• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

అమెరికా అల్లిన 24 అబద్దాలు- చైనా చెప్పిన 24 నిజాలు !

12 Tuesday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, USA

≈ 1 Comment

Tags

#US Lies, 24 American lies, 24 American lies- Chinese 24 truths, 24 ‘lies’ by US over Covid-19, Chinese 24 truths, COVID-19

Rob Rogers on Twitter: "Lies cartoon: https://t.co/SamLHmQDgA ...
ఎం కోటేశ్వరరావు
అగ్రరాజ్యం అమెరికా. దాని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా లేదా ప్రపంచ చరిత్రలో ఒక దేశాధిపతిగా ట్రంప్‌ మాట్లాడినన్ని అబద్దాలు మరొకరు మాట్లాడి ఉండరు. ఎన్ని అబద్దాలు చెబితే అంత బలం వస్తుందన్న నమ్మకం ఉన్న వ్యక్తిగా ఇప్పటికే విశ్లేషకులు తేల్చివేశారు. నోరు తెరిచి నాలుగు అంశాలు చెబితే వాటిలో మూడు పాక్షిక లేదా పూర్తి అబద్దాలే. అలాంటి వ్యక్తి, ఆయన యంత్రాంగం కరోనా వైరస్‌ గురించి అనేక కట్టుకథలు సృష్టించటం, వాటిని మీడియా ద్వారా ప్రచారంలో పెట్టటం తెలిసిందే. అనేక మంది తాము తటస్ధులం అని చెప్పుకుంటారు. ట్రంప్‌ అబద్దాల కోరని అంగీకరిస్తారు, అదే సమయంలో ఆ నోటి నుంచి లేదా సిఐఏ ఇతర కట్టుకథల ఫ్యాక్టరీల నుంచి వెలువడే అబద్దాల ఉత్పత్తులను ఉపయోగించుకొని ఏక పక్షంగా మరో దేశం మీద దాడి చేస్తారు. వీరిలో ఒక రకం తమకు తెలియకుండానే ప్రచార సమ్మోహన అస్త్రానికి పడిపోయిన వారు, రెండవ తరగతి అన్నీ తెలిసి కూడా రాళ్లేసే రకం. గతంలో ప్రచ్చన్న యుద్దం పేరుతో సోవియట్‌ యూనియన్‌, తూర్పుఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం గురించి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్‌ సందర్భంగా అదే రకమైన ఏకపక్ష దాడి ప్రారంభమైంది. అమెరికా పాటపాడితే కొన్ని దేశాలు గొంతు కలుపుతున్నాయి, మరికొన్ని పక్కవాద్యాలు వాయిస్తున్నాయి.
తెలుగు మీడియా ఇచ్చే అంతర్జాతీయ వార్తలన్నీ అమెరికా, ఐరోపా దేశాల అదుపులో ఉండే వార్తా సంస్ధల నుంచి తీసుకుంటున్నవే. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి రాసేవారు, చూపే వారు పోటీపడుతున్నారు. ఎంత సంచలనాత్మకంగా ఉంటే అంతకిక్కు, అంత రేటింగ్‌ ఉంటుంది మరి. దిగువ అంశాలు చైనా వార్తా సంస్ధ గ్జిన్హువా విడుదల చేసిన సమాచారం ఆధారంగా రాస్తున్నవే. నిడివి పెద్దది కాకుండా చూడటం కోసం సంక్షిప్తీకరించి ఇస్తున్నాను. దీనిలో 24 అంశాలపై తమ మీద వేస్తున్న అభాండాలు, చేస్తున్న అబద్ద ప్రచారం ఏమిటో చెబుతూనే దానికి సమాధానాలు ఇచ్చారు. అయినా దీన్ని ఏకపక్ష ప్రచారం అని ఎవరైనా అనుకుంటే అది వారి విజ్ఞతకే వదలి వేద్దాం. చైనా తాను చెప్పిన సమాధానాలకు, వివరణలకు, విమర్శలకు ఆధారాలతో సహా ఇచ్చింది. పాఠకుల సౌకర్యం, విశ్వసించని వారి నిర్ధారణ కోసం ఆ లింక్‌ను కూడా దిగువ ఇస్తున్నాను.
ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే ఉంటారని కమ్యూనిస్టు లెనిన్‌ చెప్పారు. ఆయన పుట్టక ముందే అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తూ హత్యకు గురైన అబ్రహాం లింకన్‌ మరో విధంగా చెప్పారు. ఎవరైనా జనం మొత్తాన్ని కొంతకాలం, కొంత మందిని కొంతకాలమే వెర్రి వెంగళప్పలను చేయగలరు గానీ అందరినీ, ఎల్లవేళలా చేయలేరు అన్నారు. వెలుగు వచ్చేకొద్దీ చీకటి పారిపోతుంది, అబద్దాలు కూడా కూడా నిజం రానంతవరకే అది పెత్తనం చేస్తాయని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇక ఆరోపణలు, వాటి మీద చైనా వార్తా సంస్ధ సమాధానాల సారాంశం చూద్దాం.
1.ఆరోపణ: కోవిడ్‌-19 అనేది చైనా లేదా ఊహాన్‌ వైరస్‌.
వాస్తవం : ఒక వ్యాధి పేరులో ప్రతికూల ప్రభావం చూపే అంటే అనవసరమైన భయాలు కలిగించే విధంగా ఒక ప్రాంతం, దేశం, ఆహారం, సంస్కృతి, జనాభా, పరిశ్రమ, వృత్తి లేదా జంతుజాతి పేరు ఉండకూడదని 2015 మే ఎనిమిదవ తేదీ ఐక్యరాజ్యసమితి సంస్ధలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. అంతకు ముందే కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ 2012లో తలెత్తిన ”మెర్స్‌” మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) పేరు మీద తలెత్తిన పరిస్ధితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణ్యంగానే 2020 ఫిబ్రవరి 11న నోవెల్‌ కరోనా వైరస్‌ కారణంగా తలెత్తే న్యూమోనియా వ్యాధికి కరోనా వైరస్‌ డిసీజ్‌ 2019(కోవిడ్‌-19) అని పేరు పెట్టారు. అయితే బ్రిటీష్‌ సైన్స్‌ పత్రిక ఏప్రిల్‌ నెలలో ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించి రాసిన సంపాదకీయాలలో కోవిడ్‌-19ను చైనా మరియు ఊహాన్‌తో జతచేసి ప్రస్తావించి తదుపరి క్షమాపణ చెప్పింది. బిబిసి, న్యూయార్క్‌ టైమ్స్‌, అమెరికన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ(ఏబిసి) వంటివి ఆసియా వాసులతో సంబంధాన్ని అంటగట్టి వార్తలను ప్రచారం, ప్రసారం చేయటంతో పశ్చిమ దేశాలలో ఆసియా వ్యతిరేకత, జాత్యంహాకార ధోరణులతో ఆసియా ఖండ పౌరులను వేధించిన ఉదంతాలు జరిగాయి.
2. ఆరోపణ: వైరస్‌ ఊహాన్‌లోనే పుట్టింది.
వాస్తవం: వైరస్‌ తొలిసారి ఊహాన్‌లో బయటపడినంత మాత్రాన అది అక్కడే పుట్టిందని అర్ధం కాదు, శాస్త్రవేత్తలు దాన్ని ఇంకా గుర్తించలేదు. ఉదాహరణకు ఎయిడ్స్‌ వ్యాధిని తొలుత అమెరికాలో గుర్తించారు. అది అక్కడ పుట్టింది కాకపోవచ్చు. అలాగే స్పానిష్‌ ఫ్లూ స్పెయిన్‌లో పుట్టలేదు అనేందుకు అనేక ఆధారాలు దొరికాయి. ఎక్కడ నుంచి తలెత్తిందన్నది శాస్త్ర అంశం. జనవరి 24న బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌లో ప్రచురితమైన విశ్లేషణలో డిసెంబరు 16 నుంచి జనవరి రెండవ తేదీ వరకు ఊహాన్‌ నగరంలో నిర్ధారణ అయిన 41కరోనా కేసులలో 27 మందికి ఊహాన్‌ సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో సోకినట్లు తేలింది, మిగిలిన వారికి వేరే ప్రాంతాలలో సోకింది. తొలి రోగిని డిసెంబరు ఒకటవ తేదీన గుర్తించారు. అతనికీ మార్కెట్‌కు ఎలాంటి సంబంధం లేదు, కుటుంబ సభ్యులకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తలేదు. అతని నుంచి ఇతరులకు వ్యాపించిందనే ఆధారాలు దొరకలేదు. వైరస్‌ ఎక్కడ ఉద్బవించింది అనే అంశంలో అమెరికా నుంచి తమ సంస్ధకు ఎలాంటి సమాచారం లేదా నిర్ధిష్ట రుజువులు అందలేదని మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమాల డైరెక్టర్‌ డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని బెలెవిలే మేయర్‌ మైఖేల్‌ మెల్‌హామ్‌ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఇదే వైరస్‌తోనే తాను 2019నవంబరులో కూడా అస్వస్తతకు గురై ఉండవచ్చని చెప్పారు. అంటే అది అమెరికాలో బయటపడిన తొలి కేసు జనవరి 20కి రెండునెలల ముందునాటి సంగతి. మే ఆరవ తేదీన యుఎస్‌ఏ టుడే వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్లోరిడాలో జనవరి ప్రారంభంలోనే 171 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి, అయితే వారెవరూ చైనాకు ప్రయణించిన వారు కాదు.
మే మూడవ తేదీన యాంటీమైక్రోబియల్‌ ఏజంట్స్‌ అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో 2019 డిసెంబరు చివరి నుంచే సారస్‌-కోవ్‌-2 వైరస్‌ ఫ్రాన్స్‌లో వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు. డిసెంబరు రెండు నుంచి జనవరి 16వరకు ఫ్లూ లక్షణాలతో ఐసియులో చికిత్స పొందిన 14 మందికి ఏప్రిల్‌ ఆరు-తొమ్మిదవ తేదీల మధ్య ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష చేశారు.వారిలో 42ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ బయటపడింది. అయితే అతనేమీ ఇటీవలి కాలంలో చైనా లేదా మరో విదేశీ ప్రయాణం చేయలేదు.

Political cartoons: Donald Trump blasts Google
3. ఆరోపణ: వైరస్‌ను ఊహాన్‌ వైరాలజీ సంస్ధలో తయారు చేశారు
వాస్తవం: అందుబాటులో ఉన్న రుజువులన్నీ సహజంగానే పుట్టినట్లు చూపుతున్నాయి. కృత్రిమంగా తయారు చేసింది కాదు. జనవరి 30వ తేదీ లాన్‌సెట్‌ వైద్య పత్రిక వ్యాసం ప్రకారం మిగతా వైరస్‌లతో పోల్చితే గుడ్లగూబల నుంచే వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఎనిమిది దేశాలకు చెందిన 27 మంది ప్రముఖ నిపుణులు చేసిన ప్రకటనలో కరోనా వైరస్‌ మిగతా వాటి మాదిరే వన్య ప్రాణుల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. మార్చి 17న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలకు చెందిన ఐదుగురు ప్రముఖ నిపుణులు వైరస్‌ను ప్రయోగశాలలో తయారు చేయలేదని, పని గట్టుకొని వ్యాపింప చేయలేదని తెలిపారు. మార్చి 26న అమెరికా జాతీయ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌ రాసిన వ్యాసంలో సహజంగానే కరోనా వైరస్‌ పుట్టిందని, ఎవరూ తయారు చేయలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 21న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రతినిధి ఫడేలా చాయిబ్‌ మాట్లాడుతూ వైరస్‌ జంతువుల నుంచే వచ్చిందని అయితేగబ్బిలాల నుంచి మానవులకు ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ అంతుబట్టలేదన్నారు. ఏప్రిల్‌ 30న అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన ప్రకారం కరోనా వైరస్‌ కృత్రిమంగా తయారు చేసింది లేదా జన్యుమార్పిడి చేసింది కాదనే శాస్త్రవేత్తల అభిప్రాయంతో గూఢచార సమాజం ఏకీభవిస్తున్నదని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ మాట్లాడుతూ వైరస్‌ జన్యుక్రమం గురించి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం సహజంగా ఉద్భవించిందే అన్నారు. మే ఐదవ తేదీన అదే సంస్ధ ప్రతినిధి డాక్టర్‌ గువ్‌డెన్‌ గాలెయా కూడా అదే చెప్పారు. ఫ్రెంచి పత్రి వాలెర్‌ యాక్ట్యువల్‌ తమ దేశ గూఢచార వర్గాలను ఉటంకిస్తూ వైరస్‌ ఊహాన్‌లోని పి4లాబ్‌ నుంచి వెలువడలేదని పేర్కొన్నది.
4 ఆరోపణ : ఊహాన్‌ వైరాలజీ సంస్ధ నుంచి ప్రమాదవశాత్తూ వైరస్‌ లీకైంది.
వాస్తవం: ఊహాన్‌ నేషనల్‌ బయోసేఫ్టీ లాబరేటరీ(పి4) చైనా-ఫ్రెంచి ప్రభుత్వాల సహకారం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైంది. దీనిలో పనిచేసే తొలి బృందం సిబ్బందికి ఫ్రాన్స్‌, అమెరికాలోనే శిక్షణ ఇచ్చారు. ఇక్కడి సౌకర్యాలు, పరికరాలను మూడవ పక్షం ప్రతిఏటా తనిఖీ చేస్తుంది. తనిఖీలో అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారితమైన తరువాతే పని చేయటాన్ని అనుమతిస్తారు. ఆ లాబ్‌కు కృత్రిమ వైరస్‌ తయారు చేసే సామర్ధ్యం లేదు, వైరస్‌ లీకై సిబ్బందికి సోకిన రుజువులేదు. ఈ లాబ్‌ కార్యకలాపాల గురించి, కరోనా వైరస్‌ గురించి తెలుసుకొనేందుకు యావత్‌ ప్రపంచం నుంచి ఆరులక్షల మంది వెబ్‌సైట్‌ను దర్శించగా 2.1కోట్ల డౌన్లోడ్‌లు నమోదయ్యాయి. ఎలర్జీ మరియు అంటువ్యాధుల అమెరికా జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫౌసీ మే4న మాట్లాడుతూ చైనా లాబ్‌లో వైరస్‌ తయారు కాలేదని, ప్రకృతిలోనే పుట్టి జంతువుల్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని అన్నారు. జంతువుల నుంచి సోకిన వైరస్‌ను లాబ్‌కు తెచ్చినపుడు ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి లీకైందన్న కథనాన్ని తాను నమ్మటం లేదన్నారు. వైరస్‌ కృత్రిమ సృష్టి అని ఎలాంటి రుజువులు లేవని బ్రిటీష్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హనాక్‌ అక్కడి పత్రిక ఇండిపెండెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు.
5. ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ను అరికట్టిన చైనా తమ జాతీయులను మిలన్‌, న్యూయార్క్‌ ఇతర నగరాల్లో వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు పంపింది.
వాస్తవం: స్వల్ప వ్యవధిలోనే చైనా కఠిన చర్యలు తీసుకుంది. చైనా నుంచి బయటకు చాలా తక్కువగా వ్యాప్తి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 23 నుంచి ఏప్రిల్‌ ఎనిమిది వరకు ఊహాన్‌ నగరం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ సమయంలో నగర వాసులు బయటకు వెళ్లలేదు. జనవరి 23న అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఫిబ్రవరి రెండున అమెరికా తన సరిహద్దులను మూసివేసింది. అంతకు ముందు కేవలం ఎనిమిది కేసులు మాత్రమే అమెరికాలో నమోదయ్యాయి. మార్చి 13న అమెరికా జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. ఆరోజుకు 1,896 కేసులు నిర్ధారణ అయ్యాయి. చైనాలో లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన ఏప్రిల్‌ 8వ తేదీనాటికి అమెరికాలో కేసులు నాలుగు లక్షలకు పెరిగాయి. ఒకటి నుంచి పది లక్షలకు పెరగటానికి అమెరికాలో వందరోజుల కంటే తక్కువే పట్టింది. తమ రాష్ట్రానికి చైనా నుంచి వైరస్‌ రాలేదని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిడీ పరిశోధన వెల్లడించినట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమో చెప్పారు. న్యూయార్క్‌ కరోనా వైరస్‌ ఆసియా నుంచి వచ్చింది కాదని అమెరికా పరిశోధనను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తను ప్రచురించింది. తమ దేశానికి అమెరికా సందర్శకులు వైరస్‌ను తీసుకు వచ్చినట్లు కెనడా సమాచారం వెల్లడించింది. గుర్తు తెలియని వనరు నుంచి ఫ్రాన్స్‌లో స్ధానికంగానే వైరస్‌ వ్యాపించిందని, చైనా, రష్యాల నుంచి రాలేదని ఫ్రెంచి పరిశోధనా సంస్ధ పాస్టర్‌ వెల్లడించింది.
6.ఆరోపణ: చైనీయులు గబ్బిలాలను తింటూ వైరస్‌ను వ్యాపింప చేశారు.
వాస్తవం: చైనీయుల ఆహారంలో ఎన్నడూ గబ్బిలాలు లేవు. ఒక చైనా మహిళ గుడ్ల గూబ చారు తాగుతున్నట్లు చూపే వీడియో ఇంటర్నెట్‌లో తిరుగుతోంది. ఒక చిన్న పసిఫిక్‌ దీవిలో విహార యాత్రల ప్రచారంలో భాగంగా ఆమె బృందం తీసిన వీడియో అది, దాన్ని 2016లోనే ఆన్‌లైన్‌లోనే పోస్టు చేశారు. గబ్బిలాల చారు అక్కడి ప్రత్యేకత.
7.ఆరోపణ: చైనా వన్య ప్రాణుల మార్కెట్లను తెరిచింది.
వాస్తవం: చైనాలో వన్య ప్రాణుల మార్కెట్లనేవి లేవు. వాటిని వేటాడటం, అమ్మకాలను చైనా నిషేధించింది. కోళ్లు, చేపల వంటి సముద్ర ఉత్పత్తులను మాత్రమే ప్రాణాలతో విక్రయించే మార్కెట్లు ఉన్నాయి. ఇలాంటివి ఒక్క చైనాలోనే కాదు అనేక దేశాలలో ఉన్నాయి. అలాంటి అమ్మకాలను నిషేధించే అంతర్జాతీయ చట్టాలు లేవు. రైతు బజార్లనే ఊహాన్‌లో తెరిచారు. ఊహాన్‌, హుబెరు, హునాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్లు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయి.
8 ఆరోపణ: వైరస్‌ వ్యాప్తి గురించి తొలి రోజుల్లో దాచి పెట్టింది, వెల్లడించటం ఆలస్యం చేసింది. దాంతో వ్యాప్తి పెరిగింది.
వాస్తవం: ఆకస్మికంగా గుర్తు తెలియని వైరస్‌ దాడి జరిగినపుడు అవగాహన, అధ్యయనం చేసేందుకు సమయం పడుతుంది. డిసెంబరు 27న న్యూమోనియాతో రోగులు ఉన్నట్లు గుర్తించారు. అదే రోజు వెల్లడించారు. మూడు రోజుల తరువాత కారణం తెలియని న్యూమోనియా గురించి ప్రకటించారు.డిసెంబరు 31న దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలిపారు. జనవరి మూడు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు, అమెరికా ఇతర దేశాలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి మూడు వరకు 30సార్లు అమెరికాకు సమాచారం తెలియచేశారు. జనవరి ఏడవ తేదీ నాటికి జన్యుక్రమాన్ని గుర్తించారు. పదకొండవ తేదీన ఆ సమాచారాన్ని ఇతర దేశాలకు అందచేశారు. వెంటనే నివారణ కిట్ల తయారీకి ఉపక్రమించారు. ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. చైనాలో వైరస్‌ గురించి ప్రకటన చేసిన 70రోజుల తరువాత అమెరికా అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది

Sack cartoon: In Trump we trust? | Star Tribune
9.వైరస్‌ వ్యాప్తిని గోప్యంగా ఉంచిందని బయట పెట్టిన డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ను అరెస్టు చేశారు.
వాస్తవం: వెనలియాంగ్‌ స్వంత సంస్ధ అక్రమాలను బయట పెట్టే వ్యక్తి కాదు, అతన్ని అరెస్టు చేయలేదు. అంటు వ్యా ధులను నిర్ధారించటానికి కఠినమైన నిబంధనలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఇది సాధారణ అంశం. అంటువ్యాధుల నిర్ధారణ గురించి వెల్లడించటానికి ఒక చట్టం, పద్దతులు ఉన్నాయి. డాక్టర్‌ ఝాంగ్‌ జిక్సియాన్‌ ఒక శ్వాసనిపుణుడు, కోవిడ్‌-19 గురించి తొలిసారి నివేదించాడు, అతనికి అవార్డును ఇచ్చారు. జిక్సియాంగ్‌ నివేదించిన మూడు రోజుల తరువాత డిసెంబరు 30న, అధికారికంగా విడుదల చేయటానికి ఒక రోజు ముందు డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ అనే కంటి వైద్యుడు తన సహచరులకు ఉరు ఛాట్‌ గ్రూప్‌లో ఏడు నిర్ధారితమైన సారస్‌ కేసులు ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని ప్రచారం చేయవద్దని పోస్టు పెట్టాడు. అయితే అది ఇంటర్నెట్‌లో బయటకు వచ్చి భయాన్ని కలిగించింది. జనవరి మూడవ తేదీన ఊహాన్‌ పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపి నిర్ధారణ కాని సమాచారాన్ని వెల్లడించకూడదని, ప్రచారాన్ని ఆపాలని చెప్పి అధికారయుతంగా మందలిస్తూ ఒక లేఖను ఇచ్చి పంపారు. తరువాత అతనికి వైరస్‌ సోకింది, జనవరి 31న నిర్ధారణ అయింది. ఫిబ్రవరి ఏడవ తేదీన అతను మరణించాడు. అతనికి సంబంధించిన అంశాల మీద దర్యాప్తు జరపాలని ఒక బృందాన్ని నియమించారు. మార్చి 19న దర్యాప్తు నివేదికను వెల్లడించారు.అతని విషయంలో చట్టపరమైన అంశాలను తప్పుగా అన్వయించారని, మందలింపు లేఖను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. డాక్టర్‌ లీ మంచి వైద్యుడు, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు, ప్రభుత్వ వ్యతిరేకి కాదు, మార్చి ఐదున కరోనా వ్యతిరేక పోరులో మరణించిన ఆదర్శ జాతీయ ఆరోగ్య కార్యకర్తగా లీని ప్రకటించి ఒక అమర జీవిగా ఏప్రిల్‌ రెండున గౌరవించారు. ప్రభుత్వ వ్యతిరేకిగా లీని చిత్రించటం అతన్ని, అతని కుటుంబాన్ని అగౌరవ పరచటమే.
10.మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడించటంలో చైనా చాలా ఆలస్యం చేసింది. దాంతో తగిన సమాచారం లేక అమెరికా, ఇతర దేశాలు వెంటనే స్పందించటంలో విఫలమయ్యాయి.
వాస్తవం: చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వర్తమానాలు సకాలంలోనే గట్టిగానే వెళ్లాయి, అమెరికాకు తొలి నుంచీ అన్నీ తెలుసు. ఒక కొత్త వైరస్‌ ఒక మనిషి నుంచి మరొక మనిషికి సోకుతుందా లేదా అని తెలుసుకొనేందుకు కఠినమైన శాస్త్రీయ క్రమం ఉంటుంది. జనవరి తొమ్మిదిన నోవెల్‌ కరోనా వైరస్‌ అని చైనా నిపుణులు ప్రకటించారు. ఇరవయ్యవ తేదీన ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందని నిర్ధారించారు. అప్పటికి అమెరికాలో నిర్దారిత కేసులు లేవు. ఇరవై మూడవ తేదీన కోటీ 20లక్షల మంది జనాభా ఉన్న ఊహాన్‌ నగరాన్ని లాక్‌డౌన్‌ చేసి ప్రపంచానికి గట్టి హెచ్చరికను పంపింది. ఆరోజుకు అమెరికాలో ఒకే ఒక్క కేసు నమోదైంది.అంతకు ముందు రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానవుల్లో వ్యాప్తి గురించి వెల్లడించింది, 27వ తేదీ ప్రమాద తీవ్రతను పెంచింది, 30వ తేదీన మహమ్మారిగా మారినట్లు వెల్లడించింది. ఊహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు పిలిపించి, జనవరి 25వ తేదీ నుంచి కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన తొలి దేశం అమెరికా. ఫిబ్రవరి రెండున తన సరిహద్దులను మూసివేస్తూ చైనా పౌరులు అంతకు ముందు 14రోజులు చైనాలో ఉన్న ఇతర దేశీయులకు ప్రవేశం లేదని నిషేధించింది. ఆరోజున అమెరికాలో కేవలం ఎనిమిది కేసులే ఉన్నాయి. మార్చి తొలి వారం వరకు అమెరికా తీవ్ర సమస్యగా పరిగణించలేదు. అమెరికా సమస్యలకు చైనా కారణమని చెప్పటం పెద్ద అబద్దం అని అమెరికా ప్రముఖ ఆర్ధికవేత్త జెఫ్రీ సాచ్స్‌ పేర్కొన్నారు. తాము డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధను హెచ్చరించామని చైనా రాష్ట్రమైన తైవాన్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే డిసెంబరు 31న తమకు తైవాన్‌ నుంచి వచ్చిన ఇమెయిల్‌లో ప్రత్యేక లక్షణాలు గల న్యూమోనియా కేసుల గురించి వచ్చిన వార్తలను ఉటంకిస్తూ తమకు దాని గురించి మరింత సమాచారం కావాలని అడిగారు తప్ప దానిలో హెచ్చరికలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ద వివరణ ఇచ్చింది.
11.ఆరోపణ: చైనాలో కేసులు, మరణాల గురించి వాస్తవాలు చెప్పటం లేదు, ప్రకటించిన దాని కంటే 50రెట్లు ఎక్కువ.
వాస్తవం: కరోనా సమాచారం విషయంలో చైనా పారదర్శకంగా ఉంది. జనవరి 21 నుంచి ప్రతి రోజూ అధికారికంగా సమాచారాన్ని వెల్లడించింది.జాతీయ, ప్రాంతీయ స్ధాయిలో మూడువేలకు పైగా పత్రికా గోష్టులు నిర్వహించారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్నకారణంగానే కేసులు, మరణాలు తగ్గాయి. వ్యాధి గ్రస్తులను ఇతరుల నుంచి పూర్తిగా వేరుచేశారు. ఈ చర్యల కారణంగా ఏడు లక్షల కేసులను నివారించినట్లు సైన్సు పత్రిక అంచనా వేసింది.
12.ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ కేసుల సంఖ్యను తరువాత సవరించటం కేసులను తొక్కిపెట్టారన్నదానికి నిదర్శనం.
వాస్తవం: సమాచార సమీక్ష, సవరణ అంతర్జాతీయంగా సాధారణంగా జరిగేదే. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి. ఒక్కసారిగా ఆసుపత్రులు రోగులతో నిండిపోవటంతో అనేక మంది ఆసుపత్రులకు రాకుండానే ఇండ్ల దగ్గరే మరణించారు. ఆసుపత్రులన్నీ నిండిపోవటంతో ఆరోగ్య కార్యకర్తలు కేసులన్నీ నమోదు చేయలేని స్ధితి ఏర్పడింది లేదా ఆలస్యం అయింది. తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ప్రయివేటు ఆసుపత్రులు, సంచార వైద్యశాలలు, కొన్ని సంస్ధలలో చికిత్స పొందిన వారు, మరణించిన వారిని జాబితాలకు అందచేయలేదు. కొన్ని కేసులు ఒకటికి రెండుసార్లు నమోదు కావటం, కొన్ని అసంపూర్ణంగా ఉండటం వంటి కారణాల వలన సమాచారాన్ని సరి చేసి సవరించారు. ఇది అంతర్జాతీయంగా జరుగున్నదే. ఉదాహరణకు బ్రిటన్‌లో ఆసుపత్రుల వెలుపల మరణించిన వారిని లెక్కించలేదు, తరువాత దాన్ని సరిచేశారు. స్పెయిన్‌ ప్రభుత్వం కూడా తమ సమాచారాన్ని సవరిస్తామని ప్రకటించింది.

