What the Muslims Who Are Not On His Mind Tell Us About Modi

Tags

,

Believe it or not, Imran Khan, Noor Jahan and Javed Ahmed are not the only individuals mentioned by Prime Minister Narendra Modi in his speeches and ‘Mann ki Baat’ broadcasts. Sunil Jaglan, Haryana ex-sarpanch, was mentioned once in his radio show and then again at Wembley stadium, London. And in the same November 29 broadcast where Noor Jahan and Javed Ahmed were mentioned, Jamuna Mani Singh found an honourable mention too.

Jamuna who? Why is it that only the first three names have stayed in mind? Not just because of their achievements. Few would remember what Alwar’s Imran Khan did to earn praise from Modi. By next month, Noor Jahan and Javed Ahmed’s achievements would be forgotten too. But their names will not, or at least, their Muslim identity will not.

This was the man who was chief minister when those who shared his ideology massacred Muslims across his state. Now, as prime minister, he chooses to praise Muslims. If that’s not news, what is? No wonder that the media has gone after these unknown Muslims much more enthusiastically than it has pursued the others mentioned by him.

Sunil Jaglan was already famous for his “selfie with daughter’’ campaign before Modi praised him. But few people outside Haryana may remember that he has been mentioned by Modi not once, but twice.

As for Jamuna Mani Singh, only two mainstream English newspapers – one from Kolkata, and one from the south – bothered to trace out this ASHA worker in Odisha’s Balasore district. The rest who chased her belonged to the Odia media.

It’s not as if Jaglan and Jamuna Mani Singh’s achievements are insignificant compared to those of Khan, Noor Jahan and Ahmed. Both had the guts to go against the norm in their villages. Jaglan fought Haryana’s male-dominated, misogynist society, known to regard women as the dirt beneath their feet, and he did so in his village. Jamuna had to persuade tribals in her village to give up age-old beliefs in animal sacrifice as a way of fighting illness, and turn instead, to modern medicine to fight malaria, an illness that’s routinely fatal for tribals. Any medical worker who’s worked among tribals knows how tough that is. Jamuna succeeded; there have been no malaria deaths in her village for the last two years.

Yet, it’s the Muslims who stay in mind.

It’s unfortunate for Khan, Noor Jahan and Ahmed to be remembered not for what they’ve achieved, but for the accident of their birth. For their feats are indeed noteworthy. Imran Khan, who teaches mathematics in a Sanskrit school in BJP-ruled Rajasthan, developed 52 learning Apps – learning how to do so on his own – for his deprived rural students. Noor Jahan, even at 70, rents out solar lamps for a mere Rs 3 a day to her electricity-starved villagers near Kanpur. Javed Ahmed, rendered paralysed waist downwards by a militant’s bullet in Kashmir when he was just 21, turned his life around by teaching poor children and then started a school for disabled children.

For these three, who’ve worked quietly without craving attention, praise by the PM represents the acme of achievement. As it does for their families and indeed, their entire village. The same applies for Jaglan and Jamuna Mani Singh.

Yet, there’s a difference. The immediate reaction that takes place after their names and work are lauded by the PM has been different for the former. Local BJP leaders promptly land up at their door, and are photographed congratulating them. Widowed 20 years back, Noor Jahan told reporters she could do with more solar lamps to meet the village’s growing demand – she has just 50 now. What she did get instead was a clock with Modi’s face, a shawl and a garland, from BJP Kanpur chief Surendra Maithani, and a vague promise of “financial help from the Centre.’’ Imran Khan was offered a job by the government and felicitated by the state education minister. Jamuna, on the other hand, wasn’t deemed worthy of an immediate visit by the Odisha unit of the BJP. Surely as an opposition party, the BJP would have benefitted more by a photo-op with Jamuna.

A lot of research must go into finding individuals deemed worthy of being mentioned by the PM in his speeches. There are thousands of such unsung heroes in our villages. So who Modi talk’s about reflects a deliberate choice. At any rate, this PM is not known for spontaneous gestures (the one that has stood out is his almost reflex rejection of a Muslim topi offered by a maulana in Gujarat.)

So what’s the message Modi is trying to send out when he mentions Muslims in his Mann ki Baat broadcasts, which are touted as his way of communicating directly to the people? That all that talk of him being anti-minority is just ‘sickular’ propaganda? That he is indeed appreciative of the community?

But then, why the silence when a Muslim is killed by a mob driven mad by their belief in Hindutva and their hatred for Muslims – be it Mohsin Shaikh in Pune, or Mohammed Akhlaq in Dadri? Why his silence when cabinet colleagues and other important party members abuse Muslims? Why did he refer to them as the “other community’’ in his Bihar campaign? Why did his prime ministerial campaign have graphic references to the way animals are killed and their pink flesh exported, or to those illegal immigrants out to grab :your’’ jobs (in Assam), or the regret that “your’’ women are not safe (in UP where “protection of our bahu-beti’’ was the driving force behind Jat violence against Muslims in Muzaffarnagar)?

The late Shiv Sena chief Bal Thackeray had the habit of listing Muslims whom he approved of as patriotic, while the rest were deemed not up to the mark. Everyone knows what his “boys’’ did to the rest in Mumbai, in 1984, and then in 1992-93. Modi seems to be following in his footsteps. “My India lives in Imran Khan,’’ Modi declared in Wembley to an adoring crowd. “And it dies with Mohammed Akhlaq,” if only he could have added.

Above article appeared in WIRE.com

వ్యాపారులు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలా ? దాన ధర్మాల పేరుతో ఎక్కువ వ్యాపారం చేయాలా ?

Tags

, , ,

ధర్మకర్తృత్వం-దాతల బండారం-3

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచ మంతా బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ధర్మాల గురించి పాత రోజుల్లో పల్లె టూళ్లలో గుంపులుగా కూడి సినిమా కధలు చెప్పుకున్నట్లుగా చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి గురించి ఇక చెప్పనవసరం లేదనుకోండి. ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ దాతృత్వం గురించి గొప్పగా పొగిడారు( మరి ఆయనకు తాతగా ప్రమోషన్‌ వచ్చిన సందర్బంగా హెరిటేజ్‌ ఇతర కంపెనీల్లో వున్న వాటాలను కూడా అలాగే ధర్మం చేయవచ్చు కదా అని ఎవరూ అడగకండి). మనకున్న జబ్బు అని అనకూడదు గానీ ఏ అంశమైనా కొనసాగింపు,పర్యవసానాలు ఏమిటి అని చూడటం తక్కువగా వుంది.మూసి పెట్టటం తప్ప మీడియా దాని గురించి అసలు పట్టించుకోదు.ఒక అవినీతి గురించి సంచలన వార్త ప్రసారం లేదా ప్రచారం, ప్రచురణ తరువాత చివరకు ఏమైంది? కాకపోతే ఎందుకు కాలేదు అన్న సమాచారం వుండదు. కలికాలం కాకపోతే ధనవంతులకు ఆకస్మికంగా ధర్మాలు చెయ్యాలన్న బుద్ది పుట్టటమేమిటి? ఈ విషయం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారో లేదో నేను వినలేదు) నిజంగా వారు తమ సంపదలను ఇచ్చారా? ఇస్తే ఏం జరిగింది అన్నది తెలుసుకోకపోవాలన్న ఆసక్తి జనానికి వుండకూడదనే ధనికులు కోరుకుంటారు.ఒక్క ఇచ్చినపుడు ప్రచారం తప్ప.

బిల్‌గేట్స్‌ తన సంపదలను దానం చేశాడు, ఓకే, దాని వలన లాభపడింది ఎందరు? అసలు సమాజంలో ఒకరు ఇచ్చేవారు, ఒకరు పుచ్చుకొనే నిస్సహాయత ఎందుకు వుండాలి. పుచ్చుకొనేవారి కష్టానికి తగిన ప్రతిఫలం లేదా గౌరవ ప్రదమైన శ్రమకు తగ్గ విలువను చెల్లిస్తే వేరొకరి ముందు చేయి చాచాల్సిన అగత్యం ఎందుకు అని ఆలోచించనవసరం లేదా ? అంటే పెట్టుబడిదారులు తమది ఎల్లపడు పైచేయిగా వుండే పరిస్ధితులు శాశ్వతం కావాలని కోరుకుంటున్నారా ?

బిల్‌ గేట్స్‌ దాన ధర్మాల గురించి ఆండ్రూ బౌమన్‌ అనే పరిశోధకుడు కొన్ని మింగలేని విషయాలను వెల్లడించారు. హఫింగ్టన్‌ పోస్ట్‌ అనే పత్రికకు కొద్ది సంవత్సరాల క్రితం అసలు తానెందుకు సంపదను దానం చేయాలనుకున్నదీ గేట్స్‌ వివరించాడు. 1993లో గేట్స్‌ ఆఫ్రికా వెళ్లినపుడు అక్కడి పరిస్ధితులను చూసి చలించిపోయాడన్నది సారాంశం. అమెరికాలో ఎవరైనా తమ సంపదలో ఏడాదికి ఐదు శాతం దాన ధర్మాలకు అందచేస్తే వారికి పన్ను రాయితీలు దక్కుతాయి. గేట్స్‌ ఆఫ్రికాను చూసి చలించి పోయిన తరువాత ఆయన మిత్రుడు వారెన్‌ బఫెట్‌లో కూడా చలనం వచ్చింది. గేట్స్‌తో కలసి తన కుటుంబం 30 బిలియన్‌ డాలర్లను దాన ధర్మాలకు ఇస్తామని ప్రకటించారు. 2010నాటికి వారు 26 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ప్రపంచ ఆరోగ్య అవసరాలకు ఇచ్చారు. అమెరికాలో అంతకు ముందు ధనికుడిగా వున్న రాకఫెల్లర్‌ కుటుంబం 1914నుంచి ఇచ్చిన మొత్తం 14 బిలియన్‌ డాలర్లు మాత్రమే. గేట్స్‌ ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ టీకాల ద్వారా అరవైలక్షల మంది పిల్లలను బతికించినట్లు చెప్పుకున్నారు. ఎయిడ్స్‌, టీబీల నుంచి ఏడాదికి లక్షమందిని రక్షించటం లక్ష్యంగా గేట్స్‌ ప్రకటించారు. గేట్స్‌ చొరవ అనేక మంది ధనికులను ప్రపంచ ఆరోగ్యంవైపు దృష్టి సారింప చేయించిందని అనేక మంది పొగిడారు.

