• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

మొసాక్‌ ఫోన్సెకా కథ, కమామిషు

12 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Mossack Fonseca, panama, panama papers

ఎం కోటేశ్వరరావు

      ప్రపంచ నేతలు, పేరు మోసిన ప్రముఖులను గడ గడలాడిస్తున్న  పత్రాలను కలిగి వున్న కంపెనీ మొసాక్‌ ఫోన్సెకా కథ, కమామిషు ఏమిటి ? అనగా అనగా ఒక భూ ప్రపంచం, దానిలో ఒక ఖండం పేరు దక్షిణ అమెరికా, దానికి ఇంకొక పేరు లాటిన్‌ అమెరికా.దీనిని వుత్తర అమెరికా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు వున్న ఖండం) ఖండాన్ని కలుపుతూ మధ్యలో వున్న చిన్న దేశాలలో ఇదొకటి. అందుకని దీనిని మధ్య అమెరికా దేశం అని కూడా అంటారు గానీ ఖండాల వారీ చూస్తే దక్షిణ అమెరికాకే చెందుతుంది. పసిఫిక్‌-అట్లాంటిక్‌ సముద్రాలను కలుపుతూ ఒక కాలువను తవ్వారు అదే పనామా కాలువ.అంతకు ముందు ఐరోపా, ఆఫ్రికా ఖండాల నుంచి దూరప్రాచ్య దేశాలకు వెళ్లాలంటే దక్షిణ అమెరికాలోని చిలీలో వున్న కేప్‌ హారన్‌ను చుట్టి రావాల్సి వుండేది. అది ఖర్చు, సమయం వృధాతో పాటు ప్రమాదకర మార్గంగా వుండేది. దాంతో ఆఫ్రికా ఖండంపై ఆధిపత్యం సంపాదించిన ఫ్రెంచి పాలకులు పనామా కాలువకు రూప కల్పన చేశారు. ఈ కధ వేరే. అలాంటి పనామా తమ దేశంలో తవ్విన కాలువను జాతీయ చేసిన తరువాత ఆ కాలువ గుండా ప్రయాణించే ఓడల నుంచి టోలు వసూలు చేసుకోవటంతో పాటు సులభంగా డబ్బు సంపాదించేందుకు తమ దేశంలో కంపెనీలను ఏర్పాటు చేస్తే ఎలాంటి పన్నులు విధించబోమని ప్రకటించింది. పరిశ్రమలు పెడితే, వ్యాపారాలు నిర్వహించి తమ జనానికి వుపాధి కల్పిస్తే రాయితీలు ఇస్తామని ప్రకటించే దేశాల గురించి చాలా మందికి తెలుసు గానీ ఇలా కేవలం కంపెనీలను రిజిస్టర్‌ చేస్తే రాయితీలిచ్చే దేశాలు, ప్రాంతాలు ప్రపంచంలో చాలా తక్కువగా వున్నాయి.

    ఇంతకీ పనామా జనాభా ఎంత అనుకుంటున్నారు. నలభై లక్షల లోపు, వారిలో సగం మంది రాజధాని పనామా సిటీలోనే వుంటారు.కార్పొరేట్‌ కంపెనీలకు సేవలు అందించేందుకు 1977లో జర్మన్‌ లాయర్‌ జర్గన్‌ మొసాక్‌ తన పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. పది సంవత్సరాల తరువాత పనామాకు చెందిన లాయర్‌ రామొన్‌ ఫొన్సేకా దానిలో చేరటంతో అది మొసాక్‌ ఫొన్సేకా కంపెనీగా మారింది. తరువాత స్విడ్జర్లాండ్‌కు చెందిన మరో లాయర్‌ క్రిస్టోఫ్‌ జోలింగర్‌ వారితో భాగస్వామిగా చేరాడు. ఇంకేముంది ముగ్గురు లాయర్లు అరవై కక్షిదారులుగా వారి వ్యాపారం విస్తరించింది. వాణిజ్య , ట్రస్ట్‌ చట్టాలు, కంపెనీ రిజిస్ట్రేషన్లు,మదుపు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్ధల గురించి సలహాలు అందించటంలో అది పేరు తెచ్చుకుంది.దానికి ప్రపంచంలో 40 కార్యాలయాలు వాటిలో 500 మంది సిబ్బంది వున్నారు. గుట్టుగా లావాదేవీలు నిర్వహించే ఈ సంస్ధలో 1977-2015 మధ్యకాలంలో దాని సేవలు పొందిన, పొందుతున్న ఖాతాదారుల వివరాల పత్రాలు వెల్లడి కావటంతో ప్రపంచ వ్యాపితంగా దాని పేరు తెలిసిపోయింది. పనామాలో ఇంకా ఇలాంటి సేవలు అందించే కంపెనీలు చాలా వున్నాయి.పనామాలో నమోదైన మొత్తం కంపెనీలలో సగం ఇలాంటి ఏడు పెద్ద సంస్ధల సేవలు పొందుతున్నాయి.

    ఎంత ఎదిగినా ఒదిగి వుండాలన్నట్లుగా అబ్బే మా కంపెనీ చాలా చిన్నదండీ ప్రపంచ ఆర్ధిక సేవల సలహాలలో కేవలం ఐదుశాతమే మా వాటా అని మొసాక్‌ ఫొన్సేకా చెప్పుకుంటుంది. కానీ పదిశాతం వరకు వుంటుందని ఒక అంచనా.కరీబియన్‌ ప్రాంతంలో బ్రిటీష్‌ వారి ఏలుబడిలో వున్న వర్జిన్‌ ఐలాండ్స్‌ అనే దీవిలో కూడా మొసాక్‌ ఫొన్సెకా కార్యకలాపాలు వున్నాయి. ఇక్కడ అది లక్షకు పైగా కంపెనీలను నమోదు చేసింది. ఇవి అక్కడి జనాభాకు నాలుగు రెట్లు ఎక్కువంటే ఆశ్చర్యపోవద్దు. వీటిని సూట్‌ కేస్‌ కంపెనీలని కూడా అంటారు. వాటికి కార్యాలయాలు వుండవు, సిబ్బంది వుండరు.పేరుకు అక్కడ ఆఫీసులు, ఇతర చోట్ల కార్యకలాపాలు, పన్నుల చెల్లింపు విషయానికి వస్తే అక్కడి చిరునామాను చూపి తప్పించుకుంటాయి. బినామీ, సూట్‌ కేసు కంపెనీల ఏర్పాటుకు సలహాలు ఇచ్చే మొసాక్‌ ఫోన్సెకా వంటి కంపెనీలు కూడా నకిలీలను ఏర్పాటు చేసుకుంటాయి. అర్జెంటీనా అక్రమాల విచారణలో ఇది ఎంఎఫ్‌ అనే మరో సూట్‌ కేసు కంపెనీ ఏర్పాటు చేసినట్లు బయటపడింది. బ్రెజిల్‌లో జరిగిన అక్రమాలలో కూడా ఇలాంటిదే బయట పడింది. అయితే అక్కడి కార్యాలయం తమ ఏజంట్‌ తప్ప తమ ప్రధాన కార్యాలయంనుంచి పనిచేయదని తప్పించుకుంది. ఈ కంపెనీ యజమానులలో ఒకరు పనామా సలహాదారుగా వుండి, ఈ కుంభకోణం బయటపడటంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

   మనదేశ చరిత్రలో అనేక కుంభకోణాలు జరిగాయి. వాటన్నింటినీ ఇక్కడ పేర్కొనటం సాధ్యం కాదు. వాటిలో దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించి అవినీతి మైలు రాళ్లుగా (ఇప్పుడు కిలోమీటర్‌ రాళ్లు అనుకోవాలి) చెప్పుకొనే కొన్నింటిని రేఖా మాత్రంగా ఇక్కడ చూద్దాం. నయా వుదారవాద విధానం లేదా నూతన ఆర్ధిక విధానాల పేరుతో 99శాతం ప్రజలకు చెందాల్సిన వనరులను ఒక శాతం కార్పొరేట్లకు కట్టపెట్టటం జరుగుతోంది.

    రాజ్యాంగ సంస్ధ అయిన కంప్ట్రోలర్‌ మరియు ఆడిటర్‌ (కాగ్‌) నివేదికల ప్రకారం మన దేశంలో అపారంగంగా వున్న బొగ్గు నిల్వలను వేలం పాట లేకుండా అడ్డదారుల్లో, అవినీతి మార్గాలలో ప్రయివేటు సంస్ధలకు కట్టపెట్టటం పెద్ద కుంభకోణం.దీనికి వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రూపకల్పన చేస్తే మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం అమలు జరిపింది. పనిలో పనిగా విమర్శలను తప్పించుకొనేందుకు కొన్ని ప్రభుత్వ రంగ సంస్ధలకు కూడా ఇచ్చారు. దాని వలన నష్టం లేదు. వచ్చే లాభాలు తిరిగి ప్రభుత్వానికే చేరతాయి.ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల నష్టమని కాగ్‌పేర్కొనగా మీడియా అంచనా పదిలక్షల కోట్లకు పైగానే వుంది. ఇదంతా 2004-09 మఢ్యనే జరిగింది. అదీ స్వయంగా ప్రధాని ఆధ్వర్యంలోనే అని తెలుసుకోవాలి.

    బాగా చర్చజరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణం కారణంగా ఖజానాకు లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. పెరిగిన 2008 రేట్లు వున్నప్పటికీ నిబంధనలను పక్కదారి పట్టించి 2001 రేట్ల ప్రకారం కేటాయింపులు జరిపి ఈ అక్రమానికి తెరతీశారు.

   హవాలా కుంభకోణం. పన్ను ఎగవేసేందుకు, విదేశాల్లో డబ్బు దాచుకొనేందుకు అనుసరించిన విధానాన్ని హవాలా అంటారు. ఒక వ్యక్తి మన దేశం నుంచి అమెరికాకు డబ్బు పంపాలి. మరొకరు అక్కడి నుంచి మన దేశానికి పంపాలి. చట్ట బద్దమైన పద్దతులలో పంపితే లెక్కలు చూపాలి, పన్ను కట్టాలి.ఇవేమీ లేకుండానే కొంత కమిషన్‌ తీసుకొని అక్కడా ఇక్కడా డబ్బు సర్దుబాటు చేసే ఏజంట్లు వుంటారు.ఇందుకు గాను మన దేశంలో రాజకీయ నాయకులకు కోటీ ఎనభైలక్షల డాలర్ల మేర ముడుపులు ఇచ్చారని 1996లో వెల్లడయింది. దీనిలో అద్వానీ పేరు కూడా చోటు చేసుకుంది. తరువాత కాదని తేల్చారు. ఈ కుంభకోణం ఇప్పుడు కూడా నడుస్తున్నది.