trump lies
13. ఆరోపణ: కరోనా వైరస్‌ గురించి చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తోంది.
వాస్తవం: తప్పుడు సమాచార బాధితురాలు చైనా. అమెరికా రాజకీయవేత్తలు, పండితులు, మీడియా చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
14.ఆరోపణ:చైనా రాజకీయ వ్యవస్ధ సమస్యలకు మూలం.
వాస్తవం: సామాజిక వ్యవస్ధ లేదా భావజాలానికి వైరస్‌కు సంబంధం లేదు. వైరస్‌ను అరికట్టటంలో చైనా పౌరులు విజయం సాధించారు. నూటనలభై కోట్ల మందిని ఐక్యపరచటంలో రాజకీయ వ్యవస్ధ విజయం సాధించింది. ఒక అభివృద్ది చెందుతున్న దేశంగా చైనా సమస్యలను అధిగమించాల్సి ఉంది. వెయ్యి పడకల ఆసుపత్రిని పది రోజుల్లో, 1600 పడకల ఆసుపత్రిని 15 రోజుల్లో నిర్మించేందుకు చైనా రాజకీయ వ్యవస్ద పెద్ద ఎత్తున మానవ, వస్తుసామగ్రిని సమీకరించగలిగింది. రోజు లేదా ఒకటిన్నర రోజుల వ్యవధిలో 13వేల మంది రోగులను చేర్చేందుకు వీలుగా మరో 16 సంచార వైద్యశాలలను ఏర్పాటు చేసింది. వైరస్‌ నుంచి జనాన్ని రక్షించేందుకు గాను 13,800 గృహ సముదాయాలకు ఊహాన్‌ నగరంలో 44,500 మంది స్ధానిక పార్టీ కార్యకర్తలను సమీకరించి, భౌతిక దూరం పాటింపు, తదితర చర్యలను గట్టిగా అమలు జరిపింది. సింగపూర్‌లోని బ్లాక్‌బాక్స్‌ పరిశోధనా సంస్ద జరిపిన సర్వేలో 23దేశాల్లో తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించగా చైనాకు నూటికి 85మార్కులు వచ్చి అగ్రస్ధానంలో నిలిచింది. సంక్షోభం నుంచి దేశం బయటపడగలదని 85శాతం మంది చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదే అమెరికాలో 11, ఐరోపా యూనియన్‌లో 15,భారత్‌లో పదిశాతం మాత్రమే ఉన్నారు.
15. ఆరోపణ : నిజాలను బయట పెట్టకుండా అమెరికా విలేకర్లను చైనా నుంచి బహిష్కరించారు.
వాస్తవం: చాలా కాలంగా అమెరికా తీసుకుంటున్న చర్యలకు ప్రతిచర్య తప్ప మరొకటి కాదు. ఇటీవలి కాలంలో అమెరికా పరోక్ష చర్యల ద్వారా మీడియా సిబ్బందిని పరిమితం చేసి 60 మంది చైనా జర్నలిస్టులను బహిష్కరించింది. వీసాల విషయంలో కూడా అమెరికా అనుచితంగా వ్యవహరిస్తోంది.
16. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్దకు చైనా లంచాలు ఇచ్చి అదుపు చేస్తోంది.
వాస్తవం: చైనా ఎన్నడూ ఆ సంస్ధను అదుపు చేసేందుకు ప్రయత్నించలేదు.సంస్ధలో 194 దేశాలకు సభ్యత్వం ఉండగా ప్రధాన కార్యాలయంలో పని చేసే 21 మంది నాయకత్వ బృందంలో 11 మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌కు చెందిన వారే కాగా చైనా నుంచి ఒకే ఒక్కరు ఉన్నారు. వారందరూ నిపుణులే. 2018,19 సంవత్సరాలలో అమెరికా, జపాన్‌ తరువాతనే చైనా అతి పెద్ద దాతగా ఉంది. సభ్యత్వం, విరాళాన్ని పరిగణనలోకి తీసుకుంటే చైనా తొమ్మిదవ స్దానంలో ఉంది.చైనా వాణిజ్య సంస్ధలు, ప్రభుత్వేతర సంస్ధలు ఇచ్చిన మొత్తాలను మినహాయిస్తే చైనా స్ధానం ఇంకా దిగజారుతుంది.
17.ఆరోపణ: మనుషల నుంచి మనుషులకు సోకుతుందని డిసెంబరు 31వ తేదీనే తైవాన్‌ సమాచారమిచ్చినా ప్రపంచ ఆరోగ్య సంస్ద తీవ్రంగా పరిగణించలేదు.
వాస్తవం: తైవాన్‌ రాష్ట్రం ఆరోగ్య సంస్దకు ఎలాంటి హెచ్చరికను పంపలేదు.వ్యాధి గురించి ఊహాన్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించిన తరువాత అదనపు సమాచారం కావాలని ఆరోగ్య సంస్దను తైవాన్‌ కోరింది. అదే విధంగా చైనా జాతీయారోగ్య సంస్ధకూ లేఖ రాసింది.తైవాన్‌తో ఆరోగ్యం, వైద్యానికి సంబంధించి ఉన్న ఒప్పందం మేరకు వెంటనే సమచారాన్ని పంపారు. అదే రోజు తైవాన్‌ ఆరోగ్య సంస్ధకు ఇమెయిల్‌ పంపింది.
18. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్ధలో చేరేందుకు తైవాన్‌ ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంది. తద్వారా అక్కడి పౌరుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది.
వాస్తవం: చైనాలో అంతర్భాగమైన తైవాన్‌కు ఆరోగ్య సంస్దలో చేరేందుకు హక్కు లేదు. సర్వసత్తాక దేశాలకు మాత్రమే దానిలో చేరే హక్కు ఉంది. సాంకేతిక సహకారం వాటి మధ్య నిరాఘాటంగా కొనసాగుతోంది. తైవాన్‌ నిపుణులు అనేక సమావేశాలకు హాజరయ్యారు. తైవాన్‌ నుంచి ఊహాన్‌కు సైతం నిపుణులు వచ్చారు.
19. ఆరోపణ: ప్రపంచ వ్యాపితంగా వైరస్‌ వ్యాపించటానికి చైనాయే కారణం కనుక, ఆ విషయాలపై దర్యాప్తు జరపాలి, పరిహారం చెల్లించాలి.
వాస్తవం: చైనాయే బాధ్యురాలని, పరిహారం కోరేందుకు చట్టపరంగా ఎలాంటి అవకాశాలు లేవు. స్ధానిక రాజకీయ అజెండా కారణంగా అమెరికా రాజకీయవేత్తలు చైనా మీద నెపం వేస్తున్నారు. చైనా కూడా బాధిత దేశమే. ఒక చోట తొలుత వెల్లడైనంత మాత్రాన ఆ దేశం నష్టపరిహారం చెల్లించాలని ఎక్కడా లేదు.1980దశకంలో ఎయిడ్స్‌ తొలుత అమెరికాలో బయటపడింది, అప్పటి నుంచి పరిహారం చెల్లించాలని దాన్ని ఎవరూ అడగలేదు. ప్రజారోగ్యం గురించి అమెరికాతో చైనాకు ఎలాంటి ఒప్పందమూ లేదు.
20. ఆరోపణ: వైరస్‌ నుంచి లబ్దిపొందేందుకు వైద్య సరఫరాలను చైనా దాచిపెట్టింది. అమెరికాలో వెంటిలేటర్ల వంటి వాటికి కొరత ఏర్పడటానికి ఇదే కారణం.
వాస్తవం: దేశీయంగా వైరస్‌ను ఎదుర్కొంటూనే ఇతర దేశాలకు సాయపడేందుకు చైనా తన శక్తికొద్దీ ప్రయత్నించింది. ఇప్పటికి 150దేశాలకు వైద్య సరఫరాలు చేసింది. మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 30వరకు 71.2బిలియన్ల వైద్య పరికరాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేసింది. మార్చి ఒకటి మే అయిదవ తేదీల మధ్య అమెరికాకు చైనా నుంచి 6.6బిలియన్ల ముఖతొడుగులు,344 మిలియన్‌ జతల సర్జికల్‌ తొడుగులు, 44.09 మిలియన్ల రక్షణ సూట్లు, 6.75 మిలియన్ల కళ్లద్దాలు, ఏడున్నర వేల వెంటిలేటర్లను సరఫరా చేశారు. ఇవిగాక అమెరికాలోని 30 రాష్ట్రాలు, 55 నగరాలకు అనేక లక్షల కిట్లు, తొడుగులు మొదలైన వాటిని విరాళంగా పంపారు.
21. ఆరోపణ: ఇతర దేశాలకు మహమ్మారి వ్యతిరేక సాయంలో కూడా చైనా రాజకీయ, ప్రచార కండూతితో వ్యవహరించింది.
వాస్తవం: వైరస్‌ను ఎదుర్కోవటంలో ఇతర దేశాలు చైనాకు చేసిన సాయానికి ప్రతిగానే చైనా కూడా సాయం చేసింది. చైనా నిపుణులు 120 వీడియో కాన్ఫరెన్సుద్వారా 160దేశాల వారితో అనుభవాలను పంచుకున్నారు. పందొమ్మిది దేశాలకు 21 చైనా బృందాలు వెళ్లాయి.
22. ఆరోపణ: డోనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి ఎన్నిక అవకుండా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటోంది.
వాస్తవం: చైనా ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే సూత్రానికి కట్టుబడి ఉంది. అమెరికాలోని కొందరు రాజకీయవేత్తలే అక్కడి ఎన్నికల్లో చైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చైనా మీద దాడిని ఎక్కుపెట్టాలని రిపబ్లికన్‌ పార్టీ సెనెటోరియల్‌ కమిటీ 57పేజీల పత్రాన్ని ప్రచార విభాగానికి అందచేసినట్లు పొలిటికో పత్రిక వెల్లడించింది. కరోనా వైరస్‌కు చైనాయే కారణమని, దాన్ని దాచిపెట్టిందని, డెమోక్రాట్లు చైనా పట్ల సానుకూలంగా ఉన్నారని, తాము ఎన్నికైన తరువాత వైరస్‌ను వ్యాప్తి చేసినందుకు చైనా మీద ఆంక్షలు విధిస్తామని ప్రచారం చేయాలని దానిలో పేర్కొన్నారు.

Cartoon Movement - Trump Lies
23.ఆరోపణ : కిట్స్‌, మాస్కులు, వెంటిలేటర్ల ఎగుమతుల గురించి ఎగుమతిదారులు కస్టమ్స్‌ వివరాలు వెల్లడించాలని చైనా కోరింది, ఎగుమతులపై నిషేధం విధించేందుకు అలా చేశారు.
వాస్తవం: నాణ్యతా ప్రమాణాల మెరుగుదల కోసమే ఆ సమాచారాన్ని అడిగారు. ఈ చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. నాణ్యత లేని ఉత్పత్తులను నిరోధించటానికి, కనుగొనేందుకు తోడ్పడింది. త్వరగా కస్టమ్స్‌ అనుమతులు ఇవ్వటానికి వీలు కలిగించింది. ఎగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
24. ఆరోపణ: ఆఫ్రికన్ల విషయంలో గువాంగ్‌డోంగ్‌లో వివక్ష ప్రదర్శించారు.

వాస్తవం:చైనీయులు, విదేశీయులెవరైనా ఎలాంటి వివక్ష చూపలేదు. స్ధానికంగా ఎన్ని ఇబ్బందులు పడినా హుబెరు రాష్ట్రంలోని మూడువేల మంది ఆఫ్రికన్‌ విద్యార్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకుంది. ఒక విద్యార్ధికి వైరస్‌ సోకితే వెంటనే చికిత్స అందించారు. ఏప్రిల్‌13న గ్వాంగ్‌డోంగ్‌లో విదేశాల నుంచి వచ్చిన వారిలో 26 మందికి వైరస్‌ ఉంది, వారిలో 19 మంది ఆఫ్రికన్లు ఉన్నారు.ఎవరినీ లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకోలేదు. ఊహాన్‌ వీధుల్లో కెనియన్‌ దంపతుల మీద దాడి జరిగినట్లు బిబిసి ఏప్రిల్‌ 17న బిబిసి ప్రసారం చేసింది. నిజానికి అది అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగింది.

http://www.xinhuanet.com/english/2020-05/10/c_139044103.htm

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర కొరియా కిమ్‌పై కొనసాగుతున్న పిట్ట, కట్టుకథలు !

05 Tuesday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

DPRK Kim Jong Un, Kim Jong-un, North Korea, North Korea’s Kim Jong Un

Kim Jong-un 'speaks out' amid death claims, according to North ...

ఎం కోటేశ్వరరావు
ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ కొద్ది రోజులు కనిపించకపోవటం గురించి కట్టు కథలు అల్లి చివరకు ‘చంపేసిన’ మీడియా మే ఒకటవ తేదీన కనిపించిన తరువాత పిట్ట కథలు చెబుతోంది. ప్రపంచంలో అనేక దేశాధినేతలు, మీడియాలో కతలు వండే, చెప్పేవారిని, ఉత్తర కొరియా నుంచి ఫిరాయించి రాజభోగాలు అనుభవిస్తున్న విభీషుణులకు కిమ్‌ తీవ్ర ఆశాభంగం కలిగించారు. ప్రపంచంలో తమకు తెలియని రహస్యం ఉండదు అని విర్రవీగే సిఐఏ వంటి గూఢచార సంస్ధలు జరిగిన దాన్ని చూసి నోళ్లు వెళ్ల బెట్టాయి. అలాంటి పేరు మోసిన సంస్ధలు, జేమ్స్‌ బాండ్‌ వంటి గూఢచారులను కూడా ఉత్తర కొరియా వెర్రి వెంగళప్పలను చేసింది. అవాక్కయిన వారందరూ గుక్క తిప్పుకొని మరో రూపంలో దాడి చేస్తున్నారు. పిట్ట కథలు చెబుతున్నారు.
కిమ్‌ విషయంలో తెలుగు మీడియా కూడా తక్కువ తినలేదు. పోటీలు పడి అమెరికా సిఐఏ, దక్షిణ కొరియా సంస్ధలు, ఉత్తర కారియా వ్యతిరేకులు అందించిన సమాచారంతో కొద్ది రోజుల పాటు ఊహాగానాలతో కాలక్షేపం చేశారు. కొన్ని విదేశీ టీవీలు కిమ్‌ మరణించినట్లు వార్తలు చెప్పేశాయి. మన తెలుగు టీవీ ఉత్సాహవంతులెవరైనా ఆ పుణ్యం కట్టుకున్నారేమో తెలియదు. ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన ఒక మాజీ దౌత్యవేత్త థాయే ఎంగ్‌ హౌ మీడియాను రంజింప చేశాడు. కిమ్‌ నిలబడలేడు, నడవ లేని స్ధితిలో తీవ్రంగా జబ్బు పడ్డాడు అంటూ మే ఒకటవ తేదీకి మూడు రోజుల ముందు చెప్పాడు. అది వాస్తవం కాదని తేలటంతో ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. ఇంతకూ ఈ పెద్ద మనిషి 2016లో దక్షిణ కొరియాకు ఫిరాయించాడు, గత నెలలో పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు.ఉత్తర కొరియాకు సంబంధించిన అంశాలలో ఆకాంక్షలకు అనుగుణ్యంగా కచ్చితమైన విశ్లేషణ చేస్తానని, అంచనాలు వేస్తాననే నమ్మకంతో మీరు నన్ను పార్లమెంట్‌కు ఎన్నుకున్న కారణాలలో ఒకటని నాకు తెలుసు. కారణాలేమైనప్పటికీ నేను ప్రతివారికి ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాను. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బాధ్యత, తప్పు నాదే అని ప్రకటించాడు. కిమ్‌ చావు వార్త గురించి తాను ఎటూ చెప్పలేని కొద్ది రోజుల క్రితం చెప్పిన ట్రంప్‌ అంతర్గతంగా ఎదురు చూశాడని వేరే చెప్పనవసరం లేదు. అయితే మే ఒకటవ తేదీన కనిపించటంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశాడు.

Kim Jong Un resurfaces on state media with mysterious mark on ...
అతనికి ఉన్న సిగ్గు, బిడియం మీడియాకు ఎందుకు లేకపోయింది ? తేలు కుట్టిన దొంగల మాదిరి ఏమీ ఎరగనట్లు కొత్త కథలు అల్లటంలో నిమగమయ్యారు. కిమ్‌కు అసలు ఎలాంటి ఆపరేషన్లు జరగలేదని దక్షిణ కొరియా చెబుతోంది. అయినా సరే కిమ్‌ చేతికి ఒక గాయం మాదిరి కనిపిస్తోందని జర్నలిస్టులు చెబుతున్నారు. తన వ్యతిరేకులను, కట్టు కథలను అల్లిన మీడియా జనాలను వెర్రి వెంగళప్పలను చేయటానికి అలాంటి చిహ్నంతో మేకప్‌ వేసుకొని కావాలని కనిపించేట్లు చేశారేమో ! మరొక ఫిరాయింపుదారు, పార్లమెంట్‌కు ఎన్నికైన జి సెయోంగ్‌ హౌ అయితే మరొక అడుగు ముందుకు వేసి గుండె ఆపరేషన్‌ జరిగిన కిమ్‌ మరణించాడని 99శాతం కచ్చితంగా చెబుతున్నా, మృతి వార్తను అధికారికంగా శనివారం నాడు ప్రకటిస్తారు అని శుక్రవారం నాడు చెప్పాడు. ఇతగాడిని 2018లో అమెరికా పార్లమెంట్‌ ఉభయ సభలలో ప్రసంగించేందుకు ట్రంప్‌ ఆహ్వానించాడు. ఇలాంటి ఫిరాయింపుదార్లందరినీ అమెరికా సర్కార్‌ పెంచి పోషిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ పెద్దమనిషి ఇప్పుడు మీడియాను తప్పించుకు తిరుగుతున్నాడు.
చీకట్లో బాణాలు వేసే ఇలాంటి వారి మాటలను నమ్మి జనానికి మీడియా కట్టుకధలు అందిస్తోందని మరోసారి రుజువైంది. నిజం చెప్పకపోగా ఉత్తర కొరియాతో సంబంధాలను మరింతగా చెడగొట్టినందుకు గూఢచార, రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీల నుంచి వారిని తొలగించాలని అధికార పక్షంలో కొందరు సూచించారు.న్యూస్‌ వీక్‌ వంటి పత్రికల్లో రాసే వారు కూడా ఫేక్‌ న్యూస్‌ను పాఠకుల ముందు కుమ్మరించారు. హయాంగ్‌సాన్‌ రాష్ట్రంలోని మౌంట్‌ కుమగాంగ్‌లో ఒక విల్లాలో కిమ్‌ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని రాసింది. నిజానికి అలాంటి రాష్ట్రం ఉత్తర కొరియాలో లేదు. అది మౌంట్‌ మోయోయాంగ్‌ ప్రాంతంలోని ఒక ఆసుపత్రి పేరు. ఇలాంటి వాటిని చూసి జనంలో నగుబాట్ల పాలౌతారని కామోసు ఒక వ్యాఖ్యాత కిమ్‌ గురించి వార్తలు రాయటం కంటే రాయకపోవటమే మంచిది అని పేర్కొన్నాడు.
క్యూబా ప్రజల ప్రియతమ నేత ఫిడెల్‌ కాస్ట్రోను సిఐఏ లేదా అది కిరాయికి నియమించిన హంతకులు 634 పద్దతుల్లో లేదా అన్ని సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు హాలీవుడ్‌లో ఒక సినిమా కూడా తీశారు. సిఐఏ ఏజంట్లు, వారితో కుమ్మక్కైన వారు పలు దేశాలలో అనేక మంది నేతలను మట్టుపెట్టారు. మీకు కూతవేటు దూరంలో కేవలం 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా అధినేత కాస్ట్రోను ఏమి చేయలేకపోయారు మీ గొప్పల గురించి మాదగ్గర చెప్పకండి అని అమెరికా మిత్రులు బహుశా ఎకసెక్కాలాడి ఉంటారు. అందుకే కసితో అన్ని సార్లు కాస్ట్రోను హతమార్చేందుకు యత్నించి ఉండాలి అనుకోవాల్సి వస్తోంది.అలాగే గత ఏడు దశాబ్దాలుగా ఆసియాలో కొరకరాని కొయ్యగా ఉన్న ఉత్తర కొరియా నాయకత్వాన్ని హతమార్చేందుకు అమెరికన్లు చేయని యత్నం లేదు. కిమ్‌ జోంగ్‌ అన్‌ మీద, తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌, తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ను హత్య చేసేందుకు అమెరికా, దక్షిణ కొరియా సంస్ధలు చేయని యత్నం లేదు. అనేక సార్లు మీడియాలో వారిని బతికి ఉండగానే చంపేశారు.
క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు, కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌, ఆయన కుటుంబ సభ్యులు తమ తమ దేశాల్లో నియంతలు, దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర కలిగిన వారు తప్ప నియంతలు కాదు. ఏ సోషలిస్టు దేశంలోనూ లేని విధంగా ఉత్తర కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌ వ్యక్తి పూజ గురించి, ఆయన తరువాత కుమారుడు, ఆ తరువాత మనుమడికి పట్టం కట్టటం గురించి ఎవరైనా విమర్శలు చేయవచ్చు. కుటుంబవారసత్వం అన్నది అది తప్పా ఒప్పా అన్నది ఆ దేశ పౌరులు తేల్చుకుంటారు, కానీ నియంతలని నిందించటం తగనిపని. అమెరికాకు లొంగని వారందరినీ నియంతలుగానే చిత్రిస్తారు. దాని మద్దతుతో గద్దెలెక్కి జనాన్ని అణచివేసిన నియంతలందరినీ అపర ప్రజాస్వామిక వాదులుగా చూపుతారు. వారితో బహిరంగంగా చేతులు కలపటాన్ని ప్రోత్సహిస్తారు. అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన అనేక సంస్ధలు, వ్యక్తులు కూడా నిఖార్సుగా నిలిచిన సోషలిస్టు దేశాల నేతలు, అంతర్గత విషయాలలో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడూ అదే జరిగింది, ఊహాగానాలు తప్ప ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఫిరాయింపుదార్ల మాటలు నమ్మి ట్రంప్‌ వంటి వారు నగుబాట్ల పాలయ్యారు.
ఏప్రిల్‌ 11న ఉత్తర కొరియా పాలక వర్కర్స్‌ పార్టీ విధాన నిర్ణాయక కమిటీ సమావేశంలో కిమ్‌ పాల్గొన్నారు. పదిహేనవ తేదీన కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదు.ఇరవై ఒకటవ తేదీన అమెరికా నిధులతో దక్షిణ కొరియా నుంచి నడిచే డెయిలీ ఎన్‌కె అనే దినపత్రిక కిమ్‌కు గుండె ఆపరేషన్‌ జరిగినట్లు రాసింది. ఇరవై మూడవ తేదీన కిమ్‌ ప్రయివేటు రైలు ఒక దగ్గర కనిపించిందంటూ కొన్ని చిత్రాలను విడుదల చేశారు, అదే రోజు అక్కడకు చైనా వైద్యులు వచ్చినట్లు కూడా వార్తలను రాశారు. మే ఒకటవ తేదీన ఒక ఎరువుల కర్మాగారంలో జరిగిన మేడే కార్యక్రమంలో పాల్గొన్న కిమ్‌ చిత్రాలు, వీడియోలను విడుదల చేయటంతో పుకార్ల మిల్లుల యంత్రాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫిరాయింపుదార్లు, అమెరికా ఏజంట్లు వ్యాపింప చేసిన వార్తలను తాము నమ్మటం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా, తప్పుడు సమాచారాన్ని ఖండించకపోవటంతో మీడియా రెచ్చిపోయింది. గతంలో ఉత్తర కొరియన్లు ఆకలితో చచ్చిపోతున్నారంటూ మీడియాలో చెప్పిన అంకెలను అన్నింటినీ కలిపితే ఆ దేశ జనాభాను మించి ఉన్నాయి. అసలు దేశమే అంతరించి పోయి ఉండేది. ఎవరికైనా ఇబ్బందులు రావటం వేరు, వాటిని బూతద్దంలో చూపి అంతా అయిపోయినట్లుగా చెప్పటాన్ని ఏమనాలి?

Kim Jong-un Resurfaces, State Media Says, After Weeks of Health Rumors
కిమ్‌ కనపడటం లేదంటూ చావుతో సహా రకరకాల ప్రచారం చేసిన పెద్దలు ఇప్పుడు అవే నోళ్లతో ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పటికీ అధికారంలో ఉన్నాను అని రుజువు చూపేందుకు ఇప్పుడు బయటకు వచ్చారంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక వేళ తనకేదయినా జరిగితే అధికారం కోసం ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, జనం ఎలా స్పందిస్తారో తెలుసుకొనేందుకు కిమ్‌ చావు నాటకం అడారని కొందరు ఇప్పుడు వీక్షకులకు కతలు వినిపిస్తున్నారు. అధికారం కోసం పాకులాడిన వారి తొలగింపు తదుపరి జరగనుందని చెబుతున్నారు. కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇటీవల సోదరుడితో తరచూ కనిపిస్తున్నారని, తదుపరి ఆమే పీఠం ఎక్కవచ్చంటూ గతంలో ప్రచారం చేశారు. ఇతర దేశాల నేతల మాదిరి ప్రతి రోజూ సోషలిస్టు దేశాల నేతలు మీడియాలో కనిపించకపోవటం కొత్తేమీ కాదు.2014లో నలభై రోజుల పాటు కిమ్‌ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. అంతకు ముందు ఆయన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ కొన్ని నెలల పాటు కనిపించని సందర్భం కూడా ఉంది. తన సమీప బంధువు కిమ్‌ కొయోంగ్‌ హురును విషమిప్పించి కిమ్‌ చంపించాడని ఫిరాయింపుదార్లు నమ్మబలికారు. ఆ తరువాత ఆమె చిరునవ్వుతో దర్శనమిచ్చింది. ఉత్తర కొరియాలో ఏమి జరుగుతోందో తెలియదని ఇనుపతెర ఉందని చెబుతారు. అదే నోటితో అమెరికాలోని పెంటగన్‌ లేదా సిఐఏ కార్యాలయాల్లో ఏమి జరుగుతోందో తెలియదని, అక్కడి పాలకులు నియంతలని మీడియాలో ఎందుకు వర్ణించరు? తాము మెచ్చింది రంభ-మునిగింది గంగ అంటే ఇదేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా ”మందు” రెమిడెసివిర్‌ -కందకు లేని దురద కత్తి పీటలకా !

