• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చి రాగాలకు నరేంద్రమోడీ నాట్యం చేస్తున్నారా ?

23 Sunday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

military strike on targets in Iran, President Donald Trump, US aborted strikes on Iran

Image result for is narendra modi dancing to donald trump insane tunes

ఎం కోటేశ్వరరావు

డోనాల్డ్‌ ట్రంప్‌కు పిచ్చి పట్టిందా, ఆ పిచ్చివాడి ప్రేలాపనలు, చర్యలకు అనుగుణంగా మారు మాట్లాడకుండా భారత్‌తో సహా అనేక దేశాలు నృత్యం చేయటం ఏమిటి? ఆ పిచ్చి మనకూ సోకిందా ? ఇరాన్‌ మీద దాడి చేయమని ట్రంప్‌ ఆదేశించటం ఏమిటి, చివరి నిమిషంలో ఆపేయండి అనటం ఏమిటి, అంతలోనే అసలు నేను దాడికి సిద్దం కమ్మని చెప్పానే తప్ప అంతిమ ఆదేశం జారీచేయలేదని అనటం ఏమిటి, పిచ్చిగాక పోతే అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇరాన్‌ గగన తలం మీద నుంచి మన విమానాలు ఎగరకూడదని అమెరికా తన సంస్ధలను ఆదేశించింది. మనతో సహా మిగతా దేశాలకు ఏమైంది. మన విమానాలను కూల్చివేస్తామని ఇరాన్‌ ప్రకటించలేదే, అటువంటి వాతావరణం కూడా లేదే, అయినా మనం కూడా మరో దారిలో ప్రయాణించాలని నిర్ణయించాం. ఇది విమాన సంస్ధల మీద లేదా ప్రయాణీకుల మీద భారం మోపదా ? అమెరికా కోసం మనం ఇరాన్‌తో వైరం తెచ్చుకోవాలా? ఇవన్నీ జనానికి సంబంధించిన ప్రశ్శ లు. అమెరికా అడుగులకు మడుగులొత్తాలని పాలకులెప్పుడో నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల పూర్వరంగంలో తమపై దాడి జరిగితే దాన్ని తిప్పికొట్టేందుకు సర్వసన్నాహాలతో వున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.

మరోవైపు నుంచి ఆలోచిస్తే ట్రంప్‌ పిచ్చివాడా, ఇది నిజమా ? కానే కాదు, ప్రపంచాన్ని తన గుప్పిటలో పెట్టుకోవాలనుకుంటున్న అమెరికా సామ్రాజ్యవాదులు ఒక పిచ్చివాడిని గద్దె మీద కూర్చోపెట్టేంత అమాయకులా కానే కాదు, కాదు. మరి ఎందుకలా ప్రవర్తిస్తున్నారు ! డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యల గురించి అనేక మంది పరి పరి విధాలుగా అలోచిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. ఎందుకిలా చేశారు, కారణం ఏమై వుంటుంది. గత కొద్ది వారాల పరిణామాలను చూస్తే ఇరాన్‌ మీద ఆధారరహిత నిందలు మోపేందుకు, రెచ్చగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. తాజాగా వచ్చిన వార్తల మేరకు అమెరికన్లు గురువారం వుదయం ఇరాన్‌ గగనతలం మీదకు ఒక గూఢచారి డ్రోన్‌ను పంపారు, దాని వెనుకనే 35మంది సైనికులు వున్న మిలిటరీ విమానమూ వుంది. అనుమతి లేకుండా తమ గగనతలాన్ని అతిక్రమించిన డ్రోన్‌ను ఇరాన్‌ గార్డులు కూల్చివేశారు. మిలిటరీ విమానం కూడా ఇరాన్‌ గగనతలంలో ప్రవేశించిందా లేదా అన్నది తెలియదు. అసలు మిలిటరీ విమానాన్ని పంపలేదని అమెరికా చెబుతోంది. తమ డ్రోన్‌ అంతర్జాతీయ జలాల పరిధిలో వుంది కనుక కూల్చివేత దుర్మార్గమంటూ ఇరాన్‌ మీద దాడి చేయాలని ట్రంప్‌ వెంటనే ఆదేశాలిచ్చాడని, అయితే ఆరోజు రాత్రేే నిలిపివేయమని చెప్పినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ద్వారా లోకానికి వెల్లడించారు. తరువాత ఒక జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానసలు అంతిమ ఆదేశాలు ఇవ్వలేదు, విమానాలు గాల్లోకి ఎగరలేదని ట్రంప్‌ స్వయంగా చెప్పాడు. డ్రోన్‌ కూల్చివేత పూర్వరంగంలో ఇరాన్‌ గగన తలం మీదుగా విమానాలను నడపవద్దని అమెరికా తన విమాన సంస్ధలను కోరింది. ఇంకేముంది పొలోమంటూ మనతో సహా మిగతా దేశాలు కూడా అదే పని చేశాయి. అయితే ఇరాన్‌ రాజధాని టెహరాన్‌కు నడిపే విమానాలను ఇతర దేశాలు రద్దు చేయలేదని, గతం మాదిరే నడిపాయని వార్తలు వచ్చాయి. ఇదొక ప్రచార, మానసిక యుద్ధం తప్ప వేరు కాదు.

తాను ఆదేశించినట్లుగా దాడులు జరిగితే నిర్ధేశిత లక్ష్యాలను దెబ్బతీయటంతో పాటు 150 మంది పౌరుల ప్రాణాలు పోతాయని అందువలన దాడులను నిలిపివేసినట్లు ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే లక్ష్యాలతో పాటు ప్రాణ నష్టాల గురించి వివరించిన తరువాతే ట్రంప్‌ దాడి ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్‌ పత్రిక పేర్కొన్నది. అందువలన ట్రంప్‌ ఆడిన అబద్దాలలో ఇదొకటిగా మిగిలిపోయింది. ట్రంప్‌ చర్య వెనుక కారణాలేమిటి అని అనే మీడియా వూహాగానాలలో ెముఖ్యమైౖనవి ఇలా వున్నాయి.కమాండర్‌ తప్పిదం తప్ప డ్రోన్‌ను కూల్చివేయాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడాలని ఇరాన్‌ నాయకత్వం అనుకోలేదని ట్రంప్‌కు తెలిసిందట, దాంతో దాడుల విరమణకు ఆదేశాలిచ్చినట్లు అమెరికన్‌ మాజీ జనరల్‌ జాక్‌ కియానే ఫాక్స్‌ బిజినెస్‌ ఛానల్‌కు చెప్పాడు. తన ఆదేశాల మేరకు మరో పదినిముషాల్లో విమానాలు బయలు దేరుతాయనగా దాడులు జరిగితే 150 మంది పౌరులు మరణిస్తారని తెలిసిన వెంటనే ఆపమని చెప్పారన్నది ఒక కధనం. అయితే జరిగే ప్రాణనష్టం గురించి కూడా వివరించిన తరువాతే దాడులకు ఆదేశాలిచ్చినట్లు అమెరికన్‌ అధికారులు తమకు చెప్పినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక పేర్కొన్నది. ఇరాన్‌ రక్షణ వ్యవస్ధలను తప్పించుకొనే బి2 బాంబర్లు సిద్ధం కానందున దాడులను నిలిపివేసినట్లు ఒక అధికారి ఓక్స్‌ విలేకరికి చెప్పగా దాడి జరిగితే చమురు సంక్షోభం తలెత్తవచ్చని, అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం జరగవచ్చని భావించిన ట్రంప్‌ నిలిపివేతకు ఆదేశించినట్లు మరో అధికారి ఓక్స్‌ విలేకరికి చెప్పటం గమనార్హం. గురువారం రాత్రి ఫాక్స్‌న్యూస్‌ ఛానల్‌లో టక్కర్‌ కార్ల్సన్‌ ఇరాన్‌ మీద దాడి చేయవద్దని చేసిన వినతికి స్పందించి ట్రంప్‌ వెంటనే దాడి నిలిపివేయాలని కోరినట్లు మరొక కధనం. చర్చలకు అంగీకరించకపోతే దాడులు చేస్తామని ట్రంప్‌ బెదిరించాడు, ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా ఇరాన్‌ స్పందించలేదు, దాంతో ట్రంప్‌ వెనక్కు తగ్గాడని ఇరాన్‌ వర్గాలు చెప్పినట్లు రాయిటర్‌ పేర్కొన్నది. అయితే అసలు కారణం ఏమిటన్నది అధ్యక్ష భవన ప్రతినిధి ఎవరికీ చెప్పలేదు. వూహాగానాలను అవునని గాని కాదని గాని ఖండించలేదు. గూఢచార డ్రోన్‌తో పాటు సైనికులున్న విమానం కూడా ఎగిరిందా లేదా అన్నది అమెరికన్లు నిర్ధారించలేదు.

ఇదంతా చూస్తుంటే ఇరాన్‌ ఆదమరచి వున్న సమయంలో దెబ్బతీయటానికి ఇలాంటి ఆదేశాలు, నిలిపివేతల నాటకం ఆడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో యుద్దోన్మాదులు ఇలాంటి అనేక నాటకీయ పరిణామాలకు పాల్పడినందున దేన్నీ కొట్టివేయలేము. అయితే ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ఇరాన్‌ అన్ని విధాలుగా సన్నద్దంగానే వున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రెచ్చగొట్టిన వాటికి సమాధానం ఇవ్వటం తప్ప తానుగా ఇంతవరకు రెచ్చిపోయిన వుదంతం లేదు. చమురు ఓడల మీద ఇరాన్‌ దాడులు చేసినట్లు అమెరికా చెప్పటమే తప్ప ఆధారాలు లేవు. డ్రోన్‌ కూల్చివేయటం ఒక్కటే నిజం. అది తన గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించినా కూల్చకపోతే భయపడినట్లు ప్రపంచం భావిస్తుందని ఇరాన్‌కు తెలుసు కనుకనే కూల్చివేసింది. ఒక వేళ సంయమనం పాటించి కూల్చకపోతే చూశారా, వారి గగన తలంలోకి మేము ప్రవేశించినా చూస్తూ వుండిపోయిందని అమెరికన్లు ప్రచారం చేసుకొనే అవకాశమూ వుంది. ఇదంతా రెచ్చగొట్టే ఒక దుష్ట క్రీడ తప్ప వేరే కాదు. అమెరికా విదేశాంగ మంత్రి, రక్షణ సలహాదారు, సిఐఏ డైరెక్టర్‌ వంటి వారందరూ దాడులకు అనుకూలంగా వున్నప్పటికీ ట్రంప్‌ వైఖరి అలా లేదనే ప్రచారమూ జరుగుతోంది. రాజు మంచివాడేగానీ మంత్రులూ, సలహాదారులే చెడ్డవారు అని చెప్పటం వంటిదే. ఇరాన్‌ మీద దెబ్బకు దెబ్బ తీయాలంటూ జనం నుంచి స్పందన వెల్లువెత్తింది, దాన్ని చూసిన తరువాత ఎంత మంది చనిపోతారని నేను అడిగాను, 150 మంది సర్‌ అని ఒక జనరల్‌ చెప్పాడు. వెంటనే డాడి ఇంకా పదినిమిషాల్లో జరగనుందనగా ఆపేయమని చెప్పా, వారు మానవ రహిత డ్రోన్‌ను కదా కూల్చింది, నాకేం తొందరలేదు’ అని స్వయంగా ట్రంప్‌ చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి తొలుతదాడికి ఆదేశాలెందుకు ఇచ్చినట్లు ? అమెరికా విమానాలను ఇరాన్‌ గగనతలంలోకి ప్రవేశించవద్దని ఆదేశాలు ఎందుకు జారీ చేసినట్లు ?

Image result for narendra modi dancing to donald trump tunes

ఇరాన్‌ మీద దాడి చేస్తే వుపయోగం ఏమిటి, నష్టాలేమిటి అనే విషయాన్ని అమెరికా వ్యూహకర్తలు తేల్చుకోలేకపోతున్నారా అనే పద్దతుల్లో కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు ట్రంప్‌ నిర్ణయించుకున్నాడు. శతృవులుగా ప్రకటించిన దేశాల పట్ల కఠినంగా వున్నట్లు కనిపించకపోతే ట్రంప్‌ శిబిరం డీలా పడిపోతుంది. అందువలన అలా కనిపించాలి, ఆచరణలో అడుగు ముందుకు వేయకుండా ఎదుటి వారి మీద వత్తిడి తేవాలి, అది మెక్సికోతో సరిహద్దు మూసివేత, చైనాతో వాణిజ్య యుద్దం, రాయితీలను రద్దు చేసి భారత్‌ను బెదిరించటం వంటిది ఏదైనా కావచ్చు. ఇరాక్‌ మీద దాడికి పాల్పడి సీనియర్‌ బుష్‌ భయంకరమైన తప్పిదం చేశారని ట్రంప్‌ విమర్శిస్తుంటారు. అలాంటి పెద్ద మనిషి అంతకంటే బలమైన ఇరాన్‌ మీద దాడి చేసేందుకు మరో తప్పిదం చేస్తాడా ? రెండవది ట్రంప్‌ను వెనక్కు లాగే అంశాలలో ఆర్ధిక వ్యవస్ధ. యుద్దం చేస్తామన్న ప్రకటనతోనే చమురు ధరలు పెరిగాయి, నిజంగా చేస్తే పరిస్ధితి ఏమిటి? తనతో పాటు తనను నమ్ముకున్నవారూ మునుగుతారు అనే సంశయం. అన్నింటా అమెరికాకే అగ్రస్ధానం కోసం ప్రయత్నించాల్సిందేగానీ తెగేదాకా లాగి సుదూర ప్రాంతాలలో యుద్ధాలలోకి దిగితే నష్టమే తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదుకనుక, అమెరికన్ల ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు తొందరపడవద్దు అనే వత్తిడి ట్రంప్‌మీద వుంది. ఒక వేళ ట్రంప్‌ గనుక ఇప్పుడు యుద్ధాన్ని ప్రారంభిస్తే అది ఏవో కొన్ని దాడులు చేసి వదిలివేస్తే వచ్చే ఏడాది నవంబరు ఎన్నికల్లో పరువుపోతుంది. దీర్ఘకాల దాడికి పూనుకుంటే అది ఆలోగా ముగిసే అవకాశం వుండదు, అది మరింకా నష్టం. ఇది ఒక గుంజాటన అయితే అమెరికా అధ్యక్షుడిగా వుండి ఒక్క యుద్ధాన్ని కూడా ప్రారంభించకపోతే చరిత్రలో అసమర్ధుడిగా మిగిలిపోతానేమో అనేది కూడా ట్రంప్‌ను యుద్ధం వైపు లాగుతోందని చెప్పవచ్చు.

ఒకటి మాత్రం స్పష్టం. ఇరాన్‌తో జగడం గతంలో ఇరాక్‌ మీద దాడికి దిగినంత సులభం కాదు. రష్యా, చైనాలు ఇరాన్‌కు బాసటగా వుంటాయన్నది ఇప్పటి వరకు వెల్లడైన వైఖరి. అమెరికన్లు ఇప్పుడు అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నందున వారి వైఖరిలో అనూహ్య మార్పులు జరుగుతాయని అనుకోలేము. ఏక్షణంలో అయినా మరోసారి అమెరికా, ఇతర ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మాంద్య సంక్షోభంలోకి జారుతాయని వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమా లేక సాధారణ అమెరికన్లకు మానసికంగా దేనికైనా సిద్ధం చేసేందుకు చేస్తున్న ప్రచారమా అన్నది చూడాల్సి వుంది. ధనిక దేశాల ఆర్దిక వ్యవస్ధల తీరుతెన్నులను చూస్తే సమీప భవిష్యత్‌లో కోలుకొనే అవకాశాలు కనిపించటం లేదు. దాన్నుంచి తప్పించుకొనేందుకే అమెరికా ఇప్పుడు చైనాతో వాణిజ్య యుద్దం, భారత్‌ వంటి దేశాల మీద వత్తిడి అని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హాంకాంగ్‌ ఆందోళన వెనుక అసలు కధ ఏమిటి ?

19 Wednesday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Carrie Lam, china communist party, HONG KONG, Hong Kong Extradition Bill, Hong kong protests, Umbrella Movement

Image result for Hong kong protests

ఎం కోటేశ్వరరావు

హాంకాంగ్‌ ఈ మధ్య ప్రపంచ వార్తల్లోకి వచ్చిన ప్రాంతం. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన వార్తలను చదివేవారికి అదొక ప్రత్యేక దేశం అనే భ్రమ కలిగే అవకాశం వుంది. ఎందుకంటే అక్కడ నేరాలకు పాల్పడిన వారిని విచారించేందుకు చైనా ప్రధాన భూభాగానికి పంపేందుకు హాంకాంగ్‌ పాలనా వ్యవస్ధ ఒక బిల్లును ఆమోదించేందుకు గత కొన్ని నెలలుగా అవసరమైన చర్యలను చేపట్టింది. ఇంకేముంది మా స్వేచ్చకు ముప్పు వచ్చింది అని బిల్లును వ్యతిరేకించిన వారు ఆందోళనకు దిగారు.నిజమే అన్యాయం అంటూ అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు వారికి మద్దతు పలికాయి. జనంలో తలెత్తిన వుద్రేకాలను తగ్గించేందుకు బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టి చర్చలు జరుపుతామని ప్రత్యేక పాలనా అధికారి ప్రకటించిన తరువాత కూడా ఆందోళనలు ఆగలేదు, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి, స్వాతంత్య్రం అంటూ డిమాండ్లను ముందుకు తెస్తున్నారు. పోలీసులను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యగా మార్చేందుకు కొట్లాటలకు దిగుతున్నారు. దీన్ని బట్టి నేరస్ధుల అప్పగింత కంటే మించిన అంశాలు ఈ ఆందోళన వెనుక వున్నాయన్నది స్పష్టం.గత మూడు దశాబ్దాలుగా హాంకాంగ్‌ను అడ్డం పెట్టుకొని విదేశాలు చైనా మీద వత్తిళ్లు తెస్తున్నాయంటే అతిశయోక్తికాదు. హాంకాంగ్‌ న్యాయవ్యవస్ధలో వున్న లోపాలను సరి చేసేందుకు, నేరాలకు సంబంధించి పరస్పరం సహకరించుకొనేందుకు గాను నేరస్ధుల అప్పగింతతో సహా మరికొన్ని అంశాలను దానిలో పొందుపరిచారు.నేరగాండ్లను ఒక్క చైనా ప్రధాన భూభాగానికే కాదు, తైవాన్‌కు సైతం అప్పగించేందుకు కూడా దానిలో నిబంధనలను పొందుపరిచారు. ఆందోళనల పూర్వరంగంలో బిల్లును వాయిదా వేయటం, చర్చలు జరుపుతామన్న ప్రకటనను చైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘స్వేచ్చ కోసం జరిగే ప్రపంచ యుద్ధంలో ముందు పీఠీన జరిగే పోరులో హాంకాంగ్‌ ‘అనే శీర్షికతో అమెరికాకు చెందిన టైమ్‌ పత్రిక ఒక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పోరుకు నాయకులెవరూ లేరని, దానంతట అదే తలెత్తిన విద్యార్ధులు, యువకుల వుద్యమం అని ప్రపంచ మీడియాలో కథనాలను వండి వారుస్తున్నారు. జూన్‌ పన్నెండవ తేదీ ప్రదర్శనల గురించి టైమ్‌ కధనం ఇలా ప్రారంభం అయింది. గుమికూడిన గుంపులు కేవలం ఒక గాలివానను తట్టుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లతోనే రాలేదు, అలాంటిదొకటి వస్తుందని వారు లెక్కవేసుకుంటున్నారు. వర్షం ప్రారంభం కాగానే ‘గా యావ్‌ ‘ అంటూ గొడుగులు పట్టుకున్నవారందరూ ఒక్కసారిగా కేకలు వేశారు.( దాని అర్ధం అగ్నికి ఆజ్యం పోయండి అని) కొద్ది గంటల్లోనే వచ్చిన అనేక గుడారాలతో తాత్కాలిక రక్షణ శిబిరాలు తయారయ్యాయి. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించినా, పెప్పర్‌ స్ప్రే చల్లినా తప్పించుకొనేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇలాంటి ఆందోళన అసంఘటితమైనదని, ఎవరూ వెనుక లేరని లోకాన్ని నమ్మింప చూస్తున్నారు. తొంభై తొమ్మిదిసంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారి పాలనలో ఎలాంటి హక్కులూ లేనపుడు అక్కడి వారికి స్వేచ్చ, స్వాతంత్య్రాలు కావాలని అనిపించలేదు. ఎలాంటి ప్రజావుద్యమాలూ జరపలేదు. ఆకస్మికంగా చైనాలో విలీనమైన తరువాత వాటికోసం వారు ఆందోళన ప్రారంభించారని ప్రపంచానికి చెబుతున్నారు.

హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగమే అయినప్పటికీ ఒక ప్రత్యేక పాలిత ప్రాంతం. తొంభై తొమ్మిది సంవత్సరాల బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత 1997లో అది చైనాలో విలీనమైంది. అయితే అది ఒక అంతర్జాతీయ ఓడరేవుగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా అప్పటికే అభివృద్ధి చెంది వున్న కారణంగా, దాని తరువాత పోర్చుగీసు నుంచి అదే మాదిరి కౌలు గడువు తీరిన తరువాత చైనాలో విలీనం అయ్యే మకావో దీవులు, అప్పటికే తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ సమస్యలను దృష్టిలో వుంచుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నో తర్జన భర్జనల తరువాత ఒక వైఖరిని తీసుకుంది. ఒకే దేశం-రెండు వ్యవస్ధలు అని దాన్ని పిలిచారు. హాంకాంగ్‌ వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందితే, మకావో పెద్ద జూదకేంద్రంగా వలసపాలనలో మారింది. అందువలన అక్కడ వున్న ప్రత్యేక పరిస్ధితులు, పెట్టుబడులు, ఇతర సామాజిక అంశాలను గమనంలో వుంచుకొని 2050 వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని, ఇతర దేశాల సంస్ధలతో మాదిరి అక్కడి కార్పొరేట్లు ప్రధాన భూభాగంలో పెట్టుబడులు పెట్టవచ్చని, వాటికి హామీ ఇస్తామని పాలక కమ్యూనిస్టు పార్టీ ఒక ఒప్పందం ద్వారా భరోసా ఇచ్చింది. విలీనాన్ని చైనా ఆక్రమణగా వక్రీకరిస్తున్నారు. ఆ గడువు మరో 30దశాబ్దాలలో ముగిసి చైనా సమాజంలో పూర్తిగా అంతర్భాగం కావాల్సివుంది. గడువు దగ్గర పడుతున్నకొద్దీ సాఫీగా హాంకాంగ్‌ను ఆవైపు నడిపేందుకు చైనా ప్రయత్నిస్తుండగా వేర్పాటు ధోరణులను రెచ్చగొట్టేందుకు, పరిస్ధితులను సంక్లిష్టం గావించేందుకు విలీన వ్యతిరేకశక్తులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, తదితర పశ్చిమ దేశాలు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపధ్యాన్ని అర్ధం చేసుకుంటేనే అక్కడి పరిణామాలు అర్ధం అవుతాయి.

