• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

కర్ణాటకలో బిజెపి రాజ్యాంగ బద్ద కుట్రను భగ్నం చేసిన సుప్రీం కోర్టు !

20 Sunday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, bjp constitutional coup in karnataka, karnataka developments, karnataka votes 2018, Supreme Court

ఎం.కోటేశ్వరరావు

ఒక కట్టడాన్ని కొన్ని క్షణాల్లో కూల్చివేయగల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మాయాబజార్‌ వంటి సినిమాలలో తప్ప నిజజీవితంలో కొన్ని క్షణాలలో ఒక కట్టడనిర్మాణానికి అవసరమైన పరిజ్ఞానం మనకు ఇంకా రాలేదు. ప్రజాస్వామ్య కట్టడం పరిస్ధితి కూడా అలాగే వుంది. ఒక వేళ తమకు తగినన్ని సీట్లు రాని పక్షంలో ప్రలోభాలతో ఫిరాయించిన వారికి నష్టం జరగకుండా ఒక రాజ్యాంగ బద్ద కుట్రద్వారా అధికారానికి రావాలని కర్ణాటకలో కమలనాధులు ముందే కుట్రపన్నారా ? జరిగిన పరిణామాలను అవలోకనం చేసుకుంటే అవుననే తేలుతున్నది. మే పదిహేడవ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేస్తానని బిజెపి నేత ఎడ్డియూరప్ప ముందే చెప్పటానికి ఆ కుట్రే కారణం అన్నది మరింత తేటతెల్లమైంది.

Image result for bjp constitutional coup in karnataka

మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని , ప్రజాతీర్పును అపహాస్యం, ఖూనీ చేయటంలో కాంగ్రెస్‌ పేరు మోసిన నేరస్ధురాలు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకాలం దానిని తీవ్రంగా విమర్శించి, వ్యతిరేకించిన బిజెపి తన దాకా వచ్చే సరికి అంతకంటే తక్కువ కాదని స్వయంగా వెల్లడించుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రలోభాలు, బెదిరింపులతో పాటు తన తెలివి తేటలన్నీంటినీ వినియోగించింది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఒక అడుగు ముందుకు వేసింది. మాయాబజార్‌ సినిమాలో మాకు తల్పం కాదు గిల్పం కావాలని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించి చావుదెబ్బలు తిన్నవారి మాదిరి కర్ణాటకలో బిజెపి అతి తెలివి తేటలను వుపయోగించి భంగపడింది.

కోర్టు ఇచ్చిన ప్రతి తీర్పు పురోగామి లేదా ప్రజాస్వామ్య బద్దం అని చెప్పలేము గానీ కర్ణాటక వుదంతంలో మాత్రం జస్టిస్‌ ఎకె సిక్రి, అశోక్‌ భూషన్‌, ఎస్‌ఏ బోబ్డేలతో కూడిన బెంచ్‌  చేసిన తాత్కాలిక నిర్ణయాన్ని మాత్రం అభినందించాల్సిందే. అదే కమలనాధుల కలలను కల్లలయ్యేట్లు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ వినిపించిన వాదన నాటి కాంగ్రెస్‌ అత్యవసర పరిస్ధితిని గుర్తుకు తెచ్చింది. అత్యవసర పరిస్ధితి విధించి అనేక మంది సిపిఐ(ఎం) నేతలతో పాటు నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగంగా వున్న జనసంఘం, ఇతర కాంగ్రెసేతర పార్టీల నేతలను అనేక మందిని అరెస్టు చేసి జైలుపాలు చేశారు.( సిపిఐ అత్యవసర పరిస్ధితిని సమర్ధించింది కనుక ఆ పార్టీ వారిని మినహాయించారు) అలా జైలుపాలైన ఒక నిర్బంధితుని అరెస్టు అక్రమం అంటూ ఒక హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ సుప్రీం కోర్టులో దాఖలైంది. ఆ సమయంలో అటార్నీ జనరల్‌గా వున్న నిరేన్‌ డే చేసిన వాదనల సారాంశం ఇలా వుంది.

అత్యవసర పరిస్ధితి విధించిన కారణంగా పౌరులు కోర్టుకు వెళ్లే హక్కును నిలిపివేశారు. ఒక వేళ నిర్భంధం అక్రమం అయినప్పటికీ దాన్ని కోర్టులో ప్రశ్నించటానికి లేదు. అత్యవసర పరిస్ధితి నిబంధల లక్ష్యం, వుద్దేశ్యమూ కార్యనిర్వాహణ వ్యవస్ధకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం, రాష్ట్రపతి ఆదేశాలు మరియు చట్టానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ప్రాధమికహక్కులను నిరాకరిస్తూ కార్యనిర్వాహకవ్యవస్ధ ఏదైనా ఒక చర్య తీసుకుంటే దాన్ని కోర్టులో సవాలు చేయటానికి లేదు. ఆ వాదన మీద జస్టిస్‌ హెఆర్‌ ఖన్నా స్పందిస్తూ ఆర్టికల్‌ 21లో ప్రాణం గురించి ప్రస్తావించారు, దానికి కూడా ఇదే వర్తిస్తుందా అని ప్రశ్నించగా చట్టవిరుద్దంగా ప్రాణాలు తీసినప్పటికీ కోర్టులేమీ చేయలేవని నిరేన్‌ డే వాదించారు. ఆ కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో మిగతా నలుగురూ అటార్నీ జనరల్‌ వాదనను సమర్ధిస్తూ తీర్పు చెప్పగా జస్టిస్‌ ఖన్నా వ్యతిరేకించారు.

Image result for bjp constitutional coup in karnataka

కర్ణాటక వుదంతంలో ఒక వ్యక్తి ప్రాణాల కంటే ఎక్కువ విలువ నిచ్చి ప్రాణాలు అర్పించటానికి సిద్దపడే ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేసినా కోర్టులకు ప్రశ్నించే హక్కు లేదని మోడీ సర్కార్‌ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదించారు. రాజ్యాంగం ప్రకారం అటార్నీ జనరల్‌ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, కానీ ఆయన అంతకంటే బిజెపి న్యాయవాది మాదిరి కోర్టులో వ్యవహరించారు. ఆ పార్టీ నేతలు చేసిన వాదననే కోర్టుకు వినిపించటమే అందుకు పక్కా నిదర్శనం. న్యాయమూర్తుల బెంచ్‌కు పూర్తి అంకెలు తెలియవు, నిన్న ప్రకటించిన మేరకు తప్ప మొత్తం తెలియదు అని వేణుగోపాల్‌ చెప్పగా మేము అంతకు మించి చూడలేము, మీకు మెజారిటీ వున్నదని అంకెలు చెప్పటం లేదు అని జస్టిస్‌ ఎకె సిక్రీ చెప్పారు. అసలు వాదన ఆ తరువాతే బయటకు వచ్చింది. కోర్టు స్పెక్యులేషన్‌లోకి పోకూడదు, ఎడ్డియూరప్పకు ఎంత మంది మద్దతు ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. ప్రభుత్వ ఏర్పాటునకు ఎవరికి ఆహ్వానం వచ్చింది, బలనిరూపణ సమయంలో ఏ శాసనసభ్యుడు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అని తెలుసుకొనేందుకు సుప్రీం కోర్టు రాజకీయ పొదలోకి తొంగి చూడటానికి లేదు, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిని ప్రమాణ స్వీకారం చేయక ముందే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్య తీసుకొనేందుకు అవకాశం వుందని ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎక్కడా చెప్పలేదు. శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుంది.ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం సభలో బలనిరూపణ అంశానికి సంబంధించింది. అవన్నీ సభలోనే పరిష్కారం కావలసి వుంది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో అసలు పిటీషన్‌ దాఖలు చేయటానికే లేదు. సభలో బలనిరూపణ వరకు పిటీషన్‌ దారులు వేచి చూడాలి. ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవటానికి లేదు. దాన్ని తరువాత సుప్రీం కోర్టు సమీక్షించవచ్చు. అని వేణుగోపాల్‌ వాదించారు. దీంతో అవాక్కయిన బెంచ్‌ ఇది అసంగత వాదన(మూర్ఖ అనే అర్ధం కూడా వుంది) దాని అర్ధం వారు ప్రమాణ స్వీకారం చేయక ముందే సూట్‌కేసుల మార్పిడి అంతా పూర్తవుతుందన్నది అర్ధమా అంటూ దాన్నే మాత్రం అనుమతించటానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.

ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధి ఎన్నికైనట్లు ప్రకటించిన వెంటనే ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఏ ఎంఎల్‌ఏ లేదా ఎంపీ అయినా ప్రమాణ స్వీకారం చేయటానికి నిరాకరించినా, పార్టీ నిర్ణయాన్ని ఖాతరు చేయకపోయినా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్త్తుందని పేర్కొన్నారు. అయితే ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రమాణ స్వీకారం చేయకుండా సభకు గైర్హాజరైనా సభలో ఆ సమయానికి వున్న సంఖ్యను బట్టి బలనిరూపణ జరుగుతుంది తప్ప ఆగదు, తరువాత అలాంటి సభ్యులపై చర్యతీసుకోవటం వేరే విషయం అని కొంత మంది భాష్యం చెబుతున్నారు. దీన్నే అటార్నీ జనరల్‌ కూడా వాదించారు. బిజెపి నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే పధకంతోనే కొంత మంది సభ్యులను సభకు హాజరు కాకుండా చూసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి వీలుగాక భంగపడ్డారన్నది స్పష్టం అవుతోంది.

1967లో కాంగ్రెస్‌ అనేక వుత్తరాది రాష్ట్రాలలో ఓడిపోయినపుడు అధికారం కోసం అడ్డదారులు తొక్కింది. హర్యానాలో గయా లాల్‌ అనే స్వతంత్ర సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారగా ఒక రోజు తొమ్మిది గంటల వ్యవధిలోనే ఒక ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించడు. నాటి కాంగ్రెస్‌ నేతరావు బీరేంద్ర సింగ్‌ గయాలాల్‌ను ఛండీఘర్‌లో మీడియా ముందు ప్రదర్శిస్తూ గయారామ్‌ నౌ ఆయారామ్‌ ( పోయిన రాముడు ఇప్పుడు తిరిగి వచ్చాడు) అని చమత్కరించాడు.అప్పటి నుంచి పార్టీ ఫిరాయింపుదార్లను ఆయారామ్‌ గయారామ్‌ అని ఎద్దేవా చేస్తున్నారు. 1985లో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటంతో వారిని నిలబెట్టుకొనేందుకు, ముఠారాజకీయాలు చేయకుండా నిరోధించేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని తీసుకు వచ్చింది తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాదు. ఇప్పుడు బిజెపి ఆ చట్టంలోని లసుగులను వుపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పూనుకుంది. తాత్కాలిక స్పీకర్‌గా సభలోని సీనియర్‌ సభ్యుడిని నియమించటం ఒక సాంప్రదాయంగా వచ్చింది తప్ప నిబంధనలేమీ లేవు. గతంలో అలాంటి సాంప్రదాయాన్ని కొన్ని పార్టీలు వుల్లంఘించాయి. ఇప్పుడు ఆ జాబితాలో బిజెపి కూడా చోటు దక్కించుకుంది. అయితే తాత్కాలిక స్పీకర్‌ అయినప్పటికీ సభలో బలనిరూపణ సమయంలో స్పీకర్‌కు వుండే అధికారాలు వుంటాయి. అందువలన అవసరమైతే అందుకు వుపయోగించుకొనేందుకు బిజెపి తన సభ్యుడినే గవర్నర్‌ ద్వారా నియమింపచేసుకుంది.

కర్ణాటక వుదంతం గవర్నర్ల విచక్షణ అధికార అంశంతో పాటు స్పీకర్ల అధికారాల గురించి కూడా చర్చ, సమస్యను మరోసారి ముందుకు తెచ్చింది. కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన బిజెపి ఎంపీలు ఎడ్డియూరప్ప, బిశ్రీరాములు బెంగళూరు నుంచి పంపిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ వెంటనే ఆమోదించి అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. స్వయంగా నెలన్నర క్రితం అందచేసిన వైఎస్‌ఆర్‌సి సభ్యుల రాజీనామాలను మాత్రం ఇంతవరకు ఆమోదించలేదు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్ర శాసనసభలలో పార్టీలు ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన సభ్యుల విషయాన్ని తేల్చకుండా స్పీకర్లు నానబెడుతున్నారు. ఫిరాయింపుదారులు మంత్రులు కూడా అయ్యారు. అదే విధంగా తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్‌ రెడ్డి రాజీనామా సమర్పించి కాంగ్రెస్‌లో చేరినా అసెంబ్లీ స్పీకర్‌ ఆ రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పూర్వరంగంలో కర్ణాటక వుదంతాన్ని విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు ఈ విషయాల మీద కూడా స్పష్టత ఇవ్వటం అవసరం. గత ఏడు దశాబ్దాల చరిత్రను చూసినపుడు ప్రజాస్వామ్యం గురించి పెద్ద కబుర్లు చెప్పిన పార్టీలే దానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించాయి. మరోవైపు పాలకవర్గ ప్రజాస్వామిక వ్యవస్ధల మీద నమ్మకం లేని కమ్యూనిస్టులు దానికి కట్టుబడి వుండటం కనిపిస్తుంది. వున్నత న్యాయస్ధానాలు ప్రజాసామ్యాన్ని బలపరిచేందుకు వీలుగా రాజ్యాంగానికి భాష్యం చెప్పటం, లోపాలను ఎత్తి చూపి సవరించేవిధంగా మార్గదర్శనం చేయాల్సి వుంది. దీనికి ఎన్నో పరిమితులు,ఆటంకాలు వున్నాయి. ఇది ఒక ఎత్తయితే ప్రజాకోర్టులో న్యాయమూర్తులైన ఓటర్లు ఫిరాయింపుదారులు, అవకాశవాదుల పట్ల ఎప్పుడైతే సరైన తీర్పు ఇచ్చేందుకు పూనుకుంటారో అప్పుడే స్వచ్చ రాజకీయాలవైపు పరిణామాలు మలుపు తిరుగుతాయి.ప్రజలకు ఎలాంటి ఆటంకాలు వుండవు, వున్నా వాటిని త్రోసి రాజని ముందుకు పోయే హక్కు, అవకాశం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక అంకెల ఆటలో బిజెపికి భంగపాటెందుకు కలిగింది !

19 Saturday May 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ 1 Comment

Tags

BJP, Congress party, jds, karnataka votes 2018, karnataka votes facts, numbers game in karnataka, Yeddyurappa

Image result for Yeddyurappa

ఎం కోటేశ్వరరావు

కర్ణాటకలో అటు ప్రజా కోర్టులో ఇటు అసెంబ్లీ అంకెల ఆటలో బిజెపి భంగపడింది. కులం, ధన, పదవీ ప్రలోభాలు, బెదిరింపులు, బుజ్జగింపులతో తమకు లేని బలాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించటాన్ని యావత్‌ దేశం గమనించింది. దానిలో విఫలమై అవమానకరంగా రాజీనామా చేసిన తరువాత ఏ కోశానా లేని తమ నిజాయితీ గురించి తమకు తామే ఆ పార్టీ నేతలు కితాబునిచ్చుకుంటున్నారు. 117 సీట్లు, 56.8శాతం ఓట్లు తెచ్చుకున్న కూటమి కంటే ఓట్ల చీలిక కారణంగా 104 సీట్లు వచ్చినప్పటికీ వారికి వచ్చిన 36శాతం ఓట్లను దాచి పెద్ద పార్టీ అంటూ ఇంకా ఫోజు పెడుతున్నారు. వారెంతగా ఖంగుతిన్నారంటే బలనిరూపణకు సుప్రీం కోర్టు ఇచ్చిన అవకాశాన్ని వుపయోగించుకొని మరింత గబ్బుపట్టటం కంటే ముందే తప్పుకోవటం మంచిదని రాజీనామా చేయటం నష్ట నివారణ చర్యలో భాగం. తనకు అధికారం లేకపోయిన తరువాత ఇంకేంటి అన్నట్లుగా అసెంబ్లీలో ప్రసంగం ముగించి రాజీనామా ప్రకటించిన వెంటనే లేచి వెళ్లిపోయారు. జాతీయ గీతం గురించి పెద్ద సమస్య చేసిన ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో జాతీయగీతాలాపన ముగియ కుండానే లేచిపోవటం వారి నిజస్వరూపాన్ని వెల్లడి చేసింది. ఈ వుదంతంలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది అనటం కటే బిజెపి ఘోరంగా ఓడిపోయింది అని చెప్పాల్సి వుంటుంది.

తమ పార్టీ కార్యకర్తగా మాదిరి వ్యవహరించే వ్యక్తి రాజభవన్‌లో గవర్నర్‌గా వున్నందున విచక్షణాధికారం పేరుతో ముందు అధికార పీఠాన్ని సంపాదిస్తే తరువాత గతంలో మాదిరి ఏదో విధంగా దాన్ని నిలబెట్టుకోవచ్చని బిజెపి వేసిన ఎత్తుగడలు అనూహ్యంగా చిత్తయ్యాయి. తమకున్న బలానికి మరికొందరు మద్దతిస్తారని లేఖ ఇవ్వటం తప్ప ఎవరు, ఎలా ఇస్తారో ఎడ్డియూరప్ప చెప్పలేదు. మరోవైపు తమకు 117 మంది మద్దతు వుందని సంతకాలతో సహా కాంగ్రెస్‌-జెడిఎస్‌ లేఖ అందచేసినప్పటికీ గవర్నర్‌కు నమ్మకం కుదరలేదని తిరస్కరించటంతోనే కుట్రకు తెరలేచింది. లేఖలో వారం రోజుల గడువు అడిగితే గవర్నరు పదిహేను రోజులు ఇవ్వటం కూడా బిజెపి వ్యూహంలో తరువాత వచ్చిన ఆలోచన పర్యవసానమే.

బిజెపి పధక రూపకర్తలు ఎక్కడ పప్పులో కాలేశారు. కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లనున్నదని తెలిసి కోర్డు సమయం ముగిసిన తరువాత గవర్నర్‌ కార్యాలయం నుంచి లేఖ తెప్పించుకోవటం, తిరిగి కోర్టు తెరిచే లోపల ప్రమాణ స్వీకార తతంగాన్ని ముగించి కోర్టు ఆటంకాన్ని తప్పించుకోవచ్చనేంత వరకు వారు తెలివిగానే వ్యవహరించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా అర్ధరాత్రి తలుపు తట్టిన కాంగ్రెస్‌ నేతల వినతిని మన్నించి అప్పటి కప్పుడు విచారణ బెంచిని ఏర్పాటు చేసి తెల్లవార్లూ విచారణ జరపటాన్ని మాత్రం వారు వూహించలేదు. తమకు వున్న మెజారిటీ గురించి గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొనకపోవటంతో ధర్మాసనం బలనిరూపణకు ఒక రోజు మాత్రమే ఇవ్వటంతో తీరికగా చేపలకు గాలాలు విసురుదామనుకున్న కమలనాధుల ఎత్తులు చిత్తయ్యాయి. బిజెపి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఏడుగురిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవచ్చని కమలనాధులు భావించారు. అందుకే మీడియాకు అనధికారికంగా ఆ ఏడుగురు తమవైపే అన్న ధీమాతో వుప్పందించారు.

