Muslim Mirror » Manjhi blames RSS chief, Amit Shah for Bihar debacle
09 Monday Nov 2015
Posted in BJP, Current Affairs
09 Monday Nov 2015
Posted in BJP, Current Affairs
09 Monday Nov 2015
Posted in Left politics, Uncategorized
1965,66 సంవత్సరాలలో ఇండోనేషియాలో నియంత సుహార్తో నాయకత్వంలో జరిగిన కమ్యూనిస్టు వూచకోతపై ఐరోపాలోని హేగ్ నగరంలో జరిగే ‘ప్రజాకోర్టు’కు హాజరు కావద్దని ఇండోనేషియా ప్రభుత్వం విద్యార్ధినేతలను బెదిరించింది. ఈనెల 10-13 తేదీలలో జరిగే ఈ విచారణకు హాజరైనట్లయితే విద్యార్ధులకు స్కాలర్‌షిప్పులను నిలిపివేస్తామని నెదర్లాండ్స్‌లోని ఇండోనేషియా రాయబారకార్యాలయ అధికారులు లిడెన్లోని ఇండోనేషియా విద్యార్ది అసోసియేషన్ (పిపిఐ) విద్యార్ధులను పిలిపించి బెదిరించినట్లు ప్రజాకోర్టు కమిటీ అధిపతి, మానవ హక్కుల న్యాయవాది నూర్సిభానీ కాట్జసుంగ్కాన్ తెలిపారు. యాభై సంవత్సరాల నాటి ఊచకోత గురించి విచారణ జరపటాన్ని కమ్యూనిజం పునరుద్దరణగా రాయబార కార్యాలయం పరిగణిస్తున్నదని ఆమె జకర్తా పోస్టు పత్రికతో వ్యాఖ్యానించారు. రాయబార కార్యాలయానికి స్కాలర్ షిప్పులను నిలిపివేసే అధికారం లేదని, దాని పని విద్యార్ధులను బెదిరించటం కాదని ఆమె ఆగ్రహం వెలిబుచ్చారు. ఇదే విధంగా హింసాకాండకు గురైన, అదృశ్యమైన వ్యక్తుల విచారణ కమిటీ అధ్యక్షుడు హారిస్ అజార్ కూడా అధికారుల చర్యను ఖండించారు. ఈ చర్య అనారిక స్వభావాన్ని వెల్లడిస్తున్నదని, ఎందుకు తమ ప్రభుత్వం ఇలా చేస్తున్నదో అర్ధం కావటం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వంలోని పోలీసు, సైన్యం లేదా ప్రభుత్వంలోని పలుకుబడిగల ఎవరో దీని వెనుక వున్నారని, వాస్తవానికి ఇప్పుడు కమ్యూనిజంతో ముప్పులేదని కొందరు వ్యాఖ్యానించారు.
09 Monday Nov 2015
Posted in Current Affairs
India’s elections are always a massive enterprise. In the Bihar state elections, more than half the sixty-seven million eligible voters took to the ballot to reject the Bharatiya Janata Party (BJP)…
09 Monday Nov 2015
Posted in Current Affairs
There is no space for hate politics in our country. Bihar result is a tribute to my father, and against hate and communalism: Son of Mohammad Akhlaq
Source: Bihar verdict a tribute to my father: Dadri beef lynching victim’s son
09 Monday Nov 2015
Posted in BJP, Current Affairs
Hours after humiliating defeat of BJP in Bihar Assembly polls, the ‘Modi Not Welcome’ campaign against India PM Narendra Modi was intensified in London.
Source: After BJP’s massive defeat in Bihar, ‘Modi Not Welcome’ campaign intensified in London
09 Monday Nov 2015
Posted in BJP, Current Affairs
Tags
మోడీపై కార్పొరేట్ల ‘సంస్కరణల’ వత్తిడి
బీహార్ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలకు చెప్పుకోలేని చోట దెబ్బ తగిలింది. ఏడాదిన్నర మోడీ పాలనలో ఇదో పెద్ద మలుపు. ఇప్పటికే తాము కోరుతున్న సంస్కరణలను వేగంగా అమలు జరపటం లేదనే అసంతృప్తితో వున్న జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్లు మరింత వత్తిడి పెంచాయి. భారతీయ జనతా పార్టీతో తమ సంబంధాలను ఎన్‌డిఏలోని మిగతా భాగస్వామ్య పక్షాలు సమీక్షించుకోవటానికి ఈ ఎన్నికలు నాంది పలికాయి. దేశంలో పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిన కాంగ్రెస్‌కు రానున్న రాష్ట్రాల ఎన్నికలలో మరో పరీక్ష ఎదురుకానుంది. ఈ ఎన్నికలలో మోడీ-షాలతో పాటు వారికి వంత పాడిన కార్పొరేట్ మీడియా, ఎన్నికల పండితులు, సర్వే కంపెనీలకు శృంగభంగమైంది.