    పెద్ద గీతను చిన్నదానిగా చేయాలంటే దాని పక్కనే మరింత పెద్దగీత గీయాలి. ఒకప్పుడు హర్షద్‌ మెహతా పెద్ద గీత ఇప్పుడు అంతకంటే ఎన్నో పెద్ద గీతలు.బ్యాంకులు, బోంబే స్టాక్‌ మార్కెట్‌ను మోసం చేసి దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన హర్షద్‌ మెహతా బీమా కంపెనీలో ఒక చిన్న వుద్యోగి. ఆర్ధిక లావాదేవీలలో లొసుగులను కనిపెట్టి వాటిని వుపయోగించుకున్నాడు.మొత్తం 28 కేసులు నమోదు చేయగా నాలుగింటిలోనే శిక్ష పడింది. 47ఏళ్ల వయసులో జైల్లో మరణించాడు. ఆ కేసులు మాత్రం ఇంకా నడుస్తూనే వున్నాయి.

  రక్షణ రంగంలో ముడుపులు లేని లావాదేవీ వుండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాటిని బహిర్గతం చేసింది బోఫోర్స్‌ కుంభకోణం. పెద్ద తుపాకుల కొనుగోలు కాంట్రాక్టులో 80 కోట్ల రూపాయల కమిషన్లు పొందిన వారిలో రాజీవ్‌ గాంధీ వున్నట్లు వెల్లడైంది. దీంతో పెద్ద సంచలనం. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలతో పోలిస్తే ఇది మరీ చిన్నగీత.

   కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా చివరికి గడ్డిలో కూడా కోట్లు సంపాదించవచ్చుని బీహార్‌లో జరిగిన 900 కోట్ల రూపాయల ఈ కుంభకోణం నిరూపించింది. దీని పేరు చెబితే వెంటనే లాలూ ప్రసాద్‌ యూదవ్‌ గుర్తుకు రాక మానరు.. బ్యాంకింగ్‌ రంగంలో వున్న లొసుగులను వుపయోగించుకొని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను కేతన్‌ పరేఖ్‌ అనే పెద్ద ఒక విధంగా వందల కోట్ల రూపాయలకు ముంచాడు.

    దాదాపు పది సంవత్సరాల పాటు విదేశీ, స్వదేశీ జనాలు, కంపెనీలను దాదాపు 14వేల కోట్ల రూపాయలకు ముంచిన సత్యం కంప్యూటర్స్‌ గురించి పెద్దగా చెప్పుకోనవసరం లేద. బిల్‌గేట్స్‌,చంద్రబాబు నాయుడు వంటి వారు ఈ మోసగాడిని తమ పక్కన కూర్చో పెట్టుకొని అందలమెక్కించారు. నకిలీ స్టాంపుల ముద్రణతో 20వేల కోట్లకు పైగా ముంచిన తెల్గి, దాదాపు పదివేల కోట్ల రూపాయలను స్వాహా చేసిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణం వంటివి మన కళ్ల ముందే జరిగాయి. వీటిలో భాగస్వాములైన వారిని శిక్షిస్తారా ? పోయిన ప్రజల సొమ్మును తిరిగి రాబడతారా ? అప్పనంగా సొమ్మును అప్పగించటమే అవినీతి కాదు, అలా తేలిన సొమ్మును రాబట్టకపోవటం కూడా అవినీతిలో భాగమే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పనామా కంపెనీ పత్రాలు – పెద్దల అవినీతి చిత్రాలు

12 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

big shots corruption, CORRUPTION, panama, panama papers

ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

ఎం కోటేశ్వరరావు

   లైసన్సులు, పర్మిట్లు ఇప్పించినందుకు లంచాలు తీసుకోవటం, బల్లకింద చెయ్యి పెట్టటం నాటి పద్దతి ! ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలు, భూములు, రుణాలు ఇప్పించి నీకది-నాకిది, నీకింత -నాకింత అని పంచుకోవటం నేటి పద్దతి !! ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకుంటుంటే అవినీతి నిరోధకశాఖ సిబ్బంది నాటకీయంగా వలపన్నటం లెక్కలేనన్ని సినిమాల్లో అందరూ చూసింది మోటు పద్దతి. ఇప్పుడు అంతా చట్టబద్దమే, బల్లమీది వ్యవహారమే.

    రాజకీయ నేత, పారిశ్రామికవేత్త, వ్యాపారి, సినిమా యాక్టర్‌ ఇలా ఎందరో మహాను భావులు , చిదిమితే దేశ భక్తి కారిపోతుంటుంది. ప్రతిదానినీ వ్యాపారం-లాభం లెక్కలలో చూసుకొనేవారు ఎవరైనా ఇదే పద్దతి. గజం పాతికవేల రూపాయల స్ధలాన్ని కంపెనీ పేరుతో పాతిక రూపాయలకే అప్పనంగా పొందవచ్చు. దీన్ని కేటాయించిన సదరు మంత్రి కుమారుడు, కుమార్తెల పేరుతో (ఎందుకంటే ఇప్పుడు బావమరుదులను కూడా నమ్మటం లేదు మరి) ముందుగానే ఏర్పాటు చేసిన సూట్‌ కేసు కంపెనీలలో పది రూపాయల వాటాను వెయ్యి రూపాయలకు కొనటం లేదా సదరు కంపెనీకి ఎలాంటి వడ్డీ లేకుండా వందల కోట్ల రుణం పేరుతో డబ్బు బదలాయించి చట్టబద్దంగానే లంచం చెల్లించటం నేటి పద్దతి.

     ఇక అలా సంపాదించిన దానిని స్నేహితులు, బంధువుల పేరుతోనో మరొక పేరుతోనో దాస్తే, ఎవరినీ నమ్మే రోజులు కావివి, తీరా గడ్డితిని సంపాదించిన దానిని వారు నొక్కేస్తే ? డబ్బూపోయె శనీ పట్టె అన్నట్లు ఎందుకొచ్చిన తిప్పలు ! విదేశాల్లో దాచుకుంటే ఏ గొడవా వుండదు. అందుకే ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

     మనకు బాగా తెలిసి పన్నుల స్వర్గం స్విడ్జర్లాండ్‌. అక్కడి బ్యాంకుల నిబంధనల ప్రకారం ఎవరైనా ఎంతైనా డబ్బు దాచుకోవచ్చు. అది ఎక్కడిది, అక్రమమా, సక్రమమా అని ఎవరూ అడగటానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించారు.అందుకని ఎవరైనా స్విడ్జర్లాండ్‌ వెళ్లారంటే అక్కడ లావాదేవీలు చూసుకొని రావటానికే అని అనుమానించటం సహజం. ఇపుడు స్విడ్జర్లాండ్‌ నిబంధనలు మార్చారు.ఎవరైనాఅడిగితే సమాచారాన్ని తెలియచేయాల్సి వుంటుంది. ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేని పనామా వంటి దేశాలు, దీవులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. డబ్బుంటే చాలు, దానిని ఎలా దాచుకోవాలో, ఎలా పన్నులు ఎగ్గొట్టాలో సలహాల సేవలు అందించే కంపెనీలు చాలా వున్నాయి. అదిగో అలాంటి వాటిలో పనామాలోని ఒక పెద్ద సంస్ధ మోసాక్‌ ఫొన్సెకా. దాని దగ్గర వున్న లక్షలాది లావాదేవీల పత్రాలు బయటికి వచ్చాయి. ఆ కంపెనీ పనామాలో వుంది కనుక వాటిని పనామా పత్రాలని పిలుస్తున్నారు.రెండులక్షలకు పైగా కంపెనీల వివరాలు ఇపుడు బయటకు వచ్చాయి. తమ కంప్యూటర్లను హాక్‌ చేశారని మొసాక్‌ ఫొన్సేకా ప్రకటించింది.

    ఏప్రిల్‌ మొదటివారంలో ఈ పత్రాలు వెలువడగానే దాదాపు అన్ని పత్రికలు ఆ వార్తను పతాక శీర్షికలతో పెట్టాయి. తరువాత వాటి గురించి దాదాపు మరిచి పోయాయి ? పెట్టుబడిదారుల పుత్రికలైన పత్రికలు కొనసాగింపు వార్తలను ఇస్తాయని ఎవరైనా ఆశిస్తే అది దురాశే.మన దేశానికి చెందిన పెద్దల పేర్లు కూడా పనామా పత్రాలలో వుండటంతో మన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. వాటి వెనుక కారణాలు ఏవున్నప్పటికీ ఆ మేరకు స్పందించినందుకు కొంత మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు పంచుతామని ఎన్నికలకు ముందు చెప్పిన ప్రధాని రెండేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదనే విమర్శలను తప్పించుకోవటానికే మొక్కుబడిగా ఆ ప్రకటన చేశారని ఎందరో భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం చాలా పరిమితమే. రానున్న రోజుల్లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మరింత సమాచారాన్ని వెల్లడించనుంది.అందువలన ఇది అంతంకాదు ఆరంభం మాత్రమే. వస్తున్న విశ్లేషణలు, నిబంధనలను పరిశీలిస్తే ఎవరెంత మన దేశంలో దోచుకున్నారో విదేశాల్లో దాచుకున్నారో వివరాలు కొంతమేరకు తెలుసుకోవచ్చేమో తప్ప సరిహద్దులు దాటిపోయిన ధనం ఏమేరకు తిరిగి వస్తుందన్నది అనుమానమే.

     పనామా పత్రాలు ప్రపంచంలో అనేక మంది రాజకీయ నేతలకు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఐస్లాండ్‌ ప్రధాని రాజీనామా చేశాడు.నలభై లక్షల డాలర్ల అక్రమ బాండ్ల వివరాలు బయటకు రావటంతో తోకముడిచాడు. బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ పన్నులకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చినట్లు బయటకు రావటంతో ఇబ్బందులలో పడ్డాడు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.ఇలాంటి వారు 45 దేశాధినేతల పేర్లు ఈ పత్రాలలో ప్రస్తావనకు వచ్చాయి.న్యూస్‌ వీక్‌ పత్రిక సమాచారం ప్రకారం ప్రపంచంలోని పన్నుల స్వర్గాలలో 21నుంచి 32లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రపంచ సంపన్నులు, కార్పొరేట్లు అక్రమంగా దాచుకున్నారు. స్విడ్జర్లాండ్‌, హాంకాంగ్‌, అమెరికా, సింగపూర్‌, కేమాన్‌ దీవులు ప్రధమ స్ధానాలలో వుండగా పనామా 13,బ్రిటన్‌ 15వ స్ధానంలో వుంది.బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్‌లో పన్ను చెల్లించనవసరం లేకపోవటంతో ఎఫ్‌డిఐలు అక్కడికి లక్షా ఇరవైవేల కోట్ల పౌండ్ల మేరకు వచ్చాయి. అక్కడ 6,72,500 కంపెనీలు లేదా ఖాతాలు వున్నాయి. దారి జనాభా 30వేలకు లోపు. ఇలాంటి అక్రమలావాదేవీలకు ప్రధాన కేంద్రంగా బ్రిటన్‌ వుంది. పనామా పత్రాల తీవ్రత ‘పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేదిగా వుందని’ టైమ్‌ పత్రిక వ్యాఖ్యానించింది.’21వ శతాబ్దపు పెట్టుబడిదారీ విధాన వాహనం అడ్డుగోడను ఢీకొట్టేందుకు శబ్దం చేస్తూ వెళ్లే దారిలో మొసాక్‌ ఫొన్సెకా వ్యవహారం ఒక మైలు రాయి అని ‘ జీన్‌ పెరీ లేమాన్‌ అనే పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించాడు.

