• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

పెట్రోలు ధరలపై బిజెపి నేతల నోటి తుత్తర – సామాన్య జనానికి విషాదం !

22 Friday Oct 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, BJP motormouth, BJP u turn on Fuel prices, crude oil price, Fuel Price in India, Narendra Modi

ఎం కోటేశ్వరరావు


పెట్రోలు ధరలు లీటరుకు వంద రూపాయలు దాటగానే వచ్చిన విమర్శలను తట్టుకోలేని నరేంద్రమోడీ-బిజెపి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయారు. వంద కాదు రెండు వందలైనా చెల్లిస్తాం, దేశం కోసం తప్ప నరేంద్రమోడీకి ఇస్తున్నారా అంటూ ఎదురుదాడులకు దిగారు. వారిలో ఏ దుష్ట క్షణంలో అలాంటి భావం కలిగిందో గానీ తధాస్తు దేవతలు వారి కోరికను తీర్చనున్నట్లు పరిణామాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు పీపా ధర త్వరలో వంద డాలర్లు కానుంది ఎవరైనా పందెం కాస్తారా అని సవాలు చేసే వారిని మరికొందరు పందెం రాయుళ్లు వందేంటి వచ్చే ఏడాది చివరికి రెండువందల డాలర్లు చూసుకుందామా అంటున్నారు.


శుక్రవారం నాడు ఢిల్లీలో పెట్రోలు ధర రు.106.89, హైదరాబాదులో రు. 111.18 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది రాసిన సమయానికి పీపా ముడి చమురు ధర 85.24 డాలర్లుంది. కొద్ది రోజుల క్రితం 86డాలర్లు దాటింది. పెరుగుతున్న ధరల గురించి ఏం చెప్పాలో తెలియక బిజెపి నేతలు నోటి తుత్తర వినోదం పండిస్తుంటే అది జనాలకు విషాదాన్ని నింపుతోంది. మద్దతు ఇచ్చిన మోజో లేక తగ్గకపోతాయా అన్న ఆశ, రోడ్లమీదకొస్తే నీకు దేశభక్తి లేదా, నువ్వు భారతీయుడివి కాదా ? వేయించుకున్న వాక్సినుకు డబ్బు ఇచ్చావా అని కాషాయదళాలు నిలదీస్తాయన్న భయం, ఏదైనా కావచ్చు, వినియోగదారుల నుంచి స్పందన లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలు అపహాస్యంగా మాట్లాడుతున్నా అది ప్రతిపక్ష నేతలను అనుకుంటున్నారు తప్ప తమను కూడా వెర్రివెంగళప్పలను చేస్తున్నారని అనుకోవటం లేదు. గుర్తించటం లేదు.


తాజాగా ఉపేంద్ర తివారీ అనే ఉత్తర ప్రదేశ్‌ మంత్రిగారు ” కార్లున్న కేవలం కొద్ది మందికి మాత్రమే పెట్రోలు అవసరం, 95శాతం మందికి అవసరం లేదు. వందకోట్ల కరోనా వాక్సిన్లు ఉచితంగా వేశారు.తలసరి ఆదాయంతో పోల్చితే పెట్రోలు ధరలు ఇప్పుడు చాలా తక్కువ.” అని చెప్పారు. గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి గారేమన్నారంటే ” మన ప్రభుత్వం దేశంలోని 130 కోట్ల మందికి ఉచితంగా వాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. చమురు మీద వేసే పన్నుల నుంచే వస్తుంది. కరోనాను ఎదుర్కొనేందుకు మా మంత్రిత్వశాఖ నుంచి ఆరోగ్యశాఖకు నిధులు మళ్లించాము. మీరు గనుక హిమాలయ బ్రాండ్‌ మంచినీరు తాగాలంటే సీసాకు వంద రూపాయలు పెట్టాలి.” కర్ణాటక మంత్రి ఉమేష్‌ విశ్వనాధ్‌ కత్తి ఏం చెప్పారంటే ” కరోనాను కట్టడి చేయాలంటే ఖర్చు అవుతుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి డబ్బు అవసరం గనుక చమురు ధరలు పెరిగాయి.త్వరలో వీటిని పరిష్కరిస్తారు.” అన్నారు. మధ్యప్రదేశ్‌ మంత్రి ప్రద్యుమ్న సింగ్‌ తోమర్‌ ఏమని సెలవిచ్చారంటే ” కూరగాయల మార్కెట్‌కు పోవాలంటే సైకిలును ఉపయోగిస్తామా ? అలా చేస్తే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, కాలుష్యమూ ఉండదు. ధరలు ఎక్కువే కానీ దీని ద్వారా పేదలకు లబ్ది సమకూర్చేందుకు డబ్బులు వస్తాయి. మనకు దేశ ఆరోగ్య సేవలు ముఖ్యమా పెట్రోలు, డీజిలు ధరలు ముఖ్యమా ? ” అని ఎదురుదాడికి దిగారు. అదే రాష్ట్రానికి చెందిన మరొక మంత్రి ఓమ్‌ ప్రకాష్‌ సక్లేచా జనాన్ని వెర్రివెంగళప్పలను ఎలా చేశారో చూడండి.” కష్టాలు వచ్చినపుడే మంచి రోజుల్లో ఉన్న సంతోషం ఏమిటో మీరు గుర్తిస్తారు, ఇబ్బందుల్లేవనుకోండి మీరు సంతోషాన్ని అనుభవించలేరు. ” అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చమురు రేట్లు తక్కువంట అక్కడకు వెళ్లండి అన్న పెద్ద మనుషుల గురించి తెలిసిందే, ఇలాంటి వారు మీకు రోజూ చాలా మంది తగులుతూనే ఉంటారు.


గతేడాది ఏప్రిల్‌ 22న పీపా ముడిచమురు 16డాలర్లకు తగ్గింది. మనకు పైసా కూడా తగ్గించలేదు. ఇప్పుడు ఒక డాలరు పెరిగినా తెల్లవారే సరికి పెంచేస్తున్నారు. 2019-20లో మన దేశం దిగుమతి చేసుకున్న చమురు విలువ 130బి.డాలర్లు, మరుసటి ఏడాది కరోనా కారణంగా 82.4 బి.డాలర్లకు తగ్గింది. వర్తమాన సంవత్సరం మొదటి ఆరునెలల్లోనే బిల్లు 70.5బి. డాలర్లుగా ఉంది. పెరుగుతున్న ధరల కారణంగా మిగిలిన ఆరునెలల్లో ఏమేరకు పెరుగుతుందో తెలియదు. ఎంత పెరిగితే అంత మన జేబుల నుంచి తీసుకుంటారు, పన్ను తగ్గించరు, పైసా సబ్సిడీ ఇవ్వరు. గతంలో రుపాయి విలువ పడిపోతే మన్మోహన్‌ సింగ్‌ అసమర్దత అని బిజెపి నేతలు సెలవిచ్చారు. గత ఏడు సంవత్సరాల్లో 58 నుంచి 75కు పతనమైంది. ఇది మోడీగారి సామర్ధ్యానికి నిదర్శనం, దేశం కోసమే అని మనం అంగీకరించాలి. ఇది కూడా చమురు ధరలను పెంచుతోంది. 2020 జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో మన చమురు దిగుమతి బిల్లు 8.5బి.డాలర్లు కాగా ఈ ఏడాది అదే కాలంలో 24.7 బి.డాలర్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని జనం నుంచి పిండారు. ఈ కారణంగా ధరల పెరుగుదలతో మరెంత భారం పెరిగిందో లెక్కలు లేవు. పీపా ధర పది డాలర్లు పెరిగితే ద్రవ్యోల్బణం ప్రాతిపదిక సూచి పది పెరుగుతుంది.


బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 2018లో 85 డాలర్లు ఉంది. ఇప్పుడు దాన్ని దాటింది. ఏడాది క్రితం దీనిలో సగం ధర ఉంది. దానికి ఒకటి రెండు డాలర్లు తక్కువగా మనం వాడే చమురు ధర ఉంటుంది. సహజంగా ఆర్ధిక రంగం కోలుకుంటే సంతోషంగా ఉంటుంది, కానీ పెరుగుతున్న చమురు ధరలను చూస్తుంటే భయమేస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో అమెరికాలో పరిస్ధితి ఎలా ఉందంటే ముందస్తు ఒప్పందం ప్రకారం చమురు తీసుకొనేందుకు కంపెనీలు తిరస్కరించాయి, సరఫరాదార్లకు ఎదురు డబ్బిచ్చి చమురొద్దురా బాబూ నిలవకు జాగా లేదు అన్నాయి. ఇప్పుడు దానికి విరుద్దంగా ఎక్కడ చూసినా ఖాళీ టాంకులే ఉన్నాయట. అంతకు ముందుతో పోలిస్తే నాలుగోవంతు మాత్రమే ఉందట.ఐరోపాలో కూడా నిల్వలు తగ్గాయి. చమురు ధరల పెరుగుదలకు ఇది ఒక కారణంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 95డాలర్లకు పెరగవచ్చని జెపిమోర్గాన్‌ సంస్ధ జోశ్యం చెప్పింది.


కొందరి అంచనాల ప్రకారం ప్రస్తుతం 83 డాలర్లకు పైగా ఉన్న అమెరికన్‌ రకం ముడి చమురు డిసెంబరు నాటికి వంద డాలర్లకు, వచ్చే ఏడాది డిసెంబరుకు 200 డాలర్లకు చేరవచ్చని చెబుతున్నారు. స్టాక్‌ మార్కెట్లో ఈ మేరకు బ్రెంట్‌ రకం 200 డాలర్లకు కాల్‌ ఆప్షన్‌ లావాదేవీలు జరిగాయి.2022 డిసెంబరులో 200 డాలర్లు ఉంటుందని ఒకరు పది పీపాల మీద రెండు డాలర్ల చొప్పున 20డాలర్ల ప్రీమియం చెల్లించాడనుకుందాం. గడువు నాటికి చమురు ధర అంతకంటే తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని కోల్పోతాడు. లేదు 210 డాలర్లకు పెరిగిందనుకోండి. ఒక్కొక్క పీపాకు ప్రీమియం పోను ఎనిమిది డాలర్లు అతనికి లాభం వస్తుంది. ఇలా ఎన్ని పీపాల మీద పందెం కాస్తే నష్టం లేదా లాభం దాన్ని బట్టి ఉంటుంది. అమెరికా, ఐరోపాల్లో ఉన్న స్ధితి, ఆర్ధిక రంగం కోలుకుంటున్నది కనుక డిమాండ్‌ పెరిగి చమురు ధరలు పెరుగుతాయనే అంచనాలు దీన్ని సూచిస్తున్నాయి. ఇదొక జూదం, దీన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు గానీ విస్మరించకూడదు. అమెరికా ముడిచమురు వచ్చే ఫిబ్రవరిలో వంద డాలర్లకు చేరనుందని పందాలు పెరుగుతున్నాయి. 95 నుంచి 180 డాలర్ల వరకు రకరకాల పందాలను కాస్తున్నారు. పెట్రోలు, డీజిలును వాడేది కార్ల యజమానులు మాత్రమే కాదని, వివిధ పరిశ్రమలు కూడా వాడతాయని తద్వారా వస్తువుల ధరలు పెరుగుతాయని బిజెపి మంత్రులకు ఎవరు చెప్పాలి ? కరోనాతో నిమిత్తం లేకుండానే పన్నులు పెంచారని బిజెపి నేతలకు ఎలా చెప్పాలో జనానికే వదిలేద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంబానీ, అదానీలకు సంపదలు- అభాగ్యులకు అప్పుల తిప్పలు !

18 Monday Oct 2021

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Ambani and Adani, billionaires, India extreme inequality, Richest Indians


ఎం కోటేశ్వరరావు


ముకేష్‌ అంబానీ తరువాత అత్యంత సంపన్నుడైన గౌతమ్‌ అదానీ త్వరలో అంబానీ స్ధానాన్ని ఆక్రమించనున్నారా ? పేదలు,మధ్యతరగతి మరింతగా దిగజారనున్నారా ? తీరు తెన్నులు ఎలా ఉన్నాయి ? ప్రస్తుతం అంబానీ రోజువారీ సంపాదన 163 కోట్లు కాగా అదానీ రాబడి 1002 కోట్లు మరి. అంబానీ ఆస్తి 7,18,000 కోట్లు కాగా అదానీ దగ్గర 5,05,000 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే అంబానీ సంపద పెరుగుదల తొమ్మిది శాతం కాగా అదానీకి 261శాతం అంటే నోరెళ్లపెట్టకండి. ఇదే సమయంలో ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌.కాం అనే వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం దేశంలో కనీసవేతనం గత ఐదు సంవత్సరాలుగా పెరగలేదు. మన్మోహన్‌ సింగ్‌ దుర్దినాలలో 2011-13లో రోజుకు రు. 115 కాగా మోడీ గారీ అచ్చేదిన్‌ ప్రారంభంలో 2014లో రు.137, తరువాత రెండు సంవత్సరాలు రు.160, గత ఐదు సంవత్సరాలుగా రు.176 ఉంది. ఈ ఏడాది చివరి నాటికి సగటు రోజు వారీ వేతనం రు.372.33కు, 2022లో రు.397, 2023నాటికి రు.419కి పెరగవచ్చని ఎకనోమెట్రిక్‌ పద్దతిలో అంచనా వేసింది. అంబానీ, అదానీల ఒకేడాది పెరుగుదలకు, అభాగ్యుల ఎనిమిదేండ్ల పెరుగుదలకు ఎంత తేడా ? అచ్చేదిన్‌ ఎవరికి చచ్చేరోజులు ఎవరికి ?


పురుషులందు పుణ్య పురుషులు వేరు (మహిళలకూ ఇదే వర్తిస్తుంది) అన్నట్లుగా పరిశోధకులందు జనపరిశోధకులు ధనశోధకులు వేరు అని నోబెల్‌ బహుమతుల ప్రకటన వెల్లడించింది. ఎందుకంటే ఆ రాణీ ప్రేమపురాణం, ఈ కైఫీయత్‌కైన ఖర్చుల గురించి గాక కార్మికుల కనీసవేతనాలు, ఉపాధి గురించి పరిశోధన గురించి ఈ రోజుల్లో ఎవరుంటారు ! ఆ అంశాన్ని ఎంచుకున్న ముగ్గురు ఉత్తమ పరిశోధకులకు నోబెల్‌ బహుమతి రావటం చిన్న విషయం కాదు కదా ! గుయిడో ఇంబెన్స్‌, జాషువా ఆగెస్‌, డేవిడ్‌ కార్డ్‌ ముగ్గురికీ కలిపి బహుమతి ఇచ్చారు. కార్మిక మార్కెట్‌ మీద కనీసవేతనాలు, విద్య, వలసల ప్రభావం ఎలా ఉంటుందనే అంశపై పరిశోధన జరిపారు.కనీసవేతనాలు పెంచితే కుర్ర కార్మికులు, నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని చేసిన సూత్రీకరణలు తప్పని నిరూపించారు.వేతనాలు పెంచితే కార్మిక లభ్యత పెరుగుతుందని కూడా తేల్చారు. అన్నింటికీ మించి వేతనాలు పెంచితే కంపెనీ లాభాలు తగ్గుతాయన్నది వాస్తవం కాదని ఆమేరకు వస్తు ధరలు పెంచుతారని వెల్లడించారు. మరి కేంద్ర ప్రభుత్వం లేదా మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి పాలకులు ఎవరికోసం కనీసవేతనాలను సంవత్సరాల తరబడి పెంచకుండా ఉన్నట్లు ? సంపద పంపిణీలో అసమానతలను పెంచే చర్య కాదా ఇది.


గౌతమ్‌ అదానీ సంపద ఒక్క ఏడాదిలో రు.1.04 నుంచి ఏకంగా రు.5.05లక్షల కోట్లకు ఎదిగింది. ఇదంతా కష్టపడితే పెరిగిందేనా ? సాధారణ కార్మికుడి కంటే అదనంగా రోజుకు ఎన్ని గంటలు శ్రమపడి ఉంటారు ? ఇక్కడ కొంత మందికి సంపద పెరిగిందని ఏడవటం కాదు, ఎందరికో ఎందుకు పెరగటం లేదు అన్న ఆవేదనతో ఈ ప్రశ్న.కరోనా కాలంలో కొందరి సంపదలు పెరిగితే ఎందరో దిగజారారు ఎందుకని ? ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2021 వెల్లడించిన వివరాల మేరకు ఏడాది కాలంలో కేవలం అదానీ మాత్రమే ఒక లక్ష విలువగల కంపెనీలు ఐదింటిని ఏర్పాటు చేశారు. సోదరుడు వినోద్‌ శాంతిలాల్‌ అదానీ కూడా లక్ష కోట్ల సంపదదాటిని పది మందిలో ఎనిమిదవ స్దానంలో ఉన్నారు. అతగాడి రోజు వారీ సంపాదన రు.245 కోట్లు. ఏడాది కాలంలో ఏకంగా పన్నెండు స్ధానాలు ఎగబాకి రు.1.31లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. ఏడాది కాలంలో ఎవరెవరి సంపాదన ఎలా పెరిగిందో పట్టికలో చూడవచ్చు.


కరోనా కాటుకు బలై ప్రాణాలు కోల్పోయిన వారెందరో అయితే బతికి ఆస్తులు అమ్ముకొని అప్పులపాలైన వారు అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సమయంలోనే 58 మంది బిలియనీర్లు పెరిగి 237కు చేరారు. ధనవంతుల జాబితాలో 179 మంది చేరి 1,007కు పెరిగారు, 894 మంది సంపదలు పెరిగితే 113 మందికి తగ్గాయట. పాపం కదా ! ఇక ధనికులు విపరీతంగా పెరిగిన రంగాలను చూస్తే ఫార్మాలో 130 మంది, పెట్రోకెమికల్స్‌లో 98 మంది ఉన్నారు. మహమ్మారులు సామాన్య జనం ప్రాణాలు తీస్తే ఔషధ కంపెనీలకు లాభాలను సమకూర్చుతాయని కరోనా నిరూపించింది. ఈ కంపెనీలకు గతేడాది రు.3,45,900 కోట్లు అదనంగా వచ్చిందట.ఇండియా రేటింగ్‌ సంస్ధ విశ్లేషణ ప్రకారం రెండువేల ఆర్ధికేతర కార్పొరేట్‌లలో వేతనాల గురించి విశ్లేషించగా 60శాతం కంపెనీల్లో గతేడాది సెప్టెంబరు, డిసెంబరు త్రైమాసికాల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సిబ్బంది ఖర్చు తగ్గించారు. అంటే కుటుంబాలకు ఉపాధి, ఆదాయం తగ్గింది.పోయినవి తిరిగి వచ్చే అవకాశం లేదని ఆ సంస్ద పేర్కొన్నది. అసలే తక్కువ ఆదాయం ఆపై కరోనా కాటుతో అనేక కుటుంబాలు అంతకు ముందు చేసుకున్న పొదుపు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. జనం బికారులు కావటానికి అదానీ, అంబానీల సంపద మరింత పెరగటానికి కారణాలను కూడా రేటింగ్‌ సంస్ద పేర్కొన్నది. పరోక్ష పన్నులు జనం మీద పెరగ్గా కార్పొరేట్లకు పన్ను తగ్గింది. 2010లో గృహస్తుల మీద పన్ను 60శాతం ఉంటే ఇప్పుడు అది 75కు పెరిగింది. ఇదే కాలంలో కార్పొరేట్‌ పన్ను తగ్గింది. అంతకు ముందు పెంచినదిగాక 2020 మార్చి-మే మాసాల మధ్య పెట్రోలు మీద రు.13, డీజిలుపై రు.16లను కేంద్రం పెంచింది. ఈ కాలంలో పీపాధర 28 డాలర్లు ఉండగా జనానికి తగ్గిందేమీ లేదు, పెరిగిన తరువాత ఆమేరకు జనం నుంచి వసూలు చేస్తున్నారు. ప్రతి రోజూ కొత్త రికార్డు నెలకొంటోంది. ఇది కుటుంబాల జేబులను గుల్ల చేస్తోంది. పోనీ అంతకు ముందు నిజవేతనాలు పెరిగాయా అంటే….ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం 2015లో 2.8, 2016లో 2.6, 2017, 18లో 2.5శాతాల చొప్పున పెరిగాయి.తరువాత తగ్గాయి.కనీసవేతనం రు.176 కాగా వివిధ రాష్ట్రాల వేతనాలను విశ్లేషించినపుడు మధ్యగత వేతనం రు.269 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చినెలలో పార్లమెంట్‌లో తెలిపింది. వేతన కోడ్‌ 2019 ప్రకారం ఐదేండ్లలోపు కనీసవేతనాలను సవరించాలని నిర్దేశించటమే గొప్పఅన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.


ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న వ్యవసాయ రంగంలో గత ఏడు సంవత్సరాల్లో ఆదాయాలు పెరిగాయా తరిగాయా అంటే పెరిగినట్లు చిత్రిస్తున్నారు.నిజం ఏమిటి ? లెక్కలతో తికమక చేస్తున్నారు. నిఖర ఆదాయం బదులు చెల్లించిన మొత్తాలనే పరిగణనలోకి తీసుకున్నారనే విమర్శ ఉంది. రికార్డు స్ధాయిలో పంటలు పండితే అది రైతాంగానికి ఆదాయం లేదా సంపద అన్నట్లు చిత్రిస్తున్నారు, గందరగోళపరుస్తున్నారు.పరిస్ధితి మదింపు సర్వే ప్రకారం 2018-19 సంవత్సరంలోసేకరించిన వివరాల ప్రకారం 2012-13 నుంచి 2018-19 కాలంలో కుటుంబంలో ఒకరు ఏడాది పాటు పొలంలో పని చేస్తే పంటల ద్వారా రు.4000కు మించి ఆదాయం వస్తే వ్యవసాయ కుటుంబంగా పరిగణిస్తారని ఎన్‌ఎస్‌ఎస్‌ పేర్కొన్నది.నాబార్డు సర్వే 2016-17లో ఆ మొత్త రు.5,000లుగా చెప్పారు. దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి ? అది తేలేది కాదు వదిలేద్దాం. ప్రభుత్వలెక్కల ప్రకారం పైన పేర్కొన్న సంవత్సరాలలో వచ్చిన ఆదాయాల మార్పు తీరుతెన్నులను చూద్దాం.ఆదాయం రూపాయలు.


వనరు×××××××× 2012-13××××2018-19××××× తేడా శాతం××××35.3శాతం ద్రవ్యోల్బణంతో తేడా
వేతన ఆదాయం××× 2,071 ××× 4,063 ××××× 96.2 ×××× 60.9
పంట ఆదాయం××× 3,081 ××× 3,798 ××××× 23.3 ×××× -12
పశుపోషణఆదాయం× 763 ××× 1,582 ××××× 107.3 ×××× 72
ఇతర ఆదాయం××× 512 ××× 641 ××××× 25.2 ×××× -10.1
మొత్తం ఆదాయం××× 6,427 ××× 10,084 ××××× 56.9 ×××× 21.6
రైతు కుటుంబానికి పంట నిజ ఆదాయం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు తగ్గింది. మిగతా పశు, ఇతరంగా లేకుండా కేవలం పంటల మీదనే ఆధారపడితే నష్టం తప్ప లాభం లేదు. మొత్తంగా తీసుకున్నప్పటికీ పెరుగుదల పెద్దగా లేదన్నది స్పష్టం.గ్రామీణ సంక్షోభంలో ఇదొక ప్రధాన అంశం. ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఖర్చుల పెరుగుదలను విస్మరిస్తే కుదరదు కదా, అందువలన నిఖర ఆదాయం ఎంతో తేలితే అసలు బండారం బయట పడుతుంది. సర్వే జరిగిన సంవత్సరం పంటల పరిస్ధితి మెరుగ్గా ఉండవచ్చు లేదా దిగజారి కూడా ఉండవచ్చు. అందువలన ఒక ఏడాది ప్రమాణం సరైన నిర్ధారణ ఇవ్వదు.


