Tags
# Anti Muslims, #Hindutva, Anti communist, BJP, CPI()M, durga puja, leftists Book stalls, RSS, Taslima Nasrin
ఎం కోటేశ్వరరావు
దసరా సందర్భంగా దుర్గా మండపాల సమీపంలో పుస్తకాల దుకాణాలు ఏర్పాటు చేసిన సిపిఐ(ఎం) ఇతర వామపక్ష, పురోగామి శక్తులపై కాషాయ మÖకలు దాడి చేసి పుస్తకాలను చిందరవందర చేశారు, కొన్ని చోట్ల తగులబెట్టారు. ముస్లింల ఈద్, క్రైస్తవుల క్రిస్మస్ సందర్భంగా వామపక్షాలు దుకాణాలను ఏర్పాటు చేసి మతాన్ని విమర్శించే సాహిత్యాన్ని విక్రయిస్తాయా అని కాషాయ దళం ప్రశ్నించింది. సరిగ్గా ఇవే మాటలు బంగ్లాదేశ్ వివాదాస్పదÁ రచయిత్రి తస్లీమా నస్రీన్ నోటివెంట వెలువడ్డాయి.నిజానిజాలు తెలుసుకోకుండా సంఘపరివార్ శక్తులు ఇతరుల మీద బురద చల్లటమే ఒక కార్యక్రమంగా పెట్టుకుంటాయనే విమర్శ ఉన్న సంగతి తెలిసిందే.తస్లీమా రచయిత్రి, ఒకటికి రెండుసార్లు నిర్దారణ చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అందరూ అనుకుంటారు. కానీ ఆమె బిజెపి రాసి ఇచ్చిన స్క్రిప్టునే చదివారు. ఆమె అవాస్తవాలు చెప్పారంటూ ఆల్ట్ న్యూస్ నిజానిజాలను తనిఖీ చేసి తన పరిశీలన అంశాలను వెల్లడించింది. “ క్రిస్మస్ మరియు ఈద్ సందర్భంగా వామపక్షాలు బెంగాల్లో పుస్తకదుకాణాలు ఏర్పాటు చేస్తాయా ? అవును, వారు చేశారు ” అంటూ ఆల్ట్ న్యూస్ 2026 అక్టోబరు 24వ తేదీన తన విశ్లేషణకు శీర్షిక పెట్టింది. తస్లీమా నస్రీన్ అక్టోబరు 20వ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో వామపక్షాల గురించి రాశారు.కేవలం హిందువుల పండుగ దుర్గాపూజ సందర్భంగా వామపక్షాలు పుస్తకదుకాణాలను ఏర్పాటు చేశాయని, అదే మాదిరి ఇతర మతాల పండుగలైన క్రిస్మస్, ఈద్ సందర్భంగా అలాంటి దుకాణాలు ఎక్కడా కనపడవని, వామపక్షాలు ఎందుకు ఆపని చేయవని ఆమె ప్రశ్నించారు.
తన ఫేస్బుక్లో ఆమె ఇలా రాశారు “ మీరు ఎప్పుడైనా వామపక్షవాదులు నాస్తికవాదం మీద ఉన్న పుస్తకాలను ఈద్ సందర్భంగా ఒక ఈద్గా సమీపంలో అమ్మటాన్ని చూశారా ? క్రిస్మస్ రోజున ప్రార్ధనలకు వచ్చే వారికి రిచర్డ్ డాకిన్స్ లేదా క్రిస్టోఫర్ హిచెన్స్ పుస్తకాలను అమ్మటం మీరు ఎప్పుడైనా చూశారా అని కొందరు అడిగారు. దీంతో తరువాత సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది.హిందూ దుర్గాపూజా మండపాల దగ్గర మాత్రమే ప్రత్యేకించి నాస్తికవాదంపై ఉన్న పుస్తకాలను ఎందుకు విక్రయించాలనుకుంటున్నారు ? ఈ ప్రశ్నకు కొల్‌కతాలోని వామపక్షవాదుల దగ్గర సమాధానం ఏముంది ?” అని ప్రశ్నించారు. చిత్రం ఏమిటంటే ఆమెకు సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా తన ఖాతాలో వ్యాఖ్యల సెక్షన్ పనిచేయకుండా చేశారు. గమనించాల్సిన అంశం ఏమంటే వినాయకచవితి, విజయదశమి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు మండపాలను ఏర్పాటు చేసినట్లుగా ఈద్ లేదా క్రిస్మస్ పండగల సందర్భంలో అలాంటివేమీ ఉండవు. ప్రార్ధనలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఒక పుస్తకదుకాణం ఏర్పాటు చేయాలంటే అందుకు అయ్యే ఖర్చు అయినా అమ్మకాల మీద రావాలి గనుక, ఒకటి రెండు రోజుల్లో అలాంటి అవకాశం ఉండదు, అందుకనే ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయటం లేదన్నది గమనించాలి.ఈ విషయాలు తెలిసి కూడా తస్లీమా నస్రీన్ అలాంటి వ్యాఖ్యలు చేయటం వామపక్షాలపై దాడికి ఏదో ఒకసాకును ఎంచుకోవటం తప్ప మరొకటి కాదు.
