• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: UK

ఐరోపా యూనియన్‌ భవిష్యత్‌ మరింత సంక్లిష్టం !

29 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

Brexit Party, Europe Far-Right, european parliamentary elections 2019, european parliamentary elections 2019 verdict, European Union, Far-right populists, Le Pen’s National Rally, Salvini’s Lega party, The Greens

Image result for european parliamentary elections 2019 verdict complicated it's future

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాటితో ముగిసిన మూడు రోజుల ఐరోపా యూనియన్‌ తొమ్మిదవ పార్లమెంట్‌ ఎన్నికలు సంస్ధ భవిష్యత్‌ను సంక్లిష్టగావించాయి. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నది స్పష్టమైంది. పర్యావరణ పరిరక్షణ కోరే గ్రీన్స్‌ పార్టీలు, తీవ్ర మితవాద పార్టీలు గతం కంటే బలం పుంజుకున్నాయి, నాలుగు దశాబ్దాల తరువాత సాంప్రదాయ మధ్యేవాద, వామపక్ష పార్టీలు మెజారిటీని కోల్పోయాయి. ఫలితాలు ఐరోపా సమాజంలో జరుగుతున్న మధనానికి అద్దం పట్టాయి. ఇటీవలి సంవత్సరాల పర్యవసానాల పలితాలు ఇవి. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈ సారి 50శాతం పైగా ఓట్లు పోలు కావటం ఒక విశేషం అయితే కొన్ని చోట్ల పోలింగ్‌ తగ్గటం జనంలో వున్న నిర్లిప్తతను, కొన్ని చోట్ల పెరగటం గ్రీన్స్‌, పచ్చి మితవాదులకు మద్దతుగా ఓటర్లు ముందుకు వచ్చినట్లు కూడా వెల్లడించింది. మితవాద శక్తులు మొత్తం మీద బలం పెంచుకున్నప్పటికీ వూహించినంతగా విజయం సాధించకపోవటమే ఒక వూరటగా కొందరి విశ్లేషణ వుంది. గత ఎన్నికల్లో పార్లమెంట్‌లో 20శాతంగా వున్న బలాన్ని ఇప్పుడు 25శాతానికి పెంచుకున్నారు. అదే విధంగా గ్రీన్స్‌ విజయాన్ని కూడా వూహించలేదు. అన్ని దేశాల్లో ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద ఐరోపా రాజకీయ రంగంలో వారొక శక్తిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని కోరుకొనే వారి సంఖ్య మరింత పెరిగే ధోరణులు వ్యక్తమయ్యాయి. గ్రీన్స్‌తో పాటు ఇటీవలి కాలంలో స్ధిరోష్ణ పేటిక(ఇంకుబేటర్‌)లో వున్న జాతీయవాద పార్టీలు ఇప్పుడు యుద్ధ భూమిలో చురుకుగా వున్నట్లుగా ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. వీటన్నింటికీ మితవాదం, జాతీయ వాద లక్షణాలలో సారూప్యత వున్నప్పటికీ విడివిడిగా చూస్తే వాటి మధ్య వైరుధ్యం వుంటుంది. ఎవరికి వారు తమ దేశప్రయోజనాలే ముఖ్యం అనుకున్నపుడు వైరుధ్యాలు తలెత్తటం అనివార్యం. ప్రస్తుతం వున్న వాటిని కూల్చివేయాలనటంలో వున్న ఏకీభావం వాటి స్ధానంలో వేటిని నిర్మించాలనటంలో వుండదు.

1979లో ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ వునికిలోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం 28దేశాలకు చెందిన 51.2 కోట్ల మంది పౌరులకు ప్రాతినిధ్యం వహించే 751 మంది ఎంపీలను ఎన్నుకొనే ప్రక్రియ మే 23 నుంచి 26వరకు జరిగింది. యూనియన్‌ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ నిర్ణయించటంతో స్ధానాల సంఖ్యను 751 నుంచి 705కు తగ్గించారు. అయితే ఈ ఏడాది అక్టోబరు వరకు బ్రిటన్‌ సభ్యత్వాన్ని పొడిగించిన కారణంగా అక్కడ కూడా ఎన్నికలు జరిగాయి.( అధికారిక ఎన్నికల ఫలితాల వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రానందున ఈ సమీక్ష కొన్ని పరిమితులకు లోబడి వుంటుందని పాఠకులు గమనించమనవి.) ఇటలీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో మితవాద శక్తులు అతి పెద్ద పార్టీలుగా ముందుకు రాగా మరికొన్ని చోట్ల కూడా గణనీయమైన విజయాలు సాధించాయి.

గ్రీన్స్‌ విషయానికి వస్తే గత ఎన్నికల్లో 51 సీట్లు తెచ్చుకోవగా ఇప్పుడు 70కి పెరిగాయి. జర్మనీలో మధ్యేవాద వామపక్షంగా వర్ణితమయ్యే సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీని వెనక్కు కొట్టి రెండవ పెద్ద పార్టీగా గ్రీన్స్‌ అవతరించారు. ఫిన్లాండ్‌లో 16శాతం, ఫ్రాన్స్‌లో 13, బ్రిటన్‌లో 12శాతం చొప్పున తెచ్చుకున్నారు. వీరు వలసలకు, ఐరోపా యూనియన్‌ ఐక్యతకు అనుకూలురు. అయితే పర్యావరణం పేరుతో వీరు తీసుకొనే కొన్ని వైఖరులతో అటు మితవాదులకు, ఇటు వుదారవాదులకు కూడా కొన్ని విబేధాలు వున్నాయి.

Image result for european parliamentary elections 2019 verdict complicated it's future

ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోతుందా లేదా, అదే జరిగితే ఎలా అనే విషయాలను పక్కన పెడదాం. అక్టోబరు వరకు సాంకేతికంగా అది యూనియన్‌ సభ్యురాలిగా వుంటుంది. తరువాత విడిపోతే ఈ ఎన్నికలు వృధా ప్రయాస. అయితే ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు ఈ ఎన్నికలు బ్రిటన్‌ రాజకీయ రూపు రేఖలను మార్చివేసేవిధంగా సాంప్రదాయ కన్సర్వేటివ్‌, లేబర్‌ పార్టీలకు పోటీగా మరొక పార్టీ ముందుకు వచ్చింది. మూడు నెలల క్రితం పెట్టిన బ్రెక్సిట్‌(ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని కోరుకొనే ) పార్టీ 32శాతం ఓట్లతో బ్రిటన్‌లోని 73 సీట్లకు గాను 29 పొందింది. ఒక్క లండన్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో ఈ పార్టీ ప్రాతినిధ్యం సంపాదించింది.1834తరువాత కన్సర్వేటివ్‌ పార్టీ అత్యంత దయనీయ స్ధితిలో తొమ్మిదిశాతం ఓట్లతో ఐదవ స్ధానంలో మూడు సీట్లతో సరిపెట్టుకుంది. ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో దీనికి 24శాతం వచ్చాయి. ఈ పార్టీ మద్దతుదారులు అత్యధికులు బ్రెక్సిట్‌ పార్టీకి ఓటు చేశారు. ఐరోపా యూనియన్‌ అనుకూల లిబరల్‌ డెమోక్రాట్లు గతం కంటే బలం పుంజుకొని 20శాతం ఓట్లతో రెండవ స్ధానంలో, ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 14శాతం, గ్రీన్స్‌ పార్టీ 11, యుకెఐపి నాలుగుశాతంలోపు ఓట్లతో చివరి స్ధానంలో వుంది.గత యూరో పార్లమెంట్‌ ఎన్నికలలో 24సీట్లు తెచ్చుకున్న యుకెఐపి పార్టీ ఇప్పుడు ఒక స్ధానానికి పరిమితం అయింది. ఈ పార్టీ నేత నైగెల్‌ ఫారజే దాన్నుంచి విడిపోయి బ్రెక్సిట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పూర్వరంగంలో జూన్‌ ఏడున కన్సర్వేటివ్‌ పార్టీ ప్రధాని థెరెసా మే ఫలితాలు రాక ముందే రాజీనామాకు నిర్ణయించుకున్నారు. ఈ ఓటింగ్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఆమె స్ధానంలో వచ్చేవారు ఎవరు? అసలేమీ జరగనుంది అనేది చూడాల్సి వుంది.

ఫ్రాన్స్‌లో పచ్చి మితవాది మారినే లీపెన్‌ నాయకత్వంలోని నేషనల్‌ ర్యాలీ పార్టీ (ఆర్‌ఎన్‌) 23.3శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో నిలిచింది. అయితే గత ఎన్నికలలో ఈ పార్టీకి 24.9శాతం వచ్చాయి. అధ్యక్షుడు మక్రాన్‌ పార్టీకి తాజా ఎన్నికలలో 22.4శాతం వచ్చాయి. గ్రీన్‌ పార్టీకి 13.4శాతం వచ్చాయి. మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ నాయకత్వంలోని రిపబ్లికన్స్‌ పార్టీకి 8.4, సోషలిస్టు పార్టీకి 6.3శాతం ఓట్లు వచ్చాయి. గత కొద్ది నెలలుగా ప్రతివారాంతంలో ఆందోళనలు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పసుపు చొక్కాల పార్టీకి కేవలం 0.54శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. వారి కంటే ఎక్కువగా జంతు ప్రేమికుల పార్టీకి 2.17శాతం వచ్చాయి. ఫ్రాన్స్‌లో మొత్తం 34 పార్టీలు పోటీ చేశాయి.

ఇటలీలోని అధికార మితవాద లీగ్‌ పార్టీ 34.3శాతం ఓట్లతో 28సీట్లతో ప్రధమ స్ధానంలో వుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ 27-31శాతం మధ్య వస్తాయని పేర్కొన్నవాటి కంటే ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ప్రతిపక్ష లెఫ్ట్‌ డెమోక్రాట్స్‌ 22.7శాతం, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న ఫైవ్‌ స్టార్‌ పార్టీ(ఎం5ఎస్‌) 17.1శాతం ఓట్లు తెచ్చుకుంది.మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని ఫోర్జా ఇటాలియాకు 8.8శాతం, ఇటలీ బ్రదర్స్‌ పార్టీకి 6.5శాతం వచ్చాయి. కనీసం నాలుగుశాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీలకే ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇక్కడ మరో పార్టీ ఆమేరకు ఓట్లు సంపాదించలేదు. ఇటలీ పార్లమెంట్‌ ఎన్నికలలో ఏడాది క్రితం 32శాతం ఓట్లు తెచ్చుకున్న ఫైవ్‌ స్టార్‌ పార్టీ ఓట్లు ఈ ఎన్నికలలో 17శాతానికి పడిపోయాయి. మరోవైపు సాల్వినీ నాయకత్వంలోని లీగ్‌ పార్టీ బలం 17 నుంచి 34శాతానికి పెంచుకుంది. దీంతో సాల్వినీ ప్రధాన పదవిని డిమాండ్‌ చేసే అవకాశం వుందని వార్తలు వచ్చాయి.

ఇటీవలి కాలంలో జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎఎఫ్‌డి) పేరుతో ముందుకు వచ్చిన పచ్చి మితవాద శక్తులు తాజా ఎన్నికల్లో కాస్త తగ్గినప్పటికీ మొత్తం మీద బలాన్ని నిలుపుకున్నాయి. పూర్వపు తూర్పు జర్మనీలో ఇది బలమైన పార్టీగా ముందుకు వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 13శాతం తెచ్చుకున్న ఈ పార్టీ ఇప్పుడు 11శాతానికి పరిమితమైంది. ఐరోపా మితవాత శక్తుల్లో బలాన్ని కోల్పోయిన పార్టీ ఇదొక్కటే కనిపిస్తోంది. తూర్పు జర్మనీలోని రెండు రాష్ట్రాలలో రెండు పార్టీల మధ్య తేడా రెండుశాతమే అయినప్పటికీ అధికార ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని క్రిస్టియన్‌ డెమోక్రాట్స్‌(సిడియు)ను రెండవ స్ధానంలోకి నెట్టి ఎఎఫ్‌డి ప్రధమ స్దానంలో వచ్చింది. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దేశం మొత్తం మీద సిడియు 29శాతంతో ముందుండగా తరువాత గ్రీన్స్‌ పార్టీ 20.5శాతం ఓట్లతో, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) 16శాతం ఓట్లతో మూడవ స్ధానంలో వుంది. పట్టణాలలోని యువత గ్రీన్స్‌ పార్టీ వైపు మొగ్గినట్లు కనిపించింది.

ఎన్నికలు ఐరోపా పార్లమెంట్‌కు అయినప్పటికీ సభ్య దేశాలలో పోటీలు మాత్రం స్ధానిక ప్రాతిపదికగానే జరిగాయి. ఎలాంటి వుమ్మడి ఎన్నికల ప్రణాళికలు, వాగ్దానాలు లేవు. బ్రిటన్‌లో బ్రెక్సిట్‌( ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా ) అనే ప్రాతిపదిక మీద జరిగాయి. ఫ్రాన్స్‌లో గత అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడిన ప్రత్యర్ధి పార్టీలు మరోసారి తమ బలనిరూపణ ప్రాతిపదికనే తలపడ్డాయి. స్పెయిన్‌లో కొద్ది వారాల ముందు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో గణనీయ విజయాలు సాధించిన సోషలిస్టు వర్కర్స్‌ పార్టీ తన బలాన్ని పటిష్ట పరచుకొనేందుకే ప్రయత్నించింది. ఇటలీలో మితవాద లీగ్‌ పార్టీ ఏడాది క్రితం సాధించిన ఓట్లను మెరుగుపరచుకొవటం మీదే కేంద్రీకరించింది.

ఐరోపా యూనియన్లోని నాలుగు ప్రధాన దేశాల వివరాలను చూసిన తరువాత . మొత్తం మీద ఐరోపా అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా మరింత స్పష్టంగా వేరుబడటం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ధోరణులు మరింతగా తీవ్రం కానున్నాయని చెప్పవచ్చు. కార్మికవర్గంలో అసంతృప్తికి అన్ని దేశాలలో ఒకే కారణం కానప్పటికీ మొత్తం మీద పెరుగుతోంది. ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎప్పుడు ఏది జనాకర్షక నినాదంతో ముందుకు వస్తే దాని వెనుక సమీకృతం అవుతున్నారన్నది ఇటలీ ఓటింగ్‌ తీరుతెన్నులు స్పష్టం చేస్తున్నాయి. పచ్చిమితవాదులు బలంపుంజుకోకపోయినా సాంప్రదాయ పార్టీలు బలహీనం కావటం ఫ్రెంచి పరిణామం సూచించింది.జాతీయ వాదులకు బుద్ధి లేదు, వారి దేశాలను ప్రేమిస్తారు, విదేశీయులను ద్వేషిస్తారు అని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘాటుగా వ్యాఖ్యానించారు. అంటే వలస కార్మికుల సమస్య ఐరోపాను ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్నది స్పష్టం.

Related image

ప్రపంచ వ్యాపితంగా ముఖ్యంగా ఐరోపాలో ప్రజాకర్షక, జాతీయవాదులు, వీరందరినీ మితవాదులు అనవచ్చు. వీరి వైఖరి ఆయాదేశాల పరిస్ధితులను బట్టి మారుతూ వుంటుంది గాని మౌలిక లక్షణం మితవాదం, అది ముదిరితే పచ్చి మితవాదం, మతవాదం, ఇంకా నయా ఫాసిజం, నాజీజం. ఎందుకీ పరిస్ధితి తలెత్తింది అన్నది అభ్యుదయవాదులు, అధికారం కోసమే పని చేసినా మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను సమర్ధించే సాధారణ లౌకికవాదుల ముందున్న ప్రశ్న. వలస కార్మికుల సమస్యపై జాతీయ వాద రాజకీయవేత్తల వైఖరి ఐరోపా ఐక్యతకే స్పష్టమైన ముప్పును ముందుకు తెచ్చింది అని జుంకర్‌ చెప్పారు. ‘ ఈ ప్రజాకర్షకులు, జాతీయ వాదులు, బుద్దిలేని జాతీయవాదులు తమ దేశాలను ప్రేమిస్తారు, సుదూరాల నుంచి వచ్చే వారిని వారు ఇష్టపడరు, మన కంటే దుర్భర పరిస్ధితుల్లో వున్న వారికి మనం మద్దతుగా వ్యవహరించాలి’ అని జుంకర్‌ చెప్పారు. ఐరోపా దేశాలలో కూడా జాత్యహంకారులు, శ్వేతజాతి వాదులు మైనారిటీలను, విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశం పట్ల విధేయత వుండదని అవమానిస్తారు.

ఐరోపా అంతటా ఇటీవలి కాలంలో మితవాదం పెరుగుతోంది, ఇదే సమయంలో సోషల్‌ డెమోక్రసీ తరుగుతోంది. నాజీ హిట్లర్‌ తరువాత జర్మనీలో ఏడు దశాబ్దాల పాటు ఐరోపా తరహా ప్రజాస్వామ్యమే వుంది తప్ప మితవాద శక్తులు తలెత్తలేదు. అలాంటి చోట ఎఎఫ్‌డి( జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ మూడవ శక్తిగా వునికిలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఐరోపా తిరిగి తమకు పోటీగా బలపడకూడదని అమెరికా భావించింది. ఒంటరిగా వుంటే ఏనుగు వంటి అమెరికాను ఎదిరించి ప్రపంచ మార్కెట్లో తమ వాటాను తాము కాపాడుకోలేమని గ్రహించిన యూరోపియన్‌ కార్పొరేట్‌ శక్తుల ఆలోచన ప్రకారమే ఐరోపా యూనియన్‌ వునికిలోకి వచ్చింది. ఐరోపా బొగ్గు, వుక్కు కమ్యూనిటీతో 1951లో ప్రారంభమై ఏడుదశాబ్దాలుగా సరిహద్దుల చెరిపివేత వరకు వచ్చిన ఐరోపా యూనియన్‌ మీద ఇప్పుడు అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఎవరి కాపురం వారు పెట్టుకుందాం, ఎవరి గొడవ వారు చూసుకుందామనే ధోరణులు పెరిగాయి. దాని పర్యవసానమే ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్‌ నిర్ణయం.

Image result for european parliamentary elections 2019 verdict complicated it's future

ఓటింగ్‌ తీరుతెన్నులను చూసినపుడు మొత్తం మీద మెజారిటీ జనం ఐరోపా యూనియన్‌ ఐక్యతకే మొగ్గుచూపుతున్నట్లు చెప్పవచ్చు. అనేక దేశాలలో విడిపోవాలనే వారు క్రమంగా పెరుగుతుండటం కనిపిస్తోంది. ప్రపంచీకరణ వల్లనే ఇదంతా జరుగుతోంది అనే శక్తులు దాన్ని వ్యతిరేకించటం ఒకటైతే అంతకంటే ప్రమాదకరమైన వైఖరి జాతీయ వాదంవైపు మొగ్గటం. జనంలో మార్పు కావాలనే వాంఛ కనిపిస్తున్నది, అయితే అది ఎటుంవంటిది అన్న విషయంలో స్పష్టత లేదు. ఏ నేత లేదా పార్టీ నినాదం ఆకర్షణీయంగా వుంటే దాని వెంట సమీకృతం అవుతున్నారు. ఈ క్రమంలో సాంప్రదాయ బూర్జువాపార్టీలు, వామపక్ష శక్తులను జనం పక్కన పెడుతున్నారు. జనాకర్షక, జాతీయవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. 2008లో ఆర్ధిక మాంద్యం తలెత్తిన నాటి నుంచి ఐరోపాలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవటం లేదు. కొత్త పార్టీలు పుట్టుకువస్తున్నాయి, పాత పార్టీలను వెనక్కు నెడుతున్నాయి. తాజాగా ఎన్నికలకు ముందు మద్యేవాద మితవాద, పురోగామి సోషలిస్టులు, డెమోక్రాట్లు పార్లమెంట్‌లో 54శాతం మంది వుంటే ఇప్పుడు వారి సంఖ్య 43శాతానికి పడిపోయిందని కొన్ని విశ్లేషణలు వెల్లడించాయి. ఈ మేరకు పచ్చి మితవాదులు, గ్రీన్స్‌ పెరిగారు. ధనిక దేశాల ఆర్ధిక సమస్యలు, మాంద్యానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించకపోగా మరో తీవ్ర మాంద్యం పొంచి వుందనే హెచ్చరికల నడుమ వున్నాం. అందువలన ఐరోపాలో లేదా మరొక చోట భవిష్యత్‌లో ఎలాంటి రాజకీయ, నాటకీయ పరిణామాలు జరుగుతాయో జోశ్యం చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై దాడికి సాకు సృష్టించిన అమెరికా, కొత్తగా వచ్చిన ముప్పేమీ లేదన్న బ్రిటన్‌ !

15 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

iran us war, Islamic State, MIDDLE EAST, Threats From Iran, Trump administration

Image result for iran us war

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు పిచ్చి పట్టిందా ? అలాంటి వున్మాదిని అక్కడి పాలకవర్గం ఎందుకు అనుమతిస్తోంది? ప్రపంచాన్ని ఎటు వైపు తీసుకుపోతున్నారు? గత వారం పదిరోజులుగా పరిణామాలను చూస్తున్న సామాన్యులకు సైతం ఎదురవుతున్న ప్రశ్నలు.అమెరికా ప్రస్తుతం ఒక కొత్త యుద్ధాన్ని ప్రారంభించి మరొక రెండింటిని తీవ్రతరం చేస్తోంది. ఇరాన్‌ తీరానికి మరో యుద్ద నౌకను పంపుతోంది. అది సముద్రంలోనూ అవసరమైతే భూమ్మీదకు వచ్చి దాడి చేయగలదు. మరో వైపు గుర్తుతెలియని వారు తమ రెండు చమురు టాంకర్లపై దాడి చేసి నష్టం కలిగించారని సౌదీ అరేబియా ఆరోపించింది. చమురు పైప్‌లైన్లపై కూడా దాడి జరిగిందని రెండో రోజు ప్రకటించింది. చైనా నుంచి చేసుకొనే 200 బిలియన్‌ డాలర్ల విలువగల దిగుమతులపై 25శాతం వరకు పన్ను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతిగా చైనా కూడా 60బిలియన్‌ డాలర్ల అమెరికా వస్తువులపై దిగుమతి పన్నులు విధించింది. ఇది ఏడాది క్రితం ప్రారంభించినదాని కొనసాగింపు. ఇరాన్‌ తీరానికి అమెరికా యుద్దనౌకలను పంపటం, అవసరమైతే లక్షా ఇరవై వేల మంది సైనికులను ఆ ప్రాంతానికి తరలించేందుకు పెంటగన్‌ పధకాలను సిద్ధం చేసినట్లు వార్తలను వ్యాపింప చేయటం మానసిక యుద్ధాన్ని ప్రారంభించటమే. మరోవైపు ఇరాన్‌ నుంచి తమకు, తమ అనుయాయులకు ముప్పువుందని అమెరికా చెబుతుంటే అందుకు నిదర్శనం అంటూ సౌదీ అరేబియా తమ నౌకలపై దాడి జరిగిందని ఆరోపించింది. ఎవరు చేశారో చెప్పకపోయినా అది ఇరాన్‌వైపే సంకేతాలిచ్చిందని వేరే చెప్పనవసరం లేదు. ఇది గత ప్రచార యుద్ద కొనసాగింపు.

ట్రంప్‌ యంత్రాంగం యుద్దోన్మాద ప్రేలాపనలు చేస్తుంటే కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని బ్రిటన్‌ గాలి తీసింది. మంగళవారం నాడు పెంటగన్‌ వద్ద బ్రిటీష్‌ సీనియర్‌ మిలిటరీ అధికారి మేజర్‌ జనరల్‌ క్రిస్‌ ఘికా విలేకర్లతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు అసాధారణం, బ్రిటన్‌ ఆలోచనా తీరుకు ప్రతిబింబం. అమెరికా యుద్ధానికి దిగేందుకు సిద్దమౌతున్న తరుణంలో దాని మిత్రపక్షానికి చెందిన ఒక వున్నతాధికారి ఇలా మాట్లాడటం చిన్న విషయమేమీ కాదు. అయితే అంతిమంగా బ్రిటన్‌ ఏం చేస్తుందనేది వేరే విషయం. ఘికా మాట్లాడిన కొద్ది సేపటికే అమెరికా మిలిటరీ కమాండ్‌ ఒక ప్రకటన చేస్తూ అమెరికా, దాని మిత్రపక్షాల వద్ద వున్న విశ్వసనీయమైన ముప్పుకు సంబంధించి వున్న సమాచారానికి విరుద్ధంగా ఐఎస్‌ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సేనలకు డిప్యూటీ కమాండర్‌ కూడా అయిన బ్రిటీష్‌ అధికారి చెప్పారని ప్రకటించటం కూడా అసాధారణ అంశమే. ఇరాన్‌పై అమెరికా దాడులకు తెగబడుతుందా లేదా అన్నది ఒక అంశమైతే, అందుకు అవసరమైన నేపధ్యాన్ని సిద్ధం చేస్తోందన్నది స్పష్టం. చరిత్రలో జరిగిన అనేక యుద్దాలు సాకులు, చిన్న చిన్న కారణాలతోనే ప్రారంభమయ్యాయి. వీటిలో అమెరికాదే అగ్రస్ధానం.మచ్చుకు కొన్నింటిని నెమరు వేసుకుందాం.