ఎంతకైనా తెగించే బిజెపి తీరుతెన్నుల గురించి జాగ్రత్తపడిన కాంగ్రెస్‌ాజెడిఎస్‌లు తమ సభ్యులను కాపాడుకొనేందుకు గట్టి చర్యలు తీసుకోవటంతో ఎడ్డి మడ్డి వ్యవహారం బెడిసి కొట్టింది. కర్ణాటకలో బిజెపి గతంలో అధికారం వెలగబెట్టినప్పటికీ ఇప్పుడే మొదటిసారి దక్షిణాదిన తమ పాదం మోపుతున్నామనే భ్రమ కలిగే విధంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. దానికి మీడియాకూడా ఎలాంటి వెనుక ముందులు చూడకుండా నిజమే అన్నట్లు ప్రచారం చేసింది. ఇక్కడ బిజెపికి ఎదురైన సమస్యలేమిటి? 2008లో కాంగ్రెస్‌తో సంకీర్ణం నుంచి బయటకు వచ్చిన జెడిఎస్‌ను బిజెపి దగ్గరకు తీసి తనకు అధిక సీట్లు వున్నప్పటికీ జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే బిజెపితో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని జెడిఎస్‌కు త్వరలోనే అర్ధమై బిజెపి నుంచి దూరం జరిగింది. ఈ ఎన్నికలలో కూడా అదే విధంగా బిజెపి పెద్ద పార్టీగా, కాంగ్రెస్‌, జెడిఎస్‌లు రెండు, మూడు స్ధానాలలో నిలిచాయి. దక్షిణాదిలో తమ పార్టీ విస్తరణలో భాగంగా ఎట్టి పరిస్ధితిలోనూ తమ పార్టీనేతనే ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి ఎప్పుడో నిర్ణయించుకుంది. అవసరమైతే జెడిఎస్‌ను తమ జూనియర్‌ భాగస్వామిగానే వుంచుకోవాలనుకుంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో దేవెగౌడమీద ఎక్కడ లేని గౌరవం ఒలకపోశాడు. అవసరమైతే ఈ సారి కూడా ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చేయాలని, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తమ వారు లేకపోయినా ఇబ్బంది లేదు అని బిజెపి అనుకొని వుంటే పరిస్ధితులు భిన్నంగా వుండేవి. గతంలో కలిగిన అనుభవం దృష్టిలో వున్నప్పటికీ కాంగ్రెస్‌ వివేకం ప్రదర్శించి బేషరతుగా జెడిఎస్‌కు మద్దతు ప్రకటిస్తుందని బిజెపి వూహించలేకపోయింది. దాంతో ప్రలోభాల బాట పట్టింది, భంగపడింది.

మూడు పార్టీలలో అవకాశవాదులు, పదవీ వ్యామోహపరులకు కొదవేమీ లేదు . అధికారం ఎక్కడ వుంటే అక్కడకు చేరే వాతావరణం వున్న ఈ రోజుల్లో బిజెపి ప్రలోభాలకు కాంగ్రెస్‌,జెడిఎస్‌ కూటమిలోని ఎంఎల్‌ఏలు ఎందుకు ప్రభావితం కాలేదు అన్నది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్ధితి ఒక ఏడాది ముందు వచ్చి వుంటే ప్రలోభాలు పని చేసి వుండేవన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడెందుకు పని చేయలేదు. కేంద్రంలో బిజెపి అన్ని రంగాలలో విఫలమైందని జనం గుర్తించటం ప్రారంభమైంది.గత లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లు, 43శాతం ఓట్లు, 130 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీ తెచ్చుకున్న బిజెపి ఈ సారి 104సీట్లకు, 36శాతం ఓట్లకే పరిమితం అయింది. అంటే నరేంద్రమోడీని చూసి జనం ఓట్లెయ్యరు అన్నది స్పష్టం. దీర్ఘకాలం ముఖ్య మంత్రిగా వున్న గుజరాత్‌లో నరేంద్రమోడీ చెమటోడ్చితిరిగినా చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా బిజెపి బతికి బయటపడింది. వుత్తరాదిన ఆ పార్టీ గతంలో మాదిరి ఓట్లను అకర్షించే స్ధితిలో లేదని అనేక రాష్ట్రాల వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటం స్పష్టం చేసింది. 2014లో బిజెపి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన సీట్లు 282 తెచ్చుకున్నప్పటికీ దానికి వచ్చిన ఓట్లు 31.34 శాతమే, దాని మిత్రపక్షాలవి కలుపుకున్నా వచ్చినవి 38.5శాతమే. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోవటం కారణంగానే బిజెపి అన్ని సీట్లు తెచ్చుకుందన్నది స్పష్టం. ఈసారి బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సర్దుబాటు చేసుకుంటాయన్న వాతావరణం రోజురోజుకూ బలపడుతోంది. పెద్ద రాష్ట్రమైన వుత్తర ప్రదేశ్‌లో వుప్పు-నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు రెండు లోక్‌సభ వుప ఎన్నికలలో ఐక్యంగా పోటీ ఇచ్చి బిజెపి అభ్యర్ధులను ఓడించాయి. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్‌డిఏ నుంచి బయటకపోయినవి తప్ప కొత్తగా ఒక్క పార్టీ కూడా చేరే పరిస్ధితి లేదన్నది స్పష్టం కావటం. ఆరు నెలల్లో రాజస్ధాన్‌,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు నరేంద్రమోడీ సన్నద్దమౌతున్నారన్నది స్పష్టంగా కనిపించటం. మోడీ భవితవ్యమే ఎలావుంటుందో తెలియనపుడు బిజెపితో జట్టుకడితే ఆరునెలల్లో పరిస్ధితి తారుమారైతే తమ పరిస్ధితి ఏమిటన్న దూరాలోచన కూడా అవకాశ వాదులలో తలెత్తి వుండవచ్చు. అందువలన తాత్కాలికంగా ప్రలోభాలకు లంగకపోయినప్పటికీ అవకాశవాదులతో ఆ ముప్పు ఎప్పుడూ మెడమీద కత్తిలా వేలాడుతూనే వుంటుంది.

ఈ ఎన్నికలు బిజెపి అవకాశవాదం,అప్రజాస్వామిక చర్యలను ఎంతగానో బయట పెట్టాయి. అనేక మంది ఆ పార్టీ అభిమానులుగా వున్నవారు పరస్పర విరుద్దమైన వాదనలు చేయటాన్ని సమర్ధించుకోలేని స్ధితిలో పడ్డారు. మెజారిటీ కూటమిని కాదని, మెజారిటీ లేని పార్టీ పెద్దది అనే పేరుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌ చర్యను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దాని మీద పదివారాల తరువాత విచారణకు చేపట్టనుంది. గతంలో వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులు వున్నప్పటికీ వాటికి తమదైన భాష్యాలు చెబుతూ గవర్నర్‌ విచక్షణాధికారాల పేరుతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ అవకాశవాదానికి పాల్పడుతున్నది. దీని మీద కూడా మరింత స్పష్టత వచ్చే విధంగా సుప్రీం తీర్పు వుండవచ్చని అనేక మంది ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకొని వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు తరువాత కూటమి కట్టటం ఏమిటని బిజెపి ఒక వాదనను ముందుకు తెచ్చింది, దాని గురించి ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు గుండెలు బాదుకుంటున్నారు.

గోవా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలలో తలపడిన పార్టీలు, స్వతంత్రులతో జతకట్టిన బిజెపి, అదే కర్ణాటకలో జరిగితే తప్పుపట్టటం ఏమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జెడియు, బిజెపి ఎంత హోరాహోరీగా పోటీ చేసింది, పరస్పరం ఎన్నిమాటల తూటాలను ప్రయోగించిందీ చూశాము. అలాంటి నితీష్‌ కుమార్‌కు మద్దతు ఇవ్వటానికి బిజెపికి, తీసుకోవటానికి నితీష్‌ కుమార్‌కు ఎలాంటి సమస్య ఎదురు కానపుడు కాంగ్రెస్‌-జెడిఎస్‌ను ఎందుకు తప్పుపడుతున్నట్లు ? ఇలాంటి విషయాలన్నీ అటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను విమర్శించిన బిజెపి ఆచరణలో అదేపని చేస్తున్నదనే అంశాన్ని ఈ సందర్భంగా అదనంగా మరికొంత మంది గ్రహించారు. ఇవన్నీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఏతర పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకొనేందుకు దాని అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు జాగరూకతతో వుండేందుకు ఈ వుదంతం తోడ్పడింది.

కొన్ని ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులను కూడా ఇది వెల్లడి చేసింది. పొరుగునే వున్న రాష్ట్రానికి వెళ్లి జెడిఎస్‌కు మద్దతు ప్రకటించి వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లేదా టిఆర్‌ఎస్‌ అక్కడి పరిణామాలపై మౌనం దాల్చటం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. లోపాయకారీగా బిజెపితో అవగాహన నిజమే అనేందుకు ఆస్కారం కలిగించింది.తాము మద్దతు ఇచ్చిన జెడిఎస్‌ నాయకుడే ముఖ్యమంత్రి అవుతున్నా టిఆర్‌ఎస్‌కు అది ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే తెలంగాణాలో తమను సవాలు చేస్తున్నది కాంగ్రెస్‌ కావటం, ఆ పార్టీ మద్దతుతోనే కుమారస్వామి కర్ణాటక ముఖ్య మంత్రి కావటం టిఆర్‌ఎస్‌ వూహించిన పరిణామం కాదు. మరొక ఫ్రంటు అంటూ కెసిఆర్‌ చేస్తున్న యత్నాలకు ఇది చెప్పులో రాయిలా ఇబ్బంది పెట్టే అంశమే.

తమతో కలసి అధికారంలో భాగస్వాములౌతూనే వైఎస్‌ఆర్‌సిపితో కధనడుపుతున్న బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకొనేందుకు ప్రత్యేక రాష్ట్రహోదా కల్పనలో వాగ్దాన భంగాన్ని తెరమీదకు తెచ్చింది. కర్ణాటకలో ఒక వేళ బిజెపి గెలిస్తే తదుపరి తమను వేధిస్తారనే అనుమానం కలగటం లేదా అలాంటి సూచనలు కనపడటం వలనగానీ తెలుగుదేశం నేతలు కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ను గెలిపించమని చెప్పలేదు గానీ బిజెపిని ఓడించమని ప్రచారం చేశారు. అంటే బిజెపి మీద ఎవరు గెలిచే సత్తా వుంటే వారిని గెలిపించమన్నదే దాని అంతరార్ధం. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అంతరం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక చీలిక, సంక్షోభానికి తెరలేపనున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. వుక్రోషంతో బిజెపి అందుకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అయితే అలాంటిదేదో జరగాలని తెలుగుదేశం కూడా అంతరంగంలో కోరుకుంటున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై బిజెపి ద్రోహం చేసిందనే ప్రచారం చేస్తున్న ఆ పార్టీనేతలపై కొత్త కేసులు పెట్టినా పాత కేసులను తిరగదోడినా తమపై వేధింపులకు పూనుకుందంటూ బాధిత ఫోజు పెట్టి జనం ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. కర్ణాటకలో తమ గురించి గొప్పలు చెప్పుకుంటున్న బిజెపికి, ఇతర పార్టీలకు గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల, సీట్ల వివరాలు ఇలా వున్నాయి.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం బిజెపి            కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)    ఇతరులు

2004    28.33(79) 35.27(65)   20.77(58) 15.3(22)

2008    33.86(110) 35.13(80)  19.44(28) 11.57(6)

2013     19.90(40) 36.60(122)  20.20(40) 24.40(22)

2018      36.20(104) 38.00(78)  18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009 41.63(19) 37.5(6) 13.57(3) 5.20(0)

2014 43.00(17) 40.80(9) 11.00(2) 5.20(0)

నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లోక్‌సభ ఎన్నికలలో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి సోదరులు అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అనూహ్య మలుపులు తిరిగిన కర్ణాటక వుదంతం !

17 Thursday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, Congress, jds, karnataka developments, karnataka politics, karnataka votes 2018, unexpected twist in karnataka developments

Image result for Karnataka government formation

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఒక తీవ్రమైన అంశాన్ని దేశ అత్యున్నత న్యాయ స్ధానం అర్ధరాత్రి విచారణకు స్వీకరించి తెల్లవారు ఝామున ఒక తాత్కాలిక నిర్ణయాన్ని ప్రకటించి, తదుపరి విచారణ కొనసాగింపునకు నిర్ణయించటం బహుశా ఇదే ప్రధమం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాని స్ధితిలో 117 మంది బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్‌-జెడిఎస్‌ను కాదని 104 స్ధానాలున్న బిజెపిని ఆహ్వానించటం చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టింది, ఇది అనూహ్యమైన మలుపు. గతంలో కొన్ని కేసులలో వచ్చిన తీర్పులు, సంప్రదాయాల మార్గదర్శనం వున్నప్పటికీ గవర్నర్లు తమ విచక్షణ, వివేచనను వినియోగించిన తీరు పిచ్చివాడి చేతిలో రాయిలా ఎవరెలా వినియోగిస్తారో తెలియని స్ధితిని ముందుకు తెచ్చింది. గవర్నర్ల విచక్షణ అధికారాలకు కూడా నిర్ధిష్ట మార్గదర్శక సూత్రాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం కనిపిస్తోంది. అందువలన ఈ కేసు తీర్పు లేదా నిర్ణయం పర్యవసానాలు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ ప్రతినిధులుగా పరిరక్షకులుగా వుండాల్సిన గవర్నర్ల వ్యవస్ధ మీద, రాజ్యాంగానికి, గవర్నర్ల విచక్షణకు వున్న పరిమితుల మీద భాష్యం చెప్పి దానిని కాపాడాల్సిన న్యాయవ్యవస్ధ మీద ఎలా పడతాయో చూడాల్సి వుంది. ఏ వ్యవస్ధకూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు గాని అవి పని చేస్తున్న తీరును విమర్శించే అవకాశం వుండటం ప్రజాస్వామ్య వ్యవస్ధ లక్షణం. అందుకు కోర్టు తీర్పులు కూడా మినహాయింపు కాకూడదు.

రాజ్యాంగానికి భాష్యం చెప్పాల్సిన వుదంతంలో ఈ కేసులో సీనియర్‌ న్యాయమూర్తులను వదలి జూనియర్లతో బెంచ్‌ ఏర్పాటు చేయటం కూడా ఇదే ప్రధమం. గవర్నర్‌ కార్యాలయం నుంచి అధికారికంగా వర్తమానం రాకముందే ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారం గురించి బిజెపి సామాజిక మాధ్యమంలో ప్రకటించటం కూడా ఇదే ప్రధమం. ప్రత్యర్ధులు కోర్టుకు వెళుతున్నారని తెలిసి దానికి అవకాశం లేకుండా చేసేందుకు సాధారణంగా కోర్టు సమయం ముగిసిన తరువాత గవర్నరు లేఖ రాయటం, మరుసటి రోజు కోర్టును తెరవక ముందే ప్రమాణ స్వీకారానికి పూనుకోవటం కూడా ఇదే ప్రధమం. ఇదంతా తెరవెనుక ఒక పధకం ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోంది.

గవర్నర్‌ నిష్పాక్షితను ఎవరూ ప్రశ్నించకుండా వుండాలంటే రెండు పక్షాలు తమకే బలం వుందని చెబుతున్నపుడు, ఒక పక్షంలోని పేర్లు మరొక పక్షం జాబితాలో కనిపిస్తున్నపుడు గవర్నరు తన ముందు హాజరై సంఖ్యానిరూపణ చేసుకోమని ఎందుకు కోరలేదు. కర్ణాటక వుదంతం దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

తమకు మెజారిటీ మద్దతు వుందని చెప్పుకుంటున్న పార్టీ నేతను బుధవారం మధ్యాహ్నం లోగా జాబితాను సమర్పించాలని సుప్రీం కోర్టు కోరింది. బిజెపి నేతగా ఎన్నికైన ఎడ్డియూరప్ప గవర్నర్‌కు ముందు ఇచ్చిన జాబితాలో ఎన్నిపేర్లున్నాయి, బిజెపిగాకుండా ఇతర పార్టీలవి, ఇండిపెండెంట్లవి ఎన్ని వున్నాయన్నది ఆసక్తికర అంశం. ఒక లేఖ కాకుండా రెండు ఇచ్చారా అన్నది కొందరి సందేహం. మరోవైపు కాంగ్రెస్‌ -జెడిఎస్‌ అందచేసిన జాబితాలో 117 పేర్లు వున్నట్లు ఆ పార్టీనేతలు పేర్కొన్నారు.

ఇరు పక్షాలు ఇచ్చిన లేఖలు, జాబితాలను చూసిన గవర్నర్‌ తన ‘విచక్షణ ‘ అధికారాన్ని వినియోగించినట్లు కనిపిస్తోంది తప్ప జాబితాల్లో పేర్ల తకరారును నిర్ధారించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తమ మద్దతుదార్లందరినీ స్యయంగా గవర్నరు ముందు ప్రవేశపెడతామని కాంగ్రెస్‌-జెడిఎస్‌ చెప్పినప్పటికీ గవర్నర్‌ అంగీకరించలేదంటే, ముందే ఒక నిర్ణయానికి వచ్చారా అన్నది ఒక ప్రశ్న. ఎడ్డి యూరప్ప తన బల నిరూపణకు వారం రోజులు గడువు ఇమ్మని కోరినట్లు వార్తలు రాగా గవర్నరు పదిహేను రోజులు ఇచ్చారు. బల నిరూపణకు ఎడ్డి యూరప్ప గడువును కోరటం అంటే అధికారాన్ని అప్పగించమని కోరే సమయంలో తమకు పూర్తి మెజారిటీ లేదని అంగీకరిస్తూ, కొందరు మద్దతు ఇస్తామని చెప్పినందున గడువు ఇమ్మని కోరటం తప్ప మరొకటి కాదు. ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్‌ తరువాత ఏ రాజకీయ పార్టీలోనూ నిబంధనలకు అనుగుణ్యంగా ఎలాంటి చీలికలు లేవు. అలాంటపుడు ఇతర పార్టీల వారు తమకు మద్దతు ఇస్తున్నారని చెబితే గవర్నర్‌ నమ్మటం ఏమిటి? ఎడ్డి యూరప్ప చెప్పారు, ఈ గవర్నర్‌ నమ్మారు అది అంతే అంటారా ?

గవర్నర్‌లు పాలకపార్టీల వారే గనుక వారు ఎక్కడ స్టాంపు వేయమంటే అక్కడ స్టాంపు వేస్తారని గతంలో కాంగ్రెసు, ఇపుడు బిజెపి నియమిత గవర్నర్లు నిరూపించారు. అనూహ్యంగా ఇప్పుడు బంతి కోర్టుకు వచ్చింది. గవర్నరు విచక్షణ అధికారాన్ని తాము ప్రశ్నించలేం, అందువలన దీనిలో ఎలాంటి జోక్యం చేసుకోం అని కేసును అంతటితో ముగిస్తే కధ వేరుగా వుండేది. గవర్నరు చర్యమీద, ఎడ్డి యూరప్ప ప్రమాణ స్వీకారం మీద స్టే ఇవ్వకుండా ఫిర్యాదును విచారించేందుకు పూనుకోవటం బహుశా బిజెపి వూహించి వుండదు.

అధికారాన్ని కోరిన రెండు పక్షాలు ఇచ్చిన జాబితాలను తమకు సమర్పించాలని కోర్టు కోరటం అంటే వాటిలోని నిజానిజాలను తేల్చేందుకు పూనుకోవటమే. ఇప్పటికే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక మిశ్రా తీరుతెన్నులపై సుప్రీం కోర్టు సీనియరు న్యాయమూర్తులే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వారిని పక్కన పెట్టి ఈ కేసులో జూనియర్లతో బెంచిని ఏర్పాటు చేశారు. వారు ఇచ్చే తీర్పు కీలకం కానుంది.

