ఇండోనేషియాలో కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందా !

Tags

, , ,

ఎంకెఆర్‌

    ఇండోనేషియాలో అంత మైంది అనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందా ? కొంత మంది చెబుతున్నట్లు 2017లో ఈ మేరకు ప్రకటన వెలువడుతుందా ? లేక మరికొందరు అంటున్నట్లు ఎక్కువ చేసి చెబుతున్నారా ? యాభై సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోశారు. మరికొన్ని లక్షల మందిని అనుమానంతో కమ్యూనిస్టులుగా భావించి జైళ్లలో పెట్టారు, చిత్రహింసల పాలు చేశారు. కమ్యూనిజాన్ని అణచివేశామని అదింకేమాత్రం ఇండోనేషియాలో కనిపించదని సంబరాలు చేసుకున్నారు. ఆసియాలో కమ్యూనిజ వ్యాప్తి నిరోధంలో భాగంగా అమెరికా సిఐఏ రూపొందించిన ఒక దుష్ట పధకం ప్రకారం ఇదంతా జరిగింది.నాడు ఏక్షణంలో ఏ సైనికులు, పోలీసులు, వారి కిరాయి ఏజంట్లు వచ్చి తమను హతమారుస్తారో అని కమ్యూనిస్టులు, అభిమానులు, సాధారణ ప్రజాతంత్ర వాదులు భయపడ్డారు. నేడు అందుకు విరుద్ధంగా ఏ మూల నుంచి కమ్యూనిస్టులు పుట్టుకు వస్తారో అని భయపడుతూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు వీధులకెక్కుతున్నారు. అనేక సంస్థలకు చెందిన వారూ, రిటైర్డ్‌ మిలిటరీ అధికారులు కొద్ది రోజుల క్రితం కమ్యూనిస్టు వ్యతిరేక సదస్సు పెట్టి ఆ సందర్భంగా రాజధాని జకర్తాలో ఒక ప్రదర్శన చేశారు.అరుణ పతాకాలను తగుల పెట్టారు.కమ్యూనిస్టులను చంపటం సరైనదే అని వున్మాదంతో నినాదాలు చేశారు. కమ్యూనిజం, ఇతర భావజాలాల నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు ఈ ప్రదర్శన జరిపినట్లు వుపన్యాసాలు చేసిన వారు చెప్పారు. హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు వేసి ఎంతో మందిని చంపిన అమెరికా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిందని, కమ్యూనిస్టులను చంపటం కూడా యుద్ధంలో భాగంగానే పరిగణించి ప్రభుత్వం ఎలాంటి క్షమాపణలు చెప్పకూడదని వాదించారు. ఇంతకాలంగా కార్యకలాపాలలో లేని ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ(పికెఐ) తన వునికిని చాటుకొనేందుకు పధకాలు వేసిందని, దానిని అడ్డుకోవాలని కోరారు. కొన్ని పత్రికలు మూడువేల మంది పాల్గొన్నట్లు రాస్తే మరికొందరు పదివేలని పేర్కొన్నారు.

    దీనికి కొద్ది వారాల ముందు ప్రభుత్వమే 1965 హత్యాకాండ బాధితుల గురించి వారి కుటుంబాలు, మేథావులు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులతో ఒక సదస్సు జరిపిన విషయం తెలిసినదే.అదే ప్రభత్వం కమ్యూనిస్టు ప్రచారం, పునరుద్ధరణలో భాగంగా చివరికి కమ్యూనిస్టు చిహ్నాలున్న టీ షర్టులను అమ్ముతున్నవారిని, ధరించిన వారిని కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పికెఐ భావజాలం వున్న వారు చెప్పింది మాత్రమే వినవద్దు, మేము చెప్పేది కూడా వినాలి, 1965లో మరణించిన వారిని (కమ్యూనిస్టులను) బాధితులుగా ప్రభుత్వం గుర్తిస్తే వారిని హతమార్చిన వారిని(మిలిటరీ, ఇతర కిరాయి ఏజంట్లు) నేరస్థులుగా పరిగణించాల్సి వుంటుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు పేర్కొన్నారు.

  ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికలిగిస్తున్నాయి.ప్రపంచంలో కమ్యూనిజాన్ని అంతం చేశామని అమెరికన్లు ప్రకటించిన పాతిక సంవత్సరాల తరువాత అదే అమెరికాలో తాము సోషలిస్టుల మంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలంటూ స్వయంగా సోషలిస్టును అని ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ ప్రస్తుతం ప్రచారంలో మునిగిన విషయం, ఆయనకు యువత నీరాజనాలు పడుతున్న సంగతి తెలిసిందే.

   ఇండోనేషియాలో నియంత సుహార్తో పతనం తరువాత 1965 నాటి మారణకాండపై విచారణ జరపాలనే అంశం మెల్లగా వూపందుకుంది. మొత్తాన్ని అంతం చేసిన తరువాత కూడా ఇంకా కమ్యూనిస్టులు మిగిలి వున్నారా ? వుంటే ఏ పేరుతో వున్నారు, తాజా డిమాండ్‌ వెనుక వారున్నారా ? అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులను వేధిస్తున్న ప్రశ్న. కమ్యూనిస్టుల నాయకత్వాన నైజా నవాబు, దేశముఖ్‌లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణా సాయుధ పోరాట సందర్బంగా కోస్తా జిల్లాలో ఆ పోరాటానికి మద్దతు తెలిపిన వారిని కూడా మిలిటరీ, పోలీసులు అనేక మందిని కాల్చి చంపటమే గాక గ్రామాలకు గ్రామాలను చుట్టుముట్టి చిత్ర హింసల పాలు చేశారు. పోలీసులకు ఎవరు కమ్యూనిస్టులో ఎవరు కాదో తెలియని స్ధితి, వచ్చిన స్పెషల్‌ ప ోలీసులకు జనాన్ని బాదటం తప్ప తెలుగు తెలియదు. గాంధీ విగ్రహాల ముందు జనాన్ని మందవేసి చిత్రహింసలు పెడుతున్న సందర్భంలో కొంత మంది తాము యాంటీ కమ్యూనిస్టుల మని చెప్పుకున్నారట. అసలే పోలీసు, తలమీద టోపీ పెట్టగానే బుర్ర అసలు పని చేయదని తెలిసిందే. దాంతో వున్న కమ్యూనిస్టులతోనే వేగలేకపోతుంటే వీరెవరో కొత్తగా యాంటీ కమ్యూనిస్టులట వీరికి నాలుగు అదనంగా తగిలించమని పురమాయించినట్లు చెప్పేవారు. అలాగే ఇండోనేషియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత ఎంతవరకు పోయిందంటే కమ్యూనిస్టు వ్యతిరేక పుస్తకాలను కూడా మిలిటరీ, పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారట. ఏమిటంటే కమ్యూనిస్టులను విమర్శించాలన్నా కమ్యూనిస్టులు ఏమి చెప్పేది వివరించాలి కనుక అది కూడా కమ్యూనిస్టు ప్రచారానికి తోడ్పడుతందని వారు భయపడుతున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకత ముసుగులో నియంత సుహార్తో అనుసరించిన మేథోవ్యతిరేక ధోరణులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్‌ బాగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇలాంటి చర్యలు ఫలితాలనివ్వవని తెలిసినప్పటికీ అదే మొరటు పద్దతులను పాటిస్తున్నారు. మిలిటరీ, పోలీసులు ఎంతగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడితే యువతరం అంతగా దానిపట్ల ఆకర్షితులయ్యే ప్రమాదం లేకపోలేదని కొందరు భయపడుతున్నారు.

   ఇండోనేషియాలో కమ్యూనిస్టు కార్యకలాపాల పునరుద్ధరణ గురించి వస్తున్న వార్తలు అతిశయోక్తులని దేశ వుపాధ్యక్షుడు యూసఫ్‌ కలా వ్యాఖ్యానించారు.’ కమ్యూనిజం అనేది సమానత్వం కోరుతున్న ఒక భావజాలం,అందుకే కాబోలు జనం దానిని భిన్నంగా చూస్తున్నారు, ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ అనేది అతిశయోక్తి అనుకుంటున్నా. అది అనేక దేశాలలో విఫలమైంది, ప్రస్తుతం వుత్తర కొరియాలో మాత్రమే వుంది, అక్కడి ప్రభుత్వం కూడా విఫలమైంది, ఒక భావజాలంగా ఒకసారి తిరస్కారానికి గురైంది తిరిగి వేళ్లూను కుంటుంది అనుకోవటం లేదు.’ అన్నారు. మిలిటరీ అధికారి కివలన్‌ జెన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరించబడింది, 2017లో ప్రకటన వెలువడ నుంది అన్నారు. రాజకీయ, భద్రత, న్యాయ వ్యవహారాల మంత్రి లుహుత్‌ బిన్సర్‌ పండజైటన్‌ మాట్లాడుతూ ‘ అదే నిజమైతే ఆ సంస్ధ ఎక్కడుందో చెప్పమనండి, నాకు చాలా కళ్లు,చెవులు వున్నాయి కానీ ఒక్క నివేదిక కూడా నాకు అందలేదు’ అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది ఆసక్తి కలిగిస్తోంది.

విశ్వసనీయతను దిగజార్చుకుంటున్న చంద్రబాబు

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ జనాలను వెర్రివాళ్ల కింద జమకడుతున్నారా ? తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటున్నారా ? ఇది ప్రతిపక్ష పార్టీల వారికి వస్తున్న ఆలోచన కాదు, స్వంత బుర్రలను వుపయోగించి తెలుగు దేశం పార్టీని పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని కోరుకొనే కార్యకర్తలలో కూడా తలెత్తున్న ప్రశ్న. విజయవాడ బెంజి సర్కిల్‌లో జూన్‌ రెండవ తేదీన నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూసిన తరువాత కలుగుతున్న సందేహాలివి.

   ముఖ్యమంత్రి, అనుచర గణం రాష్ట్ర నవనిర్మాణం కోసం దీక్ష అనే ఒక పెద్ద బ్యానర్‌ కింద మౌనంగా కూర్చొని వుంటే ఎంతో హుందాగా వుండేది. లేదూ తస్మదీయ పత్రికలు, ఛానళ్ల వారిని,తెలుగుదేశం కార్యకర్తలను సంతోష పెట్టేందుకు అసలు ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలలో జరిగిందేమిటి? జరగాల్సిందేమిటి? విభజన సమయంలో కేంద్రం చేసిన చట్టం, వాగ్దానాలు ఏమిటి ? అవి ఎంతవరకు అమలు జరిగాయి? జరగకపోతే ఎదురైన సమస్యలేమిటి మొదలైన అంశాలతో రాష్ట్ర ప్రజల ముందు శ్వేత పత్రం పెట్టి ఏం చేయాలో చర్చించండని ఒక్క మాట చెప్పి వుంటే జనం అర్ధం చేసుకొని వుండేవారు. తమ నిర్ణయం తాము తీసుకొని వుండేవారు.

