Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


శీర్షికను చూసి ఆశ్చర్యపోతున్నారా ! నిజం, మహమ్మద్ ఘోరీ మిలిటరీ కమాండర్లలో ఒకడైన మహమ్మద్ భక్తియార్ ఖిల్జీ క్రీస్తుశకం 1,20205 సంవత్సరాలలో బౌద్దులు నెలకొల్పిన నలంద విశ్వవిద్యాలయం, అక్కడ ఉన్న గ్రంధాలయాన్ని నాశనం చేసినట్లు, అనేక ప్రాంతాలను ఆక్రమించినట్లు చరిత్రలో నమోదైన సంగతి తెలిసిందే.అఫ్‌కోర్స్ హిందువులు అలాంటి విశ్వవిద్యాలయాలు, జ్ఞానాన్ని కలిగించే గ్రంధాలయాలను నెలకొల్పినట్లు లేదా వాటిని విదేశీయులు నాశనం చేసినట్లు మనకు తెలియదు. హిందూత్వ కాషాయ మÖకలు కొల్‌కతా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో శరన్నవరాత్రుల సందర్భంగా కమÖ్యనిస్టులు ఏర్పాటు చేసిన పుస్తకదుకాణాలమీద, నిర్వాహకుల మీద దాడి చేసి దుకాణాలను ఆక్రమించుకొనేందుకు పూనుకున్నారు.తగులబెట్టారు. మహమ్మద్ ఘోరీ అసలు సిసలు వారసులం తామే అని నిరూపించుకున్నారు. ఘోరీ అనుచరులు అల్లాహు అక్బర్ అంటూ దాడులకు పాల్పడితే బిజెపి గూండాలు జై శ్రీరామ్ నినాదాలతో రెచ్చిపోతున్నారు.వారి దాడుల్లో అనేక మంది నేతలు గాయపడ్డారు.అయినా ప్రతిఘటించి అనేక చోట్ల కమÖ్యనిస్టులు దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దాడులకు సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి సూత్రధారి అంటే నమ్ముతారా ! అసలేం జరిగింది ?

దసరా సందర్భంగా కొల్‌కతాలో పెద్ద ఎత్తున మండపాలలో దుర్గామాత విగ్రహాలను పెట్టి పూజలు చేస్తారు. వాటిని సందర్శించేందుకు పెద్ద ఎత్తున జనాలు వస్తారు.కమÖ్యనిస్టు నేత ముజఫర్ అహమ్మద్ చొరవతో తొలిసారిగా ఉమ్మడి కమÖ్యనిస్టు పార్టీ 1954 నుంచి ఈ ఉత్సవాల సందర్భంగా కొల్‌కతాలోని పార్క్ సర్కస్ ప్రాంతంలో పుస్తకాల దుకాణం ఏర్పాటు చేసి అభ్యుదయ సాహిత్యాన్ని విక్రయించటం ప్రారంభించారు. కమÖ్యనిస్టు ఉద్యమంలో చీలికలు వచ్చిన తరువాత వివిధ పార్టీలు, పురోగామి సంస్థలు ఆ ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి.ఏడు దశాబ్దాల తరువాత హిందూత్వశక్తులకు అది నచ్చలేదు.వామపక్ష, ప్రజాస్వామిక, పురోగామి భావజాల వ్యాప్తికి తోడ్పడే పుస్తకాలు, వాటిలోని అంశాలు తమ అజెండాకు అడ్డుపడతాయని భయపడుతున్నట్లున్నారు. నెల రోజుల క్రితమే పుస్తక విక్రయాలను అడ్డుకొనేందుకు మతం ముసుగులో తెరలేపారు. దానికి ఏకంగా అసెంబ్లీనే వేదికగా చేసుకొని సెప్టెంబరు పదవ తేదీన ముఖ్యమంత్రి సువేందు అధికారి కాషాయ దళాలను ఉసిగొల్పారు. దుర్గాపూజా జరిగే ప్రాంతాలలో కమÖ్యనిస్టుల పుస్తకాల దుకాణాలు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు.