Tags
#Hindutva, BJP, Fish eating In Kali Temple, Kalighat, RSS, Sanatan Hindu Dharma, Suvendu Adhikari
ఎం కోటేశ్వరరావు
మేకపిల్లను తినదలుచుకున్న తోడేలు కథ తెలిసిందే, అయినా తెలియనివారి కోసం క్లుప్లంగా చెప్పుకుందాం.ఒక కొండవాగు ఎగువన తోడేలు ఉంది. దిగువన ఉన్న మేకపిల్లను చూసి దాన్ని ఎలాగైనా తినాలని అనుకుంది.మేకపిల్లా మేకపిల్లా నేను తాగే మంచినీటిని ఎందుకు మురికి చేస్తున్నావని అడిగింది. అదేంటి నువ్వు ఎగువున నేను దిగువన కదా ఉన్నది, కొండ మీద ఉన్న నీటిని నేను కలుషితం చేయటం ఏమిటి అని మేకపిల్ల ప్రశ్నించింది. నువ్వుగాకపోతే నీ తల్లి చెడగొట్టిందిలే అని మేకపిల్లను ఎగరేసుకుపోయింది. దాని మాదిరే దుర్గాపూజను శరద్ ఉత్సవాలంటున్నారని వాటిని మÖసివేయాలని బిజెపి తోడేలు వాదించి దాడులు చేసింది. పశ్చిమబెంగాల్లో దసరా సందర్భంగా శరద్ ఉత్సవాల పేరుతో సిపిఐ(ఎం) ఇతర వామపక్షాలు పుస్తకదుకాణాలను ఏర్పాటు చేసి విక్రయించటం దశాబ్దాలుగా జరుగుతున్నది. కొత్తగా అధికారానికి వచ్చిన బిజెపి ప్రభుత్వ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆ దుకాణాలను అడ్డుకొనేందుకు కుట్రచేశారు.దుర్గాపూజ అని గాకుండా శరద్ ఉత్సవాలు అని పిలిస్తే అలాంటి వారి దుకాణాలను అనుమతించరాదని ఏకంగా అసెంబ్లీలోనే పిలుపు ఇచ్చారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ దళాలు వామపక్షాల పుస్తక దుకాణాల ధ్వంసం, తగులబెట్టటం, నిర్వాహకులపై దాడులు కొనసాగించారు.న్యాయస్థానం భిన్నమైన తీర్పులు ఇచ్చింది.దసరా ముగిసినా హిందూత్వ మÖకలు వామపక్ష భావజాలంపై ప్రారంభించిన దాడికి తెరపడలేదు.ఎలా కొనసాగించాలా అని వారు చూస్తుంటే ఏవిధంగా ఎదుర్కోవాలా అని పురోగామి శక్తులు తయారవుతున్నాయి.ఒక భావజాలాన్ని తర్కంతో ఎదుర్కోవచ్చు తప్ప పుస్తకాలను తగులబెడితేనో, అమ్మనివ్వకుండా చేస్తేనో అడ్డుకోలేరు. ఐరోపాలో పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించిన కొందరు పరిశ్రమల్లో యంత్రాలను నాశనం చేస్తే పెట్టుబడిదారులు నాశనం అవుతారని అదే పని చేశారు. అది జరిగిందా ? గతంలో బ్రిటీష్ పాలకులు కొన్ని పుస్తకాలు, సినిమాలు,కళారూపాల మీద నిషేధం విధించితే జనాలు వాటికోసం ఎగబడ్డారు. చరిత్ర నుంచి కాషాయ దళాలు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు.
