• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP

లోక్‌సభ ముందస్తు ఎన్నికలను ముందుకు తెచ్చే గుజరాత్‌ విజయం ?

19 Tuesday Dec 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress party, gujarat election verdict, lok sabha midterm polls, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎలాగైతేనేం అక్కడ మా మోడీ విజయం సాధించాడా లేదా అని బుర్రలో గాక మరెక్కడో మెదళ్లున్నవారు చేసే వాదనలు పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే అలాంటి అలగా తరగతి ఎప్పుడూ అన్ని పాలకవర్గ పార్టీల వెనుకా వుంటుంది. ఇలాంటి వారు నిజంగా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే శక్తులకు వుత్తేజమిస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే, విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి బ్యాంకు ఖాతాల్లో తలా పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో జనాన్ని నమ్మించారు. ఇదేమిటయ్యా అమిత్‌ షా అని ఎన్నికల తరువాత అడిగితే ఎన్నికల జుమ్లా , ఓట్ల కోసం అనేకం చెబుతుంటాం అని చిరునవ్వు నవ్వేశాడు. గుజరాత్‌లో ఈసారి తమకు 150 సీట్లు వస్తాయని ఆ పెద్దమనిషే ప్రచారం చేశాడు. అవెక్కడ అంటే జుమ్లా అని మరోసారి నవ్వేస్తారు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని గంటల పాటు బిజెపి నేతలకు ముచ్చెమటలు పట్టాయి.

సంఘపరివార్‌ ప్రయోగశాల గుజరాత్‌. గత రెండు దశాబ్దాలుగా మైనారిటీల వ్యతిరేక, మెజారిటీ అనుకూల మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును తయారు చేసేందుకు అది చేయని అవాంచనీయ చర్యలు లేవు.అలాంటి చోట కూడా బిజెపి చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా స్వల్పమెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. సమగ్ర విశ్లేషణలకు సమాచారం ఇంకా అందుబాటులోకి రావాల్సి వుంది. పూర్తిగా పట్టణ లేదా లేదా అత్యధిక భాగం పట్టణ ఓటర్లున్న 53 నియోజకవర్గాలలో బిజెపి 45చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 129 గ్రామీణ నియోజకవర్గాలలో 72 చోట్ల గెలిచింది. మతోన్మాదం పట్టణాలలో ఎక్కినంతగా గ్రామీణంలో ఎక్కదని, ఎక్కినా వ్యవసాయ సంక్షోభంలో తమకు మతం వండి వార్చేదేమీ వుండదని గ్రామీణులు గ్రహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక మంచి సంకేతం. పట్టణ ప్రాంతాలలో కూడా బిజెపి సీట్లు తెచ్చుకున్నప్పటికీ దాని ఓట్లు 2014తో పోల్చితే పదకొండు శాతం వరకు తగ్గాయి. ఈ పరిణామం కూడా బిజెపి ఆందోళన కలిగించేదే. మొత్తం మీద చూసినపుడు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే బిజెపి ఓట్లు 10.2 నుంచి 10.9 మధ్య తగ్గగా ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓట్లు 6.2 నుంచి 10.8శాతం వరకు పెరిగాయి. అంటే బిజెపికి తగ్గిన ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కు పడలేదు.

ఒక నమూనా రాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకున్న చోటే నరేంద్రమోడీ ఆ విషయం మినహా మిగతా విషయాలన్నీ ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌ నేత నీచ్‌ కిసామ్‌కా ఆద్మీ( నీచపు పనులు చేసే వ్యక్తి) అని చేసిన వ్యాఖ్యకు కాళిదాసు కవిత్వానికి తన పైత్యాన్ని జోడించినట్లుగా గుజరాత్‌లో అత్యధికంగా చదివే గుజరాత్‌ సమాచార్‌ పత్రిక ‘మోడీ నీచ్‌ జాతినో మానాస్‌ ఛే (ఒక తక్కువ కులంలో పుట్టిన మోడీ) అన్నట్లుగా కులాన్ని, మోడీ పేరును జతచేసి మొదటి పేజీలో సంచలనాత్మకంగా ప్రకటించి చివరి క్షణంలో బిజెపికి మేలు చేసింది. కీలక సమయాల్లో మీడియా ఎలాంటి పాత్ర పోషించగలదో ఈ ఎన్నికలు నిరూపించాయి. బిజెపి, మోడీ మీద కోపంతో ఓటర్లు మరొక ప్రత్యామ్నాయం లేదు కనుక కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు తప్ప నిజానికి కాంగ్రెస్‌ మీద అభిమానం కలగటానికి ఒక ప్రతిపక్షంగా గత రెండు దశాబ్దాలలో అక్కడ అది చేసిందేమీ లేదు. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు ఎలా వుంటాయి అన్నది చర్చనీయాంశంగా ముందుకు వస్తోంది.

బిజెపికి పోటీగా మరో పార్టీలేని చోట్ల తమవైపు తిరిగి ఓటర్లు మొగ్గుతారని కాంగ్రెస్‌లో ఆశలు రేగుతాయి. అనేక పార్టీలున్న చోట్ల ఎవరికి వారే తామే ప్రత్యామ్నాయంగా ఓటర్ల ముందుకు వచ్చేందుకు కాంగ్రెసేతర పార్టీలు పోటీ పడతాయి. కాంగ్రెస్‌ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా వున్న చోట్ల ఆప్‌, బిఎస్‌పి వంటి పార్టీలు దెబ్బతింటాయి. ఓటర్లు తమకు ఇష్టం వున్నా లేకపోయినా బిజెపిపై తలెత్తిన అసంతృప్తితో నిఖరంగా ఆ పార్టీని ఓడించగల శక్తివైపే మొగ్గు చూపవచ్చు.ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న చోట్ల కాంగ్రెస్‌ పరిస్ధితి ఇప్పుడున్న మాదిరే వుండవచ్చు లేదా దిగజారవచ్చు. అటు కాంగ్రెస్‌ లేదా బిజెపి బలంగా లేని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల ఇప్పటి వరకు బిజెపితో అంటకాగిన లేదా బిజెపి పంచన చేరాలని చూస్తున్న పార్టీలలో పునరాలోచన మరింత తీవ్రంగా జరగవచ్చు. ప్రాంతీయ పార్టీలను మింగి తాను ఎదగాలని బిజెపి చూస్తున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల గుజరాత్‌ ఫలితాలు బిజెపిని ఇరుకున పెడతాయి.శివసేన, తెలుగుదేశం వంటి పార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగుతాయి, సమయం వచ్చినపుడు, వాటంగా వుంటే బిజెపిని వదలిపోయినా ఆశ్చర్యం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తాను బలపడేందుకు అటు తెలుగుదేశం, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏది వాటంగా వుంటే దానితో వుండేందుకు గల అవకాశాలను చూస్తున్నది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను నిరాకరించిన బిజెపి దాని కంటే మెరుగైన ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పి దానికి కూడా మొండి చేయి చూపింది. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి అటు తెలుగుదేశం పార్టీ ఇటు బిజెపి ఎవరి నాటకాన్ని వారు బాగారక్తి కట్టిస్తున్నారు. ఒక వేళ బిజెపి తో తెగతెంపులు చేసుకొంటే రాష్ట్రానికి బిజెపి చేసిన ఈ ద్రోహాలను జనం ముందు పెట్టి తెలుగుదేశం ఒంటి కంటితో( ఎందుకంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం ప్రకారం మరో కన్ను తెలంగాణా కనుక ఆయనకు మిగిలింది మరొకటి మాత్రమే అనే అవగాహనతో) ఏకధారగా నీరు గార్చి ఓటర్ల ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకొని ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆలోచన చేస్తున్నారన్నది బలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే గుజరాత్‌ ఫలితాలు జగన్‌లో ముఖ్యమంత్రి పీఠంపై మరింతగా ఆశలు పెంచవచ్చు. ఒక ప్రతిపక్షంగా విఫలమైనప్పటికీ గుజరాత్‌ ఓటర్లు బిజెపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రధాన ప్రతిపక్షం తామే గనుక తమ మీద ఇష్టం వున్నా లేకపోయినా చంద్రబాబు మీద వ్యతిరేకతతో జనం ఓట్లు వేస్తారనే ఆశలు కలగవచ్చు.

ఇక బిజెపి విషయానికి వస్తే అన్ని పార్టీల కంటే గుజరాత్‌లో గెలిచిన సంతోషం కంటే దాని పర్యవసానాల గురించి ఆందోళన పెరగటం ఖాయం. పార్టీలో నరేంద్రమోడీ ఏకపక్ష వైఖరితో ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న శక్తులు మరింతగా దాడిని పెంచుతాయా లేక మొదటికే మోసం వస్తే ఎలా అని సర్దుబాటు చేసుకుంటాయా అన్నది ఒక అంశం. అధికారమే పరమావధిగా వుండే పాలకపార్టీలలో అత్యధిక సందర్భాలలో బాధితులు రాజీపడిన సందర్భాలు తక్కువ. గ్రామీణుల ఆదాయాలను రెట్టింపు చేసి అదనంగా అన్న వస్త్రాలను అంద చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ విధానాలు వున్న వస్త్రాలను కూడా లాగివేస్తున్నాయి. లోకసభ ఎన్నికల నిర్దిష్ట గడువు వరకు పరిస్ధితి ఇలాగే వుంటే పట్టణ ప్రాంతాలతో పాటు అంతకంటే ఎక్కువగా గ్రామీణంలో బిజెపి వ్యతిరేకత పెరగటం అనివార్యం.

బిజెపి లేదా కాంగ్రెస్‌ గానీ ప్రజావ్యతిరేక, ద్రవ్యపెట్టుబడిదారీ అనుకూల, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యసంస్ధ ఆదేశిత విధానాల అమలులో తక్షణమే వెనక్కు తిరిగి రాలేనంతగా కూరుకుపోయాయి. వాటిని మరింత వేగంగా, ఎక్కువగా అమలు జరపాలనే వత్తిడి పెరుగుతోంది. అదే జరిగితే గ్రామీణ వ్యవస్ధ మరింత తీవ్ర సంక్షోభానికి గురి కావటం అనివార్యం. నరేంద్రమోడీ విషయానికి వస్తే తాను ప్రజలకు చేసిన వాగ్దానాలకంటే పైన చెప్పుకున్న శక్తుల విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా రూపొందించే సులభతర వాణిజ్య ర్యాంకులో మోడీ సర్కార్‌ ఏకంగా 130 నుంచి వందవ స్ధానానికి ఎగబాకింది. ప్రపంచ ధనిక దేశాలలో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సంక్షోభం 2018లో పదవ సంవత్సరంలో ప్రవేశించనుం ది. అది ఎప్పటికి పరిష్కారం అవుతుందో, కనీసం సంక్షోభ పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు వస్తుందో తెలియని స్ధితి. దాని పర్యవసానాలు మన ఆర్ధిక వ్యవస్ధపై బలంగా పడే సమయంలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. గత మూడున్నర సంవత్సరాలలో వుత్పాదక, ఎగుమతి రంగాలలో దిగజారుడు ఆ సంక్షోభపర్యవసానాలే. అయితే చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో దిగుమతుల బిల్లు తగ్గిపోయి జనానికి పెద్దగా నొప్పి కలగలేదు. గత కొద్ది నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి, రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని జోశ్యం చెబుతున్నారు. ఇప్పటికే లీటరుకు పది రూపాయలకు పైగా ధరలు పెరిగాయి, కిరోసిన్‌, గ్యాస్‌ సబ్సిడీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఇప్పటి మాదిరే వున్నప్పటికీ మన దిగుమతుల బిల్లు పెరిగిపోయి, దానిని సర్దుబాటు చేసేందుకు వ్యవసాయ రంగానికి, ఇతర సంక్షేమ చర్యలకు ఇస్తున్న సబ్సిడీలను మరింతగా కోత పెట్టటం, లేదా పన్ను భారాలను పెంచటం మినహా మరొక దగ్గరదారి లేదు. వీటన్నింటినీ చూసినపుడు ఏం చేసినా అది మోడీ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. అందువలన గడువుకు ముందే ముందస్తున్న ఎన్నికలకు పోతారని గత కొంతకాలంగా వినవస్తున్నది. గుజరాత్‌లో భారీ మెజారిటీతో గెలిస్తే దాన్ని చూపి దేశమంతటా ప్రచారం చేసేందుకు ముందుస్తున్న ఎన్నికలకు పోతారని ముందుగానే పండితులు అంచనాలు వేశారు. ఇప్పుడు గెలిచినా దాన్ని పెద్దగా చెప్పుకొని సంబర పడే స్దితి లేదు.వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ఘర్‌ బిజెపి పాలితం కాగా కర్ణాటక కాంగ్రెస్‌, త్రిపుర సిపిఎం ఏలుబడిలో వున్నాయి. వాటి ఫలితాలు కూడా లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైతే అది రాజకీయంగా బిజెపికి నష్టం. ఇది కూడా ముందస్తు ఎన్నికలను ముందుకు తెస్తుందనే చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేటింగ్స్‌ కోసం మోడీ సర్కార్‌ పైరవీలు జరిపిందా ?

18 Saturday Nov 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP’s trolling army, India economy, india ratings, moody’s india ratings, Narendra Modi, narendra modi bhakts

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి నేతలు జరిపిన విదేశీయాత్రలు, అందుకు అయిన విమానఖర్చుల మేరకు కూడా వారు విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులను సమీకరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మోడీ విదేశీ పర్యటనలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో విమర్శకుల నోరు మూయించేందుకు వారికి ఒక అస్త్రం దొరికింది. గత పదమూడు సంవత్సరాలుగా మన స్ధానాన్ని చెత్త రేటింగ్‌ ఎగువన, పెట్టుబడి రేటింగ్‌కు దిగువున వుంచిన మూడీస్‌ అనే అమెరికా సంస్ధ దేశ ఆర్ధిక రేటింగ్‌ను ఒక మెట్టు పైకి పెంచింది. కొద్ది రోజుల క్రితం అదే అమెరికాకు చెందిన ప్యూ అనే సంస్ధ విడుదల చేసిన సర్వేలో కాస్త పలుకుబడి తగ్గినప్పటికీ ఇప్పటికీ నరేంద్రమోడీయే తిరుగులేని నాయకుడిగా వున్నాడని తేలిందని పేర్కొన్నారు.(ఆ సర్వే తొమ్మిదినెలల క్రితం చేసింది, ఇప్పుడు ఎందుకు విడుదల చేశారన్నది ఒక ప్రశ్న) వాణిజ్య సులభతర సూచికలో గతేడాది కంటే ఏకంగా 30పాయింట్లు తగ్గి ఎగువకు చేరింది. ఇప్పుడు మూడీస్‌ బూస్ట్‌ ఈజ్‌ద సీక్రెట్‌ ఆఫ్‌ అవర్‌ ఎనర్జీ అన్నట్లు దేశవ్యాపితంగా బిజెపి శ్రేణులు,నేతలు గంతులు వేస్తున్నాయి. దానికి వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ ఎన్నికలలో ప్రచారానికి వీటిని వుపయోగించుకొని బయటపడగలమనే సంతోషమే కారణం. అయితే వీటి ప్రభావం ఎంత మేరకు వుంటుందన్నది ప్రశ్నార్ధకమే. ఒక వేళ మోడీ-అమిత్‌ షా రేటింగ్‌ను ఓట్ల కోసం వాడితే మిగతా రెండు సంస్ధల మాటేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా వూరుకుంటాయా? తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక చక్కటి డైలాగ్‌ వుంది. నేను నియోగిని ఎలా కావాలంటే అలా వినియోగపడతాను అంటాడు రామకృష్ణ(నిజానికి ఆ కవి అలాంటి వాడో కాదో తెలియదు) భజన మీడియా మాత్రం అలాంటిదే. కనుక దాని చిత్రణ చూసి గంతులేస్తే గోతిలో పడతారు. ఇప్పటికీ కాస్త విమర్శనాత్మకంగా చూసే విశ్లేషకులు ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులేయాల్సినంతగా తాజా రేటింగ్‌లో ఏముందంటున్నారు.

మూడీస్‌ సంస్ధ రేటింగ్‌ చరిత్రలోకి వెళితే బిజెపి భజన బృందాలకు కాస్త ఇబ్బందేమరి. ఎందుకంటే తమ నేత వాజ్‌పేయి కాలంలో దేశం వెలిగిపోయిందని చెప్పుకున్న కాలంలో కూడా మన రేటింగ్‌ అధ్వాన్నంగానే వుంది మరి. పెట్టుబడిదారులు, భూస్వాములకు లబ్ది చేకూర్చేందుకు మన పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వళ్లు వంచి ఎంతో కష్టపడుతున్నారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలతో బంధం ముడిపడిన తరువాత చేపట్టిన చర్యలకు సంస్కరణలు అని పేరు పెట్టారు. ప్రధానులుగా పని చేసిన వారిలో నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి తెచ్చుకున్న రాజీవ్‌ గాంధీ పాలనలో మూడీస్‌ సంస్ధ మన దేశానికి పెట్టుబడిలో ఆరవ ర్యాంకు(1988) ఇచ్చింది. విపిసింగ్‌ ఎనిమిది(1990) చంద్రశేఖర్‌ పది(1991) పివి నరసింహారావు పాలనలో పెట్టుబడేతర చెత్త రాంకులు పదకొండులో రెండోది(1991), ఆయన పాలనలోనే 1994లో పెట్టుబడిలో పదవరాంకు తరువాత దేవెగౌడ పాలనలో 1998లో కూడా దాన్నే కొనసాగించింది. అదే ఏడాది వాజ్‌పేయి అధికారానికి వచ్చిన తరువాత తిరిగి రెండవ చెత్త రాంకులోకి దిగజారింది. తరువాత ఒకటవ చెత్త రాంకులోకి, తరువాత 2004లో పెట్టుబడిపదవ రాంకులోకి పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో అదే కొనసాగి ఇప్పుడు నరేంద్రమోడీ మూడున్నర ఏండ్ల తరువాత పదినుంచి తొమ్మిదవ రాంకులోకి పెంచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వాజ్‌పేయి హయాంలో చెత్తకు అటూ ఇటూగా వున్నందుకే తమ పాలనలో దేశం వెలిగిపోయిందంటూ బిజెపి వారు పెద్ద ఎత్తున వందల కోట్లతో ప్రచారానికి తెరతీసి జనం ముందుకు వచ్చి బక్కబోర్లా పడిన విషయాన్ని మరచి పోకూడదు. అందువలన ఈ మాత్రానికే మోడీ పరివారం పండగ చేసుకోవాలా అని కొందరు అంటున్నారు.

పిల్లి ఏ రంగుదని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా సంస్కరణలు ఏ ప్రధాని ఎలా అమలు జరిపారన్నది కాదు, దాని వలన జనానికి ఒరిగిందేమిటి అన్నదే గీటురాయి. రేటింగ్‌లో మార్పు కోసం నరేంద్రమోడీ సర్కార్‌ తెగతాపత్రయ పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా చివరకు పైరవీలకు ప్రయత్నించి విఫలమైందని రాయిటర్స్‌ సంస్ధhttps://in.reuters.com/article/india-ratings-moody-s/exclusive-how-india-lobbied-moodys-for-ratings-upgrade-but-failed-idINKBN14E09A   గతేడాది డిసెంబరు 25న ఒక వార్తను ప్రచురించింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ కూడా అదే పని చేసి భంగపడిందని వార్తలు వెలువడ్డాయి.

రాయిటర్స్‌ కథన సారాంశం ఇలా వుంది. మూడీస్‌ రేటింగ్‌ పద్దతులను భారత్‌ విమర్శించింది. రేటింగ్‌ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సంబంధిత పత్రాలలో రాయిటర్స్‌ గమనించింది, అయితే దుర్బలంగా వున్న బ్యాంకుల తీరుతెన్నులను ఎత్తి చూపుతూ వత్తిడికి లంగేందుకు అమెరికా సంస్ధ తిరస్కరించింది. అధికారానికి వచ్చిన నాటి నుంచి పెట్టుబడులను పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు, ద్రవ్య,కరెంట్‌ ఖాతాలోటు తేడాను తగ్గించేందుకు నరేంద్రమోడీ చర్యలు తీసుకున్నారు.అయితే ఇంకా చర్యలు తీసుకోవాలని మూడు రేటింగ్‌ సంస్దలు కోరాయి. ఆర్ధిక మంత్రిత్వశాఖ-మూడీస్‌ మధ్య నడిచిన వుత్తర ప్రత్యుత్తరాలలో రుణభారం,136బిలియన్‌ డాలర్ల విలువగల బ్యాంకుల పారుబాకీల గురించి రేటింగ్‌ సంస్ధలకు భరోసా ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు వెల్లడైంది. అక్టోబరులో రాసిన లేఖలు, ఇమెయిల్స్‌లో మూడీస్‌ సంస్ధ లెక్కలు కట్టే విధానాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్నంతా ఆశావహంగా రుణభార సమస్య లేదని, బ్యాంకుల తీరు ఆందోళన కలిగిస్తోందని మూడీస్‌ అ వాదనలను తిరస్కరించింది. రేటింగ్‌ సంస్ధలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసాధారణంగా వుందని, రేటింగ్‌ ఏజన్సీలపై వత్తిడి చేయలేమని ఆర్ధికశాఖ మాజీ అధికారి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు. బిఏఏ రేటింగ్‌ వున్న దేశాల జీడిపిలో ఆదాయం 21.7శాతం మీడియన్‌(మధ్యరేఖ) కాగా భారత్‌లో 21శాతమే వుందని అందువలన మూడీస్‌ సంస్ధ పెట్టుబడులలో కనిష్ట రేటింగ్‌ ఇచ్చింది. రేటింగ్‌ ఎక్కువ వున్న దేశంలో రుణాలు పొందటానికి అయ్యే వ్యయం తక్కువగా వుంటుంది కనుక పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తారు. దేశంలో వచ్చే ఆదాయంలో ఐదోవంతుకు పైగా అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతోంది.

