అన్నదాతల రుణ భారం కారణాలు – మూడవ భాగము

Tags

, ,

మద్దతు ధరలు రైతులకా వ్యాపారులకా ?
రైతు మిత్ర

అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌లో ధాన్య రైతుల పరిస్థితి గురించి చూద్దాం. కనీస మద్దతు ధరలు రైతాంగానికి వుపయోగపడుతున్నాయా లేక వ్యాపారులకు ప్రయోజనం కలిగిస్తున్నాయా అన్న అనుమానం వస్తోంది. వుదాహరణకు 2004-05 నుంచి 2014-15 వరకు పరిశీలిస్తే ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు సగటున రు.979.79లుగా వుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు అందచేసిన సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అగ్‌మార్క్‌నెట్‌ పేర్కొన్న సంవత్సరాలలో డిసెంబరు, జనవరి మాసాలలో ఆంధ్రప్రదేశ్‌లోని మార్కెట్లలో ధాన్య రైతులు పొందిన సగటు ధరలు, దేశం మొత్తంగా రైతులు పొందిన ధరల వివరాలను దిగువ పట్టికలో చూడవచ్చు.స్ధలా భావం కారణంగా ప్రతి ఏడు డిసెంబరు, జనవరి మాసాల ధరలను మాత్రమే ఇక్కడ ఇవ్వటమైంది. దాని ప్ర కారం మన రాష్ట్రంలో ఈ కాలంలో ప్రతి ఏటా డిసెంబరులో రైతు పొందిన సగటు ధర రు.953.70, జనవరిలో 997.15 గా నమోదైంది. అదే దేశవ్యాపితంగా రు.1200.76, రు.1157.57 గా వున్నాయి. ఒక ఏడాది కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వున్నా, మరొక ఏడాది తక్కువ వున్నా భరించాల్సింది రైతు మాత్రమే. 2005లో వున్న కనీస మద్దతు సగటు ధర 575తో 2015లో వున్న సగటు ధర 1430తో(సూపర్‌ ఫైన్‌, ఫైన్‌ రెండింటి సగటు) పోల్చితే మద్దతు ధర 147శాతం పెరిగింది. ఇదే సమయంలో 2005 జనవరిలో మార్కెట్‌లో రైతుకు లభించిన 634తో 2015లో వున్న 1363 రు.లను పోల్చితే పెరుగుదల 114శాతమే. ఆ విధంగా చూసినపుడు ఏం జరిగిందనేది వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అధికారిక అంకెలే పరిస్ధితిని వివరిస్తున్నాయి.

1990 నుంచి మన దేశం నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాలు శాంతి భద్రతలు, కరెన్సీ, సరిహద్దుల రక్షణ,సైన్యం వంటి వాటికి మాత్రమే పరిమితమై మిగతా రంగాల నుంచి తప్పుకొని మార్కెట్‌ శక్తులకు వాటిని వదలి వేయాలి. అప్పుడే జనానికి మెరుగైన సేవలు అందుతాయి.అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఒక్కొక్క బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకొంటున్నాయి. వాటి మంచి చెడ్డలు, విమర్శలు, ప్రశంసల గురించి ఇక్కడ చర్చించబోవటం లేదు. కనీస మద్దతు ధరలు ప్రకటించిన మాత్రాన్నే అవి రైతులకు గిట్టుబాటు కలిగిస్తాయా ? నిజానికి అవి వాస్తవ పెట్టుబడులను ప్రతిబింబిస్తున్నాయా ?

ధాన్యానికి ఆంధ్రప్రదేశ్‌లోని మార్కెట్లలో గత సంవత్సరాలలో లభించిన ధరల వివరాలు ఇలా వున్నాయి. మొదటి కాలంలో ఆ ఏడాది జనవరిలో లభించిన ధర అయితే రెండవ కాలంలో అంతకు ముందు ఏడాది డిసెంబరులో లభించిన ధర, మూడవ కాలంలో అంతకు ముందు సంవత్సరం జనవరి ధర పోలిస్తే మార్పు, నాలుగవ కాలంలో ఏడాదిలో వచ్చిన మార్పుగా గమనించాలి. వుదాహరణకు 2005 జనవరిలో వచ్చిన ధర పక్కనే 2004డిసెంబరులో వచ్చిన ధరగా తరువాత కాలంలో 2004 జనవరి ధర అని గమనించాలి.

