ఇంటిదారి పట్టిన పోర్చుగీసు మితవాద ప్రభుత్వం

Tags

, ,

పోర్చుగీసులో పదిరోజుల క్రితం అధికారానికి వచ్చిన మితవాద మైనారిటీ ప్రభుత్వం మంగళవారం నాడు రాజీనామా చేసింది. త్వరలో సోషలిస్టులు, కమ్యూనిస్టు పార్టీ, వామపక్ష సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కానుంది. మితవాద ప్రభుత్వ విధానాలను పార్లమెంట్‌ తిరస్కరించటంతో ఈ నాటకీయ పరిణామం సంభవించింది. తమ షరతులను అంగీకరించాలన్న యూరో దేశాలు ఈ పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. పొదుపు చర్యలనుంచి( ప్రజలపై భారాలు, ప్రభుత్వం సేవల బాధ్యతల నుంచి వైదొలగటం) వైదొలిగితే నూతన ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాల పూర్వరంగంలో డిసెంబరు 20న జరిగే స్పెయిన్‌ ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. పోర్చుగల్‌లో నూతన ప్రభుత్వానిక సోషలిస్టు పార్టీ నాయకుడు ఆంటోనియో కోస్తా ప్రధానిగా నాయకత్వం వహించనున్నారు. మంగళవారం నాడు పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా వెలుపల భారాల వ్యతిరేక ప్రదర్శన జరిగింది. ప్రభుత్వ రాజీనామా తమ విజయంగా వారు వర్ణించారు.

గతంలో విధించిన వేతన, పెన్షన్‌ కోతలు తదితర కార్మిక వ్యతిరేక చర్యలను వెనక్కు తీసుకోవాలని కమ్యూనిస్టు, వామపక్షాలు కోరుతున్నాయి. తాము అమలు జరిపిన పొదుపు చర్యల కారణంగా నాలుగు సంవత్సరాల నాటితో పోల్చితే దేశం మెరుగ్గా వుందని రాజీనామాచేసిన ప్రభుత్వ ఆర్ధిక మంత్రి చెప్పుకున్నారు. ప్రభుత్వ రాజీనామా గురించి గురువారం నాడు స్పీకర్‌ అధికారికంగా దేశాధ్యక్షుడికి నివేదిస్తారు. తరువాత నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు చర్యలు తీసుకుంటారు.

క్యూబా తీరంలో చైనా ఆధునిక యుద్ధ నౌకలు

Tags

,

 

సుహృద్భావ పర్యటనలో భాగంగా మూడు చైనా సైనిక నావలు ప్రస్తుతం క్యూబా తీరానికి చేరాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి యాభై ఐదవ వార్షికోత్సవం సందర్బంగా ఈ పర్యటన జరుగుతోంది. మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు క్యూబా తీరంలో చైనా నావలు లంగరు వేస్తాయి.ఈ సందర్బంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ఆధునిక చైనా క్షిపణి విధ్వంసక నౌకలలో ఒకటైన జియాన్‌ వీటిలో ఒకటి. అట్లాంటిక్‌ సముద్రంలో అమెరికా నావికా దళంతో కలసి తొలి సంయుక్త నౌకా విన్యాసాలు జరిపిన తరువాత చైనా నౌకలు క్యూబా వచ్చాయి.

దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెందిన దీవులపై వివాదానికి దిగిన అమెరికా ఆ ప్రాంతంలో వుద్రిక్తతలను రెచ్చగొడుతున్న పూర్వరంగంలో చైనా నౌకల రాకు ప్రాధాన్యత ఏర్పడింది. కరీబియన్‌ జలాల్లోకి చైనా నౌకలు ప్రవేశించటం ఇదే తొలిసారి. తిరుగు ప్రయాణంలో పనామా కాలువ ద్వారా ప్రయణించి మార్గమధ్యలోని మెక్సికో ఇతర ప్రాంతాలను కూడా ఈ నౌకలు మర్యాదపూర్వకంగా సందర్శిస్తాయి.

గతనెల 27న అమెరికా యుద్ధ నౌక యుఎస్‌ఎస్‌ లాసెన్‌ దక్షిణ చైనా సముద్రంలోని చైనా దీవులకు సమీపంలో లంగరు వేసింది. దీనిపై చైనా నౌకదళం హెచ్చరికలు చేయటంతో తాము అంతర్జాతీయ జలాల్లో మాత్రమే వున్నామని తమ హక్కును వినియోగించుకుంటున్నామని అమెరికా చెప్పింది. సాధారణంగా జరిపే పర్యటన అని చెప్పినప్పటికీ అంతర్జాతీయ చట్టాలు అనుమతించినంత వరకు తాము దక్షిణ చైనా సముద్రంతో సహా ఎక్కడకైనా వెళ్లగలమని ప్రపంచానికి ముఖ్యంగా చైనాకు హెచ్చరిక చేయటమే ఈ చర్య లక్ష్యం. దీనికి ప్రతిగా మా ఇల్లు మీకెంత దూరమో మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం జాగ్రత్త అంటున్న చైనా తన బలాన్ని కూడా ప్రదర్శించింది.

నిజానికి దక్షిణ చైనా సముద్రంలోని స్పార్టలే దీవులతో అమెరికాకు ఎటువంటి సంబంధం లేదు, గతంలో వాటిని ఆక్రమించుకున్న జపాన్‌, ఫిలిప్పైన్స్‌ మరికొన్ని దేశాలు తమవే అంటున్నాయి. జపాన్‌, ఫిలిప్పైన్స్‌తో వున్న రక్షణ ఒప్పందాలను సాకుగా తీసుకొని వాటికి సాయం చేసే పేరుతో ఆప్రాంతంలో అమెరికా బల ప్రదర్శనకు దిగుతోంది.

Recorded 17 attacks against the Venezuelan electrical system | News | teleSUR

El titular de Energía Eléctrica llamó a los venezolanos a analizar la relación que tienen los constantes ataques con la cercanía de las elecciones parlamentarias, que se llevarán a cabo el próximo 6 de diciembre.

Source: Recorded 17 attacks against the Venezuelan electrical system | News | teleSUR

Bihar BJP MP Bhola Singh launches blistering attack on Amit Shah, PM after Bihar defeat – The Economic Times

Bhola Singh also faulted Amit Shahs unilateral working style and advocated the need for an impartial review of his work before presidential elections.

Source: Bihar BJP MP Bhola Singh launches blistering attack on Amit Shah, PM after Bihar defeat – The Economic Times