• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నిందితులకు రాజకీయ ఆశ్రయం !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Adani, Ambani, Ambani and Adani, crony capitalism in India, India crony capitalism, Narendra Modi

Image result for political patronage  for economic offenders, india

(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు ! విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ఆర్ధిక నేరగాళ్ల గురించి కూడా మన దేశంలో రాజకీయాలు చేయటం ఒక విషాదం. ఒక పార్టీలో వుంటూ ఆర్ధిక నేరాల ఆరోపణలను ఎదుర్కొన్నవారు మరో పార్టీలో చేరగానే పునీతులౌతున్నారు. కేసులు మరుగునపడుతున్నాయి. దీనికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఎకనమిక్‌ టైమ్స్‌లో ఒక వార్త వచ్చింది. గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్రలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారి వివరాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాలను ఆ పత్రిక ఇచ్చింది. నూట ఎనభైకి పైగా కేసులు రాగా ఆర్ధిక నేరాల ముంబై పోలీసు విభాగం చేపట్టింది రెండు మాత్రమే. ఈ కేసులలో రూ. 19,317 కోట్ల మేరకు దుర్వినియోగం జరిగినట్లు అంచనా లేదా అనుమానం కాగా స్వాధీనం చేసుకున్న సొమ్ము రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక ప్రకారం తీవ్ర అక్రమాల దర్యాప్తు కార్యాలయం(సిఎఫ్‌ఐఓ)కు 2017 డిసెంబరు నుంచి 2018 నవంబరు వరకు 33 కేసులను దర్యాప్తు చేయాలని ఆదేశించగా కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని కేసులలో మూడు లేదా నాలుగు సంస్ధలు చేపడుతున్నందున సమయంతో పాటు డబ్బు వ ధా అవుతోంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసును మూడు సంస్ధలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ కేసును మూడు సంస్ధలు దర్యాప్తు చేస్తున్నాయి. భూషణ్‌ స్టీల్స్‌ అక్రమాల కేసులో ఎండీ నీరజ్‌ సింగాల్‌ అరెస్టును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్ధ అనుసరించిన పద్దతుల్లో లోపాలు, ఇతర కొన్ని అక్రమాలు దీనికి కారణం.

2015 నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం అంతకు ముందు పది సంవత్సరాలలో ఆర్ధిక నేరాలు రెట్టింపైనట్లు వెల్లడైంది.2006లో ప్రతి లక్ష మందికి 6.6 నమోదు కాగా 2015 నాటికి 11.9కి పెరిగాయి. రాజస్ధాన్‌లో 17.42 నుంచి 37.4కు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 12.01 వుంటే తెలంగాణాలో 24.6 నమోదయ్యాయి.ఆర్ధిక నేరాల పెరుగుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద, సులభతర వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే లావాదేవీలు పెరిగినందున దానికి అనుగుణ్యంగానే నేరాలు కూడా పెరిగాయన్నది కొందరి అభిప్రాయం.ప్రతి స్ధాయిలో డబ్బు అందుబాటులో వుండటం నేరాల పెరుగుదలకు కారణం అని న్యాయవాదులు అంటున్నారు.

గత ఐదు సంవత్సరాలలో దేశం నుంచి 27 మంది ఆర్ధిక నేరగాండ్లు దేశం విడిచి పోయారని 2019 జనవరి నాలుగున కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు ఒక రాతపూర్వక సమాధానంలో చెప్పారు. వీరిలో 20 మంది మీద రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరగా ఎనిమిది మీద నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. 2018 జూలై 25వ తేదీన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం 2015 నుంచి ఆరుగురు మహిళలతో సహా 28 మంది ఆర్ధిక అవకతవకలు, నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలను ప్రారంభించామని, వారంతా విదేశాల్లో వున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

2018 మార్చి 23న ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిన సమాచారం ప్రకారం నేరగాండ్ల అప్పగింతకు అప్పటి వరకు 48దేశాలతో ఒప్పందాలు, మరో మూడు దేశాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. సిబిఐ 23, ఇడి 13 కేసులను దర్యాప్తు చేస్తుండగా విజయ మాల్య, మెహుల్‌ చోక్సి, నీరవ్‌ మోడీ, జతిన్‌ మెహతా, ఆషిష్‌ జోబన్‌ పుత్ర, చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశారా రెండు సంస్ధల దర్యాప్తులో నిందితులుగా వున్నారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి జాబితాలో దిగువ పేర్లు వున్నాయి.

పుష్ప బైద్‌, అషిష్‌ జీబన్‌ పుత్ర, ప్రీతి అషిష్‌ జీబన్‌ పుత్ర, విజయమాల్య, సన్నీ కల్రా,సంజరు కల్రా, సుధీర్‌ కుమార్‌ కల్రా, ఆరతి కల్రా, వర్ష కల్రా, జతిన్‌ మెహతా, వుమేష్‌ పరేఖ్‌, కమలేష్‌ పరేఖ్‌, నిలేష్‌ పరేఖ్‌, ఏకలవ్య గార్గ్‌, వినరు మిట్టల్‌,చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశరా, నీరవ్‌ మోడీ, నీషాల్‌ మోడీ, సబయ సేథ్‌, రాజీవ్‌ గోయల్‌, అల్కా గోయల్‌, లలిత్‌ మోడీ, రితేష్‌ జైన్‌, హితేష్‌ నరేంద్రభారు పటేల్‌, మయూరీ బెన్‌ పటేల్‌.

గత ఐదు సంవత్సరాలలో విదేశాలకు పారిపోయిన ఆర్ధిక, ఇతర నేరగాండ్లు పద్దెనిమిది మందిని కేంద్ర ప్రభుత్వం దేశానికి రప్పించింది.1. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో రాజీవ్‌ సక్సేనా(యుఏయి నుంచి)తో పాటు లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌, ఇదే కేసులో మధ్యవర్తి పాత్ర వహించిన బ్రిటీష్‌ జాతీయుడు క్రిస్టియన్‌ మిచెల్‌, 2. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కేసులలో ఇండోనేషియా నుంచి మహమ్మద్‌ యాహ్యా, అక్కడి నుంచే ఇదే కేసులలో వినరు మిట్టల్‌, 3. యుఏయి నుంచి వుగ్రవాద కార్యకలాపాల కేసులో మన్సూర్‌ లేదా ఫరూక్‌ టక్లా, 4. బ్యాంకు అక్రమాల కేసులో రుమేనియా జాతీయుడు ఎంఎం ఫరూక్‌ యాసిన్‌ను నికరాగువా నుంచి, 5. వుద్యోగాల పేరుతో టోకరా కేసులో అబూబకర్‌ కదిర్‌ లోనట్‌ అలెగ్జాండ్రును సింగపూర్‌ నుంచి,6. హత్య కేసులో బంగ్లాదేశ్‌ నుంచి అబ్దుల్‌ రౌత్‌ మర్చంట్‌ మహమ్మద్‌ సుల్తాన్‌, 7. హత్యాయత్నం కేసులో సింగపూర్‌ నుంచి కుమార్‌ క ష్ణ పిళ్లె, 8.భారత్‌కు వ్యతిరేకంగా వుగ్రవాద కేసులో యుఏయి నుంచి అబ్దుల్‌ వాహిద్‌ సిద్ది బాపాను, 9.హత్యాయత్నం కేసులో మారిషస్‌ నుంచి కళ్లం గంగిరెడ్డి, 10. వుగ్రవాద కేసులో అనూప్‌ చెటియా నుంచి బంగ్లాదేశ్‌ నుంచి, కిడ్నాప్‌, హత్య కేసుల్లో ఇండోనేషియా నుంచి చోటా రాజన్‌,11. హత్య కేసులో మొరాకో నుంచి బన్నాజే రాజా, 12. హత్య కేసులో థారులాండ్‌ నుంచి జగతార్‌ సింగ్‌ను మన దేశానికి రప్పించారు.

వీరుగాక ఆర్ధిక నేరాలకు పాల్పడిన మరికొందరిని దేశం విడిచి పోకుండా చూడాలని కార్పొరేట్‌ మంత్రిత్వ వ్యవహారాల శాఖ 20 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసి ఐబికి అదచేసింది. వారిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌, అనిత గోయల్‌, దీపక్‌ కొచార్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌ తదితరుల పేర్లు వున్నట్లు వెల్లడైంది. నరేష్‌ గోయల్‌, అనితా గోయల్‌ దుబారు మీదుగా లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబ్‌ విమానాశ్రయంలో వారిని నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదలి పారిపోయే వారి గురించి విచారణకు వున్న చట్టాలు పటిష్టంగా లేనందున కొత్తగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్నే చేయాల్సి వచ్చింది. విజయ మల్య అనే పెద్ద మనిషి 18-20 సంచులు తీసుకొని పారిపోతుంటే నిఘాసంస్ధల సిబ్బంది విమానాశ్రయంలో గుడ్లప్పగించి చూశారు. ఆయన కదలికల మీద కన్నేసి వుండమన్నారు తప్ప అరెస్టు చేయాలనే ఆదేశాలు లేవని వారు చెప్పిన విషయం తెలిసిందే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ విషయంలో కూడా అదే జరిగింది. కొత్త చట్టం ప్రకారం వంద కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలకు పాల్పడి పారిపోయిన వారిని ఒక ప్రత్యేక కోర్టులో విచారిస్తారు. విచారణ సమయంలో నిందితుల ఆస్ధులను స్వాధీనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు దాదాపు రెండులక్షల నలభైవేల కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు,పారిపోయిన నిందితులు 39 అని చెప్పారు.గతేడాది పార్లమెంట్‌కు ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 31 మంది దేశం వదలి పారిపోయారు. అలాంటి నిందితులను మనకు అప్పగించటానికి వీలుగా కేవలం 57దేశాలతో మాత్రమే ఒప్పందాలున్నాయి. అనేక మంది నిందితులు అవి లేని దేశాలకు పారిపోయారు.

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా వుందా లేక ఇబ్బందుల్లో వుందా అన చెప్పటానికి బ్యాంకుల్లో పేరుకు పోతున్న నిరర్ధక ఆస్ధులు ఒక సూచిక. మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల బకాయిలను పారు బాకీలుగా పక్కన పెడుతున్నారు. వాటిని వసూలు చేస్తామని మరోవైపు చెబుతుంటారు. అలాంటి బాకీలను పరిష్కరించుకోవటంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2019 మార్చి నాటికి 8.06లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులున్నాయి. మూడు నెలల గడువు తీరినా కనీస మొత్తం చెల్లించని వాటిని, రుణం తీర్చటం కోసం రుణం తీసుకున్న మొత్తాలను నిరర్ధక ఆస్ధులుగా పరిగణిస్తున్నారు. గతంలో వాటిని రావాల్సిన బకాయిలుగా చూపే వారు. ఇప్పుడు ప్రతి ఏటా రద్దు చేసిన వాటిని మినహాయించి చూపుతూ నిరర్ధక ఆస్ధుల మొత్తం తగ్గుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలా చేయకపోతే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావటం లేదు.ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ అందించిన సమాచారం ప్రకారం 2018 ఆర్ధిక సంవత్సరంలో 1.28లక్షల కోట్లు,2019లో 1.77లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్ధులను రద్దు చేశారు. ఈ చర్యలు ఆర్ధిక నేరస్ధులను ఆదుకోవటం కాదా ?

Image result for India crony capitalism cartoons

ప్రతి ఆర్ధిక విధానంలోనూ లబ్ది పొందేవారు వుంటారు. పాతికేండ్ల సంస్కరణల ఫలితాల గురించి ఆర్ధిక వ్యవహారాల ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ 2016లో రాసిన విశ్లేషణను కాటో సంస్ధ ప్రచురించింది. దానిలో వున్న అంశాలతో ఏకీభవించటం లేదా విబేధించటం వేరే విషయం. ఆర్ధిక నేరాలు అనే ఈ విశ్లేషణతో ముడిపడిన దానిలోని కొన్ని అంశాల సారం ఇలా వుంది.

Image result for India crony capitalism: political patronage

” 1991 తరువాత అంతకు ముందు రాజకీయ సంబంధాలున్న కొన్ని కుటుంబాల ప్రాబల్యం అంతరించి కొత్తవారు ఎదిగారు. కొత్తగా వాణిజ్య రంగంలోకి వచ్చిన(ముఖ్యంగా రియలెస్టేట్‌, మౌలిక సదుపాయాల రంగం) వారిని ఆశ్రిత పెట్టుబడిదారులు అని పిలిచారు. వారికి బలమైన రాజకీయ సంబంధాలు తప్పనిసరిగా వుంటాయి. వారింకా సురక్షితమైన గుత్త సంస్ధలుగా మారలేదు, వాటిలో అనేక మంది(డిఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, లాంకో, ఐవిఆర్‌సిఎల్‌) దారుణంగా విఫలమయ్యారు. భారత్‌లో లంచాలను రాజకీయ నేతల బలవంతపు వసూలు అని పిలుస్తారు, ఎందుకంటే లంచాలు కొన్ని సందర్భాలలో అనిశ్చితంగానూ కొన్ని సార్లు ప్రతికూల ఆపదగా వుంటాయి. ఆర్ధిక సరళీకరణ మరియు పోటీ కొన్ని సందర్భాలలో పేరుగాంచిన పాత కంపెనీలను దివాలా తీయించాయి.(హిందుస్ధాన్‌ మోటార్స్‌, ప్రీమియర్‌ ఆటోమొబైల్స్‌, జెకె సింథటిక్స్‌, డిసిఎం) తీవ్రమైన పోటీని తగినంత సౌష్టవంగా వుంటేనే మనుగడ సాగించగలవని సూచించాయి.1991లో సెన్సెక్స్‌లో వున్న 30 కంపెనీలలో రెండు దశాబ్దాల తరువాత కేవలం తొమ్మిదే మిగిలాయి.కొత్త కంపెనీల గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ ఈ కంపెనీలు ధనికుల సంతానం కాదు, సరళీకరణ సంతానం ‘ అన్నారు. గత పాతికేండ్లలో పాతపద్దతిలోని లైసన్సులు, అదుపులు రద్దయ్యాయిగానీ కొత్తవి, అధికార యంత్రాంగపు ఆటంకాలు వచ్చాయి. పర్యావరణం, అడవులు, గిరిజన హక్కులు, భూమి, కొత్త అవకాశాలైన చిల్లరవర్తకం, టెలికాం, ఇంటర్నెట్‌ సంబంధిత కార్యకలాపాల్లో వీటిని చూడవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తగినంతగా సరళీకరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అవినీతి, ఫైళ్లను పక్కన పడేయటం గురించి తీవ్రంగా ఫిర్యాదులు చేస్తున్నారు.