బ్రిటీష్‌ పాలకులు హాంకాంగ్‌ను తమ వలసగా చేసుకున్న తరువాత ఏ రకమైన ప్రజాస్వామిక వ్యవస్ధనూ అమలు జరిపేందుకు వారెలాంటి ప్రయత్నమూ చేయలేదు. నామ మాత్ర పాలనా మండళ్లను ఏర్పాటు చేశారు, అదీ ధనికులకు మాత్రమే పరిమితంగా ఓటింగ్‌ హక్కు ఇచ్చారు, నామినేటెడ్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు, చాంగ్‌ కైషేక్‌, అతని నాయకత్వంలోని మిలిటరీ, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాద దేశాల మద్దతుతో తైవాన్‌కు పారిపోయి దాన్ని స్ధావరంగా చేసుకొని చైనా పేరుతో అక్కడి నుంచి పాలన ప్రారంభించారు.ఐరాస కూడా 1970వరకు దానినే అసలైన చైనాగా గుర్తించింది. 1950 దశకంలో బ్రిటీష్‌ వారు హాంకాంగ్‌లో ప్రజాస్వామిక వ్యవస్ధను ఏర్పాటు చేస్తామంటూ ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రాంతాన్ని మరొక తైవాన్‌ మాదిరి తిరుగుబాటు ప్రాంతంగా చేయాలనే ఎత్తుగడ దాని వెనుక వుంది. అందుకే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించి గడువు మీరే వరకు ఒక వలస ప్రాంతంగానే వుంచాలి తప్ప మరొకవిధంగా చేయకూడదని స్పష్టం చేసింది. దాంతో వెనక్కు తగ్గిన బ్రిటీష్‌ వారు, 1997గడువు దగ్గరపడే కొద్ది స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామిక వ్యవస్దల ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించి అసమ్మతికి బీజాలు నాటారు. చైనాలో విలీనమైన తరువాత కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రత్యేక పాలనా మండలికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుపుతూ అందరికీ ఓటు హక్కు కలిగించింది. పైకి ఏమి చెప్పినప్పటికీ చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే వారు, అనుకూలించేవారిగా చీలిపోయి పోటీ చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం చైనాలో విలీనానికి మొగ్గుచూపే వారు పాలకమండలిలో మెజారిటీగా వున్నారు.

తాజా ఆందోళన వెనుక అమెరికా, మరికొన్ని దేశాలు వున్నాయన్నది చైనా అభిప్రాయం. బిల్లును సమర్ధించేవారు నడుపుతున్న వెబ్‌సైట్‌ మీద దాడి జరిపిన వారి మూలాలు అమెరికాలో కనిపించాయి.మార్చినెలలో ఈ బిల్లును హాంకాంగ్‌ పాలక మండలికి సమర్పించిన వెంటనే స్పందించిన తొలి విదేశం అమెరికాయే. ఒక వేళ బిల్లును ఆమోదించినట్లయితే హాంకాంగ్‌కు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాల రద్దు గురించి ఆలోచించాల్సి వుంటుందని అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బెదిరించారు. బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా కూడా అదేబాటలో నడిచాయి. జపాన్‌లో త్వరలో జరిగే జి20 సమావేశాల్లో తమ అధ్యక్షుడు ఈ అంశాన్ని లేవనెత్తుతారని అమెరికా విదేశాంగ మంత్రి మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు. బిల్లును వక్రీకరిస్తూ హాంకాంగ్‌ అంతటా అనేక కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. విద్యార్ధులు, ఇతరులను రెచ్చగొట్టేవిధంగా వాటి రాతలున్నాయి. ఈ బిల్లును గనుక ఆమోదిస్తే నిరుద్యోగం పెరుగుతుందని, మతాన్ని అణచివేస్తారని, ఇతర దేశాలకు వీసాలతో నిమిత్తం లేకుండా వెళ్లే అవకాశాలు రద్దవుతాయంటూ వాటిలో పేర్కొన్నారు. నిజానికి అలాంటి అంశాలే బిల్లులో లేవు. ఆ బిల్లు చట్టంగా మారితే నేరస్ధులకే కాదు, సామాన్య పౌరులకూ తరువాత పొడిగిస్తారు, నగరంలో ప్రవేశించే వారందరూ అనుమతి పాస్‌లు తీసుకోవాల్సి వుంటుంది. అందువలన మరోసారి నేను ఇక్కడకు రావాలా లేదా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది అని అమెరికా మాజీ దౌత్యవేత్త సీన్‌ కింగ్‌ వంటి వారు తప్పుడు ప్రచారాలు చేశారు. వుఘీర్స్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలను పాటించని వారిని పదిలక్షల మందిని నిర్బంధించారు, టిబెట్‌ బౌద్ధ వారసత్వాన్ని లేకుండా చేస్తున్నారంటూ జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు.

2016లో హాంకాంగ్‌ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆరుగురు చైనా వ్యతిరేకులు, హాంకాంగ్‌ వేర్పాటు వాద సభ్యులు ఒక వేదికగా చేసుకున్నారు. హాంకాంగ్‌ చైనా కాదు అని ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. హాంకాంగ్‌ దేశానికే తాము విధేయులమై వుంటామని ప్రమాణస్వీకారాన్ని అపహాస్యం చేశారు. చైనాను అవమానపరిచారు. దాన్నొక వుపన్యాస వేదికగా మార్చివేశారు. వారి ప్రమాణ స్వీకారం చెల్లదని అధికారులు ప్రకటించారు. అయితే వారి ప్రవర్తన సరిదిద్దుకొనేందుకు అవకాశం ఇస్తూ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చారు. వారు దాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ తాము చేసింది తప్పుకాదంటూ సమర్ధించుకున్నారు. ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. అక్కడి న్యాయమూర్తి వేర్పాటు వాదులకు వూతమిచ్చే విధంగా తీర్పు చెప్పారు. అంతకు ముందు హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పుస్తక ప్రచురణకర్తల అరెస్టును వివాదం చేశారు. హాంకాంగ్‌ మరియు బ్రిటీష్‌ పౌరసత్వం వున్న ఇద్దరు చైనీయులు పుస్తక ప్రచురణ పేరుతో చైనా వ్యతిరేకతను, అశ్లీలంతో సహా అన్ని రకాల అరాజకత్వాన్ని రెచ్చగొట్టే విధంగా సాగిన రచనలను అక్రమంగా ముద్రించి పంపిణీ చేశారు. వారు సరైన పత్రాలు లేకుండా చైనాలో ప్రవేశించి అధికారులకు దొరికిపోయారు, అలాంటి వారే మరో ముగ్గురిని చైనా నిర్బంధించింది. ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన తరువాత బ్రిటన్‌తో సహా ఇతర చైనా వ్యతిరేకులు మానవహక్కులు, స్వేచ్చ అంశాలను ముందుకు తెచ్చారు తప్ప వారి చైనా వ్యతిరేకచర్యలను మరుగుపరిచారు. వారిని చైనా అధికారులే అపహరించారని ఆరోపించారు. ఐదుగురిలో ఒకడు తమ పౌరుడేనని చైనా ప్రకటించింది. వారు హాంకాంగ్‌ తిరిగి వచ్చిన తరువాత అంతకు ముందు చేసిన ప్రకటనకు భిన్నంగా తమ చేత చైనాలో బలవంతంగా నేరాన్ని అంగీకరింప చేయించారంటూ మీడియా ముందు ప్రకటించి చైనా వ్యతిరేకతను వెల్లడించుకున్నాడు. ఈ పూర్వరంగంలోనే ఇలాంటి వారిని చైనాలో విచారించేందుకు వీలుగా అప్పగింత బిల్లు వచ్చిందని గమనించాలి. ఎక్కడ నేరం చేస్తే అక్కడే విచారించాలనే పేరుతో ఇలాంటి నేరస్ధులను రక్షించేందుకు చైనా వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు. పుస్తక ప్రచురణ కర్తలు స్ధానిక అంశాల మీద పుస్తకాలు ప్రచురించి అక్రమాలకు పాల్పడితే అక్కడే విచారించాలని అంటే అర్ధం వుంది. సమంజసం కావచ్చు, చైనాలో హాంకాంగ్‌ అంతర్భాగం అయినపుడు సదరు చైనా సర్కార్‌ను కూల్చివేయాలని, కమ్యూనిస్టు పార్టీని అంతం చేయాలని అక్కడ మానవహక్కులు లేవని దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినపుడు, స్దానిక చట్టాలు పటిష్టంగా లేనపుడు ఏమి చెయ్యాలన్నది సమస్య.

రాజకీయ పరమైన ఈ సమస్యలు ఇలా వుండగా 2018 ఫిబ్రవరిలో జరిగిన ఒక నేరం బిల్లు రూపకల్పనలకు నాంది పలికిందని చెప్పవచ్చు. హాంకాంగ్‌కు చెందిన ఒక యువకుడు తన స్నేహితురాలితో కలసి తైవాన్‌ వెళ్లి అక్కడ ఆమెను హత్య చేసి హాంకాంగ్‌ తిరిగి వచ్చాడు. చిన్న చిన్న నేరాలకు జైలు పాలయ్యాడు. ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం హాంకాంగ్‌ వెలుపల జరిపిన నేరాలకు గాను నిందితులను హాంకాంగ్‌లో విచారణ జరపటానికి లేదు. అందువలన అతని మీద విచారణ జరపాలంటే తైవాన్‌కు పంపాలి. ఈ పూర్వరంగంలో ఈ బిల్లును రూపొందించారు.

Image result for Hong kong protests

ఈ బిల్లు మీద తలెత్తిన వ్యతిరేకతను, దాని వెనుక వున్న శక్తుల ఎత్తుగడలను గమనించిన చైనా, హాంకాంగ్‌ అధికారులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఎంతగా రెచ్చగొట్టి హింసాపూరితంగా మార్చాలని చూసినా దానికి వీలులేకుండా చూశారు. ఆందోళనలో పాల్గొన్నవారి సంఖ్య గురించి బయటి మీడియా చిలవలు పలవలుగా వర్ణించింది. అంత సీను లేకపోయినా గణనీయ సంఖ్యలో పాల్గొనటాన్ని గమనించిన చైనా నాయకత్వం తాత్కాలికంగా బిల్లును వాయిదా వేయాలని సలహా ఇచ్చింది. వాయిదా కాదు, పూర్తిగా రద్దు చేయాలనే ఆందోళన ఇప్పుడు సాగుతోంది. ప్రస్తుతం చైనాను లొంగదీసుకొనేందుకు అమెరికన్లు వాణిజ్య యుద్దాన్ని తీవ్రతరం చేయటంతో పాటు అనుకోకుండా వచ్చిన హాంకాంగ్‌ బిల్లును కూడా వుపయోగించుకొనేందుకు పూనుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు ఈ ఏడాది మార్చినెలలో అమెరికాను సందర్శించి మద్దతు కోరారు. దాని పర్యవసానమే అమెరికా జోక్యం, బెదిరింపులు అన్నది స్పష్టం. అమెరికా లేదా మరొక దేశం గానీ నేటి చైనా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. హాంకాంగ్‌ను బ్రిటీష్‌ వారికి కౌలుకు ఇచ్చిన నాటి స్ధితిలో చైనా వుందనుకుంటే పప్పులో కాలేసినట్లే అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. సున్నితమైన ఈ సమస్యను చైనా నాయకత్వం ఎంతో జాగ్రత్తగా చూస్తోంది. ఒక్క ఈ విషయంలోనే కాదు, ఇతర అంశాలలో కూడా దీనిని గమనించవచ్చు.

మన దేశంలో పోలీసు చర్యతో సంస్ధానాలను విలీనం చేసినట్లుగా, రష్యా పాలకులు క్రిమియాను స్వాధీనం చేసుకున్నట్లుగా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ను మిలిటరీ చర్యద్వారా చైనాలో విలీనం చేయటం పెద్ద సమస్య కాదు. దాని వెనుక వున్న సామ్రాజ్యవాదుల హస్తం, ఇతర అంశాలను గమనంలో వుంచుకోవటంతో పాటు ఆయా ప్రాంతాలలోని జన అంగీకారం, మద్దతు ముఖ్యం. విశృంఖలమైన పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరిగిన వారు ఒక క్రమశిక్షణకు వెంటనే సిద్ధం కావటం చిన్న విషయం కాదు. అందువలన బలప్రయోగం మార్గం కాదనే చైైతన్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రదర్శిస్తోంది. తైవాన్‌, హాంకాంగ్‌, మకావోల్లో సామ్రాజ్యవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు వ్యవధి పట్టవచ్చుగాని, వాటి కుట్రలకు వమ్ము చేసి ఆ ప్రాంతాలను కాపాడుకోవటం అనివార్యం !

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే చైనానే ఎక్కువగా నమ్ముతున్న అమెరికన్‌ యువత !

12 Wednesday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Communist China, Donald trump, RED MAY, US youth distrust Trump, US Youth Trusting communist China

Image result for College kids' distrust for Trump over communist China

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం మేథావులకు తీవ్ర వ్యతిరేకి, చాలా వ్యతిరేకి, విశ్వవిద్యాలయాల వంటి వాటిని వుదారవాద ప్రచార యంత్రాలుగా పిలుస్తున్నారు. కాబట్టి అది జాత్యంహంకారి మాత్రమే కాదు, మేథావుల మీద దాడి వంటిది కూడా అని భావిస్తా ‘ ఇది ఒక విద్యార్ధి అభిప్రాయం. ‘ నావరకైతే చైనా ప్రభుత్వం నిజాయితీ కలిగినదా లేనిదా అనే గుర్తింపు ఎంత వుందో తెలియదు, కానీ ట్రంప్‌ సర్కార్‌ నిజాయితీలేనిదని మాత్రం నాకు కచ్చితంగా తెలుసు, కనుక అతన్ని నేను నమ్మను, అందువలన నేను నా స్వతంత్ర పరిశోధన చేస్తాను ‘ అనేది మరొక విద్యార్ధిని చెప్పిన మాట. అమెరికా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక చర్చలలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ ధోరణి గురించి ఒక కమ్యూనిస్టు వ్యతిరేక వెబ్‌సైట్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక క్లుప్త వ్యాఖ్యానాన్ని ప్రచురించింది.

పూర్వరంగం ఏమిటంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో దాదాపు వంద చోట్ల చైనా ప్రభుత్వం లేదా సంస్ధల నుంచి పొందే నిధులతో నడిచే కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిని మూసివేయాలని కోరుతూ 2014లో కొంతమంది ప్రొఫెసర్లు ఒక నివేదికను విడుదల చేశారు. గత సంవత్సరం సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ రే మాట్లాడుతూ కన్‌ఫ్యూసియస్‌ సంస్ధల కార్యకలాపాల మీద దర్యాప్తు జరుపుతున్నామని, వాటిని నిఘానిమిత్తం వినియోగిస్తున్నట్లు గూఢచారులు హెచ్చరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా పదమూడు విశ్వవిద్యాలయాల్లోని కేంద్రాల గురించి పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ కార్యాలయం) చేసిన పరిశోధనలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్‌ ఫ్రీ బీకన్‌ అనే పత్రం పేర్కొన్నది. ఈ అధ్యయన కేంద్రాలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని సిఐఏ పేర్కొన్నది. అమెరికా-చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య పోరు నేపధ్యంతో పాటు విశ్వవిద్యాలయాల సంస్కరణల గురించి అధ్యయనం చేస్తున్న ఒక మితవాద బృందానికి చెందిన మీడియా డైరెక్టర్‌ కాబోట్‌ ఫిలిప్స్‌ ఇటీవల మేరీలాండ్‌ విశ్వవిద్యాలయ సందర్శన చేశారు. అక్కడ మీరు కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలను నడిపే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్నా లేక కాపిటలిస్టు డోనాల్డ్‌ట్రంప్‌లో ఎవరిని ఎక్కువగా నమ్ముతారు అని ప్రశ్నించగా విద్యార్ధులు చెప్పిన సమాధానాలను పైన చూశారు. కనీసం ఒక విషయంలో అయినా ట్రంప్‌ కంటే చైనా చెప్పేదాన్నే నమ్ముతామన్నది వారి భావం అని తేలిందని, దీన్ని గమనించే అమెరికా గూఢచారశాఖ గేరు మార్చిందని సదరు వెబ్‌సైట్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు. దానిలో భాగంగానే దేవుడిని నమ్మని, అణచివేత వ్యవస్ధ కలిగిన, విఫలమైన చైనా గురించి ఆందోళన కలిగించే, తీవ్ర, కరోఠ సత్యాలను జనానికి అందిస్తున్నట్లు కూడా తెలిపారు.

కన్‌ఫ్యూసియస్‌ సంస్ధ మరియు పురోగామి విద్యావ్యవస్ధ కారణంగా విద్యార్ధులు సోషలిజం, కమ్యూనిజాల మరియు ప్రపంచ హేతువాద భావాల ఛాంపియన్లుగా తయారవుతున్నారు, అది చివరికి అమెరికా వ్యతిరేక మరియు సామాజిక న్యాయ పోరాట యోధులనే నూతన జాతిని తయారు చేస్తున్నది, ఈ రోజుల్లో కాలేజీ విద్యార్ధులు డోనాల్డ్‌ ట్రంప్‌ మరియు అతని ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకమైన ధోరణులకు దగ్గర అవుతున్నారు. అనేక మంది విద్యార్ధులు ట్రంప్‌ సర్కార్‌ కంటే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానే ఎక్కువగా నమ్ముతున్నారనే విస్తుగొలిపే అంశాన్ని ఎవరైనా చూడవచ్చు అని బ్లేజ్‌ అనే ఒక స్ధానిక పత్రిక పేర్కొన్న అంశాన్ని వెబ్‌సైట్‌ విశ్లేషణ వుటంకించింది.అనేక అంశాలపై ట్రంప్‌ ప్రభుత్వం,అమెరికా గూఢచార సంస్ధలు చెబుతున్న దాని కంటే చైనా ప్రభుత్వం చెబుతున్నవాటికే మద్దతు పలుకుతామన్నది సాధారణంగా వెల్లడైన సమాధానం కావటంతో సదరు కాబోట్‌ ఫిలిప్స్‌ బుర్ర దిరిగి చైనాలో మానవహక్కులు లేవని, మతవిశ్వాసాల కారణంగా మిలియన్ల మందిని అణచివేస్తున్నారంటూ ఆ విద్యార్ధులకు చెప్పి ఇప్పుడు చెప్పండి చైనా గురించి అని అడిగాడు. వెంటనే ఒక విద్యార్ధి చైనాను నమ్ముతున్నానని నేను చెప్పలేదు అనగా, మేథావులకు ట్రంప్‌ వ్యతిరేకం అని వ్యాఖ్యానించిన విద్యార్ధిని ఒక్క క్షణం ఆలోచించి నేను కచ్చితంగా చెప్పలేను అన్నది, మరొకరు ఇది చాల కష్టమైన ప్రశ్న, దానికి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, అది నూటికి నూరుశాతం కరెక్టని చెప్పలేను అన్నారు. చైనా భాష, సంస్కృతిని, కన్‌ఫ్యూసియస్‌ భావజాలాన్ని పెంపొందించే పేరుతో కమ్యూనిస్టు పార్టీ ప్రచార కేంద్రాలుగా వినియోగించుకుంటున్నారని కాబోట్‌ ఫిలిప్స్‌ ఆరోపించాడు. గత పన్నెండు సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేంద్రాలలో మొత్తం 35వేల మంది విద్యను అభ్యసించారు. అక్కడ జరిగే కార్యక్రమాలలో తొమ్మిది లక్షల 20వేల మంది పాల్గొన్నారని 2018లో నార్త్‌ కరోలినా కేంద్రం వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

అమెరికా సమాజం తమ నాయకత్వాన్ని విశ్వసించటం లేదన్నది స్పష్టం, అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు, చైనా వంటి వాటి గురించి ఏకపక్ష సమాచారం మాత్రమే యువతరానికి అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా పాలకవర్గం పూనుకుంది అన్నది కూడా సుస్పష్టం.చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ అణచివేత గురించి యువతకు వివరిస్తే వారి వైఖరి మారుతుందని ఫిలిప్స్‌ చెప్పటాన్ని బట్టి రానున్న రోజుల్లో మరో మారు పెద్ద ఎత్తున చైనా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీయనున్నారు.

‘ రెడ్‌ మే ‘ పేరుతో అమెరికాలోని సియాటెల్‌ నగరంలో 2017 నుంచి ప్రతి ఏటా మే మాసమంతా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ పెట్టుబడిదారీ విధానం నుంచి కొన్ని రోజులు సెలవు ‘ పేరుతో ఇవి జరుగుతున్నాయి. బహిరంగ స్ధలాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు ఎవరైనా హాజరుకావచ్చు. విద్యాసంస్ధలు లేదా సభల్లో చెప్పేదానికి అతీతంగా ఇక్కడ అవగాహన చేసుకోవటానికి అవకాశం వుంటుందని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధుల పత్రిక ది డైలీ పేర్కొన్నది. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక ఆంగ్ల ప్రొఫెసర్‌ పాల్గొని మానవాళి విముక్తికి మార్క్సిస్టు భావజాలాన్ని వినియోగించటాన్ని పొగిడినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. అలీస్‌ వెయిన్‌బౌమ్‌ అనే ప్రొఫెసర్‌ మాట్లాడుతూ ‘ ఇండ్లలో భోజనం చేసే సమయంలో దొర్లే మాటల్లో సోషలిజం లేదా కమ్యూనిజం అనేవి చెడ్డ పదాలు, ఇలాంటి కార్యక్రమాలలో పొల్గ్గొన్నపుడు వ్యక్తులు ప్రత్యేకించి కాలేజీ విద్యార్ధులు వామపక్ష భావజాలం మీద వున్న నిందల గురించి ప్రభావితం అయ్యే అవకాశం వుంది. రెడ్‌ మే కార్యక్రమాలు ఒక రాజకీయ సిద్ధాంతం మీద ఒకే వైఖరికి కట్టుబడి వుండటం లేదు, ప్రస్తుత మన పరిస్ధితి గురించి ఎల్లలు లేని చర్చలకు అవకాశం ఇస్తున్నాయి. అనేక మంది పండితులు ఈ భావజాలాలను వర్తమాన పరిస్ధితులకు వర్తింప చేస్తూ ఆలోచిస్తున్నారు. వారిలో పండితులే కాదు, కార్యకర్తలుగా పని చేసే పండితులు కూడా ఈ విద్వత్సభలో వున్నారు. ఈ సంస్ధ పరిధిలకు మించి వారంతా పని చేస్తున్నారు, మానవాళి విముక్తికి వివిధ మార్గాలలో భాగంగా మార్క్సిస్టు భావజాలాన్ని కూడా ఒక మార్గంగా వినియోగిస్తున్నారు.’ అని చెప్పారు. ఆమె స్త్రీవాదం, నల్లజాతీయుల అధ్యయనం, మార్క్సిస్టు సిద్దాంతం, అట్లాంటిక్‌ ప్రాంత వర్తమాన సాహిత్యం, సంస్కృతి, పునరుత్పత్తి సంస్కృతి, రాజకీయాల వంటి అంశాల మీద బోధన చేస్తున్నారు. ఆమె పుట్టుక శ్వేతజాతిలో అయినప్పటికీ జాత్యహంకార సమస్యల గురించి రచనలు చేశారు.