అయితే ఈ ఫౌండేషన్‌ పెట్టే ఖర్చు, దానిప్రభావం ఎంత , అసలది ఎవరికి జవాబుదారీ అన్న సమస్యలు ముందుకు వచ్చాయి. దాన ధర్మాలకు ఇచ్చిన సొమ్ములో ఏటా ఐదు శాతం మొత్తం తమ వైపు తిప్పుకొనేందుకు యత్నించే(లాబీయింగ్‌) వ్యవహారాలకు, సలహాలకు ఖర్చు చేస్తామని ఫౌండేషన్‌ చెప్పుకుంటుంది. వాటిలో అమెరికా విశ్వవిద్యాలయాల మొదలు ఎన్‌జీవోల వరకు అనేక సంస్ధలున్నాయి. ముందే చెప్పుకున్నట్లు ఫౌండేషన్‌ చేసే ఖర్చులో సింహభాగం ప్రపంచ ఆరోగ్య భాగస్వామ్యం కోసమే కేటాయించారు.అంటే ఆరోగ్య విధానాల రూపకల్పనలో తమ ముద్ర , ప్రాధాన్యతలు వుండే విధంగా లాబీయింగ్‌ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ఇతర ఏజన్సీలు వున్నప్పటికీ గేట్స్‌ ఫౌండేషన్‌ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలపై సమీక్షా సమయాలలో గేట్స్‌ కంపెనీ సిఇఓ కుర్చీవేసుకు కూర్చుంటాడు. వూరికే కూర్చోవటానికి వారేమన్నా పనిలేని వారా ? దానాలలో కూడా లాభాలు ఎలా పిండుకోవచ్చో కనిపెట్టిన వారు వూరికే వుండరు కదా ! విధానాలపై ప్రభావం చూపేందుకు జోక్యం చేసుకుంటారు. మందులు మా బావమరిది షాపులోనే కొనాలనే షరతులు విధించకుండానే కొనిపించే డాక్టర్ల మాదిరి చేయాల్సింది చేసుకుంటారు.డాక్టర్‌ డేవిడ్‌ మెకాయ్‌ అనే ప్రజారోగ్య వైద్యుడు లండన్‌ విశ్వవిద్యాలయ కళాశాలలో పరిశోధకుడు, ్క ప్రజారోగ్య వుద్యమానికి ఒక సలహాదారు. ఆయనేమన్నారంటే ‘ఫౌండేషన్‌ అంటే నిధుల వసూలు , పధకాల అమలుకు మించి దాని లక్ష్యాలు వుంటాయి అన్నారు. అకడమీషియన్లుగా వుండే వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్ధలు, వాణిజ్య రంగాలతో అంతర్గత సంబంధాలు కలిగి వుంటాయి. అంతర్జాతీయ ఆరోగ్య సమస్యపై ఒక బృంద ఆలోచనగా ప్రభావం చూపుతాయి.శాస్త్రీయ అభిప్రాయాలలోని భిన్నత్వాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌ అణచివేస్తున్నదని, అది తనకు తాను తప్ప ఇతరులెవరికీ జవాబుదారీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని మలేరియా విభాగ పరిశోధన అధిపతి ఆరాటా కోచి 2008లో విమర్శించారు.

గేట్స్‌ వంటి ఫౌండేషన్లు ప్రపంచ ఆరోగ్య విధానాన్ని ఏవైపుకు నెడుతున్నాయి ?

తాను పెట్టుబడులు పెట్టటానికి ఒకేసారి ఏడడుగులు ఎగిరేందుకు ప్రయత్నించటం గాక ఒక అడుగుతో దాటిపోయేయి ఏవి వుంటాయా అని పరికించిచూస్తాను అని వారెన్‌బఫెట్‌ అన్నాడు.అయితే బిల్‌గేట్స్‌ దీనికి విరుద్ధంగా కుండలో కూడు కుండలోనే వుండాలి పిల్లాడు మాత్రం తెల్లవారేసరికి దుడ్డులా తయారు కావాలి అన్నట్లు తాను ఇచ్చే దాన సొమ్ముతో ఒకేసారి ఏడడుగులు గెంతాలి అన్నాడు. పసితనంలో రెండుమూడు డోసులు వేసే టీకాలతో జీవితకాలంపాటు రాని వ్యాధుల మాదిరి ఎయిడ్స్‌, టీబీ వంటి వ్యాధులను ఒక్క మాత్ర లేదా టీకాతో నయం చేసే అద్భుతాలు జరగకపోతే ఆధునిక పరిజ్ఞానం ఎందుకన్నట్లు మాట్లాడటమే కాదు తన దానపు సొమ్ములో1998-2007 మధ్య 36.5శాతం ప్రభుత్వ-ప్రయివేటురంగ భాగస్వామ్యంతో నడిచే ‘గావి అలయన్స్‌’ పరిశోధనలకే కేటాయించాడు. అది హెపటైటిస్‌ బి, హెచ్‌ఐబి బాక్టీరియా నిర్మూలనకు వాక్సిన్‌ల తయారీకీ పనిచేసింది. ప్రస్తుతం న్యూమోనియో, డయేరియా వంటి వ్యాధుల కారక బాక్టీరియాను నిర్మూలించే వ్యాక్సిన్ల పరిశోధనలో నిమగ్నమై వుంది. మరి ఈ వాక్సిన్లు మానవాళికి వుపయోగమా కాదా అంటే వుపయోగమే.

సమస్య ఎక్కడ వుందంటే ఇప్పటి వరకు సాగించిన శాస్త్ర పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు అన్నీ సమాజానికి చెందినవే తప్ప వ్యక్తులకు చెందినవి కాదు. ఒక శాస్త్రవేత్త ఒక ఔషధాన్ని కనిపెట్టాడు, లేదా ఒక ప్రమాదకర బాక్టీరియాను జాడ పట్టాడు అంటే దాని వెనుక అతని ప్రతిభ లేదని కాదు. పరిశోధన రిలే పరుగు పందెం వంటిది అనుకుంటే విజయసూచికగా రిబ్బన్ను తాకేది చివరి రన్నర్‌ కావచ్చుగాని అంతకు ముందు వారు లేకుండా, వారు సరిగా పరుగుతీయకుండా చివరి వ్యక్తికి విజయం సాధ్యం కాదు. అలాగే తన ముందు తరాల వారు వాటిపై సాగించిన అధ్యయనాల కొనసాగింపుగా ఎవరైనా నూతన అంశాన్ని కనుగొన్నారు, వున్నవాటిని మెరుగుపరిచారు తప్ప స్వంతంగా తామే కనుగొనలేదు.ఎవరైనా అలా చెప్పుకుంటే అది వారి సంస్కారానికి సంబంధించిన అంశం. రైట్‌ బ్రదర్స్‌కు ముందు విమానాలపై జరిగిన పరిశోధనలు, వైఫల్యాల నుంచి వారు తీసుకున్న గుణపాఠంతో విమానం ఎగరటంపై పైలట్స్‌కు ఎలా అదుపు వుండాలో కనుగొన్నారు. అది ఒక విప్లవాన్ని తెచ్చింది.వారి పరిశోధన బృందంలో సైకిల్‌ షాపు మెకానిక్‌ చార్లీ టేలర్‌ కూడా ఒక ముఖ్యుడన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ప్రింటింగ్‌ ప్రెస్‌లు,మోటార్లు, సైకిల్‌షాపులు అన్నింటిని ఆ బృందం పరిశీలించి, వాటిలో పనిచేసి విమానం ఎగిరే యంత్రాన్ని కనిపెట్టారు. కానీ పేటెంట్‌ మాత్రం రైట్‌ బ్రదర్స్‌ పొందారు.నిజానికి ఆది సమష్టి కృషి.దానిని సమాజానికి వుపయోగించినపుడు ఫలాలు అందరూ అనుభవిస్తారు, వ్యక్తులు లేదా కొన్ని కంపెనీలకు పరిమితం చేసినపుడు వారు మాత్రమే లబ్దిపొందుతారు. ఈ దిశగా ఆధునిక పెట్టుబడిదారులు తమ లాభాలను కాపాడుకొనేందుకు, పెంచుకొనేందుకు నూతన పద్దతులను, ఆర్ధిక వుత్పత్తులను కనిపెడుతున్నారు.