28 Tuesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

Remdesivir, remdesivir clinical trial, remdesivir clinical trial coronavirus facts and myths

Gilead says Remdesivir trial posted online prematurely was ...

ఎం కోటేశ్వరరావు
చైనాకు వ్యతిరేకంగా ఏ చెత్తను మార్కెట్లో పెట్టినా ఆమ్ముడవుతుందా ? కొన్ని మీడియా సంస్ధలు అలాంటి చెత్త వార్తలను అమ్మి సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయా ? ఏమో ! చైనా ” మందు ” జాగ్రత్త అనే శీర్షికతో ఒక ప్రముఖ తెలుగు పత్రిక సోమవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. తప్పుడు వార్తలు రాసేందుకు, రాయించేందుకు కూడా ” సమగ్రశిక్షణ ” అవసరం అని కాస్త జాగ్రత్తగా చదివిన వారికి అర్ధం అవుతుంది. ఇంతకూ ఏమిటట?
జనవరి 20న కరోనా వ్యాప్తిపై ప్రకటన, తరువాతి రోజే రంగంలోకి ” వూహన్‌ లాబ్‌ ”, రెమ్‌డెసివిర్‌ ఔషధం పేటెంట్‌కు దరఖాస్తు. ఈ అంశాల మీద ఆ కథను అల్లారు. వైరస్‌ వ్యాప్తి గురించి ఆరు రోజుల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వమే మోకాలడ్డిందని ఇంకా ఏవేవో రాసిన వాటిని పునశ్చరణ చేయనవసరం లేదు. దీనర్ధం ఏమంటే వైరస్‌ పరిశోధనలు చేస్తూ దాన్ని ఒక పధకం ప్రకారం బయటకు వదలిన చైనాలోని వూహాన్‌ వైరాలజీ సంస్ధ దాని నిరోధానికి అవసరమైన ఔషధాన్ని కూడా ముందే తయారు చేసి పెట్టుకుందని జనాల బుర్రలకు ఎక్కించే యత్నమే.
ఈ వార్తను లండన్‌ నుంచి ప్రచురితమయ్యే డెయిలీ మెయిల్‌ డాట్‌కామ్‌ 25వ తేదీ బిఎస్‌టి(బ్రిటీష్‌ సమ్మర్‌ టైమ్‌) రాత్రి పది గంటలకు ప్రచురించింది. దానికి మనం నాలుగున్నర గంటలను కలుపుకుంటే మన సమయం రాత్రి రెండున్నర అవుతుంది. ఆ వార్త లేదా ఏదైనా ఏజన్సీ వార్తను గానీ తీసుకొని పైన చెప్పిన కథను వండి వడ్డించి ఉండాలి. దాని సంగతి తరువాత చూద్దాం. ముందుకొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోక తప్పదు. చైనా గురించి మీడియాలో వచ్చేది, దాని వ్యతిరేక దేశాల నేతలు, శాస్త్రవేత్తలు చెప్పేదంతా నిజమే అని నమ్మేవారు నమ్మవచ్చు. అలా నమ్మకాన్ని ఖరారు చేసుకొనే ముందు భిన్న కథనాలు కూడా ఉన్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సవినయ వినతి. అవన్నీ ఎక్కడ కుదురుతాయి… మా వీనులకు విందు, చెవులకు ఇంపుగా ఉండేది, బుర్రకు కిక్కునిచ్చేదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం అనే వారి నిజాయితీకి జోహార్లు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రకటనలు బయటకు రాగానే చైనా గూఢచారులు కెనడా లాబ్‌ నుంచి అపహరించి వూహాన్‌ లాబ్‌ నుంచి బయటకు వదిలారు, చైనా ప్రమాదకర జీవ ఆయుధాలను తయారు చేస్తోంది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజంగా బయటకు వదల దలచుకొంటే కెనడా లాబ్‌ నుంచే చైనా గూఢచారులు బయటకు పంప వచ్చు కదా ! దున్న ఈనిందంటే ముందు దూడను గాటన కట్టేయమన్నట్లుగా చాలా మంది నమ్మేశారు. నిజంగానే ఎవరైనా ఒక వైరస్‌ను బయటకు వదిలితే దానికి సరిహద్దులు,దేశాలు, రంగు బేధాల తేడాలుండవు, ఎక్కడ అనువుగా వుంటే అక్కడకు పాకి తన ప్రభావం చూపుతుందనే లోకజ్ఞానం ఈ సందర్భంగా పని చేసి ఉంటే ఇప్పుడు కరోనా ప్రళయ తాండవానికి కకావికలౌతున్న దేశాలన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉండేవి. లక్షలాది ప్రాణాలను కాపాడేవి. కొంత మంది కావాలని కాదు గానీ ప్రమాదవశాత్తూ బయటకు వచ్చి ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతూ నమ్మింపచేసేందుకు ప్రయత్నించారు. ప్లేగు, మసూచిని కావాలని అంటించిన దేశాలను, రసాయన బాంబులు, గ్యాస్‌లో జనాన్ని మట్టు పెట్టిన దుర్మార్గాన్ని ప్రపంచం చూసింది. ఒక వైరస్‌ను సృష్టించి వదలిన దేశం గురించి చరిత్రలో నమోదు కాలేదు. కొన్ని అనుమానాలు వ్యక్తం అయినా ఎక్కడా రుజువు కాలేదు. ఒక కొత్త వైరస్‌ తొలుత ఎక్కడ బయటపడితే దాన్ని ఆదేశమే తయారు చేసింది అనే నిర్ధారణకు వచ్చేట్లయితే ఆ వరుసలో చైనా కంటే ముందు అనేక దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి ఇంతకు ముందే తెలుసు. తాజాగా తలెత్తిన కోవిడ్‌-19 వైరస్‌ కొత్తరకం అని కృత్రిమ సృష్టి కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ, అనేక మంది ఆ రంగంలో పని చేస్తున్నవారు ప్రకటించినా, కొందరు పని గట్టుకొని చేస్తున్న ప్రచారానికి మీడియా ఎలాటి విమర్శనాత్మక దృష్టి లేకుండా ఏకపక్షంగా ప్రాధాన్యత ఇస్తోంది.
రెండవ అంశం ఈ వైరస్‌ను అమెరికన్లే తయారు చేసి తమ దేశం మీద ప్రయోగించినట్లు అనుమానిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఒక విమర్శ చేశాడు. అమెరికా మిలిటరీ దాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు. అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న ఫోర్ట్‌ డెట్‌రిక్‌ అమెరికా మిలిటరీ లాబ్‌ నుంచి వైరస్‌లు బయటకు రాకుండా నివారించేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు లేనందున ఏడాది క్రితమే దాన్ని మూసివేశారని వెంటనే వార్తలు వచ్చాయి. అయితే తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశారు తప్ప మూసివేయలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రకటించింది.
ఇక రెమిడెసివిర్‌ ఔషధం కధను చూద్దాం. కరోనా వైరస్‌ కొత్తది కాదు, గతంలోనే గుర్తించారు. దానిలో అనేక రకాలు ఉన్నాయి. తాజాగా తలెత్తినదానిని కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. గతంలో తలెత్తిన కరోనా వైరస్‌, ఇతర వైరస్‌లకు వ్యాక్సిన్‌లు, ఔషధాలు తయారు చేసే సంస్ధలు ఎన్నో గతంలోనే పేటెంట్లకు దరఖాస్తులు చేశాయి. అంటే అవి ముందే మందులను తయారు చేసి వైరస్‌ను ఇప్పుడు సృష్టించాయని భావించాలా ? కుట్ర సిద్దాంతాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే కోవిడ్‌-19ను అమెరికానే సృష్టించిందని అనుకోవాలి? అది అలాంటి ప్రయత్నాలు చేయకపోతే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్‌ కంపెనీ నాలుగు సంవత్సరాల క్రితమే కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెసివిర్‌ను అనుమతించాలని పేటెంట్‌కు దరఖాస్తు ఎందుకు చేసినట్లు ? ప్రపంచ వ్యాపితంగా వినియోగించేందుకు నాలుగు సంవత్సరాల క్రితమే దరఖాస్తు చేసినట్లు గిలీడ్‌ కంపెన చెప్పినట్లు డెయిలీ మెయిల్‌ రాసింది. కోవిడ్‌-19కు అది పని చేస్తుందని తేలితే భవిష్యత్‌లో సరఫరా చేసేందుకు గాను ప్రస్తుతం చికిత్సలో దాని పని తీరును నిర్ధారించుకునే పనిలో ఉన్నామని గిలీడ్‌ చెబుతోంది. నిజానికి ఆ ఔషధాన్ని ఎబోలా వైరస్‌కోసం గిలీడ్‌ తయారు చేసింది. ఇది కరోనాకూ పని చేస్తుందేమో అని అది నిర్ధారించుకుంటోంది. అదే ఔషధం తయారీకి తమకు పేటెంట్‌ ఇవ్వాలని ఊహాన్‌ వైరాలజీ సంస్ధ జనవరి 21న దరఖాస్తు చేసిందట. అది నిజంగా కరోనా కోసమో కాదో తెలియదు, కరోనా కోసమే అయితే ఏ తరగతి కోసమో అంతకంటే తెలియదు, దరఖాస్తులోని వివరాలు ఏడాది తరువాత గానీ బయటకు రావు. అలాంటిది ముందే కరోనా మందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు ఏ ఆధారాలతో రాస్తారు ? ఒక వేళ నిజంగానే రెమ్‌డెసివిర్‌కు చైనా సంస్ధ దరఖాస్తు చేస్తే అంతకు ముందే ఉన్న గిలీడ్‌ కంపెనీకి ఇవ్వకుండా చైనా సంస్ధకు ఎలా ఇస్తారు ? నిజంగా ఆ ఫార్ములాను ఎవరైనా తస్కరిస్తే మరొక పేరుతో దరఖాస్తు చేస్తారు తప్ప అదే పేరుతో ఎలా చేస్తారు ? మరీ అంత అమాయకంగా ఎవరైనా ఉంటారా ? ఎప్పుడో నాలుగేండ్ల క్రితం దరఖాస్తు చేసిన దానికే ఇంతవరకు అనుమతి రాకపోతే జనవరిలో చేసిన దానికి వెంటనే అనుమతి ఎలా వస్తుంది ? ఇదంతా చూస్తే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు గిలీడ్‌ కంపెనీ తాపీగా ఉన్నా జర్నలిస్టులు కొందరు గోక్కుంటున్నారు.
ఇక రెమ్‌డెసివవిర్‌ గత కొద్ది వారాలుగా వార్తల్లో ఉంది. ఆ ఔషధాన్ని తయారు చేశారు గానీ ఎక్కడా ఉత్పత్తి చేయటం లేదు. ఎబోలా కోసం తయారు చేసిన దానిని ఇప్పుడు కరోనాకు ఉపయోగపడుతుందేమో చూద్దాం అన్నట్లుగా గిలీడ్‌ కంపెనీ ఉంది.కోవిడ్‌-19 రోగులు 63 మంది మీద ప్రయోగిస్తే 36 మందికి కాస్త గుణం కనిపించిందని, ఇంకా ప్రయోగదశలోనే ఉందని, ప్రపంచంలో ఎక్కడా చికిత్సకు అనుమతించలేదని కంపెనీ సిఇఓ డేనియల్‌ ఓడే ఏప్రిల్‌ 10న ప్రకటించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త పేర్కొన్నది.ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఫలితాలు వెల్లడైన తరువాత వినియోగం గురించి పరిశీలిస్తామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) శాస్త్రవేత్త రామన్‌ గంగా ఖేద్‌కర్‌ చెప్పారు. 2015లో ఇదే కంపెనీ తయారు చేసిన హెపటైటిస్‌ సి ఔషధం గురించి చేతులు కాల్చుకున్న ఐసిఎంఆర్‌ అంత రెమ్‌డెసివర్‌ గురించి ఆసక్తి ప్రదర్శించటం లేదని కూడా వార్తలు వచ్చాయి. పనికి వచ్చేట్లయితే జనరిక్‌ ఔషధం తయారు చేసేందుకు గిలీడ్‌ కంపెనీ స్వచ్చందంగా అనుమతిస్తే తయారు చేయవచ్చని కొందరు అంతకు ముందు ఆలోచన చేశారు. మరికొన్ని వార్తల ప్రకారం ఇదే ఔషధంపై చైనాలోని రెండు ఆసుపత్రులలో 28 మగ చిట్టెలుకల మీద ప్రయోగాలు జరపగా వాటిలో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు, అసహజత పెరిగినట్లు ప్రాధమిక పరశీలనల్లో వెల్లడైంది.దీని గురించి ఎలాంటి నిర్దారణలకు ఇంకా రాలేదని ఏప్రిల్‌ 23న ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఇలాగే అమెరికా, బ్రిటన్‌, మరికొన్ని దేశాలలో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కోవిడ్‌-19కు పని చేయదని తేలినట్లు గిలీడ్‌ కంపెనీ గతశుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపిందని కూడా వార్తలు వచ్చాయి.
చైనా దరఖాస్తు గురించి తమకు తెలుసునని, అయితే వచ్చే ఏడాది ఆ వివరాలను ప్రచురించేంత వరకు దాని గురించి తామేమీ చెప్పలేమని గిలీడ్‌ చెప్పింది. ఎబోలాకు తయారు చేసిన తమ ఔషధం కరోనాకు పనికి వస్తుందా లేదా అన్న అధ్యయనాన్ని నిలిపివేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక కంపెనీ తయారు చేసిన దాన్ని మరొక దేశంలో పేటెంట్‌ కోరినా మంజూరు కాదు.గిలీడ్‌ కంపెనీ తమ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఫిర్యాదు అయినా చేసి ఉండేది, ఒక వేళ అదే నిజమైతే ఈ పాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ కంపెనీ తయారు చేసిన దాన్ని చైనా తస్కరించిందని ఈ పాటికే నానా యాగీ చేసి ఉండేవాడు. బహుశా ఈ ఔషధ ప్రయోగాల గురించి చెప్పి ఉంటే అది నిజమని నమ్మి కొద్ది రోజుల్లో వాక్సిన్‌ తయారు చేయాలని రెండు నెలల క్రితం ట్రంప్‌ బహిరంగంగా విలేకర్ల సమావేశంలో చెప్పాడని అనుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌ -19 చికిత్సకోసం అమెరికా, ఐరోపాల్లో వాక్సిన్ల పేటెంట్‌ గురించి నంబర్లతో సహా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోంది. ఎఎఫ్‌పి వార్తా సంస్ధ వాటి గురించి నిర్ధారణ చేసుకొని అవన్నీ నకిలీ అని తేల్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై విచారణ సరే ముందు అమెరికా, జర్మనీ నేరాల మాటేమిటి !

22 Wednesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#China biological weapons, american crimes against humanity, COVID- 19 pandemic, Donald trump angry at China, German crimes against humanity

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ తొలుత బయట పడిన ఊహాన్‌ నగరంలో జరిగిందేమిటో తెలుసుకొనేందుకు తమ తనిఖీదార్లను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. ఈ డిమాండ్‌ను చైనా తోసి పుచ్చింది. కరోనా గురించి సకాలంలో హెచ్చరించని కారణంగా తమ దేశానికి జరిగిన నష్టం 20లక్షల కోట్ల డాలర్లు చైనా చెల్లించాల్సిందే అని అమెరికన్లు కొందరు తమ దేశంలో దావా దాఖలు చేశారు. చైనా మీద కేసులు అమెరికా కోర్టుల్లో దాఖలు చేయటం ఏమిటో, అవి విచారణ జరిపే ప్రహసనం ఏమిటో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇదే విధంగా తమకు 149 బిలియన్‌ యూరోల నష్టపరిహారం చెల్లించాలని జర్మన్‌ పత్రిక బిల్డ్‌ పేర్కొన్నది. రాబోయే రోజుల్లో ఇంకా ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్‌లు రావచ్చు. అవెంత ఉంటాయో తెలియదు. ఈ డిమాండ్లు న్యాయసమ్మతమేనా ? ఆచరణ సాధ్యమేనా ?
నావరకు అయితే కొన్ని చిన్న చిన్న షరతులతో న్యాయసమ్మతమే, ఆచరణ సాధ్యమే ! అదెలాగో తరువాత చూద్దాం.ఈ వార్తలను చూసి చాలా మంది చైనా తిక్క కుదిరింది అనుకుంటున్నారు. దాఖలు చేయని కేసులను కూడా వేసినట్లే సంబర పడుతున్నారు. ముందు తమ దేశాల్లో కరోనా నివారణ చేయకుండా ఇదేమిటి అనుకొనేవారు కూడా లేకపోలేదు. ఇలాంటి నష్ట పరిహారం కోరేవారు నిజంగా సాధించేందుకు అవకాశాలున్నాయని నమ్ముతున్నారా ? లేక ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ట్రంప్‌ ఇలాంటి కేసులను వేయిస్తున్నాడా అన్నది అనుమానమే. అసలు ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్ధలో అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన మార్గదర్శక సూత్రాల మేరకు అంతర్జాతీయ నేరాలుగా పరిగణించిన వాటిని విచారించేందుకు అంతర్జాతీయ న్యాయ స్ధానం ఉంది. చైనాలో వెలువడిన కరోనా వైరస్‌ అలాంటి నేరంగా ఎవరూ ఎక్కడా నిర్ధారించలేదు. చరిత్రలో ఎప్పుడైనా నిజంగా తప్పు చేసిన ఏ దేశమైనా ఎవరికైనా పరిహారం చెల్లించిందా ?


అమెరికా ఏమిటి ఏ దేశమైనా దేని గురించి అయినా స్వంత విచారణలు జరుపుకోవచ్చు. కోరుకున్న తీర్పులు రాసుకోవచ్చు. రద్దు కింద అమ్ముకోవటానికి తప్ప అవి దేనికి పనికి వస్తాయి ? ఆ దేశాలన్నీ ముందు చైనాలో వైరస్‌ను ఎలా అరికట్టారో తమ దేశాలలో ఎలా జనం ప్రాణాలు తీస్తున్నారో తెలుసుకోవాలి. ఇతర దేశాల్లోకి స్వంత దర్యాప్తు బృందాలను పంపటానికి ఏ దేశానికీ హక్కు లేదు, అవకాశం అంతకంటే లేదు. అదే నిజంగా ఉంటే పాకిస్ధాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను ఈ పాటికే మన కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసి ఉండేది, అదే విధంగా పాక్‌ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మన మీద చేసిన ఆరోపణలను విచారించే వారు. అమెరికాలో అత్యధిక కేసులు ఐరోపా నుంచి దిగుమతి అయ్యాయి. అందువలన ఆ దేశాల మీద ముందు అమెరికా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే ప్రపంచ పోలీసుగా తనకు తాను బాధ్యత తీసుకున్న అమెరికా దాదాపు అన్ని చోట్లా చావు దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రపంచ న్యాయమూర్తిగా మారదలచుకున్నట్లు కనిపిస్తోంది. అత్యాశగాకపోతే అది సాధ్యమేనా ?
చైనాలోని ఉహాన్‌ వైరాలజీ సంస్ధ అధిపతి, చైనా మిలిటరీ మేజర్‌ జనరల్‌ తమ దేశంలో కరోనా వ్యాప్తి, మరణాలకు కారకులని, నష్టపరిహారంగా 20లక్షల కోట్ల డాలర్లు చెల్లించాలని అమెరికాలోని ఒక లాయర్‌, మరో ఫొటోల కంపెనీ, మరో ఇద్దరు కేసులు దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పిచ్చి కేసుకు ప్రపంచ వ్యాపితంగా ప్రచారం తప్ప మరొక లాభం ఉండదు. అది కోరిన మొత్తం చైనా జిడిపికంటే ఎక్కువ. అంటే చైనా మొత్తాన్ని అమ్మినా అంత సొమ్ము రాదు, అసలు కొనే వారెవరు అన్నది వేరే విషయం. ఆస్ట్రేలియా ఎలాంటి నష్ట పరిహారం కోరలేదుగానీ అమెరికా ఏది మాట్లాడితే దానికి వత్తాసుగా పలుకుతోంది. ఇక జర్మనీలో అత్యధిక ఆదరణ కలిగిన పత్రిక ” బిల్డ్‌ ” సంపాదకులు తమ దేశానికి చైనా కారణంగా వివిధ రంగాలకు 149 బిలియన్‌ యూరోల మేరకు నష్టం జరిగిందని ఆ మొత్తం చెల్లించాలని రాశారు. అయితే ఇందుకోసం ఎలాంటి కేసులు గట్రా దాఖలు చేయలేదు.
ఇక చైనా మీద విచారణ అంశాన్ని దానికి గాను నేను ముందే చెప్పిన షరతుల సంగతి చూద్దాం. ఎప్పుడో క్రీస్తు పూర్వం సంభవించిన వైరస్‌ల మూలాలు ఏదేశంలోనివో ఇప్పుడు నిర్ధారించటం కష్టం. ఎందుకంటే నాడున్న దేశాలు లేదా సామ్రాజ్యాలు నేడు లేవు గనుక నిందితులు ఫలానా అని నిర్దారించలేము. నిజానికి ఏ దేశం తప్పుచేసినా విచారణ జరిపేందుకు ప్రపంచ రాజ్యాలు ఏక క్రీవంగా అంగీరించి ముందు ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ఆమోదించాలన్న చిన్న షరతును ముందు నెరవేర్చాలి. ఆ మేరకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కనుక మొదటి ప్రపంచ యుద్ధాన్ని తీసుకుందాం, లేదూ ఎవరైనా అంతకు ముందు నుంచే విచారణ ప్రారంభించాలి అంటే అభ్యంతరమూ లేదు.చైనాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
కరోనా వైరస్‌ను చైనా తయారు చేసిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. మానవాళి చరిత్రలో అతి పెద్ద మహమ్మారి ప్లేగు వ్యాధి అని తెలిసినా కొన్ని వందల సంవత్సరాలు గడచి నందున దానికి సంబంధించిన అంశాలు పూర్తిగా నిర్దారించలేము. మనకు బాగా తెలిసిన స్పానిష్‌ ఫ్లూ(ప్రపంచానికి తెలిసిన తొలి హెచ్‌1ఎన్‌1 వైరస్‌). మొదటి ప్రపంచ యుద్ధం చివరిలో ప్రబలింది. ఇది ఐరోపాలోనా, అమెరికాలోనా ఎక్కడ ప్రారంభమైంది అన్న అంశం మీద వివాదం ఉంది. భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువ పరిశీలనలు అమెరికా వైపే వేలు చూపుతున్నాయి. నిజానికి ట్రంప్‌కు, జర్మన్‌ పత్రిక బిల్డ్‌ సంపాదకులకు, వారిని సమర్ధించే వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ వైరస్‌ ఎక్కడ ప్రారంభమైందో ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం నిర్ధారించాలి. చైనాలో విచారణకు తమ నిపుణులను అంగీకరించాలని ట్రంప్‌ కోరాడు. అలా ఒక దేశం కాకుండా భద్రతా మండలిలో ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా సభ్యరాజ్యాలుగా ఉన్నాయి కనుక వాటి ప్రతినిధులను ఎంపిక చేసి విచారణ జరిపించాలి. ఆ నివేదిక ప్రాతిపాదికన నష్టాలను నిర్ధారించి ఆ మొత్తాలను బాధిత దేశాలకు పంచాలి. ఇదేమీ పెద్ద షరతు కాదు, అసాధ్యమైంది అంతకంటే కాదు.


1918 జనవరి నుంచి 1920 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపితంగా నాడు ప్రపంచంలో ఉన్న మూడో వంతు జనాభా 50 కోట్ల మందికి సోకింది. కోటీ 70లక్షల నుంచి ఐదు కోట్ల మందికి, మరికొందరి అంచనాల ప్రకారం పది కోట్ల మంది దుర్మరణం చెందారు. ఇది మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొన్న దేశాలు గావించిన నష్టానికి అదనం, ప్రపంచ ఆధిపత్యం కోసం యుద్దాన్ని తెచ్చిన దేశాలు, స్పానిష్‌ ఫ్లూ నష్టాలను కలిపి లేదా విడిగా తేల్చి దానిలో ఎవరి వాటా ఎంతో ఎలా చెల్లిస్తారో అమెరికా, ఐరోపా దేశాలు ముందు తేల్చుకోవాలి. ఆ యుద్ధంలో స్పెయిన్‌ తటస్ధంగా ఉంది. అయితే ఆ సమయంలోనే తలెత్తిన ఫ్లూ సోకి రాజు 13వ ఆల్‌ఫోన్సో మరణించటంతో నేటి మాదిరే నాటి పత్రికలు కూడా వెనుకా ముందూ చూడకుండా స్పెయిన్‌లోనే పుట్టిందని దానికి స్పానిష్‌ ఫ్లూ అని రాశాయి. తరువాత స్పెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా ఆ పేరు వాడుకలో ఉండిపోయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ద కరోనాకు కోవిడ్‌-19 అని పేరు పెట్టినా చైనా వైరస్‌ అని నిందిస్తున్న మాదిరి అన్నమాట. ఈ ఫ్లూ కొనసాగింపుగా 2009లో స్వైన్‌ ఫ్లూ వచ్చింది కనుక దీన్ని కూడా చేర్చి విచారణ జరపాలి. ఇది పుట్టింది అమెరికాలోనా, మెక్సికోలోనా మరొక చోటా అన్నది ఆ దేశాలు తేల్చాలి. పనిలో పనిగా ఎయిడ్స్‌ను ఎక్కడ తయారు చేసి ప్రపంచం మీద వదిలారో కూడా తేల్చి పరిహారం చెల్లించాలి.
మన కళ్ల ముందే ఇరాక్‌లో మారణాయుధాలు, జీవ రసాయన ఆయుధాల గుట్టలు ఉన్నట్లు ప్రచారం చేసిన అమెరికన్ల గురించి తెలుసు. ఆ పేరుతో ఇరాక్‌ మీద దాడి చేసి పదిలక్షల మంది ప్రాణాలు తీశారు. దేశాన్ని సర్వనాశనం చేశారు. తీరా తమ తనిఖీలో ఎలాంటి జీవ, రసాయన ఆయుధాలు లేవని స్వయంగా అమెరికన్లే ప్రకటించారు. అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించి అపార ప్రాణ నష్టానికి కారకులయ్యారు. ఇస్లామిక్‌ తాలిబాన్‌(ఉగ్రవాదులు)లను సృష్టించారు. ఈ రోజు వారు ప్రపంచ వ్యాపితంగా చేస్తున్న దుర్మార్గాలకు గాను ఎవరు పరిహారం చెల్లిస్తారు, ట్రంప్‌ మెడపట్టి బాధిత దేశాలన్నీ నష్టపరిహారం కోరాలి. విచారణకు డిమాండ్‌ చేయాలి. పాక్‌ ఉగ్రవాదులు తాలిబాన్ల శిక్షణలోనే తయారయ్యారు కనుక మన మోడీ గారు కూడా స్నేహితుడనే విషయాన్ని పక్కన పెట్టి ఈ విషయంలో అమెరికా, ట్రంప్‌ను పరిహారం కోరాలి.