     అటువంటి సదవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారు. వుపాధి హామీ పధకం కింద జనానికి పని కల్పించినా లేకపోయినా, బాబొస్తే జాబొస్తుందని ఎదురు చూస్తున్న జనాలు గోళ్లు గిల్లు కుంటూ కూర్చున్నా, వున్న వుద్యోగాలు కూడా వూడగొడుతున్నారని అనేక మంది చిరుద్యోగులు నిస్సహాయులైన స్ధితిలో వున్నా, వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఎవరికైనా దేవదూతేమో గాని తమకు మాత్రం మాత్రం సైతాన్‌గా పరిణమించారని నరేంద్రమోడీ గురించి ఆంధ్ర ప్రదేశ్‌ జనం భావిస్తున్న తరుణంలో చంద్రబాబు వుభయుల పక్షాన ప్రతిపక్షాలకు మాత్రం చేతి నిండా పని కల్పిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో తనను సవాలు చేసే ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదని, జనం విసుక్కున్నా, తిట్టుకున్నా తిరిగి తనకు తప్ప మరొకరికి పట్టం కట్టే అవకాశం లేదన్న ధీమాతో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారా ? గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాంటి చులకన భావంతోనే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో తెలియంది కాదు. గతం మాదిరి కాకపోయినా, పాత్రలు మారినా కొత్త రూపంతో చరిత్ర పునరావృతం కాక తప్పదు.

     గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు, అదేమిటంటే ఎన్నికలపుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను, మాట్లాడతానని మిగతా సమయాలలో రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకు మరొకటి పట్టదని, ప్రతిపక్షాలు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించేవారు. ఒకవైపు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో పెట్టుబడులు కోసం తిరిగిన దారి ఖర్చులు తప్ప పర్యటనలు ఏ మేరకు ఫలించాయో కనిపించటం లేదు. తరుణం రాక ముందే కూసిన కోయిల మాదిరి కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని రాష్ట్రం విడిపోక ముందే కోరిన చంద్రబాబు కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేక, వచ్చిన డబ్బుతో తాత్కాలిక రాజధాని కడుతున్నారని జనం సానుభూతి చూపుతున్నారు. తొలి బిడ్డ పెళ్లికి అవసరమైన డబ్బు సంగతి తేల్చుకోకుండానే అన్నీ కుదుర్చుకొని, చివరకు ముహూర్తాలు కూడా పెట్టుకొని పనులు మొదలు పెట్టిన తరువాత అప్పు ఇస్తానన్న వారు సొమ్ము ఇవ్వకపోతే ఆ గృహస్థు పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి జనానికి కలిగించిన ఆశలు కూడా అలాగే కల్లలయ్యాయి. అప్పు ఇస్తామన్న వారు కనీసం మధ్యవర్తితో అయినా కొద్ది రోజుల ముందు డబ్బు సర్దుబాటు కాలేదు ఇవ్వలేకపోతున్నాము వేరే చూసుకోండని కబురు చేస్తారు. అదేమి చిత్రమో ఐదు కోట్ల ఆంధ్రప్రజలు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్న ప్రత్యేక హోదా, లోటు నిధుల భర్తీ , పాకేజ్‌ల గురించి ప్రధాని నరేంద్రమోడీ వులకరు పలకరు, అవుననీ చెప్పరు కాదనీ చెప్పకపోగా ఇప్పటికే చాలా ఇచ్చామని పార్టీ వారి చేత చెప్పిస్తున్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే ఇచ్చిన దానికి లెక్కలు చెప్పమంటున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరించి చివరికి పొమ్మనకుండా పొగబెట్టినట్లు, ఇంక దాని గురించి అయితే న్యూఢిల్లీ రావద్దు అని జనానికి బాగా స్పష్టమయ్యే రీతిలో సందేశాలు పంపారు.

     ఇటువంటి స్ధితిలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీనికంటే మౌనంగా దీక్ష చేసి వుంటే అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పాటు అధోగతి పాలు చేస్తున్న బిజెపి గురించి కూడా చంద్రబాబు ఆగ్రహంతో వున్నారని అయినా జనం అనుకొనే వారు. చంద్రబాబు చెబుతున్నట్లు అసాధారణ రీతిలో అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ఎలా విభజన బిల్లును ఆమోదించిదీ పదే పదే చెప్పనవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో అదేగా చెప్పారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌లేదు, అలాంటి పని చేసిన వారికి రాష్ట్ర శాసన సభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా జనం తగిన విధంగా తీర్పు నిచ్చారు. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ఇంకా చంద్రబాబు దాని గురించి మాత్రమే మాట్లాడితే ఆయన విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది. రెండు కళ్ల సిద్దాంతాలు చెప్పి విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చరిత్ర చెరిగిపోదు. పార్లమెంట్‌లో చట్టం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఒక్కటే లేదు, అంతకంటే ఎక్కువ హడావుడి చేసిన బిజెపి ఏం చేసింది? పోనీ వారేమీ చిన్న పిల్లలు, తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వారు కాదే. అందువలన చంద్రబాబు చెప్పినట్లు సంబరాల బదులు విభజన కారణంగా జరిగిన అన్యాయానికి దీక్షలు చేయాల్సి రావటానికి కాంగ్రెస్‌ ఎంత కారకురాలో బిజెపి కూడా అంతే బాధ్యురాలు. కాంగ్రెస్‌ అధికారం నుంచి పోయింది. ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన బిజెపికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా ? అలాంటి పార్టీతో స్నేహం కొనసాగించాలా లేదా అనేది తెలుగు దేశం పార్టీ ఇష్టం. తమ్ముడు తమ్ముడే న్యాయం న్యాయమే బిజెపి కూడా ఏపికి న్యాయం చేయలేదు అనే మాట చెప్పటానికి నోరు రావటం లేదే. అవ్వతో వసంత మాడినట్లు అన్నీ అయి పోయిన కాంగ్రెస్‌ను మాత్రమే విమర్శిస్తే అది జనాన్ని మభ్యపెట్టే రాజకీయం తప్ప మేలు చేసేది కాదు.

    విభజన చేసి అప్పులు మాత్రమే జనాభా దామాషాలో పంచారు, ఆస్థులు మాత్రం ఎక్కడివి అక్కడే అన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలను తరలించుకుపొమ్మని చెబితే చంద్రబాబు తీసుకు వస్తారా? అనేక రాష్ట్రాలను విడగొట్టారు. ఎక్కడైనా ఎక్కడి ఆస్థులు అక్కడే వుంచారు, అప్పులు పంచారు తప్ప మరొక పద్దతిని పాటించలేదు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరో పదేండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలో ఒక రికార్డు సృష్టించిన చంద్రబాబుకు నిజంగా ఈ మాత్రం తెలియదా ? తెలిసినా ఎందుకు ఇలాంటి అంశాలను జనం మెదళ్లకు ఎక్కిస్తున్నారు ? ఒక సీనియర్‌ రాజకీయవేత్తగా విశ్వసనీయత కోల్పోవటం, పోసుకోలు కబుర్లకు తప్ప దాని వలన ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా వుపయోగం వుంటుందా ?

ఏపీలో అన్ని జాబ్ లు ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ

Tags

, ,

బుధవారం విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం  అనంతరం సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కేబినెట్ లో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

  • ఈ నెల 8న ఒంగోలులో మహాసంకల్ప సభ నిర్వహణకు ఏపీ కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరిట ఏపీలో ప్రారంభమైన ‘చంద్రన్న బీమా’ పథకం విధివిధానాలకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపిందని మంత్రి అన్నారు. ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం ఏర్పడినా రూ. 5 లక్షల వరకూ డబ్బు అందుతుందని, ఇది పేదలకు వరప్రసాదం వంటిదని ఆయన అన్నారు. అంగవైకల్యానికి రూ. 3,62,500 వరకూ డబ్బు చేతికి అందుతుందని అన్నారు. సహజ మరణం సంభవిస్తే రూ. 30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు అందుతుందని వివరించారు. 18 నుంచి 70 సంవత్సరాలున్న వారికి, నెలకు రూ. 15 వేల కన్నా తక్కువగా ఆదాయం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాన్ని చంద్రబాబు నాయకత్వంలో రూపొందించినట్టు తెలిపారు. ఏడాదికి రూ. 170 బీమా ప్రీమియంగా చెల్లించాల్సి వుంటుందని, అందులో రూ. 150 ప్రభుత్వమే భరిస్తుందని, లబ్దిదారు నుంచి నామమాత్రపు రుసుమునే వసూలు చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వివరించారు.
  • జూన్ 10 నుంచి 20 వరకూ ఉద్యోగుల బదిలీలుంటాయన్నారు
  • మొత్తం 10వేల పోస్టులను మొదటి దశలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు
  • కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలపై సోషియో ఎకనమిక్ డేటా సర్వే నిర్వహిస్తామన్నారు
  • జూన్ 20 నుంచి 30 వరకు, వచ్చే నెల 5 నుంచి 30 వరకు పల్స్ సర్వే జరుపుతామన్నారు
  • ప్రభుత్వోద్యోగాల కోసం కోటి ఆశ‌ల‌తో ఎదురుచూస్తోన్న‌ నిరుద్యోగుల‌కు త్వర‌లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపిక‌బురు అందించ‌నుందని మంత్రి వెల్లడించారు. ఉద్యోగాల జాతర ఇక మొద‌లు కానుంద‌ని చెప్పారు.
  • పోలీస్ మినహా అన్ని జాబ్ లు ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు
  • త్వరలో గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్ -3 నోటిఫికేషన్లు వెలువడనున్నాయని అందులో భాగంగా గ్రూప్-1లో 94, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో వెయ్యి పోస్టులు ఉండనున్నాయన్నారు
  • అత్యధికంగా పోలీస్ శాఖలో 6వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుందని తెలిపారు.
  • నవనిర్మాణ దీక్ష కోసం జొన్న విత్తుల రచించిన గీతానికి, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచగా దాన్ని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
  • ప్రభుత్వ ఎయిడెడ్ , మున్సిపల్ పాఠశాల విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి  వెల్లడించారు.

 

CPI(M) On Two Years of BJP-Modi Government

Tags

, , , , , , , , , , , ,

The Polit Bureau of the Communist Party of India (Marxist) met at New Delhi
on May 29 & 30, 2016. It has issued the following statement:

The BJP government had conducted a gaudy celebration of the completion of
two years in office making many bombastic claims.

These two years have confirmed that a new `trimoorti? is being sculpted.
Its three faces represent the following: one, the relentless pursuit of
aggressive communal polarization in the effort to transform the secular
democratic character of the Indian Republic into the RSS version of a
rabidly intolerant fascistic `Hindu Rashtra?; two, the pursuit of the
neo-liberal trajectory of economic reforms, more aggressively than pursued
by the UPA government, imposing unprecedented burdens on the vast majority
of our people; and three, increasing recourse to authoritarian measures
undermining the institutions of parliamentary democracy and running
roughshod over democratic rights and civil liberties.