అక్టోబరు నెలలో మూడీస్‌ ప్రతినిధికి పంపిన ఇమెయిల్‌లో సంస్ధ రేటింగ్‌ పద్దతిని మోడీ ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జపాన్‌, పోర్చుగల్‌ వంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధల కంటే రెట్టింపు రుణభారం కలిగి వున్నప్పటికీ మెరుగైన రేటింగ్‌ ఇచ్చారని పేర్కొన్నది.2004 తరువాత భారత రుణభారం గణనీయంగా తగ్గినప్పటికీ రేటింగ్స్‌లో అది ప్రతిబింబించలేదని, విదేశీమారక ద్రవ్య నిల్వలు మెరుగ్గా వుండటం, ఆర్ధిక పురోగతిని కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని అభ్యంతరం తెలిపింది. దానికి మూడీస్‌ ప్రతినిధి వెంటనే సమాధానమిస్తూ భారత్‌తో సమాన రేటింగ్‌ వున్న దేశాలతో పోల్చితే రుణభారం ఎక్కువగా వుందని, అదే సమయంలో రుణాన్ని భరించగల స్ధితి కూడా తక్కువగా వుందని పేర్కొన్నారు.బ్యాంకుల పారుబాకీల సమస్య సమీప భవిష్యత్‌లో పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపించటం లేదని పేర్కొన్నారు. సానుకూల వైఖరి కనిపిస్తున్నప్పటికీ గతంలో ఇచ్చిన బిఏఏఏ3 రేటింగ్‌ను మార్చే అవకాశం లేదని గ్రేడ్‌ పెంచే పరిస్ధితులు లేవని నవంబరు 16న మూడీస్‌ తెలిపింది.’

1980దశకం నాటి స్ధాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రేటింగ్‌ పెంచిన కారణంగా తక్కువ వ్యయ్యంతో విదేశాలలో భారత్‌ నిధులు తెచ్చుకొనే అవకాశాలు పెరుగుతాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే మిగతా రెండు ప్రధాన రేటింగ్‌ సంస్ధలైన్‌ ఎస్‌అండ్‌పి, ఫిచ్‌కూడా రేటింగ్‌ పెంచితేనే అది సాధ్యం అవుతుంది. అవి కూడా వెంటనే ఆ పని చేయకపోతే మూడీస్‌ చర్యను అంతర్జాతీయ పెట్టుబడిదారులు అనుమానించే అవకాశం వుంది. అదే జరిగితే రేటింగ్‌ను తగ్గించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండవది ఈ రేటింగ్‌ను నిలుపుకొనే విధంగా ప్రభుత్వ చర్యల్లేకపోయినా తిరిగి తగ్గించే అవకాశాలు లేకపోలేదు. రేటింగ్‌ మెరుగ్గా లేకపోయినప్పటికీ దానితో నిమిత్తం లేకుండానే గత పద మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులు కొంత మేరకు పెరిగాయి. దానికి తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే అని మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోడీ ఎవరికి వారు చెప్పుకోవటం సహజం. అయితే ఇప్పుడు ఈ రేటింగ్‌తో అదనంగా వచ్చేదేమిటి అన్నది ఒక ప్రశ్న. రేటింగ్‌ మెరుగైన కారణంగా ఇంకా విదేశీ నిధులు వచ్చిపడితే జరిగేదేమిటి? ఒకటి నిధులు, రుణాల వ్యయం తగ్గటం ఒక సానుకూల అంశం. ధనిక దేశాల బ్యాంకులలో మన కంటే వడ్డీరేట్లు మరీ తక్కువగా వున్నాయి. వాటితోపోల్చితే మన దగ్గర ఎక్కువ. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన హామీ వుంటే విదేశీ సంస్ధలు ముందుకు వస్తాయి.

అదే సమయంలో విదేశీ నిధుల ప్రవాహం మన రూపాయి విలువపై ప్రభావం చూపటం అనివార్యం. ఇప్పటికే రూపాయి విలువ పెరిగిన కారణంగా ఎగుమతిదార్లు పోటీని ఎదుర్కోలేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రూపాయి విలువ ఇంకా పెరిగితే ఎగుమతులు మరింతగా పడిపోతాయి. వాణిజ్యలోటు పెరుగుతుంది. ఆ ప్రభావం మన కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రేటింగ్‌ వార్త వెలువడిన శుక్రవారం నాడు 30పైసల మేరకు విలువ పెరిగింది. అయితే రూపాయి విలువ ఎంత పెరిగితే ఆ మేరకు చమురు ధరలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలు, ప్రభావాల గురించి అనేక అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ రేటింగ్‌తో నిమిత్తం లేకుండానే విదేశీ నిధులు ఇప్పటికే వచ్చినందున రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం వుంటుందో చూడాల్సి వుంది.

ఒకటి మాత్రం స్పష్టం. ఏదో ఒక పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై పూర్తిగా సబ్సిడి ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై ఎత్తివేత క్రమంగా అమలు జరుగుతోంది. ఇలాంటి చర్యలు ద్రవ్యలోటును ఎంత మేరకు పూడ్చగలవనేది చూడాల్సి వుంది. నోట్ల రద్దు ద్వారా మూడు లక్షల కోట్ల మేరకు లబ్ది చేకూరుతుందన్న అంచనాలు పోయి నష్టాలు మిగిలాయి. దీనికి తోడు బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చేందుకు ప్రభుత్వం 2.11లక్షల కోట్లను కేటాయించాల్సి వుంది. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వాన్ని పాలక ఎన్‌డిఏ కూటమి, దానితో జతకట్టాలని వుబలాటపడుతున్నవారికి ఆందోళన కలిగించే అంశం పెరుగుతున్న చమురు ధరలు. ఇప్పటికే 60డాలర్లున్న పీపా ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందనే జోస్యాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రేటింగ్‌ ప్రయోజనాలన్నీ ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయి. చమురు ధరల పెరుగుదల పర్యవసానాలను మోడీ సర్కార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న. భారం మొత్తాన్ని జనంపై మోపితే ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానితో సంబంధం వున్న వేతనాలు,భత్యాల వంటివి పెరగాల్సి వుంది.

దేశాల రేటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలలో ఆ దేశాల రుణభారం ఒకటి. మన పొరుగునే వున్న చైనా జిడిపి వంద రూపాయలనుకుంటే దాని అప్పులు 43, అదే మన దేశానికి వస్తే 68 రూపాయలుగా వుంది. మన వంటి రేటింగ్‌ వున్న దేశాల మీడియన్‌ 44 మాత్రమే. అమెరికా, బ్రిటన్‌లకు 70శాతం వుంది. ఆ దేశాలకు అంత అప్పు వున్నప్పటికీ వాటికి తీర్చే సత్తా కూడా వుంది. మన పరిస్ధితి అది కాదు.ఎస్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ధ మన దేశ అప్పు దామాషా 60లోపుగా వుండాలని షరతు లాంటి వత్తిడి చేస్తోంది. రేటింగ్‌ పెంపుదల కోసం మూడీస్‌ సంస్ధతో మోడీ సర్కార్‌ లాబీయింగ్‌(పైరవీ) చేసిందని చెప్పిన రాయిటర్స్‌ మరో అమెరికన్‌ సంస్ధ ఎస్‌ అండ్‌ పి, బ్రిటన్‌ కంపెనీ ఫిచ్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మూడీస్‌ చేసిన సవరణను మిగతా రెండు సంస్ధలు కూడా అనుసరిస్తాయా? అది తేలేంత వరకు మోడీ భక్తులకు బిపి పెరగటం ఖాయం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ నోరు మూస్తే ఏమిటి ? తెరిస్తే ఏమిటి ?

29 Friday Sep 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Arun jaitly, BJP, BJP-led NDA, economic mess, India economy, Narendra Modi, rupee value

ఎం కోటేశ్వరరావు

మిన్ను విరిగి మీద పడ్డా తన అంతరాత్మ అయిన అమిత్‌ షాతో మనకు లాభమో నష్టమో చెప్పు, అవసరమైతే నోరు విప్పుతా అంటారు ప్రధాని నరేంద్రమోడీ. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు దాన్నే నిర్ధారిస్తున్నాయి. ప్రయోజనం లేని మొగుడు తోటలో వుంటేనేం కోటలో వుంటే ఏమిటి ప్రయోజనం అన్న సామెత మాదిరి మోడీ వచ్చి మూడు సంవత్సరాల నాలుగు నెలలైంది ఆయన నోరు తెరిస్తే ఏమిటి మూస్తే ఏమిటి అని జనం అనుకోవటం ప్రారంభించారు. ఆ పెద్ద మనిషి మూసుకున్నా దేశం కోసం మేం నోరు తెరవక తప్పదంటున్నారు బిజెపి నేతలు. మోడీ పోయినా పార్టీని దక్కించుకోవాలి కదా మరి ! ఇంతకాలం చెప్పిన వాటికి భిన్నంగా ఇప్పుడు వాస్తవాలను చెప్పినా జనం నమ్ముతారా ? అన్నది అసలు సమస్య !

డాలరుతో మారకంలో రూపాయి బలపడినట్లే కనిపించి తిరిగి పతనం అవుతోంది. ఆ క్రమంలో అది పడుతూ లేస్తూ వుంది. సెప్టెంబరు ఎనిమిదిన గరిష్ట స్ధాయిలో రు.63.78 వున్నది కాస్తా ఆ తరువాత 194పైసల విలువ కోల్పోయింది. బుధవారం నాడు 65.72కి చేరింది. శుక్రవారం నాడు 65.31గా వుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ముఖ్యంగా డాలరుతో మన బంధం ముడివేసుకున్న కారణంగా, మన పాలకులు గత 70సంవత్సరాలుగా అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్ధిక విధానాల పర్యవసానంగా కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా మన రూపాయి పరిస్ధితి తయారైంది. విలువ తగ్గినా, పెరిగినా కార్పొరేట్లకు పోయిందేమీ లేదు. ఆ కారణాలతో దివాలా తీసి బలవన్మరణాలకు పాల్పడిన పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా వున్నట్లు మనకు వార్తలు లేవు. వారు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను ఎగవేయటం, మన్మోహన్‌, మోడీ వంటి పాలకులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్ల అప్పులను ఏటా వేల కోట్ల వంతున రద్దు చేయటం తప్ప. బ్యాంకులు చేశాయా, పాలకులు చేయించారా అన్నది జనానికి అనవసరం మనవి ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుక పాలకులే మనకు బాధ్యులు. 2016 మార్చి వరకు అంతకు ముందు ఐదు సంవత్సరాలలో రద్దు చేసిన మొత్తం బకాయి 2,25,180 కోట్ల రూపాయలు. అంతకు ముందు ఆరు సంవత్సరాలవి కూడా కలుపుకుంటే రెండున్నరలక్షల కోట్ల రూపాయలు. రుణగ్రస్తులైన సామాన్య వ్యాపారులు, జనమే గగ్గోలు పెట్టి ఆత్మహత్యలకు పూనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది తప్ప పెద్దలకు లేదు.విజయమాల్య వంటి వాడైతే అమ్మాయిలను వెంటేసుకొని మరీ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. గత ఆరునెలలుగా రూపాయి బలపడితే కొంత మంది వ్యాపారులు సంతోషించారు, ఇప్పుడు కొంత మంది వ్యాపారులతో పాటు జనమంతా గగ్గోలు పెట్టే దిశంగా ఈ పతనం కొనసాగుతుందా అని పిస్తోంది. రూపాయి విలువ పెరిగినపుడే పెట్రోలు ధరలను మండిస్తుంటే ఇదేంట్రా బాబూ అనుకుంటున్న జనానికి రూపాయి విలువ పడిపోయిందంటే మరింతగా బాదుడు తప్పదు. అయినా సరే నరేంద్రమోడీ నోరు విప్పరు, ఇలాంటి మేళాన్నా మనం తలకెక్కించుకున్నాం !

కొత్తల్లుడు నోరు విప్పకపోతే మాఅల్లుడి పలుకే బంగారం అని అత్తామామలు మురిసి పోతారు, ఏదైనా వుంటే గదిలోకి తీసుకు వెళ్లి అమ్మాయికే చెబుతాడు అని అత్తింటి వారు సిగ్గుపడుతూ తొలి రోజుల్లో గొప్పగా చెప్పుకుంటారు. కానీ పాతపడిన తరువాత సమయం వచ్చినపుడు కూడా నోరు తెరవకపోతే మీ ఆయనకదేం జబ్బే అని అడిగితే నేనూ మోసపోయా, ఆయనకు నత్తి, మాట్లాడటం సరిగా రాదు అని కూతురు అసలు విషయం చెప్పక తప్పదు. మా మోడీ ఎలాగూ మాట్లాడరు కనుక మేం మాట్లాడక తప్పదు అంటున్నారు బిజెపి అగ్రనేతలలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా . ఆర్ధిక రంగాన్ని చిందరవందర చేసిన మంత్రి అరుణ్‌జైట్లీ గురించి ఇప్పటికీ నేను నోరు విప్పక పోతే నా బాధ్యతలను విస్మరించిన వాడిని అవుతాను. పార్టీలో పెద్ద సంఖ్యలో వున్నటువంటి, బయట మాట్లాడటానికి భయపడే వారి తరఫున నేను మాట్లాడుతున్నాను అన్నారాయన. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. నోట్ల రద్దు, జిఎస్‌టి ఇలా ప్రతి చర్యనూ మోడీకి ఆపాదించిన పూర్వరంగంలో ఆయన పూలనే కాదు రాళ్లను కూడా భరించాల్సి వుంటుంది. అయితే ‘ అంత సహనం’ ప్రస్తుతం బిజెపిలో లేదు. అందుకే లోతు తెలుసుకొనేందుకు ఆంచులను తాకి చూస్తున్నట్లుగా యశ్వంత సిన్హా ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీని ఎంచుకున్నారు. ఆయనేమీ తక్కువ తినలేదు, అసలు విషయాలు చెప్పకుండా 80 ఏండ్ల వయస్సులో వుద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని సిన్హాను ఎత్తిపొడిచారు. అంతే కాదు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా వున్న సిన్హా కుమారుడు జయంత సిన్హా చేత పోటీగా తండ్రి వ్యాసానికి ఖండనగా మరో పత్రికలో వ్యాసం రాయించారు.మంత్రిత్వశాఖకు సంబంధం లేని తమ కుమారుడి చేత వ్యాసం రాయించిన పెద్దలు మరి అతనిని సహాయ ఆర్ధిక మంత్రిగా ఎందుకు తొలగించారో అని యశ్వంత సిన్హా ఎత్తి పొడిచారు. కొడుకు వ్యాసంలో పెద్ద పసేమీ లేదనుకోండి.

ఇంతకీ సీనియర్‌ సిన్హా చెబుతున్నదేమిటి? ప్రయివేటు పెట్టుబడులు గత రెండు దశాబ్దాల కనిష్టానికి తగ్గిపోయాయి. పారిశ్రామిక వుత్పత్తి మొత్తంగా కుప్పకూలిపోయింది. వ్యవసాయం సంక్షోభంలో వుంది. పెద్ద సంఖ్యలో వుపాధి కల్పించే నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్లో వుంది. ప్రతి త్రైమాసికానికి అభివృద్ధి రేటు పడిపోతూ 5.7శాతానికి చేరింది. ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడుకు నోట్ల రద్దు ఆజ్యం పోసింది. ప్రస్తుత ప్రభుత్వం 2015లో జిడిపి లెక్కింపు పద్దతిని మార్చింది. ఫలితంగా రెండువందల ప్రాతిపదిక పాయింట్లు పెరిగి అభివృద్ధి రేట్లు రికార్డయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసిక వృద్ధి రేటు 5.7, అదే పాత లెక్కల ప్రకారం అయితే 3.7 లేదా అంతకంటే తక్కువ. నరేంద్రమోడీ నోరు మూసుకొని గానీ ఇతర మంత్రులు, బిజెపి నేతలు తెరిచిగానీ ఈ అంకెలను సవాలు చేసే స్ధితిలో లేరు.

దేశ ఆర్ధిక వ్యవస్ధకు వుద్దీపన కలిగించనున్నారనే వార్తలు రావటంతోనే వరుసగా వారం రోజుల పాటు స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఇంటి పెద్ద సామర్ధ్యం మీద ఒకసారి అపనమ్మకం కలిగిన తరువాత బయటి వారే కాదు జాగ్రత్తగా గమనిస్తే ఇంట్లో వారే ఎవరికి వారు జాగ్రత్త పడటం వుమ్మడి కుటుంబాల్లో తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ పరిస్ధితి అలాగే వుందంటే అతిశయోక్తి కాదు. యశ్వంత సిన్హా చెప్పినట్లు గణాంక విధానం మార్చిన కారణంగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఒక ఏడాది తరువాత అభివృద్ధి ఎంతో పెరిగినట్లు కనిపించింది. అది వాపు తప్ప బలుపు కాదని అప్పుడే ఎందరో చెప్పారు. ఇప్పుడు రుజువైంది. ఇంకా వాపుగానే కనిపిస్తున్నప్పటికీ మూడు సంవత్సరాల కనిష్టానికి మన అభివృద్దిరేటు పడిపోయింది. నిజానికి ఈ పరిస్ధితిని అధికారంలో వున్న పెద్దలు వూహించలేదా అంటే నమ్మటం కష్టం. మార్కెట్లో చెలామణి అవుతున్న నల్లధనాన్ని వెలికి తీయటానికి పెద్దనోట్ల రద్దు అనే తప్పుడు ఇచ్చిందెవరో మోడీ పదవీచ్యుతుడై ఎన్‌డిఏలో ముసలం పుట్టిన తరువాత గానీ బయటకు రాదు. దానితో నాలుగు లక్షల కోట్లరూపాయల రాబడి అప్పనంగా ప్రభుత్వానికి వస్తుందని ఆ మొత్తంతో కొన్ని మెరుపులు మెరిపించి మంచి రోజులొచ్చయనే ప్రచార హోరులో మధ్యంతర ఎన్నికలతో మరో ఐదు సంవత్సరాలకు ఓట్లు కొల్లగొడదామని వేసిన అంచనాలు నీరు గారిపోయాయి. మోడీ ప్రతిష్టనిర్మాణంలో భాగంగానే నోట్ల రద్దు ఆయన తీసుకున్న నిర్ణయమే అని ఆపాదించిన వారు అదిప్పుడు శాపంగా మారిందని అర్ధమైన తరువాత తేలుకుట్టిన దొంగల మాదిరి వున్నారు.ముఖ్యమంత్రిగా వుండగా తీవ్రంగా వ్యతిరేకించిన జిఎస్‌టి అమలు మంచి చెడ్డలను పూర్తిగా ఆధ్యయనం చేయకుండానే ఆదరాబాదరా అమలులోకి తెచ్చారు. ఈ రెండు చర్యలూ తాత్కాలికంగా అయినా ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనానికి కారణమయ్యాయని మోడీ సర్కారు తప్ప అందరూ అంగీకరిస్తున్నారు. అంతా బాగుంది, ఏదైనా వుంటే అది తాత్కాలికమే అని సొల్లు కబుర్లు చెబుతున్న పెద్దలు వాటినే కొనసాగిస్తే ఒక దారి. కానీ ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పని చేయించేందుకు ఒక వుద్దీపన పధకం గురించి కసరత్తు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ఆరుణ్‌జైట్లీ సెప్టెంబరు 20న చేసిన ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి.