ప్రస్తుతం 64 సంవత్సరాల వయస్సులో ఉన్న బంగ్లా జాతీయురాలు తస్లీమా తన రచనలు, ఆత్మకథలో రాసిన వివాదాస్పద అంశాల కారణంగా ముస్లిం ఛాందసవాదులు బంగ్లాదేశ్‌లో నిరసనలు తెలపటమేగాక చంపుతామని బెదిరించటంతో 1994లో దేశం వదలి వెళ్లారు.అక్కడి నుంచి స్వీడన్,జర్మనీ,ఫ్రాన్స్, అమెరికాలలో ఉన్నారు. పదేండ్ల తరువాత భారత్ వచ్చారు. ఇక్కడ కూడా ముస్లిం మత ఛాందసులు ఆమెకు వ్యతిరేకంగా ఫత్వాజారీ చేశారు. చంపుతామని బెదిరించారు.దానిలో భాగంగా ఆమె రచన లజ్జ తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించేందుకు 2007లో హైదరాబాదు వచ్చినపుడు మజ్లిస్ గూండాలు ఆమె మీద దాడి చేశారు. శాంతి భద్రతల సమస్య కారణంగా కొల్కతా వదలి వెళ్లాలని తరువాత వామపక్ష ప్రభుత్వం ఆదేశించింది, తరువాత అధికారానికి వచ్చిన తృణమÖల్ కాంగ్రెస్ కూడా అనుమతించలేదు. 2008లో ఆమె స్వీడన్ వెళ్లారు. తిరిగి 2015లో భారత్ వచ్చారు. అదే ఏడాది అమెరికా వెళ్లారు. ఆల్‌ఖైదాతో సంబంధం ఉన్న తీవ్రవాదులు బెదిరించటంతో శాశ్వతంగా తమదేశంలో ఉండటం కుదరని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.తరువాత మనదేశం కూడా ఏడాదికి ఒకసారి వీసా పొడిగింపు ప్రాతిపదికన ఉండేందుకు అనుమతించింది తప్ప శాశ్వత నివాసానికి మోడీ సర్కార్ అంగీకరించలేదు. జైపూర్ లేదా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆమె ఉంటున్నారు. బెంగాల్లో బిజెపి అధికారానికి రావటంతో ఆ పార్టీ నేతలు తమ అజెండాలో భాగంగా ఆమెకు స్వాగతం పలికారు. దాంతో మరోసారి ఆమె వార్తలకు ఎక్కారు.లజ్జ నవలలో బంగ్లాదేశ్ మైనారిటీల(హిందువులు)పై జరుగుతున్న అత్యాచారాల గురించి రాసింది గనుక బిజెపికి ఆమె మీద ప్రేమపుట్టుకువచ్చింది. అదే సమయంలో ఇస్లాంలోని ఛాందసత్వాన్ని విమర్శించటం కూడా అదనం. చిత్రం ఏమిటంటే ఆదే బిజెపి మనదేశంలో హిందూమత ఛాందసం, ఉన్మాదం గురించి ఎవరైనా రాస్తే వారి మీద దాడులకు పురికొల్పుతుంది తప్ప తస్లీమా మాదిరి భుజాల మీదకు ఎక్కించుకోదు.