కరోనా కల్లోలంలో ఉపాధికి దెబ్బ చెప్పుకోలేనిది, సమగ్ర సమాచారం లేదు. అసలు వలస కార్మికులెంత మందో తెలియని వాస్తవాన్ని కరోనా బయట పెట్టింది. ఉపాధి నష్టం అంచనాలు తప్ప నిర్దిష్టత లేదు.2020-21లో ఆర్ధిక వృద్ది 7.3శాతం లోటు అన్న లెక్కలను కూడా అనేక మంది అంగీకరించటం లేదు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చన్నది అభిప్రాయం. అమెరికాలోని పూ పరిశోధనా సంస్ధ అంచనామేరకు 3.2కోట్ల మంది మధ్యతరగతి జనాలు ఆ వర్గీకరణ నుంచి దిగజారిపోయారు.ప్రపంచంలో వంద మంది పరిస్ధితి అలా దిగజారిందని అనుకుంటే మన వాటా 60 అని చెప్పిందంటే పరిస్ధితి ఎంతదారుణంగా ఉందో అర్ధం అవుతుంది. అయితే అసలు మధ్య తరగతి ఎందరనేది మౌలిక ప్రశ్న.మన దేశంలో పేదరికానికి తప్ప దీనికి నిర్ధిష్ట ప్రమాణం లేదు. బ్రూకింగ్‌ సంస్ధకు చెందిన హౌమీ ఖరాస్‌ నిర్వచనం ప్రకారం 2011లో 11-110 డాలర్ల మధ్య (రు. 171-1714)ఆదాయం ఉన్న 38 కోట్ల మంది 2015-22లో మధ్యతరగతిలోకి ప్రవేశిస్తారని 2019లో చెప్పాడు. ఎన్‌సిఏఆర్‌ చెప్పిందాని ప్రకారం రెండు నుంచి పదిలక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి అని అలాంటి వారు 2010లో 15.3 కోట్ల మందని చెప్పింది.2012లో అమెరికా సంస్ద గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ పదికోట్లని చెప్పింది.2009-10లో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వే ప్రకారం పది కోట్లు, గత దశాబ్దిలో వివిధ సర్వేల ప్రకారం ఏడు నుంచి 60 కోట్ల మంది మధ్య ఉన్నట్లు అంచనా వేశారు.కొన్ని సర్వేలు వినిమయాన్ని బట్టి అంచనా వేశాయి. అధికారికంగా వెల్లడించని, అనధికారికంగా బయటకు వచ్చిన ఎన్‌ఎస్‌ఓ వివరాల ప్రకారం తగినంత ఉపాధి లేక గడచిన నాలుగుదశాబ్దాలలో తొలిసారిగా 2017-18లో వినిమయం తగ్గిపోయింది.2015 నుంచి పట్టణ మధ్య తరగతి తగ్గిపోగా గ్రామీణ మధ్యతరగతి గిడసబారిపోయింది. కొందరి విశ్లేషణ ప్రకారం మన దేశ మధ్యతరగతి స్దితి ధనికులకంటే పేదలకు దగ్గరగా ఉంటుంది. కరోనా కాలంలో 23 కోట్ల మంది కనీసవేతన పరిధిలోకి దిగజారినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు.


అలాంటి వారి పొదుపు మొత్తాలు, బ్యాంకు డిపాజిట్లు కరోనా సమయంలో ఆవిరయ్యాయి.2020 జూలై ాసెప్టెంబరుమధ్య గృహస్తుల బ్యాంకు డిపాజిట్లు జిడిపిలో 7.7శాతం ఉండగా అక్టోబరు-డిసెంబరు నాటికి మూడు శాతానికి తగ్గాయని ఆర్‌బిఐ నివేదిక చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు సంపద అసమానతలను మరింతగా పెంచేందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. ప్రభుత్వ బాండ్లు, రుణ పత్రాల కొనుగోలు, 5.3లక్షల కోట్ల నగదును ద్రవ్య వ్యవస్దలోకి విడుదల చేశారు. ఈ మొత్తం నిజమైన ఆర్ధికరంగం బదులు స్టాక్‌మార్కెట్‌కు ఎక్కువ భాగం వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఆర్ధిక రంగం తిరోగమించినా, పునరుద్దరణతో నిమిత్తం లేకుండా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రికార్డులను బద్దలు కొట్టటమే దానికి నిదర్శనం. దీని గురించి ఆర్‌బిఐ ఆందోళన కూడా తెలిపింది. గృహస్తుల సంపద కరిగిపోగా కంపెనీల ఆస్తులు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన చౌకవడ్డీ రుణాలతో అంతకు ముందు అధికవడ్డీలకు తెచ్చిన రుణాలను తీర్చాయి తప్ప కొత్తగా పెట్టుబడులు పెట్టలేదని చెబుతున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది.


దేశంలో పదిశాతంగా ఉన్న ధనికుల కొనుగోలు శక్తి పెరిగితే స్టాక్‌మార్కెట్‌, విలాసవస్తువుల మార్కెట్‌, బంగారం, వజ్రాల దిగుమతి మరింతగా పెరుగుతుంది తప్ప ఉపాధి పెరగదు.మధ్య తరగతి మరింతగా తగ్గిపోతుంది, పేదరికం, దారిద్య్రం పెరుగుతుంది. అదే 90శాతంగా ఉన్నవారి శక్తి పెరిగితే నిత్యావసర వస్తు గిరాకీ పెరిగి పరిశ్రమలు, వాణిజ్యంతో ఉద్యోగాలు పెరుగుతాయి.సంస్కరణలు ప్రారంభమైన మూడు దశాబ్దాలలో అసమానతలు మన దేశంలో మరింతగా పెరిగాయి.కరోనా వాటిని మరింత పెంచింది. ఒకశాతంగా ఉన్న ధనికుల సంపద 1990లో జాతీయ ఆదాయంలో 11శాతం ఉంటే 2019నాటికి 21కి పెరిగింది.ప్రపంచంలో 64దేశాల తీరుతెన్నులను పరిశీలించగా కరోనా కాలంలో ధనికుల ఆదాయాలు మరింతగా పెరగ్గా ఇతరులవి తగ్గాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయాలు తగ్గినట్లు వేరే చెప్పనవసరం లేదు. ఏడునెలల తరువాత 2020 అక్టోబరులో లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరిలో ఉన్న ఆదాయాలు కంటే 15-20శాతం తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే సమాచారం అసమగ్రంగా ఉండటంతో పాటు ఇటీవలి కాలంలో విస్వసనీయత కోల్పోయింది. సిఎంఐఇ 2020మే నెల అంచనా ప్రకారం అంతకు ముందు నెలలో 12.2కోట్ల ఉద్యోగాలు పోయాయి. అధికారిక అంచనాల ప్రకారం పదిహేనేండ్ల వయసుపైబడిన ఉద్యోగార్ధులు 2020 జనవరి-మార్చినెలల్లో దేశంలో 18.2కోట్ల మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో 7కోట్ల మంది కార్మికశక్తి నుంచి తగ్గారు.ఉద్యోగార్ధులలో మహిళలు 4కోట్ల మందే ఉన్నా, ఉపాధి నుంచి తగ్గిన ఏడు కోట్లలో మూడు కోట్లు ఉన్నారంటే వారి మీద ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరికొన్ని గణాంకాల ప్రకారం 2020 జనవరి-మార్చి నెలల్లో 16.6 కోట్ల మంది పని చేస్తుండగా తరువాత మూడు నెలల్లో వారి సంఖ్య 2.6కోట్లకు తగ్గింది. రోజువారీ కార్మికులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.కోటీ 90లక్షల మందిలో 90లక్షల మందికి ఉపాధి పోయింది. నెలవారీ వేతనం ఉన్నవారు కోటి మంది తగ్గితే స్వయ ఉపాధి కలిగిన వారు 60లక్షల మందికి ఉపాధి పోయింది.

కరోనా ప్రభావం గురించి అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం ఆదాయాల కంటే అప్పులు ఆరు రెట్లు ఎక్కువ చేశారని తేలింది. దిగువ 25శాతం జనాభాలో పేద కుటుంబాల అప్పులు నాలుగు రెట్లు, ధనికుల అప్పు 1.4రెట్లు మాత్రమే పెరిగాయి. రానున్న రోజుల్లో అసమానతలను పెంచేందుకు ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.సిఎంఐఇ విశ్లేషణ ప్రకారం 2020చివరి నాటికి ఉపాధి కరోనా ముందు స్దాయికి చేరినా ఆదాయాలు పెరగలేదు.కోటీ 50లక్షల మంది కార్మికులు పనికి దూరంగా ఉన్నారు. కరోనా రెండవ తరం ప్రభావాల గురించి ఇప్పటికీ సరైన అంచనాలు లేవు.ఎవరి పద్దతిలో వారు వేసిన అంచనాలన్నింటినీ తలకు ఎక్కించుకుంటే బుర్రలు తిరుగుతాయి. మొత్తం మీద నడుస్తున్న చరిత్రను చూస్తే రానున్న రోజుల్లో ఆదాయ, సంపదల అసమానతలు పెరుగుతాయి. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.


గమనిక : ఈ వ్యాసం అక్టోబరు 17 ఆదివారం నవతెలంగాణా దినపత్రిక అనుబంధం సోపతి ముఖచిత్ర కథనంగా ప్రచురితమైనది

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన్మోహన్‌సింగ్‌ ఆకాంక్ష ,అమలు చేస్తున్నది నరేంద్రమోడీ – రికార్డు స్ధాయిలో చైనా దిగుమతులు, ఏమి దేశభక్తిరా బాబూ ఇది ?

16 Saturday Oct 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, India's dependence on China, India's Trade deficit, India-China trade, Manmohan Singh, Narendra Modi, Narendra Modi Failures, RSS

ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది ఆఖరు నాటికి చైనా-భారత వాణిజ్యం గత రికార్డులను బద్దలు కొట్టి వంద బిలియన్ల డాలర్లకు చేరనుందనివార్త. సెప్టెంబరు ఆఖరుకు 90.7బి.డాలర్లుగా ఉంది. ఈ లెక్కన వచ్చే మూడు నెలల్లో నెల సగటు పది బి.డాలర్ల చొప్పునైతే120బి.డాలర్లు లేదా కనీసంగా వంద బి.డాలర్లు అవుతుందని అంచనా. సరిహద్దులో గాల్వన్‌లోయలో అంత పెద్ద ఉదంతం జరిగినా చైనా వస్తువులను బహిష్కరించాలని ”అపరదేశ భక్తులు” ఎంతగా గొంతు చించుకున్నా, మీడియా ఎంత రచ్చ చేసినా ప్రధాని నరేంద్రమోడీ వాటిని ఎడం కాలుతో తన్నేసి దిగుమతులకు అనుమతులిచ్చారు.వ్యాపారులు తెచ్చుకున్నారు. దీన్ని కొందరు మింగా లేరు కక్కలేరు.2018లో మనం గరిష్టంగా 76బి.డాలర్ల మేరకు దిగుమతులు చేసుకున్నాం, ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నాం అని చెప్పవచ్చు.


రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకున్నా ఆకస్మికంగా వస్తువుల దిగుమతి నిలిపివేయలేరని హాంకాంగ్‌ నుంచి వెలువడే ఆలీబాబా దినపత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పేర్కొన్నది. ఆత్మనిర్భర పేరుతో ముడి పదార్ధాలు, విడిభాగాల కోసం చైనా మీద ఆధారపడకూడదని నరేంద్రమోడీ కోరుకుంటున్నా వెంటనే సాధ్యం కాదని ఆ పత్రిక పేర్కొన్నది.భారత ఎగుమతి సంస్ధల ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి అజయ సాహీ చైనాతో సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. 2021 సెప్టెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో గతేడాదితో పోలిస్తే చైనా నుంచి 51.7శాతం(68.46బి.డాలర్లకు) దిగుమతులు పెరిగాయి. ఇదే కాలంలో మన దేశ ఎమతులు 42.5శాతం(21.91బి.డాలర్లు) పెరిగాయి. మన దేశ లోటు 46.55బి.డాలర్లు. సంఘపరివార్‌ అనుబంధ సంస్ధ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సిఏఐటి) 500 చైనా ఉత్పత్తుల జాబితాను విడుదల చేసి 13బి.డాలర్ల మేరకు 2021లో దిగుమతులను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఇంకేముంది మనం దిగుమతులు నిలిపివేస్తే చైనా వారు మన కాళ్ల దగ్గరకు రావాల్సిందే, ఇదే దేశభక్తి అంటూ వీరంగం వేస్తూ అనేక మంది ఎక్కడికో వెళ్లిపోయారు.2020లో చైనా దిగుమతుల్లో మన వాటా (20.86బి.డాలర్లు) కేవలం 1.2శాతం, 18వ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉన్న జపాన్‌ 174.87 (పదిశాతం) మరో పదిశాతం ఉన్న దక్షిణ కొరియా నుంచి 172.76, అమెరికా నుంచి 136(7.9శాతం) ఆస్ట్రేలియా నుంచి 114.84(6.6శాతం) ఉన్న దేశాలే చైనాతో బేరాలాడుతున్నాయి. అలాంటి స్ధితిలో మనం చైనాను కాళ్ల బేరానికి రప్పిస్తామని ఏ ధైర్యంతో కొందరు చెబుతున్నారో తెలియదు.


ఇండియా టుడే సమాచారం ప్రకారం 2010లో మనం వంద వస్తువులను దిగుమతి చేసుకుంటే చైనా నుంచి 10.7 ఉండేవి, నరేంద్రమోడీ ఏలుబడిలో 2018నాటికి 16.4కు పెరిగి, 2020లో 13.8కి తగ్గాయి. ఈ ఏడాది గత రికార్డును అధిగమించేట్లుంది. గతేడాది మనం మొత్తంగా 473 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే 65బి.డాలర్లతో చైనా అగ్రస్ధానంలో, రెండవ స్ధానంలో ఉన్న అమెరికా నుంచి 35.6 బి.డాలర్లు, 7.5శాతం చేసుకున్నాము. మనం వంద వస్తువులను ఎగుమతి చేస్తుంటే చైనాకు చేస్తున్నవి కేవలం(2020) 5.3 మాత్రమే. మన గరిష్ట ఎగుమతులు 2010లో 6.5శాతం. అందుకే నిజాలు తెలిసినా మన ఎగుమతుల మీద చైనా ఆధారపడుతోందని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మన వాణిజ్య లోటు విషయానికి వస్తే 2010లో 19.2 బి.డాలర్లు కాగా 2018లో గరిష్టంగా 63 బి.డాలర్లు. ఈ ఏడాది ఇప్పటికే 46.55 బి.డాలర్లుంది. పదేండ్లలో చైనా నుంచి మన దిగుమతులు రెట్టింపు అయ్యాయి.వాటిని తగ్గించేందుకు దిగుమతి సుంకాలు విధించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చినా ఖరారు కాలేదు. పన్ను విధించినా దిగుమతులు కొనసాగితే ఆ భారం మన వినిమయదారులే భరించాల్సి ఉంటుంది.మనం పన్నులు విధిస్తే చైనా ఊరుకుంటుందా ?


2012లో నాటి చైనా ప్రధాని వెన్‌జియాబావో – మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇరు దేశాల వ్యాపార లావాదేవీలు 2015నాటికి వంద బి.డాలర్లకు పెంచాలని ఆకాంక్షించారు. తాజా సమాచారాన్ని బట్టి మన ఆత్మనిర్భర, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పిలుపులిచ్చిన నరేంద్రమోడీ దాన్ని ఈ ఏడాది నెరవేర్చేదశలో ఉన్నారు. 2017-18లో గరిష్టంగా 89.6బి.డాలర్లకు చేరగా ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టారు. త్వరలో 100బి.డాలర్ల రికార్డు నెలకొల్పనున్నారు.కొన్ని వస్తువులను వయా హాంకాంగ్‌ దిగుమతి చేసుకుంటున్నాము. వాటిని కూడా కలుపుకుంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2018లో విడుదల చేసిన ఒక నివేదికలో భారత పరిశ్రమపై చైనా వస్తు ప్రభావం గురించి పేర్కొన్నారు. దిగుమతి పన్ను చట్టాలు సరిగా అమలు కావటం లేదని ఔషధరంగంలో ముడి సరకులు, సోలార్‌ పరికరాల దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. మన ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలు మూతపడుతున్నట్లు కూడా తెలిపారు.


చైనా నుంచి పెరుగుతున్న దిగుమతులు నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న రాజకీయ నేతలు, సంస్ధలు, మీడియాకు, వాటి ప్రచారాన్ని భుజానకెత్తుకున్నవారికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ అంటే అతిశయోక్తి కాదు.వారి విశ్వసనీయతను జనం ప్రశ్నిస్తారు. దీన్ని మరోకోణం నుంచి చూస్తే వీరి చర్యల పర్యవసానాలేమిటో కూడా చూడాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనా నుంచి ఇలాంటి దిగుమతులు లేవు.1990దశకంలోనే ఎగుమతులు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు సంఘపరివార్‌ శక్తులే అధికారంలో ఉన్నాయి. వారి హయాంలో చైనా నుంచి దిగుమతులు పెరిగాయి తప్ప తగ్గలేదు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది వందలకు పైగా చైనా కంపెనీలు ఉన్నాయి. వాటిలో 75వరకు వినియోగ వస్తువులను తయారు చేసేవే.అంకుర కంపెనీలలో చైనా పెట్టుబడులు 400 కోట్ల డాలర్లు ఉన్నాయి.ఫ్లిప్‌కార్ట్‌, పేటియం, ఓలా, బైజూస్‌ వంటివి ఉన్నాయి. అనేక ఔషధ పరిశ్రమలు చైనా దిగుమతుల మీద ఆధారపడ్డాయి. వీటికి ప్రత్నామ్నాయం చూడకుండా తెల్లవారేసరికి చైనా వస్తువులను బహిష్కరిస్తే నష్టపడేది కోట్లాది మంది సామాన్యులే. చైనాకు నష్టం ఉండదు. అత్యవసర జీవన ఔషధాల తయారీకి వినియోగించే ఎపిఐలో 75శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాము.ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సోలార్‌ పానెల్స్‌, రసాయనాల గురించి చెప్పనవసరం లేదు. జనజీవితాలు, పారిశ్రామిక రంగం నుంచి ఇప్పటికిప్పుడు చైనాను పక్కన పెట్టే అవకాశాలు లేవు. అందుకే నరేంద్రమోడీ సర్కారు ఆత్మనిర్భరత , స్వయం సమృద్ధి వంటి ఎన్నికబుర్లు చెప్పినా దిగుమతులను అనుమతించిందన్నది స్పష్టం. లేకపోతే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో అధికారపార్టీకి కష్టం.చైనాలో తయారైన వస్త్రాలను బంగ్లాదేశ్‌కు తీసుకువచ్చి అక్కడ దుస్తులు తరాయారు చేసి మన దేశానికి ఎగుమతి చేస్తున్నారు. ఇలా అనేక దేశాల నుంచి వేరే రూపంలో చైనా వస్తువులు వస్తున్నాయి. వీటిని అడ్డుకుంటే మన ఎగుమతులూ ఆగుతాయి. జనానికి చౌకగా వస్తువులూ దొరకవు.

మబ్బులను చూసి ముంతలో నీళ్లు ఒలకపోసుకున్నట్లుగా అమెరికాను నమ్మి బొమనం బస్తీమే సవాల్‌ అని గనుక తారసిల్లితే అంతర్జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రాలేము. అందుకు నిదర్శనం ఆస్ట్రేలియా. ఇప్పుడు నిండా మునిగి చైనాతో వైరం కొని తెచ్చుకుంది. వారిని ముందుకు నెట్టి రెచ్చగొట్టిన అమెరికా ఇప్పుడు తన లాభాన్ని తాను చూసుకొంటోంది. చైనాకు వ్యతిరేకంగా నిలవటం ఒక గౌరవ ప్రదమైన ఘనతగా భావించిన ఆస్ట్రేలియా వెనక్కితిరిగి చూసుకుంటే తన నీడ తప్ప మరొకరు కనిపించని స్ధితికి వెళుతోందని సిడ్నీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జేమ్స్‌ లారెన్స్‌సన్‌ హెచ్చరించాడు.ఆర్ధిక లబ్దికోసం చైనా, రక్షణ అవసరాల కోసం అమెరికా మీద ఎలా ఆధారపడకూడదో ఆస్ట్రేలియా పరిణామాలు వెల్లడిస్తున్నాయన్నారు.2016 రెండవ అర్దభాగం నుంచి చైనాకు వ్యతిరేకంగా మారటం ప్రారంభమైంది. దీంతో చైనా తీసుకున్న చర్యల కారణంగా మద్యం నుంచి బొగ్గువరకు అనేక ఆస్ట్రేలియా ఎగుమతులు ప్రభావితమయ్యాయి.


బలవంతపు వాణిజ్య పద్దతులను వ్యతిరేకించాలని ఆస్ట్రేలియాతో కలసి జపాన్‌,భారత్‌ ఉమ్మడి ప్రకటనలు చేయ వచ్చు గానీ జపాన్‌, భారత్‌ ఎక్కడా చైనా పేరెత్తేందుకు సిద్దం కాదని, ఇండోనేషియా ఆప్రకటన మీద సంతకం చేసేందుకు సిద్దం కాదని లారెన్స్‌ సన్‌ చెప్పారు. మార్చినెలలో ఆస్ట్రేలియాలో అమెరికా రాయబారి మైక్‌ గోల్డ్‌మన్‌ మాట్లాడుతూ మీరు చేస్తున్నదానితో విశ్వాసంతో ముందుకు పోండి,ఆమెరికా ఇతర ప్రజాస్వామిక దేశాలు మీ విజయాన్ని ఎంతో ఆసక్తితో చూస్తాయి అన్నాడు. మిమ్మల్ని రోడ్డు మీద వంటరిగా వదిలేది లేదని మేనెలలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ చెప్పాడు. వాణిజ్య దాడులకు ఆస్ట్రేలియా గురైనంత కాలం తాము చైనాతో సంబంధాల మెరుగుదలకు సిద్దం కాదని ఇండో-పసిఫిక్‌ అమెరికా పార్లమెంట్‌ సమన్వయకర్త కర్ట్‌ కాంప్‌బెల్‌ సెలవిచ్చాడు. ఆరునెలల తరువాత వాణిజ్య లావాదేవీల వివరాలను చూస్తే చైనా నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఎగుమతుల స్ధానాన్ని అమెరికా కంపెనీలు తమ సరకులతో నింపుతున్నట్లు తేలింది.ఇదేం పని అని అడిగితే అమెరికా ఏమీ మాట్లాడదు. అంతేకాదు అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండో మాట్లాడుతూ చైనా వాణిజ్యాన్ని పెంచుకొనేందుకు తాము చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. ఉద్రిక్తతలను సడలించేందుకు ముమ్మర వాణిజ్యం తోడ్పడుతుందని సెలవిచ్చాడు.అమెరికా-చైనా వాణిజ్యం తీరుతెన్నులపై ఎనిమిది నెలల సమీక్ష తరువాత అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి మాట్లాడుతూ తాము చైనాతో విడగొట్టుకొనేందుకు బదులు సంధానం చేసుకోవటం గురించి అజెండాను ముందుకు జరపనున్నామని చెప్పింది. ఇవన్నీ చెప్పిన సదరు ప్రొఫెసర్‌గారు చెప్పిందేమంటే అమెరికా తన సంగతి తాను చూసుకుంటున్నపుడు చైనాతో మనం తగాదా ఎందుకు పడాలని తమ పాలకులను ప్రశ్నించాడు.


ఇది మన దేశానికి వర్తించదా ? మనకూ అలాంటి అనుభవం ఎదురైతేగానీ మోడీ సర్కార్‌ తన వైఖరిని మార్చుకోదా ? చైనాతో స్నేహం చేసేదీ లేనిదీ పక్కన పెడితే తగాదా అవసరమా ? గాల్వన్‌ వివాదం మన సైనికుల మరణం విచారకరమే, కానీ అదే చైనా నుంచి మనం రికార్డు స్ధాయిలో దిగుమతులు చేసుకుంటున్నది ఆ తరువాతే కదా ? మనోభావాలతో ఆడుకుంటూ జనంలో దేశ భక్తి, చైనావ్యతిరేకతను రెచ్చగొడుతూ రాజకీయరగా బిజెపి ఉంటే దిగుమతిదారులు తమ లాభాల సంగతి తాము చూసుకుంటున్నారు. నరేంద్రమోడీ వాటిని అనుమతిస్తున్నారు. ఏమి దేశభక్తిరా బాబూ ఇది.