As far as the majority of the Indian people are concerned, there is an
economic disaster rather than any cause for celebrations.
*        Six year low for new jobs in eight labour-intensive industries. In
2015, official figures reveal that only few new jobs were created in the
country as against the promise of creating two crores of new jobs annually.
Every year, over 1.3 crore of Indian youth join the job market
*        Worst decline in exports in 63 years – decline for 17 months in a
row
*        Core inflation of 6.8 per cent, Dal prices rise by more than 30 per
cent
*        Annual core sector growth of only 2.7 per cent, a decade low
*        2,997 farmers committed suicide in 2015, 116 farmers in
January-March 2016
*        MGNREGA payments not made, arrears paid after Supreme Court orders
*        Rural wages decline in real terms in a decade
*        Savings bank deposits growth at a 53 year low
*        NPAs of banks more than Rs 13 lakh core and growing
*        27 per cent zero-balance Jan Dhan accounts, 33 per cent duplicate
accounts
*        New and more taxes, surcharges and cesses on items used by the
poor
On top of this, the agrarian distress is worsening.  The Modi government
promised ?minimum of 50 per cent profits over cost of production?.

Reality:
*        Profitability down to less than 10 per cent, and in some crops,
into losses
*        Agriculture and allied sector grew at -0.2 per cent  in FY15 & 1.1
per cent in FY16
*        Foodgrains production dropped by 5 per cent in FY15, to decline
further in FY16

Severe Drought Situation
*        12 states were declared drought-hit only after Supreme Court?s
orders. Overall,  54 crore people in 13 states are suffering in the grip of
drought
*        25 per cent of India?s rural inhabitations face drinking water
crisis.
The unprecedented drought situation has resulted in the death of thousands
of poor people and lakhs of livestock.  Immediate relief must be provided to
the suffering people.  Despite the Supreme Court intervention, nothing
tangible is being done by the Central government.
The Polit Bureau of the CPI(M) demands that the sufferings of the people
must be mitigated on a war footing.

Sharpening Communal Polarisation

The RSS-BJP are, once again, resorting to whipping up communal passions in
the run up to the forthcoming Assembly elections in Uttar Pradesh in 2017.
It is reported that the Bajrang Dal has been organizing arms training camps
in several parts of the state.  This is clearly an exercise  to provoke
communal conflicts and tensions and reap the consequent electoral gains from
such polarization.  Such efforts are an expression of the worst ?vote bank
politics? seeking the consolidation of the Hindutva communal vote bank at
the expense of  weakening the unity of India?s social fabric.  The Polit
Bureau of the CPI(M) strongly condemns such activities and demands that both
the Central government and the UP state government take strong action in
accordance with the law of the land.
Racial Attacks against the People of African Origin
The reports of increasing violence resulting in the death of people of
African origin living in India is a matter of grave concern.  That such
grievous attacks take place in the national capital of Delhi is, indeed,
shameful.  Such racist attacks undermine the centuries old relationship
between India and the African countries. This has already assumed the
dimension of affecting diplomatic ties between India and the African
countries.
The Central government must immediately intervene to ensure that stringent
action is taken against the culprits and those propagating racist hatred.
This is absolutely essential to prevent the further downslide in the
international image of India.

Elections to the State Assemblies

The CPI(M) state committees in West Bengal, Kerala, Tamilnadu and  Assam are
scheduled to meet to prepare a detailed review of the CPI(M)?s performance
in the elections and the post election political situation arising in these
states.  On the basis of these review reports prepared by the state
committees, the Central Committee will conduct its review at its forthcoming
meeting from June 18-20.
With regard to the electoral tactics pursued by the CPI(M) in various
states, the electoral tactics evolved in West Bengal was not in consonance
with the Central Committee decision based on the political-tactical line of
the Party which states that there shall be no alliance or understanding with
the Congress party.

Post-Declaration of Result Violence

The Trinamool Congress has unleashed widespread violence against the cadres
of the opposition parties.  Many CPI(M) cadres have been murdered and over
600 CPI(M) and mass organization offices have been ransacked and some set on
fire.  Apart from targeting the offices of all opposition parties and mass
organizations, the attacks specifically focus on constituencies and areas
where Trinamool Congress lost in these elections.  Widespread  bomb attacks,
arson and extortions of huge amounts of money as ransom are being reported.
Those who voted against the Trinamool Congress are reportedly coerced into
paying a hefty fine for having exercised their  democratic choice.
Under these circumstances, the CPI(M) calls upon the people of West Bengal
to unitedly resist this murder of democracy and civil liberties in the
state.  The strength of the people?s unity is the answer to meet this
unprecedented unleashing of violence.

Kerala

The Polit Bureau of the CPI(M) salutes the people of Kerala for reposing
faith in the LDF in a resounding manner in these Assembly elections.  The
LDF government has assumed office with a resolve to fulfill the commitments
that it made to the people of Kerala during the polls.
The physical attacks by the RSS against the CPI(M) and the LDF continue.
Forty one such attacks have already taken place since the results were
declared. Two comrades have lost their lives, with Sasikumar, who was
seriously injured in an attack at Engandiyoor in Thrissur on 22nd May
succumbing to his injuries on May 27.  82 comrades have been injured in
these brutal attacks including an elected MLA who has now been sworn in as a
Minister.
The CPI(M) calls upon the RSS/BJP to respect the verdict of the people and
desist from such murderous onslaughts.

చాలు చంద్రన్నా చాలు !

Tags

, , , , , , ,

సత్య

   కింద పడ్డా గెలుపు నాదే అని తన వాక్చాతుర్యంతో తనను తాను సమర్ధించుకోగల నేర్పరి ముప్పవరపు వెంకయ్య నాయుడు అని తెలుగు వారందరికీ తెలిసిందే. అయితే కర్ణాటక నుంచి గత పద్దెనిమిది సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యుడిగా వుండి కన్నడిగులను మెప్పించటంలోనూ, ఒప్పించటంలోనూ బొక్కబోర్లా పడ్డారు. ఒక్కసారి కూడా ఎగువ సభలో కర్ణాటక గురించి మాట్లాడలేదు వెంకయ్యా సాకయ్యా (వెంకయ్యా ఇక చాలయ్యా అని అర్ధం) అంటూ అక్కడి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్బంగా అంతా తానే అయి పార్లమెంట్‌లో ఎంత హడావుడీ చేసిందీ జనమంతా ప్రత్యక్షంగా చూశారు. తీరా ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోడీ సర్కార్‌ వ్యవహరించిన తీరుతో ఆంధ్రప్రదేశ్‌ జనం మూగవారిని చూసి ముక్కు గిల్లితే ఎంత ఆగ్రహం వ్యక్తం అవుతుందో వెంకయ్య నాయుడి మీద బిజెపి మీదా అదే రీతిలో జనం ఆగ్రహంతో వున్నారు. అందువలన ఆంధ్రప్రదేశ్‌ నుంచి సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు నాయుడికి సుతరామూ అంగీకారం వుండదు.దాంతో తట్టా బుట్టా సర్దుకొని బతుకుజీవుడా అంటూ రాజస్థాన్‌లో పాగా వేసేందుకు వెళ్లి పోయారు.

     ఇక నిర్మలా సీతారామన్‌ ఆమె తెలుగింటి ఆడపడుచు అని రాజ్యసభ కట్టబెడితే మంత్రిగా తెలుగు రాష్ట్రానికి ఫలానా ప్రయోజనం చేకూర్చామని చెప్పుకోవటానికేమీ లేదు. మెట్టినింటికి వచ్చి కూడా పుట్టింటి తరఫున మాట్లాడినట్లుగా ప్రత్యేక హోదా విషయంలో తమిళనాడు పక్షాన మాట్లాడినట్లు ఆమెపై ఆరోపణలు వున్నాయి. అందువలన ఆమెకు మరోసారి అవకాశమిస్తే చంద్రబాబుకు పరువు దక్కదు. ఇక్కొడక బిజెపి పిట్టకధ చెప్పాలి. అక్కడి బిజెపి నేతల వర్ణనల ప్రకారం నిర్మలా సీతారామన్‌ ‘ కర్టాటక దా సోస్‌’ కర్ణాటక కోడలు. అదెలా అంటే ఆమె భర్త పరకాల ప్రభాకర్‌ కొంత కాలం కర్ణాటకలో వున్నారట. కన్నడ వాదులను ‘సంతృప్తి’ పరచే చౌకబారు వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇక రాష్ట్రానికి అనేక విషయాలలో రిక్త హస్తం చూపినా కేంద్ర ప్రభుత్వం, బిజెపితో బంధాన్ని తెంచుకొనేందుకు సిద్ధంగా లేరని మూడవ సీటును బిజెపి సురేష్‌ ప్రభుకు ఇవ్వటం ద్వారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు స్పష్టం చేశారు. పోనీ ఈ పెద్ద మనిషి ఏమైనా రాష్ట్రం పట్ల సానుకూలంగా వున్నారా అంటే వాగ్దానం చేసిన రైల్వే జోన్‌ కూడా ఇచ్చేది లేదని ఇప్పటికే సంకేతాలు పంపారు. అయినా చంద్రబాబు ఈ ప్రభువును ఆంధ్రప్రజల నెత్తిన ఎక్కించేందుకు పూనుకున్నారు.

    తెలుగు దేశం పార్టీ గ్యారంటీగా గెలుచుకొనే రెండు రాజ్యసభ స్ధానాల విషయంలో రుణ ఎగవేత ఆరోపణలున్న సుజనా చౌదరికి ఇవ్వటం ద్వారా చంద్రబాబు తన ‘క్లీన్‌ ఇమేజ్‌’ ను మరింత పెంచుకున్నట్లయిందని. రెండో సీటు ఎస్సీలకా, బీసిలకా అని ఊరించి, లీకుల కధనాలు రాయించి పక్కా ‘రాజకీయ’ వ్యాపారి టీజీ వెంకటేష్‌కు విక్రయించి తెలుగుదేశం కంపెనీని లాభాల బాటలో నడిపే పక్కా సిఇఓగా చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఆకర్షించిన ఎంఎల్‌ఏలతో నాలుగో సీటుకు స్వతంత్ర అభ్యర్ధిని రంగంలోకి దించి వైఎస్‌ఆర్‌సిపిని మరింత దెబ్బతీసేందుకు ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. విజయం సాధిస్తే లోకేష్‌ బాబు వ్యూహానికి దక్కిన ఘనతగాను, వికటిస్తే దాన్ని ఫిరాయింపు ఎమ్మేల్యేల ఖాతాలో వేయ వచ్చు. ఇవన్నీ చూసిన తరువాత ఇక చాలు చంద్రన్నా, ఇకనైనా రాజకీయాలు మాని కాస్తయినా జనానికి మేలు చేయమని జనం అంటున్నారు.

మహానాడు జయప్రదంగా జరిగింది, అయితే ఏమిటి ?

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

   తిరుపతిలో తెలుగుదేశం మహానాడు మూడు రోజుల సువార్త కూటములు ముగిశాయి. రాష్ట్ర దేవదూత చంద్రబాబు నాయుడు అన్నీ తానే అయి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులకు సందేశాలను అందచేశారు. ఇదే సమయంలో కేంద్ర దేవదూత నరేంద్రమోడీ ప్రభుత్వ విజయ గానోత్సవాలు దేశమంతటా ప్రారంభమయ్యాయి. అయితే ఏమిటి అన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకటం లేదు. తిరుపతిలో మిగిలిపోయిన తీర్మానాలు లేదా అక్కడ చేసిన వాటినే పునరుద్ఘాటిస్తూ జూన్‌ రెండున విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసలు సమస్యల గురించి తేల్చకుండా ఎన్ని దీక్షలు చేసినా ఆ ప్రాంతంలో జనాన్ని ట్రాఫిక్‌ ఇబ్బందులకు గురిచేయటం తప్ప సాధించేదేమీ వుండదు. గతేడాది దీక్ష ఫలితంగా ఏం సాధించారో చెప్పి ఈ ఏడాది ఎందుకు చేస్తున్నారో చెబితే అర్ధం వుంటుంది.