బీహార్ ఎన్నికలలో మోడీ పరాజయం తొలి పర్యవసానం సోమవారం నాడు స్టాక్ మార్కెట్ సూచీలు, రూపాయి పతనానికి దారి తీసింది. ఇప్పటికే అసంతృప్తితో వున్న కార్పొరేట్ శక్తులు రానున్న రోజుల్లో మరింత వత్తిడి పెంచే అవకాశం వుంది. అయితే రాజ్యసభలో మెజారిటీ లేకపోవటంతో మోడీ సర్కార్ కార్పొరేట్ల గొంతెమ్మ కోర్కెలను తీర్చలేకపోతోంది. ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ ఈ సంస్కరణలకు అనుకూలమే అయినప్పటికీ ఇప్పుడున్న స్ధితిలో మోడీ సర్కార్ సంస్కరణలను బలపర్చటమంటే రాజకీయంగా తన మరణశాసనాన్ని తానే రాసుకొన్నట్లు అవుతుంది. పోయిన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలంటే అనివార్యంగా పార్లమెంటులో మోడీ చర్యలను వ్యతిరేకించక తప్పదు. అధికారంలో వున్నపుడు కార్పొరేట్ల సేవలో తరించటం, లేనపుడు శ్రమజీవుల పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చటం బూర్జువా పార్టీల లక్షణం. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల ఓట్లు కొల్లగొట్టేందుకు బాక్సైట్ తవ్వకాలను ప్రతిపక్షంలో వున్నపుడు వ్యతిరేకించిన తెలుగుదేశం అధికారానికి వచ్చిన తరువాత ప్లేటు ఫిరాయించటం చూస్తున్నదే. అయితే దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ ఇలాంటివే. అందుకే కాంగ్రెస్, బిజెపి బలహీనంగా వున్న చోట్ల కార్పొరేట్లు ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇస్తూ అవసరమైనపుడు వుపయోగించుకుంటున్నాయి.
ఎన్‌డిఏలో బిజెపి తరువాత పెద్ద పార్టీ మహారాష్ట్రలో శివసేన. అనివార్యమైన స్ధితిలో బిజెపితో చేతులు కలిపినా నరేంద్రమోడీ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు అప్పుడప్పుడు తోక జాడిస్తోంది. బీహార్ ఎన్నికల సమయంలోనే ముంబై శివార్లలోని ఒక కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపిని పక్కకు నెట్టి విజయం సాధించింది. బీహార్ ఫలితాలు వెలువడగానే నితీష్ కుమార్‌ను సూపర్ హీరో అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించాడు.ఇప్పటిప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే బిజెపి ఓడిపోవటం ఖాయం, మోడీ పలుకుబడి తగ్గిపోయిందని ఆయన నాయకత్వంలో జరిగిన బీహార్ ఎన్నికలు స్పష్టం చేశాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.
పంజాబ్‌లోని అకాలీదళ్-బిజెపి కూటమిపై కూడా ప్రభావం అనివార్యం. రెండు పార్టీలూ తమ మత అజెండా ప్రకారం పనిచేయటం వాటి మధ్య సయోధ్యకు ఒక కారణం. అయితే వ్యవసాయ రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన రైతుల ఆందోళనలు రెండు పార్టీలకు ఒక హెచ్చరిక. మోడీ సర్కార్ కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేకమైనదనే ముద్ర ఇప్పటికే తెచ్చుకుంది. బీహార్‌లో ఒకవేళ గెలిస్తే ఏదో ఒక పేరుతో అకాలీదళ్‌ను వదిలించుకోవాలని బిజెపి చూసిందన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు అకాలీదళ్ ఈ అవకాశాన్ని వుపయోగించుకొని బిజెపిని కట్టడి చేయవచ్చన్నది విశ్లేషణ.