వుదాహరణకు కామెర్ల రోగానికి మందులను ఇంతకు ముందే కనిపెట్టకపోలేదు. అయితే వాటికి నిర్ణయించిన ధరలలో వుపయోగించాలంటే సామాన్యుల వల్లకాదు. పెద్ద మొత్తంలో తయారు చేస్తే ఖర్చులు తగ్గుతాయి. అందుకు పద్దతులు కనుగొనాలి, దాన్ని మార్కెటింగ్‌ చేయాలి. అప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తుంది. ‘గావీ’ సంస్ధద్వారా బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ఆపని చేసింది. హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ ధరను 68శాతం మేరకు తాము తగ్గించగలిగామని గావి చెప్పింది. దీని తరువాత న్యూమోనియా టీకాల పరిశోధనకు 150 కోట్ల డాలర్ల ధర్మ నిధిని కేటాయించారు. కామెర్ల వ్యాధి అందరికీ వస్తుందా, దాని నివారణకు వ్యాక్సిన్‌ ముందే తీసుకోవటం అవసరమా? కంపెనీలు తయారు చేశాయి,అవి అమ్ముడు పోవాలి, లేదా యంత్రాలు ఖాళీగా వుండకుండా ఏదో ఒకటి తయారు చేయాలి, నుక వాటికోసం టీకాలు తీసుకోవాలా అన్నది మరొక చర్చ. ముందస్తు నివారణ కోసం అవసరం వున్నా లేకపోయినా మందుల కంపెనీలు తమ వుత్పత్తులను అంటగడుతున్నాయన్న చర్చ జరుగుతోందా లేదా ? వ్యాక్సిన్లపై అమెరికాలో పెద్ద ఎత్తున వ్యతిరేకం వ్యక్తం అవుతోందా లేదా ?చౌకగా వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవటం మంచిదే కదా, దాని వలన ఏదైనా ఒక కంపెనీ లాభం పొందితే ఏమిటట, ఏడుపు తప్ప అనేవారు లేకపోలేదు.

పెట్టుబడిదారుల పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ దీని గురించి రాస్తూ చౌక ధరలతో, వేగంగా అటు పేదలకు ఔషధాలు దొరకటం, ఇటు వుత్పత్తుల మార్కెటింగ్‌ జరిగి కంపెనీలకు సమాన ప్రయోజనం కలిగిందని పేర్కొన్నది. సరిహద్దులకు అతీతంగా ఔషధాలు దొరకాలనే ప్రచారం చేస్తున్న సంస్ధ డైరెక్టర్‌ టిడోవాన్‌ సచోయన్‌ అంగ్‌రెర్‌ ఏమంటారంటే ప్రపంచ ఆరోగ్యరంగంలో ప్రయివేటు రంగ పాత్ర ఎక్కువగా వుండాలని గేట్స్‌ ఫౌండేషన్‌ కోరుతున్నది, ప్రభుత్వంతో ప్రయివేటు రంగ భాగస్వామ్యం కోరుతున్నది, దాన్నొక విధానంగా రూపాందింపచేసేందుకు ఈ సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి.దీని వెనుక వాటికి భారీ ప్రయోజనాలు దాగున్నాయి. ఒక ఆట నిబంధనలను రూపొందించే పాత్రలో కంపెనీలు వుండకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు భారీ మొత్తంలో నిధులు ఇస్తున్న గేట్స్‌ ఫౌండేషన్‌ ఆ సంస్ధ విధాన నిర్ణయాల రూపకల్పనలో ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నది.అది బడా ఫార్మా కంపెనీల మాజీ వుద్యోగులను పెద్ద ఎత్తున తన సిబ్బందిగా తీసుకోవటంతో కంపెనీలకు అనుగుణ్యంగా నిర్ణయాలు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.

మన కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యవుద్యమ కార్యకర్తల వత్తిడికి తలొగ్గి లేదా మన ఫార్మా పరిశ్రమ అభివృద్దికి లేదా తన బడ్జెట్‌ ఖర్చు తగ్గించుకొనేందుకు గానీ జీవనధార (జనరిక్‌)ఔషధాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పేటెంట్‌ హక్కులున్న ఔషధాలు ఎంతో ఖరీదైనవి. వాటికి అడ్డదారులు కనుగొనటంలో మనదేశం, చైనా ఫార్మాకంపెనీలు ఆరితేరాయి. జీవన ధార ఔషధాల తయారీ వలన వాటిని రూపొందించిన కంపెనీలకు ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం కలగదు. అందువలన అవి పేటెంట్‌ హక్కులను మరింత కఠినతరం చేసేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నాయి.ఈ మందులను తయారు చేసే కంపెనీలకు ఏదో ఒక సాకుతో ఆటంకాలు కలిగిస్తున్నాయి. మన దే శంలోని అనేక జనరిక్‌ మందుల తయారీ కంపెనీలకు ఏ రోజున, ఎటువైపు సుంచి ఏం ముప్పు ముంచుకువస్తుందో తెలియదు.ఈ మందుల తయారీ పోటీ లేనట్లయితే ఎందరో రోగులు మందులు కొనుగోలు చేయలేక మరణించి వుండేవారు. పేదలకు వుపయోగపడని ఆధునిక పరిజ్ఞానం ఒక పరిజ్ఞానమా అని కబుర్లు చెప్పే బిల్‌గేట్స్‌ మరోవైపున కష్టపడి పేటెంట్‌ పొందిన కంపెనీల మేధోపరమైన హక్కులకు గట్టి రక్షణ లేకపోతే ఎలా అని ‘ట్రిప్స్‌’ ఒప్పంద చర్చ సందర్భంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో, జి 8 దేశాల బృందంలో మైక్రోసాప్ట్‌ కంపెనీ ద్వారా వత్తిడి చేయించాడు.ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభాన్ని మరింత పెంచుతుందని ఆక్స్‌పామ్‌ సంస్ధ పేర్కొన్నది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు మరిన్ని దాన ధర్మాలు చేయాలా ? లేక దాన ధర్మాల పేరుతో మరింత వ్యాపారం చేయాలా అన్నది ఇక్కడ సమస్య?

గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం

Tags

, ,

ధర్మకర్తృత్వం-దాతల బండారం-2

ఎం కోటేశ్వరరావు

మార్క్‌ జుకెర్‌బర్గ్‌, వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌ వంటి వారు చేస్తున్న దాన ధర్మాలు ఎవరికీ వుపయోగపడవా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిస్సందేహంగా కొందరికి వుపయోగపడతాయి. ఫలానావారి తాతగారి ముత్తాత జ్ఞాపకార్ధం ఫలానా వారి కుమారుడు, వారి మనవడు అయిన ఫలానా వారు చేసిన ధర్మం అన్న అక్షరాలతో నిండి వుండే చొక్కాలు వేసుకొని సంచార ప్రచార వాహనాల మాదిరి తిరిగేవారు మనకు తరచూ కనిపిస్తుంటారు. దానిలో దానం కంటే ప్రచారమే ఎక్కువగా కనిపిస్తుంది. గోచీ కూడా లేని వారికి అది ఇవ్వటమే పెద్ద లోకోపకారం కదా !.ఇక్కడ సమస్య దానం అంటే ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో పుచ్చుకోవటమా ?

ప్రపంచంలో అమెరికాయే ధనిక దేశం, దానిలో వారెన్‌బఫెట్‌, బిల్‌గేట్స్‌ పెద్ద ధనికులు. వారు 2010లో తాము ఎంత దానం చేస్తున్నదీ ప్రకటిస్తూ ప్రతి ధనికుడూ తమ సంపదలో సగం దాన ధర్మాలకు వినియోగించాలని పిలుపునిచ్చారు.తమ వంటి బిలియనీర్లు 187 మందితో ఇప్పటివరకు ఎంతో కొంత దానం చేయిస్తామని వాగ్దానం చేయించారు. రెండో కంటికి తెలియకుండా దానం చేసిన వారు గొప్పవారని ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. ఎవరెంతదానం చేస్తున్నారో లోకానికి తెలిస్తే మిగతావారు కూడా వుత్సాహపడి తాము కూడా ముందుకు వస్తారు కనుక దాన ధర్మాలకు ప్రచారం కావాలని కొత్త సూత్రీకరణ చేశారు.అందుకే కాబోలు చేసిన దానం కన్నా దాని ప్రచారానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు చాలా మంది. అంతేకాదు ఎంత డబ్బు దానం కింద వచ్చిందో తెలిస్తే అది ఎక్కడకు వెళుతుందో, అందరూ ఒకదానికే కాకుండా దేనికి ఎంత ఖర్చుచేయాలో కూడా తెలుసుకోవచ్చని కూడా చెబుతున్నారు. దాతృత్వ నిపుణులు( ఫిలాంత్రపీ ఎక్స్‌పర్ట్‌ ) అనే సంస్ద సిఇవో మెలైనీ వులే కార్పొరేట్‌ దానాల గురించి చెబుతూ వ్యక్తిగతమైన ప్రయోజనమో లేక వారి వారసుల జేబులు నింపటమో గాక మొత్తం మానవాళి ఆరోగ్యం, జీవనానికి ఇలాంటి దానాలను ఖర్చు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు. దేన్నీ కాదనలేం మరి.

