American unemployment: The real and the bogus
Source: Communist Party of Ireland
10 Tuesday Nov 2015
Posted in Economics, Left politics
American unemployment: The real and the bogus
Source: Communist Party of Ireland
09 Monday Nov 2015
Posted in Left politics
7th November marks the anniversary of the October Revolution of 1917 (25th October in the Old Style Calendar), when the Lenin, Trotsky, and the Bolsheviks lead the masses of workers, soldiers, and peasants to power in Russia.
09 Monday Nov 2015
Posted in Left politics, Uncategorized
1965,66 సంవత్సరాలలో ఇండోనేషియాలో నియంత సుహార్తో నాయకత్వంలో జరిగిన కమ్యూనిస్టు వూచకోతపై ఐరోపాలోని హేగ్ నగరంలో జరిగే ‘ప్రజాకోర్టు’కు హాజరు కావద్దని ఇండోనేషియా ప్రభుత్వం విద్యార్ధినేతలను బెదిరించింది. ఈనెల 10-13 తేదీలలో జరిగే ఈ విచారణకు హాజరైనట్లయితే విద్యార్ధులకు స్కాలర్‌షిప్పులను నిలిపివేస్తామని నెదర్లాండ్స్‌లోని ఇండోనేషియా రాయబారకార్యాలయ అధికారులు లిడెన్‌లోని ఇండోనేషియా విద్యార్ది అసోసియేషన్ (పిపిఐ) విద్యార్ధులను పిలిపించి బెదిరించినట్లు ప్రజాకోర్టు కమిటీ అధిపతి, మానవ హక్కుల న్యాయవాది నూర్‌సిభానీ కాట్‌జసుంగ్‌కాన్ తెలిపారు. యాభై సంవత్సరాల నాటి ఊచకోత గురించి విచారణ జరపటాన్ని కమ్యూనిజం పునరుద్దరణగా రాయబార కార్యాలయం పరిగణిస్తున్నదని ఆమె జకర్తా పోస్టు పత్రికతో వ్యాఖ్యానించారు. రాయబార కార్యాలయానికి స్కాలర్ షిప్పులను నిలిపివేసే అధికారం లేదని, దాని పని విద్యార్ధులను బెదిరించటం కాదని ఆమె ఆగ్రహం వెలిబుచ్చారు. ఇదే విధంగా హింసాకాండకు గురైన, అదృశ్యమైన వ్యక్తుల విచారణ కమిటీ అధ్యక్షుడు హారిస్ అజార్ కూడా అధికారుల చర్యను ఖండించారు. ఈ చర్య అనారిక స్వభావాన్ని వెల్లడిస్తున్నదని, ఎందుకు తమ ప్రభుత్వం ఇలా చేస్తున్నదో అర్ధం కావటం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వంలోని పోలీసు, సైన్యం లేదా ప్రభుత్వంలోని పలుకుబడిగల ఎవరో దీని వెనుక వున్నారని, వాస్తవానికి ఇప్పుడు కమ్యూనిజంతో ముప్పులేదని కొందరు వ్యాఖ్యానించారు.
08 Sunday Nov 2015
Posted in CPI(M), Current Affairs, Left politics
LDF Victory in Kerala
The CPI(M) congratulates the people of Kerala for having voted the LDF to
victory in the elections to the local bodies. This verdict is a popular
rejection of the UDF government’s anti-people record and corruption. The
people have also rebuffed the communal politics of the BJP and its efforts
to rally leaders of caste-based organisations
The LDF has registered success in the various levels of the local bodies. It
has won 545 out of the 938 gram panchayats declared so far; 91 out of the
152 block samitis and 7 out of the 14 zilla panchayats. Of the urban
municipalities, the LDF has won 44 out of 86; of the six corporations, the
LDF has won outright 3, it has emerged as the largest block in one and in
another there is a tie. The UDF has won only one corporation outright.
The Polit Bureau conveys its warm greetings to all the workers and activists
of the CPI(M) and the LDF for this well-earned victory.
07 Saturday Nov 2015
Posted in Current Affairs, Left politics
Tags
అమ్మా ! అమ్మా !! ఈ బొమ్మ ఎంతో బాగుంది కదూ
ఏం బాబూ పెద్ద వాడివైనా నీ కింకా బొమ్మల పిచ్చి పోలేదా పద పద !
కాదమ్మా నా చిన్నపుడు ఇలాంటి బొమ్మలు రాలేదు , దీనిపై సుత్తీ కొడవలి బొమ్మలున్నాయి, ఎందుకలా వేశారు.
