సంక్షోభ సమయాల్లోనే సంస్కరణలు- ఇందిరా గాంధీ హయాంలో ఏం జరిగింది !

Tags

, , , , , ,

Did Indira Gandhi impose Emergency to escape economic crisis ...

ఎం కోటేశ్వరరావు
జిడిపిలో పదిశాతం విలువగల 20లక్షల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించినప్పటికీ నరేంద్రమోడీ ఆ సంతోషాన్ని స్వయంగా మీడియాతో ఎందుకు పంచుకోలేదు అని ఒక మీడియా మిత్రుడికి సందేహం వచ్చింది. నరేంద్రమోడీకి ప్రచారం కండూతి లేదు, అది ఒక బాధ్యతగా చేశారు కనుక మీడియాలో డబ్బాకొట్టుకోవాలనుకో లేదు, మోడీగారీ నమ్రతకు అది చిహ్నం అని మరొకరు వ్యాఖ్యానించారు. యావత్‌ జాతికి కష్ట కాలం రావటం దేశంలో ఇదే ప్రధమం, అలాంటపుడు కూడా జర్నలిస్టులతో మాటా మంతీ కలపలేదంటే ఇంకెప్పుడు మాట్లాడతారు ? అని మరొకరి వ్యాఖ్య. ఇలా పలు అంశాలపై సాగిన సంభాషణల్లో కరోనా సమయంలో దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలకు బదులు ఆ ముసుగులో ” సంస్కరణ ”లకు ఎందుకు తెరలేపారు అన్న ప్రశ్న వచ్చింది. నిజమే కదా !
మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు అన్నట్లుగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల రూపాయల కరోనా పాకేజి ఒక పాకేజి కాదు, మోడీ గారి ఆత్మ అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే జుమ్లా ! అవసరానికేదో చెబుతాం అవన్నీ నిజమనుకుంటే ఎలా అన్నది జుమ్లా అనే పదానికి అర్ధం. తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిష్కరించిన లెక్కల్లో చూపే రోజులివి. పాకేజ్‌లో బడ్జెట్‌ పధకాలతో నిమిత్తం లేకుండా అదనంగా ఖర్చు చేసేది ఎంత? మామూలుగా లేదా అదనంగా ఇవ్వదలచిన అప్పుల మొత్తాన్ని ఇరవై లక్షల కోట్లలో చూపారా ? ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మరచిపోవాల్సిన సమస్య కాదు గనుక ఇలాంటి వాటి మంచి చెడ్డల గురించి మరో సందర్భంలో చూద్ధాం.
కనీవినీ ఎరుగని సంక్షోభ సమయంలో వివాదాస్పద సంస్కరణలు ప్రకటించటం ఇదే మొదటిసారా ? మన దేశంలో సంస్కరణల పేరుతో తీసుకున్న దేశ, ప్రజావ్యతిరేక చర్యలన్నీ సంక్షోభ సమయాల్లో తీసుకున్నవే అన్నది నమ్మలేని నిజం. అదే విధంగా చేదు సంస్కరణలు చేపట్టిన ప్రతిసారీ జనం చేత వాటిని మింగించటానికి స్వదేశీ, స్వావలంబన, స్వయం సమృద్ధి నినాదాల పంచదార పూత పూయటాన్ని కూడా చూడవచ్చు. ఏదో ఒకటి చేసి ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని జనం భావిస్తారు, పాలకులు తీసుకొనే చర్యల మంచి చెడ్డలను విశ్లేషించే సంపూర్ణ పరిజ్ఞానం ఉండదు కనుక ఆ ముసుగులో తమ అజెండాను అమలు జరుపుతారు. ఇప్పటి వరకూ జరిగిన సంస్కరణల చరిత్రను చూస్తే ఆర్భాటంగా లేదా మోసపూరితం లేదా బలవంతంగా అమలు జరిపిన పాలకులందరూ తరువాత చరిత్ర చెత్తబుట్టలోకి జారిన వారే ! అయితే ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్నది సంస్కరణల కిందకే వస్తుందా ? అవును అంటే ఏమౌతారు ? కాకపోతే మరేమిటి, ఏం జరుగుతుంది? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న ! ఇప్పటికైతే, తినబోతూ రుచి అడగటం ఎందుకు అన్నదే సమాధానం !
దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ ప్రారంభం అయినప్పటి నుంచి ముఖ్యంగా జాతీయ మీడియాను పరిశీలిస్తే మరిన్ని సంస్కరణలకు ఇదే మంచి తరుణం అని అనేక మంది మంచి చెడ్డల విశ్లేషణల పేరుతో సలహాలు ఇచ్చారు. నరేంద్రమోడీ 1.0లో ఘోరవైఫల్యం కారణంగా ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు ఐదు శాతం లోపుకు పడిపోయింది. దీనికి కరోనా కూడా తోడు కావటంతో సున్నా లేదా మైనస్‌ కావచ్చని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. ఆ సూచనలు లోక్‌సభ ఎన్నికలకు ముందే కనిపించినా దాచిన మోడీ మరింత మెజారిటీతో అధికారానికి వచ్చిన దగ్గర నుంచి 2.0 ” సంస్కరణ”ల గురించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్‌ రూపంలో అలాంటి అవకాశం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. గత ఏడాది కాలంలో వడ్డీరేట్లు తగ్గించినప్పటికీ పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో వైఫల్యం తప్ప పురోగతి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా విదేశీ వస్తువులకే కాదు, విదేశీ నిధుల ప్రవాహానికి కూడా మన ద్రవ్య మార్కెట్‌ను తెరవాలని ద్రవ్య పెట్టుబడిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.
దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది కనుక బయటపడేందుకు ఏదో ఒకటి చేయాలని జనం భావిస్తున్నారు కనుక తమకు ఇదే మంచి అవకాశమని కేంద్ర పాలకులు గత ఏడాదే గ్రహించారు. ప్రభుత్వం తీసుకొనే అప్పులను బాండ్ల పేరుతో వేలం వేస్తారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే బాండ్లను విదేశీ సంస్ధలు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని తొలిసారిగా మోడీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10బిలియన్‌ డాలర్ల వరకు డాలర్‌ రుణాలు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇది గత విధానాల నుంచి వైదొలగటమే. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఇలాంటి అప్పులు తీసుకొని తిప్పలను కొని తెచ్చుకున్నాయని తెలిసీ ఇందుకు పూనుకున్నారు. ప్రభుత్వాలకు అప్పులు కావాలంటే మన దేశంలోని వారి నుంచే తీసుకోవచ్చు. అయితే అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే వడ్డీ రేట్లు మన దేశంలో ఎక్కువ కనుక అప్పు ఖరీదు పెరుగుతుంది. దీన్ని సాకుగా చూపుతూ విదేశీ సంస్ధలకు తలుపులు తెరిచారు.
దీన్ని సమర్ధించుకొనేందుకు చేస్తున్న వాదనల సారాంశం ఇలా ఉంది. స్ధానికంగా ఉన్న వడ్డీ రేట్లలో సగానికంటే తక్కువకే విదేశీ సంస్ధల నుంచి రుణాలు తీసుకుంటే స్వదేశంలో బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. దీని వలన స్ధానిక వడ్డీ రేట్లు, భారం తగ్గుతుంది. ఇది జరిగితే బ్యాంకులు ఆ మేరకు తమ దగ్గర రుణాలు తీసుకున్న ఖాతాదారులకు భారాన్ని తగ్గిస్తాయి. ప్రయివేటు రంగానికి రుణ లభ్యత పెరుగుతుంది. ప్రస్తుతం మన విదేశీ అప్పు జిడిపిలో ఐదోవంతు మాత్రమే ఉంది, అందువలన అదనంగా అప్పులు తీసుకున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి జనాలకు ఈ వాదన వీనుల విందుగా ఉంటుంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. డాలర్‌ అప్పులన్నీ డాలర్లలోనే చెల్లించాలి తప్ప మన రూపాయల్లో చెల్లిస్తామంటే కుదరదు.
యుపిఏ హయాంలో మన దేశంలోని పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు చౌకగా వస్తున్నాయి కదా అని విదేశాల నుంచి డాలర్‌ రుణాలు పెద్ద మొత్తంలో తీసుకున్నాయి. అవి అనుకున్నదొకటి జరిగింది మరొకటి. అందరికీ తెలిసిన అనిల్‌ అంబానీ, జివికె, లాంకో వంటి సంస్ధలు విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీల పేరుతో అలాంటి అప్పులు తీసుకొని ఒక విడత వడ్డీ కూడా చెల్లించలేక దివాలా తీసిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. లాంకో కంపెనీ వడ్డీ రేటు 130శాతం, జివికేకు 55శాతం వరకు చేరింది. ఈ కంపెనీలన్నీ రూపాయి మారకపు విలువ పతనంతో మరింతగా అప్పులపాలయ్యాయి. రూపాయి రుణం తీసుకుంటే ప్రతి ఏటా లేదా చివరిలో వడ్డీ, అసలు కలిపి ఇచ్చినా రూపాయల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ డాలర్ల వ్యహారం అలా కాదు. ఉదాహరణకు ఇలాంటి కంపెనీలు 2007-08లోవంద డాలర్లు అప్పులు తీసుకున్నాయనుకుందాం. ఆ ఏడాది రూపాయి సగటు మారకపు విలువ 40.24 కనుక వాటికి 4,024 రూపాయలు పెట్టుబడిగా అందుబాటులోకి వచ్చాయి. ఆ వందడాలర్లను 2013-14లో చెల్లించాల్సి ఉందనుకుంటే తీసుకున్న రోజు నుంచి తీర్చే వరకు ఏటా వడ్డీ, చివరిలో అసలు లేదా మొత్తం ఒకేసారి చెల్లించాలి అన్నది ఒప్పందం అనుకుందాం.ఆ ఏడాదిలో రూపాయి విలువ 60.50కి పడిపోయింది. అంటే తిరిగి డాలర్లలో చెల్లించాలి అంటే ఆ రోజు మార్కెట్లో వాటిని కొనుగోలు చేయాలంటే రూ.6,050 చెల్లిస్తే తప్ప వంద డాలర్లు రావు. అంటే అప్పు తీసుకున్నవారికి తడిచి మోపెడు అయింది. అప్పుతీసుకున్న నాటితో పోలిస్తే తరువాత ఆర్ధిక వ్యవస్ధ దిగజారటంతో అసలుకే మోసం వచ్చింది. అందుకే దివాలాతీసి రంగం నుంచి అంతర్ధానమయ్యాయి. అదే ప్రభుత్వాలు అలాంటి అప్పులు తీసుకుంటే అంతర్ధానం అయ్యే అవకాశం లేదు. దేశం మొత్తాన్ని విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టటం, తెగనమ్మటం తప్ప మరొక మార్గం లేదు. గతంలో ఈ కంపెనీలకు ఏం జరిగిందో తెలిసి కూడ అలాంటి ప్రమాదకర విధానాలను ఇప్పుడు నరేంద్రమోడీ అమలు జరుపుతున్నారు.
విదేశీ డాలర్‌ రుణాలను తీసుకున్నపుడు ఉన్న మారకం రేటు కంటే మన రూపాయి బలపడిందనుకోండి అప్పుడు మనకు లాభం. మన రూపాయి చరిత్రను చూస్తే పతనం తప్ప బలపడిన దాఖలా లేదు. బిజెపి, ఇతర పార్టీల చేత అసమర్ధ ప్రధాని అని ముద్రవేయించుకున్న మన్మోహన్‌ సింగ్‌ హయాంలో రూపాయి విలువ 44.93 నుంచి 60.50కి దిగజారింది. అత్యంత సమర్దుడని పొగిడించుకున్న నరేంద్ర మోడీ హయాంలో అక్కడి నుంచి ఇప్పుడు 75కు పతనమైన విషయం తెలిసిందే. ఇదింకా ఎంతకు దిగజారనుందో తెలియదు. గత ఆరు సంవత్సరాల పోకడ చూసినపుడు రూపాయి పతనాన్ని అరికట్టే సామర్ధ్యం లేదా చిత్తశుద్ది మోడీ సర్కార్‌కు లేదని తేలిపోయింది.ఎగుమతులను పెంచే పేరుతో రూపాయి పతనాన్ని ప్రోత్సహిస్తున్నారు.
చైనా కూడా సంస్కరణలు చేపట్టింది, దాని వలన అది ఎంతో లబ్దిపొందింది. మనమూ చేపట్టాం వాటితో మరింత దిగజారిపోతున్నాము. అందుకే వాటిని ఘనంగా చెప్పుకున్నవారూ, గట్టిగా సమర్ధించిన వారూ చరిత్రలో ప్రజావ్యతిరేకులుగా మిగిలిపోయారు. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన సంస్కరణలు దేశాన్ని మరింతగా విదేశీ కార్పొరేట్లకు అప్పగించేవే తప్ప మన జనానికి ప్రయోజనకరం కాదన్నది స్పష్టం. మన సంస్కరణలన్నీ సంక్షోభ సమయంలో చేపట్టినవే. అవసరానికి ఎవరి దగ్గరకైనా వెళ్లినపుడు వారి షరతులకు మనం తలొగ్గాలి తప్ప మన మాట చెల్లదు. మన సంస్కరణలకూ చైనా సంస్కరణలకూ ఒక మౌలిక తేదా ఉంది. చైనాలో ప్రభుత్వరంగ ఆధిపత్యంలో ప్రయివేటు రంగాన్ని అనుమతించారు. ఇక్కడ ప్రభుత్వరంగాన్ని దెబ్బతీసి, ప్రయివేటీకరణ చేస్తూ విదేశీ, స్వదేశీ ప్రయివేటు పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్నారు. చైనాలో ప్రభుత్వరంగంలో వచ్చే లాభాలను తిరిగి పెట్టుబడులుగా పెడుతున్నారు. మన దగ్గర ప్రభుత్వరంగ సంస్ధలను తెగనమ్మి లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు, ప్రయివేటురంగానికి సబ్సిడీలు, ఇతర రూపాల్లో కట్టబెట్టేందుకు పూనుకున్నారు.
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా దేశం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. కారణం ఆశించిన స్ధాయిలో ఎగుమతులు పెరగలేదు, దిగుమతులతో వాణిజ్య లోటు పెరుగుతోంది. దేశీయంగా మన జనాల వినిమయ ఖర్చు తగ్గుతోంది, అంటే వస్తు వినిమయం తగ్గుతోంది.ఫలితంగా పరిశ్రమలు పూర్తి సామర్ధ్యంతో పని చేయటంలేదు, కార్మికులకు పనీ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం లేదు.అభివృద్ధి రేటు పడిపోతోంది. వెరసి ఆర్ధిక సంక్షోభం ముసురుతోంది. ఈ ఆరేండ్ల కాలంలో చమురు దిగుమతి ఖర్చు గతంతో పోలిస్తే బాగా తగ్గింది. ఇదే సమయంలో పన్నుల వాత మోగిపోతోంది.ఆదా అయిన సొమ్ము ఏమౌతోందో, అదనంగా వసూలు చేస్తున్న డబ్బు ఏమౌతోందో తెలియదు. ఈ సంక్షోభం నుంచి ఎలా బయట పడాలా అని చూస్తున్న మోడీ సర్కార్‌కు కరోనా వైరస్‌ మంచి అవకాశం ఇచ్చిందనే చెప్పాలి.
గత ఆరు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ లోటు బడ్జెట్‌ పెద్ద సమస్యగా ముందుకు వస్తోంది. అది జిడిపిలో 3.5శాతానికి లోపుగానే ఉంచుతామని చెబుతున్నప్పటికీ సాధ్యం కావటం లేదు. 2021 మార్చినాటికి 6.2శాతానికి చేరవచ్చని కొందరి అంచనా, కరోనా కారణంగా ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. ఈ నేపధ్యంలో ప్రకటించిన సంస్కరణల పర్యవసానాల గురించి తరువాత చర్చించుదాం. మన దేశంలో సంస్కరణలకు ఆద్యురాలు ఇందిరా గాంధీ. అయితే ఆమె సంస్కరణలను బ్యాంకుల జాతీయ కరణ, గరీబీ హఠావో వంటి నినాదాల రూపంలోకి మార్చి జనంలోకి వెళ్లారు. ప్రతి పాలకుడూ అదే చేసినా మీడియాలో ఇప్పటి మాదిరిగాక సంస్కరణల పేరుతో చర్చ తక్కువగా జరిగింది. మీడియా మొత్తంగా గతంలో చేపట్టిన వాటినీ, ఇప్పుడు మోడీ ప్రభుత్వ సంస్కరణలనూ సమర్ధిస్తోంది గనుక విమర్శనాత్మక వైఖరికి బదులు భ్రమలను మరింత పెంచే విధంగా వ్యవహరిస్తోంది.

Indira Gandhi: If we tolerate communalism, how will we preserve ...
మన సంస్కరణల భారతం గురించి క్లుప్తంగా చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం ముగియటం, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తలెత్తిన అనిశ్చిత స్ధితిలో కొందరు స్వేచ్చా మార్కెట్‌ విధానాలను అనుసరించాలని ప్రతిపాదించగా మరికొందరు అంగీకరించలేదు. ప్రయివేటు రంగంలోని పరిశ్రమలను రక్షించుకోవాలంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటు అవసరమని బోంబే క్లబ్‌ పేరుతో జెఆర్‌డి టాటా, జిడి బిర్లాతో సహా ఎనిమిది ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేసిన సూచన మేరకు పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. తరువాత ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. తొలి ప్రణాళిక ఏడాది అమలు తరువాత విదేశీ చెల్లింపుల సమస్య తలెత్తింది. నాడు ఆర్ధిక సలహాదారుగా ఉన్న ప్రశాంత చంద్ర మహలనబిస్‌ స్వదేశీ లేదా స్వయం సమృద్ధి స్ఫూర్తిని ముందుకు తెచ్చారు. ఈ క్రమంలో పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటంతో దేశంలో ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. వాటి దిగుమతికి విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించాల్సి వచ్చింది. దీనికి తోడు చైనాతో యుద్దం మన సమస్యలను మరింత పెద్దవి చేసింది. తరువాత లాల్‌బహదూర్‌ శాస్త్రి అధికారానికి వచ్చారు. పాకిస్ధాన్‌తో జరిగిన యుద్దంలో విజయం-పర్యవసానాల నేపధ్యంలో ఆర్ధిక సంస్కరణలకు తెరతీశారు. దానిలో భాగంగా కేంద్ర ప్రణాళికా విధానం నుంచి వైదొలగాలని ఆలోచన చేశారు. దాంతో ప్రణాళికా సంఘ అధికారాలను పరిమితం చేసి విదేశీ పెట్టుబడులు, ప్రయివేటు పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఇదే సమయంలో ఆహార రంగంలో ఉత్పత్తి పెంపుదలకు జైజవాన్‌ జైకిసాన్‌ నినాదమిచ్చారు. ఇది హరిత విప్లవానికి నాంది పలికింది. ఆ ఉత్సాహంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించి శ్వేత విప్లవానికి బాటలు వేశారు.
చైనాతో యుద్ధంలో ఓడినా, పాకిస్ధాన్‌తో గెలిచినా, పెట్టుబడులకు ఆహ్వానం పలికినా, నాడున్న అంతర్జాతీయ పరిస్ధితుల్లో అవి రాక మన ఆర్ధిక సమస్యలు తీవ్రమయ్యాయి. మన రాజకీయ,ఆర్ధిక వ్యవస్ధకు సవాళ్లు ఎదురు అయ్యాయి. లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణం, ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన వెంటనే ఆమెకు అటు పార్టీలో ఇటు ఆర్ధిక రంగంలో ప్రతిఘటన ప్రారంభమైంది. జనంలో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. చైనా తరువాత అతి పెద్దదైన మన మార్కెట్‌ను ఆక్రమించుకొనే అవకాశం దక్కలేదన్న అక్కసుతో ఉన్న ధనిక దేశాలు ప్రపంచబ్యాంకు ద్వారా మన దేశంలో ప్రవేశించేందుకు అవకాశం కోసం కాచుకున్నాయి. కాంగ్రెస్‌ పాలకుల దివాలా కోరు విధానాలు అందుకు అవకాశం ఇచ్చాయి. 1964లో ప్రపంచ బ్యాంకు బృందం బెర్నార్డ్‌ బెల్‌ నాయకత్వంలో మన దేశంలో పర్యటించి మన రూపాయి విలువను తగ్గించాలని, విదేశీ వాణిజ్యంపై ఉన్న అనేక ఆంక్షలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది. వాటిని నాటి ఆర్ధిక మంత్రి టిటి కృష్ణమాచారి తిరస్కరించారు. పాకిస్ధాన్‌ మద్దతుదారుగా ఉన్న అమెరికా అంతకు ముందు మనకు ప్రకటించిన సాయాన్ని యుద్దం కారణంగా ఆకస్మికంగా నిలిపివేసింది. 1965 లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణించటం, ఇందిరా గాంధీ ప్రధాని కావటం, ఆమె ప్రపంచ బ్యాంకు పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించటం దానికి నిదర్శనంగా కృష్ణమాచారిని పదవి నుంచి తొలగించటం, భారత్‌కు తిరిగి సాయం చేస్తామని అమెరికా ప్రకటించటం, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతామని ఇందిరా గాంధీ అంగీకరించటం వంటి పరిణామాలు వెంటవెంటనే జరిగాయి.
1965 జూన్‌ 6న ఇందిరా గాంధీ డాలరుతో మారకంలో మన రూపాయి విలువను 4.75 నుంచి 7.50కి తగ్గించారు. అనేక దిగుమతి ఆంక్షలను, ఎగుమతి సబ్సిడీలను తగ్గించారు. ఇవన్నీ షరతుల్లో భాగం. వృతం చెడ్డా ఫలం దక్కలేదు. మన ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. ప్రపంచ బ్యాంకు ఇస్తామని చెప్పిన మేరకు సాయం చేయలేదు. మరోవైపు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో జనం దృష్టిలో కాంగ్రెస్‌ పలుచనైంది. ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. పర్యవసానంగా 1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేంద్రంలో గెలిచినా తొలిసారిగా ఏడు ఉత్తరాది రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. పశ్చిమ దేశాలు మనల్ని మరింతగా తమ పాదాల ముందు మోకరిల్లేట్లు చేసుకొనేందుకు పూనుకున్నాయన్నది తేలిపోయింది. ఆ సమయంలో అమెరికా-సోవియట్‌ మధ్య తీవ్ర వైరం ఉండటంతో ఇందిరా గాంధీ సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని పశ్చిమ దేశాల మెడలు వంచి రెండు వైపుల నుంచి సాయం పొందాలని చూశారు. అధికారంలోకి రాగానే ఏ ప్రపంచబ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారో, ఏ అమెరికాతో చేతులు కలపాలని చూశారో వాటి బ్లాక్‌మెయిల్‌ కారణంగా వ్యతిరేకంగా ఇందిరా గాంధీ రాజకీయంగా వ్యవహరించాల్సి వచ్చింది.
పంచ వర్ష ప్రణాళికలను అమలు జరపలేని స్ధితి, దాంతో 1966 నుంచి మూడు సంవత్సరాల పాటు వార్షిక ప్రణాళికలను రూపొందించాల్సి వచ్చింది. పాలకపార్టీలో ముఠాపోరు ఒకవైపు, ఆర్ధికంగా అనిశ్చితి మరోవైపు, ఈ బలహీనతను ఆధారం చేసుకొని ప్రయివేటు బ్యాంకులు, ప్రయివేటు బీమా సంస్ధలు ప్రభుత్వ విధానాలకు అనుగుణ్యంగా వ్యవహరించటంగాక తమ ఇష్టానుసారంగా వ్యవహరించటం, అక్రమాలకు పాల్పడటం వంటి పరిణామాల నేపధ్యంలో రాజభరణాల రద్దు, బ్యాంకులు, బీమా కంపెనీల జాతీయం వంటి చర్యలతో ఇందిరా గాంధీ తిరిగి ప్రజల మన్ననలను పొందేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో కూడా పట్టు సాధించారు. చివరకు కాంగ్రెస్‌ రెండు ముక్కలుగా చీలిపోవటానికి పరిణామాలు దారి తీశాయి. స్వయం సమృద్ధి నినాదం మరోసారి ముందుకు వచ్చింది.

Indian Banks Nationalisation | Indira Gandhi's bank ...
ముందే చెప్పుకున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు చేసినా ఫలితం లేకపోవటమే కాదు, 1966లో విదేశీ చెల్లింపుల సమస్య మరోసారి ముందుకు వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఉపయోగించుకొనేందుకు దెబ్బతిన్న సంబంధాలను మరింతగా దిగజారకుండా చూసుకొనేందుకు, అర్ధిక దిగజారుడును ఆసరా చేసుకొని 1967లో మరోసారి ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అప్పటికే హరిత విప్లవం ప్రారంభమైంది. దాన్ని ఆసరా చేసుకొని పెట్టుబడిదారీ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించటం ఒకటైతే దానికి అవసరమైన ఎరువుల రంగంలో విదేశీపెట్టుబడులకు అనుమతి సాధించే ప్రతిపాదనలతో ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.
ఒక వైపు ప్రపంచ బ్యాంకు వత్తిడికి లొంగి కొన్ని సంస్కరణలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ మరోవైపు దాని విధానాలకు వ్యతిరేకంగా స్ధానిక అంశాల కారణంగా 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1972లో బీమా కంపెనీలు, 1973లో బొగ్గు, చమురు కంపెనీల జాతీయకరణ వంటి చర్యలను తీసుకుంది. ప్రయివేటు రంగం వైఫల్యం, అవినీతి అక్రమాలు, అవసరాలకు అనుగుణ్యంగా పురోగతి లేకపోవటం వంటి వివిధ కారణాలు ఇందుకు పురికొల్పాయి. ఈ చర్యలతో ఈ రంగాలలో విదేశీ పెట్టుబడులకు దారులు మూసుకుపోయాయి. అయితే ఇదే సమయంలో ఇతర రంగాలలో విదేశీ పెట్టుబడులను ఎలాంటి నియంత్రణ లేకుండా కొనసాగించటం కూడా చూడవచ్చు. ఒక వైపు ఈ చర్యలను జనమంతా హర్షించి కాంగ్రెస్‌, ఇందిరా గాంధీకి జనం బ్రహ్మరధం పట్టినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిన ఇందిరా గాంధీపై కేసులు, కోర్టు తీర్పు ప్రతికూలంగా రావటం వంటి పరిణామాలతో సానుకూల సంస్కరణ వాతావరణం ఉన్నప్పటికీ ఇందిరా గాంధీ తన పదవికోసం 1975లో అత్యవసర పరిస్ధితిని ప్రకటించి సరికొత్త రాజకీయ సంక్షోభానికి కారకురాలయ్యారు.
ఇందిరా గాంధీ-నరేంద్రమోడీని పోల్చటం కాదు, పరిస్దితులు అప్పుడూ ఇప్పుడూ ఒకే విధంగా లేవు గానీ ఒక రాజకీయవేత్త పలుకుబడికి-ఆర్ధిక సంక్షోభాలకు సంబంధం ఉండదు. వారు అనుసరించే ఎత్తుగడలు పలుకుబడిని తెచ్చిపెడితే అనుసరించే విధానాలు సంక్షోభాలకు కారణం అవుతాయి. ఇప్పుడు మన దేశంలో అదే పునరావృతం కానుందా ? ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం నరేంద్రమోడీ వ్యతిరేకులకే కాదు, ఆయన్ను పదికాలాల పాటు కాపాడుకోవాలనే అనుకూలురకు కూడా ఉంటుంది కదా !

చైనా కంపెనీలు : అరచేతిలో వైకుంఠం, అంతా భ్రాంతియేనా !

Tags

, , ,

Thousands of Companies from America, Japan and Korea leave China ...

ఎం కోటేశ్వరరావు
కష్ట కాలంలో కడుపు నిండా తిండి పెట్టకపోయినా కడుపు నింపే కబుర్లు చెబితే చాలు. చివరికి ఏమీ జరగకపోయినా ఎవరైనా ఏమి చేస్తారులే, మన ఖర్మ అలా ఉంది అని సర్దుకుపోయే స్ధితిలో మన సమాజం ఉంది. మనిషి ఆశాజీవి కనుక దారీ తెన్నూ కనిపించనపుడు ఏ చిన్న వెలుగు కనిపించినా , ఏ కాస్త శుభవార్త చెప్పినా పోయేదేముంది చూద్దాం అని గుడ్డిగా నమ్మేస్తారు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా నుంచి మన దేశానికి వాణిజ్య, పారిశ్రామిక సంస్ధలు ముఖ్యంగా అమెరికాకు చెందినవి తరలి రానున్నట్లు గత కొద్ది రోజులుగా ఊదరగొడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీయే అందుకు తెరలేపారంటే అతిశయోక్తి కాదు. రాబోయే కంపెనీల కోసం ముందుగానే స్ధలాలు, పొలాలను సిద్ధం చేస్తున్నామని, అందరికంటే ముందుగా ఎగిరి అందుకోవటానికి సిద్ధంగా ఉండాలని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్నాహాలు చేస్తున్నారు.నమ్మిన వారు కలలు కంటున్నారు. గతంలో నమ్మి దెబ్బతిన్నవారు వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. అనుమానాలను వ్యక్తం చేస్తున్నవారి మీద మీరసలు దేశభక్తులేనా, ఒక వేళ వస్తే గిస్తే మీకేమైనా ఇబ్బందా, చైనాయే అభివృద్ది చెందాలా? మనం వెనుకబడిపోవాలాని అని కొందరు వీరావేశంతో ఎదురు దాడికి దిగుతున్నారు. వారిలో ఒక తెగ వృత్తినటులు, అవసరానికి తగినట్లు తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. మరి కొందరు నటీనటుల హావభావాలు, విన్యాసాలకు పడిపోయి నటనే నిజమని భ్రమించి భుజానవేసుకొని వాదించే వారు. అసలు ఏం జరుగుతోంది ?
ఒక వైపు కరోనా వైరస్‌ కారణంగా తమ బతుకులు అతలాకుతలం కావటంతో పరాయి చోట దిక్కులేకుండా పడి ఉండటం కంటే స్వంత ఊళ్లో కడుపులో కాళ్లు పెట్టుకొని ఉండవచ్చని కోట్లాది మంది వలస కార్మికులు ప్రాణాలకు తెగించి వెళ్లిపోతున్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పరిస్ధితులు ఎప్పుడు బాగుపడతాయో, మూతపడిన పరిశ్రమలు తిరిగి ఎన్ని తెరుచుకుంటాయో, వెళ్లిన వారు ఎంతకాలానికి తిరిగి వస్తారో తెలియదు. అందుకే తమ పనులకు అవసరమైన వారిని ఊళ్లకు పంపవద్దని నిర్మాణ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పాలకులపై వత్తిడి తెస్తున్నారు. కొందరు పరోక్షంగా అందుకు సహకరిస్తే తెగించిన వారికి తెడ్డే లింగం అన్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప ఏకంగా బహిరంగంగానే మద్దతు ఇస్తూ శ్రామిక రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ముది మది తప్పిందా అని పార్టీ పెద్దల నుంచి అక్షింతలు పడటంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారనుకోండి.
ప్రపంచ వ్యాపితంగా కరోనాకు ముందే ఆర్ధిక సంక్షోభ ఛాయలు ముసరటం ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రపంచ జిడిపి వృద్ధి రేటు ఎంతశాతమన్నది తప్ప తిరోగమన దిశలోనే ఉండబోతున్నది. కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులకు మన దేశంలో కూడా పని ఉండదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది మన కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీస్తుంది. ఇప్పటికే ఉన్న కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేసే వారు తగ్గిపోయినట్లు గతంలోనే నివేదికలు వెలువడిన విషయం తెలిసిందే. అలాంటపుడు చైనా, మరొక దేశం నుంచి వచ్చే కంపెనీలు తయారు చేసే వస్తువులను కొనే దెవరు? కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలతో ఒక వేళ అవి చౌకగా తయారు చేస్తే పోటీకి తట్టుకోలేక ఉన్న కంపెనీలు మూత పడతాయి. సిమెంట్‌ రంగంలో ఏమి జరిగిందో చూశాము. కొత్త కంపెనీలకు ఇచ్చే రాయితీల కోసం పాత కంపెనీలను మూత పెట్టి విలువైన స్దలాలను రియలెస్టేట్‌తో సొమ్ము చేసుకొన్న కంపెనీలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో కొత్తగా పెట్టేవైనా, విదేశాల నుంచి వచ్చేవైనా కార్మికులు తక్కువ-యాంత్రీకరణ ఎక్కువ అన్నది తెలిసిందే. అందువలన అవి కొత్త సమస్యలను తీసుకువస్తాయి.

