• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

శబరిమల తీర్పు 1 : సాంప్రదాయ ముసుగులో బిజెపి-ముస్లింలీగ్‌-కాంగ్రెస్‌ బృందగానం !

07 Sunday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

congress- bjp- muslim league chorus, Kerala LDF, Ready to wait, Sabarimala Entry Case, sabarimala verdict

TDB says Only real women devotees expected to visit Sabarimala temple

ఎం కోటేశ్వరరావు

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచ్‌ మెజారిటీ (4ా1) తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో బిజెపి అనుబంధ విభాగమైన మహిళా మోర్చా,యువమోర్చా తదితర సంస్ధలు రంగంలోకి దిగాయి. ప్రదర్శనలు, ఇతర రూపాల్లో ఆందోళనలు చేయిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా వచ్చిన తీర్పులను బిజెపి ఎంత రెచ్చగొట్టినా మహిళలే వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటం ఏమిటని అనేక మందిలో ఆశ్చర్యం, ఆవేదన, ఆందోళన కలిగి వుండవచ్చు.వేలు, లక్షల సంఖ్యలో రైతులు, కార్మికులు, వుద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ఒక్క ముక్క కూడా వార్తలు, చిత్రాలను ప్రచురించని పత్రికలు వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు అతిశయోక్తులను జోడించటం కూడా చాలా మందికి మింగుడుపడటం లేదు. సమాజం మొత్తం మీద చూసినపుడు వెనుకబడిన వారిలో మహిళలు అత్యంత వెనుకబడిన వారని, ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో వున్న పరిస్ధితులు, పరిణామాలను గుర్తిస్తే ఇలాంటి ప్రదర్శనల గురించి ఆశ్చర్యపడాల్సిన పని వుండదు. తిరోగామి భావజాల ప్రభావం సామాజికంగా వెనుకబడిన వారి మీద ఎక్కువగా వుంటుంది. మహిళలకు మినహాయింపు ఎలా వుంటుంది. అనేక వుదంతాలలో వారిని వారిని ముందుకు తెచ్చిన ఫ్యూడల్‌, ఇతర తిరోగామి శక్తులను చూశాము. అనేక ఆందోళనలు అవి రిజర్వేషన్లకు వ్యతిరేకం నుంచి దళితుల మీద దాడులు, వేర్పాటు వాదం నుంచి విచ్చిన్న వాదాల ఆందోళనల వరకు జరిగిన వాటిలో మహిళలు గణనీయంగా పాల్గనటం తెలిసిందే. అలాంటి వాటి గురించి వార్తలను గుప్పించటం, ఆందోళనలు, పోరాటాలను విస్మరించటం కార్పొరేట్‌, పాలకవర్గాల మీడియా వర్గదృష్టిలో భాగమని వేరే చెప్పనవసరం లేదు.

శబరిమల తీర్పు వివిధ రాజకీయపార్టీల, స్వచ్చంద లేదా సాంస్కృతిక సంస్ధల ముసుగులో వున్న శక్తుల బండారాన్ని, ఫ్యూడల్‌ శక్తుల సంతుష్టీకరణకు పడే తాపత్రయాన్ని బయట పెడుతున్నది. చిత్రం ఏమిటంటే మహిళల పట్ల మత విషయాలలో నాణానికి బమ్మా బరుసు వంటి బిజెపి-ముస్లింలీగ్‌ ఒకే పాట పాడుతున్నాయి, ఆ బృందగానంలో కాంగ్రెస్‌ గొంతు కలిపింది. శబరిమల ఆలయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకొనేందుకు సాంప్రదాయ ముసుగు వేసుకొని రంగంలోకి దిగటమే కాదు, ఓట్ల రూపంలో సొమ్ము చేసుకొనేందుకు బిజెపి, కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌, ఇతర శక్తులు పోటీ పడుతున్నాయి. తీర్పుపై పునర్విచారణకు అప్పీలు చేయరాదని నిర్ణయించినందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. కారాలు మిరియాలు నూరుతున్నాయి. మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను ముఖ్యంగా మహిళ్లో రెచ్చగొట్టేందుకు పూనుకున్నాయి.ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదనే ముద్రవేయాలన్నది కుటిలనీతి. ఒక పురోగామి తీర్పు, పరిణామాన్ని అడ్డుకోవాలంటే దానికి సాంప్రదాయ ముసుగువేయి అన్నది మతోన్మాద, కులోన్మాద శక్తులు, వాటికి అంటకాగే అవకాశవాద శక్తులఎత్తుగడ. వివిధ సందర్భాలలో ఇది వెల్లడైంది. మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష శక్తులన్నీ ఏకమైన తరుణంలో ఆచితూచి వ్యవహరించేందుకు అక్కడి వామపక్ష ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా అరవై సంవత్సరాల క్రితం ఇదే కేరళలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతసంస్ధలు, వాటి రాజకీయ ప్రతినిధులు, వారికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌కు అమెరికా గూఢచార సంస్ధ డబ్చిచ్చి మరీ విమోచన సమరం పేరుతో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఆధ్వర్యాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది. ఇప్పుడు శబరిమల పేరుతో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అని ఇప్పుడే చెప్పలేము గాని శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం కనిపిస్తున్నది. నంబూద్రిపాద్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ కమ్యూనిస్టు విప్లవ అజెండాలోనివి కాదు, ప్రజాస్వామిక స్వభావం కలిగినవే. స్వాతంత్య్రవుద్యమంలో ముందుకు వచ్చిన భూ సంస్కరణల అమలుకు పూనుకుంది. కౌలుదార్లకు రక్షణ కల్పించటం, వ్యవసాయ కార్మికుల కనీసవేతనాలు పెంచటం, ప్రయివేటు విద్యా సంస్ధలలో వుద్యోగనియామకాల క్రమబద్దీకరణ, వేతనాలను ట్రెజరీల ద్వారా చెల్లించాలని, చట్టాన్ని వుల్లంఘించిన విద్యా సంస్ధలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి సాధారణ అంశాలు మాత్రమే వున్నాయి. నిజానికి వీటి మీద వాగ్దానాలు చేయని పార్టీ లేదు. కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన ‘నేరం’ ఏమిటంటే చేసిన వాగ్దానాన్ని అమలు జరపటమే. దీనికి వ్యతిరేకంగా సర్వమత శక్తులతో పాటు నేతిబీరలో నెయ్యి మాదిరి సోషలిస్టు పార్టీల ముసుగులో వున్న శక్తులు కూడా మతశక్తులు, కాంగ్రెస్‌తో చేతులు కలిపి తమ బండారాన్ని తాము బయట పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆందోళనకు దిగిన అంశం కూడా కమ్యూనిస్టు అజెండాలోనిది కాదు. చట్టబద్దమైన పాలనకు కట్టుబడడిన వారిగా శబరిమల తీర్పును అమలు జరుపుతామని ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ప్రకటించటంతో రాజకీయ లబ్ది పొందేందుకు అన్ని రకాల శక్తులు రంగంలోకి దిగాయి. గతంలో చేసిన కుట్రలను జయప్రదంగా తిప్పి కొట్టిన కమ్యూనిస్టులు ఈ సారి దానిని ఎలా అధిగమిస్తారన్నదే ఆసక్తి కలిగించే అంశం.

మన దేశంలో పురోగమన వాదానికి కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయ వాదులు, తిరోగమన వాదానికి ఆర్‌ఎస్‌ఎస్‌, దాని భావజాలంతో ఏకీభవించే బిజెపి, శివసేన, వాటిఅనుబంధ సంస్థలు, ఏది వాటంగా వుంటే ఆవైపు మొగ్గే అవకాశవాదానికి ప్రతీకలుగా కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ బూర్జువా పార్టీలని స్థూలంగా చెప్పవచ్చు. వూహాజనితమైన, భావోద్రేకాలను రెచ్చగొట్టే అంశాలను ముందుకు తెచ్చి దేశాన్ని పట్టి పీడిస్తున్న తక్షణ సమస్యలుగా చిత్రించటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెట్టింది పేరు. వుదాహరణకు లవ్‌ జీహాద్‌. ముస్లిం యువకులు హిందూ బాలికలను ఆకర్షించి వివాహాలు చేసుకొని ముస్లింలుగా మార్చివేస్తున్నారన్నది వాటిలో ఒకటి. అందుకోసం హిందూ కుటుంబాలన్నింటినీ కలసి దాని గురించి చెప్పాలని పిలుపునిస్తారు. వాలెంటైన్స్‌ డే రోజున ఏడాదికి ఒకసారి పార్కుల వెంట తిరిగి ప్రేమికుల కోసం వెతకటం రెండవది. ఈ బాపతు భాషలో చెప్పాలంటే రుక్మిణిని లేపుకు పోయి వివాహం చేసుకున్న కృష్ణుడిని మాత్రం ఆదర్శ పురుషుడిగా కొలుస్తారు.

మూడుసార్లు తలాక్‌ చెప్పటం ద్వారా విడాకులు చెల్లవని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము ముస్లిం మహిళలను విముక్తి చేశామని, అందువలన వారంతా బిజెపికే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి మహిళల పట్ల ఆ పార్టీకి లేదా దానిని సృష్టించిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి చిత్తశుద్ది లేదు. హిందూకోడ్‌ బిల్లు విషయంలో అదెలా వ్యవహరించింది చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ గాంధీ తరువాత భారత్‌ అనే తన పుస్తకంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ధర్మశాస్త్రాల ప్రాతిపదికన ఏర్పడిన హిందూ చట్టాలలో జోక్యం చేసుకొనేందుకు రాజ్యాంగపరిషత్‌కు ఎలాంటి హక్కు లేదంటూ 1949లోనే ఆలిండియా యాంటీ హిందూకోడ్‌ బిల్‌ కమిటీ ఏర్పడింది. దేశమంతటా సభలు పెట్టారు. వుపన్యాసాలు చేసిన వారు, పాల్గన్న వారంతా ధర్మ యుద్ధ సైనికులుగా పోరాడతామన్నారు. ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సభను ఏర్పాటు చేసింది. హిందూ సమాజంపై బిల్లు ఆటంబాంబు వంటిదని ఒక వక్త వర్ణించాడు. రౌలట్‌ చట్టం బ్రిటీష్‌ రాజ్య పతనానికి నాంది పలికినట్లుగా ఈ బిల్లు నెహ్రూ ప్రభుత్వపతనానికి దారి తీస్తుందన్నారొకరు. మరుసటి రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రాజ్యాంగపరిషత్‌ భవనం వద్ద ప్రదర్శన చేశారు. నెహ్రూ, అంబేద్కర్‌ దిష్టిబమ్మలను తగులబెట్టారు. ఒక అంటరాని వ్యక్తికి బ్రాహ్మ ణులు కాపాడే విషయాలతో పనేమిటని కరపత్రిజీ మహరాజ్‌ అనే పెద్దగా తెలియని ఒక స్వామిజీ అంబేద్కర్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. పురుషులు రెండో వివాహం చేసుకోవటం గురించి యాజ్ఞవల్క్యుడే స్వయంగా ఇలా చెప్పాడంటూ సమర్ధించాడు. దాని ప్రకారం భార్యకు నిరంతరం మద్యం తాగే అలవాటు వుంటే, పిల్లలు పుట్టరని తేలితే, మాయలాడి, పెద్ద నోరుగలది, మగ పిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలను మాత్రమే కన్నపుడు, భర్తను ద్వేషించినపుడు మొదటి భార్య జీవించి వున్నా భర్త రెండవ వివాహం చేసుకోవచ్చనిచెప్పాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం విడాకులు నిషేధం ఇలా సాగింది స్వామీజి సమర్దన. బిల్లుకు వ్యతిరేకంగా ద్వారకా పీఠ శంకరాచార్య ఒక ఫత్వా జారీచేశారు.

ఈ పూర్వరంగంలో లింగవివక్ష నివారణ, మహిళలకు సమాన స్థాయి కల్పించే లక్ష్యంతో రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడు అంబేద్కర్‌ నాటి ప్రధాని నెహ్రూ మద్దతుతో 1951లో హిందూ కోడ్‌ బిల్లును ప్రతిపాదించారు. దానిలో మహిళలకు వారసత్వం, విడాకులు,భరణపు హక్కులను ఇవ్వటంతో పాటు వివాహవయస్సు పెంపు, బహుభార్యాత్వానికి వ్యతిరేకత, వితంతు వివాహాలు, బాల్యవివాహాల నిరోధం వంటి అనేక పురోగామి అంశాలను దానిలో చేర్చారు. ఈ బిల్లును ఆనాడు హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌, నేటి బిజెపి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అది హిందూ జీవన విధానాన్ని, మహోన్నతంగా నిర్మితమైన హిందూ సంస్కృతిని నాశనం చేస్తాయని నాశనం చేస్తాయని గగ్గోలు పెట్టాయి. వారికి మిగతా మితవాద సంస్థలు, కాంగ్రెస్‌లోని మితవాదులు తోడయ్యారు. ఇహ సంఘపరివార్‌ వంటి సంస్థలున్న తరువాత పుకార్లకు కొదవేముంటుంది. తన కుమార్తె ఇందిరా గాంధీ విడాకులకోసమే నెహ్రూ ఈ బిల్లును తెచ్చారని ప్రచారం చేశారు. వత్తిడికి తలగ్గిన నెహ్రూ బిల్లును వాయిదా వేయించారు. దానికి నిరసనగా అంబేద్కర్‌ రాజీనామా చేశారు. 1952తొలి పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ బిల్లును ఒక సమస్యగా చేసి ప్రచారం చేసిన నెహ్రూ ఆ తరువాత 1956లో అదే బిల్లు ఆమోదానికి దోహదం చేశారు.

ఇటీవల కాలానికి వస్తే రూప్‌ కన్వర్‌ అనే ఒక 18ఏండ్ల యువతి రాజస్ధాన్‌లోని దేవరాల గ్రామంలో మరణించిన ఆమె భర్తతో కలిపి సజీవ దహనం చేశారు. అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం ఆమె తప్పించుకొని పారిపోతే అత్తమామలు, ఇతర బంధువులు లాక్కొచ్చి మరీ చితిపై పడవేశారు. ఈ దుర్మార్గాన్ని కొందరు సతికి సహకరించటంగా వర్ణించి సమర్ధించారు.దీన్ని సమర్ధించటంలోనూ, అనుకూలంగా ప్రదర్శనలు, ఆందోళనలు చేయటంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వంటి మతోన్మాద సంస్ధలు ముందున్నాయని మరచిపోకూడదు.( సాంప్రదాయం ఇతరులకే గాని తమకు కాదు అన్నట్లుగా ఆ దురాచారాన్ని నిస్సిగ్గుగా సమర్ధించిన బిజెపిలో ఏ ఒక్కరు కూడా సతికి పాల్పడినట్లు మనకు ఎక్కడా వార్తలు కనిపించవు). అది రాజపుత్రుల సాంప్రదాయమని, స్వచ్చందంగానే సతికి పాల్పడతారని ప్రచారం చేశారు. ఈ వుదంతంలో కూడా కాంగ్రెస్‌ అవకాశవాద వైఖరి కనిపించింది. అందుకు పాల్పడిన వారి మీద కేసు నమోదు చేసేందుకు, తీరా నమోదు చేసినా కేసు నిలిచేందుకు వీలుగా వ్యవహరించటంలో విఫలమైంది. కేసులో సాక్షులుగా పేర్కొన్నవారు అడ్డం తిరగటంతో అది వీగిపోయింది. హిందూకోడ్‌ బిల్లును తన కుమార్తె విడాకుల కోసం నెహ్రూ తెచ్చాడని ప్రచారం చేసిన వారి వారసులే, రూపకన్వర్‌ వుదంతంలో నెహ్రూమనవడు, ప్రధానిగా వున్న రాజీవ్‌ గాంధీ పట్ల కూడా అలాగే వ్యవహరించారు. ఒక పార్సీ అయిన ప్రధాని రాజీవ్‌ గాంధీ ఒక విదేశీ మహిళను వివాహం చేసుకొని హిందూ మతాన్ని అవమానిస్తున్నారని భక్తిలాల్‌ అనే రాజస్ధాన్‌ మాజీ ఎంపీ ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. తరువాత సతి నిరోధక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు బిజెపి దానిని వ్యతిరేకించింది. సతి రాజపుత్రుల సంప్రదాయమని దానిని విధిగా రక్షించాలని వాదించింది.

శబరిమల ఆలయ పవిత్రతను రక్షించాలని కోరే వారిలో ఆధునిక ఛాందసవాద మహిళలేమీ తక్కువ తినలేదు. రెడీ టు వెయిట్‌ అంటే తమకు ఆలయ సందర్శన అర్హత వచ్చేవరకు(50నిండేవరకు) వేచి చూస్తాం అనే వారికి ఒక మనవి, ఒక సవినయ ప్రశ్న. ఆలయ సందర్శన మీ ఇష్టం, వెళ్లే వారిని అడ్డుకోవద్దు అని చెప్పటం తప్ప మిమ్మల్ని దేవాలయ ప్రవేశానికి బలవంతం చేసేవారెవరూ లేరు. ఇక్కడ తర్కంతో ఆలోచిస్తే ఈ నినాదం ఇచ్చేవారు ఇబ్బందుల్లో పడతారు. సాంప్రదాయాలను కాపాడాలి, పాటించాలి, అమలు జరపాలి అనే వారు ఒక్క శబరిమల ఆలయానికే పరిమితమా లేక ఇతర సాంప్రదాయాలన్నింటి విషయంలో అదే వైఖరిని కలిగి వుంటారా? సతి కూడా సాంప్రదాయమే దాని పరిరక్షించాలి, అనుమతించాలని రెడీ టు వెయిట్‌ పూర్వీకులు గతంలో ప్రదర్శనలు చేసిన విషయాన్ని వారు గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ఈ విషయంలో రెడీ టు సతి బర్న్‌ (సతి చితిమంటలకు సిద్ధం) అని పిలుపిస్తారా? బహుభార్యాత్వం కూడా మన సాంప్రదాయంలో భాగమే, అందుకు కూడా సిద్దపడతారా ? పురాణ పురుషుడు కౌశికుడికి వేశ్యకొంపల వెంట తిరిగే అలవాటుంది.కుష్టువ్యాధి సోకినా ఆ బుద్ది పోలేదు, ఏకంగా భార్యనే వారి వద్దకు తీసుకుపొమ్మని చెప్పిన అంశం తెలిసిందే. తెల్లవారే సరికి మరణించాలని దారిలో మాండవ్యముని శాపానికి గురైన భర్తను రక్షించుకొనేందుకు కౌశికుడి భార్య తన ప్రాతివ్రత్యంతో సూర్యోదయాన్నే నిలిపివేయించిందట. అంత చేయకపోయినా సాంప్రదాయాలను పాటించాలి, వాటికి కట్టుబడివుండాలని చెబుతున్నవారు కౌశికుడి భార్య బాటలో నడచి భర్తలను వేశ్య కొంపల వెంట తిప్పుతారా? సూర్యోదయాన్ని ఆపలేకపోయినా కనీసం పోలీసు అరెస్టులనైనా అడ్డుకుంటారా? వుద్రేకం వివేచనను లేకుండా చేస్తుంది, అవి వేరు ఇవి వేరు అని అవకాశవాదంతో మాట్లాడకండి. ఇలాంటి వాటిని అడ్డుకుంటే తిరోగామి శక్తులు వదలి వేసిన పనికి మాలిన సాంప్రదాయాలకు ఘనత ముసుగు తొడిగి స్త్రీలను తిరిగి వెనుకటి స్ధితిలోకి నెట్టినా ఆశ్చర్య పడనవసరం లేదు. నిదానంగా ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వున్న రాయితీలనే ఎత్తి వేస్తున్నవారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారా ?

06 Saturday Oct 2018

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

cutting down the farm subsidies, DFI, double the farmers income, India Farm Subsidies

Related image

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా స్విడ్జర్లాండ్‌లోని ప్రతి కుటుంబం రెండున్నరవేల ఫ్రాంక్‌లు(స్విస్‌ కరెన్సీ) దేశ వ్యవసాయ విధానాల అమలుకు మూల్యంగా చెల్లించాల్సి వస్తోందని సెప్టెంబరు రెండవ వారంలో ఒక వార్త వచ్చింది. ఇది రాసే సమయానికి ఒక ఫ్రాంక్‌ విలువ 75రూపాయలకు పైబడి వుంది. అంటే ప్రభుత్వం నుంచి ఏటా లక్షా తొంభైవేల రూపాయలు రైతాంగానికి సబ్సిడీ లేదా మరో రూపంలో అందుతున్నది. దేశ ఆర్ధిక వ్యవస్ధకు వ్యవసాయ రంగం నుంచి వస్తున్న ఆదాయం 340 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగానికి దేశం ఖర్చు చేస్తున్న మొత్తం 1990 కోట్ల ఫ్రాంక్‌లుగా వుందని, ఇలా ఇంకెంత మాత్రం కొనసాగకూడదని తాజాగా ఒక సంస్ధ తన అధ్యయనంలో పేర్కొన్నది. కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలు నేరుగా ఇస్తున్న మొత్తాలు, పన్నుల రాయితీలు 490, దిగుమతుల ఆంక్షల కారణంగా వినియోగదారులకు ధరలు పెరిగి 460, ఎగుమతుల కోసం ఇస్తున్న రాయితీలు 310, పర్యావరణ నష్టం 730 కోట్ల ఫ్రాంక్‌ల వంతున వున్నట్లు దానిలో తేల్చారు. పురుగు మందుల వాడకం, మాంసం కోసం పెంచే పశువుల పెంపకం, మాంస పరిశ్రమల ద్వారా జరిగే పర్యావరణ నష్టాల వంటివాటిని వ్యవసాయానికి చేస్తున్న ఖర్చుగా లెక్కించారు.