అవి చైనా మేడ్, అవి కమ్యూనిస్టు చిహ్నాలు అని చెబుతుండగానే తీసుకోండి సార్ పెద్ద ఖరీదేం కాదు అని షాపతను అంటూ వుండగానే బిలబిల మంటూ మిలిటరీ వచ్చి అక్కడున్న బొమ్మలను స్వాధీనం చేసుకొని షాపువాడిని బలవంతంగా జీవులో ఎక్కించుకు చక్కా పోయారు. వారికి ఏం జరిగిందో అర్ధం కాలేదు, ఆ బొమ్మలను ఎందుకు తీసుకుపోయారో, వాటిలో ఏమైనా వజ్రాలు, గట్రా పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారా అని పరిపరి విధాలా అనుకుంటుండగానే పోలీసులు మైకులో హెచ్చరికలు ప్రారంభించారు. సుత్తీ కొడవలి చిహ్నం వున్న బొమ్మలను అమ్మినా, వాటిని ఎవరైనా కొన్నా వారిని అరెస్టు చేస్తామన్నది వాటి సారాంశం.
ఇదేదో కథలా అనిపిస్తున్నా నిజం. ఇండోనేషియాలోని యోగ్యకర్తా అనే పట్టణంలో మిలిటరీ సుత్తీ, కొడవలి చిహ్నాలు వున్న చైనా తయారీ బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు జకర్తా గ్లోబ్ అనే పత్రిక శుక్రవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. ఆ చిహ్నాలు చూసిన పిల్లలు కమ్యూనిస్టు ఆశయాల గురించి తెలుసుకుంటారని, వాటిని అమ్మటం, కొనటం ద్వారా పిల్లల్లో కమ్యూనిస్టు బీజాలు వేసినట్లు అవుతుందని అధికారులు భావించి అలాంటి బొమ్మలను నిషేధించినట్లు తెలిపింది. లెఫ్టినెంట్ కల్నల్ కవలెరీ తుమాది దీని గురించి చెబుతూ ఈ బొమ్మలను అమ్ముతున్నవారిలో ఎక్కువ మందికి ఆ బొమ్మల వెనుక వున్న అర్ధం తెలియదని, అయితే కొంత కాలానికి మన పిల్లలు ఆ చిహ్నాలకు ఆకర్షితులు అవుతారని అదే జరిగితే తరువాత వారి మెదళ్లలో ఆ భావాలు కూడా ప్రవేశిస్తాయని ఆ మిలిటరీ అధికారి వ్యాఖ్యానించాడు. బొమ్మలకు ఆర్డర్లు ఇచ్చే వ్యాపారులు దీని గురించి ఎరిగి వుండాలని చెప్పాడు.
1965-66 సంవత్సరాలలో ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులు, అభిమానులను జనరల్ సుహార్తో నాయకత్వంలోని మిలిటరీ తిరుగుబాటుదారులు నిర్ధాక్షిణ్యంగా హత్యచేసిన విషయం తెలిసినదే. ఆ వుదంతం జరిగి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా దానిపై చర్చ, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్ ముందుకు వచ్చిన పూర్వరంగంలో ఇండోనేషియా మిలిటరీ ఈ చర్య తీసుకోవటం ద్వారా అది ఎంత భయపడుతున్నదో అర్ధం అవుతోంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వుబుద్ రైటర్స్ మరియు రీడర్స్ ఫెస్టివల్(పుస్తక ప్రదర్శన) సందర్భంగా గతనెలలో 15 కార్యక్రమాలను జరగకుండా అధికారులు అడ్డుకున్నారు. నిఘా సిబ్బందిని దింపి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆరాతీశారు. కమ్యూనిస్టుల ఊచకోత గురించి సమాచారాన్ని ప్రచురించిన జావాలోని ఒక విశ్వవిద్యాలయ పత్రిక కాపీలను మొత్తం స్వాధీనం చేసుకొని వాటిని పాఠకులకు అందకుండా నాశనం చేశారు. సుహార్తో కాలం నాటి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా మిలిటరీ, పోలీసులు కమ్యూనిస్టుల ఊచకోత గురించి చర్చ జరగకుండా సమాచారాన్ని జనానికి అందకుండా అప్రకటిత నిషేధాన్ని అమలు జరుపుతున్నారు.