Thousands of companies mull China exit after Covid; India next ...
ఒక వైపు విదేశీ వస్తువులు వద్దు,స్వదేశీయే ముద్దు అనే కొత్త పల్లవిని మన పాలకులు అందుకున్నారు. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు, చైనా నుంచి అరువు తెచ్చుకొని లేదా అనుకరించి మనం లాక్‌డౌన్‌ అమలు జరిపినట్లే మన స్వదేశీ పిలుపును చూసి ఇతరులూ అమలు జరపరా? ప్రపంచమంతటా కరోనా వైరస్‌ సమస్య ఉంది కదా ! కరోనా లేనపుడే మన మేకిన్‌ ఇండియా పిలుపు దారుణంగా విఫలమైంది, జనం చెవుల్లో కమలం పువ్వులు పెట్టటం గాకపోతే ఇప్పుడు మేకిన్‌ ఇండియా పిలుపు వలన ప్రయోజనం ఏమిటి? దానిలో భాగంగా తయారు చేసే వస్తువులను ఏ దేశానికి ఎగుమతి చేస్తాము? ఇవన్నీ ఆలోచించాలా వద్దా ? దున్న ఈనిందనగానే గాటన కట్టేయమన్నట్లు పాలకులు, వారికి వంత పాడే మీడియా ఏది చెబితే దాన్ని నమ్మటమేనా మన పని ?
గతాన్ని మరచిన జాతికి భవిష్యత్‌ ఉండదు. ఆరు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా తాను పొందిన అనుభవంతో గుజరాత్‌ అభివృద్ది నమూనాను దేశవ్యాపితంగా అమలు జరిపి అభివృద్ధి చేస్తా అన్నారు. మనమంతా నిజమే కదా అనుకున్నాం.తరువాత ఎన్నడైనా దాని గురించి నోరు విప్పారా ? విదేశీ, స్వదేశీ నల్లధనాన్ని వెలికి తీస్తామని, దాన్ని పంచితే ప్రతి ఒక్కరికీ పదిహేనులక్షల వరకు వస్తుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణా వస్తే ఆంధ్రావారంతా వెనక్కు వెళ్లిపోతారని, హైదరాబాదులో వారు ఖాళీ చేసిన ఇండ్లు (దీనికి ప్రాతిపదిక లేకపోలేదు. నైజాం నవాబు మీద తిరుగుబాటు చేసిన సమయంలో అనేక మంది నవాబు వంశీకులు, ఇతరులు హైదరాబాద్‌, కొన్ని పట్టణాలలోని కొంపా గోడూ, పొలాలు, స్దలాలు వదలి పాకిస్ధాన్‌ లేదా మరోచోటకు పోయారు. ఆ ఆస్ధులను అనేక మంది ఆక్రమించుకున్నారు) తమకు వస్తాయని కొంత మంది భ్రమించినట్లుగా నిజంగానే అంతగాకపోయినా కొంతయినా అందిస్తారని చాలా మంది నమ్మారు, ఆశగా ఎదురు చూశారు అదేమైందో తెలియదు. అసలెంత నల్లధనం వెలికి వచ్చిందో, దానిలో ఖజానాకు ఎంత చేరిందో సంఘపరివార్‌ సామాజిక మాధ్యమ మరుగుజ్జు వీరులు చెబుతారా ?
అధికారానికి వచ్చిన కొత్తలో నరేంద్రమోడీ రకరకాల కొత్త కొత్త కోట్లు వేసుకొని వరుసబెట్టి విదేశీ ప్రయాణాలు చేస్తుంటే నల్లడబ్బు వెలికితీతకేమో అని జనం అనుకుంటే , కాదు, దేశానికి అవసరమైన పెట్టుబడులు తేవటానికని వెంకయ్య నాయుడు వంటి వారు చెప్పారు. నల్లడబ్బూ తేలేదు, అదనంగా విదేశీ పెట్టుబడులూ లేవు, మేకిన్‌ ఇండియా ఎటుపోయిందో తెలియదు. పెద్ద నోట్ల రద్దు నల్లధనం వెలికి తీత, దేశభక్తి అంటే కామోసనుకున్నాం. స్వాతంత్య్రపోరాటంలో జనం బ్రిటీష్‌ వారి తుపాకి తూటాలకు ,లాఠీలకు ఎదురొడ్డి నిలుచున్నట్లుగా కోట్లాది మంది తమ డబ్బు తాము తీసుకొనేందుకు బ్యాంకులు, ఎటిఎంల ముందు వరుసలు కట్టినిలుచున్నారు. పనులతో పాటు కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. నరేంద్రమోడీ ప్రపంచంలో ఎవరూ చేయని పిచ్చి పని చేశారని విమర్శించిన వారిని దేశద్రోహులు అన్నట్లుగా చూశారు. ఇప్పుడు వాటిని గుర్తు చేస్తే కొందరికి ఎక్కడెక్కడో కాలుతోంది నిజమే. మరి ఆ చర్యవలన వచ్చిన ఉపయోగాలేమిటో ఎన్నడైనా మోడీగారు నోరు విప్పి మాట్లాడారా ? విలేకర్లతో మాట్లాడే ధైర్యం ఎలాగూ లేదని తేలిపోయింది. పోనీ కనీసం మన్‌కీ బాత్‌లో అయినా చెప్పారా ? పైన చెప్పినవి, మరి కొన్నింటినీ కలగలిపి జనానికి అచ్చేదిన్‌ తెస్తామని అన్నారు. ఆచరణలో జనాలకు చచ్చే దినాలు వచ్చాయి. అన్నింటా విఫలమైనా ఐదేండ్లలో మోడీ మీద జనాలకు మోజు తీరక, నమ్మకం చావక, ప్రతిపక్షాల మీద విశ్వాసం లేక రెండోసారి మరిన్ని సీట్లు ఇస్తూ ఓటువేశారు.

China's mobile and digital dominance runs deep into Indian economy ...
జరిగిందేమిటి ? నరేంద్రమోడీ ఏలుబడిలో తట్టలోని సంసారం బుట్టలోకి వచ్చింది. దాన్ని దాచి పెట్టేందుకు ఇప్పుడు కరోనాను సాకుగా చూపుతున్నారు. ఆపేరుతో కార్మిక చట్టాలను మార్చేందుకు శ్రమజీవులను మరింతగా కట్టుబానిసలుగా మార్చేందుకు సిద్దం చేస్తున్నారు. ఏ దేశ చరిత్ర చూసినా ఆర్దికంగా సంక్షోభంలో ఉన్న సమయంలోనే దాన్నుంచి బయటపడవేసే సాకుతో, ప్రజా, కార్మిక వ్యతిరేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడూ జరుగుతోంది అదే. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ గనుక గతంలో విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తామని ఎలా ఊరించారో ఇప్పుడు చైనా నుంచి ఫ్యాక్టరీలను తెస్తామని అంతకంటే ఎక్కువగా నమ్మబలుకుతున్నారు. దీని గురించి ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే అసలు మీరు దేశభక్తులేనా, చైనా నుంచి ఫ్యాక్టరీలు రావటం ఇష్టం లేదా అని ఎవరైనా అడ్డుతగలవచ్చు. చైనా నుంచే కాదు, యావత్‌ దేశాలలో ఇంకా మిగిలి ఉన్న ఫ్యాక్టరీలు, సంస్దలన్నీ వచ్చినా సంతోషమే.
నిద్రిస్తున్న మహా దేశం మేలుకొంటోంది, చైనా నుంచి వచ్చే ఫ్యాక్టరీలకు స్వాగతం పలికేందుకు రాష్ట్రాలు సిద్ధం కావాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా-చైనాల మధ్య తలెత్తిన వాణిజ్యం యుద్దం, కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్ధితుల నేపధ్యంలో చైనా నుంచి కంపెనీలు రావాలనుకుంటున్నాయని వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల వంటివి కల్పిస్తే చైనాకు తగిన ప్రత్యామ్నాయం అవుతామని ప్రధాని చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఏ దేశానికి ఆదేశం మరొక దేశంతో పోటీబడి అభివృద్ది చెందితే అభ్యంతరం ఎవరికి ఉంటుంది. ఎదుటివారిని దెబ్బతీసి మనం లాభపడాలనుకుంటే ఎదుటి వారు కూడా మన గురించి అదే అనుకుంటారు అని గ్రహించటం అవసరం.
మనమహాదేశం మోడీ అధికారానికి వచ్చిన ఆరుసంవత్సరాల పాటు నిద్రలో ఉండటానికి కారణం ఎవరు? పోనీ దానికి కారణం కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే అని అంగీకరిద్దాం. యాభై సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలను కేవలం ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని చెప్పుకున్నవారు, దేశాన్ని నిద్రలేపటానికే ఆరు సంవత్సరాల వ్యవధి తీసుకుంటే, దాన్ని నడిపించటానికి ఎన్ని ఆర్లు కావాలి ? ఇలాంటి కబుర్లు గతంలోనే చాలా చెప్పారు. జరిగిందేమిటి ?
ఏప్రిల్‌ 22నాటి బిజినెస్‌ టుడే వార్త ప్రకారం వెయ్యి విదేశీ కంపెనీలు ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాయని కనీసం 300 సంస్ధలను రప్పించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పినట్లుగా ఉంది. పోనీ ఇవన్నీ చైనా నుంచే వస్తాయని అనుకుందాం. అసలు చైనాలో ఉన్న విదేశీ కంపెనీలు ఎన్ని ? 2012లో 4,36,800 ఉండగా 2018లో 9,61,000 ఉన్నాయి. తరువాత పెరిగినా తరిగినా మొత్తం మీద స్ధిరంగా ఉన్నాయని అనుకుందాం. వీటిలో వెయ్యి కాదు మన మోడీ ఎంతో పలుకుబడి గలవారు గనుక మరో పది వేల కంపెనీలను రప్పించినా మన దేశం మరొక చైనా మాదిరి తయారవుతుందా ? చైనా దెబ్బకు అంత పెద్ద అమెరికాయే గిలగిల్లాడుతుంటే మనం తట్టుకోగలమా ? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి ? గతంలో గ్రామాల్లో బుర్రకథలు చెప్పేందుకు వచ్చిన వారు గ్రామీణులను ఉబ్బించి ఎక్కువ బహుమతులను రాబట్టుకొనేందుకు వెళ్లిన ప్రతి ఊరిలో మీ గ్రామం చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతుగడ్డ అని చెప్పేవారు. మన దేశం, రాష్ట్రాల గురించి అలాగే ఉబ్బవేస్తుంటే నిజమే అనుకుంటున్నారు.
చైనా కంపెనీలు విదేశాలకు పోక, మన దేశానికి రాక గురించి ఊరించటం కొత్త కాదు.చైనాలో వేతన ఖర్చు క్రమంగా పెరుగుతున్న కొద్దీ అంతకంటే తక్కువ ఖర్చయ్యే దేశాల గురించి వెతుకులాట గత ఐదు సంవత్సరాల నుంచి పెరుగుతోంది.2016-17 మన ఆర్ధిక సర్వేలో ” చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు కారణంగా దుస్తులు, తోళ్లు, పాదరక్షల తయారీ రంగాలలో ఉత్పత్తుల మార్కెట్లలో చైనా వాటా స్ధిరపడటం లేదా తగ్గుతున్న నేపధ్యంలో ఈ రంగాలను ప్రోత్సహించటానికి మన దేశానికి అవకాశం వచ్చింది. చైనాతో పోల్చితే భారత్‌లోని అత్యధిక రాష్ట్రాలలో వేతన ఖర్చు తక్కువగా ఉంది. చైనా నుంచి తరలిపోయిన వాటిలో వేగంగా దుస్తుల రంగం బంగ్లాదేశ్‌, వియత్నాంకు తరలిపోయింది. తోళ్లు,పాదరక్షల రంగం వియత్నాం, ఇండోనేషియాకు పోయింది. మన దేశంలోని దుస్తుల కంపెనీలు కూడా బంగ్లాదేశ్‌, వియత్నాం, మయన్మార్‌, చివరికి ఇథియోపియాకు కూడా తరలిపోతున్నాయి” అని పేర్కొన్నారు. మొన్నటికి మొన్న అంటే తాజా ఆర్ధిక సర్వేలో చైనా తరహా అభివృద్ది, ఆకర్షణ గురించి పేజీలకు పేజీలే రాసుకున్నాం. నిజానికి దానికీ కరోనాకు అస్సలు సంబంధమే లేదు. నాలుగేండ్ల నాటికి ఇప్పటికీ జరిగిన పెద్ద మార్పు ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?
తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేసే సంస్దలలో మెజారిటీ ఉద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు చట్టాలను చేశాయి. దీని మీద దేశీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. తమ కంపెనీలలో తాము ఎంపిక చేసుకున్న సిబ్బందినే పెట్టుకోవాలని కోరుకొనే కంపెనీలకు ఈ చట్టాలు ఆటంకంగానే కనిపిస్తాయి. ఇలాంటి చట్టాలను చేసిన రాష్ట్రాలు గానీ చేయని రాష్ట్రాలకు గానీ విదేశీ పెట్టుబడులు, సంస్ధలను ఆకర్షించటంలో పెద్ద తేడా కనిపించటం లేదు. గత మూడు సంవత్సరాలలో కొత్త కంపెనీల తీరుతెన్నులను చూసినపుడు పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ఈ స్ధితిలో ఉన్న కంపెనీలు తమ సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు లేదా అదనపు సిబ్బందిని నియమించేందుకు ముందుకు రావటం లేదు. ఈ స్ధితిలో కొత్తగా వచ్చే కంపెనీలకు మన దేశంలో కనిపించే ఆకర్షణలు ఏమిటి ?
చైనా నుంచి వస్తాయని చెబుతున్న కంపెనీలలో ఎక్కువ భాగం అమెరికాకు చెందినవిగా చెబుతున్నారు. అవే ఎందుకు ఆసక్తి కనపరుస్తున్నాయి? ఒక వైపు ట్రంప్‌ అమెరికాలో పెట్టుబడులు, పరిశ్రమల స్ధాపనకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడు. చైనా మీద ఆధారపడిన కారణంగానే అమెరికాలో ఇబ్బందులు తలెత్తాయన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అలాంటపుడు చైనాలోని అమెరికా కంపెనీలు తమ దేశానికి పోకుండా మన దేశానికి ఎందుకు రావాలని కోరుకుంటున్నాయి. వాటికి దేశభక్తి లేదా ? మన దేశాన్ని ఉద్దరించాలనే సదాశయంతో వస్తున్నాయా ? 2018 నుంచి డోనాల్డ్‌ ట్రంప్‌ చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు. చైనాలోని అమెరికన్‌ కంపెనీలు తయారు చేసే వస్తువులను కూడా చైనావిగానే పరిగణించి వాటి మీద దిగుమతి పన్ను విధిస్తున్నాడు. అమెరికా దేశభక్త కంపెనీలు ఆ పన్ను భారాన్ని తాము భరించాలా లేక తమ దేశ వినియోగదారుల నుంచి వసూలు చేయాలా అనే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒక వేళ చైనా మరిన్ని ప్రతీకార చర్యలకు పూనుకుంటే తాము ముందు బలౌతామనే భయం అమెరికన్‌ కంపెనీల్లో కలుగుతోంది. దీనికి తోడు వేతన పెరుగుదల వంటి అంశాలు, చైనా సుంకాలను పెంచితే గిట్టుబాటు కావనే దిగులు, ఇలా అనేక అంశాలను గమనంలో ఉంచుకొని ముందుగానే జాగ్రత్త పడితే మంచిదనే ఆలోచనతో కూడా కొన్ని కంపెనీలు తరలిపోవాలనే ఆలోచనలు చేస్తున్నాయి.

Why Companies Shift From China To Vietnam More Than
అయితే అసలు చైనా నుంచి విదేశీ కంపెనీలు తరలిపోవటం లేదా ? లేదని ఎవరు చెబుతారు ?లాభాల కోసం తమ స్వంత దేశాలను వదలి చైనా వచ్చిన కంపెనీలు మరొక దేశంలో లాభం ఎక్కువ వస్తుందనుకుంటే అక్కడికి తరలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది. పెట్టుబడి లక్షణమే అది. పెట్టుబడులను ఆకర్షించేందుకు మోడీ సర్కార్‌ అనేక చర్యలు తీసుకుంది, రాయితీలు ప్రకటించింది, కార్మిక చట్టాలను నీరుగార్చింది. సులభతర వాణిజ్యం ర్యాంకులో ముందుండటం కోసం పోటీ పడుతోంది. అయినా ఆకర్షణ కలగటం లేదు.2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఆగస్టు వరకు 56 చైనా కంపెనీలు అక్కడి నుంచి బయటకు వచ్చాయి. వాటిలో 26 వియత్నాంకు,11 తైవాన్‌కు, 8 థారులాండ్‌కు తరలిపోగా మన దేశానికి మూడు, ఇండోనేషియాకు రెండు వెళ్లాయని జపనీస్‌ సంస్ధ నొమురా నివేదించింది. అంతెందుకు సిఎన్‌బిసి అనే అమెరికన్‌ టీవీ మే 14న ప్రసారం చేసిన ఒక సమీక్షలో చైనా నుంచి ఎలా తరలిపోవాలా అని కంపెనీలు చూస్తుంటే మరోవైపు ఎక్కువ విలువ కలిగిన వస్తు తయారీకి చైనా సాంకేతిక రంగం మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌ కంపెనీ ఆసియాపసిఫిక్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పాట్రిక్‌ వింటర్‌ చెప్పారు. చైనాలో వేతన ఖర్చులు పెరగటం, అమెరికాతో వాణిజ్య యుద్దం కారణంగా చాలా కాలం నుంచి కంపెనీలు తరలిపోయే ఆలోచన చేస్తున్నాయన్నారు. బమ్మలు,కెమెరాల తయారీ మెక్సికోకు, పర్సనల్‌ కంప్యూటర్లు తైవాన్‌కు, ఆటోమోటివ్‌ కంపెనీలు థారులాండ్‌, వియత్నాం,భారత్‌కు తరలుతున్నాయని చెప్పారు. అంటే మనం కూడా మిగతాదేశాల్లో ఒకరం తప్ప చైనా కంపెనీలన్నీ ఏకంగా మన ఒళ్లో వచ్చి వాలిపోవటం లేదు.
సామాజిక మాధ్యమంలో మరుగుజ్జులు వేసే జిమ్మిక్కులు నిజమే అని నమ్మే జనం గణనీయంగా ఉన్నారు. అలాంటి ఒక పోస్టు ప్రస్తుతం వాట్సాప్‌లో తిరుగుతోంది. నిన్న నోయిడా వ్యాపారులు 150 మిలియన్‌ డాలర్ల చైనా ఆర్డర్‌ను రద్దు చేశారని దేశం మొత్తం నుంచి రెండు బిలియన్‌ డాలర్ల మేరకు రద్దు చేసి అనధికారికంగా చైనాను కాళ్లబేరానికి తెచ్చారని, గత సంవత్సరం దీపావళికి చైనా లైట్లను కొనుగోలు చేయనందున చైనా వస్తువులు 20శాతం నాశనం అయ్యాయని, అదే మొత్తం 62బిలియన్‌ డాలర్ల ఆర్డర్లు రద్దు చేస్తే ఏమౌతుందో చూడండి.90 రోజులు ఏ విదేశీ వస్తువులు కొనకండి, డాలరుతో రూపాయి మారకపు విలువ రెండు రూపాయలకు సమానం అవుతుంది అంటూ ఆ పోస్టు మహా రంజుగా సాగింది. చదివిన వారు లొట్టలు వేసుకుంటూ ఇతరులకు పంపుతున్నారు.
ఈ పోస్టులో నిన్న నోయిడా అంటే అది 2016 అక్టోబరు 13వ తేదీనాటి హిందూస్దాన్‌ టైమ్స్‌ వార్త. ఆ తరువాత మన దేశం చైనా నుంచి దిగుమతులను పెంచుకుందే తప్ప ఏమాత్రం తగ్గించలేదు. అంటే అనుమతించిన పాలకులు, దిగుమతి చేసుకున్న వ్యాపారులను దేశభక్తులనాలా, దేశద్రోహులనాలా ! ఇలాంటి పోసుకోలు కబుర్లు, పగటి కలలతో జనాన్ని ఎంతకాలం మభ్యపెడతారు. నరేంద్రమోడీ గారి ఏలుబడి తొలి ఏడాది 2014-15లో డాలరుతో రూపాయి సగటు మారకపు విలువ 61.14 ఉంటే ఇప్పుడు 75 రూపాయలు నడుస్తోంది. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ తానే చక్రాన్ని నడుపుతున్నట్లు కలగంటుందట. మనం వస్తువులు కొనుగోలు చేయకపోతే చైనా కాళ్ల బేరానికి వస్తుంది, కుప్పకూలిపోతుంది అన్నది కూడా ఈగ బాపతే. 2019లో చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకున్న తొలి పదిహేను దేశాలలో మూడు శాతంతో మనది ఏడవ స్ధానంలో వుంది. అంటే మిగిలిన దేశాలన్నీ 97శాతం వాటా కలిగి ఉన్నాయి. మన మూడుశాతం నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టం ఏముంటుంది? అగ్రస్ధానంలో ఉన్న అమెరికాకు చైనా 16.8శాతం ఎగుమతి చేస్తోంది. అలాంటి దేశ అధ్యక్షుడు ట్రంప్‌ను చైనీయులు మూడు చెరువుల నీరు తాగించి తమ కాళ్ల బేరానికి తెచ్చుకుంటున్నారు. ఇక మన దేశ వాణిజ్య భాగస్వాములలో చైనా 2019లో 5.08శాతంతో మూడవ స్ధానంలో ఉంది. తొలి రెండు స్ధానాలలో అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ ఉన్నాయి. చైనా ఎగుమతి చేసే వందలో మూడు వస్తువులను మనం తెచ్చుకుంటుంటే, మనం ఎగుమతి చేసే వందలో చైనా ఐదింటిని తీసుకొంటోది. పరిస్ధితి ఇలా ఉంటే మనం చైనాను కాళ్లబేరానికి తెచ్చుకోవటం ఏమిటి? మతి ఉండే ఆలోచిస్తున్నామా ? మన ఘనమైన సంస్కృతి ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పింది తప్ప దురహంకారానికి లోను కమ్మని చెప్పలేదు.

Foreign companies are coming to India leaving China, will settled ...
బాధ్యత కలిగిన వారెవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి, చర్యకు ప్రతి చర్య పర్యవసానాల గురించి ఆలోచించకుండా ముందుకు పోతే గోతిలో పడతారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విదేశీమారక ద్రవ్యం గణనీయంగా ఉన్న తొలి పది దేశాలలో మనది ఐదవ స్ధానం. అయితే తొలి స్ధానంలో ఉన్న చైనా దగ్గర 3,091, దాని ఏలుబడిలోని హాంకాంగ్‌లో 441, మకావులో 22 అంటే మొత్తం చైనా దగ్గర 3,554 బిలియన్‌ డాలర్లు ఉంటే, మన దగ్గర 485 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. మన దేశం అక్కడి పరిశ్రమలను ఆహ్వానించి చైనాతో వాణిజ్య యుద్దానికి దిగితే ఏమి జరుగుతుందో ఆలోచించుకోవాలి. మన దేశానికి చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఆర్ధికవేత్త అభిజిత్‌ ముఖర్జీ మే 12న ఒక బెంగాలీ టీవీతో మాట్లాడుతూ ఒక వేళ చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే ఏం జరుగుతుంది ? దాని వస్తువుల ధరలు తగ్గుతాయి, జనాలు వాటినే కొంటారు అన్నారు. ఆలా చెప్పిన ఆయన దేశభక్తుడు కాదా ?
ఒక దేశ జీవన ప్రమాణాలకు తలసరి జిడిపి ఒక గీటు రాయి. 2019లో చైనాలో పదివేల డాలర్లకు పైబడితే మన దేశంలో రెండువేల డాలర్లు. అందువలన చైనాను మిగతా దేశాలు ఇబ్బందుల పాలు చేసినా తాను తయారు చేసిన వస్తువులను తన ప్రజలకే విక్రయించి తన కాళ్లమీద తాను నిలబడగదు. 2008 తరువాత ధనిక దేశాల్లో సంక్షోభం కారణంగా దాని ఎగుమతి ఆధారిత వ్యవస్ధకు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆ మేరకు తన అంతర్గత వినియోగాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకొని వాటి నుంచి కాచుకుంది.మనం అటువంటి స్ధితిలో ఉన్నామా ?
చైనాలో ఉన్నది కమ్యూనిస్టు నియంతృత్వం అని ఒక పాటపాడతారు. ప్రపంచ పెట్టుబడిదారులు మరి అక్కడకు ఎందుకు వెళుతున్నట్లు ? ప్రపంచ దేశాలన్నీ దాని నేతలను ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు ? నిన్నగాక మొన్న చైనా జింపింగ్‌ను మోడీ గారు రావయ్యా జింపింగూ అజెండా ఏమీ లేదు గానీ మంచి చెడ్డలు మాట్లాడుకుందాం రమ్మని మహాబలిపురానికి ఎందుకు ఆహ్వానించినట్లు ? మోడీ గారు చైనా ఎందుకు వెళ్లినట్లు ? ప్రపంచంలో కమ్యూనిస్టులు లేని దేశాల్లో నియంతలు ఎందరో ఉన్నారు. మరి అక్కడికి పెట్టుబడులు ఎందుకు వెళ్లటం లేదు ? మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కనుక చైనా మాదిరి మనం అభివృద్ది చెందలేమని మరొక ముక్తాయింపు. అదే తర్కానికి కట్టుబడితే చైనా నుంచి కంపెనీలు వచ్చినా మనం ఎలా అభివృద్ధి చెందగలం ?
ఒక దేశంతో మరొక దేశం పోల్చుకోవటం అసంబద్దం. దేనికి ఉండే అనుకూల ప్రతికూలతలు దానికి ఉంటాయి. అందువలన అభివృద్ధి మార్గం కూడా భిన్నంగానే ఉండాలి తప్ప మరొక దాన్ని అనుసరించటం, అనుకరించటం వలన ప్రయోజనం ఉంటుందా ? ఆ రీత్యా చూసినపుడు మన భారతీయ విధానాలను అభివృద్ధి చేసుకోకుండా చైనాను అనుకరించటం భారతీయత ఎలా అవుతుంది. అసలు సిసలు దేశభక్తులం అని చెప్పుకొనే వారు ఆలోచించాలి మరి. చైనా అభివృద్ధి చైనా కమ్యూనిస్టు పార్టీ విధానాల కారణంగానే సాధ్యమైంది. మన దేశం అభివృద్ధి గాకపోవటానికి కాంగ్రెస్‌-బిజెపి వాటి విధానాలకు మద్దతు ఇచ్చే పార్టీలే కారణం. కమ్యూనిస్టులకు అధికారం ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో కమ్యూనిస్టుల ప్రత్యేక ఏమిటో మన దేశంలో కేరళ, ప్రపంచంలో చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు నిరూపించాయి.
ప్రపంచంలో గత కొద్ధి సంవత్సరాలుగా దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితిని కరోనా వైరస్‌ తాత్కాలికంగా అయినా మరింతగా దిగజార్చనుంది. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ద(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు చెప్పిన అనేక జోశ్యాలు, చూపిన రంగుల కలలు కల్లలయ్యాయి. అయినా అవి తప్ప మరొక ప్రత్యామ్నాయం లేనందున అవి చెప్పిన అంశాల ప్రాతిపదికనే అయితే, గియితే అనే షరతులు, హెచ్చరికలతో చర్చించుకోక తప్పటం లేదు.

COVID-19 and the new coronavirus: Fact versus fiction - COVID-19 ...
ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2020-21లో మన జిడిపి వృద్ధిరేటు 0.5శాతమే. మరొక అంచనా ప్రకారం 2020లో 1.9శాతం, ఇంకో అంచనా మైనస్‌ మూడుశాతం. ఇవన్నీ లాక్‌డౌన్‌కు ముందు, కొనసాగుతున్న సమయంలో వెలువడిన అంచనాలు. ఎంతకాలం కొనసాగుతుంది, ఆర్ధిక కార్యకలాపాలు తిరిగి ఎపుడు, ఎలా ప్రారంభం అవుతాయి అనేదాని మీద ఈ అంకెల్లో, వాస్తవంలో మార్పులు ఉంటాయి. ఈ నేపధ్యంలో చైనా నుంచి కంపెనీలు రావటం అంటే ఏటిఎంలో కార్డు పెట్టి వెంటనే నగదు తీసుకున్నంత సులభం కాదని గ్రహించాలి. అక్కడ 1978 నుంచి అనుసరించిన విధానాలు జిడిపిలో అమెరికాకు ధీటుగా చైనాను ముందుకు తెచ్చింది. తాము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామని, అందువలన మరింత అభివృద్ధి చెందేందుకు సంస్కరణలను కొనసాగిస్తామని, పెట్టుబడులకు మరిన్ని అవకాశాలిస్తామని చైనా ప్రకటించింది. అంతే కాదు, 1970దశకం వరకు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ సంస్ధలకు దూరంగా ఉంచిన అమెరికా, ఇతర దాని మిత్ర దేశాల మెడలు వంచి ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యమైంది. తరువాత ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టి తన ఎగుమతి అవకాశాలను పెంచుకుంది.2049 నాటికి చైనాలో పూర్తిగా విలీనం కావాల్సిన హాంకాంగ్‌, మకావు దీవుల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగిస్తామని, అక్కడి ప్రయివేటు పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని చైనా హామీ ఇవ్వటం ప్రపంచ పెట్టుబడిదారుల్లో పెద్ద విశ్వాసాన్నిచ్చింది.స్ధిరమైన ప్రభుత్వం, స్ధిరమైన విధానాలను కొనసాగించటమే చైనా విజయ రహస్యం.ఆ కృషి వెనుక ఉన్న స్ధిరమైన విధానాలు ప్రపంచ పెట్టుబడిదారులను చైనా బాట పట్టించాయని అంగీకరిస్తారా ?

అమెరికా అల్లిన 24 అబద్దాలు- చైనా చెప్పిన 24 నిజాలు !