దానికి అనుగుణంగా కొల్‌కతాలోని ధకూరియా బస్టాండ్ ప్రాంతంలో దాడులు జరిపి సిపిఐ(ఎం), లిబరేషన్, సిపిఐ ఏర్పాటు చేసిన దుకాణాల మీద, నిర్వాహకులు, అక్కడ ఉన్న నేతల మీద దాడులకు పాల్పడ్డారు. సిపిఐ(ఎం) వారు మండపాల సమీపంలో దుర్గాపూజ అనే మాటలకు బదులు “శరదోత్సవాలు ” అంటూ పండుగలో మతస్వభావాన్ని నీరుగార్చేందుకు, కమÖ్యనిస్టు సంస్కృతిని ప్రవేశపెట్టేందుకు చూస్తున్నందున మండపాల నిర్వాహకులు పుస్తకాల దుకాణాలను అనుమతించకూడదని చెప్పారు. తరువాత వినాయక మండప ప్రారంభసభలోనూ అదే పిలుపునిచ్చారు. “ ఒక తరగతి ప్రొఫెసర్లు వారిని వామపక్ష వాదులు అంటారు సనాతన ధర్మం, కాషాయ రంగును ప్రత్యేక లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తారు. కమÖ్యనిస్టులు ఏర్పాటు చేసే దుకాణాలకు దుర్గాపూజ పేరు కాకుండా శరద్ ఉత్సవాలు అని రాస్తే అలాంటి దుకాణాలను దుర్గాపూజ కమిటీలు అనుమతించకూడదు.” అని సువేందు అధికారి అసెంబ్లీలో చెప్పారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.“ నక్సలిజం వంటి ఆలోచనల పుట్టుకకు తావిచ్చే కమÖ్యనిస్టులు నాటిన విత్తనాలను ఈ గడ్డ మీద నుంచి తొలగించేందుకు సరైన సమయమిదే.వారికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి యుద్ధాన్ని కొనసాగించాలి, మీరు పోరుకు సిద్దమా కాదా ” అని ముఖ్యమంత్రి అసెంబ్లీలోని బిజెపి ఎంఎలఏలను ఉద్దేశించి రెచ్చగొట్టగా సిద్దమే అంటూ బల్లలు చరిచారు. “ వారు తమ తలిదండ్రులు మరణించిన తరువాత శ్రాద్దకర్మలు చేయరు.కారల్ మార్క్స్, లెనిన్ గురించి మాట్లాడతారు. ఇక్కడ పుస్తకాలు అమ్మి దిమాగీ నగ్జల్స్‌ను తయారు చేస్తారు.దేశానికి హానికలిగిస్తున్నారు, విభజించాలని చూస్తున్నారు, వారిని భారత్‌లో అనుమతించరాదు. వారి పుస్తక దుకాణాలను కూడా అనుమతించకూడదు ” అని బిజెపి నేత, మంత్రి అర్జున్ సింగ్ వ్యాఖ్యానించారు.

నిజానికి అభ్యుదయవాదులు, కమÖ్యనిస్టులు పుస్తకాల దుకాణాలను కాళీ పూజల మండపాలకే పరిమితం చేయలేదు. ఈద్, క్రిస్మస్ పండగల సమయంలోనూ ఏర్పాటు చేస్తున్నారు. వీటికి పోటీగా తృణమÖల్ కాంగ్రెస్, బిజెపి, ఆరఎసఎస్ అనుబంధ సంస్థలు కూడా తమ సాహిత్యాన్ని విక్రయిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేవలం వామపక్ష సంస్థల దుకాణాలను మాత్రమే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.ఆరఎసఎస్బిజెపికి చెందిన కొందరు వ్యక్తులు ధకూరియా బస్టాండ్ సమీపంలో కమÖ్యనిస్టులు ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలని, అక్కడ తాము ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నట్లు తగాదాకు తెరలేపారు. మీకు పోలీసుల అనుమతి ఉందా తమకు ఇచ్చారంటూ ఏకంగా దెబ్బలాటలకు దిగారు. అనుమతి ఎందుకు అని నిర్వాహకులు ప్రశ్నించగా ఇప్పుడు రాజ్యం మాది మేం చెప్పినట్లు వినాల్సిందే అంటూ దాడి చేశారు. లిబరేషన్ పార్టీ ఏర్పాటు చేసిన దుకాణంలో గతంలో గొడ్డు మాంసం తిన్నారంటూ ఈసారి దాన్ని తాము అనుమతించేది లేదన్నారు. గూండాయిజం చేస్తుండగా సమీపంలో ఉన్న పోలీసులు ప్రేక్షపాత్ర వహించటాన్ని బట్టి వారి మద్దతు కూడా ఉందన్నది స్పష్టం. స్థానిక సిపిఎం నేత దాడిని అడ్డుకోబోగా ఆయనను కూడా కొట్టారు. వారి చేతుల్లో ఉన్న వేడి టీని పోశారు. పశ్చిమబెంగాల్ పండుగల సీజన్‌లో పుస్తకాల విక్రయం ఒక లక్షణంగా మారింది. తాజాగా బిజెపి తప్ప ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ వాటిని అడ్డుకోలేదు.