భారత్‌లో నేరగాండ్లు రాజకీయాల్లో భాగస్వాములౌతున్నారు, తరచుగా కాబినెట్‌ మంత్రులు అవుతున్నారు.దీంతో వారి మీద వున్న ఆరోపణలను పరిశీలించకుండా చేసుకోగలుగుతున్నారు. ఏడిఆర్‌ విశ్లేషణ ప్రకారం 2014లో ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 186 మంది మీద నేరపూరిత కేసులు పెండింగ్‌లో వున్నాయి. 2009లో ఎన్నికైన వారిలో 158 మంది మీద వున్నాయి. 2014లో ఎన్నికైన వారిలో 112 మంది మీద హత్య, కిడ్నాప్‌, మహిళల మీద నేరాల వంటి తీవ్ర కేసులు వున్నాయి. ఏ పార్టీ కూడా పరిశుద్దంగా లేదు. అన్ని పార్టీల్లో నేరగాండ్లు పుష్కలంగా వున్నారు. అలాంటి వారు ప్రతిపార్టీకి డబ్బు,కండబలం, ప్రాపకాలను సమకూర్చుతారు.

 

Image result for India crony capitalism cartoons

దేశాల్లో జిడిపితో పాటు అవినీతి పెరుగుతోంది. భారత గత పాతిక సంవత్సరాల అనుభవం దీనికి మినహాయింపు కాదు. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించే ఒక మహిళ ప్రచారంలో పెట్టిన ఫొటోల కారణంగా సెక్స్‌ కుంభకోణంలో ఒక రాష్ట్ర గవర్నర్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. నగంగా వున్న ముగ్గురు యువతులు ఆ గవర్నర్‌తో వున్నారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలికి ఒక గని అనుమతి ఇప్పిస్తానన్న వాగ్దానాన్ని గవర్నర్‌ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతీకారంగా ఆమె ఫొటోలను బయటపెట్టింది.మొదట వచ్చిన వారికి తొలి కేటాయింపు( వాస్తవానికి గడువు గురించి ముందుగానే స్నేహితులకు తెలియచేసి లబ్ది చేకూర్చారు) పద్దతిలో స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వలన ఖజానాకు 1.76లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, వేలం వేయకుండా మంత్రిత్వశాఖ విచక్షణతో బొగ్గు గనులు కేటాయించిన కారణంగా 1.86లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొన్నది. ఆర్ధిక సంస్కరణలు పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారమిచ్చాయని విమర్శకులు అంటారు. సమగ్రంగా సరళీకరణ గావించిన రంగాలలో అవినీతి అద శ్యమైంది. 1991కి ముందు పారిశ్రామిక, దిగుమతి లైసన్సులు, విదేశీమారకద్య్రవ్య కేటాయింపులు, రుణాల వంటి వాటికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. సంస్కరణల తరువాత అవన్నీ సులభంగా లభ్యమౌతున్నాయి. పన్నుల తగ్గింపు కారణంగా స్మగ్లింగ్‌ దాదాపు అంతమైంది. అయితే అన్ని సహజవనరుల, టెలి కమ్యూనికేషన్స్‌ స్ప్రెక్ట్రమ్‌ విలువలను భారీగా పెంచిన కారణంగా వాటి కేటాయింపుల్లో ముడుపులకు అవకాశం కలిగింది. గతంలో ప్రభుత్వ రంగానికి మాత్రమే కేటాయించబడిన రంగాలలో ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి తెరిచారు. ప్రభుత్వ-ప్రయివేటు రంగ భాగస్వామ్యం తరచుగా ఆశ్రిత పెట్టుబడిదారుల కారణంగా నష్టం కలిగిస్తోంది. సరళీకరణ తరువాత అనేక రంగాల్లో అవినీతి పోయిందని అయితే కొన్నింటిలో ఎక్కడైతే ఎక్కువగా నియంత్రణలు, అవినీతి ఎక్కువగా వుంటాయో సహజవనరులు, రియలెస్టేట్‌ రంగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి మరింత పెరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని రంగాలలోని విస్త త అవినీతి పూర్తిగా సరళీకరించిన రంగాల్లో మెరుగుదలను మరుగున పడవేస్తున్నది.” నయా వుదారవాద లేదా సరళీకరణ విధానాలను పూర్తిగా సమర్ధించే అంక్లేసరియా అయ్యర్‌ వంటి వారే అవినీతి గురించి చెప్పకతప్పలేదు. అందరికీ కనిపిస్తున్న అవినీతి సమర్ధకులకు ఒక పట్టాన కనిపించదు. సరళీకరణ విధానం అంటే ప్రజల సంపదను కొంత మందికి కట్టబెట్టటం. ఈ క్రమంలో రాజకీయ-వ్యాపారవేత్తలు లేదా కలగలసిన వారు ప్రజాధనంతో నడిచే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం, ఎగవేయటం అనే అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. తెల్లవారే సరికి ధనవంతుడి వయ్యావా లేదా అన్నదే గీటు రాయి, ఎలా అయ్యారన్నది అనవసరం అన్న విలువలే నేడు సమాజాన్ని నడిపిస్తున్నాయి. అలాంటపుడు అక్రమాలకు కొదవేముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రయాన్‌ 2 ప్రయోగం : తీవ్ర ఆశాభంగం చెందింది నరేంద్రమోడీనా , శాస్త్రవేత్తలా !

09 Monday Sep 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Chandrayaan 2, ISRO scientists, Narendra Modi, Vikram Lander

Image result for chandrayaan 2

ఎం కోటేశ్వరరావు

చంద్రయాన్‌ -2 ప్రయోగం విఫలమైందా ? ఈ ప్రయోగం ఫలితంపై తీవ్ర ఆశాభంగానికి గురైంది ఇస్రో శాస్త్రవేత్తలా లేక రాజకీయవేత్త ప్రధాని నరేంద్రమోడీనా ? ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తుల పూజలు ఏమైనట్లు ? అసలు శాస్త్రవేత్తలకు కావాల్సింది ఏమిటి ? ఈ ప్రాతిపదికన కొన్ని అంశాల మీద వెల్లడించే అభిప్రాయాలు తమ మనోభావాలను గాయపరుస్తాయని భావించే వారు, భయపడే వారు ఇక్కడి నుంచి చదివేందుకు ముందుకు పోవాలా లేదా అన్నది వారి స్వేచ్చకే వదలి వేస్తున్నాను.

నూతన ఆవిష్కరణలు గావించే మానవాళి శాస్త్ర పరిశోధనా, ప్రయోగాలు నిర్దిష్టంగా ఫలానా రోజున ప్రారంభం అయ్యాయని చెప్పలేము. ప్రతి చిన్న ఆవిష్కరణ ఎంతో పెద్ద పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసింది. పెద్ద బండరాయి కంటే అంచు వాడిగా వుండే చిన్న రాయి ఎంతో శక్తివంతమైనదని, పశువులను చంపి తినటం కంటే వాటిని పెంచి అవసరమైనపుడు ఆహారానికి వినియోగించుకోవచ్చన్న ఆలోచన రావటం, వాటిని భూమిని దున్నటానికి వినియోగించవచ్చని ప్రయోగించటం ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసిన చరిత్ర తెలిసిందే. అందువలన అది నిరంతర ప్రక్రియ, మానవుడి లక్షణాల్లో ఒకటి. శాస్త్రవిజ్ఞానమే కాదు, ఏ విజ్ఞాన అభివృద్ధికైనా ఎదురుదెబ్బలే స్ఫూర్తి,కసిని పుట్టిస్తాయి. పరిశోధనా, ప్రయోగాలు వ్యక్తిగతం కంటే సమిష్టి కృషి ఫలితాలు, పర్యవసానాలే. అయితే ప్రతి ఆవిష్కరణలోనూ వ్యక్తిగత పాత్ర లేదా అంటే వుంటుంది. దానిలో కూడా ఇతరుల అనుభవాల సారం వుంటుంది. విద్యుత్‌ బల్బ్‌ను కనుగొన్నది ఎవరంటే ధామస్‌ ఆల్వా ఎడిసన్‌ అని చెబుతాము. నిజానికి అంతకు ముందు ఎందరో దాని మీద చేసిన పరిశోధనలు ఆయనకు తోడ్పడ్డాయి. ప్రతి దేశ అంతరిక్ష పరిశోధనకూ ఇదే వర్తిస్తుంది.

గత ఆరు దశాబ్దాలలో చంద్రుడి మీద అడుగు పెట్టేందుకు చేసిన ప్రతి ప్రయోగం విజయవంతం కాలేదు. అయినప్పటికీ ఏ దేశమూ నీరసించి తన ప్రయత్నాలను మానుకోలేదు. అమెరికాకు చెందిన నాసా సంస్ధ నిర్వహిస్త్ను చంద్రుడి వాస్తవ పత్రం(మూన్‌ ఫ్యాక్ట్‌ షీట్‌)లో వున్న సమాచారం ప్రకారం వివిధ దేశాలు ఇప్పటి వరకు 109 ప్రయోగాలు జరపగా 61 విజయవంతం కాగా 48 విఫలమయ్యాయి. మన చంద్రయాన్‌-2కు ముందు 2019 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌లో ఒక ప్రయివేటు సంస్ధ చేసిన ప్రయోగం ఏప్రిల్‌లో విఫలమైంది.

1958,59 సంవత్సరాలలో నాటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా దేశాలు 14 ప్రయోగాలు చేశాయి. వాటిలో సోవియట్‌ లూనా 1,2,3 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి విజయానికి ముందు సోవియట్‌ ప్రయోగాలు ఆరు విఫలమయ్యాయి. తరువాత 1964లో అమెరికా జరిపిన ఏడవ ప్రయోగం విజయవంతమైంది. 1966లో సోవియట్‌ లూనా 9 చంద్రుడి మీద దిగి చంద్రుడి వుపరితల చిత్రాలను తొలిసారిగా పంపింది. ఐదునెలల తరువాత అమెరికా అలాంటి ప్రయోగంలోనే విజయవంతమైంది. తొలుత సోవియట్‌ యూనియన్‌ అంతరిక్షంలోకి యూరీ గగారిన్‌ను పంపి చరిత్ర సృష్టిస్తే, తరువాత అపోలో 11వ ప్రయోగంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నాయకత్వంలో చంద్రుడి మీద తొలిసారి కాలుమోపిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే. 1958 నుంచి 1979 వరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ 90 ప్రయోగాలు జరిపాయి. తరువాత ఒక దశాబ్దం పాటు ఎలాంటి ప్రయోగాలు జరగలేదు. తరువాత జపాన్‌, ఐరోపాయూనియన్‌, చైనా, భారత్‌, ఇజ్రాయెల్‌ తమ ప్రయోగాలను ప్రారంభించాయి. 2009-19 మధ్య పది ప్రయోగాలు జరిగాయి. రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఆ రంగంలో మొదటి మూడు స్ధానాలను ఆక్రమించాయి. మన చంద్రయాన్‌ 2 సఫలీకృతం అయితే మనది నాల్గో స్ధానం అవుతుంది. మన కంటే ఆర్ధికంగా బలమైన జపాన్‌ ఎంతో వెనుకబడి వుంది, అంతమాత్రాన దాని పలుకుబడి తగ్గలేదు. మిగతా కొన్ని రంగాలలో తన ప్రతిభ చూపింది.

ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. వస్తువు గురుత్వాకర్షణ, సాంద్రత, చలన శక్తి సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ గురించి ప్రచారంలో వున్న కధ తెలిసిందే. తన సింహాసనం పూర్తి బంగారంతో చేసింది కాదని తనకు అనుమానంగా వుందని దాన్ని రుజువు చేయాలని రాజుగారు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించారు. ఒక రోజు ఆర్కిమెడిస్‌ స్నానం చేస్తుండగా ఆయన కూర్చున్న తొట్టెలోంచి నీరు పైకి వుబికింది. అది తన బరువుకు సమానంగా గుర్తించి భావోద్వేగానికి గురై యురేకా యురేకా ( నాకు అర్ధమైంది, నాకు అర్ధమైంది) అంటూ నీటి తొట్టెలోంచి లేచి బట్టల్లేకుండానే వీధుల్లో పరుగెత్తి రాజుగారి దగ్గరకు వెళ్లాడు. తరువాత బంగారంలో వేరే లోహాన్ని కలిపినట్లు బయటపెట్టాడు. అంతకు ముందు ఆర్కిమెడిస్‌తో పాటు అనేక మంది బంగారంలో కల్తీని కనుగొనేందుకు అనేక ఆలోచనలు, ప్రయోగాలు చేయకపోలేదు. అయితే తామెలా చేసేది చూడండని రాజుగారిని వారు పిలిచిగానీ, లేదా మీ ప్రయోగాన్ని స్వయంగా చూస్తానని రాజుగారు వచ్చి కూర్చున్న వుదంతాలుగానీ, ప్రయోగం లేదా వివరణలో విఫలమైతే శాస్త్రవేత్తలు కంటినీరు పెట్టుకున్నట్లు, వారిని రాజుగారు ఓదార్చినట్లు ఎక్కడా చదవలేదు. అసాధారణంగా ఎక్కడైనా జరిగిందేమో నాకు తెలియదు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి అంశం మీద జనంలో భావోద్వేగాలు, మనోభావాలు రేపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి భావించాల్సి వస్తోంది. శాస్త్ర పరిశోధనల మీద దేశమంతటా ఆసక్తిని కలిగించే యత్నాలు, శాస్త్రంపట్ల ఆసక్తిని కలిగించేందుకు తీసుకొనే చర్యలు వేరు. అనేక దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి, కానీ మన ప్రధాని నరేంద్రమోడీ మాదిరి ఒక దేశాధినేత స్వయంగా పరిశోధనా కేంద్రానికి వచ్చి కూర్చొని వీక్షించిన వుదంతం వుందేమో చెప్పమ్మా అని గూగులమ్మ తల్లిని అడిగితే చెప్పలేదు. ఎవరి దగ్గర అయినా అలాంటి సమాచారం వుంటే నా వ్యక్తీకరణను సవరించుకొనేందుకు సిద్దం. ఇస్రో చరిత్రలో విజయాలతో పాటు అపజయాలు కూడా వున్నాయి. అపజయాలు సంభవించినపుడు వుత్సాహం కొరవడ వచ్చుగానీ, ఎప్పుడూ కంటనీరు పెట్టుకున్నట్లు చదవలేదు. చంద్రయాన్‌ 2 వుదంతంలో రాజకీయం, మీడియా జనంలో భావోద్వేగాలను పెంచటంలో , వుపయోగించుకోవటంలో మాత్రం విజయం సాధించింది. మన దేశంలో క్రికెట్‌ మీద, మరొక దేశంలో మరొక క్రీడను సొమ్ము చేసుకొనేందుకు జనంలో పిచ్చిని పెంచే విధంగా మీడియా రాతలు, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందే బిసిసిఐ తీరుతెన్నులను చూశాము.అది ముదిరిపోయి కొన్ని చోట్ల తాము ఆశించిన జట్టు విజయం సాధించని సందర్భాలలో అభిమానం దురభిమానంగా మారిన వుదంతాలు కూడా చూశాము. శాస్త్ర ప్రయోగాలు అలాంటివి కాదు. వాటి విజయం గురించి ఎవరూ హామీ ఇవ్వలేరు. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దృశ్యాలు,ఓదార్పు యాత్రలు అక్కడ లేవు. ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గర ఎందుకో జనం ఆలోచించాలి.

చంద్రయాన్‌ ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. అది నిడివి పెద్దది అయినా ఇక్కడ పూర్తి పాఠం ఇస్తున్నాను. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు తను ఓ క్షణం విస్తుపోయాడు ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్‌-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది అబ్బే, ఏమాత్రం నమ్మబుల్‌గా లేదు, ఉత్త ఫేక్‌ అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు కదా ఈ వార్తను..! కానీ కాస్త అతిశయోక్తి ఉంది గానీ వార్త నిజమే. కాకపోతే మన మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు ఇలాంటివి పట్టవు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్‌.ఈ స్వామి పూరి శంకరాచార్య నంబర్‌ 145, ఈయన 143వ శంకరాచార్యుడు భారతక ష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు. ఆయన వేదగణితంలో దిట్ట. ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్‌ చేసేవాడు. ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు.

ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి.లెక్కలంటే లెక్కలే. ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు .రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి. కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్‌ బై స్టెప్‌ ఉంటుంది. ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది.”ఇందులో వింత ఏమీ లేదు, ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు. వేల ఏళ్ల క్రితమే భారతీయ రుషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది. మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి. నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు.11 పుస్తకాలు రాశాడు తను. దీనిపై చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్‌లో ఉంటారు. సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ మనోజ్‌ రత్తా.

నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్‌ సైన్స్‌తో పరిచయం కొత్తదేమీ కాదు. చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్‌ స్పేస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు వెళ్లి దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్‌ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు. అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్‌ పాఠాలు కూడా చెప్పాడు సో, స్వామి అనగానే కాషాయాలు (మన తెలుగు స్వాములతో అస్సలు పోల్చుకోవద్దు దయచేసి..) ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి. ఇదుగో, ఈ నిశ్చలానందులూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పురాతన జ్ఞానాన్ని అద్ది సుసంపన్నం చేస్తారు. తమ చుట్టూ ఛాందసాల మడి గీతలు గీసుకుని, వాటిల్లో బందీలుగా ఉండరు. విభిన్నరంగాల్లో ఇదుగో ఇలా తళుక్కుమంటారు. అవసరమైన వేళల్లో..!! ”

రోజూ సామాజిక మాధ్యమాల్లో ‘ మేకిన్‌ ఇండియా ‘ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఫేక్‌ న్యూస్‌ల్లో పైదొకటి. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు ? చిత్రించారు. చంద్రయాన్‌ 2 ప్రాజెక్టు 2007లో ప్రారంభమైంది. 2008లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2013లో ప్రయోగించాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ఆలస్యమైంది. అలాంటిదానికి ప్రయోగించబోయే ముందు లెక్కల చిక్కుముడి పడిందని చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకే లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. సదరు నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో ఇస్రోకు సమాంతరంగా ఇప్పటికైనా తన ప్రతిభతో ప్రయోగాలను చేపట్టమనండి.

విక్రమ్‌ లాండర్‌ను సులభంగా చంద్రుడి దక్షిణ ధృవం మీద దించటం, అది పద్నాలుగు రోజుల పాటు వుపరితలం మీద కదలాడుతూ సమాచారాన్ని సేకరించటం కీలకాంశం. దానికి ముందు వున్న దశలను మన శాస్త్రవేత్తలు ఎప్పుడో జయప్రదంగా అధిగమించారు. రష్యా సహకారంలో భాగంగా వారు లాండర్‌ను తయారు చేసి ఇవ్వాల్సి వుంది. అయితే వారికి తలెత్తిన సాంకేతిక సమస్యలు కావచ్చు, బయటికి తెలియని ఇతర కారణాలతో గానీ తాము ఇవ్వలేమని చెప్పిన తరువాత మన వారే స్వంతంగా తయారు చేశారు. ఇది కూడా ఆలశ్యానికి ఒక కారణం.

Image result for disappointed Narendra Modi at ISRO

మన దేశంలో ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేయటం చేస్తున్నారు. ఈ ఏడాది ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకృష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. ఈ వుత్తరం అందిన వారు మరొక పదకొండు మందికి లేఖలు రాయకపోతే అరిష్టానికి గురి అవుతారు అన్నట్లు గాక పోయినా అందరికీ పంపి ప్రార్ధనలు చేయండని కోరారు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మనం చేయాల్సింది చేయాలి, దేవుడి కటాక్షం కోరాలి అని చెప్పేవారు వుంటారు. అలాంటపుడు ఓదార్పు శాస్త్రవేత్తలకే ఎందుకు, ప్రయోగాన్ని కాపాడలేకపోయినందుకు దేవుళ్లు దేవతలు, స్వాములను కూడా ఓదార్చాలి లేదా అభిశంచించాలి. మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము.

ఆయుధాలు, అంతరిక్ష ప్రయోగాల కోసం దేశాలు పోటీ పడ్డాయి. దీనిలో సాంకేతికంగా, మిలిటరీ రీత్యా పై చేయి సాధించటంతో పాటు ‘రాజకీయ’ ప్రయోజనం కూడా చోటు చేసుకుంది. వుదాహరణకు హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ, ఇటలీ, జపాన్‌ కూటమికి వ్యతిరేకంగా తమతో చేయి కలపాలని అమెరికా, బ్రిటన్‌ దేశాలు నాటి సోవియట్‌ను కోరాయి. 1945 జూలై 16న ప్రపంచంలో తొలిసారిగా అమెరికా అణుబాంబు పరీక్ష జరిపింది. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌కు ఈ విషయం చెప్పాడు. అయితే అప్పటికే సోవియట్‌ నేత స్టాలిన్‌ వారితో కలవటానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారు. మిత్రపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు. అందువలన ఈ విషయం తెలిస్తే ఒక వేళ స్టాలిన్‌ వెనక్కు తగ్గుతారేమో, కొత్త షరతులను పెడతారేమో అనే అనుమానంతో వెంటనే చెప్పవద్దని ఇద్దరు నేతలూ అనుకున్నారు. జపాన్‌ మీద యుద్దం చేసేందుకు స్టాలిన్‌ అంగీకరించిన తరువాత జూలై 25 తమ దగ్గర ప్రమాదకరమైన ఒక బాంబు వుందని ట్రూమన్‌ సూచన ప్రాయంగా స్టాలిన్‌కు చెప్పాడు. దీనిలో వున్న రాజకీయం ఏమంటే అప్పటికే అమెరికన్లు బాంబు ప్రయోగానికి నిర్ణయించుకున్నారు. ఆగస్టు పదిలోగా బాంబును ప్రయోగించాలని, అలాంటి బాంబులు హిట్లర్‌, స్టాలిన్‌ దగ్గర లేవని ట్రూమన్‌ తన డైరీలో రాసుకున్నాడు. అది జరిగిన తరువాత సోవియట్‌ యూనియన్‌ భయపడిపోయి యుద్ధానంతరం ఐరోపాను పంచుకొనే విషయంలో తమ షరతులకు అంగీకారానికి రాకతప్పదనే ఆలోచన దాగుంది. అయితే స్టాలిన్‌ ఆ సమాచారం విని తాపీగా అలాగా, సంతోషం, మంచికోసమే వుపయోగించాలి అనటం తప్ప ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదు. అప్పటికే యుద్ధం ముగింపుదశలో వుంది. మరో వారం రోజుల్లో సోవియట్‌ సేనలు జపాన్‌పై దాడికి వస్తాయనగా ట్రూమన్‌ ఆగస్టు ఆరున తొలి బాంబును, రెండు రోజుల తరువాత రెండవ బాంబును ప్రయోగించాలని ఆదేశించాడు.యుద్ధం ముగిసిన తరువాత మూడు సంవత్సరాల్లో అంటే 1949 ఆగస్టు 29న సోవియట్‌ యూనియన్‌ తొలి అణుపరీక్ష జరిపింది.అది ప్రపంచ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన విషయం తెలిసిందే.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

సోవియట్‌ పట్టుదల అంతటితో ఆగలేదు. అణుబాంబును మోసుకుపోయి లక్ష్యాల మీద వేసే క్షిపణుల తయారీకి పూనుంది. అమెరికా కంటే ముందుగా అలాంటి ఒక క్షిపణిని ప్రయోగించింది. అదే తరువాత కాలంలో అంతరిక్ష ప్రయోగాలకు ఎన్నో పాఠాలు నేర్పింది. తాము మరో రెండు సంవత్సరాలలో అంతరికక్ష వుపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు 1955లో అమెరికా ప్రకటించింది. దానికంటే ముందే సోవియట్‌ వుపగ్రహాన్ని ప్రయోగించింది, అంతటితో ఆగలేదు 1961లో యూరీ గగారిన్‌ అంతరిక్ష ప్రయాణం చేయించింది. అదే ఏడాది అమెరికన్లు క్యూబామీద దాడి చేసేందుకు ప్రయత్నించి ఎదురు దెబ్బతిన్నారు.దీంతో సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో అమెరికాకు ఎదురు లేదన్న ప్రతిష్ట అడుగంటింది. ఈ పూర్వరంగంలో అమెరికా ఆధిపత్యానికి తిరుగులేదు అంటే ఏమి చెయ్యాలి? అంతరిక్షంలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనం సోవియట్‌ను అధిగమించగలమా ? చంద్రుడి చుట్టూ తిరిగి రాగలమా, చంద్రుడి మీద రాకెట్లను దించగలమా ? రాకెట్లలో మనిషిని పంపి తిరిగి వెనక్కు తీసుకురాగలమా ? ఇవిగాక మన ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకు అవసరమైన నాటకీయ ఫలితాలను సాధించే అంతరిక్ష కార్యక్రమం ఏదైనా వుంటే చెప్పండి అని నాటి అమెరికా అధ్యక్షుడు కెన్నడీ తన సలహాదారులను అడిగాడు. రెండు వారాల తరువాత వుపాధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ నాయకత్వంలోని ఒక కమిటీ సోవియట్‌తో పోటీలో అధిగమించకపోయినా సమంగా అయినా వుండేట్లు చూడాలని కెన్నడీ కోరాడు. దాని ఫలితమే అపోలో కార్యక్రమం.

