి వెళుతున్నారు. దాదాపు కోటి మంది ఏటా డిగ్రీలు పొందుతున్నారు.వారి పరిజ్ఞానం, నైపుణ్యం చాలా తక్కువ స్ధాయిలో ఉంది. ఉపాధి అవసరాలకు తగినట్లుగా లేదు. ఏటా రెండులక్షల మంది ఎంఫిల్‌ లేదా పిహెచ్‌డిలు పొందుతున్నారు. వారి పరిశోధన, బోధనా స్దాయిలు ఉండాల్సినంతగా లేవు. విద్య మీద మన పెట్టుబడిలో ప్రపంచంలో మనది 158, అత్యంత వెనుకబడిన సూడాన్‌ మనకంటే ఒక స్ధానంలో ముందుంది, నమీబియా 159లో ఉంది. అమెరికా 27, చైనా 44వ స్దానాల్లో ఉన్నాయి.


2019 ప్రపంచ ఆకలి సూచికలో 117 దేశాల జాబితాలో మనది 102, పదే పదే చెప్పాలంటే సిగ్గువేస్తోంది, శ్రీలంక 66, నేపాల్‌ 73,బంగ్లా 88, పాకిస్ధాన్‌ 94లో ఉంది, మనువాదులు చెప్పే అఖండ భారత్‌లోని ఆఫ్ఘనిస్తాన్‌ 108వ స్దానంలో ఉంది. ఇదంతా ఎప్పుడు, చైనా కంటే వేగంగా మనం అభివృద్ధి చెందుతున్నాం, త్వరలో దాన్ని అధిగమిస్తున్నాం అని చెప్పిన తరువాత అని గమనించాలి. అందరికీ ఆహారం సంగతి తరువాత అందరికీ ఆరోగ్యం సంగతి చూద్దాం. ఆదాయం తగినంతలేక భరించలేని ఆరోగ్య ఖర్చుతో అప్పుల పాలై ప్రతి ఏటా ఆరుకోట్ల మంది జనం దారిద్య్రంలోకి దిగజారుతున్నారన్న అంచనాలు ఉన్నాయి. లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం గోవాలో ప్రతి 614 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి పడక ఉంటే బీహార్‌లో 8,789 మందికి ఒకటి ఉంది. వాటిలో సౌకర్యాలు, ఆధునిక పరికరాల సంగతి సరేసరి. కేంద్ర పెద్దలు చెప్పే ఆయుష్మాన్‌ భారత్‌ స్దితి ఇది. ఇలాంటి అంశాలన్నీ మానవాభివృద్ధి సూచికల్లో ప్రతిబింబిస్తాయి.


మన దేశ జిడిపి పెరుగుతున్నది. కానీ జనం చేతుల్లోకి పోతే మానవాభివృద్ది మెరుగుపడుతుంది. అదే వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతమైతే అంకెల్లో గొప్పలు చెప్పుకోవటానికి మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ ఆర్ధిక వేదిక(డబ్ల్యుఇఎఫ్‌) ప్రపంచ సామాజిక చలనశీలత లేదా పరివర్తనీయత నివేదిక 2020 ఏమి చెప్పింది. గణనీయమైన ఆర్ధికపురోగతి సాధించినప్పటికీ భారత్‌లోని సామాజిక ఆర్ధిక అసమానత జనంలో గణనీయమైన భాగాన్ని దానికి దూరంగా ఉంచినట్లు పేర్కొన్నది. అల్పాదాయ తరగతి కుటుంబాల్లో జన్మించిన వారు సరాసరి ఆదాయాన్ని పొందేందుకు ఏడు తరాలు పడుతుందని కూడా చెప్పింది. 2013 నాటి వివరాల ప్రకారం తలసరి రోజుకు 32 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తున్న వారు దేశంలో 22 కోట్ల మంది ఉన్నారు. జాతీయ గణాంక సంస్ద అంచనా ప్రకారం 2019-20లో తలసరి వార్షిక జాతీయ ఆదాయం రూ.1,12,835 ఉంది. పేదలు దీన్ని చేరుకోవాలంటే ఏడు తరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక చెప్పింది.ప్రపంచ సామాజిక చలనశీలత లేదా పరివర్తనీయత నివేదిక 2020 ప్రకారం 82దేశాల జాబితాలో మనది 76వ స్ధానం.


మానవాభివృద్ధికి ఉపాధి, తద్వారా వచ్చే ఆదాయం కూడా ముఖ్యపాత్ర వహిస్తుందన్నది తెలిసిందే. మన దేశంలో జనాభా తప్ప ఉపాధి అవకాశాలు, అవసరాలకు తగినట్లుగా వేతనాలు పెరగటం లేదు. 2005 మార్చి నుంచి 2012 మార్చి నాటికి 459.4 నుంచి 474.2 మిలియన్లకు మొత్తం ఉపాధి పెరిగింది. 2018 నాటికి అది 465.1మిలియన్లకు తగ్గిపోయింది. ఈ కాలంలో కార్మికశక్తి 470.2 నుంచి 495.1 మిలియన్లకు పెరిగింది.కార్మికశక్తి భాగస్వామ్యం 43 నుంచి 36.9శాతానికి తగ్గిపోయింది.గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడుకు కారణమైందని తెలిసిందే. పురుష వ్యవసాయ కార్మికుల వేతనాలు 2014 డిసెంబరులో 5.13శాతం పెరిగితే 2016లో 6.77, 2018లో 4.84శాతం పెరుగుదల రేటు ఉంది. అంటే నిజవేతనాలు గణనీయంగా పడిపోయాయి.నిపుణులైన కార్మికుల వేతనాల పెరుగుదల రేటు ఈ కాలంలో 6.16 నుంచి 4.06శాతానికి పడిపోయింది. ఇది తలసరి వినియోగం తగ్గటానికి దారి తీసింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు.


వివిధ అంతర్జాతీయ సూచికలు, పోలికల్లో మన దేశ స్ధానం గౌరవ ప్రదమైనదిగా లేనప్పటికీ మన ప్రధాని, బిజెపి నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టను పెంచామని పదే పదే చెప్పుకుంటున్నారు. మనం సాధించామని చెబుతున్న ప్రచారానికి విశ్వసనీయత చేకూర్చే ఆధారాలు ఎక్కడా కనిపించటం లేదు. అది యాభై ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలోనూ, ఆ యాభై ఏండ్లలో చేయలేని దానిని ఐదేండ్లలో చేసి చూపించామని చెప్పుకొనే బిజెపి ఏలుబడిలోనూ కనిపించటం లేదు. అప్పుడూ ఇప్పుడూ అసలు సమస్యల నుంచి జనాన్ని పక్కదారి మళ్లించే నినాదాలు, చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఆర్ధిక విషయానికి వస్తే కరోనా పూర్వపు దిగజారిన స్ధితికి అయినా ఎప్పటికి వస్తుందో ఎవరూ చెప్పలేని స్ధితి. వివిధ అంతర్జాతీయ సంస్ధలు రూపొందించిన సూచికల్లో మన స్దానం ఎలా ఉందో చూద్దాం. ఏడాది కాలంలో కనీసం 15అంశాల్లో దిగజారిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కెనడాలోని ఫ్రాసర్‌ సంస్ద రూపొందించే ఆర్ధిక స్వేచ్చ సూచికలో మన దేశం 2019 సూచికలో 79వ స్ధానంలో ఉంటే 2020లో 105కు పడిపోయింది. ప్రజాస్వామ్య సూచికలో 2018తో పోల్చితే పదిస్ధానాలు దిగజారి 2019లో 51వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో 27వ స్ధానంలో ఉండేది. పత్రికా స్వేచ్చలో 142, మహిళలకు భద్రతలో 133, ప్రపంచ సంతోష సూచికలో 133 నుంచి 140కి దిగజారింది. శాంతి సూచికలో ఐదు స్ధానాలు దిగజారి 163 దేశాలలో 141కి, ప్రపంచ పోటీతత్వ సూచికలో పది స్ధానాలు దిగజారి 68కి, స్త్రీ పురుష నమానత్వ సూచికలో 112కు దిగజారింది. పాస్‌పోర్టు సూచికలో 199 దేశాలలో మనది 84వ స్దానం. ఇలా అనేక సూచికలు దిగజారటం నరేంద్రమోడీ పాలనలో కనిపిస్తోంది. వాటి కొనసాగింపే మానవాభివృద్ధి సూచిక పతనం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో వంచనాపూరిత వాదనలు -వాస్తవాలూ !

08 Tuesday Dec 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ 1 Comment

Tags

Bharat Bandh 2020, Farmers agitations, India farmers' protest


ఎం కోటేశ్వరరావు
డిసెంబరు ఎనిమిదిన రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు భారత బంద్‌ జయప్రదంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు చర్చలంటున్నది. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ గారే స్వయంగా రెచ్చగొట్టేందుకు పూనుకొని వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. తాజా ఆందోళన ఎంతకాలం కొనసాగుతుంది, ఏమౌతుంది అన్నది ఒక అంశమైతే రైతుల ఆందోళనల సందర్భంగా జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. ప్రతి ఉద్యమ సమయంలో దాన్ని వ్యతిరేకించే శక్తులు తప్పుడు వాదనలూ, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసేందుకు సామాజిక మాధ్యమాలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. పంజాబు రైతులే ఎందుకు ఆందోళనలో ముందున్నారు, మిగతా రాష్ట్రాల వారు ఎందుకు స్పందించటం లేదు వంటి కొన్నింటి తీరు తెన్నులను చూద్దాం.


1.పార్లమెంట్‌ అంగీకరించిన తరువాత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు ?
ఇది తర్కానికి నిలిచేది కాదు. పార్లమెంట్‌ ఆమోదించినంత మాత్రాన వ్యతిరేకత వ్యక్తం చేయకూడదని చెప్పటం నిరంకుశత్వలక్షణం. ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్ధితిని అప్పటి పార్లమెంట్‌, రాష్ట్రపతి ఆమోదించారు. అయినా నేటి బిజెపి పూర్వ రూపమైన జనసంఘం ఎందుకు వ్యతిరేకించింది ? ఆర్టికల్‌ 370, కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కూడా పార్లమెంటు ఆమోదించినవే అయినా బిజెపి ఎందుకు వ్యతిరేకించింది, రద్దు చేసింది ?


2.ముందే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు, ఆందోళన చేయలేదు ?
ఇది తప్పుడు ప్రచారం. ఆర్డినెన్స్‌లు తెచ్చినపుడే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కరోనా కారణంగా వీధుల్లోకి రాలేదు, అన్నింటికీ మించి వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందనే ఆశ, నమ్మకం ఉండటం. ఇవి రెండూ పోయిన తరువాత మరొక మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీనామా చేసిన బిజెపి మిత్రపక్షం అకాలీదళ్‌ చెప్పింది అదే. రెండు వ్యవసాయ, ఒక వినియోగదారుల చట్టాలకు సంబంధించి మార్పులను ఆర్డినెన్సుల ద్వారా అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు అంశాలూ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. చర్చలు జరపలేదు. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలో ఉన్నాయి గనుక మౌనం దాల్చాయి.


3. ప్రజాస్వామ్య బద్దంగానే జరిగింది కదా !
పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ స్దానే బిల్లులను ప్రవేశపెట్టినపుడు సెలెక్టు కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం తోసి పుచ్చింది. నిరసనల మధ్య ఆమోద తతంగాన్ని పూర్తి చేసింది. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపింది. వీటిని ఎందుకు తిరస్కరించినట్లు ? ఇది ప్రజాస్వామ్యమా ? విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు అంతర్గతంగా హామీ ఇచ్చారు కనుకనే ఆర్డినెన్సు, తరువాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఆమోద తతంగం చేశారు. అందువలన అవి రద్దయ్యేవరకు గళం విప్పుతూనే ఉండటం తప్పెలా అవుతుంది.


4. రైతులు మొండిగా ఉన్నారు, కమిటీ వేస్తామన్నారు కదా, ఎందుకు అంగీకరించరు ?
మొండిగా ఉన్నది ప్రభుత్వమే. తమ మిత్రపక్షం అకాలీదళ్‌ నిరసన వ్యక్తం చేసినా రాజకీయంగా దానితో విడగొట్టుకొనేందుకు అయినా సిద్దపడింది గానీ ఆ పార్టీ చెబుతున్నదానిని కూడా వినిపించుకోలేదు. సెప్టెంబరు 25న అఖిల భారత నిరసన దినం పాటించాలని అఖిల భారత కిసాన్‌ సంఘర్ష సమితి పిలుపు ఇచ్చింది, పాటించారు. అప్పుడు స్పందించలేదు. తరువాత నవంబరు 26న ఆందోళన పిలుపునూ పట్టించుకోలేదు. తీరా రైతులు ఢిల్లీ బయలు దేరిన తరువాత శివార్లలో కందకాలు తవ్వేందుకు, ఆటంకాలు ఏర్పాటుకు చూపిన శ్రద్ద పరిష్కారం మీద లేదు. రైతులు వచ్చిన వారం తరువాత చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అయితే వత్తిడిని తట్టుకోలేక ముందే చర్చలకు పిలిచింది. కమిటీని వేస్తామనటం తప్ప మార్పులకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు కేంద్రం వైపు నుంచి లేవు. ఇది కాలయాపన, ఉద్యమాన్ని చల్లార్చే ఎత్తుగడ. అలాంటపుడు రైతులేమి చేయాలి ?


5. కేంద్రం చెబుతున్నది ఏమిటి ? రైతులు కోరుతున్నది ఏమిటి ?
ఐదుసార్లు చర్చలు జరిపారు. చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని రైతులు ప్రతిసారీ చెప్పారు. సావిత్రీ నీ పతి ప్రాణంబుదక్క వరాలు కోరుకోమన్నట్లుగా అది మినహా ఇతర అంశాల గురించి మాట్లాడుదాం అనటం తప్ప కేంద్రం నుంచి మరొకమాటలేదు. రైతులు చెప్పాల్సింది చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలేమిటో ఇంతవరకు చెప్పలేదు.


6. కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు, కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రధాని చెప్పిన తరువాత కూడా రైతులు ఆందోళన చేయటం ఏమిటి ?
ఆ మార్పులేమిటో నిర్దిష్టంగా చెబితే రైతులు ఆలోచిస్తారు. ఎవరు చెబుతున్నది ఏమిటో జనమూ గ్రహిస్తారు. రైతులు గొంతెమ్మ కోరికలు కోరితే ఆందోళనకు మద్దతు తగ్గిపోతుంది. అయినా ప్రభుత్వం లేదా నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌లో చెప్పిందేమీ లేదు. ఎవరితో సంప్రదించకుండానే ఆర్డినెన్సు తెచ్చారు. పార్లమెంట్‌లో అభ్యంతరాలను పట్టించుకోలేదు. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా గురించి బిజెపి ఎంత హడావుడి చేసిందో తరువాత ఎలా ప్లేటు ఫిరాయించిందో తెలిసిందే. యాభై రోజుల్లో పెద్ద నోట్ల రద్దు సమస్యను పరిష్కరించలేకపోతే శిక్షించమని మోడీ చెప్పారు. నాలుగేండ్ల తరువాత నల్లధనాన్ని తగ్గించామని బుకాయించటం తప్ప అంకెల్లో చూపారా? జిఎస్‌టి ఆదాయం తగ్గితే పరిహారం ఇస్తామని చేసుకున్న ఒప్పందానికే ఎగనామం పెడుతూ దేవుడి లీల, కేంద్రం పరిహారం ఇవ్వలేదని బుకాయించిన తీరు చూశాము. అందువలన ప్రధాని నోటి మాటలను ఎవరైనా ఎలా నమ్ముతారు ? కనీస మద్దతు ధర గురించి చెబుతున్న మాటలనే చట్టబద్దం ఎందుకు చేయరని రాజస్దాన్‌, హర్యానాలో ఉన్న బిజెపి మిత్రపక్షాలే చెబుతున్నాయి. దాన్నయినా చేస్తామని ఎందుకు చెప్పటం లేదు ?


7. రైతులకు ఉపయోగం లేకపోతే జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు కేంద్రాన్ని ఎందుకు సమర్ధిస్తున్నారు ?
జయప్రకాష్‌ నారాయణ ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి. రాజకీయాల్లో ఒక విఫలనేత. ఆయన ఎందుకు సమర్ధిస్తున్నారో స్కాన్‌ చేసి చూడలేము. అయితే ఒక మేథావిగా ఆయన చెప్పిన మాటలను వినాల్సిందే. కానీ అవే ప్రమాణం కాదు. జెపి కంటే వ్యవసాయ-ఆర్ధిక రంగంలో ఎంతో పరిశోధనలు చేసిన నిపుణులు అనేక మంది వ్యతిరేకించారు. తెలుగు రాష్ట్రాల్లో జెపి ఎంత బాగా తెలిసిన వ్యక్తో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా అంతే తెలుసు. మరి నాగేశ్వర్‌ వ్యతిరేకతను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు.

7. రైతులను బిజెపి వ్యతిరేక పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయి !
రైతులు అంత అమాయకులు కాదు. ఒక వేళ ఇతర పార్టీలు తప్పుదారి పట్టిస్తే బిజెపి వారిని సరైనదారిలో పెట్టలేనంత అసమర్ధంగా ఉందా ? ఈ ఆరోపణ రైతుల అనుభవం, తెలివితేటలను అవమానించటం తప్ప మరొకటి కాదు. మన దేశంలో, ప్రపంచంలో రైతాంగ ఉద్యమాలు కొత్త కాదు,ఎన్నో చారిత్మ్రాక పోరాటాలు చేశారని మరచిపోకూడదు. పంజాబ్‌ పోరాటాల గడ్డ, పంజాబీలు అటు సైన్యంలో జైజవాన్లుగా, వ్యవసాయంలో జైకిసాన్లుగా వారి పాత్రను ఎవరూ తక్కువ చేసి చూపలేరు. సెప్టెంబరు 25న తొలి ఆందోళన ప్రారంభమైంది. అప్పటి నుంచి రైతులను సమాధాన పరిచేందుకు బిజెపి చేసింది ఏమిటి ?


8.ప్రతిపక్షాలు ప్లేటు ఫిరాయించాయి. మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ 2019 మానిఫెస్టోలో చెప్పింది.
ప్లేటు ఫిరాయించటం రాజకీయాల్లో కొత్త కాదు, అది ప్రజలకు మేలు చేసేది, తప్పిదాన్ని సరిదిద్దుకొనేది అయితే ఇబ్బంది ఏమిటి. ముఖ్యమంత్రిగా జిఎస్‌టిని వ్యతిరేకించిన నరేంద్రమోడీ తీరా తాను ప్రధాని అయిన తరువాత తగినకసరత్తు లేకుండా అమలు జరపటాన్ని , దేశాన్ని ఇబ్బందుల పాటు చేయటాన్ని ఏమనాలి. అనేక రాష్ట్రాలకు ప్రకటించిన పాకేజీలు, హామీలను తిరస్కరించటం ఏమిటి ? రెండు తెలుగు రాష్ట్రాలకు బిజెపి, కేంద్రి ఇచ్చిన హామీలకు మొండి చేయి చూపటాన్ని ఏమనాలి? బిజెపి గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తోంది.

