• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

నిస్సహాయత + అసహనం = చంద్రబాబు

11 Saturday Feb 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

chandababu, chandrababu fire on media, Intolerent chandrababu naidu, Media

Image result for Incapable,Intolerance chandrababu naidu

ఎం కోటేశ్వరరావు

    అసహనం ! అసహనం !! అసహనం !!! సహనానికి మారుపేరైన మన దేశం, అక్షర క్రమంతో పాటు సహనంలో కూడా అగ్రస్ధానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు అసహనం అనే మందుపాతర మీద వున్నదా అనిపిస్తోంది. ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు అన్నట్లు సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఒకటేమిటి అన్ని రంగాలు, స్త్రీ, పురుష బేధం లేకుండా ఎక్కడబడితే అక్కడ అన్ని చోట్లా పెరుగుతున్న అసహనం ఎలాంటి పర్యవసానాలకు దారితీయనుందో !

    అసహన రాజకీయాలు ప్రపంచానికి ముప్పు తెస్తున్నాయని 90దేశాల పరిణామాలను పరిశీలించిన మానవ హక్కుల నిఘా సంస్ధ జనవరిలో విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ప్రకటించింది. అమెరికా, ఐరోపాలో ప్రజాకర్షక ధోరణి పెరుగుదల ప్రపంచంలో నియంతృత్వ నేతలను ప్రోత్సహించటం, బలిష్టం కావిస్తోందని కూడా హెచ్చరించింది.వేళ్లమీద లెక్కించగలిగిన ప్రపంచ బడా కార్పొరేట్లు, వాటి లాభాల కోసం కొన్ని ధనిక దేశాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాల పర్యవసానంగా ప్రపంచం మొత్తం అభివృద్ధికి ఎదురుగాలి వీస్తున్నది. సంక్షోభం అంటు వ్యాధిలా వ్యాపిస్తున్నది.

   అధికారమే పరమావధిగా ఏ అడ్డదారి తొక్కేందుకైనా సిద్ధం సుమతీ అన్నట్లు వుండే రాజకీయ పార్టీల, నేతల ప్రజాకర్షక నినాదాలు, చర్యలు ప్రకటించటాన్ని ఒలింపిక్స్‌లో చేరిస్తే మనకు అన్ని పతకాలు రావటం ఖాయం. తీరా అధికారానికి వచ్చాక వారి అసలు రంగు బయటపడుతోంది.తాబేలు నడక, ప్లేటు ఫిరాయించటం, చెప్పినవాటిని అమలు జరపమని ఎవరైనా అడిగితే వారిపై తాసుపాములా కస్సుమంటూ లేస్తున్నారు. ప్రశ్నించే తత్వాన్ని ఏ మాత్రం సహించలేక దురుద్ధేశ్యాలను ఆపాదించి అధికార దర్పంతో నోరు మూయించాలని చూస్తున్నారు. రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల పరిధి దాటి జర్నలిస్టులకు సైతం రాజకీయ అనుబంధాలు, వుద్ధేశ్యాలను ఆపాదించి అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది ప్రమాదకర పోకడ, గర్హనీయం కాదా ?

   విద్యా గంధం ఇచ్చే అత్యున్నత ఫలితం సహనం అని ప్రముఖ మానవతావాది హెలెన్‌ కెల్లర్‌ చెప్పారు. అది ఎంత మందిలో ప్రతిబింబిస్తున్నది అన్నది ప్రశ్న. ఒక కేసులో మన సుప్రీం కోర్టు మరో విధంగా చెప్పింది. అసహనం ప్రజాస్వామ్యానికేగాక వ్యక్తులుగా వారికి కూడా ఎంతో ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలని సలహా ఇచ్చింది.

    అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు ఎన్నికలు జరిగిన ప్రతి చోటా ప్రజాకర్షక వాగ్దానాల వరదలు వెల్లువెత్తుతున్నాయి. మచ్చుకు, ఫిలిప్పీనియన్ల జీవితాలను దుర్భరంగా మార్చివేసిన వారందరినీ అంతం చేయండి అంటూ ఎన్నికల ప్రచారంలో జనాన్ని రెచ్చగొట్టిన రోడ్రిగో డార్టే ఆదేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తాను అధికారంలోకి వస్తే అమెరికాలో వుద్యోగాలు అమెరికన్లకే, అమెరికాలో వుత్పత్తి చేయకుండా బయటి నుంచి దిగుమతులు చేసుకొంటే వాటిపై పెద్ద మొత్తంలో పన్ను విధిస్తా, బయటి దేశాలలో పని చేయించే కంపెనీలపై జరిమానాలు వేస్తా అంటూ వాగ్దానాలు చేసిన డోనాల్ట్‌ ట్రంప్‌ కూడా అధ్యక్షుడయ్యాడు. రాష్ట్రాన్ని ఒక పద్దతి ప్రకారం చీల్చకుండా అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్‌ మీద కారాలు మిరియాలు నూరుతూ వూరూ వాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన మిత్రపక్షం బిజెపి, వారిద్దరి మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ గురించి తెలిసిందే.

   బాబొస్తే జాబొస్తుందన్న నినాదం గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేక హోదా గురించి స్వయంగా నరేంద్రమోడీ ఇక వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి, వేస్తున్న పిల్లి మొగ్గలూ అన్నీ ఇన్నీ కాదు. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అక్కడ నరేంద్రమోడీ ప్రధాని, వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి అయ్యారు. వీరందరూ రాజకీయాల్లో, పాలనా వ్యవహారాలలో ముదుర్లు తప్ప లేగ దూడలు కాదు. అందుకే తరువాత చూసుకోవచ్చు లెమ్మని ప్రత్యేక హోదావంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి జనంపై ఎదురుడాడికి దిగారు.

    చంద్ర ‘బాబా ‘ తత్వశాస్త్రం ప్రకారం కేంద్రంపై పోరాటం చేస్తే పోలవరం వంటి ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రత్యేక హోదా బదులు పాకేజి తీసుకోవటం మెరుగు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని పెద్దలు చెప్పారు గానీ అది చివరికి ఎదురు తన్నుతుంది. అధికారానికి వచ్చిన తరువాత అమెరికాలో ట్రంప్‌ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవి అసంగతమైనవని, ఆ చర్యలతో అమెరికాను అస్తవ్యస్ధతలోకి నెట్టారని, ఒక వ్యక్తి దేశాన్ని ఎలా నాశనం చేస్తాడో ఒక వుదాహరణగా మారాడని, పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి జనం అధికారాన్నిచ్చారని, ఒక జోకర్‌గా ట్రంప్‌ తయారయ్యాడని చంద్రబాబు వివిధ సందర్బాలలో వ్యాఖ్యానించారు. జనం సొమ్మును అప్పనంగా ఖర్చు చేసి నేతల కీర్తి కండూతి కోసం మహిళా సాధికారత పేరుతో ఏర్పాటు చేసిన సదస్సును దలైలామాతో ప్రారంభోత్సవం చేయించారు.

    ఈ రెండు చర్యలు ‘బాబా ‘ గారి లాజిక్కుకు విరుద్దమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు హాని కలిగించేవి. ట్రంప్‌ మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో వుంటారు. అలాంటి వ్యక్తిని పిచ్చివాడని, అమెరికాను నాశనం చేస్తున్నాడు, జోకర్‌ అని విమర్శించిన తరువాత అమెరికా నుంచి లేదా అమెరికా కంపెనీలున్న మలేషియా తదితర దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి. తనను అంత తీవ్రంగా విమర్శించిన నేత పాలకుడుగా వున్న రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే అమెరికాలో స్ధిరపడిన ప్రవాస ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భక్తులు పెట్టే పెట్టుబడుల గురించి ట్రంప్‌ ప్రభుత్వం సహిస్తుందా ? దలైలామా చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మన దేశంలో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి. అలాంటి పెద్దమనిషిని పిలిచి పెద్ద పీట వేస్తే గతంలో చంద్రబాబు చేసిన చైనా పర్యటనలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు చేసిన యత్నాలు ‘పవిత్ర సంగమం’ (కృష్ణా నది)లో పోసినట్లే కదా ! ఎందుకిలా ప్రవర్తిస్తున్నట్లు ? దలైలామాను పిలిచినందువలన మీడియాలో వార్తలు తప్ప పైసా ప్రయోజనం వుంటుందా ? చైనా కంపెనీలు ఒకటికి రెండుసార్లు వెనుకా ముందూ ఆలోచించవా?

   రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింప చేయటానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నాన్చి, నాన్చి రెండు సంవత్సరాల తరువాత ఇచ్చేది లేదని కరాకండిగా చెప్పేసింది. దానికోసం పోరాడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానాలు చేయించారు. తీరా హోదా లేదు పాకేజి ఇస్తామని చెప్పగానే అందని ద్రాక్ష పుల్లన అన్న నక్క సామెత చందాన హోదా వలన ప్రయోజనం లేదు, అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు తెచ్చే పాకేజి ఎంతో ముద్దు అని కొత్త పల్లవి అందుకున్నారు.పనికిరాదని ముందే తెలిసినపుడు ఎన్నికలలో వాగ్దానమెందుకు? అసెంబ్లీ తీర్మానాలెందుకు? హోదా బదులు పాకేజీకి ఆమోద ముద్ర కోసం పోరాడాలని ఎంపీల సమావేశాలలో వుద్బోధలెందుకు ? ప్రతి నెలా జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశాలలో తెలుగు దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?

    పవిత్ర సంగమం ప్రాంతంలో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ వస్తారని అయన కోసం ఎయిర్‌ కండిషన్ల మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయించారు చంద్రబాబు. ప్రధాని రావటం లేదని, కేవలం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడతారని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం. చివరికి అదేమీ లేకపోగా ఏ కార్యక్రమాలూ లేకపోతే ఆకాశవాణిలో ప్రసారం చేసే ‘నిలయవిద్వాంసుల’ సంగీత కార్యక్రమాల మాదిరి వెంకయ్య నాయుడిని పంపారు. ప్రత్యేక హోదాను నిరాకరించిన తరువాత రాష్ట్రానికి రావటానికి నరేంద్రమోడీ జంకుతున్నారా ? వీడియో కాన్ఫరెస్సులో మాట్లాడకపోతే పోనీ రికార్డు చేసిన సందేశం పంపటానికి కూడా మోడీ తిరస్కరించారంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడి పలుకుబడి ఏపాటిదో అర్ధం కావటం లేదా ?

    హోదా లేదన్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దానికి కూడా సహనంతో సర్దుకు పోతున్నారు. పోనీ పాకేజీని అయినా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందా అంటే నెలలు గడుస్తున్నా ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారైన స్ధితిలో వాటి గురించి అడగటమే పాపమన్నట్లుగా అటు వెంకయ్య నాయుడు, ఇటు చంద్రబాబు నాయుడు చిందులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా హోదా గురించి అడిగింది మేము మాత్రమే, మిగతావారెవరూ మాట్లాడలేదు, ఇప్పుడు మేమే అవసరం లేదంటున్నాము, అప్పటి మాదిరి ఇపుడు కూడా మిగతావారంతా నోర్మూసుకోవాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలోనా లేక నందంటే నంది పందంటే పంది అనక తప్పని నిరంకుశపాలనలో చెవుల్లో పూలు పెట్టుకొని వున్నామా ?

   గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా ఆయన ప్రభుత్వం పట్ల మీడియా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. తన విధానాలను విమర్శించే లేదా పదే ప్రశ్నించే రెండు పత్రికలను, ఛానళ్లను లక్ష్యంగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ముద్రవేసి శత్రుపూరితంగా ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తనకు నచ్చని ఛానళ్లు పత్రికలకు, ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు పార్టీల ముద్రవేసి అదేపని చేస్తున్నారు. తటస్ధ వైఖరి తీసుకొనే మీడియా సంస్ధల జర్నలిస్టులే ప్రశ్నలు అడగాలని నిర్ధేశిస్తున్నారు. మీడియా తటస్ధత అంటే ఒక సంఘటన, ఒక అభిప్రాయం, అంశంపై ఒకే వైఖరిని పాఠకుల ముందుంచటంగాక అన్ని రకాల అభిప్రాయాలకు తగు స్ధానం కల్పించి అందచేయటం తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు అడగకూడదని అర్ధం కాదు.

     చంద్రబాబు తత్వశాస్త్రం ప్రకారం తటస్థం అంటే ఏం జరిగినా నోరు మూసుకోవాలని చెప్పటమే. తటస్ధ మీడియా సంస్ధల జర్నలిస్టులను కూడా చంద్రబాబుతో సహా ఏ ముఖ్యమంత్రీ సహించటం లేదు. మీడియా సమావేశంలో ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే సదరు విలేకరి వార్త ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లక ముందే సంపాదకుడు లేదా యాజమాన్య ప్రతినిధికి సచివాలయం నుంచి ఫోన్లు వెళ్లటం, ప్రకటనలను మరిచి పోవాల్సి వస్తుందని హెచ్చరించటం – వారు విలేకరికి తలంటించటం, వుద్యోగం నుంచి వుద్వాసనకు హెచ్చరికలు బహిరంగ రహస్యం. లాభాల కోసం రంగంలోకి వచ్చిన మీడియా సంస్ధలు చచ్చిన చేపల మాదిరి వాలునబడి పోతాయి తప్ప తటస్థంగా ఎ్కడుంటాయి ? వుద్యోగ భద్రత లేని కారణంగా అనేక మంది బలవంతంగా మౌనంగా సహిస్తున్నారు తప్ప జర్నలిస్టులందరూ ఆ స్థితికి చేరలేదు. ప్రజలకు వుపయోగపడతాయనుకున్న అంశాలను వెలికితీయటం, పాలకులుగా వున్న వారిని ప్రశ్నించే యావ, చేవ ఇంకా సజీవంగానే వుంది. అది లేని వారు యజమానులతో ప్రత్యక్ష సంబంధాలున్న రాజకీయనేతలో, యజమానో అధికారో చెప్పింది రాసుకొనే షార్ట్‌ హాండ్‌ గుమస్తాలు తప్ప జర్నలిస్టులు కారు. అటువంటి స్ధితి ప్రజాస్వామ్యానికి, జనస్వామ్యానికి ముప్పు.

     తటస్థం అని చెప్పుకొనే మీడియా సంస్ధల యాజమాన్యాలకు రాజకీయపార్టీలతో వున్న సంబంధాలు బహిరంగ రహస్యం. అనేక మంది పెట్టుబడులు వాటిలో వున్నాయి, అందువలన తెలుగు నేలపై అలాంటి తటస్థ మీడియా ఎక్కడ వుందనేది పెద్ద ప్రశ్న. ప్రశ్నించిన విలేకరులు, మీడియా సంస్ధలపై వైఎస్‌, చంద్రబాబు, వెంకయ్య నాయుడు వంటి వారు విరుచుకుపడినపుడు సీనియర్‌ జర్నలిస్టులు కూడా మౌనం దాల్చటానికి పూర్వరంగమిదే. పోనీ ఈ మౌనం వలన జర్నలిస్టులు బావుకుంటున్నదేమైనా వుందా అంటే అదీ లేదు. తమకు చట్టపరంగా రావాల్సిన వేతన భత్యాలను పొందుతున్న జర్నలిస్టులు ఎంత మంది వున్నారు. అసలు చట్టాలే అమలు జరగటం లేదు, వాటిని అమలు జరపాల్సిన ప్రభుత్వాలు యజమానుల కొమ్ము కాస్తున్నాయి. కాంగ్రెస్‌ పాలనలోగానీ తెలుగుదేశం పాలనలో గానీ ముఖ్య మంత్రులుగా వున్న వారు కొన్ని సంస్ధలపై విరుచుకుపడి వాటి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించారే తప్ప జర్నలిస్టులకు అమలు చేయాల్సిన చట్టాల అమలుకు ఒక్కటంటే ఒక్క చర్యకూడా తీసుకున్న పాపాన పోలేదు. కార్మిక శాఖ అధికారులు ఎన్ని మీడియా కార్యాలయాలను సందర్శించారు, చట్టాల అమలును పర్యవేక్షించారో చెప్పమనండి. జర్నలిస్టుల వేతన చట్ట అమలు గురించి సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది.

     చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చి మూడో సంవత్సరం త్వరలో పూర్తికానుంది. ఇంతవరకు జర్నలిస్టుల సమస్యలపై అధికారికంగా యూనియన్‌ ప్రతినిధులతో ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా జరిపి సాధకబాధకాలను చర్చించలేదు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్న అనేక మంది విలేకర్లపై అధికారపక్ష శాసనసభ్యులు, వారి దగ్గరి బంధువులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిని నియంత్రించటం లేదు, జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయటానికి సర్కార్‌కు రెండున్నర సంవత్సరాలకుపైగా పట్టింది, ఇంతవరకు ఒక్క సమావేశం కూడా జరపలేదు. ప్రెస్‌ అకాడమీ కూడా అంతే. చైర్మన్‌ నియామకం జరిపారు, పాలకవర్గాన్ని వేయలేదు, ఎలాంటి కార్యకలాపాలను ప్రారంభించలేదు. జర్నలిస్టుల సంక్షేమం గురించి ఇంత వరకు అసలు కమిటీ నియామకమే జరపలేదు. ఎందుకని ?

    అసహనాన్ని వ్యక్త పరిచేందుకు తెలుగులో ఒక సామెత వుంది. అదే మంటే నిస్సహాయతతో ‘ అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు ‘. రాజకీయ చాణుక్యుడిగా పిలిపించుకున్న చంద్రబాబు నాయుడి పరిస్థితి అలాగే వుందా అనిపిస్తోంది.అంతర్జాతీయ విషయాలపై స్పందన అడిగినపుడు మాదీ ప్రాంతీయ పార్టీ అంతర్జాతీయ విషయాలెందుకు బ్రదర్‌ అనే వారు. అలాంటిది ట్రంప్‌పై అసాధారణ వ్యాఖ్యలు చేయటాన్ని చూస్తే చంద్రబాబు బుర్ర ఎంతగా కలవర పడుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఎపుడైనా ఇబ్బందికర ప్రశ్నలు ఎదురైనపుడు గతంలో నో కామెంట్‌ (వ్యాఖ్యానించదలచలేదు) అని తనదైన శైలిలో కన్నుగీటుతూ తప్పించుకొనే వారు. దాంతో విలేకరులు కూడా అంతకు మించి అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటి ప్రశ్న వస్తే వెంటనే ముందు నువ్వు ఏ పత్రిక, ఏ ఛానల్‌ అని అడుగుతున్నారు. దానిని బట్టి స్పందిస్తున్నారు. విశాఖలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ‘ప్రజాశక్తి’ విలేకరిపై విరుచుకుపడుతూ చేసింది అదే. ఆల్‌ఇండియా, ప్రపంచ స్ధాయిలో ఎందరో జర్నలిస్టులను చూశానని చెప్పిన చంద్రబాబు ఆ స్ధాయిలో వ్యవహరించి వుంటే ఆయనకు హుందాగా వుండేది. అలా చేయకపోవటం విచారకరం. ఏ జాతీయ, అంతర్జాతీయనాయకుడు ప్రశ్న అడిగిన వారిని నువ్వు ఏ సంస్ధ ప్రతినిధివి అని అడిగి రాజకీయ అనుబంధాన్ని అంటగట్టిన వుదంతం మనకు కనపడదు.