అమెరికాలో 501(సి)(3) అనే ఒక చట్ట సెక్షన్‌ ప్రకారం ఎవరైనా దానం చేసిన వాటి మీద వారికి ఎలాంటి హక్కు వుండదు. దానం చేసిన వారి పాత్ర అంతటితో ముగుస్తుంది.వాటిని స్వీకరించిన సంస్ధకు దానిపై సర్వహక్కులు వుంటాయి. కానీ జుకెర్‌బర్గ్‌ వంటి బిలియనీర్లు చేసే దానాలు అలాంటివి కావు. వాటికి బదులుగా పరిమిత జవాబుదారీ కంపెనీ(లిమిటెడ్‌ లయబులిటీ కంపెనీ(ఎల్‌ఎల్‌సి)ని ఏర్పాటు చేసి దానికి బదలాయిస్తారు. ప్రయివేటు ట్రస్టులంటే బాగా అర్ధం అవుతుంది.జుకర్‌ బెర్గ్‌కు ముందు దానాలు చేసినవారందరూ ఇలాంటి దారులే ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను కట్టకుండా బహిరంగంగా తమ ఆస్తులను వీటిలో దాచుకుంటారు. పబ్లిక్‌ ట్రస్టులంటే నియంత్రణలు ఎక్కువ వుంటాయి. ఈ ఎల్‌ఎల్‌సీలకు అలాంటి బాదర బందీ వుండదు. లాభాలు వస్తాయనుకుంటే వేటిలో అయినా ఈ ట్రస్టులలోని సొమ్మును ఎప్పుడు కావాలంటే అక్కడ పెట్టుబడులుగా పెట్టవచ్చు, రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వవచ్చు. దీని గురించి న్యూయార్క్‌ నగరంలోని న్యూ స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎరికి కోల్‌ ఎరియన్స్‌ ఏమంటారంటే ‘ మరో మాటలో చెప్పాలంటే దాతృత్వ పెట్టుబడులను సొమ్ము చేసుకోవలనుకోటంలో వారెంతో(జుకర్‌బెర్గ్‌ వంటివారు) పారదర్శకంగా వున్నారు, వారిలో ఎక్కువ మంది ఇలా చేస్తూనే మరోవైపున వారు ఎవరికైతే సేవ చేయాలనుకుంటున్నారో వారికి మరిన్ని సమస్యలు తెచ్చే వర్తమాన పెట్టుబడిదారీ వ్యవస్ధను కూడా ముందుకు తీసుకుపోతున్నారు. ఇది, ఎల్లవేళలా దాతృత్వ విరుద్ధ స్వభావం ఇలానే వుంటుంది. ఒకవైపు అసమానతలను సృష్టించే విధానాలను కొనసాగిస్తూనే మరోవైపు ఎవరైనా దారిద్య్రం, అ సమానత, పర్యావరణ, కార్మిక హక్కులను దుర్వినియోగాన్ని అరిక్టగలరా ? ఈ సమస్యలను పరిష్కరించటానికి సామాజిక దృక్పధంతో వుంటేవాటికి ట్రస్టులు నిధులు సమకూర్చవచ్చు, కార్మికవర్గం నిర్వహించే వాటికి పెట్టుబడి మిగులును సాయంగా అందించగలరా అన్న ప్రశ్న తలెత్తున్నది’ అని ఆమె అన్నారు.

ఈ వారంలో నే ఇలాంటివారందరినీ ఒక దగ్గరకు చేర్చుతున్న బిల్‌గేట్స్‌ తదితరులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఇంధన విజయ కూటమి (బ్రేక్‌త్రూ ఎనర్జీ కోయలిషన్‌). అంటే నాణ్యమైన లేదా క్లీన్‌ ఎనర్జీపై పరిశోధన చేసేందుకు వారు ‘దాన ధర్మాలు’ చేస్తారు. ఇదొక కొత్త తరం ధార్మికత, వీరొక ప్రత్యేక ధార్మికులు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అంటే ఇదే. ఖర్చేమీ వుండదు, పుణ్యానికి పుణ్యం. నాణ్యమైన ఇంధనంతో పర్యావరణాన్ని కాపాడేందుకు తామీ ధర్మం చేస్తున్నామని చెప్పు కోవచ్చు. పనిలో పనిగా అందుకు ఇచ్చే సొమ్ముపై పన్ను రాయితీలు, ధర్మపరులుగా మరికొన్ని రాయితీలు పొందవచ్చు. ఒక్కొక్క రంగంలో ఎవరికి వారు ప్రత్యేకంగా పరిశోధన జరిపితే ఖర్చు తడిచి మోపెడంత అవుతుంది. అలాగాక ‘సహకార కూటమి పద్దతి’లో చేస్తే తలా కాస్త, అది కూడా పన్నురాయితీలతో తమకు ఎలాంటి భారం పడకుండా తమకు అవసరమైన పరిశోధన చేయించుకుంటారు. దాని వలన వచ్చిన ఫలితాలను పొందేది ఎవరంటే తిరిగి ఈ కార్పొరేట్లే. పగలంతా సంపాదించిన దానిని ముఠాకార్మికులు రాత్రికి కలసి పంచుకున్నట్లుగా ప్రాజెక్టులలో భాగస్వామ్యం ద్వారా పరిశోధన ఫలాలను అందరూ కలసి పంచుకుంటారు. పేరుకు పేరు సొమ్ముకు సొమ్ము. వీరు చేసే దానాలను స్వీకరించేందుకు వీరందరూ కలసి తమ చెప్పుచేతల్లో వుండే ట్రస్టులను ఏర్పాటు చేస్తారు. అందులో తమ వారినే వుద్యోగులుగా నియమిస్తారు. వారికి జీతాలను ఆ ట్రస్టుల నుంచే ఇస్తారు. కన్సల్టెంట్స్‌గా కూడా తమవారినే పెట్టుకుంటారు. క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు రూపకల్పన చేయిస్తారు. మన వంటి పేద దేశాలు వాటిని కావాలని వెళితే మనకు ఆ పధకాలు ఇవ్వటే కాదు, అందుకు అవసరమైన అప్పులను కూడా వేరే ఏజన్సీ ద్వారా ఇప్పిస్తారు. అప్పు డబ్బు రూపంలో ఇస్తే దారి మధ్యలో ఎవరైనా కొట్టివేయకుండా మాకు తెలిసిన కంపెనీలలో వున్న యంత్రాలను కొనుగోలు చేయండి, వాటిని బిగించాలన్నా, సరిగా పనిచేయాలన్నా వాటి ఇంజనీర్లు మాత్రమే వుండాలి, ఇలా షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా సవాలక్ష నక్షత్రాలను వుంచి మనకు ఇస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, పరీక్షా కేంద్రాలు, మందులు, మెడికల్‌ షాపులు, రోగులు అన్నమాట. అవసరమా లేదా అని ప్రశ్నించకుండా వైద్యులు రాసిన పరీక్షలన్నీ చేయించుకోవాలి, అదీ వారు పేర్కొన్న పరీక్షా కేంద్రాలలోనే మిగతా చోట్లకు వెళితే రిపోర్టులు సరిగా రావంటారు. వారు రాసిన మందులే కొనాలి. మిగతా మందులు సరిగా పనిచేయవు మీ ఇష్టం అంటారు. వారు చెప్పిన షాపులోనే కొనాలి, అవి అక్కడ తప్ప మరొక చోట దొరకవంటారు. కౌపీన సంరక్షణార్ధం చివరకు ఒక సన్యాసి సంసార జంఝాటంలో చిక్కుకున్నట్లుగా దాతృత్వం గురించి చెబుతానంటూ ఈ విషయాలన్నీ ఏమిటి అనుకుంటున్నారా ? కార్పొరేట్‌ దానాలకు అదే కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు వున్న సంబంధాన్ని ఈ లావాదేవీలలో మనం చూడటం కష్టం, ఎలాగంటే ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుంది. ఇది చదివిన తరువాత కూడా సంబంధం లేని విషయాలుగా మీకు అనిపిస్తే చెప్పటంలో లోపం నాదే. మన దేశాన్ని బ్రిటీష్‌వారు దోచుకుంటున్నారు, వారిని తరిమివేస్తే తప్ప మనకు మంచి జరగదు అని మన జనాన్ని ఒప్పించటానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది, ఎన్ని విధాలుగా చెప్పాల్సి వచ్చిందో తెలుసు కదా !

ధర్మకర్తృత్వం-దాతల బండారం-1

Tags

, ,

ఎం కోటేశ్వరరావు

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, కుందేటి కొమ్ము సాధించవచ్చు గాని మూర్ఖుని మనస్సును రంజింప చేయలేమన్న పెద్దల అనుభవసారాన్ని ఇంతకాలం పాఠాలలో చదువుకున్నాం. దీనికి తోడుగా వుదారులైన మంచి భూస్వాములు, దొరలు, కార్మికుల శ్రమశక్తిని జలగల్లా పీల్చని అతి మంచి పెట్టుబడుదారులను కనలేమని కూడా చెప్పుకోవచ్చేమో ?