మరో ఆరు రోజుల తరువాత గత మూడు సంవత్సరాలుగా మూలన పడవేసిన ప్రధాని ఆర్ధిక సలహా మండలి దుమ్ముదులిపారు. ఇది ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న భయాలను మరింత పెంచేదే తప్ప తగ్గించేది కాదు. ఇప్పటి వరకు ద్రవ్యలోటు 3.2శాతం కంటే పెరగరాదు అన్న ఆంక్షలను చూపి అన్ని రకాల పెట్టుబడులు, అభివృద్ధి పనులకు కోత పెట్టిన సర్కార్‌ ఇప్పుడు కట్టుకున్న ఆ మడిని పక్కన పెట్టి ఆర్ధిక వ్యవస్ధలోకి అదనంగా 50వేల కోట్లను కుమ్మరించి ఆర్ధిక మందగింపును ఆపగలమా అని సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న మంద్యానికి కారణంగా గత మూడు సంవత్సరాలుగా గ్రామీణ ఆర్ధిక వ్య వస్ధలో రైతాంగ వుత్పత్తులకు ధరలు పడిపోవటం ఒక ప్రధాన కారణంగా అనేక మంది చెబుతున్నారు. దేశ బ్యాంకింగ్‌ వ్యవస్ధలో నిరర్ధక ఆస్థులు 2013 మార్చి నాటికి 1.56లక్షల కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాది మార్చినాటికి 6.41లక్షల కోట్లకు పెరిగాయి. రుణాలు ఇచ్చింది మన్మోహన్‌ సర్కారే అనుకుందాం వసూలు చేయకుండా మోడీ సర్కార్‌ను అడ్డుకున్నదెవరు? యుపిఏ హయాంలో విజయమాల్య వేల కోట్లు తీసుకొని ఎగవేసి విదేశాలకు పారిపోతుంటే నరేంద్రమోడీ సర్కార్‌ వెళ్లిరండి సార్‌ అని విమానం ఎక్కించిందా లేదా ? ప్రతి వారూ పరిశ్ర మలు, వ్యాపారాలకు వడ్డీ రేటు తగ్గించమని కోరేవారే తప్ప అదే సూత్రం వ్యవసాయానికి ఎందుకు వర్తింపచేయరని అడుగుతున్నవారేరి?

నరేంద్రమోడీ సర్కార్‌ అప్పుచేసి పప్పుకూడు అన్నట్లుగా వ్యవహరిస్తోందంటే చాలా మంది నమ్మరు. మన ప్రభుత్వాలు ఏటా ఎంత మొత్తం అప్పు తెచ్చుకోవాలో, దాన్నెట్లా తీర్చుకోవాలో ముందే నిర్ణయించుకుంటాయి. ఆ మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పన్నెండు నెలల్లో వంద రూపాయల అప్పు తీసుకోవాల్సి వుంటే మొదటి నాలుగు నెలల్లోనే 92 తీసుకొని అనుభవజ్ఞుడైన నరేంద్రమోడీ ఖర్చు పెట్టేశారు. అందువలన ఏ మాత్రం అదనంగా ఖర్చు చేయాలన్నా అప్పులన్నా తేవాలి లేదా అదనంగా నోట్లన్నా అచ్చువేయాలి. మొదటి పని చేస్తే అభివృద్ధి పనులు ఆగిపోయి అప్పులు తీర్చుకోవాల్సి రెండోది జరిగితే జనానికి ధరలు పెరుగుతాయి. బలి ఇవ్వటానికి మంచి యువకుడి కోసం దుర్భిణీ వేసి వెతికిన పాతాళభైరవి మాంత్రికుడి మాదిరి నరేంద్రమోడీ ఏదైనా మంత్రదండం దొరక్క పోతుందా అని వెతుకుతున్నారు. ఏదైనా పిచ్చిపని చేసి జనం దృష్టిని మళ్లిస్తే తప్ప అల్లావుద్దీన్‌ అద్బుత దీపాలకు, మంత్రదండాలకు పరిష్కారమయ్యేవి కాదిప్పుడు ముసురుకున్న సమస్యలు. వచ్చేటపుడు మంచిదినాలను తెస్తున్నా అన్న మోడీ చెడ్డదినాలతో పోయాడు అని పించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసలేమనుకుంటున్నారీ కాషాయ తాలిబాన్లు మన అమ్మాయిల గురించి ?

28 Thursday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Banaras Hindu University, BHU, BJP, girl students, saffron talibans

ఎం కోటేశ్వరరావు

అసలేమనుకుంటున్నారీ కాషాయ తాలిబాన్లు మన అమ్మాయిల గురించి ? అమ్మాయిలు చదువుకోవద్దా ? చెప్పండీ ఆ విషయం స్పష్టంగా. ఆకుపచ్చ తాలిబాన్లకున్న నిజాయితీ కూడా వీరికి లేదు. వారు అనుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. వీరు అడుగడుగునా ఆటంకాలు, అవమానాలు కలిగిస్తూ, వ్యక్తిత్వాలను దెబ్బతీస్తూ ఆడ పిల్లలను చదివించటం ఎందుకురా బాబూ అనుకునేట్లుగా తలిదండ్రులలో ఆలోచనలు కలగచేస్తున్నారు. పొమ్మన కుండానే పొగబెడుతున్నామని లోలోపల చంకలు కొట్టుకుంటున్నారా ? అసలేమనుకుంటున్నారు వీరు మన అమ్మాయిల గురించి?

గ్యాన్‌ దేవ్‌ ఆహుజా అనే రాజస్ధాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ గతేడాది ఫిబ్రవరిలో జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయం గురించి చేసిన నీచమైన వ్యాఖ్యలను మన సభ్య సమాజం ఎందుకు తీవ్రంగా పట్టించుకోలేకపోయింది అన్నది ప్రశ్న. ఏమన్నాడతడు ? అక్కడ రోజుకు మూడువేల కండోమ్‌లు, రెండు వేల మద్యం సీసాలు, 50వేల బొమికలు, నాలుగువేల బీడీలు, పదివేల సిగిరెట్‌ ముక్కలు పోగుపడతాయట. ప్రస్తుతం మన రక్షణ మంత్రిగా వున్న నిర్మలా సీతారామన్‌ కూడా అక్కడి విద్యార్ధినే, ఆమె కూడా బహిరంగంగా ఆ ఎంఎల్‌ఏ నోరు మూయించలేదు. ఇంకా ఎందరో అక్కడ చదివిన బిజెపి నేతలు అదే మౌనం పాటించారు, ఎందుకో తెలియదు. ఈ ఒక్క విద్యా సంస్ధలో చదివే వారి గురించే కాదు అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులను వ్యతిరేకించే ప్రతి చోటా ఇలాంటి చౌకబారు ప్రచారాలు, నిందలతో విద్యార్ధులను బెదిరించేందుకు ఇలాంటి ఎత్తుగడలు అనుసరిస్తున్నారు.

అది బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జాతీయ విద్యాలయాల ఏర్పాటులో పండిట్‌ మదన మోహన్‌ మాలవీయ నాయకత్వంలో 1916లో ఏర్పడిన విశ్వవిద్యాలయం ఇది. జాతీయోద్యమ స్ఫూర్తితో తెలుగు ప్రాంతాల నుంచి ఎందరో అక్కడ చదివి స్వాతంత్య్ర సమరంలో, తరువాత కమ్యూనిస్టు కార్మిక వుద్యమాలలోకి దూకేందుకు ప్రాతిపదిక వేసిన సంస్ధ అది. నేడు మనువాదుల నిలయంగా, ప్రయోగశాలగా మారింది.

బేటీ పఢావో, బేటీ బచావో అన్న నినాదం ఇచ్చిన వారి పాలనలో నిశ్చింతగా చదువుకుంటూ సురక్షితంగా వుండొచ్చు అనుకుంటున్న చోట సెప్టెంబరు మూడవ వారంలోసూర్యుడు అస్తమించక ముందే అదీ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు ముందు రోజు సాయంత్రం, ముగ్గురు యువకులు ఒక విద్యార్ధినితో అనుచితంగా ప్రవర్తించారు. దాని గురించి వెంటనే వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తే అసలు ఆ సమయంలో నువ్వెందుకు అక్కడ వున్నావ్‌ అని ఎదురు ప్రశ్న వచ్చిందట. దాంతో మిగతా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ కేవలం ముట్టుకోవటమేగా, అంతకు మించి ఏం చేయలేదటకదా అయినా ప్రధాని పర్యటన ముగిసింతరువాతే దాని గురించి చూద్ధాం అని నిర్లక్ష్య సమాధానాలిచ్చారట. విసిని కలుసుకుంటామంటే కుదరదు పొమ్మని అనుమతించలేదట. ఆ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ గిరీష్‌ చంద్ర తిఫాఠి ఒక పరివార్‌ కార్యకర్త అన్నది బహిరంగ రహస్యం. మిగతా అధికారులు కూడా సాక్షి మహారాజ్‌ వంటి వారి నుంచి స్ఫూర్తి పొందిన వారే. అందుకే విద్యార్ధినులు రాత్రి ఎనిమిది గంటలలోగానే రూములకు చేరుకోవాలి. పది గంటల తరువాత ఎవరూ సెల్‌ఫోన్లు వుపయోగించకూడదు. పురుష విద్యార్ధుల మాదిరి యువతులు కాంటీన్లలో ఎలాంటి మాంసాహారం తీసుకోకూడదు. ఇలాంటి లక్ష్మణ రేఖలను ఎన్నింటినో అక్కడి విద్యార్ధినులు పాటించాల్సి వుంది. ఇంతకూ వేధింపు జరిగిన సమయం బయట తిరగటానికి అనుమతించిన వ్యవధిలో, అందునా సూర్యాస్తమయం కూడా కాలేదు.

విశ్వవిద్యాలయంలో ప్రధాని కార్యక్రమం లేదు, అది వున్న రోడ్డు మార్గంద్వారా ప్రయాణిస్తారంతే. కడుపు మండిన విద్యార్ధినులు గంగమ్మ, అవులు పిలిస్తే పరిగెత్తుకొచ్చే మోడీ గారూ అకతాయిలు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, మా మొర వినండి మేం పిలుస్తున్నాం అంటూ ఒక గేటు దగ్గర ఆందోళనకు దిగారు. దాంతో వేరే మార్గంలో ప్రధాని ప్రయాణం ముగిసే వరకు మిన్నకుండి తరువాత దొరికిన వారిని దొరికినట్లు మగపోలీసులతో చితకబాదించారు. ఒక యోగి పోలీసులు ఎలా వుంటారో తొలిసారిగా అమ్మాయిలకు రుచి చూపించారు. వందలాది మందిపై కేసులు బనాయించారు. ఇదంతా ఆడపిల్లలను వేధించిన వారిని పట్టుకొనే క్రమంలో కాదు, దానిని ఎదిరించిన వారి నోరు మూయించే పక్రియలో భాగం. మోడీ-యోగి సర్కార్‌ నిజరూపం గురించి తెలుసుకోండమ్మా, తెలుసుకోండయ్యా అని వేల గొంతులు చెప్పినా తలకు ఎక్కనిది ఒక్క రోజు లాఠీ, రెండో రోజు కేసులు అరటి పండు వలచినట్లు వేలాది మంది విద్యార్ధినులకు, అన్ని వేలకు మరికొన్ని రెట్లు ఎక్కువగా తలిదండ్రులకు సామూహిక జ్ఞానబోధ చేశాయంటే అతిశయోక్తి కాదు.

ఒకనాడు ప్రాచ్య దేశాల ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంగా ఖ్యాతికెక్కిన విశాలమైన బనారస్‌ విశ్వవిద్యాలయంలో చీకటి పడితే స్వేచ్చగా సంచరించటానికి సరిపడా విద్యుత్‌ వెలుగులు కూడా లేవని ఆడపిల్లలు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. ఎవరు అధికారంలో వున్నా అదే తీరు నడిచింది. బిజెపి అందుకు మినహాయింపు కాదు. బహుశా దేశంలో 30వేల మందికి పైగా విద్యార్ధులున్న విశ్వవిద్యాలయం ఇదేనేమో ? మీ ఆడపిల్లలు చదువుకోవాలంటే ముందు వారిని రక్షించండి అన్నది ఆందోళన జరిగిన రాత్రి ఆడపిల్లలు ప్రదర్శించిన ఒక ప్లేకార్డులోని అంశం. ఆందోళన చేశారు. ఎన్నడూ బయటకు రాని వారు వీధులకెక్కారు. వారేం చెబుతారో విందామని కనీసం ముఖ్యమంత్రి యోగి అయినా వారి వద్దకు వచ్చి ఓదార్చాల్సిన అవసరం వుందా లేదా. అలాంటి దేమీ లేకపోగా ఆడపిల్లలు కనుక బయటి నుంచి సంఘవ్యతిరేకశక్తులు ప్రవేశించి కుట్రచేశాయంటే చాలా బాగోదు కనుక యోగి గారు అమ్మాయిలలోనే సంఘవ్యతిరేకశక్తులు ఆందోళనకు కారణమంటూ సెలవిచ్చారు. సరే వంది మాగధులు కుట్ర గురించి చెబుతున్నారనుకోండి.

అంటే ఏమిటటా ? ప్రధాని పర్యటనకు ముందు రోజు ముగ్గురు ఆకతాయిలను ప్రతిపక్షాలు పని గట్టుకొని బనారస్‌ విశ్వవిద్యాలయానికి పంపించాయి. వారిచేత ఒకమ్మాయిని అల్లరి చేయించాయి. ఆమె చేత అధికారులకు ఫిర్యాదు చేయించాయి. అధికారులతో రెచ్చగొట్టేట్లు మాట్లాడించాయి. విద్యార్ధినులను ఆందోళనకు దించాయి. ప్రధాని పర్యటన ముగిసేవరకు పోలీసులను అదుపు చేసి తరువాత దాడి చేయించాయి. రెండో రోజు వందలాది మందిపై కేసులు పెట్టించాయి. తరువాత కొంత మందిపై చర్యలకు వుపక్రమింప చేశాయి. అని జనం అనుకోవాలి. మరి ఇంత జరుగుతుంటే, కూత వేటు దూరంలో ప్రధాని కార్యక్రమాలు వుంటే నిఘా యంత్రాంగం, యోగి సర్కార్‌ ఏ గుడ్డి గుర్రానికి…. అబ్బే ఇది పాత సామెత, ఏ కర్రావు పేడెత్తుతూ తెల్లావు మూత్రాన్ని వడిసి పడుతున్నట్లు ?

నరేంద్రమోడీ అంటే సమయం వచ్చినపుడు నోర్మూసుకుంటారు గానీ విద్యార్ధినులు వారి తలిదండ్రులకు అంత ఖర్మేం పట్టింది. ముందుగానే దసరా సెలవుల పేరుతో విశ్వవిద్యాలయాన్ని మూసివేశారు. దాంతో ప్రస్తుతం వేలాది మంది విద్యార్ధినులు హాస్టళ్లను ఖాళీ చేసి తమ గ్రామాలు, పట్టణాలకు వెళ్లిపోయారని వార్తలు. ప్రధానంగా వుత్తర భారత్‌లోని వుత్తర ప్రదేశ్‌, బీహారు, రాజస్ధాన్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వారంతా అక్కడ వూరుకుంటారా ? ఎవరి మీద కేసులు పెట్టారో తెలియదు, తమ మీద ఏ తప్పుడు ప్రచారం చేస్తారో తెలియదు. వారి దసరా, అనంతర కబుర్లు కూడా ఇవే. ఇంటి దగ్గర వున్ననన్ని రోజులు ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తే జరిగిందేమిటో, మోడీ-యోగి సర్కార్‌ నిర్వాకం ఏమిటో చర్చ జరగకుండా వుంటుందా? కొంతమంది అయినా కొత్త కార్యకర్తలు తయారవుతారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా కొంత మంది వున్నతాధికారులచేత రాజీనామా, కొంత మంది పోలీసులు, విశ్వవిద్యాలయ అధికారులపై కొన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. అసమర్దంగా అంతకంటే బాధ్యతా రహితంగా వ్యవహరించిన వైస్‌ ఛాన్సలర్‌ను ఏదో ఒక పేరుతో ఇంటికి పంపే ఏర్పాట్లలో వున్నట్లు వార్తలు. మన సంఘపరివార్‌ వ్యక్తే కదా అని మూసిపెడితే విశ్వవిద్యాలయం పాచిపోతుంది.

ఎక్కడ శవం కనపడితే అక్కడకు రాబందులు వాలినట్లుగా ఎక్కడ బిజెపి ప్రభుత్వంపై విద్యారు&ధలు ఆందోళన చేస్తుంటే అక్కడకు కాషాయ ట్రోల్‌ సేనలు దాని మీదకు దిగిపోతాయి. బనారస్‌ విషయంలో కూడా అదే జరిగింది. వుద్యమంలోకి కమ్యూనిస్టులు ప్రవేశించారని తెలుసుకొని తాను వైదొలుగుతున్నట్లు ఒక యువతి చెప్పిందట. ఇదంతా అమెరికా పోలీసు కట్టుకధల కాపీ. అక్కడ కూడా విద్యాలయాల్లో ఏదైనా జరగ్గానే వాటి వెనుక కమ్యూనిస్టులున్నారని మరుసటి రోజు కథనాలు వెలువడతాయి. రెండవది అంతకంటే విడ్డూరమైన ప్రచారం. బనారసులో వుద్యమం ప్రారంభం కాగానే ఎన్‌డిటివీ నుంచి ఒక వ్యాను వచ్చిందట, దాని వెనుకే మరో రెండు వ్యాన్లు వచ్చాయట. వాటిలోంచి ఐదుగురు విద్యారి&ధనులు దూకి వుద్యమకారులతో కలసిపోయారట. వెంటనే సదరు టీవీ విలేకరి ఇతరులతో గాక వారితోనే మాట్లాడించిన వెంటనే వారు అక్కడి నుంచి మాయమయ్యారట. ఇది ఒక నకిలీ వార్త కధనం. ఇక్కడ మన బుర్రను వుపయోగించాల్సి వుంది. అదే వాస్తవం అయితే ఎన్‌డిటివీ వార్తలో కనిపించిన అమ్మాయిలు ఎవరో కనిపెట్టటం కష్టమా? వారు అక్కడి వారు కానట్లయితే ఎవరో ఏమిటో వెల్లడించాలి. ఇలాంటి కట్టుకధలు రాయటం, ఎన్డీటీవిపై బురదజల్లటానికి తప్ప మరొకటి కాదు. నకిలీ వీడియోలనే తయారు చేసిన వారికి ఇలాంటి కట్టుకధలు ఒక లెక్కా ?

బనారస్‌ వుదంతం చూసిన తరువాత ఒక సున్నితమైన సమస్య పట్ల ఎలా వ్యవహరించాలో కూడా విద్యాసంస్ధల వున్నతాధికారులకు తెలియదని, వారి చర్మాలు ఎంతగానో మొద్దుబారి పోయాయనన్నది స్పష్టమైంది. ఒక యువతి తనను అల్లరి పెట్టారనో, అఘాయిత్యం జరపబోయారనో నిర్దిష్ట ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావటమంటేనే జరగకూడనిదేదో జరిగిందనుకోవాలి. ఫిర్యాదు చేయటానికి వెళ్లిన బాధితులనే నేరగాళ్ల మాదిరి పోలీసులు ప్రశ్నించినట్లుగా విశ్వవిద్యాలయ అధికారులు అసలు ఆ సమయంలో అక్కడ నువ్వెందుకున్నావ్‌, నిన్నే ఎందుకు అలా చేశారు, ఆ డ్రస్సేమిటి, ఆ పోకడేమిటి అన్నట్లు ప్రవర్తించటమే సమస్య మరో రూపం తీసుకోవటానికి దారితీసింది. యువతి పట్ల చిన్నపాటి వేధింపును ప్రధాని రాక సందర్భంగా కావాలని ముందుకు తెచ్చి రాజకీయం చేశారని విసీ గిరీష్‌ చంద్ర త్రిపాఠీ వర్ణించారు. తొలుత స్పందించిన వారు సక్రమంగా వ్యవహరించి వుండాల్సిందని వారణాసి కమిషనర్‌ చేసిన వ్యాఖ్యను విసి అంగీకరించలేదు. ప్రతివారు సక్రమంగా వ్యవహరించి వుంటే విశ్వవిద్యాలయ ప్రధాన ప్రోక్టర్‌ ప్రొఫెసర్‌ ఓఎన్‌ సింగ్‌ నైతిక కారణాలతో రాజీనామా ఎందుకు చేసినట్లు ? అసలు లాఠీచార్జి చేయాల్సినంతగా శాంతి భద్రతలేమి అదుపు తప్పాయి. ఇప్పుడు చేసిన పొరపాటును కప్పిపుచ్చుకోవటానికి మరికొన్ని తప్పులతో ఏదో ఒక నివేదికను జనం ముందు పడేస్తారు, తాత్కాలికంగా అయినా విద్యార్ధినుల నోరు మూయిస్తారు. దేశంలో మితవాద భావజాల పట్టులో వున్న వుత్తరాది ప్రాంతానికి చెందిన ఆమ్మాయిల్లో ఇంత ప్రతిఘటన తెగింపు ఎలా వచ్చిందన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇది బిజెపి వంటి మనువాద, ఇతర ఫ్యూడల్‌ శక్తుల పట్టులో వున్న పార్టీలకు ఆందోళన కలిగించే పరిణామం అయితే ప్రగతివాద శక్తులు హర్షించే అధ్యాయం. అన్యాయం, అక్రమాలను ప్రతిఘటించటానికి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని బిజెపిఏ కాదు అధికార పులినెక్కిన ఏ పాలకపార్టీ తలకెక్కించుకోదని వేరేచెప్పాల్సిన పని లేదు.