గతంలో ఇదే ఎడ్డి యూరప్ప తనకు 110 సీట్లు వచ్చినపడు, కొంత మంది ఇండిపెండెంట్లను తన వైపుకు తిప్పుకోవటం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట వేటు పడకుండా ఇతర పార్టీల సభ్యులను సభకు హాజరు కాకుండా చేసి తన మెజారిటీని నిరూపించుకొని తరువాత వారిచేత రాజీనామా చేయించి తన సర్కారును కాపాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో ఫిరాయింపుదార్లను ఏకంగా మంత్రివర్గంలో చేర్చుకున్నప్పటికీ వారి మీద పిరాయింపు నిరోధక చట్టవేటు పడలేదు, వారి గురించి స్పీకర్లు ఎటూ తేల్చలేదు. అదే వ్యూహాన్ని కర్ణాటకలో కూడా అనుసరించేందుకు బిజెపి పూనుకుందా ? అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి పరిస్ధితికి తేడా వుంది. అక్కడ మెజారిటీ పక్షాలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. తమకు అదనపు బలం అవసరం లేకపోయినా ఏదో ఒకసాకుతో ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాయి. కర్ణాటకలో పరిస్ధితి భిన్నం. గతంలో మాదిరే ఇతర పార్టీల సభ్యులను కొందరిని లోపాయకారీగా కూడగట్టుకొని గట్టెక్కాలన్నది బిజెపి ఎత్తుగడ. గత అనుభవాల రీత్యా కాంగ్రెస్‌-జెడిఎస్‌ ముందు చూపుతో తమ జాగ్రత్తలు తాము తీసుకున్నాయి. అయితే సభలో బలనిరూపణ సమయంలో పార్టీ విప్‌ను ధిక్కరించి వ్య తిరేకంగా ఓటు వేసే లేదా వేయకుండా వుండే అవకాశం వుంది.

ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ముందే, బలపరీక్ష జరగక ముందే వివాదం కోర్టుకు వెళ్లింది. సభ ఇంకా ఏర్పడ లేదు, సభ్యులు ప్రమాణ స్వీకారమే చేయలేదు. కోర్టు విచారణ సమయానికి ఏ సభ్యుడూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించలేదు. ప్రమాణ స్వీకారంపై స్టే ఇవ్వకుండా కేసు విచారణ చేస్తామని కోర్టు చెప్పటం అంటే సదరు ప్రమాణ స్వీకారం తమ తీర్పుకు లోబడి వుండాలనటం తప్ప వేరు కాదు.

కోర్టు తీర్పు పర్యవసానాలు ఏమిటి? గత తీర్పుల ప్రకారం మెజారిటీ వున్న కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని గనుక తీర్పు వస్తే మన కోర్టుల మీద జనంలో మిగిలి వున్న కొద్దో గొప్పో నమ్మకం బలపడుతుంది. ఒక వేళ గవర్నర్‌ విచక్షణ అధికారాలలో తాము జోక్యం చేసుకోలేం అని ప్రకటిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ల వ్యవస్ధను గబ్బు పట్టించటాన్ని కోర్టులు కూడా ఏమీ చేయలేవు అని వాటి మీద వున్న విశ్వాసాన్ని జనం కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌, విజిలెన్స్‌, సిబిఐ, ఇతర అనేక సంస్ధలు పాలకుల చేతుల్లో సాధనాలుగా మారాయనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఈ కేసు న్యాయవ్యవస్ధకు ఒక అగ్నిపరీక్ష వంటిదే ! ఎలాగైనా అధికారానికి అంటి పెట్టుకొని వుండేందుకు కాంగ్రెస్‌, జెడిఎస్‌ సభ్యులను ఆత్మసాక్షి ప్రబోధానుసారం ఓటు వేయమని కోరతానని ఎడ్డియూరప్ప ప్రకటించారు. గతంలో తమ పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి పదవి అభ్యర్ధిని ఓడించేందుకు ఇందిరా గాంధీ ఆత్మప్రబోధానుసారం ఓటు వేయమని పిలుపు నిచ్చి ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరతీశారు. ఇప్పుడు అది చెల్లదు, పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం అలాంటి ఓటింగ్‌ చెల్లదని తెలిసినా ఎడ్డి యూరప్ప ఆ పిలుపు ఇవ్వటం తమకు బలం లేదని అంగీకరించటమే. ఆవు ఎక్కడ కట్టినా తమ దొడ్లో ఈనితే చాలు అనుకున్నట్లుగా ఏ పార్టీ తరఫున గెలిచినా తమకు మద్దతు ఇస్తే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న బిజెపి డబ్బు, ఇతర ప్రలోభాలను ఎరచూపి, బెదిరింపులకు పాల్పడి రాజకీయంగా మరింతగా విమర్శల పాలు కావటం ఖాయం. అటు కేంద్రంలో నరేంద్రమోడీపై ఇప్పటికే వున్న మచ్చలకు తోడు ఇది మరొకటి తోడు కావటం తప్ప అదనంగా ఒరిగేదేమీ లేదు. ఈ వుదంతం చివరికి ఎలా పరిష్కారం అవుతుందో తెలియదు. ఒక వేళ కోర్టు తీర్పు ఎడ్డికి అనుకూలంగా వస్తే న్యాయవ్యవస్ధను కూడా బిజెపి ప్రభావితం చేసిందని జనం భావించే అవకాశం వుంది. అనూహ్యంగా ఎడ్డికి అవకాశం ఇవ్వటం రాజ్యాంగ విరుద్దమని తీర్పు ఇస్తే బిజెపికి అది పెద్ద భంగపాటు. ఏది జరిగినా మరికొద్ది నెలల్లో జరిగే రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుంది.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక అంకెలు చెబుతున్న నిజాలు- అబద్దాలు చెబుతున్న బిజెపి నేతలు !

15 Tuesday May 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP leaders lies, Karnataka Legislative Assembly election 2018, karnataka votes 2018, karnataka votes facts

ఎం కోటేశ్వరరావు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికారం ఎవరికి అన్న బంతి గవర్నరు కోర్టులో వుంది. ఆ కోర్టును నియంత్రించేది బిజెపి కేంద్ర నాయకత్వం అన్నది అనధికార నిజం. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోవా గవర్నరు చేసిందాని ప్రకారం కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి మెజారిటీని గుర్తించి ప్రభుత్వ ఏర్పాటకు ఆహ్వానిస్తారా లేక అతి పెద్ద పార్టీకి ముందు అవకాశం ఇవ్వటం సబబు అంటూ బిజెపిని గద్దెనెక్కిస్తారా అన్నది చూడాల్సి వుంది. గోవా సాంప్రదాయాన్ని అనుసరిస్తే బిజెపి ప్రతిపక్షంలో కూర్చోవాలి. లేదూ బిజెపిని ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి బేరసారాలకు, ఇతర ప్రలోభాలకు తెరలేపుతారా ? అదే జరిగితే మరోసారి బిజెపి రాజకీయంగా గబ్బుపట్టటం ఖాయం.

ఇక బిజెపికి వచ్చిన సీట్ల గురించి ఎవరేమన్నారు? ఇది బిజెపికి చారిత్రాత్మక విజయం: చత్తీస్‌ఘర్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో మా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా మరోసారి చరిత్రను సృష్టించారు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇది ఎంతవరకు నిజం ? 2004,08,13,18లో జరిగిన ఎన్నికల అంకెలేమి చెబుతున్నాయో ముందు చూద్దాం.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం      బిజెపి        కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)  ఇతరులు

2004     28.33(79)   35.27(65)   20.77(58)   15.3(22)

2008    33.86(110)   35.13(80)   19.44(28)  11.57(6)

2013    19.90(40)    36.60(122)   20.20(40) 24.40(22)

2018    36.20(104)  38.00(78)     18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009    41.63(19)     37.5(6)       13.57(3) 5.20(0)

2014    43.00(17)    40.80(9)      11.00(2) 5.20(0)

పై అంకెలను చూసినపుడు కర్ణాటకలో తాజా ఎన్నికలలో బిజెపి బలం, పెరిగిందో తగ్గిందో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓటింగ్‌లో పెద్ద మార్పులేమీ లేకుండా కొనసాగటాన్ని చూడవచ్చు.జెడిఎస్‌ బలం కూడా, అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు ఒకే విధంగానూ, పార్లమెంట్‌ ఎన్నికలలోనూ ఒకే విధంగా వుండటాన్ని చూడవచ్చు. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గిందన్నది రాజకీయాల్లో ఓనమాలు వచ్చిన వారికి కూడా తెలిసిందే.తొలిసారిగా దక్షిణాదికి ముఖద్వారంగా వున్న కర్ణాటక పాగా వేశామన్నట్లుగా బిజెపి నేతలు చిత్రిస్తున్నారు. దానికి గతంలోనే గరిష్టంగా 110 స్ధానాలు వచ్చి అధికారం వెలగబెట్టి గబ్బుపట్టిన విషయాన్ని మరుగుపరుస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసన-పత్రికా స్వేచ్చను అడ్డుకొనే యత్నం !

23 Monday Apr 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

CJI impeachment, Free press, freedom of media, India press freedom

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా తీరుతెన్నులపై మీడియాతో మాట్లాడిన నలుగురు సుప్రీం న్యాయమూర్తులు

ఎం కోటేశ్వరరావు

ప్రధాన కార్మదర్శి, నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ (ఎన్‌ఏజె)

ఒక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసిస్తూ లేదా తొలగించాలని కోరుతూ నిబంధనల ప్రకారం ఒక తీర్మానం లేదా పిటీషన్‌ అందచేయటం స్వతంత్రభారత చరిత్రలో తొలిసారిగా జరిగింది. ఇదే సమయంలో ఈ ప్రక్రియకు సంబంధించి వార్తలు ప్రచురించకుండా మీడియాను ఆదేశించాలని ఒక స్వచ్చంద పేరుతో సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు కావటం కూడా తొలిసారే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి పిటీషన్‌ అందచేయటం తొలిసారే అయినప్పటికీ గతంలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి వి.రామస్వామిపై మొదటిసారి ఒక తీర్మానం అందచేయటం, దానిపై పార్లమెంటు చర్చించటం చరిత్రలో తొలిసారి. దీపక్‌ మిశ్రాపై పిటీషన్‌ రాజకీయ కుట్రలో భాగమే అని, జస్టిస్‌లోయా సహజమరణం చెందారన్న తీర్పు ఇచ్చిన కారణంగానే ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాపై తీర్మానం అందచేశారని న్యాయశాఖ మంత్రి అరుణ్‌ జెట్లీ అన్యాయమైన ఆరోపణ చేశారు. దీపక్‌ మిశ్రాపై తీర్మానానికి లోయా మరణంపై తీర్పుకు సంబంధం లేదు. జనవరి మూడవ వారంలోనే సిపిఎం నేత సీతారాం ఏచూరి తీర్మానం గురించి ఇతర పార్టీలతో సంప్రదిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసినదే. అందువలన దీపక్‌ మిశ్రాను సమర్ధించేందుకు అధికారపక్షం ముందుగానే నిర్ణయించుకున్నట్లు వేరే చెప్పనవసరం లేదు.

అభిశంసన విషయమై మీడియాను కట్టడి చేయాలని సూచన చేస్తూ లా కమిషన్‌ ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చిందని, అభిశంసన ప్రక్రియపై రాయకుండా కట్టడి చేసే అంశం రాజ్యాంగంలో కూడా వుందని, అలా రాయటం వలన న్యాయమూర్తుల విధుల నిర్వహణపై ప్రభావం పడుతుందంటూ పిటీషన్‌ దాఖలు చేసిన స్వచ్చంద సంస్ధతరఫు న్యాయవాది వాదించారు. ఈ అంశంపై రాజకీయ నాయకులు కొంతకాలంగా మాట్లాడుతున్నారని, మీడియా వాటిని నివేదిస్తున్నదని న్యాయమూర్తులు భయపడకుండా తమ విధులు నిర్వర్తించాలంటే మీడియాను కట్టడి చేయాలని కూడా కోరారు.పార్లమెంట్‌ ముందు ఎలాంటి పిటీషన్‌ లేకుండానే రాజకీయ నేతలు ఒక న్యాయమూర్తి తొలగింపు గురించి అన్ని రకాల ప్రకటనలు చేస్తున్నారని, అలాంటి చర్చలు సంబంధిత న్యాయమూర్తి పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, అందువలన అలాంటి ప్ర కటనలు చేయకుండా వాటిని మీడియా ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌జీఓ సంస్ధ న్యాయవాది పేర్కొన్నారు.అయితే అటార్నీ జనరల్‌ ఏమి చెపుతారో వినకుండా తామేమీ నిర్ణయించలేమని పేర్కొన్న బెంచ్‌ కేసును మే 7వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపక్ష సభ్యులు గత శుక్రవారం నాడు అందచేసిన తీర్మానంపై తగినంత కసరత్తు లేకుండా రాజ్యసభ అధ్యక్షుడు, వుపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయకుడు సోమవారం నాడు తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించటంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. తీర్మాన తిరస్కరణను సుప్రీం కోర్టులోనే సవాలు చేస్తామని ప్రకటించటంతో ఒక వేళ నిజంగానే పిటీషన్‌ దాఖలైతే దాని విచారణ ఎవరితో కూడిన బెంచ్‌కు అప్పగిస్తారు అన్నది ఆసక్తికరం. ఏ కేసును ఎవరు విచారించాలన్నది ప్రధాన న్యాయమూర్తి విచక్షణే అనటాన్ని కొందరు సీనియర్‌ న్యాయమూర్తులు సవాలు చేసిన పూర్వరంగంలో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఏకంగా తన అభిశంసనపైనే వచ్చే పిటిషన్‌పై ఏం చేస్తారు అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

నిజంగా రాజ్యాంగంలో మీడియాను నియంత్రించాలనే స్పష్టమైన నిబంధన వుంటే లేదా లా కమిషన్‌ సూచనకు చట్టబద్దత వుంటే సుప్రీం కోర్టు ఈ పాటికి నిషేధం విధించి వుండేది. అది లేదు కనుకనే సుప్రీం కోర్టు బెంచి ఎలాంటి వుత్తరువు జారీ చేయకుండా అటార్నీ జనరల్‌ అంటే ప్రభుత్వ సాయం కోరింది. ప్రజాప్రతినిధులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని వ్యాఖ్యానించింది. అభిశంసన ప్రక్రియపై నివేదించకుండా లేదా వ్యాఖ్యానించకుండా చర్యతీసుకోవచ్చని అటార్నీ జనరల్‌ సూచిస్తే సమస్య ఏమిటన్నది ప్రశ్న. ఇప్పటికే కుహనా లేదా నకిలీ వార్తల సాకుతూ జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేసేందుకు సమాచార, ప్రసారశాఖ ప్రయత్నించి నిరసనతో వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశంపై కూడా జర్నలిస్టులు మౌనం దాల్చితే రేపు ఏం జరిగినా ఆశ్చర్యం లేదు.

నేడు దేశంలో ఏ వ్యవస్ధా విమర్శకు అతీతంగా లేదు. ఏకంగా నలుగు సుప్రీం కోర్టు న్యాయమూర్తులే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీరుతెన్నులను తప్పుపడుతూ మీడియాకు ఎక్కిన తరువాత మీడియాను కట్టడి చేయటమంటే అది మీడియా స్వేచ్చను అడ్డుకోవటం తప్ప వేరు కాదు. రాజ్యాంగంలో న్యాయమూర్తులను తొలగించేందుకు అవకాశం వున్నపుడు, అవసరమని భావించినపుడు ప్రజాప్రతినిధులు దానిని వుపయోగించుకోవటం, మీడియాలో చర్చ జరగటం ప్రజాస్వామిక లక్షణం తప్ప వేరు కాదు. అటార్నీ జనరల్‌ సలహా కోరటమంటే ఇతరుల భుజాలమీద నుంచి కాల్చేందుకు చేసే యత్నమని అనుకొనే అవకాశం లేదా ? రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే ఆర్టికల్‌ 124(4) ఆర్టికల్‌ 125(5) మేరకు పార్లమెంట్‌ వుభయ సభలలో హాజరైన సభ్యులలో మూడింట రెండువంతులకు తక్కువ కాకుండా తీర్మానం ఆమోదించినపుడు, అదే సమావేశాలలో అధ్యక్షుడికి అందచేసినపుడు తొలగిస్తూ వుత్తరువు జారీ చేసినపుడు అమలులోకి వస్తుంది.

మన దేశంలో మీడియా స్వేచ్చను అడ్డుకొనేందుకు ఏ అవకాశం దొరికినా ఎవరూ వదలటం లేదు. అదే సమయంలో పలు సందర్భాలలో కోర్టులు దానిని కాపాడేందుకు చేస్తున్న కృషిని కూడా మరువలేము. ప్రతి వ్యవస్ధ అధికారంతో ప్రభావితమౌతున్న పూర్వరంగంలో మీడియా స్వేచ్చ విషయంలో ఎవరు అతీతంగా వుండగలరన్న ఆందోళన వ్యక్తం కావటం సహజం. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జయంత్‌ షా వ్యాపారలాభం ఇబ్బడి ముబ్బడిగా పెరగటంపై వార్తను ప్రచురించిన ‘వైర్‌’ వెబ్‌సైట్‌పై పరువు నష్టం కేసుదాఖలు చేసిన విషయం తెలిసినదే. ఈ కేసు విచారణ సందర్భంగా మీడియాను వార్తలు ప్రచురించకుండా కట్టడి చేయాలని జయంత్‌ షా తరఫున్యాయవాదులు చేసిన వినతిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా తిరస్కరిస్తూనే మీడియాను తీవ్రంగా విమర్శించారు. ఆధారం లేని వార్తలు ప్రచురిస్తున్నప్పటికీ వాటిని కట్టడి చేస్తూ వుత్తరువు జారీ చేయటం లేదన్నారు. తన అభిప్రాయాలను కొందరు విమర్శిస్తారని, తన తీర్పులు పత్రికా స్వేచ్చ పరిమితులను కుదించాయనే విమర్శలకు వాటికి పెద్ద తేడాలేదన్నారు.’ ఏమి రాయటానికైనా వారికి స్వేచ్చ వుందా ? వారు రాసినవి కొన్ని సందర్భాలలో పూర్తిగా కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయి. బుర్రలోకి ఏది వచ్చినా దానిని రాయటం జర్నలిజం సంస్కృతి కాదని, వారికి కొన్ని స్వంత వెబ్‌సైట్లు వున్నంత మాత్రాన దేన్నిబడితే దానిని వారు ప్రచురించరాదని అన్నారు. 2015లో జస్టిస్‌ మిశ్రా చారిత్రకంగా గౌరవనీయులైన వ్యక్తులపై విమర్శల జోలికి పోకుండా వుండేందుకు ప్రయత్నించాలని, భావ ప్రకటనా స్వేచ్చ, వ్యక్తీకరణకు పరిమితులు వుండాలన్నారు. మరొక కేసులో 2016లో ఆయన నాయకత్వంలోని బెంచ్‌ క్రిమినల్‌ డిఫమేషన్‌ చట్టాన్ని సమర్ధిస్తూ భావ ప్ర కటనా స్వేచ్చ కంటే కీర్తి ప్రతిష్టలు వున్నతమైనవని వ్యాఖ్యా నించింది. సినిమా హాళ్లలో జాతీయగీతాన్ని విధిగా వినిపించాలని, ఆ సందర్భంగా మినహాయింపులున్నవారు తప్ప ప్రతి ఒక్కరూ విధిగా లేచి నిలబడాలని తీర్పు నిచ్చింది కూడా మిశ్రాయే అన్న విషయం తెలిసిందే. ఏడాది తరువాత ఆ వుత్తరువును వుపసంహరించుకున్న అంశమూ ఎరిగినదే.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాను అభిశంసిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన తీర్మానాన్ని వుపరాష్ట్రపతి, రాజ్యసభ వుపాధ్యక్షుడు ఎం వెంకయ్య నాయుడు సోమవారం నాడు త్రోసిపుచ్చారు. తీర్మానంపై సంతకాలు చేసిన వారు తమ వాదనలను సమర్ధించుకొనేందుకు తగినన్ని వాస్తవాలను అందించలేకపోయారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ విలేకర్లతో మాట్లాడుతూ వుపరాష్ట్రపతి నిర్ణయం చట్టవిరుద్దమని, అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించటంపై సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. దీనిని విచారణకు తీసుకోవాలా తిరస్కరించాలా అనే అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని తాము కోరుకుంటున్నామని, కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని సిబల్‌ చెప్పారు. వుపరాష్ట్రపతి ఇంత వేగంగా తీర్మానంపై నిర్ణయం తీసుకోవటాన్ని తప్పుపడుతూ అసలు ఆయనకు తీర్మాన మంచి చెడ్డలను నిర్ణయించే, తిరస్కరించే అధికారమే లేదని, ఇచ్చిన తీర్మానం సరిగ్గా వుందా లేదా తగినంత మంది సంతకాలు చేశారా లేదా చేసిన సంతకాలు నిజమైనవా కాదా అని మాత్రమే నిర్ణయించేందుకు పరిమితం కావాలని సిబల్‌ చెప్పారు.