రెడ్‌ మే కార్యక్రమాలకు హాజరైన మైక్‌ కార్లసన్‌ ఇలా చెప్పాడు.’ దీనికి సంబంధించి ఒక గొప్ప విషయం ఏమంటే వామపక్ష భావజాలంలో ఒకదానికొకటి విడిగా వుండే అనేక అంశాలు వున్నాయి. ఎవరైనా వచ్చి భిన్నమైన ఆలోచనలను ఇక్కడ వ్యక్తీకరించవచ్చు, ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అది తమ స్వంత విషయం కావచ్చు లేదా ఒక ప్రాజెక్టు ఏదైనా కావచ్చు అన్నాడు. ‘కమ్యూనిస్టు పరిధి వెలుపల (కమింగ్‌ అవుట్‌ కమ్యూనిస్టు)’ అనే అంశమీద చర్చలో అతను పాల్గొన్నాడు.ఈ కార్యక్రమాలలో మార్క్సిస్టు సిద్ధాంతాల నుంచి కార్పొరేట్‌లు సోషలిజానికి ఎలా పునాది వేస్తున్నాయి అనే అంశాల వరకు అనేక చర్చలు జరుగుతాయి. తమ కార్యక్రమాలు వివిధ ఆలోచనలకు ఎదురవుతున్న సవాళ్లు, అభివృద్ధి చేయటం తప్ప హాజరైన వారి బుర్రల్లో బలవంతంగా ఎక్కించటం లేదా వున్న వాటిని తొలగించటం కాదని రెడ్‌మే కార్యక్రమాల ప్రారంభ నిర్వాహకులలో ఒకరైన ఫిలిప్‌ హోల్‌స్టెట్టర్‌ అన్నారు. ఏడాదికి ఒక నెల పెట్టుబడిదారీ విధానం నుంచి సెలవు తీసుకుందాం, ఒక నెల పాటు కమ్యూనిస్టుగా వుందాం, భిన్నంగా ఆలోచిద్దాం, మిమ్మల్ని ఎవరూ మార్చేందుకు ప్రయత్నించరు అన్నారు.

Image result for communist China

కమ్యూనిజం గురించి అమెరికన్లను భయపెట్టేందుకు అక్కడి పాలకవర్గం అనుసరించని తప్పుడు ఎత్తుగడలు, ప్రచారాలు లేవు. అవే ఇప్పుడు వారి నోళ్లు మూతపడేట్లు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విశ్లేషణ ప్రారంభంలోనే అమెరికా యువత ట్రంప్‌ ప్రభుత్వ మాటలు, చేతలను విశ్వసించటం లేదు అని చెప్పుకున్నాము, అంటే విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. ‘దశాబ్దాల తరబడి చైనా గురించి అబద్దాలు చెప్పిన వారు మనకు ఇప్పుడు ఏదోఒకటి చెప్పాలి’ అనే శీర్షికతో అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక తాజాగా ఒక విశ్లేషణను ప్రచురించింది. తియన్మెన్‌ స్క్వేర్‌ ఘటనలకు మూడు దశాబ్దాలు నిండిన సందర్భంగా దాన్ని రాశారు.

తరతరాలుగా చైనా గురించి రాజకీయ పండితులు, ఆర్ధికవేత్తలు చేసిన విశ్లేషణలు, చెప్పిన జోశ్యాలను చైనా ఎలా వమ్ము చేసిందో, అవెలా తప్పో, చైనా సాధించిన విజయాలను పేర్కొంటూ ఆ విశ్లేషణ సాగింది. దానిలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా వుంది.కమ్యూనిజం అంటే ఎక్కడైనా ఒకటే అని అమెరికా విదేశాంగ విధానంలో పేర్కొన్నారు. ఆచరణలో వేర్వేరు అని సోవియట్‌, చైనాల అనుభవం తెలిపింది. నిక్సన్‌ చైనాతో సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనే వరకు రెండు దేశాలను ఒకే శత్రుశిబిరంలో వుంచారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత చైనా కంటే సహజవనరులు ఎక్కువగా వున్న ఆఫ్రికన్‌ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అమెరికా ఆర్ధికవేత్త జోశ్యం చెప్పారు. ఆ విషయంలో పప్పులో కాలేశారు. 1960లో కాంగోలో తలసరి జిడిపి 220 డాలర్లు వుండేది, అది నైజీరియా, చైనాలకు రెట్టింపు.2017నాటికి చైనా తలసరి జిడిపి 9000 డాలర్లకు అంటే నైజీరియా జిడిపికి నాలుగు రెట్లు, కాంగోకు 19రెట్లు ఎక్కువ. చైనా 1978లో నవీకరణ కార్యక్రమం చేపట్టిన తరువాత మానవజాతి చరిత్రలో అత్యంత వేగమైన అభివృద్ధిని నిలకడగా సాధించటమేగాక 85కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసింది.

ఆసియన్‌ టైగర్లని చెప్పిన జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాల మాదిరి అభివృద్ధి సాధించిన తరువాత మరింత ప్రజాస్వామికంగా తయారవుతుందని చెప్పారు. అది కూడా జరగలేదు.1989 నుంచి 1991 మధ్య కమ్యూనిస్టు దేశాలలో ప్రజాస్వామిక గాలి వీచింది, ప్రచ్చన్న యుద్దం ముగిసింది, కొంత మంది అయితే చరిత్ర ముగిసింది అని చెప్పారు.(ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే సోషలిజాన్ని వదులు కోవటం, చరిత్ర ముగిసింది అంటే కమ్యూనిస్టు చరిత్ర అని అర్ధం) అయితే అది తూర్పు ఐరోపాలో, ఇతర చోట్ల జరిగింది తప్ప చైనాలో కాదు. దీర్ఘకాలం అభివృద్ధితో పాటు పార్టీ అదుపు కూడా కొనసాగింది.చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేర్చితే అది కూడా పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ ప్రజాస్వామిక వ్యవస్ధల మాదిరి తయారవుతుందనే భావన 1989 నుంచి డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ ప్రభుత్వాలలో వుంది. అది కూడా జరగలేదు. చరిత్రలో అతి పెద్ద సంపద బదిలీ జరిగింది అని జాతీయ భద్రతా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ కెయిత్‌ అలెగ్జాండర్‌ 2012లోనే చెప్పారు. చైనా గురించి ఎంతో మంది ఎందుకిలా చెప్పారంటే విధాననిర్ణేతలు, మేథావులు సాధారణ సూత్రీకరణలు చెప్పారు కానీ చైనా పురాతన కాలంలోనూ నూతన ఆవిష్కరణలు చేసింది, ఆధునిక కాలంలోనూ దారిద్య్రం నుంచి బయటపడి ఒక ఆధునిక దేశంగా మారింది.1949 తరువాత కమ్యూనిస్టు నాయకత్వంలో ఒక గ్రామీణ దేశంగా వున్నదానిని ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘావేసే దేశాలతో సమంగా తయారైంది.

Image result for communist China

అమెరికా, చైనా నేతలకు మౌలికమైన తేడాలున్నాయి. అమెరికన్ల విషయానికి వస్తే జ్ఞాపకాలు స్వల్పకాలంలోనే అంతరిస్తాయి, కేంద్రీకరణలో నిలకడ వుండదు, ఒక సంక్షోభం నుంచి మరోసంక్షోభానికి ఎదురు చూస్తున్నట్లు వుంటుంది. వాషింగ్ట్‌న్‌లో బడ్జెట్‌ను ఆమోదించటం, దాని మీద కేంద్రీకరించటమే ఒక వీరోచిత చర్యగా చూస్తారు. అదే చైనా విషయానికి వస్తే దీనికి భిన్నంగా జ్ఞాపకాలు దీర్ఘకాలం వుంటాయి, కేంద్రీకరణ నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ పధకాలు దీర్ఘకాలానికి రూపొందిస్తారు.కృత్రిమ మేధస్సు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు చైనాలో సంవత్సరాల తరబడి పని చేస్తాయి. చైనా మిలిటరీ నవీకరణ 1990దశకంలో ప్రారంభమైంది.ఒక విమానవాహక యుద్ద నౌకను తయారు చేయటానికి చైనాకు ఎంత కాలం పడుతుందని ఒక నౌకాదళ అధికారిని అడిగితే సమీప భవిష్యత్‌లో అని చెప్పారు. దాని అర్ధం 2050 కొంత కాలం ముందు అని, ఆ జోశ్యం కూడా తప్పింది.(1985లో ఆస్ట్రేలియా పాతబడిన ఒక యుద్ద నౌకను తుక్కు కింద మార్చేందుకు చైనాకు విక్రయించింది. అలాంటి వాటిలో అన్ని కీలక విభాగాలను పునరుద్దరించటానికి వీల్లేని విధంగా పనికి రాకుండా చేసి ఇస్తారు. చైనా దానిని అలాగే వుంచి ఏ భాగానికి ఆభాగాన్ని విడదీసి తన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పరిశీలనకు అప్పగించింది. దాన్నే తన ప్రయోగాలకు వాడుకుంది. తరువాత రష్యా నుంచి మరో మూడు పాత యుద్ద నౌకలను కొనుగోలు చేసింది. వాటిని తుక్కు కింద మార్చకుండా ఒక దానిని విలాస హోటల్‌గానూ, మరొక దానిని సందర్శకులకు ఇతివృత్త పార్కుగా మార్చింది. మూడోదానికి మరమ్మతులు చేసి 2012లో తన తొలి విమాన వాహక యుద్ధ నౌకగా మిలిటరీకి అప్పగించింది. 2030 నాటికి అందుబాటులోకి వచ్చే దశలవారీ కనీసం అరడజను నౌకలను నిర్మిస్తోంది.) అమెరికా ప్రపంచ నాయకత్వం అనేది నడుస్తున్న చరిత్ర, అదే చైనా విషయానికి వస్తే 1840దశకం నాటి నల్లమందు యుద్ధాలకు ముందు అదొక పెద్ద శక్తి. వందసంవత్సరాల అవమానాల తరువాత తిరిగి అది ఒక శక్తిగా తయారవుతోంది. అనేక విధాలుగా అసాధారణంగా అది పెరుగుతోంది. చైనా గురించి చేసిన సాధారణ సూత్రీకరణలు, జోశ్యాల గురించి వివరించిన దాని కంటే ఎంతో అస్పష్టంగా వున్నాయి.

ఇండోచైనా, ఆగ్నేయ ఆసియాలో వియత్నాంపై భ్రాంతి పూర్వకమైన అంచనా కారణంగా అమెరికా 58వేల మంది సైనికులను బలి ఇచ్చుకోవాల్సి వచ్చిందంటూ ఒక విశ్లేషకుడు తాజాగా రాశాడు.1965 జూన్‌ తొమ్మిదిన అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ వియత్నాం మీదకు సైన్యాన్ని పంపుతున్నట్లు ప్రకటించిన రోజును గుర్తు చేస్తూ అమెరికా నాయకత్వ అంచనాలు ఎలా తప్పాయో, దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అమెరికా సైనికుల మరణాల గురించి తప్ప వారు వియత్నాంలో చేసిన దారుణాలు, మారణ కాండ ప్రస్తావన లేదు. వియత్నాం మన చేతుల నుంచి పోతే కంబోడియా పోతుంది, థాయ్‌లాండ్‌ పోతుంది, మలేసియా పోతుంది, ఇండోనేషియా పోతుంది, ఫిలిప్పినోస్‌ పోతుంది అంటూ సెనెటర్‌ గాలే మెక్‌గీ చెప్పారు. ఇలాంటి భ్రాంతికి అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ గురయ్యాడు. వుత్తర వియత్నాం కమ్యూనిస్టు దేశంగా వున్నందున దాన్ని అరికట్టి దక్షిణ వియత్నాంను కమ్యూనిస్టు ప్రభావంలోకి పోకుండా చూడాలనే ఎత్తుగడతో ముందుకు తెచ్చిన వున్మాదమది. వియత్నాంను అదుపు చేయకపోతే తమ దేశాలు కూడా కమ్యూనిజంలోకి పోతాయని భయపడి వియత్నాంపై యుద్ధానికి జత కలుస్తాయని అమెరికా భావించింది. అయితే దానికి విరుద్దంగా జరిగిందని, అమెరికా మాత్రం 58వేల మంది సైనికులను బలిపెట్టాల్సి వచ్చిందన్నది విశ్లేషకుడి సారాంశం.

Image result for College kids' distrust  Trump

ప్రపంచ పరిణామాల గురించి తమ నేతలు, విధాన నిర్ణేతలు చేసిన అనేక వూహాగానాలు, సిద్ధాంతాలు విఫలమయ్యాయని చెప్పే వారు అమెరికాలోనే పెరగటం ఇటీవలి కాలంలో వూపందుకుంటున్న పరిణామం. అందుకే యుద్ధాలకు పాల్పడినప్పటికీ తమ సైనికులను అక్కడికి పంపకూడదని, ఒక ప్రాణం పోయినా సమాజంలో తీవ్ర ప్రతికూలత ఎదురవుతుందని సామ్రాజ్యవాదులు భయపడుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా యుద్ధాలు చేయాలని చూస్తున్నారు. అమెరికా నేతల గురించి యువతలో నమ్మకం లేకపోవటం, మీడియాలో ఇలాంటి చర్చ జరగటానికి సంబంధం వుంది. ఏది ముందు, ఏది వెనుక అనే చర్చ కంటే జరుగుతున్న పరిణామాలు పురోగామి శక్తులకు ఎంతో విశ్వాసాన్ని కలిగించేవి అనటంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఇవి ఏ రూపం తీసుకుంటాయని జోశ్యం చెప్పలేము గాని సోషలిజం, కమ్యూనిజాల మీద విశ్వాసం తగ్గుతున్న రోజుల్లో ఇవి ఆశారేఖలు అనటం నిస్సందేహం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో వున్న పురోగామి, వామపక్ష ప్రభావాన్ని చూసిన కారణంగానే మన దేశంలోని కాషాయ దళాలు జెఎన్‌యు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటివాటి మీద తప్పుడు ప్రచారాలు చేయటంతో పాటు వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించాలి. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం చెందుతున్న పూర్వరంగంలో అమెరికా సామ్రాజ్యవాదులకే వామపక్ష భావజాల వ్యాప్తిని అరికట్టటం సాధ్యం కాలేదు. అలాంటిది మన దేశంలో కాషాయదళాల వల్ల అవుతుందా ? అమెరికాలో కమ్యూనిస్టులం అని చెప్పుకొని పని చేసే పరిస్ధితుల్లేని రోజుల నుంచి అవును మేం సోషలిస్టులం, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగలవచ్చు. వివిధ కారణాలతో తాత్కాలికంగా కమ్యూనిస్టులకు ఓటు వేయకపోవచ్చుగానీ అమెరికా సమాజంలో మాదిరి మన దేశంలోని కష్టజీవుల్లో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. వారి త్యాగాలను మరచిపోలేదు. జనంలో పోయిన పునాదిని తిరిగి పొందటం ఎలా అన్నదే అభ్యుదయవాదులు, కమ్యూనిస్టుల ముందున్న సవాలు ! చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికి వున్న చేపలు ఎదురీదుతాయి. కమ్యూనిస్టులూ అంతే !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందే వెల్లడైన వెనెజులా ప్రతిపక్ష కుట్ర !

06 Monday May 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, cia, Juan Guaidó, Nicolás Maduro, operation liberty coup, Venezuela

Image result for operation liberty coup unveiled weeks before

ఎం కోటేశ్వరరావు

వెనెజులా పరిణామాలు 2

ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన జరిపిన తిరుగుబాటు యత్నం విఫలం కావటంతో ఇప్పుడు వెనెజులా ప్రతిపక్ష నేత జువాన్‌ గుయ్‌డో అమెరికా ప్రత్యక్షంగా మిలిటరీ జోక్యంచేసుకోవాలని కోరుతున్నాడు. తమ నడకలో ఎలాంటి తడబాట్లు లేవని, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. మరోవైపు గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని కారకాస్‌లోని స్పెయిన్‌ రాయబారి ఇంట్లో ఆశ్రయం పొందిన ప్రతిపక్ష నేత లియోపాల్డ్‌ లోపెజ్‌ను అరెస్టు చేయాలని వెనెజులా సర్కార్‌ నిర్ణయించింది. అతను రాజకీయ ఆశ్రయం కోరలేదని తాము ఆతిధ్యం మాత్రమే ఇస్తున్నామని స్పెయిన్‌ ప్రకటించింది.

వెనెజులా వ్యవహారాల్లో అమెరికా జోక్యం నిత్యకృత్యం అన్న విషయం తెలిసినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త పధకాలు వేస్తూనే వుంటారు. ఆపరేషన్‌ లిబర్జీ పధకం కూడా అలాంటిదే. మధ్యంతర అధ్యక్షుడిగా జువాన్‌ గుయ్‌డో ప్రకటించుకోవటం, అతగాడి ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలతో దాన్ని గుర్తింప చేయటం, మదురో సర్కార్‌ నియమించిన రాయబారులను గుర్తించటం లేదని ప్రకటించటం వగైరాలన్నీ అంతర్జాతీయంగా వెనెజులాలో ప్రభుత్వం మారిపోయిందని, మదురో ఇంకేమాత్రం అధ్యక్షుడు కాదని ప్రపంచాన్ని నమ్మింపచేయటం ఈ పధకంలో భాగమే. దీన్ని అనేక దశల్లో అమలు జరిపారు. విఫలమైన అంకం ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి దేశంలో అంతర్గతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేయటం, మిలిటరీని తన వైపు రమ్మని కోరటం, తిరుగుబాటు చేయాలని అమెరికా పిలుపు ఇవ్వటం వంటి వన్నీ దానిలో భాగమే. కుట్రను గొప్పగా రూపొందించిన వారికి దాన్ని అనుసరించటానికి వెనెజులా జనం సిద్ధంగా లేరనే స్పృహ లేదు. అక్కడే పప్పులో కాలేశారు.

ఈ పధకంలో భాగంగా అమలు జరపాల్సిన వాటి మీద అమెరికాకు చెందిన సిఐఏ, యుఎస్‌ ఎయిడ్‌, ఎన్‌ఇడి వంటి వాటికి బాధ్యతలు అప్పగించారు. యుఎస్‌ ఎయిడ్‌ రూపొందించిన పలు దేశాలకు రూపొందించిన కార్యాచరణ పధకానికి సంబంధించిన పత్రం ఫిబ్రవరిలోనే వెల్లడైంది. ఆ సంస్ధకు అనుబంధంగా పనిచేసే ‘ యుఎస్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ లాబ్‌ ‘ 75పేజీల పత్రాన్ని రూపొందించింది. దానికి రాపిడ్‌ ఎక్స్‌పెడిషనరీ డెవలప్‌మెంట్‌(ఆర్‌ఇడి)(రెడ్‌) టీమ్స్‌: డిమాండ్‌ అండ్‌ ఫీజ్‌బులిటీ అని పేరు పెట్టింది.( వేగంగా దండయాత్ర నిర్వహించే బృందాలు: అవసరం మరియు సాధ్యాసాధ్యాలు) ఈ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం వివిధ దేశాలలో రహస్య కార్యకలాపాలు నిర్వహించే సామర్ధ్యం గురించి అమెరికా మిలిటరీ, గూఢచార తదితర అధికారులు నివేదికను రూపొందించిన వారిని ఇంటర్వ్యూ చేశారు. ఒక్కో బృందం ఇద్దరిద్దరితో వుండాలని, ఎదురుదాడి, ఆత్మరక్షణ పద్దతులను, ప్రతికూల పరిస్ధితుల్లో ఎలా పని చేయాలో వాటికి నేర్పాలని అవి అమెరికా ప్రత్యేక దళాలు(ఎస్‌ఎఫ్‌) మరియు సిఐఏ పర్యవేక్షణలో పని చేయాలని నిర్దేశించారు. ఇవి స్ధానిక సామాజిక తరగతుల మధ్య అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. స్ధానికంగా వున్న పరిస్దితులను గమనించటం వాటికి అనుగుణంగా వెంటనే స్పందించి పధకాలు రూపొందించటం, నిధులు అందచేయటం, చిన్న చిన్న కార్యకలాపాల నిర్వహణ చేస్తాయి. వీటిలో సామాజిక కార్య క్రమాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే పేరుతో బోధలతో పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించటం కూడా వుంటాయి. దేశమంతటా స్వేచ్చ మరియు సహాయ కమిటీలను దేశ వ్యాపితంగా ఏర్పాటు చేయాలి. రెడ్‌ టీమ్స్‌ పైకి వుత్ప్రేరకాలుగా కనిపించాలి, వాటికి సామాజిక తరగతులను సమీకరించే పద్దతులు, చిట్కాలతో పాటు ఎదురుదాడి, ఆత్మ రక్షణకు ఆయుధాలను ఎలా వినియోగించాలో కూడా శిక్షణ ఇస్తారు. వారు స్ధానికులతో సంబంధాలను నెలకొల్పుకొని వారి ద్వారా మరికొందరిని ప్రభావితం చేసేందుకు, ప్రలోభపరచేందుకు వారి బలహీనతలను గుర్తించి డబ్బు,ఇతర వాటిని ఎరవేస్తారు. ఒకసారి వారి వలలో చిక్కిన తరువాత తమకు నిర్ధేశించిన రహస్యకార్యకలపాలలో నిమగ్నం చేస్తారు. ఈ అంశాలన్నీ ప్రతి దేశంలో అమలు జరపాల్సిన నమూనాలో భాగం. ఈ పధకాన్ని దక్షిణ అమెరికా దేశాలన్నింటా అమలు జరపాలి. ముందుగా అమెరికా పట్ల సానుకూలంగా వుండే ప్రభుత్వాలున్న దేశాలను ఎంచుకోవాలి. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు జరిపేందుకు బ్రెజిల్‌ను ఎంచుకోవాలని సూచించారు.

ఈ ఏడాది జనవరిలో బ్రెజిల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఫాసిస్టు జెయిర్‌ బల్‌సానారో అమెరికాతో సంబంధాల ఏర్పాటు గురించి బహిరంగంగానే చెప్పాడు. సిఐఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి బ్రెజిల్‌ అధ్యక్షుడయ్యాడు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ గతం కంటే తమ మధ్య సంబంధాలు బలపడ్డాయని, బ్రెజిల్‌ నాటోలో చేరాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తరువాత బొల్‌సానారో ఫిబ్రవరిలో ఒక ప్రకటన చేస్తూ తమ గడ్డ మీద నుంచి అమెరికా మరో దేశంలో సైనిక జోక్యం చేసుకోవటాన్ని తాము అనుమతించబోమని ప్రకటించాడు. అయితే తండ్రికి సలహాదారు, పార్లమెంట్‌ సభ్యుడైన ఎడ్వర్డ్‌ బొల్‌సానారో మార్చినెలలో మాట్లాడుతూ ఏదో ఒక సమయంలో వెనెజులాలో సైనిక జోక్యం అవసరమని, అన్ని అవకాశాలున్నాయని చెప్పాడు. అయితే బ్రెజిల్‌ నుంచి ప్రత్యక్ష జోక్యం చేసుకొనే అవకాశం లేకపోతే అక్కడి నుంచి రెడ్‌ బృందాలు రహస్య కార్యకలాపాలను నిర్వహించాలని సిఐఏ సూచించింది.