ఈ మాట చదవగానే డిసెంబరు రెండవ తేదీ పత్రికలు చూసిన వారంతా నా మీద ఇంతెత్తున మండి పడతారు. వూరంతటిది ఒకదారి ఇలాంటి వులిపికట్టెలది ఒకదారి, వీరు జన్మలో మారరు, ఇతరుల మంచిని, దయా గుణాన్ని చూడరు అంటూ ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బెర్గ్‌ దంపతులు తమకు కుమార్తె పుట్టిన సంతోషంలో మూడు లక్షల కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన వార్తలను చూపించిన టీవీలను కదలించరు గానీ ప్రచురించిన పత్రికలను నా ముఖాన కొడతారని తెలుసు. జుకెర్‌బర్గ్‌ ఎవరనుకుంటున్నారు. మన యజమాని, మనం అంటే ఫేస్‌బుక్‌లో ఖాతాలున్నవారందరం. జీతాలు అడగకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్న కార్మికులం.మనం రోజూ లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసే ప్రతిదీ, ఫేస్‌బుక్‌లో మనం వుత్పత్తి చేసేవన్నీ మనకు తెలియకుండానే జుకెర్‌బెర్గ్‌ ఆస్తిగా మారిపోతాయి. వాటిని మార్కెటింగ్‌ చేసుకొని విపరీత లాభాలు సంపాదిస్తున్నాడు. ఇలాంటి కార్మికులు,దోపిడీ గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌లు ఊహించి వుండరు. ఫ్యాక్టరీ లేదు, మౌలిక వసతులైన కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు అవినడిచేందుకు అవసరమైన ,బ్యాటరీలు, విద్యుత్‌ అన్నీ మనం స్వంతంగా డబ్బు పెట్టి మరీ సమకూర్చుకుంటున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం, జీతాలు తీసుకోకుండా రోజుకు 50 కోట్ల మందిమి పనిచేస్తున్నాము. మన కేవలం వీడియోలు చూస్తే చాలు,పోస్టింగులు పెడితే చాలు, లైకులు,షేర్లు కొడితే చాలు డబ్బే డబ్బు. ఎనిమిది బిలియన్ల వీడియోలు చూస్తున్నాం, ఇది పని కాదేటి? దీనికి శ్రమపడనవసరం లేదా? దీని ద్వారా వచ్చే జబ్బులు, దురలవాట్లు , అవలక్షణాలు తప్ప మనకు లాభాల్లో వాటా లేదే !త్వరలో మన సంఖ్య 153 కోట్లకు చేరుతుందని, వీరిలో 136 కోట్ల మందిమి సెల్‌ఫోన్ల మీద పనచేసే వారం తయారవుతామట. మూడవ త్రైమాసిక ఆదాయం 480 కోట్ల డాలర్లని తాజా సమాచారం. ఖర్చు మూడు వందల కోట్ల డాలర్లట. రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందని ఇంత ఖర్చయినా ఫరవాలేదని మదుపుదార్లు ధీమాగా వున్నారు.

నిజమే ఏ మాటకామాటే చెప్పుకోవాలి కదా ! అయినా ఎందుకో నా హార్ట్‌వేర్‌లో అది సూట్‌కావటం లేదు. నా చిన్న తనంలో మా పక్కింటి వారు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ వుండేవారు. ఒకరి పొలం గట్టును మరొకరు కొద్ది కొద్దిగా ఎవరూ లేనపుడు నరికి తమ పొలంలో కలుపుకుంటున్నారన్నది తగాదాకు హేతువు. ఎంతవరకు పోయిందంటే కర్రల నుంచి గొడ్డళ్ల వరకు. ఇపుడు రిలయన్స్‌ కంపెనీ తనకిచ్చిన బావుల పక్కనే వున్న కృష్ణా-గోదావరి బేసిన్‌లోని ప్రభుత్వరంగ ఓఎన్‌జిసి బావుల నుంచి లోలోపలే తొమ్మిది వందల కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువును కరిమింగిన వెలగపండులా లాగించేయటం నిజమేనని, దాని విలువ పదకొండువేల కోట్ల రూపాయలని తెలిసినపుడు మా పక్కింటి రైతులు కొద్ది గజాల గట్టుకోసం గొడ్డళ్ల వరకు పోవటం నిజంగా నవ్వు తెప్పిస్తోంది. రిలయన్స్‌ వంటి మహానుభావులైన కంపెనీలు ఇలాంటి సొమ్ముతో ఎన్ని విరాళాలైనా ఇస్తాయి, మన వంటి రాష్ట్రాలలోని పత్రికలు, టీవీ ఛానల్స్‌లో పెట్టుబడులుగా పెట్టి అలాంటి వార్తలు, విశ్లేషణలను తొక్కిపెడతాయంటే ఆ కంపెనీ భక్తులు నా వంటి వారి మీద గొడ్డళ్లు ఎత్తకపోతేనే ఆశ్చర్యం. కంపెనీలన్న తరువాత అక్రమాలకు పాల్పడకుండా వుంటాయా, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా వుంటాయా, కేసులను మాఫీ చేయించుకోకుండా వుంటాయా అంటే భగవంతుడా వీరికి ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లోడ్‌ చేశావేమయ్యా అని అనుకోవటం తప్ప చేసేదేముంది.

నిద్రపోయే ముందు ఎంత మంది అద్దాలలో తమ ముఖం చూసుకుంటారో లేదో తెలియదు గానీ ంప్యూటర్లలో ముఖపుస్తకం చూసి మాత్రమే నిద్రపోతారని, పొద్దున్నేలేచి అద్దంలో ముఖం సంగతేమోగాని ముఖపుస్తకం చూస్తారని తెలుసు. అలాంటి వరాన్ని మనకు ప్రసాదించిన దేవుడు మార్క్‌ జుకెరబర్గ్‌ .తమ జీవిత కాలంలో ఫేస్‌బుక్‌ కంపెనీలో తమకు వున్న వాటాలలో 99శాతం విరాళంగా ఇచ్చి చిన్నారుల సంక్షేమానికి ఖర్చు చేస్తానని ప్రకటించి కోట్లాది మంది నీరాజనాలు అందుకుంటున్నాడు.మన దేశానికి అందునా అతగాడిని నమ్మే మతంలో కూడా విశ్వాసం వున్న వారికి మాత్రమే పేటెంట్‌ హక్కువున్న కలియుగ దేవుడి కంటే ఎలాంటి హద్దులు, సరిహద్దులు, ఆంక్షలు లేని దేవతలుగా జుకర్‌బెర్గ్‌ దంపతులని చెపితే మా మనోభావాలు దెబ్బతీశారని ఎవరైనా దాడి చేసి చంపేస్తారేమో ?

హైస్కూలు పుస్తకాలలో ధర్మకర్తృత్వ సిద్దాంతం కూడా ఒకటి వుందని చదువుకున్నాం. దాని ప్రకారం భూస్వాములు తమ భూములలో పనిచేసేవారు, ఫ్యాక్టరీ యజమానులు తమ కార్మికుల పట్ల ఎంతో దయతో తమ బిడ్డలుగా చూసుకుంటారు, ధర్మకర్తలుగా వుంటారు తప్ప యజమానులు-పనివారలనే భావం వుండదన్నది దాని సారం. ఇటీవలి కాలంలో ప్రపంచంలో ధర్మకర్తృత్వ పెట్టుబడిదారీ విధానం అనే పదం వినిపిస్తున్నది. అంటే పెట్టుబడిదారులు తాము సంపాదించిన దానిలో భారీ మొత్తాలను దాన ధర్మాలకు కేటాయించటం.

కాశీ మజిలీ కధలన్నింటా మనకు అంతర్లీనంగా రంగు రంగుల పూసల్లో దారంలా కన్పించే సందేశం ఏమంటే రాజులందరూ తమ పౌరులను కన్నబిడ్డలుగా చూసుకొనేవారు, కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా వుండేది. దాని కొనసాగింపుగా రాజులు, రాజరికాలు పోయినా వాటి స్దానంలో జమిందార్లు, భూస్వాములు, దొరలు వచ్చినా, వారు పెట్టుబడిదారులుగా మారినా తమ వద్ద పనిచేసేవారిని కన్నబిడ్డలుగా చూసుకుంటారనే సందేశం మాత్రం ఏదో రూపంలో వస్తూనే వుంది. అదే సమయంలో అంతరాలు గతం కంటే తీవ్రంగా పెరుగుతున్నాయి. డిజిటల్‌ యుగంలో కూడా దాతృత్వాన్ని చూపి దోపిడీని మరుగుపరచాలని చూసే యత్నంలో భాగంగానే ఇప్పుడు కూడా బలంగా ధర్మకర్తృత్వ పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని కొత్త పద్దతుల్లో ముందుకు తెస్తున్నారు. వద్దంటే డబ్బు అన్నట్లుగా అది కూడా వారికి లాభాలనుె తెచ్చి పెట్టే విధంగా రూపొందించారంటే నిజమా అని ముక్కున వేలేసుకోవాల్సిందే.

మార్క్‌ జుకెరబెర్క్‌ దంపతులు ఫేస్‌బుక్‌ కంపెనీలోని తమ వాటాలలో 99శాతం ధర్మానికి ఇచ్చివేసినా కంపెనీలో వారి పెత్తనానికి ఢోకా వుండదట. అదే అసలు మతలబు. ఇదేం పితలాటకం అనుకోకండి.ప్రపంచంలో 2015లో బిలియనీర్లు 1826 మంది వున్నారని, వారిలో 290 మంది కొత్తగా ఈ ఏడాది చేరినట్లు ధనవంతుల సంపదల గురించి రాసే పత్రిక ఫోర్బ్స్‌ పేర్కొన్నది. అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో బిలియనీర్లుగా ఎదిగింది కేవలం 1536 మందే అయితే ఏడాదిలో 290 మంది పెరిగారంటే కొద్ది మంది దగ్గర నడమంత్రపు సంపదలు ఎంత వేగంగా చేరుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సామాన్య రైతులు ఎంత మట్టి పిసికితే అంత అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప బిలియనీర్‌ సంగతి దేవుడెరుగు మిలియనీరు కూడా కాలేడు.