మరో ముఖ్యమిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తన వ్యూహం మార్చుకోవటానికి ఇది నాంది. తన అవసరాలకు తగినట్లు వ్యూహం మార్చటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఎన్డిఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటానికి అతల్ బీహారీ వాజ్‌పేయిని చూసి ఇస్తున్నాము తప్ప బిజెపిని చూసి కాదని చెప్పారు. గత ఎన్నికలలో అలాంటి సాకుతో పని లేకుండానే మోడీ పలుకుబడిని వుపయోగించుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అదే మోడీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఏాదిన్నర గడిచినా నోరు మెదపటం లేదు. హోదా లేదనే సంకేతాలు ఇప్పటికే పంపారు. దేశంలో అసహనాన్ని రెచ్చగొట్టటానికి కాషాయ పరివారం చేస్తున్న యత్నాలు, అది వికటించకతప్పదని బీహార్ ఫలితాలు నిరూపించాయి. బీహార్‌కు పెద్ద ప్యాకేజిని ప్రకటించిన నరేంద్రమోడీని జనం నమ్మలేదని ఎన్నికల ఫలితాలు నిర్ధారించాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు బదులు దయాదాక్షిణ్యాలతో కూడిన మెరుగైన ప్యాకేజి ఇస్తామని చెబుతున్న కబుర్లను రాష్ట్ర ప్రజలు ఇంకేమాత్రం విశ్వసించరు. దాంతో చట్టబద్దమైన హోదాకు ప్రజలు పట్టుబట్టే అవకాశం వుంది.ఈ పూర్వరంగంలో రాజధాని అమరావతి, అంతర్జాతీయ స్దాయి పట్టణ రంగుల కల కబుర్లను ఇంక ఎంతో కాలం చెప్పలేరు. బీహార్‌లో మోడీ ఓడిపోవటానికి దారి తీసిన ఇతర కారణాలతో పాటు ఏడాదిన్నర కాలంలో సాధించిన నిర్ధిష్ట విజయాలు లేకపోవటం, వందరోజుల్లో నల్లధనాన్ని వెలికితీస్తామని, ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయని చేసిన వాగ్దానం వంటివాటిని విస్మరించారు. బాబొస్తే జాబొస్తుందన్న తెలుగుదేశం నినాదం కూడా అలాంటిదే. వున్న జాబులు పోవటం తప్ప ఇంతవరకు కొత్త జాబులేమీ వచ్చే సూచనలు కనిపించటం లేదు.పైకి బింకంగా వున్నప్పటికీ ప్రస్తుత పరిస్ధితులలో కేంద్రం నుంచి సాధించేదేమీ లేదని చంద్రబాబు అంతర్గతంగా గుబులుతో వున్నారు. తమనేతపై వున్న కేసుల కారణంగా ప్రతిపక్షంగా వున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతర్గతంగా నరేంద్రమోడీతో సంబంధాలు కొనసాగిస్తోందన్నది తెలుగుదేశం శ్రేణులు చేసే ఒక ప్రచారం లేదా ఆరోపణ కావచ్చు. ఒక రాజకీయ పార్టీగా వున్నది కనుక ఒకవేళ అలాంటి సంబంధాలు వుంటే ముందు ముందు వారు కూడా జాగ్రత్త పడవచ్చు.
దేశంలో విధానాల ప్రాతిపదికన రాజకీయ సమీకరణలు జరగనంత కాలం బూర్జువా జాతీయ, ప్రాంతీయ పక్షాలు కార్పొరేట్ల సేవలో తరిస్తూనే వుంటాయి. అవకాశ వాద రాజకీయాలు నడుపుతూనే వుంటాయి. వామపక్షాలు బలపడినపుడే వాటి అసలు రంగు బహిర్గతం అవుతుంది. బీహార్ ఎన్నికలలో వామపక్షాలు తాము విజయం సాధించలేమని తెలిసినప్పటికీ విధానాల ప్రాతిపదికన సమీకరణకు విడిగా పోటీ చేశాయి. వాటిలో సిపిఎం(ఎల్) పార్టీకి మాత్రమే మూడు సీట్లు వచ్చాయి. బూర్జువాశక్తులతో విడగొట్టుకొని తమ బలాన్ని పెంచుకోవటం అన్నది ప్రస్తుతం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు. కేరళలో గతవారంలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన (ఎల్డిఎఫ్)ఘనవిజయాలు సాధించింది. ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో దానిని కొనసాగించనున్నదని అనేక మంది వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఎల్డిఎఫ్ నుంచి ఆర్ఎస్పి బయటకు పోయి కాంగ్రెస్ గూటిలో చేరింది. కేరళలో వున్న పరిస్దితులో కొన్ని వేల ఓట్లు కూడా ఫలితాలను అటూ ఇటూ చేస్తాయన్న విషయం తెలిసిందే. అక్కడ మత,కుల సంస్ధలు కొన్ని కాంగ్రెస్ మరికొన్ని బిజెపి వెనుక చేరి సిపిఎంను దెబ్బతీసేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడినప్పటికీ పరిమిత ప్రాంతాల్లో అయినా బిజెపి గణనీయమైన ఓట్లు సంపాదించింది.
