• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: COUNTRIES

అమెరికా ఆదేశాలు, ఆర్ధిక విధానాలతో స్వాతంత్య్రానికి ముప్పు !

03 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

economic policies, India foreign policy under narendra modi, Indian independence, modi foreign policy, US dictats

Image result for threat to india's independence

ఎం కోటేశ్వరరావు

డెబ్బయి రెండవ స్వాతంత్య్రవేడుకలకు దేశం సిద్దం అవుతోంది, మరోసారి అధికారానికి వచ్చి 75వ వేడుకలను కూడా తానే ప్రారంభించాలని ప్రధాని నరేంద్రమోడీ కోరుకుంటున్నారు. తన ప్రసంగంలో వుండాల్సిన అంశాల మీద సలహాలు ఇవ్వాలని కోరారు. జనాభిప్రాయానికి తలొగ్గే పాలకుడిగా కనపడే ప్రచార ఎత్తుగడలో భాగమిది. మూకదాడుల గురించి దేశ అత్యున్నత న్యాయస్ధానం ఒక చట్టాన్ని రూపొందించండని చెప్పటం సమస్య తీవ్రతకు నిదర్శనం. అయినా ఈ సమస్యపై మన ప్రధాని మౌనంగానే వున్నారు. అలాంటి పెద్దమనిషి సామాన్య జనం చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకుంటారంటే నమ్మటమెలా ? వంచనగాకపోతే నిత్యం జనంతో వున్నామని చెప్పుకొనే నేతలకు జనాభిప్రాయాలేమిటో స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా చెప్పేదేమిటి?

ఐదవసారి ఎర్రకోట మీద మువ్వన్నెల జండా ఎగురవేయబోతున్న ప్రధాని ముందు ఒక పెద్ద ప్రశ్న వుంది. నిజానికి అది యావత్తు దేశ ప్రజల ముందున్న సవాలు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా వున్న మన విదేశాంగ విధానాన్ని నిర్దేశిస్తున్నది ఎవరు అన్నదే ఈ స్వాతంత్య్రదినోత్సవ ప్రత్యేకత అని చెప్పవచ్చు. వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవవేడుకల ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను మన ప్రభుత్వం ఆహ్వానించింది. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చిన కొన్ని వార్తలు ఈ ఆహ్వాన ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీల విషయంలో అమెరికా ఆంక్షలకు తలగ్గకపోతే చెల్లించే మూల్యం భారీగా వుంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికే ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిన మన దేశం 2030 నాటికి మూడవ స్ధానానికి చేరుకోనున్నదని వార్తలు వచ్చాయి. ఆ బాటలో వున్న మనం భారీ మూల్యం చెల్లించాల్సినంత దుర్బలంగా వున్నామా? అమెరికా అడుగుల్లో నడవటం స్వాతంత్య్రపిపాసకులకు మింగుడు పడని అంశమే. ఒక చిన్న దేశం విధిలేక ఒక పెత్తందారు అడుగులకు మడుగులొత్తిందంటే అర్ధం చేసుకోగలం కానీ జనాభారీత్యా, ఘనమైన గతంతో వున్న మనదేశం అమెరికా కనుసన్నలలో నడుస్తోందంటే మన ఆత్మగౌరవం ఏమైనట్లు? నరేంద్రమోడీ లేదా ఎన్‌డిఏ పక్షాలకు ఇవేవీ తెలియకనే ట్రంప్‌కు ఆహ్వానం పలికారా? పాండవుల పక్షాన నిలవాలని ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణుడు ధుర్యోధనుడితో ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జున జూచితి అని చెప్పినట్లుగా అన్నీ తెలిసే మోడీ సర్కార్‌ ట్రంప్‌కు ఎర్రతివాచీ పరచేందుకు నిర్ణయించింది అనుకోవాలి. దేశభక్తులమని చెప్పుకొనే వారు చేయాల్సినపనేనా ఇది?

చైనా మన పొరుగుదేశం. రెండు దేశాల మీద బ్రిటీష్‌ పాలకులు పెత్తనం చేశారు. వాస్తవంలో ఏ ప్రాంతం ఎవరికింద వుంది అన్నది చూడకుండా ఆఫీసుల్లో కూర్చొని సరిహద్దుగీతలు గీసిన కారణంగా చైనాతో తలెత్తిన సరిహద్దు పంచాయతీలు ఇంకా పరిష్కారం కాలేదు. దేశాన్ని బ్రిటీషోడు విడదీసినపుడు మనవైపు మొగ్గిన కాశ్మీర్‌లో కొంత ప్రాంతాన్ని పాకిస్ధాన్‌ ఆక్రమించుకుంది, దాన్నొక విముక్తి ప్రాంతంగా, స్వతంత్రమైనదిగా ప్రకటించింది. ఆ సమస్య కారణంగా దానితో సంబంధాలు సజావుగా లేవు. తరువాత కాలంలో అమెరికా ప్రోద్బలంతో కాశ్మీర్‌ వేర్పాటు వాదులను రెచ్చగొట్టటం, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెట్టి దుర్మార్గాలకు పాల్పడటం వంటి చర్యలు తెలిసినవే. నిత్యం సరిహద్దుల్లో పోరుకు బదులు వాటిని వారూ మనం పరిష్కరించుకోవాలి. మిగతా ప్రపంచ దేశాలతో మనకు ఎలాంటి పేచీలు లేవు. స్నేహసంబంధాలే వున్నాయి, ఇప్పుడు అమెరికా వాడు వాటిని దెబ్బతీసేందుకు పూనుకోవటం ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం?

మనకు ఒక స్వతంత్ర విధానం వుంది, గతంలో సోవియట్‌ లేదా అమెరికా కూటమిలోకో మొగ్గు చూపకుండా అలీన విధానం అవలంభించాం. దాని మేరకు మన రక్షణ అవసరాల రీత్యా అణ్వాయుధాలను తయారు చేస్తున్నాం, వాటిని పరీక్షిస్తున్నాం. అందుకే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేసేందుకు ఇంతకాల నిరాకరించాం, ఇప్పటికీ అదే వైఖరి కొనసాగుతోంది.దీనిపై సంతకం చేయని వాటిలో మనతో పాటు పాకిస్ధాన్‌,ఇజ్రాయెల్‌, 2011లో స్వాతంత్య్రం పొందిన దక్షిణ సూడాన్‌ వున్నాయి. ఈ ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు శాంతియుత అవసరాలకు అణుశక్తిని వినియోగించవచ్చు తప్ప అణ్వాయుధాలను తయారు చేయటానికి లేదు.

ఇరాన్‌తో ఆరు దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా ఏకపక్షంగా ప్రకటించింది. అంతవరకు పరిమితమైతే అదొకదారి, ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించింది. దానితో వ్యాపారలావాదేవీలు జరిపేవారికి కూడా అవి వర్తిస్తాయని పేర్కొన్నది. పంచాయతీ వుంటే ఆ రెండు దేశాలు తేల్చుకోవాలి తప్ప ఇతర దేశాల మీద కూడా తన ఆంక్షలు అమలు జరుగుతాయని చెప్పటం పెద్దన్న వైఖరి తప్ప ప్రజాస్వామ్యపూరితం కాదు. ఇరాన్‌తో మన సంబంధాలు ఈనాటివి కాదు. దాని అవసరాల నిమిత్తమే కావచ్చు మిగతా చమురు సరఫరా దేశాలేవీ ఇవ్వని రాయితీలను అది మనకు ఇస్తోంది, కొంత మేరకు మన రూపాయి చెల్లింపులను అంగీకరిస్తోంది. ఇది మనకూ ప్రయోజనమే కనుక మన ఇంధన అవసరాలలలో ఎక్కువభాగం అక్కడి నుంచే పొందుతున్నాము. ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షలు ఇరాన్‌తో సంబంధాలున్న అన్ని దేశాలకూ వర్తిస్తాయి. గతంలో కూడా ఆంక్షలున్నప్పటికీ టర్కీ బ్యాంకుల ద్వారా మనం సొమ్ము చెల్లించి చమురు దిగుమతి చేసుకొనే వారం. ఇప్పుడు అలాంటివి కూడా కుదరదని ట్రంప్‌ తెగేసి చెప్పాడు. గతంలో మన దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సమయంలో రెండు దేశాలూ సమాన భాగస్వాములు అంటూ వూదరగొట్టిన అమెరికన్లు ఇప్పుడు మనల్ని పాలేర్లకింద జమడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

Image result for us diktats to india

ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించగానే వాటితో తమకు సంబంధం లేదని, ఏ దేశంపై అయినా ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. ఆంక్షలు మూడోపక్ష దేశాలకూ వర్తిస్తాయని వెల్లడించగానే నెల రోజులు కూడా గడవక ముందే ఇరాన్‌ బదులు నవంబరు నుంచి మరొక దేశం నుంచి చమురు దిగుమతి ఏర్పాట్లు చేసుకోవాలని మన చమురు మంత్రిత్వశాఖ చమురుశుద్ధి కర్మాగారాలకు లేఖ రాసింది. తాము చెల్లింపులు జరపలేమని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇది అమెరికా వత్తిడికి లొంగటం కాదా ? మన అలీన విధానం ఏమైనట్లు? ఈ పూర్వరంగంలోనే ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలను విధిస్తామన్న అమెరికా బెదిరింపుకు భారత్‌ ఎలా స్పందించాలన్న ప్రశ్నకు అమెరికాకు తలొగ్గకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ చెప్పారు.’ ఇదొక ప్రధాన ఆర్ధిక సమస్య గాక విదేశాంగ విధానపరమైన నిర్ణయం కూడా ఇమిడి వుంది. గతం కంటే మరింత కఠినంగా అమలు జరుపుతామని అమెరికా స్పష్టంగా చెప్పటం కనిపిస్తోంది, దీని అర్ధం మినహాయింపులు పరిమితంగా వుంటాయి. అదే జరిగితే మనం చమురుకోసం ఇతర వనరులను చూసుకోవాలి, అమెరికా చెప్పింది వినకపోతే మూల్యం చాలా ఎక్కువగా వుంటుంది. ప్రతి అంతర్జాతీయ వ్యవస్ధలో డాలరు ప్రవేశిస్తోంది, అది ఒక్క వ్యాపారానికే పరిమితం కావటం లేదు ఒక చెల్లింపు సంవిధానంగానూ ద్రవ్య మార్కెట్లలో ఒక సాధనంగా మారింది, దానికి అనుగుణంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంది.’ అన్నారు.

ఏ దేశపెత్తనానికి తలొగ్గం అని చెప్పుకొనే ప్రభుత్వానికి సలహాలిచ్చే పెద్దమనిషి చెప్పిన ఈ మాటలకు అనుగుణంగానే మోడీ సర్కార్‌ వ్యవహరిస్తున్నది. ఇరాన్‌పై ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికాకు రాత పూర్వకంగా ఇంతవరకు ఇవ్వలేదు తప్ప ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను తగ్గించింది. దీని అర్ధం ఏమిటి? మరోవైపు అమెరికా ఆంక్షలను తాము ఖాతరు చేయబోమని చైనా, టర్కీ ప్రకటించాయి.తామే అసలైన జాతీయవాదులం, దేశభక్తులం అని చెప్పుకుంటున్న బిజెపికి ఈ పరిణామం పెద్ద పరీక్ష. అలీన విధానం, స్వతంత్ర వైఖరినుంచి వైదొలగి అమెరికా వైపు మొగ్గుచూపటమే. ఆగస్టు ఆరవ తేదీ నుంచి అమెరికా ఆంక్షల తొలి చర్యలు అమలులోకి వస్తాయి. వీటి వలన మనకు ఎలాంటి ఇబ్బందులు రావు, చమురు లావాదేవీలపై ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీ నుంచి వర్తిస్తాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న మనం ఇరాన్‌తో సంబంధాలు వదులుకొంటే మరింత ఇబ్బందులు పడటం ఖాయం. అమెరికా వత్తిడికి లొంగితే ప్రపంచంలో మనపరువు గంగలో కలుస్తుంది. మనతో భాగస్వామ్యానికి మిగతా దేశాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.

భారత ఇబ్బందులను తాము అర్ధం చేసుకోగలమని, అయితే ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీలు నిలిచిపోతాయని, భారత సర్వసత్తాక నిర్ణయ హక్కును తాము గౌరవిస్తామని ఇరాన్‌ రాయబారి ప్రకటించారు. అమెరికా నుంచి ఇలాంటి ప్రకటన రాకపోగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నికీహాలీ న్యూఢిల్లీ వచ్చి ప్రధానితో సమావేశమై ఇరాన్‌తో సంబంధాలను సవరించుకోవాలని ఆదేశం మాదిరి మాట్లాడి వెళ్లారు. అంతకు ముందే తమ ఆంక్షలలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా ప్రకటించింది. ఒక దేశాధినేతతో అమెరికా వ్యవహరించే తీరిది. అయితే అమెరికా బెదిరింపు పని చేసిందనేందుకు నిదర్శనమా అన్నట్లు జూన్‌లో ఇరాన్‌ నుంచి మన చమురు దిగుమతులు 16శాతం తగ్గాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి మన చమురు దిగుమతులు రెట్టింపు అయ్యాయి. రూపాయలతో కొంత మేరకు కొనే చమురును ఇప్పుడు పెరిగిన డాలర్లతో కొనాల్సిన అగత్యం ఏర్పడింది.

మన రక్షణ ఏర్పాట్లు మనం చేసుకోవాలి. అవసరాలకు అనుగుణంగా మనం ఎవరి దగ్గర ఆయుధాలు కొనుగోలు చేయాలి, ఏ సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలనేది మన సర్వసత్తాక హక్కు. దీనిలో కూడా అమెరికా జోక్యం చేసుకొంటోంది. తన చట్టాలు, నిర్ణయాలను సర్వవ్యాపితంగా రుద్దాలని, అమలు చేయాలని చూస్తోంది. మన అవసరాలకు తగినవిగా రష్యా తయారీ ఎస్‌-400 గగన రక్షణ క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణ శాఖ నిర్ణయించింది. రష్యా మీద తాము ఆంక్షలను విధించిన కారణంగా రష్యాలో తయారయ్యే ఆయుధాలను కొనుగోలు చేసిన వారికి అవి వర్తిస్తాయని అమెరికా చెబుతోంది. తమకు ఐక్యరాజ్యసమితి నిబంధనలు, చట్టాలు వర్తిసాయి తప్ప అమెరికావి కాదని మన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ అమెరికాకు చెప్పినప్పటికీ వాటి కొనుగోలుకు మనల్ని నిరోధించే విధంగా అమెరికా వత్తిడి చేయటం మానుకోలేదు. ఒకేసారి 400 కిలోమీటర్ల పరిధిలోని 36 లక్ష్యాలను చేరుకోగలిగిన అధునాతన పరికరాలివి. మన విదేశాంగ విధానంలో జోక్యం చేసుకొనేందుకు, వత్తిడి చేసేందుకు, భారాలు మోపేందుకు ఇతర దేశాలకు అవకాశం ఇస్తున్నది ఎవరు? ఎందుకీ పరిస్ధితి ఏర్పడింది. అమెరికాకు దాసోహం అన్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ బూట్లలో కాళ్లు పెట్టి బిజెపి నరేంద్రమోడీ నడుస్తున్నారు. రష్యా క్షిపణి వ్యవస్ధల కొనుగోలు వ్యవహారంలో వెనక్కు తగ్గితే అది మన రక్షణకే ముప్పు, అందువలన వాటి కొనుగోలుకే కట్టుబడి వుండటంతో తమ ఆంక్షలను మన దేశానికి మినహాయింపు నిచ్చేందుకు అమెరికా పార్లమెంట్‌ ఒక బిల్లును ఆమోదించాల్సి వచ్చింది. మిగతా విషయాలలో మన సర్కార్‌ అంతగట్టిగా మన వైఖరికి ఎందుకు కట్టుబడి వుండదు ?

దేశాన్ని దీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడింది, తప్పిదాలు చేసిందనే విమర్శను తప్పుపట్టాల్సిన పనిలేదు. తిరుగులేని వాస్తవం, అందుకు ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష గుర్తింపు హోదా కూడా లేని పార్టీగా దిగజారి భారీ రాజకీయ మూల్యం చెల్లించింది. పాలనలో అలాంటి పార్టీ ప్రభావం, రూపురేఖలను పూర్తిగా చెరిపివేయాలనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలేమిటి అన్నది జనం ముందున్న ప్రశ్న. వాటిలో ఒకటి ప్రణాళికా సంఘం, విధానాలను రద్దు చేయటం. గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా అభివృద్ధిలో ప్రణాళికా విధానం కీలకమైనది అని రుజువైంది.ఆరున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం పనికిరానిదిగా తయారైంది అంటూ దానిని రద్దు చేసి నీతి ఆయోగ్‌ పేరుతో రూపాంతరం చెందుతున్న భారత్‌ కోసం జాతీయ సంస్ధ(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా)ను 2015 జనవరి ఒకటి నుంచి అమలులోకి తెచ్చారు. ఇది పదిహేను సంవత్సరాల మార్గం, ఏడు సంవత్సరాల దృష్టి, వ్యూహం, కార్యాచరణతో పని చేస్తుంది. అంటే ఐదేండ్లకు బదులు ఏడు సంవత్సరాల ప్రణాళిక అనుకోవాలా? రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగి, ప్రభుత్వాలు మారటానికి అవకాశం వున్నపుడు పేరు ఏది పెట్టినా ఏడు సంవత్సరాల ప్రణాళికలంటే వచ్చే ఇబ్బందుల గురించి చెప్పనవసరం లేదు. మధ్యలో మార్చుకోకూడదా అంటే మార్చుకోవచ్చు. ఇక్కడ సమస్య అది కాదు.

1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో అమలు చేస్తున్న విధానాలు ప్రణాళికలు అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే కొన్ని కార్యక్రమాలుగా మారిపోయాయి. అప్పటి నుంచి ప్రభుత్వాలు ఒక్కొక్క బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. వుదాహరణకు పెరుగుతున్న జనాభా, అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్ధల ఏర్పాటు, మెరుగుపరచటంపోయి వాటిని ప్రయివేటు రంగానికి వదలి వేశారు. ఆ విధానాలలో భాగంగానే ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేశారు. ఈ కారణంగానే ఒక్క రక్షణ సంబంధిత రంగాలలో తప్ప ఇతరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పిన పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. విద్యుత్‌ రంగంలో ప్రయివేటు విద్యుత్‌ ఖర్చు ఎక్కువగా వుండటం వలన గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయటం, ఒకటీ అరా కొత్తగా స్ధాపించటం తప్ప ఆ రంగంలోనూ పరిమితం చేశారు. వ్యవసాయ రంగంలో గణనీయంగా తగ్గించిన కారణంగా పరిశోధన, అభివృద్ధి లేకుండా పోయింది. బహుళజాతి గుత్త సంస్ధలు వ్యవసాయరంగంలో ప్రవేశించి విత్తన రంగాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.పర్యవసానంగా విత్తన ధరలు పెరిగాయి. ఎరువులపై ధరల నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ శక్తులకు వదలివేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పరిమితం చేసి దానినే అందచేస్తున్నారు. దీనిలో కొత్త పద్దతుల్లో అక్రమాలకు తెరలేవటం అందరికీ తెలిసిందే.

స్వాతంత్య్రానికి ముందు, తరువాత కాలంలో కార్మికవర్గ రక్షణ కోసం రూపొందించిన అనేక చట్టాలను నీరుగార్చటం, అమలుకు నోచుకోకుండా ఆటంకాలు, ఆంక్షలు విధించటం వంటి విషయాలు తెలిసిందే. మొత్తం శ్రమ జీవులందరికీ సామాజిక భద్రత కల్పించాల్సిన ప్ర భుత్వాలు వున్న వారికి వర్తింపచేస్తున్న వాటిని రద్దు చేశాయి. నూతన పెన్షన్‌ పధకం(ఎన్‌పిఎస్‌) పేరుతో 2004 తరువాత చేరిన వారికి పాత పద్దతిలో వుపయోగకరమైన పెన్షన్‌ రద్దు చేశారు. దానిని రూపొందించిన ఖ్యాతి వాజ్‌పేయి నాయకత్వంలోని గత ఎన్‌డిఏ ప్రభుత్వానిదైతే దానిని తు.చ తప్ప కుండా అమలు జరిపిన చరిత్ర తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ, రాష్ట్రాలలో అధికారంలో వున్న బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీల గురించి తెలిసిందే. నూతన పెన్షన్‌ పధకాన్ని రద్దు చేసి పాతదాన్ని పునరుద్దరించాలని వుద్యోగులు పోరుబాట పట్టారు. ఒక్క వామపక్షాలు తప్ప మిగతా పార్టీలేవీ దాని గురించి పట్టించుకోవటం లేదంటే ఆమోదం, అమలుకు అంగీకరించినట్లే.

Image result for us diktats to india

మన దేశంలో వునికిలోకి వచ్చిన ప్రతి చట్టం వెనుక ఆయా తరగతులు జరిపిన వుద్యమాల వత్తిడి, త్యాగాలు వున్నాయి. వ్యాపార సులభతరం పేరుతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. బిజెపి పాలిత రాజస్ధాన్‌ పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి స్వాతంత్య్ర పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. ఇలాంటి వన్నీ బ్రిటీష్‌ వలసదారులు చేశారంటే అర్ధం వుంది, స్వతంత్ర భారత్‌లో చేయటం అంటే పరాయి పాలనకు వ్యతిరేకంగా కార్మికోద్యమం చేసిన త్యాగాలన్నీ వృధా అయినట్లే. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన అపర ప్రజాస్వామిక నడత ఘనత బిజెపి ఖాతాలో చేరింది. అంబేద్కరిస్టులు లేదా దళిత అస్ధిత్వవాదులు చేసే ప్రకారం ఈ దేశంలో కార్మికులందరూ దళితులే. అంటే వారి అవగాహన ప్రకారం కార్మిక రంగంలో చేస్తున్న మార్పులన్నీ దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది.ఇదా స్వాతంత్య్రం ! అది ఎవరికి వుపయోగపడుతోంది?

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇదేదో నరేంద్రమోడీ హయాంలోనే ప్రారంభమైందని కాదు, ఆయన ఏలుబడిలో వేగం పెరిగింది. దానికి నిదర్శనం సులభతర వాణిజ్యంలో మన స్దానం పైకి ఎగబాకటమే. తన ప్రభుత్వ ఘన విజయాలలో అదొకటని మోడీ సర్కార్‌ చెబుతోంది. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌. స్వాతంత్య్రానికి ముందు మనం ఏ లక్ష్యాల కోసం పోరాడాము, తరువాత ఇప్పటి వరకు వాటికి మనం ఎంతవరకు కట్టుబడి వున్నాము, లక్ష్యాలు, గత ఆచరణ నుంచి కూడా ఇప్పుడు మనం వైదొలగుతున్న తీరు మన స్వాతంత్య్రాన్ని ఏమి చేయనున్నది అని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలోనే కాదు ప్రతి క్షణం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. నాడు బ్రిటీష్‌ తెల్లదొరల దుర్వివిధానాలకు వ్యతిరేకంగా పోరాడినట్లుగానే ఆ స్వాతంత్య్రానికి, సర్వసత్తాక అధికారానికి ముప్పు తెస్తున్న నేటి అమెరికన్‌ దొరల వత్తిడికి లంగిపోతున్న నల్లదొరల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పరిరక్షణకోసం మరోమారు వుద్యమించాల్సిన పరిస్ధితి ఏర్పడలేదా ? ఆలోచించిండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యూహ ప్రతి వ్యూహాలతో విస్తరిస్తున్న వాణిజ్య యుద్ధం !

01 Wednesday Aug 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Counter tariffs, counterstrategies, TRADE WAR, Trade war Expanding

Image result for Trade war

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరున తాను ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కొనసాగించటంపై అమెరికా, తనను తాను రక్షించుకోవటంపై దాడికి గురైన చైనా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ మొదలు పెట్టిన ఈ పోరు మీద ఇప్పటికీ అనేక కోణాల నుంచి విమర్శలే ఎక్కువగా వస్తున్నాయంటే ప్రపంచ పెట్టుబడిదారులు దీనిని ‘ మంచి యుద్ధం’ గా పరిగణించటం లేదనే అనేకోవాలి. తాజా పరిణామాలు, విశ్లేషణలను బట్టి వాణిజ్య దాడులను దీర్ఘకాలం కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ చర్యలు చైనా నాయకత్వ పట్టుదలను మరింత పెంచుతాయని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ హెచ్చరించాడు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నుల పెంపుద్వారా మోపిన భారాన్ని అమెరికన్‌ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వినియోగదారులపై మోపటం ప్రారంభమైంది. పంటల ధరలు పడిపోవటంతో రైతులకు 12బిలియన్‌ డాలర్ల మేర చెల్లించాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ప్రకటన వెలువడగానే మా సంగతేమిటని పారిశ్రామికవేత్తలు అడగటం ప్రారంభించారు. ఇదే సమయంలో అమెరికా దాడి ప్రభావం చైనాపై పెద్దగా పడిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా కరెన్సీ యువాన్‌ విలువ తగ్గటంతో చైనా ఎగుమతులపై పెద్ద ప్రభావం లేదన్నది వాటి సారాంశం. వెలువడుతున్న విమర్శలు, వాణిజ్య యుద్ధం ఇరుపక్షాలకూ నష్టం కలిగిస్తుందనే విశ్లేషణల పూర్వరంగంలో రెండు దేశాలూ మరోమారు చర్చలకు పూనుకోవచ్చన్నది తాజా వార్త.