ఐరోపాలో వ్యవసాయానికి రాయితీలు ఇచ్చే దేశాల వరుసలో నార్వే, ఐస్‌లాండ్‌, స్విడ్జర్లాండ్‌ మొదటి మూడు స్ధానాల్లో వున్నాయి. స్విస్‌లో వ్యవసాయ రంగానికి అవుతున్న మొత్తం ఖర్చు పైన చెప్పుకున్నట్లుగా 1990 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగం ద్వారా వచ్చే మొత్తం 340 కోట్లకు వ్యవసాయ వస్తువులపై విధించే దిగుమతి పన్ను ద్వారా వచ్చే 60కోట్లను కూడా కలుపుకుంటే నికరంగా ప్రభుత్వం అంటే జనం భరించే మొత్తం 1590 కోట్ల ఫ్రాంక్‌లని, ప్రతి కుటుంబానికి 4,500 ఫ్రాంక్‌లైతే పర్యావరణ నష్టాన్ని మినహాయించి లెక్కవేస్తే 2,570 ఫ్రాంక్‌లను భరించాల్సి వస్తోందని లెక్కలు చెప్పారు. ఈ నివేదిక చదివిన,విన్న,కన్నవారు ఇంత భారం మోపి వ్యవసాయం చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది, కావాల్సినవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే పోదా అనుకోవటం సహజం.ఈ లెక్కలు అక్కడి పాలకులకు తెలియవా ? అసలు విషయం ఏమంటే వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేయాలనేవారి కుతర్కమిది. స్విస్‌ వ్యవసాయ- ఆహార పరిశ్రమ ద్వారా ఏటా జిడిపికి 9000 కోట్ల ఫ్రాంక్‌లు సమకూరుతున్నాయి.వ్యవసాయం లేకపోతే దానికి ముడిసరకులు ఎక్కడి నుంచి వస్తాయని కొన్ని పార్టీల వారు ఆ నివేదిక మీద ధ్వజమెత్తారు. ప్రస్తుతం అక్కడ వున్న వ్యవస్ధలో పన్నెండుశాతం మంది రైతులు నష్టపోతున్నారన్నది వాస్తవమని ఒక పత్రిక రాసింది.

అయినప్పటికీ 2018ా21మధ్య 78.9 కోట్ల ఫ్రాంక్‌ల సబ్సిడీ కోత పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.2014 వివరాల ప్రకారం అక్కడి రైతు కుటుంబం సగటున ఏడాదికి 65వేల ఫ్రాంక్‌ల రాయితీలు పొందుతున్నది. వ్యవసాయ పంటల మీద వచ్చే నిఖరాదాయం 3000 ఫ్రాంక్‌లు, ఇతర ఆదాయం 26వేలు కలుపుకుంటే మొత్తం 94వేల ఫ్రాంక్‌లు పొందుతున్నట్లు అంచనా వేశారు. 2004ా14 మధ్య సగటున అక్కడి రైతు కుటుంబాల ఆదాయం 12శాతం పెరిగింది. గమనించాల్సిన అంశం ఏమంటే వ్యవసాయం ద్వారా వచ్చే నిఖరాదాయం ఇదే కాలంలో 13 నుంచి మూడు వేల ఫ్రాంక్‌లకు పడిపోయింది. మరి పెరుగుదల ఎలా సాధ్యమైందంటే సబ్సిడీలు 37శాతం, వ్యవసాయేతర ఆదాయం 22శాతం పెరుగుదల ఫలితం. భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ రైతాంగంలో కొంత మంది ఇప్పటికీ దారిద్య్రంలోనే వున్నారు.మన దగ్గర దారిద్య్రం గోచిపాతరాయుళ్ల రూపంలో కనిపిస్తే అక్కడ సూటు, కోటు వేసుకొని కనిపిస్తారు. దాదాపు 50శాతం వరకు రాయితీలు పొందుతున్న రైతుల పరిస్ధితే అలా వుంటే మన దగ్గర రోజు రోజుకూ సబ్సిడీలు తగ్గిస్తున్న పాలకులు మరోవైపు రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు.

తల్లికి తిండి పెట్టని వాడు పిన్నమ్మ చేతికి బంగారు గాజులు వేయిస్తానంటే నమ్మగలమా ! గతంలో రైతులకు ఇచ్చిన రాయితీలకు కోత పెడుతూ, మేం ఇచ్చిన రాయితీలు మీతో అంగీకరించిన వ్యవసాయరాబడిలో పదిశాతం మొత్తానికి లోబడే వున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్ధకు సంజాయిషీ ఇస్తున్న మన పాలకులు రాబోయే రోజుల్లో రాయితీలు తగ్గించటం తప్ప పెంచే అవకాశాలు లేవని ముందుగా తెలుసుకోవాలి. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు పదిశాతం మేరకు పెరిగినట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు మీడియా పేర్కొన్నది. ఎరువుల సబ్సిడీ 64970 కోట్ల రూపాయల నుంచి 70100 కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు. దేశ స్ధూల జాతీయోత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది, త్వరలో చైనాను అధిగమిస్తాం, దానికి మా నరేంద్రమోడీఏ కారణమంటూ ఒక వైపు భజన సాగుతోంది. దానికి అనుగుణ్యంగా లేదా ద్రవ్యోల్బణం మేరకు రైతాంగానికి సబ్సిడీలు మాత్రం పెరగటం లేదు. 2008-09లో మిశ్రమ ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ 65554 కోట్లు యూరియాకు 33940 కోట్లు మొత్తం 989494 కోట్ల రూపాయలకు గాను తాజా బడ్జెట్‌లో కేటాయింపుపైన పేర్కొన్న మొత్తం. అంటే 30వేల కోట్లకు కోత పడింది. తాజా 70వేల కోట్లలో యూరియా సబ్సిడీ 45వేల కోట్లు అయితే మిశ్రమ ఎరువులకు 25వేల కోట్లు మాత్రమే. అంటే మిశ్రమ ఎరువులు వాడే రైతుల మీద ఈ కాలంలో 40వేల కోట్ల అదనపు భారం పడుతున్నట్లే. నూతన ఎరువుల రాయితీ విధానం ప్రకారం నూట్రియంట్‌లను బట్టి రేటు నిర్ణయిస్తున్నారు.2013-14లో అంటే మోడీ అధికారానికి రాక ముందు ఎన్‌పికె,సల్పర్‌ ఎరువులను ఒక్కొక్క కిలో చొప్పున కొన్న రైతుకు రు.20.875,18.679,18.833,1.677 అంటే మొత్తం రు.60.06లను ప్రభుత్వ సబ్సిడీగా ఇచ్చింది. ఇదే ఎరువులను మోడీ హయాంలో అంటే ఇప్పుడు కొనుగోలు చేస్తే ఆ మొత్తం రు.47.96కు తగ్గిపోయింది. ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ శక్తులకు వదలి వేసింది. నిర్ణీత మొత్తాన్ని రాయితీగా ఇస్తోంది. 2011-12నుంచి ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత అప్పటి నుంచి సబ్సిడీ మొత్తం 70వేల కోట్లకు అటూ ఇటూగానే వుంటోంది. రాబోయే రోజుల్లో ఒక వేళ యూరియా ధరలను పెంచితే ఇంతకంటే తగ్గవచ్చు తప్ప పెరిగే అవకాశాలు లేవు. కొన్ని ఎరువుల ధరలు ఎలా పెరిగాయో చూద్దాం. డిఏపి 2017 ఏప్రిల్‌లో టన్ను రు. 21,818, 2018 మార్చి నాటికి 23,894కు చేరింది. జూలై నెలలో 25,706 వున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిత్వశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. టన్నుకు నాలుగు వేలు పెరిగింది. అన్నింటికీ ఇంత పెద్ద ఎత్తున లేనప్పటికీ గణనీయంగా పెరిగాయి.

దేశంలో వినియోగించే డీజిల్‌ ప్రతి వందలో 14 లీటర్లు వ్యవసాయానికి అవుతోంది. వ్యవసాయ వుత్పత్తులను రవాణా చేసే ట్రక్కులది కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. డీజిల్‌ ధరలపై నియంత్రణను మోడీ సర్కార్‌ ఎత్తివేసింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు ఢిల్లీలో ఒక రైతు ట్రాక్టర్‌కు ఒక రోజు పది లీటర్ల డీజిల్‌ను వాడితే 2014 మార్చినెల ఒకటవ తేదీన రు 554.80 చెల్లించాడు. లీటరుకు రు.8.37 చొప్పున 83.70 సబ్సిడీ పొందాడు. అదే రైతు 2018 సెప్టెంబరు 17న అదే ఢిల్లీ బంకులో రు.738.70 చెల్లించాడు. నాలుగేండ్ల క్రితం పీపా అన్ని ఖర్చులతో 126.93 డాలర్లకు దిగుమతి చేసుకున్నాం. సెప్టెంబరు 17న 93.45 డాలర్లకే వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ జరిగిన మార్పేమిటంటే దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర తగ్గింది, ఇతరులతో పాటు రైతులకు వచ్చే రాయితీ ఎగిరిపోయింది, 180 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. నాలుగేండ్ల క్రితం ఒక లీటరు డీజిలుపై ఎక్సయిజు పన్ను రు.3.56, దాన్ని మోడీ గారు రు.15.33 చేశారు.

మోడీ అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ 58 అయితే ఇప్పుడు 73వరకు పతనమైంది. దీని వలన రైతాంగం వినియోగించే పురుగుమందులలో దిగుమతి చేసుకొనే వాటి ధర ఆ మేరకు పెరుగుతుంది. ఒక లీటరు మందును నాలుగు సంవత్సరాల క్రితం 58కి కొంటే ఇప్పుడు 73 చెల్లించాల్సిందే. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ 45-50 మధ్యనే వుంది. రానున్న రోజుల్లో ఇంకా పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను కొనసాగిస్తున్నాయి. అమెరికా 95, బ్రెజిల్‌ 75శాతం స్ధాయికి చేరుకుంటే డీజిల్‌ వినియోగం ఇంకా పెరుగుతుంది. వ్యవసాయ ఖర్చు తగ్గించే పేరుతో యాంత్రీకరణ, దానికి డీజిల్‌ ఖర్చు తడిచి మోపెడైతే బాగుపడేది యంత్రాలను తయారు యజమానులు, చమురు కంపెనీల వారు, పన్నులతో జనాల జేబులకు కత్తెర వేసే ప్రభుత్వం తప్ప ఇంక రైతాంగానికి మిగిలేదేముంటుంది.

Image result for double the farmers income

ఇప్పటికే వున్న సబ్సిడీలు రద్దు లేదా నామమాత్రం అవుతున్నాయి. వాటి కంటే మోయలేని కొత్త భారాలు పడుతున్నాయి. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు గద్దెనెక్కినా లేదా వాటికి మద్దతు పలికి భుజాలు నొప్పి పుట్టేట్లు మోసిన ప్రాంతీయ పార్టీల వారు గానీ రైతాంగానికి, మొత్తంగా జనానికి నిజాలు చెప్పటం లేదు. మన దేశంలో ఆహార భద్రతలో భాగంగా పౌరపంపిణీ వ్యవస్ధ ద్వారా సరఫరా చేసే ఆహార ధాన్యాలకు ఇచ్చే రాయితీలు లేదా నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా కొన్ని సందర్భాలలో వ్యవసాయ రాయితీలలో భాగంగా చూపుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో మోడీగారు ఆబగా కౌగలించుకొనే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఫిర్యాదులో సారాంశమిదే. కనీస మద్దతు ధరల ప్ర కటనను కూడా రాయితీల కిందనే జమకడుతోంది. పౌర పంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలని, రాయితీలు ఇవ్వాలనుకుంటే లబ్దిదార్లకు నేరుగా నగదు ఇవ్వాలని, ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోళ్లను నిలిపివేసి మొత్తం వ్యాపారాన్ని ప్రయివేటు రంగానికి వదలి వేయాలన్నది అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ సంస్కరణల పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు వంతపాడుతున్నాయి. అందుకు అంగీకరించిన మోడీ సర్కార్‌ తొలి దశలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఛండీఘర్‌, పాండిచ్చేరిలో చౌకదుకాణాలను ఎత్తివేసింది. క్లబ్బుడాన్సర్‌లు ఒంటి మీది దుస్తులను ఒకటకటి తొలగించే మాదిరి మన పాలకులు సబ్సిడీలను ఎత్తి వేస్తున్నారు.ఎఫ్‌సిఐకి చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పుగా మార్చివేస్తోంది. 2015-16లో లక్షా35వేల కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ కాగా మరుసటి ఏడాది దానిని లక్షా ఐదువేల కోట్లకు తగ్గించి 25వేల కోట్ల రూపాయలను జాతీయ చిన్నపొదుపు మొత్తాల నిధి నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పుగా అందచేశారు. కేటాయించిన మొత్తాలను కూడా చెల్లించకుండా బకాయి పెట్టి మరుసటి ఏడాది ఆ బకాయిలను కూడా చెల్లింపులలో చేర్చి ఆహార సబ్సిడీ మొత్తాన్ని పెంచినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

వివిధ కారణాలతో కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరల్లో పెరుగుదల లేకపోవటం లేదా తగ్గుదల కనిపిస్తోంది. ఈ సమయంలోనే మోడీ సర్కార్‌ రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తానంటూ ముందుకు వచ్చింది. ప్రపంచ మార్కెట్‌తో పోల్చితే కొన్ని సందర్భాలలో మన దేశంలో ధరలు ఎక్కువగా వున్నాయి. అవి తమకు గిట్టుబాటు కావటం లేదని మన రైతాంగం గగ్గోలు పెడుతోంది. ఈ పరిస్ధితులలో అనేక దేశాలు తమ రైతాంగాన్ని ఆదుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. 2015లో అమెరికాలో ఒక్కొక్క రైతుకు సగటున 7,860 డాలర్లు, బ్రిటన్‌లో 28,300 పౌండ్లు, జపాన్‌లో 14,136, న్యూజిలాండ్‌లో 2,623 డాలర్లు చెల్లించగా మన దేశంలో 417 డాలర్లు మాత్రమే ఇచ్చినట్లు తేలింది. రైతుల ఆదాయాల రెట్టింపు చేయాల్సిన అవసరం, వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక గురించి నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ ఒక పత్రాన్ని రూపొందించారు. 2004-05 నుంచి 2011-12 మధ్య దేశంలో వ్యవసాయదారుల సంఖ్య 16.61 కోట్ల నుంచి 14.62కోట్లకు పడిపోయింది. ఈ ధోరణే కొనసాగితే 2015-16 నుంచి 2022-23 మధ్య మరొక కోటీ 96లక్షల మంది అంటే రోజుకు 6,710 మంది వ్యవసాయం మానుకొంటారని అంచనా వేశారు. జనం తగ్గుతారు గనుక వ్యవసాయ ఆదాయం పెరుగుతుందని, కనుక సబ్సిడీలు తగ్గించవచ్చని కొందరు వాదించేవారు లేకపోలేదు.

అన్ని తరగతుల వారికీ టోకరా వేసి వచ్చే ఎన్నికలలో ఏదో విధంగా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పూనుకున్న పెద్ద మనుషులు అమాయకపు రైతాంగాన్ని వదలి పెడతారా ? 2022 అంటే మనకు స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడిచే నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది నరేంద్రమోడీ అండ్‌ కో చేసిన వాగ్దానం. దాన్ని ఎలా అమలు జరుపుతారు,ఆ దిశలో ఎంతవరకు పయనించారు అని అడుగుదామంటే కుదరదు.ఎందుకంటే ఆ పెద్దమనిషి చెప్పరు, అడుగుదామంటే మీడియాతో మాట్లాడరు. భజనపరులకు అడిగే ధైర్యం ఎలాగూ వుండదు. మౌనమునిగా మన్మోహన్‌సింగ్‌ను వర్ణించిన బిజెపి పెద్దలు తమలో అంతకంటే పెద్ద మహామౌన మునిని పెట్టుకొని లేనట్లే ప్రవర్తిస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల పాలనా కాలంలో మూడు సార్లు మీడియాతో మాట్లాడితే నరేంద్ర ముని ఐదేండ్లలో ఇంతవరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. రైతు జనోద్ధారకుడిగా రాబోయే రోజుల్లో ఓటర్ల ముందుకు వెళ్లేందుకు అమలులో వున్న మూడు పాత పధకాలను కలిపి స్వల్పమార్పులతో కొత్తగా ప్రధాన మంత్రి ఆషా పేరుతో అమలు జరుపుతామని ప్రకటించారు.

రైతాంగ ఆదాయాల రెట్టింపు అన్నది ఆషామాషీ సమస్య కాదు. దానిలో ఎన్నో అంశాలు ఇమిడి వున్నాయి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపధ్యంలో వారి బాగుకోసం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ నానాటికీ పెరుగుతున్నది. స్వామినాధన్‌ కమిషన్‌ వున్నంతలో ఒక శాస్త్రీయ సూత్రాన్ని చెప్పింది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేయటం గురించి ఇంతవరకు ఎలాంటి సర్వే జరపలేదు, ఒక ప్రాతిపదికను ఏర్పరచలేదన్నది పచ్చి నిజం.ఈ విషయాన్ని వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్‌ రూప్లా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2013లో జరిపిన జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) తప్ప తరువాత ఇంతవరకు అలాంటిది జరగలేదు. దానిలో ( 2012 జూలై 2013జూన్‌ మధ్య జరిపిన సర్వే) వ్యవసాయ రంగం పరిస్ధితి మదింపు సర్వే అంశాలనే పార్లమెంట్‌కు సమర్పించారు.

ఆ నివేదికలో వున్న అంశాలేమిటి? దేశ రైతు కుటుంబ తలసరి నెలసరి ఆదాయం రు.6,426, బీహార్‌లో అతి తక్కువ రు.3,558, పశ్చిమ బెంగాల్‌లో రు.3980, వుత్తరా ఖండ్‌లో రు.4,701 కాగా అత్యధికంగా పంజాబ్‌లో రు.18,059, హర్యానాలో రు.14,434, జమ్మూకాశ్మీర్‌లో రు.12,683 వున్నాయి. ఇక తెలుగురాష్ట్రాలకు వస్తే తెలంగాణా రు.6,311, ఆంధ్రప్రదేశ్‌ రు.5,979 చొప్పున వున్నాయి. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కేరళ రు.11,888, కర్ణాటక రు.8,832, తమిళనాడు రు.6,980. నాబార్డు రూపొందించిన నివేదిక ప్ర కారం 2015-16లో దేశ తలసరి కుటుంబ నెలాదాయం రు. 8,931కి పెరిగింది. అత్యధికంగా మొదటి మూడు రాష్ట్రాలైన పంజాబ్‌లో రు.23,133, హర్యానాలో రు.18,49,, కేరళలోరు.16,927 వున్నాయి. చివరి మూడు రాష్ట్రాలైన వుత్తర ప్రదేశ్‌లో 6,668,ఆంధ్రప్రదేశ్‌లో రు.6,920, ఝార్ఖండ్‌లో రు.6,991 వుంది. తెలంగాణాలో రు.8,951, తమిళనాడులో రు.9,775, కర్ణాటకలో రు.10,603గా నమోదైంది.

Image result for cutting down the farm subsidies,india cartoons

ఈ రెండు నివేదికల మధ్య ఆదాయ పెరుగుదల దేశ సగటు 39శాతం వుంది. మహారాష్ట్ర ఒక్కటే దేశ సగటును కలిగి వుంది. వివిధ రాష్ట్రాల మధ్య అంతరాలను పరిశీలిస్తే నాలుగు రాష్ట్రాలలో ఒకటి నుంచి 16.5శాతం వరకు తగ్గగా గరిష్టంగా మూడు రాష్ట్రాలలో 94.9 నుంచి 130.9శాతం వరకు పెరుగదల వుంది. దేశ సగటుకు ఎగువన తొమ్మిది రాష్ట్రాలు 39-65.7శాతం మధ్య వున్నాయి. మిగిలిన చోట్ల తక్కువ నమోదైంది. తెలంగాణాలో 41.8శాతం పెరగ్గా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 15శాతమే వుంది. మూడు సంవత్సరాలలోనే ఇంతటి ఎగుడుదిగుడులు వున్నపుడు ఆదాయాల రెట్టింపునకు ప్రాతిపదిక దేనిని తీసుకోవాలి అన్నది సమస్య. భిన్న ప్రాంతాలు, భిన్న వాతావరణం, భిన్న పంటలు, వనరులు ఇలా అనేక అంశాలలో ఏ ఒక్క రాష్ట్రమూ మిగతావాటితో వాటితో పోల్చటానికి లేదు. ఈ పూర్వరంగంలోనే నీతి ఆయోగ్‌ తొలిసారిగా ఏడాదికేడాది రైతుల ఆదాయాన్ని మదింపు వేసేందుకు పూనుకుంది, వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి వుంది. ఒక అంచనా మేరకు నిజధరల ప్రకారం ప్రస్తుతం రైతుల ఆదాయం ఏటా 3.8శాతం పెరుగుతున్నది. మరోవైపు మార్కెట్‌ ధరల ప్రకారం 11శాతం పెరుగుదల చూపుతున్నది. ఈ లెక్కన మోడీ చెబుతున్నట్లు 2022 నాటికి ఆదాయాలు రెట్టింపు ఎలా అవుతాయి? నిజధరల మేరకు ఆదాయాలు రెట్టింపు కావాలంటే రెండుదశాబ్దాలకుపైనే పడుతుంది. ఈ లోగా వచ్చే మార్పుల సంగతేమిటి?