చరిత్ర,సంస్కృతి,సాంప్రదాయాలకు భిన్నమైన భాష్యాలు చెబుతున్నారు.వాటిలో అభ్యుదయవాదులు చెప్పిన పురోగామి లక్షణాలు,నిరోధకులు ప్రవచించిన తిరోగామి అంశాలూ ఉన్నాయి.మానవ సమాజ చరిత్రను చూసినపుడు అవసరం లేనివాటిని వదిలించుకుంది తప్ప కొనసాగించటం లేదు. తాను పక్కా సనాతనవాదిని అను చెప్పుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి (బిజెపి) కమÖ్యనిస్టులు హిందూ ఆచారాలను పట్టించుకోరని, వక్ర భాష్యాలు చెబుతారంటూ రాజకీయపరమైన దాడి జరుపుతారు.కమÖ్యనిస్టుల పాలనలో దుర్గా, గణేష్ పూజలేకాదు ఏ ఇతర మత పండుగలకైనా ఏ రోజైనా త్రిపుర,కేరళ, పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్నపుడు ఎప్పుడైనా ఆటంకాలు కల్పించిన ఉదంతం ఒక్కటైనా ఉందా ? బెంగాల్లో దుర్గా పూజా మండపాల పరిసరాల్లో అనేక మంది తమ వస్తువులు, బొమ్మలు అమ్మినట్లే కమÖ్యనిస్టులు పుస్తకాల షాపులు పెట్టి విక్రయాలు చేస్తున్నారు, ఆ మాటకు వస్తే ఆరఎసఎస్ సంస్థలు కూడా అదే మాదిరి దుకాణాలు తెరిచి తమ భావజాల పుస్తకాలను విక్రయిస్తున్నారు.ఎవరికి ఇష్టమైన వాటిని వారు కొనుగోలు చేస్తారు.పూజలు, విశ్వాసాలు మండపాలకే తప్ప వెలుపల కాదు. గణేష్, దుర్గ ఇతర మండపాలను ఏర్పాటు చేస్తున్నవారు జనాలనుంచి చందాల రూపంలో దండుకున్న మొత్తాలతో తాగితందనాలాడటం గురించి తెలియనిదెవరికి ?
సనాతన కబుర్లు చెప్పే బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శతాబ్దాలనాటి కొల్కతా కాళి ఆలయంలో లొ£ట్టలు వేసుకుంటూ భోగ్ పేరుతో చేప తల మాంసం, వేపుడు, పులావు తిన్నారు. దాని మీద హిందూత్వశక్తులు అభ్యంతరపెడితే అది బెంగాల్ సంప్రదాయం తప్పేమీ లేదని స్వయంగా సిఎం, బిజెపి సమర్ధించుకుంది. ఇదే ఏ కమÖ్యనిస్టులో, మరొకరో చెబితే ఈ పాటికి ఎంత మందికి మనోభావాలు దెబ్బతిని ఆసుపత్రులపాలై ఉండేవారో ! బీఫ్ గురించి నిత్యం రాద్దాంతం చేసే కాషాయ దళాలు దాన్ని ఎక్కువగా తినే ఈశాన్య రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో మంచి రుచికరమైన బీఫ్ సరఫరా చేస్తామని ఎన్నికల వాగ్దానాలు కూడా చేసిన ఉదంతాలు ఉన్నాయి, అవకాశవాదానికి వారు మారుపేరు. కాళీమాతకు చేపలు, గొర్రె మాంసం సమర్పించటం ఆచారంగా ఉంది.అది బిజెపి, దాన్ని కన్న ఆరఎసఎస్, హిందూత్వశక్తులు పుట్టక ముందునుంచే అలా చేస్తున్నారు. కౌషికి అమావాస్య రోజున సిఎం చేపల మాంసం తిన్నారు. హిందువుల్లో శాక్త సాంప్రదాయాన్ని పాటించే వారికి అమావాస్య పవిత్రమైనది, మాంసం తినటం తప్పుకాదు. అలాంటి వారు ప్రతిచోటా ఉన్నారు.తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామదేవతలకు జంతుబలులు , మాంసాలు వండుకొని తినటం అందరికీ తెలిసిందే. ఆ సందర్భాలకు బంధు,మిత్రులను కూడా ఆహ్వానిస్తారు.బెంగాల్‌లోని అనేక దేవాలయాల్లో జరిగేదే.హిందూమతాన్ని పునరుద్దరిస్తామంటూ కొత్తగా నామాలు పెట్టుకొని వీరంగం వేస్తున్న కొందరు దీని మీద మండిపడుతున్నారు.తరతరాలుగా దేవాలయాల్లో, పరిసరాల్లో మాంసం తింటున్నవారు హిందువులుకాకపోయారా ? మతానికి ఏమైనా చేటు తెచ్చారా ? ఎందుకీ ఉన్మాదం ! ఇష్టమైన వారు శాఖాహారం తినవచ్చు, అది వారిష్టం. ఇతరుల మీద రుద్దే హక్కు వారికి లేదు.దక్షిణాది దేవాలయాల్లో పూజారులు అంగవస్త్రంతో క్రతువులు నిర్వహిస్తారు.హిమాలయ ప్రాంత దేవాలయాల్లో అలా చేయగలరా ! తత్వం తలకెక్కింది కదా అని వారివి వీరు వీరివి వారు వేసుకుంటే చలి, ఉక్కపోతతో శ్రీవశ్రీవ ఇబ్బంది పడతారు. బెంగాల్, ఉత్తరాది రాష్ట్రాలలో బ్రాహ్మలు చేపలు, మాంసం తినటం సాధారణ విషయం.వారిని మత్స్య బ్రాహ్మలు అని కూడా పిలుస్తారు. నదులు, కాలువలు, చెరువుల్లో స్నానానికి వెళ్లినపుడు పనిలో పనిగా చేపలు కూడా పట్టుకువస్తారు. రామకృష్ణ పరమహంస శిష్యుడైన వివేకానందుడు చేపల గురించి ఎద్దేవా చేసిన వారితో దెబ్బలాటలకు దిగినట్లు కూడా రాశారు కదా ! ఆయన చేపలు, మాంసం తిన్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు అన్ని చోట్లా కొందరు బహిరంగంగా మరికొందరు దొంగచాటుగా తింటున్నారనుకోండి.
