• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

రష్యా ఎన్నికలలో పశ్చిమ దేశాల జోక్యం !

04 Thursday Jan 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Communist Party of the Russian Federation, russian elections, Vladimir Putin, western countries intervention, western countries intervention in russian elections

ఎం కోటేశ్వరరావు

మార్చి 18న జరిగే రష్యా ఏడవ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం మొదలైంది. నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్ధులు తమ అర్హత పత్రాలను ఈనెల ఏడు, పార్టీల అభ్యర్ధులు పన్నెండవ తేదీలో సమర్పించాల్సి వుంది. ఎన్నికల ప్రచారం అధికారికంగా డిసెంబరు18న ప్రారంభమైంది. అప్పటి నుంచి 25 రోజుల లోగా అంటే జనవరి పదహారవ తేదీలోపు తాము ఫలానా వారిని అభ్యర్ధులుగా నియమించినట్లు పార్టీలు సమావేశాలలో అధికారికంగా చేసిన తీర్మానాలను ఎన్నికల కమిషన్‌కు అందచేయాలి. అధ్యక్ష పదవికి ఎన్నికవ్వాలంటే యాభైశాతంపైగా ఓట్లు తెచ్చుకోవాలి. ఎవరికీ ఆమేరకు రానట్లయితే మూడు వారాల్లోపు మొదటి రెండు స్ధానాలలో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ నిర్వహించాల్సి వుంది.

అధ్యక్ష పదవికోసం మరోసారి పోటీ పడుతున్న వ్లదిమిర్‌ పుతిన్‌, కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధిగా లెనిన్‌ వ్యవసాయ కంపెనీ పారిశ్రామికవేత్త పావెల్‌ గ్రడినిన్‌, ఇతర పార్టీల తరఫున వ్లదిమిర్‌ జిరినోవస్కీ, గ్రిగొరీ యెవలిన్‌స్కీ,సెనియా సోబ్‌చెక్‌ తదితరులు వున్నారు. రష్యా నిబంధనల ప్రకారం పార్టీల అభ్యర్ధులుగా పార్టీ సభ్యులు కాని వారిని కూడా నియమించవచ్చు.దానికి అనుగుణ్యంగానే కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా ఎంపిక చేసింది. ప్రస్తుతం రష్యాలో నమోదైన పార్టీలు 69 వున్నాయి. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలంటే మూడులక్షల సంతకాలను సేకరించాల్సి వుంది, అయితే ఏ ఒక్క రాష్ట్రంలోనూ అవి ఏడున్నరవేలకు మించకూడదు. అంటే దేశమంతటా పలుకుబడి కలిగిన వారే పోటీకి అర్హులు అవుతారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని పార్టీల అభ్యర్ధులు లక్ష సంతకాలను సమీకరించాల్సి వుంది. ఏరాష్ట్రంలోనూ అవి రెండున్నరవేలకు మించకూడదు.ఒక ఓటరు ఒక అభ్యర్ధికి మాత్రమే మద్దతుగా సంతకం చేయాలి. ఫిిబ్రవరి మొదటి వారంలో నామినేషన్ల పరిశీలన, ఖరారు చేస్తారు.

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వున్న కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని అధ్యక్షపదవికి అభ్యర్ధిగా నిర్ణయించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. డిసెంబరు 23న కమ్యూనిస్టు పార్టీ వార్షిక ప్లీనరీ సమావేశంలో పావెల్‌ గ్రడినిన్‌ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీ అధినేత జుగనోవ్‌ అభ్యర్ధి గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు.’ ఆయనొక శక్తి వంతుడు, అనుభవశాలి. సోషలిస్టు పద్దతులలో తన సంస్ధను నిర్మించారు. గ్రడినిన్‌ను బలపరిస్తే ఈ అనుభవాన్ని ప్రతిచోటా వ్యాపింపచేయవచ్చు. ఆయన వ్యాపారే, మాటలు చెప్పరు, వ్యాపారాన్ని జాతీయ దృక్పధంతో చేస్తున్నారు. సోవియట్‌ విలువలకు మద్దతు ఇస్తారు. ఆయన సంస్ధ అత్యుత సాంకేతిక పరిజ్ఞానంతో కూడి వుంది. ఒక బ్యాంకు చైర్మన్‌ మాదిరి గాక ఒక కమ్యూనిస్టు డైరెక్టర్‌లా వ్యవహరిస్తారు. నిరంకుశుడు కాదు, జన సేవకుడు. రష్యన్‌ ప్రభుత్వం అన్నింటినీ వదిలించుకోవాలనే కార్యక్రమం కలిగి వుంది. ఆ సవాలును దేశభక్తులు స్వీకరించారు. వారి ప్రధాన లక్ష్యం జనం గురించిన ఆందోళనే. సొమ్మును దోచుకోలేదు, విదేశాల్లో దాచుకోలేదు,పెట్టుబడులు పెట్టాడు. ప్రజల మనిషిగా అన్ని పరీక్షలు నెగ్గాడు. పార్టీ మద్దతు, దేశభక్తుల విశాల కూటమితో పనిచేశాడు. గ్రామీణ సామాజిక జీవనాన్ని పటిష్టం గావించారు. మార్కెట్‌ శక్తులు, దోపిడీదారులు, అవినీతి పరుల మధ్య పోటీలో ఒక స్ధిరమైన సంస్ధను నిర్మించారు. ఆయనకు వుత్పత్తి ఎలా చేయాలో మాత్రమే కాదు గౌరవ ప్రదమైన వేతనాలు, పెన్షన్లు ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. గరిష్ట వేతనాలు, సిబ్బంది సంరక్షణ చూశారు.వుచిత గృహవసతి, విద్య, వైద్యం కల్పించారు. సోవియట్‌ కాలం నాటి కార్మిక నిబంధనలన్నీ పాటించారు. పార్టీ మొత్తంగా ఆయన విజయానికి పని చేయాలి.మన అభ్యర్ధి ఒక మంచి, విలువైన వ్యక్తి అని మనం రుజువు చేయాలి, ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా ఆయన విజయానికి కృషి చేయాలి.’ అని జుగనోవ్‌ చెప్పారు.

యాభైఏడు సంవత్సరాల గ్రడినిన్‌ మెకానికల్‌ ఇంజనీరు, మాస్కో సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో 1990 దశకం నుంచి పనిచేస్తున్నారు.ఆయన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించగానే రష్యన్‌ మీడియా ఆసక్తితో పాటు దాడులు కూడా ప్రారంభించింది. కమ్యూనిస్టు పార్టీ తన పలుకుబడిని పెంచుకొనేందుకు పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పోటీకి నిలిపినట్లు అనేక మంది వ్యాఖ్యానించారు.జుగనోవ్‌ ఇతర కమ్యూనిస్టు పార్టీ నేతలతో కలసి వేసిన నామినేషన్‌ కార్యక్రమానికి పెద్ద ప్రచారం కల్పించారు.

ఎన్నికల ప్రచారం లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ ఇంకా వూపందుకోలేదు.పోలింగ్‌కు సరిగ్గా నెల రోజు ముందు మీడియాలో అభ్యర్ధుల ప్రచారం ప్రారంభం అవుతుంది. గతంలో జరిగిన ఎన్నికలపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సారి ఎలా జరుగుతాయో వూహించటం కష్టం కాదు. 2016 అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందన్న తీవ్ర విమర్శలు, ఆరోపణల నేపధ్యంలో ఈ సారి దానికి పోటీగా అమెరికా జోక్యం చేసుకుంటుందా అన్నది ప్రశ్న.ప్రస్తుతం వెల్లడవుతున్న అభిప్రాయాల ప్రకారం పుతిన్‌ తిరిగి విజయం సాధించటం ఖాయం అనే వాతావరణం వుంది. డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారనే విమర్శల నేపధ్యంలో ఇపుడు రష్యా ఎన్నికలలో జోక్యం అనే వార్తలు వస్తున్నాయి. అవినీతి కేసులలో శిక్షపడిన అలెక్సీ నవాల్నే పోటీకి అనర్హుడని ప్రకటించటంతో రష్యన్‌ ఎన్నికలను బహిష్కరించాలని అతడు పిలుపునిచ్చాడు. తను రంగంలో వుంటే పుతిన్‌ అవకాశాలు దెబ్బతింటాయనే కారణంతోనే తనను తప్పించారని చేసిన ఆరోపణను అమెరికన్‌ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ చర్య తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని పుతిన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఖండించారు. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేయటమే తమ ముఖ్య లక్ష్యంగా ఎంచుకున్న సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికన్లు తదుపరి పర్యవసానాలను పూర్తిగా అంచనా వేయలేకపోయారా అన్నది ఒక అంశం. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత రష్యా కూడా ఐరోపాలోని ఇతర దేశాల మాదిరి తనకు లొంగి వుంటుందని అమెరికన్లు భావించి వుండవచ్చు. కానీ ఆచరణలో అది కూడా పోటీదారుగా మారుతుందని, ప్రపంచ రాజకీయాలలో తన పట్టు పెంచుకొనేందుకు ముందుకు వస్తుందని సామ్రాజ్యవాద దేశాలు అంచనా వేసి వుంటే పరిణామాలు కచ్చితంగా మరో విధంగా వుండేవి. మార్కెట్ల వేట పోటీలో సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసికొత్తగా ముందుకు వచ్చిన రష్యా సహజంగానే తన వాటాను డిమాండ్‌ చేయటమే మిగతా పశ్చిమ దేశాలు, దానికి వున్న వివాదం.

దీనిలో పశ్చిమ దేశాలను సవాలు చేసేంతగా రోజు రోజుకూ అన్ని రకాలుగా బలం పెంచుకుంటున్న సోషలిస్టు చైనా అనేక అంశాలలో రష్యాతో చేయి కలుపుతోంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, సైనిక సమీకరణలు లేకపోవటం వుభయులకు ప్రయోజనకరమైన అంశం. అందువల్లనే అమెరికా, దాని మిత్ర దేశాలతో ఆసియాలో, ఐరోపాలో రష్యన్లు ఏకు మేకై కూర్చున్నారు. రష్యా పక్కనే వున్న వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు నాటో కూటమి నిరంతరం ప్రయత్నిస్తున్నది.రష్యా అడ్డుకుంటున్నది. క్రిమియా ప్రాంతాన్ని తనలో కలిపివేసుకోవటం ద్వారా ఆ ప్రాంతంలో తమకు ఎదురులేదని రష్యా లోకానికి చాటింది. ఆ పేరుతోనే వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు పశ్చిమ దేశాలు పావులు కదుపుతున్నాయి, పోటీ పడుతున్నాయి. వుక్రెయిన్‌ పరిరక్షణకు తాము టాంకులను ధ్వంసం చేసే క్షిపణులతో సహా అధునాతన మారణాయుధాలు అందచేసేందుకు సిద్దంగా వున్నామని తొలిసారిగా కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రకటించింది రష్యా. వాటిని ఆత్మరక్షణ కోసమే వాడతాం తప్ప ఎదురుదాడికి కాదని వుక్రెయిన్‌ చెబుతున్నది. అమెరికా ప్రకటనను తప్పు పడుతున్న జర్మనీ అదనపు ఆయుధ విక్రయాల గురించి ప్రశ్నిస్తున్నది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయుధాలతో పనేముంది వేరే మార్గం వుందన్నట్లుగా జర్మనీ రంగంలోకి దిగింది. ఎన్నికలలోపే వుక్రెయిన్‌లో ఐరాస శాంతి దళాలను ఏర్పాటు చేయాలని బుధవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రి వుక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో కోరటం దానిలో భాగమే. వుక్రెయిన్‌లో ఐరాస దళాల ఏర్పాటుకు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ఫ్రాన్స్‌తో కలసి జర్మనీ ప్రయత్నిస్తోంది. రష్యా ఎన్నికలను సాకుగా చూపరాదని కోరుతోంది. వుక్రెయిన్‌ విషయంలో తనకు పెద్దన్న పాత్ర వుండాలని అమెరికా కోరుకుంటుండగా అటువంటి అవకాశం ఇవ్వరాదని జర్మనీ, ఫ్రాన్స్‌ సహజంగానే కోరుకుంటాయి. ఐరోపా సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, ఇతరుల పాత్ర వుండరాదని అవి చెబుతున్నాయి. ఈ రెండు పరిణామాలు పరోక్షంగా రష్యన్‌ ఎన్నికలలో జోక్యం చేసుకోవటమే అవుతుంది. తమకు కొరకరాని కొయ్యగా తయారైన పుతిన్‌ మీద పశ్చిమ దేశాలకు సానుకూల వైఖరి వుండదు. అయితే తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించగల బలమైన మరొక నాయకుడు, శక్తి పశ్చిమ దేశాలకు దొరకటం లేదు. అధికారపక్ష బలంతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ గత పాతిక సంవత్సరాలుగా అక్కడ కమ్యూనిస్టుపార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా వుంటోంది. వర్గ స్వభావ రీత్యా పశ్చిమ దేశాలు కమ్యూనిస్టులను బలపరిచే సమస్యే లేదు. ఇదొక విచిత్ర పరిస్ధితి. ఇతర పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాలలో పశ్చిమ దేశాలు తమకు అనుకూలమైన శక్తులను సంపాదించటంలో కొంత మేరకు జయప్రదమయ్యాయి. అనేక సందర్భాలలో రష్యాను వ్యతిరేకించే, పశ్చిమ దేశాల అనుకూల శక్తులే ఎన్నికలలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

నిజానికి పుతిన్‌ అధికార రాజకీయాలలో తలపండిన వ్యక్తి. తన ఎన్నికకు మార్గం సుగమం చేసుకొనేందుకు గత ఏడాది కాలంగా ఇంటా బయటా అనేక చర్యలు తీసుకున్నాడు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తారనే అనుమానం వున్న గవర్నర్లను తొలగించటం,బదిలీ చేయటం వంటి వాటిని కొద్దినెలల ముందుగానే పూర్తి చేశాడు.విదేశాలలో సొమ్ము దాచుకున్నవారిపై కఠిన చర్యలంటూ ఆర్భాటం చేసినప్పటికీ ఎన్నికల నేపధ్యంలో వారికి అనుకూలమైన చర్యలు తీసుకున్నాడు. ఆర్ధికశాఖ నిషేధజాబితాలో వున్న దేశాలలో తప్ప ఇతర దేశాలలో దాచుకున్న సొమ్మును రష్యా తీసుకురానవసరం లేదని, పన్నులు చెల్లించక్కరలేదని లెక్కలు ప్రకటిస్తే చాలనే వెసులుబాటు కల్పించాడు. నిధుల వివరాలు వెల్లడించిన వారి మీద ఒకటి రెండుశాతం పన్ను విధించి క్షమించి వదలి వేయాలనే ఆలోచన వున్నట్లు వార్తలు రాయించారు. జనవరి ఒకటి నూతన సంవత్సరాది సందర్భంగా చిన్న సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ పుతిన్‌ పలు చర్యలు ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల అక్రమాలు తప్ప మరొకటి కాదు.

అంతర్జాతీయంగా రష్యా తన పట్టునిలుపుకొనే క్రమంలో అమెరికాను వ్యతిరేకిస్తున్నప్పటికీ దాని ఆర్ధిక పరిస్ధితి అంత సజావుగా లేదు. ఇతర ధనిక దేశాల మాదిరే ఆర్ధిక సంక్షోభప్రభావం తీవ్రంగా పడింది. గత కొంత కాలంగా దాని అభివృద్ధి రేటు గిడసబారింది. గతేడాది అభివృద్ధి రేటు 1.8-2.2శాతం మధ్య వుండవచ్చని డిసెంబరు మధ్యలో రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంకు ప్రకటించింది. దాని అంచనా ప్రకారం 2018లో 1.5-2శాతం మధ్య వుంటుందని పేర్కొన్నది. రానున్న పది సంవత్సరాలలో రష్యా ఆర్ధిక పరిస్ధితి నిరాశాజనకమే అని బ్లూమ్‌బెర్గ్‌ విశ్లేషించింది. 2021నాటికి చమురు పీపా ధర 20డాలర్లకు పడిపోతుందని, రష్యన్‌ప్రభుత్వం బడ్జెట్‌ సమస్యలతో పాటు కార్మికుల సమ్మెలతో తలెత్తే పరిస్ధితిని ఎదుర్కోవాల్సి వుంటుందని పేర్కొన్నది.2024నాటికి చమురు ధర పదిడాలర్లకు పడిపోతుందని,2028నాటికి రాజకీయ రంగం నుంచి పుతిన్‌ కనుమరుగవుతారని జోస్యం చెప్పింది.ఈ జోస్యం ఫలించినా లేదా ఇప్పుడున్న ఆర్ధిక మాంద్యం కొనసాగినా పుతిన్‌కు ఇవే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యం లేదు. గతంతో పోలిస్తే చమురు ధరలో పెద్దగా పెరుగుదల లేకపోయినా దివాలాకోరు ఆర్ధిక విధానాల కారణంగా రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధకున్న పరిమితులు వెల్లడయ్యాయి.

ఈ పూర్వరంగంలో జరుగుతున్న ఎన్నికలను ఆర్ధిక స్ధితి పెద్దగా ప్రభావితం చేయబోదని పుతిన్‌ విజయం సాధిస్తారని మీడియా పండితులు చెబుతున్నారు. ఆర్ధిక పరిస్ధితి ఇలాగే కొనసాగితే రష్యన్‌ సమాజంలో ఎలాంటి అసంతృప్తి తలెత్తుతుందనేది ఇప్పుడే జోస్యం చెప్పలేము. అయితే సోషలిజాన్ని పోగొట్టుకున్న పాతికేండ్ల తరువాత సాధించిందేమిటి అని నెమరువేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బోల్షివిక్‌ విప్లవం జరిగి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 58శాతం మంది సోవియట్‌ను కోల్పోయినందుకు విచారం వెలిబుచ్చుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. గతం మాదిరే చరిత్ర పునరావృతం కాదుగాని ముందుకే పోతుంది, అది పురోగమనం వైపే అన్నది చరిత్ర చెప్పిన సత్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పార్లమెంట్‌, రాష్ట్రాలలో నేపాల్‌ కమ్యూనిస్టు ఐక్యకూటమి ఘనవిజయం !

13 Wednesday Dec 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

cpn uml, kp sharma oli, Nepal communists, Nepal elections, prachanda

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో నేపాల్‌ కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు.ఒక నాడు ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ప్రకటించిన నేపాల్‌లో అన్ని మతాలకు సమాన గుర్తింపు నిచ్చే లౌకిక, ప్రజాస్వామ్య నూతన రాజ్యాంగం రచనలో కమ్యూనిస్టులు భాగస్వాములు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన స్ధానాలలో మూడింట రెండు వంతులపైగా మెజారిటీ ఇప్పటికే సాధించారు. దామాషా స్ధానాలను కలిపినపుడు కూడా అదే మెజారిటీ పొందే అవకాశాలున్నాయి. కమ్యూనిస్టులే సంపూర్ణ మెజారిటీతో ఏర్పాటు చేసే ప్రభుత్వం నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాతే ఇదే ప్రధమం. నవంబరు 26, డిసెంబరు ఏడవ తేదీన రెండు విడతలుగా 275 సీట్లకు జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టుల విజయం హిమాలయ దేశంపై ఆసక్తి చూపుతున్న అన్ని దేశాలలో ముఖ్యంగా కమ్యూనిస్టులు అధికారానికి రావద్దని కోరుకుంటున్న వారిలో వేడిపుట్టించిందంటే అతిశయోక్తికాదు.