జనవరి డిసెంబరు జనవరి నెలలో మార్పు ఏడాదిలో మార్పు

2005 ఆంధ్రప్రదేశ్‌ 634.24 624.79 581.8 1.51 9

దేశ సగటు 727.07 698.7 668.07

2006ఆంధ్రప్రదేశ్‌ 1033.38 473.52 634.24 118.23 62.93

దేశ సగటు 697.78 678.85 727.07

2007ఆంధ్రప్రదేశ్‌ 615.69 640.9 1033.38 -3.94 -40.42

దేశ సగటు 776.74 822.9 697.78

2008ఆంధ్రప్రదేశ్‌ 699.66 785.92 615.69 -10.98 13.64

దేశ సగటు 1015.81 1013.67 776.74

2009ఆంధ్రప్రదేశ్‌ 881.19 874.83 699.66 0.73 25.95

దేశ సగటు 1087.59 1155.48 1015.81

2010ఆంధ్రప్రదేశ్‌ 1036.35 1029.70 881.19 0.65 17.61

దేశ సగటు 1283.17 1303.54 1087.59

2011ఆంధ్రప్రదేశ్‌ 996.36 1004.60 1036.35 -0.82 -3.86

దేశ సగటు 1296.20 1239.66 1283.17

2012ఆంధ్రప్రదేశ్‌ 1080.31 1080.48 996.36 -0.02 8.43

దేశ సగటు 1228.22 1117.38 1296.2

2013ఆంధ్రప్రదేశ్‌ 1271.77 1273.14 1080.31 -0.11 17.72

దేశ సగటు 1704.53 1571.97 1228.22

2014ఆంధ్రప్రదేశ్‌ 1356.07 1338.66 1271.77 1.3 6.63

దేశ సగటు 2005.4 1970.67 1704.53

2015ఆంధ్రప్రదేశ్‌ 1363.64 1364.18 1356.07 -0.04 0.56

దేశ సగటు 1630.62 1635.44 2005.4

ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెల సగటు ధర.997.15

దేశవ్యాపితంగా జనవరి నెల సగటు ధర రు. 1157.57

ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబరు సగటు ధర రు. 953.70

దేశవ్యాపితంగా డిసెంబరు నెల సగటు ధర రు. 1200.76

కనీస మద్దతు ధరల సగటు : రు.979.79

మన రాష్ట్రంలోని వాణిజ్య పంటలలో పత్తి ఒకటి. దీని పరిస్థితి ఎలా వుందో చూద్దాం. పత్తి విషయంలో కూడా బాగా మార్కెట్‌కు వచ్చే జనవరి నెల గణాంకాలనే తీసుకోవటం జరిగింది.

జనవరి డిసెంబరు జనవరి నెలలో ఏడాదిలో మద్దతు ధర
మార్పు మార్పు
2005 ఆంధ్రప్రదేశ్‌ 1815.87 1774.81 1960