వియత్నాంపై దాడికి టోంకిన్‌ గల్ఫ్‌ వుదంతం

కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలి, చైనాకు పక్కలో బల్లెంగా మారాలంటే అప్పటికే దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికన్లు వియత్నాంలో కూడా స్ధావరం ఏర్పాటు చేసుకోవాలని పధకం వేశారు.హోచిమిన్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టులు, జాతీయ వాదుల పోరాటానికి తోక ముడిచిన ఫ్రెంచి సామ్రాజ్యవాదలు వియత్నాం నుంచి వైదొలుగుతూ దేశాన్ని రెండు ముక్కలుగా చేశారు. పరిస్ధితులు బాగుపడిన తరువాత ఎన్నికలు జరిపి రెండింటినీ విలీనం చేయాలనేది జెనీవా ఒప్పంద సారం. అయితే సామ్రాజ్యవాదుల తొత్తులుగా వున్న దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు వ్య తిరేకులు, మిలిటరీ విలీనానికి అడ్డుపడింది. ఈ పూర్వరంగంలో దక్షిణ వియత్నాంకు మద్దతుగా రంగంలోకి దిగేందుకు పొంచి వున్న అమెరికాకు ఎలాంటి అవకాశం దొరకలేదు. దాంతో టోంకిన్‌ గల్ఫ్‌లోని తమ యుద్ధ నౌకలపై వుత్తర వియత్నాం సేనలు దాడి చేశాయనే కట్టుకధలు అల్లి 1964లో అమెరికా వుత్తర వియత్నాంపై దాడులకు తెగబడింది. ఇప్పుడు సౌదీ అరేబియా తన నౌకల్లో ఎవరూ మరణించలేదని, చమురు సముద్రం పాలు కాలేదని అయితే నౌకలకు నష్టం జరిగిందని చెబుతున్నట్లుగానే టోంకిన్‌ గల్ఫ్‌లో కూడా వియత్నాం దాడిలో ఎవరూ మరణించలేదని, తమ నౌకకు చిన్న రంధ్రం మాత్రమే ఏర్పడినట్లు, ఇదే సమయంలో తాము మూడు వియత్నాం యుద్ద బోట్లను కూల్చివేశామని, నలుగురు సైనికులను మట్టుపెట్టామని అప్పుడు అమెరికా చెప్పుకుంది. అయితే అదంతా వియత్నాం మీద దాడికి అల్లిన కట్టుకధ అని తరువాత వెల్లడైంది. వియత్నాం మీద జరిపిన దుర్మార్గ దాడుల్లో అమెరికా ఎంత మారణకాండకు పాల్పడిందీ, చివరకు ఎలా తోకముడిచిందీ, రెండు వియత్నాంలు ఎలా ఒకటై కమ్యూనిస్టు దేశంగా మారిందీ చెప్పనవసరం లేదు.

పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడి పేరుతో రెండవ ప్రపంచ యుద్దంలో అడుగు పెట్టిన అమెరికా

రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభంలో అమెరికా తటస్ధ దేశంగా ఫోజు పెట్టింది. రెండు పక్షాలకూ ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకుంది. అయితే యుద్దంలో నాజీలు ఓడిపోతున్నారనే అంచనాకు వచ్చిన అమెరికన్లు యుద్ధానంతరం తమ పలుకుబడిని విస్తరించాలనే కాంక్షతో ఎలాగైనా యుద్ధంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ పూర్వరంగంలో 1941 డిసెంబరు ఏడున అమెరికా పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ సేనలు దాడి చేశాయి. అమెరికన్లు ఆసియాలో జోక్యం చేసుకొనేందుకు పధకం వేశారని తెలిసిన తరువాత ముందస్తు ఎదురుదాడిలో భాగంగా ఇది జరిగినట్లు చెబుతారు. ఇదే సమయంలో జపాన్‌ అలాంటి దాడులకు పధకం వేసిందని అమెరికన్లకు ముందుగానే వుప్పందింది. అయినా దాడి జరిగిన తరువాత ఆ పేరుతో తాము యుద్ధానికి దిగాలన్నది వారి ఎత్తుగడగా తరువాత బయటపడింది.1941నవంబరు 30న హిలో(హవాయి) ట్రిబ్యూన్‌ హెరాల్డ్‌ అనే పత్రిక వారాంతంలో జపాన్‌ దాడి చేయవచ్చు అంటూ ఎనిమిది కాలాల పతాక శీర్షికతో వార్తను ప్రచురించింది. జపాన్‌ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా పూర్తి స్ధాయి యుద్దానికి దిగిందంటే అది అప్పటికే సన్నాహాలు పూర్తి చేసుకుందన్నది స్పష్టం. దాడులు చేసే విధంగా జపాన్‌ను ప్రోత్సహించిదని కూడా కొందరు చెప్పారు. అది ఒక్క అమెరికాకే కాదు, బ్రిటీష్‌ వారికి కూడా తెలుసని తేలింది.యుద్దం చివరిలో జపాన్‌ దాదాపు లొంగిపోయి, పోరు ముగిసే సమయంలో అమెరికన్లు హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసి తమ దగ్గర ఎంతటి ప్రమాదకర ఆయుధాలున్నాయో చూడండి అంటూ ప్రపంచాన్ని బెదిరించారు. ఆ వుదంతం తరువాతే ప్రపంచంలో ఆయుధ పోటీ పెరిగిందన్నది తెలిసిందే.

రెండో ప్రపంచ యుద్ధానికి జర్మనీ సాకు

రెండవ ప్రపంచ యుద్దాన్ని 1939 సెప్టెంబరు ఒకటిన పోలాండ్‌పై దాడితో హిట్లర్‌ సైన్యం ప్రారంభించింది. అంతకు ముందు రోజు అందుకు అవసరమైన సాకును సృష్టించింది. ఆగస్టు 31న ఆరుగురు నాజీ సైనికులు పోలాండ్‌ ప్రతిఘటన యోధుల పేరుతో వేషాలు వేసుకొని ఒక పోలాండ్‌ రైతును పట్టుకొని అతకి మాదకద్రవ్యాలిచ్చి పోలాండ్‌ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని గిలివైస్‌ అనే చోట ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. పోలాండ్‌ యోధుల వేషాల్లో వున్న నాజీ సైనికులు స్టేషన్‌ ఇంజనీర్లను నిర్బంధించి రేడియోను స్వాధీనం చేసుకొని పోలిష్‌ భాష వచ్చిన ఒక సైనికుడు తాము జర్మన్‌ స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నామని, న్యూయార్క్‌ వర్ధిల్లాలి, జర్మనీపై కెనడా దాడి చేయనున్నది అంటూ మాట్లాడి జర్మన్లను రెచ్చగొట్టారు. తరువాత మాదకద్రవ్యాల మత్తులో వున్న రైతును రేడియో స్టేషన్‌ మెట్ల మీద పోలిష్‌ సైనిక యూనిఫాం వేసి కూర్చోబెట్టి నుదిటిపై కాల్చి వదలి వెళ్లారు. జర్మనీపై పోలాండ్‌ జరిపిన దాడికి చిహ్నంగా చూపారు. తరువాత జరిపిన మారణ హోమం ఏమిటో ప్రపంచానికి తెలిసిందే.

అబద్దాలతో యుద్దాన్ని ప్రారంభించిన బిస్మార్క్‌

జర్మన్లను ఐక్యం చేసిన ఘనుడిగా బిస్మార్క్‌ను చరిత్రకారులు రాశారు. జర్మనీని ఒక సామ్రాజ్యవాద శక్తిగా మార్చేందుకు అతగాడు అబద్దాలతో యుద్ధాన్ని ప్రారంభించిన విషయాన్ని కావాలనే విస్మరించారు. 1870లో ప్రష్యా ప్రధానిగా బిస్మార్క్‌ వున్నాడు. అప్పటికే ఫ్రాన్స్‌తో విబేధాలు వున్నాయి. ఈ పూర్వరంగంలో ఘర్షణలను నివారించేందుకు ఫ్రాన్సు ఒక టెలిగ్రామ్‌ను పంపింది, దానిని ప్రచురించి జనానికి తెలియచేయాలని కోరింది. అయితే బిస్మార్క్‌ దానిలోని కొన్ని అంశాలను పూర్తిగా మార్చి జర్మన్లను అవమానపరిచే విధంగా ఫ్రెంచి వారు రాశారంటూ దానిని ప్రచారం చేశాడు. అది జరిగిన వారం రోజులకే ఫ్రాన్స్‌ యుద్దం ప్రకటించింది. ఆ యుద్ధాల్లో అది ఓడిపోయింది. ప్రష్యాలో భాగంగా వున్న జర్మన్‌,ఇతర ప్రాంతాలను కలిపి జర్మనీగా ఏర్పాటు చేయటంలో బిస్మార్క్‌ కీలక పాత్ర వహించాడు. తరువాత అదే జర్మనీ మొదటి ప్రపంచ యుద్దానికి కారణమైంది. దానిలో ఓడిపోయి, అవమానకర షరతులతో రుద్దిన సంధిని అంగీకరించింది. ఆ సంధిని చూపి పోయిన జర్మనీ పరువు నిలబెట్టాలి, తిరిగి జర్మనీకి పూర్వప్రాభవం కల్పించాలనే పేరుతో హిట్లర్‌ రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Image result for iran us war

మన కళ్ల ముందే జరిగిన అనేక దాడులకు ఇలాంటి సాకులనే సామ్రాజ్యవాదులు, ముఖ్యంగా అమెరికన్లు ప్రయోగించారు. ఇరాక్‌లో సద్దాం హుసేన్‌ పెద్ద మొత్తంలో మారణాయుధాలను పోగు పెట్టాడని ప్రచారం చేసి అమెరికా, దాని మిత్ర దేశాలు దాడులు చేసి సద్దాంను హతమార్చిన విషయం తెలిసిందే. మారణాయుధాలు లేవు మరొకటి లేదు. అలాగే లిబియాలో గడాఫీ మీద తప్పుడు ప్రచారం చేసి హతమార్చిన విషయమూ జగద్విదితమే.ఇప్పుడు ఇరాన్‌ మీద అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇరాన్‌తో ఇతర దేశాలతో కలసి చేసుకున్న అణుకార్యక్రమ నిలిపివేత ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అయినప్పటికీ ఇరాన్‌ దానికి కట్టుబడే వుందని, ఎలాంటి వుల్లంఘనలు తమ దృష్టికి రాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ ప్ర కటించింది. మిగతా భాగస్వాముల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అయినా అమెరికా తప్పుడు ప్రచారం మానలేదు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ట్రంప్‌కు ఏదో ఒకటి అవసరం కనుక ఇరాన్‌ మీద కాలు దువ్వుతున్నాడన్నది ఒక అంచనా.

డోనాల్డ్‌ ట్రంప్‌ తన లబ్దికి చేసే పిచ్చిపనులకు అమెరికా పాలకవర్గం ఎందుకు మద్దతు ఇస్తోంది అన్నది కొందరి సందేహం. అమెరికా కార్పొరేట్లకు ఆయుధాల వ్యాపారం ఇప్పుడు అసలైన ఆదాయ వనరు. అందుకు గాను వారికి మార్కెట్‌ అవసరం. కొత్తగా రూపొందించిన మారణాయుధాలు ఎలా పని చేస్తాయో చూడాలంటే జనం మీద ప్రయోగించాలి, అందుకు గాను ఎక్కడో ఒక చోట యుద్ధాలు చేయాలి. రెండవది వివిధ దేశాల మధ్య తగాదాలు పెట్టాలి, లేదా ఫలానా దేశం నుంచి మీకు ముప్పు వుందంటూ పరస్పరం పురి ఎక్కించి రెండు దేశాలకూ ఆయుధాలను అమ్ముకోవాలి. ఇలాంటి పనులు చేసే వారే సదరు కార్పొరేట్లకు అమెరికా గద్దె మీద వుండాలి. సౌమ్యుడని పేరు తెచ్చుకున్న డెమోక్రాట్‌ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అయినా పిచ్చిపనులు చేస్తున్నాడని పేరు తెచ్చుకున్న ట్రంప్‌ అయినా ఆచరణలో అమలు జరిపింది ఒకే అజండా. చైనాతో వాణిజ్య యుద్దం అమెరికన్లకు హాని అనేకంటే అక్కడి వాణిజ్య సంస్ధల లాభాలకు గండికొట్టేది కనుక ఆ తరగతికి చెందిన కార్పొరేట్లు వాణిజ్య యుద్దాన్ని వ్యతిరేకిస్తున్నాయి.అనేక అమెరికన్‌ కంపెనీలు చైనాలో వస్తూత్పత్తి చేసి తిరిగి తమ దేశానికే ఎగుమతి చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధంలో ట్రంప్‌ విధించే పన్నులు వాటిమీద కూడా వుంటాయి. ఈ చర్య అమెరికా నుంచి ఎగుమతులను దెబ్బతీస్తుంది, వినియోగదారులపై భారాలు మోపుతుంది, కార్పొరేట్ల లాభాలను హరిస్తుంది. అందుకే ఇరాన్‌ మీద యుద్ధం అంటే ముందుకు నెట్టే వారు కొందరైతే వాణిజ్య యుద్దం అంటే వెనక్కు లాగేవారు మరి కొందరు. రెండు చర్యలూ కార్పొరేట్లకు అవసరమైనవే.

Image result for sabotage attacks an american alibi,Britain says no new Threat from iran

తాజా పరిణామాల్లో సౌదీ అరేబియా నౌకల మీద దాడి అనే వుదంతాన్ని సృష్టించారన్నది స్పష్టం. తమ మీద ఆంక్షలు మరింతగా విధించినా,మరొకటి చేసినా హార్ముజ్‌ జలసంధిలో చమురు నౌకల రవాణాను అడ్డుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ఈ ప్రాంతానికి దాదాపు 140కిలోమీటర్ల దూరంలోని ఎమెన్‌ జలసంధిలో యుఏయి రేవు ఫుజైరాలో ఆదివారం నాడు నార్వేకు చెందిన ఒకటి, సౌదీ అరేబియాకు చెందిన రెండు నావల మీద ఇరాన్‌ పంపిన వారు దాడులు చేశారని, నౌకలకు పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే అవి నకిలీ వార్తలని తమ రేవుల్లో ఎలాంటి వుదంతం జరగలేదని యుఏయి వాటిని ఖండించింది. అయితే తరువాత అప్పుడప్పుడూ అలాంటివి జరుగుతుంటాయని, తరువాత నిజంగానే దాడులు జరిగాయని ప్రకటించింది.

Image result for iran us war

మధ్య ప్రాచ్యంలో తమ ప్రయోజనాలకు ముప్పుగా ఇరాన్‌ తయారైందని, లెబనాన్‌, ఇరాక్‌, సిరియాలలో షియా మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నదని, ఎమెన్‌లో హుతీ తిరుగుబాటుదార్లకు క్షిపణులు అందిస్తున్నదని, పర్షియన్‌ గల్ఫ్‌లో యుద్ద విన్యాసాలకు తన నౌకాదళాన్ని అనుమతిస్తున్నదని అమెరికా ఎప్పటి నుంచో చెబుతోంది. ఇవన్నీ కొత్తవేమీ కాదని, ఈ అంశాలన్నీ తమకు తెలిసినవేనని, వాటిని ఇప్పటికే పర్యవేక్షిస్తున్నామని కొత్తగా పెరిగిన ముప్పేమీ లేదని బ్రిటీష్‌ అధికారి చెప్పారు. గతంలో ఇరాక్‌ విషయంలో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పేర్చారని తప్పుడు ఆరోపణలతో చేసిన యుద్ధం గురించి తెలిసిన ఐరోపా మిత్ర దేశాలు ఇప్పుడు ఇరాన్‌ విషయంలో చెబుతున్న అంశాలను తాపీగా తీసుకుంటున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. సోమవారం నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల అధిపతి ఒక ప్రకటన చేస్తూ గరిష్ట సంయమనం పాటించాలని, వత్తిడిని పెంచాలని చెప్పారు తప్ప అమెరికాకు వంత పాడలేదు. ట్రంప్‌ సలహాదారు బోల్టన్‌, మైక్‌ పాంపియోలు ట్రంప్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని ఐరోపా అధికారులు ప్రయివేటు సంభాషణల్లో చెబుతున్నారు. ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం విషయంలో అమెరికా చెబుతున్నదానికి విశ్వసనీయత లేదని మిగతా భాగస్వామ్య దేశాలన్నీ భావిస్తున్నాయి.అయితే వెలువడిన వార్తల ప్రకారం ఇరాన్‌ మీద దాడికి ఐరోపా యూనియన్‌ సుముఖంగా లేదన్న వాదన వినిపిస్తోంది. అందువలన అదే నిజమైతే వాటిని కాదని అమెరికా ముందుకు పోతుందా, ప్రచార దాడితో సరిపెడుతుందా అన్నది చూడాల్సి వుంది. ఆ జలసంధిలో అమెరికా యుద్ద నౌక ఇప్పటికే ప్రవేశించింది, ఈ నేపధ్యంలో ఇరాన్‌ తన ఆధీనంలో వున్న హార్ముజ్‌ జలసంధిని మూసివేయటం అంటే అమెరికాతో యుద్ధానికి సిద్దపడటమే. అది జరుగుతుందా, మూసివేసినా దాడులకు అమెరికా తెగిస్తుందా ? ఇప్పటికి వూహాజనిత ప్రశ్నలే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసాంజే అరెస్టు వెనుక అసలు కథేంటి ?

17 Wednesday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Politics, UK, USA

≈ Leave a comment

Tags

Assange's Arrest, Assange's asylum, Julian Assange, Lenín Moreno, Rafael Correa, WikiLeaks

Image result for julian assange

ఎం కోటేశ్వరరావు

కాలిలో ముల్లు, చెప్పులో రాయి, చెవిలో జోరీగ, ఇల్లాలి పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామా అన్న వేమన పద్యం తెలిసిందే. వికీలీక్స్‌ అధిపతి జూలియన్‌ అసాంజే చెప్పులో రాయిగా మారాడని వర్ణించిన ఈక్వెడోర్‌ అధ్యక్షుడు లెనిన్‌ మోరెనో అన్నంతపనీ చేసి అసాంజేను వదిలించుకున్నాడు. దీనికి కారణాలేమిటి అన్నది ఆసక్తి రేపుతున్న అంశం. ప్రపంచంలో వెల్లడయ్యే వ్యతిరేకత, వత్తిడే అమెరికా నుంచి అసాంజే జీవితాన్ని కాపాడతాయి. ఆ జర్నలిస్టు జీవితాన్ని ఏదో ఒకసాకుతో జీవితాంతం జైలుపాలు చేయవచ్చు. ఈక్వెడోర్‌ చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఆశ్రయం ఇచ్చిన తరువాత ప్రభుత్వం దానిని రద్దు చేయటానికి వీల్లేదు. బ్రిటన్‌లో బెయిల్‌ నిబంధనలను వుల్లంఘించిన వారు వేలాది మంది వున్నారు. వారందరినీ వదలి అసాంజేను అరెస్టు చేయటం వెనుక బ్రిటన్‌ మీద అమెరికా తెచ్చిన వత్తిడే అన్నది స్పష్టం.

లండన్‌లోని తమ రాయబార కార్యాలయంలో శరణార్దిగా వున్న అసాంజే తామిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసినందున లండన్‌ పోలీసులకు అప్పగించినట్లు తొలుత ప్రకటించిన మోరెనో, అతను తమ కార్యాలయాన్ని గూఢచార కార్యకలాపాలకు వినియోగించుకున్నాడని కొద్ది రోజుల తరువాత మరొక అభాండం వేశాడు. ఇతని తీరు చూస్తే మేకపిల్లను తినదలచుకున్న తోడేలు చెప్పిన సాకుల కధ గుర్తుకు రాకమానదు. ఆస్ట్రేలియన్‌ పౌరుడైన జూలియన్‌ అసాంజే 2006 వికీలీక్స్‌ స్దాపక సంపాదకుడిగా అనేక అంశాల మీద ముఖ్యంగా అమెరికాకు చెందిన లక్షలాది రహస్య పత్రాలను బహిర్గతం కావించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.2010లో అమెరికా అరెస్టు వారెంట్‌ జారీ చేయటమే కాదు, అతను దొరికితే తమకు అప్పగించాలని తనతో ఒప్పందం వున్న దేశాలన్నింటినీ కోరింది. ఆ వల నుంచి బయటపడిన అసాంజే 2012లో బ్రిటన్‌లో వుండగా ఈక్వెడోర్‌ రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించటంతో లండన్‌లోని రాయబార కార్యాలయంలో అప్పటి నుంచీ నివాసం వుంటున్నాడు. ఒక దేశ అనుమతి లేకుండా స్ధానిక లేదా బయటి ప్రభుత్వాలకు చెందిన పోలీసులు, ఇతర ఏజన్సీలేవీ ప్రవేశించటానికి లేదు. అయితే గత వారంలో ఈక్వెడోర్‌ అధ్యక్షుడు తాము అసాంజేను బయటికి పంపుతున్నామని తెలియచేసి మరీ లండన్‌ పోలీసులకు అప్పగించాడు. ఈ అసాధారణ చర్య మీద ప్రపంచవ్యాపితంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా పట్టించుకోవటం లేదు.

Image result for julian assange

లెనిన్‌ మోరెనో చర్య అంతర్జాతీయంగా ఈక్వెడోర్‌ ప్రతిష్టను దెబ్బతీసింది. తమ సార్వభౌమత్వాన్ని తామే దెబ్బతీసుకోవటంతో పాటు, శరణార్దిగా , తరువాత దేశ పౌరుడిగా మారిన అసాంజేను అప్పగించి అంతర్జాతీయ న్యాయ సూత్రాల వుల్లంఘనకు పాల్పడ్డాడు. లండన్‌ పోలీసులను తమ కార్యాలయంలోకి స్వయంగా ఆహ్వానించాడు. వామపక్ష వాది రాఫెల్‌ కొరెయా వారసుడిగా అధికారానికి వచ్చిన లెనిన్‌ ఇలా ప్రవర్తించటం ఏమిటని వామపక్ష వాదులకు, ఇతరులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. రెండు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన అతగాడి కదలికలను గమనిస్తున్నవారికి ఏ క్షణంలో అయినా అసాంజేను అమెరికా రాక్షసికి అప్పగించవచ్చనే అభిప్రాయం ఎప్పటి నుంచో వుంది. అందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూశాడు.

లాటిన్‌ అమెరికాలో గత రెండు దశాబ్దాలలో వామపక్షాలు అధికారానికి వచ్చిన దేశాలలో ఈక్వెడోర్‌ ఒకటి.ఈ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన పార్టీలలో చేరిన వారందరూ అన్ని అంశాల మీద ఏకాభిప్రాయం కలిగిన వారు కాదు. నియంతలు, మిలిటరీపాలకులు, ప్రజాస్వామ్య హక్కులు, కార్మికవర్గంపై దాడులను, అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించే ఒక సాధారణ లక్షణమే ఈ పార్టీలలో చేరిన వ్యక్తులు, శక్తుల మధ్య అంగీకృతమైంది. నయావుదారవాద విధానాల కొనసాగింపు, పెట్టుబడిదారీ వ్యవస్ధను సమూలంగా తొలగించాలనిగాక సంస్కరించాలని కోరే వారి వరకు అందరూ ఈ పార్టీలలో వున్నారు. అందుకే ఎక్కడా నయా వుదారవాద విధానాలకు ప్రత్యామ్నాయం రూపొందించకుండా వాటినే కొనసాగిస్తూ జనానికి వుపశమన చర్యలు తీసుకుంటున్నారు. వాటికి పరిమితులు ఎదురైనపుడు ఆ విధానాల నుంచి కూడా వైదొలుగుతున్నారు. అందుకు తాజా వుదాహరణ ఈక్వెడోర్‌.

అక్కడ ప్రస్తుతం అధికారంలో వున్న పాయిస్‌ అలయన్స్‌. పయస్‌ అంటే స్పానిష్‌లో దేశం అని అర్ధం, ఆంగ్లంలో ప్రౌడ్‌ అండ్‌ సావరిన్‌ ఫాదర్లాండ్‌( గర్వించదగిన మరియు పితృభూమి) కూటమి. మధ్యేవాద-వామపక్ష ప్రజాస్వామిక సోషలిస్టు మరియు సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీగా దీని లక్షణాన్ని విశ్లేషకులు వర్ణించారు. ఈ కూటమికి నాయకుడిగా మూడుసార్లు అధ్య క్షపదవి చేపట్టిన రాఫెల్‌ కొరెయా అక్కడి నిబంధనల ప్రకారం మూడోసారి పోటీ చేసేందుకు వీలులేని కారణంగా తమ అభ్యర్ధిగా లెనిన్‌ మోరెనోను ప్రకటించాడు.(వామపక్ష వాది అయిన మోరెనో తండ్రి తన కుమారుడు లెనిన్‌ అంతటి వ్యక్తి కావాలనే ఆకాంక్షతో పేరులో లెనిన్‌ చేర్పాడు. ) అసాంజేను లండన్‌ పోలీసులకు అప్పగించిన లెనిన్‌ మోరెనో ఈక్వెడోరియన్‌ మరియు లాటిన్‌ అమెరికా చరిత్రలో పేరుమోసిన విద్రోహి అని అదే రాఫెల్‌ కొరెయా తీవ్రంగా స్పందించాడు. మోరెనో ఒక అవినీతి పరుడు, అతను చేసిన నేరాన్ని మానవాళి ఎన్నటికీ మరవదు అని ట్వీట్‌ చేశాడు.

అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే మోరెనో తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించాడు. అచిర కాలంలోనే జనం నుంచి దూరమయ్యాడు. ప్రస్తుతం అతన్ని సమర్ధించేవారి సంఖ్య 17శాతానికి అటూఇటూగా మాత్రమే వుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మార్చినెల చివరి వారంలో ప్రతిపక్ష ఎంపీ ఒకరు మోరెనో అవినీతిని వెల్లడించే పత్రాలను బహిర్గతం చేశాడు. వాటిలో వున్న వివరాల ప్రకారం పన్నుల ఎగవేతల స్వర్గం, బినామీ కంపెనీలకు నిలయమైన పనామాలో ఐఎన్‌ఏ పెట్టుబడుల కంపెనీ పేరుతో మొరెనో అక్రమాస్తులను కూడపెట్టాడు. అది సోదరుడు ఎడ్విన్‌ మోరెనో పేరు మీద వుంది. లెనిన్‌ మోరెనో కుమార్తెలు ఇరినా, క్రిస్టినా,కరీనా పేర్లు కలసి వుండేలా ఐఎన్‌ఏ కంపెనీ వుంది. అందుకు ఆదే పేరుతో అక్రమాల కుంభకోణాన్ని పిలుస్తున్నారు. దీని మీద వచ్చిన ఫిర్యాదులను ప్రాధమికంగా విచారించేందుకు ఏప్రిల్‌ నాలుగున తమ ముందుకు హాజరుకావాలని ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం దేశాధ్యక్షుడికి సమన్లు పంపింది. ఇదంతా తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పన్నిన కుట్ర అని, మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా ఏర్పాటు చేసిన రాజకీయ సంస్ధ సిటిజన్‌ రివల్యూషన్‌లో సభ్యుడిగా వున్న ఎంపీ ఇదంతా చేస్తున్నాడని మోరెనో ఆరోపించాడు. పాయిస్‌ అలయన్స్‌ అభ్యర్ధిగా ఎన్నికైన మోరెనో దానికే ద్రోహం చేశాడని, విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని కొరెయా విమర్శించారు. విచారణ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, అమెరికా అనుకూల శక్తులను తనవైపు తిప్పుకొనేందుకు అసాంజేను బలిపెట్టారన్నది ఒక కోణం.దానికి అనుగుణ్యంగానే మీడియా కేంద్రీకరణ అవినీతి నుంచి అసాంజే వైపు మళ్లింది.

గతంలో పాయిస్‌ అలయన్స్‌ నేత, మాజీ వుపాధ్యక్షుడైన జార్జి గ్లాస్‌ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి 20017 ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆ సమయంలో మోరెనో వుపాధ్యక్షుడిగా, రాఫెల్‌ కొరెయా అధ్యక్షుడిగా వున్నారు. తరువాతే మోరెనో అధ్య క్షుడయ్యాడు. ఆ వుదంతాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని తాను అవినీతి పరుల అంతం చూసే వ్యక్తినని జనం ముందుకు వెళ్లాడు. ఇప్పుడు ఐఎన్‌ఏ పత్రాలలో అతగాడే పెద్ద అవినీతి పరుడని బయటపడింది. తనను అధ్యక్షుడిని చేసిన రాఫెల్‌ కొరెయాను కూడా మోరెనో వదల్లేదు. 2012లో అధ్యక్షుడిగా వున్న సమయంలో ప్రతి పక్ష ఎంపీని కిడ్నాప్‌ చేయించారనే ఒక తప్పుడు కేసు బనాయించారు. ఆ కేసులో హాజరుకాకపోవటంతో కొరెయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు గత ఏడాది జూలైలో ఆదేశించింది. ఆ సమయంలో బెల్జియం వాస్తవ్యురాలైన భార్యతో కొరెయా అక్కడే వుంటున్నారు. ఇప్పటికీ అక్కడే వున్నారు.అసాంజే అరెస్టు సందర్భంగా కొరెయా ఫేస్‌బుక్‌ పేజీని తొలగించారు. ఇతరుల వ్యక్తిగత వివరాలన్నీ వెల్లడించారనే తప్పుడు కారణాలు చూపారు.

తప్పంటూ ఒకసారి చేసినా వందసార్లు చేసినా ఒకటే అన్నట్లుగా లండన్‌ పోలీసులతో అసాంజేను అరెస్టు చేయించిన మోరెనా దేశంలో తన పోలీసులను ప్రయోగించి అసాంజే మద్దతుదార్లును అరెస్టు చేయించాడు. విదేశీయులను అరెస్టు చేసినపుడు ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు తెలియచేయాల్సి వుంది. దాన్ని కూడా పాటించలేదు. తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు రష్యన్‌ హాకర్స్‌, వికీలీక్స్‌ సభ్యులు వున్నారని హోంమంత్రి ఆరోపించారు.ఈక్వెడోర్‌ మాజీ విదేశాంగ మంత్రి రికార్డో పాటినో ఒక ప్రకటన చేస్తూ నెంబరులేని ప్రభుత్వ ట్రక్కు ఒకటి భార్యతో కలసి ప్రయాణిస్తున్న తన కారును వెంటాడిదని పేర్కొన్నారు. అంతకు ముందు రోజు ఒక రేడియోలో మాట్లాడుతూ ఐఎంఎఫ్‌, అమెరికా పెత్తనంలో వున్న ఆర్ధిక సంస్ధల నుంచి రుణాల కోసం లొంగిపోయి అసాంజేను అప్పగించాడని రికార్డో పాటినో చెప్పారు.పాటినో కూడా తన ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు కుట్రచేసిన వారిలో ఒకరని మోరెనో ఆరోపించాడు.

అసాంజే అప్పగింతకు జరుగుతున్న ప్రయత్నాల గురించి రాఫెల్‌ కొరెయా ఈఏడాది ప్రారంభంలోనే ఒక హెచ్చరిక చేశారు. ఆశ్రయం పొందిన అసాంజే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడా లేదా అన్నది మదింపు జరుగుతోందని ఒక డాక్యుమెంట్‌ను ట్విటర్‌ద్వారా వెల్లడించారు. ఐఎంఎఫ్‌ నుంచి పొందే పది బిలియన్‌ డాలర్ల రుణానికి గాను ప్రతిగా అసాంజేను అమెరికాకు అప్పగించాలని, ఈక్వెడోర్‌ వర్షపు అడవులను కాలుష్యం గావించిన అమెరికా కార్పొరేట్‌ చమురు కంపెనీ చెవరాన్‌ నుంచి ఎలాంటి నష్టపరిహారం కోరకూడదని తదితర షరతులను ఐఎంఎఫ్‌ సూచించింది. ఐఎంఎఫ్‌లో 17.46శాతం వాటా కలిగిన అమెరికా గతంలో తమ డిమాండ్లను అంగీకరించకపోతే ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ వంటి సంస్ధల నుంచి తాము వైదొలగాల్సి వుంటుందని బెదిరించిన విషయం బహిరంగమే. ఐఎంఎఫ్‌ను సాంప్రదాయేతర ఆర్ధిక ఆయుధంగా వాడుకోవాలన్న అమెరికా మిలిటరీ సూచనలను వికీలీక్స్‌ బయట పెట్టింది. ప్రత్యర్ధులు అమెరికాకు లొంగితే రాయితీలు , వ్యతిరేకంగా వుంటే దెబ్బతీయాలని సూచించారు.

మోరెనా సర్కార్‌ అసాంజేను అప్పగించటమే కాదు, ఐఎంఎఫ్‌ ఇతర షరతులను కూడా వెంటనే అమలు జరిపింది.ఒప్పందంపై సంతకాలు చేయకముందే తమ చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు లేదా అప్పుకు వుద్యోగుల తొలగింపుకు సంబంధం లేదని చెప్పుకొనేందుకు సంస్కరణల పేరుతో పదివేల మంది ప్రభుత్వ సిబ్బందిని ఇంటికి పంపింది. అంతేకాదు రెండున్న దశాబ్దాల క్రితం చెవరాన్‌ కంపెనీ కలుషితం చేసిన ప్రాంతాన్ని ప్రభుత్వ నిధులతో శుద్ది చేసేందుకు పూనుకొని కంపెనీకి ఖర్చు తప్పించింది. అధికారానికి రాగానే 2017లోనే క్విటో నగరంలో మోరెనో, అమెరికా ప్రత్యేక ప్రతినిధి రాబర్ట్‌ ములర్‌, ట్రంప్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ పాల్‌ మానాఫోర్ట్‌ సమావేశమయ్యారు.దానిలో అసాంజే అప్పగింతకు తగిన చర్యలు తీసుకుంటామని, దారి వెతుకుతామని మోరెనో హామీ ఇచ్చాడు. పొమ్మనకుండా పొగపెట్టినట్లుగా 2018లో లండన్‌ రాయబార కార్యాలయంలో అసాంజేకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని, భద్రతా సిబ్బందిని తొలగించారు. అమెరికాకు సంతోషం చేకూర్చేందుకు వెనిజులా నాయకత్వంలో ఏర్పడిన లాటిన్‌ అమెరికా దేశాల కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు గతేడాది ఆగస్టులో ప్రకటించారు. బ్రెజిల్‌ ఎన్నికల్లో గెలిచిన వామపక్ష వ్యతిరేకి జైర్‌ బోల్‌సోనారోకు అభినందనలు తెలిపాడు. తమ సహనం నశించిన తరువాతే అసాంజేను తీసుకుపోవాల్సిందిగా లండన్‌ పోలీసులను కోరినట్లు ఈనెల 11న మోరెనో ప్రకటించాడు.

Image result for julian assange

నయావుదారవాద విధానాల ప్రాతిపదికన సంక్షేమ రాజ్యాలను ఏర్పాటు చేయాలన్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల వైఫల్యాన్ని అవకాశంగా తీసుకొని అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల సామ్రాజ్యవాదులు ప్రజావ్యతిరేకులను తిరిగి ప్రతిష్ఠించగలిగారు.ఈక్వెడోర్‌లో వామపక్ష వేదికనే వుపయోగించుకొని నెగ్గిన మోరెనోను ఏకంగా తమ వాడిగా మార్చుకోవటం సరికొత్త పాఠాలను నేర్పుతోంది. అక్కడి వామపక్షాలలో సాగుతున్న మధనం ఇలాంటి హాలాహలాన్ని అధిగమించగలదనటంలో ఎలాంటి సందేహం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్టికల్‌ 370-వుగ్రవాదానికి లంకె బోడిగుండు మోకాలుకూ ముడి పెట్టడమే !

02 Saturday Mar 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Article 370 and Terrorism, Article 370 facts, link between article 370 and terrorism

Image result for article 370 and terrorism

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి 14న పుల్వామా వుగ్రదాడి పర్యవసానాలతో మీడియాలో చర్చలు, మిలిటరీ చర్యలు, పరిస్ధితిని ఓట్లు రాబట్టుకొనేందుకు వినియోగించుకొనే రాజకీయ ఎత్తుగడలను దేశం గమనిస్తోంది. మీడియా చర్చలు, రాతల్లో అనేక అంశాలను వుగ్రవాదానికి ముడిపెడుతున్నారు. దీనిలో రెండు రకాలు ప్రచారానికి ప్రభావితమైన వారు ఒక తరగతి అయితే వుద్ధేశ్యపూర్వకంగా లంకె పెట్టేవారు మరి కొందరు. వాటిలో ప్రధానమైవి అసలు జమ్మూ కాశ్మీర్‌కు 370, 35ఏ ఆర్టికల్స్‌ వంటి వాటిని వర్తింప చేసినందునే వుగ్రవాదం తలెత్తింది. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మిలిటరీకి తొలిసారిగా పూర్తి అధికారాలను ఇచ్చింది, వాటిని సడలించకుండా కొనసాగించి అంతు తేల్చేయాలి. వుగ్రవాదం మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించకోకూడదు. జైషే మహమ్మద్‌ వుగ్రవాద సంస్ధ నేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా అడ్డుపడుతోంది. ఇలా సాగుతున్నాయి. వీటన్నింటినీ ఒక విశ్లేషణలో వివరించటం సాధ్యం కాదు గనుక ఆర్టికల్‌ 370, దాని సంబంధిత అంశాలను చూద్దాం. విద్వేషాలు, వుద్రేకాలును తగ్గించుకొని భిన్న కోణాలను పరిశీలించటం అవసరం. ఆర్టికల్‌ 370ని రద్దు చేయటం అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చటమే అవుతుంది. ఎంతకైనా తెగించి అనేక రాజ్యాంగ వ్యవస్ధలను దెబ్బతీయటం, నీరుగార్చటం, స్వప్రయోజనాలకు వుపయోగించుకుంటున్న స్ధితి. సదరు ఆర్టికల్‌ను రద్దు చేయటం అంటే దాని వుద్ధేశ్యాలను మరొక రూపంలో పరిరక్షించాలా వద్దా? రద్దు చేయాలనే వారు ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాటి ప్రతిపాదనలు చేసినట్లు కనిపించదు. ప్రత్యామ్నాయం అదీకూడా కాశ్మీర్‌ను రక్షించుకోవటం కోసం అంతకంటే మెరుగైనదిగా వుంటేనే సమ్మతం అవుతుంది. ఆ దిశగా సంపూర్ణ మెజారిటీ వున్న బిజెపి ఎలాంటి చర్యలూ చేపట్టకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం నిరంతరం ప్రయత్నిస్తున్నది. కాశ్మీర్‌ సమస్యపై నిజంగా చిత్తశుద్ది వుంటే దాని మీద ఒక సమగ్ర శ్వేతపత్రాన్ని జనం ముందు పెట్టి మంచి చెడ్డలను తెలుసుకొనేందుకు అవకాశమివ్వాలి. అలాగాక నిరంకుశంగా ఆర్టికల్‌ రద్దుకు పూనుకుంటే అది అంతటితో ఆగదు. ఒక్క బాబరీ మసీదే కాదు ఇంకా అలాంటి అనేక మసీదులను కూల్చాల్సి వుందని సంఘపరివారం చెబుతున్నట్లుగా రాజ్యాంగంలోని అనేక అంశాల మీద విబేధాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వుదాహరణకు తెలుగు రాష్ట్రాలలో వున్న 1-70 గిరిజన హక్కుల రక్షణ చట్టం తమకు సమ్మతం కాదని అనేక మంది డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఎన్నో !

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి దేశరాజ్యాంగానికి లోబడి కొన్ని అంశాలపై స్వయం ప్రతిపత్తి అధికారమిచ్చే 370 ఆర్టికల్‌ను రద్దు చేయాలన్నది బిజెపి ఎన్నికల వాగ్దానం. ఆ పార్టీ మాతృసంస్ధ అయిన జనసంఘం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. మధ్యలో అత్యవసర పరిస్ధితి అనంతరం జనసంఘాన్ని రద్దు చేసి జనతా పార్టీలో విలీనం చేసిన సమయంలో మినహా తిరిగి బిజెపి పేరుతో కొత్త దుకాణాన్ని తెరిచినప్పటి నుంచి పాత వ్యతిరేకతను కొనసాగిస్తోంది. ఈశక్తులతో పాటు అంబేద్కర్‌, మరికొందరు కూడా 370 ఆర్టికల్‌ను వ్యతిరేకించారు. ఇది దాస్తే దాగేది కాదు. జనసంఘం, బిజెపి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన దాని రాజకీయ విభాగాలే అన్నది ముందుగా గ్రహించాలి. అలాగే సదరు ఆర్టికల్‌ను కొనసాగించాలని కోరే పార్టీలు అంతకంటే ఎక్కువగా వున్నాయి.

‘ హిందూస్ధాన్‌కు హిందూ సంస్కృతి జీవనాడి. అందువలన హిందూస్ధాన్‌ను రక్షించుకోవాలంటే ముందుగా మనం హిందూ సంస్కృతిని పెంచి పోషించుకోవాలన్నది స్పష్టం. హిందుస్ధాన్‌లోనే హిందూ సంస్కృతి నాశనమైతే, హిందూ సమాజం వునికి కోల్పోతే……. కాబట్టి తనకు చేతనైనంత వరకు హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం ప్రతి హిందువు విధి………మన యువత మెదళ్లను అంతిమంగా ఆ దిశగా మలచటం సంఘ్‌ ప్రధాన లక్ష్యం’ సంఘపరివార్‌గా పరిచితమైన ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం గురించి దాని స్ధాపకుడు డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ చెప్పిన మాటలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ తెరవగానే మనకు కనిపిస్తాయి.

Image result for article 370 and terrorism

ఇలాంటి సంస్ధ ఏర్పాటు చేసిన బిజెపిపైకి ఏమి చెప్పినప్పటికీ దాని చర్యలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే వుంటాయన్నది వేరే చెప్పనవసరం లేదు. అందుకోసం జనాన్ని మతపరంగా చీల్చేందుకు ప్రతిదానికి ఒకసాకును వెతుక్కుంటుంది.కాశ్మీర్‌కు 370 ఆర్టికల్‌ నుంచి కూడా అది సాధించదలచిన ప్రయోజనమదే. అందుకుగాను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధలు, దాని భావజాలానికి ప్రభావితమైన వ్యక్తులు ఎంతకైనా తెగించి చేయాల్సిందంతా చేస్తాయి. ఆర్టికల్‌ 370 రాజ్యాంగబద్దమైనది కనుక దాన్ని సవాలు చేసే అవకాశం లేదు. అందువలన దాని సంబంధితమైన ఆర్టికల్‌ 35ఏ రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ ఢిల్లీకి చెందిన వుయ్‌ ద సిటిజన్స్‌ అనే ఒక సంస్ధ మరికొందరు వ్యక్తులుగా సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారని మీడియాలో వార్తలు వచ్చాయి. దాని మీద ఇప్పుడు విచారణ జరుపుతున్నది. ఇలాంటి ప్రజాసంబంధమైన అంశాలలో ఎవరైనా తమను కూడా ప్రతివాదులుగా చేర్చమని కోర్టును అభ్యర్దించి చేరేందుకు అవకాశం వుంది. ఆ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) చేరింది. ఇలాగే మరికొన్ని సంస్ధలు, వ్యక్తులు ఈ కేసులో ప్రతివాదులుగా చేరి జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటాన్ని కూడా సవాలు చేస్తూ పిటీషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియా, సామాజిక మీడియాలో లేవనెత్తిన కొన్ని అంశాల తీరుతెన్నులు, వాస్తవ అవాస్తవాలను చూద్దాం.

ఆర్టికల్‌ 35ఏ ఆర్టికల్‌ 370లో భాగమా కాదా ?

ఆర్టికల్‌ 370 గురించి ప్రతిపాదనలు వచ్చినపుడు దాని అంశాలపై వివాదం అప్పుడే తలెత్తింది. రాజ్యాంగరచన కమిటీ అధ్యక్షుడిగా, ప్రధాన రచయితగా వున్న బిఆర్‌ అంబేద్కర్‌ సదరు ఆర్టికల్‌ను రూపొందించేందుకు తిరస్కరించారు. దాంతో కాశ్మీరు రాజు హరిసింగ్‌ వద్ద దివానుగా పనిచేసి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ ప్రభుత్వంలో పోర్టుపోలియో లేని మంత్రిగా పని చేసిన గోపాలస్వామి అయ్యంగార్‌ రూపొందించి రాజ్యాంగంలో చేర్చే ప్రతిపాదన చేసి ఆమోదం పొందారు. ఈ ఆర్టికల్‌ రాజ్యాంగమౌలిక స్వరూపంలో భాగమే. ఒక వేళ 35ఏ ఆర్టికల్‌ను కోర్టు గనుక కొట్టివేస్తే అది దాని ఒక్కదానికే పరిమితం కాదు, ఆర్టికల్‌ 370తో పాటు 1950 నుంచి ఇప్పటి వరకు చేసిన అనేక అంశాల చెల్లుబాటు సమస్య తలెత్తుతుంది.అందువలన దాన్ని సవాలు చేయటం వెనుక వున్న ఎత్తుగడను అర్ధం చేసుకోవటం కష్టం కాదు. అనేక మంది నిపుణులు రెండు ఆర్టికల్స్‌ను విడదీసి చూడలేమని చెప్పారు. సమస్య సుప్రీం కోర్టు ముందు వుంది కనుక ఎవరి వాదన, అభిప్రాయాలు సరైనవో స్పష్టం కానుంది. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని శక్తులు అంగీకరిస్తాయా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి పిల్లల్ని కనేవయస్సు వున్న మహిళలు ప్రవేశించటాన్ని నిషేధించే ఆంక్షలను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధలు వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కోర్టు విచారణ ఒకరోజులో జరిగింది కాదు, రహస్యమైంది కాదు. ఏ రోజూ కోర్టు కేసులో ప్రతివాదిగా చేరని శక్తులు తీర్పును అమలు జరపకూడదని వత్తిడి తేవటం తెలిసిందే. శనిసింగనాపూర్‌లోని శని ఆలయంలో మహిళలకు ఆలయ ప్రవేశంపై వున్న ఆంక్షలను కోర్టు కొట్టివేసినపుడు వీరు నోరు మెదపలేదు. శబరిమల కోర్టు తీర్పును అంగీకరించని, వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన సంఘపరివార్‌ శక్తులు అంతవరకే పరిమితం అవుతాయా ? ఎవరు చెప్పగలరు?

ఆర్టికల్‌ 35ఏ రద్దు వెనుక దానిని వ్యతిరేకించే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుయాయుల లక్ష్యం ఏమిటి?

ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు పాలస్తీనాను రెండుగా విభజించి యూదులు ఎక్కువగా వున్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌గా ఏర్పాటు చేశారు. వెంటనే ఇజ్రాయెల్‌ తనకు కేటాయించిన భాగానికి పరిమితం కాకుండా పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించుకొని ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి, ఇజ్రాయెల్‌ నుంచి యూదులను రప్పించి పాలస్తీనా ప్రాంతాలలో అరబ్బులను మైనారిటీలుగా మార్చి వాటి స్వభావాన్నే మార్చేందుకు పూనుకున్న విషయాన్ని మనం చూశాము. కాశ్మీరులో కూడా అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి హిందువులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా, సంస్కృతి, సంప్రదాయాలను మార్చివేయాలని అనేక మంది బహిరంగంగానే చెబుతున్న విషయం తెలిసిందే.

అసలు ఆర్టికల్‌ 35ఏ ప్రధాన అంశాలు ఏమిటి ?

1956 నవంబరు 17న ఆమోదించిన ‘జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగం ‘ ప్రకారం నిర్వచించిన శాశ్వత నివాసి(పర్మనెంటు రెసిడెంట్‌-పిఆర్‌)కి చెప్పిన వివరణ ప్రకారం 1954 మే 14వరకు వున్న రాష్ట్ర అంశాల ప్రకారం లేదా పది సంవత్సరాల పాటు రాష్ట్రంలో నివాసిగా వున్న వారు లేదా చట్టబద్దంగా స్ధిర ఆస్తులను సంపాదించుకున్నవారు గానీ జమ్మూ కాశ్మీరులో శాశ్వత నివాసులుగా పరిగణించబడతారు. శాశ్వత నివాసి నిర్వచనాన్ని మార్చే హక్కు ఆ రాష్ట్ర శాసనసభకు మాత్రమే వుంది, దాన్ని కూడా మూడింట రెండువంతుల మెజారిటీతో ఆమోదించి వుండాలి. ఆ రాష్ట్ర రాజ్యాంగం అంగీకరించిన విచక్షణాధికారాల ప్రకారం అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే చట్టసభలకు పోటీ చేసేందుకు, ఓటు హక్కుకు అర్హులు. శాశ్వత నివాసులు కాని వారు స్వంత ఆస్ధులు కలిగి వుండటానికి,రాష్ట్ర ప్రభుత్వ వుద్యోగం పొందటానికి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన, లేదా ప్రభుత్వ నిధులు పొందిన వృత్తి విద్యాకాలేజీలలో చేరటానికి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం-భారత ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పంద అవగాహన ప్రకారం ఈ రక్షణలు కల్పించారు.

ఇతర రాష్ట్రాలకు లేని ఈ ప్రత్యేక హక్కు జమ్మూ కాశ్మీర్‌కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ?

పైన పేర్కొన్న ‘జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగం ‘ భారత్‌లోని ఒక రాష్ట్రంగా కాశ్మీర్‌కు వర్తిస్తుంది. అది 1957 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఇలాంటిది మరొక రాష్ట్రానికి లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 కాశ్మీర్‌లో భారత పార్లమెంట్‌,కేంద్ర ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే వర్తిస్తాయి. ఇతర అంశాలన్నింటి విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో పేర్కొనని వాటిలో రాష్ట్ర శాసనసభ అనుమతి పొందిన ప్రభుత్వానికి మాత్రమే దఖలు పడతాయి. అంటే ఏ రాష్ట్రానికి లేని స్వయంప్రతిపత్తి దీనికి రాజ్యాంగం ఇచ్చింది. దానిలో భాగంగానే 1965 వరకు రాష్ట్ర గవర్నర్‌ను సదర్‌ ఏ రియాసత్‌ అని ముఖ్యమంత్రిని ప్రధాని అని పిలిచారు. దీనికి వున్న చారిత్రక నేపధ్యాన్ని దాచిపెట్టి ఇలాంటి అంశాలపై బిజెపి వంటి కొన్ని శక్తులు జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో రెండుగా విభజించి పాకిస్ధాన్‌ను ఏర్పాటు చేశారు.ఆ సమయంలో కాశ్మీర్‌ బ్రిటీష్‌ పాలనలో ఒక సంస్ధానంగా వుంది. హరిసింగ్‌ రాజుగా వున్నాడు. భారత్‌లో లేదా పాకిస్ధాన్‌లో దేనితో వుండాలో నిర్ణయించుకొనే హక్కు 1947నాటి స్వాతంత్య్ర చట్టం సంస్ధానాలకు ఇవ్వనప్పటికీ నాడు సామ్రాజ్యవాదులు చేసిన కుట్రలో భాగంగా ఏ దేశంలోనూ చేరబోనని, స్వతంత్ర రాజ్యంగా వుంటానని ప్రకటించాడు. బ్రిటీష్‌ వారు భారత్‌ను వదలి పోవాలని 1947ఆగస్టు15న స్వాతంత్య్రప్రకటన జరగాలని ముందే నిర్ణయం జరిగిపోయింది. అయితే బ్రిటన్‌ పాలకులు నూతన ఏర్పాట్లు జరిగేంత వరకు యథాతధ స్ధితి కొనసాగుతుందంటూ ఒక ఒప్పందాన్ని తయారు చేసి స్వతంత్ర భారత్‌,పాక్‌, ఇతర సంస్ధానాధీశులతో 1947 జూన్‌ మూడున ముసాయిదా ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అయితే అది కేవలం పాలనాపరమైన అంశాలకే పరిమితం చేస్తుందా అని జవహర్‌లాల్‌నెహ్రూ చర్చల సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు. మహమ్మదాలీ జిన్నా మాత్రం అలా అంగీకరించాల్సి వుందని చెప్పారు.దీనితో పాటు బ్రిటీష్‌ పాలకులు కొత్తగా ఏర్పడబోయే స్వతంత్ర భారత్‌,పాకిస్ధాన్లలో దేనితే జతకట్టేదీ తెలుపుతూ అంగీకార పత్రం మీద సంతకాలు చేయాలని మరొక మెలిక పెట్టారు. ఈ రెండింటినీ సంస్ధానాధీశుల ఛాంబర్‌ ముందు పెట్టారు. పది మంది సంస్ధానాధీశులు, పన్నెండు మంది మంత్రులతో సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. జూలై 31న ఆ కమిటీ ఆ పత్రాలను ఖరారు చేశారు. అయితే కొంత మంది సంస్ధానాధీశులు తాము యథాతధ స్ధితి ఒప్పందంపై సంతకాలు చేస్తాము తప్ప ఏ దేశంతో జతకట్టేదీ తేల్చుకొనేదానిపై ఆలోచించుకొనేందుకు సమయం కావాలని మెలికపెట్టారు. 1947 ఆగస్టు 15లోగా తమతో జతకట్టే సంస్ధానాధీశులతోనే యథాతధ స్దితి ఒప్పందంపై సంతకాలు చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. నాలుగు సంస్ధానాలు మినహా మిగిలిన వారందరూ సంతకాలు చేశారు.