పశ్చిమ బెంగాల్లో కూడా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. తృణమూల్ కాంగ్రెస్ పైకి ఏమి చెబుతున్నప్పటికీ బిజెపితో దాని సంబంధాలపై అనుమానాలు వుండనే వున్నాయి. బీహార్‌లో జెడియు,లాలూ, కాంగ్రెస్ కూటమికి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించింది. దానికి ప్రతిగా తాము బెంగాల్లో ఆమెకు మద్దతు ఇస్తామని జెడియు చెబుతున్నది. ఇక్కడ తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌ను ఏమి చేస్తారన్నది ప్రశ్న. మన దేశంలో కూడా రెండు పార్టీల వ్యవస్ధను వునికిలోకి తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలని కార్పొరేట్లు చేస్తున్న యత్నం ఇంతవరకు సఫలం కాలేదు. ఇప్పుడున్న స్ధితిలో అది సాధ్యమయ్యేట్లు కనిపించటం లేదు. కాంగ్రెస్ తిరిగి పుంజుకొనే అవకాశాలు నానాటికీ సన్నగిల్లుతున్నాయి. అంతర్జాతీయ మీడియా ఈ ఫలితాలకు బీహార్ ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. బీహార్ విజయం గురించి దేశంలో కాషాయ సేనలు ఎంత ధీమాగా వున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి నేతలు ఫలితాల ముందురోజే మీడియా సంస్ధలకు తమ విజయోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం పంపారు. టీవీలలో తొలి గంటలో వెలువడిన ఫలితాలు బిజెపికి అనుకూలంగా కనిపించటంతో కొన్ని చోట్ల బాణా సంచాలు, కొన్ని చోట్ల స్వీట్లు పంచారని వార్తలు వచ్చాయి. తొలి ఫలితాలను చూసి కొన్ని ఛానల్స్ బిజెపి అనుకూల వ్యాఖ్యానాలు కూడా ప్రారంభించాయి. వాటిని చూసి బిజెపి అభిమానులు విజయం తమదేనని నిర్ధారించుకున్నారు. అయితే తొలి రెండు గంటలలోనే అంకెలు తిరగబడటం ప్రారంభించాయి.ఆ సమయంలో టీవీలలో మాట్లాడిన కమలనాధులు అప్పుడే ఏమైంది చూద్దాం అన్నట్లుగా మాట్లాడారంటే మోడీ-షా చాణక్యం మీద వారెంత గుడ్డి భ్రమలతో వున్నారో వెల్లడైంది. ఎన్నికల పండితులు, సర్వేలు, పోలింగ్ అనంతర సర్వేలు మొత్తంగా బొక్కబోర్లా పడ్డాయి.
చివరిదశ ఎన్నికల వరకూ మొత్తంగా వార్తల తీరుతెన్నులను చూస్తే బిజెపికి భారీ మెజారిటీ లేదా పూర్తి ఆధిక్యత గురించి రాసినవే ఎక్కువ. నితీష్ కుమార్, లాలూ, కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని రాసినవారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వారంతా తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు.మనవంటి వెనుకబడిన సమాజాలలో ఎవరు గెలుస్తారంటే వారివైపే మొగ్గే వారు కొంతశాతం మంది ఓటర్లు వుంటారు. మీడియా ప్రచారం వారిని ప్రభావితం చేస్తుంది. ఆ లెక్కన బీహారు ఫలితాలను చూస్తే అలాంటి ఓటర్లు కొంతమందైనా మొగ్గి వుంటారు కనుక బిజెపికి ఆ మాత్రమైనా సీట్లు వచ్చాయి, లేకుంటే ఇంకా తగ్గి వుండేవి.
బీహార్‌లో బిజెపి ఓడిపోతే పాకిస్ధాన్లో టపాకాయలు కాలుస్తారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. పాక్పేరుతో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు వేసిన చౌకబారు ఎత్తుగడ అన్నది వేరే చెప్పనవసరం లేదు. గల్లీలో వుండాల్సివారు ఢిల్లీ వెళితే ఇలాగే వుంటాయి. పాకిస్తాన్ సంగతేమోగానీ బిజెపిలోని మోడీ బాధితులతో సహా దేశమంతటా దీపావళి సంబరాలు చేసుకుంటున్నారన్నది వాస్తవం.