    అంతెందుకు ఆ రెండు పత్రికలు, ఛానల్స్‌ అంటూ కయ్యం పెంచుకున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన కుటుంబ సభ్యులతో స్వయంగా ప్రారంభింప చేయించిన పత్రిక, టీవీ ఛానల్‌లో తాను వ్యతిరేకించిన మీడియా సంస్ధల నుంచి వచ్చిన వారినే జర్నలిస్టులుగా నియమించారు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నవారికి విధి నిర్వహణ ముఖ్యం. వారు కూడా పౌరులే కనుక ఏ రాజకీయ అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు.యాజమాన్యాల ఆదేశాల మేరకు పని చేసి వుండవచ్చు. అంతమాత్రాన పని చేసే సంస్ధను బట్టి రాజకీయాలు, వుద్దేశ్యాలను అపాదించటం తగని పని. ఆ మాటకు వస్తే ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన వారి రాజకీయాల సంగతేమిటి ?

అనేక దేశాలు రక్షణాత్మక చర్యలలో భాగంగా తమ దేశాల నుంచి పెట్టుబడులు బయటకుపోకుండా చర్యలు తీసుకోవటంతో పాటు తామే ఆకర్షించుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో రాష్ట్రాలు అంతకంటే ఎక్కువగా రాయితీలతో పోటీ పడుతున్నాయి. అందువలన విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వస్తాయని చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడుల పరిస్థితి అగమ్యంగా వుంది. విభజన సమయంలో ఇస్తామన్న ప్రత్యేక హోదా లేదు, దాని బదులు అంతకంటే మెరుగ్గా ఇస్తామన్న ప్రత్యేక పాకేజి బ్రహ్మపదార్ధంగా మారింది. నిజానికి అలాంటి ప్యాకేజీలు ప్రకటించటానికి కేంద్రానికి అసలు అధికారాలేమిటో ఎవరైనా చెప్పగలరా ?

   కన్నుగీటితే చాలు కాసుల వర్షం అన్నట్లుగా రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు వస్తున్నాయని, వాణిజ్యం చేసేందుకు అగ్రపీఠీన అత్యంత అనుకూల స్ధానంలో వున్నామని నిత్యం ఏదోఒక చోట సంతోషంతో విజయగాధలు వినిపిస్తున్న స్ధితిలో తమ అజెండాలోని వాటి గురించే ఒక చిన్న ప్రశ్న అడిగినా భరించలేని అసహనం ఎందుకు ? దేశ, విదేశాలు తిరిగి ఎంతో అనుభవం గడించిన చంద్రబాబుకు ఈ విషయాలేవీ తెలియవా ? రాష్ట్రంలో జనంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరచటానికి ఏదో ఒక రాజకీయం చేయాలి, లోపల ఏమున్నా పైకి నటించాలి. కేంద్రం నుంచి ప్రచారం చేసిన మాదిరి సాయం రాదని తేలిపోయింది. మాటలతో ఎక్కువ కాలం గడపటం కష్టం. అనేక రంగాలలో పురోగతి లేమి దాంతో ఒకవైపు నిస్సహాయత, దాన్నుంచి మరోవైపు తలెత్తుతున్న అసహనం అన్నీ కలిస్తే చంద్రబాబు అని చెప్పవచ్చు.

     అందుకే ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్‌, వామపక్షాలు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టులు ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేకపోవటానికి కారణమిదే ! ఇప్పుడున్న స్ధితిలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని ప్రతిపక్షాన్ని చూసి భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు, ఏ రోజు ఏ ఎంఎల్‌ఏను తమ నుంచి తీసుకుపోతారో అని ప్రతిపక్షమే భయపడే స్ధితి. జనానికి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను, వివిధ తరగతులపై జరుగుతున్న దాడులను ఎవరు ప్రతిఘటించాలి? ఎవరికి వారు ఏదో ఒక కారణం వెతుక్కొని నా వరకు వచ్చినపుడు కదా చూసుకోవచ్చు అనుకొనే వారికి జర్మన్‌ రచయిత మార్టిన్‌ నిమోలియర్‌ నాజీల గురించి రాసిన ప్రఖ్యాత కవితను గుర్తు చేయటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు- నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత కార్మికనేతల కోసం వచ్చారు -నేను కార్మికనేతను కాదు కనుక మిన్నకున్నాను

తరువాత యూదుల కోసం వచ్చారు -నేను యూదును కాదు కనుక నోరు విప్పలేదు

తరువాత నాకోసం వచ్చారు – నోరు విప్పేందుకు అప్పటికి నా వెనుక ఎవరూ లేరు

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారాల పెంపు తప్ప జనానికి వుపశమనం లేని బడ్జెట్‌

04 Saturday Feb 2017

Posted by raomk in Current Affairs, Economics, employees, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Budget 2017-18, Central budget 2017, Demonetisation, Economic Survey, GST

Image result for Budget 2017-18 Imposes Further Burdens, no relief on the People

ఎం కోటేశ్వరరావు

     ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అన్నట్లుగా ఇప్పుడు ప్రతి రోజూ బడ్జెట్‌ రోజుగా మారిపోయింది. మనకు బడ్జెట్‌ అంటే బ్రిటీష్‌ వారి సాంప్రదాయ ప్రకారం ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం అవుతుంది. ఏం మే ఒకటవ తేదీ నుంచి ఎందుకు ప్రారంభం కాకూడదు అని ఎవరైనా వాదనకు దిగితే విబేధించేందుకేమీ వుండదు. సాంప్రదాయానికి భిన్నంగా రుతువుకు ముందే కూసిన కోయిల మాదిరి కేంద్ర బడ్జట్‌ ఒక నెల ముందుగానే వచ్చింది. ఏడాదికి ఒకసారి దేశ సంపద పంపిణీకి చేసే కసరత్తే బడ్జెట్‌. ఇది సామాన్యులకు ఒక పట్టాన అంతుపట్టదు. మేథావుల తరగతిలో ఎంత మందికి అర్ధం అవుతుందన్నది పెద్ద ప్రశ్న. లెక్కించే పద్దతులలో తేడాలు, లోపాలు వున్నాయనే విమర్శలు, ఆరోపణలు ఎలా వున్నప్పటికీ మన దేశంతో సహా ప్రపంచమంతటా అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయన్నది పచ్చి నిజం.దవోస్‌లో ప్రపంచ కార్పొరేట్ల సమావేశాల సందర్భంగా ఆక్స్‌ఫామ్‌ అనే సంస్ధ విడుదల చేసిన వివరాల ప్రకారం ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సంపద ఎంత అంటే మన దేశంలో 40శాతం మంది పేదల సంపదకు సమానం. మన దేశంలోని రిలయన్స్‌ కంపెనీ అన్నదమ్ములలో పెద్ద వాడైన ముఖేష్‌ అంబానీ దగ్గర 30శాతం మంది సంపదకు సరిపడా వుంది. గత 70 సంవత్సరాలుగా మంచి, పురోగామి బడ్జెట్‌నే ప్రవేశపెట్టామని అధికారంలో కాంగ్రెస్‌, జనతా, బిజెపి ఇలా ఎవరున్నా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి అదే వాస్తవమైతే దేశంలో అసమానతలు ఇంతగా ఎందుకు పెరిగాయి? ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని అబద్దాలు చెబుతున్నా మేథావులు అర్ధం చేసుకోలేకపోతున్నారా లేక అర్ధమై తాము కూడా ఏనాటికైనా అంబానీలం కావాల్సిన వారిమే కనుక ఈ విధానాన్ని ప్రశ్నించటం, తప్పుపట్టకూడదనుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా ?

   ఎన్‌డిఏ ప్రభుత్వం 2017-18 సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. దాని మీద చర్చలు జరుగుతాయో, అసలు పార్లమెంట్‌ సమావేశాలే పద్దతిగా నడుస్తాయో లేదో తెలియదు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డిస్తున్న విధానం నుంచి మరలి గత రెండున్నర సంవత్సరాలుగా పారదర్శకమైన పద్దతిని పాటిస్తున్నట్లు మోడీ సర్కార్‌ బడ్జెట్‌లో పేర్కొన్నది. ఇప్పటికీ నరేంద్రమోడీని అభిమానిస్తున్నవారు మాకు కనిపిస్తోంది, మాకు కనిపిస్తోందని చెబుతున్నారు కనుక పుణ్యాత్ములకు మాత్రమే కనిపించే దేవతా వస్త్రాల వంటిదే ఇది అనుకోవాలి మరి. దూడగడ్డి కోసం తాడి చెట్టు ఎక్కామని చెప్పినట్లుగా ఒక నెల ముందుగానే బడ్జెట్‌ ప్రవేశ పెట్టటం గురించి అధికారపార్టీ సమర్ధన వుంది. బడ్జెట్‌ను ముందుగానే ప్రవేశ పెట్టనున్నట్లు గతేడాది సెప్టెంబరులోనే చెప్పామని, దీని వలన ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి పెట్టుబడుల చక్రం తిరగటం ప్రారంభమౌతుందని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అదే అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరేం ఖర్మ జనవరిలోనే ప్రవేశపెట్టి ఫిబ్రవరి నాటికి ఆమోదం పొందితే ఇంకా స్పష్టత వచ్చి ‘పెట్టుబడుల చక్రం ‘ పూర్తి స్ధాయిలో వేగంగా తిరుగుతుంది, రాష్ట్రాలకు వచ్చే నిధులేమిటో రానివేమిటో మరింత స్పష్టమై వాటి బడ్జెట్లను మరింత స్పష్టంగా రూపొందించుకోవటం కుదురుతుంది కదా ! అలా చేస్తే ఎవరు వద్దన్నారు ? కడుపులో దుష్ట ఆలోచన పెట్టుకొని పిల్లా గడ్డికొస్తావా అన్నట్లుగా ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల ప్రచారం కోసమే ఇది అన్నది అందరికీ తెలిసిన అసలు విషయం. కేంద్ర సర్కార్‌ పారదర్శకత బండారమిది.

    ఇక బడ్జెట్‌ తీరు తెన్నులు చూస్తే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా వుంది. కోర్టుకు చెప్పినట్లు ఏప్రిల్‌ ఒకటి నుంచి పెట్టుబడుల చక్రం తిరగటానికి దోహదం చేసే ఎలాంటి విప్లవాత్మక విధాన ప్రకటనలేమీ లేవు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా బడ్జెట్‌ను ఒక ప్రహసనంగా మార్చివేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ గురించి చెప్పాల్సిన పనేలేదు. ప్రత్యామ్నాయ పద్దతి లేకుండా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. ఈ ప్రభుత్వానికి ప్రతి దినమూ బడ్జెట్‌ రోజే. అందుకే ఈ మధ్య ఏ ఒక్క వాణిజ్య సంస్ధ కూడా బడ్జెట్‌ వస్తోంది ముందుగానే వస్తువులు కొనుక్కోండి అని ప్రకటనలు గుప్పించటం లేదు. బడ్జెట్‌, పార్లమెంటు ఆమోదంతో పనేమీ లేకుండానే ముందే విధాన ప్రకటనలు, పన్నులు, భారాలను వడ్డించి చూశారా భారాలు లేని బడ్జెట్‌ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాజా బడ్జెట్‌ కూడా అంతే. ఆర్ధిక మంత్రి ప్రసంగంలో డిజిటల్‌ ఎకానమీ అనే అంశం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. గతేడాది బడ్జెట్‌కు ముందు అంటే 2015 నవంబరులో కేంద్ర ప్రభుత్వం పది హేను రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ పెద్ద విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. తరువాత జనవరిలో స్టార్టప్‌, స్టాండప్‌ ఇండియాల పేరుతో ప్రధాని మరొక ప్రకటన చేశారు.సరే నవంబరు నెలలో చేసిన పెద్ద నోట్ల రద్దు అనే చారిత్రాత్మక నిర్ణయం గురించి చెప్పనవసరం లేదు. అది కూడా ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రచార వస్తువుగా వుపయోగించుకొనేందుకే అన్నది స్పష్టం.అన్నింటికీ మించి ఇలాంటి ప్రధాన నిర్ణయాలేవీ హల్వా వంటకంతో ప్రారంభిస్తున్నవీ, పార్లమెంట్‌లో చర్చించి చేస్తున్నవీ కాదు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ లేక బహుళజాతి కార్పొరేట్‌ సంస్ధల అజెండాలను తయారు చేసే సంస్ధల సలహాలు మొరటుగా చెప్పాలంటే ఆదేశాల ప్రకారం చేస్తున్నవి తప్ప మరొకటి కాదు. ఇది నరేంద్రమోడీ నూతన దారి కాదు, గతంలో మన్మోహస్‌ సింగ్‌ కూడా నడిచిన బాట అదే. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చినపుడు గానీ అసలు విషయాలు బయట పడవు. మోడీ సర్కార్‌ను గట్టిగా బలపరిచే ఒక వ్యాఖ్యాత ఈ ఏడాది రెండో బడ్జెట్‌ లేదా చిన్న బడ్జెట్‌ వుండదని చెప్పలేము అని పేర్కొన్నారు. ఆర్ధిక సంవత్సరం అక్టోబరుకు మారిపోనుందని చెప్పారు. అందువలన ఈ బడ్జెట్‌ అంకెలను చూసి భారాలు, రాయితీల గురించి చర్చించటం అసవసర ఆయాసం తప్ప మరొకటి కాదు.

Image result for Budget 2017-18 meme

    ఇది సమగ్రబడ్జెట్‌ కాదు అనేందుకు కారణాలు అందరికీ తెలిసినవే. ఇదే కాదు, అన్ని రాష్ట్రాల బడ్జెట్లు ఒక విధంగా మూడు లేదా ఆరునెలలకు అవసరమయ్యే ఖర్చులకు అనుమతి పొందే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ వంటివే. ఎందుకంటే వస్తు,సేవల పన్ను జూలై లేదా సెప్టెంబరు నుంచి అమలులోకి వస్తుంది. మన ఆదాయంలో సింహభాగం దాని నుంచే రావాల్సి వుంది. దాదాపు 1400 వస్తువులపై ఎంత పన్ను విధిస్తారో, దాని పరిధిలోకి రానివేవో ఇంకా తెలియదు. ఇదొక ప్రధాన కారణమైతే అమెరికా పద్దతుల్లో జనవరి నుంచి డిసెంబరు వరకు ఆర్ధిక సంవత్సరాన్ని కూడా మార్చాలని ఇప్పటికే ఒక కమిటీ చేసిన సిఫార్సు గురించి కూడా ఈలోగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌, అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధలన్నీ కూడా అదే కోరుతున్నాయి. అదే జరిగితే 2018 బడ్జెట్‌ ఏ సెప్టెంబరో, అక్టోబరులోనే ప్రవేశ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్‌, తరువాత మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, చత్తీస్‌ఘర్‌ ఎన్నికలు జరగాల్సి వుంది. ఇవన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలు. వాటి ఫలితాలు 2019లో జరిగే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఎన్నికల ఏడాది ఎలాగూ ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ మాత్రమే ప్రవేశపెడతారు. అంటే మోడీ సర్కార్‌కు 2018 బడ్జెట్‌ కీలకం, బహుశా ఆ కారణంగానే కావచ్చు, తాజా బడ్జెట్‌లో ఎలాంటి ప్రజాకర్షక ప్రతిపాదనలు చేయలేదు. ఇంత ముందుగా చేస్తే జనం మరిచిపోయే అవకాశం వుంది కనుక ఎన్నికల సంవత్సరాలలో అయితే తాము సొమ్ము చేసుకోవచ్చన్నది బిజెపి ఆలోచన.

   ప్రతి బడ్జెట్‌ సమావేశానికి ముందు ప్రభుత్వం తమ విధానాలు, విజయాల గురించి చెప్పుకొనేందుకు పార్లమెంట్‌ వుభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్వారా ఒక ప్రసంగం చేయిస్తుంది. మోడీ ప్రభుత్వ ‘ఘనత ‘ ఖాతాలో వేస్తారో మరొకదానిలో వేస్తారో తెలియదు గానీ అసాధారణ రీతిలో వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి ప్రసంగానికి 651 సవరణలు ప్రతిపాదించారు. ఇదొక రికార్డు అని చెప్పవచ్చు. వీటిలో మోడీ సర్కార్‌పై విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా పోరాడుతున్నట్లు చెబుతున్న కాంగ్రెస్‌ నుంచి ఒక్కటంటే ఒక్క సవరణ కూడా లేకపోవటం ఒక కిక్కు. గతంలో వేసిన కుర్చీలు చాలక అనేక మంది ఎంపీలు నిలబడి ప్రసంగాలను వినేవారని, తాజా ప్రసంగానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని మీడియాలో వ్యాఖ్యలు వెలువడ్డాయి. జన గణమణ పాడుతుండగానే కొందరు ఎంపీలు వెళ్లిపోవటం ప్రారంభించారని కూడా రాశారు. రాజ్యసభ సభ్యులు ప్రతిపాదించిన సవరణల్లో పెద్ద నోట్ల రద్దు గురించి రాష్ట్రపతి సరిగా చెప్పలేదన్నది ఒక ప్రధాన అంశం.ఈ సవరణల మీద ఓటింగ్‌ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం కూడా వుంది.