Image result for Venezuela 2 : operation liberty coup unveiled weeks before

నివేదికలో వెనెజులాలో నిర్వహించాల్సిన అంశాలను కూడా అనుబంధాలలో పొందుపరిచారు. ఏప్రిల్‌ ఆరవ తేదీన ఆపరేషన్‌ ఫ్రీడమ్‌ లేదా లిబర్టీ ప్రారంభమౌతుందని వాటిలో పేర్కొన్నారు. కాన్వాస్‌ అనే సంస్ధ అమెరికా నిధులతో వెనెజులాలో ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించాలో జువాన్‌ గుయ్‌డోకు శిక్షణ ఇచ్చింది. దేశంలోని కీలకమైన వ్యవస్ధలను ధ్వంసం చేయటం ద్వారా మదురో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తిని రెచ్చగొట్టటం వాటిలో ఒకటి. దానికి అనుగుణంగానే కొద్ది వారాల క్రితం వెనెజులా విద్యుత్‌ వ్యవస్ధను దెబ్బతీసి అంధకారం గావించిన విషయం తెలిసిందే. ఇలాంటి సలహాలు, ఎత్తుగడలు అమెరికా జోక్యం చేసుకొనే అన్నిదేశాలకూ సూచించారు. చిత్రం ఏమిటంటే వుదాహరణకు అని చెప్పినట్లుగా వెనెజులాలోని గౌరి డామ్‌ వద్ద వున్న సైమన్‌ బోలివర్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీస్తే పర్యవసానాలు ఎలా వుంటాయో వివరించారు.

ఆపరేషన్‌ లిబర్టీలో ఒక అంశం నిర్ణయాత్మక దశ అని పేరు పెట్టారు. దాన్ని ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీల్లో అమలు జరపాలని చూశారు. దాని ప్రకారం ఏం జరిగిందో కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరణ సారాంశం ఇలావుంది.ఆపరేషన్‌ లిబర్టీలో భాగంగా ఏప్రిల్‌ 30వ తేదీ తెల్లవారు ఝామున 5.46 నిమిషాలకు కొంత మంది సైనికుల రక్షణగా కెమెరా ముందు నిలబడిన లియోపాల్డ్‌ లోపెజ్‌ మాట్లాడుతూ పౌరులు వీధుల్లో ప్రదర్శనలుగా రావాలని, జువాన్‌ గుయ్‌డో వేచి వున్న లా కార్లోటా వైమానిక స్ధావరం వద్ద అందరం కలసి అక్కడి నుంచి మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కదులుదామని చెప్పాడు. ఆ తరువాత అర్ధగంటకు తాను నిర్బంధం నుంచి విముక్తి అయ్యానని, గుయ్‌డోకు విధేయులుగా వున్న సైనికులు తనను విడిపించారని ఇది నిర్ణయాత్మక దశ అని విజయానికి ఇదే తరుణం అన్నాడు. కొద్ది సేపటికి తాను వైమానిక స్ధావరం వద్దకు వచ్చానని చెప్పాడు. అయితే పంపిన ఫొటోలు దాని వెలుపల రోడ్డుమీదివి తప్ప మరొకటి కాదు. వుదయం 8.30కు తుపాకి కాల్పులు వినిపించాయి. ఎవరు ఎవరి మీద కాల్చారో తెలియని స్ధితి. మధ్యాహ్నానికి రోడ్ల మీద కొన్ని వుందల మందే వున్నారు. అక్కడి నుంచి ప్రదర్శన జరుపుదామని గుయ్‌డో, లోపెజ్‌ జనంతో చెప్పారు. ఆ సమీపంలోనే అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌, తదితర ప్రభుత్వ భవనాలు వున్నాయి. అటువైపు ప్రదర్శన సాగాలని చెప్పిన తరువాత భద్రతా దళాలు ప్రదర్శకులను అడ్డుకున్నాయి. రెండు గంటల సమయంలో నేషనల్‌గార్డ్స్‌, బొలివేరియన్‌ పోలీస్‌లు ప్రదర్శకులపై కాల్పులు జరిపారు. కొద్ది మంది గాయపడటం తప్ప ఎవరూ మరణించలేదు. సాయంత్రానికి కొద్ది మంది నిరసనకారులు అక్కడే వున్నారు.ఎక్కువ మంది వెళ్లిపోయారు.

తన ప్రయత్నం విఫలమైందని అర్ధం కాగానే గుయ్‌డో మే ఒకటవ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చాడు. మరోవైపు లోపెజ్‌ కారకాస్‌లోని చిలీ రాయబార కార్యాలయంలో వున్న తన భార్యాబిడ్డలను తీసుకొని స్పానిష్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి ఆశ్రయం కోరాడు. అయితే వారు కార్యాలయానికి బదులు రాయబారి ఇంట్లో రక్షణ ఇచ్చారు. వారం రోజులుగా ఇప్పటికి అక్కడే వున్నాడు. ఇరవై అయిదు మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. గుయ్‌డో గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయాడు. తొలి రోజు ఒకడు మరణించినట్లు,59 మంది గాయపడినట్లు వార్తలు వచ్చాయి. రెండవ రోజు మే డే నాడు కొన్ని చోట్ల గుయ్‌డో మద్దతుదార్లు ఘర్షణలకు దిగారు. పోలీసు కాల్పుల్లో ఒక యువతి గాయపడి తరువాత ఆసుపత్రిలో మరణించింది. అంతకు ముందు రోజు రాత్రే తిరుగుబాటును అణచివేసినట్లు మదురో ప్రకటించాడు. మే డే రోజున పెద్ద ఎత్తున ఆయన మద్దతుదార్లు వీధుల్లో అనేక చోట్ల ప్రదర్శనలు జరిపారు. తిరుగుబాటుదార్లు, వారి నేతలు గుయ్‌డో, లోపెజ్‌ల పట్ల మదురో సర్కార్‌ ఎంతో సంయమనం పాటించిందన్నది స్పష్టం. లేకుంటే వారు అంత స్వేచ్చగా కారకాస్‌ శివార్లలో తిరిగే వారు కాదు. తప్పుదారి పట్టిన పౌరుల పట్ల కూడా భద్రతా దళాలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. భారీ ఎత్తున కాల్పులు జరిగాయని పశ్చిమ దేశాల మీడియా వార్తలు ఇచ్చింది. అయితే తరువాత అందుకు తగిన ఆధారాలు లేకపోవటంతో గప్‌చుప్‌ అయ్యాయి. తరువాత ఏమిటి అంటూ సమస్యను పక్కదారి పట్టించే కధనాలను ఇస్తున్నాయి. మచ్చుకు ఒకదాన్ని చూస్తే చాలు.

Image result for operation liberty coup

వెనెజులా పౌరులు పోగొట్టుకున్న తమ స్వాతంత్య్రం కోసం వీధుల్లోకి పెద్ద ఎత్తున వచ్చివుంటే ఎందరో మరణించి వుండేవారు. ఛావెజ్‌ను ఎన్నుకొని వారు పెద్ద తప్పు చేశారు. ఇరవై ఏండ్ల సోషలిజపు వినాశకర ప్రభావాలను చూస్తున్నారు. దశాబ్దకాలంగా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. ప్రజాస్వామిక స్వేచ్చలను అణచివేశారు. భావ ప్రకటనా స్వేచ్చ, స్వతంత్ర మీడియా అదృశ్యమైంది. సమాజంలోని ప్రతి స్ధాయిలో క్యూబా గూఢచారులను నింపివేశారు. దేశాన్ని ఒక పోలీసు రాజ్యంగా మార్చివేశారు. చివరకు మదురో వ్యక్తిగత అంగరక్షకులుగా భారీ సంఖ్యలో రష్యన్‌ సాయుధులు వచ్చారు. వెనెజులా మిలిటరీ ప్రస్తుత నాయకత్వాన్ని బలపరచి ప్రయోజనం లేదని గ్రహించి తిరుగుబాటు చేసే వరకు రష్యా, చైనా మదురోకు మద్దతు ఇస్తూనే వుంటాయి. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పటం తొందరపాటు అవుతుంది.

ఇలా చెత్త రాతలన్నీ రాస్తున్నాయి. వాటన్నింటినీ దేవదూతల సందేశాలుగా భావించిన వారు ప్రచారంలో పెడుతున్నారు. ఆపరేషన్‌ లిబర్టీ కుట్ర ముందే వెల్లడి కావటంతో మదురో సర్కార్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవటం కూడా జయప్రదంగా దాన్ని తిప్పి కొట్టటానికి దోహదం చేసిందనవచ్చు. వాస్తవం ఏమిటో అనుభవించిన వారికి స్పష్టంగా తెలుసు, ప్రతిపక్ష నాయకుల గురించి కూడా వారికి చెప్పనవసరం లేదు. అయితే అమెరికన్లు తెగించి ప్రత్యక్ష సైనిక చర్యకు పాల్పడతారా, మరోసారి మిగతా దేశాలలో మాదిరి చేతులు కాల్చుకుంటారా అన్నది వచ్చే ఎన్నికలలో లబ్ది కోసం డోనాల్ట్‌ ట్రంప్‌ చేసే పిచ్చి ఆలోచనలను బట్టి వుంటుంది. ఒక వేల ప్రత్యక్ష జోక్యం చేసుకుంటే అది లాటిన్‌ అమెరికాలో, ప్రపంచంలో మరో కొత్త పరిణామాలకు నాంది అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా వత్తిడికి లొంగిన అపర జాతీయవాది నరేంద్రమోడీ !

25 Thursday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Donald Trump diktats, INDIA, iran, Iran Oil, Narendra Modi, US SANCTIONS

Image result for narendra modi surrendered to donald trump diktats

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌, అమెరికా మధ్య రెండు ఖండాలు, పన్నెండు వేల కిలోమీటర్ల దూరం వుంది. అమెరికాతో పోల్చితే ఇరాన్‌ సైనిక శక్తి లేదా ఆయుధాలు ఒక రోజు యుద్ధానికి కూడా సరిపోవు. అలాంటి దేశం తమకు, పశ్చిమాసియాకు ముప్పుగా పరిణమిస్తోందని, అందువలన మేనెల రెండవ తేదీ తరువాత దాని దగ్గర వున్న ముడి చమురును కొన్నవారి తాట తీస్తా అంటూ అమెరికా హెచ్చరించింది. ఆ మాత్రానికే మన దేశ పాలకులకు బట్టలు తడుస్తున్నాయి. అంతవరకు ఎందుకు లెండి, కొనుగోళ్లను బాగా తగ్గించాం, ఇక ముందు పూర్తిగా నిలిపివేస్తాం, ఇప్పటికే ప్రత్యామ్నాయం చూసుకొన్నాం అని చేతులేత్తేశాం. అంతమాట అన్నావు కదా ఇప్పుడు చెబుతున్నాం ఇంతకు ముందు కొన్నదాని కంటే ఎక్కువ కొనుగోలు చేస్తాం, ఏమి చేస్తావో చేసుకో చూస్తాం అని చైనా తాపీగా జవాబు చెప్పింది. హెచ్చరికలు అందుకున్న దేశాలలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలాగూ అమెరికా అడుగులకు మడుగులత్తుతాయి, అటూ ఇటూ తేల్చుకోలేక టర్కీ మల్లగుల్లాలు పడుతోంది. అమెరికా ప్రకటన కొత్తదేమీ కాదు గతంలోనే చేసినప్పటికీ ఏదో మీరు మిత్రదేశాలు కనుక కొద్ది నెలలు ఆంక్షలను సడలిస్తున్నాం, ఆలోగా తేల్చుకోండి అని గతేడాది చివరిలో చెప్పింది. ఇప్పుడు తాజాగా మే రెండవ తేదీతో గడువు ముగుస్తుంది అని ప్రకటించేసింది.

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అది గల్లీ, ఢిల్లీ, వాషింగ్టన్‌ ఏదైనా కావచ్చు. అమెరికా చివరి క్షణంలో మరోసారి గడువు పెంచుతుందా? ఎందుకంటే మన దేశంతో సహా ప్రభావితమయ్యే దేశాలన్నీ బహిరంగంగానో, తడిక రాయబారాలో చేస్తున్నాయి. వారం రోజుల గడువుంది. అమెరికా అంటే డాలర్లు. ప్రతిదానిలో తనకెన్ని డాలర్ల లాభమా అని చూసుకుంటుంది. అందుకే ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజులుగా అమెరికన్ల ప్రకటనలను బట్టి ఇరాన్‌తో రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నదనే భావం కలుగుతోంది కనుక, దాని పూర్వరంగం, పర్యవసానాల గురించి చూద్దాం.

ఇరాన్‌ మీద ఎందుకీ ఆంక్షలు ?

ప్రపంచంలో ఏకీభావం లేని అంశాలలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందం(ఎన్‌పిటి) ఒకటి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు ఈ ఒప్పందం వర్తించదు, మిగతా దేశాలు మాత్రం అణ్వస్త్రాలను తయారు చేయకూడదనేది అప్రజాస్వామిక, అవి లేని దేశాలను బెదిరించే వైఖరి తప్ప మరొకటి కాదు. అందుకే మన దేశం వంటివి ఆ ఒప్పందం మీద సంతకాలు చేయకుండా ఆత్మ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును అట్టిపెట్టుకున్నాయి. ఇరాన్‌ 1970లోనే ఆ ఒప్పందంపై సంతకం చేసింది. అలాంటి దేశాల అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు అనువైనదిగా వుండాలి తప్ప ఆయుధాలు తయారు చేయకూడదు. ఇరాన్‌ ఆ నిబంధనలను వుల్లంఘిస్తున్నదనే ఆరోపణల పూర్వరంగంలో చాలా సంవత్సరాల సంప్రదింపుల తరువాత 2015లో ఇరాన్‌-భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాలు, కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ(ఐఏఇఏ) పర్యవేక్షణలోకి తేవాలి. దానికి ప్రతిగా అంతకు ముందు అమెరికన్లు స్దంభింపచేసిన ఇరాన్‌ ఆస్ధులను విడుదల చేయాలి, ఆంక్షలను ఎత్తివేయాలి. అయితే ఒప్పందంలోని మిగతా దేశాలతో నిమిత్తం లేకుండా కుంటి సాకులతో 2018లో అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అప్పటి నుంచి ఆంక్షలను మరింత కఠినతరం గావించేందుకు, అందుకు ఇతర దేశాలను కూడా తనకు మద్దతు ఇచ్చేందుకు వాటి మీద చమురు ఆయుధంతో వత్తిళ్లు, బెదిరింపులకు పూనుకుంది. ఇరాన్‌ చమురు సొమ్ముతో పశ్చిమాసియాలో గత నాలుగు దశాబ్దాలుగా అస్ధిర పరిస్ధితులకు కారణం అవుతోందని, అందువలన ఆ సొమ్ముదానికి అందకుండా చేయాలని అమెరికా చెబుతోంది. అదే సరైనది అనుకుంటే ప్రపంచవ్యాపితంగా అనేక ప్రాంతాలలో అస్ధిర పరిస్ధితులకు కారణం అమెరికా, మరి దాని మీద ప్రపంచమంతా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదా ?

కమ్యూనిస్టు అంటే ప్రతిఘటన, ప్రజాస్వామ్యం అంటే లొంగిపోవటమా !

కొంత మంది దృష్టిలో చైనా కమ్యూనిస్టు నియంతృత్వదేశం. అమెరికా అపర ప్రజాస్వామిక దేశం. అయితే సదరు దేశ పాలకులు కమ్యూనిస్టు చైనాతో పాటు తోటి ప్రజాస్వామిక, మిత్ర దేశాలుగా పరిగణించే భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, టర్కీ మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. కమ్యూనిస్టు చైనా మాత్రమే అవి మాదగ్గర పనిచేయవు అని చెప్పింది. వీర జాతీయవాదులమని చెప్పుకొనే బిజెపి నాయకత్వంలోని మన ప్రభుత్వం మాత్రం అమెరికా గుడ్లురుమగానే సలాం కొట్టి వేరే దేశాల నుంచి అధిక ధరలకు చమురు కొనుగోలుకు పూనుకుంది. ఎంతకు కొంటే అంత వసూలు చేయాలనే విధానం అమలవుతోంది గనుక డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ కౌగిలింతలు, కలయికలకు ఎలాంటి అంతరాయం వుండదు, జేబుల్లో డబ్బులు పోగొట్టుకొనేది వినియోగదారులే. పెట్రోలు, డీజిలు ధరలు పెరిగినా, వాటి ప్రభావం పరోక్షంగా పడినా అనుభవించేంది జనాభాలో నూటికి 80శాతంగా వున్న బడుగు, బలహీనవర్గాలే అన్నది తెలిసిందే. ట్రంప్‌ సంతోషం లేదా అమెరికా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకోసం పేద, మధ్యతరగతి వారిని బలిపెడతారా ? దీన్ని దేశభక్తి అనాలా లేక మరొకటని వర్ణించాలా?

ప్రపంచంలో మన దేశంతో సహా అనేక దేశాలలో అణ్వాయుధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఒక వాదన ప్రకారం ఏ దేశంలో అణువిద్యుత్‌ కేంద్రం వుంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు తయారు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం, అణుశక్తి వున్నట్లే లెక్క. అణ్వాయుధాలున్న మిగతా దేశాలన్నీ తాముగా ముందుగా ప్రయోగించబోమని ప్రకటించాయి, మరోసారి ప్రయోగించబోమని అమెరికా ఇంతవరకు చెప్పలేదు. అందువలన దాని బెదిరింపులకు లేదా ఇతరత్రా ప్రమాదాలు వున్న ప్రతి దేశం అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మనం ఆపని చేసినపుడు మన మిత్ర దేశం అదే పని చేస్తే తప్పేమిటి అన్నది ఆలోచించాలి. అయినప్పటికీ తాను అణ్వాయుధాలు తయారు చేయనని ఇరాన్‌ ఒప్పందాన్ని అంగీకరించినా వుల్లంఘిస్తోందని ఆధారాలు లేని ఆరోపణలతో అమెరికా పేచీలకు దిగుతోంది. మనం ఎందుకు సమర్ధించాలి? ఒప్పందంలో భాగస్వాములైన మిగతా దేశాలకు లేని అభ్యంతరాలు అమెరికాకు ఎందుకు ?

ఇరాన్‌ మీద ఆంక్షలు అమలు జరిగితే పర్యవసానాలు ఏమిటి ?

ఒక దేశం మీద ఆంక్షలు అమలు జరిపినంత మాత్రాన అది అణ్యాయుధ కార్యక్రమాన్ని వదలివేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇరాన్‌తో పోలిస్తే పాకిస్ధాన్‌ చాలా పేద దేశం. అదే అణ్వాయుధాలు,క్షిపణులు తయారు చేయగలిగినపడు ఇరాన్‌కు ఎందుకు సాధ్యం కాదు? గతంలో అణు పరీక్షలు జరిపినపుడు మన దేశం మీద కూడా అమెరికా ఆంక్షలు అమలు జరిపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోయాము.క్షిపణులు తయారు చేశాము, వాటిని జయప్రదంగా ప్రయోగించాము. తాజాగా ఐదున్నరవేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఆయుధాన్ని కూడా జయప్రదంగా ప్రయోగించాము. అయితే దాన్నింకా ఎంతో మెరుగుపరచాల్సి వుందనుకోండి. అదేమీ పెద్ద సమస్య కాదు. ఇలాంటి మన దేశం మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కించపరిచే విధంగా అమెరికా ఆంక్షలకు లంగిపోయి వేరే దేశాల నుంచి చమురు కొనుగోలు చేయటం ఏమిటి? మనం వెనిజులా నుంచి కూడా చమురు కొంటున్నాం. ఆదేశం మీద కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. దాన్నుంచి కూడా కొనుగోలు ఆపేయాల్సిందే అంటే ఆపటమేనా, రేపు సౌదీ అరేబియాతో తగదా వచ్చి దాన్నుంచి కూడా కొనుగోలు చేయవద్దంటే మన పరిస్ధితి ఏమిటి ? మన అవసరాలకు 80శాతం విదేశాల మీద ఆధారపడుతున్న స్ధితిలో చమురు దేశాలతో మిత్రత్వం నెరపాలి తప్ప అమెరికా కోసం శతృత్వాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? అమెరికాకు లంగిపోవటమే మన విధానమా, దానితో సాధించేదేమిటి? మన యువతీ యువకులకు వీసాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఎగుమతులకు ఇచ్చిన దిగుమతి పన్ను మినహాయింపులను రద్దు చేశారు.

వినియోగదారుల మీద పడే భారం ఎంత !

అమెరికా ఆడుతున్న రాజకీయాల కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌ ప్రభావితం అవుతోంది. ధరలు పెరుగుతున్నాయి, 2018 నవంబరు రెండవ తేదీన భారత్‌ాఇరాన్‌ ప్రభుత్వాలు కుదుర్చుకున్న అవగాహన ప్రకారం అంతకు ముందున్న ఏర్పాట్ల ప్రకారం నలభై అయిదు శాతం రూపాయల్లో, 55శాతం యూరోల్లో ఇరాన్‌ చమురుకు చెల్లించాలన్న ఒప్పందాన్ని సవరించి సగం మొత్తం రూపాయల్లో చెల్లించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అవగానకు వచ్చిందని రాయిటర్స్‌ సంస్ధ తెలిపింది. గతంలో అమెరికా ఆంక్షలున్నప్పటికీ ఇరాన్‌కు మన దేశం వ్యవసాయ వుత్పత్తులు, ఆహారం, ఔషధాలు, వైద్యపరికరాలను ఎగుమతులు చేయవచ్చు. ఇప్పుడు రూపాయల్లో చెల్లించే అవకాశం లేదు. ఇరాన్‌కు వెళ్లే ఎగుమతులూ నిలిచిపోతాయి. మరోవైపు మార్కెట్లో డాలర్లను కొనుగోలు చేసి మొత్తం చమురు కొనుగోలు చేయాలి. ఇది మన విదేశీమారక నిల్వలు, రూపాయి విలువ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్నింటికీ మించి అమెరికా చర్యల వలన చమురు ధరలు పెరుగుతాయి. ఇరాన్‌ పట్ల కఠిన వైఖరి అవలంభించనుందనే అంచనాల పూర్వరంగంలో గత రెండు నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. నవంబరు తరువాత అమెరికాలో ఒక గ్యాలన్‌ (3.78 లీటర్లు)కు మూడు డాలర్ల మేర ఇప్పుడే ధరలు పెరిగాయి. తొమ్మిది వారాలుగా గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతూనే వున్నాయి.అక్కడి జనానికి ఆదాయం వుంది కనుక వారికి ఒక లెక్కకాదు. మనం దిగుమతి చేసుకొనే చమురు డిసెంబరు నెలలో సగటున ఒక పీపా ధర 57.77 డాలర్లు వుండగా మార్చినెలలో అది 66.74డాలర్లకు పెరిగింది. మార్చి ఎనిమిదవ తేదీన మన రూపాయల్లో 3,922 వుండగా ఇప్పుడు 4,620కి అటూఇటూగా వుంది. ఇంకా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. పీపా ధర ఒక డాలరు పెరిగితే మన వినియోగదారుల మీద మనం దిగుమతి చేసుకొనే చమురు ఖర్చు పదకొండువేల కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా.

మన ప్రత్యామ్నాయ వనరులంటే ఏమిటి ?

