• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

డోనాల్డ్‌ ట్రంప్‌ నోట మరో పచ్చి అబద్దం !

01 Tuesday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

another big lie from Donald Trump, Donald trump, donald trump motormouth, policing the world, U.S. Military Bases Worldwide, US World Police Cap

Image result for donald trump , us world police

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే ! అమెరికా పాలకవర్గమూ అలాంటిదే ! వారికి యుద్ధమూ లాభమే, పోరు నిలిపివేతా లబ్ది చేకూర్చేదే అయితే దేనికైనా సిద్ధపడతారు ! అది ఆసియా ఖండమా, ఐరోపానా అన్నదానితో నిమిత్తం లేదు ! అందుకు డెమోక్రాట్లు- రిపబ్లికన్లూ అన్న తేడా లేదు ! అవసరమైతే పార్లమెంటులో రెండు పార్టీలు కలసి ఎవరు అధ్యక్షుడిగా వున్నా అడ్డుకుంటాయి లేదా మద్దతు ఇస్తాయి ! ఆ రెండు పార్టీల మధ్య తగాదా అధికారం దగ్గర తప్ప కార్పొరేట్ల ప్రయోజనాల గురించి కాదు. తమ లక్ష్యాన్ని చేరుకొనేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలు, అనుసరించాల్సిన మార్గాల మీద తప్ప లక్ష్యం మార్పు రద్దు గురించి కాదు. అమెరికా రాజకీయాలు, విధానాలను నిర్ణయించేది అక్కడి గుత్త సంస్ధలు తప్ప సామాన్యులు కాదు. రాజకీయ నేతలు వాటి తోలుబమ్మలే. అందుకే వారు ఎలా ఆడిస్తే అలా ఆడతారు. అమెరికా ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అన్నింటా అగ్రస్ధానం తమదే అనే దాని ఆటలు సాగటం లేదు. అదిరింపు, బెదిరింపు, బుజ్జగింపు, లాలింపు, తప్పదనుకుంటే రాజీ ఇదీ ఇప్పటి దాని స్ధితి. ఇలా చెప్పటం అంటే అమెరికా పని అయిపోయిందని కాదు. అగ్రరాజ్యానికి కూడా అనువుగాని పరిస్ధితులు ఎదురైనపుడు సింహం కూడా ఒకడుగు వెనక్కు వేయకత తప్పదు. ఏమిటా పరిస్ధితి, ఎందుకీ పరిణామాలు !

సిరియా నుంచి పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సగం మంది సైనికులను వుపసంహరించనున్నట్లు ట్రంప్‌ సంచలన ప్రకటన, దానికి నిరసనగా దేశ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ రాజీనామా, ఆ తరువాత మెక్సికో సరిహద్దులో గోడకు నిధుల కేటాయింపుపై పార్లమెంట్‌లో వ్యతిరేకత, అది ప్రభుత్వ స్ధంభనకు దారితీత, ఇది కొనసాగుతుండగానే ఆకస్మికంగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో తిష్టవేసిన అమెరికన్‌ దళాల వద్దకు వెళ్లి ఇంకేమాత్రం అమెరికా ప్రపంచ పోలీసుగా వుండబోదని ఒక ప్రకటన. ఇవన్నీ పక్షం రోజుల్లో వరుసగా జరిగిన పరిణామాలు. అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సంక్షోభం, సమస్యల తీవ్రతకు ప్రతిబింబాలు. ఒక వారంలో ఒకదాన్ని సంచలనాంశంగా మారిస్తే మరో వారంలో మరో అంశాన్ని ముందుకు తెస్తున్న ట్రంప్‌ తీరుతెన్నులు ప్రపంచానికి పజిల్‌గా వుంటున్నాయి. ఒక ప్రకటన చేయటం దాని మీద స్పందనలు ఎలా వుంటాయో చూడటం, దానికి అనుగుణ్యంగా తదుపరి చర్యలు. వీటిలో ప్రపంచ పోలీసుగా అమెరికా పాత్ర గురించి వివరంగా పరిశీలించుదాం. చరిత్రలో తొలి ప్రపంచ పోలీసుగా బ్రిటన్‌ వ్యవహరిస్తే తదుపరి ఆ పాత్రను అమెరికా పోషిస్తోంది. కర్రవున్నవాడిదే గొర్రె అన్నట్లుగా ప్రపంచంపై పెత్తనం కోసం తమకు తాముగా కర్రపెత్తనం చలాయించటం తప్ప ఈ దేశాలకు ఎవరూ ఆ బాధ్యతను అప్పగించలేదు. ఆ పాత్రలో తామింక వుండలేమని ట్రంప్‌ చెప్పటం వెనుక పరమార్ధం ఏమిటి?

రేపటి నుంచి మిమ్మల్ని తినబోనని పులి చెబితే మేకలు నమ్ముతాయా, ట్రంప్‌ మారుమనస్సు పుచ్చుకున్నాడా ? ఎందుకింత పెద్ద అబద్దం చెప్పాడు. అమెరికా సమాజానికి ఇది ఒక ప్రజాకర్షక అంశంగా తయారైంది. అందుకే ఇటీవలి కాలంలో ఎవరు అధికారంలో వున్నా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాల్సివస్తోంది. ప్రపంచ పోలీసు పాత్రలో వుండాలనుకోవటం లేదు అన్న మాటలు కాదు, కొనసాగింపు అంశం ముఖ్యం. ‘ భారం మొత్తం మేమే భరించటం సముచితం కాదు. మమ్మల్ని, నిస్సందేహమైన మా మిలిటరీని తమ రక్షణకు వుపయోగించుకోవాలని ఇతర దేశాలు చూడటాన్ని ఇంకేమాత్రం మేము కోరుకోవటం లేదు.’ అన్నాడు.ప్రస్తుత స్ధాయిలో అమెరికా మిలిటరీ ఖర్చు వెర్రి తప్ప మరొకటి కాదు, అదుపులేని ఆయుధపోటీగా మారినందున అర్ధవంతమైన ముగింపు పలకాలి, ఒక రోజు తాను, చైనా, రష్యా నాయకులు దీని గురించి చర్చ ప్రారంభించకతప్పదు అని గతంలో ట్రంప్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.జనాభాలో సగం, జిడిపిలో పదోవంతు కలిగిన పొరుగుదేశం వుత్తర కారియానుంచి రక్షణ కోసం దక్షిణ కొరియాను అమెరికా ఎందుకు కాపాడాలి. అమెరికా కంటే రష్యాకు మరింతదగ్గరగా వుంది జర్మనీ, తూర్పు నుంచి (రష్యా) నుంచి వస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది జిడిపిలో ఒక శాతం కూడా ఖర్చు చేయటం లేదు వాటికోసం అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి అని కూడా ప్రశ్నించాడు. గత కొద్ది సంవత్సరాలుగా తమ మిలిటరీ రక్షణ పొందాలని చూసే దేశాలు అందుకయ్యే ఖర్చులో అధికభాగం భరించాలని అమెరికా సందర్భం వచ్చినపుడల్లా చెబుతోంది, వత్తిడి తెస్తోంది. దక్షిణ కొరియాలో ఏటా మూడున్నర బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి తమ సైన్యాన్ని అక్కడ ఎందుకు కొనసాగించాలని ట్రంప్‌ గతేడాది ప్రశ్నించాడు. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా వుండాలంటే కొనసాగించక తప్పదని సిరియానుంచి సైనిక దళాల వుపసంహరణను వ్యతిరేకిస్తూ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మాటిస్‌ స్పష్టం చేశాడు. ఇస్లామిక్‌ తీవ్రవాదులను అణచే పేరుతో సిరియాలో ఏటా 15, ఆఫ్ఘనిస్తాన్‌లో 45 బిలియన్‌ డాలర్లను ఏటా అమెరికా ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేసి సాధించేదేమిటి? అనే ప్రశ్నకు పాలకులు సూటిగా సమాధానం చెప్పే స్ధితిలో లేరు.

పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల విశ్లేషణ, అవగాహన ప్రకారం ఒక దేశ రక్షణ ఖర్చు కంటే అప్పుల చెల్లింపు ఎక్కువైన దేశాలు కుప్పకూలిపోతాయి. గతంలో కమ్యూనిజాన్ని, తరువాత ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని అణచే పేరుతో లేదా వాటి నుంచి దేశాలను రక్షించే సాకుతో ప్రపంచ వ్యాపితంగా అమెరికా తన సేనలను మోహరించింది. ప్రత్యక్షంగా ఆయా దేశాల గడ్డమీద లేదా ఏ క్షణంలో అయినా జోక్యం చేసుకొనేందుకు వీలుగా సమీప ప్రాంతాలలో వేసిన తిష్టవలన గానీ 150 దేశాల్లో అమెరికా సైన్యాలు వున్నట్లు లెక్క. ప్రస్తుతం అమెరికా జాతీయ రుణ భారం 21లక్షల కోట్ల డాలర్లు.2012లో ఫెడరల్‌ లోటు బడ్జెట్‌ లక్ష కోట్లు దాటగా 2018లో 779 బిలియన్‌ డాలర్లుంది.2020 నాటికి ఐదుశాతం రక్షణతో సహా ప్రతి శాఖ కోత విధించాలని ట్రంప్‌ కోరాడు. రుణ చెల్లింపులు రక్షణ ఖర్చుకంటే ఎక్కువైన కారణంగానే రోమన్‌ సామ్రాజ్యం, సోవియట్‌ యూనియన్‌ దివాలా తీశాయని, అమెరికా ఇప్పుడు దానికి దగ్గరగా వస్తోందని హార్వర్లు ప్రొఫెసర్‌ నియాల్‌ ఫెర్గూసన్‌ హెచ్చరించాడు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా సైనిక కేంద్రాలు వివిధ ప్రాంతాలు, సముద్రాలలో ఐరోపాలో 330, ఆసియాలో 210, మధ్య ప్రాచ్యంలో 73, లాటిన్‌ అమెరికాలో 71, పసిఫిక్‌లో 66, ఆఫ్రికాలో 24,కెనడా లేదా గ్రీన్‌లాండ్‌లో నాలుగు, అట్లాంటిక్‌లో రెండు చొప్పున మొత్తం 750 వున్నాయి.

ఇటీవల పార్లమెంట్‌ బడ్జెట్‌ కార్యాలయం(సిబిఓ) తెలిపిన సమాచారం ప్రకారం 2018లో జాతీయ అప్పు మీద చెల్లించిన వడ్డీ 371బిలియన్‌ డాలర్లు, ఇది రక్షణ బడ్జెట్‌లో సగం. ప్రస్తుత బడ్జెట్‌ పోకడలను బట్టి ఐదు సంవత్సరాలలో రక్షణ కంటే వడ్డీ చెల్లింపులకు కేటాయించాల్సిన మొత్తం పెరగనుంది. పది సంవత్సరాలలో వడ్డీ,సామాజిక భద్రత వంటి పధకాలకు పన్ను వసూళ్లలో 85శాతం ఖర్చు అవుతుందని, జిడిపిలో 2018లో 3.1శాతంగా వున్న రక్షణ బడ్జెట్‌ 2028నాటికి 2.6శాతానికి తగ్గనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఐరోపాలోని ధనిక దేశాల రక్షణ ఖర్చు గణనీయంగా పెరగనుంది. వడ్డీ రేట్ల పెరుగుదల అంచనా కంటే వేగంగా వుంటే ఇంకా ముందే ఏడాదికి వడ్డీ చెల్లింపులు 900బిలియన్‌ డాలర్లకు చేరి రక్షణ ఖర్చును మించి పోవచ్చు. చైనా, ఐరోపా యూనియన్‌ దేశాల రక్షణ ఖర్చు జిడిపిలో రెండుశాతానికి చేరితే త్వరలోనే అమెరికాతో సమం కావచ్చు. ఇప్పుడున్న తీరు తెన్నులను బట్టి 2035నాటికి చైనా, ఐరోపా యూనియన్‌లు అమెరికాను అధిగమించనున్నాయి.

సామ్రాజ్యం అంటే వలసలు లేదా అధీన రాజ్యాలు కలిగి వుండటం అన్నది సాంప్రదాయ అర్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆ పరిస్ధితి అంతరించింది కనుక ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ఎన్ని సైనిక కేంద్రాలు, ఎందరు సైనికులున్నారన్నది సామ్రాజ్యవాదానికి తాత్పర్యంగా చెప్పవచ్చు.దీనికి ముందే చెప్పుకున్న సైనిక కేంద్రాలే నిదర్శనం. చమురు రవాణా సక్రమంగా జరిగేందుకు నావల ప్రయాణించే మార్గాలు, పైపులైన్ల రక్షణ మొదలు అనేక వ్యూహాత్మక అవసరాలకు అమెరికా ఈ కేంద్రాలను, సైన్యాన్ని వినియోగిస్తున్నది. వీటికి ఏటా 156 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతున్నది. సాంప్రదాయక సామ్రాజ్యవాదం అది బ్రిటన్‌ లేదా ఫ్రెంచి, డచ్‌, పోర్చుగీసు, స్పెయిన్‌ ఏదైనా కావచ్చు, వందల సంవత్సరాలు వలస దేశాలలో తిష్టవేసి ప్రధానంగా వాటిని తమ పరిశ్రమలకు ముడివస్తువులను సరఫరా చేసే దేశాలుగానూ, పారిశ్రామిక వస్తువులకు మార్కెట్లగానూ వినియోగించుకున్నాయి. కానీ అమెరికా సామ్రాజ్యవాదం వీటితో పాటు అంతకు ముందు లేని కమ్యూనిజం వ్యాప్తి నిరోధం, కమ్యూనిస్టు దేశాల అణచివేతను కూడా జోడించి వివిధ ప్రాంతాలలో కుట్రలకు తెరలేపింది, నియంతలను బలపరిచింది, యుద్ధాలను, వాటికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ ఆర్ధికంగా లబ్దిపొందుతున్నది. ఈ కారణంగానే మిలిటరీ పారిశ్రామిక కార్పొరేట్‌లు అవతరించాయి.వుదాహరణకు మనకందరకు తెలిసిన బోయింగ్‌ కంపెనీ ప్రయాణీకుల విమానాలతో పాటు యుద్ధ జెట్‌ విమానాలతో పాటు అనేక మారణాయుధాలను కూడా తయారు చేస్తున్నది. అవి నిత్యం పని చేస్తూ వుండాలంటే ప్రపంచంలో నిత్యం ఏదో ఒక మూల ఒక దేశం మరొక దేశంతో కొట్లాడుకోవాలి లేకపోతే అమెరికాయే ప్రత్యక్షంగా ఎక్కడో ఒక చోట దాడులకు తెగబడుతూ వుండాలి. రక్షణ ఒప్పందాలు, ముప్పు పేరుతో అనేక దేశాలను తన గుప్పెటలోకి తెచ్చుకొని నిరంత ఆయుధ విక్రయాలతో దోపిడీ సాగిస్తున్నది. అలాంటి దేశం తెల్లవారేసరి తాను ప్రపంచ పోలీసు పాత్రనుంచి తప్పుకోవాలను కుంటుందా ? తన ఆయుధ పరిశ్రమలను మూసివేసుకుంటుందా ? లాభాలను వదులుకుంటుందా ?

Image result for donald trump on us world police cartoons

విదేశాలలోని సైనిక స్ధావరాలలో అమెరికా లక్షన్నర మంది సైనికులను మోహరించింది. నిజానికి పాతికేండ్ల క్రితం ప్రచ్చన్న యుద్ధంలో విజయం సాధించామని, కమ్యూనిజం అంతరించిందని చెప్పిన అమెరికా విదేశాల్లోని సగం సైనిక కేంద్రాలనైనా తక్షణమే మూసి వుండాల్సింది. కానీ కేంద్రాల సంఖ్యతో పాటు సైనికులను మోహరించిన దేశాల సంఖ్య కూడా 40 నుంచి 80కి పెరిగింది.సహజంగానే ఖర్చు కూడా తడిచి మోపెడు అవుతుంది. ఈ ఖర్చు ఎంతో నిజానికి బయటి ప్రపంచానికి తెలియదు. విదేశీ స్ధావరాల వార్షిక ఖర్చు ఎంత అని పార్లమెంట్‌ కోరితే 21 లేదా 22 బిలియన్‌ డాలర్లని పేర్కొన్నారు. అయితే దీన్నెవరూ నమ్మటం లేదు, ఏడాదికి కనీసం 250 బిలియన్‌ డాలర్లని కొందరి అంచనా. పైకి చెప్పకపోయినప్పటికీ జపాన్‌లో 113, దక్షిణ కొరియాలోని 83 సైనిక కేంద్రాలు నిజానికి ఏక్షణంలో అయినా చైనా లేదా రష్యాతో యుద్ధానికి తలపడే సన్నద్దతతో గత ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. దీని వలన సామాన్యజనానికి భారం తప్ప వారికి ఒరుగుతున్నదేమీ లేదు. ఆయుధ పరిశ్రమలకు నిరంతరం లాభాలు వస్తున్నాయి.నిరంతరం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అమెరికా 33 అప్రజాస్వామిక దేశాలలో సైనిక కేంద్రాలను నడుపుతున్నదని ఒక మాజీ అధికారి పేర్కొన్నాడు. ఇవే కాదు సైనిక స్ధావరం వున్న ప్రతి దేశం అమెరికా ఆయుధాలు, వస్తువులకు అవి మార్కెట్లుగా వున్నాయని వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే ట్రంప్‌ మరో పచ్చి అబద్దం ఆడాడని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 3 : చైనా లక్షణాలతో సోషలిజం అంటే ఏమిటి !

24 Monday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

china communist party, china reforms, Forty years of China Reforms, Socialism with Chinese Character

Image result for forty years china reforms

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కమ్యూనిస్టు వుద్యమ సైద్ధాంతిక చర్చలో రష్యా మార్గం, చైనా మార్గం అనే మాటలు వినిపించేవి. సారాన్ని సులభంగా అర్ధం చేసుకొనేందుకు ఆ పదజాలాన్ని వాడినప్పటికీ దేశంలో సోషలిజాన్ని ఎలా తీసుకురావాలి అనేదే ఆ చర్చ. కొందరు మాది చైనా మార్గం మావోయే మా చైర్మన్‌ అనేంత వరకు వెళ్లగా మరికొందరు తమది రష్యా మార్గమన్నారు. వామపక్ష వుద్యమంలో ప్రధాన భాగంగా వున్న సిపిఐ(ఎ) తమది చైనా కాదు రష్యా కాదు భారత మార్గం అని స్పష్టం చేసింది. అంటే ఏ దేశంలో వున్న పరిస్ధితులను బట్టి దానికి అనుగుణ్యంగా విప్లవశక్తుల కార్యాచరణ వుండాలి తప్ప ఏదో ఒక దేశాన్ని అనుసరించటం కాదని చెప్పటమే. అయితే ఆ మార్గం మంచి చెడ్డలు, అనుసరిస్తున్న ఎత్తుగడలు, విధానాల గురించి ఎవరైనా విమర్శించవచ్చు, విబేధించవచ్చు, చర్చించి పరిపుష్టం చేయవచ్చు అది వారికి వున్న స్వేచ్చ. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తరచూ చేసే వ్యాఖ్యానాలలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద నిర్మాణం, సమాజం వంటి అంశాలుంటాయి.

నిజానికి ఇది సైద్ధాంతిక అవగాహనకు సంబంధించినది. ఆచరణకు రానంత వరకు ఏ కొత్త భావజాలమైనా ఎంతగానో ఆకర్షిస్తుంది, ఆదర్శంగా వుంటుంది. దూరం నుంచి చూస్తే కొండలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. వాటి దగ్గరకు వెళ్లి ఎక్కాల్సివచ్చినపుడు ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతాయి. శక్తి రూపాలను మార్చుకున్నట్లుగానే దోపిడీ రూపాలు మారవచ్చు గానీ అనుమతించే వ్యవస్ధలున్న చోట దోపిడీ అంతం కాదు.మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం-ఆచరణకు సంబంధించి శాస్త్రీయమైనది. ఈ సిద్ధాంతాన్ని ఆయా దేశ, కాల పరిస్ధితులకు అన్వయించుకోవాల్సి వుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ విప్లవం ద్వారా అధికారాన్ని పొంది నూతన వ్యవస్ధ నిర్మాణానికి పూనుకుంది. సుదీర్ఘంగా సాగిన విప్లవకాలంలోనూ తరువాత మూడు దశాబ్దాల వరకు మావోఆలోచనా విధానం పేరుతో చైనా పరిస్దితులకు అన్వయించిన అంశాలను అమలు జరిపారు. మావో బతికి వుండగానే వచ్చిన అనుభవాల ప్రాతిపదికగా మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ హయాంలో సంస్కరణల విధానాన్ని అనుసరించారు. అప్పటి నుంచి చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అంటున్నారు. నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన చైనా సంస్కరణలు ఇప్పుడు 1980దశకం మాదిరే వుండవు. ఇప్పటి అవసరాలకు తగిన మార్పులు చేర్పులు వుండాలి. జనాభా అవసరాలకు అనుగుణంగా వుపాధి, కనీస అవసరాలు తీరాలంటే ఆర్ధిక వ్యవస్ధ వేగంగా అభివృద్ధి చెందాలి. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ అధికారం కింద సోషలిజానికి కట్టుబడి వుంటూనే మార్కెట్‌ సంస్కరణలను అమలు జరిపేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాజీలు పడ్డారు.

Image result for forty years china reforms

గతంలో ఏ సోషలిస్టు దేశంలోనూ ఇలాంటి ప్రయోగం జరపలేదు. మార్కెట్‌ విధానాలు పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్ధ పద్దతుల్లో లేవు, ప్రణాళికలు పూర్తిగా సోషలిస్టు పద్దతిలోనూ లేవు. చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుంది, భౌతిక సంపద స్ధాయి తక్కువగా వుంది, సోషలిస్టు సమ సమాజం తరువాత కమ్యూనిస్టు సమాజానికి దారి తీయాలంటే ముందు ఆర్ధిక పురోగతి సాధించాలి, దానికి గాను మార్కెట్‌ ఆర్ధిక విధానాలు సాధనమని అధికారానికి వచ్చిన రెండున్నర దశాబ్దాల తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహనకు వచ్చింది. నిజానికి చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుందని 1950దశకం చివరిలోనే కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. పరివర్తన దశలో వుత్పాదక శక్తులు బలహీనంగా వున్నాయని ఆర్ధికవేత్తలు హెచ్చరించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్దలలోనే సోషలిస్టు విప్లవం జయప్రదం అవుతుందన్న మార్క్సిస్టు తత్వవేత్తల అంచనా తప్పింది.పురోగామి వుత్పాదక సంబంధాలు వుత్పత్తిని పెంచుతాయన్న మావో ఆలోచన ఆచరణ రూపం దాల్చలేదు. సోవియట్‌ తరహా ప్రణాళికాబద్ద విధానాలు కూడా జయప్రదం కాలేదు. పెట్టుబడిదారీ విధానంలో లాభాలు వచ్చే వాటికే ప్రాధాన్యత వుంటుంది. సోషలిస్టు వ్యవస్దలో ప్రజల అవసరాలకు వుపయోగపడే వస్తూత్పతికి ప్రాధాన్యత వుంటుంది. ఈ రెండింటినీ మేళవించి అమలు జరిపిన విధానం కారణంగా చైనా శరవేగంతో అభివృద్ది చెందుతోంది.

చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ 1984చేసిన ఒక వుపన్యాసంలోచెప్పిన అంశాలను మననం చేసుకోవటం అవసరం. వాటి సారాంశం ఇలా వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసే నాటికి పాత చైనాను నాశమైన ఆర్ధికవ్యవస్ధను వారసత్వంగా తెచ్చుకున్నాము. పరిశ్రమలు దాదాపు లేవు. సోషలిజాన్ని ఎందుకు ఎంచుకున్నారని కొందరు అడుగుతారు. పెట్టుబడిదారీ విధానం చైనాలోని గందరగోళాన్ని లేదా దారిద్య్రం వెనుకబాటు తనాన్ని తొలగించదు. అందుకే మార్క్సిజానికి, సోషలిస్టు బాటకు కట్టుబడి వున్నామని పదే పదే చెబుతున్నాము. అయితే మార్క్సిజం అంటే మన అర్ధం చైనా పరిస్ధితులకు దానిని అసుసంధానించటం, సోషలిజం అంటే చైనా పరిస్ధితులకు అనుగుణ్యంగా ప్రత్యేకించి చైనా లక్షణాలతో రూపొందించుకోవటం. సోషలిజం, మార్క్సిజం అంటే ఏమిటి ? గతంలో దీని గురించి అంత స్పష్టత లేదు. వుత్పాదకశక్తుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతతో మార్క్సిజం ముడిపడి వుంది. కమ్యూనిజానికి ప్రాధమిక దశ సోషలిజం అని చెప్పాము. ఆ వున్నత దశలో ప్రతి ఒక్కరూ శక్తి కొద్ది పని చేయటం, అవసరం కొద్దీ వినియోగం వుంటుంది. దీనికి వున్నతంగా అభివృద్ధి చెందిన వుత్పాదకశక్తులు,సరిపడా సరకుల తయారీ అవసరం వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసిన తరువాత వుత్పాద శక్తుల అభివృద్ధికి తగిన శ్రద్ధ పెట్టకపోవటం ఒక లోపం. సోషలిజం అంటే దారిద్య్రాన్ని తొలగించటం, బికారితనం సోషలిజం కాదు. పశ్చిమ దేశాలలో పారిశ్రామిక విప్లవం సంభవించినపుడు చైనా తన తలుపులు మూసుకున్న విధానం అనుసరించింది. విప్లవం తరువాత ఇతర దేశాలు చైనాను దిగ్బంధనం కావించాయి. ఈ స్ధితి ఇబ్బందులను కలిగించింది. చైనా జనాభా 80శాతం గ్రామాలలోనే వుంది. వాటి నిలకడమీదనే చైనా స్ధిరత్వం ఆధారపడి వుంది. విదేశీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పద్దతులకు స్వాగతం పలికాము. అవి సోషలిజాన్ని పూర్వపక్షం చేస్తాయా, అవకాశం లేదు, ఎందుకంటే చైనా ఆర్ధిక వ్యవస్ధలో సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ ప్రధాన భాగం.సహజంగానే విదేశీ పెట్టుబడులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. సానుకూల అంశాలతో పోలిస్తే ప్రతికూల ప్రభావాలు అంత ముఖ్యమైనవి కాదు. మరొక సందర్భంలో మాట్లాడుతూ సోషలిజం-పెట్టుబడిదారీ వ్యవస్ధల మధ్య ప్రణాళికా బద్ద మరియు మార్కెట్‌ శక్తులనేవి అనివార్యమైన విభేదం కాదని చెప్పారు. సోషలిజం అంటే ప్రణాళికా బద్ద ఆర్ధిక వ్యవస్ధ అనే నిర్వచనమేమీ లేదని పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాదిరి ప్రణాళికాబద్ద మరియు మార్కెట్‌ శక్తుల ఆర్దిక వ్యవస్ధ సోషలిజంలో కూడా వుంటుందని రెండు శక్తులు ఆర్దిక వ్యవస్ధలను అదుపు చేస్తాయన్నారు.

ప్రపంచంలో సమసమాజం ఎలా స్ధాపించాలనే విషయంలో తలెత్తిన సైద్ధాంతిక సమస్యలు దోపిడీని ఎలా కొనసాగించాలనే అంశం మీద వ్యక్తం కాలేదు. ఈ కారణంగానే చైనాలో సాధించిన అభివృద్ధిని స్వాగతించేవారు కూడా ప్రస్తుతం అక్కడ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు, బిలియనీర్లు, ధనికుల సంఖ్యలను చూసి వారెక్కడ విప్లవాన్ని వమ్ము చేస్తారో అని భయపడుతున్నారు. మరోవైపు పెట్టుబడిదారుల్లో చైనా నాయకత్వం గురించి భయ సందేహాలు ఎలా పెరుగుతున్నాయో చూడటం అవసరం. 2018 అక్టోబరు మూడవ తేదీన అమెరికాకు చెందిన న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ‘ఆధునిక చైనాను నిర్మించిన ప్రయివేటు వాణిజ్యాలు, ఇపుడు వెనక్కు నెడుతున్న ప్రభుత్వం ‘ అనే శీర్షికతో ఒక విశ్లేషణ ప్రచురించింది. ప్రయివేటు వాణిజ్యాలను అనుమతించే బీజింగ్‌ అనుజ్ఞార్ధకం గతకొద్ది సంవత్సరాలుగా అల్లుకుపోతూ ముందుకు సాగింది. నియంతృత్వం(పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు చైనా కమ్యూనిస్టు పాలనను అలాగే వర్ణిస్తారు) మరియు స్వేచ్చా మార్కెట్‌ మధ్య దీర్ఘకాలంగా వున్న వుద్రిక్తలు ఇప్పుడు సందిగ్దబిందువు వద్దకు చేరుకున్నాయని చైనాలో కొందరు చెప్పారని వక్కాణించారు. ఆ విశ్లేషణ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

వ్యాఖ్యలు మెళకువతో కూడిన భాష వెనుక నక్కాయి, కానీ చైనా దిశ గురించిన హెచ్చరిక స్పష్టంగా వుంది. సంపదలతో పెరిగేందుకు తనలో భాగం మార్కెట్‌ శక్తులను ఆలింగనం చేసుకొన్నది. పొసగని గళాలతో ఇప్పుడు ప్రయివేటు సంస్ధలను ఖండిస్తున్నది. ఈ దృగ్విషయాన్ని గమనించాల్సివుంది అని మార్కెట్‌ అనుకూల ఆర్ధికవేత్త 88 ఏండ్ల వు జింగాలియన్‌ వ్యక్తం చేసిన అసాధారణ అధికారిక స్వరం చైనా వ్యాపార, ఆర్దికవేత్తలు, చివరికి కొంత మంది ప్రభుత్వ అధికారులలో కూడా పెరుగుతున్న ఆందోళనకు ప్రతిధ్వని. ప్రపంచంలో ఆర్ధికంగా రెండవ స్ధానంలోకి తీసుకుపోయిన స్వేచ్చా మార్కెట్‌, వాణిజ్య అనుకూల విధానాల నుంచి చైనా వెనక్కు తగ్గవచ్చు, గత నాలుగు దశాబ్దాలుగా నియంతృత్వ కమ్యూనిస్టు అదుపు మరియు స్వేచ్చగా తిరిగే పెట్టుబడిదారీ విధానం మధ్య చైనా వూగుతోంది. అక్కడ ఏమైనా జరగవచ్చు, లోలకం తిరిగి ప్రభుత్వంవైపే వూగవచ్చని కొందరికి కనిపిస్తోంది.

ఒకప్పుడు ప్రయివేటు వాణిజ్య సంస్దలు ముందుపీఠీన వున్న చోట పారిశ్రామిక వుత్పత్తి,మరియు లాభాలవృద్ధిలో రోజురోజుకూ ప్రభుత్వ అదుపులోని కంపెనీల వాటా పెరుగుతోంది. ఇంటర్నెట్‌ వ్యాపారం, రియలెస్టేట్‌, వీడియోగేమ్స్‌ను నియంత్రించేందుకు చైనా రంగంలోకి దిగింది. కంపెనీలు పన్నుల పెంపుదల, వుద్యోగులు పొందే లబ్ది ఖర్చును ఎక్కువగా భరించాల్సి రావచ్చు. కొందరు మేథావులు ప్రయివేటు సంస్ధలను పూర్తిగా రద్దు చేయాలని పిలుపులనిస్తున్నారు. అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రయివేటు సంస్ధలకు తమ ప్రభుత్వ మద్దతు వుంటుందని హామీ ఇస్తూ ప్రభుత్వరంగంలోని పెద్ద కంపెనీలకు పూర్తి స్ధాయి మద్దతు ప్రకటించటాన్ని ప్రయివేటు వాణిజ్యాలకు ఇంకచోటు లేదని చెప్పటమే అని అనేక మంది ఆర్ధికవేత్తలు నమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధ చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కేంద్రం ఒకదాని సందర్శన సందర్భంగా గ్జీ మాట్లాడుతూ ‘ ప్రభుత్వ రంగ సంస్ధలు వుండకూడదు, మనకు చిన్న ప్రభుత్వ సంస్ధలే వుండాలి’ అనే ప్రకటనలు తప్పు, ఏకపక్షమైనవి అన్నారు. చైనా అధ్యక్షుడు మిలిటరీ, మీడియా, పౌర సమాజం మీద పూర్తిగా పార్టీ అదుపు వుండాలని కోరతారు. ఇప్పుడు వాణిజ్యం మీద దృష్టి సారిస్తున్నారు. పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో నేరుగా వాటాలు తీసుకోవటం గురించి పరిశీలిస్తోంది. విదేశీ కంపెనీలతో సహా అన్నింటిలో కమ్యూనిస్టు పార్టీ కమిటీలకు పెద్ద పాత్ర కల్పించేందుకు నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వామపక్ష పండితులు, బ్లాగర్స్‌(వివిధ అంశాల మీద విశ్లేషణలు, అభిప్రాయలు రాసేవారు) ప్రభుత్వ అధికారులు సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన మద్దతు తెలియచేస్తున్నారు. ప్రయివేటు యాజమాన్యాలను తొలగించాలని జనవరిలో(2018) బీజింగ్‌లోని రెనిమిన్‌ విశ్వవిద్యాలయ మార్క్సిజం ప్రొఫెసర్‌ జౌ గ్జిన్‌చెంగ్‌ కోరారు. అభివృద్ధి లక్ష్యాన్ని ప్రయివేటు రంగం పూర్తి చేసిందని ఇప్పుడు దానికి స్వస్తి పలకాలంటూ వు గ్జీయపింగ్‌ అనే అంతగా తెలియని బ్లాగర్‌ రాసిన అంశం ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. మానవ వనరులు, సాంఘిక భద్రత వుప మంత్రి క్వి గ్జియపింగ్‌ ప్రయివేటు సంస్ధలలో ప్రజాస్వామిక యాజమాన్య పద్దతులు వుండాలని, యజమానులు-కార్మికులు సంయుక్తంగా వాటిని నడపాలని కోరారు. ప్రభుత్వ చర్యల వలన రుణాలపై ఆధారపడి నడిచే ప్రయివేటు కంపెనీలకు డబ్బు దొరకటం కష్టంగా మారింది, ఇదే సమయంలో ప్రభుత్వ రంగ కంపెనీలకు కొత్త రుణాలు పొందటంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవటం లేదు. ఒకప్పుడు అసలు వూహల్లోకి కూడా రాని వాటిని ఇప్పుడు కొన్ని ప్రయివేటు సంస్దలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఇంతవరకు 46 ప్రయివేటు కంపెనీలు సగానికిపైగా వాటాలను ప్రభుత్వానికి విక్రయించినట్లు వార్తలు వచ్చాయి.చైనా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే సంఖ్య చాలా చిన్నది అయినప్పటికీ ప్రయివేటు కంపెనీలకు వాటాలను విక్రయించే ప్రభుత్వ కంపెనీల రెండు దశాబ్దాల ధోరణికి ఇది వ్యతిరేకం.

Image result for forty years china reforms

కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగానికి ప్రత్యక్ష పాత్ర కల్పించిన తరువాత కొత్త వీడియో గేమ్స్‌కు అనుమతులు స్ధంభించాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ, వీడియో గేమ్‌ల్లో పేరు ప్రఖ్యాతులున్న టెన్‌సెంట్‌ కంపెనీమార్కెట్‌ విలువ దాదాపు మూడోవంతు పడిపోయింది. కొత్తగా తెచ్చిన చట్ట ప్రకారం ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే కంపెనీలు ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి, పన్నులు చెల్లించాలి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో ఒకటైన అలీబాబా గ్రూప్‌ను దెబ్బతీస్తుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ కంపెనీలకు ఇది మంచి సంవత్సరం. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఏడాది తొలి ఏడునెలల్లో ప్రయివేటు కంపెనీలతో పోటీ పడి మూడురెట్లు లాభాలు సాధించాయి. అధిక సామర్ద్యం, కాలుష్యనివారణ చర్యలు ఎక్కువగా ప్రయివేటు కంపెనీల మీద మోపుతున్న ప్రభుత్వ ప్రయత్నాలు కూడా దీనికి కారణం.

చైనా మ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన మార్గంలోనే సంస్కరణలు నడుస్తున్నాయా? లేదూ న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషకుడు చెబుతున్నట్లు ప్రభుత్వ రంగ అదుపులోకి తిరిగి చైనా అర్ధిక వ్యవస్ధ వెళ్ల నుందా? ఎంతకాలం పడుతుంది? వీటిన్నింటి గురించి చైనా వెలుపల కూడా చర్చించవచ్చు. అభిప్రాయాలను వెల్లడించవచ్చు. కోర్టు తీర్పులను విమర్శించవచ్చు గానీ న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు అన్నట్లుగా చైనా కమ్యూనిస్టు నాయకత్వానికి దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారి విధాన మంచి చెడ్డలను సమీక్షించవచ్చు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మాదిరి చైనాలో కూడా తప్పిదాలకు పాల్పడితే అనే పెద్ద సందేహం ఎవరికైనా తలెత్తవచ్చు. ఇప్పటికైతే అది వూహాజనిత సమస్య. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు సోషలిజం అనే భావజాలానికి కాలం చెల్లిందని అమెరికా ప్రకటించింది. అదే చోట ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం పనికిరాదు, అది కాలం చెల్లిన సిద్ధాంతం అని నమ్ముతున్నవారు, సోషలిజాన్ని అభిమానిస్తున్నవారు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నారు. సమాజ మార్పుకోరే పురోగామి శక్తులకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలవచ్చు గాని చరిత్ర ముందుకే పోతుంది, అంతిమ విజయం వారిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 2 : అమెరికాకు 69 ఏండ్లు , చైనాలో 18కే సాధ్యమైంది !

23 Sunday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Forty years of China Reforms, Xi Jinping

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై అమెరికా టెక్‌ వార్‌లో భారత్‌ ఎటువైపు !

19 Wednesday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, Huawei, us china tech war, US-CHINA TRADE WAR

Image result for  us china tech war

ఎం కోటేశ్వరరావు

మూడు నెలలపాటు వాణిజ్య యుద్ధ దాడులకు విరామం ఇద్దామని అమెరికా-చైనా నిర్ణయించాయి. ఇంతలోనే అమెరికా మరో యుద్దానికి తెరలేపింది. అదే టెక్నాలజీ యుద్ధం. చైనాలోని ప్రముఖ హైటెక్‌ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ హువెయి యజమాని కుమార్తె, కంపెనీ సిఎఫ్‌ఓ మెంగ్‌ వాన్‌జౌ అరెస్టు దానికి నాంది అని కొందరంటుంటే పర్యవసానాలపై గత ఇరవై రోజులుగా అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు కెనడాలో అరెస్టు చేసిన మెంగ్‌ను కోర్టుకు హాజరుపరిచారు. తమను రెచ్చగొట్టే ట్రంప్‌ సర్కార్‌ చర్యమీద చైనా ఇప్పటి వరకు ఎంతో సంయమనంతో వ్యవహరించింది. మెంగ్‌ అరెస్టు అయిన నాటి నుంచి తన కనుసన్నలలో వ్యవహరించే దేశాల మీద అమెరికా వత్తిడి తెస్తోంది. హువెయి కంపెనీ పరికరాలు, ఫోన్లు కొనవద్దని కోరుతోంది. దానిలో భారత్‌ కూడా ఒకటి. ఈ వ్యవహారం నరేంద్రమోడీ సర్కార్‌కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే చైనాతో వాణిజ్యలోటు కొండలా పెరిగిపోతోంది.మన వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ చైనాతో సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. ఆవు పేడను తయారు చేయటం తప్ప మోడీ మేకిన్‌ ఇండియా పధకం ముందుకు సాగటం లేదు. అమెరికా ఆదేశాల మేరకు హువెయి కంపెనీ వుత్పత్తుల కొనుగోలు నిలివి పేస్తే మరొక అగ్రదేశం తయారు చేసే ఐదవ తరం పరికరాల కోసం ఎదురు చూడటం తప్ప మనకు మరొక మార్గం లేదు. అదే చేస్తే చైనాకు ఇప్పుడు మనం చేస్తున్న ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ చర్య కారణంగా మరింతగా స్వదేశీయ పరిజ్ఞానం మీద ఆధారపడాలనే కసితో చైనా వ్యవహరించకూడదు అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాకు ఎదురైన చేదు అనుభవాలంటూ కొన్ని అంశాలను పేర్కొని టెక్నో జాతీయవాదం తెలివితక్కువ తనమని, వాణిజ్యదారులను మూసివేస్తుందని, భద్రతను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెంగ్‌ అరెస్టుపై నోరు మూసుకొని గత నాలుగు దశాబ్దాలుగా మార్కెట్‌ను తెరిచినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా వ్యవహరించకపోతే ఇప్పటి వరకు సాధించిన ప్రగతి దెబ్బతింటుందని పరోక్షంగా బెదిరించిందని చెప్పవచ్చు. ప్రపంచ కార్పొరేట్ల ప్రతినిధి అయిన మీడియా సంస్ధ నుంచి ఇలాంటివి వెలువడటంలో ఆశ్చర్యం లేదు.

డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలోని వాంకోవర్‌లో మెంగ్‌ ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారుతున్న సమయంలో కెనడా పోలీసులు ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య ఆమె మానవ హక్కులను హరించటమే అని చైనా పేర్కొనగా, ఆ చర్య కిడ్నాపింగ్‌ తప్ప మరొకటి కాదని చైనా మీడియా వర్ణించింది. అరెస్టులో తమ సర్కార్‌ ప్రమేయం లేదని కొద్ది రోజుల ముందే నోటీసు ఇచ్చామని కెనడా ప్రధాని ట్రడేవ్‌ ఆరు రోజుల తరువాత ప్రకటించారు. కొద్ది నెలల ముందే అరెస్టు వారంటు జారీ చేసినట్లు అమెరికా చెప్పింది. అమెరికా ఆంక్షలను వుల్లంఘిస్తూ ఇరాన్‌తో వ్యాపారం చేసేందుకు హువెయి కంపెనీ స్కైకామ్‌ అనే హాంకాంగ్‌ సంస్ధను అనధికార అనుబంధ సంస్ధగా వుపయోగించుకొని ద్య్రవ్య సంస్ధలను మోసం చేసేందుకు కుట్రపన్నిందని, తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా దాని చర్యలున్నాయని బెయిలు విచారణ సమయంలో అమెరికా చేసిన ఆరోపణలను కెనడా సర్కార్‌ వల్లించింది.అరెస్టయిన పదకొండవ రోజున వాంకోవర్‌లోని ఆమె ఇంటి నుంచి బయటకు పోకుండా షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు కెనడియన్లను భద్రతా కారణాలతో అరెస్టుచేసినట్లు చైనా అధికారులు ప్రకటించారు. అరెస్టు చేసిన మెంగ్‌ను తమకు అప్పగించాలని అమెరికా కోరింది. ఈ కేసులో 30సంవత్సరాల శిక్షపడే అవకాశం వుంది. అదే జరిగితే అమెరికా-చైనా సంబంధాలు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేము.

ఇటీవలి కాలంలో హైటెక్‌ వుత్పత్తులలో ఇతర దేశాలకు చైనా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. మనందరికీ తెలిసిన శాంసంగ్‌ కంపెనీ సెల్‌ఫోన్లు, టెలికమ్యూనికేషన్ల పరికరాల తయారీలో మొదటి స్ధానంలో వుండగా చైనా హువెయి కంపెనీ రెండవ స్ధానానికి ఎదిగింది. ఇప్పుడు అది 5జి సాంకేతిక రంగంలో ముందున్నదని, ఒకటవ స్ధానానికి ఎదగ నుందని వార్తలు వచ్చాయి. వ్యాపారంలో తలెత్తిన పోటీయే కంపెనీ సిఎఫ్‌ఓ అరెస్టుకు అసలు కారణమని చెబుతున్నారు. చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్‌ చైనా కంపెనీల పరికరాలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆరోపించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే అమెరికా పౌరులు హువెయి కంపెనీ సెల్‌ఫోన్లు, సంస్ధలు పరికరాలను వాడవద్దనే నిషేధాలను విధించారు. అమెరికా కనుసన్నలలో కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కూడా నిషేధం విధించాయి.ఈ ఐదు దేశాలకు చెందిన గూఢచార సంస్ధలు ‘ఫైవ్‌ ఐస్‌’ (ఐదు నేత్రాలు) పేరుతో చైనా కంపెనీ పరికరాలలో రహస్య పరికరాలు వున్నట్లు నివేదికలను రూపొందించాయి. జూలై 17న ఐదుగురు గూఢచార అధిపతులతో కెనడా ప్రధాని కెనడాలోని అట్టావాలో ఒక రహస్య సమావేశం నిర్వహించారు. దీనిలో సిఐఏ డైరెక్టర్‌ గినా హాస్పెల్‌, బ్రిటన్‌ ఎం16 అధిపతి మైఖేల్‌ యంగర్‌ పాల్గన్నారు. ఈ సమావేశం గురించి ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ దీన్నొక సాదాసీదా సమావేశంగా వార్తను ప్రచురించింది. ఆ తరువాతే చైనా, రష్యాల మీద పెద్ద ఎత్తున ప్రచార దాడిని ప్రారంభించారు. హువెయి కంపెనీ పరికరాలను కొన వద్దనే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. కంపెనీ అధికారిణి అరెస్టు దానికొనసాగింపు.జపాన్‌ ప్రభుత్వం, మూడు టెలికాం కంపెనీలు కూడా హువెయి పరికరాల కొనుగోలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.

Image result for us china tech war cartoons

ప్రపంచంలో అన్ని దేశాలలో గూఢచర్యం జరిపే అమెరికాకు ఇప్పుడు తన నీడను చూస్తే తానే భయపడుతున్నట్లుగా వుంది. తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలు దానిలో భాగమే. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆధునిక పరికరాలతో గూఢచర్యం ఎలా జరపవచ్చో అమెరికాకు వేరొకరు చెప్పనవసరం లేదు. అవే అస్త్రాలతను తమ మీద కూడా ప్రయోగిస్తున్నారని అది కంగారు పడుతోంది. ఈ రోజు ప్రతి దేశం తన అవసరాల కోసం, ఇతరుల కుట్రల గురించి జాగ్రత్తలు తీసుకొనేందుకు గూఢచర్యం జరపటం సాధారణ విషయం. దానిలో చైనా, మరొక దేశానికి ఎలాంటి మినహాయింపులు వుండవు. ఇప్పుడు అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో వున్నాయి. స్మార్ట్‌ ఫోన్లను అక్కడ తయారు చేయటం లేదు. చైనా ఫోన్లమీదే అమెరికన్లు ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో డెలాయిట్‌ కన్సల్టింగ్‌ విడుదల చేసిన ఒక నివేదికలో ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ ఏర్పాటు పరుగులో అమెరికా మీద చైనా విజయం సాధించనున్నది.అమెరికా వెంటనే రంగంలోకి దిగకపోతే భవిష్యత్‌లో నూతన కంపెనీల ఏర్పాటులో తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించింది. ఈ రంగంలో ముందున్న వారికి వెనుకబడినవారితో పోల్చితే ఎంతో ఆర్ధిక ప్రయోజనం వుంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి హెచ్చరికలనే చేశాయి.