ధర్మకర్తృత్వ పెట్టుబడిదారులలో ఇంతకు ముందు వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌, ఫోర్డ్‌, బ్లూమ్‌బెర్గ్‌ వంటివారు నెలకొల్పిన రికార్డులన్నింటినీ జుకర్‌బెర్గ్‌ బద్దలు కొట్టాడని, వారంతా పెద్దవారైన తరువాత ధర్మబుద్ది పొందితే ఇతగాడు 31 సంవత్సరాలకే దాన్ని పొందాడని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన సామాజిక సమస్యలకు కొత్త పద్దతుల్లో పరిష్కారం చూపేందుకు ధనికులు తమ సంపదలను,సామర్ద్యాన్ని ఒక దగ్గరకు చేరుస్తున్నారని కొంత మంది వ్యాఖ్యానించటం కూడా ప్రారంభించారు.వీటిని చూస్తుంటే ప్రపంచ ధనికులందరూ తమ ఆస్తులను ధాన ధర్మాలకు ఇచ్చి జనాన్ని ఈతిబాధల నుంచి రక్షించి సోషలిజం సాధిస్తారని, ఇంక కమ్యూనిస్టులతో పని లేదని ఎవరైనా చెప్పినా ఆశ్చర్యం లేదు. (ఇంకా వుంది. అంతం కాది ఆరంభం)

Escalating calls to put a price on carbon

Tags

, , ,

In a remarkable show of unity on the first day of the climate talks in Paris, heads of state from France, Germany, Mexico, Chile, Ethiopia and Canada joined World Bank President Jim Yong Kim to urge other nations and companies to put a price on carbon pollution.

 Max Thabiso Edkins/World Bank

STORY HIGHLIGHTS
  • Heads of state from France, Germany, Mexico, Chile, Ethiopia and Canada joined World Bank President Jim Yong Kim to urge other nations and companies to put a price on carbon pollution.
  • The call by heads of state and government was echoed by ministers and CEOs from around the world at the official launch of the Carbon Pricing Leadership Coalition (CPLC).
  • Ahead of COP21 more than 90 developed and developing countries, have indicated plans to use international, regional, or domestic carbon pricing schemes for mitigation action.

In an extraordinary move on the first day of the climate conference in Paris, the leaders of six countries stood on stage with the head of the World Bank Group urged other nations and companies to put a price on carbon pollution.

The leaders from France, Germany, Mexico, Chile, Ethiopia and Canada joined Bank President Kim as well as the Secretary General of the OECD Angel Gurria in calling for carbon pricing as a means of driving investment for a cleaner future.

French President, François Hollande joined Angela Merkel, Chancellor of the Federal Republic of Germany, Enrique Peña Nieto, President of Mexico, Justin Trudeau, Prime Minister of Canada Hailemariam Dessalegn, Prime Minister of the Federal Republic of Ethiopia and Michelle Bachelet President of Chile.

Speaking before more than 500 people in the main media conference room at the climate talks in Paris, President Kim said the talks were taking place in the shadow of an undeniable truth:

” We simply cannot afford to continue polluting the planet at the current pace, this was the right time to set the right price on the true cost of carbon on our planet “
Image

Jim Yong Kim

World Bank Group president

President Hollande said putting a price on carbon pollution would help encourage better behavior, and he pointed to the number of national plans developed by countries ahead of the Paris talks which referenced carbon pricing.

Chilean President Bachelet reminded people of the toll of carbon pollution. “Cheap and dirty energy is not cheap for our people’s health,” she said.

“Mexico regards carbon pricing is an effective means of reducing greenhouse gas emissions and promoting the use of cleaner fuels,“ said the President Enrique Peña Nieto.

Canadian Prime Minister said “it was no longer a choice” between what’s good for the economy and what’s good for the environment.  And he spoke about how British Columbia’s carbon pricing system was revenue neutral.

“We have a number of reasons to see climate change is addressed,” said the Ethiopian Prime Minister. “And there is already ample evidence carbon pricing can be cost effective,” he said.

The call by heads of state and government was echoed by ministers and CEOs from around the world at another event today in Paris to officially launch the Carbon Pricing Leadership Coalition (CPLC). The Coalition brings together key governments such as Mexico, Germany, France, Chile and California, along with nearly 90 global businesses and NGOs.

Ahead of the Paris talks more than 90 developed and developing countries, including the European Union, have indicated plans to use international, regional, or domestic carbon pricing schemes for mitigation action.

About 40 nations and 23 cities, states and regions have implemented or are putting a price on carbon with programs and mechanisms covering about 12 percent of global greenhouse gas emissions. The coverage is expected to grow given China’s recent announcement to bring in a national emissions trading system in 2017.

A recent World Bank report, State and Trends of Carbon Pricing 2015, shows the number of implemented or planned carbon pricing schemes around the world has almost doubled since 2012 and are now worth about $50 billion.

పెట్టుబడిదారుల ఊహకందని పోర్చుగల్‌ వామపక్ష ఐక్యత

Tags

,

ఎం కోటేశ్వరరావు

జనం నాడిని పసిగట్టటంలో దోపిడీ వర్గం ఎప్పుడూ ముందుంటుందని అనేక దేశాల పరిణామాలు వెల్లడించాయి.ఎందుకంటే తమ లాభాలతో పాటు వాటికి ముప్పు ఎటువైపు నుంచి వస్తుందాని కూడా అవి నిరంతరం చూస్తుంటాయి. గత వారంలో ఐరోపాలోని పోర్చుగల్‌లో వామపక్ష కూటమి అధికారానికి వస్తుందని ఐరోపా కార్పొరేట్లు వూహించలేదని ఆ పరిణామాలపై తాజాగా ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యాత రాసిన విశ్లేషణ వెల్లడిస్తోంది. దానిలోని ముఖ్యాంశాల సారాంశం ఇలా వుంది.’ నాలుగు దశాబ్దాలుగా ఎడమొహం పెడమొహంగా వున్న వుదారవాద సోషలిస్టులు, రాజీపడని కమ్యూనిస్టులు ఏకతాటిపైకి వచ్చేందుకు అంగీకరించటం వారికి తీవ్రవాద వామపక్షం తోడు కావటం పోర్చుగల్‌ వర్తమాన తరానికి అతిపెద్ద పెద్ద రాజకీయ విప్లవం.వారి మధ్య ఆటంకాలు తొలగిపోవటానికి కారణం పొదుపు చర్యలను(జనంపై మోపుతున్న భారాలకు కార్పొరేట్లు పెట్టిన ముద్దు పేరు) అధిగమించటానికి గతంలో ఎన్నడూ జరగని ఒప్పందం కుదరటమే.

సోవియట్‌ కమ్యూనిజం మరియు స్వేచ్ఛామార్కెట్‌ ప్రజాస్వామ్యం మధ్య అత్యంత బలమైన చిహ్నంగా వున్న బెర్లిన్‌ గోడ పతనమైన పాతిక సంవత్సరాల తరువాత తమ మధ్య కుదిరిన సంబంధం బెర్లిన్‌ గోడలో కూల్చిన చివరి ఇటుకవంటిదని నూతన కూటమికి సంధానకర్తగా వున్న సోషలిస్టు పార్టీ నాయకుడు ఆంటోనియో కోస్టా వ్యాఖ్యానించాడు. మాజీ శతృవుల మధ్య ఆశ్చర్యకరంగా వుద్రిక్తత సడలటానికి అక్టోబరు నాలుగున జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కారణం. మధ్యేవాద మితవాద ఫార్వర్డ్‌ పోర్చుగల్‌ (మున్ముందుకే పోర్చుగల్‌) కూటమి గత ఎన్నికల కంటే ఏడులక్షల ఓట్లు, 230 స్దానాలున్న పార్లమెంట్‌లో 25 సీట్లు పొగొట్టుకొని అతి పెద్ద పక్షంగా అవతరించింది.

కొన్ని విధానపరమైన రాయితీలను పొంది అందుకు బదులుగా మధ్యేవాద మితవాద మైనారిటీ ప్రభుత్వం స్ధిరంగా వుండేందుకు మద్దతు ఇవ్వాలని మితవాద అధ్యక్షుడు అనిబల్‌ కావాక్‌ సిల్వా కోస్టాను కోరాడు. కానీ సోషలిస్టు పార్టీ నాయకుడు అందుకు సిద్దం చేసిన స్క్రిప్ట్‌ను చించివేయటమేగాక పొదుపు వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసి దేశాన్ని మరియు మిగతా ఐరోపా మొత్తాన్ని ఆశ్చర్య పరిచారు. ఈ ఎత్తుగడను ఎన్నికలలో ఓటర్ల ముందు సూచించలేదు. నూతన ఒప్పందాన్ని పార్లమెంటులో పొగుడుతూ ఒక ఆంక్ష తొలగి పోయింది, ఒక గోడ కూలిపోయింది, ఒ దుర్భ్రమను అధిగమించాము అన్నాడు.ఒక నాడు వేర్వేరుగా వున్న వామపక్షాలు ఎన్నికలలో మెజారిటీ సీట్లు సాధించాక అక్టోబరు 30న అధికారాన్ని స్వీకరించిన పాసోస్‌ కోహో ప్రభుత్వాన్ని పదకొండు రోజులకే కూల్చివేయటానికి ఐక్యమయ్యాయి.

మితవాద మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు అధ్యక్షుడు అడ్డదారిలో విప్‌ను ధిక్కరించాల్సిందిగా సోషలిస్టు పార్టీ సభ్యులను కోరాడు. నలభై ఒక్క సంవత్సరాల దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత తక్కువ రోజులు అధికారంలో వున్న సర్కార్‌గా పాసోస్‌ ప్రభుత్వం చరిత్రకెక్కింది. వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచటం కేవలం అధికార దాహంగా పోసోస్‌ వర్ణించాడు. 1974లో నియంత పాలనను కూలదోసిన తరువాత పోర్చుగీసు సోవియట్‌ అనుకూల కమ్యూనిస్టుల చేతిలోకి పోకుండా చూసేందుకు సోషలిస్టు నాయకుడు మరియో సోరెస్‌ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పశ్చిమదేశాల ఒడిలోకి చేర్చేందుకు ప్రయత్నించాడు.1977లో ఐరోపా యూనియన్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేయటం దానిలో భాగమే అని సోరెస్‌ చెప్పాడు.