స్వతంత్ర భారత చరిత్రలో ఇంత వరకు ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీదనే అభిశంసన తీర్మానం వచ్చింది. అది కూడా వీగిపోయింది. తాజాగా దీపక్‌ మిశ్రామీద వచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ వుపాధ్యక్షుడు తిరస్కరించటంతో కొత్త సమస్య తలెత్తింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామస్వామి పంజాబ్‌-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1987నవంబరు 12 నుంచి 1989 అక్టోబరు ఆరువరకు పని చేసి తరువాత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినపుడు ఆయన నివాసం పేరుతో చేసిన దుబారా ఖర్చుల గురించి 1990లో మీడియా రాసింది.1991 ఫిబ్రవరి ఒకటిన సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఒక తీర్మానం చేస్తూ ఆయనను తొలగించాలని, ఎలాంటి న్యాయపరమైన పని అప్పగించవద్దని నాటి ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది. నాడు ప్రతిపక్షంలో వున్న బిజెపి, వామపక్ష పార్టీలు కలసి పార్లమెంట్‌కు ఒక అభిశంసన నోటీసు అందచేశాయి.లోక్‌సభ స్పీకర్‌ రబీరే నోటీసులోని ఆరోపణలపై విచారణకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి పిబి సావంత్‌, బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిడి దేశాయ్‌, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఓ చిన్నప్పరెడ్డితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రామస్వామిపై వచ్చిన 14లో 11ఆరోపణలు వాస్తవమే అని తేల్చారు. 1993 మే పదవ తేదీన లోక్‌సభ తీర్మానంపై చర్చ జరిపింది.ఓటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 196 ఓట్లు వచ్చాయి. వ్యతిరేక ఓట్లేమీ రాలేదుగానీ 205 మంది కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల సభ్యులు ఓటింగ్‌కు గైరు హాజరు కావటంతో తగినన్ని ఓట్లు లేక వీగిపోయింది. దీపక్‌ మిశ్రాపై ఇచ్చిన తీర్మానంపై ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటి తీర్మానాలపై చర్చ జరగకుండా మీడియాను కట్టడి చేయాలా లేదా అనే అంశంపై అటార్నీ జనరల్‌ ఏ అభిప్రాయం చెబుతారు, సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, అది మీడియా స్వేచ్చపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది యావత్‌ జర్నలిస్టులకే కాదు, మొత్తం సమాజానికి సంబంధించి అంశం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహాత్మా, మార్క్స్‌, అంబేద్కర్‌ సంస్కరణల ముసుగులో చట్టాల దుర్వినియోగంపై కర్తవ్యబోధ చేయండి !

09 Monday Apr 2018

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Ambedkar, Gandhi, Government Misuse of acts, Karl Marx

Image result for Gandhi, Karl Marx, Ambedkar

ఎం కోటేశ్వరరావు

కావేరీ జలాలపై ట్రిబ్యునల్‌ వేయాలంటూ వారాల తరబడి వేళ్ల మీద లెక్కించదగినంత మంది సృష్టించిన రభసను అనుమతించిన పాలకపార్టీ పార్లమెంటరీ వేదికలను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటాన్ని చూశాము. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా విషయంలో వాగ్దానభంగం, నమ్మించి మోసం చేసిన బిజెపిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకొనేందుకు పాలకపక్షం ప్రయోగించిన శిఖండి అన్నాడిఎంకె అన్నది ప్రతిఒక్కరికీ తెలిసిపోయింది. ప్రతి నలుగురిలో ఒకరుగా వున్న దళితులు, గిరిజనుల రక్షణకోసం వుద్దేశించిన అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందంటూ బిజెపి సర్కార్‌ సుప్రీం కోర్టుకు చెప్పటం, అది అందచేసిన సమాచారం, వాదనలకు అనుగుణంగా ఆ చట్టాన్ని నీరుగార్చే విధంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పటం తెలిసిందే. పార్లమెంట్‌లో వున్న దళిత, గిరిజన ఎంపీలు ఆ తీర్పుపై అప్పీలు చేయాలంటూ ఒక్క రోజు కాదు, కనీసం పది నిమిషాలపాటు సభను అడ్డుకొని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకుపోలేకపోయారన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయమిది. కావేరీ ట్రిబ్యునల్‌ పాటి కూడా ఈ అంశానికి ప్రాధాన్యత లేదని వారు భావించారా? బలహీనవర్గాలకు కొందరికైనా మేలు చేస్తున్న విద్య, వుద్యోగాల రిజర్వేషన్లను తొలగించాలన్న ప్రచారం, డిమాండ్‌ గతం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా వినిపిస్తున్న పూర్వరంగంలో కేవలం పది సంవత్సరాలకు పెట్టిన రిజర్వేషన్లు ఇంకెంతకాలం పొడిగిస్తారంటూ ఎవరైనా సవాలు చేస్తే పునరాలోచించాలని కోర్టులు తీర్పు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నోరు విప్పని వారు అప్పుడైనా తెరుస్తారని నమ్మటం ఎలా ? ఇలాంటి వారినా జనం గుడ్డిగా ఎన్నుకుంటున్నది, నమ్ముతున్నది అన్న మౌలిక ప్రశ్న ముందుకు వస్తోంది.

మహిళలు, దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచార దాడిని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని కొందరైనా గుర్తించారు. కార్యాచరణలో ఏప్రిల్‌ రెండవ తేదీ బంద్‌ ఒక చిన్న అడుగు మాత్రమే. దీన్ని ఎలా కొనసాగించాలన్నది ప్రశ్న. చట్టాల దుర్వినియోగం అనే అంశంలోకి లోతుగా వెళితే ఈ రెండు చట్టాలలో వుందని చెబుతున్న దుర్వినియోగం సముద్రంలో కాకి రెట్ట వంటిది. కార్యనిర్వాహక వ్యవస్ధ, తోటి సమాజం నిర్లక్ష్యం చేసినపుడు, పక్షపాతం చూపినపుడు నిస్సహాయులుగా వున్నవారు కసిగా ఫిర్యాదులు చేసి వుండవచ్చు. కొందరు నిర్దోషులు ఇబ్బందులు పడి వుండవచ్చు. అలాంటివి వేళ్ల మీద లెక్కించగలిగినవే. వాటిని సక్రమంగా విచారించి నిర్దోషులను రక్షించటానికి పోలీసు, న్యాయవ్యవస్ధలకు ఎలాంటి ఆటంకాలు లేవు. అవి తమ బాధ్యతను ‘దుర్వినియోగం’ చేయకుండా సక్రమంగా వ్యవహరించి, అసలు అలాంటి నేరాలకే తావులేని పరిస్ధితిని ఏర్పరచి వుంటే చట్టాల నామమాత్ర దుర్వినియోగ పరిస్ధితే తలెత్తి వుండేది కాదు. వేల మంది లలిత్‌ మోడీలు, విజయ మాల్యలు, నీరవ్‌ మోడీలు లక్షల కోట్లు స్వాహా చేసి కోట్లాది మందికి హాని చేసి పారిపోయినా సహించవచ్చుగానీ ఒక్క జింకను చంపిన వారిలో ఒక్కరిని కూడా వదల కూడదు అన్నట్లుగా వుంది పరిస్ధితి. చట్టాలు, వాటిని అమలు జరపాల్సిన వారు, పని తీరును పర్యవేక్షించేవారు సక్రమంగా పని చేసి, దుర్వినియోగం చేయకుండా వుంటే నేరగాళ్లు తప్పించుకొనేవారా ?

Image result for Gandhi, Karl Marx, Ambedkar

ఇక్కడ ప్రధాన సమస్య, ఆందోళనకరమైనది సక్రమంగా అమలు జరపాల్సిన అధికార యంత్రాంగం నూటికి నూరుశాతం దుర్వినియోగం, జనాల మీద దాడులకు వుపయోగిస్తున్న ఇతర చట్టాల మాటేమిటి? యావత్‌ శ్రామిక సమాజానికి జరుగుతున్న అన్యాయం మాటేమిటి? ఎవరైనా ఒక వ్యక్తి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే మరొక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ప్రభావితులౌతారు. సంస్కరణలనో మరొక పేరుతోనే అదే మొత్తం చట్టాన్ని దుర్వినియోగం చేస్తే, ఎసరుబెడితే జరిగే తీవ్ర నష్టం మాటేమిటి? వుదాహరణకు కార్మిక చట్టాలు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్ధలు సైతం వాటిని నీరుగార్చటం, వుల్లంఘించటంలో ఎలాంటి తేడా కనపడదు. అలాంటిది ప్రయివేటు రంగం సంగతి చెప్పాల్సిన పనేముంది. నరేంద్రమోడీ సర్కార్‌, బిజెపి ఇతర అనేక రాష్ట్రాల పాలకులు(వామపక్షాలు మినహా) సంస్కరణల పేరుతో చేస్తున్న మార్పులు కార్పొరేట్‌ యజమానులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చేస్తున్న దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. వీటి ద్వారా గోడదెబ్బ, చెంపదెబ్బ అన్నట్లు సామాజిక రక్షణ చట్టానికి తూట్లు పడి దళితులు, మొత్తంగా మహిళలు రెండు విధాలుగా నష్టపోవటం లేదా ? ఎగుమతుల పేరుతో సెజ్‌లకు కార్మిక చట్టాల అమలు మినహాయింపులు చట్టదుర్వినియోగమా కాదా ?

నయా వుదారవాద విధానాల పేరుతో అమలు జరుపుతున్న పెట్టుబడిదారీ విధానాలను కొంత మంది దళిత మేధావులతో సహా వామపక్ష భావజాలం లేని వారందరూ వూట సిద్ధాంతం పేరుతో సమర్ధించారు. దాని ప్రకారం సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు వూట మాదిరి సమాజం అంతటికీ దిగుతాయి. గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల అమలులో వూట ఎలా దిగింది? కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌- జివిఏ)లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6కు పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన వుత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటం కాదా? అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా వుద్యమించాల్సిన రోజులివి. ఈ పూర్వరంగంలో కార్పొరేట్లకు మరింత లబ్ది చేకూర్చేందుకు సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ అమలు జరప ప్రయత్నించిన వాటిని బిజెపి ఆచరించేందుకు పూనుకుంది. ఇది అధికార దుర్వినియోగం కాదా ? దీన్నెవరు ప్రశ్నించాలి, కోర్టు పరిభాషలో చెప్పాలంటే ఈ పరిస్ధితిని ఎలా సరిచెయ్యాలి?

బిజెపి పాలిత రాజస్ధాన్‌ కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా తయారైంది.అక్కడి పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి తిరిగి పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. యాంత్రీకరణ, రోబోల వినియోగం మరింతగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సవరణలు చేయటం అంటే అత్యధిక ఫ్యాక్టరీలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తొలగించటమే. అలాంటపుడు కనీసవేతనాలను సవరించినా వుపయోగం ఏముంది? ప్రభుత్వం యజమానులు ఏం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతిచ్చే చర్యలకు ముద్దుగా ‘సంస్కరణలు’ అని పేరు పెట్టింది. శాశ్వత స్వభావం వున్న పరిశ్రమలలో కూడా కాంట్రాక్టు కార్మికులను అనుమతించటాన్ని ఏమనాలి. ఒక సంస్ధలో సిబ్బందిని రిట్రెంచ్‌ లేదా లే ఆఫ్‌ చేయాలన్నా గతంలో ప్రభుత్వ అనుమతి అవసరం, ఇప్పుడు యజమాని చిత్తానికి వదలివేశారు.డెబ్బయిశాతం పరిశ్రమలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తప్పించారు. తనిఖీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే సాకుతో లేబర్‌ అధికారుల తనిఖీలపై సవాలక్ష ఆంక్షలు విధించి ఆచరణలో లేకుండా చేశారు. పేరుకు కార్మికశాఖ అయినా అది యజమానుల సేవలో మునిగి తేలుతుందని, కార్మిక చట్టాల అమలు కంటే వుల్లంఘనే ఎక్కువ అన్నది కార్మికులకు తెలిసిన నగ్నసత్యం.

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. ఇది చట్టదుర్వినియోగం గాక మరేమిటి? ఈ దుర్వినియోగం వెనుక రాజ్యంలోని అన్ని విభాగాలు లేవా ? చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన ఘనత బిజెపి ఖాతాలో చేరింది. ఇది దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది.

ప్రపంచవ్యాపితంగా ధనిక దేశాలన్నింటా అప్రెంటిస్‌షిప్‌(నైపుణ్య శిక్షణ) పేరుతో పెద్ద ఎత్తున పర్మనెంటు కార్మికుల స్ధానంలో కార్మిక చట్టాల పరిధిలో లేని కార్మికులను నియమిస్తున్నారు. వారికి తక్కువ వేతనాలు, అలవెన్సులు చెల్లించేందుకు ఇదొక దొంగదారి అన్నది తెలిసిందే. మన దేశంలో కూడా అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించి శిక్షణలో వున్న వారు చేయకూడని పనులను కూడా వారితో చేయించేందుకు, పెద్ద ఎత్తున నియామకానికి తెరతీశారు. శిక్షణా కాలంలో అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేవిధంగా పధకాలు సిద్దం చేశారు. ఇది యజమానులకు మరొక అదనపు రాయితీ. ఇలా కార్మికవర్గం, అన్ని తరగతుల వారు గుర్తించాల్సిన, గళమెత్తాల్సిన దుర్వినియోగాలు ఇంకా చాలా వున్నాయి.

స్వాతంత్య్ర వుద్యమ వారసత్వంతో ఏమాత్రం సంబంధం లేని, బ్రిటీష్‌ వారికి లంగిపోయిన భావజాలంతో పని చేసే శక్తుల ఆధిపత్యంలోకి తొలిసారిగా పూర్తిగా మనపాలనా వ్యవస్ధ పోయింది. మహాత్ముడు కన్న కలలు కల్లయ్యాయి. ఆయన వారసులుగా బయలు దేరిన వారు వేరే గాంధీల విధేయులమని చెబుతున్నారు తప్ప అసలు గాంధీని విస్మరించారు. అలాంటి వారిని కనీసం ఒక్కసారి చూసేందుకు కూడా మహాత్మా గాంధీ మనస్కరించరు. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా మహాత్ముడిపట్ల భక్తిని ప్రదర్శిస్తూనే ఆయనను హత్య చేసిన వాడికి జేజేలు పలికే శక్తులు గాంధీ ప్రవచించిన అహింసను, మతసామరస్యాన్ని ఏడునిలువులలోతున పాతిపెట్టి హింసో పరమ ధర్మ: అన్నట్లుగా చెలరేగిపోతున్నాయి. మనుషుల కంటే ఆవు రక్షణ ముఖ్యం అంటూ మనుషుల ప్రాణాలను తీస్తున్నవారిని కాపాడుతున్న రాజ్యం నడుస్తోంది. సాంఘిక, సామాజిక న్యాయం గురించి ఆశపడిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఒక్కసారి వెనక్కు వచ్చి చూస్తే హతాశుడౌతారు. తన అధ్యక్షతన జరిగిన రాజ్యాంగరచన, దాని స్ఫూర్తి, నిబంధనలకు అనుగుణ్యంగా ఆమోదించిన అనేక ప్రజానుకూల చట్టాలకు తూట్లుపొడిచే ప్రయత్నాలను,మనువాదాన్ని మరో రూపంలో తీసుకువచ్చే తీవ్ర యత్నాలను చూసి సంఘటితపడమని మరో పిలుపు ఇవ్వకపోడు. దోపిడీ రహిత సమాజం కోసం తాను ప్రతిపాదించిన దోపిడీ రహిత సమాజం కోసం పోరాడే కార్మికవర్గాన్ని, వారికి వెన్నుదన్నుగా నిలిచే రాజకీయశక్తులను పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైపైకి అంటూ తన స్నేహితుడు ఎంగెల్స్‌తో కలసి కారల్‌ మార్క్స్‌ సందేశమిస్తూనే వుంటాడు. కార్మికుల రక్షణకోసం చేసిన చట్టాల రూపు మార్చి వాటిని యజమానుల ఆయుధాలుగా మారుస్తున్న వారిని కూలదోస్తే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని నిస్సంకోచంగా చెబుతాడు. అందుకే ముగ్గురూ వచ్చి కార్యాచరణ కర్తవ్యబోధ చేయాలని యావత్‌జాతి కోరుతోందంటే అతిశయోక్తి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లోక్‌సభ ముందస్తు ఎన్నికలను ముందుకు తెచ్చే గుజరాత్‌ విజయం ?

19 Tuesday Dec 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress party, gujarat election verdict, lok sabha midterm polls, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎలాగైతేనేం అక్కడ మా మోడీ విజయం సాధించాడా లేదా అని బుర్రలో గాక మరెక్కడో మెదళ్లున్నవారు చేసే వాదనలు పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే అలాంటి అలగా తరగతి ఎప్పుడూ అన్ని పాలకవర్గ పార్టీల వెనుకా వుంటుంది. ఇలాంటి వారు నిజంగా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే శక్తులకు వుత్తేజమిస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే, విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి బ్యాంకు ఖాతాల్లో తలా పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో జనాన్ని నమ్మించారు. ఇదేమిటయ్యా అమిత్‌ షా అని ఎన్నికల తరువాత అడిగితే ఎన్నికల జుమ్లా , ఓట్ల కోసం అనేకం చెబుతుంటాం అని చిరునవ్వు నవ్వేశాడు. గుజరాత్‌లో ఈసారి తమకు 150 సీట్లు వస్తాయని ఆ పెద్దమనిషే ప్రచారం చేశాడు. అవెక్కడ అంటే జుమ్లా అని మరోసారి నవ్వేస్తారు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని గంటల పాటు బిజెపి నేతలకు ముచ్చెమటలు పట్టాయి.