09 Monday Nov 2015
Posted in Current Affairs
Tags
అరవై ఏళ్లు నిండాయంటే మా కమలన్న మేధా కమలం మరింత వికసిస్తుంది, మరింత పరిపూర్ణుడౌతాడనుకుంటే ఇదేంటి ఇలా చేశాడు మీ హీరో అని అందరూ అంటుంటే నీకెలా వుందోగాని మాకు మాత్రం సిగ్గుగా వుందన్నా ! ఏదైనా ఒక సమస్యపై ఎటూ తేల్చుకోలేకపోతే మౌన భూషణం ధరించటం ఒక పద్దతి. మీ సినిమా చీకటి రాజ్యం విడుదల సందర్బంగా దానితో నాలుగు డబ్బులు చేసుకొనేందుకు హైదరాబాదు వచ్చారు, ఓకే. విలేకర్లతో మాట్లాడినపుడు అనేక విషయాలను ముఖ్యంగా ఇబ్బంది పెట్టేవి అడుగుతారు, ప్లీజ్ నేను సినిమా కోసం వచ్చాను మిగతా విషయాలు ఇప్పుడు వద్దు అని తప్పించుకొని వుంటే ఒక పద్దతిగా వుండేది. నోరు విప్పారు, ముందుగా స్క్రిప్టు, డైరెక్షన్ వగైరా ఏమీ లేకుండా మాట్లాడారు కనుక ఇదేమిటి ఇలా మాట్లాడారు అనుకున్నాము. ఆ మాటలు ఎదురు తన్నాయి. పోనీ అంతటితో వూరుకున్నారా అంటే లేదు అసలే కోతి, దానికి తోడు కల్లు తాగిందన్నట్లుగా చెన్నయ్‌లో మరింత రెచ్చిపోయారు. గూండాలు, రౌడీలు, మతశక్తులు ఒంటరిగా వుండరు. తెలిసో తెలియకో తమ దగ్గరకు వచ్చిన వారితో ఏదో ఒక నేరం చేయించి తమ పట్టునుంచి జారిపోకుండా చూసుకుంటారు. అయినా మా పిచ్చిగానీ ఎన్నో సినిమాలు తీసి, కధలు విన్న మీకు ఇవన్నీ మేం చెప్పాలా ? కమలనాధులు మిమ్మల్ని అదే చేసినట్లుగా కనిపిస్తోంది.

వివిధ సందర్బాలలో మీరు మాట్లాడినవి,వెలిబుచ్చిన అభిప్రాయాలను బట్టి ‘ విశ్వరూపం, హేరామ్, వుత్తమ విలన్’ వంటి సినిమాల విడుదల సందర్బంగా మతశక్తులు చేసిన గొడవను బట్టి మీకు కాస్త వామపక్ష భావజాలం, స్వతంత్ర భావాలు వున్నాయని, హేతువాదివని ఇంతవరకు అనుకుంటున్నాము. మీ తండ్రితో కలసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న యాకూబ్ హసన్ స్నేహానికి గుర్తుగా మీ తండ్రి మీ పేర్ల చివరన హసన్ చేర్చినట్లు విన్నాం, మీరు కూడా మీ కుమార్తెల పేర్లకు చివరన హసన్ చేర్చినందుకు మీ కుటుంబం ఎంతో విశాల భావాలు కలదని అభిమానులంతా పొంగి పోయారు.చదవేస్తే వున్న మతి పోయిందన్నట్లుగా వయస్సు పెరిగింది కానీ బుర్ర వికసించలేదని తాజాగా స్వయంగా రుజువు చేసుకున్నారు.
మీరు కాషాయ బురద అంటించుకొని ఈ వయస్సులో వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడటాన్ని అభిమానులుగా జీర్ణించుకోలేకపోతున్నాం. అనుపమఖేర్ అంటే వాళ్లావిడ చండీఘర్ బిజెపి ఎంపీ నుక ఆ పార్టీ వుప్పు తింటున్నందుకు ఆ పెద్దమనిషి గజ్జెలు కట్టుకొని జడలు విరబోసుకొని శరభ శరభ దశ్శరభ శరభ అంటూ వీర తాళ్లతో వీరంగం వేస్తున్నాడు. మీకేం వచ్చింది ? కొంపదీసి ఇలా మాట్లాడి మద్దతు నటించటానికి మీరు గానీ కాల్షీట్లు ఇచ్చారా ఏమిటి ? ఎందుకంటే గతంలో అనేక మంది నటీ నటులను అలా ఏర్పాటు చేసుకున్నారు, సొమ్ము చేసుకొనేందుకు వారు కూడా అలా నటించారు మరి.