స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీలోని తోటి కమ్యూనిస్టుపార్టీల మాదిరిగాక సోవియట హయాం మారిపోయిన తరువాత కూడా పోర్చుగీసు కమ్యూనిస్టుపార్టీ మార్క్సిస్టు-లెనినిస్టు వైఖరికి గట్టిగా నిలబడింది. అనేక స్ధానిక ప్రభుత్వాలకు అది ఎన్నికైంది.జాతీయ ఎన్నికలలో 8.3శాతం ఓట్లు తెచ్చుకుంది. గ్రీసు సిరిజా, స్పెయిన్‌ పొడేమాస్‌కు ముందే 1999లో ప్రజలను ఆకర్షించే నినాదాలతో పోర్చుగల్‌లో వామపక్ష కూటమి ఏర్పడింది. అంతకు ముందుతో పోల్చితే తాజా ఎన్నికలలో తన ఓట్లను రెట్టింపు చేసుకొని 10.2శాతానికి పెంచుకొని పార్లమెంట్‌లో మూడవ పెద్ద పక్షంగా అవతరించింది. వామపక్ష కూటమి ప్రభుత్వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కోస్టా ఐక్యవామపక్షం 50.8శాతం ఓట్లు సంపాదించిందని భాష్యం చెప్పారు. పొదుపు చర్యలకు వ్యతిరేకంగా మార్పును కోరుకున్న ఓటర్లని అన్నారు. అత్యంత దుర్మార్గమైన నయా వుదారవాద విధానాల కోసం పాసోస్‌ మధ్యేవాద మితవాద సోషల్‌ డెమోక్రటిక్‌ మూలాలను వదులు కున్నారని కోస్టా విమర్శించారు.వామపక్ష ఐక్యతకు తాము కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందంతో ఐరోపా యూనియన్‌లో పోర్చుగల్‌ సభ్యత్వానికి ముప్పు లేకుండానే దేశం పొదుపు పేజీని తిప్పేట్లు చేస్తామని కోస్టా అన్నారు.అయితే కమ్యూనిస్టులతో ఒప్పందాన్ని కుదుర్చుకోవటాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన వ్యతిరేకులు కోస్టా ఎన్నికలలో ఓడిపోయిన తరువాత కుదుర్చుకున్న అవకాశ వాద ఒప్పందంగా, రాజకీయంగా అక్రమ ప్రభుత్వంగా వర్ణిస్తున్నారు. అనూహ్యంగా కోస్టా వామపక్షాలతో ఒప్పందం కుదుర్చుకోవటంతో సోషలిస్టు పార్టీలో విభేదాలకు కారణమైంది. చీలిక తప్పదనిపిస్తోందని కోస్టా వ్యతిరేకి ఫ్రాన్సిస్‌కో ఆసిస్‌ వ్యాఖ్యానించాడు. వామపక్షాలతో ఒప్పందం పైకి కనిపిస్తున్నది చాలా తక్కువ అంతర్గతంగా వున్నది ముఖ్యం,అది మామూలుగా పెద్ద వినాశనానికి దారితీస్తుంది అని వ్యాఖ్యానించాడు.’

ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక చేసిన ఈ వ్యాఖ్యానం ఐరోపా పెట్టుబడిదారుల అంతరంగాన్ని, పోర్చుగల్‌లో ఆశాభంగాన్ని వెల్లడిస్తున్నది. గ్రీసు సిరిజా అనుభవం తరువాత పోర్చుగీసు సోషలిస్టులు పాఠం నేర్చుకుంటారా? లేక వారి మాదిరి వత్తిళ్లకు లొంగి ఏదో ఒక పేరుతో భారాలు మోపుతారా అన్నది చూడాల్సి వుంది.

దక్షిణాఫ్రికా కమ్యూనిస్టులపై మీడియా దాడి

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

శతృవు దాడి చేస్తున్నాడంటే కమ్యూనిస్టులు తమ కర్తవ్యాన్ని నిర్వరిస్తున్నట్లే భావించాలి. కార్మికవర్గంతో మంచిగా వుండే వారు పెట్టుబడిదారులు నిజమైన పెట్టుబడిదారులు కానట్లే పెట్టుబడిదారీ వర్గం పట్ల మెత్తగా వుండే కమ్యూనిస్టులను కూడా అనుమానించాల్సిందే. కమ్యూనిస్టులు భాగస్వాములుగా వున్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరించే కొన్ని విధానాలపై విమర్శలు వున్నాయి. అక్కడి ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కార్మిక సంఘాల సమాఖ్య, దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీలు ఎన్నికలలో వుమ్మడిగానే పోటీ చేస్తాయి. గత రెండు దశాబ్దాలుగా వాటి మధ్య ఐక్యతను దెబ్బతీయాలని జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఒకదాని మీద మరొకదానిని రెచ్చగొట్టటం, ఆయా సంస్ధలలోనే అంతర్గతంగా కలహాలను రాజేయటం, ఆఫ్రికన్ల మధ్య చిచ్చురేపటం వంటి ఎన్నో చేస్తున్నారు. అయినా ఆ కూటమి మధ్య ఐక్యత కొనసాగటం వర్తమాన పరిస్ధితుల్లో ఒక విశేషం, విజయమూను.

కమ్యూనిస్టుపార్టీ ప్రస్తుతం మీడియాలో రావాల్సిన మార్పుల గురించి ప్రచారం చేస్తున్నది .ప్రపంచంలో పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో ఏడవ స్దానంలో వున్న దక్షిణాఫ్రికా నాస్సర్‌ కంపెనీ మీడియా 24 ద్వారా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంలో ముందున్నది. గతంలో ఈ సంస్ధ జాత్యహంకార శక్తుల మద్దతుదారుగా వుండి ప్రస్తుతం ప్రభుత్వ ముఖ్యంగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంలో మునిగి వుంది. కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బ్లేడ్‌ జిమాండే తదితర అగ్రనేతల ప్రతిష్టను దిగజార్చేందుకు పూనుకుందని యువ కమ్యూనిస్టు లీగ్‌ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నది. నాస్పర్‌ తన పత్రికలు, టీవీ, డిజిటల్‌ మీడియాకు 2017 వరకు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది.దేశాన్ని తిరిగి వెనక్కు తీసుకొని వెళ్లటాన్ని అనుమతించేది లేదని, ఆధారంలేని అభూత కల్పనలను అడ్డుకొనేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని యువ కమ్యూనిస్టు లీగ్‌ హెచ్చరించింది. నాస్పర్‌ మీడియా సంస్ధలు, ప్రతిపక్ష శ్వేతజాతి డెమోక్రటిక్‌ అలయన్స్‌ పార్టీ కుమ్మక్కై తప్పుడు వార్తలను వండి వార్చటం వాటిని పార్లమెంట్‌లో, వెలుపలా ప్రస్తావించి జనం మెదళ్లను లుషితం చేసేందుకు పూనుకున్నారు.మీడియా కుట్రలు, తప్పుడు ప్రచారం గురించి కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తున్న రెడ్‌ అక్టోబర్‌ ప్రచారానికి యువ కమ్యూనిస్టు లీగ్‌ పూర్తి మద్దతును ప్రకటించింది.