    ఇటు చంద్రబాబు మూడు రోజుల ప్రసంగాలు, ఆయన వంది మాగధుల స్త్రోత్రాలు, అటు కేంద్రంలో నరేంద్రమోడీ వుపన్యాసాలు, భజనపరుల కీర్తనలు అతిశయోక్తులతో నిండి దాదాపు ఒకే విధంగా వున్నాయి. సందేశ, వుపదేశ, భజన వ్యూహాలను బహుశా ఒకటి కొంటే ఒకటి వుచితం అన్నట్లుగా ఒకే నిపుణుల బృందం రెండు చోట్లా సమకూర్చి వుండాలి. చేసిన పనులను వాస్తవాలతో నిమిత్తం లేకుండా పెద్దవి చేసి చెప్పటం (తమపాలనలో దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారం చేసి 2004 ఎన్నికలలో ఆరిపోయిన విషయాన్ని నరేంద్రమోడీ, చంద్రబాబు మరిచి పోయి లేదా గోబెల్స్‌ను ఆదర్శంగా అయినా తీసుకొని వుండాలి), ఆత్మస్తుతి, పరనిందలతో మోతెక్కించారు. కాంగ్రెస్‌ తన ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తున్నదని మోడీ చెబితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తమ పాలనకు ఆటంకం కలిగిస్తున్నదని తెలుగుదేశం మహానాడు తీర్మానించింది. వాస్తవం ఏమంటే కేంద్రంలో కాంగ్రెస్‌కు లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లేదు, వైఎస్‌ఆర్‌సిపికి వున్నా ప్రయోజనం లేని పార్టీగా కనిపిస్తున్నది. అవ్వతో వసంత మాడినట్లు రెండు చోట్లా రెండు సంవత్సరాల తరువాత కూడా వాటిపై దాడి చేస్తూ కాలం గడుపుతున్నారు. తన ప్రభుత్వం చేసిన అవినీతి ఏదైనా వుంటే చూపమని ఢిల్లీలో మోడీ సవాలు విసిరితే, తన ప్రభుత్వంలో అవినీతి లేదుకను రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నానని చంద్రబాబు, తన మీద అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే తానే వెళ్లి జైల్లో కూర్చుంటానని కుమారుడు నారా లోకేష్‌ తమ ప్రసంగాలలో చెప్పారు.

    ఈ రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు( లోకేష్‌ తొమ్మిదో, పదో చదువుతుండగానే 1996లో తాత్కాలిక మైన ప్రధాని పదవి చేపట్ట వద్దని తనకు సలహా యిచ్చినట్లు చంద్రబాబు నాయుడు మహానాడు సందర్భంగా విలేకర్లతో ఇష్టాగోష్టిగా వెల్లడించారని వార్తలు)కుమారుడు లోక్‌ష్‌, మంత్రులు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో తిరిగి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, పెట్టుబడులు పెట్టేవారికి ఎన్నో రాయితీలు వస్తాయి గనుక రా రమ్మని ఆహ్వానాలు పలికి వచ్చారు. ఇప్పుడు అది రాదని తేలిపోయింది. పాండవులకు చివరకు ఐదూళ్లు కాదు కదా సూది మోపినంత స్ధలం కూడా ఇవ్వం అని కౌరవులు స్పష్టం చేసినట్లుగా ఏపికి ప్రత్యేక హోదా కాదు కదా ప్రత్యేక పాకేజి కూడా సాధ్యం కాదని బిజెపి వారు తేల్చిపారవేశారు. మరి ఇప్పుడేమి చేస్తారు?

    పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదాకు ఆటంకంగా వున్నాయని పిట్టకధలు చెబుతున్నారు. అటువంటపుడు ఆ నిబంధనలు ప్రత్యేక పాకేజికి కూడా ఆటంకమే కదా. లేకుంటే గత రెండు సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేదు. పోనీ ఇప్పటికైనా సూటిగా ఎందుకు తేల్చరు? ప్రపంచంలో పెట్టుబడులు ఎక్కడ లాభం వుంటే అక్కడకు తరలుతాయి. టాటా తన నానో కార్ల ఫ్యాక్టరీని బెంగాల్‌ నుంచి భారీగా రాయితీలు ఇచ్చిన గుజరాత్‌కు తరలించారు. మిగతా రాష్ట్రాలు పోటీ పడలేకపోయాయి. వుమ్మడిగా వున్నపుడే ఆంధ్రప్రదేశ్‌ పోటీ పడలేక అనేక పరిశ్రమలను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు పోయేట్లు చేసింది. ఇప్పుడు అసలే ఇబ్బందుల్లో వున్న స్థితిలో స్వంత నిధులతో రాయితీలు ఇచ్చి ఆకర్షించటం సాధ్యమయ్యేదేనా ? కేంద్రం ఇతర రాష్ట్రాలలో వెనుక బడిన ప్రాంతాలకు ఇస్తున్న మాదిరే ఆంధ్రప్రదేశ్‌కూ ఇస్తున్నది తప్ప దయా దాక్షిణ్యం కాదు, లోటు భర్తీ చేస్తామన్న వాగ్దానాన్ని కూడా కేంద్రం నెరవేర్చటం లేదని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. ఈ స్ధితిలో వుద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మహానాడు ఇచ్చిన సందేశం లేదా భరోసా ఏమిటి ?

   తెలుగు దేశం మహానాడు జరుగుతున్న కాలంలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాదు పర్యటనకు వచ్చారు. తెలుగు దేశం పార్టీ 2019 తెలంగాణాలో అధికారానికి రావాలని తీర్మానం చేసిన సమయంలోనే తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని అమిత్‌ షా తెలంగాణా బిజెపికి దిశానిర్ధేశం చేశారు. అంటే తెలుగు దేశం పార్టీని పక్కకు నెట్టేయమనేగా ? ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి నేతలు పదే పదే మాట్లాడుతున్నదేమిటి ? దేశమంతటా చెబుతున్నదేమిటి? తమకు అవకాశం లేని చోట పాగా వేయటానికి ప్రాంతీయ పార్టీలను సోపానాలుగా చేసుకోవటం తరువాత, వాటిని పక్కన పెట్టి తమ చుట్టూ తిప్పుకోవటమేగా. మహారాష్ట్రలో బలంగా వున్న శివసేన, అసోంలో వున్న ఏజిపీలను బిజెపి అలాగే పక్కకు నెట్టివేయలేదా ? కర్ణాటకలో జరిగిందేమిటి ? తెలుగు దేశం పార్టీతో సఖ్యత తెగకొట్టుకున్నది తాము కాదనే పేరు తెచ్చుకోకుండా బిజెపి జాగ్రత్త పడుతున్నది. తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ ఫినిష్‌ అయిందన్న అంచనాతోనే బిజెపి నేతలు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ వైఖరిని వెల్లడించేందుకు అది సమయం కోసం ఎదురు చూస్తున్నది. విజయోత్సవాలలో భాగంగా విజయవాడలో కూడా బిజెపి ఒక కార్యక్రమాన్ని తలపెట్టింది.

     కేంద్రం ఇప్పటికే ఎంతో చేసింది, వాటికి లెక్కలు చెప్పాలంటున్న బిజెపి నేతలకు సమాధానంగా మహానాడులో ఇప్పటి వరకు జరిగిందేమిటో శ్వేత పత్రం ద్వారా వెల్లడించి వుంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడి అయి వుండేవి. భక్తులు స్వామీజీల, బాబాల వుపన్యాసాలు వినేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో వెళతారు. బోధనలు విన్నంత సేపు అలాగే వుండాలనుకుంటారు. ఇంటికి వచ్చిన తరువాత షరా మామూలే. అలాగే తెలుగు దేశం కార్యకర్తలు, జనానికి వుపన్యాసాలతో చంద్రబాబు బోధలు చేసి పంపారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటల పధకాల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి, ప్రత్యేక హోదా రాకపోవటం, లోటు భర్తీకి చర్యలు తీసుకోకపోవటం, రాజధాని నిర్మాణానికి తగినన్ని నిధులు ఇవ్వకపోవటం కూడా అంతకంటే తక్కువేమీ కాదు. ప్రభుత్వానికి దిశా నిర్ధేశం చేసే మహానాడు ఈ విషయంలో ఆలోచించిన ప్రత్యామ్నాయం ఏమిటి ? 2050వరకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారంలో వుండాలని వూదరగొట్టటంద్వారా యువతకు వుద్యోగాలు వస్తాయా ?అవినీతి, కేసుల గురించి వూకదంపుడుగా చెప్పటమే తప్ప సత్వర విచారణకు తీసుకున్న చర్యలు లేవు, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లేదా తండ్రీ ,కొడుకులు ప్రతిపక్ష నేతపై ఎంత కాలం శాపనార్ధాలు పెడుతూ, తిట్టిపోస్తూ ఎంత కాలం గడుపుతారు? దాని వలన రాష్ట్రానికి ఒరిగేదేమిటి ?

వాచ్‌మన్ల జాతి పిత నరేంద్రమోడీ

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

సార్‌ నేను అర్ధరాత్రి తరువాత నిద్రపోతానని మీరంతా అంటారు, ఇక నుంచీ నేను నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటా సార్‌ అని మా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ అర్ధరాత్రి తలుపుకొట్టీ మరి చెప్పాడు.

ఏం ఈ వుద్యోగం చేయాలని లేదా అన్నాను. అదేంటి సార్‌ అలా అంటారు అన్నాడు.

ఓరి పిచ్చోడా నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటానంటే ఇక్కడ వున్న వుద్యోగం వూడగొడతారు, కొత్తగా ఎక్కడా ఇవ్వరు అన్నాను. అదేంటి సార్‌ అని నిజంగానే వూడగొట్టిన వుద్యోగి మాదిరి నీరసపడిపోయాడు.

న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ విజయగాన బజానాలను ఎప్పుడూ లేనిది శుక్రవారం రాత్రి దూర దర్శన్‌లో చూసి అమాయకుడు వుత్సాహపడిపోయాడు. ఎన్నడూ లేనిది పొద్దున్నే లేచి నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు. కనిపించగానే సార్‌ రాత్రి మీరు అలా అన్నారేంటి సార్‌ అని అడిగాడు.

తొమ్మిదివేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎగవేసిన విజయ మాల్య దేశం విడిచి పోతుంటే గుడ్లప్పగించి చూసిన నరేంద్రమోడీ, ఫాదర్‌ ఆఫ్‌ వాచ్‌మెన్‌ అంటే దేశంలోని వాచ్‌మన్లకు తలకాయ. ఆ పెద్దమనిషి మాదిరి పని చేస్తా అంటే దొంగలు దోచుకొని పారిపోతుంటే చూస్తూ వూరుకుంటా, ఎటు వెళ్లిందీ చెబుతా తప్ప పట్టుకోను అని చెప్పటమే అన్నాను.