వ్యవసాయం, పశుసంపద, చేపల పెంపకాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ ఆదాయం లెక్కలు వేస్తున్నారు. కేరళ, హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలలో అడవి మీద ఆధారపడే వారు గణనీయంగా వున్నారు. వారిని ఎలా లెక్కిస్తారు. మిగతా రాష్ట్రాలలో అడవుల నుంచి వచ్చే ఆదాయాన్ని కలిపి వాటికి తేడాలు రావా ? ఆదాయం ఎక్కువగా వున్న పంజాబ్‌, హర్యానా, లేదా దేశ సగటుకు దగ్గరగా వున్న మహారాష్ట్రల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభం కనిపిస్తున్నది. గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఏటా 16.5శాతం వ్యవసాయ అభివృద్ధిని సాధిస్తున్నది. చిత్రం ఏమిటంటే గిట్టుబాటు ధరలు కావాలని, రుణాల రద్దును కోరుతూ అక్కడ పెద్ద ఎత్తున రైతులు వీధుల్లోకి వచ్చారు. అందువలన అభివృద్ధి అంటే ఏమిటి? ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే తరువాత మూడు సంవత్సరాలలో సగటున రైతుల ఆదాయం 39శాతం పెరిగిందని నాబార్డు నివేదిక చెప్పింది. ఈ కాలంలో పాత విధానాల కొనసాగింపు తప్ప ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలేమీ లేవు. ఆ నివేదికే వాస్తవం అనుకుంటే కొన్ని చోట్ల రెట్టింపు ఆదాయాలు ఇప్పటికే వచ్చాయి, మరికొన్నిచోట్ల వున్న ఆదాయాలకే గండిపడింది. వీటిని ఎలా చూడాలి? ఏనుగు ఎలా వుందని అడిగితే తలా ఒక వర్ణన చేసినట్లుగా ఎవరి అవగాహనకు అనుగుణంగా వారు నివేదికలు ఇస్తున్నట్లు మనకు స్పష్టం అవుతున్నది. దారీ తెన్నూ నిర్ధారించుకోలేని మోడీ సర్కార్‌ రైతాంగాన్ని ఎక్కడికో తీసుకుపోతోంది తప్ప ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

497 వివాదం పురుషుల పట్ల వివక్ష మీద- తీర్పు, చర్చ మహిళల సమానత్వం గురించి !

29 Saturday Sep 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Women

≈ Leave a comment

Tags

Adultery, adultery law, IPC section 497, Supreme Court of India

Image result for adultery law : challenged by men, ruling and discussion focused on women

ఎం కోటేశ్వరరావు

‘భర్త అంటే భార్యకు యజమాని కాదు, వేరొకరి భార్యతో మరో పురుషుడు సంబంధం పెట్టుకుంటే ఆ కారణంగా విడాకులు కోరవచ్చు అది తప్పిదం తప్ప ఆ చర్య శిక్షార్హమైన నేరపూరితమైది కాదు ‘ సుప్రీం కోర్టు మన శిక్షా స్మృతిలోని 158 ఏండ్ల నాటి చట్టం చెల్లదంటూ కొట్టి వేస్తూ ఇచ్చి తీర్పు సారాంశమిది. అయితే ఈ తీర్పు వివాహితుల విశృంఖలతకు, వివాహ వ్యవస్ధ విచ్చిత్తికి దోహదం చేస్తుందంటూ ఆడమగా తేడా లేకుండా కొందరి నుంచి తీవ్ర వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(ఈ రచయిత న్యాయ నిపుణుడు కాదు, కనుక పరిమితులు వున్నాయని గమనించ మనవి). న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారిచ్చే ఏ తీర్పునైనా విమర్శించ వచ్చు కనుక వారికా స్వేచ్చ వుంది. ఇక తాజా తీర్పు విషయానికి వస్తే అసలు ఈ కేసును దాఖలు చేసిన వ్యక్తి వుద్ధేశ్యం వేరు. ఇప్పుడున్న చట్టం పురుషుల పట్ల వివక్షతో కూడుకున్నదని తన స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడిన కారణంగా ఆ వివక్షను సవాలు చేస్తూ పగబట్టిన మహిళలు, వారి భర్తల నుంచి వివాహేతర సంబంధాల విషయంలో పురుషులను రక్షించేందుకు తాను కేసు దాఖలు చేసినట్లు కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు జోసెఫ్‌ షైనీ చెప్పాడు. అతను ఇటలీలో ఒక హోటల్‌ నిర్వహిస్తున్నాడు. దీనిపై వెలువడిన తీర్పు, దాని మీద జరుగుతున్న చర్చ మహిళల సమానత్వం, ఇతర అంశాల చుట్టూ తిరగటం విశేషం.

రంకుతనం నేరపూరితమైనదిగా నిర్దేశించిన భారతీయ శిక్షా స్మృతిలోని 497వ సెక్షన్‌ చెల్లదని ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. భారతీయ శిక్షా స్మృతిలో రంకుతనం గురించి చెబుతున్న సెక్షన్‌ 497 ప్రకారం దానికి పాల్పడిన మహిళలను శిక్షించే అవకాశం లేదు. భర్త అంగీకారం లేకుండా అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడు మాత్రమే నేరం చేసినట్లుగా అది చెబుతున్నది. ఎవరైనా రంకుతనానికి పాల్పడితే భాగస్వామి ఆ కారణంగా విడాకులు కోరవచ్చు. ఈ సెక్షన్‌ భర్తను ఒక యజమానిగా పరిగణిస్తున్నదంటూ కోర్టు కొట్టి వేసింది. రంకుతనం(వివాహేతర సంబంధం) అంటే ఒక వ్యక్తి అంగీకారం లేదా చూసీచూడనట్లుగా వుంటే తప్ప అతని భార్యతో ఎవరైతే లైంగిక సంబంధం కలిగి వున్నారో దాన్ని రంకుతనంగా పరిగణిస్తారు. అటు వంటి సంబంధం అత్యాచార నేరం కిందికి రానప్పటికీ రంకుతనపు నేరస్దుడిగా పరిగణించబడతాడు. అందుకుగాను జరిమానాతో లేదా జరిమానా లేకుండా, లేదా జరిమానాతో సహా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అలాంటి కేసులలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిందంటూ భార్యను శిక్షించటానికి వీలు లేదు.

ఈ భాష్యం అనేక అంశాలను ముందుకు తెచ్చింది. రంకుతనం నేరంలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిన వ్యక్తిగా వివాహిత మహిళను పరిగణించరు. అంటే రంకుతనానికి పురుషులను తప్ప మహిళలను బాధ్యురాలిగా చూడటం లేదు. వివాహంగాని ఒక మహిళ ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుంటే ఈ సెక్షన్‌ వర్తించదు. ముందే చెప్పినట్లు భర్త అనుమతించినా, చూసీచూడనట్లు వ్యవహరించినా ఆ రంకుతనం నేరం కాదు. రంకుతనానికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయటానికి సదరు వివాహిత మహిళ భర్తకు మాత్రమే హక్కు వుంది. సదరు పురుషుడి భార్య హక్కు గురించి ఏమీ చెప్పలేదు. అంటే ఒక మహిళ ఒక పురుషుడికి చెందినది మాత్రమే అని, ఒక వేళ ఆమె వివాహేతర సంబంధానికి అంగీకరించినప్పటికీ ఆమెకు స్వంతంగా ఎలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు వుండవని సెక్షన్‌ పరిగణిస్తున్నది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 మరియు 15ను వుల్లంఘిస్తున్నదని అందువలన దాని మీద విచారణ జరపాలంటూ 2017 డిసెంబరులో సుప్రీం కోర్టు ముందు ఒక జోసెఫ్‌ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సుప్రీం కోర్టు విచారణకు అనుమతించింది.

రాజ్యం ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టపరమైన సమాన రక్షణను నిరాకరించజాలదని ఆర్టికల్‌ 14 చెబుతుండగా కుల, మత, తెగ, లింగ, పుట్టిన ప్రాంతం తదితరాలు కారణాలుగా ఏ పౌరుడి పట్ల వివక్ష చూపరాదని ఆర్టికల్‌ 15చెబుతున్నది. జోసెఫ్‌ పిటీషన్‌ స్వీకరించిన కోర్టు 497 సెక్షన్‌ను సవాలు చేసిన తొలి పిటీషన్‌ ఇది కాదని 1954 నుంచీ సవాలు చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి, కేసులున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పెద్ద ప్రయాస లేకుండానే దీని గురించి నిర్ణయించవచ్చని పేర్కొన్నది. చట్టాలు లింగ సంబంధంగా తటస్ధంగా వుండాలని భావించింది. పురుషుల పట్ల వివక్ష చూపుతున్నదని పిటీషన్‌దారు వాదించాడు. ఈ పిటీషనర్‌ వాదనను అంగీకరిస్తే ఇప్పటి కంటే వివాహేతర సంబంధాలు మరింత స్వేచ్చగా చెలరేగుతాయని, దీని బదులు సంస్కరణల కమిటీ సూచించినట్లుగా ‘ మరొక వ్యక్తి భాగస్వామి లేదా మరొకరితో ఎవరు లైంగిక సంబంధాలు నెరిపినా దానిని రంకుతనంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఆగస్టు ఒకటిన వాదనలు వినటం ప్రారంభించిన కోర్టు సెప్టెంబరు 27న ఆ సెక్షన్‌ చెల్లదంటూ ఐదుగురు సభ్యుల బెంచ్‌ తీర్పు చెప్పింది.

తీర్పు పట్ల పిటీషనర్‌ జోసెఫ్‌ హర్షం వ్యక్తం చేశారు. తన స్నేహితుడితో కలసి పని చేస్తున్న వుద్యోగిని ఒకరు ఒకరు తప్పుడు అత్యాచార ఆరోపణ చేయటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ వుదంతం తనను పిటీషన్‌ వేసేందుకు ప్రేరేపించిందని చెప్పాడు. మహిళలు ఇష్టపూర్వకంగానే భాగస్వాములై వుండవచ్చు, కానీ భర్తలు ఫిర్యాదు చేసినపుడు సంబంధం పెట్టుకున్న పురుషుడు బాధితుడు అవుతున్నాడు. ఇలాంటి ఫిర్యాదులు దాఖలైనపుడు పురుషుడు ఒంటరి తనం ఫీలవుతాడు. తట్టుకోలేకపోవచ్చు. ఈ సెక్షన్‌ రద్దు ఒక ప్రాధమిక చర్య, అది అనేక మార్పులకు దారి తీయవచ్చు అన్నాడు. కేరళ పురుషుల్లో రంకుతనం విచ్చలవిడిగా వున్నప్పటికీ బయటకు ఖండిస్తారు అన్నాడు.

భారతీయ సంస్కృతి ఏమౌతుందో అని ఆవేదన చెందే వారు ఈ తీర్పు వివాహేతర సంబంధాలకు ఇప్పటి వరకు వున్న బంధనాలను ఛేదించి స్వేచ్చ ప్రసాదించిందని, దీన్ని అవకాశంగా తీసుకొని స్త్రీ, పురుషులు ఇక తెగబడతారని, ఇంక పెళ్లెందుకు అని ఈసడించుకుంటున్నారు. గతాన్ని ఒకసారి అవలోకించటం అవసరం. ఇక్కడ ఇతిహాసాలు, మనుస్మృతి లేదా పురాణాల వుదంతాలను ప్రస్తావిస్తున్నామంటే అర్ధం వాటిన నమ్మిలేదా అవి మంచివి అని అర్ధం కాదు. వాటి ప్రభావం సమాజం మీద తీవ్రంగా వుందన్నది కాదనలేని వాస్తవం. కొన్ని సందర్భాలలో తమకు వాటంగా వుందనుకున్నపుడు వాటిని మన సంస్కృతిగా చూపుతూ రక్షణగా తీసుకోవటం, ఇష్టం లేనపుడు వాటికి విరుద్దంగా వాదించే అవకాశవాద వైఖరి మన సమాజంలో కనిపిస్తుంది. దాన్ని చెప్పేందుకే వాటి ప్రస్తావన పరిమితి. మిర్యాలగూడెం ప్రణయ్‌-అమృత వివాహ విషయాన్నే చూడండి.మిర్యాల గూడెం అమృత, ప్రణయ్‌ వివాహ వుదంతంలో తొమ్మిదో తరగతిలో ప్రేమ ఏమిటి అని బుగ్గలు నొక్కుకుంటున్న వారు రుక్మిణిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న సమయంలో కృష్ణుడి వయసెంతో చెబుతారా ? రుక్మిణికి 13 లేదా 14, కృష్ణుడికి 14, కొన్ని పురాణాల ప్ర కారం ఎనిమిది, 16, ఆ సమయానికి కృష్ణుడు ఇంకా సెటిల్‌ కాలేదు. సీతారాముల వివాహ సమయంలో వారి వయస్సు 12-6 సంవత్సరాలట. ఆ వుదంతాలను లట్టలు వేసుకుంటూ భక్తి పారవశ్యంతో చూస్తాం. మరి దీన్నెందుకు ద్వేషిస్తున్నాం. వారు అవతారపురుషులు అనేట్లయితే, ముందే రాసి పెట్టిన దాని ప్రకారం ఎలాగూ వివాహం అవుతుంది కదా? అంత చిన్న వయస్సులో అలా చేసుకోవాల్సిన ఖర్మేం పట్టింది. మనుస్మృతిలోని ఒక శ్లోకం ప్రకారం యుక్త వయస్సు వచ్చిన యువతి తనను చేపట్టే పెండ్లికొడుకు కోసం మూడు సంవత్సరాలు ఆగాలి. పెండ్లికొడుకులు రానపుడు ఆయువతే తనకు కావాల్సిన వాడిని చూసుకోవచ్చు.అని కామకోటి.ఓఆర్‌జిలో రాశారు.వీటన్నింటినీ చూసినపుడు చూసినపుడు ప్రణయ్‌-అమృత బాల్య వివాహం చేసుకోలేదు. చట్ట ప్రకారం వయస్సు వచ్చిన తరువాతే చేసుకున్నారు.శివుడిని తన కుమార్తె పార్వతి వివాహం చేసుకోవటం ఇష్టం లేని దక్షుడు వారిమానాన వారిని వదలి వేశాడు తప్ప శివుడ్ని చంపించేందుకు సుపారీ ఇచ్చి ఏర్పాట్లు చేయలేదే. విధి రాతను తప్పించలేం అని నమ్మేట్లయితే అందుకు విరుద్దంగా హత్య చేయించటం విధిని వెనక్కు తిప్పే ప్రయత్నమే కదా? అలాంటి మారుతీరావుకు మద్దతుగా ప్రదర్శనలు జరపటం, సామాజిక మాధ్యమాల్లో మద్దతు ప్రకటించట అంటే సమాజరీతిని వెనక్కు నడిపించాలని చూడటం తప్ప వేరు కాదు.

మహాభారతంలో పాండు రాజు ఇతరుల నుంచి పిల్లలను కనాలని కుంతిని స్వయంగా ప్రోత్సహించాడు. కుంతి తొలుత అంగీకరించలేదు. భార్య ఒక భర్తకే కట్టుబడి వుండాలన్న ఆంక్షలేవీ లేవని చెబుతాడు. ఆమె ఒకరికి పరిమితం కాకుండా ఒకరిని అనధికారికంగా ఐదుగుర్ని ఐదుగురితో అధికారికంగా కన్నదనుకోండి అది వేరే విషయం. ద్రౌపది ఆ పాండవులను ఐదుగుర్నీ భర్తలుగా చేసుకుంది. దాని వలన మన సమాజానికి హాని కలిగిందని ఎవరూ చెప్పలేదు. ఏదో ఒకసాకుతో ఆమోదించారు. వుద్ధాలకుడి కుమారుడు శేవత్‌కేతు తన తల్లి ఇతరులతో సంబంధాలను కలిగి వుండటాన్ని చూసి భార్యలు భర్తలకే పరిమితం కావాలన్న కొత్త నిబంధనను తీసుకువచ్చిన విషయమూ తెలిసిందే. భర్త చనిపోయినపుడు నియోగి విధి పేరుతో అంబిక, అంబాలిక పిల్లలను కనవచ్చని వ్యాసుడే చెప్పాడు. ఇప్పుడెవరైనా ఆ పని చేస్తే అంగీకరిస్తారా? రామాయణం విషయానికి వస్తే కొంత కాలం పరపురుషుడి పంచన వున్న ఒక మహిళ పవిత్రంగా ఎలా వుంటుందన్న మాటలు విన్న రాముడు సీత పవిత్రతను నిరూపించుకొనేందుకు అగ్ని ప్రవేశం చేయమన్న విషయం తెలిసిందే. అదే రాముడి సాయం పొందిన సుగ్రీవుడు తన భార్య రుమ వాలి చెరలో వున్నప్పటికీ ఆమె పవిత్రను నిరూపించుకోమని కోరలేదు. రాముడు కూడా దాన్ని రుద్దలేదు. మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం మహిళలు పురుషుల ఆస్తులుగానే వున్నారు తప్ప వారి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు. మనుస్మృతి ప్రకారం ఒక మహిళ ఎగువ తరగతి కులపు వ్యక్తితో సంభోగిస్తే అది శిక్షించదగిన చర్య కాదు. అదే దిగువ కులపు పురుషుడితో చేస్తే శిక్షార్హమేకాదు ఆమెను విడిగా వుంచాలి. దిగువ తరగతి పురుషుడు ఎగువ తరగతి మహిళతో సంబంధం కలిగి వుంటే అతనికి వురి శిక్ష విధించాలి. ఎవరైనా పురుషుడు (భార్యకాని) తన స్వంతకులపు మహిళతో తన ఇచ్చ తీర్చుకుంటే అతడు ఆమెకు పరిహారం చెల్లించాలి. ఈ తీరు తెన్నులను మన గత ఘన సంస్కృతి అని కీర్తిద్దామా?

ఎవరి వాదనలు వారు, ఎవరి తర్కం వారు చెప్పవచ్చు. తమకు నచ్చని భావాలను వ్యతిరేకించటం,అసహనాన్ని ప్రదర్శించవద్దు.తమ భావాలను ఇతరుల మీద రుద్ద వద్దు. సమాజం తనకు ఆటంకం కలిగించే వాటిని నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టివేసి ముందుకు పోతుంది. వివాహేతర సంబంధాలు నేరాలు కావని చెప్పటమంటే అలాంటి సంబంధాలు పెట్టుకోమని చెప్పినట్లు కాదు. చట్టం వున్నప్పటికీ రోజూ జరుగుతున్న అనేక నేరాలకు అవే కారణమని మనకు తెలిసిందే. అందువలన రంకుతనం అనేది చట్టం వుంటే అదుపులో వుంటుందని లేకపోతే విచ్చలవిడిగా పెరిగిపోతుందని వాదించటం అంటే మనమీద మనకే నమ్మకం లేకపోవటం. అనేక దేశాలలో ఇలాంటి బూజుపట్టిన చట్టాలు ఎప్పుడో రద్దయ్యాయి. అక్కడ వివాహవ్యవస్ధ, కుటుంబ జీవనం లేదా, నైతిక విలువలు లేవా? ఏ సమస్య మీద అయినా మధనం జరగనివ్వండి, ఎవరికి వారిని మంచి చెడ్డలను నిర్ణయించుకోనివ్వండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

2008 సంక్షోభానికి పదేండ్లు- మరో ముప్పు ముంచుకొస్తోంది !

12 Wednesday Sep 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

2008 financial crisis, 2008 meltdown, Another financial crisis, Collapse of Lehman brothers, Great Depression

Image result for ten years of 2008 financial crisis cartoons

ఎం కోటేశ్వరరావు

2008, ప్రపంచ ధనిక దేశాలలో తలెత్తిన మరొక మహా సంక్షోభానికి పది సంవత్సరాలు. అమెరికాలోని లేమాన్‌ బ్రదర్స్‌ బ్యాంకు 2008 సెప్టెంబరు15న దివాలా ప్రకటన చేయటాన్ని చాలా మంది మరచిపోయి వుంటారు. ప్రపంచ ధనికులు మాత్రం మెలకువగానే వున్నారు. వారిలో ఒకడిగా 92బిలియన్ల సంపదకలిగిన బిల్‌గేట్స్‌ ‘ఎప్పుడు అన్నది చెప్పటం కష్టంగానీ 2008 వంటి మరో సంక్షోభం రావటం తప్పని సరి ‘ అని ఈ ఏడాది మార్చి2న ఒక ఆస్ట్రేలియా మీడియాలో అడిగిన ప్రశ్నకు చెప్పారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తిరుగులేని విధంగా తెలిసినట్లే ఒకదాని తరువాత ఒక సంక్షోభం రావటం పెట్టుబడిదారీ విధానంలోనే ఇమిడి వున్న లక్షణం అని గేట్స్‌ వంటి వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అందుకే తాము మునిగి పోకుండా వుండేందుకు నిరంతరం దారులు వెతుకుతుంటారు. పదేళ్ల నాటి సంక్షోభం దెబ్బకు అమెరికాలో 87లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. సంక్షోభం నుంచి కోలుకున్నట్లు చెబుతున్నా ఇప్పటికీ పూర్వపు స్ధితికి చేరుకోలేదు.