Tags

, , , , ,

Rob Rogers on Twitter: "Lies cartoon: https://t.co/SamLHmQDgA ...
ఎం కోటేశ్వరరావు
అగ్రరాజ్యం అమెరికా. దాని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా లేదా ప్రపంచ చరిత్రలో ఒక దేశాధిపతిగా ట్రంప్‌ మాట్లాడినన్ని అబద్దాలు మరొకరు మాట్లాడి ఉండరు. ఎన్ని అబద్దాలు చెబితే అంత బలం వస్తుందన్న నమ్మకం ఉన్న వ్యక్తిగా ఇప్పటికే విశ్లేషకులు తేల్చివేశారు. నోరు తెరిచి నాలుగు అంశాలు చెబితే వాటిలో మూడు పాక్షిక లేదా పూర్తి అబద్దాలే. అలాంటి వ్యక్తి, ఆయన యంత్రాంగం కరోనా వైరస్‌ గురించి అనేక కట్టుకథలు సృష్టించటం, వాటిని మీడియా ద్వారా ప్రచారంలో పెట్టటం తెలిసిందే. అనేక మంది తాము తటస్ధులం అని చెప్పుకుంటారు. ట్రంప్‌ అబద్దాల కోరని అంగీకరిస్తారు, అదే సమయంలో ఆ నోటి నుంచి లేదా సిఐఏ ఇతర కట్టుకథల ఫ్యాక్టరీల నుంచి వెలువడే అబద్దాల ఉత్పత్తులను ఉపయోగించుకొని ఏక పక్షంగా మరో దేశం మీద దాడి చేస్తారు. వీరిలో ఒక రకం తమకు తెలియకుండానే ప్రచార సమ్మోహన అస్త్రానికి పడిపోయిన వారు, రెండవ తరగతి అన్నీ తెలిసి కూడా రాళ్లేసే రకం. గతంలో ప్రచ్చన్న యుద్దం పేరుతో సోవియట్‌ యూనియన్‌, తూర్పుఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం గురించి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్‌ సందర్భంగా అదే రకమైన ఏకపక్ష దాడి ప్రారంభమైంది. అమెరికా పాటపాడితే కొన్ని దేశాలు గొంతు కలుపుతున్నాయి, మరికొన్ని పక్కవాద్యాలు వాయిస్తున్నాయి.
తెలుగు మీడియా ఇచ్చే అంతర్జాతీయ వార్తలన్నీ అమెరికా, ఐరోపా దేశాల అదుపులో ఉండే వార్తా సంస్ధల నుంచి తీసుకుంటున్నవే. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి రాసేవారు, చూపే వారు పోటీపడుతున్నారు. ఎంత సంచలనాత్మకంగా ఉంటే అంతకిక్కు, అంత రేటింగ్‌ ఉంటుంది మరి. దిగువ అంశాలు చైనా వార్తా సంస్ధ గ్జిన్హువా విడుదల చేసిన సమాచారం ఆధారంగా రాస్తున్నవే. నిడివి పెద్దది కాకుండా చూడటం కోసం సంక్షిప్తీకరించి ఇస్తున్నాను. దీనిలో 24 అంశాలపై తమ మీద వేస్తున్న అభాండాలు, చేస్తున్న అబద్ద ప్రచారం ఏమిటో చెబుతూనే దానికి సమాధానాలు ఇచ్చారు. అయినా దీన్ని ఏకపక్ష ప్రచారం అని ఎవరైనా అనుకుంటే అది వారి విజ్ఞతకే వదలి వేద్దాం. చైనా తాను చెప్పిన సమాధానాలకు, వివరణలకు, విమర్శలకు ఆధారాలతో సహా ఇచ్చింది. పాఠకుల సౌకర్యం, విశ్వసించని వారి నిర్ధారణ కోసం ఆ లింక్‌ను కూడా దిగువ ఇస్తున్నాను.
ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే ఉంటారని కమ్యూనిస్టు లెనిన్‌ చెప్పారు. ఆయన పుట్టక ముందే అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తూ హత్యకు గురైన అబ్రహాం లింకన్‌ మరో విధంగా చెప్పారు. ఎవరైనా జనం మొత్తాన్ని కొంతకాలం, కొంత మందిని కొంతకాలమే వెర్రి వెంగళప్పలను చేయగలరు గానీ అందరినీ, ఎల్లవేళలా చేయలేరు అన్నారు. వెలుగు వచ్చేకొద్దీ చీకటి పారిపోతుంది, అబద్దాలు కూడా కూడా నిజం రానంతవరకే అది పెత్తనం చేస్తాయని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇక ఆరోపణలు, వాటి మీద చైనా వార్తా సంస్ధ సమాధానాల సారాంశం చూద్దాం.
1.ఆరోపణ: కోవిడ్‌-19 అనేది చైనా లేదా ఊహాన్‌ వైరస్‌.
వాస్తవం : ఒక వ్యాధి పేరులో ప్రతికూల ప్రభావం చూపే అంటే అనవసరమైన భయాలు కలిగించే విధంగా ఒక ప్రాంతం, దేశం, ఆహారం, సంస్కృతి, జనాభా, పరిశ్రమ, వృత్తి లేదా జంతుజాతి పేరు ఉండకూడదని 2015 మే ఎనిమిదవ తేదీ ఐక్యరాజ్యసమితి సంస్ధలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. అంతకు ముందే కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ 2012లో తలెత్తిన ”మెర్స్‌” మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) పేరు మీద తలెత్తిన పరిస్ధితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణ్యంగానే 2020 ఫిబ్రవరి 11న నోవెల్‌ కరోనా వైరస్‌ కారణంగా తలెత్తే న్యూమోనియా వ్యాధికి కరోనా వైరస్‌ డిసీజ్‌ 2019(కోవిడ్‌-19) అని పేరు పెట్టారు. అయితే బ్రిటీష్‌ సైన్స్‌ పత్రిక ఏప్రిల్‌ నెలలో ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించి రాసిన సంపాదకీయాలలో కోవిడ్‌-19ను చైనా మరియు ఊహాన్‌తో జతచేసి ప్రస్తావించి తదుపరి క్షమాపణ చెప్పింది. బిబిసి, న్యూయార్క్‌ టైమ్స్‌, అమెరికన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ(ఏబిసి) వంటివి ఆసియా వాసులతో సంబంధాన్ని అంటగట్టి వార్తలను ప్రచారం, ప్రసారం చేయటంతో పశ్చిమ దేశాలలో ఆసియా వ్యతిరేకత, జాత్యంహాకార ధోరణులతో ఆసియా ఖండ పౌరులను వేధించిన ఉదంతాలు జరిగాయి.
2. ఆరోపణ: వైరస్‌ ఊహాన్‌లోనే పుట్టింది.
వాస్తవం: వైరస్‌ తొలిసారి ఊహాన్‌లో బయటపడినంత మాత్రాన అది అక్కడే పుట్టిందని అర్ధం కాదు, శాస్త్రవేత్తలు దాన్ని ఇంకా గుర్తించలేదు. ఉదాహరణకు ఎయిడ్స్‌ వ్యాధిని తొలుత అమెరికాలో గుర్తించారు. అది అక్కడ పుట్టింది కాకపోవచ్చు. అలాగే స్పానిష్‌ ఫ్లూ స్పెయిన్‌లో పుట్టలేదు అనేందుకు అనేక ఆధారాలు దొరికాయి. ఎక్కడ నుంచి తలెత్తిందన్నది శాస్త్ర అంశం. జనవరి 24న బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌లో ప్రచురితమైన విశ్లేషణలో డిసెంబరు 16 నుంచి జనవరి రెండవ తేదీ వరకు ఊహాన్‌ నగరంలో నిర్ధారణ అయిన 41కరోనా కేసులలో 27 మందికి ఊహాన్‌ సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో సోకినట్లు తేలింది, మిగిలిన వారికి వేరే ప్రాంతాలలో సోకింది. తొలి రోగిని డిసెంబరు ఒకటవ తేదీన గుర్తించారు. అతనికీ మార్కెట్‌కు ఎలాంటి సంబంధం లేదు, కుటుంబ సభ్యులకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తలేదు. అతని నుంచి ఇతరులకు వ్యాపించిందనే ఆధారాలు దొరకలేదు. వైరస్‌ ఎక్కడ ఉద్బవించింది అనే అంశంలో అమెరికా నుంచి తమ సంస్ధకు ఎలాంటి సమాచారం లేదా నిర్ధిష్ట రుజువులు అందలేదని మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమాల డైరెక్టర్‌ డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని బెలెవిలే మేయర్‌ మైఖేల్‌ మెల్‌హామ్‌ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఇదే వైరస్‌తోనే తాను 2019నవంబరులో కూడా అస్వస్తతకు గురై ఉండవచ్చని చెప్పారు. అంటే అది అమెరికాలో బయటపడిన తొలి కేసు జనవరి 20కి రెండునెలల ముందునాటి సంగతి. మే ఆరవ తేదీన యుఎస్‌ఏ టుడే వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్లోరిడాలో జనవరి ప్రారంభంలోనే 171 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి, అయితే వారెవరూ చైనాకు ప్రయణించిన వారు కాదు.
మే మూడవ తేదీన యాంటీమైక్రోబియల్‌ ఏజంట్స్‌ అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో 2019 డిసెంబరు చివరి నుంచే సారస్‌-కోవ్‌-2 వైరస్‌ ఫ్రాన్స్‌లో వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు. డిసెంబరు రెండు నుంచి జనవరి 16వరకు ఫ్లూ లక్షణాలతో ఐసియులో చికిత్స పొందిన 14 మందికి ఏప్రిల్‌ ఆరు-తొమ్మిదవ తేదీల మధ్య ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష చేశారు.వారిలో 42ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ బయటపడింది. అయితే అతనేమీ ఇటీవలి కాలంలో చైనా లేదా మరో విదేశీ ప్రయాణం చేయలేదు.

Political cartoons: Donald Trump blasts Google
3. ఆరోపణ: వైరస్‌ను ఊహాన్‌ వైరాలజీ సంస్ధలో తయారు చేశారు
వాస్తవం: అందుబాటులో ఉన్న రుజువులన్నీ సహజంగానే పుట్టినట్లు చూపుతున్నాయి. కృత్రిమంగా తయారు చేసింది కాదు. జనవరి 30వ తేదీ లాన్‌సెట్‌ వైద్య పత్రిక వ్యాసం ప్రకారం మిగతా వైరస్‌లతో పోల్చితే గుడ్లగూబల నుంచే వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఎనిమిది దేశాలకు చెందిన 27 మంది ప్రముఖ నిపుణులు చేసిన ప్రకటనలో కరోనా వైరస్‌ మిగతా వాటి మాదిరే వన్య ప్రాణుల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. మార్చి 17న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలకు చెందిన ఐదుగురు ప్రముఖ నిపుణులు వైరస్‌ను ప్రయోగశాలలో తయారు చేయలేదని, పని గట్టుకొని వ్యాపింప చేయలేదని తెలిపారు. మార్చి 26న అమెరికా జాతీయ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌ రాసిన వ్యాసంలో సహజంగానే కరోనా వైరస్‌ పుట్టిందని, ఎవరూ తయారు చేయలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 21న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రతినిధి ఫడేలా చాయిబ్‌ మాట్లాడుతూ వైరస్‌ జంతువుల నుంచే వచ్చిందని అయితేగబ్బిలాల నుంచి మానవులకు ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ అంతుబట్టలేదన్నారు. ఏప్రిల్‌ 30న అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన ప్రకారం కరోనా వైరస్‌ కృత్రిమంగా తయారు చేసింది లేదా జన్యుమార్పిడి చేసింది కాదనే శాస్త్రవేత్తల అభిప్రాయంతో గూఢచార సమాజం ఏకీభవిస్తున్నదని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ మాట్లాడుతూ వైరస్‌ జన్యుక్రమం గురించి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం సహజంగా ఉద్భవించిందే అన్నారు. మే ఐదవ తేదీన అదే సంస్ధ ప్రతినిధి డాక్టర్‌ గువ్‌డెన్‌ గాలెయా కూడా అదే చెప్పారు. ఫ్రెంచి పత్రి వాలెర్‌ యాక్ట్యువల్‌ తమ దేశ గూఢచార వర్గాలను ఉటంకిస్తూ వైరస్‌ ఊహాన్‌లోని పి4లాబ్‌ నుంచి వెలువడలేదని పేర్కొన్నది.
4 ఆరోపణ : ఊహాన్‌ వైరాలజీ సంస్ధ నుంచి ప్రమాదవశాత్తూ వైరస్‌ లీకైంది.
వాస్తవం: ఊహాన్‌ నేషనల్‌ బయోసేఫ్టీ లాబరేటరీ(పి4) చైనా-ఫ్రెంచి ప్రభుత్వాల సహకారం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైంది. దీనిలో పనిచేసే తొలి బృందం సిబ్బందికి ఫ్రాన్స్‌, అమెరికాలోనే శిక్షణ ఇచ్చారు. ఇక్కడి సౌకర్యాలు, పరికరాలను మూడవ పక్షం ప్రతిఏటా తనిఖీ చేస్తుంది. తనిఖీలో అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారితమైన తరువాతే పని చేయటాన్ని అనుమతిస్తారు. ఆ లాబ్‌కు కృత్రిమ వైరస్‌ తయారు చేసే సామర్ధ్యం లేదు, వైరస్‌ లీకై సిబ్బందికి సోకిన రుజువులేదు. ఈ లాబ్‌ కార్యకలాపాల గురించి, కరోనా వైరస్‌ గురించి తెలుసుకొనేందుకు యావత్‌ ప్రపంచం నుంచి ఆరులక్షల మంది వెబ్‌సైట్‌ను దర్శించగా 2.1కోట్ల డౌన్లోడ్‌లు నమోదయ్యాయి. ఎలర్జీ మరియు అంటువ్యాధుల అమెరికా జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫౌసీ మే4న మాట్లాడుతూ చైనా లాబ్‌లో వైరస్‌ తయారు కాలేదని, ప్రకృతిలోనే పుట్టి జంతువుల్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని అన్నారు. జంతువుల నుంచి సోకిన వైరస్‌ను లాబ్‌కు తెచ్చినపుడు ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి లీకైందన్న కథనాన్ని తాను నమ్మటం లేదన్నారు. వైరస్‌ కృత్రిమ సృష్టి అని ఎలాంటి రుజువులు లేవని బ్రిటీష్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హనాక్‌ అక్కడి పత్రిక ఇండిపెండెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు.
5. ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ను అరికట్టిన చైనా తమ జాతీయులను మిలన్‌, న్యూయార్క్‌ ఇతర నగరాల్లో వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు పంపింది.
వాస్తవం: స్వల్ప వ్యవధిలోనే చైనా కఠిన చర్యలు తీసుకుంది. చైనా నుంచి బయటకు చాలా తక్కువగా వ్యాప్తి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 23 నుంచి ఏప్రిల్‌ ఎనిమిది వరకు ఊహాన్‌ నగరం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ సమయంలో నగర వాసులు బయటకు వెళ్లలేదు. జనవరి 23న అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఫిబ్రవరి రెండున అమెరికా తన సరిహద్దులను మూసివేసింది. అంతకు ముందు కేవలం ఎనిమిది కేసులు మాత్రమే అమెరికాలో నమోదయ్యాయి. మార్చి 13న అమెరికా జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. ఆరోజుకు 1,896 కేసులు నిర్ధారణ అయ్యాయి. చైనాలో లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన ఏప్రిల్‌ 8వ తేదీనాటికి అమెరికాలో కేసులు నాలుగు లక్షలకు పెరిగాయి. ఒకటి నుంచి పది లక్షలకు పెరగటానికి అమెరికాలో వందరోజుల కంటే తక్కువే పట్టింది. తమ రాష్ట్రానికి చైనా నుంచి వైరస్‌ రాలేదని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిడీ పరిశోధన వెల్లడించినట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమో చెప్పారు. న్యూయార్క్‌ కరోనా వైరస్‌ ఆసియా నుంచి వచ్చింది కాదని అమెరికా పరిశోధనను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తను ప్రచురించింది. తమ దేశానికి అమెరికా సందర్శకులు వైరస్‌ను తీసుకు వచ్చినట్లు కెనడా సమాచారం వెల్లడించింది. గుర్తు తెలియని వనరు నుంచి ఫ్రాన్స్‌లో స్ధానికంగానే వైరస్‌ వ్యాపించిందని, చైనా, రష్యాల నుంచి రాలేదని ఫ్రెంచి పరిశోధనా సంస్ధ పాస్టర్‌ వెల్లడించింది.
6.ఆరోపణ: చైనీయులు గబ్బిలాలను తింటూ వైరస్‌ను వ్యాపింప చేశారు.
వాస్తవం: చైనీయుల ఆహారంలో ఎన్నడూ గబ్బిలాలు లేవు. ఒక చైనా మహిళ గుడ్ల గూబ చారు తాగుతున్నట్లు చూపే వీడియో ఇంటర్నెట్‌లో తిరుగుతోంది. ఒక చిన్న పసిఫిక్‌ దీవిలో విహార యాత్రల ప్రచారంలో భాగంగా ఆమె బృందం తీసిన వీడియో అది, దాన్ని 2016లోనే ఆన్‌లైన్‌లోనే పోస్టు చేశారు. గబ్బిలాల చారు అక్కడి ప్రత్యేకత.
7.ఆరోపణ: చైనా వన్య ప్రాణుల మార్కెట్లను తెరిచింది.
వాస్తవం: చైనాలో వన్య ప్రాణుల మార్కెట్లనేవి లేవు. వాటిని వేటాడటం, అమ్మకాలను చైనా నిషేధించింది. కోళ్లు, చేపల వంటి సముద్ర ఉత్పత్తులను మాత్రమే ప్రాణాలతో విక్రయించే మార్కెట్లు ఉన్నాయి. ఇలాంటివి ఒక్క చైనాలోనే కాదు అనేక దేశాలలో ఉన్నాయి. అలాంటి అమ్మకాలను నిషేధించే అంతర్జాతీయ చట్టాలు లేవు. రైతు బజార్లనే ఊహాన్‌లో తెరిచారు. ఊహాన్‌, హుబెరు, హునాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్లు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయి.
8 ఆరోపణ: వైరస్‌ వ్యాప్తి గురించి తొలి రోజుల్లో దాచి పెట్టింది, వెల్లడించటం ఆలస్యం చేసింది. దాంతో వ్యాప్తి పెరిగింది.
వాస్తవం: ఆకస్మికంగా గుర్తు తెలియని వైరస్‌ దాడి జరిగినపుడు అవగాహన, అధ్యయనం చేసేందుకు సమయం పడుతుంది. డిసెంబరు 27న న్యూమోనియాతో రోగులు ఉన్నట్లు గుర్తించారు. అదే రోజు వెల్లడించారు. మూడు రోజుల తరువాత కారణం తెలియని న్యూమోనియా గురించి ప్రకటించారు.డిసెంబరు 31న దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలిపారు. జనవరి మూడు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు, అమెరికా ఇతర దేశాలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి మూడు వరకు 30సార్లు అమెరికాకు సమాచారం తెలియచేశారు. జనవరి ఏడవ తేదీ నాటికి జన్యుక్రమాన్ని గుర్తించారు. పదకొండవ తేదీన ఆ సమాచారాన్ని ఇతర దేశాలకు అందచేశారు. వెంటనే నివారణ కిట్ల తయారీకి ఉపక్రమించారు. ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. చైనాలో వైరస్‌ గురించి ప్రకటన చేసిన 70రోజుల తరువాత అమెరికా అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది

Sack cartoon: In Trump we trust? | Star Tribune
9.వైరస్‌ వ్యాప్తిని గోప్యంగా ఉంచిందని బయట పెట్టిన డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ను అరెస్టు చేశారు.
వాస్తవం: వెనలియాంగ్‌ స్వంత సంస్ధ అక్రమాలను బయట పెట్టే వ్యక్తి కాదు, అతన్ని అరెస్టు చేయలేదు. అంటు వ్యా ధులను నిర్ధారించటానికి కఠినమైన నిబంధనలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఇది సాధారణ అంశం. అంటువ్యాధుల నిర్ధారణ గురించి వెల్లడించటానికి ఒక చట్టం, పద్దతులు ఉన్నాయి. డాక్టర్‌ ఝాంగ్‌ జిక్సియాన్‌ ఒక శ్వాసనిపుణుడు, కోవిడ్‌-19 గురించి తొలిసారి నివేదించాడు, అతనికి అవార్డును ఇచ్చారు. జిక్సియాంగ్‌ నివేదించిన మూడు రోజుల తరువాత డిసెంబరు 30న, అధికారికంగా విడుదల చేయటానికి ఒక రోజు ముందు డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ అనే కంటి వైద్యుడు తన సహచరులకు ఉరు ఛాట్‌ గ్రూప్‌లో ఏడు నిర్ధారితమైన సారస్‌ కేసులు ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని ప్రచారం చేయవద్దని పోస్టు పెట్టాడు. అయితే అది ఇంటర్నెట్‌లో బయటకు వచ్చి భయాన్ని కలిగించింది. జనవరి మూడవ తేదీన ఊహాన్‌ పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపి నిర్ధారణ కాని సమాచారాన్ని వెల్లడించకూడదని, ప్రచారాన్ని ఆపాలని చెప్పి అధికారయుతంగా మందలిస్తూ ఒక లేఖను ఇచ్చి పంపారు. తరువాత అతనికి వైరస్‌ సోకింది, జనవరి 31న నిర్ధారణ అయింది. ఫిబ్రవరి ఏడవ తేదీన అతను మరణించాడు. అతనికి సంబంధించిన అంశాల మీద దర్యాప్తు జరపాలని ఒక బృందాన్ని నియమించారు. మార్చి 19న దర్యాప్తు నివేదికను వెల్లడించారు.అతని విషయంలో చట్టపరమైన అంశాలను తప్పుగా అన్వయించారని, మందలింపు లేఖను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. డాక్టర్‌ లీ మంచి వైద్యుడు, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు, ప్రభుత్వ వ్యతిరేకి కాదు, మార్చి ఐదున కరోనా వ్యతిరేక పోరులో మరణించిన ఆదర్శ జాతీయ ఆరోగ్య కార్యకర్తగా లీని ప్రకటించి ఒక అమర జీవిగా ఏప్రిల్‌ రెండున గౌరవించారు. ప్రభుత్వ వ్యతిరేకిగా లీని చిత్రించటం అతన్ని, అతని కుటుంబాన్ని అగౌరవ పరచటమే.
10.మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడించటంలో చైనా చాలా ఆలస్యం చేసింది. దాంతో తగిన సమాచారం లేక అమెరికా, ఇతర దేశాలు వెంటనే స్పందించటంలో విఫలమయ్యాయి.
వాస్తవం: చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వర్తమానాలు సకాలంలోనే గట్టిగానే వెళ్లాయి, అమెరికాకు తొలి నుంచీ అన్నీ తెలుసు. ఒక కొత్త వైరస్‌ ఒక మనిషి నుంచి మరొక మనిషికి సోకుతుందా లేదా అని తెలుసుకొనేందుకు కఠినమైన శాస్త్రీయ క్రమం ఉంటుంది. జనవరి తొమ్మిదిన నోవెల్‌ కరోనా వైరస్‌ అని చైనా నిపుణులు ప్రకటించారు. ఇరవయ్యవ తేదీన ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందని నిర్ధారించారు. అప్పటికి అమెరికాలో నిర్దారిత కేసులు లేవు. ఇరవై మూడవ తేదీన కోటీ 20లక్షల మంది జనాభా ఉన్న ఊహాన్‌ నగరాన్ని లాక్‌డౌన్‌ చేసి ప్రపంచానికి గట్టి హెచ్చరికను పంపింది. ఆరోజుకు అమెరికాలో ఒకే ఒక్క కేసు నమోదైంది.అంతకు ముందు రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానవుల్లో వ్యాప్తి గురించి వెల్లడించింది, 27వ తేదీ ప్రమాద తీవ్రతను పెంచింది, 30వ తేదీన మహమ్మారిగా మారినట్లు వెల్లడించింది. ఊహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు పిలిపించి, జనవరి 25వ తేదీ నుంచి కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన తొలి దేశం అమెరికా. ఫిబ్రవరి రెండున తన సరిహద్దులను మూసివేస్తూ చైనా పౌరులు అంతకు ముందు 14రోజులు చైనాలో ఉన్న ఇతర దేశీయులకు ప్రవేశం లేదని నిషేధించింది. ఆరోజున అమెరికాలో కేవలం ఎనిమిది కేసులే ఉన్నాయి. మార్చి తొలి వారం వరకు అమెరికా తీవ్ర సమస్యగా పరిగణించలేదు. అమెరికా సమస్యలకు చైనా కారణమని చెప్పటం పెద్ద అబద్దం అని అమెరికా ప్రముఖ ఆర్ధికవేత్త జెఫ్రీ సాచ్స్‌ పేర్కొన్నారు. తాము డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధను హెచ్చరించామని చైనా రాష్ట్రమైన తైవాన్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే డిసెంబరు 31న తమకు తైవాన్‌ నుంచి వచ్చిన ఇమెయిల్‌లో ప్రత్యేక లక్షణాలు గల న్యూమోనియా కేసుల గురించి వచ్చిన వార్తలను ఉటంకిస్తూ తమకు దాని గురించి మరింత సమాచారం కావాలని అడిగారు తప్ప దానిలో హెచ్చరికలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ద వివరణ ఇచ్చింది.
11.ఆరోపణ: చైనాలో కేసులు, మరణాల గురించి వాస్తవాలు చెప్పటం లేదు, ప్రకటించిన దాని కంటే 50రెట్లు ఎక్కువ.
వాస్తవం: కరోనా సమాచారం విషయంలో చైనా పారదర్శకంగా ఉంది. జనవరి 21 నుంచి ప్రతి రోజూ అధికారికంగా సమాచారాన్ని వెల్లడించింది.జాతీయ, ప్రాంతీయ స్ధాయిలో మూడువేలకు పైగా పత్రికా గోష్టులు నిర్వహించారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్నకారణంగానే కేసులు, మరణాలు తగ్గాయి. వ్యాధి గ్రస్తులను ఇతరుల నుంచి పూర్తిగా వేరుచేశారు. ఈ చర్యల కారణంగా ఏడు లక్షల కేసులను నివారించినట్లు సైన్సు పత్రిక అంచనా వేసింది.
12.ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ కేసుల సంఖ్యను తరువాత సవరించటం కేసులను తొక్కిపెట్టారన్నదానికి నిదర్శనం.
వాస్తవం: సమాచార సమీక్ష, సవరణ అంతర్జాతీయంగా సాధారణంగా జరిగేదే. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి. ఒక్కసారిగా ఆసుపత్రులు రోగులతో నిండిపోవటంతో అనేక మంది ఆసుపత్రులకు రాకుండానే ఇండ్ల దగ్గరే మరణించారు. ఆసుపత్రులన్నీ నిండిపోవటంతో ఆరోగ్య కార్యకర్తలు కేసులన్నీ నమోదు చేయలేని స్ధితి ఏర్పడింది లేదా ఆలస్యం అయింది. తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ప్రయివేటు ఆసుపత్రులు, సంచార వైద్యశాలలు, కొన్ని సంస్ధలలో చికిత్స పొందిన వారు, మరణించిన వారిని జాబితాలకు అందచేయలేదు. కొన్ని కేసులు ఒకటికి రెండుసార్లు నమోదు కావటం, కొన్ని అసంపూర్ణంగా ఉండటం వంటి కారణాల వలన సమాచారాన్ని సరి చేసి సవరించారు. ఇది అంతర్జాతీయంగా జరుగున్నదే. ఉదాహరణకు బ్రిటన్‌లో ఆసుపత్రుల వెలుపల మరణించిన వారిని లెక్కించలేదు, తరువాత దాన్ని సరిచేశారు. స్పెయిన్‌ ప్రభుత్వం కూడా తమ సమాచారాన్ని సవరిస్తామని ప్రకటించింది.