కమ్యూనిస్టు బూచిని చూసి బెదరని శాండర్స్‌

అమెరికాలో కమ్యూనిస్టు అంటే ఎయిడ్స్‌ వచ్చిన వారి మాదిరి చూసే రోజులు ఒకప్పుడు వుండేవి, ఇప్పుడు కూడా వ్యతిరేకతను రెచ్చగొట్టటం, భయపెట్టటంలో తక్కువేమీ లేదు. అయితే ప్రచ్చన్న యుద్ధంలో తామే విజయం సాధించామని, సోషలిజం, కమ్యూనిజాలను ఓడించామని పాతికేళ్ల క్రితం అమెరికన్లు ప్రకటించారు. శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిందని సోషలిస్టు ఆర్ధిక వ్యవస్దలు పని చేయవని చెప్పిన పెట్టుబడిదారీ వ్యవస్దలే గతంలో వచ్చిన వాటి కంటే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే.ఈ పూర్వరంగంలో అమెరికాలో తాము కమ్యూనిస్టులమే అని బహిరంగంగా చెప్పుకొనే వారు పెరిగారు. కష్మా సావంత్‌ అనే భారతీయ సంతతికి చెందిన మహిళ సియాటిల్‌ నగరంలో తాను కమ్యూనిస్టును అని చెప్పి మరీ నగర పాలక సంస్ధ ఎన్నికలలో 2013లో విజయం సాధించింది, మరోసారి ఇటీవల రెండోసారి ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా బెర్నీశాండర్స్‌ అనే ఎంపీ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడుతున్నారు.ఆయన ఒక కమ్యూనిస్టు అని ముద్రవేసి వ్యతిరేకతను రెచ్చగొట్టే యత్నం జరుగుతోంది.అందుకు మీడియా తన వంతు పాత్రను పోషిస్తోంది. తాను సోషలిస్టునని శాండర్స్‌ ప్రకటించుకున్నాడు. మూడు దశాబ్దాల క్రితం నికరాగువా అధ్యక్షుడిగా ఎన్నికైన డేనియల్‌ ఓర్టేగాను కమ్యూనిస్టుగా పేర్కొన్న మీడియాను ప్రశ్నిస్తూ బర్లింగ్టన్‌ మేయర్‌గా వున్న శాండర్స్‌ మాట్లాడిన దానిని గతవారంలో ఒకరు యూట్యూబ్‌ నుంచి వెలికి తీసి జనానికి అందుబాటులోకి తెచ్చారు. దానిలో అసలు కమ్యూనిస్టు అంటే ఏమిటి అని విలేకర్లకు ప్రశ్న సంధిస్తూ ప్రారంభించారు. ఓర్టేగా బహిరంగంగా తాను మార్క్సిస్టు అని చెప్పనపుడు ఆయనకు మీడియా ఆ ముద్ర వేయటం ఎందుకన్న శాండర్స్‌ ప్రశ్న. వుదాహరణకు రోనాల్డ్‌ రీగన్‌ అమెరికా ఫాసిస్టు అధ్యక్షుడు అని ముద్ర వేస్తే ఏమౌతుంది అంటూ రీగన్‌ తనను ఫాసిస్టు అనుకోడు అందువలన ఎవరికైనా ఒక ముద్రవేసేటపుడు వారు తమను తాము ఏమనుకుంటున్నదీ పరిగణనలోకి తీసుకోవాలని శాండర్స్‌ చెప్పాడు. వుత్తర, దక్షిణ అమెరికా దేశాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను తీవ్రంగా రెచ్చగొట్టిన పూర్వరంగంలో ఓర్టేగాతో సహా అనేక మంది కమ్యూనిస్టులు వేరే పేర్లతో వుద్యమాలు నడిపారు. మన దేశ చరిత్రను చూసినట్లయితే స్వాతంత్య్ర వుద్యమ కాలంలో నిర్బంధకాండను తప్పించుకొనేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ, పెజెంట్స్‌ అండ్‌ వర్కర్‌ పార్టీల పేరుతో పని చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి.ఇటీవలి కాలంలో డెమోక్రటిక్‌ పార్టీలోని అనేక మంది ఆ పార్టీలో వుంటూనే వామపక్ష వాదులుగా స్వతంత్ర కార్యాచరణకు పూనుకుంటున్నారు. దానిలో భాగంగానే కొన్ని చోట్ల కార్మికుల తరఫున ప్రత్యేక వేదికల పేరుతో ఎన్నికలలో కూడా పోటీ చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలోని కార్మిక వ్యతిరేక శక్తులను బలపరిచేది లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నార. ఈ పూర్వరంగంలో బెర్నీ శాండర్స్‌పై గత కొద్ది సంవత్సరాలుగా మీడియా, ఆయన ప్రత్యర్ధులు కమ్యూనిస్టు ముద్రవేసి వెనక్కు నెట్టాలని చూస్తున్నారు. ఆయన నిజమైన వామపక్షవాది కాదు అని కొంతమంది వామపక్షవాదులు భావిస్తున్నమాట వాస్తవం. అమెరికా రాజకీయాలలో తాను వామపక్ష వాదిని అని చెప్పుకొంటే జరిగేదేమిటో, అధికారానికి దగ్గరకావాలంటే చేయాల్సిందేమిటో తెలియనంతటి అమాయకుడు కాదు శాండర్స్‌.అయినా డెమోక్రటిక్‌, రిపబ్లిక్‌ పార్టీల విధానాలకు భిన్నంగా కొన్ని అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించటం ఆహ్వానించదగిన పరిణామమే. శాండర్స్‌ అధికార డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ తప్ప కమ్యూనిస్టు సభ్యుడు కాదు. అందువలన పక్కా కమ్యూనిస్టులా వుండాలని ఆశించటం, ఆ దృష్టితో చూడటం వాస్తవ దృక్పధం కాజాలదు. సోషలిస్టు అగ్ని ఆరిపోకుండా, పెరగటానికి ఎవరు ఎన్ని చితుకులు వేసినా ఆహ్వానించాల్సిందే.

అట్లీకి మావో రాసిన లేఖ వేలం

1937లో నాటి బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీకి చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్‌ 1937 నవంబరు ఒకటిన రాసిన లేఖను బ్రిటన్‌లో వేలం వేయబోతున్నారు. ఆ ప్రఖ్యాత లేఖ ధర లక్ష పౌండ్లకుపైగా పలుకుతుందని అంచనా. జపాన్‌ సామ్రాజ్యవాదులను ఎదుర్కొనేందుకు సాయం చేయవలసిందిగా ఏనాన్‌లోని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మావో రాసిన లేఖ అది. జపాన్‌ను ఎదుర్కొనేందుకు చైనాకు చేయదగిన సాయానికి మద్దతు ఇవ్వాలని అట్లీని మావో కోరారు. బ్రిటన్‌ పౌరులకు చైనాలో జపాన్‌ దురాక్రమణ వాస్తవం గురించి తెలుసునని, చైనా పౌరులకు వారు మద్దతుగా ముందుకు వస్తారని, చివరకు జపాన్‌ నుంచి తమ కంటే తక్కువగాని ముప్పును తామూ ఎదుర్కొనే ప్రమాదాన్ని తప్పించేందుకు వీలుగా తమ ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరించే విధంగా వారు వత్తిడి తెస్తారని మావో తన లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖను లండన్‌లోని సౌత్‌ బేలో డిసెంబరు 15న వేలానికి వుంచుతారు. లక్ష నుంచి లక్షా 50వేల పౌండ్ల వరకు అమ్ముడు పోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో మావో సంతకంతో కూడిన పత్రాలలో ఇది రెండవది. అంతర్జాతీయ దౌత్యంలో భాగంగా అధికారానికి రాక ముందే మావోప్రారంభ చర్యలలో ఇదొకటి.ఆయన సంతకంతో కూడిన లేఖ కావటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Growth in World Cotton Consumption Slows:ICAC

Tags

,

 

World cotton consumption has been revised downward from initial projections to 24.4 million tons, up less than 1% from 2014/15. In its October 2015 report, the International Monetary Fund lowered its forecast for world economic growth in 2015 to 3.1%. Despite optimism from the narrowing gap between polyester prices and cotton prices at the start of 2014/15 and falling domestic cotton prices, cotton consumption in China remained unchanged from 2013/14 at 7.5 million tons. With the latest revision, mill use in China is now forecast at 7.3 million tons in 2015/16. As China’s spinning sector continues to decline, mill use in Asia has grown. India, the world’s second largest consumer of cotton lint may see mill use rise by 3% to reach 5.5 million tons in 2015/16. However, Pakistan, which had in previous years benefited from the growing demand for cotton yarn in China, is expected to see mill use decrease this season by 10% to 2.2 million tons. In addition to reduced demand from China, an ongoing energy crisis, high energy costs, and high taxes that greatly add to the cost of production have caused many mills to reduce operations, and in some cases to shut down entirely. Turkey’s consumption is projected to increase by 5% to 1.4 million tons, due in part to expanding private consumption in the EU and political after its most recent elections. Lower production costs and favorable government policies for the textile sectors in Bangladesh and Vietnam will encourage consumption growth in these countries. Mill use in Bangladesh is forecast to rise by 10% to just over 1 million tons while in Vietnam, by 20% to 1.1 million tons. With consumption slowing, world cotton imports are forecast to decline by 3% to 7.4 million tons in 2015/16, which would constitute the fourth consecutive season in which import volume declined after peaking at 9.8 million tons in 2011/12. China’s imports are expected to shrink by 33% to 1.2 million tons. Imports by Vietnam during the first two months of 2015/16 are up 63% from the same period last season and may reach 1.1 million tons by the end of the season. World cotton production is forecast to fall by 12% to 23.1 million tons, which is 1.3 million tons lower than projected demand in 2015/16. Decreases are expected in all five top producing countries. India’s production may decrease by 4% to 6.3 million tons due to reduced plantings and pest problems. China is in its fourth consecutive season of declining production, and its volume in 2015/16 is projected down 19% to 5.3 million tons. In the United States, a 13% reduction in harvested area and lower yields are expected to cause production to fall by 18% to 2.9 million tons. Production in Pakistan is forecast to reach around 1.9 million tons in 2015/16 while in Brazil, it is projected to decease by 6% to 1.5 million tons. World ending stocks are expected to fall by 6% to 20.7 million tons, which represents about 85% of the volume needed for world mill use in 2015/16. Stocks in China are projected to be just under 12 million tons at the end of 2015/16, while stocks outside of China are forecast down by 4% to 8.7 million tons. WORLD COTTON SUPPLY AND DISTRIBUTION

2013/14 2014/15 2015/16      2013/14 2014/15 2015/16

Million Tons            Million Tons    Changes from previous month

Production     26.27  26.18  23.11           -0.01 0.02 -0.81

Consumption 23.88  24.24  24.37          0.25 -0.24 -0.67

Imports            8.67   7.60    7.35           0.00 0.00 -0.12

Exports             8.99    7.71   7.35            0.00 0.00 -0.12

Ending Stocks  20.08 21.92 20.65           -0.21 0.06 -0.08

Cotlook A Index 91 71 70* *

The price projection for 2015/16 is based on the ending stocks/consumption ratio in the world-less-China in 2013/14 (estimate), in 2014/15 (estimate) and in 2015/16 (projection), on the ratio of Chinese net imports to world imports in 2014/15 (estimate) and 2015/16 (projection). The price projection is the mid-point of the 95% confidence interval: 61 cts/lb to 82 cts/lb