    ఇక బడ్జెట్‌ విషయానికి వస్తే తినబోతే ఆవుల్లో దున్నబోతే దూడల్లో అన్నట్లుగా వుంది. ఎగుమతులు ఎందుకు తగ్గాయంటే అంతర్జాతీయ పరిస్థితులు అంటారు, అదే నోటితో తమ ఘనత కారణంగా అభివృద్ధి బహుబాగుంది అని చెబుతారు. అంకెల గారడీ తప్ప ఇదెలా సాధ్యం ! మన ఆర్ధిక వ్యవస్ధ అధిక వృద్ది రేటుతో పురోగమిస్తున్నదని, కావాలంటే ఐఎంఎఫ్‌ కూడా చెప్పింది చూడమంటున్నారు. అన్నింటికీ శకునం చెప్పే బల్లి తానే కుడితిలో పడినట్లు అన్ని దేశాల గురించి జోశ్యం చెప్పే ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్ధలేవీ 2008 నుంచి ధనిక దేశాలను, తరువాత వాటి అడుగుజాడల్లో నడిచే మన వంటి దేశాలను పట్టి పీడిస్తున్న ఆర్ధిక సంక్షోభాన్ని పసిగట్టటంలో ఘోరంగా విఫలమయ్యాయి. అందువలన అవి చెప్పే జోశ్యాలను సమర్ధనకు తీసుకోవటం జనాన్ని తప్పుదారి పట్టించటమే.

     గతేడాది ప్రపంచంలో సంభవించిన ప్రధాన ఆర్ధిక, రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో పెద్ద అనిశ్చితిని ఎదుర్కోనున్నదని, 2017లో అమెరికాలో వడ్డీ రేట్లు పెంచే ఆలోచన వున్నందున వర్ధమాన దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు వచ్చే పెట్టుబడులు తగ్గవచ్చని, బయటకు వెళ్లే మొత్తాలు ఎక్కువ కావచ్చని, వస్తువుల ధరలలో అనిశ్చితి ముఖ్యంగా ముడి చమురు ధరల కారణంగా వర్ధమాన దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని, రక్షణాత్మక చర్యలు పెరుగుతున్న కారణంగా వస్తువులు, సేవలు, జనం విషయంలో ప్రపంచీకరణ వెనుక పట్టు పట్టే సూచనలు మన ముందున్న సవాళ్లని చెబుతూనే రాబోయే రోజుల్లో ఆర్ధిక వ్యవస్ధ బాగా పురోగమించనున్నదని చెప్పారు.

    అసలు ప్రణాళికా సంఘమే రద్దయింది కనుక 2017-18 బడ్జెట్‌లో ప్రణాళిక-ప్రణాళికేతర అనే విభజనే లేకుండా పోయింది. అందువలన వివిధ రంగాలకు కేటాయింపులు, గతంతో పోల్చుకోవటానికి వీలు లేకుండా పోయింది. రైల్వే బడ్జెట్‌ను రద్దు చేసి సాధారణ బడ్జెట్‌లో దాన్నొక శాఖగా కలిపివేశారు.లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. ఇది పంచపాండవులు-మంచం కోళ్ల కథను పునరావృతం చేసేట్లున్నది. తొలుత నల్లధనం ఆరులక్షల కోట్లని, తరువాత దానిని మూడు లక్షల కోట్లని అనధికారిక అంచనాలు చెప్పిన వారు ఇప్పుడు అసలు మాట్లాడటం లేదు. ఎందుకయ్యా అంటే బ్యాంకులకు తిరిగి వచ్చిన నోట్లను ఇంకా లెక్క పెడుతూనే వున్నారట. కొన్ని వార్తల ప్రకారం ఆగస్టులో రిజర్వు బ్యాంకు వార్షిక నివేదికలో మాత్రమే ఆ వివరాలు వెల్లడి అయ్యే అవకాశం వుంది. అయితే ప్రతిపక్షాలు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో అంత తేలికగా వదలవు గనుక ఈ సందర్భంగా అయినా వెల్లడి అవుతాయా అన్నది చూడాల్సిందే.

   పెద్ద నోట్ల రద్దు నల్ల ధనం వెలికితీతకే అని చెప్పినప్పటికీ చివరకు అది డిజిటల్‌ ఆర్ధిక లావాదేవీలను జనంపై బలవంతంగా రుద్ధేందుకు అన్నది స్పష్టమైంది. అదనపు భారం పడకుండా వుంటే నగదు రహిత లావాదేవీలను జరపటానికి జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. పేటిఎం, రిలయన్స్‌, తదితర కార్పొరేట్ల ఆదాయాలు పెంచటానికే అన్నది తేలిపోయింది. ప్రభుత్వమే ప్రతిదానికి వినియోగ చార్జీలు, సేవా పన్ను పేరుతో జనాన్ని బాదుతుంటే ప్రయివేటు సంస్ధలు అదీ కేవలం వడ్డీ వ్యాపారం చేసే బ్యాంకులు, బ్యాంకేతర ఆర్ధిక సంస్ధలు వుచితంగా సేవలు అందిస్తాయని నమ్మటానికి జనం చెవుల్లో పూలుపెట్టుకొని లేరు. నగదు రహిత లావాదేవీలు జరిగితే అవినీతి వుండదన్నది ఒక ఎండమావి. అవినీతికి-నగదు రహితానికి సంబంధం లేదు. అమెరికాలో 45శాతం నగదు రహితమే, అయినా అది ప్రపంచ నల్లధనానికి అగ్రస్ధానంలో వుంది, కెనడాలో 57, బ్రిటన్‌లో 52శాతం నగదు రహితమే, ఆ రెండూ ప్రపంచంలో నల్లధనంలో అగ్రస్ధానంలో వున్న పది దేశాలలో వున్నాయి. ఇక ప్రపంచంలో నల్లధన కుబేరులు, పన్నుల ఎగవేతదార్లందరికీ ఆశ్రయం కల్పిస్తూ, అవినీతిని ప్రోత్సహించే స్విడ్జర్లాండ్‌ వంటి దేశాల గురించి చెప్పాల్సిందేముంది. నరేంద్రమోడీ నోట్ల రద్దు నిర్ణయం తరువాత హైదరాబాదు వంటి అనేక పట్టణాలలో కొన్ని చిన్న దుకాణదారులు పోయిన వ్యాపారాన్ని రాబట్టుకొనేందుకు నగదు రహిత లావాదేవీలకోసం మిషన్లు పెట్టారు. ప్రస్తుతం నగదు సాధారణ స్థాయికి రావటంతో అనేక చోట్ల వాటిని ఎత్తివేశారు. జనాన్ని నగదు రహితం వైపు మళ్లించటానికి ఈ బడ్జెట్‌లో సహజంగానే పెద్ద పీట వేశారు. బ్యాంకుల్లో పది లక్షలు, ఆధార్‌తో లింక్‌ చేసే మరో 25లక్షల మిషన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. మూడులక్షల రూపాయల కంటే నగదు లావాదేవీలు జరపరాదనే నిర్ణయం రాబోయే రోజుల్లో చేయనున్నారు. అంతా బాగుందని ఒకవైపు చెబుతారు, మరోవైపు అభివృద్ధి వుద్దీపన పేరుతో పారిశ్రామిక సంస్ధలపై పన్ను రేటు తగ్గిస్తున్నారు.ఏటా యాభై కోట్లకు లోబడి లావాదేవీలు జరిపే వాటిపై ఆదాయపన్ను 25శాతానికి తగ్గించటం అదే. ఎన్నో ఆశలు పెట్టుకున్న వుద్యోగుల విషయానికి వస్తే ఇది వట్టిస్తరి మంచి నీళ్ల వంటిదే. ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయంపై పన్ను రేటు పది నుంచి ఐదు శాతానికి తగ్గించి పండుగ చేస్కోండి అన్నట్లుగా ఫోజు పెట్టారు. దీని వలన అంతకు మించి ఆదాయం వున్నవారికి 12,500 రూపాయలు తగ్గుతాయి. ఇంతకు మించి మరొకటి లేదు.

    బడ్జెట్‌ను మొత్తంగా చూస్తే వాస్తవాలను ప్రతిబింబించలేదనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు వలన అనేక మంది నష్టపోయారు. ఆ నష్టం గురించి ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వేలో ఆర్ధిక ప్రగతి మందగించిందని, వస్తువులు, సేవల డిమాండ్‌ పెద్ద ఎత్తున పడిపోయిందని, వుపాధిపోయిందని, వ్యవసాయ ఆదాయాలు పడిపోయాయని పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా అంతా బాగుందని బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి చెప్పారు. లోటు తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవటం గురించి గొప్పగా చెప్పారు. అసలు విషయం ఏమంటే ఖర్చు తగ్గించారు. వర్తమాన సంవత్సరం జిడిపిలో 13.4 శాతం మొత్తం బడ్జెట్‌గా వుంటే వచ్చేఏడాది దానిని 12.7శాతానికి తగ్గించారు.మొత్తం ఆదాయం 9.4శాతం వస్తుందనుకుంటే సవరించిన బడ్జెట్‌లో తొమ్మిదిశాతానికి తగ్గించారు. అయితే కార్పొరేట్‌లకు ఇచ్చిన రాయితీలు మాత్రం అంచనాల కంటే 30వేల కోట్ల రూపాయలు పెరిగాయి. తక్కువ మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించేవారికి 20వేల కోట్లరూపాయల వరకు భారం తగ్గించినప్పటికీ పరోక్ష పన్నుల ద్వారా జనంపై 75వేల కోట్ల మేరకు అదనపు భారాన్ని ప్రతిపాదించారు. ఈ ఏడాది కూడా చమురు వుత్పత్తులపై అధిక ఎక్సయిజ్‌ డ్యూటీ ప్రాతిపదికన ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రతిపాదించారు. అంటే గత మూడు సంవత్సరాలలో పెంచిన పన్ను తగ్గేది లేదన్నది స్పష్టం. ఇండ్ల నిర్మాణానికి రాయితీల ప్రకటన ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో తెలియదుగానీ రియలెస్టేట్‌ రంగంలో కాపిటల్‌ గెయిన్‌ పన్ను ప్రాతిపదిక సంవత్సరాన్ని 1981 నుంచి 2001కు మార్చటం ద్వారా ఆ రంగంలోని బడా పెద్దలకు విపరీత లాభాలు సమకూర్చేందుకు వీలుకల్పించారు. షెడ్యూలు తెగల సంక్షేమానికి 1.48శాతం, షెడ్యూలు కులాల వారికి 2.44 శాతాల మొత్తమే మొత్తం బడ్జెట్‌లో కేటాయించారు. వారి జనాభాతో పోల్చితే ఇది చాలా తక్కువ. జనాభాలో సగానికి పైగా మహిళలు వున్నప్పటికీ లింగ ప్రాతిపదికన బడ్జెట్‌లో కేటాయింపు కేవలం 5.3శాతమే వుంది.

   వుపాధి హామీ పధకానికి కేటాయింపు 48వేల కోట్లకు పెంచినట్లు చెప్పినా వాస్తవానికి గతేడాది చేసిన ఖర్చు 47.5వేల కోట్లకు దగ్గరగానే వుంది తప్ప తగినంత పెంపుదల లేదు.విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణ్యంగా పెంపుదల లేదు. 2016-17లో 2.2శాతం అని నిర్ణయించినా సవరించిన అంచనా 2.16కు తగ్గింది. రైతుల ఆదాయాలను ఐదు సంవత్సరాలలో రెట్టింపు అని జపం చేయటం తప్ప అందుకు నిర్ధిష్ట చర్యలు లేవు. గతబడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి కేటాయించిన 1.98శాతంలో సవరించిన అంచనా పకారం 1.95శాతం కంటే ఖర్చయ్యే అవకాశం లేదు. మౌలిక సదుపాయాల పరిస్ధితి కూడా ఇంతే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుడకకే వుడకకే ఓ వుల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపు పోదు !

16 Monday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Father of the Nation, Gandhi's Charkha Pose, KVIC, KVIC calendar, Mahatama Gandhi, mahatma, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

    తెల్లగా వున్నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా, వుప్పు కప్పురంబు చూడ ఒక్కటిగ నుండు చూడ చూడ రుచుల జాడ వేరయా అన్న ప్రఖ్యాత తెలుగు సామెతలు, సామ్యాల గురించి చాలా మంది వినే వుంటారు. నా చిన్న తనంలో ఫొటో తీయించుకోవటం అన్నది చాలా మందికి ఒక తీరని కల. తిరునాళ్లకు వెళ్లినపుడు లేదా పట్టణాలకు వెళ్లినపుడు అక్కడ స్టూడియోలకు వెళితే మోటారు సైకిలు మీద, గుర్రం మీద కూర్చున్నట్లు ఫొటోలు తీయించుకుంటే చెప్పలేని ఆనందం. ఎందుకంటే అవి ఆ నాడు సామాన్యులకు అందుబాటులో వుండేవి కాదు. ఎవరైనా గ్రామానికి మోటార్‌ సైకిల్‌ మీద వస్తే గ్రామం మొత్తం అబ్బో అన్నట్లుగా చూసేది, ఒకప్పుడు బైసికిలు(సైకిల్‌ను బైసికిలుగా ఆమె నోట మొదటిసారి విన్నాను) ఎక్కినపుడు కూడా అలాగే చూసేవారని మా తాతమ్మ చెప్పేది.

   ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీకి కూడా అలాంటి సరదాయే కలిగిందా అన్న అనుమానం వస్తోంది. లూధియానాలో జరిగిన ఒక కార్యక్రమంలో మహాత్మా గాంధీ మాదిరి చరఖా ముందు కూర్చొన్నపుడు తీసిన ఫొటోను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌, డైరీలపై ముద్రించారు. అసలు ఖాదీ అంటే సామాన్యులు వాడే ముతక రకం వస్త్రం. ఇస్త్రీ లేకుండా ఖాదీ దుస్తులు ధరిస్తే అదేదో సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు. ఇప్పుడు ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీవరకు చిల్లర రాజకీయాలు చేసే వారు, ఫ్యాన్సీగా ధనికులు తప్ప సామాన్యులెవరూ వాడటం లేదు. వాటిని ధరించి పొలాల్లో, ఫ్యాక్టరీలలో పనిచేసే సామాన్యులెవరూ మనకు కనిపించరు. ఖద్దరు మాదిరి కనిపించే మర మగ్గాలు లేదా మిల్లు వస్త్రాలు మార్కెట్‌లో ఖాదీగా చెలామణి అవుతున్నాయన్నది కూడా వాస్తవమే.

    ఇక నరేంద్రమోడీ ఫొటోలంటే పడి చస్తారనేది ఇప్పటికి అనేక సందర్భాలలో రుజువైంది. ప్రధాన మంత్రి కనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం వున్న ఏ శాఖ లేదా సంస్ధ కాలండర్‌లో అయినా ఫొటో వేయటాన్ని తప్పుపట్టనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో జనంలో స్వాతంత్య్ర కాంక్ష రగిల్చేందుకు గాంధీ ఖాదీ తయారీని విదేశీ వ్యతిరేక స్వదేశీ వుద్యమంగా చేెపట్టారు, స్వయంగా వడికారు. గాంధీ అంటే ఖాదీ, ఖాదీ అంటే గాంధీ అన్న నానుడి వునికిలోకి వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీ విదేశీ వస్తువులకు మన తలపులను మరింత బార్లా తెరిచి తానొక బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాలనుకుంటున్నారు. దేశానికి ఏ మాత్రం వుపయోగపడినా కూడా తప్పులేదు. అంబానీ జియో వేదిక, ప్రకటనలు చూస్తే మనకు అది కనిపిస్తుంది. ఖాదీ విషయంలో ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో, ప్రధానిగా దేశంలో ప్రత్యేకంగా చేసిందేమీలేదు. ఖాదీ నూలు వడికే వారి బతుకుల దైన్య స్ధితే అందుకు నిదర్శనం. తాజా వివాదానికి వస్తే ఖాదీ సంస్ధ కాలెండర్‌పై గాంధీని అనుకరించిన ఫొటో వేయటమే అభ్యంతరకరం. చారిత్మ్రాత్మక గాంధీ ఫొటోకు, నరేంద్రమోడీ పాల్గొన్న ఒక సభలోని చిత్రానికి తేడా ఏమిటంటే ఆయన చొక్కా వేసుకోలేదు, సాదాసీదాగా నిజంగా నూలు వడుకుతున్నపుడు తీసింది. మోడీది డిజైన్డ్‌ చరఖా, ఖాదీ చొక్కా, కుర్తా వేసుకుకొని ఫొటో కోసం ఫోజిచ్చిన చిత్రం. అందుకే చూసే వారికి మొదటి ఫొటో సహజంగా కనిపించింది, రెండవ చిత్రం ఎబ్బెట్టుగా వుంది. బహిరంగ సభలలో మిత్రోం అంటూ సంబోధించే ఫొజుతో వున్న ఏ ఫొటోను అయినా ఒకవైపు, రెండవ వైపు గాంధీ ఫొటోను కాలండర్‌పై ముద్రించి వుంటే ఇంతటి వివాదం తలెత్తి వుండేది కాదు.

   ఖాదీ సంస్ధ కాలండర్‌పై గాంధీ చిత్రాన్ని తొలగించి మోడీ బొమ్మ ముద్రించటంతో అనేక మంది మనోభావాలు గాయపడ్డాయి . అయితే మాకేంటి అంటారా పోనీ అదైనా చెప్పండి. కాలండర్‌పై గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రం పెట్టటాన్ని ఖాదీ సంస్ధ సమర్ధించుకున్న తీరు చిత్రంగా వుంది. ప్రధాని బొమ్మ పెట్టి ఆయన అనుగ్రహం పొందేందుకు ఖాదీ సంస్ద అధికారులు ప్రయత్నిస్తే వారి చర్యను సమర్ధించి నరేంద్రమోడీ కార్యాలయం ప్రజల మనోభావాలను గాయపరిచింది. ఇక హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజె అర్‌ఎస్‌ఎస్‌ పరివార అంతరంగాన్ని బయటపెట్టారు.