తాజా దాడుల తరువాత వామపక్షాల కార్యకర్తలు ఫిర్యాదు చేయగా పోలీసులు తీసుకొనేందుకు తిరస్కరించారు. పుస్తకాల దుకాణాలు పెడుతున్నట్లు తమకు సమాచారం తెలియచేశారే తప్ప అనుమతి తీసుకోలేదని అందువలన జరిగిన ఉదంతాల్లో తాము జోక్యం చేసుకొనేది లేదని బిజెపి గూండాలకు వత్తాసు పలికారు. ముందస్తు అనుమతి తీసుకున్నారా అని బిజెపి గూండాలు అడిగిన ప్రశ్నలనే పదే పదే వారు అడిగారు. పుస్తకదుకాణాలను ఏర్పాటు చేస్తున్న స్థలం మున్సిపల్ కార్పొరేషన్‌దని దానికి చెల్లించాల్సిన ఫీజు చెల్లించి, ఆ విషయాన్నే పోలీసులకు తెలిపామని, ఇది గత ఐదుదశాబ్దాలుగా జరుగుతున్నదేనని, కొల్‌కతా ఇతర ప్రాంతాల్లో పోలీసు అనుమతి గురించి ఎవరూ ప్రశ్నించలేదని కూడా వామపక్షాల నేతలు చెప్పారు. పోలీసుల అనుమతి తీసుకోవటం తప్పనిసరనే విధంగా నిబంధనలు మార్చినట్లు పోలీసు అధికారులు ఎలాంటి పత్రాలను చూపలేకపోయారు. దీన్ని బట్టి బిజెపి అడ్డగోలు చర్యలకు పాల్పడినట్లు తేలింది.


బంగావ్‌లో తమ పుస్తకదుకాణ ఏర్పాటును హిందూ జాగరణ్ మోర్చా పేరుతో వ్యవహరిస్తున్నవారు అడ్డుకొని దాడి చేశారని సిపిఐ(ఎం) కొలకతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.జస్టిస్ సౌగత భట్టాచార్య బెంచ్ దాన్ని విచారించి ప్రతిపక్ష కార్యక్రమాలను అడ్డుకొనే విధంగా యంత్రాంగం వ్యవహరించకూడదని, పుస్తకదుకాణాలు పెట్టుకోవచ్చని ఆదేశాలు జారీచేసింది. ఒక పార్టీకి అనుమతి ఇచ్చి ఇతరులకు నిరాకరించటం సరైంది కాదని, ఈ పద్దతిలో ప్రతిపక్ష రాజకీయ పార్టీని అణచివేయకూడదు, వారేమీ లాటరీ షాపును ఏర్పాటు చేయాలనుకోవటం లేదు, పుస్తకాలు అమ్మాలనుకుంటున్నారు,సమస్య ఏమిటి అని జస్టిస్ భట్టాచార్య ప్రశ్నించారు. దీని మీద ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. వారు దుకాణం ఏర్పాటు చేయదలచుకున్న స్థలం ప్రజాపనుల శాఖకు చెందినదని, పోలీసు అనుమతి తీసుకోకపోయినా సదరు శాఖ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం వాదించింది. అయితే డివిజన్ బెంచ్ ఆ కేసును తిరిగి భట్టాచార్య బెంచ్ పరిశీలించాలని తిప్పి పంపింది. పరిశీలన అనంతరం తలపెట్టిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలోపు సిపిఐ(ఎం) దుకాణం పెట్టుకోవచ్చని, దాని చుట్టుపక్కల ఏదైనా అవాంఛనీయ ఉదంతాలు జరిగితే పోలీసులదే బాధ్యత అని శాంతి భద్రతలను కాపాడాలని ఆదేశాలు ఇచ్చింది. పండుగల సందర్భంగా ఇతరులు దుకాణాలను ఏర్పాటు వివిధ వస్తువులను విక్రయిస్తున్నపుడు పుస్తకాలను అమ్మకుండా సిపిఐ(ఎ)ను అడ్డుకోరాదని ఆదేశాలు జారీ చేసింది.ప్రజాస్వామ్యంలో భిన్న భావజాలాలు, ఆలోచనలను స్వాగతించాలని కూడా వ్యాఖ్యానించింది.పుస్తక దుకాణాలు నెలకొల్పుకోవచ్చంటూ గురువారం నాడు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలను శుక్రవారం నాడు డివిజన్ బెంచ్ నిలుపుదల చేసింది. ఈ పరిణామాలన్నీ స్వేచ్చా ఆలోచనల మీద దాడి అని సిపిఐ(ఎం) నేత మహమ్మద్ సలీం వర్ణించారు. ఒక నిరసన రూపంగా మరిన్ని దుకాణాలను ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు చెప్పారు. మరోవైపు తాము ఐదువేల దుకాణాలను తెరిచి మోడీ, హిందూత్వ భావజాలానికి చెందిన పుస్తకాలను జనాలకు అందుబాటులోకి తెస్తామని బిజెపి ప్రకటించింది.