• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

కరోనా మరణాలను దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే !

25 Friday Jun 2021

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, Health, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, COVID- 19 pandemic, excess corona death trends, Kerala Corona Deaths, Kerala LDF


ఎం కోటేశ్వరరావు


కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి ప్రభుత్వం అనేక అంశాలలో ముఖ్యంగా కరోనా నిరోధంలో చేస్తున్న కృషికి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండవ తరంగంలో అక్కడ పెద్ద ఎత్తున కేసులు పెరిగిన నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో సంఘపరివార్‌ మరుగుజ్జులు రెచ్చిపోయారు. కేరళ ఆదర్శం అన్నారు, కేసులు ఎందుకు పెరిగాయంటూ తమదైన పద్దతిలో ప్రచార దాడి చేశారు. దానికి కొందరు బలైపోయి ఉంటారు. అక్కడి ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించే వారిలో కూడా ఎందుకిలా పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమైన మాట నిజం. శత్రువులు ఎలా చూసినా మిత్రులు ఎలా ఆవేదన చెందినప్పటికీ కేరళ జనం వాటిని పట్టించుకోలేదు. పాలకులు, ప్రభుత్వ చిత్తశుద్దిని విశ్వసించి చరిత్రను తిరగరాస్తూ రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నది తెలిసిందే. ఆ రాష్ట్రముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కరోనా గురించి విలేకర్లతో మాట్లాడినన్ని రోజులు, నిర్వహించిన పత్రికా సమావేశాలు దేశంలో మరొకరెవరూ చేయలేదు. దేన్నీ దాచుకోలేదు,కేసులు ఎలా పెరగబోయేదీ ఆయనే చెప్పారు.


అన్నింటికంటే ముఖ్యవిషయం ఏమంటే దేశంలో మిగతా రాష్ట్రాలలో మాదిరి కరోనా మరణాలను, కేసులను కేరళ ప్రభుత్వం మూసిపెట్టలేదు. అలాచేసిన రాష్ట్రాలలో పరిస్ధితి ఎలా పాచిపోయిందో చూస్తున్నాము. సమాచార హక్కు కింద హిందూ పత్రిక సేకరించిన అధికారిక వివరాలు మరణాలను తక్కువ చేసి చూపిన రాష్ట్రాల బండారాన్ని బయటపెట్టాయి. కేరళ గురించి కూడా ఆ పత్రిక రాసిన విశ్లేషణ మరోసారి పినరయి ప్రభుత్వ నిజాయితీని నిర్ధారించింది. ఎక్కడైనా సాధారణ మరణాల రేటుకు ఒక ఏడాది ఒకటో రెండు శాతాలో ఎక్కువో తక్కువ ఉండవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా జరిగిన మరణాలు అధికారిక లెక్కలకు ఎక్కినా వాటిని కరోనా ఖాతాలో చూపలేదన్నదే అసలు సమస్య. తెలంగాణా వంటి చోట్ల అలాంటివి పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేరళలో నూటికి నూరుశాతం మరణాలు నమోదవుతున్నాయా అంటే లాక్‌డౌన్‌,తదితర అనేక కారణాలతో సహజమరణాలు కూడా కొన్ని సకాలంలో నమోదు కావటం లేదనే అభిప్రాయం ఉంది.
కేరళ విషయానికి వస్తే ఏటా నమోదౌతున్న సాధారణ మరణాల కంటే కరోనా సమయంలో మరణాల సంఖ్య తగ్గింది.

రాజధాని తిరువనంతపురంలో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మేనెల వరకు కరోనా మరణాలు 765 కాగా ఇదే కాలంలో సాధారణ మరణాలతో సహా మొత్తం మీద 646 తగ్గాయి. 2015 నుంచి 2019 వరకు సగటున ఏటా నగరంలో మరణాలు 16,652 కాగా 2020లో కరోనా ఉన్నప్పటికీ 14,734 మాత్రమే నమోదయ్యాయి. కరోనాను పక్కన పెట్టి మరణాల పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 18,340 వరకు పెరగాల్సింది, తగ్గాయి. ఒక్క రాజధాని నగరమే కాదు, మొత్తం రాష్ట్రంలో 2019తో పోల్చితే 2020లో 11.1శాతం తగ్గాయి. అయితే తాజా వివరాల ప్రకారం ఆ తగ్గుదల 7.9శాతంగా ఉంది. అంటే ఈ ఏడాది మరణాలు కొద్దిగా పెరిగాయి. అవి కరోనా మరణాలన్నది అధికారిక అంకెలే చెబుతున్నాయి. కేరళ మరణాల నమోదు నిబంధనల ప్రకారం మరణించిన 21 రోజుల్లోపల స్ధానిక సంస్ధలలో నమోదు చేసుకోవాలి. లేనట్లయితే ఆ ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. అందువలన ఆస్ధి, ఇతర వివాదాలు లేని మరణాలు నమోదు కాకపోవచ్చు. 2020లో లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో నమోదు ప్రక్రియ ఉండే శ్మశానాలలో తప్ప బయటివి నమోదు కానందున అధికారికంగా మరణాలు తగ్గినట్లు కనిపించవచ్చన్నది కూడా కొందరి అభిప్రాయం. దానిలో వాస్తవం కూడా ఉండవచ్చు.


కేరళలో మరణాల రేటు తగ్గటం అనేది ఇప్పుడే జరిగింది కాదు. గతంలో కూడా అలాంటి ధోరణి వ్యక్తమైంది. 2013లో రాష్ట్రంలో 2,53లక్షలు నమోదు కాగా 2014లో 12,621, 2015లో 3,920 తక్కువగా నమోదయ్యాయి. దీనికి రాష్ట్రంలో ఆరోగ్య సూచికల మెరుగుదల వలన సగటు జీవిత కాలం ఏడాదికేడాది పెరుగుతున్నది.అందువలన మరణాలు తగ్గుతాయి. 2021 జనవరి నుంచి మేనెలాఖరు వరకు పౌర నమోదు వ్యవస్ధ(సిఆర్‌ఎస్‌)లో ఉన్న సమాచారం మేరకు మొత్తం మరణాలు 1,13,372గా ఉన్నాయి. ఒక సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 2015 నుంచి 2019వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రతి ఏటా జనవరి-మే మాసాల మధ్య మరణించిన సగటు సంఖ్య 98,387. దీని ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఐదు నెలల్లో నమోదైన అధిక మరణాలు 14,535 అని, ఇదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరోనా మరణాలు 6,700గా ఉన్నందున 8,867 నమోదు గాని కరోనా మరణాలు అని, అయితే అవి ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ అని సదరు సంస్ధ పేర్కొన్నది. పైన పేర్కొన్న సంవత్సరాలలో మేనెల సగటు మరణాలు 19,600 అని ఈ ఏడాది మేనెలలో 28వేలుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.కేంద్ర ప్రభుత్వ సిఆర్‌ఎస్‌ సమాచారం ప్రకారం 2015-19 సంవత్సరాల మధ్య సగటు మరణాలు 1,08,425 మాత్రమే. దీని ప్రకారం చూస్తే అదనపు మరణాలు 4,950 మాత్రమే.

వివిధ మీడియా సంస్ధల విశ్లేషణ ప్రకారం కర్ణాటకలో 2021 జనవరి – జూన్‌ 15వ తేదీ మధ్య 1.02లక్షల మరణాలు నమోదయ్యాయి. అవి అధికారిక లెక్కల కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి-మే మాసాల మధ్య 1.3లక్షలు నమోదు కాగా అవి అధికారికంగా ప్రకటించిన వాటి కంటే 34 రెట్లు ఎక్కువ. తమిళనాడులో 1.29లక్షలు అదనం, అధికారిక లెక్కల కంటే 7.5 రెట్లు అదనం, తెలంగాణాలోని హైదరాబాదులో అధికంగా నమోదైనవి 14,332. కేరళలో అనేక మంది మరణించిన కుటుంబ సభ్యులను గృహ ప్రాంగణాలలోనే సమాధి చేస్తారని, అలాంటి వారు నమోదు చేయటం, ధృవీకరణ పత్రాలు తీసుకోవటం గానీ చేయరని, 2020లో లాక్‌డౌన్‌ కారణంగా నమోదు గణనీయంగా తగ్గి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం. 2018లో సాధారణ పరిస్ధితిలోనే సకాలంలో మరణ నమోదుశాతం 62శాతమే ఉంది.

రాజధానుల వివరాలను మాత్రమే చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రభుత్వం ప్రకటించిన కరోనా మరణాలు 13,346 కాగా అక్కడ సాధారణం కంటే ఎక్కువగా నమోదైనవి 31,029 ఉన్నాయి. అలాగే చెన్నయిలో 7,091కిగాను 29,910 ఉన్నాయి. హైదరాబాదులో సాధారణం కంటే 32,751 ఎక్కువ ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లుగా తిరువనంతపురంలో 765 కరోనా మరణాలు ఉన్నా మొత్తంగా 645 తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా మరణాలు గణనీయంగా పెరిగినట్లు కార్పొరేషన్‌ వివరాలు వెల్లడించాయి. వీటిలో పొరుగునే ఉన్న గ్రామాలు, కొల్లం జిల్లా, తమిళనాడు నుంచి చికిత్సకోసం వచ్చి మరణించిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఉదంతాలు మిగతా రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు.


సహజమరణాలు తగ్గటానికి జనాలు ఇండ్లకే పరిమితం కావటంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గటం, న్యుమోనియా, ఫ్లూ, నీరు, బయటి ఆహార సంబంధ వ్యాధులు పరిమితం కావటం దోహదం చేశాయని భావిస్తున్నారు. అన్నింటి కంటే వెంటనే స్పందించే ప్రజారోగ్య సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్ధ, వాటిని పని చేయించే, పట్టించుకొనే రాజకీయ నాయకత్వం ప్రధాన కారణం. అక్షరాస్యత, విద్యావంతులు ఎక్కువగా ఉండటం వెంటనే స్పందించటం, పరీక్షలు, గుర్తించటం కూడా మిగతా చోట్లతో పోలిస్తే ఎక్కువే.కరోనా కారణంగా కేరళలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గాయి. మిగతా రాష్ట్రాలలో కూడా అదే జరిగి ఉండవచ్చు.2016-19 సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 4,290 మంది మరణించగా 2020లో 2,979, ఈ ఏడాది జూన్‌ 21వరకు 1,423 నమోదయ్యాయి.


అనేక రాష్ట్రాలలో జరుగుతున్న మాదిరే కేరళలో కూడా కొన్ని తేడాలు ఉండవచ్చు. ఉదాహరణకు కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత ఇతర కారణాలతో మరణిస్తే లేదా కరోనా లక్షణాలు లేనందున గుర్తించటంలో పొరపాటు గావచ్చు, మరణించిన తరువాత కరోనా అని తేలితే దాన్ని ఏ తరగతి కింద నమోదు చేయాలి అన్నది అందరికీ అవగాహన కూడా లేకపోవచ్చు. ఇటీవల సుప్రీం కోర్టు కరోనా మరణ ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలని సూచించింది. ఆమేరకు అనేక రాష్ట్రాలలో కరోనా మరణాల సంఖ్యలను సవరిస్తున్నారు. కేరళలో కూడా అదే జరగవచ్చు, అయితే కేసులు స్వల్పంగా పెరుగుతాయి తప్ప మిగతా రాష్ట్రాలలో మాదిరి అసాధారణంగా ఉండవు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చితే వాటిని దాచని రాష్ట్రం కేరళ ఒక్కటే అన్నది స్పష్టం.

కరోనా మరణాల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో 1.3శాతం ఉండగా కేరళలో అది 0.44శాతమే ఉంది. దేశంలో వాస్తవ మరణాలను లెక్కిస్తే దేశ సగటు గణనీయంగా పెరుగుతుంది.కేరళలో తొలి దశలో కేసులు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ రెండవ దశలో ఎక్కువగా ఎందుకు పెరిగాయన్నది పరిశీలించాల్సిన అంశం అయితే, దేశంతో పోల్చినపుడు మరణాలు తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం. తొలి దశలో మాదిరే రెండవ దశలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసులు పెరిగాయి. ఆ దామాషాలో మరణాలు పెరగలేదు. రెండవ దశలో వేగంగా విస్తరించే డెల్టా రకం వైరస్‌ వ్యాప్తి ఒక కారణం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరణాలు ఎక్కువగా ఉండటానికి ఆరోగ్య వ్యవస్ధ మీద వత్తిడి పెరగటం అన్నవారు కొందరు. కేవలం నలభై రోజుల్లోనే రెండవ దశలో మరణాలు గణనీయంగా ఉన్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలతో ఇండ్ల దగ్గరే మరణించిన వారి వివరాలు కొన్ని ప్రభుత్వ వ్యవస్ధలో ఇంకా చేరాల్సి ఉండవచ్చని, అయినప్పటికీ సగటు, వాస్తవ మరణాల మధ్య తేడా తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం లేదన్నది కొందరి అభిప్రాయం. మిగతా రాష్ట్రాలలో మాదిరి కేరళ ప్రభుత్వం కూడా వివరాలను మూసి పెట్టి ఉంటే అక్కడి ప్రభుత్వాన్ని నిరంతరం స్కాన్‌ చేసి చూసే మీడియా ఈ పాటికి రచ్చ రచ్చచేసి ఉండేది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి కేరళలో కూడా వాస్తవ మరణాలు ఎక్కువ ఉండవచ్చని అమెరికా సంస్ద చేసిన విశ్లేషణను అక్కడి పత్రికలు ప్రకటించాయి తప్ప స్వంత కథనాలు లేవు.


కరోనా అనాధలకు ప్రభుత్వ ఆదరణ !


కరోనా కారణంగా తలిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు కేరళ ప్రభుత్వం మూడు రకాలుగా ఆదుకోవాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరి పేరు మీద మూడు లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. డిగ్రీ వరకు చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అప్పటి వరకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున గుర్తింపు పొందిన సంరక్షకులు-పిల్లల సంయుక్త బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కరోనాతో నిమిత్తం లేకుండా తలిదండ్రులలో ఒకరు మరణించినా, కరోనాతో మరొకరు మరణించి అనాధలైన పిల్లలకు కూడా ఈ పధకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ మరణించిన పిల్లలు 74 మంది ఉండగా, ఎవరో ఒకరు మరణించిన వారు వెయ్యి మంది ఉన్నారు.


కన్నూరులో సిపిఎం వినూత్న ప్రచార కార్యక్రమం !


కన్నూరు జిల్లాలో సిపిఎం వినూత్న కార్యక్రమం చేపట్టింది.” కొటేషన్‌ మాఫియా ”, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా జూలై ఐదున 3801 కేంద్రాలలో సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవి జయరాజన్‌ ప్రకటించారు. కేరళకు చెందిన వారు గల్ఫ్‌, ఇతర దేశాలలో ఉపాధి కోసం వెళ్లే వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. వారు తాము మిగుల్చుకున్న పొదుపుతో బంగారం, హవాలా పద్దతిలో నల్లధనాన్ని కేరళకు తీసుకువస్తారు. అలాంటి వాటిని విదేశాల నుంచి పంపి విమానాశ్రయాలు, ఇతర చోట్ల నుంచి తీసుకొని సంబంధిత వ్యక్తులకు చేర్చేందుకు ప్రయివేటు వారిని వినియోగించుకుంటారు. వీరినే కొటేషన్‌ గ్యాంగ్‌ అంటారు. ఇవి లెక్కల్లో చూపనివి కనుక అంతా నమ్మకం, రహస్య పద్దతుల్లో జరుగుతుంది. ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు ఇవే కొటేషన్‌ గ్యాంగులు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు ఒక కొటేషన్‌ గ్యాంగ్‌ మనుషులు బంగారం, డబ్బు తీసుకు వస్తున్న విషయాన్ని మరో గ్యాంగు పసికట్టిందనుకోండి. దారి మధ్యలో మొదటి గ్యాంగు నుంచి వాటిని కొట్టివేస్తారు. ఇలాంటి వారు నేరగాండ్లుగా, ముఠానేతలుగా మారి పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు సమకూర్చుకున్నవారున్నారు. బాధితులు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యవహారాల్లో ముఠాల మధ్య వివాదాలు చెలరేగి హింసాత్మక చర్యలకు పాల్పడటం, కొందరు మధ్యవర్తులుగా రంగంలోకి దిగటం, దుండగులు రాజకీయ పార్టీలను ఆశ్రయించటం పరిపాటిగా మారింంది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కోట్ల రూపాయలు ఈ మార్గాన ఇలాంటి కొటేషన్‌ గ్యాంగుల ద్వారా తెచ్చినవే. రాష్ట్రబిజెపి నేతలు గిలగిల్లాడిపోతున్న కొడక్కర హవాలా సొమ్ము దోపిడీ ఉదంతం దీనిలో భాగమే. ఒక ముఠా తెస్తున్న సొమ్మును మధ్యలో ఒక ముఠా అడ్డగించి సొమ్మును అపహరించింది. మూడున్నర కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నవారు కేవలం ఇరవై అయిదు లక్షల రూపాయల దోపిడీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు తీగలాగటంతో డొంకంతా కదిలి ఇంకా పెద్ద మొత్తంలోనే చేతులు మారినట్లు, ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు బయటపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మీదే ఈ సంబంధిత కేసు నమోదైంది. అనేక మంది యువకులు ఇలాంటి ముఠాల్లో చేరి నేరపూరిత చర్యల ద్వారా సులభంగా డబ్బు సంపాదించి తెల్లవారే సరికి పెద్దవారై పోవాలని చూస్తున్నారు. అందువలన తలిదండ్రులు తమ బిడ్డలు ఏమి చేస్తున్నారు, నేరగాండ్ల చేతుల్లో చిక్కుతున్నారా, విలాస వంతమైన జీవితం లేదా విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే వారికి ఆ సొమ్ము ఎలా వస్తున్నదీ చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని వివరిస్తూ సిపిఎం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. కొటేషన్‌ మాఫియా నిర్వాహకులు సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ తమ లావాదేవీలను పెంచుకొనేందుకు కుటుంబాలతో సంబంధాలను పెట్టుకుంటారు. వివాహాల వంటి సామాజిక, కుటుంబ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములౌతారు. వాటి మాటున తమ నేరాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారందరినీ సమాజం నుంచి వేరు చేయాలని సిపిఎం కోరింది.


మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి రాజీనామా !


కేరళ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు ఎంసి జోసఫిన్‌ రాజీనామా చేశారు. ఒక న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో అత్తింటి వేధింపులకు గురైన ఒక యువతి చేసిన ఫిర్యాదు సందర్భంగా స్పందించిన తీరు రాష్ట్రంలో తీవ్ర విమర్శలు, నిరసనలకు గురైంది. వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశావా అని జోసఫిన్‌ అడిగినపుడు లేదు అని యువతి సమాధానం చెప్పింది. అయితే అనుభవించు అని జోసఫిన్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఒక తల్లి మాదిరి అలా అన్నానే తప్ప మరొక విధంగా కాదని, తన వ్యాఖ్యకు విచారిస్తున్నానని ఆమె ప్రకటించారు. అయినా నిరసనలు ఆగలేదు, ఈ లోగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ అంశాన్ని చర్చించి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించటంతో శుక్రవారం నాడు ఆ మేరకు ప్రకటన చేశారు. జోసఫిన్‌ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. రాష్ట్రంలో చాలా కాలం తరువాత వరకట్న వేధింపులకు విస్మయి అనే యువతి బలైన ఉదంతం ఇదే సమయంలో రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించి, నిరసనలు వెల్లడవుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్య సామాజిక మాధ్యమం, రాజకీయ, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తియన్మెన్‌ స్క్వేర్‌ సంఘటనలు: ”తిరగరాసిన” చరిత్ర

24 Thursday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ 7 Comments

Tags

1989 Tiananmen Square protests, china communist party, Tiananmen square - Facts


యం. జయలక్ష్మి


జూన్‌ 24, 1989, చైనాపార్టీ వందేళ్ళ చరిత్రలో ఒక ముఖ్యఘట్టం. సోషలిస్టు చైనా నిలదొక్కుకోటానికి పునరంకితమైన రోజది. తూర్పుయూరపులో, సోవియట్‌ యూనియన్‌లో మాదిరే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతనమవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలను వమ్ముచేస్తూ చర్యలు తీసుకొన్న రోజు. 24వతేదీన ముగిసిన రెండురోజుల విస్త త ప్లీనరీ సమావేశంలో నాటివిద్యార్థి ఆందోళనపై ప్రధాని, పోలిట్‌ బ్యూరో సభ్యుడు లీపెంగ్‌ నివేదికను చర్చించి ఆమోదించారు. కేంద్రనాయకులు 557మంది పాల్గొని, ముఖ్యనిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రధానకార్యదర్శి జావోజియాంగుని అన్ని పదవులనుంచీ తొలగించారు. సంస్కరణలక్రమంలో ”బూర్జువా లిబరలైజేషన్‌”ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన నాలుగు మౌలిక సూత్రాలను పునరుదోటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంత త్వం, మా.లె.మావోసిద్ధాంత నేత త్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను పాటించని వారు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను నిర్వహించారని, ప్రజా చైనా, పార్టీ భవితవ్యాన్ని దెబ్బతీయటానికి, సామ్రాజ్యవాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్రస్వభావాన్ని అర్థంచేసుకోకుండా, దాన్ని బలపరిచి, ఆయనతోపాటు మరి కొద్దిమంది తీవ్రమైన తప్పుని చేశారని వివరించారు.


1989జూన్‌4 నాడు ”తియనన్మెన్‌ స్క్వేర్‌ లో పదివేలమంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని” ఒక విషప్రచారంతో అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు తమ కుట్రను కప్పిపెట్టుకో చూశారు. ఆ ఆందోళనను చైనా మరిచిపోయినా, అమెరికా, పశ్చిమదేశాలు, భారతీయమీడియా ఏటా జూన్‌ నెలలో గుర్తుచేస్తుంటాయి. కాగా చైనాపార్టీ నాడు చెప్పినదే మౌలికంగా సరైనదని చెప్పకనే చెప్పిన ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. దానిక్లుప్త పరిచయమే ఈ వ్యాసలక్ష్యం.
చైనావ్యతిరేక దుమారాన్ని తిరిగి ప్రోత్సహిస్తున్ననేటి బైడెన్‌ యుగంలో నాటిచరిత్రని ”తిరగరాసిన” పుస్తకం ” తియన్మెన్‌ స్క్వేర్‌ : ద మేకింగ్‌ ఆఫ్‌ ఏ ప్రొటెస్ట్‌ – ఏ డిప్లొమాట్‌ లుక్స్‌ బాక్‌ ” సాదాసీదా రచయిత కథనం కాదది: ఆనాడు చైనాలో ఇండియా దౌత్యవేత్తగా వుండిన చైనా నిపుణుడు, ప్రత్యక్షసాక్షి విజరు గోఖలే రాశారు. ఈ ఏడాది మేనెలలో విడుదలైన 181పేజీల (399రూ. హార్పర్‌ కాలిన్స్‌) పుస్తకం దౌత్యప్రపంచంలో సంచలనం. ఆతర్వాత భారత విదేశాంగశాఖ కార్యదర్శి అయిన గోఖలే కథనం విలువైనది, మరుగునపడిన అనేక వాస్తవాలను వెలికి తెచ్చినది అని గతంలో చైనాలో పనిచేసి, తర్వాత అదే పదవిని అలంకరించిన శ్యాంశరణ్‌, శివశంకరమీనన్‌ వంటివారు ప్రశంసించారు. ‘ఎంతోకాలంగా బైటపెట్టాలనుకున్న విషయాలివి. కానీ ”నేనున్న పరిస్థితులలో” కుదరలేదు’ ుఅని రాశారు గోఖలే. గతఏడాదే విదేశాంగ కార్యదర్శిగా రిటైరయ్యారు. .


ఆ ఘటనల గురించిన పాశ్చాత్య కథనాన్ని మీ పుస్తకంలో సవాలు చేశారు. అది ఎందుకు అవసరమయ్యింది? అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (మే23) విదేశీవ్యవహారాల నిపుణులు ప్రశ్నించారు. ఇరుపక్షాల మీడియా కూడా భావజాలపర పక్షపాతాలతో కూడివుంది. ఆ 50రోజుల ఘటనలను స్వంత అనుభవంతో చూశాను. నిజంగా ఏం జరుగుతున్నది అని పరిశీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్తలను వండి వడ్డించారు. చైనా విద్యార్థుల్లో కొందరు కూడా అందులో భాగమయ్యారు. వారు చెప్పినవి పూర్తి వాస్తవాలు కావు. ప్రశ్నించదగినవి, నాకు స్వయంగా తెల్సిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అవన్నీ నా కళ్ళు తెరిపించాయి. ఈమొత్తాన్ని పాశ్చాత్య మీడియా తమదైన రీతితో వక్రీకరించింది. అందుకే వీటిని బైటపెట్టాల్సిన అవసరముంది అని భావించాను అని గోఖలే జవాబిచ్చారు.


కరోనా గురించి చైనావ్యతిరేక పాశ్చాత్య దుమారం (భారత మీడియా దానికి యుద్ధోన్మాద భేరీలను జోడించి ప్రచారం చేస్తుంటుంది: స్వంత విలేకరుల కథనాలు దాదాపు లేవని ఈ వ్యవహారాలు ఏకాస్త తెల్సినవారయినా ఇట్టే గ్రహించగలుగుతారు) ఈ నేపధ్యంలో గోఖలే రచన ఎంతో ప్రాముఖ్యత కలిగినది. అమెరికా అంటే ప్రపంచవ్యాప్త దోపిడీదారనీ, పసిపిల్లలతో సహా లక్షలాది మంది పౌరులను బలిగొన్న యుద్ధోన్మాదరాజ్యం అనీ, ప్రత్యేకించి నల్లవారిని అణగదొక్కిన జాత్యహంకార పోలీసువ్యవస్థ కలిగినదనీ తెల్సినదే. వియత్నాంలో ఘోరమైనఓటమి (1975) తర్వాత అమెరికా మిలటరీ వెనక్కితగ్గిన కాలమిది.


చైనా విప్లవం, మావో విజయాలను అనుభవించడమేతప్ప, గతకాలపు అగచాట్ల, పోరాటాల లోతు తెలియని యువతరంవారి ఆందోళన తియన్మెన్‌ స్క్వేర్‌ సంఘటనలు. పాశ్చాత్య పెట్టుబడిదారీవిధానపు బూర్జువాప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు. 1970తర్వాత అమెరికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలోహలో అని పలకరించుకుంటున్న వాతావరణం. ఆతర్వాత పుట్టిపెరిగిన విద్యార్థితరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత త్వంల గురించిన పైపైఅవగాహనే వుంది. ”సంపూర్ణ పాశ్చాత్యీకరణ”ను, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ విగ్రహ నమూనాని కూడా తలకెత్తుకున్నారు కొందరు చైనావిద్యార్థులు.