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేరగాడు గుర్మీత్‌: కాంగ్రెస్‌ాబిజెపి బాధ్యత ఎంత ?

27 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, cbi, Congress party, Gurmeet Ram Rahim Singh, Narendra Modi, rape, rape case

ఎం కోటేశ్వరరావు

డేరా సచ్చా సౌదా ఆశ్రమాల అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు భక్తురాండ్రపై జరిపిన అత్యాచారం కేసులలో నేరగాడని వినాయకచవితి రోజున పంచకుల సిబిఐ కోర్టు నిర్ధారించింది. శిక్ష ఎంత అనేది సోమవారం నాడు ప్రకటించనున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే నిరసిస్తూ గుర్మీత్‌ అనుచరులు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, వుత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హత్య, హింసాకాండకు పాల్పడ్దారు. పంచకుల నగరం తీవ్రంగా ప్రభావితమైంది.కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌కు ఒక వైపున క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిన మొహాలీ లేదా ఎస్‌ఎఎస్‌ నగర్‌ మరోవైపు పంచకుల వుంది. వీటిని త్రినగరాలు అంటారు. చండీఘర్‌ కేంద్రపాలనలో మొహాలీ పంజాబ్‌, పంచకుల హర్యానాపాలనలో వుంటాయి. మూడూ ఆధునిక నగరాలే. గుర్మీత్‌ అత్యాచార నిర్ధారణ తీర్పు పర్యావసానం అనేక అంశాలను జనం ముందుంచింది.

ఢిల్లీలో ఒక నిర్భయపై జరిపిన అత్యాచార వుదంతానికి నిరసనగా నిందితుడిని శిక్షించాలని వేలాది మందిని వీధుల్లోకి రప్పించింది. తన ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన ఇద్దరు నిర్భయలపై గుర్మీత్‌ జరిపిన అత్యాచార వుదంతంలో అతగాడిని శిక్షించకూడదంటూ లక్షలాది మంది వీధుల్లోకి రావటం, వున్మాదంతో హింసాకాండకు పాల్పడటం దేశాన్ని విస్మయపరుస్తోంది. ఢిల్లీ నిర్భయ వుదంతంపై దేశమంతా ఏకతాటిగా నిలిచింది. కానీ ఒక బాబా ముసుగులో గుర్మీత్‌ జరిపిన అత్యాచారంపై పరిమితంగా అయినా భిన్న స్వరాలు వినిపించటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుజరాత్‌లో గోధ్రాపేరుతో జరిపిన మారణకాండతో పోలిస్తే ఇదెంత హ ! హ !! అనుకున్నారో ఏమో ప్రధాని నరేంద్రమోడీ షరా మామూలుగా ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ వుదంతం సందర్భంగా మీడియాలో పరిమితంగానే అయినప్పటికీ వెలుగులోకి వచ్చిన అనేక అంశాలు మన రాజకీయ వ్యవస్ధ ముఖ్యంగా అధికారమే పరమావధిగా ఎంత గడ్డికరవటానికైనా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు(వామపక్షాలకు ఇటు వంటి మరక లేదు) పూనుకుంటాయో అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి.

గుర్మీత్‌ వంటి శక్తులు తెరముందు ఎలా వున్నా తెరవెనుక నేర,దేశద్రోహ చరిత్రలుంటాయని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొత్తగా పుట్టుకువచ్చే యోగులు, యోగినులు, బాబాల చుట్టూ నిరక్షరాస్యులతో పాటు వున్నత విద్యావంతులు కూడా అనేక కారణాలతో తిరగటం, వారికి విశ్వసనీయత కలిగించటం మన దౌర్భాగ్యం. ఎవరిపై అయినా ఒక ఆరోపణ వచ్చినపుడు దానిలో వాస్తవాలు తేలేంత వరకు వారికి కితాబు ఇవ్వకుండా వుండటం కనీస విధి. కానీ అనేక మంది బాబాల మాదిరి ఇతగాడి విషయంలో కూడా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీల నేతలు అతడిని ప్రసన్నం చేసుకొని వెనుక వున్న అనుచరుల ఓట్లను రాబట్టుకొనేందుకు కరవని గడ్డి లేదు. ఇప్పుడు ఆ పార్టీల వారు, ఇతరులు త్వశుంఠ, త్వశుంఠ అంటూ ఎవరెంత వెధవాయలో ఒకరి గురించి ఒకరు, స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. అవాంఛనీయ సమర్ధనలకు పూనుకుంటున్నారు. ఈ వుదంతంలో కూడా రాజకీయ లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఇలాంటి వారిని అచ్చ తెలుగులో వుచ్చల గుంటలో చేపలు పట్టేరకం అంటారు. కొంత మంది ఈ వుదంతాన్ని దళిత బాబా- అగ్రకుల కుట్ర కోణంలో చూసేందుకు ప్రయత్నించటం గర్హనీయం. డేరా ఆశ్రమాల్లో చేరుతున్నది దళితులు, ఇతర బలహీనవర్గాలే అనుకుంటే అత్యాచారాలు, హత్యలకు గురైంది కూడా ఆ తరగతులకు చెందిన వారే కదా అనే సృహ కనిపించటం లేదు. ఎవరికి చెందిన వారి ఆశ్రమాల్లో ఏ నేరం, అత్యాచారం జరిగినా పట్టించుకోకూడదు అని చెప్నే ప్రమాదకరపోకడ ఇది. మరో విధంగా చెప్పాలంటే మా మనోభావాలను దెబ్బతీస్తే సహించం అ నే వున్మాద లక్షణం తప్ప మరొకటి కాదు.

తన ఓటు బ్యాంకుకు వ్యతిరేకంగా తొలుత ఆశారాంబాపు, తరువాత రాంపాల్‌, ఇప్పుడు గుర్మీత్‌ సింగ్‌ను కనీసం బిజెపి అరెస్టు చేసింది అని చెట్టుకింది ప్లీడరు పాయింట్‌ను బిజెపి అభిమానులు ముందుకు తెచ్చారు. కోర్టుల తీర్పులు లేదా ఇతర అనివార్య పరిస్ధితులలో అధికారంలో ఏ పార్టీ వున్నా ఆపని చేయటం విధి. ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ఇలాంటి బాబాలకు అంటకాగిన వారు వ్యవహరిస్తారు. ఎక్కడిదాకో ఎందుకు గుర్మీత్‌ విషయమే తీసుకుంటే కోర్టు నిర్ణయం వెలువడగానే ప్రముఖులు బసచేసే ఒక వసతి గృహానికి తీసుకు వెళ్లి, దాన్నే జైలుగా మార్చేందుకు హర్యానా బిజెపి పభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది. అయితే దాని గురించి మీడియాలో వార్తలు గుప్పుమనటంతో సాధారణ ఖైదీ మాదిరే రోహతక్‌ జైలుకు తరలించాల్సి వచ్చింది. దాన్ని కూడా తమ ప్రభుత్వ ప్రత్యేకతగా చెప్పుకొనేందుకు బిజెపి సేనలు ప్రయత్నించాయి. గుర్మీత్‌కు జడ్‌ తరహా భద్రత కల్పించింది ఎవరు-కాంగ్రెస్‌, గుర్మీత్‌ సింగ్‌ కుమారుడు వివాహం చేసుకున్నది ఎవరిని-పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత కూతురిని అంటూ మరొక ప్రచారం. ఇలాంటి సందర్భాలలో బిజెపి మేథావులు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. హర్యానా బిజెపి అధ్యక్షుడి కుమారుడు ఒక యువతిని వెంటాటి కిడ్నాపో, అత్యాచారమో ఏదో చేయటానికి ప్రయత్నించిన వుదంతం తెలిసిందే. ఆ సందర్భంగా ఆ యువతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే చౌకబారు ఎత్తుగడలు కాకపోతే గుర్మీత్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన జడ్‌ భద్రతను బిజెపి ఎందుకు కొనసాగించినట్లు? కాంగ్రెస్‌ నేత కూతుర్ని కోడలుగా చేసుకున్న గుర్మీత్‌తో బిజెపి నేతలు ఆయన అనుగ్రహం కోసం ఎందుకు పడిగాపులు పడ్డారు, ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగినట్లు ? ఒక కాంగ్రెస్‌ నేత కూతుర్ని తన కోడలుగా చేసుకున్నందుకు గుర్మీత్‌ను తప్పుపట్టనవసరం లేదు. తద్వారా కాంగ్రెస్‌ పాలకుల నుంచి పొందిన లబ్ది ఏదైనా వుంటే దాన్ని తప్పుపట్టాలి. ఇదే ప్రమాణాన్ని బిజెపికి వర్తింప చేస్తే …… సంజయగాందీ భార్య మేనకా గాంధీని,ó కుమారుడు ఫిరోజ్‌ గాంధీని, గబ్బుపట్టిన ఇంకా ఎందరో కాంగ్రెస్‌ నేతలను బిజెపిలో ఎందుకు చేర్చుకున్నట్లు ? స్వయంగా నరేంద్రమోడీ ప్రధాని హోదాలో గుర్మీత్‌కు ప్రణామం చేస్తున్నట్లు చేసిన ప్రకటన మాటేమిటి? ఇది గుర్మీత్‌పై కేసు విచారణలో వుండగానే కదా ! ఒక నిందితుడికి ప్రణామం చేస్తున్నానని ప్రధాని హోదాలో వున్న వ్యక్తి చెప్పటం దేనికి నిదర్శనం, దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు? ఇలాంటి బాబాలను వెనకేసుకు రావటంలో, వారి నుంచి లబ్ది రాజకీయంతో సహా అన్ని రకాల లబ్దులు పొందటంలో కాంగ్రెస్‌,బిజెపిలు, వాటికి అంటకాగే ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీలు పడ్డాయి తప్ప వారికి దూరంగా వుండేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

ఇతరుల మీద బురద జల్లేందుకు పూనుకున్న బిజెపి పరివారం, వారి మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) పాలు తాగుతున్న పిల్లి చందం మాదిరి ఎవరూ తమను గమనించటం లేదని అనుకుంటున్నాయి. సాక్షి మహరాజ్‌ అనే ఒక పేరుమోసిన బిజెపి ఎంపీ గుర్మీత్‌ నేరాన్ని కోర్టు తీర్మానించిన వెంటనే స్పందించిన తీరు దేశాన్ని విస్మయపరిచింది, దాంతో నష్టనివారణ చర్యగా అతని మాటలతో మాకు సంబంధం లేదని బిజెపి నక్కజిత్తు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా కేంద్ర బిజెపి నుంచి రాలేదు. ఈ పెద్దమనిషి కూడా మత బాబాయే, ఆశ్రమాల వ్యాపారం చేస్తాడు, నోటి తుత్తర మనిషి. ఇతగాడేమన్నాడు ‘ దివ్యాత్మ గలిగిన రామ్‌ రహీమ్‌ వంటి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చెబుతున్నది సరైనది? రామ్‌ రహీమ్‌ సింగ్‌లో దేవుడిని చూస్తున్న కోట్లాది మంది చెబుతున్నదా లేక ఫిర్యాదు చేసిన ఆ యువతిదా ? దీని మీద పెద్ద గొడవ జరుగుతున్నది, శాంతి భద్రతలు చిన్నాభిన్నమయ్యాయి, జనం చనిపోతున్నారు… దీన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జమా మసీదు అధిపతి షాహీ ఇమామ్‌ను ఈ విధంగా సంబోధించగలదా ? అతని మీద కూడా అనేక కేసులున్నాయి, అతనే మన్నా వారి బంధువా ? రామ్‌ రహీమ్‌ ఎంతో సాదాసీదాగా వుంటాడు కనుక అతన్ని వేధిస్తున్నారు.’ అని సాక్షి మహరాజ్‌ సెలవిచ్చారు. సాక్షి మహరాజ్‌ చెప్పిందాన్ని పార్టీ ఆమోదించటం లేదని దేశానికి అంతగా తెలియని కైలాష్‌ విజయవర్గీయ అనే నేత చేత బిజెపి చెప్పించింది.

మూడు రాష్ట్రాలలో హింస చెలరేగి అనేక మంది మరణించి ఎందరో గాయపడి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా పరిస్ధితులు వుంటే ఇల్లు కాలుతుంటే బగ్గులేరుకొనే బాపతు మాదిరి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తన సహజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు.’ సాధువులకు కొత్త ముప్పు వచ్చింది. స్వామీజీలను జైళ్లకు పంపి రాజకీయ నేతలు, ఆశ్రమాలలో వున్నవారు ఆశ్ర మ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకుంటున్నారు.’ అని ట్వీట్‌ చేశాడు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాంబాపును సమర్ధించిన ఈ స్వామి గారు అంతటితో ఆగలేదు. తాను సాధారణ పరిభాషలో చేసిన వ్యాఖ్యను రావణ రహీమ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ చిత్రించిందని ఆరోపిస్తూ ప్రతి విరాట్‌ హిందూ ప్రముఖుడిపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కంచి శంకరాచార్య, రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్లను మరో ట్వీట్‌లో స్వామి వుటంకించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ట్వీట్‌లో మీడియాపైన, ఆస్తినష్టం జరగటాన్ని ఖండించారు తప్ప గుర్మీత్‌ అనుచరుల హత్యాకాండ, మరణించిన వారి ప్రస్తావన లేదు.

కోర్టు తీర్పుతో గుర్మీత్‌ను బహిరంగంగా సమర్ధించలేని స్ధితిలో పడింది తప్ప అతనితో బిజెపి సంబంధాలు దాస్తే దాగేవి కాదు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం 47 మంది హర్యానా బిజెపి సభ్యులలో 19తో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుభాష్‌ బరాలా 2014 ఎన్నికల తరువాత గుర్మీత్‌ను కలిశారు. వారిలో దాదాపు అందరూ మంత్రులయ్యారు.కోర్టు నిర్ణయం వెలువడగానే మొదలైన హింసాకాండను ప్రభుత్వ నివారించలేకపోవటం గురించి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ స్పీకర్‌ కన్వర్‌ పాల్‌ గుజ్జార్‌ సమాధానం ఇచ్చిన తీరు గమనించాల్సిన అంశం.’ మేము ఒక్కరిమే ఈ డేరాలకు వెళ్లలేదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వెళ్లాయి. రాజకీయవేత్తలుగా మేం అనేక మందిని కలుస్తుంటాం, వారిలో ఎవరైనా తరువాత కాలంలో తప్పుచేసిన వారిగా రుజువు అవుతారని ఎలా అనుకుంటాం, తాను చట్టాన్ని గౌరవిస్తానని గురూజీ చెప్పినట్లు ఇతరులు కూడా దాన్ని గౌరవించాలి. ఎగువ కోర్టులకు వెళ్లటానికి అవకాశాలున్నాయి, హింసాకాండ అన్నింటికీ సమాధానం కాదు,డేరా అనుచరులు శాంతిని పాటించాలి’ అన్నారు తప్ప ఖండన మాట ఒక్కటి కూడా లేదు.

 

డేరా ఆశ్రమాలను కాంగ్రెస్‌, ఇండియన్‌ లోక్‌దళ్‌ వంటి ఇతర పార్టీల నాయకులు కూడా సందర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు గుర్మీత్‌ మద్దతు ప్రకటించాడు. అయితే 2014 ఎన్నికలలో డేరా సచ్చా సౌదా బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది. దాని పధకాలకు హర్యానా బిజెపి ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటును కూడా అందించింది. గుర్మీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన సినిమాలకు ఆరునెలల పాటు వినోదపన్ను కూడా మినహాయింపు ఇచ్చింది. డేరా సంస్ధ 2016లో నిర్వహించిన గ్రామీణ క్రీడలకు రాష్ట్రమంత్రి తన విచక్షణా కేటాయింపు నిధి నుంచి 50లక్షలు విరాళంగా ఇచ్చాడు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆశ్రమాన్ని సందర్శించి మరో 51లక్షలు ఇస్తానని ప్రకటించాడు. గుర్మీత్‌తో బిజెపి నేతలకు వున్న ఇన్ని సంబంధాలను వదలి పెట్టి కాంగ్రెస్‌ జడ్‌కేటగిరి భద్రత కేటాయించిందని, కొడుక్కి పిల్లనిచ్చిందని బిజెపి సామాజిక మీడియాలో ప్రచారం ప్రారంభించింది.

గుర్మీత్‌ సింగ్‌ వ్యవహారశైలి, అతని మీద వున్న కేసుల గురించి తెలియజూకుండానే బిజెపి నేతలు ఇవన్నీ చేశారా? బుర్రలో గుంజున్నవారెవరూ నమ్మరు. డేరా ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన ఒక మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ 2002 జూలైలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గుర్మీత్‌ నిందితుడు, విచారణ చివరి దశలో వుంది. భక్తురాండ్రపై గుర్మీత్‌ అత్యాచారాల వేధింపుల గురించి మేనేజర్‌ రంజింత్‌ సింగ్‌ ఆకాశరామన్న లేఖలను ప్రచారంలో పెట్టిన కారణంగానే హత్యకు గురయ్యాడని చెబుతారు.సిర్సాలోని డేరా ఆశ్రమ ప్రధాన కేంద్రంలో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి రాసినందుకు చట్టర్‌పతి అనే జర్నలిస్టు 2002 అక్టోబరు 23న హత్యకు గురయ్యాడు. ఆ హత్య కుట్రలో గుర్మీత్‌ భాగస్వామిగా కేసు నమోదైంది.సిబిఐ దర్యాప్తు చేసింది. పంచకుల కోర్టులోనే విచారణ చివరి దశలో వుంది.

గురువుగారి(గుర్మీత్‌) మార్గదర్శకత్వలో దేవుడిని చేరాలంటే పురుష భక్తులు తమ జననాంగాలను తొలగించుకోవాలని చెప్పి సిర్సా ఆశ్రమంలో దాదాపు నాలుగు వందల మందికి ఆపరేషన్లు చేశారనే ఆరోపణలు రావటంతో వాటిపై సిబిఐ దర్యాప్తు జరపాలని 2014 డిసెంబరు 23న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు దర్యాప్తులో వుంది. తాను దేవుడిని అని చెప్పుకొనే గుర్మీత్‌ సింగ్‌ 2007లో సిక్కుల గురు గోవింద్‌ సింగ్‌ మాదిరి వస్త్రాలను ధరించి కనిపించటంతో హర్యానా, పంజాబ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. భటిండా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆకేసును 2014లో పంజాబ్‌ అకాలీ-బిజెపి ప్రభుత్వం కేసును వుపసంహరించుకుంది. సిర్సాలోని డేరా ఆశ్రమంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని సైన్యం 2010 డిసెంబరులో తెలియచేసింది. అక్రమ ఆయుధాలు, శిక్షణ గురించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరగా అబ్బే అలాంటిదేమీ లేదంటూ హర్యానా ప్రభుత్వం పేర్కొన్నది. తాజా హింసాకాండలో ఆయుధాలు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.

గుర్మీత్‌పై ఆత్యాచారం కేసుల విషయానికి వస్తే అత్యాచారాలు జరిగిన పది సంవత్సరాల తరువాత 2009,10 సంవత్సరాలలో నమోదయ్యాయి. ఇద్దరు భక్తురాండ్ర ప్రత్యక్ష వాంగ్మూలాలు గుర్మీత్‌ను దోషిగా నిలిపాయి. సిబిఐ న్యాయమూర్తుల ముందు వారుచెప్పిన అంశాలు బాబా భయంకర రూపాన్ని వెల్లడించాయి. సిర్సా ఆశ్రమంలోని భూగర్భంలో గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం వుంది. దాని రక్షణకు ఎల్లవేళలా యువతులనే నియమిస్తారు. గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మే విశ్వాసపరుల కుటుంబాలకు చెందిన యువతులను ఎంపిక చేసి వారు కూడా గుర్మీత్‌ను ఆధ్యాత్మిక గురువుగా నిజంగా నమ్ముతున్నారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత నియామకాలు జరుపుతారట. అత్యాచారాలు చేసే సమయంలో గుర్మీత్‌ తానొక దేవుడినని ఫోజు పెట్టేవాడట. హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన ఒక యువతి తనపై అత్యాచారం ఎలా జరిగిందో 2009 ఫిబ్రవరి 28న సిబిఐ న్యాయమూర్తి ఎకె వర్మ ముందు వివరించింది. తన సోదరుడి కారణంగా తాను 1999 జూలైలో డేరాలో భక్తురాలిగా చేరానని, పితాజీ నిన్ను క్షమించాడా అని అని  భక్తులు అడగుతుంటేే తొలుత తనకు అర్ధం కాలేదని, 1999 ఆగస్టు28/29 తేదీన తనను గుర్మీత్‌ నివాసంలోకి పిలిచించి అత్యాచారం చేసిన తరువాత ఆ మాటలకు అర్ధం స్పష్టమైందని వివరించింది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తరువాత ఆమె సోదరుడు హత్యకు గురయ్యాడు. సిర్సాకు చెందిన మరొక భక్తురాలు 2010 సెప్టెంబరు తొమ్మిదిన తన వాంగ్మూలమిచ్చింది. ఆమె తలిదండ్రులు డేరా గురించి చేసిన బోధల కారణంగా తాను భక్తురాలిగా మారానని, 1998 జూన్‌లో ఆశ్ర మంలో చేరిన తనకు నజం అని గుర్మీత్‌ నామకరణం చేశాడని, 1999 సెప్టెంబరులో గుర్మీత్‌ నివాసకాపలాదారుగా వుండగా లోపలికి పిలిచి తనపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లుగా పేర్కొన్నది.