trump lies
13. ఆరోపణ: కరోనా వైరస్‌ గురించి చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తోంది.
వాస్తవం: తప్పుడు సమాచార బాధితురాలు చైనా. అమెరికా రాజకీయవేత్తలు, పండితులు, మీడియా చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
14.ఆరోపణ:చైనా రాజకీయ వ్యవస్ధ సమస్యలకు మూలం.
వాస్తవం: సామాజిక వ్యవస్ధ లేదా భావజాలానికి వైరస్‌కు సంబంధం లేదు. వైరస్‌ను అరికట్టటంలో చైనా పౌరులు విజయం సాధించారు. నూటనలభై కోట్ల మందిని ఐక్యపరచటంలో రాజకీయ వ్యవస్ధ విజయం సాధించింది. ఒక అభివృద్ది చెందుతున్న దేశంగా చైనా సమస్యలను అధిగమించాల్సి ఉంది. వెయ్యి పడకల ఆసుపత్రిని పది రోజుల్లో, 1600 పడకల ఆసుపత్రిని 15 రోజుల్లో నిర్మించేందుకు చైనా రాజకీయ వ్యవస్ద పెద్ద ఎత్తున మానవ, వస్తుసామగ్రిని సమీకరించగలిగింది. రోజు లేదా ఒకటిన్నర రోజుల వ్యవధిలో 13వేల మంది రోగులను చేర్చేందుకు వీలుగా మరో 16 సంచార వైద్యశాలలను ఏర్పాటు చేసింది. వైరస్‌ నుంచి జనాన్ని రక్షించేందుకు గాను 13,800 గృహ సముదాయాలకు ఊహాన్‌ నగరంలో 44,500 మంది స్ధానిక పార్టీ కార్యకర్తలను సమీకరించి, భౌతిక దూరం పాటింపు, తదితర చర్యలను గట్టిగా అమలు జరిపింది. సింగపూర్‌లోని బ్లాక్‌బాక్స్‌ పరిశోధనా సంస్ద జరిపిన సర్వేలో 23దేశాల్లో తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించగా చైనాకు నూటికి 85మార్కులు వచ్చి అగ్రస్ధానంలో నిలిచింది. సంక్షోభం నుంచి దేశం బయటపడగలదని 85శాతం మంది చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదే అమెరికాలో 11, ఐరోపా యూనియన్‌లో 15,భారత్‌లో పదిశాతం మాత్రమే ఉన్నారు.
15. ఆరోపణ : నిజాలను బయట పెట్టకుండా అమెరికా విలేకర్లను చైనా నుంచి బహిష్కరించారు.
వాస్తవం: చాలా కాలంగా అమెరికా తీసుకుంటున్న చర్యలకు ప్రతిచర్య తప్ప మరొకటి కాదు. ఇటీవలి కాలంలో అమెరికా పరోక్ష చర్యల ద్వారా మీడియా సిబ్బందిని పరిమితం చేసి 60 మంది చైనా జర్నలిస్టులను బహిష్కరించింది. వీసాల విషయంలో కూడా అమెరికా అనుచితంగా వ్యవహరిస్తోంది.
16. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్దకు చైనా లంచాలు ఇచ్చి అదుపు చేస్తోంది.
వాస్తవం: చైనా ఎన్నడూ ఆ సంస్ధను అదుపు చేసేందుకు ప్రయత్నించలేదు.సంస్ధలో 194 దేశాలకు సభ్యత్వం ఉండగా ప్రధాన కార్యాలయంలో పని చేసే 21 మంది నాయకత్వ బృందంలో 11 మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌కు చెందిన వారే కాగా చైనా నుంచి ఒకే ఒక్కరు ఉన్నారు. వారందరూ నిపుణులే. 2018,19 సంవత్సరాలలో అమెరికా, జపాన్‌ తరువాతనే చైనా అతి పెద్ద దాతగా ఉంది. సభ్యత్వం, విరాళాన్ని పరిగణనలోకి తీసుకుంటే చైనా తొమ్మిదవ స్దానంలో ఉంది.చైనా వాణిజ్య సంస్ధలు, ప్రభుత్వేతర సంస్ధలు ఇచ్చిన మొత్తాలను మినహాయిస్తే చైనా స్ధానం ఇంకా దిగజారుతుంది.
17.ఆరోపణ: మనుషల నుంచి మనుషులకు సోకుతుందని డిసెంబరు 31వ తేదీనే తైవాన్‌ సమాచారమిచ్చినా ప్రపంచ ఆరోగ్య సంస్ద తీవ్రంగా పరిగణించలేదు.
వాస్తవం: తైవాన్‌ రాష్ట్రం ఆరోగ్య సంస్దకు ఎలాంటి హెచ్చరికను పంపలేదు.వ్యాధి గురించి ఊహాన్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించిన తరువాత అదనపు సమాచారం కావాలని ఆరోగ్య సంస్దను తైవాన్‌ కోరింది. అదే విధంగా చైనా జాతీయారోగ్య సంస్ధకూ లేఖ రాసింది.తైవాన్‌తో ఆరోగ్యం, వైద్యానికి సంబంధించి ఉన్న ఒప్పందం మేరకు వెంటనే సమచారాన్ని పంపారు. అదే రోజు తైవాన్‌ ఆరోగ్య సంస్ధకు ఇమెయిల్‌ పంపింది.
18. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్ధలో చేరేందుకు తైవాన్‌ ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంది. తద్వారా అక్కడి పౌరుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది.
వాస్తవం: చైనాలో అంతర్భాగమైన తైవాన్‌కు ఆరోగ్య సంస్దలో చేరేందుకు హక్కు లేదు. సర్వసత్తాక దేశాలకు మాత్రమే దానిలో చేరే హక్కు ఉంది. సాంకేతిక సహకారం వాటి మధ్య నిరాఘాటంగా కొనసాగుతోంది. తైవాన్‌ నిపుణులు అనేక సమావేశాలకు హాజరయ్యారు. తైవాన్‌ నుంచి ఊహాన్‌కు సైతం నిపుణులు వచ్చారు.
19. ఆరోపణ: ప్రపంచ వ్యాపితంగా వైరస్‌ వ్యాపించటానికి చైనాయే కారణం కనుక, ఆ విషయాలపై దర్యాప్తు జరపాలి, పరిహారం చెల్లించాలి.
వాస్తవం: చైనాయే బాధ్యురాలని, పరిహారం కోరేందుకు చట్టపరంగా ఎలాంటి అవకాశాలు లేవు. స్ధానిక రాజకీయ అజెండా కారణంగా అమెరికా రాజకీయవేత్తలు చైనా మీద నెపం వేస్తున్నారు. చైనా కూడా బాధిత దేశమే. ఒక చోట తొలుత వెల్లడైనంత మాత్రాన ఆ దేశం నష్టపరిహారం చెల్లించాలని ఎక్కడా లేదు.1980దశకంలో ఎయిడ్స్‌ తొలుత అమెరికాలో బయటపడింది, అప్పటి నుంచి పరిహారం చెల్లించాలని దాన్ని ఎవరూ అడగలేదు. ప్రజారోగ్యం గురించి అమెరికాతో చైనాకు ఎలాంటి ఒప్పందమూ లేదు.
20. ఆరోపణ: వైరస్‌ నుంచి లబ్దిపొందేందుకు వైద్య సరఫరాలను చైనా దాచిపెట్టింది. అమెరికాలో వెంటిలేటర్ల వంటి వాటికి కొరత ఏర్పడటానికి ఇదే కారణం.
వాస్తవం: దేశీయంగా వైరస్‌ను ఎదుర్కొంటూనే ఇతర దేశాలకు సాయపడేందుకు చైనా తన శక్తికొద్దీ ప్రయత్నించింది. ఇప్పటికి 150దేశాలకు వైద్య సరఫరాలు చేసింది. మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 30వరకు 71.2బిలియన్ల వైద్య పరికరాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేసింది. మార్చి ఒకటి మే అయిదవ తేదీల మధ్య అమెరికాకు చైనా నుంచి 6.6బిలియన్ల ముఖతొడుగులు,344 మిలియన్‌ జతల సర్జికల్‌ తొడుగులు, 44.09 మిలియన్ల రక్షణ సూట్లు, 6.75 మిలియన్ల కళ్లద్దాలు, ఏడున్నర వేల వెంటిలేటర్లను సరఫరా చేశారు. ఇవిగాక అమెరికాలోని 30 రాష్ట్రాలు, 55 నగరాలకు అనేక లక్షల కిట్లు, తొడుగులు మొదలైన వాటిని విరాళంగా పంపారు.
21. ఆరోపణ: ఇతర దేశాలకు మహమ్మారి వ్యతిరేక సాయంలో కూడా చైనా రాజకీయ, ప్రచార కండూతితో వ్యవహరించింది.
వాస్తవం: వైరస్‌ను ఎదుర్కోవటంలో ఇతర దేశాలు చైనాకు చేసిన సాయానికి ప్రతిగానే చైనా కూడా సాయం చేసింది. చైనా నిపుణులు 120 వీడియో కాన్ఫరెన్సుద్వారా 160దేశాల వారితో అనుభవాలను పంచుకున్నారు. పందొమ్మిది దేశాలకు 21 చైనా బృందాలు వెళ్లాయి.
22. ఆరోపణ: డోనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి ఎన్నిక అవకుండా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటోంది.
వాస్తవం: చైనా ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే సూత్రానికి కట్టుబడి ఉంది. అమెరికాలోని కొందరు రాజకీయవేత్తలే అక్కడి ఎన్నికల్లో చైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చైనా మీద దాడిని ఎక్కుపెట్టాలని రిపబ్లికన్‌ పార్టీ సెనెటోరియల్‌ కమిటీ 57పేజీల పత్రాన్ని ప్రచార విభాగానికి అందచేసినట్లు పొలిటికో పత్రిక వెల్లడించింది. కరోనా వైరస్‌కు చైనాయే కారణమని, దాన్ని దాచిపెట్టిందని, డెమోక్రాట్లు చైనా పట్ల సానుకూలంగా ఉన్నారని, తాము ఎన్నికైన తరువాత వైరస్‌ను వ్యాప్తి చేసినందుకు చైనా మీద ఆంక్షలు విధిస్తామని ప్రచారం చేయాలని దానిలో పేర్కొన్నారు.

Cartoon Movement - Trump Lies
23.ఆరోపణ : కిట్స్‌, మాస్కులు, వెంటిలేటర్ల ఎగుమతుల గురించి ఎగుమతిదారులు కస్టమ్స్‌ వివరాలు వెల్లడించాలని చైనా కోరింది, ఎగుమతులపై నిషేధం విధించేందుకు అలా చేశారు.
వాస్తవం: నాణ్యతా ప్రమాణాల మెరుగుదల కోసమే ఆ సమాచారాన్ని అడిగారు. ఈ చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. నాణ్యత లేని ఉత్పత్తులను నిరోధించటానికి, కనుగొనేందుకు తోడ్పడింది. త్వరగా కస్టమ్స్‌ అనుమతులు ఇవ్వటానికి వీలు కలిగించింది. ఎగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
24. ఆరోపణ: ఆఫ్రికన్ల విషయంలో గువాంగ్‌డోంగ్‌లో వివక్ష ప్రదర్శించారు.

వాస్తవం:చైనీయులు, విదేశీయులెవరైనా ఎలాంటి వివక్ష చూపలేదు. స్ధానికంగా ఎన్ని ఇబ్బందులు పడినా హుబెరు రాష్ట్రంలోని మూడువేల మంది ఆఫ్రికన్‌ విద్యార్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకుంది. ఒక విద్యార్ధికి వైరస్‌ సోకితే వెంటనే చికిత్స అందించారు. ఏప్రిల్‌13న గ్వాంగ్‌డోంగ్‌లో విదేశాల నుంచి వచ్చిన వారిలో 26 మందికి వైరస్‌ ఉంది, వారిలో 19 మంది ఆఫ్రికన్లు ఉన్నారు.ఎవరినీ లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకోలేదు. ఊహాన్‌ వీధుల్లో కెనియన్‌ దంపతుల మీద దాడి జరిగినట్లు బిబిసి ఏప్రిల్‌ 17న బిబిసి ప్రసారం చేసింది. నిజానికి అది అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగింది.

http://www.xinhuanet.com/english/2020-05/10/c_139044103.htm

దేశంలో ఏం జరుగుతోంది, మనం దేన్నయినా పట్టించుకుంటున్నామా !

Tags

, ,

Coronavirus: PM Modi to address nation on Thursday - INDIA ...

ఎం కోటేశ్వరరావు
దేశంలో ఏమి జరుగుతోంది ? బుద్ధి జీవులు(మేథావులు) ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఏ దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ తరగతులు ఏమి ఆలోచిస్తున్నాయి,ఏం చేయాలనుకుంటున్నాయి? మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి పట్టించుకుంటున్నామా? మనమేం చేస్తున్నామో మనకు తెలుస్తోందా ? ఇది ఒక ఆలోచన మాత్రమే, ఆసక్తి ఉన్నవారు మాత్రమే ముందుకు పోండి, ఆల్‌ ఈస్‌ వెల్‌ (అంతా బాగుంది ) అనుకుంటున్నవారు చదివి ఇబ్బంది పడకండి. ఆలోచనా పరులైతై మీ భావాలను బయట పెట్టండి. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం కాస్త బతికే ఉంది. జరుగుతున్నవి నాకు సంబంధం లేనివి కదా నేనెందుకు మాట్లాడాలి అనుకోకండి. మీవరకు వచ్చే సరికి మీకోసం మాట్లాడేవారు మిగలరని తెలుసుకోండి.
గృహబందీ శాశ్వతం కాదని,పరిమితకాలమైనా తప్పదని తెలుసు. గతంలో నరేంద్రమోడీ అనాలోచితంగా పెద్ద నోట్లను రద్దు చేసినపుడు జనం నీరాజనాలు పట్టారు. ఇప్పుడు గృహబందీ ప్రకటించినా అనేక మంది కోటీశ్వరులు, మధ్యతరగతి, చీకట్లో ఉన్న వారు అదే చేస్తున్నారు. నోట్ల రద్దు జనం, ఆర్ధిక వ్యవస్ధ ప్రాణాలు తీసింది. రెండవది జాగ్రత్తలు పాటించిన వారి ప్రాణాలు కాపాడుతుంది. మొదటి చర్య మోడీ స్వమస్తిష్కం నుంచి పుడితే, రెండవది చైనా నుంచి అరువు తెచ్చుకున్నది.(చైనా వస్తువులను, దాని కమ్యూనిస్టు ఆలోచనలను బహిష్కరించాలని చెప్పేవారు దీని గురించి మౌనం దాల్చారు ఎందుకో మరి )
ప్రపంచంలో జిడిపిలో ఐదో స్ధానంలో ఉన్న మన దేశం జనధన్‌ ఖాతాలకు 1500(డాలర్లలో 20) రూపాయలు నేరుగా నగదు మూడు దఫాలుగా పంపిణీ చేస్తోంది.(ఒకేసారి ఇస్తే దుర్వినియోగం చేస్తారని కాబోలు) అదే 42వ స్ధానంలో ఉన్న పాకిస్ధాన్‌ దాని కరెన్సీలో ఒకేసారి పన్నెండువేల రూపాయలు(డాలర్లలో 75) ఇస్తోంది. అయినా తాము చేసింది పెద్ద గొప్పని మన బిజెపి నేతలు చెప్పుకుంటారు. పాక్‌ పధకాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. మరోవైపు మన దేశానికి ఆరోగ్య సంరక్షణ చర్యలకు గాను ప్రపంచబ్యాంకు ఒక బిలియన్‌ డాలర్ల పాకేజ్‌ ప్రకటించింది. పాకిస్దాన్‌ కూడా తీసుకొని ఉండవచ్చు. కానీ ప్రపంచంలో కరోనా విపత్తు సహాయ చర్యలకు గాను మన దేశం జిడిపిలో మూడు నుంచి ఐదుశాతం ఖర్చు చేసేందుకు ఆలోంచాలని ప్రకటించింది. కానీ మోడీ ప్రకటించింది 0.7శాతమే అని తెలిసినా కొందరు ఆహా ఓహౌ అంటూ విరగబడిపోతున్నారు. మన వివేకం ఏమైనట్లు ?
జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలో తీసుకుపోయామని బిజెపి వారు చెప్పుకుంటుంటే ఆ విషయాన్ని మనం లొట్టలు వేసుకుంటూ ఆహా మోడీ గారి ఘనత కదా అనుకుంటున్నాం. తలసరి జిడిపిలో ఎక్కడున్నాం, ఎవరితో పోల్చుకోవాలి, సంబరాలు చేసుకొనేంతగా పరిస్ధితి మెరుగుపడిందా అన్నది ప్రశ్న. 2017లో చైనా 75, పాకిస్ధాన్‌ 1501వ స్ధానాల్లో ఉంటే మనది 145. అదే 2019 అంచనాలకు వచ్చేసరికి చైనా 65, పాకిస్ధాన్‌ 151 మనం 139వ స్ధానంలో ఉన్నాం. ఇది కూడా ఘనతేనా, దీనికి బాధ్యత ఎవరిది ? మన కంటే నరేంద్రమోడీ ఉన్నారు కనుక చక్రం తిప్పి రాంకు పెంచారనుకుందాం కాసేపు. బంగ్లాదేశ్‌ ఈ కాలంలోనే 153 నుంచి 150, 143వ స్ధానానికి మెరుగు పరచుకుంది. అక్కడ మోడీ లేకపోయినా పది స్ధానాలు పైకి ఎగబాకితే మోడీ మంత్రదండం ఉన్నా కేవలం ఆరు రాంకులే పెరిగింది. దీని గురించి వ్యాఖ్యానం అవసరం ఏముంది ?
ప్రపంచంలో అనేక దేశాలు కరోనా కారణంగా వందలాది సంక్షేమ చర్యలను చేపట్టాయి. వీటన్నింటిలో ఇప్పటివరకు నరేంద్రమోడీ సర్కార్‌ చేపట్టింది అన్నింటి కంటే మెరుగ్గా ఉందని గానీ లేదా మెరుగైన చర్యలు చేపట్టిన వాటిలో ఒకటిగా ఉందని గానీ ఏ అంతర్జాతీయ సంస్ధా చెప్పలేదు, అయినా స్వంత డబ్బా మోగుతూనే ఉంది. ఒక బిలియన్‌ డాలర్లను మన ఆరోగ్య రంగానికి ఇస్తామని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇది అప్పా, దానమా అన్నది పక్కన పెడదాం. అప్పయినా దానమైనా మోడీ గారికి ఘనత తెచ్చే అంశం కాదు. ఈ సందర్భంగా బ్యాంకు మన దేశ డైరెక్టర్‌గా ఉన్నó జునైద్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ భారత్‌ కరోనా ఉద్దీపనకు భారత్‌ జిడిపిలో మూడు నుంచి ఐదుశాతం వరకు ఖర్చు చేసేందుకు ఆలోచించాలని చెప్పాడు. ఆయన బంగ్లాదేశ్‌ ఆర్ధికవేత్త అయిపోయాడు కనుక సరిపోయింది గానీ అదే పాక్‌ జాతీయుడు అయి ఉంటే మా మోడీని ఇరకాటంలో పెట్టేందుకు అలా మాట్లాడి ఉండే వారని ఈ పాటికి బిజెపి మరుగుజ్జులు సామాజిక మాధమాల్లో గంతులు వేసి ఉండేవారు. ఒకటికి రెండు సార్లు ధృడ సంకల్పాన్ని యావత్‌ జాతి ప్రకటించాలని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మూడవసారి గృహబందీ పొడిగించినపుడు దేశ ప్రజలను ఉద్దేశించి మాటా పలుకు లేదు. సంకల్పాన్ని మరో ప్రదర్శించమని జనాన్ని కోరలేదు. ఎందుకనో ఎవరైనా ఆలోచించారా ?
సుభాషితాల వల్లింపు ఎక్కువైతే ఏమి జరుగుతుందో రాజకీయాల్లో జనాన్ని ఏమార్చటంలో తలపండిన నరేంద్రమోడీకి తెలియంది కాదు. తమ ఆర్ధిక ఇబ్బందుల గురించి రాష్ట్రాలు మెల్లగా గొణుగుతున్నాయి. కేంద్రం ఎలాంటి పాకేజ్‌లు ప్రకటించే సూచనలు లేవు. అందువలన మరోసారి చప్పట్లు కొట్టాలనో, విద్యుత్‌ దీపాలు ఆర్పి వేరే దిపాలు వెలిగించాలనో మరొకటో చెబితే ఈ కబుర్లు ఇంక చాల్లే అనే స్ధితి వచ్చేసింది కనుక జనంలో పలుచనౌతారు. అందుచేత మరో మాట లేకుండా ఆర్మీతో పూలు చల్లించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గృహబందీ తొలిసారి ప్రకటించినపుడు పెద్ద నోట్ల రద్దు మాదిరి ఆకస్మికంగా ప్రకటించేశారు. ఇంత పెద్ద దేశంలో కోట్లాది మంది ప్రతి రోజూ ప్రయాణిస్తారని, వారంతా ఎక్కడిక్కడ చిక్కుకుపోతే ఇబ్బందులు పడతారని సామాన్యుల గుండె చప్పుడు తనకంటే మరొకరికి తెలియదని చెప్పుకొనే ప్రధానికి తట్టలేదా ఎవరూ చెప్పలేదా ? మొత్తానికి ఏమి జరిగిందో ఇంతవరకు తెలియలేదు. పోనీ వలస కార్మికులను స్వస్ధలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఎట్టకేలకు నిర్ణయించారు. అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలనేది కూడా ముందుకు చర్చించకుండా ఎంత నగుబాట్ల వ్యవహారం చేశారో చూశాము. ఎవరికీ బుర్రలేదా లేక మరేదైనా జరిగిందా ? ఆ ఖర్చు మేము భరిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన తరువాత నష్టనివారణ చర్యలు తీసుకున్నారు. పిఎం కేర్‌కు చేరిన వేల కోట్ల రూపాయల్లో రైల్వేలు ఇచ్చిన 150 కోట్లు కూడా ఉన్నాయి. దానికి ఎంత వచ్చిందో దేనికి కేటాయిస్తున్నారో మనకు తెలుసా ? వలన కార్మికుల రవాణాకు అయ్యే ఖర్చును పిఎం కేర్‌ నిధి నుంచి ఇస్తామని చెబితే సొమ్మేం పోయేది? పరాయి రాష్ట్రంలో చిక్కుకుపోయిన గుజరాతీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాంతో మిగతా చోట్ల నుంచీ అదే డిమాండ్‌ వచ్చింది. విదేశాలలో చిక్కుకుపోయిన వారిని తీసుకురావటం గురించి ప్రతిదేశమూ ఏర్పాట్లు చేసింది గానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచార ఆర్భాటం ఎక్కడా కానరాదు. దానికి వందే భారత్‌ అని ఒక పేరు, పోనీ అదేమైనా కొత్తదా కాదే వందే మాతరానికి అనుకరణ కాదా ? విదేశాల్లో వున్న వారికోసం విమానాలు, మిలిటరీ నావలను పంపి తీసుకువస్తున్నారు, వారి దగ్గర ఖర్చు వసూలు చేస్తున్నారు. దాన్నొక విజయంగా ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వలస కార్మికులు మేము టిక్కెట్లు కొని ప్రయాణిస్తామని మొత్తుకుంటున్నా రైళ్లను ఏర్పాటు చేసేందుకు వారాల తరబడి ఎందుకు ముందుకు రాలేదు. అలాంటి ఏర్పాటే ఉంటే ఔరంగాబాద్‌ దగ్గర వలస కూలీలు రైలు పట్టాలపై పడుకొనే వారా, వారి మీదుగా రైలు వెళ్లి దుర్మరణం చెందేవారా? అనేక రాష్ట్రాలు వేరే చోట చిక్కుకుపోయిన తమ రాష్ట్ర కూలీలను తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదు. ఏమిటిది? మనం ఎటు పోతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా మరొకటా ?
చరిత్రలో, కొన్ని సినిమాల్లో కార్మికులను బందీలుగా తీసుకుపోయి వారిని అక్కడి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా చచ్చేంత వరకు వెట్టి చాకిరీ చేయించుకోవటం చూశాము. కర్ణాటక నుంచి వలస కార్మికులు వెళ్లిపోవటానికి వీల్లేదు, మేము నష్టపోకూడదని భవన నిర్మాణ కంపెనీల లాబీ వత్తిడి తెస్తే ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప ప్రత్యేక రైళ్లను రద్దు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి ? బిజెపి ఒక జాతీయ పార్టీ, దానికి ఒక విధానమంటూ ఉండాల వద్దా? ముదిమది తప్పిన వ్యవహారమా, మరొకటా ? కేంద్రం ప్రకటించిన విధానాన్ని కూడా అమలు జరపరా ?చివాట్లు పడిన తరువాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. గృహబందీ నిబంధనల సడలింపు గురించి కేరళ ప్రభుత్వం ప్రకటించగానే కేంద్ర హౌంశాఖ బహిరంగ ప్రకటనల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. మరి ఎడ్డి యూరప్ప విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? రెండు నాలుకల ధోరణి, కరోనాలో కూడా రాజకీయం చేయటం కాదా ?

Coronavirus In India: How Indians are dealing with the onset of a ...
మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేదని బిజెపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పోనీ బిజెపి పాలిత రాష్ట్రాలతో సహా పలుచోట్ల సడలించారు, భౌతిక దూరం పాటించకుండా మందుబాబులు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు, ( మందు షాపులు ఎందుకు తెరిచారంటే కరోనా కారణంగా తలెత్తిన నిధుల కొరతను అధిగమించటానికనేకదా పాలకులు చెబుతోంది) విరగబడి మందు కొనేందుకు పోటీలు పడటం వారికి ఉన్న దేశభక్తి ప్రదర్శనకు నిదర్శనం అనుకుందాం. అనుమతి ఇవ్వకపోతే వరుసల్లో మందుకోసం బేటాలతో పాటు బేటీలు కూడా నిలబడటాన్ని చూసిన తరువాత అయినా రాష్ట్రాలను ఎందుకు హెచ్చరించలేదో ఆలోచిస్తున్నామా ? ఈ కారణంగా ఎక్కడైనా కరోనా ప్రబలితే బాధ్యత ఎవరిది ?
కరోనా వ్యాప్తి నిరోధానికి గృహబందీని జనవరి మూడవ వారం నుంచే చైనాలో అమలు జరుపుతున్నారని తెలుసు. తబ్లిగీ జమాత్‌ సంస్ధ మలేషియాలో నిర్వహించిన సామూహిక సమావేశాల కారణంగా ఫిబ్రవరినెలలో కరోనా వైరస్‌ వ్యాపించిందని ప్రపంచానికంతకూ తెలిసిందే. ఆ అనుభవంతో మార్చినెల రెండవ వారంలో మన దేశం కంటే ముందు పాకిస్ధాన్‌లో అదే సంస్ధ సమావేశాలను అక్కడి ప్రభుత్వం నిషేధిస్తే అర్ధంతరంగా సమావేశాలను ముగించారు. అక్కడా వైరస్‌ వీరి కారణంగానే వ్యాపించింది. ఇవన్నీ తెలిసి ఢిల్లీలో అలాంటి సమావేశాలను ఎందుకు అనుమతించారు, ఎవరు అనుమతించారన్నది ఎవరమైనా ఆలోచించామా ? తబ్లిగీ సంస్ధ బాధ్యతా రహితంగా వ్యహరించిందనటంలో మరోమాట లేదు. వారి సమావేశాలకు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాగారే కదా అనుమతులు ఇచ్చింది. మలేషియా నుంచి ఇతర దేశాల నుంచి వైరస్‌ను మోసుకువచ్చిన వారి వీసాలను ఎందుకు రద్దు చేయలేదు, పోనీ టూరిస్టులనో మరో పేరుతోనే వచ్చారు, వారికి ఎందుకు పరీక్షలు చేయలేదు, కరోనా ఉంటే క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు. ఈ ప్రశ్నలన్నీ వేయాలా వద్దా? లేక మోడీ పార్టీ పాకేజ్‌లకు అమ్ముడు పోయిన లేదా మతోన్మాదం తలకెక్కిన మీడియా కరోనా వ్యాప్తికి కారణమైన తబ్లిగీ జమాత్‌ పేరుతో యావత్‌ ముస్లిం సామాజిక తరగతి మీద దాడి చేస్తుంటే, ఇదేమి విపరీతం అని ఎందుకు ఆలోచించలేకపోయాము, అసలు తబ్లిగీ సమావేశాలకు అనుమతి ఇవ్వటం వెనుక కారణం ఆ సమావేశాల తరువాత ఆయోధ్యలో ఇతర చోట్లా తలపెట్టిన అంతకంటే పెద్ద శ్రీరామనవమి సమావేశాలే కారణమని(తరువాత రద్దు చేయటం వేరే) ఎందుకు ఆలోచించలేకపోయాము ?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాకేజ్‌ లక్షా 70వేల కోట్లు, ఈ పాకేజ్‌తో నిమిత్తం లేకుండా జూన్‌లో రైతాంగానికి రెండువేల రూపాయల చొప్పున ఇవ్వాల్సిన దాదాపు 20వేల కోట్లు ముందే ఇచ్చి దాన్ని కూడా పెద్ద సాయంగా చిత్రించారు. ఇంకా ఇలాంటివే దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఉన్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పోతే మార్చినెలలో మూడు రూపాయలు, తాజాగా పెట్రోలియం ఉత్పత్తుల మీద పెంచిన పన్నుల ద్వారా మొత్తం ఏడాదికి రెండులక్షల కోట్ల రూపాయల వరకు కేంద్రానికి అదనపు ఆదాయం రానుంది. డీజిల్‌ లేదా పెట్రోలు మీద లీటర్‌కు ఒక రూపాయి పెంచితే కేంద్రానికి ఏడాదికి 14వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డిఏ, జూలై, వచ్చే ఏడాది జనవరిలో పెరగాల్సిన(ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది కనుక ఎక్కువా తక్కువ కావచ్చుగానీ డిఏ పెరుగుతుంది) డిఏను కూడా జూలై వరకు పెంచకుండా 17శాతాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీని వలన అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు లక్షా 20వేల కోట్ల రూపాయలు చెల్లింపు బాధ్యత ఏడాదిన్నరపాటు తగ్గుతుంది. ఎల్‌టిసి, వేతనంతో కూడిన సెలవుల వంటి వాటి మీద మరికొన్ని ఆంక్షలు విధించారు. ఇవిగాక పారిశ్రామిక సంస్ధలు ఇచ్చిన వేల కోట్ల రూపాయల పిఎం కేర్‌ నిధులున్నాయి. అంటే ఇప్పటి వరకు జనానికి ఇచ్చింది ఎక్కువా కరోనా పేరుతో జనం జేబుల నుంచి కొట్టివేస్తున్నది ఎక్కువా? దేశభక్తి కళ్లతో చూసినా వేద గణితం ప్రకారం చూసినా ఎక్కువే కదా !
గృహబందీ వ్యవధి పెరిగే కొద్దీ ప్రధాని నరేంద్రమోడీ తన ఎత్తుగడలు మారుస్తున్నారు. దానిలో భాగమే తాజా పరిణామాలు. కేంద్రం సుభాషితాలు వల్లిస్తూ, పెత్తనం చలాయిస్తున్నది, పైసా విదల్చటం లేదు, సమస్యలను రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సి వస్తోంది. పోనీ ప్రత్యేక చర్యగా భావించి పరిమితికి మించి కరోనా అప్పులు చేసేందుకు అనుమతి ఇస్తున్నారా లేదు. కేంద్రం మీద నిధుల వత్తిడి తగ్గాలంటే రాష్ట్రాలలో ఒక ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మద్యం అమ్మకాలను అనుమతించారు తప్ప అదేమైనా కరోనా నియంత్రణ చర్య కాదే.దేశంలోని మధ్య తరగతి, ధనికుల మన్ననలను పొందే చర్యలను ప్రకటించి భజన చేసే మీడియాలోనూ, చెక్క భజన చేసే పాలకపార్టీ సామాజిక మాధ్యమ విభాగాలతో ప్రచారం చేయిస్తున్నారు.
అత్యవసర వస్తువుల సరఫరాను మెరుగుపరచే పేరుతో కార్మికుల పని గంటలను ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనేక రాష్ట్రాలు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. తాజా ఆదేశాల ప్రకారం యజమానులు కోరితే పన్నెండు గంటల వరకు విధిగా కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. మాకు అదనపు వేతనం లేదా ఓవర్‌ టైమ్‌ వద్దు నిబంధనల ప్రకారం ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తామంటే కుదరదు. వాస్తవానికి ఇప్పటికే కార్మిక చట్టాలను గాలికి వదలిన కారణంగా అనేక చోట్ల పన్నెండు గంటల పని చేయిస్తున్నారు. ఓవర్‌టైమ్‌లేదు, కనీస వేతనాలు, పని పరిస్ధితుల నిబంధనల అమలు లేదు. కేంద్రం, రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకొనేందుకు తక్షణ కారణం తమ స్వస్ధలాలకు వెళ్లిపోయిన వలస కార్మికులు వెంటనే తిరిగి వచ్చే అవకాశాలు పరిమితం కావటమే. అందువలన కొత్తవారిని నియమించి వారికి శిక్షణ ఇవ్వటం, ఒకసారి పని ఇచ్చిన తరువాత తొలగింపు సమస్యలతో కూడుకున్నది కావటంతో యజమానులు అందుబాటులో ఉన్న వారిమీదే పని భారం పెంపుదలకు పూనుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించటం తప్ప మరొక కారణం లేదు.

Prime Minister Narendra Modi On Coronavirus: Total Lockdown From ...
గృహబందీ సమయంలో సరకు రవాణాలో ఇబ్బందులు తప్ప ఇంతవరకు నిత్యావసర సరకుల కొరత ఏర్పడలేదు. నిజానికి అనేక కారణాలతో వినిమయం పరిమితం అయింది. తగ్గిపోయింది కూడా. కరోనాతో నిమిత్తం లేకుండానే డిమాండ్‌ పడిపోయింది.2011-12తో పోల్చితే 2017జూలై 2018జూన్‌ మధ్య గ్రామీణ ప్రాంతాలలో వినియోగ గిరాకీ 8.8శాతం పడిపోయిందని జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) తెలిపింది. దేశ జనాభాలో మూడింట రెండువంతుల మంది గ్రామాలలోనే ఉంటున్నారు. దుస్తులు, ఆహారం,విద్యపై ఖర్చు పడిపోయింది, తృణ ధాన్యాల వంటి అత్యవసర వస్తువుల డిమాండ్‌ 20శాతం వరకు పడిపోయిందని అంచనా.1972-73 తరువాత తొలిసారిగా దేశంలో పట్టణ ప్రాంతాలలో రెండుశాతం డిమాండ్‌ పెరిగినా గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన కారణంగా మొత్తంగా 3.7శాతం తలసరి వినిమయ ఖర్చు పడిపోయింది. అయితే ప్రభుత్వం ఈ గణాంకాలను విశ్లేషించే పేరుతో ఖరారు చేయకుండా తొక్కి పెడుతోంది. కరోనా కారణంగా గ్రామాలకు తరలి పోతున్న కోట్లాది మంది వలస కార్మికులకు గ్రామాలలో పనులు ఉండవు. అందువలన గ్రామీణ వినియోగం రానున్న రోజుల్లో ఇంకా పడిపోయే అవకాశం ఉంది. అటువంటపుడు పన్నెండు గంటల పాటు పనిచేయించాల్సిన అవసరం ఏముంది ?
2016లో చేసిన బుర్ర తక్కువ పని పెద్ద నోట్ల రద్దు వలన మోడీగారు చెప్పినట్లు సత్ఫలితాలకు బదులు దుష్ఫలితాలు కలిగాయి. మరుసటి ఏడాది ప్రవేశపెట్టిన జిఎస్‌టి మరికొంత దెబ్బతీసింది. ఆ దెబ్బలకు అలవాటు పడుతున్న స్ధితిలో పులిమీద పుట్రలా కరోనా ప్రభావం దేశ ఆర్ధిక స్ధితిని మరింత దిగజార్చనుంది. జిడిపి వృద్ధి రేటు సున్నా అవుతుందా ఇంకా దిగజారుతుందా అన్నది ఎవరూ చెప్పలేని స్ధితి. అయినా ఇంకా మంచిదినాలు రానున్నాయి(అచ్చేదిన్‌) అంటే మూతికి చిక్కెం బిగించి కంటికి కనపడేలా దూరంగా గడ్డి కట్ట చూపుతుంటే ఆశతో ముందుకు సాగే గుర్రాల మాదిరి పరుగెడుతూనే ఉన్నాం. మన మాదిరి మెదడు పెరగలేదు కనుక అవి పరుగెడతాయి, మన సంగతేమిటి.
ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే ఇక్కడ పెంచుతాము, తగ్గితే తగ్గిస్తాము అని కబుర్లు చెప్పారు. మార్చినెల 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పీపా ధర సగటున 60డాలర్లకు కొనుగోలు చేసిన మనం ఏప్రిల్‌లో ఇరవై డాలర్లకు లోపే కొన్నాం. జనవరి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు తగ్గుతున్నాయి, మార్చినెలలో మరింత తగ్గాయి. అయినా మార్చి 16 నుంచి నేటి వరకు అంతకు ముందు ఉన్న ధరనే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఎందుకు ఆ పని చేస్తున్నారో వారు చెప్పరు, ఏమిటీ పట్టపగలు జేబు కొట్టుడు అని మనమూ అడగం. ధరలు తగ్గిన తరువాత వినియోగదారుల మీద రెండులక్షల కోట్ల రూపాయల వరకు పన్నుబాదితే ఇదేమని ప్రశ్నించలేని బలహీనత లేదా లొంగుబాటు ఏమిటి ?