రాత్రి నుంచి నిద్రపోకుండా ఎంత ఆలోచించినా మీరెందుకు అలా అన్నారో తట్టలేదు సార్‌. ఇప్పుడు మీరు చెప్పిన తరువాత ఇంక చచ్చినా ఎక్కడా నేను వాచ్‌మన్‌ వుద్యోగం చేస్తున్నా అని చెప్పను గాక చెప్పను సార్‌ అన్నాడు ఏదో ధృఢ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మాదిరి.

పొద్దున్నే పాలకోసం దుకాణానికి వెళ్లా. మూమూలుగా నన్ను చూడగానే పాలు ఇచ్చేసి తన పనిలో తాను నిమగ్నమయ్యే దుకాణదారు ఎన్నడూ లేని విధంగా అదేంటి సార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భజన చేశాడు రాత్రి అన్నాడు.

ఏం తప్పేముంది నలుగురితో నారాయణా, గుంపుతో గోవిందా అన్నా. అమితాబ్‌ కాంగ్రెస్‌, నెహ్రూ కుటుంబానికి బాగా దగ్గర కదా అలాంటిది ఇప్పుడు ఇలా ఫిరాయించాడేమిటి అన్నాడు సంభాషణ పొడిగిస్తూ.

అపుడు కాంగ్రెస్‌ ‘మా’ ఇప్పుడు పనామా పత్రాలలో పేరు కనిపించటంతో నరేంద్రమోడీ ‘బా'(పు) అయ్యాడు. అయినా ఎన్నడూ దేని గురించి అడగనిది ఇవాళ ఇదేమిటి? నీకూ రాజకీయాలలో చేరాలని వుందా అని అడిగా.

పాత సినిమాల్లో వీలునామా పత్రాల గురించి చూశా, పనామా పత్రాల పేరు ఎప్పుడూ వినలే, కొత్త ప్రభుత్వాలు రాగానే పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టినట్లుగా వీలునామా పత్రాలకూ పేరు మార్చారా ఏమిటి అన్నాడు.

దొంగడబ్బు దాచుకున్నవారి వివరాలను మా జర్నలిస్టులు కొందరు బయట పెట్టారులే, ఆ ఖాతాలు పనామా అనే దేశంలో వున్నాయి, కనుక వాటిని పనామా పత్రాలు అంటున్నారులే.

అంటే కొంత మంది ఇంట్లో వారికి తెలియకుండా నా దగ్గర డబ్బు, నోట్లు పెట్టి వడ్డీకి తిప్పుతుంటార్లే అలాగేనా అన్నాడు.

ఓర్నీ, అంటే ప్రతి దుకాణమూ ఒక పనామా యేనా ఏమిటి కొంపదీసి, నీ సంగతి తెలిస్తే అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ కూడా నీ దగ్గరకే వచ్చి వుండేవారన్నమాట.

అంత పెద్ద మొత్తాలను నేనెక్కడ తిప్పగలను సార్‌, ఏదో….. ఏదో నాతో అంటే అన్నావు గానీ ఇంకెవరితో అనకు….ఏం సార్‌ అన్నాడు.

ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి చెప్పిన బిజెపి వారు ఇప్పుడు విదేశాల్లో కంటే స్వదేశంలోనే ఎక్కువ వుంది అంటున్నారు, నువ్వు ఇలాగే నలుగురితో చెప్పావనుకో ఏదో ఒక రోజు భారత మాతాకీ జై అంటూ ఖాకీ నిక్కరు వాళ్లు వచ్చి దాడి చేసి నీ దగ్గర ఎవరెవరు నల్లధనం దాచుకుంటున్నారో బయట పెట్టు అంటారు జాగ్రత్త.

సార్‌ ఖాకీ నిక్కరంటే గుర్తుకు వచ్చింది మా పక్కింటి పోరగాడికి వుద్యోగమేదీ రాలేదు, ఈ మధ్య కొత్తగా నిక్కర్లేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, పిల్లలు నిక్కరంటే సరేగానీ అదేంటి సార్‌ పెద్ద వారు కూడా అలా అసహ్యంగా, వారు వస్తుంటే వీధిలో అడవాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారు, ఈ మధ్య మీరన్నారే భారత మాతాకీ జై అంటూ నిద్రలో కలవరించటమే కాదట, పక్కనున్నవారిని పట్టుకొని మీరూ అనరెందుకు అని నిద్రలోనే కొడుతున్నాడట ఏం చేయాలో తెలియటం లేదంటూ వాళ్ల నాన్న తలపట్టుకుంటున్నాడు.అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందీ అంటూ పాలు తీసుకొని బయలు దేరా.

ఇంతలో పచ్చ చొక్కా వేసుకొని మా ఎదురింటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపించాడు.ఏం తిరుపతి మహానాడుకు వెళ్లలేదా ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్లుగా తిరుపతి వెంకన్న దర్శనం, ఎంచక్కా మూడు రోజుల పాటు మంచి భోజనాలు పెడుతున్నారట కదా !

మీరు జర్నలిస్టు కనుక వూరుకున్నా అదే ఇంకొకరు అని వుంటేనా అంటూ, అయినా మహానాడులో మీకు కనిపించింది భోజనాలేనా, తీర్మానాలు, వుపన్యాసాలు వినిపించలేదా అన్నాడు వుక్రోషంగా.

మిత్రమా లైట్‌ తీస్కో అదేదో సామెత చెప్పినట్లు పండగనాడూ పాత….. పాడిందే పాడరా…. అన్నట్లు ఎన్నికలకు ముందు నుంచి తరువాత గత రెండు సంవత్సరాలుగా జగన్‌ భజన చేస్తూనే వున్నారు బోరు కొట్టటం లేదా ! ఒకవైపు జగన్‌ పార్టీని ఫినిష్‌ చేశాం చూడమంటారు, మరోవైపు తద్దినపు తంతు మాదిరి ఎన్‌టిఆర్‌ పేరన్నా అప్పుడపుడు చెబుతున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్‌ పేరు తలవకుండా, పలకకుండా తెలుగుదేశం సమూహం మాట్లాడలేని స్ధితికి వచ్చింది, భాషా దారిద్య్రం పట్టుకుందా ! ఒకవైపు మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు జనంలోకి వెళ్లటం లేదని మీరే చెబుతుంటారు, జగన్‌ భజన మాని ఆ పని ఎందుకు చేయరు ? అయినా అదేమిటయ్యా నేను నిద్రపోను, ఇతరులను నిద్రపోనివ్వను అని పదే పదే చెప్పే చంద్రబాబు హాయిగా నిద్రపోతున్నా అని మహానాడులో చెప్పాడు విడ్డూరంగా లేదూ !

మనలో మన మాట ఆఫ్‌ది రికార్డు, ప్రధాని నరేంద్రమోడీకి భార్యను వదిలేశారు కనుక ఆయన న్యూఢిల్లీలో వున్నపుడు నిశ్చింతగా నిద్రపోతున్నారు, మా నాయకుడికి భార్యా కుటుంబం వున్నా వారంతా హైదరాబాదులో వుంటున్నారు, ఈయనేమో వుండేది వుండవల్లిలో ఇంక నిద్రపోకేమీ చేస్తారు.

అదేమిటి ? వుండవల్లికి నిద్రకు సంబంధం ఏమిటి, ఆ వూరి వారంతా రేయింబవళ్లు కష్టపడి బాగా పని చేస్తారే అన్నాను నిజంగానే ఆశ్చర్యంగా !

ఎక్కడైనా దేవుళ్లందరూ నిలబడే వుంటారు, కానీ వుండవల్లి గుహలలోని అనంత పద్మనాభ స్వామి పడుకొని కదా వుండేది, మరి చంద్రబాబు నిద్రపోకుండా రాత్రంతా మేలుకొని వుంటే పద్మనాభునికి అంతరాయం కలుగుతుంది కదా అందుకని అన్నాడు.

నీ లాజిక్‌ వినటానికి బాగానే వుంది గానీ బాబొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, దానితో ఇంటికో జాబొస్తుందని ఆశించారు, ఇప్పుడే హోదా లేదు గీదా లేదు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం కావాలంటే లెక్కలు తీయండి అని బిజెపి, కేంద్ర ప్రభుత్వం వారు సవాళ్లు విసురుతున్నారు. వాటి గురించి చెప్పకుండా నా పాలనలో అవినీతి లేదు కనుక నిద్ర పోతున్నా అంటారేమిటి ?

సార్‌ మరోసారి మనలో మాట, కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్కకూతురైపాయే అన్నట్లు మా పరిస్ధితి వుంది. అందుకే కేంద్రాన్ని మోడీని, వెంకయ్య నాయుడిని ఏమీ అనలేక ఆ కసిని జగన్‌, కాంగ్రెస్‌ మీద తీర్చుకుంటున్నాం అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చక్కా పోయాడు.

ఆర్భాటం ఎక్కువ-ఆచరణ తక్కువ

Tags

, , , ,

 

రెండేళ్ల మోడీ పాలన

ఎం కోటేశ్వరరావు

    తన రెండు సంవత్సరాల పాలనలో అవినీతిని  చూపండంటూ మూడవ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తన రాజకీయ ప్రత్యర్ధులకు ఒక సవాలు విసిరారు. అవినీతి అంశాన్నే ప్రధాన సోపానంగా చేసుకొని అధికారానికి వచ్చిన మోడీ ఈ కాలంలో ఎన్ని అవినీతి కేసులను ఒక కొలిక్కి తెచ్చారు? ఎంతమందిని కటకటాల వెనక్కు పంపారు ? అందుకు తీసుకున్న ప్రత్యేక చర్యలేమిటి? అన్నింటి కంటే ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలను పంచుతానన్న నల్లధనం సంగతేమిటి ? దానిని దాచినవారిపై చర్యలేమిటి అన్న అసలు ప్రశ్నలకు రెండేళ్లు గడిచినా సమాధానం లేదేమిటా అని ఎదురు చూస్తున్నవారికి మోడీ సవాలు గానీ, ఎన్నో సంస్కరణలు అమలు చేశానని చెప్పుకోవటం గానీ అంతగా కిక్కు ఇవ్వటం లేదు. అన్నింటి కంటే పనామా పత్రాలలో పేరు చోటు చేసుకున్న అమితాబ్‌ బచ్చన్‌ న్యూఢిల్లీలో నరేంద్రమోడీ విజయాలను పొగుడుతూ ఒకవైపు కార్యక్రమం నిర్వహించుతున్నపుడు మరోవైపు అవినీతి అక్రమాలకు వ్యతిరేక పోరాట యోధుడిగా నరేంద్రమోడీ ఎన్నికబుర్లు చెప్పినా ప్రయోజనం ఏముంది ?