గుర్మీత్‌ మద్దతుదారులు పంచకుల నగరాన్ని తగులబెడుతుంటే హర్యానా బిజెపి సర్కార్‌ నీరోలా వ్యవహరించింది. సాక్షాత్తూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆ రాష్ట్ర సర్కార్‌ను బహిరంగంగానే అభిశంచింది. హింసాకాండకు సంఘవ్యతిరేకశక్తులు కారణమని చెప్పటాన్ని ఎండగట్టింది.గుర్మీత్‌కు శిక్ష ఖరారు తేదీని ఎంతో ముందుగానే ప్రకటించారు. ఆ కేసులో అతగాడికి శిక్ష పడనుందని అనుచరులకు కూడా అనిపించిన కారణంగానే వారం రోజుల ముందు నుంచే పంచకుల, తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెట్రోలు, పెట్రోలు బాంబులు, ఇతర మారణాయుధాలను సమీకరించారని వార్తలు ముందే వచ్చినా హర్యానా సర్కార్‌ తీసుకున్న ముందుస్తు చర్యలేమీ లేవు. గుర్మీత్‌ మద్దతుదారులు స్వేచ్చగా గుమికూడటానికి అన్ని అవకాశాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు సంఘవ్యతిరేకశక్తులే హింసాకాండకు పాల్పడితే అది తెలిసి కూడా ఏడు రోజుల పాటు ఎలాంటి వారి ప్రవేశానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.శాంతి భద్రతల అంశం రాష్ట్రాలదని అదనపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సత్యపాల్‌ జైన్‌ చెప్పటాన్ని కోర్టు తప్పుపట్టింది.’ ప్రధాన మంత్రి దేశం మొత్తానికి ప్రధాని తప్ప ఒక పార్టీకి కాదు…హర్యానా, పంజాబ్‌ దే శంలో భాగం కాదా అని ప్రశ్నించింది. అంతే కాదు, హింసాకాండలో నష్టపడిన వారు అధికారయంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని తనిఖీ చేసి కోర్టుకు నివేదించాలని, ఈ నష్టాన్ని దానికి బాధ్యులైన వారి నుంచి రాబట్టాలని కూడా కోర్టు పేర్కొన్నది.

కేరళలోని తిరువనంతపురంలో వ్యక్తిగత వివాదంలో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీ పర్యటించటం, గవర్నర్‌ జోక్యం చేసుకోవటం వంటి చర్యలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు నానా యాగీచేశారు. గుర్మీత్‌ మద్దతుదార్ల చేతుల్లో 31 మంది హత్యకు గురికావటం, 250 మందికిపైగా గాయపడటం, పెద్ద సంఖ్యలో ఆస్తినష్టం. రైళ్లు, బస్సులు రద్దయి, కొన్ని చోట్ల కర్ఫ్యూవిధించటంతో లక్షలాది ప్రయాణీకులు, సామాన్య నానా ఇబ్బందులు పడితే, పడుతుంటే బిజెపి నేతలకు చీమైనా కుట్టకపోగా నెపాన్ని సంఘవ్యతిరేక శక్తుల మీదకు నెడతారా ? గుండెలు తీసిన బంట్లు వీరని అనిపించటం లేదా !

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిల్లర రాజకీయాలు వద్దు, చిన్న పిల్లలను కాపాడండి యోగి మహాశయా !

20 Sunday Aug 2017

Posted by raomk in BJP, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Amitshaw, BJP, BJP’s trolling army, BRD Medical College and Hospital, Dr Kafeel Ahmad Khan, Gorakhpur deaths, petty politics, save the children, UP CM, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది రోజులుగా వుత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన వార్తలు ఇంతవరకు కొన్ని అంశాలను నిర్ధారించాయి. నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా బిజెపి తరఫున రాబోయే రోజులలో కాబోయే ప్రధానిగా ప్రచారంలో వున్న యోగి ఆదిత్యనాధ్‌ పాలనకు ఇతరులకు పెద్ద తేడా లేదు. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటం, ఇతరుల మీద నెట్టటంలో ఎవరికీ తీసిపోరు. ప్రజల పట్ల జవాబుదారీ తనం లేదు. కొద్ది రోజుల క్రితం ఆదిత్యనాధ్‌ సోదరి సామాన్యుల మాదిరే ఒక టీ దుకాణం నడుపుకొంటోందని ఈ వుదంతం యోగికి బంధుప్రీతి లేదని చెప్పేందుకు పక్కా నిదర్శనం అని ప్రచారం జరిగింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు స్వయం సేవకుడిగా వున్నపుడు పారిశుధ్య పని చేసిన నిగర్వి అంటూ ఒక ఫొటోను ఆయన భక్తులు సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున తిప్పారు. గతంలో ఏ కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల నాయకులకు లేని వ్యక్తిత్వాన్ని, గతాన్ని సృష్టించేందుకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఒక వేళ అలాంటివి వుంటే కాషాయ తాలిబాన్లు, మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) బయట పెడితే లోకానికి మేలు చేసిన వారవుతారు. కాషాయ పరివారం వీరుడు, శూరుడు అని పొగిడే విడి సావర్కర్‌ చరిత్రను చూస్తే ఆయన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని ప్రేమ లేఖలు రాసిన విషయం తెలిసిందే. అంతే కాదు, బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక హీరోగా, వీరుడిగా వర్ణించటానికి తగిన వ్యక్తి సావర్కర్‌ అన్నట్లుగా తనకు తానే చిత్రగుప్తుడనే మారుపేరుతో రాసిన పుస్తకంలో రాసుకున్న ఘనుడు. అందువలన ఆయన పరంపరలో ముందుకు వస్తున్నవారికి లేని గొప్పలను ఆపాదించటంలో విశేషం ఏముంది. మహా అయితే ఎవరన్నా ‘దేశద్రోహులు’ ఈ విషయాన్ని ప్రస్తావిస్తే అది మా విశ్వాసం, మా మనోభావాలను దెబ్బతీశారంటూ దాడులకు దిగుతారు.https://thewire.in/140172/veer-savarkar-the-staunchest-advocate-of-loyalty-to-the-english-government/

అందువలన యోగి గారి సోదరి కథను నమ్మటమా లేదా అన్నది పక్కన పెడదాం. ఆయన మఠానికి దగ్గరలో వున్న గోరఖ్‌పూర్‌ బిఆర్‌డి ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో పిల్లలు మరణిస్తున్నారనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ చనిపోవటం కొత్తగా జరుగుతున్నదేమీ కాదని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా మహాశయుడే నిర్ధారించారు. అలాంటి దాని గురించి సామాజిక, సాంప్రదాయక మీడియాలో పెద్ద చర్చ, ఆరోపణలు, ప్రత్యాపరోపణలు ఇప్పటికీ వస్తుంటే భవ బంధాలు, రాగ ద్వేషాలు వుండకూడని, నిజం తప్ప అబద్దాలు చెప్పకూడని ఒక యోగి చిల్లర రాజకీయాలు తప్ప నిజాయితీతో కూడిన ఒక ప్రకటన చేసి దానికి స్వస్తి వాక్యం పలకలేదేం ? ఇదేమి జవాబుదారీతనం. లేదూ విచారణకు ఆదేశించాం అప్పటి వరకు మాట్లాడకూడదు అంటే విచారణ నివేదికలు నిర్ధారించేంత వరకు ఆగకుండా కొందరు వైద్యులపై చర్యలెందుకు తీసుకున్నట్లు ?

గత కొద్ది రోజులుగా మీడియాలో రాసిన వార్తలు, రాయించిన వార్తలను చదివిన వారికి, టీవీలలో చూసిన వారికి ‘మెదడు వాపు ‘ వ్యాధి వచ్చేట్లుగా వుంది. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో మెదడువాపు వ్యాధి విభాగపు అధిపతిగా పని చేస్తున్న డాక్టర్‌ కఫీల్‌ అహమ్మద్‌ సదరు ఆసుపత్రికి అనుబంధంగా వున్న మెడికల్‌ కాలేజీలో పిల్లల వైద్య సహాయ ఫ్రొఫెసర్‌గా బోధన కూడా చేస్తున్నారు.అందువలన ఆయన ఆక్సిజన్‌ కొరత గురించి తెలుసుకొని ఇతర స్నేహితుల నుంచి అరువుగా లేదా కొనుగోలు చేసి సిలిండర్లను తెచ్చి ఎందరో పిల్లలను కాపాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.ఆయన ఆక్సిజన్‌ తెప్పించిన విషయాన్ని అభినందించకపోతే పోయే వాటి గురించి తన ప్రతిష్టను పెంచుకొనేందుకు మీడియాలో ఆయన అలా రాయించుకున్నాడని కొంత మంది చెబుతున్నారు.ఆ వార్తలు వచ్చిన వెంటనే బహుశా వాటిని రాయటంలో వెనుకబడిన కొన్ని మీడియా సంస్ధలు చద్ది వార్తలే ఇస్తే తమకు ‘లాభం’ ఏముంటుంది అనుకున్నాయోమో ఆయన తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి సిలిండర్లను దొంగతనం చేశాడని, అలా తస్కరించిన వాటిని తన, ఇతర ఆసుపత్రుల నుంచి తిరిగి తెప్పించాడు తప్ప అందరూ అనుకున్నట్లు ప్రాణదాతేమీ కాదని మరుసటి రోజునే ప్రచురించాయి. ఒక బిజెపి మహిళా నాయకురాలు ఆయన అత్యాచారాలు చేశాడన్న ప్రచారం మొదలెట్టింది. విద్యార్ధిగా వుండగా ఒకరి బదులు మరొకరికి పరీక్ష రాసిన కేసులో అరెస్టయ్యాడని మరొక వార్త.ఆయనపై క్రిమినల్‌ కేసు వున్న కారణంగా మణిపాల్‌ విశ్వవిశ్వవిద్యాలయం ఆయనను సస్పెండ్‌ చేసిందని మరొక వార్త. ఇలా ఇంకా రాబోయే రోజుల్లో ఏమేమి ఆపాదిస్తారో తెలియదు.సదరు వైద్యుడు ఎందరినో కాపాడారని రాసిన వార్తలను సహించలేక ఆయనపై ఇన్ని ఆరోపణలు లేదా పాత విషయాలను( ఎంతవరకు నిజమో తెలియదు) తవ్వి సామాజిక మాధ్యమంలోపరువు తీయటం అవసరమా ? వారికి దురుద్ధేశ్యం తప్ప మరొకటి కనపడటం లేదు.

సదరు డాక్టర్‌పై తీసుకున్న చర్య గురించి కూడా మీడియాలో వార్తలు తప్పుదారి పట్టించేవిగా వున్నాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమ నోడల్‌ అధికార బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. మెదడువాపు వ్యాధి నివారణకు సదరు సంస్ధ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని పని చేస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం ఆయనపై నమోదు చేసిన అత్యాచార ఆరోపణలో వాస్తవం లేదని ఆ కేసును పోలీసులు మూసివేశారు. అయినా ఆయనొక రేపిస్టు అని నేను విన్నా అని బిజెపి నాయకురాలు ట్వీట్‌ చేసింది. సినిమా నటుడైన బిజెపి ఎంపీ పరేష్‌ రావల్‌ దానిని సమర్ధిస్తూ చెద పురుగుల తెగ దృష్టిలో హీరో అని పేర్కొన్నాడు. డాక్టర్‌ ఖాన్‌ను బలిపశువును చేశారని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో విమర్శించింది. ప్రజారోగ్యాన్ని యోగి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నది.వైద్య విద్య డైరెక్టర్‌ జనరల్‌ చేసిన మౌలిక ఆరోపణ ప్రకారం ఆక్సిజస్‌ సిలిండర్లను తన ఆసుపత్రి నుంచి సేకరించటం అని న్యూస్‌18 వార్త పేర్కొంటే ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా చర్య తీసుకున్నట్లు హిందుస్తాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది. గతేడాది సెప్టెంబరు ఎనిమిది నుంచి డాక్టర్‌ ఖాన్‌ ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం లేదని చెబుతున్నారు.

నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌తో వున్న మన దేశ సరిహద్దులను కాపాడే సహస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బి) ప్రజాసంబంధాల అధికారి ఓపి సాహు ఇలా చెప్పారు.’ ఆగస్టు పదిన బిఆర్‌డి మెడికల్‌ కాలేజీలో అసాధారణ సంక్షోభ పరిస్ధితి ఏర్పడింది. డాక్టర్‌ కఫిల్‌ ఖాన్‌ ఎస్‌ఎస్‌బి డిఐజి వద్దకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను సేకరించి మెడికల్‌ కాలేజీకి తరలించేందుకు ఒక ట్రక్కు కావాలని అడిగారు.బిఆర్‌డి మెడికల్‌ కాలేజీ సిబ్బందికి సహకరించేందుకు డిఐజి పదకొండు మంది జవాన్లను కూడా ట్రక్కుతో పాటు పంపారు. మా క్క్రు కొద్దిగంటల్లోనే వివిధ ప్రాంతాల నుంచి ఖలీలాబాద్‌లోని ఒక గోడౌన్‌ నుంచి కూడా సిలిండర్లను సేకరించి తీవ్ర సంక్షోభం వున్న మెడికల్‌ కాలేజికి తరలించారు.’

పిల్లల మరణాల వార్తలు వెలువడగానే ఆక్సిజన్‌ సరఫరా లేక మరణించారనటాన్ని యోగి సర్కార్‌ తోసి పుచ్చింది. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ రౌటెల ఒక ప్రకటన చేసి ఇతర కారణాలతో మరణించినట్లు చెప్పిన దాన్ని ఆరోగ్య మంత్రి కూడా చిలుక పలుకుల్లా వల్లించాడు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి నాలుగవ తేదీ వరకు ఆక్సిజన్‌ కొరత గురించి తన కార్యాలయానికి తెలియదని, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటానని దానికి ప్రిన్సిపల్‌, ఇతరులే కారణమని ఆరోపించారు.

మార్చి 22నే ప్రిన్సిపల్‌ రాజీవ్‌ మిశ్రా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌కు ఆక్సిజన్‌ సరఫరాదారు పుష్పా సేల్స్‌ వారి లేఖను కూడా జతపరచి చెల్లింపుల గురించి తెలిపారు. తిరిగి ఏప్రిల్‌ మూడున అదనపు ఛీఫ్‌ సెక్రటరీకి పుష్సా సేల్స్‌ తాజా లేఖను జతపరచి మరోసారి రాశారు. రెండు లేఖలకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.ఆగస్టు ఒకటిన మరోసారి అదనపు చీఫ్‌ సెక్రటరీకి రాసి దాని కాపీని మంత్రికి పంపారు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిలో సమీక్ష సందర్భంగా ఆరోజు వుదయం బిల్లుల చెల్లింపు గురించి ఆరోగ్యశాఖ మంత్రికి స్వయంగా తాము లేఖను అంద చేశామని, ఆరోజు సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తేగా ఏమిటి అన్నట్లు ప్రశ్నార్ధకంగా యోగి మంత్రివైపు చూసి తరువాత మౌనంగా వుండిపోయినట్లు తమకు తెలిసిందని పుష్పా సేల్స్‌ ప్రతినిధులు టెలిగ్రాఫ్‌ పత్రికతో చెప్పారు. యోగి కాలేజీ నుంచి వెళ్లిపోయిన తరువాత ఆ సాయంత్రమే సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. అంటే ఒక చిన్న వ్యాపార సంస్ధ కూడా యోగి పని తీరు మీద విశ్వాసం కోల్పోయిందన్నది స్పష్టం.

మరణాలకు బాధ్యత వహిస్తూ ఆగస్టు 12న రాజీనామా చేసిన మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజీవ్‌ మిశ్రా మరుసటి రోజు చేసిన ఓ ప్రకటనలో ఆక్సిజన్‌ సరఫరాదారుకు డబ్బు చెల్లించటంలో బ్యూరాక్రటిక్‌ పద్దతులు, ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ పర్యటనే కారణమని విమర్శించారు. ఆక్సిజన్‌ సరఫరాదారుకు చెల్లించేందుకు తాము ఐదవ తేదీనే నిధులు విడుదల చేశామని, సకాలంలో ప్రిన్సిపల్‌ చెల్లించలేదని వైద్య విద్య శాఖ మంత్రి అశుతోష్‌ టాండన్‌ చెప్పారు. రెండు కోట్ల రూపాయలు విడుదల చేయాలని జూలై నెలలోనే మూడు నాలుగు లేఖలు రాశానని ఐదవ తేదీన నిధులు విడుదల చేశారని డాక్టర్‌ మిశ్రా చెప్పారు. ఆగస్టు ఐదవ తేదీ శనివారం, నిధుల విడుదల ఆదేశాలు మాకు ఏడవ తేదీన అందాయి. బిల్లు ఓచర్‌ను ఏడవ తేదీన ట్రెజరీకి పంపాము, వారు ఎనిమిదవ తేదీన టోకెన్‌ విడుదల చేశారు.తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ ఆసుపత్రి సందర్శనకు వచ్చిన కారణంగా ఆసుపత్రి యంత్రాంగమంతా తీరికలేకుండా వుంది.పదవ తేదీన మాత్రమే 52లక్షల రూపాయలను ఆక్సిజన్‌ సరఫరాదారు ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా కోరుతూ బ్యాంకుకు పంపగలిగాము.మెడికల్‌ కాలేజీ, ఆక్సిజన్‌ సరఫరాదారు బ్యాంకు ఖాతాలు వేర్వేరు చోట్ల వున్నందున బ్యాంకు బదిలీ చేసే అవకా శం లేదు, రెండు బ్యాంకుల మధ్య నగదు బదిలీకి ఒక రోజు వ్యవధి పడుతుంది. అని మిశ్రా చెప్పారు. పదవ తేదీ మధ్యాహ్నం ఆక్సిజన్‌ సరఫరాదారు నుంచి ఫోన్‌ వచ్చింది, తదుపరి ట్రక్కు సిలిండర్లను పంపే అవకా శం లేదని వారు చెప్పారు. నిధులు విడుదల చేశామని బ్యాంకులో ఆలశ్యం అవుతున్నదని, మీ ఖాతాకు నిధులు అందుతాయని చెప్పానని, అయితే సిలిండర్ల సరఫరా నిలిపివేస్తారని తాను ఊహించలేదని డాక్టర్‌ మిశ్రా అన్నారు.