పార్లమెంట్‌లోని 275 స్ధానాలు ఏడు రాష్ట్రా( ప్రాంతాలు)లలో విస్తరించి వున్నాయి. వాటిలో 165 నియోజకవర్గాలకు మనదేశంలో మాదిరి ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్ధానాలకు పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి దామాషా పద్దతిలో ఎన్నికలు జరిగాయి.  165కు గాను 116 చోట్ల కమ్యూనిస్టులు విజయం సాధించారు. మొత్తం ఓట్లు లెక్కింపు పూర్తి అయిన తరువాత పదిహేనవ తేదీన దామాషా ప్రాతిపదికన వచ్చిన సీట్లను పార్టీలకు కేటాయిస్తారు. బుధవారం నాటికి జరిగిన లెక్కింపు వివరాల మేరకు దామాషా ఓట్లలో నేపాలీ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ 35.35శాతం ఓట్లతో ముందుండగా నేపాలీ కాంగ్రెస్‌ 33.62శాతంతో రెండవ స్ధానంలో, 13.63 శాతంతొ మావోయిస్టు సెంటర్‌ మూడవ స్ధానంలో కొనసాగుతోంది. మరో మూడు పార్టీలు సాధించాల్సిన కనీస మూడుశాతం కంటే ఎక్కువ తెచ్చుకొని దామాషా సీట్లలో ప్రాతినిధ్యం పొందనున్నాయి. మొత్తం స్ధానాలలో 33శాతం మహిళలకు కేటాయించారు. ఏడు ప్రాంతాల శాసనసభకు జరిగిన ఎన్నికలలోనూ నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ అభ్యర్ధులు ఆరు చోట్ల మెజారిటీలో వున్నారు. ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. రాష్ట్రాల శాసన సభలలో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల స్ధానాలలో యుఎంఎల్‌ 166,మావోయిస్టు సెంటర్‌ 73, నేపాలీ కాంగ్రెస్‌ 45, ఇతర పార్టీలు 45 తెచ్చుకున్నాయి. దామాషా సీట్లకు గాను నమోదైన పార్టీలు కనీసంగా ప్రతి రాష్ట్రంలో 1.5శాతం ఓట్లు తెచ్చుకుంటే ప్రాతినిధ్యం పొందుతాయి.

మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండ

తమ కూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందనే విశ్వాసాన్ని ఎన్నికల ముందు వ్యక్తపరచిన యుఎంఎల్‌ నాయకుడు కెపి శర్మ ఓలీ మాటలను అతిశయోక్తిగా వర్ణిస్తూ మహా అయితే స్వల్ప మెజారిటీ సాధించవచ్చునేమో అని అనేక మంది కొట్టిపారేశారు. మావోయిస్టులు అధికారంలో కొనసాగుతూనే ప్రతిపక్షంలో వున్న యుఎంఎల్‌ పార్టీతో అవగాహనకు రావటంపై సహజంగానే వుభయ పార్టీలలో కొంత అసంతృప్తి రేపింది. సీట్లు కోల్పోయిన వారు, రాని వారు కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తారేమోనని సందేహించారు. కమ్యూనిస్టు పార్టీల మధ్య అవగాహనను దెబ్బతీసేందుకు మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండకు చివరి క్షణంలో నేపాలీ కాంగ్రెస్‌నేతలు ప్రధాని పదవిని ఎరవేసినా ఆశ్చర్యం లేదని కొందరు వూహించారు. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కమ్యూనిస్టులు విజయకేతనం ఎగుర వేశారు. మూడింట రెండువంతుల కంటే ఎక్కువగా సీట్లను పొందారు.

అక్టోబరు రెండవ తేదీన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌) నేపాలీ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60:40 దామాషా పద్దతిలో రెండు పార్టీలు పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత పార్టీల ఐక్యతా క్రమాన్ని ప్రారంభిస్తారు. యుఎంఎల్‌ పార్టీ 80, మావోయిస్టు సెంటర్‌ 36 సీట్లు గెలుచుకుంది. రద్దయిన పార్లమెంటులో పెద్ద పార్టీగా వున్న నేపాలి కాంగ్రెస్‌కు 23, ఇతర పార్టీలకు 26 సీట్లు వచ్చాయి. మావోయిస్టు సెంటర్‌ నుంచి విడిపోయి నయాశక్తి పార్టీ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని బాబూరామ్‌ భట్టారాయ్‌ని తమ గుర్తుపై పోటీ చేసేందుకు మావోయిస్టు సెంటర్‌ నిరాకరించింది. దాంతో ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చి పార్లమెంటుసీటులో విజయం గెలిచారు. వచ్చిన వార్తలను బట్టి యుఎంఎల్‌ పార్టీ అధ్యక్షుడు కెపి శర్మ ఓలి ప్రధానిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. నేపాల్‌ నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన 30 రోజుల లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వుంది. ఎన్నికల తరువాత రెండు పార్టీల విలీనం జ రుగుతుందని గతంలో ప్రకటించారు.

. రాచరిక వ్యవస్ధ అంతరించిన తరువాత నేపాల్‌ రాజకీయ అవనికపై నేపాలీ కాంగ్రెస్‌, యుఎంఎల్‌, మావోయిస్టు సెంటర్లే ప్రధాన పాత్ర పోషించాయి. వాటి మధ్యే సంకీర్ణ కూటమి అవగాహనలు కుదిరాయి, ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి, విడిపోయాయి. అందువలన వైఫల్యాలకు మూడు పార్టీలను బాధ్యులను చేయాల్సి వుంటుంది. అసలే పేద దేశం దానికి తోడు దశాబ్దాల పాటు ఫూడల్‌ రాచరిక వ్యవస్ధలో ప్రజాస్వామ్యం, ఎలాంటి అభివృద్ధి లేని దేశంలో రాచరికానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం సాగిన అంతర్యుద్ధం, అది ముందుకు తెచ్చిన అంశాలు, వేర్పాటు వాదం వంటి సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి.చైనాతో సన్నిహిత సంబంధాలతో పాటు ఆ దేశ పెట్టుబడులను ఆహ్వానించాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్న కారణంగానే జలవిద్యుత్‌ ప్రాజక్టుల వంటివి ఆలశ్యమయ్యాయని విమర్శకులు ఆరోపించారు. అదే సమయంలో నేపాలీ కాంగ్రెస్‌కు గతంలో భారత్‌తో వున్న సంబంధాల కారణంగా భారత్‌తో స్నేహంగా వుండాలనే వైపు మొగ్గు చూపారని కూడా విశ్లేషకులు పేర్కొన్నారు.

రాచరిక వ్యవస్ధ కూలిపోయిన తరువాత ఏర్పడిన అనేక సంకీర్ణ ప్రభుత్వాలు, భాగస్వామ్య పక్షాల మధ్య తలెత్తిన సమస్యలు, నూతన రాజ్యాంగంపై ఏర్పడిన ప్రతిష్ఠంభన, కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత వ్యక్తం కావటం, ఇరుగు పొరుగు దేశాలజోక్యం, ప్రభావం,పేదరికం, దారిద్య్రం, ప్రజల ఆకాంక్షల వంటి అనేక సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి. ఈ పూర్వరంగంలో నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగటమే ఒక ముఖ్యాంశంగా చెప్పాల్సి వుంటుంది. రిపబ్లికన్‌, ఫెడరల్‌ లక్షణాలతో కూడిన నూతన రాజ్యాంగాన్ని 2015 సెప్టెంబరులో ఆమోదించారు. 2018జనవరిలోగా కొత్త రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలన్నది ఆదేశం. రద్దయిన పార్లమెంట్‌లో అధికార కూటమిలో వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) ప్రధాన ప్రతిపక్షంగా వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌)తో అవగాహనకు రావటం దేశ రాజకీయాలలో నూతన వుత్తేజాన్ని నింపటంతో పాటు ప్రజామోదం పొందినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.

ఎన్నికలకు ముందు నేపాల్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు సంభవించాయి. నేపాలీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వంలో మావోయిస్టు సెంటర్‌ భాగస్వామి. దాని మంత్రులు రాజీనామా చేయకుండానే ప్రతిపక్ష యుఎంఎల్‌ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. దీంతో నేపాలీ కాంగ్రెస్‌ దేశంలోని కమ్యూనిస్టేతర పార్టీలన్నింటినీ ప్రభుత్వంలోకి ఆహ్వానించటమే గాక కొత్త మంత్రులను కొందరిని చేర్చుకొని వారికి మావోయిస్టు మంత్రుల శాఖలను కేటాయించారు. రాచరిక వ్యవస్ధను సమర్ధించే రాష్ట్రీయ ప్రజాతంత్రపార్టీ, మధేశీపార్టీల వంటి వాటిని చేరదీశారు. అయితే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా వాటి మధ్య ఐక్యత కానరాలేదు. మధేశీ పార్టీలలో ఒకటైన ఎన్‌డిఎఫ్‌ మాత్రమే నేపాలీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఎన్నికల ప్రచార తీరు తెన్నులను చూస్తే కమ్యూనిజమా లేక ప్రజాస్వామ్యమా అన్న పద్దతిలో మార్చివేసిన కమ్యూనిస్టేతర పార్టీలు దేశంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టచూశాయి. ఇదే సమయంలో ఎన్నికలను విచ్చిన్నం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. అసంతృప్తి చెందిన మావోయిస్టులు, ఇతరులు కొందరు కొన్ని చోట్ల బాంబుల దాడులు కూడా జరిపారు. కొన్ని చోట్ల సైన్యాన్ని దింపాల్సి వచ్చింది. మొత్తం మీద ఎన్నికలు జరగటం ఒక విశేషంగానే పరిశీలకులకు కనిపించింది.

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ ప్రజలు మా కార్యక్రమాన్ని ఆమోదించారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అభివృద్ధికోసం ప్రతిపక్షాలను కూడా కలుపుకుపోతాం, దేశాభివృద్ధికి ఏకాభిప్రాయం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇతర శక్తులను విమర్శించే లేదా నిందించే రోజులు పోయాయి, ఇప్పుడు దేశం స్ధిరత్వాన్ని చూడనుంది, మేం అభివృద్ధి గురించి తప్ప రాజకీయాలు మాట్లాడబోం అన్నారు.పార్లమెంటరీ మెజారిటీ సాధించటంతోనే స్ధిరత్వం రాదని అభివృద్ధి, సంపదల సృష్టికి నేతలు సుముఖత చూపితేనే సాధ్యమని చెప్పారు.

ఎన్నికల తరువాత దేశం రాజకీయ స్ధిరత్వం మరియు అభివృద్ధి బాటలో ప్రవేశించిందని మావోయిస్టు సెంటర్‌ అధ్యక్షుడు పుష్ప కమాల్‌ దహాల్‌( ప్రచండ) వ్యాఖ్యానించారు.చిటవాన్‌ మూడవ నంబరు పార్లమెంటరీ స్ధానం నుంచి విజయం సాధించిన సందర్భంగా ఎన్నికల సంఘ అధికారి ధృవీకరణ పత్రం అందచేసే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రచండ పాల్గన్నారు. దేశం ఇంకేమాత్రం గందరగోళ పరిస్ధితులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని వామపక్ష కూటమికి ప్రజలిచ్చిన బాధ్యతను వమ్ముకానివ్వబోమని చెప్పారు. ఈ విజయం ప్రపంచవ్యాపితంగా వివిధ కారణాలతో నీరసపడి వున్న పురోగామివాదులు, కమ్యూనిస్టులలో ఎంతో వుత్సాహాన్ని నింపుతుందని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్క్సిజానికి క్రైస్తవం వ్యతిరేకమా, అనుకూలమా ?

16 Thursday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RELIGION, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, bible teachings, Bolshevik Revolution, communism, communist manifesto, Pope Francis

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మాస్కోలో వైఫల్యం-బీజింగ్‌లో విజయం !

14 Tuesday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, china communist party, communist, Donald trump, Socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-4

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడవ తేదీ సందర్భంగా వంద సంవత్సరాల బోల్షివిక్‌ విప్లవం గురించి ముందుగానే మొదలైన చర్చ తరువాత కూడా ప్రపంచ మీడియాలో సాగుతోంది. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా బోల్షివిక్‌ విప్లవం గురించి వెలువడే వ్యతిరేక,సానుకూల అంశాలన్నింటిపై మధనం జరగవలసిందే. పాత, కొత్త తరాలు వాటి మంచి చెడ్డలను గ్రహించాలి. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ విధానాలదే పైచేయిగా వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి ప్రాతినిధ్యం వహించే దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తమ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వాటికి దిక్కు తోచటం లేదు. మొత్తంగా చూసినపుడు సోషలిస్టు దేశాలు-పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు తమ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో వాటి మధ్య విబేధాలు కూడా కొనసాగుతూనే వున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలోకి రాక ముందు 1949 నుంచి 1994 వరకు ఏడు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందాలు జరిగాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు 16సంవత్సరాలు గడిచినా కొనసాగుతూనే వున్నాయి. సాగదీతలో ఇప్పటికి ఇదే ఒక రికార్డు అయితే ఇంకెంతకాలానికి ఒప్పందం కుదురుతుందో తెలియదు. అమెరికా-ఐరోపాయూనియన్‌ల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణం. ఎవరిదారి వారు చూసుకొనే క్రమంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషలిస్టు దేశాలను ఒకవైపు దెబ్బతీయాలని చూస్తూనే మరోవైపు వాటితో సఖ్యతగా వుండే ద్వంద్వ వైఖరిని ధనిక దేశాలు అనుసరిస్తున్నాయి. రెండో వెసులుబాటు గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు వుండేది కాదు.

ఒక సైద్ధాంతిక ప్రత్యర్ధిగా భావించే చైనాను ఎదుర్కొనే క్రమంలో ప్రజాస్వామిక దేశాలు తమ వైఫల్యాలను గుర్తించాల్సి వుందని ఐరిష్‌ టైమ్స్‌ వాఖ్యాత మార్టిన్‌ వూల్ఫ్‌ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యాన సారాంశం ఇలా వుంది. నాటి రష్యానేతల కంటే చైనా గ్జీ మరింత జాగ్రత్తగా వున్నారు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నూతన యుగంలోకి ప్రవేశించిందని ఎంతో ధృడంగా చెప్పారు. తమ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటూనే అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుకొనే ఇతర దేశాలకు చైనా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. లెనినిస్టు రాజకీయ వ్యవస్ధ చరిత్ర అవశేషాలనుంచి వుద్భవించింది కాదు, ఇంకా అదొక నమూనాగా వుంది. సోవియట్‌ పారిశ్రామికీకరణ నాజీ సైన్యాలను ఓడించటానికి తోడ్పడింది. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ, ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అదే పెద్ద అసాధారణ రాజకీయ పరిణామం. ఇదిలా వుండగా అత్యంత ముఖ్యమైన ఆర్ధిక పరిణామం దారిద్య్రం నుంచి మధ్యతరగతి ఆర్ధిక స్ధాయికి చైనా ఎదుగుదల. అందుకే గ్జీ చైనాను ఒక నమూనాగా చెప్పగలుగుతున్నారు. మాస్కోలో విఫలమైన వ్యవస్ధ బీజింగ్‌లో ఎలా విజయవంతం అయిందన్నది ఇంకా తెలియాల్సి వుంది. రెండింటికి మధ్య వున్న పెద్ద తేడా ఏమంటే మావో తరువాత లెనినిస్టు రాజకీయ వ్యవస్ధను అట్టేపెట్టిన డెంగ్‌ సియావో పింగ్‌ సూక్ష్మబుద్ధితో కూడిన నిర్ణయాలు. అన్నింటికీ మించి ఆర్ధిక వ్యవస్ధను బయటివారికి తెరుస్తూనేే పార్టీ ఆధిపత్యపాత్రను కొనసాగించటం. చైనీయులు వర్ణించే జూన్‌ నాలుగవ తేదీ సంఘటన,పశ్చిమ దేశాలు 1989 మారణకాండగా పిలిచిన వుదంతం సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ అదుపు గురించి ఎంత పట్టుదలగా వున్నారో తెలియచేశాయి. ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో ఎన్నడూ తడబడలేదు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.

Image result for 1991 soviet coup,lenin statue

సోవియట్‌ యూనియన్‌ కూడా అటువంటి బాటనే అనుసరించి వుండాల్సింది అనే చర్చ ప్రారంభమై వుండాల్సింది కానీ జరగలేదు. దీని ఫలితంగా శతాబ్దం క్రితం జరిగిన అక్టోబరు విప్లవాన్ని ఎలా గుర్తించాలి అనేది నేటి రష్యాకు తెలియకుండా పోయింది. లెనినిజం, మార్కెట్‌తో చైనా బంధపు పర్యవసానాలేమిటి? చైనా నిజంగానే పశ్చిమ దేశాల నుంచి ఆర్ధికశాస్త్రాన్ని నేర్చుకుంది.అయితే ఆధునిక పశ్చిమదేశాల రాజకీయాలను తిరస్కరించింది.చైనా అభివృద్ధి చెందే కొద్దీ లెనినిస్టు రాజకీయాలు, మార్కెట్‌ అర్ధికవిధానాల జమిలి వైఖరి పని చేస్తుందా? అంటే మనకు తెలియదనే సమాధానం చెప్పాలి. ఈ వ్యవస్ధ ఇప్పటి వరకు అద్భుతంగా పనిచేసింది. దీర్ఘకాలంలో పార్టీ మీద ఒక వ్యక్తి ఆధిపత్యం, చైనా మీద ఒక పార్టీ ఆధిపత్యం నిలబడదు. ఇదంతా దీర్ఘకాలంలో జరిగేది, తక్షణ స్ధితి సుస్పష్టం. ఏక వ్యక్తి నియంత్రించే లెనినిస్టు నిరంకుశపాలనలో చైనా ఒక ఆర్ధిక అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఎదుగుతున్న ఈశక్తి మిగతా ప్రపంచమంతా శాంతియుతంగా సహకరించటం తప్ప మరొక అవకాశం లేదు. వుదారవాద ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారందరూ ఆర్ధిక చైనాను మాత్రమే కాదు ప్రముఖ సైద్ధాంతిక ప్రత్యర్ధిగా కూడా గుర్తించాల్సిన అవసరం వుంది.ఒకటి, నిష్కారణంగా చైనాతో ప్రతికూల సంబంధాలను పెంచుకోకుండా పశ్చిమ దేశాలు తమ సాంకేతిక, అర్ధిక వున్నతిని కొనసాగించాలి. చైనా మన వ్యాపార భాగస్వామే తప్ప స్నేహితురాలు కాదు. రెండవది ఎంతో ముఖ్యమైనది, ఈరోజు మాదిరి దుర్బలంగా వున్న పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా కాకపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తమ ఆర్ధిక యాజమాన్యం మరియు రాజకీయాలు సంతృప్తికరంగా లేవన్న వాస్తవాన్ని గుర్తించి, నేర్చుకోవాలి. పశ్చిమ దేశాలు తమ ద్రవ్యవ్యవస్ధను ఎటూ కదలని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే విధంగా వదలివేశాయి.తమ భవిష్యత్‌కు చేసే ఖర్చు విషయంలో గుచ్చి గుచ్చి వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్ధికవిజేతలు-పరాజితుల మధ్య ప్రమాదకరమైన అఘాతం పెరగటాన్ని అమెరికా అనుమతించింది. తన రాజకీయాలలో అబద్దాలు, విద్వేషానికి తావిచ్చింది.