దేశ సగటు 2096.04 2171.53 2726.41

2006ఆంధ్రప్రదేశ్‌ 1890.20 1961.44 1815.87 -3.63 4.09 1980

దేశ సగటు 2095.36 2147.27 2096.04

2007ఆంధ్రప్రదేశ్‌ 1994.58 1958.21 1890.20 1.86 5.52 1990

దేశ సగటు 2174.52 2249.97 2095.36

2008ఆంధ్రప్రదేశ్‌ 2718.18 1953.31 1994.58 39.16 36.28 2030

దేశ సగటు 2754.93 2733.65 2174.52

2009ఆంధ్రప్రదేశ్‌ 2561.32 2573.37 2718.18 -0.47 -5.77 3000

దేశ సగటు 2566.02 2700.45 2754.93

2010ఆంధ్రప్రదేశ్‌ 3092.58 3157.70 2561.32 -2.06 20.74 3000

దేశ సగటు 3447.75 3184.55 2566.02

2011ఆంధ్రప్రదేశ్‌ 4781.66 4079.47 3092.58 17.21 54.62 3000

దేశ సగటు 4543.68 4282.19 3447.75

2012ఆంధ్రప్రదేశ్‌ 3954.20 3830.46 4781.66 3.23 -17.3 3300

దేశ సగటు 4128.05 3946.85 4543.68

2013ఆంధ్రప్రదేశ్‌ 3893.25 3817.79 3954.20 1.98 -1.54 3900

దేశ సగటు 4073.02 4109.67 4128.05

2014ఆంధ్రప్రదేశ్‌ 4594.92 4137.30 3893.25 11.06 18.02 4000

దేశ సగటు 5128.21 4709.26 4073.02

2015ఆంధ్రప్రదేశ్‌ 3972.90 4011.39 4594.92 -0.96 -13.54 4050

దేశ సగటు 5479.75 4024.36 5128.21

పత్తి రైతులు గతంలో విచక్షణా రహితంగా సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ వాడిన కారణంగా పర్యావరణ సమతూకం దెబ్బతిని తెల్లదోమ, పచ్చపురుగు ప్రబలి పంట దెబ్బతిని ప్రకాశం, గుంటూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తరువాత రైతుల పాలిట కల్పతరువుగా బిటి పత్తి వచ్చిందన్నారు. అయినా దేశంలో అనేక చోట్ల పత్తి రైతులు ముఖ్యంగా మహారాష్ట్ర వంటి చోట్ల ఆత్మహత్యలు ఆగలేదు. ఆ బీటీ పత్తే కారణమని విశ్లేషకులు ఇప్పుడు చెబుతున్నారు. పైన పేర్కొన్న పట్టిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెలలో పత్తి సగటు ధర రు.2,973.48, అదే దేశ సగటు రు3,498.84 వుంది. ఈ కాలంలో పత్తి సగటు కనీస మద్దతు ధర రు.3017.50 వుంది. పొడవు పింజ పత్తి మద్దతు ధర ఈ కాలంలో రు.1960 నుంచి రు.4050కి 106 శాతమే పెరిగింది.ఈ కాలంలో ప్రయివేటు మార్కెట్‌లో 2005జనవరి ధరతో 2015జనవరి ధరతో పోల్చితే పెరుగుదల 118శాతం వుంది. గమనించాల్సిందేమంటే అప్పుడూ ఇప్పుడూ పత్తి కనీస మద్దతు ధరల కంటే తక్కువే రు.1815-3972 మధ్యవుంది. మధ్యలో కొన్ని సంవత్సరాలు కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ పలికినప్పటికీ దాని వలన రైతులకు పెద్దగా ఒరిగింది లేదు.సగటున ఎంత దక్కిందన్నదే ముఖ్యం.

ముగిసినది

Delhi High Court Dismisses Plea Seeking Ban On Cow Slaughter, Beef In The National Capital

NEW DELHI — The Delhi High Court today dismissed a PIL seeking enactment of a law prohibiting slaughter of cows and sale of beef and such products across the national capital region (NCR), terming it

Source: Delhi High Court Dismisses Plea Seeking Ban On Cow Slaughter, Beef In The National Capital

NDTV Reporter Allegedly Heckled, Called A Prostitute At Anupam Kher’s Tolerance March

New Delhi — Several media persons, including a woman journalist from NDTV, were heckled by the participants of the ‘March For India’ rally organised by Anupam Kher in Delhi today. NDTV reports: &

Source: NDTV Reporter Allegedly Heckled, Called A Prostitute At Anupam Kher’s Tolerance March

ఎరుపే కాదు, సుత్తీ కొడవలి అన్నా భయపడుతున్న పాలకులు

Tags

,

అమ్మా ! అమ్మా !! ఈ బొమ్మ ఎంతో బాగుంది కదూ

ఏం బాబూ పెద్ద వాడివైనా నీ కింకా బొమ్మల పిచ్చి పోలేదా పద పద !