Brick Tamland Anchorman - I have no idea What's going on! | Funny ...
తప్పులు అందరూ చేస్తారు. వాటిని అంగీకరించి సరిదిద్దుకోవటమే గొప్ప అని మన పెద్దలు చెప్పారే. కమ్యూనిస్టులు తాము అనుసరించిన విధానాలు, ఎత్తుగడల తప్పుల గురించి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభల్లో సమీక్షించుకుంటారు. వాటిని బహిరంగంగానే అంగీకరిస్తారు. కొందరు దెప్పుతున్నట్లు విదేశీ సిద్ధాంతాలను పాటించేవారిలోనే ఆ నిజాయితీ కనిపిస్తున్నప్పుడు పక్కా భారతీయం అమలు జరుపుతున్నామని చెప్పుకొనే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు పెద్ద తప్పిదం అని జాతికి ఎప్పుడైనా చెప్పారా ? ఎందుకు చెప్పలేదు ? ఆయన ఖర్మకు ఆయన్ను వదిలేద్దామా ? వ్యక్తులుగా అయితే అలాగే చేద్దుము, కానీ ప్రధాని, ముఖ్యమంత్రులు వ్యక్తులు కాదే, వ్యవస్ధకు ప్రతినిధులు. వారి ఖర్మలకు జనం అనుభవించాలా ? ఇదెక్కడి వేదాంతం ? ఇదెక్కడి భారతీయత ?
ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి వారు ఆలపించిన భజన గీతాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.ఏ విదేశీ దుండగీడు వచ్చినా చేవచచ్చినట్లు భరించి పాలన అప్పగించి ఎన్ని విధాలుగా నష్టపోయామో తెలిసిందే. అలాగే స్వదేశీయుడు ఏమి చేసినా అలాగే భరించాలా ? కొంత మంది మన వేదవిజ్ఞానం, పురాతన తర్కజ్ఞానం గురించి గొప్పగా చెబుతారు. అదే నిజమైతే మనం వాటిలో ఆవగింజలో అరవయ్యో వంతు వంటబట్టించుకున్నా ఎందుకు అనే ఒక చిన్న ప్రశ్న కూడా మనల్ని మనం, పాలకులను అడిగి ఉండేవారం కాదా ? ఎక్కడుందీ లోపం, ఎవరైనా ప్రశ్నిస్తే కమ్యూనిస్టు విదేశీ సిద్ధాంతాన్ని అరువు తెచ్చుకున్నారని ఎదురుదాడికి దిగుతారు. ఏం జరిగినా నోరు సహా అన్నీ మూసుకొని కూర్చోమని మన స్వదేశీ వేదజ్ఞానం, తర్కం చెప్పిందా ?

కమ్యూనిస్టుల సైద్ధాంతిక విబేధాల పరిష్కారం ఎలా ?

Tags

, , , , ,

Long live Marxism-Leninism and Mao Zedong thought! | Communist ...

ఎం కోటేశ్వరరావు
కారల్‌ మార్క్స్‌ 202వ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమంలో వచ్చిన ఒక పోస్టు దిగువ విధంగా ఉంది. ఒక జర్నలిస్టు తన వాల్‌ మీద షేర్‌ చేస్తే దాని నుంచి నేను తీసుకున్నాను. అభిమాని-కార్యకర్త మధ్య సంభాషణగా దీన్ని రాశారు, రచయిత పేరు తెలియదు. ఏ సందర్భంగా రాసినప్పటికీ దీనిలోని అంశాలు అనేక మందిలో ఉన్నాయనేది ఒక వాస్తవం. ఒక జర్నలిస్టుగా, పరిశీలకుడిగా కొన్ని అభిప్రాయాలను చర్చ కోసం పాఠకుల ముందు ఉంచుతున్నాను. నేను కమ్యూనిస్టు సిద్దాంత పండితుడిని కాదు కనుక పొరపాటు అభిప్రాయాలు వెల్లడిస్తే ఎవరైనా సరిచేయవచ్చు. ఇది సమగ్రం అని కూడా చెప్పలేను, ఒక అభిప్రాయం మాత్రమే.
పురోగామి, కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధి కోసం నూరు పూవులు పూయనివ్వండి నూరు ఆలోచనలను వికసించనివ్వండి అనే ఆలోచనతో ఏకీభావం ఉన్న వ్యక్తిగా చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి. అసలు పోస్టు ఏమిటో తెలియకుండా దాని మీద వ్యాఖ్యలు చేయటం వలన పాఠకులకు ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆ పోస్టును ముందుగా ఉన్నది ఉన్నట్లుగా ఇస్తున్నాను. తరువాత అభిమాని ప్రశ్నలను అలాగే ఉంచి లేవనెత్తిన అంశాలకు మరో కార్యకర్త వివరణ రూపంలో నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు గమనించాలని మనవి. బుల్లెట్ల రూపంలో చిట్టి పొట్టి వివరణలు ఇచ్చి సందేహాలను తీరిస్తే మంచిదే కానీ, అన్ని వేళలా అది సాధ్యం కాదు. సాధ్యమై ఉంటే కాపిటల్‌ గ్రంధాన్ని అంత వివరంగా మార్క్స్‌ రాసి ఉండేవారు కాదు. దీన్ని కూడా చదివే ఓపికలేని అభిమానులు, కార్యకర్తల వలన ప్రయోజనం లేదు. కనుక ఓపిక, ఆసక్తి ఉన్నవారు మొత్తం చదవాలని మనవి. లేనట్లయితే ఇక్కడితోనే ముగించి మరింత ఉపయోగకరమైన విషయాలను చదువుకోవచ్చు.
(దిగువ ఉన్నది నేను స్వీకరించిన పోస్టు)
అభిమాని – కార్యకర్త – మధ్యలో మార్క్స్‌
అభిమాని: మన దేశంలో మార్క్స్‌ వారసులు ఎవరు?
కార్యకర్త: పదుల సంఖ్యలో ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, సానుభూతిపరులు.
అభిమాని: మరి మార్క్స్‌ వారసులు ఇన్ని పార్టీల్లో ఎందుకున్నారు?
కార్యకర్త: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు ఉన్నాయి కాబట్టి.
అభిమాని: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు అంటే ఏమిటి?
కార్యకర్త: అవి తీవ్రమైనవి కాబట్టి, అంత సులభంగా అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు వివరించడం అస్సలు సాధ్యం కాదు.
అభిమాని: ఈ తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు మార్క్స్‌ మౌలిక రచనల్లో ఏమైనా సమాధానాలు దొరుకుతాయా?
కార్యకర్త: మార్క్స్‌ మౌలిక రచనలు అంటే ఏమిటి?
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చాలా ఉన్నాయి. పోనీ ఇప్పటి వరకూ మీకు తెలిసిన, మీరు చదివిన మార్క్స్‌ రచనలు ఏంటో చెప్పండి?
కార్యకర్త: ఏంగెల్స్‌ తో కలిసి రాసిన కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో చదివాను. మార్క్స్‌ రాసిన ‘పెట్టుబడి’ గ్రంథాన్ని చూశాను, దాని గురించి విన్నాను, పూర్తిగా చదవలేదు. పెట్టుబడి గ్రంథంలోని మూడు వాల్యూమ్స్‌ బహుశా మా నాయకులు కూడా చదివి ఉండరు. మిగిలిన మౌలిక రచనల గురించి పెద్దగా తెలియదు.
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చదవకుండా, మార్స్కిస్టులమని చెప్పుకోవడం, మార్క్స్‌ కి జేజేలు పలకడం సబబేనా?
కార్యకర్త: రాముడిని నమ్మేవాళ్ళంతా రామాయణాన్ని చదవలేదు కదా!
అభిమాని: అది మతం, నమ్మేవారు భక్తులు. కానీ మార్క్సిజం ఒక శాస్త్రమని చెబుతున్నప్పుడు, మార్క్సిస్టులు భక్తులు కాదు కదా!
కార్యకర్త: ఇది ఆలోచించాల్సిన విషయమే అయినా, మరీ ఆ పోలికేంటి?
అభిమాని: మరైతే మౌలిక రచనల్ని చదవడం ప్రారంభిస్తే, వాటిలోనే ఈ సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు సమాధానం దొరుకుతుందేమో పరిశీలించండి.
కార్యకర్త: ఈరోజు మార్క్స్‌ జయంతి సందర్భంగా మా పార్టీ కూడా కొన్ని కార్యక్రమాల్ని రూపొందించింది. అవన్నీ పూర్తయ్యాక, మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను.
(పై పోస్టు మీద నా అభిప్రాయాలు దిగువ ఇస్తున్నాను)

అభిమాని – కార్యకర్తల సమన్వయమే మార్క్స్‌
అభిమాని: మన దేశంలో మార్క్స్‌ వారసులు ఎవరు?
కార్యకర్త: ఎక్కడైనా దోపిడీ సమాజాన్ని రూపు మాపాలని చిత్తశుద్దితో పని చేసే వారు, కోరుకొనే వారందరూ వారసులే, వారంతా కమ్యూనిస్టు పార్టీల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అందుకు ఉదాహరణకు లాటిన్‌ అమెరికా దేశాలు, అమెరికాలో, ఇతర చోట్ల మార్పుకోరుకొనే కమ్యూనిస్టేతర వామపక్ష శక్తులు కూడా వారసులే. మార్క్స్‌ వారసత్వానికి పేటెంట్‌ లెప్ట్‌ తప్ప రైట్‌ లేదు.
అభిమాని: మరి మార్క్స్‌ వారసులు ఇన్ని పార్టీల్లో ఎందుకున్నారు?
కార్యకర్త: ఈ ప్రశ్న గురించి చర్చించే ముందు ఒక ప్రశ్న. మార్క్స్‌ను అభిమానించే వారిలో కొందరే కార్యకర్తలుగా, ఎక్కువ మంది అభిమానులుగా ఎందుకు ఉన్నారో ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాలని మనవి. సమాజాన్ని స్ధూలంగా దోపిడీదారులు-దోపిడీకి గురయ్యేవారు అని చూస్తే దోపిడీదారులందరూ ఒకే పార్టీలో ఎందుకు లేరో కూడా ఆలోచించాలి. మార్క్సిజం పిడివాదం కాదు. అది నిరంతరం నవీకరణకు గురయ్యే ఒక శాస్త్రం. అది చెప్పినట్లు దోపిడీ సమాజం అంతం కావటం అనివార్యం తప్ప అది అన్ని చోట్లా ఒకే విధంగా ఒకే సారి జరుగుతుందని ఎక్కడా చెప్పలేదు. అలాంటి జోశ్యాలు కొన్ని తప్పాయి. కమ్యూనిస్టు ప్రణాళికను రాయటానికి ముందే జర్మనీలో, ఇతర దేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు. అది రాసిన లేదా రాస్తున్న సమయంలోనే జర్మనీతో సహా అనేక ఐరోపా దేశాలలో తిరుగుబాట్లు జరిగాయి. వాటిలో కమ్యూనిస్టులు పాల్గొన్నారు గానీ నాయకత్వ పాత్రలో లేరు. జర్మన్‌ కమ్యూనిస్టు లీగ్‌ రెండు భావాల, సంస్ధల సమ్మిళితంగా ఏర్పడిన పార్టీ. ఆ మాటకొస్తే ప్రతి పార్టీ చరిత్రా అదే, స్థూలంగా కొన్ని అంశాలతో ఏకీభవించే వారు దగ్గరయ్యారు. విబేధాలు తలెత్తినపుడు విడిపోయారు. 1836 లో లీగ్‌ ఆఫ్‌ జస్ట్‌ పేరుతో పని ఏర్పడిన క్రైస్తవ కమ్యూనిజం, ఊహావాద కమ్యూనిజం భావాలతో ఉన్న జర్మన్‌ కార్మిక నేత కారల్‌ ష్కాప్పర్‌ నాయకత్వంలో దేవుని రాజ్యం ఏర్పాటు చేయాలనే సత్ససంకల్పంతో పారిస్‌లో ఏర్పడి పని చేసింది. ఈ సంస్ధతో కారల్‌ మార్క్స్‌ మరియు ఎంగెల్స్‌ ప్రధాన పాత్రధారులుగా ఉంటూ బెల్జియంలోని బ్రసెల్స్‌లో పని చేసిన కమ్యూనిస్టు కరస్పాండెన్స్‌ కమిటీ విలీనమై 1847లో కమ్యూనిస్టు లీగ్‌గా మారాయి. హైదరాబాద్‌ ఎలా వెళ్లాలి అని ఎవరినైనా అడిగిత నాలుగు దిక్కుల్లో ఉన్నవారు నాలుగు విధాలుగా చెబుతారు. బస్సుల గురించి తెలిసిన వారు బస్సుద్వారానే వెళ్లాలని చెబుతారు. అలాగే రైళ్లు, విమానాల వారు తమ పద్దతులను చెబుతారు. జర్మన్‌ కమ్యూనిస్టు లీగ్‌ ఏర్పడిన తరువాతే కమ్యూనిస్టు ప్రణాళిక రచన జరిగింది. అందువలన భిన్న ఆలోచనలు, భిన్న మార్గాలతో సమసమాజాన్ని స్ధాపించాలని ఐక్యమైన వారిలో ఎలా సాధించాలి అనే అంశంపై భిన్న అభిప్రాయాలు తలెత్తటం సహజం. అనేక పార్టీలు ఏర్పడటానికి ఇదే మూలం. ఈ మౌలిక అంశాన్ని ఎవరూ విస్మరించలేరు. ఎవరి మార్గం సరైనది అన్నది ఎక్కడికక్కడ ఆచరణలో తేలాల్సి ఉంది. అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఒకే సమయంలో ఉనికిలోకి వచ్చినా అన్ని చోట్లా విప్లవాలు జయప్రదం కాలేదు. అంతెందుకు నిజాం సంస్ధానంలో తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలు ఉన్నాయి. నిజాం దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలుగా ఉన్న ప్రాంతంలోనే సాయుధ పోరాటం ఎందుకు పారంభమైంది. తెలంగాణాలో ఇతర చోట్లకు, మిగిలిన కన్నడ, మరాఠా ప్రాంతాలకు ఎందుకు విస్తరించలేదు. వారికి నిజాంపాలనపై ఎందుకు ఆగ్రహం రాలేదు. ఇలాంటి అంశాలన్నీ అధ్యయనం చేయాల్సినవి. పాఠాలు తీసుకోవాల్సినవి. కమ్యూనిస్టు పార్టీలు కానివన్నీ దోపిడీని కోరుకొనేవే. అలాంటపుడు ఇన్ని రకాల పార్టీలుగా వారంతా ఎందుకు ఉన్నారు ? దోపిడీని అంతం చేయటం ఎలా అన్న అంశంపై కమ్యూనిస్టు పార్టీలలో తేడాలు తెస్తే దోపిడీ చేయటం ఎలా అన్న విషయంలో మిగతా పార్టీల మధ్య అధికార కుమ్ములాటలే అన్ని పార్టీలుగా ఏర్పడటానికి కారణం.

Kisan Long March has given hope to comrades that they can rise ...

అభిమాని: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు అంటే ఏమిటి?
కార్యకర్త: వాటిని అర్ధం చేసుకోవటం అంతకష్టమేమీ కాదు, సమాధానం చెప్పలేకపోతే కుత్తుకలను ఉత్తరించే అపూర్వ చింతామణి ప్రశ్న అసలే కాదు. అమెరికాలో ఉన్న కార్మికవర్గానికి- ఆదిలాబాద్‌ అడవుల్లో ఉన్న కార్మికవర్గ స్ధాయి, అవగాహన ఒకే విధంగా ఉండదు. మన నిచ్చెన మెట్ల సమాజంలో దళిత కార్మికుడి ఆలోచన, దళితేతర కార్మికుల ఆలోచన ఒకే విధంగా ఉండదు. ఇద్దరూ ఒకే ఫ్యాక్టరీలో పని చేస్తూ ఒకే దోపిడీకి గురవుతున్నా, దళితుడికి ప్రత్యేకమైన సామాజిక అణచివేత అదనపు సమస్యగా ఉంటుంది. ఏ దోపిడీని ముందు అంతం చేయాలన్న అంశపై ఏకాభిప్రాయం లేకపోవటమే ఒక సైద్దాంతిక విబేధం.ఇలా అనేక వాస్తవిక అంశాల మీద సమస్యలు తలెత్తాయి. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌కు వ్యతిరేకంగా సోవియట్‌ యూనియన్‌ నిలిచింది. దాని సరసనే బ్రిటన్‌ కూడా పోరాడింది. బ్రిటీష్‌ వారితో విబేధాలున్నా తొలి కార్మిక రాజ్యంతో కలసి పోరాడుతోంది, హిట్లర్‌ ముట్టడి సోవియట్‌ గురైంది కనుక బ్రిటీష్‌ వారికి మద్దతు ఇస్తే అది సోవియట్‌కు బలం చేకూర్చుతుందనే అభిప్రాయంతో క్విట్‌ ఇండియా పిలుపు సమయంలో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారు. ఇది ఒక సైద్దాంతిక సమస్య విబేధం. తరువాత కాలంలో అలా చేయటం తప్పని పాఠం నేర్చుకున్నారు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో కొన్ని తేడాలున్నా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, సోషలిస్టులు మొత్తం మీద ఐక్యంగానే ఉన్నారు. తరువాత దేశంలో ఎలాంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నదాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ కాంగ్రెస్‌ వారే బ్రిటీష్‌ వారి పెట్టుబడులు, కంపెనీలకు రక్షణ కల్పించారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలి అన్న అంశం మీద కమ్యూనిస్టుల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఇవి అర్ధం చేసుకోలేనంతటి తీవ్రమైనవి కాదు. కాస్త పురోగమన భావాలతో అధికారంలో ఉన్నవారికి మరికాస్త ఊపునిస్తే వారే సోషలిజం తెస్తారన్న భ్రమలకు కొందరు లోనై చివరికి వారితోనే కలసిపోయారు. కాదు జనంలో అసంతృప్తి ఉంది, ఒక దగ్గర అంటిస్తే తాటాకు మంట మాదిరి విప్లవం వ్యాపించి అధికారానికి రావచ్చని కొందరు తుపాకి పడితే విప్లవం బదులు పొగ మాత్రమే వచ్చింది. ఈ రెండు ధోరణులతో జనానికి విశ్వాసం తగ్గిపోయింది, రెండు మార్గాలు కాదు మూడో మార్గంలో విప్లవం తేవాలని చెప్పిన వారు ఒక పెద్ద పార్టీగా ప్రత్యామ్నాయం చూపుతున్నా వారి మీద జనంలో విశ్వాసం కలగటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో అధ్యయనం చేయాలి. ఏనుగు ఎలా ఉందని అడిగితే ఏడుగురు అంధులు తాము తడిమిన ఏనుగు అవయవాలను బట్టి దాన్ని భిన్నంగా వర్ణించారు. వారు చెప్పింది వాస్తవమే అయినా ఏనుగు సమగ్ర రూపం కాదు. వివిధ ప్రాంతాలు, పరిస్ధితుల్లోని విప్లవకారుల అవగాహన కూడా అలాంటిదే. అయితే తాము చెప్పిందే ఏనుగు రూపం అని ఎవరికి వారు భీష్మించుకుంటే సమస్య పరిష్కారం కాదు, కలబోసుకొని అవగాహనకు రావాలి.

US govt report says Indian Maoists are world's sixth largest ...
అభిమాని: ఈ తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు మార్క్స్‌ మౌలిక రచనల్లో ఏమైనా సమాధానాలు దొరుకుతాయా?
కార్యకర్త: మార్క్స్‌ ఎంగెల్స్‌లు తమ కాలంలో పరిస్ధితులను అధ్యయనం చేసి కొన్ని రచనలు చేశారు. వాటిలో ఏవైనా ఇప్పటి పరిస్ధితులకు అన్వయించలేము అనుకుంటే వాటిని పక్కన పెట్టవచ్చు. ఆ రచనల్లో సూచన ప్రాయంగా ప్రస్తావించిన అంశాలు కొన్ని ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వారి తరువాత కాలంలో సామ్రాజ్యవాదం మరికొన్ని పాఠాలు నేర్పింది, రష్యా, చైనా విప్లవాలు, మన దేశంలో మూడు చోట్ల కమ్యూ నిస్టుల నాయకత్వంలో ప్రభుత్వాల ఏర్పాటు నుంచి తాజా లాటిన్‌ అమెరికా పరిణామాల వరకు ప్రతిదీ ఒక కొత్త పాఠాన్ని నేర్పేవే. ఒక నాడు హిందూమత దేశంగా ప్రకటించుకున్న నేపాల్‌లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్న చోట అలాంటి పరిణామం జరగలేదు. మన దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చే యత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలకు చెందిన వారిని సమీకరించటం ఎలా, వీటిలో కొన్ని సమాధానాలు ఇస్తుంటే మరికొన్నింటికి వెతకాలి. కావాల్సింది ఓపిక, ఎటిఎం కార్డు పెడితే మిషన్‌ నుంచి డబ్బువచ్చినట్లుగా సమాధానాలు దొరకవు. ఒక మిషన్‌లో ఏ నోట్లు ఎన్ని పెట్టాలో ముందే నిర్ణయం అయి వుంటుంది, నోట్లు కూడా ముందే ముద్రించి పెడతారు. సమస్యలు, వాటికి సమాధానాలు అలాంటివి కాదు. వీటిని కార్యకర్తలే కాదు అభిమానులు కూడా చర్చించవచ్చు, పరిష్కారాలను సూచించవచ్చు. అభిమానులకు ఆ వెసులు బాటు ఇంకా ఎక్కువ.
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చాలా ఉన్నాయి. పోనీ ఇప్పటి వరకూ మీకు తెలిసిన, మీరు చదివిన మార్క్స్‌ రచనలు ఏంటో చెప్పండి?
కార్యకర్త: ఒక కార్యకర్తగా అన్ని మౌలిక రచనలను పూర్తిగా చదవటం సాధ్యం గాకపోవచ్చు. మార్క్స్‌ మౌలిక రచనలు చదివితేనే చాలదు. వాటికి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. వాటిలో కొన్ని తప్పుదారి పట్టించేవి కూడా ఉంటాయి. మార్క్సిజాన్ని ఒక దేశ పరిస్ధితులకు నిర్దిష్టంగా అన్వయించటం ఒక ఎత్తయితే దాన్ని అమలు జరిపే పార్టీ నిర్మాణం కావాలి. లాటిన్‌ అమెరికాలో మార్క్సిస్టు మేథావులు అలాంటి ఎత్తుగడలను రూపొందించి వామపక్ష శక్తులు అధికారానికి రావటానికి తోడ్పడ్డారు. కానీ ఆ విజయాలను పటిష్ట పరచుకొనేందుకు విప్లవాన్ని తీసుకు వచ్చేందుకు అవసరమైన పార్టీ నిర్మాణాలు జరగనందున అనేక ఎదురు దెబ్బలు తిన్నారు. అదొక లోపం. మార్క్సిజానికి సంబంధించి అనేక మౌలిక గ్రంధాలు ఉన్నాయి. ప్రతి సభ్యుడు, అభిమాని వాటిని చదివిన తరువాత కార్యాచరణ మొదలు పెట్టాలంటే జీవిత కాలాలు చాలవు. ఏది ముందు జరగాలి ? అధ్యయనమా ? కార్యాచరణా ? అని తర్కించుకుంటూ కూర్చునే వారు కుర్చీలకే పరిమితం అవుతారు. రెండూ కలగలిపి జరపాలి. పని చేసే క్రమంలో తలెత్తే సమస్యలకు పరిశీలన, అధ్యయనం చేయాలి. పని మాత్రమే చేసి మౌలిక అంశాలను అధ్యయనం చేయకపోతే విబేధాలు, కొత్త సమస్యలు,సవాళ్లు తలెత్తినపుడు గందరగోళపడి రెండింటికీ దూరమౌతారు.

In Defense of Communism: Kisan March
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చదవకుండా, మార్స్కిస్టులమని చెప్పుకోవడం, మార్క్స్‌ కి జేజేలు పలకడం సబబేనా?
కార్యకర్త: ఇది పడక కుర్చీ వాదులు ముందుకు తెచ్చే వాదన. మార్క్సిస్టులం అని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే దాని అర్ధం స్దూలంగా దోపిడీని నిర్మూలించాలనే ఆ సిద్దాంతాన్ని అంగీకరిస్తున్నామని. ఏమీ తెలియని ఒక కార్మికుడు, మహిళ పార్టీలోకి రావాలంటే కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ , ఇతర గ్రంధాలను చదవాలనే షరతు పెట్టటం అర్ధం లేని విషయం. నిరక్షరాస్యులు, అక్షర జ్ఞానం ఉన్నా, సాధారణ పుస్తకాలు కూడా చదవలేని వారెందరో ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో అనేక మంది నిరక్షరాస్యులు కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు సాయుధ దళాల్లో చేరి తరువాత చదువు నేర్చుకున్న వారు, మరింత పదును పెట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడైనా అనేక మంది కనీస నిబంధనలను అంగీకరించి సభ్యులుగా చేరిన వారు ఎందరో సైద్దాంతిక అంశాలను అధ్యయనం చేశారు. దేవాలయాలకు వెళ్లే వారందరూ భగవద్దీతను, సమాజు చేసే వారు ఖురాన్‌, చర్చ్‌లకు వెళ్లేవారందరూ బైబిల్‌ను పూర్తిగా చదవటం లేదు.
అభిమాని: అది మతం, నమ్మేవారు భక్తులు. కానీ మార్క్సిజం ఒక శాస్త్రమని చెబుతున్నప్పుడు, మార్క్సిస్టులు భక్తులు కాదు కదా!
కార్యకర్త: కచ్చితంగా కాదు. పార్టీలో సభ్యులుగా చేరే వారికి ఆయా ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటం అనర్హత కాదు. ఒకసారి పార్టీ సభ్యుడు అయిన తరువాత మతం, దేవుడు, దేవత విశ్వాసాల గురించి అధ్యయనం చేయించి వారిని హేతువాదులుగా, భౌతికవాదులుగా మార్చాలి, శాస్త్రీయ ఆలోచనతో పని చేసేట్లు చూడాలి. ఎక్కడైనా విఫలమైతే అది ఆయా స్ధాయిలో ఉన్న కార్యకర్తల, నాయకత్వ లోపం తప్ప పార్టీలోపం కాదు.
అభిమాని: మరైతే మౌలిక రచనల్ని చదవడం ప్రారంభిస్తే, వాటిలోనే ఈ సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు సమాధానం దొరుకుతుందేమో పరిశీలించండి.
కార్యకర్త: మౌలిక రచనల్లో అన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పలేము. అవి సాధారణ సూత్రీకరణలు వాటిని ఆయా దేశాలు, సమాజాలకు అన్వయించుకోవటంలోనే సమస్యలు వస్తున్నాయి. ముందే చెప్పుకున్నట్లు మన దేశంలో కుల వివక్ష, ఇతర సామాజిక అంశాల గురించి మౌలిక సిద్ధాంతాలలో పరిష్కారం దొరకదు. సైద్ధాంతిక భిన్నాభిప్రాయాలు ఉండటం ఒక మంచి లక్షణం. అంతర్గతంగా కొన్ని అంశాల మీద విబేధించినా కాల క్రమంలో వాటి గురించి అధ్యయనం చేయాలి. ఆచరణలో ఎవరి వైఖరి సరైనదో తేల్చుకుంటారు. అయితే ఒక అంశం మీద విబేధం ఉంది అది పరిష్కారం కాకుండా ముందుకు కదలటానికి వీల్లేదంటే కుదరదు. అది సైద్ధాంతిక సమస్య అయినా, ఎత్తుగడలకు సంబంధించింది అయినా మెజారిటీ అభిప్రాయాన్ని మైనారిటీ అంగీకరించి అమలు జరపాలి. కొన్ని సందర్భాలలో మెజారిటీ కూడా పొరపాటు పడవచ్చు. గుడ్డిగా అనుసరించటం హానికరం. పార్టీలు వేరైనా ఏకీభావం ఉన్న అంశాల మీద కలసి పని చేస్తున్నాం. వాటికి సైద్ధాంతిక సమస్యలను అడ్డంకిగా తేగూడదని భావిస్తున్నాం. ఆ క్రమంలో వాటిని పరిష్కరించుకుంటాం. సైద్ధాంతికంగా విబేధిస్తే వాటిని తర్కం ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ మీరు ద్రోహులు అని ముద్రవేసి ఇతరుల మీద సాయుధదాడులు చేయటం, హతమార్చటం కమ్యూనిస్టుల లక్షణం కాదు. అది వర్గశత్రువుకు ప్రయోజనం, కనుక అలాంటి వారితో చేతులు కలపటం సాధ్యం కాదు.

2011's most memorable images in China - China.org.cn
ఈ రోజు సైద్దాంతిక సమస్యలతో పాటు అసలు మొత్తంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్నే సవాలు చేసే పరిస్ధితులు మరోసారి వచ్చాయి. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్ధకు ఎదురువుతున్న సవాళ్లకు పరిష్కారం మార్క్సిజంలో దొరుకుతుందా అని ఇంతకాలం ఆ వ్య వస్ధ మీద భ్రమలు ఉన్న వారు ఇప్పుడు మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులుపుతున్నారు. అభిమానులుగా బయట ఉండి సలహాలు చెప్పటం మంచిదే. చెరువు గట్టు మీద ఉండి కబుర్లు చెప్పేవారికి దాని లోతు ఎంతో తెలియదు. కనుక చెప్పేది ఎక్కువ అయితే కొందరు బోధకులుగా మారతారు. మీరు కూడా కార్యకర్తగా ఒక్క అడుగు ముందుకు వేయండి, వాస్తవిక సమస్యలు అర్ధం అవుతాయి, విప్లవం మరింత ముందుకు పోతుంది. ఏ పార్టీ మంచిది ఏది సరైన దారి చూపుతుంది అని తేల్చుకొనేందుకు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ముందు కమ్యూనిస్టులు విబేధాలను పరిష్కరించుకురండి అప్పుడు ఆలోచిస్తాం అని కొందరు అభిమానులుగా చెప్పుకొనే వారు అంటారు. అది సానుకూలంగా చెప్పేవారు కొందరైతే ఆ పేరుతో తప్పించుకొనే వారు మరి కొందరున్నారని మాకు తెలుసు. కమ్యూనిస్టులు పోటీ చేసినపుడు అభిమానులం అని చెప్పుకొనే వారు కనీసం ఓటు కూడా వేయని వారిని చూస్తున్నాం. ప్రతికూల పరిస్ధితులు ఎదురైనపుడు తట్టుకొని నిలిచే వాడే కార్యకర్త. అభిమానులు కూడా అలాగే ఉండాలి. పార్టీ మంచి విజయాలు సాధిస్తే ఆహౌ ఓహౌ అనటం, ఎదురు దెబ్బలు తగిలితే మొహం చాటేయటం, నాయకులు ఏదో తప్పు చేశారని అనటం అభిమానుల లక్షణం కాకూడదు. మంచి చెడుల చర్చ ఆరోగ్యకర లక్షణం. అభిమానులు, కార్యకర్తలూ అందరికి అది ఉండాలి.