ఇంకా మరికొన్ని విషయాలు తన విశ్లేషణలో పేర్కొన్న మార్టిన్‌ వూల్ప్‌ కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి కలిగినవాడేమీ కాదు. చైనా సోషలిజం కూలిపోతుందని జోస్యం చెప్పాడు. విధిలేని పరిస్ధితుల్లో అవకాశం వచ్చేంత వరకు చైనాతో మంచిగా వుండి సమయంరాగానే దెబ్బతీయాలని పరోక్షంగా సూచించాడు. చైనా వ్యాపార భాగస్వామి తప్ప స్నేహితురాలు కాదనటంలో అంతరంగమిదే. సంక్షోభాన్నుంచి బయటపడేందుకు,లాభాల కోసం పెట్టుబడిదారీ వర్గం సోషలిస్టు దేశాలతో సఖ్యంగా వుండటం అన్నది 1980 దశకం తరువాతి ముఖ్యపరిణామం. అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలన్నీ గత కొద్ది దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమిదే.

తాజా తొలి ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా, వియత్నాంల అభివృద్ధి గురించి పొగిడారు.చైనాతో వాణిజ్యలోటుకు తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు.మార్టిన్‌ చెప్పినట్లు ఆర్ధిక అవసరాల కోసం అలా చెప్పాడు తప్ప సైద్ధాంతికంగా కమ్యూనిస్టు వ్యతిరేక చర్యతోనే ఆ దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టటం ట్రంప్‌ వర్గనైజం. బోల్షివిక్‌ విప్లవానికి వందేండ్ల సందర్భంగా నవంబరు ఏడును ‘కమ్యూనిజం బాధితుల జాతీయ దినం ‘గా ప్రకటించి మరీ వచ్చాడు. వాస్తవానికి రోసెన్‌బర్గ్‌ దంపతులను వురితీయటంతో సహా అనేక మందిని వెంటాడి వేధించిన దుష్ట చరిత్ర వారిదే.కమ్యూనిజం గతించిందని, దానిని పాతిపెట్టామని, అంతిమ విజయం సాధించామని చెప్పుకున్న పాతికేండ్ల తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఇంకా భయపడుతున్నాయి.పోరులో ఒక రంగంలో ఓడిపోవచ్చు, అంతమాత్రాన యుద్ధం ఓడిపోయినట్లు కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ అనేక రంగాలలో విజేతగా వున్నాడు, సోవియట్‌ గడ్డపై జరిగిన నిర్ణయాత్మకపోరులో కమ్యూనిస్టుల చేతిలో ఓటమిపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా బోల్షివిక్‌ విప్లవాన్ని వమ్ముచేసినంత మాత్రాన దోపిడీ వర్గం అంతిమ విజయం సాధించినట్లు సంబరపడితే అది కార్మికవర్గాన్ని మరింతగా కర్తవ్యోన్ముఖులుగా మారుస్తుంది.

అక్టోబరు విప్లవం జయప్రదం అయిన తరువాత సోవియట్‌ను దెబ్బతీయటానికి పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. అంతర్గతంగా సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే శక్తుల విచ్చిన్న కార్యకలాపాలకు తోడు, బయట రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేవరకు ఇరుగుపొరుగు దేశాలతో సోవియట్‌ సంబంధాలు సజావుగా లేవు. ఏడు సంవత్సరాల తరువాత 1924లో మాత్రమే బ్రిటన్‌ సోషలిస్టు రష్యాను గుర్తించింది. ప్రతి దేశంతో ఏదో ఒక సమస్య, సహాయ నిరాకరణ. వీటన్నింటినీ తట్టుకొని స్టాలిన్‌ నాయకత్వంలో సోవియట్‌ బలపడింది.

సోషలిస్టు చైనాకు సైతం పాతిక సంవత్సరాల పాటు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో గుర్తించకుండా అడ్డుకున్నారు. ఇటువంటి స్ధితి చరిత్రలో మరేదేశానికీ వచ్చి వుండదు. మార్టిన్‌ పేర్కొన్నట్లు చైనాలో కమ్యూనిస్టు పార్టీ తన పట్టును పెంచుకున్న తరువాత డెంగ్‌ హయాంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర రాజకీయ నిర్ణయాలు నేటి చైనా అవతరణకు దోహదం చేశాయి. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను కూలదోసేందుకు జరిగిన ప్రయత్నాన్ని నిర్ణయాత్మకంగా ఎదుర్కొనటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర,దానికి జనామోదం లభించటానికి ఎంతో ముందు చూపుతో డెంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ ప్రారంభించిన సంస్కరణలతో తమ జీవితాలు మెరుగుపడుతున్నాయని జనం గ్రహించటం కూడా ఒక ప్రధానకారణం.చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోని ప్రజా మిలిటరీ తియన్మెన్‌ స్క్వేర్‌ కుట్రను మొగ్గలోనే తుంచి వేసింది. బహుశా దానిని గమనించే అమెరికా, ఇతరసామ్రాజ్యవాదులు సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలో కుట్రను ముందుకు, మరింత వేగంగా అమలు జరిపినట్లు కనిపిస్తోంది.తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రదర్శనలుగా ప్రపంచానికి తెలిసిన ఘటనలు 1989 ఏప్రిల్‌ 15న ప్రారంభమై జూన్‌ నాలుగు వరకు జరిగాయి. తూర్పు ఐరోపాలో అదే ఏడాది నవంబరులో తూర్పు జర్మనీలో, తరువాత సోవియట్‌లో మొదలయ్యాయి. దానిని గుర్తించి అక్కడి కమ్యూనిస్టుపార్టీలు చైనా పార్టీ మాదిరి తమ పాత్రలను మలుచుకొని వుంటే చరిత్ర మరోవిధంగా వుండేది. !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోషలిజంపై చిత్త భ్రమణ తంత్ర విద్య ప్రయోగం !

06 Monday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Bolshevik Revolution, CAPITALISM, capitalist crisis, China, communist, Communist Revolution, Mind Games, new American socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -2

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కొన్ని సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన తీవ్ర ఎదురుదెబ్బలు ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయంలో విద్య, సమాచార వ్యవస్ధ కొత్త పుంతలు తొక్కి అరచేతిలోకి అందుబాటులోకి రావటం వంటి పరిణామాలతో కమ్యూనిస్టు సిద్ధాంతంపై దాడి కగతం కంటే తీవ్రంగా జరుగుతోంది. కొత్త ఎత్తుగడలు అనుసరించటాన్ని అన్ని రంగాలలో చూడవచ్చు. గతంలో మాదిరి కమ్యూనిజాన్ని నేరుగా వ్యతిరేకిస్తే లాభం వుండదని గత వంద సంవత్సరాల అనుభవాలు దోపిడీ వర్గానికి నేర్పాయి. అంటే దొంగ దెబ్బలకు పూనుకున్నాయి, దీంతో కమ్యూనిస్టుల పనిని మరింత సంక్లిష్టం గావించాయని చెప్పాలి. శత్రువును చంపదలచుకుంటే ప్రత్యక్ష పోరాటంలో ఎంతో కష్టపడాలి, అదే తీపి మాటలతో వెన్నుపోటు పొడిచి అంతం చేయటం ఎంతో సులభం. ఈ కుటిల నీతిని కమ్యూనిస్టు వ్యతిరేకులు బాగా ప్రయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో నవతరం సోషలిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితులు కావటం గతం మాదిరి సులభం కాదు. అయితే దోపిడీ వ్యవస్ధ ఎప్పటికపుడు తనకు తెలియకుండానే యువతరాన్ని ఆవైపు నెడుతోంది. పీడితులు కూడా తమ ఆయుధాలను సన్నద్దం చేసుకోవటం అనివార్యం.

అమెరికాలోని కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ అనే సంస్ధ తన వార్షిక నివేదికలో భాగంగా యు గవ్‌ అంటే మీ ప్రభుత్వం అనే ఒక పరిశోధనా సంస్ధతో కలసి అక్టోబరు చివరి వారంలో ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సంస్ధ ప్రమేయంతో ఇలాంటి నివేదికల తయారీకి రూపొందించే ప్రశ్నావళి స్వభావం,లక్ష్యం ఎలా వుంటుందో తెలిసిందే. వెన్నుపోటు ఎత్తుగడలో ఇదొక భాగం. ఈ సర్వే సెప్టెంబరు 28 అక్టోబరు 5 మధ్య జరిగింది. అమెరికా ప్రధాన మీడియా అంతటా ఆ సమయంలో అమెరికా దృష్టిలో ధూర్త దేశంగా వున్న సోషలిస్టు-కమ్యూనిస్టు వుత్తర కొరియా జపాన్‌ మీదుగా, అమెరికా తీరంలోని దీవులలో కూడా పడే ఖండాంతర క్షిపణి ప్రయోగాలను జరిపిందని, అమెరికన్లకు ముప్పు తెచ్చిందంటూ ముమ్మరంగా ప్రచార దాడి జరిపిన సమయమది. సర్వేపై దాని ప్రభావం పడకుండా ఎలా వుంటుంది. అందువలన దానికి వుండే పరిమితులను గమనంలో వుంచుకోవాలి. ఈ నివేదికలో కొన్ని అసంబద్దతలు, తర్కానికి నిలబడని అంశాలున్నాయి.

ప్రపంచానికి కమ్యూనిజం ఇప్పటికీ ఒక సమస్యగానే వుందని నమ్ముతున్న అమెరికన్లు 75శాతం వున్నారని, గతేడాది కంటే ఐదుశాతం ఎక్కువంటూ సర్వే తొలి అంశంగా ఆ నివేదిక ప్రారంభమైంది. ప్రతి పదిమందిలో ఏడుగురు అమెరికన్లకు కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకపోవటం లేదా తప్పుగా గుర్తించారట. ఇదే సమయంలో నూతన సహస్రాబ్ది యువతరంగా పరిగణించబడేవారిలో సోషలిజం పట్ల సానుకూలత పెరుగుతోంది. జనాభా మొత్తంగా చూసినపుడు 63శాతం పెట్టుబడిదారీ, నాలుగు శాతం ఫాసిస్టు దేశంలో జీవించాలన్న అభిలాషను వ్యక్తం చేయగా సోషలిస్టు-కమ్యూనిస్టు దేశంలో నివశించాలన్న కోర్కె 37 శాతం మందిలో వ్యక్తమైంది. ఇదే సహస్రాబ్ది యువతలో 49, 51శాతం వున్నారు. ప్రస్తుతం అమెరికా జనాభాలో సహస్రాబ్దితరంగా పరిగణించబడేవారు ఎక్కువగా వున్నారు. నివేదిక మొత్తంలో కమ్యూనిస్టు వ్యతిరేకతనే ప్రధానంగా చూపినప్పటికీ ఈ ఒక్క అంశంపై కమ్యూనిస్టు వ్యతిరేకులు కలవర పడుతున్నారు. గతంలో విదేశాలలో పెరుగుతున్న సోషలిస్టు అభిమానులను చూసి భయపడిన అమెరికన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులు ఇప్పుడు తమ యువతను చూసి తామే భయపడుతున్నారన్నమాట. ఎంతలో ఎంత మార్పు? సహస్రాబ్ది యువతలో ఇటువంటి భావాలు ఏర్పడటానికి కారణం 53శాతం మంది అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అభిప్రాయం పడటం కావచ్చని సర్వే రచయితలు వ్యాఖ్యానించారు.

‘ ప్రస్తుతం అమెరికాలో సహస్రాబ్ది తరం అతి పెద్ద సమూహంగా వుంది. ఆందోళన కలిగించే కొన్ని ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించటాన్ని చూస్తున్నాం. సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు మళ్లటం పెరుగుతోంది, చివరికి కమ్యూనిజం కూడా ఆచరణీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు’ అని కమ్యూనిజం బాధితుల స్మార ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.ఇదే సమయంలో 1946-64 మధ్య పుట్టిన వారు ఎక్కువగా పెట్టుబడిదారీ విధానానికి,26శాతం మందే సోషలిజానికి మద్దతు ఇస్తున్నారు. అమెరికాలో స్టాలిన్‌ను ప్రతి ఐదుగురిలో ఒకరు హీరోగా భావిస్తుండగా, లెనిన్‌, వుత్తరకొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌లను అభిమానించే వారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నారని తేలింది. సోషలిజం, కమ్యూనిజాలకు తేడాతో పాటు అసలు వాటి గురించి తెలియని కారణం, కమ్యూనిస్టు పాలిత దేశాలలో చంపివేయబడిన జనం గురించి తక్కువ అంచనా వేయటం వల్లనే యువత ఈ బాటలో వున్నారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు ‘ఎర్ర శతాబ్దం’ పేరుతో రాసిన సానుకూల వ్యాసాలు కూడా కమ్యూనిజం వెనుక వున్న నిజాన్ని పట్టించుకోకుండా చేశాయని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు.’ సోషలిజం, కమ్యూనిజాల విషయంలో అమెరికన్‌ సమాజంలో చారిత్రక పాండిత్యం ఎంత తక్కువగా వుందో అలజడి వైపు తిప్పుతున్న ఈ పరిణామం వెలుగులోకి తెస్తోంది.వంద సంవత్సరాల క్రితం జరిగిన బోల్షివిక్‌ విప్లవం తరువాత కమ్యూనిజం కారణంగా జరిగిన మారణహోమం, వినాశనం, దుఖం గురించి విద్యార్ధులకు బోధించటంలో వ్యవస్ధ వైఫల్యం గురించి కూడా ఇది వెల్లడించింది.’ అని కూడా మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.

కమ్యూనిస్టుల పాలనలో రోమన్‌ కాధలిక్‌ మతగురువులతో సహా చంపిన వారి సంఖ్య పది లక్షలలోపే అని సర్వేలో పాల్గన్నవారిలో పదిశాతం, 1-250లక్షలని 21, 250-500లక్షలని 15, 500-750లక్షలని 12, 750-1000లక్షలని 11, పది కోట్లకు పైగా అని31శాతం చొప్పున నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ అంకెలకు ఎలాంటి ఆధారాలు లేవు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా వీటిని తిప్పుతున్నారు. ఈ అతిశయోక్తులను మొత్తంగా 69శాతం మంది తక్కువ చేసి చూశారు. సహస్రాబ్ధి యువతలో గతేడాది మాదిరే తప్ప మార్పు లేదు. గత కొద్ది కాలంగా ముఖ్యంగా 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం తరువాత అమెరికన్‌ యువతలో సోషలిజం, కమ్యూనిజం గురించి సానుకూల వైఖరి వ్యక్తమౌతోంది. అందువలన వారిని గందరగోళంలో పడేయటానికి ఇలాంటి సర్వేలతో ఒకవైపు వారిలో తలెత్తిన మార్పును చెబుతూనే మరోవైపు వెనక్కు లాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు మనం చూడవచ్చు. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం, బకెట్లతో సముద్రనీటిని తోడటం ఎలా సాధ్యం కాదో భావజాల వ్యాప్తిని, అసంతృప్తిని అణచివేయటం, పక్కదారి పట్టించటం కూడా అలాంటిదే.

సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం నిజానికి ఒక ప్రయోగం. దాని ఫలితాలు ప్రపంచానికి తెలియవు. అందువలన నిర్మాణంలో ఏవైనా లోపాలుంటే వాటిని స్నేహపూర్వకంగా లేదా సైద్ధాంతికంగా చెప్పటం వేరు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదంగా వర్ణించిన నక్సల్స్‌ తాము కూడా కమ్యూనిస్టులమే అని చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానాలపై కూడా కొంతమంది అదే రకమైన దాడి చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్యవాదులుగా మారినవి వున్నాయి. అదే విధంగా పెట్టుబడిదారీ పంధాలో పయనిస్తూ అభివృద్ధిలో బాగా వెనుకబడిన దేశాలూ వున్నాయి. అటువంటి దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలు వస్తే ఎంతకాలం అనేది ఎవరూ చెప్పలేకపోవచ్చుగాని కొంత కాలం అదే మాదిరి తేడాలు లేకుండా ఎలా వుంటాయి? చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ అనేది బూటకం, పేరుకే కమ్యూనిస్టు పార్టీ, అక్కడ ఆర్ధిక అంతరాలు చాలా ఎక్కువగా వున్నాయి, ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా దాడి జరుగుతోంది. ఇక్కడ సోషలిజం పట్ల కారుస్తున్న మొసలి కన్నీరును కడవలతో కొలవజాలం. నిజమైన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణ జరగటం లేదని తీవ్ర విచార ప్రదర్శన. ఇదంతా కమ్యూనిస్టు వ్యతిరేకులు, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు కూడా కొందరు చేస్తున్నారు. ఇదంతా సమాజంలోని ఒక భాగం లేదా వ్యక్తులను మానసికంగా తిమ్మినిబమ్మిని చేసి ఇబ్బందులకు గురిచేసే చిత్త భ్రమణ తంత్ర విద్యలో భాగమే.

Image result for US youth, socialism

బ్రెజిల్‌కు చెందిన లూయీస్‌ కార్లోస్‌ బ్రెస్సెర్‌ పెరీరా అనే సామాజిక, ఆర్ధికవేత్త పెట్టుబడిదారీ విధానంలో ఐదు నమూనాలు వున్నాయని విశ్లేషించారు. ఆయనతో ఏకీభవించాలనేమీ లేదు. ధనిక దేశాలలో వుదారవాద ప్రజాస్వామిక లేదా ఆంగ్లో-శాగ్జన్‌ నమూనా, సామాజిక లేదా ఐరోపా, అంతర్జన్య లేదా జపాన్‌, వర్ధమాన దేశాలలో వుదారవాద ఆధారిత నమూనాలు ఆసియాలో ఒక విధంగా, బ్రెజిల్‌తో సహా ఇతర దేశాల నమూనాలు భిన్నంగా వుంటాయని ఆయన చెప్పారు. ఇదే సూత్రం సోషలిస్టు దేశాలకు మాత్రం ఎందుకు వర్తించదు? అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గ నాయకత్వాన విప్లవాలు జయప్రదమౌతాయని మార్క్స్‌-ఎంగెల్స్‌ అంచనా వేశారు. ఆ తరువాత బోల్షివిప్లవానికి ముందు సైద్ధాంతిక చర్చ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం గురించి తప్ప నమూనా, విప్లవ మార్గం గురించి పెద్ద సమస్యలు ముందుకు రాలేదు. బోల్షివిక్‌ విప్లవం తరువాతే ఆచరణలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ తెల్లవారే సరికి పరిష్కారిస్తామని, పరిష్కారమౌతాయని గానీ ఏ కమ్యూనిస్టూ చెప్పజాలరు. వాటిని కూడా దోపిడీ శక్తులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. పద్దతులను కూడా మార్చుకున్నాయి. గతంలో మాదిరి సోవియట్‌ను వ్యతిరేకించినట్లుగా నేడు చైనాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగేందుకు ముందుకు రావటం లేదు. ఎందుకంటే గతంలో సోవియట్‌ తయారీ వస్తువులతో పాశ్చాత్య దేశాల మార్కెట్లను నింపలేదు, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మేడిన్‌ చైనా దర్శనమిస్తోంది.అయితే అదే సమయంలో సోవియట్‌ను తొక్కివేసేందుకు, కూల్చివేసేందుకు చేసిన కుట్రలకు ఏమాత్రం తీసిపోకుండా చైనాకు వ్యతిరేకంగా చేయాల్సినవి చేస్తున్నాయని మర్చిపోరాదు. అధికారికంగా సంబంధాలు, అనధికారికంగా చైనా, కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిజం మీద విషపూరిత దాడి జరుగుతోంది.