9. పంజాబ్‌ రైతులు, జాట్‌కులస్తులు తప్ప ఉద్యమంలో ఎవరూ లేరు ?
జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు చేస్తున్న తప్పుడు వాదన ఇది. కుల వ్యవస్ధ ఉన్న కారణంగా ప్రతి వారూ పుట్టుకతో ఏదో ఒక కులానికి చెందుతున్నారు. అనేక మంది ఐఎఎస్‌, ఐపిఎస్‌లు ఉన్నారు ? మరి జెపి ఒక్కరే లోక్‌సత్తా ఎందుకు పెట్టారు ? ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు ? ప్రజల సొమ్ముతో వైద్య విద్యను చదివి ప్రాక్టీస్‌ చేయకపోవటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, జనానికి అవసరమైన మరొక వైద్యుడు తయారు కాకుండా అడ్డుకోవటమే. అలాంటి వారిలో జెపి ఒకరు ఎందుకు అయ్యారు ? పోనీ ఐఎఎస్‌ అధికారిగా అయినా కొనసాగి జనానికి మేలు చేయలేదు.
ఎస్‌ పంజాబ్‌ రైతులు ఉద్యమంలో ముందున్నారు. సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకేసారి ముందుకు ఎందుకు రాలేదో జెపి వంటి వారు చెప్పాలి. హరిత విప్లవంలో పంజాబ్‌ రైతులు ముందున్నారు. వ్యవసాయ మిగులును సాధించటంలోనూ వారే ముందున్నారు. ఆ మిగులుకు మార్కెటింగ్‌ సమస్యలు వచ్చినపుడు ప్రభావితమయ్యేదీ వారే కనుక, ముందుగా మేలుకున్నారు.
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వంద ఎకరాలలో వంద కిలోల ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయనుకుంటే ఉత్తర ప్రదేశ్‌లోని 15.71 ఎకరాల్లో 16.91 కిలోలు, మధ్య ప్రదేశ్‌లోని 12.7 ఎకరాల్లో 12.08 కిలోలు పంజాబ్‌లోని 5.4 ఎకరాల్లో 11.29 కిలోలు పండుతున్నాయి. మిగిలిన సంవత్సరాలలో కూడా స్వల్ప తేడాలతో ఇదే విధంగా ఉంటాయి. దీనర్దం ఏమిటి పంజాబ్‌లో అమ్ముకోవాల్సిందీ ఎక్కువే. మార్కెట్‌ కమిటీలను, సేకరణ వ్యవస్ధలను పనికిరాకుండా చేసి, కనీస మద్దతు ధరలను నీరుగారిస్తే ఎక్కువగా నష్టపోయేది పంజాబ్‌ రైతులే కనుక వారే ముందుగా మేలుకున్నారు.
2017-18 వివరాల ప్రకారం బియ్యం ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్‌ 13.26శాతంతో దేశంలో అగ్రస్దానంలో ఉంటే 11.85శాతంతో పంజాబ్‌, 11.75శాతంతో ఉత్తర ప్రదేశ్‌ రెండు, మూడు స్దానాల్లో ఉన్నాయి. ఇక బియ్యం వినియోగంలో నెలకు తలసరి వినియోగం పంజాబ్‌లో బియ్యం 0.4కిలోలు ఉంటే 14.5కిలోలతో ఒడిషా ప్రధమ స్దానంలో ఉంది. అందువలన రెండు రాష్ట్రాల రైతులకూ మార్కెటింగ్‌ సమస్యలు ఒకే విధంగా ఉంటాయా ? ఎంత పండినా వినియోగించే స్దితిలో ఒడిషా రైతు, అమ్ముకోవాల్సిన అవసరంతో పంజాబ్‌ రైతు ఉంటాడు. అందుకే ఆందోళనలో ముందుంటాడు. ఇలాంటి తేడాలే ఉంటాయి.


10.ఆందోళన చేస్తున్నది రైతులు కాదా ?
మరి ఎవరు ? సామాజిక మాధ్యమంలో మరుగుజ్జులు పంజాబ్‌ గురించి అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకదానిలో చెప్పినదాని ప్రకారం పంజాబ్‌లో వ్యవసాయం చేసే గ్రామాలు కేవలం 1,500 మాత్రమేనట. అక్కడ 30వేల మంది అడితియాస్‌(కమిషన్‌ ఏజంట్లు), వారి వద్ద పని చేసే మూడులక్షల మంది సహాయకులు కలిపి ప్రతి గ్రామానికి 220 మంది చొప్పున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారట. చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2001లో 12,729 గ్రామాలున్నాయి. తరువాత ఏవైనా కొన్నింటితో మున్సిపాలిటీలు ఏర్పాటు అయి ఉండవచ్చు. పన్నెండు వేలకు తగ్గవు.పంజాబ్‌ను వ్యవసాయ రాష్ట్రంగా చెబుతుంటే 1500 గ్రామాలతో అంత ఉత్పత్తి సాధ్యమా ? దీన్ని ప్రచారం చేస్తున్న వారు కాస్త బుర్రపెట్టి ఆలోచించాలి. ఇలాంటి లెక్కలతోనే అడితియాసే రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నట్లు బిజెపి, దాని తొత్తులు ప్రచారం చేస్తున్నారు.


11. ఇతర రాష్ట్రాలతో పోల్చటం తప్పంటారా ?
ఈ ప్రశ్నకు పంజాబ్‌ రైతుల గురించి చెప్పినదానిలోనే కొంత సమాధానం ఉంది. మార్కెట్‌ యార్డుల వెలుపల అమ్ముకొనే స్వేచ్చ ఇస్తే రైతులకు లాభం అని చెప్పేవారి దగ్గర ఆధారం లేదు. ఒక భ్రమ మాత్రమే. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం 2006లోనే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను రద్దు చేసింది. ధాన్య సేకరణ బాధ్యతను సహకార సంస్దలకు, వ్యాపారమండళ్లకు అప్పగించింది. గత ఏడాది 30లక్షల టన్నులు సేకరణ లక్ష్యంగా చెప్పారు, 20లక్షల టన్నులకు దాట లేదు. గతేడాది క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ.1,815 ఉంటే బహిరంగ మార్కెట్లో సీజన్లో రూ.1,350కి అమ్ముకున్నారు( మే 8, 2019 డౌన్‌టు ఎర్త్‌). ఏటా బీహార్‌లో 1.6 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా. దీనిలో 30లక్షల టన్నుల సేకరణ లక్ష్యం. ఈ ఏడాది నవంబరు 15 నుంచి డిసెంబరు ఐదువరకు కొన్నది కేవలం 793 టన్నులు మాత్రమే. కనీస మద్దతు ధర రూ.1,868 కాగా రైతులు రూ.800-1200 మధ్య అమ్ముకుంటున్నారు(డిసెంబరు ఆరు, 2020 ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌). అందుకే బీహార్‌ పరిస్ధితితో పోల్చుకొని పంజాబ్‌ రైతులు ముందే మేలుకున్నారు. పంజాబీలను చూసి బీహారీలు కూడా వీధుల్లోకి రావచ్చు.అందువలన అందరూ ఉద్యమంలోకి ఎందుకు రావటం లేదని కాదు వచ్చిన వారి డిమాండ్లలో న్యాయం ఎంత అన్నది ముఖ్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డాగా తెలంగాణా గడ్డను మారుస్తారా ?

06 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Telangana

≈ 1 Comment

Tags

AIMIM, BJP, GHMC election 2020, trs


ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుదామంటే ఎల్లవేళలా సాధ్యం కాదు.అందునా రాజకీయ పార్టీలకు అసలు కుదరదు. హైదరాబాద్‌ మహానగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలన్నింటికీ ఒక కొత్త సవాలును ముందుకు తెచ్చాయి. దాన్ని ఏ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అన్నదాన్ని బట్టి వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మీద ఒక తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాదు జనాభా రీత్యా రాష్ట్రంలో మూడోవంతు కలిగి ఉంది. తెలుగు ప్రాంతాల నుంచే గాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్ధిరపడిన, వలస వచ్చిన జనం ఇక్కడ ఉంది. ఈ నేపధ్యంలోనే తప్పించుకు తిరిగితే కుదరని స్ధితి ఏర్పడిందని చెప్పాల్సి వస్తోంది.
జిహెచ్‌ఎంసి ఫలితం తీరు తెన్నులు ఏమిటి ?
గత ఎన్నికలకు, వర్తమాన ఎన్నికలకు పోలికను చూడటం సహజమే అయినప్పటికీ అనేక అంశాలు ఒకదానితో ఒకటి పోల్చుకొనేందుకు వీలు లేదు. గత ఎన్నికల్లో బిజెపి తన మిత్రపక్షం తెలుగుదేశంతో కలసి 63 స్ధానాల్లో పోటీ చేసింది, ఈసారి అన్ని సీట్లకు పోటీ చేసింది. మజ్లిస్‌ పార్టీ గత ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేయగా ఈ సారి 51కే పరిమితం అయింది. అందువలన వచ్చిన సీట్లు, ఓట్లశాతలను పోల్చుకోలేము. టిఆర్‌ఎస్‌ అన్ని స్ధానాలకు కాంగ్రెస్‌ 146 చోట్ల పోటీ చేసింది. పార్టీల వారీ టిఆర్‌ఎస్‌ 55, బిజెపి 48, మజ్లిస్‌ 44, కాంగ్రెస్‌ రెండు సీట్లు తెచ్చుకుంది. ఒక స్ధానం ఫలితం ఖరారు కావాల్సి ఉంది. గత, తాజా ఎన్నికల్లో పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ 2016 ——- 2020
టిఆర్‌ఎస్‌ 43.85 ——- 34.9
బిజెపి 10.34 ——– 34.6
మజ్లిస్‌ 15.85 ——– 18.28
కాంగ్రెస్‌ 13.11 ——— 6.5
టిడిపి 15.10 ——— 1.61
గత ఎన్నికల ఫలితాలు ఏమి వెల్లడించాయి ?
గత ఏడాది జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలోనే కారు వేగం తగ్గటాన్ని చూశాము. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు, పార్టీల వారీ ఓటింగ్‌ ఇతర అంశాలను క్లుప్తంగా చూద్దాం.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులను టిఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్‌ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్‌ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్‌ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్‌ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్‌ 431, కాంగ్రెస్‌ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్‌ పార్టీ 99 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్‌ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్‌ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా దానికి సీట్లు రాలేదు.
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో కారు వేగం బాగా తగ్గింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.
మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ 50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస 28 ———- 71 —– 20 —– 0 —— 1—— 1
కాంగ్రెస్‌ 1 ———- 10 —– 35 —– 30 —- 26 —- 18
బిజెపి 0 ———— 3 ——- 4 —– 14 —- 40 —- 59
మజ్లిస్‌ 0 ———— 0 ——- 2 ——- 1 —– 2 —- 40
–ఇతరులు 1 ———— 2 —— 11 —– 17—-48 —- 41

పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరాసకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్‌ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్‌ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్‌ 41(12.61) మజ్లిస్‌ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్‌, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్‌ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. కరీంనగర్‌ లోక్‌సభ స్ధానానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 60 స్ధానాలకు గాను టిఆర్‌ఎస్‌ 36, దానితో ఉండే స్వతంత్రులు నలుగురు, బిజెపి 13, మజ్లిస్‌ 6,స్వతంత్ర ఒకరు ఉన్నారు.

రాబోయే రోజుల్లో బిజెపి వ్యూహమేమిటి ?
బిజెపి హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన వనరులను అన్నింటినీ కేంద్రీకరించటంతో పాటు తన మత అజెండాను పూర్తిగా ముందుకు తీసుకు వచ్చింది. మత పరమైన భావోద్వేగాలను గరిష్ట స్ధాయిలో రేపేందుకు అది ప్రయత్నించింది. ఎన్నికల ఫలితాలపై చర్చలలో ఆ పార్టీ ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలను మొత్తంగా చూస్తే ఈ అజెండాను రాష్ట్ర వ్యాపితంగా ముందుకు తీసుకుపోవటం ద్వారా 2023 లేదా దానికి ముందే ఒక వేళ జమిలి ఎన్నికలను రుద్దితే 2022లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో విజయం సాధించాలనే ఆశ, ఆకాంక్షలను అది దాచుకోలేదు. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత హైదరాబాదులో వచ్చిన విజయాలతో రానున్న రోజుల్లో ప్రచారదాడిని మరింతగా పెంచనుంది. మజ్లిస్‌ను పరోక్షంగా ప్రోత్సహించి లబ్ది పొందుతుంది తప్ప ప్రత్యక్షంగా సంబంధాలను తీసుకొనే అవకాశాలు లేవు. ఒక రాష్ట్ర అధికారం వేరు ఒక కార్పొరేషన్‌ పరిధి వేరు.

కాంగ్రెస్‌ భవితవ్యం ఏమిటి ?
ఆంబోతుల మధ్య లేగ దూడలు నలిగిపోయినట్లుగా కాంగ్రెస్‌ పరిస్దితి తయారైంది. దుబ్బాకలో చివరి నిమిషం వరకు అభ్యర్ధిని తేల్చుకోలేకపోవటంలోనే దాని బలహీనత వ్యక్తమైంది. హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో అలాంటి పరిస్ధితి లేదు. అంతర్గత విబేధాలు వెల్లడయ్యాయి. బిజెపి-మజ్లిస్‌-తెరాసలతో పోటీ పడి అది ప్రచారం నిర్వహించలేకపోయింది. సంఖ్యరీత్యా గతంలో ఉన్న రెండు సీట్లు నిలుపుకున్నా గణనీయంగా ఓట్లను కోల్పోయింది. ఆ పార్టీలో ఇప్పుడు మిగిలేవారు ఎందరు అన్నది ప్రశ్న. ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించినా దానిలో ఉంటారనే విశ్వాసం ఓటర్లలో కోల్పోవటం ఒక ప్రధాన కారణం. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమకుమార్‌ ఎప్పుడో తప్పుకుంటానని ప్రకటించినా ఆ స్ధానంలో మరొకరిని భర్తీ చేయలేని పార్టీ తీరా పూర్తిగా కాడి పడవేసిన తరువాత కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేని బలహీనతతో అది ఉంది.

చౌరాస్తాలో ఉన్న టిఆర్‌ఎస్‌ కారు !
టిఆర్‌ఎస్‌ కారుకు దుబ్బాకలో ఓడిపోయిన దాని కంటే హైదరాబాద్‌లో గెలిచినా పెద్ద దెబ్బతగిలింది. నాలుగు రోడ్ల (చౌరాస్తా) కూడలిలో నిలిచింది.ఇది స్వయంకృతం. ఇప్పుడు అది ఏ దారిలో వెళ్లనుంది అన్నదే కీలకమైన ప్రశ్న. హైదరాబాదు ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాలను కొత్త బాట పట్టించేందుకు దోహదం చేశాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను ఆకర్షించి దెబ్బతీసిన ప్రశ్నించే వారు లేకుండా చూసుకోవాలని భావించిన ఆ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో తన వారిని నిలుపుకొనేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తుందన్న ప్రశ్నను ఈ పరిణామం ముందుకు తెచ్చింది. హైదరాబాద్‌ను చూపి బిజెపి తెరాస-కాంగ్రెస్‌ నేతలకు గాలం వేస్తున్నది. మజ్లిస్‌తో అది ఆడిన క్రీడ ఇప్పుడు అడుగడుగునా మజ్లిస్‌కు లొంగలేదు అని నిరూపించుకోవాల్సిన పరిస్ధితిని తెచ్చి పెట్టింది. మేయర్‌ ఎన్నికలో అది పోటీ చేసినా, చేయకుండా బేషరతు మద్దతు ఇచ్చినా తెరవెనుక ఏదో జరిగిందనే జనం భావించే స్దితిని స్వయంగా కల్పించుకుంది.

మజ్లిస్‌ ఏమి చేయనుంది ?
ఇతర రాష్ట్రాలలో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బిజెపి బి టీమ్‌గా పోటీలోకి దిగుతున్నదనే విమర్శ మజ్లిస్‌ మీద ఉంది. దాని వలన లబ్దిపొందిన తీరును మహారాష్ట్ర, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో చూశాము.మరికొన్ని చోట్ల కూడా అదే పాచికను ప్రయోగించవచ్చు. అయితే తెలంగాణా- ప్రత్యేకించి హైదరాబాదులో ఉన్న పరిస్ధితి వేరు. మజ్లిస్‌, ముస్లిం మైనారిటీలను బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతానికి చెందిన వారిని తన ఓటు బ్యాంకుగా మార్చుకొనేందుకు ఎప్పటి నుంచో నిరంతరం ప్రయత్నిస్తోంది. బిజెపి ప్రచారంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని పటిష్ట పరచుకుంది. రెండు మతశక్తులు రంగంలోకి దిగినపుడు జరిగే పరిణామం ఇదే. ఇప్పుడు మజ్లిస్‌ను ఒక అంటరాని పార్టీగా చేయటంలో బిజెపి ప్రచారం విజయవంతమైంది. ఎన్నికల ప్రచారంలో బిజెపి అంత తీవ్రంగా గాకపోయినా మజ్లిస్‌ను కూడా టిఆర్‌ఎస్‌ విమర్శించక తప్పలేదు. మజ్లిస్‌ మాత్రం టిఆర్‌ఎస్‌ మీద ఎలాంటి దాడి చేయలేదు. ఈ పరిణామాన్ని బిజెపి ఉపయోగించుకుంది. మజ్లిస్‌ను ఉపయోగించుకొని లబ్ది పొందేందుకు గతంలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నించింది. ఇదే టిఆర్‌ఎస్‌ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసింది. ఒక విధంగా చూస్తే ఇప్పుడు మజ్లిస్‌ కూడా ఇరకాటంలో పడింది. అధికారం లేకుండా అది ముస్లింలను తనతో ఉంచుకోలేదు. గొంతెమ్మ కోరికలు కోరి తెగేదాక లాగకపోవచ్చు. ఒక ఎత్తుగడగా ఈ ఎన్నికలో వాటా కోరకపోవచ్చు. డిప్యూటీ మేయర్‌ లేదా కొంతకాలం మేయర్‌ పదవితో దానికి వచ్చే ప్రయోజనం కంటే బేషరతు మద్దతుతోనే ఎక్కువ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు.

