• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Donald trump

దక్షిణాఫ్రికా భూ సంస్కరణలకు అమెరికా వ్యతిరేకత!

29 Wednesday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, land reforms, South Africa, South African land reforms

Image result for Donald trump against South Africa land reforms                   అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌                                   సిరిల్‌ రాంఫొసా

 ఎం. కోటేశ్వరరావు

‘దక్షిణాఫ్రికాలో భూ స్వాధీనాలు, పెద్ద ఎత్తున రైతాంగ హత్యలూ జరుగుతున్నాయి, వాటి గురించి సునిశితంగా అధ్యయనం చేయండి’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన విదేశాంగ మంత్రి మైక్‌ పోంపియోను ఆగస్టు 22న ఆదేశించటంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా భూసమస్య ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఒక సర్వసత్తాక దేశ అంతర్గత వ్యవహారాలలో, భూ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇంత బహిరంగంగా జోక్యం చేసుకొనేందుకు పూనుకోవటం అమెరికా తెంపరి తనానికి నిదర్శనం. కొద్ది రోజుల క్రితం మితవాద మేథావి మరియన్‌ టపీ భూ స్వాధీనాలపై దక్షిణాఫ్రికాను హెచ్చరించండి అంటూ ట్రంప్‌ను కోరుతూ ఒక వ్యాసం రాశాడు. శ్వేతజాతి రైతులను చంపుతున్నారు, వారి భూములను లాక్కుంటున్నారు అంటూ అమెరికా మీడియాలో రెచ్చగొడుతున్నారు. భూ సంస్కరణలను వ్యతిరేకించే శ్వేతజాతీయులతో కూడిన ఆఫ్రీఫోరమ్‌ ప్రతినిధులు జూన్‌లో అమెరికా వచ్చి అనేక మందిని కలిశారు, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్రంప్‌ చర్యను దక్షిణాఫ్రికాలో అనేక మంది తీవ్రంగా ఖండించారు. దేశ ఉపాధ్యక్షుడు మబుజా ఒక ప్రకటన చేస్తూ భూ సంస్కరణలు సామాజిక, జాతి విభజన ఫలితాలు కాదని స్పష్టం చేశారు.
భూ సమస్య ముందుకు రావటం గురించి పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొందరు దీనిని రాబోయే ఎన్నికల గారడీగా భావిస్తున్నారు. భూ సంస్కరణలు జరగాలన్నది సాధారణ ఏకాభిప్రాయం. ఎలా అన్నదానిపై తేడాలున్నాయి. పాతికేండ్లుగా తేల్చుకోలేని స్ధితి. జాత్యహంకార, వలసపాలనలో భూముల నుంచి స్థానికులను వెళ్లగొట్టి వలస వచ్చిన శ్వేతజాతీయులు ఆక్రమించుకున్నారు. 1994లో శ్వేతజాతి దురహంకార పాలన అంతమై ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంలో త్రిపక్ష కూటమి అధికారానికి వచ్చేనాటికి తొమ్మిదిశాతం శ్వేత జాతీయుల చేతిలో 90శాతం భూమి కేంద్రీకృతమై ఉంది. భూ పంపిణీ అన్నది ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ ప్రకటించిన ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. స్ధానిక ఆఫ్రికన్లను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసిన శ్వేతజాతి ప్రభుత్వం 1913లో చేసిన ఒక చట్టం ప్రకారం నల్లజాతీయులైన ఆఫ్రికన్లు ‘శ్వేత దక్షిణాఫ్రికా’లో భూములు కొనుగోలు చేసేందుకు లేదా కౌలుకు తీసుకొనే అవకాశాన్ని కోల్పోయారు, భూముల నుంచి గెంటివేతకు గురయ్యారు.
దేశాధ్యక్షుడు సిరిల్‌ రాంఫొసా తాజాగా ఒక పత్రికకు భూసమస్యపై రాసిన వ్యాసం సారాంశం ఇలా వుంది. గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల శాఖ జరిపిన భూ తనిఖీ లెక్కల ప్రకారం 90శాతం భూమి వ్యక్తులు, ట్రస్టులు, కంపెనీల చేతిలో ఉంది. పదిశాతం ప్రభుత్వానికి చెందినది. తొంభైశాతం భూమిలో వ్యక్తుల వద్ద 39, ట్రస్టులకు 31, కంపెనీలకు 25శాతం వుంది. వ్యవసాయ క్షేత్రాలు, భూములు కేవలం ఏడుశాతం యజమానుల చేతుల్లో ఉన్నాయి. ఈ ఏడుశాతంలో 72శాతం శ్వేతజాతీయులు, 15శాతం రంగు జాతీయులు (మన దేశంలో ఆంగ్లో ఇండియన్ల మాదిరి స్ధానిక ఆఫ్రికన్లు, శ్వేతజాతీయులు, భారత జాతీయుల సంకరంతో కలిగిన జనాభా), ఐదుశాతం భారతీయ సంతతి, నాలుగుశాతం ఆఫ్రికన్లు ఉన్నారు. ట్రంప్‌ ప్రకటన విషయానికి వస్తే ఉత్తర రాష్ట్రంలో ప్రయివేటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న వార్తల పూర్వరంగంలో వెలువడింది. ప్రభుత్వ రేటు ప్రకారం రెండు కోట్ల రాండ్‌లు తీసుకొని భూమిని స్వాధీనం చేయాలని స్థానిక అధికారులు ఒక యజమానిని కోరారు. అయితే తనకు 20కోట్ల రాండ్లు ఇవ్వాలని అతను తిరస్కరించటంతో చట్టనిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకొనేందుకు పూనుకున్నారు.
ముఫ్పైశాతం భూమిని ఐదేండ్లలో పంపిణీ చేయాలన్నది 1994లో తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో చేసిన వాగ్దానం. దానిలో ఇప్పటి వరకు పదిశాతం కూడా జరగలేదని 2014వరకు విధించిన గడువును 2024 వరకు పొడిగించనున్నట్టు వార్తలు వచ్చాయి. అంటే పాతికేండ్లలో చేసిందేమీ లేదన్నది చేదు నిజం. ఆఫ్రికన్లలో విపరీతంగా ఉన్న నిరుద్యోగం, పాతికేండ్లుగా అనుసరిస్తున్న నయావుదారవాద విధానాల వలన ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వంటి అనేక కారణాలతో జనంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. అవినీతి, అక్రమాల కారణంగా ఏకంగా ఒక దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా కొద్ది నెలల క్రితం పదవి నుంచి తప్పుకోవాల్సి రావటం అక్కడి పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జుమాను తొలగించకపోతే తాము సంకీర్ణ కూటమి నుంచి వైదొలుగుతామని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించాల్సి వచ్చింది. అవినీతి విషయంలో పట్టుబట్టిన మాదిరి ఇతర ప్రజావ్యతిరేక విధానాలు లేదా భూ సంస్కరణల వంటి వాటి విషయంలో కమ్యూనిస్టు పార్టీ అలాంటి వత్తిడి పాలక కూటమి మీద తీసుకురాలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే అంగీకృత విధానాల నుంచి కూటమి నాయకురాలైన ఏఎన్‌సీ దూరంగా వ్యవహరిస్తున్నందున వచ్చే ఎన్నికలలో తాము అవసరమైతే వంటరిగా బరిలోకి దిగుతామని కమ్యూనిస్టు నేతలు హెచ్చరించారు. ఒక వేళ అదే జరిగితే భూ సంస్కరణలు ఎన్నికల సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. కూటమి ఐక్యంగానే ఉన్నప్పటికీ జనం నుంచి వస్తున్న వత్తిళ్లు, నిరుద్యోగం, సాధికారత వంటి అంశాల కారణంగా భూ సంస్కరణలను వ్యతిరేకించే వారు, అనుకూలించే వారుగా ఎన్నికలలో చీలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఎలాంటి పరిహారం లేకుండా పరిమితులు దాటిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పంపిణీ చేసే విధంగా చట్ట సవరణ చేయనున్నట్టు అధ్యక్షుడు రాంఫొసానే ప్రకటించారు. 25వేల ఎకరాలకు పైబడి ఉన్న వారి నుంచి మాత్రమే పరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటామని ఏఎన్‌సీ అధ్యక్షుడు మంతాషే చేసిన ప్రకటన అనేక మందిలో చలనం కలిగించింది. పరిమితికి మించి వున్న భూములను అమ్ముకొనేందుకు ప్రయత్నించగా కొనే వారు కరువయ్యారు. దాంతో ప్రభుత్వ రేటుకు పదిహేను నుంచి ఇరవై రెట్లు అదనంగా ఇస్తేనే తాము భూములు వదులుకుంటామని కొందరు పట్టుబడుతున్నారు. భూములన్నీ శ్వేతజాతీయుల చేతిలో ఉండటంతో ప్రభుత్వ చర్యలు కూడా సహజంగానే వారికి వ్యతిరేకంగానే ఉంటాయి. దీంతో ఆ సమస్యకు రంగు పూసి జాతి వివక్షగా చిత్రించేందుకు పూనుకున్నారు. ట్రంప్‌ ట్వీట్‌ కూడా దానినే ప్రతిబింబించింది. స్వాభావికంగానే పెట్టుబడిదారీ వర్గం భూసంస్కరణలను సమర్ధిస్తుంది. దాని వస్తువులకు మార్కెట్‌ పెరగాలంటే జనం కొనుగోలు శక్తి పెరగాలి, అందుకుగాను భూ కేంద్రీకరణ ఒక ఆటంకం. ఒక వైపు కంపెనీ వ్యవసాయం లాభసాటి అంటూ ఆ వైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు భూ పంపిణీని కూడా ప్రపంచబ్యాంకు సమర్ధించుతుండటం మిత్రవైరుధ్యానికి నిదర్శనం. విప్లవాత్మకంగా భూసంస్కరణలను అమలు జరిపే ఉద్దేశ్యం ఏఎన్‌సీ ప్రభుత్వానికి ఉంటే నిజానికి ఎప్పుడో పరిహారంతో నిమిత్తం లేకుండా సీలింగ్‌ దాటిన భూములను స్వాధీనం చేసుకొని రైతాంగానికి పంచి ఉండేది. కారణాలు ఏమైనా కొన్ని చర్యలు తీసుకోక తప్పక పోవటంతో భూస్వాముల ప్రతినిధులు పాతపడిన, పాచి పాటలు పాడటం ప్రారంభించారు. అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటంతో అవి స్పష్టమయ్యే వరకు యజమానులు వ్యవసాయ పెట్టుబడులు పెట్టటం ఆలస్యం లేదా నిలిపివేస్తారు. దాని వలన ఈలోగా కార్మికుల వేతనాలు తగ్గిపోతాయి. పెట్టుబడి తగ్గితే ఆ మేరకు నిజ ఆదాయాలు, ఉత్పత్తి, దిగుబడులు పడిపోతాయి. మాంద్యం తలెత్తుతుంది. పెట్టుబడులు కలిగిన నిపుణులు, తెలివి తేటలు కలిగిన శ్వేతజాతీయులందరూ, తమ పరిజ్ఞానంతో సహా దేశం వదలి పోతారు. భూముల స్వాధీనం కారణంగా విదేశీ పెట్టుబడిదారులు తమ మదుపు మొత్తాలను వెనక్కు తీసుకుంటారు. అదింకెన్నటికీ తిరిగి రాదు. రాజకీయంగా చూస్తే భూ స్వాధీనం పాలక పార్టీకి మంచిదేమో గానీ ఆర్థిక విధానాల రీత్యా చాల చెడుచేస్తుంది. ఇలాంటి కబుర్లతో భయపెట్టాలన్నది వృధా ప్రయత్నమే. నష్ట పరిహారం లేకుండా భూ స్వాధీనం గురించి ఇంతవరకు చట్ట సవరణే చేయలేదు. చేస్తామని ప్రకటించగానే అప్పుడే భూములు లాగేసుకున్నట్టు, శ్వేతజాతి రైతులపై దాడులు, హత్యలు చేస్తున్నట్టు అంతర్జాతీయంగా నానా యాగీ చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో వ్యవసాయ సమస్య కీలకమైనదే. అక్కడి జనాన్ని భూముల నుంచి వెళ్లగొట్టి వాటిని స్వాధీనం చేసుకున్నవారు పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, గనుల తవ్వకం వంటి వాటిని అభివృద్ధి చేశారు. జనాన్ని దోపిడీ, అణచివేతలకు గురిచేశారు. వ్యవసాయ పంటల ఉత్పత్తి, సంపదసృష్టి, వన్యప్రాణి రక్షణ, కనీస సదుపాయాలతో జన నివాసాల ఏర్పాటు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. జాత్యహంకార పాలన పోయింది తప్ప ఆ పాలనలో గట్టిపడిన ఆస్తి, యాజమాన్య సంబంధాలలో పెద్ద మార్పు రాలేదు. వాటి స్థానంలో నల్లజాతీయుల పెత్తనం అంటే తెల్లజాతి పెట్టుబడిదారుల స్థానంలో నల్లజాతి పెట్టుబడిదారులను పెంపొందించాలనే వైఖరులు కూడా అక్కడ కొన్ని తరగతుల్లో బలంగా ఉన్నాయి. 1994తరువాత వచ్చిన అవకాశాలను అందుకు వినియోగించుకోవాలని చూసే వారు ఉన్నారు. అనేక మంది ఇప్పటికే ఆ క్రమంలో బలంగా తయారయ్యారు. వారు శ్వేతజాతి పెత్తనాన్ని వ్యతిరేకిస్తారు తప్ప పెట్టుబడిదారీ విధానాన్ని, నయా వుదారవాద విధానాలను కాపాడేందుకు పూనుకుంటారు. గత 25ఏండ్లలో కార్మికవర్గంపై జరిగిన దాడులే అందుకు నిదర్శనం. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలతో జాత్యహంకారాన్ని, సామాజిక అసమానతలను దూరం చేయటం, దోపిడీ, స్త్రీ పురుష వివక్షను రూపు మాపటం జరిగేది కాదు. తెల్లవారి స్ధానంలో నల్లవారు రావటం తప్ప జరిగేదేమీ ఉండదు.
దక్షిణాఫ్రికాలో భూసమస్యపై గత పాతికేండ్లలో స్ధూలంగా వెల్లడైన ధోరణుల గురించి చూద్దాం. మితవాదులైన శ్వేత జాతీయులు, ఇతరంగా స్వల్పంగా వున్న భూ కామందులు మొత్తంగా ఎలాంటి సంస్కరణలు జరగరాదని పట్టుబడుతున్నారు. లేదా భూములను వదులుకోవాల్సి వస్తే పెట్టుబడిదారీ మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారం ఇచ్చి తీసుకోమంటున్నారు. నయా వుదారవాదులు అమ్మకందార్లు, కొనుగోలు దార్ల సూత్రాన్ని అమలు జరపమంటున్నారు. అంటే అది కూడా డబ్బున్నవారి యాజమాన్యంలోకే భూ బదిలీ తప్ప మరొక పురోగామి ఆలోచన కాదు. మరోవైపున భూ సంస్కరణలు ఎలా అమలు జరపాలన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకోవాలి అన్నది ఒక వైఖరి. ఏ భూమిని స్వాధీనం చేసుకోవాలి దేనిని కూడదు అన్నది ఇంతవరకు తేల్చుకోలేదు. పట్టణ ప్రాంతాలలోని వ్యాపారులు తమ వ్యాపారాలకు గ్రామాలలో అనుబంధంగా కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కలిగి ఉండటానికి అనుమతించాలని కోరుతున్నారు. భూస్వాములు కోరుతున్నట్టు మార్కెట్‌ రేట్లకు ప్రభుత్వం కొనుగోలు చేయటం అర్థం లేని విషయం. అవన్నీ కొన్ని తరాల కింద పేదల నుంచి ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకున్నవి, కూలీలుగా వారి శ్రమను దోచుకున్న వారి ఆధీనంలో ఉన్నవి. అన్నింటినీ మించి నయా వుదారవాద విధానాలలో భాగంగా ప్రభుత్వాలు ఉత్పాదక రంగాలలో పెట్టుబడులను పెట్టటం లేదు. దక్షిణాఫ్రికాలో భూ సంస్కరణలు అమలు జరిపి పేదలకు భూమిని ఇచ్చి సాగు చేయమంటే జరిగేది కాదు. ఇప్పటి వరకు వేలాది ఎకరాల క్షేత్రాలలో పెట్టుబడిదారీ పద్ధతులలో సాగును చూసిన అక్కడి పేదలు తమకు కేవలం భూమిని ఇస్తే ఏం చేసుకోవాలనే అనాసక్తత కూడా ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందువలన ప్రభుత్వం ఏ రూపంలో పెట్టుబడులు పెట్టాలి, ఆహార భద్రత ఎలా చేకూర్చాలి, రైతాంగానికి గిట్టుబాటు అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి మొదలైన అనేక అంశాల మీద విధానపరమైన స్పష్టత వచ్చినపుడే సంస్కరణలు జయప్రదమౌతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టర్కీకి అమెరికా వెన్నుపోటు !

16 Thursday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, NATO allies, Recep Tayyip Erdoğan, Turkey, Turkish lira, U.S.

Image result for U.S. is stabbing Turkey in the back

ఎం కోటేశ్వరరావు

ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా, విను వీధిని శ్రేణులుగా నిలిచి విడ్డూరమును చూచెదరా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ.. అంటూ కొసరాజు రాసిన పాటకు స్వరాలు సమకూర్చి స్వయంగా గానం చేసిన ఘంటసాల గీతాన్ని లవకుశ సినిమాలో చూసి కన్నీళ్లు కార్చేవారు ఇప్పటికీ వున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఇతిహాస గాధ. ప్రపంచవ్యాపితంగా ఎందరినో కష్టాల పాలు చేసే, తప్పించటానికి అవకాశం వున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పలు దేశాల మీద ప్రారంభించిన వాణిజ్య లేదా ఆర్ధిక యుద్దమనే దారుణాన్ని సహించాలా, ఎలా అడ్డుకోవాలన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న వాస్తవం. అమెరికాను మనకు మంచి స్నేహదేశంగా చిత్రించేందుకు నిక్కర్ల నుంచి పాంట్స్‌కు మారిన వారు నానా తంటాలు పడుతున్నారు. అలాంటి మిత్రదేశం దెబ్బకు తొలిసారిగా మన రూపాయి గురువారం వారం నాడు ఒక దశలో ఒక డాలరుకు మారకం విలువ 70.32కి పడిపోయి సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క మన దేశమే కాదు ప్రపంచాన్నంతటినీ ట్రంప్‌ ప్రమాదపు అంచుల వరకు తీసుకుపోతున్నాడు. మరి ఈ దారుణాన్ని ఎవరు అడ్డుకోవాలి? జనం శ్రేణులుగా నిలిచి విడ్డూరంగా చూడాలా ?

తమ ఎగుమతులపై పన్ను విధించి కరెన్సీ లీరాను దెబ్బతీసిన అమెరికాపై ప్రతీకారంగా అమెరికా కార్లపై 120శాతం, మద్యంపై 160, పొగాకు వుత్పత్తులపై 60శాతానికి దిగుమతి పన్నును టర్కీ పెంచింది. మరోవైపు 15బిలియన్‌ డాలర్ల మేరకు టర్కీలో పెట్టుబడులు పెడతామని కతార్‌ ప్రకటించటంతో లీరా కొద్దిగా కోలుకుంది.ఏడాది క్రితం సౌదీ అరేబియా నాయకత్వంలో నాలుగు అరబ్‌ దేశాలు కతార్‌పై వాణిజ్య, దౌత్యపరమైన ఆంక్షలను విధించాన్ని టర్కీ వ్యతిరేకించింది. ఇపుడు కతార్‌ ఈ విధంగా బదులు తీర్చుకుంది. టర్కీ అవసరాలలో 15బిలియన్‌ డాలర్లు చిన్న మొత్తమే అయినప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా సాధించిన నైతిక విజయమిది.

దశాబ్దాల తరబడి ఆంక్షలతో క్యూబాను అతలాకుతలం చేసిన అమెరికా తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. గత కొద్ది సంవత్సరాలుగా వామపక్ష పాలనలో వున్న వెనెజులా, నయా పెట్టుబడిదారీ ఏలుబడిలో వున్న రష్యా, మతశక్తుల ఏలుబడిలో వున్న ఇరాన్‌, పొరుగునే వున్న మిత్రదేశాలు మెక్సికో, కెనడా, సోషలిస్టు దేశమైన చైనాపై ఆర్ధిక, వాణిజ్య దాడులను జరుపుతున్నది. ఐరోపా యూనియన్‌తో తాత్కాలిక రాజీకుదుర్చుకుంది. పాతికేండ్ల క్రితం సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తమకిక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా ఇప్పుడు బస్తీమే సవాల్‌ అంటూ తన, పరబేధం లేకుండా ఎందుకు కత్తులు దూస్తున్నది? పర్యవసానాలేమిటి? తాజాగా మన రూపాయి రికార్డు పతనానికి కారణం నాటో కూటమిలో కీలక సభ్యదేశమైన టర్కీపై అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఆదేశాన్ని ఏ క్షణంలో అయినా పతనంలోకి నెట్టే అవకాశం వుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఆర్ధిక, రాజకీయ, మిలిటరీ ఎత్తుగడులలో ఎంతో కీలకమైనది ఐరోపా కేంద్రంగా వున్న నాటో కూటమి.దానిని మరింతగా విస్తరించేందుకు ఒకవైపు పూనుకున్న అమెరికా మరోవైపు కీలకమైన భాగస్వామి టర్కీతో సంబంధాలను దెబ్బతీసేందుకు పూనుకుంది. తమను వెన్నుపోటు పొడిచేందుకు అమెరికా చూస్తున్నదని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించాడు.ఆర్ధిక యుద్ధాల తూటాలు, ఫిరంగి గుండ్లు, క్షిపణులను ప్రయోగించినప్పటికీ తాము వెనక్కు తగ్గేది లేదని హెచ్చరించాడు. టర్కీ కరెన్సీ లీరా పతనమైన కారణంగానే తాము పన్నులను పెంచినట్లు ట్రంప్‌ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లీరా 41శాతం పతనమైంది. దీంతో టర్కీలో విదేశీ వస్తువుల ధరలు పెరిగిపోయి డిమాండ్‌ తగ్గిపోయింది. వీటిని సాకుగా చూపి గతవారంలో టర్కీ నుంచి దిగుమతి అయ్యే వుక్కుపై 50, అల్యూమినియంపై 20శాతం చొప్పున సుంకాన్ని విధించటంతో టర్కీ కరెన్సీ లీరా, స్టాక్‌ మార్కెట్‌ మరింతగా పతనమయ్యాయి, ద్రవ్యోల్బణం 15శాతానికి పెరిగింది. ఇవన్నీ ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చని భావిస్తున్నారు.దీనికి మతాధికారి ఆండ్రూ బ్రూసన్‌ను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌ను కూడా ట్రంప్‌ సర్కార్‌ జోడించింది. టర్కీ యూరేసియా దేశం.ఐరోపాలో ఎక్కువ భాగం వుండటంతో అక్కడి ఏకైక ముస్లిం దేశంగా పరిగణిస్తారు. ఐరోపాలోని గ్రీస్‌, బల్గేరియా, యూరేసియాలోని జార్జియా, ఆర్మీనియా, అజర్‌బైజాన్‌, ఆసియాలోని ఇరాన్‌, ఇరాక్‌, సిరియాలు సరిహద్దుగా వుంది. ఈ ప్రాంతంలో అమెరికా తన ప్రయోజనాలకు పెద్ద పీట వేయటంతో విధిలేక కొన్ని సార్లు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించుతున్నది, తాజా వివాదానికి నేపధ్యమిదే. నిజానికి అమెరికా చేసుకొనే దిగుమతుల్లో టర్కీ నుంచి వుక్కు 4.2, అల్యూమినియం ఒకశాతం లోపే వున్నది. అందువలన వీటి కంటే రాజకీయకారణాలే ప్రస్తుతం వుభయ దేశాల మధ్య విబేధాల పెరుగులకు కారణాలుగా చెప్పవచ్చు.