1961 మే 25న అమెరికా పార్లమెంట్‌, దేశ ప్రజలను వుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాపితంగా వున్న మన స్నేహితులుా,శత్రువుల మధ్య జరుగుతున్న పోరులో మనం విజయం సాధించాల్సి వుంది. మనం సైనికుల హృదయాలను చూరగొన గలగాలి. అంతరిక్షంలో 1957లో స్పుత్నిక్‌(సోవియట్‌) సాధించిన నాటకీయ పరిణామాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రతి చోటా ముందుకు పోవాలనే పట్టుదలతో వున్న మార్గంలో ప్రయాణిస్తున్న సైనికులపై ప్రభావం పడింది. మనం అంతరిక్షంలోకి పోవాలి. ఇలా సాగింది ఆ ప్రసంగం. అంతటి అమెరికన్లే తమ రాజకీయ, ఇతర ప్రయోజనాల కోసం అంతరిక్ష కార్యక్రమాన్ని వుపయోగించుకున్నారన్నది స్పష్టం.

ఇదే సమయంలో తమ సోషలిస్టు భావజాలం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు, ఇతర దేశాలను అమెరికా నుంచి దూరం చేసి తమ వైపుకు తిప్పుకొనే రాజకీయాల్లో భాగంగా సోవియట్‌ కూడా తన పాత్ర నిర్వహించింది. పెద్ద విజయంగా టాంటాం వేసుకుంటున్న కాశ్మీరు రాష్ట్ర విభజన, ఆర్టికల్‌ 370 గురించి ఎన్నో రోజులు వూదరగొట్టేందుకు నరేంద్రమోడీకి, బిజెపికి అవకాశం లేదు. ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత ఎక్కువగా ఆ చర్య వలన ఇతర రాష్ట్రాలకు జరిగిన మేలు ఏమిటని జనం ప్రశ్నిస్తారు. ఇదిలా వుండగా దేశంలో ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం మరింత పెరుగుతోంది, పరిశ్రమల మూతలు పెరుగుతున్నాయి. వాటిని గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని నరేంద్రమోడీ అండ్‌కోకు జనం దృష్టిని మళ్లించే ఒక పెద్ద అంశం కావాలి. అందువలన ఈ పూర్వరంగంలో చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకు నరేంద్రమోడీ ప్రయత్నించారా అన్న సందేహం కలగటంలో తప్పేముంది. ప్రయోగాల వైఫల్యం ఇస్రో శాస్త్రవేత్తలకు కొత్త కాదు. అందువలన వారి కంటే నరేంద్రమోడీ ఎక్కువగా హతాశులయ్యారా ? చంద్రయాన్‌ అందినట్లే అంది అందకుండా పోయింది.

చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక చిన్న ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. గతకాలంలో ఎన్నో విజయాలు సాధించాము. తక్కువ ఖర్చుతో చేపట్టబోయే, 2024లో మొదలయ్యే చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.. మన శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎవరికంటే తీసిపోరు, 104దేశ విదేశీ ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రయోగించిన ఘనత మనవారిదే కదా. అయినా.. కొంతమందికి బాధ అనిపించినా మన దేశానికి ముందు కావలసింది దేశ అభివ ద్ధికి ప్రత్యక్షంగా ఉపయోగపడే ప్రయోగాలు అని గుర్తించాలి. ప్రస్తుత చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేస్తున్నది. లాండర్‌ మాత్రమే విఫలమైంది.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మోడీ సర్కార్‌లో ఇద్దరు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులకు విద్య లేదా పరిశోధన చేసిన పూర్వరంగం లేదని వారు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి సూచనలను స్వీకరించటం తప్ప నిపుణులు చెప్పేది వినటం లేదని అన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కృత్రిమ గర్భధారణ పద్దతులను అభివృద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు.

యుపిఏ హయాంలో శాస్త్ర, పరిశోధనల మీద జిడిపిలో 0.8శాతం ఖర్చు చేస్తే మోడీ హయాంలో అది 0.69కి పడిపోయింది. అమెరికా అత్యధికంగా 3-4శాతం వరకు ఖర్చు చేస్తుండగా చైనా రెండుశాతంపైగా చేస్తున్నది. వైఫల్యాలన్నీ పరిశోధన బడ్జెట్‌ను బట్టే వుంటాయని చెప్పలేము గానీ,తగినన్ని నిధుల కేటాయింపు లేకపోయినా ప్రయోగాలు విజయవంతం కావు. పరిశోధనల మీద ఖర్చును పెంచాలని దేశవ్యాపితంగా శాస్త్రవేత్తలు ప్రదర్శనలు చేసిన విషయం తెలిసినదే.విజయం అంచున ఖ్యాతిని సొంతం చేసుకొనేందుకు పరిశోధనా కేంద్రాలకు చేరి తాపత్రయం పడే రాజకీయాలకు నేటి నేతలు స్వస్తి పలకాలి. అలాంటివి శాస్త్రవేత్తలను మరింత వత్తిడికి గురిచేస్తాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఓదార్పులు, ఆ పేరుతో ప్రచారం కాదు. వర్తమానంలో వున్న ఆవిష్కరణలన్నింటినీ మన పూర్వీకులు ఎప్పుడో కనుగొని వాడిపారేశారు, ఆ విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కృత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కృత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి. ఆవు మూత్రం, పేడలో ఏముందని తెలుసుకొనేందుకు కాదు, జనానికి పనికి వచ్చే పరిశోధన, అభివృద్ధికి నిధులను గణనీయంగా పెంచాలి. అవి లేకుండా ఓదార్పుల వలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గ్రీస్‌ వామపక్షం సిరిజా ఓటమి కారణాలేమిటి?

10 Wednesday Jul 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

100 years of the KKE, Alexis Tsipras, Greece New Democracy, Socialist PASOK, Syriza, The ‘SYRIZA Experience

Image result for why leftist syriza lost the Greece 2019 election

ఎం. కోటేశ్వరరావు

గ్రీస్‌లో నాలుగేండ్ల క్రితం తొలి వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ సిరిజా ఆదివారంనాడు జరిగిన మలి ఎన్నికల్లో పరాజయం పాలైంది. మితవాద న్యూ డెమోక్రసీ పార్టీ తిరిగి అధికారానికి వచ్చింది. తొలిసారిగా మే నెలలో జరిగిన ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని రకాల మితవాద పార్టీలు 52శాతం ఓట్లు తెచ్చుకొని అక్కడ పెరుగుతున్న ప్రమాదానికి సంకేతాలను వెల్లడించాయి. ఇప్పుడు వాటి బలం మరింత పెరిగింది. వామపక్ష సిరిజా వైఖరి, విధానాలతో తొలినుంచీ విభేదిస్తున్న కమ్యూనిస్టు పార్టీ గత ఎన్నికలలో తెచ్చుకున్న ఓట్లూ సీట్లను నిలబెట్టుకుంది. గతంలోనూ, ఈసారీ ఆ పార్టీ 300స్థానాలున్న పార్లమెంట్‌లో 15 సీట్లు తెచ్చుకుంది. లాటిన్‌ అమెరికాలో కొన్నిచోట్ల వామపక్షాలకు తగిలిన ఎదురుదెబ్బల పూర్వరంగంలో గ్రీస్‌ ఎన్నికలు అభ్యుదయవాదులు, వామపక్షాలు, కమ్యూనిస్టులు, కార్మికవర్గానికి కూడా ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతున్నాయి.
ఈ ఎన్నికల్లో అధికారిక సమాచారం ప్రకారం వివిధ పార్టీల ఓట్లశాతం, సీట్ల సంఖ్య ఇలా ఉన్నాయి. న్యూడెమోక్రసీ 39.85(158), సిరిజా 31.53(86), కినాల్‌(మార్పుకోసం ఉద్యమం) 8.10(22), కమ్యూనిస్టుపార్టీ 5.3(15), ఎలినికి లిసీ(గ్రీక్‌ పరిష్కారం) 3.7(10) డైయం25(2025 ఐరోపా ఉద్యమంలో ప్రజాస్వామ్యం) 3.44(9) సీట్లు పొందగా ఇతర పార్టీలకు 8.08శాతం ఓట్లొచ్చాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం 300స్థానాలున్న పార్లమెంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 151స్థానాలు అవసరం. అయితే ఎన్నికలు 250స్థానాలకు మాత్రమే జరుగుతాయి. వీటిలో మూడు రకాలు, దేశం మొత్తాన్ని 12 నియోజకవర్గాలుగా పరిగణించి పార్టీలు పొందిన ఓట్లశాతాలకు అనుగుణంగా సీట్లను కేటాయిస్తారు. ఇవిగాక మరో ఏడు స్ధానాలు ఇవన్నీ దాదాపు దీవులకు చెందినవి. వీటిలో నియోజకవర్గ ప్రాతిపదికన మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న వారిని విజేతలుగా నిర్ణయిస్తారు. మిగిలిన 231స్థానాలను దేశంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గాలలో వున్న సీట్లను దామాషా ప్రాతికపదికన పార్టీలకు కేటాయిస్తారు. కనీసం 3శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీకి మాత్రమే ప్రాతినిద్యం లభిస్తుంది. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పెద్ద పార్టీకి 50స్థానాలు బోనస్‌గా ఇస్తారు. ఈ కారణంగానే న్యూ డెమోక్రసీ పార్టీకి 39.85శాతమే ఓట్లు వచ్చినా సీట్లు సగానికిపైగా పొందింది.
కొంతమంది వర్ణించినట్టు తీవ్రవాద వామపక్ష లేదా వామపక్ష కూటమిగా 2004లో ఏర్పడి పదేండ్లలో అధికారానికి వచ్చిన పార్టీగా సిరిజా ఎందరో వామపక్ష అభిమానులకు ఉత్సాహానిచ్చింది. సిరిజా అంటే మూలాల నుంచి లేదా విప్లవాత్మకం అని అర్థం. గ్రీసులో 1990 దశకంలో ప్రయివేటీకరణ, సామాజిక, పౌర సమస్యల వంటివాటితో పాటు కొసావోపై దాడులను వ్యతిరేకించటం వంటి అనేక సమస్యలపై ఐక్యంగా ఉద్యమించిన వామపక్ష సంస్థలు, పార్టీలు, శక్తులు తొలిసారిగా 2002 గ్రీస్‌ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్దుబాట్లు చేసుకున్నాయి. తరువాత దాని కొనసాగింపుగా 2004ఎన్నికల సమయంలో సిరిజా కూటమిగా పోటీ చేశాయి. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయిన ఒక గ్రూపు, వామపక్ష-పర్యావరణ ఉద్యమకారుల పార్టీ, ఇంటర్నేషనల్‌ వర్కర్స్‌ లెఫ్ట్‌ వంటివి, వివిధ భావజాలాలతో పని చేస్తున్న వామపక్ష బృందాలూ వ్యక్తులూ దీనిలో చేరారు. ఆ ఎన్నికల్లో 3.3శాతం ఓట్లు తెచ్చుకున్న సిరిజా ఆరు పార్లమెంట్‌ స్థానాలు తెచ్చుకుంది. ఆరుగురు ఎంపీలు వామపక్ష-పర్యావరణ పార్టీకి చెందిన వారే అయ్యారు. ఇది మిగతా బృందాలలో ఆందోళనకు కారణమైంది. సిరిజాలో ఇదే పెద్దపార్టీ. మధ్యేవాద వామపక్ష రాజకీయాలను తిరస్కరించాలనే అంశంపై కొన్ని సైద్ధాంతిక సమస్యలు తలెత్తటంతో ఎన్నికలు ముగిసిన మూడునెలలకే ఈ పార్టీ విడిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల్లో విడిగానే పోటీ కూడా చేసింది. సిరిజాలో విలీనమైన ఇతర పార్టీలలో కూడా విభేదాలు తలెత్తాయి. అయితే అదే ఏడాది డిసెంబరులో తిరిగి సంకీర్ణ కూటమిలో కొనసాగాలని నిర్ణయించుకొన్నారు. 2004 నుంచి 2009 వరకు సిరిజా అనేక అంతర్గత సమస్యలను ఎదుర్కొన్నది, కొత్త శక్తులు చేరాయి. 2009ఎన్నికల్లో 4.6శాతం ఓట్లు తెచ్చుకుంది. తరువాత కాలంలో ప్రధాని అయిన సిప్రాస్‌ పార్లమెంటరీ పార్టీనేతగా ఎన్నికయ్యారు. మరుసటి ఏడాది వామపక్ష-పర్యావరణ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు సిరిజా నుంచి విడిపోయి డెమోక్రటిక్‌ లెఫ్ట్‌ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. 2012లో జరిగిన ఎన్నికల్లో సిరిజా కూటమి 16శాతం ఓట్లు తెచ్చుకొని రెండవ పెద్ద పక్షంగా ముందుకొచ్చింది. అయితే ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవటంతో అదే ఏడాది జూన్‌లో తిరిగి ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికల్లో కూటమి బదులు సిరిజా ఒక పార్టీగా పోటీ చేసి 27శాతానికి ఓట్లను పెంచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మరుసటి ఏడాది ఐక్యపార్టీ సభ జరిగింది. కూటమిలోని పార్టీలను రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే నాలుగు పార్టీలు అంగీకరించకపోవటంతో ఆ నిర్ణయాన్ని మూడునెలలు వాయిదా వేశారు. సిప్రాస్‌ను అధ్యక్షుడిగా 74శాతం అంగీకరించారు. యూరో నుంచి తప్పుకోవాలని కోరే వామపక్ష వేదిక అనే పార్టీ సిరిజా కేంద్రకమిటీలో 30శాతం స్ధానాలను పొందింది. 2014 ఐరోపా యూనియన్‌ ఎన్నికల్లో 26.5శాతం ఓట్లతో సిరిజా పెద్ద పార్టీగా అవతరించింది. తరువాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో వివిధ కారణాలతో మిశ్రమ ఫలితాలను పొందింది. 2014 డిసెంబరులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవటంలో విఫలం కావటంతో పార్లమెంట్‌ రద్దయింది. 2015 జనవరి 25న జరిగిన ఎన్నికల్లో సిరిజా 36.3శాతం ఓట్లు, 149 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది గానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి రెండు సీట్లు తగ్గాయి. సిరిజా గనుక అధికారంలోకి వస్తే పొదుపు చర్యలకు వ్యతిరేక వైఖరిని తీసుకుంటుందని, పెట్టుబడిదార్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని అనేకమంది భయపడ్డారు. మితవాద ఇండిపెండెంట్‌ గ్రీక్స్‌ పార్టీ సంకీర్ణానికి అంగీకరించటంతో సిప్రాస్‌ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడింది. ఒక వామపక్షం, పచ్చి మితవాద పార్టీ పొత్తు అది.
రుణభారం నుంచి గ్రీస్‌ను బయట పడవేసేందుకు ఐరోపాయూనియన్‌, ఐరోపా కమిషన్‌, ఐఎంఎఫ్‌ల త్రికూటమి పొదుపు పేరుతో విధించిన షరతులను అంగీకరిస్తూ సిప్రాస్‌ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనను సిరిజాలోని 25మంది ఎంపీలు వ్యతిరేకించారు. వారంతా బయటకొచ్చి పాపులర్‌ యూనిటీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. మెజారిటీ కోల్పోవటంతో 2015 ఆగస్టు 20న రాజీనామా చేసి సెప్టెంబరు 20న తాజా ఎన్నికలకు సిప్రాస్‌ సిఫార్సు చేశారు. తిరిగి సిరిజా పెద్దపార్టీగా అవతరించి 145స్థానాలను తెచ్చుకుంది. మరోసారి ఇండిపెండెంట్‌ గ్రీక్స్‌తో ఒప్పందం చేసుకొని 155సీట్లతో సంకీర్ణ ప్రభుత్వాన్ని రెండోసారి ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌ పదవీ కాలం నాలుగేండ్లు అయినందున ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు వుంది. అయితే మేలో జరిగిన ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో, తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిరిజా ఓటమి చెందింది. దాంతో ముందస్తు ఎన్నికలకు సిప్రాస్‌ సిఫార్సు చేయటంతో ఈనెల ఏడున ఎన్నికలు జరిగాయి. ఒక వామపక్ష పార్టీగా సిరిజా స్వల్ప కాలంలోనే ఓటర్లకు ఎందుకు దూరమైంది అన్నది అనేకమందిలో తలెత్తుతున్న ప్రశ్న.
నాలుగేండ్ల క్రితం గ్రీస్‌ చేగువేరా(సిప్రాస్‌)గా పేరు తెచ్చుకున్న నేత పాలనలో అంతకు ముందు పాలకుల హయాంలో త్రికూటమి తమ మీద రుద్దిన భారాలనుంచి విముక్తి కలిగిస్తారని ఆశించిన కార్మికవర్గ కలలు కల్లలయ్యాయి. గత పాలకులు ప్రకటించిన పొదుపు చర్యల గురించి ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్టు సిప్రాస్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. మితవాదులు గగ్గోలు పెట్టారు. జనం బ్రహ్మరథం పట్టారు. 2015 జూలై 5న జనాభిప్రాయ సేకరణ సమయంలో డబ్బులేక బ్యాంకులు మూతబడ్డాయి. ఐరోపా సంస్థలు, ఐఎంఎఫ్‌ నగదు సరఫరా నిలిపేశాయి. అవి ప్రతిపాదించిన పొదుపు చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు 61శాతం మంది ఓటు వేశారు. కొద్దిరోజుల తరువాత ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి సదరు సంస్థలు రుద్దిన అన్ని షరతులకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ 25మంది ఎంపీలు తిరుగుబాటు చేయటంతో వెంటనే పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలు జరిపారు. నూతన షరతుల గురించి జనానికి పూర్తిగా తెలిసి, పర్యవసానాల గురించి చర్చలు ప్రారంభమయ్యేలోగానే ఎన్నికలు రావటం, ఎదురుగా అంతకు ముందే పొదుపు చర్యల్ని రుద్దిన న్యూ డెమోక్రసీ పార్టీ కనిపిస్తుండటంతో చాలామంది ఓటర్లు అసలు ఎన్నికలకే దూరమయ్యారు. 1974 తరువాత కనిష్టంగా 56.6శాతం ఓట్లు పోలయ్యాయి (తాజా ఎన్నికల్లో మరో శాతం పెరిగింది తప్ప ఓటర్లలో ఉత్సాహం లేదు). మరోసారి సిరిజానే ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ పార్టీకి, సిరిజాకు పెద్ద తేడాలేదని భావించిన వామపక్ష ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉండిపోయారనే అభిప్రాయాలూ వెల్లడయ్యాయి.