ఒక సోషలిస్టు దేశంగా చైనాను కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు అభిమానించవచ్చు. దాని మాదిరి మన దేశం, ఇతర దేశాలూ ముందుకు పోవాలనీ కోరుకుంటారు. అందుకోసం ఉద్యమాలు చేస్తారు తప్ప చైనాతో వాణిజ్యం చేయరు. ఇంతకు ముందు అలా చేసిన నేతలూ లేరు, ఇప్పుడూ లేరు, ఇక ముందూ ఉండరు.చేసేదంతా పారిశ్రామిక,బడా బాబులే, వారికి సహకరించేది అధికారంలో ఉన్న పార్టీల నేతలే. వ్యాపారం వ్యాపారమే. ఎవరికైనా లాభం వస్తేనే చేస్తారు. భారత కమ్యూనిస్టులు ఇక్కడి ప్రజల ప్రయోజనాలకే ప్రధమ పీటవేస్తారు తప్ప మరొక దేశానికి దోచిపెట్టమని ఎక్కడా చెప్పలేదు, చెప్పరు. గాల్వన్‌ లోయ ఉదంతం సందర్భంగా ప్రధాని అఖిలపక్ష సమావేశంలో చైనా మన ప్రాంతాలను ఆక్రమించలేదని స్వయంగా చెప్పారు. సరిహద్దు వివాదం కొత్తగా తలెత్తింది కాదు. దాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కమ్యూనిస్టులు ప్రత్యేకించి సిపిఎం మొదటి నుంచీ చెబుతోంది. అలా చెప్పిన వారిని దేశద్రోహులుగానూ, చైనాతో తగాదా కోరుకున్నవారిని దేశభక్తులుగానూ చిత్రిస్తున్నారు. దేశభక్తి అంటే చైనాను వ్యతిరేకించటంగా చిత్రీకరిస్తున్నారు. మరి ఆ చైనా నుంచి రికార్డు స్ధాయిలో దిగుమతి చేసుకుంటున్నవారిని, అనుమతిస్తున్నవారిని ఏమనాలి ? దేశద్రోహులా, భక్తులా ?


సామాజిమాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేందుకు బిజెపి దాని మాతృసంస్ధ సంఘపరివారం వెచ్చించే సమయంలో వెయ్యవ వంతు దేశం మీద కేంద్రీకరించినా – ఎందుకంటే దేశమంతటా తామే ఉన్నామని చెబుతున్నారు గనుక ఇక్కడే ఉత్పత్తి పెరిగి చైనా మీద ఆధారపడటం కాస్తయినా తగ్గి ఉండేదేమో ! మన జనాలకు పనీపాటా దొరికేదేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీ దేశం చుట్టుపక్కల అరవై ఆరు దేశాలకు పోతుగడ్డ మోడీ మహా ప్రభో !

12 Tuesday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Bilateral trade pacts, India trade gap, Narendra Modi, Narendra Modi Failures, RSS, SJM


ఎం కోటేశ్వరరావు


దేశంలో అధికార రాజకీయ క్రీడ ఒక వైపు, దానిలో ఓడిపోకుండా ఉండేందుకు వెంపర్లాట మరోవైపు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య ఒకవారం ఇన్ఫోసిస్‌ దేశభక్తిని శంకిస్తే మరో వారం కథనంలో అమెజాన్‌ రెండో తరం ఈస్టిండియా కంపెనీ అని వర్ణించింది. అది ఒక కంటితోనే చూస్తోంది. మరోకంటితో అవలోకిస్తే విదేశీ ఒప్పందాల కోసం నరేంద్రమోడీ సర్కార్‌ వెంపర్లాడుతున్న దృశ్యం కూడా కనపడి ఉండేది. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అనే అంశం తెలిసినా సర్దుబాటు చేసేందుకు పూనుకున్నారు. చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం మధ్య ప్రభుత్వ వాణిజ్య విధానంలో పెద్ద మార్పు అనే పేరుతో ఒక వార్తా సంస్ధ విశ్లేషణ వెలువడింది. పెద్ద మార్పు అంటే ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ త్వరత్వరగా ప్రయోజనాలు పొందే ఒప్పందాలు చేసుకోనున్నది అని కూడా దానిలో చెప్పారు. కేంద్ర మంత్రులు లేదా ఉన్నతాధికారులతో జర్నలిస్టులు సంభాషించిన తరువాతనే ఇలాంటి విశ్లేషణలు వస్తుంటాయి లేదా పని కట్టుకొని రాయిస్తుంటారు. ఇది మొదటి కోవకు చెందినదే.


ఎందుకు ఇలాంటి విశ్లేషణలు అంటే ప్రతిదాని వెనుక ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు నరేంద్రమోడీ ఎందుకు తొందరపడుతున్నారు ? అధికారానికి వచ్చిన తొలిరోజుల నుంచి కొన్ని సంవత్సరాల పాటు చమురు ధరలు పడిపోవటంతో వచ్చిన వెసులుబాటు నరేంద్రమోడీ ఘనతే అన్నట్లుగా ప్రచారం చేశారు. మీడియా కూడా అదే భజన చేసింది. అది నూతన సాధారణ స్ధాయికి చేరటం, చమురు ధరలు పెరగటంతో ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆరు సంవత్సరాల కాలంలో దేశవృద్ది రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారింది. అప్పటి నుంచి ప్రతిదానికీ కరోనాను సాకుగా చూపుతున్నారు. ఇంకేమాత్రం ఆ కబుర్లు నమ్మేందుకు జనం సిద్దంగా లేరు. తొలి నెలల్లో విదేశాల్లో, విమానాల్లోనే మోడీ ఎందుకు కాలం గడుపుతున్నారు అంటే పెట్టుబడుల కోసం అని చెప్పారు. కొత్తగా వచ్చిందేమీ లేదు. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా అన్నారు. ఉన్న ఎగుమతులు కూడా తగ్గాయి. తరువాత చైనా నుంచి ఇతర దేశాల కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెప్పారు. వాటి జాడలేదు.


ఇప్పుడు ఆత్మనిర్భరత, ఉత్పత్తి, ఎగుమతుల ఆధారిత రాయితీలంటూ విఫల పధకాన్ని మరోసారి ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు విదేశాలతో ఒప్పందాలని హడావుడి చేస్తున్నారు.చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలు ఒకవైపు ఎగుమతులు-మరోవైపు తమ పౌరుల కొనుగోలు శక్తి పెంచేవిధంగా ఆదాయాల పెంపు వంటి విధానాలను అనుసరిస్తున్న కారణంగా అవి ముందుకు పోతున్నాయి. రెండవది జరగకుండా ఎగుమతులతో ముందుకు పోవాలని మోడీ సర్కార్‌ ఆత్రంగా ఉంది. అలాంటి విధానాలను అనుసరించిన లాటిన్‌ అమెరికా దేశాల అనుభవాలను ఏమాత్రం పట్టించుకున్నట్లు కనపడదు.


ఎగుమతులు, పెట్టుబడుల ఆకర్షణకు సమగ్ర ఒప్పందాలు కుదరాలంటే ఏండ్లూ పూండ్లూ పడుతుంది. ఏ దేశానికి ఆ దేశం తమకే పెద్ద పీట అంటే మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తావు, మాదేశం వస్తే మాకేం తెస్తావు అన్నట్లుగా ఉన్నాయి. బేరాలాడుతున్నాయి. చైనాతో తగాదా పెట్టుకొన్న మోడీ కౌగిలింతల భాగస్వామి డోనాల్డ్‌ ట్రంప్‌కు ఏ గతి పట్టిందో చూసిన తరువాత ఎవరికి మాత్రం ఆందోళన, ఆత్రం ఉండదు ! ఎన్నికలు, రాజకీయాలు నిలవనీయవు కదా ! తక్షణ ఫలితాలను జనానికి చూపాలి, అందుకు గాను ఏదో ఒకటి చేయాలి మరి. అందుకే వెంటనే అమల్లోకి వచ్చే తాత్కాలిక ఒప్పందాలు అని చెబుతున్నారు. నిజమే కదా… చేసుకుంటే తప్పేమిటి ? కోడలు మనవడిని కంటానంటే అత్త వద్దంటుందా అన్న సామెత తెలిసిందే.(ఇది ఆడపిల్లల పట్ల వివక్షే అని వేరే చెప్పనవసరం లేదు) మన కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ గారు గత ఏడాది జరిగిన 290బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 2022లో 400బి.డాలర్లకు(40వేల కోట్లు) పెంచాలని, 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్లకు పెంచాలని చెపుతున్నారు. ప్రస్తుతం కనీసం ఇరవై దేశాలతో ఒప్పందాల సంప్రదింపులు జరుపుతున్నారు. ఆస్ట్రేలియా,బ్రిటన్‌, ఐరోపాలోని మరికొన్నింటితో క్రిస్మస్‌లోగా ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చూస్తున్నారు.గతంలో మేకిన్‌, మేడిన్‌ ఇండియా ప్రచారంలో భాగంగా ఇలాంటి రాయితీల ఆశ చూపినా ప్రయోజనం కలగలేదు. తమకు దేశ ప్రయోజనాలు ముఖ్యం కనుక దేశాలతో ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలమే అని స్వదేశీ జాగరణ మంచ్‌ సహకన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ చెప్పారు. కరోనా సమయంలో వాణిజ్యలోటు తగ్గింది, ఇప్పుడు తిరిగి గణనీయంగా పెరుగుతోంది.


2019లో కుదిరిన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)ని జనవరి నుంచి అమల్లోకి తెచ్చేందుకు చైనా, ఇతర ఒప్పంద దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే 15దేశాలకు గాను పది దేశాలు సంతకాలు చేశాయి. ఇది ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య ఒప్పందం. ఆసియన్‌ కూటమిలోని ఆరు, ఇతర దేశాల్లో మూడు సంతకాలు చేసిన తరువాత రెండు నెలల్లో ఇది అమల్లోకి వస్తుంది. అనుకున్నట్లుగా అమల్లోకి వస్తే ఆ దేశాలకు చెందిన 91శాతం వస్తువులు ముఖ్యంగా పారిశ్రామిక వస్తువులపై పన్నులు పూర్తిగా రద్దు లేదా నామమాత్రం అవుతాయి. తాను లేని ఈ ఒప్పందాన్ని అమెరికా ముందుకు పోనిస్తుందా అన్న ప్రశ్న ఎలాగూ ఉంది. ఒకవేళ అమలైతే మన దేశానికి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఏ దేశం ముందుకు వస్తే వారితో వెంటనే ఏదో ఒక ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎగుమతుల్లో పురోగతి లేక దిగుమతులు పెరిగి చెల్లింపుల సమస్య తలెత్తితే 2024 ఎన్నికల్లో ఎదురీదక తప్పదు.


మన దేశానికి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కొత్త కాదు.మన దేశం ఇప్పటి వరకు వివిధ దేశాలతో పెట్టుబడులకు సంబంధించి 86 ఒప్పందాలు చేసుకుంది. వాటిలో పదమూడు మాత్రమే అమల్లో ఉన్నాయి.వివాదాల కారణంగా అనేక ఒప్పందాల నుంచి వైదొలిగాము. అయితే గత అనుభవం ఏమంటే మన ఎగుమతులకు బదులు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అంటే లబ్ది ఇతర దేశాలకు కలిగింది.2001లో మన వాణిజ్యలోటు ఆరుబిలియన్‌ డాలర్లు ఉంటే 2017నాటికి 109బి.డాలర్లకు పెరిగింది. ఒప్పందం చేసుకున్న దేశాలలో ఒక్క శ్రీలంకతో మాత్రమే మనకు మిగులు ఉంది. 2011-17 మధ్య జపాన్‌, దక్షిణ కొరియాతో వాణిజ్యలోటు రెట్టింపైంది. చైనా విషయానికి వస్తే 50శాతం పెరిగింది. దీంతో రెండు అంశాలు ముందుకు వచ్చాయి. దిగుమతి వస్తువులతో వాణిజ్యం చేసే వారు లబ్ది పొందారు. అవే వస్తువులను మన దేశంలో తయారు చేసే సంస్ధలు పోటీని తట్టుకోలేక మూతపడ్డాయి. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో, అంతకు ముందు చేసుకున్న ఒప్పందాల సారమిదే. వాటికి వ్యతిరేకంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ అనే ఒక సంస్ధనే రంగంలోకి తెచ్చింది. మన్మోహన్‌ సింగ్‌ చివరి సంవత్సరాలలో కొన్ని ఒప్పందాలను సమీక్షించాలన్నంత వరకు ఆలోచన చేశారు. దాని ప్రభావం తరువాత ఏలుబడిలోకి వచ్చిన మోడీ సర్కార్‌ మీద పడి కొత్త ఒప్పందాలేవీ చేసుకోలేదు. ఆర్‌సిఇపిలో చేరకూడదని నిర్ణయించింది.


ఏ ఒప్పందం చేసుకున్నప్పటికీ అది ఆ దేశ వాణిజ్య పోటీతత్వం మీద ఆధారపడి ఉంటుంది. స్విడ్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే ఐఎండి సంస్ధ ప్రకటించే ప్రపంచ పోటీతత్వ సూచికలో 64దేశాలలో మనం 2021లో 43వ స్ధానంలో ఉండగా చైనా 16 దగ్గర ఉంది. గత ఐదు సంవత్సరాల సూచికలను చూస్తే మనం 45 నుంచి 43కు పెంచుకుంటే చైనా 18 నుంచి 16కు ఎదిగింది. 2017 నుంచి వరుసగా 45,44,43,43,43 సూచికలతో మనం ఉండగా చైనా 18,13,14,20,16తో ఉంది. ప్రస్తుతం మనం ఒప్పందాల కోసం సంప్రదింపులు చేసే దేశాలన్నీ మన కంటే మెరుగైన సూచికలతో ఉన్నందున మనం పోటీ పడగలమా ?

తమ వైఫల్యాలను జనం గ్రహించకముందే ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంలో మోడీ సర్కార్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి దేశమూ రక్షణాత్మక చర్యలను అమలు జరుపుతోంది. మనం ఆర్‌సిపిఇలో చేరకపోవటం కూడా దానిలో భాగమే.గత స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి ముందే చెప్పుకున్నాము. ఆ కారణంగానే గత ఏడు సంవత్సరాలలో వాటి పట్ల మోడీ సర్కార్‌ పెద్దగా మొగ్గుచూపలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం) అలాంటి ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేయటం కూడా దీని కారణాల్లో ఒకటి. అయితే వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి ఇటీవలి కాలంలో వత్తిడి పెరుగుతోంది. అందుకే వారి ఉత్పత్తులకు మార్కెట్లను వెతికేపనిలో భాగంగా ఐరోపా యూనియన్‌, విడివిడిగా వివిధ దేశాలో ఒప్పందాలు చేసుకొనేందుకు పూనుకుంది. అయితే ఆ దేశాలు విధించే షరతులు బిజెపి ఓటు బ్యాంకుగా ఉన్న చిన్న వ్యాపారులు, చివరికి పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సైతం మింగుడు పడక ముందుకు సాగటం లేదు. మరోవైపు అలాంటి ఒప్పందాలను ప్రపంచ వాణిజ్య సంస్ధలో సవాలు చేసే అవకాశం కూడా ఉంది. అందువలన తాత్కాలిక ఒప్పందాల ముసుగులో పని కానివ్వాలని చూస్తున్నారు.


కరవమంటే కప్పకు కోపం-విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్ధితి ఉంది. అనేక వస్తు దిగుమతులపై రక్షణాత్మక చర్యల్లో భాగంగా పన్నులను పెంచారు. ఇప్పుడు వాటిని తగ్గించకపోతే విదేశాలు ముందుకురావు, తగ్గిస్తే స్ధానిక సంస్ధలు నష్టపోతాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యరాజ్యాల మధ్య ప్రత్యేక ఒప్పందాలు కుదిరితే మిగతా దేశాలకు కూడా వాటిని వర్తింప చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే వివాదాలే. తాత్కాలిక ఒప్పందాలకు కాలపరిమితిని స్పష్టం చేయాల్సి ఉంటుంది, అది అనిశ్చితికి దారితీస్తుంది. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో నామమాత్ర పన్నులు విధించే చర్యలకు త్వరలో మంగళం పాడే అవకాశం ఉంది. ఏ బహుళజాతి కంపెనీ ఎక్కడ పెట్టుబడులు పెట్టినా పదిహేనుశాతం పన్ను విధించాలన్న ఒప్పందాన్ని అంగీకరించిన 140కి గాను 136 దేశాలు సంతకాలు చేశాయి. దీనివలన దేశాల మధ్య పోటీ నివారణ అవుతుందని భావిస్తున్నారు. అది అమల్లోకి వస్తే ద్విపక్ష ఒప్పందాలు ఏమౌతాయో తెలియదు.


స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, ద్విపక్ష పెట్టుబడి ఒప్పందాల తీరుతెన్నులు చూసినపుడు కొన్ని అంశాలు స్పష్టం అయ్యాయి.ప్రజల,పర్యావరణాన్ని ఫణంగా పెట్టి బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు పెద్ద పీట వేసే సాధనాలుగా పని చేస్తాయి. 1950-70దశకం వరకు నూతనంగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాల్లోని వలస దేశాల పెట్టుబడుల రక్షణకు వీటిని సాధానాలుగా చేసుకున్నారు. తరువాత స్వేచ్చామార్కెట్‌ పేరుతో వాటిని మరింత ఎక్కువ చేశారు. ఇప్పుడు మూడువేలకు పైగా పెట్టుబడి రక్షణ ఒప్పందాలున్నాయని అంచనా.వీటిని ఆధారం చేసుకొని అనేక కంపెనీలు ప్రభుత్వాలతో వివాదాలకు దిగాయి. పన్నుల తగ్గింపు లేదా అసలు కొన్నింటిపై పన్ను లేకుండా చేస్తారు. ఈక్రమంలో వాణిజ్యపోటీలో నిలిచే పేరుతో కార్మికుల వేతనాల తగ్గింపు, బేరమాడేశక్తి లేకుండా చేసే కార్మిక చట్టాలను వారి మీద రుద్దుతారు.ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు జనాన్ని అప్పగిస్తాయి. ఐరోపా ఫ్రీ ట్రేడ్‌ ఏరియా(ఇఎఫ్‌టిఏ), ఐరోపా యూనియన్‌తో 2007-08లోనే చర్చలకు నాంది పలికాము. వారి కార్లు, మద్యం దిగుమతులకు అంగీకరించాము. మన ధాన్యసేకరణ రంగం, బీమా, బాంకు, ఇతర ఆర్ధిక సేవల రంగంలో ప్రవేశానికి అనుమతించాలన్న వత్తిడి కారణంగా 2013లో అవి నిలిచిపోయాయి. తిరిగి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

మోడీ సర్కార్‌ ముందుకు తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో ధాన్యసేకరణ ప్రయివేటును అనుమతించే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా సమయంలో ఎలాంటి చర్చకు వీల్లేకుండా ఆదరాబాదరా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆ క్రమంలో భాగమే. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన వస్తున్నది, పదినెలలుగా సాగుతున్న రైతు ఉద్యమం దానిలో భాగమే.దీన్ని అణచివేసిన తరువాత కార్మిక హక్కులను హరించేందుకు అవసరమైన బిల్లులను సిద్దం చేశారు. అనూహ్యమైన రైతు ఉద్యమం కారణంగా సమయం కోసం చూస్తున్నారు. కార్పొరేట్లపై పన్ను తగ్గింపు కారణంగా తలెత్తిన లోటును పూడ్చుకొనేందుకు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు కల్పించేందుకు ప్రజల మీద పన్ను భారాలు మోపుతారు. పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను, సెస్సుల మర్మమిదే. పెరుగుతున్న ధరలకు అనుగుణ్యంగా రైతులకు సబ్సిడీలను పెంచకుండా నామమాత్రం చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ ఏటా 70-80వేల కోట్ల మధ్యనే ఉంచటమే దానికి నిదర్శనం. ప్రతిపాదిత విద్యుత్‌ బిల్లు ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదని చెప్పటం కూడా దానిలో భాగమే. రాష్ట్ర ప్రభుత్వాలకు క్రాస్‌ సబ్సిడీ అవకాశాలను ఎత్తివేస్తారు. ముందుగా వినియోగదారులనుంచి వసూలు చేసి తరువాత వారి ఖాతాలో జమచేసే విధానాన్ని తీసుకురానున్నారు. వంటగ్యాస్‌ మాదిరి ధరలు పెంచుకుంటూపోయి నామమాత్రం చేస్తారు. రాష్ట్రాలకు అధికారం లేకుండా నియంత్రణ కమిషన్ల పేరుతో చట్టసభల అవకాశాలను పరిమితం చేసి కాలక్షేప కేంద్రాలుగా మార్చివేస్తారు. ఇవి చట్టసభలకు జవాబుదారీగా ఉండవు.


రైతాంగానికి, పరిశ్రమలకు నష్టం అనే వైఖరి తీసుకున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల వత్తిడి, ఆందోళనల కారణంగా, హిందూ మత, మితవాదుల మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ తదితర సంస్ధల వైఖరి వలన మోడీ సర్కార్‌ ఆర్‌సిఇపిలో చేరలేదు.అది హ్రస్వ దృష్టికి నిదర్శనమని విదేశాంగశాఖ మాజీ అధికారి శ్మామ్‌ సరణ్‌ వంటి వారు విమర్శించారు. మరోవైపు అదే మోడీ సర్కార్‌ ఇతర దేశాలతో స్వేచ్చా, ద్విపక్ష ఒప్పందాల కోసం వెంపర్లాడుతోంది. ఇప్పుడు అదే జాగరణమంచ్‌ దేశం కోసం ఇవి అవసరం అని కొత్త పల్లవి అందుకుంది. తాము బహుళ దేశాలతో కూడిన వాటికి తప్ప ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలం అంటోంది. చిల్లు కాదు తూటు అన్నట్లుగా ఆర్‌సిఇపి ఒప్పందంలోని అంశాలే వీటిలో కూడా ఉంటాయి, నాడు దాన్నెందుకు తప్పన్నారు, నేడు వీటినెందుకు ఒప్పంటున్నారు ? విదేశీ రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు వరుసలు కట్టి వస్తున్నారు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా యూనియన్‌, గల్ఫ్‌ సహకార సంస్ధ, యుఏయి, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు ఉన్నాయి. పూర్వం గ్రామాల్లో హరికథలు, బుర్రకథలు, ఇతర కళారూపాలను ప్రదర్శించేవారు. గ్రామపెద్దలు, పౌరుల నుంచి పెద్ద మొత్తంలో కానుకల కోసం అబ్బో మీ ఊరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతుగడ్డ, మీది పెద్ద చేయి అంటూ పొగిడేవారు. ఇప్పుడు మన మార్కెట్‌ మీద కన్నేసిన దేశాలన్నీ అలాంటి పొగడ్తలే కురిపిస్తున్నాయి, మనకు బిస్కెట్లు వేస్తున్నాయి.


స్వదేశీ కంపెనీలకు రక్షణకు కట్టుకున్న మడిని పక్కన పెట్టి మోడీ సర్కార్‌ మంత్రులు, అధికారులు వీటితో మాట్లాడుతున్నారని గ్రహించాలి. వచ్చే ఏడాది మార్చినాటికి బ్రిటన్‌తో, తరువాత ఆస్ట్రేలియాతో తాత్కాలిక ఒప్పందాలు కుదురుతాయని చెబుతున్నారు. ఐరోపా,ఆస్ట్రేలియా వంటి దేశాలతో అంటే వాటి పాల ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. అప్పుడు పాల ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాల రైతులు కూడా ఢిల్లీ వద్ద నిరసనలకు దిగకతప్పదు. ఐరోపా యూనియన్నుంచి బయటకు వచ్చిన బ్రిటన్‌కు ఇప్పుడు ఇతర దేశాలతో ఒప్పందాలు అవసరం గనుక అది వెంటపడుతోంది. చైనాతో వివాదం వచ్చింది కనుక ఆస్ట్రేలియా తన ఉత్పత్తులను మన దేశంలో విక్రయించాలని చూస్తోంది. ఎలక్ట్రానిక్స్‌, టెలికాం పరికరాల కోసం చైనా మీద ఆధారపడకుండా ఉండాలంటే బ్రిటన్‌తో ఒప్పందం అవసరమని స్వదేశీ జాగరణ మంచ్‌ నేత అశ్వనీ మహాజన్‌ వాదిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులుతో ఉంది. కనుక తన వ్యవసాయ, పాడి, కోళ్ల ఉత్పత్తులను మన మార్కెట్లో కుమ్మరించాలని చూస్తోంది. దానికి అంగీకరిస్తే మన రైతాంగం నష్టపోతుంది. తన ఆయుధాలు, చమురుతో పాటు వీటిని కూడా దిగమతులు చేసుకోవాలని మన మీద వత్తిడి తెస్తోంది.

అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాలు కుదుర్చుకొనే ద్విపక్ష ఒప్పందాలలో కార్మికులకు సంబంధించి ప్రపంచ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) ఆమోదించిన ఎనిమిది కీలక అంశాల అమలును ఒక షరతుగా పెడతాయి. యజమానులకు ఇష్టమైనపుడు కార్మికులను పెట్టుకొనే, లేనపుడు తొలగించే, అసలు సంఘాలు పెట్టుకోవటాన్నే అసాధ్యం చేసే విధంగా కార్మిక చట్టాలను మార్చేందుకు పూనుకన్న మోడీ సర్కార్‌ మరి వాటిని ఎలా అంగీకరిస్తుంది. అంగీకరించి అమలు జరపకపోతే కార్మికులు ఊరుకుంటారా ? ఈ మార్పులను చివరికి సంఘపరివార్‌ సంస్ధ బిఎంఎస్‌ కూడా అంగీకరించటం లేదు. నిజంగా దేశానికి తద్వారా మన జనాలకు మేలు కలిగించే ఇలాంటి ఒప్పందాలు చేసుకోవటానికి చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం వంటి పరిణామాలను సాకుగా చూపటం అవసరమా అనే ప్రశ్నలు అడగకూడదు. అపర దేశభక్తులు చెప్పింది వినాలి తప్ప బుర్రతో ఆలోచించకూడదు. మోడీ ప్రారంభించిన ఒప్పందాల తీరుతెన్నులు గతంలో మన్మోహన్‌ సింగ్‌కు తెచ్చిన తలనొప్పులనే పునరావృతచేస్తాయా ? మోడీ దూకుడు అలానే ఉంది మరి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సామాన్యులకు గోడదెబ్బ-చెంపదెబ్బ : పెరుగుతున్న చమురు – తరుగుతున్న రూపాయి !

07 Thursday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

crude oil price, Fuel Price in India, Rupee depreciation

ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి రోజూ వినియోగదారుల మీద భారం పెరుగుతోందని ఇంకోసారి చెప్పనవసరం లేదు. బుధవారం నాడు పీపాధర బ్రెంట్‌ రకం 82-83 డాలర్ల మధ్య కదలాడింది. గురువారం నాడు 80.7 డాలర్లతో ప్రారంభమై 81.36 మధ్య ఉంది. మనం దిగుమతి చేసుకొనే రకం ఒకటి-రెండు డాలర్లు తక్కువగా ఉంటుంది. తొంభై డాలర్ల వరకు పెరగవచ్చని గోల్డ్‌మన్‌ శాచస్‌ జోశ్యం చెప్పింది. ఏం జరగుతుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేని స్ధితి. జనం జేబులు కొల్లగొట్టటం ఎలా అని తప్ప భారం తగ్గింపు ఆలోచనలో కేంద్రం లేదు. రాష్ట్రాలకు అలాంటి అవకాశం పరిమితం. మిగతా వస్తువుల మాదిరే చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తెచ్చి వాటి ఆదాయాలకు హామీ ఇస్తే రాష్ట్రాలు ఆ విధానానికి ఆమోదం తెలుపుతాయి. అందుకు కేంద్రం సిద్దంగా లేదు.


అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఓపెక్‌+దేశాలు నవంబరు నెలలో రోజుకు నాలుగు లక్షల పీపాల కంటే ఉత్పత్తిని ఎక్కువ పెంచేందుకు తిరస్కరించటం ఒక ప్రధాన కారణం.ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50శాతంపైగా పెరిగాయి. కరోనా కారణంగా కుదేలైన రంగాలు తిరిగి కోలుకుంటే చమురు గిరాకీ పెరుగుతుంది. అప్పుడు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వంద డాలర్లకు చేరే అవకాశం గురించి జోశ్యాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగితే వచ్చే ఏడాది 180డాలర్లను అధిగమించవచ్చని కూడా చెబుతున్నారు. కరోనాకు ముందు ఉన్న ఉత్పత్తి స్ధాయికి చేరుకొనే వరకు నెలకు నాలుగు లక్షల పీపాలకు మించి పెంచేది లేదని ఒపెక్‌+దేశాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే వంద రూపాయలు దాటిన పెట్రోలు ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలియదు.


ఐరోపాతో సహా అనేక దేశాలలో సహజవాయు ధరలు విపరీతంగా పెరిగాయి.బొగ్గు కూడా మండుతోంది. ఈ నేపధ్యంలో అనేక విద్యుత్‌ కంపెనీలు గ్యాస్‌కు బదులు చమురుతో విద్యుత్‌ ఉత్పత్తి చౌక అని ఆలోచించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది. అమెరికాలో ఇడా హరికేన్‌ కారణంగా మూడు కోట్ల పీపాల చమురు ఉత్పత్తి పడిపోయింది.ఇది కూడా ఒక తక్షణ కారణం. ఉత్పత్తి కంటే కంపెనీల వాటాదారుల లాభాలు ముఖ్యం అనుకుంటున్న అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలు ఉత్పత్తిని పరిమితం చేశాయి. ధరలు పెరిగినా ఫరవాలేదు, ఉత్పత్తి పెంచాలనే డిమాండ్‌ అమెరికా వైపు నుంచి వచ్చింది. దాన్ని ఉత్పత్తి దేశాలు ఖాతరు చేయలేదు. రోజుకు ఎనిమిది లక్షల పీపాల ఉత్పత్తి పెంచుతారు అన్న అనధికారిక వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.
రానున్న శీతాకాలంలో అనేక దేశాలు గడ్డు పరిస్ధితిని ఎదుర్కోనున్నట్లు చెబుతున్నారు.పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలను సాగిస్తున్న చైనా తన అవసరాల కోసం ఎక్కడెక్కడి చమురు, గ్యాస్‌, బొగ్గును కొనుగోలు చేస్తోంది. ఐరోపా ఇబ్బందులు పడుతోంది. ధర ఎక్కువైనా స్ధానిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో ఇబ్బంది లేదు. ఐరోపా గ్యాస్‌ నిల్వలు పదేండ్ల కనిష్టానికి తగ్గాయయి.

రష్యా గ్యాస్‌ సరఫరా చేయగలిగినప్పటికీ ఐరోపా దేశాలతో ఉన్న విబేధాల కారణంగా ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి ప్రభావితం అవుతాయి. సాధారణ వినియోగదారులు, పరిశ్రమలు, కార్మికుల నుంచి రాజకీయ నాయకత్వాలకు సమస్యలు ఎదురవుతాయి. నిరసనలకు దారి తీసి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినా ఆశ్చర్యం లేదు. ఇంధన సరఫరా ముప్పు గురించి ప్రతి వారూ చర్చిస్తున్నారు గానీ పరిష్కారాలు కనిపించటం లేదు. ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పన్నులు తగ్గించటం తప్ప మరొక మార్గం లేదు. సహజవాయు ధరలపై నియంత్రణ ఎత్తివేయటంతో ఏ రోజు కారోజు ధరల విధానంవైపు మార్కెట్‌ను నెట్టారు. మరోవైపు రష్యా నుంచి ఐరోపా దేశాలకు సహజవాయు సరఫరా చేసే గొట్టపు మార్గంపై రాజకీయ కారణాలతో అమెరికా విధించిన ఆంక్షలను ఐరోపా వ్యతిరేకిస్తోంది. దీనివలన ఎక్కువగా నష్టపోయేది ఐరోపా దేశాలే. తాము వాయు సరఫరాను పెంచుతామని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించటం వెనుక అమెరికా పలుకుబడిని దెబ్బతీసే ఎత్తుగడ ఉంది.దీని వలన పదిశాతం ధరలు కూడా తగ్గాయి. గొట్టపు మార్గం పని చేసేందుకు అనుమతించేందుకు జర్మనీ సిద్దంగా ఉంది.


ఐరోపాలో ఒక మెగావాట్‌ అవర్‌ విద్యుత్‌(ఐరోపాలో 330 ఇండ్లలో ఒక గంటపాటు వినియోగించేదానికి సమానంగా పరిగణిస్తారు) ధర రికార్డును బద్దలు కొట్టి 106 యూరోలను తాకింది. ఇది పీపా చమురు ధర 205 డాలర్లకు సమానం. రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రం కానుందని భావిస్తున్నారు. ఆసియా, ఇతర కొనుగోలుదారులకు సౌదీ అరేబియా పీపాకు చమురు ధరలో 0.42 డాలర్లు తగ్గించటంతో చమురు ధరలు గురువారం నాడు స్వల్పంగా తగ్గాయి. రానున్న చలికాలంలో ఇంధన సరఫరాలు తగ్గకుండా చూడాలని చైనా ప్రభుత్వం ఆదేశించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది.


మన దేశంలో చమురు ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాలతో పాటు నరేంద్రమోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఎగుమతులను పెంచేందుకు మన రూపాయి విలువను పతనం కావించటం ఒకటి. అక్టోబరు ఆరవ తేదీన రూపాయి డాలరుకు 75కు పతనమైంది. సెప్టెంబరు 28న 74 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర స్ధిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే వినియోగదారుల నుంచి ఆ మేరకు వసూలు చేస్తారు. ఇప్పుడు చమురు ధర పెరుగుదల, రూపాయి పతనం రెండూ జరుగుతున్నాయి. దీన్నే గోడదెబ్బ-చెంపదెబ్బ అంటారు. దేశీయంగా జరుగుతున్న చమురు ఉత్పత్తిని పెంచకపోగా గత స్ధాయిని కొనసాగించటంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ విఫలమైంది. ఇథనాల్‌ ఉత్పత్తి చేసి ఆమేరకు భారం తగ్గిస్తామని చెప్పిన మాటలు కూడా అమలు కాలేదు. ప్రస్తుతం మన దేశం 80శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతున్నది.


గతంలో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి కొనుగోలు చేసిన చమురు విలువలో సగం మొత్తాన్ని రూపాయిలలో చెల్లిస్తే సరిపోయేది. మన దేశం నుంచి ఇరాన్‌కు ఎగుమతులు చేసిన వారికి మన ప్రభుత్వం సర్దుబాటు చేసేది. మన అవసరాల్లో పదిశాతం అక్కడి నుంచే దిగుమతి చేసుకొనే వారం. ఇరాన్‌ దగ్గర చమురు కొన్న దేశాల మీద ఆంక్షలు విధిస్తామన్న అమెరికా బెదిరింపులతో మన సర్కార్‌ భయపడిపోయి అక్కడి నుంచి పూర్తిగా కొనుగోళ్లను ఆపివేసింది. అందువలన ఆ మేరకు డాలర్లు చెల్లించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దీంతో ఇరాన్‌ మన దేశం నుంచి దిగుమతులను కూడా పరిమితం చేసింది. 2018-19లో రెండు దేశాల వాణజ్య విలువ 17బిలియన్‌ డాలర్లు ఉండేది. మరుసటి ఏడాదికి అది 4.77 బి.డాలర్లకు పడిపోయింది. మన ఎగుమతులు 2019తో పోల్చితే 42శాతం తగ్గి 2020లో 2.2బి.డాలర్లకు, 2021లో మరింతగా పడిపోయాయి.

మరోవైపున ఇరాన్‌-చైనా బంధం మరింత గట్టిపడింది.రాయితీలతో కూడిన చమురు నిరంతరాయంగా ఇరాన్‌ సరఫరా చేస్తే చైనా 400 బిలియన్‌ డాలర్ల మేరకు వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెట్టనుంది. అమెరికా బెదిరింపుల కారణంగా మనం ఇరాన్‌తో స్నేహాన్ని ప్రశ్నార్దకం చేసుకోవటంతో పాటు వాణిజ్య అవకాశాలను కూడా కోల్పోయాము. వినియోగదారుల మీద భారం మోపుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఇరాన్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అది మన అర్ధిక వ్యవస్ధ మీద తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెట్‌లోటు పెరిగితే సంక్షేమ చర్యలకు కోత పెడతారు.పరిమితంగా ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తివేస్తారు. చమురు, గాస్‌ ధరలు పెరిగితే ఎరువుల ధరలు కూడా పెరిగి రైతాంగం మీద భారాలు పెరుగుతాయి. ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు తిరస్కరిస్తూ రాజధాని చుట్టూ ఇనుప మేకులు పాతి పది నెలలుగా రైతులను రాజధానిలోకి రాకుండా అడ్డుకుంటున్న సర్కార్‌ చమురు భారాలకు వ్యతిరేకంగా జనం ఉద్యమిస్తే ఏం చేయనుందో చూడాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు, ఆహార కొరత బ్రిటన్‌ స్వయం కృతం !

06 Wednesday Oct 2021

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Opinion, Prices, UK

≈ Leave a comment

Tags

Boris Johnson, brexit, Britain's fuel and food shortages, British economy, UK Labor shortages


ఎం కోటేశ్వరరావు

వేలాది పందులను వధిస్తున్నారా ! ఇలాంటివి మామూలే కదా ! పెంపుడు జంతువులు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది. ఇరుగు పొరుగు దేశాల్లో లేని చమురు, వస్తు కొరత బ్రిటన్‌లోనే ఎందుకు తలెత్తింది ? అది గిరాకీని బట్టి ఉంటుంది.డైనోసార్‌ లేస్తోంది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు విలేకర్ల నుంచి ఎదురైన ప్రశ్నలు, ఆ పెద్ద మనిషి స్పందించిన తీరు ఇది. చైనాలో తలెత్తిన విద్యుత్‌ కొరత, ఎవర్‌గ్రాండే అనే రియెలెస్టేట్‌ కంపెనీ చెల్లింపుల సమస్య కారణంగా కొన్ని రేటింగ్‌ సంస్ధలు చైనా ఆర్ధిక రంగం గురించి తమ రేటింగ్స్‌ను సవరించాయి. దాంతో ఇంకేముంది చైనాలో సంక్షోభం తలెత్తిందని కొందరు తెగ సంతోషపడిపోతున్నారు. ఒక వేళ అదే జరిగినా చైనాతో పాటు ప్రపంచం కూడా నష్టపోతుందనే సృహ వారిలో ఉన్నట్లు కనపడదు. అలాంటి దుష్ట ఆలోచనలు పెట్టుకున్నవారు ఆశాభంగం చెందకతప్పదు. ఇదే సమయంలో ఐరోపా ధనిక దేశాల్లో ఒకటైన బ్రిటన్‌లో చమురు సరఫరాకు అవసరమైన వాహనాలను నడిపే డ్రైవర్లు లేక అక్కడ తీవ్ర సమస్య తలెత్తింది. దీని గురించి రేటింగ్‌ సంస్ధలు స్పందించలేదు.ఎనిమిది సంవత్సరాల నాటి గరిష్ట రికార్డును చమురు ధరలు అధికమించాయి. పెరిగిన చమురు ధరలతో పాటు సిబ్బంది వేతనాల పెంపుదలను కూడా వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నారు. బ్రెంట్‌ రకం చమురు ధర 82-83 డాలర్ల మధ్య కదలాడుతోంది. ద్రవ్యోల్బణ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022లో అది 180 డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు వెల్లడయ్యాయి. చమురు టాంకర్లను నడిపేందుకు మిలిటరీ రంగంలోకి దిగింది. విదేశాల నుంచి పదివేల మంది డ్రైవర్లకు వీసాలు ఇస్తామని ప్రకటిస్తే మంగళవారం నాటికి కేవలం 127 మంది మాత్రమే ముందుకు వచ్చారని వార్తలు. తన ప్రభుత్వ విధానాలను బ్రిటన్‌ ప్రధాని పూర్తిగా సమర్ధించుకున్నారు. అసలు జరుగుతోందేమిటి ?


బ్రిటన్‌లో చమురు, గ్యాస్‌ పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని బంకుల్లోకి చేర్చేందుకు అవసరమైన టాంకర్లను నడిపే డ్రైవర్ల కొరత కారణంగా సరఫరాలో తీవ్ర సమస్య తలెత్తింది. దీంతో డ్రైవర్లు ఉన్నా చమురు లేక ఆసుపత్రులు, ఆహార, వస్తు దుకాణాల వంటి రవాణా సంబంధిత రంగాలన్నీ ప్రభావితం అయ్యాయి. అనేక దుకాణాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇది తాత్కాలిక సమస్యగానే భావిస్తున్నప్పటికీ అనేక మంది నమ్మటం లేదు. ఎంతకాలం ఉంటుందో తెలియని స్ధితి. దేశ ప్రధానే నిర్దిష్టంగా చెప్పలేకపోయాడు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణం అని అందరూ వేలెత్తి చూపుతున్నారు. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోయేందుకు(బ్రెగ్జిట్‌) నిర్ణయించుకున్న సమయంలో పర్యవసానాల మంచి చెడ్డలను పాలకులు బేరీజు వేయలేదనే అభిప్రాయం వెల్లడి అవుతోంది.
అమెరికా, జపాన్‌ ఆర్ధిక పోటీ నుంచి తట్టుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపా యూనియన్‌ రంగంలోకి వచ్చింది. దాని నిబంధనల ప్రకారం సభ్య దేశాలకు చెందిన పౌరులు ఎలాంటి అనుమతులు, అంగీకారాలు లేకుండా ఏ సభ్య దేశంలో అయినా పని చేసేందుకు, నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు వీలు కలిగింది. ఇది ధనిక దేశాల్లోని వాణిజ్య, పారిశ్రామిక సంస్దలకు చౌకగా శ్రమశక్తిని అందించే వ్యవస్ధగానూ, పేద దేశాలకు నిరుద్యోగ సమస్య తీరేందుకు, ఆదాయవనరుగా ఉపయోగ పడింది. 2020 జనవరి 31 నుంచి బ్రిటన్‌ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోయింది. దీంతో అక్కడి సంస్ధలకు అవసరమైన చౌకగా లభించే శ్రామికుల కొరత ప్రారంభమైంది. ఇప్పుడు వేతనాలు పెంచినా శ్రమజీవులు దొరకటం లేదు.


వర్తమాన స్ధితి గురించి మీడియాలో 1978-79 నాటి ఆర్ధిక దిగజారుడు, కార్మిక ఆందోళనల మాదిరి తయారు కావచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. స్టాగ్‌ఫ్లేషన్‌ (ఆర్ధిక వృద్ధి నిలిచిపోవటం-ధరల పెరుగుదల వలన ద్రవ్యోల్బణ పెరుగుదల)కు గురికావచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడి చమురు బంకులు, అనేక దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్రిటన్‌లో తమకంటే మెరుగైన వేతనాల కారణంగా గతంలో అనేక పేద దేశాల కార్మికులు వలసలు వచ్చారు. వలస విధానంలో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి కూడా వలసలను అనుమతించారు. పది సంవత్సరాల వ్యవధిలో నాలుగుశాతం వలస కార్మికులు పెరిగారు. దీంతో స్ధానికులకు అవకాశాలు తగ్గి అసంతృప్తి తలెత్తింది. తమ దుస్ధితికి ఐరోపాయూనియన్‌లో ఉండటమే కారణమని భావించి దానికి వ్యతిరేకత తెలిపారు. తమ పలుకుబడితో ఇతర దేశాలతో ప్రత్యక్ష ఒప్పందాలు చేసుకోవటం లాభదాయకంగా ఉంటుందని కార్పొరేట్‌లు కూడా విడిపోవటానికి మద్దతు ఇచ్చాయి. స్ధానికుల అసంతృప్తిని తగ్గించేందుకు ఇతర దేశాల నుంచి నైపుణ్యం తక్కువగా ఉండే కార్మికులను అనుమతించకూడదని బ్రిటన్‌ నిర్ణయించింది. అదే ఇప్పుడు వ్యవసాయం, కోళ్ల, పశుపెంపకం వంటి రంగాలలో పని చేసే కార్మికులు, డ్రైవర్ల కొరతకు దారి తీసింది. ఇతర ఉద్యోగాలతో పోల్చితే డ్రైవర్లకు ఇచ్చే వేతనాలు తక్కువ, పనిభారం ఎక్కువ, తగినంత గౌరవం కూడా లేకపోవటంతో స్ధానికులు వాటి పట్ల మొగ్గుచూపటం లేదు. బయటివారికి అవకాశం లేదు.

ఈ ఏడాది జూన్‌-ఆగస్టు మాసాల మధ్య పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జాతీయ గణాంక సంస్ధ వెల్లడించింది. సంస్ధ వివరాల ప్రకారం గతేడాది మార్చి నెలాఖరుకు ఉన్న సంఖ్యతో పోల్చితే భారీ వాహనాలను నడిపే ఐరోపా యూనియన్‌ డ్రైవర్ల సంఖ్య పదహారువేలు తక్కువగా ఉంది. బ్రిటన్‌ రవాణా అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం మొత్తం లక్ష మంది కార్మికుల కొరత ఉంటే వారిలో ఇరవైవేల మంది విదేశీయులని వెల్లడించారు. డ్రైవర్లు లేక కొన్ని వస్తువుల కొరత ఏర్పడి రెస్టారెంట్‌లు, పబ్‌లు, సూపర్‌మార్కెట్లను అనేక చోట్ల మూసివేశారు.కొన్ని చోట్ల సిబ్బంది కారత కూడా తోడైంది. కరోనా సమయంలో స్వదేశాలకు వెళ్లిన కార్మికులు కొందరు తిరిగి రాకపోవటం కూడా పరిస్ధితిని దిగజార్చింది. కరోనా కారణంగా ప్రభుత్వం వారానికి 20 పౌండ్లు (రు.2020) ఇవ్వటం కూడా కార్మికుల కొరతకు దారి తీసిందని కొందరు చెబుతున్నారు. పదిన్నరవేల మంది ట్రక్కు డ్రైవర్లు, ఐదువేల మంది కోళ్ల పరిశ్రమలో పనిచేసే విదేశీ కార్మికులకు తాత్కాలిక వీసాలు ఇవ్వాలని బ్రిటన్‌ సర్కార్‌ నిర్ణయించింది. కార్మికుల కొరత కారణంగా కొన్ని చోట్ల పంటలను పొలాల్లోనే వదలి వేస్తున్నారని, ఆహార పంటలు పనికి రాకుండాపోతున్నాయని వార్తలు వచ్చాయి. క్రిస్మస్‌ సందర్భంగా పెరిగే గిరాకీ కోసం టర్కీ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు, ఈ సారి వాటి కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా అమెరికన్లు టాయిలెట్‌ పేపర్లను విరగబడి కొనుగోలు చేసి నిలవచేసుకున్నట్లుగా ు్లగా ప్రస్తుతం బ్రిటన్‌లో సరఫరా కొరత కారణంగా చమురుతో పాటు మద్యం, నిల్వచేసుకొనే మాంసం, పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులను కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వచేసుకోవటంతో దుకాణాలు ఖాళీ అయ్యాయి. ధరలు కూడా పెరిగాయి. డిసెంబరు నాటికి మెరుగుపడకపోతే పరిస్ధితి మరింత దిగజారుతుందని భావిస్తున్నారు.