దేశంలో అసహన పరిస్ధితులు పెరిగి పోతున్నాయని కళాకారులు, సాహితీవేత్తలు, వివిధ రంగాలలోని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఆలోచన కలిగించిందీ, దాన్ని మరింత మందికి తెలిసేట్లు చేసింది ఎవరు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కన్నడ రచయిత లుబుర్గిని వుట్టి పుణ్యానికి మత మదమెక్కిన వారు హత్య చేస్తే ఖండించమనేగా రచయితలు అకాడమీని అడిగింది. అదేమీ రాజకీయ సంస్ధ కాదు, మీరన్నట్లు మేధావులతో కూడినదే. కలుబుర్గి హత్య కుటుంబ తగాదాల కారణంగా అని ఒక కధ, వ్యక్తిగత సమస్య అని ఒక కధ తొలుత ప్రచారంలో పెట్టారు. పోనీ అదే నిజం అనుకున్నా తాము అవార్డు ఇచ్చిన ఒక ప్రముఖుడిని కాల్చి చంపితే అయ్యో పాపం అనటానికి, హత్యను ఖండిిస్తే వారి నోటి ముత్యాలు రాలిపోతాయా ? చంపింది ఆయన భావాలను సహించలేని వారే అని తేలిన తరువాత, వారు మరికొందరు రచయితలను కూడా హతమారుస్తామని బెదిరింపులకు దిగిన పూర్వరంగంలో అయినా సాహిత్య అకాడమీ ఖండించి వుంటే పరిణామాలు మరొక విధంగా వుండేవి.లుబుర్గి హత్యను సాహిత్య అకాడమీ ఎందుకు ఖండించలేదు? అంటేె ఎండని చేప కథ గుర్తుకు వస్తోంది. ఆ కథలో చివరకు నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చీమ చెబుతుంది. దీనిలో మమ్మల్ని పర్యవేక్షించే కమలనాధులకు ఇష్టం లేని పని మేమెందుకు చేస్తాము అన్నట్లుగా సాహిత్య అకాడమీ పెద్దలు మౌనంగా వుండటం తప్ప మరొకటి ఏముంది? అయినా కలుబుర్గి హేతువాది, మీరూ హేతువాది అంటారు, అంటే తోటి హేతువాది హత్యపై కూడా నోరు విప్పని వారిని పట్టుకొని ఎంతో ప్రముఖులు, మేధావులు, వారిని నేనెంతో గౌరవిస్తా అని చెప్పటానికి మీది నోరా మరొకటా ? ఆరుపదులకే ముది మది తప్పిందా లేక వుమ్తెత్త కాయలు కానీ తినలేదు కదా !
కలుబుర్గిని చంపింది ఆగస్టు 30న, దానిని ఖండించనందుకు నిరసనగా అవార్డును తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించిన తొలి రచయితగా వుదయ ప్రకాష్ చరిత్రకెక్కారు. అవార్డు రచయితల నిరసన క్రమంగా పెరుగుతున్న సమయంలో సెప్టెంబరు 28న దాద్రిలో ఆవు మాంసం తింటున్నారనే పేరుతో ఒక మూక ఒక ముస్లిం కుటుంబంపై దాడి చేసి యజమానిని బలిగొన్నది. దానిని ఖండించటానికి ముందుకు రాకపోగా బిజెపి పెద్దలు హంతకులను సమర్ధించిన తరువాతే అసహన ధోరణిపై రచయితలతో పాటు ఇతర మేధావులు కూడా జతకలిశారు. దీనిలో మీరు చెబుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ? బిజెపి, దానికి వంత పాడుతున్న మీ వంటి వారి బుర్రల్లో తప్ప, నిజంగా ప్రభుత్వవ్యతిరేకతే అయితే పోయినేడాది మోడీ అధికారానికి వచ్చి ఏడాది వుత్సవాలు జరుపుకునేంతవరకు ఆగటం ఎందుకన్న కనీస జ్ఞానం మీకు లేకపోయిందే అని అభిమానులుగా మేం బాధపడుతున్నాం. అసహన ధోరణులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్న భావం ప్రబలటానికి కారకులు ఎవరు ? ఐదూళ్లు కాదు సూది మోపినంత కూడా ఇచ్చేది లేదన్న ధుర్యోధనుడి మాదిరి దాద్రి హత్యను ఖండించేందుకు నరేంద్రమోడీ తిరస్కరించటం మరింత ఆజ్యం పోసిందా లేదా ? ఖండించకపోగా ప్రతి పక్షాలే మత ధోరణులను పెంచుతున్నాయని ఎదురుదాడికి దిగారా లేదా ? సేనాపతే అలా వున్న తరువాత అనుంగు సైనికులైన సాక్షి మహరాజ్ వంటి నోటి దురద వ్యాధి గ్రస్తులు సాధ్వులు, సంతులు రెచ్చిపోయిన తరువాతే కదా మరింత మంది నిరసన గళం విప్పింది.