Image result for syriza tsipras  lost
ఒకనాడు ప్రయివేటీకరణ, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మటాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన వ్యక్తే వాటిని కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టటాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొత్తగా అన్న, వస్త్రాల కోసం చూస్తే వున్న వాటినే వూడగొట్టినట్టుగా పరిస్థితి తయారైంది. విప్లవకారుడని భావించిన వారికి విద్రోహిగా కనిపించాడంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు వందల నౌకా కంపెనీలకు, ఇతర సంస్థలకు పెద్ద మొత్తంలో పన్నుల రాయితీలు ప్రకటించారు. ఇలాంటి వైఖరి కారణంగానే మితవాదుల కంటే అతివాదుల పేరుతో భారాలు మోపే వారే మంచిదనే కారణంతో ఐరోపా యూనియన్‌ ఎన్నికల్లో దేశంలో ఇరవైకి పైగా ఉన్న బడా సంస్థలలో సగం, బ్యాంకులు, ఐరోపా యూనియన్‌, కమిషన్‌, అనేక కార్పొరేట్‌ సంస్థలు సిప్రాస్‌కు మద్దతిచ్చినట్టు వార్తలొచ్చాయి. అమెరికా నుంచి ఎఫ్‌16 యుద్ధ విమానాల కొనుగోలుకు రెండున్నర బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఇజ్రాయెల్‌తో స్నేహ సంబంధాలను పెంపొందించుకున్నారు. బాల్కన్‌ ప్రాంతానికి నాటో కూటమి విస్తరించటాన్ని వ్యతిరేకిస్తూ గతంలో గ్రీస్‌ చేసిన వీటో రద్దు చేసి దారి సుగమం చేశారు.
గ్రీక్‌ బడాబాబులకు, ఐరోపా యూనియన్‌ భారాలకు, పొదుపు చర్యలకు వ్యతిరేకంగా పోరాడతానన్న వాగ్దానాలతో సిప్రాస్‌ అధికారానికి వచ్చారు. వాటికి పూర్తి భిన్నంగా ఆచరణలో వ్యవహరించారు. పొదుపు పేరుతో పేదల మీద భారాలను మోపారని చివరికి జర్మన్‌ ఆర్థిక మంత్రి వూల్ఫ్‌గాంగ్‌ ష్కాబుల్‌ కూడా విమర్శించారంటే ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నాలుగేండ్ల క్రితం న్యూడెమోక్రసీకి 16.5శాతం మంది యువకులు ఓటు వేస్తే ఈ ఎన్నికల్లో 30శాతానికి పెరిగింది, ఇదే విధంగా పెన్షనర్లు కూడా ఆ పార్టీ వైపు మొగ్గారని వెల్లడైంది. సిరిజా నాయకత్వం పైకి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఆచరణలో ప్రజావ్యతిరేక నయా ఉదారవాద విధానాలను అమలు చేసింది. మిగతా పార్టీలకు దానికీ తేడాలేదని తనను తానే బహిర్గత పరుచుకుంది. ఇతర బూర్జువా పార్టీల మాదిరే పార్టీలో అన్నీ తానే అయి వ్యవహరించి సిరిజా అంటే సిప్రాస్‌ అనే విధంగా మార్చివేశారన్న విమర్శలున్నాయి. ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఓటర్లను ఆకట్టుకొనేందుకు సిప్రాస్‌ కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించాడు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఫలితం లేకుండా పోయింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాలో కమ్యూనిస్టులకు చోటు, వెసులుబాటు !

23 Sunday Jun 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

100 years US Communist Party, American Communist Party, CPUSA, CPUSA organization’s 31st National Convention, HAY MARKET, Wahsayah Whitebird

Wahsayah Whitebird, shown here attending the Communist Party USA's 2019 convention in Chicago, Ill., won election to the Ashland, Wisconsin, city council in a nonpartisan election in April 2019.  (James Varney/The Washington Times)

ఎం కోటేశ్వరరావు

పార్టీ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేయాలా, డెమాక్రటిక్‌ పార్టీ వంటి వాటిలోని వామపక్ష శక్తులకు మద్దతు ఇవ్వాలా అన్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాలు ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఆ సమాజాలలో రెచ్చగొట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకత ఆ పరిస్ధితిని సృష్టించింది. అయితే అమెరికాలోని ఒక యువ కమ్యూనిస్టు, మన పరిభాషలో చెప్పాలంటే ఒక గిరిజన యువకుడికి అలాంటి పరిస్ధితి ఎదురుకాలేదు. చికాగో నగరంలో జరిగిన అమెరికా కమ్యూనిస్టు పార్టీ 31వ మహాసభ, పార్టీ శతవసంతాల వుత్సవాలకు ప్రతినిధిగా హాజరైన విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని ఒక చిన్న మున్సిపాలిటీ ఆష్‌లాండ్‌ కౌన్సిలర్‌గా ఏప్రిల్‌ నెలలో ఎన్నికైన వాహ్‌సయా వైట్‌బర్డ్‌ గురించి ఒక పత్రిక వెల్లడించిన కధనం ఎంతో ఆసక్తికరంగానూ, అమెరికా సమాజంలో వస్తున్న మార్పు సూచికగా కనిపిస్తున్నది. అమెరికా రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ వైఖరిని చెప్పటానికి,వునికిని కొనసాగించటానికి చోటు, వెసులుబాటు వుందంటారు వైట్‌బర్డ్‌. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలకు ముందు తన రాజకీయ వైఖరి ఏమిటని ఎవరూ అడగలేదు, అడిగిన తరువాత వెంటనే 2011 నుంచి కమ్యూనిస్టుగా వున్నట్లు తెలిపే నా పార్టీ గుర్తింపు కార్డును వారికి చూపించాను. ఎన్నికలకు ముందు స్ధానిక మీడియా వారు పార్టీ అనుబంధం గురించి అడిగారు, అదొక సమస్యగా నాకు అనిపించలేదు, ఎన్నికలలో నేను పేదల వేదిక పేరుతో పోటీ చేశాను, పేదలకు అందుబాటులో గృహాలు, కనీసవేతనం పెంపు, ఇండ్లు లేని వారికి ఆశ్రయాలు కల్పించాలనే అజెండాను ఓటర్ల ముందు పెట్టాను, డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి మీద గెలిచాను. పార్టీ గుర్తు మీద పోటీ చేయటం ఒక సమస్య కాదనుకుంటున్నాను. పార్టీ తన స్వంత అభ్యర్ధులను నిలిపేందుకు ప్రయత్నించాలి.ఇతరులతో కూటమి కట్టాలి. కీలకమైన అంశం విధానాల మీద వుండాలి, పాక్షికమైన అనుబంధాల మీద కాదు. అని చెప్పాడు. ఒక బేకరీ కార్మికుడిగా అతను పని చేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ భావజాలం ఆధిపత్యం సాధిస్తుందని చెప్పబోవటంలేదు గానీ తాను పని చేస్తున్న గ్రామీణ విస్కాన్సిన్‌ రాష్ట్రంలో తాను చెప్పే అంశాలను వినేవారు వున్నారంటూ కొన్ని అంశాలలో స్ధానిక సంస్ధలలో పన్నులు పెంచకుండా,ప్రస్తుతం లాభాలే లక్ష్యంగా పని చేస్తున్న చోట తక్కువ రేట్లతో కొన్ని పనులు చేయవచ్చు అన్నారు. రియలెస్టేట్‌ను ప్రజోపయోగ కంపెనీగా నడిపితే జనం మీద భారం పడదని తాను గుర్తించానన్నారు.