రెండుసార్లు సిఐఏ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మైఖేల్‌ మోరెల్‌ వాషింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాఖ్యానంలో ఇది వాణిజ్య యుద్దం కాదు, సాంకేతిక యుద్ధం, ఐదవతరం పోటీలో మైలు దూరంలో అమెరికా వెనుకంజలో ఓడిపోతోందని మరింత స్పష్టంగా పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు తరచుగా వాణిజ్య యుద్ధం గురించి చెబుతాడు, నిజానికి అమెరికా సాంకేతికపరమైన ప్రచ్చన్న యుద్దం చేస్తోంది. ఐదవతరం నెట్‌వర్క్‌లతో గతంలో ఎన్నటి కంటే వేగంగా ఎక్కువ సమాచారాన్ని సేకరించవచ్చు, ఈ నెట్‌వర్క్‌ల ద్వారా గూఢచర్యమే కాదు, విద్రోహానికి కూడా పాల్పడవచ్చు, ఈ రంగంలో పై చేయి సాధించిన వారు ఆర్ధికంగా ముందుంటారు, తమ రహస్యాలను పదిలపరుచుకోవటంతో పాటు ఇతరుల వాటిని తెలుసుకోవటంలో ముందుంటారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నపుడు అమెరికా ఆందోళనపడక తప్పదని హెచ్చరించాడు.

ఐదవతరం ఇంటర్నెట్‌ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన, అభివృద్దిలో హువెయి కంపెనీ ఏటా 14బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా కంటే ముందున్నది. చైనా మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరిచిన సమయంలో అమెరికాకు చెందిన మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఐఫోన్‌ వంటి సంస్దలు తమ పరికరాల ద్వారా పెద్ద ఎత్తున చైనా గూఢచర్యానికి పాల్పడ్డాయి. నిజానికి అమెరికన్లు అన్ని దేశాలలో అలాంటి చర్యలకు పాల్పడ్డారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్‌ వర్తమానాలను దొంగిలించారు. చైనా అధ్యక్షుడు ప్రయాణించే బోయింగ్‌ 737 విమానంలో అమర్చిన రహస్య పరికరాన్ని చైనీయులు తొలగించారు. అమెరికా పరికరాలనే వుపయోగించి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికా రహస్య సమాచారాన్నే పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్నదంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఐదవ తరం పరిజ్ఞానంలో అమెరికా ఎందుకు వెనుకబడిపోయినట్లు? చైనాలో పరిశోధనలు చేయకుండా అది ముందుకు ఎలా పోయినట్లు ? నిజానికిది ప్రచార దాడి తప్ప ఒకసారి తస్కరించినట్లు తేలితే ఏ దేశమైనా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటుందా ?

Image result for  us china tech war

గతేడాది అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగింది. మేడిన్‌ చైనా 2025 పేరుతో అది కొన్ని లక్ష్యాలను దేశం ముందుంచింది. దాని కొనసాగింపుగానే అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అనేక చర్యలను చేపట్టారు. అన్ని రంగాలలో సాంకేతిక పరంగా పై చేయి సాధించాలన్నదే ఆ లక్ష్యాల, చర్యల సారాంశం. అది యుద్ధ ప్రాతిపదిక మీద అమలు జరుగుతోందా సాదాసీదాగా జరుగుతోందా అంటే గత నాలుగు దశాబ్దాల చైనా అభివృద్ధిని చూసినపుడు వారు ఏ లక్ష్యాన్ని సాదాసీదాగా అమలు జరపలేదు. నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని చేరేందుకు ప్రతి అంశంలోనూ యుద్ధం మాదిరి పని చేశారు. గతంలో సూపర్‌ కంప్యూటర్లంటే అమెరికా తప్ప మరొకపేరు వినపడేది కాదు. గత రెండు దశాబ్దాల్లో పరిస్ధితి మారిపోయింది. టాప్‌ 500 పేరుతో ఒక సంస్ధ రూపొందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 500 వేగవంతమైన కంప్యూటర్లలో 206 చైనా వద్ద, 124 అమెరికా వద్ద వున్నాయి. నాలుగు అగ్రశ్రేణి కంప్యూటర్లలో రెండు చైనా వద్ద వున్నాయి, ఇటీవలనే అమెరికా మూడవదానిని రూపొందించి మొదటి స్దానం తిరిగి పొందింది. పోటీలో నువ్వానేనా అన్నట్లుగా అమెరికా-చైనా వున్నాయి. మైక్రోచిప్స్‌ విషయంలో చైనా ఎంతో వెనుకబడి వుంది. అమెరికా పది తయారు చేస్తే చైనాలో ఒకటి మాత్రమే వుత్పత్తి అవుతోంది. 2025నాటికి అమెరికాతో ఢీకొనేందుకు చైనా 30బిలియన్‌ డాలర్లు కేటాయించింది.ప్రపంచమంతా ఇపుడు కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతోంది. 2030నాటికి ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండేందుకు చైనా 150బిలియన్‌ డాలర్లను కేటాయించి పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిజ్ఞానం రెండంచుల పదును కలది అటు మానవ కల్యాణానికి, వినాశకరమైన మిలిటరీ అవసరాలకు రెండింటికీ వినియోగపడుతుంది. ఐదవ తరం టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటులో అమెరికా ఇంకా ఆలోచనలోనే వుండగా చైనా దూసుకుపోయి కీలకమైన సాంకేతిక ప్రమాణాలను ప్రపంచం ముందుంచింది. మిగతా ప్రపంచం చైనాను అసుసరించటం తప్ప మేం కూడా వచ్చేంతవరకు మీరు ముందుకు పోవటానికి వీల్లేదంటే కుదరదు. క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారీకి ఇప్పుడు అగ్రరాజ్యాలు పోటీపడుతున్నాయి. దానిలో కూడా చైనా వెనుకబడి లేదు. ఇప్పటికే పది బిలియన్‌ డాలర్లతో పని ప్రారంభించింది. అదే అమెరికా రానున్న ఐదు సంవత్సరాలలో 1.25 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేయనున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా దుష్ట స్వభావం గురించి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్ధికవేత్త జెఫ్రీ శాచస్‌ సిబిసి టీవీతో చెప్పిన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం.

‘ మెంగ్‌ అరెస్టు మరో ప్రచ్చన్న యుద్దానికి నాంది అవుతుంది, అందుకు అమెరికాను కెనడా ప్రేరేపించింది. ఎట్టి పరిస్ధితుల్లో అయినా చైనా ఎదుగుదలను అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.ప్రత్యర్ధి ఆర్ధిక ఎదుగుదలను దెబ్బతీసేందుకు తన అధికారాన్ని వుపయోగించే అమెరికా వైఖరి బాగా తెలిసిందే, ఇది చాలా చెడ్డది, ప్రమాదకరమైంది, వాస్తవానికి ప్రపంచానికి మరొక కొత్త ప్రచ్చన్న యుద్ధాన్ని తెచ్చేది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తప్పుడు లెక్కలతో పత్తి, చెరకు రైతులకు హాని తలపెట్టిన అమెరికా, ఆస్ట్రేలియా !

06 Thursday Dec 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

cotton farmers, cotton subsidies, sugarcane, WTO

Image result for usa, australia stand against india farmers at wto

ఎం కోటేశ్వరరావు

అమెరికా, ఆస్ట్రేలియా వంటి ధనిక దేశాలు దౌత్యపరంగా మనకు మిత్ర దేశాలే. మన యువతీ యువకులు తెల్లారి లేస్తే ఏదో ఒక చోటికి వెళ్లాలని తహతహలాడుతుంటారు. మన పాలకులు అక్కడికి వెళ్లినపుడు, వారు ఇక్కడికి వచ్చినపుడు భారత దేశమా చుట్టుపక్కల 66 దేశాలకు పోతుగడ్డ అన్నట్లుగా మాట్లాడతారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లు, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా తమ దేశాల కార్పొరేట్ల ప్రయోజనాల విషయంలో మనకు ముఖ్యంగా రైతాంగానికి అవి శత్రుదేశాలే. ప్రపంచీకరణ పేరుతో మన పెట్టుబడిదారులు ఇతర దేశాలకు విస్తరించేందుకు, ఇప్పటికే విస్తరించిన బహుళజాతి కంపెనీలతో జత కట్టేందుకు మన పాలకవర్గం ప్రపంచీకరణ పేరుతో వాటికి ప్రాతినిధ్యం వహించే సంస్ధల సలహాలు, ఆదేశాలతో నడుస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే మన పాలకులు ఒక్కొక్క వలువ తీసివేసి చివరకు గోచి మీద నిలబెట్టినట్లు నామ మాత్ర రాయితీలు మిగిల్చాయి. ఇప్పుడు రైతాంగానికి మిగిలిన ఆ గోచిని కూడా తీసేయాల్సిందేనని ధనిక దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు ఆ పంచాయతీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో నడుస్తోంది.

అమెరికాాచైనా మధ్య జూలైలో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం గురించి మాత్రమే మనకు తెలుసు. ఆ యుద్దంలో దెబ్బతినే తన రైతాంగానికి ఇప్పటికే ఇస్తున్న సబ్సిడీలకు తోడు అదనంగా పత్తి, సోయా వంటి అనేక ఎగుమతి పంటలకు 12బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది అమెరికా. అలాంటి దేశం గతంలో వరి, గోధుమలపై ఇప్పుడు మన మీద పత్తి రాయితీలు పరిమితికి మించి ఇస్తున్నారంటూ కనీస మద్దతు ధరకు ఎసరు పెట్టింది. తప్పుడు లెక్కలతో ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)కు ఫిర్యాదు చేసింది. చెరకు రైతులకు, పంచదార ఎగుమతులకు ఇస్తున్న సబ్సిడీలు తమ రైతాంగాన్ని, మొత్తంగా ప్రపంచ పంచదార మార్కెట్‌ను దెబ్బతీశాయంటూ ఆస్ట్రేలియా కూడా అదే పని చేసింది. ఆ వాదన లేదా మనపై దాడికి ప్రాతిపదిక ఏమిటి? మన దేశంలో వున్న విభిన్న వాతావరణ పరిస్ధితుల కారణంగా అటు వుష్ణ మండల పంటలతో పాటు ఇటు శీతల మండల, సమశీతల మండల ప్రాంతాలలో సాగు చేసే పంటలలో కొన్ని మినహాదాదాపు అన్నింటినీ పండించే అవకాశం వుంది. అందుకే మన దేశాన్ని తన పరిశ్రమలకు ముడిసరకు సరఫరా చేసే ప్రాంతంగా పారిశ్రామిక విప్లవం తరువాత ఐరోపా ధనిక దేశాలు గుర్తించాయి. అందుకే ఆక్రమణ పోటీలో బ్రిటన్‌ది పైచేయి అయింది.మారిన పరిస్ధితుల్లో తమ అన్ని రకాల వ్యాపారాలు, వస్తుమార్కెట్లకు మన దేశం అనువుగా వుంది కనుక, భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశం లేదు గనుక మన మార్కెట్‌ను ఆక్రమించుకొనేందుకు, తమకు అనుకూలంగా మన విధానాలను రూపుదిద్దేందుకు పూనుకున్నాయి. అందుకోసం ప్రపంచీకరణ, సరళీకరణ, సంస్కరణలు అంటూ ముద్దుపేర్లను ముందుకు తెచ్చాయి. ప్రస్తుతాంశం వ్యవసాయ సబ్సిడీలు కనుక వాటి గురించి చూద్దాం.

గత రెండు దశాబ్దాలలో మన వ్యవసాయ పెట్టుబడులు కనీసంగా నాలుగింతలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలో వచ్చి జనవరి ఒకటిన 24వ సంవత్సరంలో అడుగిడబోతోంది. ముఫ్పై సంవత్సరాల నాటి లెక్కల ఆధారంగా వర్ధమాన దేశాలకు నిర్ణయించిన పదిశాతం సబ్సిడీ పరిమితిని, వ్యవసాయ వుత్పత్తుల ధరలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు భారత్‌లో సబ్సిడీలు పరిమితికి మించి ఇస్తున్నారని అమెరికా, ఆస్ట్రేలియాలు ఫిర్యాదు చేశాయి. కనీస మద్దతు ధర ఆ నిబంధనను వుల్లంఘించేదిగా వుందని, తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సరే అసలు ఎత్తివేయాలని కూడా మరోవైపు వత్తిడి తెస్తున్నాయనుకోండి. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే మన దేశంలో వుత్పత్తి అయ్యే మొత్తం పత్తి విలువ వెయ్యికోట్ల రూపాయలు అనుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపాయూనియన్‌ వంటి ధనిక దేశాల వాదన ప్రకారం పత్తి మీద సబ్సిడీ మొత్తం విలువలో పదిశాతం అంటే వంద కోట్ల రూపాయలకు మించి ఇవ్వకూడదు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల వందకోట్ల రూపాయలకు మించకూడదు.(ప్రత్యక్షంగా ఇచ్చే సబ్సిడీ మొత్తాలకు, కనీస మద్దతు ధరల సబ్సిడీ అవగాహనకు వున్న తేడా తెలిసిందే) మిగతా పంటలకూ ఇదే సూత్రం. ప్రపంచ వాణిజ్య సంస్ధ వునికిలోకి రాక ముందు దాని విధి విధానాలను రూపొందించే కసరత్తులో భాగంగా 1986-88 సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్లో వున్న సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకొని ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వకూడదని నిర్ణయించారు.

అంకెలతో ఎన్నో గారడీలు చేయవచ్చు. స్వామినాధన్‌ కమిటి సిఫార్సుల ప్రకారం వుత్పాదక ఖర్చుకు అదనంగా సగం కలిపి అంటే 150 గా కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుత్పాదక ఖర్చులో కొన్నింటిని కలపలేదని మనం విమర్శిస్తున్నాం. అంతకంటే ముందే మన మద్దతు ధరలను వ్యతిరేకిస్తున్న అమెరికా ఏమి చెబుతోందో చూద్దాం. మన గోధుమలు, వరికి ప్రకటిస్తున్న మద్దతు ధర పదిశాతం పరిమితికి మించి 60,70 శాతం వుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేశాడు. గాజు కొంపలో కూర్చొని ఎదుటివారి మీద రాళ్లు వేస్తున్నది అమెరికా. మన దేశం వరికి 60శాతం అదనంగా ఇస్తున్నట్లు యాగీ చేస్తున్న ఆ దేశం తన రైతాంగానికి 82శాతం, ఐరోపా యూనియన్‌ 66శాతం ఇస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ సూత్రాల ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతం పరిమితికి సబ్సిడీలు మించకూడదు. అయితే దీన్ని వక్రీకరించి కొన్ని పంటలకు కొన్ని సంవత్సరాలలో విపరీతమైన సబ్సిడీలను ఇచ్చి మొత్తం పంటల విలువకు దాన్ని వర్తింప చేసి ధనిక దేశాలు తప్పించుకుంటున్నాయి. అందుబాటులో వున్న సమాచారం మేరకు కొన్ని సంవత్సరాలలో అమెరికాకు అర్హత వున్న సబ్సిడీ మొత్తం వంద రూపాయలు అనుకుంటే 90రూపాయలను పాలు, పంచదార రైతులకే ఇచ్చింది, అలాగే ఐరోపా యూనియన్‌ 64రూపాయలను గోధుమ, వెన్నకే ఇచ్చింది.

గత ఇరవై ఏండ్లలో ఏడు సంవత్సరాల సమాచారాన్ని చూసినపుడు అమెరికాలో కొన్ని వుత్పత్తులకు వూలు 215, మేక బచ్చుతో చేసే శాలువలకు 141, వరి 82, పత్తి 74, పంచదార 66, కనోలా 61, ఎండు బఠాణీలకు 57శాతం, ఐరోపా యూనియన్‌లో పట్టుపురుగులకు 167, పొగాకు 155, పంచదార 120, కీరా 86, పియర్స్‌ పండ్లకు 82, ఆలివ్‌ ఆయిల్‌ 76, వెన్న 71,ఆపిల్స్‌ 68,పాలపొడి 67,టమాటా 61శాతాల చొప్పున ఇచ్చారు. ఇలా ప్రత్యేకించి ఒక వుత్పత్తికి ఇచ్చిన రాయితీలు సబ్సిడీల పరిధిలో చూపటం లేదు.

మన దేశం 53ా81శాతం మధ్య పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేసిన కొనుగోళ్లను మాత్రమే సబ్సిడీలుగా భారత్‌ చూపుతున్నది.2015ా16లో 120 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రపంచ వాణిజ్య సంస్ధకు భారత్‌ తెలిపిందని అయితే 50,400 కోట్ల రూపాయలు చెల్లించినట్లు అమెరికా ఆరోపించింది. అంటే మొత్తం పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్లు చిత్రించింది. పంచదారను ప్రభుత్వం సేకరించే విధానం లేనప్పటికీ మద్దతు ధర నిర్ణయించటమే సబ్సిడీ చెల్లించటంగా ఆస్ట్రేలియా ఆరోపించింది. తాము నిర్ణయిస్తున్న మద్దతు ధరలను డబ్ల్యుటిఓ ఏర్పాటుకు ముందు 1986ా88 నాటి ధరలతో పోల్చి ఎక్కువగా వుంటున్నట్లు అమెరికా తప్పుడు లెక్కలు వేస్తోందని మన దేశం గతంలోనే సమాధానమిచ్చినా ఖాతరు చేయకుండా ఫిర్యాదు చేశారు. భారత్‌ డాలర్లలో లెక్కలు వేస్తుంటే అమెరికన్లు భారతీయ కరెన్సీలో గుణిస్తున్నారని అందువలన ఇరు దేశాలు చెప్పేదానికి పొంతన వుండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1990లో ఒక డాలరుకు 18 రూపాయలుండగా ఇప్పుడు 72 తాకింది. అందువలన రూపాయల్లో లెక్కవేసినపుడు నాలుగు రెట్లు ఎక్కువగా కనిపించటం సహజం. భారత, చైనా వంటి దేశాల వ్యవసాయ సబ్సిడీల గురించి అభ్యంతర పెడుతున్న ధనిక దేశాలు తాము ఇస్తున్నవాటి గురించి దాస్తున్నాయి. పలు ఖాతాల ద్వారా అందచేస్తూ వాటిని సబ్సిడీలుగా పరిగణించకుండా జాగ్రత్త పడుతున్నాయి.

అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ 2018 నవంబరులో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్న అంశాలను గమనించటం అవసరం. కనీస మద్దతు ధరలు, ప్రత్యక్ష వుత్పాదక సబ్సిడీ, బీమా, తదితర రాయితీలన్నింటినీ కలిపి మొత్తంగా పత్తి సబ్సిడీలని పిలుస్తున్నారు.ప్రపంచ వ్యాపితంగా ఇవి 2016-17లో 4.4బిలియన్‌ డాలర్లుండగా 2017-18నాటికి 5.9బిలియన్లకు( ఒక బిలియన్‌ వంద కోట్ల డాలర్లు) 33శాతం పెరిగాయి. ఒక పౌను(453) దూదికి ఇచ్చిన సబ్సిడీ 17 నుంచి 18 సెంట్లకు(నవంబరు 27 విలువ ప్రకారం రు.12.03 నుంచి రు.12.74కు పెరిగాయి) 1997-98 నుంచి ఇప్పటి వరకు వున్న ధోరణుల ప్రకారం పత్తి ధరలు ఎక్కువగా వున్నపుడు సబ్సిడీలు తగ్గటం, తగ్గినపుడు పెరుగుదల వుంది.

పత్తి ధరల విషయానికి వస్తే 2013-14లో సగటున పౌనుకు 91సెంట్లు లభిస్తే 2014-16లో 70కి తగ్గి 2016-17లో 83కు, 2017-18లో 88 సెంట్లకు పెరిగింది.బ్రెజిల్‌,భారత్‌,పాకిస్ధాన్‌ వంటి అనేక దేశాలలో 2017-18లో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్లో ఎక్కువ ధరలు వున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాలు ఎరువులు, రవాణా, గ్రేడింగ్‌, నిల్వ, ఇతర మార్కెటింగ్‌ ఖర్చులను సబ్సిడీగా ఇచ్చాయి.కొన్ని చోట్ల పంటల బీమా సబ్సిడీ పెరిగింది.1998-2008 మధ్య ప్రత్యక్ష, ఇతర సబ్సిడీల మొత్తం సగటున 55శాతం పెరిగింది, మరుసటి ఏడాది 83శాతానికి చేరింది, 2010-14 మధ్య 48శాతానికి తగ్గింది, తదుపరి రెండు సంవత్సరాలలో సగటున 75శాతానికి పెరిగి తదుపరి రెండు సంవత్సరాలలో 47శాతానికి తగ్గాయి. ఈ పూర్వరంగంలో చూసినపుడు మన దేశం గురించి అమెరికా చేసిన ఫిర్యాదు దురుద్దేశపూరితం, కనీస మద్దతు ధర వంటి కనీస రక్షణ కూడా ఎత్తివేయాలని వత్తిడి చేయటం తప్ప మరొకటి కాదు. చైనా, అమెరికాలలో మాదిరి వివిధ పధకాల కింద ఇస్తున్న రాయితీలు మన పత్తి రైతాంగానికి లేవు. ఎరువులు, పురుగు మందుల ధరల మీద నియంత్రణ ఎత్తివేయటం, పెరిగిన ధరలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచకపోవటం వంటి చర్యల కారణంగా పత్తి రైతాంగానికి ఏటే వుత్పాదక ఖర్చు పెరిగిపోతోంది. కనీస మద్దతు ధరకంటే పడిపోయినపుడు రంగంలోకి వస్తున్న సిసిఐ పరిమితంగానే కొనుగోళ్లు చేస్తూ ప్రయివేటు వ్యాపారులకు ఎక్కువగా తోడ్పడుతోంది. అనేక సందర్భాలలో రైతుల పేరుతో వ్యాపారుల నుంచే కొనుగోలు చేసిన కుంభకోణాల గురించి పత్తి రైతాంగానికి తెలిసిందే.

అమెరికా అభ్యంతర పెడుతున్న కనీస మద్దతు ధరల ప్రహసనం ఏమిటో మనకు తెలియంది కాదు. అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ నివేదిక రహస్యమేమీ కాదు. దానిలో మన దేశం గురించి పేర్కొన్న అంశాలు ఇలా వున్నాయి.’ భారత్‌లో కనీస మద్దతు ధర పద్దతి వుంది. 2014-15 మరియు 2015-16 సంవత్సరాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్‌ ధరలు తక్కువగా వున్నందున కొద్ది కాలమైనా ప్రభుత్వం నేరుగా పత్తి కొనుగోలు చేసింది.2016-17,2017-18లో మార్కెట్‌ ధరలు ఎక్కువగా వున్నందున మద్దతు ధరల వ్యవస్ధ కొనుగోలు అవసరం లేకపోయింది. మధ్యరకం పింజ రకమైన జె34 రకానికి 2017-18లో మద్దతు ధరగా క్వింటాలుకు రు.4,020 నిర్ణయించారు. అది పౌను దూది ధర 83సెంట్లకు సమానం. భారత్‌లో పత్తి రైతులు ప్రభుత్వ రుణ మాఫీ మరియు ఎరువుల సబ్సిడీ వలన లబ్ది పొందారు. పంటల బీమా ద్వారా కూడా కొంత మేర మద్దతు ఇచ్చారు. అయితే దీని విలువ ఎంతో తెలియదు. ఇది కాకుండా నాణ్యమైన విత్తనాల వుత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. టెక్నాలజీ మిషన్‌ ద్వారా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ యూనిట్ల నవీకరణకు, పత్తి మార్కెటింగ్‌కు ఇటీవల తోడ్పడింది. వీటి గురించి బహిరంగంగా తెలిపే సమాచారం లేదు. ఇవి గాకుండా జౌళి రంగానికి ప్రత్యక్ష మద్దతు, చౌక రుణాల ద్వారా కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.’ రుణాల రద్దును, నూలు, వస్త్ర మిల్లులకు ఇస్తున్న రాయితీలను కూడ పత్తి రైతులకు ఇస్తున్న రాయితీగా చిత్రించారు.