   తమ చర్యను ఖాదీ కమిషన్‌ అడ్డంగా సమర్ధించుకొంటోంది. ‘ గాంధీ తత్వశాస్త్రం, ఆశయాలు, ఆలోచనల ప్రాతిపదికనే మొత్తం ఖాదీ పరిశ్రమ ఏర్పడింది. ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌ ఆత్మ ఆయన, అలాంటి గాంధీని విస్మరించే ప్రశ్నే లేదు. నరేంద్రమోడీ ఎంతో కాలం నుంచి ఖాదీని ధరిస్తున్నారు. ఖాదీతో తన స్వంత శైలిని అభివృద్ధి చేసుకుంటూ సామాన్య జనంలోనూ విదేశీ అతిధులలోనూ ఎంతో ప్రాచుర్యం కల్పించారు. వాస్తవానికి ఆయన ఖాదీకి అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌, ఆయన భావనలు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌కు సరిపోయాయి. బొమ్మల ముద్రణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు, సాంప్రదాయాలు లేవు, గతంలో కూడా ముద్రించని సందర్భాలు వున్నాయని’ కమిషన్‌ చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా చెప్పారు. ప్రధాని కార్యాలయం కూడా అనవసరమైన రచ్చ అంటూ కొట్టి పారవేసిందని, 1996, 2005, 2011,12,13, 16లో గాంధీ ఫొటో లేదని, కాంగ్రెస్‌ యాభై సంవత్సరాల పాలనలో రెండు నుంచి ఏడుశాతం చొప్పున మాత్రమే ఖాదీ అమ్మకాలు పెరిగాయని అదే గత రెండు సంవత్సరాలలో 34శాతం పెరిగాయంటే ఖాదీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మోడీ చేసిన యత్నాలే కారణమని కార్యాలయ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానిలో వాస్తవాంశాల కొస్తే మోడీ హయాంలో పెరుగుదల ఏడుశాతమే తప్ప 34శాతం కాదని వార్తలు వచ్చాయి. మిగతా విషయాల కొస్తే కార్యాలయ వర్గాలు పేర్కొన్న ప్రకారమైనా కొన్ని తప్ప మిగతా సంవత్సరాలన్నీ గాంధీ బొమ్మనే ముద్రించారు, ఆయన బోధనలనే ప్రచురించారు తప్ప, దాని బదులు మరొక ప్రధాని బొమ్మను ముద్రించినట్లు , వేరే వారి సుభాషితాలను పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం, ఖాదీ కమిషన్‌గానీ చెప్పలేదు. మోడీ ఖాదీ ధరిస్తారు కనుక అమ్మకాలు ఎక్కువ అవుతాయన్నది మరొక వాదన, మిగతా ప్రధానులెవరూ ఖాదీ ధరించలేదా ? చేనేత, ఖాదీ ధరించమని ఏదో ఒక సందర్భంలో చెప్పలేదా ?

    సేనాని అయిన ప్రధాని కార్యాలయమే సమర్ధనకు దిగిన తరువాత సైనికులు మామూలుగా వుంటారా ? ఆదివారం నాడు హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజ్‌ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించినప్పటి నుంచి దాని విలువ తగ్గిపోతున్నదని, అందువలన వాటిపై కూడా క్రమంగా ఆ బొమ్మ అంతరించిపోతుందన్నాడు.ఖాదీతో గాంధీ పేరు ముడిపడివున్నంత కాలం దాని అమ్మకాలు పెద్దగా లేవు, తగ్గిపోయాయి. కాలండెర్‌పై బొమ్మ తీసివేయటం మంచి పని.మోడీ బొమ్మ పెట్టిన తరువాత 14శాతం పెరిగాయని అనిల్‌ వ్యాఖ్యానించాడు. వాటిపై విమర్శలు రావటంతో హర్యానా ముఖమంత్రి ఖట్టర్‌ ఒక ప్రకటన చేసి అవి అతని వ్యక్తిగత వ్యాఖ్యలని కొట్టిపారవేశారు. పార్టీకి సంబంధం లేదన్నారు. తరువాత తాను అన్న మాటలను వుపసంహరించుకున్నట్లు అనిల్‌ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. బిజెపి నేతలు ఇలాంటి వదరుబోతు వ్యాఖ్యలు చేయటం తరువాత వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించటం ఒక ఎత్తుగడ, ఒక అలవాటు. కడుపులో వున్నదే బయటికి వస్తుంది తప్ప వేరొకటి కాదు. వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటికీ అవి తిరుగుతూ వాటిపని అవి చేస్తాయి.

  ఖాదీ వినియోగం పెంపుదలకు నరేంద్రమోడీ ఎంతగానో కృషి చేస్తున్నారనేది ఒక ప్రచారం మాత్రమే. గ్రామాలలో ఖాదీ దారాలను తయారు చేసే కార్మికులకు కనీసవేతనాలు కూడా రావటం లేదని రోజుకు 125-150 మాత్రమే వేతనం వస్తున్నట్లు కొందరు పరిశోధకులు మూడు నెలల క్రితం తమ పత్రంలో ప్రకటించారు.

   కాళ్లు తుడుచుకునే పట్టాలను మన జాతీయ పతాక రంగులు, చిహ్నంతో తయారు చేసి విక్రయించటాన్ని వెంటనే నిలిపి వేయాలని, భారతీయుల మనోభావాలను గౌరవించాలని అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజం అమెజాన్‌ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఈ మేరకు మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముందు ఒక ట్వీట్‌ చేసి పాలనా పద్దతుల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. వుపసంహరించకపోతే అమెజాన్‌ కంపెనీ అధికారుల వీసాలను పునరుద్ధరించబోమని హెచ్చరించారు. తరువాత విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని మన రాయబారిద్వారా అమెజాన్‌ కంపెనీకి నిరసన తెలియ చేయమని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని అమెజాన్‌ కంపెనీ చెప్పిందనుకోండి. నిజానికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా ట్విటర్‌ ద్వారా హెచ్చరించటం విశేషం.మన జాతీయ జెండాను అలా వుపయోగించటం చట్టరీత్యా నేరమే కాకుండా, మన మనోభావాలను దెబ్బతీసిన అంతర్జాతీయ వాణిజ్య సంస్ధకు హెచ్చరికలు చేసిన పాలకులు గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రాన్ని పెట్టి మనోభావాలను గాయపరచటాన్ని ఏమనాలి?

    గాంధీని చంపిన గాడ్సే వారసులు తామరతంపరగా చెలరేగుతున్న ఈ తరుణంలో అలాంటి గౌరవం జాతిపితకు ఇస్తారని ఆశించటమే అసహజం. గాంధీ, గాంధీయిజానికి మేము వ్యతిరేకం, దాన్ని ఏడు నిలువుల లోతున పాతేస్తాం, అందుకే గాంధీని జనం మరిచిపోయేట్లు చేయదలచుకున్నాం అని నిజాయితీగా ప్రకటించి చేస్తే అదో పద్దతి. అలాగాక కొందరు అంటున్నట్లు చరఖా ముందు కూర్చొని గాంధీని అనుకరించి ఫొటోలు దిగితే నరేంద్రమోడీ మహాత్ముడు అవుతారా, ఆయనపై పడిన మచ్చలు తొలుగుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌ ద్వారా రష్యాతో రాజీకి అమెరికన్లు ప్రయత్నిస్తున్నారా ?

14 Saturday Jan 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

anti-Beijing, Beijing, China, Donald trump, Moscow, RUSSIA, Vladimir Putin, Washington, Washington’s new pro-Moscow

ఎం కోటేశ్వరరావు

    భవిష్యత్‌లో తమ దేశం ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతుందని , దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి అబద్దాలకోరుగా పేరు తెచ్చుకున్న ఒక అధ్యక్షుడిని తమ వారసులు ఎన్నుకుంటారని గానీ 240 సంవత్సరాల క్రితం స్వాతంత్య్ర సాధనకు పోరాడిన అమెరికన్లు అస్సలు వూహించి వుండరు. వారి చరిత్రలో ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించకుండా, ఏ విధానాన్ని అమలు జరపకుండానే ప్రజలలో పలుకుబడి కోల్పోయి, వివాదాల మధ్య నూతన అధ్యక్షుడు వైట్‌ హౌస్‌లో ఆశీనుడౌతాడని గానీ ఏమాత్రం ఆలోచించి వుండరు. ఇదే సమయంలో ట్రంప్‌ వ్యవహరిస్తున్న అపారదర్శక తీరును చూస్తే తరుణం రాకుండానే ముందే కూసిన కోయిల మాదిరి కొంత మంది విశ్లేషకులకు రష్యాతో అమెరికా పాలకవర్గం సయోధ్యకు అమెరికా పాలకవర్గం పావులు కదుపుతోందా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. వర్తమాన పరిస్థితులలో అది సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా బలంగానే వున్నాయి. ప్రతిదానికీ అయితే గియితే అనే మినహాయింపులు, బొమ్మా బొరుసులూ వున్నప్పటికీ ఎత్తుగడలు, తాత్కాలికంగానే అయినా అంతర్జాతీయ పరిణామాలలో ఏదీ అసాధ్యం కాదని గత చరిత్ర రుజువు చేసింది.

    సాధారణ జనం ఓట్లలో మైనారిటీ, అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీలో మెజారిటీ తెచ్చుకొని అధ్యక్షుడిగా ఎన్నికై ఈ నెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించబోయే డోనాల్డ్‌ ట్రంప్‌ తొలి సారిగా, పదవి నుంచి దిగిపోయే బరాక్‌ ఒబామా కొద్ది రోజుల క్రితం చివరి విలేకర్ల సమావేశాలు నిర్వహించారు. గత ఎనిమిది సంవత్సరాల ఏలుబడిని అమెరికన్లతో పాటు ప్రపంచమంతా చూసింది గనుక పదవి నుంచి దిగిపోయే ఒబామా చెప్పిన దానిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. మొత్తం పదవీ కాలమంతా దేశాన్ని దురాక్రమణ యుద్ధాలలో నిమగ్నం చేసి, కోట్లాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేసి తగుదునమ్మా అంటూ ప్రపంచ శాంతి బహుమతి స్వీకరించి నోబెల్‌నే అపహాస్యం చేసిన పెద్దమనిషిగా చరిత్రకెక్కాడు. తొలి పత్రికా గోష్టి కంటే ముందే తన మంత్రులను ఎంపిక చేసిన తీరు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన విధానాలు ఎలా వుండబోతున్నాయో ట్రంప్‌ స్పష్టం చేశారు కనుక తనపై వార్తలు రాసిన కొన్ని మీడియా సంస్ధలకు హెచ్చరికలు చేయటం మినహా పత్రికా గోష్టిలో సరికొత్తగా చెప్పిందేమీ లేదు.

    నిత్యం అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడి కొట్టుకు చచ్చినట్లుగా అమెరికా గూఢచార సంస్ధల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ప్రతి దేశ అంతర్గత వ్యవహారాలలో ఏదో ఒక రూపంలో జోక్యం చేసుకొని, తన పలుకుబడి, ప్రభావాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు ఎదుర్కొనే అమెరికా ఇప్పుడు తమ వ్యవహారాలలో రష్యా జోక్యం గురించి అవుననీ, కాదనీ చెప్పలేక కొట్టుమిట్టాడుతున్న స్ధితిలో వుంది. అది కూడా నాటకంలో అంతర్నాటకం కూడా కావచ్చునని కొందరు అనుకోవచ్చు. నిత్యం మనం చూసే హాలీవుడ్‌ సినిమాలలో సిఐఏ, ఎఫ్‌బిఐ ఏజంట్లు ఎంతో తెలివిగలవారు , అంతిమ విజయం సాధించేవారుగానూ, మిగతా ప్రపంచ దేశాల వారంతా తెలివితక్కువ వాజమ్మలుగా చిత్రించి చూపుతారు. ఇప్పుడు రష్యన్ల ప్రమేయం గురించిన వివాదంలో అమెరికా నిఘా సంస్ధల అధికారులు పరస్పర విరుద్ధంగా చెబుతూ నగుబాట్ల పాలవుతున్నారు. ఎన్నికల సందర్భంగా రష్యన్‌ గూఢచారులు డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలకు సంబంధించిన వ్యక్తిగత రంకు బొంకులు, వ్యాపారలావాదేవీలు, ఇతర విషయాలన్నింటినీ సేకరించారట. అయితే డోనాల్డ్‌ ట్రంప్‌కు విజయం చేకూర్చేందుకు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారి సమాచారాన్ని మాత్రమే బహిర్గతం చేశారన్నది ఒక కథనం. దౌత్యపరమైన ఎత్తులు జిత్తులలో అదొక భాగం కావచ్చు. అనేక ప్రపంచ వ్యవహారాలలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు అనుసరించిన రష్యా వ్యతిరేక వైఖరికి బదులు తీర్చుకొనేందుకు, తాము తలచుకొంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలనే ప్రభావితం చేయగలమని ప్రపంచానికి తెలియ చెప్పేందుకు కావచ్చు. తాము కోరుకున్న డెమోక్రటిక్‌ పార్టీ ఓడిపోయి డోనాల్ట్‌ ట్రంప్‌ ఎన్నికయ్యాడు కనుక అతగాడిని కూడా అదుపులో పెట్టుకొనేందుకు ఆ పెద్దమనిషి బలహీనతలు, రంకు, బొంకులు తదితర సమాచారం కూడా తమ దగ్గర వుందని సంకేతాలు, శాంపిల్‌ సమాచారాన్ని పంపి బ్లాక్‌ మెయిలు చేసేందుకు పూనుకుందన్నది మరొక ఆరోపణ.

   అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లు ఇప్పుడు అమెరికాలో ఎవరు ఏం మాట్లాడినా చివరికి దీని దగ్గరకే వస్తున్నది. ఏ యుద్ధంలో అయినా ముందు బలయ్యేది సత్యం. ఇప్పుడు అమెరికాలో కూడా అదే జరుగుతోంది. విరుద్ధ కథనాలు, సమాచారాలతో జుట్టుపీక్కొనే పరిస్థితి. జోక్యం చేసుకున్నట్లు గూఢచార సంస్ధలు నివేదించాయి, అయితే వాటి దగ్గర ఆధారాలు లేవు. నిజమే అని అంగీకరించటం ట్రంప్‌కు ఇబ్బంది, అమెరికా పరువు పోతుంది. కాదని ఖండిస్తే డెమోక్రటిక్‌ పార్టీ, దాని అనుకూల మీడియా వెల్లడిస్తున్న కధనాలకు సరైన సమాధానం లేదు. తనపై రష్యా సేకరించిందన్న సమాచారం గురించి కథనాలు గుప్పించిన మీడియా సంస్ధలపై ట్రంప్‌ తన అధికారిక తొలి పత్రికా గోష్టిలో విరుచుకుపడ్డారు.బజ్‌ఫీడ్‌ అనే ఆన్‌లైన్‌ మీడియా ట్రంప్‌కు సంబంధించి రష్యన్ల దగ్గర వున్నదనే పేరుతో 35పేజీల సమాచారాన్ని ప్రచురించింది. అదంతా చెత్త అంటూ దీనికి గాను ఆ సంస్ధ పర్యవసానాలను అనుభవిస్తుందని ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. ఆ సమాచారమంతా పిల్లలు ఆడుకొనేందుకు దుకాణాల్లో కొనే ఆట కరెన్సీ నోట్ల వంటిది తప్ప మరొకటి కాదని సిఐఏ మాజీ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అది వాస్తవమేనని ఎఫ్‌బిఐ అభిప్రాయపడినట్లు మీడియా రాసింది. తాము ప్రచురించిన అంశాలకు కట్టుబడి వున్నామని, ఏది నిజమో కాదో పాఠకులకు వదలి వేస్తున్నామని బజ్‌ఫీడ్‌ సంపాదకుడు ప్రకటించాడు. ప్రజావేగు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఇచ్చిన ఆశ్రయానికి కృతజ్ఞతగా అతనే రహస్య సమాచారాన్ని రష్యన్లకు అందచేసినట్లు కొందరి అనుమానం. రష్యన్లు తమ వద్ద వున్న సమాచారాన్ని అమెరికన్‌ ఏజన్సీలకు చేరవేసే ముందు ట్రంప్‌ వ్యతిరేకులకు కూడా అందించినట్లు వార్తలు వచ్చాయి. తమ అధ్యక్షుడికి రష్యాతో వున్న సంబంధాల గురించి స్పష్టత వచ్చేంతవరకు మీరు ఎలాంటి సమాచారాన్ని అధ్యక్ష భవనం, జాతీయ భద్రతా మండలికి గానీ అందచేయవద్దని, అ సమాచారం రష్యా ద్వారా ఇరాన్‌కు చేరే అవకాశం వుందని అమెరికా నిఘా సంస్ధల అధికారులు ఇజ్రాయెల్‌ సంస్ధలకు చెప్పినట్లు, అది తెలిసి ఇజ్రాయెలీలు నెత్తీనోరు బాదుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. నాటకాన్ని రక్తి కట్టించేందుకు , ట్రంప్‌ను కాపాడేందుకా అన్నట్లు ఆ సమాచారం వాస్తవం కాదని రష్యన్‌ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అయినా సరే దాని మీద రగడ కొనసాగటాన్ని చూస్తే మొత్తం మీద ఎంతో సమర్ధులమని విర్రవీగే అమెరికన్లను ప్రపంచం ముందు వెర్రివారిగా మార్చి రష్యన్లు వినోదం చూస్తున్నారన్నది స్పష్టం.

   రష్యన్లు ట్రంప్‌కు అనుకూలంగా , తమకు వ్యతిరేకంగా వ్యవహరించారనే వుక్రోషంతో హాకింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ 35 మంది దౌత్య సిబ్బందిని తన చివరి చర్యగా ఒబామా సర్కార్‌ బహిష్కరించింది. మామూలుగా అయితే అంతే సంఖ్యలో అమెరికా సిబ్బందిని కూడా రష్యా బహిష్కరించి వుండాలి. అయితే తనదైన దౌత్యనీతిని ప్రదర్శించిన పుతిన్‌ ఆపని చేయకుండా ట్రంప్‌ ఎలా వ్యవహరిస్తాడో చూస్తామంటూ బంతిని ట్రంప్‌ కోర్టుకు నెడుతూ ప్రకటన చేశాడు. పుతిన్‌ ఎంతో హుందాగా వ్యవహరించాడంటూ ట్రంప్‌ స్పందించాడు. ఈ వ్యవహారంలో వెలువడుతున్న పలు విశ్లేషణలు అనేక కొత్త కోణాలను జనం ముందుంచుతున్నాయి. వాటిని పూర్తిగా నమ్మటం లేదా కొట్టి పారవేయకుండా పరిశీలించటం అవసరం.