2003లో జార్జి డబ్ల్యు బుష్‌ నాయకత్వంలో ఇరాక్‌పై అమెరికా దాడి చేసింది. అది మొదలు ఆ ప్రాంతంలో అమెరికా ప్రమేయంతో జరుగుతున్న పరిణామాలలో టర్కీకి సమస్యలు తలెత్తుతూనే వున్నాయి. టర్కీ, ఇరాన్‌, సిరియా సరిహద్దు ప్రాంతంలో కుర్దులు పెద్ద సంఖ్యలో వున్నారు. ఇజ్రాయెల్‌ మాదిరి తమకు ప్రత్యేకంగా కుర్దిస్దాన్‌ ఏర్పాటు చేయాలన్నది ఎప్పటి నుంచో వారి డిమాండ్లలో ఒకటి. అది జరిగితే ఆ ప్రాంత దేశాల స్వరూపమే మారిపోతుంది కనుక ఎవరూ అంగీకరించటం లేదు. పశ్చిమాసియా వివాదాలలో అమెరికన్లు కుర్దులకు మద్దతు తెలిపి వారిని పావులుగా వాడుకుంటున్నారు. సిరియాలో అసాద్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఐఎస్‌ తిరుగుబాటుదార్లను ఎదుర్కోవటంలో కుర్దులది ప్రధాన పాత్ర. వారికి అమెరికా మద్దతు ఇస్తున్నది. ఇరాక్‌, టర్కీలలోని కుర్దులు తమకు ప్రత్యేకం దేశం కావాలంటూ చేస్తున్న సాయుధ చర్యలను అక్కడి ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి.

రెండు సంవత్సరాల క్రితం టర్కీలో ఒక విఫల తిరుగుబాటు జరిగింది. దానికి కుర్దిస్ధాన్‌ వర్కర్స్‌ పార్టీ, దానితో సంబంధాలున్న అమెరికా మతాధికారి ఆండ్రూ బ్రున్‌సన్‌ సంధానకర్తగా వున్నాడని భావించిన టర్కీ ప్రభుత్వం అతగాడిని అరెస్టు చేసి విడుదలకు తిరస్కరించింది. ప్రస్తుతం అధికారంలో వున్న ఎకెపి పార్టీ సహకారంతో రెండు దశాబ్దాల క్రితం టర్కీలో గులెన్‌ పేరుతో ఒక ఇస్లామిక్‌ సంస్ధ వునికిలోకి వచ్చింది. ప్రభుత్వ అండదండలతో దానితో సంబంధం వున్న అనేక మంది ప్రభుత్వ యంత్రాంగంలోకి చొరబడ్డారు. అది ఎంతవరకు వచ్చిందంటే పోలీసు, న్యాయవ్యవస్ధలోని గులెన్‌ సభ్యులు, ఆ సంస్ధను పెంచి పోషించిన ఎకెపి పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు తలెత్తింది. చివరకు అధ్యక్షుడు ఎర్డోగన్‌పై తిరుగుబాటుకు ఆ సంస్ధ పురికొల్పింది. అయితే దానిని కఠినంగా అణచివేశారు. దానికి సహకరించాడంటూ అమెరికా మతాధికారిని అరెస్టు చేసి గులెన్‌ ఒక వుగ్రవాద సంస్ధ అని ప్రకటించింది.తిరుగుబాటును ప్రోత్సహించిన ఫతుల్లా గులెన్‌ అమెరికాలోని పెన్సిల్వేనియాలో వుంటున్నాడు. అతడిని తమకు అప్పగించాలన్న టర్కీ డిమాండ్‌ను అమెరికా తిరస్కరించింది. వుగ్రవాదం పట్ల అమెరికా మెతకగా వుందంటూ టర్కీ విమర్శించింది. అప్పటి నుంచి వుభయ దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. ఒక దేశాన్ని లొంగదీసుకోవాలంటే దాని ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం అమెరికా ఆయుధాల్లో ఒకటి. టర్కీ విషయంలో అదే జరుగుతోందా ? ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని పరిణామాలు అమెరికాకు మింగుడు పడటం లేదు.

అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వుపసంహరించుకున్న అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తాము ఖాతరు చేసేది లేదని టర్కీ ప్రకటించింది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రత్యర్ధి అయిన రష్యాతో టర్కీ సంబంధాలు పెరుగుతున్నాయి. క్షిపణులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. అది అమెరికన్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నది. సిరియాలో రష్యా మద్దతు వున్న ప్రభుత్వానిది పైచేయిగా వుంది. రష్యా, ఇరాన్‌, టర్కీలే సిరియా పరిణామాలను నిర్దేశించేవని ఇప్పటికే తేలిపోయింది. అమెరికన్లకు అది పరాభవమే. చైనా చొరవతో ప్రారంభమైన సిల్క్‌ రోడ్‌తో పాటు చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం, తదితర చర్యలు సిరియా పునర్‌నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఇరాన్‌ స్ధిరపడటానికి దోహదం చేసేవిగా వున్నాయి. ఇది అమెరికన్లకు ఏమాత్రమూ అంగీకారం కాదు. సిరియా తదితర పరిణామాలలో అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ నిలబడుతోంది. ఇరాన్‌తో వాణిజ్యాన్ని వదులుకొనేది లేదని చైనా స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా తన వెసులుబాటు కోసం ఇరాన్‌ వంటి దేశాలతో సంబంధాల మెరుగుదలకు చమురురంగంలో పెట్టుబడుల వంటివాటితో పూనుకుంది.

ఒక మతాధికారిని అడ్డం పెట్టుకొని టర్కీని తమ కాళ్లముందు పడేసుకోవాలని చూస్తోందని ఎర్డోగన్‌ మండిపడ్డారు. అమెరికా గనుక తన పద్దతులను మార్చుకోనట్లయితే తాము కొత్త స్నేహితులు, కలసి వచ్చే వారికోసం చూడాల్సి వస్తుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. గత ఆరుదశాబ్దాల కాలంలో అమెరికాతో కలసి తాము ఎలాపని చేసిందీ ఏకరువు పెట్టి అవన్నీ మరచిపోయి తమతో వ్యవహరిస్తున్నారని, తమ పౌరుల ఆందోళనను అర్ధం చేసుకోవటం లేదని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన తిరుగుబాటు మీద సంతృప్తికరంగా అమెరికా స్పందించలేదని, తిరుగుబాటకు కారకుడైన వ్యక్తిని తమకు అప్పగించలేదని పేర్కొన్నాడు. ఒక మతాధికారి కోసం మీరు నాటోలోని మీ వ్యూహాత్మక భాగస్వామిని మార్చేందుకు చూస్తున్నారు, బెదిరింపులతో మా దేశాన్ని మీదారికి తెచ్చుకోలేరు, మీకు డాలర్లు వుంటే మాకు అల్లా వున్నాడు, మేము స్వాతంత్య్రంతో పోరాడతాము అని హెచ్చరించాడు.అమెరికా స్వయంగా వుగ్రవాద గ్రూపుగా ప్రకటించిన సిరియా మద్దతు వున్న పికెకె సంస్ధకు అమెరికా ఐదువేల ట్రక్కులు, రెండువేల విమానాల ద్వారా ఆయుధాలను అందచేసిందని, ఆ సంస్ధ చేతిలో 1984 నుంచీ వేలాది మంది తమ పౌరులు మరణించారని పేర్కొన్నాడు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించిన నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఎర్డోగన్‌ ఫోన్లో సంభాషించాడు.

టర్కీ పాలకుల విషయానికి వస్తే అమెరికా అనుచిత కార్యకలాపాలన్నింటిలో భాగస్వాములయ్యారు.దేశంలో భిన్నాభిప్రాయాన్ని అణచివేయటంలో పేరు మోశారు. వ్యూహాత్మక స్ధానంలో వున్న కారణంగా అమెరికా, ఇతర పశ్చిమ ఐరోపా ధనిక దేశాల మాదిరి ప్రాంతీయ పరిణామాలలో పాత్రవహించాలని సహజంగానే కోరుకుంటారు. అమెరికా బలంగా వున్నపుడు ఎర్డోగన్‌ వంటి వారు ఎలా తలొగ్గుతారో బలహీనపడినపుడు దాని నుంచి లబ్ది పొందేందుకు కూడా అదే మాదిరి తలెత్తుతారు. టర్కీ తీరుతెన్నులు ఇప్పుడు అలాగే వున్నాయి. ఇప్పుడున్న స్ధితిలో మరో అధికార కేంద్రం పెరగటాన్ని అమెరికా అంగీకరించదు. టర్కీ నాటో సభ్యురాలు, రష్యా ఆ కూటమికి ప్రధమ శత్రువు, తోటి సభ్యురాలిపై అమెరికా కత్తి గట్టింది. సిరియాకు రష్యా పూర్తి మద్దతు ఇస్తున్నది. సిరియాపై గతంలో ఐఎస్‌ తీవ్రవాదులు దాడి చేసేందుకు టర్కీ ప్రాంతాన్ని అమెరికా వుపయోగించుకుంది. ఇప్పుడు మారిన పరిస్ధితులలో ఐఎస్‌ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు టర్కీలోని వైమానిక స్ధావరాన్ని నాటో వినియోగిస్తున్నది. అమెరికా తమపై కత్తి కట్టింది కనుక దాన్ని మూసివేయాలని కొందరు వత్తిడి తెస్తున్నారు. టర్కీ దిగుమతి చేసుకొనే చమురులో సగం ఇరాన్‌ నుంచే వస్తోంది. అమెరికా ఆంక్షలను టర్కీ తిరస్కరించింది. నాటో సభ్యురాలైనప్పటికీ రష్యా నుంచి టర్కీ క్షిపణులను కొనుగోలు చేస్తున్నది. ఇవన్నీ ఒక సంక్లిష్ట పరిస్ధితికి నిదర్శనం.ఐరోపా యూనియన్‌ తక్షణమే అమెరికాతో ఘర్షణకు దిగటానికి సిద్ధం కాదు కనుకనే పన్నుల విషయంలో తాత్కాలిక రాజీకి వచ్చింది. అమెరికాకు అనేక షరతులు విధించింది. ఐరోపా కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకే ఈ రాజీ. అమెరికా వత్తిడికి తలొగ్గిన టర్కీ సర్కార్‌ మతాధికారి బ్రున్స్‌న్‌ను జైలు నుంచి గృహనిర్భంధానికి మార్చింది. తాజా వివాదంలో బ్రున్సన్‌ ఒక తురుపు ముక్క మాత్రమే. నల్ల సముద్రం, మధ్యప్రాచ్చం, పసిఫిక్‌ సముద్రాల మధ్య వున్న టర్కీ ప్రాధాన్యత గురించి అమెరికన్లకు తెలియదనుకోవటం పొరపాటు. అందువలన తెగేదాక లాగకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ రాజకీయాల పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అబద్దాలు, అదిరింపులు, బెదిరింపులతో నాటో భేఠీ !

14 Saturday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Donald trump, lies, NATO, nato brussels summit 2018, scares, threats

Image result for nato brussels summit 2018

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారికి ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతోంది.అమెరికా పాలకవర్గం(దాని ప్రతినిధులు రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలనేతలు) ప్రపంచాన్ని ఏవైపు తీసుకుపోతున్నది? పర్యవసానాలు ఎలా వుంటాయి? ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌, వుత్తర కొరియాతో అణు సమస్యపై తొలిసారిగా ఒక ఒప్పందానికి వస్తున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో ఏ దేశమైనా లావాదేవీలు జరిపితే వాటి మీద కూడా తన కొరడా ఝళిపిస్తానని భారత్‌ వంటి దేశాలను బెదిరించాడు.కెనడాలో జరిగిన జి7 సమావేశంలో అన్నింటా తన అనుయాయిగా వున్న కెనడా, ఇతర మిత్ర దేశాల మీద విరుచుకుపడ్డాడు. చైనాతో పాటు కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ మీద కూడా వాణిజ్య యుద్దం ప్రకటించాడు. తాజాగా ఈనెల 11,12 తేదీలలో జరిగిన నాటో కూటమి దేశాల సమావేశంలో మిలిటరీ ఖర్చు పెంచుతారా లేదా అంటూ బెదిరింపులకు దిగాడు. ఐరోపా యూనియన్‌లో అగ్రరాజ్యమైన జర్మనీపై విరుచుకుపడుతూ ఇంధనం కోసం రష్యా చేతిలో బందీ అయిందని మండిపడ్డాడు. నాటో ఖర్చు అంతటినీ అమెరికాయే భరిస్తోందంటూ అతిశయోక్తులు పలికి అపహాస్యం పాలయ్యాడు. అంతే కాదు దాదాపు అన్ని విషయాల్లో అమెరికాకు వత్తాసు పలుకుతూ, ఐరోపా యూనియన్‌లో అమెరికా ఏజంటు వంటిది అని పేరు తెచ్చుకున్న బ్రిటన్‌ను కూడా ట్రంప్‌ వదల్లేదు. ప్రధాని థెరెస్సా మే గురించి, బ్రెక్సిట్‌ గురించి నోరుపారవేసుకున్నాడు. దీంతో సోమవారం నాడు బ్రిటన్‌ పర్యటనలో లక్షలాది మంది నిరసన ఎదుర్కొన్నాడు. బ్రసెల్స్‌ నాటో సమావేశంలో నిజమైన బేధాభిప్రాయం దానికి నిధుల చెల్లింపు గురించే అని నాటో వర్గాలు వెల్లడించాయి. లోపల ఎన్ని బేధాభిప్రాయాలు వున్నా, ట్రంప్‌ ప్రవర్తనపై అసంతృప్తి వున్నా ఐరోపా నేతలు సంయమనం పాటించారు. తాత్కాలికంగా అయినా ట్రంప్‌ను సంతృపరచేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామలన్నీ దేనికి సూచిక ?

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ముఖ్యంగా సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌లైన జార్జియా, వుక్రెయిన్లలో రష్యా మిలిటరీ జోక్యం ముగిసిందనుకున్న ప్రచ్చన్న యుద్ధం మరో రూపంలో ప్రారంభం అవుతుందా అన్న ప్రశ్నను రేకెత్తించాయి. రష్యాను ఒంటరిని చేయాలని నాటో అనే శిఖండిని ముందు పెట్టుకొని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఎలా ప్రయత్నిస్తున్నాయో రష్యా కూడా నాటోలో రాజకీయ విబేధ విత్తనాలు నాటేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. బ్రసెల్స్‌ సమావేశాల్లో వాటి గురించి స్వయంగా అమెరికాయే బయటపడటం విశేషం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా, ఐరోపా దేశాలు 1949లో వుమ్మడి మిలిటరీ రక్షణ కూటమిగా వుత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ(నాటో)గా ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిలో 29దేశాలు వున్నాయి. నాటి సోవియట్‌ నుంచి రక్షించుకొనే పేరుతో ఏర్పడిన ఈ సంస్ధ 1991 అది రద్దయిన తరువాత కూడా కొనసాగటమే కాదు, దాని ఖర్చును రెట్టింపు చేయాలని తాజాగా బ్రసెల్స్‌లో జరిగిన సమావేశంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సభ్యరాజ్యాలను డిమాండ్‌ చేశాడు. గత ఏడు దశాబ్దాలలో కమ్యూనిస్టు సోవియట్‌ లేదా తరువాత దాని వారసురాలిగా మారిన పెట్టుబడిదారీ రష్యా గానీ నాటో సభ్యరాజ్యాల మీద దాడి లేదా ప్రయత్నం కూడా చేయలేదు. అయినా సరే దాన్నింకా బలపరచాలని అమెరికా కోరటం వెనుక వున్న వుద్దేశ్యం ఏమిటి? ఎవరి నుంచి ముప్పు వస్తుస్తుందని ఐరోపా రాజ్యాలు భయపడుతున్నాయి?

1991లో సోవియట్‌ యూనియన్‌ను కూల్చివేశారు. అప్పటి వరకు దానికి వ్యతిరేకంగా పని చేసిన నాటో తదుపరి ప్రయాణం ఏదిశగా సాగాలి, అసలు కొనసాగటం అవసరమా అన్న దిశలో చర్చలు జరిగాయి. పశ్చిమ ఐరోపాతో పాటు తూర్పు ప్రాంతానికి కూడా రక్షణ ఛత్రాన్ని విస్తరింప చేయాలని నాటి బిల్‌క్లింటన్‌ సర్కార్‌ మొగ్గు చూపింది. ప్రపంచం మీద పెత్తనం కొనసాగించాలన్నదే అంతర్గత అంశం. సోవియట్‌ ముప్పు లేకపోయిన తరువాత ఐరోపా రక్షణకు అమెరికా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది అమెరికా రక్షణశాఖలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. నాటో విస్తరణ కూటమిని పలుచన చేస్తుందని బ్రిటన్‌, విస్తరణ నాటో ప్రభావాన్ని అవసరానికి మించి పెంచుతుందని ఫ్రాన్స్‌ భయం వ్య్తం చేసింది. చిత్రం ఏమిటంటే 69 సంవత్సరాల క్రితం నాటో ఏర్పాటు లక్ష్యం వేరు, ఆచరణలో దాన్ని వినియోగిస్తున్న తీరు వేరుగా వుంది. నాటో ఒప్పందం ప్రకారం ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలోని సభ్య రాజ్యాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిపై ఎవరైనా దాడి చేస్తే అందరి మీద జరిగిన దాడిగా పరిగణించి ప్రతిఘటించాలి. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా అటువంటి దాడి జరగలేదు. సరికదా నాటో దేశాల సరిహద్దుల వెలుపల నాటో సభ్య దేశాలే ఏదో ఒకసాకుతో మిలిటరీ జోక్యం చేసుకుంటున్నాయి. కొత్త భద్రతా సమస్యలు తలెత్తాయనే పేరుతో దాన్ని కొనసాగించేందుకు కొత్త సాకులు వెతుకుతున్నాయి.

Nato

1990దశకంలో నాటి యుగోస్లావియా జాతుల విబేధాలతో ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి బోస్నియా, హెర్జెగోవినా మీద విమానాలు ఎగరకూడదని ఆంక్షలు విధించింది. దాన్ని అవకాశంగా తీసుకొని తొలిసారిగా నాటో దళాలు 1994లో నాలుగు బోస్నియా విమానాలను కూల్చివేశాయి. ఆ తరువాత కొసోవోలో శాంతి పరిరక్షణ పేరిట, మధ్యధరా సముద్రంలో భద్రతా గస్తీ, సోమాలియాలో ఆఫ్రికన్‌ దళాలకు మద్దతు, ఆఫ్ఘనిస్తాన్‌లో వుగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు పేరుతో నాటో జోక్యం చేసుకుంది. ఇవన్నీ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద ఎత్తుగడలు, లక్ష్యాలలో భాగంగానే జరిగాయి తప్ప ఐరోపాకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇంతే కాదు ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను నీరుగార్చి, దాని లక్ష్యాలను కూడా దెబ్బతీసే విధంగా నాటో రాజ్యాలు వ్యవహరిస్తున్నాయి. వుదాహరణకు లిబియా మీద 2011లో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. వాటిని అమలు జరిపే పేరుతో రంగంలోకి వచ్చిన అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరువాత కొద్ది రోజుల్లోనే ఆ బాధ్యతను నాటో కమాండ్‌కు అప్పగించాయి. టర్కీ ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.లిబియాపై దాడులు చేసేందుకు జర్మనీ, పోలాండ్‌ తిరస్కరించాయి.

తమ సభ్యదేశంపై జరిగిన దాడిని వుమ్మడిగా ఎదుర్కోవాలనే సూత్రాన్ని 2001లో ఆప్ఘనిస్తాన్‌లో నాటో ముందుకు తెచ్చింది. వుగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే పేరుతో అక్కడ జోక్యం చేసుకుంది అమెరికా.అమెరికా సేనల మీద దాడులు జరిపింది ఆల్‌ఖైదా వుగ్రవాదులు. దానికి నాటో సూత్రానికి లంకెపెట్టి అమెరికా నాయకత్వంలోని దళాలు అక్కడి ప్రభుత్వానికి సాయం చేసే పేరుతో తిష్టవేశాయి. రెండు సంవత్సరాల తరువాత ఆ బాధ్యతను నాటో స్వీకరించింది.అయితే కొన్ని దేశాలు జాతీయ కారణాలు చూపి ఆ దాడులకు తమ సైన్యాన్ని పంపలేదు. నాటో, దాని భాగస్వామ్య దేశాల పేరుతో 50కిపైగా దేశాల నుంచి లక్షా 30వేల మంది సైన్యాన్ని దించి 2014వరకు దాడులు చేశారు. వాటిలో వుగ్రవాదుల చేతుల్లో మరణించిన వారిలో చురుకుగా పాల్గన్న అమెరికా, బ్రిటన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలవారే అధికులు. ఆ తరువాత గత నాలుగు సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పేరుతో 16వేల మంది నాటో సైనికులు అక్కడ కొనసాగుతుండగా వారిలో సగం మంది అమెరికన్లే. అదే ఆల్‌ఖైదా వుగ్రవాదులకు అమెరికాతో పాటు ఐరోపా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి సిరియాలో వున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించటాన్ని గమనించాలి. వాటికి వ్యతిరేకంగా అక్కడ రష్యా సేనలు సిరియాకు మద్దతు ఇస్తున్నాయి. నాటో విస్తరణ ఐరోపాకే పరిమితం చేయలేదు. రష్యాను చుట్టుముట్టేందుకు ఆసియాలోని అజర్‌బైజాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలకు సైతం ఏదో ఒకసాకుతో విస్తరించేందుకు పూనుకున్నారు. దీని వెనుక రష్యాను దిగ్బంధనం చేయటంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల వరకు నాటో పేరుతో అమెరికా దళాలను రప్పించే ఎత్తుగడ వుంది. అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరాన్‌ వుంది. 1990దశకంలో జర్మనీ ఏకీకరణ సమయంలో నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని అమెరికా ఇచ్చిన హామీలకు భిన్నంగా తూర్పుకే కాదు, చివరకు ఆసియాకు సైతం వస్తున్నది. అందువలన నాటో ఏర్పడిన లక్ష్యాలకు, ఇప్పుడు చేస్తున్నదానికి వున్న ఏకైక లక్ష్యం ఏమిటంటే అప్పుడూ ఇప్పుడూ ఈ ప్రాంతంపై అమెరికా పెత్తనాన్ని విస్తరించటమే. నాటోను కొనసాగించితే దీర్ఘకాలంలో ప్రమాదముంటుంది, అదే తూర్పుదిశగా వేగంగా విస్తరింపచేస్తే రష్యాను నయా సామ్రాజ్యవాద దేశంగా మార్చటానికి దారితీస్తుందని 1994లో అమెరికా విదేశాంగ మంత్రి వారెన్‌ క్రిస్టోఫర్‌ హెచ్చరించారు. అయితే రష్యా, నాటో వైపు నుంచి కూడా పరిస్ధితిని దిగజార్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వుక్రెయిన్‌ తూరుప్రాంతంలోని క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకుంది. జార్జియాలో కూడా జోక్యం చేసుకొని తన పలుకుబడిని పెంచుకుంటున్నది . వాటిని చూపి ఐరోపాకు ముప్పుతొలగలేదని అమెరికా చెబుతున్నది. రష్యాపై ఆంక్షలను విధిస్తున్నది. వాటిని కొన్ని ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. 2014 నుంచి రష్యాతో పౌర, మిలిటరీ సహకారాన్ని నాటో నిలిపివేసింది. తూర్పు ఐరోపాలో బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాలను పెంచింది. ఈ రెండు దేశాలను నాటోలో చేర్చుకుంటే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని రష్యా హెచ్చరిస్తున్నది. ఈ కారణంగానే ఆ దేశాలను నాటోలో చేర్చుకొనేందుకు కూటమి దేశాలు తొందరపడటం లేదు. వాటిని ఈపాటికి చేర్చుకొని వుంటే పరిణామాలు, పర్యవసానాలు వేరే విధంగా వుండి వుండేవి. అయితే రష్యా మద్దతు వున్న తిరుగుబాటదార్లను అదుపు చేసే పేరుతో వుక్రెయిన్‌కు అత్యంత అధునాత ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. క్రిమియాను విలీనం చేసుకున్న తరువాత అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన వుపన్యాసంలో నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ అనేకసార్లు వారు మాతో అబద్దాలు చెప్పారు, మాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారు, తూర్పు దిశగా నాటో విస్తరణ జరిగింది, మా సరిహద్దులలో మిలిటరీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే మమల్ని అదుపు చేయాలనే పశ్చిమదేశాల విధానంతో పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవయశతాబ్దాలలో నడిచాయి, నేడు కూడా కొనసాగిస్తున్నాయి.’ అన్నారు.