చైనా పత్తి రైతులకు ఇస్తున్న రాయితీల గురించి చూద్దాం. 2017-18లో అంతకు ముందు ఏడాది ఇచ్చిన 3.3బిలియన్‌ డాలర్ల సబ్సిడీని 4.3బిలియన్‌ డాలర్లకు పెంచారు(పౌనుకు 30సెంట్లు). ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం దిగుమతి చేసుకోవాల్సిన నిర్దేశిత వంతుకు మించి అదనంగా దిగుమతి చేసుకొనే పత్తి మీద 40శాతం పన్నుతో సహా రైతాంగానికి పలు రక్షణలు కల్పిస్తున్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ ధరకంటే రైతాంగానికి ఎక్కువ గిట్టుబాటు అవుతున్నది. దిగుమతి చేసుకున్న పత్తి ధర, చైనా మిల్లులకు చేరిన ధరకు మధ్య వున్న వ్యత్యాసం రైతులకు నష్టదాయకంగా వుండకుండా చూసేందుకు చెల్లించిన లబ్ది మొత్తం 201-17లో ఒక బిలియన్‌ డాలర్లు వుండగా మరుసటి ఏడాది అది 1.5బిలియన్లకు పెరిగింది. ఇంతేగాకుండా మన దగ్గర కనీస మద్దతు ధర మాదిరిగా ప్రతి ఏటా రైతాంగానికి ఒక లక్షిత ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ఏడాది మార్కెట్‌లో వచ్చిన సగటు ధరతో దానిని పోల్చి తక్కువ వస్తే ఆ మేరకు రైతులకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుంది. ఆ మేరకు 2015,16,17 సంవత్సరాలలో చెల్లింపులు చేసింది. 2018 సంవత్సరానికి ఒక టన్నుకు 18,600 యువాన్లుగా నిర్ణయించింది. ఇది పౌనుకు 130 సెంట్లకు సమానం. దాని ప్రకారం అంతకు ముందు సంవత్సరం చెల్లించిన 1.6బిలియన్ల నుంచి 2.1బిలియన్లకు మొత్తాన్ని పెంచింది. అంతే కాదు ప్రతి ఏటా 15క్లో డాలర్ల మేర నాణ్యమైన విత్తన సబ్సిడీ, మరో 15కోట్ల డాలర్లను దూర ప్రాంత రవాణా ఖర్చుల కింద రైతాంగానికి చెల్లించింది. ప్రపంచ వాణిజ్య సంస్ధలో సభ్యత్వం కోసం చైనా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఒక ఏడాదికి 8,94,000 టన్నుల పత్తి దిగుమతి చేసుకుంటే దాని మీద పన్ను ఒక శాతమే విధించాలి. అంతకు మించి దిగుమతులు వుంటే పరిమాణాన్ని బట్టి ఒక శాతం నుంచి 40శాతం వరకు పన్ను విధించవచ్చు. గత మూడు సంవత్సరాలుగా నిర్దేశిత మొత్తం మేరకే దిగుమతులు చేసుకుంటున్నది.

Image result for cotton picking in india

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిసిఐ) వార్షిక నివేదికలను ఆ సంస్ధ వెబ్‌ సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. వాటిలో పేర్కొన్నదాని ప్రకారం 2014-15 సంవత్సరానికి పత్తి కనీస మద్దతు ధర అంతకు ముందు సంవత్సరం కంటే పెంచింది రు.50, ఇది ఒక శాతానికి దగ్గరగా వుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పడిపోయిన కారణంగా ఆ ఏడాది దేశీయ మార్కెట్లో ముడిపత్తి ధరలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 19 నుంచి 30శాతం వరకు, అదే విధంగా దూది ధర 25 నుంచి 30శాతం వరకు పతనమైందని సిసిఐ నివేదిక తెలిపింది. ఇలాంటి సందర్భాలలో చైనా, అమెరికాలలో రైతాంగానికి ఆయా ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో నష్టం రాకుండా చూశాయి. మన దేశంలో అలాంటి విధానం లేదు. కనీస మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ వున్నపుడు ఇష్టం లేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా సిసిఐ కొనుగోళ్లు వుంటున్నాయి. అవి కూడా మద్దతు ధరకు మించటం లేదు. పైన చెప్పుకున్నట్లు ఒక ఏడాది ధరలు భారీగా పడిపోయినా రైతాంగం అప్పులపాలు కావాల్సిందే. ఈ ఏడాది ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధరల కంటే తక్కువ ధరలకే అధిక మొత్తాలను కొనుగోలు చేస్తున్నట్లు వివిధ మార్కెట్ల సమాచారం వెల్లడిస్తున్నది.

1966 నాటి చెరకు నియంత్రణ విధానం ప్రకారం మన ప్రభుత్వాలు చెరకు ధరను సూచిస్తున్నాయి. ఈ విధానం, పంచదార ఎగుమతులకు ఇస్తున్న రాయితీల కారణంగా ధరలు తగ్గి తమతో పాటు ప్రపంచ రైతాంగానికి, వ్యాపారులకు నష్టం జరుగుతోందంటూ ఆస్ట్రేలియా ప్రపంచ వాణిజ్య సంస్ధకు మన దేశం మీద చేసిన పరోక్ష ఫిర్యాదును ఇప్పుడు విచారిస్తున్నారు.’ చెరకు వుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచేందుకు భారతీయ రైతులకు అధిక మూల్యం చెల్లిస్తున్నారు.దీంతో పంచదార మిల్లులకు ప్రభుత్వం అదనంగా చెల్లించేందుకు వీలు కలుగుతోంది. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్‌ సబ్సిడీలను తగ్గించే జాబితాలో చెరకు లేదు ‘ అని ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. చెరకు సబ్సిడీలను తగ్గిస్తామని అంగీకరించిన దేశాలలో మన దేశం లేదు. ధనిక దేశాలు కోరుతున్న పద్దతిలో వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలనటాన్ని మనదేశం, చైనా వుమ్మడిగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో వ్యతిరేకించాయి, ఈ అంశం మీద చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. అయితే అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌, నార్వే, స్విడ్జర్లాండ్‌ తదితర దేశాలు చర్చను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2011-17 మధ్య అంగీకరించిన సబ్సిడీ మొత్తాలకు మించి చెరకు సబ్సిడీలను భారత్‌లో ఇచ్చారని ఆస్ట్రేలియా వాదించింది. భారత చెరకు, పంచదార గురించి అమెరికా తయారు చేసిన తప్పుడు లెక్కలను వుదహరించి ఆస్ట్రేలియా కేసు దాఖలు చేసింది. ఒక్క చెరకు పంట మీదే కాదు, పప్పుధాన్యాలకు కూడా భారత్‌ ఇస్తున్న సబ్సిడీ వలన కూడా ప్రపంచ వాణిజ్యం ప్రభావితం అవుతోందని ఆరోపిస్తోంది.ఈ వైఖరి ఒక విధంగా మన దేశ సార్వభౌమత్వాన్నే సవాలు చేయటంగా కూడా చెప్పవచ్చు.

ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల కారణంగా ఈ ఏడాది భారత్‌లో పంచదార వుత్పత్తి ఏకంగా 20 నుంచి 35 మిలియన్‌ టన్నులకు పెరిగిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. భారత్‌ 85కోట్ల డాలర్ల మేర సబ్సిడీ ఇచ్చి ఐదులక్షల టన్నుల పంచదారను ప్రపంచ మార్కెట్లో కుమ్మరిస్తున్నదని, తమ దేశంలో టన్ను పంచదార వుత్పత్తికి 440-450 డాలర్ల వరకు ఖర్చవుతుండగా మార్కెట్లో 500డాలర్లుగా వున్న ధర పడిపోయి 400కు మించి రావటం లేదని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. మరోవైపు మన దేశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న ధరలు రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదని పెంచాలని కోరుతున్నారు. దీన్నే సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నారు.నిజానికి రాష్ట్రం లేదా కేంద్రంగానీ రైతులకు ఇస్తున్న ప్రోత్సాహక ధరలు లేదా రాయితీలు చెరకు-దాని వుత్పత్తుల మీద వచ్చే ఆదాయం, పన్నులతో పోల్చుకుంటే తక్కువే. ఈ మాత్రపు రక్షణ కూడా లేకుండా మార్కెట్‌ శక్తులకు వదలి వేయాలని అంతర్జాతీయ బడా పంచదార వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు.

గత పదహారు సంవత్సరాలలో తొలిసారిగా భారత్‌ పంచదార వుత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి 35.9 మిలియన్‌ టన్నులతో ప్రధమ స్ధానంలోకి వచ్చింది. అయితే ఇది తాత్కాలికమే అని చెప్పవచ్చు. బ్రెజిల్‌లో ప్రతికూల వాతావరణం నెలకొనటం ఒక కారణమైతే, చమురు ధరలు 85డాలర్లకు పెరిగినందున పంచదార బదులు ఎథనాల్‌ తయారు చేయటం లాభసాటిగా వున్నందున పంచదార వుత్పత్తిని కావాలనే తగ్గించారు. చమురు ధరలు 60డాలర్లకు పడిపోయినందున ఎథనాల్‌ బదులు పంచదారకు మరలితే మన పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుంది. ప్రపంచ వ్యాపితంగా 188.3మిలియన్‌ టన్నుల పంచదార వుత్పత్తి అవుతుందని అంచనా.

మన మార్కెట్‌ను బహుళజాతి గుత్త సంస్ధలకు తెరిచిన కారణంగా ఇప్పటికే పత్తి, ఇతర విత్తన రంగం,పురుగు మందుల రంగం విదేశీ, స్వదేశీ గుత్త సంస్ధల ఆధిపత్యంలోకి పోయింది.వారు నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. కార్గిల్‌ వంటి బహుళజాతి గుత్త సంస్ధలు కనీస మద్దతు ధరలను దెబ్బతీసే విధంగా పరోక్షంగా కొనుగోళ్లు జరుపుతూ మార్కెట్లను నిర్దేశిస్తున్నాయని 2017 జనవరిలో వార్తలు వచ్చాయి. లోపాలతో కూడినదే అయినప్పటికీ ఆ విధానం కూడా వుండకూడదని, అప్పుడే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చని అవి భావిస్తున్నాయి. దానిలో భాగంనే పారిశ్రామిక రంగానికి ఇచ్చే రాయితీలను కూడా రైతుల ఖాతాలో వేసి అమెరికా వంటి దేశాలు కనీస మద్దతు ధరల విధానం మీద దాడి చేస్తున్నాయన్నది స్పష్టం. దీని వెనుక అంతర్జాతీయ వ్యవసాయ కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. ధనిక దేశాల లాబీ, వత్తిడికి లంగి వాటికి అనుకూలమైన విధానాలు అమలు జరుపుతున్న పాలకవర్గాల మీద, అదే విధంగా కార్పొరేట్‌ శక్తుల కుట్రల మీద రైతాంగం చైతన్యవంతులై ఆ విధానాలను తిప్పికొట్టకపోతే వున్న రాయితీలు కూడా వూడ్చిపెట్టుకుపోయే ప్రమాదం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా డెమోక్రటిక్‌ పార్టీలో అణగారిన తరగతుల ముందంజ !

12 Monday Nov 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ 1 Comment

Tags

2018 US midterm elections, Democratic Socialists of America, Donald trump, US Democratic party, US Republican party

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఆరవ తేదీన అమెరికా పార్లమెంట్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు సెనెట్‌ విషయంలో తప్ప ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) విషయంలో సర్వేల విశ్లేషణకు దగ్గరగానే వచ్చాయి. ఎగువ సభ సెనెట్‌లో ఎలాగైనా సరే మెజారిటీ సాధించాలనే పట్టుదలతో కేంద్రీకరించిన అధ్యక్షుడు డ్రోనాల్డ్‌ ట్రంప్‌కు సభలోని వందకు గాను చావుదప్పి కన్నులట్టపోయి రిపబ్లికన్‌ పార్టీకి 51వచ్చాయి. డెమోక్రాట్లకు 44, స్వతంత్రులకు రెండు రాగా తిరిగి ఓట్ల లెక్కింపు జరుగుతున్న మరో మూడు స్ధానాల ఫలితాలను ఖరారు చేయాల్సి వుంది. ప్రజాప్రతినిధుల సభలో ట్రంప్‌ బక్కబోర్లా పడ్డారు, డెమోక్రటిక్‌ పార్టీకి మెజారిటీ వచ్చింది. ట్రంప్‌ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణగా భావించబడిన ఈ ఎన్నికలలో దిగువ సభలోని మొత్తం 435 స్ధానాలకు గాను ఆ పార్టీకి 227, రిపబ్లికన్లకు 198 రాగా మరో పదింటి ఫలితాలను ప్రకటించాల్సి వుంది. ఈ ఫలితాలతో అమెరికాలో విప్లవాత్మక మార్పులేవో జరుగుతాయని కాదు గానీ డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్గతంగా ప్రారంభమైన మధనానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఫలితం, పర్యవసానాల గురించి వామపక్ష,పురోగామి శక్తులు తరువాతేంటి అనే ఆలోచన చేస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించగానే అనేక తరగతుల వారు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తమ సమస్యలపై వీధుల్లోకి వచ్చారు. అధికార పార్టీ అక్రమాలు, ప్రలోభాలను తట్టుకొని వుద్యమించిన వారి ఆకాంక్షలకు ప్రతిబింబంగా తాజా ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు.ఈ ఎన్నికల్లో కార్మికులు, మహిళలు, ఆఫ్రికన్‌ అమెరికన్లు, లాటినోలు, గిరిజనులు మొత్తంగా డెమోక్రాట్లు విజయం సాధించారు. అన్నీ తానై వ్యవహరించినందున రిపబ్లికన్ల ఓటమి అంటే అది వాస్తవానికి డోనాల్డ్‌ ట్రంప్‌కే వర్తిస్తుందని చెప్పవచ్చు. మన పదజాలంలో చెప్పాలంటే అమెరికాలోని సకల అణగారిన తరగతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓట్లు వేసి ట్రంప్‌కు చుక్కలు చూపించారు. గమనించాల్సిన ముఖ్యఅంశాలు ఇలా వున్నాయి.

అనేక దశాబ్దాల చరిత్ర చరిత్రలో తొలిసారిగా డెమోక్రటిక్‌ పార్టీలో అనేక మంది పురోగామి వాదులు(అమెరికా ప్రమాణాల ప్రకారం) ఎక్కువగా ఎన్నికయ్యారు. డోనాల్డ్‌ ట్రంప్‌, ఆ పెద్దమనిషి ప్రాతినిధ్యం వహిస్తున్న మితవాద రిపబ్లికన్‌ పార్టీ సాగించిన మహిళా వ్యతిరేక, శ్వేతజాతి మెజారిటీ నినాదాలకు చెంపపెట్టుగా అసాధారణ రీతిలో మహిళలు, రంగు వివక్షకు, జాతిపరంగా వివక్షకు గురయ్యేవారు, ఇతరులు డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కరడు గట్టిన ఐదుగురు రిపబ్లికన్‌ గవర్నర్లను(మన ముఖ్యమంత్రులకు సమానం) ఓటర్లు ఇంటికి పంపారు. అతి పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాలో, ప్రపంచ ఆర్ధిక రాజధాని వంటి న్యూయార్క్‌ రాష్ట్రంలోనూ డెమోక్రాట్లదే పైచేయి. గవర్నర్లుగా వారే ఎన్నికయ్యారు. వర్గరీత్యా రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలు మౌలికంగా పెట్టుబడిదారీ విధాన ప్రతినిధులే. అందువలన అధికారంలోకి వచ్చిన తరువాత సహజంగానే ప్రజావ్యతిరేకతను వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఆ రీత్యా చూసినపుడు గతంలో ఒబామా ఎనిమిదేండ్లు అధికారంలో వున్న సమయంలో వివిధ రాష్ట్రాల చట్ట సభలలో వెయ్యి మంది వరకు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారు మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ట్రంప్‌ రెండు సంవత్సరాల ఏలుబడిలోనే 323 మంది రిపబ్లికన్లు ఇంటిదారి పట్టారు. గెలిచిన రాష్ట్రాల నియోజకవర్గాలలో పురోగామివాదుల నుంచి వంద చోట్ల మితవాదులవైపు మొగ్గగా 300చోట్ల తిరోగామి వాదులను ఓడించి పురోగామివాదుల వైపు ఓటర్లు నిలిచారు.కొన్ని చోట్ల పురోగామి అభ్యర్ధులు ఓటమి పాలైనా మొత్తం మీద ఆశక్తులతో నిండిన బృందాలు ఈ ఎన్నికలను తీవ్రంగా తీసుకోవటం మంచి పరిణామం. గతంలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన శివారు పట్టణాలలోని శ్వేతజాతి మహిళలు అనేక మంది ఈసారి రిపబ్లికన్లకు దూరమయ్యారు.గత రెండు సంవత్సరాలలో వివిధ సమస్యల మీద సాగించిన ఆందోళనల ఫలితాలు ఈ ఎన్నికల్లో ప్రతిబింబించాయి.ఎన్నికలకు ముందు కొన్ని చోట్ల కనీస వేతనాల పెంపుదల జరిగింది. నేరాలు చేశారనే సాకుతో ఫ్లోరిడా రాష్ట్రంలో ఓటు హక్కు తొలగించిన 14లక్షల మందికి ఈ ఎన్నికల్లో పునరుద్దరించారు.

ప్రజాప్రతినిధుల సభలో, వివిధ రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికలో గణనీయ విజయాలు సాధించిన డెమోక్రాట్లు సెనెట్‌లో ఎందుకు మెజారిటీ సాధించలేకపోయారు అన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. సెనెట్‌ ఎన్నికలలో రిపబ్లికన్‌ అభ్యర్ధుల కంటే డెమోక్రాట్లకు కోటీ ఇరవై లక్షల ఓట్లు అదనంగా వచ్చాయి. సెనెట్‌ రాష్ట్రాల ప్రతినిధుల సభ. జనాభా ఎంత మంది అనేదానితో నిమిత్తం లేకుండా ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున యాభై రాష్ట్రాల నుంచి ఎన్నిక అవుతారు. యోమింగ్‌ రాష్ట్ర జనాభా ఆరులక్షలు లోపు, అదే కాలిఫోర్నియా జనాభా దానికి 60రెట్లు ఎక్కువ, అయినా రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరిద్దరిని మాత్రమే ఎన్నుకోవాల్సి వుంది. సాంప్రదాయకంగా గ్రామీణ ప్రాంతాలలో రిపబ్లికన్లవైపే ఓటర్లు మొగ్గు వుంటోంది. ఇది కూడా సెనెట్‌ ఎన్నికలపై ప్రభావం చూపుతోంది.ఈ విధానంలో రాష్ట్రాల సమాన ప్రాతినిధ్యం అనే ప్రజాస్వామిక అంశంతో పాటు, జనాభాతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య వ్యతిరేక లక్షణం కూడా వుంది. ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటివి వున్నాయి. ట్రంప్‌ గత ఎన్నికలలో ఎలక్ట్రొరల్‌ కాలేజ్‌లో మెజారిటీ తెచ్చుకొని అధ్యక్షుడు అయినప్పటికీ సాధారణ ఓటర్ల తీర్పు ప్రకారం ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్‌ కంటే 30లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. ప్రజాప్రతినిధుల ఓట్ల వివరాలను చూస్తే డెమోక్రాట్లకు ఏడు శాతం అధికంగా వచ్చాయి.

Image result for democratic winner alexandria

అలెగ్జాండ్రియా కాసియో కార్టెజ్‌

ప్రజాప్రతినిధుల సభకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే సెనెట్‌కు ప్రతి రెండు సంవత్సరాలకు మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇది రాస్తున్న సమయానికి ఖరారైన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు గతంలో ప్రాతినిధ్యం వహించిన సీట్లలో రెండు చోట్ల ఓడిపోగా రిపబ్లికన్లు వున్న చోట్ల 29 గెలిచారు. సెనెట్‌లో రెండు చోట్ల డెమోక్రాట్లను రిపబ్లికన్లు ఓడించి (100కు 51) ఒక సీటు మెజారిటీ తెచ్చుకున్నారు.ఎన్నికలు జరిగిన 35 సీట్లలో డెమోక్రాట్లు 26చోట్ల రిపబ్లికన్లు తొమ్మిది చోట్ల గతంలో ప్రాతినిధ్యం వహించారు. తాము అధికారంలో రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు అనుకూలంగా రిపబ్లికన్లు పునర్విభజన చేశారని కూడా వెల్లడైంది.అయినా కొన్ని చోట్ల డెమోక్రాట్లు విజయం సాధించారు. 2020లో జరిగే ఎన్నికల నాటికి డెమోక్రాట్లు కూడా అదే ఎత్తుగడలను అనుసరించే అవకాశం వుంది. తాజా ఎన్నికల్లో కొన్ని చోట్ల రిపబ్లికన్లు కుంటి సాకులతో డెమోక్రాట్లకు పడే ఓటర్లను అడ్డుకున్నారు. దానికి సుప్రీం కోర్టు మద్దతు కూడా తోడైంది. అమెరికాలోని అడవులలో నివసించే గిరిజన ప్రాంతాలలో ఓటర్లకు పోస్టు బాక్సు నంబర్లే చిరునామాలుగా వుంటాయి. ఓటరు గుర్తింపు కార్డుకు, ఓటర్ల జాబితాలో పేర్లకు అన్నీ సరిపోలి వుండాలనే ఒక నిబంధన వుంది. పేర్లలో కామాలు, పులుస్టాప్‌లు, పేరులో మధ్యనామం సరిగా లేదు, వుచ్చారణ సరిగా లేదు అనే కుంటిసాకులను చూపి వేల ఓట్లను తిరస్కరించారు. వుత్తర డకోటా ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో వీధుల వివరాలు లేవనే సాకుతో వేలాది మంది ఓటర్లను తిరస్కరించారు. ఈ కారణం కూడా తోడై గతంలో ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిని ఈసారి ఓడిపోయారు.