ఆ నేపథ్యంలో నాటి చైనా నాయకత్వంలో ఒక ఆందోళన మొదలైంది. ””ఎర్ర జన్యువు”ని తర్వాతితరాలకి అందించాలి అని నేటి అధ్యక్షుడు జిన్పింగ్‌ అన్నారు. నాడూనేడూ కూడా ఈ ‘రెడ్‌ జీన్‌’ కీలక సంకేతం ు అన్నారు గోఖలే (టైమ్సులో). అభివ ద్ధి, సంపదలు, సౌకర్యాలు, టెక్నాలజీలన్నీ కలిసి ‘రెడ్‌ జీన్‌’ని పలుచనచేసేస్తాయేమో అన్నది ఒక అభిప్రాయం. డెంగ్‌ ఆర్థిక సంస్కరణలు మొదలై పదేళ్ళు దొర్లినాయి. విదేశీ, దేశీ పెట్టుబడిదారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది. ”చైనా తరహా సోషలిజం” పేరిట అనుసరించిన వ్యూహం-ఎత్తుగడల పట్ల అవగాహనలో గందరగోళం నెలకొనివుంది, ముఖ్యంగా యువతరంలోని పార్టీకేడర్లో, నాయకత్వంలో కూడా వున్నది. ఆనాటికే కొన్ని భ్రమలూ, అలజడులూ తలెత్తాయి. ఆ ప్రమాదాన్ని పసిగట్టే ”బూర్జువా లిబరలైజేషన్‌’కి వ్యతిరేకంగా చైనాపార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్నిసంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల చట్రానికి లోబడిమాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశికసూత్రాలను ప్రకటించారు(పార్టీ 13వ మహాసభలో, 1987అక్టోబరు). సంస్కరణలక్రమంలో పెచ్చరిల్లిన ”బూర్జువా లిబరలైజేషన్‌ ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన ఆ సూత్రాలను పునరుదోటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంత త్వం, మా.లె.మావోసిద్ధాంత నేత త్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం.


ఆ పరంపరలో వచ్చినవే తియన్మెన్‌ స్క్వేర్‌ సంఘటనలు.హఠాత్తుగా వచ్చినవి కాదు.
ఆర్థిక సంస్కరణలతో సోషలిస్టు చైనా ‘ ఉదారవాద (పెట్టుబడిదారీ) చైనా’గా మారిపోతుందని పాశ్చాత్యదేశాలు భావించాయి. అది తప్పుదారి పట్టిన పాశ్చాత్య ఊహ మాత్రమే అంటారు గోఖలే. 1989నుంచీ భారత విదేశాంగశాఖ, రాజకీయ నాయకత్వంకూడా దాన్ని విశ్వసించటంలేదు. ఆమాట పాశ్చాత్యులకు చెప్పాం కూడా. అయినా చైనా మార్కెటు, అక్కడ వస్తున్న లాభాలతో వారు మిన్నకుండిపోయారు అన్నారు గోఖలే(టైమ్స్‌).
”పాశ్చాత్యీకరించబడిన” ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు. దీన్ని భారతీయులు కూడా బాగా అర్థంచేసుకోవాలి. మనతో సరిహద్దు తగాదా చైనా కమ్యూనిస్టులు స ష్టించినది కాదు. అంతకుముందటి ”జాతీయ” చైనా, అమెరికా అనుకూల చియాంగ్‌ కై షేక్‌ కాలపు చైనా వైఖరీ ఇదే. వారెవ్వరూ మెక్‌ మహన్‌ లైనుని, సిక్కింని (దలైలామా కూడా 2008దాకా) గుర్తించలేదు అని ఎత్తిచూపారు గోఖలే.


ఆనాటి ఘటనల గురించి ఎన్నో కథనాలున్నాయి. భారత ద క్కోణం గల ”విశిష్టమైన కాంట్రిబ్యూషన్‌ ఈ పుస్తకం” అని ప్రశంసించారు సి.ఉదయభాస్కర్‌. ఆయన చైనా వ్యూహవ్యవహారాల నిపుణుడు, వ్యాఖ్యాత. ఇప్పటిదాకా చెప్పని కథనాన్ని ఎంతో నచ్చచెప్పేరీతిలో, ఆచితూచి రాసిన పుస్తకం అన్నారాయన. నేను కళ్ళారాచూసిన వాస్తవాలకు అన్వయంజోడించి, 30ఏళ్ళతర్వాత వెనక్కిచూసుకుంటే అర్థమయ్యేద ష్టితో రాసిన 10అధ్యాయాల పుస్తకం అని చెప్పుకున్నారు గోఖలే. ఆనాడు 500బిలియన్‌ డాలర్లున్న చైనా జీడీపీ నేడు 14000బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నవంతులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. డెంగ్‌ చూపెట్టిన, ఆతర్వాత నాయకులంతా అనుసరించిన మార్గంతో వారు ఈ స్థాయికి చేరారు. 1989తర్వాత నేటివరకూ అక్కడి యువతరం, విద్యార్థులు ఎన్నడూ నిరసన తెలిపే అవసరం రాలేదు. ఇప్పటి చైనామార్గం స్థానంలో ”ప్రజాస్వామ్యం పేరిట మరోవ్యవస్థని కోరుకుంటారేమోనన్న సూచనలేవీ మెజారిటీప్రజల్లో కన్పించటంలేదు” అని నిర్ధారించారు గోఖలే అని ఉదయభాస్కర్‌ చెప్పారు. పాశ్చాత్యదేశాలకు తమ తప్పులను గుర్తించటానికి 30ఏళ్ళు పట్టింది అంటారు గోఖలే.


ఆనాటి కొందరు విద్యార్థినేతలు ఎలాంటి వారంటే చాటుగా భోజనాలుచేస్తూ నిరాహారదీక్షలు చేసినవారు, పాశ్చాత్యదేశాల, మీడియాల ఆకర్షణ గలవారు అని గోఖలే రాశారు. నిజానికి నిరాహారదీక్షలు చేయరాదని విద్యార్థుల ఫెడరేషన్‌ తీర్మానించింది కూడా. అయినా ఒక నాయకుడు మీడియాముందు ఈ ”డ్రామాను” మొదలుపెట్టాడు. విద్యార్థులలోబాగా చీలిక వుండేదనీ, తమనితాము నాయకులుగా చెప్పుకునేవారు రహస్య ఎజెండాలతో ఎలాపనిచేశారో బయటపెట్టారు గోఖలే. సంస్కరణలగురించి పార్టీనాయకత్వంలో విభేదాలు, చర్చలు కొనసాగుతున్నకాలం. అలాంటి ఒక పొలిట్‌ బ్యూరో సమావేశంలో హుయావో బాంగ్‌ గుండెపోటుతో 15-4-1989న మరణించారు. డెంగ్‌ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్‌ వైపు మొగ్గిన నేత. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో ప్రధానకార్యదర్శిగా (16-1-1987) రాజీనామాచేసి, పొలిట్‌ బ్యూరోలో వుండగా మరణించారు. నాటి వాతావరణాన్ని, విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోశాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యంపోశాయి విదేశాలు, విదేశీమీడీయా. అలా ఏప్రిల్‌18-22న సంతాపంపేరిట వేలాదిమంది తరలివచ్చారు.అదే ముదిరి 50రోజులు కొనసాగింది. ప్రధానే మైదానంలోకివచ్చి తమతో చర్చలు జరపాలని మొండి డిమాండు పెట్టారు కొందరు. ప్రధాని లీపెంగ్‌ జనంమధ్యకి వచ్చి, నేలపైకూర్చొని మే18న జరిపిన సుదీర్ఘచర్చలను, ఫోటోలను ఆనాటి చైనా టీవీ, పత్రికలు ప్రచురించాయి.


300మందికిపైగా కీలకపార్టీ, ప్రభుత్వ నాయకులంతా వుండే కేంద్రస్థానం అది. వారి నివాసాలు, ఆఫీసులు, ప్రభుత్వ సెక్రటేరియట్‌ కూడా అందులోనే. అలాంటిస్థానాన్ని లక్షమంది విద్యార్థులు చుట్టుముట్టిన నెలతర్వాత, మే18న పొలిట్‌ బ్యూరో నిర్ణయంతో, మే20నగానీ మార్షల్‌ లా ప్రకటించలేదు. ఆతర్వాతే సైన్యప్రవేశం, కానీ నగరం వెలుపలే ఉంచారు. మే15-16న రష్యానేత గోర్బచేవ్‌ పర్యటన సందర్భంగా స్క్వేర్‌ లో కార్యక్రమాలకోసం మైదానాన్ని ఖాళీ చేయాలా అని చర్చించారు. కానీ చేయలేదు. జూన్‌ 3 రాత్రిదాకా ఒక్క బుల్లెట్‌ కూడా పేలలేదు. ప్రపంచ మానవాళి చరిత్రలో ఇలాంటి తిరుగుబాటుని అన్నిరోజులు అనుమతించిన రాజ్యం మరొకటిలేదు. ఏదైనావుంటే ఎవరైనా ఉదహరించవచ్చు. చర్చలద్వారా 90-95 శాతంమందిని నచ్చచెప్పి ఇళ్ళకు పంపేశారు. వారు పోగా ఇంకా 5నుంచి10వేలమంది దాకావుంటారు.
”మొత్తం” ఎంతమంది చనిపోయారు? చైనాలెక్క 300 (సైనికులతోసహా). జూన్‌3రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలోవున్నపుకార్లు: పదివేలమంది. అమెరికాగూఢచారి సంస్థ ఎన్‌ఎస్‌ఏ 500 మందిదాకా, యామ్నెస్టీ 1000దాకా, న్యూయార్క్‌టైమ్స్‌(జూన్‌21)400-800దాకా. స్క్వేర్‌ లో విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. నిజమే ‘ అక్కడ అలాంటి ఆధారాలేవీ లేవ’ని వాషింగ్టన్‌ పోస్టు, సిబిఎస్‌ విలేకరులు, ”అక్కడ ఎలాటి ఊచకోతనీ చూడలేద”ని సంఘీభావంగా జనంమధ్యేవున్న తైవాన్‌ విలేకరి, ”అక్కడ” రక్తపాతం జరుగలేదని 2011లో అమెరికా రాయబార కార్యాలయం పంపిన రహస్య కేబుల్స్‌ చెప్పాయి. పాశ్చాత్యకపటాన్ని చైనా నిర్దిష్టంగా బట్టబయలుచేసింది. దానితో కొన్ని ఏజెన్సీలు (వాయిస్‌ ఆఫ్‌ అమెరికా) తమతప్పులను కొంత అంగీకరించాయి. మరయితే జూన్‌ 3 రాత్రి ఏంజరిగింది? పూర్తివివరాలు ఈ పుస్తకంలోనూ లేవు. జర్నలిస్టిక్‌ నియమాలను తుంగలోతొక్కి ఊహాగానాలతో, రూమర్లతో, కట్టుకథలతో పాశ్చాత్యమీడియా పచ్చికపటంతో ఎలా వ్యవహరించిందో అద్భుతంగా వెల్లడించారు గోఖలే అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఈ ”తిరగరాసిన చరిత్ర”ని తరచి చూడాల్సిన అవసరం వుంది.

వ్యాస రచయిత్రి ఆంధ్రప్రదేశ్‌ కోపరేటివ్‌ బ్యాంకు మాజీ అధికారిణి

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి వ్యతిరేక కూటమి : వివిధ పార్టీల ముందున్న సవాళ్లు – అవకాశాలు !

23 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Anti BJP Front, CPI(M), Narendra Modi, Sharad Pawar, TMC


ఎం కోటేశ్వరరావు

జూన్‌ 22వ తేదీన న్యూ ఢిల్లీలో ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ నివాసంలో బిజెపిని వ్యతిరేకించే కొన్ని పార్టీలు, కొందరు మేథావుల ఇష్టాగోష్టి సమావేశం జరిగింది. దీనికి బిజెపి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా నిర్వహిస్తున్న రాష్ట్ర మంచ్‌ ఫోరమ్‌ పేరుతో ఆహ్వానాలు పంపారు. దీనిలో శరద్‌ పవార్‌, యశ్వంత సిన్హా, ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌) ఘనశ్యామ్‌ తివారీ (సమాజవాది), జయంత్‌ చౌదరి(ఆర్‌ఎల్‌డి), సుశీల్‌ గుప్తా (ఆప్‌), నీలోత్పల్‌ బసు( సిపిఎం) , వినరు విశ్వం( సిపిఐ), పవన్‌ వర్మ (జనతాదళ్‌-యునైటెడ్‌), మాజీ న్యాయమూర్తి ఎపి షా, ఆర్ధికవేత్త అరుణ్‌ కుమార్‌, మాజీ దౌత్యవేత్త కెసి సింగ్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొందరికి ఆహ్వానాలు పంపినప్పటికీ ఎవరూ రాలేదు. బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్న కాన్ని పార్టీలకు ఆహ్వానాలు అందిందీ లేనిదీ కూడా స్పష్టత లేదు. ఇది బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు కోసం జరిగిన రాజకీయ సమావేశం కాదని, కరోనా, నిరుద్యోగం, దేశంలోని వ్యవస్ధలపై జరుగుతున్నదాడుల వంటి అంశాల మీద ఆలోచనలను పంచుకొనేందుకు భావ సారూప్యత కలిగిన పార్టీల ప్రతినిధులు, వ్యక్తుల సమావేశం అని సిపిఎం నేత నీలోత్పల్‌ బసు చెప్పారు. మిగతావారు కూడా ఇదే పద్దతుల్లో మాట్లాడారు. అయితే ఇది రాజకీయ అంశమే అని జనం భావిస్తున్నారు. బిజెపి గురించి చెప్పాల్సిన పనిలేదు.


ఇప్పటి వరకు దేశంలో జరిగిన పరిణామాలను, ముఖ్యంగా సంకీర్ణ రాజకీయ ప్రక్రియను చూసినపుడు నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటి వన్నీ ఎన్నికలు, అధికారం చుట్టూనే తిరిగాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మొత్తం మీద నయా ఉదారవాద విధానాలను అమలు జరపటం తప్ప వాటి పర్యవసానాలకు ప్రత్నామ్నాయ విధానాలు లేవు. సంకీర్ణ ధర్మం కారణంగా తమ అసలు సిసలు విధానాలను అమలు జరపలేమని ఏ పార్టీ కూడా ఇప్పుడు చెప్పటానికి లేదు. ఎవరితో నిమిత్తం లేకుండానే బిజెపికి గత రెండు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చింది. రాజ్యసభలో కూడా అవసరమైన మెజారిటీ చేకూర్చేందుకు ఇతర పార్టీలు సిద్దంగా ఉన్నట్లు స్పష్టమైంది. అయినప్పటికీ గతంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన సంస్కరణలను మరింత వేగంగా, అమానవీయంగా అమలు జరపటం తప్ప కొత్త విధానాలేమీ లేవు. అందువలన ప్రత్యామ్నాయ విధానాలతో నిమిత్తం లేని ఫ్రంట్‌ మరొకటి ఉనికిలోకి వచ్చినా ప్రయోజనం ఏమిటి అన్నది ప్రశ్న.


గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించటం వెనుక దాని అవినీతి అక్రమాలే కాదు, జనానికి ప్రయోజనం లేని విధానాల పర్యవసానం కూడా ఇమిడి ఉంది. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం గానీ గతంలో ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో కూడా అలాంటిదే. ఇందిరా గాంధీ పార్టీలో తన ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు దాన్ని ముందుకు తెస్తే, కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే పేరుతో నరేంద్రమోడీ కొత్త నినాదాలిచ్చారు. తన ప్రయోజనాల కోసం అధ్యక్ష తరహా పద్దతుల్లో ప్రధాని అభ్యర్ధి అంటూ గతంలో వాజ్‌పారు, తాజాగా నరేంద్రమోడీని బిజెపి రంగంలోకి తెచ్చింది. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో ఒక ఫ్రంట్‌ ఏర్పడవచ్చేమోగానీ ప్రధాని అభ్యర్ధిని అంగీకరించే అవకాశాలు లేవు.అది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం.


శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు కొత్తవి కాదు. గతంలో కూడా ఉన్నాయి, అయినప్పటికీ గత ఏడు సంవత్సరాలలో ఇలాంటి సమావేశాలు ఎందుకు జరగలేదు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. సమావేశంలో పాల్గొన్నవారు లోపల ఏమి చర్చించారు, బయటికి ఏమి చెప్పారన్నదానిని పక్కన పెడితే ఇది బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పడాలన్న వాంఛ నేపధ్యంలోనే జరిగిన ప్రయత్నమన్నది స్పష్టం. అయితే అది రూపుదిద్దుకుంటుందా ? తీరుతెన్నులు ఎలా ఉంటాయి ? ఆటంకంగా ఉన్న అంశాలేమిటి ?ఎదురయ్యే సవాళ్లేమిటన్న వాటి గురించి రాబోయే రోజుల్లో చర్చ ప్రారంభం అవుతుంది. మరి ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదా ? ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుందని చెప్పలేము. గతంలో ఏర్పడిన ఫ్రంటులు, సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ఫలితాలు, వైఫల్యాలూ అన్నీ పార్టీలు, మేథావుల అన్నింటికీ మించి జనం ముందు ఉన్నాయి. వాటిని విస్మరించి ఏ ప్రయత్నమూ సఫలం కాదు.


దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత రెండు దశాబ్దాలకు తొలిసారిగా కాంగ్రెస్‌ వ్యతిరేకత అంశం ముందుకు వచ్చింది. 1967లో తొలిసారిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఒక్కటై పార్లమెంట్‌ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో ఐక్యంగా పోటీ చేశాయి. తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ తొలిసారిగా ఓడిపోయింది. వాటిని కూల్చివేయటంతో కాంగ్రెస్‌ వ్యతిరేకత బాగా పెరిగింది.


బిజెపి పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన 2014 ఎన్నికలు మూడు ఫ్రంట్ల మధ్య పోటీగా జరిగాయి. ఒకటి బిజెపి నాయకత్వాన ఉన్న నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌, కాంగ్రెస్‌ నాయకత్వాన యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపిఏ), కాంగ్రెస్‌ను తిరస్కరించండి, బిజెపిని ఓడించండి అనే పిలుపుతో వామపక్షాలు ఒక ఫ్రంట్‌గా విడిగా పోటీ చేశాయి. అందువలన కాంగ్రెస్‌కు భిన్నంగా బిజెపి వ్యతిరేక కూటములు ప్రారంభం నుంచీ ఉన్నాయి. ఇంకా పదేండ్లు ముందుకు పోతే కాంగ్రెస్‌కు అవసరమైన మెజారిటీ లేని కారణంగా బిజెపిని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు వామపక్షాలు యుపిఏ కూటమికి మద్దతు ఇచ్చిన అంశాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు. అందువలన బిజెపి వ్యతిరేకత అన్నది అది తొలిసారి అధికారానికి వచ్చినప్పుడే అంకురించింది. సరికొత్త ఆలోచన అయితే కాదు.


కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది ఆ పార్టీ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, అన్నింటికీ మించి రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల పట్ల అనుసరించిన కక్ష పూరిత వైఖరి, రాష్ట్రాల పట్ల అనుసరించిన విధానాల వంటి వాటి ప్రాతిపదికన ప్రారంభమైంది. 1975లో అత్యవసర పరిస్ధితిని విధించి మొత్తం ప్రజాస్వామిక హక్కులకే ముప్పుగా తయారైన నేపధ్యంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది మరింత స్పష్టంగా ముందుకు వచ్చింది. ఆ సమయంలో రాజకీయంగా తనను వ్యతిరేకించిన పార్టీలు, వ్యక్తులు, శక్తులను అది జైలు పాలు చేసింది. అందువల్లనే అనంతరం జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన జనతా పార్టీలో సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) పూర్వ రాజకీయ విభాగమైన మతశక్తి జనసంఘం, స్వతంత్ర పార్టీ వంటి మితవాద శక్తులు ఉన్నప్పటికీ సిపిఎం దాన్ని బలపరిచేందుకు వెనుకాడలేదు.


గత ఏడు సంవత్సరాల కాలంలో బిజెపి ఒక్క అత్యవసర పరిస్ధితి విధింపు మినహా మిగతా అన్ని రకాల ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల కూల్చివేతలకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర దర్యాప్తు సంస్దల దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం వంటి అంశాలన్నీ ఉన్నాయి. వీటితో పాటు మతోన్మాద మహమ్మారిని ముందుకు తెచ్చింది. వివిధ ఉద్యమాల్లో తన విధానాలను వ్యతిరేకించిన వారి మీద ఉగ్రవాద, దేశద్రోహ నేరాలను మోపుతూ తమను వ్యతిరేకిస్తే అందరికీ ఇదే గతి అని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక చేసింది. కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి పాలనకు వ్యతిరేకత పెరిగే కొద్దీ అది రాజకీయ పార్టీలకు విస్తరించే రోజు ఎంతో దూరంలో లేదు. అందువలన వీటిని వ్యతిరేకించే శక్తులన్నీ సహజంగానే ఐక్యం కావాలని కోరుకుంటాయి. అలాంటి వాంఛకు నిదర్శనమే శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశం. కరోనా రెండవ దశను నిర్లక్ష్యం చేయటం, వచ్చిన తరువాత అయినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడకపోవటం అన్నింటినీ మించి ఆక్సిజన్‌, వాక్సిన్ల విషయంలో సుప్రీం కోర్టులో తగిలిన ఎదురుదెబ్బల గురించి తెలిసిందే. ఈ సమయంలోనే ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బిజెపి బలహీనత, దాన్ని వ్యతిరేకించే శక్తుల బలం వెల్లడైంది. బిజెపి వ్యతిరేక శ క్తుల సమావేశానికి పురికొల్పిన అంశాలు ఇవే. వచ్చే ఏడాది జరిగి ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను బట్టి ఈ ప్రయత్నాలు ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పవచ్చు.


గత అనుభవాలను చూసినపుడు కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమిలోకి వచ్చేందుకు బిజెపి ఎన్నడూ తటపటాయించలేదు. అధికారం కోసం ఎవరితో అయినా చేతులు కలిపేందుకు అది అర్రులు చాచింది. రాజకీయంగా ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తపించి పోయింది. తన అజెండాను దాచుకోకపోయినా ముందుకు తేకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు దాన్నే ముందుకు తెచ్చి అమలు చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాల వివాదంలో తాము సంఘపరివార్‌ను వదులుకొనేది లేదని బహిరంగంగా ప్రకటించి జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘం విడిపోయి బిజెపి పేరుతో కొత్త దుకాణం తెరిచింది. ఈ కారణంగానే తరువాత కాలంలో దానికి ఉన్న మతోన్మాద లక్షణం కారణంగా వామపక్షాలు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. (పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమన్వయం చేసుకోవటం వేరు ) మిగతా పార్టీలు మతకోణాన్ని పక్కన పెట్టి అవకాశవాదంతో దానితో చేతులు కలిపాయి. ఇప్పుడు అవి తమ వైఖరిని తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.


బిజెపి వ్యతిరేక కూటమి విషయానికి వస్తే గతంలో బిజెపి లేదా దాని పూర్వ రూపం జనసంఘం మాదిరి ఎవరితో అయినా కలవటానికి ముందుకు వచ్చినట్లుగా కాంగ్రెస్‌ రావటం లేదు. రాజకీయంగా బలహీనపడినప్పటికీ తన షరతుల మీద నడవాలని అది కోరుకుంటోంది. అందుకే ఉత్తర ప్రదేశ్‌లో బిజెపిని వ్యతిరేకించే శక్తులతో రాజీపడేందుకు సిద్దం కావటం లేదు. వాస్తవ పరిస్ధితిని గుర్తించేందుకు సిద్దంగా లేదు. ఇతర పార్టీలతో నిమిత్తం లేకుండా తానే ఏక పార్టీగా చక్రం తిప్పగలననే భ్రమలతో ఉంది.బలంగా ఉన్న చోట్ల ఇతర పార్టీలను ఖాతరు చేయటం లేదు. తొక్కివేసేందుకు వెనుకాడటం లేదు. అయితే ఎంత బలహీనపడినప్పటికీ బిజెపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్‌ లేకుండా లక్ష్యం నెరవేరదు.
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే రెండు రకాలు. గతంలో కాంగ్రెస్‌ బాధిత పక్షాలు,సహజంగానే కాంగ్రెస్‌ వ్యతిరేకతకు ముందుకు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చివేసిన కారణంగానే తరువాత ఎన్‌టి రామారావు దానికి కేంద్రంగా మారారు. అయితే కాంగ్రెస్‌ బలహీనపడిన తరువాత అవే పార్టీలు బిజెపితో అవకాశవాదంతో జట్టు కట్టాయి. అలాంటి వాటిలో తెలుగుదేశం పార్టీ ఒకటి. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీ కాంగ్రెస్‌తో కూడా చేతులు కలిపింది. గత ఎన్నికల్లో బిజెపిని వ్యతిరేకించింది. ఇప్పుడు తిరిగి ఆ పార్టీతో సంబంధాలకు తహతహలాడుతోంది.


మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి కూడా కూడా అవకాశవాదానికి మారుపేరుగా ఉంది. సమాజవాది పార్టీతో మిత్రపక్షంగా ప్రారంభమై శత్రుపక్షంగా మారింది. గతలోక్‌సభ ఎన్నికల్లో తిరిగి జట్టుకట్టింది. ఇప్పుడు దానితో కలిసే పరిస్ధితి లేదు. అదే విధంగా ముఖ్యమంత్రి పదవికోసం బిజెపితో చేతులు కలిపింది. రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. అదే పార్టీతో వైరమూ పెట్టుకుంది. యుపిఏ ప్రభుత్వానికి గతంలో మద్దతు ఉపసంహరించుకుంది.
శివసేన విషయానికి వస్తే అది బిజెపి బాధిత పార్టీ. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గతంలో బిజెపితో చేతులు కలిపింది, కేంద్ర మంత్రి పదవులను కూడా దక్కించుకుంది.తరువాత అధికారం దగ్గర పంచాయతీ వచ్చి బిజెపితో పోరాడాల్సి వచ్చింది. బిజెపి బాధిత పార్టీగా మారింది. తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు దాసోహం అంటున్నాయి. ఒడిషాలో బిజెడి ఎటూ తేల్చుకోలేని స్ధితిలో ఉంది. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌-బిజెపిలను రెండింటినీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటుంది. కానీ కేంద్రంలో బిజెపి తీసుకొనే అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇస్తుంది. వైసిపి విషయానికి వస్తే కాంగ్రెస్‌తో దానికి పేచీ లేదు. ఆ పార్టీని అంతం చేసి వచ్చింది. అధికారానికి వచ్చిన తరువాత బిజెపితో సమస్యలున్నప్పటికీ దానికి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ముందుకు వస్తుందా అంటే అనుమానమే. బిజెపిని సమర్ధించే విషయంలో బిజెపితో పోటీ పడుతోంది.


పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలు లేవు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యశ ్వంత సిన్హా ఆహ్వానం మేరకు ఇతర పార్టీలతో పాటు సమావేశానికి హాజరైనప్పటికీ ఆ పార్టీ ఉండే కూటమిలో చేరటం అనుమానమే. కర్ణాటకలో జెడిఎస్‌ పార్టీ కూడా అవకాశ వాదంతో వ్యవహరించింది. అధికారం కోసం బిజెపి-కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపేందుకు అది సిద్దం. కనుక ఇప్పటికిప్పుడు బిజెపి వ్యతిరేక కూటమి రూపుదిద్దుకోవటం అనేక సమస్యలతో కూడి ఉంది.

కరోనా రెండవ దశ తగ్గుముఖం పట్టి బిజెపిని రాజకీయంగా కొంత మేరకు రక్షించింది. అయితే దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితి రాబోయే రోజుల్లో అసలైన పరీక్ష పెట్టనుంది. బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటుకు అది కూడా దోహదం చేస్తుంది. గతంలో ఇందిరా గాంధీ తన అధికారానికి ఎసరు వచ్చినపుడు రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సంఘపరివార్‌ తన అజెండాను అమలు జరిపేందుకు అధికారంలో కొనసాగాలని కోరుకుంటోంది. అందువలన ఒక వేళ ఎన్నికల్లో ఓటమి తధ్యమని తేలితే ఎంతకైనా తెగించినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో అదే జరిగింది. అందువలన ప్రస్తుతానికి ఊహాజనితమైన ప్రశ్నే అయినప్పటికీ అధికారం కోసం ఏమైనా చేయవచ్చు. అదే జరిగితే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాల ప్రాతిపదికన ఏకీకరణ జరుగుతోంది. మన దేశంలో కూడా అలాంటి మధనం జరగాలి. దానికి శరద్‌ పవార్‌ నివాసంలో నిర్వహించిన సమావేశం నాంది పలికితే దాని ప్రాధమిక ప్రయోజనం నెరవేరినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేను గాని ఈలవేస్తే……బిజెపికి కొరకరాని కొయ్య కర్ణాటక యడియూరప్ప !

20 Sunday Jun 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BJP Dynastic Politics, BJP Karnataka rumble tumble, BS Yediyurappa, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


రెండు తెలుగు రాష్ట్రాలకూ పొరుగు అయిన కర్ణాటకలో ఏమి జరుగుతోంది ? బిజెపి రాజకీయ నాటకంలో పాత్రధారులెవరు, సూత్రధారులెవరు ? టీవీ సీరియల్‌ మాదిరి ఎంత కాలం సాగనుంది ? తాజాగా ముగిసిన భాగంలో పాత్రధారులు చెప్పిందేమిటి ? అధిష్టానం ఎప్పుడు దిగమంటే అప్పుడు దిగుతా అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్‌ ఎడియూరప్ప. లేదు, ఆయన పూర్తి పదవీ కాలంలో ఉంటారు, మార్పులేదు అన్నారు కేంద్ర పార్టీ ప్రతినిధి అరుణ్‌ సింగ్‌. మేము వెనక్కు తగ్గేది లేదు అంటున్నాయి ఇతర పాత్రలు.మొత్తం మీద మూడు ముక్కలాట నడుస్తోంది.


బిజెపి ఎంఎల్‌ఏలు, మంత్రులు లేవనెత్తుతున్న అవినీతి ఆరోపణలు, పాలనా వ్యవహారాల్లో ఎడియూరప్ప కుమార రత్నం జోక్యం గురించి పార్టీ అధిష్టానం మాట్లాడటం లేదు. ఆల్‌ ఈస్‌ వెల్‌ (అంతా సజావుగా ఉంది) అంటోంది. పాచిపోతుందని తెలిసినా ఇద్దరు ముగ్గురు ఎంఎల్‌ఏలు చేస్తున్న రచ్చ తప్ప మరింకేం లేదని మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి యడియూరప్ప బిజెపి కేంద్ర నాయకత్వానికి, ముఖ్యంగా తిరుగులేని మోడీ-అమిత్‌ షా ద్వయానికి కొరకరాని కొయ్యగా మారారా ? దేశంలోని పరిస్ధితులు వారిని బలహీన పరిచాయా ?

కర్ణాటకలో కరోనా ఎలా విజృంభించిందో ఎంత మంది మరణించారో, మరణాలను ఎలా దాచిపెట్టారో లోకానికి తెలిసిందే. అభివృద్ది పనులేమీ లేవని బిజెపి వారే చెబుతున్నారు గనుక వివాదం లేదు. డెబ్బయి అయిదు సంత్సరాలు దాటిన వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదన్నది స్వయంగా బిజెపి విధించుకున్న నిబంధన అని అమిత్‌ షా వంటి వారు చెప్పారు. దాని వెనుక ప్రధాని పదవి రేసు నుంచి ఎల్‌కె అద్వానీ తప్పించే ఎత్తుగడ ఉందంటారు. అసలీ నిబంధన నిర్ణయం ఏ సమావేశంలో జరిగిందో తనకు తెలియదని, అమిత్‌ షానే చెప్పాలని లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గతలోక్‌ సభ ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించారు. ఆ నిబంధనను చూపి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ను, కేంద్ర మంత్రి నజమా హెప్తుల్లాను పదవుల నుంచి తప్పించారు. కానీ అదే బిజెపి పెద్దలు 75 ఏండ్లు దాటిన తరువాతనే యడియూరప్పను మరోమారు కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించారు ( లేకపోతే ఆయనే గద్దెనెక్కితే ఆమోద ముద్రవేశారు). కేరళలో యడియూరప్పకంటే పదేళ్ల పెద్ద అయిన 88 ఏండ్ల మెట్రో మాన్‌ శ్రీధరన్‌ పిళ్లేను ఎన్నికల్లో నిలపటమే కాదు, ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించారు. నిజానికి ఈ రెండూ ఆ పార్టీ ప్రవచించిన స్వయం ప్రవర్తనా నియమావళికి విరుద్దమైనవే.మోడీ-షా ద్వయం తమకు వ్యతిరేకం లేదా ఎవరినైనా దెబ్బతీయాలనుకుంటే ఈ నిబంధనను ముందుకు తెస్తారు. 2014 ఎన్నికల్లో సీట్లు ఇచ్చినప్పటికీ అద్వానీ, మురళీ మనోహర జోషిని ఈ నిబంధన చూపే దూరంగా పదవులకు దూరంగా పెట్టారు. అన్నింటికంటే అవమానం ఏమిటంటే ఇలాంటి వయస్సు మీరిన వారందరితో ఒక మార్గదర్శక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అది ఏడు సంవత్సరాలలో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, మార్గదర్శనం చేయాలని అడిగిన వారు లేరు.

ఎడియూరప్పకు ఇప్పుడు 78 సంవత్సరాలు, ఆ నిబంధనకు మినహాయింపు ఇస్తే కారణం ఏమిటో చెప్పాలి, ఎలాంటి ప్రకటన, వివరణ లేకుండానే ముఖ్యమంత్రిగా ఆమోదించారు, కొనసాగిస్తున్నారు. అధిష్టానం ఏమి చెప్పినప్పటికీ కర్ణాటక బిజెపి వ్యవహారాలు వీధుళాలకెక్కాయి. కుమారుడే తెరవెనుక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందున యడియూరప్పను తప్పిస్తే తప్ప తాము వెనక్కు తగ్గేది లేని వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. ఎంఎల్‌సి హెచ్‌ విశ్వనాధ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఎడియూరప్పకు వయసైపోయింది, ఆరోగ్య సమస్యలున్నాయి, కుటుంబ సభ్యులు పాలనలో జోక్యం చేసుకుంటున్నారు, ముఖ్యంగా కుమారుడు విజయేంద్ర అన్ని శాఖలల్లోనూ వేలు పెడుతున్నారని ఆరోపించారు. అయితే విశ్వనాధ్‌ ప్రకటన వ్యక్తిగతం పార్టీకి సంబంధం లేదని, యడియూరప్పే ముఖ్యమంత్రి అని కేంద్ర ప్రతినిధి అరుణ్‌ సింగ్‌ ఇప్పటికే చెప్పారని బళ్లారి మంత్రి బి శ్రీరాములు సిఎంకు మద్దతుగా ప్రకటించారు. జెడిఎస్‌ నుంచి ఫిరాయించిన వారిలో విశ్వనాధ్‌ ఒకరు. వీరశైవ సామాజిక తరగతి నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని కోరుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల వ్యవధి ఉంది. అందువలన కొత్త ముఖంతో ఎన్నికలకు పోవాలన్నది వ్యతిరేకుల ప్రతిపాదన. అదే చేస్తే అసలు ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉందని కేంద్ర పెద్దల భయం.


కరోనా నిరోధంలో ముఖ్యమంత్రి పని తీరు బాగుందని, పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీ అధిష్టానానికి విధేయులుగా ఉండాలని, ఎవరికైనా సమస్యలుంటే నాతో మాట్లాడాలి తప్ప బహిరంగ ప్రకటనలు చేయకూడదు, ఎవరైనా అలా చేస్తే సంజాయిషీ కోరతాం అని కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌ సింగ్‌ చెప్పారు. ఇద్దరు ముగ్గురు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, వారిలో ఒకరికి బిజెపి సంస్కృతి గురించి తెలియదని అన్నారు. మూడు రోజుల పాటు బెంగళూరులో మకాం వేసి మంత్రులు, ఎంఎల్‌ఏలతో చర్చలు జరిపారు. అంతకు ముందు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప ముఖ్యమంత్రి నియంత పోకడల మీద గవర్నర్‌కు ఐదు పేజీల లేఖ రాశారు. పర్యాటక శాఖ మంత్రి సిపి యోగేశ్వర్‌ స్వయంగా ముఖ్యమంత్రి మీద ధ్వజమెత్తారు.ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. మంత్రులను పార్టీ గానీ, ముఖ్యమంత్రిగానీ ఇంతవరకు ఎలాంటి సంజాయిషీ కోరలేదు. ముఖ్యమంత్రి మార్పు గురించి డిమాండ్లు వస్తుండటంతో యడియూరప్పకు మద్దతుగా 65 మంది సంతకాలు చేసినట్లు సిఎం రాజకీయ కార్యదర్శి, ఎంఎల్‌ఏ రేణుకాచార్య ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు శాసనసభా పక్ష సమావేశం జరపాలని కొందరు ఎంఎల్‌ఏలు డిమాండ్‌ చేసిన నేపధ్యంలో సంతకాల కార్యక్రమం చేపట్టారు.

గతంలో యడియూరప్ప మార్పు గురించి అనేక తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో తాజాగా మే రెండవ తేదీ తరువాత ఎప్పుడైనా ఆయన ఉద్యోగం ఊడుతుందని చెప్పారు. ” సూర్యుడు-చంద్రుడు ఉన్నంత వరకు యడియూరప్ప ముఖ్యమంత్రగా ఉంటారని కొందరు చెబుతున్నారు.అదెలా సాధ్యం, 2023లో కూడా ముఖ్యమంత్రిగా ఉంటారా ? 75 సంవత్సరాల వయోపరిమితి నిబంధన వర్తించదా ? ఇప్పటికే రెండు సంవత్సరాల బోనస్‌ పొందారు. అందుకుగాను పార్టీకి కృతజ్ఞతలు చెప్పాలి, ఏప్రిల్‌ 17 తరువాత స్వచ్చందంగా వైదొలగాలి, మే రెండవ తేదీ తరువాత మార్పు ఏ రోజైనా మార్పు జరగనుంది. ఉత్తర కర్ణాటక నుంచి ఒకరు ముఖ్యమంత్రి అవుతారు ” అని సీనియర్‌ బిజెపి ఎంఎల్‌ఏ బసన్‌గౌడ పాటిల్‌ ఏప్రిల్లో విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఏప్రిల్‌ 17న బెలగామ్‌ లోక్‌సభ, బసవకల్యాన్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌, మే రెండవ తేదీన ఫలితాల ప్రకటన గనుక ఆ తేదీలను బసవన గౌడ ప్రకటించారు. అంతకు ముందు ఇలాంటి ప్రకటనలే చేసినందుకు సంజాయిషీ లేఖ ఇచ్చినప్పటికీ వెనక్కు తగ్గకుండా బహిరంగ దాడికి దిగారు. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలు, బదిలీల మాఫియా గురించి, హైకోర్టు మందలింపుల గురించి పార్టీ అధిష్టానానికి తెలుసు అని కూడా గుర్తు చేశారు.పక్షం రోజుల క్రితం కూడా బసన్‌గౌడ తన దాడిని కొనసాగించారు.ముఖ్యమంత్రిని మార్చటం తధ్యం, ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళితే ఓటమి ఖాయం, కర్ణాటకలో పార్టీ బతకాలంటే బయటకు పంపేయాల్సిందే అన్నారు.


అందరికీ తెలిసిన అంశం కుక్క తోకను ఆడిస్తుంది తప్ప తోక కుక్కను ఆడించదు. కానీ కర్ణాటకలో రెండోదే జరుగుతోంది. యడియూరప్పే పార్టీని నిర్దేశిస్తున్నారు. 2019లో కాంగ్రెస్‌-జనతాదళ్‌ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత జరిగింది అదే. అంతకు ముందు బళ్లారి ఇనుప ఖనిజం కుంభకోణంలో యడియూరప్ప ప్రమేయం కారణంగా 2011లో ముఖ్యమంత్రి పదవి నుంచి కేంద్ర పార్టీ తొలగించింది. దాంతో బయటికి వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు, బిజెపి ఓటమే ధ్యేయంగా పని చేశారు. 2013 ఎన్నికల్లో అదే జరిగింది. తరువాత యడియూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు, పూర్తి అధికారాలు ఇచ్చారు. 2014లో నరేంద్రమోడీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన తరువాత మిత్ర పక్ష పార్టీల పట్ల, అదే విధంగా రాష్ట్రాల్లో బిజెపి వ్యవహారాల్లోనూ మోడీ-షా ద్వయం మాటకు తిరుగులేకుండా పోయింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారానికి అవసరమైన సీట్లు తగ్గాయి. కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది. తరువాత అసలు కథ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల గురించి బిజెపి ఎన్ని నీతి కబుర్లు చెప్పినా అధికార కూటమిలోని ఎంఎల్‌ఏలకు ఎరవేయకుండా యడియూరప్పను అధిష్టానం నివారించలేకపోయింది. ఆయన చెప్పినట్లు తలాడించకతప్పలేదు. తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫిరాయింపు ఎంఎల్‌ఏలకు సీట్లు ఇవ్వటం గురించి పార్టీలో వ్యతిరేకత వెల్లడైనా యడియూరప్ప మాటే చెల్లుబాటైంది. మంత్రివర్గంలో తన అనుచరులకే పెద్ద పీటవేశారు.

ఆర్ధిక రంగం, కరోనా నిరోధంలో నరేంద్రమోడీ వైఫల్యం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపధ్యంలోనే యడియూరప్పను తొలగించాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. కరోనా వైఫల్యాన్ని సాకుగా చూపి ప్రత్యర్ధులు పావులు కదిపారు. దాని మీద ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్య నరేంద్రమోడీని ఉద్దేశించే అన్నది స్పష్టం. జూన్‌ మొదటి వారంలో విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు స్పందించారు.” నేను ఎవరినీ విమర్శించను, నాకు ప్రత్యామ్నాయం లేరంటే నేను అంగీకరించను, ప్రత్యామ్నాయ వ్యక్తులు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎల్లవేళలా ఉంటారు, నాకు ఎలాంటి గందరగోళమూ లేదు, హైమాండ్‌ నాకు అవకాశం ఇచ్చింది, నాశక్తికి మించి పని చేస్తున్నాను. మిగిలిందంతా అధిష్టానమే చూసుకుంటుంది. వారి విశ్వాసం ఉన్నంత వరకు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా.” అన్నారు.
దక్షిణ భారత్‌లో ఉన్న ఒక్క కర్ణాటకలో కూడా కాషాయ జెండా ఎగరకపోయినా ఫరవాలేదు, యడియూరప్పను తొలగించాల్సిందే అనుకుంటే తప్ప నాయకత్వమార్పిడి జరిగే అవకాశాలు లేవు. ప్రత్యర్ధుల మీద మాదిరి ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యుల లేదా ఆశ్రితుల అక్రమ సంపాదనల మీద దాడులు చేసినా, కేసులు నమోదు చేసినా పోయేది పార్టీ పరువే. ఇప్పటికీ ముఖ్యమంత్రి, కుటుంబసభ్యుల మీద కేసులు పరిష్కారం కాలేదు. సెక్స్‌ కుంభకోణంలో ఇప్పటికే ఉద్యోగం పొగొట్టుకున్న మంత్రి రమేష్‌ జర్కిహౌలికి యడియూరప్ప పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఒక భూమి డీనోటిఫికేషన్‌ వ్యవహారంలో యడియూరప్ప ప్రమేయం ఉందనే ఫిర్యాదులు రావటంతో ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశించింది. జెడిఎస్‌ ఎంఎల్‌ఏ కుమారుడిని డబ్బు, మంత్రిపదవితో ప్రలోభపెట్టారంటూ 2019లో యడియూరప్పమీద దాఖలైన కేసు ఇంకా ఉంది.ఇలాంటివి అనేక ఆరోపణలు ఉన్నా చలించటం లేదు.


యడియూరప్ప మీద తిరుగుబాటును సమర్ధిస్తే కలిగే లాభనష్టాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ మదింపు వేస్తున్నట్లు వార్తలు. లింగాయత్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్ల అంశం ఎటూ తేలటం లేదు. యడియూరప్ప ఆ సామాజిక తరగతిలో ఒక కులానికి చెందిన వ్యక్తి. ఒక వేళ ముఖ్యమంత్రిపదవి నుంచి తొలగిస్తే మరొక బలమైన సామాజిక తరగతి మీద ఆధారపడాల్సి ఉంటుందన్నది ఒక ఆలోచన. అలాంటపుడు కురుబల మీద ఆధారపడాల్సి వస్తుందని, అందువల్లనే ఆ సామాజిక తరగతికి చెందిన మంత్రి ఈశ్వరప్పతో ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు జెండా ఎగురవేయించారన్నది ఒక అభిప్రాయం. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలలో ఆరితేరిన యడియూరప్ప అంత తేలికగా లొంగబోరని చెబుతున్నారు. ప్రస్తుతం 224 సభ్యులున్న అసెంబ్లీలో బిజెపికి ఉన్న బలం 119 మాత్రమే. అంటే కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి గెలిచిన వారు దూరమైనా ప్రభుత్వం నిలిచే అవకాశం లేదు. తనతో పాటు కనీసం 30-35 మందిని యడియూరప్ప తీసుకుపోగలరని భావిస్తున్నారు. ఒక వేళ జెడిఎస్‌తో మిగిలిన బిజెపి సభ్యులు చేతులు కలిపినా ప్రయోజనం ఉండదు. నరేంద్రమోడీ పేరుతో ఓట్లడిగి బీహార్‌లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా బయటపడినా అసోంలో పెద్ద మెజారిటీ రాలేదు, పశ్చిమబెంగాల్లో అనూహ్య ఓటమి నేపధ్యంలో కర్ణాటకలో మోడీ బొమ్మను చూపి ఓట్లడిగే పరిస్ధితిలో బిజెపి ఉందా అంటే అనుమానమే. తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ, షా వంటి పెద్దలు ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నింటా మిగతా చోట్ల మాదిరే ఓట్లు తగ్గాయి.

కుల రాజకీయాలు నడుస్తున్నంత కాలం ఎడియూరప్ప తన సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. దానికి తోడు ఐక్యంగా పనిచేసే కుటుంబం కూడా ఉంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వారందరూ ఐక్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దీపాలు చక్కపెట్టుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. కుటుంబపాలన గురించి అనేక చోట్ల బిజెపి పెద్ద కబుర్లు చెబుతుంది, ఆ పేరుతో ఓట్లు దండుకుంది. కానీ కర్ణాటకలో అసలు అలాంటిదేమీ లేదన్నట్లుగా ఉంటుంది. పెద్ద కుమార్తె పద్మావతి యడియూరప్ప ఇంట్లోనే ఉంటారు, ఆయన అధికారిక పర్యటనలను కూడా ఖరారు చేస్తారు. రెండవ కుమార్తె అరుణాదేవీ అఖిల భారత వీరశైవ మహాసభ మహిళా విభాగ అధ్యక్షురాలు. మూడవ కుమార్తె ” కుటుంబ వ్యాపారాలను ” చూసుకుంటారు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర షివమొగ్గ లోక్‌సభ సభ్యుడు. కేంద్రంలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. రెండవ కుమారుడు విజయేంద్రకు ఎలాంటి పదవులు లేకపోయినా సూపర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్‌-జెడిఎస్‌ల నుంచి రెండు సంవత్సరాల క్రితం ఎంఎల్‌ఏల కొనుగోలులో ప్రధాన పాత్రధారి అని చెబుతారు.తనను ముఖ్యమంత్రిగా తొలగిస్తే విజయేంద్రను వారసుడిగా అంగీకరిస్తే యడియూరప్ప ఏ క్షణంలో అయినా వైదొలుగుతారు. వచ్చే ఎన్నికల్లో విజయేంద్ర మైసూరు జిల్లా వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ముందే ప్రకటించేశారు. బిజెపిలో కుమ్ములాటలకు ఇదే మూలం.


కర్ణాటక బిజెపిలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఎవరి ప్రయోజనాలు వారివి. ఆ పార్టీ వ్యవహారాలు చూసినపుడు యడియూరప్ప కొరకరాని కొయ్య. ఆయన చుట్టూ పార్టీ నడవాలి తప్ప పార్టీ చెప్పినట్లు నడిచే తత్వం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం ఉన్న రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. యడియూరప్ప లేకపోతే అదీ ఉండదు, వారికి కావాల్సింది అధికారం, విలువలు-వలువలతో పనిలేదు కనుక బిజెపి కేంద్ర పెద్దలు కూడా ఇప్పటికైతే చేయగలిగింది లేదు. నేను గాని ఈలవేస్తే అనే పరిస్దితి లేదు. కానీ అదే యడియూరప్ప ఈల వేస్తే బిజెపి ఖాతా నుంచి కర్ణాటక అవుట్‌ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

యోగి కొనసాగితే బిజెపి అదృష్ట యోగం 50 సీట్లే : కేంద్ర ఇంటిలిజెన్స్‌ హెచ్చరిక !

17 Thursday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, CM Yogi Adityanath, Modi vs Yogi, Narendra Modi, RSS, UP Politics


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాధ్‌. నాలుగు సంవత్సరాలు గడిచే సరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు సూచించినట్లుగా వార్తలు రావటం విశేషం. అబ్బే అదేమీ లేదు, అంతా సజావుగా ఉంది అని చెప్పుకున్నా అది నష్ట నివారణ చర్య తప్ప మరొకటి కాదు. బిజెపి వంటి పార్టీలలో అలాంటి మార్పులు జరపాల్సి వచ్చినా దాని తీరే వేరుగా ఉంటుంది గనుక సమస్య పూర్తిగా ముగిసింది అని చెప్పలేము. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ, హౌం మంత్రి అమిత్‌ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాలతో యోగి భేటీ అయ్యారు. ఎందుకు ఆ సమావేశం జరిగిందో, ఒక్కరే వచ్చి ఏమి చర్చించారో బయటకు తెలియదు. పైకి చెబుతున్నది మాత్రం మర్యాదపూర్వక కలయిక, మార్గదర్శనం కోసం అని. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. ఒకటి మాత్రం స్పష్టం, యోగి సర్కార్‌ వైఫల్యాలు, పార్టీనేతలతో పాటు వివిధ తరగతుల్లో అసంతృప్తి, కరోనా వైఫల్యం, రైతాంగ ఉద్యమం వంటి అంశాలు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ముప్పు తెస్తాయనే ఆందోళన పార్టీ పెద్దల్లో ఉంది. కేంద్ర గూఢచార శాఖ ఇటీవల జరిపిన సర్వేలో యోగి నాయకత్వంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపికి 403కు గాను 50 మించి రావని తేలినట్లు చెబుతున్నారు. అదే తాజా పరిణామాలకు మూలంగా భావిస్తున్నారు.

యోగీ తొలగింపు వార్తల వెనుక అసలేమీ లేదా అంటే చాలా ఉంది. మొదటిది నరేంద్రమోడీ ఇష్టనేతల్లో యోగి లేరు. అనివార్యమై అంగీకరించారు. గత ఎన్నికల్లోనే మనోజ్‌ సిన్హా అనే మాజీ కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడ్డారు. ప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పని చేస్తున్నారు.నరేంద్రమోడీ మద్దతుదారు. నరేంద్రమోడీ వైఫల్యాల చర్చ వచ్చినపుడు నితిన్‌ గడ్కరీ ప్రత్యామ్నాయంగా పేరు ఎక్కువగా వినిపిస్తున్నది, పెద్ద రాష్ట్రం గనుక రాజనాధ్‌ సింగ్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. యోగి ఆదిత్యనాధ్‌ వీరి పట్ల మొగ్గుచూపుతున్నారు. రాజనాధ్‌ సింగ్‌-యోగి ఇద్దరూ ఠాకూర్‌ సామాజికతరగతికి చెందిన వారే. వారెప్పుడైనా తనకు విరోధులుగా మారతారనే అనుమానం నరేంద్రమోడీలో ఉంది. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ఘోరపరాజయం, కరోనా వైఫల్యాలపై చర్చ నేపధ్యంలో అనుమానం పెనుభూతమైందని వార్తలు. కరోనా విషయంలో యోగి వైఫల్యంతో మోడీ అనుకూలురకు మంచి అవకాశం వచ్చినందున దీన్ని వదులు కోకూడదని తమ వంతు యత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. యోగి కొరకరాని కొయ్యగా మారిన కారణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు లక్నో పర్యటన జరిపి పరిస్ధితిని మదింపు వేశారని చెబుతున్నారు. తరువాతనే యోగి ఆదిత్యనాధ్‌ ప్రధాని నరేంద్రమోడీ, ఇతర నేతలను ఢిల్లీలో ” మర్యాద ” పూర్వకంగా కలిసి ” మార్గదర్శనాన్ని” అందుకున్నారు.


ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద అనుమానాలు తలెత్తటంతో సామాజిక సమీకరణలకు బిజెపి తెరలేపింది. ఉత్తర ప్రదేశ్‌లో సామాజికంగా 21శాతం మంది దళితులు ఉన్నారు. పన్నెండుశాతం మంది బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వారు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలలో వారు 20శాతం వరకు ఉన్నారు. యోగి సర్కార్‌ తమను నిర్లక్ష్యం చేస్తోందన్న అసంతృప్తి వారిలో మొదలైంది. దళితుల కంటే తమ వారు ఎక్కువ మంది హత్యలకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు ఒక బ్రాహణ నేతగా పేరున్న కాంగ్రెస్‌ ప్రముఖుడు జితిన్‌ ప్రసాదను బిజెపి వైపు ఆకర్షించటం వెనుక కథ ఇదే. హక్కుల కోసం పోరాడేందుకంటూ 2020 జూలైలో బ్రాహ్మణ చేతన పరిషత్‌ పేరుతో జితిన్‌ ప్రసాద ఒక సంస్దను ఏర్పాటు చేశారు. వివిధ కేసులను ఎదుర్కొంటున్న తమ సామాజిక తరగతికి సాయం చేసేందుకు టి-20 పేరుతో ప్రతి జిల్లాలోనూ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తరువాత ప్రకటించారు. యోగి ఆదిత్యనాధ్‌ అధికారానికి వచ్చిన తరువాత బ్రాహ్మణుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగినట్లు గతంలో జితిన్‌ ప్రసాద విమర్శించారు. ఇప్పుడు జితిన్‌ ప్రసాదను పార్టీలో చేర్చుకోవటం ద్వారా వారిని బుజ్జగించవచ్చన్నది బిజెపి ఎత్తుగడ.


పార్టీ రహిత ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిజెపి పెద్దలు జిల్లాపరిషత్‌ స్ధానాలకు తమ అభ్యర్ధులు వీరే అని ప్రకటించి చేతులు కాల్చుకున్నారు. వారిలో అత్యధికులు ఓడిపోయారు. దీనికి ఆదిత్యనాధే సూత్రధారి. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలో, రామాలయానికి శంకుస్దాపన చేసిన అయోధ్యలో కూడా ఓడిపోవటంతో నరేంద్రమోడీ పరువు కూడా పోయింది. అదే యోగి వ్యతిరేకులకు ఆయుధంగా మారింది. స్ధానిక సంస్దలలో ఓటమితో పాటు కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం, హైకోర్టు న్యాయమూర్తులతో చివాట్లు తినటం, అనేక చోట్ల ఆక్సిజన్‌ మరణాలు సంభవించటంతో తీవ్ర విమర్శలు, అసంతృప్తి వెల్లడైంది. వీటికి పరాకాష్టగా కరోనా మృతుల దేహాలను గంగానదిలో పారవేయటంతో బిజెపి పరువు గంగలో కలిసింది. గుజరాత్‌ కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ నరేంద్రమోడీని దిగంబర రాజుగా వర్ణిస్తూ రాసిన కవిత్‌ వైరల్‌ కావటం తెలిసిందే. ఇన్ని జరిగిన తరువాత నష్ట నివారణ చర్యగా యుపిలో అంతా బాగుంది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయించి యోగి మరిన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. వాణిజ్య ప్రకటనలు, పాకేజ్‌ (డబ్బిచ్చి) వార్తలు, ఇంటర్వ్యూల వంటివి చేయించారు. పార్టీ ఢిల్లీ పెద్దల వ్యూహం మేరకు గుజరాత్‌ కాడర్‌గా పని చేస్తున్న యుపికి చెందిన ఆలిండియా అధికారి ఎకె శర్మ చేత రాజీనామా చేయించారు. ఎంఎల్‌సిగా నియమించి కాబినెట్‌లో చోటు కల్పించాలని ప్రతిపాదించారు. అయితే ఆదిత్యనాధ్‌ ఎంఎల్‌సి పదవిని ఇచ్చారు తప్ప మంత్రిమండలిలో చేర్చుకోలేదు, కనీసం శర్మను కలుసుకొనేందుకు కూడా నిరాకరించారని వార్తలు వచ్చాయి.

ప్రధాని తరువాత ఆదిత్యనాధ్‌ను ప్రధాన ప్రచారకుడిగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి పంపారు. ఇప్పుడు మరోసారి అసలు యుపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఓటర్ల ముందుంచుతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జార్ఖండ్‌, బీహార్‌, హర్యానాల్లో మిత్రపక్షాలు ఉన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. అసోంలో మాత్రమే గట్టెక్కింది. యుపిలో బలమైన మిత్రపక్షం కూడా బిజెపికి లేదు. అనేక చోట్ల హిందూత్వ తురుపుముక్క పని చేయలేదు, యుపిలో కూడా అదే పునరావృతం అవుతుందేమో అన్న అనుమానాలు సంఘపరివార్‌లో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఓబిసి, షెడ్యూలు కులాలకు చెందిన వారు తమను ఉపయోగించుకొని వదిలేశారనే భావంతో ఉన్నారు. చిన్న పార్టీలే అయినప్పటికీ మిత్ర పక్షాలు అసంతృప్తితో ఉన్నాయి.భారతీయ సమాజ్‌ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. బిజెపి మునిగిపోయే నావ దానిలో ఎవరైనా ఎక్కాలనుకుంటే వారిష్టం, నేను మాత్రం ఎక్కను అని ఆ పార్టీ నేత నేత ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగుతులను వాడుకొని వదిలేస్తున్నారని, నాలుగున్నర సంవత్సరాలలో తమకు చేసిన వాగ్దానం దేన్నీ అమలు జరపలేదన్నారు. బిజెపిని ఓడించేందుకు తాముప్రయత్నిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అప్నాదళ్‌ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక ముక్క సమాజవాదితో చేతులు కలిపేందుకు నిర్ణయించుకుంది. మరో ముక్క కేంద్రంలో తమకు మంత్రి పదవి ఇస్తారా లేదా అని బేరం పెట్టింది. నిషాద్‌ పార్టీ కూడా ఇదే విధంగా బేరం పెట్టింది, పదవులు ఇవ్వకపోతే సమాజవాది పార్టీ వైపు చేరతామనే సంకేతాలు ఆ పార్టీలు ఇస్తున్నాయి.


ఈ పార్టీల బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదని వాటితో నిమిత్తం లేకుండా హిందూత్వ అజెండాతో తిరిగి విజయం సాధిస్తామనే అభిప్రాయంతో యోగి ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రులు, ఎంఎల్‌ఏలు చెప్పేది వినకుండా తనకు నమ్మకస్తులైన అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసగా అసెంబ్లీలోనే 2019లోనే 200 మంది ఎంఎల్‌ఏలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన ఉదంతం తెలిసిందే. బిజెపికి చెందిన నందకిషోర్‌ గుర్జార్‌ తమ జిల్లా అధికారయంత్రాంగం, పోలీసుల వేధింపుల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవటం పట్ల నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా బిజెపి ఎంఎల్‌ఏలతో సహా రెండు వందల మంది వివిధ పార్టీలకు చెందిన వారు మూడు గంటల పాటు సభలో ధర్నా జరిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లు అవినేతి కేంద్రాలుగా మారాయని కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సమక్షంలోనే ఒక మాజీ ఎంఎల్‌ఏ చెప్పిన మాటలను ఎంఎల్‌ఏలు, నేతలు అందరూ అభినందించిన ఉదంతం ఈ ఏడాది మార్చినెలలో జరిగింది. రైతు ఉద్యమం పట్ల యోగి సర్కార్‌ అనుసరించిన వైఖరి ముఖ్యంగా రాకేష్‌ తికాయత్‌ను అరెస్టు చేసేందుకు చేసిన యత్నం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సంచలనమైంది, తికాయత్‌ జాతీయ నేతను చేసింది.రైతు ఉద్యమం బలపడింది. యోగి ఆదిత్యనాధ్‌ జన్మదినాన్ని నిరుద్యోగదినంగా జరపాలని ఇచ్చిన పిలుపు పెద్ద చర్చనీయాంశమైంది.ఉద్యోగులు, టీచర్లలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది.


ఎన్నికలకు కొద్ది నెలల ముందు యోగిని మార్చటం చిన్న విషయం కాదని బిజెపి పెద్దలకు అర్దమైంది. గతంలో బిజెపితో ఉంటూనే హిందూ యువవాహిని పేరుతో తనదైన దళాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ మెడలు వంచిన ఉదంతాలు ఉన్నాయి. తనకు అధికారం వచ్చిన తరువాత దాన్ని వదిలేశారు. అయినప్పటికీ హిందూత్వకు ప్రతీకగా యోగి ఉన్నందున ఆయనను మారిస్తే ఎలా అన్న గుంజాటన కూడా ఉంది. ఆ ప్రాతిపదికన ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అజెండాతో ముందుకు పోవాలంటే యోగి లేకుండా కష్టం అని భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, పెద్ద రాష్ట్రమైన యుపి మీద ప్రయోగాలకు పూనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఏదైతే అది అవుతుందన్న తెగింపుతో కేంద్ర బిజెపి పెద్దలకు అవగతం అయి ఉండాలి. అయితే పూర్తిగా పగ్గాలు యోగికే ఇస్తారా అన్నది సందేహమే. యోగికి ఒక సందేశం పంపారు, సూచన చేశారు. గతంలో మాదిరి నరేంద్రమోడీ తిరుగులేని నేతగా ఉంటే అదొక దారి, ఇప్పుడు వైఫల్యాల బాటలో ఉన్నందున యోగి వంటి వారు ఒక పట్టాన అంగీకరిస్తారని చెప్పలేము. ఎందుకంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్‌ చేజారితే అది రాజకీయంగా బిజెపికి కోలుకోలేని దెబ్బ.యోగి మార్పు గురించి చర్చ ప్రారంభమైంది గనుక కొనసాగిస్తే బిజెపిలో, ఆర్‌ఎస్‌ఎస్‌లో నరేంద్రమోడీ పలుకుబడి కోల్పోయినట్లుగా పార్టీలోనే కాదు, దేశ వ్యాపితంగా సందేశం వెళుతుంది. తొలగిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు యోగి కానసాగితే నష్టం-మార్చినా యుపిలో గెలుపు కష్టం అన్నట్లుగా ఉంది. నష్టం కంటే కష్టాన్ని ఎలాగోలా అధిగమిద్దాం అని భావించారా ? పరిస్ధితిని మరింత మదింపు వేసేందుకు సమయం తీసుకుంటున్నారా ? అయోధ్య రామజన్మభూమిని పరిష్కరించాం అనే ప్రచారం చేసుకొనేందుకు ఒక అవకాశం ఉంది. యోగి మీద వ్యతిరేకత వెల్లడవుతున్న కారణంగా రానున్న రోజుల్లో వారణాసిలోని గ్యానవాపి మసీదు వివాదాన్ని, మధురలో షాహీమసీదు సమస్యను ముందుకు తేవటం ద్వారా దాన్ని అధిగమించి విజయం సాధించవచ్చా అనే మదింపులో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెరూలో తీవ్ర ఉత్కంఠ-అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విజయం !

09 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Elecciones en Perú, Latin america left, Pedro Castillo, Peru presidential election 2021, Socialist Castillo


ఎం కోటేశ్వరరావు


నువ్వా నేనా ! ఒక వైపు పచ్చిమితవాద, అవినీతి వారసత్వం మరోవైపు మచ్చలేని వామపక్ష ఘన వారసత్వం. నరాలు తెగే ఉత్కంఠ. ఓటు ఓటుకూ అభ్యర్ధులు, మద్దతుదారుల రక్తపోటులో తేడా. ఆదివారం నాడు పెరూలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. మూడు లక్షల ఓట్లను లెక్కించకుండా బయటపడవేశారంటూ ప్రత్యర్ధి మద్దతుదారులు ఎన్నికల కార్యాలయం ముందు ప్రదర్శనలకు దిగగా కాస్టిల్లో మద్దతుదారులు కూడా ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పోటీ ప్రదర్శనలకు దిగారు. ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటికీ మారు మూల గ్రామీణ ప్రాంతాలు, విదేశాల నుంచి ఓట్ల వివరాలు రావటంలో ఆలశ్యం కారణంగా లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. పెరూ కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన 99.8 శాతం ఓట్లలెక్కింపులో కాస్టిల్లో 50.20 ప్రత్యర్ధి మితవాద కైయికు ఫుజిమోరి 49.80శాతం ఓట్లు సాధించారు. సంఖ్య రీత్యా కాస్టిల్లోకు 87,35,448, ప్రత్యర్ధికి 86,63,684 వచ్చాయి. కాస్టిలో మెజారిటీ 71,764 ఉంది. మెజారిటీ కంటే లెక్కించాల్సిన ఓట్లు తక్కువగా ఉండటంతో కాస్టిలో విజయం ఖాయమైంది. అక్రమాలకు పాల్పడి అవాంఛనీయ పరిణామాలు జరిగితే తప్ప అదే ఖరారు అవుతుంది.

గ్రామీణ ప్రాంతాలలో వామపక్ష అభ్యర్ధికి పెద్ద ఎత్తున మద్దతు ఉన్నట్లు వెల్లడైన కారణంగా మిగిలిన ఓట్లు అక్కడివే కావటంతో తమ అభ్యర్ధి విజయం సాధించినట్లు కాస్టిలో మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు లెక్కింపులో అక్రమాలు జరిగినందున ఫలితాన్ని తాను అంగీకరించేది లేదని కైయికూ ప్రకటించినందున పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లు పరిగణిస్తున్నారు. పరిశీలకులుగా ఉన్న లాటిన్‌ అమెరికా దేశాల సంస్ధ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. పది సంవత్సరాల కాలంలో మూడవ సారి కూడా ఓడిపోతుండటంతో కైకు నిరాశతో ఇలాంటి ఆరోపణలకు దిగారని విమర్శలు వచ్చాయి.


వామపక్ష అభ్యర్ధి విజయం తధ్యమనే వాతావరణం ఏర్పడటంతో స్టాక్‌ మార్కెట్‌, వాణిజ్య, పారిశ్రామికవేత్తలలో వెల్లడైన భయం కూడా ఒక సూచిక. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలటంతో సోమవారం నాడు కొద్ది సేపు క్రయ విక్రయాలను నిలిపివేయాల్సి వచ్చింది. కరెన్సీ విలువ కూడా గణనీయంగా పడిపోయింది. వామపక్ష నేత అధికారానికి వస్తే మార్కెట్‌ శక్తుల ఆధిపత్యంలోని వ్యవస్ధను మార్చివేస్తారనే ఆందోళన వ్యక్తమైంది.పట్టణ ప్రాంతాల నుంచి తొలుత లెక్కింపు ప్రారంభమైంది. ఎనభై ఆరుశాతం ఓట్ల లెక్కింపు వరకు మితవాద అభ్యర్ధిని కెయికో ఫుజిమోరీ 52శాతానికి పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగారు,అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటంతో 93శాతానికి చేరగానే ఇద్దరి ఓట్లు సమం తరువాత కాస్టిల్లో ఓట్లు పెరగటం ప్రారంభమైంది.

పెరూ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలిదశలోనే 50శాతానికి మించి ఓట్లు తెచ్చుకుంటే రెండవ సారి అవసరం ఉండదు. లేనట్లయితే తొలి దశలో మొదటి రెండు స్దానాలలో ఉన్న అభ్యర్ధుల మధ్య అంతిమ పోటీ జరుగుతుంది. దీని ప్రకారం ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికలలో 18 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వీరిలో మార్క్సిస్టు భావజాలంతో పని చేస్తున్న ఫ్రీ పెరు పార్టీ అభ్యర్ది పెడ్రో కాస్టిల్లో 18.92శాతం ఓట్లతో ముందుండగా ద్వితీయ స్ధానంలో పాపులర్‌ ఫోర్స్‌ పార్టీకి చెందిక కెయికు ఫుజిమోరి 13.41శాతంతో రెండవ స్ధానంలో నిలిచారు. పార్లమెంట్‌లోని 130 స్ధానాలకు గాను 27 బహుళనియోజకవర్గాల నుంచి ప్రతినిధులను దామాషా ప్రాతిపదికన ఎన్నుకుంటారు. మొత్తంగా ఐదుశాతంపైగా ఓట్లు సాధించటం లేదా ఒక నియోజకవర్గంలో ఏడుగురు ప్రతినిధులు గెలిచినా దేశం మొత్తంలో దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు 20 పార్టీలు పోటీ పడగా పది పార్టీలు ఐదుశాతానికి పైగా ఓట్లు సాధించి పార్లమెంట్‌లో ప్రవేశం పొందాయి.ఫ్రీ (విముక్త )పెరు పేరుతో రంగంలోకి దిగిన కొత్త పార్టీ 13.4శాతం ఓట్లు పొంది 37 స్ధానాలతో పెద్ద పార్టీగా ఎన్నికైంది. .


దేెశంలో జరిగిన అభివృద్ది సామాన్యులకు ఉపయోగపడలేదని, కరోనా సమయంలో పిల్లలు ఇంటి దగ్గర నుంచి చదువుకొనేందుకు అవసరమైన లాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌కు నోచుకోలేకపోయారని పేదలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నరకాల మాదిరి తయారయ్యాయని విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నికైన పది మంది అధ్యక్షులలో ఏడుగురు అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారు. గత మూడు సంవత్సరాలలో నలుగురు అధ్యక్షులు మారారంటే రాజకీయ అనిశ్చితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.తీవ్ర మాంద్యం, కరోనా కేసులతో పాటు మరణాల రేటూ ఎక్కువగా ఉంది. కేవలం మూడు కోట్ల 20లక్షల మంది జనాభాలో కరోనా కారణంగా ఇప్పటి వరకు రెండు లక్షల మంది మరణించారు. ప్రపంచంలో ఇది అత్యధిక రేటు. ఇదే సమయంలో పదకొండుశాతం మంది అన్నార్తులు పెరిగారు. చిలీ తరువాత ప్రపంచంలో రాగి ఎగుమతి చేసే రెండవ దేశంగా ఉంది. రాగి ఎగుమతులతో జిడిపిలో పదిశాతం ఆదాయం వస్తోంది.

తుది పోరులో పోటీ బడిన కైయికు ఫుజిమోరి జనానికి పరిచయం అవసరంలేని పేరు. కుట్రతో అధికారానికి వచ్చిన తిరుగుబాటుదారుగా, నియంతగా పేరున్న తండ్రి ఆల్బర్ట్‌ ఫుజిమోరి నుంచి రాజకీయవారసత్వం, ధనికులకు అనుకూల వైఖరితో పాటు, గత రెండు ఎన్నికలలో ఆమె అధ్యక్షపదవికి పోటీ పడ్డారు.2016 ఎన్నికలలో విజయం సాధించిన పెడ్రో పాబ్లోకు ప్రత్యర్ధి కెయికు ఫుజిమోరి మీద కేవలం 42,597 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. తాను గెలిస్తే కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 2,600 డాలర్ల విలువగల స్ధానిక కరెన్సీ చెల్లిస్తానని, గనుల నుంచి వచ్చే ప్రతిఫలంలో 40శాతం సొమ్ము ఆ ప్రాంత పౌరులకు నేరుగా అందచేస్తానని వాగ్దానం చేశారు. కెయికో ఫుజిమోరీ మాజీ ఎంపీ, అవినీతి కేసులు శిక్ష అనుభవించారు. పాతిక మందిని హత్య చేయించటం, అవినీతి కేసులో పాతిక సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న తన తండ్రిని విడుదల చేస్తానని చెప్పారు. గత ఎన్నికల తరువాత దేశంలో తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిణామాలకు తనను క్షమించాలని వేడుకున్నారు.ఆల్బర్టో ఫూజిమోరి పాలన అవినీతి అక్రమాలు, సంఘటిత నేరాల మయంగా మారింది, పది సంవత్సరాల పాలనలో పాల్పడిన నేరాలకు గాను పాతికేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆల్బర్ట్‌ కుమార్తె కెయికు నాయకత్వంలోని పార్టీ గత ఐదు సంవత్సరాలలో రాజకీయ అనిశ్చితికి కారకురాలు కావటంతో పాటు అవినీతి కేసులో కెయికు కూడా జైలు శిక్ష అనువించింది.అయితే ధనికులందరూ ఆమె తమ ప్రయోజనాలను కాపాడే సమర్ధురాలనే అభిప్రాయంతో మద్దతుగా నిలిచారు.


వామపక్ష అభ్యర్ధి కాస్టిలో ఒక స్కూలు టీచరు. ఫుజిమోరి హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని ఆయన వాగ్దానం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా పెరూలో ధనికులు-పేదల మధ్య అంతరాలు పెరిగాయి. ఎన్నికల్లో కూడా ఇదే సమీకరణ కనిపిస్తోంది.పెరూ ప్రయోజనాలకు విరుద్దమైన వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులను సమీక్షిస్తామని, గ్యాస్‌ ప్రాజెక్టులను జాతీయం చేయటం వంటి చర్యలు తీసుకుంటామని, లూటీ చేసిన సంపదలను స్వాధీనం చేసుకుంటామని పెరూ విముక్త పార్టీ వాగ్దానం చేసింది. 2007లో తొలుత పెరూ విముక్త రాజకీయ ప్రాంతీయ ఉద్యమంగా ప్రారంభమైంది.2012లో పెరూ విముక్త పార్టీగా ఏర్పడింది.2016లో దీన్ని ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేశారు. 2019లో పెరూ విముక్త జాతీయ రాజకీయ పార్టీగా పేరు ఖరారైంది.తమది సోషలిస్టు సంస్ధ అని, తాము మార్క్సిజానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది.

ఓట్ల లెక్కింపులో తన మెజారిటీ తగ్గటం ప్రారంభం కాగానే కెయికో ఆరోపణల పర్వానికి తెరలేపారు.తనకు పడిన ఓట్లను బయట పడవేశారని, ఫలితాన్ని అంగీకరించేది లేదని ప్రకటించారు. లెక్కింపు సమయంలో ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలని అంతకు ముందు కాస్టిలో తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. రెండవ దశ ఎన్నికలకు ముందు ఆయన మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరిగింది. గత నెలలో గుర్తు తెలియని సాయుధులు జరిపిన జరిపినదాడిలో నలుగురు పిల్లలతో సహా 16 మంది మరణించారు. దీనికి షైనింగ్‌ పాత్‌ పేరుతో సాయుధ చర్యలకు పాల్పడిన మావోయిస్టు గెరిల్లాల నుంచి విడిపోయిన వారే కారణమని ప్రచారం జరిగింది. ఈ మారణకాండను కాస్టిలో తీవ్రంగా ఖండించారు.
తొలి దశ ఎన్నికల్లో వామపక్ష కాస్టిల్లో ప్రధమ స్ధానంలో నిలవటంతో మీడియాలో, సామాజిక మాధ్యమంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు.మావోయిష్టు షైనింగ్‌ పాత్‌ సంస్ధతో సంబంధాలున్నాయని, కమ్యూనిస్టు అని ముద్రవేసి ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నించారు. వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో సంబంధాలు ఉన్నాయని మనం మరో వెనెజులాగా మారవద్దంటూ ధ్వజమెత్తారు. తనపై జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ, కొందరిలో ఉన్న అనుమానాలను తొలగిస్తూ మేం కమ్యూనిస్టులం కాదు, ఛావిస్తాలమూ(వెనెజులా ఛావెజ్‌) కాదు, ఉగ్రవాదులమూ కాదు. మేం కార్మికులం, మీ వంటి వారిమే,మనమందరం వీధుల్లో ఉన్నాం, ప్రశాంతంగా ఉండే వ్యవస్ధ కావాలని కోరుకుంటున్నాం అని ప్రచారంలో చెప్పారు.అంతకు ముందు విముక్త పెరూ పార్టీ నేత కాస్టిలోకు షైనింగ్‌ పాత్‌తో సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతుదారులు నాయకులుగా ఉన్న టీచర్స్‌ యూనియన్‌ నాయకత్వంలో నాలుగు సంవత్సరాల క్రితం సమ్మెకు నాయకత్వం వహించాడని మీడియా ప్రచారం చేసింది. తన పదవీకాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన తరువాత గ్రామీణ ప్రాంతాలలోని తన పాఠశాలలో తిరిగి బోధన చేస్తానని కాస్టిలో చెప్పాడు.


రాజ్యాంగం ప్రకారం ఒకసారి ఎన్నికయిన తరువాత వెంటనే జరిగే ఎన్నికలో పాల్గొనేనేందుకు అవకాశం లేదు. ఐదు సంవత్సరాల తరువాత తిరిగి పోటీ చేయవచ్చు. పెరూ రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ప్రత్యక్ష ఎన్నిక జరిగిన తరువాత మరణించినా, ఏకారణంతో అయినా పదవి కోల్పోయినా, రాజీనామా చేసినా తదుపరి ఎవరిని ఎన్నుకోవాలో కూడా నిర్ధిష్టంగా ఉంటుంది, ఆమేరకు వారిని ఎన్నుకోవాలి తప్ప కొత్తగా ఎన్నికలు ఉండవు. అధ్యక్షుడిని అభిశంసించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. స్పెయిన్‌ వలస నుంచి విముక్తి పొందిన జూలై 28న ఎన్నికైన ప్రభుత్వం నూతన బాధ్యతలను స్వీకరిస్తుంది. ఇక పెరూలో ఉన్న రాజకీయ అనిశ్చితి విషయానికి వస్తే ఐదు సంవత్సరాల క్రితం పెడ్రో పాబ్లో కుజిన్‌స్కి ఎన్నికయ్యాడు.2018లో రాజీనామా చేయటంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మార్టిన్‌ విజికారా బాధ్యతలు స్వీకరించాడు. అతగాడిని 2020లో అభిశంసించి పదవి నుంచి తొలగించారు. తరువాత పార్లమెంట్‌ స్పీకర్‌ మెరినో బాధ్యతలు స్వీకరించిన వారంలోగానే జనం నిరసన కారణంగా రాజీనామా చేశాడు.తరువాత ఫ్రాన్సిస్కో సగస్తీని పార్లమెంట్‌ ఎన్నుకుంది.