07 Saturday Nov 2015
Posted in Current Affairs, Left politics
42 సంవత్సరాల తరువాత దర్యాప్తు
ప్రఖ్యాత చిలీ కవి, 1973లో మరణించిన పాబ్లో నెరూడా కాన్సర్ లేదా సహజమరణం పాలయ్యారని ఇంత వరకు అనుకుంటున్నది వాస్తవం కాదా? సాల్వెడార్ అలెండీని అంతమొందించిన నియంత పినోచెట్ నెరూడాను కూడా హత్య చేయించారా? తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం ఇంకా నిర్ధారణ కానప్పటికీ అవుననే చెబుతున్నది. గతంలో బయటకు రాని ఒక పత్రంలోని సమాచారం కొత్త సమాచారాన్ని వెల్లడిస్తున్నది. బహుశాను నెరూడా హత్యకు గురై వుంటారని చిలీ ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది.
ఎల్ పాయిస్ అనే ఒక పత్రిక ఆ పత్రాన్ని సంపాదించింది. దానిలోని అంశాలను నిర్ధారించాల్సిందిగా ప్రభుత్వ హోంశాఖను కోరింది. 1973లో నెరూమరణానికి మూడవ పక్షం కారణమై వుండవచ్చని ప్రభుత్వం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది.నెరూడా మరణంపై లోతైన దర్యాప్తు ఫలితంగా ఆ పత్రం లభ్యమైనట్లు ఆ పత్రిక పేర్కొన్నది. పత్రం నిజమేనని, దర్యాప్తుచేస్తున్న బృందం వివాదాస్పద మరణంపై అంతిమ నిర్ణయానికి రావలసి వుందని ప్రభుత్వం పేర్కొన్నది. కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా వున్న వామపక్ష ప్రభుత్వం 42 సంవత్సరాల తరువాత రాజకీయ కారణాలతో నెరూడాను హత్య చేసి వుంటారన్న వూహాగానాలు సంవత్సరాలుగా వెలువడుతుండటంతో ఈ ఏడాది ప్రారంభంలో నెరూడా హత్య కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. ఇదే కారణాలతో 2013లో నెరూడా అవశేషాలను మరోసారి పరీక్షించింది.
కమ్యూనిస్టు, కవి అయిన నెరూడా నియంతల కుట్రకు బలైన చిలీ కమ్యూనిస్టు అధ్యక్షుడు సాల్వెడార్ అలెండీ మద్దతుదారు. అలెండీని చంపివేసిన కొద్ది వారాల తరువాత అనుమానాస్పద స్ధితిలో నెరూడా మరణించారు. 1924లో 19 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రఖ్యాత ‘సాంగ్ ఆఫ్ డెస్‌ఫెయిర్’ ఇతర కవితలను రాశారు. సాహిత్యంలో ఆయనకు 1971లో నోబెల్ బహుమతి వచ్చింది. నెరూడా కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, మరణించే ముందు ఫ్రాన్స్‌లో చిలీ రాయబారిగా పనిచేశారు. 1948లో కమ్యూనిస్టుపార్టీపై నిషేధం విధించిన సమయంలో ఆయన కొంతకాలం అజ్ఞాతవాసం గడిపారు.
07 Saturday Nov 2015
Posted in Current Affairs, Left politics
ఐరోపాలోని పోర్చుగీసులో సోషలిస్టు, కమ్యూనిస్టు, వామపక్ష కూటమితో కూడిన త్రిపక్ష సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ఆ పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీంతో పదకొండు రోజుల క్రితం ఏర్పడిన మితవాద మైనారిటీ సర్కార్‌ను కూలద్రోసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వామపక్ష కూటమికి పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లు వున్నాయి.అక్టోబరు మొదటి వారంలో జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభత్వ ఏర్పాటు, అనుసరించాల్సిన విధానాల గురించి తలెత్తిన వివాదాల కారణంగా సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావటంతో మితవాద శక్తులు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే పొదుపు చర్యలకు వ్యతిరేకంగా వున్న శక్తులందరూ ఏకంకావాలని దేశంలోని వివిధ తరగతుల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా తాజాగా సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. పార్లమెంట్‌లోని 230 స్థానాలకు గాను మితవాదులకు 99 మాత్రమే వున్నాయి. కమ్యూనిస్టుపార్టీకి 18, వామపక్ష కూటమికి 19, సోషలిస్టుపార్టీకి 85 స్థానాలతో కలిసి 122 వుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. మంగళవారం నాడు పార్లమెంట్ విశ్వాస పరీక్షలో మితవాద ప్రభుత్వాన్ని ఓడించి వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది. స్పీకర్ ఎన్నికలో వామపక్ష కూటమి అభ్యర్ది ఇప్పటికే ఎన్నికయ్యారు.