అవార్డులు తిరిగి ఇచ్చినంత మాత్రాన జరిగేదేమీ వుండదని మీ నోటి వెంట ఒక సుభాషితం వెలువడింది. అంటే అసహన ధోరణులను నిరుత్సాహపరచటం జరగదు, వారు చేసేది చేసుకుంటారు, మీరు చేసేది చేసుకోండన్నదే మీ మాటలకు అర్ధమా ? దేశంలో ఇప్పుడు గతం కంటే ఎక్కువగా అసహన ధోరణులు వున్నాయా లేవా అనే దానికి అవునో కాదో చెప్పకుండా నిరసన తెలుపుతున్న వారు కూడా సహనంతో వుండాలని, ఇచ్చి పుచ్చుకోవాలని చెప్పటం నవ్వు తెప్పిస్తోంది. సహనయాత్ర పేరుతో అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నవారికి వ్యతిరేకంగా అసహనయాత్ర చేసిన అనుపమఖేర్ అండ్‌కో రాష్ట్రపతికి ఇచ్చేందుకు తయారు చేసిన ఒక పిటీషన్‌పై మీరు కూడా సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి. సహనంతో చదివి సంతకం చేశారా లేక నిరసన తెలుపుతున్న వారి మీద అసహనంతో చూడకుండానే వేలి ముద్ర వేశారా ? అసహన పరిస్ధితులు వున్నాయని తెలియ చెప్పేందుకు అనేక పద్దతులు వున్నాయన్నారు బాగుంది ఆ లెక్కన మీరే పద్దతిలో అయినా ఇంతవరకు ఎందుకు నిరసన తెలపలేదో చెప్పగలరా ? ఒక వేళ రహస్యంగా తెలిపితే వచ్చిన స్పందన ఏమిటో తెలిపితే సంతోషం. ఊరందరికీ వుల్లిపాయ తినొద్దని చెప్పాను గానీ మనింట్లో వద్దని నీకు చెప్పానా అని ఒ బోధకుడు భార్యపై దెబ్బలాడినట్లు సహనశీలత పేరుతో అసహనపరులు అనుపమఖేర్ బృందం జరిపిన ప్రదర్శన సందర్భంగా జర్నలిస్టులను చూసి నిర్వాహకులు రెచ్చిపోయారు. ఒక మహిళా జర్నలిస్టును అనరాని మాటలతో అవమాన పరిచారు.
సినీ రంగంలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన మీరు అవార్డుకు, డిగ్రీకి తేడా తెలియకుండా మాట్లాడటం బెర్నార్డ్ షా జోకును గుర్తుకు తెస్తోంది. అదేమంటే ఒక అందగత్తె ఆయన దగ్గరకు వెళ్లి మనం పెళ్లి చేసుకుందాం , నా అందం, మీ తెలివి తేటలతో పుట్టే పిల్లలు మన కంటే గొప్పవారు అవుతారన్నదట. దానికాయన నీతో పెళ్లికి నాకు ఓకే. ఒక వేళ నా అందం నీ తెలివి తేటలు కలిగిన పిల్లలు పుడితే ఎలా అని ప్రశ్నించాడట. మీరు కాషాయ నరేంద్రమోడీతో ముడివేసుకున్న ఫలితంగా మీ వివేకం స్ధానంలో వారి బుద్ది ప్రవేశించినట్లుగా వుంది. మధ్యలో మహాత్మాగాంధీని తెచ్చారెందుకు మహానుభావా ? బ్రిటీష్ వారు పరిపాలిస్తున్నారు గనుక గాంధీజి తన బారిస్టరు డిగ్రీని తిరిగి ఇచ్చివేస్తారని మనం వూహించగలమా అది బాధ్యతా రహితం అవుతుంది, నేనలాంటి బాధ్యతారాహిత్యానికి పాల్పడను అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసన తెలపటం మన దేశంలో విశ్వకవి రవీంద్రుడితో ప్రారంభమైందని తెలుసా మీకు ? 1915లో తనకు బ్రిటీష్ వారు ఇచ్చిన వున్నత గౌరవాన్ని 1919లో జలియన్‌వాలాబాగ్ దురంతం తరువాత నిరసతో తిరిగి అప్పగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.