ఇప్పుడేమి జరగనుంది ? ఏమి చేయాలి ?
హైదరాబాదు మేయర్‌ కంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగానే అన్ని పార్టీలు వ్యవహరించటం అనివార్యం. రాజకీయాల్లో దేశద్రోహులుగా లేదా దేశద్రోహశక్తులకు మద్దతు ఇచ్చిన పార్టీలని తాను విమర్శించిన వాటితో చేతులు కలపటానికి బిజెపికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాశ్మీరులో పిడిపితో కలసి సంకీర్ణ మంత్రివర్గంలో పాల్గొనటమే దానికి పెద్ద నిదర్శనం. అలాంటి పార్టీకి మజ్లిస్‌తో చేతులు కలపటం పెద్ద సమస్య కాదు. అయితే అలంకార ప్రాయమైన మేయర్‌ పీఠం కంటే ముఖ్యమంత్రి గద్దె మీద బిజెపి కేంద్రీకరించినందున ప్రస్తుతానికి మజ్లిస్‌తో చేతులు కలిపే అవకాశాలు లేవు. మజ్లిస్‌తో చేతులు కలిపిందనే ప్రచారాన్ని నగర ఓటర్లు అనేక మంది నమ్మిన కారణంగానే గతంలో టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారు ఇప్పుడు బిజెపి వైపు మొగ్గారు. అలాంటపుడు మజ్లిస్‌తో చేతులు కలిపితే బిజెపికి మొదటికే మోసం వస్తుంది.
మేయర్‌ పీఠాన్ని టిఆర్‌ఎస్‌ దక్కించుకొనేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి ? హాజరైన సభ్యులలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీకి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలు దక్కుతాయి. తమ మధ్య ఎలాంటి అవగాహన లేదు అని చెప్పుకొనేందుకు మజ్లిస్‌ ఓటింగ్‌ను బహిష్కరించవచ్చు లేదా అది కూడా పోటీ పెడితే బిజెపి కూడా పోటీ చేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండవచ్చు. ఏది జరిగినా టిఆర్‌ఎస్‌కు పీఠం ఖాయం. గత ఎన్నికల్లో టిర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉన్న కారణంగా రెండు పదవులనూ అదే దక్కించుకుంది. మజ్లిస్‌తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే బిజెపి పన్నిన వలలో చిక్కినట్లే. పరోక్షంగా మద్దతు తీసుకున్నా బిజెపి దాడి ఆగదు.
తెలంగాణా వ్యాప్తంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు అనువైన భౌతిక పరిస్ధితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగితే ఇలాంటి మితవాద భావాలు ఓటర్ల మీద బలంగా ప్రభావం చూపుతాయి. అది హైదరాదు నగరం మీద ఉన్నంత తీవ్రంగా ఇతర ప్రాంతాల మీద ఉంటుందని చెప్పలేము. చారిత్రక నేపధ్యం, రజాకార్‌ వారసత్వం, గతంలో ఇక్కడ జరిగిన మతకలహాలు, రాజకీయ పార్టీల అవకాశవాదం దీనికి కారణం. హైదరాబాదులో మజ్లిస్‌ పార్టీ గూండాయిజం నుంచి రక్షణ కల్పించేది తామే అనే బిజెపి ప్రచారం దశాబ్దాలుగా పధకం ప్రకారం సాగుతోంది. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్నట్లుగా అనేక మంది ఆ ప్రచారానికి లోనుకావటం కూడా తాజా ఎన్నికల్లో బిజెపి పుంజుకోవటానికి దోహదం చేసింది. ముఖ్యంగా మజ్లిస్‌ ప్రభావం ఎక్కువ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకోవటం లేని ప్రాంతాలలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించటం దానికి ఒక సూచిక అని చెప్పవచ్చు.
టిఆర్‌ఎస్‌-బిజెపి మధ్య తెరవెనుక అవగాహన ఉందన్నది గతంలో ఆ పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో, వెలుపల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వైఖరి స్పష్టం చేసింది. బిజెపితో రాజీపడి తమ జోలికి రాకుండా చూసుకోవాలన్నది టిఆర్‌ఎస్‌ నేతల అవకాశవాదం. అదే విధంగా మజ్లిస్‌ను బుజ్జగించే వైఖరితోనే ఆ పార్టీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని బిజెపి చేస్తున్న ప్రచారదాడిని ఎదుర్కోవటంలో చట్టపరంగా, రాజకీయంగా కెసిఆర్‌ సర్కార్‌ అచేతనంగా ఉందని జనం భావిస్తున్నారు. తాము పార్లమెంట్‌లో బిజెపికి మద్దతు ఇచ్చి తప్పు చేశామనే టిఆర్‌ఎస్‌ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేసినా రాజకీయంగా నిర్దిష్ట వైఖరిని తీసుకోలేదు. నవంబరు 26జాతీయ సమ్మెకు చివరి నిమిషంలో మద్దతు ప్రకటించింది.డిసెంబరు ఎనిమిదవ తేదీ భారత్‌ బంద్‌లో సంపూర్ణంగా పొల్గొనాలని రెండు రోజులు ముందుగానే కెసిఆర్‌ ప్రకటించారు. బిజెపి తమ గద్దెకు ఎసరు తెస్తోందని నిర్ధారించుకున్నట్లుగా ఇది సూచిస్తున్నది.
ఇక మజ్లిస్‌తో తమకు తెరచాటు అవగాహన లేదని నిరూపించుకొనే బాధ్యత టిఆర్‌ఎస్‌ మీద ఉంది. దాని వలన లబ్ది పొందేది కూడా అదే. తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా నిజమాబాద్‌ కార్పొరేషన్‌లో దాని సహకారంతోనే మేయర్‌ పదవిని దక్కించుకుంది. కనుక చెప్పే మాటలను అంత తేలికగా నమ్మటం కష్టం. ఎలా నిరూపించుకుంటారో ఆ పార్టీయే నిర్ణయించుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే అదేమీ కష్టం కాదు. నిజంగానే అదే జరిగితే ఏం జరుగుతుంది ? రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు గతంలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఇటీవల టిఆర్‌ఎస్‌ వైపు ఉన్నారు. మజ్లిస్‌తో సంబంధాలను తెంచుకుంటే ఆ పార్టీ ఇతర రాష్ట్రాలలో తన అభ్యర్ధులను పోటీ పెట్టి మైనారిటీల ఓట్లను చీల్చి బిజెపికి లబ్ది చేకూర్చినట్లే ఇక్కడ కూడా చేసేందుకు అవకాశం లేకపోలేదు. బిజెపి మెజారిటీ మతతత్వాన్ని వ్యతిరేకించినట్లే మజ్లిస్‌ మైనారిటీ మతతత్వాన్ని కూడా నిఖరంగా వ్యతిరేకిస్తే కోల్పోయిన ఓట్లలో కొన్నింటిని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇదే విధంగా అసంతృప్తి చెందిన వివిధ తరగతుల సమస్యలను పరిష్కరిస్తే వారి మద్దతును కూడా తిరిగి పొందటం కష్టం కాదు. ప్రభుత్వం మీద ఒకసారి అసంతృప్తి ప్రారంభమైతే ఎన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపినా అవి ఓట్లు తెచ్చి పెట్టవు అని ఇప్పటికైనా టిఆర్‌ఎస్‌ నాయకత్వం గుర్తించటం అవసరం. ఎవరు అధికారంలోకి వచ్చినా అమలు జరుపుతున్న సంక్షేమ పధకాలను కొనసాగిస్తారు కనుక తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకోవచ్చనే అభిప్రాయం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్లలో కనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ అది మరింత స్ధిరపడుతుంది. కొత్తది ఏదైనా సాధారణ స్దాయికి చేరిన తరువాత దాని మీద ఆకర్షణ తగ్గి కొత్త అంశాల మీద కేంద్రీకరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగింది అదే. చంద్రబాబు నాయుడి సర్కార్‌ అమలు జరిపిన పధకాలేమీ తక్కువ కాదు, చివరి నిమిషంలో ముందుకు తెచ్చిన పసుపు-కుంకమ కంటే వైసిపి పార్టీ ఎక్కువగా అమలుజరుపుతుందని జనం భావించారన్నది స్పష్టం.
హైదరాబాదు ప్రచారంలో అభివృద్ది అంశాల కంటే మత అంశాలనే ఎక్కువగా ముందుకు తెచ్చారు. తెలంగాణాలో సంక్షేమ పధకాలతో పాటు మతోన్మాద భావాలను కూడా బిజెపి జమిలిగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రసమితి, ఆ పార్టీ నాయకత్వం తమ వైఖరులను మార్చుకొని సామరస్యతగా మారుపేరుగా ఉన్న రాష్ట్రాన్ని ఇదే బాటలో నడిపిస్తారా ? అవకాశ వాదం, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి మెజారిటీ-మైనారిటీ మతశక్తుల అడ్డాగా మారుస్తారా ? టిఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్ష ఎదురైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బీహార్‌ ఎన్నికల ఫలితాలు: ప్రధాని నరేంద్రమోడీ అసత్యాలు-వాస్తవాలు !

12 Thursday Nov 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Bihar assembly 2020 verdict, MGB-Bihar, NDA, Nitish Kumar, Tejashwi Yadav


ఎం కోటేశ్వరరావు
బీహార్‌లో జెడియు-బిజెపి కూటమి గెలుపు అక్కడి అభివృద్ది పనులకు విజయమని ప్రధాని నరేంద్రమోడీ వర్ణించారు. బీహార్‌ ప్రజాస్వామ్య గడ్డ అని ఎందుకు పిలుస్తామో ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు.కుటుంబ పాలన గురించి కూడా నరేంద్రమోడీ ప్రస్తావించారు. ఢిల్లీలో జరిగిన బీహార్‌ ఎన్నికల విజయోత్సవ సభలో ప్రధాని చేసిన ప్రసంగమంతా ఇదే ధోరణిలో కొనసాగింది.ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఎవరూ చెప్పలేదని, అనుకూలత కారణంగానే తమ కూటమి 125 స్ధానాలు సాధించిందని బీహార్‌ ఉపముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ చెప్పారు. ఇద్దరు యువరాజులు అధికారం కోసం పోటీ పడుతున్నారని. మరొక సారి అరాచక పాలనా కావాలో లేదో తేల్చుకోవాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని బీహారీలను కోరారు. నిజంగా బీహార్‌లో బిజెపి కూటమి సాధించినదాన్ని ” విజయం ” గా పరిగణించాలా ? ప్రధాని పేర్కొన్న ఇతర అంశాల్లో నిజమెంత ? అంకెలతో ఎలా అయినా ఆడుకోవచ్చు, భిన్న భాష్యాలు చెప్పవచ్చు తప్ప వాటిని మార్చలేము.


భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా కొన్ని వేల ఓట్ల తేడాతో అధికారం దక్కటం బీహార్‌లోనే జరిగింది. గతంలో కేరళలో అలాంటి పరిణామం జరిగినప్పటికీ కొన్ని లక్షల ఓట్ల తేడా ఉంది. ఇది రాసిన సమయానికి ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు కాలేదు. వివిధ మీడియా సంస్దలు అందచేసిన వివరాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నపుడు 0.1 శాతం నుంచి 0.05శాతం మధ్య తేడాలు చూపాయి. ఓట్ల రీత్యా చూస్తే పదమూడు నుంచి 24 వేల ఓట్ల మెజారిటీతో అధిక సీట్లు తెచ్చుకొని ఎన్‌డిఏ కూటమి అధికారం సాధించటం బీహార్‌లో మాత్రమే జరిగింది. ఈ కారణంగానే చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. అసెంబ్లీలోని 243 సీట్లలో మెజారిటీకి అవసరమైన 122గాను ఎన్‌డిఏ 125 తెచ్చుకొన్నది. రాష్ట్రీయ జనతాదళ్‌ లేదా ఆర్‌జెడి-కాంగ్రెస్‌-మూడు వామపక్ష పార్టీల (ఎంజిబి) కూటమి 110, మూడవ కూటమిగా పోటీ చేసిన వాటిలో మజ్లిస్‌ 5, బిఎస్‌పి, విడిగా పోటీలో ఉన్న ఎల్‌జెపి 1, స్వతంత్రులు ఒకరు గెలిచారు. పార్టీల వారీగా చూసినపుడు గత అసెంబ్లీలో 81 స్ధానాలున్న జెడియు 43కు పరిమితం కాగా, బిజెపి 53ను 74కు పెంచుకుంది. ఈ రెండు పార్టీల మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీలు ఒకటి నుంచి ఎనిమిదికి పెంచుకున్నాయి. ఆర్‌జెడికి 80కిగాను 75, కాంగ్రెస్‌కు 27కు 19 వచ్చాయి. సిపిఐ(ఎంఎల్‌-లిబరేషన్‌) మూడు నుంచి 12కు పెంచుకోగా ప్రాతినిధ్యం లేని సిపిఐ, సిపిఎం రెండేసి చోట్ల గెలిచాయి. మజ్లిస్‌ పార్టీ ఐదు, బిఎస్‌పి ఒకటి కొత్తగా సంపాదించాయి. స్వతంత్రులు నాలుగు నుంచి ఒకటికి తగ్గారు.


ఓట్ల వివరాలను చూస్తే వికీపీడియా ప్రకారం జెడియు కూటమికి 37.26శాతం (1,57,01,226), ఆర్‌జెడి కూటమికి 37.21(1,56,77,0320) వచ్చాయి. ఎల్‌జెపి పోటీ చేసిన 134 స్ధానాల్లో 5.66శాతం(23,83,457) ప్రజాస్వామ్య లౌకిక మహాకూటమి పేరుతో పోటీ చేసిన ఆరు పార్టీల కూటమికి 4.5శాతం ఓట్లు వచ్చాయి. బిజెపి పోటీ చేసిన చోట ఎల్‌జెపి తన అభ్యర్ధులను నిలపకుండా ఆ పార్టీకి మద్దతు ప్రకటించింది.అంటే 109 స్ధానాల్లో తన ఓట్లను బదలాయించింది. ఆ పార్టీ సాధించిన ఓట్ల సగటు ప్రాతిపదికగా 4.6శాతం ఓట్లను బిజెపికి వేయించిందని భావించవచ్చు. ఈ ఎన్నికలలో బిజెపికి 19.46శాతం, జెడియుకు 15.39 శాతం వచ్చాయి. ఎల్‌జెపి ఓట్ల బదలాయింపు బిజెపి సీట్లు, ఓట్ల సంఖ్య పెరిగేందుకు దోహదం చేసిందని అంకెలు చెబుతున్నాయి. కనీసం 30 స్ధానాల్లో జెడియు అవకాశాలను దెబ్బతీసిందని ప్రాధమిక సమాచారం వెల్లడించింది. 2019 మేనెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, జెడియు, ఎల్‌జెపి మూడూ కలసి 53.25శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. వామపక్షాలు లేని ఆర్‌జెడి-కాంగ్రెస్‌ కూటమికి 30.76శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ చూస్తే జెడియు కూటమిలో బిజెపి 96, జెడియు 92, ఎల్‌జెపి 35, హిందూస్దానీ అవామ్‌ పార్టీ రెండు చోట్ల మొత్తం 225 స్ధానాల్లో ఆధిక్యత, 40కి గాను 39లోక్‌ సభ సీట్లును సాధించాయి. ఆర్‌జెడి 9, కాంగ్రెస్‌ 5 స్ధానాలకే పరిమితం అయ్యాయి.(కాంగ్రెస్‌ మాత్రమే ఒక లోక్‌సభ స్ధానంలో విజయం సాధించింది) విడిగా పోటీ చేసిన మజ్లిస్‌ రెండు, ఆర్‌ఎస్‌ఎల్‌పి, సిపిఐ(ఎంఎల్‌-లిబరేషన్‌) ఒక్కొక్క చోట ఆధిక్యత కనపరిచాయి.


లోక్‌సభ ఎన్నికలలో బిజెపి-జెడియు 17 చొప్పున, ఎల్‌జెపి ఆరు చోట్ల పోటీ చేసి వరుసగా 23.58, 21.81, 7.86శాతం తెచ్చుకున్నాయి.పై వివరాలన్నీ చూసినపుడు ప్రధాని నరేంద్రమోడీ ఎంతగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికలలో ఆ కూటమికి ఓట్లు, సీట్లు కూడా గణనీయంగా తగ్గాయి. మరోవైపు ఆర్‌జెడి కూటమి ఓట్లు, సీట్ల రీత్యా ఎంతో మెరుగుదల సాధించాయి.
ఏడాదిన్నర క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 40కిగాను 39 స్ధానాలు సాధించిన జెడియు-బిజెపి కూటమి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా 243కు గాను 125 స్ధానాలు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. బీహారీల తీర్పు సరికొత్త రాజకీయానికి తెరలేపింది.గత రెండు దశాబ్దాలుగా మూడు స్ధంభాలాటగా మారిన రాష్ట్ర రాజకీయాలలో బిజెపి, ఆర్‌జెడి, జెడియు పార్టీలలో ఏ రెండు కలిసినా అధికారాన్ని పొందే పరిస్ధితి తలెత్తింది. దీన్ని ఉపయోగించుకొని నితీష్‌ కుమార్‌ 15ఏండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే గాక సీట్లు తగ్గినా తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు కూడా ఇదే పొందిక తోడ్పడింది.


తొలిసారి నరేంద్రమోడీ పాలనా కాలంలో 2014-19 మధ్య బిజెపి బంధం నుంచి 15 పార్టీలు వైదొలిగాయి. రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత మూడు పార్టీలు గుడ్‌బై చెప్పాయి.ఈ నేపధ్యంలో బీహార్‌ పరిణామాలను చూడాల్సి ఉంది. మహారాష్ట్ర అనుభవనాన్ని చూసిన తరువాత దాన్ని పునరావృతం కానివ్వరాదని బిజెపి అధిష్టానవర్గం బీహార్‌లో జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి ఇది అనివార్యస్ధితి. ఈ నేపధ్యంలోనే తమ కారణంగానే నితీష్‌ కుమార్‌కు మరోమారు ముఖ్యమంత్రి పదవి దక్కిందని శివసేన వ్యాఖ్యానించింది. ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ఆ పార్టీ నేతలు ఒక వేళ మాట తప్పితే మా మాదిరే వ్యహరించాలని జెడియుకు హితవు చెప్పింది. ఈ కారణంగానే అనివార్య పరిస్ధితుల్లో బిజెపి వ్యవహరిస్తోంది. ఇది ఎంత కాలం కొనసాగుతుంది అన్న ప్రశ్న ఎలాగూ ఉండనే ఉంటుంది. మహారాష్ట్రలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా అధికారాన్ని రెండు భాగాలుగా పంచుకొనేందుకు అంతర్గతంగా అంగీకరించిన బిజెపి ఫలితాలు వచ్చిన తరువాత మాట తప్పిందని శివసేన చెప్పింది. తాము అలాంటి ఒప్పందం చేసుకోలేదని బిజెపి అడ్డం తిరిగింది. ఫలితంగా అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు, పర్యవసానాల్లో బిజెపి భంగపడిన విషయం తెలిసిందే. తమకు సీట్లు ఎక్కువ వచ్చిన కారణంగా సిఎం పదవి తమకే అని బీహార్‌ బిజెపి అంటే శివసేన మాదిరి జెడియు బయటకు వచ్చి ఆర్‌జెడితో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే నితీష్‌ కుమార్‌ను గద్దెనెక్కించి చక్రం తిప్పాలని బిజెపి నిర్ణయించిందని చెప్పవచ్చు. మాన్‌ ఆఫ్‌ ది మాచ్‌ ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్‌, ఎన్‌డిఏ విజయోత్సవాలు చేసుకోవటం పెద్ద జోక్‌, జెడియు అవకాశాలను దెబ్బతీసిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఇంకా ఎన్‌డిఏలోనే ఉన్నారు అని శివసేన నేత సంజయ రౌత్‌ వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో అందునా అధికారం కోసం దేనికైనా గడ్డి కరుస్తున్న ఈ రోజుల్లో తెల్లవారే సరికి అనూహ్య పరిణామాలు జరగవచ్చు. ఈ నేపధ్యంలో నితీష్‌ కుమార్‌ పదవి ఎంతకాలం ఉంటుంది అన్నది ఒక ప్రశ్న. వివాదాస్పద ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ అంశాలు ముందుకు వచ్చినపుడు బీహార్‌లో వాటిని అమలు జరిపేది లేదని నితీష్‌ కుమార్‌ చెప్పారు. అంతేకాదు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు, దాన్ని బిజెపి వ్యతిరేకించలేదు. నాడు బిజెపి మీద నితీష్‌ కుమార్‌, నేడు బిజెపి మీద నితీష్‌ కుమార్‌ ఆధారపడనున్నారు. అందువలన ఇప్పుడు కూడా బిజెపి దానికే కట్టుబడి ఉంటుందా ? ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో పార్లమెంట్‌లో జెడియు వ్యతిరేకించింది. తరువాత ఒకసారి పార్లమెంట్‌ ఆమోదించిన తరువాత బలపరచక చేసేదేమీ లేదని అడ్డం తిరిగింది. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఓటర్లను వేడుకున్న నితీష్‌ కుమార్‌ ఇప్పుడు పదవికోసం ఎన్‌ఆర్‌సి,ఎన్‌పిఆర్‌ విషయంలో గత వైఖరికే కట్టుబడి ఉంటారా ? పదవికోసం పై అంశాలలో తన వ్యతిరేకతను తానే దిగమింగి బిజెపి అజెండాకు జైకొడతారా ? అదే జరిగితే జెడియులో ఎలాంటి వ్యతిరేకత తలెత్తదా ?
తాత్కాలికంగా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినప్పటికీ తరువాత వత్తిడి తెచ్చి కేంద్ర మంత్రిగా పంపటం లేదా తనంతట తానే పదవి నుంచి తప్పుకొనే విధంగా బిజెపి వ్యవహరించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఒక వేళ అదే జరిగితే జెడియు ఎంఎల్‌ఏలు బిజెపి నాయకత్వాన్ని అంగీకరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్దకమే. బిజెపి దయాభిక్షతో వచ్చే పదవులు ఆర్‌జెడి కూటమికి మద్దతు ప్రకటించినా వస్తాయన్నది స్పష్టమే. ఇక విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసంలోని కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.తమ అభివృద్ధి పధకాలే విజయాన్ని చేకూర్చాయన్నారు. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? ఇప్పటికి సాధించినదానికే తమ భుజాలను తాము చరుచుకుంటే బీహార్‌ రాబోయే రోజుల్లో కూడా అధోగతిలోనే ఉంటుంది. పదిహేనేండ్ల నితీష్‌ కుమార్‌ పాలనలో మానవాభివృద్ధి సూచికలో 2018 యుఎన్‌డిపి నివేదిక ప్రకారం బీహార్‌ 36వ స్దానంలో ఉంది. దాని తరువాత మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం లేదు. అయినా మోడీ అభివృద్ధి విజయమని చెప్పారు.