Image result for democratic winner rashida

రషీదా లాయిబ్‌

అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక గవర్నర్‌ పదవికి నల్లజాతి మహిళ స్టాసీ అబ్రామ్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధిగా జార్జియా రాష్ట్రానికి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారిగా వందమందికి పైగా మహిళలు ఎన్నికవ్వటం ఒక విశేషం. ఎన్నికైన మహిళల్లో 29 ఏండ్ల పిన్న వయస్కురాలు అలెగ్జాండ్రియా కాసియో కార్టెజ్‌, ఆమె ఒక బార్‌లో వెయిట్రెస్‌( మద్యం, ఆహారపదార్దాల అందచేసే పని)గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. న్యూయార్క్‌ నగరంలోని బ్రాంక్స్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె తాను డెమోక్రటిక్‌ సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకున్న యువతి. సోమాలియా నుంచి నిర్వాసితురాలిగా అడుగుపెట్టి అమెరికా పౌరసత్వం పొంది మినియా పోలీసు నుంచి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఎన్నికైన తొలి సోమాలి-అమెరికన్‌ మహిళ ఇహాన్‌ ఓమర్‌. మైనారిటీల సమస్యల మీద పని చేస్తూ ట్రంప్‌ సర్కార్‌ వలసదార్ల వ్యతిరేక వైఖరిని ఎండగట్టటంలో ముందున్నారు.డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధిగా మసాచుసెట్స్‌ నగరంలోని ఒక నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా తొలిసారిగా ఎన్నికయ్యారు అయనా ప్రెస్లే. అంతకు ముందు బోస్టన్‌ నగరపాలక సంస్ధ సభ్యురాలిగాను, పదహారు సంవత్సరాల పాటు పార్లమెంట్‌ కార్యాలయంలో పని చేశారు. డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ప్రాచుర్యం పొందిన రషీదా లాయిబ్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళ. ఆమె పోటీ లేకుండా గెలిచారు. కాన్సాస్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా గిరిజన మహిళలు షారైస్‌ డేవిడ్స్‌, డెబ్రా హాలాండ్‌ కాన్సాన్‌, న్యూ మెక్సికో నుంచి ఎన్నికయ్యారు. ఇరవై తొమ్మిది సంవత్సరాల మరో పిన్న వయస్సురాలైన అబీ ఫిన్‌కెనౌర్‌ లోవా నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళ, డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి.

యాభై సంవత్సరాల క్రితం మధ్యంతర ఎన్నికల్లో 49శాతం పోలింగ్‌ కాగా తాజా ఎన్నికల్లో దానికి దగ్గరగా 47శాతానికి మించి పోలు కావటం ఓటర్లలో పెరిగిన ఆసక్తి, వుత్సాహానికి నిదర్శనం. కొన్ని చోట్ల 60శాతం వరకు నమోదైంది. ఎనిమిది సంవత్సరాల క్రితం 41శాతం, నాలుగు సంవత్సరాల నాడు 36.7శాతమే నమోదైంది. ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతతో పాటు గెలిచిన అభ్యర్ధులను పరిశీలిస్తే పురోగామి వాదులను గెలిపించాలన్న తపన పలు తరగతుల ఓటర్లలో వుందనటానికి ఇది ఒక సూచిక. గత నాలుగు సంవత్సరాలలో అనేక ఓట్లను జాబితా నుంచి తొలగించటంతో అనేక మంది పట్టుదలగా ఓట్లు నమోదు చేయించుకొని పోలింగ్‌కు వచ్చారు. గుర్తింపు కార్డుమీద పూర్తి చిరునామా వుండాలన్న నిబంధన కొద్ది వారాల ముందే విధించటంతో గిరిజనులు పెద్ద ఎత్తున కొత్త గుర్తింపుకార్డులు అచ్చువేయించుకొనేందుకు రావటంతో తొక్కిసలాట పరిస్ధితి ఏర్పడింది. చాలా మంది సమగ్రగుర్తింపు కార్డు లేకపోవటంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. అయినా నాలుగు సంవత్సరాలతో పోల్చితే గిరిజనులు రెట్టింపు మంది ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.

కార్మిక సంఘాలను, ఆందోళలను వ్యతిరేకించే రిపబ్లికన్లు ఓడించి పలువురు కార్మిక నేతలు ఎన్నికయ్యారు. వారిలో ఆండీ లెవిన్‌, రోజా డెలారో డి కాన్‌, బాబీ స్కాట్‌, జోహనా హేస్‌, కేంద్రా హారన్‌(తొలి గిరిజన మహిళ)ఎన్నికయ్యారు. అనేక మంది కార్మిక ప్రతినిధులు స్వల్పతేడాతో ఓడిపోయారు. ముఖ్యమైన విజయంగా విస్కాన్‌సిన్‌ రాష్ట్రంలో కార్మిక సంఘాలను తీవ్రంగా వ్యతిరేకించిన రిపబ్లికన్‌ గవర్నర్‌ను టోనీ ఎవర్స్‌ ఓడించారు. ఏడు సంవత్సరాల క్రితం రాష్ట్ర అసెంబ్లీని దాదాపు లక్ష మంది కార్మికులు ముట్టడించి నిరసన తెలపటానికి రిపబ్లికన్‌ గవర్నర్‌ వైఖరే కారణం. పార్లమెంట్‌, అసెంబ్లీలకు 743మందికార్మిక సంఘాల నేతలు ఎన్నికయ్యారు. మొత్తం శాసనసభ్యులలో దాదాపు పదో వంతు. మినెసోటా గవర్నర్‌గా టిమ్‌ వాల్జ్‌ (అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ నేత) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో తాము 23.5లక్షల ఇండ్లకు వెళ్లామని, పని కేంద్రాలలో 50లక్షల కరపత్రాలు, కోటీ ఇరవైలక్షల ఇమెయిల్స్‌, 2,60,094 ఎస్‌ఎంఎస్‌లు, సామాజిక మీడియాలో 6.9కోట్ల పోస్టింగులతో ప్రచారం నిర్వహించినట్లు అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ ప్రతినిధి తెలిపారు.

ఈ ఎన్నికలలో ప్రవాస భారతీయులు, వారి సంతతికి చెందిన వారు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అనేక మంది చట్టసభలకు ఎన్నికయ్యారు. డాక్టర్‌ అమీ బెరా వరుసగా నాలుగవ సారి కాలిఫోర్నియా నుంచి ఎన్నికయ్యారు. ఇలినాయిస్‌ నుంచి రెండవ సారి రాజా కృష్ణమూర్తి, సిలికాన్‌ వాలీ నుంచి రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌ సియాటిల్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వివిధ రాష్ట్రాల శాసనసభలకు విస్కాన్సిన్‌ నుంచి అటార్నీ జనరల్‌ స్ధానానికి జోష్‌ కౌల్‌, కెంటకీలో నీమా కులకర్ణి, అరిజోనా నుంచి అమిష్‌ షా, న్యూయార్క్‌ సెనేట్‌కు కెవిన్‌ ధామస్‌, వుత్తర కరోలినా సెనేట్‌కు మజతాబా మహమ్మద్‌, జయా చౌధురి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఇంకా నీరజ్‌ అతానీ(ఓహియో), మంకా ధింగ్రా( వాషింగ్ట్‌న్‌), సబీకుమార్‌(టెనెసీ), ఆషా కార్లా(కాలిఫోర్నియా) కుమార్‌ భారవే(మేరీలాండ్‌), జూలీ మాథ్యూ, కెపి జార్జి(టెక్సాస్‌), షాలినీ (మసాచుసెట్స్‌) ఎన్నికయ్యారు.

సోషలిజం పట్ల ఓటర్లలో డెమోక్రటిక్‌ పార్టీలో వెల్లడౌతున్న సానుకూల వైఖరి, ఈ ఎన్నికలలో అణగారిన వర్గాలుగా వున్నవారు గణనీయంగా విజయం సాధించటంతో అమెరికాలోని వామపక్ష శక్తులలో తదుపురి ఏమిటి అన్న చర్చ మరింతగా పెరుగుతున్నది. మరింత విశాలంగా ఆలోచించాలి, పెద్ద ఎత్తున సమీకరించాలన్నది ఒక అభిప్రాయం. రిపబ్లికన్‌ పార్టీ లేదా ట్రంప్‌ మద్దతుదారులందరూ జాత్యంహకారులు, వలసకార్మికులకు, మహిళలకు వ్యతిరేకం కాదని అందువలన మితవాదులు కాని వారిని ఆకర్షించటం ఎలా అన్నది మధిస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో పెట్టుబడిదారీవర్గాన్ని బలపరిచే శక్తులదే పైచేయి అయినప్పటికీ పార్టీలోని పురోగామిశక్తులలో సోషలిస్టు తిరుగుబాటు రాజుకుంటున్నది. కొంత కాలం క్రితం ఆ పార్టీలో సోషలిస్టులుగా వున్నవారు తమ వైఖరికి కట్టుబడి పోరాడాలా వద్దా అనే గుంజాటనలో వుండేవారు. అయితే 2008తలెత్తిన తీవ్ర మాంద్యం, వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం, నల్లజాతీయుల జీవన్మరణ సమస్య, పర్యావరణ సమస్యలు తీవ్రతరం గావటం, సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించుకొని ప్రచారం చేయటం వంటి పరిణామాలతో ఇప్పుడు లక్షల మంది మేం కూడా సోషలిస్టులమే అని ప్రకటించుకున్నారు. ఈ పరిస్ధితుల్లో సోషలిస్టులేమి చేయవచ్చు అన్న చర్చ ప్రారంభమైంది.

బెర్నిశాండర్స్‌ వంటి కొంత మంది కార్మికవర్గం, సామాజిక వుద్యమాల గురించి మాట్లాడటం ఒక ముందడుగు. వారు అంతవరకే పరిమితం గాకుండా కార్మికుల ఆందోళనల దగ్గరకు వెళ్లేందుకు కూడా సిద్ధ పడుతున్నారు. ఒక విధంగా సోషల్‌ డెమోక్రాట్స్‌ మాదిరి వ్యవహరిస్తున్నారు. అంటే డెమోక్రటిక్‌ పార్టీ నాయకత్వంలోకి సోషల్‌ డెమోక్రాట్లను తీసుకు వచ్చి పురోగామి శక్తులను ఎన్నికలలో నిలబెట్టి కార్మికవర్గ సమస్యలను పరిష్కారించాలనే వైఖరికి అలాంటి వారు ప్రతినిధులు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్ధను సంస్కరించగలమనే నమ్మకం వున్నవారు, సంస్కరిస్తే చాలు సమస్యలు పరిష్కారమౌతాయనే భ్రమలు కలిగిన వారు. మరో రెండు సంవత్సరాలలో జరిగే ఎన్నికలలో ఈ పరిస్ధితి బెర్నీశాండర్స్‌ అభ్యర్ధిత్వం మీద ఎలా పని చేస్తున్నందన్నది ప్రశ్న.

డెమోక్రటిక్‌ పార్టీని సంస్కరించటం జరిగేది కాదు, ఆ పార్టీలో డెమోక్రటిక్‌ సోషలిస్టులుగా వున్న అలెగ్జాండ్రా కాసియో కోర్టెజ్‌, రషీదా లాయిబ్‌ వంటి విజయం సాధించిన వారి మాదిరి గాకుండా సోషలిస్టులే ప్రత్యక్షంగా పోటీ పడాలన్నది మరొక వాదన. ఎన్నికైన పురోగామి వాదులు వర్గపోరాటాలను ప్రోత్సహించేందుకు ముందుగా సోషలిస్టు బృందంగా ఏర్పడే అవకాశాలున్నాయని కొందరి అంచనా. ఇప్పుడు ఎన్నికైన సోషలిస్టులు సమన్వయంతో పని చేస్తూ కార్మిక పోరాటాలు, పార్లమెంటరీ, పార్లమెంటేతర కార్యక్రమాలలో తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవటం ద్వారా మరింత బలమైన శక్తిగా రూపొందేందుకు అవకాశం వుంటుందన్న సూచనలు కూడా వెల్లడయ్యాయి.

ఈ ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధులు ఓటమి పొందినప్పటికీ వారు చేసిన డెమోక్రటిక్‌ సోషలిస్టు ప్రచారం, కార్యాచరణ వృధాకాదు. బెర్నీశాండర్స్‌ వంటి వారు చేసిన ప్రచారం, భావజాలం కార్మికవర్గ జీవితాలలో కొద్ది మార్పు చెందేందుకు దారితీసేదిగా వుంటుంది, అయితే అందరికీ ఆరోగ్యం, కాలేజీ విద్య వుచితం, విద్యార్ధి రుణాల రద్దు వంటి డిమాండ్లకు బహిరంగంగా మద్దతు ప్రకటించేందుకు కొందరు డెమోక్రాట్లను పురిగొల్పింది. రాష్ట్రాల అసెంబ్లీలలో తాము డెమోక్రటిక్‌ సోషలిస్టులం అని చెప్పుకున్న వారు కేవలం ముగ్గురే వుండగా ఈ సారి అలాంటి వారు పది మంది ఎన్నికయ్యారు.మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్యతో పోలిస్తే లెక్కలోకి తీసుకోవాల్సిన సంఖ్యగాక పోయినా సోషలిస్టులమని చెప్పుకొని పోటీ చేసే వారు ముందుకు రావటం గమనించాల్సిన అంశం. ఇలాంటి వారిని నిరుత్సాహపరిచేందుకు, దెబ్బతీసేందుకు డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు, సోషలిస్టు వ్యతిరేకులు అడుగడుగునా ప్రయత్నిస్తారని వేరే చెప్పనవసరం లేదు.

అమెరికాలో ఇప్పుడు రెండు రకాల సోషలిస్టులు, డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్భాగంగా( గతంలో మన స్వాతంత్య్రవుద్యమ సమయంలో కాంగ్రెస్‌ సోషలిస్టుల మాదిరి) పని చేస్తున్న డెమోక్రటిక్‌ సోషలిస్టులు, విడిగా పని చేస్తున్న సోషలిస్టు శక్తులు, కమ్యూనిస్టు పార్టీగా పని చేస్తున్నవారు వున్నారు. ఈ శక్తుల మధ్య ఎలాంటి సంబంధం వుండాలో కూడా చర్చ ప్రారంభించారు. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సభలో డెమోక్రటిక్‌ సోషలిస్టులుగా పక్కాగా ప్రకటించుకొని గెలిచిన ఇద్దరు మహిళలు వున్నారు.రానున్న రోజుల్లో డెమోక్రటిక్‌ పార్టీలో వున్న సోషలిస్టులతో మిగతావారందరూ కలసి ఒక ప్రత్యేక పార్టీగా ఏర్పడేందుకు, స్వతంత్ర వైఖరి, కార్యాచరణ, సిద్ధాంత ప్రచారానికి, జరుగుతున్న కార్మిక, వుద్యోగ, వుపాధ్యాయ, సామాజికోద్యమాలతో సమన్వయానికి సిద్ధంగావాలన్న ప్రతిపాదన ఒకటి వుంది. దీనిలో వుండే నష్టాలూ, లాభాల గురించి కూడా ఆలోచించాలని చెబుతున్నారు. అమెరికాలో ప్రారంభమైన ఈ మధనం అక్కడి రాజకీయాలలో గణనీయమైన మార్పులకు, అది మరింత పురోగమనం దిశగా వుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. విప్లవాలు మనం కోరుకున్నట్లుగా, ఆశించినంత వేగంగా, ఊహించిన చోట రావు అని ఎలా చెబుతామో రావని కూడా చెప్పలేము !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోషలిజాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన అమెరికా మధ్యంతర ఎన్నికలు !

06 Tuesday Nov 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, Democratic Socialists of America, focus on Socialism, Karl Marx, rise of the left, socialists are coming, US midterm Elections

Image result for karl marx

ఎం కోటేశ్వరరావు

చివరి క్షణంలో అనూహ్య పరిస్ధితులు ఏర్పడితే తప్ప మంగళవారం నాటి అమెరికా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ వుభయ సభల్లోనూ మెజారిటీ పక్షంగా అవతరించనున్నదని ఎన్నికల సర్వేలు చెప్పాయి. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రేలాపనలు కూడా ఓటర్లనాడి తమకు వ్యతిరేకంగా వుందని వెల్లడించటమే. అయితే పార్లమెంట్‌లో ఎవరికి మెజారిటీ వచ్చినా ఫలితం ఏమిటన్నది అసలు ప్రశ్న. గత ఎన్నికల ఫలితాలను చూస్తే అధికారంలో ఏ పార్టీ అధ్యక్షుడు వుంటే మధ్యంతర ఎన్నికల్లో సదరు పార్టీ ఓడిపోవటం అత్యధిక సందర్భాలలో జరిగింది. అందువల్లనే ప్రతి అధ్య క్షుడు తన సర్వశక్తులూ ఒడ్డి ఓటమిని తప్పించుకొనేందుకు, ప్రతిపక్ష మెజారిటీని బటాబటాగా అయినా వుంచేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు ట్రంప్‌ కూడా అలాంటి విఫల యత్నమే చేసినట్లు చెప్పవచ్చు. గత చరిత్రను చూసినపుడు ఎవరు అధికారంలో వున్నా పార్లమెంటులో ప్రతిపక్షానికి మెజారిటీ వున్నప్పటికీ అధ్యక్షులు లేదా పాలకవర్గం దేశీయంగా కార్మిక వ్యతిరేక, అంతర్జాతీయంగా వివిధ దేశాల పట్ల అనుసరించిన ప్రజాస్వామ్య వ్యతిరేక, స్వార్ధపూరిత, దుర్మార్గ , యుద్ధోన్మాద వైఖరుల్లో ఎలాంటి మార్పు లేదు. అందువలన ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికలు కూడా అలాంటివే అన్నది కొందరి అభిప్రాయం.

విప్లవం ! ఈ మాట వింటే కొందరికి భయం, అందువలన ఒక గుణాత్మక మార్పు అందాం. అది ఆలశ్యం అవుతోందని ప్రగతిశీలశక్తులు ఆవేదన చెందుతుంటే , ఆలశ్యంగా అయినా వస్తుందేమో అని దాని గురించి భయపడే వారు ఆందోళన చెందుతారు. ఎవరు అవునన్నా కాదన్నా మార్పు అని వార్యం. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది, ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికల ప్రత్యేకత కూడా అదే.సున్నా కంటే ఒకటి ఎంతో పెద్దది కదా ! సోషలిజం, కమ్యూనిజం అనే పదాలే వినపడకూడదు, అలాంటి భావజాలం వున్న వారు కనపడకూడదు అన్న అమెరికాలో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నారు. గతేడాది జార్జియాలోని ఓక్‌వుడ్‌ అనే చోట లానియర్‌ టెక్నికల్‌ కాలేజీలో ఆంగ్లబోధన టీచర్‌గా డాక్టర్‌ బిల్‌ ఎలెనెబర్గ్‌ అనే అతను దరఖాస్తు చేశాడు. అతని వివరాలు చూసిన యాజమాన్యం సాహిత్యం, ఇతర అంశాలలో అతని ప్రతిభాపాటవాలను చూసి ఇన్ని తెలివి తేటలున్నాయంటే ఎవడో కమ్యూనిస్టు అయి వుంటాడని భావించి నేను కమ్యూనిస్టును కాదు అని ప్రమాణ పత్రం ఇవ్వాల్సిందే అంటూ బలవంతంగా రాయించుకున్నారు.

అలాంటి చట్టవిరుద్దమైన, కమ్యూనిస్టు వ్యతిరేక పరిస్ధితి వున్న చోట ఈ ఎన్నికల సందర్భంగా అనేక మంది పురోగామివాదులు అంతకు ముందు పాతుకుపోయి వున్నవారిని పెకలించి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా పోటీలోకి వచ్చారు. సంఖ్యరీత్యా వారెంత మంది అనటం కంటే ఓటర్లలో వచ్చిన, వస్తున్న మార్పు ముఖ్యం. ఒకవైపు లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి కొన్ని చోట్ల తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలినా అమెరికాలో సోషలిస్టు నినాదం పట్ల పెరుగుతున్న ఆకర్షణ తగ్గలేదు. దీనర్ధం అమెరికాలో వామపక్షాలు త్వరలో అధికారానికి వస్తాయని అతిశయోక్తి చెప్పటం కాదు.అమెరికాలో ఒక పార్టీ తరఫున అభ్యర్ధిగా ఎన్నిక కావాలంటే కొన్ని నెలల ముందే పోటీ చేయాలనుకునే వారు ఆయా నియోజకవర్గాలలో పార్టీ మద్దతు సంపాదించాలి. వాటినే ప్రైమరీలు అంటారు. పార్టీ అంతర్గత ఎన్నికలు జరుగుతాయి. వాటిలో నెగ్గిన వారిని సాధారణంగా అభ్యర్ధులుగా ఆయా పార్టీలు నిర్ణయిస్తాయి. మన దగ్గర మాదిరి కొన్ని పార్టీలలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ పేరుతో తమకు కావాల్సిన వ్యక్తిని అభ్యర్ధిగా పెట్టటం సాధారణంగా జరగదు.

జూలై నెలలో బ్రూకింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌ ప్రైమరీ ప్రాజక్టు అనే సంస్ధ ఆరువందల స్ధానాల అభ్యర్ధిత్వాలకోసం పోటీ పడిన 1600 మంది డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధుల గురించి విశ్లేషణ చేసింది. ముప్పై ఒక్క రాష్ట్రాలలో 2014ఎన్నికలలో తాము పురోగామి వాదులం అని స్వయంగా చెప్పుకున్న అభ్యర్ధులు కేవలం 60 మంది అయితే తాజా ఎన్నికలలో 280 మంది వున్నారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో పురోగామివాదులుగా బహిరంగంగా చెప్పుకొని అభ్యర్ధులుగా ఎన్నికైన వారు 24 మంది అయితే తాజా ఎన్నికలలో 81మంది విజయం సాధించటం లేదా విజయబాటలో వున్నట్లు ఆ విశ్లేషణ పేర్కొన్నది. ఇప్పుడు అమెరికాలో పరిస్ధితి ఎలా వుందంటే అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని బలపరచే వారందరికీ సోషలిస్టు ముద్రను తగిలిస్తున్నారు. దానికి వ్యతిరేకమా అనుకూలమా అనేది డెమోక్రటిక్‌ పార్టీలో ఒక ప్రధాన అంశం. అందరికీ ఆరోగ్యం కావాలనటమే సోషలిజం అయితే మాకది కావాలి, మేమూ సోషలిస్టులమే అని సాధారణ ఓటర్లు ఆ నినాదాన్ని బలపరిచిన వారికి మద్దతుదారులుగా మారుతున్నారంటే అతిశయోక్తి కాదు. డెమోక్రటిక్‌ పార్టీ అంటే గతంలో ప్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ వంటి కులీన వుదారవాదులది పైచేయిగా వుండేది. కానీ ఇప్పుడు వారి సంఖ్య తగ్గిపోతూ రంగు, నల్లజాతి వారి చురుకుదనం పెరుగుతున్నది. న్యూయార్క్‌ నగరంలోని ఒక ఎంపీ స్ధానంలో 20సంవత్సరాల నుంచీ గెలుస్తున్న జో క్రోలేను బార్‌లో పనిచేసిన అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ అనే 29సంవత్సరాల యువతి ఓడించి యావత్‌ అమెరికాను ఆశ్చర్యపరచింది. స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో కాంగ్రెస్‌లో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ మాదిరి డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీశాండర్స్‌ నాయకత్వంలోని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఆమె పని చేస్తున్నది. ఇది డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్భాగంగానే వుంటుంది. తాము సోషలిస్టులమని బహిరంగంగా చెప్పుకొనే ఒకాసియో వంటి వారు ఆవిర్భవించటం డెమోక్రటిక్‌ పార్టీలోని యథాతధ వాదులకు, మితవాద రిపబ్లికన్లకు ఆందోళన కలిగించే అంశమే.

On the 200th anniversary of Karl Marx’s birth, the report breathlessly notes, ‘Detailed policy proposals from self-declared socialists are gaining support in Congress and among much of the electorate.’