అమెరికా తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై కూడా దిగుమతి పన్నుల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెరతీసింది. అయితే జూలై నెల మూడవ వారంలో ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌-డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య రాజీకుదిరింది. అమెరికా నుంచి సోయా, సహజవాయువు(ఎల్‌ఎన్‌జి), ఐరోపా నుంచి కార్లు మరియు ఆటో విడి భాగాలను పరస్పరం దిగుమతులు చేసుకొనేందుకు, ఆటోయేతర పారిశ్రామిక వుత్పత్తులపై ఎగుమతులు, దిగుమతులపై ఆటంకాలు, పన్నులు, సబ్సిడీలను ఎత్తివేసేందుకు అంగీకరించారు. అయితే పన్నులను పూర్తిగా రద్దు చేయటం అన్నది ఎంత మేరకు సాధ్యం అన్నది ప్రశ్న. అంతిమంగా కుదిరే ఒప్పందాన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఈ చర్య బహుముఖాలుగా దాడులు చేయటం తనకు మంచిది కాదన్న గ్రహింపు అమెరికాకు వచ్చినందునే ఈ తాత్కాలిక రాజీ, దానికి అది ఎంత కాలం కట్టుబడి వుంటుందన్నది కూడా సందేహమే. మా తల మీద తుపాకి గురి పెట్టి మమ్మల్ని ఒప్పించాలని చూస్తే కుదరదని ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు అమెరికాకు స్పష్టం చేశాయి. అందువల్లనే ట్రంప్‌ ఒక అడుగు వెనక్కు వేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చొక్కా నలగకుండా, అటూ ఇటూ ఆయుధాలను విక్రయించి లాభపడిన అమెరికాను ఎదుర్కోవాలంటే, విజయం సాధించినప్పటికీ ఎంతో నష్టాన్ని మూటగట్టుకొని, వికలాంగులుగా మారిన తాము ఐక్యంగా వుంటే తప్ప సాధ్యం కాదని గ్రహించిన ఫలితమే నేటి ఐరోపా యూనియన్‌. అందువలన వాటి రెండింటి మధ్య ఇప్పటికీ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అనూహ్యంగా తమకు సవాలుగా పరిణమించిన చైనాను ఎదుర్కోవటంలోనూ అవి చేతులు కలిపేందుకు వెనుకాడవు. కమ్యూనిస్టు ్యవతిరేకత, మార్కెట్లను ఆక్రమించుకోవటంలో అవి ఏవీ తక్కువ కాదు. అందువలన తమపై దాడి ప్రారంభించిన అమెరికా మీద ఐరోపా ధనిక దేశాలు వత్తిడి తెస్తాయనే భ్రమలు, తమతో చేతులు కలుపుతాయనే ఆశలు చైనాకు లేవు. అతి పెద్ద దేశంగా వున్నందున జిడిపి ఎక్కువగా వున్నట్లు కనిపించినా, అమెరికా, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నదేశమే, ఈ కారణంగానే ప్రపంచ వాణిజ్య సంస్ధలో కొన్ని రాయితీలను పొందుతున్నది.

అమెరికా తరువాత మరో ధనిక దేశమైన జపాన్‌ కూడా ఇటీవలే ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక బహిరంగ వాణిజ్య ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. జపాన్‌ నుంచి చేసుకొనే దిగమతులలో 99శాతం వస్తువులపై పన్నులను ఐరోపా యూనియన్‌ రద్దు చేస్తుంది. అమెరికా-ఐరోపా యూనియన్‌ కూడా ఇదే మాదిరి ఒప్పందానికి వస్తే అప్పుడు చైనా ఇతర దేశాలతో వాణిజ్యం చేయటం కష్టం అవుతుంది లేదా వత్తిడికి లంగి తన దిగుమతి పన్నులను తగ్గించి మరింతగా తన మార్కెట్‌ను తెరవాల్సి వుంటుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో చైనా ప్రారంభించిన సంస్కరణలకు నలభై సంవత్సరాలు నిండాయి. పశ్చిమ దేశాలకు పెద్ద ఎత్తున మార్కెట్‌ ద్వారాలు తెరిచిన కారణంగా పరస్పరం లబ్దిపొందాయి. ఈ క్రమంలో అది వాణిజ్య మిగులు దేశంగా మారింది. ఇంకా తమ వస్తువులను అదనంగా కొనాలని పశ్చిమ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధ మూలకారణమిదే. చైనా ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ పశ్చిమ దేశాలతో పోల్చితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటికీ వెనుకబడే వుంది. తమ వైపు నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపును అడ్డుకుంటే చైనా దారికి రావచ్చన్నది పశ్చిమ దేశాల వూహ. అమెరికా ఇప్పుడు క్రమంగా వాణిజ్య యుద్ధాన్ని 500బిలియన్‌ డాలర్ల మేరకు విలువగల వస్తువులకు పెంచుతానని బెదిరించింది. దీనితో పాటు చైనా పశ్చిమ దేశాల ఆధునిక పరిజ్ఞాన కంపెనీలను కొనుగోలు చేయకుండా చూడటంతో పాటు వాణిజ్య సంస్ధలో సంస్కరణల పేరుతో కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టాలని కూడా అమెరికా నిర్ణయించింది. అంటే చైనాను చక్రబంధంలో బిగించి దారికి తెచ్చుకోవాలన్నది వ్యూహం.

‘చైనాతో వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. అంటే వాణిజ్య యుద్ధం నిరవధికంగా కొనసాగవచ్చు, ఇతర దేశాల ద్వారా చైనా వుక్కు అమెరికా చేరకుండా వుండాలంటే ప్రపంచం అంతటి నుంచి వచ్చే వాటి మీద పన్నులు విధించటమే ఏకైక మార్గం ‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పారు. అమెరికా మరో వాణిజ్య ప్రతినిధి డెనిస్‌ షెయా చైనా కమ్యూనిస్టుపార్టీపై విరుచుకుపడుతూ చైనా ప్రభుత్వ ఒప్పందాలకు విరుద్దంగా కమ్యూనిస్టు పార్టీ వాణిజ్య విధానాన్ని ఆదేశిస్తున్నదని, చైనా ఆర్ధిక విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యులు నష్టపోవాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యురాలిగా లబ్ది పొందిన చైనా 2005-16 మధ్య 9.5శాతం నిజ జిడిపి అభివృద్ధి రేటుతో రెండవ ఆర్ధికశక్తిగా ఎదిగిందని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ధనిక దేశాలన్నీ చైనా మీద కత్తి గట్టటానికి సన్నద్ధం అవుతున్నాయి.

ముందు తన ఇంటిని చక్కదిద్దుకొని వాణిజ్య లోటు ఏర్పడకుండా దేశీయంగా పొదుపును పెంచుకోవాలని చైనా తిప్పి కొట్టింది. వాణిజ్య యుద్ధం ప్రారంభం సాంకేతికంగా జూలై ఆరున ప్రారంభమైనప్పటికీ దానికి నిర్ణయం, సన్నాహాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అనేక సంవత్సరాలుగా తమ సరకులను ఎక్కువగా కొనుగోలు చేసి వాణిజ్య లోటును తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తోంది. ఇదే సమయంలో ధనిక దేశాలపై ఆధారపడిన తన ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధకు వున్న పరిమితులను చైనా నాయకత్వం గుర్తించకపోలేదు. తమ పౌరుల కొనుగోలు శక్తిని పెంచటం, వెనుక బడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ వంటి అంతర్గత చర్యలతో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో సహా అన్ని ఖండాలలో తన వాణిజ్య అవకాశాలను పెంచుకొనేందుకు పూనుకుంది, ఆ దిశగా అనేక చర్యలను చేపట్టింది. తమ పన్నుల దాడి నుంచి కాచుకొనేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏ దేశమైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే లాభాలతో పాటు నష్టాలు కూడా వుంటాయి. కరెన్సీ విలువ తక్కువగా వుంటే ప్రపంచ మార్కెట్‌లో ధరలపోటీలో నిలబడవచ్చు. అదే సమయంలో సదరు దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతాయి. చైనా దగ్గర డాలర్‌ నిల్వలు భారీగా వున్నందున తన కరెన్సీ విలువ తగ్గించి కుక్క కాటుకు చెప్పు దెబ్బమాదిరి ప్రతీకారం తీర్చుకోవచ్చన్నది ఒక వాదన. పదకొండువందల వస్తువులపై అమెరికా విధించిన 25శాతం దిగుమతి పన్ను భారాన్ని తమ కంపెనీలపై తగ్గించేందుకు వాణిజ్య యుద్ధం ప్రారంభానికి ముందు నుంచే అంటే తన కరెన్సీ విలువ పతనాన్ని ప్రోత్సహించిందని, గత మూడునెలల్లో డాలరుతో 7.7శాతం పడిపోయిందని చెబుతున్నారు. ఇదే కాలంలో మన దేశంతో సహా అనేక దేశాల కరెన్సీ విలువలు పడిపోయాయి.’ చైనా, ఐరోపా యూనియన్‌లు కరెన్సీ విలువలను తిమ్మిని బమ్మిని చేస్తున్నాయి, వడ్డీ రేట్లు తక్కువగా వుంచుతున్నాయని’ ట్రంప్‌ స్వయంగా ట్వీటర్‌లో ఆరోపించాడు. దీనికి తగిన ఆధారాలు కనిపించటం లేదు. జర్మనీలో పదేండ్ల బాండ్లపై 0.5, అమెరికాలో 2.6 శాతం వడ్డీ వస్తుండగా చైనాలో 3.75శాతం వస్తున్న కారణంగా ఏప్రిల్‌కు ముందు పన్నెండు నెలల కాలంలో వంద బిలియన్‌ డాలర్లు చైనాకు తరలి వచ్చాయి. చైనా వడ్డీ రేటును స్ధిరంగా వుంచుతుందనే నమ్మకమే దీనికి కారణమని కొందరి విశ్లేషణ. కరెన్సీ విలువ తగ్గితే విత్త (వడ్డీ) వ్యాపారులు చైనా నుంచి బయటకు పోతారు. చైనాకు సంపదలతో పాటు అప్పులు కూడా భారీగానే వున్నాయి, అలాంటపుడు విదేశీ నిధులు బయటకుపోతే ఎన్నో చిక్కులు తలెత్తుతాయి కనుక చైనా నాయకత్వం అలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోదు అని కొందరి వాదన.

Image result for Trade war

ఒక దేశంలో కరెన్సీ విలువ పడిపోతే అది దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు పెరుగుతాయి. యువాన్‌ విలువ తగ్గితే చైనాలో అమెరికా వస్తువులు ప్రియం అవుతాయి. జూలై ఆరు తరువాత ఇప్పటి వరకు యువాన్‌ విలువ రెండున్నర శాతం తగ్గింది. అయితే ఇలాంటి హెచ్చు తగ్గులు గతంలో కూడా వున్నాయి. గతనెలలో చైనా పిఎంఐ సూచిక 51.2గా వుంది. అంతకు తగ్గితే ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడినట్లు. ఏమైనా ప్రభావం, పర్యవసానాల గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము. గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకొనేందుకు రష్యా తన కరెన్సీ విలువను తక్కువగా వుంచిందని, చైనా కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని కొందరు అంటున్నారు.అయితే రష్యాకు దాని వలన కొన్ని సమస్యలు కూడా తలెత్తకపోలేదు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు అటు చైనా ఇటు అమెరికా మీద మెల్లగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో సోయా, ఇతర వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనం కావటంతో రైతులను ఆదుకొనేందుకు ట్రంప్‌ సర్కార్‌ 12బిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమెరికాకు ప్రతిగా తాము విధించిన పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభావితమయ్యే పరిశ్రమలు, సంస్ధలకు రాయితీల రూపేణా అందిస్తామని చైనా ఎప్పుడో ప్రకటించింది. రైతులకు రాయితీలు ప్రకటించటంతో మిగతా పరిశ్రమల వారు కూడా తమ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా రాయితీలు ఇస్తే 39బిలియన్‌ డాలర్లు అవుతాయని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. గతంలో తాము ఎన్నో మాంద్యాలు, అంతర్యుద్ధాల కాలంలో కూడా నిలబడ్డామని కానీ ఇప్పుడు వాణిజ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మనుగడ కష్టమని 1839 నుంచి వునికిలో వున్న బ్రిన్లీ-హార్డీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. వుక్కు ధరలు 33శాతం పెరిగాయని వాపోయారు. అనుచిత యుద్ధం, అసమర్ధులైన సైన్యాధికారులు, ప్రజల మద్దతు లేనపుడు గెలవటం అసాధ్యమని, ట్రంప్‌ ప్రారంభించి వాణిజ్య యుద్దం కూడా అలాంటిదే అని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు ఏమైనప్పటికీ 2020 నాటికి అమెరికా ఆర్ధిక లోటు లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే జరిగితే పెట్టుబడులు, దిగుమతులు పడిపోవటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం వుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సమస్య చైనా కాదని, దేశీయంగా పొదుపు చాలా తక్కువగా వుండటం అసలు సమస్య అన్నారు. ట్రంప్‌ కోరుతున్నట్లు అమెరికా నుంచి చైనా మరింతగా చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మితే చైనాతో వాణిజ్యలోటు తగ్గించానని ట్రంప్‌ చెప్పుకోవటానికి తప్ప పెద్ద తేడా ఏమీ వుండదు, రవాణా ఖర్చులు పెరుగుతాయి అన్నారు. చైనా వస్తువులకు డిమాండ్‌ తగ్గితే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే దాని కరెన్సీ విలువ బలహీనమౌతుంది, అప్పుడు ఇతర దేశాలతో చైనా పోటీతత్వం పెరుగుతుంది. 2015లో చైనా ఆమోదించిన మేడిన్‌ చైనా 2025 విధానాన్ని అడ్డుకొనేందుకు ట్రంప్‌ ప్రయత్నించినట్లయితే కచ్చితంగా విఫలమౌతాడు, మరోవైపు నూతన ఆవిష్కరణలు, సాంకేతికంగా పైచేయి సాధించాలన్న చైనా నేతల పట్టుదలను మరింత పెంచినవారవుతారు, తాము ఇతరులపై ఆధారపడలేమని వారు గుర్తించిన తరువాత అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అని స్టిగ్జిజ్‌ చేసిన హెచ్చరికను ట్రంప్‌ పట్టించుకుంటాడా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అబద్దాలు, అదిరింపులు, బెదిరింపులతో నాటో భేఠీ !

14 Saturday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Donald trump, lies, NATO, nato brussels summit 2018, scares, threats

Image result for nato brussels summit 2018

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారికి ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతోంది.అమెరికా పాలకవర్గం(దాని ప్రతినిధులు రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలనేతలు) ప్రపంచాన్ని ఏవైపు తీసుకుపోతున్నది? పర్యవసానాలు ఎలా వుంటాయి? ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌, వుత్తర కొరియాతో అణు సమస్యపై తొలిసారిగా ఒక ఒప్పందానికి వస్తున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో ఏ దేశమైనా లావాదేవీలు జరిపితే వాటి మీద కూడా తన కొరడా ఝళిపిస్తానని భారత్‌ వంటి దేశాలను బెదిరించాడు.కెనడాలో జరిగిన జి7 సమావేశంలో అన్నింటా తన అనుయాయిగా వున్న కెనడా, ఇతర మిత్ర దేశాల మీద విరుచుకుపడ్డాడు. చైనాతో పాటు కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ మీద కూడా వాణిజ్య యుద్దం ప్రకటించాడు. తాజాగా ఈనెల 11,12 తేదీలలో జరిగిన నాటో కూటమి దేశాల సమావేశంలో మిలిటరీ ఖర్చు పెంచుతారా లేదా అంటూ బెదిరింపులకు దిగాడు. ఐరోపా యూనియన్‌లో అగ్రరాజ్యమైన జర్మనీపై విరుచుకుపడుతూ ఇంధనం కోసం రష్యా చేతిలో బందీ అయిందని మండిపడ్డాడు. నాటో ఖర్చు అంతటినీ అమెరికాయే భరిస్తోందంటూ అతిశయోక్తులు పలికి అపహాస్యం పాలయ్యాడు. అంతే కాదు దాదాపు అన్ని విషయాల్లో అమెరికాకు వత్తాసు పలుకుతూ, ఐరోపా యూనియన్‌లో అమెరికా ఏజంటు వంటిది అని పేరు తెచ్చుకున్న బ్రిటన్‌ను కూడా ట్రంప్‌ వదల్లేదు. ప్రధాని థెరెస్సా మే గురించి, బ్రెక్సిట్‌ గురించి నోరుపారవేసుకున్నాడు. దీంతో సోమవారం నాడు బ్రిటన్‌ పర్యటనలో లక్షలాది మంది నిరసన ఎదుర్కొన్నాడు. బ్రసెల్స్‌ నాటో సమావేశంలో నిజమైన బేధాభిప్రాయం దానికి నిధుల చెల్లింపు గురించే అని నాటో వర్గాలు వెల్లడించాయి. లోపల ఎన్ని బేధాభిప్రాయాలు వున్నా, ట్రంప్‌ ప్రవర్తనపై అసంతృప్తి వున్నా ఐరోపా నేతలు సంయమనం పాటించారు. తాత్కాలికంగా అయినా ట్రంప్‌ను సంతృపరచేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామలన్నీ దేనికి సూచిక ?

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ముఖ్యంగా సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌లైన జార్జియా, వుక్రెయిన్లలో రష్యా మిలిటరీ జోక్యం ముగిసిందనుకున్న ప్రచ్చన్న యుద్ధం మరో రూపంలో ప్రారంభం అవుతుందా అన్న ప్రశ్నను రేకెత్తించాయి. రష్యాను ఒంటరిని చేయాలని నాటో అనే శిఖండిని ముందు పెట్టుకొని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఎలా ప్రయత్నిస్తున్నాయో రష్యా కూడా నాటోలో రాజకీయ విబేధ విత్తనాలు నాటేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. బ్రసెల్స్‌ సమావేశాల్లో వాటి గురించి స్వయంగా అమెరికాయే బయటపడటం విశేషం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా, ఐరోపా దేశాలు 1949లో వుమ్మడి మిలిటరీ రక్షణ కూటమిగా వుత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ(నాటో)గా ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిలో 29దేశాలు వున్నాయి. నాటి సోవియట్‌ నుంచి రక్షించుకొనే పేరుతో ఏర్పడిన ఈ సంస్ధ 1991 అది రద్దయిన తరువాత కూడా కొనసాగటమే కాదు, దాని ఖర్చును రెట్టింపు చేయాలని తాజాగా బ్రసెల్స్‌లో జరిగిన సమావేశంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సభ్యరాజ్యాలను డిమాండ్‌ చేశాడు. గత ఏడు దశాబ్దాలలో కమ్యూనిస్టు సోవియట్‌ లేదా తరువాత దాని వారసురాలిగా మారిన పెట్టుబడిదారీ రష్యా గానీ నాటో సభ్యరాజ్యాల మీద దాడి లేదా ప్రయత్నం కూడా చేయలేదు. అయినా సరే దాన్నింకా బలపరచాలని అమెరికా కోరటం వెనుక వున్న వుద్దేశ్యం ఏమిటి? ఎవరి నుంచి ముప్పు వస్తుస్తుందని ఐరోపా రాజ్యాలు భయపడుతున్నాయి?

1991లో సోవియట్‌ యూనియన్‌ను కూల్చివేశారు. అప్పటి వరకు దానికి వ్యతిరేకంగా పని చేసిన నాటో తదుపరి ప్రయాణం ఏదిశగా సాగాలి, అసలు కొనసాగటం అవసరమా అన్న దిశలో చర్చలు జరిగాయి. పశ్చిమ ఐరోపాతో పాటు తూర్పు ప్రాంతానికి కూడా రక్షణ ఛత్రాన్ని విస్తరింప చేయాలని నాటి బిల్‌క్లింటన్‌ సర్కార్‌ మొగ్గు చూపింది. ప్రపంచం మీద పెత్తనం కొనసాగించాలన్నదే అంతర్గత అంశం. సోవియట్‌ ముప్పు లేకపోయిన తరువాత ఐరోపా రక్షణకు అమెరికా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది అమెరికా రక్షణశాఖలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. నాటో విస్తరణ కూటమిని పలుచన చేస్తుందని బ్రిటన్‌, విస్తరణ నాటో ప్రభావాన్ని అవసరానికి మించి పెంచుతుందని ఫ్రాన్స్‌ భయం వ్య్తం చేసింది. చిత్రం ఏమిటంటే 69 సంవత్సరాల క్రితం నాటో ఏర్పాటు లక్ష్యం వేరు, ఆచరణలో దాన్ని వినియోగిస్తున్న తీరు వేరుగా వుంది. నాటో ఒప్పందం ప్రకారం ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలోని సభ్య రాజ్యాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిపై ఎవరైనా దాడి చేస్తే అందరి మీద జరిగిన దాడిగా పరిగణించి ప్రతిఘటించాలి. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా అటువంటి దాడి జరగలేదు. సరికదా నాటో దేశాల సరిహద్దుల వెలుపల నాటో సభ్య దేశాలే ఏదో ఒకసాకుతో మిలిటరీ జోక్యం చేసుకుంటున్నాయి. కొత్త భద్రతా సమస్యలు తలెత్తాయనే పేరుతో దాన్ని కొనసాగించేందుకు కొత్త సాకులు వెతుకుతున్నాయి.

Nato

1990దశకంలో నాటి యుగోస్లావియా జాతుల విబేధాలతో ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి బోస్నియా, హెర్జెగోవినా మీద విమానాలు ఎగరకూడదని ఆంక్షలు విధించింది. దాన్ని అవకాశంగా తీసుకొని తొలిసారిగా నాటో దళాలు 1994లో నాలుగు బోస్నియా విమానాలను కూల్చివేశాయి. ఆ తరువాత కొసోవోలో శాంతి పరిరక్షణ పేరిట, మధ్యధరా సముద్రంలో భద్రతా గస్తీ, సోమాలియాలో ఆఫ్రికన్‌ దళాలకు మద్దతు, ఆఫ్ఘనిస్తాన్‌లో వుగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు పేరుతో నాటో జోక్యం చేసుకుంది. ఇవన్నీ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద ఎత్తుగడలు, లక్ష్యాలలో భాగంగానే జరిగాయి తప్ప ఐరోపాకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇంతే కాదు ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను నీరుగార్చి, దాని లక్ష్యాలను కూడా దెబ్బతీసే విధంగా నాటో రాజ్యాలు వ్యవహరిస్తున్నాయి. వుదాహరణకు లిబియా మీద 2011లో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. వాటిని అమలు జరిపే పేరుతో రంగంలోకి వచ్చిన అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరువాత కొద్ది రోజుల్లోనే ఆ బాధ్యతను నాటో కమాండ్‌కు అప్పగించాయి. టర్కీ ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.లిబియాపై దాడులు చేసేందుకు జర్మనీ, పోలాండ్‌ తిరస్కరించాయి.