Communist Party USA celebrates its 100th birthday at Chicago convention

అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ చాలా పరిమితమైనది. మూడు రోజుల జాతీయ మహాసభ, శతవసంతాల వుత్సవం శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగింది.ప్రతినిధులు చికాగోలోని హేమార్కెట్‌ (మేడే పోరాటాలు జరిగిన ప్రాంతం)ను సందర్శించటంతో శుక్రవారం నాడు సభలు ప్రారంభమయ్యాయి. అనేక దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు సౌహార్ధ ప్రతినిధులుగా వచ్చారు. వెనెజులా కమ్యూనిస్టు యువజన విభాగ ప్రతినిధి అలెక్స్‌ గ్రానాడో ఇచ్చిన సందేశానికి పెద్ద ఎత్తున ప్రతినిధులు ప్రతిస్పందించారు. ప్రారంభ సభలో చికాగో నగరానికి నల్లజాతికి చెందిన తొలి మేయర్‌ హరోల్డ్‌ వాషింగ్టన్‌ సన్నిహితుడిగా వుండి 1983లో హత్యకు గురైన కమ్యూనిస్టు రూడీ లోజోనో కుమారుడు పెపె లోజోనో, గతంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున వుపాధ్యక్షపదవికి పోటీ చేసిన, ప్రస్తుతం పార్టీ వుపాధ్య క్షుడిగా వున్న జార్విస్‌ టైనర్‌ తదిరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మీద వున్న ఆరోపణలను తిప్పి కొట్టాలని, అమెరికాకు శాంతి, సమానత్వం, సోషలిజాలను తీసుకు రావాలని జార్విస్‌ టైనర్‌ చెప్పారు. కమ్యూనిస్టు వ్యతిరేకత అనేది పెద్ద అబద్దమని, అది ఇప్పుడు వైట్‌హౌస్‌లో నివాసం వుందని అన్నారు. యుద్దం, జాత్యంహంకారం, అసమానతల వైపు నెడుతున్నారని, యజమానులకు లొంగిపోవాలని కార్మికులను ఒప్పించేందుకు చూస్తున్నారని అన్నారు.

పార్టీ ప్రతినిధుల సభ శనివారం నాడు ప్రారంభమైంది. అధ్యక్షుడు జాన్‌ బాచ్‌టెల్‌ ప్రారంభ వుపన్యాసం చేస్తూ దేశంలో పార్టీ నిర్మాణం, సమస్యలను వివరించారు.డోనాల్డ్‌ ట్రంప్‌ కార్పొరేట్‌, పచ్చి మితవాదుల ప్రతిబింబంగా వున్నాడని పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడని చెప్పారు. అహింసా పద్దతుల్లో ఎన్నికల ద్వారా సోషలిజాన్ని తీసుకురావాలని కోరారు. కార్మికవర్గ పోరాటం వీధులతో పాటు భావజాల రంగంలో కూడా కొనసాగించాలన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌, ఎలిజబెత్‌ వారెన్‌, కమలా హారిస్‌,జో బిడెన్‌ వంటి వారు 24 మంది అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్నారని, ఎవరు సరైన వ్యక్తి అన్నది ఇంతవరకు నిర్ణయం కాలేదన్నారు. అధికారాన్ని నిలుపుకొనే ప్రక్రియలో భాగంగా పురోగామి, వామపక్ష శక్తుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు మితవాదులు అబద్దాలు, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని బాచ్‌టెల్‌ చెప్పారు. కార్మికవర్గంలో వున్న భయాలు, అభద్రతాభావాలను వుపయోగించుకొని ఆర్ధిక జాతీయవాదాన్ని ముందుకు తెచ్చి దోపిడీ చేయాలని చూస్తున్నారన్నారు. వర్గ, శ్వేత, పురుషాధిక్యాలను ప్రదర్శిస్తూ అవినీతి, యూనియన్లను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. పచ్చిమితవాదులు, రిపబ్లికన్‌ పార్టీని ఓడించటం అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు.చమురు వ్యాపారులు, మిలిటరీ-పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ శక్తులతో అవి నిండి వున్నాయని అన్నారు. అధికారికంగా నమోదు కాని పదిలక్షల మంది వలసకార్మికులను దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్‌ అనుకుంటే అతగాడు నరకానికి పోతాడని బాచ్‌టెల్‌ అన్నారు.

Communist Party chair declares at convention: “Trump can go to hell!”

మితవాద శక్తుల ప్రభావానికి వ్యతిరేకంగా జరిగే పోరులో పార్టీకి ప్రత్యేకించి యువతరం కావాలని, పార్టీ ప్రతినిధులను చూస్తే యువజన ప్రాతినిధ్యం, భిన్న సామాజిక తరగతులు వుండటం దీన్ని ప్రతిబింబిస్తున్నదని బాచ్‌టెల్‌ అన్నారు. 202 మంది ప్రతినిధుల్లో మూడింట రెండువంతుల మంది 44సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు వారని, 10.3శాతం ఆఫ్రికన్‌ అమెరికన్లు, మరో 10.3శాతం లాటినోలు, ఐదుశాతం ఆఫ్రో కరీబియన్లు, 9.2శాతం మంది యూదులు వున్నారు. అయితే మహిళలు 30శాతమే వున్నారని, ఈ అసమతూకాన్ని సరిదిద్దాలని అన్నారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత పార్టీ సభ్యత్వం పెరిగిందని, అనేక మంది స్ధానిక బృందాలు, సామాజిక వుద్యమాల్లో చేరుతున్నారని, వారిలో ఎక్కువ మంది నేడు డెమోక్రటిక్‌ పార్టీలో వుంటూనే కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా కూడా వుంటున్నారని, రేపటి కార్మికవర్గ పార్టీకోసం అందరూ కలసి పని చేయాలని చెప్పారు.

కమ్యూనిస్టుపార్టీ కనీస వేతన చట్టం, సామాజిక భద్రత, కార్మిక సంబంధాల జాతీయచట్టం, అందరికీ వైద్యం, నిరుద్యోగ పరిహారం వంటి ఇతర పురోగామి అంశాలతో పాటు ఆఫ్రో అమెరికన్ల అణచివేతకు, ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్న కమ్యూనిస్టుల భావజాలం నేడు ప్రధాన స్రవంతి చర్చగా వుందన్నారు.మనకు ఒక స్వప్నం వుంది. దానిలో గోడలు వంతెనలుగా, ఆయుధాలు నాగళ్లుగా, పెట్టుబడిదారులు అంతరించిపోయిన రాజులు, డైనోసార్సుగా మారతారు. మన ముందున్న సవాలుకు ధీటుగా మనం పెరిగితే ఇదే మన భవిష్యత్‌ అని బాచ్‌టెల్‌ చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే చైనానే ఎక్కువగా నమ్ముతున్న అమెరికన్‌ యువత !

12 Wednesday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Communist China, Donald trump, RED MAY, US youth distrust Trump, US Youth Trusting communist China

Image result for College kids' distrust for Trump over communist China

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం మేథావులకు తీవ్ర వ్యతిరేకి, చాలా వ్యతిరేకి, విశ్వవిద్యాలయాల వంటి వాటిని వుదారవాద ప్రచార యంత్రాలుగా పిలుస్తున్నారు. కాబట్టి అది జాత్యంహంకారి మాత్రమే కాదు, మేథావుల మీద దాడి వంటిది కూడా అని భావిస్తా ‘ ఇది ఒక విద్యార్ధి అభిప్రాయం. ‘ నావరకైతే చైనా ప్రభుత్వం నిజాయితీ కలిగినదా లేనిదా అనే గుర్తింపు ఎంత వుందో తెలియదు, కానీ ట్రంప్‌ సర్కార్‌ నిజాయితీలేనిదని మాత్రం నాకు కచ్చితంగా తెలుసు, కనుక అతన్ని నేను నమ్మను, అందువలన నేను నా స్వతంత్ర పరిశోధన చేస్తాను ‘ అనేది మరొక విద్యార్ధిని చెప్పిన మాట. అమెరికా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక చర్చలలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ ధోరణి గురించి ఒక కమ్యూనిస్టు వ్యతిరేక వెబ్‌సైట్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక క్లుప్త వ్యాఖ్యానాన్ని ప్రచురించింది.

పూర్వరంగం ఏమిటంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో దాదాపు వంద చోట్ల చైనా ప్రభుత్వం లేదా సంస్ధల నుంచి పొందే నిధులతో నడిచే కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిని మూసివేయాలని కోరుతూ 2014లో కొంతమంది ప్రొఫెసర్లు ఒక నివేదికను విడుదల చేశారు. గత సంవత్సరం సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ రే మాట్లాడుతూ కన్‌ఫ్యూసియస్‌ సంస్ధల కార్యకలాపాల మీద దర్యాప్తు జరుపుతున్నామని, వాటిని నిఘానిమిత్తం వినియోగిస్తున్నట్లు గూఢచారులు హెచ్చరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా పదమూడు విశ్వవిద్యాలయాల్లోని కేంద్రాల గురించి పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ కార్యాలయం) చేసిన పరిశోధనలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్‌ ఫ్రీ బీకన్‌ అనే పత్రం పేర్కొన్నది. ఈ అధ్యయన కేంద్రాలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని సిఐఏ పేర్కొన్నది. అమెరికా-చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య పోరు నేపధ్యంతో పాటు విశ్వవిద్యాలయాల సంస్కరణల గురించి అధ్యయనం చేస్తున్న ఒక మితవాద బృందానికి చెందిన మీడియా డైరెక్టర్‌ కాబోట్‌ ఫిలిప్స్‌ ఇటీవల మేరీలాండ్‌ విశ్వవిద్యాలయ సందర్శన చేశారు. అక్కడ మీరు కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలను నడిపే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్నా లేక కాపిటలిస్టు డోనాల్డ్‌ట్రంప్‌లో ఎవరిని ఎక్కువగా నమ్ముతారు అని ప్రశ్నించగా విద్యార్ధులు చెప్పిన సమాధానాలను పైన చూశారు. కనీసం ఒక విషయంలో అయినా ట్రంప్‌ కంటే చైనా చెప్పేదాన్నే నమ్ముతామన్నది వారి భావం అని తేలిందని, దీన్ని గమనించే అమెరికా గూఢచారశాఖ గేరు మార్చిందని సదరు వెబ్‌సైట్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు. దానిలో భాగంగానే దేవుడిని నమ్మని, అణచివేత వ్యవస్ధ కలిగిన, విఫలమైన చైనా గురించి ఆందోళన కలిగించే, తీవ్ర, కరోఠ సత్యాలను జనానికి అందిస్తున్నట్లు కూడా తెలిపారు.

కన్‌ఫ్యూసియస్‌ సంస్ధ మరియు పురోగామి విద్యావ్యవస్ధ కారణంగా విద్యార్ధులు సోషలిజం, కమ్యూనిజాల మరియు ప్రపంచ హేతువాద భావాల ఛాంపియన్లుగా తయారవుతున్నారు, అది చివరికి అమెరికా వ్యతిరేక మరియు సామాజిక న్యాయ పోరాట యోధులనే నూతన జాతిని తయారు చేస్తున్నది, ఈ రోజుల్లో కాలేజీ విద్యార్ధులు డోనాల్డ్‌ ట్రంప్‌ మరియు అతని ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకమైన ధోరణులకు దగ్గర అవుతున్నారు. అనేక మంది విద్యార్ధులు ట్రంప్‌ సర్కార్‌ కంటే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానే ఎక్కువగా నమ్ముతున్నారనే విస్తుగొలిపే అంశాన్ని ఎవరైనా చూడవచ్చు అని బ్లేజ్‌ అనే ఒక స్ధానిక పత్రిక పేర్కొన్న అంశాన్ని వెబ్‌సైట్‌ విశ్లేషణ వుటంకించింది.అనేక అంశాలపై ట్రంప్‌ ప్రభుత్వం,అమెరికా గూఢచార సంస్ధలు చెబుతున్న దాని కంటే చైనా ప్రభుత్వం చెబుతున్నవాటికే మద్దతు పలుకుతామన్నది సాధారణంగా వెల్లడైన సమాధానం కావటంతో సదరు కాబోట్‌ ఫిలిప్స్‌ బుర్ర దిరిగి చైనాలో మానవహక్కులు లేవని, మతవిశ్వాసాల కారణంగా మిలియన్ల మందిని అణచివేస్తున్నారంటూ ఆ విద్యార్ధులకు చెప్పి ఇప్పుడు చెప్పండి చైనా గురించి అని అడిగాడు. వెంటనే ఒక విద్యార్ధి చైనాను నమ్ముతున్నానని నేను చెప్పలేదు అనగా, మేథావులకు ట్రంప్‌ వ్యతిరేకం అని వ్యాఖ్యానించిన విద్యార్ధిని ఒక్క క్షణం ఆలోచించి నేను కచ్చితంగా చెప్పలేను అన్నది, మరొకరు ఇది చాల కష్టమైన ప్రశ్న, దానికి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, అది నూటికి నూరుశాతం కరెక్టని చెప్పలేను అన్నారు. చైనా భాష, సంస్కృతిని, కన్‌ఫ్యూసియస్‌ భావజాలాన్ని పెంపొందించే పేరుతో కమ్యూనిస్టు పార్టీ ప్రచార కేంద్రాలుగా వినియోగించుకుంటున్నారని కాబోట్‌ ఫిలిప్స్‌ ఆరోపించాడు. గత పన్నెండు సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేంద్రాలలో మొత్తం 35వేల మంది విద్యను అభ్యసించారు. అక్కడ జరిగే కార్యక్రమాలలో తొమ్మిది లక్షల 20వేల మంది పాల్గొన్నారని 2018లో నార్త్‌ కరోలినా కేంద్రం వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

అమెరికా సమాజం తమ నాయకత్వాన్ని విశ్వసించటం లేదన్నది స్పష్టం, అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు, చైనా వంటి వాటి గురించి ఏకపక్ష సమాచారం మాత్రమే యువతరానికి అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా పాలకవర్గం పూనుకుంది అన్నది కూడా సుస్పష్టం.చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ అణచివేత గురించి యువతకు వివరిస్తే వారి వైఖరి మారుతుందని ఫిలిప్స్‌ చెప్పటాన్ని బట్టి రానున్న రోజుల్లో మరో మారు పెద్ద ఎత్తున చైనా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీయనున్నారు.