     ఆర్ధిక అసమానతలను పరిష్కరించని పక్షంలో మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్ధకే ముప్పు వస్తుందని తీవ్ర హెచ్చరిక చేసిన ఫ్రెంచి ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ పన్నుల స్వర్గాలను అదుపు చేయని పక్షంలో మొత్తం ప్రపంచ వ్యవస్తే కుప్పకూలి పోతుందని అది జరగక ముందే వాటిని తక్షణమే అదుపు చేయాలని,నిబంధనలు పాటించని దేశాలపై అవసరమైతే ఆర్ధిక ఆంక్షలు విధించాలని పనామా పత్రాల వెల్లడి గురించి వ్యాఖ్యానించారు. పన్నుల స్వర్గాలలో జరుగుతున్న అక్రమాల గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయని ప్రభుత్వాలు చేసే ప్రకటనలకు, ఆచరణకు నక్కకూ నాగలోకానికి వున్నంత దూరం వుందని పికెటీ పేర్కొన్నారు. 2014లో లక్సెంబర్గ్‌ లీక్స్‌ లేదా లక్స్‌లీక్స్‌ దర్యాప్తులో ఐరోపాలోని కార్పారేట్‌ కంపెనీలేవీ పన్నులు కట్టటం లేదని తేలింది. పనామా పత్రాల ప్రకారం ధనిక, పేద దేశాల ఆర్ధిక, రాజకీయ పెద్దలు తమ ఆస్థులను ఎలా దాచుకుంటున్నారో వెల్లడి అయింది. జర్నలిస్టులు తమ విధి నిర్వహిస్తున్నందుకు మనం సంతోషించాలి.సమస్య ఎక్కడంటే ప్రభుత్వాలే తమపని తాము చేయటం లేదు. వాస్తవం ఏమంటే 2008లో ప్రారంభమైన సంక్షోభం తరువాత అసలు చేసిందేమీ లేదు.మరో విధంగా చెప్పాలంటే పరిణామాలు మరింతగా దిగజారాయి.తమ ఆధీనంలోని వర్జిన్‌ దీవులు, ఇతర ప్రాంతాలలో కొల్లగొట్టే పనులు చేస్తూనే బ్రిటన్‌ తన పన్ను రేటును 17శాతానికి తగ్గించబోతున్నది. ఒక పెద్ద దేశం ఇలా చేయటాన్ని ఎక్కడా వినలేదు. దీని గురించి ఏమీ చేయకపోతే మనమందరం ఐర్లండ్‌ మాదిరి 12శాతం లేదా సున్నా లేకపోతే పెట్టుబడులు పెట్టిన వారికి గ్రాంట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అని కూడా పికెటీ వ్యాఖ్యానించారు.

      పన్నుల స్వర్గాలలో ప్రయివేటు ఆస్ధులను దాచుకోవటంపై ఇప్పటికీ పూర్తి పారదర్శకత లేదు, 2008 నుంచి ఆర్ధిక వ్యవస్ధల కంటే ఆస్తులు వేగంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వారు ఇతరుల కంటే తక్కువ పన్ను చెల్లించటం ఒక కారణం.ప్రభుత్వం ఎలాగూ దర్యాప్తు చేయదనే భయంతో ప్రాన్స్‌లో ఒక జూనియర్‌ మంత్రి తనకు స్విడ్జర్లాండ్స్‌లో ఖాతాలు లేవని 2013లో మంత్రి తాపీగా చెప్పాడు. జర్నలిస్టులు వాస్తవాలను వెల్లడించారు. తమ దగ్గర వున్న సమాచారాన్ని వున్నది వున్నట్లు అధికారికంగా తెలియచేసేందుకు స్విడ్జర్లాండ్‌ అంగీకరించింది. పనామా ఇప్పటికీ తిరస్కరిస్తున్నది. సమాచారాన్ని వెల్లడి చేయటమంటే అదొక ప్రభావ వంతమైన సామాజిక నిరసన అనే సిద్ధాంతం గతంలో లేని విధంగా నేడు పరీక్షకు గురి అవుతోంది. అది పెట్టుబడిదారీ విధానం రానున్న రోజుల్లో మరింత తీవ్ర సంక్షోభంలో పడవేయటానికి తోడ్పడుతుందని పికెటీ హెచ్చరించారు.

మన జర్నలిస్టులూ భాగస్వాములే

      ఈ శతాబ్ది జర్నలిజం ప్రాజెక్టుగా పేరుతెచ్చుకున్న పనామా పత్రాలను బయట పెట్టిన జర్నలిస్టులలో మన దేశానికి చెందిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన వారు ముగ్గురు వున్నారు. పి వైద్యనాధన్‌, రితు శరీన్‌, జయ్‌ మజుందార్‌ దాదాపు ఎనిమిది నెలల పాటు పనామా పత్రాల పరిశీలనలో నిమగ్నమయ్యారు.యాజమాన్యం వారిని అందుకు అనుమతించింది. విలేకర్లు తెచ్చిన సమాచారాన్ని తీసుకొని డబ్బున్న, అక్రమాలకు పాల్పడిన వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు సంపాదించే మీడియా సంస్ధల యజమానులు విచ్చల విడిగా వున్న ఈ రోజుల్లో విశ్వసనీయత ముఖ్యమైనది. అందుకు గాను గతంలో వారి పరిశోధనలు, వెల్లడించిన సమాచారం, వ్యక్తిగత నిజాయితీల రికార్డు ఆధారంగా ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసిఐజె) తన బృందాన్ని ఎంపిక చేసుకుంటుంది. దీనిలో అలా రాటు దేలిన వారు 25 భాషలు, 70 దేశాలకు చెందిన 250 మంది జర్నలిస్టులు భాగస్వాములయ్యారు. వీరికి అందుబాటులోకి వచ్చిన సమాచారం గురించి వింటే పడిపోవాల్సిందే. 1977 నుంచి 2015 డిసెంబరు వరకు వున్న నలభై ఎనిమిది లక్షల ఇమెయిల్స్‌, 21లక్షల పిడిఎఫ్‌ పైల్స్‌ను వారు వడపోశారు.ఒక జర్మన్‌ పత్రిక సమాచారం ప్రకారం కోటీ 15లక్షల రహస్య పత్రాలు జర్నలిస్టులకు అందుబాటులోకి వచ్చాయి. తామేం చేస్తున్నామో, తాము పరిశీలిస్తున్న మొసాక్‌ ఫోన్సెకా పేరు కూడా తమ స్వంత సంస్ధలోని వారికి కూడా పత్రాలను బహిర్గతం చేసేవారికి కూడా తెలియదని రీతు శరీన్‌ చెప్పారు. ఆమె గత నలభై సంవత్సరాలుగా ఇలాంటి వార్తలను సేకరించటంలో నిమగ్నమయ్యారు.ఆమె అంతకు ముందు బ్రిటన్‌లోని పెద్ద బ్యాంకు అయిన హెచ్‌ఎస్‌బిసి-స్విస్‌ బ్యాంకు, వర్జిన్‌ ఐలాండ్‌లోని భారతీయుల ఖాతాల లోగుట్టును బయటపెట్టారు.ఇది ఐసిఐజెతో ఆమెకు మూడవ ప్రాజెక్టు. నీరారాడియా టేపులను బహిర్గతంలో చేయటంలో చేయితిరిగిన రీతు తన బృందంలో బ్యాంకింగ్‌, ఆర్ధిక రంగాలలో సమగ్రపరిజ్ఞానం వున్న వారిని ఎంపిక చేసుకున్నారు. వారికి మరో 22 మంది వివిధ రాష్ట్రాల రిపోర్టర్లు తోడ్పడ్డారు. అయితే వారంతా ఈ ముగ్గురు బృందం అడిగిన సమాచారం అంటే పనామా పత్రాలలో వున్న భారతీయుల చిరునామాలు, ఇతర సమాచారాన్ని ఇవ్వటం తప్ప తామెందుకు ఆ సమాచారం ఇస్తున్నారో కూడా వారికి తెలియదు. మన దేశానికి సంబంధించిన 36వేల పత్రాలను ఎక్స్‌ప్రెస్‌ బృందం పరిశీలించింది.ఎప్పటి కప్పుడు సమాచారం బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. రీతు రెండు అంతర్జాతీయ రహస్యసమావేశాలకు వెళ్లి పత్రాల పరిశీలనలో శిక్షణ కూడా తీసుకున్నారు.

      నరేంద్రమోడీ సర్కార్‌ విదేశాల్లో వున్న నల్లధనం తెస్తానని రంకెలు వేయటం, అక్రమార్కులను సర్దుకోమని చెప్పటం తప్ప మరొకటి కాదని తేలిపోయింది. పనామా పత్రాల ప్రకారం గతేడాది కూడా అనేక మంది నల్లధన కుబేరులు పనామాలో ఖాతాలు తెరిచినట్లు బయట పడింది. మన చట్టాలు ఎంత లోప భూయిష్టంగా వున్నాయంటే పనామా వంటి పన్ను స్వర్గాలలో కంపెనీలు తెరవటానికి అనుమతించవు గానీ వాటిలో వాటాలు, ఏకంగా కంపెనీలనే కొనుగోలు చేయవచ్చు. అంటే చట్టబద్దంగానే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం సులభమైంది కనుకనే అనేక మంది తాపీగా తమ లావాదేవీలన్నీ చట్టబద్దమే అని చెబుతున్నారు. దాదాపు ఐదు వందల మంది భారతీయులకు పనామాలో ఖాతాలున్నట్లు అంచనా. వారిలో పద్మభూషన్‌ కౌశల్‌ పాల్‌ సింగ్‌ నుంచి ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ, కాంగ్రెస్‌కు సన్నిహితుడైన సమీర్‌ గెహ్లట్‌, బిగ్‌బి అమితాబ్‌,ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ తదితరులు ఈ జాబితాలో వున్నారు. వాణిజ్య వేత్తలు తాము అధికారులకు అన్నింటినీ వెల్లడించామని, అంతా చట్టబద్దంగానే జరిగిందని చెబుతుండగా అమితాబ్‌ మాత్రం అస్సలు తమకేమీ తెలియదని ప్రకటించారు.మరికొందరు ప్రవాస భారతీయులు తమకు భారత చట్టాలు వర్తించవని తమ దేశభక్తిని ప్రకటించుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శని సింగనాపూర్‌లో మనువాదంపై మహిళల తిరుగులేని విజయం

09 Saturday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ Leave a comment

Tags

Bhumata Brigade, manuvadis, Shani Shingnapur, Trupti Desai, Women decisive victory, women power

సత్య

13న కొల్లాపూర్‌ మహలక్ష్మి దేవాలయ ప్రవేశం

    తృప్తి దేశాయ్‌ ! భూమాత రాన్‌ రాగిణి బ్రిగేడ్‌ !! శని శింగనాపూర్‌ !!!