తమదేశంతో సహా రష్యా విదేశాల ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది, నూతన అణ్వాయుధాలను తయారు చేస్తున్నది. ఐరోపాలోని వ్యవస్ధలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది, ఐరోపా రక్షణలో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నది అని అమెరికా ఆరోపిస్తున్నది. ఐరోపాలో తాను ఏర్పాటు చేస్తున్న పరిమిత క్షిపణి రక్షణ వ్యవస్ధలు ఇరాన్‌ దాడిని ఎదుర్కొనేందుకు అని అమెరికా చెబుతున్నది. ఈ మాటలను ఎవరూ నమ్మరని వేరే చెప్పనవసరం లేదు. క్రిమియాలో రష్యా జోక్యాన్ని సాకుగా చూపుతూ తటస్ధ దేశాలుగా వున్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను కూడా నాటో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్ధలను సమకూర్చుకొనేందుకు టర్కీ పాలకులు ప్రయత్నించటానికి నాటోలోని మిగతా దేశాలు అభ్యంతర పెడుతున్నాయి.

ఈ పూర్వరంగంలో జూలై 11,12 తేదీలలో బ్రసెల్స్‌లో నాటో కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు అపహాస్యం పాలైంది. బ్రసెల్స్‌ సమావేశం విజయవంతమైందని ట్రంప్‌ ప్రకటించాడు. సభ్యదేశాల నేతలతో తన సంబంధాలు ఎంతో బాగున్నాయని మరీ మరీ చెప్పాడు. అయితే జరిగిన పరిణామాలు అలా కనిపించటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌-రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ లోహానిస్‌ భేఠీ వార్తల సేకరణ వుందంటూ ప్రధాన వార్తా కేంద్రం నుంచి వెళ్లిపోయిన రుమేనియా విలేకర్లు వెంటనే తిరిగి వచ్చి సమావేశం రద్దయినట్లు తెలిపారు. అంతే కాదు అజర్‌బైజాన్‌, వుక్రెయిన్‌, జార్జియానేతలతో వుందన్న సమావేశాల పరిస్ధితీ అదే అయింది.

గతంలో సభ్యరాజ్యాల స్ధూల జాతీయాదాయం(జిడిపి)లో రెండుశాతం మొత్తాన్ని 2024నాటికి రక్షణకు కేటాయించాలని నాటో నిర్ణయించింది.దాన్ని వచ్చే జనవరి నాటికే అమలు చేయాలని, తరువాత నాలుగుశాతానికి పెంచాలని ట్రంప్‌ పట్టుపట్టాడు. అతగాడితో ఇప్పుడు గొడవెందుకు సరే అలాగే చేద్దాం లెమ్మన్నట్లుగా సభ్యదేశాల స్పందన వుంది. ఈ సమావేశాలలో అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధిగా ట్రంప్‌ విశ్వరూపం కనిపించింది అంటే అతిశయోక్తి కాదు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘నేను అధికారానికి రాక ముందు ఆయుధాల గురించి విన్నాను గానీ పదవిలోకి వచ్చాక నేను నిజంగా తెలుసుకున్నాను. ఇతరులు తయారు చేసే వాటి కంటే మావి ఎంతో మెరుగైనవి, మీరు మాకంపెనీలు లాక్‌హీడ్‌, బోయింగ్‌, గ్రమ్మన్‌ వంటి వాటిని చూడండి, ఎలాంటి మెటీరియల్‌ను వాడుతున్నామో, ఎంతో నాణ్యమైన పరికరాలను తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మా పరికరాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. వారెంతో మంచి పని చేస్తున్నారు, వారందరికీ చేయగలరా? కాబట్టి వాటిలో కొన్ని దేశాలకు సాయపడుతున్నాం, మంచి పరికరాలను కొనుగోలు చేయగలుగుతున్నారు.’ ఇలా ఒక కంపెనీ ప్రతినిధి తప్ప ఒక దేశాధినేత చెప్పే మాటలుకావు. ఈ సమావేశాలలో ట్రంప్‌ తన అజెండాకు ఆమోదముద్ర వేయించుకున్నాడా లేదా అన్న చర్చ జరుగుతోంది.

సమావేశాల ప్రారంభంలోనే ట్రంప్‌ జర్మనీపై దాడికి దిగాడు. ఇంధనం కోసం ఎక్కువగా ఆధారపడి తనంతట తానే రష్యాకు బందీ అయిందని, నాటో రక్షణ నిమిత్తం చెల్లింపులలో విఫలమైందని ఆరోపించాడు. చమురుకైతే బిలియన్లకు బిలియన్లు చెల్లిస్తారు గానీ నాటో విషయంలో ముందుకు రారు అని వ్యాఖ్యానించాడు. ‘ జర్మనీని రష్యా పూర్తిగా అదుపు చేస్తోంది. ఈ దేశాలు(నాటో కూటమి) కేటాయింపులు పెంచాలి, దశాబ్దకాలంలో కాదు, వెంటనే కేటాయించాలి.జర్మనీ ధనిక దేశం, వారు కొద్దికొద్దిగా 2030నాటికి పెంచుతామంటున్నారు. వారు తక్షణమే, రేపే పెంచితే మాకెలాంటి సమస్య వుండదు.(విలేకర్ల సమావేశంలో పక్కనే వున్న నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌ బర్గ్‌తో మాట్లాడుతూ) ప్రతి ఏటా గ్యాస్‌ కోసం జర్మన్లు బిలియన్లకొద్దీ డాలర్లు రష్యాకు చెల్లిస్తుంటారు, కానీ రష్యా నుంచి రక్షించాలని మమ్మల్ని కోరతారు, ఇది సరైంది కాదని నేను అనుకుంటున్నాను. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది, తన ఇంధనంలో 70శాతాన్ని రష్యా నుంచి పొందుతోంది.’ అన్నాడు.

రష్యా నుంచి బాల్టిక్‌ సముద్ర ప్రాంత దేశాలన్నింటికీ గ్యాస్‌ను సరఫరా చేసే పదకొండు బిలియన్‌ డాలర్ల పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు తెలిపింది. ఈ వైఖరి ఇతర ఐరోపా దేశాలకు నచ్చలేదు. ‘ ఇది ప్రయివేటు వాణిజ్య పధకం, దీనికి జర్మన్లు చెల్లించిన పన్నుల నుంచి ఎలాంటి కేటాయింపులు లేవని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు.జర్మనీ రక్షణ మంత్రి అర్సులా వాండెర్‌ లేయాన్‌ మాట్లాడుతూ మాకు రష్యాతో అనేక సమస్యలున్నాయనటంలో ఎలాంటి సందేహం వుండనవసరం లేదు. మరోవైపు దేశాలు లేదా కూటములు మరియు వ్యతిరేకులతో కూడా సమాచార సంబంధాలను కొనసాగించాల్సి వుంది.’ అన్నారు. రష్యన్‌ గ్యాస్‌ మీద ఆధారపడటాన్ని తగ్గించాలనే అంశంపై నాటోలోని ఐరోపా దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని స్టోల్టెన్‌ బర్గ్‌ కూడా చెప్పారు.

తొలి రోజే అనేక మంది దేశాధినేతలతో ప్రయివేటుగా చర్చలు జరపటంతో రెండో రోజు అజెండా అంశాలపై ఎవరూ భిన్నాభిప్రాయం వెల్లడించలేదు. మిగతా దేశాధినేతలందరూ వుదయం తొమ్మిది గంటలలోపే సమావేశానికి హాజరైనప్పటికీ ట్రంప్‌ కావాలనే ఆలస్యంగా వచ్చారని విమర్శలు వచ్చాయి. జార్జియా, ఆప్ఘనిస్తాన్‌ల గురించి చర్చించే అజెండా వున్నప్పటికీ అదేమీ పట్టనట్లుగా యూరోపియన్ల రక్షణ ఖర్చు గురించి మాట్లాడటం మొదలెట్టారు. వచ్చే ఏడాది జనవరిలోగా ఖర్చుల కేటాయింపు పెంచనట్లయితే అమెరికా తనదారి తాను చూసుకుంటుందని వ్యాఖ్యానించగానే సమావేశంలో వున్నవారంతా అవాక్కయ్యారు. ట్రంప్‌ మాటల గురించి ఎవరూ విబేధించలేదు గానీ వాటికి మాత్రం భిన్న భాష్యాలు వెల్లడయ్యాయి. దీని అర్ధం అమెరికాతో ఘర్షణ పడటానికి ప్రస్తుతానికి ఎవరూ సిద్ధంగా లేరన్నది స్పష్టం.

రక్షణ ఖర్చు పెంచని పక్షంలో తాము నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ బెదిరించినట్లుగా రాయిటర్స్‌ పేర్కొన్నది. ట్రంప్‌ మాటలకు అర్ధం అదని తాను భావించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పేర్కొన్నాడు. ట్రంప్‌ వ్యాఖ్యలతో సమావేశ గదిలో విస్మయం వ్యక్తం కావటంతో నాటో జనరల్‌ సెక్రటరీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడే వున్న ఆఫ్ఘనిస్తాన్‌, అజర్‌బైజాన్‌ ప్రతినిధులతో మీరు నాటో సభ్యులు కానందున బయటకు వెళ్లండని చెప్పారు. తరువాత సమావేశంలో ఎవరూ ఎలాంటి కొత్త ప్రతిపాదనలూ చేయలేదు, ఐరోపా నాయకులందరూ అంతకు ముందు ప్రకటించిన మీడియా సమావేశాలను రద్దు చేసుకొని నేరుగా విమానాశ్రయాలకు వెళ్లిపోయారు. మీడియా సమావేశ కార్యక్రమం లేనప్పటికీ షెడ్యూలు మార్చుకొని ట్రంప్‌ 35నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం జయప్రదమైందని, ఇతర నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకున్నారు. ట్రంప్‌తో ఎలాంటి వుద్రిక్తత ఏర్పడలేదని, ట్రంప్‌ ముక్కుసూటిగా మాట్లాడి వుండవచ్చు,కేటాయింపు పెంచుతామని సభ్యులు వాగ్దానం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి అన్నారు.

రష్యా నుంచి ముప్పు వస్తోందనే పేరుతో నాటో కూటమి గతేడాది 900బిలియన్‌ అంటే దాదాపు లక్షకోట్ల డాలర్లను ఖర్చు చేశాయి. వీటిలో అధికభాగం అమెరికా ఖర్చు చేసిన మాట నిజమే. కానీ అదే రీతిలో ఆ సొమ్ములో అధిక భాగం తిరిగి అమెరికన్‌ సైన్యం, అమెరికన్‌ ఆయుధ కంపెనీలకే చేరుతుందనే విషయం చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో రష్యా చేసిన ఖర్చు కేవలం 66 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అవసరం లేకపోయినా విస్తరణ పేరుతో నాటో మిలిటరీని రష్యా ముంగిటకు తీసుకుపోతున్న అమెరికా ఎత్తుగడలే నేడు ఐరోపాలో వుద్రిక్తతలకు కారణం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఐరోపాకు లేని ముప్పును చూపుతూ అమెరికా మిలిటరీ కార్పొరేట్‌లు ఐరోపా దేశాలను అదిరించి బెదిరించి తమ ఆయుధాలను, వినిమయ వస్తువులను అంటగట్టేందుకు చూడటం తప్ప ట్రంప్‌ చర్యల్లో మరొకటి కనిపించటం లేదు.

ఐరోపా రాజ్యాలు అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధం కాదు. అందుకే ఒకవైపు దానితో మిత్రత్వాన్ని నెరపుతూనే తమ ప్రయోజనాలను తాము చూసుకుంటున్నాయని చెప్పవచ్చు. వుదాహరణకు అనేక అంశాలలో అమెరికా వైఖరిని ఐరోపాయూనియన్‌ ఏకీభవించటం లేదు. వుక్రెయిన్‌లో భాగంగా వున్న క్రిమియాను అక్కడి పౌరుల ఆకాంక్షలకు అనుగుణ్యంగా రష్యా తనలో విలీనం చేసుకున్నది.ఆ చర్యను జర్మనీ విమర్శించినప్పటికీ తనకు అవసరమైన చమురు అవసరాలకోసం రష్యన్‌ చమురు కంపెనీ గాజ్‌పోమ్‌తో జర్మనీ 11 బిలియన్‌ డాలర్లతో ఒకపైప్‌లైన్‌ నిర్మాణంపై 2015లో ఒప్పందం చేసుకుంది. దాని గురించే ట్రంప్‌ బ్రసెల్స్‌లో జర్మనీపై విరుచుకుపడ్డాడు. నాటో రక్షణ ఖర్చును తమకు ఇవ్వాలని అమెరికా పట్టుబడుతున్నది, అయితే ఐరోపా దేశాలు ఆ ఖర్చుతో తమ ఏర్పాట్లను తాము చేసుకుంటున్నాయి, ఆ మొత్తాలను కూడా నాటో ఖర్చులో భాగంగానే చూపుతున్నాయి. నాటో సమావేశాలకు ముందు ట్రంప్‌ చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలను గమనించటం అవసరం. నాటోలోని అనేక దేశాలు తమను రక్షించాలని కోరుకుంటాయి, అవి అంగీకరించిన మేరకు జిడిపిలో రెండుశాతం ఖర్చుచేయకపోవటమే కాదు, ఏండ్ల తరబడి వుపేక్షిస్తున్నాయి, అవి పాతబకాయిలను కూడా చెల్లిస్తాయా?అని ట్వీట్‌ చేశాడు. బ్రసెల్స్‌ బయలు దేరే ముందు ‘ఐరోపాలో మా రైతులు, కార్మికులు, కంపెనీలు వ్యాపారం చేయటాన్ని ఐరోపా యూనియన్‌ అసాధ్యం గావిస్తున్నది, మరోవైపు నాటో ద్వారా మేము సంతోషంగా వారిని రక్షించాలని కోరుకుంటారు, దానికి నాజూకు చెల్లింపులు చేస్తారు, ఇలా ఎలా పని జరుగుతుంది.’ అన్న ట్రంప్‌ వచ్చీ రావటంతోనే జర్మనీపై విరుచుకు పడ్డారు. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది అన్న ట్రంప్‌తో తాను ఏకీభవించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ పేర్కొన్నారు. తమను మాస్కో గానీ వాషింగ్టన్‌గానీ అదుపు చేయటం లేదని జర్మన్‌ అధికారులు తిప్పికొట్టారు.

తాను ఎక్కడ వున్నా అమెరికన్ల గురించే ఆలోచిస్తూ వుంటానని చెప్పేందుకు ట్రంప్‌ ప్రయత్నించాడు.’నేను ఇప్పుడు బ్రసెల్స్‌లో వున్నప్పటికీ మన రైతుల గురించే ఎల్లవేళలా ఆలోచిస్తున్నాను. 2012 నుంచి నా ఎన్నిక నాటికి సోయాబీన్స్‌ ధర సగం పడిపోయింది, గత పదిహేను సంవత్సరాలుగా రైతులకు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇతర దేశాల వాణిజ్య ఆటంకాలు మరియు పన్నులతో వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను గతం కంటే మెరుగ్గా ఈ సమస్యలను లేవనెత్తుతాను, అయితే అది అంతత్వరగా ముందుకు పోదు. మన రైతులందరికీ సమాన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను, మనం విజయం సాధిస్తాము ‘ ఇలా సాగింది.

నాటో కొనసాగాల్సిన అవసరం గురించి సంస్ధ ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలటెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ‘ బలమైన నాటో ఐరోపా, అమెరికాకు మంచిది. విడిపోవటం కంటే కలసి వుంటే ధృడంగా వుంటామని రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధం మాకు నేర్పాయి.ఐరోపాలో అమెరికా మిలిటరీ,కెనడా వునికి ఐరోపాకు మాత్రమే కాదు వుత్తర అమెరికా మరియు ప్రత్యేకించి అమెరికా(యుఎస్‌)కు మంచిది, ఎందుకంటే అమెరికా ఒక ప్రపంచ శక్తిగా ఎదగటానికి అది తోడ్పడుతుంది. బాల్టిక్‌ సముద్ర గ్యాస్‌ పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది నాటో సభ్యదేశాలు కాదు, అది ఒక జాతీయ నిర్ణయం.’

నాటో తొలిరోజు సమావేశ ప్రారంభానికి ముందు వుదయపు అల్పాహార విందు సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి. నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌బర్గ్‌తో నాటో ఖర్చులో అత్యధిక భాగం తమ దేశమే భరిస్తోందని వ్యాఖ్యానించాడు. జర్మనీ ఒకశాతం కంటే కొద్దిగా ఎక్కుగా చెల్లిస్తోంది. అదే అమెరికా జిడిపిలో 4.2శాతం చెల్లిస్తోంది. ఇది సరైంది కాదు, మేము జర్మనీని రక్షిస్తున్నాము, మేము ఫ్రాన్స్‌ను రక్షిస్తున్నాము, మేము ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాము. దానికి ఇంకా మేము ఎంతో చెల్లిస్తున్నాము. విందు అనంతరం ట్రంప్‌ వైఖరిని స్టోల్టెన్‌ బర్గ్‌ అపహాస్యం చేశాడు. వుదయపు అల్పాహార విందు బాగుంది…. దీనికి అమెరికాయే బిల్లు చెల్లించింది అని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌ అధ్యక్షుడు అయిన తరువాత ఐరోపాలో మిలిటరీ వునికి నిమిత్తం 40శాతం నిధులు పెంచాడు. అమెరికా సైన్యాలు ఎక్కువగా వున్నాయి, గతం కంటే విన్యాసాలు, మౌలిక సదుపాయాల నిమిత్తం పెట్టుబడులు కూడా పెరిగాయి’ అన్నాడు.

Image result for nato brussels summit 2018

గతంలో అంగీకరించిన మేరకు నాటో నిర్వహణకు పూర్తిగా నిధులు చెల్లిస్తున్నది అమెరికా, బ్రిటన్‌, పోలాండ్‌, గ్రీస్‌, ఎస్తోనియా మాత్రమే. తాను హాజరైన తొలి సమావేశనాటి కంటే సభ్య దేశాలు చెల్లిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గిపోయిందంటూ ట్రంప్‌ అవాస్తవం చెప్పారంటూ పొలిటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొన్నది. 2014లో ఐరోపా దేశాలు, కెనడా చెల్లించిన మొత్తం 254బిలియన్‌ డాలర్లు 2017 నాటికి 275కు పెరిగినట్లు పేర్కొన్నది. నాటో ఖర్చులో 70 నుంచి 90శాతం వరకు అమెరికా చెల్లిస్తున్నదని చెప్పటం అవాస్తవమని తెలిపింది. నాటోకు ఎంత ఖర్చు చేయాలనేది ఎక్కడా నిర్ధారించలేదు. సంస్ధ వుమ్మడి నిధిలో అమెరికా 22శాతం చెల్లిస్తున్నది. సభ్యదేశాల రక్షణ బడ్జెట్‌ ఎంతో నాటో సేకరిస్తుంది, వాటి మొత్తాలను కలిపి చూసుకున్నపుడు అమెరికా రక్షణ కోసం 70శాతం ఖర్చు చేస్తున్నది. అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తి గనుక అంతవుంది, ఐరోపా సభ్యదేశాలు అలాంటివి కాదు. తమ రైతాంగానికి ఐరోపా యూనియన్‌ తలుపులను మూసింది అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా కంటే ఐరోపా యూనియన్‌ సగటున చూసినపుడు కొద్దిగా ఎక్కువ పన్నులు విధిస్తున్నది. 30శాతం వ్యవసాయ వుత్పత్తులపై ఇరువైపులా పన్నులు లేకుండా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ఫలితంగా 28 సభ్యరాజ్యాలు, ఐరోపా యూనియన్‌ 2017లో అమెరికాకు వ్య వసాయ వుత్పత్తులలో ఐదవ పెద్ద ఎగుమతిదారుగా మారింది. అమెరికా తాను ఎగుమతి చేసుకున్నవాటి కంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంది.

గతంలో రెండుశాతం వరకు ఖర్చు చేయాలని అనుకున్నారు, ఇప్పుడు దాన్ని విధిగా చేయాలని ట్రంప్‌ అన్నాడు. రక్షణ నిమిత్తం జిడిపిలో రెండుశాతం ఖర్చు చేయాలని 2006లో అంగీకరించిన మాట వాస్తవం. అయితే అంత మొత్తాన్ని విధిగా ఖర్చు చేయాలనే అంగీకారమేదీ లేదు. ఈ వారంలో ఆ మేరకు నిర్ణయం జరిగిందేమో తెలియదు. రెండుశాతం మొత్తం కేటాయింపులను 2024 నాటికి క్రమంగా పెంచుకుంటూ పోవాలని 2014లో మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు. ఆ మేరకు వ్యవహరించినవి ఐదు దేశాలు మాత్రమే. బ్రసెల్స్‌ సమావేశాల తరువాత ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన జరిపారు. సోమవారం నాడు హెల్సింకీలో ట్రంప్‌-పుతిన్‌ భేఠీ జరగనుంది. ఆ తరువాత నాటో, ట్రంప్‌ పర్యటన వివరాల సమాచారం వెల్లడయ్యే అవకాశం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంక్షలతో భారత్‌కు వుచ్చు బిగిస్తున్న అమెరికా !