‘కారల్‌ మార్క్స్‌ 200వ జన్మదినోత్సవ సంవత్సర సందర్భోచితంగా అమెరికా రాజకీయ చర్చలలో సోషలిజం తిరిగి చోటుచేసుకుంటున్నది. సోషలిస్టులం అని స్వయంగా చెప్పుకుంటున్నవారి నుంచి వచ్చిన వివరణాత్మక విధాన ప్రతిపాదనలకు పార్లమెంటులోమరియు ఎక్కువ మంది ఓటర్లలో మద్దతు పెరుగుతున్నది’ అని అమెరికా అధ్యక్ష భవనంలోని ఆర్ధిక సలహాదారుల మండలి అక్టోబరు 23న ఒక శ్వేతపత్రంలో పేర్కొన్నది. 1950దశకంలో అమెరికా నలుమూలల సోవియట్‌ యూనియన్‌ పట్ల పెరిగిన కమ్యూనిస్టు సానుభూతి అమెరికన్‌ పాలకవర్గాలను భయపెట్టినట్లుగా ఇప్పుడు సోషలిజం గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నదనటానికి ఈ నివేదిక ఒక సూచిక. ఓటర్లను భయపెట్టేందుకు, సోషలిస్టులుగా ప్రకటించుకున్నవారిని ఓడించేందుకే సరిగా ఎన్నికల ముందు దీనిని విడుదల చేశారని వేరే చెప్పనవసరం లేదు. దాని కొనసాగింపుగానే పోలింగ్‌కు ఇంకా కొద్ది గంటల వ్యవధి వుందనగా ట్రంప్‌ కుటుంబం ఓటర్ల ముందు సోషలిస్టు బూచిని చూపింది. డెమోక్రాట్లు గెలిస్తే అరాచకం, సోషలిజాలను తీసుకువస్తారనే యుగళగీతాన్ని వారు అలపించారు. టీవీ యాంకర్‌ మరియు ట్రంప్‌ కోడలైన లారా ట్రంప్‌ తన మామ ఎజండాను అడ్డుకొనేందుకు డెమోక్రాట్లు వూహించటానికి కూడా వీలు లేని అంశాలను ముందుకు తెచ్చారని ఆరోపించింది. వారు సోషలిజం గురించి మాట్లాడుతున్నారు, మనం దాన్ని మరిచిపోరాదు, అది చాలా భయంకరమైనది, ప్రతి ఒక్కరూ దీనిమీద దృష్టి సారించాలి అని సెలవిచ్చింది. నాన్సీ పెలోసీ, చుక్‌ స్కుమర్‌ వంటి వారు పార్లమెంటులో వుంటే రానున్న రెండు సంవత్సరాలూ అరాచకమే, మా నాన్నను అడ్డుకుంటారు, మూక పాలనను ప్రవేశపెడతారు. ఎవరైనా తమ దేశభక్తి సూచనలను వెల్లడిస్తూ కార్లమీద అమెరికా జండాలను కడితే కార్లను తగులబెడతారు, నా తండ్రి విధ్వంసానికి వ్యతిరేకంగా వుపాధి చూపేందుకు ప్రయత్నిస్తున్నాడు, వారు వస్తే పన్నులను రెట్టింపు చేస్తారు, అది మాంద్యానికి లేదా సంక్షోభానికి దారి తీయవచ్చు, వారు చట్టాల అమలును అడ్డుకొని దాడులు చేస్తారు. అందుకే రిపబ్లికన్లకు ఓట్లు వేయాలి. అని ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ఆరోపించాడు.

సోషలిజం వాస్తవిక ముప్పు తెస్తోందనటానికి ఈ అధ్యయనం ఒక రుజువు అని ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్‌ సీన్‌ హానిటీ వర్ణించాడు. అందరికీ ఆరోగ్యం అని డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ ప్రతిపాదించిన విధానాన్ని అమలు జరపాలంటే పదేండ్ల వ్యవధిలో 32.6లక్షల కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది. అంత మొత్తాన్ని జనానికి ఖర్చు చేసేందుకు కార్పొరేట్‌ శక్తులు అంగకరించటం లేదు. అమలు జరిగితే జిడిపి పడిపోతుందని, పన్నులు పెరుగుతాయని, అమలు జరుగుతున్న ఇతర సంక్షేమ చర్యలకు కోతపడుతుందని రిపబ్లికన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా సర్వేల ప్రకారం ఈ విధానానికి మద్దతు ఇస్తున్న వారు డెమోక్రటిక్‌ అభ్యర్ధులలో సగానికి మించి వున్నారు. వారు కనుక ఎన్నికైతే రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో అందుకోసం పట్టుబట్టటం అనివార్యం. ఒకవైపు సోషలిస్టు నినాదం పట్ల సామాన్య ఓటర్లు అకర్షితులౌతుంటే మితవాద ఓటర్లను నిలుపుకొనేందుకు, ఆకట్టుకొనేందుకు డెమోక్రటిక్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు నాన్సీ పెలోసీ వంటి వారు మేము పెట్టుబడిదారులం అదే సరైన మార్గం అని ప్రకటించుకున్నారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు ట్రంప్‌ రెచ్చగొట్టని అంశం లేదు, చేయని వక్రీకరణ, ఆడని అబద్దం లేదు. అయితే అధికారానికి వచ్చిన 649రోజుల్లో రోజుకు పది వంతున 6,420 వక్రీకరణలు, అబద్దాలు చెప్పినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ప్రకటించింది. డెమోక్రాట్లు రెట్టింపు లేదా మూడు రెట్లు పన్నులు పెంచాలని కోరుకుంటున్నారు, దేశం మీద సోషలిజాన్ని రుద్దాలని, అమెరికా సరిహద్దులను చెరిపివేయాలని చూస్తున్నారు. దేశంలోకి అక్రమంగా వలసలు వచ్చే వారిని బిడారులుగా ఒకదాని తరువాత ఒకదానిని ఆహ్వానిస్తున్నారు. అది మన దేశం మీద దండయాత్ర చేయటమే. ఇవి అలాంటి వాటిలో కొన్ని. గత కొద్ధి సంవత్సరాలుగా ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి అమెరికాలో జరుగుతున్న అంతర్మధనాన్ని పరిశీలించితే డెమోక్రటిక్‌ పార్టీ నాయకుల కంటే దాని మద్దతుదార్లయిన ఓటర్లలోనే సోషలిస్టు భావజాలంవైపు ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. మరో రెండు సంవత్సరాలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో దాని ప్రభావం ఎలా వుంటుందోనని ఇప్పటి నుంచే కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.పలు మీడియా సంస్ధల ఎన్నికల సర్వేలు డెమోక్రాట్లకే మెజారిటీని చూపాయి. అయితే సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా, రిపబ్లికన్లు ఇతరులు రెచ్చగొట్టిన ప్రచారంతో డెమోక్రాట్లలోని మితవాదులు గనుక ప్రభావితమైతే అనూహ్యంగా రిపబ్లికన్లు బటాబటి మెజారిటీతో విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ నిజంగా అదే జరిగినా లేక ఈ ఎన్నికలలో డెమోక్రటిక్‌ సోషలిస్టులు గణనీయ విజయాలు సాధించినా అమెరికా రాజకీయ సమీకరణలు మరింత వేగవంతం కావటం అనివార్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా – రష్యా మధ్యలో చైనా !

24 Wednesday Oct 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

China, Donald trump, INF Treaty, Intermediate-Range Nuclear Forces, RUSSIA, The 1987 INF Treaty

Related image

గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌  ఒప్పందం

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు మరో రెండు వారాలుండగా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యావత్‌ ప్రపంచాన్ని ముఖ్యంగా ఐరోపాను ఆందోళనకు గురిచేసే ప్రకటన చేశాడు. మూడు దశాబ్దాల క్రితం నాటి సోవియట్‌తో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. దీని మీద ఐరోపాలో మొత్తం మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది రష్యా వ్యాఖ్యానించినట్లు బెదిరింపా లేక చెప్పినట్లు నిజంగానే వైదొలుగుతుందా అన్నది చూడాల్సి వుంది. ఐరోపాలో వెల్లడయ్యే స్పందన వ్యతిరేకంగా వుంటే తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఒప్పందం నుంచి వైదొలగటం ఖాయం అని చెప్పవచ్చు. ప్రపంచానికి ట్రంప్‌ పిచ్చివాడనిపించవచ్చుగానీ ఒక పధకం ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా సెనెట్‌్‌ ఆమోదించిన ఒప్పందాలను దాని అనుమతి లేకుండా రద్దు చేసేందుకు లేదా వాటి నుంచి వుపసంహరించుకుంటామని ప్రకటించేందుకు అధ్యక్షుడికి అనుమతి లేదు. అయినా ట్రంప్‌ ప్రకటన తక్షణ ప్రయోజనం ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ విజయం దిశగా పయనిస్తున్నదన్న వార్తల పూర్వరంగంలో అధికారపార్టీ రిపబ్లికన్లకు లబ్ది చేకూర్చటమే. ఎన్నికల్లో లబ్దికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవటం ఒక ఎత్తుగడ కావచ్చుగాని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు మరొక ప్రచ్చన్న యుద్ధానికి తెరలేపేందుకు ఎప్పటి నుంచో చేస్తున్న సన్నాహాలలో భాగమే ఇది. నిజంగానే ఒప్పందం నుంచి వైదొలిగితే ఆ చారిత్రాత్మక ఎదురుదెబ్బకు బాధ్యురాలు అమెరికానే అవుతుంది.

అసలీ ఒప్పందం ఏమిటి ? ఐరోపాలో ఆయుధాల మోహరింపును అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూర్వరంగంలో మధ్య శ్రేణి అణు బలాల ఒప్పందం(ఐఎన్‌ఎఫ్‌) పేరుతో తమ వద్ద వున్న మధ్య,లఘు శ్రేణి క్షిపణులను తొలగించుకొనేందుకు 1987 డిసెంబరు ఎనిమిదిన గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌ మధ్య కాలపరిమితి లేని ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. తరువాత సోవియట్‌ రద్దు కావటంతో దాని వారసురాలిగా రష్యా ఒప్పందంలోకి వచ్చింది. ఆ మేరకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు వున్న లఘు, వెయ్యి నుంచి 5,500 కిలోమీటర్లకు వుండే మధ్య శ్రేణి అణు, సాంప్రదాయ క్షిపణులను రెండు దేశాలు తొలగించాల్సి వుంటుంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలో లేవు. ఒప్పందం ప్రకారం అమెరికా 846 సోవియట్‌ లేదా రష్యా 1,846 క్షిపణులను నాశనం చేశాయి. ఇవి ప్రధానంగా ఐరోపాలో యుద్ధానికి అనువుగా రూపొందించినవి కావటంతో వాటిని తొలగించటం ప్రాంతీయ భద్రతకు ఎంతో ముఖ్యమని ఐరోపా భావించింది.

ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇంతవరకు అమలు వుల్లంఘన గురించి కొన్ని ఫిర్యాదులు రెండువైపుల నుంచీ వున్నప్పటికీ పెద్ద వివాదాలేమీ బయటి ప్రపంచానికి తెలియదు. ఆకస్మికంగా ఈనెల 20న తాము వైదొలగాలనుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటన చేశాడు. ఈ ఒప్పందంతో చైనాకు ఎలాంటి ప్రమేయమూ లేదు, ఏ విధంగానూ భాగస్వామి కాదు. చిత్రం ఏమిటంటే తాము వైదొలగదలచుకుంటే అది అమెరికా తలనొప్పి అనుకోవచ్చు కానీ, ఈ సమస్యలోకి ట్రంప్‌ మహాశయుడు చైనాను లాగాడు.రష్యా మన దగ్గరకు రావాలి, చైనా మన దగ్గరకు రావాలి, అందరూ మన దగ్గరకు రావాలి. అందరం మంచిగా తయారవుదాం మనలో ఎవరమూ ఆ అయుధాలను తయారు చేయవద్దు అని చెబితే తప్ప మనం తయారు చేయాల్సిందే. కానీ రష్యా తయారు చేస్తూ, చైనా తయారు చేస్తూ వుంటే మనం ఒప్పందానికి కట్టుబడివుండాలంటే కుదరదు. రష్యా ఒప్పందానికి కట్టుబడి వుండటం లేదు కాబట్టి మనం కూడా కట్టుబడి వుండనవసరం లేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నాం అని ట్రంప్‌ ప్రకటించాడు. అంటే రష్యాతో ముడి పెట్టి చైనాను కూడా దెబ్బతీయాలనే లక్ష్యం ట్రంప్‌ ప్రకటన వెనుక వుందా ? ముగిసిందని ప్రకటించిన ప్రచ్చన్న యుద్ధాన్ని చైనా మీద ప్రారంభించదలచారా ? అంటే వెలువడుతున్న వ్యాఖ్యానాలను బట్టి అవుననే చెప్పాల్సి వుంది. ట్రంప్‌ ప్రత్యక్షంగా రష్యా, చైనాలను రంగంలోకి తెచ్చేందుకు పూనుకున్నప్పటికీ మరోవైపు ఐరోపా రాజ్యాలను మరింతగా తన అదుపులోకి తెచ్చుకొనే ప్రయత్నం కూడా లేకపోలేదు.

‘ ట్రంప్‌ ప్రచ్చన్న యుద్ధాన్ని పునరుద్ధరించవచ్చు , కానీ చైనా దాని గతిని మార్చగలదు’ అనే శీర్షికతో న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక వ్యాఖ్యానాన్ని ప్రకటించింది. బెదిరింపులు, అణ్వాయుధాలు పాతవయ్యాయి. కొద్ది రోజులుగా ఐరోపా, అమెరికాలో అనేక మంది నూతన ప్రచ్చన్న యుద్ధం ప్రారంభం అవుతున్నదని అనుకుంటున్నారు, నూతన గతులు దానికి తూట్లు పొడుస్తాయి ఎందుకంటే సంపద్వంతమైన, జాతీయవాద చైనా అవతరించిందని సదరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రష్యా, చైనాలతో గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎఎన్‌ఎఫ్‌ ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందని తమ ఎన్నికలు, అంతర్గత వ్యవహారాల్లో రష్యా జోక్యం చేసుకొంటోందని గత రెండు సంవత్సరాలుగా అమెరికా ఒక పధకం ప్రకారం ఆరోపణలు చేస్తోంది. మరోవైపున పెట్టుబడులు, వాణిజ్యం, మేథోసంపత్తి హక్కు చౌర్యం, ఇతర పద్దతుల్లో అమెరికా ప్రజాభిప్రాయాన్ని మలచేందుకు చైనా ప్రయత్నిస్తోందని ట్రంప్‌ అండ్‌కో ప్రచారం చేస్తోంది.దాన్ని అడ్డుకొనే పేరుతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆయుధపోటీకి కాలుదువ్వుతోంది.

1987నాటి రష్యాాఅమెరికా ఆయుధ నియంత్రణ ఒప్పందంలో చైనా లేని కారణంగా అది స్వంత అణ్వాయుధ మరియు అన్ని శ్రేణుల సాంప్రదాయ క్షిపణులను తయారు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని అమెరికా వ్యూహకర్తలు వాదిస్తున్నారు. దాన్నే ట్రంప్‌ వెళ్లగక్కాడు.ఈ ఒప్పందంలో చైనా భాగస్వామి కానప్పటికీ దాని దగ్గర వున్న క్షిపణులలో 95శాతం మధ్యశ్రేణివే అని దక్షిణ కొరియాలో రాయబారిగా పని చేసిన అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ అధిపతి హారీ హారిస్‌ ఒక నివేదికలో ఆరోపించాడు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఐరోపా కేంద్రంగా చేసుకున్నదని అమెరికాాచైనా మిలిటరీ బలాబలాలను పరిగణనలోకి తీసుకోవలేదని, ఆ అంశం ఇటీవలి కాలంలో అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిందని ఇటీవల కొందరు కొత్త వాదనలు లేవనెత్తారు. ఆసియాలో చైనా ఇతర దేశాలను బెదిరించేందుకు గాను సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్ధల కంటే భూతలం నుంచి ప్రయోగించే ఆయుధాల ఖర్చు అమెరికాకు కలసి వస్తుంది. అయితే మిత్రదేశాల అనుమతి లేకుండా చైనా లక్ష్యంగా పసిఫిక్‌ ప్రాంతం నుంచి క్షిపణులను ప్రయోగించే కేంద్రాలు పరిమితంగా వుండటం అమెరికాకు ఒక సమస్య. జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు అటువంటి వ్యవస్ధలను తమ భూభాగంపై నెలకొల్పేందుకు అంగీకరిస్తాయా అన్నది సందేహాస్పదమే. అలా చేయటం అంటే అమెరికా కోసం చైనాతో వైరం తెచ్చిపెట్టుకోవటమే.గత నాలుగు దశాబ్దాలుగా చైనా తన సంస్కరణలు, తన అభివృద్ధి తప్ప ఆయుధపోటీలో వున్నట్లు మనకు కనిపించదు.అలాంటి దానిని వాణిజ్యంలో తన షరతులను రుద్దటంలో విఫలమైన అమెరికా ఇప్పుడు మిలిటరీ రీత్యా ఆయుధపోటీకి దిగి చైనా దృష్టి మళ్లించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అణ్వాయుధాలతో పోల్చితే చైనా ఎంతో వెనుకబడి వుంది, దానికి వాటి అవసరం కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు అమెరికా కవ్వింపులకు దిగుతుండటంతో ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

ఇటీవలి కాలంలో అమెరికా అంతర్జాతీయ వ్యవస్ధ నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నది. వాతావరణ మార్పులు, భూతాపం తదితర అంశాలున్న పారిస్‌ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అణు ఒప్పందం, అంతర్జాతీయ పోస్టల్‌ యూనియన్‌ నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అవన్నీ ఒక ఎత్తయితే ఇది అత్యంత ప్రమాదకర చర్యల, అంతర్జాతీయ భద్రత మీద ఎంతో పభావం చూపనుంది. మొత్తంగా చూసినపుడు ఇటీవలి కాలంలో అనేక ఒప్పందాలను తిరగదోడుతోంది, కొత్తవి కావాలని వత్తిడి తెస్తోంది. అమెరికాకు అగ్రస్ధానం లేదా సింహభాగం రాబట్టుకొనేందుకు పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. తనకేమీ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఇది అమెరికన్లకేగాక యావత్‌ మానవాళికి హానికలిగించే పోకడ అని చెప్పకతప్పదు. ఒక పరిశీలన ప్రకారం చాలా సంవత్సరాలుగా అమెరికా వుపరితల ఆధారిత లఘు, మధ్యశ్రేణి క్షిపణులను అభివృద్ది చేయలేదు. ఇటీవలనే అందుకు నిధులు కేటాయించింది. వుపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులను మోహరించేందుకు ఏ ఐరోపా దేశం కూడా తమ భూ భాగాలను అనుమతించే అవకాశం లేదు. అయితే రష్యా దగ్గర అలాంటి ఆయుధాలు వున్నందున చాలా త్వరగా మోహరించే అవకాశాలున్నాయి. నిషేధిత శ్రేణిలో కొత్త క్షిపణులను రష్యా తయారు చేసిందని అయితే ఒప్పందం కారణంగా వాటి శ్రేణిని పెంచి ఖండాంతర క్షిపణిగా పేర్కొన్నదని అమెరికా అనుమానిస్తున్నది.

Image result for intermediate-range nuclear missile

తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినప్పటి నుంచి రష్యాను చక్రబంధంలో బిగించేందుకు నాటో కూటమిని విస్తరించేందుకు అమెరికన్లు ప్రయత్నించి ఇప్పుడు రుమేనియా, పోలాండ్‌ వంటి చోట్ల రష్యా ముంగిటికి తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు. దానికి ప్రతిగా అది కూడా తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.గురివిందగింజ మాదిరి తన చర్యల గురించి నోరెత్తని ట్రంప్‌ రష్యా మోహరింపులను సాకుగా చూపి ఒప్పందం నుంచి వైదొలుగుతాననటం ఒక సాకు మాత్రమే. మూడు దశాబ్దాలుగా ప్రశాంతంగా వున్న తమకు మరోసారి ఆయుధముప్పు తెచ్చిపెడుతున్నారనే అభిప్రాయం ఐరోపాలో వ్యక్తం అవుతోంది. రష్యాను అంకెకు తెచ్చేందుకు అమెరికా చేసే యత్నాలకు తాము మద్దతిస్తాం తప్ప ఒప్పందం నుంచి తప్పుకుంటామనే అమెరికా వైఖరిని ఐరోపా నాయకులు తప్పు పడుతున్నారు. నిరాయుధీకరణ ఒప్పందం ఐరోపా భద్రత అనే కట్టడానికి గత మూడు దశాబ్దాలుగా ఒక స్ధంభం మాదిరి వుంది, ప్రచ్చన్న యుద్ధాన్ని అంతం చేసేందుకు తోడ్పడింది అని ఐరోపా యూనియన్‌ విదేశాంగ విధాన విభాగ ప్రతినిధి ఫెడరేసియా మోఘెరిని ఒక రాత పూర్వక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం కారణంగా దాదాపు అణు, సాంప్రదాయ ఆయుధాలున్న మూడువేల క్షిపణులను తొలగించి నాశనం చేశారు. ప్రపంచానికి నూతన ఆయుధపోటీ అవసరం లేదు, దాని వలన ఎవరికీ లాభం లేకపోగా మరింత అస్ధిరత్వాన్ని తెస్తుందని పేర్కొన్నారు. స్వీడిష్‌ మాజీ ప్రధాని కార్ల్‌ బిడిట్‌ అమెరికా చర్య రష్యాకు ఒక బహుమతి లాంటిది. ఐరోపాకు అణుముప్పును పెంచుతుంది. ఎందుకంటే అమెరికా ఆయుధపోటీలో చేరటంతో రష్యా పెద్ద సంఖ్యలో నూతన ఆయుధాలను మోహరిస్తుందన్నాడు. ఇబ్బందులు రష్యా క్షిపణుల పరిధిలో వున్న ఐరోపావారికి తప్ప అమెరికన్లకు కాదని జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ పేర్కొన్నారు.ట్రంప్‌ ప్రకటన విచారకరమని ఒప్పందానికి కట్టుబడే అంశాలను పరిష్కరించాలని రష్యాను కోరారు. తాము అమెరికా వైఖరిని సమర్ధిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. ఈ చర్య ఎక్కడికి దారితీస్తుందో వాష్టింగ్టన్‌లోని వారికి నిజంగా అర్ధం కావటం లేదా అని ఒప్పందంపై సంతకం చేసిన సోవియట్‌ మాజీ అధ్యక్షుడు గోర్బచెవ్‌ ప్రశ్నించాడు.ఒప్పందం నుంచి వైదొలగటం ప్రమాకర అడుగు అవుతుందని, తమను బ్లాక్‌ మెయిల్‌ చేయటమే అని, అయితే దాన్ని అంగీకరించేది లేదని రష్యా తక్షణ స్పందనలో పేర్కొన్నది.

ట్రంప్‌ చర్యను అమెరికాలోని కొందరు మేథావులే తప్పు పడుతున్నారు. దౌత్యపరంగా హ్రస్వదృష్టి, మధ్యంతర ఎన్నికలకు ముందు ట్రంప్‌కు రాజకీయంగా ప్రమాదకరం, ముప్పుతో కూడుకున్నదని వాషింగ్టన్‌లోని ఆయుధాల అదుపు అసోసియేషన్‌ డైరెక్టర్‌ డారిల్‌ కింబాల్‌ వ్యాఖ్యానించారు. ఒప్పంద వుల్లంఘనకు రష్యా పాల్పడుతున్నదనే ఆందోళన ఒకవైపు వుండగా దాన్నుంచి అమెరికా వుపసంహరణ ప్రకటన చేయటంతో వైఫల్య నిందను నెత్తిన వేసుకున్నట్లయిందని కింబాల్‌ వాపోయారు. వివాద పరిష్కారానికి దౌత్య అవకాశాలు ఆవిరి కాలేదని, ట్రంప్‌ పాలనా కాలంలో ఆయన సలహాదారు బోల్టన్‌ మాస్కో పర్యటన కేవలం మూడవదేనని కూడా కిబాల్‌ చెప్పారు. రుమేనియాలో ఆమెరికా మోహరించిన క్షిపణులను అడ్డుకొనే కేంద్రాలను రష్యన్‌ నిపుణులు, ఆమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్న రష్యా 9ఎం729 వ్యవస్ధలను అమెరికా నిపుణులు పరస్పరం తనిఖీ చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు.