American Crime Case #23: The Afghanistan and Iraq War Logs and the ...
రెండవ ప్రపంచ యుద్ధంలో మిగతా వన్నీ పక్కన పెడితే కొన్ని దేశాలు ప్రత్యేకంగా చేసిన నేరాలు ఉన్నాయి. వాటిని విచారణ జరిపి శిక్షలు కూడా వేశారు. ఆ యుద్దం ముగింపు దశలో అమెరికన్లు జపాన్‌లోని నాగసాకి,హిరోషిమా పట్టణాల మీద వేసిన రెండు అణుబాంబులు ఎంత మందిని బలితీసుకున్నాయో తెలుసు. తొలిసారి అవసరం లేకపోయినా చేసిన ఈ దాడికి అమెరికన్లు జపాన్‌కు ఎంత నష్టపరిహారం ఇస్తారో ముందు తేల్చాలి. అమెరికా మిత్ర దేశంగా జపాన్‌ ఉంది కనుక ఆ పరిహారాన్ని తీసుకోవాలా లేదా అన్నది వేరే విషయం. జపాన్‌ మిలిటరీ చైనా పట్టణాలపై ప్లేగు బాంబులు వేసి ప్లేగు వ్యాధిని వ్యాపింప చేసి దొరికి పోయి విచారణ ఎదుర్కొన్న విషయం దాస్తే దాగేది కాదు. అందువలన దానికి చైనాకు ఎంత నష్ట పరిహారం ఇస్తారో జపాన్‌ కూడా తేల్చాలి. వియత్నాం ఇతర ఇండో చైనా దేశాలేమీ ఎవరి మీదా దాడులు చేయలేదు, దురాక్రమణకు పాల్పడలేదు. అయినా జపాన్‌, ఫ్రెంచి, అమెరికా సామ్రాజ్యవాదులు దశాబ్దాలతరబడి దాడులు చేసి కలిగించిన అపార నష్టానికి ఆ మూడు దేశాలు నష్టపరిహారం చెల్లించాలి, ఎవరి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి.
ఇక జర్మనీ సంగతి. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా 60లక్షల మంది యూదులు, కోటీ పదిలక్షల మంది ఇతరులను బలిగొన్న నాజీ సైన్యాలను నడిపింది జర్మనీ. గ్యాస్‌ ఛాంబర్లలో ఏ రసాయనాన్ని పంపి హత్యలు చేశారో వెల్లడించాలి. దానికి ఎంతో నష్టపరిహారం చెల్లించాలో ముందు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బిల్డ్‌ సంపాదకుడు తగుదునమ్మా అంటూ ఆధారాలు లేని చైనాను నష్టపరిహారం అడుగుతున్నాడు.
మన దేశాన్ని బ్రిటన్‌ ఆక్రమించి మనక ఎంత నష్టం కలిగించిందో తెలిసిందే. అందువలన దాని మీద కూడా విచారణ జరిపి నష్టపరిహారాన్ని రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు లేదా దేశాల మీద ఆపాదించినంత మాత్రాన నేరంచేసినట్లు కాదు. చైనా మీద కూడా ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు.పైన చెప్పుకున్న దేశాల నేరాలు ఇప్పటికే రుజువయ్యాయి. అందువలన నిందితులను, నష్టపరిహారాన్ని తేల్చి తరువాత చైనా సంగతి మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన చరిత్ర ఇప్పటి వరకు సామ్రాజ్యవాదులదే, ఏ సోషలిస్టు దేశానికి అలాంటి చరిత్ర లేదు. ఒక వేళ ఎవరైనా నిరూపిస్తే దానికి ఎలాంటి అభ్యంతరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెద్దన్న ట్రంప్‌ పిచ్చిపనులపై నిజమైన దేశభక్తుల మౌనం తగదు మోడీ గారూ !

19 Sunday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic, Donald trump angry at WHO, Donald Trump Madness, Narendra Modi, WHO

Donald Trump 'imitates Indian Prime Minister Narendra Modi's ...

ఎం కోటేశ్వరరావు
అమెరికా పెద్దన్న డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్నాడు, యావత్‌ ప్రపంచాన్ని అలవికాని ఆర్ధిక బాధల్లోకి నెడుతున్నాడు. ఈ వైఫల్యాన్ని, నేరాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థను, చైనాను దెబ్బతీసేందుకు పూనుకున్నాడు. ఈ వ్యాఖ్యతో ప్రారంభించిన ఈ రాతలో ఇంకేమి ఉంటుందిలే అని చప్పరించే వారు తమ సమయాన్ని వృధా చేసుకోనవసరం లేదని మనవి. ప్రాణ, విత్త, మానభంగములందు అసత్యాలు చెప్పవచ్చని మన పెద్దలు చెప్పారు. ట్రంప్‌ దానికి ఎన్నికలను కూడా జోడించాడు. నవంబరులో జరగాల్సిన ఎన్నికల్లో గట్టెక్కేందుకు ట్రంప్‌ ఎంతకైనా తెగించేందుకు సిద్దపడుతున్నాడని వేరే చెప్పనవసరం లేదు.
ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్ధలు ఏ ఒక్కరి సొత్తో కాదు. వాటిని ప్రారంభించే రోజు సంస్ధాపక సభ్య దేశాలలో కొన్నింటికి దురాలోచనలు మరికొన్నింటికీ దూరాలోచనలు ఉన్నాయి. ఎన్ని లోపాలున్నా అంతకంటే మెరుగైన ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనే వరకు ఉన్నవాటిని రక్షించుకోవటం తప్ప మరొక మార్గం లేదు. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనాకు అనుకూలంగా పని చేస్తోందని లేదా చైనా ఆ సంస్ధ మీద పెత్తనం చేస్తోందని నిజంగా నమ్మేవారు 1945 నుంచి 1971 వరకు చైనాను ఐక్యరాజ్యసమితి, దాని సంస్ధల గడప తొక్కనివ్వలేదని, చైనా పేరుతో తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా పరిగణిస్తూ అమెరికా మోకాలడ్డిందని, ఐరాసలో అనుమతించినా 2000 సంవత్సరం వరకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు భాగస్వామ్యం కల్పించలేదని కూడా తెలుసుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే పెత్తనం చేసింది. ఈ రోజు చైనా పెత్తనం చేస్తోందంటూ బుడిబుడి రాగాలు తీస్తోంది. ఇంతకాలం అమెరికా తప్పుడు పనులు చేసింది కనుకనే ఐరాసలో దానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, అదేపని చైనా లేదా మరొక దేశం చేస్తే వాటికీ అదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు చైనా అలాంటి తప్పులు చేస్తోందా? ఉదాహరణలు ఉంటే ఎవరైనా చెప్పాలి మరి !
ఐక్యరాజ్యసమితికి రూపకల్పన చేసిన సమయానికి అమెరికా అగ్రరాజ్యం. నిబంధనల కూర్పులో దానిదే పైచేయి. ఇప్పుడు వాటినే అది ప్రశ్నిస్తోంది. ఐరాస, దాని సంస్దలు సమర్ధవంతంగా లేదా ప్రజాస్వామ్య బద్దంగా పని చేయాలంటే సంస్కరణలు తేవాలి. దానికి బదులు అమెరికా వంటి దేశాలు అర్ధంతరంగా నిధులు నిలిపివేస్తే నష్టపోయేది మన వంటి లేదా ఇంకా దరిద్రంలో ఉన్న దేశాలే. ఇలాంటి చర్యలకు బ్లాక్‌మెయిల్‌ లేదా బెదరింపు అని తప్ప మరొక భావం, అర్ధం లేదు. పెద్దన్న బెదరింపులను నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించటం లేదో తెలియదు. మన ప్రయోజనాలను రక్షించుకోవటమే దేశభక్తి అని అంగీకరిస్తే ఆచరణలో అది కనిపించాలి కదా ! అమెరికా మెడలు వంచి గత ఆరు సంవత్సరాలలో మనం సాధించిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరి కోసం పని చేస్తున్నట్లు ?
అమెరికా తన ఆయుధాలను అమ్ముకొనేందుకు అనేక చోట్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు, అంతర్యుద్ధాలను రెచ్చగొడుతోంది. గతంలో మన మీద పాకిస్ధాన్‌ను ఎగదోసింది, ఇప్పుడు మనలను దాని మీదకు ఎగదోస్తోంది. రెండు దేశాలకూ అవసరమైన ఆయుధాలను అందిస్తోంది, డాలర్లను జేబులో వేసుకుంటోంది. మనం ప్రాణాలను కాపాడే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు ఇస్తే దానికి బదులు ప్రాణాలు తీసే ఆయుధాలను మనకు అమెరికా అందచేస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన పౌరుల ప్రాణ రక్షణకు అవసరమైన వెంటిలేటర్ల బదులు ఇతర దేశాల్లో ప్రాణాలు తీసే ఆయుధ తయారీకే ట్రంప్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్‌లో నాటి సోవియట్‌ యూనియన్‌ పలుకుబడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్ల పేరుతో మత ఉ గ్రవాదులను తయారు చేసింది. సోవియట్‌ ఉపసంహరణ తరువాత వారు ఏకుమేకై అమెరికాకే తలనొప్పిగా తయారయ్యారు. అక్కడ తన సైన్యాన్ని నిర్వహించటం పెద్ద భారంగా మారింది, చివరకు ఉపసంహరణకు ఆ తాలిబాన్లతోనే చర్చలు జరపాల్సిన దుర్గతి ట్రంప్‌కు పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌, ప్రపంచ సంపదలు, మిలిటరీ రీత్యా వ్యూహాత్మక ప్రాంతాల మీద పట్టు సాధించటం అమెరికా కార్పొరేట్ల అసలు లక్ష్యం. అక్కడి అధ్యక్షులందరూ వాటి కాపలాదారులు, సేవకులే.
బడ్జెట్‌ను సర్దుబాటు చేయలేక సతమతం అవుతున్న ట్రంప్‌ అధికారంలోకి రాగానే పొదుపు చర్యల్లో భాగంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి పరిరక్షక కార్యకలాపాలకు అంద చేస్తున్న నిధుల కోత పెట్టాలని ప్రతిపాదించాడు. తరువాత అన్ని ఐరాస కార్యక్రమాలకు సగం కోత కోయాలని పార్లమెంట్‌ను కోరాడు.శాంతి పరిరక్షక కార్యకలాపాలకు కేటాయించే నిధుల మీద ఉన్న ఆంక్షలను 2001లో తొలగించారు. ట్రంప్‌ ప్రతిపాదనలను చర్చించిన పార్లమెంట్‌ శాంతిపరిరక్షక కార్యకలాపాల మొత్తాలకు తిరిగి పరిమితి విధించింది. దాంతో వాటికి అమెరికా అందచేస్తున్న మొత్తం 28 నుంచి 25శాతానికి తగ్గిపోయింది. ఆమొత్తం 2019లో 20 కోట్ల డాలర్లు. ఇదే సమయంలో రానున్న పది సంవత్సరాల కాలంలో శాంతి పరిరక్షక కార్యకలాపాలకు వంద కోట్ల డాలర్లు ఇవ్వాలని చైనా నిర్ణయించింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేస్తున్న దేశాలకు చేస్తున్న సాయానికి కూడా కోత పెట్టాలని ట్రంప్‌ కార్యాలయం ప్రతిపాదించింది.
ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత ఈ ఏడాది జనవరి 19నాటికి 1095 రోజుల్లో ఆడిన అబద్దాల సంఖ్య 16,241 అని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఒక విశ్లేషణలో వెల్లడించింది. నోరు తెరిస్తే రోజూ ఏదో ఒక అబద్దం ఆడిన అధ్యక్షుడు అమెరికా చరిత్రలో మరొకరు లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు నిలిపివేసేందుకు ఆడిన అబద్దాలు ఎన్నో ! చైనా చెప్పినట్లు చేస్తోంది, చైనా దాచిన సమాచారాన్ని సమర్ధించింది. ఊహాన్‌లో కరోనా వ్యాప్తి పెద్ద సమస్య కాదని చెప్పిందట, అమెరికా సరిహద్దులను చైనాకు తెరిచి ఉంచాలని తొలుత సలహా ఇచ్చిందట. ఆరోగ్య సంస్ధ ఒక వేళ చెప్పిందే అనుకుందాం, మాకంటే మొనగాండ్లు లేరని విర్రవీగే సిఐఏ, ఎఫ్‌బిఐ తెలివి తేటలు ఏమయ్యాయి. చైనా సమాచారాన్ని దాచిందే అనుకుందాం, నష్టపోయేది వారే కదా ! ఎదుటి వాడు తొడకోసుకుంటే తెలిసి ఎవరైనా మెడకోసుకుంటారా ? అమెరికా, ఐరోపా దేశాలు చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ద చెప్పిన వాటిని పెడచెవిన పెట్టి తమ పౌరుల ప్రాణాల మీదకు తేవటాన్ని ఏమనాలి ?
అసలేమి జరిగిందో చూద్దాం. కరోనా వైరస్‌ నిర్ధారణ గాక ముందు డిసెంబరు 31న చైనా ఒక ప్రకటన చేస్తూ ఊహాన్‌ నగరంలో న్యుమోనియా కేసులు అసాధారణంగా నమోదైనట్లు వెల్లడించింది. జనవరి ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నూతన కరోనా వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చినట్లు నిర్ధారించింది. పన్నెండవ తేదీనాటికి దాని పూర్తి జన్యువును నిర్ధారించింది. తొమ్మిది రోజుల తరువాత తన తొలి శాస్త్రవేత్తల బృందాన్ని ఊహాన్‌ నగరానికి పంపింది. జనవరి 30న ఏక కాలంలో అనేక మందికి సోకే అంటువ్యాధిగా ప్రజారోగ్యానికి ప్రమాదం వచ్చిందని, అంతర్జాతీయ సమాజం అత్యవసరమైన అంశంగా పరిగణించాలని ప్రకటించింది. అయితే ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించుతుందని స్పష్టమైన ఆధారాలు లేవని చైనా చేసిన ప్రకటనను జనవరి 14న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ట్వీట్‌ చేసింది. తరువాత వచ్చిన సమాచారం మేరకు ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది.కానీ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికాను లేదా ప్రపంచాన్ని గానీ తప్పుదారి పట్టించలేదు. నిజానికి ఐరోపా ధనిక దేశాలు, ట్రంప్‌, యావత్‌ అమెరికా యంత్రాంగం ఆ హెచ్చరికలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ద ప్రకటనలను పట్టించుకోనవసరం లేదని జనవరి 22న ట్రంప్‌ చెప్పాడు. ఫిబ్రవరి పదవ తేదీన న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఏప్రిల్‌ నాటికి వాతావరణం వేడెక్కుతుంది, కరోనా వైరస్‌ ఎలా వచ్చిందో అలాగే ఆశ్చర్యకరంగా అదృశ్యం అవుతుంది అన్నాడు. ఫిబ్రవరి 26న విలేకర్లతో మాట్లాడుతూ ఇది ఫ్లూ, ఫ్లూ వంటిది, అమెరికాలో ప్రతి ఏటా వేలాది మంది ఫ్లూతో మరణిస్తుంటారని తెలియదా అన్నాడు. మార్చి తొమ్మిదవ తేదీన కరోనాను తాము సమర్దవంతంగా ఎదుర్కొన్నామని ప్రకటించాడు. అత్యధిక కేసులు, మరణాలో అమెరికాలో మరణ మృదంగం మోగుతుంటే ఇలాంటి పెద్ద మనిషి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధను తప్పుపడుతున్నాడు. తన తప్పిదం లేదని జనాన్ని నమ్మించేందుకు అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నాడు. కట్టుకథలను మీడియాకు అందిస్తున్నాడు.

Ingram Pinn's illustration of the week: 'A beautiful timeline ...
ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంది. చైనాలో కరోనా వైరస్‌ గురించి ఒక వైద్యుడు ముందే హెచ్చరించాడన్నది ఒక అంశం. అది నిజమై ఉండవచ్చు.ఒక ప్రాంతంలో తలెత్తిన ఒక ప్రమాదకర వైరస్‌ను ఎవరో ఒకరు లేదా ఒక బృందం ముందుగా అనుమానించటం లేదా కనుగొనటం సహజమే. అయితే అది యావత్‌ సమాజాన్ని భయాందోళనకు గురిచేసేది అయితే ముందుగా ప్రభుత్వంతో సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోకుండా, ఏర్పాట్లు చేయకుండా బయటకు వెల్లడిస్తే సమాజం అల్లకల్లోలం అవుతుంది. సదరు వైద్యుడు తాను అనుమానించిన అంశాన్ని నిర్దారిస్తూ సోషల్‌ మీడియాలో తన సహచరులతో పంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్‌ ఆసుపత్రిలో తగిన రక్షణ పరికరాలు లేవని, పోలీసుల ప్రవర్తన సరిగా లేదని తప్పుపట్టటం, మంత్రులతో సహా ఎవరూ పట్టించుకోవటం లేదని బహిరంగంగా చేసిన విమర్శను సహించని ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంది. అలాంటిది ఒక వైరస్‌ భయంకరమైనదని ఒక బృందం లేదా సంస్ధ నిర్దారించకుండా ఒక వైద్యుడు సోషల్‌ మీడియాలో ప్రచారం చేయటాన్ని ఏ సర్కార్‌ అయినా ఎలా తీసుకుంటుంది ? తప్పుపడుతూ చైనా సర్కార్‌ ఆ వైద్యుడిపై చర్య తీసుకుంది. అతను చెప్పింది నిజమైంది గనుక తరువాత తన చర్యను సరిదిద్దుకుంది. ఒక వేళ అవాస్తవం అయి ఉంటే ?
2009, 10 సంవత్సరాలలో స్వైన్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. అది 1918-19లో ప్రపంచాన్ని వణికించి లక్షల మంది ప్రాణాలను బలిగొన్న స్పానిష్‌ ప్లూ హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ తాలుకు కొత్త రకం .పక్షులు, పందులు, మనుషుల నుంచి పునర్వర్గీకరణం చెందింది. ఇది పందుల నుంచి వ్యాపించిన వైరస్‌ కావటంతో దాన్నీ స్వైన్‌(పంది)ఫ్లూ అని పిలిచారు.ఇది కనీసం 70 నుంచి 140 కోట్ల మందికి సోకిందని అంచనా వేశారు. అయితే మరణించిన వారు 1.5లక్షల నుంచి 5.75లక్షల మంది ఉంటారని అంచనా వేశారు.అధికారికంగా ఆయా దేశాలు ప్రకటించిన మేరకు 67లక్షల 24,149 మందికి వ్యాధి సోకగా మరణించిన వారి సంఖ్య 19,654 మాత్రమే. ప్రతి ఏటా ప్రపంచంలో ఫ్లూ(జలుబు) కారణంగా మరణించే వారు రెండున్నర నుంచి ఐదు లక్షల మంది వరకు ఉంటారని, దీనితో పోల్చుకుంటే స్వైన్‌ ప్లూతో మరణించిన వారు తక్కువే అని కొందరు పోలిక చెప్పారు. కొందరు ఆరోపిస్తున్నట్లు కరోనాకు చైనాయే కారణమైతే ఏటా లక్షల మందిని బలిగొంటున్న ఫ్లూ వైరస్‌ను ఎవరు వదులుతున్నట్లు ?
స్వైన్‌ ఫ్లూ తొలుత మెక్సికోలోని పందుల ఫారాల నుంచి సోకి 2009 మార్చి తొమ్మిదవ తేదీన ఒక ఐదు సంవత్సరాల బాలుడిలో బయటపడింది. ఏప్రిల్‌ చివరిలో 50 రోజుల తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చే అంటువ్యాధిగా ప్రకటించింది. అంత సమయం ఎందుకు తీసుకున్నట్లని ఎవరూ ఆనాడు సంస్ధను తప్పుపట్టలేదు. నిధులు నిలిపివేయలేదు. అన్ని అంశాలను నిర్ధారించుకున్న తరువాతే ఒక బాధ్యతాయుత సంస్ధ వ్యవహరిస్తుంది. తాము అనేక నివారణ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఆ రోజుల్లో గొప్పలు చెప్పుకున్నప్పటికీ అక్టోబరు 24న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించాడు. అన్ని నెలలు ఎందుకు ఆలస్యం చేసినట్లు ? మరణాల సంఖ్య అధికార రీత్యా ప్రకటించిన మేరకు తక్కువే అయినా అగ్రస్ధానంలో అమెరికాయే ఉంది. ఇక మన దేశం విషయానికి వస్తే అమెరికా నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వైన్‌ ఫ్లూను మోసుకు వచ్చాడు. హైదరాబాదు విమానాశ్రయంలో మే 13వ తేదీన గుర్తించారు, ఆగస్టు నాటికి అనేక రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికులు 937 మంది మరణించగా ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏలుబడిలో గుజరాత్‌ 488 మరణాలతో రెండవ స్ధానంలో నిలిచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా మీద ఆధారపడింది అనటం ఎంతవరకు వాస్తవం ? ప్రపంచ ఆరోగ్య సంస్దకు మేము ఏటా 40 నుంచి 50 కోట్ల డాలర్లు అందచేస్తున్నాము, అదే చైనా నాలుగు కోట్ల డాలర్లు, అంతకంటే తక్కువే ఇస్తోంది. ఒక ప్రధాన ప్రాయోజిత దేశంగా ఉన్న తమకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పూర్తి జవాబుదారీగా ఉండాలని కోరే హక్కు మాకుంది అని ట్రంప్‌ సెలవిచ్చాడు. అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నంత మాత్రాన అమెరికా చెప్పినట్లు ఏ సంస్ధ అయినా నడవాలా ?
అంటు వ్యాధుల నివారణ సమాచారం ఎవరి దగ్గర ఉంటే ఆ దేశాల మీద ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆధారపడటం సహజం. ప్రజారోగ్యం విషయంలో చైనా ప్రత్యేక చర్యలు, 2003లో కరోనా తరగతికి చెందిన సారస్‌ను చైనాలో సమర్దవంతంగా అరికట్టిన చరిత్ర, దానికి సంబంధించి వారి దగ్గర ఉన్న సమాచారం మరొక దేశం దగ్గర లేదు. కనుకనే కరోనా నిర్దారణ కాగానే చైనా సమాచారం మీద ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆధారపడింది తప్ప నిధులు ఎక్కువ పొందో లేక మరొక ప్రలోభంతోనో కాదు. ప్రపంచ రాజకీయాల్లో ఐరోపా యూనియన్‌ అమెరికాతో ఉంటుంది తప్ప చైనా మిత్రపక్షం కాదు. అలాంటిది నిధులు నిలిపివేయాలన్న ట్రంప్‌ చర్యను ఖండిస్తూ తీవ్ర విచారం ప్రకటించింది. నిందల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. వైరస్‌కు సరిహద్దులు లేవు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యేకించి నిధుల లేమితో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్దను బలపరచాలి, వాక్సిన్ల తయారీ పరీక్షల అభివృద్ధికి తోడ్పడాలని జర్మన్‌ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ వ్యాఖ్యానించాడు.
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ట్రంప్‌ చైనా మీద, ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీద నిందలు వేశాడు. ఐక్యరాజ్యసమితి సంస్ధలను తన రాజకీయాలు, దుర్మార్గ చర్యలకు ఉపయోగించుకోవటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వాటిని తన కనుసైగలతో నడిపించిన అమెరికా ఇప్పుడు ప్రాభవం కోల్పోతుండటంతో ఇతర దేశాలు అలాగే వ్యవహరిస్తున్నాయనే అనుమానపు జబ్బుకు గురైంది.
మన కళ్ల ముందే ఇరాక్‌లో ఏం జరిగిందో చూశాము. ఇరాన్‌కు వ్యతిరేకంగా పని చేసినంతకాలం ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుసేన్‌కు అన్ని రకాల ఆయుధాలను అందించి పదేండ్ల పాటు యుద్దం చేయించటంలో అమెరికా పాత్ర బహిరంగ రహస్యం. తరువాత అదే సద్దామ్‌ అమెరికా వ్యతిరేకిగా మారటంతో సద్దామ్‌ను వదిలించుకొనేందుకు ఇరాక్‌లో మారణాయుధాలను గుట్టలుగా పోశారని అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రచారం ప్రారంభించాయి. అమెరికా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న సద్దామ్‌ కువైట్‌పై దాడి చేసి అమెరికా సైనిక జోక్యానికి అవకాశం కల్పించాడు.
భద్రతా మండలిలో తీర్మానం చేయించి ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో అంతర్జాతీయ అణు ఇంధన సంస్ద ప్రతినిధి బృందాన్ని పంపారు.దానితో పాటు అమెరికా ప్రతినిధులు కూడా వెళ్లారు. దానిలో సిఐఏ ఏజంట్లు ఉన్నారని అప్పుడే వార్తలు వచ్చాయి.రెండు బృందాలు కలసి రెండు సంవత్సరాల పాటు ఇరాక్‌లో తిష్టవేసి వంద కోట్ల డాలర్లు ఖర్చు చేసి 1,625 మంది 1,700 స్దలాలను వెతికి చివరికి ప్రకటించిందేమంటే ఎలాంటి ఆయుధ ఆనవాళ్లు లేదా జీవ, రసాయన ఆయుధ కార్యక్రమాలు లేవని తేల్చారు. బుష్‌ విచారం వ్యక్తం చేశాడు. అయితే తమ చర్యను సమర్దించుకొనేందుకు ఆ కార్యక్రమాలను రద్దు చేసిన ఆనవాళ్లు దొరికాయని ప్రకటించి అమెరికా, ఇతర దేశాల యుద్ద నేరాలను కప్పిపుచ్చారు. ఆ పేరుతో ఇరాక్‌ను ఆక్రమించిన అమెరికా సేనలు చివరకు సద్దామ్‌ హుసేన్‌ను ఉరితీసి తమ తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.అమెరికా దాడి కారణంగా లక్షా తొమ్మిదివేల మంది మరణించినట్లు వికీలీక్స్‌ బయటపెట్టిన అమెరికా పత్రాల్లో ఉండగా మరో అంచనా ప్రకారం పదిలక్షల మంది ఇరాకీయులు అమెరికా కారణంగా మరణించారు. ఆల్‌ ఖైదాకు ఇరాక్‌ పాలకులకు ఎలాంటి సంబంధం లేదని సిఐఏ రహస్య పత్రాలు వెల్లడించాయి. అమెరికా చెప్పిన వన్నీ అబద్దాలే అని తేలిపోయింది. అలాంటి అమెరికా చైనా,ప్రపంచ ఆరోగ్య సంస్ధ గురించి ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే నమ్మటం ఎలా ?