04 Wednesday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

direct and indirect sanctions, Donald trump, Donald trump trade war, NATO, TRADE WAR, us encircling india, US SANCTIONS, US-CHINA TRADE WAR

Image result for nikki haley,modi meet

ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే, ప్రధాని నరేంద్రమోడీ

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరు, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు ! చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పూరించిన వాణిజ్య సమర భేరి దాడులకు నాంది పలికే గడువు అది. సామరస్యపూర్వకంగా పరిష్కారం కానట్లయితే ఆ దినం నుంచి చైనా వస్తువులపై ప్రకటించిన పన్ను పెంపుదల అమలులోకి వస్తుంది. కొద్ది రోజుల క్రితం వరకు నిజంగా వాణిజ్య యుద్ధం జరుగుతుందా? సర్దుబాటు చేసుకుంటారా అన్న పద్దతిలో సాగిన విశ్లేషణలు ఇప్పుడు నిజంగానే జరుగుతుందని, జరిగితే ఎంత విలువ వుంటుంది? ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మీద చూపే ప్రభావాలు ఎలా వుంటాయనే వైపు మళ్లాయి. ఒక లక్ష బిలియన్‌ డాలర్ల వరకు వుంటుందని ఒక అంచనా. వాణిజ్య యుద్ధం వ్యాపారలావాదేవీలకు మాత్రమే పరిమితం కాదు. అనేక రంగాలను అది ప్రభావితం చేస్తుంది.

గత కొద్ది రోజులుగా ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలు, చర్యలు కేవలం వాణిజ్య యుద్ధానికే పరిమితం కాలేదు. అవి ప్రపంచ దేశాల సమీకరణలను వేగవంతం చేస్తున్నాయా ? వాటి స్వభావమేమిటి ? పర్యవసానాలు ఎలా వుంటాయన్నది ప్రపంచమంతా వుగ్గపట్టుకొని ఆసక్తితో చూస్తున్నది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను మా మిత్ర దేశాలు కూడా పాటించాల్సిందే, లేకుంటే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం, ఎవరికీ మినహాయింపులు లేవు అని ట్రంప్‌ చేసిన ప్రకటనతో నరేంద్రమోడీ సర్కార్‌ ఏం చేయాలో తోచక కాళ్లు తొక్కుకుంటున్నది. చిన్నది కావచ్చుగానీ ఐరోపా యూనియన్‌ కూడా చైనా మాదిరి చెడ్డదే. చూడు మక్రాన్‌ మనిద్దరికీ చైనా సమస్య వుంది కనుక కలసి పని చేద్దాం, చైనా కంటే ఐరోపా యూనియన్‌ అధ్వాన్నంగా వుంది, నాఫ్టా ఎంత చెడ్డదో నాటో కూడా అలాంటిదే, అది అమెరికాకు భరించరాని ప్రియంగా వుంది. ఇవన్నీ ట్రంప్‌ బహిరంగంగా చేసినవీ, అంతర్గత సంభాషణల్లో వెల్లడించిన అభిప్రాయాలుగా మీడియాలో తిరుగుతున్నవి. ప్రపంచ దేశాల మీద అమెరికా ఒక్క వాణిజ్యయుద్ధానికే పరిమితం కాలేదు, ఇతర రంగాలలో కూడా తన పెత్తనాన్ని, భారాలను రుద్దేందుకు పూనుకుంది అన్నది స్పష్టం. నాటో కూటమికి అయ్యే ఖర్చును సభ్య దేశాలన్నీ భరిస్తాయో లేదో చెప్పాలంటూ ఐరోపా దేశాలకు జూన్‌ నెలలో ట్రంప్‌ లేఖలు రాశాడు.

కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మన విదేశాంగ విధానాన్ని నిర్దేశించేది మన ప్రభుత్వమా లేక డోనాల్డ్‌ ట్రంపా అన్న అనుమానం తలెత్తక మానదు. నరేంద్రమోడీ సర్కార్‌ పులిలా గాండ్రించి చివరికి పిల్లిలా మ్యావ్‌ మ్యావ్‌ మంటూ తోకముడుస్తోంది. ఇరాన్‌తో కుదిరిన అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. ఆంక్షలను అమలు జరుపుతామని ప్రకటించింది. ఆ సమయంలో మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందిస్తూ ఏకపక్షంగా అమెరికా ప్రకటించిన ఆంక్షలను భారత్‌ పరిగణనలోకి తీసుకోదని ఐక్యరాజ్య సమితి వాటినే గుర్తిస్తుందని ప్రకటించారు. అలాంటిది నెల రోజులు కూడా గడవక ముందే నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరిలో మార్పు వచ్చింది, అదీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారీ నికీహాలే ఢిల్లీ పర్యటన మరుసటి రోజే కావటం గమనించాల్సిన అంశం. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీని అమలులోకి వస్తాయి. అప్పటికి ఇరాన్‌ నుంచి గణనీయంగా దిగుమతులను తగ్గించుకోవటం లేదా పూర్తిగా మానుకోవాలని చమురుశుద్ధి కర్మాగారాలకు మన చమురు మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అదే జరిగితే మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయన్నది చమురు రంగ విశ్లేషకుల అభిప్రాయం.ఇరాన్‌తో చమురులావాదేవీలకు స్వస్తి పలుకుతున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇరాన్‌ చమురుతో ప్రయాణించే నౌకలు లేదా దానిని శుద్ధి చేసే కర్మాగారాలకు బీమా వర్తింప చేయబోమని ఆ కంపెనీలు ప్రకటించేఆలోచనలో వున్నాయి. ఇరాన్‌ మనకు కొన్ని రాయితీలు ఇస్తున్నది. వాటిని వదులుకొని ఇతర దేశాల దగ్గర కొనటం అంటే అమెరికాను సంతృప్తిపరచటమే కాదు, అందుకోసం మన జనం మీద భారాలు మోపేందుకు మోడీ సర్కార్‌ పూనుకుంది. ఇరాన్‌కు రూపాయిల చెల్లింపులతో మోడీ పెద్ద విజయం సాధించినట్లు ఆయన భక్తులు ప్రచారం చేశారు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే రూపాయల బదులు ఇతర దేశాలకు చెల్లించేందుకు మనం డాలర్లను మరింతగా సమకూర్చుకోవటం అంటే మన కరెన్సీ విలువ మరింత పతనం కావటమే. గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మన దేశానికి ఆంక్షలను మినహాయించాడు. అలాంటివేమీ కుదరవని ట్రంప్‌ ప్రకటించాడు. మన దేశాన్ని తన ఆదేశాలను పాటించే పాలేరు అనుకుంటున్నాడా ? జవాబుదారీతనంతో వ్యవహరించే ఏ దేశమైనా ఇతరుల బెదిరింపులను అనుమతించని బాధ్యతతో వ్యవహరించాల్సి వుంటుంది. అమెరికా వత్తిడికి మోడీ సర్కార్‌ తీసుకున్న చర్యతో పాటు దీర్ఘకాలంగా ఇరాన్‌తో వున్న సంబంధాలు ప్రమాదంలో పడటమేగాక అంతర్జాతీయంగా మన పరువు ఎక్కడ కలుస్తుందో తెలియదు. మన బలహీన దౌత్యానికి ఇది సూచిక. ఇరాన్‌ ఎగుమతి చేసే చమురులో సగాన్ని చైనా, భారత్‌, టర్కీ దిగుమతి చేసుకుంటున్నాయి.అమెరికా ఏకపక్ష ఆంక్షలను తాము ఆమోదించేది లేదని మిగిలిన రెండు దేశాలు ప్రకటించాయి.

అనేక దేశాల మధ్య తంపులు పెట్టి, రెచ్చగొట్టి అటూ ఇటూ ఆయుధాలు అమ్ముకొని లబ్దిపొందే ఎత్తుగడను అమెరికా ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. మన దేశం-పాకిస్ధాన్‌ విషయంలో అదే చేసి పాకిస్ధాన్‌కు పెద్ద ఆయుధ అమ్మకందారుగా మారింది. సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత తరువాత మన పాలకులు అమెరికాకు దగ్గర కావటంతో ఇప్పుడు పాక్‌ కంటే పెద్ద బడ్జెట్‌ వున్న మనం ఆత్మీయులుగా కనపడటం గురించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల తరబడి సోవియట్‌ ఆయుధాల మీద ఆధారపడిన మనం వెనువెంటనే అమెరికా ఆయుధాలతో మన మిలిటరీని సాయుధం చేసే అవకాశం లేదు కనుక ఇప్పటికీ ఆ లావాదేవీలు కొనసాగుతున్నాయి. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులు కొనుగోలు చేసినట్లయితే భారత్‌ మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించింది. మన వాయుసేన దాదాపు ఐదింటిని కొనుగోలు చేసే ఒప్పందం ఖరారు దశలో వుంది. ఈనెల ఆరున భారత్‌-అమెరికా మధ్య రక్షణ, భద్రతా సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు విదేశాంగ, రక్షణశాఖల మంత్రుల తొలి సమావేశం జరగాల్సి వుండగా కొద్ది రోజుల ముందు అనివార్య కారణాల వలన దానిని రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పోంపియో ఏకపక్షంగా మన మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలియ చేశారు. ఇరాన్‌తో సంబంధాల గురించి భారత్‌ పునరాలోచించుకోవాలని జూన్‌ 27న ఐరాసలో అమెరికా రాయబారి నికీ హాలే మన ప్రధాని నరేంద్రమోడీని కలసి కోరిన సమయంలోనే ఈ సమావేశ రద్దును తెలిపారు.

దీనికి ముందుగా జూన్‌ 19న అమెరికా అంతర్గతంగా తన చట్టాలకు ఆమోదించిన సవరణల ప్రకారం రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేస్తే గతంలో వున్న అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు అవుతుంది. మన అవసరాలకు అమెరికాలో తయారైన పేట్రియాట్‌ పిఏసి-3 క్షిపణి 70కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని చేరుతుంది. అదే రష్యా ఎస్‌ 400 క్షిపణి నాలుగు వందల కిలోమీటర్ల లక్ష్యం కలిగినదిగా వుండటంలో నలభైవేల కోట్ల రూపాయలతో ఐదు క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణశాఖ నిర్ణయించింది. దీన్ని దెబ్బతీసేందుకు ఆంక్షలు విధించేందుకు అమెరికా బెదిరింపులకు పూనుకోవటంతో పాటు సమావేశాన్ని రద్దు చేసింది. ఇవేగాదు రష్యా నుంచి మరొక 12బిలియన్‌ డాలర్ల విలువగల ఇతర ఆయుధాల కొనుగోలుపై కూడా ఆంక్షలు విధించే అవకాశం వుండటంతో అమెరికా ఇలాంటి బెదిరింపులకు పూనుకున్నట్లుగా భావిస్తున్నారు.

అమెరికాకే అగ్రతాంబూలం అన్న పద్దతిలో వ్యవహరిస్తున్న ట్రంప్‌ వైఖరి నుంచి తమను కాచుకొనేందుకు గాను ఐక్యంగా వ్యవహరించాలని, ప్రపంచ వ్యవస్ధను నిలబెట్టాలని చైనా, ఐరోపా యూనియన్‌ నిర్ణయించాయి. ప్రపంచ స్వేచ్చా వాణిజ్య వ్యవస్ధ ఏర్పాటుకు తాము సహకరించామని దానిని కాపాడుకోవాల్సిన అవసరం వుందని ఐరోపా యూనియన్‌ నేతలు చెబుతున్నారు. సోవియట్‌ యూనియన్‌ ప్రారంభంలో రష్యన్‌ కమ్యూనిస్టులకు వాల్‌స్ట్రీట్‌ పెట్టుబడిదారులు రహస్యంగా సాయం చేశారని, 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా ప్ర వేశానికి అమెరికా సెనేట్‌ అత్యధిక మెజారిటీతో ఆమోదం తెలిపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా తన వైఖరి మార్చుకుంటే తామెందుకు అనుసరించాలని పరోక్షంగా పశ్నిస్తున్నారు. అదే కమ్యూనిస్టు చైనాతో కలసి తమ ప్రయోజనాలను రక్షించుకోవాలని వుద్బోధిస్తున్నారు. ఈ నెలలో బీజింగ్‌లో చైనా-ఐరోపా యూనియన్‌ సమావేశంలో ఒక ప్రకటన వెలువడుతుందని వార్తలు వచ్చాయి.

ఒకవైపు ఐరోపా యూనియన్‌ దేశాలపై వాణిజ్య ఆంక్షలను ప్రకటించిన ట్రంప్‌ మరోవైపు నాటో కూటమి ఖర్చులో సింహభాగాన్ని మీరు భరిస్తారో లేదో చెప్పాలని వత్తిడి తెస్తున్నాడు.త్వరలో బ్రసెల్స్‌ సమావేశంలోగా ఏదో ఒకటి తేల్చాలంటున్నాడు. ఏప్రిల్‌లో మీ పర్యటన సందర్బంగా మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని దేశాలు వాగ్దానం చేసిన మాదిరి నిధులు కేటాయించటం లేదని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌కు రాసిన లేఖలో ట్రంప్‌ పేర్కొన్నాడు. ఐరోపా రక్షణకు మేము పెద్ద మొత్తంలో వనరులను కేటాయించటం ఇంకేమాత్రం సాధ్యం కాదని, మా దేశంలో అసంతృప్తి పెరుగుతున్నదని కూడా పేర్కొన్నాడు. నాలుగు సంవత్సరాల నాడు వేల్స్‌ సమావేశంలో ప్రతి దేశం జిడిపిలో రెండుశాతం మొత్తాన్ని దేశభద్రతకు ఖర్చు చేయాలని అంగీకరించిన మేరకు అమలు జరపటం లేదన్నది అమెరికా ఫిర్యాదు. మిగతా దేశాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాయని అలాంటిది మీరు కూడా చేయాల్సిన మేరకు ఖర్చు చేయటం లేదని జర్మనీని కూడా విమర్శించాడు. విదేశాలలో అమెరికన్‌ సైనికులు ప్రాణాలు అర్పించటం లేదా తీవ్రంగా గాయపడే త్యాగాలు చేస్తున్నపుూ వుమ్మడి రక్షణ భారాన్ని కొన్ని దేశాలు ఎందుకు పంచుకోవటం లేదు అని అమెరికా పౌరులు అడుగుతుంటే సమర్ధించుకోవటం ఇంకేమాత్రం సాధ్యం కావటం లేదని కూడా ట్రంప్‌ పేర్కొన్నాడు. దక్షిణ కొరియాలో సైన్యం గురించి కూడా ఇదే వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.

ట్రంప్‌ లేఖలపై ఐరోపాలో విమర్శలు వచ్చాయి.’ నాటో అంటే ఒక క్లబ్‌ అని, దానికి మీరు బకాయి చెల్లించకపోతే పర్యవసానాలు అనుభవిస్తారు లేదా సోమరులైన ఈ ఐరోపా వారందరూ సెలవులు గడపటానికి వచ్చి కూర్చున్నారని, వారందరినీ అమెరికా రక్షిస్తోందనే భావనలోనే ఇంకా ట్రంప్‌ వున్నట్లుగా కనిపిస్తోంది’ అని అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి డెరెక్‌ చోలెట్‌ వ్యాఖ్యానించారు. ‘ వాణిజ్యం మీద దూకుడుగా వున్న ట్రంప్‌ వ్యాఖ్యలను ఎలా అమలు చేస్తారు, భద్రతా విషయాలలో కూడా అలాగే చేస్తారా అని ఐరోపావారు చూస్తున్నారు అని కూడా అన్నారు.

అమెరికా మొరటుగా వాణిజ్య యుద్ధానికి పూనుకుంటే అనేక దేశాలతో ఇదే విధంగా ఇతర రంగాలలో కూడా తన పెత్తందారీ, బలప్రయోగానికి పాల్పడే అవకాశాలున్నాయి. అయితే వాణిజ్య యుద్ధం జరిగితే తమకు సంభవించే లాభనష్టాల గురించి అమెరికాలో తర్జన భర్జన జరుగుతోంది. లాభం అనుకుంటే ట్రంప్‌ ముందుకు పోతాడు. వాణిజ్య యుద్ధంలో గెలిచే అవకా శాలు లేవని బలంగా వినిపిస్తున్న పూర్వరంగంలో ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గే అవకాశాలూ లేకపోలేదు. సంక్షోభం, సమస్యలు ముదిరితే పర్యవసానాలను అంచనా వేయటం కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుత్తర కొరియాతో ఒప్పందం ఓకే, ఇరాన్‌ మాటేమిటి ట్రంప్‌ !

13 Wednesday Jun 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

denuke deal with north korea, Donald trump, iran, Kim Jong-un, kim-trump meet, North Korean leader Kim Jong-un, nuclear threat

ఎం కోటేశ్వరరావు

తాతా మనవల వంటి డోనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ అన్‌ అనూహ్య భేటీ ముగిసింది. విశ్లేషకులందరూ ఎవరిది పైచేయి, ఎవరు తామనుకున్నది సాధించారు అనే మల్లగుల్లాల్లో తలమునకలై వున్నారు. ఎవరేం చెప్పినా ఒక చిన్న దేశమైన వుత్తర కొరియా ప్రపంచానికి ఒక పెద్ద సందేశం ఇచ్చింది. బలవంతమైన సర్పం చలిచీమల చేతుల్లో హతమౌతుందన్నది పాత అనుభవం అయితే ఒళ్లంతా అణుబాంబులు కట్టుకొని తిరిగే ప్రపంచంలోనే బలవంతుడైన అమెరికాను అదుపులోకి తెచ్చుకోవాలంటే ఒక్క అణుబాంబు, దానిని అమెరికా గడ్డ మీదకు ప్రయోగించగలిగిన క్షిపణి వుంటే చాలని వుత్తర కొరియా నిరూపించిందని చెప్పక తప్పదు. ప్రపంచ మానవాళిని వందసార్లు చంపటానికి అవసరమైనన్ని మారణాయుధాలు మా దగ్గర వున్నాయని ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. పిచ్చిపట్టిన అమెరికా అధ్య క్షుడెవరైనా అణుమీట ఒకసారి నొక్కితేనే ప్రపంచం భస్మీపటలం అవుతుంది, రెండోసారికే ఏమీ వుండదు, ఇంక వందసార్లకు అవకాశం ఎక్కడుంటుంది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే వారికి బాగా అర్ధం అయిన విషయం ఏమంటే తమ దేశం నుంచి బయలుదేరిన అణ్వస్త్రం మారణహోమం సృష్టించకముందే ఇతర దేశాలలో వున్న అణుమీటలు కూడా పని చేసి అన్ని వైపుల నుంచి అమెరికాను చుట్టుముడతాయని, అన్నీ ఒకేసారి అందరినీ హతమారుస్తాయని తెలుసు.

‘ఇప్పుడే విమానం దిగాను, సుదీర్ఘ ప్రయాణం, అయితే నేను పదవీ బాధ్యతలు స్వీకరించేనాటితో పోలిస్తే ఇప్పుడు మరింత సురక్షితం అని ప్రతి ఒక్కరు భావించవచ్చు. కిమ్‌ జోంగ్‌ అన్‌తో భేటీ చాలా ఆసక్తికరంగా ఎంతో సానుకూల అనుభవంతో జరిగింది. వుత్తర కొరియాకు మంచి భవిష్యత్‌ వుంది. నేను అధికారాన్ని స్వీకరించబోయే ముందు మనం వుత్తర కొరియాతో యుద్ధానికి దిగబోతున్నామని జనం అనుకుంటున్నారు. వుత్తర కొరియా మనకు అతి పెద్ద ప్రమాదకర సమస్య అని బరాక్‌ ఒబామా చెప్పాడు, అలాంటిదింకేమీ లేదు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి అని సింగపూర్‌ నుంచి అమెరికా గడ్డపై కాలు పెట్టగానే ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. అంటే అమెరికన్లలో ఎంత భయం గూడు కట్టుకొని వుందో, దానిని పోగొట్టటం అక్కడి ప్రభుత్వానికి ఎంత అవసరమో ఇవి విదితం చేయటం లేదా ?

కొరియాలో యుద్ధవిన్యాసాలు ఆపుతామని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. వచ్చే ఏడాది 716బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. కిమ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ కొరియా ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పాడు. అంతటితో ఆగలేదు, మా గువామ్‌ దీవి నుంచి విమానాలను తీసుకు వచ్చి దక్షిణ కొరియాలో విన్యాసాలు చేయించి తిరిగి ఆ దీవికి తీసుకుపోవాలంటే మాకు చాలా ఖర్చు అవుతోంది, సింహభాగం మేమే భరించాల్సి వస్తోంది అని వ్యాఖ్యానించి ఇంటా బయటా నవ్వుల పాలయ్యాడు. అడుసుతొక్కనేల కాలు కడగనేల. ఎవరు విన్యాసాలు చేయమన్నారు, ఎవరికోసం చేస్తున్నారు, ఖర్చు భరించటం చేతకానపుడు కొనసాగించటం ఎందుకు? అసలు యుద్ధ విన్యాసాలు ఆపమని వుత్తర కొరియా అసలు అడిగిందా? మా ప్రాంతం నుంచి తుండు తుపాకీ మొత్తంగా సర్దుకొని మీ దేశానికి వెళ్లిపోయి మా రెడు దేశాలను ఐక్యం చేసేందుకు అడ్డుతొలగండి అని డిమాండ్‌ చేస్తోంది తప్ప, విన్యాసాలకే పరిమితం కావటం లేదు. జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధపోరాటం ప్రారంభించి, తరువాత అమెరికాతో యుద్దంతో చేసి, గత ఆరున్నర దశాబ్దాలుగా అణ్యాయుధాల మోహరింపులు, యుద్ద విన్యాసాలు, బెదిరింపుల మధ్య పెరిగిన వుత్తర కొరియన్లను యుద్ద విన్యాసాలు ఏమాత్రం భయపెట్టలేదని రుజువైంది. గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్లు ప్రయోజనం లేని విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పినంత మాత్రాన కొరియా సమస్య పరిష్కారం కాదు.

కొరియా ద్వీపకల్పంలో అమెరికా తిష్ట ఎందుకు వేసిందో కమ్యూనిస్టులు చెబితే, ఆ వారు అంతకు మించి ఏమి చెబుతారులే అని చాలా మంది పట్టించుకోరు. సింగపూర్‌లో ట్రంప్‌ ప్రకటన తరువాత అమెరికాలోని స్వంత రిపబ్లికన్‌ పార్టీ నేతలే వ్యతిరేకించారు. తమ నేత తెలివి తక్కువ ప్రకటన చేశాడని పార్టీ ఎంపీ లిండ్‌సే గ్రాహమ్‌ వ్యాఖ్యానించాడు. చేస్తున్న ఖర్చు వూరికే పోవటం లేదని అసలు కొరియాలో దళాల తిష్ట చైనాకు హెచ్చరిక అంటూ కొనసాగించాలని కోరాడు. అంటే దుష్టఆలోచన మనసులో పెట్టుకొని గడ్డికొస్తావా పిల్లా అన్నట్లుగా దక్షిణ కొరియా రక్షణ పేరుతో ఇంతకాలం అమెరికా చేస్తున్న యుద్ధ విన్యాసాలు, బలగాల మోహరింపు చైనాకు వ్యతిరేకం అని గ్రాహమ్‌ చెప్పకనే చెప్పాడు. సమగ్రమైన ఒప్పందం మీద సంతకం చేశామని ట్రంప్‌ చెప్పాడు. గతంలో వుత్తర కొరియాతో కుదిరిన ఒప్పందాలతో పోలిస్తే ఇది ఒక స్పష్టత లేని, ఎలాగైనా భాష్యం చెప్పటానికి, చర్చకు దారితీసేదిగా వుందనే అభిప్రాయం అమెరికాలో వెల్లడైంది. ఎవరూ వ్యతిరేకించటం లేదు గానీ సంతోషించటానికి ఏముంది అని పెదవి విరుస్తున్నారు.2005లో కుదిరిన ఒప్పందంలో మరోనాలుగు ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వాములు ఇప్పుడు వాటి ప్రస్తావన లేదు.