ఇప్పటికీ ప్రధాన స్రవంతి మీడియా లేదా వామపక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలు జనానికి ఇలాంటి వాటి గురించి వాస్తవాలు చెప్పటం లేదు. తప్పుడు నిర్ణయాలు, విధానాలతో దివాలా తీసిన సంస్ధలన్నింటినీ అమెరికా, ఇతర దేశాల పాలకులు ప్రజల సొమ్ముతో రక్షించారు. 1980దశకం నుంచి స్వేచ్చా మార్కెట్‌ విధాన సంస్కరణలను ముందుకు నెట్టటంలో ప్రముఖుడైన అమెరికా ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) మాజీ అధ్య క్షుడైన అలాన్‌ గ్రీన్‌స్పాన్‌ 2008 మేనెలలో ఒకప్రకటన చేస్తూ 2007లో ప్రారంభమైన తనఖా సంక్షోభం మీద వ్యాఖ్యానిస్తూ ‘ ద్రవ్య సంక్షోభంలో అనర్ధం ముగిసింది లేదా త్వరలో ముగియ నుంది’ అన్నాడు. లేమాన్‌ బ్రదర్స్‌ దివాలా ప్రకటన వెలువడగానే తాను చాలా తొందరపడ్డానని, తన స్వేచ్చామార్కెట్‌ సిద్ధాంతంలో లోపాలున్నట్లు గుర్తించానని చెప్పాడు.

2001లో డాట్‌కాం బుడగ పేలటం, మాంద్యం తలెత్తటంతో ద్రవ్య సంస్ధలు లాభాల కోసం కొత్త మార్గాలు వెతికాయి. వడ్డీ రేట్లు తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పరిమితమైంది. వడ్డీ రేట్లు తక్కువగా వుండటంతో ద్రవ్య సంస్ధల నిధుల సేకరణ సులభతరం, ఖర్చు తక్కువగావటం,మరిన్ని ఆస్ధుల కొనుగోలుకు, అధిక వడ్డీల కోసం తనఖా వంటి ముప్పుతో కూడిన రుణాలు ఇవ్వటానికి దారితీసింది.2004నాటికి రుణాలు తీసుకున్నవారు విపరీతంగా పెరగటంతో పాటు వాయిదాల చెల్లింపుల సమస్య తలెత్తింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లు పెంచింది. ఇండ్ల ధరలు పతనమయ్యాయి. అప్పులు తీర్చాలంటే అందుకోసం కొత్త అప్పులు చేద్దామంటే పుట్టని స్ధితి. తనఖా అంటే అనకాపల్లిలో అయినా అమెరికాలో అయినా వడ్డీ రేటు ఎక్కుగా వుండటంతో పాటు అసలుకు ముప్పు కూడా వుంటుంది. తీర్చగలరా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అధికవడ్డీలకు దురాశ పడిన ఆర్ధిక సంస్ధలు అప్పులు తెచ్చి మరీ అడిగిన ప్రతివారికీ రకరకాల తనఖాలు, షరతులతో గృహ రుణాలు ఇచ్చాయి. కొన్ని సంస్ధలు నేరుగా రుణాలు ఇవ్వక పోయినా ఇతర సంస్ధలు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకొనేందుకు వాటిని కొనుగోలు చేశాయి. తీసుకున్న వారికి రుణ చెల్లింపులు భారంగా మారటం, బుడగపేలిపోయినట్లుగా ఇండ్ల ధరలు పతనం కావటంతో రుణాలు తీసుకున్నవారితో పాటు ఇచ్చిన ఆర్ధిక సంస్ధలు, బ్యాంకులు కూడా 2007లో కుప్పకూలాయి. తనఖా పత్రాల విలువ 6.8లక్షల కోట్ల డాలర్లని తేలింది. మన సత్యం కంప్యూటర్స్‌ అసత్య లెక్కలు రాసి కుప్పకూలినట్లుగానే 2008లో లేమాన్‌ బ్రదర్స్‌ లెక్కల బాగోతం బయటపడి దివాలా ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా అమెరికాలో తిరిగి తనఖా రుణాలు పెరుగుతున్నాయని, మన దేశంతో సహా అనేక చోట్ల ఇస్తున్న గృహ రుణాలు చెల్లింపులో వైఫల్యం తప్పదని అనేక మంది చెబుతున్నారు. లసుగుల గురించి సామాన్యుల కంటే బిల్‌గేట్స్‌ వంటి వారికి ఎక్కువ తెలుసు కనుక వారు చెప్పిన ముప్పు ఏ క్షణంలో అయినా ఎదురు కావచ్చు.

పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాగైనా లాభాలు సంపాదించటానికి ప్రాధాన్యత ఇస్తారు, వాటిలో అప్పు మీద ఆధారపడటం ఒకటి. కాసినో లేదా జూదశాలల్లో జూదాలు నిర్వహించేవారు మనకు కనపడరు. డబ్బు పోగొట్టుకున్నా, ఎప్పుడన్నా సంపాదించినా జూదాలు కాసేవారు, వాటిని నిర్వహించే మధ్యవర్తులే మనకు కనిపిస్తారు.లేమాన్‌ బ్రదర్స్‌ అలాంటి మధ్యవర్తిగా డబ్బు జూదంలో నిలిచింది.దానితో రకరకాల ద్రవ్యలావాదేవీలు జరిపిన ఇతర బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల వారు అది ఇచ్చే లాభాలను చూశారు తప్ప రాసే తప్పుడు లెక్కలను గమనించలేక చివరికి మునిగిపోయారు. సంక్షోభం బద్దలు అయింతరువాత బ్యాంకులు బిలియన్లకొద్దీ డాలర్లను నిరర్దక ఆస్ధులుగా ప్రకటించాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడాయి. వ్యాపారాలకు కూడా రుణాలు దొరకటం గగనమైంది. వ్యాపారం తగ్గిపోయి దాని ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ మీద పడింది. పెట్టుబడితగ్గి డిమాండ్‌, వుత్పత్తి తగ్గుదలకు దారి తీసి, వుద్యోగాల రద్దుకు కారణమైంది.మాంద్యం తలెత్తింది.సంక్షోభం అమెరికా నుంచి ఐరోపాకు, ఇతర ప్రాంతాలకూ పాకింది. వెంటనే రంగంలోకి దిగిన అమెరికా సర్కార్‌ పరిస్ధితులు మెరుగుపడిన తరువాత తిరిగి అమ్మే ప్రాతిపదిక మీద 700 బిలియన్‌ డాలర్ల పాకేజితో దివాలా తీసిన సంస్ధల బాండ్లు, ఇతర విలువ పడిపోయిన ఆస్ధులను కొనుగోలు చేసేందుకు పూనుకుంది. మెరుగుపడక పోగా ఇంకా దిగజారటంతో మరో 250 బిలియన్‌ డాలర్లను ఇతర చిన్న సంస్దలలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది.

మరోవైపున వినియోగాన్ని పెంచేందుకు బ్రిటన్‌ సర్కార్‌ వ్యాట్‌ను 17.5 నుంచి 15శాతానికి తగ్గించింది. అనేక బ్యాంకులకు నిధులు సమకూర్చి నిలబెట్టింది.బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లను 5నుంచి 0.5శాతానికి తగ్గించింది. 2009లో లండన్లో సమావేశమైన జి20 సమావేశం ఆర్ధిక వినాశనాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలోకి 681బిలియన్‌ పౌండ్లను అందించాలని నిర్ణయించింది. బ్రిటన్‌లోని రాయల్‌ స్కాటిష్‌ బ్యాంక్‌(ఆర్‌బిఎస్‌) దివాలా తీసిన వాటిలో ఒకటి. పది సంవత్సరాల తరువాత కూడా అక్కడి జనం దివాలాకు మూల్యం చెల్లిస్తున్నారు. పది సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆర్‌బిఎస్‌ తన వాటాదార్లకు గత నెలలో రెండు పెన్నీల డివిడెండ్‌ ప్రకటించింది.( బ్రిటీష్‌ పౌండుకు వంద పెన్నీలు, ఒక పెన్నీ మన 93పైసలకు సమానం). పదేండ్ల క్రితం దివాలా తీసిన సదరు బ్యాంకును నిలబెట్టేందుకు బ్రిటన్‌ సర్కార్‌ 45.5బిలియన్‌ పౌండ్లను అందచేసింది. ఇప్పటి వరకు నాలుగు బిలియన్‌ పౌండ్లు నష్టపోయింది.గతంలో 84శాతంగా వున్న వాటాలను(జనం సొమ్ము) నష్టాలకు విక్రయించి 62శాతానికి తగ్గించుకుంది. ప్రభుత్వం ఆదుకొనేందుకు ఇచ్చిన సొమ్ములో 21బిలియన్‌ పౌండ్లను ఖాతాదారులతో వివాద పరిష్కారాలకు, అపరాధరుసుములు చెల్లించేందుకు బ్యాంకు ఖర్చు ఖర్చు చేసింది.

150 సంవత్సరాల క్రితమే కారల్‌ మార్క్స్‌ వుత్పాదక రంగంలో చేసే పెట్టుబడికి, ద్రవ్య వుత్పత్తుల్లో పెట్టే పెట్టుబడికి వున్న తేదాను వివరిస్తూ బ్యాకింగ్‌ బుడగలు ఎలా పెరుగుతాయో, పేలిపోతాయో పేర్కొన్నారు. మరో సంక్షోభం సంభవించే వరకు పెట్టుబడిదారులు జనానికి ఏదో ఒక ఆశచూపుతూనే వుంటారు. వుత్పాదక రంగంలో తమ పెట్టుబడికి ఆకర్షణీయమైన లాభాలు రానపుడు పెట్టుబడిదారులు తమ సొమ్మును ద్రవ్య మార్కెట్లో పెట్టుబడులుగా పెడతారు. బడా కంపెనీల, దుకాణాల పోటీలో నిలదొక్కుకోలేని అనేక మంది చిన్న మదుపుదారులు దగ్గర మార్గంగా వడ్డీ వ్యాపారాన్ని ఎంచుకోవటం తెలిసిందే. గ్రామాలలో వస్తువ్యాపారం చేసే వారు తమ మిగులును వడ్డీ, తాకట్టు వ్యాపారాలకు మళ్లించటాన్ని మనం చూస్తున్నదే. ద్రవ్య పెట్టుబడి లాభాలు వుత్పాదకరంగం పెట్టుబడిపై ఆధారపడి వుంటాయి. నిజమైన ఆర్ధిక వ్యవస్ధలో సంభవించే మార్పులు ద్రవ్యవ్యాపారంపై ప్రభావం చూపుతాయి. నిజ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడితే ద్రవ్య పెట్టుబడి( బ్యాంకింగ్‌) రంగం కుప్పకూలిపోతుంది.

బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ వంటి వారు ఏ క్షణంలో అయినా మరో ద్రవ్య సంక్షోభం రావచ్చని చెబుతున్నారంటే దానికి ప్రాతిపదిక లేకపోలేదు.2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌజోన్స్‌ సూచి 350శాతం పెరగ్గా, వాస్తవ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదల కేవలం 15శాతమే. తెలుగు ప్రాంతాల్లో సప్తగిరి, వుమ్మిడియార్స్‌ నుంచి కరక్కాయల పొడి వరకు అనేక మంది మోసగాళ్లు సగం ధరలకే వస్తువులు, అధిక వడ్డీలు, లాభాల ఆశచూపుతూనే వున్నారు. అలాంటివి ముంచుతాయని తెలిసినా ముందుగా పెట్టుబడి పెట్టి తాము తప్పించుకోవచ్చని ఎవరికి వారు దురాశకు లోనై నష్టపోవటం చూస్తున్నాము. ద్రవ్య పెట్టుబడిలో సంభవించే నష్టాలు ఆయా సంస్ధల యజమానుల కంటే జనాన్ని ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. భూగోళంలో ఒక ప్రాంతంలో తలెత్తిన సంక్షోభం దానికే పరిమితం కాదు. ప్రపంచీకరణ పేరుతో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముడివేయటంతో తరతమ తేడాలతో ప్రపంచ వ్యాపితంగా ప్రభావం, పర్యవసానాలు పడతాయి.

పది సంవత్సరాల తరువాత నెలకొన్న పరిస్ధితి గురించి మెకెన్సీ సంస్ధ ప్రతినిధి సుసాన్‌ లండ్‌ చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ఐరోపా, అమెరికాలోని బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే వాటి దగ్గర వున్న పెట్టుబడి ఎక్కువగా వుంది. దీని అర్ధం అవి మరింత స్ధిరంగా వున్నాయి, భవిష్యత్‌లో తలెత్తే నష్టాలను తట్టుకోగలవు. అయితే వడ్డీ రేట్లు, రుణాలకు డిమాండ్‌ తక్కువగా వుండటం, పెట్టుబడిమీద వచ్చే ఆదాయం తక్కువగా వుండటం బ్యాంకుల అభివృద్ధికి పరిమితులను సూచిస్తున్నాయి. ద్రవ్య సంక్షోభం తరువాత బ్యాంకులకు పెట్టుబడిమీద వచ్చే ఆదాయం సగం తగ్గింది, దీంతో లాభాల కోసం నూతన వాణిజ్య పద్దతుల కోసం కుస్తీ పడుతున్నాయి. పదేండ్ల నాటి సంక్షోభం తరువాత ప్రపంచ రుణ భారం స్ధిరంగా వుండటం లేదా పడిపోవటంగాక 72లక్షల కోట్ల డాలర్లు పెరిగింది.

బ్యాంకుల వంటి ద్రవ్య సంస్ధలను ఇబ్బందుల నుంచి బయటపడవేసేందుకు పాలకవర్గ ప్రభుత్వాలు ఆ భారాన్ని జనం మీదనే మోపుతాయి. పొదుపు చర్యలు, సంక్షేమ పధకాలకు కోత, ప్రభుత్వ ఆస్ధుల విక్రయం, జనం మీద అదనపు పన్నులు ఇలా అనేక రూపాలలో వుంటున్నాయి.పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా కేంద్రీకరణ ముప్పుకు సూచన. గతేడాది ప్రపంచ జిడిపికి 217శాతం ఎక్కువగా అప్పు వున్నట్లు తేలింది. పదేండ్ల నాటి సంక్షోభానికి ముందు కంటే ఇది 40శాతం ఎక్కువ. లేమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలిపోగానే పెద్ద బ్యాంకులు, ద్రవ్య సంస్ధలను చిన్నవిగా చేయాలనే ఆలోచన చేశారు. అయితే మన దేశంతో సహా అనేక చోట్ల పోటీని తట్టుకోవాలంటే పెద్దవిగా వుండాలంటూ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎస్‌బిఐలో విలీనం చేసిన విషయం తెలిసిందే. 2007లో అమెరికాలోని బ్యాంకు ఆస్ధులలో 44శాతం కేవలం ఐదింటి చేతిలో వుండగా ఇప్పుడు ఆ మొత్తం 47శాతానికి పెరిగింది. ఒక శాతం మ్యూచ్యువల్‌ ఫండ్‌ సంస్ధల చేతుల్లో 45శాతం స్టాక్స్‌, బాండ్లు, ఇతర ఆస్ధులు వున్నాయి. ఇవిగాక షాడో బ్యాంకులు అంటే తెరవెనుక లావాదేవీలు నిర్వహించేవి కూడా వున్నాయని ఒక నగ్నసత్యం. 2010లో వాటి ఆస్ధుల విలువ 28లక్షల కోట్లయితే ఇప్పుడు హీనాతి హీనంగా లెక్కవేసినా 45లక్షల కోట్ల డాలర్లని చెబుతున్నారు. బ్యాంకుల మీద నియంత్రణలు పెరిగే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి. అందువలన వీటిలో ఏ ఒక్కటి మునిగినా పదేండ్ల నాటి సంక్షోభంతో పోల్చితే నష్టం కొన్ని రెట్లు ఎక్కువగా వుంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో సంక్షోభం బద్దలవుతుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డాలరు విలువను అమెరికా ఎందుకు తగ్గించదు !

07 Friday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Currency Value, Donald trump, US Dollar

Image result for donald trump us currency

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనం మీద ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యాఖ్యానం చూసినపుడు మాయాబజార్‌ సినిమాలో శశిరేఖ రూపంలో వున్న ఘటోత్కజుడు వివాహ ప్రహసనంలో లక్ష్మణ కుమారుడి పాదాన్ని తొక్కినపుడు నొప్పి పెడుతున్నా ఏడవ లేక నవ్విన దృశ్యం గుర్తుకు రాకమానదు. ఆ సంగతి జనం చూసుకుంటారు వదిలేద్దాం ! గురువారం నాడు రూపాయి విలువ 72.11కి దిగజారి 71.99 వద్ద ముగిసింది. ( ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో తెలియదుగానీ దాదాపు రోజూ జరుగుతున్నదానికి వరుసగా కొత్త రికార్డులంటూ రాసి రాసి చదువరులకు బోరు కొట్టించదలచుకోలేదు.) మన రూపాయి లేదా చైనా యువాన్‌ విలువ పతనమైతే ఎగుమతులు పెరుగుతాయి కదా అలాగే అమెరికా కూడా తన డాలరు విలువను తగ్గించుకొని ఎగుమతులు పెంచి వాణిజ్య లోటును ఎందుకు తగ్గించుకోకూడదు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.

2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం, చైనా నుంచి దిగుమతుల కారణంగా కోల్పోయిన వుద్యోగాలను తిరిగి కల్పించేందుకు డాలరు విలువ తగ్గించాలన్న వూహలతో అధికారానికి వచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. అయితే అది ఎంత నష్టదాయకమో వెంటనే తెలిసి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏం జరిగి పరిణామాలు ఎలా వుంటాయో చెప్పలేము గాని ప్రపంచంలో ఇప్పుడొక వినూత్న పరిస్ధితి ఏర్పడిందని చెప్పక తప్పదు.

ప్రపంచంలో అమెరికా ఎంత పెద్ద ధనిక దేశమో దానికి అప్పులు కూడా అంత ఎక్కువగా వున్నాయి. మొత్తం అప్పు19.19లక్షల కోట్ల డాలర్లు.దానిలో విదేశీ అప్పు 5.35 లక్షల కోట్ల డాలర్లు వుంది. డాలరు విలువ తగ్గితే అప్పులు పెట్టిన వారందరూ గగ్గోలు పెడతారు. అప్పులిచ్చిన విదేశాలలో చైనా 1.1877లక్షల కోట్లతో ప్రధమ స్ధానంలో వుండగా జపాన్‌ 1.0435 లక్షల కోట్లు, ఐర్లండ్‌ 317.9 బిలియన్‌ డాలర్లతో మూడో స్ధానంలో వుంది. మన విదేశీ అప్పు 500 బిలియన్‌డాలర్లకు మించి వుంది. అయితేనే మనం కూడా అమెరికాకు 157 బిలియన్‌ డాలర్ల అప్పిచ్చి 11వ స్ధానంలో వున్నాం.(అరవై వేల జనాభాగల కేమాన్‌ దీవులు 242.9 బిలియన్లిచ్చి ఏడవ స్ధానంలో వుంది) అమెరికా అప్పు దాని జిడిపికి 106శాతం వుంది. 2017లో అప్పులకు చెల్లించిన వడ్డీ రేటు 2.26శాతం. కొందరు ఇంకా తక్కువ వడ్డీరేటుకే అప్పు ఇచ్చారు.