       దేశంలో అనేక మంది నోళ్లలో నానుతున్న పేర్లివి. నాలుగు వందలఏళ్ళ  నాటి శని దేవాలయంలో మహిళలకు ప్రవేశ నిషేధ శని శుక్రవారం సాయంత్రంతో వదలి పోయింది.ఈనెల ఒకటవ తేదీన బొంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో శని దేవాలయ పాలకవర్గం మహిళలపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇది నిజంగా మహిళలు సాధించిన పెద్ద విజయాలలో ఒకటి. దీనితో వుత్తేజితులైన మహారాష్ట్ర మహిళలు ఇప్పుడు తమ దృష్టి ఇతర దేవాలయాలపై సారించారు. తదుపరి ఈనెల 13న తాము కొల్లాపూర్‌లోని మహలక్ష్మి దేవాలయ ప్రవేశం చేస్తామని, తరువాత నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయ ప్రవేశం చేస్తామని ఈ వుద్యమానికి నాయకత్వం వహిస్తున్న తృప్తి దేశాయ్‌ శనివారం నాడు ప్రకటించారు. ఒక చిన్న పల్లెటూరు శని శింగనాపూర్‌లో ప్రారంభమైన ఈ వుద్యమం దేశంలోని ఇతర పాంతాలకు విస్తరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో దళితులకు దేవాలయ ప్రవేశాలపై వున్న ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేవాలయ ప్రవేశ వుద్యమాలు సాగిన విషయం తెలిసిందే. ఇపుడు మహిళా ప్రవేశ వుద్యమానికి నాంది పలికారు.దీంతో మనువాదులు మింగా కక్కలేకుండా వున్నారు. రాజ్యాంగం చట్టాలు వుండబట్టిగాని లేకపోతే ఇలాంటి తీర్పులు ఇస్తున్న న్యాయమూర్తుల అంతం చూసి వుండేవాళ్లం ప్రకటించే సర్వసంగ పరిత్యాగులమని ఫోజు పెట్టే సాధ్వులు, బాబాలు, యోగులు,యోగినులు మనకు దర్శనమిచ్చినా ఆశ్చర్యం లేదు.

     చాలా మందికి సుపరిచితమైన షిరిడీకి దగ్గరలో అహమ్మద్‌ నగర్‌ జిల్లాలో ఈ శనిదేవాలయం వుంది. తమకు పట్టిన శని వదలాలని లేదా పట్టకుండా వుండాలని ముందస్తుగా కోరుకుంటూ వేలాది మంది నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహిళలు సాగిస్తున్న ఈ వుద్యమం ఆస్తికులకే గాక నాస్తికులకు కూడా అభ్యంతరకరంగా వున్నట్లు అక్కడక్కడా వినిపిస్తోంది. ఇక్కడ సమస్య మహిళలలో మూఢనమ్మకాలను ప్రోత్సహించటం కాదు. దళితుల దేవాలయ ప్రవేశ వుద్యమానికి కమ్యూనిస్టు అగ్రనాయకులు అనేక మంది నాయకత్వం వహించారంటే అర్ధం దళితులను తీసుకువెళ్లి మనువాదానికి అప్పగించాలని కాదు. పుట్టుక కారణంగా వివక్ష ప్రదర్శించటాన్ని, తోటి మనిషిని మనిషిగా చూడాలనే ప్రజాతంత్ర డిమాండ్‌, హక్కును నిర్ధారించుకొనేందుకే ఆ వుద్యమాలు జరిగాయి.ఇప్పుడు మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న వుద్యమం, న్యాయపోరాటాలను కూడా అలాగే చూడాలి. ఒక వ్యక్తి దేవుడిని, మతాన్ని నమ్మటమా నమ్మకపోవటమా అన్నది వారి వ్యక్తిగతం.

    ఈ వుద్యమానికి నాంది పలికిన 31 సంవత్సరాల యువతి ఆస్ధికురాలు. మహారాష్ట్రలో అధికారంలో వున్న బిజెపి-శివసేన సంకీర్ణ కూటమి ప్రభుత్వం శని ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొనేందుకు చేయని ప్రయత్నం లేదు. మహిళలను అడ్డుకొనేందుకు తొలిసారిగా ఆ దేవాలయానికి మహాళా ధర్మకర్తలను నియమించి వారి ద్వారా అడ్డుకోవాలని చౌకబారు ఎత్తుగడ వేసింది. మహిళలను సమీకరించేందుకు కూడా చేయూత నిచ్చింది.అయితే బోంబే హైకోర్టులో ప్రభుత్వం వివక్షకు వ్యతిరేకమని అఫిడవిట్‌ ఇవ్వాల్సి వచ్చింది. అయినా తీర్పును అమలు జరిపేందుకు సిద్ధం కాకపోవటంతో ముఖ్య మంత్రిపై కోర్టు ధిక్కరణ నేరం కింద కోర్టుకు లాగుతామని తృప్తి దేశాయ్‌ ప్రకటించిన తరువాతే శని ఆలయ కమిటీ దిగివచ్చింది. ఇంత జరిగాక దేవాలయ ప్రవేశం కోసం మహిళలు ఆందోళన చేయాల్సి రావటం సిగ్గుచేటని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించటం విశేషం. వివక్షను పాటిస్తున్న ఇతర దేవాలయాల ప్రవేశం సందర్భంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాల్సి వుంది.

   కాలం చెల్లిన మనువాదులను వుక్కిరి బిక్కిరి చేస్తున్న తృప్తి దేశాయ్‌ ఒక సాధారణ కుటుంబానికి చెందిన గృహిణి. కర్ణాటక సరిహద్దులోని నిపానీ తాలుకాలో జన్మించిన తృప్తి కుటుంబం తరువాత పూనాలో స్ధిరపడింది. ముంబైలో హోం సైన్సు కోర్సులో చేరిన ఆమె కుటుంబ పరిస్ధితుల కారణంగా ఒక ఏడాది తరువాత విద్యను మానుకోవాల్సి వచ్చింది.తరువాత తాను నివసించే పరిసరాలలో క్రాంతి వీర్‌ అనే ఒక సంస్ధలో చేరి దానికి అధ్యక్షురాలైంది. పేదలకు రేషన్‌ కార్డులు ఇప్పించేందుకు, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి, వుపాధికి తోడ్పటం వంటి కార్యకలాపాలను ఆ సంస్ధ నిర్వహించేది.ఈ క్రమంలోనే 2007లో ఆమె ఎన్‌సిపి అగ్రనేత అజిత్‌ పవార్‌ కుటుంబ ఆధ్వర్యంలో నడిచే అజిత్‌ సహకార బ్యాంకులో జరిగిన 50 కోట్ల అవినీతికి వ్యతిరేకంగా తృప్తి దేశాయ్‌ గళం విప్పింది.బ్యాంకు డిపాజిట్‌దార్లతో పోరాట సమితిని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల తరువాత 29వేల మందికి తమ డిపాజిట్లు వచ్చేట్లు చేయటంతో ఆమె వెలుగులోకి వచ్చారు. దాంతో కొంత మంది ఆమెకు ఏదైనా సామాజిక సంస్ధను ఏర్పాటు చేయమని సలహా ఇచ్చారు.

     అలా ఏర్పడిందే భూమాత బ్రిగేడ్‌.నలభై మందితో 2010 సెప్టెంబరు 27న ప్రారంభమైన ఈ సంస్ధలో ఇపుడు ఐదువేల మందికి పైగా స్త్రీ, పురుష సభ్యులున్నారు. అనేక అంశాలపై ఈ సంస్ధ పని చేస్తుంది.అన్నా హజారే జనలోక్‌పాల్‌ ఆందోళనలోనూ వారు పాల్గొన్నారు. శని దేవాలయ ప్రవేశం కోసం భూమాత బ్రిగేడ్‌ ఒక వుప విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి భూమాత రాన్‌రాగిణి బ్రిగేడ్‌ అని పేరు పెట్టారు. నవంబరు 29న ప్రారంభమైన ఈ వుద్యమం ఏప్రిల్‌ ఎనిమిదిన దేవాలయ ప్రవేశంతో విజయం సాధించింది. తృప్తి దేశాయ్‌ 2006లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇప్పుడు ఆరు సంవత్సరాల కుమారుడు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. తన భార్య కార్యకలాపాలను చూసి తాము గర్వ పడుతున్నట్లు ఆమె భర్త ప్రశాంత్‌ దేశాయ్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Changes in JEE Examination

07 Thursday Apr 2016

Posted by raomk in Current Affairs, Education, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Changes in JEE Examination, JEE Examination

After examining the report of Ashok Misra Committee and considering the public feedback, Ministry of Human Resource Development has notified the following changes in the JEE pattern for 2017 :

1. The performance of the students in the 12th Class Examination shall be a crucial parameter for determining the eligibility of the student for the JEE examination.

2. For the candidates to qualify in the JEE Examination, they shall have secured at least 75% marks or be in the top 20 percentile in the 12th Class Examination conducted by respective Boards. For SC/ST students this condition shall be relaxed to 65% marks.

3. The present system of giving 40% weightage for the 12th Class marks in calculating the ranks in the JEE Main shall be dispensed with.

4. All other JEE Examination systems shall remain unchanged.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Index of Eight Core Industries (Base: 2004-05=100) February, 2016

01 Friday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Cement, Core Industries, electricity, Fertilizers, Index of Eight Core Industries, Natural Gas, Refinery Products, steel

 

  1. The summary of the Index of Eight Core Industries (base: 2004-05) is given at the Annexure.

2.         The Eight Core Industries comprise nearly 38% of the weight of items included in the Index of Industrial Production (IIP).The combined Index of Eight Core Industries stands at 172.2 in February, 2016, which was 5.7 %highercompared to the index of February, 2015. Its cumulative growth during April to February, 2015-16 was 2.3 %.