తొలి దశ ఎన్నికలో పోటీపడి గణనీయంగా ఓట్లు సంపాదించిన పార్టీలలో వామపక్ష శక్తులతో పాటు ఫుజిమోరిజంగా వర్ణితమైన మితవాదులను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. తుది దశ ఎన్నికల్లో వారంతా కాస్టిలోకు మద్దతు ప్రకటించారు. రాజధాని లిమా, ధనికులుండే పట్టణ ప్రాంతాలలో కైయికు మెజారిటీ సాధించగా పేదలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు కాస్టిలోను ఎంచుకున్నారు. రాజకీయాల్లో వామపక్ష శక్తుల పలుకుడి పెరిగినట్లే. రానున్న రోజుల్లో విధానపరమైన మార్పుల కోసం పెరూవియన్లు పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం ఉంది. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో వామపక్షాల విజయాలను చూసి అనేక మంది తాము కూడా వామపక్ష వాదులమే అనే ముసుగు తగిలించుకొని ప్రజాకర్షక నినాదాలతో రంగంలోకి వచ్చారు. ఆ విధంగా గతంలో పెరూలో అధికారానికి వచ్చిన ఇద్దరు అధ్యక్షులు తాము వామపక్ష వాదులమే అని ప్రకటించుకున్నారు. ఆచరణలో పెట్టుబడిదారుల బంట్లుగా మారారు. వారిలో ఒల్లాంటా హుమలా ఒకడు. 2011నుంచి 2016 వరకు అధికారంలో ఉన్నాడు. నయాఉదారవాద విధానాలను అమలు జరిపి అభాసుపాలయ్యాడు. అవినీతి అక్రమాలకు తరువాత అరెస్టయ్యాడు.తాజా ఎన్నికల్లో తొలిదశలో పోటీ చేసి పదమూడవ స్ధానంలో నిలిచి కేవలం 1.5శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నాడు. అనేక దేశాల అనుభవం చూసినపుడు వామపక్ష శక్తులు అధికారంలో ఉండి పెట్టుబడిదారులు, ప్రపంచ ద్రవ్య పెట్టుబడిని వ్యతిరేకించే చర్యలు తీసుకుంటే ఆశక్తుల కుట్రలను ఛేదించేందుకు జనం అవసరమైతే వీధుల్లోకి రావాల్సి ఉంటుందని బొలీవియా, వెనెజులా, చిలీ తదితర దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏది ముందు పుట్టింది ? జ్ఞానమా , అజ్ఞానమా – మత శక్తులెందుకు జ్ఞానం మీద దాడి చేస్తాయి ?

07 Monday Jun 2021

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, imperialism, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, USA

≈ Leave a comment

Tags

Anandaiah's K medicine, Ignorance, knowledge, pseudoscience, Science, science literacy, scientific temper


ఎం కోటేశ్వరరావు


జ్ఞానం ముందు పుట్టిందా ? అజ్ఞానం ముందు పుట్టిందా ! ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి రాక ముందు జనానికి అస్సలు విజ్ఞానం లేదా ? లేదని చెబితే పురాతన మానవుల అనుభవాలను, తరతరాలుగా వాటిని పరిరక్షించటాన్ని కించపరచటమే. ఈజిప్టు పిరమిడ్లు నిర్మించిన వారు, వాటిలో మమ్మీలను భద్రపరచిన వారి పరిజ్ఞాన్ని విస్మరించగలమా ? చైనా గోడ నిర్మాతలకు తట్టిన ఆలోచన సామాన్యమైనదా ? క్రీస్తు పూర్వమే మన దేశంలో చెక్కిన ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలకు ప్రాతిపదిక విజ్ఞానం కాదా ? రోమ్‌ నగరంలో వేల సంవత్సరాల నాడు నిర్మించిన ప్రఖ్యాత బహిరంగ స్డేడియం కూడా అలాంటిదే. అయితే ఇవన్నీ కూడా ప్రపంచమంతటా వాటి నిర్మాణ కాలంలో లేదా తరువాత గానీ మరోచోట పునరావృతం కాలేదు. ఎందుకు ? విదేశీ దండయాత్రల నుంచి రక్షణకోసమే చైనా గోడ నిర్మాణమైందనుకుందాం. విదేశీ దండయాత్రలు ఒక్క చైనా మీదే జరిగాయా ? మిగతా దేశాలకు అలాంటి ఆలోచన ఎందుకు తట్టలేదు, చూసి కూడా ఎందుకు నిర్మించలేదు ? అలాగే మిగతావీనూ. ఎవరైనా ఈ కోణం నుంచి పరిశోధించారో లేదో నాకైతే తెలియదు, అలాంటి విశ్లేషణలు ఉంటే అందరం చదువుకుందాం.

గత కొద్ది వారాలుగా ఆనందయ్య ఆకుల మిశ్రమం ( మందు లేదా ఔషధం కాదని ఆయుష్‌ చెప్పింది కనుక), ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని తూలనాడిన రామ్‌దేవ్‌ బాబా గురించి చర్చలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ సమగ్రంగా చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు, కొన్ని పరిశీలనలకే పరిమితం. దక్షిణాసియా, మరికొన్ని ప్రాంతాలలో ఆకు, వక్క, సున్నంతో కిళ్లీలు వేసుకోవటం ఎప్పటి నుంచో ఉంది.దానితో నోరు ఎర్రగా పండుతుందని తెలుసు కానీ ఎరుపుకు బదులు వేరే రంగులో ఎందుకు పండదో లేదా అసలు ఎందుకు పండుతుందో వేసుకొనే వారందరికీ తెలుసా ? తెలియనంత మాత్రాన వారిది అజ్ఞానం అనలేము ? ఆకు, వక్కలను పూజల్లో వినియోగిస్తాము. ఎందుకు ? ముఖ్యమైన దేవతలంతా తమలపాకులోని వివిధ భాగాలలో ఉంటారనే పుక్కిటి పురాణాలు వీటికి మూలం.

మహలక్ష్మి ఆకు కింది భాగంలో, సరస్వతి మధ్యలో, జేష్టలక్ష్మి తొడిమ-ఆకు కలిసే చోట, పార్వతి, మాంగల్యదేవి ఎడమవైపు, భూదేవి కుడి వైపు, శివుడు ఆకు బయట, శుక్రుడు పైన, సూర్యుడు ఆకులో మొత్తంగా ఇలా అనేక మంది దేవతలు, దేవుళ్లు, కాని ప్రముఖులకు కూడా తమలపాకులో స్ధానం కల్పిస్తూ కథలు రాశారు. శివుడు, పార్వతి ఆకు, వక్క మొక్కలను హిమాలయ ప్రాంతంలో నాటారు అని చెబుతారు. వాటినే ఇప్పటికీ విద్యావంతులు కూడా నమ్ముతూ ఉంటే దాన్ని అజ్ఞానం అంటారు, వారిని అజ్ఞానులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. చదువులేని వారికి తెలియని తనం తప్ప అజ్ఞానం అనలేము. శివుడు, పార్వతి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు, హిమాలయాల్లోనే ఎందుకు నాటారు, మిగతా ప్రాంతాలను ఎందుకు విస్మరించారు. దేవతలకు పక్షపాతం ఉండకూడదు కదా ? అనే ప్రశ్నలకు సమాధానం ఉందా ? అదంతే అంటే దాన్నేమనాలి ? ఆయుర్వేదంలో తమలపాకులో ఉన్న ఔషధ లక్షణాల గురించి రాశారు. అది వేల సంవత్సరాల మానవుల అనుభవ సారం తప్ప ఎవరో ఒకరు పరీక్షించి కనుగొన్న పర్యవసానం కాదు. ఆకు, వక్కలతో వేసుకునే సున్నం మోతాదు మించితే నోరు బొక్కుతుంది. ఇది కూడా అనుభవంలోంచి వచ్చిందే కదా ? ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే అదంతే అంటే వితండవాదం, నాకు కనిపించేదాన్ని మాత్రమే నమ్ముతా మిగతావి నమ్మను అంటే మూర్ఖత్వం అవుతుంది.


ఇప్పుడంటే యావత్‌ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఆ మూల నుంచి ఈ మూలకు కొన్ని గంటల్లోనే వెళ్లి రావచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతి దేశం లేదా ప్రాంతం వారు అనుభవంలో తమవైన వైద్య పద్దతులను ఉనికిలోకి తెచ్చారు. ఎవరికి వారు తమ పద్దతే గొప్ప అనుకోవటమే కాదు, మిగతావాటిని అంత తేలికగా స్వీకరించలేదు. ఐరోపాలో హౌమియోపతి వైద్యులు తొలి రోజుల్లో అల్లోపతిని అంగీకరించలేదు, అపహాస్యం చేశారు. నాగరిక సమాజాలతో సంబంధాలు లేకుండా ఆడవులు, కొండలకే పరిమితమైన గిరిజనులు ఇప్పటికీ తమవైన ఔషధాలను తయారు చేసుకొని వాడుతున్నారు. వారికి ఆయుర్వేదం అంటే తెలియదు, ఆయుర్వేదాన్ని గిరిజన ప్రాంతాలకు తీసుకుపోయిన చరిత్రా లేదు. ఉంటే ఇప్పటికీ వారు తమ నాటు మందులనే ఎందుకు నమ్ముతున్నారు. తమ సాంప్రదాయ గిరిజన వైద్య పద్దతులకే కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. నల్లమలలోని చెంచు ఆదివాసులు కరోనా వాక్సిన్‌ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎక్కడికక్కడ స్ధానిక వైద్య పద్దతులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ ఆయుర్వేదానికి మన కాషాయ దళాలు పెట్టినట్లు హిందూ వైద్యం, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల పేర్లు పెట్టలేదు. మన దేశంలో బౌద్దం, జైనం ఒకప్పుడు ప్రధాన మతాలుగా ఉన్నాయి, మరి వాటి పేరుతో వైద్యం ఎందుకు లేదు ! మన దేశంలో హిందూత్వ శక్తులకు ఒక అజెండా ఉంది, దానిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం ఒక ఎత్తుగడ గనుక ఇప్పుడు ప్రతిదానికి మతాన్ని తగిలిస్తున్నారు. సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశంలో విడదీయలేని భాగం, ఆయుర్వేదానికి మత, కుల ముద్రలు వేయటం ద్వారా దానికి ఆదరణ పెంచాలనుకుంటున్నారా ? దెబ్బతీయాలని తలపెట్టారా ? ఆనందయ్య మిశ్రమానికి కొందరు అతివాదులుగా చెలామణి అవుతున్నవారు కులాన్ని కూడా జత చేశారు. అందుకే అతివాదం-మితవాదం నాణానికి బొమ్మా బొరుసూ వంటివి అంటారు.


ఒక నాడు అల్లోపతి అప్పటికి ఉన్న వైద్యపద్దతులకు ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ముందుకు వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇప్పుడు అదే అసలైనదిగా మారి, స్ధానిక, దేశీయ వైద్య పద్దతులు జనం దృష్టిలో ప్రత్యామ్నాయమైనవిగా మారిపోయాయి. ఆయా దేశాలలో అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులను ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూ పోయి ఉంటే అల్లోపతి రంగంలోకే వచ్చేదే కాదు కదా ? వాటికి చాదస్తాలను తగిలించి అభివృద్ది కాకుండా చేసింది ఎవరు ? వర్తమాన ప్రభుత్వాల సంగతి పక్కన పెడదాం. అమెరికా, ఐరోపా దేశాలలో ఉన్న స్ధానిక వైద్య పద్దతులు ఉన్నప్పటికీ వాటి స్ధానంలో అల్లోపతి అభివృద్ది చెందింది. అదేమీ రహస్యంగా జరగలేదు. బలవంతమూ చేయలేదు. మన దేశంలో ఆయుర్వేద పండితులు వాటిని చూసి తమ వైద్య పద్దతిని, ఔషధాలను అభివృద్ది చేయటాన్ని ఎవరు అడ్డుకున్నారు. బ్రిటీష్‌ పాలకులేమీ ఆంక్షలు పెట్టలేదు, అప్పటికి అల్లోపతి కార్పొరేట్‌ ఆసుపత్రులు వాటితో కుమ్మక్కయ్యే ఔషధ మాఫియాలు కూడా రంగంలో లేవే !

హౌమియోపతి వైద్యపద్దతి రోగి లక్షణాల మీద ఆధారపడింది. దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా, ఐరోపాలో కొందరు ముందుకు తెచ్చినదానిని హౌమియోపతి నిపుణుడు హానిమన్‌ తొలిసారిగా అల్లోపతి అని వర్ణించాడు. రోగ లక్షణంతో సంబంధం లేకుండా చికిత్సకు వేరే పద్దతుల్లో వైద్యం చేయటాన్ని ఎగతాళి చేస్తూ తొలిసారిగా 1810లో ఆ పదాన్ని ఉపయోగించాడు. జ్వరం వస్తే లక్షణాలను బట్టి హౌమియో పద్దతిలో కొన్ని మందులు ఇచ్చి దాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదంలో కాషాయం, లంఖణాలతో చిక్సిత చేస్తారు. అదే అల్లోపతిలో యాంటీబయోటెక్‌ ఇచ్చి జ్వరానికి కారణమైన బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయటం ద్వారా జ్వరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదం, హౌమియోపతి వంటి వాటిలో శస్త్రచికిత్సలు లేవు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే రెండు పద్దతులను అసలు పోటీ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక ఔషధాలతో జ్వరాన్ని రెండు మూడు రోజుల్లో తగ్గిస్తే లంఖణం పరమౌషధం పేరుతో వారాల తరబడి మంచాలకే పరిమితం చేస్తే ఉద్యోగాలేమి కావాలి, సెలవులు ఎక్కడి నుంచి వస్తాయి. శస్త్రచికిత్సలు అవసరమైన చోట దానికి బదులు మన మతం, మన కులం, మనదేశ పద్దతుల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా ?

” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” ఇలాంటి ట్వీట్ల ద్వారా పతంజలి కంపెనీ సిఇఓ ఆచార్య బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఈ పెద్దమనిషికి నిజంగా ఆయుర్వేదం మీద, అన్నింటికీ మించి తాము తయారు చేస్తున్న ఔషధాల మీద, సకల రోగ నివారిణిగా చిత్రిస్తున్న యోగా మీద విశ్వాసం ఉందా ? నిజంగా ఉంటే ఉత్తరాఖండ్‌ రిషీకేష్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌( అల్లోపతి)లో చేరి ఎందుకు చికిత్స తీసుకున్నారు. 2019 ఆగస్టు 23న ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి, బాలకృష్ణను పరామర్శిస్తూ రామ్‌దేవ్‌ బాబా నిలిచిన చిత్రాలూ దర్శనమిచ్చాయి. తాజాగా అలాంటి ఈ పెద్దమనుషులిద్దరూ అల్లోపతి వైద్యం మీద అనుచిత విమర్శలు చేయటంతో కొందరు పాతవీడియోలకు వ్యాఖ్యానాలు తోడు చేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. బాలకృష్ణకు గుండెపోటు వస్తే దివ్య అర్జున్‌ కషాయం ఇవ్వలేదు, అనులోమ విలోమ యోగా చేయించకుండా నేరుగా ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు, ఇప్పుడు రామ్‌దేవ్‌ బాబా అల్లోపతిమీద విమర్శలు చేస్తున్నారు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారా లేదా అని బూమ్‌ వెబ్‌సైట్‌ నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తే ఆసుపత్రిలో చేరిన మాట నిజమే అని తేలింది. ఇండియా టుడే గుండెనొప్పితో అని రాస్తే జీ న్యూస్‌ కలుషిత ఆహారం కారణంగా అని రాసింది. అయితే ఆ సమయంలో రామ్‌దేవ్‌ ప్రతినిధి కెకె తిజార్‌వాలా చేసిన ట్వీట్‌లో కలుషిత ఆహారం గురించి పేర్కొన్నారు. ఇక్కడ సమస్య చిన్నదైనా పెద్దదైనా , జబ్బు ఏదైనా అల్లోపతి సామర్ధ్యం గురించి విమర్శిస్తున్న వారు అదే ఆసుపత్రిలో చేరటం ఏమిటి ? ఒక చెట్టునో, ఆవు మూతినో వాటేసుకోకుండా సిలిండర్ల ఆక్సిజన్‌ తీసుకోవటం ఏమిటి ?

ఏడాది తరువాత కరోనాకు,రోగనిరోధక శక్తికి ఇదిగో మందు అంటూ ఆనందయ్య రంగంలోకి వచ్చారు లేదా కొందరు తెచ్చారు. దీని నేపధ్యం ఏమిటి ? కరోనా కొత్త వైరస్‌ గనుక దానికి చికిత్స ఏమిటో ఏ వైద్య పద్దతికీ తెలియదు. జ్వరం వస్తుంది కనుక పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్నే చెప్పారు. మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఇస్తే ఫలితం ఉంటుందన్నారు. వెంటనే మన దేశం వాటిని ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. నిషేధం ఎత్తివేయకపోతే డొక్క చించుతా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. తరువాత రెమిడెసివిర్‌ దివ్వ ఔషధం అన్నారు, ఎంతగా బ్లాక్‌ మార్కెట్‌ జరిగిందో చూశాము. చివరికి బిజెపి పెద్దలు కంపెనీ నుంచి తామే సేకరించి పెద్ద మేలు చేకూర్చేవారిగా ఫోజు పెట్టారు. తరువాత దాని వలన ఫలితం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో ప్లాస్మా చికిత్స గురించి ప్రచారం. చివరికి అదీ ఫలితం లేదని తేలిపోయింది. రామ్‌దేవ్‌ బాబా కరోనిల్‌ పేరుతో కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రారంభించి కరోనాకు దివ్వ ఔషధం అన్నారు. అది అసలు ఔషధమే కాదు తేలిపోయింది. ఒకవైపు కరోనా రెండవ తరంగం రెచ్చిపోతుంటే జనానికి దిక్కుతోచని స్ధితిలో ఆనందయ్యను రంగంలోకి తెచ్చారు. అతను గాకపోతే మరొకరు వచ్చి ఉండేవారు. గతంలో మెదడు వాపు వ్యాధి, స్వైన్‌ఫ్లూ వంటివి జనాన్ని భయపెట్టిన సమయంలో నిర్ధారణగాని హౌమియో, ఆయుర్వేదం మందులు ఇలాగే పెద్ద ఎత్తున పంచారు. నష్టం లేదు కదా అని జనం కూడా తీసుకున్నారు.


అల్లోపతిలో ప్రయత్నించిన ప్రతి ఔషధం ఉపశమనం కల్పించేది తప్ప నిరోధించేది కాదని తేలిన సమయంలో ఆనందయ్య మూలికల మిశ్రమం వచ్చింది. దాన్ని తినేందుకు మాత్రమే ఇస్తే ఇంత రగడ జరిగి ఉండేది కాదేమో ? కండ్లలో వేసే చుక్కలతో రోగనిరోధకశక్తి వస్తుందని చెప్పటమే తీవ్ర వివాదాన్ని రేపింది.నిర్ధారణ కాని వాటిని కరోనా రోగులు కంట్లో వేసుకున్నా, తిన్నా వారి కండ్లు,ప్రాణాలకు ముప్పు కనుక అనేక మంది అభ్యంతరాలు తెలిపారు. ఇది కూడా ఎందుకు జరిగింది. ఏడాదికి పైగా కరోనా జనాన్ని చంపేస్తుంటే ఆనందయ్య ఎక్కడున్నాడో తెలియదు. ఏడాది కాలంగా చేసిన పరిశోధన లేదా తెలుసుకున్న పరిజ్ఞానం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి మందు కనుగొన్నా అంటే సరిపోతుందా ? ఇక్కడ ఆనందయ్య ఒక చిన్న వ్యక్తి. కరోనా వైరస్‌ గురించి నిర్ధారణ కాగానే అనేక దేశాల్లో ఉన్న స్ధానిక వైద్యపద్దతుల నిపుణులు ఔషధాన్ని ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు ? అల్లోపతి శాస్త్రవేత్తలు, వైద్యుల ప్రయోగాలే ఫలించి వాక్సిన్‌ ఉనికిలోకి వచ్చింది. సహజంగానే దాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్‌ సంస్ధలు పూనుకున్నాయి. వాటిని చూపి నిర్ధారణ కాని నాటు మందులను ఒకసారి వాడి చూస్తే ఏమౌతుంది? నష్టమేమీ లేదు కదా అనే వాదనలు చేసే వారికి చెప్పేదేముంది. వాడి చూడండి, అనుభవించండి. ఆయిల్‌ పుల్లింగు చూశాము, నీటి వైద్యం వంటి వాటిని చూశాము. సాధారణ రోగాలకు అలాంటి వాటిని వెయ్యి వాడండి ఎవరి ఖర్మ వారిది. కానీ కరోనా ఒక మహమ్మారి, ఆదమరిస్తే, సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయేదానితో కూడా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదని చెబుతుంటే వితండవాదం చేసే వారి మానసిక స్ధితిని అనుమానించాల్సి వస్తోంది. చుక్క వేయగానే పక్కాగా తయారయ్యానని చెప్పిన కోటయ్య మాస్టారు కొద్ది రోజుల్లోనే ఎందుకు మరణించారు,సమర్ధించిన వారే ఆయన ప్రాణాలకు మీదకు తెచ్చారనటం వాస్తవం కాదా ?


వైద్య రంగంలో అల్లోపతి ఆసుపత్రులు, ఔషధాల మాఫియా ఎలా అయితే ఉందో ఆయుర్వేద మాఫియా కూడా ముందుకు వచ్చింది. జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తాము తయారు చేసిన కరోనిల్‌ ఔషధం కరోనాను అరికడుతుందని ప్రచారం చేసి సొమ్ము చేసుకొనేందుకు పెద్ద పధకం వేసిన రామ్‌దేవ్‌ బాబా ఆయుర్వేద మాఫియా తెగకు చెందిన వారు కాదా ? ఇలాంటి వారిని చూసి పక్కా ప్రణాళికతోనే ఆనందయ్యను కొందరు రంగంలోకి దించారని చెబుతున్నారు ? కాదని నిరూపించండి. నిజానికి ఏ పట్టా లేని ఆనందయ్యకు కొన్ని మూలికల మిశ్రమంతో కరోనా తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసినపుడు ఆమాత్రం కూడా ఆయుర్వేద నిపుణలకు ఎందుకు తట్టలేదు. జగదేక వీరుడి సినిమాలో మాదిరో లేక ఆఫ్రికా లేదా అమెజాన్‌ అడవుల నుంచి తెచ్చిన అపురూప మూలికలు కాదే. వేటితో తాను తయారు చేస్తున్నదీ ఆనందయ్యే చెప్పాడంటున్నారు కదా ? అప్పుడైనా ఆ మిశ్రమానికి ఆ లక్షణం ఉంటుందో లేదో నిపుణులు ఎందుకు చెప్పలేకపోయారు ? ఆయుష్‌ రంగంలోకి దిగి అలాంటి లక్షణాలేమీ లేవు వేసుకుంటే వేసుకోండి, చస్తే చావండి మీ ఇష్టం, ఇతర మందులను ఆపకుండా కావాలంటే దాన్ని కూడా తీసుకోండి తప్ప అల్లోపతి మందులను ఆపవద్దని చెప్పింది కదా ? దీనికి అనుగుణ్యంగానే దాన్ని పంపిణీ చేయవచ్చని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్ధానం తామే దాన్ని తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అది ఔషధం కాదంటున్నారు గనుక ఆపని మానుకున్నాం అంటోంది. చిత్రం ఏమిటంటే ఆ పార్టీ ఎంఎల్‌ఏలు మాత్రం మందు తయారు చేయించి పంపిణీ ప్రారంభించారు. ఇంత చర్చ జరిగాక కూడా ఎవరైనా దాని మీదే ఆధారపడితే ఎవరూ చేయగలిగింది లేదు. తమ పార్టీ వారే ఈ పని చేస్తున్నారు గనుక ఏదైనా అనుకోనిది జరిగితే వైఎస్‌ జగన్‌ మరోమారు ఓదార్పు యాత్రలు చేయాల్సి ఉంటుంది.

ఆనందయ్య మందును ప్రశ్నించటం ఒక కులాన్ని అణగదొక్కటంగా లేదా ఆయుర్వేదం హిందూ ఔషధం గనుక దాన్ని వ్యతిరేకించటం అంటే హిందూమతాన్ని వ్యతిరేకించటం , నాశనం చేసేందుకు పూనుకోవటమే అంటూ వాటిని అనుమతించాల్సిందే అని ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. శాస్త్రీయ అంశాలు బయటికి రావటం మతశక్తులకు ఇష్టం ఉండదన్నది చరిత్ర చెప్పిన సత్యం. బాగ్దాద్‌లో మహమ్మద్‌ బిన్‌ జకారియ లేదా రహేజాగా సుపరిచితుడైన వైద్యుడు 860-932 సంవత్సరాల మధ్య జీవించాడు. హేతువాద భావనలు, ఆ నాటికి ఉన్న పశ్చిమ దేశాల బోధనలను ముందుకు తెచ్చాడు. వైద్యం గురించి ఒక పుస్తకం రాశాడు. దాన్ని తట్టుకోలేని ముస్లిం మత పెద్ద ఆ పుస్తకంతోనే తల మీద మోదాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో అతని కండ్లు పోయాయి. మైఖైల్‌ సెర్వెటస్‌ అనే స్పెయిన్‌ వైద్యుడు 1511-53 మధ్య జీవించాడు. ఊపిరితిత్తుల పనితీరు గురించి, క్రైస్తవాన్ని సంస్కరించటం గురించి తన అభిప్రాయాలతో ఒక పుస్తకం రాశాడు.అది మతవిరుద్దమని ప్రకటించటంతో కాథలిక్‌ మతగురువుల విచారణ, శిక్ష నుంచి తప్పించుకొనేందుకు స్విడ్జర్లాండ్‌ వెళ్లాడు. అక్కడ ప్రొటెస్టెంట్‌ మతగురువులకూ కంటగింపయ్యాడు. జెనీవా సరస్సు ఒడ్డున సజీవదహనం చేశారు. అందరికీ తెలిసిన గెలీలియో (1564-1642) గురించి చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చెప్పటాన్ని సవాలు చేసి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు. దాన్ని వ్యతిరేకించిన క్రైస్తవమత పెద్దలు జీవితాంతం గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించటమే గాక ఆయన రచనలను నిషేధించారు.