వుత్తర కొరియా అణు సమస్య పరిష్కారం అంటే అది సమగ్రమైంది కాదు.దీనిలో రెండు అంశాలున్నాయి. వుత్తర కొరియా అణు కార్యక్రమం నిలిపివేత అంటే ఆయుధాల తయారీ తప్ప శాంతియుత ప్రయోజనాల కార్యక్రమాన్ని నిలిపి వేయటానికి ఏ దేశమైనా అంగీకరిస్తుందా? దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా మోహరించిన అణ్వాయుధఛత్రం, ఇతర ప్రమాదకర క్షిపణులు, సైన్యం మాటేమిటి? వీటి గురించి సింగపూర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు, ఒప్పందమూ కుదరలేదు. సమస్యల పరిష్కారానికి ఒక సూత్రప్రాయ అంగీకారం మాత్రమే కుదిరింది కనుక ప్రపంచమంతా ఈ పరిణామాన్ని సహజంగానే హర్షిస్తోంది. వుత్తర కొరియా పూర్తిగా అణుకార్యక్రమాన్ని నిలిపివేయాలంటే దానికి జరిగే నష్టాన్ని ఎలా భరిస్తారు, ఎవరు భరిస్తారు, ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను ఎలా, ఎంతకాలంలో తొలగిస్తారు, దానికి హామీ ఏమిటి అనేక అనేక అంశాలు పరిష్కారం కావాల్సి వుంది. వీటిపై గతంలో అంగీకరించిన ఒప్పంద నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన మచ్చ వుంది. ఒకవైపు వుత్తర కొరియాతో చర్చలు జరుపుతూనే అణు సమస్యపై ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగింది. అన్ని ప్రధాన దేశాలతో వాణిజ్యలోటు కలిగి వున్న అమెరికా అదిరించి బెదిరించి తన వుత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఈ క్రమంలో దానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిఘటన ఎదురవుతున్నది. వుత్తర కొరియాను అదుపు చేసే పేరుతో ఇంతకాలం పెద్ద మొత్తంలో అమెరికా నిధులు ఖర్చు చేసింది. అనుకున్నట్లుగా ఒప్పందం అమలు జరిగితే ఇప్పుడు సైనిక విన్యాసాలకు బదులు వుత్తర కొరియా రక్షణ గురించి ఖర్చు చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. దాన్ని ఎవరి మీద రుద్దుతుంది? ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి వుంది.

Image result for denuke deal with north korea

ఒప్పందాల విషయంలో గతంలో అమెరికా ఇతర దేశాల నిర్వాకం చూసిన తరువాత వుత్తర కొరియా తన రక్షణకు మరింత జాగ్రత్త పడుతుంది. వుదాహరణకు 30దేశాలు నిధులు అందచేసే కొరియా ద్వీపకల్ప ఇంధన అభివృద్ధి సంస్ధ(కెడో) ద్వారా 250 కోట్ల డాలర్లు వెచ్చింది ఒక అణుఇంధన రియాక్టర్‌ను నిర్మించారు. దానికి అమెరికా 50కోట్ల డాలర్ల విలువగల తేలిక జల ఇంధనాన్ని సమకూర్చేందుకు ఖర్చు చేసింది. చివరికి దాన్ని 2006లో మూసివేశారు. అయితే దానికి రెండువందల కోట్ల డాలర్లను సమకూర్చాయి. ఆమొత్తం సొమ్ము దానిని నిర్మించిన ఐరోపా యూనియన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ కంపెనీలకే తిరిగి చేరింది తప్ప వుత్తర కొరియాకు ఒరిగిందేమీ లేదు. ఒప్పందం విఫలం కావటంతో వుత్తర కారియా అప్పటి వరకు అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ పర్యవేక్షణలో వుంచిన ప్లూటోనియం రాడ్ల సీళ్లను తొలగించి తిరిగి అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి అమెరికాదే పూర్తి బాధ్యత.

ప్రాంతీయ రాజకీయాలు, దేశాలలో జోక్యం చేసుకోవటంలో అమెరికాను మించిన వారు ఇప్పుడు లేరు. వుదాహరణకు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తొత్తుగా చేసుకొని అమెరికా పాల్పడని జోక్యం లేదు. చివరకు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా తయారు చేసి కిరాయికి ప్రయోగిస్తోంది. అలాంటి అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో ఇరాన్‌ జోక్యం చేసుకొంటోందనే నెపంతో దానితో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇప్పుడు వుత్తర కొరియా నుంచి ప్రమాదం లేదు, హాయిగా నిదురపొండి అని తన జనానికి చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఇరాన్‌ గురించి ఏమి చెబుతారు? కొద్ది రోజుల తరువాత వుత్తర కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కూడా తూ నా బడ్డుబాలు అని చెప్పరన్న గ్యారంటీ ఏముంది? అందుకే అమెరికా అడుతోంది రాజకీయం తప్ప మరొకటి కాదు అని చెప్పాల్సి వస్తోంది. వుత్తర కొరియాలో నిర్బంధించిన అమెరికన్ల విడుదల కొరకు ఆదేశం ఎలాంటి మొత్తాన్ని డిమాండ్‌ చేయలేదు. ఇరాన్‌లో బందీలైన అమెరికన్లను విడిపించుకొనేందుకు 40కోట్ల యూరోలను విమానంలో తరలించి, దానిలోనే బందీలను వెనక్కు తీసుకువచ్చారు. అయితే ఆ సొమ్మును ఒప్పందం ప్రకారం సరఫరా చేయని మిలిటరీ పరికరాల కోసమని అమెరికా చెప్పుకొన్నది. అలాంటి మొత్తం అయితే ఇంకా 200 కోట్ల డాలర్ల వరకు అమెరికా చెల్లించాల్సి వుంది. ఇవన్నీ చూసినపుడు అమెరికా ఆడుతున్నది రాజకీయం తప్ప ప్రపంచశాంతి సమస్యపై దానికి చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటి కొస్తూ మాకేమి తెస్తారంటే కుదరదు అమెరికా పెద్దన్నా !

22 Tuesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, CHINA TRADE, Donald trump, Indo-China trade, TRADE WAR, US-CHINA TRADE WAR

ఎం కోటేశ్వరరావు

వాణిజ్య యుద్ధంలో అమెరికా ముందు చైనా చేతులెత్తేసిందా? ఏమో ! చైనా మెడలు వంచి వాణిజ్య పోరులో అమెరికా విజయం సాధించిందా ? ఏమో చెప్పలేం గానీ తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. ‘చైనాతో యుద్దం వాయిదా పడింది, కానీ ట్రంప్‌ వ్యూహ గందరగోళం కొనసాగుతూనే వుంది’ . కార్పొరేట్ల పత్రిక ఫోర్బ్స్‌ ఒప్పందంపై రాసిన తక్షణ విశ్లేషణ శీర్షిక ఇది. ‘ చైనా ముఖ్యమైన ప్రయోజనాలను కాపాడుకుంది’ ఇది చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. వివరాలేమీ తెలియకుండానే అమెరికాన్లకు చైనా లంగిపోయిందని సంతోష పడే వారికి చివరకు మిగిలేది నిరాశే అని గత చరిత్రను బట్టి చెప్పక తప్పదు.

ప్రపంచంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు వునికిలోకి తెచ్చినదే ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ). అది ఒక పక్క వుండగానే మరోవైపు దానిలోని సభ్యదేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడటం అంటే దాని వైఫల్యాన్ని సూచిస్తున్నది. నిజానికి ప్రపంచీకరణ యుగంలో రెండు దేశాల మధ్య తలెత్తే వాణిజ్యపోరు, పరిష్కారం కూడా వాటికే పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ధనిక దేశమూ చైనాతో వాణిజ్యంలో లోటుతోనే వుంది, కనుక ప్రతి దేశమూ దానిని తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. వాటిలో అమెరికా ఒకటి. దిగుమతి సుంకాల పెంపుతో ఎవరైనా చైనాను దెబ్బతీయాలని చూస్తే ఆ విబేధాన్ని వినియోగించుకొనేందుకు మిగతా దేశాలు కాచుకొని వుంటాయి, వున్నాయి. అందుకు పెద్ద వుదాహరణ మన దేశమే.

కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతుంటారు. దేశభక్తి నిరూపణకు చైనా వ్యతిరేకతను ఒక ప్రమాణంగా ముందుకు తెస్తున్నారు. అయితే గతకొద్ది నెలలుగా ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి మొదలు, వున్నత అధికారయంత్రాంగం మొత్తం చైనాతో సయోధ్య దిశగా ముందుకు పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పాత సామెత ప్రకారం వ్యాపారి వరదనబడి పోతున్నాడంటే ఏదో లాభం కనిపించబట్టే అని వేరే చెప్పనవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతలో అమెరికా కంటే సంఘపరివారం పేరుమోసిందేమీ కాదు. అలాంటి అమెరికానే చైనాతో కాళ్లబేరానికి వస్తున్నపుడు పరివార పెద్దలైన మోడీ, మరొకరు ఎంత? వారంతా కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప మరొకరు కాదు. ఎడ్లెవిస్‌ అగ్రీవాల్యూ చైన్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిశోధన విభాగ అధిపతి పెరెరాణా దేశాయ్‌ చైనా-అమెరికా వాణిజ్య పోరు గురించి ఇలా చెప్పారు.’ ఎగుమతుల ధరలు పోటాపోటీగా వున్నట్లయితే అయిల్‌ సీడ్స్‌ మీల్స్‌ అయిన సోయా, ఆవ, పత్తి మరియు మొక్కజన్న భారతీయ ఎగుమతిదార్లకు ఒక చిన్న వ్యవసాయ ఎగుమతి కిటికీ తెరుచుకుంటుంది. నూట ఆరు అమెరికా వుత్పత్తులపై చైనా 25శాతం వరకు కొత్త పన్నులు ప్రకటించింది, అంతకు ముందు 128 అమెరికా వుత్పత్తులపై పన్నులు పెంచింది. రెండు అతి పెద్ద దేశాలు ఒక వాణిజ్య యుద్ధంలోకి అడుగుపెట్టాయి.పదమూడు వందల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్నులు విధించింది.’ భారత పత్తి సంఘం అధ్యక్షుడు అతుల్‌ గణత్ర మాట్లాడుతూ ‘ అమెరికా తరువాత పత్తి ఎగుమతిలో స్థానం భారత్‌దే. చైనా 50మిలియన్‌ బేళ్ళ పత్తి దిగుమతి చేసుకుంటే దానిలో 40శాతం అమెరికా నుంచి వస్తోంది. ఆ పత్తిపై చైనా 25శాతం పన్ను విధిస్తోంది. మన పత్తిపై చైనాలో ఎలాంటి పన్నులు లేవు, అందువలన అమెరికా పత్తి కంటే మన సరకు చౌక అవుతుంది కనుక మనకు ఇది మనకు లాభదాయకం.’ సౌరాష్ట్ర జిన్నర్స్‌ అసోసియేషన్‌ ఆనంద్‌ పోపట్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా, ఆఫ్రికన్‌ కాటన్‌ కంపెనీల కంటే మన పత్తి ధర చౌక, భారత సోయాబీన్‌పై వున్న ఆంక్షలను చైనా తొలగించినట్లయితే వారికి మనం సరఫరా చేయగల మరొక వస్తువు అవుతుంది. చైనాకు అవసరమైన 93.4 మిలియన్‌ టన్నులు సోయాలో ప్రస్తుతం అమెరికా 39శాతం సరఫరా చేస్తోంది.’ అన్నారు. చైనా పశు, కోళ్ల దాణాకు వుపయోగించే సోయాను మన దేశం నుంచి ఎగుమతి చేసేందుకు ఇప్పుడున్న ఆంక్షల ఎత్తివేతకు మన దేశవాణిజ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల గురించి ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా పరిస్ధితి వుంది. మన వాణిజ్యలోటు గతేడాది ఏప్రిల్‌లో 13.25బిలియన్‌ డాలర్లు వుండగా ఈ ఏడాది 13.72 బిలియన్లకు పెరిగింది. రోజు రోజుకూ చమురు ధరల పెరుగుదల కారణంగా ఇది మరింత విస్తరించటమే కాదు, మన దేశం నుంచి డాలర్లు తరలిపోవటం పెరుగుతుండటంతో విదేశీమారకద్రవ్య సమస్యకూడా తలెత్తే అవకాశం వుంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన మార్కెట్లో ప్రవేశించేందుకు మోడీని కౌగలించుకోవటం తప్ప వారి మార్కెట్లలో మనకు ప్రవేశం ఇవ్వటం లేదు. మన దేశ ధనికులు ఏ కారణం చేతో బంగారం, బంగారు ఆభరణాలు, ముత్యాలు, రంగురాళ్లు దిగుమతి చేసుకోవటం తగ్గించబట్టిగాని లేకపోతే వాణిజ్యలోటు మరింత పెరిగి వుండేది. గత ఏప్రిల్‌లో చమురు దిగుమతులకు 7.36బిలియన్‌ డాలర్లు మనం చెల్లించగా ఈ ఏడాది ఆ మొత్తం 10.41బిలియన్లకు పెరిగింది.

ప్రపంచంలో నేడు చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, పెద్ద వినియోగదారుగా కూడా మారుతోంది. అక్కడి జనాభా కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగా ఆ మార్కెట్‌ను వదులుకొనేందుకు ఏ ధనిక దేశమూ సిద్దంగా లేదు. అలాంటి దేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మన కార్పొరేట్‌ రంగంలో క్రమంగా పెరుగుతోంది. సంఘపరివార్‌ చైనా వ్యతిరేక చిల్లర ప్రచారం ఎలా వున్నప్పటికీ ప్రభుత్వపరంగా అది కుదరదని స్పష్టం చేస్తున్న కారణంగానే ఇటీవలి కాలంలో డోక్లాం దగ్గర నుంచి అనేక సానుకూల వైఖరులను వెల్లడిస్తున్నది. చైనా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ వద్ద పెండింగ్‌లో వున్న 254 వుత్పత్తుల నమోదుకు వేగంగా అనుమతులు తీసుకోవాలని మన ఫార్మారంగం మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తోంది.

తాను ఎగుమతి చేయటమే తప్ప దిగుమతులు చేసుకోవటం లేదన్న విమర్శలను పూర్వపక్షం చేసేందుకు లేదా ఎవరేమి ఎగుమతి చేయగలరో చూపండి అన్నట్లుగా ఈ ఏడాది నవంబరు నెలలో షాంఘై నగరంలో తొలిసారిగా చైనా దిగుమతుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అంటే ప్రపంచ దేశాలన్నీ తమ వుత్పత్తులను అక్కడ ప్రదర్శించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో తాము పది లక్షల కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటామని చైనా చెబుతోంది. అందువలన ప్రతి దేశం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. షాంఘై ప్రదర్శనలో చైనా తన విధానాన్ని, నిబంధనలను ప్రపంచానికి తెలియచేయనుంది. ఈ ప్రదర్శనలో మన దేశం నుంచి కనీసం వందమంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం వుంది. చైనా వస్తువుల దిగమతులు నిలిపివేసి దేశభక్తి నిరూపించుకోవాలని సంఘపరివార్‌ సంస్ధలు ఎంతగా గగ్గోలు పెట్టినా గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మన దేశం చైనా నుంచి 69.4బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకోగా ఇదే సమయంలో కేవలం 11.5బిలియన్ల మేరకు మాత్రమే ఎగుమతులు చేసింది. వాణిజ్య తేడా 58 బిలియన్‌ డాలర్లు. చైనాతో సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్యపరంగా ఇలాంటి ఎన్నో ప్రాధాన్యత అంశాలున్నందున వారితో వైరం తెచ్చుకోవాలని ఏ కార్పొరేట్‌ సంస్ధా కోరుకోదు. పాలకులు ఎవరైనా అలాంటి పిచ్చిపనులకు పూనుకుంటే వైఖరి మార్చుకునే విధంగా తాను చేయాల్సింది చేస్తుంది. ఈ పూర్వరంగంలోనే ఎలాంటి ముందస్తు ఎజండా లేకుండా నరేంద్రమోడీ చైనా వెళ్లినప్పటికీ సానుకూలంగా వున్నామన్న సందేశం దానిలో ఇమిడి వుంది.

అమెరికాాచైనాల మధ్య వాణిజ్య పోరుకు స్వస్థిచెప్పి వాణిజ్యలోటు సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆచరణలో ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి గనుక అమలు ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కూడా ప్రతి అమెరికా అధ్యక్షుడూ ఏదో ఒక దశలో వాణిజ్యపోరు పేరుతో బెదిరింపులకు దిగిన వారే. ట్రంప్‌ వైఖరి మొరటుగా వుంది. తన పదవీకాలం పూర్తయ్యే నాటికి రెండు దేశాల మధ్య వున్న వాణిజ్యలోటులో 200బిలియన్‌ డాలర్లను తగ్గించాలని చెబుతున్నాడు. అయితే హడావుడి చేస్తోందని చైనీయులు చెబుతున్నారు. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా తన వుత్పాదక పరిశ్రమను వున్నత స్ధాయికి పెంచుకొనేందుకు దీర్ఘకాలిక క్రీడను ప్రారంభించిందని, దానిని పడనివ్వకుండా చేయటంతో పాటు అమెరికా తాత్కాలిక ప్రయోజాలను కోరుతోందని, చైనా కీలక ప్రయోజనాలను ఎట్టి పరిస్ధితులలో ఫణంగా పెట్టదని పరిశోధకులు చెబుతున్నారు.

చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం తప్పిపోయిందని విజయోత్సవాలు చేసుకోవటం తప్ప సాధించిందేమిటో తెలియదని అమెరికాలో విమర్శకులు అంటున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో కలవకుండా తన ప్రయోజాలకే పెద్ద పీట వేస్తున్న చైనాను ఒంటరి పాటు చేయటం లేదా అంకెకు తీసుకురావటం అన్న అసలు లక్ష్యాన్ని ట్రంప్‌ పట్టించుకోవటం లేదన్న విమర్శలు చెలరేగాయి. అసలు చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టనివ్వటమే అమెరికా చేసిన పెద్ద తప్పిదమని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక నివేదికలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్ధలో రాజ్య జోక్యం చేసుకోకుండా చైనాను కట్టడి చేయటమే అంతి మ లక్ష్యం అయితే అమెరికా వస్తువులను కొనుగోలు చేయించమని చైనాను కోరటం ప్రతికూలమౌతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఇప్పుడు ఒక్క చైనా మీదే కాదు మా వస్తువులు కొంటారా లేక మీ వస్తువుల మీద దిగుమతి పన్ను విధించమంటారా తేల్చుకోండని అన్ని దేశాలను బెదిరిస్తున్నది. వాటిలో జపాన్‌ ఒకటి. రాజకీయంగా చైనాకు వ్యతిరేకంగా దానిని కూడగడుతున్నప్పటికీ ఆర్ధిక విషయాల్లో జపాన్‌పై అమెరికా తన షరతులను రుద్దేందుకు పూనుకుంది. తమ వుక్కు, అల్యూమినియం వస్తువులపై 25,10 శాతం చొప్పున దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా పూనుకుంటే తాము కూడా ప్రతి చర్యలకు దిగక తప్పదని ప్రపంచవాణిజ్య సంస్ధకు జపాన్‌ తెలియచేసింది. అమెరికా బెదిరింపులకు చైనా లంగకపోవటం జపాన్‌కు వూతమిచ్చి అమెరికాను హెచ్చరించేంత వరకు వెళ్లిందని పరిశీలకులు భావిస్తున్నారు. 1970,80 దశకాలలో అమెరికాను ఎదిరించే శక్తిలేని జపాన్‌ ప్లాజా ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చిందని పర్యవసానంగా జపాన్‌లో దీర్ఘకాల ఆర్ధిక తిరోగమనానికి దారి తీసిందని ఇప్పుడు అమెరికా గొంతెమ్మ కోర్కెలను చైనా అంగీకరించటం లేదని అందువలన చైనా నుంచి నేర్చుకోవాల్సి వుందని జపాన్‌ భావిస్తున్నది.

చిత్రం ఏమిటంటే ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలుపుతున్న అక్కడి ధనిక దేశాలు కూడా జపాన్‌ చర్యను చూసి అమెరికా దిగుమతి సుంకాలకు ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై అదనపు సుంకాలను విధించాల్సి వుంటుందని ఐరోపా యూనియన్‌ పేర్కొన్నది.అయితే ఈ హెచ్చరికలేవీ జపాన్‌-ఐరోపాయూనియన్‌- అమెరికా మధ్య వున్న రాజకీయ బంధాన్ని దెబ్బతీసేవిగా మారే అవకాశాలు ఇప్పటికైతే లేవు. మన దేశంపై అమెరికా వాణిజ్య యుద్దానికి దిగకపోయినప్పటికీ మన వ్యవసాయ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు వత్తిడి తెస్తోంది. దానిలో భాగంగానే మన దేశంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలను ఎక్కువగా నిర్ణయిస్తోందని, వ్యవసాయ, ఆహార రాయితీలను పరిమితికి ఇస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్ధకు కొద్దివారాల క్రితం ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో వుక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి కూడా వర్తిస్తాయని మన దేశం కూడా వాణిజ్య సంస్ధకు నోటీసు అందచేసింది. మొత్తం మీద చూసినపుడు మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికొస్తూ మాకేమి తెస్తారు అన్న రీతిలో అమెరికా ప్రవర్తిస్తోంది. అందువలన దాని వైఖరికి ప్రభావితులయ్యే ప్రతి ఒక్కరు ఏదో విధంగా సమన్వయం చేసుకొని పెద్దన్న వైఖరిని అడ్డుకోవటం అవసరం. ఈ దృష్ట్యా కూడా చైనాతో మన దేశం సఖ్యంగా వుండి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిరియాపై దాడులతో రెచ్చగొడుతున్నడోనాల్డ్‌ ట్రంప్‌ !