తమ సభ్యదేశంపై జరిగిన దాడిని వుమ్మడిగా ఎదుర్కోవాలనే సూత్రాన్ని 2001లో ఆప్ఘనిస్తాన్‌లో నాటో ముందుకు తెచ్చింది. వుగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే పేరుతో అక్కడ జోక్యం చేసుకుంది అమెరికా.అమెరికా సేనల మీద దాడులు జరిపింది ఆల్‌ఖైదా వుగ్రవాదులు. దానికి నాటో సూత్రానికి లంకెపెట్టి అమెరికా నాయకత్వంలోని దళాలు అక్కడి ప్రభుత్వానికి సాయం చేసే పేరుతో తిష్టవేశాయి. రెండు సంవత్సరాల తరువాత ఆ బాధ్యతను నాటో స్వీకరించింది.అయితే కొన్ని దేశాలు జాతీయ కారణాలు చూపి ఆ దాడులకు తమ సైన్యాన్ని పంపలేదు. నాటో, దాని భాగస్వామ్య దేశాల పేరుతో 50కిపైగా దేశాల నుంచి లక్షా 30వేల మంది సైన్యాన్ని దించి 2014వరకు దాడులు చేశారు. వాటిలో వుగ్రవాదుల చేతుల్లో మరణించిన వారిలో చురుకుగా పాల్గన్న అమెరికా, బ్రిటన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలవారే అధికులు. ఆ తరువాత గత నాలుగు సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పేరుతో 16వేల మంది నాటో సైనికులు అక్కడ కొనసాగుతుండగా వారిలో సగం మంది అమెరికన్లే. అదే ఆల్‌ఖైదా వుగ్రవాదులకు అమెరికాతో పాటు ఐరోపా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి సిరియాలో వున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించటాన్ని గమనించాలి. వాటికి వ్యతిరేకంగా అక్కడ రష్యా సేనలు సిరియాకు మద్దతు ఇస్తున్నాయి. నాటో విస్తరణ ఐరోపాకే పరిమితం చేయలేదు. రష్యాను చుట్టుముట్టేందుకు ఆసియాలోని అజర్‌బైజాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలకు సైతం ఏదో ఒకసాకుతో విస్తరించేందుకు పూనుకున్నారు. దీని వెనుక రష్యాను దిగ్బంధనం చేయటంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల వరకు నాటో పేరుతో అమెరికా దళాలను రప్పించే ఎత్తుగడ వుంది. అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరాన్‌ వుంది. 1990దశకంలో జర్మనీ ఏకీకరణ సమయంలో నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని అమెరికా ఇచ్చిన హామీలకు భిన్నంగా తూర్పుకే కాదు, చివరకు ఆసియాకు సైతం వస్తున్నది. అందువలన నాటో ఏర్పడిన లక్ష్యాలకు, ఇప్పుడు చేస్తున్నదానికి వున్న ఏకైక లక్ష్యం ఏమిటంటే అప్పుడూ ఇప్పుడూ ఈ ప్రాంతంపై అమెరికా పెత్తనాన్ని విస్తరించటమే. నాటోను కొనసాగించితే దీర్ఘకాలంలో ప్రమాదముంటుంది, అదే తూర్పుదిశగా వేగంగా విస్తరింపచేస్తే రష్యాను నయా సామ్రాజ్యవాద దేశంగా మార్చటానికి దారితీస్తుందని 1994లో అమెరికా విదేశాంగ మంత్రి వారెన్‌ క్రిస్టోఫర్‌ హెచ్చరించారు. అయితే రష్యా, నాటో వైపు నుంచి కూడా పరిస్ధితిని దిగజార్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వుక్రెయిన్‌ తూరుప్రాంతంలోని క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకుంది. జార్జియాలో కూడా జోక్యం చేసుకొని తన పలుకుబడిని పెంచుకుంటున్నది . వాటిని చూపి ఐరోపాకు ముప్పుతొలగలేదని అమెరికా చెబుతున్నది. రష్యాపై ఆంక్షలను విధిస్తున్నది. వాటిని కొన్ని ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. 2014 నుంచి రష్యాతో పౌర, మిలిటరీ సహకారాన్ని నాటో నిలిపివేసింది. తూర్పు ఐరోపాలో బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాలను పెంచింది. ఈ రెండు దేశాలను నాటోలో చేర్చుకుంటే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని రష్యా హెచ్చరిస్తున్నది. ఈ కారణంగానే ఆ దేశాలను నాటోలో చేర్చుకొనేందుకు కూటమి దేశాలు తొందరపడటం లేదు. వాటిని ఈపాటికి చేర్చుకొని వుంటే పరిణామాలు, పర్యవసానాలు వేరే విధంగా వుండి వుండేవి. అయితే రష్యా మద్దతు వున్న తిరుగుబాటదార్లను అదుపు చేసే పేరుతో వుక్రెయిన్‌కు అత్యంత అధునాత ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. క్రిమియాను విలీనం చేసుకున్న తరువాత అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన వుపన్యాసంలో నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ అనేకసార్లు వారు మాతో అబద్దాలు చెప్పారు, మాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారు, తూర్పు దిశగా నాటో విస్తరణ జరిగింది, మా సరిహద్దులలో మిలిటరీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే మమల్ని అదుపు చేయాలనే పశ్చిమదేశాల విధానంతో పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవయశతాబ్దాలలో నడిచాయి, నేడు కూడా కొనసాగిస్తున్నాయి.’ అన్నారు.

తమదేశంతో సహా రష్యా విదేశాల ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది, నూతన అణ్వాయుధాలను తయారు చేస్తున్నది. ఐరోపాలోని వ్యవస్ధలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది, ఐరోపా రక్షణలో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నది అని అమెరికా ఆరోపిస్తున్నది. ఐరోపాలో తాను ఏర్పాటు చేస్తున్న పరిమిత క్షిపణి రక్షణ వ్యవస్ధలు ఇరాన్‌ దాడిని ఎదుర్కొనేందుకు అని అమెరికా చెబుతున్నది. ఈ మాటలను ఎవరూ నమ్మరని వేరే చెప్పనవసరం లేదు. క్రిమియాలో రష్యా జోక్యాన్ని సాకుగా చూపుతూ తటస్ధ దేశాలుగా వున్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను కూడా నాటో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్ధలను సమకూర్చుకొనేందుకు టర్కీ పాలకులు ప్రయత్నించటానికి నాటోలోని మిగతా దేశాలు అభ్యంతర పెడుతున్నాయి.

ఈ పూర్వరంగంలో జూలై 11,12 తేదీలలో బ్రసెల్స్‌లో నాటో కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు అపహాస్యం పాలైంది. బ్రసెల్స్‌ సమావేశం విజయవంతమైందని ట్రంప్‌ ప్రకటించాడు. సభ్యదేశాల నేతలతో తన సంబంధాలు ఎంతో బాగున్నాయని మరీ మరీ చెప్పాడు. అయితే జరిగిన పరిణామాలు అలా కనిపించటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌-రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ లోహానిస్‌ భేఠీ వార్తల సేకరణ వుందంటూ ప్రధాన వార్తా కేంద్రం నుంచి వెళ్లిపోయిన రుమేనియా విలేకర్లు వెంటనే తిరిగి వచ్చి సమావేశం రద్దయినట్లు తెలిపారు. అంతే కాదు అజర్‌బైజాన్‌, వుక్రెయిన్‌, జార్జియానేతలతో వుందన్న సమావేశాల పరిస్ధితీ అదే అయింది.

గతంలో సభ్యరాజ్యాల స్ధూల జాతీయాదాయం(జిడిపి)లో రెండుశాతం మొత్తాన్ని 2024నాటికి రక్షణకు కేటాయించాలని నాటో నిర్ణయించింది.దాన్ని వచ్చే జనవరి నాటికే అమలు చేయాలని, తరువాత నాలుగుశాతానికి పెంచాలని ట్రంప్‌ పట్టుపట్టాడు. అతగాడితో ఇప్పుడు గొడవెందుకు సరే అలాగే చేద్దాం లెమ్మన్నట్లుగా సభ్యదేశాల స్పందన వుంది. ఈ సమావేశాలలో అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధిగా ట్రంప్‌ విశ్వరూపం కనిపించింది అంటే అతిశయోక్తి కాదు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘నేను అధికారానికి రాక ముందు ఆయుధాల గురించి విన్నాను గానీ పదవిలోకి వచ్చాక నేను నిజంగా తెలుసుకున్నాను. ఇతరులు తయారు చేసే వాటి కంటే మావి ఎంతో మెరుగైనవి, మీరు మాకంపెనీలు లాక్‌హీడ్‌, బోయింగ్‌, గ్రమ్మన్‌ వంటి వాటిని చూడండి, ఎలాంటి మెటీరియల్‌ను వాడుతున్నామో, ఎంతో నాణ్యమైన పరికరాలను తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మా పరికరాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. వారెంతో మంచి పని చేస్తున్నారు, వారందరికీ చేయగలరా? కాబట్టి వాటిలో కొన్ని దేశాలకు సాయపడుతున్నాం, మంచి పరికరాలను కొనుగోలు చేయగలుగుతున్నారు.’ ఇలా ఒక కంపెనీ ప్రతినిధి తప్ప ఒక దేశాధినేత చెప్పే మాటలుకావు. ఈ సమావేశాలలో ట్రంప్‌ తన అజెండాకు ఆమోదముద్ర వేయించుకున్నాడా లేదా అన్న చర్చ జరుగుతోంది.

సమావేశాల ప్రారంభంలోనే ట్రంప్‌ జర్మనీపై దాడికి దిగాడు. ఇంధనం కోసం ఎక్కువగా ఆధారపడి తనంతట తానే రష్యాకు బందీ అయిందని, నాటో రక్షణ నిమిత్తం చెల్లింపులలో విఫలమైందని ఆరోపించాడు. చమురుకైతే బిలియన్లకు బిలియన్లు చెల్లిస్తారు గానీ నాటో విషయంలో ముందుకు రారు అని వ్యాఖ్యానించాడు. ‘ జర్మనీని రష్యా పూర్తిగా అదుపు చేస్తోంది. ఈ దేశాలు(నాటో కూటమి) కేటాయింపులు పెంచాలి, దశాబ్దకాలంలో కాదు, వెంటనే కేటాయించాలి.జర్మనీ ధనిక దేశం, వారు కొద్దికొద్దిగా 2030నాటికి పెంచుతామంటున్నారు. వారు తక్షణమే, రేపే పెంచితే మాకెలాంటి సమస్య వుండదు.(విలేకర్ల సమావేశంలో పక్కనే వున్న నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌ బర్గ్‌తో మాట్లాడుతూ) ప్రతి ఏటా గ్యాస్‌ కోసం జర్మన్లు బిలియన్లకొద్దీ డాలర్లు రష్యాకు చెల్లిస్తుంటారు, కానీ రష్యా నుంచి రక్షించాలని మమ్మల్ని కోరతారు, ఇది సరైంది కాదని నేను అనుకుంటున్నాను. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది, తన ఇంధనంలో 70శాతాన్ని రష్యా నుంచి పొందుతోంది.’ అన్నాడు.

రష్యా నుంచి బాల్టిక్‌ సముద్ర ప్రాంత దేశాలన్నింటికీ గ్యాస్‌ను సరఫరా చేసే పదకొండు బిలియన్‌ డాలర్ల పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు తెలిపింది. ఈ వైఖరి ఇతర ఐరోపా దేశాలకు నచ్చలేదు. ‘ ఇది ప్రయివేటు వాణిజ్య పధకం, దీనికి జర్మన్లు చెల్లించిన పన్నుల నుంచి ఎలాంటి కేటాయింపులు లేవని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు.జర్మనీ రక్షణ మంత్రి అర్సులా వాండెర్‌ లేయాన్‌ మాట్లాడుతూ మాకు రష్యాతో అనేక సమస్యలున్నాయనటంలో ఎలాంటి సందేహం వుండనవసరం లేదు. మరోవైపు దేశాలు లేదా కూటములు మరియు వ్యతిరేకులతో కూడా సమాచార సంబంధాలను కొనసాగించాల్సి వుంది.’ అన్నారు. రష్యన్‌ గ్యాస్‌ మీద ఆధారపడటాన్ని తగ్గించాలనే అంశంపై నాటోలోని ఐరోపా దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని స్టోల్టెన్‌ బర్గ్‌ కూడా చెప్పారు.

తొలి రోజే అనేక మంది దేశాధినేతలతో ప్రయివేటుగా చర్చలు జరపటంతో రెండో రోజు అజెండా అంశాలపై ఎవరూ భిన్నాభిప్రాయం వెల్లడించలేదు. మిగతా దేశాధినేతలందరూ వుదయం తొమ్మిది గంటలలోపే సమావేశానికి హాజరైనప్పటికీ ట్రంప్‌ కావాలనే ఆలస్యంగా వచ్చారని విమర్శలు వచ్చాయి. జార్జియా, ఆప్ఘనిస్తాన్‌ల గురించి చర్చించే అజెండా వున్నప్పటికీ అదేమీ పట్టనట్లుగా యూరోపియన్ల రక్షణ ఖర్చు గురించి మాట్లాడటం మొదలెట్టారు. వచ్చే ఏడాది జనవరిలోగా ఖర్చుల కేటాయింపు పెంచనట్లయితే అమెరికా తనదారి తాను చూసుకుంటుందని వ్యాఖ్యానించగానే సమావేశంలో వున్నవారంతా అవాక్కయ్యారు. ట్రంప్‌ మాటల గురించి ఎవరూ విబేధించలేదు గానీ వాటికి మాత్రం భిన్న భాష్యాలు వెల్లడయ్యాయి. దీని అర్ధం అమెరికాతో ఘర్షణ పడటానికి ప్రస్తుతానికి ఎవరూ సిద్ధంగా లేరన్నది స్పష్టం.

రక్షణ ఖర్చు పెంచని పక్షంలో తాము నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ బెదిరించినట్లుగా రాయిటర్స్‌ పేర్కొన్నది. ట్రంప్‌ మాటలకు అర్ధం అదని తాను భావించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పేర్కొన్నాడు. ట్రంప్‌ వ్యాఖ్యలతో సమావేశ గదిలో విస్మయం వ్యక్తం కావటంతో నాటో జనరల్‌ సెక్రటరీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడే వున్న ఆఫ్ఘనిస్తాన్‌, అజర్‌బైజాన్‌ ప్రతినిధులతో మీరు నాటో సభ్యులు కానందున బయటకు వెళ్లండని చెప్పారు. తరువాత సమావేశంలో ఎవరూ ఎలాంటి కొత్త ప్రతిపాదనలూ చేయలేదు, ఐరోపా నాయకులందరూ అంతకు ముందు ప్రకటించిన మీడియా సమావేశాలను రద్దు చేసుకొని నేరుగా విమానాశ్రయాలకు వెళ్లిపోయారు. మీడియా సమావేశ కార్యక్రమం లేనప్పటికీ షెడ్యూలు మార్చుకొని ట్రంప్‌ 35నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం జయప్రదమైందని, ఇతర నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకున్నారు. ట్రంప్‌తో ఎలాంటి వుద్రిక్తత ఏర్పడలేదని, ట్రంప్‌ ముక్కుసూటిగా మాట్లాడి వుండవచ్చు,కేటాయింపు పెంచుతామని సభ్యులు వాగ్దానం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి అన్నారు.

రష్యా నుంచి ముప్పు వస్తోందనే పేరుతో నాటో కూటమి గతేడాది 900బిలియన్‌ అంటే దాదాపు లక్షకోట్ల డాలర్లను ఖర్చు చేశాయి. వీటిలో అధికభాగం అమెరికా ఖర్చు చేసిన మాట నిజమే. కానీ అదే రీతిలో ఆ సొమ్ములో అధిక భాగం తిరిగి అమెరికన్‌ సైన్యం, అమెరికన్‌ ఆయుధ కంపెనీలకే చేరుతుందనే విషయం చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో రష్యా చేసిన ఖర్చు కేవలం 66 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అవసరం లేకపోయినా విస్తరణ పేరుతో నాటో మిలిటరీని రష్యా ముంగిటకు తీసుకుపోతున్న అమెరికా ఎత్తుగడలే నేడు ఐరోపాలో వుద్రిక్తతలకు కారణం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఐరోపాకు లేని ముప్పును చూపుతూ అమెరికా మిలిటరీ కార్పొరేట్‌లు ఐరోపా దేశాలను అదిరించి బెదిరించి తమ ఆయుధాలను, వినిమయ వస్తువులను అంటగట్టేందుకు చూడటం తప్ప ట్రంప్‌ చర్యల్లో మరొకటి కనిపించటం లేదు.

ఐరోపా రాజ్యాలు అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధం కాదు. అందుకే ఒకవైపు దానితో మిత్రత్వాన్ని నెరపుతూనే తమ ప్రయోజనాలను తాము చూసుకుంటున్నాయని చెప్పవచ్చు. వుదాహరణకు అనేక అంశాలలో అమెరికా వైఖరిని ఐరోపాయూనియన్‌ ఏకీభవించటం లేదు. వుక్రెయిన్‌లో భాగంగా వున్న క్రిమియాను అక్కడి పౌరుల ఆకాంక్షలకు అనుగుణ్యంగా రష్యా తనలో విలీనం చేసుకున్నది.ఆ చర్యను జర్మనీ విమర్శించినప్పటికీ తనకు అవసరమైన చమురు అవసరాలకోసం రష్యన్‌ చమురు కంపెనీ గాజ్‌పోమ్‌తో జర్మనీ 11 బిలియన్‌ డాలర్లతో ఒకపైప్‌లైన్‌ నిర్మాణంపై 2015లో ఒప్పందం చేసుకుంది. దాని గురించే ట్రంప్‌ బ్రసెల్స్‌లో జర్మనీపై విరుచుకుపడ్డాడు. నాటో రక్షణ ఖర్చును తమకు ఇవ్వాలని అమెరికా పట్టుబడుతున్నది, అయితే ఐరోపా దేశాలు ఆ ఖర్చుతో తమ ఏర్పాట్లను తాము చేసుకుంటున్నాయి, ఆ మొత్తాలను కూడా నాటో ఖర్చులో భాగంగానే చూపుతున్నాయి. నాటో సమావేశాలకు ముందు ట్రంప్‌ చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలను గమనించటం అవసరం. నాటోలోని అనేక దేశాలు తమను రక్షించాలని కోరుకుంటాయి, అవి అంగీకరించిన మేరకు జిడిపిలో రెండుశాతం ఖర్చుచేయకపోవటమే కాదు, ఏండ్ల తరబడి వుపేక్షిస్తున్నాయి, అవి పాతబకాయిలను కూడా చెల్లిస్తాయా?అని ట్వీట్‌ చేశాడు. బ్రసెల్స్‌ బయలు దేరే ముందు ‘ఐరోపాలో మా రైతులు, కార్మికులు, కంపెనీలు వ్యాపారం చేయటాన్ని ఐరోపా యూనియన్‌ అసాధ్యం గావిస్తున్నది, మరోవైపు నాటో ద్వారా మేము సంతోషంగా వారిని రక్షించాలని కోరుకుంటారు, దానికి నాజూకు చెల్లింపులు చేస్తారు, ఇలా ఎలా పని జరుగుతుంది.’ అన్న ట్రంప్‌ వచ్చీ రావటంతోనే జర్మనీపై విరుచుకు పడ్డారు. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది అన్న ట్రంప్‌తో తాను ఏకీభవించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ పేర్కొన్నారు. తమను మాస్కో గానీ వాషింగ్టన్‌గానీ అదుపు చేయటం లేదని జర్మన్‌ అధికారులు తిప్పికొట్టారు.

తాను ఎక్కడ వున్నా అమెరికన్ల గురించే ఆలోచిస్తూ వుంటానని చెప్పేందుకు ట్రంప్‌ ప్రయత్నించాడు.’నేను ఇప్పుడు బ్రసెల్స్‌లో వున్నప్పటికీ మన రైతుల గురించే ఎల్లవేళలా ఆలోచిస్తున్నాను. 2012 నుంచి నా ఎన్నిక నాటికి సోయాబీన్స్‌ ధర సగం పడిపోయింది, గత పదిహేను సంవత్సరాలుగా రైతులకు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇతర దేశాల వాణిజ్య ఆటంకాలు మరియు పన్నులతో వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను గతం కంటే మెరుగ్గా ఈ సమస్యలను లేవనెత్తుతాను, అయితే అది అంతత్వరగా ముందుకు పోదు. మన రైతులందరికీ సమాన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను, మనం విజయం సాధిస్తాము ‘ ఇలా సాగింది.

నాటో కొనసాగాల్సిన అవసరం గురించి సంస్ధ ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలటెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ‘ బలమైన నాటో ఐరోపా, అమెరికాకు మంచిది. విడిపోవటం కంటే కలసి వుంటే ధృడంగా వుంటామని రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధం మాకు నేర్పాయి.ఐరోపాలో అమెరికా మిలిటరీ,కెనడా వునికి ఐరోపాకు మాత్రమే కాదు వుత్తర అమెరికా మరియు ప్రత్యేకించి అమెరికా(యుఎస్‌)కు మంచిది, ఎందుకంటే అమెరికా ఒక ప్రపంచ శక్తిగా ఎదగటానికి అది తోడ్పడుతుంది. బాల్టిక్‌ సముద్ర గ్యాస్‌ పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది నాటో సభ్యదేశాలు కాదు, అది ఒక జాతీయ నిర్ణయం.’

నాటో తొలిరోజు సమావేశ ప్రారంభానికి ముందు వుదయపు అల్పాహార విందు సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి. నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌బర్గ్‌తో నాటో ఖర్చులో అత్యధిక భాగం తమ దేశమే భరిస్తోందని వ్యాఖ్యానించాడు. జర్మనీ ఒకశాతం కంటే కొద్దిగా ఎక్కుగా చెల్లిస్తోంది. అదే అమెరికా జిడిపిలో 4.2శాతం చెల్లిస్తోంది. ఇది సరైంది కాదు, మేము జర్మనీని రక్షిస్తున్నాము, మేము ఫ్రాన్స్‌ను రక్షిస్తున్నాము, మేము ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాము. దానికి ఇంకా మేము ఎంతో చెల్లిస్తున్నాము. విందు అనంతరం ట్రంప్‌ వైఖరిని స్టోల్టెన్‌ బర్గ్‌ అపహాస్యం చేశాడు. వుదయపు అల్పాహార విందు బాగుంది…. దీనికి అమెరికాయే బిల్లు చెల్లించింది అని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌ అధ్యక్షుడు అయిన తరువాత ఐరోపాలో మిలిటరీ వునికి నిమిత్తం 40శాతం నిధులు పెంచాడు. అమెరికా సైన్యాలు ఎక్కువగా వున్నాయి, గతం కంటే విన్యాసాలు, మౌలిక సదుపాయాల నిమిత్తం పెట్టుబడులు కూడా పెరిగాయి’ అన్నాడు.

Image result for nato brussels summit 2018

గతంలో అంగీకరించిన మేరకు నాటో నిర్వహణకు పూర్తిగా నిధులు చెల్లిస్తున్నది అమెరికా, బ్రిటన్‌, పోలాండ్‌, గ్రీస్‌, ఎస్తోనియా మాత్రమే. తాను హాజరైన తొలి సమావేశనాటి కంటే సభ్య దేశాలు చెల్లిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గిపోయిందంటూ ట్రంప్‌ అవాస్తవం చెప్పారంటూ పొలిటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొన్నది. 2014లో ఐరోపా దేశాలు, కెనడా చెల్లించిన మొత్తం 254బిలియన్‌ డాలర్లు 2017 నాటికి 275కు పెరిగినట్లు పేర్కొన్నది. నాటో ఖర్చులో 70 నుంచి 90శాతం వరకు అమెరికా చెల్లిస్తున్నదని చెప్పటం అవాస్తవమని తెలిపింది. నాటోకు ఎంత ఖర్చు చేయాలనేది ఎక్కడా నిర్ధారించలేదు. సంస్ధ వుమ్మడి నిధిలో అమెరికా 22శాతం చెల్లిస్తున్నది. సభ్యదేశాల రక్షణ బడ్జెట్‌ ఎంతో నాటో సేకరిస్తుంది, వాటి మొత్తాలను కలిపి చూసుకున్నపుడు అమెరికా రక్షణ కోసం 70శాతం ఖర్చు చేస్తున్నది. అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తి గనుక అంతవుంది, ఐరోపా సభ్యదేశాలు అలాంటివి కాదు. తమ రైతాంగానికి ఐరోపా యూనియన్‌ తలుపులను మూసింది అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా కంటే ఐరోపా యూనియన్‌ సగటున చూసినపుడు కొద్దిగా ఎక్కువ పన్నులు విధిస్తున్నది. 30శాతం వ్యవసాయ వుత్పత్తులపై ఇరువైపులా పన్నులు లేకుండా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ఫలితంగా 28 సభ్యరాజ్యాలు, ఐరోపా యూనియన్‌ 2017లో అమెరికాకు వ్య వసాయ వుత్పత్తులలో ఐదవ పెద్ద ఎగుమతిదారుగా మారింది. అమెరికా తాను ఎగుమతి చేసుకున్నవాటి కంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంది.