పొదుపు చర్యల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్న తరుణంలో ఐరోపాలో మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటిని వ్యతిరేకించే శక్తులవైపు జనం చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో పోర్చుగల్ పరిణామాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో అప్పులు ఇచ్చిన వారి షరతులకు కట్టుబడి వుంటామని సోషలిస్టు పార్టీ ప్రకటించింది. అయితే కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో వాటి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వ విధానాల ఖరారుకు ఆదివారం నాడు ఈ కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఆమోదయోగ్యమైన విధానాలను రూపొందించని పక్షంలో గ్రీస్‌లో మాదిరి మరోసారి ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదు.
07 Saturday Nov 2015
Posted in Left politics
Corporations bleed what profits they can from disaster. Democracy is replaced by a business plan. An excerpt from Antony Loewenstein’s Disaster Capitalism: Making A Killing Out Of Catastrophe
Source: Disaster capitalism: outsourcing violence in the UK – Counterfire
05 Thursday Nov 2015
Posted in Left politics

General Julio Rodríguez Fernández in a picture taken in 2010. / LUIS SEVILLAN
A former top-ranking military official will be running in Spain’s general election as a candidate for anti-austerity party Podemos.
General Julio Rodríguez Fernández, 67, was Chief of the Defense Staff from 2008 to late 2011, under the Socialist government of José Luis Rodríguez Zapatero.
It is an honor for us to be joined by Julio Rodríguez, a man who has devoted his life to defending his country”
Podemos leader Pablo Iglesias
“He is going to be number two on the Zaragoza list, after Pedro Arrojo,” said Podemos secretary general Pablo Iglesias in a press conference on Wednesday.
“It will be an honor for us if he accepts being defense minister,” said Iglesias, whose party is currently fourth in voting intention polls after the incumbent Popular Party (PP), Ciudadanos and Socialist Party (PSOE).
“It is an honor for us to be joined by Julio Rodríguez, a man who has devoted his life to defending his country, a uniformed citizen and a democrat who has held the highest rank available in the military, and who contributes the solvency, honesty and commitment of a life devoted to others,” he added.
This is not the first high-profile enlistment that the emerging party, which political opponents describe as having a far-left ideology, has made.
On Monday, Podemos announced that another one of its candidates to the Spanish Congress will be Juan Pablo Wert, brother to former education minister José Ignacio Wert, of the conservative PP.
Spain will hold a general election on December 20, a date already viewed as historic because for the first time since the return of democracy in the late 1970s, more than two parties stand a good chance of winning.
05 Thursday Nov 2015
Posted in Left politics
మార్క్సిజం`లెనినిజాన్ని మన దేశ పరిస్ధితులకు అన్వయించటంలో అనుభవ లేమి వంటి అనేక కారణాలతో కమ్యూనిస్టులు పొరపాటు వైఖరులు తీసుకోవటం, సరిదిద్దుకోవటం పార్టీ చరిత్రలో అనేక సార్లు కనిపిస్తుంది.కష్టజీవుల విముక్తి పట్ల జవాబుదారీ తనంతో పనిచేస్తున్న కారణంగానే పార్టీ ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకొంటోంది తప్ప అవి వ్యక్తిగతమైనవో లేక కావాలని చేసినవో కాదు.
ఎవరైనా పని చేసే వారే తప్పు చేస్తారు. వాటిని సరిదిద్దుకోవటం,అంగీకరించటం కంటే వుత్తమ లక్షణం మనకు చరిత్రలో కనిపించదు.
మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిజం గురించి ఫేస్‌బుక్‌లో ఇంత వివరణ అవసరమా అని ప్రశ్నించిన వారు కొందరు, వెనుక పట్టు పట్టింది కనుకనే సంజాయిషీలా వుందని మరికొందరు అంటున్నారు. ఎవరు ఏమైనా అనుకోవటానికి వారికి వున్న స్వేచ్ఛను ఎవరూ కాదనలేరు. చరిత్రను సంజాయిషీగా సమాజం భావించలేదు కనుకనే మనకు తరతరాల చరిత్ర లభ్యమౌతోంది. చరిత్ర లేకపోతే భవిష్యత్తే వుండదు. ఎన్నో రాజరికాలు వచ్చాయి, పోయాయి. రాజులు వచ్చారు పోయారు, ఎన్నో పార్టీలు పుట్టాయి గిట్టాయి. అనేక దేశాలలో ఆయా దశలలో ప్రముఖ పాత్ర పోషించి దీర్ఘకాలం పాటు అధికారంలో వున్న పార్టీలు నేడు మన దేశంలో కాంగ్రెస్ మాదిరి దిగజారి పోయి ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి.