18 Wednesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

chemical weapons, Donald trump, RUSSIA, Syria, UN and OPCW

Image result for syria attack

ఎం కోటేశ్వరరావు

‘ఒక బీరు కొని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కలసి తాగుతూ స్వయంగా నా అనుభవాలను పంచుకోవాలనుంది. సిరియా పౌరుల కోసం ఏదో ఒకటి చేసేందుకు ఆయన ప్రయత్నించంటం నాకు సంతోషంగా వుంది.’ గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో ఆశ్రయం పొంది జర్నలిస్టు ముసుగులో సిరియాపై తప్పుడు ప్రచారం సాగిస్తున్న కాశీమ్‌ ఇద్‌ అనే ఒక ఐఎస్‌ఏజంట్‌ గతవారంలో సిరియాపై దాడుల తరువాత సిఎన్‌ఎన్‌ టీవీతో చేసిన వ్యాఖ్య. అమెరికా నాయకత్వంలో ఫ్రెంచ్‌, బ్రిటన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర కొన్ని దేశాలు జరిపిన దాడులతో ఐఎస్‌ ఏజంట్ల ఆనందం ఎలా వుందో ఇది తెలుపుతోంది. నేను సైతం తక్కువ తిన్నానా అంటూ నాలుగు సంవత్సరాల క్రితం బరాక్‌ ఒబామా తన వంతుగా ఒక దాడి జరిపితే, నీకంటే పెద్ద వెధవాయను నేను అంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది ఒకసారి ఇప్పుడు మరోసారి దాడులు జరిపించాడు. గతంలో ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో, ఇప్పుడు ప్రభుత్వమే తన పౌరులపై రసాయనిక ఆయుధాలను ప్రయోగిస్తోందనే ముసుగుతో దాడికి పాల్పడింది. చరిత్రలో ఇంత వరకు నాజీలు తప్ప ఎవరూ రసాయనిక ఆయుధాలతో సామూహిక హత్యలు చేసిన వుదంతాలు కానరావు. తమ దగ్గర ఎలాంటి రసాయన ఆయుధ కార్యక్రమం లేదు కనుక వత్తిడికి తలగ్గిన సిరియా ఏవైనా వుంటే వాటి నిర్మూలనకు అమెరికాతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. దాన్ని అమలు జరపకుండా, అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించి ఎలాంటి చట్టబద్దత లేకుండా జరిపిన దాడి ఇది. అణు జలాంతర్గాములు, అణ్వాయుధాలను మోసుకుపోయే విమానవాహక యుద్ధ నౌకలతో మోహరించి 2003లో ఇరాక్‌ తరువాత జరిపిన పెద్ద దాడి ఇది.ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నారనే వార్తలు ఒకవైపు, రష్యాకు చెందిన ఒక డబుల్‌ ఏజంట్‌, అతని కూతురిపై విష ప్రయోగం జరిపిందనే సాకుతో అనేక మంది రష్యా రాయబార సిబ్బందిని ఐరోపా దేశాల నుంచి బహిష్కరించటం వంటి పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు గిల్లి కజ్జాలకు పూనుకున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మిలిటీకరణ జరిగింది. ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలే అక్కడ ఆయుధాలు తయారు చేస్తాయి. అందువలన వాటికి లాభాలు రావాలంటే ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల రావణకాష్టం మాదిరి య దానికి ఎక్కడో ఒక చోట యుద్ధాలు, దేశాల మధ్య వుద్రిక్తతలు వుంటే తప్ప జరుగుబాటు వుండదు. మిలిటరీ పరిశ్రమలను మేపేందుకు అమెరికా పాలకవర్గం ఇప్పటికే స్కూళ్ల ప్రయివేటీకరణ, నిధుల కోత, మౌలిక సౌకర్యాల తగ్గింపు, గృహ, వైద్య రంగాల నుంచి తప్పుకోవటం వంటిచర్యల ద్వారా జనజీవితాలను దిగజార్చటంతో పాటు నిరుద్యోగం, దారిద్య్రాన్ని పెంచుతోంది. రెండోవైపు అంతర్జాతీయంగా దాడులకు తలపడుతోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలమని ప్రగల్భాలు పలికే పశ్చిమ దేశాలు జరిపిన ఈ దాడిని అనేక దేశాలు, సమాజాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పశ్చిమాసియాలో, తద్వారా ప్రపంచ యుద్ధానికి పశ్చిమ దేశాలు అర్రులు చాస్తున్నాయని అనేక మంది భయపడుతున్నారు.అంతర్గతంగా వైఫల్యాలబాటలో వున్న ట్రంప్‌ వాటిని పక్కదారి మళ్లించేందుకు, నవంబరులో జరగనున్న పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికలలో ఓట్లు పొందేందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. సిరియా రసాయక ఆయుధాలను ప్రయోగించిందని ఆరోపించటం కాదు, అంతర్జాతీయ సంస్ధల ద్వారా దర్యాప్తు జరిపించాలి. దాని గురించి ఐక్యరాజ్యసమితిలో చర్చ జరపాలి. ఏ చర్య తీసుకున్నా దాని అనుమతితో, పర్యవేక్షణలో జరపాలి తప్ప అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ నేతలు ముగ్గురూ కూర్చొని సిరియాపై దాడులు చేయటానికి వారెవరు?

Image result for syria attack

సిరియా వద్ద వున్న రసాయనిక ఆయుధాల సామర్ధ్యాన్ని దెబ్బతీసే పేరుతో జరిపిన ఈ దాడులు ప్రపంచాన్ని భయపెట్టేందుకు తప్ప మరొకందుకు కాదు. నిజంగా ఎవరైనా రసాయనిక ఆయుధాలను తయారు చేస్తుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికా ప్రకటనల తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటారా? వర్తమాన పరిస్ధితుల్లో ఏ దేశానికాదేశం తన రక్షణ కోసం అన్ని రకాల ఆయుధాల తయారీకి పూనుకోవటం బహిరంగ రహస్యం. వాటిలో ఒకటైన జీవ, రసాయన ఆయుధాల్లేని పెద్ద దేశాలేవీ లేవు. కొన్ని బహిర్గతమైతే కొన్ని రహస్యంగా చేస్తుంటాయంతే తేడా. గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం సిరియా 1300 టన్నుల రసాయన ఆయుధాలను నాశనం చేసింది. అయినా సరే దాని దగ్గర ఇంకా ఎక్కడో వున్నాయన్నది పశ్చిమ దేశాల ఆరోపణ. ఐక్యరాజ్యసమితిలోని రసాయనాయుధాల నిషేధ సంస్ధ(ఒపిసిడబ్ల్యు) సిరియా రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినందుకు గాను 2013లో నోబెల్‌ శాంతి బహుమతి కూడా పొందింది. మరుసటి ఏడాది సెప్టెంబరు నాటికి 96శాతం ఆయుధాలను నాశనం చేసినందున, తయారీ కేంద్రాల విధ్వంసానికి నిర్ణయించిందని , 2016జనవరిలో మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ఆ సంస్ధ ప్రకటించింది. నిజానికి అవన్నీ 1970దశకం నుంచి రూపొందించినవి. అలాంటపుడు తిరిగి ఏడాది కూడా గడవక ముందే సిరియా వద్ద రసాయనిక ఆయుధాలు గుట్టలు పడ్డాయని పశ్చిమ దేశాలు ప్రకటించాయంటే ఆధారం ఏమిటి? ప్రతి దేశంలోనూ పారిశ్రామిక అవసరాల కోసం వుపయోగించే క్లోరీన్‌ గాస్‌ను రసాయనికాయుధాల తయారీకి కూడా వుపయోగించవచ్చు. దీనిని చూపే సిరియాపై పశ్చిమ దేశాలు ఆరోపణలకు దిగాయి. తరువాత ఓపిసిడబ్ల్యు, ఐరోసా సంయుక్త దర్యాప్తు వ్యవస్ధను(జిమ్‌) ఏర్పాటు చేశాయి. ఆ జిమ్‌ కొత్తగా సిరియా రసాయనికాయుధాల గురించి ఒక నివేదిక సమర్పించింది. అది అమెరికా అనుకూల తొత్తు నివేదిక అని రష్యా గుర్తించేందుకు నిరాకరిస్తోంది. దాని ఆధారంగా ఎలాంటి చర్య తీసుకోకూడదని రష్యా ఐరాసలో వీటో చేసింది. అందువలన అమెరికా నాయకత్వంలోని కూటమి ఇప్పుడు ఏకపక్షంగా దాడులు చేసింది. ఆనక తీరికగా దర్యాప్తు అంటూ కబుర్లు చెబుతోంది.

అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ చెప్పినదాని ప్రకారం 105 దీర్ఘకాలిక శ్రేణి క్షిపణులను ప్రయోగించిన పెద్ద దాడి ఇది, ఒక్కసారికే ఇది పరిమితం అని చెప్పినప్పటికీ ప్రపంచ స్పందనను చూసేందుకు చేసిన ఒక ప్రయోగమని చెప్పవచ్చు. తన నూతన, నవీకరించిన ఆయుధాలు ఎలా పని చేస్తాయో పరీక్షించేందుకు గతంలో ఇరాక్‌ మొత్తాన్ని తన యుద్ద ప్రయోగశాలగా మార్చింది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. కొద్ది రోజుల క్రితం డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యాను బెదిరిస్తూ చేసిన ఒక ట్వీట్‌లో కొత్తవి, చక్కని, చిన్నవైన క్షిపణులు వస్తున్నాయి కాచుకోండి అని పేర్కొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని జీవ, రసాయన ఆయుధాల రూపకల్పన, తయారీ, పరీక్షా కేంద్రం మీద, హామ్‌ అనే పట్టణంలోని రసాయనిక ఆయుధాల గోడవున్‌ మీద, మూడవ దాడి దానికి సమీపంలోనే వున్న ఒక బంకర్‌ మీద క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికన్లు చెబుతున్నారు. అమెరికన్లు చెబుతున్నదే వాస్తవమైతే ఆయుధ గోడవున్లపై బాంబులు వేస్తే అవి పేలి ఈ పాటికి ఎంతో ప్రాణ నష్టం జరిగి వుండాల్సింది. అలాంటి వార్తలేవీ రాలేదు కనుక సిరియా ప్రకటించినట్లు దాని వైమానిక సైనిక కేంద్రాలు, విమానాశ్రయాల మీద మాత్రమే దాడులు జరిగాయని అనుకోవాల్సి వస్తుంది.మరోవైపున ప్రయోగించిన 103లో 71క్షిపణులను సిరియా వైమానిక రక్షణ వ్యవస్ధలు కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. రష్యా వద్ద వున్న అధునాతన క్షిపణి విధ్వంసక వ్యవస్ధలు సిరియాలో ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి.

సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధాలతో దాడులు జరుపుతోందంటూ ఒక పధకం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ దేశాల మీడియా ప్రచారం చేస్తోంది. అలాంటి దాడులు జరిపింది సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పశ్చిమ దేశాల సాయంతో దాడులు చేస్తున్న కిరాయి ఐఎస్‌ తీవ్రవాదులు తప్ప మరొకరు కాదని గతంలోనే వెల్లడైంది. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే చివరికది నిజమై కూర్చుంటుందన్న నాజీ గోబెల్స్‌ సిద్ధాంతం ప్రకారం సిరియాపై రసాయనిక ఆయుధాల ప్రయోగ ప్రచారం జరుగుతోంది. 2003లో బుష్‌ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇరాక్‌పై దాడులు చేసేందుకు చేసిన ప్రచారాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ ప్రత్యర్ధి దేశాలపై దాడులు చేసేందుకు మారణాయుధాలను గుట్టలుగా పోగేశాడంటూ పెద్ద ఎత్తున చేసిన ప్రచారాన్ని, ప్రభుత్వాన్ని కూల్చివేసి, అక్కడి చమురుబావులను స్వాధీనం చేసుకొని, సద్దాంను వురితీసిన తరువాత అలాంటి ఆయుధాలేమీ కనపడలేదని పశ్చిమ దేశాలే ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.

ఆసియా,ఐరోపా, ఆఫ్రికా ఖండాల సంగమ ప్రాంతం వంటి మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా మిలిటరీ రీత్యా వ్యూహాత్మకం, చమురువంటి సహజ సంపదల నిలయమైన ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకొనేందుకు చరిత్రలో ప్రతి సామ్రాజ్యవాదీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిటలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా ఆలోచన నిరంతరం దీని చుట్టూతిరుగుతూనే వుంటుంది. అందుకు గాను గోతికాడ నక్కలా అవకాశాల కోసం వేచి చూస్తుంటుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంత దేశాల పాలకులపై పెల్లుబికిన అసంతృప్తితో 2010లో ట్యునీసియాలో ప్రారంభమై మధ్య ప్రాచ్యం, వుత్తర ఆఫ్రికాలోని పలు దేశాలకు విస్తరించిన ఆందోళనలను అరబ్‌ వసంతోదయంగా వర్ణించారు. ఆ సమయంలో పనిలో పనిగా అమెరికన్లు తమ అజెండాల్లో వున్న దేశాలలోని పాలకులను తొలగించేందుకు తమ తొత్తులు ఏజంట్లను ప్రయోగించి అక్కడ కూడా తిరుగుబాట్లు ప్రారంభమైనట్లు ఒక పెద్దకుట్రకు తెరతీశారు. దానిలో ఒకటి సిరియా. గోడల మీద ప్రభుత్వవ్యతిరేక నినాదాలు రాసిన విద్యార్దులను అరెస్టు చేసిందనే పేరుతో 2011 మార్చినెలలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు తెరతీశారు.తొలుత అంతర్గత తిరుగుబాటుగా మీడియా చిత్రించింది. కొద్ది నెలల్లోనే వివిధ దేశాల నుంచి ఐఎస్‌ తీవ్రవాదులు, కిరాయి మూకలను సమీకరించి పశ్చిమ దేశాలు అడుతున్న నాటకంగా వెల్లడైంది. ప్రతిగా వారిని అణచివేసేందుకు సిరియా సర్కార్‌ పూనుకుంది. తాము కూడా ఐఎస్‌ తీవ్రవాదులను అణచివేసేందుకు సిద్ధమే, సిరియాకు సాయం చేస్తామంటూ సరికొత్త నాటాకానికి తెరతీసిన పశ్చిమ దేశాలు త్వరలోనే అక్కడి అసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే సత్తా ఐఎస్‌ తీవ్రవాదులకు లేదని గ్రహించించాయి. తీవ్రవాదులకు ఆయుధాలు ఇచ్చింది కూడా వారేనని తేలింది. అప్పటి నుంచి తీవ్రవాదుల పట్టులో వున్న ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు రసాయనికి ఆయుధాలను ప్రయోగిస్తోందంటూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. నిజానికి వాటిని ప్రయోగించింది తిరుగుబాటుదారులే అని తేలింది.

2012 ఆగస్టు 20న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక ప్రకటన చేస్తూ సిరియా సర్కార్‌ రసాయన ఆయుధాలను గనుక ప్రయోగిస్తే అమెరికా గీచిన ఎర్ర(హెచ్చరిక అనే బెదిరింపు) గీతను దాటినట్లుగానే భావించాల్సి వుంటుందని బెదిరించాడు.2014లో ఒబామా సిరియా మీద దాడులు చేయించాడు. అయితే ఐఎస్‌,ఆల్‌ఖైదా వుగ్రవాదుల మీద దాడి అంటూనే సిరియా సామర్ధాన్ని దెబ్బతీసేందుకు పెద్ద ప్రయత్నం చేసి బక్కబోర్లాపడ్డాడు. అప్పటి వరకు అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు మాత్రమే తెలుపుతున్న రష్యా ప్రత్యక్షంగా 2015 సెప్టెంబరు నుంచి తన మిలిటరీ నిపుణులు, సామగ్రిని సిరియాకు తరలించి తిరుగుబాటుదార్లను అణచేందుకు తోడ్పడుతోంది. అప్పటి నుంచి సిరియాపై దాడులకు పెంటగన్‌ ఎదురు చూస్తోంది. అదే ఏడాది నవంబరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎన్నికైతే ఐఎస్‌పై దాడులకు సిరియాకు పదాతి దళాలను కూడా పంపేందుకు వెనుకాడను అని ప్రకటించాడు. ఎన్నిక తరువాత తిరిగి అదే ప్రకటన చేస్తూ రష్యాతో పోరును కూడా మనం ముగించాల్సి వుంది అని సిరియా అధ్య క్షుడు అసద్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. గతేడాది ఏప్రిల్‌లో అమెరికా 59 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సిరియాపై ప్రయోగిచింది. సిరియాను ఆక్రమించేందుకు అమెరికన్లు చేస్తున్న తప్పుడు ప్రచారం దాని బలహీనతలనే బయటపెడుతున్నది. నిజంగానే అసాద్‌ ప్రభుత్వం వద్ద రసాయన ఆయుధాలు వుంటే, ఇటీవల కూడా ప్రయోగించినట్లు అమెరికా చెప్పటం అంటే నాలుగు సంవత్సరాలలో జరిపిన మూడు దాడులు ఎలాంటి ప్రభావం చూపలేదన్నది స్పష్టం. అయితే తాజాగా మూడోసారి ఎందుకు జరిపినట్లు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ రక్షణ మంత్రి గవిన్‌ విలియమ్స్‌న్‌ బిబిసితో మాట్లాడుతూ తాము చేసిన దాడి అక్కడి అంతరుద్ద్యంలో జోక్యం లేదా పాలకుల మార్పు కోసం చేసింది కాదు, ఇది ఆప్రాంతంలో వుద్రిక్తతలు మరింతగా పెరగకుండా తీసుకున్న పరిమిత, లక్షిత దాడి అన్నారు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డికోసమన్న సమాధానమిది. ఈనెల ఏడవ తేదీన సిరియా మిలిటరీ ప్రయోగించిన క్లోరీన్‌, ఇతర గుర్తు తెలియని గ్యాస్‌ వల్ల అనేక మంది పౌరులు మరణించారన్న కట్టుకథను ఆధారం చేసుకొని పదమూడవ తేదీన దాడి జరిపారు. ముందే చెప్పుకున్నట్లు అమెరికాలో ఆయుధాలను తయారు చేసేది ప్రయివేటు సంస్ధలు. ఇప్పుడు ప్రయోగిస్తున్న తోమహాక్‌ క్షిపణులను రేథియాన్‌ అనే కాంట్రాక్టరు. అంటే వాడికి పని ఇవ్వాలనే ఒప్పందం వుంది గనుక ఏదో ఒక సాకుతో ఎక్కడో ఒకచోట వాటిని ప్రయోగించాలి. ఈక్షిపణికి అమర్చన బాంబు పేలబోయే ముందు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి నిర్దేశిత లక్ష్యంపై బాంబు వేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఈ రకం క్షిపణులను వినియోగిస్తున్నప్పటికీ నవీకరించిన తరువాత తొలిసారిగా 900కిలోల బాంబును తాజాదాడిలో దానికి అమర్చి ప్రయోగించారు. అయితే ఇవి ఎంత మేరకు నష్టం చేకూర్చుతున్నాయనేది సందేహమే. గతేడాది సిరియా వైమానిక స్ధావరంపై చేసిన దాడిలో అనేక విమానాలు, రన్‌వే ధ్వంసమైనట్లు అమెరికన్లు వీడియోలద్వారా ప్రపంచానికి చూపారు. అయితే మరుసటి రోజు నుంచే ఆ రన్‌వేను వుపయోగిస్తున్నట్లు బయటపడింది. అంటే అవి నకిలీ వీడియోలన్నది స్పష్టం. తాజా దాడులలో 71క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్లు రష్యా చెబుతోంది. కొందరు నిపుణుల వాదనల ప్ర కారం ఖండాంతర క్షిపణుల కంటే అమెరికా ఇప్పుడు ప్రయోగించిన క్రూయిజ్‌ క్షిపణులు చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కనుక మధ్యలోనే వాటిని కూల్చివేయటానికి అవకాశాలను కాదనలేము. వాటిని కూల్చివేయగల రష్యా ఎస్‌-400 వ్యవస్ధలున్నాయనే అనుమానం వుంటే వాటి పరిధిలోకి పైలట్లతో కూడిన విమానాలను దాడులకు పంపేందుకు అమెరికా దాని మిత్రపక్షాలు భయపడతాయి. ఈ దాడులను రష్యా, చైనాలు ఖండించాయి. ఈ దాడి జరగటం తమ నాయకుడు పుతిన్‌కు అవమానకరం అని రష్యా దౌత్యవేత్తలు వ్యాఖ్యానించినట్లు నిర్ధారణకాని వార్తలు వెల్లడించాయి. ఇవి పుతిన్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు ప్రచారంలో పెట్టినవి కూడా కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోడకు నిధులు – అక్రమవలసదార్లకు పౌరసత్వం : డోనాల్డ్‌ ట్రంప్‌ !

25 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, Dreamers, Republican party, us government shutdown, US immigration deal

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో శుక్రవారం రాత్రి పన్నెండు గంటల నుంచి అక్కడి ప్రభుత్వం పనిచేయటం ఆగిపోయింది. మూడు రోజుల తరువాత ముగిసింది. దీనికంటే ముఖ్యవిషయం ఏమంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ పెద్దమనిషి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడచిన సందర్భంగా లక్షలాది మంది మహిళలు అమెరికా అంతటా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం మూతపడినందువలన ఎక్కువగా ప్రభావితమయ్యేది మిలిటరీ గనుక తెరిచేందుకు ముందుకు రావాలని మూతకు కారకులైన డెమోక్రాట్లకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. ఏడాది పాలనలో తన ఆర్ధిక విజయం, సంపదల సృష్టికి గాను పండుగ చేసుకొనేందుకు ఈ రోజు ప్రదర్శనలు మహిళలకు ఇది సరైన సమయం అంటూ ట్రంప్‌ వారిని రెచ్చగొట్టే విధంగా మరో ట్వీట్‌ద్వారా వ్యాఖ్యానించాడు. నిజానికి ప్రభుత్వ మూత అనేది పెద్ద్ద ప్రహసనం. డెమోక్రాట్లను బందీలుగా మార్చటంతో మరో మార్గం లేక దిగి వచ్చారని అధ్యక్షుడు ట్రంప్‌ తనదైన శైలిలో మూత ముగిసిన తరువాత ట్వీట్‌ చేశాడు. అధ్యక్షుడు తమతో తెరవెనుక ఒప్పందానికి వచ్చారని డెమోక్రాట్‌ సెనెటర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. వలసదారుల సమస్యలపై తరువాత చర్చ జరిపేందుకు రిపబ్లికన్లు సమ్మతించారు గనుక డెమోక్రాట్లు మూత ఎత్తివేతకు అంగీకరించారని వార్తలు. అయితే అలాంటి చర్చ జరుగుతుందో లేదో హామీ లేదని, డెమోక్రాట్లు దేనిమీదా గట్టిగా నిలబడరని మరోసారి రుజువైందని అనేక విమర్శలు వచ్చాయి. రెండు రోజు తరువాత స్వయంగా ట్రంపే అసలు విషయాన్ని బయటపెట్టారు. అక్రమ వలసదారులను నిరోధించేందుకు మెక్సికో-అమెరికా సరిహద్దులలో నిర్మించతలపెట్టిన గోడ నిర్మాణానికి 25బిలియన్‌ డాలర్ల ఖర్చుకు బడ్జెట్‌లో డెమోక్రాట్లు ఆమోదం తెలిపితే పది పన్నెండు సంవత్సరాల వ్యవధిలో చిన్నవయస్సులో చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని విలేకర్లతో చెప్పారు. ఇది సమస్యను మరోవైపు మళ్లించేయత్నం తప్ప పరిష్కారానికి చిత్తశుద్ది కనిపించటం లేదు.