గత వంద సంవత్సరాలలో ఫాసిస్టు శక్తులను అణచివేయటంలో కమ్యూనిస్టులు ఎంతటి త్యాగాలకు పాల్పడతారో, ఎలా సన్నద్దమౌతారో లోకానికి తెలియ చెప్పటంలో సోవియట్‌ యూనియన్‌ జయప్రదమైంది. సోషలిజాన్ని కాపాడుకుంటూ అచిర కాలంలోనే ఒక నూతన అభివృద్ది నమూనాను ప్రపంచం ముందుంచటంలో చైనా జయప్రదమైంది. చైనాలో సమస్యలేమీ లేవా అంటే కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా జరబడతాయని వాటిని అదుపు చేయాల్సి వుంటుందని కూడా తమకు తెలుసునని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ చెప్పారు. సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఇప్పుడు అధికారికంగా వారే చెబుతున్నపుడు లేవని ఎవరంటారు? అన్ని పెట్టుబడిదారీ దేశాలూ ఒకే విధంగా అభివృద్ధి ఎందుకు చెందలేదు, అన్ని ఖండాలలో ఒకేసారి పారిశ్రామిక విప్లవం ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలకు సమాధానంలోనే సోషలిజానికి కూడా జవాబు దొరుకుతుంది.

చైనాలో వున్నది పెట్టుబడిదారీ విధానం అనే వాదనలతో విబేధిస్తున్నవారు ముందుకు తెస్తున్న అంశాలేమిటో చూద్దాం.పెట్టుబడిదారీ పాలనా విధానంలో అప్రయత్న పూర్వకమైన సంబంధాలతో వస్తూత్పత్తి లాభాల కోసం జరుగుతుంది.లాభాల రేటు పెట్టుబడుల వర్తులాను నిర్దేశించటంతో పాటు ఆర్ధిక సంక్షోభ ఆవర్తనాలను కూడా వుత్పత్తి చేస్తుంది. ఇది చైనాకు ఇంతవరకు వర్తించలేదు. ప్రణాళిక, ప్రభుత్వరంగంలో వుత్పత్తిపై యాజమాన్య పద్దతే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ అధికార పునాదివేళ్లు ప్రజాయాజమాన్యంలోనే వున్నాయి.పెట్టుబడిదారీ తరహా వుత్పత్తి పద్దతి లేకుండానే చైనా ఆర్ధికంగా ఎదుగుదలను సాధించింది. కీలకమైన 102 ప్రభుత్వ రంగ సంస్దల విలువ ఏడున్నరలక్షల కోట్ల డాలర్లు. వీటిని ప్రయివేటీకరిస్తారని ఎవరైనా ఆశపడుతుంటే అలాంటిదేమీ వుండదని పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రధానమైన ప్రజాయాజమాన్య స్ధితి, ప్రభుత్వ రంగ ఆర్ధిక వ్యవస్ధ నాయకత్వ పాత్రపై ఎలాంటి డోలాయమానం వుండదని అధ్యక్షుడు గీ జింగ్‌ పింగ్‌ గతేడాది స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల వారు గత మూడున్నర దశాబ్దాలుగా చైనా ఆ బాటను వీడి స్వేచ్చా మార్కెట్‌,ప్రయివేటు రంగం నాయకత్వ పాత్ర వహించాలని కోరుతూనే వున్నారు.లాభాపేక్షలేని ప్రణాళికా బద్దమైన ప్రభుత్వరంగ పాత్ర నాయకత్వంలో తలెత్తే సమస్యలను పెద్దవిగా చూపుతూ వాటిని అవకాశంగా మార్చుకోవాలని కంటున్న కలలు ఇంతవరకు కల్లలుగానే మిగిలిపోయాయి. సామాజిక-ఆర్ధిక అంశాల రూపకల్పన, జయప్రదంగా అమలు చేయటంపై నిజానికి చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నది.

2008లో పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత కూడా చైనా అభివృద్ధి రేటు ఏడుశాతం కొనసాగుతున్నది. తమ తరువాత సంక్షోభంలోకి కూరుకుపోవటం చైనా వంతు అని చెప్పిన వారి జోస్యం వాస్తవం కాదని తేలిపోయింది. కొన్ని వడిదుడుకులు తప్ప గత పదిసంవత్సరాలుగా సజావుగా పురోగమిస్తోంది. ఇది కమ్యూనిస్టుపార్టీ, సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత. ఇప్పుడు పెట్టుబడిదారీ ధనిక దేశాలలోని యువతను ఆకర్షించే అంశం ఇది. ఏ స్టోర్‌లో చూసినా చైనా వస్తువులే, పశ్చిమ దేశాల వుద్యోగాలను హరించి చైనా తన వారికి పని కలిపిస్తున్నదన్న వార్తలు ఏదో ఒక రూపంలో వారిని చేరుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అనేదే గీటు రాయి అనుకుంటే ఇప్పటి వరకు పెట్టుబడిదారీ విధానం ఒరగబెట్టిందేమీ లేదు, రాబోయే రోజుల్లో ఏదో చేస్తుందనే ఆశ కనిపించటం లేదు, అందువలన సోషలిజమే మెరుగు, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్న ఆలోచన తలెత్తుతోంది. సోషలిస్టు భావన వునికిలోకి వచ్చిన తరువాత సాధించిన పెద్ద విజయాలలో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు సోషలిస్టు వ్యవస్ధల వైఫల్యాలను బూతద్దంలో పెట్టి చూపటం,అవాస్తవాలను ప్రచారం చేసి సోషలిజం గురించి చిత్త భ్రమణ తంత్ర విద్యను( మైండ్‌ గేమ్‌ ఆడటం) ప్రయోగించి తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు తప్ప పెట్టుబడిదారీ విధానం ఎలా మెరుగైనదో దానికి పోతుగడ్డ అంటున్న అమెరికా యువతకు చెప్పలేకపోతున్నారు. అదే పెద్ద బలహీనత. దీన్ని దెబ్బకొట్టి యువతను సోషలిజం వైపు మళ్లించటమే కమ్యూనిస్టుల ముందున్న పెద్ద సవాలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెరుగైన అవకాశాలు-తీవ్ర సవాళ్ల మధ్య చైనా: గీ జింపింగ్‌

18 Wednesday Oct 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China, chinese communist party, chinese communist party congress 2017, Xi Jinping

బుధవారం నాడు మహాసభను ప్రారంభిస్తున్న గీ జింపింగ్‌

చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ ప్రారంభం

ఎం కోటేశ్వరరావు

ప్రియమైన పాఠకులు ఈ వ్యాసం చదవటం ప్రారంభించే సమయానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరొక చారిత్రక అధ్యాయానికి చైనాలో తెరలేచింది. వారం రోజుల పాటు జరిగే చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ బుధవారం నాడు ప్రారంభమైంది. బీజింగ్‌లోని తియన్మెస్‌ స్క్వేర్‌లోని గ్రేట్‌ హాల్‌లో మహాసభ ప్రారంభం వుపన్యాసంలో రానున్న ఐదు సంవత్సరాల కార్యాచరణకు సంబంధించిన అంశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి గీ జింపింగ్‌ ఆవిష్కరించారు.’ ప్రస్తుతం చైనా, ప్రపంచం కూడా తీవ్ర మరియు సంక్లిష మార్పుల మధ్య వుంది. వ్యూహాత్మక అభివృద్ధి అవకాశాల విషయంలో చైనా ఇప్పటికీ ఒక ముఖ్యమైన యుగంలోనే వుంది. అవకాశాలు మెరుగ్గా వున్నాయి, అదే సమయంలో తీవ్రమైన సవాళ్లు కూడా వున్నాయి.’ అని జింపింగ్‌ చెప్పారు.

ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహసభల గురించి అటు శత్రువులు, ఇటు స్నేహితులలోనూ సహజంగానే ఎంతో ఆసక్తి తలెత్తుతుంది. గతంలో జరిగిన మహాసభలకు ముందు ప్రపంచ మీడియాలో ఎన్నో కట్టుకథలు, పిట్టకథలు రాసేవారు. ఈ సారి కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా తన పాఠకులు, వీక్షకులకు అటువంటి వినోదాన్ని చాలా పరిమితం చేసి ఎందరినో నిరాశపరిచింది.

పురాతన చరిత్రలో ఎన్నో వైవిధ్యాలను నమోదు చేసిన చైనా వర్తమానంలో కూడా అదే బాటలో నడుస్తోంది. పెట్టుబడిదారీ దేశాలు, వ్యవస్ధలతో ఆర్ధిక సంబంధాలు కలిగి వున్న కారణంగా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ ఏడాదికేడాది ఎన్నో విజయాలు సాధిస్తూ చైనా సోషలిస్టు వ్యవస్థ ముందుకు పోతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్ధకు పట్టిన జబ్బులు ఎప్పుడు వదులుతాయో, పక్షవాతం ఎన్నటికి నయమౌతుందో తెలియని స్ధితిలో చైనా గురించి అవాస్తవాలు రాసే మీడియా విశ్వసనీయత నానాటికీ పడిపోవటం వంటి కారణాలతో ఈ సభల సందర్భంగా వాటి జోలికి పోలేదా ? పది సంవత్సరాల క్రితం ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రం అమెరికాలో ప్రారంభమైన సంక్షోభానికి త్వరలో పదేండ్లు నిండబోతున్నాయి. తమతో పాటే చైనా కూడా మునిగిపోతుందని పిచ్చి కలలు కన్న వారిని చైనా కమ్యూనిస్టులు కొరడాతో కొట్టి లేపి మా విజయాలు చూడండి అని చూపుతున్న కారణంగానే 19వ మహాసభ సందర్భంగా వారు ఒళ్లు దగ్గర పెట్టుకున్నారా ?

కమ్యూనిస్టు పార్టీల మహాసభలు రెండు విధాలుగా జరుగుతాయి. అధికారంలో వున్న కమ్యూనిస్టు పార్టీలు సైద్దాంతిక సమస్యలతో పాటు తమ దేశ ఆర్ధిక వ్యవస్ధ, జనజీవన పరిస్ధితులను ఎలా మెరుగుపరచాలో సభలలో చర్చించి లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి. ప్రస్తుతానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ముందు పెద్ద సైద్ధాంతిక సవాళ్లు లేవనే చెప్పాలి. అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ము చేసి, ప్రపంచ దేశాలతో సఖ్యత పెంచుకొని తన జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచి వర్తమానం నుంచి మరో సోషలిస్టు దశకు ఎలా చేరటమా అన్నదే వారి ముందున్న పెద్ద సవాలు . అధికారంలో లేని కమ్యూనిస్టు పార్టీలు జరిపే సభలలో సైద్ధాంతిక, రాజకీయ ఎత్తుగడల పంధా, జనజీవన పరిస్థితుల మెరుగుదలకు చేపట్టాల్సిన పోరాటాల వంటి సమస్యలు ప్రధాన అజెండాగా వుంటాయి.

2012లో జరిగిన 18వ మహాసభ తరువాత చైనా సాధించిన అభివృద్ధి గురించి జాతీయ గణాంకాల సంస్థ వివరాలను గత వారంలో విడుదల చేసింది. 2013ా16 సంవత్సరాల మధ్య ప్రపంచ సగటు వృద్ధి రేటు 2.6, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 4 వుంటే చైనాలో 7.2శాతం వుంది.ఈ ఏడాది తొలి త్రైమాసిక వృద్ధి రేటు 6.9శాతం. గతేడాది ప్రపంచ జిడిపి విలువలో చైనా వాటా 14.8శాతం(11.2లక్షల కోట్ల డాలర్లు).గత నాలుగు సంవత్సరాలలో 3.4శాతం పెరిగింది. ఇదే కాలంలో ప్రపంచ పురోభివృద్ధికి చైనా 30శాతం వాటా అందించింది.ఇది అమెరికా, జపాన్‌, యూరోజోన్‌ దేశాల మొత్తం కంటే ఎక్కువ. జిడిపిలో సేవారంగం వాటా 45.3 నుంచి 51.6కు పెరిగింది. పట్టణాలలో పని చేసే గ్రామీణుల వార్షిక పెరుగుదల రేటు 1.8శాతం. పట్టణాలలో శాశ్వతనివాసితుల శాతం 52.57 నుంచి 57.35కు పెరిగింది. ఏటా కోటీ 30లక్షల కొత్త వుద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ 31 పెద్ద నగరాలలో నిరుద్యోగులు ఐదుశాతం వున్నారు.పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు 1.91నుంచి 2.11శాతానికి పెరిగింది. పేటెంట్‌ దరఖాస్తుల స్వీకరణ 69శాతం, మంజూరు 39.7శాతం పెరిగింది.కొత్త కంపెనీల నమోదు పెరుగుదల 30శాతం. జనం ఖర్చు చేయగలిగిన తలసరి ఆదాయం 7,311యువాన్ల నుంచి 23,821కి పెరిగింది.వార్షిక పెరుగుదల రేటు 7.4శాతం. అది గ్రామీణుల విషయంలో 10.7శాతం వుంది.

1921లో షాంఘై నగరంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభ జరిగింది.మావో సేటుంగ్‌తో సహా కేవలం 13 మంది మాత్రమే ప్రతినిధులు ఆ సభకు హాజరయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో కొన్ని డజన్ల మంది కార్యకర్తలు, నాయకులు మాత్రమే అసమయానికి వున్నారు.వారి నాయకత్వంలో కమ్యూనిస్టుపార్టీ 28 సంవత్సరాల తరువాత అనూహ్యరీతిలో చైనాలో అధికారాన్ని స్వీకరిస్తుందని వారు ఆ సమయంలో వూహించి వుండరు. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమ చరిత్రలో చైనాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అక్కడి భౌతిక పరిస్ధితులకు అనుగుణ్యంగానే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ’ నిర్మాణం చేపట్టాలని 1982లో పన్నెండవ మహాసభ నిర్ణయించింది. బీజింగ్‌లో జరుగుతున్న 19వ సభకు 8.9కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశమంతటి నుంచీ ఎన్నికైన 2,287 మంది ప్రతినిధులు హాజరుకావాల్సివుంది. ఈ సభలో ఇరవై అయిదు మందితో పొలిట్‌బ్యూరో, ఏడుగురితో పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ, 205 మందిని కేంద్రకమిటీ సభ్యులుగా మరి కొందరిని ప్రత్యామ్నాయ కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. కేంద్రకమిటీ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటుంది.

గతమహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గ్జీ జింపింగ్‌(64) తిరిగి ఆ బాధ్యతకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయని, పార్టీలో అంతర్గతంగా ఎలాంటి నాయకత్వ సమస్యలేదని, స్టాండింగ్‌ కమిటీలోని ఏడుగురిలో ఐదుగురు బాధ్యతల నుంచి తప్పుకొంటారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో చర్చించబోయే అంశాలను ముందుగానే గత మహాసభలో ఎన్నికైన కేంద్రకమిటీ ఖరారు చేస్తుంది.రాబోయే మహాసభ వరకు ఏమి చెయ్యాలో ముసాయిదా నివేదికలను రూపొందిస్తుంది. ఒక వేళ కేంద్రకమిటీలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలుంటే పార్టీ అత్యున్నత విధాయక పార్టీ మహాసభకు నివేదిస్తుంది. అంగీకారమైతే వాటిని నివేదికలు లేదా తీర్మానాలలో చేర్చుతారు, లేదా సవరణ ప్రతిపాదనలను ఓటింగ్‌కు పెట్టి అంతిమ నిర్ణయం చేస్తారు.

ఈ మహాసభ సమయంలో పిట్టకథలేమీ లేవంటే అసలేమీ లేవని కాదు. అవి లేకపోతే మీడియాకు కిక్కు వుండదు కదా. బహిరంగంగా మాట్లాడే అసమ్మతి వాదులను మహాసభ సమయంలో బీజింగ్‌ వదలి వెళ్లమన్నారని, విదేశీ జర్నలిస్టులతో మాట్లాడవద్దన్నారని రాశారు. అధికారిక వార్తా సంస్ధ నుంచి వచ్చే కథనాలను తప్ప వేరే పుకార్లను వ్యాపింపచేయవద్దని, చోటివ్వవద్దని మీడియా సంస్ధలకు జారీ చేసిన రహస్య సెన్సార్‌ నిబంధనలలో పేర్కొన్నారని ఒక పత్రిక రాసింది. ఇవెంత హాస్యాస్పదమో వేరే చెప్పనవసరం లేదు. ఇవే నోళ్లు గతంలో అసమ్మతి వాదులను జైలు పాలు చేశాయని చెప్పి ఇప్పుడు నగరం విడిచి వెళ్లమని చెప్పాయని చెబుతున్నాయి. అధికార మీడియా సంస్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రహస్య సెన్సార్‌ నిబంధనలు అని చెప్పటం కట్టుకధగాక మరేమిటి? గత నాలుగు దశాబ్దాలుగా చెబుతున్న ఒక పిట్టకధ చైనీయులు చెప్పే అంకెలను నమ్మకూడదు. ఎవరు నమ్మమన్నారు? వివిధ దేశాలతో వాణిజ్య మిగులు కారణంగా ఏ దేశం వద్ద లేనన్ని డాలర్లు పోగుపడ్డాయా లేదా? చివరకు అమెరికాయే వారి నుంచి అప్పుతీసుకొంటోందా లేదా? అన్ని దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లి పరిశ్రమలు, వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారా లేదా ?

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇతర దేశాలపై నెట్టేందుకు, ఇతర దేశాల మార్కెట్లను ఆక్రమించుకొని ఇబ్బందుల నుంచి తాము బయట పడాలని పెట్టుబడిదారీ వర్గం చేయని ప్రయత్నం లేదు. వారికి కంటగింపుగా వున్న తమను వేయి కళ్లతో చూస్తున్నాయని చైనా నాయకత్వానికి తెలియంది కాదు. గత మూడు దశాబ్దాలుగా విపరీత వేగంతో జరిగిన అభివృద్ది వారికి కొత్త సమస్యలను తెచ్చింది. ఆర్ధికరీత్యా తమతో సంబంధాలు కలిగి వున్నప్పటికీ సోషలిస్టు వ్యవస్థను కూల్చేందుకు, మిలిటరీ రీత్యా దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. వీటిని ఎదుర్కొంటూనే, అంతర్గతంగా సామాజికంగా తలెత్తుతున్న సమస్యల నుంచి తమ వ్యవస్ధను మెరుగుపరుచుకోవటం అనే ద్వంద్వ సవాళ్లను ప్రస్తుతం చైనా నాయకత్వం ఎదుర్కొంటున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ ప్రపంచంలో వున్న వైరుధ్యాలను ప్రస్తుతానికి అది వుపయోగించుకోగలుగుతోంది. ఈ రోజు చైనా సాధిస్తున్న పురోగతి, దాని నుంచి ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి లబ్ది పొందకుండా మనకు మనమే గిరిగీసుకోవద్దని ఆస్ట్రేలియా-చైనా వాణిజ్య మండలి మాజీ సిఇవో లారీ పెర్సీ ‘ఆస్ట్రేలియన్‌’ పత్రికలో చైనా కమ్యూనిస్టుపార్టీ మహాసభ సందర్భంగా రాసిన వ్యాసంలో సలహా ఇచ్చారు. నలభై అయిదు సంవత్సరాల క్రితం 1971లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు విట్‌లామన్‌ చైనా సందర్శించారు. అది జరిగిన మూడు రోజుల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ రహస్యంగా చైనా వెళ్లి నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసి వచ్చాడు. ఆ పర్యటనను నాడు అధికారంలో వున్న ఆస్ట్రేలియా సంకీర్ణ కూటమి దాన్ని బుద్దిలేని వ్యవహారంగా చూసిందని ఆ వుదంతాన్ని పేర్కొంటూ అమెరికాయే చైనాతో సంబంధాలు పెట్టుకొని లబ్ది పొందుతున్నపుడు మనం కూడా చైనా నుంచి ఎందుకు లబ్ది పొందకూడదని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇది ఒక్క ఆస్ట్రేలియా కార్పొరేట్ల వైఖరే కాదు. గత పది సంవత్సరాలుగా ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న మన దేశంతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాల కార్పొరేట్ల ఆలోచనకు అది ప్రతిబింబం. అందువలనే బయట వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గాంగ్‌ చైనా వ్యతిరేక ప్రచారం చేసి ఇంతకాలం తాము తయారు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేకులను సంతృప్తి పరుస్తుంటే అధికారంలో వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చైనాతో వాణిజ్యం, పెట్టుబడులతో కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. ఇది వారి ద్వంద్వ స్వభావం అనేకంటే మోసకారి తనం అనాలి.

చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల వెనుక ఎంతో పకడ్పందీగా పధకం రూపొందించటం, ఆచరణ గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారు. బ్రిటీష్‌ వారి కౌలుకింద వున్న హాంకాంగ్‌ ప్రపంచంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రాలలో ఒకటిగా మారింది. తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ కూడా అదేమాదిరి అభివృద్ధి చెందింది. వాటితో పోల్చుకుంటే ప్రధాన భూభాగం ఎంతో వెనుక బడి వుంది. కౌలు గడువు తీరి హాంకాంగ్‌ చైనాలో విలీనమైంది. అక్కడ వున్న పెట్టుబడుల అవసరం చైనాకు వుంది. అందువలననే సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి భంగం కలగకుండానే ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానం కింద 2050వరకు హాంకాంగ్‌ ఆర్ధిక వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఒక ఒప్పందం చేసుకొని అక్కడి పెట్టుబడిదారులకు స్పష్టమైన హామీనిచ్చింది.

చైనాలో సంస్కరణలు మొత్తం మీద ఎంతో అభివృద్దికి దోహదం చేసినప్పటికీ ఆదాయ, ప్రాంతాల మధ్య అసమాన అభివృద్ధి అసమానతలు, అవినీతి పెరుగుదల వంటి సమస్యలతో పాటు, సామాజికంగా మత ప్రభావం పెరుగుదల వంటి కొత్త సమస్యలను చైనా ఎదుర్కొంటోంది. వాటిని తక్కువగా చూడనవసరం లేదు. వాటిని పరిష్కరించటంలో చైనా నూతన నాయకత్వం ఎలాంటి చర్యలను చేపడుతుందన్నదే ఆసక్తికరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెద్ద అమెరికాను వణికిస్తున్న చిన్న ఉత్తర కొరియా!

20 Wednesday Sep 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Donald trump, he North Korea, Kim Jong-un, nuclear and missile tests, Rocket man, United Nations

 
 ఎం కోటేశ్వరరావు

     ఐక్యరాజ్య సమితి సమావేశాలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డు ట్రంప్‌ మంగళవారం నాడు వుత్తర కొరియాను మరోసారి బెదిరించాడు. అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి ప్రయోగాల నుంచి వెనక్కు తగ్గనట్లయితే కొరియాను పూర్తిగా నాశనం చేయటం తప్ప మరొక మార్గం లేదని మాట్లాడాడు. గత నలుగురు అమెరికా అధ్యక్షులు విఫలమైన తీరు, అమెరికా వైపు నుంచి చేసిన పిచ్చిపనులు ముది మది తప్పిన ఈ మనిషికి తెలిసినట్లు లేదు. గత కొద్ది వారాలుగా ఉత్తర కొరియా అమెరికా సంబంధాలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. స్టాక్‌ మార్కెట్లు ఉద్ధాన, పతనాలకు గురవుతున్నాయి. ఒక చిన్న ఉత్తర కొరియా అంత పెద్ద అమెరికా, జపాన్‌లను, ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ను ఎందుకు, ఎలా వణికిస్తోంది అని బుద్ధిజీవులు ఆలోచిస్తున్నారు. రెండున్నర కోట్ల జనాభాతో వున్న ఈ సోషలిస్టు దేశం గురించి మీడియాలో సానుకూలమైన వార్త ఒక్కటీ రావటం లేదు, దాన్నొక బూచిగా చూపుతున్నారు. దీపావళి సందర్భంగా ఎదురు బెదురు కుర్రకారు పోటా పోటీగా తారాజువ్వలను వదిలినట్టుగా ఉత్తర కొరియా, అమెరికా మద్దతుతో దక్షిణ కొరియా క్షిపణులను ప్రయోగిస్తున్నాయి. విత్తు ముందా చెట్టు ముందా అన్న తెగని చర్చలోకి పోకుండా చూస్తే ఇరు దేశాలూ సమాన స్ధాయిలోనే వదులుతున్నాయి. మీడియాలో మాత్రం ఏకపక్షంగా వార్తలు వస్తాయి. ఐరాస ఆంక్షలు విధించిన తరువాత ఇంతవరకు ఆరు అణు పరీక్షలు జరపగా వాటిలో 33ఏండ్ల కిమ్‌ జోంగ్‌ అన్‌ అధికారంలోకి వచ్చిన 2016 జూన్‌ నుంచి నాలుగు, 75 హ్రస్వ, దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగాలు జరిపింది. కొన్ని జపాన్‌ మీదుగా ప్రయాణించి అమెరికా ప్రధాన భూ భాగానికి దగ్గరలోని లక్ష్యాలను తాకాయని వార్తలు వచ్చాయి. ఇవి పరీక్షలే కాదు, అవసరమైతే నిజంగానే ప్రయోగిస్తాం అని ఉత్తర కొరియా చెబుతోంది.

ఉత్తర కొరియా ప్రయోగాలను అవును అంటే దాన్ని అణురాజ్యంగా అంగీకరించినట్టు, కాదు అంటే తన రక్షణ ఛత్రం కింద వున్న జపాన్‌, దక్షిణ కొరియాల అనుమానాలను తీర్చలేక వాటికోసం కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో అమెరికన్లు బలప్రదర్శనలకు దిగి విమర్శలపాలు అవుతున్న స్ధితి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గాలంటే దక్షిణ కొరియా నుంచి అమెరికా తన సైన్యాలను ఉపసంహరించి ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం ఉభయ కొరియాల విలీనానికి వీలు కల్పించాల్సి వుంది. అందుకు అమెరికన్లు సిద్ధం కాదు. చైనా, రష్యా, ఉత్తర కొరియాలను ఎప్పుడైనా దెబ్బతీయాలి లేదా తన దారికి తెచ్చుకోవాలనే లక్ష్యంతో అమెరికన్లు దక్షిణ కొరియాలో క్షిపణి వ్యవస్థ ఏర్పాటు చేశారు. జపాన్‌తో కలసి నిత్యం యుద్ధ విన్యాసాలకు దిగుతున్నారు. దానిని చూసి ఉత్తర కొరియా తన జాగ్రత్తలను తాను తీసుకొంటోంది. అణు కార్యక్రమం నుంచి వైదొలిగేందుకు చేసుకున్న పలు ఒప్పందాలకు అమెరికా తూట్లు పొడిచిన కారణంగా ఉత్తర కొరియా తన ప్రయోగాలను పునరుద్ధరించింది. పూర్తి స్ధాయి అణుదేశంగా మారేందుకు ఉత్తర కొరియా ముందుకు పోతోందన్నది స్పష్టం. దాన్ని ఆ బాట నుంచి మళ్లించాలంటే రెచ్చగొట్టటం కంటే ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, చైనా, రష్యా, జపాన్‌ ఒక గట్టి నిర్ణయం తీసుకొని అమలు జరపాల్సి వుంది. గత శుక్రవారం నాడు స్వయంగా కిమ్‌ జోంగ్‌ అన్‌ పర్యవేక్షణలో ఒక క్షిపణి పరీక్ష జరిపినట్టు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. అది 770 కిలోమీటర్ల ఎత్తున 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకుంది. తమ అంతిమ లక్ష్యం అమెరికాతో వ్యూహాత్మక సమానత్వాన్ని సాధించేందుకు, ఉత్తర కొరియాపై సైనిక ప్రయోగం వంటి మాటలు అమెరికా నేతలు మాట్లాడకుండా వుండేందుకు ఈ ప్రయోగాలను జరుపుతున్నట్టు కిమ్‌ వ్యాఖ్యానించారు.


ఉత్తర కొరియా ఇటువంటి తీవ్ర చర్య తీసుకోవటానికి కారణం ఎవరు? అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)లో అది భాగస్వామి. రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఉభయ కొరియాల విలీనానికి అడ్డుపడుతూ దక్షిణ కొరియాలో తిష్టవేసింది అమెరికా. నిత్యం ఉత్తర కొరియాపై కవ్వింపులు, అక్కడి నాయకత్వానికి వ్యతిరేకంగా కుట్రలు సాగించింది. చైనా, ఇండో చైనాలోని వియత్నాం, కంపూచియా, లావోస్‌ తదితర దేశాలకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో అమెరికా తన అణ్వాయుధాలను మోహరించింది. ఈ పూర్వరంగంలో ఉత్తర కొరియా అణు రియాక్టర్ల నిర్మాణానికి నాటి సోవియట్‌ యూనియన్‌ సహకరించింది. ఆ క్రమంలో 1985లో ఉత్తర కొరియా ఎన్‌పీటీపై సంతకం చేసింది. దక్షిణ కొరియా నుంచి అమెరికా అణ్వాయుధాలను వుపసంహరించాలని ఒక షరతు పెట్టింది. అయితే ఆ పని చేయకపోగా ఉత్తర కొరియా అందచేసిన సమచారాన్ని విశ్వసించటం లేదని ప్రత్యేక తనిఖీలకు అనుమతించాలని అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ ద్వారా అమెరికా వత్తిడి చేసింది. అందుకు అంగీకరించకపోవటంతో ఐరాసకు ఫిర్యాదు చేశారు. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ పూర్వరంగంలో 1994లో తాను ఎన్‌పీటీ నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. అమెరికా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొరియా అణు కార్యక్రమం నిలిపివేస్తే దానికి ప్రతిగా ఆర్ధికసాయం చేయాలి. అయితే దీనికి అమెరికన్లు 2002లో తూట్లు పొడిచారు. కథ మళ్లీ మొదటికి రావటంతో ఈ సారి అమెరికా, ఉభయ కొరియాలు, చైనా, రష్యా, జపాన్‌ కలసి చర్చించి 2005లో ఒప్పందం చేసుకున్నాయి. దాన్ని కూడా అమెరికా 2009లో ఉల్లంఘించింది. దాంతో తాము మరోసారి చర్చలకు వచ్చేది లేదని, అమెరికా చిత్తశుద్ధి ప్రదర్శించటం లేదని ఉత్తర కొరియా ప్రకటించింది. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
తాజా క్షిపణి పరీక్షలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యక్ష చర్యలకు పూనుకోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. అలాంటి ఉడత ఊపులకు బెదిరేది లేదని కొరియా మరో క్షిపణి పరీక్ష జరిపింది. అమెరికా ప్రత్యక్ష చర్యల ప్రకటనలు మాని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా, రష్యా హితవు పలికాయి. ఐరాసలో రష్యా రాయబారి వాసిలీ నెబెన్‌జరు మాట్లాడుతూ భద్రతా మండలి విధించిన ఆంక్షలకు మించి అదనపు చర్యలకు తాము సుముఖం కాదని స్పష్టం చేశారు. ‘అమెరికా, ఇతర భాగస్వాములను మేము కోరేదేమంటే భద్రతా మండలి తీర్మానంలో అవకాశం కల్పించిన రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారాలను ముందు అమలు జరపాలి, వాటిని అమలు జరపకపోవటం అంటే తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించటం లేదని మేము పరిగణించాల్సి వుంటుంది’ అని చెప్పారు. కొరియాతో తిరిగి ముఖాముఖి చర్చలు జరపాలన్న చైనా, రష్యా ప్రతిపాదనను గతంలో అమెరికా తిరస్కరించింది. అమెరికాలోని చైనా రాయబారి కురు టీయంకారు మాట్లాడుతూ గతం కంటే అమెరికాయే ఇప్పుడు ఎంతో చేయాల్సి వుంది. మరిన్ని బెదిరింపులకు పాల్పడకుండా నిగ్రహంతో వుండాలి. చర్చలు, సంప్రదింపులకు ప్రభావవంతమైన మార్గాలను వెతికేందుకు వారు ఎంతో చేయాల్సి వుంది’ అన్నారు.
గత కొన్నేండ్లుగా ఉత్తర కొరియా గురించి జరిగిన ప్రచారాలలో అక్కడ జనం ఆకలితో మాడిపోతున్నారు, కరవు తాండవిస్తోంది, వస్తు కొరత తీవ్రంగా వుంది. అభివృద్ధి లేదు. నిరంకుశత్వం రాజ్యమేలుతోంది. జనంలో అసంతృప్తి పెరుగుతోంది. ఇలా ఉంటోంది. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితే ఉంటే దశాబ్దాల తరబడి జనం తిరుగుబాటు చేయకుండా వుంటారా? ఐరాస తాజాగా విధించిన ఆంక్షల ఫలితంగా చమురు, గ్యాస్‌ ఎగుమతులు పరిమితం అవుతాయి. అక్కడి నుంచి వస్త్రాల వంటి వస్తువుల దిగుమతులు తగ్గిపోతాయి. నిజానికి ఇలాంటి పరిస్ధితిని ఉత్తర కొరియా ఏదో ఒక రూపంలో గత కొద్ది దశాబ్దాలుగా ఎదుర్కొంటోంది. ఆ దేశమంటే ఏమాత్రం సానుకూల వైఖరి లేదా సోషలిజం అంటే అభిమానం లేని కొందరు వ్యాఖ్యాతలు ఏమంటున్నారో చూద్దాం.
సిల్వియా మెర్లెర్‌ ఐరోపా కమిషన్‌ విశ్లేషకురాలు, జర్నలిస్టు. ఆమె ఒక వ్యాసంలో వివిధ అభిప్రాయాలను ఉటంకించారు. వాటిలో కొన్నింటిని చూద్దాం. ‘ఎకనమిస్ట్‌’ పత్రిక వాదన ఇలా వుంది. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మీద పశ్చిమ దేశాల ఆంక్షలు పెద్దగా పని చేయలేదు. ఏటా ఒకటి-ఐదు శాతం మధ్య అది అభివృద్ధి సాధించి వుండవచ్చు. అక్కడి నుంచి బొగ్గు ఎగుమతులను నిలిపివేయాలని ఐరాస ప్రయత్నించింది. అక్కడి నుంచి 99శాతం బొగ్గు దిగుమతి చేసుకొనే చైనా వాటిని నిలిపివేస్తానని ప్రకటించింది. అయితే కొరియా బొగ్గు ఓడలు చైనా రేవులకు వెళుతూనే వున్నాయి. డెయిలీ ఎన్‌కె అనే పత్రిక ప్రచురించిన వార్తల ప్రకారం అధికారికంగా 387 మార్కెట్లను మంజూరు చేయగా వాటిలో ఆరు లక్షల దుకాణాలలో విక్రయాలు సాగుతున్నాయి. యాభైలక్షల మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాటిపై ఆధారపడి వున్నారు. కొత్తగా మధ్యతరగతి పెరుగుతోంది. ఆదాయ అసమానతలు తీవ్రం అవుతున్నాయి. ఈ వార్తకు ముందు రాసిన ముందు మాటలో స్టెఫాన్‌ హగ్గడ్‌ ఇలా వ్యాఖ్యానించారు. ‘ఆర్థిక ఆంక్షలు వారిని దెబ్బతీస్తున్నాయి. 2002 అణు సంక్షోభం తలెత్తిన తరువాత జపాన్‌, దక్షిణ కొరియా ఇతర దేశాలతో వాణిజ్యం దాదాపు సున్నా స్థాయికి చేరింది. మొత్తం చైనా పైనే ఆధారపడుతోంది. ఇటువంటి స్థితిలో 2017 ఆగస్టులో భద్రతా మండలి ఆంక్షలను చైనా ఆమోదించే విధంగా అమెరికా చేయగలిగింది.
అమెరికా కొరియా సంస్ధకు చెందిన హెన్రీ ఫెరాన్‌ 38 నార్త్‌ బ్లాగ్‌ అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ‘ప్రస్తుతం అమలు జరుగుతున్న ఆర్థిక ఆంక్షలు ఎలాంటి ప్రభావం చూపటం లేదని అక్కడ జరుగుతున్న నిర్మాణాలు, ఆహారధాన్యాల ఉత్పత్తి, విదేశీ వాణిజ్యం వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి పలువురు పలు కారణాలను విశ్వసిస్తున్నప్పటికీ ముఖ్యమైన ఒక అంశం ఏమంటే కొరియా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించగలిగే సామర్థ్యం దానికి వుండటమే.’ 2016లో కొరియా వాణిజ్యంలో చైనా వాటా 64 నుంచి 88కి పెరిగింది. దక్షిణ కొరియా వాటా 30 నుంచి 5కు తగ్గింది. రెచ్చగొట్టే చర్యల నుంచి ఉత్తర కొరియా వెనక్కు తగ్గదు అనుకుంటే ఆంక్షలు ఏమౌతాయన్నది ప్రశ్న అని మరొకరు పేర్కొన్నారు. దీనిని బట్టి సాంకేతికంగా ఐరాస ఆంక్షలను సమర్ధించినప్పటికీ ఉత్తర కొరియాకు చైనా, రష్యా అండదండల కారణంగానే అది నెట్టుకొస్తోందన్నది స్పష్టం. అణ్వాయుధాలు పలు దేశాల వద్ద వున్న కారణంగా వాటితో యుద్ధానికి ఎవరూ తలపడే లేదా, వాటిని చూసి లొంగిపోయే అవకాశాలు లేవు. ఈ కారణంగానే అనేకమంది ఉత్తర కొరియాతో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప ఆయుధ ప్రయోగం వలన ఫలితం లేదని అంటున్నారు. అమెరికన్లకు ఈ మంచి మాటలు తలకెక్కుతాయా?

కొరియాపై యుద్దానికి దిగితే జరిగే నష్టం గురించి అమెరికా రక్షణ మంత్రి జేమ్సు మాటిస్‌ అనూహ్యమైన విషాదం చోటు చేసుకుంటుందని చెప్పాడు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ తదితర ప్రాంతాలను లక్ష్య ంగా చేసుకొని వుత్తర కొరియా 8000 ఫిరంగులను ఎక్కు పెట్టి వుంచింది. ఒక వేళ అమెరికా దాడులను ప్రారంభించి క్షిపణులను వదిలితే అవి ఆకాశంలో ప్రయాణించి వుత్తర కొరియాను చేరే లోపలే ఆ ఫిరంగులు తమపని కానిస్తాయి.తొలి కొద్ది గంటలలోనే లక్షల మంది దక్షిణ కొరియన్లు మరణిస్తారు. అక్కడ వున్న లక్షా 30వేల మంది అమెరికన్లు కూడా నాశనం అవుతారు.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత, 1953లో వుత్తర కొరియాపై యుద్ధానికి దిగిన అమెరికా వైఖరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వుత్తర కొరియాను ఏ మాత్రం భయపెట్టక పోగా చివరికి అమెరికు సమీపంలోకి క్షిపణులను వదిలేంతగా కొరియా ఆయుధ సామర్ద్యాన్ని సముపార్జించుకుంది.తన అత్యంత ఆధునిక ఆయుధాల ప్రయోగశాలలుగా ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లను వుపయోగించుకున్న అమెరికాకు అక్కడ తీవ్రనష్టాలు, ఎదురుదెబ్బలే తప్ప విజయాలు దక్కలేదు. అలాంటిది అమెరికాతో ఢీ అంటే ఢీ అనేంతగా ఎదిగిన చైనా పక్కన వుండగా వుత్తర కొరియాపై దాడి చేసి నాశనం చేస్తామని ట్రంప్‌ చెబితే నమ్మేవారెవరైనా వుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందో లేదో చూడాలి !