యోగులు మఠాలకే పరిమితం అయితే ఒక తీరు, అలాగాక ప్రజాజీవనంలోకి వచ్చి, అధికారపదవులు కూడా స్వీకరించిన తరువాత వారినేమీ ప్రశ్నించకూడదు అంటే కుదరదు. పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించటం వాస్తవం. ఆ సంబంధిత వార్తలతో పాటు ఆసుపత్రి, దాని పరిసరాలు, అసలు మొత్తంగా గోరఖ్‌పూర్‌ పరిసరాలన్నీ ఆశుభ్రత నిలయాలుగా వున్నాయని కూడా వార్తలు వచ్చాయి. మెదడు వాపు వ్యాధి కారణంగా ఆ ప్రాంతంలో పిల్లలు, ఇతరులు మరణించటం కూడా ఎక్కువగానే వుందని వెల్లడైంది. సరే ఎవరైనా మూడు నెలల్లోనో, ఆరునెలల్లోనే అద్భుతాలు చేయగలరని ఎవరూ అనుకోరు. యోగులైనా అంతే.మరణించిన పిల్లల తలిదండ్రులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గోరఖ్‌ పూర్‌ వెళతానని ప్రకటించటంతో యోగికి పూనకం వచ్చింది. ఆగ్రహంతో వూగిపోయారు. గోరఖ్‌పూర్‌ను ఒక విహార కేంద్రంగా మార్చవద్దని ఎదురుదాడి ప్రారంభించారు.(కేరళలో వ్యక్తిగత కక్షలు లేదా కారణాలతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే కేంద్ర మంత్రి పరామర్శకు వెళ్లటం సరైనదే అయితే 70 మందికి పైగా పిల్లలు మరణించిన వుదంతంలో రాహుల్‌ గాంధీ పరామర్శించటం తప్పెలా అవుతుందో మరి) స్వచ్చ వుత్తర ప్రదేశ్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరే షరా మామూలుగా గత ప్రభుత్వాలు కనీస సదుపాయలు కల్పించలేదని చెప్పారనుకోండి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మన యోగి గారు పాతికేండ్లుగా, అంతకు ముందు ఆయన సీనియర్‌ యోగి గోరఖపూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధిగా వున్నారు. ప్రతి ఏటా తమ కనుసన్నలలో వుండే బిఆర్‌డి ఆసుపత్రిలో పిల్లలు చని పోతుంటే, ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా తయారైతే, మెదడు వాపు వ్యాధి ప్రబలంగా వుంటే ఎంపీగా ఆయన లేదా స్ధానిక బిజెపి ఎంఎల్‌ఏలు ఏం చేస్తున్నారు. ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నారు. మూడు సంవత్సరాలుగా నరేంద్రమోడీ స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో కనీసం ఆసుపత్రి పరిసరాలను అయినా బాగు చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి?ఎంపీగా ఏం పట్టించుకున్నట్లు ? తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి కేరళ ఆసుపత్రులలో చేర్చుకోని కారణంగా మరణించాడు. ఆ ఘటన మీద కేరళ ముఖ్యమంత్రి విచారం వెలిబుచ్చారు. రాగ ద్వేషాలకు అతీతంగా వుండే, వుండాల్సిన యోగి బిఆర్‌డి ఆసుపత్రికి నిధులు సకాలంలో విడుదల కాలేదన్న విమర్శలు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించి భవిష్యత్‌లో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చూస్తామని చెబితే ఆయన గౌరవం మరింత పెరిగి వుండేది. ఇంత రాద్దాంతం జరిగేది కాదు.కానీ చేసిందీ, జరిగిందేమిటి? ముందసలు తనకు తెలియదన్నారు ముఖ్యమంత్రి. ఇలాంటివి కొత్తగా జరగటం లేదని తేల్చిపారేశారు అమిత్‌ షా. యోగి ప్రభుత్వం, బిజెపి మరుగుజ్జు యోధులు, బిజెపి మెప్పుపొందేందుకు తహతహలాడిన మీడియా చౌకబారు రాజకీయాలకు పాల్పడింది. విమర్శకులపై ఎదురుదాడికి దిగింది. యోగి సర్కార్‌ పని తీరును బజారుకు ఈడ్చింది.

యోగి ఆదిత్యనాధ్‌ ఒక పర్యటన సందర్భంగా దళితులు శుభ్రంగా లేరని వారికి సబ్బులు, షాంపూలు ఇచ్చి స్నానాలు చేయించి, వారెక్కడ యోగిని ముట్టుకుంటారో అని లేవకుండా చేసేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇపుడు ప్రజల ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న అధికార యంత్రంగాన్ని మొత్తంగా శుద్ధి చేయటానికి ఎన్ని సబ్బులు వాడాలో తెలియదు. మొత్తం మీద ఈ వుదంతం బిజెపి, యోగి సర్కార్‌, యోగికి వ్యక్తిగతంగా చెప్పుకోలేని చోట దెబ్బ కొట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కావాల్సింది చిల్లర రాజకీయాలు కాదు, చిన్న పిల్లల ప్రాణాలు కాపాడండి యోగి మహాశయా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారతీయ మహిళలు ఆవు ముసుగులెందుకు ధరిస్తున్నారు ?

28 Wednesday Jun 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP’s trolling army, cow masks, Hindu Fundamentalism, Hindu supremacy, Hinduthwa, Indian women wearing cow masks, Narendra Modi, trolling army

గీతా పాండే బిబిసి న్యూస్‌, ఢిల్లీ

భారత దేశంలో పశువుల కంటే మహిళలు తక్కువ ప్రాధాన్యత కలిగిన వారా అనే తుపాకి మందులా పేలే ప్రశ్న వేస్తూ ఆవు ముసుగులు ధరించిన మహిళల ఫొటోలు దేశంలో వైరస్‌ మాదిరి వ్యాపించాయి. వాటిని తీసిన 23 సంవత్సరాల ఫొటో గ్రాఫర్‌ హిందూ జాతీయవాద మరుగుజ్జు యోధుల(ట్రోల్స్‌) ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు.

‘ఒక మహిళకంటే ఆవులను ప్రాముఖ్యత కలిగినవిగా పరిగణించటాన్ని చూసి నేను విహ్వలనయ్యాను. అనేక మంది హిందువులు పవిత్రమైనదిగా భావించే ఆవు కంటే అత్యాచారం లేదా దాడికి గురైన ఒక మహిళకు న్యాయం జరగటానికి ఎక్కువ కాలం పడుతోంది.’ అని ఢిల్లీకి చెందిన ఫొటోగ్రాఫర్‌ సుజాత్రో ఘోష్‌ బిబిసితో చెప్పారు. మహిళలపై నేరాల విషయంలో భారతదేశం తరచూ వార్తలకు ఎక్కుతోంది.ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి పదిహేను నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది.

‘నిందితులకు శిక్ష పడటానికి ముందు కోర్టులలో ఈ కేసులు సంవత్సరాల తరబడి నడుస్తున్నాయి. అదే ఒక ఆవును వధిస్తే హిందూ వుగ్రవాద బృందాలు తక్షణమే వెళ్లి ఆవును వధించినట్లు అనుమానించిన వారిని చంపటమో కొట్టటమో చేస్తున్నాయి.’ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ 2014 వేసవిలో అధికారానికి వచ్చిన తరువాత ధైర్యం తెచ్చుకున్న గో రక్షక బృందాల ప్రభావం పెరిగిపోవటంపై తాను తీసిన ఫొటోల కార్యక్రమం ‘తనకు తోచిన పద్దతిలో నిరసన’ అని అతడు చెప్పాడు.

‘విచారణ చేయకుండా చంపిన దాద్రీ వుదంతం( గొడ్డు మాంసాన్ని తిని, నిలవ చేశాడనే పుకార్లతో ఒక హిందూ గుంపు ఒక ముస్లింను హత్య చేసినవుదంతం) ఇంకా అలాంటివే ముస్లింలపై గోరక్షకులు చేసిన ఇతర మతపరమైన దాడులతో ఆందోళన చెందా’ అన్నాడు ఘోష్‌.

ఇటీవలి నెలల్లో భారత్‌లో సమీకరణలకు ఆవు అత్యంత ముఖ్యమైన జంతువుగా మారింది.ఆ జంతువు పవిత్రమైనదని, దానిని రక్షించాలని బిజెపి నిర్దేశిస్తోంది. అనేక రాష్ట్రాలలో గోవధను నిషేధించాయి, నేరం చేసిన కఠిన శిక్షలను ప్రవేశపెట్టాయి మరియు ఆ నేరం చేసినందుకు మరణశిక్షను విధించేందుకు వీలుగా ఒక బిల్లు పెట్టటం గురించి పార్లమెంట్‌ పరిశీలిస్తోంది.

అయితే ముస్లింలు, క్రైస్తవులు మరియు కోట్లాది మంది తక్కువ కుల దళితులకు( గతంలో అంటరానివారు) గొడ్డు మాంసం ముఖ్యమైనది. గో రక్షణ గుంపులు చేస్తున్న దుష్కార్యాలకు వారే గురి అవుతున్నారు. ఆవు పేరుతో గత రెండు సంవత్సరాలలో దాదాపు డజను మంది హత్యకు గురయ్యారు.తరచుగా నిరాధారమైన పుకార్ల ప్రాతిపదికన లక్ష్యాలను నిర్ణయిస్తున్నారు అంతే కాదు పాలకోసం ఆవులను తరలిస్తున్నపుడు కూడా ముస్లింలపై దాడులు చేశారు.

ఘోష్‌ తూర్పు ప్రాంత పట్టణమైన కొల్‌కతాకు( గతంలో కలకత్తా) చెందిన వారు.’కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చిన తరువాతే ‘ ప్రమాదకరమైన మతం మరియు రాజకీయాల కలగలుపు గురించి ‘ తెలిసిందన్నారు.’ఈ ఫొటోల కార్యక్రమం మౌనంగా జరిపే ఒక నిరసన రూపం, అది తగిన ప్రభావం చూపుతుందని నేను అనుకుంటున్నా’ అన్నారు. ఈనెల ప్రారంభంలో న్యూయార్క్‌ సందర్శన సందర్భంగా ఒక దుకాణంలో ఆవు ముసుగును కొనుగోలు చేశారు. తిరిగి వచ్చిన తరువాత సందర్శకులు సంచరించే ముఖ్యకేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, వీధులు, ఇళ్లు, పడవలు, రైళ్లలో ఆవు ముసుగులు ధరించిన మహిళలతో ఫొటోలు తీశారు. ఎందుకంటే ప్రతి చోటా మహిళలు దాడికి అనువుగా వుంటారు.

‘ సమాజంలోని అన్ని భాగాల నుంచి మహిళల ఫొటోలు తీశాను. రాజకీయాలు, మతం ఎక్కువ చర్చలు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతాయి రాజధాని నగరం కేంద్రం కనుక ఈ కార్యక్రమాన్ని నేను ఢిల్లీ నుంచి ప్రారంభించాను. భారత్‌లో ఎక్కువ మంది సందర్శించే స్ధలాలో ఒకటైన సరూపమైన ఇండియా గేట్‌ దగ్గర తొలి చిత్రం తీశాను. తరువాత రాష్ట్రపతి భవనం ఎదుట ఒక మోడల్‌తో తీశాను.మరొకటి కొలకతాలోని హుగ్లీ నదిలో పడవపై హౌరా వంతెన నేపధ్యంలో తీశాను.’ అన్నాడు. అతడు ఎంచుకున్న మోడల్స్‌ ఇంత వరకు అందరూ స్నేహితులు, బాగా తెలిసిన వారే ఎందుకంటే ‘ ఇది ఒక సున్నితమైన అంశం, దీనికి కొత్త వారిని సంప్రదించటం కష్టం అవుతుంది’ అన్నాడు.

రెండు వారాల క్రితం ఇనస్టాగ్రామ్‌లో అతను ప్రారంభించిన ఫొటోల కార్యక్రమానికి ‘అంతా సానుకూల ‘ స్పందనే వచ్చింది. తొలి వారంలో అది వైరస్‌ మాదిరి వ్యాపించింది. నా శ్రేయోభిలాషులు, చివరికి నాకు తెలియని వారు కూడా నన్ను అభినందించారు.’ అయితే భారతీయ మీడియా వాటిని ప్రచురించి ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో వాటి కధనాలను పెట్టిన తరువాత ప్రతి క్రియ ప్రారంభమైంది.’ కొంత మంది నన్ను బెదిరిస్తూ వ్యాఖ్యలు రాశారు.ట్విటర్‌ మీద నన్ను వెంటాడటం ప్రారంభించారు. నన్ను, నా మోడల్స్‌ను ఢిల్లీ జమా మసీదుకు తీసుకువెళ్లి వధిస్తామని, మా మాంసాన్ని ఒక మహిళా జర్నలిస్టు, రచయిత్రికి తినిపిస్తామంటూ జాతీయ వాదులు తమ ఏహ్య భావాన్ని వెల్లడించారు. నా శవాన్ని చూసి నా తల్లి ఏడవటాన్ని చూడాలని వుందని వారు చెప్పారు.’ కొందరు ఢిల్లీ పోలీసులను కూడా సంప్రదించారు.నేను కొట్లాటలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నానని అరెస్టు చేయాలని కోరారు.’

తీవ్ర వ్యాఖ్యలు వెలువడటంపై ఘోష్‌ ఆశ్చర్యపడలేదు,తీవ్ర వ్యంగ్యంతో కూడిన తన ఫొటోలు పరోక్షంగా బిజెపిపై చేసిన వ్యాఖ్య అని ఘోష్‌ అంగీకరించారు.నేను రాజకీయ ప్రకటన చేస్తున్నాను, ఎందుకంటే అది రాజకీయ అంశం కనుక, అయితే మనం విషయాలలోకి లోతుగా వెళితే అక్కడ మనకు ఎల్ల వేళలా హిందూ ఆధిపత్యం కనిపిస్తుంది. గత రెండు సంవత్సరాలలో ఈ ప్రభుత్వంతో అది బహిర్గతమైంది.’ బెదిరింపులు అతనిని భయపెట్టలేదు.’ నేను భయపడలేదు, ఎందుకంటే ఒక మంచి కోసం నేను పని చేస్తున్నాను’ అన్నాడు.

ఈ ఫొటోల కార్యక్రమం తరువాత ఒక సానుకూల అంశమేమంటే ప్రపంచమంతటి నుంచి అనేక మంది మహిళలు తాము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములం అవుతామని సందేశాలు పంపారు. అందువలన ఆవు ప్రయాణిస్తూనే వుంటుంది అన్నాడతడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎందుకు రైతులు ఆందోళనకు దిగుతున్నారు ?

18 Sunday Jun 2017

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

BJP, bjp cow politics, Farm prices, Farmers, Farmers agitations, indian farmers

ఎం కోటేశ్వరరావు

ఎందుకిలా జరుగుతోంది ? రాబోయే (ముందస్తు లేదా నిర్ణీత గడువు ప్రకారం జరిగే) ఎన్నికలలో కూడా తమదే అధికారం అని కలల పడవలో ప్రశాంత అలల మధ్య తేలి పోతున్న బిజెపి నేతలకు అనుకోని రీతిలో రైతుల ఆందోళనలనే కుదుపులు ఎందుకు తగులున్నాయి? అవీ మూడేండ్ల సంబరాల సమయంలో అని ప్రతిపక్షాల కంటే బిజెపి అభిమానులు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలు నిలదీసి ఎందుకు అని ప్రశ్నించకుండా మనకెందుకులే అని తప్పుకోవటాన్నే మన పురాతన నాగరికత, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర నేర్పాయా ? మన వివేచనను నీరుగార్చాయా అన్న అనుమానం కలుగుతోంది. తమ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా సమృద్ధిగా పంటలు పండాయని మూడు సంవత్సరాల విజయ గాధలలో మోడీ సర్కార్‌ పేర్కొన్నది. వ్యవసాయం వుమ్మడి జాబితాలో వుంది. ప్రధానంగా రాష్ట్రాల అంశం, అయినప్పటికీ ఘనత తనదే అని మోడీ చెప్పుకున్నారు. మరి అలాంటి ఘనత సాధించిన వారి హయాంలో రైతులు రోడ్లెక్కటం ఏమిటి? దానికి ఎవరు బాధ్యత వహించాలి. ఆకాశాన్ని అంటిన పప్పుల ధరలు తగ్గగానే సామాజిక మాధ్యమాలలోని మోడీ భక్తులు ఆ ఘనత తమ నేతదే అని ప్రచారం చేశారు. ఆ తగ్గుదలకు మూల్యం చెల్లించింది ఎవరు ? ధరలు పతనమై నష్టాలు వచ్చాయని ఒక్క వ్యాపారీ దివాళా ప్రకటించలేదు, ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు లేవు.ఆ దుర్గతి రైతులకే ఎందుకు పట్టింది. పప్పు ధాన్యాల ధర తమకు గిట్టుబాటు కాని రీతిలో పతనమైందనే కదా మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ రైతులు ఆందోళనకు దిగింది. పప్పుల ధరలు పెరగగానే వాటిని తగ్గించే పేరుతో బిజెపికి అన్ని విధాలుగా సాయపడిన పారిశ్రామిక, వాణిజ్యవేత్త అదానీ కంపెనీలకు పప్పుల దిగుమతికి, వాటిని అధిక ధరలకు అమ్ముకొని విపరీత లాభాలు సంపాదించేందుకు అవకాశం కల్పించింది ఎవరు ? రైతులకు గిట్టుబాటు కాని రీతిలో ధరలు పతనమైతే మోడీ సర్కార్‌ లేదా బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోలేదు ? ఎవరు ఆదుకోవాలి? తాజా రైతు ఆందోళన ఏమి తెలియ చేస్తున్నది? అతివృష్టి, అనావృష్టికి బలయ్యేది రైతులే, అలాగే పంటలు బాగా పండినా, పండకపోయినా ప్రభావితులవుతున్నదీ రైతులే. ఏది జరిగినా నష్టాలే వస్తున్నాయి.

ఖమ్మంలో పతనమైన ధర గురించి ఆందోళన చేసిన మిర్చి రైతులు సంఘవ్యతిరేశక్తులని మంత్రులు, వారి వంది మాగధులు ప్రకటించారు. తీరా సామాన్య రైతులకు బేడీలు వేసి వీధులలో తిప్పి జైలుకు పంపారు. మధ్య ప్రదేశ్‌ పాలకులు మరొక అడుగు ముందుకు వేసి రైతులు పోలీసులు కాల్పులలో మరణించలేదన్నారు, వారసలు రైతులే కాదు పొమ్మన్నారు, మరణించిన వారిలో గంజాయి స్మగ్లింగ్‌ కేసులున్న నేరగాళ్లున్నారని ప్రచారం చేశారు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి తరువాత మరణించిన ప్రతి రైతు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? రైతులను కాల్చి చంపించటమే గాక ఎదురుదాడి వ్యూహంలో భాగంగా రైతులు హింసాకాండకు స్వస్ధి చెప్పాలని ఒక బిజెపి ముఖ్య మంత్రి స్వయంగా నిరాహార దీక్ష చేస్తారని పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారో లేదో తెలియదు గానీ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆపని చేశారు. అంతకంటే విచిత్రం, విపరీతం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు విభాగం భారతీయ కిసాన్‌ సంఘ్‌ తాము కూడా రైతు సమస్యలపై ఆందోళన జరపనున్నట్లు ప్రకటించింది. అంతరించిపోగా అవశేషాలు మిగిలినట్లు ఇంకా బుర్రలు మిగిలిన వారికి ఎందుకిలా జరుగుతోంది ? అనే ప్రశ్న ఎదురవుతోంది.

2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది బిజెపి. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ కిసాన్‌ సంఘ్‌ వుపాధ్యక్షుడు ప్రభాకర్‌ కేల్కర్‌ ఫస్ట్‌ పోస్ట్‌ అనే వెబ్‌ పత్రికతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అమలు జరపని కారణంగా రైతులలో ఆగ్రహం పేరుకుపోయినందున ఆందోళన అనివార్యమని అయితే హింసా పద్దతులకు తాము వ్యతిరేకమని చెప్పుకున్నారు. రైతులు కనీస మద్దతు ధరలను పొందటం లేదని, తదుపరి సాగునిమిత్తం పెట్టుబడుల కోసం తమ వుత్పత్తులను తెగనమ్ముకోవటం వంటి పరిణామాలు రైతుల ఆందోళనకు కారణాలని ఆ పెద్దమనిషి చెప్పాడు. అయినా బిజెపి సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు. తొలుత రైతుల ఆందోళనలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం మధ్యలో చర్చల పేరుతో శకుని పాత్ర పోషించి వైదొలిగింది. వాస్తవాలు ఇలా వుంటే కాంగ్రెస్‌ను భూస్తాపితం చేశామని, వామపక్షాలు వునికి కోల్పోయాయని ఒకవైపు ఇప్పటికే ప్రకటించేసి, అదే నోటితో రైతుల ఆందోళనల వెను వారున్నారని బిజెపినేతలు ఆరోపించారు. అవి నోళ్లా లేక మరేవైనానా ?

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయాయి. అవి సబ్సిడీలు కావచ్చు, మరొక సేవ రూపంలోని కావచ్చు. అదే సమయంలో నియంత్రణలు ఎత్తివేసిన కారణంగా ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. రెండో వైపు మార్కెట్‌ను ప్రయివేటు వ్యాపారులు అదుపు చేస్తున్న కారణంగా రైతాంగానికి ఒక స్ధిరమైన ఆదాయాలు వుండటం లేదు. పంటలు దెబ్బతినటంతో పాటు విద్య, వైద్యం వలన కూడా అన్ని తరగతుల వారితో పాటు రైతాంగం అదనంగా అప్పులపాలవుతున్నారు.ఈ ఏడాది రైతులకు పత్తి ధరలు గతేడాది కంటే కాస్త మెరుగ్గా వున్నాయి.దాంతో నూలు, వస్త్ర మిల్లు యజమానుల లాభాలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అని భయపడిన నరేంద్రమోడీ సర్కార్‌ గత కాంగ్రెస్‌ పాలకులను పక్కకు తోసి పత్తి దిగుమతులలో సరికొత్త రికార్డును సాధించింది. గత మూడు సంవత్సరాలలో(2013-14 నుంచి 2016-17) మన దేశం నుంచి జరిగిన పత్తి ఎగుమతులు 363.75 నుంచి 162.71 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దిగుమతులు 39.44 నుంచి 94.66 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఒక్క పత్తి విషయంలోనే కాదు ఇదే కాలంలో మొత్తం మన వ్యవసాయ, అనుబంధ వుత్పత్తుల ఎగుమతులు 4236.26 నుంచి 3382.14 కోట్ల డాలర్లకు పడిపోగా దిగుమతులు 1552.89 నుంచి 2563.64 కోట్ల డాలర్లకు పెరిగాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో రైతుల వుద్యమం తలెత్తిన ప్రాంతాలు పప్పుధాన్యాల సాగుకు ప్రసిద్ది. ఈ మూడు సంవత్సరాలలో వాటి దిగుమతి 182.81 నుంచి 424.42 కోట్ల డాలర్లకు పెరిగాయి. అంటే ప్రభుత్వ దిగుమతి విధానాలు ఈ రెండు రాష్ట్రాల పప్పుధాన్యాల రైతుల నడ్డి విరిచాయి. అందుకే గత ఎన్నికలలో బిజెపికి పూర్తి మద్దతు ఇచ్చిన రైతాంగం నేడు విధిలేక రోడ్డెక్క వలసి వచ్చింది. ఇదంతా వ్యవసాయ రంగంలో ఘనవిజయాలు సాధించామని, వుత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటూ కేంద్ర ప్రభుత్వ విజయగానాలు చేస్తున్న సమయంలోనే జరిగింది. ఇటువంటి విధానాలతో బిజెపి 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు మాటేమోగాని రుణభారం, ఆత్మహత్యలను రెట్టింపు చేసేదిగా కనిపిస్తోంది.

వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మొత్తం వుత్పత్తి ఖర్చుపై 50శాతం అదనంగా ఆదాయం వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రఖ్యాత వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ 2008లోనే రైతులపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ నివేదికలో చెప్పారు. దానికి అనుగుణంగా కనీస మద్దతు ధరల ప్రకటన లేకపోగా ఈ ఏడాది ప్రకటించిన ధరలకంటే పతనమైనా ప్రభుత్వాలు ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోలేదు. తాజా రైతుల ఆందోళన వెనుక పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూడా వుందని, దాని గురించి సరైన అధ్యయనం లేదని స్వామినాధన్‌ క్వింట్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా చెప్పారు. ఇప్పుడు ఏర్పడిన పరిస్ధితుల కారణంగా రైతుల రుణాలను ప్రస్తుతానికి రద్దు చేసినప్పటికీ వ్యవసాయం గిట్టుబాటు కావటానికి దాన్నొక పద్దతిగా మార్చరాదని, రైతుల ఆదాయాలను స్ధిరపరచటానికి పద్దతులను రూపొందించాలని, రుణాల రద్దు వలన పేదల కంటే ధనిక రైతులే ఎక్కువ లబ్దిపొందుతున్నారని ఆయన చెప్పారు. సామాజిక రక్షణలు లేని కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వ్యవసాయం జీవితాన్ని ఇవ్వాలే తప్ప ప్రాణాలు తీసేదిగా వుండకూడదని ప్రస్తుతం లండన్‌లో వున్న 92 సంవత్సరాల స్వామినాధన్‌ చెప్పారు.

ఆవును వధిస్తే జీవితకాల జైలు లేదా మరణశిక్ష విధించాలన్నట్లుగా తమ పాలిత రాష్ట్రాల శాసనసభలన్నీ (ఒక పధకం ప్రకారం) తీర్మానాలు చేస్తున్నాయి తప్ప ఆ ఆవులను సాకే రైతుల గురించి ఎందుకు ఆలోచించటం లేదని బిజెపి వారు తమ తలలు తామే పట్టుకోవటం అవసరం. మాంసం కోసం ఆవులను వధిస్తున్నారంటూ జై భజరంగ ‘బలీ’ అని(ముస్లింలపై) దాడులకు తెగబడుతున్న హిందూత్వ ‘కారుణ్యమూర్తులు’ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వారిపై కాల్పులు జరుగుతుంటే ఒక్క వీధిలో కూడా వారి జాడలేదేం? నిజానికి ఈ ప్రశ్నలు అటు బిజెపి అనుకూలురు లేదా వ్యతిరేకులే కాదు మేం ఎటు న్యాయం వుంటే అటు వుంటాం అనే తటస్ధులు కూడా తీవ్రంగా ఆలోచించాల్సినవి కాదా. వాటి గురించి తమలో తాము తర్కించుకొనేందుకు, ఎవరినైనా ప్రశ్నించేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అశాస్త్రీయ ప్రచారాలు-ఆవు, పేడ రాజకీయాలు !

17 Saturday Jun 2017

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Others, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, bjp cow politics, cow, cow dung, cow politics, cow sciences, cow urine, subhash palekar

ఎం కోటేశ్వరరావు

శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటం ద్వారా ఎవరైనా విరుద్ధ భావాలను వ్యాపింపచేయగలరు అని ఇటాలియన్‌ శాస్త్రవేత గెలీలియో ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ప్రపంచంలో రెండే అనంతమైనవి. ఒకటి విశ్వం, రెండవది మానవుల బుద్దిహీనత, అయితే మొదటిదాని గురించి నేను అంత ఖాయంగా చెప్పలేను అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐనిస్టీన్‌ అన్నాడు.లోకం పోకడలను కాచి వడపోసిన వారే ఇలాంటి తిరుగులేని అంశాలను గతంలో చెప్పారు. ఇప్పుడు ఎలాంటి అనుభవం లేకుండానే ‘ఆణిముత్యాలను’ ప్రవచించటానికి అనంతమైన బుద్ధి హీనులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. మనకు కావాల్సింది కాస్త బుర్రకు పని పెట్టి వారి లోకాన్ని విమర్శనాత్మకంగా చూడటమే !

భూమి చుట్టూ సూర్యుడు తిరగటం కాదు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోందని తొలిసారిగా చెప్పింది గెలీలియో. అప్పటివరకు వేల సంవత్సరాలుగా వున్న విశ్వాసాలను పటాపంచలు చేశాడు. అయితే బైబిల్‌ చెప్పిందానికి భిన్నంగా తమ మనోభావాలను గాయపరిచాడంటూ నాటి క్రైస్తవ మతోన్మాదులు గెలీలియోను గృహనిర్బంధం కావించారు. చివరికి కళ్లు పోయిన స్ధితిలో కూడా ఆ కరుణామయులు ఆయనను విడుదల చేయలేదు. ఆయనను తరువాతి తరాల వారు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో శాస్త్రీయంగా రుజువైన వాటిని కూడా తిరస్కరించే వున్మాదం క్రమంగా వ్యాపిస్తోంది. అది ఆవు ఆక్సిజన్‌ గ్రహించి దాన్నే విడుదల చేస్తుందని చెప్పటం కావచ్చు, వేదాల్లోనే అన్నీ వున్నాయట అనే రుజువు కాని శాస్త్రీయ భావాలు, విమానాలు,టెస్టుట్యూబ్‌ బేబీలు, ప్లాస్టిక్‌ సర్జరీ వంటి ఆధునిక ఆవిష్కరణలన్నీ వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో వున్నాయని చెప్పటం కావచ్చు. ఈ అశాస్త్రీయ వాదనలను సవాలు చేసే, వ్యతిరేకించే వారు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వసుధైక కుటుంబం, సర్వేజనాసుఖినో భవంతు, నీవు ఎవరు నేను ఎవరు సర్వం నేనే అని సుభాషితాలు పలికే కొందరు దాడులు, హత్యలకు దిగుతున్నారు.

అలాంటి వారిని పాలకులు ప్రోత్సహిస్తున్నారు, రక్షణ కల్పిస్తున్నారు. గెలీలియో కొత్త విషయాన్ని చెప్పినందుకు అక్కడి మతవాదులు భగ్గుమంటే, రుజువులున్నా పాత విషయాన్నే ఆమోదించాలంటూ ఇక్కడి మతవాదులు దాడులు చేస్తున్నారు. మన సమాజం ముందుకు పోతోందా? తిరోగమనంలో వుందా? నూతన ఆవిష్కరణలను నిరుత్సాహపరిచే ఇలాంటి ధోరణులతో ఇప్పటికే మనం ఎంతో నష్టపోయిన విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా ? విషాదం ఏమంటే శాస్త్రీయ అంశాలను చదువుకొని వాటి ఆధారంగా పని చేస్తున్న పెద్దలు ఎక్కడో ఒకరో అరా తప్ప మనకెందుకులే అన్నట్లుగా ఇలాంటి శక్తుల పట్ల మౌనం దాలుస్తున్నారు. బుద్ది హీనత మనలో పెరుగుతోందా ? ఇవన్నీ వేదాల్లోనే వున్నాయా? పోతులూరి వీరబ్రహ్మంగారు దీని గురించి ఏం చెప్పారు ?

గతంలో పది సంవత్సరాలు అధికారంలో వున్న కాలంలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీ – కుప్పం ప్రాజెక్టు అంటూ వ్యవసాయం గురించి వూదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఘోరంగా విఫలమైన ఆ పధకం, టెక్నాలజీ వూసే ఎత్తటం లేదు. సూక్ష్మంలో మోక్షం మాదిరి ఇప్పుడు ఆవు పేడ వ్యవసాయ టెక్నాలజీ గురించి రైతులకు చెప్పేందుకు కాబినెటు హోదా ఇచ్చి ఒక సలహాదారును నియమించేశారు. కేంద్రంలోని పాలకులు ఆవు రాజకీయం చేస్తున్నారు గనుక వారితో స్నేహం కారణంగా చంద్రబాబు సరికొత్త పల్లవి అందుకున్నారు. అదే మంటే ఆవు మూత్రం, ఆవు పేడతో ప్రకృతి వ్యవసాయం చేయిస్తానంటూ ముందుకు వచ్చిన సుభాష్‌ పాలేకర్‌ అనే పెద్ద మనిషికి వంద ఎకరాలు, వంద కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా మార్చిన రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను అవమానించటం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదు. తమకు డబ్బులిస్తే బంగారం తయారు చేసే చిట్కాలు చెబుతామని, లంకె బిందెలను చూపిస్తామంటూ మోసాలకు పాల్పడే దొంగబాబాలను చంద్రబాబు గుర్తుకు తెస్తున్నారు. చివరికి ఈ పిచ్చి ముదిరి వేదాల్లోనే అన్నీ వున్నాయి, విమానాలు, క్షిపణులు తయారు చేసే పరిజ్ఞానం మన దగ్గరే వుంది అని చెబుతున్నవారికి కూడా భూములు, డబ్బు ఇచ్చి అమరావతిలో తిష్ట వేయించినా ఆశ్చర్యం లేదు.

అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచారంలోకి పెట్టటంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారందరికీ పెద్ద దిక్కుగా వుంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రచురించిన ఒక ప్రచార కరపత్రం. జూన్‌ 21న యోగా దినం సందర్బంగా మాతాశిశు సంరక్షణ కోసమంటూ రాసిన దానిని మంత్రి శ్రీపాద నాయక్‌ విడుదల చేశారు. గర్భం దాల్చిన తరువాత మాంసం తినవద్దు, శృంగారానికి దూరంగా వుండాలి. దుష్టులను దూరంగా వుంచాలి, దైవపరమైన ఆలోచనలతో వుండాలి, గదులలో మంచి, అందమైన బొమ్మలను అలంకరిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అన్నది ఆ కరపత్ర సారాంశం. ఈ వార్తలను చదివిన వారు కొందరు నిషేధిత జాబితాకు ఖర్జూరాలను, మరికొన్నింటిని కూడా చేర్చి ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి విపరీతం ? అనేక పేద దేశాలతో పోల్చితే మన దేశంలో రక్తహీనత సమస్య అధికంగా వుంది. దానిని అధిగమించేందుకు అవసరమైన ప్రొటీన్లు, ఇనుము మాంసంలో లభిస్తాయి. అలాంటి మాంసాన్ని గర్భిణులు తినకూడదన్నది ఒక అశాస్త్రీయ సలహా. అనేక మూఢనమ్మకాలకు నిలయమైన మన దేశంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అలా చెబుతుంటే దానిని పాటిస్తే ప్రసూతి మరణాలు ఇంకా పెరగటం తప్ప తగ్గవు. ఆరోగ్యవంతులైన తల్లీ పిల్లల కోసం ప్రభుత్వాలు చేయాల్సిందెంతో వుంది. వాటిన్నింటినీ వదలి పెట్టి శాస్త్రీయంగా రుజువు కాని, అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయటం గర్హనీయం. ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రచురించిన కరపత్రంలోని అంశాలపై తీవ్ర విమర్శలు రావటంతో తమ కరపత్రలో కామాన్ని(లస్ట్‌) అదుపు చేసుకోవాలని పేర్కొన్నామే తప్ప శృంగారం( సెక్స్‌) అనే పదం వాడలేదని సదరుశాఖ ఒక వివరణ ఇచ్చింది. ఇది చిల్లు కాదు తూటు అని సమర్ధించుకొనే అతి తెలివి తప్ప మరొకటి కాదు. సమస్యాత్మక కేసులలో గర్భిణులే కాదు సాధారణ మహిళలను కూడా కొన్ని సందర్భాలలో శృంగారానికి దూరంగా వుండాలని నిపుణులు చెప్పటం వేరు, కానీ కేంద్ర ప్రభుత్వ కరపత్రంలో దానిని సాధారణీకరించటమే విమర్శలకు గురైంది.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇలాంటి పనికిరాని అంశాలను ప్రచారం చేయటం ఎక్కువైంది. సమాజంలో శాస్త్రీయ దృష్టి, ఆసక్తిని పెంచటంపై దాని పురోభివృద్ధి ఆధారపడి వుంటుంది. దానికి బదులు అన్నీ వేదాల్లోనే వున్నాయంటూ మెదళ్లను కలుషితం చేయటంలో తిరోగమన వాదం జయప్రదమైంది. మన దేశానికి అది చేసిన హాని అంతా ఇంతా కాదు. ఆధునిక ఆవిష్కరణలకు మన యువతను దూరం చేశారు.ఎందుకు అనే ప్రశ్నను వేయనివ్వకుండా నోళ్లను మూయించారు ఇప్పుడు మరోసారి అలాంటి శక్తులు చెలరేగిపోతున్నాయి. అధికారంలో వున్నవారే వాటికి సాధికారత చేకూర్చేందుకు పూనుకున్నారు.

గతంలో కాంగ్రెస్‌ ఒక తరహా ఓట్ల రాజకీయాలకు పాల్పడితే, ఇప్పుడు దాని స్ధానాన్ని ఆక్రమించిన బిజెపి హిందూత్వ, రామాలయం, గోమూత్రం, పేడ, గొడ్డు మాంస రాజకీయాలతో లబ్ది పొందాలని చూస్తోంది. దానిలో భాగంగానే బిజెపిని బలపరిచే సంస్ధలు,శక్తులు, వ్యక్తులు ఆవుకు లేని ప్రాధాన్యత, పవిత్రత, మహత్తులను ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారు. వారి చర్యలు, వాదనలను చూస్తే చీకటి యుగాల రోజులను గుర్తుకు తెస్తున్నారు. వారి ప్రచారాంశాల శాస్త్రీయత,అధారాలను ప్రశ్నించే, విబేధించేవారు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ అనేక రకాల దాడులకు తెగబడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీయే 2016 ఆగస్టులో గో సంరక్షకుల మంటూ తెగబడుతున్నవారి గురించి ఇలా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవటం అవసరం. ‘ గో సంరక్షణ పేరుతో జనాలు దుకాణాలు నడపటం నాకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొంత మంది పగలు గో రక్షకులుగా ముసుగు వేసుకొని రాత్రుళ్లు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.’ అన్నారు. చిత్రం ఏమంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా అలాంటి ఒక్క దుకాణదారును శిక్షించిన దాఖలాలు లేవు. దాంతో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆవులను రవాణా చేస్తున్న లారీలపై కూడా గో గూండాలు దాడి చేస్తే వాటిని పోలీసు రక్షణతో రాజస్ధాన్‌ బిజెపి సర్కార్‌ రాష్ట్ర సరిహద్దులను దాటించాల్సిన తీవ్ర పరిస్ధితులు అక్కడ నెలకొన్నాయి. స్వయంగా ప్రధాని, ఆయన అనుచరగణం నిరూపితం కాని, శాస్త్రవిరుద్దమన, అతిశయోక్తులను ప్రచారం చేయటం వారి ద్వంద్వ ప్రవృత్తి, చతురతకు నిదర్శనం.

మన కేంద్రమంత్రి రాజనాధ్‌ సింగ్‌ గారు ఒక సందర్భంలో అమెరికా వ్యవసాయశాఖ నివేదికను వుటంకిస్తూ దాని ప్రకారం ఆవులో కనుగొన్న జీన్స్‌లో 80శాతం మానవులలో కూడా వున్నాయని అందువలన ఆవును రక్షించి పూజించాలని చెప్పారు. పొద్దున లేస్తే ముస్లిం, క్రైస్తవ మతాలను, వాటిని అవలంభించే వారికి వ్యతిరేకంగా ప్రచారం, దాడులు చేస్తున్నారు. వారిలో కూడా అదే మోతాదులో ఆవు జీన్సు వున్నాయని అందువలన వారికి వ్యతిరేకంగా వున్మాదాన్ని రెచ్చగొట్టం గోవును అవమానించటమే అని గుర్తించటం అవసరం. సరే వున్మాదాన్ని రెచ్చగొట్టటం కూడా ఓటు బ్యాంకు రాజకీయాలనుకోండి. ఇక్కడ మెదళ్లను వుపయోగించాల్సిన అవసరం వుంది. అందరికీ సుపరిచితమైన సైన్సు అనే పత్రికలో వెల్లడించినదాని ప్రకారం మానవులలో వుండే జీన్సును పోలినవి చింపాంజీలు, పిల్లులు, ఎలుకలు, కుక్కలలో వరుసగా 96,90,85,84 శాతాల చొప్పున వున్నాయట. అంటే అవు కంటే ఎక్కువ శాతం. అరటి వంటి అనేక పండ్లలో కూడా అలాంటి జీన్సు వున్నాయి, మరి వాటికి లేని పవిత్రత ఆవు కెందుకు అంటే సమాధానం వుండదు. ఆవు పేడ, మూత్రం, అది పీల్చే, విడిచే వాయువుల గురించి కూడా అతిశయోక్తులు, కట్టుకధలను ప్రచారం చేస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదని పేరు పెట్టాలన్నట్లుగా ఓట్లు దండుకొనేందుకు ఆవుకు లేని పవిత్రతను ఆపాదించటం కూడా అలాంటిదే.

దాని కొనసాగింపులో భాగంగా రాజస్ధాన్‌ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవలనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దానిని చంపితే మరణశిక్ష విధించాలని చెప్పారు. న్యాయమూర్తులు చట్టంలో వున్నదానికి భాష్యం చెప్పటానికి తప్ప లేని దానిని, తమ స్వంత బుర్రలలో వున్నవాటిని న్యాయ పీఠాలపై కూర్చొని చెప్పటానికి వీలులేదు. దేశమంతా ఆవు రాజకీయం నడుస్తోంది, ఆ పేరుతో కొందరు చట్టవిరుద్దమైన గూండాయిజానికి పాల్పడుతున్నారు. సదరు న్యాయమూర్తి చర్య గూండాయిజం కాకపోవచ్చుగాని చట్టవిరుద్దమైనదే. ఇదే న్యాయమూర్తి మగనెమలి కంటి నీటిని తాగిన ఆడ నెమళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభమౌతుందని,మగ నెమళ్లు ఆజన్మ బ్రహ్మచారులని కూడా సెలవిచ్చారు. ఇలాంటి పోసుకోలు కబుర్లు చెప్పటానికి గెలీలియో చెప్పినట్లు శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటమే అర్హత. వాటికి చదువులతో పని లేదు. ఇందుకు కొన్ని వుదాహరణలను చూద్దాం. మనం కొద్దిగా ఆలోచిస్తే కర్ణుడి జన్మను చూస్తే ఆరోజుల్లోనే మనకు జన్యుశాస్త్రం, వినాయకుడికి ఏనుగుతలను అతికించటాన్ని బట్టి ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసని అర్ధం అవుతుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బిజెపికి చెందిన వుత్తరాఖండ్‌ మాజీ ముఖ్య మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఎంపీగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ పదిలక్షల సంవత్సరాల నాడే రుషి కణాదుడు అణుపరీక్షలను నిర్వహించాడని చెప్పాడు.పైథాగరస్‌ కంటే మూడువందల సంవత్సరాల ముందే ఆ సూత్రాన్ని మన వారు కనుగొన్నారని ముంబై విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ అధిపతి గౌరీ మహిలీకర్‌ సెలవిచ్చాడు. విమానాలు, మోటారు కార్లు, అంతరిక్ష ప్రయాణాల వంటి వన్నీ మన పూర్వీకులెప్పుడో ఆచరించి వదలివేసినవే అని చెప్పేవారికి కొదవ లేదు.