ప్రపంచంలో ఎక్కడా ఏ రోజూ, ఏక్షణం కూడా ప్రభుత్వ వ్యవస్ధలు మూతపడటం అనేది లేదు. అదొక మిధ్య అంటే అతిశయోక్తి కాదు. ట్రంప్‌ ఒక సామ్రాజ్యవాద ప్రతినిధి కనుక ఆ పెద్దమనిషి నోటి నుంచి ఆ భాషే వెలువడుతుంది. నిజానికి మూతపడిన రోజుల్లో పనికి దూరమైన ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు నష్టపోతారు, ఆమేరకు వారు చేసే ఖర్చు తగ్గుతుంది కనుక ఆమేరకు వ్యాపారలావాదేవీలు, వ్యాపారులకు లాభాలు తగ్గుతాయే తప్ప నష్టపోయేదేమీ వుండదు. సంక్షేమ పధకాలు నిలిచిపోతాయి. వుద్యానవనాలు, మ్యూజియంలు, ఇతర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్శనీయ స్ధలాలు మూతపడిన కారణంగా వచ్చే ఆదాయాన్ని కూడా నష్టంగా లెక్కవేస్తున్నారు. వాయిదా పడిన సేవలు తరువాత అయినా అందించేందుకు వీలుంటుంది కనుక వాటిని నష్టాలుగా చెప్పటం కొంతమేరకు అతిశయోక్తి అవుతుంది.

అసలు అమెరికా ప్రభుత్వం ఎందుకు మూతపడింది ? నాలుగు దశాబ్దాల క్రితం సవరించిన రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంట్‌లోని వుభయ సభలు నిర్ణీత మెజారిటీ ఓటుతో ఆమోదించాల్సి వుంది. సాధారణంగా మన పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాలలో అలాంటి సందర్భాలు వచ్చినపుడు ఓటింగ్‌లో పాల్గనటం గురించి రాజకీయ పక్షాలు అవసరమైతే విప్‌లు జారీ చేస్తాయి. అమెరికాలో అలాంటి ఏర్పాట్ల గురించి, మన మాదిరి అక్కడ కూడా జరిగే అపహాస్యాలు, ప్రహసనాల లోతుల్లోకి పోలేదు కనుక వాటి గురించి పక్కన పెడదాం. పార్లమెంట్‌ ఎగువ సభసెనెట్‌లోని వంద స్ధానాలకు గాను రిపబ్లికన్లకు 51,డెమోక్రాట్లకు 47 మంది, ఇద్దరు స్వతంత్రులు వున్నారు. బడ్జెట్‌ ఆమోదానికి కనీసం 60మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రభుత్వఖర్చుల ఆమోదానికి శుక్రవారం నాడు (మన ఓట్‌ఆన్‌ అకౌంట్‌ మాదిరి) జరిగిన ఓటింగ్‌లో అనారోగ్యం కారణంగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఒకరు గైర్హాజరు కాగా 50 మంది అనుకూలంగానూ 49 వ్యతిరేకంగానూ ఓటు చేశారు. ఐదుగురు అధికార పక్ష సభ్యులు ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటు చేయగా ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా తమ పార్టీ వైఖరికి విరుద్దంగా ఓటు చేశారు. దాంతో తగిన మద్దతు లేక బిల్లు వీగిపోయింది. నిధుల మంజూరు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి నిలిచిపోయింది. దీన్నే ప్రభుత్వ మూత అంటున్నారు. ఒప్పందం కుదిరిన తరువాత జరిగిన ఓటింగ్‌లో సెనెట్‌లో 81-18, దిగువ సభ కాంగ్రెస్‌లో 266-150 మెజారిటీతో ప్రతిష్టంభన ముగిసింది.

బడ్జెట్‌కు వుభయ సభల ఆమోదం, అదుపునకు సంబంధించి దశకలో నిబంధనలు సవరించిన తరువాత 1976 నుంచి ఇలాంటి మూతలు తాజా వుదంతంతో సహా పద్దెనిమిది సార్లు జరిగాయి. ఇవి ముగ్గురు రిపబ్లికన్లు, ముగ్గురు డెమోక్రాట్‌ పార్టీల అధ్యక్షుల హయాంలో జరిగాయి. పదకొండు సార్లు డెమోక్రాట్లు కారణంకాగా ఏడు రిపబ్లిక్‌ పార్టీ ఖాతాలో వున్నాయి. వీటిని స్ధూలంగా పరిశీలించినపుడు అత్యధిక సందర్భాలలో కార్మికవర్గానికి వ్యతిరేకమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చినపుడే జరిగాయని గమనించవచ్చు. రెండు పార్టీలు ఒకే వర్గానికి ప్రాతినిధ్యం వహించుతాయనే విషయంలో ఎలాంటి భ్రమలకు లోనుకానవసరం లేదు. వున్నంతలో ఏది తక్కువ హాని చేసే పార్టీ అని బేరీజు వేసుకొని మెజారిటీ కార్మికవర్గం,వలస కార్మికులు డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారులుగా వుంటున్నందున వారిని నిలబెట్టుకొనేందుకు ఆ పార్టీ రిపబ్లికన్లతో పోల్చితే సంక్షేమ చర్యల గురించి ఎక్కువగా మాట్లాడుతోంది.

తాజా మూత విషయానికి వస్తే బాలలుగా వున్నపుడు అమెరికాకు అక్రమంగా తీసుకువచ్చి వారిచేత తక్కువ వేతనాలకు పని చేయించుకొని ఇప్పుడు పెరిగి పెద్దవారైన తరువాత మార్చినెలలో బయటకు గెంటివేయాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమస్యపై వారి సంక్షేమం కోసం నిధుల కేటాయింపు సక్రమంగా లేదంటూ డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అక్రమంగా వలస వచ్చిన వారి బెదిరింపులకు లంగకూడదంటూ రిపబ్లికన్లు పట్టుబట్టారు. ఈ వివాదంపై రెండు పార్టీల మధ్య రాజీకుదిరి తిరిగి ఓటింగ్‌ జరిపి ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే అప్పుడు ఖర్చులకు నిధులను వినియోగించవచ్చు. అది జరగపోతే ఇటు సూర్యుడు అటు పొడుస్తాడా అంటే అంతసీనేమీ వుండదని గత అనుభవాలు రుజువు చేశాయి. నిజంగా అది ప్రతిబంధకమై ముందుకు పోలేని స్ధితి వుంటే అది పునరావృతం కాకుండా సాధారణ మెజారిటీతో ఆమోదం పొందే విధంగా రెండవ మూత సంభవించకుండానే నిబంధనల సవరణ చేసి వుండేవారు. ప్రతిసారీ అత్యధిక సందర్భాల్లో ఏదో ఒక రాజకీయంలో భాగంగానే జరుగుతోంది. ఇప్పుడు అమెరికాకు వలస వచ్చిన వారి గురించి అధికార ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

1976లో తొలి మూత పడటానికి కారణం రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌( ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ యజమాని). కార్మికులు,విద్య,వైద్యం,సంక్షేమ పధకాలకు గాను 56బిలియన్‌ డాలర్ల మేరకోత విధిస్తూ వీటో జారీచేసినపుడు దానికి వ్యతిరేకంగా అదే ఏడాది అమలులోకి వచ్చిన బడ్జెట్‌ అదుపు చట్టాన్ని వినియోగించుకొని డెమోక్రాట్లు ఖర్చులను అడ్డుకున్నారు. అది ఎన్నికల సంవత్సరం అని గమనించాలి. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన డెమోక్రాట్‌ జిమ్మీకార్టర్‌ 1977లో అధికారానికి వచ్చిన తొలిఏడాదే మూడుసార్లు రిపబిక్లన్లు 12,8,8 రోజుల చొప్పున ప్రభుత్వాన్ని మూతవేయించారు. అబార్షన్లు చేయించుకున్నపుడు వైద్యసాయం చేసేందుకు నిధుల కేటాయిపునుఅ అసలు అబార్షన్లనే వ్యతిరేకించే రిపబ్లికన్లు అడ్డుకున్నారు. అవసరం లేని మిలిటరీ పరికరాల కొనుగోలుకు ప్రతిపాదన చేశారంటూ 37బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని కార్టర్‌ వీటో చేయటాన్ని వ్యతిరేకిస్తూ 26 రోజుల పాటు రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు.1979 ఎన్నికల సంవత్సరంలో పార్లమెంటు సభ్యులు మరియు వున్నతాధికారులకు 5.5శాతం వేతనాల పెంపు ప్రతిపాదనను, అబార్షన్లకు నిధులను రిపబ్లికన్లు అడ్డుకొని మరోసారి 11రోజుల పాటు మూతకు కారణమయ్యారు. తరువాత అధికారానికి వచ్చిన రిపబ్లికన్‌ రోనాల్డ్‌ రీగన్‌ తొలి నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో ఆరుసార్లు (మొత్తం 12రోజులు) మూత వేయించి డెమోక్రాట్లు రికార్డు సృష్టించారు. తదుపరి నాలుగు సంవత్సరాల కాలంలో రెండుసార్లు, రెండురోజులు మూతపడవేయించి అత్యధిక మూతల అధ్యక్షుడిగా రికార్డులకెక్కించారు. తరువాత డెమోక్రాట్‌ బిల్‌క్లింటన్‌ హయాంలో మెజారిటీ దిగువసభలోని రిపబ్లికన్ల బిల్లును వీటోను చేయటంతో రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు. ఇది గరిష్టంగా 21రోజులు సాగి అత్యధిక ప్రతిష్టంభనగా నమోదైంది. చివరికి బిల్‌క్లింటనే రాజీపడి ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, పన్నుల పెంపుదల ప్రతిపాదన ఆమోదానికి బాటవేశారు. తరువాత బరాక్‌ ఒబామా హయాంలో పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యబీమా చట్టాన్ని వ్యతిరేకించిన రిపబ్లికన్లు 2013లో 16రోజుల పాటు మూత వేయించారు. ఆ తరువాత తిరిగి మూతపడటం ఇదే ప్రధమం.

వారాంతంలో లేదా వరుసగా సెలవులు వున్నపుడు మూతపడిన సందర్భాలలో పెద్ద ప్రభావం చూపలేదుకనుక కొన్ని అసలు చర్చనీయాంశం కాలేదు, అసలు మూతపడినట్లే కొందరికి తెలియలేదు. ఎక్కువ రోజులు కొనసాగితే ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు పని లేకుండా ఇళ్లకు పోవటం లేదా తరువాత వేతనాలు తీసుకొనే ప్రాతిపదికన పని చేయటం ఇలాంటి సందర్భాలలో సర్వసాధారణం. మిలిటరీలో పనిచేసే పౌరవుద్యోగులకు కూడా ఇదే వ ర్తింస్తుంది. మిలిటరీ, గూఢచార, వుగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో వున్న సిబ్బందికి ఈ మూత వర్తించదు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది వుండదు. అయితే ఈ సారి మిలిటరీ సిబ్బందికోసం ప్రసారాలు చేసే టీవీ నెట్‌వర్కు మూతపడినందున తమకు ఇబ్బంది కలిగిందని స్వదేశంలోనూ, విదేశాల్లో వున్న మిలిటరీ సిబ్బంది విమర్శలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.కొన్ని కవాతులు, మిలిటరీలోకి తీసుకోవటం కొన్ని కార్యక్రమాలకు పరిమితంగా ఆటంకం కలుగుతుంది తప్ప అమెరికన్లు విదేశాల్లో జరిపే దాడులు, దుండగాలకు, పోలీసు, అత్యవసర సేవలుగా ప్రకటించిన వాటికి మాత్రం ఎలాంటి ఇబ్బంది వుండదు. గత నాలుగు సందర్భాలలో జరిగిన ఇలాంటి పరిణామాలను గమనంలో వుంచుకొనే అనేక తాత్కాలిక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం ఒబామా హయాంలో 16రోజుల మూత సమయంలో ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ వుద్యోగులను వేతనాలు లేకుండా ఇళ్లకు పంపివేశారు. అమెరికాలో పనిచేయకపోతే వేతనం ఇచ్చే విధానం లేని విషయం తెలిసినదే. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది. అందువలన ముందే చెప్పుకున్నట్లు జరిగే నష్టం కార్మికవర్గానికే.

నిజానికి మూసివేత సమస్యకు మూడు రోజుల వేతనం పోగొట్టుకున్న కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు. ఆంబోతుల పోరులో లేగదూడల మాదిరి నష్టపోయారు. డోనాల్డ్‌ ట్రంపు చెప్పినట్లు అక్రమంగా వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వాలంటే 25 బిలియన్ల డాలర్ల బడ్జెట్‌ కేటాయింపు అంటే అది మరోవిధంగా జనంపై భారమే. ట్రంపు ప్రతిపాదిత గోడను డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. అందువలన ప్రభుత్వ మూతను ఎత్తివేసి ఫిబ్రవరి 6వరకు బడ్జెట్‌ ఖర్చుల ఆమోదానికి గాను అధికార ప్రతిపక్షాలకు ఇరువురకూ ఇబ్బంది లేని రీతిలో కుదిరిన రాజీ అని చెప్పవచ్చు. అయితే ఏదన్నా నష్టం జరిగితే రిపబ్లికన్లకే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. గోడ నిర్మాణానికి ఆమోదం తెలపటం అంటే డెమోక్రాట్లకూ ఇబ్బందే. నిజానికి అక్రమవలసదారులతో తక్కువ వేతనానికి పనిచేయించుకున్న కార్పొరేట్‌ కంపెనీల నుంచే అవసరం అనుకుంటే ఈ మొత్తాన్ని వసూలు చేయాలి. ఎందుకంటే వారి లాభాలకోసమే ఎవరు అధికారంలో వున్న అక్రమవలసలను ప్రోత్సహించిన విషయం జగద్విదితం.

జనవరి 20నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం ఏడాది పూర్తవుతుంది. దానికి ముందుగానే ఇటువంటిదేదో జరగనుందని కొన్ని సూచనలు వెలువడినా ప్రభుత్వ యంత్రాంగం అంత తీవ్రంగా తీసుకోలేదని వార్తలు వెలువడ్డాయి. జరిగిన నష్టం ఎంతో తరువాత వెల్లడి అవుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది 4.1లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.దీనిలో సగానికిపైగా మిలిటరీకి ఇతర సంస్ధలకు కేటాయిస్తారు. మూడోవంతుకు అటూ ఇటూగా వున్న మొత్తానికి మాత్రమే పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి వుంటుంది. డెమోక్రాట్లు సృష్టించిన ఈ మూత, దానికి కారణమైన రిపబ్లికన్ల ప్రతిపాదనలు రెండూ ఈ ఏడాది నవంబరులో జరగనున్న పార్లమెంటు దిగువసభ ఎన్నికల దృష్టితోనే అన్నది గమనించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ మేథావా, మెంటలా ? ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు ?

11 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, Donald trump one year rule, genius, insane, US failures

ఎం కోటేశ్వరరావు

అధ్యక్ష పదవికి ఎన్నికైన వెంటనే డోనాల్డ్‌ ట్రంప్‌ ఇలా చెప్పాడు.’ దివంగత మహానుభావుడు అబ్రహాం లింకన్‌ తప్ప ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసిన వారందరికంటే నేను మెరుగైన అధ్యక్షుడిగా వుండగలనని మీకు చెప్పగలను’ అన్నాడు. ఏడాది తరువాత ట్రంప్‌ మానసిక స్ధితిపై జాతీయ స్ధాయిలో చర్చ జరగకుండా చూడటం ఎలా అని అధ్యక్షభవనం మల్లగుల్లాలు పడుతూ తలలు పట్టుకుంటోందని అమెరికాలోని ప్రముఖ పత్రిక వాషింగ్టన్‌ పోస్టు ఒక వార్తకు శీర్షికగా పెట్టింది. ట్రంప్‌ పాలన ప్రారంభమై ఈనెల 20తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ తరుణంలో ప్రపంచ అగ్రరాజ్య అధిపతి గురించి ఇలాంటి విశ్లేషణ రావటానికి కారణం ఏమిటి ?

‘రగలటం మరియు కోపావేశం’ పేరుతో ట్రంప్‌ ఎన్నికల ప్రచారం, గతేడాది కాలంలో అధ్యక్ష భవనంలో వ్యవహరించిన తీరు తెన్నులపై అంతరంగిక కధనాలతో మైఖేల్‌ వూల్ఫ్‌ అనే రచయిత ఒక పుస్తకం రాశాడు. దీనిపై స్పందిస్తూ తాను నిజంగానే తగిన శక్తి సామర్ధ్యాలు, స్ధిరమైన మేథావిగా వున్నానని ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ముసలోడు దెబ్బలాటకు సిద్ధం అన్నట్లుగా వున్నప్పటికీ ఆయన సహాయకులు మాత్రం అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారట. నిజానికి ట్రంప్‌ మానసిక స్ధితి గురించి ఎన్నికలకు ముందే చర్చ ప్రారంభమైంది. దాని గురించి ఇప్పుడు పుస్తకం కూడా వెలువడటంతో బహిరంగ చర్చకు నాంది పలికినట్లు కావటంతో అధ్యక్ష భవనం కూడా ఏదో ఒకటి చేయాల్సింది వుంది. చెత్త పుస్తకం రాసిన చెత్త రచయిత అని వ్యాఖ్యానించిన ట్రంప్‌ సలహాదారుడు తమనేత గొప్ప రాజకీయ మేథావి అని వర్ణించాడు. విమర్శకుల నోరు మూయించటం, ట్రంప్‌ గురించి పొగడ్తలకు దిగటం సహాకులకు మామూలే. కొందరు విమర్శకులు చెబుతున్నట్లు ట్రంప్‌ మానసిక స్ధితి నిజంగానే బాగా లేదా ?

అమెరికా అధ్యక్ష భవనంలో ఎవరు కొలువుతీరారన్నది పెద్దగా ప్రాముఖ్యత కలిగిన విషయం కాదు. వ్యక్తులుగా ప్రవర్తనలో మంచిచెడ్డలు విధానాలపై ప్రభావం పెద్దగా చూపవు.పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణ్యంగా జాతీయ, అంతర్జాతీయ విధానాలు వుంటాయి. ఎవర, ఏ పార్టీ నేత పీఠంపై వున్నా దోపిడీ, ప్రపంచాధిపత్యం, యుద్ధోన్మాదం కనిపిస్తూనే వుంటుంది. అయితే ఏడు పదులు దాటిన ట్రంప్‌ ముదిమది తప్పి వ్యవహరిస్తున్నట్లుగా కొన్ని సందర్భాలలో అనిపించటం లేదా ? ఒక సందర్భంలో జర్నలిస్టులను లేపేయాలని తన మనసులోని మాటను వెల్లడించిన ట్రంప్‌ మరో సందర్భంలో నకిలీ వార్తల గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అత్యంత విస్వసనీయతలేని, అవినీతి మీడియా అవార్డులను ఈ ఏడాదికి ప్రకటించబోతున్నట్లు చెప్పాడు. అదే ట్రంప్‌ తాజాగా మీడియా అంతిమంగా తనను బలపరచకతప్పదని లేకపోతే టిఆర్‌పి రేటింగ్‌ పడిపోతుందని ఎద్దేవా చేశాడు. ఇలాంటి ప్రవర్తన చూసినపుడు మతితప్పి వ్యవహరిస్తున్నట్లే అనిపించవచ్చుగానీ వాస్తవం కాదు. అమెరికా ఇంటా బయటా ఎదుర్కొంటున్న వైఫల్యాలు, తీవ్ర సమస్యల మధ్య నాయకత్వం ఎదుర్కొంటున్న తలనొప్పులను వ్యక్తీకరించటంలో సమతూకం తప్పటం తప్పటం తప్ప మరొకటి కాదు. అది స్ధానిక మీడియా కావచ్చు వుత్తర కొరియా అధ్యక్షుడి గురించి కావచ్చు, అన్నింటా అది కనిపిస్తుంది.

అంతర్గతంగా గతేడాది కాలంలో ట్రంప్‌ సర్కార్‌ ఏ విధంగా వ్యవహరించిందో చూద్దాం. ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే ఇండియానా పోలీసు ప్రాంతంలో జరిపిన పర్యటన గురించి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసింది. అక్కడి ఒక వుక్కు కర్మాగారంలో తాను పదకొండు వందల పర్మనెంటు వుద్యోగాలను రక్షించానని చెప్పుకున్న గొప్పలను అక్కడి కార్మికనేత అంతసీన్‌ లేదని, చాలా తక్కువ అని గాలితీశాడు. నా పరువు తీస్తావా అంటూ సదరు నేతపై ట్రంప్‌ ట్విటర్‌ దాడి చేశాడు. అదే పెద్దమనిషి ఏడాది తరువాత తానొక స్ధిరమైన మేథావినని డబ్బా కొట్టుకున్నాడు. ట్రంప్‌ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన పదవీ స్వీకారం జరిగిన వెంటనే జరిపిన భారీ మహిళా ప్రదర్శన తరువాత గతేడాది కాలంలో జరిగిన ప్రదర్శనల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గంటున్నారు. మేకలకు తోడేళ్లను సంరక్షకులుగా నియమించినట్లు ఒక పెద్ద ఫాస్ట్‌ ఫుడ్‌ కంపెనీ యజమాని ఆండ్రూపుడెర్‌ను కార్మికశాఖ మంత్రిగా నియమించటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటంతో వుపసంహరించకతప్పలేదు. అనేక మంది పేదలకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఒబామా ఆరోగ్యసేవల పధకంగా పిలిచిన దానికి తూట్లు పొడిచేందుకు ట్రంప్‌ చేసిన యత్నాన్ని తాత్కాలికంగా అయినా కార్మికులు అడ్డుకోగలిగారు. ఒకవైపు కార్మికుల సంక్షేమ చర్యలను నీరు గార్చేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు రాబోయే పది సంవత్సరాల కాలంలో ధనికులు, కార్పొరేట్లకు లక్షన్నరకోట్ల డాలర్ల మేర పన్ను రాయితీలు ఇచ్చేందుకు చేసిన నిర్ణయాన్ని కార్మికులు అడ్డుకోలేకపోయారు. కార్మిక వ్యతిరేక చట్టాలకు అనుమతి, వుద్యోగ భద్రత రక్షణ, ఆరోగ్య రక్షణ వుపసంహరణ, ఆర్ధిక పరమైన రక్షణలకు మంగళం పాడే అనేక నిర్ణయాలకు అనుమతినిచ్చాడు. జాతీయ కార్మిక సంబంధాల బోర్డుతో సహా అనేక కమిటీలు, బోర్డులను కార్మిక వ్యతిరేకులతో నింపివేశారు.పర్యవసానంగా మూడు కార్మిక అనుకూల తీర్పులను తిరస్కరించారు. ట్రంప్‌ ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాలలో వున్న విబేధాలు కూడా ట్రంప్‌ కార్మిక వ్యతిరేకచర్యలను వేగవంతంగావిస్తున్నాయి.

ఒబామా సర్కార్‌ హయాంలోనే మంచివేతనాలతో కూడిన వుద్యోగాల సంఖ్య తగ్గి,వేతన మొత్తాలు తక్కువగా వుండే వుపాధి పెరుగుదల ప్రారంభమైంది. అది ట్రంప్‌ ఏడాది కాలంలో మరింతగా పెరిగింది. అందువలన నిరుద్యోగం తగ్గినట్లు కనిపించినా ఆరోగ్య సంరక్షణ, బార్లు, హోటళ్లలో పనిచేసే వారి సంఖ్య పెరిగింది. పర్యవసానంగా వేతన ఆదాయం తగ్గటంతో యూనియన్లలో చేరే కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోతోంది. దీంతో రాష్ట్రాలలలో కార్మిక వ్యతిరేక చట్టాలకు ప్రతిఘటన కూడా తగ్గిపోయింది.