Coal

3.         Coal production (weight: 4.38%) increased by 3.9 % inFebruary, 2016over February, 2015. Its cumulative index during April to February, 2015-16 increased by 5.0% over corresponding period of previous year.

Crude Oil

4.         Crude Oil production (weight: 5.22%) increased by 0.8 % in February, 2016over February, 2015. Its cumulative index during April to February, 2015-16 decreased by 1.0 % over the corresponding period of previous year.

Natural Gas

5.         The Natural Gas production (weight: 1.71%) increased by 1.2 % in February, 2016 over February, 2015. Its cumulative index during April to February, 2015-16 declined by 3.6 % over the corresponding period of previous year.

 

Refinery Products (93% of Crude Throughput)

6.         Petroleum Refinery production (weight: 5.94%) increased by 8.1 % in February, 2016 over February, 2015. Its cumulative index during April to February, 2015-16 increased by 3.1 % over the corresponding period of previous year.

Fertilizers

7.         Fertilizer production (weight: 1.25%)increased by 16.3 % in February, 2016 over February, 2015. Its cumulative index during April to February, 2015-16 increased by 10.3 % over the corresponding period of previous year.

Steel (Alloy + Non-Alloy)

8.         Steel production (weight: 6.68%) declined by 0.5 % in February, 2016 over February, 2015. Its cumulative index during April to February, 2015-16 declined by 1.8 %over the corresponding period of previous year.

Cement

9.         Cement production (weight: 2.41%) increasedby 13.5 % in February, 2016 over February, 2015. Its cumulative index during April to February, 2015-16 increased by 3.9 % over the corresponding period of previous year.

Electricity

10.       Electricity generation (weight: 10.32%)increased by 9.2 % in February, 2016 over February, 2015. Its cumulative index during April to February, 2015-16 increased by 4.6 % over the corresponding period of previous year.

 Note 1:Data are provisional. Revision has been made based on revised data received for corresponding month of previous year in respect of Coal, Crude Oil, Natural Gas, Refinery Product, Steel, Cement and Electricity. Accordingly, indices for the month February, 2015 have been revised.

Note 2: Release of the index for March, 2016 will be on Monday, 2nd May, 2016.

Annexure

Performance of Eight Core Industries

Yearly Index & Growth Rate

Base Year: 2004-05=100

INDEX

Sector Weight 2010-11 2011-12 2012-13 2013-14 2014-15 Apr-Feb 2014-15 Apr-Feb 2015-16
Coal 4.379 139.7 141.5 148.1 150.0 162.5 157.2 165.0
Crude Oil 5.216 111.0 112.1 111.4 111.2 110.2 109.9 108.8
Natural Gas 1.708 164.4 149.7 128.1 111.5 106.0 105.9 102.1
Refinery Products 5.939 129.7 133.7 172.5 175.0 175.6 175.0 180.5
Fertilizers 1.254 103.4 103.8 100.2 101.8 101.7 102.2 112.7
Steel 6.684 157.7 174.0 181.1 201.9 211.8 211.3 207.5
Cement 2.406 164.2 175.2 188.7 194.5 205.2 204.0 212.0
Electricity 10.316 138.1 149.3 155.3 164.6 178.5 178.7 187.0
Overall Index 37.903 138.4 145.3 154.7 161.2 168.6 167.7 171.6

 

GROWTH RATES (in %)

Sector Weight 2010-11 2011-12 2012-13 2013-14 2014-15 Apr-Feb 2014-15 Apr-Feb 2015-16
Coal 4.379 -0.2 1.3 4.6 1.3 8.3 8.6 5.0
Crude Oil 5.216 11.9 1.0 -0.6 -0.2 -0.9 -1.1 -1.0
Natural Gas 1.708 10.0 -8.9 -14.5 -13.0 -4.9 -5.3 -3.6
Refinery Products# 5.939 3.0 3.1 29.0 1.5 0.4 0.5 3.1
Fertilizers 1.254 0.0 0.4 -3.4 1.5 -0.1 -0.5 10.3
Steel 6.684 13.2 10.3 4.1 11.5 4.9 5.9 -1.8
Cement 2.406 4.5 6.7 7.7 3.1 5.5 6.6 3.9
Electricity 10.316 5.6 8.1 4.0 6.0 8.4 9.0 4.6
Overall Index 37.903 6.6 5.0 6.5 4.2 4.6 5.0 2.3

 

#Refinery Products’ yearly growth rate of 2012-13 is not comparable with other years on account of inclusion of RIL (SEZ) production data since April, 2012.

Performance of Eight Core Industries

Monthly Index & Growth Rate

Base Year: 2004-05=100

 

INDEX

Sector Coal Crude Oil Natural Gas Refinery Products Fertilizers Steel Cement Electricity Overall Index
Weight 4.379 5.216 1.708 5.939 1.254 6.684 2.406 10.316 37.903
Feb-15 184.4 101.5 95.7 166.0 97.5 203.6 204.9 165.9 162.9
Mar-15 220.4 113.9 107.2 182.5 96.9 217.3 217.4 175.9 177.8
Apr-15 156.0 106.6 100.9 161.3 87.3 201.3 213.6 176.0 162.4
May-15 156.5 112.5 107.8 186.0 101.8 231.7 221.3 194.0 178.6
Jun-15 148.1 109.5 102.9 183.9 105.3 221.1 215.0 181.8 171.2
Jul-15 134.7 110.7 99.0 176.2 111.3 206.3 209.7 190.3 168.0
Aug-15 139.0 112.8 107.2 185.1 119.0 197.5 197.2 194.3 169.6
Sep-15 143.2 107.4 103.9 170.3 119.4 197.5 195.8 194.4 166.8
Oct-15 168.4 111.3 105.6 172.5 122.1 209.4 207.4 201.1 175.4
Nov-15 180.3 107.3 102.6 185.9 118.4 194.6 185.9 174.2 166.8
Dec-15 197.4 108.7 103.4 190.2 122.6 203.6 217.9 182.4 175.7
Jan-16 200.4 107.3 92.5 194.7 118.5 216.7 236.1 187.3 180.7
Feb-16 191.5 102.3 96.9 179.4 113.4 202.6 232.5 181.2 172.2

 

 

GROWTH RATES (in %)
Sector Coal Crude Oil Natural Gas Refinery Products Fertilizers Steel Cement Electricity Overall Index
Weight 4.379 5.216 1.708 5.939 1.254 6.684 2.406 10.316 37.903
Feb-15 10.8 -1.9 -8.1 -1.0 -0.4 -0.6 2.2 5.9 2.3
Mar-15 6.0 1.7 -1.5 -1.3 5.2 -4.4 -4.2 1.7 -0.1
Apr-15 7.9 -2.7 -3.6 -2.9 0.0 0.6 -2.4 -1.1 -0.4
May-15 7.8 0.8 -3.1 7.9 1.3 2.6 2.6 5.5 4.4
Jun-15 6.3 -0.7 -5.9 7.5 5.8 4.9 2.6 0.2 3.0
Jul-15 0.3 -0.4 -4.4 2.9 8.6 -2.6 1.3 3.5 1.1
Aug-15 0.4 5.6 3.7 5.8 12.6 -5.9 5.4 5.6 2.6
Sep-15 1.9 -0.1 0.9 0.5 18.1 -2.5 -1.5 10.8 3.2
Oct-15 6.3 -2.1 -1.8 -4.4 16.2 -1.2 11.7 8.8 3.2
Nov-15 3.5 -3.3 -3.9 2.5 13.5 -8.4 -1.8 0.0 -1.3
Dec-15 6.1 -4.1 -6.1 2.1 13.1 -4.4 3.2 2.7 0.9
Jan-16 9.1 -4.6 -15.3 4.8 6.2 -2.8 9.0 6.0 2.9
Feb-16 3.9 0.8 1.2 8.1 16.3 -0.5 13.5 9.2 5.7

 

 

***

DJM/nb

Share this:

  • Tweet
  • More
Like Loading...

India’s External Debt Data at End December 2015

01 Friday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Economic Affairs, India’s External Debt

Department of Economic Affairs, Ministry of Finance has been compiling and releasing quarterly statistics on India’s external debt for the quarters ending September and December every year.

At end-December 2015, India’s external debt stock stood at US$ 480.2 billion, recording an increase of US$ 4.9 billion (1.0 per cent) over the level at end-March 2015. The rise in external debt during the period was due to long-term external debt particularly commercial borrowings and NRI deposits. However, on a sequential basis, total external debt at end-December 2015 declined by US$ 1.2 billion from the end-September 2015 level.

Long-term debt at end-December 2015 was US$ 398.6 billion, showing an increase of US$ 8.8 billion (2.3 per cent) over the level at end-March 2015. Short-term external debt witnessed a decline of 4.6 per cent and stood at US$ 81.6 billion at end-December 2015.

At end-December 2015, long-term external debt accounted for 83.0 per cent of India’s total external debt, while the remaining (17 per cent) was short-term debt. Component-wise, the share of commercial borrowings stood highest at 38.2 per cent of total external debt, followed by NRI deposits (25.5 per cent) and multilateral debt (11.1 per cent).

Government (sovereign) external debt stood at US$ 90.7 billion at end-December 2015 while non-Government debt amounted to US$ 389.5 billion. The share of Government (Sovereign) and non-Government debt in the total external debt was 18.9 per cent and 81.1 per cent respectively, at end-December 2015.

The share of US dollar denominated debt continued to be the highest in external debt stock at 57.6 per cent at end-December 2015, followed by the Indian rupee (28.7 per cent), SDR (5.8 per cent), Japanese yen (4.1 per cent), and euro (2.3 per cent).

The ratio of concessional debt to total external debt was 8.7 per cent at end-December 2015 (8.8 per cent at end-March 2015).

India’s foreign exchange reserves provided a cover of 73.0 per cent to the total external debt stock at end-December 2015 vis-à-vis 67.5 per cent at end-March 2015.

The ratio of short term external debt to foreign exchange reserves was 23.3 per cent at end-December 2015 as against 26.7 per cent at end-March 2015.

The complete quarterly report of India’s external debt at end-December 2015 is available on the website of Ministry of Finance – www.finmin.nic.in.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Under-recoveries for the month of April 2016 will be Rs 8.73 per litre in case of PDS Kerosene

01 Friday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Domestic LPG, lpg, PDS Kerosene, under-recoveries

The Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas has reviewed international prices of crude oil and petroleum products for the month of March 2016. In the case of PDS Kerosene, the under-recoveries for the month of April 2016 will be Rs 8.73 per litre (Rs 6.58 per litre in last month). The cash transfer to customer under DBTL will be Rs. 90.37, out of which Rs. 42.11 will be Cash Compensation on Domestic LPG by Govt. to consumers & Rs 48.26 will be the Cash compensation on Domestic LPG by OMCs towards ‘Uncompensated Costs’ to consumers.