ఉత్తర కొరియా కిమ్‌పై కొనసాగుతున్న పిట్ట, కట్టుకథలు !

Tags

, , ,

Kim Jong-un 'speaks out' amid death claims, according to North ...

ఎం కోటేశ్వరరావు
ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ కొద్ది రోజులు కనిపించకపోవటం గురించి కట్టు కథలు అల్లి చివరకు ‘చంపేసిన’ మీడియా మే ఒకటవ తేదీన కనిపించిన తరువాత పిట్ట కథలు చెబుతోంది. ప్రపంచంలో అనేక దేశాధినేతలు, మీడియాలో కతలు వండే, చెప్పేవారిని, ఉత్తర కొరియా నుంచి ఫిరాయించి రాజభోగాలు అనుభవిస్తున్న విభీషుణులకు కిమ్‌ తీవ్ర ఆశాభంగం కలిగించారు. ప్రపంచంలో తమకు తెలియని రహస్యం ఉండదు అని విర్రవీగే సిఐఏ వంటి గూఢచార సంస్ధలు జరిగిన దాన్ని చూసి నోళ్లు వెళ్ల బెట్టాయి. అలాంటి పేరు మోసిన సంస్ధలు, జేమ్స్‌ బాండ్‌ వంటి గూఢచారులను కూడా ఉత్తర కొరియా వెర్రి వెంగళప్పలను చేసింది. అవాక్కయిన వారందరూ గుక్క తిప్పుకొని మరో రూపంలో దాడి చేస్తున్నారు. పిట్ట కథలు చెబుతున్నారు.
కిమ్‌ విషయంలో తెలుగు మీడియా కూడా తక్కువ తినలేదు. పోటీలు పడి అమెరికా సిఐఏ, దక్షిణ కొరియా సంస్ధలు, ఉత్తర కారియా వ్యతిరేకులు అందించిన సమాచారంతో కొద్ది రోజుల పాటు ఊహాగానాలతో కాలక్షేపం చేశారు. కొన్ని విదేశీ టీవీలు కిమ్‌ మరణించినట్లు వార్తలు చెప్పేశాయి. మన తెలుగు టీవీ ఉత్సాహవంతులెవరైనా ఆ పుణ్యం కట్టుకున్నారేమో తెలియదు. ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన ఒక మాజీ దౌత్యవేత్త థాయే ఎంగ్‌ హౌ మీడియాను రంజింప చేశాడు. కిమ్‌ నిలబడలేడు, నడవ లేని స్ధితిలో తీవ్రంగా జబ్బు పడ్డాడు అంటూ మే ఒకటవ తేదీకి మూడు రోజుల ముందు చెప్పాడు. అది వాస్తవం కాదని తేలటంతో ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. ఇంతకూ ఈ పెద్ద మనిషి 2016లో దక్షిణ కొరియాకు ఫిరాయించాడు, గత నెలలో పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు.ఉత్తర కొరియాకు సంబంధించిన అంశాలలో ఆకాంక్షలకు అనుగుణ్యంగా కచ్చితమైన విశ్లేషణ చేస్తానని, అంచనాలు వేస్తాననే నమ్మకంతో మీరు నన్ను పార్లమెంట్‌కు ఎన్నుకున్న కారణాలలో ఒకటని నాకు తెలుసు. కారణాలేమైనప్పటికీ నేను ప్రతివారికి ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాను. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బాధ్యత, తప్పు నాదే అని ప్రకటించాడు. కిమ్‌ చావు వార్త గురించి తాను ఎటూ చెప్పలేని కొద్ది రోజుల క్రితం చెప్పిన ట్రంప్‌ అంతర్గతంగా ఎదురు చూశాడని వేరే చెప్పనవసరం లేదు. అయితే మే ఒకటవ తేదీన కనిపించటంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశాడు.

Kim Jong Un resurfaces on state media with mysterious mark on ...
అతనికి ఉన్న సిగ్గు, బిడియం మీడియాకు ఎందుకు లేకపోయింది ? తేలు కుట్టిన దొంగల మాదిరి ఏమీ ఎరగనట్లు కొత్త కథలు అల్లటంలో నిమగమయ్యారు. కిమ్‌కు అసలు ఎలాంటి ఆపరేషన్లు జరగలేదని దక్షిణ కొరియా చెబుతోంది. అయినా సరే కిమ్‌ చేతికి ఒక గాయం మాదిరి కనిపిస్తోందని జర్నలిస్టులు చెబుతున్నారు. తన వ్యతిరేకులను, కట్టు కథలను అల్లిన మీడియా జనాలను వెర్రి వెంగళప్పలను చేయటానికి అలాంటి చిహ్నంతో మేకప్‌ వేసుకొని కావాలని కనిపించేట్లు చేశారేమో ! మరొక ఫిరాయింపుదారు, పార్లమెంట్‌కు ఎన్నికైన జి సెయోంగ్‌ హౌ అయితే మరొక అడుగు ముందుకు వేసి గుండె ఆపరేషన్‌ జరిగిన కిమ్‌ మరణించాడని 99శాతం కచ్చితంగా చెబుతున్నా, మృతి వార్తను అధికారికంగా శనివారం నాడు ప్రకటిస్తారు అని శుక్రవారం నాడు చెప్పాడు. ఇతగాడిని 2018లో అమెరికా పార్లమెంట్‌ ఉభయ సభలలో ప్రసంగించేందుకు ట్రంప్‌ ఆహ్వానించాడు. ఇలాంటి ఫిరాయింపుదార్లందరినీ అమెరికా సర్కార్‌ పెంచి పోషిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ పెద్దమనిషి ఇప్పుడు మీడియాను తప్పించుకు తిరుగుతున్నాడు.
చీకట్లో బాణాలు వేసే ఇలాంటి వారి మాటలను నమ్మి జనానికి మీడియా కట్టుకధలు అందిస్తోందని మరోసారి రుజువైంది. నిజం చెప్పకపోగా ఉత్తర కొరియాతో సంబంధాలను మరింతగా చెడగొట్టినందుకు గూఢచార, రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీల నుంచి వారిని తొలగించాలని అధికార పక్షంలో కొందరు సూచించారు.న్యూస్‌ వీక్‌ వంటి పత్రికల్లో రాసే వారు కూడా ఫేక్‌ న్యూస్‌ను పాఠకుల ముందు కుమ్మరించారు. హయాంగ్‌సాన్‌ రాష్ట్రంలోని మౌంట్‌ కుమగాంగ్‌లో ఒక విల్లాలో కిమ్‌ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని రాసింది. నిజానికి అలాంటి రాష్ట్రం ఉత్తర కొరియాలో లేదు. అది మౌంట్‌ మోయోయాంగ్‌ ప్రాంతంలోని ఒక ఆసుపత్రి పేరు. ఇలాంటి వాటిని చూసి జనంలో నగుబాట్ల పాలౌతారని కామోసు ఒక వ్యాఖ్యాత కిమ్‌ గురించి వార్తలు రాయటం కంటే రాయకపోవటమే మంచిది అని పేర్కొన్నాడు.
క్యూబా ప్రజల ప్రియతమ నేత ఫిడెల్‌ కాస్ట్రోను సిఐఏ లేదా అది కిరాయికి నియమించిన హంతకులు 634 పద్దతుల్లో లేదా అన్ని సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు హాలీవుడ్‌లో ఒక సినిమా కూడా తీశారు. సిఐఏ ఏజంట్లు, వారితో కుమ్మక్కైన వారు పలు దేశాలలో అనేక మంది నేతలను మట్టుపెట్టారు. మీకు కూతవేటు దూరంలో కేవలం 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా అధినేత కాస్ట్రోను ఏమి చేయలేకపోయారు మీ గొప్పల గురించి మాదగ్గర చెప్పకండి అని అమెరికా మిత్రులు బహుశా ఎకసెక్కాలాడి ఉంటారు. అందుకే కసితో అన్ని సార్లు కాస్ట్రోను హతమార్చేందుకు యత్నించి ఉండాలి అనుకోవాల్సి వస్తోంది.అలాగే గత ఏడు దశాబ్దాలుగా ఆసియాలో కొరకరాని కొయ్యగా ఉన్న ఉత్తర కొరియా నాయకత్వాన్ని హతమార్చేందుకు అమెరికన్లు చేయని యత్నం లేదు. కిమ్‌ జోంగ్‌ అన్‌ మీద, తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌, తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ను హత్య చేసేందుకు అమెరికా, దక్షిణ కొరియా సంస్ధలు చేయని యత్నం లేదు. అనేక సార్లు మీడియాలో వారిని బతికి ఉండగానే చంపేశారు.
క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు, కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌, ఆయన కుటుంబ సభ్యులు తమ తమ దేశాల్లో నియంతలు, దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర కలిగిన వారు తప్ప నియంతలు కాదు. ఏ సోషలిస్టు దేశంలోనూ లేని విధంగా ఉత్తర కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌ వ్యక్తి పూజ గురించి, ఆయన తరువాత కుమారుడు, ఆ తరువాత మనుమడికి పట్టం కట్టటం గురించి ఎవరైనా విమర్శలు చేయవచ్చు. కుటుంబవారసత్వం అన్నది అది తప్పా ఒప్పా అన్నది ఆ దేశ పౌరులు తేల్చుకుంటారు, కానీ నియంతలని నిందించటం తగనిపని. అమెరికాకు లొంగని వారందరినీ నియంతలుగానే చిత్రిస్తారు. దాని మద్దతుతో గద్దెలెక్కి జనాన్ని అణచివేసిన నియంతలందరినీ అపర ప్రజాస్వామిక వాదులుగా చూపుతారు. వారితో బహిరంగంగా చేతులు కలపటాన్ని ప్రోత్సహిస్తారు. అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన అనేక సంస్ధలు, వ్యక్తులు కూడా నిఖార్సుగా నిలిచిన సోషలిస్టు దేశాల నేతలు, అంతర్గత విషయాలలో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడూ అదే జరిగింది, ఊహాగానాలు తప్ప ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఫిరాయింపుదార్ల మాటలు నమ్మి ట్రంప్‌ వంటి వారు నగుబాట్ల పాలయ్యారు.
ఏప్రిల్‌ 11న ఉత్తర కొరియా పాలక వర్కర్స్‌ పార్టీ విధాన నిర్ణాయక కమిటీ సమావేశంలో కిమ్‌ పాల్గొన్నారు. పదిహేనవ తేదీన కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదు.ఇరవై ఒకటవ తేదీన అమెరికా నిధులతో దక్షిణ కొరియా నుంచి నడిచే డెయిలీ ఎన్‌కె అనే దినపత్రిక కిమ్‌కు గుండె ఆపరేషన్‌ జరిగినట్లు రాసింది. ఇరవై మూడవ తేదీన కిమ్‌ ప్రయివేటు రైలు ఒక దగ్గర కనిపించిందంటూ కొన్ని చిత్రాలను విడుదల చేశారు, అదే రోజు అక్కడకు చైనా వైద్యులు వచ్చినట్లు కూడా వార్తలను రాశారు. మే ఒకటవ తేదీన ఒక ఎరువుల కర్మాగారంలో జరిగిన మేడే కార్యక్రమంలో పాల్గొన్న కిమ్‌ చిత్రాలు, వీడియోలను విడుదల చేయటంతో పుకార్ల మిల్లుల యంత్రాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫిరాయింపుదార్లు, అమెరికా ఏజంట్లు వ్యాపింప చేసిన వార్తలను తాము నమ్మటం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా, తప్పుడు సమాచారాన్ని ఖండించకపోవటంతో మీడియా రెచ్చిపోయింది. గతంలో ఉత్తర కొరియన్లు ఆకలితో చచ్చిపోతున్నారంటూ మీడియాలో చెప్పిన అంకెలను అన్నింటినీ కలిపితే ఆ దేశ జనాభాను మించి ఉన్నాయి. అసలు దేశమే అంతరించి పోయి ఉండేది. ఎవరికైనా ఇబ్బందులు రావటం వేరు, వాటిని బూతద్దంలో చూపి అంతా అయిపోయినట్లుగా చెప్పటాన్ని ఏమనాలి?

Kim Jong-un Resurfaces, State Media Says, After Weeks of Health Rumors
కిమ్‌ కనపడటం లేదంటూ చావుతో సహా రకరకాల ప్రచారం చేసిన పెద్దలు ఇప్పుడు అవే నోళ్లతో ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పటికీ అధికారంలో ఉన్నాను అని రుజువు చూపేందుకు ఇప్పుడు బయటకు వచ్చారంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక వేళ తనకేదయినా జరిగితే అధికారం కోసం ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, జనం ఎలా స్పందిస్తారో తెలుసుకొనేందుకు కిమ్‌ చావు నాటకం అడారని కొందరు ఇప్పుడు వీక్షకులకు కతలు వినిపిస్తున్నారు. అధికారం కోసం పాకులాడిన వారి తొలగింపు తదుపరి జరగనుందని చెబుతున్నారు. కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇటీవల సోదరుడితో తరచూ కనిపిస్తున్నారని, తదుపరి ఆమే పీఠం ఎక్కవచ్చంటూ గతంలో ప్రచారం చేశారు. ఇతర దేశాల నేతల మాదిరి ప్రతి రోజూ సోషలిస్టు దేశాల నేతలు మీడియాలో కనిపించకపోవటం కొత్తేమీ కాదు.2014లో నలభై రోజుల పాటు కిమ్‌ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. అంతకు ముందు ఆయన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ కొన్ని నెలల పాటు కనిపించని సందర్భం కూడా ఉంది. తన సమీప బంధువు కిమ్‌ కొయోంగ్‌ హురును విషమిప్పించి కిమ్‌ చంపించాడని ఫిరాయింపుదార్లు నమ్మబలికారు. ఆ తరువాత ఆమె చిరునవ్వుతో దర్శనమిచ్చింది. ఉత్తర కొరియాలో ఏమి జరుగుతోందో తెలియదని ఇనుపతెర ఉందని చెబుతారు. అదే నోటితో అమెరికాలోని పెంటగన్‌ లేదా సిఐఏ కార్యాలయాల్లో ఏమి జరుగుతోందో తెలియదని, అక్కడి పాలకులు నియంతలని మీడియాలో ఎందుకు వర్ణించరు? తాము మెచ్చింది రంభ-మునిగింది గంగ అంటే ఇదేనా ?

ఈ నిస్సిగ్గు, పట్టపగలు చమురు దోపిడీ ఇంకెంత కాలం నిర్మలమ్మగారూ ?

Tags

, ,

West Bengal Congress on Twitter: "Our Prime Minister is so busy to ...

ఎం కోటేశ్వరరావు
యాభై మంది ప్రముఖులకు 68వేల కోట్ల రూపాయల రణాల రద్దు గురించి రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు ఆర్ధిక మంత్రి నిర్మలమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మనకైనా అంతే కదా ఉన్నమాటంటే ఊరుకుంటామా ! దేశ పౌరులను తప్పుదారి పట్టించేందుకు సిగ్గు లేని రీతిలో ప్రయత్నిస్తున్నారని చాలా పెద్ద మాట వాడారు. అధికారంలో ఉన్నారు , జనం కాంగ్రెస్‌ను చులకనగా చూస్తున్నారు కనుక ఎంతమాటైనా అంటారు. రుణాల రద్దు అంటే రద్దు కాదు కావాలంటే మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. సరే రాహుల్‌ గాంధీ ఇప్పటికీ పరిణితి లేని కుర్రాడు, కాంగ్రెస్‌ కనుక దాని పూర్వీకులు చేసిన నిర్వాకాలను బిజెపి వారు మీ సంగతేమిటని జనం నిలదీసే వరకు నిందిస్తూనే ఉంటారు- ఆ విషయాన్ని వదలి వేద్దాం.
నిర్మలమ్మ గారు తమ నేత ప్రధాని నరేంద్రమోడీ గారిని అడిగి యావత్‌ దేశానికి చెప్పాల్సిన అంశం గురించి ఇక్కడ చూద్దాం. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయిలో పతనమయ్యాయి. వారి మధ్య సయోధ్య కుదిరిన తరువాత కూడా ధరల పతనం ఆగలేదు. అమెరికాలో చమురు నిల్వ చేసేందుకు ఖాళీ లేకపోవటంతో ఎదురు డబ్బు ఇచ్చి చమురును వదిలించుకోవాల్సి వచ్చింది. చమురు చౌకగా వస్తోంది కనుక కేంద్ర ప్రభుత్వ బిల్లు కూడా గణనీయంగా తగ్గుతుంది.
గతేేడాది డిసెంబరు నెలలో సగటున ఒక పీపాను 66 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడు ధర వినియోగదారుడికి లీటరు పెట్రోలు ఢిల్లీలో 75.14 ఉండేది. 2015లో ఇదే సర్కార్‌ ఏలుబడిలో పీపా 35.68 డాలర్లకు కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ.59.98కి విక్రయించారు. ఇంకాస్త ముందుకు పోతే 2004లో పీపా ధర 34.22 డాలర్లు ఉన్నపుడు రూ.35.71కి దొరికింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక మరియు విశ్లేషణ విభాగం మే ఒకటవ తేదీ నవీకరించిన సమచారం ప్రకారం మార్చినెలలో ఒక పీపా చమురు సగటున మన దేశం 33.36 డాలర్లకు దిగుమతి చేసుకుంది. అది ఏప్రిల్‌ నెలలో 19.9డాలర్లకు పడిపోయింది. శుక్రవారం నాడు ధర 17.23 డాలర్లకు తగ్గింది. ఒక రోజు తగ్గవచ్చు మరో రోజు పెరగవచ్చు. కానీ ఆమేరకు వినియోగదారులకు మార్పులు జరగటం లేదు. మార్చినెల 16 నుంచి మే రెండవ తేదీ వరకు ఢిల్లీలో పెట్రోలు లీటరు రు.69.59 ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశమంతటా ఇదే విధంగా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం ధరల విధానంలో ఏదైనా మార్పులు ప్రకటించిందా అంటే అదేమీ లేదు. మరో పద్దతిలో నిర్మలా సీతారామన్‌ పదజాలంలో చెప్పాలంటే చమురు వినియోగదారులను సిగ్గులేని రీతిలో పట్టపగలే వినియోగదారుల జేబులు కొట్టి వేస్తున్నారు. ప్రభుత్వ చమురు కంపెనీలు దోపిడీ చేస్తూ ప్రయివేటు చమురు కంపెనీలను కూడా దోచుకొనేందుకు వీలు కల్పిస్తున్నాయి. మార్చి 14న కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోలు మీద లీటరుకు మూడు రూపాయల చొప్పున పన్ను పెంచింది. రాబోయే రోజుల్లో మరో ఎనిమిది రూపాయలు పెంచుకొనేందుకు పార్లమెంట్‌లో ముందస్తు ఆమోదం తీసుకుంది. మన పార్లమెంట్‌ సభ్యులు దీనికి ఎందుకు ఆమోదం తెలిపారో అడిగే పరిస్దితి మనకు ఉంటే ఇలా జరిగేదా ?నరేంద్రమోడీగారి అచ్చేదిన్‌లో ఇదేమి దోపిడీ ?

3 reasons why fall in crude prices won't benefit India - Rediff ...
ఇంతగా చమురు ధరలు పడిపోయినా వినియోగదారులకు ఎందుకు తగ్గించటం లేదు ?
చమురు ధరల్లో పెద్దగా తేడాలు లేని రోజుల్లో ప్రతి రోజు ఒక పైసా లేదా రెండు పైసలు తగ్గించిన, పెంచిన రోజులు కూడా ఉన్నాయి. చూశారా మోడీ సర్కార్‌ వినియోగదారుల పట్ల ఎంత నిజాయితీగా ఉందో అని వంది మాగధులు పొగిడారు. ఇప్పుడు అసాధారణ రీతిలో చమురు ధరలు పడిపోయినందున పైసలు కాదు పదుల రూపాయలు తగ్గించాలి. పైసలంటే ఏదో కాని ఇంత పెద్ద మొత్తం తగ్గిస్తామా అన్నట్లుగా ఇప్పుడు సర్కార్‌ వ్యవహరిస్తోంది. గుండెలు తీసిన బంట్లు అంటే ఈ పాలకులేనా ? చమురు ధరలను ఎందుకు తగ్గించటం లేదో చూద్దాం.
1. ఇప్పటికే ధనికులకు ఇచ్చిన రాయితీలు, ధనికులు కావాలని ఎగవేసిన బ్యాంకు రుణాలు రద్దు చెయ్యటం, బ్యాంకులకు ఆ మేరకు ప్రభుత్వం నిధులు సమకూర్చటం. ఈ విధానాల పర్యవసానం ఖజనా గుల్లకావటం, దాన్ని పూడ్చుకొనేందుకు చమురు ధరల రూపంలో అందరి ముందే వినియోగదారుల జేబులు కొల్లగొట్టి లోటును పూడ్చుకొనేందుకు ఈ పని చేస్తున్నారు. మనం ఇంతకు ముందే చమురు దెబ్బలు తినేందుకు అలవాటు పడి చర్మం మొద్దుబారిన కారణంగా ఇదేమీ అనిపించటం లేదు, దీనికి తోడు గృహబందీల మయ్యాం. నోరెత్తితే దేశద్రోహం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ద్రవ్యలోటు జిడిపిలో 3.5శాతానికి మించకూడదు. ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాల కారణంగా ఈ ఏడాది ద్రవ్యలోటు ఏడుశాతం వరకు ఉండవచ్చని ముంబైకి చెందిన స్టాక్‌బ్రోకరేజ్‌ సంస్ధ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏప్రిల్‌13న ఒక నివేదికలో హెచ్చరించింది. మన జిడిపి వృద్ధి రేటు ఒక శాతానికి అటూ ఇటుకు దిగజారవచ్చన్న అంచనాల పూర్వరంగంలో లోటు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. కనుక లోటు పూడ్చుకొనేందుకు ఇదొక మార్గం.
2. చమురు ధరలను తగ్గిస్తే కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయం స్ధిరంగానే ఉంటుంది. ధరల మీద శాతాల ప్రాతిపదికన రాష్ట్రాలు వ్యాట్‌ విధిస్తున్నందున చమురు జారీ ధరలు తగ్గితే రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది.అఫ్‌కోర్సు మిగిలిన రాష్ట్రాలకు సైతం ఉపయోగపడినా మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలోనే ఉన్నాయి కనుక వాటికి ఆదాయం తగ్గకూడదు.
3. గృహబందీ కారణంగా రవాణా రంగం స్ధంభించింది, సాధారణ వినియోగం తగ్గింది, తిరిగి ఎంతకాలం తరువాత పూర్వపు స్ధితి ఏర్పడుతుందో తెలియదు కనుక చమురు రంగంలో ప్రయివేటు కంపెనీలు కూడా ఉన్నందున లావాదేవీలు తగ్గినా లాభాలు తగ్గకుండా చూసేందుకు అధిక ధరలను కొనసాగిస్తున్నారు.
4. రూపాయి విలువ పతనాన్ని నిలబెట్టటంలో కేంద్ర సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏడుశాతం పతనమైంది. రికార్డు స్ధాయిలో 76.92కు పడిపోయింది, 80కి దిగజారవచ్చని అంచనాలు. అదృష్టం ఏమిటంటే దీని వెనుక విదేశీ హస్తం ఉందని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
5. ద్రవ్యలోటును పూడ్చుకొనేందుకు గుడ్ల కోసం బంగారు బాతులను కోయాలని కేంద్రం నిర్ణయించింది. దానిలో భాగంగానే భారత్‌ పెట్రోలియంలో వాటాలను అమ్మి ఈ ఏడాది అరవై వేల కోట్ల రూపాయలను ఖజనాకు జమచేయాలని కేంద్రం నిర్ణయించింది. చమురు ధరలను తగ్గిస్తే ఆ సంస్ధ లాభాలు తగ్గి వాటా విలువపడిపోతుంది. దాంతో తెగనమ్మితే నష్టం కనుక వాటిని అమ్మేంతవరకు కంపెనీకి లాభాలు తగ్గకుండా చూడాలంటే చమురు ధరలను తగ్గించకూడదు. ముందస్తు ధరలకు చమురు కొనుగోలు చేస్తాము. అయితే ఆ ధరలు ఖరారు అయిన తరువాత చమురు ధరలు భారీగా పడిపోయినందున వచ్చే నష్టాలను చమురు కంపెనీలు పూడ్చుకోవాలి కనుక ధరలు తగ్గించటం లేదు. అంతే కాదు ప్రపంచ వ్యాపితంగా శుద్ధి చేసిన చమురుకు డిమాండ్‌ పడిపోయింది. అందువలన శుద్ధి కర్మాగారాలు పూర్తి స్ధాయితో పని చేస్తే చమురు నిల్వ సమస్యలు తలెత్తుతాయి. మన దేశంలో కూడా అదే పరిస్ధితి ఏర్పడింది.తాత్కాలికంగా అయినా అవసరాలకు మించి చమురుశుద్ధి సామర్ద్యం ఉంది. ఈ దశలో డిమాండ్‌ లేనపుడు కంపెనీల వాటాలకు డిమాండ్‌ పడిపోతుంది. ఏనుగు వంటి బిపిసిఎల్‌ను కొనేందుకు ఈ దశలో ఎవరు ముందుకు వస్తారు? కంపెనీ వాటాల అమ్మకపు దరఖాస్తుల గడువును జూన్‌ 13వరకు ప్రభుత్వం గడువు విధించింది. అప్పటికి పరిస్ధితికి ఇంకా దిగజారితే… వేరే చెప్పాల్సిందేముంది ?
6.కేంద్ర ప్రభుత్వం మరో విధంగా కూడా చమురు ధరలతో ఖజనా నింపుతోంది. ఇప్పుడు ధరలు రికార్డు స్ధాయిలో పడిపోయినందున ఎంత ఎక్కువ ముడి చమురుకొని నిల్వచేస్తే ఒక వేళ రాబోయే రోజుల్లో ధరలు పెరిగితే ప్రభుత్వానికి అంతగా లాభం.ఒక వైపు వినియోగం పడిపోతున్నా కేంద్ర సర్కార్‌ చమురు కొనుగోళ్లను పెంచింది. అయితే చమురు ధరలు తగ్గినపుడల్లా వినియోగదారుల పన్ను రేటు పెంచి 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని పొందింది.
మరికొన్ని అంశాలను కూడా చూద్దాం. వర్తమాన ఖాతా లోటు (కరెంట్‌ ఎకౌంట్‌ ) ఇటీవలి కాలంలో మెరుగుపడింది. అయితే రూపాయి విలువ పతనం ఆ మెరుగుదలను దెబ్బతీస్తుంది. మార్చినెలలో మన విదేశీమారక ద్రవ్య నిల్వలు 475బిలియన్‌ డాలర్లు అయితే వాటిలో 300బిలియన్‌ డాలర్లు ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్‌(ఎఫ్‌పిఐ) ఖాతాలోనివే. అంటే విదేశీయులు మన దేశంలోని బ్యాంకుల్లో దాచుకొనే సొమ్ము, మన కంపెనీల వాటాలు, మనకు అప్పులు ఇచ్చిన మొత్తాలు. ఇవి కొన్ని సందర్భాలలో స్పెక్యులేషన్‌ కోసం కూడా వస్తాయి. అప్పులకు ఒక కాల పరిమితి ఉంటుంది తప్ప మిగిలిన వాటికి స్ధిరత్వం ఉండదు, లాభసాటిగా ఉంటే ఉంటాయి లేకపోతే నవారు అట లేదా పుల్ల ఆటగాండ్ల మాదిరి బిచాణా ఎత్తివేస్తాయి. మన వర్తమాన ఖాతా లోటు తగ్గటం అంటే మన విదేశీ మారక ద్రవ్య అవసరాలు తగ్గటం లేదా గణనీయంగా ఆ మొత్తాలు ఉండటం. అలా ఉండటం అంటే ఎప్‌పిఐలను మన ఆర్ధిక వ్యవస్ధ ఆకర్షించే శక్తి పరిమితం అని భావిస్తారు.
చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంటే ధరల పెరుగుదల రేటు పడిపోతుంది. అయినా కేంద్రం పైన చెప్పుకున్న ఇతర కారణాలతో జనానికి ధరలు పెరిగితే మాత్రం ఏం అన్నట్లుగా చమురు ధరలను తగ్గించటం లేదు. పీపా ముడి చమురు ధరలో ఒక డాలరు తగ్గితే లీటరు డీజిల్‌ లేదా పెట్రోలుకు 50పైసలు తగ్గించవచ్చని చెబుతారు. ఇదే కాదు ముడి చమురు నుంచి వచ్చే నాఫ్తా వంటి ఉత్పత్తుల ధరలు కూడా తగ్గి ఎరువుల ధరలను తగ్గించాల్సి ఉంటుంది. కానీ ఎరువుల ధరలు తగ్గించలేదు.

India imports more oil in 5 years of Modi Govt; 10% import cut by ...
గృహబందీ ఏప్రిల్‌ 14వరకు కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం రెండు నుంచి మూడుశాతం మధ్య పడిపోవచ్చని క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ అంచనా వేసింది. దాన్ని ఇప్పుడు మే 17వరకు కేంద్రం పొడిగించింది, తరువాత అయినా ఎత్తివేస్తారన్న హామీ లేదు, కరోనా వ్యాప్తి కేసులు వేగంగా పెరుగుతున్నందున తరువాత కూడా పొడిగించినా ఆశ్చర్యం లేదు. మన దేశంలో 15మిలియన్‌ టన్నుల చమురు నిల్వ సామర్ధ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాము. అయితే ప్రస్తుతం 5.3మిలియన్‌ టన్నులు మాత్రమే నిల్వచేయగలం. మిగతా ఏర్పాట్లు పూర్తి కాలేదు. కనుక ప్రపంచ మార్కెట్లో ఎవరైనా ఉచితంగా ఇస్తామని చెప్పినా మనం చమురు తెచ్చుకోలేని పరిస్ధితి.
తాను వస్తే మంచి రోజులను తెస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ జనం చచ్చేట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత ఎక్సయిజు పన్ను పెట్రోలు మీద 142, డీజిల్‌ మీద 318శాతం పెంచిన విషయం తెలిసిందే. ఇంకా పెంచేందుకు అనుమతి తీసుకున్నారని ముందే చెప్పుకున్నాము.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. ఈ విధానం నుంచి గత కొన్ని వారాలుగా ప్రభుత్వం ఎందుకు వైదొలగిందో, ఎంతకాలం ఇలా అధిక ధరలకు విక్రయిస్తారో ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు ప్రధాని నరేంద్రమోడీని అడిగి చెబుతారా ?
బిజెపి వారు ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చేందుకు పేటెంట్‌ తీసుకున్నారు, అదే ఇతరులు పోలిస్తే దేశద్రోహం, తుకడే తుకడే గ్యాంగులంటూ దాడి చేస్తారు. గత నెల 27న ప్రపంచంలో పెట్రోలు లీటరు సగటు ధర 92 సెంట్లు(డాలరుకు వంద సెంట్లు). మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌లో 60,భూటాన్‌లో 65,నేపాల్లో 79, చైనాలో 83, శ్రీలంకలో 84, మన దేశంలో 95 సెంట్లు కాగా బంగ్లాదేశ్‌లో 105 సెంట్లు ఉంది. బంగ్లా మినహా మిగిలిన దేశాలలో రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో ఆర్ధిక మంత్రి చెబుతారా ? బిజెపి మరుగుజ్జులు ఈ వాస్తవాలను కాదనగలరా ?