మన దేశంలో హేతువాదం, భౌతికవాదానికి ఆదిపురుషులు చార్వాకులు అన్నది ఒక అభిప్రాయం. వారు బౌద్ద, హిందూ మతాలను రెండు చెప్పే ఆశాస్త్రీయ, పరస్పర విరుద్ద అంశాలను వ్యతిరేకించారు. స్వర్గ నరకాలు లేవన్నారు. అంతకు ముందు ఉనికిలో ఉన్న అనేక భావనలను వారు సవాలు చేశారు. అది తమ మతాల మనుగడకే ప్రమాదమని భావించిన నాటి మత పెద్దలు వారిని సర్వనాశనం చేశారు, వారి రచనలను దొరక్కుండా చేశారు. వారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రస్తావనలతో రాసిన వ్యతిరేక రచనల నుంచి వారి భావజాలం గురించి తెలిసింది, వారి అసలు రచనలు లేవు. మొత్తంగా చెప్పాలంటే ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా నాశనం చేశారు. పర్యవసానంగా ఒక నిర్వీర్యమైన జాతిగా మనది తయారు కావటానికి మతాలు తప్ప మరొకటి కాదన్నది కొందరి అభిప్రాయం. నాడు మతశక్తులు హేతువాదాన్ని అణగదొక్కితే నేటి మతశక్తులు మరోరూపంలో అశాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి ఈసమాజాన్ని అజ్ఞానంలోకి నెట్టాలని చూస్తున్నాయి. దేశంలోని హిందూత్వ శక్తులు సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్నాయి గనుక మూఢనమ్మకాలకు, ఆశాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సైన్సు సమావేశాలనే వేదికగా చేసుకొని అశాస్త్రీయ, ఆధారంలేని అంశాలను ప్రచారం చేశారు. ఆవు మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా తేల్చమని నిధులు కేటాయిస్తున్నారంటే ఏమనుకోవాలి. తిరోగామి జాతీయవాద అజెండాలో భాగంగా పురాతన సంస్కృతికి, మెజారిటీ హిందూమతానికి ముప్పు వచ్చిందనే పేరుతో జరుగుతున్న ప్రచారం తెలిసిందే. దానిలో భాగంగానే హేతువాదం ఘర్షణ పడే ప్రతిదానికి మతానికి సంబంధం కలిపితే జనాన్ని తమవెంట తీసుకుపోవటం సులభమని వారు భావిస్తున్నారు.

ఆల్లోపతి వైద్యం చేసే కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఔషధాలు తయారు చేసే కంపెనీల లాభాపేక్ష, ఇతర లోపాలను చూపి ఆయుర్వేదానికి మతాన్ని తగిలించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న పతంజలి వంటి కంపెనీల యజమానులు అలాంటి ధోరణులను ప్రోత్సహిస్తున్నారు.వారికి కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు గురించి చెప్పనవసరం లేదు. విదేశీ కార్పొరేట్‌లు పెరిగితే తప్పు పట్టని వారు స్వదేశీ కార్పొరేట్ల ఎదుగుదలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమెజాన్‌ మాదిరి మన అంబానీ కంపెనీ ఎందుకు పెరగకూడదు, ఒక ఫైజర్‌, ఒక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మాదిరి రామ్‌దేవ్‌ బాబా పతంజలి ఎందుకు విస్తరించకూడదు అనే వాదనలకు స్వదేశీ కార్పొరేట్‌ జాతీయవాదమే మూలం. అసలు మొత్తంగా దేశాన్ని కార్పొరేట్‌లకు అప్పగించటం హానికరం అని ఎక్కడా చెప్పరు. ఐరోపా సామ్రాజ్యవాదులు ఇలాంటి కార్పొరేట్‌ జాతీయవాదంతోనే తమ కంపెనీలకు మార్కెట్‌ను కల్పించేందుకు గతంలో దేశాలను వలసలుగా చేసుకున్నారు, ఎన్నో ప్రాంతీయ యుద్దాలు, రెండు ప్రపంచ యుద్దాలకు, నిత్యం ఏదో ఒక మూల ఉద్రిక్తతలకు కారకులు అవుతున్నారు. ఆనందయ్య వంటి వారిని కొందరు తమ స్ధాయిలో ఉపయోగించుకోవాలని చూస్తుంటే మతశక్తులతో చేతులు కలిపిన పతంజలి పెద్దలు పెద్ద స్ధాయిలో లబ్ది పొందాలనుకుంటున్నారు. ” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” అంటూ చేస్తున్న ట్వీట్లు, హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందంటూ సంఘపరివారం చేసే ప్రచారానికి పెద్ద తేడా ఏముంది ?


శాస్త్రం, కుహనా శాస్త్రం, జ్ఞానం, అజ్ఞానం వీటిలో ఏది ముందు ? బతుకు పోరాటంలోనే మానవుడు అనేక అంశాలను నేర్చుకున్నాడు. చెట్టుమీది కాయలు కింద పడటం మానవులకు తెలియని అంశం కాదు. దానిక్కారణం తెలియక ముందు అది దేవుడు, దేవత లేదా ఆదృశ్యశక్తి మహిమ అనుకున్నారు. అది కారణం తెలియని స్ధితి. దీనికి అజ్ఞానం ఒక పర్యాపదం. చెట్టుమీది యాపిల్‌ పండ్లు పైకి పోకుండా, పక్కకు పడకుండా నిటారుగా కిందనే ఎందుకు పడుతున్నాయన్న ఆలోచన న్యూటన్‌కు వచ్చింది కనుకనే భూమ్యాకార్షణ సిద్దాంతం వచ్చింది. అది విజ్ఞానం. అంతకు ముందు దేవుడే అలా రాసిపెట్టాడు అనుకోవటం తప్పుకాదు. తరువాత కూడా ఆ సిద్దాంతం గురించి తెలియని వారు అనుకుంటే దాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. కానీ చదువుకొన్న వారు కూడా దేవుడి మహిమే అంటే అది అజ్ఞానం. పిల్లలు ఎలా పుడతారో తెలియక ముందు దేవుడి దయ, తెలిసిన తరువాత కూడా అలా అనుకుంటే అజ్ఞానం. అందువలన మౌలికంగా తెలియని స్ధితి లేదా అజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టింది. సైన్సు, కుహనా సైన్సు కూడా అంతే. వివేకం లేని జ్ఞానం ఇసుకలో నీరు వంటిది అన్నది ఒక సామెత. వానరుడు నరుడిగా మారిన పరిణామ క్రమం గురించి మీరు విశ్వసిస్తారా అంటూ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా సంస్ద జరిపిన సర్వే ప్రకారం జపాన్‌లో 78, ఐరోపాలో 70, చైనాలో 69, దక్షిణ కొరియాలో 64శాతం మంది అవునని అంగీకరిస్తే అమెరికాలో 45శాతం మందే ఉన్నారు. అజ్ఞానిగా ఉండటం పెద్దగా సిగ్గుపడాల్సిన అంశం కాదు, తెలుసు కొనేందుకు నిరాకరించటమే సిగ్గులేనితనం అని అమెరికా జాతిపితలలో ఒకడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చెప్పారు. వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో అన్నింటి గురించి రాశారని, మన సంస్కృత గ్రంధాల్లో ఉన్నవాటిని పాశ్చాత్యులు అపహరించి తామే కనుగొన్నట్లు ప్రచారం చేసే, చెబుతున్నవారు కొత్తగా తెలుసుకొనేందుకు ముందుకు వస్తారని ఆశించటం అత్యాశే. తెలుసుకొనేందుకు నిరాకరించే జాతి ఎక్కడైనా ముందుకు పోయిందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరుగుతున్నారా – ఒక పరిశీలన !

01 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

#Kerala Politics, Believers in Kerala LDF, CPI(M), Kerala LDF, Sabarimala controversy


ఎం కోటేశ్వరరావు


కేరళ ఎల్‌డిఎఫ్‌లో గతంలో ఎన్నడూ లేనంత మంది ” విశ్వాసులు ” దేవుడి పేర శాసనసభ్యులుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటూ కేరళలో ప్రముఖ మీడియా సంస్ధ మలయాళ మనోరమ పత్రిక ఒక విశ్లేషణ రాసింది. అంతకు ముందు కొన్ని పత్రికలు మంత్రివర్గంలో కులాల వారీ ఎవరు ఎందరున్నారనే విశ్లేషణలు చేశాయి. వీటిని చదివిన వారు ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం వ్యతిరేకులైతే శత్రుపూరిత దాడి చేసేందుకు, శ్రేయోభిలాషులైతే స్నేహపూర్వక విమర్శలు, సమర్దనలు చేసేందుకు పూనుకోవచ్చు.


మనోరమ పత్రిక విశ్లేషణ ప్రకారం 1980లో ఎల్‌డిఎఫ్‌ ఏర్పడిన తరువాత తొలిసారిగా 99 మంది కూటమి సభ్యులలో 17 మంది దేవుడి పేరుతో ప్రమాణం స్వీకారం చేశారు, మరొక సభ్యుడు సకాలంలో వచ్చి ఉంటే 18 అయ్యేవారు. ఇరవై ఒక్క మంది మంత్రుల్లో ఆరుగురు దేవుడి మీద ప్రమాణం చేశారు. ఇక పార్టీల వారీ చూస్తే పదకొండు పార్టీల కూటమిలో కేరళ కాంగ్రెస్‌(ఎం) ఐదుగురు, సిపిఎం ముగ్గురు, జనతాదళ్‌(ఎస్‌) ఇద్దరు, మిగిలిన వారిలో సిపిఐ మినహా ఇతర పార్టీల సభ్యులు దేవుడి పేరుతో ప్రమాణాలు చేసిన వారు ఉన్నారు. మంత్రుల్లో సిపిఎంకు చెందిన వీణాజార్జి ఉన్నారు. గత అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ నుంచి 10 మంది, అంతకు ముందు ఏడుగురు ఉన్నారు. కుక్క మనిషిని కరవటం వార్త కాదు, మనిషి కుక్కను కరవటం వార్త అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కూటమిలో సిపిఎం, సిపిఐ మినహా మిగిలిన పార్టీల వారు ఎలా ప్రమాణ స్వీకారం చేసినా అది పెద్ద సమస్య కాదు. కమ్యూనిస్టుల్లో వారి మద్దతుదారుల్లో ఎవరైనా ఉంటేనే అది విశేషం అవుతుంది.


ప్రపంచంలోని ఇతర దేశాలలో మాదిరే మన దేశంలో కూడా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ ఉన్న పార్టీలలో సిపిఎం అగ్రస్దానంలో ఉంది. ఆ పార్టీ నిబంధనావళిని చూసినపుడు పార్టీ ఆశయాలను అంగీకరించటం, కనీస నిబంధనలు పాటించటం తప్ప మతం, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండకూడదన్న నిబంధన లేదు అనే అంశం చాలా మందికి తెలియదు. వ్యక్తిగతంగా వాటిని పాటించటానికి ఆటంకం లేదు. ఆ నిబంధనలు, ఆశయాలేమీ రహస్యం కాదు. పుస్తకాల దుకాణాల్లో అవి దొరుకుతాయి అనుమానం ఉన్న వారు కొని చదువుకోవచ్చు. చరిత్రలో మత రాజ్యాల గురించి, పాలకులు ఏ మతాన్ని ఆచరిస్తే జనం కూడా దాన్నే ఆచరించాలనే వత్తిడిని చూశాం తప్ప కమ్యూనిస్టుల పాలనలో అలాంటిది ఎక్కడా కనపడదు. నిజంగా కమ్యూనిస్టులు అలా చేసి ఉంటే సోషలిస్టు దేశాలలో ఒక్క చర్చి, ఒక్క మసీదు కూడా మిగిలి ఉండేది కాదు. కానీ ఎక్కడా వాటి జోలికి పోలేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనిజం లక్ష్యం దోపిడీ లేని సమాజాన్ని నిర్మించటం, ఆ క్రమంలో మతం, కులం, దేవుడి వంటి భావాలు, వివక్ష పాటింపు వంటివి సామాజిక చైతన్యంతో అంతరిస్తాయని నమ్ముతారు, అందుకు కృషి చేస్తారు తప్ప బలవంతంగా అమలు చేయలేదు, చేయరు.

ఈ నేపధ్యంలో కేరళలో జరుగుతున్నదానిని చూడాల్సి ఉంది. కమ్యూనిస్టులు, వారి సిద్దాంతాలు, ఆచరణ గురించి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మూడు మతాలకు చెందిన వారు బలమైన శక్తులుగా ఉన్నారు. అక్కడ ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతినిధులతో పాటు లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్‌, పురోగామి సిద్దాంతాలతో పని చేస్తున్నామని చెప్పుకున్న ప్రజా సోషలిస్టు పార్టీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, కేరళ సోషలిస్టు పార్టీ, ఒక మతానికే ప్రధానంగా పరిమితమైన ముస్లిం లీగు విమోచన సమరం పేరుతో కుమ్మక్కయ్యాయి. ఆందోళన చేసి 1957లో ఏర్పడిన నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని 1959లో కేంద్ర ప్రభుత్వంతో బర్తరఫ్‌ చేయించాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమోదించిన భూసంస్కరణలు, విద్యా బిల్లులతో ప్రభావితులైన వారందరూ దీని వెనుక ఉన్నారు. వీరందరినీ దగ్గరకు చేర్చిందీ, ఆందోళనల రూపాలు ఎలా ఉండాల్సిందీ, జనాన్ని ఎలా రెచ్చగొట్టాల్సిందీ నేర్పింది, అవసరమైన నిధులు ఇచ్చిందీ అమెరికా గూఢచార సంస్ద సిఐఏ అన్న విషయం తెలిసిందే. ఇది కమ్యూనిస్టుల ఆరోపణ లేదా చీకట్లో బాణం కాదు. మన దేశంలో అమెరికా రాయబారులుగా 1973-75లో పని చేసిన డేనియల్‌ మోయినిహన్‌ 1978లో ఏ డేంజరస్‌ ప్లేస్‌ పేరుతో రాసినపుస్తకంలో, 1956-61 మధ్య పని చేసిన రాయబారి ఎల్స్‌వర్త్‌ బంకర్‌ జీవిత చరిత్రను రాసిన హౌవర్డ్‌ ష్కాఫర్‌ దాని గురించి ప్రస్తావించారు. ” భారత్‌లో మరికొన్ని కేరళలు ” ఏర్పడకుండా చూడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేక విముక్తి సమరానికి నిధులు ఇచ్చిన విషయాన్ని చెప్పారు.

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఎలా కుమ్మక్కు అవుతాయో ఈ పరిణామం పాఠాలు నేర్పింది. దీన్నుంచి ఉద్యమాన్ని రక్షించుకోవటమే కాదు, ఆదరించిన కష్టజీవుల తీర్పుకు అనుగుణ్యంగా ప్రభుత్వాల ఏర్పాటుకు గాను అనుసరించిన అనేక పురోగామి ప్రయోగాల ప్రతి రూపమే నాలుగు దశాబ్దాల నాడు ఏర్పడిన ఎల్‌డిఎఫ్‌.అయితే దీనిలోని కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో అటూ ఇటూ మారిన ఉదంతాలూ, రెండు కమ్యూనిస్టు పార్టీలతో పాటు ముస్లిం లీగు నుంచి చీలి ఇండియన్‌ నేషనల్‌ లీగుగా ఏర్పడిన పార్టీ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిన తీరూ ఉంది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష సంఘటనలో సిపిఎంతో కలసి అధికారం పంచుకున్న ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డు బ్లాక్‌ కేరళలో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నాయి. ఏనాడూ అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర ఎల్‌డిఎఫ్‌, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎంకు లేదు. ఉదాహరణకు 2011 ఎన్నికల్లో కేవలం 0.89శాతం ఓట్ల తేడా, ఎల్‌డిఎఫ్‌కు 68, యుడిఎఫ్‌ 72 సీట్లు వచ్చిన సమయంలో ఒకటి రెండు యుడిఎఫ్‌ ఫ్రంట్‌ పార్టీలు,ఎంఎల్‌ఏలు ముందుకు వచ్చినప్పటికీ ప్రజాతీర్పును ఎల్‌డిఎఫ్‌ హుందాగా స్వీకరించింది తప్ప అధికారం కోసం కక్కుర్తి పడలేదు.


కమ్యూనిస్టులు మతాన్ని మత్తు మందుగా ఎందుకు భావిస్తారు, ఎందుకు వ్యతిరేకిస్తారు అని అనేక మంది అడుగుతారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సింది కమ్యూనిస్టులకంటే అంటే కారల్‌మార్క్స్‌కు ముందుగానే మతాన్ని మత్తు మందుతో పోల్చిన వారు, వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. రెండవది కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకిస్తారనేది హిమాలయమంత వక్రీకరణ. నల్ల మందుతో వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి, హానిచేసే లక్షణాలూ ఉన్నాయి. దాన్ని ఎవరైనా తినిపించినా, స్వయంగా తీసుకున్నా మందమతులుగా మత్తుతో పడిఉంటారు. అందువలన దాన్ని దుర్వినియోగం చేయటమే ఎక్కువగా ఉంది, దానితో తయారు చేసే మాదక ద్రవ్యాలతో అక్రమ సంపాదనకు ఒక ప్రధాన వనరుగా ఉన్నందున ప్రతికూల భావంతోనే జనం చూస్తారు. మతం కూడా అలాగే దుర్వినియోగమైంది. కనుకనే కమ్యూనిస్టులు పుట్టక ముందే ఐరోపాలో కొందరు మత్తు మందు అన్నారు. రాజకీయాలోకి మతాన్ని చొప్పించటం, పరమత ద్వేషంతో వ్యవహరించే మతాలను, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా మతాన్ని ఒక ఆయుధంగా వినియోగించటాన్ని మాత్రమే కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు.

మతం ఆ విధంగా దుర్వినియోగం అవుతున్నందున మతం అంతరించాలని కోరుకోవటంలో ఎలాంటి మినహాయింపులు, రాజీలు లేవు. గాయపడిన, జబ్బు పడిన వారికి పూర్వం నల్లమందు ఇవ్వటం ద్వారా ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించేవారు. దాంతో తక్షణం ఉపశమనం కలిగేది, భ్రమల్లోకి తీసుకుపోయేది కనుక కొంత శక్తినిచ్చేది. మార్క్స్‌ ఈ కోణం నుంచే మతాన్ని నల్ల (మత్తు) మందుతో పోల్చారు. ఫ్యూడల్‌ సమాజంలోనూ, తరువాత పారిశ్రామిక విప్లవంతో ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ విధానంలోనూ ఐరోపా సమాజాల్లో క్రైస్తవ మతం దోపిడీదారులకు సాయపడింది తప్ప జనానికి కాదు, దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటాలను తప్పుదారి పట్టించేందుకు చేయాల్సిందంతా చేసింది. అందుకనే మతం పట్ల ఆయనకు ఎలాంటి సానుభూతి లేదు. ఆయన సిద్దాంతాలతో ప్రభావితులైన కమ్యూనిస్టులకూ అదే అభిప్రాయం ఉంటుంది. మతం గురించి నాలుగు ముక్కల్లో మార్క్స్‌ చెప్పిందేమిటి ? ” అణచివేతకు గురైన వారికి మతం ఒక నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచానికి గుండెకాయ, పశుప్రాయమైన పరిస్ధితులకు ఆత్మవంటిది. జనం పాలిట మత్తుమందు.”


ఇరవై ఎనిమిదేండ్ల వయస్సులోనే టీబితో మరణించిన జర్మన్‌ కవి నోవాలిస్‌ (1772-1801) మతం మత్తు మందు మాదిరి పనిచేస్తుంది. ఉద్దీపకగా,ఇంద్రియ జ్ఞానాన్ని పోగొట్టేదిగా, దుర్బలపరచి నొప్పిని తగ్గిస్తుంది అన్నారు. అప్పటికి మార్క్సు పుట్టనేలేదు. మార్క్స్‌ సమకాలికుడు హెన్రిచ్‌ హెయిన్‌ 1840లో మతం గురించి చెబుతూ బాధల్లో ఉన్న జనానికి మతం కొన్ని చుక్కల ఆధ్యాత్మిక మత్తుమందును, కొన్ని చుక్కల ప్రేమ, ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తుంది అన్నారు. బైబిల్‌ను ఒక మత్తుమందు డోసుగా ఉపయోగిస్తున్నామని ఇంగ్లండ్‌ చర్చికి చెందిన చార్లెస్‌ కింగ్‌స్లే 1847లో రాశాడు. వీరెవరూ కమ్యూనిస్టులు కాదు. తమ అనుభవంలోంచి చెప్పిన మాటలే.జనానికి నిజమైన సంతోషం కలగటానికి చేసే పోరాటాల నుంచి భ్రమలతో కూడిన తప్పుదారి పట్టించే ఉపశమనాన్నిచ్చేందుకు ప్రయత్నించే సంఘటిత మతం అంతరించాలని కమ్యూనిస్టులు కోరుకుంటారు. అయితే జనం స్వచ్చందంగా వదులుకోవాలని చెబుతారు తప్ప బలవంతం చేయరు.

సామ్రాజ్యవాదులు, క్రైస్తవ మతాధికారులు కుమ్మక్కై కూల్చివేసిన సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాలలో కమ్యూనిస్టులు మతాన్ని నాశనం చేయలేదు, దానికి ఆలవాలంగా ఉన్న చర్చ్‌లను కూల్చివేయలేదు.మతం మత్తు మందు అని నమ్మినప్పటికీ దాన్ని వదిలించేందుకు కమ్యూనిస్టు పార్టీలు తగిన చర్యలు తీసుకోకపోతే అక్కడ జరిగిందేమిటో చూశాము. జనంలో తలెత్తిన అసంతృప్తిని క్రైస్తవమత పెద్దలు ఉపయోగించుకొని జనాన్ని రెచ్చగొట్టారు. ఏ చర్చ్‌లను, మసీదులనైతేే సురక్షితంగా ఉంచారో వాటినే సమీకరణ కేంద్రాలుగా మార్చారు. చైనాలో కూడా టిబెట్‌లో బౌద్దమతం పేరుతో చిచ్చుపెట్టేందుకు గతంలో, ఇప్పుడూ సామ్రాజ్యవాదులు చేస్తున్న ప్రయత్నం, ఇప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న ఒక రాష్ట్రంలో రెచ్చగొడుతున్నతీరు, సోషలిస్టు వ్యవస్ధకు వ్యతిరేకంగా రహస్య పద్దతుల్లో క్రైస్తవమతాన్ని రంగంలోకి తెస్తున్న పరిణామాలనూ, వాటిని సమర్దవంతంగా ఎదుర్కొన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అనుభవాన్ని చూశాము.


ఇక కేరళ అసెంబ్లీ సభ్యులలో ఎల్‌డిఎఫ్‌కు చెందిన కొందరు ప్రమాణ స్వీకారాలు ఎలా చేశారనే అంశానికి వస్తే 99 మంది సభ్యులలో 18 మంది దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే 81 మంది ఆత్మ సాక్షిగా చేశారంటే త్రాసు ఎటు వైపు మొగ్గుగా ఉంది. వీరిలో సిపిఎంకు చెందిన వారు ముగ్గురు అని పేర్కొన్నారు. సిపిఎం వారు అంటే పార్టీ గుర్తుమీద పోటీ చేసిన వారు, సిపిఎంకు కేటాయించిన స్ధానాలలో అది బలపరచిన స్వతంత్రులు కూడా ఉన్నారు. వారిలో ఆరుగురు గెలిచారు. వారందరినీ సిపిఎం కిందే పరిగణిస్తున్నారు. సిపిఎం నుంచి ముగ్గురు దేవుడి మీద ప్రమాణం చేశారంటే వారిలో ముగ్గురు కూడా కావచ్చు, మరో ముగ్గురు చేయలేదని అనుకోవచ్చు. ఎవరు అన్నది మనోరమ విశ్లేషకుడు రాయలేదు. లేదూ ముగ్గురూ సిపిఎం సభ్యులే కూడా కూడా అయి ఉండవచ్చు. గతం కంటే పెరిగారు అన్నది ఒక వ్యాఖ్య. ఇది ఒక వైపు మాత్రమే, రెండో వైపును చూడాలి. లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ అనే కొత్త పార్టీ మూడు సీట్లకు పోటీ చేసి ఒకటి గెలుచుకుంది. కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే పార్టీ యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరి పన్నెండు సీట్లకు పోటీ చేసి ఐదు గెలుచుకుంది. ఈ కారణంగా కూడా గతం కంటే పెరిగారు. దీన్ని చూపి ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరిగారు అని చెప్పటం గురించి పాఠకులను దురుద్దేశ్య పూరితం, తప్పుదారి పట్టించే యత్నంగా ఎందుకు భావించకూడదు ?

దేవుడి మీద లేదా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసేందుకు మన రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా మతాన్ని పాటించటానికి, దేవుణ్ని విశ్వసించటానికి- మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి, దేవుణ్ని ఓట్ల కోసం వీధుల్లోకి తీసుకురావటానికి ఎంతో తేడా ఉంది. సిపిఎం విషయానికి వస్తే గతంలో కొంత మంది సభ్యులు దేవుడి సాక్షిగా ప్రమాణస్వీకారం చేసినందుకు అభిశంసనకు గురయ్యారు. సిపిఎంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జారీ చేసిన మార్గదర్శక సూత్రాల మీద కొంత మంది విబేధించారు. పార్టీ సభ్యులు మత కార్యక్రమాల్లో పాల్గొన కూడదని దానిలో పేర్కొన్నారు. దానికి నిరసనగా కేరళకు చెందిన మాజీ ఎంపీ కెఎస్‌ మనోజ్‌ పార్టీకి రాజీనామా చేశారు. మత విశ్వాసాలు పార్టీ కంటే ఉన్నతమైనవని, దిద్దుబాటు పేరుతో జారీ చేసిన మార్గదర్శకాలు రాజ్యాంగానికి వ్యతిరేమైనవని రాజీనామా కారణాలుగా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు సాధారణంగా, సూత్రరీత్యా హేతువాదులు, వారికి ఏమతం పట్లా విశ్వాసం ఉండదు. అయితే మతం, కులం అనేవి ఉనికిలో ఉన్నాయి గనుక వాటిని విస్మరించజాలరు. అందుకే అలాంటి భావాలు ఉండి కూడా కమ్యూనిస్టు సిద్దాంతాలను కూడా అంగీకరిస్తే అలాంటి వారికి సభ్యత్వం ఇస్తున్నారు. వాటి మూలం ఏమిటో తెలుసు, వాటికి అతీతంగా జనాన్ని ఎలా మార్చాలో కూడా అవగాహన ఉన్నవారు. అదే సమయంలో వాటి అడుగుజాడల్లో నడవరు. అలాంటి పరిస్ధితే ఉంటే కమ్యూనిస్టులు పార్టీ దుకాణం మూసుకొని ఇతర పార్టీల్లో చేరి బాబాలు, స్వామీజీల అడుగుజాడల్లో నడిచే వారు. అందువలన స్వతంత్రులుగా గెలిచిన ఆరుగురితో సహా సిపిఎంకు చెందిన 68 మంది ఎంఎల్‌ఏల్లో ముగ్గురు దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తే దాన్ని బూతద్దంలో చూపటం భావ ప్రకటన రీత్యా ఎవరికైనా ఎంత హక్కుందో అదే హక్కు ప్రకారం దురుద్ధేశ్య పూరితం అని కూడా చెప్పవచ్చు.