ఒక్కసారిగా డాలరు విలువ తగ్గితే వారంతా ఏం కావాలి. దివాలా తీయాలి, చలికాచుకొనేందుకు నోట్లను వుపయోగించాలి. తక్కువ వడ్డీకి ఇచ్చిన వారికి డాలరు విలువ పెరిగితే లాభం తప్ప తగ్గితే మిగిలేది బూడిదే. అందువలన దాని విలువలో స్వల్ప మార్పులను అనుమతించటం తప్ప అధికారంలో ఎవరున్నా విలువ పతనం కాకుండా చూస్తారు. ప్రస్తుతం మన దేశంతో లావాదేవీలలో అమెరికా 23బిలియన్‌డాలర్ల మేరకు వాణిజ్యలోటు కలిగి వుంది. దాన్ని పూడ్చుకోవాలంటే రానున్న మూడు సంవత్సరాలలో పది బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా తమ నుంచి దిగుమతులు చేసుకోవాలని అమెరికన్లు మన మీద వత్తిడి చేస్తున్నారు.(సెప్టెంబరు 6 హిందూ పతాక శీర్షిక) ఇదే విధానాన్ని చైనా, ఇతర దేశాల మీద కూడా రుద్దాలని చూస్తోంది. డాలరు విలువ తగ్గనుంది అనే వార్త వచ్చిందో డాలరు పెట్టుబడులన్నీ ఇతర మెరుగైన కరెన్సీలకు మారిపోతాయి. మన రూపాయి విలువ తగ్గటంతో డాలర్లు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అందువలన విశ్వం అంతమౌతుందనుకున్నపుడే చివరి చర్యగా డాలరు విలువను తగ్గిస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మన రూపాయి విలువ తగ్గుతున్నమేరకు మనం దిగుమతి చేసుకొనే పెట్రోలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. డాలరు విలువ తగ్గితే అమెరికాలో కూడా అదే జరుగుతుంది. రోజువారీ వాడే వస్తువులన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆ పరిణామం ఎగుమతి చేసే దేశాలకు కూడా మంచిది కాదు. డాలరు విలువ తగ్గితే వాటి కరెన్సీ విలువ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాకు నామమాత్రపు లేదా అసలేమీ వడ్డీ లేకుండా విదేశీ పెట్టుబడులు, రుణాలు వస్తున్నాయి, దాని కరెన్సీ విలువ తగ్గితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. అమెరికాలో ఇప్పుడున్న వేతనాలతో చైనా, భారత్‌ మాదిరి చౌక ధరలకు వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేయటం కష్టం. వేతనాలు తగ్గిస్తే సామాజిక సంక్షోభం తలెత్తుతుంది. డాలరు విలువ ఎక్కువగా వుంటే ఎగుమతులు గిట్టుబాటుగాక వుత్పత్తి పడిపోతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా డాలరు ఇప్పుడు రిజర్వు కరెన్సీగా వుంది. అనేక దేశాలు, కార్పొరేట్‌ సంస్ధలు పెద్ద మొత్తంలో వాటిని నిల్వ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలు, పెట్టుబడులకు వాటిని వినియోగిస్తాయి. రిజర్వు కరెన్సీ కలిగిన ఏ దేశమైనా చౌకగా ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. బ్రిటన్‌ ప్రాభవం కోల్పోవటంతో దాని పౌండ్‌ స్ధానంలో తన డాలరును అలాంటి కరెన్సీగా చేయాలని అమెరికా నిర్ణయించుకుని అమలు చేస్తోంది. సాంప్రదాయ వస్తూత్పత్తి పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్యపెట్టుబడిదారులది ఎప్పుడు పైచేయి అయిందో అప్పటి నుంచి డాలరును ముందుకు తెచ్చారు. దీని వలన ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, అప్పులు తీసుకోవటం ద్వారా అమెరికా తన లోటును పూడ్చుకొంటోంది. ద్రవ్యపెట్టుబడిదారుల ఆధీనంలోని బ్యాంకుల పలుకుబడి, లావాదేవీలు, లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. డాలరును ఆయుధంగా చేసుకొని అమెరికా కార్పొరేట్‌ సంస్ధలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో, ఆయా దేశాలలో చొరబడటంతో పాటు ప్రపంచ మిలిటరీ వుద్రిక్తతలలో అమెరికా జోక్యం, ఎక్కడైనా లేకపోతే సృష్టించటం జరుగుతున్నది. వాటి ద్వారా కార్పొరేట్ల ఆయుధ పరిశ్రమలు మూడుపువ్వులు ఆరుకాయలుగా లాభాలు పొందుతున్నాయి. వాటికి దెబ్బ తగుల కుండా వుండాలంటే ఒక చోట వుద్రిక్తతలు సడలితే, ముగిస్తే మరొక చోట తలెత్తేట్లు చేస్తున్నారు. మిలిటరిజం, సామ్రాజ్యవాదం ఒకదానితో ఒకటి కలసి పెరుగుతున్నాయి. డాలరు విలువను తగ్గిస్తే ఇది సాధ్యం కాదు.

చైనా పెద్ద మొత్తంలో అమెరికాకు అప్పు ఇచ్చినందున డాలరు విలువ తగ్గితే ఎక్కువగా నష్టపోయేది కూడా ఆ దేశమే. చైనా కనుక తన అప్పును తగ్గించుకుంటే, మిగతా దేశాలు కూడా దాని బాటనే నడిస్తే తక్షణం డాలరు విలువ పతనం అవుతుంది. చైనా కొత్తగా డాలర్లను కొనుగోలును తగ్గించినా సమస్యలు తలెత్తుతాయి. మొత్తం మీద అమెరికా లేదా చైనా ఏ విపరీత చర్యకు పాల్పడినా రెండు దేశాలతో పాటు ప్రపంచం సంక్షోభంలో మునుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే తెలిసిగానీ లేక తెలియకగానీ ట్రంప్‌ దూకుడు మీద వున్నాడు. పిచ్చి పనులు చేస్తే ఫలితాలు, పర్యవసానాలను అనుభవిస్తాడు. మన రూపాయితో పోలిస్తే జపాన్‌ ఎన్‌ విలువ ఇంకా తక్కువ, శుక్రవారం నాడు ఒక డాలరుకు 110.6 ఎన్‌ల వద్ద వుంది. దీని కంటే చాలా ఎక్కువగా వుండే చైనా యువాన్‌ విలువను పెంచాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందిగానీ జపాన్‌ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. రాబోయే రోజుల్లో జపాన్‌తో వాణిజ్య సమస్య మీద కూడా కేంద్రీకరిస్తానని ట్రంప్‌ ప్రకటించటంతో డాలర్‌ విలువ స్వల్పంగా పతనమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రో పన్ను తగ్గించం- గాల్లో దీపం రూపాయి !

05 Wednesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, Currency Value, India oil Tax, Naredra Modi, RBI, Rupee Fall

Image result for rupee value : narendra modi cartoons

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -3

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనానికి వాణిజ్య యుద్దం, చమురు ధరల పెరుగుదల వంటి బయటి అంశాలే కారణం, మనకు సంబంధం లేదు, కనుక రూపాయి దానికదే సర్దుకుంటుంది. రూపాయి విలువ పతనమైనందున పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినంత మాత్రాన వాటి మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు. తాజా పరిస్ధితులపై నరేంద్రమోడీ సర్కార్‌ అనధికార స్పందన లేదా అధికార యంత్రాంగం లీకుల ద్వారా వెల్లడి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో తర్కం ఇది. అయినా సరే ఇంకా మోడీని సమర్ధించేవారు, బిజెపిని నెత్తికెత్తుకునే వారు వున్నారు. ప్రజాస్వామ్యం మనది, ఎవరి స్వేచ్చ వారిది.

వస్తుమార్పిడి పద్దతి నుంచి నగదు లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ప్రతి దేశ కరెన్సీ ఏదో ఒక విధంగా ప్రభావితమౌతూనే వుంది. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతూ వుండటం, నిత్యం పెట్రోలు, డీజిలు ధరల పెంపుదల ప్రకటనలు వెలువడుతుండటంతో కరెన్సీ విలువపై చర్చ జరుగుతోంది. బుధవారం వుదయం (11.20) రూపాయి విలువ మరింతగా దిగజారి ఒక డాలరుకు రు. 71.71గా నమోదైంది . ఇంత జరుగుతున్నా మన కరెన్సీ ఇంకా పతనమైనా ఫరవాలేదు అన్నట్లుగా కొందరు చెబుతున్నారు. నరేంద్రమోడీ తీరు తెన్నులను చూసినపుడు దేశమంతా చర్చనీయాంశం అయిన, ఆందోళన చెందిన విషయాల మీద సకాలంలో సూటిగా మాట్లాడిన వుదంతం ఒక్కటంటే ఒక్కటీ లేకపోవటం ఆశ్చర్యకరంగాకపోయినా ఆందోళనకరం. రూపాయి పతనాన్ని అరికడతారో లేక కొనసాగింపును అనుమతిస్తారో ఏదో ఒకటి చెప్పాల్సిన రాజధర్మం ఏమైనట్లు ?

కరెన్సీ విలువలను ప్రస్తుతం ఎక్కువ దేశాలు మార్కెట్‌ శక్తులకు వదలి వేశాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు తెరచాటున విలువ నిర్ణయ అధికారాన్ని తమ చేతుల్లోనే వుంచుకున్నాయి. చైనా సర్కార్‌ తన యువాన్‌ విలువను నియంత్రిస్తున్నదని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. అలాంటిదేమీ లేదని చైనా చెబుతోంది. ఇటీవలి కాలంలో మన కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకు డాలర్లను కొన్నింటిని అమ్మిందని అవి 20బిలియన్ల వరకు వున్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకు గానీ, కేంద్రం గానీ తాము తీసుకోబోయే చర్యల గురించి జనానికి చెప్పటం లేదు. మొత్తం మీద పరిణామాలను చూసినపుడు మార్కెట్‌ శక్తులకు వదలివేసినా అదుపు తప్పినపుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. లేకపోతే వాటి పుట్టి మునుగుతుంది కదా !

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విధానాలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందుకే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే నిర్ధారణలకు వస్తున్న యువత అక్కడ నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో చైనా తనదైన తరహా సోషలిస్టు పద్దతుల్లో ముందుకు పోతోంది, కొన్ని ఎగుడుదిగుడులున్నా సంక్షోభాలకు దూరంగా వుంది. అనేక దేశాలు అమెరికా నుంచి అధిక ధరలకు యంత్రాలు, పరికరాలు, ఇతర వస్తువులను కొనే బదులు తామే తయారు చేయటం, ప్రత్యామ్నాయాలను చూసుకోవటంతో పాటు ఎగుమతుల్లో అమెరికాకు పోటీగా తయారయ్యాయి. తన కరెన్సీ విలువను అధికంగా వుంచుతూ ఆధరకు తన వస్తువులను కొనాలంటూ ఇతర దేశాల మీద అమెరికా వత్తిళ్లు తెస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోంది. చైనాపై ప్రారంభించిన వాణిజ్య యుద్ద సారమిదే. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు పరిమితంగా అయినా తన కరెన్సీ విలువ తగ్గింపును చైనా ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూసుకోవటం, వున్న మార్కెట్లలో దెబ్బ తగలకుండా చూసుకొనేందుకు కరెన్సీ విలువను పరోక్షంగా నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది.

1930దశకంలో తలెత్తిన మహా ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడేందుకు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి బడాదేశాలన్నీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్ధాయిలో 40శాతం వరకు తమ కరెన్సీ విలువలను తగ్గించాయి.బంగారంతో కరెన్సీ విలువ లింక్‌ను విస్మరించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారం చెల్లించిన జర్మనీ యుద్ధ భారాలను తట్టుకోలేక తన కరెన్సీకి కావాలనే విలువ లేకుండా చేసింది. ఒక డాలరుకు వందకోట్ల మార్క్‌లుగా విలువ పతనం అయింది. తద్వారా కారుచౌకగా తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్మి ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కిందిగానీ సామాన్య జర్మన్లు భారీ మూల్యం చెల్లించారు. ఆ దశలో అధికారానికి వచ్చిన హిట్లర్‌ జర్మన్‌ ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే పేరుతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన విషయం తెలిసిందే. చరిత్రలో అతిపెద్ద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు ఏ పర్యసానాలకు దారి తీస్తాయో ?

గత ఆరునెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే అంతర్గత ఇబ్బందులను అధిగమించటం కోసం అమెరికా తన వడ్డీ రేట్లను పెంచటం, ఇంకా పెంచనున్నట్లు ప్రకటించటం, చైనా, ఇతర దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగటం, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను ప్రకటించటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు పెరగటం, టర్కీ లీరా, అర్జెంటీనా పెసో పతనం వంటి ముఖ్య పరిణామాలన్నీ ప్రపంచ కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓట్ల కోసం ట్రంప్‌ తీసుకొనే చర్యల కారణంగా నవంబరులో అమెరికాలో జరిగే పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం వుంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మన వంటి దేశాల పౌరుల పరిస్ధితి తయారైంది. కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలతో ప్రతి దేశానికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని కష్టాలు వుంటాయి. వుదాహరణకు ఐటి వుత్పత్తులను ఎగుమతి చేసే మన కంపెనీల వాటాల ధరలు దూసుకుపోతుండగా దిగుమతులు చేసుకొనే కంపెనీలవి డీలా పడుతున్నాయి. వాణిజ్యలోటు వున్న మన వంటి దేశాలకు కరెన్సీ పతనం ప్రయోజనకరం అయినా మిగులు వున్న చైనా వంటి దేశాలకు వాటి సమస్యలు వాటికి వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్లను కొనుగోలు చేయటం అంటే మిగతా కరెన్సీలను విక్రయించటం కూడా ఇమిడి వుంటుంది. ఏ లావాదేవీ జరిగినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు వీటిని తమకు అనుకూలంగా నియంత్రిస్తారు.

ప్రతి దేశమూ అధికారిక లావాదేవీలను జరిపే సమయంలో ఒక నిర్ణీత విలువతోనే ఖరారు చేసుకుంటుంది. ఒక పరిధి నిర్ణయించుకొని దానికి లోబడి మార్పులున్నంత వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. దాటినపుడు చర్యలకు వుపక్రమిస్తుంది. కొన్ని దేశాలు ప్రయివేటు రంగంలో కూడా నిర్ణీత విలువను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి చోట్ల డాలర్ల క్రయ విక్రయాలు బ్లాక్‌ మార్కెట్‌కు చేరే అవకాశాలూ లేకపోలేదు. పీకల్లోతు నీరు వచ్చింది తప్ప ప్రాణాలకు ముప్పు లేదు, అయినా వచ్చిన వరద వచ్చినట్లే పోతుంది లేదా స్ధిరపడుతుంది ఆందోళన అవసరం లేదన్నట్లుగా మన అధికార యంత్రాంగం వుంది. రూపాయి పతనానికి వాణిజ్యం యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణాలు, వాటిని ప్రభుత్వం ఏమీ చేయగలిగింది లేదు, రూపాయి దానంతట అదే స్ధిరపడుతుందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు అనధికారికంగా వ్యాఖ్యానించారు. పతనం మరింతగా కొనసాగుతుందనటానికి తగినన్ని కారణాలున్నాయని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ చెప్పారు.

డబ్బు బయటకు పోకుండా చర్యలు తీసుకోవటం ద్వారా కరెన్సీ పతనాన్ని కొంతమేరకు అరికట్టిన వుదంతాలు వున్నాయి. గతంలో చైనా అలా వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్ధానిక కరెన్సీని విక్రయించకుండా ఆర్ధిక సంస్ధలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి అదుపు చేయటం, వుల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకపద్దతి. రిజర్వుబ్యాంకులు బయటకు ప్రకటించకుండానే ఒక నిర్ణీత ధరను సూచించటం మరొకటి. లావాదేవీలపై పరిమితులు విధించటం, అన్నింటిని విధిగా నమోదు చేయటం వంటివి మరికొన్ని చర్యలు.

అమెరికాలో వడ్డీ రేట్లను ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి అక్కడికి తరలటం ప్రారంభించాయి. ఆ ప్రవాహాన్ని ఆపేందుకు మన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి, రూపాయి పతనం ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలున్నాయి. చివికి పోయిన వస్త్రానికి ఒక దగ్గర మాసిక వేస్తే మరో చోట చిరిగి పోతుందన్నట్లుగా ఒకదాని కోసం ఒక చర్య తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. జనం మీద విపరీత భారం, ప్రభుత్వాలకు ద్రవ్యలోటు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక దేశ కరెన్సీ విలువ పెరగటం కూడా ఒక్కోసారి నష్టదాయకమే. వుదాహరణకు స్విడ్జర్లాండ్‌ వుదంతం. బలమైన మారకపు విలువ కారణంగా అక్కడ డబ్బు దాచుకోవటం ఎంతో భరోసాగా భావించి ఒకప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనమంతా స్విస్‌ బ్యాంకులకు చేరేది. దాంతో వాటి లాభాలు ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. అయితే స్విస్‌ ఫ్రాంక్‌ విలువ పెరిగి ఆ దేశ ఎగుమతులు ఖరీదయ్యాయి. పారిశ్రామికవేత్తలు లబోదిబో మన్నారు. దాంతో నల్లధన ప్రవాహాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటంతో నల్లధన కుబేరులు వేరే దేశాల బాట పట్టారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ-1

03 Monday Sep 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, Indian currency, Narendra Modi, Rupee, Rupee Fall

Image result for Rupee value : narendra modi  cartoons

ఎం కోటేశ్వరరావు

ఈ మధ్య కిరాయి ప్రచార యంత్రాంగం పడిపోతున్న రూపాయిని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా మార్చేందుకు పూనుకుంది. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి మోడీని ధన్యుడిని చేయాలన్న తాపత్రయంలో వారున్నారు. మన కంటే కొన్ని కరెన్సీల విలువలు ఎక్కువగా పడిపోతున్నాయి. మన కరెన్సీ విలువ కూడా పెరిగింది అయితే కొన్ని కరెన్సీల విలువలు ఇంకా పెరిగాయి అంటూ కొన్ని అంకెలను ప్రచారంలో పెట్టారు. తెనాలి రామకృష్ణుడు నియోగులను ఎలాగైనా వినియోగించుకోవచ్చు అన్నట్లుగా అంకెలు కూడా అలాంటివే.

మన్మోహన్‌ సింగ్‌ హయాంలో గరిష్టంగా పతనమైన రూపాయి విలువను తాజాగా పడిపోయిన విలువను పోల్చి పెద్దగా పడిందేమీ లేదని జనానికి చెప్పదలచుకున్నారు.2013 ఆగస్టు 31న 65.70రులకు పడిపోయింది. 2018ఆగస్టు 30న విలువ 70.74ను చూపి తేడా ఐదు రూపాయలే కదా అన్నట్లుగా చిత్రిస్తున్నారు. 2009 మార్చి ఆరున రు.51.69 కనిష్టంగా వున్నది తరువాత క్రమంగా పడిపోతూ 2011 ఆగస్టు ఒకటిన 44.05 గరిష్ట స్ధాయికి చేరింది, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ పైన చెప్పుకున్న 65.70కి పతనమైంది. ఆ తరువాత మోడీ ఏలుబడికి వచ్చే నాటికి 2014 మే 25న 58.52కు పెరిగింది. అప్పటి నుంచి గత నాలుగు సంవత్సరాలలో ఇంతవరకు కనీసం ఆస్ధాయిని ఒక్క రోజు కూడా చేరుకోలేదు, క్రమంగా పెరుగుతూ సోమవారం నాడు (సెప్టెంబరు 3న) 71.21గా ముగిసి మరో రికార్డు సృష్టించింది. ఈ వివరాలను ఎవరైనా కాదనగలరా చెప్పండి. కావాలంటే క్రింది లింక్‌లో గ్రాఫ్‌ను చూడండి. మోడీ భక్తుల బండారం బయట పడుతుంది.https://www.poundsterlinglive.com/bank-of-england-spot/historical-spot-exchange-rates/usd/USD-to-INR

Image result for Rupee value cartoons

మన కరెన్సీ విలువ కూడా పెరిగింది, మన కంటే డాలరు విలువ ఇంకా పెరిగింది. ఇది అతితెలివితో కూడిన వాదన.మన కరెన్సీ విలువ మరొక కరెన్సీతో పోల్చితే పెరిగింది లేదా తగ్గింది అంటే అర్ధం ఏమిటి? వుభయులము పరస్పరం కరెన్సీలను కొనుగోలు చేసి ఆ మేరకు చెల్లించే వప్పందం వున్నపుడు పాకిస్ధాన్‌-మనమ ధ్య లావాదేవీలు జరిగితే ఏం జరుగుతుంది. మన దేశం నుంచి వంద రూపాయల విలువ గల వస్తువును పాకిస్ధాన్‌ కొంటే గతేడాది సెప్టెంబరు 28న పాక్‌ కొనుగోలు దారులు మనకు వారి కరెన్సీ 162 రూపాయలు చెల్లించాలి.అదే ఈ ఏడాది జూలై 28న 188 అయింది, ఈ నెల రెండున 173 అయింది. అంటే జూలై 28తో పోల్చితే సెప్టెంబరు రెండుకు పాక్‌ కరెన్సీ విలువ(మనతో పోల్చుకుంటే) పెరిగినట్లు. మనం పాకిస్ధాన్‌ నుంచి వంద రూపాయల వస్తువు కొంటే జూలై 26న 53 రూపాయలు ఇస్తే సరిపోయింది, అదే వస్తువుకు మనం సెప్టెంబరు 2న 58 చెల్లించాల్సి వచ్చింది. అంటే పాక్‌ కరెన్సీతో మన రూపాయి విలువ పడిపోయింది. అదే మన మధ్య డాలర్ల మార్పిడి జరిగిందను కోండి. మన దగ్గర వుంటే వాటిని లేదా మార్కెట్లో కొని చెల్లించాలి. ఆగస్టు ఆరున మనం పాక్‌ నుంచి ఒక డాలరుకు ఒక పెన్ను దిగుమతి చేసుకుంటే మనం ఆరోజున్న మార్కెట్‌ రేటు ప్రకారం రు.68.46 పెట్టి ఒక డాలరు కొని పాక్‌ వ్యాపారికి ఇచ్చాము. అదే పెన్నును సెప్టెంబరు మూడున కొంటే సెప్టెంబరు రెండున డాలరుకు రు.71.21చెల్లించాల్సి వచ్చింది. డాలర్లలో ఏ దేశానికైనా అదే రీతిలో చెల్లించాలి. అమెరికా మన నుంచి ఒక చాక్లెట్‌ దిగుమతి చేసుకుంటే ఆగస్టు 3న 0.015 డాలర్లు చెల్లించాలి. ఒక నెల తరువాత సెప్టెంబరు మూడున ఆ మొత్తం 0.014కు పడిపోయింది. అంటే మన కరెన్సీ విలువ తగ్గింది, అమెరికా విలువ పెరిగింది.