బాగేశ్వర బాబా అనే ధీరేంద్ర శాస్త్రి బాగేశ్వర ధామ్‌కు ప్రధాన పూజారి.దుర్గాప్పుూ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారం తినవద్దని అనటమే కాదు, ఎవరైతే తింటారో వారు మోసకారులని కూడా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో మాంసం, మద్యం దుకాణాలను మÖసివేయాలని, ప్రభుత్వం పట్టించుకోవాలని సెలవిచ్చారు.తినటమే కాదు, మాంసాన్ని కాళీ మాతకు నైవేద్యంగా సమర్పించే బెంగాలీలకు ఈ బోధ ఆగ్రహం తెప్పించింది.అనేక చోట్ల అతగాడి ఫొటోలను దగ్దం చేసి నిరసన తెలిపారు. వివాదం మరింతగా ముదరకుండా చూసేందుకు సిఎం, బిజెపి కూడా రంగంలోకి దిగింది. ఒకవైపు బెంగాలీలను సంతుష్టీకరిస్తూనే మరోవైపు ఛాందసులను మంచి చేసుకొనేందుకు చూశారు. ధీరేంద్ర శాస్త్రికి అట్టహాసంగా ఎర్రతివాచీ స్వాగతం పలకటమే కాదు, ఆశ్రమాన్ని బెంగాల్లో కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఎవరైనా శాస్త్రి దిష్టిబొమ్మలను తగలేస్తే కేసులు బనాయిస్తామని బెదిరించారు. జనాల ఆహార అలవాట్లను బాబాలు నిర్ణయించలేరంటూ మరో ముక్తాయింపు ఇచ్చారు. తృణమÖల్ కాంగ్రెస్ హయాంలో ఈ బాబా ప్రవచనాలను అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. బెంగాలీల మాంసాహారం గురించి హౌరాలో ఒక ప్రవచనంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెంగాల్ బిజెపి అధ్యక్షుడు శామిక్ భట్టాచార్య మరో అడుగు ముందుకు వేశారు. “ బాగేశ్వర్ బాబా “ మరో లోకం ” (ఉత్తరాది) నుంచి వచ్చారు.బెంగాల్ పౌరులు ఏం తినాలో నిర్ణయించే హక్కు ఆయనకు లేదు.బెంగాలీలు చేపలు, మాంసం తింటారు.వివేకానందుడు వాటిని తినటానికి అనుకూలంగా మాట్లాడారు.” అన్నారు. శాస్త్రి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ “ వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్పటానికి ఆయనకు హక్కుంది.జనాలు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. నేను సనాతన హిందువును మహాష్టమి రోజు దుర్గామాతను పూజించాను.నేను సాత్విక ఆహారం తిన్నాను. కార్తీక మాసంలో కూడా అదే తిన్నాను, ఇదే సమయంలో ఈ రోజు కాళీమాతకు అర్పించిన ఆహారం అంటే మేక మాంసాన్ని కూడా తిన్నాను. దేవాలయంలో ప్రసాదంగా చేప తల, వేపుడు, బాస్మతి పులావును సమర్పించాను, దాన్ని తిన్నాను ” అన్నారు. బెంగాలీలు ఏం తినాలో కూడదో ఇతరులు ఎలా నిర్ణయిస్తారంటూ తృణమÖల్, బిజెపి బాబాల ఆదేశాలను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ నేతలు స్పందించారు. సైన్సు చెప్పే మానవ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన శరీర ధర్మం అటు ఆకులు అలములు ఇటు జంతువుల మాంసాన్ని తినేందుకు వీలుగా అభివృద్ధి చెందింది. లేదూ భగవంతుడే సృష్టికర్త అనుకుంటే ఏదో ఒకటే తినే వారిని గాక రెండింటినీ తినేవారిగా ఎందుకు సృష్టించినట్లో సమాధానం చెప్పాలి. పుట్టుకతోనే ఎవరూ శాఖాహారం లేదా మాంసాహారం తినటం లేదు, తరువాత అలవాట్ల ప్రకారం తింటున్నారు. ఏ ఒక్కటి తిన్నా ఎలాంటి ఇబ్బంది లేదు, రెండూ తిన్నా పోయేదేమీ లేదు. అందువలన మాంసాహారం తినకూడదని చెప్పటానికి, కేవలం శాఖాహారమే తినాలని నిర్దేశించటానికి ఎవరికీ హక్కులేదు. బలవంతంగా రుద్దాలంటే కుదరదు.