గతంలో రెండుశాతం వరకు ఖర్చు చేయాలని అనుకున్నారు, ఇప్పుడు దాన్ని విధిగా చేయాలని ట్రంప్‌ అన్నాడు. రక్షణ నిమిత్తం జిడిపిలో రెండుశాతం ఖర్చు చేయాలని 2006లో అంగీకరించిన మాట వాస్తవం. అయితే అంత మొత్తాన్ని విధిగా ఖర్చు చేయాలనే అంగీకారమేదీ లేదు. ఈ వారంలో ఆ మేరకు నిర్ణయం జరిగిందేమో తెలియదు. రెండుశాతం మొత్తం కేటాయింపులను 2024 నాటికి క్రమంగా పెంచుకుంటూ పోవాలని 2014లో మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు. ఆ మేరకు వ్యవహరించినవి ఐదు దేశాలు మాత్రమే. బ్రసెల్స్‌ సమావేశాల తరువాత ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన జరిపారు. సోమవారం నాడు హెల్సింకీలో ట్రంప్‌-పుతిన్‌ భేఠీ జరగనుంది. ఆ తరువాత నాటో, ట్రంప్‌ పర్యటన వివరాల సమాచారం వెల్లడయ్యే అవకాశం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాణిజ్య యుద్ధంతో ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు

10 Tuesday Jul 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

INDIA, Indonesia, TRADE WAR, Trade war India, Trade war puts Indonesia and India at risk

Image result for trade war

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ పౌరుల ఆకాంక్షలకు విరుద్దంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రలో అతిపెద్ద ప్రపంచ వాణిజ్య యుద్ధం ప్రారంభసూచికగా జూలై ఆరవతేదీ అర్ధరాత్రి చైనా మీద తొలి తూటా పేల్చాడు. గతంలో కూడా వాణిజ్య యుద్ధాలు జరిగినప్పటికీ తాజా పరిణామం పర్యవసానాలు తీవ్రంగా వుంటాయనే అభిప్రాయాలు, భయాలు వెలువడుతున్నాయి. చైనా, ఇతర దేశాల మీద ప్రారంభించిన యుద్ధంతోతాము ఎంతో కొంత లాభపడవచ్చనే ఆశ అమెరికన్‌ కార్పొరేట్లలో అంతర్గతంగా వుంది. అయితే అదే సమయంలో జరిగే నష్టాల గురించి కూడా అంతే భయపడుతున్నా. లాభాల గురించి బహిరంగంగా చెప్పుకోలేరు, ఇదే సమయంలో ప్రతికూలతల గురించి మీడియాలో ఎన్నో హెచ్చరికలు వెలువడుతున్నాయి. అమెరికా దిగుమతులపై విధించిన పన్నుద్వారా వసూలయ్యే మొత్తాన్ని అమెరికా ఆంక్షలతో ప్రభావితమయ్యే చైనా కంపెనీలు, కార్మికుల కోసం వినియోగిస్తామని చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. అమెరికా-చైనా రెండూ కూడా దీర్ఘకాల వాణిజ్య యుద్ధానికి సిద్దపడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా వుత్పత్తులపై అదనపు పన్ను వసూలు ప్రారంభించిన చైనా మరోవైపు గతంలో నిలిపివేసిన తమ కోడి మాంస దిగుతులకు అనుమతించినట్లు జర్మనీ మంత్రి ప్రకటించారు.

వాణిజ్య యుద్ధాలను, వాటిలో భాగంగా దిగుమతి పన్నులను విధించేందుకు అధ్యక్షుడికి వున్న అధికారాలను పరిమితం చేయాలని నేషనల్‌ టాక్స్‌ పేయర్స్‌ ఫౌండేషన్‌ విశ్లేషకుడు ఆండ్రూ విల్‌ఫోర్డ్‌ ‘యుఎస్‌ఏ టుడే’లో పేర్కొన్నాడు. దాని సారాంశం ఇలా వుంది. 1962లో చేసిన వ్యాపార విస్తరణ చట్టంలోని అవకాశాలను ట్రంప్‌ వినియోగిస్తున్నాడు. నిర్దిష్ట జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వాటికోసం చేసిన చట్టాలను దుర్వినియోగపరుస్తూ దేశ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందున, పార్లమెంట్‌ జోక్యం చేసుకొని అధ్య క్షుడిని నిలువరించాలి. అల్యూమినియం, వుక్కు దిగుమతుల ద్వారా దేశభద్రతకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే 2010-15 మధ్య దేశీయంగా వుత్పత్తి అయిన వుక్కులో కేవలం సగటున మూడుశాతం లోపే జాతీయ భద్రతకు వినియోగిస్తున్నట్లు తేలింది, అవసరానికి మించి దేశంలో వుత్పత్తి వుంది, అదే విధంగా దిగుమతి చేసుకున్న వుక్కులో జాతీయ భద్రతకు వినియోగిస్తున్నది సగటున 2.4నుంచి 2.8శాతం మధ్యనే వుంది, ఆ దిగుమతులలో కూడా అత్యధిక భాగం భాగస్వామ్య లేదా మిత్ర దేశాల నుంచే వున్నాయి. వుక్కు పరిశ్రమలో వుపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఐదు పెద్ద కంపెనీలు మార్కెట్‌ కాపిటలైజేషన్‌ను రెట్టింపు చేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వుత్పాదకత గణనీయంగా పెరిగింది.అల్యూమినియం, వుక్కు దిగుమతులపై పన్నుల విధింపు కారణంగా నిఖరంగా 4.7లక్షల వుద్యోగాలు పోతాయి. ఇవి అమెరికా వుక్కు పరిశ్రమలో పని చేస్తున్న లక్షా 40వేల మందికి మూడు రెట్లు. బలమైన ఆర్ధిక వ్యవస్ధ లేకుండా బలమైన జాతీయ భద్రత సాధ్యం కాదని వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ స్వయంగా చెప్పాడు. పన్నుల విధింపు తగదని వంద మంది రిపబ్లికన్‌ ఎంపీలు లేఖ రాశారు. ట్రంప్‌ వినియోగిస్తున్న చట్టంలోని నిబంధనను 1979,82 సంవత్సరాలలో ఇరాన్‌, లిబియా చమురు దిగుమతుల నిరోధానికి వినియోగించారు.

రక్షణాత్మక చర్యలను చేపట్టబోయే ముందు వస్తువుల నిజమైన జాతీయత ఏమిటో తెలుసుకోవాలని లాసానే విశ్వవిద్యాలయ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ స్టెఫానే గారెలీ హితవు చెప్పాడు. ఆయన వాదన ఇలా వుంది. ప్రపంచీకరణ యుగంలో వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం అంత సులభం కాదు. కొద్ది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా, లాస్‌ ఏంజల్స్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఒక ఐపాడ్‌లోని 431భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు.ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చిన ఆ భాగాలను చైనాలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఐపాడ్‌గా రూపొందిస్తారు. అంతిమ వుత్పత్తిపై చైనా జోడించే విలువ ఐదుశాతం మించటం లేదు. అయితే అమెరికా కస్టమ్స్‌ శాఖ వద్దకు వచ్చే సరికి అది చైనా తయారీ వుత్పత్తిగా పరిగణించబడుతోంది. అది నిజంగా చైనా వుత్పత్తా ? అమెరికా వాణిజ్యలోటు అది చేసుకొనే దిగుమతుల కారణంగా ఏర్పడుతోంది. మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే వాటిలో 40శాతం మెక్సికోలోని అమెరికన్‌ కంపెనీలు లేదా అమెరికాకు మాత్రమే ఎగుమతి చేసే మెక్సికో స్ధానిక కంపెనీల నుంచి వుంటున్నాయి. చైనా నుంచి చేసుకొనే దిగుమతులు కూడా అలాంటివే. వాణిజ్య వ్యూహాలలో భాగంగా స్మార్ట్‌ ఫోన్ల తయారీకి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వుచితంగా సాప్ట్‌వేర్‌ను అందచేస్తున్నది. దానికి గనుక ధర నిర్ణయిస్తే ఏడాదికి రెండువందల బిలియన్‌ డాలర్లు వుంటుంది. ఆ మొత్తం అమెరికా వాణిజ్యలోటులో సగం.

వాణిజ్యం యుద్ధం విస్తరిస్తే అమెరికా అధ్య క్షుడు జర్మన్‌ ఆటో పరిశ్రమకు కూడా ముప్పు తెస్తున్నట్లే. బిఎండబ్ల్యు సౌత్‌ కరోలినా లోని స్పార్టన్‌బర్గ్‌, అలబామాలోని వాన్స్‌లో మెర్సిడెస్‌, టెనెసీలోని ఛాటూంగాలో ఓక్స్‌వాగన్‌ కార్లు తయారవుతాయి. ఇవి ఎగుమతుల కోసం కూడా తయారు చేస్తాయి. గతేడాది బిఎండబ్ల్యు తయారు చేసిన వాటిలో 70శాతం ఎగుమతి చేశారు. వీటిని అమెరికన్‌ కార్లు అనాలా జర్మనీవి అనాలా ? వాణిజ్య యుద్ధానికి ముందు అమెరికా తయారీ కార్లపై చైనా దిగుమతి పన్ను తగ్గించిన కారణంగా ఫోర్డ్‌, టెల్సా వంటి కంపెనీలు కొద్దివారాల ముందు చైనాలో పదిహేనుశాతం వరకు కార్లధరలను తగ్గించాయి. అమెరికా ప్రారంభించిన యుద్ధంతో చైనా విధించిన ప్రతికూల సుంకాల కారణంగా ఇప్పుడు 40శాతం పన్నుతో ధరలు పెరిగాయి. ఈ పన్నులను వినియోగదారుల నుంచి వసూలు చేయటం తప్ప తాము భరించలేమని బిఎండబ్ల్యు చైనా ప్రకటించింది.1974 నుంచి అమలులోకి వచ్చిన కొయొటో ఒప్పందం ప్రకారం ఒక వస్తువు తయారీలో కనీసంగా స్ధానిక అంశం ఎంత వుంది లేదా చివరి తయారీ క్రమం పాత్ర ఎంత అనేది నిర్ధారించవచ్చు. అయితే ప్రపంచీకరణ మరియు డిజిటలైజేషన్‌ సంక్లిష్టతను పెంచాయి. వివిధ విడిభాగాలతో తయారైన ఒక వస్తువులు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఆయాప్రాంతాల సామర్ధ్యం, ధరలను బట్టి మారిపోతుంటాయి.

ప్రపంచీకరణ కారణంగా ఒక ఆర్ధిక వ్యవస్ధను వేరు చేసి చూడటం కష్టం అనే విషయాన్ని బ్రెక్సిట్‌ మద్దతుదారుల మాదిరి అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. ఇతర దేశాలలో అమెరికా ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది, అలాగే ఇతర దేశాలు అమెరికాలో ఏడులక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. మొత్తం మీద ప్రపంచ జిడిపిలో ప్రత్యక్ష పెట్టుబడులు 35శాతం వరకు వుంటాయి. ఎనిమిది కోట్ల మందికి వుపాధి కల్పిస్తున్నాయి. ప్రయివేటు జీవితంలో వివాహం చేసుకోవటం కంటే విడిపోవటం ఎంతో సంక్లిష్టం, ఖరీదైనది. అంతర్జాతీయ వాణిజ్యం మీద చూపే ప్రభావాన్ని స్పష్టంగా చూడాలంటే కస్టమ్స్‌ లెక్కల నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేదానికంటే ఒక వస్తువు వుత్పత్తిలో విలువ జోడింపు మీద కేంద్రీకరించాలి. బ్లాక్‌ చెయిన్‌ ద్వారా నమోదయ్యే లావాదేవీల ద్వారా వికేంద్రీకరణ చెందిన మరియు నిరాకార ప్రపంచంలో ఎవరు దేనికి యజమానులో ఎలా చెప్పగలం? జాన్‌మైేునార్డ్‌ కీన్స్‌ చెప్పినట్లు సమస్యలన్నీ ఆర్ధిక పరమైనవి అయితే పరిష్కారాలన్నీ రాజకీయ పరమైనవి అయినందున ట్రంప్‌తో మనం జీవించాల్సి వుంది.

వాణిజ్య యుద్ధం జరిగితే నష్టపోయేది అమెరికా అని గతంలో బిల్‌క్లింటన్‌ హయాంలో సహాయ విత్తమంత్రిగా చేసిన ప్రొఫెసర్‌ జె బ్రాడ్‌ఫోర్డ్‌ డెలాంగ్‌ స్పష్టం చేశారు. మోటార్‌ సైకిళ్ల తయారీలో పేరెన్నికగన్న హార్లే డేవిడ్స్‌న్‌పై ఇటీవల డోనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడటం అమెరికా ప్రజాస్వామ్యం మీదే దాడి వంటిదని, నవంబరులో జరిగే ఎన్నికలలో వుభయ సభలలో ఒకదానిలో అయినా మెజారిటీ సంపాదించగలిగితే తప్ప ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టకు చేసిన నష్టాన్ని సరిచేయలేమని అన్నారు. బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో హార్లే డేవిడ్స్‌న్‌ అధికారులు, యూనియన్‌ నేతలతో ట్రంప్‌ ఒక సమావేశం జరిపారు. ఈ కంపెనీ అమెరికాలో వస్తువులను తయారు చేస్తున్నది, నేను చూస్తుండగానే దాన్ని విస్తరించాలని చెప్పాడు. ఏడాది తిరగ్గానే పరిస్ధితులు మారిపోయాయి. దిగుమతి చేసుకున్న అల్యూమినియం, వుక్కుపై పన్నులు విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన కారణంగా ఐరోపా యూనియన్‌ ప్రతికూల చర్యలకు గురికాని ప్రాంతాలకు కొన్ని కార్యకలాపాలను తరలిస్తామని మోటార్‌ సైకిల్‌ కంపెనీ ప్రకటించింది. దాన్ని చూడగానే ట్రంప్‌ ఆ కంపెనీ మీద దాడి చేశాడు. ఒకసారి బయటకు పోయిన తరువాత తిరిగి అమెరికాలో పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా అమ్ముతామంటే కుదరదు అని హెచ్చరించాడు. వారు మరొక దేశంలో ఫ్యాక్టరీ నిర్మించటానికి వీల్లేదంటే వీల్లేదు, వారు ఇక్కడి నుంచి తరలటం అంటే అంతానికి ఆరంభం అని ట్వీట్లలో వాగాడు.

వాణిజ్య యుద్ధం తధ్యమనే అభిప్రాయంతో చైనాలోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలించేందుకు ఆలోచన చేశాయి, ఇంకా చేస్తున్నాయి. అక్కడ పెరుగుతున్న వేతనాలతో అనేక కంపెనీలు ఎప్పటి నుంచో తక్కువ వేతనాలకు శ్రమ దొరికే చోటికి తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్యంలో చైనాకు ఎంతో మిగులున్న కారణంగా చైనాను లంగదీసుకోవచ్చనే అభిప్రాయం కొంత మందిలో లేకపోలేదు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐదువందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల మీద పన్ను విధిస్తానంటున్నాడు ట్రంప్‌, దానికి పోటీగా చైనా ఎంతపన్ను విధించినా 130 బిలియన్‌ డాలర్ల మేరకే దాని దిగుమతులున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు మంచివి, విజయం సాధించటం సులభం అని ట్రంప్‌ చెప్పారు, వాస్తవం ఏమంటే వాటిలో పాల్గనేవారే కాదు వాణిజ్య యుద్ధాలు ప్రతి ఒక్కరినీ నష్టపరుస్తాయి, ఎవరూ గెలవజాలరని ఆస్ట్రేలియా సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రికలో ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒక వేళ విజయం సాధించినా అది పరిమితం. ట్రంప్‌ తన కలలను నిజం చేసుకోవాలంటే చైనా లేదా ఐరోపా యూనియన్‌ అందచేసే వస్తువులను స్ధానికంగా తయారుచేసేందుకు మరిన్ని ఫ్యాక్టరీలను పెట్టాలి, వాటిద్వారా మరిన్ని వుద్యోగాలను కల్పించవచ్చు. అయితే అలా తయారు చేసే వస్తువులు ఎంతో ప్రియమైనవిగా పరిమితంగా వుంటాయి.

వాణిజ్యయుద్ధ తుపాకి గుండు పేల్చాలన్న నిర్ణయం దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఒక్క చైనాకే పరిమితం చేయలేదు, కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద కూడా పన్నులు విధించాడు. అదే జరిగితే అమెరికా దిగుమతి చేసుకొనే 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై కూడా ఐరోపా యూనియన్‌ పన్నులు విధిస్తుంది. ప్రభావాలు, అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి. ఐరోపా యూనియన్‌, ఇతర అమెరికా మిత్రదేశాలకు చైనాతో స్వంత సమస్యలు వున్నాయి. ట్రంప్‌ గనుక వాణిజ్యదాడిని ఒక్క చైనాకే పరిమితం చేసి వుంటే వారంతా కలసి వచ్చేవారు. దానికి బదులుగా ఐరోపా యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, కెనడా, మెక్సికోలపై చర్యల ద్వారా అమెరికాను ఒంటరిపాటు చేశాడని ఆస్ట్రేలియా పత్రిక పేర్కొన్నది.

తొలి దఫా పన్నుల అర్ధం వాణిజ్య యుద్ధ పూర్తి స్ధాయి ప్రభావం ఎలా వుంటుందో అనుభవించటానికి అమెరికన్‌ వినియోగదారులు ఒక అడుగు దగ్గర కావటమే అని నేషనల్‌ రిటైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాథ్యూ సాహే అన్నారు. విధించే పన్నులు అమెరికా వుద్యోగాలనేమాత్రం కాపాడలేవు, కానీ అవి పన్నుల సంస్కరణద్వారా పొందిన లబ్దిని దెబ్బతీస్తాయి, అనేక వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి, తమ గదులకు అవసరమైన చిన్న ఫ్రిజ్‌లకు విద్యార్ధులు అధిక మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది, ఏకపక్షంగా పన్నులు విధించటం తప్పుడు పద్దతి, దానిని వెంటనే నిలిపివేయాలి అని కూడా సాహే చెప్పారు.

ఇరవై లక్షల కోట్ల పెద్ద అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే వాణిజ్య యుద్ధం, దానిలో 34బిలియన్‌ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించటం సముద్రంలో కాకిరెట్ట వంటిదని, దీని వలన కొంత మంది నష్టపోతారు, కొందరు లాభపడతారు అని ఓక్స్‌ డాట్‌కామ్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. చట్టపరంగా చెప్పాలంటే 34బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై 25శాతం పన్ను విధింపు అక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్న చైనాను శిక్షించటమే. ట్రంప్‌ వాక్పటిమలో 300బిలియన్‌ డాలర్లపై పన్ను విధిస్తామని చెప్పాడు. ఇరవైలక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ కలిగిన అమెరికాకు గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న 478బిలియన్‌ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ. మరో విధంగా చెప్పాలంటే 2017లో ఏడాదికి 150 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న పార్లమెంట్‌ తీర్మానంతో పోలిస్తే 25శాతం పన్ను విధింపుద్వారా ఏడాదికి వచ్చే 8.5బిలియన్‌ డాలర్లు ఏపాటి? వాషింగ్‌మెషిన్ల పరిశ్రమకు పన్నుల మొత్తం పెద్దగా వుండవచ్చుగాని ఒక మిషన్‌ కొనే పౌరుడికి పెద్ద భారం అనిపించదు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సమాచారం ప్రకారం 1977 తరువాత తొలిసారిగా జనవరిలో పన్నులు పెంచిన కారణంగా మార్చినెల నుంచి వాషింగ్‌ మెషిన్ల ధరలు 16శాతం పెరిగాయి. పౌరులు వాటిని రోజూ కొనరు కదా ! అయినప్పటికీ 2015లో వున్న ధరలకంటే ఇప్పుడు చౌకగానే వున్నాయి. అనేక పరికరాల ధరలు గత కొద్ది సంవత్సరాలుగా పడిపోతున్నాయి, ట్రంప్‌ వాటిని కొద్దిగా పెంచారు. దాని కధనం ఇలా సాగింది.

Image result for trade war

వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో ధరలు పెరిగి, అభివృద్ధి దిగజారుతుందని ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో పేర్కొన్నది.తొలుత 34 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై విధించిన 25శాతం పన్నుతో అటు చైనా, ఇటు అమెరికాపై ఆర్ధికంగా పెద్దగా ప్రభావం చూపదు. నష్టం తరువాత పెరుగుతుంది. గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 506బిలియన్‌ డాలర్లు కాగా అవసరమైతే తాను 550 బిలియన్‌ డాలర్ల వస్తువులపై పన్ను విధిస్తానని ట్రంప్‌ పేర్కొన్నాడు. పన్నులను విస్తరించే కొద్దీ వినియోగదారులకు ధరలు పెరుగుతాయి, దిగుమతి చేసుకొనే విడిభాగాలపై ఆధారపడిన కంపెనీల ఖర్చు పెరుగుతుంది.ద్రవ్యమార్కెట్‌లు దడదడలాడతాయి.కొంత మందిని లేఆఫ్‌ చేయవచ్చు, చైనాతో ట్రంపేమైనా రాజీకి వస్తారా అని వాణిజ్యపెట్టుబడులపై నిర్ణయం తీసుకొనేందుకు వేచి చూస్తారు. గతేడాది పన్నుల తగ్గింపు ద్వారా కల్పించిన అనేక ఆర్ధిక లబ్దులు ప్రమాదంలో పడతాయి. పూర్తి స్ధాయి వాణిజ్య యుద్దం జరిగితే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇతరులు హెచ్చరించినట్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయే ప్రమాదముంది. అమెరికా సోయాలో 60శాతం దిగుమతి చేసుకుంటున్న చైనా హెచ్చరిక కారణంగా గత నెలలో 17శాతం మేరకు ధరలు పడిపోయాయి. ఇదే సమయంలో చైనా కరెన్సీ విలువ డాలరు మారకంతో గతనెలలో 3.5శాతం పడిపోయింది. ఇది అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి చైనా కంపెనీలకు వూతమిస్తుంది. అమెరికా వినియోగదారుల మీద ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం చైనా పారిశ్రామిక వస్తువుల మీదనే తొలుత కేంద్రీకరించింది. అయితే ఆ చర్య ద్వారా కంపెనీల యంత్రాల ధరలు పెరిగితే ఆ భారాన్ని అవి చివరికి తమఖాతాదారులు, వినియోగదారులమీదనే మోపుతాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది.

అమెరికా-చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు కలిగించవచ్చని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్ధికవేత్త పాల్‌ గ్రుయెన్‌వాల్‌ హెచ్చరించాడు. వర్ధమాన దేశాల మార్కెట్లనుంచి మంచి వడ్డీ రేట్లు వస్తున్న అమెరికాకు మదుపుదార్లు తమ పెట్టుబడులను తరలిస్తున్నారని, మిగతా ఆసియా దేశాలతో పోల్చితే ఇండోనేషియా, భారత్‌లకు ఎక్కువ ముప్పు వుందన్నాడు.పతనమౌతున్న ఇండోనేషియా కరెన్సీ రుపయా విలువ నిలబెట్టేందుకు, స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడుల వుపసంహరణను నివారించేందుకు మే, జూన్‌ నెలల్లో వడ్డీ రేట్లను పెంచింది. పెట్టుబడులరాక మందగించటం, వున్న పెట్టుబడులు బయటకు పోతుండటంతో భారత్‌ కూడా నాలుగేండ్లలో తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. క్రమంగా పెరుగుతున్న వేతనాలు ఆర్ధిక వ్యవస్ధపై విశ్వాసాన్ని కలిగిస్తూ చైనా ఆర్ధిక పురోగతిని కొనసాగిస్తున్నాయి, అది బ్యాంకింగ్‌ వ్యవస్ధలో డబ్బును మదుపు చేయటానికి జనాన్ని ప్రోత్సహిస్తున్నది, ఆ సొమ్మును కంపెనీలకు రుణాలుగా ఇస్తున్నారని, ఈ వలయం తిరుగుతున్నంత వరకు బయటకు పోయే అవకాశం లేదు, తరువాత ఆ విధానం కొనసాగుతుంది, ఒక వేళ విశ్వాసం కోల్పోయినట్లయితే కరెన్సీ మారకపు విలువమీద, విదేశీమారపు నిల్వల మీద వత్తిడి పెరుగుతుందని గ్రుయెన్‌వాల్‌ పేర్కొన్నాడు.

వాణిజ్య యుద్ధం ప్రారంభమై ఇంకా వారం కూడా గడవ లేదు. దాని ప్రభావం గురించి ప్రారంభానికి ముందూ వెనుకూ ఎలా వున్నాయో చూశాము. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు, ప్రభావాలు వెల్లడవుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విదేశీ అప్పు- నరేంద్రమోడీ భక్తుల తిప్పలు !

08 Sunday Jul 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India’s External Debt, RBI, Rupee Fall, value of the rupee

Image result for india’s external debt, modi 2018

ఎం కోటేశ్వరరావు

లేని ప్రతిష్టకోసం అనేక మంది రాజులు, రంగప్పలు భట్రాజులు, కిరాయి కవులను పోషించినట్లు విన్నాం. ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం నరేంద్రమోడీ గురించి అలాంటి కిరాయిబాపతు రేయింబవళ్లు పని చేస్తున్నది. వారు సృష్టించిన అవాస్తవాలు, వక్రీకరణలను అనేక మంది అమాయకులు నిజమని నమ్మటమే కాదు, వారు కూడా జీతం భత్యం లేని ప్రచారకర్తలుగా పని చేస్తున్నారు. అలాంటి వాటిలో గత నాలుగు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో ఒక్క రూపాయి కూడా విదేశీ అప్పులు చేయలేదు అనే హిమాలయపర్వత మంత అబద్దాన్ని ప్రచారం ఒకటి.. నిజం నిదానంగా ఒక అడుగు వేసేసరికి అబద్దం వంద అడుగుల ముందు వుంటుంది. ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారంతా బాగా చదువుకున్న ప్రబుద్ధులు కావటమే విచారకరం, ఆందోళన కలిగించే అంశం.