కాదమ్మా నా చిన్నపుడు ఇలాంటి బొమ్మలు రాలేదు , దీనిపై సుత్తీ కొడవలి బొమ్మలున్నాయి, ఎందుకలా వేశారు.
అవి చైనా మేడ్‌, అవి కమ్యూనిస్టు చిహ్నాలు అని చెబుతుండగానే తీసుకోండి సార్‌ పెద్ద ఖరీదేం కాదు అని షాపతను అంటూ వుండగానే బిలబిల మంటూ మిలిటరీ వచ్చి అక్కడున్న బొమ్మలను స్వాధీనం చేసుకొని షాపువాడిని బలవంతంగా జీవులో ఎక్కించుకు చక్కా పోయారు. వారికి ఏం జరిగిందో అర్ధం కాలేదు, ఆ బొమ్మలను ఎందుకు తీసుకుపోయారో, వాటిలో ఏమైనా వజ్రాలు, గట్రా పెట్టి స్మగ్లింగ్‌ చేస్తున్నారా అని పరిపరి విధాలా అనుకుంటుండగానే పోలీసులు మైకులో హెచ్చరికలు ప్రారంభించారు. సుత్తీ కొడవలి చిహ్నం వున్న బొమ్మలను అమ్మినా, వాటిని ఎవరైనా కొన్నా వారిని అరెస్టు చేస్తామన్నది వాటి సారాంశం.

ఇదేదో కథలా అనిపిస్తున్నా నిజం. ఇండోనేషియాలోని యోగ్యకర్తా అనే పట్టణంలో మిలిటరీ సుత్తీ, కొడవలి చిహ్నాలు వున్న చైనా తయారీ బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు జకర్తా గ్లోబ్‌ అనే పత్రిక శుక్రవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. ఆ చిహ్నాలు చూసిన పిల్లలు కమ్యూనిస్టు ఆశయాల గురించి తెలుసుకుంటారని, వాటిని అమ్మటం, కొనటం ద్వారా పిల్లల్లో కమ్యూనిస్టు బీజాలు వేసినట్లు అవుతుందని అధికారులు భావించి అలాంటి బొమ్మలను నిషేధించినట్లు తెలిపింది. లెఫ్టినెంట్‌ కల్నల్‌ కవలెరీ తుమాది దీని గురించి చెబుతూ ఈ బొమ్మలను అమ్ముతున్నవారిలో ఎక్కువ మందికి ఆ బొమ్మల వెనుక వున్న అర్ధం తెలియదని, అయితే కొంత కాలానికి మన పిల్లలు ఆ చిహ్నాలకు ఆకర్షితులు అవుతారని అదే జరిగితే తరువాత వారి మెదళ్లలో ఆ భావాలు కూడా ప్రవేశిస్తాయని ఆ మిలిటరీ అధికారి వ్యాఖ్యానించాడు. బొమ్మలకు ఆర్డర్లు ఇచ్చే వ్యాపారులు దీని గురించి ఎరిగి వుండాలని చెప్పాడు.