మరోవైపు వామపక్షాల దుకాణాల మీద దాడులు కొనసాగిస్తున్నది. ప్రజాస్వామిక, స్వేచ్చా సమాజాన్ని అభివృద్ధి చేయాలంటే భిన్న భావజాలాల పుస్తకాలను చదవాలని, కానీ ఈ సారి ప్రభుత్వమే తమ దుకాణాల మీద దాడులు చేస్తున్నదని స్వయంగా ముఖ్యమంత్రే అందుకు పాల్పడ్డారని అది ప్రభుత్వం చేయాల్సిన పని కాదని మహమ్మద్ సలీం ఖండించారు. పుస్తకాల మీద దాడి ఒక సాకు మాత్రమే అని విద్య, సంస్కృతి సంబంధ అంశాలన్నింటినీ అణచివేయాలని చూస్తున్నదని, సృజనాత్మక రంగాలపై యుద్దాన్ని ప్రకటించారని అన్నారు. పుస్తకాలు బిజెపికి ఆయుధాలుగా కనిపిస్తున్నాయని,వారెందుకు వాటిని చూసి భయపడుతున్నారని లిబరేషన్ పార్టీ నేత కార్తీక్ పాల్ ప్రశ్నించారు.


ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం తీవ్ర అభ్యంతరం తెలిపారు. మత భావాలను రెచ్చగొట్టే ఫాసిస్టు దాడిగా, రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేయటమని వర్ణించారు. రాత్రుళ్లు పార్టీ కార్యాలయాను తగులబెట్టే,వివిధ సంస్థలలో విధ్వంసకాండను సృష్టించే భజరంగీలను రెచ్చగొట్టేందుకు సిఎం పూనుకున్నారన్నారు. పుస్తక దుకాణాల పెట్టాలో వద్దే నిర్ణయించే అధికారం సిఎంకు ఎక్కడిదని ప్రశ్నించారు.దాని బదులు విద్య, వైద్యం, ధరల పెరుగుదల వంటి ప్రజల సమస్యల మీద కేంద్రీకరించకుండా పౌర గ్రంధాలయాల్లో ఏ పుస్తకాలు, ఏ పత్రికలను ఉంచాలో నిర్ణయించిన మమతాబెనర్జీ చెప్పుల్లో కాళ్లు దూర్చుతున్నారని ధ్వజమెత్తారు. శరద్ ఉత్సవాలు ఆసియా అంతటా వ్యవసాయ సమాజాýతో ముడివడి ఉన్నాయన్నారు.అందుకే బెంగాల్లో విశ్వకవి రవీంద్రుడు పుష్య(మాసం) మేళ, వర్షమేళ, వసంత ఉత్సవాలను ప్రారంభించారని చెప్పారు. దుర్గాపూజ కూడా నూతన పుస్తకాలు, పాటలు, ప్రదర్శనల ఏర్పాటు, మండపాల ఏర్పాటులో వివిధ రకాల సృజన మరియు సాంస్కృతిక అంశాలను వ్యక్తీకరించటానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నదని సలీం చెప్పారు. వీటన్నింటినీ ఆపాలని బిజెపి కోరుకుంటున్నది.అన్ని రకాల మతఛాందసులు, మతాలు అదే చేస్తాయి.ఏం చేయాలో, ఏం చేయకూడదో వారే నిర్ణయిస్తారు, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఏ ఆంక్షలు విధించటాన్ని అయినా సిపిఐ(ఎ) వ్యతిరేకిస్తుందని సలీం స్పష్టం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని చూసే బాపతు గురించి తెలిసిందే.పుస్తకాల దుకాణాలను అడ్డుకున్నంత మాత్రాన జనంలో పఠనాసక్తిని అడ్డుకోలేరు. అమెరికా, ఐరోపా దేశాల్లో నవతరం సోషలిజం, కమÖ్యనిస్టు సిద్దాంతాలు, రాజకీయాల అధ్యయనానికి అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటున్నది. పుస్తక పఠనం గురించి బెంగాలీలకు ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు. భావజాల పోరుకు తెరలేపిన కాషాయ దళాలకు తగిన పాఠం చెప్పగలరనటంలో ఎలాంటి సందేహం లేదు.