ఊహాన్‌లో సంభవించిన కరోనా మరణాల సంఖ్యను సవరించినట్లు చైనాయే స్వయంగా ప్రకటించింది. దీన్ని చూపి చూశారా చైనా నిజాలను దాచిందని మేం ముందే చెప్పాం అంటూ అమెరికా లేదా ఎవరైనా వాదించవచ్చు. వివిధ కారణాలతో కోటి మంది జనాభా ఉన్న ఊహాన్‌లో రోజూ అనేక మంది మరణిస్తుంటారు. అధికార యంత్రాంగం కరోనా మరణాలను కొన్నింటిని సహజ మరణాలుగా నమోదు చేసి ఉండవచ్చు. తరువాత విచారణలో కాదని తేలినందున అంకెలను సవరించారు. అదేమీ నేరం కాదే. మరణాలు, శ్మశానాల్లో అస్ధికలశాల సంఖ్య గురించి పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. నిజంగా వాటిని అక్కడి ప్రభుత్వాలు, పాలకులు నమ్మితే, పెద్ద సంఖ్యలో మరణించినట్లు చెబుతున్నదానికి ఆధారాలుంటే, అలాంటి ప్రమాదకారి కరోనా కట్టడికి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పిన వారు లేరు. పాత చింతకాయ పచ్చడినే కొత్తగా వండి వడ్డిస్తున్నారు.
ఒక్క ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీదనే కాదు అనేక సంస్ధల మీద ట్రంప్‌ సర్కార్‌ దాడి చేసింది. అదిరించి బెదిరించి లొంగదీసుకోవాలని చూసింది. ఆప్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అమెరికన్ల మీద , ఇతర దేశాలపై అమెరికా విధించిన ఆర్ధిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలపై విచారణ జరుపుతున్న అంతర్జాతీయ నేర కోర్టు న్యాయమూర్తులు, సిబ్బందిని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన జాన్‌ బోల్టన్‌ బెదిరించాడు. అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘనల గురించి నిత్యం ఇతర దేశాలపై దుమెత్తిపోసే అమెరికా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్ధ నుంచి వైదొలిగిన తొలి దేశంగా చరిత్రలో నమోదైంది. అమెరికాలో దారిద్య్రం గురించి ఒక నివేదికను రూపొందించేందుకు ధైర్యం చేసిన ప్రొఫెసర్‌ ఫిలిప్‌ ఆల్‌స్టన్‌ను ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ విమర్శించాడు. ప్రపంచవ్యాపితంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వలసపోవటం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. అసలు అమెరికా అంటేనే వలస వచ్చిన వారితో కూడిన దేశం, అలాంటిది ప్రపంచ వలసల చర్చల నుంచి అమెరికా వైదొలిగింది. యునెస్కో నుంచి వైదొలిగి శాశ్వత పరిశీలక దేశంగా ఉంటానని ప్రకటించింది. వాతావరణ మార్పులు, యూదుల పట్ల వ్యతిరేకత, వారి మీద జరిగిన మారణకాండ వంటి అంశాల మీద యునెస్కో పని చేయటం, దానిలో అమెరికా పాత్ర బయటకు రావటం సహించలేని అమెరికా ఈ చర్యకు పాల్పడింది. పాలస్తీనియన్లు, ఇతర చోట్ల నిర్వాసితులుగా మారిన వారి సహాయ చర్యలు చేపట్టే సంస్ధకు తామింకేమాత్రం నిధులు అందచేసేది లేదని ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. ఇలాంటి చర్యలను చూసిన తరువాత అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితిని అమెరికా మిత్రునిగా చూస్తోందో శత్రువుగా భావిస్తోందా అన్నవే అవి. ఇదంతా ఇంటర్నెట్‌లో వెతికితే ఎవరికైనా దొరికే సమాచారమే !
ఇటీవలి కాలంలో ఏమి చేసినా చివరికి ప్రధాని నరేంద్రమోడీని అవమానించినా అమెరికా, ట్రంప్‌ను బలపరిచే, గుడ్డిగా వెనకేసుకు వచ్చే, చైనా మీద బురద చల్లే ఒక అనాలోచిత ధోరణి మన దేశంలో వెల్లడి అవుతోంది. అమెరికాను నమ్మితే కుక్కతోకను బట్టి గోదావరిని దాటే యత్నం లాంటిదే. నరేంద్రమోడీని లేదా మరొకరిని వ్యక్తిగా లేదా ఒక రాజకీయవేత్తగా విమర్శిస్తే దాని సంగతి వారు చూసుకుంటారు. ప్రధాని పదవిలో ఉన్నపుడు అవమానాలు పాలుకావటం అంటే దేశ వ్యవస్ధనే అవమానించటంతో సమానం. అమెరికా పౌరుడు బిల్‌ గేట్సే తమ ప్రభుత్వ చర్యను విమర్శించాడు. కానీ మన పాలకపక్షాలకు ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. ముందు కరోనా నివారణకు మన ప్రాధాన్యత అని మన ప్రభుత్వ ప్రతినిధి ఒక ముక్తాయింపు ఇచ్చారు. మిగతా దేశాలకు ఆ మాత్రం తెలియక విమర్శించినట్లా ?

Who's Ready to Die for Trump's Ego? | Common Dreams Views
ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు ఆగిపోతే నష్టపోయేది మనవంటి దేశాలే అని గుర్తించటం అవసరం. అమెరికా, ఇతర ఐరోపా దేశాలలోని బహుళజాతి ఔషధ గుత్త సంస్ధలు ప్రజారోగ్యం, మహమ్మారులకు సంబంధించిన సమాచారంపై గుత్తాధిపత్యంతో ఔషధాలు, వాక్సిన్ల తయారీకి పూనుకోవటం తెలిసిందే. మన వంటి వర్ధమాన దేశాలకు అవసరమైన సలహాలు, సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి మాత్రమే పొందగలం. నిధులు లేక దాని కార్యకలాపాలు కుంటుపడితే నష్టపోయేది మన దేశం, మన ఔషధ కంపెనీలే అని గుర్తించాలి. కామెర్ల ఔషధం మన దేశ సంస్ధలు తయారు చేయక ముందు విదేశీ రకాలకు ఎంత ధర చెల్లించామో తెలిసినదే. మన వంటి దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎంతగానో తోడ్పడుతోంది. అందువలన ట్రంప్‌ చర్యను యావత్‌ సభ్య సమాజం నిరసించాలి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఎన్నో కేసులను దాఖలు చేసింది. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటివి ఎన్నో చూడాల్సి రావచ్చు. అందుకే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రపంచ సంస్ధలను కాపాడుకొనేందుకు పూనుకోవాలి. ట్రంప్‌ను ఏ విధంగా సమర్ధించినా అది దేశద్రోహం తప్ప దేశభక్తి కాదు !

(అమెరికా పెద్దన్న ట్రంప్‌కు ఆరోగ్య సంస్ధ మీద ఆగ్రహం ఎందుకు -2 ముగింపు)

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ : కట్టడిలో కమ్యూనిస్టుల విజయం- జాడలేని మతాలు, యోగులు, యోగినులు !

11 Saturday Apr 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

catholic religion, COVID- 19 pandemic, Good friday 2020, Pope Francis

Coronavirus

ఎం కోటేశ్వరరావు
బ్రహ్మాండం బద్దలు కాలేదు, సముద్రాలు ఇంకి పోలేదు, ఇటు సూర్యుడు అటు పొడవ లేదు. కరోనా కారణంగా వందల సంవత్సరాలుగా పాటిస్తున్న గుడ్‌ఫ్రైడే క్రతువును పోప్‌ స్వయంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. తన నివాసంలోనే తంతును పూర్తి చేశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది.ఎక్కడైతే ఏసు క్రీస్తును శిలువ వేశారని భక్తులు నమ్ముతారో జరూసలెంలోని ఆ ప్రాంతంలో నిర్మించిన హౌలీ పుల్చెర్‌ చర్చ్‌లో అతి కొద్ది మంది ప్రార్ధనలు చేశారు. ఫిలిప్పైన్స్‌లో ఊరేగింపునే రద్దు చేశారు. కొందరు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించి కొన్ని చోట్ల ప్రార్ధనలు చేశారు. అందువలన మత చాదస్తులు, ఉన్మాదులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని చేరవెయ్యాలి, కళ్లారా చూసేందుకు దృశ్యాలను వారి ముందు ప్రదర్శించాలి. అయినా మారకపోతే అలాంటి వారిని కరోనా క్వారంటైన్‌ మాదిరి ఎక్కడైనా పెట్టి తాళం వెయ్యాలి. ఇది ఒక్క క్రైస్తవుల గురించే వ్యాఖ్య అనుకుంటే పొరపాటు ఏ మతం వారికైనా జరగాల్సింది ఇదే.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మతాల మూఢనమ్మకాల ఉక్కు గోడలను తుత్తునియలు చేస్తోంది. మతాలతో నిమిత్తం లేని దేవుడు, దేవతలు, దయ్యాలతో ప్రమేయం లేని కమ్యూనిస్టు చైనా కరోనాను కట్టడి చేసి సాధారణ జనజీవితాన్ని పునరుద్దరించింది. మరోవైపు దేవుడు,దేవతలు, దేవుడు, దేవుని కుమారుడు, దేవ దూతలు తమను రక్షిస్తారని కూర్చున్న మూర్ఖశిఖామణులను వారెవరూ కాపాడటం లేదు, దిక్కులేని చావు చస్తున్నారు, పూడ్చేందుకు కూడా ఎవరూ లేని వారిని అమెరికాలో గుట్టలుగా పడవేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం మత పునరుద్దరణ, మతోన్మాదశక్తులకు ఊహించని ఎదురుదెబ్బ. మూఢనమ్మకాలను నల్లేరు మీద బండిలా ముందుకు తీసుకుపోవచ్చన్న అజెండాతో ముందుకు పోతున్నవారికి పెద్ద కుదుపు. ఊగిసలాటతో ఉన్న అనేక మందికి ఈ పరిణామం దేవుడు, దేవతలు, మతాలు వాటి మహిమల మీద నమ్మకాలను వమ్ము చేస్తుంది.
ప్రపంచంలో ఏదైనా ఒక ప్రధాన ఘటన జరిగిన తరువాత జ్యోతిష్కులు అదిగో చూడండి మేము ముందే చెప్పాము అంటూ ముందుకు వస్తారు. కొంత మంది తమ మెదళ్లలో ఉన్న అశాస్త్రీయ సరుక్కు ఇదిగో నాసా(అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చెప్పింది అని ముద్ర తగిలిస్తారు. మరికొందరు మన పోతులూరి వీరబ్రహ్మం, ఫ్రెంచి జ్యోతిష్కుడు మైఖేల్‌ డే నోస్ట్రాడామస్‌ పేరు ఉపయోగించి 1551లో ఇలా రాశాడు అంటూ ప్రచారం చేస్తారు. వాటిలో ఒకటి ఇప్పుడు కరోనా మీద తిరుగుతోంది. దానిలో ఇలా ఉంది.” ఒక జంట సంవత్సరం(2020) ఉంటుంది. దాన్నుంచి ఒక రాణి (కరోనా) తూర్పు దిక్కు(చైనా) నుంచి వస్తుంది.ఏడు కొండలు ఉన్న ఒకదేశం(ఇటలీ) మీద ఒక చీకటి రాత్రి ఒక ప్లేగ్‌(వైరస్‌)ను చల్లుతుంది.అది జీవిత చరమాంకంలో ఉన్న పురుషులలో ప్రవేశించి మట్టి(మరణం)గా మారుస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను అంతం చేస్తుంది”.

These photos show how coronavirus fears left religious sites empty ...
దీన్ని సృష్టించిన వారు, దాన్ని గుడ్డిగా నమ్మేవారు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే వారి గురించి చెప్పాలంటే ఏమాత్రం బుర్ర ఉపయోగించని వారే అన్నది స్పష్టం. నోస్ట్రోడామస్‌ ఒక జంట సంవత్సరం వస్తుంది, అది 2020 అని చెప్పటమే తెలివితక్కువ తనం. ప్రతి నూట ఒక్క సంవత్సరాలకు అలాంటి సంవత్సరాలు వస్తాయి. అవి నోస్ట్రోడామస్‌కు ముందు వచ్చాయి, తరువాత వస్తాయి. అతగాడు చెప్పింది 1551లో అంటున్నారు గనుక 1616,1717,1818,1919 వచ్చాయి. అవే కాదు మూడంకెల సంవత్సరాలు కూడా వచ్చాయి. మిగతా సంవత్సరాలలో ఈ సంవత్సరాలలో కూడా ప్రపంచాన్ని కుదిపివేసిన ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఈ ప్రచార సృష్టి కర్తలకు బాక్టీరియాకు, వైరస్‌కు తేడా తెలియదు. అది ఇటలీలో ముసలి వారిని చంపేస్తుంది అన్నారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని వయసుల వారినీ కబళిస్తోంది. ఇటలీతో పాటు అనేక ఐరోపా దేశాలలో విలయతాండవం చేస్తోంది. అన్నిదేశాల కంటే వ్యాధి అమెరికాలో ఎక్కువగా ఉంది.
గణేషా స్పీక్స్‌ డాట్‌ కామ్‌ పేరుతో జ్యోతిషాన్ని చెబుతున్నవారు మార్చి 30 తరువాత వైరస్‌ నుంచి కాస్త ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఇప్పుడు అనేక చోట్ల ఎంత వేగంగా విస్తరిస్తోందో, దేశ ఆర్ధిక వ్యవస్ధలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో చూస్తున్నాము. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పటంలో ఒక మతం అని లేదు. స్వాములు, బాబాలు, గురువులు, గురవమ్మలు, గంటల, దిన, వార పంచాంగాలు,రాసి ఫలాలను ప్రచురించి సొమ్ము చేసుకొనే మీడియా గురించి ఏం చెప్పాలి? హిందూ మహాసభ గోమూత్ర పార్టీలను ఏర్పాటు చేసింది, ఇంకే ముంది కొందరు బిజెపి నేతలూ అదే పాట అందుకున్నారు.
కరోనా వైరస్‌ మతశక్తులలో విబేధాలు తెచ్చినట్లు ప్రముఖ పత్రిక ”ఎకనోమిస్ట్‌ ” తాజాగా ఒక వార్తను ప్రచురించింది. గుడ్‌ ప్రైడే సందర్భంగా రోమ్‌లో ప్రతి ఏటా పోప్‌ భక్తులతో కలసి శిలువను మోస్తూ ఏసు క్రీస్తు జీవితంలోని పద్నాలుగు ఘట్టాలకు చిహ్నంగా (మహాభారత పర్వాలు, రామాయణ కాండల మాదిరి) 14చోట్ల ఆగుతూ నడుస్తారు. ఆ దారిలో వేలాది మంది అనుచరులు శిలువను ముద్దాడుతూ తమ భక్తిని ప్రదర్శిస్తారు. వాటన్నింటినీ పక్కన పెట్టారని, ఏ ఏదేశాల్లో ఏమి జరుగుతోంది ఆ పత్రిక ప్రకటించింది. తాను 51 సంవత్సరాలుగా బోధకుడిగా ఉన్నానని ఇప్పుడు జనాన్ని చర్చ్‌లకు రావద్దని చెప్పాల్సి రావటం తనకు ఎంత కష్టమో ఆలోచించాలని రష్యన్‌ ఆర్ధోడాక్స్‌ చర్చ్‌ ప్రధాన గురువు కిరిల్‌ ప్రకటించారు. అయితే కొందరు అమెరికన్‌ ఇవలాంజికల్స్‌ మూర్ఖంగా వ్యవహరించి కటకటాల పాలయ్యారు. ప్రార్ధన చేసి వైరస్‌ను నిర్మూలిస్తామంటూ జనాన్ని తరలించిన ఫ్లోరిడా బోధకుడు రోడ్నీ హౌవార్డ్‌ బ్రౌన్‌ వారిలో ఒకడు. మన తిరుపతి వేంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల్లో మాదిరి భక్తులు లేకుండా తప్పనిసరి అనుకున్న మత క్రతువులను నిర్వహించవచ్చని ఫ్లోరిడా గవర్నర్‌ ప్రకటించాడు. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నపుడు కూడా ఈస్టర్‌ పూజలను ఇలా పూర్తిగా అడ్డుకోలేదని తూర్పు ఐరోపా దేశాల్లో సామాన్యులు భావిస్తున్నారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. యూదు మతంలో ఒక బహిరంగ మత క్రతువు నిర్వహించాలంటే కనీసం పది మంది హాజరు ఉండాలి, ఇప్పుడు సాధ్యం కాదు కానుక వాట్సాప్‌ లేదా మరొక పద్దతిలో పది మందిని చూపి దాన్ని పూర్తి చేస్తున్నారు.
ఇరాక్‌లో వైరస్‌ను వ్యాపింప చేసే వారు హంతకులతో సమానమని షియా మత పెద్ద గ్రాండ్‌ అయాతుల్లా అలీ అల్‌ సస్తానీ చేసిన వ్యాఖ్యలను ముక్తాదా అల్‌ సదర్‌ అనే మత పెద్ద వ్యతిరేకించాడు. నజఫ్‌ లోని ఇమామ్‌ అలీ మందిరాన్ని తెరవాల్సిందే అంటూ ప్రార్ధన ధర్నా చేశాడు. తలుపులు తెరిచిన తరువాత శవాలతో జనం దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొందరు మతఛాందుసులైన క్రైస్తవులు, స్వలింగ వివాహాలకు మద్దతు ఇస్తున్న కారణంగా కరోనా వైరస్‌ శిక్షిస్తున్నదని ముక్తాదా ముక్తాయింపులు ఇస్తున్నాడు. ఈనెల 23న రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ సందర్భంగా ఇస్లామిక్‌ దేశాలలో ఏమి చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇరాన్‌లో అన్ని మత ప్రదేశాలకు భక్తులు రావటాన్ని గతనెల 16న ప్రభుత్వం నిషేధించింది. అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోయిందని లౌకికవాదులు విమర్శిస్తే, ఇది తగని చర్య అని మతోన్మాదులు విరుచుకుపడ్డారు. అయోధ్యలో రామనవమి ఉత్సవాలను పరిమితం చేయాలని అధికారులు ప్రయత్నిస్తే హిందూ సంస్ధల వారు అయిష్టంగానే అంగీకరించారని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది.
కరోనా వైరస్‌ బతికి ఉన్నవారి మధ్య దూరం పెంచటమే కాదు, మరణించిన వారి అంత్యక్రియలకు సైతం పరిమితులు విధించింది. సంప్రదాయాలను పక్కన పెట్టమంది. క్రైస్తవులు, ముస్లింలు అనేక దేశాల్లో మరణించిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు మూడు రోజులు తీసుకుంటారు. ఇప్పుడు మరణించిన రోజే ఆపని చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కొన్ని చోట్ల రోజుల తరబడి శవాలను ఇచ్చే పరిస్ధితి లేదు. కరోనా వ్యాధి గ్రస్తులు మరణించిన తరువాత వైరస్‌ ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయినా సరే అలాంటి వారిని అనుమతించేది లేదని అనేక శ్మశానవాటికలు నిరాకరిస్తున్నాయి. హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ రెండు కిలోమీటర్ల దూరం పైగా నిలబడి శ్రద్దాంజలి ఘటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
మత మూర్ఖశిఖామణులే కాదు కొన్ని ప్రభుత్వాలు కూడా జనం ముఖ్యంగా లక్షలాది మంది మహిళల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం వైరస్‌ వ్యాప్తికి అబార్షన్లే కారణమని అనటమే కాదు, అబార్షన్లను నిషేధించింది. అసలే ఉద్యోగాలు పోయి, ఆదాయం లేని అనేక మంది ఇదేమి అదనపు భారంరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అంతకు ముందు అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చిన ఆసుపత్రులన్నీ వాటిని రద్దు చేశాయి. అతిక్రమించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఇతర రాష్ట్రాల్లో అత్యవసరంగా గర్భవిచ్చిత్తి చేసే ఆసుపత్రుల కోసం పరుగులు తీస్తున్నారు.
కరోనా వైరస్‌ కారణంగా ఇది రాస్తున్న సమయానికి వ్యాధిగ్రస్తులైన వారు 17లక్షల 16వేలు, మరణించిన వారు లక్షా మూడువేల 848మంది. ఒక్క అమెరికాలోనే 30శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. మానవాళితో పాటు వారిని నడిపిస్తున్న మతాలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి. దీని దెబ్బకు మతాలు బోధకుల మీదనే విశ్వాసం సన్నగిల్లే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. గత చరిత్రను చూసినపుడు ప్రళయాలు సంభవించినపుడు, వర్తమాన కాలంలో ఆర్ధిక సంక్షోభాలు వచ్చినపుడు జనం మరింతగా మతాలు, దేవుళ్లవైపు చూశారని స్పష్టమైంది. సమాజాన్ని వెనుక్కుతీసుకుపోయే మతశక్తులు మత, క్రతువుల పునరుద్దరణకు చేసే సంఘటిత ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వర్తమాన కాలంలో హిందూత్వ శక్తులు హిందూమతం కోసం ప్రయత్నిస్తుంటే తబ్లిగీ జమాత్‌ వంటి సంస్దలు ఇస్లామ్‌ పునరుద్దరణ ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాగే ప్రతి మతంలోనూ తిరోగామి శక్తులు చెలరేగుతున్నాయి. మానవ ప్రవర్తన మీద మతాల ప్రభావం ఇప్పుడు పెరుగుతోందా తరుగుతోందా అనే చర్చ ఉండనే ఉంది. ఆర్ధిక పరిస్ధితులు బాగుంటే దేవుడ్ని పట్టించుకోరనే మాట తరచూ వినిపించటం అందరికీ తెలిసిందే.
1960 దశకంలో అమెరికాలో 40శాతం లోపే మతాన్ని నమ్మటం లేదా తమ జీవితాల మీద మత ప్రభావం ఉందని భావించగా న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు రెండు విమానాలతో దాడులు చేసిన తరువాత మతం మీద విశ్వాసం ఉండాలని భావించిన వారు 71శాతం ఉన్నట్లు గ్యాలప్‌ సర్వే పేర్కొన్నది.14వ శతాబ్దంలో ఐరోపాలో ప్లేగ్‌ వ్యాధి ప్రబలినపుడు జనజీవితంలో చేస్తున్న తప్పుల కారణంగానే శిక్షగా దేవుడు ప్లేగ్‌ను పంపాడని మత పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్లేగు వ్యాధితో జనం మరణించకుండా నివారణ ప్రార్ధనలు జరిపేందుకు నాటి రాజు కులీ కుతుబ్‌ షా 1591లో నిర్మించిన కట్టడం అది. ప్రపంచంలో అనేక చోట్ల అలాంటివి వెలిశాయి. తరువాత హైదరాబాదు సంస్ధానంలో ప్లేగు వచ్చినపుడు పాలకులు భారం దానిమీదే వేసి ఊరుకోలేదు.ఐరోపాలో ప్లేగు కోట్లాది మందిని బలితీసుకుంది. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్లేగు వ్యాధి పదే పదే రావటంతో జనాలకు మతం మీద నమ్మకం సన్నగిల్లింది. దేవుడు మంచి వాడే గానీ మత పెద్దలు కాదన్నట్లుగా ఆగ్రహం వారి మీదకు మళ్లింది. ఆ పరిణామం మత సంస్కరణ ఉద్యమానికి నాంది పలికింది.
కరోనా సందర్భంగా అక్కడా ఇక్కడ అని లేకుండా ప్రపంచ వ్యాపితంగా అన్ని మతాల ప్రార్ధనా మందిరాలను మూసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చాదస్తం, మూర్ఖత్వంతో వ్యవహరిస్తే ఆయా మతాల వారిలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మలేసియా, పాకిస్దాన్‌, భారత్‌లలో తబ్లిగీ జమాత్‌ సమావేశాలు కరోనా వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా, వాటిలో పాల్గొన్నవారు వైరస్‌ను మోసుకు వచ్చిన వారిగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ తప్పు ఇస్లాం మతానిది కాదు, ఆ మతాన్ని పునరుద్దరించే పేరుతో పనిచేస్తున్న సంస్ధలు, వ్యక్తులు కరోనా వ్యాప్తి గురించి తెలిసి కూడా మూర్ఖంగా సమావేశాలు నిర్వహించటం నేరపూరిత వ్యవహారం. దాని మీద ఆ మతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మతాన్ని పునరుద్దరిస్తాం అంటే సరి పెట్టుకున్నంత మాత్రాన అసలుకే ఎసరు తెస్తే ఎలా అంగీకరిస్తాం అనే ఆగ్రహం ఆ మతంలోని వారి నుంచే వ్యక్తం అవుతోంది. సరే ఈ ఉదంతాలను కూడా మతోన్మాదాన్ని, ఇస్లాం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్న వారి గురించి తెలిసిందే. వారికి సోకిన మత వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం.

In a test of faith, Christians mark Good Friday in isolation - The ...