సనాతనం లేదా మను లేదా మరొక మతం చెప్పేవైనా కాలక్రమంలో సమాజాన్ని అదుపులో ఉంచుకోవాలని చూసిన వారు చెప్పిన తత్వాలు తప్ప మరొకటి కాదు.సనాతన ధర్మం అని చెప్పేదాని ప్రకారం ఒకసారి వివాహం అయిన తరువాత బంధం ఎట్టి పరిస్థితిలోనూ తెగిపోకూడదు. ఇలా చెప్పారంటే దాని అర్ధం ఏమిటి ? అంతకు ముందు వివాహబంధంలో ఉన్నవారు ఇష్టంలేకపోతే విడిపోవటం ఒక మామÖలు వ్యవహారంగా సాగించిన కారణంగా కలిపి ఉంచేందుకు బోధల పేరుతో ఒక చట్రాన్ని తయారు చేశారన్నది స్పష్టం. మానవ సమాజ పరిణామ క్రమంలో జంతువుల నుంచి మనుషులు వేరుపడిన వెంటనే వివాహ బంధాలను ఏర్పాటు చేసుకోలేదు.కొన్ని లక్షల సంవత్సరాల తరువాత ఉనికిలోకి వచ్చాయి.ఉదాహరణకు వితంతు, బాల్య,ద్వితీయ, తృతీయ వివాహాలు, సతీసహగమనం, వర్ణాశ్రమ ధర్మాల వంటి అనేక అంశాలపై సమాజంలో వచ్చిన మార్పు తెలిసిందే.ఇలాంటి విషయాల్లో పాతపద్దతులకు వెళదామని ఏ “ మను లేదా సనాతనవాది ” అయినా అంటే ఆ కుటుంబాలవారు లేదా బాధితులు చెంపచెళ్లుమనిపిస్తారు.అయినా భార్యలను వదలివేసిన వారు, పెళ్లయినా కానట్లు దాచిపెట్టిన వారు, ఒకటికి మÖడు వివాహాలు చేసుకున్నవారు అధికార పీఠాలనెక్కి పక్కా సనాతనవాదులమని ఫోజు పెట్టటం తెలిసిందే. ఒకసారి వివాహం చేసుకున్న తరువాత దంపతులు విడిపోకూడదని సనాతనం చెబుతున్నదని చాగంటి కోటేశ్వరరావు వంటివారు చెబుతుంటే దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేవారు విడాకుల కోసం ఆధునిక ధర్మం(రాజ్యాంగం) మీద ఆధారపడతారు, పక్కా సనాతన కబుర్లు వినిపిస్తారు, నటిస్తారు. ఇప్పుడు దేవాలయాల్లో మాంసం తినటం తప్పేమీ కాదని బిజెపి ముఖ్యమంత్రి సువేందు అధికారి చెప్పబట్టి సరిపోయిందిగానీ అదే కమÖ్యనిస్టులో మరొకరో చెబితే అమ్మో హిందూమతానికి ముప్పు వచ్చిందంటూ మనోభావాలు దెబ్బతినట్లు ఊరూవాడూ ఏకం చేసేవారు, కాదంటారా ? ప్రకృతిలో ప్రతిదీ మారుతుంటుందని ఆధునిక శాస్త్రం(సైన్సు) చెబుతుంది. కానీ మార్పులేనిది సనాతనం అని చెప్పే వారు కూడా మారుతూనే నంగనాచి కబుర్లు చెబుతున్నారు, విశ్వసనీయతను పొగొట్టుకుంటున్నారు. దేన్నయినా మÖసిపెడితే పాచిపోతుంది. కొల్కతా కాళీ ఆలయంలో మాంసం తినటాన్ని సమర్ధించిన బిజెపి దేశంలోని ఇతర ప్రాంతాల కాళీ లేదా దుర్గ ఆలయాల్లో తమనేతలతో తినిపిస్తుందా ? ఏ రోటి దగ్గర ఆ పాట పాడే నయవంచనకు ఇది నిదర్శనం కాదా !
