Tags
#Lula is back, anti left, brazi 2026 elections, Donald trump, Flavio Bolsonaro Flees Brazil, lula da silva
ఎం కోటేశ్వరరావు
ఆదివారం నాడు జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల తుదిపోరులో వామపక్ష, ప్రజాతంత్ర కూటమి నేత లూలా డిసిల్వా(80) నాలుగవసారి చారిత్రాత్మక విజయం సాధించాడు.అన్నీ సజావుగా ఉంటే డిసెంబరు 18వ తేదీన ఎన్నికను నిర్దారిస్తూ అధికారిక పత్రాలను జారీ, జనవరి ఐదున పదవీ స్వీకారం చేస్తారు.ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త పార్లమెంటు ప్రారంభం అవుతుంది.ప్రజాస్వామ్య పునరుద్దరణ తరువాత అక్కడ జరిగిన ఏడు ఎన్నికల్లో ఆరుసార్లు వామపక్షం నెగ్గింది.లూలాకు 51.75, ప్రత్యర్ధి ఫ్లావియో బోల్సనారోకు 48.25 శాతం చొప్పున ఓట్లు రాగా లూలా మెజారిటీ 45లక్షలు దాటింది. అక్కడి రాజ్యాంగం ప్రకారం 50శాతంపైగా ఓట్లు ఎవరికీ రాకపోతే ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న అభ్యర్దులతో రెండవసారి ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దఫా ఓటింగ్‌లో బోల్సనారోకు 47.03, లూలాకు 45.16 శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి.మిగిలినవి ఇతరులకు వచ్చాయి.రెండవ దఫాలో లూలా కోటీ పదిలక్షల ఓట్లను అదనంగా పొందాడు.బ్రెజిల్ పతాకాన్ని ముద్దాడుతున్న అభ్యర్ధి కావాలో అమెరికా పతాకాన్ని ముద్దాడుతున్న వ్యక్తి కావాలో తేల్చుకోవాలని రెండవ దఫా ఎన్నికల ప్రచారంలో లూలా కోరాడు. మితవాదాన్ని వ్యతిరేకించే వారందరూ లూలాకు మద్దతు ఇచ్చారు. ఈ విజయం నయాఫాసిస్టు ట్రంప్‌కు కూడా ఓటమే అని .కూటమిలో భాగమైన బ్రెజిల్ కమÖ్యనిస్టు పార్టీ(పిసిడిఓబి) పత్రిక వెర్మెలో వ్యాఖ్యానించింది. బోల్సనారోకు మద్దతు ఇవ్వటమేగాక సామాజిక మాధ్యమవేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుస్,వాట్సప్ యాజమాన్య కంపెనీ మేటా లూలాకు వ్యతిరేకంగా పని చేసింది.అమెరికా జోక్యం, ఇతర కుట్రలను బ్రెజిలియన్ ఓటర్లు జయప్రదంగా తిప్పి కొట్టారు. దక్షిణ లేదా లాటిన్ అమెరికాలోని పన్నెండు దేశాల్లో ఇప్పుడు ఏడు చోట్ల మితవాదులు పాగా వేశారు. ఆ ఖండంలో పెద్దదైన బ్రెజిల్ వారిని అడ్డుకుంది. తన సోదరుడు ఓడిపోతే ప్రభుత్వం అరెస్టు చేయవచ్చని లేదా అమెరికాకు పారిపోవచ్చని ఫ్లావియో సోదరుడు ఎడ్వర్డ్ ఎన్నికలకు ముందు చెప్పాడు.అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బోల్సనారో దేశం విడిచిపారిపోయినట్లు మంగళవారం నాడు వార్తలు వచ్చాయి. అతగాడి గురించి అనుచరులు సంప్రదించగా ఆచూకీ దొరకలేదు. పాస్‌పోర్టును ప్రభుత్వానికి అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపధ్యంలో ఈ పరిణామం సంభవించింది. అధికారిక చెక్‌పోస్టుల ద్వారా దేశం వెలుపలకు వెళ్లినట్లు తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని బ్రెజిల్ పోలీసులు చెబుతున్నారు.సరిహద్దులో ఉన్న అర్జెంటీనా వెళ్లి అక్కడి నుంచి అమెరికాలో ఆశ్రయం పొందవచ్చని ఊహిస్తున్నారు.దేశం విడిచి వెళ్లకుండా తనపై ఆంక్షలు విధించినందున సాధారణ, ఎంపీగా దౌత్యపరమైన పాస్‌పోర్టులను అప్పగించాలని పోలీసులు కోరినట్లు సోమవారం రాత్రి బోల్సనారో సామాజిక మాధ్యమంలో పేర్కొన్నాడు.