మే నెల రెండు నుంచి ఆంక్షల మీద మినహాయింపులు రద్దు చేస్తామని, వుల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించగానే మన అధికారులు దాని వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగాయని ప్రకటించారు. అమెరికా సంగతి తెలిసిన మన అధికారులు చమురు ధరలు తక్కువగా వున్నపుడు సాధారణంగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నదానికంటే ఎక్కువగా దిగుమతులు చేసుకొని మంగళూరు తదితర చోట్ల పెద్ద ఎత్తున నిలవ చేశారు. అది కొద్ది రోజులు లేదా వారాలు వినియోగదారుల మీద భారం మోపకుండా చూడవచ్చు. అయితే ఇదంతా ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆ సమయంలో ధరలు పెరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాటన్నది కొందరి అభిప్రాయం. అందుకే మే 19వ తేదీ చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతారని, అప్పటి వరకు పెంచవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు చెబుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదేమాదిరి జరిగింది. ఇదొక అంశమైతే ఇటీవలి వరకు అమెరికా తన అవసరాల కోసం చమురు దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు తన భూభాగం మీద వున్న షేల్‌ ఆయిల్‌ను తీయటం ప్రారంభించిన తరువాత అది ఎగుమతి దేశంగా మారింది. దానిలో భాగంగానే అది మన దేశానికి గత రెండు సంవత్సరాలుగా చమురు ఎగుమతి చేస్తోంది. పశ్చిమాసియా చమురు నిల్వలు, వాణిజ్యం మీద పట్టుపెంచుకోవటం, క్రమంగా తన షేల్‌ అయిల్‌ వుత్పత్తి పెంచుతూ ఆమేరకు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించుకోవాలన్నది దాని తాజా ఆలోచన. ఇరాన్‌పై ఆంక్షలు, ఇతర దేశాలను బెదిరించటం దీనిలో భాగమేనా అన్నది ఆలోచించాలి.తన చమురుకు మార్కెట్‌ను పెంచుకోవటంతో పాటు ధరలు ధరలు పెరగటం కూడా దానికి అవసరమే.ఇదే జరిగితే అన్నిదేశాలూ దానికి దాసోహం అనాల్సిందేనా ?

Related image

ఇరాన్‌ నిజంగా ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందా ?

అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే వుపయోగించాలన్న షరతులను ఇరాన్‌ వుల్లంఘిస్తోందా అన్న ప్రశ్నకు లేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ(ఐఎఇఏ) అధిపతి యుకియా అమానో చెప్పారు.అణు ఒప్పందానికి భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని, అయితే తాము జాగ్రత్తగా పర్యవేక్షించాలని అన్నారు. ఇరాక్‌ అధిపతి సద్దాం హుస్సేన్‌ మానవాళిని అంతం చేసేందుకు అవసరమైన పెద్ద మొత్తంలో మారణాయుధాలను గుట్టలుగా పేర్చాడని అమెరికా ప్రచారం చేయటమే కాదు, ఇరాక్‌పై దాడి చేసి సద్దాంను హత్య చేసిన విషయం కూడా తెలిసిందే. లిబియాలో కల్నల్‌ గడాఫీ మీద కూడా అలాంటి ఆరోపణలే చేసి హతమార్చిన విషయమూ తెలిసిందే. ఇప్పటికే ఆంక్షల కారణంగా 2018 మేనెల నుంచి పదిబిలియన్‌ డాలర్ల మేరకు ఇరాన్‌ నష్టపోయింది. దాని కరెన్సీ రియాల్‌ మూడింట రెండువంతుల విలువను కోల్పోయింది.అనేక బహుళజాతి గుత్త సంస్ధలు తమ పెట్టుబడులను వుపసంహరించుకున్నాయి. ఫిబ్రవరిలో వరదలు వచ్చినపుడు అవసరమైన ఔషధాలను కూడా సరఫరా చేయకుండా అమెరికన్లు ఆంక్షలు విధించారని ట్రంప్‌ తమ మీద జరుపుతున్నది ఆర్ధిక యుద్ధం కాదు, వుగ్రవాదం అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ విమర్శించారు.

మన దేశం అమెరికాతో మరొక దేశం దేనితో స్నేహాన్ని వదులు కోవాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికా కోసం ఇతర దేశాలతో తగాదా తెచ్చుకోవనవసరమూ లేదు. ఒక దేశ వత్తిడికి లంగిపోవటమంటే అప్రదిష్టను మూటగట్టుకోవటమే. చివరికి అది స్వాతంత్య్రానికి ముప్పుతెచ్చినా ఆశ్చర్యం లేదు.అందుకే తస్మాత్‌ జాగ్రత్త !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్యలోటు తగ్గిందా ? వాస్తవాలేమిటి ?

20 Saturday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

China, India’s Trade, India’s Trade Deficit, India’s Trade Deficit With China

Image result for India’s Trade Deficit With China 2019

ఎం కోటేశ్వరరావు

‘చైనాతో వాణిజ్య లోటును రూ.69,500 కోట్లు తగ్గించిన భారత్‌,చైనాకు భారత్‌ ఎగుమతులు 31శాతం పెరుగుదల, భారత్‌కు చైనా దిగుమతులు ఎనిమిదిశాతం తగ్గుదల,ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అంతిమంగా చైనాతో లోటు తగ్గుతున్నది’ ఇది ‘ నేషన్‌ విత్‌ నమో మోడీ ‘ పేరుతో బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన మరో వుత్పత్తి. ఆంగ్లంలో వున్న ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నది.

దీనిలో రెండు అంశాలున్నాయి. ఒకటి బిజెపి వారు నిజంగా దీన్ని నమ్మితే వెర్రి పుల్లయ్యల కింద జమకట్టాలి. లేదూ వాస్తవాలన్నీ తెలిసి ఇలా ప్రచారం చేస్తున్నారంటే జనాన్ని మోసం చేసే ఘరానా పెద్దలు అయినా అయివుండాలి. బిజెపి వారు వెర్రి పుల్లయ్యలైతే కాదు. అసలు వాస్తవాలేమిటో ఇక్కడ చర్చిద్దాం, అంతిమంగా వారేమిటో పాఠకులే నిర్ణయించుకోవచ్చు.

కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2007-08 నుంచి 2016-17 మధ్య చైనాతో మన దేశ వాణిజ్య లోటు 16బిలియన్ల నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అంటే 2018-19లో వుభయ దేశాల మధ్య వాణిజ్యలోటు పదిబిలియన్‌ డాలర్ల మేరకు తగ్గి 53బిలియన్ల వద్ద వుంది. నమో మోడీ ప్రచారంలో ఈ పదిబిలియన్‌ డాలర్లనే రూపాయల్లోకి మార్చి రూ 69,500 కోట్ల మేరకు తగ్గించినట్లు, ఇదొక విజయమన్నట్లు పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి మన వాణిజ్యలోటు 63బిలియన్లకు పెరిగినదానిలో పది బిలియన్లు తగ్గించారు.

Image result for India’s Trade Deficit With China 2019

2014 మార్చి నాటికి అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి చైనాతో మన వాణిజ్యలోటు 36.2 బిలియన్‌ డాలర్లు. దీని కంటే తగ్గించటమో కనీసం అంతకు మించి పెరగకుండా వుండటమో చేస్తే నరేంద్రమోడీ ఘనుడని, ఆయన దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుత దీపం వుందని అనుకోవచ్చు. వ్యాపార లావాదేవీలన్న తరువాత ఒక రోజు పెరగవచ్చు, మరో రోజు తరగవచ్చు. అంతిమంగా ఒక ఏడాది కాలంలో లేదా ఒక ప్రధాని పదవీకాలం ఐదేండ్లలో నష్టమా, లాభమా అని ఎవరైనా చూడాలి. ఆ రీత్యా చూసినపుడు ఐదేండ్లలో మన లోటు 36.2బిలియన్ల నుంచి 53కు పెరిగింది. 2008-09లో చైనాకు మన ఎగుమతులు 9.4 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులుండగా 2011-12 నాటికి 18.1 బిలియన్లకు పెరిగింది. తరువాత2015-16 నాటికి తొమ్మిది, 2016-17 నాటికి 10.2కు, 2018-19లో ఏప్రిల్‌-నవంబరు మాసాలకు గాను 11.1బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2018 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు 13.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. బిజెపి ప్రచార యంత్రాంగం 31శాతం ఎగుమతుల పెరుగుదల అన్నది దీని గురించే. ఇదే కాలంలో చైనా నుంచి తగ్గింది ఎనిమిదిశాతం కాదు,24.64 శాతం పెరిగి 76.38 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంటే మన వాణిజ్య లోటు 63 బిలియన్ల కంటే ఎక్కువగా వుందని ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా చెపుతారు. ఆ మొత్తం ఈఏడాది మార్చినాటికి 53బిలియన్‌ డాలర్లకు తగ్గింది కనుక ఆ ఘనత మోడీ సర్కారుదే అని ప్రచారం చేస్తున్నారు. ఇక మార్చినెలతో ముగిసిన వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పైన పేర్కొన్నట్లు ఏప్రిల్‌-నవంబరు మధ్య మన ఎగుమతులు 11.1 బిలియన్‌ డాలర్లు అయితే ఇదే సమయంలో చైనా నుంచి 2.66శాతం తగ్గి 48.35 బిలియన్‌ డాలర్లుగా వున్నాయి. (బిజినెస్‌ లైన్‌ జనవరి 4, 2019).

ఎకనమిక్‌ టైమ్స్‌ (జనవరి 22,2019) పేర్కొన్నదానిని బట్టి చైనా అధికారిక సమాచారం ప్రకారం 2018లో మన దేశం నుంచి చైనాకు జరిగిన ఎగుమతుల విలువ 18.84 బిలియన్‌ డాలర్లు. అంతకు ముందుతో పోల్చితే 17శాతం పెరిగింది. రెండు దేశాల మధ్య లావాదేవీల్లో మన వాణిజ్యలోటు ఇదే కాలంలో 51.72 బిలియన్ల నుంచి 57.86 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మొత్తం మీద నరేంద్రమోడీది గోల్డెన్‌ లెగ్గా ఐరన్‌ లెగ్గా ? వాణిజ్య లోటు మోడీ అధికారానికి వచ్చిన సమయంలో వున్న 36.2 బిలియన్లకు తగ్గేదెపుడు ? అసలు సమస్య ఇది కదా !

చైనాకు మన ఎగుమతులు పెరగటం సంతోషించాల్సిందే.ఆ పెరుగుదలకు కారణం బిజెపి వారు ప్రచారం చేస్తున్నట్లు డ్రాగన్‌ మెడలు వంచి సాధించటం కాదు. అయితే దిగుమతులు పెంచాలని వత్తిడి చేస్తున్నది నిజం. అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా చైనా సడలించిన నిబంధనలే ప్రధాన కారణం. ఇదే సమయంలో చైనా నుంచి మన దిగుమతులు తగ్గాయా ? దీని కధేమిటో చూద్దాం. 2019 ఏప్రిల్‌ 17వ తేదీన లైవ్‌ మింట్‌ పత్రిక వ్యాఖ్యాత ఒక విశ్లేషణ చేశారు. ఇటీవల చైనా తన వుత్పత్తులు కొన్నింటిని తన రేవుల నుంచి గాక హాంకాంగ్‌ రేవు ద్వారా ఎగుమతులు చేయటం ప్రారంభించిందని, చైనా-హాంకాంగ్‌ల నుంచి మన దేశం చేసుకున్న దిగుమతుల విలువను చూస్తే వాణిజ్యలోటు తగ్గిందేమీ లేదని పేర్కొన్నారు. ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15వ తేదీన మరొక కధనాన్ని అందించింది. దానిలో మింట్‌ పత్రిక వ్యాఖ్యాతను వుటంకించింది. (సాధారణంగా ఇలా జరగదు) దాని ఆధారంగా తాను సేకరించిన సరికొత్త సమాచారాన్ని పాఠకులకు అందించి మింట్‌ కథనాన్ని నిర్ధారించింది.

Related image

పెరుగుతున్న వాణిజ్యలోటును తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని భారత్‌ నుంచి వస్తున్న వత్తిడిని తప్పించుకొనేందుకు చైనా కొత్త ఎత్తుగడలకు పాల్పడిందని పేర్కొన్నారు.’ వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2018లో చైనాతో వాణిజ్యలోటు 59.3 నుంచి 57.4 బిలియన్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత్‌తో హాంకాంగ్‌ వాణిజ్యలోటు భారత్‌కు ఎగుమతులు పెరిగి 2.7బిలియన్‌ డాలర్లకు చేరింది.భారత్‌తో చైనా-హాంకాంగ్‌ వాణిజ్యాన్ని కలిపి చూస్తే భారత్‌లోటు 2018లో అంతకు ముందున్న 55.4 బిలియన్ల నుంచి 60.1 బిలియన్లకు పెరిగింది.2018లో చైనాకు భారత్‌ ఎగుమతులు 30.4శాతం పెరిగి 16.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో హాంకాంగ్‌కు భారత ఎగుమతులు 15 నుంచి 13.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మొత్తంగా 900మిలియన్‌ డాలర్లు భారత్‌కు నష్టం. చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకొనే సెల్‌ఫోన్‌ విడి భాగాలు 2018లో 34.1 శాతం తగ్గాయి. అయితే అదే విడిభాగాల దిగుమతి హాంకాంగ్‌ నుంచి 728శాతం పెరిగాయి.లాన్‌ అడాప్టర్లు చైనా నుంచి 32శాతం తగ్గితే హాంకాంగ్‌ నుంచి 173శాతం పెరిగాయి. ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లను దిగుమతి చేసుకోవటం చైనా నుంచి పెరిగింది, అయితే హాంకాంగ్‌ నుంచి 6,017శాతం పెరిగాయి. వాణిజ్యమంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2017లో వుభయ దేశాల వాణిజ్య లావాదేవీల విలువ 84.44 బిలియన్‌ డాలర్లు. దీనిలో భారత్‌ లోటు 52 బి.డాలర్లు. 2018 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ ఎగుమతులు 31శాతం పెరిగి 13.3బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో దిగుమతులు 24.64శాతం పెరిగి లావాదేవీల మొత్తం 76.38 బి.డాలర్లుగా వుంది. వాణిజ్యలోటును 63 బిలియన్‌ డాలర్లకు చేరింది.’ అని ఎకనమిక్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమంటూ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి పెద్ద ఎత్తున గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. చైనాతో సంబంధాల విషయానికి వస్తే బిజెపి దాని అనుబంధ లేద సోదర సంస్ధలన్నీ నిత్యం విషం చిమ్ముతుంటాయి. చైనా వస్తు బహిష్కరణలకు పిలుపులనిస్తుంటాయి. అవి ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో అంతకంటే ఎక్కువగా వాటికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో దిగుమతులు పెరుగుతున్నాయి. మేకిన్‌ ఇండియా అంటూ చైనా ఇతర దేశాలతో పోటీ బడి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఏమైనట్లు ? ఆ చైనా నుంచే దిగుమతులను ఏటేటా ఎందుకు పెంచుతున్నట్లు ? ఎందుకీ వంచన ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నెహ్రూపై అరుణ్‌ జెట్లీ వక్రీకరణలు – వాస్తవాలు !

15 Friday Mar 2019

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Jaitley blames Nehru, original sinner, UNSC Seat

ఎం కోటేశ్వరరావు

భీష్ముడు మరణించిన తరువాత కౌరవ సేనాధిపతిగా ద్రోణుడు వచ్చాడు.కుమారుడు అశ్వద్ధామ అంటే ద్రోణుడికి చచ్చేంత ప్రేమ. ద్రోణుడిని ఓడించటం కష్టమని తెలిసిన శ్రీకృష్ణుడు అందుకు ఒక కుయుక్తిని ప్రయోగించాడు అదే ద్రోణుడిని నిర్వీర్యం చేయటం. అందుకు గాను అశ్వద్ధామ అనే పేరున్న ఏనుగును చంపమని భీముడికి చెప్పాడు. భీముడు ఆపని చేసి తాను అశ్వద్ధామను చంపినట్లు యుద్ధరంగంలో ప్రకటించాడు. దానిని నమ్మని ద్రోణుడు అబద్దం చెప్పడని పేరున్న ధర్మరాజు  దగ్గరకు వెళ్లి అశ్వద్ధామను చంపామని చెప్పారు నిజమేనా అని అడిగాడు. దానికి అవును అశ్వద్ధామను చంపారు అని బిగ్గరగా చెప్పి అయితే అది మనిషో ఏనుగో నాకు తెలియదు అని వినిపించీ వినిపించకుండా గొణిగాడు. దాంతో ద్రోణుడు కుప్పకూలాడు. తరువాత పాండవులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలో లోక్‌సభ ఎన్నికల పోరు ప్రారంభమైంది. దీన్ని గెలిచేందుకు రాజకీయ పార్టీలు వేయని ఎత్తులు, చేయని మోసాలు లేవు. వాటిలో ఒకటి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గురువారం నాడు చేసిన పెద్ద వక్రీకరణ. ఇలాంటి సమయాలలో ఒక అబద్దం, వక్రీకరణను వదిలితే అది రేసు గుర్రంలా పరుగుతీస్తుంది, నిజం తాబేలు మాదిరి వేగంతో కూడా జనం దగ్గరకు వెళ్లదు.

జైషే మహమ్మద్‌ అధిపతి మసూద్‌ అజహర్‌ను ప్రపంచ వుగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాన్ని భద్రతామండలిలో చైనా  వీటో చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం గురించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానిస్తూ చైనాకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదని, మోడీ బలహీనుడు, చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అంటే భయం అన్నారు.  దాన్ని తిప్పి కొడుతూ కాశ్మీర్‌, చైనాల మీద అసలు పాపం చేసింది జవహర్‌లాల్‌ నెహ్రూ అని, భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్ధానం కల్పిస్తామంటే చైనా వంటి గొప్పదేశానికి ఇవ్వాలని నెహ్రూ చెప్పారని, అదే విషయాన్ని 1955లో ముఖ్య మంత్రులకు లేఖలో కూడా రాశారని జెట్లీ ఎదురుదాడి చేశారు. భద్రతా మండలిలో ఆంక్షల కమిటి ప్రతిపాదించిన 1267వ తీర్మాన ఫలితంతో ఆశాభంగం చెందామని మన విదేశాంగశాఖ తన తొలి స్పందనలో వ్యాఖ్యానించింది. తీర్మానాన్ని ప్రతిపాదించిన వారికి, మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. తీర్మానాన్ని వీటో చేసిన చైనా గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. చైనా ఈ తీర్మానాన్ని వీటో చేయటం ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు మూడుసార్లు అదే చేసింది. భారత్‌-పాకిస్ధాన్‌ విబేధాలు పరిష్కారం కావటానికి ఇలాంటి తీర్మానాలు దోహదం చేయవని, మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు తగినన్ని ఆధారాలు లేవని గతంలోనూ ఈ సందర్భంగానూ చైనా పేర్కొన్నది. చైనా వైఖరి గురించి తెలిసినప్పటికీ ఈ ఐదు సంవత్సరాలలో ఆ దేశంతో మన ఆర్ధిక, ప్రభుత్వ సంబంధాలు ఇంకా బలపడ్డాయి, వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రిమోట్‌ కంట్రోలర్‌ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధలు ఏదో ఒక అవకాశాన్ని సాకుగా చూపి చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తూనే వున్నాయి, అవి ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తే అంతగా వాణిజ్యం పెరుగుతోందన్నది చేదు నిజం.

2013ా14లో చైనా నుంచి మన దిగుమతులు 51బిలియన్‌ డాలర్ల విలువ  కలవి కాగా ఎగుమతులు 14.82బిలియన్ల్‌, మన వాణిజ్యలోటు 36బిలియన్లు వుంది.2017ా18 తొలి తొమ్మిది నెలల కాలంలో మన ఎగుమతులు పది బిలియన్‌డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు ఇదే కాలానికి 63బిలియన్‌ డాలర్లకు, వాణిజ్య లోటు 53బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలోనే చైనా మూడుసార్లు భద్రతామండలిలో మసూద్‌ టెర్రరిస్టు తీర్మానాన్ని వీటో చేసింది. దీన్ని బట్టి నరేంద్రమోడీ సర్కార్‌ రాజకీయాలను, ఆర్ధిక లావాదేవీలను విడివిడిగా చూస్తున్నదన్నది స్పష్టం. రాజకీయంగా చైనాను ఏమీ అనలేని స్ధితిలో వున్న అరుణ్‌ జెట్లీ తన అక్కసును నెహ్రూ మీద తీర్చుకున్నారని, బిజెపి ప్రచార కమిటీ నేతగా  తమ క్యాడర్‌కు ఒక అస్త్రాన్ని అందించారన్నది స్పష్టం. అయితే ప్రతి అస్త్రం నిర్ధేశిత లక్ష్యాన్ని తాకుతుందా అంటే అనుమానమే. ఈ పూర్వరంగంలో నెహ్రూ గురించి చేసిన వాఖ్యల గురించి చూద్దాం.

మొదటిది. జైట్లీ చేసిన వక్రీకరణ కొత్తది కాదు. వాస్తవమూ కాదు. వివేక్‌ అగ్నిహోత్రి అనే ఒక సినిమా రంగానికి చెందిన కాషాయదళ వ్యక్తి 1965 యుద్ధంలో ఎదురుదాడి చేద్దామన్న తన మిత్రుడైన సైనికదళాల ప్రధాన అధికారి జనరల్‌ చౌదరిని రాజీనామా చేస్తావా తొలగించమంటావా అని నాటి ప్రధాని నెహ్రూ వత్తిడి చేశారని కొద్ది రోజుల క్రితం ట్వీట్‌ చేశాడు. జనరల్‌ చౌదరి 1966లో పదవీ విరమణ చేసిన ఏడు సంవత్సరా తరువాత పుట్టిన అగ్నిహోత్రి సదరు అధికారి తన స్నేహితుడని చెప్పుకుంటే కాషాయ మరుగుజ్జులు ఆ ట్వీట్‌ను గుడ్డిగా షేర్‌ చేశారు. అన్నింటి కంటే పచ్చి నిజం ఏమంటే జవహర్‌లాల్‌ నెహ్రూ 1964మేనెలలో మరణించారన్న కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. 1965 యుద్ద సమయంలో ప్రధానిగా లాల్‌బహదూర్‌ శాస్త్రి వున్నారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే మాకు వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారన్న అరుణ్‌జెట్లీ ట్వీట్‌ కూడా ఇలాంటిదే.  రెండవ ప్రపంచ యుద్ధం నాటికి చైనా ఒక స్వతంత్ర రాజ్యం. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్‌ మార్చ్‌ పురోగతిలో వుంది. అనేక విజయాలను కమ్యూనిస్టులు సాధించారు. కొమింటాంగ్‌ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ కూటమికి వ్యతిరేకంగా మిత్రరాజ్య కూటమిలో భాగంగా పాల్గన్నది.1939లో రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమైంది. దాన్ని నివారించటంలో నానాజాతి సమితి విఫలమైంది. ఈ పూర్వరంగంలో కొత్త ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన అమెరికా విదేశాంగ శాఖ ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు 1941డిసెంబరు చివరిలో ఒక ముసాయిదాను తయారు చేస్తే దానికి సోవియట్‌ యూనియన్‌ కొన్ని సవరణలు చేసింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌, బ్రిటన్‌, చైనాలు దాని మీద సంతకాలు చేశాయి. ఆ సమయంలో ఫ్రాన్స్‌ హిట్లర్‌ మూకల దురాక్రమణలో వుంది. 1945 అక్టోబరు 24 ఐక్యరాజ్యసమితి వునికిలోకి వచ్చింది. ఆ తరువాత ఫ్రాన్స్‌ రిపబ్లిక్‌గా ఏర్పడిన తరువాత భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. రెండవ ప్రపంచ యుద్దంలో విజేతలుగా వున్నందున ఐదు దేశాలకు శాశ్వత భద్రతా మండలి సభ్యత్వంతో పాటు వీటో హక్కు కల్పించారు. తరువాత అవి అణుశక్తి దేశాలుగా కూడా మారాయి. అందువలన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. అసలు ఆ సమయానికి మనకు స్వాతంత్య్రం రాలేదు, నెహ్రూ అసలు ప్రధాని కాలేదు.