ప్రతి మూడు మాసాలకు ఒకసారి మన అప్పుల గురించి రిజర్వుబ్యాంకు అధికారికంగా వివరాలను ప్రకటిస్తుంది. దానిలో అప్పుల తీరుతెన్నుల గురించి వుంటాయి. అయినా సరే రిజర్వుబ్యాంకు వివరాలను ఎంత మంది చూస్తారు, నిజం తెలిసే లోపల మనం చెప్పే అబద్దాలను జనం గుడ్డిగా నమ్ముతారు, ప్రయోజనం నెరవేరుతుందనే తెంపరితనంతో మోడీ పరివారం వ్యవహరిస్తోంది.

అసలు గత నాలుగేండ్లలో మా మోడీ సర్కార్‌ అప్పులే చేయలేదని చెబుతారు. అది అవాస్తవమని రుజువు చూపితే తేలు కుట్టిన దొంగల మాదిరి దాని గురించి మాట్లాడరు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సరికి అంటే 2014 మార్చి 30 నాటికి మన విదేశీ అప్పు 446.2 కోట్లు, అది 2018 మార్చి నాటికి ఖరారుగాని అంకెల ప్రకారం 529 బిలియన్‌ డాలర్లకు చేరింది. రిజర్వుబ్యాంకు వివరాలివి. దీనితో మోడీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతారా? ఒకవేళ అదే ప్రాతిపదిక అయితే గత పాలకులకు కూడా సంబంధం వుండదు. అలాంటపుడు మోడీ అప్పు చేయలేదని ఎలా చెబుతారు. ఈ వివరాల సంగతేమిటి అని అడిగితే, గత ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో చేశాయి, మోడీ చేసింది తక్కువ అని కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లుగా వాదనలు చేసే వారి గురించి చెప్పాల్సిందేముంది?

గతంలో అప్పు చెయ్యలేదని ఎవరు చెప్పారు. అవసరమైతే తీసుకోవచ్చు. అది అవమాన షరతులు లేదా మన ఇల్లు గుల్ల అయ్యేట్లుగా వుండకూడదు. అప్పుల కోసం ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ షరతులను అమలు జరిపారనే కదా వామపక్షాలు విమర్శలు చేశాయి. దివాలాకోరు, ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరిపిన కారణంగానే మన ఆర్ధిక వ్యవస్ధలో ఇన్నేండ్లలో ధనికులు మరింత ధనికులయ్యారు, సంపద అంతా కొద్ది మంది చేతిలో పోగుపడుతోంది. ఫలితంగా మెజారిటీ జనంలో కొనుగోలు శక్తి లేక మన అభివృద్దికి పరిమితులు ఏర్పడ్డాయి. ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను బార్లా తెరవటంతో విదేశీ సరకులతో మన దుకాణాలు నిండుతున్నాయి. లాభాల పేరుతో సంపద విదేశాలకు తరలిపోతోంది. ఆ విధానాలను బిజెపి పూర్తిగా సమర్ధించింది, వ్యతిరేకించిన చరిత్ర దానికి లేదు. ఆ విధానం నుంచి మోడీ సర్కార్‌ వైదొలగదలచుకుంటే ఎవరు అడ్డు పడ్డారు. 2016లో 484బిలియన్‌ డాలర్ల అప్పును మోడీ 2017నాటికి 471కి అంటే 13 బిలియన్‌ డాలర్లు తగ్గించిన ఘనుడని మోడీ భక్తులు బాజా వాయిస్తున్నారు. దీన్నే అతి తెలివి అంటారు. ప్రవాస భారతీయులు చేసే డిపాజిట్లు కూడా మన విదేశీ రుణాల్లో కలసి వుంటాయి. పైన పేర్కొన్న 13 బిలియన్‌ డాలర్ల అప్పు తగ్గటానికి ఆ ఏడాది ప్రవాసభారతీయుల డిపాజిట్లలో పది బిలియన్‌ డాలర్లు తగ్గాయి. అది కూడా మోడీగారి గొప్పతనమే అంటారా? విదేశాల్లో వుపాధి లేదా డబ్బు సంపాదన ధ్యేయంగా వున్నవారు మాత్రమే ప్రవాస భారతీయులు. వారు సంపాదించిన ఒక డాలరు మరొక డాలరును ఎలా జత చేసుకుంటుంది అనేదే వారికి ప్రధాన లక్ష్యంగా వుంటుంది. అందువలన ఆయా పరిస్ధితులను బట్టి ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడ తమ సొమ్మును డిపాజిట్లుగా పెడతారు. ఇక్కడ దేశభక్తి మరొకటో సమస్యగా రాదు. ఇలాంటి కారణాలతో విదేశీ రుణాలలో ఒక ఖాతాలో తగ్గవచ్చు, ఒకదానిలో పెరగవచ్చు. మొత్తంగా అప్పు పెరుగుతోందా తగ్గుతోందా అన్నదే గీటురాయి. 2018 మార్చి నాటికి చూపిన అంచనాల్లో వాణిజ్య రుణాలు, స్వల్పకాలిక రుణాలలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అందువల్లనే 471 నుంచి 529 బిలియన్‌ డాలర్లుగా ఆర్‌బిఐ పేర్కొన్నది. అసలు నాలుగేండ్లలో అప్పులే చేయలేదు అని ప్రచారం చేసే వారు లేదా దానిని నమ్ముతున్న వారు ఆర్‌బిఐ ఖరారు చేసిన అంకెల ప్రకారం మోడీ పాలన తొలి ఏడాదే అప్పు 446.2 బిలియన్‌ డాలర్ల నుంచి 474.7 బిలియన్‌ డాలర్లకు ఎలా పెరిగిందో చెబుతారా ? రాజు కంటే మొండి వాడు బలవంతుడు అన్నట్లుగా అడ్డగోలు వాదనలు చేసే వారిని ఎవరేమీ చేయలేరు.

Image result for india’s external debt, modi

రిజర్వుబ్యాంకు అంకెల ప్రకారం 2006-14(మార్చి31) మధ్యకాలంలో మన విదేశీ అప్పు సగటున జడిపిలో 17.5 శాతం వుంది. అదే మోడీ నాలుగేండ్లపాలనలో 21.95 శాతం వుంది. ఇదే సమయంలో విదేశీ అప్పులపై మనం చెల్లించిన వడ్డీ యుపిఏ ఎనిమిదేండ్ల సగటు 5.23 శాతం కాగా మోడీ పాలనలో అది 8.05 వుంది, మొత్తం రుణాలలో రాయితీలతో కూడినవాటి శాతం తొమ్మిదేండ్ల యుపిఏ కాలంలో 17.36 శాతం కాగా మోడీ ఏలుబడిలో 9.07 శాతానికి పడిపోయాయి. ఇన్ని చేదు నిజాలను రిజర్వుబ్యాంకు మనకు అందిస్తుంటే గతంలో చేసిన అప్పులతో పోలిస్తే మోడీ కాలంలో పెరుగుదల శాతం తక్కువగా వుంది కనుక ఈ మంచిని విమర్శకులు చూడటం లేదనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది మొత్తంగా ఫలితం, పర్యవసానాలు ఏమిటి అన్నది. వాటిని చూసినపుడు మోడీని అభినందించాల్సిందేమీ కనిపించటం లేదు.

మన విదేశీ అప్పులలో ప్రభుత్వం చేసేవి, ఇతర వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల లేదా విదేశీయుల డిపాజిట్లన్నీ కలిసే వుంటాయి. రిజర్వుబ్యాంకు అందచేసిన వివరాల ప్రకారం ప్రభుత్వ అప్పుల తీరుతెన్నులు చూద్దాం. 2014-16 మధ్య మన ప్రభుత్వ అప్పు 83.7 నుంచి 93.4 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అది 2018 నాటికి 111.9 బిలియన్లకు చేరింది. అంటే నాలుగేండ్లలో మోడీ సర్కార్‌ చేసిన అప్పు 83.7 నుంచి 111.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తం పెరిగినా అది జిడిపితో పోలిస్తే శాతాల రూపంలో తగ్గింది. ఇది ఒక్క ప్రభుత్వ రుణాలకే కాదు, ప్రయివేటు రుణాలకూ వర్తిస్తుంది. మన విదేశీ అప్పు పెరుగుదల తగ్గుదలలో రూపాయి విలువ ప్రమేయం కూడా వుంటోంది. రూపాయి విలువ తగ్గితే కొత్త అప్పులు తీసుకోకపోయినా మన అప్పు కొండలా పెరిగిపోతుంది.

మన విదేశీ అప్పులో 2007లో ప్రవాస భారతీయుల డిపాజిట్లు, వాణిజ్య రుణాలు దాదాపు సమంగా వున్నాయి. ఆ ఏడాది మొత్తం అప్పు 172 బిలియన్‌ డాలర్లయితే 41 చొప్పున డిపాజిట్లు, వాణిజ్య రుణాలు వున్నాయి. 2018 నాటికి అవి 126-189 బిలియన్‌ డాలర్లుగా మారిపోయాయి. మన విదేశీ రుణాలలో అత్యధిక భాగం డాలర్‌లో ముడి పెట్టి వున్నాయి. రూపాయి విలువ పెరిగితే మనకు లాభం తగ్గితే అదనపు భారం అవుతుంది. యుపిఏ పాలన అయినా నరేంద్రమోడీ ఏలుబడి అయినా మన రూపాయి విలువ తగ్గటం తప్ప పెరగటం లేదు. ఫలితంగా మనకు తెలియకుండానే విదేశీ అప్పులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నాము. మన అప్పులో (2017 డిసెంబరునాటికి) 78.8శాతం ప్రభుత్వేతర ప్రయివేటు కంపెనీల రుణాలే వున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇంత వరకు మన రూపాయి విలువ ఏడుశాతం పతనమైంది. ఈ మేరకు ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్దలైనా డాలర్‌ చెల్లింపులకు అమేరకు అదనంగా రూపాయలు చెల్లించి డాలర్లను కొనుగోలు చేయాల్సిందే. చమురు ధరలు పెరుగుతున్న కారణంగా చెల్లింపులకు అదనపు డాలర్లు అవసరమయ్యాయి. దీంతో డాలర్లకు డిమాండ్‌ పెరిగంది. రూపాయి విలువ తగ్గింది. రూపాయి విలువ పతనం గాకుండా కాపాడాల్సిన బాధ్యత దాని నిర్వహణ చూస్తున్న కేంద్ర ప్రభుత్వానిది, దాని నేత నరేంద్రమోడీదే. ఆయన భక్తులు చెబుతున్నట్లు అప్పులు తక్కువగా చేసినందుకు మోడీ ఖాతాలో ఎన్ని అభినందనలు వేస్తే రూపాయి విలువ పతనం కారణంగా అదే మోడీ ఖాతాలో అక్షింతలు కూడా వేస్తే రెండూ సమానం అవుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచగానే మన దేశం నుంచి డాలర్ల ప్రవాహం అటు తిరిగింది. దాంతో మన రూపాయి పతనానికి అదొక కారణమైంది. ఇప్పటికే ఈ ఏడాది రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఈ ఏడాది ఆఖరికి మరో రెండుసార్లు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన రూపాయి మరింత పతనం అయ్యే ముప్పు వుంది. ఈ ముప్పును తప్పించేందుకు మన రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఒకసారి వడ్డీరేట్లను పెంచింది. ఇది మన దేశం నుంచి డాలర్లు తరలిపోకుండా చేసేందుకు తీసుకున్న చర్య. వడ్డీ రేట్లను ఇంకా తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్న వాణిజ్య, పారిశ్రామికవర్గాలకు ఇది ఎదురుదెబ్బ. మొత్తం జనం మీద అదనపు భారాలకు కారణం అవుతుంది. ఈ పరిస్ధితిని నివారించేందుకు మోడీ దగ్గర వున్న మంత్రదండాన్ని బయటకు తీయమని ఆయన భక్తులు డిమాండ్‌ చేయాలి తప్ప విమర్శకుల మీద ఎదురు దాడి చేస్తే ప్రయోజనం ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంక్షలతో భారత్‌కు వుచ్చు బిగిస్తున్న అమెరికా !

04 Wednesday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

direct and indirect sanctions, Donald trump, Donald trump trade war, NATO, TRADE WAR, us encircling india, US SANCTIONS, US-CHINA TRADE WAR

Image result for nikki haley,modi meet

ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే, ప్రధాని నరేంద్రమోడీ

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరు, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు ! చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పూరించిన వాణిజ్య సమర భేరి దాడులకు నాంది పలికే గడువు అది. సామరస్యపూర్వకంగా పరిష్కారం కానట్లయితే ఆ దినం నుంచి చైనా వస్తువులపై ప్రకటించిన పన్ను పెంపుదల అమలులోకి వస్తుంది. కొద్ది రోజుల క్రితం వరకు నిజంగా వాణిజ్య యుద్ధం జరుగుతుందా? సర్దుబాటు చేసుకుంటారా అన్న పద్దతిలో సాగిన విశ్లేషణలు ఇప్పుడు నిజంగానే జరుగుతుందని, జరిగితే ఎంత విలువ వుంటుంది? ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మీద చూపే ప్రభావాలు ఎలా వుంటాయనే వైపు మళ్లాయి. ఒక లక్ష బిలియన్‌ డాలర్ల వరకు వుంటుందని ఒక అంచనా. వాణిజ్య యుద్ధం వ్యాపారలావాదేవీలకు మాత్రమే పరిమితం కాదు. అనేక రంగాలను అది ప్రభావితం చేస్తుంది.

గత కొద్ది రోజులుగా ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలు, చర్యలు కేవలం వాణిజ్య యుద్ధానికే పరిమితం కాలేదు. అవి ప్రపంచ దేశాల సమీకరణలను వేగవంతం చేస్తున్నాయా ? వాటి స్వభావమేమిటి ? పర్యవసానాలు ఎలా వుంటాయన్నది ప్రపంచమంతా వుగ్గపట్టుకొని ఆసక్తితో చూస్తున్నది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను మా మిత్ర దేశాలు కూడా పాటించాల్సిందే, లేకుంటే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం, ఎవరికీ మినహాయింపులు లేవు అని ట్రంప్‌ చేసిన ప్రకటనతో నరేంద్రమోడీ సర్కార్‌ ఏం చేయాలో తోచక కాళ్లు తొక్కుకుంటున్నది. చిన్నది కావచ్చుగానీ ఐరోపా యూనియన్‌ కూడా చైనా మాదిరి చెడ్డదే. చూడు మక్రాన్‌ మనిద్దరికీ చైనా సమస్య వుంది కనుక కలసి పని చేద్దాం, చైనా కంటే ఐరోపా యూనియన్‌ అధ్వాన్నంగా వుంది, నాఫ్టా ఎంత చెడ్డదో నాటో కూడా అలాంటిదే, అది అమెరికాకు భరించరాని ప్రియంగా వుంది. ఇవన్నీ ట్రంప్‌ బహిరంగంగా చేసినవీ, అంతర్గత సంభాషణల్లో వెల్లడించిన అభిప్రాయాలుగా మీడియాలో తిరుగుతున్నవి. ప్రపంచ దేశాల మీద అమెరికా ఒక్క వాణిజ్యయుద్ధానికే పరిమితం కాలేదు, ఇతర రంగాలలో కూడా తన పెత్తనాన్ని, భారాలను రుద్దేందుకు పూనుకుంది అన్నది స్పష్టం. నాటో కూటమికి అయ్యే ఖర్చును సభ్య దేశాలన్నీ భరిస్తాయో లేదో చెప్పాలంటూ ఐరోపా దేశాలకు జూన్‌ నెలలో ట్రంప్‌ లేఖలు రాశాడు.

కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మన విదేశాంగ విధానాన్ని నిర్దేశించేది మన ప్రభుత్వమా లేక డోనాల్డ్‌ ట్రంపా అన్న అనుమానం తలెత్తక మానదు. నరేంద్రమోడీ సర్కార్‌ పులిలా గాండ్రించి చివరికి పిల్లిలా మ్యావ్‌ మ్యావ్‌ మంటూ తోకముడుస్తోంది. ఇరాన్‌తో కుదిరిన అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. ఆంక్షలను అమలు జరుపుతామని ప్రకటించింది. ఆ సమయంలో మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందిస్తూ ఏకపక్షంగా అమెరికా ప్రకటించిన ఆంక్షలను భారత్‌ పరిగణనలోకి తీసుకోదని ఐక్యరాజ్య సమితి వాటినే గుర్తిస్తుందని ప్రకటించారు. అలాంటిది నెల రోజులు కూడా గడవక ముందే నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరిలో మార్పు వచ్చింది, అదీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారీ నికీహాలే ఢిల్లీ పర్యటన మరుసటి రోజే కావటం గమనించాల్సిన అంశం. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీని అమలులోకి వస్తాయి. అప్పటికి ఇరాన్‌ నుంచి గణనీయంగా దిగుమతులను తగ్గించుకోవటం లేదా పూర్తిగా మానుకోవాలని చమురుశుద్ధి కర్మాగారాలకు మన చమురు మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అదే జరిగితే మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయన్నది చమురు రంగ విశ్లేషకుల అభిప్రాయం.ఇరాన్‌తో చమురులావాదేవీలకు స్వస్తి పలుకుతున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇరాన్‌ చమురుతో ప్రయాణించే నౌకలు లేదా దానిని శుద్ధి చేసే కర్మాగారాలకు బీమా వర్తింప చేయబోమని ఆ కంపెనీలు ప్రకటించేఆలోచనలో వున్నాయి. ఇరాన్‌ మనకు కొన్ని రాయితీలు ఇస్తున్నది. వాటిని వదులుకొని ఇతర దేశాల దగ్గర కొనటం అంటే అమెరికాను సంతృప్తిపరచటమే కాదు, అందుకోసం మన జనం మీద భారాలు మోపేందుకు మోడీ సర్కార్‌ పూనుకుంది. ఇరాన్‌కు రూపాయిల చెల్లింపులతో మోడీ పెద్ద విజయం సాధించినట్లు ఆయన భక్తులు ప్రచారం చేశారు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే రూపాయల బదులు ఇతర దేశాలకు చెల్లించేందుకు మనం డాలర్లను మరింతగా సమకూర్చుకోవటం అంటే మన కరెన్సీ విలువ మరింత పతనం కావటమే. గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మన దేశానికి ఆంక్షలను మినహాయించాడు. అలాంటివేమీ కుదరవని ట్రంప్‌ ప్రకటించాడు. మన దేశాన్ని తన ఆదేశాలను పాటించే పాలేరు అనుకుంటున్నాడా ? జవాబుదారీతనంతో వ్యవహరించే ఏ దేశమైనా ఇతరుల బెదిరింపులను అనుమతించని బాధ్యతతో వ్యవహరించాల్సి వుంటుంది. అమెరికా వత్తిడికి మోడీ సర్కార్‌ తీసుకున్న చర్యతో పాటు దీర్ఘకాలంగా ఇరాన్‌తో వున్న సంబంధాలు ప్రమాదంలో పడటమేగాక అంతర్జాతీయంగా మన పరువు ఎక్కడ కలుస్తుందో తెలియదు. మన బలహీన దౌత్యానికి ఇది సూచిక. ఇరాన్‌ ఎగుమతి చేసే చమురులో సగాన్ని చైనా, భారత్‌, టర్కీ దిగుమతి చేసుకుంటున్నాయి.అమెరికా ఏకపక్ష ఆంక్షలను తాము ఆమోదించేది లేదని మిగిలిన రెండు దేశాలు ప్రకటించాయి.

అనేక దేశాల మధ్య తంపులు పెట్టి, రెచ్చగొట్టి అటూ ఇటూ ఆయుధాలు అమ్ముకొని లబ్దిపొందే ఎత్తుగడను అమెరికా ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. మన దేశం-పాకిస్ధాన్‌ విషయంలో అదే చేసి పాకిస్ధాన్‌కు పెద్ద ఆయుధ అమ్మకందారుగా మారింది. సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత తరువాత మన పాలకులు అమెరికాకు దగ్గర కావటంతో ఇప్పుడు పాక్‌ కంటే పెద్ద బడ్జెట్‌ వున్న మనం ఆత్మీయులుగా కనపడటం గురించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల తరబడి సోవియట్‌ ఆయుధాల మీద ఆధారపడిన మనం వెనువెంటనే అమెరికా ఆయుధాలతో మన మిలిటరీని సాయుధం చేసే అవకాశం లేదు కనుక ఇప్పటికీ ఆ లావాదేవీలు కొనసాగుతున్నాయి. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులు కొనుగోలు చేసినట్లయితే భారత్‌ మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించింది. మన వాయుసేన దాదాపు ఐదింటిని కొనుగోలు చేసే ఒప్పందం ఖరారు దశలో వుంది. ఈనెల ఆరున భారత్‌-అమెరికా మధ్య రక్షణ, భద్రతా సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు విదేశాంగ, రక్షణశాఖల మంత్రుల తొలి సమావేశం జరగాల్సి వుండగా కొద్ది రోజుల ముందు అనివార్య కారణాల వలన దానిని రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పోంపియో ఏకపక్షంగా మన మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలియ చేశారు. ఇరాన్‌తో సంబంధాల గురించి భారత్‌ పునరాలోచించుకోవాలని జూన్‌ 27న ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే మన ప్రధాని నరేంద్రమోడీని కలసి కోరిన సమయంలోనే ఈ సమావేశ రద్దును తెలిపారు.

దీనికి ముందుగా జూన్‌ 19న అమెరికా అంతర్గతంగా తన చట్టాలకు ఆమోదించిన సవరణల ప్రకారం రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేస్తే గతంలో వున్న అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు అవుతుంది. మన అవసరాలకు అమెరికాలో తయారైన పేట్రియాట్‌ పిఏసి-3 క్షిపణి 70కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని చేరుతుంది. అదే రష్యా ఎస్‌ 400 క్షిపణి నాలుగు వందల కిలోమీటర్ల లక్ష్యం కలిగినదిగా వుండటంలో నలభైవేల కోట్ల రూపాయలతో ఐదు క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణశాఖ నిర్ణయించింది. దీన్ని దెబ్బతీసేందుకు ఆంక్షలు విధించేందుకు అమెరికా బెదిరింపులకు పూనుకోవటంతో పాటు సమావేశాన్ని రద్దు చేసింది. ఇవేగాదు రష్యా నుంచి మరొక 12బిలియన్‌ డాలర్ల విలువగల ఇతర ఆయుధాల కొనుగోలుపై కూడా ఆంక్షలు విధించే అవకాశం వుండటంతో అమెరికా ఇలాంటి బెదిరింపులకు పూనుకున్నట్లుగా భావిస్తున్నారు.

అమెరికాకే అగ్రతాంబూలం అన్న పద్దతిలో వ్యవహరిస్తున్న ట్రంప్‌ వైఖరి నుంచి తమను కాచుకొనేందుకు గాను ఐక్యంగా వ్యవహరించాలని, ప్రపంచ వ్యవస్ధను నిలబెట్టాలని చైనా, ఐరోపా యూనియన్‌ నిర్ణయించాయి. ప్రపంచ స్వేచ్చా వాణిజ్య వ్యవస్ధ ఏర్పాటుకు తాము సహకరించామని దానిని కాపాడుకోవాల్సిన అవసరం వుందని ఐరోపా యూనియన్‌ నేతలు చెబుతున్నారు. సోవియట్‌ యూనియన్‌ ప్రారంభంలో రష్యన్‌ కమ్యూనిస్టులకు వాల్‌స్ట్రీట్‌ పెట్టుబడిదారులు రహస్యంగా సాయం చేశారని, 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా ప్ర వేశానికి అమెరికా సెనేట్‌ అత్యధిక మెజారిటీతో ఆమోదం తెలిపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా తన వైఖరి మార్చుకుంటే తామెందుకు అనుసరించాలని పరోక్షంగా పశ్నిస్తున్నారు. అదే కమ్యూనిస్టు చైనాతో కలసి తమ ప్రయోజనాలను రక్షించుకోవాలని వుద్బోధిస్తున్నారు. ఈ నెలలో బీజింగ్‌లో చైనా-ఐరోపా యూనియన్‌ సమావేశంలో ఒక ప్రకటన వెలువడుతుందని వార్తలు వచ్చాయి.