వాటిలో నిజాం పాలనలోని హైదరాబాద్‌ రెండునెలల వ్యవధి కోరింది, గుజరాత్‌లో జునాఘడ్‌ దాని సామంత రాజ్యాలు సంస్ధానాలు రెండు వున్నాయి. జమ్మూకాశ్మీర్‌ తాము స్వతంత్రంగా వుంటామని ప్రకటించినప్పటికీ పాకిస్దాన్‌తో యథాతధ స్థితి ఒప్పందం చేసుకుంది. వెంటనే దానిని పాకిస్ధాన్‌ అంగీకరించింది. చర్చలు జరపాల్సి వుందని భారత్‌ ప్రకటించింది. బలూచిస్తాన్‌ సంస్ధానం తాము స్వతంత్రంగా వుంటూమంటూ యథాతధ స్ధితి ఒప్పందంపై పాక్‌తో సంతకాలు చేసింది.

యథాతధ స్థితి ఒప్పందంపై పాక్‌ సంతకాలు చేసినప్పటికీ కాశ్మీర్‌ ఆక్రమణకు కుట్రలకు తెరలేపింది. భరించలేని రాజు పన్నులకు వ్యతిరేకత పేరుతో ఆందోళనలను పురికొల్పింది. దానిలో భాగంగానే 1947 అక్టోబరు 6న పాకిస్ధాన్‌ ముస్లిం గిరిజనులను ముందు వారికి మద్దతుగా పాక్‌ సైన్యాన్ని పంపి కాశ్మీర్‌పై దాడి చేసి బలవంతంగా ఆక్రమించుకొనేందుకు పూనుకుంది. వెంటనే రాజు హరిసింగ్‌ తమకు సాయం చేయాలని భారత్‌ను కోరటం, చేరిక ఒప్పందాన్ని ఆమోదించాలన్న మన ప్రభుత్వ షరతుకు అంగీకరించి సంతకం చేయటం, మన సేనలు కాశ్మీర్‌ రక్షణకు పూనుకోవటం వెంటవెంటనే జరిగిపోయాయి. చేరిక ఒప్పందం(ఇనుస్ట్రుమెంట్‌ ఆఫ్‌ యాక్సెషన్‌-ఐఓఏ) ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వానికి కాశ్మీర్‌ విషయంలో విదేశీ, రక్షణ, సమాచార అంశాలలో మాత్రమే అధికారాలు వుంటాయి. మిగిలిన సంస్ధానాలన్నీ చేరిక ఒప్పందం మీదనేగాక స్వాతంత్య్రం తరువాత విలీన ఒప్పందం మీద కూడా సంతకాలు చేశాయి. కాశ్మీర్‌లో కొంత భాగాన్ని ఆక్రమించిన పాక్‌్‌ అక్కడ నెలకొల్పిన పాలనా వ్యవస్ధ కారణంగా మన ప్రభుత్వం కూడా మన ఆధీనంలోకి వచ్చిన కాశ్మీర్‌లో ప్రత్యేక పాలన చేయాల్సి వచ్చింది. విలీన ఒప్పందం జరగాలంటే అప్పటి వరకు వున్న తమ అంతర్గత చట్టాల కొనసాగింపుకు హామీ వుండాలని, స్వయంప్రతిపత్తి తదితర అంశాలు ముందుకు రావటంతో ఏ రాష్ట్రానికి లేని విధంగా జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం వచ్చింది.అది ఇప్పటికీ వునికిలో వుంది. ఆక్రమించిన కాశ్మీర్‌ ప్రాంతాన్ని ఒక ఎత్తుగడగా పాక్‌ సర్కార్‌ దానిని తమ దేశంలో విలీనం చేయకుండా ఒక స్వయంప్రతిపత్తి ప్రాంతంగా మార్చింది. దానికి ఒక అధ్యక్షుడు, ప్రధాని వుంటారు. కాశ్మీర్‌ను తమ దేశంలో విలీనం చేసుకోలేదని ప్రపంచానికి చాటేందుకు ఇప్పటికీ పార్లమెంట్‌లో ఆక్రమిత్‌ కాశ్మీర్‌కు ప్రాతినిధ్యం కూడా ఇవ్వలేదు. ఈ పూర్వరంగంలో షేక్‌ అబ్దుల్లా తదితర నాయకులతో జరిపిన సంప్రదింపులు, కాశ్మీరీల స్వయంప్రతిపత్తిని కాపాడుతామని హామీ ఇవ్వటంలో భాగంగా ఈ పూర్వరంగంలో 370 ఆర్టికల్‌ను చేర్చారు.

Image result for article 370 and terrorism

ఈ పరిస్ధితికి కారకులు ఎవరు ?

దీనికి కాంగ్రెస్‌ నెహ్రూ నాయకత్వమే కారణమని ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘం, బిజెపి పాడిందే పాడుతున్నాయి. అది వారి రాజకీయం. కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా, కాశ్మీర్‌ వ్యవహారాలలో పార్టీ ప్రయోజనాలకు పెద్ద పీటవేసి కాశ్మీర్‌ సమస్యను సంక్లిష్టంగా మార్చిన నేటి స్ధితిని చూసి గతంలో జరిగిన ఏర్పాటును విమర్శించటం, రాళ్లు వేయటం రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా వున్నవారికి, వారి ఎత్తుగడలను అర్ధం చేసుకోకుండా ప్రచార ప్రభావానికి లోనైన వారికి సులభమే. కాశ్మీర్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి ఇటు భారత్‌, అటు చైనా, సోవియట్‌ యూనియన్‌, పశ్చిమ, మధ్య ఆసియా మీద తమ పెత్తనాన్ని రుద్దాలని, మిలిటరీ వ్యూహాన్ని అమలు జరపాలని చూసిన బ్రిటీష్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదుల కుట్రను నాటి కేంద్రప్రభుత్వ నాయకత్వం వమ్ము చేసిందని మరచి పోరాదు. పశ్చిమాసియాలో సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్‌ ఆ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల ‘గూండా’ గా ఎలాంటి పరిస్ధితికి కారణమైందో మనం చూస్తూనే వున్నాం. మన ఈశాన్య రాష్ట్రాలను విడదీసి ప్రత్యేక రాజ్యాలను ఏర్పాటు చేయాలన్నది కూడా సామ్రాజ్యవాదుల కుట్రలో భాగమే. ఈ రోజు కాశ్మీర్‌లో వుగ్రవాదులు చెలరేగిపోవటానికి ఆర్టికల్‌ 370, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక హక్కులు ఇవ్వటం అని సంఘపరివార్‌ ప్రచారం చేస్తున్నది. అనేక మంది నిజమే కదా అనుకుంటున్నారు. కాశ్మీర్‌ కంటే ముందుగా ఈశాన్య రాష్ట్రాలలో, పంజాబ్‌లో వేర్పాటు, తీవ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి, ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల పరిస్ధితి చక్కబడలేదు. వాటికేమీ ప్రత్యేక ఆర్టికల్‌, ప్రత్యేక ఏర్పాట్లు లేవు, అయినా వుగ్రవాదులు ఎందుకు తయారైనట్లు ? అందువలన 370 ఆర్టికల్‌కు కాశ్మీరులో వుగ్రవాదానికి లంకె పెట్టటం బోడిగుండుకు మోకాలికీ ముడివేసే ప్రయత్నం తప్ప వేరు కాదు. మన పక్కనే వున్న శ్రీలంకలో తమిళ ఈలం పేరుతో ప్రత్యేక రాజ్యాన్ని కోరిన ఎల్‌టిటిఇ ఇతర వుగ్రవాదులకు మన దేశంలో శిక్షణ, ఆయుధాలు అందించిన వాస్తవం తెలిసిందే. అది తప్పా ఒప్పా అంటే మన దేశ ప్రయోజనాలు, లక్ష్యాలు ఇమిడి వున్నాయి. మనం మద్దతు, శిక్షణ ఇచ్చిన వుగ్రవాదులు చివరికి మన దేశానికి కూడా ముప్పుగా తయారవుతున్నారని తేలగానే అదే వుగ్రవాదులను అణచేందుకు శాంతిపరిరక్షక దళాల పేరుతో మన సైన్యం శ్రీలంకకు వెళ్లిన విషయం, దానికి ప్రతీకారంగా వుగ్రవాదులు రాజీవ్‌ గాంధీని హత్య చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో అకాలీలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ భింద్రన్‌వాలే అనే వుగ్రవాదిని పెంచి పోషించిన విషయమూ విదితమే. చివరికి ఏకుమేకైన తరువాత వాడిని మట్టుపెట్టేందుకు స్వర్ణదేవాలయం మీదికి మిలిటరీని పంపాల్సి వచ్చింది. వీటన్నింటి వెనుక మన దేశాన్ని దెబ్బతీసే అమెరికా, ఐరోపా ధనిక దేశాల సామ్రాజ్యవాదుల హస్తం వుంది. ఆప్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసేందుకు ఆఫ్ఘన్‌ సర్కార్‌ ఆహ్వానం మేరకు గతంలో సోవియట్‌ యూనియన్‌ సైన్యాన్ని పంపింది. దానికి ప్రతిగా తాలిబాన్‌ వుగ్రవాదులను తయారు చేసిన అమెరికా సోవియట్‌ సేనల వుపసంహరణ వరకు మద్దతు ఇచ్చింది. తరువాత ఆ తాలిబాన్లే అమెరికానే సవాలు చేయటంతో అంతకు ముందు వారిని దేశభక్తులుగా చిత్రించిన అమెరికా వుగ్రవాదులంటూ వారిని అణచేందుకు దశాబ్దాల తరబడి అక్కడ తన సైన్యంతో దాడులు చేసింది. చివరకు వారిణి అణచలేక వారితో రాజీచేసుకొని తన సైన్యాన్ని వెనక్కు రప్పించేందుకు ఇప్పుడు చర్చలు జరుపుతున్నది. అందువలన వారి వలలో పడకుండా వుగ్రవాదాన్ని అంతం చేసేందుకు తగిన చర్యలను తీసుకోవాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ విడిపోతుందా !

21 Wednesday Nov 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

brexit, brexit deal or no deal, European Union, Theresa May

Image result for brexit deal or no deal

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావన్ల ప్రకటనతో కన్యాశుల్కం నాటకం ఏ మలుపులు తిరిగిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఐరోపా యూనియన్‌(ఇయు)నుంచి విడిపోయిన(బ్రెక్సిట్‌) అనంతర సంబంధాల గురించి తాను కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆమె ప్రత్యర్దులు ఒప్పందాన్ని తిరస్కరించటం ద్వారా ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇయుతో తెగతెంపులు చేసుకోవాలనే కొత్త వాదనను తాజాగా ముందుకు తెస్తున్నారు. దాంతో ఒప్పందం వుంటే ఏమిటి లేకుంటే ఏమి జరుగుతుంది అన్న చర్చ ఇప్పుడు బ్రిటన్‌లో జరుగుతోంది. మరోవైపు బడాకార్పొరేట్‌ లాబీ ఇయు నుంచి బయటకు పోయినా తమ లాభాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొనే విధంగా ప్రయత్నిస్తున్నది. బ్రిటన్‌లోని వివిధ కమ్యూనిస్టు పార్టీలు బ్రెక్సిట్‌కు అనుకూలంగా రెండు సంవత్సరాల క్రితం ఓటు వేశాయి. ప్రధాన టోరీ, లేబర్‌ పార్టీలలో పునరాలోచన తలెత్తినప్పటికీ విడిపోయే విషయంలో కమ్యూనిస్టుపార్టీలు ఎలాంటి పునరాలోచన చేయటం లేదు. అయితే అక్కడి రాజకీయాలలో వీటి పాత్ర పరిమితం అన్న విషయం తెలిసిందే. పార్టీలోని పచ్చి మితవాదులు ప్రధాని థెరెసా మే మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తుండగా మరికొందరు అంతవరకు రాకుండా పార్టీలోనే సభా నాయకురాలిగా విశ్వాసతీర్మానం ఎదుర్కోవాలనే ప్రయత్నాల్లో వున్నారు. మరోవైపు ఒక వేళ ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి విడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాంకేతికపరమైన నోటీసుల పేరుతో ప్రభుత్వం అన్ని తరగతులకు సమాచారాన్ని తెలియ చేస్తున్నది. దీంతో ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ వేరు పడుతుందా అన్న వూహాగానాలకు తెరలేచింది. ఈ సమస్య చివరకు థెరెసా మే వుద్యోగం వూడగొతుందా? ఆమె ప్రత్యర్ధులు చిత్తవుతారా అనేది వెండితెరపై చూడాల్సిందే. అసలు సమస్య ఏమిటి?

రెండు సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా అనే అంశంపై ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. దాన్నే క్లుప్తంగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. వెళ్లిపోవాలనే అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు ఎలా వుపసంహరించుకోవాలనే అంశం మీద కూడా మరో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నాయి.ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ చేరటం నుంచి విడిపోవటం, అంతిమంగా ఎలా విడిపోవాలన్నది కూడా వివాదాస్పదం కావటం అంటే ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను వెల్లడించటమే. ఎలా విడిపోవాలి అనే అంశంపై కుదుర్చుకున్న ఒప్పందానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.మెరుగైన తన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని ప్రకటించిన 24 గంటలు కూడా గడవ ముందే బ్రెక్సిట్‌ మంత్రి, మరొకరు రాజీనామా ప్రకటించి వత్తిడి పెంచారు. స్వపక్షంతో పాటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూడా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది.

2016 జూన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52శాతం మంది ఇయు నుంచి బ్రిటన్‌ బయటకు రావాలని ఓటు వేయగా 48శాతం వుండాలని ఓటు వేశారు. బయటకు వస్తేనే సార్వభౌమత్వాన్ని తిరిగి పొందటం, వలసల విషయంలో భూభాగంపై మరింత అదుపు సాధ్యమని బ్రెక్సిట్‌ మద్దతుదార్లు పేర్కొన్నారు. బయటకు వస్తే ఆరోగ్య పరిరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు అవకాశం వుంటుందని ఓటర్లను తప్పుదారి పట్టించారు. దశాబ్దాల పాటు యూనియన్‌లో కొనసాగి ఇప్పుడు వుపసంహరించుకుంటే అనూహ్య సమస్యలు తలెత్తుతాయని సమర్ధకులు పేర్కొన్నారు.నిజానికి ఐరోపా యూనియన్‌లో వున్నప్పటికీ బ్రిటన్‌ కోల్పోయిందేమీ లేదు. మిగతా దేశాలన్నీ తమ కరెన్సీలను రద్దు చేసుకొని యూరోకు మారితే బ్రిటన్‌ తన పౌండ్‌ను అలాగే కొనసాగిస్తోంది. తన స్వంత వడ్డీ రేట్లు,ద్రవ్య విధానాలు, సరిహద్దులలో సందర్శకుల తనిఖీ స్వంత నిబంధనలు అమలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ చట్టబద్దమైనది కాదు. పార్లమెంట్‌ అనుమతి లేనిదే వుపసంహరణ ప్రక్రియ ప్రారంభం కారాదని బ్రిటన్‌ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో పార్లమెంట్‌ ఒక చట్టం చేయాల్సి వచ్చింది. ఐరోపా యూనియన్‌ నిబంధన ప్రకారం ఏ సభ్యదేశమైనా బయటకు వెళ్ల దలచుకుంటే ఆర్టికల్‌ 50 అమలు జరపాలని కోరాల్సి వుంది. ఆ మేరకు పరివర్తనా కాల వ్యవధి ముగిసే 2019, మే 29నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వుంది. ఈలోగా గతంలో కుదిరిన ఒప్పందాలు,భవిష్యత్‌ సంబంధాలపై బ్రిటన్‌ -ఇయు మధ్య ఒక ఒప్పందం జరగాల్సి వుంది. ఇప్పుడు ప్రధాని థెరేసా మే దాన్నే ప్రతిపాదించారు.

Image result for brexit deal or no deal cartoons

ఒప్పందానికి కట్టుబడతారో లేదో తేల్చుకోవాల్సింది బ్రిటన్‌ తప్ప బ్రెక్సిట్‌ విషయంలో ఎలాంటి పున:సంప్రదింపులు లేవని ఐరోపాయూనియన్‌ కరాఖండిగా చెప్పింది. పరివర్తన కాల వ్యవధి పొడిగింపు, అస్పష్టంగా వున్న కొన్ని అంశాల గురించి సంప్రదింపులు తప్ప ప్రధాన మార్పులకు అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ స్పష్టం చేసింది.యూనియన్‌ చర్చల ప్రధాన ప్రతినిధి మైఖేల్‌ బార్నియర్‌ విలేకర్లతో మాట్లాడుతూ బ్రిటన్‌లో రాజకీయ పరిస్ధితి ఎలా వున్నప్పటికీ ఇయు రాయబారులెవరూ వారితో విడిగా మాట్లాడవద్దని కోరారు. అనేక మంది ఐరోపా నేతలు బ్రిటన్‌ ప్రధాని వైఖరికి మద్దతుగా మాట్లాడటం విశేషం. వారిలో ఆస్ట్రియన్‌ ఛాన్సలర్‌ సెబాస్టియన్‌ కర్జ్‌ ఒకరు. ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయవద్దని డచ్‌ ప్రధాని మార్క్‌ రూటే వ్యాఖ్యానించారు. యూనియన్‌ నుంచి బయటకు వస్తే బ్రిటీష్‌ పౌరులకు బంగారు భవిష్యత్‌ వుంటుందని అక్కడి బాధ్యతారహితమైన అనేక మంది రాజకీయ నాయకులు జనానికి చెప్పారు, నిజం ఏమిటంటే ఆ నిర్ణయం వారికి కాళరాత్రి అవుతుంది అని ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 29లోగా ఒప్పందం కుదరకపోతే వెంటనే సంబంధాలు రద్దవుతాయి. ఎలాంటి పరివర్తన వ్యవధి వుండదు.

బ్రిటన్‌లో టోరీ లేదా లేబర్‌ పార్టీగానీ రెండూ మౌలికంగా పెట్టుబడిదారీ వర్గప్రతినిధులే.అయినా వాటి మధ్య అధికారం విషయంలో తగాదాలున్నాయి.వివరాలు వెల్లడైన మేరకు ఒక అభిప్రాయం ప్రకారం ఆ ఒప్పంద సారాంశాన్ని చెప్పాలంటే కార్పొరేట్‌, ఇతర ధనికుల ప్రయోజనాలను రక్షించేదిగా, వలస వచ్చే వారి మీద దాడి చేసేదిగా వుంది. గతంలో బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది మార్చినెలాఖరుకు ఐరోపా యూనియన్‌(ఇయు) నుంచి బయటకు వస్తుంది. ఆ తరువాత 21నెలల పాటు పరివర్తన కాలం వుంటుంది. ఆ సమయంలో అనేక ఐరోపా స్వేచ్చా మార్కెట్‌ నిబంధనలు వర్తించే కస్టమ్స్‌ పన్నుల పరిధిలో బ్రిటన్‌ వుంటుంది. తరువాత ఏమిటన్నది సమస్య. తరువాత కూడా కార్పొరేట్‌, ధనికులకు వుపయోగపడే విధంగా బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను రూపొందించాలన్న వత్తిడి మేరకు బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను పొందుపరిచారన్నది ఒక అభిప్రాయం.పరివర్తన వ్యవధిలో బ్రెక్సిట్‌ అనంతర సంబంధాలపై బ్రిటన్‌-ఇయు మధ్య ఒప్పందం కుదరకపోతే పరివర్తన కాలం పొడిగింపు వుంటుంది. అంటే యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా బ్యాంకింగ్‌, రవాణా, పౌరసేవల వంటి అంశాలలో బ్రిటన్‌కు కూడా ఇయు సభ్యదేశాలతో సమాన అవకాశాలు కల్పించాలన్నది బ్రిటన్‌ కార్పొరేట్ల డిమాండ్‌. పరివర్తన కాలం ముగిసిన తరువాత బ్రిటన్‌లో వున్న దాదాపు 30లక్షల మంది ఇయు వలస పౌరులు అక్కడే వుండేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బ్రిటన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఐదేండ్లనుంచి వుంటున్నట్లు రుజువు చేసుకున్నవారు అక్కడే స్ధిరపడిన స్ధితిలో కొనసాగవచ్చు. ఇదే నిబంధన ఇయు దేశాలలో వున్న బ్రిటన్‌ వలస పౌరులకు కూడా వర్తిస్తుంది.ఐరోపా యూనియన్‌ విధానాలను బట్టి ఇతర దేశాల వాసులు స్ధిరపడిన స్ధితిని బ్రిటన్‌ సర్కార్‌ రద్దు కూడా చేయవచ్చు. ఆర్ధికంగా సంపాదన లేని వారు తమ కుటుంబసభ్యులకు భారంగా లేమని తమకు తగినన్ని ఆర్ధిక వనరులు, సమగ్ర ఆరోగ్యబీమా వుందని రుజువు చేసుకోవాల్సి వుంది. వలస వచ్చిన వారికి బీమా సౌకర్యాన్ని వర్తింప చేయకూడదనే వత్తిళ్లు ఇప్పటికే వున్నాయి.వివాహ బంధంలో విడిపోయినపుడు భరణం చెల్లించటం గురించి తెలిసిందే.అలాగే విడిపోవాలని బ్రిటనే కోరుకుంది గనుక పరిహారంగా ఇయుకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వుంటుంది.

పాలక టోరీ పార్టీలో బ్రెక్సిట్‌ ఒప్పందం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అది చివరకు ఇద్దరు మంత్రుల రాజీనామా, ప్రధానిపై అవిశ్వాసతీర్మానం పెట్టాలనేంతవరకు దారితీశాయి. ఇయు నుంచి వెళ్లిపోవాలని గట్టిగా పట్టుబడుతున్నవారు పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని, వాణిజ్యం నుంచి వలసలు, వుత్పత్తుల క్రమబద్దీకరణ వరకు అన్నింటికీ బ్రిటీష్‌ చట్టాలు తప్ప ఇయు చట్టాలతో సంబంధం వుండకూడదని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నవారు బ్రిటన్‌-ఇయు మధ్య కొన్ని సంబంధాలను కానసాగించాలని, పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే దేశ ఆర్ధిక వ్యవస్ధకు, రాజకీయ స్ధిరత్వానికి విపత్కరమని వాదిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలే ప్రతిపక్ష లేబర్‌ పార్టీలోనూ వున్నాయి.బ్రెక్సిట్‌ తరువాత కూడా ఇయు కస్టమ్స్‌ యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగేందుకు వీలైన అంశం థెరేసా మే ఒప్పందంలో వుంది. ఐర్లండ్‌ అంతర్యుద్ధంలో వుత్తర ఐర్లండ్‌ ప్రాంతంలో మెజారిటీగా వున్న ప్రొటెస్టెంట్‌లు తాను బ్రిటన్‌లో భాగంగా వుండాలని కోరుకున్నారు. కాథలిక్కులు మెజారిటీ ఐర్లండ్‌లో వుండిపోయారు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యలో భాగంగా 1999లో కుదిరిన గుడ్‌ ఫ్రైడే ఒప్పందం మేరకు ఐర్లండ్‌ – వుత్తర ఐర్లండ్‌ మధ్య సరిహద్దు నిబంధనలు సులభతరంగా వున్నాయి. ఇప్పుడు బ్రిటన్‌ బయటకు పోయిన తరువాత ఐర్లండ్‌ గనుక ఇయు కఠిన నిబంధనలు అమలు జరిపితే అది 1999 ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. అందువలన సరిహద్దు నిబంధనలు సులభతరంగా వుండాలని బ్రిటన్‌ కోరుతోంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని బ్రిటన్‌ తన వుత్పత్తులను ఐర్లండ్‌లోకి పంపితే ఎలా అన్నది ఇయు సమస్య.