అయితే నెహ్రూ మీద ఇలాంటి ప్రచారం ఎందుకు జరిగినట్లు? నిప్పులేకుండా పొగరాదు కదా అని ఎవరైనా అనుకోవచ్చు.దీని గురించి జరిగిన ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని 1955లోనే పార్లమెంటులో ఒక ప్రశ్నకు నెహ్రూ సమాధానం చెప్పారు. అయినా అరుణ్‌ జెట్లీ అదే ఏడాది ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నెహ్రూ స్వయంగా అంగీకరించారని ఆరోపించారు. దీని గురించి 2002లోనే ప్రముఖ పరిశోధకుడు ఏజి నూరాని తన విశ్లేషణను ప్రచురించి వాస్తవాలను తెలియచేశారు. అయినా నెహ్రూ వ్యతిరేక శక్తులు తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూనే వున్నాయి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్న గోబెల్స్‌ వారుసులు తప్ప మరొకరు వీటిని నమ్మరు. 2015లో ఆంటన్‌ హార్డన్‌ అనే ఒక పరిశోధకుడు రాసిన వ్యాసాన్ని విల్సన్‌ సెంటర్‌ ప్రచురించింది. దాన్ని 2016 ఆగస్టులో వైర్‌ వెబ్‌సైట్‌ తిరిగి ప్రచురించింది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన రెండు సంవత్సరాలకు మనకు స్వాతంత్య్రం వచ్చింది, మూడు సంవత్సరాలకు చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌(గతంలో ఫార్మోజా దీవి)కు కొమింటాంగ్‌ సేనలు చేరి అక్కడి నుంచి తామే చైనా అధికారంలో వున్నట్లు ప్రకటించుకున్నాయి. అప్పటికే వారి ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో వున్నారు. అమెరికా వత్తిడితో దాన్నే అసలైన చైనాగా పరిగణించటం మినహా సోవియట్‌తో సహా మిగతా దేశాలకు మరొక మార్గం లేకపోయింది. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల సంఖ్యను విస్తరించాలంటే ఏకాభిప్రాయం అవసరం. కమ్యూనిస్టు చైనానే అసలైనా చైనా గుర్తించాలని సోవియట్‌ కోరినా అమెరికన్లు వీటో చేస్తే చెల్లదు. ఆ పరిస్ధితి 1971వరకు కొనసాగింది. తరువాత అమెరికా చొరవతో తైవాన్‌కు బదులు కమ్యూ నిస్టు చైనాను గుర్తించారు.

ఆ మధ్యకాలంలో జరిగిన రాజకీయాన్ని అర్ధం చేసుకుంటే తప్ప నెహ్రూ ఏమి చేశారన్నది మనకు అవగతం కాదు. మన దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత తమ రాజకీయ పలుకుబడి కిందకు తెచ్చుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. బెదిరించి లంగతీసుకోవాలన్న  దాని తప్పుడు ఎత్తుగడలు మన దేశాన్ని సోవియట్‌వైపు నెట్టాయి. 1948లో చైనాలో అధికారానికి వచ్చిన కమ్యూ నిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా, బ్రిటన్‌ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాయి. అంతర్గతంగా తిరుగుబాట్లను రెచ్చగొట్టటం, బర్మా (ప్రస్తుత మయన్మార్‌) కేంద్రంగా కొమింటాంగ్‌ సైనికులు, ఇతర విద్రోహకులకు ఆయుధాలిచ్చి చైనాలో దాడులు చేయించటం వంటి వన్నీ దాదాపు పది సంవత్సరాలు సాగాయి. అప్పటికిగానీ మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు నిలదొక్కుకోలేకపోయారు.టిబెట్‌లోని 14వ దలైలామా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చిన చైనా ప్రభుత్వం టిబెట్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు అంగీకరించింది. ఒప్పందం మీద సంతకం చేసిన తరువాత సామ్రాజ్యవాదుల కుట్రల కారణంగా 1959లో తిరుగుబాటు చేసిన దలైలామా స్వాతంత్య్ర ప్రకటన చేశాడు. దాన్ని చైనా అణచివేయటంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ గుండా పారి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొంది ప్రవాస ప్ర భుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. ఇది ఒకటైతే కమ్యూనిస్టులు అధికారాన్ని సుస్ధిరం చేసుకున్న తరువాత ఎప్పటికైనా కమ్యూ నిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యంగా గుర్తించక తప్పదని అమెరికన్లకు మొదటి నుంచి ఒక అంచనా వుంది. అయితే దాన్ని బయటపడనివ్వకుండా రాజకీయం చేశారు.

చైనా తరువాత అతి పెద్ద దేశమైన భారత్‌కు  భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సి వుందంటూ చైనాను సాధారణ అసెంబ్లీకి పరిమితం చేసి ఐదవ శాశ్వత సభ్యురాలిగా భారత్‌కు మద్దతు ఇస్తామని అమెరికన్లు నెహ్రూకు రాయబేరం పంపారు. కమ్యూ నిస్టు చైనాను దెబ్బతీయటం, భారత్‌ను తమ శిబిరంలోకి చేర్చుకోవటం అనే ఒకే దెబ్బకు రెండు పిట్టలనే ఎత్తుగడ దీనిలో వుంది. తమకు శాశ్వత సభ్యదేశ హోదా అర్హత వుందని, అయితే చైనాను పక్కన పెట్టి తమకు దాన్ని ఇవ్వటం అంటే చైనా-తమ మధ్య విబేధాలను పెంచే ఎత్తుగడ తప్ప వేరు కాదని అందువలన దాన్ని మినహాయించి తమకు ఆ స్ధానాన్ని ఇస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని నెహ్రూ సర్కార్‌ నాడు అమెరికాకు చెప్పింది. ఇదే విషయాలను నెహ్రూ తన లేఖలో రాశారు. జెట్లీ వంటి వారు ఆ లేఖను పట్టుకొని రామునితోక పివరుండు ఇట్లనియే అన్నట్లు పదే పదే ప్రచారం చేస్తున్నారు. కాశ్మీర్‌ విషయంలోనూ అదే చేస్తున్నారు. నిజానికి భద్రతా మండలిని విస్తరించాలని, దానిలో వున్న ప్రజాస్వామ్య వ్యతిరేక అంశాలను సంస్కరించాలని అనేక మంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సులు తమ ప్రయోజనాలు, అజెండాకు అనుగుణంగా ఆయా దేశాలను రెచ్చగొట్టటం, తాము ప్రతిపాదిస్తుంటే ఇతరులు అడ్డుకుంటున్నారని సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది మసూద్‌ అజార్‌ కావచ్చు మరొకటి కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ కౌగిలింతల దౌత్యం-వ్రతం చెడ్డా ఫలం దక్కేనా !

25 Monday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Hug diplomacy, Mohammed bin Salman (MBS), Narendra Modi, Narendra Modi Hug diplomacy, pakistan, Pulwama, Saudi Arabia

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

ఎం కోటేశ్వరరావు

కాశ్మీరులోని పుల్వామాలో వుగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయి పది రోజులు దాటింది. ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 3-4గంటల మధ్య పేలుడు సంభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోని సామాజిక, సాంప్రదాయ మీడియా, రాజకీయ రంగంలో చూస్తే వుగ్రవాదుల దాడులను ఎలా అరికట్టాలనేదాని కంటే యుద్దోన్మాదాన్ని, కొన్ని సామాజిక తరగతుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టటం, పుల్వామా వుదంతం నుంచి రాజకీయ లబ్ది పొందే అంశాలకు ప్రాధాన్యత ఏర్పడటం నిజంగా విచారకరం. వామపక్షాలు మినహా బిజెపి కూటమి, కాంగ్రెస్‌ కూటమి పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో లబ్దిపొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మీడియాలోని కొంత మంది వుద్రేకాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దాడికి సంబంధించి భద్రతాలోపం ఎక్కడ జరిగిందో ఇంతవరకు వెల్లడి కాలేదు. ఇదేమీ చిన్న విషయం కాదు. గతంలో సైనిక కేంద్రాలపై జరిగితే ఇప్పుడు కదులుతున్న వాహన శ్రేణి లక్ష్యంగా జరిగింది.

దాడి జరిగిన సమయంలో నరేంద్రమోడీ ఒక వీడియో షూటింగ్‌లో మునిగిపోయి మూడుగంటల వరకు దాడిని పట్టించుకోలేదని, సమోసాలు, ఇతర తినుబండారాలు తిన్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తే ప్రభుత్వం, బిజెపినేతలు దాన్ని తిరస్కరిస్తూ నాలుగు గంటలకే ప్రధాని దాడి వుదంతం మీద సమీక్షలు ప్రారంభించారని ఆ రోజు రాత్రి అసలు భోజనమే చేయలేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. తాము ఎవరు చెప్పింది వాస్తవమో కాదో తేల్చలేకపోయామని అందువలన రెండు పక్షాలు చెప్పిన అంశాలను వార్తలుగా ఇస్తున్నట్లు, ముందు చెప్పిన తీర్పును వెనక్కు తీసుకుంటున్నామని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్నది. ఇక్కడొక భట్టిప్రోలు తీర్పు అనే గుంటూరు జిల్లా పిట్టకధ చెప్పాల్సి వుంది. కొండమీద గొడవ జరుగుతుంటే చూద్దామని వెళ్లామని రెండువైపుల వారు వారు కత్తులు ఝళిపిస్తుండగా పెద్దగా వురుములు, మెరుపులు వచ్చాయని ఆ సమయంలో ఎవరు ఎవరిని ముందు కొట్టారో తాము చూడలేకపోయామని పెద్దలు చెప్పారన్నది సారాంశం. ఎన్నికల రోజులు, మోడీ తిరిగి పదవిలోకి వస్తారో రారో ఎందుకు పంచాయతీ అనుకుందేమో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా. దాన్ని కాసేపు పక్కన పెడదాం.

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ పుల్వామా దాడి జరిగిన ఎనిమిదవ రోజు అంటే 22వ తేదీన లక్నో నగరంలో భారతీయ మనోగతం అనే అంశంపై నిర్వహించిన సభలో పాల్గన్నారు.ఒక విద్యార్ధి లేచి పుల్వామా దాడికి ముందు తరువాత కూడా అసలు మన భద్రతా సంస్ధలు ఏమి చేస్తున్నాయని సూటిగా ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నువ్వనుకుంటున్నదే దేశంలోని ప్రతి సామాన్యుడి బుర్రలో మెదులుతోందంటూ వెంటనే బటబటా కన్నీళ్లు కారుస్తూ ఏడ్చేశారని వార్తలు వచ్చాయి. ఆయన సామాన్యుడేమీ కాదు, నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని కావాలని అనుకుంటున్నవారిలో వున్నట్లు ప్రచారం జరుగుతున్న నేత. ఎనిమిది రోజుల తరువాత బహిరంగంగా ఏడవటం ఏమిటి?

పుల్వామా దాడి జరిగి 24 గంటలు కూడా గడవ లేదు, దేశం దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేదు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో వేగంగా ప్రయాణించే తొలి రైలు వందే భారత్‌ను ప్రారంభించే అవకాశాన్ని వదులు కోలేదు. ఆ తరువాత నాలుగు రోజులకు 19వ తేదీ సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ నాయకత్వంలో పెద్ద ప్రతినిధి వర్గం మన దేశ పర్యటనకు వచ్చింది.ప్రాణాలు కోల్పోయిన 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కుటుంబాల కన్నీటి చారికలు ఇంకా కనిపిస్తూనే వున్నాయి. ఆ దాడికి జైషే మహమ్మద్‌ అనే పాక్‌ ప్రేరేపిత వుగ్రవాద సంస్ధ బాధ్యురాలు. ప్రపంచంలో మత ప్రాతిపదికన పని చేస్తున్న ప్రతి వుగ్రవాద సంస్ధకూ సౌదీ పెట్రో డాలర్లు నిత్యం అందుతుంటాయని తెలుసు.అమెరికా పధకం, సౌదీ ప్రోత్సాహం, సాయం లేకుండా పాకిస్దాన్‌లో వుగ్రవాద ముఠాలు మనుగడ సాగించటం సాధ్యం కాదు. మోడీకి అది తెలియంది కాదు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌(ఎంబిఎస్‌) రాజరిక వారసుడిగా ఎంపికయ్యాడు తప్ప ఇంకా రాజు కాలేదు. రాజ ప్రముఖుడిగా అధికార మర్యాదలు పొందుతున్నాడు. యువరాజు బృందాన్ని మన ప్రధాని నరేంద్రమోడీ రాజభవన్‌లో కలవాల్సి వుండగా ప్రోటోకాల్‌( గౌరవ స్ధాన భేద సూచనం) పక్కన పెట్టి తనకంటే తక్కువ స్థాయి కలిగిన యువరాజును ఆహ్వానించేందుకు ఏకంగా విమానాశ్రయానికి వెళ్లి కౌగిలింతలతో స్వాగతం పలకటం విపరీతపోకడగా దేశ ప్రజలకు కనిపించింది.

నరేంద్రమోడీ అంతకు ముందు కూడా పలువురు విదేశీనేతల పర్యటనల్లో కౌగిలింతలతో సరికొత్త దౌత్యానికి తెరతీశారు. సౌదీ యువరాజు పుల్వామా దాడి జరిగిన తరువాత ముందుగా పాక్‌ పర్యటనకు వెళ్లాడు. మన దేశ పర్యటన, తరువాత చైనా పర్యటన కూడా అంతకు ముందే ఖరారైంది. నిజంగా సౌదీ మనకు అత్యంత ముఖ్యదేశమే అయితే మన దేశంలో ఇంత పెద్ద విషాదం జరిగి, దానికి బాధ్యత పాకిస్ధాన్‌దే అని మన దేశ ప్రకటించిన తరుణంలో రాకుమారుడి పర్యటన వాయిదా వేసుకొని వుండాల్సింది. అయితే నరేంద్రమోడీయే 24గంటలు కూడా గడవక ముందే వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవానికి హాజరు కావటం, అభిలపక్ష సభను బహిష్కరించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గంటున్నపుడు సౌదీ యువరాజు ఎందుకు పర్యటన వాయిదా వేసుకోవాలంటే సమాధానం వుండదు. కారణం చెప్పకపోయినా పుల్వామా వుదంతం కారణంగానే పాక్‌ పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకొని మన దేశానికి ముందనుకున్నట్లుగానే వచ్చాడు. అతగాడికి స్వాగతం పలకటానికి పాకిస్ధాన్‌, మన దేశం రెండూ పోటీ పడ్డాయి. రావల్పిండిలో 21తుపాకులు, జెట్‌ ఫైటర్‌తో ఘనస్వాగతం పలికారు, బంగారంతో చేసిన తుపాకిని బహుమతిగా ఇచ్చారు. మన దేశంలో ప్రధాని నరేంద్రమోడీ విమానాశ్రయానికి వెళ్లి మరీ కౌగిలింతలతో స్వాగతం పలికాడు. చైనాలో అధ్యక్షుడు జింపింగ్‌తో కలసి ఫొటో దిగాడు.

జింపింగ్‌ సౌదీ యువరాజుతో ఎందుకు ఫొటో దిగాడు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. చైనా తన వాణిజ్య ప్రయోజనాలను రక్షించుకొనేందుకు రోడ్‌ మరియు బెల్ట్‌ పేరుతో ఒక పెద్ధ కార్యాచరణ తలపెట్టింది. దాన్నే కొందరు చైనా సిల్క్‌ మార్గం అని పిలుస్తున్నారు. చైనా పురాతన కాలంలో తన సిల్కును వివిధ దేశాలకు తీసుకుపోయి విక్రయించిన మార్గాన్ని అలా పిలిచారు. అయితే అది ఇప్పుడు అంతగా అతకదు. నిజానికి చైనా ఒక మార్గాన్నే తలపెట్టలేదు. చిన్నా పెద్దవి ఆరు మార్గాలు లేదా కారిడార్లను అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. దానిలో అనేక దేశాలు చేరి ప్రయోజనం పొందేందుకు ముందుకు వస్తున్నాయి. వాటిలో సౌదీ అరేబియా ఒకటి. ప్రస్తుతం సౌదీ చేసుకుంటున్న దిగుమతులలో చైనా వాటా 19శాతం వుంది. తరువాత అమెరికా 8, జర్మనీ 7.5 శాతాలతో వుండగా 5.2శాతంతో మనది ఆరవ స్ధానం. పాకిస్ధాన్‌ది 0.34శాతం. అందువలన చైనా అధ్యక్షుడు సౌదీ యువరాజుతో ఎందుకు ఫొటో దిగాడో వేరే చెప్పనవసం లేదు. పాకిస్ధాన్‌కు సౌదీ అవసరం ఎంత వుందో సౌదీకి పాక్‌ అవసరం కూడా అంతే వుంది. మూడు బిలియన్‌ డాలర్ల నగదు అంద చేసేందుకు, మూడు సంవత్సరాల పాటు చమురు కొనుగోలు చెల్లింపులను వాయిదా వేసేందుకు జనవరిలోనే సౌదీ అంగీకరించింది. అందువలన ఇమ్రాన్‌ ఖాన్‌ ఘనస్వాగతాలు పలకటాన్ని అర్ధం చేసుకోవచ్చు. మన ప్రధానికి ఏమైంది. ఏమి సాధించాలని గౌరవ మర్యాదలను పక్కన పెట్టినట్లు ?నరేంద్రమోడీ అంటే రాజకీయంగా, ఇతరంగా అందరికీ ఆమోదయోగ్యుడు కాదన్నది తెలిసిందే. అయినా ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించి మన దేశ ప్రధాని అయ్యారు. అలాంటి పదవిలో వున్నవారు నియమ లేదా వ్రతభంగం కావించటం అంటే అది దేశం మొత్తానికి వర్తిస్తుంది. దాడిని అనేక దేశాల మాదిరి ఖండించింది తప్ప పాక్‌ గురించి సౌదీ ఒక్క మాట మాట్లాడని పూర్వరంగంలో పాకిస్దాన్‌కు మనకంటే దగ్గరి స్నేహితుడైన సౌదీ రాజ ప్రతినిధికి నిబంధనలను పక్కన పెట్టి స్వాగతం పలకటం మింగుడుపడని అంశమే. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

వుగ్రవాది అంటే అందరికీ తెలిసింది బిన్‌ లాడెన్‌. అతగాడిని వుపయోగించుకుంది అమెరికా, పెంచి పోషించింది సౌదీ సర్కార్‌. చివరకు ఏకు మేకైనట్లు, గురువుకు పంగనామాలు పెట్టినట్లు తనను పెంచి పోషించిన అమెరికాలోనే న్యూయార్క్‌ పపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి సూత్రధారి అయ్యాడు. సౌదీ వుగ్రవాదులతోనే ఆపని చేయించాడు. అమెరికాకు సౌదీ అనుంగు దేశం అని తెలిసిందే. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా కుట్రలో సౌదీ పెద్ద భాగస్వామి. అలాంటి సౌదీ గురించి డోనాల్డ్‌ ట్రంప్‌ 2015లో రాసిన ‘టైమ్‌ టు గెట్‌ టఫ్‌ ‘( కఠినంగా వుండాల్సిన సమయం) పుస్తకంలో ప్రపంచంలో వుగ్రవాదానికి అత్యధిక నిధులు అందచేసే దేశం సౌదీ అని పేర్కొన్నాడు. బరాక్‌ ఒబామా సర్కార్‌లో విదేశాంగ మంత్రిగా పని చేసిన హిల్లరీ క్లింటన్‌ 2009లో రాసిన ఒక మెమోలో ప్రపంచవ్యాపితంగా వున్న సున్నీ వుగ్రవాద ముఠాలకు ఇప్పటికీ సౌదీ కీలకమైన ఆర్ధిక మద్దతుదారుగా వుంది. ఆల్‌ఖ్వైదా, తాలిబాన్‌, లష్కరే తోయబా ఇతర సంస్దలు ప్రతి ఏటా కోట్లాది డాలర్లను సౌదీ ద్వారా పొందుతున్నాయి అని పేర్కొన్నారు. వుగ్రవాదులకు నిధులు అందచేసే దేశాలలో సౌదీ అరేబియాను తీవ్ర ముప్పు వున్న దేశాల జాబితాలో చేర్చాలని జనవరిలోనే ఐరోపా యూనియన్‌ నిర్ణయించింది.

మన ప్రధాని నరేంద్రమోడీకి ఏ సమయంలో పెద్ద నోట్ల రద్దు ఆలోచన వచ్చిందోగానీ జిందాతిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా వుగ్రవాదంతో సహా అన్ని సమస్యలను పెద్ద నోట్ల రద్దుతో పరిష్కరించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, దాన్ని మన మెజారిటీ జనం గుడ్డిగా నమ్మిన విషయం తెలిసిందే.నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు, మన ఆర్ధిక వ్యవస్ధకు నష్టం జరిగింది తప్ప వుగ్రవాదులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మన దేశానికిి పాకిస్దాన్‌తో 3,323 కిలోమీటర్ల సరిహద్దు వుంటే, దానిలో వాస్తవాధీన రేఖతో సహా కాశ్మీర్‌లో 1,225కిమీ, పంజాబ్‌తో 553కిమీ వుంది.( పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో సరిహద్దు 744కిలోమీటర్లు వుంది.) ఒక్క కాశ్మీరులోనే అన్ని విభాగాలకు సంబంధించి దాదాపు ఏడులక్షల భద్రతా సిబ్బంది వున్నారు. పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాదుల నడుములు విరిచేసి వుంటే నిజానికి అక్కడ అంత మంది అవసరం వుండదు. అయినా యధావిధిగా కొనసాగుతున్నారంటే నరేంద్రమోడీ నోట్ల రద్దుకు జనాన్ని తప్పుదారి పట్టించినట్లే కదా !

