Tags
IMF, IMF Anti People, IMF austerity is back, IMF chief Kristalina Georgieva, Narendra Modi Failures, World Bank
ఎం కోటేశ్వరరావు
పెద్ద మొత్తంలో అప్పులపాలైన దేశాలు సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని, రిజర్వుబాంకులు కఠిన వైఖరులు తీసుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)అధిపతి క్రిస్టాలినా జార్జియేవా కోరారు. థాయ్‌లాండ్ రాజధాని బాంకాక్లో అక్టోబరు 1218 తేదీలలో జరగనున్న ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా గత బుధవారం నాడు సింగపూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా దాడితో ఇంథన షాక్ ఎలా తగిలిందో అదే మాదిరి పొదుపు చర్యలు ఉండాలన్న సంకేతాన్ని ఆమె ఇచ్చారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాల రుణాల పెరుగుదల, కృత్రిమ మేథ(ఏఐ)పై భారీ పెట్టుబడుల కారణంగా వేగంగా ఆభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు అప్పులను అదుపులో ఉంచుకోవాలని “ ఖర్చు క్రమశిక్షణ ” పాటించాలని క్రిస్టాలినా చెప్పారు. ద్రవ్య సమస్యలను పరిష్కరించేందుకు కేవలం అధిక వృద్ధిరేటు మీదనే ఇంకేమాత్రం ఆధారపడటం తగదని ఆమె హెచ్చరించారు.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల రుణం జిడిపి 2030లోగా వందశాతానికి చేరే అవకాశం ఉంది. ఇరాన్‌పై దాడులతో ఇంథన సరఫరా షాక్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంవైపు నడుస్తుంటే కృత్రిమ మేథపై పెట్టుబడులు సానుకూలంవైపు లాగుతున్నాయని ఆమె చెప్పారు. గల్ఫ్‌లో త్వరలో యుద్దం ముగిసినా పెరిగిన ఇంథన ధరల సమస్య తరువాత మరికొంత కాలం కానసాగుతుందన్నారు. మనం ద్వేషించవచ్చు, ప్రేమించవచ్చు లేదా భయపడినప్పటికీ కృత్రిమ మేధ అత్యంత వేగంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తిగా ఉంది. దాన్ని సక్రమంగా వినియోగిస్తే ప్రపంచ వృద్ధి రేటు ఏడాదికి అరశాతం పెరుగుదల ఉంటుందని ఐఎంఎఫ్ చెబుతున్నది.అయితే దీనికి చేసే ఖర్చు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని క్రిస్టాలినా చెప్పారు. ఏఐతో ఉపాధి నష్టం, సైబర్‌దాడుల ముప్పు ఉందని, మానవుల అదుపు కోల్పోయి విధ్వంసానికి పాల్పడవచ్చని కూడా హెచ్చరించారు.
పొదుపు పేరుతో సంక్షేమ చర్యలకు కోత పెట్టాలంటున్న ఐఎంఎఫ్ నిరంతరం అదే చేస్తున్నది.ఆక్స్‌ఫామ్ సంస్థ 201925 సంవత్సరాల మధ్య 54దేశాలలో ఐఎంఎఫ్ కార్యక్రమాలను సమీక్షించింది. వాటిలో 25దేశాల్లో సంక్షేమ చర్యలకు చేసే ఖర్చును జిడిపిలో రెండుశాతానికిపైగా కోతపెట్టాలని ఐఎంఎఫ్ ఆదేశించింది. అంతకు ముందు 201217 సంవత్సరాల్లో కేవలం మÖడో వంతు దేశాల్లో మాత్రమే ఇలాంటి కోతలు అమలు జరిగాయి. దీన్ని మరింత సులభంగా చెప్పుకోవాలంటే పొదుపు కోతలు జిడిపిలో 0.21 నుంచి 0.85శాతానికి ఈ కాలంలో పెరిగాయి.గతంలో అనేక దేశాల్లో ఒకేసారి భారీ కోతలు విధించాలన్న షరతులు విధించటంతో ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. దాంతో ఒక్కసారే విష గుళికలను మింగించటానికి బదులు మెల్లగా పనిచేసే విషం మాదిరి కొన్ని సంవత్సరాల్లో అమలు జరిపే పద్దతులను అనుసరిస్తున్నారు.జనం కోతలకు అలవాటు పడిపోతారు.అయితే ఇప్పుడు తిరిగి పాత పద్దతులకే పోవాలని ఐఎంఎఫ్ చెబుతున్నది. దాని 2026 నివేదిక సారమిదే. ఇప్పటికే హానికరమైన విషాన్ని చిన్న చిన్న మోతాదుల్లో మింగిస్తున్నది, దానికి బదులు మొత్తం సీసాను ఒకేసారి తాగించాలని చూస్తున్నదని’ ఆక్స్‌ఫామ్ విధాన సీనియర్ సలహాదారు నబిల్ అబ్డో వ్యాఖ్యానించాడు. చెప్పుకున్న సంవత్సరాల మధ్య ఐఎంఎప్ చెప్పిన మధ్యగత సామాజిక ఖర్చు 25 నుంచి 11శాతానికి పడిపోయింది.