ప్రధాని అరాజకశక్తిగా వర్ణించిన ఆర్‌జెడి కూటమి గురించి చూద్దాం. గతంలో అక్కడ అరాజకం నెలకొన్నమాట నిజం. భూమికోసం, అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటాలు సాగించినపుడు వాటిని అణచివేసేందుకు భూస్వామిక శక్తులు వివిధ సేనల పేరుతో గూండా గుంపులను పెంచి పోషించాయి. వాటికి నాడు ఒకే పార్టీలో ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌, దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అందరూ పరోక్షంగా మద్దతు ఇచ్చారు. తరువాత విడిపోయి వేర్వేరు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్నికలలో జెడియు కూటమితో సమంగా బీహారీలు ఓటు వేయటం ప్రధాని నరేంద్రమోడీ, ఆ కూటమికి చెంపదెబ్బగా చెప్పవచ్చు. నితీష్‌ కుమార్‌ ఏలుబడిలో గూండాయిజం లేదన్నది మోడీ గారి భాష్యం. గూండాయిజం సాగిందని చెబుతున్న సమయంలో తేజస్వి యాదవ్‌ నిక్కర్లతో తిరిగిన బాలుడు. ఇప్పుడు 31సంవత్సరాల యువకుడు. అందువలన గతానికి అంటే తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఏలుబడికి ముడిపెట్టి చేసిన ప్రచారాన్ని ఓటర్లు పట్టించుకోలేదన్నది స్పష్టం. ఎన్నికలలో ఎక్కడా బూత్‌ల ఆక్రమణ, దౌర్జన్యం వంటివి నమోదు కాలేదు. రెండు కూటములకు సమానంగా ఓట్లు రావటాన్ని బట్టి నరేంద్రమోడీ చేసిన ప్రచారాన్ని ఓటర్లు తిప్పికొట్టారని చెప్పవచ్చు.
మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ బిజెపికి ప్రాధాన్యత పెరుగుతోందని దానికి అనుగుణ్యంగా బీహార్‌లో సీట్లు పెరిగాయని ప్రధాని విజయోత్సవ సభలో చెప్పారు. బీహార్‌ ఎన్నికలలో గత పాతిక సంవత్సరాలలో బిజెపి సాధించిన అసెంబ్లీ స్ధానాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల సంవత్సరం—- సీట్లు
1995 ——- —— 41
2000 —————72
2005 ఫిబ్రవరి— 37
2005 అక్టోబరు— 55
2010—————- 91
2015 ————— 53
2020 ————— 74
ఈ అంకెలు నరేంద్రమోడీ చెప్పింది వాస్తవం కాదని వెల్లడిస్తున్నాయి. గతంలో గరిష్టంగా 72, 91స్ధానాలు తెచ్చుకున్న పార్టీ ఇప్పుడు 74తెచ్చుకుంటే దాన్ని ఆదరణగా చెప్పటం జనాల జ్ఞాపకశక్తిని అవమానించటం తప్ప వేరు కాదు. తమకు ఓటు వేస్తే కరోనా వైరస్‌ వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామన్న వాగ్దానం, నరేంద్రమోడీ రామాలయ నిర్మాణం, గాల్వాన్‌ లోయలో మరణించిన బీహార్‌ రెజిమెంట్‌ సైనికులు, సినిమా సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఆత్మహత్యను కూడా ఎన్నికల్లో వాడుకోవాలని చూసినా వాటి వలన పెద్దగా ప్రభావితులైనట్లు కనిపించలేదు.


గతంలో కాంగ్రెస్‌ అనుసరించిన అప్రజాస్వామిక, చివరికి అత్యవసర పరిస్ధితిని కూడా విధించిన నేపధ్యంలో దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు సమీకృతమయ్యాయి. జనతా పార్టీలో నేటి బిజెపి పూర్వ రూపమైన జనసంఘం కూడా ఉన్నదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన కారణంగా సిపిఎం, ఇతర వామపక్షాలు ఆ పార్టీకి మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు అత్యవసర పరిస్దితిని విధించకపోయినా రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చటం, ప్రతిపక్షాలపై కేంద్ర సంస్ధలతో దాడులు చేయించటం వంటి చర్యలతో పాటు మతోన్మాదాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువస్తోంది. ఈ జంట ప్రమాదాల నేపధ్యంలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు ద్వారా ఓట్ల చీలిక నివారించి ఆ పార్టీని ఎదుర్కోవాలనే అభిప్రాయం నానాటికీ బలపడుతోంది.


బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దాని ప్రాధాన్యతను మరింత స్పష్టపరిచాయి.కాంగ్రెస్‌ లేదా ఆర్‌జెడి విధానాలు, అవగాహనలను వామపక్షాలు లేదా మరొక శక్తి ఆమోదించటం, అంగీకరించాల్సిన అవసరం లేదు. ఏది ప్రధాన సమస్య అన్నపుడు బిజెపి ముప్పు ముందుకు వస్తోంది. గతలోక్‌ సభ ఎన్నికలలో వామపక్షాలు విడిగా పోటీ చేశాయి. ఐక్యత అవసరాన్ని ఆర్‌జెడి, కాంగ్రెస్‌ గుర్తించాయి. దాని ఫలితమే వామపక్షాలు సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలలో ఆర్‌జెడితో ఎలాంటి సర్దుబాటు లేకుండానే సిపిఐ(ఎంఎల్‌-లిబరేషన్‌,) సిపిఐ, సిపిఎంలకు కలిపి 3.5శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికలలో సర్దుబాటుతో 4.7శాతానికి పెరిగాయి. ఈ ఎన్నికల్లో మహాకూటమి గణనీయ సంఖ్యలో స్దానాలు సంపాదించేందుకు ఈ ఓట్లు ఎంతో దోహదం చేశాయన్నది స్పష్టం. గత లోక్‌ సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి వ్యతిరేక ఓటు సంఘటితం కావాల్సిన అవసరాన్ని ఓటింగ్‌ తీరుతెన్నులు స్పష్టం చేశాయి. బీహార్‌ ఎన్నికలలో ఎన్‌డిఏ కూటమి ‘బి’ టీమ్‌గా రంగంలోకి దిగిన మజ్లిస్‌, బిఎస్‌పి కూటమి చీల్చిన ఓట్ల ద్వారా ఎన్‌డిఏ లబ్ది పొందిదన్నది తెలిసిందే. అందువలన అలాంటి శక్తులను దూరంగా ఉంచుతూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరాన్ని కూడా ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బీహార్‌ ఎన్నికల సమరం : నితీష్‌ కుమార్‌ను -మాయం – చేసిన బిజెపి !

29 Thursday Oct 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Bihar Elections 2020, BJP, JDU, LJP, Nithish Kumar, RJD


ఎం కోటేశ్వరరావు


చాణక్య భూమి బీహార్‌. అన్ని ప్రధాన పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ఏకపక్షం అనుకున్న ఎన్నికలు ఎన్‌డిఏ కూటమికి వణుకుపుట్టిస్తున్నాయి. అక్టోబరు 28న జరిగిన తొలిదశ 71 స్ధానాల ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి వెనుకబడిందని వార్తలు వచ్చాయి. కరోనాను లెక్క చేయకుండా గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే ఎక్కువగా 55.69శాతం పోలింగ్‌ జరిగింది. నితీష్‌ కుమార్‌ను వదిలించుకోవాలనే ఓటర్ల వాంఛకు ఇది నిదర్శనమా ? నితీష్‌ కుమార్‌-నరేంద్రమోడీ కూటమిని గెలిపించాలనే ఉత్సాహం ఎక్కడా కనిపించటం లేదని పోలింగ్‌కు ముందు వచ్చిన వార్తల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.


బిజెపి అంతర్గత సర్వేలలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పట్ల ఓటర్లలో వ్యతిరేక భావం ఉందని వెల్లడి కావటం, మరికొన్ని సర్వేలలో కూడా అదే ప్రతిబింబించటంతో తొలి దశ ఓటింగ్‌కు రెండు రోజుల ముందు దర్శనమిచ్చిన బిజెపి పోస్టర్లలో నితీష్‌ కుమార్‌ మాయం అయ్యారు. నరేంద్రమోడీ చిత్రమే దర్శనమిచ్చింది. ఇది జెడియు శ్రేణులకు ఆగ్రహం తెప్పించిందని, అయితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. బిజెపి అభ్యర్ధుల మీద జెడియు కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుంటారా ? చాణక్య భూమిగా పేరు గాంచిన బీహార్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.


కరోనా లాక్‌ డౌన్‌ ముగిసినా ఇంకా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాని ప్రతికూల ప్రభావాలను జనం ఇంకా మరచి పోలేదు. ఎన్నికల ప్రకటన సమయంలో జెడియు నేత నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి విజయం సాధించనుందంటూ సర్వేల పేరుతో తొలి ప్రచారబాణం వదిలారు. మూడు దశల్లో జరిగే ఎన్నికల్లో అక్టోబరు 28న తొలి దశ, నవంబరు మూడున మలి, ఏడున మూడవ చివరి పోలింగ్‌ ముగిసి పదవ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అమెరికాలోనే సర్వేలు గాడి తప్పాయి. మన దేశం సంగతి, ప్రత్యేకించి బీహార్‌ సంగతి సరేసరి. గత సర్వేలన్నీ నిజం కాలేదు. అంధులు ఏనుగును వర్ణించిన మాదిరి తొలి దశ ప్రచార ముగింపులో కూడా కొన్ని సంస్ధలు సర్వేల వివరాలను వెలువరించాయి. చివరి క్షణం వరకు ఎటూ తేల్చుకోని ఓటర్లు కొందరు ఉంటారు. వారిని ఆకర్షించటం కోసం ఇలాంటి జిమ్మిక్కులను పార్టీలు ప్రయోగిస్తుంటాయి.


ఎన్నికల ప్రకటన నాటికి-తొలి దశ నాటికీ పోలికే లేదన్నది స్పష్టం. నితీష్‌ కుమార్‌తో అధిక సీట్ల కోసం బేరం పెట్టిన లోక్‌జనశక్తి పార్టీ అది వీలుగాకపోవటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు తిరుగుబాటు జెండా ఎగురవేసి జెడియు పోటీ చేస్తున్న అన్ని స్ధానాల్లో అభ్యర్ధులను నిలిపింది. మిగిలిన చోట్ల బిజెపి అభ్యర్ధులను బలపరుస్తానని, తరువాత ఇద్దరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఆర్‌జెడి-కాంగ్రెస్‌ కూటమితో వామపక్షాలు సర్దుబాటు చేసుకుంటాయా లేదా అన్న సందేహాలు కూడా తొలగిపోయి సజావుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్న నితీష్‌ కుమార్‌ కుల రాజకీయాలతో పాటు, తాను లౌకిక వాదిని అని చెప్పుకొనేందుకు కొన్ని అంశాలతో విబేధించినా బిజెపితో కలసి అధికారాన్ని పంచుకొని మతవాసనలను కూడా అంటించుకున్నారని, అవినీతి పాలనకు తెరతీశారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి.


బిజెపి ఆశలు పెట్టుకున్నట్లు ఈ ఎన్నికల్లో మోడీ గాలితో ఓట్లు వస్తాయా ? బీహార్‌ విషయానికి వస్తే మోడీ అధికారానికి వచ్చిన ఏడాది తరువాత జరిగిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. ఆ పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉన్న రాజస్దాన్‌, చత్తీస్‌ఘర్‌,మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ పలుకుబడి పని చేయలేదు. రెండోసారి పెద్ద సంఖ్యలో సీట్లతో గెలిచిన తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వలన బిజెపి సాధించిందేమీ లేదు. బీహార్‌లో దానికి భిన్నంగా ఎలా ఉంటుందన్న ప్రశ్నలకు బిజెపి వద్ద సమాధానం లేదు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎన్నికల ప్రకటన తరువాత మరింతగా కనిపిస్తోంది. చాణక్యుడిగా భావించే అరవై తొమ్మిది సంవత్సరాల నితీష్‌ కుమార్‌ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.

లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) విషయానికి వస్తే తాము ఎన్‌డిఏ, బిజెపి నుంచి విడిపోలేదని, నితీష్‌ కుమార్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పదే చెబుతోంది. తాను గతం కంటే బలపడ్డాననే అంచనాకు వచ్చిన బిజెపి నితీష్‌ కుమార్‌ను వదిలించుకొనే ఎత్తుగడలో భాగంగానే ఎల్‌జెపిని రంగంలోకి దింపిందని, నితీష్‌ కుమార్‌ పార్టీతో నిమిత్తం లేకుండానే ఎల్‌జెపితో కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే అంచనాలో ఉందన్నది ఒక అభిప్రాయం. ఎన్నికల ప్రకటన వరకు కలసి ఉండి విడిపోతే ఇద్దరం నష్టపోతామనే భయంతో నితీష్‌ను ఎన్నికల వరకు ఒక ముసుగుగా బిజెపి ఉపయోగించుకుంటోందని, ఫలితాలను బట్టి చూసుకోవచ్చు లెమ్మని భావిస్తున్నదని చెప్పేవారూ లేకపోలేదు.రాముడికి హనుమంతుడు ఎలానో తాను నరేంద్రమోడీకి అలాంటి వాడినని తన గుండెను చీలిస్తే మోడీయే ఉంటారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ తన ప్రభు భక్తిని ప్రదర్శించుకున్నాడు.

రంగంలోకి దిగిన తరువాత నితీష్‌కు పరిస్ధితి గడ్డుగా ఉందని అర్ధమైందని అందుకే స్ధిమితం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఒక సభలో మీరు ఓట్లు వేస్తే వేయండి లేకపోతే లేదు, అల్లరి చేయవద్దని విసుక్కున్నారు.కొడుకు కోసం ఏడెనిమది మందిని కన్నారు అంటూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఆర్‌జెడి నేత, లాలూ కుమారుడైన తేజస్వి యాదవ్‌ తిప్పి కొడుతూ ప్రధాని నరేంద్రమోడీకి కూడా తోడబుట్టిన వారు ఎక్కువగానే ఉన్నారని,నితీష్‌ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి అయి ఉండవచ్చన్నారు.


బీహార్‌లో ఉన్న సంక్లిష్ట రాజకీయ పరిస్దితుల్లో రాష్ట్ర మంతటా పార్టీ విస్తరించకపోయినా 20శాతానికి లోబడి ఓట్లు ఉన్న నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా అంతకాలం పదవిలో ఉండటం సాధ్యమైంది. ఆర్‌జెడి-బిజెపి మధ్య పోరులో నితీష్‌కు అవకాశం వచ్చింది. కొందరు ఇది నితీష్‌ చాణక్య నీతి అంటారు. బీహార్‌లో లాలూ, నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ముగ్గురూ మండల రాజకీయాల నుంచి ఎదిగినవారే.
సర్వేలను పూర్తిగా నమ్మనవసరం లేదు గానీ కొన్ని సర్వేల తీరు ఆసక్తికరం.2010లో నితీష్‌ కుమార్‌కు మద్దతు పలికిన వారు 77శాతం, 2015లో 80శాతం ఉన్నట్లు అప్పటి సర్వేలు తెలిపాయి. ప్రస్తుతం 52శాతానికి పడిపోయింది.లోక్‌నీతి-సిఎస్‌డిఎస్‌ సర్వే తిరిగి నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నవారు 38శాతమే అని వద్దంటున్నవారు 43శాతమని పేర్కొన్నది. సిఓటర్‌ సర్వే ప్రభుత్వ పనితీరుతో సంతోషంగా ఉన్నామని చెప్పింది 25శాతం, ఆశాభంగం చెందామన్నవారు 46శాతం అని పేర్కొన్నది ఈ కారణంగానే నితీష్‌తో ఇంక ప్రయోజనం లేదని బిజెపి ఎన్నికల గోదాలోకి దిగిన తరువాత భావిస్తున్నట్లు చెబుతున్నారు.