   అధికారమే పరమావధిగా వుండే పార్టీలు, శక్తులకు శాశ్వత మిత్రులు, శత్రువులు అంటూ ఎవరూ వుండరు. సరే సిద్దాంతాలు, కట్టుబడి వుండటాల గురించి ఆశించకూడదనుకోండి. ఏదో ఒక సాకుతో ఆయారాం గయారాంలు ఎక్కడ అధికారం వుంటే అక్కడికి చేరతారు. తమ మంద పెద్దదిగా వుందా లేదా అని తప్ప చేర్చుకొనే వారికి కూడా సిగ్గూ ఎగ్గూ వుండదు. అలాంటి వారిని జనం ఎందుకు ఎన్నుకుంటున్నారన్న ఒక ప్రశ్న ఎలాగూ వుండనే వుంటుంది. అధికారం, దాని కొమ్ముకాసే కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కమ్యూనిస్టు మినహా మిగిలిన పార్టీలన్నీ దేనికైనా పాల్పడతాయి. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు తమ ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి తమ లాభాలకు వుపయోగమా కాదా అని చూస్తారు, సత్తా వుందనుకుంటే దెబ్బలాడుకుంటారు, లేదనుకుంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ రాజీపడతారన్నది ప్రపంచ చరిత్ర సారం. కొందరి విశ్లేషణ ప్రకారం ప్రపంచ పరిణామాలలో అమెరికా సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నదనే అనుమానం కూడా వ్యక్తమౌతున్నది.

    రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్లు ఆసియాలో జపాన్‌పై దాడి చేశారు. అవసరం లేకపోయినా అణు బాంబులు వేసి ప్రపంచం మొత్తాన్ని బెదిరించారు. జపాన్‌ , ఐరోపాలో జర్మనీ మిలిటరీనికూడా రద్దు చేసి నాటో పేరుతో రక్షణ, పునరుద్ధరణ బాధ్యతల్లో అమెరికా తెరవెనుక వుండి పెద్దన్న పాత్ర పోషిస్తోంది. మిలిటరీ ఖర్చు లేకపోవటంతో అందుకయ్యే మొత్తాన్ని పరిశోధన-అభివృద్ధి, పారిశ్రామిక రంగానికి మరల్చి ఆర్ధిక రంగంలో అమెరికాతో ధీటుగా జపాన్‌,జర్మనీలు తయారయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు అంతరించటంతో వర్ధమాన దేశాల మార్కెట్లలో కొత్త పద్దతులలో ఎలా ప్రవేశించటమా అన్న ప్రపంచ బడా పెట్టుబడిదారుల ఆలోచన నుంచి పుట్టిందే ప్రపంచీకరణ. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌-చైనాల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల సమస్యల పూర్వరంగంలో తమ దేశంలో ప్రయివేటు పెట్టుబడులను అనుమతించేందుకు చైనా సంస్కరణల బాట చేపట్టింది. దాంతో అతి పెద్ద చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికన్లు ఐక్యరాజ్యసమితిలో కమ్యూనిస్టు చైనాను అసలైన ప్రతినిధిగానే గాక, తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమనే వైఖరిని తీసుకున్నారు.

   పెట్టుబడిదారులు ఎప్పటికప్పుడు లాభాల కోసం తమ పద్దతులను మార్చుకుంటూ వస్తున్నారు. మార్కెట్లను పంచుకొనే పోటీలో భాగంగా సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు దశాబ్దాల కాలానికే రెండవ ప్రపంచ యుద్ధానికి సామ్రాజ్యవాదులు తలపడ్డారు. ఆ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసల శకం ముగియటం, బలమైన సోషలిస్టు శిబిరం ఏర్పడటంతో సామ్రాజ్యవాదులు తమ దురాక్రమణ ఎత్తుగడలను, రూపాలను మార్చారు. గతంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటివి తమ దేశాలలో తయారైన పారిశ్రామిక వస్తువులను మన వంటి తమ వలస దేశాలలో విక్రయించి, అవసరమైన ముడిసరకులను దిగుమతి చేసుకొని రెండువైపులా లాభాలను ఆర్జించేవి. ఇప్పుడు తాము ప్రత్యక్షంగా వస్తూత్పత్తిని చేయకుండా, ముడి సరకులను దిగుమతి చేసుకోకుండా కేవలం ఆయుధాల వంటి వాటిని మాత్రమే తయారు చేసి విక్రయిస్తూ పెట్టుబడిని, కొంత మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు తరలించి అక్కడి కార్మికుల చౌక శ్రమ శక్తితో వస్తూత్పత్తి చేసి వాటిని తమ మార్కెట్లకు దిగుమతి చేసుకొని లాభాలు పొందటం ప్రారంభించారు. అందుకే అమెరికా, ఐరోపా ధనిక దేశాల దుకాణాలన్నింటా చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాల తయారీ వస్తువులే వుంటున్నాయి. తమ వద్ద ఇంకా మిగిలి వున్న డాలర్లను వర్ధమాన దేశాల స్టాక్‌ మార్కెట్లలో వాటాల క్రయ విక్రయాలతో ఎలాంటి పరిశ్రమలు, వ్యాపారాలు, కార్మికులు, వుద్యోగులు లేకుండానే లాభాలు సంపాదిస్తున్నాయి.

    ఈ క్రమంలో ధనిక దేశాలలో వస్తూత్పత్తి పడిపోయి, ఆధునిక పరిశ్రమలలో రోబోట్ల వినియోగం పెరిగి కార్మికులకు వుపాధి తగ్గిపోయి సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. చైనా తన వద్ద వున్న అపార మానవ శక్తిని పెట్టుబడిగా పెట్టి జనానికి వుపాధి కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచటంతో పాటు ప్రపంచం సంపదలలో రెండవ స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టింది. ఆ పోటీలో అమెరికాతో పోటీ పడుతూ దాని మొదటి స్దానానికి సవాలు విసురుతోంది. అంతర్జాతీయ పరిణామాలలో తనకు పోటీగా మారవచ్చనే భయం అమెరికన్లకు పట్టుకుంది. ఈ పూర్వరంగంలో దానిని కట్టడి చేసేందుకు సైనికంగా చైనా చుట్టూ తన స్థావరాలతో పాటు మిత్రులను సమీకరిస్తోంది.

    ప్రస్తుతం పెద్ద సరిహద్దు వున్న రష్యాతో చైనాకు ఎలాంటి పేచీలు లేవు. రెండు దేశాల మధ్య శతృత్వం కూడా లేదు. ఈ పూర్వరంగంలో రష్యాను కూడా తనతో కలుపుకొనే అవకాశాల గురించి అమెరికన్లు ఆలోచిస్తున్నారనేది ఒక విశ్లేషణ. దానిలో భాగంగానే ట్రంప్‌ ఒకవైపు పుతిన్‌ను పొగుడుతూ చైనాతో బస్తీమే సవాల్‌ అన్నట్లుగా రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నాడు. చైనాలో అంతర్భాగమైనా విడిగా వున్న తైవాన్‌ పాలకులతో మాట్లాడటమే గాకుండా ఒకే చైనా విధానానికి ఎందుకు కట్టుబడి వుండాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు. చైనా వస్తువులపై పెద్ద మొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తామని కూడా బెదిరింపులకు దిగాడు. అయితే ఇవన్నీ అంత తేలిక కాదు. రష్యా ఆర్ధికంగా ఇబ్బందులలో వున్నప్పటికీ సిరియా, టర్కీ పరిణామాలలో అమెరికాకు తన సత్తాఏమిటో చూపటమే గాక సవాలు కూడా విసిరింది. రష్యా ఇదే విధంగా కొనసాగితే ఐరోపామీద తన పట్టు, పలుకుబడికి విఘాతం కలగవచ్చనే భయం కూడా అమెరికా పాలకవర్గానికి వుంది. మొత్తం మీద ప్రపంచ పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో వున్న పరిస్థితుల్లో ఒక పెట్టుబడిదారీ దేశం మరొక పెట్టుబడిదారీ దేశంతో ఘర్షణ పడే అవకాశాలు లేవు. మార్కెట్లను పంచుకోవటంలో రష్యన్‌ పెట్టుబడిదారీ వర్గం కూడా పోటీ పడుతోంది. చైనా, భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమి ఏర్పాటు చేయటం దానిలో భాగమే. అమెరికన్ల ఎత్తుగడలు బాగా తెలిసిన రష్యా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. రష్యన్‌ పెట్టుబడిదారులు కూడా అదే కోరుకుంటారు.

  చైనాను రెచ్చగొట్టేందుకు ట్రంప్‌ వినియోగిస్తున్న అస్త్రాలతో పోల్చితే రష్యాను ప్రసన్నం చేసుకొనేందుకు విసురుతున్న పూలదండలు ఆసక్తి కరంగా వున్నాయి. తన విదేశాంగ మంత్రిగా రష్యా అనుకూలుడిగా ముద్రపడిన ఎక్సాన్‌ మోబిల్‌ సిఇవో రెక్స్‌ టిల్లర్సన్‌ను నియమించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎక్సాన్‌ కంపెనీకి రష్యాలోని సైబీరియాలో 50 కోట్ల డాలర్ల చమురు ఒప్పందం వుంది. త్వరలో రష్యాపై వున్న ఆంక్షలను ట్రంప్‌ ఎత్తివేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి అంశాలకు సంబంధించి వస్తున్న వార్తలలో ఎక్కువ భాగం చీకట్లో వేస్తున్న బాణాల వంటివి. ఒక్కోసారి అవే కొత్త పరిణామాలకు నాంది పలుకుతాయి. కొందరు వూహిస్తున్నట్లు రష్యా-అమెరికాలు ప్రపంచ మార్కెట్లను పంచుకొనేందుకు సయోధ్య కుదుర్చుకుంటే ప్రపంచ రాజకీయాలు మరోమలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్పు కోసం మోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు !

12 Thursday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP's social media, BJP’s IT cell, BJP’s trolling army, I am a troll, Narendra Modi, Rahul gandhi, Trolls

సాధ్వి ఖోస్లా

    స్వాతంత్య్ర సమర యోధుల పరంపరనుంచి వచ్చిన కొంత మందికి రెండు విషయాలు మాత్రమే -దేశ భక్తి మరియు గాంధీజీ సిద్ధాంతాలు-ఎరుకలో వుంటాయి. నాకైతే నా రాష్ట్రం పంజాబ్‌ కూడా. పంజాబ్‌ మీద నాకున్న ప్రేమ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు మరియు వాటికి అనుకూలంగా వున్న రాష్ట రాజకీయ పరిసరాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు శక్తి నిచ్చింది. ద్వేష పూరితమైన భారతీయ జనతా పార్టీ మరియు తమను తాము వీరులుగా చెప్పుకొనే దాని సామాజిక మీడియా మరుగుజ్జు యోధులపై పోరాడేందుకు దేశం మీద నాకున్న ప్రేమ బలాన్నిచ్చింది.

    గత మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ మీద నన్ను అసుసరిస్తున్నారు.ఈ రోజు నేనేమీ కాదు మరియు బిజెపితో నా అనుబంధాన్ని ప్రశ్నిస్తున్నారు. స్వాతి చతుర్వేది పుస్తకం అయామ్‌ ఏ ట్రోల్‌ (నేనో వెంటాడే మరుగుజ్జును )లో నేను వెల్లడించిన వాస్తవాలతో మండిపడుతున్న బిజెపి సామాజిక మీడియా సేనలోని అజ్ఞాత ముఖాలు నన్నొక దుష్టశక్తిగా చిత్రిస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు పలికే గొంతులేమైనా వుంటే వాటిని మూయిస్తారని నేను చెప్పింది వాస్తవమని వారు రుజువు చేస్తున్నారు.నేను బయటపడి వాస్తవాలను బహిరంగ పరచాలన్న నా నిర్ణయం కాంగ్రెస్‌తో నాకున్న స్వల్పకాల అనుబంధం వలన కాదు, అసత్యాలను వేద వాక్యంగా మార్చటాన్ని అపేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నమిది. ఎప్పటికప్పుడు వార్తలు అందుతున్న నేటి యుగంలో నిజం కంటే వ్యతిరేక సమాచార ప్రచారాన్ని వాట్సాప్‌, ట్విటర్‌ మరియు ఫేస్‌బుక్‌లలో జనం ఎక్కువగా నమ్ముతున్నారు. ఆ సమయానికి నిజం అడుగున పడిపోయి జరగాల్సిన హాని జరుగుతుంది.

    మన గొప్ప దేశాన్ని గత ప్రభుత్వాలు మలుచుతున్న తీరుతో ఇతర తరుణ వయస్సు భారత పౌరుల మాదిరే నేను కూడా 2013లో అసంతృప్తి చెందాను. నేను మొదటి సారిగా నా ఓటు హక్కును మోడీకి అనుకూలంగా వినియోగించాను, ఎందుకంటే మెరుగైన భారత్‌ గురించి ఆయన దర్శన కోణాన్ని, ఆయనను నమ్మాను. ఆ నమ్మకమే నన్ను 272 మంది మరియు వారితో పాటు వున్న వలంటీర్లతో కూడిన బిజెపి మిషన్‌ (ప్రచార దళం)లో చేరేందుకు ప్రేరణనిచ్చింది.ఆ ప్రచార దళపు ‘సరికొత్త ప్రచార పద్దతులు ‘ వెంటాడటంతో సహా అప్రతిష్టపాలు చేయటం, వాస్తవానికి వక్రభాష్యాలు చెప్పి జనాల న్యాయనిర్ణయాలను అయోమయంలోకి నెట్టటం గురించి నాకు ముందుగా ఏమాత్రం తెలియదు.

     2015 నవంబరులో అమీర్‌ ఖాన్‌ దేశంలో నాడున్న పరిస్ధితుల గురించి తన మనోభావాలను వ్యక్తం చేసినపుడు అరవింద గుప్తా నాయకత్వంలోని బిజెపి ఐటి విభాగం ఎలక్ట్రానిక్‌ వాణిజ్య సంస్ధ అయిన స్నాప్‌డీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్న ఆ నటుడిని తప్పించేందుకు గాను ఒత్తిడి చేస్తూ ఒక సామాజిక మీడియా ప్రచారాన్ని నిర్వహించింది. ఆ నటుడిని వెంటాడాలని, వివిధ వేదికలపై అతనిపై బురద చల్లాలని, అతని సినిమాలు చూడకుండా జనాన్ని రెచ్చగొట్టాలని మాకు (బిజెపి ఐటి విభాగంలోని వలంటీర్లకు) ఆదేశాలు జారీ చేశారు. నా భావజాలం మరియు ఆత్మ బిజెపి మతోన్మాద దళంలో భాగస్వామి అయ్యేందుకు అనుమతించలేదు.భ్రమలు తొలిగిన నేను దాని నుంచి బయటపడ్డాను. వత్తిడి కారణంగా 2016 జనవరిలో స్నాప్‌డీల్‌ అమీర్‌ ఖాన్‌తో తన సంబంధాలను రద్దు చేసుకుంది.

     అటువంటి చర్యల తీవ్ర పర్యవసానాలను మనం గుర్తించలేదు. ఒక నటుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇండ్లలో వుంటూ మన హృదయాలను దోచుకున్న వ్యక్తి ఆకస్మికంగా ఒక ‘ముస్లింగా’ మారిపోయాడు. ద్వేషాన్ని వ్యాపింప చేయటానికి సామాజిక మాధ్యమం ఒక ప్రమాదకర సాధనంగా మారిపోయింది, అదికొన్ని సందర్భాలలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కూడా దారితీయవచ్చు. చివరికి మతం కూడా రాజకీయాల మాదిరి మనల్ని విడదీయలేదు.

జాతి వ్యతిరేకిగా ముద్ర

     దాదాపు రెండు సంవత్సరాలు తీవ్ర స్ధాయిలో ప్రధాన మంత్రికి ట్విటర్‌ మీద మద్దతు పలికాను, చురుకుగా బిజెపికి ప్రచారం చేశాను, వారి ఎజండాలలో భాగంగా స్మృతి ఇరానీ, కిరణ్‌ ఖేర్‌ వంటి బిజెపి నాయకులకు తోడ్పడ్డాను. నేను వ్యతిరేకించిన సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ కూటమికి నాయకత్వం లేకపోవటాన్ని, దిగజారిన విధానాలను కూడా విమర్శించాను. ఇదే సమయంలో పంజాబ్‌ మీద వున్న నా అభిమానం రాష్ట్రంలో వున్న భయంకరమైన మాదకద్రవ్యాల వ్యాప్తిని వెల్లడిస్తూ దాని మీద ఒక డాక్యుమెంటరీని తీయించేందుకు కూడా నడిపించింది. ఆందోళన కలిగించే వాస్తవాలను ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చేందుకు ట్విటర్‌ ద్వారా ఒక వర్తమానం కూడా పంపాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని మోడీ వాగ్దానం చేశారు, అయితే అందుకు సహాయం చేసేందుకు నేను చేసిన వినతులను విస్మరించారు.

  ప్రధాన మంత్రి నిర్లక్ష్యం నన్ను కాంగ్రెస్‌ వైపు తిరిగేట్లు చేసింది. నేను గట్టిగా బలపరిచిన నరేంద్రమోడీ విస్మరిస్తే నా వినతులను రాహుల్‌ గాంధీ విన్నారు. కాంగ్రెస్‌ వుపాధ్యక్షుడితో కలిసినప్పటి నా చిత్రాలను సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బిజెపి వెంటాడే సేనకు నా కృతజ్ఞతలు. రహస్యంగా వుంచిన వారి క్రీడను నేను బయట పెట్టటాన్ని నా రాజకీయ అజండాలో భాగంగా చూపుతున్నారు. నేను నిర్మించిన డాక్యుమెంటరీని 2016 మార్చి 18న రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్‌తో నా ఏకైక సంబంధం అది మాత్రమే.

   2014 ఎన్నికలు భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేశాయి. మీడియాలో ప్రచారం ఎలా పొందాలో తెలిసిన ప్రధాన మంత్రి ఇంటర్నెట్‌ ద్వారా జనాలకు చేరువ అవుతున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా జనానికి తెలియచేస్తున్నారు. ఆయనను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు, కానీ ఆయన మాత్రం కొద్ది మంది ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుసరిస్తారు. వారిలో ఎక్కువ మంది దూషిస్తూ వెంటాడతారని బాగా తెలిసిన వారే. ప్రధానిని సందర్శించి, శుభాకాంక్షలు తెలిపేందుకు ఇలా దూషించే వారిని ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తూ వుంటారు. ఇలా వెంటాడే వారిని ప్రోత్సహించనని బిజెపి చెప్పుకునేట్లయితే ఇలాంటి అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యంగా తమ కార్ఖానా నుంచి తయారై బయటకు వస్తున్న వాటి గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?