సారవంతమైన భూమిని సరిగా దున్ని నిర్వహించకపోతే బిజెపి వంటి మెజారిటీ, మజ్లిస్ వంటి మైనారిటీ పిచ్చి మొక్కలు పుట్టి పెరిగి పెద్దవౌతాయి.వేల సంవత్సరాల మానవ జాతి నాగరిక చరిత్రలో జరిగిన ప్రతి పెద్ద మార్పూ సమాజం మరింత ముందుకు పోయేందుకే తోడ్పడిరది . చరిత్రను, పరిణామాలను వెనక్కు మళ్లించాలని విఫలయత్నం చేసిన శక్తులు తాత్కాలికంగా కొంతకాలం తమ ప్రాభవాన్ని కొనసాగించవచ్చు తప్ప చివరకు చెత్తబుట్టలోకి నెట్టిన చరిత్రే మనకు కనిపిస్తుంది. అందువలన సమాజం ముందుకు పోయేందుకు మన కృషి మనం చేస్తున్నామా లేదా అన్నదే గీటురాయిగా వుండాలి.
మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ బ్రిటీష్ వారి అణచివేతల మధ్యే పుట్టి పెరిగింది.అందుకే ముందుగా చెప్పుకున్నట్లు 1920 నాటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ నగరంలో కేవలం ఏడుగురితోనే ఏర్పడిరది. దాని మొదటి కార్యదర్శి మహమ్మద్ షఫీక్. కమ్యూనిస్టులు ప్రవాసంలో, మన దేశంలో మారు పేర్లతో వేరే పార్టీలలో పని చేయాల్సి వచ్చింది. కమ్యూనిస్టు పేరుతో బహిరంగంగా పనిచేసే అవకాశం లేదు. వివిధ గ్రూపులుగా, సంస్థలుగా పని చేశారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు వుద్యమంలోని ధోరణులతో కొన్ని సార్లు, మార్క్సిజం`లెనినిజాన్ని మన దేశ పరిస్ధితులకు అన్వయించటంలో అనుభవ లేమి వంటి అనేక కారణాలతో కమ్యూనిస్టులు పొరపాటు వైఖరులు తీసుకోవటం, సరిదిద్దుకోవటం పార్టీ చరిత్రలో అనేక సార్లు కనిపిస్తుంది.కష్టజీవుల విముక్తి పట్ల జవాబుదారీ తనంతో పనిచేస్తున్న కారణంగానే పార్టీ ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకొంటోంది తప్ప అవి వ్యక్తిగతమైనవో లేక కావాలని చేసినవో కాదు.
ఎవరైనా పని చేసే వారే తప్పు చేస్తారు. వాటిని సరిదిద్దుకోవటం,అంగీకరించటం కంటే వుత్తమ లక్షణం మనకు చరిత్రలో కనిపించదు. ఒక విజయం వెనుక ఎన్నో ఎగుడుదిగుడులు వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. విమానాన్ని కనిపెట్టింది ఎవరంటే వెంటనే చెప్పే సమాధానం రైట్ బ్రదర్స్ అని తెలిసిందే. వారికంటే ముందే ఎందరో చేసిన ప్రయోగాలు చివరికి వారికి అంతిమ విజయ దక్కేలా చేశాయి.ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఆద్యుడిగా బ్రిటన్‌కు చెందిన జార్జి కేలేను పేర్కొంటారు. ఆయన 1773లో పుట్టి 1799 నాటికే ప్రాధమిక విమానానికి రూపకల్పన చేశాడు. అంతకు ముందు, ఆ తరువాత కూడా ఎందరో ఎన్నింటినో అభివృద్ది చేశారు. అంతిమంగా రైట్ బ్రదర్శ్ 1903లో అంతకు ముందే ఎందరి కృషి ఫలితంగానో రూపొందిన విమానం ఎగరటానికి కీలకమైన ఏరోడైనమిక్ కంట్రోల్‌ను తాము కనుగొన్నట్లు వారు పేటెంట్ పొందారు. అది విమాన చరిత్రలో పెనుమార్పు తెచ్చింది. అందుకే వారికి విమానాన్ని కనుగొన్నారన్న ఖ్యాతి దక్కింది.