‘ రెడ్‌ మే ‘ పేరుతో అమెరికాలోని సియాటెల్‌ నగరంలో 2017 నుంచి ప్రతి ఏటా మే మాసమంతా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ పెట్టుబడిదారీ విధానం నుంచి కొన్ని రోజులు సెలవు ‘ పేరుతో ఇవి జరుగుతున్నాయి. బహిరంగ స్ధలాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు ఎవరైనా హాజరుకావచ్చు. విద్యాసంస్ధలు లేదా సభల్లో చెప్పేదానికి అతీతంగా ఇక్కడ అవగాహన చేసుకోవటానికి అవకాశం వుంటుందని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధుల పత్రిక ది డైలీ పేర్కొన్నది. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక ఆంగ్ల ప్రొఫెసర్‌ పాల్గొని మానవాళి విముక్తికి మార్క్సిస్టు భావజాలాన్ని వినియోగించటాన్ని పొగిడినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. అలీస్‌ వెయిన్‌బౌమ్‌ అనే ప్రొఫెసర్‌ మాట్లాడుతూ ‘ ఇండ్లలో భోజనం చేసే సమయంలో దొర్లే మాటల్లో సోషలిజం లేదా కమ్యూనిజం అనేవి చెడ్డ పదాలు, ఇలాంటి కార్యక్రమాలలో పొల్గ్గొన్నపుడు వ్యక్తులు ప్రత్యేకించి కాలేజీ విద్యార్ధులు వామపక్ష భావజాలం మీద వున్న నిందల గురించి ప్రభావితం అయ్యే అవకాశం వుంది. రెడ్‌ మే కార్యక్రమాలు ఒక రాజకీయ సిద్ధాంతం మీద ఒకే వైఖరికి కట్టుబడి వుండటం లేదు, ప్రస్తుత మన పరిస్ధితి గురించి ఎల్లలు లేని చర్చలకు అవకాశం ఇస్తున్నాయి. అనేక మంది పండితులు ఈ భావజాలాలను వర్తమాన పరిస్ధితులకు వర్తింప చేస్తూ ఆలోచిస్తున్నారు. వారిలో పండితులే కాదు, కార్యకర్తలుగా పని చేసే పండితులు కూడా ఈ విద్వత్సభలో వున్నారు. ఈ సంస్ధ పరిధిలకు మించి వారంతా పని చేస్తున్నారు, మానవాళి విముక్తికి వివిధ మార్గాలలో భాగంగా మార్క్సిస్టు భావజాలాన్ని కూడా ఒక మార్గంగా వినియోగిస్తున్నారు.’ అని చెప్పారు. ఆమె స్త్రీవాదం, నల్లజాతీయుల అధ్యయనం, మార్క్సిస్టు సిద్దాంతం, అట్లాంటిక్‌ ప్రాంత వర్తమాన సాహిత్యం, సంస్కృతి, పునరుత్పత్తి సంస్కృతి, రాజకీయాల వంటి అంశాల మీద బోధన చేస్తున్నారు. ఆమె పుట్టుక శ్వేతజాతిలో అయినప్పటికీ జాత్యహంకార సమస్యల గురించి రచనలు చేశారు.

రెడ్‌ మే కార్యక్రమాలకు హాజరైన మైక్‌ కార్లసన్‌ ఇలా చెప్పాడు.’ దీనికి సంబంధించి ఒక గొప్ప విషయం ఏమంటే వామపక్ష భావజాలంలో ఒకదానికొకటి విడిగా వుండే అనేక అంశాలు వున్నాయి. ఎవరైనా వచ్చి భిన్నమైన ఆలోచనలను ఇక్కడ వ్యక్తీకరించవచ్చు, ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అది తమ స్వంత విషయం కావచ్చు లేదా ఒక ప్రాజెక్టు ఏదైనా కావచ్చు అన్నాడు. ‘కమ్యూనిస్టు పరిధి వెలుపల (కమింగ్‌ అవుట్‌ కమ్యూనిస్టు)’ అనే అంశమీద చర్చలో అతను పాల్గొన్నాడు.ఈ కార్యక్రమాలలో మార్క్సిస్టు సిద్ధాంతాల నుంచి కార్పొరేట్‌లు సోషలిజానికి ఎలా పునాది వేస్తున్నాయి అనే అంశాల వరకు అనేక చర్చలు జరుగుతాయి. తమ కార్యక్రమాలు వివిధ ఆలోచనలకు ఎదురవుతున్న సవాళ్లు, అభివృద్ధి చేయటం తప్ప హాజరైన వారి బుర్రల్లో బలవంతంగా ఎక్కించటం లేదా వున్న వాటిని తొలగించటం కాదని రెడ్‌మే కార్యక్రమాల ప్రారంభ నిర్వాహకులలో ఒకరైన ఫిలిప్‌ హోల్‌స్టెట్టర్‌ అన్నారు. ఏడాదికి ఒక నెల పెట్టుబడిదారీ విధానం నుంచి సెలవు తీసుకుందాం, ఒక నెల పాటు కమ్యూనిస్టుగా వుందాం, భిన్నంగా ఆలోచిద్దాం, మిమ్మల్ని ఎవరూ మార్చేందుకు ప్రయత్నించరు అన్నారు.

Image result for communist China

కమ్యూనిజం గురించి అమెరికన్లను భయపెట్టేందుకు అక్కడి పాలకవర్గం అనుసరించని తప్పుడు ఎత్తుగడలు, ప్రచారాలు లేవు. అవే ఇప్పుడు వారి నోళ్లు మూతపడేట్లు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విశ్లేషణ ప్రారంభంలోనే అమెరికా యువత ట్రంప్‌ ప్రభుత్వ మాటలు, చేతలను విశ్వసించటం లేదు అని చెప్పుకున్నాము, అంటే విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. ‘దశాబ్దాల తరబడి చైనా గురించి అబద్దాలు చెప్పిన వారు మనకు ఇప్పుడు ఏదోఒకటి చెప్పాలి’ అనే శీర్షికతో అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక తాజాగా ఒక విశ్లేషణను ప్రచురించింది. తియన్మెన్‌ స్క్వేర్‌ ఘటనలకు మూడు దశాబ్దాలు నిండిన సందర్భంగా దాన్ని రాశారు.

తరతరాలుగా చైనా గురించి రాజకీయ పండితులు, ఆర్ధికవేత్తలు చేసిన విశ్లేషణలు, చెప్పిన జోశ్యాలను చైనా ఎలా వమ్ము చేసిందో, అవెలా తప్పో, చైనా సాధించిన విజయాలను పేర్కొంటూ ఆ విశ్లేషణ సాగింది. దానిలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా వుంది.కమ్యూనిజం అంటే ఎక్కడైనా ఒకటే అని అమెరికా విదేశాంగ విధానంలో పేర్కొన్నారు. ఆచరణలో వేర్వేరు అని సోవియట్‌, చైనాల అనుభవం తెలిపింది. నిక్సన్‌ చైనాతో సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనే వరకు రెండు దేశాలను ఒకే శత్రుశిబిరంలో వుంచారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత చైనా కంటే సహజవనరులు ఎక్కువగా వున్న ఆఫ్రికన్‌ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అమెరికా ఆర్ధికవేత్త జోశ్యం చెప్పారు. ఆ విషయంలో పప్పులో కాలేశారు. 1960లో కాంగోలో తలసరి జిడిపి 220 డాలర్లు వుండేది, అది నైజీరియా, చైనాలకు రెట్టింపు.2017నాటికి చైనా తలసరి జిడిపి 9000 డాలర్లకు అంటే నైజీరియా జిడిపికి నాలుగు రెట్లు, కాంగోకు 19రెట్లు ఎక్కువ. చైనా 1978లో నవీకరణ కార్యక్రమం చేపట్టిన తరువాత మానవజాతి చరిత్రలో అత్యంత వేగమైన అభివృద్ధిని నిలకడగా సాధించటమేగాక 85కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసింది.

ఆసియన్‌ టైగర్లని చెప్పిన జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాల మాదిరి అభివృద్ధి సాధించిన తరువాత మరింత ప్రజాస్వామికంగా తయారవుతుందని చెప్పారు. అది కూడా జరగలేదు.1989 నుంచి 1991 మధ్య కమ్యూనిస్టు దేశాలలో ప్రజాస్వామిక గాలి వీచింది, ప్రచ్చన్న యుద్దం ముగిసింది, కొంత మంది అయితే చరిత్ర ముగిసింది అని చెప్పారు.(ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే సోషలిజాన్ని వదులు కోవటం, చరిత్ర ముగిసింది అంటే కమ్యూనిస్టు చరిత్ర అని అర్ధం) అయితే అది తూర్పు ఐరోపాలో, ఇతర చోట్ల జరిగింది తప్ప చైనాలో కాదు. దీర్ఘకాలం అభివృద్ధితో పాటు పార్టీ అదుపు కూడా కొనసాగింది.చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేర్చితే అది కూడా పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ ప్రజాస్వామిక వ్యవస్ధల మాదిరి తయారవుతుందనే భావన 1989 నుంచి డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ ప్రభుత్వాలలో వుంది. అది కూడా జరగలేదు. చరిత్రలో అతి పెద్ద సంపద బదిలీ జరిగింది అని జాతీయ భద్రతా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ కెయిత్‌ అలెగ్జాండర్‌ 2012లోనే చెప్పారు. చైనా గురించి ఎంతో మంది ఎందుకిలా చెప్పారంటే విధాననిర్ణేతలు, మేథావులు సాధారణ సూత్రీకరణలు చెప్పారు కానీ చైనా పురాతన కాలంలోనూ నూతన ఆవిష్కరణలు చేసింది, ఆధునిక కాలంలోనూ దారిద్య్రం నుంచి బయటపడి ఒక ఆధునిక దేశంగా మారింది.1949 తరువాత కమ్యూనిస్టు నాయకత్వంలో ఒక గ్రామీణ దేశంగా వున్నదానిని ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘావేసే దేశాలతో సమంగా తయారైంది.

Image result for communist China

అమెరికా, చైనా నేతలకు మౌలికమైన తేడాలున్నాయి. అమెరికన్ల విషయానికి వస్తే జ్ఞాపకాలు స్వల్పకాలంలోనే అంతరిస్తాయి, కేంద్రీకరణలో నిలకడ వుండదు, ఒక సంక్షోభం నుంచి మరోసంక్షోభానికి ఎదురు చూస్తున్నట్లు వుంటుంది. వాషింగ్ట్‌న్‌లో బడ్జెట్‌ను ఆమోదించటం, దాని మీద కేంద్రీకరించటమే ఒక వీరోచిత చర్యగా చూస్తారు. అదే చైనా విషయానికి వస్తే దీనికి భిన్నంగా జ్ఞాపకాలు దీర్ఘకాలం వుంటాయి, కేంద్రీకరణ నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ పధకాలు దీర్ఘకాలానికి రూపొందిస్తారు.కృత్రిమ మేధస్సు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు చైనాలో సంవత్సరాల తరబడి పని చేస్తాయి. చైనా మిలిటరీ నవీకరణ 1990దశకంలో ప్రారంభమైంది.ఒక విమానవాహక యుద్ద నౌకను తయారు చేయటానికి చైనాకు ఎంత కాలం పడుతుందని ఒక నౌకాదళ అధికారిని అడిగితే సమీప భవిష్యత్‌లో అని చెప్పారు. దాని అర్ధం 2050 కొంత కాలం ముందు అని, ఆ జోశ్యం కూడా తప్పింది.(1985లో ఆస్ట్రేలియా పాతబడిన ఒక యుద్ద నౌకను తుక్కు కింద మార్చేందుకు చైనాకు విక్రయించింది. అలాంటి వాటిలో అన్ని కీలక విభాగాలను పునరుద్దరించటానికి వీల్లేని విధంగా పనికి రాకుండా చేసి ఇస్తారు. చైనా దానిని అలాగే వుంచి ఏ భాగానికి ఆభాగాన్ని విడదీసి తన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పరిశీలనకు అప్పగించింది. దాన్నే తన ప్రయోగాలకు వాడుకుంది. తరువాత రష్యా నుంచి మరో మూడు పాత యుద్ద నౌకలను కొనుగోలు చేసింది. వాటిని తుక్కు కింద మార్చకుండా ఒక దానిని విలాస హోటల్‌గానూ, మరొక దానిని సందర్శకులకు ఇతివృత్త పార్కుగా మార్చింది. మూడోదానికి మరమ్మతులు చేసి 2012లో తన తొలి విమాన వాహక యుద్ధ నౌకగా మిలిటరీకి అప్పగించింది. 2030 నాటికి అందుబాటులోకి వచ్చే దశలవారీ కనీసం అరడజను నౌకలను నిర్మిస్తోంది.) అమెరికా ప్రపంచ నాయకత్వం అనేది నడుస్తున్న చరిత్ర, అదే చైనా విషయానికి వస్తే 1840దశకం నాటి నల్లమందు యుద్ధాలకు ముందు అదొక పెద్ద శక్తి. వందసంవత్సరాల అవమానాల తరువాత తిరిగి అది ఒక శక్తిగా తయారవుతోంది. అనేక విధాలుగా అసాధారణంగా అది పెరుగుతోంది. చైనా గురించి చేసిన సాధారణ సూత్రీకరణలు, జోశ్యాల గురించి వివరించిన దాని కంటే ఎంతో అస్పష్టంగా వున్నాయి.