     మోడీ ప్రభుత్వ పని తీరు గురించి ఆయనను వ్యతిరేకించే పార్టీలు ఏదైనా చెబితే ఒక పద్దతి, ఆయన మిత్రపక్షం శివసేన ఏం చెబుతున్నది ? కొండంత రాగాలు తీయటమే తప్ప చేస్తున్నది తక్కువని ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీ ప్రకటించిన పధకాలన్నీ గత ప్రభుత్వం వేరే పేర్లతో అమలు చేసినవే అని కూడా గాలితీసింది. నల్లధనాన్ని వెలికి తీసి కనీసం పదిలక్షల రూపాయల వంతున పంచుతానని వాగ్దానం చేసిన మోడీ దాన్ని అమలు జరపటంలో విఫలమయ్యారని పేర్కొన్నది. సరిహద్దులలో పాక్‌ వుగ్రవాదం కొనసాగుతూనే వుంది, నిరంతరం మన సైనికులు మరణిస్తూనే వున్నారు, కానీ పొరుగు దేశంతో కౌగిలింతలు, ముద్దులు కొనసాగుతూనే వున్నాయని వ్యాఖ్యానించింది.మోడీ సర్కార్‌ ఐదు సంవత్సరాలకు ఎన్నికైంది కనుక ఆ గడువు ముగిసిన తరువాతే ప్రభుత్వ పని తీరు గురించి వ్యాఖ్యానించటం సబబుగా వుంటుంది, ఇప్పటికైతే మోడీకి మా శుభా కాంక్షలు అని ముగించింది.

     నరేంద్రమోడీ సర్కార్‌ ఏరి కోరి రాజ్యసభకు ఎంపిక చేసిన సుబ్రమణ్యస్వామి నోటి వెంట వచ్చిన నిజాలేమిటి ? దేశంలో అసహన వాతావరణం వుందని దీనికి బిజెపి ప్రభుత్వమే కారణమని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌ అభిప్రాయమని సుబ్రమణ్యస్వామి తాజాగా ప్రధానికి సంధించిన లేఖలో పేర్కొన్నారు.రాజన్‌ అసహనవాతావరణం గురించి మాట్లాడి వుండవచ్చు తప్ప దానికి బిజెపిఏ కారణమని బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు.ఒక వేళ రాజన్‌ అలా అని వుంటే అధికారంలో వున్నంత మాత్రాన అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదా ? మొత్తం మీద స్వామి ఫిర్యాదు స్వభావం భావ ప్రకటనా స్వేచ్చను సవాలు చేస్తున్నట్లే ? అన్నింటి కంటే గత రెండు సంవత్సరాల కాలంలో రిజర్వుబ్యాంకు గవర్నరు హోదాలో రాజన్‌ వడ్డీ రేటు తగ్గించని కారణంగా పరిశ్రమలన్నీ కుప్పకూలాయని, నిరుద్యోగం పెరిగిందని అదీ మోడీ రెండేళ్ల సంబరాలు జరుపుకుంటున్న సమయంలో సుబ్రమణ్యస్వామి చెప్పటం గమనించాల్సిన అంశం.ఇక్కడే చిన్న కిక్కుంది. అదేమిటంటే ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ అనేక సందర్భాలలో మోడీ హయాంలో ఆర్ధిక వ్యవస్ధ తిరిగి పట్టాలెక్కిందని, చైనాను అధిగమించే దిశలో పురోగమిస్తోందని అనేక సందర్బాలలో చెప్పారు. అంటే మంత్రి అవాస్తవాలను చెబుతున్నట్లా ? స్వామి నిజాలను చెబుతున్నట్లా ?ఈ సంబరాల సమయంలో కాకపోయినా తరువాత అయినా మౌన ముని మోడీయే నోరు విప్పాలి.

   మోడీ, ఆయన అర్ధభాగం అమిత్‌ షా ఇతర పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో అనేక అంశాలు చెప్పారు. వాటి సంగతి ఏమంటే ఎన్నికలపుడు అనేకం చెబుతుంటాం అవన్నీ అమలు జరపటం ఎవరికైనా ఎలా సాధ్యం అని అమిత్‌ షా నల్లధనం వెలికితీత గురించి అడిగిన సందర్భంలో చెప్పారు.తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న పార్టీ నేత ఆయన. మోడీ సర్కార్‌ పార్లమెంట్‌లో చెప్పిన వాటిని కూడా అమలు జరపటం లేదన్నదే ఇక్కడ అసలు సమస్య.

    లోక్‌సభ అధికారిక సమాచారం ప్రకారం మూడింట రెండువంతుల కేంద్ర మంత్రిత్వశాఖలు సగానికిపైగా హామీలను అమలు జరపలేదని వివరాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో రోజుకు 250 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిస్తుంది. ప్రశ్నలు, చర్చలు, ఇతర ప్రస్తావనల సందర్భంగా మంత్రులు అనేక హామీలు ఇస్తారు. అవి అధికారికంగా నమోదు అవుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాటన్నింటినీ క్రోడీకరించి హామీల స్టాండింగ్‌ కమిటీకి పంపుతుంది. వాటిని మూడు నెలలలోగా అమలు జరిపించేందుకు కమిటీ ప్రయత్నిస్తుంది. అది ఎంత వరకు వచ్చిందనేది వారం, పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష జరుగుతుంది. ఒకసారి హామీ ఇచ్చిన తరువాత ఏ కారణంతో అయినా లోక్‌సభ రద్దయితే తరువాత ఏర్పడే సభ, ప్రభుత్వానికి వాటిని అందచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా అలాంటి హామీలలో ఒకటి. అది ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా బిజెపి సర్కార్‌ కాదు అనటానికి లేదు. లేదా అధికారికంగా అది సాధ్యం కాదు అని అయినా చెప్పాలి.

     వుదాహరణకు ముంబై వుగ్రవాద దాడుల సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కోస్తా ప్రాంతాలలో పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు గురించి హామీ ఇచ్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ దానిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే అణువిద్యుత్‌ కేంద్రాలను సకాలంలో పూర్తి చేస్తామన్న హామీకి కూడా అదే జరిగింది.పెద్దగా ఆర్ధిక భారం లేని హామీలను కూడా మోడీ సర్కార్‌ నెరవేర్చటం లేదు. దేశంలోని మరో 38 భాషలను రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో చేరుస్తామని 2014 ఆగస్టులో ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రస్తుతం మన దేశంలో అద్దె గర్భంతో పిల్లలను కనటం కూడా ఏటా రెండున్నర వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. దీనిలో ఎక్కువగా బలహీన వర్గాలకు చెందిన మహిళలే దోపిడీకి గురి అవుతున్నారు. దీనిని క్రమబద్దీకరించేందుకు అవసరమైన చట్ట సవరణ చేస్తామని 2014 ఆగస్టులో ప్రభుత్వం ఇచ్చిన హామీకి ఇంతవరకు దిక్కులేదు. ఇలా అనేకం వున్నాయి.న్యాయ మంత్రిత్వశాఖ ఇచ్చిన హామీలలో కేవలం 27శాతమే అమలు చేసింది. ఇంకా అనేక మంత్రిత్వశాఖలు తరతమ స్దాయిలో హామీలు ఇ్వటమే తప్ప అమలు జరపటం లేదు. ఈ వైఖరిని ఏమనాలి? జవాబుదారీతనం లేక మోడీ చెప్పినట్లు ఇసాబ్‌(లెక్క)లేని తనం కాదా ఇది. మంత్రుల గురించి తరువాత చెప్పుకోవచ్చు ఏకంగా ప్రధాన మంత్రి ఇచ్చిన ఏకైక హామీకి ఇంతవరకు దిక్కులేదు. మంత్రిత్వశాఖల పనితీరు, మదింపు పద్దతి గురించి 2013-14 సంవత్సరానికి సంబంధించి నివేదికలు ఇస్తామని మోడీ స్వయంగా 2014లో హామీ ఇచ్చారు. వాటిని ఇంతవరకు ఇవ్వలేదు. అందువలన ఆర్భాటంగా పధకాలు ప్రకటించటం కాదు, అవి ఎంతవరకు అమలు జరిగాయన్నది కావాలి. ప్రతి పధకంపై అధికారిక శ్వేత పత్రాలు ప్రకటిస్తే అసలు రంగు తేలుతుంది.

   అవినీతికి పాల్పడబోమని, స్వచ్చమైన పాలన అందిస్తామని మంత్రులు ప్రమాణం చేస్తారు. అందువలన అలా వుండటం వారి విధి. దానిని మరిచి పోయి మేం అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకోవటం ప్రత్యేకమే. అవినీతికి పాల్పడకపోవటం సంతోషమే, కానీ అవినీతికి పాల్పడిన వారిని వెలికి తీసి శిక్షించటం కూడా రాజధర్మమే. అందువలన మేము మా రాజధర్మాన్ని నిర్వర్తించామా లేదా అన్న సవాలు విసరాలి. అధికారాంతమందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నారు. అసలు ఏదైనా పని చేస్తే కదా సక్రమంగా చేశారా అక్రమంగా చేశారా అనేది తేలేది. ఎరువులు, గ్యాస్‌ సబ్సిడీలను తగ్గించటం, బ్యాంకు ఖాతాలను తెరవటం వంటి వాటిలో అవినీతికి అస్కారం తక్కువ. ప్రజల సంపదలను కార్పొరేట్లకు కారుచౌక రేట్లకు కట్టపెట్టటం నీతా ? అవినీతా ? అది లంచం తీసుకొని చేశారా తీసుకోకుండా చేశారా అని కాదు, విధాన పరమైన అక్రమమా కాదా ?

 

తెలుగు నాట భక్తి రసం డేంజరుగా మారుతోంది

Tags

, , , ,

“పాపాలు, ఇబ్బందులే హుండీ ఆదాయాలు పెంచుతున్నాయి”

సత్య

     తన రెండేళ్ల పాలన పూర్తి కావస్తున్న సమయం, మహానాడుకు ముందుగా విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జనానికి వుపయోగపడే పనుల గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో తెలియదుగానీ మద్యం గురించి చేసిన వ్యాఖ్యలతో కలెక్టర్ల సదస్సుకు కాస్త కిక్కు వచ్చింది. ప్రత్యేక రాష్రనఠ హోదారాదని తేలిపోవటం, చంద్రన్నే చెప్పినట్లు విభజన సమయంలో ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు కాకపోవటంతో వడదెబ్బ తగిలినట్లు కలెక్టర్ల సదస్సు ప్రసంగం నిస్సారంగా సాగిందని చెప్పవచ్చు.తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో తాను చేసిన వుపన్యాసాన్ని ఒక వర్గపు మీడియా వక్రీకరించిందని దేవుడి గురించి తాను పాజిటివ్‌గానే మాట్లాడానని రెండోరోజు వివరణ ఇచ్చారు.