బీహార్‌లో మండల్‌- కమండల్‌ రాజకీయాలు పెద్ద ఎత్తున నడిచాయి. మండల్‌ త్రయంలోని నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కమండలం పంచన చేరారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒక్కరే మిగిలారు. బీహార్‌లో అరాజక శక్తులు చెలరేగిన మాట వాస్తవం. దానికి లాలూ కారకుడని చెప్పినప్పటికీ మిగిలిన నేతలు తప్పించుకోలేరు. ఉత్తర ప్రదేశ్‌ ఏమీ దానికి తక్కువ కాదు. రెండు చోట్లా భూస్వామిక శక్తులు బలంగా ఉన్నాయి. వాటిని ప్రతిఘటించటాన్ని కూడా అరాచకంగానే చిత్రించారు. పేదల పోరాటాలను అణచేందుకు భూస్వామిక శక్తులు కులాల వారీ బీహార్‌లో ప్రయివేటు సాయుధ ముఠాలను పెంచిపోషించాయి. దాడులకు పాల్పడ్డాయి. ప్రతిఘటించిన వారిని అరాజక శక్తులుగా వర్ణించారు. ప్రయివేటు సాయుధ ముఠాలను సమర్ధించిన వారిలో నితీష్‌ తక్కువ తినలేదు, బిజెపి నేతలుగా ఉన్న వారూ దూరంగా లేరు. ఇప్పుడు అలాంటి ముఠాలన్నీ దారి మార్చి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి మామూళ్లు వసూలు చేస్తున్నాయని ఈ ఎన్నికల సందర్భంగా జనం చెబుతున్నారు. నితీష్‌-బిజెపి కూటమి పాలన మీద పెరిగిన వ్యతిరేకతకు ఇది కూడా ఒక కారణమే.
బీహార్‌ కుల సమీకరణలకు పెట్టింది పేరు. వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలేవీ వాటికి అతీతంగా లేవు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్ధితుల్లో ఏ కులం అభ్యర్ది అయినా నితీష్‌ కుమార్‌ నిలబెట్టిన వారిని ఓడిస్తారా లేదా అన్నదే ప్రధానంగా చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ నిరంతరం నితీష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట కూడా ఓటర్లు జెడియును ఓడించే అభ్యర్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని బీహార్‌లో పర్యటించిన జర్నలిస్టులు రాస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగానూ, ఎన్‌డిఏ సారధిగా నితీష్‌ కుమారే అని ప్రకటించిన కారణంగా బిజెపి పోటీ చేస్తున్న చోటకూడా అసంతృప్తి చెందిన సాధారణ ఓటర్లకు నితీషే కనిపిస్తారు.

ఖండించినప్పటికీ బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందనే ఊహాగానాలు మరింతగా పెరుగుతున్నాయని బిజెపి పక్కా మద్దతుదారు అయిన స్వరాజ్య పత్రిక ఒక విశ్లేషణకు శీర్షికగా పెట్టింది. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇదే అంశం గురించి ఆ పత్రిక రాసింది. తాజా విశ్లేషణలో వ్యాఖ్యాత పేర్కొన్న అంశాల సారం ఇలా ఉంది. తొలుత ప్రచారంలో భాగంగా బిజెపి ఏర్పాటు చేసిన బ్యానర్లు, ముద్రించిన పోస్టర్లు, మీడియా వాణిజ్య ప్రకటనలలో నరేంద్రమోడీతో పాటు నితీష్‌ కుమార్‌ చిత్రానికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి దశ ఎన్నికలు దగ్గరపడే ముందు ప్రచురించిన వాటిలో కేవలం నరేంద్రమోడీ చిత్రమే ఉంది. వీటిని చూసి జెడియు నేతలు హతాశులయ్యారు గానీ మౌనం వహించారు. తొలి దశ ఎన్నికలకు ముందు ఇలాంటి వాటి మీద వ్యాఖ్యానించటం సరైంది కాదని, ఈ చర్య తమను గాయపరించిందని, బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందన్న అభిప్రాయం బలపడేందుకే ఇది దోహదం చేస్తుందని జెడియు అగ్రనేత ఒకరు చెప్పారు.కేవలం మోడీ బొమ్మలతో ప్రచారం చేయటం తనకు సంతోషం కలిగిస్తున్నదని, మా బిజెపి మిత్రులు నితీష్‌ కుమార్‌ నష్టదాయకం అని గ్రహించారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఎన్‌డిఏ నుంచి ఎల్‌జెపి బయటకు పోయిన తరువాత కేంద్రంలో కూడా ఆ పార్టీని బహిష్కరించాలని నితీష్‌ కుమార్‌ డిమాండ్‌ చేసినా బిజెపి తిరస్కరించటంతో పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఎన్నికల తరువాత బిజెపి-ఎల్‌జెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రకటనలు ఖండించదగ్గ పెద్దవి కాదని బిజెపి కొట్టిపారవేస్తోంది. చిరాగ్‌ పాశ్వాన్‌ గురించి నరేంద్రమోడీ ఎలాంటి ప్రస్తావనలు చేయకపోవటంతో జెడియు నేతలు ఆశాభంగం చెందారు. ఇరవై ఒక్క మంది బిజెపి తిరుగుబాటుదార్లకు చిరాగ్‌ సీట్లు ఇచ్చారు. ఊహాగానాలను బిజెపి నేతలు గట్టిగా ఖండించలేదని జెడియు నేతలు చెప్పారు. ఎల్‌జెపి నేతలు తాము పోటీ చేస్తున్న చోట్ల ఎన్నికల తరువాత తాము బిజెపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అందువలన మోడీ మద్దతుదారులు తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.


బిజెపి వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకుంటుంది. అయితే బీహార్‌ ఎన్నికల్లో అది పోటీ చేస్తున్న 110 స్దానాల్లో 51 మంది అగ్రవర్ణాలుగా పరిగణించబడుతున్నవారికే ఇచ్చింది. జనాభాలో వారు కేవలం 16శాతమే. ఇరవై రెండు మంది రాజపుత్రులు,15 భూమిహార్లు, 11 మంది బ్రాహ్మలు, ముగ్గురు కాయస్ధులు ఉన్నారు. 2015 ఎన్నికల్లో 157 స్ధానాలకు పోటీ చేసిన ఆ పార్టీ 65 మంది ఈ సామాజిక తరగతుల వారికే సీట్లు ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా లాలూ ప్రసాద్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడింది వారే గనుక మిగతావారి కంటే వారికే ప్రాధాన్యత ఇవ్వటం సహజమే అని బిజెపి నేతలు సమర్ధించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న బీహార్‌కు చెందిన సినిమా నటుడు సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఉదంతాన్ని పెద్ద ఎత్తున వివాదాస్పదం చేసి లబ్ది పొందేందుకు బిజెపి ప్రయత్నించిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపి మిత్రపక్షమైన జెడియు పోటీ చేస్తున్న 115 స్ధానాలలో ఈ సామాజిక తరగతులకు కేవలం 19 మాత్రమే ఇచ్చారు.


దేశంలో తొలిసారిగా సంఘపరివార్‌ శక్తులకు లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ వచ్చింది. నాలుగు ఉన్నత రాజ్యాంగ పదవుల్లో వారే ఉన్నారు. బలం లేని స్ధితిలో బిజెపి నేతలుగా ఉన్న అతల్‌-వాజ్‌పేయి ద్వయానికి ప్రస్తుత మోడీ-షా ద్వయం పని తీరు, ఎత్తుగడల్లో ఎంతో తేడా ఉంది. సంఘపరివార్‌ అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరినైనా ఉపయోగించుకోవటం, అవసరం తీరిన తరువాత పక్కన పడేయటాన్ని చూస్తున్నాము. బీహార్‌లో బిజెపి పెరుగుదల లేదా స్ధిరపడటానికి నితీష్‌ ఎంతగానో సహకరించారన్నది స్పష్టం. అంతర్గతంగా బిజెపి చేయించిన సర్వేలలో పరిస్ధితి క్లిష్టంగా ఉన్నట్లు తేలిందనే వార్తలు వచ్చాయి. మూడింట రెండువంతుల మెజారిటీ తమ కూటమికి వస్తుందని, ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినా నితీష్‌ కుమారే తిరిగి సిఎం అని పార్టీ అగ్రనేతలు చెప్పినప్పటికీ వారి అనుమానాలు వారికి ఉన్నాయి. అందుకే నితీష్‌ కుమార్‌ గురించి చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్ని మాట్లాడుతున్నా నోరు మెదపటం లేదు. ఎన్నికల తరువాత తమను వదిలించుకొని ఆర్‌జెడి నాయకత్వంలోని కూటమితో నితీష్‌ కుమార్‌ చేరితే ఏమిటనే ఆందోళన కూడా బిజెపిలో లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్‌జెడితో కలసి పోటీ చేసి బిజెపితో చేతులు కలిపిన పెద్దమనిషి మరోమారు అదే పని చేయరని ఎవరు చెప్పగలరు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుష్‌బూతో బిజెపి సినిమా హిట్టా ఫట్టా !

13 Tuesday Oct 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, DMK, Kushboo Sunder, Kushboo Sunder in BJP, Tamilnadu politics


ఎం కోటేశ్వరరావు


సినిమా గోలగా చెప్పాలంటే ఒక హీరో లేదా హీరో తమ తదుపరి చిత్రంలో చేసేందుకు అంగీకరించటమే సగం విజయమన్నట్లుగా కొందరు నిర్మాతలు తమ ఖుషీని ప్రకటిస్తారు. ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్‌గా నీరాజనాలందుకున్న ఖుషఉ్బ గతంలో డిఎంకె, కాంగ్రెస్‌ చిత్రాల్లో నటించి ఇప్పుడు బిజెపి సినిమాలో పని చేసేందుకు అంగీకరించారు. ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా ఎంతో గొప్ప తారాగణంతో తీసిన సినిమాలను జనం ఇంటికి పంపిన చరిత్ర కూడా సినిమా రంగంలో నమోదైంది.


ఒక వ్యక్తిగా ఏ పార్టీలో చేరేందుకైనా ఉన్న హక్కును ఎవరికీ కాదనలేము. అయితే జనాలకు సుద్దులు చెబితేనే మండుతుంది.పార్టీలు ఫిరాయించేవారు చెప్పే ఇలాంటి కబుర్లు విని విని జనానికి బోరు కొట్టింది. నేను ఎన్ని పార్టీలైనా మారవచ్చు, మార్పు సహజం, మారాలి అని సెలవిచ్చిన ఆమె తన సిద్దాంతాలు మాత్రం మారలేదని చెప్పారు. హీరోయిన్‌గా ఎన్ని సంవత్సరాలైనా ఫిట్‌నెస్‌ మారలేదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేస్తాను అంటే నిర్మాతలు అంగీకరించవచ్చు, అలా చేస్తే ప్రేక్షకులు ఆదరించవచ్చు. కానీ రాజకీయాలు సినిమాలు కావు. కుష్‌బూ ఏ పార్టీలో చేరితో ఆమె చెప్పిన సిద్దాంతంతో ఆయా పార్టీలు మారిపోతాయా ? ఇంతకీ ఆమె సిద్దాంతం ఏమిటి ?
తన సిద్దాంతాలు లేదా భావజాలం మారలేదు అని చెబుతున్న కుష్‌బూ పెళ్లికి ముందు కన్యలు పవిత్రంగా ఉండాలనే చాదస్తాల నుంచి సమాజం బయటపడాలని, కోరుకున్న పురుషుడితో జీవించే స్త్రీ వివాహంతో నిమిత్తం లేకుండానే పిల్లల్ని కూడా కనవచ్చంటూ గతంలో వెలిబుచ్చిన భావజాలానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ఆమె బిజెపి వేదికల మీద ప్రకటించగలరా ? గతంలో బిజెపి మీద చేసిన విమర్శలకు కట్టుబడి ఉంటారా ? డిఎంకెతో రాజకీయాలను ప్రారంభించి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు బిజెపి కండువా కప్పుకున్నారు. రేపు మరొక పార్టీలోకి వెళ్లరనే గ్యారంటీ ఏముంది ? డొల్లు పుచ్చకాయలు, పార్టీలు మారేవారు ఒకే చోట ఉంటారా ? పార్టీ మారటానికి కొద్ది వారాల ముందు నరేంద్రమోడీది జుమ్లా సర్కార్‌ (అవసరానికి అనుగుణంగా మాట్లాడటం) అని చెప్పిన ఆమె ఇప్పుడు మాట మార్చితే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని తలూపేందుకు జనం గొర్రెలా ?


తమిళనాడులో నాలుగు సీట్లు సంపాదించుకోవటం ఎలా అనే యావలో బిజెపి ఉందన్నది బహిరంగ రహస్యం. దానిలో భాగంగానే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తలుపు తట్టింది. లేస్తే మనిషిని కాదు అని దారినపోయే వారిని బెదిరించే కుంటి మల్లయ్య సామెత మాదిరి ఇప్పటి వరకు రజనీ వైఖరి ఉంది. ఇంతవరకు లేచింది లేదు, ఇప్పుడు లేస్తారో లేదో తెలియదు. 1996 నుంచి ఏదో ఒక రూపంలో రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పటమో సూచనలు ఇవ్వటమో చేస్తున్నారు. 2021 ఎన్నికలలో తన సత్తా చూపేందుకు సిద్దం అవుతున్నారని కొన్ని కథనాలు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి. తానే ఒక పార్టీని పెడతానని కూడా 69 ఏండ్ల రజనీ కాంత్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిన తరువాత ప్రకటిస్తారని చెబుతున్నారు.
సినిమా తారలు బిజెపిలో చేరటం కొత్తేమీ కాదు. గతంలో గౌతమి, నమిత, రాధారవి ఆ పార్టీలో చేరినా ఒరిగిందేమీ లేదు. కుష్‌బూ తమిళనాడులో పరిచయం అవసరం లేని స్టార్‌, మాట్లాడగల చాతుర్యం ఉంది. అందువలన వస్తారో రారో తెలియని రజనీ కోసం వేచి చూడటం కంటే ఆమెతో ప్రచారం చేయించుకోవచ్చని బిజెపి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.కుష్‌బూ డియంకె నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీకి పోయింది లేదు, కాంగ్రెస్‌లో చేరినపుడు కొత్తగా ఆ పార్టీకి పెరిగిందేమీ లేదు. ఇప్పుడు బిజెపికి కూడా ప్రచారానికి తప్ప ఓట్ల ప్రయోజనం కలగకపోవచ్చు. నేను ఇప్పుడే పార్టీలో చేరాను, ఆరునెలల తరువాత చూడండి అని విలేకర్లతో చేసిన వ్యాఖ్య బహుశా వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కావచ్చు.

గతంలో కొన్ని అంశాల మీద ఆమె చేసిన వ్యాఖ్యల మీద బిజెపి లేదా హిందూమత శక్తులు సామాజిక మాధ్యమంలో ఎలా విరుచుకుపడ్డాయో, ఎన్ని కేసులు నమోదు చేశాయో తెలిసిందే. ఇప్పుడు ఆమె బిజెపిలో చేరి సిద్దాంతాల గురించి చెప్పటాన్ని ఆశక్తులు ఎలా జీర్ణించుకుంటాయో చూడాల్సిందే. పచ్చిమితవాదులు ఆమెను అంగీకరిస్తారా ఆమె తన వైఖరిని మార్చుకుంటారా ? గతంలో ఆమె చేసిన బిజెపి వ్యతిరేక వ్యాఖ్యలు ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారకుండా ఉంటాయా ? గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిత్వాన్ని ఆశించి భంగపడిన ఆమె ఈ ఏడాది మార్చినెల నుంచి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కుష్‌బూ పేరు నఖత్‌ ఖాన్‌ అంటూ ఆమె మతం గురించి బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) దాడి చేసినపుడు అవును నేను ముస్లింగానే పుట్టాను, దాని గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరినపుడు ఆ పార్టీ తన భావజాలానికి సరిపడిందని చెప్పారు. మరి బిజెపి గురించి ఏమి చెబుతారు అంటే ఎవరైనా కులం, మతం, జాతి గురించి మాట్లాడితే నా రక్తం సలసల కాగుతుంది. నేను దేశభక్తురాలిని, లౌకికవాదిని కాషాయ, హిందూత్వవాదాలకు వ్యతిరేకం అని చెప్పారు. అలాంటి హిందూత్వవాదులతోనే ఆమె చేతులు కలిపారు.


ద్రవిడ కజగం పార్టీ స్దాపకుడు, హేతువాది, జీవితాంతం బ్రాహ్మణిజానికి, బ్రాహ్మలకు వ్యతిరేకంగా ఉన్న ఇవి రామస్వామి నాయకర్‌ మనవడైన సతీష్‌ కృష్ణన్‌ ఆగస్టు నెలలో అన్నాడిఎంకె నుంచి బిజెపిలో చేరారు. ఇలా కాంగ్రెస్‌, డిఎంకె, అన్నాడిఎంకె మూడు పార్టీలలో అసంతృప్తికి గురైన వారందరనీ చేర్చుకొనేందుకు బిజెపి తాపత్రయపడుతోంది. ఈ క్రమంలోనే గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె విద్యను పార్టీ యువజన విభాగ ఉపాధ్యక్షురాలిగా చేసి ఆ పార్టీలోకి చేర్చుకుంది. నా తండ్రిని చూసి కాదు, నేను ఏమిటన్నది చూడాలని ఆమె చెప్పుకుంది. నా తండ్రి మంచివాడని, జనాలకు సాయం చేసేవాడని నాకు చెప్పారని, తండ్రితో స్ఫూర్తి పొందానని విలేకర్లతో చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఎవరైనా ఎంఎల్‌ఏగా ఎన్నికైతే వారికి పార్టీ తరఫున ఒక ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ పార్టీ సమావేశంలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కనీసం 25 మంది ఎంఎల్‌ఏలను పార్టీ గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చని చెప్పారు. పార్టీ గెలుపుకోసం బాగా పనిచేసినట్లు గుర్తించిన వారికి తమిళనాడులో పార్టీలు బంగారు ఉంగరాలు, గొలుసులు బహుమతిగా ఇవ్వటం సాధారణ విషయం. బిజెపి మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా ఇన్నోవా కార్లనే ఎరగా చూపింది.


ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ముఠాలు పార్టీలో ఆధిపత్యం మాదంటే మాదని కొట్టుకున్నాయి. అది ముదిరితే ఏదో ఒక వర్గం తమతో వస్తుందన్న ఆశలు ఒక దశలో బిజెపిలో కలిగాయి. అయితే తామిద్దరూ ఒకటేనని పళని స్వామి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పని చేసేందుకు నిర్ణయించినట్లు అన్నాడిఎంకె ప్రకటించింది. అయితే ఆ సయోధ్య ఎన్నికల వరకు నిలుస్తుందా ఏమి జరుగుతుంది అనేది అప్పుడే చెప్పలేము.

2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 234 స్ధానాలకు పోటీ చేసిన బిజెపి 2.86శాతం ఓట్లు తెచ్చుకుంది. అన్నాడిఎంకెకు 40.88శాతం, డిఎంకె కూటమికి 39.1శాతం వచ్చాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె కూటమి 55శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది, 39కి గాను 38 సీట్లు గెలుచుకుంది. ఇంతే కాదు 216 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సంపాదించింది. అన్నా డిఎంకె కూటమి 16 చోట్ల మెజారిటీ తెచ్చుకోగా అన్నాడిఎంకె 12, పట్టలి మక్కలి కచ్చి 3, బిజెపి ఒక చోట ఆధిక్యత ప్రదర్శించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె కూటమిలో సీట్ల పంపకం పెద్ద సమస్యగాక పోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో తామే నాయకత్వం వహిస్తామని బిజెపి చెప్పుకోవటంపై అన్నాడిఎంకె గుర్రుగా ఉంది. ఎన్నికల నాటికి ఆ పార్టీ నేత శశికళ జైలు నుంచి బయటకు వస్తారని చెబుతున్నారు. ఆమె ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి-అన్నాడిఎంకె విడివిడిగా పోటీ చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో పోటీ చేసిన పట్టలి మక్కల్‌ కచ్చి 5.36 శాతం ఓట్లు తెచ్చుకుంది. లోక్‌సభ ఎన్నికల నాటికి పిఎంకె, బిజెపి, తమిళమానిల కాంగ్రెస్‌ అన్నా డిఎంకె కూటమిలో చేరాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో తెలియదు. అన్నాడిఎంకె బలహీనపడిన కారణంగా గత పార్లమెంట్‌ ఎన్నికలలో 20 స్ధానాలకే పరిమితమై పిఎంకెకు 7, బిజెపికి ఐదు, డిఎండికెకు నాలుగు, మరో మూడు పార్టీలకు మూడు సీట్లు కేటాయించింది. ఇదే ప్రాతిపదికన అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరుగుతుందా ? అన్నాడిఎంకె తన సీట్లను సగానికి తగ్గించుకుంటుందా ?