అంతర్జాతీయ వ్యవహారాలలో డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి మిగతావారి కంటే భిన్నంగా కనిపించినప్పటికీ ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లు అమెరికా పాలకవర్గ మౌలిక ప్రయోజనాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీలేకుండా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే మీడియాతో వ్యవహరించేతీరులో, ట్విటర్‌ వ్యాఖ్యల విషయంలో అందరూ అనుకొంటున్నట్లుగా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగానే వుంది. అమెరికాలో పెరుగుతున్న ఆర్ధిక అంతరాలు, ఆర్ధికరంగంలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న సంక్షోభం, ఇరాక్‌, ఆఫ్ఘ్‌నిస్తాలో తగిలిన ఎదురు దెబ్బలు, చైనాతో పెరుగుతున్న వాణిజ్యలోటు, లాటిన్‌ అమెరికాలో ప్రతిఘటన వంటి అనేక కారణాలు అంతర్జాతీయ రంగంలో అమెరికాను గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తన సంక్షోభాన్ని ఎక్కడో ఒక చోట యుద్ధంద్వారానో మరో విధంగానో ఇతరులపై రుద్ధేందుకు ట్రంప్‌ యంత్రాంగం కూడా చేయని యత్నం లేదు. వుత్తర కొరియా అణు,క్షిపణి పరీక్షలను సాకుగా చూపి కాలుదువ్వటం దానిలో భాగమే. ఈ పూర్వరంగంలో ట్రంప్‌ ప్రభుత్వ వైఖరి భారత వుపఖండంలో ఎలా వుందో చూడటం అవసరం.

పాకిస్ధాన్‌ వుగ్రవాదులకు మద్దతు ఇస్తున్న కారణంగా అందచేస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ గొప్పగా చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల సృష్టిలో, మన దేశంలో పంజాబ్‌, కాశ్మీరుల్లో వుగ్రవాదులకు అవసరమైన శిక్షణ, ఆయుధాల అందచేతలో అమెరికా ప్రయోజనాలకు అనుగుణ్యంగా పాకిస్ధాన్‌ వ్యవహరించిన తీరు లోకవిదితం.ఇంతకాలం తాము చేసిన సాయాన్ని తీసుకొని తమకు అబద్దాలు చెప్పటం, మోసం చేయటం తప్ప పాకిస్ధాన్‌ మాకు చేసిందేమీ లేదని అమెరికా ఆరోపించింది. ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధంలో వైఫల్యాలకు అమెరికా తమను బలిపశువులుగా చేస్తోందని పాక్‌ రక్షణ మంత్రి ఖుర్రమ్‌ దస్తగిర్‌ ఖాన్‌ ప్రతి విమర్శ చేశాడు. ఇప్పుడు అమెరికా సాయం నిలిపివేసినందున తమకు వచ్చే నష్టమేమీ లేదని పాక్‌ తిప్పికొట్టింది. చైనా తరువాత అతి పెద్దదిగా వున్న భారత మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు అమెరికా సామ,దాన,భేద,దండోపాయాలను అనుసరించింది. వుగ్రవాదులకు సాయం, ప్రోత్సాహం దానిలో భాగమే. ఇప్పటికీ అమెరికా మనపై వత్తిడి తెస్తూనే వుంది. వాణిజ్యం విషయంలో మన దేశంలోని కార్పొరేట్‌శక్తులు అటు సోవియట్‌ను ఇటు అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నించిన అనుభవాలున్నాయి. సోవియట్‌ అంతరించిన తరువాత చైనాకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌, మన దేశాన్ని కూడా తన గుప్పెటలో వుంచుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే దానికి భిన్నంగా జరిగిన పరిణామాలలో గత పాతిక సంవత్సరాలలో ఒక్కొక్క అడుగు మన దేశం అమెరికాకు దగ్గర అవటం, అదే సమయంలో చైనాకు పాకిస్ధాన్‌ దగ్గరయింది. దీంతో పాకిస్ధాన్‌కు సాయం నిలిపివేసి మన దేశానికి ఏదో మేలు చేస్తున్నట్లు ట్రంప్‌ ఫోజు పెడుతున్నాడు. నరేంద్రమోడీని, మన దేశాన్ని పొగుడుతూ మునగ చెట్టిక్కించటంతప్ప ఇంత వరకు ఏ ఒక్క విషయంలోనూ సానుకూల వైఖరిని అనుసరించలేదు. వీసాల విషయంలో లక్షలాది మంది భారత కార్మికులు, వుద్యోగులను భయకంపితులను గావించటంలో ఇప్పటివరకు అమెరికా అధ్య క్షులలో ట్రంప్‌ తరువాతే ఎవరైనా. ప్రపంచ రాజకీయాలలో మన దేశాన్ని జూనియర్‌ భాగస్వామిగా చేసుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రపంచ వేదికమీద భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామి కావాలి…… ఆ భాగస్వామి అమెరికానే, అది నూరేళ్ల బంధం ‘ అని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిలర్సన్‌ మనల్ని ఎక్కడికో తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు. పెరుగుతున్న చైనా ప్రాభవాన్ని అడ్డుకొనేందుకు అమెరికా పెద్ద వ్యూహం పన్నింది. దానిలో మన దేశాన్ని నిలిపేందుకు పూనుకుంది. వాణిజ్యం విషయంలో మనపై అమెరికా తెస్తున్న వత్తిడిని దేశీయ కార్పొరేట్‌ శక్తులు ప్రతిఘటిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్ధలతో చేతులు కలిపి తాము కూడా లాభాలను పంచుకోవాలనుకుంటున్నాయి తప్ప తమ లాభాలను ఫణంగా పెట్టి అంతర్జాతీయ సంస్ధలకు లొంగిపోవాలని అవి కోరుకోవటం లేదు. అందువలన మన దేశం తనకు లొంగకపోతే మరోసారి పాకిస్ధాన్‌ను దగ్గరకు తీసుకొని మనపై దానిని ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. పాకిస్ధాన్‌కు తాత్కాలికంగా సాయం నిలిపివేత ప్రచార ఆర్బాటం మనకు ఎర తప్ప చిత్తశుద్ధితో కాదు. పాక్‌తో పూర్తి సంబంధాలు తెగతెంపులు చేసుకొంటే అమెరికన్లకు ఎంత నష్టమో తెలియంది కాదు. అందువలన ట్రంప్‌ మెచ్చుకోళ్లకు మురిసిపోతే మనం వూబిలో దిగినట్లే. తనకు మాలిన ధర్మానికి పాల్పడినట్లు అమెరికా చరిత్రలో ఒక్కటంటే ఒక్క వుదంతం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ గూండాయిజం-అమెరికాను విస్మరించిన ఆసియన్‌ నాయకత్వం !

14 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

asean summit, Donald trump, Donald trump asia tour, donald trump's act of political vandalism, US leadership

ఎం. కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు ఆసియాను అవమానించారా? అవును, పన్నెండు మంది దేశాధినేతలు హాజరైన తూర్పు ఆసియా సభ ప్రారంభం కావటం రెండు గంటల పాటు ఆలస్యమైందంటూ చిందులు వేస్తూ సభను బహిష్కరించి విమానమెక్కి స్వదేశానికి చెక్కేయటం, వాషింగ్టన్‌ వెళ్లిన తరువాత తాను ఒక ప్రకటన చేస్తానని చెప్పటం అవమానం గాక మరేమిటి? ఆసియా పర్యటన చేస్తూ తూర్పు ఆసియా సభలో పాల్గనకపోతే ఆసియా పట్ల అమెరికన్లకు ఆసక్తి లేదనే విమర్శలు వస్తాయనే కారణంతో ఈకార్యక్రమాన్ని కూడా చివరిలో పర్యటనలో చేర్చారు.చివరికి ఆలస్యం సాకు చూపి సభను బహిష్కరించారు.నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందుగానే ట్రంప్‌ విమానం ఫిలిప్పైన్స్‌నుంచి బయలుదేరింది.

విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ మధ్యాహ్నభోజన సమయంలో చివరిగా తాను చెప్పదలచుకున్న అభిప్రాయాలను చెప్పేశానని, తన బదులు విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాల్గంటారని తెలిపారు.మనం పడ్డ కష్టానికి మంచి ఫలితాలే రానున్నాయని, 300బిలియన్‌ డాలర్ల మేరకు పరికరాలు, ఇతరాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని, త్వరలో లక్షకోట్ల డాలర్లకు పెరుగుతాయని చెప్పారు. తూర్పు ఆసియా సమ్మేళనంలో పాల్గనకపోవటం ట్రంప్‌ రాజకీయ గూండాయిజంగా మారుతుందని ప్రొఫెసర్‌ కార్ల్‌ థయర్‌ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అధికారం తగ్గిపోవటానికి,ఆసియన్‌ నేతలు ఆ స్ధానాన్ని భర్తీ చేయటానికి ఈ పర్యటన కీలకమైనదిగా చరిత్రకారులు ఈతేదీని నమోదు చేస్తారని మరో ప్రొఫెసర్‌ అనెలైస్‌ రైల్స్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ అధికారంలోకి రాగానే చేపట్టిన తొలి చర్యలలో భాగంగా పసిఫిక్‌ ఇరుసులో వున్న దేశాలతో వాణిజ్య ఒప్పందాన్ని వదలివేశారని, అమెరికా ప్రమేయం లేకుండా శనివారం నాడు ఆసియన్‌ నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె చెప్పారు. పెద్ద ఒప్పందాలు మన చేతులను కట్టివేస్తాయని, ఏ దేశానికి ఆదేశంతో ఒప్పందాలు చేసుకోవటంపై తాను కేంద్రీకరిస్తానని అదేరోజు ట్రంప్‌ ప్రకటించారు. ఫసిపిక్‌ భాగస్వామ్య దేశాల ఒప్పందాన్ని వమ్ము చేసే ట్రంప్‌ యంత్రాంగ యత్నాలను ఆసియన్‌ నాయకులు పట్టించుకోలేదని, తాము స్వంతంగా ముందుకు పోవాలని నిర్ణయించారని, ట్రంప్‌కు ఘనస్వాగతం చెప్పినప్పటికీ ఆయన అజెండాను మొత్తంగా పట్టించుకోలేదని రైల్స్‌ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడేమిటి? ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని అనేక మంది ముక్కుమీద వేలేసుకున్నారు. గత అధ్యక్షులందరినీ అధిగమించి డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నెండు రోజుల గత రికార్డును బద్దలు కొట్టి 13రోజులతో కొత్త ఆసియా పర్యటన రికార్డును స్ధాపించాడు. నవంబరు ఐదున జపాన్‌తో మొదలై 14వ తేదీన ఫిలిప్పీన్స్‌లో ముగిసింది. మధ్యలో చైనా, దక్షిణ కొరియా, వియత్నాం పర్యటించారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లు అమెరికా అధ్యక్షులు మన ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాదిరి ఏదో ఒక సాకుతో విదేశీ పర్యటనలు చేయరు. రాజకీయ, ఆర్ధిక, మిలిటరీ వంటి అనేక అంశాలుంటాయి. అయితే ఈ పర్యటనలో సాధించినదాని కంటే పొగొట్టుకున్న పరువే ఎక్కువగా వుందని చెప్పవచ్చు.

ఆతిధ్యం ఇచ్చేవారు పెట్టింది తిని, మర్యాదలను స్వీకరించటం సంస్కారం. కొంత మంది మా పిల్లలు అది తినరు తినరు అనిముందే చెప్పి ఇబ్బంది పెడతారు. అలవాటైన ఆహారం తప్ప కొత్తదానిని రుచిచూసేందుకు ఇచ్చగించని తరహా మనిషి ట్రంప్‌. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం జపాన్‌ వచ్చిన ట్రంప్‌ అక్కడ వడ్డించిన చేపను చూసి అది వద్దంటూ బర్గర్‌ కావాలని మరీ మారాం చేసి తెప్పించుకుతిన్నాడంటూ ఈ సందర్భంగా వార్తలు వచ్చాయంటేనేే ట్రంప్‌కు పెద్ద అవమానం. ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఆయా దేశాల వారు వడ్డించిందా లేక మరేం తింటారు అంటూ ఐరోపా, జపాన్‌ మీడియాలో కథనాలు రాశాయి. మా వృద్ధ ట్రంప్‌ బర్గర్‌ తప్ప మరొకటి తినడు అని అధికారులుప్పందించారేమో జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన ప్రారంభంలోనే వారి సాంప్రదాయ వంటకాల బదులు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న బీఫ్‌తో తయారు చేసిన బర్గర్‌నే మధ్యాహ్న విందుగా వడ్డించే ఏర్పాటు చేయాల్సి వచ్చిందట.

ట్రంప్‌ అభిరుచులు, అలవాట్లు వ్యక్తిగతం. గొడ్డు, పంది మాంసంతో తయారు చేసే హాంబర్గర్‌లు ఎన్ని తిన్నా ప్రపంచానికేమీ ఇబ్బంది లేదు. ఆ పెద్దమనిషి పర్యటనలో ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ వారు పెట్టింది తినకపోవటం, దక్షిణ కొరియాలో పెట్టింది తినటం రెండూ వివాదాస్పదం కావటం విశేషం. జపాన్‌-దక్షిణ కొరియాల మధ్య వివాదాస్పదంగా వున్న దీవుల జలాల నుంచి తెప్పించిన రొయ్యలతో సహా దక్షిణ కొరియా వంటకాలు వడ్డించటం, వాటిని లట్టలు వేసుకుంటూ ట్రంప్‌ తినటం అంటే ఆ దీవులపై దక్షిణ కొరియా హక్కును అమెరికా గుర్తించినట్లే, ఇది జపాన్‌ వ్యతిరేకమైనది అని జపాన్‌ మీడియా వ్యాఖ్యానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కొరియాను ఆక్రమించిన జపాన్‌ తన సైనికుల కోసం దక్షిణ కొరియా యువతులను చెరపట్టి అప్పగించారు. అలాంటి వారిలో ఒకరైన 88 సంవత్సరాల లీ యాంగ్‌ సూ ట్రంప్‌ విందు ఆహ్వానితుల జాబితాలో ఒకరుగా ప్రకటించటం తమను నేరగాళ్లుగా పరిగణించటమే అని జపనీస్‌ ప్రభుత్వం భావించింది. దౌత్య పద్దతులలో అమెరికాకు ఆ మేరకు నిరసన తెలిపినట్లు, వుత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా పని చేస్తున్న తరుణంలో ఇలాంటి పనులు తగవని పేర్కొన్నట్లు వెల్లడైంది. మీరు మా ఇంటికొచ్చినా, మేం మీ ఇంటికొచ్చినా మాకు కావాల్సిందే తేవాలి, పెట్టాలి అనే అమెరికా సామ్రాజ్యవాదంతోనే అసలు సమస్య. అందువలన ట్రంప్‌కు ఏం పెట్టారు, ఏ తిన్నారు అనేది కూడా రాజకీయాలు, ఆర్ధికాంశాలతో ముడి పడి వుంటాన్నాయన్నది గమనించాల్సి వుంది.

డెమోక్రటిక్‌ పార్టీ అధినేత బరాక్‌ ఒబామా హయాంలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం ట్రంప్‌, తరువాత ఎందరు అధ్యక్షులు వచ్చిం తరువాత పరిష్కారం అవుతుందో వారికే తెలియని స్ధితి.రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం మాదిరి ప్రపంచ మార్కెట్‌ను చాపచుట్టినట్లుగా తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పరిస్ధితి పీకసన్నం-బానకడుపులా వుంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా వుంటాయో జోస్యం చెప్పలేము గాని, గతం మాదిరి ఏకఛత్రాధిపత్యం వహించటం సాధ్యం కాని పరిస్థితి నేడు నెలకొంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర మాత్రం కాదన్నట్లు సామ్రాజ్యవాదులు మొత్తంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు, దేశాలకు వ్యతిరేకత విషయంలో ఐక్యంగా వుంటున్నారు, ప్రపంచ మార్కెట్‌ను పంచుకోవటంలో విబేధాలను దాచుకోవటం లేదు.

ఐదు ఆసియా దేశాల పర్యటనలో తొలి పాదం మోపిన జపాన్‌లో ప్రధాని షింజో అబేతో గోల్ఫ్‌ ఆడటానికి వెళ్లబోయే ముందు యోకోటా వైమానికస్ధావరంలో అమెరికన్‌ సైనికులతో మాట్లాడారు. పరోక్షంగా వుత్తర కొరియాను వుద్దేశించి మాట్లాడుతూ అమెరికా సంకల్పాన్ని ఎవ్వరూ, ఏ నియంత, ఏ ప్రభుత్వమైనా తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరికలు జారీ చేశాడు. గతంలో తమను తక్కువ అంచనా వేసిన ఎవరికీ అది సంతోషకరంగా లేదు, మేము లంగలేదు, ఎలాంటి సడలింపులు లేవు అన్నాడు. తరువాత దక్షిణ కొరియా పార్లమెంట్‌ సభ్యుల నుద్ధేశించి మాట్లాడుతూ ట్రంప్‌ ఇదే మాదిరి హెచ్చరికలు జారీ చేయటమే కాదు, అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి తయారీ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే మిలిటరీ చర్య తీసుకుంటామని సోషలిస్టు కొరియాపై బెదిరింపులకు దిగాడు.

రాజధాని టోకియోలో వుభయ దేశాల వాణిజ్యవేత్తల సమావేశంలో మాట్లాడుతూ జపాన్‌ అక్రమ వ్యాపార పద్దతులను అనుసరిస్తోందని ట్రంప్‌ విమర్శలు గుప్పించాడు.’ గత కొన్ని దశాబ్దాలుగా జపాన్‌ విజయం సాధిస్తోందని మీరు తెలుసుకోవాలి, ప్రస్తుతం జపాన్‌తో మా వ్యాపారం న్యాయబద్దంగా లేదు, మాకు మార్కెట్‌ను తెరవలేదు. మీరు ఇక్కడి నుంచి కార్లను షిప్పుల్లో రవాణా చేయటం కాదు, అమెరికాలో తయారు చేసేందుకు ప్రయత్నించండి, అలా అడగటం మొరటుగా వుందా’ అని ప్రశ్నించాడు. చైనా తరువాత అమెరికన్ల వాణిజ్యలోటు కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతుల కారణంగా జపాన్‌తోనే ఎక్కువగా వుంది. రాజకీయంగా అమెరికాతో వున్న బంధం కారణంగా జపాన్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. నిజానికి రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య విబేధాలు కొత్తవి కాదు. అమెరికాలో అమ్ముడౌతున్న జపాన్‌ బ్రాండ్‌ కార్లలలో 75శాతం అమెరికాలోనే తయారు చేస్తున్నామని కార్ల తయారీ వాణిజ్య సంస్ధల అసోసియేషన్‌ తెలిపింది. పసిఫిక్‌ సముద్ర ప్రాంత దేశాల స్వేచ్చా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్‌ నిర్ణయించారు, కొనసాగాలని జపాన్‌ కోరుతోంది. రెండు దేశాల మధ్య పన్నుల విషయంలో విబేధాలు ఎడతెగటం లేదు. అమెరికన్‌ కార్ల అమ్మకాలపై జపాన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని, ఘనీభవింపచేసిన గొడ్డు మాంసం, వ్యవసాయ వుత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

గతేడాది అమెరికా ఎన్నికల ప్రచారంలో చైనా శత్రువు అని చెప్పిన ట్రంప్‌ చైనా పర్యటనలో పొగడ్తలు కురిపించాడు. గ్రేట్‌ హాల్‌లో మాట్లాడుతూ రెండు పెద్ద దేశాల మధ్య పెద్ద వాణిజ్యంలో తమకు న్యాయం జరగలేదని అయితే దానికిి చైనా తప్పేమీ లేదని, తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పర్యటన సందర్భంగా 25వేల కోట్ల డాలర్ల మేరకు ఆర్ధికలావాదేవీలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ట్రంప్‌ పర్యటన లేకపోయినా రెండు దేశాల మధ్య అది జరిగి వుండేదని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

చైనాతో వాణిజ్యం గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసియా పర్యటనలో ఇంతవరకు చేసిన పెద్ద తప్పిదం, సిగ్గు చేటు, అమెరికా, ఆ ప్రాంత కార్మికులకు ఇది భయంకర వర్తమానం, డెమోక్రాట్లకు ఇది మాంస విందు అవుతుంది అని అమెరికాలోని చైనా అధ్యయనాల సంస్ధ నిపుణుడు ఎలీ రాట్నర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో వాణిజ్యలోటుకు తమ గతపాలకులదే బాధ్యత అని చైనాలో చెప్పిన ట్రంప్‌ తరువాత అపెక్‌ సమావేశంలో నాలుకను మరోవైపు తిప్పాడు.చైనా పేరు ప్రస్తావించకుండా ఈ ప్రాంత దేశాలు అనుచిత వ్యాపార పద్దతులు అనుసరిస్తున్నాయని, ఇక ముందు తమతో అలా కుదరదు అన్నాడు. దుర్విధి అనే నరకంలో పడకుండా తప్పించేందుకు అమెరికన్లు మతి తప్పిన ముసలి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని తమపై చేసిన వ్యాఖ్యలపై వుత్తర కొరియా వ్యాఖ్యానించింది. ఈ పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు నిజంగానే దాన్ని నిర్ధారిస్తున్నాయి. వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ కొవ్వుబలిసిన పొట్టోడంటూ అవమానకరవ్యాఖ్యలు చేసిన నోటితోనే కొద్ది గంటల తరువాత భవిష్యత్‌లో ఇరువురం స్నేహితులుగా వుండవచ్చు అన్నాడు. వియత్నాంలో మానవహక్కులకు భంగం కలిగిస్తున్నారని దుమ్మెత్తి పోసిన ట్రంప్‌ తాజా పర్యటనలో ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో వియత్నాం ఒకటి అని పేర్కొన్నాడు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకోలేదని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను అని గతంలో చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు మాట మార్చాడు. రిపబ్లికన్‌ పార్టీకి(ట్రంప్‌కు) అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారని సిఐఏ నివేదించిన విషయం తెలిసిందే. అమెరికా గూఢచార, దర్యాప్తు సంస్ధల నివేదికలను నేను విశ్వసిస్తానా లేదా అన్నది సమస్యకాదు, వాటికినేను కట్టుబడి వున్నాను, ప్రత్యేకించి ప్రస్తుతం పని చేస్తున్న సంస్ధలు మంచివారిని కలిగి వున్నాయి అని చెప్పాడు. ట్రంప్‌ పర్యటన అన్నింటిలో అమెరికాకు ప్రధమ స్ధానం అన్నలక్ష్యంతో సాగిందా లేక ఆ స్ధానంలో చైనాను ప్రవేశ పెట్టేందుకు వచ్చారా అన్నది అర్ధం కావటం లేదన్న వ్యాఖ్య కూడా వెలువడింది.ఆసియా పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అనేక మంది పరిశీలకులు తలలు పట్టుకుంటున్నారు.అనేక మందికి ఆశించిన కిక్కు రాలేదు. తన తీరుతెన్నులను తప్పుపడితే ట్రంప్‌కు కోపం, పొగిడితే జనాల్లో పలుచన. కార్పొరేట్‌ మీడియాకు ఇరకాటమే మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d