ఐఆర్‌ఎస్‌ అధికారులపై వేటు: మోడీ బాబాకు అంత ఆగ్రహం ఎందుకు !

Tags

, , , ,

मोदी सरकार की 20 बड़ी 'उपलब्धियां ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ ప్రపంచం, మన దేశం కూడా అత్యంత కష్టకాలంలో ఉంది. గతంలో ప్లేగు, కలరా వంటి మహమ్మారులు ప్రబలినపుడు జనం పెద్ద సంఖ్యలో దిక్కులేని చావులకు గురైయ్యారు తప్ప ఇంతటి ఆర్దిక విపత్కర పరిస్ధితి బహుశా మన దేశంలో ఇదే ప్రధమం కావచ్చు.
మన దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యవ్యవస్ధ కలిగినది అని చెప్పుకుంటాం. అఫ్‌కోర్స్‌ ఆ వైఖరితో విబేధించేవారిని అనుమతించినంత కాలం అది ప్రజాస్వామిక వ్యవస్ధగానే ఉంటుంది. ఎవరైనా కొత్త ఆలోచనను ముందుకు తేవటం లేదా సూచనలు చేయటం తప్పుకాదు. దాన్ని చర్చించి లేదా చర్చించకుండానే పాలకులు పక్కన పెట్టేయవచ్చు. గతంలో అనేక మంది ఎన్నో విలువైన సూచనలు చేశారు. వాటిని పాలకులు చర్చించకుండానే పక్కన పెట్టారు. పాలకులు చేసిన అనేక ప్రతిపాదనలు, చర్యలను జనం తిప్పికొట్టారు. ఇది ప్రజాస్వామ్య సూత్రం. కానీ అసలు సూచన చేయటమే తలకొట్టివేసే తప్పిదం అన్నట్లుగా ఎవరైనా వ్యహరించటాన్ని ఏమనాలి?
దేశంలో ఇప్పుడు ఏం జరుగుతోంది? అరవైతొమ్మిది వేల కోట్ల రూపాయల పెద్దల రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు స్వయంగా రిజర్వుబ్యాంకే ఒక సమాచార హక్కు అర్జీదారుకు సమాధానమిచ్చింది. ఇదే విషయాన్ని గృహబందీకి ముందు ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రుణాల రద్దు గురించి వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ గాంధీకి రద్దుకు అర్ధం తెలియకపోతే తమ నేత మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకొమ్మని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో యాభై మంది ఐఆర్‌ఎస్‌ అధికారులు కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యల నిమిత్తం ఆదాయం పెంపుదలకు సూచనలు చేసినందుకు ఐఆర్‌ఎస్‌ అసోసియేషన్‌ నేతలుగా ఉన్న ముగ్గురు సీనియర్‌ అధికారుల మీద నరేంద్రమోడీ సర్కార్‌ వేటు వేసింది. ఈ ప్రతిపాదనలు దేశం కొంపను ముంచుతాయన్నట్లుగా చిత్రించింది. కొద్ది మంది కార్పొరేట్లకు, ధనికులకు లక్షల కోట్ల రూపాయల రుణాల రద్దు, రాయితీలు ఇచ్చినపుడు మునగని కొంప వారి నుంచి పన్ను రూపంలో తాత్కాలిక అత్యవసర చర్యగా కొన్ని లక్షల కోట్లు వసూలు చేస్తే ఎలాా మునుగుతుంది ? ఒక చర్యను అడ్డగోలుగా సమర్ధించుకున్న కేంద్రం మరొక చర్య మీద ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
మన ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశంలో మాట్లాడకుండా మౌనవృతంలో ఇప్పటికే ప్రపంచ పాలకుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.కోవిడ్‌-19(కరోనా వైరస్‌) మహమ్మారి విషయంలో మోడీ బాబాగా మారుతున్న తీరు తెన్నులు బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రుల సమావేశాల్లో, ఇతరంగా దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడిన సందర్భాలలో చెప్పిన మాటలు, ప్రవచనాలే అందుకు పెద్ద నిదర్శనం. వాటిని పునశ్చరణ చేస్తే భక్తులకు ఆగ్రహం, అంతకంటే చదువరులకు సమయం దండగ అవుతుంది. గృహబందీ ప్రకటించటం ద్వారా మోడీ తన తెలివి తేటలను అమోఘంగా వ్యక్తపరిచారని,జనం ప్రాణాలను కాపాడారని భజన చేస్తున్నవారి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. చైనాలో మన కంటే రెండు నెలల ముందు అమలు జరిపిన గృహబందీని గుర్తు తెచ్చుకొంటే దాన్నే మన దేశంలో అమలు జరపటం అనితర ఆలోచన, పెద్ద గొప్ప అని ఎవరైనా అంటే ఎందుకు కాదు అని తలవంచుకొని పోవటం తప్ప వారితో వాదించి లాభం లేదు.
భారతీయ జనతా పార్టీ పెద్దలు దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంటారు. తమ మోడీ గనుకే జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలో తేగలిగారని ఊరూ వాడా వాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం ఏడవ స్ధానంలోకి తిరోగమించాం. అంతకంటే దిగజార్చలేదుక కనుక అదీ గొప్పేకదా అంటారేమో, దాన్ని కాసేపు పక్కన పెడదాం. కరోనా వైరస్‌ దాడిని ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ఉద్దీపన పధకాలు ప్రకటిస్తున్నాయి. వాటిలో లోపాల గురించి లేదా కార్పొరేట్‌ రంగానికే పెద్ద పీట అన్న విమర్శలు-వాస్తవాల గురించి కూడా కాసేపు మరచిపోదాం. మన దేశం ఇంతవరకు ప్రకటించిన తక్షణ ప్రత్యక్ష ఉద్దీపన పధకం లక్షా 75వేల కోట్ల రూపాయలు మన జిడిపిలో 0.7శాతం. ఇదే సమయంలో తక్షణ ఉద్దీపన చర్యలకు గాను అమెరికా 9.1, జర్మనీ 6.9, బ్రిటన్‌ 4.5, ఫ్రాన్స్‌ 2.4శాతం ప్రకటించాయి. ఇవిగాక వాయిదా వేసిన, ఇతర ఉద్దీపనలు కూడా కలుపుకుంటే చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న మనం వీటి సరసన ఎక్కడ ఉన్నాం, ఇంత తక్కువ ప్రకటిస్తే మన నాయకత్వాన్ని అంగీకరిస్తాయా ? ఎందుకు మూట ముడి విప్పటం లేదు, ఆ దేశాలకు మల్లే పరిస్ధితి విషమించిన తరువాత విప్పుతామంటారా ? మరోవైపు మన మోడీ గారి దోస్తు ట్రంప్‌ రెండవ పాకేజీ కూడా ప్రకటించారు. ఆయనకేం నవంబరులో ఎన్నికలున్నాయి కనుక రెండు కాదు నాలుగు ప్రకటిస్తాడు, మనకేం ఎన్నికలున్నాయి అంటారా ? అదైనా చెప్పండి, జనం ఆశలేమీ పెట్టుకోకుండా తిరిగి ఎన్నికలు వచ్చే వరకు తమదారి తాము చూసుకుంటారు. అసలు సమస్య ఏమిటి ?
మోడీ బాబా గారు ఇంతవరకు చేసిన ప్రసంగాలు, ప్రకటించిన కార్యక్రమాల్లో మన సంకల్పాన్ని ప్రదర్శించే చప్పుట్లు కొట్టటం, నూనె, కొవ్వొత్తి దీపాలు వెలిగించటం, విద్యుత్‌ దీపాలు ఆర్పించటం, రోజూ చేతులు కడుక్కోవాలనే అంశాలు తప్ప మరొకటేమీ లేవు. కావాలంటే ప్రతి రోజూ చప్పట్లు కొడదాం, దీపాలు వెలిగిద్దాం, సంకల్పాన్ని పదే పదే ప్రకటిద్దాం. కానీ అది చాలదే ! గృహబందీ పొడిగింపు, సడలింపులకు సంబంధించి ముఖ్యమంత్రులతో మాట్లాడటం తప్ప ప్రధాని నరేంద్రమోడీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇతరంగా ఆర్ధిక పరిస్ధితి గురించి సూచనలు, సలహాలను కోరుతూ ముఖ్యమంత్రులతో లేదా ఇతరులతో ఎలాంటి ప్రత్యేక వీడియో సమావేశాలను నిర్వహించలేదు, సూచనలు పంపాలని కోరలేదు. మన ఖజానా పరిస్ధితి ఇలా ఉంది ఏం చేద్దామని అడిగితే కేంద్రానికి పోయేదేముంది ?
ఇక బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని కావాలని ఎగవేసిన యాభై సంస్ధల పెద్దలకు దాదాపు 69వేల కోట్ల రూపాయలను గతేడాది సెప్టెంబరు నాటికి రద్దు చేసినట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది. ఇలాంటి మొత్తాలు దాదాపు ఎనిమిది లక్షల కోట్లు, ఇంకా ఎక్కువే ఉంటాయి. అయితే సాంకేతిక భాషలో చెప్పాలంటే వీటిని సాంకేతికంగా రద్దు చేయరు. వసూలు చేయాల్సిన పారు బాకీల కింద రోజువారీ చిట్టాల నుంచి తొలగించి తరువాత వసూలు చేసే ఖాతాలో చూపుతారు. అయితే మన ”సమర్ధ ” ప్రధాని మోడీ గారి ఏలుబడిలో ఈ మొత్తంలో ఎంత వసూలు చేశారన్నది ముఖ్యం. గత పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులను రద్దు చేస్తే ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు సెలవిచ్చినదాని ప్రకారం కేవలం ”పక్కన పెడితే ” దానిలో 80శాతం నరేంద్రమోడీగారి ఏలుబడిలోనే జరిగింది. ఇవన్నీ ప్రతిపక్షాల బుర్రలో పుట్టినవి కాదు, రిజర్వుబ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారమే నండోరు.కాంగ్రెస్‌ ఏలుబడిలో కావాల్సిన వారికి అప్పులు ఇప్పించారని చెప్పిన బిజెపి వారు అలాంటి కాంగ్రెస్‌ అనుకూలుర నుంచి గోళ్లూడగొట్టి ఎందుకు వసూలు చేయలేదు ? మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు వంటి వారందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరటమే దీనికి కారణమా ? పక్కన పెట్టిన (రద్దు చేసిన) బాకీలను వసూలు చేస్తున్నామని బ్యాంకులు, ప్రభుత్వం చెబుతోంది. ఎన్ని లక్షల కోట్లు పక్కన పెట్టారు, ఎన్ని లక్షల కోట్లు వసూలు చేశారో ఎవరికైనా చెబుతున్నారా ? పది హేను నుంచి 20శాతం వరకు మాత్రమే వసూలు శాతం ఉందని ఒక అంచనా, దాని ప్రకారం, నరేంద్రమోడీ తొలి ఏలుబడిలో రద్దు చేసినట్లు చూపిన 5,55,603 కోట్లకు గాను కనిష్టంగా 80వేల కోట్లు, గరిష్టంగా అయితే లక్షా పదివేల కోట్లకు మించి లేవు, అంతకు ముందు రద్దు చేసిన మొత్తంతో సహా ఏడులక్షల కోట్లనుకుంటే లక్షా40వేల కోట్లకు మించి తేలటం లేదు. విజయమల్య తాను చెల్లిస్తాను మహాప్రభో అంటున్నా తీసుకోవటం లేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతకాలం వసూలును సాగదీస్తారు. వీరికి- వారికి పర్సెంటేజ్‌లు ఇంకా కుదరలేదా అని జనం అనుకుంటున్నారు.
బడా బడా బాబులకు వేల కోట్ల రుణాలు రద్దు చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు అది రద్దు కాదు, కావాలంటే మీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకో అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్ల మీద ట్వీట్లతో సమాధానమిచ్చారు. అమ్మా నిర్మలమ్మా మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమే అనుకుందాం. అదే రీతిలో అనేక అంశాలకు మీరు కూడా నరేంద్రమోడీ గారిని అడిగి తెలుసుకొని జనానికి చెప్పాలమ్మా ? మచ్చుకు ఒక్కటి, నెలన్నరగా పెట్రోలు, డీజిలు రేట్ల సవరణ చేయకపోవటాన్ని ఏమనాలో కాస్త చెబుతారా ? అసలే ఉపాధిపోయి, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న జనాన్ని లాక్‌డౌన్‌ సమయంలోనూ బాదటం లేదా, జేబులు కొల్లగొట్టటటాన్ని ఏమనాలి? గృహబందీకి ముందు చివరిగా మార్చి16న పెట్రోలు, డీజిలు రేట్లను సవరించారు. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి సవరణ లేదు, ఈ మధ్య కాలంలో రికార్డు స్ధాయిలో ముడి చమురు రేట్లు పడిపోయాయి. అంతర్జాతీయ రేట్లు తగ్గితే తగ్గింపు, పెరిగితే పెంపు విధానం ప్రకారం ప్రతి రోజూ సవరిస్తామన్నారు కదా గత నెలన్నరగా ఎందుకు నిలిపివేశారు ? చమురు బిల్లు తగ్గింది, జనం దగ్గర వసూలు పెరిగింది, పోనీ ఆమేరకైనా జనానికి సంక్షేమ చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. డబ్బు పోగేసి ఎవరికి ధారాదత్తం చేయాలనుకుంటున్నారు, గతంలో కార్పొరేట్లకు ప్రకటించిన రాయితీలను ఈ విధంగా జనం నుంచి వసూలు చేస్తున్నారా ? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
తొలిసారి ప్రకటించిన నామమాత్ర పాకేజి తప్ప మరోసారి ఆలోచన లేదని అన్ని తరగతుల నుంచి విమర్శలు వెల్లువెత్తినా దున్నపోతు మీద వానకురిసినా మిన్నకున్నట్లు ఏమీ మాట్లాడరు. ఐఆర్‌ఎస్‌ అధికారులు ఒక సలహా చెబితే వారినేతలను ఉద్యోగాల నుంచి పక్కన పెట్టి మీ మీద ఇతర చర్యలు ఎందుకు తీసుకో కూడదో సంజాయిషీ ఇవ్వండని నోటీసులు ఇచ్చారు. ఇదెక్కడి విపరీతం ? వారు తయారు చేసిన సిఫార్సుల పత్రాన్ని ప్రధాని, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు డైరెక్టర్లకు, ఆర్ధికశాఖకు పంపారు. అదే ప్రతిని మీడియాకు విడుదల చేశారు. యువ అధికారులను తప్పుదారి పట్టించారని, ఆ సూచన పత్రాన్ని అనుమతి లేకుండా బహిరంగ పరిచారు కనుక అది ఉద్యోగ నిబంధనలను అతిక్రమించటమే అంటూ ఈనెల 27వ తేదీలోగా రాతపూర్వకంగా లేదా స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు అధికారులను బాధ్యతల నుంచి తొలగించింది. ఈశాన్య ప్రాంత దర్యాప్తు విభాగం ముఖ్య డైరెక్టర్‌ సంజరు బహదూర్‌,ఐఆర్‌ఎస్‌ అధికారుల అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి,డిఓపిటి డైరెక్టర్‌ శ్రీ ప్రకాష్‌ దూబే, ఢిల్లీ ఆదాయపన్ను ముఖ్య కమిషనర్‌ మరియు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అయిన ప్రశాంత భూషణ్‌ మీద చర్య తీసుకున్నారు. వారు చేసిందేమిటి ?
ప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ నోటీసు ప్రకారం దూబే, బహదూర్‌ ఆదాయపెంపుదల గురించి ఒక నివేదికను తయారు చేయమని తమ జూనియర్‌ అధికారులను కోరారు. ఆ నివేదికను ప్రశాంత భూషణ్‌ బహిర్గతం చేశారు. ఈ చర్యలు అనుమతి లేనివి, తమ విధులను పక్కన పెట్టి ఇతర పనులు చేయటంగా, ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకమైనవి వర్ణించారు. యువ అధికారులు తయారు చేసిన ఈ సూచనలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని ఉండేది, కానీ ఈ ఉదంతంలో అధికారిక పద్దతుల్లో ప్రభుత్వానికి పంపకుండా బహిరంగ పరచటంతో ఇప్పటికే ఆర్ధిక వ్యవస్ధ వత్తిడికి గురైన స్దితిలో ఈ నివేదిక భయాందోళనలను, పన్ను విధాన అనిశ్చితి పరిస్ధితిని కలిగించిందన్నది ప్రభుత్వ పెద్దల వాదన. ఈ నివేదిక వివరాలు బయటకు వచ్చిన తరువాత భయంతో ఏ ఒక్క పారిశ్రామిక, వాణిజ్యవేత్త లేదా ఇతర ధనికులు భయంతో ఆత్మహత్యల వంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడినట్లు ఎలాంటి వార్తలు లేవు. ఏ విదేశీ కంపెనీ కూడా మన దేశం నుంచి బయటకు పోతామని, ఏ స్వదేశీ సంస్ధ కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించలేదు. కోట్లాది మందికి ఉపాధిపోయినా, వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఆందోళనకు గురైనా, రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురైనా చీమ కుట్టినట్లుగా కూడా లేని కేంద్ర సర్కార్‌ ఈ ప్రతిపాదనల మీద ఎందుకు అంతలా వణికిపోయినట్లు ? అదృష్టం కొద్దీ వారు నివేదికను బహిర్గతం చేసిన సమయంలో మార్కెట్‌లు మూతపడి ఉన్నాయట. అతిశయోక్తి గాకపోతే స్టాక్‌ మార్కెట్‌ ఆ నివేదికకు ముందు ఎన్నివేల పాయింట్లు పతనమైందో జనానికి తెలియదా ? మరి దానికి కారకులెవరు ?
ఐఆర్‌ఎస్‌ అధికారులేమీ ధనికుల ఆస్ధులను స్వాధీనం చేసుకోమని చెప్పలేదే, కోటి రూపాయలకు పైబడిన ఆదాయం వస్తున్నవారి మీద ఆదాయపన్ను 40శాతం విధించాలని, నాలుగుశాతం కోవిడ్‌-19 సెస్‌ విధించాలని, ఐదు కోట్ల రూపాయలకు పైబడిన సంపదలు కలిగిన వారి మీద సంపద పన్ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సంఘపరివార్‌ ప్రమాణాల ప్రకారం చూసినా ఇదేమీ దేశద్రోహం కాదు, సూచనలు చేసిన వారు తుకడే తుకడే గ్యాంగు అసలే కాదు, పోనీ వారు చెప్పినట్లు వసూలు చేస్తే వచ్చే సొమ్ము పాకిస్ధాన్‌ లేదా అది పంపే ఉగ్రవాదులకు పోయేది కాదు. సామాన్యులు, మధ్యతరగతి వారి నుంచి ఎంత వీలైతే అంత పిండి కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు గత ఐదు సంవత్సరాలుగా అనుసరిస్తున్న పెద్దలకు దానికి భిన్నమైన ఇలాంటి ప్రతిపాదనలు కేంద్ర సర్వీసు ఉన్నతాధికారుల నుంచి రావటం మింగుడు పడలేదు. ఆగ్రహానికి కారణం ప్రతిపాదనలు చేసినందుకు కాదట, వాటిని బహిర్గత పరచినందుకట. ప్రతి రోజూ కేంద్రానికి ఇలాంటి అనేక ప్రతిపాదనలు వస్తుంటాయి, ఇంతవరకు ఎన్నింటిని బయట పెట్టారు. బహుశా తమ ప్రతిపాదనలు కూడా అలా బీరువాలకే పరిమితం అవుతాయని, బహిరంగ పరిస్దే చర్చిస్తారని భావించి బహిర్గత పరచి వుండవచ్చు. ఇలాంటి ప్రతిపాదనల మీద చర్చ జరిగితే లేదా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే ధనికులకు ఆగ్రహం కలుగుతుంది. అవును, ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో తాత్కాలికంగా కొంత కాలం అయినా ఎందుకు అమలు జరపరు అని కాస్త బుర్ర ఉన్న జనంలో చర్చ జరుగుతుంది. వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం ఎంత జరిగినా పర్లేదు గానీ ఇలాంటి అంశాలు జనం మెదళ్లలోకి ఎక్కితే దాన్ని ” నయా లేదా కాషాయ దేశ భక్తులు ” తట్టుకోలేరు. అందుకే తమదైన శైలిలో ఐఆర్‌ఎస్‌ అధికారులను కొందరు అర్బన్‌ నక్సల్స్‌ అని నిందిస్తూ పోస్టులు పెట్టారు. ఎంత దుర్మార్గం ?
దేశంలోని 140 కోట్ల మంది జనాభాకు కోటీ 75లక్షల కోట్ల మేరకు ఉద్దీపన ప్రకటించిన కేంద్రం,అంతకు కొద్ది వారాల ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు లక్షా 45వేల కోట్ల రూపాయల పన్ను రాయితీ తగ్గించిన విషయం మరువగలమా ? కొత్త పరిశ్రమలకు పన్ను రేట్లు తగ్గించారు. ఆ విధానాన్ని ఐఆర్‌ఎస్‌ అధికారులు తప్పు పడుతూ బజారుకెక్కితే అది ఉద్యోగ నిబంధనలకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కనుక చర్య తీసుకున్నామంటే అర్ధం ఉంది. వారా పని చేయలేదే ! దేశం, ప్రపంచం యావత్‌ ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ఎదుర్కొంటున్న సమయంలో ఉద్యోగా మరొకరా అన్నదానితో నిమిత్తం లేకుండా సూచనలు చేయటాన్ని కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్ధ అంగీకరించదా ?దీన్ని ప్రజాస్వామ్యం అనాలో నియంతృత్వం అని వర్ణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.

baba ji ka thullu by modi
నూరు పూవులు పూయనివ్వండి, నూరు ఆలోచనలను తర్కించనివ్వండి ఇది చైనాలో మావో ఇచ్చిన ఒక ఉద్యమ పిలుపు. చైనా ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలను, విధానాల మీద సవిమర్శలను వ్యక్తం చేయనివ్వాలన్న కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మావో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.(కొందరు నూరు పూవులు పూయనివ్వండి, వెయి ఆలోచనలను వికసించనివ్వండి అని కూడా దీన్ని వర్ణించారు. దీనిలో కూడా తప్పులేదు). అలాంటి ఆలోచనలను ఆహ్వానించిన కారణంగానే నేడు ప్రపంచంలో రెండవ ధనిక దేశంగా చైనా ఎదిగింది. సరే కొందరు కమ్యూనిస్టు నియంతృత్వం అని ఆరోపించే వారు, అది నిజమే అని నమ్మేవారు ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. ఇది చైనా వ్యవహారం కనుక పక్కన పెడదాం. మన దేశం విపత్కర పరిస్ధితుల్లో ఉన్నపుడు ఆదాయ పెంపు సూచనలు చేస్తే వాటితోనే దేశ ఆర్ధిక వ్యవస్ధ తలకిందులై పోతుందన్నట్లుగా భయపడటం అంటే గత ఐదేండ్లలో మన పెరుగుదల వాపా, బలుపా ?

కరోనా ”మందు” రెమిడెసివిర్‌ -కందకు లేని దురద కత్తి పీటలకా !

Tags

, ,

Gilead says Remdesivir trial posted online prematurely was ...

ఎం కోటేశ్వరరావు
చైనాకు వ్యతిరేకంగా ఏ చెత్తను మార్కెట్లో పెట్టినా ఆమ్ముడవుతుందా ? కొన్ని మీడియా సంస్ధలు అలాంటి చెత్త వార్తలను అమ్మి సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయా ? ఏమో ! చైనా ” మందు ” జాగ్రత్త అనే శీర్షికతో ఒక ప్రముఖ తెలుగు పత్రిక సోమవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. తప్పుడు వార్తలు రాసేందుకు, రాయించేందుకు కూడా ” సమగ్రశిక్షణ ” అవసరం అని కాస్త జాగ్రత్తగా చదివిన వారికి అర్ధం అవుతుంది. ఇంతకూ ఏమిటట?
జనవరి 20న కరోనా వ్యాప్తిపై ప్రకటన, తరువాతి రోజే రంగంలోకి ” వూహన్‌ లాబ్‌ ”, రెమ్‌డెసివిర్‌ ఔషధం పేటెంట్‌కు దరఖాస్తు. ఈ అంశాల మీద ఆ కథను అల్లారు. వైరస్‌ వ్యాప్తి గురించి ఆరు రోజుల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వమే మోకాలడ్డిందని ఇంకా ఏవేవో రాసిన వాటిని పునశ్చరణ చేయనవసరం లేదు. దీనర్ధం ఏమంటే వైరస్‌ పరిశోధనలు చేస్తూ దాన్ని ఒక పధకం ప్రకారం బయటకు వదలిన చైనాలోని వూహాన్‌ వైరాలజీ సంస్ధ దాని నిరోధానికి అవసరమైన ఔషధాన్ని కూడా ముందే తయారు చేసి పెట్టుకుందని జనాల బుర్రలకు ఎక్కించే యత్నమే.
ఈ వార్తను లండన్‌ నుంచి ప్రచురితమయ్యే డెయిలీ మెయిల్‌ డాట్‌కామ్‌ 25వ తేదీ బిఎస్‌టి(బ్రిటీష్‌ సమ్మర్‌ టైమ్‌) రాత్రి పది గంటలకు ప్రచురించింది. దానికి మనం నాలుగున్నర గంటలను కలుపుకుంటే మన సమయం రాత్రి రెండున్నర అవుతుంది. ఆ వార్త లేదా ఏదైనా ఏజన్సీ వార్తను గానీ తీసుకొని పైన చెప్పిన కథను వండి వడ్డించి ఉండాలి. దాని సంగతి తరువాత చూద్దాం. ముందుకొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోక తప్పదు. చైనా గురించి మీడియాలో వచ్చేది, దాని వ్యతిరేక దేశాల నేతలు, శాస్త్రవేత్తలు చెప్పేదంతా నిజమే అని నమ్మేవారు నమ్మవచ్చు. అలా నమ్మకాన్ని ఖరారు చేసుకొనే ముందు భిన్న కథనాలు కూడా ఉన్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సవినయ వినతి. అవన్నీ ఎక్కడ కుదురుతాయి… మా వీనులకు విందు, చెవులకు ఇంపుగా ఉండేది, బుర్రకు కిక్కునిచ్చేదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం అనే వారి నిజాయితీకి జోహార్లు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రకటనలు బయటకు రాగానే చైనా గూఢచారులు కెనడా లాబ్‌ నుంచి అపహరించి వూహాన్‌ లాబ్‌ నుంచి బయటకు వదిలారు, చైనా ప్రమాదకర జీవ ఆయుధాలను తయారు చేస్తోంది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజంగా బయటకు వదల దలచుకొంటే కెనడా లాబ్‌ నుంచే చైనా గూఢచారులు బయటకు పంప వచ్చు కదా ! దున్న ఈనిందంటే ముందు దూడను గాటన కట్టేయమన్నట్లుగా చాలా మంది నమ్మేశారు. నిజంగానే ఎవరైనా ఒక వైరస్‌ను బయటకు వదిలితే దానికి సరిహద్దులు,దేశాలు, రంగు బేధాల తేడాలుండవు, ఎక్కడ అనువుగా వుంటే అక్కడకు పాకి తన ప్రభావం చూపుతుందనే లోకజ్ఞానం ఈ సందర్భంగా పని చేసి ఉంటే ఇప్పుడు కరోనా ప్రళయ తాండవానికి కకావికలౌతున్న దేశాలన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉండేవి. లక్షలాది ప్రాణాలను కాపాడేవి. కొంత మంది కావాలని కాదు గానీ ప్రమాదవశాత్తూ బయటకు వచ్చి ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతూ నమ్మింపచేసేందుకు ప్రయత్నించారు. ప్లేగు, మసూచిని కావాలని అంటించిన దేశాలను, రసాయన బాంబులు, గ్యాస్‌లో జనాన్ని మట్టు పెట్టిన దుర్మార్గాన్ని ప్రపంచం చూసింది. ఒక వైరస్‌ను సృష్టించి వదలిన దేశం గురించి చరిత్రలో నమోదు కాలేదు. కొన్ని అనుమానాలు వ్యక్తం అయినా ఎక్కడా రుజువు కాలేదు. ఒక కొత్త వైరస్‌ తొలుత ఎక్కడ బయటపడితే దాన్ని ఆదేశమే తయారు చేసింది అనే నిర్ధారణకు వచ్చేట్లయితే ఆ వరుసలో చైనా కంటే ముందు అనేక దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి ఇంతకు ముందే తెలుసు. తాజాగా తలెత్తిన కోవిడ్‌-19 వైరస్‌ కొత్తరకం అని కృత్రిమ సృష్టి కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ, అనేక మంది ఆ రంగంలో పని చేస్తున్నవారు ప్రకటించినా, కొందరు పని గట్టుకొని చేస్తున్న ప్రచారానికి మీడియా ఎలాటి విమర్శనాత్మక దృష్టి లేకుండా ఏకపక్షంగా ప్రాధాన్యత ఇస్తోంది.
రెండవ అంశం ఈ వైరస్‌ను అమెరికన్లే తయారు చేసి తమ దేశం మీద ప్రయోగించినట్లు అనుమానిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఒక విమర్శ చేశాడు. అమెరికా మిలిటరీ దాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు. అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న ఫోర్ట్‌ డెట్‌రిక్‌ అమెరికా మిలిటరీ లాబ్‌ నుంచి వైరస్‌లు బయటకు రాకుండా నివారించేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు లేనందున ఏడాది క్రితమే దాన్ని మూసివేశారని వెంటనే వార్తలు వచ్చాయి. అయితే తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశారు తప్ప మూసివేయలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రకటించింది.
ఇక రెమిడెసివిర్‌ ఔషధం కధను చూద్దాం. కరోనా వైరస్‌ కొత్తది కాదు, గతంలోనే గుర్తించారు. దానిలో అనేక రకాలు ఉన్నాయి. తాజాగా తలెత్తినదానిని కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. గతంలో తలెత్తిన కరోనా వైరస్‌, ఇతర వైరస్‌లకు వ్యాక్సిన్‌లు, ఔషధాలు తయారు చేసే సంస్ధలు ఎన్నో గతంలోనే పేటెంట్లకు దరఖాస్తులు చేశాయి. అంటే అవి ముందే మందులను తయారు చేసి వైరస్‌ను ఇప్పుడు సృష్టించాయని భావించాలా ? కుట్ర సిద్దాంతాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే కోవిడ్‌-19ను అమెరికానే సృష్టించిందని అనుకోవాలి? అది అలాంటి ప్రయత్నాలు చేయకపోతే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్‌ కంపెనీ నాలుగు సంవత్సరాల క్రితమే కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెసివిర్‌ను అనుమతించాలని పేటెంట్‌కు దరఖాస్తు ఎందుకు చేసినట్లు ? ప్రపంచ వ్యాపితంగా వినియోగించేందుకు నాలుగు సంవత్సరాల క్రితమే దరఖాస్తు చేసినట్లు గిలీడ్‌ కంపెన చెప్పినట్లు డెయిలీ మెయిల్‌ రాసింది. కోవిడ్‌-19కు అది పని చేస్తుందని తేలితే భవిష్యత్‌లో సరఫరా చేసేందుకు గాను ప్రస్తుతం చికిత్సలో దాని పని తీరును నిర్ధారించుకునే పనిలో ఉన్నామని గిలీడ్‌ చెబుతోంది. నిజానికి ఆ ఔషధాన్ని ఎబోలా వైరస్‌కోసం గిలీడ్‌ తయారు చేసింది. ఇది కరోనాకూ పని చేస్తుందేమో అని అది నిర్ధారించుకుంటోంది. అదే ఔషధం తయారీకి తమకు పేటెంట్‌ ఇవ్వాలని ఊహాన్‌ వైరాలజీ సంస్ధ జనవరి 21న దరఖాస్తు చేసిందట. అది నిజంగా కరోనా కోసమో కాదో తెలియదు, కరోనా కోసమే అయితే ఏ తరగతి కోసమో అంతకంటే తెలియదు, దరఖాస్తులోని వివరాలు ఏడాది తరువాత గానీ బయటకు రావు. అలాంటిది ముందే కరోనా మందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు ఏ ఆధారాలతో రాస్తారు ? ఒక వేళ నిజంగానే రెమ్‌డెసివిర్‌కు చైనా సంస్ధ దరఖాస్తు చేస్తే అంతకు ముందే ఉన్న గిలీడ్‌ కంపెనీకి ఇవ్వకుండా చైనా సంస్ధకు ఎలా ఇస్తారు ? నిజంగా ఆ ఫార్ములాను ఎవరైనా తస్కరిస్తే మరొక పేరుతో దరఖాస్తు చేస్తారు తప్ప అదే పేరుతో ఎలా చేస్తారు ? మరీ అంత అమాయకంగా ఎవరైనా ఉంటారా ? ఎప్పుడో నాలుగేండ్ల క్రితం దరఖాస్తు చేసిన దానికే ఇంతవరకు అనుమతి రాకపోతే జనవరిలో చేసిన దానికి వెంటనే అనుమతి ఎలా వస్తుంది ? ఇదంతా చూస్తే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు గిలీడ్‌ కంపెనీ తాపీగా ఉన్నా జర్నలిస్టులు కొందరు గోక్కుంటున్నారు.
ఇక రెమ్‌డెసివవిర్‌ గత కొద్ది వారాలుగా వార్తల్లో ఉంది. ఆ ఔషధాన్ని తయారు చేశారు గానీ ఎక్కడా ఉత్పత్తి చేయటం లేదు. ఎబోలా కోసం తయారు చేసిన దానిని ఇప్పుడు కరోనాకు ఉపయోగపడుతుందేమో చూద్దాం అన్నట్లుగా గిలీడ్‌ కంపెనీ ఉంది.కోవిడ్‌-19 రోగులు 63 మంది మీద ప్రయోగిస్తే 36 మందికి కాస్త గుణం కనిపించిందని, ఇంకా ప్రయోగదశలోనే ఉందని, ప్రపంచంలో ఎక్కడా చికిత్సకు అనుమతించలేదని కంపెనీ సిఇఓ డేనియల్‌ ఓడే ఏప్రిల్‌ 10న ప్రకటించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త పేర్కొన్నది.ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఫలితాలు వెల్లడైన తరువాత వినియోగం గురించి పరిశీలిస్తామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) శాస్త్రవేత్త రామన్‌ గంగా ఖేద్‌కర్‌ చెప్పారు. 2015లో ఇదే కంపెనీ తయారు చేసిన హెపటైటిస్‌ సి ఔషధం గురించి చేతులు కాల్చుకున్న ఐసిఎంఆర్‌ అంత రెమ్‌డెసివర్‌ గురించి ఆసక్తి ప్రదర్శించటం లేదని కూడా వార్తలు వచ్చాయి. పనికి వచ్చేట్లయితే జనరిక్‌ ఔషధం తయారు చేసేందుకు గిలీడ్‌ కంపెనీ స్వచ్చందంగా అనుమతిస్తే తయారు చేయవచ్చని కొందరు అంతకు ముందు ఆలోచన చేశారు. మరికొన్ని వార్తల ప్రకారం ఇదే ఔషధంపై చైనాలోని రెండు ఆసుపత్రులలో 28 మగ చిట్టెలుకల మీద ప్రయోగాలు జరపగా వాటిలో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు, అసహజత పెరిగినట్లు ప్రాధమిక పరశీలనల్లో వెల్లడైంది.దీని గురించి ఎలాంటి నిర్దారణలకు ఇంకా రాలేదని ఏప్రిల్‌ 23న ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఇలాగే అమెరికా, బ్రిటన్‌, మరికొన్ని దేశాలలో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కోవిడ్‌-19కు పని చేయదని తేలినట్లు గిలీడ్‌ కంపెనీ గతశుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపిందని కూడా వార్తలు వచ్చాయి.
చైనా దరఖాస్తు గురించి తమకు తెలుసునని, అయితే వచ్చే ఏడాది ఆ వివరాలను ప్రచురించేంత వరకు దాని గురించి తామేమీ చెప్పలేమని గిలీడ్‌ చెప్పింది. ఎబోలాకు తయారు చేసిన తమ ఔషధం కరోనాకు పనికి వస్తుందా లేదా అన్న అధ్యయనాన్ని నిలిపివేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక కంపెనీ తయారు చేసిన దాన్ని మరొక దేశంలో పేటెంట్‌ కోరినా మంజూరు కాదు.గిలీడ్‌ కంపెనీ తమ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఫిర్యాదు అయినా చేసి ఉండేది, ఒక వేళ అదే నిజమైతే ఈ పాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ కంపెనీ తయారు చేసిన దాన్ని చైనా తస్కరించిందని ఈ పాటికే నానా యాగీ చేసి ఉండేవాడు. బహుశా ఈ ఔషధ ప్రయోగాల గురించి చెప్పి ఉంటే అది నిజమని నమ్మి కొద్ది రోజుల్లో వాక్సిన్‌ తయారు చేయాలని రెండు నెలల క్రితం ట్రంప్‌ బహిరంగంగా విలేకర్ల సమావేశంలో చెప్పాడని అనుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌ -19 చికిత్సకోసం అమెరికా, ఐరోపాల్లో వాక్సిన్ల పేటెంట్‌ గురించి నంబర్లతో సహా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోంది. ఎఎఫ్‌పి వార్తా సంస్ధ వాటి గురించి నిర్ధారణ చేసుకొని అవన్నీ నకిలీ అని తేల్చింది.