త్వరలో మనల్ని చైనాను అధిగమించేట్లు నడిపిస్తామని మోడీ బృందం నమ్మిస్తున్నది. మంచిదే, అంతకంటే కావాల్సింది ఏముంది. మనం చైనాతో సహా అన్ని దేశాలకు మేకిన్‌ ఇండియా పేరుతో వస్తువులను ఎగుమతి చేయాలని అనుకుంటున్నాం. దానిలో భాగంగా మనం అదానీ లేదా అంబానీ దుకాణం నుంచి ఒక కిలో కందిపప్పు ఒక రూపాయికి ఎగుమతి చేశామనుకోండి( మోడీ ప్రత్యేక ఎగుమతి సబ్సిడీ అందచేస్తున్నారు అనుకోవాలి మరి) మనకు చైనా తన కరెన్సీలో ఆగస్టు 3న 0.1యువాన్లు చెల్లించింది. అదే సెప్టెంబరు రెండున 0.096 యువాన్లకు తగ్గిపోయింది. దీనర్ధం మన కరెన్సీ విలువ తగ్గిపోయింది, అమెరికా, ఇతరులతో మన సంఘపరివార్‌ తదితరులు దెబ్బతీయాలని చూస్తున్న చైనా కరెన్సీ విలువ పెరిగింది.

Image result for Rupee value cartoons

మన కంటే అధ్వాన్నం అయిన పాకిస్ధాన్‌తోనే మన కరెన్సీ దిగజారింది, మోడీ భక్తులు చెబుతున్న మన కరెన్సీ పెరుగుదల అంటే దాని కంటే అధ్వాన్న దేశంతో అనుకోవాలి. ఆశలు చైనాను దెబ్బతీయటం, ఆచరణ వూరూ పేరులేని దేశాలతో పోల్చుకొని సంబర పడటం ! ఏమి సామర్ధ్యం, ఏమి దేశభక్తి బాబూ ఇది !! ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ఈ మాటలు అన్నదెవరో తెలుసా మిన్నువిరిగి మీద పడ్డా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న నరేంద్రమోడీ ! మరి ఈ మాటలు ఎలా చెప్పారు అని వెంటనే అడిగేందుకు ఆయన భక్తులు కాచుకొని వుంటారు. కాస్త నిదానించి పై వ్యాఖ్య ఎప్పుడు చేశారో ఇప్పుడేం చేస్తున్నారో చూడండి.http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయితో కనిపించని దెబ్బలు కొడుతున్న నరేంద్ర మోడీ

31 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

Demonetisation, Narendra Modi, RBI Report on Demonitisation, Rupee Fall

Image result for narendra modi hitting  below the belt with currency cartoons

ఎం కోటేశ్వరరావు

కత్తులతో పని లేకుండా కంటి చూపుతో ఖతం చేస్తా అన్న హీరోలను సినిమాల్లో చూశాము. రూపాయితో 135కోట్ల జనాన్ని చావు దెబ్బలు కొడుతున్న హీరో ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడో పెద్ద విజయగాధను చెప్పుకోకతప్పదు. నరేంద్రమోడీ పాలనలో హిందూ మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని సంసారాలతో పని లేని యోగులు, యోగినులు చేసిన ప్రచారం వల్లకానీయండి, మరో విధంగా గానీ నరేంద్రమోడీ తన ఖాతాలో మరొక విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2015 నుంచి ఈ విశ్లేషణ రాసే సమయానికి ప్రపంచంలో మన జనాభా శాతం 17.73 నుంచి 17.74శాతానికి పెరిగింది. ఇదే సమయంలో చైనా వాటా 18.92 నుంచి 18.54కు పడిపోయింది. యోగులు, యోగినులు కూడా సన్యాసాన్ని త్యజించి, భార్యలను వదిలేసిన భర్తలు కూడా ఒకింటి వారై సంతానోత్పత్తిలో పాల్గని వుంటే మన జనాభా ఇంకా పెరిగి వుండేది, చౌకగా శ్రమను ధారపోసి మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేసి వుండేవారు.

మన సమాజం ఎంతటి నేరాన్ని అయినా సహించింది, క్షమించింది. నాడు నేడు రేపు నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించదు. 2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు. ఆ గడువు తీరిపోయి త్వరలో పెద్ద నోట్ల రద్దు రెండవ వార్షికోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. ప్రతి నెలా మన్‌కీ బాత్‌ పేరుతో మాట్లాడుతూనే వున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన పెద్ద నోట్ల రద్దు వుద్ధేశ్యం ఏమేరకు నెరవేరిందో చెప్పలేదు. హైదరాబాదు వంటి మహానగరంలో ఇది రాస్తున్న సమయానికి కూడా కొన్ని ఎటిఎంలలో గరిష్టంగా ఒకసారికి ఐదువేలకు మించి డబ్బుతీసుకొనే పరిస్ధితి లేదు. ఎక్కువసార్లు తీసుకుంటే బ్యాంకుల బాదుడు మీకు తెలిసిందే.

పోనీ రిజర్వుబ్యాంకు అయినా నిజం చెప్పిందా ! బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఏ రోజుకు ఆరోజు ఖరారు అవుతాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇచ్చిన గడువు ప్రకారం ఏ రోజు ఎన్ని రద్దయిన నోట్లు వచ్చాయో తెలుసుకోవటం కష్టం కాదు. గడువు ముగిసి నెలలు, సంవత్సరం గడిచినా ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయో చెప్పలేదు. కొద్ది రోజులు నోట్ల లెక్కింపుపూర్తి కాలేదని చెప్పారు. ఈలోగా జనం మరచి పోయారు. ఎంతకాలం దాచినా ఏదో ఒక నివేదికలో వాస్తవాలను ప్రచురించకతప్పదు కనుక తాజాగా రిజర్వుబ్యాంకు నివేదికలో వెల్లడించకతప్ప లేదు. దాని ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.రాని వాటి విలువ కేవలం గాకపోయినా మరుసటి రోజుకు ఆన్‌లైన్‌లో లెక్కలు సరి చూసి 10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.

Image result for demonetisation, rbi report cartoons

కనీసం మూడు లక్షల కోట్ల రూపాయల విలువగల నోట్లు వెనక్కు రావని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య ఆదాయం వస్తుందని మోడీ సర్కార్‌ లెక్కలు వేసుకుంది. నోట్ల రద్దు వలన ఎలాంటి ఫలితం వుండదని అనేక మంది నిపుణులు ముందే చెప్పారు. వారందరూ నల్లధనాన్ని కలిగి వున్నవారి మద్దతుదార్లుగా చిత్రించారు. రద్దయిన నోట్లను మార్చుకొనేందుకు, కొత్త నోట్లు తీసుకొనేందుకు బ్యాంకుల ముందు గంటల తరబడి వరుసలలో నిలబడటం దేశభక్తికి చిహ్నంగా అనేక మంది నిజంగానే భావించారు, భ్రమించారు. ఎవరైనా నోట్లరద్దును విమర్శిస్తూమాట్లాడితే దేశద్రోహి అన్నట్లు అసహ్యించుకొని చూసినవారు, కొట్టేందుకు వచ్చిన వారు కూడా లేకపోలేదు. నోట్ల రద్దు చర్య తీసుకున్నవారు గానీ దానిని సమర్ధించిన వారుగానీ తేలు కుట్టిన దొంగల మాదిరి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నోట్ల రద్దు ఎవరికీ తెలియదు నరేంద్రమోడీ తీసుకున్న అత్యంత గుప్త నిర్ణయం అని అప్పుడు అందరూ మోడీకీర్తిని పెంచేందుకు ప్రచారం చేశారు. అది వికటించిన తరువాత ఇతరుల మీద నెపం మోపేందుకు అవకాశం లేకపోవటంతో ఎన్ని విమర్శలు వచ్చినా దాని గురించిన వివరాలు బయటపెట్టకుండా అడ్డుకున్నారు.

Image result for demonetisation, rbi report cartoons

ఇంతకాలం తరువాత అయినా నోట్ల రద్దు తప్పిదమనే నిజాయితీ ఎక్కడా ప్రదర్శితం కావటం లేదు. దాని వలన వచ్చిన లాభం ఏమిటో నష్టాలు ఏమిటో అధికారికంగా చెప్పే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదా రిజర్వుబ్యాంకుకు లేదు. అనేక సర్వేలు చేస్తున్న బ్యాంకు నష్టాల గురించి ఇంతవరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు, లేదా రహస్యంగా చేసి వుంటే బయటకు చెప్పటం లేదు. దేశం, జనాభాపట్ల జవాబుదారీతనం అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.నష్టాల గురించి ఎవరైనా మాట్లాడిదే దానిని రాజకీయంగా మార్చి పక్కదారి పట్టిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. నోట్ల రద్దు ఫలితంగా ఒక శాతం జిడిపి నష్టం జరిగిందని 2017 జనవరి-ఏప్రిల్‌ మాసాల మధ్య పదిహేను లక్షల వుద్యోగాలు హరీ మన్నాయన్నది(సిఎంఐయి) అంచనా. ఈ నష్టం సంగతి ఏమిటి? కొత్త నోట్ల మార్పిడి లేదా ఎటిఎంలు, బ్యాంకుల ముందు తమ డబ్బు తాము తీసుకోవటానికి వెచ్చించిన పని గంటలు, పెట్టిన సెలవులు దీనికి అదనం. మాజీ అర్ధిక మంత్రి పి చిదంబరం చెప్పిన లెక్కల ప్రకారం ఏడాది కాలంలో జిడిపి 1.5శాతం నష్టం విలువ 2.25లక్షల కోట్లు, అనేక వారాల పాటు 15కోట్ల మంది రోజువారీ కూలీలు పని కోల్పోయారు, నోట్ల కోసం వరుసల్లో నిలబడి వంద మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, ఫలితంగా లక్షల మంది కార్మికులకు పని పోయింది. ఆ నష్టం ఎంతో ఎవరూ లెక్క గట్టలేదు. ఐదు వందలకు బదులు వెయ్యి, రెండు వందలు, యాభై కొత్త నోట్లను ఎటిఎం యంత్రాలలో అమర్చేందుకు వాటిని మూసివేసినపుడు జనం అనుభవించిన యాతనలు చెప్పనవసరం లేదు. యంత్రాలలో మార్పులు చేర్పులకు ఆయా బ్యాంకుల మీద పడిన భారం గురించి కూడా ఎవరూ నోరు విప్పటం లేదు. ఎవరైనా చెబితే అది నేరుగా నరేంద్రమోడీకే తగులుతుంది, సదరు అధికారి బలి ఖాయం. ఇలా బయటకు చెప్పుకోలేని,లోపల తట్టుకోలేని ఇబ్బందులెన్నో. రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. నోట్లు రద్దు చేయటానికి ముందు అంటే 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆర్‌బిఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా 65,876 కోట్లు ఇచ్చింది, నోట్ల రద్దు తరువాత 2016-17లో ఆ మొత్తం 30,659 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. తదుపరి ఏడాది చెల్లించిన మొత్తం కూడా 50వేల కోట్లకు మించలేదు. అంటే కేవలం రెండు సంవత్సరాలలోనే 55వేల కోట్ల మేరకు కేంద్రానికి ఆదాయ నష్టం జరిగింది. ఇతర వాణిజ్యబ్యాంకులకు నిరర్ధక ఆస్ధులు పెరిగిపోవటంతో నష్టాలు వచ్చాయి, మరి రిజర్వుబ్యాంకు లాభాలు ఎందుకు పడిపోయినట్లో ఎవరైనా చెబుతారా ? దేవగిరి-ఢిల్లీ మధ్య రాజధానులను మార్చిన మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ చర్యకు సైన్యం, పరివారమే ఇబ్బంది పడింది. నరేంద్రమోడీ చర్యకు యావత్‌ దేశం ఇబ్బంది పడింది. ఇద్దరిలో ఎవరు మెరుగు ?

నోట్ల రద్దుకు ముందు అంటే 2016నవంబరు నాలుగున మన వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా కూడా చెప్పినట్లు కొంత మంది బాత్‌ రూముల్లో దాచుకున్నదానితో సహా దేశంలో 17.97లక్షల కోట్ల రూపాయల నగదు చెలామణిలో వుంది. ఈ ఏడాది మార్చి నాటికి చెలామణిలో వున్న నగదు 18.03లక్షల కోట్లు, అయినా సరే బ్యాంకుల్లో వున్న తమ డబ్బును తీసుకోవాలంటే అడిగినంత మొత్తం ఇవ్వలేమని బ్యాంకులు ఎందుకు చెప్పినట్లు? అంటే తిరిగి బాత్‌రూముల్లోకి పోయిందా? పోకుండా మోడీ సర్కార్‌ ఏం చేస్తున్నట్లు ? స్వయం సేవకులతో సహా చెప్పేవారెవరూ లేరు…… పోతే పోనీ గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే వుందే అన్న ముతక సామెత మాదిరి నోట్ల రద్దు వలన జరిగిన నష్టం కంటే వచ్చిన ఫలితాలు బాగున్నాయని ఇప్పటికీ అధికారపక్ష పెద్దలూ, వారికి అనుగుణంగా, కొందరు మేథావులూ, అధికారులూ అతిశయోక్తులు చెప్పటం విశేషం. నోట్ల రద్దు వలన పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణమే ఎక్కువగా ప్రభావితమైందని ఒక అధ్యయనంలో ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. గురుచరణ దాస్‌ అనే ఆర్ధికవేత్త మాట్లాడుతూ ఇండ్లలో దాచుకున్న సొమ్ము బ్యాంకుల్లోకి వచ్చింది, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారందరూ భవిష్యత్‌లో పన్ను చెల్లింపుదారులుగా మారతారు, డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ వేగంగా పెరిగింది అన్నారు. అయితే సానుకూల ఫలితాలు రావటానికి ఇది(పెద్ద నోట్ల రద్దు) మార్గం కాదు. జనాలు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువగా వుంది. నా అంచనా ప్రకారం ఒక ఏడాది ఆర్ధిక అభివృద్ధిని మనం నష్టపోయాము. దేశంలో వుపాధి సమస్యను పరిష్కరించాలంటే మనం ఏటా ఎనిమిదిశాతం చొప్పున 20సంవత్సరాల పాటు పెరగాలి అని కూడా దాస్‌ చెప్పారు.

Image result for demonetisation, rbi report cartoons

రాజుగారు నందంటే నంది, పందంటే పంది గురించి చెప్పగలిగిన సమర్ధులు మన వున్నతాధికారులు.కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్క్‌ నోట నోట్ల రద్దు విజయగానంలో చోటు చేసుకున్న అంశాలు ఇలా ఆవు వ్యాసంలో విషయాల మాదిరి వున్నాయి. గతంమాదిరే కరెన్సీ వ్యవస్ధ కొనసాగి వుంటే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు నోట్ల చలామణి తక్కువ వుండేది. మూడు లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకింగ్‌ వ్యవస్ధకు దూరంగా వుండేది, నోట్ల రద్దు తరువాత రెండులక్షల కోట్ల మేరకు బ్యాంకులకు చేరింది. ఆదాయపన్ను శాఖ 1.75లక్షల కోట్ల రూపాయల మొత్తంతో ప్రమేయమున్న అనుమానిత ఖాతాల గురించి పరిశీలన చేస్తున్నది. పద్దెనిమిది లక్షల మందికి ఆదాయానికి మించి ఆదాయం వున్నట్లు గుర్తించారు. వారిమీద చర్యల ద్వారా నల్లధనం మీద దాడి లక్ష్యం నెరవేరుతుంది. గతంలో నకిలీనోట్లు పెద్ద ఎత్తున చలామణిలో వుండేవి. నోట్ల రద్దు తరువాత అవి పెద్దలెక్కలోకి వచ్చేవిగా లేవు. ఇప్పుడు ఎవరైనా ఆ నోట్లను గుర్తించగలరు, ఎవరినీ మోసం చేయలేరు. నగదు రహిత(డిజిటల్‌ ) లావాదేవీలు పెరిగి ఒక నెలలో 25కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి, మార్చినెలల్లో నగదుకు కొరత వుండేది ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇలా బూతద్దంలో చూపేందుకు గార్గ్‌ ప్రయత్నించారు.

పెద్ద మొత్తంలో కరెన్సీ చలామణిలోకి వచ్చిందని ఏలుబడిలో వున్నవారు చెబుతుంటే కొన్ని కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చలామణిలో వున్న కరెన్సీ విలువ 19.38లక్షల కోట్ల రూపాయలని, పొదుపు 2.8శాతానికి పెరిగిందని అంగీకరిద్దాం. ఇదే సమయంలో పొదుపు సొమ్ము బ్యాంకులు లేదా కార్పొరేట్‌ డిపాజిట్లలో ఐదు దశాబ్దాల కనిష్టం 2.9శాతానికి ఎందుకు పడిపోయిందన్నది విశ్లేషకుల ప్రశ్న. డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరిన మొత్తంలో కొంత నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌ వ్యవస్ధ నుంచి వెళ్లిపోయింది. వడ్డీ రేటు తగ్గటంతో వ్యక్తిగతంగా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం తగ్గింది. అంతకు ముందు సంవత్సరంలో 6.3శాతం వున్న డిపాజిట్లు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో 2.9శాతానికి పడిపోయాయి.

నోట్ల రద్దుతో జనం మీద దాడి చేసిన మోడీ ఇప్పుడు కరెన్సీ విలువతో దాడికి దిగినట్లు కనిపిస్తోంది. మోడీకి దీనికి సంబంధం ఏమిటని కొందరు అడ్డు తగల వచ్చు. మోడీ సర్వాంతర్యామి, ఇందుగలదందు లేడను సందేహము వలదు లేదా అన్నీ నేనే అని గీతాకారుడు చెప్పినమన భూమిలో కరెన్సీలో ఆయన లేకుండా ఎలా వుంటాడు. నోట్ల రద్దు తన స్వంత నిర్ణయం చెప్పిన పెద్ద మనిషి పడిపోతున్న రూపాయి విలువకు కారణాలేమిటో, తన ప్రమేయం లేకపోతే జనాన్ని ఎలా ఆదుకుంటారో రాజధర్మంగా అయినా చెప్పాలి కదా ? శుక్రవారం నాడు మార్కెట్‌ వేళలు ముగిసే సమయానికి డాలరుతో మారకానికి రు.70.94గా పతనం చెంది సరికొత్త రికార్డు నమోదు అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల కెళితే ఏ జబ్బుకైనా ఒకే రంగు గోళీలు, నీళ్ళ మందుపోస్తారని ప్రతీతి. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకొనేందుకు గత కొద్ది రోజులుగా మన రిజర్వుబ్యాంకు అటువంటి పనే చేసింది. జబ్బు ఒకటైతే నీళ్ల మందు చికిత్సలకు తగ్గుతుందా? ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ కరెన్సీ నివేదిక ప్రకారం చమురు ధరలు ఎక్కువగా వున్నంత వరకు మన వంటి దేశాల కరెన్సీ విలువ పతనం కొనసాగుతూనే వుంటుంది. రూపాయి విలువ 70.45-70.90 లేదా అంతకు దిగువకు పడిపోవచ్చు. ఆ జోశ్యాన్ని కూడా మన రూపాయి వమ్ము చేసి ఆగస్టు 31న 70.96 నమోదు చేసింది. దిగుమతిదారులకు 70.20, ఎగుమతిదారులకు 69.75 స్ధాయిల్లో వుంటుందనే అంచనాతో లావాదేవీలను సాగించుకోవచ్చని ఐఎఫ్‌ఏ సలహా ఇచ్చింది. దిగుమతిదారుల నుంచి డిమాండ్‌ పెరగటం, మరింత పతనం అవుతుందేమో దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే ముందుచూపుతో విదేశీ మదుపుదారులు తమ సొమ్మును వెనక్కు తీసుకోవటం ఎక్కువగా చేస్తుండటంతో రూపాయి పతనం కొనసాగుతోంది. అది త్వరలో 71లేదా 72కు చేరనుందని అనేక మంది చెబుతున్నారు.ఇప్పటికే ఈ ఏడాది పదిశాతం పతనమై ఆసియాలో అత్యంత అధ్వాన్నంగా మారిన కరెన్సీగా రూపాయి పేరు తెచ్చుకుంది.