   సామాజిక మాధ్యమ వేదికను నిర్మాణాత్మక అభివృద్ధికి వినియోగించుకోవటానికి బదులు తమ వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించించిన వారిని అవమానించే విధంగా తన దిగువ సేనను వినియోగించుకుంటోంది. ఏ వ్యక్తి, సంస్ధ లేదా సమాజం అభివృద్ధి చెందాలంటే సానుకూల విమర్శలు ఆరోగ్యకరమైనవి, కానీ అసహ్యంగా విమర్శించటం, వ్యక్తిత్వాలను దెబ్బతీయటం అవాంఛనీయం. ప్రధానిని సమర్ధించే పేరుతో జనాలను మరియు వారి వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల చీకటి చిత్రాన్ని మాత్రమే ఇది బయట పెడుతోంది. వ్యతిరేకుల, జర్నలిస్టుల, రాజకీయనేతలు మరి ఇతరులెవరి ప్రతిష్టనైనా దెబ్బతీయాలని కిరాయి వలంటీర్లకు మార్గదర్శనం చేశారు. భిన్నమైన వైఖరి కలిగి వున్న ఎవరినైనా మోడీ మరియు జాతి వ్యతిరేకిగా వర్ణించారు. ఎంత అసహ్యంగా అయితే అంతగా మహిళలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్‌ గాంధీ,ఆయన తల్లి సోనియాగాంధీలపై తప్పుడు ప్రచారం చేశారు, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులను చంపేస్తామని, మాన భంగం చేస్తామని బెదిరింపులు చేశారు.

  బిజెపి ప్రచారాన్ని బయటపెట్టిన మాకు అన్ని జీవన రంగాల నుంచి ప్రజామద్దతు వెల్లువెత్తుతున్నది. ఈ అంశం దేశంలోని మారుమూలలకు కూడా ప్రయాణించింది. వ్యతిరేక భావజాలాన్ని అణచివేసేందుకు పాలకపార్టీ సామాజిక మీడియాను వినియోగించుకోవటాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.అంతిమంగా బిజెపి సామాజిక మీడియా సేన మరియు మద్దతుదారుల లక్ష్యంగా పుస్తక రచయిత్రి స్వాతి చతుర్వేది మరియు నేను వుంటాము. వారు మాపై బూతులు, కించపరిచే ప్రచారం, బెదిరింపులతో దాడి చేస్తారు. ఇదంతా ఎందుకంటే వారి చీకటి రహస్యం బట్టబయలైంది, నిజం గాయపరుస్తుంది.

   నేను నా ఆత్మ చెప్పినట్లు నడిచాను. వ్యతిరేక భావాలు కలిగి వున్న వ్యతిరేకులు లేదా ప్రముఖులకు వ్యతిరేకంగా కించపరిచే ప్రచారం చేయటానికి సామాజిక మీడియాను ఎలా సాధనంగా చేసుకుంటున్నారో నా అందమైన దేశం, దాని ప్రజలు తెలుసుకోవాలన్నది నా ఆలోచన మరియు విధి.

ప్రేమ కంటే ద్వేషం త్వరగా విస్తరించటం విచారకరం !

నేను మార్పు కోసం నరేంద్రమోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు. !

నేను చెప్పాల్సింది చెప్పాను, నేను నమ్మిందే చేశాను, చేసిందే చెప్పాను. ఇది నేను చెబుతున్న నిజం !

స్క్రోల్‌.ఇన్‌ సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పెంపకంలో రక్షణలేని రూపాయి పాపాయి !

07 Saturday Jan 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi rule, Rupee, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు

    మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. రెండున్నర సంవత్సరాల తరువాత జనవరి ఆరవ తేదీన రు.67.96కు చేరింది, డిసెంబరు నాటికి రు.69.50 పెరగవచ్చని కొందరి అంచనా. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్క బిజెపికే సంపూర్ణ మెజారిటీతో నరేంద్రమోడీ సంఖ్యరీత్యా అత్యంత బలమైన ప్రధానిగా అవతరించారు. అయితేనేం రూపాయి విలువ పెరగలేదు కదా పతనమై రు.68.86పైసలను తాకి 2016 నవంబరు 25న సరికొత్త రికార్డును సృష్టించింది. అప్పటి నుంచి 67-68కి అటూ ఇటూగా కదలాడుతోంది.ఈ ఏడాది డిసెంబరు నాటికి నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టగలరని రూపాయి మరింత పతనమై 69.50కి చేరవచ్చని రాయిటర్‌ వార్తా సంస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నది. అది పక్కా పెట్టుబడిదారులు నడిపే కంపెనీ తప్ప కమ్యూనిస్టులకు, మోడీ విమర్శకులకు ఎలాంటి సంబంధం లేనిది.

    ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తప్పు పట్టే వారు బిజెపి, దానిని సమర్ధించే పార్టీలు అధికారంలోకి రాకూడదని కోరుకొనే వారే అనటంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. మోడీ ప్రభుత్వ విధానాలు బాగు, బాగు , బహు బాగున్నాయి, వెనక్కు తిరిగి చూడనవసరం లేదని పొగిడేవారి గురించే అనుమానించాలి. ఇటీవలి కాలంలో ఇలాంటి వారు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. మోడీ విధానాలు బాగులేకపోతే ఆయనను అంత ఎక్కువ మంది ఎలా సమర్ధిస్తున్నారు అన్నది వాటిలో ప్రధానమైనది. బలపరిచే, వ్యతిరేకించే సర్వేల బండారం, బాగోతం అందరికీ తెలిసిందే. వాటిని పక్కన పెడితే మోడీని సమర్ధిస్తున్న వారందరూ ఆయన విధానాలకు ఆమోద ముద్ర వేశారనే నిర్ణయానికి వస్తే పప్పులో కాలువేసినట్లే. పెద్ద నోట్ల రద్దు విషయమే తీసుకుంటే తాము ఇబ్బందులు పడినా జనం రెచ్చి పోలేదంటే అర్ధం దేశంలో తొలిసారిగా ఏదో మంచి చేస్తున్నాడు, యాభై రోజులే అంటున్నారు కదా చూద్దాం అని సహించారు తప్ప ఆ నిర్ణయ పర్యవసానాలన్నీ తెలిసి మద్దతు ఇవ్వలేదు. అసలు వాటి పర్యవసానాల గురించి రద్దు చేసిన నరేంద్రమోడీి గానీ, ఆయనకు సలహా ఇచ్చిన అంతరంగికులు, చివరకు తానే సలహాయిచ్చానని చెప్పుకున్న , మోడీ కంటే మేథావి అని ఆయన చుట్టూవున్నవారు భావించేే చంద్రబాబు నాయుడు, అంతిమంగా అమలు జరిపిన రిజర్వుబ్యాంకు సైతం నిర్దిష్టంగా ఫలానా ప్రయోజనం లుగుతుంది అని చెప్పలేదని తెలుసుకోవటం అవసరం. ఈ జన్మలో కష్టాలు అనుభవించినా పరలోకంలో స్వర్గ సుఖాలు దక్కుతాయి అన్నట్లుగా తాత్కాలికంగా నష్టం జరిగినా భవిష్యత్‌లో మంచి జరుగుతుంది అని తప్ప అధికార పక్షం లేదా దానిని సమర్ధిస్తున్నవారు గానీ తాత్కాలిక నష్టాలు , శాశ్వత లాభాలు ఎలా వుంటాయో ఎవరైనా చెప్పారా ?

     చైతన్యం, మూఢత్వం, అసంతృప్తి, అభిమానం అనేక కారణాలతో తరతమ స్థాయిలలో వుండే మన దేశంలో గుడ్డిగా నమ్మినట్లే, గుడ్డిగా వ్యతిరేకించటం కూడా సాధారణ విషయమే. అందువలన జనం వ్యతిరేకతలు, సమర్ధనలను కాసేపు పక్కన పెడదాము. కాంగ్రెస్‌ నేతలు దేశాన్ని అన్ని రంగాలలో గాడి తప్పించారు, మేము వస్తే తిరిగి గాడిలో పెడతామనే కదా బిజెపి అండ్‌ కో పార్టీలు, వాటిని భుజాన వేసుకొని మోసిన పవన్‌ కల్యాణ్‌ వంటి పెద్దలు చెప్పింది. తాను పదవిని స్వీకరించగానే విదేశాలలో పోయిన పరువును తిరిగి రాబట్టానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం మరి దేశం సంగతేమిటి? ఆర్ధిక వ్యవస్ధ విషయమేమిటి?

     అన్ని విషయాలను ఒకేసారి చర్చించటం కుదరదు గనుక రూపాయి విలువ- పతనం, పటిష్టత పర్యవసానాల గురించి చూద్దాం. మన్మోహన్‌ సింగ్‌ గారి పాలనలో ఆయన వయస్సు పెరుగుతున్న మాదిరి రూపాయి విలువ పడిపోతున్నదని బిజెపి, నరేంద్రమోడీ విమర్శించారు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ హయాం మొత్తం మీద గరిష్టంగా ఒక డాలరుకు 68.85 రూపాయల వరకు పడిపోయింది.

     2014 మే 25న నరేంద్రమోడీ పదవీ బాధ్యతలను స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తే https://knoema.com/infographics/rygejhb/rupee-devaluation-against-dollar-1947-till-date ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

    రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే రెండున్నర సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో పది రూపాయలకు అటూ ఇటూగా వుంది. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

    రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? పోనీ నరేంద్రమోడీకి ఏదైనా లాభం వుంటుందా ? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

 

  మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము.పీపాకు వంద లీటర్ల పెట్రోలు అనుకుంటే లీటరు రు.63.14 పడుతుంది. డాలర్లలో లీటరుకు 1.07 , ఇప్పుడు అంటే 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు కొనుగోలు చేశాము. అంటే లీటరుకు రు.36 పడుతుంది. డాలర్లలో ధర 0.53. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే లీటరుకు రు.31.38కే వచ్చి వుండేది.అదే ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే మరో పది రూపాయలు తగ్గి వుండేది. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు. మరింతగా దిగజారనుందని ఆర్ధిక విశ్లేషకులు ఎందుకు అంచనా వేస్తున్నారు? అరికట్ట లేకపోగా తన హయాంలో పెట్రోలుపై పదకొండు రూపాయల పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

    రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. రూపాయి విలువ పతనం కారణంగానే ఇటీవలనే అనేక కంపెనీల కార్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు వలన తాత్కాలికంగా ఇబ్బందులంటే ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే, దాని వలన మూడు నుంచి ఐదులక్షల కోట్ల నల్లధనం వెలికి వచ్చి ఆ మేరకు ప్రభుత్వాదాయం పెరుగుతుందని వేసుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయని 40-50వేల కోట్లకు మించి రావని వార్తలు వస్తున్నాయి. ఏ రోజు లావాదేవీలను ఆరోజు సాయంత్రానికి బ్యాంకులు ఖరారు చేస్తాయి. అలాంటిది పెద్ద నోట్ల డిపాజిట్ల గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా బ్యాంకులకు చేరిన సొమ్మెంతో ఇంకా లెక్కలు వేస్తున్నామని రిజర్వుబ్యాంకు చెప్పటం ఆశ్చర్యంగా వుంది. నోట్ల రద్దు వలన కలిగే లాభం సంగతేమోగాని రెండుశాతం జిడిపి అంటే రెండులక్షల కోట్ల రూపాయల నష్టం ఖాయంగా రానుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మసూద్‌ అజార్‌ను చైనా, దలైలామాను మనం ఎందుకు కాపాడుతున్నాం ?

01 Sunday Jan 2017

Posted by raomk in BJP, CHINA, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, USA

≈ Leave a comment

Tags

anti china, anti india, China, Dalai Lama, INDIA, masood azhar

Image result for masood azhar,  Dalai Lama

ఎం కోటేశ్వరరావు

    ఈ ప్రశ్న రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వుండాలని కోరుకొనే అనేక మందికి ఆవేదన కలిగిస్తోంది, అదే సమయంలో శత్రుపూరిత సంబంధాలుండాలని కోరుకొనే వారికి ఆనందం కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. అసలేం జరుగుతోంది ? ఐక్యరాజ్యసమితి పరిభాషలో సాంకేతిక అంశాలు ఎలా వున్నప్పటికీ ఆచరణలో మన దేశానికి వ్యతిరేకంగా వుగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లుగా మన ప్రభుత్వం చెబుతున్న మౌలానా మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా పరిగణిస్తూ తీర్మానం చేయకుండా ఏప్రిల్‌, అక్టోబరులో భద్రతా మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకుంది. దాని అభ్యంతరాల గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అయితే రెండు రోజుల ముందే చర్చకు వచ్చిన ఈ అంశాన్ని మరోసారి అడ్డుకొన్నది. దీంతో వుగ్రవాదం పట్ల చైనా ద్వంద్వ ప్రమాణాలను అసుసరిస్తోందని మన దేశం విమర్శించింది. సరిగ్గా ఈ సమయంలోనే అంటే బుధవారం నాడు కజకస్తాన్‌, మంగోలియా, మన దేశ (కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతాన్ని అనుకొని వుండే) -చైనా సరిహద్దులలో వున్న చైనా రాష్ట్రం గ్జిన్‌జియాంగ్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంపై వుగ్రవాదులు దాడి చేసి ఒక కార్యకర్త, భద్రతా సిబ్బంది ఒకరిని హత్య చేశారు. వెంటనే పోలీసులు దాడిలో పాల్గొన్నవారిలో ముగ్గురిని కాల్చివేశారు. అనేక సార్లు ఇస్లామిక్‌ తీవ్రవాదులు అక్కడ దాడులకు పాల్పడిన కారణంగా ఇప్పుడు కూడా వారే అయి వుండవచ్చని వార్తలలోని వ్యాఖ్యలను బట్టి అనుకోవాలి. ఆ వుగ్రవాదులను ఇరుగు పొరుగు దేశాల వారు పెంచి పోషించి రెచ్చగొడుతున్నందున దాడులు చేస్తున్నట్లు చైనా గతంలో విమర్శించింది. చైనా కూడా వుగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది కదా అలాంటపుడు మసూద్‌ అజార్‌పై చర్యను ఎందుకు అడ్డుకుంటున్నట్లు అన్న సందేహం కొంత మందికి కలుగటం సహజం.

    ఈ సమస్య గురించి గురించి ఏకపక్షంగా ఒక వాదననే సమర్ధిస్తూ చర్చించిన వారిని దేశ భక్తులుగానూ, భిన్న కోణాల గురించి వివరించే వారిని దేశ ద్రోహులు లేదా చైనా అనుకూలురుగానో చిత్రించే వాతావరణంలో వున్నాం. ప్రస్తుతం ముస్లిం పాకిస్థాన్‌, కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే అసలు సిసలైన దేశ భక్తిగా కాషాయ సర్టిఫికెట్లు ఇస్తున్న రోజులివి. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పిన సిపిఎంను చైనా అనుకూల పార్టీగా చిత్రించిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌, అది గతంలో తన రాజకీయ విభాగంగా నడిపిన జనసంఘం ముందు వరుసలో వున్నాయి. అప్పటికీ ఇప్పటికీ సిపిఎం తన వైఖరిని మార్చుకోలేదు. సరిహద్దు గురించి సంప్రదింపులు జరిపేందుకు అర్హత కేంద్రంలో అధికారంలో వున్నవారికి మాత్రమే వుంటుంది. సిపిఎంకు అటువంటి అవకాశం రాలేదు. అంతకు ముందు చైనాతో యుద్ధానికి అవసరమైతే తాము రంగంలోకి వస్తామంటూ వీధులలో ప్రదర్శనలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు జనతా పార్టీ ముసుగులో ఒకసారి అధికారానికి వచ్చారు, రెండవ సారి బిజెపి పేరుతో, మూడవ సారి కూడా అదే పేరుతో అధికారానికి వచ్చి చేసిందేమిటయ్యా అంటే సామరస్య పూర్వరంగా చైనాతో చర్చలు జరపటమే కాదు, కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా చైనా కమ్యూనిస్టుపార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకొని చైనా యాత్రలు చేసి వస్తున్నారు. అదనంగా వ్యాపారలావాదేవీలతో మునిగి తేలుతున్నారు. చైనాతో ఒకవైపు సంబంధాలు నెరుపుతూనే మరోవైపు చైనా వ్యతిరేక రాజకీయాలలో కూడా భాగస్వాములు అవుతున్న పెద్దలు దేశ భక్తులుగా చెలామణి అవుతున్నారా లేదా ? దీనికి నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, ఇతర బిజెపి మిత్రపక్ష నేతలెవరూ మినహాయింపు కాదు. అలాంటపుడు మసూద్‌ అజార్‌ను చైనా కాపాడటం కూడా అదే రాజకీయాలలో అంతర్బాగమే అని అభిప్రాయపడిన వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు ఎలా అవుతారు ?

     అవన్నీ కాదు మన ప్రయోజనాలే ముఖ్యం, చైనా అయినా మరొక దేశమైనా మనకు అనుకూలంగా వున్నంత వరకు వుపయోగించుకోవాలి, లేనపుడు వ్యతిరేకించాలి అని అనుకోవటానికి ఎవరికైనా హక్కుంది తప్ప భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారి మీద రంగులు చల్లితే, బురద వేస్తే కుదరదు. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అనే అతి తెలివి అనాలి. కొంచెం కటువుగా వున్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటివి పని చెయ్యవు అని చెప్పక తప్పదు. ఇరుగు పొరుగుతో స్నేహం చేసేటపుడు రెండువైపులా స్నేహ ధర్మం పాటించాలి. ఈ పూర్వరంగంలో మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు కాపాడుతోందో వారి వైపు నుంచి కూడా చూడటం అవసరం.