పందొమ్మిది సంవత్సరాలు కొల్‌కతాకు వచ్చేందుకు ఆమెకు వీలు కాలేదు.ఈ ఏడాది జూలైలో నగరానికి వచ్చిన ఆమెకు బిజెపి, ఆరఎసఎస్ సంబరాలతో స్వాగతం పలికాయి. నూతన బెంగాల్లో అడుగుపెట్టినట్లుగా బిజెపి వర్ణించింది.తనను ఆ సంస్థల మద్దతుదారుగా వామపక్షాలు వర్ణించటాన్ని ఆమె తప్పుపట్టారు. పురోగామి భావజాలం కలిగిన ముస్లిం వ్యక్తి ఆధ్వర్యంలోని “ సెక్యులర్£ మిషన్ (లౌకిక కర్య్తవ్యం)” అనే సంస్థ’ ఆహ్వానించిందని, భద్రత కల్పించే ఒక చిన్న పాత్రమాత్రమే బెంగాల్ ప్రభుత్వానిదని చెప్పుకున్నారు. ఉస్మాన్ గనీ మాలిక్ అనే సదరు లాయర్ లౌకిక బండారం ఏమిటంటే హిందూత్వ శక్తిగా చెప్పుకొనేందుకు గర్వపడుతున్న బిజెపిలో చేరాడు. ఇటీవల ఉమ్మడి పౌరస్మృతి బిల్లును రూపొందించేందుకు బెంగాల్ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీలో సభ్యుడు. తనను వామపక్షాలు రాష్ట్రం నుంచి గెంటివేశాయని, ఇప్పుడు అడుగుపెట్టగానే బిజెపి మద్దతుదారుగా వర్ణిస్తున్నాయని తస్లీమా ఆరోపించారు. తృణమÖల్ కాంగ్రెస్ ప్రభుత్వం తన రచన ఆధారంగా రూపొందించిన ఒక టీవీ సీరియల్‌ను ప్రసారం చేయకుండా అడ్డుకుందని, పుస్తకావిష్కరణ సభను అనుమతించలేదన్నారు.వామపక్షాలు ముస్లిం ఛాందసవాదులను సంతుష్టీకరించేందుకు చూస్తున్నాయని, భావ ప్రకటనా స్వేచ్చ, ముస్లిం సమాజంలో సంస్కరణల గురించి వారు మౌనం పాటిస్తున్నారని, పురోగామివాద ముసుగువేసుకొని జీహాదీల భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు.తాను ఒక మానవత, లౌకికవాదినని తస్లీమా చెప్పుకుంటారు. అయితే బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి రాసిన ఆమె 2002లో నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గుజరాత్లో ముస్లింలపై దారుణ మారణకాండ, అత్యాచారాలకు పాల్పడిన హిందూత్వ మÖకల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నోటికి తాళం వేసుకున్నారు, దీనికి తోడు వామపక్షాలపై రాజకీయదాడి, దాని అర్ధం ఏమిటి ? అందుకే బిజెపి వారికి ఆమె అంటే అంత అభిమానం !
ఇక వామపక్షాల పుస్తకాల దుకాణాల్లో హిందువుల పండగల సందర్భంగా మాత్రమే నాస్తికవాద పుస్తకాలను విక్రయిస్తారని చేసిన ఆరోపణ వాస్తవం కాదని ఆల్ట్ న్యూస్ నిజానిజాలను పరిశీలించి చెప్పింది. క్రిస్మస్ను జరుపుకొనే పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా ఎసఎఫఐ, డివైఎఫఐ పుస్తకదుకాణాన్ని నిర్వహిస్తున్నాయని, సిపిఐ(ఎం) నేత బిమన్ బసు కూడా ఆ దుకాణాన్ని సందర్శించినట్లు పేర్కొన్నది. ఈ వార్తలు సామాజిక మాధ్యమంలో, మీడియాలో కూడా దర్శనమిచ్చాయని చెప్పింది.తొలిసారిగా అక్కడ 2016లో పుస్తకదుకాణాన్ని ఏర్పాటు చేసినట్లు టెలిగ్రాఫ్ పత్రిక వార్తను ఉటంకించింది.దుకణానికి సంబంధించిన చిత్రాలను కూడా ప్రచురించింది. ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా రెండు రోజుల పాటు గణనీయంగా ముస్లింలు ఉండే కిడ్డర్పూర్ ప్రాంతంలో ఎసఎఫఐ, డివైఎఫఐ స్థానిక కమిటీలు పుస్తకదుకాణాన్ని ఏర్పాటు చేశాయి.దాని గురించి కొలకతా పోర్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ(ఎం) కమిటీ ఫేస్బుక్ పేజీలో రాసినట్లు తెలిపింది.హిందువుల పండగ సందర్భంగా కేవలం నాస్తికవాద పుస్తకాలనే వామపక్షాలు అమ్ముతాయని తస్లీమా చేసిన ఆరోపణ వాస్తవం కాదని అన్ని రకాల గ్రంధాలను విక్రయిస్తున్నట్లు ,తమ విలేకరి జాదవ్‌పూర్ 8బి బస్టాండ్ సమీపంలో సిపిఐ(ఎం) పుస్తకదుకాణాన్ని సందర్శించినపుడు అక్కడ రామకృష్ణ పరమహంస, వివేకానందుడి రచనలు కూడా అందుబాటులో ఉన్నట్లు , కొనుగోలు చేసినట్లు ఆల్ట్‌న్యూస్ తెలిపింది.