Image result for brexit deal or no deal

ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకోదలచిన ముసాయిదా పత్రంలోని అంశాలను వ్యతిరేకిస్తూ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా, వారి బదులు మరొక ఇద్దరిని వెంటనే నియమించారు. ఒప్పందం తనకోసం కాదని జాతీయ ప్రయోజనాలకోసమే అని ప్రధాని చెబుతున్నారు. తన ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని థెరెసా మే సోమవారం నాడు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ(సిబిఐ)కివిజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందం వలన తమకు చౌకగా దొరికే కార్మికుల కొరత ఏర్పడుతుందని, తద్వారా తాము నష్టపోతామని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి.ఒప్పందం కుదురుతుందన్న వార్తలు వెలువడగానే బ్రిటన్‌ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతున్నాయని ఒక కంపెనీ తూర్పు ఐరోపాకు తరలాలని నిర్ణయించినట్లు సిబిఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒప్పందం లేకుండా బ్రిటన్‌ విడిపోతే 50 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సిన అవసరం వుండదని కొందరు భాష్యం చెబుతుండగా ఒప్పందం వున్నా లేకపోయినా పరిహారం చెల్లించాలని మరికొందరు చెబుతున్నారు.ఈనెల 25న బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ నేతలతో ఆమె సమావేశం తరువాత బ్రిటన్‌లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో నాయకత్వ మార్పు సమస్యను ముందుకు తెచ్చినంత మాత్రాన జరిగేదేమీ వుండదని, సంప్రదింపులు ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు మరింత పెరుగుతుందని ఆమె హెచ్చరించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

2008 సంక్షోభానికి పదేండ్లు- మరో ముప్పు ముంచుకొస్తోంది !

12 Wednesday Sep 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

2008 financial crisis, 2008 meltdown, Another financial crisis, Collapse of Lehman brothers, Great Depression

Image result for ten years of 2008 financial crisis cartoons

ఎం కోటేశ్వరరావు

2008, ప్రపంచ ధనిక దేశాలలో తలెత్తిన మరొక మహా సంక్షోభానికి పది సంవత్సరాలు. అమెరికాలోని లేమాన్‌ బ్రదర్స్‌ బ్యాంకు 2008 సెప్టెంబరు15న దివాలా ప్రకటన చేయటాన్ని చాలా మంది మరచిపోయి వుంటారు. ప్రపంచ ధనికులు మాత్రం మెలకువగానే వున్నారు. వారిలో ఒకడిగా 92బిలియన్ల సంపదకలిగిన బిల్‌గేట్స్‌ ‘ఎప్పుడు అన్నది చెప్పటం కష్టంగానీ 2008 వంటి మరో సంక్షోభం రావటం తప్పని సరి ‘ అని ఈ ఏడాది మార్చి2న ఒక ఆస్ట్రేలియా మీడియాలో అడిగిన ప్రశ్నకు చెప్పారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తిరుగులేని విధంగా తెలిసినట్లే ఒకదాని తరువాత ఒక సంక్షోభం రావటం పెట్టుబడిదారీ విధానంలోనే ఇమిడి వున్న లక్షణం అని గేట్స్‌ వంటి వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అందుకే తాము మునిగి పోకుండా వుండేందుకు నిరంతరం దారులు వెతుకుతుంటారు. పదేళ్ల నాటి సంక్షోభం దెబ్బకు అమెరికాలో 87లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. సంక్షోభం నుంచి కోలుకున్నట్లు చెబుతున్నా ఇప్పటికీ పూర్వపు స్ధితికి చేరుకోలేదు.

ఇప్పటికీ ప్రధాన స్రవంతి మీడియా లేదా వామపక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలు జనానికి ఇలాంటి వాటి గురించి వాస్తవాలు చెప్పటం లేదు. తప్పుడు నిర్ణయాలు, విధానాలతో దివాలా తీసిన సంస్ధలన్నింటినీ అమెరికా, ఇతర దేశాల పాలకులు ప్రజల సొమ్ముతో రక్షించారు. 1980దశకం నుంచి స్వేచ్చా మార్కెట్‌ విధాన సంస్కరణలను ముందుకు నెట్టటంలో ప్రముఖుడైన అమెరికా ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) మాజీ అధ్య క్షుడైన అలాన్‌ గ్రీన్‌స్పాన్‌ 2008 మేనెలలో ఒకప్రకటన చేస్తూ 2007లో ప్రారంభమైన తనఖా సంక్షోభం మీద వ్యాఖ్యానిస్తూ ‘ ద్రవ్య సంక్షోభంలో అనర్ధం ముగిసింది లేదా త్వరలో ముగియ నుంది’ అన్నాడు. లేమాన్‌ బ్రదర్స్‌ దివాలా ప్రకటన వెలువడగానే తాను చాలా తొందరపడ్డానని, తన స్వేచ్చామార్కెట్‌ సిద్ధాంతంలో లోపాలున్నట్లు గుర్తించానని చెప్పాడు.

2001లో డాట్‌కాం బుడగ పేలటం, మాంద్యం తలెత్తటంతో ద్రవ్య సంస్ధలు లాభాల కోసం కొత్త మార్గాలు వెతికాయి. వడ్డీ రేట్లు తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పరిమితమైంది. వడ్డీ రేట్లు తక్కువగా వుండటంతో ద్రవ్య సంస్ధల నిధుల సేకరణ సులభతరం, ఖర్చు తక్కువగావటం,మరిన్ని ఆస్ధుల కొనుగోలుకు, అధిక వడ్డీల కోసం తనఖా వంటి ముప్పుతో కూడిన రుణాలు ఇవ్వటానికి దారితీసింది.2004నాటికి రుణాలు తీసుకున్నవారు విపరీతంగా పెరగటంతో పాటు వాయిదాల చెల్లింపుల సమస్య తలెత్తింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లు పెంచింది. ఇండ్ల ధరలు పతనమయ్యాయి. అప్పులు తీర్చాలంటే అందుకోసం కొత్త అప్పులు చేద్దామంటే పుట్టని స్ధితి. తనఖా అంటే అనకాపల్లిలో అయినా అమెరికాలో అయినా వడ్డీ రేటు ఎక్కుగా వుండటంతో పాటు అసలుకు ముప్పు కూడా వుంటుంది. తీర్చగలరా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అధికవడ్డీలకు దురాశ పడిన ఆర్ధిక సంస్ధలు అప్పులు తెచ్చి మరీ అడిగిన ప్రతివారికీ రకరకాల తనఖాలు, షరతులతో గృహ రుణాలు ఇచ్చాయి. కొన్ని సంస్ధలు నేరుగా రుణాలు ఇవ్వక పోయినా ఇతర సంస్ధలు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకొనేందుకు వాటిని కొనుగోలు చేశాయి. తీసుకున్న వారికి రుణ చెల్లింపులు భారంగా మారటం, బుడగపేలిపోయినట్లుగా ఇండ్ల ధరలు పతనం కావటంతో రుణాలు తీసుకున్నవారితో పాటు ఇచ్చిన ఆర్ధిక సంస్ధలు, బ్యాంకులు కూడా 2007లో కుప్పకూలాయి. తనఖా పత్రాల విలువ 6.8లక్షల కోట్ల డాలర్లని తేలింది. మన సత్యం కంప్యూటర్స్‌ అసత్య లెక్కలు రాసి కుప్పకూలినట్లుగానే 2008లో లేమాన్‌ బ్రదర్స్‌ లెక్కల బాగోతం బయటపడి దివాలా ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా అమెరికాలో తిరిగి తనఖా రుణాలు పెరుగుతున్నాయని, మన దేశంతో సహా అనేక చోట్ల ఇస్తున్న గృహ రుణాలు చెల్లింపులో వైఫల్యం తప్పదని అనేక మంది చెబుతున్నారు. లసుగుల గురించి సామాన్యుల కంటే బిల్‌గేట్స్‌ వంటి వారికి ఎక్కువ తెలుసు కనుక వారు చెప్పిన ముప్పు ఏ క్షణంలో అయినా ఎదురు కావచ్చు.

పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాగైనా లాభాలు సంపాదించటానికి ప్రాధాన్యత ఇస్తారు, వాటిలో అప్పు మీద ఆధారపడటం ఒకటి. కాసినో లేదా జూదశాలల్లో జూదాలు నిర్వహించేవారు మనకు కనపడరు. డబ్బు పోగొట్టుకున్నా, ఎప్పుడన్నా సంపాదించినా జూదాలు కాసేవారు, వాటిని నిర్వహించే మధ్యవర్తులే మనకు కనిపిస్తారు.లేమాన్‌ బ్రదర్స్‌ అలాంటి మధ్యవర్తిగా డబ్బు జూదంలో నిలిచింది.దానితో రకరకాల ద్రవ్యలావాదేవీలు జరిపిన ఇతర బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల వారు అది ఇచ్చే లాభాలను చూశారు తప్ప రాసే తప్పుడు లెక్కలను గమనించలేక చివరికి మునిగిపోయారు. సంక్షోభం బద్దలు అయింతరువాత బ్యాంకులు బిలియన్లకొద్దీ డాలర్లను నిరర్దక ఆస్ధులుగా ప్రకటించాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడాయి. వ్యాపారాలకు కూడా రుణాలు దొరకటం గగనమైంది. వ్యాపారం తగ్గిపోయి దాని ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ మీద పడింది. పెట్టుబడితగ్గి డిమాండ్‌, వుత్పత్తి తగ్గుదలకు దారి తీసి, వుద్యోగాల రద్దుకు కారణమైంది.మాంద్యం తలెత్తింది.సంక్షోభం అమెరికా నుంచి ఐరోపాకు, ఇతర ప్రాంతాలకూ పాకింది. వెంటనే రంగంలోకి దిగిన అమెరికా సర్కార్‌ పరిస్ధితులు మెరుగుపడిన తరువాత తిరిగి అమ్మే ప్రాతిపదిక మీద 700 బిలియన్‌ డాలర్ల పాకేజితో దివాలా తీసిన సంస్ధల బాండ్లు, ఇతర విలువ పడిపోయిన ఆస్ధులను కొనుగోలు చేసేందుకు పూనుకుంది. మెరుగుపడక పోగా ఇంకా దిగజారటంతో మరో 250 బిలియన్‌ డాలర్లను ఇతర చిన్న సంస్దలలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది.

మరోవైపున వినియోగాన్ని పెంచేందుకు బ్రిటన్‌ సర్కార్‌ వ్యాట్‌ను 17.5 నుంచి 15శాతానికి తగ్గించింది. అనేక బ్యాంకులకు నిధులు సమకూర్చి నిలబెట్టింది.బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లను 5నుంచి 0.5శాతానికి తగ్గించింది. 2009లో లండన్లో సమావేశమైన జి20 సమావేశం ఆర్ధిక వినాశనాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలోకి 681బిలియన్‌ పౌండ్లను అందించాలని నిర్ణయించింది. బ్రిటన్‌లోని రాయల్‌ స్కాటిష్‌ బ్యాంక్‌(ఆర్‌బిఎస్‌) దివాలా తీసిన వాటిలో ఒకటి. పది సంవత్సరాల తరువాత కూడా అక్కడి జనం దివాలాకు మూల్యం చెల్లిస్తున్నారు. పది సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆర్‌బిఎస్‌ తన వాటాదార్లకు గత నెలలో రెండు పెన్నీల డివిడెండ్‌ ప్రకటించింది.( బ్రిటీష్‌ పౌండుకు వంద పెన్నీలు, ఒక పెన్నీ మన 93పైసలకు సమానం). పదేండ్ల క్రితం దివాలా తీసిన సదరు బ్యాంకును నిలబెట్టేందుకు బ్రిటన్‌ సర్కార్‌ 45.5బిలియన్‌ పౌండ్లను అందచేసింది. ఇప్పటి వరకు నాలుగు బిలియన్‌ పౌండ్లు నష్టపోయింది.గతంలో 84శాతంగా వున్న వాటాలను(జనం సొమ్ము) నష్టాలకు విక్రయించి 62శాతానికి తగ్గించుకుంది. ప్రభుత్వం ఆదుకొనేందుకు ఇచ్చిన సొమ్ములో 21బిలియన్‌ పౌండ్లను ఖాతాదారులతో వివాద పరిష్కారాలకు, అపరాధరుసుములు చెల్లించేందుకు బ్యాంకు ఖర్చు ఖర్చు చేసింది.

150 సంవత్సరాల క్రితమే కారల్‌ మార్క్స్‌ వుత్పాదక రంగంలో చేసే పెట్టుబడికి, ద్రవ్య వుత్పత్తుల్లో పెట్టే పెట్టుబడికి వున్న తేదాను వివరిస్తూ బ్యాకింగ్‌ బుడగలు ఎలా పెరుగుతాయో, పేలిపోతాయో పేర్కొన్నారు. మరో సంక్షోభం సంభవించే వరకు పెట్టుబడిదారులు జనానికి ఏదో ఒక ఆశచూపుతూనే వుంటారు. వుత్పాదక రంగంలో తమ పెట్టుబడికి ఆకర్షణీయమైన లాభాలు రానపుడు పెట్టుబడిదారులు తమ సొమ్మును ద్రవ్య మార్కెట్లో పెట్టుబడులుగా పెడతారు. బడా కంపెనీల, దుకాణాల పోటీలో నిలదొక్కుకోలేని అనేక మంది చిన్న మదుపుదారులు దగ్గర మార్గంగా వడ్డీ వ్యాపారాన్ని ఎంచుకోవటం తెలిసిందే. గ్రామాలలో వస్తువ్యాపారం చేసే వారు తమ మిగులును వడ్డీ, తాకట్టు వ్యాపారాలకు మళ్లించటాన్ని మనం చూస్తున్నదే. ద్రవ్య పెట్టుబడి లాభాలు వుత్పాదకరంగం పెట్టుబడిపై ఆధారపడి వుంటాయి. నిజమైన ఆర్ధిక వ్యవస్ధలో సంభవించే మార్పులు ద్రవ్యవ్యాపారంపై ప్రభావం చూపుతాయి. నిజ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడితే ద్రవ్య పెట్టుబడి( బ్యాంకింగ్‌) రంగం కుప్పకూలిపోతుంది.

బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ వంటి వారు ఏ క్షణంలో అయినా మరో ద్రవ్య సంక్షోభం రావచ్చని చెబుతున్నారంటే దానికి ప్రాతిపదిక లేకపోలేదు.2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌజోన్స్‌ సూచి 350శాతం పెరగ్గా, వాస్తవ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదల కేవలం 15శాతమే. తెలుగు ప్రాంతాల్లో సప్తగిరి, వుమ్మిడియార్స్‌ నుంచి కరక్కాయల పొడి వరకు అనేక మంది మోసగాళ్లు సగం ధరలకే వస్తువులు, అధిక వడ్డీలు, లాభాల ఆశచూపుతూనే వున్నారు. అలాంటివి ముంచుతాయని తెలిసినా ముందుగా పెట్టుబడి పెట్టి తాము తప్పించుకోవచ్చని ఎవరికి వారు దురాశకు లోనై నష్టపోవటం చూస్తున్నాము. ద్రవ్య పెట్టుబడిలో సంభవించే నష్టాలు ఆయా సంస్ధల యజమానుల కంటే జనాన్ని ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. భూగోళంలో ఒక ప్రాంతంలో తలెత్తిన సంక్షోభం దానికే పరిమితం కాదు. ప్రపంచీకరణ పేరుతో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముడివేయటంతో తరతమ తేడాలతో ప్రపంచ వ్యాపితంగా ప్రభావం, పర్యవసానాలు పడతాయి.

పది సంవత్సరాల తరువాత నెలకొన్న పరిస్ధితి గురించి మెకెన్సీ సంస్ధ ప్రతినిధి సుసాన్‌ లండ్‌ చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ఐరోపా, అమెరికాలోని బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే వాటి దగ్గర వున్న పెట్టుబడి ఎక్కువగా వుంది. దీని అర్ధం అవి మరింత స్ధిరంగా వున్నాయి, భవిష్యత్‌లో తలెత్తే నష్టాలను తట్టుకోగలవు. అయితే వడ్డీ రేట్లు, రుణాలకు డిమాండ్‌ తక్కువగా వుండటం, పెట్టుబడిమీద వచ్చే ఆదాయం తక్కువగా వుండటం బ్యాంకుల అభివృద్ధికి పరిమితులను సూచిస్తున్నాయి. ద్రవ్య సంక్షోభం తరువాత బ్యాంకులకు పెట్టుబడిమీద వచ్చే ఆదాయం సగం తగ్గింది, దీంతో లాభాల కోసం నూతన వాణిజ్య పద్దతుల కోసం కుస్తీ పడుతున్నాయి. పదేండ్ల నాటి సంక్షోభం తరువాత ప్రపంచ రుణ భారం స్ధిరంగా వుండటం లేదా పడిపోవటంగాక 72లక్షల కోట్ల డాలర్లు పెరిగింది.

బ్యాంకుల వంటి ద్రవ్య సంస్ధలను ఇబ్బందుల నుంచి బయటపడవేసేందుకు పాలకవర్గ ప్రభుత్వాలు ఆ భారాన్ని జనం మీదనే మోపుతాయి. పొదుపు చర్యలు, సంక్షేమ పధకాలకు కోత, ప్రభుత్వ ఆస్ధుల విక్రయం, జనం మీద అదనపు పన్నులు ఇలా అనేక రూపాలలో వుంటున్నాయి.పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా కేంద్రీకరణ ముప్పుకు సూచన. గతేడాది ప్రపంచ జిడిపికి 217శాతం ఎక్కువగా అప్పు వున్నట్లు తేలింది. పదేండ్ల నాటి సంక్షోభానికి ముందు కంటే ఇది 40శాతం ఎక్కువ. లేమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలిపోగానే పెద్ద బ్యాంకులు, ద్రవ్య సంస్ధలను చిన్నవిగా చేయాలనే ఆలోచన చేశారు. అయితే మన దేశంతో సహా అనేక చోట్ల పోటీని తట్టుకోవాలంటే పెద్దవిగా వుండాలంటూ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎస్‌బిఐలో విలీనం చేసిన విషయం తెలిసిందే. 2007లో అమెరికాలోని బ్యాంకు ఆస్ధులలో 44శాతం కేవలం ఐదింటి చేతిలో వుండగా ఇప్పుడు ఆ మొత్తం 47శాతానికి పెరిగింది. ఒక శాతం మ్యూచ్యువల్‌ ఫండ్‌ సంస్ధల చేతుల్లో 45శాతం స్టాక్స్‌, బాండ్లు, ఇతర ఆస్ధులు వున్నాయి. ఇవిగాక షాడో బ్యాంకులు అంటే తెరవెనుక లావాదేవీలు నిర్వహించేవి కూడా వున్నాయని ఒక నగ్నసత్యం. 2010లో వాటి ఆస్ధుల విలువ 28లక్షల కోట్లయితే ఇప్పుడు హీనాతి హీనంగా లెక్కవేసినా 45లక్షల కోట్ల డాలర్లని చెబుతున్నారు. బ్యాంకుల మీద నియంత్రణలు పెరిగే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి. అందువలన వీటిలో ఏ ఒక్కటి మునిగినా పదేండ్ల నాటి సంక్షోభంతో పోల్చితే నష్టం కొన్ని రెట్లు ఎక్కువగా వుంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో సంక్షోభం బద్దలవుతుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అబద్దాలు, అదిరింపులు, బెదిరింపులతో నాటో భేఠీ !

14 Saturday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Donald trump, lies, NATO, nato brussels summit 2018, scares, threats

Image result for nato brussels summit 2018

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారికి ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతోంది.అమెరికా పాలకవర్గం(దాని ప్రతినిధులు రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలనేతలు) ప్రపంచాన్ని ఏవైపు తీసుకుపోతున్నది? పర్యవసానాలు ఎలా వుంటాయి? ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌, వుత్తర కొరియాతో అణు సమస్యపై తొలిసారిగా ఒక ఒప్పందానికి వస్తున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో ఏ దేశమైనా లావాదేవీలు జరిపితే వాటి మీద కూడా తన కొరడా ఝళిపిస్తానని భారత్‌ వంటి దేశాలను బెదిరించాడు.కెనడాలో జరిగిన జి7 సమావేశంలో అన్నింటా తన అనుయాయిగా వున్న కెనడా, ఇతర మిత్ర దేశాల మీద విరుచుకుపడ్డాడు. చైనాతో పాటు కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ మీద కూడా వాణిజ్య యుద్దం ప్రకటించాడు. తాజాగా ఈనెల 11,12 తేదీలలో జరిగిన నాటో కూటమి దేశాల సమావేశంలో మిలిటరీ ఖర్చు పెంచుతారా లేదా అంటూ బెదిరింపులకు దిగాడు. ఐరోపా యూనియన్‌లో అగ్రరాజ్యమైన జర్మనీపై విరుచుకుపడుతూ ఇంధనం కోసం రష్యా చేతిలో బందీ అయిందని మండిపడ్డాడు. నాటో ఖర్చు అంతటినీ అమెరికాయే భరిస్తోందంటూ అతిశయోక్తులు పలికి అపహాస్యం పాలయ్యాడు. అంతే కాదు దాదాపు అన్ని విషయాల్లో అమెరికాకు వత్తాసు పలుకుతూ, ఐరోపా యూనియన్‌లో అమెరికా ఏజంటు వంటిది అని పేరు తెచ్చుకున్న బ్రిటన్‌ను కూడా ట్రంప్‌ వదల్లేదు. ప్రధాని థెరెస్సా మే గురించి, బ్రెక్సిట్‌ గురించి నోరుపారవేసుకున్నాడు. దీంతో సోమవారం నాడు బ్రిటన్‌ పర్యటనలో లక్షలాది మంది నిరసన ఎదుర్కొన్నాడు. బ్రసెల్స్‌ నాటో సమావేశంలో నిజమైన బేధాభిప్రాయం దానికి నిధుల చెల్లింపు గురించే అని నాటో వర్గాలు వెల్లడించాయి. లోపల ఎన్ని బేధాభిప్రాయాలు వున్నా, ట్రంప్‌ ప్రవర్తనపై అసంతృప్తి వున్నా ఐరోపా నేతలు సంయమనం పాటించారు. తాత్కాలికంగా అయినా ట్రంప్‌ను సంతృపరచేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామలన్నీ దేనికి సూచిక ?

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ముఖ్యంగా సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌లైన జార్జియా, వుక్రెయిన్లలో రష్యా మిలిటరీ జోక్యం ముగిసిందనుకున్న ప్రచ్చన్న యుద్ధం మరో రూపంలో ప్రారంభం అవుతుందా అన్న ప్రశ్నను రేకెత్తించాయి. రష్యాను ఒంటరిని చేయాలని నాటో అనే శిఖండిని ముందు పెట్టుకొని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఎలా ప్రయత్నిస్తున్నాయో రష్యా కూడా నాటోలో రాజకీయ విబేధ విత్తనాలు నాటేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. బ్రసెల్స్‌ సమావేశాల్లో వాటి గురించి స్వయంగా అమెరికాయే బయటపడటం విశేషం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా, ఐరోపా దేశాలు 1949లో వుమ్మడి మిలిటరీ రక్షణ కూటమిగా వుత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ(నాటో)గా ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిలో 29దేశాలు వున్నాయి. నాటి సోవియట్‌ నుంచి రక్షించుకొనే పేరుతో ఏర్పడిన ఈ సంస్ధ 1991 అది రద్దయిన తరువాత కూడా కొనసాగటమే కాదు, దాని ఖర్చును రెట్టింపు చేయాలని తాజాగా బ్రసెల్స్‌లో జరిగిన సమావేశంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సభ్యరాజ్యాలను డిమాండ్‌ చేశాడు. గత ఏడు దశాబ్దాలలో కమ్యూనిస్టు సోవియట్‌ లేదా తరువాత దాని వారసురాలిగా మారిన పెట్టుబడిదారీ రష్యా గానీ నాటో సభ్యరాజ్యాల మీద దాడి లేదా ప్రయత్నం కూడా చేయలేదు. అయినా సరే దాన్నింకా బలపరచాలని అమెరికా కోరటం వెనుక వున్న వుద్దేశ్యం ఏమిటి? ఎవరి నుంచి ముప్పు వస్తుస్తుందని ఐరోపా రాజ్యాలు భయపడుతున్నాయి?

1991లో సోవియట్‌ యూనియన్‌ను కూల్చివేశారు. అప్పటి వరకు దానికి వ్యతిరేకంగా పని చేసిన నాటో తదుపరి ప్రయాణం ఏదిశగా సాగాలి, అసలు కొనసాగటం అవసరమా అన్న దిశలో చర్చలు జరిగాయి. పశ్చిమ ఐరోపాతో పాటు తూర్పు ప్రాంతానికి కూడా రక్షణ ఛత్రాన్ని విస్తరింప చేయాలని నాటి బిల్‌క్లింటన్‌ సర్కార్‌ మొగ్గు చూపింది. ప్రపంచం మీద పెత్తనం కొనసాగించాలన్నదే అంతర్గత అంశం. సోవియట్‌ ముప్పు లేకపోయిన తరువాత ఐరోపా రక్షణకు అమెరికా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది అమెరికా రక్షణశాఖలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. నాటో విస్తరణ కూటమిని పలుచన చేస్తుందని బ్రిటన్‌, విస్తరణ నాటో ప్రభావాన్ని అవసరానికి మించి పెంచుతుందని ఫ్రాన్స్‌ భయం వ్య్తం చేసింది. చిత్రం ఏమిటంటే 69 సంవత్సరాల క్రితం నాటో ఏర్పాటు లక్ష్యం వేరు, ఆచరణలో దాన్ని వినియోగిస్తున్న తీరు వేరుగా వుంది. నాటో ఒప్పందం ప్రకారం ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలోని సభ్య రాజ్యాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిపై ఎవరైనా దాడి చేస్తే అందరి మీద జరిగిన దాడిగా పరిగణించి ప్రతిఘటించాలి. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా అటువంటి దాడి జరగలేదు. సరికదా నాటో దేశాల సరిహద్దుల వెలుపల నాటో సభ్య దేశాలే ఏదో ఒకసాకుతో మిలిటరీ జోక్యం చేసుకుంటున్నాయి. కొత్త భద్రతా సమస్యలు తలెత్తాయనే పేరుతో దాన్ని కొనసాగించేందుకు కొత్త సాకులు వెతుకుతున్నాయి.