Image result for masood azhar,  Dalai Lama

      మసూద్‌ అజార్‌, ఆ వరుసలో వున్న ఇంకా అనేక మంది టెర్రరిస్టులను అంతర్జాతీయంగా గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలనటం నిర్వివాదాంశం. ప్రపంచంలో అనేక దేశాలలో టెర్రరిస్టులు, తిరుగుబాటుదారులు, వేర్పాటు వాదులు ఎందరో వున్నారు. వారు మతాధికారులు, మరొకరు ఎవరైనా కావచ్చు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. అలాంటి అభ్యంతరాలున్న జాబితాలు ప్రతి దేశంలోనూ వుంటాయి. మనకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం వుంది. వాటిలో లడఖ్‌ ప్రాంతంలోని ఆక్సాయ్‌ చిన్‌, ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ వున్నాయి. బ్రిటీష్‌ పాలకులు మనకు తెచ్చిన అనేక సమస్యలలో ఇదొకటి. బ్రిటీష్‌ ఇండియా విదేశాంగ కార్యదర్శిగా పని చేసిన బ్రిటీష్‌ అధికారి హెన్రీ మెక్‌మోహన్‌ 1914లో గీసిన సరిహద్దు లైన్ల ఆధారంగా అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం-టిబెట్‌ ప్రభుత్వం మధ్య ఒక సరిహద్దు ఒప్పందం కుదిరింది. టిబెట్‌కు అలాంటి అధికారం లేదని వాదించిన చైనా ఆ హద్దును తాను గుర్తించటం లేదని అప్పుడే స్పష్టం చేసింది. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా వుంచటానికి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కుట్ర చేసినట్లే , సామ్రాజ్యవాదులు టిబెట్‌ను కూడా స్వతంత్ర రాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నారు. మిలిటరీ చర్య ద్వారా కాశ్మీర్‌ను మన దేశంలో అంతర్భాగంగా చేసినట్లే టిబెట్‌ను కూడా చైనా సైనిక చర్య ద్వారా టిబెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ సమయానికి మనదిగా బ్రిటీష్‌ వారు మ్యాపులలో చూపిన ఆక్సాయ్‌ చిన్‌ చైనాలో, చైనాకు చెందినదిగా పేర్కొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో వుంది. దాంతో ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అగత్యం కలిగింది. కాశ్మీర్‌ మన దేశ అంతర్బాగమని కమ్యూనిస్టు చైనా గుర్తించినట్లే, టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని మన దేశం కూడా గుర్తించింది. అయితే చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, టిబెట్‌ ప్రత్యేక దేశంగా ప్రకటించిన మత పెద్ద దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటును సైతం అనుమతించింది. అయితే దౌత్యపరంగా వాటికి గుర్తింపు ఇవ్వలేదు తప్ప దలైలామా అండ్‌కో చేసే చైనా వ్యతిరేక కార్యక్రమాలు, కార్యకలాపాలన్నింటినీ మన ప్రభుత్వం అనుమతిస్తున్నది.దీనికి కాంగ్రెస్‌, జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి. ఒక వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నవారెవరైనా దానికి కొత్త పీఠ ముడులను వేయకుండా చూడాలి. కానీ పరిణామాలు అలా లేవు.

    ఒక శరణార్ధిగా దలైలామాను మన దేశంలో అనుమతించటం వేరు, ఒక తిరుగుబాటు ప్రవాస ప్రభుత్వ నేతగా కార్యకలాపాలను పదే పదే అనుమతించటాన్ని చైనా సహించదని తెలిసి కూడా అనుమతించటాన్ని ఏమనాలి? మన దేశానికి మసూద్‌ అజార్‌ ఎలాంటి ప్రమాదకర వ్యక్తో చైనాకు దలైలామా అంతకంటే ఎక్కువ ప్రమాదకర వ్యక్తి. 1959లో చైనా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి అనేక మంది టిబెట్‌ తిరుగుబాటుదార్లు వుగ్రవాదులుగా మారి అనేక దేశాలలో చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ చివరి వారంలో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో తొలిసారిగా నాలుగు రోజుల పాటు చైనా వ్యతిరేక సంస్ధల అంతర్జాతీయ సమావేశాన్ని జరుపుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. దలైలామాకు ఎప్పటి నుంచో మన దేశం ఆశ్రయం కల్పించి మద్దతు ఇస్తున్నా బహిరంగంగా అమెరికా, ఇతర దేశాలలో ప్రభుత్వేతర సంస్ధల ముసుగులో పనిచేసే చైనా వ్యతిరేకుల సమావేశాన్ని అనుమతించిన ఘనత నరేంద్రమోడీకే దక్కింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతంగా చైనా అంటోంది. అక్కడి తవాంగ్‌ పట్టణం ఆరవ దలైలామా జన్మ స్ధలం. ఈ ఏడాది మార్చి నెలలో తవాంగ్‌ పర్యటన జరపాలని దలైలామా నిర్ణయించుకున్నారు. చైనాకు అభ్యంతరమని తెలిసి కూడా దేశంలో దలైలామా ఎక్కడికైనా స్వేచ్చగా వెళ్ల వచ్చని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించటం, గతేడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో అమెరికా రాయబారి పర్యటనను అనుమతించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? కాశ్మీర్‌ సమస్యలో మూడో దేశ జోక్యాన్ని మనం అనుమతిస్తామా ?

     దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి మన దేశానికి ఎలాంటి వివాదం, సంబంధం లేదు, మన నౌకలు వెళితే చైనా అడ్డుకున్న వుదంతాలు లేవు. ఆ ప్రాంతంలోని కొన్ని దీవులపై చైనా, జపాన్‌, వియత్నాం, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. ఆ సమస్యను అవే పరిష్కరించుకోవాలి. ఆ ప్రాంతంలో అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం తమ నౌకలు స్వేచ్చగా తిరగటానికి వున్న హక్కును అమలు చేసుకొంటున్నామనే పేరుతో అమెరికా-జపాన్‌ కార్యాచరణ బృందం తమ యుద్ధ నౌకలతో ఆ ప్రాంతంలో 2016 మే-జూలై మధ్య రెండున్నర నెలలపాటు విన్యాసాలు నిర్వహించి చైనాతో కయ్యానికి కాలుదువ్వాయి. వాటితో కలసి జలకాలాడేందుకు మన నాలుగు నౌకలను మోడీ సర్కార్‌ పంపటం ఏమిటి ? అమెరికా, జపాన్‌లకు జూనియర్‌ భాగస్వామిగా మన దేశాన్ని మార్చినట్లా, వాటితో పాటు కలిసి చైనాపై బస్తీమే సవాల్‌ విసిరినట్లా ? జపాన్‌తో అమెరికాకు రక్షణ ఒప్పందం వుంది కనుక అమెరికన్లు ఆ ముసుగులో జోక్యం చేసుకుంటున్నారు. మనకు సంబంధం ఏమిటి ? ఎవరిని సంతోష పెట్టటానికి ఈ పని చేసినట్లు ? మసూద్‌ అజార్‌ విషయంలో చైనా అనుసరిస్తున్నదానికి దెబ్బకు దెబ్బ అని మన దేశంలోని చైనా వ్యతిరేకులు వాదించ వచ్చు. అటువంటి వారికి మసూద్‌తో సహా ఇతర వివాదాలపై చైనాను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది ? మనం చైనా వ్యతిరేకికి ఆశ్రయం ఇచ్చిన మాదిరి మన వ్యతిరేకి మసూద్‌ అజార్‌కు చైనా ఆశ్రయం కల్పించలేదు, అలాంటి వారితో మనకు వ్యతిరేకంగా తన గడ్డపై సభల నిర్వహణకు ఏర్పాటు చేయలేదు. మసూద్‌ అజార్‌ను వుగ్రవాదిగా తీర్మానించబోయే ముందు ఆ సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకుంటున్నారేమో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చైనా కోరింది తప్ప అతను తీవ్రవాది కాదని గానీ అవుననిగానీ చెప్పలేదు. అయితే ఆ వైఖరి ఆచరణలో తీర్మానానికి అడ్డుపడినట్లే అన్నది స్పష్టం. ఇటువంటి వైఖరులతో సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని వుభయ దేశాలు చేసే ప్రకటనలకు అర్ధం వుండదు. ఎవరు ముందు తప్పు చేశారు, ఎవరు తరువాత చేశారు అనే వాద ప్రతివాదాలలోకి పోతే పరిష్కారం కుదరదు.

    గత పాతిక సంవత్సరాలలో ముఖ్యంగా గత పది సంవత్సరాలలో మన దేశాన్ని అమెరికాకు దగ్గరగా తీసుకుపోతున్న కొద్దీ ఆ మేరకు పాకిస్థాన్‌ చైనాకు దగ్గర అవుతోంది. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య వున్న విబేధాలను మన పాలకవర్గం వుపయోగించుకొని లబ్ది పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా-అమెరికా మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొని పాకిస్థాన్‌ అదేపని చేస్తోందన్నది స్పష్టం. ఒకవైపు పాకిస్థాన్‌ అమెరికన్లతో దగ్గర సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో రోజు రోజుకూ సంబంధాలను పెంచుకొంటోంది. మనకు చైనాతో వివాదాలు పెంచుకొని అమెరికాతో దగ్గర కావటం లాభమా, చైనాతో వివాదాలను తగ్గించుకొని లాభపడటం మంచిదా అని ఆలోచించుకోవాలి. మనకు, పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించి లబ్ది పొందుతున్న అమెరికా ఇప్పుడు చైనాతో మరోసారి మన వివాదాలు పెంచుకోవాలని కోరుకుంటోంది. మన దేశానికి వారి ఆయుధాలను మరింతగా విక్రయించాలంటే చైనాతో లడాయి పెరగాలి. అప్పుడే వారి ఆయుధ పరిశ్రమలు మూడు పూవులు ఆరు ఆయుధాలుగా వర్ధిల్లుతాయి. ఈ పరిణామాల పూర్వరంగాన్ని అర్ధం చేసుకుంటే చైనా తిరుగుబాటుదారుడు దలైలామాను మన దేశం ఎందుకు సమర్ధిస్తుందో, వుగ్రవాది మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు రక్షిస్తుందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిర్లా, సహారా డైరీలు – జవాబు లేని ప్రశ్నలు !

24 Saturday Dec 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

birla sahara diaries, BJP, cbi, CORRUPTION, it, Modi

ఎం కోటేశ్వరరావు

    తన దగ్గరున్న సమాచారం గనుక బయట పెడితే ఏదో జరిగి పోతుందన్నట్లుగా రాహుల్‌ గాంధీ బిల్డప్‌ ఇవ్వటం, అది తుస్సుమనటం తెలిసిందే. చీకట్లను పారద్రోలుతూ వెలుగుతుందనుకున్న ఒక మతాబా, బాగా పేలుతుందనుకున్న దీపావళి బాంబు ఒక్కోసారి తుస్సుమనొచ్చు. అయితే అవి తుస్సుమన్నప్పటికీ వాటి అవశేషాలను తొలగించి వీధిని శుభ్రం చేయాల్సిన బాధ్యత గృహస్తు మీదో స్ధానిక సంస్ధల పారిశుధ్య సిబ్బందిమీదో వుంటుంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలు, ఆ మాటకు వస్తే అవి ఆయన కొత్తగా కనుగొన్నవీ కాదు, తాజాగా బయటపడినవీ కాదు, ఇప్పటికే ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషన్‌ కోర్టులో వేసిన కేసులోనివే. ఇక్కడ రెండు అంశాలున్నాయి.

    ఒకటి నరేంద్రమోడీని సమర్ధిస్తూ బిజెపి నేతలు అత్యంత బలహీనమైన వాదనలు చేశారు. రెండు ఆయన స్వయంగా రాహుల్‌ గాంధీని అపహాస్యం చేశారు. తమ నేత గంగ అంతటి స్వచ్చమైన ముత్యం అన్నది ఒకటి. గంగతో సహా ఏ నది అయినా పుట్టుక స్థానంలో ఎంతో స్వచ్చంగా వుంటుంది. తరువాతే కలుషితంగా మారుతోంది. హిమాలయాల నుంచి బయటపడిన తరువాత గంగ ఎంత కాలుష్యంగా మారిందో మోడీ సర్కార్‌ ప్రకటించిన గంగ శుద్ధి ప్రణాళిక తెలిసిందే.ఎవరైనా పుట్టినపుడు, బాల్యంలో ఎలాంటి మచ్చ లేకుండా వుంటారు. పెరిగేకొద్దీ కథ ప్రారంభం అవుతుంది.మోడీ అయినా అంతే. డైరీల నిగ్గు తేలే వరకు సహారా, బిర్లాల దగ్గర ముడుపులు తన స్వంతానికి తీసుకున్నారా పార్టీ కోసమా అన్నది వేరే విషయం.

    పారిశ్రామిక సంస్ధలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు లేదా ముడుపులు ఎక్కడా ఖాతాలలో పక్కాగా రసీదుల వివరాలతో సహా రాయరు. డైరీలలోనో మరొక చోటో పొట్టి లేదా నిక్‌నేమ్స్‌ పేరుతోనో నమోదు చేస్తారు. ఎందుకంటే ఆ పని చేసే వారు ఆ సొమ్ము స్వంతదారులకు జవాబుదారీగా ఏదో ఒక ఆధారాన్ని చూపాలి. నమ్మకస్తుల ద్వారానే అలాంటి పని చేయిస్తారు. వుదాహరణకు రెండు దశాబ్దాల క్రితం హవాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అది కూడా ఎస్‌కె జైన్‌ అనే హవాలా వ్యాపారి నమోదు చేసిన డైరీల ఆధారంగా అని ఇక్కడ గుర్తు చేయాలి. ఆ డైరీలలో వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌,బజెపి, జనతాదళ్‌ తదితర 18 పార్టీల నేతల పేర్లు వున్నాయి. ఆ వివరాలు బయటకు రాగానే ఆ జాబితాలో ఒకరైన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేసి ఆ మచ్చ తొలిగిన తరువాత గానీ తిరిగి సభలోకి అడుగు పెట్టనని ప్రకటించి నాడు ప్రశంసలు పొందారు. దాంతో అనేక మంది కాంగ్రెస్‌, బిజెపి నేతలు కూడా పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా ఆ కేసులో తేలిందేమీ లేదు, నిర్దోషులుగా ప్రకటించారు.

   చిత్రం ఏమిటంటే అద్వానీ శిశ్యుషుడినని, ఆయన సభ్యుడిగా వున్న మార్గదర్శక మండలి సలహామేరకు పని చేస్తున్నానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ రాజీనామా సంగతి తరువాత, ముందసలు ఆ డైరీల సంగతి నిగ్గుదేల్చమని దర్యాప్తు సంస్ధలను ఆదేశించటానికి కూడా ముందుకు రాలేదెందున్నది అసలు ప్రశ్న. హవాలా డైరీలలో, సహారా, బిర్లా డైరీలలో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలందరూ వున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగ మాదిరి మోడీ సర్కార్‌ మౌనంగా వుండిపోయిందా ? సరే వెంకయ్య నాయుడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని వుపయోగించి ఆ డైరీలు బయట పడింది కాంగ్రెస్‌ హయాంలో అప్పుడెందుకు వాటి గురించి చెప్పలేదని చెట్టుకింద లాయర్‌ మాదిరి ప్రశ్న వేశారు. ఆ డైరీలు 2013 అక్టోబరులో, 2014 నవంబరులో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక సిబిఐ, ఆదాయపన్ను శాఖ దాడులలో బయట పడ్డాయి.తమకు దొరికిన వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నది ఆ సంస్ధల విధి. తమకు దొరికిన వాటి గురించి ఎటూ తేల్చకుండా మీన మేషాలు లెక్కించటాన్ని చూసిన తరువాత కామన్‌ కాజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్ద 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లింది.అంటే సిబిఐ, ఆదాయపన్ను శాఖలపై తెరవెనుక నుంచి వత్తిడి వచ్చిందన్నది స్పష్టం. ‘అవినీతి వ్యతిరేక నరేంద్రమోడీ హయాం ‘ ఇలా జరగటం ఏమిటి ? గంగ మాదిరి కాలుష్యం సోకిందా ?

     ఈ డైరీలపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తర్కం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. డైరీలలో పేర్లు వున్నంత మాత్రాన వాటిపై విచారించటం కుదరదని,ఇలాంటి వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయంటూ ఎవరైనా ఒకరు ప్రధానికి ఇంత డబ్బు ముట్టచెప్పామని తమ డైరీలలో రాసుకున్నంత మాత్రాన ఎలా విచారణ జరపాలి అంటూ మరింత స్పష్టమైన సాక్ష్యాలతో రావాలని చెప్పి చింతకాయల రవి సినిమాలో ప్రతిదానికీ సర్టిఫికెట్‌ల ఫ్రూఫ్‌ కావాలనే పాత్రధారిని గుర్తుకు తెచ్చింది. భవిష్యత్‌లో అక్రమంగా నిధులు ఇచ్చేవారు, పుచ్చుకొనే వారు కేసులు, శిక్షల నుంచి తప్పించుకొనేందుకు అనుసరించాల్సిన సులువైన పద్దతిని చెప్పినట్లు , తప్పించుకొనేందుకు అవసరమైన తర్కాన్ని సిద్ధం చేసినట్లుగా వుంది. బిర్లా డైరీలను నమోదు చేసిన వారు తమకు హవాలా మార్గంలో నగదు వస్తుందని, దానిని తమ యజమానుల ఆదేశాల మేరకు రాజకీయ నేతలకు అంద చేస్తాని విచారణలో చెప్పారు. బిర్లా కంపెనీ చైర్మన్‌ సుబేందు అమితాబ్‌ కూడా విచారణలో గుజరాత్‌ సిఎంకు 25 కోట్లు అందచేసినట్లు అంగీకరించారు. అయితే గుజరాత్‌ సిఎం అంటే గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ అని చెప్పారు. సి,ఎం అనే పదాలకు ఆ కంపెనీ పేరుకు పొంతన కుదరటం లేదు. దాని గురించి అడిగితే అదంతే అనటం తప్ప సరైన వివరణ ఇవ్వలేదు. పోనీ అక్రమ పద్దతుల్లో నగదు తీసుకున్న సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలేమన్నా తీసుకున్నారా ? అదీ లేదు. దీని వాస్తవాలను తేల్చాల్సింది ఎవరు? అందుకే ఆ డైరీలపై దర్యాప్తు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత భూషన్‌ చెబుతున్నారు. హవాలా కేసులో దొరికిన డైరీలలో పొట్టి పేర్లు మాత్రమే వున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు జరపటానికి అవి చాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు పేర్లు, డైరీలు మరింత స్పష్టంగా వున్నప్పటికీ మరింత స్పష్టమైన ఆధారాలు కావాలని అదే కోర్టు వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలపై రాజకీయంగా అపహాస్యం చేయవచ్చు, సామాజిక మీడియాలోని తన భక్తులు, సైన్యానికి వుత్సాహం తెప్పించవచ్చు. అంతటితో అది అయిపోదు, కోర్టు లేదా మోడీ సర్కార్‌ దీనిపై ఏదో ఒక వైఖరిని వెల్లడించకతప్పదు. ఆ డైరీల నిగ్గు తేల్చనంత వరకు మోడీవైపు వేలు చూపుతూనే వుంటారు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబును ఆవహించిన గురజాడ గిరీశం !