మెకెన్సీ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ సంపద 2024లో 1.7 నుంచి 1.8క్వాడ్రిలియన్( వెయ్యిలక్షల కోట్లు) డాలర్లకు లకు పెరిగింది.గృహస్తుల సంపద 570లక్షల కోట్ల డాలర్లకు చేరి రికార్డు నెలకొల్పగా దీనిలో అత్యధికం కార్పొరేట్ కంపెనీల్లో తెగబలిసిన ధనికుల వాటాల రూపంలో ఉంది. మరోవైపు జెడ్ యువతరం ప్రపంచవ్యాపితంగా విద్య, వైద్యం వంటి సేవారంగాల్లో మరింతగా పెట్టుబడులు పెట్టాలని ఉద్యమిస్తోంది.తాజాగా ఫ్రాన్సులో విద్యార్ధుల ఆందోళన అదే. ధనికుల మీద మరింతగా పన్నులు విధించాలన్న డిమాండ్ సైతం గతం కంటే ఎక్కువగా ముందుకు వస్తోంది.ఐఎంఎఫ్ ఎన్నడూ ఇలాంటి సలహాలు లేదా షరతులను దేశాల మీద రుద్దలేదు. ఎందుకంటే అది ధనికుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన సంస్థలలో ఒకటి.ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ చెప్పినట్లుగా ఆ సంస్థ చరిత్ర మొత్తం సామాజిక సంక్షేమానికి ఎలా కోతలు పెట్టాలి, జనం మీద భారాలు ఎలా మోపాలి అన్నదాని మీదే కేంద్రీకరణ.తాజాగా ఈనెల ఏడున పాకిస్తాన్‌కు మరో 121 కోట్ల డాలర్ల రుణం ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకరించింది.దానికి గాను అది పెట్టిన షరతులేమంటే చమురు సబ్సిడీలను ఎత్తివేయాలి, విద్యుత్ సంస్కరణలు చేపట్టాలి,ఎక్కువ మంది జనాలను పన్నుల పరిధిలోకి తేవాలి. గతంలో తీసుకున్న రుణాల షరతులకు వ్యతిరేకంగా అక్కడి జనం ఆందోళన చేశారు. ఇప్పుడు మరికొన్ని కోతల మీద ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ గతంలో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఐఎంఎఫ్ నిబంధనలు కనీసం ఒక మానవహక్కును హరించే విధంగా ఉన్నాయని పేర్కొన్నది. అది రూపొందించిన 39 కార్యక్రమాల్లో 32ను సమీక్షించింది. ఇరవై రెండు కార్యక్రమాల్లో ప్రభుత్వ సిబ్బంది వేతన బిల్లు తగ్గింపు జరిగింది. కొత్త నియామకాల నిలిపివేత, వేతనాలపై పరిమితులు లేదా తగ్గింపు వంటి వాటిని 2007లోనే ఐఎంఎఫ్ షరతులుగా ముందుకు తెచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు నింపకపోవటం, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం, వారికి ఇవ్వాల్సిన వేతనాలను నిరాకరించటం తెలిసిందే, అయితే కొన్ని ప్రత్యేక సడలింపులు కూడా ఇచ్చింది. ఉద్యమాలకు దిగిన జనాల వీపులు పగలగొట్టేందుకు అవసరమైన పోలీసులు, ఇతర సిబ్బంది నియామకాలు మాత్రం ఆగవు. ఇరవై మÖడు కార్యక్రమాలను చూస్తే పైకి కనిపించని వాట్ పన్నుల రూపంలో రాబడి పెంచుకోవాలని చెప్పింది. వీటిని ముక్కు పిండి వసూలు చేయటంలో పేద, ధనిక తేడాలు ఉండవు. వినియోగంపై ఆధారపడిన సబ్సిడీలు అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత పెట్రోలు, డీజిలు, గ్యాస్ సబ్సిడీలను రద్దు చేసి చమురుపై లక్షల కోట్ల రూపాయలను సెస్‌ల పేరుతో వసూలు చేస్తున్న మాదిరి ఇరవై కార్యక్రమాల్లో అలాంటి షరతులు విధించింది. బ్రెట్టన్ ఉడ్ కవలల ఆదేశాలు లేదా మార్గదర్శకాల మేరకు వాటిని రద్దు చేసినట్లు మోడీ ఎప్పుడైనా జనానికి చెప్పారా ? ఇలాంటి భారాలన్నీ మానవహక్కులకు భంగం కలిగించేవే అని మానవహక్కుల సంస్థ చెప్పింది.