ఏమైనా ఒకందుకు మీకు, మీ వంటి వారు అలుపెరగకుండా మోస్తున్న కాషాయ నరేంద్రమోడీకి ఒక విధంగా అభినందనలు చెప్పక తప్పదు.అన్ని వ్యవస్ధలను కాషాయ బంట్లతో నింపినట్లుగానే కేంద్ర సాహిత్య అకాడమీని కూడా కాషాయపూరితం చేశారు. ఆయా సంస్ధల విస్వసనీయతనే ప్రశార్ధకం చేశారు. రాబోయే రోజుల్లో సాహిత్య, పద్మ, ఇతర అవార్డులను ఈ ప్రభుత్వం లేదా దాని పర్యవేక్షణలో పనిచేసే సంస్ధలు ప్రకటిస్తే తీసుకోవాలా లేదా అన్నది ముందుగానే నిర్ణయించుకోవాల్సి వుంటుంది. తిరస్కరిస్తే మీరన్నట్లు ప్రభుత్వ వైఖరితో విబేధించినవారిగా, తీసుకుంటే కాషాయ భజనపరులుగా జనం పరిగణిస్తారు. మేధావులు ఎటువుండాలో తేల్చుకోవాల్సిన పరిస్ధితిని ముందు తెచ్చారు.
కమలన్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు ! ఇంతకాలం నా వంటి అభిమానులు మీ గురించి అల్లుకున్న ఊహలను ఒక్కసారిగా పటాపంచలు చేస్తూ కమలం గూటి పలుకులు పలుకుతావని ఎన్నడూ వూహించలేదు. ఒక్కసారి పునరాలోచించు. నోరు మంచిదైతే వూరు మంచిదౌతుందంటారు. బీహారు ఎన్నికల ప్రచారంలో గతంలో ఏ ప్రధాని కూడా తిరగని విధంగా గల్లీ గల్లీ తిరిగి గల్లీ వుపన్యాసాలు చేసిన ఫలితం ఏమి వచ్చిందో చూసే వుంటారు. తప్పు చేయటం కంటే చేసిన తప్పు తెలుసుకున్న వారు ఎంతో గొప్పవారని వేరే చెప్పనవసరం లేదు. వుంటా మరి
మీ అభిమాని
08 Sunday Nov 2015
Posted in Current Affairs
The BJP did much better than their showing in past years. However, they did not do as well as had been expected.
08 Sunday Nov 2015
Posted in Current Affairs
Bihar election results: Counting of votes in the high-stakes close-to-call Bihar assembly elections, billed as a hot battle between Prime Minister Narendra Modi’s Bharatiya Janata Party (BJP) and Chief Minister Nitish Kumar’s Janata Dal (United), is happening Sunday. Modi had led the NDA charge by holding over 30 rallies while BJP chief Shah held 85-odd public meetings.
Source: Bihar assembly election results: All you wanted to know in 10 points – Yahoo India Finance
08 Sunday Nov 2015
Posted in CPI(M), Current Affairs, Left politics
LDF Victory in Kerala
The CPI(M) congratulates the people of Kerala for having voted the LDF to
victory in the elections to the local bodies. This verdict is a popular
rejection of the UDF government’s anti-people record and corruption. The
people have also rebuffed the communal politics of the BJP and its efforts
to rally leaders of caste-based organisations
The LDF has registered success in the various levels of the local bodies. It
has won 545 out of the 938 gram panchayats declared so far; 91 out of the
152 block samitis and 7 out of the 14 zilla panchayats. Of the urban
municipalities, the LDF has won 44 out of 86; of the six corporations, the
LDF has won outright 3, it has emerged as the largest block in one and in
another there is a tie. The UDF has won only one corporation outright.
The Polit Bureau conveys its warm greetings to all the workers and activists
of the CPI(M) and the LDF for this well-earned victory.