Product-wise Under-recoveries of Public Sector Oil Marketing Companies (OMCs):

Product Unit Under / (Over) recovery (eff. 1st April 16) Cash transfer to customer under DBTL(eff. 1st Apr 16)
PDS Kerosene* (Rs./Litre) 8.73 –
Cash Compensation on Domestic LPG by Govt. to consumers** (Rs./Cylinder) – 42.11
Cash Compensation on Domestic LPG by OMCs towards ‘Uncompensated Costs’ to consumers** (Rs./Cylinder) – 48.26

 

 

 

 

 

 

 

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ పాలనలో వుపాధి పెరిగిందా ? తరిగిందా ?

01 Friday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

CMIE, employment, Employment generation, India employment, Narendra Modi rule

ఎం కోటేశ్వరరావు

    ప్రధాని గద్దె నెక్కిన తరువాత నరేంద్రమోడీ మాట్లాడటం ఆగిపోయి వుండవచ్చుగానీ కాలం ఆగలేదు. మరికొద్ది వారాలలో రెండవ వార్షికోత్సవం జరుపుకోవటానికి, వెంకయ్య నాయుడి వంటి వందిమాగధుల స్తోత్ర పారాయణాలు వినటానికి, విజయాల గురించి చెప్పుకోవటానికి సిద్ధం అవుతున్నారు.ఈరెండు సంవత్సరాల కాలంలో జనానికి దేశంలో అసలేం జరుగుతోంది అన్నది పూర్తిగా తెలియటం లేదు అనే అభిప్రాయం బలపడుతోంది. ఎంత వరకు నిజమో ఎవరికి వారు తమ అనుభవంతో తేల్చుకోవాలి. ఆవు,ఎద్దులు, గొడ్డు మాంస రాజకీయాలు, హత్యల మొదలు తాజాగా దేశభక్తులా కాదా అనటానికి భారతమాతాకి జై అన్నారా లేదా అన్న గీటురాయిని నిర్ణయించిన సంఘపరివార్‌ అజెండా ప్రధానంగా నడుస్తోంది. కమ్యూనిస్టులకు జనవాదం, మతశక్తులకు మనువాదం(మైనారిటీ మతశక్తులకు వాటి ఛాందసవాదాలు ఎలాగూ వుంటాయి) తప్ప మరొకటి పట్టదు. భారతీయ జనతా పార్టీ అన్న తరువాత ఈ రాజకీయాలు చేయకపోతే వారికి మనుగడ వుండదు కనుక కొత్తగా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం జనానికి సంబంధించి ముఖ్యంగా యువత గురించి, మిగతా విషయాల గురించి అధికార ఓడ ఎక్కక ముందు ఎన్‌డిఏ ఏం చెప్పింది,ఎక్కిన తరువాత ఏం చేస్తోంది?ఏం చెబుతోంది అన్నది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా చాలా తక్కువగా తెలుస్తోంది.

    ప్రధాని పదవిలో కూర్చున్న తరువాత నరేంద్రమోడీ వుపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి పది అంశాలతో కూడిన ఒక పధకాన్ని ప్రకటించిన విషయం బిగ్గరగా వినిపిస్తున్న భారతమాతకు జై నినాదాల మధ్య జనానికి గుర్తు చేయటం అవసరం.ప్రధాని ఎక్కువ కాలం విదేశాల్లో ఎందుకు గడిపారంటే మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం తప్ప విహార యాత్రలు చేయటం లేదని బిజెపి పెద్దలు మండినపుడు జనం కామోసు అనుకున్నారు.

    ప్రధాన మంత్రిగా పది నెలలు అధికారంలో వున్న తరువాత తొలిసారిగా హిందుస్థాన్‌ టైమ్స్‌ అనే ఒక పత్రికతో నరేంద్రమోడీ నోరు విప్పారు.రాజకీయాలు, పాలన, ఆర్ధిక విషయాలలో ప్రపంచంలో భారత దేశ విస్వసనీయతను పునరుద్ధరించామని, ప్రపంచ రాడార్‌లో మన దేశం తిరిగి కనిపిస్తున్నదని చెప్పారు. నరేంద్రమోడీ ప్రభుత్వం తొలి ఆరునెలల్లో 2.75లక్షల వుద్యోగాలు సృష్టించింది అని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం అదే కాలంలో కేవలం లక్షా ఇరవై వేల వుద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వం సృష్టించింది. అంటే మోడీ 118శాతం అదనంగా సృష్టించటానికి కారణం 25 రంగాలలో మేకిన్‌ ఇండియా కార్యక్రమ శుభ ప్రారంభమని దానిలో పేర్కొన్నారు.నైపుణ్య శిక్షణ గురించి ఆర్ధిక మంత్రిత్వశాఖ 2014-15 వార్షిక నివేదికలో 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యం కలిగించటం అవసరమని పేర్కొన్నారు. ప్రయివేటు రంగ భాగస్వామ్యంతో 15 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని జాతీయ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్‌ లక్ష్యంగా పెట్టుకోగా గతేడాది జూన్‌ నాటికి 51లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 15లక్షల మందికి వుపాధి దొరికినట్లు ఆ వార్త వివరించింది.

    గతేడాది ఏప్రిల్‌ 17వ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన వార్త ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో ఎనిమిది కీలక రంగాలలో మూడవ త్రైమాసికంలో అంతకు ముందు మూడు త్రైమాసికాల కంటే వుద్యోగఅవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో కేవలం 1.17లక్షల వుద్యోగాలు రాగా అంతకు ముందు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 1.58, ఏప్రిల్‌-జూన్‌లో 1.82లక్షల వుద్యోగాలు వచ్చాయి. ఇలా అంకెలను పేర్కొంటూ పోతే ఆల్జీబ్రా మైండ్‌ గాబరా అని ఒకప్పుడు అనుకున్న విధంగా బుర్ర తిరిగి పోతుంది. అంకెలను ఎలా అయినా వినియోగించుకోవచ్చన్నది ఆరునెలల విజయ గాధ, రెండవది ఏడాది పాలన అసలు గాధ వెల్లడించింది. మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటే కుదరదు. ఇప్పుడేంటి ? మాకేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి? నరేంద్రమోడీ లేదా ఆయన భక్త బృందంగానీ ఏం చెబుతుందో తెలియదు.

     గురువారం నాడు(మార్చి 31) హిందూ పత్రిక ‘వుపాధి పెరుగుదల ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ కార్మికులు ఎక్కువగా అవసరం వుండే ఎనిమిది కీలక రంగాలలో సేకరించిన సమాచారం ప్రకారం 2015 తొలి తొమ్మిది మాసాలలో కేవలం 1.55లక్షల నూతన వుద్యోగాలు మాత్రమే నికరంగా వచ్చాయి. ఇది ఆరు సంవత్సరాలలో కనిష్టం. ఇదే సమయాలలో 2013,14 సంవత్సరాలలో మూడు లక్షలకు పైగా వుద్యోగాలు వచ్చినట్లు కార్మికశాఖ సమాచారం తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన సూచిక కాదని విశ్లేషకులు పేర్కొన్నారు. ‘ మన పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా వుంది,వుత్పత్తి పెరినపుడు మాత్రమే వుపాధి వుంటుంది.కార్పొరేట్‌ రంగంలో పెద్ద ఎత్తున సిబ్బందిని క్రమబద్దీకరిస్తున్నారు.ప్రభుత్వం రంగం కూడా కార్మికులను నియమించటం లేదు. అభివృద్ధి ప్రధాన ఆశయం వుద్యోగ కల్పన. అంతిమంగా మనం అన్ని స్ధాయిలలో వుద్యోగాలను సృష్టించాలి. అదే జరగటం లేదు.’ అని కేర్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధికవేత్త మదన్‌ సబ్నవిస్‌ చెప్పారు.

     కేంద్ర కార్మిక శాఖ వుద్యోగకల్పన గురించి 2009 నుంచి ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నది. వస్త్ర, తోళ్ల,లోహ, ఆటోమొబైల్‌, ఆభరణాలు, రవాణా, చేనేత, ఐటి రంగాలలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ప్రభావం ఎలా పడింది అనే అధ్యయనం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రతి ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు వివరాలు ఇలా వున్నాయి. 2009లో నికరంగా 2.49లక్షల వుద్యోగాలు పెరిగాయి.(2009 జనవరి-మార్చిలో 1.17, ఏప్రిల్‌-జూన్‌లో 1.31లక్షలు తగ్గగా జూలై-సెప్టెంబరులో 4.97లక్షలు పెరిగాయి. ఈ కాలంలో నికర పెరుగుదల 2.49లక్షలు) ఇదే విధంగా 2011లో 7.04లక్షలు, 2013లో 3.36లక్షలు, 2015లో 1.55లక్షల వుద్యోగాలు నికరంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రితుపర్ణ చక్రవర్తి దీని గురించి మాట్లాడుతూ ‘ స్టాఫింగ్‌ పరిశ్రమ ఆరోగ్యకరంగా 18-20శాతం పెరుగుతోంది.కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం వుద్యోగ పెరుగుదల గురించి సమగ్ర చిత్రాన్ని ఇవ్వటం లేదు.అనేక రంగాలను అది స్వీకరించలేదు’ అన్నారు. 2015లో కాంట్రాక్టు వుద్యోగుల నియామకం గణనీయంగా తగ్గినట్లు లేబర్‌ బ్యూరో పేర్కొన్నది. వుపాధి కల్పన లేదా కోల్పోయిన వుపాధి గురించి సమగ్ర సమాచారం సేకరించటం మన దేశంలో సాధ్యం కాదు.ఎందుకంటే అసలు అధికారికంగా నమోదు అన్నది సమగ్రం కాదు. ధోరణులు మాత్రమే మనకు తెలుస్తాయి. కేంద్ర కార్మిక శాఖ ప్రభుత్వ విభాగం కనుక వున్నంతలో దాని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు

     వుపాధి కల్పన గురించి కొన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతరులు ఏం చెప్పారో చూడండి.’ కేవలం వాగ్దానాలు మాత్రమే అద్బుతాలను సృష్టించవు’ అని మోడీ పాలన ఇరవై నెలల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున బెంగలూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా చెప్పారు. విదేశీయలు మన సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో ప్రవేశించటం లేదన్నది టాటాతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తల అంతరంగం, బహిరంగం కూడా. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో ఆర్ధిక మాంద్యం 2008 నుంచి అనేక సమస్యలను ముందుకు తెస్తోంది. పెట్టుబడిదారులు తమకు ఎక్కడ అప్పనంగా లాభాలు వస్తాయో అక్కడికే పెట్టుబడులను తరలిస్తున్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు జనం సొమ్ము ఖర్చు చేసి ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా అయ్యగారి సంపాదన అమ్మగారి బుట్టలోలకులకు చాలటం లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    మన దేశంలో పెట్టుబడుల గురించి అధ్యయనం చేసే భారతీయ ఆర్ధిక పర్యవేక్షణ కేంద్రం( సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సిఎంఐఇ) కూర్చిన సమాచారం ఇంతవరకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 2015 మూడవ త్రైమాసికంలో నూతన సామర్ధ్య కల్పనకు ప్రతిపాదనలు అంతకు ముందుతో పోల్చితే 74శాతం తగ్గిపోయాయి.కేవలం లక్ష కోట్లరూపాయల విలువగల 383 పధకాలు మాత్రమే ప్రకటించబడ్డాయి. ఇది అంతకు ముందు ఐదు త్రైమాసికాల కంటే కనిష్టం. అన్ని రంగాలలో తగ్గుదల కనిపిస్తోందని, కచ్చితంగా ఫలానా అంశాలు కారణమని అప్పుడే చెప్పలేమని సిఎంఐఇ పేర్కొన్నది.నిలిచిపోయిన పధకాల విలువ 10.8లక్షల కోట్ల రూపాయలు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయని అప్పుడు చెప్పారు. వాటి అర్ధమేమిటి ?