ఒకవైపు ఐరోపా యూనియన్‌ దేశాలపై వాణిజ్య ఆంక్షలను ప్రకటించిన ట్రంప్‌ మరోవైపు నాటో కూటమి ఖర్చులో సింహభాగాన్ని మీరు భరిస్తారో లేదో చెప్పాలని వత్తిడి తెస్తున్నాడు.త్వరలో బ్రసెల్స్‌ సమావేశంలోగా ఏదో ఒకటి తేల్చాలంటున్నాడు. ఏప్రిల్‌లో మీ పర్యటన సందర్బంగా మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని దేశాలు వాగ్దానం చేసిన మాదిరి నిధులు కేటాయించటం లేదని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌కు రాసిన లేఖలో ట్రంప్‌ పేర్కొన్నాడు. ఐరోపా రక్షణకు మేము పెద్ద మొత్తంలో వనరులను కేటాయించటం ఇంకేమాత్రం సాధ్యం కాదని, మా దేశంలో అసంతృప్తి పెరుగుతున్నదని కూడా పేర్కొన్నాడు. నాలుగు సంవత్సరాల నాడు వేల్స్‌ సమావేశంలో ప్రతి దేశం జిడిపిలో రెండుశాతం మొత్తాన్ని దేశభద్రతకు ఖర్చు చేయాలని అంగీకరించిన మేరకు అమలు జరపటం లేదన్నది అమెరికా ఫిర్యాదు. మిగతా దేశాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాయని అలాంటిది మీరు కూడా చేయాల్సిన మేరకు ఖర్చు చేయటం లేదని జర్మనీని కూడా విమర్శించాడు. విదేశాలలో అమెరికన్‌ సైనికులు ప్రాణాలు అర్పించటం లేదా తీవ్రంగా గాయపడే త్యాగాలు చేస్తున్నపుూ వుమ్మడి రక్షణ భారాన్ని కొన్ని దేశాలు ఎందుకు పంచుకోవటం లేదు అని అమెరికా పౌరులు అడుగుతుంటే సమర్ధించుకోవటం ఇంకేమాత్రం సాధ్యం కావటం లేదని కూడా ట్రంప్‌ పేర్కొన్నాడు. దక్షిణ కొరియాలో సైన్యం గురించి కూడా ఇదే వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.

ట్రంప్‌ లేఖలపై ఐరోపాలో విమర్శలు వచ్చాయి.’ నాటో అంటే ఒక క్లబ్‌ అని, దానికి మీరు బకాయి చెల్లించకపోతే పర్యవసానాలు అనుభవిస్తారు లేదా సోమరులైన ఈ ఐరోపా వారందరూ సెలవులు గడపటానికి వచ్చి కూర్చున్నారని, వారందరినీ అమెరికా రక్షిస్తోందనే భావనలోనే ఇంకా ట్రంప్‌ వున్నట్లుగా కనిపిస్తోంది’ అని అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి డెరెక్‌ చోలెట్‌ వ్యాఖ్యానించారు. ‘ వాణిజ్యం మీద దూకుడుగా వున్న ట్రంప్‌ వ్యాఖ్యలను ఎలా అమలు చేస్తారు, భద్రతా విషయాలలో కూడా అలాగే చేస్తారా అని ఐరోపావారు చూస్తున్నారు అని కూడా అన్నారు.

అమెరికా మొరటుగా వాణిజ్య యుద్ధానికి పూనుకుంటే అనేక దేశాలతో ఇదే విధంగా ఇతర రంగాలలో కూడా తన పెత్తందారీ, బలప్రయోగానికి పాల్పడే అవకాశాలున్నాయి. అయితే వాణిజ్య యుద్ధం జరిగితే తమకు సంభవించే లాభనష్టాల గురించి అమెరికాలో తర్జన భర్జన జరుగుతోంది. లాభం అనుకుంటే ట్రంప్‌ ముందుకు పోతాడు. వాణిజ్య యుద్ధంలో గెలిచే అవకా శాలు లేవని బలంగా వినిపిస్తున్న పూర్వరంగంలో ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గే అవకాశాలూ లేకపోలేదు. సంక్షోభం, సమస్యలు ముదిరితే పర్యవసానాలను అంచనా వేయటం కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెక్సికో ఎన్నికల విజేత వామపక్షమా, సోషల్‌ డెమోక్రసీయా !

04 Wednesday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

AMLO, Andres Manuel Lopez Obrad, Lopez Obrador, Mexican Lopez Obrador, MORENA, The 2018 Mexican election

Image result for 2018 mexico election, amlo

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు మెక్సికోలో జరిగిన ఎన్నికలలో వామపక్షవాది ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడార్‌ (ఆమ్లో) ఘన విజయం సాధించినట్లు మీడియా ప్రకటించింది. తొంభై మూడు శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి అధ్యక్ష ఎన్నికలలో లోపెజ్‌కు 53శాతం, సమీప ప్రత్యర్ధులకు వరుసగా 22.5,16.4,5.1,0.1 ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదుగురు అభ్యర్ధులలో ముగ్గురు మూడు కూటముల తరఫున పోటీ చేయగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు. ఓట్ల లెక్కింపు పూర్తయితే దాదాపు ఇదే శాతాలు ఖరారు కావచ్చు లేదా స్వల్పతేడాలుండవచ్చు. పార్లమెంట్‌ వుభయ సభలలో కూడా లోపెజ్‌ నాయకత్వంలోని ‘కలసి కట్టుగా మేము చరిత్రను సృష్టిస్తాం’ అనే పేరుతో ఏర్పడిన కూటమి ఐదువందల స్ధానాలున్న ఛాంబర్‌ డిప్యూటీస్‌(మన లోక్‌సభ మాదిరి)లో 312, 128 సీట్లున్న సెనెట్‌(రాజ్యసభ మాదిరి)లో 69 స్ధానాలతో సంపూర్ణమెజారిటీ సాధించవచ్చునని విశ్లేషణలు వెలువడ్డాయి. లోపెజ్‌ను ‘మెక్సికో బెర్నీశాండర్స్‌’ అని కొందరు వర్ణించారు, అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో ‘సంస్కరణవాది’ అని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికలు, పార్లమెంట్‌, మున్సిపల్‌ ఎన్నికలు అన్నీ ఒకేసారి జరిగాయి. అన్నింటా ఈ కూటమి ఘన విజయం సాధించింది. అధ్యక్షుడు ఐదు సంవత్సరాల పది నెలలు, పార్లమెంటు దిగువ సభ మూడు సంవత్సరాలు, ఎగువ సభ ఆరు సంవత్సరాల పాటు వుంటుంది.

ఈ కూటమిలో జాతీయ పునరుజ్జీవన పార్టీ,మావోయిస్టులతో కూడిన వర్కర్స్‌ పార్టీ, క్రైస్తవ మత మితవాదులతో నిండిన సోషల్‌ ఎన్‌కౌంటర్‌ పార్టీ వున్నాయి. పార్లమెంటులో వీటికి వరుసగా 193,54,58 వస్తాయని ఓటింగ్‌ సరళి తెలిపింది. మున్సిపల్‌ ఎన్నికలలో 80శాతంపైగా స్ధానాలు తెచ్చుకుంది. జాతీయ పునరుజ్జీవన పార్టీ నేత లోపెజ్‌ మన దేశంలో సోషలిస్టులుగా జీవితం ప్రారంభించి వివిధ పార్టీలు మారిన జార్జిఫెర్నాండెజ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ వంటి పాలకవర్గాలకు చెందిన వారితో పోల్చదగిన రాజకీయ నేపధ్యం వుంది. మెక్సికోలో 1929 నుంచి 2000 వరకు ఎలాంటి విరామం లేకుండా అధికారంలో వున్న పిఆర్‌ఐ పార్టీ కార్యకర్తగా 1976లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ పార్టీపోకడలు నచ్చక దాన్నుంచి విడివడిన వారు 1986లో డెమోక్రటిక్‌ రివల్యూషన్‌ పార్టీ(పిఆర్‌డి)గా ఏర్పడ్డారు. లోపెజ్‌ 1989లో దానిలో చేరి 1994లో ఒక రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేశారు.2000 సంవత్సరంలో మెక్సికో నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 2005లో మేయర్‌ పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ తరఫున పిఆర్‌డి, పౌర వుద్యమం, లేబర్‌ పార్టీ కూటమి తరఫున 2006 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేశారు.స్వల్పతేడాతో ఓడిపోయారు. పిఆర్‌ఐ పార్టీ అక్రమాలకు పాల్పడిందని, అందువలన తాను ఓటమిని అంగీకరించనంటూ కొన్ని నెలలపాటు ఆందోళన నిర్వహించారు. తరువాత 2012 ఎన్నికలలో కూడా అదే కూటమి తరఫున పోటీచేసి రెండవ స్ధానం తెచ్చుకున్నారు. ఆ సందర్భంగా తనకు మద్దతు కూడగట్టేందుకు జాతీయ పునరుజ్జీవన వుద్యమం(మొరెనా) పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. ఓటమి తరువాత పిఆర్‌డి నుంచి విడిపోయి, అంతకు ముందు ఏర్పాటు చేసిన సంస్ధను 2014లో రాజకీయ పార్టీగా నమోదు చేశారు. ఇప్పుడు దాని నాయకత్వాన ఏర్పడిన కూటమి తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు.

విద్యార్ధులు, వృద్ధులకు ఆర్ధిక సాయాన్ని పెంచాలని, కొంత మంది మాదక ద్రవ్య నేరగాండ్లకు క్షమాభిక్ష ప్రసాదించాలని, ప్రభుత్వ కాలేజీలలో అందరికీ ప్రవేశం కల్పించాలని, నూతన అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేయాలని, ఇంధన సంస్కరణలు చేపట్టాలని, ప్ర భుత్వ రంగ చమురు సంస్ధ గుత్తాధిపత్యాన్ని తొలగించాలని, వ్యవసాయానికి వుద్దీపన కలిగించాలని, ఎన్నికలు ముగిసే వారకు నాఫ్టా గురించి చర్చలు నిలిపివేయాలని, కొత్తగా చమురుశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయటం, సాంఘిక సంక్షేమానికి ఖర్చు పెంచటం, ప్రజాప్రతినిధుల వేతనాల తగ్గింపు లేదా పన్నుల పెంపుదల, అధికారాల వికేంద్రీకరణ, రాష్ట్రాలకు బదలాయింపు వంటి అంశాలను లోపెజ్‌ ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు ప్రచారం, వాగ్దానాలు చేశారు.

ఈ ఎన్నికలలో మొరెనా, పిఆర్‌డి,పిటి, సిటిజన్స్‌ వుద్యమం(ఎంసి) కలసి పోటీ చేయటం గురించి ప్రతిపాదనలు వచ్చాయి. గతేడాది మెక్సికో రాష్ట్ర ఎన్నికల సమయంలో తలెత్తిన విబేధాల కారణంగా ఆ కూటమిని లోపెజ్‌ వ్యతిరేకించారు. తాము ఎన్నికలలో కలసి పోటీ చేసే అవకాశం వుందని గతేడాది చివరిలో క్రైస్తవ మతవాద సోషల్‌ ఎన్‌కౌంటర్‌ పార్టీ(పిఇఎస్‌), మొరేనా ప్రకటించాయి. చివరకు ఈ రెండు పార్టీలతో పాటు మావోయిస్టులతో కూడిన వర్కర్స్‌ పార్టీ కలసి ఐక్యంగా మేము చరిత్రను సృష్టిస్తాం అనే పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. వర్కర్స్‌, పిఇఎస్‌ పార్టీలు దిగువ సభలో 75, ఎగువ సభలో 16స్ధానాల చొప్పున పోటీ చేసేందుకు మిగిలిన వాటిలో మొరేనా బరిలో నిలిచేందుకు ఒప్పందం కుదిరింది. పిఇఎస్‌తో కూటమి కట్టడంపై విమర్శలు వచ్చాయి.

వాయిస్‌ ఆఫ్‌ అమెరికా ఎన్నికలకు ముందు చేసిన విశ్లేషణ సారాంశం ఇలా వుంది.ట్రంప్‌కు వ్యతిరేకంగా ధృడ వైఖరి అనుసరించాలనే ప్రజాకర్షక వామపక్ష వాది అధ్యక్ష ఎన్నికల రంగంలో ముందున్నాడు. ఆయన విజయం సాధిస్తే మెక్సికో త్వరలో ఒక వామపక్ష, ప్రజాకర్షక, జాతీయవాది అధికారంలో వుంటారు. విజయం తధ్యమని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. ప్రస్తుతం అధికారంలో వున్న పిఆర్‌ఐ అధ్యక్షుడు అవినీతి పట్ల మెతక వైఖరిని తీసుకున్నకారణంగా ఓటర్లు పెను మార్పులకు సిద్ధంగా వున్నారు. మెక్సికోలో ఇవి అతి పెద్ద ఎన్నికలు. అన్ని స్ధాయిలలో 3,400 మందిని ఎన్నుకుంటారు.భవిష్యత్‌లో పెద్ద మార్పులు తీసుకు వస్తానని లోపెజ్‌ వాగ్దానం చేసినందున సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతున్నది.మెక్సికో గురించి మీరు(అమెరికన్లు) తెలుసు కోవాల్సిందేమంటే అతను ఒక జాతీయ వాద వామపక్ష అభ్యర్ధి.ఏమైనా సరే సంస్కరణలు కావాలనే ధోరణిలో ఓటర్లు వున్నందున ముగ్గురు ప్రత్యర్ధుల కంటే ఎంతో ముందంజలో వున్నారు. అతను ఇంతకు ముందు రెండుసార్లు పోటీ చేసినప్పటి కంటే ఓటర్లు ఇప్పుడు ఓటర్లు ప్రభుత్వంతో విసిగిపోయి వున్నారు. మొత్తం మీద ప్రజాస్వామ్యం మీదే ఆశాభంగం కనిపిస్తున్నదని కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ పాబ్లా పికాటో అన్నారు.అసమానతలు, అవినీతి మీద పోరు సలుపుతానని లోపెజ్‌ వాగ్దానం చేశాడు. విప్లవాత్మక చర్యలని నేనంటున్నానంటే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవినీతి, అన్యాయాల వేళ్లను పెకలిస్తాను అని ఆయన ఒక సభలో చెప్పాడు.నలుగురు అభ్యర్ధులు ఒక విషయంలో ఒకే విధంగా వున్నారు. వారు నిజంగా, నిజంగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ఇష్టపడటం లేదు. ఆర్ధిక ప్రగతికి అమెరికాతో కలసి పని చేస్తూనే ట్రంప్‌ జగడాల మారి విధానాల పట్ట ధృడ వైఖరి తీసుకుంటామని వాగ్దానం చేశారు. వుత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా)పై సమీక్ష జరపాలని ట్రంప్‌ చెప్పారు.లోపెజ్‌ వైఖరి ఇప్పుడు అనుకూలంగానే వున్నప్పటికీ అతని జాతీయవాదభావాలు భవిష్యత్‌లో కీడును సూచిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే బలమైన అధ్య క్షుడు కావాలని మెక్సికో ఓటర్లు కోరుకుంటున్నారు.

Image result for The 2018 Mexican election,amlo

ఎన్నికల ఫలితాల గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఇలా వ్యాఖ్యానించింది.’ దశాబ్దాల కాలంలో తొలిసారిగా లోపెజ్‌ ఒబ్రడోర్‌ విజయం లాటిన్‌ అమెరికాలోని రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ ఆధికార కేంద్రంలో ఒక వామపక్ష వాదిని కూర్చోబెట్టింది. దేశంలోని వున్నత వర్గ భీతి, కోట్లాది మంది మెక్సికన్ల ఆశాభావం కారణంగా ఇది జరిగింది. గత పాతిక సంవత్సరాలుగా మధ్యేవాద హద్దులలో నడక మరియు ప్రపంచీకరణ అమలు తమకేమీ ఒరగబెట్టలేదనే భావానికి గురైన మెక్సికన్లు దేశంలోని యధాతధ స్ధితిని స్పష్టంగా తిరస్కరిస్తున్నారని ఫలితం సూచిస్తున్నది.’ ఆర్ధిక విధానాలు దేశంలో అసమానతలను తీవ్రంగా పెంచాయి.శాంతి భద్రతలు దిగజారాయి. ఈ ఎన్నికలు మెక్సికో చరిత్రలో అత్యంత హింసాత్మకమైనవిగా మారాయి. నలభై ఎనిమిది మంది అభ్యర్ధులతో సహా 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక రోజే ముగ్గురు మహిళా అభ్యర్ధులను కాల్చి చంపారు.మున్సిపల్‌ స్ధాయిలో నేరస్ధ గుంపులు రెచ్చిపోయాయి.బెదిరింపుల కారణంగా ఆరువందల మంది పోటీ నుంచి వెనక్కు తగ్గారు. వీటికి తోడు తమ దేశంలో ప్రవేశించిన మెక్సికన్ల గురించి యూదుల గురించి హిట్లర్‌, నాజీల మాదిరి డోనాల్డ్‌ ట్రంప్‌, అమెరికన్లు చులకనగా మాట్లాడటం, వాణిజ్య యుద్ధం ప్రకటించటం, లోపెజ్‌ ట్రంప్‌ వ్యతిరేకి అనే భావం బలంగా వ్యాపించటం కూడా ఈ ఎన్నికలలో బాగా పని చేసినట్లు కనిపిస్తోంది. అమెరికా మీద ఆధారపడకుండా మెక్సికో ఆర్ధిక స్వాతంత్య్ర సాధనకు తద్వారా వుపాధి కల్పనకు కృషి చేస్తాననే జాతీయవాద భావాన్ని కూడా లోపెజ్‌ ప్రచారం చేశారు. ఒక ఏడాదిలోపే తనను గద్దెదించటం ఎలా అనే కర్తవ్యాన్ని అమెరికా గూఢచార సంస్ధలకు లక్ష్య నిర్దేశం చేస్తారని లోపెజ్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే పేర్కొన్నారు.మెక్సికో నగర మేయర్‌గా లోపెజ్‌ పని చేసిన కాలంలో వృద్దాప్య పెన్షన్లు పెంచటం, రోడ్ల విస్తరణతో రద్దీ తగ్గించటం, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య పద్దతిలో పాతనగర అభివృద్ధి వంటి చర్యల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనటం అమెరికాలో సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ను గుర్తుకు తెచ్చిందని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానించారు. లాటిన్‌ అమెరికాలో వెనుక పట్టు పట్టిన గులాబి అలలను ఆమ్లో విజయం పునరుద్ధరిస్తుందని గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ అధ్యక్షుడు గ్లెసిస్‌ హాఫ్‌మన్‌ ఈ ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ లాటిన్‌ అమెరికాలో పురోగామి గాలుల పునరాగమనానికి ఇది చిహ్నమని పేర్కొన్నారు. ఇది ఒక్క మెక్సికో విజయం మాత్రమే కాదు మొత్తం లాటిన్‌ అమెరికాదని బ్రెజిల్‌ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ వ్యాఖ్యానించారు. మొత్తం ఈ ప్రాంత ఆశలకు ఆమ్లో ప్రతినిధి అని అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా కిర్చినర్‌ పేర్కొన్నారు.

అమెరికాతో సంబంధాల కారణంగా దెబ్బతిని ప్రధాన పార్టీలకు దూరమైన చిన్న తరహా వాణిజ్యవేత్తలు, ఒక తరగతి మేథావులు, కొందరు బడా వాణిజ్యవేత్తల మద్దతును కూడగట్టటం కూడా లోపెజ్‌ విజయానికి దోహద పడింది. దేశ జనాభాలో 46శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన వుండటం, అనేక ప్రాంతాలను మాదకద్రవ్యమాఫియా ముఠాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవటం, వాటికి అధికారగణం, పాలక పిఆర్‌ఐ, మితవాద పాన్‌ పార్టీల మద్దతు కారణంగా గత పది సంవత్సరాలలో మాదక ద్రవ్య మాఫియా చేతుల్లో రెండులక్షల మంది హతులు కావటం మరో 30వేల మంది అదృశ్యమయ్యారు.2014లో 43 మంది విద్యా ర్ధుల అదృశ్యం, హత్యకు ఎవరు కారకులో ఇప్పటికీ అధికారికంగా నిర్ధారించలేదు. స్కాలర్‌షిప్పులు పొందే విద్యార్ధులు కావాలి తప్ప కాంట్రాక్టు హంతకులు మనకు వద్దని ఇచ్చిన లోపెజ్‌ నినాదం బహుళ ఆదరణ పొందింది.

మెక్సికో ఎన్నికలలో ఎవరు గెలిచినప్పటికీ నష్టపోయేది కార్మికులే అని ఎన్నికలకు ముందే మెక్సికో కమ్యూ నిస్టుపార్టీ వ్యాఖ్యానించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధ పరిధిలో బూర్జువా పార్టీల మధ్య అధికార కుమ్ములాటలు తప్ప ఆ వ్యవస్ధ కొనసాగింపునకే లోపెజ్‌ నాయకత్వంలోని సోషల్‌ డెమోక్రటిక్‌ మొరేనా, మావోయిస్టులు ఏర్పాటు చేసిన వర్కర్స్‌ పార్టీకూడా తోడ్పడుతున్నాయని పేర్కొన్నది. ప్రగతి వాదులమని చెప్పుకొనే పిఆర్‌డి, మొరేనా, పిటి పార్టీలు మితవాదులతో కలవటానికి సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నిస్తూ అవి నిజమైన వామపక్షాలు కాదని స్పష్టం చేసింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న సంక్షోభ పరిష్కారం గురించి కొన్ని తేడాలు వుండవచ్చు తప్ప అవి ముందుకు తెచ్చే నయా వుదారవాదం లేదా నయా కీనీసియనిజం(పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర సంక్షోభం లేదా మాంద్యానికి గురైనపుడు ప్రభుత్వ పెట్టుబడులు పెంచటం, వస్తువినిమయ డిమాండ్‌ పెంచేందుకు అవసరమైన చర్యల గురించి కీన్స్‌ సూచించిన పరిష్కార మార్గం) కార్మికవర్గ జీవన పరిస్ధితులను మెరుగుపరచదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. సోషల్‌ డెమోక్రసీ తురుపు ముక్కలను ప్రయోగిస్తామని చెప్పటమే తప్ప ఆట అడదని గ్రీసులోని సిరిజా, స్పెయిన్‌లోని పొడెమాస్‌ లక్షణాలు మొరేనాలో వున్నాయని వ్యాఖ్యానించింది. 2000సంవత్సరాలో మెక్సికో నగర మేయర్‌ ఎన్నికల్లో లోపెజ్‌ పోటీ చేసినపుడు కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా వుందని, ఎన్నిక తరువాత కూటమి పట్ల విశ్వాసాన్ని కనపరచలేదని, తన వర్గ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడని గుర్తు చేసింది. గుత్తాధిపతులకు ఇష్టమైనవారిలో ఒకరిగా లోపెజ్‌ వున్నారని, ఇదే సమయంలో ఆకలి, దారిద్య్రాలతో అలమటించుతూ విసిగిపోయిన వారిలో ఆశను కూడా కలిగిస్తున్నాడని, తరువాత అసంతృప్తికి గురవుతారని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. మెక్సికో కార్మికవర్గ సమస్య పెట్టుబడిదారీ విధానం, దానిని మార్చేందుకు లోపెజ్‌ ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోగా దానిని బలపరచాలని కోరుకుంటున్నారని, అందువలన ఓటు వేసినా వేయకపోయినా ఒరిగేదేమీ లేదని, అయితే జరుగుతున్న పరిణామాలలో కార్మికవర్గం జోక్యం చేసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది.

Image result for The 2018 Mexican election

సోషల్‌ డెమోక్రాట్లు తమను వామపక్షవాదులుగా పిలుచుకోవటం, మీడియా కూడా అదే ప్రచారం చేస్తున్నది. ఫ్రాన్స్‌లో సోషలిస్టు పార్టీ, బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ, అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ వంటి వన్నీ ఈకోవకే వస్తాయి. వాటిలో కొంత మంది సంస్కరణవాదులు,కొందరు వామపక్ష వాదులు వుండవచ్చు తప్ప మౌలికంగా అవి పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడేవే తప్ప వ్యతిరేకించేవి కాదని ఇప్పటికే రుజువు చేసుకున్నాయి. బూర్జువావర్గంలో అధికారంకోసం జరిగే పెనుగులాటలో ఇలాంటి పార్టీలు అనేకం పుట్టుకు వస్తాయి, అంతరించి, కొత్త రూపాలలో రావటం తప్ప మౌలిక స్వభావంలో మార్పు వుండదు. మెక్సికో మొరేనా పార్టీ నాయకత్వంలోని కూటమి కూడా అలాంటిదే. దాని మీద భ్రమలు పెట్టుకోనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాలో రైతాంగానికి సబ్సిడీల తీరు తెన్నులు !