14 Monday Aug 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China, cow sciences, economic reforms, INDIA, india china comparison, India Independence Day

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన వాతావరణం రోజురోజుకూ విస్తరిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక మన గత చరిత్ర. గత ఘనతను చెత్తబుట్టలోకి నెట్టి మా శంఖంలోంచి వచ్చిందే పవిత్ర తీర్ధం, మేం చెప్పేదే అసలైన చరిత్ర,అదే వేదం, మేమే నిజమైన దేశభక్తులం, మాతో విబేధించేవారందరూ దేశ ద్రోహులే అనే అసహన, నిరంకుశ ధోరణులు వైరస్‌ మాదిరి వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక సమాజం పరిణితి చెందటానికి ఏమి చెయ్యాలి, ఎంత వ్యవధి పడుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతకాలంగా పాలకులు అనుసరించిన విధానాలు తీవ్ర అసంతృప్తి కలిగించాయి. దానిని అవకాశంగా తీసుకొని స్వాతంత్య్రం, హక్కులకోసం జరిగిన పోరులో భాగస్వాములు కాని భావజాల వారసులు వాటికే ఎసరు తెస్తున్నా జనం మౌనముద్రదాల్చటం నిజంగా ఆందోళనకరమే.

71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే సందర్భంగా అసంతృప్తికి ఆజ్యం పోస్తున్న ప్రధానమైన వాటిలో ఒకటైన అభివృద్ధి సమస్య గురించి అవలోకించటం సముచితంగా వుంటుంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, జనంలో ప్రచారంలో వున్న సాహిత్య సారం ఏమిటి? వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు కదా? వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, ప్రతి నాగరిక సమాజం అలాంటి ఆకాంక్షలనేే వ్యక్తం చేసింది. అయినా ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం, బలవంతులు బలహీనులను దోపిడీ చేసేందుకు జరిపిన మారణహోమమే సమస్త మానవజాతి గత చరిత్ర. మంచిని కోరుకుంటే అమలు జరిగేది కాదు, దోపిడీని అరికట్టి కొత్త వ్యవస్దను నిర్మించటమే మార్గమని సోషలిజం, కమ్యూనిజం అనే ఒక నూతన భావనను కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ ముందుకు తెచ్చారు. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు అనే మార్గంలో మన ప్రయాణం ఎంత వరకు సాగింది? గడ్డం, టోపీ పెట్టుకున్నావు, నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావ్‌,దేశద్రోహివి నిన్ను చంపేస్తా అన్న వున్మాదం వరకు అని న్యూఢిల్లీ రైలు వుదంతంలో చూశాం కదా ! గుప్తుల స్వర్ణయుగం అనో మరొకటో చెప్పి మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటే ప్రయోజనం వుంటుందా? మన పూర్వీకులు ప్రపంచానికి ఎంత ఇచ్చారో ప్రపంచం నుంచి కూడా అవసరమైంది పుచ్చుకున్నారని గ్రహించాలి.

అలెగ్జాండర్‌ మన దేశాన్ని ఆక్రమించుకొనేందుకు చేసిన ప్రయత్నం సఫలమై వుంటే, మన దేశంలో పుట్టిన బౌద్ధాన్ని మన పాలకులే నాశనం చేయకుండా వుంటే, మనువాదంతో మన చుట్టూమనం, ఇతరుల చుట్టూ గిరులు గీసి వుండకపోతే మన చరిత్ర మరోవిధంగా వుండేది. తురుష్కులు, ఆఫ్ఘన్‌్‌ దేశాల పాలకుల దండయాత్రలను ఎదుర్కోవటంలో జరిగిన వైఫల్యమే, తరువాత కాలంలో ఐరోపా దేశాల విషయంలో కూడా పునరావృతమై వాటిలో అగ్రశక్తిగా వున్న బ్రిటన్‌ ఆధీనంలోకి మన దేశం వెళ్లిపోయింది.

పొరుగునే వున్న చైనా పరిణామాలు మనకు భిన్నంగా జరిగాయి. హాంకాంగ్‌ను బ్రిటీష్‌వారికి అప్పగించినా అక్కడి క్వింగ్‌ రాజరికం ప్రధాన భూ భాగ ఆక్రమణకు బ్రిటీష్‌ వారికి అవకాశమివ్వలేదు. ఆ రాచరికానికి, బ్రిటీష్‌, ఇతర సామ్రాజ్యవాదుల కుట్రలకు వ్యతిరేకంగా జాతీయవాదులు పోరాడి రాజరికాన్ని అంతమొందించి 1912లో రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రాచరిక శక్తులు వాటితో కుమ్మక్కయిన యుద్ధ ప్రభువులు బీజింగ్‌లోని కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించి తిరుగుబాటు చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు సన్‌యెట్‌సేన్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ కమ్యూనిస్టులతో కలసి ఒక జాతీయ సైన్యాన్ని తయారు చేసి యుద్ద ప్రభువులను అణచివేసేందుకు దశాబ్దాల పాటు సాయుధ చర్యలను జరపాల్సి వచ్చింది.ఆ క్రమంలో అదే కొమింటాంగ్‌ పార్టీలోని మితవాదులు కమ్యూనిస్టులను అణచేందుకు పూనుకోవటంతో రెండు శక్తుల మధ్య జరిగిన అంతర్యుద్ధమే కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ప్రఖ్యాత లాంగ్‌ మార్చ్‌.ఆ క్రమంలోనే 90 ఏండ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ ప్రజావిముక్తి సైన్యాన్ని ఏర్పరచింది.

అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకున్నారు. దానికి వ్యతిరేకంగా మరోసారి కొమింటాంగ్‌-కమ్యూనిస్టులు చేతులు కలిపారు. ఒకవైపు జపాన్‌తో పోరాడుతూనే బలపడుతున్న కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసేందుకు కొమింటాంగ్‌ మితవాదులు మరోసారి కమ్యూనిస్టులను అణచేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జపాన్‌ ఓటమితో పాటు కొమింటాగ్‌ సేనలను కూడా కమ్యూనిస్టులు అదుపులోకి తెచ్చారు. 1949 నాటికి అది సంపూర్ణమైంది. అంటే నిజమైన స్వాతంత్య్రం, సమగ్ర చైనా అప్పటికికాని రూపొందలేదు.

మనకంటే రెండు సంవత్సరాలు వెనుక విముక్తమైన చైనాతో పోల్చుకుంటే స్వాతంత్య్రం నాటికి మన పరిస్థితి ఎంతో మెరుగు. తమ అవసరాలకోసమే అయినప్పటికీ బ్రిటీష్‌ వారు మన దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించారు, ఆనకట్టలను నిర్మించారు. చైనాకు నల్లమందును దిగుమతి చేసి అక్కడి జనాన్ని నల్లమందు భాయిలుగా మార్చారు. క్వింగ్‌ రాజరికశక్తులు, యుద్ద ప్రభువులు తమ అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు తప్ప దేశాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కమ్యూనిస్టుల విప్లవానికి ముందు మూడున్నర దశాబ్దాలు జరిగిన, తరువాత పదిహేను సంవత్సరాల పాటు అంటే మొత్తం ఐదు దశాబ్దాలకు పైగా చైనాలో పరిస్ధితులు తిరుగుబాట్లు, కుట్రలతోనే కూడి వున్నాయి, అసలు ఐక్యరాజ్యసమితిలో దానికి 1971వరకు సభ్యత్వం, గుర్తింపే లేదు. పెట్టుబడులు, ఆధునిక పరిజ్ఞానం అందకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకున్నారు. మనపరిస్ధితి అది కాదు. సోవియట్‌ సాయం పొంది అనేక పరిశ్రమలు, రక్షణ వుత్పత్తులను పొందాం. చివరకు ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలలో సాధిస్తున్న విజయాల వెనుక సోవియట్‌ సాయం ఎంతో వుంది.నాటి నుంచి నేటి వరకు ఒక్క జనాభాలో మాత్రమే మనం చైనాతో పోటీలో వున్నాం.మరో పది సంవత్సరాలలో చైనీయులు అమెరికానే అధిగమించనున్నారని కొందరు అంచనా వేస్తున్న సమయంలో సమవుజ్జీకాని దానితో మన దేశాన్ని పోల్చుకోవటం వృధా ప్రయాసే అవుతుంది.

వర్తమానానికి వస్తే అనేక ఆటంకాలను ఎదుర్కొని చైనా ఆర్ధికంగా బలపడి రెండో స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టి అమెరికా తరువాత పెద్ద శక్తిగా తయారైంది. కొందరు మన దేశం త్వరలో చైనాను అధిగమించే విధంగా పురోగమిస్తోంది అని చెబుతున్నారు. మనం చైనా, ఐరోపా, అమెరికాతోనే పోటీపడి ముందుకు పోతే అంతకంటే కావాల్సింది ఏముంది? పోటీపడాలనే అభ్యుదయవాదులు కోరుకుంటున్నారు.

విధానాలపై ప్రశ్నలు వేసుకొనే ముందు రెండు దేశాలలో వున్న తాజా పరిస్ధితులను ఒక్కసారి చూద్దాం. 1952లో ప్రపంచ జిడిపిలో రెండు దేశాల వాటా దాదాపు సమానం. ఈరోజు మనమెక్కడ, వారెక్కడ ? మనకు ఆరు దేశాలతో సరిహద్దులుంటే చైనాకు 14తో 22వేల కిలోమీటర్లకు పైబడిన భూ సరిహద్దులున్నాయి. ఇలాంటిది ప్రపంచంలో మరొక దేశం లేదు. సముద్రతీరం మనది ఏడువేల కిలోమీటర్లయితే వారికి 14,500 అందువలన దౌత్యపరంగా, సమస్యలతో పాటు మనకంటే రక్షణ ఖర్చూ, దౌత్య అనుభవమూ ఎక్కువే. వ్యవసాయ భూమి మన దేశంలో 64.5శాతం, దానిలో సాగుకు యోగ్యమైంది 52.8శాతం వుంటే చైనాలో అవి 54.7,11.3 శాతాలుగా మాత్రమే వున్నాయి. ప్రపంచ సాగు భూమి వాటా చైనాలో ఏడు శాతం వుంటే జనాభా 21శాతం వుంది. అయినా అక్కడ ఆహార ధాన్యాలకు కొరత లేదు.అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలు వందల సంవత్సరాలలో సాధించిన అభివృద్దిని చైనా కొన్ని పదుల సంవత్సరాలలోనే అందుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు సాధించిన చైనాను చూసి మన దేశం కూడా ఎలా ముందుకు పోవాలా అని చూడకుండా మనది ప్రజాస్వామ్యం, వారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని పోసుకోలు కబుర్లు చెబితే కుదరదు. వాస్తవాలేమిటని యువత ఆలోచించాల్సిన అవసరం లేదా ?

1987లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో చైనా వాటా 1.6శాతం కాగా అది 2012 నాటికి 11.47శాతానికి చేరింది. 1964లోనే 3.1శాతంగా వున్న మన వాటా 1992 నాటికి ఒకశాతానికి పడిపోయింది. ప్రపంచబ్యాంకు తాజా సమాచారం ప్రకారం అమెరికా జిడిపి వాటా 24.32, చైనా 14.84,జపాన్‌ 5.91 శాతాలతో వుండగా మన దేశం 2.83 శాతం దగ్గర వుంది. అంటే జపాన్‌, మన కంటే పెద్దవిగా జపాన్‌ తరువాత వున్న జర్మనీ,బ్రిటన్‌, ఫ్రాన్స్‌లను కూడా దాటి త్వరలో చైనాను అధిగమించే దిశగా నరేంద్రమోడీ నాయకత్వంలో మనం పయనిస్తున్నామనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దానికి తందాన అంటే దేశభక్తులు, మోసపూరిత ప్రచారం, వాస్తవ విరుద్ధం అంటే దేశద్రోహులా ? అయితే మనదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదా ? అది కార్పొరేట్లను, బిలియనీర్లను పెంచుతున్నది తప్ప సామాన్యులకు మేలు చేయటం లేదనేదే విమర్శ. వుపాధి రహిత అభివృద్ది సంపదలు ధనికుల వద్ద పోగుపడటానికి దారితీస్తుంది తప్ప జనానికి మేలు చేయదు.

స్వాతంత్య్రం తరువాత మన దేశంభూస్వాములతో రాజీపడిన పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందే బాటను ఎంచుకుంది.దానితోనే సమసమాజాన్ని స్ధాపిస్తామని పాలకవర్గం నమ్మబలికింది. మరోవైపు చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధతో సమసమాజాన్ని ఏర్పాటు చేయాలనే బాటను ఎంచుకుంది. ఇక్కడే అనేక మంది గందరగోళపడుతున్నారు. వందల సంవత్సరాల పాటు, భూస్వామిక, పెట్టుబడిదారీ వ్యవస్ధలలో వున్న దేశాలు ఒక్క గంతువేసి తెల్లవారేసరికి సోషలిస్టు సమాజాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవరూ చెప్పలేదు. చరిత్రను గమనిస్తే ఫ్యూడల్‌ వ్యవస్ధను కూలదోసి పెట్టుబడిదారీ విధానం నేటి వున్నత స్ధితికి చేరుకోవటానికి వందల సంవత్సరాలు పట్టింది. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు నడుస్తున్న ప్రాధమిక సంధిదశ ఇది.

నిర్దేశిత నమూనాలేవీ లేవు కనుక తన అనుభవాల ఆధారంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తనదైన ప్రత్యేక తరహా( దానినే చైనా లక్షణాలతో కూడిన అంటున్నారు) సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించింది. భిన్న దశలలో వున్న దేశాలలో ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం సాధ్యం కాదన్నది స్పష్టం. 1949 నుంచి 1978 వరకు తన బాటను సమీక్షించుకున్న చైనా కమ్యూనిస్టుపార్టీ దానికి భిన్నంగా కొన్ని సంస్కరణలు అవసరమని భావించింది. 1978లో చైనా సంస్కరణలను ప్రవేశ పెట్టింది. అంతకు ముందు అక్కడ అభివృద్ధి లేదా? ఆరుశాతానికి అటూఇటూగా వుండేది. అంతమంది జనానికి పని కల్పించాలన్నా, వారి జీవితాలను మెరుగుపరచాలన్నా ఆ వృద్ధి రేటు, ఆదాయాలు చాలవని కమ్యూనిస్టుపార్టీ గుర్తించింది.ఆ సంస్కరణలు కొన్ని కొత్త సమస్యలను సృష్టించినప్పటికీ మొత్తం మీద జనజీవితాలను ఎంతగానో మెరుగుపరిచాయి. ఇదే సమయంలో కొత్త ధనిక తరగతిని కూడా సృష్టించాయి. మొత్తం మీద మొగ్గు ఎటుఅంటే జనజీవితాల మెరుగుదల, దారిద్య్రనిర్మూలన వైపే అన్నది స్పష్టం.మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను గడువు కంటే ముందుగా చైనా చేరుకుంది. ఆ విషయాన్ని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ ఆర్ధిక వేదిక వంటి సంస్ధలన్నీ తమ నివేదికలలో పుంఖాను పుంఖాలుగా పేర్కొన్నాయి.

1978 నుంచి చైనా సంస్కరణలు విఫలమౌతాయని అనేక మంది చెప్పిన జోశ్యాలన్నీ ఇప్పటివరకు విఫలమయ్యాయి. చైనా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అమలు జరుపుతున్నదని చెప్పటమే ఒక వక్రీకరణ. అసలు అక్కడ పెట్టుబడిదారీ విధానమే వుందని చెప్పేవారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మూలస్ధంభాల వంటి అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం చైనా వేగాన్ని కొంత మేరకు తగ్గించింది తప్ప సంక్షోభంలోకి ఎందుకు నెట్టలేదు? ఈ కాలంలోనే అది జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ దేశంగా ముందుకు రావటం ఎలా సాధ్యం? నిజాయితీగా ఆలోచించేవారికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకటం కష్టం కాదు.

తనకున్న అపార మానవవనరును ఆర్ధిక శక్తిగా మార్చేందుకు చైనా విదేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తన షరతుల మీద ఆమోదించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు ముగిసిన సందర్భంగా అక్కడి పెట్టుబడులు తరలి పోకుండా చూసేందుకు, అవి ప్రధాన చైనాలో కొనసాగేందుకు ఒకే దేశం- రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని 2050వరకు అమలు జరుపుతామని ప్రకటించింది. అంటే ప్రధాన భూభాగంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద, హాంకాంగ్‌, మకావుల్లో నెలకొన్న పెట్టుబడిదారీ వ్యవస్దలను కూడా కొనసాగనిస్తామని స్పష్టం చేసింది. హాంకాంగ్‌లో డాలర్లు, చైనాలో యువాన్‌ కరెన్సీ. ఇదొక ప్రయోగం. ఈ కారణంగా హాంకాంగ్‌ కేంద్రంగా వున్న అనేక కంపెనీలు ఎలాంటి భయం లేకుండా చైనాలో పెట్టుబడులు పెడుతున్నాయి. దాని వలన చైనాతో పాటు ఆ కంపెనీలు కూడా లాభపడుతున్నాయి. సంస్కరణల ప్రారంభంలో వాటికి ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గాలికోసం కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు దోమలూ, ఈగలు కూడా వస్తాయి, వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు.

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న మాంద్యం కారణంగా చైనా వస్తువులకు కొంత డిమాండ్‌ తగ్గినమాట వాస్తవం. ఆ కారణంగా అక్కడ లేఆఫ్‌లు జరిగినట్లు వార్తలు లేవు. ఎందుకని ? విదేశీ ఎగుమతులు తగ్గినదానికంటే స్వదేశీ వినియోగం ఎక్కువగా పెరుగుతోంది. 2008లో చైనా కార్మికుడి వార్షిక సగటు వేతనం 29,229 యువాన్లు వుంటే 2016లో అది 67,596కు చేరిన కారణంగా అంతర్గత వినియోగం పెరిగింది. అందుకే చైనా ముందుకు పోతోంది. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మన మాదిరి కార్పొరేట్‌ సంస్ధలకు రాయితీలు ఇవ్వటం గాక జనానికి మరలిస్తున్నకారణంగానే వారి వస్తువినియోగం పెరుగుతున్నది. చైనా విజయ రహస్యం అదే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పేదరిక సమస్య వుందని చైనాయే స్వయంగా చెబుతోంది.

చైనాలో ఏటేటా వేతనాలు పెరుగుతున్నందున ఇంకేమాత్రం అక్కడ చౌకగా వుత్పత్తి చేయటం సాధ్యం కాదని అనేక కార్పొరేట్‌ సంస్ధలు అంతకంటే శ్రమశక్తి చౌకగా దొరికే చోట్లను వెతుకుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే మేకిన్‌ ఇండియా పేరుతో మన దేశంలోకి విదేశీ పెట్టుబడులను నరేంద్రమోడీ ఆహ్వానిస్తున్నారు. వాటికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించకుండా రక్షణ కల్పించేందుకు పూనుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ఇటువంటి విధానాలు అనుసరించటమంటే ఏమిటి ? గతంలో బ్రిటీష్‌ వాడు మన దేశంలోని రాజుల, రంగప్పల అనుమతి కోరి మన దేశంలో వ్యాపారం ప్రారంభించాడు. ఎర్రతివాచీ పరచి చక్కగా ఏర్పాట్లు చేస్తాము వచ్చి మా కార్మికుల శ్రమను దోచుకుపోండని విదేశీయులను మనమే ఆహ్వానిస్తున్నాము.