సంఘపరివార్‌ ప్రయోగశాల గుజరాత్‌. గత రెండు దశాబ్దాలుగా మైనారిటీల వ్యతిరేక, మెజారిటీ అనుకూల మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును తయారు చేసేందుకు అది చేయని అవాంచనీయ చర్యలు లేవు.అలాంటి చోట కూడా బిజెపి చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా స్వల్పమెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. సమగ్ర విశ్లేషణలకు సమాచారం ఇంకా అందుబాటులోకి రావాల్సి వుంది. పూర్తిగా పట్టణ లేదా లేదా అత్యధిక భాగం పట్టణ ఓటర్లున్న 53 నియోజకవర్గాలలో బిజెపి 45చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 129 గ్రామీణ నియోజకవర్గాలలో 72 చోట్ల గెలిచింది. మతోన్మాదం పట్టణాలలో ఎక్కినంతగా గ్రామీణంలో ఎక్కదని, ఎక్కినా వ్యవసాయ సంక్షోభంలో తమకు మతం వండి వార్చేదేమీ వుండదని గ్రామీణులు గ్రహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక మంచి సంకేతం. పట్టణ ప్రాంతాలలో కూడా బిజెపి సీట్లు తెచ్చుకున్నప్పటికీ దాని ఓట్లు 2014తో పోల్చితే పదకొండు శాతం వరకు తగ్గాయి. ఈ పరిణామం కూడా బిజెపి ఆందోళన కలిగించేదే. మొత్తం మీద చూసినపుడు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే బిజెపి ఓట్లు 10.2 నుంచి 10.9 మధ్య తగ్గగా ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓట్లు 6.2 నుంచి 10.8శాతం వరకు పెరిగాయి. అంటే బిజెపికి తగ్గిన ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కు పడలేదు.

ఒక నమూనా రాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకున్న చోటే నరేంద్రమోడీ ఆ విషయం మినహా మిగతా విషయాలన్నీ ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌ నేత నీచ్‌ కిసామ్‌కా ఆద్మీ( నీచపు పనులు చేసే వ్యక్తి) అని చేసిన వ్యాఖ్యకు కాళిదాసు కవిత్వానికి తన పైత్యాన్ని జోడించినట్లుగా గుజరాత్‌లో అత్యధికంగా చదివే గుజరాత్‌ సమాచార్‌ పత్రిక ‘మోడీ నీచ్‌ జాతినో మానాస్‌ ఛే (ఒక తక్కువ కులంలో పుట్టిన మోడీ) అన్నట్లుగా కులాన్ని, మోడీ పేరును జతచేసి మొదటి పేజీలో సంచలనాత్మకంగా ప్రకటించి చివరి క్షణంలో బిజెపికి మేలు చేసింది. కీలక సమయాల్లో మీడియా ఎలాంటి పాత్ర పోషించగలదో ఈ ఎన్నికలు నిరూపించాయి. బిజెపి, మోడీ మీద కోపంతో ఓటర్లు మరొక ప్రత్యామ్నాయం లేదు కనుక కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు తప్ప నిజానికి కాంగ్రెస్‌ మీద అభిమానం కలగటానికి ఒక ప్రతిపక్షంగా గత రెండు దశాబ్దాలలో అక్కడ అది చేసిందేమీ లేదు. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు ఎలా వుంటాయి అన్నది చర్చనీయాంశంగా ముందుకు వస్తోంది.

బిజెపికి పోటీగా మరో పార్టీలేని చోట్ల తమవైపు తిరిగి ఓటర్లు మొగ్గుతారని కాంగ్రెస్‌లో ఆశలు రేగుతాయి. అనేక పార్టీలున్న చోట్ల ఎవరికి వారే తామే ప్రత్యామ్నాయంగా ఓటర్ల ముందుకు వచ్చేందుకు కాంగ్రెసేతర పార్టీలు పోటీ పడతాయి. కాంగ్రెస్‌ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా వున్న చోట్ల ఆప్‌, బిఎస్‌పి వంటి పార్టీలు దెబ్బతింటాయి. ఓటర్లు తమకు ఇష్టం వున్నా లేకపోయినా బిజెపిపై తలెత్తిన అసంతృప్తితో నిఖరంగా ఆ పార్టీని ఓడించగల శక్తివైపే మొగ్గు చూపవచ్చు.ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న చోట్ల కాంగ్రెస్‌ పరిస్ధితి ఇప్పుడున్న మాదిరే వుండవచ్చు లేదా దిగజారవచ్చు. అటు కాంగ్రెస్‌ లేదా బిజెపి బలంగా లేని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల ఇప్పటి వరకు బిజెపితో అంటకాగిన లేదా బిజెపి పంచన చేరాలని చూస్తున్న పార్టీలలో పునరాలోచన మరింత తీవ్రంగా జరగవచ్చు. ప్రాంతీయ పార్టీలను మింగి తాను ఎదగాలని బిజెపి చూస్తున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల గుజరాత్‌ ఫలితాలు బిజెపిని ఇరుకున పెడతాయి.శివసేన, తెలుగుదేశం వంటి పార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగుతాయి, సమయం వచ్చినపుడు, వాటంగా వుంటే బిజెపిని వదలిపోయినా ఆశ్చర్యం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తాను బలపడేందుకు అటు తెలుగుదేశం, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏది వాటంగా వుంటే దానితో వుండేందుకు గల అవకాశాలను చూస్తున్నది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను నిరాకరించిన బిజెపి దాని కంటే మెరుగైన ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పి దానికి కూడా మొండి చేయి చూపింది. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి అటు తెలుగుదేశం పార్టీ ఇటు బిజెపి ఎవరి నాటకాన్ని వారు బాగారక్తి కట్టిస్తున్నారు. ఒక వేళ బిజెపి తో తెగతెంపులు చేసుకొంటే రాష్ట్రానికి బిజెపి చేసిన ఈ ద్రోహాలను జనం ముందు పెట్టి తెలుగుదేశం ఒంటి కంటితో( ఎందుకంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం ప్రకారం మరో కన్ను తెలంగాణా కనుక ఆయనకు మిగిలింది మరొకటి మాత్రమే అనే అవగాహనతో) ఏకధారగా నీరు గార్చి ఓటర్ల ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకొని ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆలోచన చేస్తున్నారన్నది బలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే గుజరాత్‌ ఫలితాలు జగన్‌లో ముఖ్యమంత్రి పీఠంపై మరింతగా ఆశలు పెంచవచ్చు. ఒక ప్రతిపక్షంగా విఫలమైనప్పటికీ గుజరాత్‌ ఓటర్లు బిజెపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రధాన ప్రతిపక్షం తామే గనుక తమ మీద ఇష్టం వున్నా లేకపోయినా చంద్రబాబు మీద వ్యతిరేకతతో జనం ఓట్లు వేస్తారనే ఆశలు కలగవచ్చు.

ఇక బిజెపి విషయానికి వస్తే అన్ని పార్టీల కంటే గుజరాత్‌లో గెలిచిన సంతోషం కంటే దాని పర్యవసానాల గురించి ఆందోళన పెరగటం ఖాయం. పార్టీలో నరేంద్రమోడీ ఏకపక్ష వైఖరితో ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న శక్తులు మరింతగా దాడిని పెంచుతాయా లేక మొదటికే మోసం వస్తే ఎలా అని సర్దుబాటు చేసుకుంటాయా అన్నది ఒక అంశం. అధికారమే పరమావధిగా వుండే పాలకపార్టీలలో అత్యధిక సందర్భాలలో బాధితులు రాజీపడిన సందర్భాలు తక్కువ. గ్రామీణుల ఆదాయాలను రెట్టింపు చేసి అదనంగా అన్న వస్త్రాలను అంద చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ విధానాలు వున్న వస్త్రాలను కూడా లాగివేస్తున్నాయి. లోకసభ ఎన్నికల నిర్దిష్ట గడువు వరకు పరిస్ధితి ఇలాగే వుంటే పట్టణ ప్రాంతాలతో పాటు అంతకంటే ఎక్కువగా గ్రామీణంలో బిజెపి వ్యతిరేకత పెరగటం అనివార్యం.

బిజెపి లేదా కాంగ్రెస్‌ గానీ ప్రజావ్యతిరేక, ద్రవ్యపెట్టుబడిదారీ అనుకూల, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యసంస్ధ ఆదేశిత విధానాల అమలులో తక్షణమే వెనక్కు తిరిగి రాలేనంతగా కూరుకుపోయాయి. వాటిని మరింత వేగంగా, ఎక్కువగా అమలు జరపాలనే వత్తిడి పెరుగుతోంది. అదే జరిగితే గ్రామీణ వ్యవస్ధ మరింత తీవ్ర సంక్షోభానికి గురి కావటం అనివార్యం. నరేంద్రమోడీ విషయానికి వస్తే తాను ప్రజలకు చేసిన వాగ్దానాలకంటే పైన చెప్పుకున్న శక్తుల విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా రూపొందించే సులభతర వాణిజ్య ర్యాంకులో మోడీ సర్కార్‌ ఏకంగా 130 నుంచి వందవ స్ధానానికి ఎగబాకింది. ప్రపంచ ధనిక దేశాలలో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సంక్షోభం 2018లో పదవ సంవత్సరంలో ప్రవేశించనుం ది. అది ఎప్పటికి పరిష్కారం అవుతుందో, కనీసం సంక్షోభ పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు వస్తుందో తెలియని స్ధితి. దాని పర్యవసానాలు మన ఆర్ధిక వ్యవస్ధపై బలంగా పడే సమయంలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. గత మూడున్నర సంవత్సరాలలో వుత్పాదక, ఎగుమతి రంగాలలో దిగజారుడు ఆ సంక్షోభపర్యవసానాలే. అయితే చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో దిగుమతుల బిల్లు తగ్గిపోయి జనానికి పెద్దగా నొప్పి కలగలేదు. గత కొద్ది నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి, రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని జోశ్యం చెబుతున్నారు. ఇప్పటికే లీటరుకు పది రూపాయలకు పైగా ధరలు పెరిగాయి, కిరోసిన్‌, గ్యాస్‌ సబ్సిడీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఇప్పటి మాదిరే వున్నప్పటికీ మన దిగుమతుల బిల్లు పెరిగిపోయి, దానిని సర్దుబాటు చేసేందుకు వ్యవసాయ రంగానికి, ఇతర సంక్షేమ చర్యలకు ఇస్తున్న సబ్సిడీలను మరింతగా కోత పెట్టటం, లేదా పన్ను భారాలను పెంచటం మినహా మరొక దగ్గరదారి లేదు. వీటన్నింటినీ చూసినపుడు ఏం చేసినా అది మోడీ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. అందువలన గడువుకు ముందే ముందస్తున్న ఎన్నికలకు పోతారని గత కొంతకాలంగా వినవస్తున్నది. గుజరాత్‌లో భారీ మెజారిటీతో గెలిస్తే దాన్ని చూపి దేశమంతటా ప్రచారం చేసేందుకు ముందుస్తున్న ఎన్నికలకు పోతారని ముందుగానే పండితులు అంచనాలు వేశారు. ఇప్పుడు గెలిచినా దాన్ని పెద్దగా చెప్పుకొని సంబర పడే స్దితి లేదు.వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ఘర్‌ బిజెపి పాలితం కాగా కర్ణాటక కాంగ్రెస్‌, త్రిపుర సిపిఎం ఏలుబడిలో వున్నాయి. వాటి ఫలితాలు కూడా లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైతే అది రాజకీయంగా బిజెపికి నష్టం. ఇది కూడా ముందస్తు ఎన్నికలను ముందుకు తెస్తుందనే చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేటింగ్స్‌ కోసం మోడీ సర్కార్‌ పైరవీలు జరిపిందా ?

18 Saturday Nov 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP’s trolling army, India economy, india ratings, moody’s india ratings, Narendra Modi, narendra modi bhakts

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి నేతలు జరిపిన విదేశీయాత్రలు, అందుకు అయిన విమానఖర్చుల మేరకు కూడా వారు విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులను సమీకరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మోడీ విదేశీ పర్యటనలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో విమర్శకుల నోరు మూయించేందుకు వారికి ఒక అస్త్రం దొరికింది. గత పదమూడు సంవత్సరాలుగా మన స్ధానాన్ని చెత్త రేటింగ్‌ ఎగువన, పెట్టుబడి రేటింగ్‌కు దిగువున వుంచిన మూడీస్‌ అనే అమెరికా సంస్ధ దేశ ఆర్ధిక రేటింగ్‌ను ఒక మెట్టు పైకి పెంచింది. కొద్ది రోజుల క్రితం అదే అమెరికాకు చెందిన ప్యూ అనే సంస్ధ విడుదల చేసిన సర్వేలో కాస్త పలుకుబడి తగ్గినప్పటికీ ఇప్పటికీ నరేంద్రమోడీయే తిరుగులేని నాయకుడిగా వున్నాడని తేలిందని పేర్కొన్నారు.(ఆ సర్వే తొమ్మిదినెలల క్రితం చేసింది, ఇప్పుడు ఎందుకు విడుదల చేశారన్నది ఒక ప్రశ్న) వాణిజ్య సులభతర సూచికలో గతేడాది కంటే ఏకంగా 30పాయింట్లు తగ్గి ఎగువకు చేరింది. ఇప్పుడు మూడీస్‌ బూస్ట్‌ ఈజ్‌ద సీక్రెట్‌ ఆఫ్‌ అవర్‌ ఎనర్జీ అన్నట్లు దేశవ్యాపితంగా బిజెపి శ్రేణులు,నేతలు గంతులు వేస్తున్నాయి. దానికి వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ ఎన్నికలలో ప్రచారానికి వీటిని వుపయోగించుకొని బయటపడగలమనే సంతోషమే కారణం. అయితే వీటి ప్రభావం ఎంత మేరకు వుంటుందన్నది ప్రశ్నార్ధకమే. ఒక వేళ మోడీ-అమిత్‌ షా రేటింగ్‌ను ఓట్ల కోసం వాడితే మిగతా రెండు సంస్ధల మాటేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా వూరుకుంటాయా? తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక చక్కటి డైలాగ్‌ వుంది. నేను నియోగిని ఎలా కావాలంటే అలా వినియోగపడతాను అంటాడు రామకృష్ణ(నిజానికి ఆ కవి అలాంటి వాడో కాదో తెలియదు) భజన మీడియా మాత్రం అలాంటిదే. కనుక దాని చిత్రణ చూసి గంతులేస్తే గోతిలో పడతారు. ఇప్పటికీ కాస్త విమర్శనాత్మకంగా చూసే విశ్లేషకులు ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులేయాల్సినంతగా తాజా రేటింగ్‌లో ఏముందంటున్నారు.

మూడీస్‌ సంస్ధ రేటింగ్‌ చరిత్రలోకి వెళితే బిజెపి భజన బృందాలకు కాస్త ఇబ్బందేమరి. ఎందుకంటే తమ నేత వాజ్‌పేయి కాలంలో దేశం వెలిగిపోయిందని చెప్పుకున్న కాలంలో కూడా మన రేటింగ్‌ అధ్వాన్నంగానే వుంది మరి. పెట్టుబడిదారులు, భూస్వాములకు లబ్ది చేకూర్చేందుకు మన పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వళ్లు వంచి ఎంతో కష్టపడుతున్నారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలతో బంధం ముడిపడిన తరువాత చేపట్టిన చర్యలకు సంస్కరణలు అని పేరు పెట్టారు. ప్రధానులుగా పని చేసిన వారిలో నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి తెచ్చుకున్న రాజీవ్‌ గాంధీ పాలనలో మూడీస్‌ సంస్ధ మన దేశానికి పెట్టుబడిలో ఆరవ ర్యాంకు(1988) ఇచ్చింది. విపిసింగ్‌ ఎనిమిది(1990) చంద్రశేఖర్‌ పది(1991) పివి నరసింహారావు పాలనలో పెట్టుబడేతర చెత్త రాంకులు పదకొండులో రెండోది(1991), ఆయన పాలనలోనే 1994లో పెట్టుబడిలో పదవరాంకు తరువాత దేవెగౌడ పాలనలో 1998లో కూడా దాన్నే కొనసాగించింది. అదే ఏడాది వాజ్‌పేయి అధికారానికి వచ్చిన తరువాత తిరిగి రెండవ చెత్త రాంకులోకి దిగజారింది. తరువాత ఒకటవ చెత్త రాంకులోకి, తరువాత 2004లో పెట్టుబడిపదవ రాంకులోకి పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో అదే కొనసాగి ఇప్పుడు నరేంద్రమోడీ మూడున్నర ఏండ్ల తరువాత పదినుంచి తొమ్మిదవ రాంకులోకి పెంచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వాజ్‌పేయి హయాంలో చెత్తకు అటూ ఇటూగా వున్నందుకే తమ పాలనలో దేశం వెలిగిపోయిందంటూ బిజెపి వారు పెద్ద ఎత్తున వందల కోట్లతో ప్రచారానికి తెరతీసి జనం ముందుకు వచ్చి బక్కబోర్లా పడిన విషయాన్ని మరచి పోకూడదు. అందువలన ఈ మాత్రానికే మోడీ పరివారం పండగ చేసుకోవాలా అని కొందరు అంటున్నారు.

పిల్లి ఏ రంగుదని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా సంస్కరణలు ఏ ప్రధాని ఎలా అమలు జరిపారన్నది కాదు, దాని వలన జనానికి ఒరిగిందేమిటి అన్నదే గీటురాయి. రేటింగ్‌లో మార్పు కోసం నరేంద్రమోడీ సర్కార్‌ తెగతాపత్రయ పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా చివరకు పైరవీలకు ప్రయత్నించి విఫలమైందని రాయిటర్స్‌ సంస్ధhttps://in.reuters.com/article/india-ratings-moody-s/exclusive-how-india-lobbied-moodys-for-ratings-upgrade-but-failed-idINKBN14E09A   గతేడాది డిసెంబరు 25న ఒక వార్తను ప్రచురించింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ కూడా అదే పని చేసి భంగపడిందని వార్తలు వెలువడ్డాయి.

రాయిటర్స్‌ కథన సారాంశం ఇలా వుంది. మూడీస్‌ రేటింగ్‌ పద్దతులను భారత్‌ విమర్శించింది. రేటింగ్‌ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సంబంధిత పత్రాలలో రాయిటర్స్‌ గమనించింది, అయితే దుర్బలంగా వున్న బ్యాంకుల తీరుతెన్నులను ఎత్తి చూపుతూ వత్తిడికి లంగేందుకు అమెరికా సంస్ధ తిరస్కరించింది. అధికారానికి వచ్చిన నాటి నుంచి పెట్టుబడులను పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు, ద్రవ్య,కరెంట్‌ ఖాతాలోటు తేడాను తగ్గించేందుకు నరేంద్రమోడీ చర్యలు తీసుకున్నారు.అయితే ఇంకా చర్యలు తీసుకోవాలని మూడు రేటింగ్‌ సంస్దలు కోరాయి. ఆర్ధిక మంత్రిత్వశాఖ-మూడీస్‌ మధ్య నడిచిన వుత్తర ప్రత్యుత్తరాలలో రుణభారం,136బిలియన్‌ డాలర్ల విలువగల బ్యాంకుల పారుబాకీల గురించి రేటింగ్‌ సంస్ధలకు భరోసా ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు వెల్లడైంది. అక్టోబరులో రాసిన లేఖలు, ఇమెయిల్స్‌లో మూడీస్‌ సంస్ధ లెక్కలు కట్టే విధానాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్నంతా ఆశావహంగా రుణభార సమస్య లేదని, బ్యాంకుల తీరు ఆందోళన కలిగిస్తోందని మూడీస్‌ అ వాదనలను తిరస్కరించింది. రేటింగ్‌ సంస్ధలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసాధారణంగా వుందని, రేటింగ్‌ ఏజన్సీలపై వత్తిడి చేయలేమని ఆర్ధికశాఖ మాజీ అధికారి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు. బిఏఏ రేటింగ్‌ వున్న దేశాల జీడిపిలో ఆదాయం 21.7శాతం మీడియన్‌(మధ్యరేఖ) కాగా భారత్‌లో 21శాతమే వుందని అందువలన మూడీస్‌ సంస్ధ పెట్టుబడులలో కనిష్ట రేటింగ్‌ ఇచ్చింది. రేటింగ్‌ ఎక్కువ వున్న దేశంలో రుణాలు పొందటానికి అయ్యే వ్యయం తక్కువగా వుంటుంది కనుక పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తారు. దేశంలో వచ్చే ఆదాయంలో ఐదోవంతుకు పైగా అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతోంది.