తాము కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన భుజాలను తానే తట్టుకున్నాడు. ప్రస్తుత పరిస్ధితికి బ్రెగ్జిట్‌ కారణమని కొందరు భాష్యం చెబుతున్నారు. అది పూర్తిగా వాస్తవం గాకపోయినా ప్రస్తుత సమస్య తీవ్రతరం అయ్యేందుకు బ్రెగ్జిట్‌ దోహదం చేసిందని మరికొందరు సూత్రీకరణ చేస్తున్నారు. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీ ఎంచుకున్న ఆర్ధిక నమూనాయే దీనికి మూలం అని చెప్పవచ్చు. ఆకస్మికంగా ఎదురయ్యే షాక్‌లను తట్టుకొనేందుకు దేశ ఆర్ధిక వ్యవస్ధ తగినదిగా లేదు. 2008లో తలెత్తిన సంక్షోభ సమయంలో బ్యాంకుల బలహీనతలు వెల్లడయ్యాయి. ఆసమయంలో కార్పొరేట్‌ సంస్ధలు తగిన నిధులు కలిగి ఉండటంతో నష్టాలను పూడ్చుకున్నాయని, ఇప్పుడు కంపెనీల వద్ద తగినన్ని నిధులు లేకపోవటం వలన ఉత్పాదక గొలుసు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నదని చెబుతున్నారు. ప్రతి దేశం ఇలాంటి సమస్యలతో ఉన్నప్పటికీ బ్రిటన్‌ ఎక్కువగా ప్రభావితమైందని తాజా పరిస్ధితి వెల్లడించింది. గత ఐదు సంవత్సరాలుగా భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు బ్రిటన్‌ వదలి వెళుతున్నారనే సూచనలు వెలువడినప్పటికీ కాగల కార్యం గంధర్వులు తీరుస్తారులెమ్మనట్లు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వేందుకు పూనుకున్నట్లు ఇప్పుడు అనేక సంస్థలు వేతనాలు పెంచుతూ కార్మికులను ఆకర్షించేందుకు పూనుకున్నాయి, ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందస్తు ప్రణాళిక, ఏర్పాట్లకు, వాటి నిర్వహణకు పెట్టుబడులు అవసరం గనుక వాటి జోలికి పోకుండా ఇప్పటికి గడిస్తే చాలన్నట్లుగా గత కొంత కాలంగా వ్యయహరిస్తున్నారు. చలికాలం వస్తే గ్యాస్‌ వినియోగం పెరుగుతుంది.ప్రస్తుతం గత దశాబ్దికాలంలో కనిష్ట స్ధాయిలో నిల్వలున్నాయి. దేశ నిల్వసామర్ధ్యంలో 70శాతం కలిగిన రఫ్‌ అనే కేంద్రాన్ని 2017లో మూసివేశారు. నిల్వకేంద్రాల నిర్వహణకు అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తున్న కారణంగా ప్రయివేటు వారు కూడా ముందుకు రావటం లేదు. నాలుగు లేదా ఐదు రోజుల చలికాలానికి అవసరమైన నిల్వలు మాత్రమే బ్రిటన్‌లో ఉన్నాయి.


దేశంలో 8,300 చమురు బంకులు ఉంటే వాటిలో ఐదువేల వరకు మూతబడ్డాయి.పందుల వధశాలల్లో కార్మికుల కొరత కారణంగా రైతులు ఇటీవలి కాలంలో లక్షా 20వేల జీవాలను వధించి పారవేసినట్లు జాతీయ పందుల పెంపకదారుల అసోసియేషన్‌ ప్రకటించింది. విదేశీ వలస కార్మికులతో తక్కువ వేతనాలతో పని చేయించుకొనే పద్దతి నుంచి ఎక్కువ వేతనాలతో నిపుణులైన స్ధానిక కార్మికులతో పని చేయించుకొనే పద్దతికి మారుతున్నట్లు చెప్పుకుంటున్నా అంత తేలిక కాదని అనేక మంది చెబుతున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు చిల్లర దుకాణాల సిబ్బంది వేతనాలు 44శాతం పెరిగాయి, అయినా సిబ్బంది కొరత వెంటాడుతూనే ఉంది. వేతనాలు పెరుగుతున్నందున అంతర్జాతీయ మార్కెట్లో పోటీ, ఎగుమతుల సమస్య కూడా తలెత్తనుంది.

చమురు సంక్షోభం, పందుల వధ వంటి పరిణామాలు బ్రెక్సిట్‌ అనంతర సంధి దశలో తప్పదని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. పందుల వంటి పెంపుడు జంతు వధ మామూలు విషయమే అన్నారు వలసలు, తక్కువ వేతనాలతో కూడిన విఫలమైన పాత విధానానికి వెళ్లే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. కన్సర్వేటివ్‌ పార్టీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. క్రిస్మస్‌ వరకు సరఫరాలోఅంతరాయం ఉంటుందన్నారు. పన్నులను మరింతగా పెంచే అంశాన్ని కూడా తోసిపుచ్చలేదు. సరఫరా వ్యవస్ధలో తలెత్తిన సమస్యల గురించి మాట్లాడుతూ ఏమౌతుంది ? కొద్ది దశాబ్దాల క్రితం రైతులు గ్రామీణ దుకాణాల్లో పాలు అమ్ముకొనేవారు, సూపర్‌మార్కెట్లనే వాణిజ్య భక్షకుల కారణంగా ఆ పరిస్ధితి పోయింది, తిరిగి అది వస్తే సంతోషిస్తా అన్నాడు.చమురు, వస్తువుల కొరత దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందన్నాడు. ఇలాంటి సమస్యలను మిగతా ఐరోపా దేశాలు ఎదుర్కోవటం లేదు ఎందుకంటే గిరాకీని బట్టి ప్రత్యేక సమస్య తలెత్తుతుందని సమర్ధించుకున్నాడు. తమ సర్కార్‌ విధిస్తున్న పన్నులు మార్గరెట్‌ థాచర్‌కంటే తక్కువ హరోల్డ్‌ విల్సన్‌ కంటే ఎక్కువ అన్నాడు.” అయినా మీరు మాట్లాడుతున్నదంతా చెత్త, ఎందుకంటే ఆ ప్రముఖులిద్దరూ మా మాదిరి మహమ్మారిని ఎదుర్కోలేదు. మా మాదిరి ద్రవ్య పరమైన ఉల్కాపాతాలకు గురి కాలేదు ” అన్నాడు.బ్రిటన్లో తలెత్తిన కొరతలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. క్రిస్మస్‌ నాటికి పరిస్ధితి ఒక కొలిక్కి రానట్లయితే కొత్త పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసే అవకాశం ఉంది. ఇది బ్రిటన్‌ స్వయం కృతం అన్నది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాణిజ్య సూచికలను చైనా మార్చిందా-భారత్‌కు మహర్దశ పట్టనుందా !

23 Thursday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

ease of doing business, ease of doing business ranks, World Bank

ఎం కోటేశ్వరరావు


దారుణం, ఘోరం, అన్యాయం, అక్రమం,నీతులు చెప్పే కమ్యూనిస్టు చైనా ఇంతకు తెగిస్తుందా ? ఇప్పటికైనా నిజం బయటపడింది. ఇక మన దేశానికి మంచి రోజులు వస్తాయి, పెట్టుబడులే పెట్టుబడులు అంటూ కొంత మంది నమ్మించ చూస్తున్నారు. నిజంగా పెట్టుబడులు రావటానికి ప్రపంచబ్యాంకు రాంకులు అవసరమా ? మంచి ర్యాంకులున్న దేశాల నుంచి పెట్టుబడులు ఎందుకు తరలిపోతున్నాయి ? అవి లేక ముందు పెట్టుబడులు రాలేదా, వాణిజ్యం జరగలేదా ? అసలు సమస్య ఏమిటి ?


సులభతర వాణిజ్యం చేసుకొనే అవకాశం, తద్వారా లాభాలు పిండుకొనే అవకాశం ఎక్కడ, ఎలా ఉందో సూచించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా ఒక సూచికను ప్రకటిస్తున్నది. 2018లో చైనా ర్యాంకు 78, పందొమ్మిదిలో 46, ఇరవైలో 31. ఒక్కసారిగా ఇలా ఎలా పెరిగిపోతుంది. అంతా చేతివాటం అన్నది ప్రచారం. దాని మీద తనిఖీ చేయించినట్లు చెప్పిన ప్రపంచ బ్యాంకు ఆ సూచికల ప్రకటనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.తమ మీద వేసిన నింద మీద పూర్తి స్ధాయిలో దర్యాప్తు జరపాలని చైనా డిమాండ్‌ చేసింది. బ్యాంకు నివేదిక విశ్వసనీయతతో పాటు దాని సభ్యదేశాల గౌరవాన్ని కూడా కాపాడాలని కోరింది. గతంలో ప్రపంచబ్యాంకులో పని చేసి ప్రస్తుతం ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టాలినా జియోర్‌గివే దర్యాప్తు నివేదికలో పేర్కొన్న భాష్యాలతో, తన పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా విబేధిస్తున్నట్లు ప్రకటించారు.


కాసేపు కొంత మందిని సంతుష్టీకరించేందుకు చైనా అక్రమాలకు పాల్పడింది, లబ్ది పొందిందే అనుకుందాం ! మన దేశానికి, ప్రపంచానికి జరిగిన నష్టం ఏమిటి ? వెంటనే వచ్చే సమాధానం, మన దేశానికి వచ్చే పెట్టుబడులను చైనా తన్నుకు పోయింది. ప్రపంచ బ్యాంకు ఏర్పడనపుడు, అది ప్రకటించే సులభతర వాణిజ్య సూచికలు లేనపుడు వాణిజ్యం జరగలేదా ? ప్రచారదాడికి గురై మాట్లాడటం తప్ప సూచికలను బట్టి ఎవరైనా వాణిజ్యం చేసే అమాయకులుంటారా ! 2006లో మనదేశ స్ధానం 116 అయినా పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు రాలేదు. అది 2016నాటికి 142వ స్ధానానికి దిగజారింది. సదరు సూచిక 2020 నాటికి 63కు పెరిగింది. ఈ కాలంలో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి కావాలి, వృద్ధి రేటు తారాజువ్వలా లేవాలి, జిడిపి పరుగులు తీయాలి. అదేమి మహత్యమో మరొకటో ఎనిమిదిశాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగుశాతానికి పతనమైంది. సూచికలు ఎందుకు నిలబెట్టలేకపోయాయి ?భారత రాంకు తక్కువగా ఉన్న 2010 జడిపిలో పెట్టుబడులు 40శాతం ఉంటే గణనీయంగా మెరుగుపడిన తరువాత 2019లో 30శాతానికి పడిపోయాయి.


కమ్యూనిస్టు దేశాలు తప్పుడు పనులకు పాల్పడవచ్చా అన్నది ఒక ప్రశ్న. ఎవరూ పాల్పడకూడదు. కొందరి లెక్క ప్రకారం కమ్యూనిస్టు దేశాలు నిజాయితీగా ఉండాలి, మిగతా దేశాలు మోసాలకు పాల్పడవచ్చు తప్పులేదు అన్నట్లుగా ఉంది. ఒక వేళ చైనా, మరొక దేశం తప్పు చేసిందే అనుకుందాం. ఆ జాబితా నుంచి వాటిని తొలగించి మిగతా దేశాలకు రాంకులు కొనసాగించవచ్చు కదా ? చైనాను సాకుగా చూసి అసలు రాంకులు ఇవ్వటాన్నే తాత్కాలికంగా అయినా ప్రపంచ బ్యాంకు ఎందుకు నిలిపివేసినట్లు ? దాని నిజాయితీ ప్రశ్నార్ధకం కాదా ? అసలు ఈ సూచికలను ఎందుకు ముందుకు తెచ్చారు ? స్వేచ్చా వాణిజ్యం జరిగేందుకు, సభ్య దేశాలు పన్నులను తగ్గించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)ను ఏర్పాటు చేశారు. చిత్రం ఏమిటంటే అది ఏర్పడిన నాటి నుంచి దానితో నిమిత్తం లేకుండా అనేక దేశాలు, కూటములు ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం ప్రారంభించాయి. 1996లో ప్రపంచ వాణిజ్య సంస్ధను ఉనికిలోకి తెచ్చారు.2001లో దోహా దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ఎటూ తేలలేదు. అసలు ఒక అంగీకారానికి వస్తారో రారో తెలియదు. ప్రపంచ బ్యాంకు ఇది గమనించే కావచ్చు 2006 నుంచి రాంకింగులను ప్రారంభించింది. రాజు గారి గంగాళంలో నేనొక్కడిని నీళ్లు పోస్తే ఎవరికీ అనుమానం రాదులే అని ప్రతి వారూ పాలకు బదులు నీళ్లు పోసినట్లుగా ఎవరికి వారు స్వేచ్చా వాణిజ్య కబుర్లు చెబుతూనే రక్షణ చర్యలు ప్రారంభించారు. దాంతో దేశాల మధ్య పోటీ పెట్టి వాణిజ్యవేత్తలకు లబ్ది చేకూర్చేందుకు ప్రపంచబ్యాంకు వేసిన ఎత్తు ఇది. దీని లక్ష్యం ఎలాంటి నియంత్రణలు లేకుండా లేదా నామమాత్రంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పరిస్ధితిని కల్పించటమే. ఈ సూచికలు సామాజిక ప్రగతిని పట్టించుకోవని, అసమమానతలను పెంచుతాయని కొందరు పరిశోధకులు వెల్లడించారు. ఈ అవాంఛనీయ ర్యాంకుల పద్దతిని మన దేశంలో రాష్ట్రాల మధ్యకూడా ప్రవేశపెట్టటంతో అక్రమాలకు తెరలేచిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతకీ చైనా చేసినట్లు చెబుతున్న అక్రమం ఏమిటి ?


ప్రపంచ బ్యాంకు ఇస్తున్న ర్యాంకుల మీద ఫిర్యాదులు మామూలే. అనేక సార్లు ర్యాంకులకు అవసరమైన మార్కులను ఇచ్చే పద్దతులు, ప్రశ్నలను మార్చారు. వాటిని ఉపయోగించుకొని ప్రతి దేశం ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకే ఇచ్చిన ర్యాంకుల మీద అంతర్గత తనిఖీ నిర్వహిస్తారు. 2018 సెప్టెంబరు 12న ఆ ఏడాది నివేదిక గురించి చైనా అధికారులతో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ చర్చించాడట.తరువాత రెండు రోజులకు బ్యాంకు సిఇఓ క్రిస్టాలినా జియోర్‌గియేవా చైనా అధికారులతో చర్చించిన తరువాత ర్యాంకులు మారిపోయాయని అమెరికా కంపెనీ చెబుతోంది. ఏ దేశ అధికారులైనా బ్యాంకు ఉన్నతాధికారులను కలిస్తే అక్రమాలకు పాల్పడినట్లేనా ? ఇదెక్కడి తర్కం ! బ్యాంకు ఉన్నతాధికారి సూచన మేరకు 2020 నివేదికలో జోర్డాన్‌ రాంకును తగ్గించి సౌదీ అరేబియా ర్యాంకును పెంచారట. దీని వెనుక ఎవరున్నారు ?


చైనా అక్రమాలకు పాల్పడిందంటున్నారు గనుక ఇప్పుడు పెట్టుబడులు మన దేశం వైపు మరలుతాయని కొందరు చెబుతున్నారు. సంతోషించాల్సిందే. అదే అయితే మన కంటే ముందున్న వాటిలో చైనాను మినహాయిస్తే ఇంకా అరవై ఒక్క దేశాలుంటాయి వాటన్నింటినీ దాటిన తరువాతే కదా ఎవరైనా మనవైపు చూసేది, కనుక ఆ మాటలను ఎంతవరకు నమ్మాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. గతేడాది ప్రధాని నరేంద్రమోడీ గారే స్వయంగా ముఖ్యమంత్రుల సమావేశంలో చైనా నుంచి కంపెనీలు వచ్చేస్తున్నాయి, ఎర్ర తివాచీలు పరిచేందుకు సిద్దంగా ఉండండి అని చెప్పారు. ఇంతవరకు ఎన్ని వచ్చాయో, దారి మధ్యలో ఎక్కడ ఆగాయో చెప్పినవారు లేరు. ఇప్పుడు రాంకులు మారిపోయాయి గనుక పెట్టుబడులే పెట్టుబడులు, బహుళజాతి కంపెనీలు చైనా బదులు భారత్‌కు రావాలని చూస్తున్నట్లు కొందరు కొత్త గానాలాపన మొదలు పెట్టారు. చైనా ర్యాంకును పక్కన పెట్టండి, మన ర్యాంకు 142 నుంచి 63కు పెరిగిన కాలంలో చెప్పిన విధంగా పెట్టుబడులు వచ్చాయనేందుకు ఆధారాలు లేవు. వచ్చి ఉంటే కరోనాకు ముందే వృద్ది రేటు, జిడిపి దిగజారేది కాదు కదా !


2018,2020 సూచికల మీద అలాంటి తనిఖీని అమెరికాకు చెందిన విల్మర్‌హేల్‌ అనేక కంపెనీకి అప్పగించారు. వారు తయారు చేసిన నివేదిక ప్రకారం అక్రమాలు జరిగాయని ప్రకటించారు. నాటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యోంగ్‌ కిమ్‌, సిఇఓ క్రిస్టాలినా జియోర్‌గియేవా జోక్యం చేసుకొని చైనా ర్యాంకు పెంచాలని సిబ్బంది మీద వత్తిడి చేశారట.2018లో అలా చేసినందున చైనా ర్యాంకు 85బదులు 78గా ఉందట. వాణిజ్యం ప్రారంభించటం, రుణాలు పొందటం, పన్నుల చెల్లింపు వంటి అంశాల్లో చైనాకు 65.3 పాయింట్లు వచ్చినట్లుగా లెక్కించగా రాంకు 78 వచ్చింది. అమెరికా కంపెనీ తనిఖీలో పాయింట్లు 64.5కు తగ్గాయట. దాని ప్రకారం అయితే 85 వస్తుందట. పాయింట్ల తేడా 0.8, ఈ మాత్రం దాని కోసం ప్రపంచ బ్యాంకు అధిపతులు జోక్యం చేసుకున్నట్లు తేల్చారు. ఏడు రాంకులు పెరిగితే ఏమిటి తగ్గితే ఏమిటి ? తనిఖీ చేసిన అమెరికా కంపెనీ పెద్దలు లెక్కించిన పద్దతి తప్పు కావచ్చు, చైనా వ్యతిరేకతతో అలాంటి నివేదిక ఇచ్చి ఉండవచ్చుగా !


దేశాల మధ్య అనారోగ్యకర పోటీని, అవాంఛనీయ చర్యలను ప్రోత్సహించే రాంకుల మతలబు గురించి విమర్శలు, ఆరోపణలు గతంలోనే వచ్చాయి. అసలా రాంకుల పద్దతి నిలిపివేయాలని అనేక మంది కోరుతున్నారు. 2020ఆగస్టు 31న ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషణలో కొన్ని అంశాలను పేర్కొన్నారు. 2015 లాటిన్‌ అమెరికాలోని చిలీ పన్నుల చెల్లింపు రాంకు 33గా ఉంది. మరుసటి ఏడాది దాని రాంకు 120కి పడిపోయింది. ఇదెలా జరిగింది? మితవాద శక్తులు అధికారంలో ఉన్నపుడు పరిస్ధితి మెరుగ్గా ఉంది, సోషలిస్టు పార్టీ అధికారంలోకి రాగానే దిగజారింది అని చిత్రించటం దీని వెనుక ఉందని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నలే రాసింది. దాన్ని ఖండించిన బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్త పాల రూమర్‌ కొద్ది వారాల తరువాత ఇంటిదారి పట్టాడు. సౌదీ అరేబియా రాంకు ఐదు సంవత్సరాల్లో 49 నుంచి 62కు దిగజారటం, అజర్‌బైజాన్‌ రాంకు 80 నుంచి 34కు పెరగటం, యుఏయి 22 నుంచి 16కు పెరగటం, చైనా 90 నుంచి 31 పెరగటం వెనుక కిరికిరి జరిగిందని కూడా ఆ పత్రిక రాసింది. ఇన్ని ఉదంతాలు ఉండగా ఒక్క చైనా మీదనే ఎందుకు దాడి కేంద్రీకరించారు అన్నది ప్రశ్న !

రాంకులను తారుమారు చేయటం ఎంతో సులభమని అనేక మంది చెబుతున్నారు. మన దేశం విషయానికి వస్తే విద్యుత్‌ ధర మిగతా పోటీ దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. కొత్త విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో ప్రయివేటు సరఫరాదారులున్న ముంబై, ఢిల్లీ సమాచారాన్ని మాత్రమే ప్రపంచబ్యాంకు ప్రమాణంగా తీసుకుందని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. అంటే అర్ధం ఏమిటి కృత్రిమంగా మన దేశ ర్యాంకును పెంచేందుకు ఇలా చేశారనే కదా ! రాంకుల్లో మన స్ధానం ఎంతో మెరుగుపరుచుకున్నా వాణిజ్యం, జిడిపిలో పెరుగుదల లేకపోగా వృద్ది రేటు దిగజారిపోవటం వెనుక మతలబు ఏమిటి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. మన దేశం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ర్యాంకు దోహదం చేస్తుందనే అంచనాతో మెరుగుపరుచుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంది.నరేంద్రమోడీ హయాంలో అది మరింత వేగంగా జరిగింది.2020 నాటికి భారత్‌ 50వ స్ధానంలో ఉంటుందని 2018లోనే నరేంద్రమోడీ దవోస్‌లో ప్రకటించారు. దాని కోసం ఏకంగా ఒక కమిటీనే 2015లో ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు లేబరు నియామకానికి అనుమతి, కనీసవేతన చట్టాలకు మంగళం, ఎనిమిది గంటలకు బదులు ఏదో ఒకసాకుతో ఎన్నిగంటలైనా పని చేయించుకొనే వీలు కల్పించటం,వేతనంతో కూడిన వార్షిక సెలవుల రద్దు, ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండా కార్మికులను తొలగించే అవకాశాలను కల్పించటం వంటి చర్యలు. మన ర్యాంకు పెరిగేందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మికరంగంలో తీసుకురాదలచిన మార్పులు అమల్లోకి వస్తే ఇంకా మెరుగుపడవచ్చు. కానీ కార్మికుల పరిస్ధితి మరింత దిగజారటం ఖాయం. ఇప్పటికే ఆర్ధిక అసమానతల్లో మన దేశ తాజా రాంకు 158కి 141లో ఉన్నాం. మరి దీని సంగతి ఏమిటి ? దీన్ని మెరుగుపరచేందుకు నరేంద్రమోడీ తీసుకున్న చర్యలేమిటి ? వాణిజ్య రాంకు మెరుగుదలకు కమిటీ ఏర్పాటు చేసిన పెద్దలు ఆర్ధిక అంతరాలు తగ్గించటం గురించి ఎందుకు పట్టించుకోరు ?


చైనా ఆర్ధిక రంగంలో సాధించిన అద్భుతాలను కొంత మంది ఎన్నటికీ అంగీకరించరు. దాని వలన వారికి కలిగే లాభం లేదు, చైనాకు వచ్చే నష్టం లేదు. ఈ అభివృద్ధి వెనుక ప్రపంచబ్యాంకు రాంకులు లేవు.1948 జనవరి ఒకటిన ఉనికిలోకి వచ్చిన ”గాట్‌” (జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ టారిఫ్‌ అండ్‌ ట్రేడ్‌ – పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం)లో చైనా స్ధాపక సభ్యురాలు.అయితే 1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కాకుండా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ కేంద్రంగా నడిచిన ప్రభుత్వాన్నే గుర్తించారు.1971లో ఐరాసలో కమ్యూనిస్టు చైనాను గుర్తించినా గాట్‌లో, దాని వారసురాలిగా వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో అసలైన చైనాకు స్ధానం ఇవ్వలేదు, 2001డిసెంబరులో మాత్రమే చేర్చుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసిన 2020లో 2.3శాతం వృద్దిరేటుతో ముందుకు పోయిన ఏకైక పెద్ద ఆర్ధిక వ్యవస్ధ చైనాదే.1948లో దాని విదేశీ వాణిజ్యం 907 బిలియన్‌ డాలర్లయితే 2020లో 4.65లక్షల కోట్ల డాలర్లు. చైనా వాణిజ్యం 1978లో 26వ స్ధానంలో ఉంటే 2017నాటికి ఒకటవ స్ధానానికి చేరి, నాలుగేండ్లుగా అదే స్ధాయిలో కొనసాగుతోంది. 1986లో తలసరి ఖర్చు చేయగల ఆదాయం వెయ్యి యువాన్లయితే(ఒక యువాన్‌ పదకొండు రూపాయలు), 2005నాటికి పదివేలు,2020లో32,129 యువాన్లుంది. గ్రామీణుల సగటు 17,131అయితే పట్టణసగటు 43,834 యువాన్లు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు 1950లో యాభైవేల మంది ఉంటే ఇప్పుడు యాభై లక్షలు దాటారు. పరిశోధన మరియు అభివృద్ది కోసం 1980లో 13 బిలియన్‌ యువాన్లు ఖర్చు చేస్తే 2020లో2.4లక్షల కోట్ల యువాన్లు ఉంది.2020లో తొలిసారిగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐదు వందల కంపెనీలలో 133తో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు సులభతర వాణిజ్య సూచికల తారుమారు కారణంగానే జరిగాయని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు.