21 Wednesday Dec 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

chandrababu naidu, Demonetisation, demonetisation worries, gurajada girisam

ఎంకెఆర్‌

    డామిట్‌ కథ అడ్డం తిరిగింది. పెద్ద నోట్ల రద్దు గురించి చంద్రబాబు నాయుడు కొత్త పల్లవి అందుకున్నారు. ‘ఓపినీయన్స్‌ అప్పుడప్పుడూ చేంజ్‌ చేస్తుంటేనే కానీ పొలిటీషియన్‌ కానేరడు !'( అభిప్రాయాలను అప్పుడప్పుడూ మార్చుకుంటూ వుంటేనే కానీ రాజకీయవేత్త కానేరడు) గురజాడ అప్పారావు పంతులు గారు గిరీశం పాత్ర ద్వారా ఎంత చక్కగా చెప్పారు. 1862-1915 మధ్య కేవలం 53 సంవత్సరాలు మాత్రమే జీవించిన గురజాడ ఆ నాటి రాజకీయ నేతల తీరు తెన్నులను చూసే అలాంటి వ్యాఖ్య చేశారంటే నేడే గనుక ఆయన వుండి వుంటే బాబోయ్‌ ఇంకేమైనా వుందా !

    ‘ ఒక ప్రముఖ రచయిత రాసిన ప్రతిదానినీ మెచ్చుకోవాలని నమ్మే అలవాటు తెలివి తక్కువ వారికి వుంటుంది. నా వరకైతే నాకు సంతృప్తినిచ్చే దానినే నేను చదువుతాను మరియు నా అభిరుచులకు తగినదానినే అభిమానిస్తాను’ అన్నాడు ప్రముఖ ప్రెంచి రచయిత ఓల్టేర్‌. చంద్రబాబు, నరేంద్రమోడీ నోటి నుంచి ఏది వస్తే అదే ప్రామాణికం అని నమ్మేవారు ఈ మాటలు తమకు ఎంతవరకు సరిపోతాయో ఆలోచించుకోవటం మంచిది. పెద్ద నోట్ల రద్దు గురించి కేంద్రానికి సిఫార్సు చేసిందే తానే అంటూ కేంద్రానికి రాసిన లేఖ గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చి నరేంద్రమోడీ ప్రశంసలు అందుకొనేందుకు ప్రయత్నించటాన్ని లోకమంతా చూసింది. ఇప్పుడు ఆ నిర్ణయం తెచ్చిన సమస్యలు, పర్యవసానాలను చూసి పెద్ద నోట్ల రద్దు తాను కోరుకున్నది కాదని, తలెత్తిన సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియటం లేదని రోజంతా ఆలోచించినా తట్టటం లేదని సెలవిచ్చారు. బ్రూటస్‌ నువ్వు కూడానా ! అని స్నేహితుడిగా వుండి వెన్నుపోటు పొడిచిన బ్రూటస్‌ గురించి రోమన్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ వాపోయినట్లుగా బహుశా గత రాత్రి నరేంద్రమోడీ కూడా ఒంటరిగానో లేక అమిత్‌ షా, వెంకయ్య నాయుడి వంటి తన నీడలను పిలిపించుకొనే చంద్రబాబు నాయుడి గురించి అనుకొని వుండి వుండాలి.

    సరే చంద్రబాబు నాయుడంటే పోలవరం తాత్కాలిక డామ్‌ మట్టి తీయిస్తూ, కాంక్రీట్‌ పోయిస్తూ ఆ పనేమీ లేకపోతే నేను నిదురపోను మిమ్మల్ని నిదురపోనివ్వనంటూ అధికారులతో ఏదో ఒక ప్రయోజనం లేని దాని గురించి సమీక్షపేరుతో తీరిక లేకుండా వుండి వుంటారనుకుందాం. లక్షల రూపాయల ప్రజాధనం పందారం చేస్తూ ఆయన నియమించుకున్న సలహాదారులేం చేస్తున్నట్లు ? రాజు మెచ్చిందే రంభ అన్నట్లుగా చంద్రబాబు మనసెరిగి నోట్ల రద్దు అంతా సజావుగానే జరిగిపోతుందంటూ, వాస్తవ పరిస్థితిని వివరించకుండా తప్పుదారి పట్టించి వుంటారా ?

      ‘నోట్ల రద్దు చిన్న ప్రయోజనాల కంటే మోడీ వ్యూహం ఎంతో సాహసోపేతమైనది’ అనే శీర్షికతో ఆర్‌ జగన్నాధన్‌ అనే ఆయన భక్తుడు ఒకరు రాసిన వ్యాసంలోని అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. నోట్ల రద్దు వలన ఎంతో మేలు జరుగుతుంది, దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం అని ఇప్పటికీ ఒకవైపు ప్రచారం సాగుతుంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఈ భక్తుడు రాసిన దానికి చిన్న ప్రయోజనాలని పేరు పెట్టటం అంటే ముందే చెప్పాం కదా అని ఎదురుదాడి చేసేందుకే. నోట్ల రద్దుతో జనం ఇబ్బందులపై మీడియా వార్తలతో ఇబ్బంది పడిన భక్తులు భజన బాణీ మార్చారు. మోడీ ఏదో పెద్ద పధకంతోనే ఈ పని చేశారంటూ కొత్త పాట అందుకున్నారు. ‘నోట్ల రద్దు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో విజయం కోసం కాదు, అది జరిగితే అదొక ప్రయోజనకరమైన బోనస్‌ అవుతుంది. ఆయన రాజకీయ లక్ష్యాలు అసాధారణమైనవి. అధికారానికి వచ్చిన వెంటనే నల్లధనంపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.2015లో విదేశీ ఆస్థుల గురించి తొలి స్వచ్చంద వెల్లడి పధకాన్ని ప్రకటించారు.అరవై శాతం పన్ను విధించటంతో అది విఫలమైంది. దాని గురించి గుణపాఠం తీసుకొని ఆదాయ వెల్లడి పధకం (ఐడిఎస్‌) ప్రారంభించారు. సెప్టెంబరులో ముగిసిన దానిలో రు.67,382 కోట్ల మేరకు ప్రకటన చేయించగలిగారు. వాయిదాల పద్దతిలో దానిలో 45శాతం మేరకు వసూలు చేస్తారు.( హైదరాబాదులో ప్రకటించి చేతులెత్తేసిన పదివేల కోట్ల రూపాయల ఆస్థిపరుల వంటి వారు ఇంకా ఎందరున్నారో తెలియదు).తరువాత బినామీ లావాదేవీల నిషేధ సవరణ చట్టాన్ని నోట్ల రద్దుకు కొద్ది రోజుల ముందు నోటిఫై చేశారు. జనం తమ వద్ద వున్న సొమ్మును బ్యాంకులలో డిపాజిట్‌ చేయటాన్ని చూసి పన్నుల చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం దాచుకున్న సొమ్మును వెల్లడిస్తే 50శాతం పన్ను వసూలు చేసి, 25శాతం మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా నాలుగు సంవత్సరాల తరువాత చెల్లించే విధంగా ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు.అది కూడా పనిచేయకపోతే నగదును మరింత తక్కువ చేసేందుకు, మరింతగా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధవైపు నడిపించేందుకు లక్ష్యాన్ని మార్చారు. పరిశుద్దులయ్యేందుకు ఇవన్నీ ప్రతి వారికి ఒకటికి రెండు అవకాశాలు ఇవ్వటం, అలా చేసే వారికి వేధింపులు లేకుండా చూడటం, ఎన్నో ప్రయోజనాలు లేకుండా బిజెపికి పునాది వంటి మద్దతుదారులైన వాణిజ్య, వృత్తిదారుల ఆగ్రహానికి గురిఅయ్యేందుకు కూడా సిద్ద పడి ఒక రాజకీయ నాయకుడు ఈ సాహసం చేయరు.’ ఇలా జనానికి ఆగ్రహం కలగకుండా మంచి రోజులు ముందున్నాయని నమ్మించేందుకు చేసిన ప్రయత్నమిది అని వేరే చెప్పనవసరం లేదు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కనుక ఎటుబోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తతో నోట్ల రద్దు తన సలహా వల్లనే జరిగిందని తొలి రోజుల్లో చెప్పుకున్నారు తప్ప తరువాత క్రమంగా అసంతృప్తిని వెల్లడించటం ప్రారంభించారు. తీరా ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. దీనిలో అయినా నిజాయితీ వుందా ? లేక ఆగ్రహిస్తున్న జనాన్ని దువ్వేందుకా ? కారణం ఏదైనా చంద్రబాబును గురజాడ గిరీశం ఆవహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఒపీనియన్‌ను చేంజ్‌ చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లు – చెల్లని పాత నోట్లు !

18 Sunday Dec 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Telangana

≈ Leave a comment

Tags

demonetised notes, Pawan kalyan, pawan kalyan tweets

Image result for pawan kalyan tweets

ఎంకెఆర్‌

      అన్నా పవర్‌ స్టారన్నా మీ అభిమానిగా నా ఆందోళన, ఆవేదనదాచుకోలేక ఈ లేఖ రాస్తున్నా. మీ సెక్రటరీలు లేకపోతే సలహాదారులతో ట్వీట్లు ఇప్పించినట్లు కాకుండా నువ్వే స్వయంగా చదువుకో అన్నా, లేకపోతే నిన్ను తప్పుదారి పట్టించే అవకాశం వుంది. ట్వీట్ల ద్వారా అనేక విషయాల మీద మా అన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నాడని తెలిసి అభిమానులం అందరం పొంగిపోయాం. ఇదేంటన్నా అట్టర్‌ ప్లాఫు సినిమాల మాదిరి తుస్సు మంటున్నాయి. ఒక సినిమా ఫట్టయి డబ్బాలు వెనక్కు తిరిగి వస్తే తరువాత మరో డైరెక్టర్‌తో హిట్టు సినిమా తీసి అభిమానులను అలరించటం తెలిసిందే. ఈ మధ్య నీ రాజకీయ సినిమాలన్నీ ఓపెనింగ్‌ కలెక్షన్ల తరువాత మరుసటి రోజు నుంచి జనం చూడటం లేదని నీకూ తెలిసి వుండాలి కదా అన్నా. అయినా రాజకీయ డైరెక్టర్లను మార్చినట్లు కనిపించటం లేదు. ఇలాగయితే అభిమానులం ఏం కావాలో తెలియటం లేదన్నా.

    ఎప్పుడో ఏడాది క్రితంనాటి విషయాలపై మీ స్టారు ఇప్పుడు ట్వీట్లు ఇస్తున్నాడు పవర్‌, పంచ్‌ తగ్గిపోయిందా, ఇప్పటి విషయాల మీద ఏడాది తరువాత ట్వీటుతాడా అని చివరికి బిజెపి వారు కూడా ఎగతాళిగా అంటున్నారన్నా. మాకు తలతీసేసినట్లయింది. ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లయ్య దిగింతరువాత బోడి మల్లయ్య అన్నట్లుగా పద్దతి తప్పితే ఎంతలో ఎంత మార్పో చూడన్నా ! ఇప్పుడు అటు బిజెపి, తెలుగుదేశం వారూ పట్టించుకోవటం లేదు, ఇటు వాటిని వ్యతిరేకించే వారూ నమ్మటం లేదు. దేశమంతా నరేంద్రమోడీ రద్దు చేసిన పెద్ద నోట్ల కంటే ఎక్కువ నగదు బ్యాంకుల్లో జమ అవుతుందా లేదా అని పందాలు కడుతూ డిసెంబరు 30 కోసం అందరూ అటువైపే చూస్తుంటే నువ్వేంటన్నా ఏడాది క్రితపు విషయాల మీద ఇప్పుడు స్పందిస్తున్నావు. అప్పుడు మరచిపోయావా, లేకపొరపాటున ఇప్పుడిచ్చావో తెలియటం లేదన్నా. వాటిని చెల్లని పాతనోట్లని చిన్న పిల్లాడు కూడా పట్టించుకోవటం లేదన్నా !

    పెళ్లి మంత్రాలు పెళ్లికి-తద్దినపు మంత్రాలు తద్దినానికి చదవాలన్నట్లుగా సందర్భాన్ని బట్టి కదన్నా స్పందించాల్సింది? చిన్నపుడు మా పిసినారి అమ్మమ్మ లడ్లు, కారప్పూస నెలల తరబడి దాచి చివరికి ఎప్పుడో పిల్లలికి పెడితే ఆమె చూడకుండా బయటపడేసి పారిపోయేవారు. మా కాటమ రాయుడికి అలాంటి సలహాలు ఇచ్చే నిపుణులెవరో గానీ వెతికి పట్టుకొని వీరతాళ్లు వేయాలని మన వారంతా సిద్ధం అవుతున్నారన్నా.

     రెండున్నర సంవత్సరాలయినా సాధించిన పెద్ద విజయమిది అని చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేక వుత్తర ప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాలలో ఓటర్ల ముందుకు ఎలా పోవాలా అని తలలు పట్టుకొని నరేంద్రమోడీ- అమిత్‌ షా ఒకరి గడ్డాన్ని మరొకరు ు నిమురు కుంటుంటే ఒక అర్దరాత్రి పెద్ద నోట్లు రద్దు ఆలోచన వచ్చినట్లు మన పవర్‌ స్టార్‌కు ఈ ఆలోచన ఏ సమయంలో వచ్చిందో అని జనం గుసగుసలాడుకుంటున్నారన్నా. ట్వీట్లతో బిజెపి మీద పేలుస్తున్న షాట్లు అరవై ఏండ్ల తరువాత వెనుకటి కెవడో అమ్మా అని అరిచాడన్నట్లుగా వుందిరా అబ్బాయ్‌ అని మా మాస్టారు అన్నారు. అసలేమీ మాట్లాడని వారి కంటే ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడటం మంచిదే కదా అని సమర్ధించాం అనుకో.

     ఒక చిన్న సందేహమన్నా మనం జన సేన రాజకీయ పార్టీని పెడుతున్నట్లా లేనట్లా ? లేక సినిమా టైటిల్‌ రిజిస్టరు చేసి దశాబ్దాలు గడిచినా తీయకుండా వున్నట్లుగా వుంటామా ? వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారకులు బిజెపి వారన్నది మీ ట్వీట్‌ అర్దం అని మేము అనుకుంటున్నాం . రోహిత్‌ వంటి వారు ఆత్మహత్యకు పాల్పడకుండా ఎలా చూడాలా అన్నది ఆలోచించాల్సింది పోయి బిజెపి వ్యతిరేక పార్టీలు ఆ వుదంతం నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తే బిజెపి , దాని మిత్ర పక్షాలు రోహిత్‌ దళితుడు కాదని నిరూపించేందుకు ప్రయత్నించాయని మీరు విమర్శించారు. ఈ తర్కం మీ పికె బుర్రలో పుట్టిందా లేక తెలివి తక్కువ మేథావుల నుంచి అరువు తెచ్చుకున్నదా అని ఇక్కడ అడుగుతున్నారన్నా.మీ పీకె అంత పోటు గాడయితే ఎన్నికల సమయంలో బిజెపి-తెలుగుదేశం భుజాలెక్కి, తరువాత అప్పుడప్పుడు సినిమాలు లేనపుడు, కాల్షీట్లు ఖాళీగా వున్నపుడు ఇలా వచ్చి అలా పోవటం తప్ప పీకిందేమిటి అని అడుగుతూ మీకంత సీన్‌ లేదంటున్నారన్నా !

    తప్పును తప్పుగా ఖండించటం తప్పయితే రోహిత్‌ బలవన్మరణం చెందిన పదకొండు నెలల తరువాత అదీ ఆ సమస్యపై జనం మరచి పోయిన తరువాత పికె ఇప్పుడు తప్పుపట్టటం ద్వారా మీ జనసేన పార్టీ ఏ రాజకీయ ప్రయోజనం ఆశిస్తోంది? తమను దోషులుగా చూపిన పార్టీలపై బిజెపి కూడా ఇదే మాదిరి ఎదురు దాడి చేసింది, దానికి పికె ఆరోపణకు తేడా ఏమిటి ? పోనీ ఇతర పార్టీలను తప్పుపట్టిన మీ నేత ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏం చేయాలో ఇంతకాలం తరువాత కూడా ఎందుకు చెప్పలేదు? ఇలాంటి ప్రశ్నలతో జనం మా తలంటుతున్నారన్నా ? మాక్కూడా నిజమే కదా అనిపిస్తోంది. అవు, నోట్ల రద్దు, ఏపికి ప్రత్యేక హోదా ఇలా ఏ సమస్యపై అయినా ఎవరైనా విమర్శిస్తే అధికారంలో వున్న పార్టీలన్నీ రాజకీయ లబ్దికోసమే వీటిపై విమర్శలు చేస్తున్నాయనే కదా ఎదుటి పక్షాలపై దాడి చేస్తోంది. దేశం మీకేమిచ్చిందని కాదు ఆడగాల్సింది దేశానికి మీకేమిచ్చారని ఆలోచించుకోవాలన్నట్లుగా ఇలాంటివన్నీ ప్రత్యర్ధులను నోరు మూయించటానికి అధికారపార్టీ ప్రయోగించే అస్త్రాలు. రాజకీయాలలో ఇవన్నీ పాతబడి తుప్పు పట్టిన ఆయుధాలన్నా !

   రాజకీయాలలోకి రాదలచుకుంటే ఎప్పటికప్పుడు స్పందించాలి తప్ప ఆరునెలలకో, సంవత్సరానికో అయితే నలుగురూ నవ్వుతారన్నా, జరిగిందేదో జరిగింది. మీ ట్వీట్లకు మీడియా పెద్దగా స్పందించలేదని మీకు కూడా అర్ధం అయిందనుకుంటా ! ఇక ముందైనా వెంటనే స్పందిస్తేనే ఫలితం, ప్రయోజనం !!

మీ అభిమాని

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d