పోనీ ఐఎంఎఫ్ అనే డాక్టర్ సూచించిన చికిత్సావిధానం ప్రకారం దాని కార్యక్రమాలు అమలు చేసిన దేశాల్లో దరిద్రం ఏమైనా తగ్గిందా అంటే లేదు.పాకిస్తాన్ ఇప్పటికి 25సార్లు ఐఎంఎఫ్ రుణాలు తీసుకుంది,అవిగాక ప్రపంచబ్యాంకు అదనంగా ప్రాజక్టు రుణాలను ఇచ్చింది.తాజా సమాచారం ప్రకారం 38శాతంపైగా జనాభా దారిద్య్రంతో ఉన్నారు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమైతే 44.7శాతం మంది ఉన్నారు. మనదేశం కూడా దానికి మినహాయింపేమీ కాదు.దారిద్య్ర రేఖకు మనవారు చెప్పే ప్రమాణాలు, అంతర్జాతీయంగా వేరే ఉన్నాయి.ఇతర సందర్భాల్లో మనం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉన్నామని చెబుతారు, దారిద్య్రానికి వచ్చేసరికి పేద దేశాల్లో ఉంటాం.మన దేశంలో నిరుపేదలుగా ఉన్న దిగువ పదిశాతం మంది రోజుకు మÖడు డాలర్లు ఖర్చు చేస్తుంటే అదే అమెరికా, కెనడాలలో ఇరవై అయిదు డాలర్లు, మనదేశంలో ఎగువ పదిశాతం మంది రోజుకు పది డాలర్లు ఖర్చు చేస్తుంటే అమెరికాలో 179, కెనడా, ఆస్ట్రేలియలలో 129 డాలర్లు ఉంది. ఈ దేశాల పేదలకంటే మన ధనికులు చేస్తున్న ఖర్చు తక్కువ.సామాజిక న్యాయం ప్రకారం చూస్తే ఒక లెక్క ప్రకారం మనదేశం జనాభా 127 కోట్ల మంది ఉన్నపుడు చేసిన సర్వే ప్రకారం మొత్తం 28 కోట్ల మంది దారిద్య్రంలో ఉంటే వారిలో నాలుగున్నర కోట్ల మంది మాత్రమే ఓసిలు, మిగిలినవారంతా బడుగు బలహీనవర్గాల కులాల వారే ఉన్నారు.ఓసిలు 12.5, ఓబిసిలు 20.7,ఎస్సిలు 29.4, గిరిజనులు 43శాతం ఉన్నారు. ఇక మతాల వారీ చూస్తే పట్టణ ముస్లింలు 38.4, ఇతర మైనారిటీలు 12.2శాతం, గ్రామీణ ప్రాంతంలో 26.9 మరియు 14.3శాతాల చొప్పున దారిద్య్రంలో ఉన్నారు. స్వల్ప తేడాలు తప్ప ఇప్పటికీ పెద్ద మార్పేమీ ఉండదు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ కూడా తీయని కబుర్లు చెబుతూ ఆకర్షణీయమైన ఇతివృత్తాలతో సమావేశాలు జరుపుతుంటాయి. కానీ అందుకు విరుద్దమైన షరతులను రుద్దుతాయి.ఉదాహరణకు 2025లో “ ఉపాధి ఐశ్వర్యం కోసం బాట ” ఇతివృత్తంతో ఒక సమావేశం జరిపింది. రాజకీయ అస్థిరత, అసమానతల పెరుగుదల, జీవన ఖర్చుల పెరుగుదల అన్ని చోట్లా కనిపిస్తోంది.కరోనా సమయంలో ఈ సంస్థల వైఖరి మారిందని అనేక మంది అనుకున్నారు, కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదని తేలిపోయింది.మనదేశంలో లేబర్ కోడ్ల పేరుతో పెద్ద దాడికి రంగం సిద్దమైంది.తాజాగా పూర్వపు సోషలిస్టు దేశమైన హంగరీకి ఐఎంఎఫ్ చికిత్స ప్రారంభమైంది.ఉద్యోగవిరమణ వయస్సును పెంచాలని చెప్పింది(రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేసిన సంగతి తెలిసిందే) సబ్సిడీలను తగ్గించాలని చెప్పింది(ముందే చెప్పుకున్నట్లు మోడీ సర్కార్ అమలు చేసింది),పన్నుల పెంపుదల,క్రమంగా గృహనిర్మాణ రుణాల నిలిపివేత, వేతన స్థంభనకు ఆదేశాలు ఇచ్చింది.