    చంద్రబాబుకు సానుకూల మరొక వర్గపు మీడియాగా గుర్తింపు వున్న ఒక పత్రికలో కష్టాల్లో వున్న వారు దేవుణ్ని నమ్ముకొంటున్నారు అనే శీర్షికతో ప్రధాన వార్తలో వుప భాగంగా రాశారు. దేవాదాయశాఖ కష్టపడకపోయినా 27శాతం ఆదాయం పెరిగిందనీ, ఇది ప్రజల్లో పెరిగిన భక్తిని తెలియ జేస్తుందని చంద్రబాబు అన్నారు. కష్టాల ో్ల వున్న వాళ్లు దేవుణ్ని నమ్ముకుంటున్నారు. వారితో పాటు తప్పులు చేసిన వాళ్లు హుండీల్లో డబ్బులు వేస్తున్నారు. కష్టాల్లో వున్నామని వ్యసనాల బారిన పడకుండా దేవుణ్ని విశ్వసిస్తున్నారు. గుళ్లు, చర్చిలు, మసీదుల్లాంటివి లేకపోతే పిచ్చి వాళ్లయ్యేవారేమో ! దీక్షల కాలంలో దుర్వ్యవసనాలకు దూరంగా వుంటున్నారు. అయ్యప్ప దీక్షల్లాంటివి చేస్తూ 40 రోజుల పాటు మద్యాన్ని ముట్టుకోవటం లేదని చెప్పారు. ఇదే తరగతికి చెందిన మరొక పత్రిక పాపపు సొమ్ము అనే వుప శీర్షికతో వార్త ఇచ్చింది. ఎక్కువ తప్పులు చేసిన వారు, ఆదాయం బాగా వచ్చేవారు హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు ‘ అని నవ్వుతూ అన్నారు. అని పేర్కొన్నది.చంద్రబాబు చెప్పిన ఓ వర్గానికి చెందిన మీడియాలో భాగమైన ఒక పత్రిక తన పాఠకులకు మరింత కిక్కు ఇచ్చేందుకు ఇదే అంశాన్ని మొదటి పేజీలో, తరువాత లోపలి పేజీలో పతాక శీర్షికతో వార్తను ఇచ్చింది. ‘తప్పులు చేసే వారే గుడికి వెళుతున్నారు ‘అని రాయటంతో సమస్య వచ్చింది.

    ఇదే వార్తను ఏ వర్గానికీ చెందని మీడియాలో భాగంగా పరిగణించబడే ఒక ఆంగ్ల పత్రిక తనకు మందీ మార్బలం వున్నప్పటికీ పిటిఐ వార్తా సంస్ధ ఇచ్చిన కధనాన్ని ప్రచురించటం విశేషం. ‘తప్పులు(పాపాలు), ఇబ్బందులు పెరగటమే దేవాలయాల ఆదాయ పెరుగుదల కారణం ‘ అని శీర్షిక పెట్టింది.’ జనం పాపాలు చేస్తున్నారు. కొంత మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వాటిని వదిలించుకొనేందుకు దేవాలయాలకు వెళుతున్నారు, ప్రార్ధనలు చేస్తున్నారు. వారు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటే, ఎక్కువ పాపాలు చేస్తే వారు దేవాలయాలకు వస్తున్నారు, డబ్బులు సమర్పించుకుంటున్నారు, ఇది వాస్తవం’ అని చెప్పినట్లు దానిలో పేర్కొన్నారు. అందువలన మొత్తం మీద దీనిలో వక్రీకరణగా చెప్పాల్సి వస్తే తప్పులు చేసేవారే గుడికి వెళుతున్నారు అన్న శీర్షిక తప్ప ఆయన చెప్పిన అంశాలలో వక్రీకరణ కనిపించటం లేదు. చంద్రబాబు నాయుడు రెండవ రోజు ప్రవచించిన అంశాలలో ఒకటి ఆధ్యాత్మిక టూరిజం. ఏడు ప్రధాన పుణ్య క్షేత్రాలలో దీనిని అభివృద్ధి చేయాలని కోరారు. పరిశ్రమలు, ఇతర రంగాల అభివృద్ధి ద్వారా ఆదాయం సమకూరే పరిస్ధితులు కనిపించటం లేదు కనుక అప్పనంగా వచ్చే ఆధ్యాత్మిక ఆదాయాన్ని మరింత పెంచేందుకు చంద్రబాబు పూనుకున్నారు.

   తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డేంజరుగా మారుతోంది అని ఎప్పుడో ఒక కవి చెప్పారు. ఇప్పుడు సునామీలా వుండబట్టే చంద్రబాబు నాయుడు అంత ఆనందంగా హుండీల ఆదాయం గురించి చెప్పారు. ఏ మతానికి చెందిన దేవుడు, దేవత లేక ప్రవక్తలు కూడా అవినీతిని సహించమనే చెప్పారు. కానీ వారి కళ్లెదుటే రోజు రోజుకూ దుర్మార్గాలు, పాపాలూ పెరిగి పోతున్నా వారెలాంటి చర్యలూ తీసుకోవటం లేదంటే వారు ఇస్తున్న డబ్బులు తక్కువనా లేక రూపాయి విలువ దిగజారిందని పట్టించుకోవటం లేదా? పోనీ బంగారం వేస్తున్న వారికి ఏదైనా ప్రత్యేక దారి వుందా అంటే అదీ లేదు. పాపులు వారి పాపాన వారే పోతారు అనుకుంటే మంచి వారికి ఎదురైన సమస్యలనైనా దేవతలు, దేవదూతలు, ప్రవక్తలు ఎందుకు పట్టించుకోవటం లేదు.

    మన దేశంలో ఇంకా ఫ్యూడల్‌ అవశేషాలు ఒకవైపు, ఆధునిక పెట్టుబడిదారీ తెంపరితనం మరొకవైపు కవలల మాదిరి కొనసాగుతున్నాయి. దాని పర్యవసానమే ఒక పక్కన శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచే బిర్లా ప్లానెటోరియం వుంటే దాని పక్కనే మూఢ భక్తి, విశ్వాసాలను పెంచే బిర్లా మందిరం వుండటం. తమ విధానాలను ప్రశ్నించకుండా, జనాన్ని మతం మత్తులో ముంచేందుకు పూర్వకాలంలో రాజులు, రంగప్పలు గుడులు గోపురాలు కట్టించి జనం దృష్టిని మళ్లించేవారు లేదా మత బేధాలు పెంచేవారు. ఆధునిక పాలకులు కూడా అందుకు అతీతులు కాదు.గోదావరి పుష్కరాల గురించి ఎన్నడూ లేని విధంగా జనాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించి స్నానాలు చేయించటాన్ని చూశాము. ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు సిద్ధం అవుతున్నారు. పుష్కర ఘాట్లకు విదేశీ సాయం గురించి కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణాలో యాదాద్రి అభివృద్ధికి చూపుతున్న శ్రద్ధలో వెయ్యోవంతైనా దళితులకు భూమి పంపిణీ కార్యక్రమంపై చూపటం లేదంటే కారణం ఏమిటి?

   ప్రపంచ మంతా గత కొద్ది సంవత్సరాలుగా ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధల వంటి వన్నీ కార్పొరేట్‌ల లాభాలు తప్ప సామాన్యుల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు. వాటి ఎజండాలోనే అది లేదు. ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి తప్ప వుల్లిపాయల వ్యాపారం చేయకూడదని, వాటిని ప్రయివేటు రంగానికి వదిలి వేయాలన్నది చంద్రబాబు స్కూలు సిద్ధాంతం. గ్రామాల్లో పాలు, కూరగాయలు అమ్ముకొనే వారు హెరిటేజ్‌ వంటి సంస్ధలు పెట్టక ముందు నుంచీ వున్నారు. వారు ఎంత మంది కోటీశ్వరులయ్యారు? లక్షల కోట్ల సంపదలున్న అంబానీలు పట్టణాలలో మూల మూలనా దుకాణాలు తెరిచి వుల్లిపాయలు, కూరగాయలు, పిన్నీసుల వంటివి అమ్ముతున్నారు. జడ పిన్నులు కావాలన్నా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్ధలలో బుక్‌ చేసుకొని ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. అందుకే అనేక మంది చిన్న వ్యాపారులు తమకు కలిసి రావటం లేదని ఎప్పుడూ వాపోతుంటారు. రానున్న రోజుల్లో ఇలాంటి వారు ఇంకా పెరిగి పోతారు. అప్పుడు చంద్రబాబు చెప్పినట్లు దేవాదాయ శాఖ సిబ్బంది పని చేసినా చేయకపోయినా అభాగ్యుల సొమ్ముతో హుండీలు దండిగా నిండిపోతాయి. కాళ్లూ, చేతులు చూసి జాతకాలు చెప్పి సొమ్ము చేసుకొనే వారు ఇప్పటికే తామర తంపరగా పెరిగిపోయారు. కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు అనుసరిస్తున్న విధానాలు సమాజంలో మెజారిటీకి నష్టదాయకమైతే వాటి వలన లాభపడే వారు కూడా వుంటారు.అదిగో అలాంటి వారే ఆదాయాలు పెరిగి పోయి మరింత పెరగాలని కోరుకుంటూ హుండీలలో నల్లధనాన్ని గుట్టలుగా వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

ఇండియా-ఇరాన్‌-చైనా సంబంధాలు

Tags

, , , , , ,

సత్య

  గత రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలతో ఎక్కువగా ఎందుకు కాలం గడుపుతున్నారంటే వెంకయ్య నాయుడి వంటి శిష్య గణం విదేశీ పెట్టుబడుల కోసం అని వెనుకా ముందు చూసుకోకుండా చెప్పారు. మూడో సంవత్సరంలో అడుగుపెట్టబోయే ముందు ప్రధాని ఇరాన్‌ పర్యటన జరిపారు. ఈ సందర్బంగా వచ్చిన వార్తలేమిటి అక్కడ ఒక రేవును అభివృద్ధి చేయటంతో పాటు రానున్న రోజులలో 20 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు లక్షా 30వేల కోట్ల రూపాయల పెట్టుబడులను అక్కడ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు మన దేశానికి విదేశీ పెట్టుబడులు రావాలని, వాటితో దేశాన్ని బాగు చేస్తామని చెబుతున్న పాలకులు మరోవైపు దేశం వెలుపలికి పెట్టుబడులను తరలించటం ఏమిటి ?

    దీనికి గాను జనానికి చెబుతున్నది ఏమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ఆసియా దేశాలకు ఎగుమతులు, వాణిజ్య లావాదేవీలు నిర్వహించాలంటే పాక్‌ భూ భాగం గుండా వెళ్లాలని, ఆ దేశం మనకు ఇబ్బందులు కలిగించకుండా వుండాలంటే ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని, అందుకు గాను గుజరాత్‌లో కాండ్లా రేవు నుంచి ఇరాన్‌లోని చబహార్‌ రేవుకు దగ్గరకు దగ్గర, తలనొప్పిలేని మార్గం అవుతుందని, దీనికి తోడు ఇరాన్‌ నుంచి మధ్య ఆసియా ద్వారా రష్యా వరకు రైలు మార్గంతో సరకు రవాణా సులభం అవుతుందని చెబుతున్నారు. ఇదేమీ కొత్త విషయం కాదు, ఇతరులతో తలనొప్పిలేని మార్గాలను వెతుక్కోవటం కూడా మంచిదే. మన గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇబ్బంది లేదు, తప్పులేదు, చేయదలచుకున్నదేదో చేసుకోక పొరుగుదేశాల గురించి నోటి దూల ఎందుకు ?