అక్టోబరు నెలలో మూడీస్‌ ప్రతినిధికి పంపిన ఇమెయిల్‌లో సంస్ధ రేటింగ్‌ పద్దతిని మోడీ ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జపాన్‌, పోర్చుగల్‌ వంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధల కంటే రెట్టింపు రుణభారం కలిగి వున్నప్పటికీ మెరుగైన రేటింగ్‌ ఇచ్చారని పేర్కొన్నది.2004 తరువాత భారత రుణభారం గణనీయంగా తగ్గినప్పటికీ రేటింగ్స్‌లో అది ప్రతిబింబించలేదని, విదేశీమారక ద్రవ్య నిల్వలు మెరుగ్గా వుండటం, ఆర్ధిక పురోగతిని కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని అభ్యంతరం తెలిపింది. దానికి మూడీస్‌ ప్రతినిధి వెంటనే సమాధానమిస్తూ భారత్‌తో సమాన రేటింగ్‌ వున్న దేశాలతో పోల్చితే రుణభారం ఎక్కువగా వుందని, అదే సమయంలో రుణాన్ని భరించగల స్ధితి కూడా తక్కువగా వుందని పేర్కొన్నారు.బ్యాంకుల పారుబాకీల సమస్య సమీప భవిష్యత్‌లో పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపించటం లేదని పేర్కొన్నారు. సానుకూల వైఖరి కనిపిస్తున్నప్పటికీ గతంలో ఇచ్చిన బిఏఏఏ3 రేటింగ్‌ను మార్చే అవకాశం లేదని గ్రేడ్‌ పెంచే పరిస్ధితులు లేవని నవంబరు 16న మూడీస్‌ తెలిపింది.’

1980దశకం నాటి స్ధాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రేటింగ్‌ పెంచిన కారణంగా తక్కువ వ్యయ్యంతో విదేశాలలో భారత్‌ నిధులు తెచ్చుకొనే అవకాశాలు పెరుగుతాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే మిగతా రెండు ప్రధాన రేటింగ్‌ సంస్ధలైన్‌ ఎస్‌అండ్‌పి, ఫిచ్‌కూడా రేటింగ్‌ పెంచితేనే అది సాధ్యం అవుతుంది. అవి కూడా వెంటనే ఆ పని చేయకపోతే మూడీస్‌ చర్యను అంతర్జాతీయ పెట్టుబడిదారులు అనుమానించే అవకాశం వుంది. అదే జరిగితే రేటింగ్‌ను తగ్గించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండవది ఈ రేటింగ్‌ను నిలుపుకొనే విధంగా ప్రభుత్వ చర్యల్లేకపోయినా తిరిగి తగ్గించే అవకాశాలు లేకపోలేదు. రేటింగ్‌ మెరుగ్గా లేకపోయినప్పటికీ దానితో నిమిత్తం లేకుండానే గత పద మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులు కొంత మేరకు పెరిగాయి. దానికి తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే అని మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోడీ ఎవరికి వారు చెప్పుకోవటం సహజం. అయితే ఇప్పుడు ఈ రేటింగ్‌తో అదనంగా వచ్చేదేమిటి అన్నది ఒక ప్రశ్న. రేటింగ్‌ మెరుగైన కారణంగా ఇంకా విదేశీ నిధులు వచ్చిపడితే జరిగేదేమిటి? ఒకటి నిధులు, రుణాల వ్యయం తగ్గటం ఒక సానుకూల అంశం. ధనిక దేశాల బ్యాంకులలో మన కంటే వడ్డీరేట్లు మరీ తక్కువగా వున్నాయి. వాటితోపోల్చితే మన దగ్గర ఎక్కువ. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన హామీ వుంటే విదేశీ సంస్ధలు ముందుకు వస్తాయి.

అదే సమయంలో విదేశీ నిధుల ప్రవాహం మన రూపాయి విలువపై ప్రభావం చూపటం అనివార్యం. ఇప్పటికే రూపాయి విలువ పెరిగిన కారణంగా ఎగుమతిదార్లు పోటీని ఎదుర్కోలేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రూపాయి విలువ ఇంకా పెరిగితే ఎగుమతులు మరింతగా పడిపోతాయి. వాణిజ్యలోటు పెరుగుతుంది. ఆ ప్రభావం మన కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రేటింగ్‌ వార్త వెలువడిన శుక్రవారం నాడు 30పైసల మేరకు విలువ పెరిగింది. అయితే రూపాయి విలువ ఎంత పెరిగితే ఆ మేరకు చమురు ధరలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలు, ప్రభావాల గురించి అనేక అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ రేటింగ్‌తో నిమిత్తం లేకుండానే విదేశీ నిధులు ఇప్పటికే వచ్చినందున రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం వుంటుందో చూడాల్సి వుంది.

ఒకటి మాత్రం స్పష్టం. ఏదో ఒక పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై పూర్తిగా సబ్సిడి ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై ఎత్తివేత క్రమంగా అమలు జరుగుతోంది. ఇలాంటి చర్యలు ద్రవ్యలోటును ఎంత మేరకు పూడ్చగలవనేది చూడాల్సి వుంది. నోట్ల రద్దు ద్వారా మూడు లక్షల కోట్ల మేరకు లబ్ది చేకూరుతుందన్న అంచనాలు పోయి నష్టాలు మిగిలాయి. దీనికి తోడు బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చేందుకు ప్రభుత్వం 2.11లక్షల కోట్లను కేటాయించాల్సి వుంది. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వాన్ని పాలక ఎన్‌డిఏ కూటమి, దానితో జతకట్టాలని వుబలాటపడుతున్నవారికి ఆందోళన కలిగించే అంశం పెరుగుతున్న చమురు ధరలు. ఇప్పటికే 60డాలర్లున్న పీపా ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందనే జోస్యాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రేటింగ్‌ ప్రయోజనాలన్నీ ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయి. చమురు ధరల పెరుగుదల పర్యవసానాలను మోడీ సర్కార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న. భారం మొత్తాన్ని జనంపై మోపితే ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానితో సంబంధం వున్న వేతనాలు,భత్యాల వంటివి పెరగాల్సి వుంది.

దేశాల రేటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలలో ఆ దేశాల రుణభారం ఒకటి. మన పొరుగునే వున్న చైనా జిడిపి వంద రూపాయలనుకుంటే దాని అప్పులు 43, అదే మన దేశానికి వస్తే 68 రూపాయలుగా వుంది. మన వంటి రేటింగ్‌ వున్న దేశాల మీడియన్‌ 44 మాత్రమే. అమెరికా, బ్రిటన్‌లకు 70శాతం వుంది. ఆ దేశాలకు అంత అప్పు వున్నప్పటికీ వాటికి తీర్చే సత్తా కూడా వుంది. మన పరిస్ధితి అది కాదు.ఎస్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ధ మన దేశ అప్పు దామాషా 60లోపుగా వుండాలని షరతు లాంటి వత్తిడి చేస్తోంది. రేటింగ్‌ పెంపుదల కోసం మూడీస్‌ సంస్ధతో మోడీ సర్కార్‌ లాబీయింగ్‌(పైరవీ) చేసిందని చెప్పిన రాయిటర్స్‌ మరో అమెరికన్‌ సంస్ధ ఎస్‌ అండ్‌ పి, బ్రిటన్‌ కంపెనీ ఫిచ్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మూడీస్‌ చేసిన సవరణను మిగతా రెండు సంస్ధలు కూడా అనుసరిస్తాయా? అది తేలేంత వరకు మోడీ భక్తులకు బిపి పెరగటం ఖాయం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తూటాలు గౌరీ లంకేష్‌ దేహాన్నే కానీ భావాలను తాకలేవు !

13 Wednesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, Left politics, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

attack on journalists, BJP's social media, dissent, Gouri lankesh, RSS

ఎం కోటేశ్వరరావు

మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాల వ్యతిరేక పోరులో హేతువాద, వామపక్ష వాదిగా గళమెత్తి, కలంతో కదనరంగంలోకి దూకిన షీరో(వీర నారి) జర్నలిస్టు గౌరీ లంకేష్‌. తన ప్రాణాలను తృణపాయంగా అర్పించింది. తనను ఎప్పుడైనా మతోన్మాదులు అంతం చేస్తారని తెలిసినా ఏనాడూ వెన్ను చూపని ధీశాలి. దుండగుల తూటాలు ఆమె దేహాన్ని చీల్చాయి తప్ప భావాలను కాదని దేశవ్యాపితంగా వెల్లడైన నిరసన వెల్లడించింది. నేనూ గౌరినే ఏం చేస్తారో చేయండి అంటూ ఎలుగెత్తి చాటారు. గౌరి నివాసం ముందున్న సిసిటీవీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సెప్టెంబరు ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో తన కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన ఆమెపై మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగుడు తుపాకితో కాల్చిచంపాడు. సమీపంలో ఇంకా ఎవరైనా వున్నారా అన్నది విచారణలో తేలాల్సి వుంది. మతోన్మాద వ్యతిరేక, హేతువాద, సంస్కరణవాదం, వామపక్ష భావాల నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలుబుర్గి సరసన గౌరి చేరింది. అభ్యుదయం, హేతువాదం, ప్రజానుకూల జర్నలిస్టు కలం, గళం పరంపరలో దేశంలో మతోన్మాదుల తూటాలకు బలైన తొలి మహిళగా చెప్పవచ్చు. తన ప్రాణాలకు ఏక్షణంలో అయినా ముప్పు వుందని, కొద్ది రోజులుగా ఎవరో వెంటాడుతున్నారని పసిగట్టినప్పటికి ప్రభుత్వంవైపు నుంచి ఎలాంటి సాయం ఆమె కోరలేదు. అలాంటి రక్షణలు ప్రాణాలను కాపాడలేవు అనే లోకానుభవంతో ఆమె ఆ నిర్ణయానికి వచ్చి వుండవచ్చు.

కాషాయ పరివారం, వారితో అంటకాగుతున్న పార్టీలు, శక్తులు, వ్యక్తులు తప్ప గౌరి హత్యపై దేశవ్యాపితంగా జర్నలిస్టు, ప్రజా సంఘాలు, వామపక్ష, అభ్యుదయ పార్టీలు, సంస్ధలు, శక్తులు తీవ్రనిరసన తెలిపాయి. నిందితులను గట్టిగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. అనేక మంది సీనియర్‌ జర్నలిస్టులు దేశంలో నెలకొన్న పరిస్ధితుల తీరుతెన్నుల పట్ల నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జర్నలిస్టుల ప్రాణాలు తీయటం కొత్త కాదు. మన దేశంలో కూడా అనేక మంది బలయ్యారు.రాజకీయ నేతల, గూండాల, మాఫియాల అవినీతి అక్రమాలను బయట పెట్టే క్రమంలో జర్నలిస్టులు ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితిలో గడుపుతున్నారు. గత నాలుగు సంవత్సరాలలో (2013 నుంచి) ఇప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాలలో 22 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.అనేక మందిపై హత్యాయత్నం జరిగింది. దేశమంతా గౌరీ లంకేష్‌ హత్యకు నిరసన తెలుపుతున్న సమయంలోనే బీహార్‌లో పంకజ్‌ మిశ్రా అనే జర్నలిస్టుపై అధికారపక్ష ఎంఎల్‌ఏ అనుచరులు తుపాకులతో కాల్పులు జరిపారు.

జర్నలిస్టులపై జరిగిన దాడుల కేసులను పరిశీలిస్తే అవి కాంగ్రెస్‌, బిజెపి,జెడియు, ఎస్‌పి,టిడిపి మరొకటా అన్నది పక్కన పెడితే ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ దుండగులు చెలరేగిపోతున్నారు. వత్తిడి కారణంగా కేసులు నమోదు చేయటమే తప్ప వాటిలో ఎలాంటి పురోగతి వుండటం లేదు. డేరా బాబా గుర్మీత్‌ హత్య చేయించిన సిర్సా జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి కేసు పదిహేను సంవత్సరాలుగా నడుస్తూనే వుంది. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అనేక వుదంతాలలో చార్జిషీట్లు పెట్టటంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు సంవత్సరాల క్రితం కర్ణాటకలో మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురైన కలుబుర్గి కేసులో ఇంతవరకు నిందితులెవరో తేలలేదు, దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే కేసులలో నిందితులు గోవా కేంద్రంగా పనిచేసే హిందూత్వ సనాతన సంస్ధకు చెందిన వారని సిబిఐ కేసులు దాఖలు చేసింది. ఇలాంటి వుదంతాలలో నేరగాళ్లకు శిక్షలు పడటం ఎంత అవసరమో అంతకంటే ఇటువంటి ధోరణులను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలు, శక్తులను ఎదుర్కోవటానికి సంఘటితం కావటం అంతకంటే ముఖ్యం. అసహనం, విమర్శలను తట్టుకోలేని ధోరణి, భిన్నాభిప్రాయాలను సహించకపోవటం దేశంలో క్రమంగా మరీ ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. అసమ్మతి, భిన్నాభిప్రాయాన్ని గౌరవించటం ప్రజాస్వామ్య లక్షణం. నిత్యం భావ ప్రకటనా స్వేచ్చ హక్కు గురించి పారాయణం చేసే వారు తమ దాకా వచ్చే సరికి హరిదాసు-ధర్మపత్ని-వుల్లిపాయ కథలో మాదిరి వ్యవహరిస్తున్నారు.నేతి బీరలో నెయ్యి మాదిరి తయారవుతున్నారు.

వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలహీనంగా వున్న కర్ణాటకను దక్షిణాదిలో మతోన్మాద శక్తులు ఒక ప్రయోగశాలగా చేసుకున్నాయి. అక్కడి ప్రాంతీయ పార్టీల అవకాశవాదం, అనేక హిందూ మతసంస్ధల మద్దతు కారణంగా కారణంగా బిజెపి ఆ రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఆ పార్టీ రూపకల్పన చేసింది. ఈ పూర్వరంగంలో గౌరీ వంటి అనేక మంది మతోన్మాదశక్తులకు వ్యతిరేక గళం విప్పుతూ కంట్లో నలుసుగా మారారు. వాటన్నింటిని ఆమె తన పత్రికలో ఎప్పటి కప్పుడు రాస్తూ హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆమెను కొంత మంది అనుసరించారని, రాకపోకలను నిర్ధారించుకున్నారని ఆమె హత్య అనంతరం వెల్లడైన సమాచారాన్ని బట్టి సరిగ్గా ప్రముఖ రచయిత ఎంఎం కలుబర్గిని హత్య చేసిన రోజే గౌరిని కూడా చంపివేయాలని పధకం వేశారా అనిపిస్తోంది. సరిగ్గా రెండు సంవత్సరాల ఐదు రోజుల తరువాత వారి పధకం నెరవేరింది. ఇద్దరి హత్యలకు అనేక సామీప్యాలున్నాయి.కుటుంబ సమస్యల కారణంగా కలుబర్గిని హత్య చేశారని వెంటనే ప్రచారం జరిగింది. గౌరిని నక్సలైట్లు చేసి వుండవచ్చని ప్రచారం చేశారు.

అనేక ప్రాంతాలలోని కోర్టులలో తప్పుడు కేసులు బనాయించటం మతోన్మాద శక్తులు అనుసరించే ఎత్తుగడలలో ఒకటి. ఎవరైనా పదులకొద్దీ కేసులకు హాజరుకావటం మామూలు విషయం కాదు. అయితే కోర్టులున్న ప్రతిచోటా అలాంటి కేసులను వుచితంగా చేపట్టటానికి మతశక్తులకు లాయర్లు వున్నారు. లుబుర్గి హత్య జరిగే నాటికి ఆయనపై ఇరవై వరకు వివిధ ప్రాంతాలలో పరువు నష్టం కేసులు దాఖలై వున్నాయి. అదే విధంగా గౌరి మీద కూడా(15) వున్నాయని ఆమె న్యాయవాది వెంకటేష్‌ హూట్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె కోర్టు కేసులకు వెళ్లిన ప్రతి చోటా కోర్టు వెలుపల సభలు, సమావేశాలు జరపటానికి అ అవకాశాలను వినియోగించుకొనే వారని ఆయన తెలిపారు. గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌, కలుబర్గిని ఎలాంటి నాటు తుపాకితో కాల్చి చంపారో సరిగ్గా అలాంటిదానితోనే గౌరిని కూడా చంపారు.నాలుగు వుదంతాలలోనూ దుండగులు మోటారు సైకిళ్లనే వుపయోగించి దగ్గరినుంచి కాల్చారు.పన్సారే, దబోల్కర్‌ కేసులలో ముద్దాయిలుగా తేలి పరారీలో వున్న ఒకడు 2009 గోవా పేలుళ్ల వుదంతంలో కూడా వున్నాడు.పన్సారే కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సమీర్‌ గైక్వాడ్‌ బాల్యస్నేహితుడైన రుద్రపాటిల్‌ కలుబుర్గి కేసులో అనుమానితుడు, పరారీలో వున్నాడు.

హిందూత్వ శక్తులు 2004 నుంచి గౌరిని బెదిరిస్తున్నాయి. కేసులు బనాయిస్తున్నాయి.2016 నవంబరు 28న హుబ్లి జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆమెకు పరువు నష్టం కేసులో ఆరునెలల జైలు, జరిమానా విధించారు. అదే రోజు ఆమె బెయిల్‌ తీసుకొని సెషన్స్‌ కోర్టుకు అప్పీలు చేయాలని నిర్ణయించారు. తప్పు చేస్తే జర్నలిస్టులైనా మరొకరైనా శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతర జర్నలిస్టులు దీనిని గమనంలో వుంచుకోవాలంటూ బిజెపి ఐటి విభాగ ప్రతినిధి జర్నలిస్టులను ఆ సందర్భంగా బెదిరించాడు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే 2008లో లంకేష్‌ పత్రికలో ప్రచురించిన ఒక వ్యాసం తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందంటూ సంపాదకురాలిపై ధార్వాడ బిజెపి ఎంపీగా వున్న ప్రహ్లాద్‌ జోషి, బిజెపి స్ధానిక నేత వుమేష్‌ దుషి క్రిమినల్‌ పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. కోర్టు తీరు తెన్నుల గురించి తాను ఎలాంటి ఆందోళనకు గురికాలేదని, ఆ కేసును బిజెపి నేతలు, మద్దతుదార్లు వుపయోగించుకున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందని గౌరీ వ్యాఖ్యానించారు. తాను జైలుకు పోతానని ఆశించిన వారందరికీ నిరాశ ఎదురైందని అన్నారు. ‘అదొక పెద్ద అంశమని నేను భావించలేదు, బిజెపి ఐటి విభాగం దీనినొక ఆయుధంగా చేసుకొని జర్నలిస్టులను బెదిరించటమే విభ్రాంతి కలిగించింది’ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్చ దేశంలో ఏ స్ధితిలో వున్నదో తన వుదంతం వెల్లడించిందన్నారు. అధికారంలో వున్న వారి భావజాలాన్ని వ్యతిరేకించిన లేదా విబేధించిన వారి నోరు నొక్కేందుకు చట్టాన్ని వినియోగించుకోవటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఈ ధోరణి ఎంఎం కలుబుర్గి హత్య అనంతరం పెరుగుతోందని చెప్పారు. ఈ హత్యను సమర్ధిస్తూ భజరంగ్‌ దళ్‌ కార్యకర్త భువిత్‌ షెట్టి హిందూయిజాన్ని విమర్శించిన వారు కుక్క చావు చస్తారంటూ ట్వీట్‌ చేశాడన్నారు. గతేడాది హరీష్‌ పూజారి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు, హరీష్‌ను ఒక ముస్లింగా పరిగణించి హత్య చేశారు.