తమ దేశాన్ని అమెరికాకు పెరటి తోట కానివ్వబోమని బ్రెజిల్ కార్మికవర్గం, యువత, విద్యార్ధులు రెండవ దఫా ఎన్నికలకు ముందు శపథం చేశారు. “ వీధుల్లో మరియు ఆన్లైన్లో లూలాతో విద్యార్ధులు ” అనే నినాదంతో నేషనల్ విద్యార్ధి యÖనియన్ దేశవ్యాపితంగా ప్రచారం చేసింది.కమÖ్యనిస్టు పార్టీ అనుబంధ సోషలిస్టు యÖత్ ఈ ప్రయత్నాలకు వెన్నెముకగా నిలిచింది.కార్మిక సంఘాలు, సామాజిక ఉద్యమాలు, కళాకారులు, మేథావులు రంగంలోకి వచ్చారు.రెండవ దఫా ఎన్నికలకు ముందు దేశవ్యాపితంగా జరిగిన ప్రదర్శనల్లో కోటీ యాభైలక్షల మంది పాల్గ్గొన్నారు.సావోపాలో నగరంలో జరిగిన సభకు ఇరవైలక్షల మందికి పైగా వచ్చారని అంచనా.లూలా సైన్యం పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో కొద్ది రోజుల్లోనే కోటీ ఎనిమిది లక్షల మంది చేరారు. ఎన్నికల రోజున ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రాకుండా అడ్డుకొనేందుకు మితవాదులు అనేక ఆటంకాలను కలిగించారు.వారు ఆధిపత్యవహిస్తున్న ఐదు రాష్ట్రాలు, మేయర్లుగా ఉన్న సావోపాలో, సాల్వడార్ తదితర ప్రాంతాల్లో ప్రజారవాణా బస్సుల నిలిపివేత చర్యలకు పాల్పడ్డారు.కోర్టులు జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో నడపాలని ఆదేశించాల్సి వచ్చింది.సాల్వడోర్ నగరంలో బస్సులన్నింటినీ నిలిపివేయటంతో రవాణా అధికారిని అరెస్టు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది.భారీ వర్షాల కారణంగా బస్సులను నిలిపివేసినట్లు బోల్సనారో సమర్ధించాడు.పోలింగ్ వ్యవధిని రెండు గంటలపాటు పొడిగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.ఈ చర్యను ట్రంప్ కుమారుడు విమర్శించి తన అక్కసును వెళ్లగక్కాడు.ఈ ఆటంకాలేవీ లూలా విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.ఈ పరిణామం ఒక్క దక్షిణ అమెరికాలోనే కాదు, యావత్ ప్రపంచం మీద ప్రభావం చూపుతుంది.అమెరికా, ట్రంప్ కుట్రలను ఎదుర్కోవటంపైనే లూలా తన ప్రచారాన్ని కేంద్రీకరించాడు. కమÖ్యనిస్టులు, ప్రజాస్వామికవాదులు, మితవాద ఫాసిస్టు శక్తులను వ్యతిరేకించేవారికి అనేక గుణపాఠాలను నేర్పుతున్నది,హెచ్చరికలు చేసింది.
వామపక్ష లూలా చారిత్రక విజయం సాధించినప్పటికీ లాటిన్ అమెరికా వామపక్ష, కమÖ్యనిస్టు, పురోగామి శక్తులు ఎదుర్కొంటున్న బలహీనతలను ఈ ఎన్నిక కూడా వెల్లడించింది.పార్లమెంటులోని 513 ప్రజాప్రతినిధుల స్థానాల్లో మితవాద శక్తులు 276వరకు గెలుచుకొని మెజారిటీ సాధించారు.లూలా సర్కార్ అమలు జరిపే అనేక పథకాలను వారు అడ్డుకొనే అవకాశం ఉంది. అయితే రాజ్యాంగ మార్పులకు 308 ఓట్లు అవసరం గనుక ఆ ముప్పు లేదు.దామాషా ప్రాతినిధ్య విధానం ఉన్న కారణంగా కొన్ని వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు విడిగా పోటీ చేశాయి.మితవాద బోల్సనారో నాయకత్వం వహిస్తున్న పిఎల్ పార్టీ 121 స్థానాలతో పెద్ద పక్షంగా అవతరించగా లూలా నాయకత్వంలోని కూటమికి 88 వచ్చాయి. మిగిలినవాటిని ఇతరులు పంచుకున్నారు. ఎగువసభ సెనెట్‌లో 81 స్థానాలకు దాదాపు ఇదే పద్దతుల్లో సీట్లు వచ్చాయి.మితవాదులదే పైచేయిగా ఉంది. ప్రత్యక్ష ఎన్నికల విధానం 1989లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు లూలా తప్ప ఎవరూ నాలుగుసార్లు గెలవలేదు.తాను గెలిస్తే బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్ పాత్రను సమీక్షిస్తానని, అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటానని బోల్సనారో ఓటర్లకు వాగ్దానం చేశాడు.ఇప్పుడు ఆ ప్రమాదం తప్పింది.ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అక్మిన్ గతంలో ఒక రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశాడు. మధ్యేవాద మితవాదిగా కొందరు వర్ణించారు. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయి.తాజా ఎన్నికల్లో వారిలో కొందరిని లూలా మద్దతుదారులుగా మారేందుకు ప్రయత్నించి కొంత మేరకు సఫలీకృతం అయ్యారు. మొదటి దఫా లూలా వెనుకబడగానే స్టాక్ ఎక్సేంజ్‌లో సూచిక రికార్డు స్థాయికి పెరిగింది. పెట్టుబడిదారులు ముందే పండగ చేసుకున్నారు. ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
వాగ్దానాల విషయానికి వస్తే జీవన వ్యయాన్ని తగ్గిస్తానని,వారాంతంలో ప్రజా రవాణా వ్యవస్థలో ఉచితంగా ప్రయాణించే అంశాన్ని పరిశీలిస్తామని,గృహస్తుల రుణ భారం తగ్గింపు, సామాజిక మాధ్యమ కంపెనీలను నియంత్రిస్తానని లూలా చెప్పాడు.అల్పాదాయ వర్గాల పిల్లలు స్కూళ్లకు వెళ్లేందుకు, కాలేజీల్లో చదువుకొనేందుకు అవసరమైన పథకాలను రూపొందిస్తామని చెప్పాడు. కాన్సర్ చికిత్సతో సహా అందరికీ ఆరోగ్య పథకాన్ని వర్తింప చేయటంతో పాటు వృద్దులు, మహిళలకు అనుకూలమైన పథకాలు అమలు చేస్తామని,నేరాలను అదుపుచేసి కార్మికులకు భద్రత, నేరగాళ్లకు జైలు ప్రాప్తి కల్పిస్తామన్నాడు.దేశానికి పన్నులు చెల్లించకుండా తప్పించుకొనే బడా ఐటి కంపెనీలు తమకు అవసరం లేదని, చైనా లేదా అమెరికా కృత్రిమ మేథ మీద ఆధారపడకుండా స్వంతంగా అభివృద్ది చేసే విధానాన్ని అనుసరిస్తామని చెప్పాడు. గెలిచిన వారిని అందరూ అంగీకరిచరని అయితే ఒకసారి ఎన్నికైన తరువాత ప్రతిఒక్కరికి పాలన అందుబాటులో ఉంటుందన్నాడు. లూలాకు తొలి పరీక్ష 2027 బడ్జెట్ రూపంలో ఎదురుకానుంది.ద్రవ్యోల్బణ లక్ష్యం 4.5శాతం కాగా అక్టోబరు 19న కేంద్ర బ్యాంకు వెల్లడించిన వివరాల మేరకు 5.22శాతం ఉంది. ప్రభుత్వ రుణం జిడిపిలో 93శాతం ఉంది.అమెరికాకు వ్యతిరేకంగా ఒక సైద్దాంతిక వాహనంగా ఉన్న బ్రిక్స్ కూటమి నుంచి తప్పుకొనే అంశాన్ని పరిశీలిస్తానని బోల్సనారో చెప్పాడు.ఈ కూటమి, దానితో జత కట్టిన దేశాలపై పదిశాతం అపరాధ పన్ను విధిస్తానని డోనాల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు బ్రెజిల్‌పై 50శాతం విధిస్తానంటూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు చూశాడు. ఇరాన్‌తో సహా మరికొన్ని దేశాలు అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా బ్రిక్స్‌లో చేరేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై దాడిని ఖండించటం, ఇతర అంశాల్లో అమెరికాను పేరు పెట్టి విమర్శించకుండా అధ్యక్ష స్థానంలో ఉన్న మనదేశం అడ్డుపడింది.వచ్చే ఏడాది చైనా అధ్యక్ష స్థానానికి ఎన్నికైంది. ప్రియమైన స్నేహితుడికి హృదయ పూర్వక అభినందనలు అంటూ నరేంద్రమోడీ సోమవారం నాడు లూలాకు సందేశం పంపారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం 15 బిలియన్ డాలర్ల మేర ఉన్న వాణిజ్య లావాదేవీలను 2030 నాటికి 30 బిలియన్లకు పెంచాలని ఉభయ దేశాలూ ఆకాంక్షించాయి. అపురూప విలువైన ఖనిజాలు కలిగిన దేశాలలో రెండవదిగా బ్రెజిల్ ఉన్నప్పటికీ వాటిని వెలికి తీయటంలో ఒక శాతం కంటే తక్కువగా ఉంది. అమెరికా గతంలో ఒక ఒప్పందం చేసుకుంది, మన దేశం చైనా మీద ఆధారపడ కుండా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది.తాను గెలిస్తే ఆ ఖనిజాలను అమెరికాకు అప్పగిస్తానని ఓడిపోయిన బోల్సనారో అంతకు ముందు చెప్పాడు. ఫలితాలను తాను గుర్తించటం లేదని ఆదివారం నాడు ఓటమి తరువాత చెప్పాడు. దీన్ని బట్టి కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ఉక్రోషంతో ఉన్న ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.