మరోవైపు డిఎంకె కూటమిలో 2019 లోక్‌ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ డిఎంకె 138, కాంగ్రెస్‌ 49, సిపిఎం, సిపిఐ పన్నెండు చొప్పున, ముస్లింలీగ్‌ ఐదు చోట్ల ఆధిక్యత ప్రదర్శించింది. ఇంతటి భారీ విజయం సాధించిన కారణంగా డిఎంకెలో సీట్ల కోసం పోటీ పడేవారు సహజంగానే ఉంటారు. అసంతృప్తి చెందిన వారిని పిలిచి పార్టీ కండువాలు కప్పేందుకు అన్నాడిఎంకె, బిజెపి సిద్దంగా ఉన్నాయి. అయితే పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలాల్లో పెను మార్పులు జరిగే పరిణామాలేవీ జరగలేదు. ఈ నేపధ్యంలో ఫలితాలు కూడా లోక్‌సభ మాదిరే ఉంటాయని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

స్వామినాధన్‌ కమిషన్‌ చెప్పిందేమిటి – నరేంద్రమోడీ సర్కార్‌ చేస్తున్నదేమిటి !

27 Sunday Sep 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Environment, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Science

≈ Leave a comment

Tags

Farmers, India Farm bills 2020, Indian agri reforms, indian farmers, Swami nathan commission


ఎం కోటేశ్వరరావు
స్వామినాధన్‌ కమిషన్ను ఏర్పాటు చేసిన యుపిఏ సర్కార్‌ దాన్ని అమలు జరపలేదని తాము ఆపని చేస్తున్నామని నరేంద్రమోడీ సర్కార్‌ చెబుతోంది. రైతులకు మేలు చేసే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకు వచ్చిన రెండు వ్యవసాయ, ఒక నిత్యావసర వస్తువుల చట్ట సవరణ బిల్లులు నేతి బీరకాయలో నెయ్యి, మైసూరు పాక్‌లో మైసూరు వంటివి అనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతున్నాయి. సంస్కరణలు వాంఛిస్తున్న వారు కూడా మేము కోరుతున్నది ఇవి కాదు, రైతులకు ఉపయోగపడేవి కాదు అంటున్నారు. రైతుల సమస్యలపై 2004 డిసెంబరు నుంచి 2006 అక్టోబరు వరకు పని చేసిన స్వామినాధన్‌ కమిషన్‌ ఐదు నివేదికలను సమర్పించింది. ఏడాది తరువాత వాటి ఆధారంగా రైతుల ముసాయిదా విధానం పార్లమెంట్‌కు సమర్పించారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల్లోని ముఖ్యాంశాలను చూస్తే నరేంద్రమోడీ సర్కార్‌ ఆ పేరుతో ఏం చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.


స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల సారాంశం ఇలా ఉంది. 1991-92 వివరాల ప్రకారం గ్రామీణ కుటుంబాలలోని దిగువ 51.35శాతం కుటుంబాల వద్ద ఉన్న భూమి కేవలం 3.8శాతం కాగా, ఎగువ 14.71 శాతం ధనిక రైతుల వద్ద 64.48 54శాతం ఉంది. దిగువన ఉన్న వారిలో 11.24శాతం మందికి అసలు భూమి లేదు. ఎగువన ఉన్న 2.62శాతం మంది వద్ద 15ఎకరాలు అంతకు మించి 26.67శాతం ఉంది కనుక భూసంస్కరణలు అమలు జరపాలి.
కౌలు చట్టాలు, మిగులు భూమి, వృధాగా ఉన్న భూ పంపిణీ సంస్కరణలు చేపట్టాలి. వ్యవసాయ, అటవీ భూములను వ్యవసాయేతర అవసరాలకు కార్పొరేట్‌లకు మళ్లించటాన్ని నిరోధించాలి. అవకాశం ఉన్న చోటల్లా భూమిలేని కుటుంబాలకు కనీసం ఒక ఎకరం చొప్పున భూమి ఇస్తే పెరటి తోటలు, పశుపెంపకానికి వినియోగించుకుంటారు. జాతీయ భూ వినియోగ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి భూ వినియోగం గురించి సలహాలను అందించాలి.నీటిని ప్రజా సంపదగా పరిగణించి సమాన ప్రాతిపదికన పంపిణీకి చర్యలు తీసుకోవాలి. వర్షపు నీటిని నిల్వచేయటం, ఎండిపోయిన నీటి వనరులను పునరుద్దరించటం, మెరుగైన సాగునీటి పద్దతులు, డ్రిప్‌ఇరిగేషన్‌, నీటి చైతన్య ఉద్యమం, ప్రతి గ్రామంలో నీటి పంచాయతీలు, నీటివినియోగదారుల సంఘాల ఏర్పాటు, కరవు,వరద నిబంధనల రూపకల్పన.
రాష్ట్ర స్దాయిలో పశుదాణా, గడ్డి కార్పొరేషన్ల ఏర్పాటు, జాతీయ పశుసంపద అభివృద్ది మండలి ఏర్పాటు, కోళ్ల పెంపకాన్ని వ్యవసాయంతో సమంగా గుర్తించటం, గృహ కోళ్ల పెంపకందార్లకు మద్దతు, చిన్న కోళ్ల పెంపక కేంద్రాల ఏర్పాటు. అందరికీ చేపలు అనే ఇతివృత్తంతో చేపల పెంపకం, పట్టటం,మార్కెటింగ్‌ గురించి శిక్షణ, సామర్ద్యకేంద్రాల ఏర్పాటు.జీవ వైవిధ్య వనరులపై సాంప్రదాయ హక్కులను గుర్తించటం, జెనోమ్‌ క్లబ్‌లు,జన్యు మార్పిడి అభివృద్ధి.
చిన్న రైతాంగం, ప్రకృతికి అనుకూలమైన పరిశోధనల నిమిత్తం జాతీయ బయోటెక్నాలజీ నియంత్రణ మండలి ఏర్పాటు. మేథో సంపత్తి హక్కుల విధానాలకు రూపకల్పన, వ్యవసాయ విపత్తు నిధి ఏర్పాటు, చిన్న, సన్నకారు రైతులకు సహకార వ్యవసాయ సేవా సంస్ధల రూపకల్పన, స్వయం సహాయక బృందాల ద్వారా బృంద వ్యవసాయ సంస్దల ఏర్పాటు, చిన్న కమతాల భూ ఖండాలకు రూపకల్పన, ఉత్పత్తిదారులు, కొనుగోలుదార్లు ఉభయులూ లబ్ది పొందే విధంగా ఒప్పంద వ్యవసాయ నిమిత్తం నిబంధనల రూపకల్పన, రైతులు లబ్దిదార్లుగా కంపెనీల ఏర్పాటు, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించే విధంగా తక్కువ వడ్డీలతో పధకాలకు రుణాలు, ఉత్పత్తి మరియు ప్రోసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు తోడ్పాటు.
ఆహారము, చిన్న రైతులకు ఆదాయ భద్రతకు తోడ్పడే విధంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధరల పరిధి విస్తరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్ధిక సంస్ధల సంయుక్త భాగస్వామ్యంలో మార్కెట్‌ ధరల స్ధిర నిధి ఏర్పాటు, గ్రామాలలో రైతు కుటుంబాలు క్షయ, ఎయిడ్స్‌ వంటి వ్యాధుల బారిన పడినపుడు ఉచితంగా ఔషధాలు అందుబాటులో ఉంచటం, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర జీవనానికి తోడ్పాటు, భారత వాణిజ్య సంస్ధ ఏర్పాటు వంటి అంశాలను స్వామినాధన్‌ కమిటీ సిఫార్సు చేసింది.


పైన పేర్కొన్న అంశాలలో గత ఆరు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న చర్యలేమిటంటే ముఖ్యమైన అంశాల జోలికి పోలేదనే చెప్పాలి. వాటిని అమలు జరపకుండా సిఫార్సులను అటక ఎక్కించి మార్కెట్‌ యార్డుల పరిధిని కుదించి వాటి వెలుపల ప్రయివేటు కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు అవకాశమిస్తూ చట్ట సవరణలు చేశారు. మార్కెట్‌ కమిటీలు, వాటి పరిధి నిర్ణయం రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఎక్కడో ముంబై, ఢిల్లీలో ఒక చోట నమోదు చేసుకుంటే చాలు దేశమంతటా కొనుగోళ్లు చేయవచ్చు. అంటే మరోకొత్త దళారీ వ్యవస్ధకు నాంది పలుకుతున్నట్లే . ఇంట్లో ఎలుకలుంటే అవి చేరకుండా కప్పులను మార్చుకోవాలి, మరొక చర్యతో వాటిని లేకుండా చేసుకోవాలి తప్ప ఇండ్లనే ఎవరైనా కూల్చివేస్తారా ! తగులబెడతారా ?

ఒప్పంద వ్యవసాయం, ఎక్కడైనా రైతు తన పంటను అమ్ముకొనే ఏర్పాటు వంటి చర్యల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రయివేటు పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా వాణిజ్య సులభతరానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి, అయినా విదేశీ పెట్టుబడులు రాలేదు, స్వదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి ఎందుకు కాలేదు ? 2006లోనే బీహార్‌లో వ్యవసాయ మార్కెట్లను రద్దు చేశారు. మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర కూడా రాక నష్ట పోయిన రైతులు బీహార్‌లో ఈ ఏడాది జూన్‌ చివరి వారంలో కరోనాను కూడా లెక్కచేయకుండా మొక్కజొన్న హౌమం చేసి నితీష్‌కుమార్‌-బిజెపి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మొక్కజొన్నల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కారణంగా మార్కెట్‌ కుదేలయిన విషయం తెలిసిందే. దీని గురించి తెలంగాణా హైకోర్టులో కేసు దాఖలైన సంగతీ తెలిసిందే.


వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అవసరమైన గోదాముల ఏర్పాటును ప్రభుత్వాలు దాదాపు నిలిపివేశాయి. ఇదే సమయంలో ప్రయివేటు పెట్టుబడులు రాలేదు. మెట్రో వంటి సంస్ధలు బడా పట్టణాల్లో ఏర్పాటు చేసిన పెద్ద దుకాణాలు, గోదాములు తప్ప గ్రామీణ ప్రాంతాలలో కొత్తవేమీ రాలేదు. నిత్యావసర వస్తువుల నిల్వలపై ప్రభుత్వాల ఆంక్షల కారణంగా తాము గోదాములను ఏర్పాటు చేయటం లేదని బడా సంస్దలు చెబుతున్నాయి. వాటికోసమే అనేక వస్తువులను నిత్యావసరాల జాబితా నుంచి, నియంత్రణ నుంచి ఎత్తివేశారు.
మార్కెట్‌ యార్డుల పరిధిని కుదించారు. తెలుగు రాష్ట్రాల్లో పాత తాలుకా కేంద్రాలు లేదా కొన్ని పెద్ద ప్రాంతాలలో మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటి వెలుపల కొనుగోలు చేసే బడా సంస్దకు రైతులు తమ సరకులను ఎక్కడికి తరలించాలి? లేదా సదరు సంస్ధ వారే గ్రామాలకు వచ్చి తమ స్వంత ఏర్పాట్లు చేసుకుంటారా ? పన్నులు, కమిషన్లకు పోతున్న మొత్తాలు రైతుల ధరల్లో ప్రతిబింబిస్తాయా? కనీస మద్దతు ధరలకు కంపెనీలు కట్టుబడి ఉంటాయా ? ఒప్పంద వ్యవసాయం కింద రైతులు అమ్మే సరకుల ధరలు వాటి కంటే ఎక్కువ ఉంటాయా ? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.


ఇక గ్రామాలకు ప్రయివేటు పెట్టుబడులు వస్తాయన్న అంశాన్ని చూద్దాం. కేరళలో ఎప్పటి నుంచో మార్కెట్‌ యార్డులు లేవు. అయితే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్లను ఏర్పాటు చేసింది తప్ప ప్రయివేటు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. కేరళలో టీ, కాఫీ, రబ్బరు,కొబ్బరి, సుగంధ ద్రవ్యాల వంటి వాణిజ్య పంటలే ఎక్కువ, అయినా పెట్టుబడులు ఎందుకు రాలేదు ? ముందే చెప్పుకున్నట్లు బీహార్‌లో పద్నాలుగేండ్ల క్రితం మార్కెట్‌ యార్డులు రద్దయ్యాయి. అక్కడి గ్రామాలకు వచ్చిన పెట్టుబడులేమిటో బిజెపి పెద్దలు చెప్పగలరా ? అధికారంలో ఉన్నది ఆ పార్టీ, మిత్రపక్షమే.
కేంద్ర బిల్లులు రాకముందే బిజెపి ఏలుబడిలోని గత మహారాష్ట్ర ప్రభుత్వం 2016లోనే పండ్లు, కూరగాయలను మార్కెట్‌ యార్డుల నుంచి తప్పించింది.2018లో చట్టాన్ని మరింత నీరుగార్చి ఒక ఆర్డినెన్స్‌ ద్వారా ఆహార, పశు సంపద లావాదేవీలను యార్డుల వెలుపల అనుమతించింది. అక్కడ కూడా ప్రయివేటు పెట్టుబడుల జాడలేదు.


వ్యవసాయ రంగ నిపుణులు అశోక్‌ గులాటీ చెబుతున్న అంశాల సారం ఇలా ఉంది. తాజా బిల్లులు వ్యవసాయరంగం, సేకరణ, సరఫరా గొలుసుకట్టు ఆటతీరునే మార్చివేస్తాయి. ఇదొక పెద్ద సంస్కరణ, మంచి ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాలి. చివరి క్షణంలో అధికారులు దీన్ని పాడు చేసే అవకాశం ఉంది.1943లో కొరత, కరవు ఏర్పడినపుడు నిల్వలకు సంబంధించిన పరిమితులు పెట్టారు. నిత్యావసర వస్తువుల చట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు వందశాతం ధరలు పెరిగినపుడు వారు తిరిగి పరిమితులు పెట్టవచ్చు. ఇప్పుడు మనం మిగులుతో ఉన్నాము. అందువలన పునరాలోచన దృక్ఫధంతో చూడాలి.
ఇది ప్రధానంగా ధరల స్ధిరీకరణ మరియు మార్కెట్‌ తిరిగి పనిచేసేందుకు తలపెట్టిన సంస్కరణ. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలపై నియంత్రణలకు నిత్యావసర సరకులు చట్టం ప్రభుత్వానికి ఎలాగూ అధికారం ఇస్తుంది. ఇప్పుడు నవీకరించిన గోదాముల మీద పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు రంగం ముందుకు రావటం లేదు. పంటలు మార్కెట్‌కు వచ్చిన తరువాత ఇప్పుడు పెద్ద ఎత్తు ధరలు పడిపోవు, ఏడాది పొడవునా స్ధిరంగా ఉంటాయి. రైతులు ప్రయివేటురంగం మరియు ప్రభుత్వ కనీస మద్దతు ధరలలో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లలో వ్యాపారులు ధరలను నియంత్రిస్తున్నారు, రైతులకు మరొక అవకాశం లేదు.
ప్రస్తుతం మార్కెట్‌ యార్డుల పరిధిలో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు లేదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల పరిధిని కుదించారు. ఒక అనుమతితో దేశంలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు.వ్యాపారులు ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాలు లేదా సహకార సంస్ధలు, వ్యవసాయదారుల సంస్ధల కేంద్రాలలో కొనుగోలు చేయవచ్చు. అముల్‌ కంపెనీ ప్రతి రైతు వద్దకు వెళ్లి పాలు కొనుగోలు చేయదు. రైతులు తాము కోరుకున్న ధర ఎక్కడ వస్తే అక్కడ, చెల్లింపులు సకాలంలో జరిపేవారికి విక్రయించుకోవచ్చు.
ఇప్పుడు మార్కెట్‌ యార్డులలో రెండు నిమిషాల లావాదేవీలకు కమిషన్‌ ఏజంట్లు అధికారికంగా ఎనిమిదిశాతం(ముంబై వాషి లేదా అజాద్‌పూర్‌ మార్కెట్‌) తీసుకుంటున్నారు. అనధికారికంగా రెండు వైపులా మొత్తం 14-15శాతం ఉంది. కమిషన్‌ మొత్తాలను నిర్ణయించేది ఎవరు ? మార్కెట్‌ కమిటీ అంటే రాజకీయవేత్తలు-మాజీ ఎంఎల్‌ఏ లేదా ప్రస్తుత ఎంఎల్‌ఏ లేదా వారి దగ్గరివారు కావచ్చు, ఇప్పుడు అసమర్ధ అవినీతి గుత్తాధిపత్యం బద్దలు కానుంది.
తదుపరి అడుగు ఒప్పంద వ్యవసాయానికి అనుమతి. ఇప్పుడు రైతులు మంద మందలుగా సాగు చేస్తున్నారు, అది ఆకస్మికంగా ధరలు పడిపోవటానికి కారణం అవుతోంది. దీన్ని నిరోధించేందుకు పంట చేతికి వచ్చిన తరువాత తమకు వచ్చే ధర ఎంతో రైతులు ఒక అంచనాకు రావాలి.ఒప్పంద వ్యవసాయంతో రైతుల విక్రయ ధర ముందే నిర్ణయం అవుతుంది. పండ్లు, పూల విషయానికి వస్తే నిర్ణీత నాణ్యత లభిస్తుంది. ప్రస్తుతం వినియోగదారు చెల్లిస్తున్న దానిలో రైతుకు మూడో వంతు మాత్రమే లభిస్తోంది. అదే 60శాతం లభిస్తే మనం ఎంతో గొప్పపని చేసినట్లే, ఇది ఇప్పటికే పంచదార, పాలవిషయంలో జరుగుతోంది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్దలో 46శాతం తరుగు ఉంటోందని శాంతకుమార్‌ కమిటీ చెప్పింది.పేదలు నేరుగా నగదు తీసుకుంటారా మరొకటా అనేది వారినే ఎంచుకోనివ్వండి. వారు గుడ్లు లేదా రొట్టె తినదలచుకున్నారా లేక మద్యం తాగుతారా అన్నది వారికే వదలివేద్దాం. నేరుగా మహిళలకు నగదు బదిలీ చేస్తే ఆసక్తికరమైన మార్గదర్శకాలకు దారి తీస్తుంది. మరోసారి చెబుతున్నా, సంస్కరణలు ఎంతో పెద్దవి, మంచి ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూద్దాం.