మత శక్తులు వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఒకటే. ఇండోనేషియాలో మార్చి 19వ తేదీ నుంచి జరపతలపెట్టిన తబ్లిగీ జమాత్‌ ఐదు రోజుల ఆసియా వార్షిక మత సమావేశాలను రద్దు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం చెప్పినా నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోయింది. అల్లాకు తప్ప మరొకరెవరికీ భయపడాల్సిన పనిలేదని ప్రచారం చేశారు. సమావేశ రద్దు ప్రతిపాదన వెనుక నిషేధిత ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ ఉందని కూడా రెచ్చగొట్టారు. చావు పుట్టుకలన్నీ దేవుడు ముందే నిర్ణయిస్తాడని, కనుక కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు. దానికి భయపడితే ఇస్లాం నుంచి వైదొలిగినట్లే అని రెచ్చగొట్టారు. మసీదు నిర్వాహకులు అల్లా కంటే సమావేశాలను వాయిదా వేయాల్సిందే అన్న రాష్ట్ర గవర్నర్‌ రిదవాన్‌ కమిల్‌కే ఎక్కువ భయపడ్డారని జనం భావించారు. అనుమతి లేకపోయినా భక్తులు ప్రారంభానికి ముందే వేలాది మంది చేరుకున్నారు. చివరికి అధికార యంత్రాంగం కరకుగా వ్యవహరించటంతో రద్దు చేసుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో మన దేశంలో అయోధ్యలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ జరిపి తీరాల్సిందే అని రామాలయ ట్రస్టు సభ్యుడు మహంత పరమహంస పట్టుబట్టిన విషయం తెలిసిందే. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, భక్తుల మంచి చెడ్డలను రాముడే చూసుకుంటాడని వాదించారు.
ఇక మంత్రాలకు చింతకాయలను రాలుస్తాం అనే అన్ని మతాలకు చెందిన బాబాలు, యోగులు,యోగినులు దుకాణాలు మూసుకొని కరోనా దెబ్బకు ఎక్కడికి పోయారో తెలియదు. వారిని గుడ్డిగా నమ్మిన జనం కష్ట కాలంలో ఏమయ్యారు అని నిలదీయకుండా ఉంటారా ? అంత ధైర్యం చెయ్యకపోతే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కరోనా కథ ముగిసిన తరువాత వారంతా తిరిగి దుకాణాలు తెరుస్తారు, జనానికి ఎలాంటి సంజాయిషీ చెబుతారో చూద్దాం. అలాంటి వారందరి చేత తెల్లారగానే బోధలు చేయించే మీడియా పెద్దలు కూడా జనానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో అన్ని మతాల వారు ఇండ్లలో ఉండే ప్రార్ధనలు జరపండి అని చెప్పకతప్పటం లేదు. అదే పని సాధారణ సమయాల్లో సైతం ఎందుకు చేయకూడదు అని కొందరైనా ఆలోచించకుండా ఉంటారా ? దర్శనాల వేలం వెర్రి తగ్గుతుందా? అదే జరిగితే అత్యంత లాభదాయకంగా మారిన భక్తి వాణిజ్య కేంద్రాలు, వాటి నిర్వాహకుల ఆదాయాలు ఏమి అవుతాయి ? ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోతుంది. గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ మత ప్రచారంలో పెద్ద విప్లవాన్నే తెచ్చింది. మత గ్రంధాల ప్రచురణ, పంపకం ద్వారా భక్తి విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం బాగా పెరిగి పోయిన ఈ రోజుల్లో ఫోన్‌ భక్తి వెల్లువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇష్టదైవాన్ని ఫోన్లో చూస్తూనే బస్సులు, రైళ్లు, కార్యాలయాల్లో పూజలు ప్రారంభం కావచ్చు. ఇవన్నీ మత వాణిజ్యం, మతశక్తులకు మంచి సూచనలు కావు.

Chinese President Xi Says He Was Leading COVID-19 Since Jan. 7 | Time
ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయిందని ప్రతివారూ చెబుతారు. కానీ ఆ గ్రామంలోనే ప్రతి వారూ తమ కులం, మతాలకే పరిమితమైన గోడలతో గృహ సముదాయాలను నిర్మించుకోవటాన్ని మనం చూస్తున్నాము. ప్రతి కులం, ప్రతి మతం తమ పవిత్రతను కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించే ధోరణులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదు అనుకునే పిల్లుల మాదిరి ప్రతి వారూ తమ కుళ్లును మూసిపెడుతూ ఎదుటి వారి దాని మీద దాడి చేస్తున్నారు. అంతరించి పోతున్న మత, కుల మడులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంలో మతాల పేరుతో అధికారాన్ని నిలుపుకొనేందుకు రాజులు,రంగప్పలు చేస్తే ఇప్పుడు వారి వారసులుగా కొన్ని పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. మృత భాషగా మారిపోయిన సంస్కృత శ్లోకాలను తమ పిల్లలకు నేర్పుతూ అనేక మంది ముఖ్యంగా విదేశాలలో ఉంటూ తెలియకుండానే హిందూ మత ఉద్దారకులుగా మారిపోతున్నవారిని చూస్తున్నాము. అదే పద్దతిలో ఏ మతానికి ఆ మతం వారు పడరాని పాట్లు పడుతున్నారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు. కానీ దానికి భిన్నంగా భారతీయులమని చెప్పుకోవాల్సింది పోయి ఫలానా కులం, ఫలానా మతం ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తున్న ప్రవాస భారతీయలను చూసి సిగ్గుపడుతున్నాము. అయితే ఏ విత్తనాలు వేస్తే ఆ పండ్లు, కాయలే కాస్తాయి అన్నట్లుగా మన దేశంలో, రాష్ట్రాలలో కుల మతాల కంపుతో పెరిగిన మన వారు పరాయి ప్రాంతంలో కూడా దాన్నే వ్యాపింప చేయటంలో ఆశ్చర్యం ఏముంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పరువును మురికి గంగలో కలిపిన జిగినీ దోస్త్‌ ట్రంప్‌ !

09 Thursday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

COVID-19, Donald trump, Donald trump Threat India, hydroxy chloroquine, Narendra Modi prestige

President Tump had supported the Narendra Modi government’s stand on hydroxychloroquine and praised India’s handling of the Covid-19 pandemic.

ఎం కోటేశ్వరరావు
నువ్వే నేను, నేనే నువ్వు, అన్ని విషయాల్లో ఒకే మాటగా ఒకే బాటలో నడుస్తామని చెప్పారు. మాది ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకొనే స్నేహం అన్నారు. కావాలంటే చూడండి అని కావిలించుకొని మరీ ప్రపంచానికి ప్రదర్శించారు. వారెవరో ఇంకా చెప్పాలా ! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, మన ప్రధాని నరేంద్రమోడీ. అలాంటి ట్రంప్‌ మరో దోస్తును మాక్కావలసిన మందు పంపకపోతే సంగతి చూస్తా బిడ్డా ! అని బెదిరించాడు. అంతకోపమెందుకు అన్నా నీక్కావలసినవి పంపుతున్నా అంటూ వెంటనే మోడీగారు జావగారి పోయారు. తన అవసరం తీరగానే భారత్‌కు, మోడీకి కృతజ్ఞలు అంటూ ఒక ట్వీట్‌ను ట్రంప్‌ మనకు పారేశాడు. మరి ఇదేమి స్నేహమో, ఇదేమి సమానభాగస్వామ్యమో జనం ఆలోచించాలి. ఈ విషయాల మంచి చెడ్డల గురించి మాట్లాడితే కరోనా కష్ట కాలంలో ఇలాంటివా అని మోడీ భక్తులు చెలరేగి పోతారు. మామూలు రోజుల్లోనే సహించరని ఇప్పటికే తేలిపోయింది కనుక ఇప్పుడు చెప్పనవసరం లేదు. అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చింది ట్రంప్‌. సాయం కావాల్సింది వారికి, ఎవరైనా మర్యాద పూర్వకంగా అడుగుతారు. బెెదిరించేవాళ్లను-వారికి లొంగిపోయే వారిని ఏమనాలి ? ఇది వ్యక్తుల సమస్య కాదు, దేశం పరువు. అసలు సిసలు దేశభక్తులం అని చెప్పుకొనే వారు ఇలా ప్రవర్తిస్తారా అని షాక్‌ అవుతున్నవారెందరో !
ప్రపంచ మీడియా అంతా అమెరికా బెదిరింపుకు భారత్‌ లొంగిపోయింది అని రాసింది. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు కోపం వచ్చింది అన్నట్లుగా మోడీ భక్తులకు ట్రంప్‌ అవమానించినందుకు, ప్రపంచ మీడియా అదే విషయాన్ని రాసినందుకు కోపం రాకపోవచ్చు గానీ మన దేశంలో ఎవరైనా దాని గురించి మాట్లాడితే, రాస్తే, విమర్శిస్తే ఎక్కడలేని ఆగ్రహం వస్తుంది. బానిస మనస్థత్వాన్ని ప్రదర్శించారని సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరేమనుకుంటేనేం ట్రంప్‌ పొగడ్తల ముందు అన్నీ దిగదుడుపే ! నిన్నటిదాకా ప్రపంచ రాజకీయాల్లో సమాన భాగస్వామి అని ప్రకటించిన నరేంద్రమోడీని ట్రంప్‌ అవమానిస్తే అది మోడీకి కాదు, దేశానికే అవమానం. అలాంటిది దీన్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనటాన్ని ఏమనాలి, సాధారణంగా అయితే సిగ్గు చేటు అంటాం. ఈ మాట దేశద్రోహం కిందకు రాదు. రాజకీయం చేసింది, మర్యాద లేకుండా వ్యవహరించింది ట్రంప్‌ !

COVID-19: More Hydroxychloroquine Data From France
కరోనాకు ఇంతవరకు మందు లేదు. ఉన్న మందులు కరోనా సోకిన రోగులకు తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్సకోసం తప్ప మరొకదానికి కాదు. మలేరియాకు బాగా పని చేసే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అనే ఔషధం కరోనా వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుందని ఇంతవరకు ఎవరూ నిర్దారణగా చెప్పలేదు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఫలానా మందు వేస్తే ఏమైనా సుగుణం వస్తుందేమో చూద్దాం అన్ని అందుబాటులో ఉన్న మందులను వాడుతున్నట్లుగా కొన్ని చోట్ల దీన్ని కూడా వాడారు. కొందరికి సుగుణం కనిపించిందని వైద్యులు చెప్పారు, కొందరికి అదే ప్రాణాల మీదకు తెచ్చిందని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ మందును ప్రపంచంలో ఎవరైనా తయారు చేయవచ్చు, దీనికి లైసన్సు, పేటెంట్లతో పనిలేదు. అమెరికాలో కూడా ఇప్పటికే తయారు చేస్తూనే ఉన్నారు. అలాంటి దానికోసం ట్రంప్‌ ఇంత యాగీ ఎందుకు చేసినట్లు ? తన దోస్తు పరువు ఎందుకు తీసినట్లు ?
ట్రంప్‌ చర్య బెదరింపు, హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ ,ఇతర వైద్య పరమైన వాటిపై ఎగుమతి నిషేధాన్ని సడలించకపోతే ప్రతికూల చర్యలకు పాల్పడతాం అని చెప్పటం బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. నిర్దారణగాని సదరు ఔషధం కనుక ఎగుమతి చేసినా ఇబ్బంది లేదు, కరోనా పోరులో అవసరమైన మిగతావాటిని కూడా బెదిరింపులకు లొంగి సరఫరా చేస్తే మన జనం సంగతి ఏమిటి అన్నది సమస్య? ఈ విషయాన్ని చర్చించనవసరం లేదా ? ట్రంప్‌ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఏకపక్షంగా చేయకపోతే ప్రతిపక్షాలను ఎందుకు సంప్రదించలేదు ?
సామాజిక మీడియాలో అతిశయోక్తులు ప్రచారం చేయటం, నరేంద్రమోడీకి లేని గొప్పతనాన్ని అంటగట్టటం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కూడా కాషాయ తాలిబాన్లు వెంటనే విజృంభించారు. సరైన పేరు లేదు గానీ కాషాయ రంగులో ఉండే వైరస్‌ సోకిన కారణంగా మీడియాలో పని చేసే వారందరూ కమ్యూనిస్టులుగానూ, మోడీకి సంబంధించి నిజాలను చూపని వారుగా కనిపిస్తారు. ఒక సారి ఆ వైరస్‌ సోకిన వారికి మెదడు పూర్తిగా చెడిపోతుంది, దాంతో జీవితాంతం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. అది వ్యాధి లక్షణం. అలాంటి ఒక వ్యాధిగ్రస్తుడు లేదా గ్రస్తురాలు సామాజిక మాధ్యమం కోసం తయారు చేసిన పోస్టు ఇలా తిరుగుతోంది. ” కమ్మి కమీనే మీడియా కుళ్ళుతో చెప్పని, ఇంటర్నేషనల్‌ న్యూస్‌ టాపిక్స్‌ లో హాట్‌ గా మారిన వార్త ఇవాళ్టికి ఇదే. మోడీ చాలా టఫ్‌ గురూ…సూపర్‌ పవర్‌ అమెరికాకి హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అత్యవసరం, భారత్‌ కు ఎగుమతి చేసే శక్తి ఉంది.ముందుగా డిమాండ్‌ చేశారు.మోదీజీ ముందు మా అవసరాలు తీరాలని సమాధానం. రెండోసారి బెదిరింపు.మోదీజీ నవ్వుతూ కుదరదని స్పష్టం..మూడోసారి ‘ ఓకే మీకేం కావాలో అడగండి ‘ఇదీ అడిగేపద్దతి..
1.) అమెరికన్‌ మార్కెట్లలోకి ప్రవేశించడానికి భారత్‌ ఫార్మా కంపెనీలకు అడ్డొస్తున్న నియమాలను సవరించాలి.. డన్‌…2) భారత్‌ ఫార్మా కంపెనీల మీద సహేతుకంగా లేని అమెరికన్‌ ఎఫ్‌డిఏ విధించిన అన్ని లెవీస్‌ ఎత్తివేయాలి… డన్‌. 3.) ఎఫ్‌డిఐ ఇకపై భారత్‌ ఫార్మా కంపెనీల మీద అనవసర పేటెంట్‌ హరాస్మెంట్‌ చేయకూడదు.. డన్‌ . భారత్‌ ప్రతిపాదించిన 3 ప్రధాన డిమాండ్స్‌ నూ..డన్‌..డన్‌..డన్‌ 24 గంటల సమయంలో ఒప్పుకున్న అమెరికా…నిజంగానే మోడీ చాలా టఫ్‌… కొరకరాని కొయ్య..? ఓవరాల్‌గా మన ఫార్మా కంపెనీలు అమెరికా వెళ్ళడానికి కావలిసిన అన్ని అనుమతులు మోడీ గారు దగ్గర ఉండి ఇప్పించారు. అలాగే అమెరికా అడిగిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ కూడా పంపించారు.” ఇదీ మొత్తం పోస్టు.
పాఠకులు గ్రహించాల్సింది ఏమంటే ప్రయివేటు మీడియాలో ఇవన్నీ చూపలేదు సరే, దూరదర్శన్‌, రేడియోలలో పని చేసేది కూడా కమ్యూనిస్టులేనా ? దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలో ఏముంది ? అన్నింటికీ ఒప్పుకుంటున్నట్లు అమెరికా వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదే. మరి సామాజిక మాధ్యమానికి ఎలా అందినట్లు ? ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తి ! ఇంతకీ అసలు జరిగిందేమిటి ?
అమెరికా మనలను అడిగేనాటికే మన కేంద్ర ప్రభుత్వం మన అవసరాలను గమనంలో ఉంచుకొని ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతులపై నిషేధం విధించింది.ఈ మేరకు ఈనెల నాలుగవ తేదీ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెలువడింది. అది వెలువడిన కొద్ది గంటల్లోనే అమెరికా నుంచి ఔషధాలు కావాలని అడిగారు. ట్రంప్‌ స్వయంగా సంప్రదించాడు. నిషేధం కారణంగా కుదరదని చెప్పారు. అయితే నేను స్వయంగా ఫోనులో మోడీని అడిగినా ఔషధాలను పంపరా ? మీ సంగతి చూస్తా అంటూ ట్రంప్‌ సోమవారం నాడు బహిరంగంగానే బెదిరించాడు. ఒక రోజు కూడా గడవక ముందే మన సర్కార్‌ నిషేధాన్ని సడలించి పంపుతామని ప్రకటించింది. అంతే తప్ప మన కంపెనీలు నేరుగా అమెరికా మార్కెట్‌లోకి వెళ్లేందుకు దగ్గరుండి మరీ నరేంద్రమోడీ అనుమతులిప్పించారని చెప్పటం అతిశయోక్తి. కేంద్ర ప్రభుత్వ విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ విలేకర్లతో మాట్లాడుతూ మన మీద ఆధారపడుతున్న దేశాలకు ఔషధాలను పంపుతున్నామని, అమెరికాకు పంపటాన్ని రాజకీయం చేయవద్దని, ఊహాగానాలు వద్దని కోరాడు తప్ప అమెరికాతో పైన చెప్పినట్లుగా ఒప్పందం గురించి చెప్పలేదు, కాషాయ దళాలు ఆయన్ను కూడా కమ్యూనిస్టు అంటారేమో !
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు చైనాయే మన సాయం కోరింది అని మరొక ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా తప్పుడు ప్రచారమే. ఇబ్బందులలో ఉన్నపుడు ఎంత గొప్పవారినైనా మీకేమైనా కావాలా అని అడుగుతాం. వారు కోరకుండానే మనకు తగిన సాయం చేస్తాం. అది మర్యాద, మన్నన. అలాంటి దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారంటే వారి స్దాయి ఏమిటో అర్దం చేసుకోవచ్చు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ రాత పూర్వక సమాధానమిస్తూ చైనాకు మన దేశం 15టన్నుల వైద్య సరఫరాలను ఫిబ్రవరి 26న ఒక ప్రత్యేక విమానంలో తీసుకుపోయి ఊహాన్‌లోని హుబెయ రాష్ట్ర ఛారిటీ ఫెడరేషన్‌కు అందచేశామని, వాటి విలువ 2.11 కోట్ల రూపాయలని, అంతకు ముందు ఎనిమిదవ తేదీన ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు గ్జీకి ఒక లేఖ రాస్తూ తమ సౌహార్ద్రతను తెలియచేస్తున్నామని, అవసరమైన సాయం చేయగలమని పేర్కొన్నట్లు ఆ సమాధానంలో తెలిపారు. పంపిన వాటిలో ఒక లక్ష సర్జికల్‌ మాస్కులు, ఐదులక్షల సర్జికల్‌ గ్లోవ్స్‌, 75 ఇన్‌ప్యూజన్‌ పంప్స్‌, 30 ఎంటరల్‌ ఫీడింగ్‌ పంప్స్‌, 21డిఫిబ్రిలేటర్లు, నాలుగువేల ఎన్‌95 మాస్కులు ఉన్నట్లు పేర్కొన్నారు. చైనా అవసరాలతో పోల్చినపుడు ఇవి ఎంత అన్నది సమస్య కాదు, తోటి దేశంగా తోడ్పాటు. అది ఎవరైనా చేస్తారు. దాన్ని గొప్పగా చెప్పుకోవటాన్ని ఏమనాలి ?
చైనాకు చేసిన ఈ సాయం గురించి గొప్పలు చెప్పుకుంటున్న వారికి తెలిసినా తెలియనట్లు నటించే విషయాలను జనం తెలుసుకోవాలి.చైనా, ఇతర దేశాల్లో ఎక్కడ దొరికితే అక్కడ మనకు కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను కొనుగోలు చేసేందుకు మన దేశం నిర్ణయించిందని మార్చి 31న రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనాన్ని బిజినెస్‌ టుడే ప్రకటించింది.భారత్‌కు మూడు కోట్ల 80లక్షల ముఖతొడుగులు, 62లక్షల వ్యక్తిగత రక్షణ వైద్య పరికరాలు అవసరమని ఆ వార్తలో పేర్కొన్నారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల వైద్యులకు ఇలాంటి పరికరాలు లేక రెయిన్‌కోట్లు వేసుకుంటున్నారని, గతిలేక హెల్మెట్లు పెట్టుకొని తమను తాము రక్షించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మనం చైనాకే ఎగుమతి చేసే స్దితిలో ఉన్నామని గొప్పలు చెప్పేవారు దీని గురించి ఏమి చెబుతారు ?
అమెరికన్ల పట్ల ట్రంప్‌ నిర్లక్ష్యం గురించి పదే పదే చెప్పుకోవటం నాగరికులకు సిగ్గు చేటు, వదిలేద్దాం. కరోనా చికిత్సకు హైడ్రోక్సి క్లోరోక్విన్‌ పని చేస్తుందని నిర్ధారణ కాలేదు, అయినా ఆ ఔషధం కోసం ట్రంప్‌ గత కొద్ది రోజులుగా ఇంటా బయటా ఎందుకు రచ్చ చేస్తున్నట్లు ? మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాకు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ మాదిరి వ్యవహారమేనా మరేదైనా ఉందా ? అమెరికా మీడియాలో భిన్న కథనాలు వెలువడ్డాయి. హైడ్రోక్సీ క్లోరోక్విన్‌తో కలిపి కొందరు వైద్యులు అజిత్రోమైసిన్‌ ఇస్తారు. దీన్ని జెడ్‌ పాక్‌ అంటారు. ఈ యాంటీబయోటిక్‌ బాక్టీరియాను తప్ప వైరస్‌ను నిర్మూలించదు. రెండు వారాల క్రితం ఫ్రెంచి వైద్యుల బృందం కొందరికి దీనితో చికిత్స చేశారు. ఆరు రోజుల తరువాత ఆరుగురికి పరీక్షలో నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ విషయం ఒక పత్రికలో ప్రచురితమైంది. అమెరికాలోని ఒక ప్రముఖ వైద్యుడు దీన్ని అందుకొని పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చాడు. దాన్నే సలహాగా ట్రంప్‌కు చెప్పాడు. అసలే నిర్లక్ష్యం చేసినట్లు ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ ఈ ఔషధంతో అమెరికాలో వైరస్‌ను నిర్మూలించవచ్చని నమ్మినట్లు కనిపిస్తోంది. కానీ అదే ఫ్రెంచి వైద్యుల పర్యవేక్షణలో అదే ఔషధం తీసుకున్న మరో ముగ్గురిని ఆరురోజుల తరువాత పరిస్ధితి విషమించి ఐసియులో చేర్చారు. మరొకరికి చెడు ప్రభావం కనిపించటంతో జెడ్‌ పాక్‌ ఇవ్వటం నిలిపివేశారు. మరొక పేషెంట్‌ ఆరవ రోజున మరణించాడు. ఈ విషయాలను ట్రంప్‌కు వివరించిన వైద్యుడు గానీ, ట్రంప్‌గానీ పట్టించుకోలేదు. కేవలం ఒక ఆరుగురికి వచ్చిన ఫలితాన్ని బట్టి ఒక ఔషధాన్ని వైరస్‌ అనుమానితులు లేదా వ్యాధి గ్రస్తులకు ఇవ్వటం వైద్య చరిత్రలో అరుదు, ఎవరూ అంగీకరించరు. అయినా ట్రంప్‌ హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ చరిత్రను మార్చివేస్తుందంటూ గానాలాపనకు పూనుకున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనది, ఎంతో అందమైనది, స్వర్గం నుంచి వచ్చిన బహుమతి అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలాడు. దాన్లో భాగంగానే మన దేశాన్ని బెదిరించాడు. తాను కూడా స్వయంగా తీసుకోబోతున్నట్లు చెప్పాడు. వైరస్‌ గురించి దాదాపు అన్నీ పచ్చి అబద్దాలు చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు క్లోరోక్విన్‌ గురించి ఎక్కువ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వలన ఫలితం ఉండదనే అంశాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పిన వారిని తీసుకొంటే మీకు పోయేదేమిటి అని నోరు మూయిస్తున్నాడు. ఎప్పుడైతే ట్రంప్‌ ఇలా మాట్లాడటం మొదలు పెట్టారో జనాలు తమకు ఉపయోగపడుతుందో లేదో తెలియకపోయినా అవసరం అయినపుడు ఉపయోగించుకోవచ్చని పెద్ద మొత్తంలో క్లోరోక్విన్‌ ఔషధాన్ని కొని నిల్వచేసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో అమెరికాలో కొరత ఏర్పడింది. అరిజోనా రాష్ట్రంలో చేపల తొట్లలో వేసే క్లోరోక్విన్‌ తీసుకొని భార్యాభర్తలు అస్వస్తతకు గురి కాగా భర్త మరణించాడు.
మరొక ఆసక్తికర విషయం ఏమంటే అమెరికాలో మలేరియాను ఎప్పుడో అరికట్టారు. పదమూడు రాష్ట్రాలలో మాత్రం అక్కడక్కడా చాలా సంవత్సరాల క్రితం కనిపించేది. అయితే ఇప్పటికీ మలేరియా కేసులు అమెరికా ఆసుపత్రుల్లో ఏటా రెండువేల మేరకు నమోదవుతున్నాయి. అవి కూడా విదేశాల నుంచి ముఖ్యంగా దక్షిణాసియా, సబ్‌ సహారా ఆఫ్రికా ప్రాంత దేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే క్లోరోక్విన్‌ మలేరియాతో పాటు లూపస్‌(ముఖచర్మరోగం)కు కూడా బాగా పని చేస్తుంది అందువలన దానికోసం అమెరికాలో కొన్ని కంపెనీలు తయారు చేస్తాయి. అమెరికాలో వ్యూహత్మక నిల్వల కోసం గతనెలలోనే నోవార్తిస్‌ సబ్సిడరీ శాండోజ్‌ కంపెని 2.9 కోట్ల డోసుల హైడ్రోక్సి క్లోరోక్విన్‌ సల్ఫేట్‌ను ప్రభుత్వానికి ఉచితంగా అందచేసింది. మరో కంపెనీ బేయర్‌ పదిలక్షల డోసులు ఉచితంగా అందచేసింది.
హైడ్రోక్సి క్లోరోక్విన్‌ గురించి ట్రంప్‌ హడావుడి చేయటం వెనుక స్వల్ప మొత్తాలలోనే అయినప్పటికీ ట్రంప్‌ కుటుంబ సభ్యులకు ఆర్ధిక ప్రయోజనాలున్నాయని ఆ కారణంగానే ట్రంప్‌, ఆయనకు చెందిన ఫాక్స్‌ న్యూస్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు వార్తలు వచ్చాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికే వాటిని రాసింది. పాలక్వెనిల్‌ బ్రాండ్‌ పేరుతో హైడ్రోక్సి క్లోరోక్విన్‌ తయారు చేసే సనోఫి అనే కంపెనీ వాటాలలో ట్రంప్‌ కుటుంబ సభ్యుల మ్యుచ్యువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఉన్నాయని టైమ్స్‌ రాసింది. అయితే అవి వారి ఆస్తులతో పోల్చితే నామమాత్రమే అని వాటి వలన పెద్దగా వచ్చేదేమీ ఉండదని మరికొన్ని పత్రికలు రాశాయి.