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాకిస్ధాన్‌ను మరింత బలహీనపరచాలని మనం ప్రయత్నిస్తుంటే సౌదీ ఆర్ధికంగా ఆదుకుంటున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో పూర్వపు సోవియట్‌ పలుకుబడి పెరగకుండా చూసేందుకు, ఇరాన్‌, సిరియా తదితర పశ్చిమాసియా దేశాలలో తన రాజకీయ వ్యతిరేకులను దెబ్బతీసేందుకు తాలిబాన్లు, ఇతర అనేక పేర్లతో మత తీవ్రవాదుల తయారీని అమెరికా ఎంచుకున్నది. దానికి కార్యస్ధలం పాకిస్దాన్‌ అయితే, గణనీయ మొత్తంలో నిధులు సమకూర్చింది సౌదీ అరేబియా, ఆయుధాలు, మందుగుండువంటివి అందించింది అమెరికా, ఐరోపాధనిక దేశాలు. ఈ త్రయం ఇస్లాంలో మెజారిటీగా వున్న సున్నీ తెగవారిని ఎంచుకుంటే వీరి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్‌ షియా, ఇతర తెగలను ఎంచుకొని శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్దాన్లలో తాలిబాన్లు పెద్ద శక్తిగా వున్నారు. మారిన రాజకీయపరిణామాలలో ఆఫ్ఘన్‌ తాలిబాన్లు అమెరికాకు ఏకు మేకయ్యారు. వారిని అదుపు చేయనందుకు అమెరికన్లు పాకిస్దాన్‌పై ఆగ్రహంతో వున్నారు. రెండవది మన దేశ మార్కెట్‌ను ఆక్రమించటం అసలు లక్ష్యం గనుక మనలను సంతుష్టీకరించేందుకు పాకిస్దాన్‌కు తాత్కాలికంగా మిలిటరీ సాయాన్ని ఆపినట్లు ప్రకటించారు. అది బెదిరింపు తప్ప వేరు కాదు. తాలిబాన్లను అణచివేయటంలో విఫలమైన అమెరికా తన తట్టాబుట్ట సర్దుకుపోతామని చెబుతున్నది. ఈ ప్రక్రియలో భాగంగానే కతార్‌లో జరిపే చర్చలకు తాలిబాన్లను రప్పించే బాధ్యతను పాకిస్ధాన్‌కు అప్పగించారు. భవిష్యత్‌లో ఒక వేళనిజంగానే అమెరికన్లు నిష్క్రమిస్తే ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇరాన్‌ అనుకూల తాలిబాన్ల ప్రభావాన్ని తగ్గించాలంటే అక్కడి, పాకిస్దాన్‌లోని కిరాయిమూకల అవసరం వుంటుంది. ఇదే సమయంలో ఇరాన్‌-పాక్‌ వైరుధ్యాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. పాక్‌ మద్దతు వున్న తాలిబాన్లు ఇరాన్‌కు వ్యతిరేకం. అందుకు ఇరాన్‌లోని సిస్టాన్‌-బలూచిస్తాన్‌ ప్రాంతంలో పాక్‌, ఆఫ్ఘన్‌వైపు నుంచి ప్రవేశించే వుగ్రవాదులు తరచూ దాడులు జరుపుతుంటారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు మరణించారు. అందువలన అనివార్యంగా పాక్‌తో సౌదీ అరేబియా సంబంధాలను కొనసాగించకతప్పదు. అమెరికా పధకంలో భాగంగా ఎమెన్‌పై ఇప్పటికే సౌదీ అరేబియా దాడులు జరుపుతోంది. పాకిస్ధాన్‌ను అదుపులోకి తెచ్చుకోవటం అమెరికన్లకు చిటికెలో పని.

ప్రోటోకోల్‌ను పక్కన పెట్టి కౌగిలించుకున్నంత మాత్రాన పాకిస్దాన్‌ను వదలి సౌదీ మనకు మిత్రదేశంగా మారే అవకాశాలు ఏమాత్రం లేవు. అంతదానికి అలాంటి మర్యాదలెందుకన్నది ప్రశ్న. ప్రపంచ రాజకీయాలు, మిలిటరీ వ్యూహాలలో పశ్చిమాసియా, మధ్య ఆసియా ప్రాంతానికి మొదటి ప్రపంచ యుద్దం నుంచీ ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఆ ప్రాంతంలో అపార చమురు, ఇతర ఖనిజ సంపదలతో పాటు మిలిటరీ రీత్యాకీలక ప్రాంతంగా వుండటమే కారణం. ఈ ప్రాంతాన్ని అదుపులో పెట్టుకొనేందుకు అమెరికన్లు చేయని దుర్మార్గం లేదు. సౌదీ ప్రభుత్వం లేదా అక్కడి ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలు భారత్‌, పాక్‌, చైనాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా వాటి ప్రయోజనాలకే పెద్ద పీట. ఈ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో చమురు సరఫరా చేస్తోంది. తన వ్యూహాత్మక భాగస్వామ్యం, పెట్టుబడులకు అది ఎనిమిది దేశాలను ఎంచుకుంటే వాటిలో మనది ఒకటి. అన్ని దేశాలతో ఒకే విధంగా లేదు. దానిలో భాగమే పాక్‌తో ప్రత్యేక అనుబంధం. అందుకే కాశ్మీర్‌ సమస్యలో దాని మద్దతు పాకిస్దాన్‌కే వుంది. ముప్పైమూడు సంవత్సరాల సౌదీ రాకుమారుడిని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే నరేంద్రమోడీ గట్టిగా కౌగిలించుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వ్యవసాయ పరిశోధనలు, రైతాంగానికి లబ్ది !

12 Tuesday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, Opinion

≈ Leave a comment

Tags

Agricultural, China's agricultural sector, chinese agricultural, chinese agricultural R&D, chinese agricultural revolution, chinese electro culture

Image result for Chinese agricultural

ఎం కోటేశ్వరరావు

చైనా ! నూట నలభై కోట్ల జనాభా !! వారికి అవసరమైన తిండి, బట్ట, విద్య, వైద్యం, గూడు కల్పన సామాన్యమైన విషయం కాదు.తిండి కలిగితే కండ కలదోయ్‌, కండగలవాడేను మనిషోయ్‌ అన్న మహాకవి గురజాడ వాక్కులు సార్వజనీనమైనవి. చైనాలో ప్రపంచ జనాభాలో 22శాతం, సాగుకు లాయకీ అయిన భూమిలో ఏడుశాతమే వుంది. మొత్తం భూమిలో వ్యవసాయానికి పనికి వచ్చేది 10-15శాతం మధ్య వుంది. అదే భారత్‌లో 50, ఫ్రాన్స్‌లో 32, అమెరికాలో 22, సౌదీ అరేబియాలో ఒకశాతం చొప్పున వుంది. ఈ పూర్వరంగంలో అక్కడి జనాభా అవసరాలను తీర్చటానికి ఎంతటి మహాయజ్ఞం చేయాల్సి వుందో వూహించుకోవాల్సిందే.అది ఒకరోజుతో ఆపేది కాదు. నిరంతర ప్రక్రియ. అలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ గత ఏడుదశాబ్దాల విప్లవ కాలంలో అనేక విజయాలను సాధించింది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చటం ఒక ఎత్తయితే, దాన్ని సమకూర్చే రైతాంగ మంచి చెడ్డలను చూసుకోవటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. రైతుకు గిట్టుబాటు కాకుండా, ఇతర రంగాలతో పోల్చితే ఆదాయం తగ్గినా, ప్రభుత్వం సమన్వయం చేయకపోతే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుంది. భౌగోళికంగా తలెత్తే సహజ సమస్యల నుంచి ఎలా అధిగమించాలనేది ఒక సవాలు.చైనా గురించి మీడియాలో అనేక వక్రీకరణలు వస్తుంటాయి గానీ అక్కడి రైతాంగానికి లేదా మొత్తం వ్యవసాయ రంగానికి మన మాదిరి సంక్షోభ సమస్యలు, రుణ భారం, బలవన్మరణాల వంటివి కానరావు. మార్కెట్లలో ఆకస్మికంగా ధరలు పెరగటం, అదే విధంగా పతనం కావటం వంటి సమస్యలు అసలే లేవు. చైనా దిగుమతులు తగ్గించినా, నిలిపివేసినా ఇతర దేశాల మార్కెట్లు, రైతులు ప్రభావితం కావటం తప్ప చైనా రైతాంగానికి వాటి నుంచి అన్ని రకాల రక్షణలు వున్నాయి. సబ్సిడీలు, ఇతర రక్షణ పధకాలు ఎప్పటికప్పుడు మారుతున్నప్పటికీ అవి మరింత మెరుగుదలకే తోడ్పడతాయి.

రెండు కోట్ల పదిలక్షల మంది రైతుల చిన్న కమతాల సాగు తీరుతెన్నుల గురించి పది సంవత్సరాల అధ్యయనంతో శాస్త్రవేత్తలు సూచించిన మెరుగైన యాజమాన్య పద్దతులను ఆచరించిన రైతులు తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయంతో 12.2 బిలియన్‌ డాలర్ల మేరకు లబ్ది (ఎరువుల ఖర్చులో తగ్గుదల ద్వారా) పొందారని నేచర్‌ అనే పత్రిక తాజాగా ఒక విశ్లేషణలో పేర్కొన్నది. 2005-2050 మధ్య ప్రపంచ ఆహార అవసరాలు రెట్టింపు అవుతాయనే అంచనా పూర్వరంగంలో చైనా అధ్యయనం అంతర్జాతీయ శాస్త్రవేత్తలను అబ్బురపరచింది. అధ్యయన అంశాలను ఇతర దేశాలకు వర్తింప చేయవచ్చని ఆశిస్తున్నారు. బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా బయాలజిస్ట్‌ చార్లెస్‌ గాడ్‌ఫ్రే మాట్లాడుతూ ‘ 140కోట్ల జనాభాకు అవసరమైన ఆహారాన్ని వుత్పత్తి చేయటం ద్వారా వ్యవసాయ అద్బుతాన్ని సాధించింది. అయితే పర్యావణాన్ని ఫణంగా పెట్టారు, భూమి ఆమ్లీకృతమైంది, నీరు కలుషితమై ప్రపంచ తాపం పెరగటానికి దోహదం చేసింది. తాజా అధ్యయనం పెద్ద మొత్తంలో ఆర్ధిక ఫలితాలను రాబట్టటంతో పాటు ఎరువుల వాడకాన్ని తగ్గించటం సాధ్యమే అని సూచించింది.’ అన్నారు. ఏటా ఒక హెక్టారుకు చైనా రైతులు 305కిలోల నత్రజని వాడుతున్నారు. ఇది ప్రపంచ సగటుకు నాలుగు రెట్లు ఎక్కువ. పంటల దిగుబడులు తగ్గకుండా నత్రజని వినియోగాన్ని తగ్గించటం ఎలా అనే దిశగా బీజింగ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన పధకం 2005 నుంచి 2015వరకు సాగింది.ఈ వ్యవధిలో 13,123 క్షేత్రాలలో మొక్కజన్న, వరి, గోధుమల గురించి దిగుబడులు, పంటల రకాలు, నాటు పద్దతులు, ఎరువులు, నీరు, ఎండతీవ్రత ప్రభావం వంటి అనేక అంశాలను వారు పరిశీలించారు. ఈశాన్య చైనా రైతులు గరిష్టంగా 20శాతం నత్రజని వాడకాన్ని తగ్గించారు. అధ్యయనం, పరిశోధనా కాలంలో సగటున ధాన్య వుత్పత్తి 11శాతం పెరిగింది, 15శాతం నుంచి 18శాతం ఎరువుల వాడకం తగ్గింది. తద్వారా 12లక్షల టన్నుల నత్రజని పొదుపైంది. ఈ పధకంలో పది సంవత్సరాలలో 14వేల కార్యశాలలను నిర్వహించారు. చైనా అంతటి నుంచి 1200పరిశోధకులు, 65వేల మంది ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, లక్షా 40వేల మంది వ్యవసాయ వాణిజ్య సంస్ధల ప్రతినిధులు, 37.7 మిలియన్‌ హెక్టార్లలో రెండు కోట్ల పదిలక్షల మంది రైతులు వివిధ స్ధాయిలలో భాగస్వాములయ్యారు. ఐదుకోట్ల నలభైలక్షల డాలర్లు ఖర్చయింది.ఈ ప్రయోగం నుంచి మన దేశం కూడా నేర్చుకోవాల్సింది వుంది.ఈ ప్రయోగానికి ముందు గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ గోధుమల్లో 549 నుంచి 434కు, వరిలో 941 నుంచి 812, మొక్కజన్నలో 422 నుంచి 328కి తగ్గాయని తేలింది.

పరిశోధనా అంశాలను అన్ని ప్రాంతాలకు వర్తింప చేయటంలో సమస్యలు తలెత్తవచ్చు, ఎంచుకున్న విధానాలను అమలు జరిపేందుకు చైనాలో కేంద్రీకృత ప్రభుత్వం వుంది కనుక సాధ్యం అవుతుంది, ఇతర దేశాలలో అలావుండదు అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి. ఇతర దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేయటానికి సవాళ్లు ఆటంకం కారాదని, తమ జనాభా కడుపు నింపటానికి కలుషిత, సరస్సులు, నదులు, సముద్రాలను తయారు చేయాల్సిన అవసరం లేదని చైనా అధ్యయనం నిరూపించిందనే అభిప్రాయం కూడా వెల్లడైంది. వేల యకరాల కమతాలతో భారీ యంత్రాలతో అమెరికాలో వ్యవసాయం జరుగుతోంది. అత్యంత చిన్న కమతాలుతో చైనా తన సాగు పద్దతులను మెరుగుపరచుకుంటోంది. అమెరికాతో పోలిస్తే దిగుబడులలో వెనుకబడిన చైనా మన దేశంతో సహా అనేక దేశాలతో పోల్చితే ఎంతో ముందుందని మరచిపోరాదు. అగ్గిపుల్లా, సబ్బుబిళ్ల, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా కొండలు, గుట్టలు, ఫ్యాక్టరీ, రోడ్లపక్క ఖాళీ స్దలాలు, ఇండ్లపై కప్పులు వేటినీ వదల కుండా తమకు అవసరమైన పంటలను అక్కడి జనం సాగు చేస్తున్నారు.1980దశకంలో పెద్ద ఎత్తున రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించారు. తలెత్తిన దుష్పరిణామాలను గ్రహించి వాటిని అరికట్టేందుకు, దెబ్బతిన్న పర్యావరణాన్ని సరి చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. చైనాలో భూమి ప్రభుత్వానిదే. రైతులు సాగు చేసుకొనేందుకు 30 సంవత్సరాల వరకు కౌలుకు తీసుకోవచ్చు. తాకట్టు పెట్టటానికి, కొనుగోలు, అమ్మకం చేయటానికి లేదు. భూమి హక్కులను బదలాయించే అవకాశం వుంది. పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవచ్చు. సగటున ఒక్కో కుటుంబం 1.2 ఎకరాలు కౌలుకు తీసుకుంది. దేశ జనాభాలో ఇప్పటికీ 35శాతం మంది వ్యవసాయ మీద ఆధారపడుతున్నారు. పది సంవత్సరాల క్రితం 60శాతం వరకు వున్నారు.

Image result for chinese agricultural revolution

చైనా వ్యవసాయ విజయ గాధ కమ్యూనిస్టు పార్టీ లేదా ప్రభుత్వ నివేదికలలో చెప్పినదానిని కొంత మంది నమ్మకపోవచ్చు. మనీలా టైమ్స్‌ (ఫిలిప్పీన్స్‌) ప్రతినిధి జిల్‌ హెచ్‌ ఏ శాంటోస్‌ 2018 మార్చి 18,19 తేదీలలో చైనా వ్యవసాయ విజయం వెనుక నిజాలు అనే శీర్షికతో రాశారు. దానిలో ప్రపంచ వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) విస్తరణ మరియు విద్య అధికారి డాక్టర్‌ టిటో కాంటాడో మార్చినెల మొదటి వారంలో ఫిలిప్పీన్స్‌ అధికారి బెన్‌కు పంపిన ఒక మెయిల్‌లో పేర్కొన్న అంశాలను వుటంకించారు. వాటి సారాంశం ఇలా వుంది.

1982 నుంచి 1995 వరకు చైనాలో ఎఫ్‌ఏఓ కార్యక్రమాలు, చైనీయుల నుంచి అనేకం నేర్చుకోవచ్చు.1983లో నాటి చైనా వ్యవసాయ మంత్రి హె కాంగ్‌ రోమ్‌లోని ఎఫ్‌ఏఓ కార్యాలయానికి వచ్చారు. తమ ఎనభై కోట్ల రైతాంగానికి విస్తరణ సేవలు అందించేందుకు సాయం చేయాలని కోరారు. నాటి ప్రధాని డెంగ్‌ గ్జియో పింగ్‌ చైనా ముందుకు పోవటానికి చెప్పిన నాలుగు అంశాల విషయమై కాంగ్‌ వచ్చారు. అదేమంటే 1. పిల్లి రంగు ఏమిటన్నది కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే ముఖ్యం.2. బహిరంగ మార్కెట్‌, చైనీయుల అన్ని జీవన రంగాల నవీకరణ, జవాబుదారీ వ్యవస్ధ. బహిరంగ మార్కెట్‌ వ్యవస్ధను అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం, ఇతర ఆర్ధిక రంగాన్ని నవీకరించాలి. అందువలన వ్యవసాయానికి రైతులు జవాబుదారీగా వుండాలి. మంత్రి కాంగ్‌ చెప్పినదాని ప్రకారం 80కోట్ల మంది రైతులు సగటున ఒకటిన్నర హెక్టార్ల వ్యక్తిగత కమతాలను పొందుతారు. ఏమి పండించాలో వారే నిర్ణయించుకుంటారు. వ్యవసాయ వుత్పత్తి పెంచటానికి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకొనేందుకు, ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు వారికి మంచి విస్తరణ సేవలు అవసరం. మంత్రి కోరిన వెంటనే నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఎఫ్‌ఎఓ పంపింది. అది చేసిన సిఫార్సులు ఇలా వున్నాయి. కౌంటీ(మన జిల్లాల వంటివి) ప్రాతిపదికన విస్తరణ ప్రాజెక్టులను రూపొందించాలి.(చైనాలో 19 పెద్ద రాష్ట్రాలు వుంటే 2,300 కౌంటీలు వున్నాయి. ఒక్కొక్కదానిలో ఐదు నుంచి పదిలక్షలకు పైబడి జనాభా వున్నారు) కౌంటీ ఆగ్రో టెక్నలాజికల్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ను(కాటెక్‌) ప్రతి కౌంటీకి ఏర్పాటు చేయాలి. ఆ కేంద్రం ప్రయోగాలు, శిక్షణ మరియు సమాచార చేరవేత, విస్తరణ, సలహా సేవలను అందించాలి. ప్రయోగాలకు అవసరమైన ప్రయోగశాలలు, సంబంధిత ప్రత్యేక నిపుణులు, వారికి అవసరమైన ప్రయోగ క్షేత్రం, వాటికి వున్నత స్ధాయిలో వున్న వ్యవసాయ పరిశోధనా సంస్ధలతో సంబంధాలుండాలి. కాటెక్‌లో ఐదుగురు అధికారులుండాలి. జిల్లా ప్రభుత్వ ప్రతినిధి, జిల్లా వ్యవసాయ అధికారి, స్ధానిక ప్రభుత్వ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధులుండాలి. అయ్యే ఖర్చులో సగం కౌంటీ, 30శాతం రాష్ట్రం, 20శాతం కేంద్రం భరించాలి. ఎఫ్‌ఏఓ మరియు చైనా ప్రభుత్వ నిధులతో 6.8కోట్ల జనాభా వున్న జయింగ్‌షో, 11కోట్ల జనాభా వున్న సిచువాన్‌ రాష్ట్రాలలో పైలట్‌ ప్రాజెక్టులను అమలు జరపాలని ఎఫ్‌ఏఓ బృందం సిఫార్సు చేసింది. ఒకేడాది ఈ పధకాలు అమలు జరిగిన తరువాత పది సంవత్సరాల వ్యవధిలో దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఈ నమూనాను విస్తరించాలని మంత్రి ఆదేశించారు.1995 నాటికి 85శాతం కౌంటీలలో కాటెక్‌ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇందుకు గాను ప్రపంచబ్యాంకు నుంచి 12కోట్ల డాలర్ల రుణం తీసుకున్నారు. వ్యవసాయ వుత్పత్తి పెరిగింది, వ్యవసాయరంగంలో పనిచేసే వారి శాతం 73 నుంచి 37కు తగ్గింది. 2000 సంవత్సరంలో పదిశాతం వ్యవసాయ కార్మికుల లేదా రైతుల శాతం తగ్గిందని ప్రకటించారు. దీని అర్ధం పదిశాతం మంది రైతులకు పెద్ద కమతాలు అందుబాటులోకి వచ్చాయి, అది యాంత్రీకరణకు, అధిక ఆదాయానికి దోహదం చేసింది. వనరులు తక్కువగా వుండి, ఆసక్తి చూపని జనం వున్న రాష్ట్రాలు, కౌంటీలలో తప్ప వ్యవసాయంపై ఆధారపడిన వారిలో దారిద్య్రం మాయమైంది.

ఒక విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. చైనా పురోగమనానికి ప్రధాని డెంగ్‌ పేర్కొన్న నాలుగు అంశాలలో అంతర్లీనంగా వున్న పారిశ్రామికీకరణ, నిర్మాణం, వాణిజ్యం, సేవలు, రవాణా తదితర ఆర్ధిక రంగాలు దేశవ్యాపితంగా అభివృద్ధి చెందాయి. వ్యవసాయంలో అదనంగా వున్న 63శాతం కార్మిక శక్తిని వేగంగా జరిగిన అభివృద్ది ఇముడ్చుకుంది. కాబట్టి చైనా విషయంలో వ్యవసాయ ఆధునీకరణ, రైతులకు అదనపు ఆదాయం మరియు వ్యవసాయ రంగంలో వున్న దారిద్య్రంలో అత్యధిక భాగాన్ని లేకుండా చేయటం దేశవ్యాపిత ఆర్ధిక అభివృద్ధిలో భాగంగా చూడాలి. చైనా నుంచి ఇతర పాఠాలను కూడా నేర్చుకోవాల్సి వుంది.1. వారు ఎంపిక చేసిన జాతీయ, రాష్ట్ర, కౌంటీ స్ధాయి ప్రతినిధులు జవాబుదారీ, గౌరవం కలిగిన వారు మరియు వారి సహచరులు, భాగస్వాములు వారిని అనుసరించారు. చైనా ముందుకు పోవటానికి నాలుగు సూత్రాలను జాతీయ నాయకత్వం ఒకసారి ప్రకటించిన తరువాత అవి చైనా అభివృద్దికి నూతన భావజాలమైంది, దానిని సమాజంలోని అన్ని తరగతులు అనుసరించి మరింత విస్తృత పరిచాయి. నాతో పాటు పని చేసిన అధికారులు, ఇతర జనాలు నిష్కపటంగా వున్నారు. ఇతర దేశాల నుంచి కొత్త అంశాలను, ఆలోచనలను నేర్చుకొనేందుకు ఆతృత పడేవారు, నిజాయితీ, అవసరమైన మేరకు పరిమితం కావటం, పురోభివృద్ధి, బాధ్యతలకు అంకితమైన వారు. వ్యవసాయేతర రంగాలలో ప్రత్యేకించి పారిశ్రామికీకరణలో(వ్యవసాయ యంత్రాల తయారీ సహా) పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం అంటే అది వ్యవసాయాభివృద్ధికి పెట్టుబడే. చైనాలో వ్యవసాయ విస్తరణ సేవల ఏర్పాటు సంక్లిష్టమైనది కాదు. ఖర్చు తక్కువ, అమలు జరిపేందుకు, పర్యవేక్షించేందుకు సులభమైనదే. జాతీయ ఆహార భద్రత సాధించేందుకుగాను ప్రభుత్వం నుంచి భూమిని కౌలుకు తీసుకున్న ప్రతి రైతు నిర్ణీత కోటా గోధుమలు,బియ్యాన్ని ప్రభుత్వ సంస్ధ డబ్బు చెల్లించి సేకరిస్తుంది. నిర్ణీత కోటాను అందచేయటంలో ఎవరైనా రైతులు పదే పదే విఫలమైతే సదరు భూమి నుంచి రైతులను మార్చ వచ్చు. అయితే అధికంగా పండించిన మొత్తాన్ని రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. రైతులకు అప్పగించిన భూమిలో సగం గోధుమలు, వరి సాగు చేసి కోటా చెల్లించి మిగిలిన సగంలో కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసిన రైతాంగాన్ని 1980దశకంలో పురోగామి రైతులుగా గుర్తించారు.’ అని డాక్టర్‌ టిటో కాంటాడో పేర్కొన్నారు.