గతంలో నూతన ఆర్ధిక సంస్కరణలనో మరొకటనో మార్పులు తలపెట్టిన ప్రతివారూ ఇదే కబుర్లు చెప్పారు.ఆచరణ అందుకు భిన్నంగా జరిగింది. నూతన ఆర్ధిక సంస్కరణలు వ్యవసాయం గిట్టుబాటుగాక రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురికొల్పాయి. యజమానులు వ్యవసాయం మానుకోవటం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తగ్గటం తదితర కారణాలతో కౌలు రైతులు పెద్ద ఎత్తున పెరిగారు. యాజమాన్య లేదా రక్షిత హక్కులు లేని కారణంగా ప్రభుత్వం అందించే రైతు బంధు, కిసాన్‌ సమ్మాన్‌ వంటి పధకాలేవీ వారికి వర్తించటం లేదు. ఎరువులకు ఇస్తున్న నామ మాత్ర సబ్సిడీ కూడా యజమానుల ఖాతాలకే జమ అవుతున్న కారణంగా నేరుగా నగదు బదిలీ వద్దని వారు చెబుతున్నా వినిపించుకోవటం లేదు.


ఒప్పంద వ్యవసాయం గురించి స్వామినాధన్‌ కమిషన్‌ కూడా సూచించినప్పటికీ తలెత్తే సమస్యలను కూడా వివరించింది. పంటల కొనుగోలుదారులు తక్షణ లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు. లాభాలు వచ్చే ఎగుమతి ఆధారిత పంటలకు మాత్రమే ఒప్పందం చేసుకుంటారు. ఆహార భద్రత గురించి పట్టదు. పెద్ద రైతులతోనే ఒప్పందాలకు ప్రాధాన్యత ఇస్తారు. పర్యవసానం చిన్న రైతులు పెద్ద రైతులతో ఒప్పందానికి నెట్టబడతారు. కొత్త దొంతర ఏర్పడుతుంది.


కేరళలో ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి ఒక కేసును చూద్దాం. నేలతాడి అనే ఔషధ మొక్కను సఫేద్‌ ముస్లీ అని కూడా అంటారు. 2004లో అంబికా దేవి అనే చిన్న రైతు తన ఒకటిన్నర ఎకరాలలో దాన్ని సాగు చేసేందుకు నందన్‌ బయోమెట్రిక్స్‌ దాని అనుబంధ సంస్ధ హెర్బ్స్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. కనీసం కిలో వెయ్యి రూపాయలకు ఉత్పత్తిని కొనాలనే ఒప్పందం కుదిరింది.కంపెనీ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. దీని గురించి 2008లో కేరళ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కంపెనీకి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. తమ మధ్య కుదిరిన ఒప్పందం వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోకి రాదని వాదించింది. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంది. అక్కడ కూడా చుక్కెదురైంది. అలాంటి రైతులను వినియోగదారుల రక్షణ చట్టం నుంచి మినహాయించటం చట్టాన్ని వెక్కిరించటమే అని కోర్టు పేర్కొన్నది.


కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన బిల్లు ఈ కేసును పరిగణనలోకి తీసుకోలేదని, రైతులకు వినియోగదారు రక్షణ కల్పించలేదని అందువలన ఇది పెద్ద లోపమని చెబుతున్నారు. అందువలన కోర్టుల నుంచి రైతులు రక్షణ పొందలేరు. రక్షణ లేదు అయినా ఒప్పంద వ్యవసాయం వద్దంటే రైతులు ఆగుతారని అనుకోలేము. ఆకర్షణ, ప్రలోభాలకు లొంగిపోయి ఒప్పందం చేసుకొన్న తరువాత కంపెనీ మోసం చేస్తే చేయగలిగేదేమీ ఉండదు. అధికార యంత్రాంగం ఎవరి పక్షాన ఉంటుందో తెలిసిందే. అందువలన ప్రభుత్వం ప్రతి ఒప్పందంలో మూడవ పక్షంగా చేరితేనే రక్షణ ఉంటుంది. బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్న ప్రభుత్వాలు అలాంటి ఒప్పందాలలో చేరతాయా ? తాజా బిల్లుల్లో అలాంటి సూచనలేమీ లేవు ? అలాంటపుడు పాలకుల మాటలను ఎలా నమ్మాలి ?స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులన్నీ అమలు చేసిన తరువాత అవసరమైతే మిగతా సంస్కరణల గురించి ఆలోచించవచ్చు.


ఇక అశోక్‌ గులాటీ వంటి వారు చెబుతున్న నేరుగా నగదు బదిలీ గురించి చూద్దాం. ఇది సబ్సిడీల కోత లేదా నామ మాత్రం గావించటానికి ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ముందుకు తెచ్చిన పద్దతులు. గత ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ 70వేల కోట్ల రూపాయలకు అటూ ఇటూగా మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక్క యూరియా తప్ప మిగిలిన వాటిపై ధరల నియంత్రణ ఎత్తివేసింది. మార్కెట్లో ఎంత ధర పెరిగినా ఆ 70వేల కోట్లనే సర్దుబాటు చేస్తున్నారు తప్ప పెంచటం లేదు. ఇదే పద్దతిని అన్ని సబ్సిడీలకు వర్తింప చేసే ఎత్తుగడతో కేంద్రం ముందుకు పోతోంది. ఇప్పుడు తలపెట్టిన విద్యుత్‌ సంస్కరణల లక్ష్యం కూడా అదే. వినియోగదారుకు అందచేసేందుకు ఒక యూనిట్‌కు అయ్యే ఖర్చులో 20శాతానికి మించి రాయితీలు ఇవ్వకూడనే నిబంధనను ముందుకు తీసుకువస్తున్నారు. ఆ కారణంగానే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం షరతులు విధించింది. అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఒక మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే రైతుల సంక్షేమం, సాధికారత పేరుతో తీసుకుంటున్న చర్యల వెనుక ఆంతర్యం, సంస్కరణల పర్యవసానాలు ఏమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా రైతులు ఉన్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జిఎస్‌టి మాదిరి దేవుడి లీల అంటే మా రైతుల గతేంగాను మోడీ గారూ !

23 Wednesday Sep 2020

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Act of God, Farmers matters, Indian agri reforms, indian farmers, narendra modi promises and facts


అయ్యా నరేంద్రమోడీ గారూ !


ఒక రైతు బిడ్డగా మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నా. మీకు గానీ, మీ అభిమానులకు గానీ నచ్చకపోతే నచ్చ లేదని చెప్పండి, నేను చెప్పినదాంట్లో తప్పేమిటో చర్చించండిగానీ దేశద్రోహులు అని ముద్రవేయటం చాల బాగోదని మీ వారికి చెప్పండి. రైతులను తూలనాడిన వారికి ఈ దేశంలో భవిష్యత్‌ ఉండదు. వెన్ను విరగ కొడతారు.


ఉద్యోగాలు రాకపోవటానికి కుర్రాళ్లకు నైపుణ్యం లేదని ఎత్తున శిక్షణా కేంద్రాలంటూ పెద్ద హడావుడి చేశారు. నైపుణ్యం సంగతి దేవుడెరుగు ఆ పేరుతో వేల కోట్ల రూపాయలను ఆ పేరుతో స్వాహా చేశారు. కొత్త ఉద్యోగులు రాకపోగా ఉన్న ఉపాధిపోయింది. మభ్యపెట్టే కళలో మీకు మాత్రం నైపుణ్యం పెరిగిందన్నది స్పష్టం. ఆ చాతుర్యం గురించి గతంలో మా పెద్దలు ఇందిరా గాంధీ గురించి చెప్పేవారు. ఇప్పుడు మీరు ఆమెను మించిపోయినట్లు చెబుతున్నారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నే వాడు వస్తాడు. తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఇక విషయానికి వస్తా !
పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల చట్ట సవరణ బిల్లులు ఒక మూలమలుపు అని మీరు వర్ణించారు. నిజంగానే, అయితే అది రైతులను ముంచేందుకా తేల్చేందుకా అన్నదే సమస్య. అధికారానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చెప్పిన మాట చెప్పకుండా, చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకుండా కొత్త విషయాలను జనానికి చెప్పటంలో దిట్టగా మారారు. ఈ విషయంలో మీకు మరొకరు సాటి రారు. అమెరికా అగ్రనేత అబ్రహాం లింకన్‌ ఒక మాట చెప్పారు. ” మీరు కొంత మంది జనాన్ని ఎల్లవేళలా, అందరినీ కొన్ని వేళల్లో వెర్రి వెంగళప్పలను చేయగలరు. అయితే మీరు అందరినీ, అన్ని వేళలా ఆ పని చేయలేరు ” అన్నారు. ఆ మాదిరిగానో మరో విధంగానో తెలియదు గానీ ఈ సారి మీ మాటలను నమ్మేందుకు సిద్దంగా లేమంటూ కరోనాను సైతం ధిక్కరించి రైతులు వీధుల్లోకి వస్తున్నారు. మీ సిబ్బంది లేదా మీ పార్టీ వారు మీకు ఈ విషయాలు సరిగా చెబుతున్నట్లు లేదు ? లేక మీరే వినేందుకు సిద్దంగా లేరా ? ఏదైనా కావచ్చు, జనానికి మీరు ఏం చేస్తున్నారనేదే ముఖ్యం. నా అమాయకత్వం గాకపోతే అప్రియములు రాజుగారికి చెప్పకూడదనే వంది మాగధుల లోకోక్తి మీకు తెలియకుండా ఉంటుందా ? మీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి మీరు తరచూ విలేకర్ల సమావేశాలు పెడితే రెండోవైపు ఏం జరుగుతోందో మీకు తెలిసేది. సముద్రాలు ఇంకి పోయినా, భూమ్యాకాశాలు దద్దరిల్లినా, అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇసుక నుంచి తైలం తీసినా, కుందేటి కొమ్ము సాధించినా పదవిలో ఉన్నంత కాలం విలేకర్ల గోష్టి పెట్టను, వారి ముందు నోరు విప్పను అని మీరు పట్టిన పంతం అనితర సాధ్యమే ! మీరు తప్ప ఇంతవరకు ప్రపంచంలో మరొక లేరు, భవిష్యత్తులో ఉండరు !


2022-23 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని మీరు గతంలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. దాని గడువు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది. 2015-16 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఏడు సంవత్సరాల్లో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలని మీరు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ తయారు చేసిన ఒక పత్రంలో పేర్కొన్నారు. దీనికి గాను ఏటా వృద్ధి రేటు 10.4శాతం ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు దాని ప్రస్తావన లేకుండా కొత్తవిషయాలు చెబుతున్నారు. పాత వాగ్దానం మరచిపోయినట్లుగా కనిపిస్తోంది, దేని మీదా నిలకడ కనిపించటం లేదు. అందుకే మాకు అనుమానం. ఈ విషయంలో మీకు మీరే సాటి కదా ! నల్లధనం అన్నారు, పెద్ద నోట్లను రద్దు చేశారు. సాధించిందేమిటో మీ నోట మేం వినలేదు. గుజరాత్‌ తరహా అభివృద్ధి అన్నారు, అదీ అంతే, అచ్చే దినాలన్నారు. చచ్చేదినాలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆ మధ్య మన్‌కీ బాత్‌లో కుక్కలను పెంచాలని పిలుపు ఇచ్చారు. ఆకలో అన్నమో రామచంద్రా అని జనం అంటుంటే పోషకాహారం తినాలని చెప్పారు. ఎమితిని సెపితివి కపితము అన్నట్లుగా అలా ఎందుకు మాట్లాడుతున్నారో, మీకు ఏమైందో అని మేమంతా జుట్టు పీక్కుంటున్నాము.


కరోనాతో నిమిత్తం లేకుండానే మీ అచ్చేదిన్‌లోనే ఒక్క ఏడాది కూడా నీతి అయోగ్‌ చెప్పిన 10.4శాతం వృద్ధి రేటు లేదు. అసలు మొత్తం జిడిపి వృద్ధి రేటే ఆ స్దాయిలో లేదు. అయితే ఈ కాలంలో విత్తనాల బిల్లు, నగదు బదిలీ, కనీస మద్దతు ధరల పెంపు, జీరో బడ్జెట్‌, సహజ వ్యవసాయ సాగు, వ్యవసాయ ఉత్పత్తిదార్ల వ్యాపార సంఘాల గురించి మీరు, మీ మంత్రులు ఎన్ని కబుర్లు చెప్పారో ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటారా ? అవన్నీ పక్కన పెట్టి కొత్త విషయాలు చెబుతున్నారు ? నిజమే, ఇన్ని తెలివి తేటలు ఎక్కడి నుంచి వచ్చాయా అని సాగుపనులు ముగిసిన తరువాత పిచ్చాపాటీలో మేము అనుకుంటూ ఉంటాం.


మాట్లాడితే స్వామినాధన్‌ పేరు చెబుతారు. కనీస మద్దతు ధరల నిర్ణయంలో ఆయన కమిటీ చేసిన సిఫార్సును గత పాలకులు, మీరూ పట్టించుకోలేదు.విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ కూలీలు, దున్నకం,కుటుంబ సభ్యుల శ్రమ, భూమి కౌలును పరిగణనంలోకి దీసుకొని ఉత్పాదక ఖర్చు మీద 50శాతం అదనంగా కనీస మద్దతు ధరలను ప్రకటించాల్సి ఉండగా దాన్ని నీరుగార్చారు. చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య సహాయతా సంఘం(సఫాక్‌) పేరుతో ఒక సంస్ధను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.నిజానికి అలాంటి ఉత్పత్తిదారుల సంఘాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అవిగాక కొత్తగా ఐదువేల కోట్ల రూపాయలతో 2023-24 నాటికి పదివేల నూతన సంఘాలను ఏర్పాటు చేయతలపెట్టారు. ఇప్పటి వరకు నాలుగు వేల సంస్ధలను నాబార్డ్‌ ఏర్పాటు చేసింది. ఇవన్నీ సహకార సంఘాల వంటివే. గతంలో భూస్వాములు, ధనిక రైతులు సహకార వ్యవస్ధలను ఎలా నాశనం చేసిందీ చూశాము. అయితే సహకార సంఘాలకు, వీటికీ తేడా ఉంది. వీటికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు, హామీ కావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సంస్ధలు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గతంలో ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మూతపడ్డాయి, అనేకం నామమాత్రంగా పని చేస్తున్నాయి. సఫాక్‌ ఇటీవల విడుదల చేసిన ఒక పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం 30శాతం సంస్దలు మాత్రమే బతికి బట్టగలుగుతున్నాయి, 20శాతం జీవన పోరాటం చేస్తున్నాయి. మిగిలిన కంపెనీలు వివిధ దశల్లో ఉన్నాయి, కార్యకలాపాలను ప్రారంభించలేదు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్ధలకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ప్రతి సభ్యుడికీ రెండువేల రూపాయల చొప్పున లేదా ఒక సంస్దకు గరిష్టంగా 15లక్షలకు మించకుండా మాచింగ్‌ గ్రాంట్‌, రెండు కోట్ల రూపాయల వరకు రుణం ఇస్తుంది. ఈ పరిమితుల కారణంగా అనేక సంస్ధలు చిన్న స్ధాయిలో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయి. అయినా కంఠశోష గాకపోతే మీకు ఈ విషయాలు తెలియవా ? కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లులు చట్ట రూపం దాల్చిన తరువాత బడాకంపెనీలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతాయి. పెద్ద కంపెనీలే బడా సంస్ధల దెబ్బకు తట్టుకోలేకపోతున్నపుడు వాటితో రైతు సంస్ధలు ఏమేరకు బతికి బట్టకడతాయన్నది మా ప్రశ్న.


నేరుగా (సబ్సిడీ) నగదు బదిలీ పధకం వలన తమ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని, గతంలో మాదిరే సబ్సిడీ ధరలకే ఎరువులను అందించాలని నీతి అయోగ్‌ తరఫున జరిపిన ఒక సర్వేలో 64శాతం మంది రైతులు చెప్పినట్లు తేలింది. అయితే దీన్ని అంగీకరిస్తే సబ్సిడీల ఎత్తివేతకు సోపానమైన నేరుగా నగదు బదిలీ పధకాన్ని నిలిపివేయాల్సి వస్తుందని గాకపోతే దాన్ని ఎందుకు అంగీకరించలేదో చెబుతారా ? నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది అని గతేడాది పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఒక ప్రభుత్వ నివేదిక వచ్చింది. పకోడీలు అమ్మేవారికి కూడా ఉపాధి కల్పించినట్లే, అలాంటి వాటిని లెక్కల్లోకి తీసుకోలేదని అప్పుడు చెప్పారు. తరువాత గుట్టుచప్పుడు కాకుండా దాన్నే ఆమోదించారు. నేరుగా సబ్సిడీ బదిలి గురించి అబ్బే అబ్బే ఇది సమగ్రమైన సర్వే కాదు, తగినంత మంది లబ్దిదారులను ప్రశ్నించలేదు అని నివేదికను తిరస్కరిస్తున్నట్లు 2019నవంబరు 19న పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు చెప్పించిన మీ చతురతను ఎలా మరచిపోగలం !


జీరో బడ్జెట్‌, సేంద్రీయ వ్యవసాయం పేరుతో మీ బిజెపితో కలసి పాలన సాగించిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. అది రైతాంగ ఆదాయాలు రెట్టింపు కావటానికి, రైతులు రుణ విముక్తులు కావటానికి తోడ్పడుతుందని చెప్పారు.ఈ తరహా వ్యవసాయాన్ని చేయించే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు 2018లో పెద్ద హడావుడి చేశారు. ఎనభై లక్షల ఎకరాల్లో రసాయన ఎరువులు లేని సేంద్రీయ వ్యవసాయాన్ని 60లక్షల మంది రైతులు 2024 నాటికి సాగిస్తారని చెప్పారు. ఏమైనట్లు ? దేశంలో ఇప్పుడు దాని ఊసే ఎత్తటం లేదేమి ? ఆవు పేడ, మూత్రం పేరుతో రాజకీయాలు చేయటం తప్ప మీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా వాటితోనే పంటలు పండిస్తున్నారా ? ఇప్పుడు మీరు చెబుతున్న కార్పొరేట్‌ లేదా కాంట్రాక్టు వ్యవసాయం ఆవు పేడ, మూత్రంతోనే చేయిస్తారా ? అమాయక రైతులం మీరు ఏం చెప్పినా వినక చస్తామా ?


కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు వీధుల్లోకి వచ్చారు. దీని వెనుక మార్కెట్లు రద్దయితే ఆదాయం కోల్పోయే వ్యాపారులు ఉండి నడిపిస్తున్నారని మీ పార్టీ బిజెపి ప్రచారం చేస్తోంది. ఒక వైపు మార్కెట్లను రద్దు చేస్తామని మేమెక్క డ చెప్పాం అంటారు , ఏంది సారూ ఇది ! ఆందోళనకు దిగిన వారు దేశద్రోహులని మీవారే సామాజిక మాధ్యమంలో దాడి చేస్తున్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి ప్రధాన కారణం ఈ రంగానికి సబ్సిడీలను రద్దు లేదా గణనీయంగ కోత పెట్టటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవటం, తగిన ధరలు లేకపోవటం, దిగుబడులు పెరగకపోవటం, పరిశోధనలను పక్కన పెట్టటం వంటి అనేక కారణాలు ఉన్నాయి. వ్యాపారుల దోపిడీ అనేది ఒక కారణం మాత్రమే. పాలకులకు చిత్తశుద్ది ఉంటే దాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి కనుక ఏదో ఒక సాకు చూపాలి. రైతులకు ప్రత్యక్షంగా కనిపించేది వ్యాపారులు, వారి అక్రమాలే కనుక వారిని చూపి మీరు చేయదలచుకున్నది చేస్తున్నారు తప్ప మరొకటి కాదని అనుకుంటున్నాం. పార్లమెంటులో మాదిరి వ్యవసాయ చట్టాలను మా మీద రుద్దటం సాధ్యం కాదని సవినయంగా మనవి.
వ్యవసాయ మార్కెట్‌ యార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. అక్కడ వ్యాపారం చేసే వారు విధిగా ప్రభుత్వం వద్ద నమోదు కావాలి. అక్కడ జరిగే లావాదేవీల వలన ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కనీస మద్దతు ధరలకంటే తక్కువకు కొనుగోలు చేస్తే ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దళారులను అరికట్టేందుకే జాతీయ ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెట్‌ (ఇనామ్‌)ను ప్రవేశపెడుతున్నట్లు మీరు 2016లోనే చెప్పారు. అనేక రాష్ట్రాలకు చెందిన మార్కెట్లను వాటితో అనుసంధానం చేశారు. మొత్తం 2,500 మార్కెట్‌ కమిటీలకు గాను 585 ఈ వ్యవస్ధలో ఉన్నాయి. (బీహార్‌లో వాటిని 2006లోనే రద్దు చేశారు) ఇప్పటివరకు దాని వలన గతం కంటే రైతులు పొందిన ప్రయోజనాలు ఏమిటో ఎవరైనా రైతులకు వివరించారా ? అది నిజంగా ప్రయోజనకరంగా ఉంటే అన్నింటినీ అనుసంధానించాలని వత్తిడి తెచ్చి ఉండేవారు కాదా ?ఈ పాటికి రైతులు మొత్తం ఆ వ్యవస్ధ ద్వారానే లావాదేవీలు ఎందుకు జరపటం లేదు ?


ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పాలి. మార్కెట్‌ యార్డుల వెలుపల వాణిజ్య లావాదేవీలు జరిపితే వ్యాపారులు పన్ను చెల్లించాలి. ఇప్పుడు మీరు మార్కెట్‌ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా వ్యాపారులు కొనుగోలు చేయవచ్చు అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో తెలుగుదేశంతో పోటీపడి మరీ మద్దతు ఇచ్చారు. జగన్‌ నవరత్నాల అమలుకు ఇప్పటికే డబ్బు లేదు. ఇప్పుడు మార్కెట్ల ఆదాయం కూడా పోతే ఏం చేస్తారో తెలియదు. ఆదాయ నష్టానికి కేంద్రం ఒక్క పైసా కూడ ఇవ్వదు మరి. సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి అన్నట్లుగా జగన్‌ కష్టాలు జగన్‌వి పాపం !


ఆంధ్రప్రదేశ్‌ను మీరూ కాంగ్రెస్‌ మరికొన్ని పార్టీలు కలసి పోటీ బడి విభజించాయి. అప్పుడు నా సామిరంగా పార్లమెంటులో మీ వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్‌ వంటి నేతలు చేసిన హడావుడి, అబ్బో చూడవలసిందేగానీ చెప్పతరం కాదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఐదు సంవత్సరాలు పెడతామని మన్మోహన్‌ సింగ్‌ చెబితే మీ వెంకయ్య నాయుడు హడావుడి చేసి ఐదును పదేండ్లకు ఒప్పించటానికి చెమటోడ్చాల్సి వచ్చినట్లు చెప్పారు. తరువాత మీరు తిరుపతి వెంకన్న సాక్షిగా అదే చెప్పారు. తీరా జరిగిందేమిటి ? ప్రత్యేక హౌదా లేదూ పాడూ లేదు. కాంగ్రెస్‌ నేతలు విభజన చట్టంలో పెట్టి ఉంటే సాధ్యమయ్యేది నేరం వారిదే అంటూ తప్పించుకున్నారు. దాని గురించి మరోసారి మాట్లాడవద్దని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇప్పటి సిఎం జగన్మోహనరెడ్డిగారికీ తెగేసి చెప్పారు.
పార్లమెంట్‌లో చర్చనూ విస్మరించారు. నిత్యం దేవుడి గురించి చెప్పే మీరు వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాన్ని ఖాతరు చేయలేదు. వ్యవసాయ చట్ట సవరణల్లో కనీస మద్దతు ధర గురించి, పంటల సేకరణ హామీలను చేర్చకుండా బిల్లులను ఆమోదించారు. మరోవైపు అబ్బే అవేమీ రద్దు కావు అని నమ్మమంటున్నారు. ఒక్క మాట అడిగితే ఏమనుకోరుగా సారూ ! మీరు దేవుడు అని మా వెంకయ్య నాయుడు గారు గతంలో వర్ణించారు. జిఎస్‌టి విషయంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య చట్టబద్దమైన ఒప్పందం కుదిరింది. ఐదేండ్ల పాటు పన్ను ఆదాయం తగ్గితే కేంద్రం భర్తీ చేస్తుందని దానిలో అంగీకరించారు. మన నిర్మలమ్మగారు దేవుడి లీల కారణంగా తగినంత ఆదాయం రాలేదు కనుక కేంద్రం చేసేదేమీ లేదు, కావాలంటే అప్పులిప్పిస్తాం అప్పు ఎలా కావాలో తేల్చుకోండి అన్నారు. అదేంటి సారూ మీరు దేవుడై ఉండి ఇంతవరకు మాట్లాడలేదు. పోనీ అదేమి నిర్మలమ్మా అలా మాట్లాడావేమిటి, ఆ లీల లేదా పాపం నాకు అంటుకోదా అన్ని అంతర్గతంగా కూడా ప్రశ్నించినట్లు లీకుల వార్తలు కూడా రాలేదు.


నిత్యావసర సరకుల చట్టాన్ని కూడా సవరించారు. ఏ సరుకును ఎంతైనా నిల్వచేసుకోవచ్చు. విపరీతంగా ధరలు పెరిగినపుడు మాత్రమే ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. ఇదేంటి సారు, నిల్వ చేసుకొనేందుకు అవకాశం ఇవ్వటం ఎందుకు, ధరలు విపరీతంగా పెరిగేంతవరకు చోద్యం చూడటం ఎందుకు ? అప్పుడు ఆంక్షలు ఎందుకు ? దీన్నే మేము నక్క పోయిన తరువాత బొక్క కొట్టటం అంటాం. మేం పండిస్తాంగానీ, వినియోగదారులంగా కూడా ఉంటాం. అంటే మా పంటలను మేమే అదానీ, అంబానీ, అమెజాన్‌లకు అమ్ముకోవాలి వారి దగ్గర నుంచి అధిక ధరలకు కొనుక్కోవాలా ఏంది సారూ. దీన్నే గోడదెబ్బ చెంపదెబ్బ అనుకుంటాం మేము. పాలనా జోక్యం తక్కువ పేరుతో మమ్మల్ని ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా కార్పొరేట్లకు అప్పగిస్తూ చట్టాలు చేసి మీ చేతులు మీరు దులుపుకొని పోతే రేపు మాగతేంగాను ? జిఎస్‌టి మాదిరే రేపు మాకు సైతం అన్యాయం జరిగితే, అప్పుడు కూడా అంతా దైవ లీల, విధి వైపరీత్యం, మనం నిమిత్త మాత్రులం, దేవుడు ఆడించినట్లు ఆడటం, అనుభవించటం తప్ప విధి లేదా తలరాత మార్చలేం అంటే మా గతేంగాను సారూ ?
భవదీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాధికారత కాదు రైతులపై దాడి-కార్పొరేట్ల దోపిడీకి అప్పగింత !

21 Monday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Agri Bills, agriculture in india, Farmers empowerment, indian farmers


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


రైతుల స్థితిగతుల గురించి ఏమాత్రం స్పహ లేకుండా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సెప్టెంబరు 20 ” రైతుల పాలిట దుర్దినం”. పైగా బిల్లులు రైతుల పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని, ధరలను తామే నిర్ణయించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ కేంద్రం తెచ్చిన ఈ మూడు బిల్లులు ”కరోనా వ్యాధికన్నా కూడా ప్రమాదమైనవి”.
కేవలం పెట్టుబడులు- లాభాలు తప్ప ఏ నిబంధనలు పాటించని విదేశీ, స్వదేశీ కంపెనీలు రైతుల పంటలను తక్కువ ధరలకు కొని, భారీగా నిల్వ చేసి, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఇప్పటివరకు చట్టవిరుద్దంగా బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు.కొత్త బిల్లు ప్రకారం ఎంతైనా నిల్వ చేసుకోవచ్చని చట్టమే అనుమతిస్తే ఇక వీరికి అడ్డెవరు? ఎవరూ ప్రశ్నించటానికికూడా చట్టం అనుమతించదు. ఇప్పటివరకూ చట్టవిరుద్దమైన బ్లాక్‌ మార్కెటింగ్‌ ఇకనుండి చట్టబద్దమవుతుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యంమవుతాయి. ప్రభుత్వం నిర్ణయిస్తున్న మద్దతు ధరను అమలుపరచటానికి మార్కెట్‌ యార్డులుండవు. ప్రైవేట్‌ కంపెనీలు ఇష్టమొచ్చిన ధరకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు, ఇష్టమొచ్చినంత సరుకును గోదాములలో దాచుకోవచ్చు. వారిపై ఎటువంటి పన్నులూ వుండవు. అగ్రి బిజినెస్‌ కంపెనీలు ధరలు నిర్ణయించటానికి, ముందస్తు వ్యాపారానికి( ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ )కీఈబిల్లులు అవకాశం కల్పిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిత్యావసర వస్తువుల చట్టంలో చిరుధాన్యాలు,పప్పు ధాన్యాలు,ఆలుగడ్డలు ఉల్లిపాయలు ఇకపై నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి రావు, నిల్వ చేసుకోవచ్చు. అసాధారణంగా ధరలు పెరిగినపుడే ప్రభుత్వాలు ఆంక్షలు విధించాలని చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నవారే ధరలను నియంత్రిస్తారు.ఎగుమతి దిగుమతి విధానాలు కూడా వీరే నిర్ణయిస్తారు. ఇకపై వ్యాపార సంస్ధలు,కంపెనీలు, ఎటువంటి రుసుములు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని కొత్తచట్టం చెప్తోంది.రిలయన్స్‌, అదానీ, పెప్సీ వంటి బడా కంపెనీలు వ్యవసాయ వ్యాపారంలో ప్రవేశించారు. వారికి మార్గం సుగమం చేయటమే వ్యవసాయ, నిత్యావసర సరకుల చట్టాల సవరణ బిల్లుల లక్ష్యం.
ఈబిల్లు వలన నిత్యావసర సరుకుల కత్రిమ కొరత సష్టించేందుకు దారితీసే ప్రమాదం ఉందని అనుభవం చెప్ప్తున్నది. బ్రిటిష్‌ పాలనలో రైతులను కాల్చుకు తిన్నారు. అదే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం ద్వారా అన్నదాత పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది. రైల్వేల నుంచి విమానాల వరకు అన్నింటిని ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్తున్నది. కోల్డ్‌ స్టోరేజ్‌లు ఎక్కువ కట్టినందువలన వ్యవసాయఉత్పత్తులను నిల్వ చేసుకోటానికి రైతులకు అవకాశం లభిస్తుందంటున్నారు. కోల్డ్‌ స్టోరేజి లు ఎవరివి? ఎవరు కడతారు? వ్యాపారులకు అది కూడా ఒక లాభసాటి వ్యవహారమే.
ఎక్కువ రోజులు వ్యవసాయ ఉత్పత్తులను ఆపుకోగలిగిన శక్తి సామాన్య రైతులకు లేదు. చిన్న రైతులు 86.2 శాతం మందివున్నారు. 12 కోట్ల 60 లక్షల చిన్న రైతులకు ఒక్కొక్కరికీసగటున 0.6 హెక్టార్ల సాగు భూమి మాత్రమేవున్న విషయాన్ని గమనించాలి. కౌలు రైతులైనా చిన్న రైతులయినా పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసి మంచి ధర కోసం ఎదురు చూడలేరు. తెచ్చిన అప్పులను చెల్లించటానికి, కుటుంబం గడవటానికి పంటను అమ్ముకోక తప్పదు. ఎక్కువ శాతం పంట అమ్ముకున్న తరువాత ధరలను పెంచటం ప్రపంచ అగ్రిబిజినెస్‌ నాటకంలో భాగమే.

కనీస మద్దతు ధరకే కొనాలని ఈ బిల్లులో వుందా?
కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కంపెనీలు కొనటానికి వీలులేదని ఈ బిల్లులో ఎందుకు చేర్చ లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.పెద్ద పెద్ద కంపెనీలకు స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ సదుపాయాలు కల్పించి మార్కెట్‌ పై పూర్తి అధికారాలను వారికి కట్టపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ బిల్లు, ఇది రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితిని ఇంకా దూరం చేస్తుంది. కార్పొరేటు కంపెనీలకి మేలుచేసేందుకే ఈ బిల్లులకు ఆమోదం పొందారు. ఒప్పంద వ్యవసాయం ప్రారంభమైతే ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్దతు ధరల ప్రమేయం ఉండదు. ఒప్పంద షరతులను ఒక సారి రైతులు అంగీకరించిన తరువాత ఎవరైనా కోర్టుకు వెళ్లినా చెల్లదు.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ , తెలుగుదేశం రెండు కూడా ఈ బిల్లును సమర్థించాయి. దీన్ని ఎలా వ్యతిరేకించాలా అని రైతులు, ప్రజలు ఆలోచించాలి. స్వామీనాధన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం, అవసరమైనపుడు పంట కొనుగోళ్ళను ప్రభుత్వం చేపట్టనంతకాలం రైతుకు మంచి ధర దొరకదు. వ్యవస్ధలో వున్న లోపాలను సవరించి రైతులకు లాభంచేయాల్సిన ఫ్రభుత్వాలు ఏకంగా వ్యవసాయమార్కెట్లను నాశనం చేయపూనుకున్నాయి. ఇల్లంతా ఎలుకలున్నాయని ఇల్లు తగలపెట్టడానికి పూనుకుంటున్నారు.
ఆహారస్వావలంబన సాధించి దేశానికి అన్నం పెట్టే రైతులను నాశనం చేయటం వలన దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం నాశన మౌతాయి. బీహార్‌ రాష్ట్రం లో 2006 సం.లోనే వ్యవసాయమార్కెట్‌ లను రద్దు చేశారు.మార్కెట్‌ కమిటీల రద్దు తర్వాత ధరలు తగ్గిపోయాయి. ఉదాహరణకు మొక్కజొన్న క్విటాలుకు మద్దతుధర రూ.1850.వుంది. ఎక్కువ మంది రైతులు 1000 రూపాయల కన్నా తక్కువ ధర కే అమ్ముకోక తప్పలేదు. మద్దతు ధర కే కొనాలనే నిబంధన బిల్లులో ఎక్కడా లేదు. క్రమేపీ కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోవటానికే ఆ నిబంధనలను చేర్చలేదని అర్ధమౌతుంది.

ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం

రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం ఉమ్మడి జాబితా లోనిది. ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని రుద్దుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే బిల్లులను నిరంకుశంగా తెచ్చారు. రైతన్నలలో తలెత్తుతున్న ఆందోళనలను ఖాతరు చేయకుండా ప్రవేశపెట్టొందంటూ తాను ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినిపించుకోలేదని అకాలీదళ్‌ నేత, కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు.

బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీ కి పంపాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఓటింగ్‌ జరపాలన్న ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. రూల్స్‌ ప్రకారం ఒక్క ఎంపీ అడిగినా ఓటింగ్‌ పెట్టాలి. పార్లమెంటు సభ్యులు చేసేదేమీ లేక కోపంతో బిల్లు ప్రతులను చించివేశారు. పోడియం వైపు దూసుకు వెళ్లారు. గొంతెత్తి అరిచారు.
విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు.

బిల్లుల పై భిన్న వ్యాఖ్యానాలు..

వ్యవసాయ బిల్లులను పార్లమెంటు ఆమోదించటం వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని, కోట్లాదిమంది రైతులకు సాధికారతను ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.
రైతుల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులు పంటను కొనేధర కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను బిల్లులలో ఎందుకు పొందుపరచ లేదని మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఆహార భద్రతకు విఘాతం కల్పిస్తాయని కూడా అన్నారు.

వ్యవసాయ రంగ బిల్లులు” రైతుల పాలిట మత్యు గంటలు” అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు అన్ని కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయని ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందని స్ఠాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతో మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్‌ శక్తులకు బానిసలుగా మార్చేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. రైతాంగం, వ్యవసాయం పై ముప్పేట దాడి చేస్తున్నారని, బడా వ్యా పారవేత్తలు, కార్పోరేట్‌ సంస్ధలు, అగ్రిబిజినెస్‌ సంస్ధలు పెద్దఎత్తున దోపిడీ చేయటానికి ఒక నిబంధనావళిని రూపొందిస్పున్నారని మార్క్సిస్టు పార్టీ నాయకులు అన్నారు.
తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్ళి అమ్ముకోవటం సాధ్యమేనా ? ఇది తేనెపూసిన కత్తి లాంటి చట్టం అని, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించితీరాలని, కార్పోరేట్‌ గద్దలకోసమే ఈ వ్యవసాయ బిల్లు అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయబిల్లులు అన్నదాతలకు డెత్‌ వారెంట్‌ లాంటివని కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బస్వా వ్యాఖ్యానించారు.రైతుల ప్రాణాలను హరించే ఈ బిల్లిలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
రైతులనుబానిసలుగా మారుస్తారా అని డీయంకే ఎంపీ ఇళంగోవాన్‌ ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసుకునేవి.రైతులను ఆటవస్తువులుగా మార్చేస్తాయని ఇళంగోవాన్‌ విమర్శించారు.ఈ బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కనీసం ఆర్‌ యస్‌ యస్‌ అనుబంధరైతు సంఘాలతోనూ చర్చించలేదని ఎస్‌ పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు.

25న ఆందోళనకు 250 రైతుసంఘాల పిలుపు

వ్యవసాయ రంగ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేష్‌ రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలు మొదలు పెట్టారు. బిల్లులను ఉపసంహరించుకునేలా ఆందోళన తీవ్రతరం చేయాలని భారతదేశంలోని 250 రైతుసంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 25న బందుకు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలలోనూ కలెక్టర్‌ఆఫీసుల వద్ద ఆందోళనలకు సిద్దమవుతున్నారు. రైతుల పైనా వ్యవసాయం పైనా జరుగుతున్నదాడిని ఎదుర్కోవాలి.

గమనిక : వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమడ ప్రాంత రైతు సంఘం నాయకులు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d