ఆదివారం నాటి పోలింగ్‌కు ముందు శుక్రవారం నాడు ఇద్దరు అభ్యర్ధులు ముఖాముఖీ టీవీ చర్చలో పాల్గొన్నారు.పరస్పరం విధానాల మీద ప్రశ్నలను సంధించారు.వ్యక్తిగతంగా లూలాను తొమ్మిదివేళ్ల వాడంటూ బోల్సనారో నోరుపారవేసుకున్నాడు. ఒక లోహపరిశ్రమలో కార్మికుడిగా జీవితం ప్రారంభించిన లూలా 17 సంవత్సరాల వయస్సులో రాత్రి షిప్టులో పనిచేస్తుండగా యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఎడమచేయి చిన్నవేలును కోల్పోయారు.బోల్సనారోకు ఆకలి అంటే ఏమిటో తెలియదని ఒక సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి వామపక్ష వర్కర్స్ పార్టీ నేతగా ఎదిగి మÖడుసార్లు అధ్యక్షుడిగా గెలిచిన లూలా అన్నాడు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలెయ్ మాదిరి ప్రభుత్వ ఖర్చుకు కోత పెట్టే దమ్ముందా అని బోల్సనారోను ప్రశ్నించాడు. మీరు దేశాన్ని దివాలా తీయించారు గనుక తానూ అదే చేస్తానంటూ ప్రత్యర్ధి జవాబిచ్చాడు. బ్రెజిల్ కార్పొరేట్లు అదే కోరుతున్నాయి, అందుకే వారంతా బోల్సనారో వెనుక సమీకృతులయ్యారు.అర్జెంటీనాలో పొదుపు చర్యలను యాంత్రిక “ రంపపు కోత ”తో పోల్చారు. ఇటీవల ఐఎంఎఫ్ అధిపతి అదే మాదిరి ఖర్చు తగ్గించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా రంపపు కోత పథకంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.మంత్రిత్వశాఖలను 18 నుంచి ఎనిమిదికి తగ్గించారు.ప్రభుత్వ ఉద్యోగాలలో పదిశాతం అంటే 40వేల పోస్టులను రద్దు చేశారు. ప్రజారవాణా, విద్యుత్, గ్యాస్, ఆహారం సబ్సిడీలను భారీగా తగ్గించారు. అద్దె నియంత్రణ చట్టాన్ని రద్దు చేశారు.పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి పన్ను రద్దు,ద్రవ్యలోటు, 211శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కొత్తగా కరెన్సీ ముద్రణ నిలిపివేత వంటి చర్యలు ఉన్నాయి. ఇలాంటి వాటిని అమలు చేస్తానని బహిరంగంగా ప్రకటించటంతో అనేక మంది బోల్సనారోకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 48శాతంపైగా జనాలు మద్దతు ఇవ్వటం గమనించాల్సిన అంశం. కఠినమైన చర్యలు తమ జీవితాలను మెరుగుపరుస్తాయనే భ్రమల్లో జనాలు ఉంటారని ఈ పరిణామం స్పష్టం చేసింది. అధ్యక్షులు, ప్రధానులుగా వామపక్ష నేతలు గెలిచినప్పటికీ పార్లమెంట్లలో సంపూర్ణ మెజారిటీ రావటం లేదు. ఈ కారణంగానే అనేక దేశాలలో వామపక్షాలు కొన్ని సంక్షేమ పథకాలతో సంస్కరణలు మాత్రమే అమలు చేసి తాత్కాలిక ఉపశమనం కలిగించటం తప్ప విప్లవాత్మకమైన చర్యలు చేపట్టేందుకు పూనుకోలేదు, వాటికి అవకాశం కూడా రాలేదు. సంక్షేమ పథకాలు ఒక దశదాటిన తరువాత తిరిగి జనంలో అసంతృప్తికి కారణమౌతున్నాయి. ఈ పరిస్థితిని మితవాద శక్తులు ఉపయోగించుకుంటున్నాయి, వాటికి అమెరికా ఇతర సామ్రాజ్యవాదులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.అయినా లూలా నాలుగవసారి గెలవటం న్పుింగా ఒక చారిత్రక అంశమే !