ట్రంప్‌ ప్రతినిధిగా మాస్కో పర్యటనలో వున్న బోల్టన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఒప్పందంలో పేర్కొన్న క్షిపణులు అనేక దేశాలు తయారు చేస్తున్నందున ప్రచ్చన్న యుద్ధకాలంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కాలదోషం పట్టిందని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌, ఇతర అమెరికకా నిపుణులు కోరుతున్నట్లు అణ్వాయుధ క్షిపణుల నిషేధ ఒప్పందంలో చైనా చేరే అవకాశాలేమాత్రం లేవని కింబల్‌ వ్యాఖ్యానించారు. దాని దగ్గర వున్న అణ్వాయుధాలు తక్కువ, వారి దగ్గర లఘు, మధ్య శ్రేణి క్షిపణులు ఎక్కువగా వున్నాయి. నిజంగా వారు ఒప్పందంలో చేరితే అది అమెరికా, రష్యాలకు విజయం, చైనాకు నష్టం అన్నారు. అమెరికా నిజంగా ఒప్పందం నుంచి తప్పుకుంటుందా అన్న ప్రశ్నకు కింబల్‌ ఇలా స్పందించాడు. గత కొద్ది వారాలుగా ఒప్పందాన్ని ఏమి చేయాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది.బోల్లన్‌ గనుకు చక్కగా వుండి వుంటే ఈ సమస్యను దీర్ఘకాలం నాన్చటం మంచిది కాదు, మీరు తదుపరి చర్యలు తీసుకోనట్లయితే మేము ఒప్పందం నుంచి వెనక్కు పోవచ్చు అని చెప్పేందుకు మాస్కో వెళ్లి వుండాల్సింది, కానీ గట్టిగా వ్యవహరించాలనే ప్రవత్తిగల ట్రంప్‌ ముందుగానే తుపాకిని ఎక్కు పెట్టి ఒప్పందాన్నుంచి వైదొలుగుతామని చెప్పాడు. రష్యా గురించి గట్టిగా మాట్లాడి రాజకీయంగా లబ్దిపొంద చూసేందుకు రాజకీయవేత్తలు ప్రయత్నిస్తున్నారని కొన్ని వర్గాలు పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్ధ నొవొస్తి పేర్కొన్నది.

ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం రద్దయితే పర్యవసానాలేమిటి? మరోసారి ఆయుధ పోటీకి అమెరికా తెరలేపినట్లు అవుతుంది. అని వార్యంగా రష్యా, చైనా ఇతర దేశాలు అందుకోసం అమెరికా అంతగాకపోయినా అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఐరోపా గడ్డమీద ఆయుధాలు పెరుగుతాయి. అక్కడి దేశాలు తమ రక్షణ ఖర్చును గణనీయంగా పెంచుకోవాల్సి వుంటుంది, అదిగాకుండా అమెరికా ఆయుధాలకు అదనంగా చెల్లించాల్సిన పరిస్ధితి. వీటన్నింటి వలన ప్రయివేటు రంగంలోని అమెరికా మిలిటరీ పరిశ్రమలకు లాభాలు పెరుగుతాయి. తన రాజకీయ వైఖరికి అనేక అంశాల్లో అడ్డుపడుతున్న రష్యాపై అనేక ఆంక్షలను అమలు జరుపుతున్న అమెరికా రాబోయే రోజుల్లో మరింగా విస్తరించవచ్చు. ఒప్పందం నుంచి అమెరికా వైదులుగుతున్న కారణంగా నాటో కూటమి, ఐరోపా యూనియన్‌ దేశాల మధ్య విబేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐరోపా తన భద్రతను తాను చూసుకోగలదు అంటున్న దేశాలు అమెరికా తెచ్చి పెట్టిన కొత్త సమస్యమీద ఎలా స్పందిస్తాయో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వున్న రాయితీలనే ఎత్తి వేస్తున్నవారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారా ?

06 Saturday Oct 2018

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

cutting down the farm subsidies, DFI, double the farmers income, India Farm Subsidies

Related image

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా స్విడ్జర్లాండ్‌లోని ప్రతి కుటుంబం రెండున్నరవేల ఫ్రాంక్‌లు(స్విస్‌ కరెన్సీ) దేశ వ్యవసాయ విధానాల అమలుకు మూల్యంగా చెల్లించాల్సి వస్తోందని సెప్టెంబరు రెండవ వారంలో ఒక వార్త వచ్చింది. ఇది రాసే సమయానికి ఒక ఫ్రాంక్‌ విలువ 75రూపాయలకు పైబడి వుంది. అంటే ప్రభుత్వం నుంచి ఏటా లక్షా తొంభైవేల రూపాయలు రైతాంగానికి సబ్సిడీ లేదా మరో రూపంలో అందుతున్నది. దేశ ఆర్ధిక వ్యవస్ధకు వ్యవసాయ రంగం నుంచి వస్తున్న ఆదాయం 340 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగానికి దేశం ఖర్చు చేస్తున్న మొత్తం 1990 కోట్ల ఫ్రాంక్‌లుగా వుందని, ఇలా ఇంకెంత మాత్రం కొనసాగకూడదని తాజాగా ఒక సంస్ధ తన అధ్యయనంలో పేర్కొన్నది. కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలు నేరుగా ఇస్తున్న మొత్తాలు, పన్నుల రాయితీలు 490, దిగుమతుల ఆంక్షల కారణంగా వినియోగదారులకు ధరలు పెరిగి 460, ఎగుమతుల కోసం ఇస్తున్న రాయితీలు 310, పర్యావరణ నష్టం 730 కోట్ల ఫ్రాంక్‌ల వంతున వున్నట్లు దానిలో తేల్చారు. పురుగు మందుల వాడకం, మాంసం కోసం పెంచే పశువుల పెంపకం, మాంస పరిశ్రమల ద్వారా జరిగే పర్యావరణ నష్టాల వంటివాటిని వ్యవసాయానికి చేస్తున్న ఖర్చుగా లెక్కించారు.

ఐరోపాలో వ్యవసాయానికి రాయితీలు ఇచ్చే దేశాల వరుసలో నార్వే, ఐస్‌లాండ్‌, స్విడ్జర్లాండ్‌ మొదటి మూడు స్ధానాల్లో వున్నాయి. స్విస్‌లో వ్యవసాయ రంగానికి అవుతున్న మొత్తం ఖర్చు పైన చెప్పుకున్నట్లుగా 1990 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగం ద్వారా వచ్చే మొత్తం 340 కోట్లకు వ్యవసాయ వస్తువులపై విధించే దిగుమతి పన్ను ద్వారా వచ్చే 60కోట్లను కూడా కలుపుకుంటే నికరంగా ప్రభుత్వం అంటే జనం భరించే మొత్తం 1590 కోట్ల ఫ్రాంక్‌లని, ప్రతి కుటుంబానికి 4,500 ఫ్రాంక్‌లైతే పర్యావరణ నష్టాన్ని మినహాయించి లెక్కవేస్తే 2,570 ఫ్రాంక్‌లను భరించాల్సి వస్తోందని లెక్కలు చెప్పారు. ఈ నివేదిక చదివిన,విన్న,కన్నవారు ఇంత భారం మోపి వ్యవసాయం చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది, కావాల్సినవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే పోదా అనుకోవటం సహజం.ఈ లెక్కలు అక్కడి పాలకులకు తెలియవా ? అసలు విషయం ఏమంటే వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేయాలనేవారి కుతర్కమిది. స్విస్‌ వ్యవసాయ- ఆహార పరిశ్రమ ద్వారా ఏటా జిడిపికి 9000 కోట్ల ఫ్రాంక్‌లు సమకూరుతున్నాయి.వ్యవసాయం లేకపోతే దానికి ముడిసరకులు ఎక్కడి నుంచి వస్తాయని కొన్ని పార్టీల వారు ఆ నివేదిక మీద ధ్వజమెత్తారు. ప్రస్తుతం అక్కడ వున్న వ్యవస్ధలో పన్నెండుశాతం మంది రైతులు నష్టపోతున్నారన్నది వాస్తవమని ఒక పత్రిక రాసింది.

అయినప్పటికీ 2018ా21మధ్య 78.9 కోట్ల ఫ్రాంక్‌ల సబ్సిడీ కోత పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.2014 వివరాల ప్రకారం అక్కడి రైతు కుటుంబం సగటున ఏడాదికి 65వేల ఫ్రాంక్‌ల రాయితీలు పొందుతున్నది. వ్యవసాయ పంటల మీద వచ్చే నిఖరాదాయం 3000 ఫ్రాంక్‌లు, ఇతర ఆదాయం 26వేలు కలుపుకుంటే మొత్తం 94వేల ఫ్రాంక్‌లు పొందుతున్నట్లు అంచనా వేశారు. 2004ా14 మధ్య సగటున అక్కడి రైతు కుటుంబాల ఆదాయం 12శాతం పెరిగింది. గమనించాల్సిన అంశం ఏమంటే వ్యవసాయం ద్వారా వచ్చే నిఖరాదాయం ఇదే కాలంలో 13 నుంచి మూడు వేల ఫ్రాంక్‌లకు పడిపోయింది. మరి పెరుగుదల ఎలా సాధ్యమైందంటే సబ్సిడీలు 37శాతం, వ్యవసాయేతర ఆదాయం 22శాతం పెరుగుదల ఫలితం. భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ రైతాంగంలో కొంత మంది ఇప్పటికీ దారిద్య్రంలోనే వున్నారు.మన దగ్గర దారిద్య్రం గోచిపాతరాయుళ్ల రూపంలో కనిపిస్తే అక్కడ సూటు, కోటు వేసుకొని కనిపిస్తారు. దాదాపు 50శాతం వరకు రాయితీలు పొందుతున్న రైతుల పరిస్ధితే అలా వుంటే మన దగ్గర రోజు రోజుకూ సబ్సిడీలు తగ్గిస్తున్న పాలకులు మరోవైపు రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు.

తల్లికి తిండి పెట్టని వాడు పిన్నమ్మ చేతికి బంగారు గాజులు వేయిస్తానంటే నమ్మగలమా ! గతంలో రైతులకు ఇచ్చిన రాయితీలకు కోత పెడుతూ, మేం ఇచ్చిన రాయితీలు మీతో అంగీకరించిన వ్యవసాయరాబడిలో పదిశాతం మొత్తానికి లోబడే వున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్ధకు సంజాయిషీ ఇస్తున్న మన పాలకులు రాబోయే రోజుల్లో రాయితీలు తగ్గించటం తప్ప పెంచే అవకాశాలు లేవని ముందుగా తెలుసుకోవాలి. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు పదిశాతం మేరకు పెరిగినట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు మీడియా పేర్కొన్నది. ఎరువుల సబ్సిడీ 64970 కోట్ల రూపాయల నుంచి 70100 కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు. దేశ స్ధూల జాతీయోత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది, త్వరలో చైనాను అధిగమిస్తాం, దానికి మా నరేంద్రమోడీఏ కారణమంటూ ఒక వైపు భజన సాగుతోంది. దానికి అనుగుణ్యంగా లేదా ద్రవ్యోల్బణం మేరకు రైతాంగానికి సబ్సిడీలు మాత్రం పెరగటం లేదు. 2008-09లో మిశ్రమ ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ 65554 కోట్లు యూరియాకు 33940 కోట్లు మొత్తం 989494 కోట్ల రూపాయలకు గాను తాజా బడ్జెట్‌లో కేటాయింపుపైన పేర్కొన్న మొత్తం. అంటే 30వేల కోట్లకు కోత పడింది. తాజా 70వేల కోట్లలో యూరియా సబ్సిడీ 45వేల కోట్లు అయితే మిశ్రమ ఎరువులకు 25వేల కోట్లు మాత్రమే. అంటే మిశ్రమ ఎరువులు వాడే రైతుల మీద ఈ కాలంలో 40వేల కోట్ల అదనపు భారం పడుతున్నట్లే. నూతన ఎరువుల రాయితీ విధానం ప్రకారం నూట్రియంట్‌లను బట్టి రేటు నిర్ణయిస్తున్నారు.2013-14లో అంటే మోడీ అధికారానికి రాక ముందు ఎన్‌పికె,సల్పర్‌ ఎరువులను ఒక్కొక్క కిలో చొప్పున కొన్న రైతుకు రు.20.875,18.679,18.833,1.677 అంటే మొత్తం రు.60.06లను ప్రభుత్వ సబ్సిడీగా ఇచ్చింది. ఇదే ఎరువులను మోడీ హయాంలో అంటే ఇప్పుడు కొనుగోలు చేస్తే ఆ మొత్తం రు.47.96కు తగ్గిపోయింది. ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ శక్తులకు వదలి వేసింది. నిర్ణీత మొత్తాన్ని రాయితీగా ఇస్తోంది. 2011-12నుంచి ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత అప్పటి నుంచి సబ్సిడీ మొత్తం 70వేల కోట్లకు అటూ ఇటూగానే వుంటోంది. రాబోయే రోజుల్లో ఒక వేళ యూరియా ధరలను పెంచితే ఇంతకంటే తగ్గవచ్చు తప్ప పెరిగే అవకాశాలు లేవు. కొన్ని ఎరువుల ధరలు ఎలా పెరిగాయో చూద్దాం. డిఏపి 2017 ఏప్రిల్‌లో టన్ను రు. 21,818, 2018 మార్చి నాటికి 23,894కు చేరింది. జూలై నెలలో 25,706 వున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిత్వశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. టన్నుకు నాలుగు వేలు పెరిగింది. అన్నింటికీ ఇంత పెద్ద ఎత్తున లేనప్పటికీ గణనీయంగా పెరిగాయి.

దేశంలో వినియోగించే డీజిల్‌ ప్రతి వందలో 14 లీటర్లు వ్యవసాయానికి అవుతోంది. వ్యవసాయ వుత్పత్తులను రవాణా చేసే ట్రక్కులది కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. డీజిల్‌ ధరలపై నియంత్రణను మోడీ సర్కార్‌ ఎత్తివేసింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు ఢిల్లీలో ఒక రైతు ట్రాక్టర్‌కు ఒక రోజు పది లీటర్ల డీజిల్‌ను వాడితే 2014 మార్చినెల ఒకటవ తేదీన రు 554.80 చెల్లించాడు. లీటరుకు రు.8.37 చొప్పున 83.70 సబ్సిడీ పొందాడు. అదే రైతు 2018 సెప్టెంబరు 17న అదే ఢిల్లీ బంకులో రు.738.70 చెల్లించాడు. నాలుగేండ్ల క్రితం పీపా అన్ని ఖర్చులతో 126.93 డాలర్లకు దిగుమతి చేసుకున్నాం. సెప్టెంబరు 17న 93.45 డాలర్లకే వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ జరిగిన మార్పేమిటంటే దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర తగ్గింది, ఇతరులతో పాటు రైతులకు వచ్చే రాయితీ ఎగిరిపోయింది, 180 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. నాలుగేండ్ల క్రితం ఒక లీటరు డీజిలుపై ఎక్సయిజు పన్ను రు.3.56, దాన్ని మోడీ గారు రు.15.33 చేశారు.

మోడీ అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ 58 అయితే ఇప్పుడు 73వరకు పతనమైంది. దీని వలన రైతాంగం వినియోగించే పురుగుమందులలో దిగుమతి చేసుకొనే వాటి ధర ఆ మేరకు పెరుగుతుంది. ఒక లీటరు మందును నాలుగు సంవత్సరాల క్రితం 58కి కొంటే ఇప్పుడు 73 చెల్లించాల్సిందే. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ 45-50 మధ్యనే వుంది. రానున్న రోజుల్లో ఇంకా పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను కొనసాగిస్తున్నాయి. అమెరికా 95, బ్రెజిల్‌ 75శాతం స్ధాయికి చేరుకుంటే డీజిల్‌ వినియోగం ఇంకా పెరుగుతుంది. వ్యవసాయ ఖర్చు తగ్గించే పేరుతో యాంత్రీకరణ, దానికి డీజిల్‌ ఖర్చు తడిచి మోపెడైతే బాగుపడేది యంత్రాలను తయారు యజమానులు, చమురు కంపెనీల వారు, పన్నులతో జనాల జేబులకు కత్తెర వేసే ప్రభుత్వం తప్ప ఇంక రైతాంగానికి మిగిలేదేముంటుంది.

Image result for double the farmers income

ఇప్పటికే వున్న సబ్సిడీలు రద్దు లేదా నామమాత్రం అవుతున్నాయి. వాటి కంటే మోయలేని కొత్త భారాలు పడుతున్నాయి. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు గద్దెనెక్కినా లేదా వాటికి మద్దతు పలికి భుజాలు నొప్పి పుట్టేట్లు మోసిన ప్రాంతీయ పార్టీల వారు గానీ రైతాంగానికి, మొత్తంగా జనానికి నిజాలు చెప్పటం లేదు. మన దేశంలో ఆహార భద్రతలో భాగంగా పౌరపంపిణీ వ్యవస్ధ ద్వారా సరఫరా చేసే ఆహార ధాన్యాలకు ఇచ్చే రాయితీలు లేదా నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా కొన్ని సందర్భాలలో వ్యవసాయ రాయితీలలో భాగంగా చూపుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో మోడీగారు ఆబగా కౌగలించుకొనే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఫిర్యాదులో సారాంశమిదే. కనీస మద్దతు ధరల ప్ర కటనను కూడా రాయితీల కిందనే జమకడుతోంది. పౌర పంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలని, రాయితీలు ఇవ్వాలనుకుంటే లబ్దిదార్లకు నేరుగా నగదు ఇవ్వాలని, ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోళ్లను నిలిపివేసి మొత్తం వ్యాపారాన్ని ప్రయివేటు రంగానికి వదలి వేయాలన్నది అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ సంస్కరణల పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు వంతపాడుతున్నాయి. అందుకు అంగీకరించిన మోడీ సర్కార్‌ తొలి దశలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఛండీఘర్‌, పాండిచ్చేరిలో చౌకదుకాణాలను ఎత్తివేసింది. క్లబ్బుడాన్సర్‌లు ఒంటి మీది దుస్తులను ఒకటకటి తొలగించే మాదిరి మన పాలకులు సబ్సిడీలను ఎత్తి వేస్తున్నారు.ఎఫ్‌సిఐకి చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పుగా మార్చివేస్తోంది. 2015-16లో లక్షా35వేల కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ కాగా మరుసటి ఏడాది దానిని లక్షా ఐదువేల కోట్లకు తగ్గించి 25వేల కోట్ల రూపాయలను జాతీయ చిన్నపొదుపు మొత్తాల నిధి నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పుగా అందచేశారు. కేటాయించిన మొత్తాలను కూడా చెల్లించకుండా బకాయి పెట్టి మరుసటి ఏడాది ఆ బకాయిలను కూడా చెల్లింపులలో చేర్చి ఆహార సబ్సిడీ మొత్తాన్ని పెంచినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

వివిధ కారణాలతో కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరల్లో పెరుగుదల లేకపోవటం లేదా తగ్గుదల కనిపిస్తోంది. ఈ సమయంలోనే మోడీ సర్కార్‌ రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తానంటూ ముందుకు వచ్చింది. ప్రపంచ మార్కెట్‌తో పోల్చితే కొన్ని సందర్భాలలో మన దేశంలో ధరలు ఎక్కువగా వున్నాయి. అవి తమకు గిట్టుబాటు కావటం లేదని మన రైతాంగం గగ్గోలు పెడుతోంది. ఈ పరిస్ధితులలో అనేక దేశాలు తమ రైతాంగాన్ని ఆదుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. 2015లో అమెరికాలో ఒక్కొక్క రైతుకు సగటున 7,860 డాలర్లు, బ్రిటన్‌లో 28,300 పౌండ్లు, జపాన్‌లో 14,136, న్యూజిలాండ్‌లో 2,623 డాలర్లు చెల్లించగా మన దేశంలో 417 డాలర్లు మాత్రమే ఇచ్చినట్లు తేలింది. రైతుల ఆదాయాల రెట్టింపు చేయాల్సిన అవసరం, వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక గురించి నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ ఒక పత్రాన్ని రూపొందించారు. 2004-05 నుంచి 2011-12 మధ్య దేశంలో వ్యవసాయదారుల సంఖ్య 16.61 కోట్ల నుంచి 14.62కోట్లకు పడిపోయింది. ఈ ధోరణే కొనసాగితే 2015-16 నుంచి 2022-23 మధ్య మరొక కోటీ 96లక్షల మంది అంటే రోజుకు 6,710 మంది వ్యవసాయం మానుకొంటారని అంచనా వేశారు. జనం తగ్గుతారు గనుక వ్యవసాయ ఆదాయం పెరుగుతుందని, కనుక సబ్సిడీలు తగ్గించవచ్చని కొందరు వాదించేవారు లేకపోలేదు.

అన్ని తరగతుల వారికీ టోకరా వేసి వచ్చే ఎన్నికలలో ఏదో విధంగా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పూనుకున్న పెద్ద మనుషులు అమాయకపు రైతాంగాన్ని వదలి పెడతారా ? 2022 అంటే మనకు స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడిచే నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది నరేంద్రమోడీ అండ్‌ కో చేసిన వాగ్దానం. దాన్ని ఎలా అమలు జరుపుతారు,ఆ దిశలో ఎంతవరకు పయనించారు అని అడుగుదామంటే కుదరదు.ఎందుకంటే ఆ పెద్దమనిషి చెప్పరు, అడుగుదామంటే మీడియాతో మాట్లాడరు. భజనపరులకు అడిగే ధైర్యం ఎలాగూ వుండదు. మౌనమునిగా మన్మోహన్‌సింగ్‌ను వర్ణించిన బిజెపి పెద్దలు తమలో అంతకంటే పెద్ద మహామౌన మునిని పెట్టుకొని లేనట్లే ప్రవర్తిస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల పాలనా కాలంలో మూడు సార్లు మీడియాతో మాట్లాడితే నరేంద్ర ముని ఐదేండ్లలో ఇంతవరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. రైతు జనోద్ధారకుడిగా రాబోయే రోజుల్లో ఓటర్ల ముందుకు వెళ్లేందుకు అమలులో వున్న మూడు పాత పధకాలను కలిపి స్వల్పమార్పులతో కొత్తగా ప్రధాన మంత్రి ఆషా పేరుతో అమలు జరుపుతామని ప్రకటించారు.

రైతాంగ ఆదాయాల రెట్టింపు అన్నది ఆషామాషీ సమస్య కాదు. దానిలో ఎన్నో అంశాలు ఇమిడి వున్నాయి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపధ్యంలో వారి బాగుకోసం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ నానాటికీ పెరుగుతున్నది. స్వామినాధన్‌ కమిషన్‌ వున్నంతలో ఒక శాస్త్రీయ సూత్రాన్ని చెప్పింది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేయటం గురించి ఇంతవరకు ఎలాంటి సర్వే జరపలేదు, ఒక ప్రాతిపదికను ఏర్పరచలేదన్నది పచ్చి నిజం.ఈ విషయాన్ని వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్‌ రూప్లా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2013లో జరిపిన జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) తప్ప తరువాత ఇంతవరకు అలాంటిది జరగలేదు. దానిలో ( 2012 జూలై 2013జూన్‌ మధ్య జరిపిన సర్వే) వ్యవసాయ రంగం పరిస్ధితి మదింపు సర్వే అంశాలనే పార్లమెంట్‌కు సమర్పించారు.