గతంలో వివిధ దేశాలకు చెందిన ర్యాంకుల కోసం సమాచారాన్ని తారు మారు చేసిన ఉదంతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్తగా ఉన్న పాల్‌ రోమర్‌ రాజీనామా చేసి ఇంటి బాట పట్టాడు. వివిధ దేశాల రాజకీయ అవసరాల కోసం లెక్కింపు పద్దతులను పదే పదే మార్పులు చేసిన కారణంగా ర్యాంకుల్లో మార్పులు జరిగాయని రోమర్‌ చెప్పాడు.2006-2017 మధ్య చిలీ ర్యాంకులు తారుమారయ్యాయి. సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచ్‌లెట్‌ హయాంలో దేశ పరిస్ధితి దిగజారిందని, మితవాది, నియంత సెబాస్టియన్‌ పినేరా హయాంలో మెరుగుపడిందని చూపేందుకు కావాలని ఆ పని చేశారు. అందుకు గాను వ్యక్తిగతంగా తాను క్షమాపణలు చెబుతున్నట్లు రోమర్‌ ప్రకటించాడు. వత్తిడి రావటంతో మాట మార్చాడు, చివరికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఆ ఉదంతం తెలిసిన బ్యాంకు అధ్యక్షుడు, సిఇవో చైనాకు అనుకూలంగా మార్పులు చేయాలని కోరారన్న ఆరోపణలు నమ్మదగినవేనా ?


రాంకులను బట్టే పెట్టుబడులు వచ్చేట్లయితే 2006-20 మధ్య అమెరికా రాంకు 3-8, జపాన్‌ రాంకు 10-39 మధ్య, బ్రిటన్‌ 9-10, ఆస్ట్రేలియా 6-18, కెనడా 4-23 మధ్య ఉంది. మరి ఆ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, కంపెనీలు తమ దేశాలను వదలి ఫేక్‌ రాంకులు తెచ్చుకున్నట్లు చెబుతున్న చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టినట్లు ? ఒకవేళ ఎవరైనా మోసపోయి చైనా వెళ్లిన తరువాత అక్కడ అంత సీన్‌ లేదని మిగతా కంపెనీలకు చెప్పి ఉండాలి కదా ? ఒకరిని చూసి ఒకరు పొలోమని ఎందుకు వెళ్లినట్లు ? పోనీ చైనా తప్పుదారి పట్టించింది అనుకుందాం, అక్కడ పెట్టుబడులు పెట్టి దివాలా తీసిన విదేశీ కంపెనీలెన్ని, ఆత్మహత్యలు చేసుకున్న పారిశ్రామికవేత్తలెందరో ఎవరైనా చెప్పగలరా ! చైనాలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు కేవలం ఎగుమతుల కోసమే కాదు, అక్కడి అంతర్గత మార్కెట్లో తమ సరుకులు అమ్ముకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు కూడా వెళతాయి. అలాంటి అవకాశం ప్రస్తుతం మన దేశంలో ఉందా ? మన దేశంలో వినియోగఖర్చు ఎలా ఉందనే అంశంపై అధికారిక లెక్కలు 2012నాటివే అందుబాటులో ఉన్నాయి. జాతీయ గణాంక సంస్ధ 2017-18లో సేకరించిన సమాచారాన్ని విడుదల కాకుండా నిలిపివేశారు. లీకుల సమాచారం ప్రకారం ఖర్చు తగ్గినట్లు తేలింది, దాన్ని మరోవిధంగా చెప్పాలంటే దారిద్య్రం పెరిగింది. నరేంద్రమోడీ సర్కారుకు ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద సుబ్రమణ్యం దేశ ఆర్ధిక స్ధితి ఐసియులో ఉందని చెప్పారు. ఆర్ధిక వ్యవస్ద మాంద్యంలో ఉందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌ అన్నారు.చివరికి ప్రపంచబ్యాంకు కూడా మన ఆర్ధిక వ్యవస్ధ చక్రియ మందగింపు తీవ్రంగా ఉందని చెప్పింది. ఇవన్నీ కరోనాకు ముందు వ్యాఖ్యలు. పెట్టుబడులు పెట్టాలనుకొనే వారు వీటన్నింటినీ చూడరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇన్ఫోసిస్‌ మీద ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి, భయంతో కార్పొరేట్లు – నోరు విప్పని నరేంద్రమోడీ సర్కార్‌ !

10 Friday Sep 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Infosys, Narendra Modi, Panchajanya, Rahul Bajaj, Rss attack on infosys, Tata Sons


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? ఎవరేం మాట్లాడుతున్నారు ? కొందరు పాత్రధారులైతే – తెరవెనుక సూత్రధారులెవరు ? ఆఫ్టరాల్‌ 164.5 కోట్ల రూపాయల కాంటాక్టును కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన ఇన్ఫోసిస్‌ కంపెనీ మీద ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య దాడి చేసింది. అది టీ కప్పులో తుపానులా ముగుస్తుందా ? దీని వెనుక ప్రజలను తప్పుదారి పట్టించే ఎత్తుగడ ఉందా ? ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! ఎన్నో !! ఆ దాడితో తమకు సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది, ఆ పత్రిక తమ అధికార వాణి కాదని కూడా చెప్పుకుంది. పత్రికా స్వేచ్చ ఉంది గనుక పాంచజన్య ఏమైనా రాయవచ్చని బిజెపి సమర్ధించింది. లక్షలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపుతున్న కంపెనీ మీద నిరాధార ఆరోపణ చేస్తే, అది అవునో కాదో తానే చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చింది. దాని అర్ధం ఏమిటి ?


ఇన్ఫోసిస్‌ కంపెనీ వార్షిక ఆదాయం రు. 26,823 కోట్లు(2021) నిఖరాదాయం రు.19,423 కోట్లు, కంపెనీ మొత్తం ఆస్తుల విలువ రు.1,08,386 కోట్లు. దానిలో పని చేస్తున్న సిబ్బంది 2,59,619. అలాంటి కంపెనీ మీద ఎలాంటి ఆధారాలు లేవని చెబుతూనే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న ఒక పత్రిక తప్పుడు రాతల మీద నోరు విప్పని కేంద్ర ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు పంపుతున్న సందేశం ఏమిటి ? ఇలా ప్రశ్నించటం అంటే కార్పొరేట్లను, వాటి అక్రమాలను సమర్ధించటం కాదు. దేని కదే. సందర్భం వచ్చినపుడూ వాటినీ ప్రశ్నిద్దాం !


ఆర్‌ఎస్‌ఎస్‌ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్‌ దేశవ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు-వలువల గురించి నిత్యం వల్లించే మరో పత్రిక ఏదైనా పాల్పడుతుందా ? ఏమి రాసినా తమను రక్షించేవారు పైన ఉన్నారనే తెగింపు గాకపోతే మరేమిటి ? కొన్ని పత్రికలు ఈ దిగజారుడు రాతలను విమర్శించినా మొత్తంగా మీడియా, కార్పొరేట్‌ రంగం దీని గురించి నోరు విప్పేందుకు భయపడింది. కొన్ని సంస్దల అధికారులు కార్పొరేట్‌ జవాబుదారీ తనం గురించి చెప్పారు. అనేక కార్పొరేట్‌ కంపెనీలు వాటాదార్లను నిలువునా ముంచాయి. అప్పుడు ఈ సుద్దులు చెప్పలేదేం. అవి ఆయా కంపెనీల అంతర్గత వ్యవహారాలైతే ఇదేమిటి ? ఇప్పుడు ఎవరిని సంతృప్తి పరచేందుకు, మెప్పు పొందేందుకు, తద్వారా లబ్ది పొందేందుకు ఈ సుభాషితాలు ?


అవును, ఇన్ఫోసిస్‌ సంస్ధ తయారు చేసిన ఆదాయపన్ను శాఖ పోర్టల్‌ ఆశించిన విధంగా పని చేయటం లేదు.అదొక్కటేనా, అనేకం సరిగా పని చేయటం లేదు. సరిదిద్దుతామని ఆ సంస్ధ చెప్పిన వ్యవధిలోపల పూర్తి కాలేదు. ఏం చేయాలి ? దానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. దానికి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టాలి లేదా అవకాశం ఉంటే నష్టపరిహారం కూడా రాబట్టాలి. లేదూ సాధ్యం గాకపోతే మరొక సంస్దతో కొత్త పోర్టల్‌ను తయారు చేయించాలి. అది ప్రభుత్వం-ఇన్ఫోసిస్‌ మధ్య వ్యవహారం. అప్పటి వరకు దేశం ఆర్ధికంగా స్థంభించించి పోదుగా ! ఒక సాంస్కృతిక సంస్ధ పత్రిక నుంచి ఎందుకీ దాడి !


దేశవ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తూ పని గట్టుకొని దేశ ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరం గావించేందుకు ప్రయత్నిసోందని, నక్సలైట్లు, వామపక్షవాదులు, మరియు టుకడే టుకడే గ్యాంగ్‌(దేశాన్ని విచ్చిన్నం చేసే ముఠాలు)కు నిధులు ఇస్తోందని ” తీవ్ర ఆరోపణ చేసింది. దీనికి సంబంధించి నిర్ధిష్టమైన ఆధారం తమ వద్ద లేదని చరిత్ర మరియు పరిస్ధితులను బట్టి ఇలా చెప్పాల్సి వచ్చిందని కూడా వ్యాసంలో పేర్కొన్నారు. ఇలాంటి అనుమానాస్పద కంపెనీ చైనా, ఐఎస్‌ఐ(పాక్‌ గూఢచార సంస్ద)తో కలసి దేశద్రోహానికి పాల్పడే అవకాశం ఉందని రాసింది. దీని మీద దేశం అంతటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నష్ట నివారణ చర్యకు పూనుకుంది. ఇన్ఫోసిన్‌ నిర్వహిస్తున్న పోర్టల్‌తో కొన్ని సమస్యలు ఉండి ఉండవచ్చు.అయితే పాంచజన్య ఈ నేపధ్యంలో ప్రచురించిన ఒక వ్యాసం కేవలం వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి సునీల్‌ అంబేద్కర్‌ ప్రకటించారు. ఆ పత్రిక తమ భావజాలాన్ని తీసుకొని ఉండవచ్చు తప్ప ఆ పత్రిక తమ సంస్ధ అధికార పత్రిక కాదని పత్రికను, దానిలోని అంశాలను తమ సంస్ధకు అంటగట్ట కూడదన్నారు. అయితే పత్రిక సంపాదకుడు హితేష్‌ శంకర్‌ మాత్రం తాము ప్రచురించినదానికి కట్టుబడి ఉన్నామని, ఆర్‌ఎస్‌ఎస్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.బిజెపి జాతీయ ప్రతినిధి నళిన్‌ కోహ్లి పరోక్షంగా పాంచజన్యను సమర్దించారు. ప్రతివారికి తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది కదా ! పత్రికా స్వేచ్చను మనం కాపాడుతున్నాం అన్నారు. దీన్నే పిర్రగిల్లి జోలపాడటం అంటారు.

దేశంలో ఒక పెద్ద సంస్ధ గురించి ఇంత రచ్చ జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలెవరూ నోరు విప్పలేదు. పాంచజన్యం ఇన్ఫోసిన్‌ మీద దాడిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ సంస్ధ రూపొందించిన పోర్టల్‌ లోపాలను ఎత్తి చూపవచ్చు. ఇలాంటి దానికి ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చు. కానీ రెండవ అంశంలో దేశ విచ్చిన్న ముఠాలకు నిధులు ఇస్తున్నారని, దేశ ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరం గావిస్తున్నారని చెబుతున్నారు. ఎక్కడైనా ఒక పోర్టల్‌ అదీ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సరిగా నడవనంత మాత్రాన దేశ ఆర్ధిక వ్యవస్ధ విచ్చిన్నం అవుతుందా ? మతి ఉండి రాసిన రాతలేనా ? అంత ద్రోహం జరుగుతుంటే కేంద్ర పాలకులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ?


పాంచజన్య దాడి వెనుక అజెండా లేకుండా ఉండదు. కార్పొరేట్‌ శక్తుల హస్తం ఉండే అవకాశం లేకపోలేదు. ఒకనాటికి బయటకు రాకపోదు. ప్రభుత్వ వైఖరులు, విధానాలను విమర్శించే కొన్ని న్యూస్‌ పోర్టల్స్‌, వెబ్‌సైట్లకు ఇన్ఫోసిస్‌ సంస్ధ నిధులు అందచేస్తున్నదనే ప్రచారాన్ని ఆర్‌ఎస్‌్‌ఎస్‌లో కొందరు చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. వారు కూడా దీని వెనుక ఉండవచ్చు. తమకు నచ్చని లేదా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించి ప్రచారం చేయటం గత ఏడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలను కూడా ఆ జాబితాలో చేర్చి దాడి ప్రారంభించారు. ఇన్ఫోసిస్‌ కంపెనీ స్ధాపకుల్లో ఒకరైన నందన్‌ నీలేకని 2014లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ప్రస్తుత ప్రభుత్వ ”భావజాలాన్ని” నారాయణ మూర్తి వ్యతిరేకించటం ఏమాత్రం దాచలేరని, ఒక నిర్ణీత భావజాలానికి చెందిన వారిని ముఖ్యమైన బాధ్యతల్లో నియమించటం, అలాంటి కంపెనీ ముఖ్యమైన ప్రభుత్వ కాంట్రాక్టులను పొందటం,చైనా మరియు ఐఎస్‌ఐ ప్రభావితం చేసే ముప్పు లేదా అని కూడా ఆ వ్యాసకర్త పేర్కొన్నారు. అసలు విషయం పోర్టల్లో లోపం కాదన్నది ఈమాటలను బట్టి అర్ధం అవుతోంది.


ఇన్ఫోసిస్‌పై పాంచజన్య దాడే జాతీయ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నదని , భారతీయ కార్పొరేట్లు నోరువిప్పాలని, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకీయం రాసింది. భావ ప్రకటన స్వేచ్చ గురించి రెండు నాలికలతో మాట్లాడుతున్నారని బిజినెస్‌ స్టాండర్డ్‌ పేర్కొన్నది.ప్రత్యర్ధుల మీద, ముస్లింల మీద నోరు పారవేసుకున్న వారెవరి మీద ఇంతవరకు బిజెపి లేదా సంఘపరివార్‌ చర్య తీసుకున్నది లేదు. మహా అయితే అదివారి వ్యక్తిగత అభిప్రాయం మాకేమీ సంబంధం లేదని తప్పించుకుంటారు. అందుకే పదే పదే అవి పునరావృతం అవుతున్నాయి. ఉదాహరణకు కేంద్ర మంత్రి నిరంజన్‌ జ్యోతి ముస్లింల మీద వ్యాఖ్యలు చేసి విధిలేక క్షమాపణ చెప్పారు. తిరిగి రెండవసారి ఆమెకు మంత్రిపదవిని బహుకరించారు. కంపు మాటలు సంపదలను నాశనం చేస్తాయనే శీర్షికతో ఎకనమిక్‌ టైమ్స్‌ తప్పు పట్టింది. పాంచజన్యకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది. పోర్టల్‌ సరిగా పనిచేయకపోతే కంపెనీని సంప్రదించేందుకు గౌరవ ప్రదమైన పద్దతులు ఉన్నాయి. ఆర్దిక మంత్రిత్వశాఖ ఒక ట్వీట్‌ ద్వారా అంత పెద్ద కంపెనీ సిఇఓ తమను కలవాలని ఆదేశించింది. ఇది ఎవరి గౌరవానికి భంగం ?


ఇన్ఫోసిస్‌ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన టాటా గ్రూపు కంపెనీ మీద కూడా ఆగస్టు నెలలో వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ దాడి చేశారు. అంబానీ గ్రూపు కోసం అమెజాన్ను అడ్డుకుంటున్న దేశభక్తి ఒకవైపు మనకు కనిపిస్తూనే ఉంది. అనేక మంది అమెజాన్‌పై దాడిని సమర్ధించి మన స్వదేశీ కార్పొరేట్లకు మద్దతు ఇస్తే తప్పేమిటి అని ఎదురుదాడికి దిగిన వారున్నారు. మరి ఇప్పుడు ఇన్ఫోసిస్‌, టాటా కంపెనీల మీద జరుగుతున్నదాడి గురించి ఏం చెబుతారు ? ఇలా విదేశీ-స్వదేశీ కంపెనీల మీద దాడులకు దిగితే బయటి నుంచి ఎవరైనా పెట్టుబడులు పెడతారా ? స్వదేశీ కార్పొరేట్లు తమకు అనువైన విదేశాలకు పెట్టుబడులను తరలించవా ? ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు ఏం సమాధానం చెబుతారు ? ఆవు-ఆక్సిజన్‌-గోమూత్రంలో బంగారం, దాని పేడను మండిస్తే ఏదో జరుగుతుందన్నది తప్ప వారి దగ్గర వేరే సమాధానాలున్నాయా ?


ఒక కంపెనీ వైఫల్యం గురించి ఇంతగా గుండెలు బాదుకుంటున్నవారు, దేశద్రోహాన్ని, ఆర్ధిక వ్యవస్ద విచ్చిన్నాన్ని చూస్తున్న వారికి నరేంద్రమోడీ సర్కార్‌ తప్పిదాలు, దిద్దుబాటులో వైఫల్యాలు కనిపించవా ? నల్లధనాన్ని వెలికి తీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశానని 2016 నవంబరు ఎనిమిదిన ప్రకటించిన నరేంద్రమోడీ ఇప్పటి వరకు వెలికితీసిన నల్లధనం ఎంతో నోరు విప్పి చెప్పారా ? నాలుగు సంవత్సరాల తరువాత తీరికగా సెలవిచ్చిందేమిటి ? తన చర్యతో దేశంలో నల్లధనం తగ్గిందట, బ్యాంకులావాదేవీలు పెరిగాయట ? దేనితో నవ్వాలో జనానికి అర్ధం కాలేదు. నోట్ల రద్దు, తగిన కసరత్తులేకుండా చేసిన జిఎస్‌టి వలన జరిగిన నష్టాన్ని సంవత్సరాలు గడిచినా పూడ్చలేని మోడీ సర్కార్‌ ఘోర వైఫల్యం కనపడలేదు గానీ పాంచజన్యానికి ఇన్ఫోసిస్‌ దేశద్రోహం కనిపించిందా ? నరేంద్రమోడీ సర్కార్‌ ఇవన్నీ జవాబుదారీతనంతో చేసిన నిర్వాకాలని చెబుతారా ?పాంచజన్య చేసిన దాడి గురించి వ్యాఖ్యానించాలని కోరగా ఇన్ఫోసిస్‌, టాటా కంపెనీలు స్పందించలేదని రాయిటర్స్‌ వార్తా సంస్ద పేర్కొన్నది. తమతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నోరు విప్పితే సంభవించే పర్యవసానాల గురించి భయపడ్డారని కూడా రాసింది. ఈ వార్త ప్రపంచవ్యాపితంగా మీడియాలో ప్రాచుర్యం పొందింది. విదేశీ పెట్టుబడిదారులు ఈ పరిణామాన్ని గమనించరా ?


ఇ కామర్స్‌ నిబంధనలను విమర్శించినందుకు గాను వాణిజ్య మంత్రి పియుష్‌ గోయల్‌ టాటా గ్రూప్‌ కంపెనీపై ధ్వజమెత్తారు. స్ధానిక వ్యాపారులు కేవలం లాభాల గురించే ఆలోచించకూడదని సుభాషితం పలికారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు.టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేరు ప్రస్తావిస్తూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులకు లబ్దిచేకూర్చేందుకు తాను తెస్తున్న చట్టాలను టాటా సన్స్‌ అభ్యంతర పెడుతున్నారు, అదెంతో బాధ కలిగించింది. కొన్ని విదేశీ కంపెనీలను కొనుగోలు చేసిన తరువాత జాతీయ ప్రయోజనం కంటే అది మరింత ముఖ్యమైంది. నేను, నాది, నా కంపెనీ అనే వైఖరి నుంచి మనం ముందుకు పోవాలి. జాతీయవాద దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియాల్లో మీ ఉక్కు ఉత్పత్తులను అమ్మేందుకు ప్రయత్నించి చూడండి. దేశంలోని ఎంఎస్‌ఎంఇల నుంచి ధర ఎక్కువైనా జాతీయ ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని వాటిని కొనుగోలు చేయాలని మంత్రి అన్నారని వార్తలు వచ్చాయి. పియూష్‌ గోయల్‌ సిఐఐ ఏర్పాటు చేసిన నాలుగు గోడల మధ్య జరిగిన వార్షిక సమావేశంలో ఆ విమర్శ చేశారు. అధికారికంగానే సమావేశం తరువాత సదరు మంత్రి ప్రసంగం ఉన్న వీడియోను సిఐఐ యూట్యూబ్‌ ఛానల్లో పెట్టారు. అయితే దాని మీద విమర్శలు రావటంతో ప్రభుత్వమే ఉపసంహరించాలని కోరింది. దాంతో వివాదాస్పద అంశాలను కత్తిరించి తిరిగి విడుదల చేశారు. తరువాత కారణాలు చెప్పకుండానే తరువాత దాన్ని తొలగించారు.పియూష్‌ గోయల్‌ స్ఫూర్తితో పాంచజన్య బహిరంగదాడికి పాల్పడింది.


ప్రతి క్షణం నరేంద్రమోడీ సర్కార్‌ విదేశీ కంపెనీలు రావాలంటూ ఎర్ర తివాచీలు పరుస్తుంటారు. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అప్పగిస్తాం ప్రభుత్వానికి నాలుగు రూపాయలిమ్మని ఆహ్వానాలు, విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు దారులు తెరుస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు లాభాల కోసం గాక ప్రజాసేవకోసం వస్తాయా ?సులభతర వాణిజ్యం, మరొక పేరుతో విదేశీ పెట్టుబడులు, కంపెనీలు, కొనుగోళ్లు, అమ్మకాలను అనుమతిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మన మార్కెట్‌ను విదేశీ కంపెనీలకు, వస్తువులకు ఎప్పుడో తెరిచారు. వాటి పర్యవసానాలకు నిదర్శనమే పియూష్‌ గోయల్‌ మండిపాటు అన్నది స్పష్టం. పోటీలో చిన్న సంస్ధలు నిలవలేవు, దేశీయ వ్యాపారాలకు ఎసరు ముంచుకు వస్తున్నది. సూదీ, దారాల మొదలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయలేని వస్తువు లేదు. మార్కెట్లో ఉన్న రేట్ల కంటే తక్కువకు మన ఇంటికి ఉచితంగా తెచ్చి ఇస్తున్నారు. ఆ పోటీ కారణంగానే ఆ రంగంలో ప్రవేశించిన బడా సంస్దలు విదేశీ కంపెనీలతో చేతులు కలుపుతున్నాయి. తమకు అనుకూలమైన నిబంధనల కోసం పట్టుబడుతున్నాయి. లేనపుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. వాటిని పూర్తిగా అంగీకరిస్తే బిజెపి ఓటు బ్యాంకుగా ఉన్న చిన్న, చిల్లర వ్యాపారులు దెబ్బతింటారు. చిన్న, సన్నకారు పరిశ్రమలు మరింతగా మూతపడతాయి. ఉపాధి గల్లంతు అవుతుంది. ఇప్పటికే ఈ సెగ నరేంద్రమోడీ సర్కార్‌కు తగలటం ప్రారంభమైంది. అందువల్లనే చిన్న పరిశ్రమల నుంచి వస్తువులను కొనుగోలు చేయాలంటూ పియూష్‌ గోయల్‌ మాట్లాడాల్సి వస్తోంది. అయితే దానికీ ఒక పద్దతి ఉంటుంది. సాధారణ వ్యాఖ్యలు చేయటం వేరు, ప్రత్యేకించి ఒక కంపెనీ మీద దాడి చేయటం వేరు. ఆ బాటను గోయల్‌ చూపారు కనుకనే పాంచజన్య తాజాగా ఇన్ఫోసిస్‌ మీద దాడికి దిగింది.


టాటా గ్రూపు నిర్వహించే ప్రోగ్రెసివ్‌ ఎలక్ట్రరల్‌ ట్రస్టు నుంచి 2018-19లో బిజెపికి రు.356 కోట్ల విరాళం ముట్టింది.ఆ ఏడాది అంత మొత్తం ఏ కార్పొరేట్‌ కంపెనీ నుంచి బిజెపికి రాలేదు. ఎందుకు అంతేసి మొత్తాలు కార్పొరేట్‌లు ఇస్తున్నాయంటే తమకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని ఇచ్చే అధికారిక ముడుపులే అవి. అనధికారిక మొత్తాలు చేతులు మారటం గురించి చెప్పనవసరం లేదు.


కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన విధానాలను అనుసరించినంత కాలం బడా సంస్దలు మౌనంగా ఉంటాయి. లేనపుడు పాలకులనే మార్చివేసేందుకు పావులు కదుపుతాయి. మన్మోహన్‌ సింగ్‌ కంటే మరింతగా, నిర్దాక్షిణ్యంగా తమకు దోచిపెడతారనే కారణంతోనే నరేంద్రమోడీని విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్దలు, వాటి ఆధీనంలోని బడా మీడియా ఆకాశానికి ఎత్తిందన్నది బహిరంగ రహస్యం. ద్విచక్ర వాహనాల మీద 28శాతంగా ఉన్న జిఎస్‌టిని తగ్గింపు గురించి ఆలోచిస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్‌ ప్రకటనను బజాజ్‌ కంపెనీ సహజంగానే స్వాగతించింది. పద్దెనిమిది శాతానికి తగ్గించే అవకాశం ఉందని, మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల వెల ఎనిమిది నుంచి పదివేల మేరకు తగ్గుతుందని ఒక టీవీ ఇంటర్వ్యూలో బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. ఎగుమతి ప్రోత్సహాకాలను రద్దు చేసినందుకు అదే ఇంటర్వ్యూలో రాజీవ్‌ బజాజ్‌ కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. దాని వలన తమ కంపెనీ రు.300 కోట్లు నష్టపోయిందని చెప్పారు.ఎగుమతుల ప్రోత్సాహకపధకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, 2017-18లో ఎగుమతి ప్రోత్సాహాల కింద వివిధ సంస్థలకు చేకూర్చిన లబ్ది రు.34,750 కోట్లు. 2020లో ఏప్రిల్‌-డిసెంబరు మాసాల మధ్య ఆ మొత్తాన్ని తొమ్మిదివేల కోట్లకు కుదించారు. తరువాత కొత్త దరఖాస్తులను స్వీకరించటాన్నే నిలిపివేశారు.


కేసుల నుంచి తప్పుకొనేందుకు తమది రాజకీయ సంస్ద కాదు కేవలం సాంస్కృతిక సంస్ద అని రాజకీయాల్లో పాల్గొనబోమని రాతపూర్వకంగా జాతి పిత గాంధీ హత్య సందర్భంగా రాసి ఇచ్చిన సంస్ద. అప్పటి నుంచి అది చేస్తున్న రాజకీయం ఏమిటో తెలిసిందే. అందువలన అవసరార్ధం అవాస్తవాలు చెప్పవచ్చని మార్గం చూపిన ఆదర్శం దానిది. ఈ నేపధ్యంలో పాంచజన్య తమ అధికార పత్రిక కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి చెప్పారు. ఇది వాస్తవమా ? అతల్‌ బిహారీ వాజ్‌పాయి సంపాదకుడిగా 1948లో అది ప్రారంభమైంది. రాష్ట్ర ధర్మ ప్రకాషన్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రచురణ కేంద్రాన్ని ప్రారంభించింది. 1977లో పత్రిక ప్రచురణ హక్కులను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన మరో సంస్ధ భారత ప్రకాషన్‌ ఢిల్లీ లిమిటెడ్‌కు బదలాయించింది. అందువలన పత్రిక మాది కాదంటే దబాయింపు తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరిని అర్ధం చేసుకోలేని స్ధితిలో జనం ఉన్నారా ?


లోక్‌సభ ఎన్నికలు ముగిసి రెండవ సారి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత బజాజ్‌ గ్రూప్‌ అధిపతి రాహుల్‌ బజాజ్‌ మాట్లాడింది గుర్తుందా ? గోరక్షకుల పేరుతో మూకలు చెలరేగి హత్యాకాండకు పాల్పడుతున్నవారి మీద, పార్లమెంట్‌లో జాతిపిత హంతకుడు గాడ్సేను స్తుతించిన బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మీద ఎలాంటి చర్య తీసుకోలేదని రాహుల్‌ బజాజ్‌ నరేంద్రమోడీని విమర్శించారు. ఇదెక్కడో ఎసి గదుల్లో గుసగుసలాడింది కాదు. మోడీ కంటే ఎక్కువ పలుకుబడి కలిగిననేతగా ప్రాచుర్యం పొందిన అమిత్‌ షా, పియూష్‌ గోయల్‌, నిర్మలాసీతారామన్‌ సమక్షంలోనే బహిరంగంగా 2019 డిసెంబరు ఒకటిన చెప్పిన మాటలు. అంతేనా ! మోడీ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నారని, కార్పొరేట్‌లు భయంతో జీవిస్తున్నారని కూడా అన్నారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదని, ఇన్ఫోసిస్‌పై దాడిని మౌనంగా చూస్తున్న కార్పొరేట్‌ల వైఖరి వెల్లడించటం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం సాధించారని నరేంద్రమోడీ స్తోత్ర పారాయణాలు !

07 Tuesday Sep 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi ‘Seva and Samarpan’, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి నరేంద్రమోడీ పుట్టిన రోజును సేవా దినంగా పాటించిన బిజెపి 71వ జన్మదినాన్ని ఇరవై రోజుల భజన దినోత్సవంగా పాటించేందుకు పిలుపునిచ్చింది.ఈ నెల 17 నుంచి ఇరవై రోజుల పాటు అక్టోబరు ఏడవ తేదీవరకు ప్రధాని నరేంద్రమోడీ రెండు దశాబ్దాల రాజకీయ సేవ మరియు అంకిత బాట గురించి స్తోత్ర పారాయణం చేయాలని బిజెపి పిలుపు ఇచ్చింది. ఆ సందర్భంగా మోడీకి కృతజ్ఞతలను తెలుపుతూ దేశ వ్యాపితంగా పెద్ద ప్రకటనల ఫలకాలు(హౌర్డింగ్‌లు) ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఉచితంగా వాక్సిన్‌, ఆహార ధాన్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ మోడీ బొమ్మవేసి రాస్తారు. మోడీ జీవిత చిత్రమాలికలతో ప్రదర్శనలు,రక్తదానాలు, పారిశుధ్యకార్యక్రమాల వంటి వాటిని చేపడతారు. పార్టీ ప్రజాప్రతినిధులందరూ రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి ఉచితంగా బియ్యం, గోధుమలను ఇచ్చింది ఇదిగో మా మోడీగారే అంటూ వీడియోలను చూపుతూ కృతజ్ఞతలు చెబుతారు. ఇంకా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశమంతటి నుంచీ ఐదు కోట్ల పోస్టు కార్డులతో ప్రతి ఎన్నికల బూత్‌ ప్రాంతం నుంచి కృతజ్ఞతలు చెబుతూ పోస్టు చేస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో అయితే కార్యకర్తలు ప్రత్యేకంగా71 చోట్ల గంగా నదిని శుద్ధి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికీ మేథావులు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తారు. మీడియాలో వ్యాసాలు, విశ్లేషణలు రాయిస్తారు.ప్రధానికి వచ్చిన బహుమతులన్నింటినీ వెబ్‌సైట్‌ ద్వారా వేలం వేస్తారు. పార్టీ కిసాన్‌ మోర్చా కార్యకర్తలు ఈ సందర్భంగా రైతులు-జవాన్లను సన్మానిస్తారు. రాజు తలచుకొంటే దేనికైనా కొదవేముంది ! ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన నలుగురు బిజెపి జాతీయ నేతలలో దగ్గుబాటి పురందరేశ్వరి ఉన్నారు.


నరేంద్రమోడీ ప్రభుత్వ పరంగా, రాజకీయంగా ఈ ఏడాది ఇప్పటి వరకు తిన్నన్ని ఎదురు దెబ్బలు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ రుచిచూసి ఉండరు. అయినా అవేమీ తెలియనట్లు, దేశమంతా వెలిగిపోతున్నట్లు పొగడ్తలకు పూనుకున్నారంటే జనానికి జ్ఞాపకశక్తి తక్కువనే చిన్న చూపు తప్ప మరొకటేమైనా ఉందా ? మచ్చుకు కొన్నింటిని చూద్దాం. వర్తమాన అర్ధిక సంవత్సరం 2021-22 తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి 20.1శాతంతో రికార్డు సృష్టించిందని, దీనికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నట్లుగా ప్రచారం సాగింది. దీన్ని ఘనవిజయం చెప్పుకుంటే ఇబ్బందుల్లో పడేది నరేంద్రమోడీ, పాలక బిజెపి ఎన్‌డిఏ కూటమే అని అభిమానులు గుర్తించాలి. కొంత మంది రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యల వలన ఇది సాధ్యమైందని అన్నారు. 2019-20 సంవత్సరం తొలి మూడు మాసాల్లో జిడిపి విలువ రు.35.96లక్షల కోట్లు. ఈ మొత్తం మీద 24.4శాతం దిగజారి మరుసటి ఏడాది 2020-21లో విలువ రు.26.95 లక్షల కోట్లకు తగ్గింది. ఈ మొత్తం మీద వర్తమాన సంవత్సరంలో అది 20.1శాతం పెరిగి రు.32.38లక్షల కోట్లకు చేరింది. దీన్నే ఘనతగా చిత్రిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి దేశవ్యాపితమైన లాక్‌డౌన్‌ లేదు, కార్మికుల వలసలూ అంతగా లేవు. అఫ్‌కోర్సు ఉపాధి కూడా లేదనుకోండి. అయినా ఇలా ఉందంటే పరిస్ధితి ఆందోళనకరమే అన్నది స్పష్టం.


పెట్రోలు, డీజిలు ధరలు, వాటి పెరుగుదలకు మూలమైన పన్నుల గురించి జనానికి పట్టకపోయినా ప్రభుత్వానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. వినియోగం ఎంత పెరిగితే కేంద్రానికి, ధరలు ఎంత పెరిగితే రాష్ట్రాలకు అంతగా ఆదాయం పెరుగుతున్నది. వెనెజులా మాదిరి దాదాపు ఉచితంగా జనానికి అందించకపోయినా స్ధానికంగా ఉత్పత్తి పెరిగితే వినియోగదారుల మీద భారం, అన్నింటికీ మించి విలువైన విదేశీమారక ద్రవ్యం ఎంతో ఆదాఅవుతుంది. తమ ప్రభుత్వ సామర్ద్యం గురించి బిజెపి చెప్పుకోని రోజు లేదు. 2013-14లో 37.8 మిలియన్‌ టన్నుల ముడి చమురు ఉత్పత్తిచేస్తే అది 2020-21 నాటికి 30.5 మి.టన్నులకు దిగజారింది. ఈ ఏడాది ప్రతినెలా తగ్గుదలే తప్ప ఉత్పత్తి పెరుగుదల లేదు. ఎందుకు ఈ వైఫల్యమో ఇంతవరకు చెప్పిన కేంద్ర పాలకులు లేరు. మరోవైపు దిగుమతులపై ఆధారం 2012లో 81శాతం ఉండగా 2020 నాటికి 87.6 శాతానికి పెరిగింది.కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలతో తలెత్తిన వివాదాల కారణంగా వెనుకటి తేదీల నుంచి వసూలు చేయాల్సిన పన్నులను రద్దు చేయాలని నిర్ణయించి వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్‌ కంపెనీలకు లబ్దిని, సంతోషాన్ని కలిగించింది. కానీ కోట్లాది మంది చమురు వినియోగదారులకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాలకు కొన్ని రెట్లు అదనంగా ఇప్పుడు వినియోగదారుల నుంచి మోడీ సర్కార్‌ వసూలు చేస్తోంది. అడిగేవారు లేకపోవటం అంటే ఇదే. కాంగ్రెస్‌ హయాంలో జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మీద పడిందని, వాటిని తాము తీర్చాల్సి వస్తోందని గత ఏడు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆమొత్తం ఎంత ? లక్షా 34వేల కోట్లు. ఈ మొత్తం కూడా మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉండగా వినియోగదారులకు ఇచ్చిన రాయితీలకు గాను చమురు సంస్ధలకు ప్రభుత్వం చెల్లించాల్సిస సబ్సిడీ మొత్తం ఇది. ఆ మేరకు చమురు సంస్ధలకు బాండ్ల రూపంలో ఇచ్చారు. అంటే వడ్డీ మరియు అసలు చెల్లించే ప్రామిసరీ నోట్ల వంటివి ఇవి. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే క్రమంగా పెంచి రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా ఏడాదికి 2020-21లో కేంద్రానికి 3.35లక్షల కోట్లు సమకూరింది. వినియోగం పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతుంది.


ఆత్మనిర్భర కార్యక్రమం పేరుతో 26లక్షల కోట్ల రూపాయల సాయాన్ని చేస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేశారు.అసలా కార్యక్రమం ఏమిటో, సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుందో అసలు ప్రయోజనమో కాదో కూడా ఇప్పటికీ, ఎప్పటికీ తెలియని వారెందరో. చట్ట సభల్లో అధికార పార్టీ సభ్యులు సాధారణంగా తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టని, గొప్పలు చెప్పుకొనేందుకు వీలయ్యే ప్రశ్నలే అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక సహాయపధకం(ఎన్‌ఎస్‌ఎపి-వృద్ధాప్య, ఇతర పెన్షన్‌ పధకాలు) కింద ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని బిజెపి సభ్యుడు వసంత కుమార్‌ పాండా లోక్‌సభలో అడిగారు. దానికి జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి అలాంటి ప్రదిపాదన తమ వద్ద లేదు సార్‌ అంటూ ఆగస్టు మూడవ తేదీన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 41కింద సామాజిక సహాయ పధకాన్ని అమలు జరపాలని ఉంది. ఆ మేరకు 1995లో దీన్ని ప్రారంభించి రు.75గా నిర్ణయించారు. తరువాత 2006లో రు.200కు పెంచారు. 2013లో జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ మొత్తాన్ని రు.300కు పెంచాలని సిఫార్సు చేసింది. ఎనిమిది సంవత్సరాల తరువాత తమ వద్ద అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజాలు పలుకుతున్నారా, అబద్దాలు చెబుతున్నారా ?


అసలు ఒక వృద్దుడు లేదా వృద్దురాలు రెండువందల రూపాయలతో నెల రోజులు ఏ విధంగా గడపగలుగుతారో ఎవరైనా చెప్పగలరా ? మంత్రి సమాధానాన్ని బట్టి అపర మానవతా మూర్తులైన పాలకులకు అలాంటి ఆలోచన కూడా లేదన్నది స్పష్టం. మన దేశం జిడిపిలో సామాజిక భద్రతా పెన్షన్‌ పధకాలకు ఖర్చు చేస్తున్న మొత్తం 0.04శాతం కాగా, ఆఫ్రికాలోని బోట్సవానాలో 0.3, పొరుగునే ఉన్న నేపాల్లో 0.7, లాటిన్‌ అమెరికా ఖండదేశమైన బొలీవియాలో 1.3 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నారు. వృద్దులకు రు.200, ఎనభైశాతంపైగా వికలాంగులైన వారికి, నలభై దాటిన వితంతువులకు 300, ఎనభై దాటిన వృద్దులకు 500 రూపాయల చొప్పున ఇప్పుడు కేంద్రం చెల్లిస్తున్నది. ఈ మొత్తాలకు అదనంగా జతచేసి తెలంగాణాలో వృద్ధాప్య పెన్షన్‌ రు.2000, ఆంధ్రప్రదేశ్‌లో రు.2250 చెల్లిస్తున్నారు. హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలలో కూడా ఇస్తున్నారు. దేశంలోని వృద్దులు, వికలాంగులు, వితంతువులలో పదికోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం నెలకు మూడువేల రూపాయల చొప్పున పెన్షన్‌ ఇస్తే ఏడాదికి రు.3.6లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇది జిడిపిలో 1.8శాతం. అనేక దేశాలలో మాదిరి సంపదపన్ను, లేదా కార్పొరేట్‌ పన్ను ద్వారా ఈ మొత్తాన్ని సేకరించవచ్చు. లేదూ ప్రభుత్వమే ఖర్చు చేసినా నష్టం ఉండదు. పెన్షనర్లు ఆ మొత్తాన్ని తమ రోజు వారీ అవసరాలకే వినియోగిస్తారు తప్ప బ్యాంకుల్లో డిపాజిట్లు చేయరు లేదా నల్లధనంగా మార్చి విదేశీ బ్యాంకులో పెట్టరు. ఆ మొత్తం ఖర్చు చేస్తే జిడిపి రెట్టింపు 3.8శాతం అవుతుంది. దానిలో సగటున పదిహేనుశాతం పన్నుగా తిరిగి కేంద్రం, రాష్ట్రాలకు చేరుతుంది. ఆ మొత్తం జిడిపిలో 0.54శాతం అవుతుంది. అంటే కేంద్రం నిఖరంగా ఖర్చు చేసే మొత్తం 1.26శాతమే అవుతుంది. మరి కేంద్రానికి ఎందుకు చేతులు రావటం లేదు ?


వృద్దులు, అనాధల పరిస్ధితి ఇలా ఉంటే వారిని ఆదుకోవాల్సిన యువత పరిస్ధితి ఏమిటి ? జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో పదిహేను లక్షల ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయని సిఎంఐయి తెలిపింది. నిరుద్యోగశాతం 6.96 నుంచి 8.32కు చేరింది. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం ఉద్యోగ అవకాశాలు తగ్గటానికి కారణమని సదరు సంస్ధ అధిపతి మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. ముందే చెప్పుకున్నట్లు ఆర్ధిక కార్యకలాపాలు పెరిగి తొలి మూడు మాసాల్లో జిడిపి 20.1శాతం వృద్ది చెందింది అని సంబరాలు చేసుకుంటున్న తరుణంలోని పరిస్ధితి ఇది. ఎనిమిది రాష్ట్రాల్లో హర్యానాలో 35.7, రాజస్తాన్‌లో 26.7, ఝార్ఖండ్‌ 16, బీహార్‌, జమ్మూ అండ్‌ కాశ్మీరులో 13.6, ఢిల్లీలో 11.6శాతాల చొప్పున నిరుద్యోగులను కలిగి ఉన్నాయి. తగినంత ఉపాధి లేని కారణంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే కడుపు చేత పట్టుకొని వలస కార్మికులు తిరిగి పట్టణాలకు చేరుకుంటున్నారు.2021 జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో ఉపాధి పధకం కింద పని చేసిన వారు 58శాతం తగ్గారు. దీనికి వ్యవసాయ పనులు కూడా ఒక కారణంగావచ్చుగానీ పట్టణాలకు వలసలే ప్రధానం అన్నది స్పష్టం. ఉపాధిని కల్పించే పర్యాటక, ఆతిధ్య రంగాలలో వృద్ధి లోటులోనే ఉంది. మన ఎగుమతులు పెరిగాయని సంతోషించవచ్చుగానీ, ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో ప్రయివేటు వినిమయం అంతకు ముందు మూడు మాసాలతో పోల్చితే 8.9శాతం తగ్గిపోయింది. ఉపాధిలేకపోవటం, అవసరమైన వాటినే జనం కొనుగోలు చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ధన ఆర్జన పధకం కింద ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెడితే పర్మనెంటు ఉద్యోగాలకు కోత పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. తక్కువ వేతనాలు, తక్కువ సిబ్బందితో ప్రయివేటు సంస్ధలు లాభాలు పిండుకొనేందుకు చూస్తాయన్నది తెలిసిందే.


ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం లేదన్నది స్పష్టం. అంకెల గారడీతో ఎంతగా దాచిపెట్టాలని చూసినా కుదరదు.ద్రవ్యోల్బణం పెరగటం అంటే ధరలు పెరగటం. ఉదాహరణకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఏలుబడిలో 1961లో వంద రూపాయల వస్తువులు కొన్నాం. ఆ ఏడాది ద్రవ్యోల్బణం రేటు 1.7శాతం. మరుసటి ఏడాది ద్రవ్యోల్బణం 3.63శాతం పెరిగింది. ఆ కారణంగా అదే వస్తువులకు మనం 103.63 చెల్లించాం. అంటే మన రూపాయి విలువ తగ్గినట్లా పెరిగినట్లా ? మనం ఒక్కసారిగా బిజెపి వాజ్‌పాయి గారి పాలనకు వద్దాం. 1999లో ఆ వంద రూపాయల వస్తువుల విలువ రు.2,032.56 అయింది. వారి పాలనలో దేశం వెలిగిపోయింది అని చెప్పారు కదా ! 2004లో అది రు.2,464.60కు చేరింది. మన్మోహన్‌ సింగ్‌ గారు దిగిపోయిన 2014 నాటికి రు.5,483.69కి పెరిగింది. ఇక మంచి రోజులు తెస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ గారి ఏలుబడిలో 2021నాటికి ఆ మొత్తం రు.7,646.39కి చేరింది.( 2021లో జూలైలో అంతకు ముందు పన్నెండు నెలల సగటు మేరకు వేసిన లెక్క. ఏడాది పూర్తయిన తరువాత ఇంకా మొత్తం పెరుగుతుందే తప్ప తగ్గదు). ఈ అంకెలకు ప్రపంచబ్యాంకు సమాచారం ఆధారం.ఆరు దశాబ్దాల సగటు ద్రవ్యోల్బణం రేటు 7.64శాతం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే నెహ్రూ కాలంలో ఒక రూపాయి ఇప్పుడు మోడీగారి హయాంలో 76.46కు సమానం. ఈ మేరకు కార్మికుల వేతనాలు, జన ఆదాయాలు పెరిగాయా ?


మనం తగినంత చమురును ఉత్పత్తి చేయని కారణంగా లేదా బంగారం వంటి నిరుత్పాదక వస్తువులను దిగుమతి చేసుకోవటం ద్వారా వాటితో పాటు ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేస్తున్నాం. ఎలా అంటే, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలో రూపాయి విలువ ఒక డాలరుకు 58 ఉంది. ఇప్పుడు 73-74 మధ్య కదలాడుతోంది. అంటే ఒక లీటరు పెట్రోలు దిగుమతి చేసుకుంటే ఏడు సంవత్సరాల్లో దాని ధర అంతర్జాతీయ మార్కెట్లో స్ధిరంగా ఉందని అనుకుంటే మన వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం 58 నుంచి 73-74 పెరుగుతుంది. అదే చమురు ధర పెరిగిందనుకోండి ఆ మేరకు అదనంగా పెరుగుతుంది. అదే మన రూపాయి విలువ దిగజారకుండా డాలరుతో స్ధిరంగా ఉంటే 58 మాత్రమే చెల్లించాలి.అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పెరిగితే అంత అదనం అవుతుంది. నరేంద్రమోడీ, బిజెపి నేతల మాటల ప్రకారం రూపాయి విలువ 58 నుంచి 40కి తగ్గిందనుకోండి మనం చెల్లించే మొత్తం తగ్గి ఉండేది. మనం ఏడు సంవత్సరాల్లో రెండింటికీ చెడ్డాం. కరెన్సీ విలువ తగ్గితే ఎగుమతులు పెరగాలి. 2014లో జిడిపిలో ఎగుమతుల విలువ 25.43శాతం, డాలర్లలో 472.18 బిలియన్లు కాగా 2020 నాటికి అవి 18.08 శాతం, 474.15బిలియన్లుగా ఉన్నాయి. ఎగుమతులు పెరగకపోగా తగ్గాయి. మరోవైపు దిగుమతులు పెరిగాయి.


ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నందుకు, కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేస్తున్నందుకు నరేంద్రమోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలట. మోడీగారు తాను చిన్న తనంలో అమ్మినట్లు చెబుతున్న టీ సంపాదన డబ్బు నుంచి తీసి జనానికి అందిస్తే నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిదేమీ కాదే, జనం చెల్లించిన పన్నులు, కార్పొరేట్‌ టాక్సులు, జాతి మొత్తానికి చెందిన ప్రకృతి వనరుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఏ మూలకూ చాలని ఐదు కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇచ్చినందుకు మోడీగారికి కృతజ్ఞతలు చెప్పాలంటూ బిజెపి ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా అన్న భక్తరామదాసు గుర్తుకు రావటం లేదూ ! కరోనా వాక్సిన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతగా జనం నోళ్లలో నానిందో, గబ్బుపట్టిందో తెలిసిందే. విధిలేని స్ధితిలో ఉచిత వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నారు. దీనికీ జనం సొమ్మేగా ఖర్చు చేస్తోంది. ఆపద కాలంలో ఉన్న వారిని ఆదుకోవటం, మహమ్మారుల నుంచి జనాలను రక్షించటం పాలకుల బాధ్యత. దానికి కృతజ్ఞతలను ఆశించటం ఏమిటి ? ఏదో ఒక సందర్భాన్ని ఉపయోగించుకొని మోడీ స్తోత్రపారాయణం చేయటం ద్వారా పడిన మచ్చలను కనిపించకుండా చేయాలనే కార్యక్రమం తప్ప ఏం సాధించారని ఇరవై రోజుల పాటు మోడీ గారిని పొగడాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏడేండ్ల మోడీ ఏలుబడి : నాడు చెప్పింది ఆస్తుల వృద్ది – నేడు చేస్తున్నది ఉన్న వాటి అమ్మకం ?