ఈ మధ్యకాలంలో కొందరు చైనా వ్యతిరేకులు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇస్తున్నారు. తద్వారా అందరూ దేశ భక్తిని నిరూపించుకోవాలని చెబుతున్నారు. మన దేశాన్ని ఆక్రమించి మన సంపదల మూల్గులు పీల్చుతున్న బ్రిటీష్‌ వారిని తరిమివేసేందుకు సాగిన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ అన్నది ఒక ఆయుధం. ఆ వుద్యమానికి దూరంగా వుండి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర హిందూత్వ సంస్ధలకు చెందిన వారే ఇప్పుడు చైనా వస్తువు బహిష్కరణకు విఫల పిలుపులు ఇస్తున్నారు. మన దేశంతో సహా ప్రపంచంలో తయారయ్యే కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, అవి పని చేసే వ్యవస్ధలలో చైనా వస్తువులు లేదా చైనాలో తయారైన విడిభాగాలు లేనిదెక్కడ? అందువలన ముందుగా వారు తమ సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తగులబెట్టి మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీగారి ఫ్యాక్టరీలలో తయారైన నిఖార్సయిన స్వదేశీ వస్తువులను వాడి చూపమని అడగాలి.

చౌకబారు రాజకీయం కాకపోతే ఒక్క చైనాయేం ఖర్మ అన్ని రకాల విదేశీ వస్తువులను బహిష్కరించి వాటిని మన దేశంలోనే తయారు చేసుకోవటానికి ఎవరు అడ్డుపడుతున్నారు?. అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సమాచారం ప్రకారం 2016లో చైనా 2011 బిలియన్‌ డాలర్లు, హాంకాంగ్‌ 487 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేసింది. ఒకే చైనాగా లెక్కవేస్తే 2497 బిలియన్‌ డాలర్లు. దానిలో మనం దిగుమతి చేసుకొనేది కేవలం 58 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులనే. వాటి దిగుమతులను నిలిపివేస్తే చైనా దారికి వస్తుందని చెబితే అమాయకులు తప్ప ఎవరు నమ్ముతారు.

చివరిగా మన సంస్కరణల విజయవంతం గురించి ముచ్చటించుకోకపోతే అసంపూర్ణం అవుతుంది. కాంగ్రెస్‌ పాలనలో సంస్కరణలు విఫలమయ్యాయని, అభివృద్ధి ఏదైనా వుంటే అది వుపాధిరహితంగా జరిగి కార్పొరేట్లకే ప్రయోజనం జరిగిందన్నది స్పష్టం. నరేంద్రమోడీ సర్కార్‌ ఆ విఫల విధానాల కొనసాగింపు తప్ప కొత్తదనం ఏముంది? గతనెలలో ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక సహకార కూటమి(ఆర్‌సిఇపి) సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.దానిలో చైనా భాగస్వామి. వాటిలోని కొన్ని అంశాలు మన దేశ పౌరుల ప్రయోజనాలకు హానికలిగిస్తాయని వామపక్ష, ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారు వ్యతిరేకత, నిరసన తెలిపారు తప్ప కాషాయ దళాల జాడలేదెందుకని? ఏదేశమైనా పరిశోధన, అభివృద్ధికి తగిన మొత్తాలను ఖర్చు చేయకుండా అభివృద్ధి చెందజాలదు. మనం 2015 తలసరి 39.37, చైనా 298.56 డాలర్లు ఖర్చు చేశాయి. ఇంత తక్కువ ఖర్చు చేయమని ఏ ప్రజాస్వామిక వాది చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఒక ఎత్తయితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని కొత్త పుంతలు తొక్కించింది. ఆవు పేడలో ఏం దాగుంది, మూత్రంలో ఏమున్నాయో పరిశోధించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలే కేటాయింపు తక్కువ, దాన్ని ఆవు సైన్సు మీదకు మళ్లింపా ! ఇలాంటి పరిశోధనలతో చైనాను అధిగమిస్తామా ! ప్రపంచం నవ్విపోతుంది. చైనా గాకపోతే మరొక మంచి విధానాన్ని అమలు జరపండి ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టిబెట్‌, చైనా వస్తు బహిష్కరణపై కాషాయ సేన వంచన !

13 Thursday Jul 2017

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

China goods boycott, Indo-China standoff, Indo-China trade, RSS, RSS China goods, RSS Duplicity, RSS Hypocrisy, Tibet

ఎం కోటేశ్వరరావు

చైనా-భూటాన్‌ మధ్య వివాదంలో భారత్‌ జోక్యం చేసుకున్న కారణంగా చైనా-భారత్‌ మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా వుభయ దేశాలలో పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వార్తలు వెలువడటం అవాంఛనీయ పరిణామం. తన ఆధీనంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా ప్రారంభించిన రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలని భూటాన్‌ తరఫున మన దేశ మిలిటరీ అడ్డుకోవటంతో చైనా-మన మధ్య ఒక ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఆ ప్రాంతంలో వుభయ దేశాల సైనికులు ఎదురెదురుగా గుడారాలు వేసుకొని మకాం వేశారు. సంప్రదింపుల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవటం అంత అసాధ్యమేమీ కాదు. వుద్రిక్తతలు తగ్గిన తరువాత ఏదో ఒక రూపంలో చర్యలు ప్రారంభమౌతాయి. ఈ లోగా ఎటు వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు వున్నప్పటికీ అది సమర్ధనీయం కాదు.

ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు మనం కూడా సంమయనం పాటించాల్సిన అవసరం లేదా ? నరేంద్రమోడీ సర్కారుకు నిత్యం మార్గదర&శనం చేసే సంఘపరివార్‌ సంస&ధల ప్రతినిధులు చేసే వ్యాఖ్యలుచ్చగొట్టేవిగా వున్నాయి. గత వారంలో ఇండో-టిబెట్టు సహకార వేదిక(బిటిఎస్సెమ్‌) ఆగ్రా సమావేశంలో మాట్లాడిన ఆరెసెస్సు నాయకుడు ఇంద్రేష్‌ కుమార్‌ చైనా నుంచి టిబెట్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని, చైనా ఆధీనంలోవున్న మానస సరోవర ప్రాంతాన్ని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. ధర్మశాల(హిమచల్‌ ప్రదేశ్‌)లో వున్న టిబెట్టు ప్రవాస ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో ఇంద్రేష్‌ ప్రసంగాన్ని పెట్టారు. దాని ప్రకారం ప్రస్తుతం భారత్‌కు పాకిను కంటే చైనా ఎక్కువ ప్రమాదకారిగా మారింది. అందువలన టిబెట్‌ నాయకుడు దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పర్యటనను గౌరవించటం ద్వారా ఇంకేమాత్రం చైనా గురించి భయపడటం లేదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు చైనా ఆక్రమణలోని టిబెట్‌ విముక్తికోసం పోరాడుతున్న టిబెటన్లకు సామాజికంగా, నైతికంగా, రాజకీయంగా మద్దతు ఇవ్వాలని కూడా చెప్పారు.ఆర్‌ఎస్‌ఎస్‌ విషయానికి వస్తే అది చేసే అనేక తప్పుడు ప్రచారాల్లో టిబెట్‌ అంశం ఒకటి. అసలు మన దేశం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించలేదని గతేడాది కూడా అదే నాయకుడు చెప్పాడు.http://www.tibetanreview.net/india-has-never-recognized-tibet-as-historically-chinese/

మన ప్రభుత్వం అధికారయుతంగా ఐక్యరాజ్యసమితిలో ఒకే చైనాను గుర్తిస్తున్నది. (చాలా కాలంపాటు చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్నే చైనా ప్రతినిధిగా సామ్రాజ్యవాదులు, వారి మద్దతుదారులు గుర్తించారు. తరువాత అనివార్యమై కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పలేదు) ఈ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో మన విదేశాంగశాఖ ప్రతినిధి ఒక వివరణ ఇస్తూ చైనాలో టిబెట్‌ అంతర్భాగం అన్న మన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.http://timesofindia.indiatimes.com/india/no-change-in-indias-position-on-tibet-being-part-of-china-mea/articleshow/58182984.cms?TOI_browsernotification=true మన ప్రభుత్వం అధికారయుతంగా ఐక్యరాజ్యసమితిలో ఒకే చైనాను గుర్తిస్తున్నది. (చాలా కాలంపాటు చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్నే చైనా ప్రతినిధిగా సామ్రాజ్యవాదులు, వారి మద్దతుదారులు గుర్తించారు. తరువాత అనివార్యమై కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పలేదు) కాశ్మీరు వేర్పాటు వాదులు తమకు స్వాతంత్య్రం కావాలని కోరుతున్న విషయం తెలిసిందే. వారికి ఇప్పటి వరకు పాక్‌ పాలకులు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. ఇప్పటి వరకు కాశ్మీరును మన అంతర్భాగంగానే చైనా గుర్తిస్తున్నది, దొంగ భక్తుడికి పంగనామాలెక్కువన్నట్లుగా దేశ భక్తి గురించి అతిగా చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మాటలు విన్న తరువాత అది పాలక పార్టీ పరోక్ష అభిప్రాయంగా చైనీయులు పరిగణించి కాశ్మీరు వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తే పరిస్ధితి ఏమిటి ?

అందువలన సమస్యలను మరింత సంక్లిష్టం చేయటం ఎవరికీ మంచిది కాదు. అన్ని రంగాలలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ వచ్చే ఎన్నికలలో జనం దృష్టి మళ్లించటానికి అవకాశాలను వెతుకుతున్నారన్నది ఇప్పటికే స్పష్టమైంది. దానిలో భాగంగా సరిహద్దులలో వుద్రిక్తతలను రెచ్చగొట్టి ఆపేరుతో గట్టెక్కుదామనుకుంటున్నారని అనుకోవాల్సి వస్తుంది.

మరోసారి దేశంలో చైనా వస్తువులను బహిష్కరించి గుణపాఠం చెప్పాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల రెచ్చగొట్టుడు మాటలు వినిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా అధికారంలో వున్నది దాని నేతలే. ఒకవైపు వారే దిగుమతులను అనుమతిస్తారు, మరోవైపు బహిష్కరించమని పిలుపు ఇస్తారు. ఇంతకంటే మోసం, నాటకం మరొకటి ఏముంటుంది? ఎన్నికలలో నిధులు ఇచ్చే వ్యాపారుల కోసం దిగుమతులను అనుమతిస్తారు, చైనా వ్యతిరేక మనోభావాలకు రెచ్చిపోయే మధ్యతరగతి ఓట్ల కోసం చెవుల్లో పూలు పెడుతూ బహిష్కరణ పిలుపులు ఇస్తుంటారు. http://retail.economictimes.indiatimes.com/news/industry/boycott-of-chinese-goods-how-it-wont-help-india-but-can-harm-china/59543718 ఈ లింక్‌లోని విశ్లేషణను ప్రచురించిన ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రికను కూడా దేశ ద్రోహిగా చిత్రించి ఆ పత్రికను కూడా బహిష్కరించమని పిలుపు ఇస్తారేమో తెలియదు. వస్తుబహిష్కరణ ద్వారా చైనాపై వత్తిడి తేగలమనేది పొరపాటు, దాని వలన భారత్‌కు ఒరిగేదేమీ లేదని, చైనా దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు హానికరమని పేర్కొన్నది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2016లో భారత్‌కు చైనా దిగుమతులు 0.2శాతం మాత్రమే పెరిగి 58.33 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఇదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు 12శాతం పడిపోయి 11.76 బిలియన్లకు తగ్గి వుభయ దేశాల మధ్య వాణిజ్య అంతరం 46.56 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని ఆ విశ్లేషణలో తెలిపారు. చైనా ప్రపంచ దేశాలకు వంద వస్తువులను ఎగుమతి చేస్తే దానిలో కేవలం రెండు మాత్రమే భారత్‌కు వస్తున్నాయి. అందువలన ఆ రెండింటిని మన ఆర్‌ఎస్‌ఎస్‌ యోధులు, దేశీయ ‘బాణ సంచా జాతీయో యోధులు’ బహిష్కరింపచేస్తే చైనీయులు కాళ్ల బేరానికి వస్తారని భావిస్తే అంతకంటే పిచ్చి వూహ మరొకటి వుండదు. ఇదే సమయంలో ఆ విశ్లేషణలో పేర్కొన్నట్లు చైనా దిగుమతులపై ఆధారపడిన మన ఔషధ పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజు చైనా ఒక చెరువు మాదిరి వుంది. అగ్రరాజ్యమైన అమెరికాయే దానితో మరిన్ని రాయితీలు పొందేందుకు బేరసారాలు చేస్తోంది తప్ప అలగటం లేదని గ్రహించటం అవసరం.

అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సేకరించిన సమాచారం ప్రకారం 2016లో 2011 బిలియన్‌ డాలర్లతో చైనా ప్రపంచ ఎగుమతులలో అగ్రస్ధానంలో వుంది.దీనిలో హాంకాంగ్‌ 487 బిలియన్‌ డాలర్లను కలపలేదు. తరువాత అమెరికా, జర్మనీ, 1471, 1283 బిలియన్లతో రెండు, మూడు స్ధానాల్లో వున్నాయి. మన దేశం 271 బిలియన్లతో 17వ స్ధానంలో వుంది. అందువలన మన 58 బిలియన్‌ డాలర్ల దిగుమతులను ఆపేస్తే తెల్లవారేసరికి చైనా దిగివస్తుందని అనుకోవటం మరుగుజ్జు ఆలోచన మాత్రమే. రెండవది తన వుత్పత్తికి ఎలాంటి ఢోకా లేకుండా చైనా తన అంతర్గత వినియోగాన్ని పెంచేందుకు పూనుకుందని అందరూ చెబుతున్నారు. ఇంతకూ చెప్పవచ్చేదేమంటే వాస్తవాల ప్రాతిపదికన ఆలోచించటం అవసరం.

చైనాతో మన కంటే ఎక్కువగా అమెరికా,జపాన్‌లు వివాదపడుతున్నాయి. సైనిక సమీకరణలు సాగిస్తున్నాయి. వుత్తర, దక్షిణ కొరియాలు ఏకం కాకుండా అడ్డుపడుతూ వుత్తర కొరియా నుంచి రక్షణ పేరుతో దక్షిణ కొరియాలో 30వేలకు పైగా సైన్యాన్ని, ఆధునిక క్షిపణులు, ఆయుధాలతో అమెరికన్లు తిష్టవేశారు. జపాన్‌తో రక్షణ ఒప్పందం ముసుగులో అక్కడ కూడా సైనిక స్ధావరాలను ఏర్పాటు చేసి మిలిటరీ, దానిపై ఆధారపడే వారిని లక్ష మందిని జపాన్‌లో దశాబ్దాల తరబడి అమెరికన్లు మకాం వేశారు. ఇవన్నీ చైనాకు వ్యతిరేకంగానే అన్నది స్పష్టం. ఇవేగాదు, సాధ్యమైన మేరకు చైనా చుట్టూ తన సేనలను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. అయినా చైనా వస్తువులను బహిష్కరించాలని అమెరికాలోని వారెవరూ పిలుపునివ్వటం లేదు.జపాన్‌ తన సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకొంటోంది. చైనాతో వివాదాలను పరిష్కరించుకొని మన ప్రయోజనాలను పరిరక్షించుకోవటం అవసరం. ఇవాళ వున్న పరిస్ధితుల్లో భారత్‌ – చైనా రెండూ యుద్ధాన్ని కోరుకోవటం లేదు.రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించగల క్షిపణులు వున్నాయి, అందువలన విజేతలెవరూ వుండరు. మన నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఎన్ని పిలుపులు ఇచ్చినా సమీప భవిష్యత్‌లో వాణిజ్యంలోభారత దేశం చైనాకు పోటీ అవుతుందని ఎవరూ భావించటం లేదు. ఎవరైనా అలా చెబితే మనలను వుబ్బేసి తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికి తప్ప వేరు కాదు. నరేంద్రమోడీ ఇంతవరకు చైనా వస్తువుల దిగుమతి నిషేధం లేదా బహిష్కరణ గురించి తన మనసులోని మాటల్లో కూడా బయట పెట్టటం లేదు. అమాయకులను తప్పుదారి పట్టించి, మోసం చేసి ఫేసుబుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో నగుబాట్ల పాలు చేయటానికి తప్ప రాజును మించిన రాజభక్తి మాదిరి అగ్రరాజ్యం అమెరికా వంటి వాటికే లేని దురద మన కాషాయ సేనకెందుకు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా- భూటాన్‌ మధ్య వివాదంలో భారత్‌ !

08 Saturday Jul 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, Bhutan, Chicken neck, China, Indo-China, Indo-China standoff, Nathu La

ఎం కోటేశ్వరరావు

వర్తమాన ప్రపంచంలో జరిగే యుద్ధాలలో జనాలకు నష్టాలు, కష్టాలే తప్ప విజయాలు ఎక్కడా కనిపించటం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో అంత పెద్ద అమెరికా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని ఆయుధాలు కుమ్మరించి కూడా తాను పెంచి పెద్ద చేసిన తాలిబాన్లు చివరకు ఏకు మేకైనట్లుగా మారటంతో వారిని అణచలేక అలసిపోయి వెనుదిరిగి వచ్చింది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు తోటి తోడేలు రాజ్యాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి అనేక దేశాలను కూడా ఏదో రూపంలో ఆ యుద్ధంలో దించి వాటి చేత కూడా భారీగా ఖర్చు చేయించిన విషయం తెలిసిందే. క్యూబా, వుత్తర కొరియా, వియత్నాం ఇలా ఏ చిన్న దేశం కూడా అమెరికా సైనిక పాటవాన్ని చూసి భయపడలేదు, భవిష్యత్‌లో భయపడవు. తాజాగా వుత్తర కొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణిని నిజంగా గురి పెడితే వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికాలోని ఒక ప్రాంతంలో కావాల్సినంత విధ్వంసం సృష్టించగలదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీకు మా వూరెంత దూరమో మాకు మీ వూరూ అంతే దూరం అన్నది వుత్తర కొరియా ప్రయోగ సందేశం. ఇటు వంటి పరిస్ధితులలో ఇక్కడి కోడి కూస్తే అక్కడకు, అక్కడి కోడి కూత ఇక్కడకు వినిపించే దూరంలో వున్న చైనా-మన దేశం మధ్య తలెత్తిన వివాదం ఎంత వరకు దారితీస్తుందన్నది దేశంలో ఒక పెద్ద చర్చగా వుంది. నిజానికి ఇది చైనా-భూటాన్‌ మధ్యలో భారత్‌ దూరటం అంటే సముచితంగా వుంటుంది.అందుకు గాను http://thebhutanese.bt/understanding-the-doklam-border-issue/  ది భూటానీస్‌ పత్రిక సంపాదకుడు టెన్సింగ్‌ లామ్‌సాంగ్‌ రాసిన పై వ్యాఖ్య పూర్తి పాఠాన్ని ఆసక్తి వున్నవారు చదువుకోవచ్చు.

తాజా వివాదంపై చైనా-భారత మీడియా వార్తల తీరు తెన్నులు, సామాజిక మీడియాలో వుభయ దేశాల మధ్య మైత్రిని గాక శతృత్వాన్ని కోరుకొనే వారి పోస్టులు, వ్యాఖ్యలను కాసేపు పక్కన పెట్టి వివాద పూర్వరంగాన్ని చూడటం అవసరం. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరేవారు దేశద్రోహులు కాదు, అవకాశం వచ్చినపుడు అమీ తుమీ తేల్చుకోవాలని చెప్పే వారు దేశ భక్తులు అంతకంటే కారు. మన సైనికుల ప్రాణాలు, వారి కుటుంబాల వేదన, రోదనలు, యుద్ధాలు జరిగితే మన జనంపై పడే భారాల వంటి అనేక విషయాలను ఆలోచించాల్సి వుంటుంది. దీని అర్ధం మన జాగ్రత్తలు మనం తీసుకోవద్దని, వివాదం లేని మన భూభాగాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవద్దని కాదు. వివాదాలు లేని రోజుల్లో కూడా మన రక్షణ యంత్రాంగం నిరంతరం అదే పనిలో నిమగ్నమై వుంటుంది.