Nato

1990దశకంలో నాటి యుగోస్లావియా జాతుల విబేధాలతో ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి బోస్నియా, హెర్జెగోవినా మీద విమానాలు ఎగరకూడదని ఆంక్షలు విధించింది. దాన్ని అవకాశంగా తీసుకొని తొలిసారిగా నాటో దళాలు 1994లో నాలుగు బోస్నియా విమానాలను కూల్చివేశాయి. ఆ తరువాత కొసోవోలో శాంతి పరిరక్షణ పేరిట, మధ్యధరా సముద్రంలో భద్రతా గస్తీ, సోమాలియాలో ఆఫ్రికన్‌ దళాలకు మద్దతు, ఆఫ్ఘనిస్తాన్‌లో వుగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు పేరుతో నాటో జోక్యం చేసుకుంది. ఇవన్నీ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద ఎత్తుగడలు, లక్ష్యాలలో భాగంగానే జరిగాయి తప్ప ఐరోపాకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇంతే కాదు ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను నీరుగార్చి, దాని లక్ష్యాలను కూడా దెబ్బతీసే విధంగా నాటో రాజ్యాలు వ్యవహరిస్తున్నాయి. వుదాహరణకు లిబియా మీద 2011లో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. వాటిని అమలు జరిపే పేరుతో రంగంలోకి వచ్చిన అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరువాత కొద్ది రోజుల్లోనే ఆ బాధ్యతను నాటో కమాండ్‌కు అప్పగించాయి. టర్కీ ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.లిబియాపై దాడులు చేసేందుకు జర్మనీ, పోలాండ్‌ తిరస్కరించాయి.

తమ సభ్యదేశంపై జరిగిన దాడిని వుమ్మడిగా ఎదుర్కోవాలనే సూత్రాన్ని 2001లో ఆప్ఘనిస్తాన్‌లో నాటో ముందుకు తెచ్చింది. వుగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే పేరుతో అక్కడ జోక్యం చేసుకుంది అమెరికా.అమెరికా సేనల మీద దాడులు జరిపింది ఆల్‌ఖైదా వుగ్రవాదులు. దానికి నాటో సూత్రానికి లంకెపెట్టి అమెరికా నాయకత్వంలోని దళాలు అక్కడి ప్రభుత్వానికి సాయం చేసే పేరుతో తిష్టవేశాయి. రెండు సంవత్సరాల తరువాత ఆ బాధ్యతను నాటో స్వీకరించింది.అయితే కొన్ని దేశాలు జాతీయ కారణాలు చూపి ఆ దాడులకు తమ సైన్యాన్ని పంపలేదు. నాటో, దాని భాగస్వామ్య దేశాల పేరుతో 50కిపైగా దేశాల నుంచి లక్షా 30వేల మంది సైన్యాన్ని దించి 2014వరకు దాడులు చేశారు. వాటిలో వుగ్రవాదుల చేతుల్లో మరణించిన వారిలో చురుకుగా పాల్గన్న అమెరికా, బ్రిటన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలవారే అధికులు. ఆ తరువాత గత నాలుగు సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పేరుతో 16వేల మంది నాటో సైనికులు అక్కడ కొనసాగుతుండగా వారిలో సగం మంది అమెరికన్లే. అదే ఆల్‌ఖైదా వుగ్రవాదులకు అమెరికాతో పాటు ఐరోపా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి సిరియాలో వున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించటాన్ని గమనించాలి. వాటికి వ్యతిరేకంగా అక్కడ రష్యా సేనలు సిరియాకు మద్దతు ఇస్తున్నాయి. నాటో విస్తరణ ఐరోపాకే పరిమితం చేయలేదు. రష్యాను చుట్టుముట్టేందుకు ఆసియాలోని అజర్‌బైజాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలకు సైతం ఏదో ఒకసాకుతో విస్తరించేందుకు పూనుకున్నారు. దీని వెనుక రష్యాను దిగ్బంధనం చేయటంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల వరకు నాటో పేరుతో అమెరికా దళాలను రప్పించే ఎత్తుగడ వుంది. అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరాన్‌ వుంది. 1990దశకంలో జర్మనీ ఏకీకరణ సమయంలో నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని అమెరికా ఇచ్చిన హామీలకు భిన్నంగా తూర్పుకే కాదు, చివరకు ఆసియాకు సైతం వస్తున్నది. అందువలన నాటో ఏర్పడిన లక్ష్యాలకు, ఇప్పుడు చేస్తున్నదానికి వున్న ఏకైక లక్ష్యం ఏమిటంటే అప్పుడూ ఇప్పుడూ ఈ ప్రాంతంపై అమెరికా పెత్తనాన్ని విస్తరించటమే. నాటోను కొనసాగించితే దీర్ఘకాలంలో ప్రమాదముంటుంది, అదే తూర్పుదిశగా వేగంగా విస్తరింపచేస్తే రష్యాను నయా సామ్రాజ్యవాద దేశంగా మార్చటానికి దారితీస్తుందని 1994లో అమెరికా విదేశాంగ మంత్రి వారెన్‌ క్రిస్టోఫర్‌ హెచ్చరించారు. అయితే రష్యా, నాటో వైపు నుంచి కూడా పరిస్ధితిని దిగజార్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వుక్రెయిన్‌ తూరుప్రాంతంలోని క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకుంది. జార్జియాలో కూడా జోక్యం చేసుకొని తన పలుకుబడిని పెంచుకుంటున్నది . వాటిని చూపి ఐరోపాకు ముప్పుతొలగలేదని అమెరికా చెబుతున్నది. రష్యాపై ఆంక్షలను విధిస్తున్నది. వాటిని కొన్ని ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. 2014 నుంచి రష్యాతో పౌర, మిలిటరీ సహకారాన్ని నాటో నిలిపివేసింది. తూర్పు ఐరోపాలో బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాలను పెంచింది. ఈ రెండు దేశాలను నాటోలో చేర్చుకుంటే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని రష్యా హెచ్చరిస్తున్నది. ఈ కారణంగానే ఆ దేశాలను నాటోలో చేర్చుకొనేందుకు కూటమి దేశాలు తొందరపడటం లేదు. వాటిని ఈపాటికి చేర్చుకొని వుంటే పరిణామాలు, పర్యవసానాలు వేరే విధంగా వుండి వుండేవి. అయితే రష్యా మద్దతు వున్న తిరుగుబాటదార్లను అదుపు చేసే పేరుతో వుక్రెయిన్‌కు అత్యంత అధునాత ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. క్రిమియాను విలీనం చేసుకున్న తరువాత అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన వుపన్యాసంలో నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ అనేకసార్లు వారు మాతో అబద్దాలు చెప్పారు, మాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారు, తూర్పు దిశగా నాటో విస్తరణ జరిగింది, మా సరిహద్దులలో మిలిటరీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే మమల్ని అదుపు చేయాలనే పశ్చిమదేశాల విధానంతో పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవయశతాబ్దాలలో నడిచాయి, నేడు కూడా కొనసాగిస్తున్నాయి.’ అన్నారు.

తమదేశంతో సహా రష్యా విదేశాల ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది, నూతన అణ్వాయుధాలను తయారు చేస్తున్నది. ఐరోపాలోని వ్యవస్ధలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది, ఐరోపా రక్షణలో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నది అని అమెరికా ఆరోపిస్తున్నది. ఐరోపాలో తాను ఏర్పాటు చేస్తున్న పరిమిత క్షిపణి రక్షణ వ్యవస్ధలు ఇరాన్‌ దాడిని ఎదుర్కొనేందుకు అని అమెరికా చెబుతున్నది. ఈ మాటలను ఎవరూ నమ్మరని వేరే చెప్పనవసరం లేదు. క్రిమియాలో రష్యా జోక్యాన్ని సాకుగా చూపుతూ తటస్ధ దేశాలుగా వున్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను కూడా నాటో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్ధలను సమకూర్చుకొనేందుకు టర్కీ పాలకులు ప్రయత్నించటానికి నాటోలోని మిగతా దేశాలు అభ్యంతర పెడుతున్నాయి.

ఈ పూర్వరంగంలో జూలై 11,12 తేదీలలో బ్రసెల్స్‌లో నాటో కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు అపహాస్యం పాలైంది. బ్రసెల్స్‌ సమావేశం విజయవంతమైందని ట్రంప్‌ ప్రకటించాడు. సభ్యదేశాల నేతలతో తన సంబంధాలు ఎంతో బాగున్నాయని మరీ మరీ చెప్పాడు. అయితే జరిగిన పరిణామాలు అలా కనిపించటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌-రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ లోహానిస్‌ భేఠీ వార్తల సేకరణ వుందంటూ ప్రధాన వార్తా కేంద్రం నుంచి వెళ్లిపోయిన రుమేనియా విలేకర్లు వెంటనే తిరిగి వచ్చి సమావేశం రద్దయినట్లు తెలిపారు. అంతే కాదు అజర్‌బైజాన్‌, వుక్రెయిన్‌, జార్జియానేతలతో వుందన్న సమావేశాల పరిస్ధితీ అదే అయింది.

గతంలో సభ్యరాజ్యాల స్ధూల జాతీయాదాయం(జిడిపి)లో రెండుశాతం మొత్తాన్ని 2024నాటికి రక్షణకు కేటాయించాలని నాటో నిర్ణయించింది.దాన్ని వచ్చే జనవరి నాటికే అమలు చేయాలని, తరువాత నాలుగుశాతానికి పెంచాలని ట్రంప్‌ పట్టుపట్టాడు. అతగాడితో ఇప్పుడు గొడవెందుకు సరే అలాగే చేద్దాం లెమ్మన్నట్లుగా సభ్యదేశాల స్పందన వుంది. ఈ సమావేశాలలో అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధిగా ట్రంప్‌ విశ్వరూపం కనిపించింది అంటే అతిశయోక్తి కాదు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘నేను అధికారానికి రాక ముందు ఆయుధాల గురించి విన్నాను గానీ పదవిలోకి వచ్చాక నేను నిజంగా తెలుసుకున్నాను. ఇతరులు తయారు చేసే వాటి కంటే మావి ఎంతో మెరుగైనవి, మీరు మాకంపెనీలు లాక్‌హీడ్‌, బోయింగ్‌, గ్రమ్మన్‌ వంటి వాటిని చూడండి, ఎలాంటి మెటీరియల్‌ను వాడుతున్నామో, ఎంతో నాణ్యమైన పరికరాలను తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మా పరికరాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. వారెంతో మంచి పని చేస్తున్నారు, వారందరికీ చేయగలరా? కాబట్టి వాటిలో కొన్ని దేశాలకు సాయపడుతున్నాం, మంచి పరికరాలను కొనుగోలు చేయగలుగుతున్నారు.’ ఇలా ఒక కంపెనీ ప్రతినిధి తప్ప ఒక దేశాధినేత చెప్పే మాటలుకావు. ఈ సమావేశాలలో ట్రంప్‌ తన అజెండాకు ఆమోదముద్ర వేయించుకున్నాడా లేదా అన్న చర్చ జరుగుతోంది.

సమావేశాల ప్రారంభంలోనే ట్రంప్‌ జర్మనీపై దాడికి దిగాడు. ఇంధనం కోసం ఎక్కువగా ఆధారపడి తనంతట తానే రష్యాకు బందీ అయిందని, నాటో రక్షణ నిమిత్తం చెల్లింపులలో విఫలమైందని ఆరోపించాడు. చమురుకైతే బిలియన్లకు బిలియన్లు చెల్లిస్తారు గానీ నాటో విషయంలో ముందుకు రారు అని వ్యాఖ్యానించాడు. ‘ జర్మనీని రష్యా పూర్తిగా అదుపు చేస్తోంది. ఈ దేశాలు(నాటో కూటమి) కేటాయింపులు పెంచాలి, దశాబ్దకాలంలో కాదు, వెంటనే కేటాయించాలి.జర్మనీ ధనిక దేశం, వారు కొద్దికొద్దిగా 2030నాటికి పెంచుతామంటున్నారు. వారు తక్షణమే, రేపే పెంచితే మాకెలాంటి సమస్య వుండదు.(విలేకర్ల సమావేశంలో పక్కనే వున్న నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌ బర్గ్‌తో మాట్లాడుతూ) ప్రతి ఏటా గ్యాస్‌ కోసం జర్మన్లు బిలియన్లకొద్దీ డాలర్లు రష్యాకు చెల్లిస్తుంటారు, కానీ రష్యా నుంచి రక్షించాలని మమ్మల్ని కోరతారు, ఇది సరైంది కాదని నేను అనుకుంటున్నాను. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది, తన ఇంధనంలో 70శాతాన్ని రష్యా నుంచి పొందుతోంది.’ అన్నాడు.

రష్యా నుంచి బాల్టిక్‌ సముద్ర ప్రాంత దేశాలన్నింటికీ గ్యాస్‌ను సరఫరా చేసే పదకొండు బిలియన్‌ డాలర్ల పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు తెలిపింది. ఈ వైఖరి ఇతర ఐరోపా దేశాలకు నచ్చలేదు. ‘ ఇది ప్రయివేటు వాణిజ్య పధకం, దీనికి జర్మన్లు చెల్లించిన పన్నుల నుంచి ఎలాంటి కేటాయింపులు లేవని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు.జర్మనీ రక్షణ మంత్రి అర్సులా వాండెర్‌ లేయాన్‌ మాట్లాడుతూ మాకు రష్యాతో అనేక సమస్యలున్నాయనటంలో ఎలాంటి సందేహం వుండనవసరం లేదు. మరోవైపు దేశాలు లేదా కూటములు మరియు వ్యతిరేకులతో కూడా సమాచార సంబంధాలను కొనసాగించాల్సి వుంది.’ అన్నారు. రష్యన్‌ గ్యాస్‌ మీద ఆధారపడటాన్ని తగ్గించాలనే అంశంపై నాటోలోని ఐరోపా దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని స్టోల్టెన్‌ బర్గ్‌ కూడా చెప్పారు.

తొలి రోజే అనేక మంది దేశాధినేతలతో ప్రయివేటుగా చర్చలు జరపటంతో రెండో రోజు అజెండా అంశాలపై ఎవరూ భిన్నాభిప్రాయం వెల్లడించలేదు. మిగతా దేశాధినేతలందరూ వుదయం తొమ్మిది గంటలలోపే సమావేశానికి హాజరైనప్పటికీ ట్రంప్‌ కావాలనే ఆలస్యంగా వచ్చారని విమర్శలు వచ్చాయి. జార్జియా, ఆప్ఘనిస్తాన్‌ల గురించి చర్చించే అజెండా వున్నప్పటికీ అదేమీ పట్టనట్లుగా యూరోపియన్ల రక్షణ ఖర్చు గురించి మాట్లాడటం మొదలెట్టారు. వచ్చే ఏడాది జనవరిలోగా ఖర్చుల కేటాయింపు పెంచనట్లయితే అమెరికా తనదారి తాను చూసుకుంటుందని వ్యాఖ్యానించగానే సమావేశంలో వున్నవారంతా అవాక్కయ్యారు. ట్రంప్‌ మాటల గురించి ఎవరూ విబేధించలేదు గానీ వాటికి మాత్రం భిన్న భాష్యాలు వెల్లడయ్యాయి. దీని అర్ధం అమెరికాతో ఘర్షణ పడటానికి ప్రస్తుతానికి ఎవరూ సిద్ధంగా లేరన్నది స్పష్టం.

రక్షణ ఖర్చు పెంచని పక్షంలో తాము నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ బెదిరించినట్లుగా రాయిటర్స్‌ పేర్కొన్నది. ట్రంప్‌ మాటలకు అర్ధం అదని తాను భావించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పేర్కొన్నాడు. ట్రంప్‌ వ్యాఖ్యలతో సమావేశ గదిలో విస్మయం వ్యక్తం కావటంతో నాటో జనరల్‌ సెక్రటరీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడే వున్న ఆఫ్ఘనిస్తాన్‌, అజర్‌బైజాన్‌ ప్రతినిధులతో మీరు నాటో సభ్యులు కానందున బయటకు వెళ్లండని చెప్పారు. తరువాత సమావేశంలో ఎవరూ ఎలాంటి కొత్త ప్రతిపాదనలూ చేయలేదు, ఐరోపా నాయకులందరూ అంతకు ముందు ప్రకటించిన మీడియా సమావేశాలను రద్దు చేసుకొని నేరుగా విమానాశ్రయాలకు వెళ్లిపోయారు. మీడియా సమావేశ కార్యక్రమం లేనప్పటికీ షెడ్యూలు మార్చుకొని ట్రంప్‌ 35నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం జయప్రదమైందని, ఇతర నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకున్నారు. ట్రంప్‌తో ఎలాంటి వుద్రిక్తత ఏర్పడలేదని, ట్రంప్‌ ముక్కుసూటిగా మాట్లాడి వుండవచ్చు,కేటాయింపు పెంచుతామని సభ్యులు వాగ్దానం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి అన్నారు.

రష్యా నుంచి ముప్పు వస్తోందనే పేరుతో నాటో కూటమి గతేడాది 900బిలియన్‌ అంటే దాదాపు లక్షకోట్ల డాలర్లను ఖర్చు చేశాయి. వీటిలో అధికభాగం అమెరికా ఖర్చు చేసిన మాట నిజమే. కానీ అదే రీతిలో ఆ సొమ్ములో అధిక భాగం తిరిగి అమెరికన్‌ సైన్యం, అమెరికన్‌ ఆయుధ కంపెనీలకే చేరుతుందనే విషయం చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో రష్యా చేసిన ఖర్చు కేవలం 66 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అవసరం లేకపోయినా విస్తరణ పేరుతో నాటో మిలిటరీని రష్యా ముంగిటకు తీసుకుపోతున్న అమెరికా ఎత్తుగడలే నేడు ఐరోపాలో వుద్రిక్తతలకు కారణం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఐరోపాకు లేని ముప్పును చూపుతూ అమెరికా మిలిటరీ కార్పొరేట్‌లు ఐరోపా దేశాలను అదిరించి బెదిరించి తమ ఆయుధాలను, వినిమయ వస్తువులను అంటగట్టేందుకు చూడటం తప్ప ట్రంప్‌ చర్యల్లో మరొకటి కనిపించటం లేదు.

ఐరోపా రాజ్యాలు అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధం కాదు. అందుకే ఒకవైపు దానితో మిత్రత్వాన్ని నెరపుతూనే తమ ప్రయోజనాలను తాము చూసుకుంటున్నాయని చెప్పవచ్చు. వుదాహరణకు అనేక అంశాలలో అమెరికా వైఖరిని ఐరోపాయూనియన్‌ ఏకీభవించటం లేదు. వుక్రెయిన్‌లో భాగంగా వున్న క్రిమియాను అక్కడి పౌరుల ఆకాంక్షలకు అనుగుణ్యంగా రష్యా తనలో విలీనం చేసుకున్నది.ఆ చర్యను జర్మనీ విమర్శించినప్పటికీ తనకు అవసరమైన చమురు అవసరాలకోసం రష్యన్‌ చమురు కంపెనీ గాజ్‌పోమ్‌తో జర్మనీ 11 బిలియన్‌ డాలర్లతో ఒకపైప్‌లైన్‌ నిర్మాణంపై 2015లో ఒప్పందం చేసుకుంది. దాని గురించే ట్రంప్‌ బ్రసెల్స్‌లో జర్మనీపై విరుచుకుపడ్డాడు. నాటో రక్షణ ఖర్చును తమకు ఇవ్వాలని అమెరికా పట్టుబడుతున్నది, అయితే ఐరోపా దేశాలు ఆ ఖర్చుతో తమ ఏర్పాట్లను తాము చేసుకుంటున్నాయి, ఆ మొత్తాలను కూడా నాటో ఖర్చులో భాగంగానే చూపుతున్నాయి. నాటో సమావేశాలకు ముందు ట్రంప్‌ చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలను గమనించటం అవసరం. నాటోలోని అనేక దేశాలు తమను రక్షించాలని కోరుకుంటాయి, అవి అంగీకరించిన మేరకు జిడిపిలో రెండుశాతం ఖర్చుచేయకపోవటమే కాదు, ఏండ్ల తరబడి వుపేక్షిస్తున్నాయి, అవి పాతబకాయిలను కూడా చెల్లిస్తాయా?అని ట్వీట్‌ చేశాడు. బ్రసెల్స్‌ బయలు దేరే ముందు ‘ఐరోపాలో మా రైతులు, కార్మికులు, కంపెనీలు వ్యాపారం చేయటాన్ని ఐరోపా యూనియన్‌ అసాధ్యం గావిస్తున్నది, మరోవైపు నాటో ద్వారా మేము సంతోషంగా వారిని రక్షించాలని కోరుకుంటారు, దానికి నాజూకు చెల్లింపులు చేస్తారు, ఇలా ఎలా పని జరుగుతుంది.’ అన్న ట్రంప్‌ వచ్చీ రావటంతోనే జర్మనీపై విరుచుకు పడ్డారు. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది అన్న ట్రంప్‌తో తాను ఏకీభవించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ పేర్కొన్నారు. తమను మాస్కో గానీ వాషింగ్టన్‌గానీ అదుపు చేయటం లేదని జర్మన్‌ అధికారులు తిప్పికొట్టారు.

తాను ఎక్కడ వున్నా అమెరికన్ల గురించే ఆలోచిస్తూ వుంటానని చెప్పేందుకు ట్రంప్‌ ప్రయత్నించాడు.’నేను ఇప్పుడు బ్రసెల్స్‌లో వున్నప్పటికీ మన రైతుల గురించే ఎల్లవేళలా ఆలోచిస్తున్నాను. 2012 నుంచి నా ఎన్నిక నాటికి సోయాబీన్స్‌ ధర సగం పడిపోయింది, గత పదిహేను సంవత్సరాలుగా రైతులకు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇతర దేశాల వాణిజ్య ఆటంకాలు మరియు పన్నులతో వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను గతం కంటే మెరుగ్గా ఈ సమస్యలను లేవనెత్తుతాను, అయితే అది అంతత్వరగా ముందుకు పోదు. మన రైతులందరికీ సమాన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను, మనం విజయం సాధిస్తాము ‘ ఇలా సాగింది.

నాటో కొనసాగాల్సిన అవసరం గురించి సంస్ధ ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలటెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ‘ బలమైన నాటో ఐరోపా, అమెరికాకు మంచిది. విడిపోవటం కంటే కలసి వుంటే ధృడంగా వుంటామని రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధం మాకు నేర్పాయి.ఐరోపాలో అమెరికా మిలిటరీ,కెనడా వునికి ఐరోపాకు మాత్రమే కాదు వుత్తర అమెరికా మరియు ప్రత్యేకించి అమెరికా(యుఎస్‌)కు మంచిది, ఎందుకంటే అమెరికా ఒక ప్రపంచ శక్తిగా ఎదగటానికి అది తోడ్పడుతుంది. బాల్టిక్‌ సముద్ర గ్యాస్‌ పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది నాటో సభ్యదేశాలు కాదు, అది ఒక జాతీయ నిర్ణయం.’

నాటో తొలిరోజు సమావేశ ప్రారంభానికి ముందు వుదయపు అల్పాహార విందు సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి. నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌బర్గ్‌తో నాటో ఖర్చులో అత్యధిక భాగం తమ దేశమే భరిస్తోందని వ్యాఖ్యానించాడు. జర్మనీ ఒకశాతం కంటే కొద్దిగా ఎక్కుగా చెల్లిస్తోంది. అదే అమెరికా జిడిపిలో 4.2శాతం చెల్లిస్తోంది. ఇది సరైంది కాదు, మేము జర్మనీని రక్షిస్తున్నాము, మేము ఫ్రాన్స్‌ను రక్షిస్తున్నాము, మేము ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాము. దానికి ఇంకా మేము ఎంతో చెల్లిస్తున్నాము. విందు అనంతరం ట్రంప్‌ వైఖరిని స్టోల్టెన్‌ బర్గ్‌ అపహాస్యం చేశాడు. వుదయపు అల్పాహార విందు బాగుంది…. దీనికి అమెరికాయే బిల్లు చెల్లించింది అని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌ అధ్యక్షుడు అయిన తరువాత ఐరోపాలో మిలిటరీ వునికి నిమిత్తం 40శాతం నిధులు పెంచాడు. అమెరికా సైన్యాలు ఎక్కువగా వున్నాయి, గతం కంటే విన్యాసాలు, మౌలిక సదుపాయాల నిమిత్తం పెట్టుబడులు కూడా పెరిగాయి’ అన్నాడు.