02 Monday Jul 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

american farmers, Farm bill 2018, Farmers, subsidies to american farmers, subsidies to farmers

Image result for agriculture mechanisation

ఎం కోటేశ్వరరావు

అనుచిత వాణిజ్య లావాదేవీలకు పాల్పడుతున్నదనే సాకుతో చైనానుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై 50బిలియన్‌ డాలర్ల సుంకాలను ప్ర కటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇది రాస్తున్న సమయానికి మరొక 200 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను విధించేందుకు సరకుల జాబితాను తయారు చేయాలంటూ అధికార గణానికి ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆందోళనతో వున్న అమెరికా రైతాంగం ఈ వార్తతో మరింత వత్తిడికి లోనైనట్లు వార్తలు వచ్చాయి. అమెరికా వ్యవసాయం అంటే పెద్ద రైతులతో పాటు కార్పొరేట్‌ల ప్రయోజనాలు ఇమిడి వుంటాయి. అందుకే వాణిజ్య యుద్దమంటే అవి గజగజలాడతాయి. అమెరికాలోని ప్రతి రైతుకు వచ్చే ఆదాయంలో వందకు ఇరవై రూపాయలు ఇతర దేశాలతో జరిపే అమెరికా వాణిజ్యంపై ఆధారపడి వుంటాయని అంచనా. అందువలన సహజంగానే వారి భయం వారికి వుంటుంది. ఇతర దేశాలతో ట్రంప్‌ సామరస్యంగా వున్నంత వరకు వారికి ఢోకాలేదు, తగాదా పెట్టుకుంటే తమ స్ధితి ఏమవుతుందో తెలియని అయోమయంలోకి వారు పోతారు.

అమెరికాలో ఏటా 6కోట్ల టన్నుల గోధుమలు పండుతాయి. వాటిలో సగాన్ని ఎగుమతి చేయాల్సిందే. నిజంగా వాణిజ్య యుద్ధం వాస్తవ రూపందాల్చితే వాటిని ఎక్కడ అమ్ముకోవాలన్నది ప్రశ్న. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు అనేక దేశాల మీద తొడగొడుతున్నాడు. కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ కూడా ప్రతి చర్యలు తీసుకొనేందుకు సిద్దమౌతున్నాయి. అమెరికా ఏటా 140 బిలియన్‌ డాలర్ల మేర వ్యవసాయ వుత్పత్తులను ఎగుమతి చేస్తోంది.కెనడా, మెక్సికోలు 39, చైనా 20, ఐరోపా యూనియన్‌ 12 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటున్నాయి. నిజంగా వాణిజ్య యుద్దమే జరిగితే సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. పర్యవసానాలు ఎలా వుంటాయో తెలియదు కనుక ఆచి తూచి వ్యవహరించాలని అనేక మంది సూచిస్తున్నా ట్రంప్‌ దూకుడు తగ్గటం లేదు. ఇది ప్రపంచీకరణ యుగం, ఎక్కడ ఏ వస్తువు లేదా విడి భాగం తయారైతే అక్కడి నుంచి మరికొన్ని చోట్ల కూర్చి వస్తువులను తయారు చేస్తున్నారు. అందువలన చైనా నుంచి అటువంటి వాటి మీద అమెరికా లేదా మరొక దేశం పన్నులు విధిస్తే దాని పర్యవసానం ఒక్క చైనాకే అనేక దేశాలమీద పడుతుంది. చైనాగనుక ప్రతికూల చర్యల్లో భాగంగా సోయా, పందిమాంస వంటి వాటిపై పన్నులు విధిస్తే మొత్తంగా అమెరికాకు పెద్దగా దెబ్బతగలకపోవచ్చుగానీ రైతాంగానికి పెద్ద దెబ్బ. గత ఏడాది చైనా దిగుమతి చేసుకున్న 95మిలియన్‌ టన్నుల సోయాను ఈ ఏడాది వంద టన్నులకు పెంచనుంది. వాటిలో ఒక్క అమెరికా ఎగుమతులే 33 మిలియన్‌ టన్నులు. వాటి మీద 25శాతం అదనంగా దిగుమతి పన్ను విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అందువలన అంత పన్ను చెల్లించి దిగుమతి చేసుకోవటమా ప్రత్యామ్నాయం చూసుకోవటమా అన్నది చైనా ముందు వుంది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో గతేడాది 119 మిలియన్‌ టన్నుల సోయా వుత్పత్తి కాగా దానిలో 51మిలియన్‌ టన్నులు చైనాకు ఎగుమతి చేశారు. ఇది 2016కంటే 33శాతం ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా వుండేందుకు చైనా తన ప్రయత్నాలలో తాను వున్నట్లు ఈ పరిణామం తెలియ చేస్తోంది.బ్రెజిల్‌ కరెన్సీ విలువ తక్కువ వుండటంతో అమెరికా కంటే తక్కువ ధరలకు అది ఎగుమతి చేయగలుగుతోంది. దీంతో ఇటు చైనా వినియోగదారులు, అటు బ్రెజిల్‌ రైతులు లబ్దిపొందుతున్నారు.

మూడు దశాబ్దాల నాటి అంటే 1986ా88 సంవత్సరాలలో వున్న ప్రపంచ ధరల సగటు ప్రాతిపదికన ప్రపంచ వాణిజ్య సంస్ధ సబ్సిడీలను లెక్కిస్తోంది. అందువలన అప్పటి మన కనీస మద్దతు ధరలను ఇప్పటితో పోల్చితే చాలా ఎక్కువగా వున్నట్లు కనిపించటం సహజం, దాన్ని చూపే అమెరికా మన మీద డబ్ల్యుటివోలో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆ సంస్ధలో వున్న నిబంధనల లసుగు లేదా ధనిక దేశాలకు అనుగుణంగా రూపొందించిన ఫార్ములాలకు అనుగుణంగా అనేక రూపాలలో తన రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ మనవంటి వర్ధమాన దేశాల రైతాంగాన్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. నిబంధనావళి ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో పదిశాతం మేరకు సబ్సిడీలు ఇవ్వటానికి అవకాశం వుంది. ఆ మొత్తంలో ఏ పంటకు ఎంత ఇవ్వాలన్నది తమ ఇష్టమని ధనిక దేశాలు వాదిస్తున్నాయి. వుదాహరణకు వంద రకాల పంటలకు అనుమతించిన సబ్సిడీ మొత్తం వంద రూపాయనుకుందాం. ఒక్కొక్క పంటకు రూపాయి బదులు పది పంటలకు పది రూపాయల చొప్పున ఇస్తే అభ్యంతర పెట్టకూడదని అమెరికా వాదిస్తోంది. ఆ పద్దతిలో అమెరికా, ఐరోపా యూనియన్‌లో అనేక పంటలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాలు 50శాతానికి మించాయి. వుదాహరణకు అమెరికాలో వరికి 59శాతం సబ్సిడీ ఇస్తున్నారు. 2015 నవంబరులో మింట్‌ పత్రికలో డాక్టర్‌ రవికాంత్‌ రాసినదాని ప్రకారం అమెరికాలో ప్రతి రైతుకు 50వేల డాలర్ల మేర సబ్సిడీ ఇవ్వగా మన దేశంలో ఇచ్చినది కేవలం 200డాలర్లే. అక్కడి వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ జనానికి వూబకాయం పెరిగేందుకు తోడ్పడుతోందని సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే పత్రిక రాసింది. ఐరోపాయూనియన్‌ వుమ్మడి బడ్జెట్‌లో 40శాతం వ్యవసాయ సబ్సిడీలకే కేటాయిస్తున్నారు. ఈ విషయంలో అమెరికాాఐరోపా యూనియన్‌ మధ్య కూడా విబేధాలు వున్న కారణంగానే వ్యవసాయంపై గత పదిహేను సంవత్సరాలుగా ఒప్పందం కుదరటం లేదు. మన దేశం నుంచి ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, సామర్ధ్యనిర్మాణం, ఎగుమతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా రైతుల ఖాతాలో జమచేసి అమెరికా అభ్యంతర పెడుతోంది.

అమెరికా లేదా ఇతర ఐరోపా ధనిక దేశాలు మన వ్యవసాయం మీద దాడిని ప్రధానంగా కేంద్రీకరించాయి. భారీ సబ్సిడీలతో వారి వుత్పత్తులను మన దేశంలో కుమ్మరించాలని చూడటం ఒకటైతే మన వుత్పత్తులు ప్రపంచమార్కెట్లో వాటికి పోటీ రాకుండా చూడటం మరొకటి. మన దేశంలో ఏదో ఒక ఏడాదో, రెండుసార్లో తప్ప మొత్తం సబ్సిడీలు జిడిపిలో ఒకశాతానికి మించటం లేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్యాలకు ఏటా ఇస్తున్న పన్ను రాయితీల మొత్తం నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల వరకు వుంటోంది. ఇది జిడిపిలో 5-8శాతం. ఈ రంగాలలో అమెరికా, ఇతర ధనిక దేశాల నుంచి వస్తున్న ప్రత్యక్ష పెట్టుబడులు లేదా సంస్ధల వాటాల కొనుగోలు చేస్తున్నవారికి ఈ మొత్తంలో లాభాల రూపంలో వాటా ముడుతోంది కనుక ఆ దేశాలకు ఎలాంటి అభ్యంతరాలు కనిపించటం లేదు.

Image result for subsidies to us farmers 2018

ఇక అమెరికాలో ఇస్తున్న సబ్సిడీల తీరుతెన్నుల గురించి చూద్దాం. ఒక తాజా నివేదిక ప్రకారం సబ్సిడీ లేదా ప్రకృతి వైపరీత్యాల నష్ట పరిహారంగాని 1985-2016 మధ్య 27,930 వ్యవసాయ క్షేత్రాల యజమానులకు చెల్లించిన మొత్తం 19బిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం వున్న రూపాయి మారకపు విలువలో ఏడాదికి సగటున ఒక్కొక్క యజమాని పొందిన మొత్తం నాలుగు కోట్ల 67లక్షలకు పై మాటే. గరిష్టంగా ఒక యజమాని పొందిన మొత్తం 76కోట్ల రూపాయలకు పైగా వుంది. రానున్న పది సంవత్సరాలలో వ్యవసాయ సబ్సిడీల నిమిత్తం 868 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఎవరికి ఎంత ఎలా చెల్లించాలనే అంశంపై వివాదం తలెత్తటంతో మే నెలలో వ్యవసాయ బిల్లుకు ఆమోదం లభించలేదు. సవరణలతో మరోమారు ఓటింగ్‌కు రానున్నది. పెద్ద యజమానులకు మరింత ఎక్కువ, చిన్న వారికి తగ్గించే ప్రతిపాదనలు వున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వున్న చట్ట ప్రకారం వ్యవసాయ నష్టభయం కింద నమోదు చేసుకున్న రైతులకు ఒక వ్యక్తికి ఏడాదికి లక్షా 25వేల డాలర్లకు మించి చెల్లించే అవకాశం లేదు. ఏడాదికి తొమ్మిది లక్షల ఆదాయపరిమితిని విధించారు. ఈ పరిమితిని తగ్గించి పరిహార మొత్తాన్ని పెంచాలనే ప్రతిపాదనలున్నాయి. రైతుల బీమా ప్రీమియంలో ప్రభుత్వం 62శాతం మొత్తం చెల్లిస్తోంది. అక్కడ కూడా చిన్న రైతులకు అన్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి. బీమా కంపెనీలకు ప్రభుత్వం 14శాతం లాభానికి గ్యారంటీ ఇస్తున్నది. ఆ మేరకు ఎంత లాభం తగ్గితే అంత ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతిదానికీ నిర్ణీత ధర నిర్ణయించే అమెరికాలో రైతులకు సరఫరా చేసే నీటిని మార్కెట్‌ ధరలో కొన్ని సందర్భాలలో పదిశాతం మొత్తానికే అందచేస్తున్నారు. అక్కడి వ్యవసాయదారులలో పదిశాతం బడా యజమానులకు 90శాతం సబ్సిడీ అందుతున్నది. 2015లో దేశంలోని 21లక్షల మంది రైతులలో రెండులక్షల పదివేల మందికి ప్రభుత్వ చెల్లింపులలో 70, పంటల బీమా సొమ్ములో 78శాతం దక్కింది. మిగిలిన వారిలో 80శాతం మందికి నామమాత్రం లేదా అసలు అందని పరిస్ధితి వుంది.చెరకు సాగులో రసాయన ఎరువుల వాడకం వలన ఎవర్‌గ్లాడ్స్‌ ప్రాంతంలో వాగులు, వంకలలో చేరిన కాలుష్యాన్ని తొలగించేందుకు 2035నాటికి 10.5 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే లాభాలు యజమానులకు, కాలుష్య పరిహారం ప్రజలు చెల్లించాలన్నమాట. వ్యవసాయ వస్తువులతో వ్యాపారం చేసే వారికి కూడా ఏటా 20బిలియన్‌ డాలర్ల మేర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నది.

అమెరికా వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం ప్రత్యక్షంగా పరోక్షంగా 60కిపైగా పద్దతులలో రైతులకు సాయం చేస్తున్నారు. 2014లో వ్యవసాయ పరిశ్రమలో పని చేసిన వారు 8.27లక్షలు, మొత్తం వ్యవసాయ క్షేత్రాలు 20,48,000, సగటున ఒక వ్యవసాయ క్షేత్రం 440 ఎకరాలుంటుంది. పదహారు బీమా కంపెనీలు పంటల బీమా చేస్తున్నాయి. ప్రీమియం సబ్సిడీగా గత ఐదు సంవత్సరాలలో సగటున 6.7బిలియన్‌ డాలర్ల సబ్సిడీ చెల్లించారు.బీమా కంపెనీలకు ఇచ్చిన సబ్సిడీ 1.5బిలియన్‌ డాలర్లు, వాటికి వచ్చిన నష్టానికి పరిహారం 30కోట్ల డాలర్లు, ప్రభుత్వ యంత్రాంగ ఖర్చు 20కోట్ల డాలర్లు. వందరకాల పంటలకు బీమా వర్తిస్తుంది. బీమా కంపెనీలు అక్రమాలకు పాల్పడటం షరా మామూలు. ప్రభుత్వం సగటున 62శాతం బీమా సొమ్ము చెల్లిస్తోంది.2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రైతులు చెల్లించిన ప్రీమియం కంటే అదనంగా 65బిలియన్‌ డాలర్లు పొందారు. బీమాకు అందరూ అర్హులే కావటంతో బిలియనీర్లు కూడా సబ్సిడీలను పొందుతున్నారు.

వ్యవసాయ నష్టభయం కింద ఒక రైతు ఎకరా ఆదాయం లేదా ఆ ప్రాంతంలో ఎకరాకు గ్యారంటీ ఆదాయం కంటే తక్కువ పొందితే వారికి గ్యారంటీ ఇచ్చిన మేరకు పరిహారం చెల్లిస్తారు. ఇరవై పంటలకు దీనిని వర్తింప చేస్తున్నారు.గతేడాది 3.7బిలియన్‌ డాలర్లు చెల్లించారు. పార్లమెంట్‌ సూచించిన పంట జాతీయ సగటు ఆదాయం కంటే తక్కువ వచ్చిన రైతులకు ఆ మేరకు చెల్లిస్తారు. గతేడాది ఆ మొత్తం 3.2బిలియన్‌ డాలర్లుంది.పై రెండు పధకాలలో రైతులు దేనినో ఒకదానిని ఎంచుకోవాలి. ఇదే సమయంలో వారికి పంటల బీమా పరిహారం అదనం. కొన్ని ప్రాంతాలలో భూమిని అభివృద్ధి చేసినందుకు, మరికొన్ని చోట్ల సాగు నిలిపివేసి భూమిని కాపాడినందుకు కూడా ఇస్తున్న సొమ్ము మొత్తం ఏడాదికి ఐదు బిలియన్‌ డాలర్లుంది. పంట సమయంలో తక్కువ ధరలకు అమ్ముకోకుండా రైతాంగానికి రుణాలు ఇస్తే మంచి ధర వచ్చే వరకు పంటలను నిలువ చేసుకొనే పధకం వుంది. ఆ మేరకు ధరలు తగ్గితే దానికి కూడా పరిహారం ఇస్తారు. ఇక్కడ కూడా వ్యవసాయ సబ్సిడీలకోత లేదా ఎత్తివేయాలనే ప్రతిపాదనలు లేకపోలేదు. ఏడాదికి ఐదులక్షల డాలర్లకు మించి ఆదాయం వచ్చే రైతులకు సబ్సిడీలను ఎత్తివేస్తే ఏటా 6బిలియన్‌ డాలర్లు, పంటల బీమా సబ్సిడీ ఒక క్షేత్రానికి 40వేల డాలర్లకు పరిమితం చేస్తే రెండుబిలియన్‌ డాలర్లు ఆదాఅవుతాయని అంచనా.

అమెరికాలో 2016 సగటున ఏడాది కుటుంబాదాయం 83,143డాలర్లు కాగా వ్యవసాయ కుటుంబాలకు 1,17,918 వుంది. మొత్తంగా దారిద్య్రరేఖకు దిగువన వున్న కుటుంబాలు 14శాతం కాగా వ్యవసాయ రంగంలో అది రెండుశాతం వుంది. వ్యవసాయ సబ్సిడీలు అధిక వుత్పత్తికి దారితీస్తున్నాయని,భూమి దెబ్బతినటానికి, పర్యావరణానికి, ఇతరత్రా హానికరమని,అవినీతికి దారితీస్తున్నాయని, ఇతర వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయని, జనమీంద అదనపు భారం మోపుతున్నాయని బలంగా వాదిస్తున్నవారు వున్నారు. వ్యవసాయంలో వచ్చే లాభాలను వ్యవసాయేతర రంగాలలో వస్తున్న నష్టాలను భర్తీ చేసుకొనేందుకు, పన్నుల ఎగవేతకు వుపయోగించుకుంటున్నారనే విమర్శలున్నాయి. మన దేశంలో వ్యవసాయం గిట్టుబాటు కానందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను చూస్తున్నాం తప్ప ఇతర రంగాలలో అలాంటి పరిస్ధితి లేదు. అమెరికాలో వున్న గణాంకాల ప్రకారం వ్యాపారాలలో ప్రతి పదివేల సంస్ధలకు ఎనిమిది చొప్పున దివాలా ప్రకటిస్తుండగా వ్యవసాయంలో ఆ రేటు రెండు నుంచి మూడు వరకు మాత్రమే వుంది. గతేడాది 2.4గా నమోదైంది. మన దేశంలో ధనిక రైతులు ఏదో విధంగా నెట్టుకు వస్తుండగా పేద, మధ్యతరగతి, కౌలు రైతులు వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పులపాలై చివరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న అమెరికా !

17 Sunday Jun 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

Donald Trump starting trade war, TRADE WAR, US-CHINA TRADE WAR

Image result for Is Donald Trump starting trade war

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక బఫూన్‌ కావచ్చు, కానీ అతగాడి వాణిజ్య యుద్ధం నిజం, ట్రంప్‌ ఎల్లవేళలా వాణిజ్య యుద్ధాన్ని కోరుకుంటాడు, ఇప్పుడు ఎన్నో తెచ్చుకున్నాడు, ట్రంప్‌ వాణిజ్య యుద్ధం ఎంతటి తప్పిదమో ఒక విదూషకుడు కూడా చెప్పగలడు, గనులు, రైతుల లక్ష్యంగా వాణిజ్య యుద్ధం ఇప్పటికే ట్రంప్‌ గుండెకాయను తాకింది, చైనా పన్నులు ఇప్పటికే ట్రంప్‌ ఓటర్లను దెబ్బతీస్తున్నాయి, ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు’.పత్రికలను తిరగేస్తే కనిపిస్తున్న కొన్ని వార్తల శీర్షికలివి. నిజంగా వాణిజ్య యుద్దమే వస్తే కలిగే లాభనష్టాలేమిటన్నది ప్రతి దేశమూ లెక్కలు వేసుకొంటోంది. గతంలో పెట్టుబడిదారీ వ్యవస్ధ విస్తరణ కోసం ప్రారంభించిన వాణిజ్య యుద్ధాలు చివరికి దేశాల ఆక్రమణలు, వలసలు, పలు ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అనేక ప్రాంతీయ కూటముల ఏర్పాటు ద్వారా మార్కెట్లను విస్తరించుకొనే, రక్షించుకొనే చర్యలకు పూనుకున్నారు. ఇప్పుడు సరికొత్త రక్షణాత్మక చర్యలకు పూనుకోవటమే తాజా వాణిజ్య యుద్ధ శంఖాల పూరింపు. ఇవి మార్కెట్ల విస్తరణ కాంక్షను, పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన తీవ్ర సమస్యలనూ వెల్లడిస్తోంది.

ట్రంప్‌ బఫూనా లేక వయస్సుతో వచ్చిన చిత్త చాంచల్యంతో ఇలా ప్రవర్తిస్తున్నాడా ? కొంత మందికి నిజంగా కలుగుతున్న సందేహాలివి. అమెరికా పీఠంపై ఒక విదూషకుడిని, ముది, మది తప్పిన ముసలివారిని కూర్చో పెట్టేందుకు అక్కడి కార్పొరేట్‌ శక్తులేమీ తెలివితక్కువవి కాదు. పెట్టుబడిదారీ ప్రపంచంలో తలెత్తే సంక్షోభాలను ఇతరుల మీదకు తోసి వేసేందుకు సామ,దాన, బేధోపాయాలు విఫలమైన తరువాత దండోపాయాన్ని ప్రయోగిస్తారు. దానిలో ఒక రంగం వాణిజ్య యుద్ధం. కమ్యూనిస్టు చైనా మీదే కాదు, పక్కనే వున్న తన అనుంగు దేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు అంతర్జాతీయ రంగంలో దుర్మార్గపు పనులు చేసేందుకు సై అంటే సై అని కలసి వచ్చే ఐరోపా ధనిక దేశాల మీద కూడా ట్రంప్‌ ఇప్పుడు బస్తీమే సవాలు అంటూ పలు రంగాలలో దాడులకు సిద్ధం అవుతున్నాడు. కొద్ది వారాల క్రితం చైనాతో వాణిజ్య యుద్ధం దాదాపు వచ్చినట్లే అనేంతగా వాతావరణం ఏర్పడినపుడు నాటకీయంగా పరిష్కారమైందని చెప్పారు. ఇప్పుడు తిరిగి మొదలైంది. ఈ రోజు మరణిస్తే రేపటికి రెండు అన్నట్లుగా అమెరికాను పక్కన పెడితే ఇంకా ఆరుగురం వున్నాం, జి6 బృందాన్ని ఏర్పాటు చేద్దాం అంటూ ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించటాన్ని చూస్తే వీటి పర్యవసానాలు అంత తీవ్రంగా వుంటాయా అంటే అవునని చెప్పలేము. ఎందుకంటే ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటంతో పాటు తమకు పోటీదారుగా తయారవుతున్న చైనాను వుమ్మడిగా తప్ప ఎదుర్కోలేమనే భావంతో వున్నాయి. అందువల్లనే పైకి బింకాలు పోయినా వాటి మధ్య రాజీకి అవకాశాలు వున్నాయి. గత మూడు దశాబ్దాల పరిణామాలను చూసినపుడు ధనిక దేశాల మధ్య విబేధాల గ్రాఫ్‌ వూర్ధ్వముఖంగా పయనిస్తోంది.

Image result for Is Donald Trump starting trade war cartoons

కెనడా, ఐరోపా యూనియన్‌, మెక్సికోల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకొనే వుక్కు వుత్పత్తులపై 25, అల్యూమినియంపై పదిశాతం పన్నులు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించాడు.ఇది అంతటితో ఆగకుండా కెనడా, జపాన్‌ ఆటోమొబైల్‌ రంగం మీద కూడా పన్నులు విధించే అవకాశం వుంది. జూలై నుంచి చైనా నుంచి వచ్చే దిగుమతులపై 50బిలియన్‌ డాలర్ల మేరకు పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. తాపీగా మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అన్నట్లుగా తాము కూడా అదే పని చేయకతప్పదని తనదైన శైలిలో చైనా ప్రకటించింది. ఈ వైఖరి చివరకు ప్రపంచ మాంద్యానికి దారి తీస్తుందా అన్న భయాలు తలెత్తుతున్నాయి. గతేడాది అమెరికా వాణిజ్య లోటు 566 బిలియన్‌ డాలర్లు,ఇది దాని జిడిపిలో 2.9శాతం. జి7 దేశాల మధ్య వాణిజ్య సుంకాలు చాలా తక్కువగా వున్నాయి. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై ఐరోపా యూనియన్‌ సగటున కేవలం మూడుశాతమే పన్ను విధిస్తోంది. మనదేదో ప్రపంచ పిగ్గీబ్యాంక్‌ అయినట్లు ప్రతివారూ దాన్నుంచి లబ్ది పొందుతున్నారు, ఇదింకేమాత్రం కుదరదని ట్రంప్‌ పదే పదే చెబుతున్నాడు. నిజానికి అమెరికాకు నష్టం అనేది తప్పుడు ప్రచారమే. అనేక రూపాలలో దానికి వచ్చే ఇతర ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటే అది మిగులులోనే వుంటుంది.