కరోనా వైరస్‌ ముట్టడి – రక్షణ కరవైన కర్షకులు !

Tags

, , ,

Saving the food value chain amid Covid lockdown - The Hindu ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తోంది. కర్షకులను అయోమయంలోకి నెడుతోంది. ఎటు నుంచి ఎవరి మీద దాడి చేస్తుందో తెలియని స్ధితి. కనిపించే, చేతికి చిక్కే శత్రువుతో పోరాడగలం గానీ వైరస్‌లు సాధారణ కంటికి కనపడవు, ఉన్న ఔషధాలతో అంతం కావు. ఒక దానికి వ్యాక్సిన్‌ తయారు చేస్తే అది మార్కెట్లోకి వచ్చే సరికి వైరస్‌లు తమ స్వభావాన్ని మార్చుకోవటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. కరోనా కూడా అలాంటిదే, ఇప్పటికి 33 మార్పులకు లోనైనట్లు గుర్తించారు. ఇంకా ఎన్ని విధాలుగా మారి ప్రపంచం మీద దాడి చేయనుందో తెలియదు. అంతిమంగా ఏ వైరస్‌ను అయినా అదుపు చేయగలం లేదా అది బలహీనమై పోయి మానవ శరీరాల చేతిలోనే చావు దెబ్బలు తింటుందన్నది గత చరిత్ర. అయితే ఇప్పుడు కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. మే మూడవ తేదీతో గృహబందీ(లాక్‌డౌన్‌) ఎత్తివేస్తారని భావిస్తున్నప్పటికీ ఇది రాస్తున్న సమయానికి వైరస్‌ వ్యాప్తిని చూస్తే కొన్ని సడలింపులు ఉన్నప్పటికీ మే నెలాఖరు వరకు, పరిస్ధితి విషమిస్తే తరువాత కూడా కొనసాగవచ్చన్నది ఒక అభిప్రాయం. ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయిన రైతాంగానికి ఏరువాక దగ్గరపడుతుండటంతో ఏమి చేయాలో తోచని స్ధితి అంటే అతిశయోక్తి కాదు.
కరోనా మహమ్మారి ప్రపంచం మీద ఎలా పర్యవసానాలకు నాంది పలుకుతుందో, అవి ఏవిధంగా ఉంటాయో వైరస్‌ తీరుతెన్నుల మాదిరే తెలియటం లేదు. క్షణ క్షణానికి వైరస్‌ రోగులు, మరణాల సంఖ్య మారుతున్నట్లే ఒక రోజు వేసిన అంచనాలు మరో రోజుకు పాతబడి పనికి రాకుండా పోతున్నాయి. వ్యవసాయ రంగం మీద ప్రభావాలను ఈ సందర్భంగా చూద్దాం. మన దేశంలో 50 నుంచి 60శాతం వరకు జనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. సరిగ్గా పొలాల నుంచి వివిధ పంటలు ముఖ్యంగా రబీ, దోఫసలీ(దీర్ఘకాల) పంటలు రైతుల ఇండ్లకు వచ్చే సమయంలో వైరస్‌ వ్యాప్తి కారణంగా గృహబందీని ప్రకటించారు. ఫలితంగా రైతాంగం, వారి మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలు తీవ్రంగా ప్రభావితులయ్యారు. పంటలను కోసే దిక్కు లేకుండా పోయింది కొన్ని చోట్ల, యంత్రాలు ఒక ప్రాంతం నుంచి మరోచోటికి తరలే అవకాశాలు లేక కూలీల కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల చెరకు, మిర్చి కోతలకు వచ్చిన వలస లేదా అతిధి కూలీలు సీజను ముగిసి తమ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎక్కడికక్కడ చిక్కుకు పోయారు. అకాల వర్షాల కారణంగా కళ్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి వంటికి తడిచిపోయాయి. పండ్లు కోసేవారు, కోసినా మార్కెట్లకు తరలించే సదుపాయాల్లేక చెట్ల మీదనే పండిపోతున్నా రైతాంగం గుడ్లప్పగించి చూస్తూ వదలివేయటం తప్ప మరొకటి చేయలేని స్ధితి.అన్ని చోట్లా ఏ పంటకూ కనీస మద్దతు ధర రావటం లేదు. ముఖ్యంగా పంట్ల తోటల రైతాంగ పరిస్ధితి దారుణంగా తయారైంది. పంటలు కాస్త బాగా పండాయి అనుకున్న స్ధితిలో గృహబందీ దేశంలోని 14 కోట్ల రైతు కుటుంబాలకు పిడుగుపాటులా మారింది.
మన దేశ వ్యవసాయ రంగంలో పరిస్ధితిని చూద్దాం. కరోనా వైరస్‌ రాక ముందే గతేడాది మధ్య నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ముఖ్యంగా ఉల్లి, బంగాళాదుంపలు, కూరగాయల వంటి వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుదల నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉల్లి ధరలు తగ్గినా మిగతావి తగ్గలేదు. తరువాత కరోనా కారణంగా డిమాండ్‌ బలహీనపడి ద్రవ్యోల్బణం తగ్గవచ్చని మార్చి 27న ఆర్‌బిఐ ఒక నివేదికలో పేర్కొన్నది. 2018-19 కంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 2019-20లో 2.4శాతం పెరిగి 29.2 కోట్ల టన్నులకు పెరగవచ్చని అంచనా. మార్చి ఒకటవ తేదీ నాటికి భారత ఆహార సంస్ధ వద్ద7.76 కోట్ల టన్నుల ధాన్యం నిలవ ఉంది. వ్యూహాత్మక, అత్యవసరాలకోసం అవసరమైన 2.14 కోట్ల టన్నుల కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువ. రబీ పంట సేకరణ కూడా జరిగితో మరో మూడు కోట్ల టన్నులు పెరుగుతాయని అంచనా.

Flower trade wilts under lockdown across the country - The Hindu ...
దేశంలో భిన్నమైన వ్యవసాయ ప్రాంతాలు ఉన్నాయి. పంటలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వివిధ తరగతులకు ప్రకటించిన ఉద్దీపన లక్షా 70వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఇది జిడిపిలో కేవలం 0.7శాతమే. కనీసం ఐదు నుంచి పదిశాతం వరకు సాయం చేయాలన్న సూచనలను కేంద్రం పట్టించుకోలేదు. అంతకు మించి రైతు ప్రతినిధులతో కనీసం చర్చలే జరపలేదు. అడిగితే ఎంతో కొంత సాయం చేయాల్సి వస్తుందన్న కారణంతో గావచ్చు రాష్ట్రాలను ప్రతిపాదనలు పంపమని కూడా అడగలేదు. కేంద్ర ప్రకటించిన మొత్తంలో ఇరవైవేల కోట్ల రూపాయలు గతంలోనే ప్రకటించి పిఎం కిసాన్‌ పధకం కింద మూడు విడతలుగా అందచేసే ఆరువేల సాయంలో మొదటి విడత రెండు వేల రూపాయలను ముందుగా విడుదల చేయటం తప్ప అదనపు సాయం కాదు. ఇక వ్యవసాయ కూలీలకు పని లేకుండానే స్వల్ప మొత్తంలో 182 నుంచి 202కు వేతనం పెంచి అదే పెద్ద సాయం అన్నట్లుగా చిత్రించారు. వచ్చే మూడు మాసాలకు అదనపు ఆహార ధాన్యాలు, జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల రూపాయల చొప్పున మూడు నెలలపాటు ఇస్తామని ప్రకటించారు. ఇవిగాక పిఎం కేర్‌ నిధుల నుంచి వలస, అసంఘటిత కార్మికులకు మరికొంత సాయం చేస్తామని చెప్పారు. ఇవి అవసరాలతో పోలిస్తే నామమాత్రమే. రైతాంగ రుణాలకు సంబంధించి మూడు లక్షల రూపాయల వరకు మూడు శాతం వడ్డీ రాయితీతో రుణాలను మే31వరకు మూడునెలలు వసూలు వాయిదాను ప్రకటించారు. అసలు పంటలే అమ్ముకోలేని స్ధితి, అమ్ముకున్నా కనీస మద్దతుధరల కంటే వందల రూపాయలు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తున్న రైతాంగానికి ఇవి కంటి తుడుపు మాత్రమే.
ఈతి బాధలు, కరోనా వంటి మహమ్మారులు తలెత్తినపుడు మన దేశంలో ముందు ప్రభావితులౌతున్నది రైతాంగంలో 85శాతంగా ఉన్న సన్న, చిన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులు దెబ్బతిని వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు మరలిన పేదలే అన్నది స్పష్టం. ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో పని చేసే వారికి కొంతమందికైనా ఏదో ఒక సామాజిక రక్షణ ఉంటుంది. గ్రామీణ కార్మికులకు అవేమీ ఉండవు. కరోనా ఉద్దీపన పేరుతో తీసుకుంటున్న చర్యలు మొత్తంగా వట్టిస్తరి మంచినీళ్లు తప్ప మరొకటి కాదన్నది తేలిపోయింది. పాస్ఫరస్‌, పొటాసియం ఉండే ఎరువులకు రూ.22,186 కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు గృహబందీ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక మంది ఇది బడ్జెట్‌లో ప్రకటించిన దానికి అదనం అనుకుంటున్నారు, కానే కాదు. ప్రతి ఏడాది ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ మొత్తాలు 75వేల కోట్ల రూపాయలకు మించటం లేదు. దానిలోనే ఒక ఎరువుకు తగ్గించినా, మరొకదానికి పెంచినా సర్దుకోవాలి. ఇప్పుడు కూడా అదే జరిగింది. రూపాయి విలువ మరింత దిగజారిన కారణంగా దిగుమతి చేసుకొనే ఎరువుల ధరలు పెరగవచ్చు, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మాంద్యం కారణంగా కంపెనీలు తెగబడి చమురు మాదిరి ఎరువులను కూడా తగ్గించి అమ్మితే తగ్గవచ్చు. ఇది రాస్తున్న సమయానికి అలాంటి సూచనలేవీ కనిపించటం లేదు.

The great lockdown gums up animal farms
ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్‌కు సమర్పించిన 2020-21 బడ్జెట్‌ పత్రాల ప్రకారం అంతకు ముందు సంవత్సరంలో పాస్ఫరస్‌, పొటాసియం ఎరువుల సబ్సిడీ అంచనా రూ.26,335 కోట్లుగా చూపారు. వాస్తవానికి ఎంత ఖర్చు చేసిందీ మనకు వచ్చే ఏడాది పత్రాలలో గానీ తెలియదు. కేంద్ర సమాచార శాఖ మంత్రి విలేకర్లతో ఇలా చెప్పారు. ” 2020-21కి ఫాస్పేటిక్‌ మరియు పొటాసియం ఎరువులకు సబ్సిడీ రూపంలో ఖర్చు రూ. 22,186 కోట్లకు పెంచాలని నిర్ణయించాము, ఈ సబ్సిడీ పధకం ప్రతి ఏడాదీ ఉండేదే, ఈ ఏడాది ఐదు నుంచి ఏడు శాతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించాము” అన్నారు. అంటే గత ఏడాది అంచనా మొత్తం కంటే ఖర్చు గణనీయంగా తగ్గి ఉండాలి. గత ఏడాది కంటే ఎరువులు, ఆహార సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గత సంవత్సరం 80వేల కోట్ల రూపాయల అంచనా కాగా దాన్ని 70వేల కోట్లకు సవరించారు. ఈ ఏడాది ఆ 70వేల కోట్లనే అంచనాగా చూపారు. ఆహార సబ్సిడీని కూడా రూ.1.84లక్షల కోట్ల నుంచి 1.15లక్షల కోట్లకు తగ్గించారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే భారత ఆహార సంస్ధను అప్పుల పాలు చేసి ఆ పేరుతో దాన్ని మూసివేసేందుకు ఎంచుకున్నదారి ఇది. బడ్జెట్‌లోటును తగ్గించే దొడ్డిదారి. ఎఫ్‌సిఐ లాభాల ప్రాతిపదికన పని చేసే వాణిజ్య సంస్ధ కాదు. ఇటీవలి సంవత్సరాలలో దాని బడ్జెట్‌కు నిధులు కేటాయించని కారణంగా అది జాతీయ చిన్న మొత్తాల పొదుపు సంస్ధ నుంచి అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నది. గతేడాది మార్చి ఆఖరుకు దాని అప్పులు రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. దాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయటం లేదు.ఈ ఏడాది ఇంకా కోత పెట్టింది. అంటే కేటాయించిన మొత్తం పోను ఎఫ్‌సిఐ మరింత ఎక్కువగా ఈ ఏడాది అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా పధకం కింద ఉన్న 67శాతం మందిని 20శాతానికి కుదించాలని, రేషన్‌ దుకాణాల ద్వారా ఇస్తున్న సరకుల ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సర్వే సూచించింది. అది కేంద్ర ప్రభుత్వం తయారు చేసేదే కనుక మోడీ సర్కార్‌ ఆలోచనకు ప్రతిబింబం. దీనిలో భాగంగానే ఎఫ్‌సిఐని నిర్వీర్యం చేసి రాష్ట్రాలకే ధాన్యం కొనుగోలు బాధ్యతను ఇప్పటికే బదలాయించారు. వారెలా చేస్తున్నదీ చూస్తున్నాము.
బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2019-20లో నేరగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న మొత్తాలకు కేటాయించిన 75వేల కోట్ల రూపాయలకు గాను ఖర్చయింది రూ.54,370 కోట్ల రూపాయలే. ఇరవై ఒక్కవేల కోట్ల రూపాయలను ”పొదుపు” చేసింది. ఈ పధకం కింద దేశంలోని 14కోట్ల రైతు కుటుంబాలకు గాను లబ్దిపొందింది కేవలం 8.4కోట్ల కుటుంబాలే అని అంచనా. కరోనా కారణంగా తలెత్తిన పరిస్ధితిలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొనేందుకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. ఆరోగ్య సేవలను ప్రయివేటు రంగానికి అప్పగించాలన్న నిర్ణయాన్ని వేగంగా అమలు జరుపుతున్నారు. కరోనా సందర్భంగా అదెంత ప్రమాదకర పోకడో ప్రపంచ వ్యాపితంగా వెల్లడైంది. ఇలాంటి మహమ్మారులు, ప్రకృతి ప్రళయాల సమయాల్లో ఎఫ్‌సిఐ లేదా మరొక ప్రభుత్వ సంస్ధ లేకపోతే ఎంత నష్టమో ఇప్పటికే రైతాంగానికి అర్ధం అయింది.
మన దేశం వెలుపల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికే చైనా, ఇతర ఐరోపా దేశాలతో ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దం అమెరికా రైతాంగానికి ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్దితిలోకి నెట్టింది. కరోనా కారణంగా చైనా ఆర్ధిక స్ధితి కూడా తాత్కాలికంగానే అయినా గణనీయంగా దెబ్బతిన్నట్లు స్వయంగా వారే ప్రకటించారు. ఇప్పుడు ట్రంప్‌ తన ఎన్నికల కోసం కరోనా వైరస్‌ పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నాడు. అవసరమైతే వాణిజ్య ఒప్పందాలను నిలిపివేస్తానని బెదిరిస్తున్నాడు. అమెరికాకు చైనా ఎంత దూరమో చైనాకు కూడా అమెరికా అంతే దూరంలో ఉంటుంది. చైనాకు వచ్చే ఆర్ధిక ఇబ్బందులు దానికే పరిమితం కావు,చైనాతో పోల్చితే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో చెప్పనవసరం లేదు.చమురు నిల్వ ఖాళీ లేక, ఉన.్నది అమ్ముడు పోక చమురు ధరలు పడిపోవటంతో కొనుగోలుదార్లు అమ్మకం దార్లకు ఎదురు డబ్బులు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నారు.కరోనా కారణంగా అనేక ప్రాంతాల్లో అమెరికా రైతులు పాలు అమ్ముడుపోక గోతుల్లో పోస్తున్నారని, కూరగాయల తోటలను దున్నివేస్తున్నారని వార్తలు వచ్చాయి. పంటలకు పదిశాతం, పశువులకు 12శాతం ధరలు పడిపోతాయని, రైతుల నిఖర ఆదాయాలు 20బిలియన్‌ డాలర్లు తగ్గుతాయని ఆహార మరియు వ్యవసాయ విధాన పరిశోధనా సంస్ద అంచనా వేసింది. అమెరికాలో అలా జరగటం అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో వారు ప్రపంచ మార్కెట్లో మరింత చౌకగా వాటిని కుమ్మరిస్తారు. పందొమ్మిది బిలియన్‌ డాలర్ల మేరకు వ్యవసాయ రంగానికి ఇచ్చేందుకు ట్రంప్‌ చర్యలు తీసుకుంటున్నాడు. మన దేశంలో అలాంటి నష్టం ఎంత జరిగిందో అంచనా వేసేవారు లేరు, వేసినా పరిహారం ఇచ్చేవారూ లేరు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందన్నది అందరూ అంగీకరిస్తున్న అంశం. వేగతీవ్రత అంచనాలో తేడాలుండవచ్చు.2020లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. కరోనా ప్రారంభంలో నష్టం జరిగితే అది చైనాకే పరిమితం అవుతుందన్నది ఎక్కువ మంది జోశ్యం. ఇప్పుడు ప్రపంచాన్ని కమ్ముకుంటున్నది. మన పరిస్ధితి గురించి కేంద్ర పెద్దలు అంగీకరించినా లేకున్నా గతేడాది కాలంగా దిగజారుతూనే ఉంది.ప్రపంచంలో గతేడాది ఆహార వస్తువుల ధరలు ప్రారంభంలో తగ్గినప్పటికీ కరోనా కారణంగా ఇటీవల ధరలు పెరిగినట్లు ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు తెలుపుతున్నాయి. అనేక దేశాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎగుమతులపై ఆంక్షలు విధించటం, వినియోగదారులు నిల్వలు చేసుకోవటం ఒక కారణంగా చెబుతున్నారు. వియత్నాం నిషేధం కారణంగా ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 15శాతం తగ్గాయి, మన దేశం, థారులాండ్‌ కూడా ఆంక్షలు విధిస్తే ప్రపంచ మార్కెట్లో ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది.

No crops if lockdown extended: Karnataka farmers wary of distress ...
గోధుమలను అత్యధికంగా ఎగుమతి చేసే రష్యా, గోధుమ పిండిని ఎగుమతి చేసే కజకస్తాన్‌ కూడా ఎగుమతుల మీద ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇంకా అనేక దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. దీన్ని ”ఆహార జాతీయవాదం ” తలెత్తటంగా అభివర్ణిస్తున్నారు. అమెరికాలో చమురు వినియోగం గణనీయంగా పడిపోవటంతో మొక్కజొన్నల నుంచి తయారు చేసే ఎథనాల్‌కు సైతం డిమాండ్‌ పడిపోయింది. ఫలితంగా మొక్కజొన్నల ధరలు పడిపోయాయి. అమెరికా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం బియ్యం, గోధుమల ఉత్పత్తి రికార్డు స్ధాయిలో ఈ ఏడాది 126 కోట్ల టన్నులు ఉండవచ్చని, ఇది వినియోగం కంటే ఎక్కువ కనుక ఆంక్షలు సడలిస్తే సరఫరా మెరుగుపడవచ్చని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరుతెన్నులను బట్టి అంచనాలు, జోశ్యాలు మారిపోవచ్చు. అమెరికాలో గుడ్లు, పాలు, మాంసం సరఫరా తగ్గటంతో ధరలు ముఖ్యంగా గుడ్ల ధరలు 180శాతం వరకు పెరిగాయి. గత నెలలో జనం అవసరాలకు మించి కొనుగోలు చేయటం దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు.చైనా పాల దిగుమతులు ఈ ఏడాది 19శాతం తగ్గుతాయని, అదే సమయంలో ప్రపంచంలో దిగుబడి తగ్గే అవకాశాలు లేనందున పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చని భావిస్తున్నారు. 2018 చివరిలో చైనాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కారణంగా దేశంలోని సగం పందులను చంపివేయటంతో మాంసం ధరలు గణనీయంగా పెరిగాయి. పంది మాంసం బదులు గొడ్డు మాంసానికి మరలటంతో దాని ధరలు కూడా పెరిగాయి. కరోనా కారణంగా అన్ని చోట్లా ధరలు పడిపోయాయి.అయితే అమెరికాలో రాబోయే రోజుల్లో కొరత ఏర్పడవచ్చనే భయంతో జనం కొనుగోళ్లకు ఎగబడటంతో అక్కడ ధరలు పెరిగాయి.
ఈ ఏడాది కరోనా దాదాపు ప్రపంచమంతటా కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ఆయా వ్యవసాయ సీజన్లలో వలస లేదా అతిధి కూలీలు ఎక్కడ పని దొరికితే లేదా అవసరం మేరకు వలస పోవటం సర్వసాధారణం. గృహబందీ, రవాణా లేకపోవటం వలన ఈ ఏడాది కొరత తీవ్రమైంది. సీజనల్‌ వలస కూలీలు రాని కారణంగా తమకు రానున్న మూడు నెలల్లో రెండు లక్షల మంది అవసరమని ఫ్రాన్స్‌ అంచనా వేసింది. ఇండ్లలో చిక్కుకు పోయిన వారు పనులకు రావాలని వ్యవసాయ మంత్రి బహిరంగ విజ్ఞప్తి చేశాడు. నిరుద్యోగులైన కాటరింగ్‌ కార్మికులు వ్యవసాయ పనులకు రావాలని జర్మనీ అధికారులు కోరుతున్నారు. అక్కడ పండ్లు, కూరగాయల కోతకు ఏటా మూడులక్షల మంది వస్తారు. ఉక్రెయిన్‌ నుంచి వ్యవసాయ పనులకోసం కూలీలు పోలాండ్‌కు వలస వెళతారు. వారిని స్వదేశానికి పంపకుండా అక్కడే కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని రైతుల యూనియన్‌ ప్రభుత్వాన్ని కోరింది. వ్యవసాయ కూలీలు ఎక్కడకు పోవాలనుకుంటే అక్కడకు స్వేచ్చగా అనుమతించాలని ఐరోపా యూనియన్‌ సభ్య దేశాలను కోరింది. బ్రిటన్‌లో కూరగాయలు, పండ్ల కోతకు 80వేల మంది అవసరమని, వారికి ప్రత్యేక పాకేజ్‌ ఇచ్చేందుకు 93లక్షల పౌండ్లను ప్రభుత్వం మంజూరు చేయాలని రైతు సంఘాలు కోరాయి. ఇతర చోట్ల పనులు కోల్పోయిన వారిని వ్యవసాయరంగానికి మరలేట్లు ప్రోత్సహించాలని ఇతరులు కూడా కోరుతున్నారు. అమెరికాలో వ్యవసాయ కూలీల సంఖ్య చాలా తక్కువ, ఎక్కువ భాగం యంత్రాలతోనే పని నడుస్తుంది. అయితే మనుషులు అవసరమైన చోట పని చేసేందుకు పక్కనే ఉన్న మెక్సికో నుంచి హెచ్‌ 2ఏ వీసాలతో అనుమతిస్తారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా అలాంటి వారు కనీసం అరవైవేల మంది తగ్గుతారని అంచనా వేశారు. ఇప్పటికే వచ్చి పని చేస్తున్నవారి వీసాలను పొడిగించాలని కోరుతున్నారు. ఒక వైపు వ్యవసాయేతర రంగాలలో పని చేసేందుకు ఇతర వీసాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ సర్కార్‌ వ్యవసాయంలో పని చేసే వారికి మాత్రం వీసాలు అదనంగా ఇవ్వాలని చూస్తోంది. అనేక దేశాలు ప్రకటిస్తున్న ఉద్దీపన పధకాలలో వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న మొత్తాల వివరాలు ఇంకా తెలియనప్పటికీ మన కంటే మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు.

Indian Farmers Struggle to Harvest, Sell Crops During COVID ...
మన రైతాంగ విషయానికి వస్తే ఈ ఏడాది ఇప్పటికే జరిగిన నష్టంతో పోల్చితే నామ మాత్రమే అయినా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఇస్తున్న ఆరువేల రూపాయలను రెట్టింపు చేయాలి.దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి. కరోనా కారణంగా నష్టపోయిన పంటలకు బీమా పధకాన్ని వర్తింప చేసి పరిహారం ఇవ్వాలి. గ్రామీణ కార్మికులకు కనీసం వందరోజుల ఉపాధిని కల్పించాలి. ఉచితంగా అందచేస్తున్న ధాన్యం మొత్తాలను రెట్టింపు చేయాలి. కార్డులు లేనివారికి కూడా ఉదారంగా సాయం చేయాలి. ఖరీఫ్‌ సీజన్‌లో తీసుకున్న రుణాలకు చిన్న సన్నకారు రైతులకు వడ్డీ రద్దు చేయాలి. వచ్చే ఏడాది పంటల కనీస మద్దతు ధరలను ఒకటిన్నర రెట్లు పెంచాలి.
ఏప్రిల్‌ 17న అంతర్జాతీయ రైతాంగ పోరాటదినం జరిగింది. ఎనభై దేశాలకు చెందిన 180 రైతు సంఘాలు ఒక ప్రకటన చేస్తూ కరోనా కారణంగా ఇండ్లకే పరిమితం అవండి, మౌనంగా ఉండవద్దు అని పిలుపునిచ్చాయి. ప్రపంచ జనాభా కడుపు నింపేందుకు పూనుకోవటంతో పాటు రైతాంగ హక్కుల కోసం పోరాడాలన్నదే దాని సారాంశం.