29 Sunday Aug 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, Monetisation, Narendra Modi Failures, National Monetisation Pipeline, Nirmala Sitharaman


ఎం కోటేశ్వరరావు


ప్రయివేటీకరణ విషయంలో కాంగ్రెస్‌కు -బిజెపికి ఉన్న మౌలికమైన తేడాలు ఏమిటన్నది కొందరికి సందేహం.సూటిగా చెప్పాలంటే ఆస్తులను సృష్టించిన ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించిన పార్టీ కాంగ్రెస్‌, వాటిని తెగనమ్మేందుకు పూనుకున్న పక్షం బిజెపి. మొదటి పక్షానికి కాస్త బెరుకు ఉండేది, రెండో పార్టీకి అలాంటి వేమీ లేవు, ఎందుకంటే వారి ఏలుబడిలో సృష్టించిన ఆస్తులేమీ లేవు కదా ! కాకపోతే మిగతా అంశాల్లో ఎలా అయితే ముసుగులు వేసుకుందో ఈ విషయంలో కూడా అదే చేస్తోందన్నది పరిశీలకుల భావన. అదే పూర్తిగా కట్టబెట్టటం కాదు, నిర్వహించి ప్రభుత్వానికి కొంత ముట్టచెప్పటం అని చెబుతున్నది దానికే మోనిటైజేషన్‌ అని పేరు పెట్టారు. ప్రయివేటు రంగం గురించి దేశ ప్రజలకు భ్రమలు, మరులు కొల్పించటం, ఆశ్రితులకు కారుచౌకగా ప్రజల ఆస్తులను కట్టబెట్టటం కొత్త కాదు. నయావుదారవాద విధానంలో అవి ఒక ప్రధాన అంశం.జాతీయ మౌలిక సదుపాయాల గొట్టపు పధకం పేరుతో దానికి తెరతీశారు. గత మూడు దశాబ్దాలుగా చెప్పిన కబుర్లు సినిమా నిర్మాణానికి ప్రమోషన్‌ లేదా ప్రచారంలో భాగంగా చెప్పినవి అనుకుంటే ఇప్పుడు సినిమా చూపిస్తమామా అంటూ విడుదల గురించి ఆర్భాటం చేస్తున్నారు. పాలకులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు-కార్మికులు అసమర్ధులు, అవినీతి పరులని పరోక్షంగా అంగీకరిస్తూ ప్రయివేటు రంగ మంత్రం జపిస్తున్నారు. మన కళ్ల ముందే బడా కార్పొరేట్‌ కంపెనీలు ఎలా, ఎందుకు విఫలమయ్యాయో చెబితే వాటి బండారాన్ని జనం అర్ధం చేసుకుంటారు. కానీ ఎక్కడా అలాంటి సమాచారం నరేంద్రమోడీ గారు మిత్రోంకు అందచేసిన దాఖలాల్లేవు.


ప్రయివేటు రంగం ఎంత అవినీతి, అక్రమాలతో జనాలను పీక్కుతింటుందో, ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో కరోనా మహమ్మారి వెల్లడించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, ఎస్‌బ్యాంకు, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలిసర్వీసెస్‌, ఓడాఫోన్‌, సత్యం కంప్యూటర్స్‌, ఇలా అనేక కంపెనీలు ఎలా మోసాలకు పాల్పడ్డాయో తెలిసిందే.ఇలాంటి వారికి ప్రభుత్వ ఆస్తులను అప్పగిస్తే వారు బాగుచేస్తారన్న హామీ ఏమిటి ? రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ -అనిల్‌ అంబానీ ఘోరవైఫల్యం గురించి తెలిసిందే. మన కళ్ల ముందు దివాలా తీసిన అతి పెద్ద ప్రయివేటు కంపెనీ. వారి సామర్ధ్యం ఏమైంది ? పద్దెనిమిది వేల కోట్ల ఆస్తులున్న సదరు కంపెనీ 50వేల కోట్ల అప్పులతో ఐపి( దివాలా పిటీషన్‌ ) పెట్టింది. దానికే రాఫెల్‌ విమానాల కాంట్రాక్టును కట్టపెట్టారు. పెద్ద మనిషిగా పేరు గాంచిన రతన్‌ టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ వివాదం గురించి తెలిసిందే. సైరస్‌ మిస్త్రీ నియామకం, తొలగింపు, కోర్టు వివాదాలు. అసలు ఏం జరుగుతోంది, వారు దేని గురించి దెబ్బలాడుకుంటున్నారో జనానికి తెలుసా ? పారదర్శకత ఉందా ! వారి సమస్యలనే వారు పరిష్కరించుకోలేక బజారుకు ఎక్కిన వారు దేశాన్ని ఉద్దరిస్తారంటే నమ్మటం ఎలా ? వారుగాకపోతే మరొకరు. బండారం బయటకు రానంతవరకే పెద్దమనుషులు. తెరతొలిగితే విశ్వరూపం కనిపిస్తుంది.


ఐసిఐసిఐ బ్యాంకు-వీడియోకాన్‌ బాగోతం ఏమిటి ? ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్‌కు 2009లో 300 కోట్ల రుణం ఇస్తే దానిలో 64కోట్లు మరుసటి రోజే నూపవర్‌ అనే కంపెనీకి బదలాయించారు. రుణం ఇచ్చింది ఎవరు ? చందాకొచ్చర్‌ నాయకత్వంలోని బ్యాంకు బృందం. ఐదోవంతు మొత్తాన్ని తరలించిన పవర్‌ కంపెనీ ఎవరిది, చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ది. ఆ బృందంలోని మిగతా సభ్యులకు ఏమీ తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందా ? అది లంచం తప్ప మరొకటి కాదు అని కేసు నమోదు చేసి ఇడి, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయి.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు-నీరవ్‌ మోడీ రు.11,400 కోట్ల అవినీతి బాగోతం గురించి చెప్పనవసరం లేదు. సత్యం కంప్యూటర్స్‌ అవినీతి గురించి తెలిసిందే. కార్పొరేట్‌ కంపెనీ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు అవలంభించిన కంపెనీగా, అమెరికా అధ్యక్షుడి సరసన కూర్చున్న సత్యం కంప్యూటర్స్‌కు గోల్డెన్‌ పీకాక్‌ గ్లోబల్‌ అవార్డును కూడా బహుకరించారు.తప్పుడు లెక్కలను తయారు చేసి మదుపుదార్లను మోసం చేసింది ఆ కంపెనీ. తన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న రెండు కంపెనీలు సత్యమ్‌ను తిరగేసి మైటాస్‌ అని పేరుపెట్టి ఏడువేల కోట్ల రూపాయల పెట్టుబడులను వాటికి మళ్లించేందుకు ప్రయత్నించారు. సత్యం కంపెనీతో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదంటూ ప్రపంచబ్యాంకు ఎనిమిది సంవత్సరాల నిషేధం విధించింది. పెద్దలు ఎలా మోసం చేస్తారో ప్రపంచానికి ఎంతో స్పష్టంగా ఈ ఉదంతం తెలిపింది.


ఇక సింగ్‌ సోదరులుగా పేరుమోసిన మాల్విందర్‌ సింగ్‌ – శివిందర్‌ సింగ్‌ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన రాన్‌బాక్సీ తదితర కంపెనీల యజమానులు.రెల్‌గేర్‌ ఫిన్వెస్ట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరుతో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు తీసుకొని ఆ మొత్తాలను వేరే కంపెనీలకు మరలించి ఈ కంపెనీని దివాలా తీయించారు, 2,387 కోట్ల నష్టాల పాలు చేశారు.పది సంవత్సరాల కాలంలో వీరు 22,500 కోట్ల రూపాయలను నొక్కేశారని తేలింది.
మరో మోసకారి కంపెనీ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(డిహెచ్‌ఎఫ్‌ఎల్‌).కంపెనీ బాంద్రా శాఖ పేరుతో ఖాతా పుస్తకాలను తయారు చేశారు. అసలు అలాంటి శాఖే లేదు.బాంద్రాబుక్స్‌గా పిలుస్తున్న ఈ కంపెనీ కుంభకోణంలో జరిగిందేమిటి ? రు.23,815 కోట్లను 2,60,315 మందికి రుణాలు ఇచ్చినట్లు పుస్తకాల్లో రాశారు. వాస్తవంగా ఇచ్చింది రు.11,755 కోట్లు. వాటిలో కూడా కొన్నింటిని తనిఖీ చేస్తే రుణం తీసుకున్నవారు అదే యాజమాన్యంలోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా తేలింది. లెక్కలను తారుమారు చేస,ి లేని ఆదాయాన్ని చూపి రు.24వేల కోట్ల మేరకు రుణసెక్యూరిటీల రూపంలో మదుపుదార్ల నుంచి వసూలు చేశారు.


ఇతర బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు తిరస్కరించిన వారికి రుణాలు ఇచ్చి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసిఅచిర కాలంలోనే పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించినదిగా పేరు మోసిన ఎస్‌ బ్యాంక్‌ చివరికి దివాలా తీసింది. ఎలాగూ ఎగవేసేవే గనుక బ్యాంకు కోరినంత ఫీజులు చెల్లించి మోసగాండ్లు రుణాలు తీసుకున్నారు.చివరికి బ్యాంకులో మదుపు చేసిన వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సి వచ్చింది. కేఫ్‌ కాఫీ డే కంపెనీ యజమాని సిద్దార్ద ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాఫీ గింజలను పండించటంలో 140 సంవత్సరాల చరిత్ర గల కుటుంబం నుంచి వచ్చి అత్యాశకు పోయి అప్పులపాలై చివరకు అలా ముగిసింది. విదేశీ కంపెనీల నుంచి రుణాలు తీసుకున్నారు, తగిన ఆదాయం లేక చివరకు 2,700 కోట్లకు అప్పు పెరిగి ఇచ్చిన వారి వత్తిళ్లను తట్టుకోలేక సిద్దార్ద ఆత్మహత్య చేసుకున్నాడు.దేశంలో రెండవ స్ధానంలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ యజమానులు బ్యాంకులకు రు.8,500 కోట్ల బకాయి పడ్డారు. ఇతరులకు మరో 25వేల కోట్ల మేరకు ఇవ్వాల్సి ఉంది. కింగ్‌ఫిషర్‌, సహారా, డెక్కన్‌ ఇలాంటి విమాన సంస్ధలన్నీ తప్పుడు విధానాలకు పాల్పడి తాము మునిగి బ్యాంకులు, ఇతరులను ముంచాయి. పేరుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డులు ఉన్నా అవన్నీ వేలుముద్రలు లేదా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేవారితో నిండి ఉంటాయి. ఇలాంటి ప్రయివేటు సంస్దలకు ప్రజల ఆస్తులను అప్పగించబోతున్నారు.
ఇక ప్రయివేటు బ్యాంకులు తీరు తెన్నులను చూద్దాం. గతంలో బ్యాంకులను జాతీయకరణ చేసినందుకు ఇందిరా గాంధీకి జనం బ్రహ్మరధం పట్టారంటే అమాయకులై కాదు. ప్రయివేటు రంగంలోని బ్యాంకులు, బీమా కంపెనీలు జనానికి టోపీ పెట్టాయి గనుకనే హర్షించారు. ఇప్పుడు జాతీయ సంపదలుగా ఉన్నవాటిని తిరిగి ప్రయివేటు రంగానికి కట్టబెట్టబోతున్నారు.1947 నుంచి 1969వరకు 559 ప్రయివేటు బ్యాంకులు దివాలా తీశాయి. ఈ కాలంలో 736 బ్యాంకులను విలీనం లేదా రద్దు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులను తిరిగి ప్రయివేటీకరించాలని కోరుతున్నారు. వాటిని ప్రయివేటు వారు కరిమింగిన వెలగపండులా మారిస్తే ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత తీసుకుంటారు.1969 బ్యాంకుల జాతీయకరణ తరువాత కూడా కొన్ని ప్రయివేటు బ్యాంకులను అనుమతించారు. వాటిలో ఇప్పటి వరకు 36 బ్యాంకులు అక్రమాలకు పాల్పడ్డాయి. అవేవీ ఇప్పుడు ఉనికలో లేవు. గ్ల్రోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు వాటిలో ఒకటి, దానిని ఓరియంటల్‌ బ్యాంకుతో విలీనం చేశారు.ప్రయివేటు యాజమాన్యాలు అంత సమర్ధవంతమైనవి అయితే ఈ పరిస్ధితి ఎందుకు తలెత్తింది. ఇప్పుడున్న ప్రయివేటు బ్యాంకులు తమ వాటాను ఎందుకు పెంచుకోలేకపోతున్నాయి.2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 563 ప్రయివేటు బ్యాంకులు విఫలమయ్యాయి. అక్కడ మొత్తం ప్రయివేటు రంగానిదే ఆధిపత్యం కదా !


జాతీయ ధనార్జన గొట్టపు పధకాన్ని (మోనిటైజేషన్‌) ప్రకటించే ముందు ఆస్ట్రేలియా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారా అంటూ మీడియాలో వచ్చిన ఒక విశ్లేషణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు అలాంటి ప్రశ్నలు మన మీడియాలో వచ్చేదే అపురూపం, ఎందుకంటే మీడియా యాజమాన్యాలు ప్రయివేటీకరణకు అనుకూలం గనుక. ప్రయివేటీకరణ లేదా నిర్వహణకు ప్రయివేటు వారికి అప్పగించటం పేరు ఏది పెట్టినా మన పాలకులు వాటిని పాడి గేదెలు లేదా ఆవులుగా మారుస్తామని చెబుతున్నారు. ఒకసారి మన గేదె, ఆవును ఇతరులకు అప్పగించి మేపి, పాలు తీసి అమ్ముకొని మీరు నాలుగు డబ్బులు వెనకేసుకొని మాకు నాలుగు ఇమ్మని చెప్పిన తరువాత వారు ఎంత ధర చెబితే అంతకు మనం కూడా పాలు కొనాల్సిందే, ధర మీద మనకు అజమాయిషీ ఉండదు. ముసలిదైపోయి పాలిచ్చే అవకాశం లేని దశలో మనకు అప్పగిస్తారు.


అందువలన అలాంటి పనులు చేయబోయే ముందు పోటీ తత్వం ఉందో లేదో , వినియోగదారులను అధిక ధరలతో పిండకుండా చూసేందుకు ప్రభుత్వం బహిరంగ సమీక్షలు జరపాలని ఆస్ట్రేలియా పోటీతత్వ నిఘా సంస్ద అధ్యక్షుడు రోడ్‌ సిమ్స్‌ చెప్పారు. మరి తామే అసలైన జవాబుదారులం, చౌకీదారులం అని చెబుతున్న మోడీ సర్కార్‌ అలాంటి చర్చ ఎన్నడైనా, ఎక్కడైనా జరిపిందా ? ఆస్ట్రేలియాలో తరచుగా పోటీ లేకుండా ప్రయివేటు వారికి అప్పగిస్తున్నారని సిమ్స్‌ వాపోయాడు.నియంత్రణలు లేకపోతే జనాన్ని పీక్కుతింటారని అన్నాడు. ఆస్తులను పాడిగేదెల మాదిరి మారిస్తే ఆర్ధిక సామర్ధ్యానికి ప్రతిబంధకం అవుతుందన్నాడు. 2013లో పోటీ తత్వం లేకుండా బోటనీ అనే ఆస్ట్రేలియా రేవును ప్రయివేటు వారికి అప్పగించారు. తరువాత న్యూకాజిల్‌ ప్రాంతంలో మరొక కంటెయినర్‌ టెర్మినల్‌ను ప్రతిపాదించారు. దాన్ని నిర్మించితే రేవు నూతన యజమానులకు 510 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది. ప్రయివేటీకరించిన రేవులు, విమానాశ్రయాలు యజమానుల మార్కెట్‌ శక్తిని తగ్గించటం లేదని సిమ్స్‌ పేర్కొన్నాడు. అంటే పోటీని అనుమతించటం లేదనే అర్దం. ఇదే సిమ్స్‌ ఏడు సంవత్సరాల క్రితం ఇదే హెచ్చరిక చేశాడు. పోటీకి అనుకూల సంస్కృతిని ఆస్ట్రేలియా కోల్పోతోందని చెప్పాడు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌లో విద్యుత్‌ స్ధంభాలు, వైర్ల ప్రయివేటీకరణ చేసిన తరువాత ఐదు సంవత్సరాల్లో వినియోగదారులకు విద్యుత్‌ ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. దాంతో ప్రభుత్వం వినియోగదారుల మీద భారం తగ్గించే చర్యలను చేపట్టింది.
సిడ్నీ నగరంలో నిర్మిస్తున్న భూగర్భ రోడ్డు మార్గంలో 51శాతం వాటాను ప్రయివేటు కంపెనీకి అమ్మివేశారు. దాని గురించి సమాచార హక్కు కింద వివరాలు ఇచ్చేందుకు అవకాశం లేకుండా చేశారని, ఆడిటర్‌కు కూడా పరిమితులు పెట్టారని సిడ్నీమోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రిక రాసింది.సింగపూర్‌లో రైల్వేలను కొంత మేరకు ప్రయివేటీకరించారు. తీసుకున్న యజమాని తగినంత పెట్టుబడి పెట్టని కారణంగా రైళ్లు ఆగిపోతున్నాయి. అందువలన తిరిగి జాతీయం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది.


పలు కంపెనీలు టెలికాం రంగంలోకి వచ్చినపుడు పోటీ పడి చార్జీలు తగ్గించిన విషయం తెలిసిందే. ఆలశ్యంగా మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్‌ జియో వినియోగదారులను అతి తక్కువ ఛార్జీలతో ఆకర్షించింది. తన ఆర్ధికశక్తిని పెట్టుబడిగా పెట్టింది. గణనీయమైన మార్కెట్‌ను ఆక్రమించింది. పోటీ కంపెనీలు దివాలా దీసిన తరువాత చార్జీలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న ఒకటి రెండు కంపెనీలు కూడా రంగం నుంచి తప్పుకుంటే ముకేష్‌ అంబానీ ఎంత చెబితే అంత చెల్లించకతప్పదు. రేపు రోడ్లయినా, విద్యుత్‌ మరొకటి ఏదైనా అంతే మొత్తం ప్రయివేటు వారి నిర్వహణకు పోతే వారెంత చార్జీ చెల్లించాలంటే అంత చెల్లించాల్సిందే. పజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం మన దేశంలోనే కాదు అనేక దేశాల పాలకులు సమర్పించుకుంటున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న వాటి విలువ కనిష్టంగా 75లక్షల కోట్ల డాలర్లని నాలుగు సంవత్సరాల నాటి ఒక అంచనా.రాష్ట్ర,స్ధానిక ప్రభుత్వాల వాటిని కూడా కలుపుకుంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాల అప్పులు అనేక దేశాల్లో జిడిపికి వందశాతం దాటి నందున రాబోయే రోజుల్లో ఆర్ధిక వృద్ధి మరియు ఉపాధి కల్పనకు నిధుల కేటాయింపు మరింత ఇబ్బంది అవుతుందని, అవసరాలకు – కేటాయింపులకు మధ్య తేడా 2040 నాటికి 15లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో కూడా అదే జరుగుతోంది.


1998నాటికి మన కేంద్ర ప్రభుత్వ రుణం 9,896,997,300( దాదాపు పదిలక్షల కోట్లు), అది 2014లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికి 53లక్షల కోట్లకు పెరిగింది.2021 మార్చి నాటికి ఆ మొత్తం 116,217,806,400 కోట్లు( 116లక్షల కోట్లు) వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి అది 132లక్షల కోట్లు అవుతుందని అంచనా. కేంద్రం-రాష్ర ప్రభుత్వాల రుణాల మొత్తం జిడిపిలో 2019-20నాటికి 70శాతం అయితే, మరుసటి ఏడాదికి అది 90శాతానికి చేరింది. వందశాతం మార్కు దాటటానికి ఎంతో దూరంలో లేము. అందువలన పాలకులు తెగబడి ప్రభుత్వ ఆస్తులను అయినకాడికి తెగనమ్మి లేదా అనుభవానికి అప్పగించి సొమ్ము చేసుకొని లోటు పూడ్చుకొనేందుకు లేదా అప్పులు తీర్చేందుకు పూనుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తరువాత జనం మీద మరిన్ని భారాలు మోపటమే తరువాయి. నిరుపయోగంగా పడి ఉన్న ఆస్తులను ధనార్జన అని నిర్మలమ్మ నమ్మబలుకుతున్నా అసలు విషయం వేరే. 2021 ఫిబ్రవరి 24 మన ప్రధాని నరేంద్రమోడీ జాతికి ఒక సందేశం ఇచ్చారు. మోనిటైజ్‌ అండ్‌ మోడర్నయిజ్‌ (ధనార్జన మరియు నవీకరణ) అనే ఇతివృత్తంతో బడ్జెట్‌ను రూపొందించామని, ప్రభుత్వం ఉన్నది పాలన చేయటానికి తప్ప వాణిజ్యం చేయటానికి కాదు అన్నారు.కేంద్ర ప్రభుత్వశాఖ ” దీపం ”(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేసిన ఒకవెబ్‌నార్‌లో మోడీ మాట్లాడారు. ప్రయివేటీకరణ మరియు ధనార్జన(మోనిటైజేషన్‌) ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు వినియోగిస్తామన్నారు. అంటే వీలైన వాటిని తెగనమ్మేస్తారు, కాని వాటిని మోనిటైజేషన్‌ పేరుతో ప్రయివేటు వారి అనుభవానికి సమర్పిస్తారు. చిత్రం ఏమిటంటే బ్రిటన్‌ కంపెనీ అయిన వోడా ఐడియా కంపెనీ చేతులెత్తేసి మా వాటాలను అప్పగిస్తాం మమ్మల్ని ఊబి నుంచి బయటపడేయండి అని వేడుకోళ్లకు దిగింది. దాన్ని కొనుగోలు చేసేందుకు జియో ఇతరులు పోటీ పడుతున్నాయి. ఇంకా అనేక కంపెనీలు అదే స్ధితిలో ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్తులతో ఆర్జన మాచేత కావటం లేదు వీటిని తీసుకొని మాకు నాలుగు రూకలిచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటూ మోడీ సర్కార్‌ వీధుల్లో నిలబడింది. ఏడు సంవత్సరాల క్రితం మీరు మాదేశానికి రండి, వస్తువులను తయారు చేయండి, ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోండి అని విదేశీ కార్పొరేట్‌లు, వాణిజ్య సంస్ధలకు విజ్ఞప్తి చేసిన నరేంద్రమోడీ ఇప్పుడు అవే సంస్ధలకు మా ఆస్తులను తీసుకోండి, నిర్వహించండి, మాకు కొంత సొమ్ము ముట్ట చెప్పండి అని వేడుకుంటున్నారు. ఎంతలో ఎంత మార్పు !


బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి కేంద్ర ప్రభుత్వ ధనార్జన గొట్టపు మార్గం గురించి చేసిన వ్యాఖ్యతో దీన్ని ముగిద్దాం.” ఆర్ధిక వ్యవస్ధ అధోగతి పాలైనపుడు ప్రజల ఆస్తులను అమ్మటం మానసిక దివాలా మరియు నిరాశకు ఒక సూచిక. ఇది ఆరోగ్యకరమైన సైద్దాంతిక విధాయకత కాజాలదు.2016 నుంచి జిడిపి వృద్ది రేటు ఏడాది తరువాత ఏడాది, త్రైమాసికం తరువాత త్రైమాసికం దిగజారుతున్నదని సిఎస్‌ఓ సమాచారం వెల్లడిస్తున్న అంశాన్ని మోడీ ప్రభుత్వం తిరస్కరించజాలదు.”
ఈ వ్యాసానికి మొదటి భాగ లింక్‌

బిడ్డా రాహుల్‌ గతంలో నోరెత్తలేదేం – నిలదీసిన నిర్మలక్క, స్మృతక్క

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d