గౌరీ లంకేష్‌పై కేసు వివరాల్లోకి వెళితే బిజెపి కార్యకర్తలు తనను మోసం చేశారంటూ ఒక నగల వ్యాపారి బిజెపి ఎంపీ జోషీ దగ్గరకు వెళ్లారు. ఆయన తమ కార్యకర్తలను సమర్ధించి న్యాయం చేయకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వ్యాపారి హెచ్చరించాడు. ప్రచురించిన వార్త సారాంశం ఇది. దీనిలో జోషి పరువుకు నష్టం కలిగించే అంశమేదీ లేదని, ఇదే వార్తను ఇతర పత్రికలు కూడా ప్రచురించాయని, అయినప్పటికీ తనను మాత్రమే లక్ష్యంగా చేసుకొని కేసు దాఖలు చేసినట్లు గౌరీ అన్నారు. తాను వార్తను ప్రచురించిన తరువాత జరిగిన ఎన్నికలలో జోషీ విజయం సాధించారని అలాంటపుడు పరువు పోవటం అనే ప్రశ్న ఎక్కడుందని అన్నారు. దుషీ విషయానికి వస్తే అతని మీద అనేక కేసులు దర్యాప్తులో వున్నాయని, పోవాల్సిన పరువేదో ఇప్పటికే పోయిందని, తమ పత్రికలో రాసిన వార్తతో అదనంగా పోయేదేమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.

అంతకు ముందు 1994లో హుబ్లీ ఈద్‌గాలో జాతీయ జెండాను ఎగురవేసి మతకొట్లాటలను రెచ్చగొట్టిన వుమాభారతిపై పెట్టిన కేసును వుపసంహరించేందుకు గౌరి తిరస్కరించారు.గత కొంత కాలంగా కర్ణాటకలో ఒక బలమైన సామాజిక తరగతిగా వున్న లింగాయత్‌లు తాము బసవన ధర్మాన్ని పాటించేవారం తప్ప హిందువులం కాదని, తమను ఒక ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానాలు చేసి సభలు జరుపుతున్నారు. గౌరి ఒక హేతువాది అయినప్పటికీ బసవన చెప్పిన అనేక అంశాలు తన భావాలకు దగ్గరగా వున్నందున తాను వారి అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ మత శక్తులకు కంటగింపుగా మారింది. కొన్ని పార్టీలను నిషేధించాలని కోరుతూ బిజెపి చలో మంగళూరు పేరుతో సెప్టెంబరు ఐదవ తేదీన ఒక రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టింది. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ కార్యక్రమాన్ని గౌరి తీవ్రంగా విమర్శించారు.(అదే రోజు ఆమెను దుండగులు బలిగొన్నారు) అంతకు ముందు నెలలోనే బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో పర్యటించి వెళ్లారు.

రెండు సంవత్సరాల క్రితం కలుబర్గిని హత్య చేసిన తరువాత కర్ణాటకలోని అనేక మందికి అదే గతి పడుతుందనే బెదిరింపులు వచ్చాయి.ఆ సందర్భంగా గౌరి,మరికొందరు ఒక జాబితాను తయారు చేసి ఎవరెవరిపై ఎన్నిసార్లు మతశక్తులు విద్వేష ప్రచారం, దాడులు చేశాయో, ఎవరికి ప్రాణహాని వుందో వెల్లడించారు.వారిలో మొదటి వ్యక్తిగా హేతువాది కెఎస్‌ భగవాన్‌,రచయితలు యోగేష్‌ మాస్టర్‌,బంజగారే జయప్రకాష్‌, తాను నాలుగవదానినని వెల్లడించారు. మతశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు కర్ణాటక కోము సౌద్ర వేదికను ఏర్పాటు చేయటంలో గౌరి ముఖ్యపాత్ర పోషించారు.

నీ స్నేహితులను చూస్తే నువ్వు ఎలాంటి వాడివో చెప్పవచ్చన్నది ఒక నానుడి. దాన్ని కొద్దిగా మార్చి నువ్వు సామాజిక మీడియాలో ఎవరిని అనుసరిస్తున్నావో చూస్తే నీవెలాంటి వాడివో చెప్పవచ్చన్నది న్యూ నుడిగా చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న కొంత మంది ట్వీట్లు గౌరి హత్యను సమర్ధించేవారిగా వున్నట్లు తేలటంతో, అసలు నరేంద్రమోడీని అనుసరించటం మానివేయాలనే ప్రచారం ప్రారంభమైంది. అసలే అన్ని రంగాలలో నరేంద్రమోడీ సర్కార్‌ విఫలం అయినట్లు అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. మీరు కన్న కలలను నిజం చేసేందుకు చేపట్టిన ఈచర్యకు యాభై రోజులు ఓపిక పట్టండి, ఫలితాలు కద్దనిపించకపోతే నన్ను వురి తీయండి అని మోడీ చెప్పిన పెద్ద నోట్ల రద్దు ఘోరంగా విఫలమేగాక దేశానికి నష్టదాయకంగా మారిందని రుజువైంది. దాని గురించి తేలు కుట్టిన దొంగ మాదిరి ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. ఈలోగా నరేంద్రమోడీ ఎలాంటి వారిని అనుసరిస్తున్నదీ వెల్లడి అయింది. దాంతో నష్ట నివారణ చర్యగా బిజెపి ఐటి విభాగం రంగంలోకి దిగింది. మోడీ ఎవరినైనా అనుసరిస్తున్నారంటే అర్ధం వారందరి ప్రవర్తన సరైనదే అని నిర్ధారణ పత్రం ఇవ్వటంగా భావించరాదని, ఎవరేం చేస్తారో ముందుగా ఎవరు వూహిస్తారంటూ, అనేక అవినీతి ఆరోపణలున్న రాహుల్‌ గాంధీని కూడా మోడీ అనుసరిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. గౌరి హత్యను సమర్ధించేవారి వైఖరి తప్పని ఒక్క ముక్క కూడా ఆప్రకటనలో లేకపోవటం గమనించాల్సిన అంశం.

గౌరీ హత్య వార్త ఇంకా లోకానికి పూర్తిగా తెలియక ముందే దానితో తమకేమీ సంబంధం లేదని హత్య జరిగిన కొద్ది నిమిషాలలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. ఎవరు చంపారో తెలియకుండా హిందుత్వ సంస్ధలకు దానిని ఆపాదించవద్దని కొందరు ప్రచారం ప్రారంభించారు. కొందరు చేసిన పనులకు మొత్తం హిందువులకు ఆపాదించటం ఏమిటి అని మరి కొందరు, కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని హత్యచేసినపుడు ఈ మాదిరి స్పందన ఎందుకు వ్యక్తపరచరని మరి కొందరు, ఆ కోవకు చెందిన వారే నక్సలైట్ల అంతర్గత తగాదాలలో భాగంగా ఆమెను హత్య చేశారని, కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్య అవినీతిపై కథనాన్ని రూపొందిస్తున్న సమయంలో హత్యకు గురయ్యారని, ఇలాంటి ప్రచారం మొదలు పెట్టిన వారందరూ విషయాన్ని పక్కదారి పట్టించే యంత్రాంగంలో భాగం లేదా వారి వలలో పడ్డారన్నది స్పష్టం. ఏ ఆధారం లేదా నిర్ధారణ ప్రకారం నక్సలైట్లో, మరో కారణంతోనే హత్యచేసినట్లు కొందరు చెప్పినట్లు ? హిందూత్వ సంస్ధలు, చడ్డీవాలాలకు(ఆర్‌ఎస్‌ఎస్‌) వ్యతిరేకంగా ఆమె వ్యవహరించకుండా వుంటే ఇది జరిగేది కాదని, ఆమె నా సోదరి వంటిది కానీ ఆమె రాతలను తాను అంగీకరించనని బిజెపి మాజీ మంత్రి జీవరాజ్‌ చేసిన ప్రకటనకు అర్ధం ఏమిటి? హిందుత్వ అంటే హిందూమతోన్మాదులకు పర్యాయపదంగా వాడుతున్న పదం తప్ప మొత్తం హిందువుల గురించి చెబుతున్నది కాదు. దానిని మొత్తానికి ఆపాదిస్తున్నారని చెప్పటం వక్రీకరణ. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని హత్య చేసినపుడు ఎందుకు స్పందించరని ఆమాయకత్వం నటిస్తూ అడిగే ప్రశ్న ఒకటి. అక్కడ వారేమైనా తపస్సు చేసుకొనే మునుల్లా వున్నారా? పచ్చి గూండాల మాదిరి చేస్తున్న హత్యలు దాస్తే దాగేవా? ఎక్కడా లేనివిధంగా అక్కడే ఎందుకు హత్యకు గురవుతున్నారు అంటే కమ్యూనిస్టులను అడ్డుకొంటున్నందుకు అంటారు.పేరుకు సాంస్కృతిక సంస్ధ, కమ్యూనిస్టులు రాజ్యాంగబద్దంగా పనిచేస్తున్నారు, వారిని అడ్డుకోవాల్సిన కర్తవ్యం వారెందుకు భుజానవేసుకున్నట్లు? కమ్యూనిస్టుల మీద ఆర్‌ఎస్‌ఎస్‌వారు కత్తులు ఝళిపిస్తుంటే కమ్యూనిస్టులు గులాబీలు విసురుతారా ?

ఎవరేమన్నారు ?

కేంద్ర ప్రభుత్వ పరోక్ష మద్దతుతో మితవాద శక్తులు పెంచి పోషించిన విపరీత అసహన సంస్కృతికి మరో రుజువు గౌరీ లంకేష్‌ హత్య. నాలుగు హత్యలు ఒకే తీరునజరగటం అదే విధంగా వారి సారూప్యతను ఎవరూ చూడకుండా వుండలేరు. గోవింద పన్సారే ఒక కమ్యూనిస్టు, నరేంద్ర దబోల్కర్‌ ఒక హేతువాది, ఎంఎం కలుబుర్గి ఒక సంస్కరణవాది, గౌరీ లంకేష్‌ జంకు గొంకులేని ఒక జర్నలిస్టు, సామాజిక కార్యకర్త. భారత్‌లో మత ఫాసిస్టుల లక్ష్యం ఎవరో ఇది చూపుతున్నది. అయితే బెదిరింపులు లేదా హత్యలు స్ధిరచిత్తంతో వుండే వారి గళాలను, మార్పును కోరుకొనే వారిని నిలువరించలేవు. మన లౌకిక, సోషలిస్టు విలువలు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను నులిపివేయాలని ప్రయత్నించే చీకటి శక్తులతో పోరాడాలనే మన నిర్ణయాన్ని ఇలాంటి ప్రతి పిరికి చర్య మరింత గట్టిపరుస్తుంది.

కె సచ్చిదానందన్‌

గౌరి హత్య ఒక వ్యక్తిని హత్య చేయటం కంటే పెద్దది, అది భావ ప్రకటనా స్వేచ్చ,విబేధించే హక్కు,ప్రజాస్వామిక పౌరసత్వాలపై జరిగిన దాడి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది భావజాలాల సంఘర్షణ. మా దారికి రాకపోతే నీ అంతం చూస్తామని చెప్పటమే ఈ హత్య. దేశ ప్రజాజీవనంలో ప్రముఖ పాత్రపోషించే మహిళలకు ఇదొక ప్రమాదకర హెచ్చరిక. ఆమెను తిరిగి తీసుకురాలేము కానీ విమర్శకులు, నిరసన వ్యక్తం చేసే వారిపై ప్రత్యక్ష హింసాకాండతో ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టాలని చూసే పాలకులకు ప్రతిఘటన,తిరస్కరణను రెట్టింపు చేస్తుంది.

అనన్య వాజ్‌పేయి

భారతీయ పౌరుల హత్యలను చూస్తూ వున్న మీరు ఏ దేశానికి చెందిన వారని కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలచుకున్నాను. ఈ రక్తపాతాన్ని ఆపుతారా లేక కొనసాగనిస్తారా? మీరు చర్య తీసుకొనేందుకు ఇంకా ఎన్ని శవాలు లేవాలి.ఈ దేశం మహాత్మాగాంధీది, ఆయన అంతేవాసులు, భావ ప్రకటనా స్వేచ్చకు హామీ ఇచ్చిన జవహర్‌లాల్‌ నెహ్రూది. చరిత్ర నుంచి వారి పేర్లను తుడిచి వేసే పనిలో మీరు తీరికలేకుండా వున్నారు, కానీ మీరు స్వేచ్చను హరించలేరు.

నయనతార సెహగల్‌

గౌరి దారుణ హత్యను బిజెపి ఖండిస్తున్నది. ఒక జర్నలిస్టు లేదా మావోయిస్టు మరియు నక్సలైట్ల హత్యలను ఖండించాల్సిందే, వాటికి వ్యతిరేకంగా గొంతెత్తి, గట్టిగా ఖండిస్తున్న నా వుదారవాద స్నేహితులందరూ కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా కేరళలో బిజెపి కార్యకర్తలను అనేక మందిని హత్య చేస్తుంటే ఎందుకు మౌనంగా వుంటున్నారని ప్రశ్నిస్తున్నా?

రవి శంకర్‌ ప్రసాద్‌, కేంద్ర మంత్రి

గౌరి హత్య వెనుక నక్సల్స్‌ హస్తం వుందని అనుమానిస్తున్నా. అది కావచ్చు, కాకపోనూ వచ్చు.ఆమె పూర్వరంగం దృష్ట్యా ఈ చర్య మితవాద వుగ్రవాదులదీ కావచ్చు లేదా మావోయిస్టులదీ కావచ్చు

ఇంద్రజిత్‌ లంకేష్‌( గౌరి సోదరుడు)

నక్సల్స్‌కు సంబంధం వుందని నేను అనుకోవటం లేదు. ఆమె భావజాలం మితవాదశక్తులకుతీవ్ర వ్యతిరేకమైనది కనుక వారి పనే అని నేను చెప్పదలచుకున్నాను. ఇది వ్యక్తిగతమైనది కాదని నాకు తెలుసు. ఇది మౌలికంగా ఒక ఆలోచనను హతమార్చటం. వారు ఒక ఆలోచన, ఒక వుద్యమాన్ని అంతం చేయాలని ఆలోచించారు.

కవితా లంకేష్‌( గౌరి సోదరి)

బెంగాల్‌లో హిందువులు మరియు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు వధించబడుతుంటే ఆమె, ఆమె వంటి ధైర్యవంతమైన జర్నలిజం ఎక్కడా కనపడలేదు. ఆ లం…పట్ల ఏ మాత్రం సానుభూతి లేకుండా శరీరాన్ని చీల్చివేసి, ఆపార్ట్‌మెంట్‌ను కూడా కూల్చివేసి వుండాల్సి వుంది.ఆమె, ఆమె వంటి జర్నలిస్టులనబడే సాగరిక ఘోష్‌, శోభాడే, అరుంధతీరాయ్‌, కార్యకర్తలు కవితా కృష్ణన్‌,షీలా రషీద్‌, వుమర్‌ ఖాలిద్‌, కన్నయ్య కుమార్‌ వంటి వారికి ఇదే తగినది, వారిని లేపేయాల్సిన జాబితాలో పైన పెట్టాలి.

జర్నలిస్టులు, కార్యకర్తల ముసుగులో వున్న జాతి వ్యతిరేకులకు గౌరీ లంకేష్‌ కాల్చివేత ఒక వుదాహరణగా చేద్దాం. ఇటువంటి హత్య చివరిదని భావించటం లేదు, జాతి వ్యతిరేకులందరినీ వరుసగా లేపేసే కార్యక్రమం వుండాలి

( రెండు ఫేసుబుక్‌ పోస్టులలో విక్రమాదిత్య రానా పేరుతో వున్న అంశాలివి.హిందూత్వ శక్తులు సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టుల సారాంశమిదే. అలాంటి వారిని, వారి పోస్టులను నరేంద్రమోడీ అనుసరిస్తున్నారు)

నువ్వు అనుసరించేవారెవరో చూస్తే నువ్వేంటో తెలుస్తుంది

తమ భావజాలంతో విబేధించే వారిపై ద్వేషం ఎలా వెళ్లగక్కుతున్నారో, ఎలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారో దిగువ వుదాహరణ చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ‘అనేక మంది గౌరీ లంకేష్‌ గురించి వ్యతిరేకంగా సానుకూలంగా పోస్టులు పెట్టారు.నేను ఎన్నడూ గౌరీ లంకేష్‌ను కలుసుకోలేదు, ఆమె గురించి వినలేదు, ఈ ట్వీట్‌ చేసేంత వరకు నేను ఒక అనామకుడిని. కొంత మంది దీనికి రాజకీయ రంగు పులిమి వివాదాన్ని సృష్టించారు. ఇప్పుడు నాకు గుర్తు తెలియని ఫోన్లు వస్తున్నాయి, అభినందిస్తున్నవారు, నిందిస్తున్నవారూ వున్నారు ‘ అని చెప్పాడు సూరత్‌కు చెందిన 38 సంవత్సరాల బట్టల వ్యాపారి నిఖిల్‌ దధిచ్‌. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అతనితో మాట్లాడి వార్త ప్రచురించింది) కొద్ది రోజుల క్రితం తన ట్విటర్‌ ఖాతా వివరాలలో ఇతర విషయాలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ అనుసరించే గౌరవం పొందిన వ్యక్తిని అని రాసుకున్నాడు. గౌరీ గురించి ఏమీ తెలియకపోయినా కొంతమంది పెట్టిన పోస్టులను చూసి అతగాడు గుజరాతీలో పెట్టిన పోస్టులో ‘ ఒక లం…, ఒక కుక్క చచ్చింది, పందులు ముక్త కంఠంతో గోల చేస్తున్నాయి ‘ అని రాశాడు. ఇది ఒక సాధారణ ట్వీట్‌ అని కూడా ఎక్స్‌ప్రెస్‌ విలేకరితో చెప్పుకున్నాడు. పెళ్లాం, ఇద్దరు పిల్లలతో కుటుంబం వున్న ఒక వ్యక్తి సంస్కారం ఇది. ఒక వ్యక్తి గురించి తనకేమీ తెలియకపోయినా గుడ్డిగా తోటివారితో కలసి రాళ్లు వేసే ఇతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు, రోజూ శాఖలకు వెళుతుంటాడట. ఇలాంటివి చూసినపుడు నువ్వు మనిషివా ఆర్‌ఎస్‌ఎస్‌ వాడిగా అని ప్రశ్నించటం సహజం. సంఘపరివార్‌ నుంచి ఒక సందేశం ఏదైనా వెలువడితే దాని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా ప్రచారం చేయాలన్న ఆదేశం లేదా పధకం లేకపోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. ఏకత, శీలము అంటూ నేర్పేది, నేర్చుకుంటున్నది ఇలాంటివా? ఇంతటి ఘనకార్యం చేసిన ఇతగాడిని అనుసరించే వారు మూడు రోజుల్లో పెరిగారంటే దేశంలో ద్వేష పూరిత ధోరణులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.ఈ ఘనుడిని ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్నాడని మీడియాలో గుప్పుమనటంతో తన వివరాల నుంచి ప్రధాని మోడీ అనుసరిస్తున్న గౌరవం పొందిన వాడిని అనే దానిని తొలగించి హిందూ జాతీయవాదని అని ప్రకటించుకున్నాడు. అంటే హిందూ జాతీయవాదులంటే ఎలాంటి వారో స్వయంగా ప్రకటించుకున్నాడు.