     అమెరికా కనుసన్నలలో నడుస్తున్న మనం ఇరాన్‌కు దూరంగా జరిగిన సమయంలో చైనా ఆ స్ధానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇరాన్‌కు తొలి సిల్కు రైలును విజయవంతంగా నడిపింది. చైనా తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లోని ఇవు నుంచి ఇరాన్‌ రాజధాని టెహరాన్‌కు 10,399 కిలోమీటర్ల దూరాన్ని కజకస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్‌ దేశాల గుండా ప్రయాణించి 14 రోజుల్లో రైలు 32 కంటెయినర్ల సరకును చేర్చింది. అదే సముద్రమార్గం ద్వారా చైనా షాంఘై నుంచి ఇరాన్‌ రేవు బందర్‌ అబ్బాస్‌కు ఓడ చేరుకొనేందుకు 45 రోజులు పడుతుంది. రెండు దేశాల మధ్య 2003-13 మధ్య వాణిజ్యం నాలుగు నుంచి 53 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రానున్న దశాబ్ద కాలంలో ఈ మొత్తాన్ని 600 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని జనవరిలో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ పర్యటన సందర్భంగా వుభయ దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇరాన్‌తో మన వాణిజ్యం ప్రత్యక్షంగా 14 బిలియన్‌ డాలర్లు, మూడవ పక్ష దేశం ద్వారా చేసిందానితో కలిపితే 30 బిలియన్‌ డాలర్లకు మించి లేదు. చైనా నుంచి యూరేసియా ప్రాంతానికి రైలు ద్వారా సరకు రవాణా ఇరాన్‌కు ఆదాయం తెచ్చిపెడుతుంది. తన రైలు మార్గాన్ని వినియోగించుకున్నందుకు సరకు రవాణా సంస్ధలు చెల్లిస్తాయి. చైనాలోని ఇవు నుంచి స్పెయిన్‌లో మాడ్రిడ్‌ వరకు 13వేల కిలోమీటర్ల దూరం వరకు సరకు రవాణాకు అవకాశం వుంది. ఈ పూర్వరంగంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు చబహార్‌ రేవు ఒప్పందం అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. ఇరాన్‌ తనకు ప్రయోజనం వున్న ప్రతి ఒక్కరితో సంబంధాలు నెరుపుకుంటుందని గుర్తించాలి.

     మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మన పారిశ్రామికవేత్తలు చబహార్‌లో అభివృద్ధి చేసేది పిచ్చుక గూడు అంత చిన్నది అనుకుంటే దానికి 100 కిలోమీటర్ల దగ్గరలోని పాకిస్థాన్‌ రేవు గ్వడార్‌ ప్రాంతంలో చైనా ఏకంగా పెద్ద రాజప్రాసాదమే ఏర్పాటు చేస్తున్నదట. నరేంద్ర మోడీ నిర్ణయం గురించి సంతోషం పట్టలేని ఒక తెలుగు పత్రిక ఈ ప్రాంతంలో హెచ్చుతున్న చైనా ప్రాబల్యానికి ఇది కళ్లెం వేసే నిర్ణయం అని జబ్బలు చరుచుకుంది. పాకిస్థాన్‌లో చైనా అభివృద్ధి చేసే కారిడార్‌లో పెట్టుబడులు 46 బిలియన్‌ డాలర్లు అయితే చబహార్‌లో మనం పెట్టేది 50 కోట్ల డాలర్లని ఒక ఆంగ్ల పత్రిక తన సంపాదకీయంలో పేర్కొన్నది. అదే చబహార్‌ రేవు ఆధారంగా అక్కడ చైనా ఒక పెద్ద పారిశ్రామిక పట్టణాన్నే ఏర్పాటు చేసేందుకు అదే ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంది.

    చబహార్‌ రేవు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పలుకుబడి పెంచుకోవాలని 2003లోనే వాజ్‌పేయి బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంతకాలం ఎందుకు ముందుకు పోలేదు? స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో ఒక ప్రాజెక్టు కట్టాలన్నా, ఒక కాలవ తవ్వాలన్నా బ్రిటీష్‌ రాణీగారి అనుమతి కావాల్సి వచ్చేది. ఇప్పుడు మన దేశం ఏం చేయాలన్నా అమెరికా అనుమతి కావాలంటే ఇదేమిటి ఇలా అంటున్నారు అని చాలా మందికి కోపం రావచ్చు. కానీ ఇది నిజం. ఇరాన్‌తో మనకు ఎలాంటి గట్టు పంచాయతీ లేదు. ఎక్కడా మార్కెట్ల కోసం పోటీ పడలేదు, తగాదా లేదు. అమెరికా-ఇరాన్‌కు మధ్య ఎప్పటి నుంచో వైరం. ఇరాన్‌లోని చమురు మొత్తాన్ని స్వాహా చేయాలన్నది అమెరికా కల. దాన్ని ఇరానియన్లు అడ్డుకున్నారు. దాంతో ఇరాన్‌ అణ్వాయుధ తయారీ కార్యక్రమాన్ని చేపట్టిందనే పేరుతో దానిపై ఆర్ధిక, రాజకీయ ఆంక్షలు విధించింది అమెరికా. మన పాలకులు అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ దాని వెనుకే నడుస్తున్నారు కనుక మనమూ ఇంతకాలం ఇరాన్‌కు దూరంగా వుండి అమెరికన్లను సంతోషపరిచాము. ఇప్పుడు ఇరాన్‌తో అమెరికన్లు రాజీకి వచ్చారు కనుక, ఇప్పుడు మనమూ మైత్రి గురించి కవిత్వం చెబుతున్నాము. వెన్నెముకలేని విదేశాంగ విధానం, అమెరికాకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతో చౌకగా చమురు ఇస్తామని ఇరాన్‌ ముందుకు వచ్చినా అయ్యగారికి కోపం వస్తుందన్నట్లుగా తీసుకోలేదు.

    మా దేశంలో పరిశ్రమలు పెట్టండహో అని ప్రపంచమంతా తిరిగి రా రమ్మంటున్నాము. కానీ మన పారిశ్రామికవేత్తలు రాబోయే రోజుల్లో ఇరాన్‌లో పరిశ్రమలు పెడతారట. నీరు పల్లమెరుగు- పెట్టుబడి లాభాలనెరుగు అని కొత్త సామెతను చెప్పుకోవాలేమో. పెట్టుబడి తనకు లాభాలు ఇచ్చే దేశ మాతలు లేదా పితలకు తప్ప స్వదేశ మాతా, పితలకు జై అనదు. అదేమీ చిత్రమో గానీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాల్లో తిరిగిన కొద్దీ మన ఎగుమతులు, దేశంలో వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు నానాటికీ పడిపోతున్నాయి. పదిహేడు వుపరంగాలతో కూడిన వస్తూత్పత్తి రంగంలో 2013 ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో వచ్చిన ఎఫ్‌డిఐ 8.8 బిలియన్‌ డాలర్లయితే అదే కాలంలో 2014లో 6.8, 2015లో 4.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అయితే ఇదే సమయంలో సేవారంగం, ఐటిలో ఎఫ్‌డిఐలు గణనీయంగా పెరిగాయి. వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే పెట్టుబడులు మన మౌలిక అభివృద్ధికి తోడ్పడతాయి. ఇతర రంగాలకు వచ్చేవి లాభాలు దండుకొని తెల్లవారేసరికి మాయం అవుతాయి. గతేడాది మన దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐలలో కేవలం 16శాతమే వస్తూత్పత్తి రంగానివి, ఇదే చైనాలో 43శాతం వున్నాయి. అందుకే అది ప్రపంచంలో ఎక్కడ బడితే అక్కడ తన పలుకుబడిని పెంచుకొనేందుకు అమెరికా ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర కార్యాచరణతో ముందుకు పోతున్నది, తన పారిశ్రామిక వుత్పత్తులకు మార్కెట్లను నిలబెట్టుకోవటమే కాదు, విస్తరించుకుంటున్నది. మరి మన పరిస్ధితి వున్న ఎగుమతులే గత 17 నెలలుగా పడిపోతున్నాయి. మార్కెట్లు లేకుండా స్వంత కార్యాచరణ, విధానాలు లేకుండా అమెరికా,ఐరోపా దేశాలకు జూనియర్‌ భాగస్వామిగా మారితే , అవే చైనా ధాటికి నిలవలేక విలవిల్లాడుతుంటే మనం ఎన్ని చబహార్‌లను అభివృద్ధి చేసినా ఫలితం వుంటుందా ?

    చైనా ఆర్ధిక వ్యవస్ధ గురించి అనేక మంది భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొంత మంది అక్కడ సోషలిస్టు వ్యవస్థలేదని అంటారు, మరికొందరు ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ నిర్మాణంలో వుందని వ్యాఖ్యానిస్తారు. బ్రిటన్‌ నుంచి హాంకాంగ్‌, పోర్చుగీసు నుంచి మకావో దీవులను తిరిగి తన పాలన కిందకు తెచ్చుకున్న సమయంలో చైనా ప్రభుత్వం 50 సంవత్సరాల పాటు అంటే 2049 వరకు అక్కడ వున్న వ్యవస్ధలను యధావిధిగా కొనసాగించేందుకు ఒప్పందం చేసుకుంది. అందుకే ఒకే దేశం-రెండు వ్యవస్ధలున్న దేశంగా చైనా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, ఇతర ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధ వుంది. ఇదొక నూతన ప్రయోగం. అది అనుసరించిన ప్రజానుకూల సంస్కరణల ఫలితంగా పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎంతో వేగంగా పురోగమిస్తోంది.అగ్రశ్రేణి పెట్టుబడిదారీ దేశాలతో వున్న ఆర్ధిక సంబంధాల రీత్యా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నది తప్ప పెట్టుబడిదారీ విధానం 2008 నుంచి ఎదుర్కొంటున్న అతి పెద్ద మాంద్యానికి అది దూరంగా వుంది.

   చబహార్‌ రేవు అభివృద్ధిపై ఒప్పందం కుదుర్చుకోవటాన్ని గొప్ప అంశంగా చిత్రిస్తున్నారు. దీని వలన లాభం ఎవరికి అన్నది ప్రశ్న. చైనా కూడా అలాంటి ఒప్పందాలనే కుదుర్చుకుంటున్నది, అంతకంటే ఎక్కువ పెట్టుబడులే పెడుతున్నది. కొంత మంది వ్యాఖ్యాతలు చెబుతున్నదాని ప్రకారం అక్కడ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానమే వుందనుకుందాం. అలాంటపుడు ఇలాంటి ఒప్పందాల వలన కలిగే లాభం ఏదైనా వుంటే అది ప్రభుత్వానికే చెందుతుంది, ఆ మొత్తాన్ని చైనా సర్కార్‌ జనానికే ఖర్చు పెడుతుంది. మరి మన దేశం కుదుర్చుకొనే ఒప్పందాల వలన వచ్చే లాభం ఎవరికి జేబుల్లోకి పోతుంది. అంబానీ, అదానీ అండ్‌కోలకే కదా ? మన దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు వచ్చిన లాభాలను తిరిగి ఇక్కడ పెట్టుబడులుగా పెట్టకుండా బయటకు తరలిస్తున్నాయని విమర్శిస్తున్నాం, ఇప్పుడు అదే పని మన దేశ కార్పొరేట్‌ సంస్ధలు కూడా చేస్తున్నట్లే కదా !