Image result for nato brussels summit 2018

గతంలో అంగీకరించిన మేరకు నాటో నిర్వహణకు పూర్తిగా నిధులు చెల్లిస్తున్నది అమెరికా, బ్రిటన్‌, పోలాండ్‌, గ్రీస్‌, ఎస్తోనియా మాత్రమే. తాను హాజరైన తొలి సమావేశనాటి కంటే సభ్య దేశాలు చెల్లిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గిపోయిందంటూ ట్రంప్‌ అవాస్తవం చెప్పారంటూ పొలిటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొన్నది. 2014లో ఐరోపా దేశాలు, కెనడా చెల్లించిన మొత్తం 254బిలియన్‌ డాలర్లు 2017 నాటికి 275కు పెరిగినట్లు పేర్కొన్నది. నాటో ఖర్చులో 70 నుంచి 90శాతం వరకు అమెరికా చెల్లిస్తున్నదని చెప్పటం అవాస్తవమని తెలిపింది. నాటోకు ఎంత ఖర్చు చేయాలనేది ఎక్కడా నిర్ధారించలేదు. సంస్ధ వుమ్మడి నిధిలో అమెరికా 22శాతం చెల్లిస్తున్నది. సభ్యదేశాల రక్షణ బడ్జెట్‌ ఎంతో నాటో సేకరిస్తుంది, వాటి మొత్తాలను కలిపి చూసుకున్నపుడు అమెరికా రక్షణ కోసం 70శాతం ఖర్చు చేస్తున్నది. అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తి గనుక అంతవుంది, ఐరోపా సభ్యదేశాలు అలాంటివి కాదు. తమ రైతాంగానికి ఐరోపా యూనియన్‌ తలుపులను మూసింది అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా కంటే ఐరోపా యూనియన్‌ సగటున చూసినపుడు కొద్దిగా ఎక్కువ పన్నులు విధిస్తున్నది. 30శాతం వ్యవసాయ వుత్పత్తులపై ఇరువైపులా పన్నులు లేకుండా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ఫలితంగా 28 సభ్యరాజ్యాలు, ఐరోపా యూనియన్‌ 2017లో అమెరికాకు వ్య వసాయ వుత్పత్తులలో ఐదవ పెద్ద ఎగుమతిదారుగా మారింది. అమెరికా తాను ఎగుమతి చేసుకున్నవాటి కంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంది.

గతంలో రెండుశాతం వరకు ఖర్చు చేయాలని అనుకున్నారు, ఇప్పుడు దాన్ని విధిగా చేయాలని ట్రంప్‌ అన్నాడు. రక్షణ నిమిత్తం జిడిపిలో రెండుశాతం ఖర్చు చేయాలని 2006లో అంగీకరించిన మాట వాస్తవం. అయితే అంత మొత్తాన్ని విధిగా ఖర్చు చేయాలనే అంగీకారమేదీ లేదు. ఈ వారంలో ఆ మేరకు నిర్ణయం జరిగిందేమో తెలియదు. రెండుశాతం మొత్తం కేటాయింపులను 2024 నాటికి క్రమంగా పెంచుకుంటూ పోవాలని 2014లో మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు. ఆ మేరకు వ్యవహరించినవి ఐదు దేశాలు మాత్రమే. బ్రసెల్స్‌ సమావేశాల తరువాత ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన జరిపారు. సోమవారం నాడు హెల్సింకీలో ట్రంప్‌-పుతిన్‌ భేఠీ జరగనుంది. ఆ తరువాత నాటో, ట్రంప్‌ పర్యటన వివరాల సమాచారం వెల్లడయ్యే అవకాశం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిరియాపై దాడులతో రెచ్చగొడుతున్నడోనాల్డ్‌ ట్రంప్‌ !

18 Wednesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

chemical weapons, Donald trump, RUSSIA, Syria, UN and OPCW

Image result for syria attack

ఎం కోటేశ్వరరావు

‘ఒక బీరు కొని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కలసి తాగుతూ స్వయంగా నా అనుభవాలను పంచుకోవాలనుంది. సిరియా పౌరుల కోసం ఏదో ఒకటి చేసేందుకు ఆయన ప్రయత్నించంటం నాకు సంతోషంగా వుంది.’ గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో ఆశ్రయం పొంది జర్నలిస్టు ముసుగులో సిరియాపై తప్పుడు ప్రచారం సాగిస్తున్న కాశీమ్‌ ఇద్‌ అనే ఒక ఐఎస్‌ఏజంట్‌ గతవారంలో సిరియాపై దాడుల తరువాత సిఎన్‌ఎన్‌ టీవీతో చేసిన వ్యాఖ్య. అమెరికా నాయకత్వంలో ఫ్రెంచ్‌, బ్రిటన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర కొన్ని దేశాలు జరిపిన దాడులతో ఐఎస్‌ ఏజంట్ల ఆనందం ఎలా వుందో ఇది తెలుపుతోంది. నేను సైతం తక్కువ తిన్నానా అంటూ నాలుగు సంవత్సరాల క్రితం బరాక్‌ ఒబామా తన వంతుగా ఒక దాడి జరిపితే, నీకంటే పెద్ద వెధవాయను నేను అంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది ఒకసారి ఇప్పుడు మరోసారి దాడులు జరిపించాడు. గతంలో ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో, ఇప్పుడు ప్రభుత్వమే తన పౌరులపై రసాయనిక ఆయుధాలను ప్రయోగిస్తోందనే ముసుగుతో దాడికి పాల్పడింది. చరిత్రలో ఇంత వరకు నాజీలు తప్ప ఎవరూ రసాయనిక ఆయుధాలతో సామూహిక హత్యలు చేసిన వుదంతాలు కానరావు. తమ దగ్గర ఎలాంటి రసాయన ఆయుధ కార్యక్రమం లేదు కనుక వత్తిడికి తలగ్గిన సిరియా ఏవైనా వుంటే వాటి నిర్మూలనకు అమెరికాతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. దాన్ని అమలు జరపకుండా, అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించి ఎలాంటి చట్టబద్దత లేకుండా జరిపిన దాడి ఇది. అణు జలాంతర్గాములు, అణ్వాయుధాలను మోసుకుపోయే విమానవాహక యుద్ధ నౌకలతో మోహరించి 2003లో ఇరాక్‌ తరువాత జరిపిన పెద్ద దాడి ఇది.ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నారనే వార్తలు ఒకవైపు, రష్యాకు చెందిన ఒక డబుల్‌ ఏజంట్‌, అతని కూతురిపై విష ప్రయోగం జరిపిందనే సాకుతో అనేక మంది రష్యా రాయబార సిబ్బందిని ఐరోపా దేశాల నుంచి బహిష్కరించటం వంటి పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు గిల్లి కజ్జాలకు పూనుకున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మిలిటీకరణ జరిగింది. ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలే అక్కడ ఆయుధాలు తయారు చేస్తాయి. అందువలన వాటికి లాభాలు రావాలంటే ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల రావణకాష్టం మాదిరి య దానికి ఎక్కడో ఒక చోట యుద్ధాలు, దేశాల మధ్య వుద్రిక్తతలు వుంటే తప్ప జరుగుబాటు వుండదు. మిలిటరీ పరిశ్రమలను మేపేందుకు అమెరికా పాలకవర్గం ఇప్పటికే స్కూళ్ల ప్రయివేటీకరణ, నిధుల కోత, మౌలిక సౌకర్యాల తగ్గింపు, గృహ, వైద్య రంగాల నుంచి తప్పుకోవటం వంటిచర్యల ద్వారా జనజీవితాలను దిగజార్చటంతో పాటు నిరుద్యోగం, దారిద్య్రాన్ని పెంచుతోంది. రెండోవైపు అంతర్జాతీయంగా దాడులకు తలపడుతోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలమని ప్రగల్భాలు పలికే పశ్చిమ దేశాలు జరిపిన ఈ దాడిని అనేక దేశాలు, సమాజాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పశ్చిమాసియాలో, తద్వారా ప్రపంచ యుద్ధానికి పశ్చిమ దేశాలు అర్రులు చాస్తున్నాయని అనేక మంది భయపడుతున్నారు.అంతర్గతంగా వైఫల్యాలబాటలో వున్న ట్రంప్‌ వాటిని పక్కదారి మళ్లించేందుకు, నవంబరులో జరగనున్న పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికలలో ఓట్లు పొందేందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. సిరియా రసాయక ఆయుధాలను ప్రయోగించిందని ఆరోపించటం కాదు, అంతర్జాతీయ సంస్ధల ద్వారా దర్యాప్తు జరిపించాలి. దాని గురించి ఐక్యరాజ్యసమితిలో చర్చ జరపాలి. ఏ చర్య తీసుకున్నా దాని అనుమతితో, పర్యవేక్షణలో జరపాలి తప్ప అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ నేతలు ముగ్గురూ కూర్చొని సిరియాపై దాడులు చేయటానికి వారెవరు?

Image result for syria attack

సిరియా వద్ద వున్న రసాయనిక ఆయుధాల సామర్ధ్యాన్ని దెబ్బతీసే పేరుతో జరిపిన ఈ దాడులు ప్రపంచాన్ని భయపెట్టేందుకు తప్ప మరొకందుకు కాదు. నిజంగా ఎవరైనా రసాయనిక ఆయుధాలను తయారు చేస్తుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికా ప్రకటనల తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటారా? వర్తమాన పరిస్ధితుల్లో ఏ దేశానికాదేశం తన రక్షణ కోసం అన్ని రకాల ఆయుధాల తయారీకి పూనుకోవటం బహిరంగ రహస్యం. వాటిలో ఒకటైన జీవ, రసాయన ఆయుధాల్లేని పెద్ద దేశాలేవీ లేవు. కొన్ని బహిర్గతమైతే కొన్ని రహస్యంగా చేస్తుంటాయంతే తేడా. గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం సిరియా 1300 టన్నుల రసాయన ఆయుధాలను నాశనం చేసింది. అయినా సరే దాని దగ్గర ఇంకా ఎక్కడో వున్నాయన్నది పశ్చిమ దేశాల ఆరోపణ. ఐక్యరాజ్యసమితిలోని రసాయనాయుధాల నిషేధ సంస్ధ(ఒపిసిడబ్ల్యు) సిరియా రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినందుకు గాను 2013లో నోబెల్‌ శాంతి బహుమతి కూడా పొందింది. మరుసటి ఏడాది సెప్టెంబరు నాటికి 96శాతం ఆయుధాలను నాశనం చేసినందున, తయారీ కేంద్రాల విధ్వంసానికి నిర్ణయించిందని , 2016జనవరిలో మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ఆ సంస్ధ ప్రకటించింది. నిజానికి అవన్నీ 1970దశకం నుంచి రూపొందించినవి. అలాంటపుడు తిరిగి ఏడాది కూడా గడవక ముందే సిరియా వద్ద రసాయనిక ఆయుధాలు గుట్టలు పడ్డాయని పశ్చిమ దేశాలు ప్రకటించాయంటే ఆధారం ఏమిటి? ప్రతి దేశంలోనూ పారిశ్రామిక అవసరాల కోసం వుపయోగించే క్లోరీన్‌ గాస్‌ను రసాయనికాయుధాల తయారీకి కూడా వుపయోగించవచ్చు. దీనిని చూపే సిరియాపై పశ్చిమ దేశాలు ఆరోపణలకు దిగాయి. తరువాత ఓపిసిడబ్ల్యు, ఐరోసా సంయుక్త దర్యాప్తు వ్యవస్ధను(జిమ్‌) ఏర్పాటు చేశాయి. ఆ జిమ్‌ కొత్తగా సిరియా రసాయనికాయుధాల గురించి ఒక నివేదిక సమర్పించింది. అది అమెరికా అనుకూల తొత్తు నివేదిక అని రష్యా గుర్తించేందుకు నిరాకరిస్తోంది. దాని ఆధారంగా ఎలాంటి చర్య తీసుకోకూడదని రష్యా ఐరాసలో వీటో చేసింది. అందువలన అమెరికా నాయకత్వంలోని కూటమి ఇప్పుడు ఏకపక్షంగా దాడులు చేసింది. ఆనక తీరికగా దర్యాప్తు అంటూ కబుర్లు చెబుతోంది.

అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ చెప్పినదాని ప్రకారం 105 దీర్ఘకాలిక శ్రేణి క్షిపణులను ప్రయోగించిన పెద్ద దాడి ఇది, ఒక్కసారికే ఇది పరిమితం అని చెప్పినప్పటికీ ప్రపంచ స్పందనను చూసేందుకు చేసిన ఒక ప్రయోగమని చెప్పవచ్చు. తన నూతన, నవీకరించిన ఆయుధాలు ఎలా పని చేస్తాయో పరీక్షించేందుకు గతంలో ఇరాక్‌ మొత్తాన్ని తన యుద్ద ప్రయోగశాలగా మార్చింది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. కొద్ది రోజుల క్రితం డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యాను బెదిరిస్తూ చేసిన ఒక ట్వీట్‌లో కొత్తవి, చక్కని, చిన్నవైన క్షిపణులు వస్తున్నాయి కాచుకోండి అని పేర్కొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌లోని జీవ, రసాయన ఆయుధాల రూపకల్పన, తయారీ, పరీక్షా కేంద్రం మీద, హామ్‌ అనే పట్టణంలోని రసాయనిక ఆయుధాల గోడవున్‌ మీద, మూడవ దాడి దానికి సమీపంలోనే వున్న ఒక బంకర్‌ మీద క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికన్లు చెబుతున్నారు. అమెరికన్లు చెబుతున్నదే వాస్తవమైతే ఆయుధ గోడవున్లపై బాంబులు వేస్తే అవి పేలి ఈ పాటికి ఎంతో ప్రాణ నష్టం జరిగి వుండాల్సింది. అలాంటి వార్తలేవీ రాలేదు కనుక సిరియా ప్రకటించినట్లు దాని వైమానిక సైనిక కేంద్రాలు, విమానాశ్రయాల మీద మాత్రమే దాడులు జరిగాయని అనుకోవాల్సి వస్తుంది.మరోవైపున ప్రయోగించిన 103లో 71క్షిపణులను సిరియా వైమానిక రక్షణ వ్యవస్ధలు కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. రష్యా వద్ద వున్న అధునాతన క్షిపణి విధ్వంసక వ్యవస్ధలు సిరియాలో ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి.

సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధాలతో దాడులు జరుపుతోందంటూ ఒక పధకం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ దేశాల మీడియా ప్రచారం చేస్తోంది. అలాంటి దాడులు జరిపింది సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పశ్చిమ దేశాల సాయంతో దాడులు చేస్తున్న కిరాయి ఐఎస్‌ తీవ్రవాదులు తప్ప మరొకరు కాదని గతంలోనే వెల్లడైంది. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే చివరికది నిజమై కూర్చుంటుందన్న నాజీ గోబెల్స్‌ సిద్ధాంతం ప్రకారం సిరియాపై రసాయనిక ఆయుధాల ప్రయోగ ప్రచారం జరుగుతోంది. 2003లో బుష్‌ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇరాక్‌పై దాడులు చేసేందుకు చేసిన ప్రచారాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ ప్రత్యర్ధి దేశాలపై దాడులు చేసేందుకు మారణాయుధాలను గుట్టలుగా పోగేశాడంటూ పెద్ద ఎత్తున చేసిన ప్రచారాన్ని, ప్రభుత్వాన్ని కూల్చివేసి, అక్కడి చమురుబావులను స్వాధీనం చేసుకొని, సద్దాంను వురితీసిన తరువాత అలాంటి ఆయుధాలేమీ కనపడలేదని పశ్చిమ దేశాలే ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.

ఆసియా,ఐరోపా, ఆఫ్రికా ఖండాల సంగమ ప్రాంతం వంటి మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా మిలిటరీ రీత్యా వ్యూహాత్మకం, చమురువంటి సహజ సంపదల నిలయమైన ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకొనేందుకు చరిత్రలో ప్రతి సామ్రాజ్యవాదీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిటలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా ఆలోచన నిరంతరం దీని చుట్టూతిరుగుతూనే వుంటుంది. అందుకు గాను గోతికాడ నక్కలా అవకాశాల కోసం వేచి చూస్తుంటుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంత దేశాల పాలకులపై పెల్లుబికిన అసంతృప్తితో 2010లో ట్యునీసియాలో ప్రారంభమై మధ్య ప్రాచ్యం, వుత్తర ఆఫ్రికాలోని పలు దేశాలకు విస్తరించిన ఆందోళనలను అరబ్‌ వసంతోదయంగా వర్ణించారు. ఆ సమయంలో పనిలో పనిగా అమెరికన్లు తమ అజెండాల్లో వున్న దేశాలలోని పాలకులను తొలగించేందుకు తమ తొత్తులు ఏజంట్లను ప్రయోగించి అక్కడ కూడా తిరుగుబాట్లు ప్రారంభమైనట్లు ఒక పెద్దకుట్రకు తెరతీశారు. దానిలో ఒకటి సిరియా. గోడల మీద ప్రభుత్వవ్యతిరేక నినాదాలు రాసిన విద్యార్దులను అరెస్టు చేసిందనే పేరుతో 2011 మార్చినెలలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు తెరతీశారు.తొలుత అంతర్గత తిరుగుబాటుగా మీడియా చిత్రించింది. కొద్ది నెలల్లోనే వివిధ దేశాల నుంచి ఐఎస్‌ తీవ్రవాదులు, కిరాయి మూకలను సమీకరించి పశ్చిమ దేశాలు అడుతున్న నాటకంగా వెల్లడైంది. ప్రతిగా వారిని అణచివేసేందుకు సిరియా సర్కార్‌ పూనుకుంది. తాము కూడా ఐఎస్‌ తీవ్రవాదులను అణచివేసేందుకు సిద్ధమే, సిరియాకు సాయం చేస్తామంటూ సరికొత్త నాటాకానికి తెరతీసిన పశ్చిమ దేశాలు త్వరలోనే అక్కడి అసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే సత్తా ఐఎస్‌ తీవ్రవాదులకు లేదని గ్రహించించాయి. తీవ్రవాదులకు ఆయుధాలు ఇచ్చింది కూడా వారేనని తేలింది. అప్పటి నుంచి తీవ్రవాదుల పట్టులో వున్న ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు రసాయనికి ఆయుధాలను ప్రయోగిస్తోందంటూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. నిజానికి వాటిని ప్రయోగించింది తిరుగుబాటుదారులే అని తేలింది.

2012 ఆగస్టు 20న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక ప్రకటన చేస్తూ సిరియా సర్కార్‌ రసాయన ఆయుధాలను గనుక ప్రయోగిస్తే అమెరికా గీచిన ఎర్ర(హెచ్చరిక అనే బెదిరింపు) గీతను దాటినట్లుగానే భావించాల్సి వుంటుందని బెదిరించాడు.2014లో ఒబామా సిరియా మీద దాడులు చేయించాడు. అయితే ఐఎస్‌,ఆల్‌ఖైదా వుగ్రవాదుల మీద దాడి అంటూనే సిరియా సామర్ధాన్ని దెబ్బతీసేందుకు పెద్ద ప్రయత్నం చేసి బక్కబోర్లాపడ్డాడు. అప్పటి వరకు అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు మాత్రమే తెలుపుతున్న రష్యా ప్రత్యక్షంగా 2015 సెప్టెంబరు నుంచి తన మిలిటరీ నిపుణులు, సామగ్రిని సిరియాకు తరలించి తిరుగుబాటుదార్లను అణచేందుకు తోడ్పడుతోంది. అప్పటి నుంచి సిరియాపై దాడులకు పెంటగన్‌ ఎదురు చూస్తోంది. అదే ఏడాది నవంబరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎన్నికైతే ఐఎస్‌పై దాడులకు సిరియాకు పదాతి దళాలను కూడా పంపేందుకు వెనుకాడను అని ప్రకటించాడు. ఎన్నిక తరువాత తిరిగి అదే ప్రకటన చేస్తూ రష్యాతో పోరును కూడా మనం ముగించాల్సి వుంది అని సిరియా అధ్య క్షుడు అసద్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. గతేడాది ఏప్రిల్‌లో అమెరికా 59 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సిరియాపై ప్రయోగిచింది. సిరియాను ఆక్రమించేందుకు అమెరికన్లు చేస్తున్న తప్పుడు ప్రచారం దాని బలహీనతలనే బయటపెడుతున్నది. నిజంగానే అసాద్‌ ప్రభుత్వం వద్ద రసాయన ఆయుధాలు వుంటే, ఇటీవల కూడా ప్రయోగించినట్లు అమెరికా చెప్పటం అంటే నాలుగు సంవత్సరాలలో జరిపిన మూడు దాడులు ఎలాంటి ప్రభావం చూపలేదన్నది స్పష్టం. అయితే తాజాగా మూడోసారి ఎందుకు జరిపినట్లు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ రక్షణ మంత్రి గవిన్‌ విలియమ్స్‌న్‌ బిబిసితో మాట్లాడుతూ తాము చేసిన దాడి అక్కడి అంతరుద్ద్యంలో జోక్యం లేదా పాలకుల మార్పు కోసం చేసింది కాదు, ఇది ఆప్రాంతంలో వుద్రిక్తతలు మరింతగా పెరగకుండా తీసుకున్న పరిమిత, లక్షిత దాడి అన్నారు. తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డికోసమన్న సమాధానమిది. ఈనెల ఏడవ తేదీన సిరియా మిలిటరీ ప్రయోగించిన క్లోరీన్‌, ఇతర గుర్తు తెలియని గ్యాస్‌ వల్ల అనేక మంది పౌరులు మరణించారన్న కట్టుకథను ఆధారం చేసుకొని పదమూడవ తేదీన దాడి జరిపారు. ముందే చెప్పుకున్నట్లు అమెరికాలో ఆయుధాలను తయారు చేసేది ప్రయివేటు సంస్ధలు. ఇప్పుడు ప్రయోగిస్తున్న తోమహాక్‌ క్షిపణులను రేథియాన్‌ అనే కాంట్రాక్టరు. అంటే వాడికి పని ఇవ్వాలనే ఒప్పందం వుంది గనుక ఏదో ఒక సాకుతో ఎక్కడో ఒకచోట వాటిని ప్రయోగించాలి. ఈక్షిపణికి అమర్చన బాంబు పేలబోయే ముందు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి నిర్దేశిత లక్ష్యంపై బాంబు వేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఈ రకం క్షిపణులను వినియోగిస్తున్నప్పటికీ నవీకరించిన తరువాత తొలిసారిగా 900కిలోల బాంబును తాజాదాడిలో దానికి అమర్చి ప్రయోగించారు. అయితే ఇవి ఎంత మేరకు నష్టం చేకూర్చుతున్నాయనేది సందేహమే. గతేడాది సిరియా వైమానిక స్ధావరంపై చేసిన దాడిలో అనేక విమానాలు, రన్‌వే ధ్వంసమైనట్లు అమెరికన్లు వీడియోలద్వారా ప్రపంచానికి చూపారు. అయితే మరుసటి రోజు నుంచే ఆ రన్‌వేను వుపయోగిస్తున్నట్లు బయటపడింది. అంటే అవి నకిలీ వీడియోలన్నది స్పష్టం. తాజా దాడులలో 71క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్లు రష్యా చెబుతోంది. కొందరు నిపుణుల వాదనల ప్ర కారం ఖండాంతర క్షిపణుల కంటే అమెరికా ఇప్పుడు ప్రయోగించిన క్రూయిజ్‌ క్షిపణులు చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కనుక మధ్యలోనే వాటిని కూల్చివేయటానికి అవకాశాలను కాదనలేము. వాటిని కూల్చివేయగల రష్యా ఎస్‌-400 వ్యవస్ధలున్నాయనే అనుమానం వుంటే వాటి పరిధిలోకి పైలట్లతో కూడిన విమానాలను దాడులకు పంపేందుకు అమెరికా దాని మిత్రపక్షాలు భయపడతాయి. ఈ దాడులను రష్యా, చైనాలు ఖండించాయి. ఈ దాడి జరగటం తమ నాయకుడు పుతిన్‌కు అవమానకరం అని రష్యా దౌత్యవేత్తలు వ్యాఖ్యానించినట్లు నిర్ధారణకాని వార్తలు వెల్లడించాయి. ఇవి పుతిన్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు ప్రచారంలో పెట్టినవి కూడా కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమ దేశాల పధకంలో భాగమే ముస్లిం వుగ్రవాదుల తయారీ !

03 Tuesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, UK, USA

≈ Leave a comment

Tags

Cold War, Saudi crown prince, Spread of Wahhabism

ఎం కోటేశ్వరరావు

తమ విలువైన సంపదలు పశ్చిమ దేశాల కార్పొరేట్‌ సంస్ధల పాలవుతున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ముస్లిం దేశాల పౌరులున్నారు. మరోవైపు అదే సంస్ధల ఆధీనంలో వున్న మీడియా పని గట్టుకొని చేస్తున్న ప్రచారం, జరుగుతున్న కొన్ని వుదంతాల వలన మానసికంగా గాయపడిన, అవమానభారాలకు, గందరగోళానికి, ఆత్మన్యూనతకు గురి అవుతున్నారు. అలాంటి వారు వూరట పొందేందుకు, వాస్తవాలను అర్ధం చేసుకొనేందుకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పిన అంశాలు నిస్సందేహంగా తోడ్పడతాయి. అత్యధిక ముస్లిం దేశాలలో పశ్చిమ దేశాలు, వారి ప్రయోజనాలతో ముడిపడి వున్న శక్తులతో సంబంధాలున్న నిరంకుశశక్తులు అధికారంలో వున్నాయి. వారు మిలిటరీ లేదా అవినీతి అక్రమాలకు నిలయంగా వున్నారు. అందువలన తమకు అవసరమైనది తప్ప ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ ఆయా దేశాల జనానికి తెలియకుండా నియంత్రిస్తున్నారు. వారికి అందుబాటులో వున్నదంతా పశ్చిమ దేశాల కృత్రిమ తయారీ సమాచారమే. ఒక అంచనా ప్రకారం గత అర్ధశాతాబ్దంలో దాదాపు కోటి మంది సామాన్య ముస్లింలు పశ్చిమ దేశాల కుట్రలకు బలై ప్రాణాలర్పించారని అంచనా. ఇందుకు కారకులైన దుర్మార్గాలను మరుగుపరచి ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోయినా వుగ్రవాదులందరూ ముస్లింలే అనే పేరుతో అందరినీ అవమానాలకు గురి చేస్తున్నారు. ఇదంతా పశ్చిమ దేశాలు, వాటితో చేతులు కలిపిన తమ దేశాల పాలకవర్గాల పుణ్యమే అని గ్రహించలేని వారెందరో. అలాంటి వారిలో కొందరికైనా సౌదీ పాలకుడు అధికారికంగా అంగీకరించిన అంశం వుపకరిస్తుంది.