తినే తిండిని బట్టి కొంతమంది మానభంగాలకు పాల్పడుతున్నారని ఒకడు, చికెన్‌, చేపలు తిన్నవారే ఎక్కువగా రేపులు చేస్తున్నారని ఒక బీహార్‌ మంత్రి, దక్షిణాది స్త్రీలు అందంగా వుండటానికి కారణ వారికి డ్యాన్సు తెలిసి వుండటమే అని ఒక రాజకీయనేత, హిందువుల జనాభాను పెంచేందుకు ప్రతి మహిళ కనీసం నలుగుర్ని కనాలని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌, రాసిఫలాలను బట్టి ఏ మహిళ అత్యాచారానికి గురవుతుందో తాను చెప్పగలనని ఒక జ్యోతిష్కుడు, ఒక లీటరు ఆవు మూత్రంలో మూడు నుంచి పది మిల్లీ గ్రాముల బంగారం లభించిందని చెప్పే విశ్వవిద్యాలయ పరిశోధకులు, తమ వుత్పత్తులు చక్కెర వ్యాధిని సహజంగానే నయం చేస్తాయని పతంజలి సంస్ధ ప్రచారం, యజ్ఞం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని, కొన్ని పరీక్షల ద్వారా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారిని తిరిగి బ్రతికించగలనని ఒక వైద్యుడు, ఐనిస్టీన్‌ సిద్ధాంతం పరీక్షకు నిలవదని చెప్పే మేథావులు మనకు ఎక్కడబడితే అక్కడ కలుపు మొక్కల్లా పెరిగిపోయారు.

గో లేదా పశు మాంసం తినటం విదేశీ ముఖ్యంగా ముస్లింలు మన దేశం మీద దండయాత్రలు చేసిన తరువాతే ప్రారంభమైందన్నది ఒక తప్పుడు ప్రచారం. దీనిని కూడా గుడ్డిగా నమ్ముతున్నవారు లేకపోలేదు. పండ్ల అమరిక తీరుతెన్నులను చూస్తే మాంసాహార జీవుల కోవకే మానవులు చెందుతారన్నది తిరుగులేని సాక్ష్యం. వివేకానందుడు హిందూమతావలంబకుడు అనటంలో సందేహం లేదు, అది తప్పు కూడా కాదు. కానీ నేడు కాషాయ వేషాలు వేసుకు తిరిగే అనేక మంది స్వామీజీలు, వారిలో కనిపించే పరమత ద్వేషం ఎక్కడా ఆయన వుపన్యాసాలలో కనపడదు. కాలిఫోర్నియాలోని షేక్స్పియర్‌ క్లబ్బులో 1900 ఫిబ్రవరి రెండున చేసిన ప్రసంగంలో ఆయన ఇలా చెప్పారు.’నేను దాని గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు, పురాతన క్రతువుల ప్రకారం గొడ్డు మాంసం(బీఫ్‌) తినకపోతే అతను మంచి హిందువు కాడు.కొన్ని సందర్భాలలో అతను విధిగా ఎద్దును బలిచ్చి తినాల్సిందే.’ అంతే కాదు వేదకాలం గురించి పరిశోధన చేసిన చరిత్రకారుడు సి.కున్హన్‌ రాజా ఇలా చెప్పారు.’బ్రాహ్మణులతో సహా వేదకాలపు ఆర్యన్లు చేపలు, మాంసం చివరికి గొడ్డు మాంసం కూడా తిన్నారు.ప్రముఖులు వచ్చినపుడు వారి గౌరవార్ధం గొడ్డు మాంసం వడ్డించేవారు. వేదకాలపు ఆర్యులు గొడ్డు మాంసం తిన్నప్పటికీ పాలిచ్చే ఆవులను తినేవారు కాదు. ఒక వేళ గొడ్డు మాంసం పెట్టాల్సి వస్తే ఎద్దులు, వట్టిపోయిన ఆవులు, దూడలను మాత్రమే వధించాలనే నిబంధనలు వుండేవి ‘ అని చెప్పారు.

నాజీ జర్మనీ కాలంలో జైలు పాలైన ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ మతాధికారి మార్టిన్‌ నియోమిల్లర్‌ హిట్లర్‌ చర్యలను వ్యతిరేకించినందుకు జైలు పాలు చేశారు. అక్కడ నాజీల ఎత్తుగడలు, నాటి జనం వాటిని వుపేక్షించి చివరికి ఎలాంటి దుస్ధితికి లోనయ్యిందీ వివరిస్తూ ఒక కవితను రాశాడు. ఆ కవిత ఇలా సాగుతుంది. ఆరోజుల్లో జర్మన్‌ కమ్యూనిస్టులను సోషలిస్టులని పిలిచారు.

తొలుత వారు సోషలిస్టుల కోసం వచ్చారు

నేను సోషలిస్టును కాదు కనుక మిన్నకుండి పోయాను

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక పట్టించుకోలేదు

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం ఎవరూ మిగలలేదు

ముస్లింలు మాత్రమే ఆవు మాంసం తింటారని ప్రచారం చేసిన మతశక్తులు గోవధ నిషేధం గురించి చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. వారి వత్తిడికి లొంగి రాజ్యాంగంలో దానిని ప్రస్తావించినప్పటికీ నిషేధ అంశాన్ని రాష్ట్రాలకు వదలివేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మొదలైన ప్రచారం తరువాత అన్ని మతాలవారు తినే పశుమాంసానికి కూడా వర్తింప చేశారు. దేశమంతటా గోవధ, పశుమాంస నిషేధం గురించి చెప్పే బిజెపి గోవా, కేరళ, గిరిజనులు ఎక్కువగా వున్న ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఓట్ల కోసం భిన్న గళం వినిపిస్తోంది. పశు విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలు గొడ్డు మాంసం తినే అన్ని మతాల వారికే గాక మెజారిటీ హిందూమతం వారికి, జీవన భృతికోసం పశుపాలన చేసే పేదవారికి అందరికీ నష్టదాయకంగా మారాయి. అందువలన మతశక్తులకు కావాల్సింది సెంటిమెంట్ల ద్వారా కొల్లగొట్టే ఓట్ల కోసం ఎవరినీ వదలవు అని గుర్తించటం అవసరం. గతంలో రాజులు, రంగప్పలు యజ్ఞ, యాగాదుల పేరుతో ప్రజాధనాన్ని ఎంతగా తగలేసిందీ చదువుకున్నాం. ఇప్పుడు నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి పాలకులు కూడా మరో రూపంలో అదే చేస్తున్నారు. ఆశాస్త్రీయమైన వాటిని నిరూపించేందుకు పరిశోధనల పేరుతో జనం సొమ్మును వుదారంగా ఖర్చు చేస్తున్నారు.

రామాయణంలో చెప్పిన సంజీవని మొక్కలను కనుగొనేందుకు వుత్తరాఖండ్‌ సర్కార్‌ 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇలాగే అనేక విశ్వవిద్యాలయాలలో సంస్కృతంలో నిక్షిప్తమైన పరిజ్ఞానాన్ని వెలికితీసే పేరుతో డబ్బు, మానవ శ్రమ, మేధస్సును కూడా దుర్వినియోగపరిచేందుకు పూనుకున్నారు. చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతున్న సుభాష్‌ పాలేకర్‌ చెబుతున్నట్లు ఎలాంటి ఎరవులు, పురుగుమందులు వేయకుండా ఆవు పేడ, మూత్రంతో సాగు చేస్తే ఎకరానికి పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. నరేంద్రమోడీ వాగ్దానం చేసిన ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల రూపాయల నల్లధనం సొమ్ము బదిలీకోసం ఎవరూ ఎదురు చూడరు. చంద్రబాబు చెప్పే ఐటి వుద్యోగాల జోలికి యువత అసలే పోదు. ఆవు మూత్రాన్ని సేకరించి బంగారాన్ని, పేడను వాడి వ్యవసాయం చేస్తారు. చంద్రబాబు హెరిటేజ్‌ కంటే ఎక్కువ లాభాలు పొంది ఆయనకంటే ఎక్కువగానే సంపాదించగలరు.సుభాష్‌ పాలేకర్‌ మాటలను చూస్తుంటే నాకు లక్ష రూపాయలిస్తే మీకు కోట్ల రూపాయల బంగారాన్ని తెచ్చిపెట్టే ఫార్ములా చెబుతా అనే మాయగాళ్లను గుర్తుకు తెస్తున్నారు. వారికి ఆ ఫార్ములా తెలిస్తే ఆ బంగారమేదో వారే సంపాదించుకోవచ్చు. పశువుల పేడ, మూత్రంతో కూడిన ఎరువులను పొలాల్లో చల్లటం రైతాంగానికి కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. కేవలం దానితోనే పంటలు పండుతాయని చెప్పటమే అభ్యంతరకరం. అలాగే ప్రకృతి సాగు చేస్తున్నా అంటున్న పాలేకర్‌ చెప్పేది నిజమైతై ఆయన వ్యవసాయం చేశానంటున్న మహారాష్ట్రలో రైతులు అప్పులపాలై ఆత్మహత్య లెందుకు చేసుకుంటున్నట్లు ? ఆవు పేడ వ్యవసాయాన్ని వారెందుకు చేయటం లేదు, అసలు పాలేకర్‌ చెప్పేదానికి రుజువులేమున్నాయి అని అడగాల్సిన అవసరం లేదా ? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏ రూపంలో అయినా కనీసం ఒక రూపాయి అయినా చెల్లించే ప్రతి ఒక్కరికీ పాలేకర్‌కు చేసే ఖర్చు గురించి అతని చర్యల శాస్త్రీయత గురించి ప్రశ్నించే హక్కు వుందా లేదా ?

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాణిజ్య లోటులో మూడేండ్ల మోడీ సరికొత్త రికార్డు !

19 Friday May 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

3 years of narendra modi rule, BJP, BJP-led NDA, failure Modi, India employment, India trade gap, Narendra Modi, Narendra Modi Failures, NDA

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ మూడు సంవత్సరాల విజయాల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విజయగాధలు ప్రారంభమయ్యాయి. విమర్శనాత్మకంగా విశ్లేషించే వారి రాతలు, వ్యాఖ్యలు కనిపించకుండా, వినిపించకుండా సాధ్యమైన మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఎలాగైతేనేం విజయం సాధించారా లేదా అనేది ముఖ్యం అన్నట్లుగా పరిస్థితి వుంది. ఈ నేపధ్యంలోనే కొందరైనా మీడియాలో ఏదో విధంగా నిజాలు చెప్పేందుకు తపన పడుతున్నారు. ప్రధానికి నొప్పి తగల కుండా పొగడుతూనే కొన్ని నగ్న సత్యాలను వెల్లడిస్తూ అమెరికా పత్రిక అఫింగ్టన్‌ పోస్టులో ఒక విశ్లేషణ మొదటి భాగం ఇలా సాగింది.’ మోడీ ప్రభుత్వం అధికారంలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఓటర్లలో దాని పలుకుబడి ఆశ్చర్యంగా వుంది. అత్యధిక ప్రభుత్వాల విషయంలో మూడో సంవత్సరంలో విసుగు పుట్టటం ప్రారంభమౌతుంది. దాన్నే ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభం కావటం అంటారు. మోడీ ప్రభుత్వ విషయంలో కూడా అదే జరుగుతుంది. మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను చంపివేస్తూనే వున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా కాశ్మీర్‌ పరిస్థితి దిగజారుతోంది, నిరుద్యోగ అంకెలు భయ పెడుతున్నాయి. దళితులు, ముస్లింలు, మహిళలపై హింసాకాండ ఇప్పటికే మామూలుగానే వుంది.మరో విధంగా చెప్పాలంటే కొద్దిగా కూడా మార్పు లేదు. మోడీ నూతన భారతంలో కొత్తదేమీ లేదు. సర్జికల్‌ దాడులు జరిగినప్పటికీ సైనికులను వధించటం పాకిస్థాన్‌ కానసాగిస్తూనే వుంది. వాస్తవాధీన రేఖ ఇప్పటికీ మండుతూనే వుంది.ఒక భారతీయుడిని వురి తీస్తామని పాకిస్థాన్‌ బెదిరిస్తోంది. దౌత్యపరంగా పాకిస్థాన్‌ను ఒంటరిపాటు చేయటం ప్రభుత్వ వ్యూహంగా వుంది. అయినప్పటికీ భారతే వేరుపడుతున్నట్లు కనిపిస్తోంది. తరువాత కళ్లెం లేని మోడీ రాజకీయ విజయం ఏమి వివరిస్తున్నది? చివరికి మున్సిపల్‌ ఎన్నికలలో కూడా మోడీ పేరుతో ఎదుర్కొంటున్నారు. 2014 కంటే నేడు మోడీ మరింత ప్రజాదరణ పొందారని అది తెలియ చేస్తున్నది.’ తరువాత వ్యాసమంతా విజయపరంపరకు మోడీ రహస్యమేమిటో వివరించారనుకోండి. ఇక్కడ సమస్య ఏమంటే మూడేండ్లలో ఎలాంటి మార్పు లేదని చెప్పిన తరువాత మోడీ విజయం సాధిస్తున్నారని చెప్పటంలోనే అసలు మర్మం దాగుంది. ఓట్ల చీలిక కారణంగా నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపికి వచ్చిన ఓట్ల శాతం కంటే ఎక్కువగా సీట్లు రావటానికి కారణాలేమిటో ప్రాధమిక గణితం చెబుతుంది. కానీ దానికి రాజకీయ వ్యూహం, ఎత్తుగడలంటూ లేని వాటిని ఆపాదించటమే విశేషం. నిజంగా అవి వుంటే గోవా, పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయినట్లు ?

నరేంద్రమోడీ వైఫల్యాల గురించి చెప్పేంత నిజాయితీ ప్రస్తుతం మన ప్రధాన స్రవంతి మీడియాకు లేదు.ఎందుకంటే అవన్నీ వాణిజ్యం కోసం పని చేస్తున్నవి కనుక ఆదాయాన్ని కోల్పోయేంత త్యాగం చేయవు.http://www.tradingeconomics.com/india/balance-of-trade ఈ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ ప్రభుత్వ నిర్వాకం వలన మన దేశ వాణిజ్య లోటు పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 173.5లోటు పెరిగింది. దాని తీవ్రత ఎలా వుందంటే మార్కెట్‌ అంచనా 12.79 బిలియన్‌ డాలర్లయితే వాస్తవంగా 13.25 బిలియన్లు వుంది. ఇది 2014 నవంబరు తరువాత అత్యధికంగా ఒక రికార్డు నమోదు చేసింది. సర్కారు ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు . ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా వున్న కారణంగా మనకు విదేశీ మారక ద్రవ్యం ఎంతో విలువైనది. చమురు వినియోగాన్ని కూడా పరిమితం చేయవచ్చు పోనీ సాధ్యం కాదనుకుంటే దిగుమతులు తప్పవు. బంగారం లేకపోతే మనకు రోజు గడవదా ? గతేడాది మొత్తంచమురు దిగుమతులు 49.1 శాతం పెరిగితే వాటిలో చమురు వాటా 30.1 కాగా బంగారం 211.4 శాతం పెరిగాయి. విలువైన రంగురాళ్లతో సహా మన దిగుమతుల్లో చమురు తరువాత 13శాతం అవే ఆక్రమిస్తున్నాయి. ధనికులు మాత్రమే తినే పండ్లు, కూరగాయల దిగుమతులకు కూడా దేశం మొత్తానికి చెందిన విదేశీమారక ద్రవ్యాన్ని వినియోగిస్తున్నారు. ఇలా చెప్పుకోవాల్సినవి ఇంకా వున్నాయి.

ఇదెక్కడి చోద్యం ! రైల్వే స్టేషన్లో టీ అమ్మానని చెప్పుకున్న మోడీకి ఈ దేశంలోని సామాన్యులకు ఏమి అవసరమో తెలియదా ? రంగురాళ్లు, బంగారం దిగుమతి చేయాలని ఏ చాయ్‌ వాలా అడిగాడు. గతంలో రాజులు రంగప్పలు తమ గొప్పను చూపించుకొనేందుకు, రాజకుటుంబాల ఆడంబరాన్ని ప్రదర్శించుకొనేందుకు ఇలాంటి పనులు చేశారు తప్ప సామాన్యుల గురించి ఆలోచించేవారెవరైనా చేస్తారా ? గుజరాత్‌ నమూనా పాలన ఇదేనా ? ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే ఆ అనందాన్ని కూడా అనుభవించనివ్వకుండా అదే మోడీ సర్కార్‌ పన్నులు పెంచి మన జేబుల నుంచి డబ్బు కొల్లగొడుతోంది. మన ఆర్ధిక రంగంలోని ఒక ముఖ్యమైన ఎగుమతులు, దిగుమతుల తీరు ఇలా వుంది.

మోడీ, ఆయన అనుయాయులు చేసిన అనేక వాగ్దానాలలో వుపాధి కల్పన ముఖ్యమైనది. నైపుణ్య శిక్షణ అనో మరొకదాని గురించో ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ వుపాధి కల్పనలో ఘోరవైఫల్యం చెందింది. ఇదే సమయంలో చైనా కంటే అభివృద్ధి రేటు ఎక్కువగా వుందన్న ప్రచారం సాగుతోంది. ఒక వేళ అది నిజమనుకున్నా ఆ మేరకు వుపాధి ఎక్కడ పెరిగిందో వారే చెప్పాలి. యాభయ్యవ పడిలో వున్నవారికి నేను పెద్దగా చేయలేను గాని కొత్తగా వుపాధి కోరుకొనే రెండు పదుల ప్రాయంలో వున్నవారి జీవితాల రూపు రేఖలను మార్చివేయాలనుకుంటున్నాను అని నరేంద్రమోడీ అనేక సందర్బాలలో ఓట్లడుక్కుంటున్న సమయంలో చెప్పారు. ప్రభుత్వ గణాంకాలు, విశ్లేషణల ప్రకారం 2009-11 మధ్య 8.5శాతం అభివృద్ధి రేటు వుండగా ఏటా 9.5లక్షల నూతన వుద్యోగాలు వచ్చినప్పటికీ దానిని కూడా వుపాధి రహిత అభివృద్దిగా పేర్కొన్నారు.మోడీ హయాంలో 2015,16లో అంతకు ముందుతో పోల్చితే రెండు లక్షల వుద్యోగాలు తగ్గిపోయాయి. అంటే నాలుగో వంతు పడిపోయాయి. అయితే ప్రభుత్వం అసలు విషయాల జోలికి పోకుండా లెక్కలు వేయటంలో ఏదో తప్పుంది, లెక్కల పద్దతిని మార్చాలని నిర్ణయించింది. జిడిపి వృద్ధి రేటు లెక్కింపు విధానాన్ని కూడా మార్చిన విషయం తెలిసిందే. సంఘటిత రంగానికి, సేవా రంగాన్ని కూడా జోడించటంతో 2015తో పోల్చితే 2016లో కొద్దిగా వుద్యోగాలు పెరిగినట్లు కనిపించినా, అంతకు ముందుతో పోల్చితే తక్కువే. నోట్ల రద్దు కారణంగా వుపాధికి ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం ఒకటే మాట మీద వుంది. కానీ ఆ మూడునెలల కాలంలో ఎంత మందికి వుపాధి పోయిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో కచ్చితంగా లెక్కలు తీసే యంత్రాంగం లేని కారణంగా ప్రభుత్వం అడ్డంగా వాదిస్తోంది.

పోలిక కాస్త కటువుగానే వుండవచ్చు. వయసు మీద పడిన తరువాత పురాతన వృత్తిలోకి నెట్టబడిన అభాగినుల పరిస్ధితి ఎంత దయనీయంగా వుంటుంతో నేడు ఐటి పరిశ్రమలో వయస్సు పైబడిన వారి పరిస్ధితి కూడా అగమ్యగోచరంగా వుండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటి, దాని అనుబంధ సంస్ధలలో ప్రస్తుతం వున్న 40లక్షల మంది వుద్యోగులలో 60శాతం మంది ప్రస్తుతం వున్న వారి నైపుణ్య స్ధాయిని బట్టి వుద్యోగాలకు పనికి రారని, వారికి శిక్షణ ఇచ్చినా ఏ మేరకు పనికి వస్తారన్నది ప్రశ్నార్ధకమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటికే వుపాధి తగ్గిపోయిన స్ధితిలో ఈ విద్యావంతులైన వారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరితే పరిస్థితి ఎలా వుంటుందో వూహించుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ లేబరు బ్యూరో సమాచారం ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో వుపాధి కల్పన ఇలా వుంది

డిసెంబరు నుంచి 2009 – డిసెంబరు 10 వరకు 8.70 లక్షలు

డిసెంబరు నుంచి 2010 – డిసెంబరు 11 వరకు 9.29

డిసెంబరు నుంచి 2011 – డిసెంబరు 12 వరకు 3.21

డిసెంబరు నుంచి 2012 – డిసెంబరు 13 వరకు 4.19

డిసెంబరు నుంచి 2013 – డిసెంబరు 14 వరకు 4.21

డిసెంబరు నుంచి 2014 – డిసెంబరు 15 వరకు 1.35

డిసెంబరు నుంచి 2015 – డిసెంబరు 16 వరకు 1.35

అన్నం వుడికిందో లేదో చూడటానికి ఒక మెతుకును చూస్తే చాలు అన్నట్లుగా నరేంద్రమోడీ సాధించిన విజయాల తీరు తెన్ను గురించి ఈ రెండు ముఖ్యమైన అంశాలు వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d