ఆ నివేదికలో వున్న అంశాలేమిటి? దేశ రైతు కుటుంబ తలసరి నెలసరి ఆదాయం రు.6,426, బీహార్‌లో అతి తక్కువ రు.3,558, పశ్చిమ బెంగాల్‌లో రు.3980, వుత్తరా ఖండ్‌లో రు.4,701 కాగా అత్యధికంగా పంజాబ్‌లో రు.18,059, హర్యానాలో రు.14,434, జమ్మూకాశ్మీర్‌లో రు.12,683 వున్నాయి. ఇక తెలుగురాష్ట్రాలకు వస్తే తెలంగాణా రు.6,311, ఆంధ్రప్రదేశ్‌ రు.5,979 చొప్పున వున్నాయి. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కేరళ రు.11,888, కర్ణాటక రు.8,832, తమిళనాడు రు.6,980. నాబార్డు రూపొందించిన నివేదిక ప్ర కారం 2015-16లో దేశ తలసరి కుటుంబ నెలాదాయం రు. 8,931కి పెరిగింది. అత్యధికంగా మొదటి మూడు రాష్ట్రాలైన పంజాబ్‌లో రు.23,133, హర్యానాలో రు.18,49,, కేరళలోరు.16,927 వున్నాయి. చివరి మూడు రాష్ట్రాలైన వుత్తర ప్రదేశ్‌లో 6,668,ఆంధ్రప్రదేశ్‌లో రు.6,920, ఝార్ఖండ్‌లో రు.6,991 వుంది. తెలంగాణాలో రు.8,951, తమిళనాడులో రు.9,775, కర్ణాటకలో రు.10,603గా నమోదైంది.

Image result for cutting down the farm subsidies,india cartoons

ఈ రెండు నివేదికల మధ్య ఆదాయ పెరుగుదల దేశ సగటు 39శాతం వుంది. మహారాష్ట్ర ఒక్కటే దేశ సగటును కలిగి వుంది. వివిధ రాష్ట్రాల మధ్య అంతరాలను పరిశీలిస్తే నాలుగు రాష్ట్రాలలో ఒకటి నుంచి 16.5శాతం వరకు తగ్గగా గరిష్టంగా మూడు రాష్ట్రాలలో 94.9 నుంచి 130.9శాతం వరకు పెరుగదల వుంది. దేశ సగటుకు ఎగువన తొమ్మిది రాష్ట్రాలు 39-65.7శాతం మధ్య వున్నాయి. మిగిలిన చోట్ల తక్కువ నమోదైంది. తెలంగాణాలో 41.8శాతం పెరగ్గా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 15శాతమే వుంది. మూడు సంవత్సరాలలోనే ఇంతటి ఎగుడుదిగుడులు వున్నపుడు ఆదాయాల రెట్టింపునకు ప్రాతిపదిక దేనిని తీసుకోవాలి అన్నది సమస్య. భిన్న ప్రాంతాలు, భిన్న వాతావరణం, భిన్న పంటలు, వనరులు ఇలా అనేక అంశాలలో ఏ ఒక్క రాష్ట్రమూ మిగతావాటితో వాటితో పోల్చటానికి లేదు. ఈ పూర్వరంగంలోనే నీతి ఆయోగ్‌ తొలిసారిగా ఏడాదికేడాది రైతుల ఆదాయాన్ని మదింపు వేసేందుకు పూనుకుంది, వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి వుంది. ఒక అంచనా మేరకు నిజధరల ప్రకారం ప్రస్తుతం రైతుల ఆదాయం ఏటా 3.8శాతం పెరుగుతున్నది. మరోవైపు మార్కెట్‌ ధరల ప్రకారం 11శాతం పెరుగుదల చూపుతున్నది. ఈ లెక్కన మోడీ చెబుతున్నట్లు 2022 నాటికి ఆదాయాలు రెట్టింపు ఎలా అవుతాయి? నిజధరల మేరకు ఆదాయాలు రెట్టింపు కావాలంటే రెండుదశాబ్దాలకుపైనే పడుతుంది. ఈ లోగా వచ్చే మార్పుల సంగతేమిటి?

వ్యవసాయం, పశుసంపద, చేపల పెంపకాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ ఆదాయం లెక్కలు వేస్తున్నారు. కేరళ, హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలలో అడవి మీద ఆధారపడే వారు గణనీయంగా వున్నారు. వారిని ఎలా లెక్కిస్తారు. మిగతా రాష్ట్రాలలో అడవుల నుంచి వచ్చే ఆదాయాన్ని కలిపి వాటికి తేడాలు రావా ? ఆదాయం ఎక్కువగా వున్న పంజాబ్‌, హర్యానా, లేదా దేశ సగటుకు దగ్గరగా వున్న మహారాష్ట్రల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభం కనిపిస్తున్నది. గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఏటా 16.5శాతం వ్యవసాయ అభివృద్ధిని సాధిస్తున్నది. చిత్రం ఏమిటంటే గిట్టుబాటు ధరలు కావాలని, రుణాల రద్దును కోరుతూ అక్కడ పెద్ద ఎత్తున రైతులు వీధుల్లోకి వచ్చారు. అందువలన అభివృద్ధి అంటే ఏమిటి? ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే తరువాత మూడు సంవత్సరాలలో సగటున రైతుల ఆదాయం 39శాతం పెరిగిందని నాబార్డు నివేదిక చెప్పింది. ఈ కాలంలో పాత విధానాల కొనసాగింపు తప్ప ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలేమీ లేవు. ఆ నివేదికే వాస్తవం అనుకుంటే కొన్ని చోట్ల రెట్టింపు ఆదాయాలు ఇప్పటికే వచ్చాయి, మరికొన్నిచోట్ల వున్న ఆదాయాలకే గండిపడింది. వీటిని ఎలా చూడాలి? ఏనుగు ఎలా వుందని అడిగితే తలా ఒక వర్ణన చేసినట్లుగా ఎవరి అవగాహనకు అనుగుణంగా వారు నివేదికలు ఇస్తున్నట్లు మనకు స్పష్టం అవుతున్నది. దారీ తెన్నూ నిర్ధారించుకోలేని మోడీ సర్కార్‌ రైతాంగాన్ని ఎక్కడికో తీసుకుపోతోంది తప్ప ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

2008 సంక్షోభానికి పదేండ్లు- మరో ముప్పు ముంచుకొస్తోంది !

12 Wednesday Sep 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

2008 financial crisis, 2008 meltdown, Another financial crisis, Collapse of Lehman brothers, Great Depression

Image result for ten years of 2008 financial crisis cartoons

ఎం కోటేశ్వరరావు

2008, ప్రపంచ ధనిక దేశాలలో తలెత్తిన మరొక మహా సంక్షోభానికి పది సంవత్సరాలు. అమెరికాలోని లేమాన్‌ బ్రదర్స్‌ బ్యాంకు 2008 సెప్టెంబరు15న దివాలా ప్రకటన చేయటాన్ని చాలా మంది మరచిపోయి వుంటారు. ప్రపంచ ధనికులు మాత్రం మెలకువగానే వున్నారు. వారిలో ఒకడిగా 92బిలియన్ల సంపదకలిగిన బిల్‌గేట్స్‌ ‘ఎప్పుడు అన్నది చెప్పటం కష్టంగానీ 2008 వంటి మరో సంక్షోభం రావటం తప్పని సరి ‘ అని ఈ ఏడాది మార్చి2న ఒక ఆస్ట్రేలియా మీడియాలో అడిగిన ప్రశ్నకు చెప్పారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తిరుగులేని విధంగా తెలిసినట్లే ఒకదాని తరువాత ఒక సంక్షోభం రావటం పెట్టుబడిదారీ విధానంలోనే ఇమిడి వున్న లక్షణం అని గేట్స్‌ వంటి వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అందుకే తాము మునిగి పోకుండా వుండేందుకు నిరంతరం దారులు వెతుకుతుంటారు. పదేళ్ల నాటి సంక్షోభం దెబ్బకు అమెరికాలో 87లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. సంక్షోభం నుంచి కోలుకున్నట్లు చెబుతున్నా ఇప్పటికీ పూర్వపు స్ధితికి చేరుకోలేదు.

ఇప్పటికీ ప్రధాన స్రవంతి మీడియా లేదా వామపక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలు జనానికి ఇలాంటి వాటి గురించి వాస్తవాలు చెప్పటం లేదు. తప్పుడు నిర్ణయాలు, విధానాలతో దివాలా తీసిన సంస్ధలన్నింటినీ అమెరికా, ఇతర దేశాల పాలకులు ప్రజల సొమ్ముతో రక్షించారు. 1980దశకం నుంచి స్వేచ్చా మార్కెట్‌ విధాన సంస్కరణలను ముందుకు నెట్టటంలో ప్రముఖుడైన అమెరికా ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) మాజీ అధ్య క్షుడైన అలాన్‌ గ్రీన్‌స్పాన్‌ 2008 మేనెలలో ఒకప్రకటన చేస్తూ 2007లో ప్రారంభమైన తనఖా సంక్షోభం మీద వ్యాఖ్యానిస్తూ ‘ ద్రవ్య సంక్షోభంలో అనర్ధం ముగిసింది లేదా త్వరలో ముగియ నుంది’ అన్నాడు. లేమాన్‌ బ్రదర్స్‌ దివాలా ప్రకటన వెలువడగానే తాను చాలా తొందరపడ్డానని, తన స్వేచ్చామార్కెట్‌ సిద్ధాంతంలో లోపాలున్నట్లు గుర్తించానని చెప్పాడు.

2001లో డాట్‌కాం బుడగ పేలటం, మాంద్యం తలెత్తటంతో ద్రవ్య సంస్ధలు లాభాల కోసం కొత్త మార్గాలు వెతికాయి. వడ్డీ రేట్లు తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పరిమితమైంది. వడ్డీ రేట్లు తక్కువగా వుండటంతో ద్రవ్య సంస్ధల నిధుల సేకరణ సులభతరం, ఖర్చు తక్కువగావటం,మరిన్ని ఆస్ధుల కొనుగోలుకు, అధిక వడ్డీల కోసం తనఖా వంటి ముప్పుతో కూడిన రుణాలు ఇవ్వటానికి దారితీసింది.2004నాటికి రుణాలు తీసుకున్నవారు విపరీతంగా పెరగటంతో పాటు వాయిదాల చెల్లింపుల సమస్య తలెత్తింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లు పెంచింది. ఇండ్ల ధరలు పతనమయ్యాయి. అప్పులు తీర్చాలంటే అందుకోసం కొత్త అప్పులు చేద్దామంటే పుట్టని స్ధితి. తనఖా అంటే అనకాపల్లిలో అయినా అమెరికాలో అయినా వడ్డీ రేటు ఎక్కుగా వుండటంతో పాటు అసలుకు ముప్పు కూడా వుంటుంది. తీర్చగలరా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అధికవడ్డీలకు దురాశ పడిన ఆర్ధిక సంస్ధలు అప్పులు తెచ్చి మరీ అడిగిన ప్రతివారికీ రకరకాల తనఖాలు, షరతులతో గృహ రుణాలు ఇచ్చాయి. కొన్ని సంస్ధలు నేరుగా రుణాలు ఇవ్వక పోయినా ఇతర సంస్ధలు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకొనేందుకు వాటిని కొనుగోలు చేశాయి. తీసుకున్న వారికి రుణ చెల్లింపులు భారంగా మారటం, బుడగపేలిపోయినట్లుగా ఇండ్ల ధరలు పతనం కావటంతో రుణాలు తీసుకున్నవారితో పాటు ఇచ్చిన ఆర్ధిక సంస్ధలు, బ్యాంకులు కూడా 2007లో కుప్పకూలాయి. తనఖా పత్రాల విలువ 6.8లక్షల కోట్ల డాలర్లని తేలింది. మన సత్యం కంప్యూటర్స్‌ అసత్య లెక్కలు రాసి కుప్పకూలినట్లుగానే 2008లో లేమాన్‌ బ్రదర్స్‌ లెక్కల బాగోతం బయటపడి దివాలా ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా అమెరికాలో తిరిగి తనఖా రుణాలు పెరుగుతున్నాయని, మన దేశంతో సహా అనేక చోట్ల ఇస్తున్న గృహ రుణాలు చెల్లింపులో వైఫల్యం తప్పదని అనేక మంది చెబుతున్నారు. లసుగుల గురించి సామాన్యుల కంటే బిల్‌గేట్స్‌ వంటి వారికి ఎక్కువ తెలుసు కనుక వారు చెప్పిన ముప్పు ఏ క్షణంలో అయినా ఎదురు కావచ్చు.

పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాగైనా లాభాలు సంపాదించటానికి ప్రాధాన్యత ఇస్తారు, వాటిలో అప్పు మీద ఆధారపడటం ఒకటి. కాసినో లేదా జూదశాలల్లో జూదాలు నిర్వహించేవారు మనకు కనపడరు. డబ్బు పోగొట్టుకున్నా, ఎప్పుడన్నా సంపాదించినా జూదాలు కాసేవారు, వాటిని నిర్వహించే మధ్యవర్తులే మనకు కనిపిస్తారు.లేమాన్‌ బ్రదర్స్‌ అలాంటి మధ్యవర్తిగా డబ్బు జూదంలో నిలిచింది.దానితో రకరకాల ద్రవ్యలావాదేవీలు జరిపిన ఇతర బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల వారు అది ఇచ్చే లాభాలను చూశారు తప్ప రాసే తప్పుడు లెక్కలను గమనించలేక చివరికి మునిగిపోయారు. సంక్షోభం బద్దలు అయింతరువాత బ్యాంకులు బిలియన్లకొద్దీ డాలర్లను నిరర్దక ఆస్ధులుగా ప్రకటించాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడాయి. వ్యాపారాలకు కూడా రుణాలు దొరకటం గగనమైంది. వ్యాపారం తగ్గిపోయి దాని ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ మీద పడింది. పెట్టుబడితగ్గి డిమాండ్‌, వుత్పత్తి తగ్గుదలకు దారి తీసి, వుద్యోగాల రద్దుకు కారణమైంది.మాంద్యం తలెత్తింది.సంక్షోభం అమెరికా నుంచి ఐరోపాకు, ఇతర ప్రాంతాలకూ పాకింది. వెంటనే రంగంలోకి దిగిన అమెరికా సర్కార్‌ పరిస్ధితులు మెరుగుపడిన తరువాత తిరిగి అమ్మే ప్రాతిపదిక మీద 700 బిలియన్‌ డాలర్ల పాకేజితో దివాలా తీసిన సంస్ధల బాండ్లు, ఇతర విలువ పడిపోయిన ఆస్ధులను కొనుగోలు చేసేందుకు పూనుకుంది. మెరుగుపడక పోగా ఇంకా దిగజారటంతో మరో 250 బిలియన్‌ డాలర్లను ఇతర చిన్న సంస్దలలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది.

మరోవైపున వినియోగాన్ని పెంచేందుకు బ్రిటన్‌ సర్కార్‌ వ్యాట్‌ను 17.5 నుంచి 15శాతానికి తగ్గించింది. అనేక బ్యాంకులకు నిధులు సమకూర్చి నిలబెట్టింది.బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లను 5నుంచి 0.5శాతానికి తగ్గించింది. 2009లో లండన్లో సమావేశమైన జి20 సమావేశం ఆర్ధిక వినాశనాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలోకి 681బిలియన్‌ పౌండ్లను అందించాలని నిర్ణయించింది. బ్రిటన్‌లోని రాయల్‌ స్కాటిష్‌ బ్యాంక్‌(ఆర్‌బిఎస్‌) దివాలా తీసిన వాటిలో ఒకటి. పది సంవత్సరాల తరువాత కూడా అక్కడి జనం దివాలాకు మూల్యం చెల్లిస్తున్నారు. పది సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆర్‌బిఎస్‌ తన వాటాదార్లకు గత నెలలో రెండు పెన్నీల డివిడెండ్‌ ప్రకటించింది.( బ్రిటీష్‌ పౌండుకు వంద పెన్నీలు, ఒక పెన్నీ మన 93పైసలకు సమానం). పదేండ్ల క్రితం దివాలా తీసిన సదరు బ్యాంకును నిలబెట్టేందుకు బ్రిటన్‌ సర్కార్‌ 45.5బిలియన్‌ పౌండ్లను అందచేసింది. ఇప్పటి వరకు నాలుగు బిలియన్‌ పౌండ్లు నష్టపోయింది.గతంలో 84శాతంగా వున్న వాటాలను(జనం సొమ్ము) నష్టాలకు విక్రయించి 62శాతానికి తగ్గించుకుంది. ప్రభుత్వం ఆదుకొనేందుకు ఇచ్చిన సొమ్ములో 21బిలియన్‌ పౌండ్లను ఖాతాదారులతో వివాద పరిష్కారాలకు, అపరాధరుసుములు చెల్లించేందుకు బ్యాంకు ఖర్చు ఖర్చు చేసింది.

150 సంవత్సరాల క్రితమే కారల్‌ మార్క్స్‌ వుత్పాదక రంగంలో చేసే పెట్టుబడికి, ద్రవ్య వుత్పత్తుల్లో పెట్టే పెట్టుబడికి వున్న తేదాను వివరిస్తూ బ్యాకింగ్‌ బుడగలు ఎలా పెరుగుతాయో, పేలిపోతాయో పేర్కొన్నారు. మరో సంక్షోభం సంభవించే వరకు పెట్టుబడిదారులు జనానికి ఏదో ఒక ఆశచూపుతూనే వుంటారు. వుత్పాదక రంగంలో తమ పెట్టుబడికి ఆకర్షణీయమైన లాభాలు రానపుడు పెట్టుబడిదారులు తమ సొమ్మును ద్రవ్య మార్కెట్లో పెట్టుబడులుగా పెడతారు. బడా కంపెనీల, దుకాణాల పోటీలో నిలదొక్కుకోలేని అనేక మంది చిన్న మదుపుదారులు దగ్గర మార్గంగా వడ్డీ వ్యాపారాన్ని ఎంచుకోవటం తెలిసిందే. గ్రామాలలో వస్తువ్యాపారం చేసే వారు తమ మిగులును వడ్డీ, తాకట్టు వ్యాపారాలకు మళ్లించటాన్ని మనం చూస్తున్నదే. ద్రవ్య పెట్టుబడి లాభాలు వుత్పాదకరంగం పెట్టుబడిపై ఆధారపడి వుంటాయి. నిజమైన ఆర్ధిక వ్యవస్ధలో సంభవించే మార్పులు ద్రవ్యవ్యాపారంపై ప్రభావం చూపుతాయి. నిజ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడితే ద్రవ్య పెట్టుబడి( బ్యాంకింగ్‌) రంగం కుప్పకూలిపోతుంది.

బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ వంటి వారు ఏ క్షణంలో అయినా మరో ద్రవ్య సంక్షోభం రావచ్చని చెబుతున్నారంటే దానికి ప్రాతిపదిక లేకపోలేదు.2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌజోన్స్‌ సూచి 350శాతం పెరగ్గా, వాస్తవ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదల కేవలం 15శాతమే. తెలుగు ప్రాంతాల్లో సప్తగిరి, వుమ్మిడియార్స్‌ నుంచి కరక్కాయల పొడి వరకు అనేక మంది మోసగాళ్లు సగం ధరలకే వస్తువులు, అధిక వడ్డీలు, లాభాల ఆశచూపుతూనే వున్నారు. అలాంటివి ముంచుతాయని తెలిసినా ముందుగా పెట్టుబడి పెట్టి తాము తప్పించుకోవచ్చని ఎవరికి వారు దురాశకు లోనై నష్టపోవటం చూస్తున్నాము. ద్రవ్య పెట్టుబడిలో సంభవించే నష్టాలు ఆయా సంస్ధల యజమానుల కంటే జనాన్ని ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. భూగోళంలో ఒక ప్రాంతంలో తలెత్తిన సంక్షోభం దానికే పరిమితం కాదు. ప్రపంచీకరణ పేరుతో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముడివేయటంతో తరతమ తేడాలతో ప్రపంచ వ్యాపితంగా ప్రభావం, పర్యవసానాలు పడతాయి.

పది సంవత్సరాల తరువాత నెలకొన్న పరిస్ధితి గురించి మెకెన్సీ సంస్ధ ప్రతినిధి సుసాన్‌ లండ్‌ చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ఐరోపా, అమెరికాలోని బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే వాటి దగ్గర వున్న పెట్టుబడి ఎక్కువగా వుంది. దీని అర్ధం అవి మరింత స్ధిరంగా వున్నాయి, భవిష్యత్‌లో తలెత్తే నష్టాలను తట్టుకోగలవు. అయితే వడ్డీ రేట్లు, రుణాలకు డిమాండ్‌ తక్కువగా వుండటం, పెట్టుబడిమీద వచ్చే ఆదాయం తక్కువగా వుండటం బ్యాంకుల అభివృద్ధికి పరిమితులను సూచిస్తున్నాయి. ద్రవ్య సంక్షోభం తరువాత బ్యాంకులకు పెట్టుబడిమీద వచ్చే ఆదాయం సగం తగ్గింది, దీంతో లాభాల కోసం నూతన వాణిజ్య పద్దతుల కోసం కుస్తీ పడుతున్నాయి. పదేండ్ల నాటి సంక్షోభం తరువాత ప్రపంచ రుణ భారం స్ధిరంగా వుండటం లేదా పడిపోవటంగాక 72లక్షల కోట్ల డాలర్లు పెరిగింది.

బ్యాంకుల వంటి ద్రవ్య సంస్ధలను ఇబ్బందుల నుంచి బయటపడవేసేందుకు పాలకవర్గ ప్రభుత్వాలు ఆ భారాన్ని జనం మీదనే మోపుతాయి. పొదుపు చర్యలు, సంక్షేమ పధకాలకు కోత, ప్రభుత్వ ఆస్ధుల విక్రయం, జనం మీద అదనపు పన్నులు ఇలా అనేక రూపాలలో వుంటున్నాయి.పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా కేంద్రీకరణ ముప్పుకు సూచన. గతేడాది ప్రపంచ జిడిపికి 217శాతం ఎక్కువగా అప్పు వున్నట్లు తేలింది. పదేండ్ల నాటి సంక్షోభానికి ముందు కంటే ఇది 40శాతం ఎక్కువ. లేమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలిపోగానే పెద్ద బ్యాంకులు, ద్రవ్య సంస్ధలను చిన్నవిగా చేయాలనే ఆలోచన చేశారు. అయితే మన దేశంతో సహా అనేక చోట్ల పోటీని తట్టుకోవాలంటే పెద్దవిగా వుండాలంటూ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎస్‌బిఐలో విలీనం చేసిన విషయం తెలిసిందే. 2007లో అమెరికాలోని బ్యాంకు ఆస్ధులలో 44శాతం కేవలం ఐదింటి చేతిలో వుండగా ఇప్పుడు ఆ మొత్తం 47శాతానికి పెరిగింది. ఒక శాతం మ్యూచ్యువల్‌ ఫండ్‌ సంస్ధల చేతుల్లో 45శాతం స్టాక్స్‌, బాండ్లు, ఇతర ఆస్ధులు వున్నాయి. ఇవిగాక షాడో బ్యాంకులు అంటే తెరవెనుక లావాదేవీలు నిర్వహించేవి కూడా వున్నాయని ఒక నగ్నసత్యం. 2010లో వాటి ఆస్ధుల విలువ 28లక్షల కోట్లయితే ఇప్పుడు హీనాతి హీనంగా లెక్కవేసినా 45లక్షల కోట్ల డాలర్లని చెబుతున్నారు. బ్యాంకుల మీద నియంత్రణలు పెరిగే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి. అందువలన వీటిలో ఏ ఒక్కటి మునిగినా పదేండ్ల నాటి సంక్షోభంతో పోల్చితే నష్టం కొన్ని రెట్లు ఎక్కువగా వుంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో సంక్షోభం బద్దలవుతుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d