ఇస్లామిక్‌ దేశాలలో మతోన్మాదశక్తులు పెరగటానికి అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదశక్తులే కారణం అన్నది ఎప్పటి నుంచో తెలిసిన బహిరంగ రహస్యం. 1960వ దశకంలో ఇండోనేషియాలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, సోవియట్‌ సేనలపై దాడులకు ముజాహిదీన్‌ లేదా తాలిబాన్ల పేరుతో వున్న మతశక్తులకు ఆయుధాలిచ్చాయి. ఇప్పుడు సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వాటిని వుపయోగిస్తున్నారు. ముస్లిం దేశాలు సోవియట్‌ ప్రభావంలో పడకుండా వుండేందుకు గాను పశ్చిమ దేశాల సలహా మేరకు వహాబియిజాన్ని వ్యాప్తి చేసేందుకు తాము పెద్ద మొత్తంలో నిధులు అంద చేస్తున్నట్లు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వెల్లడించారు. గతనెల మూడవ వారంలో అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు పత్రిక జర్నలిస్టుల ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గని అనేక విషయాలు చెప్పారు. ప్రచ్చన్న యుద్ద(కమ్యూనిజంపై సామ్రాజ్యవాదుల దాడికి పెట్టిన పేరు) సమయంలో సోవియట్‌ ప్రభావం (అంటే కమ్యూనిస్టు వుద్యమ) పెరగకుండా చూసేందుకు పశ్చిమ దేశాల సలహా సౌదీ అరేబియా వ్యవహరించిన తీరును వివరించారు. ఇష్టాగోష్టిగా చెప్పినప్పటికీ తరువాత కొన్ని విషయాలను ప్రచురించి, ప్రసారం చేయటానికి సౌదీ రాయబారకార్యాలయం వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు అనుమతిచ్చింది.ఆ విధంగా పై వివరాలు బయటకు వచ్చాయి.

ఇస్లామిక్‌ దేశాలలో సోవియట్‌ ప్రభావం విస్తరించకుండా చూసేందుకు ఆ దేశాలలో సున్నీ తెగ ముస్లింల మసీదుల నిర్మాణం, మదార్సాల ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రచ్చన్న యుద్ధ కాలంలో తమ దేశాన్ని పశ్చిమ దేశాలు కోరాయని, మధ్యలో కొన్ని సౌదీ ప్రభుత్వాలకు వాటితో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఇప్పుడు తిరిగి పునరుద్ధరించుకున్నామని, వాటికి నిధులు ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రధానంగా సౌదీలోని ధార్మిక సంస్ధల ద్వారా అంద చేస్తున్నట్లు యువరాజు వెల్లడించారు. తరువాత కొద్ది రోజుల తరువాత అట్లాంటిక్స్‌ పత్రిక సంపాదకుడితో మాట్లాడుతూ వహాబియిస్టులకు నిధులు ఇస్తున్న మాట వాస్తవమేనని అయితే వహాబియిజం అంటే నిర్వచనం ఏమిటో తనకు తెలియదని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఇస్లామ్‌ను సంస్కరించే పేరుతో 1703-1791 మధ్య సౌదీ ప్రాంతంలో నివశించిన మహమ్మద్‌బిన్‌ అబ్దల్‌ వహాబ్‌ అనే ఇస్లామిక్‌ పండితుడు సున్నీ ముస్లింలు కఠోరనైతికతా వాదంతో ఎలా వుండాలో ప్రవచించిన దానినే వహాబియిజమ్‌ అని వ్యవహరిస్తున్నారు. దానికి పలు వ్యాఖ్యానాలున్నాయి. అయితే ఇప్పుడు తాలిబాన్లు, ఆల్‌ఖైదా, ఐఎస్‌, బోకో హారం పేరుతో వ్యవహరిస్తున్న మత వుగ్రవాద సంస్ధలన్నీ తాము వహాబియిజాన్నే అనుసరిస్తున్నామని, అలాంటి ముస్లిం సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ జనం మీద అనేక ఆంక్షలు విధిస్తున్నాయి, అమలు జరపనివారి మీద దాడులు చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ దేశాలతో చేతులు కలపని ముస్లిందేశాల పాలకులందరిని మత ద్రోహులుగా ముద్రవేసి పవిత్రపోరాటం పేరుతో అమెరికా తదితర దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డబ్బుతో కిరాయిదాడులకు పాల్పడుతున్నాయి.

జనంలో తంపులు పెట్టటం, తిరోగమన శక్తులను పెంచి పోషించటంలో అందెవేసిన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు వహాబియిజాన్ని సాధనంగా చేసుకొని తమ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. తరువాత అమెరికా పెద్దన్న పాత్ర తీసుకొని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. దీనిలో భాగంగానే బిన్‌ లాడెన్‌ వంటి దుష్టశక్తులను పెంచి పెద్ద చేశారు. ఆల్‌ఖైదా తీవ్రవాదులు 2001సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసినప్పటికీ అమెరికన్లు ఈ మత వుగ్రవాదులకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. దానికి తన ప్రయోజనాలు తప్ప తాను పెంచిన వుగ్రవాదులు తన దేశపౌరులపై దాడులు చేసినప్పటికీ దానికేమీ చీమకుట్టినట్లు లేదని తరువాత పరిణామాలు స్పష్టం చేశాయి. సౌదీలోని పాలకులకు ఈ శక్తులు వెన్నుదన్నుగా వున్నాయి. ఆఫ్రికాలోని ఎమెన్‌ ప్రాంతం మిలిటరీ వ్యూహరీత్యా ఎంతో కీలకంగా వుండటంతో అక్కడ తిష్టవేసేందుకు అమెరికా గత యాభై సంవత్సరాలుగా చేయని దుర్మార్గం లేదు. ఆ కుట్రలు ఫలించకపోవటంతో సౌదీ అరేబియాను ముందు పెట్టి దాని నాయకత్వంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎమెన్‌పై దాడులు చేయిస్తున్నారు. కొన్ని లక్షల మందిని చంపివేసినా, కరవు కాటకాలకు, కలరా వంటి వ్యాధులకు గురిచేసినా, లక్షల మందిని దేశం నుంచి తరిమివేసినా దాన్ని స్వాధీనం చేసుకోవటం సాధ్యం కావటం లేదు. అక్కడి సామ్రాజ్యవాద వ్యతిరేకశక్తులు మొక్కవోని ధైర్యంతో ప్రతిఘటిస్తున్నాయి. సౌదీ అరేబియన్‌ పౌరుల రక్షణకు మాత్రమే తాము అక్కడ జోక్యం చేసుకుంటున్నామని సల్మాన్‌ సమర్ధించుకున్నారు.

సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా మతోన్మాద, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల వలలో పడిన ముస్లిం యువతలో, యావత్‌ ఇస్లామిక్‌ దేశాలలో పురోగామి ఆలోచనలు రేకెత్తించటానికి, సామ్రాజ్యవాదుల కుట్రల పట్ల మరింత అప్రమత్తం కావటానికి సౌదీ యువరాజు వెల్లడించిన అంశాలు తోడ్పడతాయి. కమ్యూనిస్టు వుద్యమం విస్తరించకుండా చూసేందుకు సామ్రాజ్యవాదులు అనుసరించిన వ్యూహంలో ఎన్నో అంశాలున్నాయి. అరబ్‌ సోషలిజం పేరుతో సంస్కరణవాదశక్తులను ప్రోత్సహించారు. దానికి పెద్ద వుదాహరణ బాత్‌ పార్టీ సోషలిజం పేరుతో సద్ధాం హుసేన్‌ రంగంలోకి రావటానికి, సమర్ధించటంలో అమెరికా తోడ్పడింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆ సద్దాంనే ప్రయోగించి యుద్దం చేయించిన వుదంతం మన కళ్ల ముందే వున్నది. అమెరికా కుట్రలను ఎరిగిన సోవియట్‌ యూనియన్‌ అనేక అరబ్బు దేశాలలో సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులకు మద్దతిచ్చి నిలబెట్టింది. అలాంటి వారిలో గడాఫీ ఒకరు. ఇదే సమయంలో సౌదీ అరేబియా వంటి దేశాల పాలకులతో చేతులు కలిపి తాలిబాన్లు,ఆల్‌ఖైదా వంటి ఛాందస వుగ్రవాదుల తయారీని చూశాము. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత తనను వ్యతిరేకించే అరబ్బు జాతీయశక్తులను దెబ్బతీసేందుకు అమెరికా పావులు కదిపింది. ఇరాక్‌ , లిబియాలో జరిగింది అదే. ఇరాన్‌లో విఫలయత్నం చేసింది. సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల పాలకులను మార్చేందుకు ఇప్పటికీ దాడులు కొనసాగిస్తున్నది. తమ చేతికి మట్టి అంటకుండా ఇస్లామ్‌ పునీకరించేపేరుతో మతఛాందసాన్ని మెదళ్లకు ఎక్కించటం, ప్రపంచాధిపత్యంలో భాగంగా అపార చమురు, ఇతర సహజ సంపదలున్న ప్రాంతాలపై ఆధిపత్యం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతాలను తమ చేతుల్లో వుంచుకొనేందకే ఇదంతా చేస్తున్నారు.

సామ్రాజ్యవాదులు కేవలం ఇస్లామిక్‌ సమాజాలు, ఇస్లామిక్‌ దేశాల మీదే కేంద్రీకరించాయనుకుంటే పొరపాటు. అది మతం, ప్రాంతీయం, భాష, వేర్పాటు వాదం ఏదైనా కావచ్చు. వాటి వెనుక సామ్రాజ్యవాదుల హస్తం వుంటుంది. మన దేశంలో హిందూ తాలిబాన్లు,గతంలో పంజాబ్‌ తీవ్రవాదులు, ఇప్పుడు కాశ్మీరులో తీవ్రవాదులు, ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ వుగ్రవాదులు, ఐరోపా దేశాలలో నయా నాజీ బృందాల వెనుక పశ్చిమ దేశాల హస్తం, డబ్బు లేకుండా ఇంతగా రెచ్చిపోవటం సాధ్యం కాదు. తాము తయారు చేసిన వుగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ కొన్ని చోట్ల తమ అదుపు తప్పటంతో లేదా తమ వ్యతిరేకులైన ఇరాన్‌ ప్రభావంలోకి పోవటం వంటి పరిణామాలతో అవే పశ్చిమ దేశాలు ఒక ఎత్తుగడగా వుగ్రవాద వ్యతిరేక ఫోజుపెడుతున్నాయి. తమతో సంబంధాలలో వున్న వారితో సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వుపయోగించుకుంటున్నాయి. నిజానికి వంద సంవత్సరాల క్రితం ముస్లిం తీవ్రవాదం గురించి ప్రపంచానికి తెలియదు, అటువంటి వుగ్రవాద చర్యలు కూడా లేవు. ముస్లిం సమాజం వుగ్రవాదానికి లోనై వుంటే పశ్చిమాసియాలో వారి మెజారిటీగా వున్న ప్రాంతాలకు ప్రపంచంలో వున్న యూదులందరినీ సమీకరించి కొన్ని ప్రాంతాల రూపురేఖలను మార్చివేస్తుంటే సహించి వుండేవారా ? తమ ప్రాంతాల నుంచి తమను వెళ్లగొట్టటం ప్రారంభమైన తరువాతే పాలస్తీనియన్లు ఆయుధాలు పట్టారు తప్ప అంతకు ముందు ఎంతో సౌమ్యంగా వున్న సమాజాలవి. నిజానికి ఇస్లాం ఒక మతమే కాదు, ఒక సంస్కృతి కూడా. ప్రతి సంస్కృతిలో కొన్ని మినహాయింపులున్నట్లే దానికి భిన్నంగా ప్రవర్తించేవారు ఆ సమాజంలో వుండట ఆశ్చర్యమేమీ కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో ఏం జరుగుతోంది, ఎందుకలా ?

31 Wednesday Jan 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

chinese communist party, Communist Party Groups, foreign companies in China, Xi Jinping

Image result for communist party vangaurd in china companeis

ఎం కోటేశ్వరరావు

చైనాలో ఏం జరిగినా అది కమ్యూనిస్టులకు, పెట్టుబడిదారులకూ ఆసక్తికరంగానే వుంటుంది. ఒకే దేశమైనా అక్కడ రెండు వ్యవస్ధలను అనుమతించే విధంగా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయం తీసుకుంది. తమకు అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ సంస్ధలు, పెట్టుబడులకు అనుమతివ్వాలని 1970దశకం చివరిలోనే చైనా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయించింది. అందువలన ఆ తరువాత రెండు దశాబ్దాలకు బ్రిటీష్‌, పోర్చుగీసువారి కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనం కావాల్సిన హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలోని పెట్టుబడిదారీ వ్యవస్ధను 2050 వరకు కొనసాగనిస్తామని హామీ ఇచ్చింది. హాంకాంగ్‌ అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ద వున్న ప్రాంతాలలో ఒకటి. ఎక్కడి నుంచో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నపుడు తనలో విలీనం అయ్యే ప్రాంతాలలో వారిని తిరస్కరించటంలో అర్ధం వుండదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి తెలిసిందే. కమ్యూనిస్టుపార్టీ ఇచ్చిన వెసులుబాటును అవకాశంగా తీసుకొని ప్రపంచ పెట్టుబడిదారులు విలీన ప్రాంతాలలో శాశ్వతంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగించేందుకు లేదా చైనా నుంచి విడగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. వాటిని ఎదుర్కొంటూనే మరోవైపు చైనా తన దైన పద్దతులలో ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ గతంలోనే ప్రకటించింది.

స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ఇటీవలనే పెట్టుబడిదారీ జలగల వార్షిక జాతర జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి మాదిరిగా బయటిలోకానికి పరిచయం అవుతున్న కెటిఆర్‌ ఆ జాతరకు వెళ్లి వచ్చారు. దేశంలో, తమ రాష్ట్రాలలో లాభాలను పీల్చుకొనేందుకు వున్న అవకాశాల గురించి వివరించి మరీ వచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో మారియట్‌ ఇంటర్నేషనల్‌ సిఇఓ ఆర్నె సోరెన్సన్‌ ఒకరు. అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గాయని దానిలో భాగంగానే ఈరోజు అమెరికాను ఆహ్వానించేవారు తగ్గిపోయారని దానికి కారణం డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాడు. చైనాలో పూర్తిగా కమ్యూనిస్టు నిరంకుశత్వం వుందని కూడా ఆరోపించాడు. ప్రత్యక్షంగా ఘర్షణ పడటానికి సిద్దంగా లేనప్పటికీ చైనాను దెబ్బతీసేందుకు సామ్రాజ్యవాదులు చేయన్ని యత్నం లేదు. చైనాలో 300 హోటల్స్‌ నిర్వహిస్తున్న మారియట్‌ కొద్ది వారాల క్రితం ఒక ఇమెయిల్‌ సర్వే జరిపింది. దానిలో టిబెట్‌, హాంకాంగ్‌, మకావో, తైవాన్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా పేర్కొన్నది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే చైనా ప్రభుత్వం మారియట్‌ మొబైల్‌ ఆప్‌ను, తరువాత దాని వెబ్‌సైట్‌ను పనిచేయకుండా చేసింది. వెంటనే ఇందుకు పాల్పడిన తమ సిబ్బందిపై చర్యతీసుకుంటామని, మరోమారు అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మారియట్‌ క్షమాపణలు చెప్పింది. సదరు ప్రాంతాలు చైనా నుంచి విడిపోవాలని కోరే శక్తులు, లేదా వ్యక్తులకు తమ మద్దతు వుండదని, సమస్య తీవ్రతను గుర్తించామని పేర్కొన్నది.

చైనాలో వ్యాపారం చేస్తూ ఆ దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలో విదేశీ కంపెనీలు ఎలాంటి పాత్ర నిర్వహిస్తాయో ఈ వుదంతం చెప్పకనే చెప్పింది. కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయని, వాటిని ఎలా అదుపు చేయాలో తమకు తెలుసని సంస్కరణలకు ఆద్యుడిగా భావిస్తున్న డెంగ్‌సియావో పింగ్‌ ప్రారంభంలోనే చెప్పిన విషయం తెలిసిందే. చైనాలో విదేశీ కంపెనీలను ఎలా అదుపు చేస్తున్నారనేది సహజంగానే ఆసక్తి కలిగించే అంశం. దీనికి సంబంధించి బహిరంగంగా చైనా చేసిన ప్రకటనలు లేదా విధానాల వివరాలు మనకు అందుబాటులో లేవు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై విదేశీ సంస్ధలు, వ్యక్తులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు కొన్ని సందర్భాలలో రామునితోక పివరుండు అన్నట్లుగా వుంటాయి కనుక యధాతధంగా తీసుకోనవసరం లేదు. అయితే ఆ సమాచారం కొన్ని విషయాలను వెల్లడిస్తున్నది. వాటి మంచి చెడ్డలు, పర్యవసానాలను పక్కన పెట్టి వాటిని చూద్దాం.

చైనా జనజీవితంలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను పెంచటానికి, అగ్రగామిగా వుంచటానికి అక్కడి నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. విదేశీ సంస్ధలకు ద్వారాలు తెరిచిన తరువాత అన్యవర్గ ధోరణులైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పార్టీ , సోషలిస్టు వ్యతిరేక ధోరణులు చైనా సమాజంపై పడకుండా చూసేందుకు అవి అన్నది స్పష్టం. వాషింగ్టన్‌ పోస్టు అనే అమెరికా పత్రిక కొద్ది రోజుల క్రితం విదేశీ కంపెనీలలోకి ప్రవేశించేందుకు, అదుపు చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తున్నది అనే పేరుతో అది ఒక విశ్లేషణ రాసింది. దాని భాష్యాన్ని మనం యధాతధంగా తీసుకోనవసరం లేదు. చైనా సర్కారుతో కలసి సంయుక్త భాగస్వామ్య సంస్ధలను నెలకొల్పిన అమెరికా మరియు ఐరోపా కంపెనీలు వాటిలోని నిర్ణయాత్మక కమిటీలు, ఎగ్జిక్యూటివ్‌లు, వాణిజ్య బృందాలలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఇటీవల చైనా కోరిందన్నది వార్త సారం. చైనాలోని అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు జేమ్స్‌ జిమర్‌మన్‌ ‘ కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగం ఇంతవరకు విదేశీ పెట్టుబడులున్న సంస్ధలలోకి పెద్ద ఎత్తున పాకి చొరబడినట్లు కనిపించటం లేదు గాని జరుగుతున్న విషయాలను చూస్తే అదే మార్గంలో పయనిస్తున్నాయి’ అన్నారు. విదేశీ కంపెనీల యాజమాన్య నిర్ణయాలలో పాత్రను కమ్యూనిస్టుపార్టీ కోరటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని, ఇదే సమయలో ఇంటర్నెట్‌పై సెన్సార్‌షిప్‌ విదేశీ కంపెనీలపై ప్రభావితం చేయటానికి నాంది అని, తాను ఆర్ధికంగా బలంగా వున్నందున పశ్చిమ దేశాల వాణిజ్యాన్ని తగ్గించేయవచ్చని చైనా భావిస్తున్నట్లు ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. కంపెనీల నిర్వహణలో మరొక దొంతరను ప్రవేశపెట్టటం సంయుక్త భాగస్వామ్య కంపెనీల స్వతంత్ర నిర్ణయాలు చేసే సామర్ద్యాన్ని దెబ్బతీస్తాయని, పెట్టుబడులకు ఆటంకం అవుతుందని చైనాలోని యూరోపియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే అనేక ఆర్ధిక రంగాలలో సంయుక్త భాగస్వామ్యం వున్న కంపెనీలలో చేరాలని చైనా చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.

ఇంటర్నెట్‌ను విదేశీ కంపెనీలు వినియోగించుకోవాలంటే ‘ చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన ఏడు నిబంధనలకు కట్టుబడి వుంటామని, సోషలిస్టు వ్యవస్ధ, ప్రజాభద్రత, సామాజిక నైతికతను దెబ్బతీయబోమని, దేశ ప్రయోజనాలను వుల్లంఘించబోమని ఒక హమీ పత్రాన్ని ఇవ్వాల్సి వుంటుంది. గతేడాది జూన్‌ నుంచి చైనాలో అమలులోకి వచ్చిన ఇంటర్నెట్‌ భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అయితే తమ వ్యాపార రహస్యాలు, మేథాసంపత్తి బహిర్గతం అవుతాయనే పేరుతో ప్రభుత్వ నియంత్రణను విదేశీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. చైనాలో వున్న అన్ని విదేశీ కంపెనీలలో శాఖలను ఏర్పాటు చేసేవిధంగా కమ్యూనిస్టుపార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నదని ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా అనే బ్రిటీష్‌ కంపెనీ తాజాగా ఒక నివేదికను తన కెనడా ఖాతాదారులకు పంపింది.దానిలోని అంశాలపై కెనడా మీడియా వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఆ మేరకు ఆ నివేదికలోని అంశాల సారాంశం ఇలా వుంది.

వ్యాపార, వాణిజ్యాలు స్వతంత్రరంగానికి చెందినవి కాదు. ఇప్పటి వరకు ప్రయివేటు వాణిజ్యాన్ని రాజ్యమే క్రమబద్దీకరించింది తప్ప పార్టీ కాదు, కానీ ఇప్పుడు గ్జీ జింపింగ్‌ వాణిజ్యాన్ని పార్టీ అదుపు చేయాలని కోరుతున్నారు.ముఖ్యంగా టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ల కంపెనీలపై పార్టీ ప్రభావం, అదుపు వుండాలి. విదేశీ కంపెనీలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేయటం ద్వారా వాణిజ్య నిర్ణయాలపై పార్టీ ప్రభావం ఏమిటో తెలుసుకోవటానికి వీలుకలుగుతుంది. మారియట్‌ హోటల్స్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌, మకావోలను వేరే దేశాలుగా పేర్కొనటాన్ని పార్టీ శాఖలే కనుగొన్నాయి. ప్రతి రంగంలోనూ పార్టీ ప్రమేయం వుండాలని గతేడాది జరిగిన పార్టీ మహాసభ చేసిన నిర్ణయానికి అనుగుణంగా వందలాది ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రధాన నిర్ణయాలపై పార్టీ కమిటీలను సంప్రదించే విధంగా మార్గదర్శకాలను సవరించాయి.

ఏ సంస్ధలో అయినా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పార్టీ సభ్యులుంటే అక్కడ పార్టీ విధానం, సూత్రాలు అమలు జరుగుతున్నదీ లేనిదీ వారు చూడాలని పార్టీ నిబంధనావళి పేర్కొంటున్నది. అయితే 1980వ దశకంలో సంస్కరణల కారణంగా దీని అమలును సడలించారు. తరువాత రెండు దశాబ్దాల కాలంలో వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్ధలపై ప్రత్యక్ష నియంత్రణలను సడలించారు. ప్రభుత్వ, పార్టీ అదుపును సవాలు చేసే స్ధితిలో లేని చిన్న ప్రయివేటు, మరియు ప్రభుత్వ రంగ సంస్దలపై కమ్యూనిస్టు పార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే 2001లో ప్ర పంచవాణిజ్య సంస్ధలో చేరేందుకు గాను వ్యాపార, వాణిజ్య రంగాలలో వున్నవారిని కూడా పార్టీలో చేరేందుకు అనుమతించారు. ఈ చర్యతో అనేక కొత్త కంపెనీలను ఆశ్రిత పక్షపాతంతో పార్టీలో వున్నవారి బంధువులు, ఆశ్రితులతో ఏర్పాటు చేయించారు. ఆ సమయంలో కేవలం మూడుశాతం ప్రయివేటు కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలున్నాయి.తరువాత కాలంలో చైనా ఆర్ధిక వ్యవస్ధలో ప్రయివేటు కంపెనీలు, వాటిలో కమ్యూనిస్టుపార్టీ శాఖల సంఖ్య కూడా పెరిగింది. 2015 నుంచి ఏర్పాటయిన 36లక్షల ప్రయివేటు సంస్దలలో మెజారిటీ సంస్ధలలో పార్టీ శాఖలున్నాయి. సభ్యులు అనేక కంపెనీలలో అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వుండటం పెరిగింది. టెన్సెంట్‌ అనే ఇంటర్నెట్‌ కంపెనీ సిబ్బందిలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులు 23శాతం అయినప్పటికీ 60శాతం కీలక బాధ్యతలలో వారున్నారు. 2002లో చైనాలోని 17శాతం విదేశీ కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలుంటే అక్కడున్న ఏడున్నర లక్షల విదేశీ కంపెనీలలో 70శాతంలో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు.

చైనా మాదిరే మన దేశం కూడా సంస్కరణలకు తెరతీస్తే ఇక్కడి కమ్యూనిస్టులు అక్కడ బలపరుస్తూ ఇక్కడ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించటం తెలిసిందే. చైనాలో ప్రయివేటు కంపెనీలను విచ్చలవిడిగా అనుమతించిన తరువాత అది సోషలిజం ఎలా అవుతుందని కమ్యూనిస్టు అభిమానుల్లో సందేహాలు వున్నాయి. అందువలన అక్కడ జరుగుతున్న తీరుతెన్నులను రేఖా మాత్రంగా తెలిపే ఈ సమాచారం సోషలిస్టు వ్యవస్ధను బలపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d