     ఐటి రంగంలో పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రచార మంత్రి పల్లె రఘునాధ రెడ్డి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ తమ పలుకుబడిని వుపయోగించి అనేక ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. 2015-16లో 12-14శాతం అభివృద్ధి వుంటుందని భావిస్తే అది 2017లో 10-12 శాతంగా వుందని అంచనా.’ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మేము చూసిన ధోరణులను బట్టి ఒక వేగంతో దేశీయ విభాగం పెరుగుతుందని అంచనా వేశాము. అయితే వాటిలో ఎక్కువ భాగం ఆచరణలోకి రాలేదు. అవి ఎప్పుడు ఆచరణలోకి వస్తే అప్పుడు మనం పెద్ద ప్రభావాన్ని చూడవచ్చు ‘ అని నాస్కామ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి విదేశీ పర్యటనల మోజు తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే విమాన ఖర్చులకు కూడా సరిపడా ప్రయోజనం లేకపోతే జనానికి చెప్పుకొనేదేమీ వుండదు. బహుశా ఈ కారణంగానే ఆయన మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. తమ ప్రభుత్వ ఖాదీ పధకాల కారణంగా 2016-17లో 70-80లక్షల వుద్యోగాలు లభిస్తాయని చిన్న, సన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెబుతున్నారు. అంటే జనం చౌకగా దొరికే మిల్లు వస్త్రాల బదులు ఖరీదయిన ఖాదీ ధరిస్తారని అర్ధమా ? ఖాదీ వడికేందుకు సోలార్‌ రాట్నాలను ప్రవేశపెడితే ఖర్చు తగ్గుతుందని,లాభాలు వస్తాయని మంత్రిగారు చెబుతున్నారు. ‘ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞాపనలో ఏదో మాజిక్‌ వుంది. ఖాదీ పెరుగుదల రేటును చూస్తే గణనీయంగా పెరిగిందని’ ఖాదీగ్రామీణ పరిశ్రమల సంస్ధ సిఇఓ అరుణ్‌ కుమార్‌ చెబుతున్నారు. అది పిట్ట కధలా లేదూ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం చెప్పారు మోడీజీ వహ్వా ! వహ్వా !!

30 Wednesday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

BJP, Farm prices, Farmers, MSP, Narendra Modi, Narendra Modi Failures, narendra modi namo mantra, Narendra Modi sarkar

యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది

ఎం కోటేశ్వరరావు

     2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటానికి ఏడు సూత్రాల పధకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.గతంలో రైతుల ఆదాయాల గురించి కాకుండా వ్యవసాయ వుత్పత్తులు పెరగటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, కేవలం సవాలే కాదు మంచి వ్యూహాన్ని కూడా రచించాను, పకడ్బందీగా రూపొందించిన కార్యక్రమాలు, తగినన్ని వనరులు, అమలులో సుపరిపాలన కారణంగా ఈ లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌ ఇండియా ఆర్ధిక

వేదిక కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాలను చెప్పారు.ఆ ఏడు సూత్రాలు ఏవంటే

1. ఒక చుక్కనీటికి ఎంతో పంట లక్ష్యంగా సాగునీటి పధకాలకు భారీ బడ్జెట్‌

2. ఆహార ప్రక్రియ ద్వారా అదనపు విలువ చేకూర్చటం

3. 585 కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫారాల ద్వారా ఒకే విధంగా వుండేట్లు చూడటం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు

4. ప్రతి పొలం భూసారాన్ని బట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు

5. భారీ పెట్టుబడులతో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు ద్వారా పంట చేతికి వచ్చిన తరువాత నష్టాల తగ్గింపు

6.చెల్లించగలిగిన ధరలలో కొత్త పంటల బీమా పధకం

7. వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, తేనెటీగలు, చేపల పెంపకాలకు ప్రోత్సాహం

    ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఎంతో విశ్వాసంతో వున్నట్లు ప్రధాని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలు రైతుల కేంద్రంగా, నూతన ఆదాయ మార్గాలుగా వున్నాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ స్వయంగా తనకు లేఖ రాసినట్లు ప్రధాని చెప్పారు.

     ప్రధాని త్వరలో అధికారానికి వచ్చిన రెండో వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. నిజానికి ఒక చొక్కా విప్పి రెండో చొక్కా తగిలించుకున్నట్లుగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏకంగా ప్రధాని అయ్యారు. ఆందువలన ఆయనకు అనుభవం ప్రత్యేకంగా అవసరం వుందని ఆయనా అనుకోలేదు,జనం కూడా భావించలేదు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలలో రైతులకు వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వుండేట్లు చూస్తామని బిజెపి తన ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నది. అది అమలులోకి రావాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల, ఆ మేరకు అవసరమైతే ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపటం. రైతాంగానికి ఆ మేరకు ధరలు పెంచటానికి పార్లమెంటుతో పని లేదు, ప్రతిపక్షాల మద్దతు అంతకంటే అవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా యాభైశాతం ఒక్కసారిగా పెంచకపోయినా ఐదు సంవత్సరాలలో యాభై శాతం పెరిగేట్లుగా ఏటా పదిశాతం చొప్పున ఎందుకు పెంచలేదు. అంటే ప్రధాని మన్‌కి బాత్‌ వుపన్యాసం వినమని చెప్పటం తప్ప ఎదురు చూస్తున్న కిసానోంకి బాత్‌ గురించి చివరికి దేశానికి దిగివచ్చిన దేవదూత నరేంద్రమోడీ అని స్త్రోత్ర పారాయణం చేసిన మన వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా సమాధానం చెప్పినట్లు మనకు తెలియదు.

     ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు వ్యవసాయంపై సలహాదారుగా వున్న అశోక్‌ గులాటీ ‘దేశంలో వున్న పరిస్థితి తీవ్రతను ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిగా గ్రహించినట్లు లేదు, కొన్ని రాష్ట్రాలలో 20శాతం వరకు ఆహార ధాన్యాల వుత్పత్తి పడిపోయింది. ప్రభుత్వం నిరంతరం రైతాంగాన్ని ఆదుకొనే వ్యవస్ధను ఏర్పాటు చేయనట్లయితే 1960 దశకంలో మాదిరి ఆహార కొరత ఏర్పడే అవకాశం వుంది’ అని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు.ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారమే అనేక వ్యవసాయ వుత్పత్తులకు రైతులు తక్కువ ధరలను పొందారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రకారం ఏ ఒక్క వుత్పత్తి ధర యాభైశాతం కాదు కదా ఆ సమీపంలో కూడా లేదు. అనేక రాష్ట్రాలలో ఆ ధరలు అమలు కాని స్ధితి కూడా వుంది. అసలు ఖర్చుల లెక్కింపు విధానమే లోపభూయిష్టం. జిడిపి లెక్కింపు విధానం, దారిద్య్రరేఖ ఎంత వుండాలి వుండకూడదు అని తర్జభర్జనలతో మార్పు గురించి ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ ఖర్చుల లెక్కింపు విధానంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ప్రధాని తన మనసులోని మాటలో గానీ ఇతర చోట్లగానీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపరు ? తాజాగా ఆయన చెప్పిన ఏడు సూత్రాలలో కూడా ముఖ్యమైన ఈ అంశం చోటు చేసుకోలేదు. గతేడాది మన ప్రభుత్వం గోధుమలకు ఇచ్చిన ధర టన్నుకు 226 డాలర్లయితే ఇదే సమయంలో పాకిస్థాన్‌ చెల్లించిన ధర 320 డాలర్లు.

    రైతాంగానికి కనీస మద్దతు ధరలను పెంచకపోవటానికి కారణాలు ఏమిటి ? రైతులకు మద్దతు ధరలు పెంచితే వినియోగదారులకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక పెంచవద్దని ప్రభుత్వ ఆర్ధికవేత్తలైన అరవింద్‌ సుబ్రమణ్యం, పంగారియా వంటి వారు జారీచేసిన హెచ్చరికలకు లొంగిపోయింది మోడీ సర్కార్‌.పోనీ ద్రవ్యోల్బణం పెరగ కుండా స్ధిరంగా వుందా అంటే ఆరునెలలకు ఒకసారి వుద్యోగులకు పెంచుతున్న కరువు భత్యమే లేదనేందుకు పక్కా నిదర్శనం. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో 2012-13నుంచి 2017-18 మధ్య కాలంలో సగటున ఏడాదికి నాలుగు శాతం వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాస్తవంలో రెండుశాతానికి మించలేదు. కొత్త బడ్జెట్‌లోగానీ, నరేంద్రమోడీ ఎన్నికల సభలు, రైతుల సభలలో గానీ ఎక్కడా తమ ఎన్నికల వాగ్దానం గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఆరు సంవత్సరాలలో ఆదాయం రెట్టింపు గురించి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి ?

     గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ప్రభుత్వం వాగ్దానం చేసిన వ్యవసాయ ఖర్చులపై 50శాతం లాభం చేకూర్చేవిగా లేవంటూ రైతు సంఘాల కూటమి గతేడాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దానికి వివరణ ఇస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది. అందుకే వ్యవసాయంతో పాటు కోళ్లు,చేపలు, తేనెటీగలు పెంచుకోండని నరేంద్రమోడీ వుచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందునుంచే రైతాంగం ఆ పని చేస్తున్నది.