దేశంలోపలివా, వెలుపలివా కారణాలు ఏవైనప్పటికీ డాలర్లకు డిమాండ్‌ పెరగటం మన రూపాయి విలువ పతన కారణాల్లో ఒకటి. పెట్రోలు, డీజిలు లేకపోతే గడవదు కనుక ఎన్ని డాలర్లయినా ఇచ్చి తెచ్చుకోవాలనుకుందాం.విదేశీ లిప్‌స్టిక్‌లు,లో దుస్తులు, పై దుస్తులు, నగలు, వాచీలు, బంగారం చివరికి అమెరికా నుంచి బాదం పప్పు, దోసకాయల వంటి నిత్యావసర వస్తువులు లేకపోతే తమకు గడవదు అనుకొనే వారికి కూడా మన జనం మొత్తం తరఫున అధిక ధరలకు డాలర్లను కొని ఇస్తున్నాం. ఇరాన్‌ మీద అమెరికా వాడికి కోపం వస్తే పెరిగే చమురు ధరలకు మన ఇతర దేశాల నుంచి కొనాలి తప్ప చౌకగా ఇచ్చే ఇరాన్‌ నుంచి కొనుగోలు చేయం. ఎందుకంటే ట్రంప్‌కు మన మీద కోపం వస్తుంది. ఇలాంటి వాటి కారణంగా మన కరెంట్‌ ఖాతాలోటు పెరుగుతోంది. మనం చేసుకొనే దిగుమతులకు చెల్లించే మొత్తం, మన ఎగుమతుల ద్వారా సంపాదించే ఆదాయ మొత్తానికి మధ్య వుండే తేడానే కరెంట్‌ ఖాతా లోటు లేదా మిగులు అంటాం.మరో విధంగా చెప్పాలంటే పెట్టుబడులు సంపాదించటానికి, పలుకుబడి పెంచే పేరుతో విదేశాలకు విమానాల్లో తిరగటానికి, రోజుకో కొత్త కోటు వేసుకోవటానికి మన మోడీకి అయ్యే ఖర్చు ఆయన సంపాదించిన దాని కంటే ఎక్కువ వుంది అనుకోండి.

2018 ఆర్ధిక సంవత్సరంలో మన కరెంట్‌ ఖాతా లోటు జిడిపిలో 1.9శాతం వుంటే అది 2019కి 2.8కి పెరుగుతుందని అంచనా. ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం తగ్గుతోంది. మన దేశ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు, ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చేవారు ఇంతకు ముందు గణనీయంగా పెరిగారు. ఇప్పుడు ఎందుకైనా మంచిదని వెనక్కు వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50వేల కోట్ల రూపాయల మేర వెనక్కు తీసుకున్నారు. మనకు అప్పులు ఇచ్చేవారు డాలర్లలో ఇస్తారు, డాలర్లలోనే తీసుకుంటారు. మనరూపాయలను అంగీకరించరు. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో తొలిసారిగా మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి నాటి గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 71రూపాయలను ఏక్షణంలో అయినా దాటేట్లు వుంది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే నరేంద్రమోడీ పాలనలో కూడా అదే స్ధాయిలో జరిగింది, త్వరలో నూతన రికార్డులను కూడా నమోదు చేయవచ్చు. మోడీ అధికారానికి వచ్చినపుడు మనం ఒక వంద డాలర్లు అప్పు తీసుకున్నామనుకుంటే అసలు రు.5843. దానికి మార్కెట్లో వున్న రేటున బట్టి వడ్డీ చెల్లించాలి.( అలాగాక చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మా ణానికి అప్పుకు అధికవడ్డీ రేటు ఇచ్చినట్లుగా ఇస్తే అది వేరే.) చైనాతో పేచీ వచ్చింది, మాక్కూడా డాలర్ల అవసరం పెరిగింది మా సొమ్ము మాకివ్వండని అమెరికా వాడు అడిగాడనుకోండి. గత నాలుగేండ్లుగా చెల్లించాల్సిన బారు లేదా చక్ర వడ్డీగాక, అసలే 7096కు పెరిగిపోయింది. మన రూపాయి విలువ పతన పర్యవసానమిది.

దీన్నే మరో విధంగా చెప్పుకోవటం అవసరం. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అక్కడి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అమెరికా, ఇతర ధనిక దేశాలలో వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించారు. వుదాహరణకు ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ అనే వెబ్‌సైట్‌ విశ్లేషణ ప్రకారం అమెరికాలో సంక్షోభ సమయంలో వడ్డీ రేటు 3.6శాతం వుండగా ఒక ఏడాదిలో అది 0.25శాతానికి పడిపోయింది.2016 వరకు అదే కొనసాగి, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రెండుశాతానికి పెరిగింది. అంతకంటే ఎక్కువగా మన దేశంలో వడ్డీ రేట్లు వున్నాయి కనుక. డాలరు బాబులు మనకు వుదారంగా అప్పులిచ్చారు. ఇప్పుడు తమ దగ్గరే వడ్డీ రేట్లు పెరిగాయి, ఇంకా పెంచుతామని అమెరికా ఫెడరల్‌ రిజర్వు( రిజర్వుబ్యాంకు వంటిది) ప్రకటించింది. గనుక మనకు అప్పు లేదా పెట్టుబడులు పెట్టటం కంటే తమ దేశమే నయమని ఎవరికి వారు వెనక్కి తీసుకుంటున్నారు. ఇది కూడా మన రూపాయి పతనానికి దారి తీస్తోంది.

మన వాణిజ్యమంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్‌ా జూలై నెలల్లో మన చమురు దిగుమతుల విలువ 46.98 బిలియన్‌ డాలర్లు. అదే నెలల్లో ఒక ఏడాది క్రితం ఆ మొత్తం 31.02 బిలియన్లు మాత్రమే. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగటమే దీనికి కారణం. ఇది ప్రామాణిక బ్రెంట్‌ ముడిచమురు ప్రస్తుతం పీపా ధర 78 డాలర్లు వుంది. ఈ ఏడాది అది 80 దాట వచ్చని అంచనా. చమురు ధరలు అంతకు మించి 90 డాలర్లకు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు 3.6శాతానికి చేరుతుందని అంచనా. ఇదే జరిగితే జనంలో గగ్గోలు చెలరేగకుండా వుండాలంటే చమురు మీద పెంచిన పన్నులను అయినా తగ్గించాలి. లేదా పెరిగిన భారాన్ని జనం మీద మోపాలి. తగ్గిస్తే ప్రభుత్వం అదనంగో నోట్లను ముద్రించాలి, అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే ధరలు పెరుగుతాయి. భారం తగ్గించకపోయినా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. కరంట్‌ ఖాతా లోటు పెరిగితే అప్పులు తెచ్చి లేదా జనం మీద భారాలు మోపీ చెల్లింపులు చేయాల్సి వుంటుంది. ఏది జరిగినా భరించాల్సింది జనమే.

గతంలో చూసిన అనుభవాల కారణంగా విదేశీమారక ద్రవ్యనిల్వలకు ఆర్‌బిఐ కొన్ని చర్యలు తీసుకుంది. వాటి నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య 14.5బిలియన్‌ డాలర్లను విక్రయించి డాలర్లకు డిమాండ్‌ను తగ్గించేందుకు తద్వారా రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూసేందుకు ప్రయత్నించింది. రూపాయి బాండ్లను ప్రవేశపెట్టటం, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచటం ద్వారా డాలర్ల డిమాండ్‌ను తగ్గించటం వంటి చర్యలు తీసుకుంది. రూపాయి విలువ పతనాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని మన దేశానికి పంపుతున్నారు. మన కరెన్సీ ఎంత పతనమైతే వారికి అంతగా కష్టపడకుండానే ఎక్కువ రూపాయలు వస్తాయి మరి. చైనాలో కరెన్సీ విలువ మన మాదిరి పతనం కాలేదు, డాలరుతో పోటీ పడుతోంది కనుక ప్రవాస చైనీయులు మనవారి కంటే ఐదు బిలియన్‌ డాలర్లు తక్కువ పంపారట. చమురు ధరలు తక్కువగా వున్నాయి గనుక సొమ్ము చేసుకుందామని పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన విమాన కంపెనీలు ఇప్పుడు దివాలా బాటలో వుండటానికి చమురు ధరలు పెరగటమే కారణం.రాబోయే రోజుల్లో దిగుమతి చేసుకొనే ఆధునిక పరికరాలు ధరలు పెరిగి టెలికాం కంపెనీలపై భారం పెరగనున్నదని అప్పుడే వార్తలు వస్తున్నాయి. మన్మోహన్‌ సింగ్‌ చివరి రోజుల్లో అంటే 2013లో ఆరునెలల దిగుమతి అవసరాలకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలుంటే ఇప్పుడు మోడీ చివరి రోజుల్లో పది నెలలకు సరిపడా వున్నాయి. అనూహ్యపరిస్ధితులు తలెత్తితే పరిస్ధితి ఇంకా దిగజారి మరోసారి అప్పుల చిప్ప పట్టుకోవాల్సి వచ్చినా ఆశ్చర్య ం లేదు. ఇటువంటి విధానాలతో లబ్ది పొందేవారి కంటే నష్టపోయేవారే ఎక్కువ.1991 తరువాత అధికారంలో వున్నవారు వరుసగా రెండవ సారి ఎన్నిక అవటం 2009 ఒక్క మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే జరిగింది. మరే పార్టీ వరుసగా అధికారంలోకి రాలేదు. అందుకే పరిస్ధితులు మరింతగా దిగజారకముందే ఓటర్ల ముందుకు వెళితే ఫలితం వుంటుందేమో అన్నఆశతో నరేంద్రమోడీ ముందస్తు ఎన్నికల గురించి దూరాలోచన చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాగు పెట్టుబడులలో ఎగువ- పంటల దిగుబడుల్లో దిగువ !

14 Tuesday Aug 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Agriculture, agriculture in india, crops productivity low, high input costs

Image result for agriculture in india :high input costs

ఎం కోటేశ్వరరావు

ముందస్తు ఎన్నికలు మదిలో వున్న కారణంగానే సాగు ప్రారంభమైన నెల రోజుల తరువాత నరేంద్రమోడీ పంటల కనీస మద్దతు ధరలను ఆలస్యంగా ప్రకటించారని విమర్శలు ఎదుర్కొన్నారు. వెనుకో ముందో ప్రభుత్వం ఏదో ఒకటి చేసిందిగా, పెంపుదలను అభినందిస్తారా లేదా అని మోడీ మద్దతుదారులు అడగటం సహజం. 2022 నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామని మోడీ నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే వున్నారు. ఇందుకు గాను మోడీ అధికారానికి వచ్చిన రెండేళ్ల తరువాత 2016లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది ఇంతవరకు 14నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. అంతిమ నివేదికను సమర్పించాల్సి వుంది. దానిలో ఏమి సిఫార్సు చేస్తారో ఇంతవరకు వెల్లడి కాలేదు అయినా సరే నాలుగు సంవత్సరాల పాలన తరువాత తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చానని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించారు.

వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న కొన్ని సమస్యలను చూద్దాం. వ్యవసాయ ధరల, ఖర్చుల కమిషన్‌(సిఏసిపి) వ్యవసాయ ఖర్చును మూడు రకాలుగా చూపింది. వుదాహరణకు ధాన్య వుత్పత్తి వాస్తవ ఖర్చు ఎ2 రు.865, రెండవది వాస్తవ ఖర్చు ఎ2, వాస్తవ ఖర్చు ఎ2 ప్లస్‌ (రైతు శ్రమ) ఎఫ్‌ఎల్‌,రు.1166, మూడవది సి2 రు 1560 ( దీనిలో వాస్తవఖర్చు ఎ2, ఎఫ్‌ఎల్‌, కౌలు, బ్యాంకు వడ్డీలు, ఇతరాలు అన్నీ వున్నాయి.) గిట్టుబాటు ధర నిర్ణయించేటపుడు ప్రభుత్వాలు సి2ను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి బదులు రు.1166ను మాత్రమే తీసుకొని దానిలో యాభైశాతం కలిపితే వచ్చే మొత్తాన్ని నిర్ణయించి, ఇదే గిట్టుబాటు ధర, మా వాగ్దానాన్ని నెరవేర్చామని మోడీ సర్కార్‌ చెబుతోంది. సి2ను పరిగణనలోకి తీసుకుంటే ధాన్యం ధర రు.2,340 కావాలి. కానీ కేంద్రం రు.1750,1770 వంతున నిర్ణయించింది. అన్ని పంటలకూ ఇదే తీరు. పత్తికి రు 6,771కి గాను 5150,5450 వంతున నిర్ణయించింది.

వ్యవసాయ పెట్టుబడులలో భాగమైన ఎరువులు, పురుగు మందులు, పెట్రోలు, డీజిలు వంటి వాటిని అంతర్జాతీయ ధరల ప్రాతిపదికన(ఎరువులకు స్వల్ప రాయితీలు మినహా) ఎలాంటి రాయితీలు లేకుండా రైతాంగం కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఇదే సమయంలో మద్దతు ధరల నిర్ణయంలో అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను కూడా పరిగణనంలోకి తీసుకోవాలని, మనం ఎగుమతులలో పోటీ పడేలా వుండాలని కేంద్రం చెబుతోంది. ఇక్కడే పొంతన కుదరటం లేదు. ధనిక దేశాలన్నీ అటు రైతాంగానికి, ఇటు వ్యాపారులకు రాయితీలు ఇచ్చి మరీ ఎగుమతులు చేయిస్తున్నాయి, వినియోగదారులకు అందిస్తున్నాయి. మన దగ్గర అటువంటి పరిస్ధితి లేదు.

మన దేశంలో నూతన ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత 1995 నుంచి ఇప్పటి వరకు జాతీయ నేర రికార్డుల బ్యూరో సమాచారం మేరకు రోజుకు సగటున 46 మంది రైతులు బలవన్మరణం పాలవుతున్నారు. దీనికి ఆర్ధిక, సామాజిక, భౌతిక పరమైనవిగా కారణాలను మూడు తరగతులుగా చూస్తున్నారు. ఏ కారణం ఎక్కువగా వుందన్న విశ్లేషణలో పంటలు దెబ్బతినటం, ధరలు పడిపోవటం వాటి పర్యవసానాలైన అప్పుల పాలు కావటం వంటి అంశాలే ప్రధానంగా పనిచేస్తున్నాయని తేలింది. రైతాంగ ఆత్మహత్యలు ఒక సాధారణ అంశంగా మారాయి. ప్రపంచీకరణలో ద్రవ్యీకరణ లేదా ధనీకరణ మార్కెట్లను ప్రభావితం చేస్తూ అన్ని రంగాలను అతలాకుతలం చేస్తున్నది. ఈ ప్రక్రియలో ఎక్కడా ప్రమేయం లేని రైతు అంతిమంగా ప్రభావితం అవుతున్నాడు.

అమెరికా వ్యవసాయ శాఖ 2018 జూలై రెండవ వారంలో విడుదల చేసిన సమాచారం ప్రకారం కొన్ని పంటల దిగుబడులు (ఒక హెక్టారు(రెండున్నర ఎకరాలు)కు టన్నులలో, పత్తి కిలోలు) 2016-17 సంవత్సరంలో ఆయా దేశాలలో ఎలా వున్నాయో చూద్దాం. పత్తి దిగుబడులు బర్మాలో 634, పాకిస్ధాన్‌లో 699, సిరియాలో 1089, మెక్సికోలో 1520, ఆస్ట్రేలియాలో 1602, బ్రెజిల్‌లో 1626, టర్కీలో 1742, కిలోలు వుంది.

పంట              ప్రపంచం       అమెరికా     ఐరోపా      చైనా      రష్యా      భారత్‌      ఈజిప్టు

గోధుమ           3.39         3.54      5.34      5.33    2.69      2.88      6.43

వరి                4.50         8.11      6.80     6.86     0.00      3.74      8.18

ముతక ధాన్యం   4.15        10.27      5.19     5.83     2.69      1.73      7.05

పత్తి               781          972        000     1708     000       542       673

మొక్కజన్న      5.77        10.96      7.21      5.97     5.51       2.69    8.00

తెల్ల జన్న        1.43         4.89       5.53      4.78     000       0.78     5.36

పై వివరాలను గమనించినపుడు దిగుబడి రీత్యా దాదాపు అన్ని పంటలలో మన దేశం ఎంతో వెనుకబడి వుంది. పెట్టుబడులు, మార్కెట్‌ ధరల విషయంలో ప్రపంచ మార్కెట్లకు అనుగుణ్యంగా మన రైతాంగం వ్యవహరించాల్సి వస్తోంది. దిగుబడి రీత్యా ఎంతో వెనుకబడి వుండటంతో ప్రపంచ మార్కెట్‌ ధరలు మన రైతాంగానికి ఏ మాత్రం గిట్టుబాటు కావు.

దిగుబడులు పెంచటానికి అవసరమైన వంగడాల సృష్టికి ఖర్చుతోకూడిన పరిశోధనలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఫలితంగా పత్తి దిగుబడి హెక్టారుకు మన దేశంలో గత పది సంవత్సరాలలో 5 నుంచి4.8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రపంచ సగటు ఎనిమిది క్వింటాళ్లు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో 35.9 నుంచి 19.1శాతం వరకు దిగుబడులు తగ్గటం గమనించాల్సిన అంశం. 2008-12 మధ్య దేశ సగటు దిగుబడి ఐదు క్వింటాళ్లు కాగా తెలుగు రాష్ట్రాలలో 5.4 వుంది, అదే 2013-17 మధ్య దేశ సగటు 4.8 కాగా తెలుగు రాష్ట్రాలలో 4.4కు పడిపోయింది. అనేక పంటల దిగుబడులలో మన దేశం చాలా వెనుక బడి వుందో దిగువ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీస్తోంది.(హెక్టారుకు కిలోలు)

పంట          ప్రపంచ సగటు        గరిష్టం          భారత్‌         రాష్ట్రాలు

ధాన్యం          4,636.6     చైనా6,932.4    2,400.2     పంజాబ్‌ 3974.1

మొక్కజన్న    5,640.1   అమెరికా10960.4   2,567.7 తమిళనాడు 7010

పప్పులు        731.2    ఆస్ట్రేలియా 5540.3      656.2      గుజరాత్‌ 931

కందిపప్పు      829.9        కెన్యా 1612.3       646.1   గుజరాత్‌ 1124.8

సోయాబీన్స్‌   2,755.6   అమెరికా 3,500.6       738.4       ఎంపి 831

వేరుశనగ     1,5,90.1   అమెరికా 4118.6       1,464.9  తమిళనాడు 2,574.3

లోపాలతో కూడిన కనీస మద్దతు ధరల నిర్ణయం ఒకటైతే అసలు వాటిని అమలు జరిపే యంత్రాంగం లేదు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్దలు అరకొరగా కొనుగోళ్లు, అదీ ప్రయివేటు మార్కెట్‌ కనుసన్నలలో మాత్రమే చేస్తున్నాయి. వుదాహరణకు పత్తి విషయం తీసుకుందాం. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికలో అందచేసిన వివరాల ప్రకారం 2013-17 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో క్వింటాలు ముడి పత్తి(పొట్టి పింజ) కనీస మద్దతు సగటు ధర రు. 3,763. ఇదే కాలంలో దేశీయ మార్కెట్లో రైతుకు వచ్చిన సగటు ధర రు. 4616, అంతర్జాతీయ మార్కెట్లో లభించినది రు.4674. అంటే కనీస మద్దతు ధర మార్కెట్‌ ధర కంటే తక్కువగానే వుంది. పత్తికి వ్యవసాయ ధరల కమిషన్‌ లెక్కింపు ప్రకారం అన్ని ఖర్చులను కలుపుకుంటే క్వింటాలుకు రు 6,771నిర్ణయించాల్సి వుండగా 5150,5450 వంతున నిర్ణయించింది. చైనా పత్తి రైతు సగటున హెక్టారుకు 1,708 కిలోల దిగుబడి సాధిస్తుండగా మన రైతు ప్రపంచ సగటు 781 కిలోల కంటే కూడా బాగా తక్కువగా 542కిలోలు మాత్రమే పొందుతున్నపుడు ఏ చిన్న వడిదుడుకు వచ్చినా తక్షణమే ప్రభావితం అయ్యే అవకాశం వుంది.

, దిగుబడులు పెరగక, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రైతులకు ప్రతిఫలం రాకపోవటం మరొక తీవ్ర సమస్య. రైతాంగ ఆదాయాల రెట్టింపునకు జాతీయ వర్షాధారిత సంస్ధ సిఇవో అశోక్‌ దళవాయి ఆధ్వర్యంలో ఏర్పాటయిన కమిటీ ఒక నివేదికలో ఇలా చెప్పింది. ‘ మొత్తం మీద 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో ఒక హెక్టారు వుత్పత్తి విలువ వాస్తవ ధరలలో ఎక్కువ పంటలకు పెరిగింది. అయితే అదే సమయంలో వుత్పత్తికి అయ్యే పెట్టుబడి ఖర్చు అంతకంటే ఎక్కువగా పెరిగింది.ఫలితంగా వ్యవసాయంలో అత్యధిక పంటలకు నిఖరంగా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. 2002-03 నుంచి 2012-13 మధ్యకాలంలో వ్యవసాయ కుటుంబాల ఆదాయ పెరుగుదల 3.6శాతమే వుంది, ఇది నిజ జిడిపి అభివృద్ధి రేటు కంటే చాలా తక్కువ. అసోంలో 2009-10 నుంచి 2013-14 మధ్య కాలంలో సగటున ఒక హెక్టారుకు ఆరువేల రూపాయలకు పైగా ధాన్య రైతులు నష్టపోతే అంతకు ముందు ఐదు సంవత్సరాల సగటు రు.3,930 మాత్రమే వుంది. అదే బెంగాల్లో నష్టం 3,146 నుంచి 5,625 రూపాయలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌ వంటి రాష్ట్రాలలో కూడా ధాన్య రైతుల సగటు ఆదాయం తగ్గిపోయింది.

ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని సమయాలలో రైతులను దెబ్బతీస్తున్నాయి. గత ఎన్‌డిఏ పాలనా కాలంలో 2001జూలై నుంచి పత్తి ఎగుమతులపై పరిమాణ ఆంక్షలను ఎత్తివేసి సాధారణ ఎగుమతుల జాబితాలో చేర్చారు. దేశీయంగా ధరలు పెరుగుతుండటంతో మిల్లు యజమానుల వత్తిడికి లొంగిన యుపిఏ సర్కార్‌ 2010 ఏప్రిల్‌లో క్వింటాలు పత్తి (దూది) ఎగుమతిపై రు.2500 సుంకం విధించి నిరుత్సాహపరచింది. ఎగుమతులను పరిమితుల ఆంక్షల జాబితాలో పెట్టింది.ు ఎగుమతులతో పాటు దిగుమతులను కూడా మన సర్కార్‌ ప్రోత్సహించింది. ఈ చర్య రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. మన పత్తి ఎగుమతులలో ఎగుడుదిగుడులు కూడా రైతాంగానికి లభించే ధరపై ప్రభావం చూపుతున్నాయి. గరిష్టంగా 2013-14లో గరిష్టంగా 18.6లక్షల టన్నుల పత్తి ఎగుమతి జరిగింది. అది 2016-17 నాటికి 9.1లక్షలకు పడిపోయింది.

Image result for agriculture in india :high input costs

ప్రపంచ మార్కెట్లో మన మొక్కజొన్నల కంటే రేట్లు తక్కువగా వుండటంతో ఇటీవలి కాలంలో దాదాపు ఎగుమతి ఆగిపోయింది. 2012-13లో 47.9లక్షల టన్నులు చేస్తే 2016-17 నాటికి 5.7లక్షల టన్నులకు పడిపోయింది. పప్పు ధాన్యాలన్నీ అంతర్జాతీయ ధరలకంటే మన దేశంలో ఎక్కువగా వుండటంతో తక్కువ ధరలకు వ్యాపారులు దిగుమతిచేసుకుంటున్నారు. మన మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా గతేడాది రైతాంగానికి రాలేదు. గత రెండు సంవత్సరాలలో బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధరలకంటే తక్కువకే రైతాంగం అమ్ముకోవాల్సి వచ్చింది. గత రెండు సంవత్సరాలలో పప్పుధాన్యాల ధరలు కనీస మద్దతు కంటే మార్కెట్లో తక్కువ వున్నాయి. మన వ్యవసాయ ఎగుమతులు 2013-14 నుంచి 2016-17వరకు 268.7 నుంచి 233.6 బిలియన్‌ డాలర్లకు పడిపోగా, దిగుమతులు 109.7 నుంచి 185.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

ఎన్నికలకు ముందు గత యుపిఏ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అది నడచిన బాటలోనే ఎన్‌డిఏ నడుస్తోంది. వుదాహరణకు గత పద్దెనిమిది సంవత్సరాలలో పత్తి ధరలను పెంచిన తీరు చూద్దాం. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ అసలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 2000-01 నుంచి 2003-04 వరకు పొడవు పింజ పత్తి కనీస మద్దతు ధరను 1825,1875,1895,1925 మాత్రమే చేసింది. తరువాత అధికారానికి వచ్చిన యుపిఏ ఒకటి 2009 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని 2007-08లో వున్న 2030 ధరను ఏకంగా 3000కు పెంచింది. తరువాత 3000,3300కు పెంచి తరువాత 2014 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆమొత్తాన్ని 4000 చేసింది.నరేంద్రమోడీ సర్కార్‌ దానిని 4050 నుంచి నాలుగు సంవత్సరాలలో 4,320కి పెంచి ఇప్పుడు రు.5450 చేసింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ ఇద్దరూ దొందూ దొందే అంటే కరెక్టుగా వుంటుందేమో !

రైతులు మరొకరు ఎవరిపట్ల అయినా ప్రభుత్వాలు, పాలకులు నిజాయితీతో వ్యవహరించాల్సి వుంది. అది గతంలో లేదు, ఇప్పుడూ కనిపించటం లేదు. రైతాంగాన్ని ఆదుకొనేందుకు అనుసరించే ఇతర విధానాలు, చర్యలతో పాటు వాటిలో వచ్చే వడిదుడుకులను మిగతా అంశాల కంటే బలంగా ఒక మేరకు తట్టుకొని నిలిచే దిగుబడుల పెంపు అన్నది మన దేశంలో తక్షణం తీసుకోవాల్సిన చర్య.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యూహ ప్రతి వ్యూహాలతో విస్తరిస్తున్న వాణిజ్య యుద్ధం !

01 Wednesday Aug 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Counter tariffs, counterstrategies, TRADE WAR, Trade war Expanding

Image result for Trade war

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరున తాను ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కొనసాగించటంపై అమెరికా, తనను తాను రక్షించుకోవటంపై దాడికి గురైన చైనా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ మొదలు పెట్టిన ఈ పోరు మీద ఇప్పటికీ అనేక కోణాల నుంచి విమర్శలే ఎక్కువగా వస్తున్నాయంటే ప్రపంచ పెట్టుబడిదారులు దీనిని ‘ మంచి యుద్ధం’ గా పరిగణించటం లేదనే అనేకోవాలి. తాజా పరిణామాలు, విశ్లేషణలను బట్టి వాణిజ్య దాడులను దీర్ఘకాలం కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ చర్యలు చైనా నాయకత్వ పట్టుదలను మరింత పెంచుతాయని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ హెచ్చరించాడు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నుల పెంపుద్వారా మోపిన భారాన్ని అమెరికన్‌ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వినియోగదారులపై మోపటం ప్రారంభమైంది. పంటల ధరలు పడిపోవటంతో రైతులకు 12బిలియన్‌ డాలర్ల మేర చెల్లించాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ప్రకటన వెలువడగానే మా సంగతేమిటని పారిశ్రామికవేత్తలు అడగటం ప్రారంభించారు. ఇదే సమయంలో అమెరికా దాడి ప్రభావం చైనాపై పెద్దగా పడిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా కరెన్సీ యువాన్‌ విలువ తగ్గటంతో చైనా ఎగుమతులపై పెద్ద ప్రభావం లేదన్నది వాటి సారాంశం. వెలువడుతున్న విమర్శలు, వాణిజ్య యుద్ధం ఇరుపక్షాలకూ నష్టం కలిగిస్తుందనే విశ్లేషణల పూర్వరంగంలో రెండు దేశాలూ మరోమారు చర్చలకు పూనుకోవచ్చన్నది తాజా వార్త.

అమెరికా తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై కూడా దిగుమతి పన్నుల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెరతీసింది. అయితే జూలై నెల మూడవ వారంలో ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌-డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య రాజీకుదిరింది. అమెరికా నుంచి సోయా, సహజవాయువు(ఎల్‌ఎన్‌జి), ఐరోపా నుంచి కార్లు మరియు ఆటో విడి భాగాలను పరస్పరం దిగుమతులు చేసుకొనేందుకు, ఆటోయేతర పారిశ్రామిక వుత్పత్తులపై ఎగుమతులు, దిగుమతులపై ఆటంకాలు, పన్నులు, సబ్సిడీలను ఎత్తివేసేందుకు అంగీకరించారు. అయితే పన్నులను పూర్తిగా రద్దు చేయటం అన్నది ఎంత మేరకు సాధ్యం అన్నది ప్రశ్న. అంతిమంగా కుదిరే ఒప్పందాన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఈ చర్య బహుముఖాలుగా దాడులు చేయటం తనకు మంచిది కాదన్న గ్రహింపు అమెరికాకు వచ్చినందునే ఈ తాత్కాలిక రాజీ, దానికి అది ఎంత కాలం కట్టుబడి వుంటుందన్నది కూడా సందేహమే. మా తల మీద తుపాకి గురి పెట్టి మమ్మల్ని ఒప్పించాలని చూస్తే కుదరదని ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు అమెరికాకు స్పష్టం చేశాయి. అందువల్లనే ట్రంప్‌ ఒక అడుగు వెనక్కు వేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చొక్కా నలగకుండా, అటూ ఇటూ ఆయుధాలను విక్రయించి లాభపడిన అమెరికాను ఎదుర్కోవాలంటే, విజయం సాధించినప్పటికీ ఎంతో నష్టాన్ని మూటగట్టుకొని, వికలాంగులుగా మారిన తాము ఐక్యంగా వుంటే తప్ప సాధ్యం కాదని గ్రహించిన ఫలితమే నేటి ఐరోపా యూనియన్‌. అందువలన వాటి రెండింటి మధ్య ఇప్పటికీ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అనూహ్యంగా తమకు సవాలుగా పరిణమించిన చైనాను ఎదుర్కోవటంలోనూ అవి చేతులు కలిపేందుకు వెనుకాడవు. కమ్యూనిస్టు ్యవతిరేకత, మార్కెట్లను ఆక్రమించుకోవటంలో అవి ఏవీ తక్కువ కాదు. అందువలన తమపై దాడి ప్రారంభించిన అమెరికా మీద ఐరోపా ధనిక దేశాలు వత్తిడి తెస్తాయనే భ్రమలు, తమతో చేతులు కలుపుతాయనే ఆశలు చైనాకు లేవు. అతి పెద్ద దేశంగా వున్నందున జిడిపి ఎక్కువగా వున్నట్లు కనిపించినా, అమెరికా, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నదేశమే, ఈ కారణంగానే ప్రపంచ వాణిజ్య సంస్ధలో కొన్ని రాయితీలను పొందుతున్నది.

అమెరికా తరువాత మరో ధనిక దేశమైన జపాన్‌ కూడా ఇటీవలే ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక బహిరంగ వాణిజ్య ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. జపాన్‌ నుంచి చేసుకొనే దిగమతులలో 99శాతం వస్తువులపై పన్నులను ఐరోపా యూనియన్‌ రద్దు చేస్తుంది. అమెరికా-ఐరోపా యూనియన్‌ కూడా ఇదే మాదిరి ఒప్పందానికి వస్తే అప్పుడు చైనా ఇతర దేశాలతో వాణిజ్యం చేయటం కష్టం అవుతుంది లేదా వత్తిడికి లంగి తన దిగుమతి పన్నులను తగ్గించి మరింతగా తన మార్కెట్‌ను తెరవాల్సి వుంటుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో చైనా ప్రారంభించిన సంస్కరణలకు నలభై సంవత్సరాలు నిండాయి. పశ్చిమ దేశాలకు పెద్ద ఎత్తున మార్కెట్‌ ద్వారాలు తెరిచిన కారణంగా పరస్పరం లబ్దిపొందాయి. ఈ క్రమంలో అది వాణిజ్య మిగులు దేశంగా మారింది. ఇంకా తమ వస్తువులను అదనంగా కొనాలని పశ్చిమ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధ మూలకారణమిదే. చైనా ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ పశ్చిమ దేశాలతో పోల్చితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటికీ వెనుకబడే వుంది. తమ వైపు నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపును అడ్డుకుంటే చైనా దారికి రావచ్చన్నది పశ్చిమ దేశాల వూహ. అమెరికా ఇప్పుడు క్రమంగా వాణిజ్య యుద్ధాన్ని 500బిలియన్‌ డాలర్ల మేరకు విలువగల వస్తువులకు పెంచుతానని బెదిరించింది. దీనితో పాటు చైనా పశ్చిమ దేశాల ఆధునిక పరిజ్ఞాన కంపెనీలను కొనుగోలు చేయకుండా చూడటంతో పాటు వాణిజ్య సంస్ధలో సంస్కరణల పేరుతో కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టాలని కూడా అమెరికా నిర్ణయించింది. అంటే చైనాను చక్రబంధంలో బిగించి దారికి తెచ్చుకోవాలన్నది వ్యూహం.

‘చైనాతో వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. అంటే వాణిజ్య యుద్ధం నిరవధికంగా కొనసాగవచ్చు, ఇతర దేశాల ద్వారా చైనా వుక్కు అమెరికా చేరకుండా వుండాలంటే ప్రపంచం అంతటి నుంచి వచ్చే వాటి మీద పన్నులు విధించటమే ఏకైక మార్గం ‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పారు. అమెరికా మరో వాణిజ్య ప్రతినిధి డెనిస్‌ షెయా చైనా కమ్యూనిస్టుపార్టీపై విరుచుకుపడుతూ చైనా ప్రభుత్వ ఒప్పందాలకు విరుద్దంగా కమ్యూనిస్టు పార్టీ వాణిజ్య విధానాన్ని ఆదేశిస్తున్నదని, చైనా ఆర్ధిక విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యులు నష్టపోవాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యురాలిగా లబ్ది పొందిన చైనా 2005-16 మధ్య 9.5శాతం నిజ జిడిపి అభివృద్ధి రేటుతో రెండవ ఆర్ధికశక్తిగా ఎదిగిందని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ధనిక దేశాలన్నీ చైనా మీద కత్తి గట్టటానికి సన్నద్ధం అవుతున్నాయి.

ముందు తన ఇంటిని చక్కదిద్దుకొని వాణిజ్య లోటు ఏర్పడకుండా దేశీయంగా పొదుపును పెంచుకోవాలని చైనా తిప్పి కొట్టింది. వాణిజ్య యుద్ధం ప్రారంభం సాంకేతికంగా జూలై ఆరున ప్రారంభమైనప్పటికీ దానికి నిర్ణయం, సన్నాహాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అనేక సంవత్సరాలుగా తమ సరకులను ఎక్కువగా కొనుగోలు చేసి వాణిజ్య లోటును తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తోంది. ఇదే సమయంలో ధనిక దేశాలపై ఆధారపడిన తన ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధకు వున్న పరిమితులను చైనా నాయకత్వం గుర్తించకపోలేదు. తమ పౌరుల కొనుగోలు శక్తిని పెంచటం, వెనుక బడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ వంటి అంతర్గత చర్యలతో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో సహా అన్ని ఖండాలలో తన వాణిజ్య అవకాశాలను పెంచుకొనేందుకు పూనుకుంది, ఆ దిశగా అనేక చర్యలను చేపట్టింది. తమ పన్నుల దాడి నుంచి కాచుకొనేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏ దేశమైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే లాభాలతో పాటు నష్టాలు కూడా వుంటాయి. కరెన్సీ విలువ తక్కువగా వుంటే ప్రపంచ మార్కెట్‌లో ధరలపోటీలో నిలబడవచ్చు. అదే సమయంలో సదరు దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతాయి. చైనా దగ్గర డాలర్‌ నిల్వలు భారీగా వున్నందున తన కరెన్సీ విలువ తగ్గించి కుక్క కాటుకు చెప్పు దెబ్బమాదిరి ప్రతీకారం తీర్చుకోవచ్చన్నది ఒక వాదన. పదకొండువందల వస్తువులపై అమెరికా విధించిన 25శాతం దిగుమతి పన్ను భారాన్ని తమ కంపెనీలపై తగ్గించేందుకు వాణిజ్య యుద్ధం ప్రారంభానికి ముందు నుంచే అంటే తన కరెన్సీ విలువ పతనాన్ని ప్రోత్సహించిందని, గత మూడునెలల్లో డాలరుతో 7.7శాతం పడిపోయిందని చెబుతున్నారు. ఇదే కాలంలో మన దేశంతో సహా అనేక దేశాల కరెన్సీ విలువలు పడిపోయాయి.’ చైనా, ఐరోపా యూనియన్‌లు కరెన్సీ విలువలను తిమ్మిని బమ్మిని చేస్తున్నాయి, వడ్డీ రేట్లు తక్కువగా వుంచుతున్నాయని’ ట్రంప్‌ స్వయంగా ట్వీటర్‌లో ఆరోపించాడు. దీనికి తగిన ఆధారాలు కనిపించటం లేదు. జర్మనీలో పదేండ్ల బాండ్లపై 0.5, అమెరికాలో 2.6 శాతం వడ్డీ వస్తుండగా చైనాలో 3.75శాతం వస్తున్న కారణంగా ఏప్రిల్‌కు ముందు పన్నెండు నెలల కాలంలో వంద బిలియన్‌ డాలర్లు చైనాకు తరలి వచ్చాయి. చైనా వడ్డీ రేటును స్ధిరంగా వుంచుతుందనే నమ్మకమే దీనికి కారణమని కొందరి విశ్లేషణ. కరెన్సీ విలువ తగ్గితే విత్త (వడ్డీ) వ్యాపారులు చైనా నుంచి బయటకు పోతారు. చైనాకు సంపదలతో పాటు అప్పులు కూడా భారీగానే వున్నాయి, అలాంటపుడు విదేశీ నిధులు బయటకుపోతే ఎన్నో చిక్కులు తలెత్తుతాయి కనుక చైనా నాయకత్వం అలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోదు అని కొందరి వాదన.

Image result for Trade war

ఒక దేశంలో కరెన్సీ విలువ పడిపోతే అది దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు పెరుగుతాయి. యువాన్‌ విలువ తగ్గితే చైనాలో అమెరికా వస్తువులు ప్రియం అవుతాయి. జూలై ఆరు తరువాత ఇప్పటి వరకు యువాన్‌ విలువ రెండున్నర శాతం తగ్గింది. అయితే ఇలాంటి హెచ్చు తగ్గులు గతంలో కూడా వున్నాయి. గతనెలలో చైనా పిఎంఐ సూచిక 51.2గా వుంది. అంతకు తగ్గితే ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడినట్లు. ఏమైనా ప్రభావం, పర్యవసానాల గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము. గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకొనేందుకు రష్యా తన కరెన్సీ విలువను తక్కువగా వుంచిందని, చైనా కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని కొందరు అంటున్నారు.అయితే రష్యాకు దాని వలన కొన్ని సమస్యలు కూడా తలెత్తకపోలేదు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు అటు చైనా ఇటు అమెరికా మీద మెల్లగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో సోయా, ఇతర వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనం కావటంతో రైతులను ఆదుకొనేందుకు ట్రంప్‌ సర్కార్‌ 12బిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమెరికాకు ప్రతిగా తాము విధించిన పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభావితమయ్యే పరిశ్రమలు, సంస్ధలకు రాయితీల రూపేణా అందిస్తామని చైనా ఎప్పుడో ప్రకటించింది. రైతులకు రాయితీలు ప్రకటించటంతో మిగతా పరిశ్రమల వారు కూడా తమ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా రాయితీలు ఇస్తే 39బిలియన్‌ డాలర్లు అవుతాయని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. గతంలో తాము ఎన్నో మాంద్యాలు, అంతర్యుద్ధాల కాలంలో కూడా నిలబడ్డామని కానీ ఇప్పుడు వాణిజ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మనుగడ కష్టమని 1839 నుంచి వునికిలో వున్న బ్రిన్లీ-హార్డీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. వుక్కు ధరలు 33శాతం పెరిగాయని వాపోయారు. అనుచిత యుద్ధం, అసమర్ధులైన సైన్యాధికారులు, ప్రజల మద్దతు లేనపుడు గెలవటం అసాధ్యమని, ట్రంప్‌ ప్రారంభించి వాణిజ్య యుద్దం కూడా అలాంటిదే అని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు ఏమైనప్పటికీ 2020 నాటికి అమెరికా ఆర్ధిక లోటు లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే జరిగితే పెట్టుబడులు, దిగుమతులు పడిపోవటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం వుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సమస్య చైనా కాదని, దేశీయంగా పొదుపు చాలా తక్కువగా వుండటం అసలు సమస్య అన్నారు. ట్రంప్‌ కోరుతున్నట్లు అమెరికా నుంచి చైనా మరింతగా చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మితే చైనాతో వాణిజ్యలోటు తగ్గించానని ట్రంప్‌ చెప్పుకోవటానికి తప్ప పెద్ద తేడా ఏమీ వుండదు, రవాణా ఖర్చులు పెరుగుతాయి అన్నారు. చైనా వస్తువులకు డిమాండ్‌ తగ్గితే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే దాని కరెన్సీ విలువ బలహీనమౌతుంది, అప్పుడు ఇతర దేశాలతో చైనా పోటీతత్వం పెరుగుతుంది. 2015లో చైనా ఆమోదించిన మేడిన్‌ చైనా 2025 విధానాన్ని అడ్డుకొనేందుకు ట్రంప్‌ ప్రయత్నించినట్లయితే కచ్చితంగా విఫలమౌతాడు, మరోవైపు నూతన ఆవిష్కరణలు, సాంకేతికంగా పైచేయి సాధించాలన్న చైనా నేతల పట్టుదలను మరింత పెంచినవారవుతారు, తాము ఇతరులపై ఆధారపడలేమని వారు గుర్తించిన తరువాత అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అని స్టిగ్జిజ్‌ చేసిన హెచ్చరికను ట్రంప్‌ పట్టించుకుంటాడా?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d