ప్రపంచబ్యాంకు ఆదేశాలను ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తన విధానాలుగా చెప్పుకొని విద్యుత్ సంస్కరణలకు తెరలేపిన సంగతి తెలిసిందే.కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఉన్నా నరేంద్రమోడీ ఉన్నా చేసింది, చేస్తున్నదీ అదే. పొదుపు చర్యలకు బదులు 2014 నుంచి ఆర్ధిక సమగ్రత(ఫిస్కల్ కన్సాలిడేషన్) అనే ముద్దు పేరు పెట్టారు.అయితే ఊహించని దెబ్బలు తగలటంతో అనుకున్నది జరగటం లేదు. కోట్లాది మంది రైతులకు ఇస్తున్న సబ్సిడీల విషయాన్ని చూస్తేఅర్ధం అవుతుంది. ఈ మొత్తాలను ఎలా తగ్గించాలనేదానిపై ప్రధాన కేంద్రీకరణ ఉంది. ఉదాహరణకు ఎరువులకు 200607లో రు.25,952 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. అది 200809నాటికి రు.75,849 కోట్లకు చేరింది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికి రు.67,339 కోట్లు.తరువాత 201819కి రు.70,605 కోట్లు.యుపిఏఎన్డిఏ పాలనా కాలంలో 70వేల కోట్లకు అటూఇటూగానే ఉంది తప్ప పెరిగిన ధరలు, వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా సబ్సిడీని పెంచలేదు. తరువాత దిగుమతి, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, ఢిల్లీలో జరిగిన మహత్తర రైతాంగ ఉద్యమం వంటి కారణాలతో సబ్సిడీ మొత్తం రు.1,27,922 కోట్లకు చేరింది, అది క్రమంగా 202223లో రికార్డు స్థాయిలో రు.2,54,799 కోట్లకు చేరి 202526 నాటికి రు.1,86,631కోట్లుగా ఉంది. ఎరువుల సబ్సిడీ కోత చర్యల్లో భాగంగా యÖరియా మినహా ఇతర ఎరువులకు చెల్లించే సబ్సిడీని న్యూట్రియంట్ (పోషకాల) ప్రాతిపదికన ఒక కిలోకి ఇంత అంటూ నిర్ణీత మొత్తానికి పరిమితం చేస్తూ 2010 నుంచి ఎరువుల ధరలపై నియంత్రణను ఎత్తివేశారు.ఉదాహరణకు నైట్రోజన్ కిలోధర 2010`11లో రు.23.23 ఉండగా అన్ని మిశ్రమ ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ మొత్తం రు.34వేల కోట్లు. తరువాత ధర తగ్గటంతో సబ్సిడీ కూడా తగ్గింది, 2026లో అదే నైట్రోజన్ ధర కిలో రు.47.32కు పెరిగినా సబ్సిడీ మాత్రం రు.41వేల కోట్లకు(ఖరీఫ్ వరకు మాత్రమే పెంచారు. ఇలా జనానికి అర్ధంకాని పద్దతుల్లో అనేక విధాలుగా సబ్సిడీలకు కోతపెట్టి భారాలు పెంచారు. మోడీ అధికారానికి వచ్చినపుడు బడ్జెట్లో 15.5శాతం మొత్తం సబ్సిడీలకు కేటాయిస్తే తాజా బడ్జెట్లో అది తొమ్మిదిశాతానికి కోత పెట్టారు. ఎప్పుడైనా తగ్గించినట్లుగానీ, కారణం ఏమిటో ఎవరైనా చెప్పారా ? ఇదంతా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ షరతుల పుణ్యమే అని మన జనాలకు తెలుసా !