గుండెలు బాదుకుంటున్న అమెరికా వాణిజ్య లోటులో సగానికి పైగా (385బిలియన్‌ డాలర్లు) ఒక్క చైనాతోనే వుంది. అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలు కూడా వాణిజ్యలోటు విషయంలో చైనా పట్ల గుర్రుగా వున్నాయి. అదే సమయంలో వివిధ కారణాలతో అమెరికా మాదిరి చైనాతో యుద్ధానికి అవి సిద్దంగా లేవు. ఇదే సమయంలో తాత్కాలికంగా అయినా అమెరికాతో కలసి ఐక్యంగా దాడి చేసే స్ధితిలో కూడా లేవు. అమెరికాకు ఇప్పుడున్న అప్పును చూస్తే ప్రతివారికీ ఆందోళన కలుగుతోంది. మమ్మల్ని కాపాడుకోవటం మీకే శ్రేయస్కరం అన్నట్లుగా అమెరికా వైఖరి కనిపిస్తోంది. అనేక యుద్ధాలలో దెబ్బలు తిన్న అమెరికా ఒకవైపు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధాలతో పాటు రెండో వైపు వాణిజ్య యుద్ధాలకు తెరలేపుతోందని భావిస్తున్నారు. స్వేచ్చా వాణిజ్యం గురించి ఇంతకాలం చెప్పిన అమెరికా దానికి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతోంది. కెనడా, ఐరోపాయూనియన్‌, మెక్సికో వంటి తన మిత్రదేశాలతో పాటు రాజకీయంగా వ్యతిరేకించే చైనాతో యుద్ధానికి పూనుకుంది. సహజంగానే ఈ దేశాలు కూడా ప్రతి చర్యలకు పూనుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వర్గం తక్కువ వ్యయంతో ఎక్కడ వస్తువులు తయారైతే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ తన లాభాలను కాపాడుకుంటోంది. ఆ విధంగా చూసినపుడు ఆ దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా పన్నులు విధించటమంటే తన వినియోగదారులపై భారం మోపటం ఒకటైతే ఎగుమతి చేసే దేశంలో వుత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. అందువలన వుభయతారకంగా సమస్యను పరిష్కరించుకోవటం అందరికీ మేలు. కానీ ట్రంప్‌ అలా అనుకోవటం లేదు, తాను పన్నులు విధిస్తే ఇతర దేశాలు భయపడిపోయి తమ దగ్గర ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేస్తాయని, తద్వారా అమెరికన్‌ కార్పొరేట్ల లాభాలకు ముప్పు వుండదని భావిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయం, ద్రవ్యరంగం, సాఫ్ట్‌వేర్‌ రంగాలలో పెద్ద మొత్తంలో లాభాలు సంపాదిస్తోంది. అందుకనే వస్తూత్పత్తి రంగంలో వస్తున్న వడిదుడుకులను ఎదుర్కోగలుగుతోంది. చౌకగా తయారయ్యే దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుండటం, యాంత్రీకరణతో వస్తూత్పత్తి రంగంలో అమెరికన్లకు నానాటికీ పని లభ్యత తగ్గిపోతోంది. వేతనాలు తగ్గిపోతున్నాయి, అది కొనుగోలు శక్తి క్షీణతకు దారి తీస్తుంది. దాని వలన దేశీయంగా వస్తూత్పత్తి కూడా పడిపోతుంది. ఇది ఒక విష వలయం. ఇప్పటికిప్పుడు అమెరికా తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకొనే ధరలకు తయారు చేసి తన వినియోగదారులకు అందించగలదా? అంత సీను లేదు. అందుకే మిగతాదేశాలు కూడా కన్నుకు కన్ను పన్నుకు పన్ను సై అంటున్నాయి. ఇది మరింత ముదిరితే మిగతా దేశాలు తమ వస్తువులు,సేవలను కొనుగోలు చేయటం మానుకుంటే తమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అమెరికన్లలో వుంది. అమెరికా నుంచి వస్తున్న సేవలు, వస్తువులు ఆగిపోతే ఆయా దేశాలు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకుంటే నష్టపోయేది అమెరికాయే. లేదూ అదే వ్యాపారం ఇతర దేశాలకు పోయినా నష్టపోయేది అమెరికన్‌ కార్పొరేట్లే. ప్రతి దేశమూ కొన్నింటికి ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్ధితులలో అమెరికా కొండెక్కితే మిగతా దేశాలు కూడా అదే చేస్తాయి. అందుకే వాణిజ్య యుద్ధం తమకు నష్టదాయకమని అమెరికన్లు భావిస్తున్నారు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధానికి ఇప్పుడున్న లోటు కంటే భవిష్యత్‌లో ఎదురయ్యే పోటీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మేడిన్‌ 2025పేరుతో చైనా రోబోటిక్స్‌, ఏరోస్పేస్‌, పారిశ్రామిక యంత్రాలు, ఆటోమొబైల్‌ రంగాలలో వున్నత సాంకేతిక పరిజ్ఞాన వుత్పత్తుల తయారీ దిశగా ముందుకు పోతోంది. ఇప్పటి వరకు ఆ రంగంలో అగ్రగామిగా వున్న అమెరికాకు మరిన్ని సవాళ్లు ఎదురుకావటం అనివార్యం. అందుకే ముందుచూపుతో అదిరింపులు బెదిరింపులకు పూనుకుందనేది ఒక అభిప్రాయం.

అమెరికాలో వుపాధి తగ్గిపోవటానికి చైనా, ఇతర తక్కువ వ్యయమయ్యే దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటమే అనే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్‌ పాలకవర్గం ప్రయత్నిస్తోంది. ఇది పూర్తివాస్తవం కాదు. అమెరికాలో పెరిగిన యాంత్రీకరణ ఒక ప్రధాన కారణం అన్నది అనేక మంది చెబుతున్న నిజం. అదే విధంగా ఒక్కొక్క దేశం పట్ల ఒక్కో కారణం చెబుతోంది. చైనా అక్రమవాణిజ్య పద్దతులకు, సాంకేతికపరిజ్ఞాన చోరీకి పాల్పడుతున్నదంటూ ఆరోపిస్తుండగా కెనడా,మెక్సికో, ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి చేసుకొనే దిగుమతులు తమ రక్షణకు ముప్పు తెస్తున్నాయని అంటోంది. అమెరికాతో రెండవ పెద్ద వాణిజ్య సంబంధాలున్న కెనడా వుత్పత్తులను పన్నుల పెంపు నుంచి మినహాయిస్తామని చెప్పిన ట్రంప్‌ మాటతప్పాడు. గతేడాది రెండు దేశాల మధ్య వాణిజ్యంలో అమెరికాదే మిగులు. అమెరికా పాడి వుత్పత్తులపై 270శాతం పన్నులు విధిస్తోందంటూ కెనడాపై ట్రంప్‌ మండి పడ్డారు. కెనడాతో అమెరికా జరుపుతున్న 680 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంలో పాడి వుత్పత్తుల శాతం 0.1 మాత్రమే, 99శాతం వాణిజ్యంపై అసలు పన్నులే లేవు.కెనడా తన రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా గతేడాది అమెరికాతో మూడుబిలియన్ల లోటులోనే వుంది. పోనీ అమెరికా ఏమైనా వుదారంగా వుంటోందా అంటే లేదు. అక్కడి పొగాకు పరిశ్రమకు ఇతరుల నుంచి పోటీ లేకుండా చూసేందుకు దిగుమతులపై 350శాతం పన్నులు విధిస్తోంది.

ట్రంప్‌ చర్యకు ప్రతిగా చైనా ప్రారంభించిన ఎదురుదాడిలో భాగంగా 34బిలియన్‌ డాలర్ల మేరకు వ్యవసాయ వుత్పత్తులు, 16బిలియన్‌ డాలర్ల మేరకు బగ్గు, చమురు వంటి వాటిపై దిగుమతి పన్నులు పెంచింది. తరువాత మరికొన్నింటిని పెంచుతామని ప్రకటించింది. గత నెలలో సయోధ్య కుదిరిన సమయంలో తాము అమెరికా వ్యవసాయ వుత్పత్తుల కొనుగోలు పెంచుతామని చైనా పేర్కొన్నది ఇప్పుడు వాటిమీదే ఎక్కువ పన్నులు విధించింది.తొలి దఫా ప్రకటించిన 50బిలియన్‌ డాలర్ల పన్నులు గాకుండా తదుపరి మరో వంద బిలియన్ల మేరకు విధిస్తామని ట్రంప్‌ బెదిరించాడు.

Image result for Is Donald Trump starting trade war cartoons

ఆంబోతుల మధ్య లేగదూడలు నలిగినట్లు మన దేశ పరిస్ధితి వుంది. ఒకవైపు ఈ యుద్ధంతో మనం లాభపడవచ్చని కొందరు సంతోషపడుతున్నారు. నరేంద్రమోడీ ఏ దేశం వెళ్లినా ఆ నాయకులతో ఎంతో సాన్నిహిత్యం వున్నట్లు వెల్లడించేందుకు ఆలింగనాలు చేసుకుంటున్నారు. ట్రంప్‌తో కూడా అలాగే చేశారు. వుక్కు వుత్పత్తులపై 25, అల్యూమినియంపై 10శాతం పన్నుల నుంచి మన దేశాన్ని మినహాయించాలని వేడుకున్నా ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా తిరస్కరించింది. మన మంత్రి సురేష్‌ ప్రభు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఇప్పటి వరకు అమెరికాకు 30వస్తువుల విషయంలో ఇస్తున్న 24 కోట్ల డాలర్ల రాయితీలను వుపసంహరించనున్నట్లు ప్రకటించారు. స్వదేశంలో విమర్శలపాలైన మోడీ ఎంతగా విదేశాల్లో పర్యటించినా మన ఎగుమతులు నానాటికీ తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు.ఆర్‌సియిపిలోని పదహారింటిలో ఏడు దేశాలతో మన వాణిజ్య లోటు పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. 2017-18లో చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో మన వాణిజ్యలోటు 97.71బిలియన్‌ డాలర్లు, అంతకు ఏడాది 77.58 బిలియన్‌ డాలర్లు మాత్రమే వుంది. మన దేశంలో వుత్పాదకశక్తి తక్కువగా వున్నందున ఇతర దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా బలవంతులకు తప్ప మనకు పయోజనం వుండదు. నాలుగేండ్లుగా మోడీ మేకిన్‌ ఇండియా ప్రభుత్వ ప్రకటనలకే పరిమితం తప్ప అడుగు ముందుకు సాగలేదు. అమెరికా-చైనా-ఐరోపా యూనియన్‌ మధ్య ఒకవేళ నిజంగా వాణిజ్య యుద్ధమే జరిగితే మన వుత్పత్తులకు జరిగే ప్రయోజనం ఎంతో తెలియదు గానీ చైనా నుంచి మరిన్ని దిగుమతులు పెరగటం ఖాయం. అందువలన ధనిక దేశాల మధ్య తలెత్తిన వాణిజ్య యుద్ధ పరిణామ పర్యవసానాలు, పరిష్కారాలు ఎలా వుంటాయన్నదే ఆసక్తి కరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుత్తర కొరియాతో ఒప్పందం ఓకే, ఇరాన్‌ మాటేమిటి ట్రంప్‌ !

13 Wednesday Jun 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

denuke deal with north korea, Donald trump, iran, Kim Jong-un, kim-trump meet, North Korean leader Kim Jong-un, nuclear threat

ఎం కోటేశ్వరరావు

తాతా మనవల వంటి డోనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ అన్‌ అనూహ్య భేటీ ముగిసింది. విశ్లేషకులందరూ ఎవరిది పైచేయి, ఎవరు తామనుకున్నది సాధించారు అనే మల్లగుల్లాల్లో తలమునకలై వున్నారు. ఎవరేం చెప్పినా ఒక చిన్న దేశమైన వుత్తర కొరియా ప్రపంచానికి ఒక పెద్ద సందేశం ఇచ్చింది. బలవంతమైన సర్పం చలిచీమల చేతుల్లో హతమౌతుందన్నది పాత అనుభవం అయితే ఒళ్లంతా అణుబాంబులు కట్టుకొని తిరిగే ప్రపంచంలోనే బలవంతుడైన అమెరికాను అదుపులోకి తెచ్చుకోవాలంటే ఒక్క అణుబాంబు, దానిని అమెరికా గడ్డ మీదకు ప్రయోగించగలిగిన క్షిపణి వుంటే చాలని వుత్తర కొరియా నిరూపించిందని చెప్పక తప్పదు. ప్రపంచ మానవాళిని వందసార్లు చంపటానికి అవసరమైనన్ని మారణాయుధాలు మా దగ్గర వున్నాయని ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. పిచ్చిపట్టిన అమెరికా అధ్య క్షుడెవరైనా అణుమీట ఒకసారి నొక్కితేనే ప్రపంచం భస్మీపటలం అవుతుంది, రెండోసారికే ఏమీ వుండదు, ఇంక వందసార్లకు అవకాశం ఎక్కడుంటుంది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే వారికి బాగా అర్ధం అయిన విషయం ఏమంటే తమ దేశం నుంచి బయలుదేరిన అణ్వస్త్రం మారణహోమం సృష్టించకముందే ఇతర దేశాలలో వున్న అణుమీటలు కూడా పని చేసి అన్ని వైపుల నుంచి అమెరికాను చుట్టుముడతాయని, అన్నీ ఒకేసారి అందరినీ హతమారుస్తాయని తెలుసు.

‘ఇప్పుడే విమానం దిగాను, సుదీర్ఘ ప్రయాణం, అయితే నేను పదవీ బాధ్యతలు స్వీకరించేనాటితో పోలిస్తే ఇప్పుడు మరింత సురక్షితం అని ప్రతి ఒక్కరు భావించవచ్చు. కిమ్‌ జోంగ్‌ అన్‌తో భేటీ చాలా ఆసక్తికరంగా ఎంతో సానుకూల అనుభవంతో జరిగింది. వుత్తర కొరియాకు మంచి భవిష్యత్‌ వుంది. నేను అధికారాన్ని స్వీకరించబోయే ముందు మనం వుత్తర కొరియాతో యుద్ధానికి దిగబోతున్నామని జనం అనుకుంటున్నారు. వుత్తర కొరియా మనకు అతి పెద్ద ప్రమాదకర సమస్య అని బరాక్‌ ఒబామా చెప్పాడు, అలాంటిదింకేమీ లేదు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి అని సింగపూర్‌ నుంచి అమెరికా గడ్డపై కాలు పెట్టగానే ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. అంటే అమెరికన్లలో ఎంత భయం గూడు కట్టుకొని వుందో, దానిని పోగొట్టటం అక్కడి ప్రభుత్వానికి ఎంత అవసరమో ఇవి విదితం చేయటం లేదా ?

కొరియాలో యుద్ధవిన్యాసాలు ఆపుతామని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. వచ్చే ఏడాది 716బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. కిమ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ కొరియా ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పాడు. అంతటితో ఆగలేదు, మా గువామ్‌ దీవి నుంచి విమానాలను తీసుకు వచ్చి దక్షిణ కొరియాలో విన్యాసాలు చేయించి తిరిగి ఆ దీవికి తీసుకుపోవాలంటే మాకు చాలా ఖర్చు అవుతోంది, సింహభాగం మేమే భరించాల్సి వస్తోంది అని వ్యాఖ్యానించి ఇంటా బయటా నవ్వుల పాలయ్యాడు. అడుసుతొక్కనేల కాలు కడగనేల. ఎవరు విన్యాసాలు చేయమన్నారు, ఎవరికోసం చేస్తున్నారు, ఖర్చు భరించటం చేతకానపుడు కొనసాగించటం ఎందుకు? అసలు యుద్ధ విన్యాసాలు ఆపమని వుత్తర కొరియా అసలు అడిగిందా? మా ప్రాంతం నుంచి తుండు తుపాకీ మొత్తంగా సర్దుకొని మీ దేశానికి వెళ్లిపోయి మా రెడు దేశాలను ఐక్యం చేసేందుకు అడ్డుతొలగండి అని డిమాండ్‌ చేస్తోంది తప్ప, విన్యాసాలకే పరిమితం కావటం లేదు. జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధపోరాటం ప్రారంభించి, తరువాత అమెరికాతో యుద్దంతో చేసి, గత ఆరున్నర దశాబ్దాలుగా అణ్యాయుధాల మోహరింపులు, యుద్ద విన్యాసాలు, బెదిరింపుల మధ్య పెరిగిన వుత్తర కొరియన్లను యుద్ద విన్యాసాలు ఏమాత్రం భయపెట్టలేదని రుజువైంది. గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్లు ప్రయోజనం లేని విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పినంత మాత్రాన కొరియా సమస్య పరిష్కారం కాదు.

కొరియా ద్వీపకల్పంలో అమెరికా తిష్ట ఎందుకు వేసిందో కమ్యూనిస్టులు చెబితే, ఆ వారు అంతకు మించి ఏమి చెబుతారులే అని చాలా మంది పట్టించుకోరు. సింగపూర్‌లో ట్రంప్‌ ప్రకటన తరువాత అమెరికాలోని స్వంత రిపబ్లికన్‌ పార్టీ నేతలే వ్యతిరేకించారు. తమ నేత తెలివి తక్కువ ప్రకటన చేశాడని పార్టీ ఎంపీ లిండ్‌సే గ్రాహమ్‌ వ్యాఖ్యానించాడు. చేస్తున్న ఖర్చు వూరికే పోవటం లేదని అసలు కొరియాలో దళాల తిష్ట చైనాకు హెచ్చరిక అంటూ కొనసాగించాలని కోరాడు. అంటే దుష్టఆలోచన మనసులో పెట్టుకొని గడ్డికొస్తావా పిల్లా అన్నట్లుగా దక్షిణ కొరియా రక్షణ పేరుతో ఇంతకాలం అమెరికా చేస్తున్న యుద్ధ విన్యాసాలు, బలగాల మోహరింపు చైనాకు వ్యతిరేకం అని గ్రాహమ్‌ చెప్పకనే చెప్పాడు. సమగ్రమైన ఒప్పందం మీద సంతకం చేశామని ట్రంప్‌ చెప్పాడు. గతంలో వుత్తర కొరియాతో కుదిరిన ఒప్పందాలతో పోలిస్తే ఇది ఒక స్పష్టత లేని, ఎలాగైనా భాష్యం చెప్పటానికి, చర్చకు దారితీసేదిగా వుందనే అభిప్రాయం అమెరికాలో వెల్లడైంది. ఎవరూ వ్యతిరేకించటం లేదు గానీ సంతోషించటానికి ఏముంది అని పెదవి విరుస్తున్నారు.2005లో కుదిరిన ఒప్పందంలో మరోనాలుగు ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వాములు ఇప్పుడు వాటి ప్రస్తావన లేదు.

వుత్తర కొరియా అణు సమస్య పరిష్కారం అంటే అది సమగ్రమైంది కాదు.దీనిలో రెండు అంశాలున్నాయి. వుత్తర కొరియా అణు కార్యక్రమం నిలిపివేత అంటే ఆయుధాల తయారీ తప్ప శాంతియుత ప్రయోజనాల కార్యక్రమాన్ని నిలిపి వేయటానికి ఏ దేశమైనా అంగీకరిస్తుందా? దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా మోహరించిన అణ్వాయుధఛత్రం, ఇతర ప్రమాదకర క్షిపణులు, సైన్యం మాటేమిటి? వీటి గురించి సింగపూర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు, ఒప్పందమూ కుదరలేదు. సమస్యల పరిష్కారానికి ఒక సూత్రప్రాయ అంగీకారం మాత్రమే కుదిరింది కనుక ప్రపంచమంతా ఈ పరిణామాన్ని సహజంగానే హర్షిస్తోంది. వుత్తర కొరియా పూర్తిగా అణుకార్యక్రమాన్ని నిలిపివేయాలంటే దానికి జరిగే నష్టాన్ని ఎలా భరిస్తారు, ఎవరు భరిస్తారు, ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను ఎలా, ఎంతకాలంలో తొలగిస్తారు, దానికి హామీ ఏమిటి అనేక అనేక అంశాలు పరిష్కారం కావాల్సి వుంది. వీటిపై గతంలో అంగీకరించిన ఒప్పంద నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన మచ్చ వుంది. ఒకవైపు వుత్తర కొరియాతో చర్చలు జరుపుతూనే అణు సమస్యపై ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగింది. అన్ని ప్రధాన దేశాలతో వాణిజ్యలోటు కలిగి వున్న అమెరికా అదిరించి బెదిరించి తన వుత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఈ క్రమంలో దానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిఘటన ఎదురవుతున్నది. వుత్తర కొరియాను అదుపు చేసే పేరుతో ఇంతకాలం పెద్ద మొత్తంలో అమెరికా నిధులు ఖర్చు చేసింది. అనుకున్నట్లుగా ఒప్పందం అమలు జరిగితే ఇప్పుడు సైనిక విన్యాసాలకు బదులు వుత్తర కొరియా రక్షణ గురించి ఖర్చు చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. దాన్ని ఎవరి మీద రుద్దుతుంది? ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి వుంది.

Image result for denuke deal with north korea

ఒప్పందాల విషయంలో గతంలో అమెరికా ఇతర దేశాల నిర్వాకం చూసిన తరువాత వుత్తర కొరియా తన రక్షణకు మరింత జాగ్రత్త పడుతుంది. వుదాహరణకు 30దేశాలు నిధులు అందచేసే కొరియా ద్వీపకల్ప ఇంధన అభివృద్ధి సంస్ధ(కెడో) ద్వారా 250 కోట్ల డాలర్లు వెచ్చింది ఒక అణుఇంధన రియాక్టర్‌ను నిర్మించారు. దానికి అమెరికా 50కోట్ల డాలర్ల విలువగల తేలిక జల ఇంధనాన్ని సమకూర్చేందుకు ఖర్చు చేసింది. చివరికి దాన్ని 2006లో మూసివేశారు. అయితే దానికి రెండువందల కోట్ల డాలర్లను సమకూర్చాయి. ఆమొత్తం సొమ్ము దానిని నిర్మించిన ఐరోపా యూనియన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ కంపెనీలకే తిరిగి చేరింది తప్ప వుత్తర కొరియాకు ఒరిగిందేమీ లేదు. ఒప్పందం విఫలం కావటంతో వుత్తర కారియా అప్పటి వరకు అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ పర్యవేక్షణలో వుంచిన ప్లూటోనియం రాడ్ల సీళ్లను తొలగించి తిరిగి అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి అమెరికాదే పూర్తి బాధ్యత.

ప్రాంతీయ రాజకీయాలు, దేశాలలో జోక్యం చేసుకోవటంలో అమెరికాను మించిన వారు ఇప్పుడు లేరు. వుదాహరణకు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తొత్తుగా చేసుకొని అమెరికా పాల్పడని జోక్యం లేదు. చివరకు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా తయారు చేసి కిరాయికి ప్రయోగిస్తోంది. అలాంటి అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో ఇరాన్‌ జోక్యం చేసుకొంటోందనే నెపంతో దానితో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇప్పుడు వుత్తర కొరియా నుంచి ప్రమాదం లేదు, హాయిగా నిదురపొండి అని తన జనానికి చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఇరాన్‌ గురించి ఏమి చెబుతారు? కొద్ది రోజుల తరువాత వుత్తర కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కూడా తూ నా బడ్డుబాలు అని చెప్పరన్న గ్యారంటీ ఏముంది? అందుకే అమెరికా అడుతోంది రాజకీయం తప్ప మరొకటి కాదు అని చెప్పాల్సి వస్తోంది. వుత్తర కొరియాలో నిర్బంధించిన అమెరికన్ల విడుదల కొరకు ఆదేశం ఎలాంటి మొత్తాన్ని డిమాండ్‌ చేయలేదు. ఇరాన్‌లో బందీలైన అమెరికన్లను విడిపించుకొనేందుకు 40కోట్ల యూరోలను విమానంలో తరలించి, దానిలోనే బందీలను వెనక్కు తీసుకువచ్చారు. అయితే ఆ సొమ్మును ఒప్పందం ప్రకారం సరఫరా చేయని మిలిటరీ పరికరాల కోసమని అమెరికా చెప్పుకొన్నది. అలాంటి మొత్తం అయితే ఇంకా 200 కోట్ల డాలర్ల వరకు అమెరికా చెల్లించాల్సి వుంది. ఇవన్నీ చూసినపుడు అమెరికా ఆడుతున్నది రాజకీయం తప్ప ప్రపంచశాంతి సమస్యపై దానికి చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d