దేశ లౌకిక రాజ్యాంగంలో మత విశ్వాసాలను కలిగి ఉండటానికి ఎంత హక్కు ఉందో మతాన్ని పాటించకుండా ఉండేందుకు కూడా అంతే హక్కు ఉంది. కనుకనే కమ్యూనిస్టులు అలాంటి ప్రమాణాలను పాటించే విధంగా ఉండాలని నిరంతరం చెబుతుంటారు తప్ప వాటిని ఒక నిబంధనగా పెట్టలేదు. సమాజం మొత్తం లేదా అత్యధిక భాగం ఏదో ఒక మతం లేదా కులంలో పుట్టిన వారితో నిండి ఉన్నపుడు వారు లేకుండా కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం ఎలా సాధ్యం ? ముందే వాటిని వదులుకోవాలని షరతు పెడితే ఎవరైనా అటువైపు చూస్తారా ? వేల సంవత్సరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన వాటిని కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోగానే అందరూ వాటిని పోగొట్టుకుంటారని అనుకుంటే వాస్తవ పరిస్ధితుల మీద ఆధారపడిన అవగాహన కాదు. దోపిడీని వ్యతిరేకించి సోషలిస్టు సమాజాన్ని నిర్మించేందుకు పార్టీ నిబంధనావళిని అంగీకరిస్తున్నారా, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా లేదా అనేదే కొలబద్ద గానీ మతాన్ని, కులాన్ని వదులుకుంటారా అన్న షరతులు ఉండవు. పార్టీలోకి వచ్చిన తరువాత అన్యవర్గధోరణులుగా వాటిని పొగొట్టుకొనేందుకు సభ్యులు, సైద్దాంతిక అవగాహన కలిగించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది.ఎక్కడైనా అలా జరగలేదంటే స్ధానికంగా అధిగమించాల్సిన లోపం తప్ప పార్టీ సిద్దాంతం లేదా పార్టీది కాదు. ప్రజల కోసం చిత్తశుద్దితో పని చేసే మత సంస్ధల పెద్దలు ఎవరైనా ఉంటే వారితో కలసి పనిచేసేందుకు వారి సాయం తీసుకోవటం కూడా తప్పుకాదని కూడా సిపిఎం తన వైఖరిని వివరించే వ్యాసాల్లో పేర్కొన్నది. పార్టీలో చేరిన వారు గుడులు గోపురాలు, చర్చ్‌లు, మసీదులకు వెళ్లటం వారి వ్యక్తిగత విషయంగానే భావిస్తుంది. దాని అర్ధం మతోన్మాద చర్యల్లో భాగస్వాములు కమ్మని, మతాన్ని రాజకీయాలు, అధికారానికి జోడించమని కాదు. అలాంటి పనులు చేస్తే సిపిఎం నిర్మాణంలో వారు ఇమడలేరు.


అందువలన ఎల్‌డిఎఫ్‌, దానిలో ప్రధాన భాగస్వామి అయిన సిపిఎంలో కొంత మంది దేవుడి మీద ప్రమాణాలు చేసినంత మాత్రాన వారు మతశక్తులు కాదు. శబరిమల విషయంలో హిందూమతానికి వ్యతిరేకంగా విజయన్‌ సర్కార్‌ పని చేసిందని మతశక్తులు గగ్గోలు పెట్టినపుడు దానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఇప్పుడు ఎంఎల్‌ఏలు, మంత్రులుగా ఉన్నవారందరూ పని చేసిన వారే. వారు ఎక్కడైనా మతాన్ని, తమ వ్యక్తిగత విశ్వాసాలను ప్రజాజీవితంలో జనం మీద రుద్దారా, ప్రభావితం చేశారా అంటే అలాంటి రికార్డు ఎక్కుడా లేదు. అదే గనుక ఉంటే మనోరమ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికలు ఈపాటికి దుమ్మెత్తి పోసి ఉండేవి. అదే విధంగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు, కులసంఘాల వారు కమ్యూనిస్టులు, వారితో కలసి పని చేస్తున్నవారికి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినప్పటికీ ఓటమికైనా సిద్ద పడ్డారు తప్ప ఓట్ల కోసం కక్కుర్తి పడని వారే వారందరూ. ఎక్కడా మతశక్తులతో రాజీ పడలేదు, అలాగని ఆయా మతాలకు చెందిన సామాన్యుల సంక్షేమం విషయంలో మడమతిప్పలేదు గనుక జనం మత, కులశక్తులకు చెంపపెట్టుగా ఎల్‌డిఎఫ్‌కు చారిత్రాత్మక విజయం చేకూర్చారు. కొన్ని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ కోరకుండానే స్ధానిక రాజకీయాలు, ఇరుకున పెట్టే ఎత్తుగడల్లో భాగంగా మతశక్తులు మద్దతు ఇచ్చినపుడు గెలిచిన పదవులకు రాజీనామా చేసిన వారి నిజాయితీ, చిత్తశుద్ది గురించి తెలిసిందే.

అధికారంలో దేవాదాయశాఖ మంత్రిగా కమ్యూనిస్టు ఉన్నపుడు పూజలు చేసి కమ్యూనిస్టు విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తే అది కూడని పని తప్ప అసలు గుళ్లకు వెళ్లకూడదంటే కుదరదు. ఇంత మంది దేవుడి పేరుతో ప్రమాణస్వీకారం చేసినందున శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు పునర్విచారణ తీర్పు ఎలా వచ్చినప్పటికీ వీరిని సిపిఎం విస్మరించజాలదని మనోరమ విశ్లేషకుడు ఒక పెడర్ధాన్ని తీశారు. శబరిమల విషయం మీద సిపిఎం వైఖరి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా ఒకటే అన్నది స్పష్టం. ఓట్ల కోసమే అయితే హిందూమతశక్తులు నిర్దేశించిన విధంగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చి ఉండేది. అనుకూలంగా తీర్పు వచ్చింది కనుక దానికి కట్టుబడి అమలు జరిపేందుకు ప్రయత్నించింది.కోర్టు తీర్పును గౌరవించనిది, ఖాతరు చేయకుండా మనోభావాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతు ఇచ్చే కుల, మతశక్తులు. దాన్ని వ్యతిరేకించింది ఎల్‌డిఎఫ్‌. గత ఎన్నికల్లో మతశక్తులు, వాటితో రాజీపడిన కాంగ్రెస్‌ కూటమి దాన్ని వినియోగించుకొని లబ్ది పొందాలని చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓట్లు వస్తాయా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా తీర్పు ఎలా వచ్చినా దాని గురించి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఎం ప్రకటించింది తప్ప మతశక్తుల వత్తిడికి లొంగలేదు.ఆ కక్షతోనే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చారు.


లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో వామపక్ష ప్రభుత్వాలకు నాయకత్వం వహించి, వరుస విజయాలకు కారకులైన ఛావెజ్‌, మదురో వంటి వారు ఒకచేత్తో బైబిలు మరొక చేత్తో కష్టజీవుల జెండాను మోసిన వారే. అయినప్పటికీ అక్కడి చర్చి అధికారులు వారిని వ్యతిరేకించటంలో, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు చేయటానికి వెనుకాడటం లేదు. చర్చి పెద్దలు చెప్పారు కదా అని సామాన్య జనం వామపక్షాలకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. అది నికరాగువా డేనియల్‌ ఓర్టేగా కావచ్చు మరొకరు కావచ్చు. కమ్యూనిస్టుల గురించి లాటిన్‌ అమెరికా, అమెరికా ఖండాలలో జరిగిన విష ప్రచారం మనవంటి వారికి పెద్దగా తెలియదు. ఫలానా వ్యక్తి కమ్యూనిస్టు అంటే వ్యతిరేక ఉన్మాదం తలకు ఎక్కిన వారు ఉట్టిపుణ్యానికే ఇండ్ల మీద దాడులు చేసిన ఉదంతాలు అమెరికాలో ఉన్నాయి. తాము మతానికి, వ్యక్తిగత మతవిశ్వాసాలకు, ఆచరణకు, విశ్వాసాలు, సంస్కృతికి వ్యతిరేకం కాదు అని కమ్యూనిస్టులు విశ్వాసం కలిగించకపోతే జనం పార్టీ వైపు రారు, దోపిడీలేని సమాజానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సిద్దం కారు. మేము కూటికి పేదలం తప్ప కులానికి కాదు అని చెప్పే అనేక మంది సామాన్యులను మనం చూస్తాం. అలాంటి వారిని పేదరికానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమీకరించదలచిన వారు మేం మతాన్ని, కులాన్ని నిర్మూలిస్తాం, మీరు వాటిని వదులు కోవాలనే షరతులు పెట్టి సమీకరించలేరు. ఎవరైనా అలా చెబితే అది మొరటు తనం తప్ప మరొకటి కాదు.


కమ్యూనిస్టుల గురించి సమాజంలో ఉన్నతమైన భావనలతో పాటు దురభిప్రాయాలు కూడా ఉన్నాయి. వారి సిద్దాంతం, ఆచరణ మొదటి వాటికి మూలమైతే రెండవ వాటికి శత్రువులు కారణం. అయితే దురభిప్రాయాల ప్రచారానికి గురైన వారందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కాదు. కమ్యూనిస్టు సిద్దాంతానికి ముందే ప్రపంచంలో వేల సంవత్సరాలుగా మతాలు,వాటికి ప్రతీకలుగా తయారు చేసిన దేవుళ్లను వ్యతిరేకించిన నాస్తికులు ఉన్నారు. నాస్తికులందరూ కమ్యూనిస్టులు కాలేరు. కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, అభిమానులందరూ కూడా తెల్లవారేసరికి నాస్తికులు కాలేరు అన్నది గ్రహించటం అవసరం. కమ్యూనిస్టు సిద్దాంతంలో అనేక అంశాలలో నాస్తికత్వం కూడా ఒకటి తప్ప అదే ఏకైక ప్రాతిపదిక కాదు. నాస్తికులలో అనేక మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు ఉన్నారు. కమ్యూనిస్టులలోని ఆస్ధికులలో నాస్తికత్వం మీద అలాంటి వ్యతిరేకత కానరాదు. పినరయి విజయన్‌ నాయకత్వంలో వరుసగా రెండవ సారి అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించిన ఎల్‌డిఎఫ్‌ కొత్త మంత్రి వర్గంలో దేవస్దానాల మంత్రిగా ఒక దళితుడిగా పుట్టిన కె రాధాకృష్ణన్‌ను నియమించటాన్ని ఎలా చూడాలి ? ఆయనేమీ దేవుడి మీద ప్రమాణం చేయలేదు. హిందూ మత లేదా అగ్రకుల భావనలు కలిగిన వారిని సంతుష్టీకరించేందుకు నిజంగా విజయన్‌ సర్కార్‌ పూనుకుంటే ఇలా జరుగుతుందా ? రాధాకృష్ణన్‌ గతంలో స్పీకర్‌గా పని చేశారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, విద్యార్ధి ఉద్యమం నుంచి ఎదిగిన నేత. మరి ఈ నియామకాన్ని ఎలా చూడాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ భక్తులూ గుండె నిబ్బరం చేసుకోండి – అఘాయిత్యాలకు పాల్పడకండి !

27 Thursday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ 1 Comment

Tags

Amezon Master Stroke, China companies to India, China goods boycott, India imports from China, narendra modi bhakts, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మీద విమర్శల ధాటికి బిజెపి వారు ఉత్సవాలు జరుపుకోలేకపోయారు(ఆన్‌లైన్‌లోనే లెండి). చైనా లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో రెండు దేశాల మిలిటరీ మధ్య విచారకర ఉదంతం జరిగి ఏడాది గడిచిపోయింది. ఈ సందర్భంగా మోడీ గారిని ఒక విషయంలో అభినందించాల్సి వస్తోంది. విదేశీ పెట్టుబడుల ద్వారా మన జనానికి ఉపాధి, ఎగుమతులు పెంచుతామనే కదా తొలిరోజుల్లో గాలిమోటారెక్కి(విమానాలు) అనేక దేశాలు చుట్టివచ్చారు. గాల్వాన్‌లోయ ఉదంతాల నేపధ్యంలో కాషాయ అభిమానుల, వారి ప్రచారదాడికి గురైన వారి మనోభావాలకు అనుగుణ్యంగా చైనా యాప్‌లను నిషేధించారు. అక్కడి నుంచి వస్తున్న పెట్టుబడులను అడ్డుకున్నారు. కొన్ని దిగుమతులను కూడా తగ్గించినట్లు చెప్పారు. యాప్‌లను పక్కన పెడితే పెట్టుబడులను వదులుకోవటం అంటే మనకు కొన్ని ఉద్యోగాలు రాకుండా చేశారు.ఉద్యోగాల కంటే దేశభక్తి ముఖ్యం అని భావించిన వారు నిజంగానే ఆ చర్యలను సమర్ధించారు. కాని నరేంద్రమోడీ వారికి ఒక విపత్కర పరిస్ధితిని తెచ్చిపెట్టారు. ఇరకాటంలోకి నెట్టారు. అదేమంటే చైనాలో మరింత ఉపాధి పెంచే విధంగా రికార్డు స్ధాయిలో అక్కడి నుంచి వస్తు దిగుమతులు చేసుకున్నారు. ఈ వివరాలను వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు గానీ, పాకేజ్‌ల మీడియాతో సహా మోడీ భక్తులు గానీ ఎక్కడా ప్రచారం చేయరు.తేలు కుట్టిన దొంగలంటే ఇలాంటి వారే.


ట్రేడింగ్‌ ఎకనోమిక్స్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం 1991 నుంచి 2021 వరకు సగటున ఏడాదికి 136.71 బిలియన్‌ (వంద కోట్లు ) రూపాయల విలువగల దిగుమతులు చేసుకున్నాము. 1991ఏప్రిల్‌ నెలలో రు.0.01బిలియన్‌లు కాగా 2021 మార్చినెలలో ఆల్‌టైమ్‌ రికార్డు రు.498.29 బిలియన్ల మేరకు దిగుమతులు ఉన్నాయి. మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా పధకాల ద్వారా దేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మార్చి ఎగుమతులు చేసి ఇబ్బడి ముబ్బడిగా చేయలేనంత ఉపాధి కల్పిస్తామని చెప్పిన వారి హయాంలోనే ఇది జరిగింది. సెన్సెస్‌ అండ్‌ ఎకనమిక్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (సిఇఐసి) విశ్లేషణ ప్రకారం 2002 నుంచి 2021వరకు సగటున ఏటా రు. 222 బిలియన్ల మేరకు దిగుమతులు చేసుకున్నాము. ఈ ఏడాది ఫిబ్రవరిలో 459.6 బిలియన్‌ రూపాయల మేర దిగుమతులు చేసుకున్నాము. ఇవేవీ కమ్యూనిస్టులో, దేశద్రోహులో నిర్వహిస్తున్న సంస్దలు కాదు. లేదా మోడీని వ్యతిరేకించిన వారు తయారు చేసిన టూల్‌కిట్ల సమాచారమూ కాదు.

మరి ఈ వార్త తెలిస్తే చైనా వస్తువులను దిగుమతులు చేయవద్దు, నిషేధించండి, దిగుమతులు ఆపివేసి చైనాను మన కాళ్ల దగ్గర పడేట్లు చేయండి అని వీరంగం వేసిన వారందరికీ కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ రాదు గానీ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ రుషిగా మారే క్రమంలో ఉన్నారు కనుక ఆయనకేమీ కాదు, నమ్ముకున్న వారంతా ఆత్మలను నిర్భరంగా ఉంచుకోవాలి, గుండెలను దిటవు చేసుకోవాలి. అనుకున్నదొకటీ అవుతున్నదొకటి అని అవమానాన్ని తట్టుకోలేక ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా నిజాలను తెలుసుకోవటం ప్రారంభించాలి. భజనే చేయాలనుకుంటే మోడీ గారు గాకపోతే మరొకరు. బ్రతుకు ముఖ్యం కదా ! భక్తులు శత్రుదేశం అని ప్రచారం చేస్తున్నా ఖాతరు చేయకుండా దిగుమతుల్లో రికార్డు సాధించినందుకు మోడీని ”అభినందించక” తప్పదు. విశ్వగురువా మజాకానా ! ఎవరైనా ఇది కమ్యూనిస్టు లేదా మోడీ వ్యతిరేక ప్రచారం అని నిరూపిస్తే సవరించుకుంటానని సవినయంగా మనవి చేస్తున్నా.


భారత-చైనా ఎగుమతులు, దిగుమతుల తీరుతెన్నులు చూసినపుడు చైనాకు మనం వలస దేశంగా మారుతున్నామా అని ప్రశ్నిస్తూ ది ప్రింట్‌ పోర్టల్‌ 2021 ఏప్రిల్‌ ఒకటిన ఒక విశ్లేషణను ప్రచురించింది. తమను వెర్రి వెంగళప్పలను చేయటానికి ఈ పని చేశారని లేదా రాశారని మోడీ భక్తులు ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. వారి స్వర్గంలో వారిని ఉండనిద్దాం. మన దేశం చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులతో పోలిస్తే ఎగుమతులు ఐదో వంతు మాత్రమే ఉన్నాయి.2019-20తో ముగిసిన ఆరు సంవత్సరాలలో మన దేశ ఎగుమతులు సగటున 13 బిలియన్‌ డాలర్లు ఉండగా దిగుమతులు 66 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో చైనాకు మన ఎగుమతులు పెరిగిన తరువాతనే ఈ పరిస్ధితి ఉంది. ఈ వివరాలు చెబుతున్నామంటే చైనాను పొగడటంగానో మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారో అని ఎవరైనా అనుకుంటే వారికి కృష్ణ పట్నం ఆనందయ్య మందుతోనో లేక గుజరాత్‌లో మాదిరి గోమూత్రం, ఆవు పేడ పులిమిగాని చికిత్స చేయాల్సిందే.


స్వాతంత్య్రానికి ముందు మన దేశం బ్రిటన్‌కు ముడిసరకులు ఎగుమతి చేసేదిగాను అక్కడి నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, పెట్టుబడులను దిగుమతి చేసేదిగానూ ఉండేదన్న విషయం తెలిసిందే. అదే ధోరణి ప్రస్తుతం చైనాతో మన లావాదేవీలు ఉన్నందున ప్రింట్‌ విశ్లేషకులు మనం చైనాకు వలసదేశంగా ఉంటున్నామా అని ప్రశ్నించాల్సి వచ్చింది. గతంలో జాతీయ వాదులు వలస నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. మనమే పరిశ్రమలు స్ధాపించాలని కలలు కన్నారు. అసలు సిసలు జాతీయ వాదుల వారసులం అని చెప్పుకున్న కాంగ్రెస్‌ వారు గానీ, మేమే అసలైన జాతీయవాదులం అని చెప్పుకుంటున్న కాషాయ వాదులు గానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్నవస్తువులతో మన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పొందుతున్న లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంగ్రెస్‌ వారిని విమర్శించి గద్దెనెక్కిన బిజెపి గత ఏడు సంవత్సరాలలో ఈ ధోరణిని మార్చేందుకు చేసిన ప్రయత్నాలేమిటో ఎవరైనా చెప్పాలి.

2020 జనవరి నుంచి డిసెంబరు వరకు మన దేశం చైనా నుంచి 58.71 బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఈ ఏడాది మార్చి 17న లోక్‌సభకు చెప్పారు. చైనా తరువాత అమెరికా నుంచి 26.89, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి 23.96, సౌదీ అరేబియా నుంచి 17.73, ఇరాక్‌ నుంచి 16.26 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు చేసుకున్నాము.


ప్రపంచానికి ఎదురయ్యే అఘాతాలు, వత్తిళ్లను తట్టుకొనే స్ధితి స్ధాపకత ఉన్నట్లు చైనా సరఫరా వ్యవస్ధలు రుజువు చేశాయని అమెరికాలోని ఆర్కాన్సాస్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కె జెంగ్‌ ఈస్ట్‌ ఆసియా ఫోరమ్‌లో తాజాగా రాశారు. చైనా అంతర్గత మార్కెట్‌లో సొమ్ముచేసుకొనేందుకు, తమ దేశాలలో ఉత్పాదక ఖర్చులను మిగుల్చుకొనేందుకు బహుళజాతి గుత్త సంస్దలు భారీ ఎత్తున చైనాలో పెట్టుబడులు పెట్టాయి, ప్రపంచ ఫ్యాక్టరీగా, ప్రపంచ సరఫరా వ్యవస్ధ కేంద్రంగా చైనాను మార్చాయి. అమెరికా – చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్దం, కరోనా మహమ్మారి సంక్లిష్టమైన ప్రపంచ సరఫరా వ్యవస్ధ భేద్యతను వెల్లడించాయి. ఇటీవలి సంవత్సరాలలో చైనా అధిక విలువను జతచేసే పారిశ్రామిక ఉన్నతీకరణ, విలువ వ్యవస్దలో పెరుగుదల వైపు పయనించింది. వాణిజ్య యుద్దం, మహమ్మారి గానీ చైనా కేంద్రంగా ఉన్న సరఫరా వ్యవస్దను ఏమేరకు ప్రభావితం చేశాయో ఇంకా తెలియదు గానీ ప్రాధమిక రుజువులను బట్టి ప్రభావం అన్ని రకాల పరిశ్రమల మీద ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద స్వదేశీ విదేశీ మార్పులకు అనుగుణ్యంగా వత్తిళ్లను తట్టుకొనే విధంగా తగిన వ్యూహాలను రూపొందించుకొన్నాయని సదరు ప్రొఫెసర్‌ పేర్కొన్నారు. మన సంస్కృత ఘనాపాటీలు ఎలాంటి పాఠాలు చెబుతారో తెలియదు.

భారీ పరిశ్రమలుగా వర్గీకరించిన చైనా పరిశ్రమల లాభాలు గతేడాదితో పోలిస్తే ఏప్రిల్‌ నెలలో 57శాతం పెరిగాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో గతేడాదితో పోలిస్తే లాభాలు గనుల రంగంలో 1.06 రెట్లు, ముడిపదార్ధాల తయారీ రంగంలో 3.66 రెట్లు పెరిగాయని జాతీయ గణాంక సంస్ద వెల్లడించింది. ఇటీవల రెండు సంవత్సరాల సగటు లాభాలు 29.2శాతం ఉండగా ఫార్మా రంగంలో ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 80.2శాతం పెరిగాయి. దుస్తులు, వస్త్రాలు, ముద్రణ పరిశ్రమల్లో గత రెండు సంవత్సరాల్లో లాభాలు గణనీయంగా పడిపోయాయి, అయితే ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో మెరుగు పడి తేడా తగ్గినట్లు గణాంక సంస్ద వెల్లడించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా జిడిపి 18.3శాతం పెరగ్గా దక్షిణ కొరియా 1.8, ఫ్రాన్స్‌ 1.5, అమెరికాలో 0.4శాతం వృద్ది రేటు నమోదు కాగా జపాన్‌ 1.8, జర్మనీ 3.1, ఇటలీ 4.8, బ్రిటన్‌లో 6.1శాతం తిరోగమన వృద్ధి నమోదైంది.

ఏ నేతకైనా వైఫల్యాలు సహజం. ఒక మత గ్రంధంలో పాప ప్రక్షాళన చేసుకుంటే పరలోక ప్రాప్తి అని ఉంది తప్ప పుణ్య ప్రస్తావన లేదంటారు.అలాగే నరేంద్రమోడీ నిఘంటువులో వైఫల్యాలకు అర్ధమే లేదు.ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో సహా ఇంతవరకు అన్నీ విజయాలే అన్నారు తప్ప ఒక్క వైఫల్యం గురించి కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ మోడీ ఎంతగా అపహాస్యం పాలయ్యారంటే కొద్ది రోజుల క్రితం బహుళజాతి గుత్త సంస్ద అమెజాన్‌లో ఒక పుస్తకాన్ని ఉచితంగా పొందండి అంటూ ప్రచారం సాగింది. దాని పేరు ఆంగ్లంలో ”మాస్టర్‌ స్రోక్‌ ” ( తిరుగులేని దెబ్బ లేదా తిరుగులేని యుక్తి ) రచయిత పేరు బెరోజ్‌గార్‌ భక్త్‌, అట్టమీద ప్రధాని నరేంద్రమోడీ బొమ్మ వేసి భారత్‌లో ఉపాధి వృద్ధికి గాను ప్రధానికి తోడ్పడిన 420 రహస్యాలు అని రాసి ఉంది. తీరా 56 పేజీల ఆ పుస్తకాన్ని తీసుకున్నవారు తెరిస్తే అంతా ఖాళీగా దర్శనమివ్వటాన్ని బట్టి నరేంద్రమోడీ మీద విసిరిన ఒక మాస్టర్‌ ్టస్టోక్‌ అని చెప్పవచ్చు. అది వైరల్‌ అయిన తరువాత అమెజాన్‌ దాన్ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. బెరోజ్‌గార్‌ భక్త్‌ అంటే తెలుగులో పనిపాటా లేని భక్తుడు అని అర్ధం. ఇక 420 అంటే ఏ సందర్భంలో వాడతారో తెలిసిందే. ఉపాధి పోగొట్టటం తప్ప ఉపాధి కల్పనలో ఘోరవైఫల్యం గురించి ఒకవైపు చర్చ నడుస్తున్ననేపధ్యంలో మరోవైపు మీడియా, ఇతరంగా నరేంద్రమోడీ దేశానికి అందించిన అద్భుతమైన సేవ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మోడీకి తోడ్పడిన 420 రహస్యాలు అంటే మోసాలు అని అర్ధం. మోడీ ఏలుబడిలో పెద్ద లేదా సానుకూలమైనవి ఏవీ లేవని చెప్పటమే.

చైనాతో పోటీ పడి మన దేశాన్ని వృద్ధి చేయవద్దని ఎవరూ చెప్పలేదు. చైనాకు వ్యతిరేకంగా మనల్ని నిలిపేందుకు పధకం వేసిన అమెరికన్లు, జపనీయులు చెప్పిన మాటలు నమ్మిన మన నేతల పరిస్ధితి సినిమాల్లో హాస్యగాళ్లలా తయారైంది. ఇంకే ముంది వెంటనే చైనా నుంచి వెయ్యి కంపెనీలు వస్తున్నాయి, అందుకొనేందుకు సిద్దంగా ఉండండి అని చెప్పగానే నిజమే అని హడావుడి చేశారు. ఏడాదైంది, ఏమైందో ఎవరైనా చెప్పారా ? ఎందుకని చైనా నుంచి అమెరికా సంస్ధలు మన దేశానికి రావటం లేదు. సరిహద్దుల్లో వాటిని అడ్డుకున్నారా ? గతేడాది మోడీ గారు చెప్పిందేమిటి ? ” రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఒక నూతన ప్రపంచ వ్యవస్ధ ఏర్పడటాన్ని మనం చూశాము. కోవిడ్‌-19 తరువాత అలాంటిదే జరగ నుంది. ఈ సారి ఉత్పాదక బస్‌ను భారత్‌ నడపనుంది, ప్రపంచ సరఫరా వ్యవస్ధలతో అనుసంధానం కానుంది. మనకు ప్రజాస్వామ్యం, జనాభా సంఖ్య, గిరాకీ రూపంలో నిర్దిష్టమైన అనుకూలతలు ఉన్నాయి.” అని 3డి సినిమా చూపారు. దాని కొనసాగింపుగా ముఖ్యమంత్రులందరూ పరిశ్రమలను అందుకొనేందుకు ఎర్రతివాచీలు పరిచి సిద్దంగా ఉండాలన్నట్లు మాట్లాడారనుకోండి.