ఈ ఘనుడిని అనుసరించేవారిలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, వుత్తర గుజరాత్‌ బిజెపి మీడియా విభాగనేత పరాగ్‌ షేత్‌ కూడా వున్నారు. దధీచ్‌ ట్వీట్‌ గురించి అడిగిన ప్రశ్నకు పరాగ్‌ స్పందిస్తూ ‘ మీరు ట్వీట్‌ అనంతరం వెలువడిన వ్యాఖ్యలను దానికి జోడిస్తే అప్పుడు నేను అదొక అసహ్యకరమైన ట్వీట్‌ అని తీవ్రంగా ఖండించాలంటాను’ అన్నాడు. అయినప్పటికీ నేను ట్విటర్‌పై అతనిని అసుసరించటం మానుకోబోవటం లేదు. సామాజిక మీడియాలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అనుసరించటం అంటే రెండోవారి ప్రవర్తనపై సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు కాదు.సామాజిక మీడియాలో జరుగుతున్నదాని ప్రకారం ఒకసారి ఎవరైనా ఒకరిని అనుసరిస్తే తరువాత అనుసరించకపోవటం అంటూ వుండదు.’ అని సమర్ధించుకున్నాడు.

లాటిన్‌ అమెరికా అనుభవాలు

1970,80 దశకాలలో లాటిన్‌ అమెరికాలోని వామపక్ష భావజాలం, మానవహక్కుల వుద్యమకార్యకర్తలను పూర్తిగా నిర్మూలించేందుకు అమెరికా సిఐఏ ఆపరేషన్‌ కండోర్‌ పేరుతో పెద్ద హంతక కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఒక అంచనా ప్రకారం చిన్న పెద్ద నాయకులు అలాంటి వారు 50 వేల మంది అదృశ్యం లేదా హత్యలకు గురయ్యారు. ఇప్పటికీ ఎన్నో వేల మంది విషయం విడిపడని రహస్యంగానే వుంది. ఒక్క అర్జెంటీనాలోనే అలాంటి వారు ఏడు నుంచి 30వేల మంది వరకు వున్నారని అంచనా. మన దేశంలో కూడా అదే దశకాలలో తలెత్తిన వామపక్ష వుగ్రవాదులను అణచేందుకు పాలకులు బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేయించారు. అందుకు పాల్పడిన పోలీసులకు అవార్డులు, రివార్డులు ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారు. ఇదొక భాగమైతే తమ చేతికి మట్టి అంటకుండా తమ భావజాల వ్యతిరేకులను అంతం చేయించేందుకు కిరాయి మూకలను వినియోగించిన అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ పద్దతులను మన దేశంలో కూడా అమలు చేస్తున్నట్లు గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన కొన్ని వుదంతాలు స్పష్టం చేశాయి. జర్నలిస్టుల హత్యలకు కూడా అదే పద్దతిని ఆయాశక్తులు అనుసరించినట్లు చెప్పవచ్చు. లాటిన్‌ అమెరికా దేశాల్లో ఇలాంటి హత్యలకు పాల్పడిన శక్తులు వాటిని పెంచి పోషించిన పాలకుల పేర్లను ప్రస్తావించటానికి కూడా మీడియా ముందుకు రాలేదు. అత్యధిక సందర్భాలలో నియంతల, సిఐఏ కధనాలకే ప్రాధాన్యత ఇచ్చి జనం ముందు పెట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లాటిన్‌ అమెరికాను తన పెరటి తోటగా మార్చుకొనేందుకు అమెరికా ఇంత దుర్మార్గానికి పాల్పడింది. ప్రస్తుతం మన దేశంలో తమ భావజాల వ్యతిరేకుల నోరు మూయించేందుకు మితవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి, వాటికి కేంద్రంలోని ప్రభుత్వమద్దతు వుందని ప్రతిపక్షాలు, అనేక మంది మేధావులు, సంస్ధలు విమర్శిస్తున్నాయి. అలాంటి వారిపై దాడులు, హత్యలు జరిగినపుడు పాలక పార్టీ లేదా దానికి మద్దతు ఇచ్చే సంస్ధల వాదనల తీరు వాటిని ఆ విమర్శలకు బలం చేకూర్చేవిగా వుంటున్నాయి. మీడియా మొత్తం మీద పాలకవర్గ ప్రయోజనాలకే తోడ్పడుతోంది. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలలో కమ్యూనిజం నుంచి రక్షించేందుకు తాము పూనుకున్నట్లు నియంతలు ప్రకటనలు చేశారు. ఇక్కడ కమ్యూనిస్టులు, అభ్యుదశక్తులు అంతపెద్ద శక్తిగా లేనందున అలాంటి ప్రకటనలు లేవుగానీ చాపకింద నీరులా తమ పని తాము చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌

12 Tuesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

fake news, Gouri lankesh, Narendra Modi, RSS

గౌరీ లంకేష్‌

ఈ వారం సంచికలో దేశంలోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్‌దారిలో వెళుతున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.

కొన్ని రోజుల క్రితం గణేశ్‌ చతుర్ధి సందర్భంగా సామాజిక మీడియా ద్వారా సంఘపరివార్‌ ఓ పుకారును ప్రచారంలోకి తెచ్చింది. గణేష్‌ విగ్రహాలను ఎక్కెడెక్కడ ప్రతిష్టించాలో కర్ణాటక(కాంగ్రెస్‌) సర్కారే నిర్ణయిస్తుందన్నది ఆ వార్త. ఒక్కో విగ్రహం కోసం రు.పదిలక్షలు చెల్లించాలి. ఎత్తు విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇతర మతస్తుల నివాసాలు లేని దారిలోనే నిమజ్జన యాత్ర సాగాలి. టపాసులు కాల్చేందుకు అనుమతించరు. ఈ తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెచ్చింది ఆర్‌ఎస్‌ఎస్‌. కర్ణాటక డిజిపి ఆర్‌కె దత్తా ఈ వార్తపై వివరణ ఇవ్వక తప్పని పరిస్దితి. అటువంటి నిబంధనలేమీ ప్రభుత్వం విధించలేదని స్పష్టం చేశారు. దాంతో అది పచ్చి అబద్దమని తేలిపోయింది. ఈ పుకారుకు ఆధారమేమిటని వెతికితే ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ అని తేలింది. అది హిందూత్వ వాదులు నడిపిస్తున్న వెబ్‌సైట్‌. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు ఇలాంటి వార్తలను ఆ వెబ్‌సైట్‌ సృష్టిస్తుంది.

ఆగస్టు 11వ తేదీన ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ కర్ణాటకలో తాలిబన్‌ పాలన పేరుతో ఒక అబద్దపు వార్తను సృష్టించింది. గణేష్‌ చతుర్ధి సందర్భంగా ప్రభుత్వం అనుచిత నియమాలను పెట్టిందన్నది సారాంశం. ఈ అబద్దాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేయటంలో సంఘీయులు విజయం సాధించారు. వేరే కారణాలతో సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలతో వున్నవారు ఈ అబద్దపు వార్తను తమ ఆయుధంగా చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయం ఏమంటే జనం తమ కళ్లు, చెవులు మూసుకొని బుర్రకు ఏమాత్రం పని పెట్టకుండా, ఆలోచించకుండానే అదే నిజమని భావించారు.

అత్యాచారం కేసులో రామ్‌ రహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ గతవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనతో చాలా మంది బిజెపి నేతలు అంతకు ముందు దిగిన ఫొటోలు ఈ సందర్బంగా సామాజిక మీడియాలో వైరస్‌ మాదిరి వ్యాపించాయి. ప్రధాని మోడీతో సహా హర్యానాకు చెందిన బిజెపి మంత్రుల ఫొటోలు కూడా అందులో వున్నాయి. దీంతో బిజెపి, సంఘపరివార్‌ ఇరకాటంలో పడ్డాయి. దానికి పోటీగా సిపిఐ(ఎం)నేత, కేరళ ముఖ్య మంత్రి పినరయ్‌ విజయన్‌ గుర్మీత్‌తో కలిసిన ఫొటో అంటూ ఒక దానిని ప్రచారంలో పెట్టారు. వాస్తవాన్ని వెలికి తీయగా అది కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ గుర్మీత్‌తో దిగిన ఫొటో అని తేలింది. ఫొటోషాప్‌ ద్వారా చాందీ తల స్ధానంలో విజయన్‌ది వుంచి సృష్టించిన నకిలీ ఫొటో అని స్పష్టమైంది. హిందూత్వవాదులకు చెందిన సామాజిక మీడియా నిపుణులు చాందీ ఫొటో స్ధానంలో విజయన్‌ది చేర్చి ప్రచారంలో పెట్టారు. అసలు ఫొటోను కొందరు వెలుగులోకి తేవటంతో సంఘపరివార్‌ బండారం బయటపడింది.

హిందుత్వ వాదులు సాగిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలకు గతేడాది వరకు సరైన ప్రతిస్పందన వ్యక్తం చేసిన వారు లేరు. ఇప్పుడు చాలామంది అందుకు నడుంబిగించారు. స్వాగతించదగిన పరిణామం. ఇప్పటిదాకా నకిలీ వార్తలే రాజ్యమేలగా ఇప్పుడు వాస్తవ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. వుదాహరణకు ఆగస్టు 17న ధృవ్‌ రాధీ సామాజిక మీడియాలో ఒక వీడియోను పెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న అబద్దాలను ఎత్తి చూపే వీడియో ఇది. మోడీ చెబుతున్న అబద్దాలను రాధీ గతకొద్ది మాసాలుగా బహిర్గతం చేస్తున్నారు. ప్రారంభంలో కొద్ది మంది మాత్రమే ఆ వీడియోలను వీక్షించేవారు. అయితే ఈ వీడియోకి బాగా ప్రచారం లభించింది. యూ ట్యూబ్‌లో లక్షమందికి పైగా చూశారు.

రాధీ పేర్కొన్న వివరాల ప్రకారం నెల రోజుల కిందట ‘బుజి బుజియా’ (అబద్దాల కోరు-మోడీకి గౌరీ పెట్టిన పేరు) ప్రభుత్వం రాజ్యసభలో ఓ విషయం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 30లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారని చెప్పింది. అయితే నోట్ల రద్దు అనంతరం 91లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అంతకు ముందు పేర్కొన్నారు. ఆర్ధిక సర్వే ప్రకారం కేవలం 5.4లక్షల మంది మాత్రమే పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారు. ఈ మూడింటిలో ఏవి సరైన అంకెలని రాధీ తన వీడియోలో ప్రశ్నించారు.

బిజెపి ప్రభుత్వం చెప్పిన అబద్దాలను, ఇచ్చిన సమాచారాన్ని ప్రధాన మీడియా అంగీకరిస్తోంది. ప్ర శ్నించేవారు, సవాల్‌ చేసే వారు లేకపోవటమే అందుకు కారణం. టీవీ వార్తా ఛానళ్ల విషయానికొసే రామనాధ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు అనేక ఆంగ్లవార్తా ఛానళ్లు ఒక కథనాన్ని ప్రసారం చేశాయి. కోవింద్‌ ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్‌లో 30లక్షల మందికిపైగా అనుచరులను సంపాదించుకున్నారన్నది వార్త సారాంశం. కోవింద్‌కు ప్రజాదరణ ఏవిధంగా పెరిగిందో రోజంతా నొక్కి చెప్పాయి.

ఈ రోజుల్లో అనేక టీవీ వార్తా సంస్ధలు ఆర్‌ఎస్‌ఎస్‌తో జట్టుకట్టినట్లు కనిపిస్తోంది. కోవింద్‌ కథనం వెనుక వాస్తవం ఏమంటే పదవీ విరమణ చేసిన దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక ట్విటర్‌ ఖాతాను కొత్తగా పదవిని చేపట్టిన కోవింద్‌కు కేటాయించారు. దాంతో సహజంగానే ఆయన అనుచరులందరూ కోవింద్‌కు బదిలీ ఆయ్యారు. మాజీ రాష్ట్రపతికి ట్విటర్‌లో 30లక్షల మందికి పైగా అనుచరులున్నారన్నది గమనించదగ్గ విషయం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలకు ప్రతిగా సత్యాన్వేషకులు అనేక మంది వాస్తవమేంటో చెబుతున్నారు. దృవ్‌ రాధే తన వీడియోలతో ఆ పని చేస్తుంటే ప్రతీక్‌ సిన్హా ఒక వెబ్‌సైట్‌(ఆల్ట్‌న్యూస్‌.ఇన్‌), ది వైర్‌, స్క్రోల్‌, న్యూస్‌ లాండ్రి, క్వింట్‌ వంటి ఆన్‌లైన్‌ పత్రికలు వున్నాయి. ఇవి చాలా చురుగ్గా తప్పుడు కథనాల గుట్టు విప్పి చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కాషాయ దళం సాగిస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వారంతా ఎలాంటి ఆర్దిక ప్రయోజనాలనూ ఆశించకపోవటం గమనార్హం. వాళ్ల లక్ష్యం తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చూడటం, ఫాసిస్టుల బండారాన్ని బయటపెట్టటం. కొద్ది వారాల క్రితం భారీ వర్షాల కారణంగా బెంగళూరు నీట మునిగిపోయినపుడు బిజెపి కర్ణాటక ఐటి విభాగం ఒక ఫొటోను విడుదల చేసింది. ‘చంద్రుడి మీద నడుస్తున్న ప్రజలను నాసా కనిపెట్టింది, ఆ తరువాత బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ దానిని తన రోడ్డుగా ధృవీకరించింది.’ అంటూ ఫొటో కింద వ్యంగ్యోక్తులను కూడా జోడించింది.భారీ వర్షాలపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే యత్నమిదని స్పష్టమౌతోంది. వాస్తవానికి ఆ ఫొటో బిజిపి పాలిత మహారాష్ట్రకు చెందినదని, బెంగళూరుది కాదని బైటపడటంతో పధకం బెడిసి కొట్టింది.

అదే విధంగా ఇటీవల పశ్చిమబెంగాల్లో అల్లర్లు చెలరేగినపుడు మతతత్వశక్తులు సోషల్‌ మీడియాలో రెండు పోస్టర్లను ప్రచారంలో వుంచాయి. ఒకటి కాలిపోయిన ఇళ్ల ఫొటో. దాని కింద’బెంగాల్‌ తగులబడుతోంది’ అని రాసి వుంది. రెండవ ఫొటోలో అనేక మంది చూస్తుండగా ఒక పురుషుడు మహిళ చీరలాగుతున్నాడు. ఆ ఫొటో కింద ‘ బదూరియాలో హిందూ మహిళలపై దాడి ‘ అని రాసి వుంది. అయితే కొద్ది గంటలలోనే ఆ ఫొటో వెనుక దాగిన వాస్తవం బహిర్గతమైంది. మొదటి ఫొటో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా 2002లో అల్లర్లు చెలరేగినపుడు తీసింది. రెండవ ఫొటో ఒక భోజ్‌పురి సినిమాలోది. ఇప్పటికీ వుంది. ఈ ఫొటోను బిజెపి సీనియర్‌ నేత విజేత మాలిక్‌ షేర్‌ చేసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు బిజెపి మంత్రులు కూడా నకిలీ వార్తలు, కథనాలను ప్రచారం చేస్తున్నారు.వుదాహరణకు ముస్లింలు మూడు రంగుల జెండాను తగులబెడుతున్న ఫొటోను నితిన్‌ గడ్కరీ షేర్‌ చేసుకున్నారు. ఆ ఫొటో కింద ‘ గణతంత్ర దినోత్సవం నాడు హైదరాబాదులో మూడు రంగుల జెండాను దగ్దం చేస్తున్నారు ‘ అని రాసి వుంది. గూగుల్‌లో కొత్తగా ఒక యాప్‌ వచ్చింది. దీని సాయంతో ఒక ఫొటోను ఎప్పుడు, ఎక్కడ రూపొందించారో తెలుసుకోవచ్చు. ప్రతీక్‌ సిన్హా దాన్ని ఎక్కడిదో తెలుసుకున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో నిషేధిత సంస్థలు నిరసన తెలుపుతున్న చిత్రమది. కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దేశంలో 50వేల కిలోమీటర్ల రోడ్ల మీద 30లక్షల ఎల్‌యిడి లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయని ఆ ఫొటో శీర్షిక సారాంశం. అయితే అదీ బోగస్‌ అని తేలిపోయింది.జపానులోని ఒక వీధిలో 2009లో తీసిన చిత్రమది. చత్తీసుఘర్‌ బిజెపి ప్రభుత్వం నిర్మించిన వంతెన అంటూ ఆ రాష్ట్ర బిజెపి మంత్రి రాజేష్‌ మునాత్‌ ఓ ఫొటోను ప్రచారంలో పెట్టారు. వాస్తవానికది వియత్నాంలో నిర్మించిన వంతెన అది. కర్నాటక ఎంపీ ప్రతాప్‌ సిన్హా ప్రపంచానికి నీతి బోధ చేసే పనిలో పడ్డారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ప్రచురితమైందంటూ ఒక నివేదికను షేర్‌ చేశారు. ఒక హిందూ బాలికను ముస్లిం పొడిచి చంపాడు అన్నది శీర్షిక. ఒక్క పత్రిక కూడా ఆ విధమైన వార్తను ప్రచురించలేదు.వార్తను కూడా మతపరమైన కోణంలో మలచారు. శీర్షికను ఫొటోషాప్‌లో మార్చి పెట్టారు.అయితే దీనిపై కలవరం చెలరేగటంతో ఎంపి ఆవార్తను తొలగించారు. మత విద్వేషాన్ని రగిల్చే అబద్దాన్ని ప్రచారం చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పలేదు. విచారం వెలిబుచ్చలేదు.

నా స్నేహితుడు వాసు గుర్తు చేసినట్లు నేను కూడా ఈ వారంలో ఒక నకిలీ ఫొటోను షేర్‌ చేశాను. అది పాట్నాలో ర్యాలీకి సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ షేర్‌ చేసినది. నా స్నేహితులు శశిధర్‌ హెమ్మాడి అది నకిలీ అని గుర్తు చేశారు. దాంతో గ్రహించుకొని వాస్తవ ఫొటోలను జతచేసి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఇదంతా కేవలం ప్రచారం కోసం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలన్నదే నా ఆకాంక్ష, చివరి మాటగా తప్పుడు వార్తల్ని వెలికితీసే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. అటువంటి వారు చాలా మందే వున్నారని అనుకుంటున్నా.

( ఇది గౌరీ లంకేష్‌ రాసిన చివరి సంపాదకీయం)

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d