అలాగే మార్క్సిజం`లెనినిజం అనే ఒక శాస్త్రీయ తత్వశాస్త్రాన్ని విజయవంతంగా ఆయా దేశాలకు వర్తింపచేసి అమలు జరపటానికి అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రయోగం అంటేనే విజయాలు`అపజయాలు కలగలసి వుంటాయి.యుద్ధంలో అంతిమ విజయం సాధించామంటే అర్ధం అసలు యుద్ద రంగంలో అపజయాలు లేవని కాదు. భారత కమ్యూనిస్టు వుద్యమాన్ని కూడా అలాగే చూడాలి. కమ్యూనిస్టులు తప్పు చేసినా జనం వారి చిత్త శుద్ధిని శంకించకపోవటానికి అవి వ్యక్తిగతమైనవి కాదు, అవగాహన లోపాలు మాత్రమే.
ఒక సమగ్ర పార్టీగా రూపొందకుండా బ్రిటీష్ పాలకులు అడుగడుగునా అడ్డుకోవటం, ఎదురైన సమస్యలపై అభిప్రాయ బేధాలు, వాటిపై ఏకాభిప్రాయం, కొత్త సమస్యలు, కొత్త విబేధాలు ఇలా సాగిన ప్రస్తానంలో పార్టీ ప్రాధమిక రూపం ఏర్పడిన 23 సంవత్సరాల తరువాత గానీ 1943లో ప్రధమ మహాసభ జరుపుకోలేక పోయింది.ఆ సమయంలో పార్టీ సభ్యుల సంఖ్య కేవలం 15,563 మాత్రమే. అంతకు ముందు పెషావర్, కాన్పూరు, మీరట్ కుట్ర కేసులు కమ్యూనిస్టులను రాటుదేల్చాయి. మొదటి మహాసభ తరువాత రెండవ ప్రపంచ యుద్దం, కొత్త సమస్యలు. తొలి దశలో బ్రిటీష్ వారిని వ్యతిరేకించినప్పటికీ ఎపుడైతే సోవియట్ యూనియన్ హిట్లర్‌తో తలపడిరదో సోవియట్‌ను కాపాడుకోవటం ప్రపంచ కమ్యూనిస్టుల కర్తవ్యంగా భావించిన భారత కమూనిస్టులు దానిని ప్రజాయుద్దంగా పరిగణించారు, దానిలో బ్రిటన్ ప్రభుత్వం సోవియట్‌కు బాసటగా వుంది కనుక క్విట్ ఇండియా వుద్యమాన్ని వ్యతిరేకించారు. ఆ వైఖరి తప్పని తరువాత పార్టీయే స్వయంగా అంగీకరించింది.
ఆ మాటకు వస్తే కాంగ్రెస్ స్వాతంత్య్ర పోరాట కాలంలో ఎన్నిసార్లు బ్రిటీష్ వారితో రాజీపడలేదు, ఎన్నిసార్లు ప్రజావుద్యమాన్ని నీరు గార్చిందో చరిత్రలో నమోదయ్యే వుంది. కానీ ఆ నాయకత్వం తన తప్పిదాలను అంగీకరించిన నిజాయితీ మనకు కనపడదు. మన శతృవుకు శతృవు మనకు మిత్రుడనే అవగాహనతో మన స్వాతంత్య్రం కోసం సుభాస్ చంద్రబోస్ ప్రపంచ ప్రజల శతృవైన జర్మనీ సాయం కోరిన విషయం కూడా చరిత్రలో వుంది.ఆ చర్యను కమ్యూనిస్టులు విమర్శించారు తప్ప ఆయన చిత్తశుద్దిని శంకించలేదు. అలాగే కమ్యూనిస్టు క్విట్ ఇండియా వుద్యమం పట్ల పొరపాటు వైఖరి తీసుకున్నప్పటికీ అనేక చోట్ల సాగించిన పోరాటాలు కూడా ఆ కాలంలోనే జరిగాయి. అందుకే జనం కూడా కమ్యూనిస్టుల చిత్తశుద్దిని శంకించలేదు. వారి పిలుపు మేరకు లక్షలాది మంది కదలి వచ్చారు. అసమాన త్యాగాలు చేశారు. అందుకే తొలి పార్లమెంట్‌లో కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికయ్యారు.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)