నిజానికి చైనా నుంచి కంపెనీలు ఎన్ని బయటకు పోతున్నాయనేది పక్కన పెడితే అంతకు ముందే కొన్ని బయటకు వచ్చాయి. 2019 అక్టోబరు వరకు 56 కంపెనీలు బయటకు వస్తే వాటిలో మూడంటే మూడే మన దేశం వచ్చాయి, 26 వియత్నాం, 11 తైవాన్‌, 8 థారులాండ్‌ వెళ్లాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ ఎగుమతి సబ్సిడీలను వ్యతిరేకిస్తున్న కారణంగా దానికి పేరు మార్చి మన ప్రభుత్వం విదేశీ కంపెనీలకు ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకాన్ని ప్రవేశ పెట్టింది. దాని ద్వారా పదిలక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని మాదిరి గ్రాఫిక్స్‌ చూపింది.2020-21 సంవత్సరంలో కొన్ని లక్ష్యాలను నిర్ణయించింది. పదహారు కంపెనీలు ఆసక్తి చూపగా పదిహేను విఫలమయ్యాయి. ఒక్క శాంసంగ్‌ మాత్రమే పూర్తి చేసింది. దాంతో మరొక ఏడాది పాటు వ్యవధిని పొడిగించి 2021-22లో చేసిన ఉత్పత్తిని తొలి ఏడాది లక్ష్యంగా పరిగణించాలని ఆలోచన చేస్తోంది. సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు మొదటి ఏడాది నాలుగువేల కోట్ల మేరకు రెండవ ఏడాది ఎనిమిదివేల కోట్ల మేరకు ఉత్పత్తిని పెంచితే దాన్ని బట్టి రాయితీలు చెల్లిస్తారు.ఇలాంటివి గతంలో ఎగుమతుల పేరుతో ఉన్నా ప్రయోజనం కలగలేదు.


చైనా నుంచి లేదా ఇతర దేశాల నుంచి మన దేశానికి కంపెనీలు ఎందుకు రావటం లేదు. ఒకటి చైనా కంటే పన్ను ఎక్కువ. రెండవది ఇతర సౌకర్యాలకు పట్టే వ్యవధి, భూమి లభ్యతలోనూ సమస్యలుండటం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. అన్నింటికంటే మన కరెన్సీ విలువలో స్ధిరత్వం లేకపోవటం కూడా సమస్యగానే ఉంది. 2000 జనవరిలో చైనా కరెన్సీ మారకం ఒక డాలరుకు 8.27 ఉంది. గతేడాది అక్టోబరు నాటికి 6.69 యువాన్లకు పెరిగింది. ఇదే కాలంలో మన కరెన్సీ విలువ 43.55 నుంచి 74.54కు తగ్గింది. చైనా కరెన్సీ రెండు దశాబ్దాలలో 19శాతం బలపడగా మన కరెన్సీ 71శాతం బలహీనపడింది.కరెన్సీ విలువలో ఇంతటి ఒడిదుడుకులు ఉంటే కంపెనీలకు రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. డాలర్లలో పెట్టుబడి పెట్టిన వారికి వాటి విలువ తగ్గిపోతుంది. లాభాలు తీసుకుంటాయి తప్ప కంపెనీలు ముప్పుకు ఎందుకు సిద్దపడతాయి. అయితే మన దేశానికి కరెన్సీతో ఉన్న సమస్య ఏమిటి ? అది బలపడితే మన ఎగుమతులు తగ్గుతాయి, బలహీనపడితే పెరుగుతాయి, మనకు విదేశీ చెల్లింపులకు డాలర్లు కావాలి కనుక రూపాయి విలువను తగ్గించి ఎగుమతులు పెరిగేట్లు చూస్తున్నాం. మరోవైపు కనిపించే చిత్రం ఏమిటి ? దిగుమతి చేసుకొనే వస్తువుల ధర ఎక్కువగా ఉంటే మన ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఆదాయం ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు చమురు ధరలు పెరిగితే రాష్ట్రాలకు దాని మీద వచ్చే పన్ను ఆదాయం దామాషా ప్రకారం పెరుగుతుంది. దాన్ని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు తగ్గే ఆదాయాన్ని చెల్లించే స్ధితిలో కేంద్రం లేదు. ఎవరి గోల వారిది.


మన దేశంలో మధ్య తరగతి, ధనికులు గణనీయంగా ఉన్నారనే అంచనాతో అనేక కంపెనీలు వినియోగవస్తువులను మన మార్కెట్లో నింపేందుకు చూస్తున్నాయి. అయితే కరోనా సమయంలో నరేంద్రమోడీ ఒకందుకు చేసుకున్న ప్రచారం మరొక విధంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, పప్పులు ఇచ్చామని, ఇలాంటి కార్యక్రమం మానవ జాతి చరిత్రలో మరొకటి లేదని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. నూట ముప్పై కోట్ల జనాభాలో ఇంత మంది పేదలు ఉన్న దేశంలో ఖరీదైన వస్తువులను తయారు చేస్తే ఎవరు కొంటారు, పెట్టుబడులు దండగ అవుతాయోమో అని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు వెనకడుగు వేస్తున్నాయని చెబుతున్నారు. విదేశీ కంపెనీలకు కావాల్సింది పెద్ద సంఖ్యలో జనం కాదు, తమ వస్తువుల కొనుగోలు శక్తి ముఖ్యం. ఇదే సమయంలో నూటనలభై కోట్ల జనాభా ఉన్న చైనాలో 80 కోట్ల మంది మధ్యతరగతి, అధిక ఆదాయం కలవారు ఉన్నారు కనుక దానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప మనవైపు చూడరు.చైనాతో పోలిస్తే మన దేశంలో కొనుగోలు శక్తి కేవలం 20శాతమే. 1990 దశకం వరకు రెండు దేశాల తలసరి జిడిపి పోటా పోటీగా ఉంది. 2021 నాటికి నామినల్‌ పద్దతిలో మన కంటే చైనా తలసరి జిడిపి 5.4రెట్లు, పిపిపి పద్దతిలో 2.58 రెట్లు ఎక్కువ. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఎందుకంటే మన తలసరి ఆదాయం 2019లో 2104 డాలర్లు ఉంటే 2020లో 1965 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో చైనాలో 10,261 నుంచి 10,484కు పెరిగింది. కనుకనే చైనా ఉత్పత్తి చేయటంలోనే కాదు, వినియోగించటంలోనూ మనకంటే ముందుంది.

ఈ నేపధ్యంలో అమెరికన్‌ లేదా జపాన్‌ కంపెనీ అయినా అక్కడ ఉండేందుకే ప్రయత్నిస్తాయి తప్ప మన దేశానికి వచ్చేందుకు, చేతులు కాల్చుకొనేందుకు ఎందుకు పూనుకుంటాయి. ఒకవేళ బయటకు పోవాల్సి వస్తే మనకంటే రిస్కు తక్కువ ఉన్న దేశాలకే పోతాయి. కరోనాలో మన దిగజారుడు చూసిన తరువాత కనీసం అలాంటి ఆలోచన కూడా చేయరు. గిరాకీ మన నేతల ప్రకటనల్లో తప్ప వాస్తవంలో ఎక్కడుంది. అమెరికన్లు చైనాతో పోట్లాడతారు అక్కడే ఉంటారని ట్రంప్‌ పాలనా కాలం నిరూపించింది. మన దేశాన్ని వినియోగించుకుంటారని వారి చమురును మనకు అంటగట్టి వారు లబ్దిపొందటాన్ని కూడా ఇదే కాలంలో చూశాము. చైనాకు వ్యాపారం, మనకు కౌగిలింతలు ఇచ్చారు. హౌడీ మోడీ-నమస్తే ట్రంప్‌ వంటి జిమ్మిక్కులు చేసి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. అమెరికా వైట్‌హౌస్‌లో ఎవరు కూర్చున్నా జరిగేది ఇదే.


అంతర్జాతీయ రాజకీయాల్లో అనుసరించే విధానాలు కూడా వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో మన దేశం చైనాకు వ్యతిరేకంగా పని చేయటం బహిరంగ రహస్యం. ఇదే సమయంలో చైనా తన అవసరాల కోసం పాకిస్దాన్ను దగ్గరకు తీస్తున్నది. మన పంచదార వ్యాపారులు పాకిస్ధాన్‌ కంటే పంచదారను టన్ను 40 డాలర్లకు తక్కువ ఇస్తామన్నప్పటికీ పాక్‌ నుంచి దిగుమతి చేసుకొనేందుకు చైనా మొగ్గుచూపింది. మన దేశం ఔషధ పరిశ్రమ చైనా మీద ఎంతగా ఆధారపడిందంటే అక్కడి నుంచి అవసరమైన పదార్ధాల దిగుమతి ఆగిపోతే పెన్సిలిన్‌ వంటి వాటిని మనం తయారు చేసుకోలేనంతగా అని చెప్పాలి. ఇక రాజకీయాల విషయానికి వస్తే మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేసి వారిని లొంగదీసుకుంటున్నట్లు కాషాయ మరుగుజ్జులు ప్రచారం చేస్తారు. ఇది జనాన్ని మోసం చేయటమే. మనం నిజంగా చేయాల్సింది మొత్తంగా దిగుమతులను నిలిపివేసి స్వయంగా తయారు చేసుకోవటం. కానీ జరుగుతోందేమిటి ? గతంలో మనం 2015లో చైనా నుంచి 2.8 బిలియన్‌ డాలర్ల మేర ఉక్కు దిగుమతులు చేసుకున్నాం ఇప్పుడు ఒక బిలియన్‌కు పడిపోయింది. ఎందుకు ? చైనా నుంచి దిగుమతి చేసుకోవాలంటే పదిహేనుశాతం ధర ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా తాను ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా మనకు ఎలాంటి పన్నులు లేని ఉక్కును సరఫరా చేస్తున్నందున చౌకగా దొరుకుతోంది గనుక అక్కడి నుంచి కొంటున్నాం. ఇలా అనేక అంశాల మీద జనాన్ని తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతోంది. కనుక బిజెపి లేదా మరొక పార్టీ ఏది చెప్పినా దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు, ఏ దేశం మీదా గుడ్డి ద్వేషాలను పెంచుకోవద్దు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వామపక్ష శక్తులకు ఉత్సాహమిచ్చే అల్బేనియా, చిలీ ఎన్నికలు !

26 Wednesday May 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Albania elections 2021, Albanian Left, Chile communists, Chile Left Victories, Edi Rama, Latin American left, Socialist Party of Albania


ఎం కోటేశ్వరరావు


అల్బేనియా, టర్కీ మాదిరే అత్యధిక ముస్లిం జనాభాతో ఉన్న ఆగేయా ఐరోపా ఖండ దేశం. జనాభా 30లక్షలకు లోపుగానే ఉన్న లౌకిక రాజ్యం. తూర్పు ఐరోపా దేశాల మాదిరే మూడు దశాబ్దాల క్రితం సోషలిస్టు వ్యవస్ధలో ఉంది.1991 తరువాత బహుళ పార్టీ రాజకీయ వ్యవస్ధ ఉనికిలోకి వచ్చింది. మూడు దశాబ్దాలు గడచినా కమ్యూనిస్టు గతాన్ని సమూలంగా వదిలించుకోవటంలో విఫలమైందని రాజధాని టిరానా కేంద్రంగా పని చేస్తున్న ఒక స్వచ్చంద సంస్ధ పరిశోధకుడు అల్టిన్‌ జెటా తాజాగా రాసిన వ్యాసంలో వాపోయాడు. తూర్పు ఐరోపా దేశాలలో అనేక చోట్ల ప్రజాస్వామ్య ఖూనీ, కమ్యూనిస్టు పార్టీలపై నిషేధం, కమ్యూనిజం బాధితుల పేరుతో వ్యతిరేక ప్రచారం చేసే శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో అల్బేనియా గురించి ఇలాంటి వ్యాఖ్య వెలువడటం ఒక చిన్న దేశం ఇస్తున్న పెద్ద సందేశంగా చెప్పవచ్చు. కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఎందుకీ కడుపు మంట ?

కమ్యూనిస్టు గతం నుంచి విడగొట్టుకోని ఏకైక పూర్వపు ఐరోపా సోషలిస్టు దేశం అని సదరు రచయితే చెప్పాడు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు వ్యవస్ధలను వ్యతిరేకిస్తూ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు, నాటి పోప్‌తో చేతులు కలిపిన ఉదంతాలను గుర్తుకు తెచ్చుకుంటే అలాంటి శక్తులు, వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేని ఏకైక దేశం అల్బేనియా. అయినప్పటికీ అక్కడి పాలకవర్గం అనేక చర్యలు బహుళ పార్టీ వ్యవస్ధను ప్రవేశ పెడుతూ రాజ్యాంగ పరమైన మార్పులు చేసింది. పూర్వపు సోషలిస్టు వ్యవస్ధలోని యంత్రాంగం, పార్టీ రాజకీయాలు, ఇతర అనేక అంశాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న దేశం అయినప్పటికీ దీని ప్రభావం మిగిలిన పూర్వపు సోషలిస్టు దేశాల మీద పడుతుందన్నది సామ్రాజ్యవాదులు లేదా వారి ఏజంట్ల భయం. పూర్వపు సోషలిస్టు దేశాల్లో అధికారానికి వచ్చిన శక్తులు సోషలిస్టు వ్యవస్ధలు, కమ్యూనిజం మీద విషం కక్కుతుంటే అల్బేనియాలో అలాంటి పరిస్ధితి లేదు. కమ్యూనిస్టు అల్బేనియా దేశంలో అందరికీ ఓటింగ్‌ హక్కు కల్పించటం,ఉచిత విద్య, వైద్యం, ఇతర అభివృద్ధికి ఒక పురోగామి రాజ్యంగా పని చేసిందని పాఠశాల పుస్తకాల్లో ఇప్పటికీ పిల్లలకు బోధిస్తున్నారు. దీన్ని కొనసాగిస్తున్న కారణంగా కమ్యూనిస్టు గతాన్ని పూర్తిగా తుడిచివేయటం అసాధ్యంగా మారిందని అక్కసు వెళ్లగక్కుతున్నారు.


సదరు రచయిత అక్కసుకు తక్షణ ప్రేరేపణ గతనెలాఖరులో అక్కడ జరిగిన ఎన్నికల్లో పూర్వపు అల్వేనియా లేబర్‌ పార్టీ ( కమ్యూనిస్టు పార్టీ ) వారసురాలు అల్బేనియా సోషలిస్టు పార్టీ అధికారానికి రావటమే. అనేక దేశాలలో కార్మికుల పేరుతో ఏర్పడిన అనేక పార్టీలు తరువాత కాలంలో సోషలిస్టు లక్ష్యంతో, కమ్యూనిస్టు సిద్దాంతాలను అనుసరించినప్పటికీ పూర్వపు పేర్లతోనే కొనసాగాయి. వాటిలో అల్బేనియా పార్టీ ఒకటి. ఉత్తర కొరియాలో అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులని అందరికీ అందరికీ తెలుసు. పార్టీ పేరు కొరియా వర్కర్స్‌ పార్టీ అనే ఉంది. అదే విధంగా క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ 1920దశకంలోనే ఏర్పడినప్పటికీ ఎన్నికల అవసరాల కోసం 1944లో ప్రజా సోషలిస్టు పార్టీగా పేరు మార్చుకుంది. అయితే నియంత బాటిస్టాను కూలదోసిన ఉద్యమానికి నాయకత్వం వహించిన ఫైడెల్‌ కాస్ట్రో ఆ సమయంలో కమ్యూనిస్టు కాదు.1955లో జూలై 26 ఉద్యమం పేరుతో ఏర్పడిన పార్టీ నేత.1959లో అధికారానికి వచ్చారు. రెండు సంవత్సరాల తరువాత విప్లవంలో భాగస్వాములైన మూడు పార్టీలు 1961లో విప్లవ సంస్ధగా ఐక్యమయ్యాయి. మరుసటి ఏడాది క్యూబన్‌ విప్లవ ఐక్య సోషలిస్టు పార్టీగా మారింది. మరో మూడు సంవత్సరాల తరువాత క్యూబా కమ్యూనిస్టు పార్టీ అయింది. 1976లో రాజ్యాంగ సవరణ చేసి దేశానికి మార్గదర్శిగా కమ్యూనిస్టు పార్టీని గుర్తించారు.

అయితే అల్బేనియా పార్టీ అలా ఉందని చెప్పలేముగాని ఒక వామపక్ష పార్టీగా పూర్వపు వారసత్వాన్ని కొనసాగిస్తోందని భావించవచ్చు. పూర్వపుసోషలిస్టు ప్రభుత్వంలో పని చేసిన వారు ఈ పార్టీలో కొనసాగుతున్నారు.యాభై ఆరు సంవత్సరాల ఎడి రామా పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఉన్నారు. కమ్యూనిస్టు నేపధ్యం గల కుటుంబంలో జన్మించిన రామా కమ్యూనిస్టు పార్టీలో పని చేయటం లేదా ప్రభుత్వ పదవుల్లో గానీ లేరు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా కుట్రలు జరిగిన 1990దశకంలో అల్బేనియాలో ప్రజాస్వామ్య వ్యవస్ధ కావాలని కోరిన వారిలో ఒకడు. డెమోక్రటిక్‌ పార్టీలో చేరి వెంటనే సైద్దాంతిక విబేధాలతో బయటికి వచ్చి సోషలిస్టు పార్టీలో చేరారు. టిరానా నగర మేయర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆయన నాయకత్వంలో మూడు సార్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో , రెండు మున్సిపల్‌ ఎన్నికలలో పార్టీ విజయం సాధించింది. ఐరోపా సోషలిస్టు పార్టీల కూటమిలో భాగస్వామిగా ఉంది.


తాజా విషయానికి వస్తే గతనెలాఖరులో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 140 స్ధానాలకు గాను 74 సాధించి అల్బేనియా సోషలిస్టు పార్టీ వరుసగా మూడవ సారి అధికారానికి వచ్చింది. 1992 నుంచి ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో ఒక సారి సంకీర్ణ మంత్రి వర్గానికి నాయకత్వం వహించింది, నాలుగుసార్లు స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నాలుగు సార్లు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ధనిక దేశాలలో తలెత్తిన 2008 ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ 2013 నుంచి వరుసగా ఎన్నిక అవుతూనే ఉంది. మిగతా ఐరోపా దేశాలలో ఒక పాలకపార్టీ ఇలా వరుస విజయాలు సాధించటం ఇటీవలి కాలంలో అరుదు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికలోనూ ఓట్లశాతాన్ని పెంచుకుంటూ వస్తుండటం కూడా ఒక విశేషమే. ప్రతిపక్ష మితవాద డెమోక్రటిక్‌ పార్టీ ఎన్నికల ఫలితాలను గుర్తించటం లేదని ప్రకటించి తరువాత మౌనం దాల్చింది. అనివార్యమైన స్ధితిలో అమెరికా, ఐరోపా దేశాలు కూడా సోషలిస్టుల విజయాన్ని జీర్ణించుకోలేకపోయినా గుర్తించక తప్పలేదు.


ఇక అంతర్గత రాజకీయాల విషయానికి వస్తే 2017లో సోషలిస్టు పార్టీ మద్దతుతో ఎన్నికైన అధ్యక్షుడు లిర్‌ మెటా తరువాత ప్రభుత్వ వ్యతిరేకిగా మారాడు. తాజా ఎన్నికలలో సోషలిస్టు పార్టీకి గనుక 71 స్ధానాలు వస్తే తాను రాజీనామా చేస్తానని ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసి ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నించాడు. సోషలిస్టు పార్టీ విజయం సాధించిన తరువాత 2022లో తన పదవీ కాలం పూర్తయ్యే వరకు కొనసాగుతానని, రాజీనామా ప్రసక్తి లేదని ప్రకటించాడు. అయితే అధికారపార్టీకి చెందిన ఎంపీలు అధ్యక్షుడిని అభిశంసించేందుకు ఒక తీర్మానాన్ని అంద చేశారు, తనను తొలగించటం చట్టవిరుద్దమని మెటా వాదిస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్యలను తీసుకొనేందుకు ప్రభుత్వం పూనుకుంది.అల్బేనియా ఎన్నికల్లో సోషలిస్టుల విజయం ఐరోపాకే కాదు, యావత్‌ ప్రపంచ పురోగామి శక్తులకు ఉత్సాహానిచ్చే పరిణామమే.

చిలీలో మితవాదులకు చావు దెబ్బ

లాటిన్‌ అమెరికాలోని చిలీ పరిణామాలు కూడా ప్రపంచ వామపక్ష శక్తులకు ఉత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి. నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసే రాజ్యాంగపరిషత్‌కు జరిగిన ఎన్నికలలో మితవాద శక్తులకు చావు దెబ్బ తగిలింది.మాజీ నియంత పినోచెట్‌ మద్దతుదారులు, సాంప్రదాయ పార్టీలు జనాగ్రహ సునామీలో కొట్టుకుపోయాయి. మే 16వ తేదీన నూటయాభై ఐదు స్ధానాలకు జరిగిన ఎన్నికలలో 77శాతం మంది వామపక్ష భావాలు కలిగిన వారు, నియంత పినోచెట్‌ విధానాలను వ్యతిరేకించిన వారు విజయం సాధించారు. అధికారంలో ఉన్న సోషలిస్టు సాల్వెడోర్‌ అలెండీని హత్య చేసిన పినోచెట్‌ 1973లో అధికారానికి వచ్చి 1990వరకు కొనసాగాడు. రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికలలో మితవాద పార్టీల కూటమికి కేవలం 37 మాత్రమే వచ్చాయి.నిబంధనల ప్రకారం కొత్త రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్‌ ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. మితవాద శక్తులు గనుక 54 స్ధానాలు పొంది ఉంటే రాజ్యాంగ రచన చిక్కుల్లో పడి ఉండేది, అయితే ఓటర్లు అలాంటి అవకాశం లేకుండా 37 మాత్రమే ఇవ్వటంతో రాజ్యాంగ రచనలో మితవాద శక్తుల పప్పులు ఉడికే అవకాశాలు లేవు. రాజ్యాంగ సభలో 77 మంది మహిళలు, 78 మంది పురుషులు ఉన్నారు. నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ప్రక్రియ ప్రారంభమైంది. పెద్ద విజయాలు సాధించిన వారిలో 28 స్దానాలతో కమ్యూనిస్టులు ఉన్నారు, వామపక్షంగా ఉన్న మరొక పార్టీ 24 పొందింది.


2018లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన మితవాది, బిలియనీర్‌ సెబాస్టియన్‌ పినేరా విధానాలతో మరుసటి ఏడాదే దేశంలో వివిధ తరగతుల్లో ఆందోళన ప్రారంభమైంది. తరువాత అనేక ఉద్యమాలు నడిచాయి. గత మూడు సంవత్సరాలుగా పార్లమెంట్‌లోని మితవాదులు, పినేరా కూడా వైద్యరంగంలో ప్రజానుకూల సంస్కరణలకు అడ్డుతగిలారు. నయావుదారవాద విధానాలతో జనజీవితాలు అతలాకుతలం అయ్యాయి.సంపదలు దిగువ జనానికి చేరతాయని చెప్పిన ఊట సిద్దాంతం తిరగబడింది. కనీసం పదిలక్షల మంది జనం 2019లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన నేపధ్యంలో రాజ్యాంగపరిషత్‌ ఎన్నికలను చూడాలి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం నయా ఉదారవాద విధానాలతో నియంత పినోచెట్‌ ఏర్పాటు చేశాడు. రాజ్యాంగ పరిషత్‌తో పాటు ప్రాంతీయ ప్రభుత్వాలు, స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావిస్తున్న డేనియెల్‌ జాడ్యు 66శాతం ఓట్లతో శాంటియాగోలోని రాజధాని ప్రాంత కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే విధంగా శాంటియాగో మేయర్‌గా చిలీ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త లిరాసీ హాస్లర్‌ ఎన్నికయ్యారు. ఆమె కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. కమ్యూనిస్టు పార్టీతో సహా వామపక్ష శక్తులు ఉన్న బ్రాడ్‌ ఫ్రంట్‌ (విశాల కూటమి) తరఫున పోటీచేసిన అనేక మంది స్ధానిక సంస్ధలలోనూ, రాజ్యాంగ పరిషత్‌లోనూ విజయాలు సాధించారు. మితవాద శక్తులకు సాంప్రదాయంగా ఓటు వేసే అనేక పట్టణాల్లో వారిని మూడవ స్ధానానికి నెట్టివేశారు. చిలీ జనాభా కోటీ 90లక్షలు కాగా శాంటియాగో పరిసరాల్లో 60లక్షల మంది ఉన్నారు. ఆప్రాంతంలోని 27 మేయర్‌ స్ధానాలను కమ్యూనిస్టు, వామపక్షశక్తులు, పదకొండు స్ధానాలను స్వతంత్రులు గెలుచుకోగా మితవాదులకు 14వచ్చాయి. ఎన్నికలు ముగిసిన ఏడాది లోపు నూతన రాజ్యాంగ రచన జరగాలి. ఆ తరువాత రెండు నెలల్లో మరోసారి దాని మీద ప్రజాభిప్రాయసేకరణ జరిపి ఆమోదానికి పెట్టాలి.


ప్రపంచ వ్యాపితంగా మితవాద, నయా ఫాసిస్టు శక్తులు పెరిగేందుకు అనువైన పరిస్దితులు ఉన్నాయి. అందుకే మన దేశంతో సహా అనేక చోట్ల అవి అధికార పీఠాలపై తిష్టవేశాయి.ఈ పరిణామాలను చూసి గుండెలు బాదుకోవాల్సిన పనిలేదు. ఇదేమీ ప్రపంచానికి కొత్త కాదు, వాటి పీచమణిచే ప్రజాశక్తి మొద్దుబారలేదు. అల్బేనియా, చిలీ పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d