శత్రుప్ ఘోష్ అనే సిపిఐ(ఎం)నేత చిత్రీకరించిన ఒక వీడియోలో మాట్లాడిన ఒక మహిళ తాను ఆధ్యాత్మికవేత్త లాలన్ ఫకీర్ భక్తురాలినని, తాను కొనుగోలు చేసిన పుస్తకాల్లో వంటలకు సంబంధించినదానితో సహా లాలన్ ఫకీర్, మరో ఆధ్యాత్మికవేత్త నిత్యానంద ప్రభు మీద రాసిన పుస్తకాలు కూడా ఉన్నట్లు వీక్షకులకు చూపారు. ఆ దుకాణ బాధ్యుడైన సిపిఐ(ఎం) నేత సుదీప్ గుప్తా దుకాణం గురించి నిత్యం ఫేస్బుక్లో ఫొటోలు పెడుతుంటారని, అక్కడ పుస్తకాలు కొనుగోలు చేసిన వారిలో ఒకరైన డాక్టర్ అర్జున్‌దాస్ గుప్తా చేతిలో వివేకానందుడి గ్రంధంతో పాటు రెండవ ప్రపంచయుద్ధానికి చెందిన పుస్తకం కూడా ఉందని పేర్కొన్నది. ఆయన మాట్లాడుతూ “ ఈ దుకాణంలో వందేమాతరం గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ నవల ఆనందమఠం, ఇతర పుస్తకాలు ఉన్నాయి, అందువలన కేవలం నాస్తికవాద పుస్తకాలు మాత్రమే విక్రయిస్తారనటం వాస్తవం కాదు. ఈ దుకాణాలు బెంగాలీ సంస్కృతిలో భాగం, పుస్తకాలు కొనుగోలు చేయటాన్ని ఇష్టపడేవారు ఎవరైనా ఇలాంటి దుకాణాలను మÖసివేయించే వారి ప్రయత్నాలను వ్యతిరేకించాలి. బెంగాలీలమైన మేము అది ఇస్కాన్ లేదా సిపిఐ(ఎం) దుకాణంలో అయినా పుస్తకాన్ని పుస్తకంగానే చూస్తాము. మేము పుస్తకాలను ప్రేమిస్తాము, అందువలన అన్ని దుకాణాలూ తిరుగుతాము. బాల్యంలో ఉన్నపుడు ప్రపంచమంతటి నుంచి ఉన్న అనేక పుస్తకాలను ఈదుకాణాలు మాకు పరిచయం చేశాయి. నా తండ్రి ఇస్పత్, ఉక్కును ఎలా తయారు చేస్తారు అనే నికోలాయ్ ఓస్త్రోవస్కీ బెంగాలీ అనువాదాన్ని నాకు కొనిపెట్టారు.నాలాంటి వేలాది మందికి ఇలాంటి జ్ఞాపకాలే ఉంటాయి ” అని చెప్పారు. కాళీఘాట్ దేవాలయం సమీపంలో సిపిఐ(ఎం) ఏర్పాటు చేసిన దుకాణంలో రవీంద్రుడి రచనలు, బంకించంద్ర ఛటర్జీ రచన కపాలకుండల,శరత్ రచనలు దేవదాస్, గృహదహ, మా శారదపై రాసిన పుస్తకాలు తదితరాలు ఉన్నట్లు ఆల్ట్ న్యూస్ తెలిపింది.