కొన్ని దేశాలలో అమెరికా వ్యవసాయశాఖ రూపొందించిన కొన్ని పంటల తాజా దిగుబడుల వివరాలు ఇలా వున్నాయి.( హెక్టారుకు టన్నులలో, పత్తి కిలోలు, 2019 ఫిబ్రవరి అంచనా )

దేశాలు                  వరి     గోధుమ     పత్తి      చమురు గింజలు    మొక్కజన్న

ప్రపంచ సగటు        4.55    3.39     779          2.31            5.81

అమెరికా              8.66    3.20     939          3.21          11.07

ఐరోపా యూనియన్‌   6.89    5.39      –             2.64            7.54

చైనా                   7.03    5.42     1787        2.49             6.11

భారత్‌                  3.8      3.32     480         0.97             2.83

గతంలో బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు వలస దేశాలను తమ పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు సరఫరా దేశాలుగా పరిమితం చేసేందుకు ప్రయత్నించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా సామ్రాజ్యవాదం లాటిన్‌ అమెరికాలో అదేపని చేసింది. ఒక్కొక్క దేశంలో ఒక వుత్పత్తి మీద కేంద్రీకరించి ఇతర అవసరాల కోసం తన మీద ఆధారపడే విధంగా చేసుకుంది. వుదాహరణకు క్యూబాలో ఇతర పంటలు పండేందుకు అవకాశం వున్నా కేవలం పంచదారనే ఎక్కువగా ప్రోత్సహించటం, వెనెజులాలో చమురునిల్వల వెలికి తీత తప్ప వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, ఇదే విధంగా ఇతర దక్షిణ అమెరికా దేశాలన్నింటా ఏదో ఒక వాణిజ్య పంటల వుత్పత్తికి లేదా గనులకే పరిమితం చేయటంతో అవి అని వార్యంగా ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ బలహీనత ఆధారంగా క్యూబా పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టి అక్కడి సోషలిస్టు వ్యవస్ధను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వెనెజులా చమురు ఆదాయాన్ని మదురో సర్కార్‌కు అందనివ్వకుండా ఆర్దికంగా ఇబ్బందుల పాల్జేసేందుకు పూనుకున్నారు. చైనా జనాభా అవసరాలను కూడా అందుకు వినియోగించుకొనే అవకాశం లేకుండా చైనా తీసుకున్న జాగ్రత్తలలో ఆహార స్వయం సమృద్ధి సాధన ఒకటి. జనాభా అవసరాలన్నింటినీ తీర్చే సోషలిస్టు కార్యక్రమం అమలు జరుపుతున్నందున చైనాలో సంభవించే పరిణామాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ ప్రకృతి వైపరీత్యాల రీత్యా పంటల దిగుబడి, వుత్పత్తి తగ్గితే దిగుమతులు కారణంగా ప్రపంచ మార్కెట్లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పెరుగుతాయి, అదే బాగా పండి దిగుమతి అవసరాలు తగ్గితే ధరలు పడిపోతాయి. పత్తి విషయంలో మన దేశంలో ధరలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అందువలన పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణ్యంగా చైనాలో వ్యవసాయం గురించి నిరంతరం అక్కడి ప్రభుత్వం జాగరూకత ప్రదర్శిస్తోంది.2030 నాటికి జనాభా 150కోట్లకు చేరితే ప్రతి ఏటా పదికోట్ల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా వుత్పత్తి చేయాల్సి వుందని అంచనా. చైనాలో బియ్యం ప్రధాన ఆహారం. వరిసాగుకు నీరు అవసరం. ప్రపంచ తలసరి సగటు అందుబాటులో కేవలం నాలుగోవంతు మాత్రమే చైనా నీటి లభ్యత వున్నందున దాన్ని అధిగమించటం నిజంగా పెద్ద సవాలే. చైనాలో మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా పందిమాంసం, చేపలు, కోడి మాంస వినియోగం వేగంగా పెరుగుతోంది. వాటి వుత్పత్తిని కూడా పెంచాల్సి వుంది. అందుకు అవసరమైన దాణా కూడా ధాన్య అవసరాలు పెరుగుతున్నాయి. ఒక కిలోమాంసం కావాలంటే రెండు, పందిమాంసానికి నాలుగు నాలుగు, గొడ్డు మాంసానికి ఏడు కిలోల ధాన్యం కావాల్సి వుంది. అందువలన అమెరికా ఇతర దేశాల నుంచి సోయా, మొక్కజన్న, జన్నల వంటి వాటి దిగుమతులలో ఎక్కువ భాగం దాణాకే వినియోగిస్తున్నారు.

ఫిబ్రవరి ఆరున ఈ ఏడాది చైనా నూతన సంవత్సరాది వేడుకలు ప్రారంభమయ్యాయి. సూకర(పంది)నామ సంవత్సరంగా పాటిస్తున్నారు.చైనాలో మాంస వినియోగం ఏటేటా పెరుగుతోంది. 2011లో సగటున తలకు 43.8కిలోలుండగా ఈ ఏడాది 53.3కిలోలుగా వుంటుందని అంచనా వేశారు. దీనిలో సగం పంది మాంసం. ప్రపంచ తలసరి ప్రొటీన్ల వినియోగం రోజుకు 46 గ్రాములుండాలని ఆరోగ్య సంస్ధలు సిఫార్సు చేశాయి. ప్రస్తుతం ప్రపంచ సగటు 80గ్రాములుండగా మన దేశంలో 60 వుంది. 1990-2011 మధ్య వినియోగంలో పెద్ద మార్పు లేదు. అదే చైనాలో 75 నుంచి 95కు పెరిగింది. అమెరికా సగటు వినియోగదారుడికి అవసరమైన వాటిని సమకూర్చాలంటే అక్కడ ఒక ఎకరం అందుబాటులో వుంటే అదే చైనాలో 20సెంట్లు మాత్రమే వుంది. అందువలన వ్యవసాయ అభివృద్ధి చైనాకు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. అందుకే పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో ఎలక్ట్రో కల్చర్‌ పరిశోధనలు ఒక భాగం గోబీ ఎడారి నుంచి పసిఫిక్‌ సముద్ర తీరం వరకు కూరగాయల సాగును పరిశోధించారు. మొక్కల పెరుగుదలకు విద్యుత్‌ ఎలా తోడ్పడుతుందనేది ముఖ్యాంశం. కొద్ది వారాల క్రితం విద్యుత్‌ వినియోగం ద్వారా 20 నుంచి 30శాతం వుత్పాదకత పెరిగితే, 70 నుంచి 100శాతం వరకు పురుగుమందులు, 20శాతం ఎరువుల వినియోగం తగ్గినట్లు తేలిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కూరగాయ మొక్కల మీద పది అడుగుల ఎత్తులో గ్రీన్‌ హౌస్‌లో రాగితీగల ద్వారా గరిష్టంగా 50వేల ఓల్టుల వరకు విద్యుత్‌ను ప్రసారం చేసి ఫలితాలను పరిశీలించారు. దీని వలన మొక్కలకు, సమీపంలోని మనుషులకు ఎలాంటి హాని జరగలేదు. ఎలక్ట్రోకల్చర్‌ సాగును క్రమంగా పెంచుతున్నారు. ఈ రంగంలో తాము ఇతర దేశాల కంటే ఒకడుగు ముందున్నామని, తమ సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను అమెరికాతో సహా మరికొన్ని దేశాలకు అందచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మొక్కలపై విద్యుత్‌ ప్రభావం గురించి ఆలోచన, ప్రయోగాలు కొత్తవి కాదు. చైనా రెండు వందల సంవత్సరాల తరువాత ఈ పరిశోధనల్లోకి దిగిందని చరిత్ర వెల్లడిస్తోంది.1990లో సేంద్రీయ వ్యవసాయ పరి శోధనల్లో భాగంగా చైనా సర్కార్‌ పరిశోధనలను ప్రోత్సహించింది.2014 నుంచి ఈ పరిశోధనల్లో భాగస్వామి అయిన ఒక ప్రయివేటు కంపెనీ ఎలక్ట్రో కల్చర్‌ ద్వారా రెండు సంవత్సరాలో పన్నెండు లక్షల యువాన్లను అదనంగా ఆదాయాన్ని పొందినట్లు పేర్కొన్నది. ఒక హెక్టారు గ్రీన్‌ హౌస్‌కు రోజుకు 15కిలోవాట్‌ గంటల విద్యుత్‌ అవసరం. అయితే అవసరమైన యంత్రాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని, ప్రభుత్వ తోడ్పాటు లేకుండా సాధ్యం కాదని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నాడు. ప్రతి కుటుంబం ఇంట్లో ఒక గదిలో ఎలక్ట్రో కల్చర్‌ సాగుచేసే విధంగా ఖర్చు తగ్గించే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. నిజంగా అదే జయప్రదమైతే మరో వ్యవసాయ విప్లవం వచ్చినట్లే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరో ఆయుధ పోటీకి చిచ్చు రాజేస్తున్న అమెరికా !

06 Wednesday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Arms race, INF, INF Treaty, Intermediate-Range Nuclear Forces, The 1987 INF Treaty

Image result for arms race

ఎం కోటేశ్వరరావు

మూడు దశాబ్దాల క్రితం నాటి సోవియట్‌తో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు గతేడాది మధ్యంతర ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినపుడు ఓట్ల కోసం అని అందరూ అనుకున్నారు. కానీ మరొక అడుగు ముందుకు వేస్తూ దాన్ని నిర్ధారిస్తూ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్లు గత శుక్రవారం నాడు అమెరికా అన్నంత పనీ చేసింది. వెంటనే మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ తామూ వైదొలుగుతున్నట్లు రష్యా చెప్పేసింది. అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి నిషేధిత భూ వుపరితలం నుంచి ప్రయోగించే క్షిపణుల తయారీకి పూనుకుంటున్నట్లు ప్రకటించింది. రెండు దేశాల మాటలు వాస్తవ రూపందాలిస్తే ఆరునెలల్లో పార్లమెంట్ల అనుమతితో ఆప్రక్రియ పూర్తి అవుతుంది. దీని మీద ఐరోపా వైఖరి బహిర్గతం కావాల్సి వుంది. ఈ ఒప్పందం మీద వుభయ దేశాలు ఆరోపణల, ప్రత్యారోపణల పూర్వరంగంలో 2014 నుంచి అనేక దఫాలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. అయితే రెండు దేశాలకూ, ఐరోపాను, మొత్తంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఈ పరిణామం గురించి రెండు దేశాలకు వున్న సమస్యల కారణంగా పునరాలోచించే అవకాశాలు కూడా లేకపోలేదు.ఒప్పందాన్ని రష్యా వుల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తూ ఒప్పందం నుంచి తాము వైదొలనున్నట్లు చెబుతోంది. ఫిబ్రవరి రెండవ తేదీ వరకు తాము గడువు ఇస్తున్నామని ఆలోగా సానుకూలంగా స్పందించకపోతే తాము వైదొలుగుతామని డిసెంబరులోనే పాంపియో సూచన ప్రాయంగా చెప్పారు.నిషేధిత పరిధిలోని క్షిపణులను తాము పరీక్షించలేదని, తాము వుల్లంఘించినట్లు ఆరోపణలు గాక రుజువులు చూపాలని రష్యా ప్రతిస్పందించింది. అమెరికాయే ఒప్పందానికి విరుద్ధంగా ఐరోపాలో క్షిపణులను మోహరించిందని పేర్కొన్నది.

ఎందుకీ ఒప్పందం అవసరమైంది?

ప్రచ్చన్న యుద్దంలో భాగంగా సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపా ధనిక దేశాలు అమెరికాతో చేతులు కలిపాయి. దాంతో తన వ్యూహంలో భాగంగా పశ్చిమ ఐరోపా దేశాల మీద దాడి చేయగల ఎస్‌ఎస్‌20 మధ్యంతర శ్రేణి క్షిపణులను సోవియట్‌ తన గడ్డమీద మోహరించింది. దానికి ప్రతిగా అమెరికన్లు ఇటలీ, బ్రిటన్‌, జర్మనీలో తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు. ఈ మోహరింపును అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూర్వరంగంలో మధ్య, స్వల్ప శ్రేణి అణు బలాల ఒప్పందం(ఐఎన్‌ఎఫ్‌) పేరుతో తమ వద్ద వున్న మధ్య,లఘు శ్రేణి క్షిపణులను తొలగించుకొనేందుకు 1987 డిసెంబరు ఎనిమిదిన గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌ మధ్య కాలపరిమితి లేని ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. తరువాత సోవియట్‌ రద్దు కావటంతో దాని వారసురాలిగా రష్యా ఒప్పందంలోకి వచ్చింది.ఆ మేరకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు వున్న లఘు, వెయ్యి నుంచి 5,500 కిలోమీటర్లకు వుండే మధ్య శ్రేణి అణు, సాంప్రదాయ క్షిపణులను రెండు దేశాలు తొలగించాల్సి వుంటుంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలో లేవు. ఒప్పందం ప్రకారం 1991నాటికి అమెరికా 846 సోవియట్‌ లేదా రష్యా 1,846 క్షిపణులను నాశనం చేశాయి.

ఒప్పంద రద్దుకు అమెరికాను ప్రేరేపిస్తున్న అంశాలేమిటి?

గత ఐదు సంవత్సరాల పరిణామాలను చూసినపుడు ఒప్పందం రద్దు గురించి అమెరికన్ల గళమే ఎక్కువగా వినిపిస్తున్నది. రష్యా నుంచి అటువంటి ప్రకటనలు లేవు. తాజాగా ట్రంప్‌, విదేశాంగ మంత్రి పాంపియో ప్రకటనల వెనుక ఆంతర్యం గురించి కూడా పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి. 1987 ఒప్పందం తరువాత అమెరికా తయారు చేస్తున్న లేదా ఇప్పటికే తయారు చేసిన అధునాతన అణ్వాయుధాలను ప్రపంచం ముందుంచాలంటే రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ఆటంకంగా వుంది. రష్యా, చైనా వంటి సుదూర లక్ష్యాలను చేరగల క్షిపణిని తయారు చేస్తున్నట్లు అమెరికా ఇంధన శాఖ సూచన ప్రాయంగా ఇటీవలనే వెల్లడించింది.1987 ఒప్పందంలో చైనా లేని కారణంగా అది స్వంత అణ్వాయుధ మరియు అన్ని శ్రేణుల సాంప్రదాయ క్షిపణులను తయారు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని, ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఐరోపా కేంద్రంగా చేసుకున్నదని అమెరికా-చైనా మిలిటరీ బలాబలాలను పరిగణనలోకి తీసుకోవలేదని, ఆ అంశం ఇటీవలి కాలంలో అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిందని అమెరికాలో కొత్త వాదనలు లేవనెత్తారు. గత మూడు దశాబ్దాలలో అనేక దేశాలు అధునాతన అణ్వాయుధాలను తయారు చేశాయి. ఇది రెండు దేశాలకే పరిమితమైనందున వాటిని నియంత్రించే అవకాశం లేదు. అందువలన దానికి ఎందుకు కట్టుబడి వుండాలని, గతంలో కుదిరిన ఒప్పందాలన్నీ అమెరికాను అదుపు చేసే లక్ష్యంతోనే జరిగాయని, అందువలన వాటికెందుకు కట్టుబడి వుండాలని యుద్ధోన్మాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. దీనికి అనుగుణ్యంగానే అధికారానికి వచ్చినప్పటి నుంచి ట్రంప్‌ వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరోవైపు ఒబామా, ట్రంప్‌ ఎవరు అధికారంలో వున్నా ఏటేటా రక్షణ బడ్జెట్‌ పెంపుదల వెనుక నూతన ఆయుధాల తయారీ వుందన్నది స్పష్టం.ఒప్పందం నుంచి వైదొలుగుతామని ప్రకటించటంలో ముందుండటమే కాదు, దాని ప్రారంభంలోనే తూట్లు పొడిచింది. ఒప్పందం కుదిరిన నాలుగు సంవత్సరాల తరువాత 1991లో అమెరికా తన తొలి దీర్ఘశ్రేణి అణ్వాయుధాల తయారీకి పూనుకుంది. దాన్ని చూపి మిగతా దేశాలు కూడా తమ ప్రయత్నాల్లో తాము నిమగ్నమయ్యాయి.

ఒప్పంద రద్దు పర్యవసానాలేమిటి ?

ఒప్పందం రద్దు పర్యవసానాల గురించి కూడా చర్చ జరుగుతోంది.అమెరికా, రష్యా చర్యలు ప్రపంచంలో నూతన ఆయుధ పోటీకి తెరలేపుతాయని భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ పోటీ రెండు దేశాలకే పరిమితం కాగా నూతన పరిస్ధితుల్లో చైనా కూడా అనివార్యంగా రంగంలోకి దిగాల్సి వుంటుంది. నిజంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అమెరికా, రష్యా, చైనా మధ్య నూతన తరహా ప్రచ్చన్న యుద్ధం వంటి పరిస్ధితి తలెత్తుతుందని, గతం కంటే ఇప్పుడు రష్యా, చైనాలు మరింత సన్నిహితంగా వున్న విషయాన్ని మరచిపోరాదని అమెరికా గూఢచార సంస్ధలు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.నిజంగానే రద్దు చేసుకుంటే రష్యాతో ఎలా వ్యవహరించాలన్నది తక్షణం అమెరికా ముందున్న సమస్య. 2021లో నూతన వ్యూహాత్మక అణ్వాయుధ ఒప్పందం(న్యూ స్టార్ట్‌) కుదిరే అవకాశాలు లేవు. అది లేకుండా అణ్వస్త్రవ్యాప్తి నిరోధ అమలు సాధ్యం కాదు. అన్నింటికీ మించి అణ్వాయుధాలు అనేక దేశాల దగ్గర వున్నందున వాటన్నింటినీ కట్టడి చేయటానికి అవసరమైన పెద్ద సంఖ్యలో ఆయుధాలు తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వుత్పాదక శక్తి, ఆర్ధిక సామర్ధ్యం లేదన్నది ఒక అంచనా. వాటన్నింటినీ అధిగమించి అన్ని దేశాలకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను మోహరిస్తే అమెరికా మరింతగా ఒంటరిపాటు కావటం ముఖ్య రాజకీయ పర్యవసానం అవుతుంది. ఆయుధాలను మోహరించటం తప్ప ప్రయోగించే పరిస్ధితి లేనపుడు ఇలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోవటం ఎందుకన్నది మౌలిక సమస్య. ఇప్పటికే అమెరికా తమ మీద పెత్తనం చేస్తున్నదని, తమ భద్రత తాము చూసుకోగలమని ఐరోపా ధనిక దేశాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు నాటో ఖర్చును ఐరోపా దేశాలే ఎక్కువగా భరించాలని అమెరికా వత్తిడి తెస్తోంది. ఇప్పుడు నూతన ఆయుధాలను మోహరించాలంటే అది రష్యాతో వైరాన్ని పెంచటమే గాక తమ జనాన్ని ఒప్పించటం ఐరోపా దేశాలకు అంత తేలిక కాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు గత అనుభవాల రీత్యా అవసరమైన నూతన ఆయుధాలను తయారు చేసుకొనే వరకు వున్న ఒప్పందాలను కొనసాగించక తప్పని స్ధితిలో అమెరికా వుంటుందన్నది ఒక అభిప్రాయం. ఒప్పందం నుంచి వైదొలిగితే ట్రంప్‌ ఎప్పటి నుంచో చెబుతున్నట్లు ఐరోపాలో అమెరికా మరిన్ని కొత్త ఆయుధాలను మోహరించటం, దానికి ప్రతిగా రష్యా చర్యలు వుంటాయి. నిజంగా ఒప్పందం రద్దయితే జర్మనీ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఐరోపా భద్రతకు, వ్యూహాత్మక సమతుల్యానికి ఒప్పందం కొనసాగటం అవసరమని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించగా, అమెరికా ఆయుధాల మోహరింపు బహుముఖ ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని చైనా పేర్కొన్నది.మధ్యంతర ఎన్నికల సమయంలో ట్రంప్‌ చేసిన ప్రకటనతో నాటో కూటమి దేశాలలో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా వ్యక్తమైంది. తాజా పరిస్ధితికి రష్యాదే పూర్తి బాధ్యత అని అమెరికా నాయకత్వంలోని నాటో తాజాగా వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ ఎడ్వర్డ్‌ జె మార్కే మాట్లాడుతూ ప్రమాదకరమైన ఆయుధపోటీకి దారి కల్పిస్తూ ట్రంప్‌, అతని యుద్ధ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నదని విమర్శి ంచారు. నాటో విస్తరణ ముసుగులో పోలాండ్‌, ఇతర బాల్టిక్‌ దేశాలలో ఆయుధాలను మోహరించేందుకు అమెరికా పూనుకుంది. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం నుంచి వైదొలిగి ఆయుధాలను మోహరిస్తే అవి కొన్ని నిమిషాల్లోనే రష్యాలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. అందువలన వాటికి ప్రతిగా తాము వంద మెగాటన్నుల విధ్వంసక బాంబులను తీసుకుపోయే క్షిపణులను తయారు చేయక తప్పదని రష్యన్లు హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో అమెరికా అంతర్జాతీయ వ్యవస్ధ నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నది. వాతావరణ మార్పులు, భూతాపం తదితర అంశాలున్న పారిస్‌ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అణు ఒప్పందం, అంతర్జాతీయ పోస్టల్‌ యూనియన్‌ నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అవన్నీ ఒక ఎత్తయితే తాజా ప్రకటన అత్యంత ప్రమాదకర చర్యల, అంతర్జాతీయ భద్రత మీద ఎంతో పభావం చూపనుంది. తమ వద్ద వున్న పాత తరం అణ్వాయుధాలను వదలించుకొనేందుకు ఒప్పందంలో అమెరికా భాగస్వామి అయిందనే ఒక అభిప్రాయం వుంది. ఇప్పుడు అంతకంటే అధునాతన ఆయుధాలున్నందున మరోసారి ప్రపంచాన్ని భయపెట్టేందుకు పూనుకుందని చెప్పాలి. రెండవ ప్రపంచ యుద్ధం దాదాపుగా ముగిసిన తరువాత ప్రపంచాన్ని భయపెట్టేందుకు అమెరికన్లు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించిన ‘లిటిల్‌ బోయ్‌, ఫాట్‌ మాన్‌ ‘ అణుబాంబులు ఇప్పటి వాటితో పోల్చితే చాలా చిన్నవి. అయినా అవెంత మారణకాండకు కారణమయ్యాయో ఇప్పటికీ ఆ ప్రాంతంలో అణుధార్మికత ఎలా వుందో చూస్తున్నాము.మరోసారి ప్రపంచ యుద్దమంటూ వస్తే మిగిలే దేశం ఒక్కటీ వుండదు.ప్రచ్చన్న యుద్దం 35వేల అణ్వాయుధాల తయారీకి దారితీసింది. వాటితో ప్రపంచాన్ని ఎన్నిసార్లు నాశనం చేయవచ్చో వూహించుకోవాల్సిందే. అలాంటి పోటీని మరింతగా పెంచేందుకు అమెరికా పూనుకుంది. ఇది అత్యంత దుర్మార్గం.నిజంగానే ఒప్పందం రద్దయితే ఆ చారిత్రాత్మక ఎదురుదెబ్బకు బాధ్యురాలు అమెరికానే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d