Trump threatens payback for U.S. companies that move abroad | PBS ...
ఈ ఉదంతం మొత్తాన్ని చూస్తే ఒక అంశం స్పష్టం అవుతున్నది. ట్రంప్‌ అనుసరించిన నిర్లక్ష్యం కారణంగా నేడు అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నది, ఎంత మందికి సోకుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితం వ్యాధి విస్తరణ తీరు తెన్నులను అరికట్టకపోతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది వరకు మరణించే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ విజయం అనుమానమే. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. జో బిడెన్‌ ఇప్పుడు ట్రంప్‌ ప్రత్యర్ధి అని తేలిపోయింది. అమెరికాలో ఔషధ తయారీ ఎంతో ఖర్చుతో కూడుకున్నది తప్ప అక్కడ తయారు చేయలేనిదేమీ కాదు. అంటే ట్రంప్‌ ఇక్కడ కూడా ఖర్చు – లాభం చూసుకున్నాడని అనుకోవాలి. ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడల్లో భాగంగా ఎంతకైనా తెగిస్తానని, అమెరికన్ల కోసం ఏమైనా చేస్తానని ప్రదర్శించుకొనేందుకు మన దేశాన్ని బెదిరించినట్లు స్పష్టం కనిపిస్తోంది.
నరేంద్రమోడీ సర్కార్‌ బెదిరింపుల గురించి కనీస నిరసన కూడా తెలియచేయకుండా నాలుగు రోజుల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేసి అమెరికాకు ఔషధాన్ని పంపేందుకు నిర్ణయించింది, మరి ఆ 56 అంగుళాల ఛాతికి ఏమైందో, సమాన భాగస్వామ్యం ఎక్కడకు పోయిందో తెలియదు, మరీ ఇంత లొంగుబాటా ? ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తామని చెప్పుకొనే తమ నేత పరువు ప్రపంచ మీడియా వార్తలతో వారణాసిలోని మురికి గంగలో కలసిందని, దానికి ఆయన జిగినీ దోస్త్‌ ట్రంపేనని ఆయన భక్తులు గ్రహిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డెబ్బై ఆరు రోజుల తరువాత ఊహాన్‌లో సాధారణ జన జీవనం !

07 Tuesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

COVID-19, Normalcy in Wuhan city, Wuhan city

Why Wuhan is so important to China's economy and the potential ...

ఎం కోటేశ్వరరావు
చైనా తన గురించి ప్రపంచానికి అనేక విషయాలు చెప్పింది. అది చెప్పేది నమ్మకూడదని పశ్చిమ దేశాలు గత ఏడు దశాబ్దాలుగా నూరిపోస్తున్నాయి. దాని వలన చైనాకు వచ్చిన నష్టమేమీ లేదు గానీ మిగిలిన దేశాలు ఎంతగా నష్టపోతున్నాయో కరోనా మహమ్మారి ఉదంతంలో యావత్‌ ప్రపంచం చూస్తోంది. ఎక్కడైతే కరోనా తొలిసారిగా కనిపించిందో ఆ ఊహాన్‌ నగరం దాన్ని అదుపులోకి తెచ్చుకుంది. కరోనా విలయతాండవం సాగిన 76 రోజుల తరువాత తిరిగి బుధవారం నుంచి ఆ నగరం సాధారణ కార్యకలాపాల్లో నిమగం కానుందని అధికారులు ప్రకటించారు. ఈ నిజాన్ని నమ్మని వారిని మానసిక చికిత్సాలయాలకు తరలించటం తప్ప మరొక మార్గం లేదు. ఆ విషయాల గురించి చెప్పుకోబోయే ముందు పశ్చిమ దేశాలు ఇప్పటికీ తమ జనం ప్రాణాలను ఫణంగా పెట్టి ఎలా ప్రయోగాలు చేస్తున్నాయో చూద్దాం.
ముఖాలకు తొడుగులు(మాస్క్‌లు) వేసుకొని కరోనా నుంచి తప్పించుకొనే జాగ్రత్తలలో ఒకటని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో వాటికి ఉన్న పరిమితులు, జాగ్రత్తలను కూడా తెలియ చేస్తున్నారు. కరోనాను జయప్రదంగా అరికట్టిన చైనాలో జనం ముఖ తొడుగులు వేసుకున్నారు. అది ఎన్నో ఫలితాల నిచ్చిందని ఇప్పటికే రుజువైంది. ఐరోపా దేశమైన డెన్మార్క్‌లో మంగళవారం నాటికి 187 మంది మరణించగా 4,681కేసులు నమోదయ్యాయి. ముఖ తొడుగుల వలన ప్రయోజనం ఉందా లేదా చైనా వారు చెప్పేది నిజమా కాదా అని తేల్చుకొనేందుకు బుధవారం నుంచి అక్కడ నెల రోజుల పాటు ఆరువేల మంది మీద ప్రయోగాన్ని తలపెట్టారు. మూడువేల మంది ముఖాలకు తొడుగులు వేస్తారు, మరో మూడువేల మందిని తొడుగులు లేకుండా ఈ నెల రోజుల్లో పరీక్షిస్తారట.
అమెరికన్లు తాము కనిపెట్టిన నూతన ఆయుధాలు ఎలా పని చేస్తాయో చూసేందుకు ఎక్కడో ఒక దగ్గర యుద్ధాన్ని రెచ్చగొట్టి ప్రయోగించి చూడటం మనకు తెలిసిందే. ఇరాక్‌లో అదే పని చేశారు. అన్నింటికీ మించి జపాన్‌పై అణుబాంబులు వేసి బహిరంగ పరీక్ష జరిపిన విషయం గురించి చెప్పనవసరం లేదు. డెన్మార్క్‌ ముఖతొడుగుల ప్రయోగం చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాను ముఖతొడుగును ధరించనని, అయితే తమ పౌరులు స్వచ్చందంగా ధరించవచ్చని ప్రకటించాడు. అనేక పశ్చిమ దేశాల్లో ముఖ తొడుగుల మీద వ్యతిరేక ప్రచారం ఉంది. ఈ దేశాల్లో ఉన్న ఆసియన్లు ఎవరైనా ముఖతొడుగులు ధరిస్తే వారిని కించపరచటం, కొన్ని చోట్ల దాడులు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ముఖతొడుగుల గురించి నమ్మకం లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలి గానీ జనాన్ని ఫణంగా పెట్టి ప్రయోగాలు చేయటం ఏమిటి ? ఇదేమీ రాజకీయ సిద్ధాంతం కాదు, పరీక్షలు జరిపి నిర్ధారించుకొనే తరుణమూ కాదు. తాము పాటించేదే ప్రజాస్వామ్యం, భావ ప్ర కటనా స్వేచ్చ, తాము కనుగొన్నదే సత్యం, ఇతరులను నమ్మం అనే ఒక దురహంకారం పశ్చిమ దేశాలలో ఉన్నది. ఇప్పుడు ముఖతొడుగుల విషయంలో కూడా దాన్నే వెల్లడించుకుంటున్నారు.

23 Eerie Pictures Of Wuhan, China, After Nearly Two Weeks In ...
ఇక ఊహాన్‌ నగరం ఉన్న హుబెరు రాష్ట్రం, పరిసరాలు సాధారణ స్థితికి వస్తున్నాయి. గడచిన 24 గంటల్లో సోమవారం నాడు హుబెరులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు. అయితే అంత మాత్రాన పరిస్ధితి గురించి ఉపేక్షించకూడదని, కరోనా మీద కన్నేసి ఉంచుతామని, ఇంకా ఆనంద, ఉత్సాహాలను ప్రకటించే తరుణం రాలేదని అధికారులు చెప్పారు. రోగ లక్షణాలున్న వారిని పరీక్షలకు పంపే యంత్రాంగం ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి వారికి ఒక ఆరోగ్య కోడ్‌ ఇచ్చినందున ఎవరైనా హౌటళ్లు, దుకాణాలు, బస్‌, రైల్వే స్టేషన్లకు వచ్చినపుడు ఆ కోడ్‌ను స్కాన్‌ చేస్తారు. తిరిగి వ్యాధి అనుమానాలుంటే చికిత్సకు తరలిస్తారు. బుధవారం నుంచి రైళ్లు, విమానాశ్రయాలను కూడా పునరుద్దరిస్తున్నారు. వందలాది మెట్రో, బుల్లెట్‌ రైళ్లు సిద్ధం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఊహాన్‌ వాసులు వీధులలోకి వస్తున్నారు, తమకు ఇష్టమైన ఉదయపు ఉపాహారమైన నూడిల్స్‌ను తీసుకుంటూ దుకాణాల వద్ద కనిపిస్తున్నారు. తిరిగి ఫ్యాక్టరీలు, కార్యాలయాలకు పనులకు హాజరయ్యే వారు తాము ఆరోగ్యంగా ఉన్నామని సర్టిఫికెట్‌లను స్మార్ట్‌ ఫోన్ల మీద సమర్పించాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ ఎలా వస్తుందన్నది ఇంకా అంతుబట్టని కారణంగా జనం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు గత కొద్ది రోజులుగా నగర వాసులను హెచ్చరిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు బయట పడకుండా వైరస్‌ సోకే అవకాశాలు కూడా ఉన్నాయని, అందువలన బయటి నుంచి వచ్చిన వారిని ఫ్యాక్టరీలు,కార్యాలయాల్లో పరీక్షించి నిర్దారించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా లక్షణాలు బయట పడితే వారు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణించారు అనేది వివరాలు తెలుసుకొని వ్యాధి జాడను కనుగొంటారు. ఇలాంటి పరీక్షలు జరపగా సోమవారం నాడు 78 కొత్త అనుమానితుల కేసులు బయట పడ్డాయి, వాటిలో 40 విదేశాల నుంచి వచ్చిన వారు,ఐదు నిర్దారణ అయ్యాయి. చైనాలో వైరస్‌ కారణంగా సోమవారం నాటికి మరణించిన వారి సంఖ్య 3,335కు చేరింది, ఇంకా చికిత్సలో ఉన్నవారు 1,299 కాగా వారిలో 211 మంది పరిస్ధితి విషమంగా ఉంది.
శనివారం నాడు దేశవ్యాపితంగా మృతులకు శ్రద్దాంజలి ఘటించారు. అయితే మరణాల సంఖ్యను దాచి పెడుతున్న చైనా వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు శ్మశానవాటికల వద్ద పెద్ద సంఖ్యలో జనం చేరకుండా నిషేధించిందని అమెరికా పత్రికలు వక్రీకరణ వార్తలు రాశాయి. ఇంకా పెద్ద ఎత్తున జనం గుమి కూడటం ప్రమాదకరమే అని అందువలన జాగ్రత్తలో భాగంగా ఇండ్ల వద్దనే శ్రద్ధాంజలి ఘటించాలని కోరటాన్ని అలా చిత్రీకరించారు.
ఊహాన్‌ పరిసరాలలో ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్దలు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సబ్సిడీలు, పన్నుల తగ్గింపు వంటి చర్యలకు ప్రభుత్వం తొలి విడతగా ఇరవై బిలియన్‌ యువాన్ల(2.82 బిలియన్‌ డాలర్లు)ను కేటాయించింది. హుబెరు రాష్ట్రంలో మొత్తం 67,803 కరోనా కేసులు నమోదు కాగా రాజధాని ఊహాన్‌లోనే 50,008 ఉన్నాయి. దేశంలో సాధారణ పరిస్దితులు నెలకొంటున్న నేపధ్యంలో వైరస్‌ నుంచి రక్షణ కోసం పట్టణాలలో విద్యార్ధులు, తల్లిదండ్రులకు ప్రత్యేక రూట్లు, బస్‌లను ఏర్పాటు చేశారు. పాఠశాల సమయాల్లో ఇలాంటి బస్‌ రూట్లను కొన్ని చోట్ల గతేడాది అక్టోబరులోనే ప్రారంభించారు. కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లు ప్రారంభం కావటంతో ముందస్తు జాగ్రత్త చర్యలతో కొత్తగా అనేక చోట్ల ఈ బస్సులను నడుపుతున్నారు. వీటిలో పిల్లలతో పాటు వారిని తీసుకు వెళ్లేందుకు వచ్చి వెళ్లే వారు కూడా ఎక్కేముందు శరీర ఉష్ణ్రోగ్రత ఎంత వుందో పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. బస్‌ డోర్లకే ఆటోమాటిక్‌ ధర్మోమీటర్‌, ముఖాన్ని గుర్తించే పరికరాలు ఉంటాయి. మొబైల్‌ ఫోన్ల ద్వారా విద్యార్దులు, తలిదండ్రులు ముందుగా నమోదు చేయించుకొన్నవారికే ప్రవేశం ఉంటుంది. వైరస్‌ నివారణ జరిగినా స్కూళ్లలో పిల్లలు మధ్యాహ్నభోజనం చేసేటపుడు గుంపులుగా ఒక దగ్గరకు చేరకుండా ఏ తరగతి వారు ఎక్కడ తినాలో నిర్ణయించి అమలు చేస్తున్నారు. తరగతి గదిలో కూడా ఒక బల్లకు ఒకరు మాత్రమే కూర్చొనే విధంగా కూడా చూస్తున్నారు. ఎక్కువ భాగం స్కూళ్లు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి.

COVID-19: Wuhan partially reopens from months-long isolation ...
చైనా ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి కరోనా మహమ్మారి తిరిగి తలెత్తకుండా చూడటం, అంటే ప్రజారోగ్యం. రెండవది దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టటం. కరోనా వైరస్‌ నిరోధానికి ఎంత ఖర్చు చేయాల్సి వచ్చిందో అంత కంటే ఎక్కువగా మరోమారు తలెత్తకుండా చూసేందుకు దేశవ్యాపితంగా ప్రజారోగ్య వ్యవస్దను మరింత పటిష్టపరచటం సామాన్య విషయం కాదు. వైరస్‌ను నిరోధించేందుకు మానవాళి చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా జనాన్ని ఇండ్లకే పరిమితం చేసినపుడు తలెత్తే సమస్యలు చైనా యంత్రాంగానికి, సమాజానికి కూడా కొత్తే. వైరస్‌ కారణాల గురించి తొలి రోజుల్లో ప్రపంచం ఎలా ఆలోచించిందో చైనా సమాజంలో కూడా అలాంటి భావాలు లేవని చెప్పలేము. అయితే రోజులు గడిచే కొద్దీ జరిగిన పరిణామాలు ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చినా, అంతర్గతంగా వెల్లడైన లోపాలు, వాటితో తలెత్తిన వత్తిడి నుంచి ముందు విముక్తి కావాల్సి ఉంది.

China is lifting travel restrictions and life is returning to normal

ఎవరు ఎలాంటి అంచనాలు వేస్తున్నా, జోశ్యాలు చెబుతున్నా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోవటం అనివార్యంగా కనిపిస్తోంది. అయితే అది ఏ రూపంలో ఎలా ఉంటుందన్నదే తప్ప మాంద్యం ఖాయం. ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా ఉన్నప్పటికీ మాంద్యం కారణంగా వస్తు వినియోగం పడిపోతే దాని ప్రభావం చైనా మీద తప్పక పడుతుంది. కరోనా కాటు చైనా కంటే అమెరికా, ఐరోపా దేశాలకే పెద్ద చేటు తేనుంది. వైరస్‌ వ్యాప్తికి చైనాయే కారణం అంటూ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రజాగ్రహాన్ని చైనా మీద మళ్లించేందుకు అమెరికా, ఐరోపా దేశాల నేతలు చేస్తున్న ఆరోపణలు తరువాత కాలంలో అంతర్జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం అమెరికా ఆర్ధికంగా అగ్రస్దానంలో ఉంది, అదే సమయంలో అప్పులలో కూడా అదే స్దితిలో ఉంది. ద్రవ్యమార్కెట్‌కు మద్దతు ఇచ్చేందుకు రానున్న రోజుల్లో అమెరికా తీసుకొనే చర్యలు ప్రపంచం మీద ప్రభావం చూపుతాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలోకి డాలర్లను కుమ్మరించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం పూనుకుంది. వివిధ దేశాలు, విదేశీ సంస్దలకు అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 6.86లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పు పడింది. దీనిలో జపాన్‌కు 1.21లక్షల కోట్ల డాలర్లు, చైనాకు 1.08లక్షల కోట్ల డాలర్ల అప్పు పడింది.అమెరికా ప్రభుత్వ అప్పులను చైనా ఇప్పుడు స్వల్పకాలానికి కొనుగోలు చేయటం లేదా అమ్మటం గానీ చేయదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఐరోపా దేశాలతో పోల్చుకుంటే చైనా పరిస్ధితి ప్రస్తుతానికి స్ధిరంగా, సురక్షితంగానే ఉన్నప్పటికీ ప్రపంచ మాంద్యం తలెత్తితే పరిస్ధితి ఏమిటన్నది సమస్య. చైనా విదేశీ మారకద్రవ్య నిల్వల్లో మూడో వంతు అమెరికా ప్రభుత్వ అప్పురూపంలోనే ఉంది. ఒక వేళ డాలరు దివాళా తీస్తే, విలువ దిగజారితే అనేది ప్రస్తుతానికి ఊహాజనితమే అయినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫేక్‌ న్యూస్‌ బాధితులు సీత-రాముడు- లక్ష్మణుడు !

04 Saturday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Conspiracy theory, Coronavirus fake news, fake news

Granlund cartoon: Fake news - News - Times Reporter - New ...

ఎం కోటేశ్వరరావు
తప్పుడు సమాచారం రెండో అంటు వ్యాధి అనే శీర్షికతో అమెరికా పత్రిక లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ కొద్ది వారాల క్రితం రాసింది. ఒకవైపు వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్‌ మీద చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. మరోవైపు తప్పుడు సమాచార అంటు వ్యాధి ఎక్కడ చూసినా తాండవిస్తోంది. మహారాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి అతుల్‌ భత్‌ఖల్కకర్‌ ఏప్రిల్‌ ఒకటవ తేదీన (ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అని గుర్తుండకపోయి వుండవచ్చు) ఒకట్వీట్‌ చేశారు.” కరోనా కోసం ఏర్పడిన ప్రత్యేక దళానికి(టాస్క్‌ఫోర్స్‌) నాయకుడిగా నరేంద్రమోడీ ఉండాలని అమెరికా, బ్రిటన్‌తో సహా పద్దెనిమిది దేశాలు కోరుతున్నాయి.భారత్‌కు ఎంత గర్వకారణమైన క్షణం ! మహానేతకు మనమందరం మద్దతు ఇవ్వాలి మరియు మనం కరోనా వ్యతిరేకపోరులో కచ్చితంగా విజయం సాధిస్తాం” అని దాన్లో పేర్కొన్నారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌(బిజెపి) సలహాదారు రజత్‌ సేథీ మరొక అడుగు ముందుకు వేసి ” కోవిడ్‌ 19 మహమ్మారిని ప్రపంచ వ్యాపితంగా నిరోధించేయత్నాలను సమన్వయం చేసేందుకు ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌ కేంద్ర స్ధానాన్ని తీసుకుంది. ప్రపంచ నేతలు ట్రంప్‌, బోరిస్‌ జాన్సన్‌, స్కాట్‌మోరిసన్‌ తదితరులు కరోనా వ్యాప్తి నిరోధ ప్రయత్నాలకు మన ప్రధాని మోడీ నాయకత్వం వహించాలని కోరుతున్నారు. ఇది నిజమైన రాజనీతిజ్ఞత ” అని పేర్కొన్నారు.
వైఆన్‌(వరల్డ్‌ ఈస్‌ ఒన్‌ న్యూస్‌) అనే వార్తా ఛానల్‌ మార్చినెల పదిహేనవ తేదీన ఒక వార్తను ప్రసారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ చొరవను ప్రపంచ నేతలు హర్షించారు. జి20ని అనుసంధానం చేయాలన్న ప్రధాని మోడీ పిలుపును ఆస్ట్రేలియా స్వాగతించింది” అని దానిలో పేర్కొన్నారు. న్యూఢిల్లీతో కలసి పని చేయాలని తాము కోరుకుంటున్నట్లు సార్క్‌ దేశాలు భారత చర్యను హర్షించాయి, సార్క్‌ దేశాల నేతలే కాదు ఇతరులు కూడా హర్షించారు అని కూడా ఆ టీవీలో తెలిపారు.అంతే తప్ప ఎక్కడా పద్దెనిమిది దేశాలు, బిజెపినేత, సిఎం సలహాదారు పేర్కొన్న పేర్లు, అంశాలేవీ ఆ వార్తలో లేవు అని ఆల్ట్‌ న్యూస్‌ పేర్కొన్నది. జి న్యూస్‌ ఛానల్‌ యాజమాన్యంలో నడిచే ఈ ఛానల్‌ జర్నలిస్టులు మోడీ ప్రతిష్టను పెంచేందుకు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడిస్తే బిజెపి నేతలు ఇంకే ముంది నిర్ణయం జరిగిపోయింది భజన ప్రారంభించండి అన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. ఒక వేళ అలాంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఉంది, ఐక్యరాజ్యసమితి ఉంది, ఒక దేశ నేతను ఎన్నుకోవటం అన్నది అతిశయోక్తి. అందునా కరోనాను పారదోలేందుకు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని చిట్కా చెప్పిన పెద్దమనిషిని నమ్ముకుంటే ప్రపంచజనాభా దిక్కులేని చావు చస్తుంది. తప్పుడు సమాచార అంటు వ్యాధి మీడియాలో పని చేస్తున్న వారికి సోకితే దాన్ని యావత్‌ సమాజానికి వ్యాపింప చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరు తెన్నులను చూసి ఏ దశలో ఉందో తెలుసుకొనేందుకు మెడికల్‌ డాక్టర్లు కొన్ని లక్షణాలను ఖరారు చేశారు. తప్పుడు సమాచార అంటు వ్యాధి ఏ దశలో ఉందో జర్నలిజంలోని దిగ్గజాలు చెప్పాల్సి ఉంది.

Cartoonists in India battle fake news through their comic strips ...
ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా నుంచి కోలుకోవటానికి ఆయుర్వేద ఔషధాలు తోడ్పడ్డాయని, వేల సంవత్సరాల నుంచి పురాతన ఆచరణే దానికి కారణం అని కేంద్ర ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ప్రకటించారు. ఇది అవాస్తవం, బ్రిటన్‌లో ఉన్న జాతీయ వైద్య వ్యవస్ధ సూచించిన చికిత్సను తప్ప మరొకదాన్ని దేన్నీ వినియోగించలేదని చార్లెస్‌ కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. బెంగలూరులోని సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్‌ యజమాని డాక్టర్‌ ఐజాక్‌ మత్తయ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ప్రిన్స్‌ చార్లెస్‌కు సూచించిన ఆయుర్వేద, హౌమియోపతి చికిత్స ఫలించిందని చెప్పారు. వ్యవస్ధ పనితీరుకు ఇదొక ఉదాహరణ అని మంత్రి విలేకర్లకు చెప్పారు. కేంద్ర మంత్రులే తప్పుడు సమాచార అంటువ్యాధికి గురయ్యారు. ఒక డాక్టర్‌ నుంచి అలాంటి ఫోన్‌ నిజంగానే వచ్చిందనుకుందాం, ప్రిన్స్‌ చార్లెస్‌ కార్యాలయాన్ని సంప్రదించి దాన్ని నిర్ధారించుకోవాలి.అలాగాక వాట్సాప్‌ యూనివర్సిటీ పండితుల మాదిరి తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటం ఏమిటి ?
మార్చినెలాఖరు వరకు ఒక అంచనా ప్రకారం కరోనా వైరస్‌ గురించి మూడువందల కోట్ల పోస్టులు, పదివేల కోట్ల సంభాషణలు నమోదైనట్లు అంచనా. ఒక అంశం మీద మానవాళి చరిత్రలో ఇంతగా భిన్న భాషలలో, అనేక వేదికల మీద దేన్నీ చర్చించి ఉండకపోవచ్చని, ఎలక్ట్రానిక్‌ సాధనాలపై ఇంతగా సమయాన్ని వెచ్చిస్తున్నందున నోమో ఫోబియా(ఫోన్‌ ఫోబియా-ఫోన్‌కు అతుక్కుపోవటం) ప్రమాదం కూడా పెరిగిందని సామాజిక మాధ్యమ నిపుణుడు డెనిజ్‌ ఉనరు చెప్పారు. పరిశుభ్రత సంబంధిత అంశాలను సామాజిక మాధ్యమంలో ఎక్కువగా అందుకున్న వారు ఇండ్లలో వాటికి అనవసర ప్రాధాన్యత ఇచ్చి అతిశుభ్రత వ్యాధికి, రసాయనాలతో కూడిన ఉత్పత్తుల ప్రభావాలకు గురయ్యే అవకాశాలున్నాయని కూడా డేనిజ్‌ హెచ్చరించారు. ముఖాలకు, చేతులకు తొడుగులు ఎక్కువగా వినియోగించటం, సామాజిక దూరాన్ని ఎక్కువగా పాటించటం వలన ఎదుటివారి మీద విశ్వాసాన్ని కోల్పోయేట్లు చేస్తుందని, భయంకర దృశ్యాలుండే సినిమా చూస్తున్న మాదిరి ప్రవర్తించవచ్చని, కరోనా వ్యాప్తి గురించి మితిమించిన ఆత్రత, కుంగుబాటు ఆలోచనలు కూడా జనాలకు ముప్పుగా పరిగణించవచ్చని డెనిజ్‌ హెచ్చరించాడు. వీటి బారిన పడకుండా ఉండాలంటే విశ్వసనీయ సమచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యంగా అధికారిక సంస్ధలు, వ్యవస్ధలు ఇచ్చే వాటి మీద ఆధారపడాలని, లేనట్లయితే తప్పుడు సమాచారంతో ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని సలహా ఇచ్చాడు.