1965-66 సంవత్సరాలలో ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులు, అభిమానులను జనరల్‌ సుహార్తో నాయకత్వంలోని మిలిటరీ తిరుగుబాటుదారులు నిర్ధాక్షిణ్యంగా హత్యచేసిన విషయం తెలిసినదే. ఆ వుదంతం జరిగి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా దానిపై చర్చ, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిన పూర్వరంగంలో ఇండోనేషియా మిలిటరీ ఈ చర్య తీసుకోవటం ద్వారా అది ఎంత భయపడుతున్నదో అర్ధం అవుతోంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వుబుద్‌ రైటర్స్‌ మరియు రీడర్స్‌ ఫెస్టివల్‌(పుస్తక ప్రదర్శన) సందర్భంగా గతనెలలో 15 కార్యక్రమాలను జరగకుండా అధికారులు అడ్డుకున్నారు. నిఘా సిబ్బందిని దింపి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆరాతీశారు. కమ్యూనిస్టుల ఊచకోత గురించి సమాచారాన్ని ప్రచురించిన జావాలోని ఒక విశ్వవిద్యాలయ పత్రిక కాపీలను మొత్తం స్వాధీనం చేసుకొని వాటిని పాఠకులకు అందకుండా నాశనం చేశారు. సుహార్తో కాలం నాటి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా మిలిటరీ, పోలీసులు కమ్యూనిస్టుల ఊచకోత గురించి చర్చ జరగకుండా సమాచారాన్ని జనానికి అందకుండా అప్రకటిత నిషేధాన్ని అమలు జరుపుతున్నారు.

పాబ్లో నెరూడాను హత్య చేశారా ?

Tags

,

42 సంవత్సరాల తరువాత దర్యాప్తు

ప్రఖ్యాత చిలీ కవి, 1973లో మరణించిన పాబ్లో నెరూడా కాన్సర్‌ లేదా సహజమరణం పాలయ్యారని ఇంత వరకు అనుకుంటున్నది వాస్తవం కాదా? సాల్వెడార్‌ అలెండీని అంతమొందించిన నియంత పినోచెట్‌ నెరూడాను కూడా హత్య చేయించారా? తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం ఇంకా నిర్ధారణ కానప్పటికీ అవుననే చెబుతున్నది. గతంలో బయటకు రాని ఒక పత్రంలోని సమాచారం కొత్త సమాచారాన్ని వెల్లడిస్తున్నది. బహుశాను నెరూడా హత్యకు గురై వుంటారని చిలీ ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది.

ఎల్‌ పాయిస్‌ అనే ఒక పత్రిక ఆ పత్రాన్ని సంపాదించింది. దానిలోని అంశాలను నిర్ధారించాల్సిందిగా ప్రభుత్వ హోంశాఖను కోరింది. 1973లో నెరూమరణానికి మూడవ పక్షం కారణమై వుండవచ్చని ప్రభుత్వం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది.నెరూడా మరణంపై లోతైన దర్యాప్తు ఫలితంగా ఆ పత్రం లభ్యమైనట్లు ఆ పత్రిక పేర్కొన్నది. పత్రం నిజమేనని, దర్యాప్తుచేస్తున్న బృందం వివాదాస్పద మరణంపై అంతిమ నిర్ణయానికి రావలసి వుందని ప్రభుత్వం పేర్కొన్నది. కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా వున్న వామపక్ష ప్రభుత్వం 42 సంవత్సరాల తరువాత రాజకీయ కారణాలతో నెరూడాను హత్య చేసి వుంటారన్న వూహాగానాలు సంవత్సరాలుగా వెలువడుతుండటంతో ఈ ఏడాది ప్రారంభంలో నెరూడా హత్య కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. ఇదే కారణాలతో 2013లో నెరూడా అవశేషాలను మరోసారి పరీక్షించింది.

కమ్యూనిస్టు, కవి అయిన నెరూడా నియంతల కుట్రకు బలైన చిలీ కమ్యూనిస్టు అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీ మద్దతుదారు. అలెండీని చంపివేసిన కొద్ది వారాల తరువాత అనుమానాస్పద స్ధితిలో నెరూడా మరణించారు. 1924లో 19 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రఖ్యాత ‘సాంగ్‌ ఆఫ్‌ డెస్‌ఫెయిర్‌’ ఇతర కవితలను రాశారు. సాహిత్యంలో ఆయనకు 1971లో నోబెల్‌ బహుమతి వచ్చింది. నెరూడా కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్‌ సభ్యుడిగా, మరణించే ముందు ఫ్రాన్స్‌లో చిలీ రాయబారిగా పనిచేశారు. 1948లో కమ్యూనిస్టుపార్టీపై నిషేధం విధించిన సమయంలో ఆయన కొంతకాలం అజ్ఞాతవాసం గడిపారు.