అనేక వుదంతాలను చూసిన తరువాత యుద్ధాలు వద్దు, శాంతి కావాలి, ఆయుధాలకు తగలేసే ఖర్చును అభివృద్ధికి వినియోగించాలి అన్న భావం ప్రపంచ వ్యాపితంగా ఏదో ఒక మూల రోజూ వినిపిస్తూనే వుంది. అదే విధంగా చంపు, కొట్టు, నరుకు అనే వున్మాదం తలకెక్కిన వారు కూడా గణనీయంగా వున్నారు గనుకే హిట్లర్‌ వంటి నరహంతకులు తయారవుతున్నారు. ఆ కారణంగానే లాభాల కోసం పని చేసే ప్రపంచ యుద్ధ పరిశ్రమలలో ఎలాంటి సంక్షోభం కనిపించటం లేదు. వాటికోసం అమెరికా సామ్రాజ్యవాదులు ప్రపంచంలో ఏదో ఒకచోట నిత్యం యుద్ధాలను కొనసాగిస్తూనే వున్నారు. తిరుగుబాట్లను రెచ్చగొడుతూ అటు తీవ్రవాదులు-ప్రభుత్వాలకు కూడా ఆయుధాలు విక్రయిస్తూ లాభాలు పోగేసుకుంటున్నారు. ఆయుధ వుత్పత్తి సంస్ధలలో అత్యధికం సామ్రాజ్యవాదుల వెన్నుదన్ను వున్న కార్పొరేట్ల చేతులలో వున్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు మన దేశంలో వున్న పరిస్ధితులలో చైనా లేదా పాకిస్ధాన్‌తో యుద్ధం, యూదు మత దురహంకారి అయిన ఇజ్రాయెల్‌తో సంబంధాలు వద్దు అని చెప్పేవారిని దేశ ద్రోహులుగా చిత్రిస్తారని, వెంటాడి వేధిస్తారని తెలుసు. నేనయితే రక్తం ఏరులై పారాలని, యుద్ధం కావాలని కోరుకొనే పని పాటలు లేని దేశ భక్తుడిని కాదు. మీడియాలో రాస్తున్న వార్తలలో తమకు అనుకూలంగా వున్న వాటిని చూసి ఆవేశం తెచ్చుకొనే రకాన్ని అంతకంటే కాదు. సామాజిక మీడియాలో వీరావేశం ప్రదర్శించేవారందరూ సరిహద్దులకు కాదు కదా ఫేస్బుక్‌ దాటి బయట కాలు పెట్టరు. యుద్ధానికి ముందు సమాధి అయ్యేది నిజం. ఏదేశానికి ఆదేశ పాలకులు, అధికార యంత్రాంగం తమకు అనుకూలమైన సమాచారాన్ని, టీకాతాత్పర్యాలను మాత్రమే జనం ముందుంచుతుంది.

వుదాహరణకు జూన్‌ 19న వాతావరణం సరిగా లేని కారణంగా మన దేశంలోని సిక్కిం నుంచి బయలు దేరాల్సిన మానస సరోవర యాత్రికులు నిలిచిపోయారని తొలి వార్తలు వచ్చాయి. తరువాత 23న రోడ్డు మార్గం సరిగా లేని కారణంగా చైనా వారు నాథూలా కనుమ గేట్లు తెరవలేదని, తరువాత యాత్రికులను వారు అనుమతించటం లేదని వార్తలు వచ్చాయి. ఎందుకిలా జరిగిందో తెలియదని మన విదేశాంగశాఖ అధికారులు వ్యాఖ్యానించారు. అసలు విషయాన్ని చైనా లేదా మన ప్రభుత్వం గానీ 30వ తేదీ వరకు వెల్లడించలేదు. తన ఆధీనంలో వున్న డోక్లాం ప్రాంతంలోని డోక్లాలో చైనా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. అది తమ ప్రాంతమని భూటాన్‌ వాదిస్తోంది. అయితే అది చైనా ఆధీనంలో వుంది. రోడ్డు నిర్మాణంపై భూటాన్‌ అభ్యంతరాలను చైనా ఖాతరు చేయలేదు. దాంతో భూటాన్‌ అధికారులు మన దేశానికి నివేదించారు. భూటాన్‌తో మనకు రక్షణ ఒప్పందం వుంది కనుక వివాదాస్పద భూటాన్‌ ప్రాంతాన్ని రక్షించే పేరుతో మన సేనలు డోక్లాం ప్రాంతంలో వ్రవేశించి చైనా సిబ్బంది వేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. దానికి ప్రతిగా మానస సరోవర యాత్రను చైనా నిరాకరించింది. నాథులా కనుమ మానస సరోవరానికి దగ్గరి దారి, దీనిని రెండు సంవత్సరాల క్రితం చైనా అనుమతించింది. సరిహద్దులలోని ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన వివాదం దృష్ట్యా భద్రతాపరమైన కారణాలతో ఈ మార్గాన్ని మూసివేశామని, ఇతర మార్గాల ద్వారా అనుమతిస్తున్నామని చైనా ప్రకటించింది. తమ భూ భాగంలో తాము నిర్మించుకుంటున్న రోడ్డును భారత బలగాలు అడ్డుకోవటమేగాక, బంకర్లు కూడా నిర్మించాయని, తమ ప్రాంతంలో తిష్ట వేశాయని చైనా ప్రకటించింది. చైనా సైనికులే మన భూ భాగంలో ప్రవేశించి మప బంకర్లను కూల్చివేశారని మన దేశంలోని మీడియా వార్తలను అందించింది.

భారత్‌-చైనా- భూటాన్‌ సరిహద్దు మూడు ప్రాంతాల కూడలి కోడి మెడ ఆకారంలో వుంటుంది. ఆ ప్రాంతంలోని సిక్కిం దగ్గరి సరిహద్దుతో మనకూ చైనాకు వివాదాలు లేవు. అయితే భూటాన్‌- చైనాల మధ్య ప్రాంతాల విభజనపై ఆ రెండు దేశాల మధ్య వివాదం వుంది. ప్రస్తుతం మన సేనలు ప్రవేశించినట్లు చెబుతున్న ప్రాంతం తనదని భూటాన్‌ వాదిస్తుండగా తమ ఆధీనంలో వున్న తమ ప్రాంతమని చైనా చెబుతున్నది. దానిని భూటాన్‌ గుర్తించలేదు. ఈ వివాదానికి సంబంధించి భూటానీస్‌ పత్రిక సంపాదకుడు రాసిన వ్యాఖ్య సారాంశం ఇలా వుంది.’ సరిహద్దు గురించి అంతిమ పరిష్కారం జరిగే వరకు యథాతధ స్ధితితో పాటు ఆ ప్రాంతంలో శాంతి, సామరస్యాలను పాటించాలని 1988,1998లో వుభయ(చైనా-భూటాన్‌) దేశాలు చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను భూటాన్‌ ప్రాంతంలో రోడ్డు నిర్మించటం ద్వారా చైనా అతిక్రమించిందని భూటాన్‌ విదేశాంగశాఖ జూన్‌ 29న ప్రకటించింది. భూటాన్‌ సైనిక శిబిరం వున్న జొంపెలిరీ వైపునకు దారితీసే విధంగా డోక్లా ప్రాంతంలో చైనా జూన్‌ 16న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. ఢిల్లీలో వున్న భూటాన్‌ రాయబారి ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి దీనిపై అభ్యంతరం తెలిపారు. ఈ పరిణామాల గురించి ఎప్పటికప్పుడు భారత్‌కు భూటాన్‌ తెలియచేస్తున్నది. డోక్లా సాధారణ ప్రాంతంలో వున్న భారత సైన్యం భూటాన్‌ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రోడ్డు నిర్మాణం జరుపుతున్న చైనా సిబ్బంది వద్దకు వెళ్లి నిర్మాణం నిలిపివేసి యథాతధ స్ధితిని కొనసాగించాలని కోరింది. ఆ నిర్మాణం యథాతధ స్దితిలో గమనించదగిన మార్పునకు దారితీయటమే గాక భారత్‌ రక్షణకు తీవ్రమైన పర్యవసానాలు ఎదురవుతాయని చైనాకు తెలియచేసింది. 2012లో భారత్‌-చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మూడు దేశాల కూడలి సరిహద్దులపై వుభయ దేశాలతో పాటూ మూడవ పక్ష దేశాలతో కూడా సంప్రదించి ఖరారు చేసుకోవాల్సి వుండగా ఈ అవగానకు విరుద్దంగా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టిందని భారత్‌ అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాంతం తమదే అంటూ చైనా తన చర్యను సమర్ధించుకుంది.

సంఘటన జరిగిన ప్రాంతం గురించి గందరగోళం వున్నట్లు కనిపిస్తోంది. అది మూడు దేశాల కూడలి. కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే మూడు దేశాలు కలుసుకోగలిగిన ఇరుకైన ప్రాంతం. ఎవరికి వారు తమ దైన పేరుతో దానిని సాధారణ ప్రాంతంగా పిలుస్తున్నారు. సంఘటన జరిగిన డోక్లాంలో పెద్ద ప్రాంతం భూటాన్‌దే. సామాజిక మీడియాను అనుసరిస్తున్న కొందరు భూటానీయులు మరో వివాదాస్పదమైన ఫూటెగాంగ్‌ ప్రాంత రోడ్డుపై వివాదం జరిగినట్లు గందరగోళపరుస్తున్నారు. దానికి ఒకవైపు చైనా మరోవైపు భూటాన్‌ అవుట్‌పోస్టులున్నాయి. అక్కడెలాంటి సంఘటన జరగలేదు.డోక్లాం ప్రాంతంలో నిర్మిస్తున్న రోడ్డును నిలిపివేయాలని భూటాన్‌ సైన్యం చేసిన ప్రయత్నానికి చైనా నిరాకరించింది. తరువాత ఆ ప్రాంతానికి వచ్చిన భారతీయ సైన్యం రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసింది. దానికి ప్రతిగా తరువాత వచ్చిన చైనా సైన్యం ఇరుకుగా వున్న ఆప్రాంతంలో భారత సైనికులు నిర్మించిన చిన్న మిలిటరీ అవుట్‌పోస్టులను ధ్వంసం చేసింది.

చైనా విషయానికి వస్తే చుంబీ లోయలోని యాడోంగ్‌ పట్టణం వరకు పెద్ద రోడ్డు నిర్మాణం జరిపింది. భూటాన్‌, భారతవైపు అనేక రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. అయినప్పటికీ ముఖ్యంగా భారత్‌కు కోడి మెడ కూడలి ప్రాంతంవైపు దక్షిణదిశగా నిర్మించే రోడ్డు దాని భద్రతకు హాని కలిగిస్తుందని భావిస్తోంది. ఆ ప్రాంతం దాని ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలుపుతుంది.వాటిలో కొన్నింటిలో తీవ్రవాద సమస్యలున్నాయి. చుంబీలోయలో చైనా ప్రాంతం వున్నప్పటికీ ఇరుకుగా వుండటంతో చైనాకు స్ట్రాటజిక్‌ షోల్డర్స్‌ (భుజంతో కాచుకొనే, మార్చుకొనే వీలు) లేవు. అందుకే అది భూటాన్‌కు చెందిన 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కావాలని, దానిలో సులభంగా మసల వచ్చని చైనా భావిస్తోంది. అదే జరిగితే తనకు పెద్ద ముప్పని భారత్‌ భావిస్తోంది. భూటాన్‌ విషయానికి వస్తే ఏ ప్రాంతాన్ని కోల్పోవటానికి, చొరబాట్లను అంగీకరించటానికి సిద్దంగా లేదు. వ్యూహాత్మక ప్రాధాన్యత రీత్యా 1996లో చైనా ఒకప్యాకేజ్‌ను ప్రతిపాదించింది. దాని ప్రకారం డోక్లాంలో తనకు 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వదిలితే భూటాన్‌ వుత్తర ప్రాంతంలో తమదిగా వున్న 495 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భూటాన్‌కు బదలాయిస్తామని చైనా ప్రతిపాదించింది.

భూటాన్‌-చైనా సరిహద్దు వివాదం 1959లో చైనా సైన్యం టిబెట్‌, భూటాన్‌లో ప్రవేశించి తదుపరి భూటాన్‌ వుత్తర సరిహద్దులను మూసివేసినప్పటి నుంచి ప్రారంభమైంది. అప్పటి పరిణామాలలో భారత్‌కు భూటాన్‌ చేరువైంది. భూటాన్‌-టిబెట్‌ మధ్య పారేనీటి వాలును బట్టి సరిహద్దులనిర్ణయం జరగాలన్న సాంప్రదాయ పద్దతిని చైనా అంగీకరించటం లేదు. తొలుత సరిహద్దు సమస్యను భారత్‌తో సంప్రదించి, దాని ద్వారా చైనాతో భూటాన్‌ చర్చలు జరిపింది. 1984 నుంచి చైనాతో నేరుగా భూటానే చర్చలను ప్రారంభించింది. అప్పటి నుంచి 2016 వరకు 24సార్లు వుభయ దేశాల మధ్య చర్చలు జరిగాయి.’

చైనా నిర్మిస్తున్న రోడ్డు భూటాన్‌ -చైనా మధ్య వున్న వివాదాస్పద ప్రాంతమైనప్పటికీ మూడు దేశాల సరిహద్దు కూడలికి దగ్గరగా రోడ్డు వున్నందున, అది మిలిటరీ రీత్యా కీలక ప్రాంతమైనందున మన దేశం ఆందోళన వెలిబుచ్చటం సహేతుకమే. అలాంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి వుంది. భూటాన్‌ తరఫున మన సైన్యం రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవటమే మన దేశం-చైనా మధ్య వివాదానికి కారణంగా కనిపిస్తోంది. రెండు దేశాల ప్రతినిధులు పరిమితులకు మించి చేసిన వ్యాఖ్యలు దానిని మరింత పెంచాయి. తమ భూ భాగం నుంచి భారత సైనికులు వైదొలిగితేనే తాము చర్చలు జరుపుతామని చైనా షరతు విధించింది.

గత కొంత కాలంగా చైనా పట్ల మనం, దానికి ప్రతిగా చైనా మనపట్ల అనుసరిస్తున్న వైఖరి రెండు దేశాల మధ్య పరస్పర అనుమానాలను పెంచుతున్నది. మనకు ప్రత్యక్షంగా సంబంధంలేని దక్షిణ చైనా సముద్ర వివాదం వంటి విషయాలలో కూడా మన దేశం అనుసరిస్తున్న వైఖరి చైనాకు మింగుడు పడటం లేదు. అందుకే అది మన దేశానికి సంబంధించిన కొన్ని విషయాలలో వేరే విధంగా స్పందిస్తున్నది. తమ చుట్టూ అమెరికన్లు బిగిస్తున్న మిలిటరీ వ్యూహానికి ప్రతిగా స్వయం రక్షణ చర్యలలో భాగంగా చైనా కూడా తనదైన పద్దతులలో ముందుకు పోతున్నది. ఈ పూర్వరంగంలోనే తాజా సమస్యను చూడాల్సి వుంది. ప్రపంచంలో ఏ దేశానికి ఆదేశం తన ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అనేక చర్యలను తీసుకొంటోంది. వాటిలో రాజకీయ కోణాన్ని చొప్పిస్తేనే సమస్యలు సంక్లిష్టంగా మారతాయి.

దలైలామా చైనాపై తిరుగుబాటు చేసి మన దేశానికి వచ్చి ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌పై చైనా అధికారాన్ని సవాలు చేస్తున్నాడు. టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగంగా మన దేశం గుర్తిస్తూనే దలైలామాకు ఆశ్రయం కల్పించటం, చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించటాన్ని చైనా అభ్యంతర పెడుతున్నది. తమ టిబెట్టులోని దక్షిణ ప్రాంత మంటూ మన ఆధీనంలో వున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ను గుర్తించేందుకు చైనా నిరాకరిస్తున్నది. అక్కడ పర్యటించటానికి దలైలామాను అనుమతించవద్దని అభ్యంతరం చెప్పింది. అరుణాచల్‌ మన భూ భాగమని దానిలో ఎవరు పర్యటించాలో వద్దో చెప్పే అధికారం చైనాకు లేదంటూ మన సార్వభౌమత్వాన్ని వెల్లడించే చర్యలో భాగంగా మన ప్రభుత్వం దలైలామా పర్యటనకు ఏర్పాట్లు చేసింది. అంతే కాదు దాని రక్షణకు అవసరమైతే సత్వరం సైన్యాన్ని, ఇతర సామాగ్రిని తరలించేందుకు వీలుగా అరుణాచల్‌ తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు మన ప్రభుత్వం పొడవైన వంతెనను కూడా నిర్మించింది. ఇది చైనా సరిహద్దులకు చేరువలో వుంది. అదే విధంగా రైలు మార్గ నిర్మాణానికి కూడా తలపెట్టింది. చైనా కూడా మన సరిహద్దులకు దగ్గరగా సైనిక రవాణాకు వీలు కల్పించే ఒక ముఖ్యమైన రైలు మార్గాన్ని టిటెట్‌లో నిర్మించిన విషయం బహిరంగమే. అందువలన ఎవరి రక్షణ చర్యలు వారు తీసుకోవటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వుదాహరణకు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయాలని మన దేశంపై పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో వత్తిడి చేస్తున్నాయి. ప్రపంచశాంతి కావాలని మన దేశంలో కోరుకొనే శక్తులు కూడా ఆ ఒప్పందంపై సంతకం మన దేశం చేయవద్దనే చెబుతున్నాయి. మన సార్వభౌమత్వ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును మనం అట్టిపెట్టుకోవాలని తప్ప ఆయుధాలు తయారు చేసి అమెరికా మాదిరి మిగతా దేశాల మీద ప్రయోగించాలని కాదు. అణుయుద్దమే వస్తే ఏ ఒక్కదేశమూ మిగలదు. మిగతా దేశాలు కూడా అణ్వాయుధాలు తయారు చేశాయి గనుకనే అమెరికా ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తోంది.

చైనాతో సంబంధాల విషయాన్ని కూడా మన ప్రయోజనాలను కాపాడుకొంటూ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం ప్రయోజనదాయకమని గత అనుభవాలు నిరూపించాయి.1962లో రెండు దేశాల మధ్య జరిగిన యుద్దం సందర్భంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని వెల్లడించినందుకు నాటి ప్రభుత్వం వుమ్మడి కమ్యూనిస్టుపార్టీ నుంచి ఆతరువాత సిపిఎంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని నాటి ప్రభుత్వం అరెస్టు చేసింది. సిపిఎంను చైనా అనుకూల పార్టీగా ముద్రవేశాయి. ఇప్పటికీ రాజకీయ ఓనమాలు తెలియని వారు అదే విధంగా నిందలు వేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు దేశభక్తి పేరుతో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టాయి. తరువాత జరిగిన పరిణామాలలో సిపిఎం నాయకత్వం చెప్పినట్లు వుభయ దేశాలు సరిహద్దు సమస్యపై సామరస్యపూర్వక చర్చలను ప్రారంభించటంతో పాటు సంబంధాలను మెరుగుపరచుకోవటం చూశాము. చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాజ్‌పేయి జనతాపార్టీ హయాంలో విదేశాంగ మంత్రిగా, తరువాత ప్రధానిగా పని చేసినప్పటికీ చైనాతో సంబంధాల మెరుగుదలకే కృషి చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ అదే ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే వుంది. ఇప్పుడూ దాని శ్రేణులు అదే చేస్తున్నాయి. తాజా వివాదాన్ని కూడా పరస్పర విశ్వాసం పాదుకొల్పే చర్యలతో పరిష్కరించుకోవటం తప్ప ఆయుధాలతో పరిష్కారమయ్యేది కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d