March | 2020 | HENRY KOTULA
సాధారణ సమయాల్లోనే ఏ దేశానికి ఆదేశం ప్రత్యర్దులపై ప్రచారదాడికి అనేక అస్త్రాలను ప్రయోగిస్తోంది. అందువలన అవన్నీ వాస్తవాలే అనుకుంటే పప్పులో కాలేసినట్లే, మనకు తెలియకుండానే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిలో ఒకరిగా మారిపోతాము. తప్పుడు సమచారాన్ని వ్యాపింప చేయటంలో అగ్రస్ధానంలో ఉండే అమెరికా తాను తీసుకున్న గోతిలో తానే పడిందని జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా పక్షపాతంతో వ్యవహరిస్తోందని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు. అందువలన అది చేసిన ప్రతి హెచ్చరికనూ పెడచెవిన పెట్టి నేడు అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చాడన్నది రుజువైంది. దేవుడు నైవేద్యం తినడు అని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.అలాగే పెద్ద ఎత్తున తాను నిధులు అందచేసే అనేక అంతర్జాతీయ సంస్ధలను తనకు అనుకూలంగా మలచుకొని చెప్పినట్లు చేయించుకుంటున్న అమెరికన్లకు ప్రతిదీ అలాగే కనిపించటం సహజం. చైనా నుంచి సర్వం కావాలి కానీ చైనా చెప్పే సమాచారాన్ని అమెరికా నమ్మదు. కనుకనే కరోనా మహమ్మారి గురించి చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ట్రంప్‌ జిగినీ దోస్తుగా ఉన్న నరేంద్రమోడీ కూడా అదే మాదిరి నిర్లక్ష్యం వహించారని తరువాత జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 15న కోవిడ్‌19 గురించి ఉన్న అపోహలు, ప్రచారాల గురించి మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అడగహనోమ్‌ మాట్లాడుతూ తమ సంస్ధ, ప్రపంచవ్యాపితంగా ప్రభుత్వాలు కేవలం కరోనా మహమ్మారితోనే కాదు తప్పుడు సమాచార మహమ్మారితో కూడా పోరాడాల్సి వస్తోందని చెప్పాడు.వైరస్‌ కంటే తప్పుడు వార్తలు వేగంగా వ్యాపించటం ప్రమాదకరమని అన్నాడు. మార్చి11న కరోనా ప్రపంచ మహమ్మారిగా మారినట్లు డబ్ల్యుహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. నరేంద్రమోడీ వెంటనే స్పందించి ఉంటే తగ్లిబీ జమాతే నిజాముద్దీన్‌ మర్కజ్‌ను మూసివేయించి ఉండేవారు, లాక్‌డౌన్‌ను వెంటనే ప్రకటించి ఉండేవారు. మంత్రాల పఠనం, యాగాలు, గోమూత్రం, ఆవు పేడ చిట్కాల ప్రచారం కొంతమేరకైనా ఆగిపోయి ఉండేది.
కుట్ర సిద్దాంతాలు కూడా నకిలీ వార్తల తయారీలో భాగమే. వాటిలో భాగమే జీవ ఆయుధాల తయారీ వార్తలు. ప్రతిదేశమూ అలాంటి కుట్రసిద్దాంతాలకు ప్రాణప్రతిష్ట చేయటం, అలాంటి సిద్ధాంత కర్తలను మేపటం వలన కరోనా విషయంలో కూడా అవి ముందుకు వచ్చి జనాన్ని, పాలకులను కూడా గందరగోళ పరిచాయంటే అతిశయోక్తి కాదు. వ్యాక్సిన్లు తయారు చేసే వ్యాపారులు అవసరం లేకపోయినా వాటిని బలవంతంగా ప్రయోగించేందుకు అనుకూల ప్రచారం చేయించారని చెబుతున్నవారు కొందరు. దాని వ్యతిరేక లాబీ వ్యాక్సిన్ల వ్యతిరేక ప్రచారాన్ని చేసింది. భారత్‌, జపాన్‌, మరికొన్ని దేశాల్లో క్షయ నిరోధక బిసిజి వ్యాక్సిన్లు వేస్తున్న కారణంగానే కరోనా మరణాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు.దీనికి ఆధారం లేదని మరొక వాదన అయితే , వందేళ్ల నాటి టిబి వైరస్‌ కరోనాను ఎలా నిరోధిస్తుందన్నది మరొక వాదన. క్షయ కేసులు, మరణాలు ప్రపంచంలో నాలుగోవంతు మన దేశంలోనే ఎందుకు ఉన్నాయన్నది ఈ సందర్భంగా అడగకూడని ప్రశ్న. కరోనా వైరస్‌ గురించి తప్పుడు ప్రచారం చేసిన లేదా జనాన్ని తప్పుదారి పట్టించిన వారిలో ప్రధముడు డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాలి.
ఏప్రిల్‌ ఐదవ తేదీన దీపాల వెలుగును సంకల్పబల ప్రదర్శనకు అన్నది మోడీ గారి అభిప్రాయంగా తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. అది జనతా కర్ఫ్యూ రోజు చప్పట్లతో ముగిసింది. అన్ని పార్టీలు పాటించాయి. సంకల్పాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించాలి. ఈ తేదీని ఎంచుకోవటం గురించి అనేక మందిలో సంకల్పం సంగతి తరువాత బిజెపి రాజకీయ అజెండా ఉందనే అనుమానాలు తలెత్తాయి. జనతా పార్టీ నుంచి విడిపోయి బిజెపిగా అవతరించాలని నిర్ణయించిన రోజు ఇది, మరుసటి రోజు నుంచి అంటే 1980ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి బిజెపి ఉనికిలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు నిండుతున్న సందర్భాన్ని పాటించేందుకు దాన్ని ఎంచుకున్నారని కొందరి విమర్శ. తెరముందు కనిపించే బిజెపికి తెరవెనుక బిజెపికి తేడా ఉంటుందన్న విమర్శను ఇది రుజువు చేస్తోంది కదా !
రెండవది ప్రతి ఇంటిలో తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాలు దీపాలు వెలిగించాలన్నారు. దీన్ని కూడా సరిపెట్టుకుందాం. వెంటనే దానికి ఒక శాస్త్రీయ సిద్దాంతాన్ని జోడించేందుకు తయారయ్యారు. ” ప్రతి ఇంటిలో 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశం లోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయిన అన్ని దీపాల వెలుగులు ఫోటాన్‌ శక్తులు గా మారుతాయి. అప్పుడు 9 ( నవ) గ్రహాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్ష్య లోకి వస్తాయి, అలా రావడం వల్ల నవ గ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్‌ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి ఆటమిక్‌ ఎనర్జీ గా మారుస్తారు. ఆ ఆటమిక్‌ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది.” దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా బుర్రలేని వారందరూ దీన్ని వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు.
అంత సులభంగా అటామిక్‌ ఎనర్జీ తయారుచేసుకునే అవకాశం ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు భాగస్వామిగా ఉన్న అణుకంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం,వేల కోట్లు కట్టబెట్టటం ఎందుకు ? వాటితో వచ్చే ప్రమాదాల గురించి రోజూ భయంతో చావటం ఎందుకు ? నిజంగా దీపాల వెలుగుతో కరోనా చచ్చేట్లయితే రోజూ జనాలు వెలిగిస్తున్న దీపాలతో తయారయ్యే శక్తితో ఈ పాటికి అంతరించి ఉండాలి కదా ! ఒక్క వైరస్‌ ఏమిటి జనాన్ని పీడిస్తున్న ఈగలు, దోమలు కూడా ఎప్పుడో అంతరించి ఉండాల్సింది కదా ? రోజూ ప్రపంచ వ్యాపితంగా వెలిగించే దీపాల వెలుగుతో పని చేయకుండా నవ గ్రహాలు రోజూ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? ఎందుకీపోసుకోలు కబుర్లు ?
కరోనా వైరస్‌ మరోసారి కుట్రసిద్దాంత పండితులకు, ఫేక్‌ న్యూస్‌ ఉత్పాదకులకు మంచి అవకాశాలను కల్పించింది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతాలకు బలి అయ్యేవారిలో మెదడును సరిగా ఉపయోగించని వారే ఎక్కువగా ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ఈ బలహీనతను గమనించే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పాలకులు అందరూ వాటిని ఆయుధాలుగా చేసుకొని జనం మీద దాడి చేస్తున్నారు. కరోనా వైరస్‌ వయసు మీరిన, జబ్బులున్నవారి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫేక్‌ న్యూస్‌, కుట్ర సిద్దాంతానికి వయస్సుతో పని లేదు. ఎవరి మెదడు పని చేయకుండా ఉందా అన్నదే గీటురాయి. వైరస్‌ మాదిరి వీటికిి ఎల్లలు, కులాలు, మతాలు, భాషా, రంగు బేధాలు లేవు. మెదళ్లను ఖరాబు చేయటమే కాదు, ఉన్మాదాన్ని పెంచుతాయి, ప్రాణాలు తీస్తాయి.

Court finds case against Lord Ram, Laxman 'beyond logic', squashes ...
రామాయణ, మహాభారతాలు, అనేక పురాణాల్లో ఫేక్‌ న్యూస్‌, మాయలు కోకొల్లలు. మాయలేడిని చూపి సీతను ప్రలోభపెట్టారు.రాముడి మాదిరి హా సీతా హా లక్ష్మణా అంటూ పారడీ చేసి సీతను గీత దాటించిన ఉదంతం తెలిసిందే. సీత గీత దాటకపోతే రామాయణం అన్ని మలుపులు తిరిగేదా ? ఫేక్‌ న్యూస్‌, మాయ లేడి బాధితులు సీత, రాముడు, లక్ష్మణుడు అన్నది స్పష్టం. మహాభారతంలో అశ్వద్ధామ హత: కుంజర: ఉదంతం తెలిసిందే. ఇలాంటివే చెప్పుకుంటే ఎన్నో. పాలకులకు ఇవి నిత్యకృత్యం. వర్తమాన కాలంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవి ఇంకా పెరిగాయి. ఇందుగల వందు లేవను సందేహము వలదు ఎందెందు చూసిన అందందు గలవు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై తప్పుడు ప్రచారాలు, సమాధానం లేని ప్రశ్నలు !

29 Sunday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Amarican Virus, Donald Trump Virus, falsities, Falsities against China, Novel Coronavirus

Information warfare: Western media spreads false info on virus ...

ఎం కోటేశ్వరరావు
వైరస్‌లు ఒకే విధంగా ఉండవు, ఎప్పటికప్పుడు స్వభావాన్ని, స్వరూపాన్ని కూడా మార్చుకుంటూ ఉంటాయి. అందుకే వాటికి వాక్సిన్లు లేవు. నిజానికి తయారు చేయటం కష్టమేమీ కాదు. వాక్సిన్‌ తయారీ, పరీక్షలు జరిపి నిర్ధారించుకొనే లోగా సదరు వైరస్‌ కనుమరుగు కావటం లేదా కొత్త లక్షణాన్ని సంతరించుకుంటే అది వృధా. తయారు చేసిన వారికి సమయం, పెట్టుబడి దండగ. కొంత మంది చెబుతున్నట్లు కరోనా ఇప్పుడు అమెరికన్‌ వైరస్‌గా మారింది. ఇది నిన్నటి మాట, అమెరికన్లకు అవమానకరం. అది పక్కాగా డోనాల్డ్‌ ట్రంప్‌ వైరస్‌గా రూపాంతరం చెందినట్లు అది అక్కడ వ్యాప్తి చెందుతున్న తీరుతెన్నులు స్పష్టం చేస్తున్నాయి. అయితే దాని లక్షణాలు మాత్రం కరోనావే, ఎలాంటి మార్పులు లేవు.
హాలీవుడ్‌ సినిమాల్లో గొరిల్లాల మాదిరి కరోనా తమ ముంగిటికి వచ్చినప్పటికీ గుర్తించలేని మతి తప్పిన స్ధితిలో కొందరు ఉన్నారు.వారిలో ట్రంప్‌ ఒకడు. మన దేశంలో కొందరు మడి కట్టుకున్న మాదిరే ప్రపంచంలో తమను ఏ వైరస్‌లు అంటుకోవు అనే దురహంకారులు ప్రపంచమంతటా ఉన్నారు. చైనాలో దాన్ని అరికట్టినా అక్కడ వెలువడుతున్న కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారిలో తప్ప స్ధానికుల్లో కొత్త కేసులు లేవు. అనేక మంది ఈ వార్తలను నమ్మటం లేదు. నిజానికి వారికి కొత్త మానసిక వ్యాధి పట్టుకుంది. కరోనా సోకిన వారికి తగిన సమయంలో చికిత్స అందిస్తే కోలుకుంటారు. కానీ ఈ మానసిక వ్యాధికి ఒకసారి గురైతే జీవితాంతం వారిని అది వెంటాడుతూనే ఉంటుంది. స్వయం కృతం అని, తన గోతిలో తానే పడిందని, తయారు చేసి ప్రపంచం మీదకు వదలిందని ఇలా చైనా గురించి తప్పుడు ప్రచారాలన్నీ చేసిన వారు, బుర్రకు పని పెట్టకుండా వాటిని గుడ్డిగా నమ్మినవారు చైనాలో వైరస్‌ను అరికట్టటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమైన జబ్బు. దానికన్నా వాక్సిన్‌ కనుగొనగలరేమో గానీ, దీనికి అసాధ్యం.

Arab Media: COVID-19 Is A US Plot To Ruin China's Economy | MEMRI
కరోనా పీడితుల్లో ఇప్పుడు అమెరికా అగ్రస్ధానానికి చేరింది.పెరుగుదల రేటు వారంలో రెట్టింపైంది. దీనికి ట్రంప్‌ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, దురహంకారం తప్ప మరొకటి కారణం కాదు. గూఢచార సంస్ధలు, అధికారులు నెత్తీనోరూ బాదుకొని చెప్పినా వినిపించుకోలేదు. చైనా వైరస్‌ను తయారు చేసి వదిలిందని, దాని గురించి ప్రపంచానికి వెల్లడించకుండా దాచి పెట్టి తన గోతిలో తానే పడిందని అనేక మంది నోరు పారవేసుకున్నారు. ఒక పిచ్చి రోగిని పిచ్చి ఉందంటే మరింతగా రెచ్చి పోయేలక్షణం ఉంటుంది కనుక. చైనా పిచ్చి పట్టిన వారు చెప్పేదాన్ని కాసేపు అంగీకరిద్దాం. తామొక రాక్షసితో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ జనవరిలోనే ప్రకటించారు. వెంటనే వ్యాధి ఉన్న ప్రాంతంలో జనబందీ(లాక్‌డౌన్‌) పాటించిందని తెలుసు కదా ?చైనాలో ఎప్పుడేమి జరుగుతోందా తమకు పక్కాగా తెలుసునని విర్రవీగే పశ్చిమ దేశాల గూఢచారులు ఏ గుడ్డిగుర్రాలకు పళ్లు తోముతున్నట్లు ? తమ దేశాలను తగుజాగ్రత్తలు తీసుకోవాని ఎందుకు హెచ్చరించలేదు ? వీటికి సమాధానాలు మనకు ఎక్కడా కనపడవు.
తీరా ఇప్పుడు కేసుల్లో చైనాను మించిపోయిన అమెరికాలో దేశమంతటా జనబందీని ఎందుకు అమలు జరపటం లేదు. కొంత మంది చెప్పినట్లు చైనా తన జనాన్ని గోతి నుంచి సురక్షితంగా బయటకు తెచ్చింది. మిగతా దేశాల పాలకులందరూ ఇప్పుడు తమ జనం మొత్తాన్ని గోతుల్లో పడవేశారు. ప్రాణాలు తీస్తున్నారు. అంత్యక్రియలు కూడా సకాలంలో చేసే వారు లేక శవాలు గుట్టలుగా పడుతున్న దుస్ధితిని చూస్తున్నాము. ఈ దుర్మార్గానికి ఎందుకు పాల్పడ్డారని వారిని అడగాల్సిందిపోయి ఇంకా కొందరు చైనా మీద ప్రశ్నలను సంధిస్తున్నారు. వారిలో రెండు రకాలు, ఒకటి కావాలని చేయటం, రెండవది అమాయకంగా వారి ప్రచారాన్ని గుడ్డిగా నమ్మి వాట్సప్‌లో అందరికీ పంచేవారు. బుర్ర పక్కన పెట్టి చెవులప్పగించి వినేవారుంటే చెప్పేవారు ఏదైనా మనకు ఎక్కిస్తారు.కొన్ని ప్రశ్నలకు సమాధానాలు,ఆలోచనకోసం మరికొన్ని ప్రశ్నలను ఇక్కడ చూద్దాం
అమెరికన్ల దగ్గర అంతులేని సంఖ్యలో అణు, ఇతర ఆయుధాలున్నాయి. యుద్ద విమానాలకు, ఓడలకు కొదవలేదు. అలాంటి దేశంలో…..తుడుచుకొనే కాగితపు ఉండలకు కొరత ఎందుకు ఏర్పడింది? శత్రుదేశాల మీద క్షణాల్లో బాంబులు వేసి విధ్వంసం సృష్టించే ఎఫ్‌35 బాంబర్లను క్షణాల్లో తయారు ప్రపంచంలో ఏమూలకైనా సరఫరా చేయగల అమెరికా తన పౌరుల ప్రాణాలను రక్షించే వెంటిలేటర్లను వెంటనే ఎందుకు తయారు చేసుకోలేకపోతోంది? వైద్య సిబ్బందికి అవసరమైన కనీస మాస్కులు, గ్లౌజులు, గౌన్లు ఎందుకు సరఫరా చేయలేకపోతోంది? రోగులను పరీక్షించే కిట్లకు ఎందుకు కటకటలాడుతోంది ? ఇతర దేశాలను అమెరికా ఎందుకు ఆదుకోలేకపోతోంది ?

ఊహాన్‌ నగరం నుంచి జర్మనీలోని డూయిస్‌బర్గ్‌కు వైద్య సరఫరాలతో కూడిన రైలు ఈనెల 28న బయలుదేరింది. జనబందీ ఎత్తివేసిన తరువాత ప్రారంభమైన తొలి సరఫరా ఇది. చైనా నుంచి మరికొన్ని ఆసియా దేశాలకు ఇప్పటికే విమానాల్లో సరఫరా చేశారు ? అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఏమి చేస్తున్నట్లు ? ఇవా ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నలు ? లేక చైనా గురించా ? ఇప్పటికీ చైనా గురించి అడుగుతున్నారంటే వారి కడుపులో దుష్ట బుద్ధి ఇంకా ఉన్నట్లే !
ఊహాన్‌, పరిసరాల్లో తప్ప చైనాలోని మిగతా ప్రాంతాల్లో ఎందుకు వ్యాప్తి చెందలేదు అని చైనాను ప్రశ్నిస్తున్నవారు దానికి సమాధానం తెలుసుకోవటంతో పాటు అమెరికా, ఐరోపా, మన దేశంతో సహా అనేక చోట్ల తొలి కేసులు బయట పడగానే వ్యాపించకుండా ఎందుకు కట్టడి చేయలేదు అని అడగాలా లేదా ? ఇక కరోనా గురించి చైనా చెప్పేదానిని నమ్మరు, అలాంటి వారు మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా కట్టడి చేశారంటే నమ్ముతారనే హామీ ఏముంది? సంతృప్తి చెందుతారా ? వారు నమ్మాలంటే ఏ అమెరికా వాడో మరొకరో చెప్పాలి. చైనా చెప్పిందాన్ని నమ్మకుండా తమ జనం ప్రాణాల మీదకు తెచ్చిన వారు చైనా గురించి ఏమి చెబుతారు ? వారేమి చెప్పినా చెప్పకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 2002-03లో కరోనా జాతికి చెందిన సారస్‌ బాధిత దేశం చైనా. ఆ అనుభవం ఉంది కనుకకే ఊహాన్‌లో బయటపడిన వెంటనే అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు రాకపోకలను బంద్‌చేసింది, తదుపరి చర్యగా హుబెయి, పరిసర రాష్ట్రాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని జనవరి 23 నుంచి దాదాపు రెండు నెలలపాటు ఇండ్లకే పరిమితం చేసింది(లాక్‌డౌన్‌). చైనా ఇతర ప్రాంతాలలో కూడా కేసులు ఉన్నాయి తప్ప చెదురుమదురు, వాటిని కూడా సకాలంలో ఎదుర్కొన్నారు.

First train with medical supplies for Europe leaves Wuhan as China eases Covid-19 lockdown

చైనా వారు ప్రపంచానికి అంటించారన్నది ఒక తప్పుడు ప్రచారం. ఊహాన్‌ నుంచి షాంఘై 839కిలోమీటర్లు, ఊహాన్‌ నుంచి బీజింగ్‌ 1152 కిలోమీటర్లే ఉన్నా వాటికి సోకని కరోనా పదిహేను వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకు ఎలా పాకిందని తెలివితేటలు ఎక్కువగా ఉన్న కొందరు ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఇది రాస్తున్న సమయానికి ఉన్న 1,23,750 కేసులలో ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలో 53,455 ఉన్నాయి, దాని పక్కనే పెద్ద సరిహద్దు ఉన్న పెన్సిల్వేనియాలో 2,751 మాత్రమే ఉండగా పక్కనే మరో చిన్న సరిహద్దు ఉన్న న్యూజెర్సీలో 11,124 కేసులు ఎందుకు నమోదయ్యాయో చైనా గురించి అడిగేవారు చెప్పగలరా ?
చైనాలో తొలిసారి వైరస్‌ గురించి చెప్పిన ఒక వైద్యుడు, దాన్ని బయట పెట్టిన ఒక జర్నలిస్టు నోరును అక్కడి ప్రభుత్వం మూయించిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది నిజం కావచ్చు కాకపోవచ్చు. ఒక కొత్త జబ్బు నిర్ధారణ కాకుండా ఒక వైద్యుడు లేదా జర్నలిస్టు ఇలాంటి విషయాలను బహిర్గతం చేయటాన్ని ఏ ప్రభుత్వమైనా అంగీకరిస్తుందా ? నిర్ధారణ అయిన తరువాత చైనా తగుజాగ్రత్తలు తీసుకుంది. వైరస్‌ తీవ్రత గురించి అమెరికా అధినేత ట్రంప్‌కు వివరించి హెచ్చరించామని, అయినా పట్టించుకోలేదని గూఢచారి వర్గాలు చెప్పిన అంశాన్ని పత్రికలు బయటపెట్టాయి. మరి దీనికి జవాబు ఏమిటి ? ఇక సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధికారిని లోబరుచుకున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్ధ అబద్దాలాడిందని ఆధారాలు లేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటున్నారు. అన్నీ అధికారికంగా ఆయా వెబ్‌సైట్లలో ఉన్నాయి. నమ్మకం లేని వారు తీరికగా మంచి కళ్లద్దాలు పెట్టుకొని చూడవచ్చు.
వైరస్‌ సోకిన సమయంలోనే చైనా నూతన సంవత్సరాది ఉత్సవాలు వచ్చాయి. ఆ సమయంలో ప్రతి ఏడాది కోట్ల మంది చైనీయులు సెలవుల మీద స్వదేశంలో వివిధ ప్రాంతాలకు, విదేశాలకు ప్రయాణిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం ఆ ఉత్సవాలను రద్దు చేసింది, ఊహాన్‌ నుంచి స్వదేశీ, విదేశీ విమానాలను రద్దు చేయటం బహిరంగ రహస్యం. ఊహాన్‌ నుంచి 50లక్షల మందిని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎందుకు పంపారన్నది మరొక ప్రశ్న. ఊహాన్‌ జనాభా కోటిచిల్లర. అందులో సగం మందిని ఆకస్మికంగా విదేశాలకు పంపుతూ ఉంటే ఆ దేశాలు ఎందుకు వీసాలు ఇచ్చినట్లు ? వైరస్‌ సోకిన తరువాత ఊహాన్‌ నుంచి ఏదేశం ఎంత మందికి వీసాలు ఇచ్చిందో, ఎన్ని విమానాల్లో వారు ప్రయాణించారో ఈ ప్రశ్న వేసిన వారే వివరాలు చెప్పాలి. ఇక సంక్షోభ సమయంలో భారత్‌ ప్రపంచ నేతగా ముందుకు వచ్చింది అని ఒక ముక్తాయింపు. ఇది కాషాయ దళాల ప్రచారం తప్ప వాస్తవం కాదు. వైరస్‌ నుంచి తాను తేరుకొని ఇతర దేశాలకు అవసరమైన సాయం చేస్తున్నది చైనా తప్ప మరొక దేశం కాదు.తమ జబ్బలను తామే చరుచుకొనే వారిని కానివ్వండి అనటం తప్ప ఆగమని చెప్పలేం కదా !
చైనా తన శత్రు దేశాలకు మాత్రమే వైరస్‌ను ఎగుమతి చేసింది, మిత్ర దేశాలను మినహాయించింది అన్నది మరొక ప్రచారం. జపాన్‌ అమెరికా మిత్రదేశం, చైనాకు శత్రుదేశం, దాన్ని ఆక్రమించుకొని నానా బాధలు పెట్టటమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు చైనా నగరాలపై ప్లేగు బాంబులను ప్రయోగించి లక్షల మంది జనాన్ని బలిగొన్న చరిత్ర జపాన్‌ది. ఊహాన్‌ జపాన్‌ మధ్య దూరం కేవలం 2,300కిలోమీటర్లే, మరి జపాన్‌లో వైరస్‌ను ఎందుకు వ్యాప్తి చేయలేదో ఎవరైనా చెబుతారా ? చైనా మిత్ర దేశం ఇరాన్‌, రెండుదేశాల మధ్య దూరం 5,600 కిలోమీటర్లు. ఇరాన్‌ ఇప్పుడు కరోనా బాధిత దేశాల్లో ఒకటి, మరి మిత్ర దేశం అయినపుడు ఇరాన్‌కు ఎందుకు పంపినట్లు ?
తప్పుడు సమాచారాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించే అమెరికన్‌ అలెక్స్‌ జోన్స్‌ తయారు చేయించిన ”ఇన్ఫోవార్స్‌” అనే ఒక యాప్‌ను తాజాగా గూగుల్‌ నిషేధించింది. ఇంతకాలం దాని సమాచారాన్ని తలకెక్కించుకొని ఇతరుల మెదళ్లు తిన్నవారి గురించి జాలిపటం తప్ప మరేమీ చేయలేము. గూగుల్‌ కూడా తప్పుడు సమాచారాన్ని సొమ్ముచేసుకోవటంలో ఏమాత్రం తీసిపోలేదు. 2018లోనే యాపిల్‌ కంపెనీ శాశ్వతంగా నిషేధించినప్పటికీ ఇంతవరకు గూగుల్‌ కొనసాగించిందంటే డబ్బు తప్ప దానికి మరొక కారణం లేదు.

How the coronavirus is testing social media's efforts to stem the ...

అలెక్స్‌జోన్స్‌ ప్రతిదానిని కుట్రకోణంలో వండివారుస్తాడు కనుక కుట్ర సిద్ధాంతవేత్త అని పేరు వచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించాలని, ఒక దగ్గర ఉండిపోవాలని, స్వీయదిగ్బంధనం పాటించాలనటం వెనుక కుట్ర ఉందని అతగాడు తన యాప్‌ ద్వారా ప్రచారంలో పెట్టాడు. బహుశా ట్రంప్‌ వంటి వారందరూ నిర్లక్ష్యం చేయటానికి ఇలాంటి వాటిని ప్రమాణంగా తీసుకోవటం కావచ్చు. కరోనా మీద తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకోవాలన్న గూగుల్‌ నిర్ణయానికి ఈ యాప్‌ను కొనసాగించటం పొసగదు కనుక ఆ పని చేసింది. ఈ యాప్‌ద్వారా వైరస్‌ నివారణ ఔషధాలంటూ ఆ ప్రబుద్ధుడు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అలాంటి ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని గతవారంలో న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటియా జేమ్స్‌ ఉత్తరువు జారీ చేశారు. అవి ప్రజారోగ్యానికి భంగకరమని పేర్కొన్నారు. కనుక ఇలాంటి ప్రబుద్దుడి నోరు ఒకదాన్ని మూయించినా లక్షల కొలదీ వాగుతూనే ఉన్నాయి. అందుకే వినేవాడుంటే చెప్పేవాడు చెత్తంతా నింపుతాడు ! కాస్త వివేచనతో ఆలోచించినపుడు వాస్తవాలేమిటో తెలుస్తాయి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d