    రోడ్లు వేసేందుకు విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులు చెల్లించేందుకు లేదా ఆ కంపెనీలు నిర్వహిస్తున్న టోల్‌ టాక్సును ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. విదేశీ అప్పులను మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లిస్తున్నారు. వుద్యోగులకు ఆరునెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కరువు భత్యం చెల్లిస్తున్నారు. అదే విధంగా అమలు జరిపినా లేకపోయినా పారిశ్రామిక కార్మికులు, ఇతరులకు కూడా ద్రవ్యోల్బణ ప్రాతిపదికన కరువు భత్యం నిర్ణయిస్తున్నారు. రూపాయి విలువ పతనమైతే రైతాంగం కొనే డీజిల్‌, పెట్రోలు, ఎరువులు, పురుగుమందులు ధరలు ఎప్పటికపుడు పెరుగుతాయి. విద్యుత్‌, బొగ్గు, వుక్కు వంటి సంస్ధల వుత్పత్తులకు కనీస లాభాలను నిర్ణయించే విధానం వుంది. కానీ రైతాంగం విషయానికి వచ్చే సరికి అడ్డగోలు వ్యవహారం తప్ప ఒక నిర్ణీత విధానం, ప్రాతిపదిక లేదు. ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పెట్రోలు,డీజిల్‌ ధరలను సవరిస్తున్న కేంద్రం రైతాంగ వుత్పత్తులకు కొన్నింటికి అసలు మద్దతు ధరల నిర్ణయ విధానమే లేదు. వున్నవాటికి కూడా ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అవి అమలు జరగనపుడు అమలు జరిపే యంత్రాంగం లేదు.ఎందుకీ పరిస్థితి?

    2015లో వార్షిక ఇంక్రిమెంట్లు గాక వుద్యోగులకు 13శాతం కరువు భత్యం పెరిగింది.అదే ధాన్యం కనీస మద్దతు ధర 3.25శాతం, గోధుమలకు 5.2శాతం పెరిగింది. విజయ మాల్య, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి కంపెనీలు బకాయిలు చెల్లించకుండా వున్నపుడు ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అనో పరిశ్రమలను ఆదుకొనే పాకేజి పేరుతోనో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఆదుకుంటున్నాయి. మరి వరుసగా కరువుల పాలవుతున్న రైతులకు ఇలాంటి పాకేజీలు ఎందుకు వుండవు?

    పప్పు ధాన్యాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకొనేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీన్నే అప్పు చేసి పప్పుకూడు అంటారు. అదే మన రైతాంగానికి చెల్లిస్తే కావలసినన్ని పప్పులు పండించరా ? విలువైన మన విదేశీమారక ద్రవ్యం మిగులు తుంది, మనరైతుల జేబుల్లో నాలుగు డబ్బులు వుంటాయి. వాటిని ఇతర వస్తువుల కొనుగోలుకు వుపయోగిస్తారు కనుక, పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా పచ్చగా వుంటాయా లేదా ? ఆ పని ఎందుకు చేయరు?

   పన్నెండవ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి లక్షా యాభైవేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయ లావాదేవీలలో లక్షా 62వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ పేర్కొన్నది . అరవై కోట్ల మంది రైతుల కుటుంబాల కంటే కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయానికి ప్రాధాన్యత ఎక్కువ వున్నట్లు స్పష్టం కావటం లేదూ ? గత ప్రభుత్వ విధానాలతో పోల్చితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని మార్చిందేమీ లేదు. గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది. మరి తాజాగా నరేంద్రమోడీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఈ సంఖ్యను తగ్గిస్తాయా?పెంచుతాయా? తగ్గించాలనే కోరుకుందాం .

Share this:

  • Tweet
  • More
Like Loading...

విద్యార్ధులపై దాడితో కెసిఆర్‌ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకున్నారా ?

24 Thursday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Education, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

JNU, kanniah kumar, KCR, police attack, students, University of Hyderabad (UoH), UoH

ఎంకెఆర్‌

   హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం విద్యార్ధులతో అమీ తుమీ తేల్చుకొనేందుకే సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.అందుకు కెసిఆర్‌ కూడా సై అన్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంఛార్జి వైస్‌ ఛాన్సలర్‌కు సైతం తెలియకుండా సెలవుపై వెళ్లిన వైస్‌ ఛాన్సలర్‌ పొదిలె అప్పారావు ఆకస్మికంగా విశ్వవిద్యాలయంలో ప్రత్యక్షం కావటం యాదృచ్చికంగా జరిగిందని ఎవరూ అనుకోవటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న విషయమేమీ రహస్యం కాదు. దానికి ముందుగానే వైస్‌ ఛాన్సలర్‌ అకస్మికంగా ప్రత్యక్షం కావటం కన్నయ్యను విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టకుండా చేయటానికే అన్నది సుస్పష్టం. తన ఆందోళన ప్రస్తానంలో విద్యార్ధులను ఎంతగానో వుపయోగించుకున్న తెలంగాణా ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు కనుసన్నలలో పనిచేసే పోలీసు యంత్రాంగం వివాదాస్పద వైస్‌ ఛాన్సలర్‌కు మద్దతుగా విద్యార్దుల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే ఓడమల్లయ్య బోడి మల్లయ్యను గుర్తుకు తెస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వ మద్దతు లేకుండా వైస్‌ ఛాన్సలర్‌ తిరిగి విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టే సాహసం చేసి వుండరని లోకం కోడై కూస్తున్నది.

    ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్ధులపై దేశ ద్రోహ నేరం మోపేందుకు బహుశా బ్రిటీష్‌ పాలకులు కూడా సిగ్గుపడే విధంగా వీడియోలను తిమ్మిని బమ్మిని చేసి చేతులు కాల్చుకున్న కేంద్ర ప్రభుత్వం అది కాస్త చల్లబడగానే హైదరాబాదులో మరో అధ్యాయానికి తెరతీసింది. వైస్‌ ఛాన్సలర్‌ పొదిలె అప్పారావుకు తిరిగి బాధ్యతలు అప్పగించటం ద్వారా విద్యార్ధులను రెచ్చగొట్టింది. వైస్‌ ఛాన్సలర్‌పై కేసులు నమోదు చేయాలన్న విద్యార్ధుల డిమాండ్లను పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సదరు అప్పారావు కబురు చేయగానే తగుదునమ్మా అంటూ విద్యార్ధులపై తన ప్రతాపం చూపింది. చివరకు అమ్మాయిలను కూడా మగ పోలీసులు వదలి పెట్టలేదు. బూతులు తిట్టకపోతే పోలీసులే కారు అని మరోసారి నిరూపించుకున్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రుజువు చేసుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా వుండాలనుకుంటే అది వేరే విషయం, కానీ అందుకు చూశారా విద్యార్ధులపై ఎలా లాఠీని ఝళిపించానో అంటూ మోడీని సంతృప్తి పరచేందుకు ప్రయత్నించటం అన్యాయం. ఇప్పటి వరకు దేశమంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిపైనే తన నిరసనను కేంద్రీకరించింది, ఇప్పుడు దానిలో కూడా వాటా కావాలని చంద్రశేఖరరావు కోరుకుంటునట్లున్నారు. వైస్‌ ఛాన్సలర్‌ తిరిగి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అంశం పోలీసులకు తెలియదా ? వైస్‌ ఛాన్సలర్‌ రాక సందర్భంగా జరిగాయని చెబుతున్న వుదంతాలే అందుకు నిదర్శనం.అటువంటపుడు ఆయన వస్తే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని కేంద్రానికి తెలంగాణా సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది? ఆ వుదంతాలను ఎందుకు నిరోధించలేకపోయింది? పోనీ తగిన భద్రతా సిబ్బందిని నియమించి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? న్యూఢిల్లీ పోలీసు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కాబట్టి జెఎన్‌యు విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించటానికి కేంద్ర ప్రభుత్వ వత్తిడి కారణం కావచ్చు. కానీ హైదరాబాదు పోలీసులు కూడా అదే పని చేస్తారని బహుశా విద్యార్ధులు వూహించి వుండరు.

   విద్యార్ధులకు తగిన ‘పాఠం’ చెప్పేందుకు ఎంతో అనుభవం వున్న వైస్‌ ఛాన్సలర్‌ హాస్టళ్లు,మెస్‌లను మూసి వేసి, ఇంటర్నెట్‌ను కట్‌ చేసి తానంటే ఏమిటో రుజువు చేసుకున్నారు. బహుశా దేశభక్త ఎబివిపి విద్యార్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వుంటారు, లేదా బయటి నుంచి సాయం తీసుకొని వుండాలి. తిరిగి వస్తూనే ఈనెల 24న జరగాల్సిన అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయటం ఆయన చేసిన తొలి ఘనకార్యంగా చెబుతున్నారు. ఆ సమావేశంలో వివక్ష వ ్యతిరేక కమిటీ ఏర్పాటు, వివిధ కమిటీలలో ఎస్‌సి,ఎస్‌టిల ప్రాతినిధ్యాన్ని పెంచటం, నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ ఎనిమిది నుంచి 25వేలకు పెంచే ప్రతిపాదనను పరిశీలించటం వంటి అంశాలు అజెండాగా వున్నాయి. అలాంటి ముఖ్యమైన సమావేశాన్ని వాయిదా వేయటం వుద్రిక్తతలను వుపశమించటానికి గాక మరింత ఎగదోయటానికే తోడ్పడతాయి.

   హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన తాజా వుదంతాలలో బోధనేతర సిబ్బందిని విద్యార్ధులకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు ప్రయత్నించటం కొత్త , ప్రమాదకర పరిణామం.వైస్‌ ఛాన్సలర్‌ నివాసంపై విద్యార్ధులు దాడి చేశారనే ఆరోపణతో బోధనేతర సిబ్బంది ఆందోళనకు దిగటం, మెస్‌లను మూసివేయటం సరైన చర్య అవుతుందా? అది సమర్ధనీయమే అనుకుంటే విద్యార్ధుల పట్ల వైస్‌ ఛాన్సలర్‌ అనుసరించిన వైఖరి,వాటి పర్యవసానాలకు కూడా వారు బాధ్యత వహిస్తారా ? ఇది విశ్వవిద్యాలయంలో పరిస్థితులు మరింత దిగజారటానికి దారితీయ వచ్చు. బోధనేతర సిబ్బంది-విద్యార్ధులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. పంచాయతీ వారి మధ్య కాదు, వున్నతాధికారులు-విద్యార్ధుల మధ్య కనుక విచక్షణతో వ్యవహరించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d