పోర్చుగీసులో కమ్యూనిస్టు, వామపక్ష ప్రభత్వ ఏర్పాటుకు ఒప్పందం

Tags

, ,

ఐరోపాలోని పోర్చుగీసులో సోషలిస్టు, కమ్యూనిస్టు, వామపక్ష కూటమితో కూడిన త్రిపక్ష సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ఆ పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీంతో పదకొండు రోజుల క్రితం ఏర్పడిన మితవాద మైనారిటీ సర్కార్‌ను కూలద్రోసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వామపక్ష కూటమికి పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లు వున్నాయి.అక్టోబరు మొదటి వారంలో జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభత్వ ఏర్పాటు, అనుసరించాల్సిన విధానాల గురించి తలెత్తిన వివాదాల కారణంగా సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావటంతో మితవాద శక్తులు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే పొదుపు చర్యలకు వ్యతిరేకంగా వున్న శక్తులందరూ ఏకంకావాలని దేశంలోని వివిధ తరగతుల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా తాజాగా సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. పార్లమెంట్‌లోని 230 స్థానాలకు గాను మితవాదులకు 99 మాత్రమే వున్నాయి. కమ్యూనిస్టుపార్టీకి 18, వామపక్ష కూటమికి 19, సోషలిస్టుపార్టీకి 85 స్థానాలతో కలిసి 122 వుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. మంగళవారం నాడు పార్లమెంట్‌ విశ్వాస పరీక్షలో మితవాద ప్రభుత్వాన్ని ఓడించి వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది. స్పీకర్‌ ఎన్నికలో వామపక్ష కూటమి అభ్యర్ది ఇప్పటికే ఎన్నికయ్యారు.

పొదుపు చర్యల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్న తరుణంలో ఐరోపాలో మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటిని వ్యతిరేకించే శక్తులవైపు జనం చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో పోర్చుగల్‌ పరిణామాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో అప్పులు ఇచ్చిన వారి షరతులకు కట్టుబడి వుంటామని సోషలిస్టు పార్టీ ప్రకటించింది. అయితే కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో వాటి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వ విధానాల ఖరారుకు ఆదివారం నాడు ఈ కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఆమోదయోగ్యమైన విధానాలను రూపొందించని పక్షంలో గ్రీస్‌లో మాదిరి మరోసారి ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదు.

The story hidden in Anupam Kher’s Twitter timeline – Dadri to #AwardWapsi – Truth Of Gujarat

— Modi in Election mode before May 2014: Pink Revolution, Pink Revolution Anupam Kher: Vote for Modi, Vote for Modi — Modi in China, Ireland etc: Mocking secularism on every second foreign tour. International Media watches a PM of a country mock a principle which is one of the standing principles in the country’s constitution. Anupam Kher: Silent — Dadri… Read more →

Source: The story hidden in Anupam Kher’s Twitter timeline – Dadri to #AwardWapsi – Truth Of Gujarat

Indian textile and garment firms may shift base to Vietnam

The Indian textile and garment companies facing duty disadvantage at home, some have already prompted to expand outside India in recent years. Moreover, with the recently negotiated Trans-Pacific Partnership (TPP), some more the Indian companies may shift their base to Vietnam to grab the advantage of duty-free access to the US and other TPP markets, like they did some years ago to Bangladesh to take the benefit of duty in exports as well as low labour costs, according to analysts.

Source: Indian textile and garment firms may shift base to Vietnam

Romila Thapar ‘Appalled’ by Media Reports of Her Presence at Congress Event | The Wire

New Delhi: The noted historian Romila Thapar has issued a statement making it clear that contrary to reports in some sections of the media, she did not take part in an event organised by the Congress party think-tank, the Rajiv Gandhi Institute for Contemporary Studies, on Friday.”I would lik

Source: Romila Thapar ‘Appalled’ by Media Reports of Her Presence at Congress Event | The Wire