ఇండోచైనా, ఆగ్నేయ ఆసియాలో వియత్నాంపై భ్రాంతి పూర్వకమైన అంచనా కారణంగా అమెరికా 58వేల మంది సైనికులను బలి ఇచ్చుకోవాల్సి వచ్చిందంటూ ఒక విశ్లేషకుడు తాజాగా రాశాడు.1965 జూన్‌ తొమ్మిదిన అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ వియత్నాం మీదకు సైన్యాన్ని పంపుతున్నట్లు ప్రకటించిన రోజును గుర్తు చేస్తూ అమెరికా నాయకత్వ అంచనాలు ఎలా తప్పాయో, దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అమెరికా సైనికుల మరణాల గురించి తప్ప వారు వియత్నాంలో చేసిన దారుణాలు, మారణ కాండ ప్రస్తావన లేదు. వియత్నాం మన చేతుల నుంచి పోతే కంబోడియా పోతుంది, థాయ్‌లాండ్‌ పోతుంది, మలేసియా పోతుంది, ఇండోనేషియా పోతుంది, ఫిలిప్పినోస్‌ పోతుంది అంటూ సెనెటర్‌ గాలే మెక్‌గీ చెప్పారు. ఇలాంటి భ్రాంతికి అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ గురయ్యాడు. వుత్తర వియత్నాం కమ్యూనిస్టు దేశంగా వున్నందున దాన్ని అరికట్టి దక్షిణ వియత్నాంను కమ్యూనిస్టు ప్రభావంలోకి పోకుండా చూడాలనే ఎత్తుగడతో ముందుకు తెచ్చిన వున్మాదమది. వియత్నాంను అదుపు చేయకపోతే తమ దేశాలు కూడా కమ్యూనిజంలోకి పోతాయని భయపడి వియత్నాంపై యుద్ధానికి జత కలుస్తాయని అమెరికా భావించింది. అయితే దానికి విరుద్దంగా జరిగిందని, అమెరికా మాత్రం 58వేల మంది సైనికులను బలిపెట్టాల్సి వచ్చిందన్నది విశ్లేషకుడి సారాంశం.

Image result for College kids' distrust  Trump

ప్రపంచ పరిణామాల గురించి తమ నేతలు, విధాన నిర్ణేతలు చేసిన అనేక వూహాగానాలు, సిద్ధాంతాలు విఫలమయ్యాయని చెప్పే వారు అమెరికాలోనే పెరగటం ఇటీవలి కాలంలో వూపందుకుంటున్న పరిణామం. అందుకే యుద్ధాలకు పాల్పడినప్పటికీ తమ సైనికులను అక్కడికి పంపకూడదని, ఒక ప్రాణం పోయినా సమాజంలో తీవ్ర ప్రతికూలత ఎదురవుతుందని సామ్రాజ్యవాదులు భయపడుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా యుద్ధాలు చేయాలని చూస్తున్నారు. అమెరికా నేతల గురించి యువతలో నమ్మకం లేకపోవటం, మీడియాలో ఇలాంటి చర్చ జరగటానికి సంబంధం వుంది. ఏది ముందు, ఏది వెనుక అనే చర్చ కంటే జరుగుతున్న పరిణామాలు పురోగామి శక్తులకు ఎంతో విశ్వాసాన్ని కలిగించేవి అనటంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఇవి ఏ రూపం తీసుకుంటాయని జోశ్యం చెప్పలేము గాని సోషలిజం, కమ్యూనిజాల మీద విశ్వాసం తగ్గుతున్న రోజుల్లో ఇవి ఆశారేఖలు అనటం నిస్సందేహం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో వున్న పురోగామి, వామపక్ష ప్రభావాన్ని చూసిన కారణంగానే మన దేశంలోని కాషాయ దళాలు జెఎన్‌యు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటివాటి మీద తప్పుడు ప్రచారాలు చేయటంతో పాటు వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించాలి. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం చెందుతున్న పూర్వరంగంలో అమెరికా సామ్రాజ్యవాదులకే వామపక్ష భావజాల వ్యాప్తిని అరికట్టటం సాధ్యం కాలేదు. అలాంటిది మన దేశంలో కాషాయదళాల వల్ల అవుతుందా ? అమెరికాలో కమ్యూనిస్టులం అని చెప్పుకొని పని చేసే పరిస్ధితుల్లేని రోజుల నుంచి అవును మేం సోషలిస్టులం, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగలవచ్చు. వివిధ కారణాలతో తాత్కాలికంగా కమ్యూనిస్టులకు ఓటు వేయకపోవచ్చుగానీ అమెరికా సమాజంలో మాదిరి మన దేశంలోని కష్టజీవుల్లో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. వారి త్యాగాలను మరచిపోలేదు. జనంలో పోయిన పునాదిని తిరిగి పొందటం ఎలా అన్నదే అభ్యుదయవాదులు, కమ్యూనిస్టుల ముందున్న సవాలు ! చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికి వున్న చేపలు ఎదురీదుతాయి. కమ్యూనిస్టులూ అంతే !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందే వెల్లడైన వెనెజులా ప్రతిపక్ష కుట్ర !

06 Monday May 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, cia, Juan Guaidó, Nicolás Maduro, operation liberty coup, Venezuela

Image result for operation liberty coup unveiled weeks before

ఎం కోటేశ్వరరావు

వెనెజులా పరిణామాలు 2

ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన జరిపిన తిరుగుబాటు యత్నం విఫలం కావటంతో ఇప్పుడు వెనెజులా ప్రతిపక్ష నేత జువాన్‌ గుయ్‌డో అమెరికా ప్రత్యక్షంగా మిలిటరీ జోక్యంచేసుకోవాలని కోరుతున్నాడు. తమ నడకలో ఎలాంటి తడబాట్లు లేవని, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. మరోవైపు గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని కారకాస్‌లోని స్పెయిన్‌ రాయబారి ఇంట్లో ఆశ్రయం పొందిన ప్రతిపక్ష నేత లియోపాల్డ్‌ లోపెజ్‌ను అరెస్టు చేయాలని వెనెజులా సర్కార్‌ నిర్ణయించింది. అతను రాజకీయ ఆశ్రయం కోరలేదని తాము ఆతిధ్యం మాత్రమే ఇస్తున్నామని స్పెయిన్‌ ప్రకటించింది.

వెనెజులా వ్యవహారాల్లో అమెరికా జోక్యం నిత్యకృత్యం అన్న విషయం తెలిసినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త పధకాలు వేస్తూనే వుంటారు. ఆపరేషన్‌ లిబర్జీ పధకం కూడా అలాంటిదే. మధ్యంతర అధ్యక్షుడిగా జువాన్‌ గుయ్‌డో ప్రకటించుకోవటం, అతగాడి ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలతో దాన్ని గుర్తింప చేయటం, మదురో సర్కార్‌ నియమించిన రాయబారులను గుర్తించటం లేదని ప్రకటించటం వగైరాలన్నీ అంతర్జాతీయంగా వెనెజులాలో ప్రభుత్వం మారిపోయిందని, మదురో ఇంకేమాత్రం అధ్యక్షుడు కాదని ప్రపంచాన్ని నమ్మింపచేయటం ఈ పధకంలో భాగమే. దీన్ని అనేక దశల్లో అమలు జరిపారు. విఫలమైన అంకం ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి దేశంలో అంతర్గతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేయటం, మిలిటరీని తన వైపు రమ్మని కోరటం, తిరుగుబాటు చేయాలని అమెరికా పిలుపు ఇవ్వటం వంటి వన్నీ దానిలో భాగమే. కుట్రను గొప్పగా రూపొందించిన వారికి దాన్ని అనుసరించటానికి వెనెజులా జనం సిద్ధంగా లేరనే స్పృహ లేదు. అక్కడే పప్పులో కాలేశారు.

ఈ పధకంలో భాగంగా అమలు జరపాల్సిన వాటి మీద అమెరికాకు చెందిన సిఐఏ, యుఎస్‌ ఎయిడ్‌, ఎన్‌ఇడి వంటి వాటికి బాధ్యతలు అప్పగించారు. యుఎస్‌ ఎయిడ్‌ రూపొందించిన పలు దేశాలకు రూపొందించిన కార్యాచరణ పధకానికి సంబంధించిన పత్రం ఫిబ్రవరిలోనే వెల్లడైంది. ఆ సంస్ధకు అనుబంధంగా పనిచేసే ‘ యుఎస్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ లాబ్‌ ‘ 75పేజీల పత్రాన్ని రూపొందించింది. దానికి రాపిడ్‌ ఎక్స్‌పెడిషనరీ డెవలప్‌మెంట్‌(ఆర్‌ఇడి)(రెడ్‌) టీమ్స్‌: డిమాండ్‌ అండ్‌ ఫీజ్‌బులిటీ అని పేరు పెట్టింది.( వేగంగా దండయాత్ర నిర్వహించే బృందాలు: అవసరం మరియు సాధ్యాసాధ్యాలు) ఈ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం వివిధ దేశాలలో రహస్య కార్యకలాపాలు నిర్వహించే సామర్ధ్యం గురించి అమెరికా మిలిటరీ, గూఢచార తదితర అధికారులు నివేదికను రూపొందించిన వారిని ఇంటర్వ్యూ చేశారు. ఒక్కో బృందం ఇద్దరిద్దరితో వుండాలని, ఎదురుదాడి, ఆత్మరక్షణ పద్దతులను, ప్రతికూల పరిస్ధితుల్లో ఎలా పని చేయాలో వాటికి నేర్పాలని అవి అమెరికా ప్రత్యేక దళాలు(ఎస్‌ఎఫ్‌) మరియు సిఐఏ పర్యవేక్షణలో పని చేయాలని నిర్దేశించారు. ఇవి స్ధానిక సామాజిక తరగతుల మధ్య అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. స్ధానికంగా వున్న పరిస్దితులను గమనించటం వాటికి అనుగుణంగా వెంటనే స్పందించి పధకాలు రూపొందించటం, నిధులు అందచేయటం, చిన్న చిన్న కార్యకలాపాల నిర్వహణ చేస్తాయి. వీటిలో సామాజిక కార్య క్రమాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే పేరుతో బోధలతో పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించటం కూడా వుంటాయి. దేశమంతటా స్వేచ్చ మరియు సహాయ కమిటీలను దేశ వ్యాపితంగా ఏర్పాటు చేయాలి. రెడ్‌ టీమ్స్‌ పైకి వుత్ప్రేరకాలుగా కనిపించాలి, వాటికి సామాజిక తరగతులను సమీకరించే పద్దతులు, చిట్కాలతో పాటు ఎదురుదాడి, ఆత్మ రక్షణకు ఆయుధాలను ఎలా వినియోగించాలో కూడా శిక్షణ ఇస్తారు. వారు స్ధానికులతో సంబంధాలను నెలకొల్పుకొని వారి ద్వారా మరికొందరిని ప్రభావితం చేసేందుకు, ప్రలోభపరచేందుకు వారి బలహీనతలను గుర్తించి డబ్బు,ఇతర వాటిని ఎరవేస్తారు. ఒకసారి వారి వలలో చిక్కిన తరువాత తమకు నిర్ధేశించిన రహస్యకార్యకలపాలలో నిమగ్నం చేస్తారు. ఈ అంశాలన్నీ ప్రతి దేశంలో అమలు జరపాల్సిన నమూనాలో భాగం. ఈ పధకాన్ని దక్షిణ అమెరికా దేశాలన్నింటా అమలు జరపాలి. ముందుగా అమెరికా పట్ల సానుకూలంగా వుండే ప్రభుత్వాలున్న దేశాలను ఎంచుకోవాలి. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు జరిపేందుకు బ్రెజిల్‌ను ఎంచుకోవాలని సూచించారు.

ఈ ఏడాది జనవరిలో బ్రెజిల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఫాసిస్టు జెయిర్‌ బల్‌సానారో అమెరికాతో సంబంధాల ఏర్పాటు గురించి బహిరంగంగానే చెప్పాడు. సిఐఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి బ్రెజిల్‌ అధ్యక్షుడయ్యాడు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ గతం కంటే తమ మధ్య సంబంధాలు బలపడ్డాయని, బ్రెజిల్‌ నాటోలో చేరాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తరువాత బొల్‌సానారో ఫిబ్రవరిలో ఒక ప్రకటన చేస్తూ తమ గడ్డ మీద నుంచి అమెరికా మరో దేశంలో సైనిక జోక్యం చేసుకోవటాన్ని తాము అనుమతించబోమని ప్రకటించాడు. అయితే తండ్రికి సలహాదారు, పార్లమెంట్‌ సభ్యుడైన ఎడ్వర్డ్‌ బొల్‌సానారో మార్చినెలలో మాట్లాడుతూ ఏదో ఒక సమయంలో వెనెజులాలో సైనిక జోక్యం అవసరమని, అన్ని అవకాశాలున్నాయని చెప్పాడు. అయితే బ్రెజిల్‌ నుంచి ప్రత్యక్ష జోక్యం చేసుకొనే అవకాశం లేకపోతే అక్కడి నుంచి రెడ్‌ బృందాలు రహస్య కార్యకలాపాలను నిర్వహించాలని సిఐఏ సూచించింది.

Image result for Venezuela 2 : operation liberty coup unveiled weeks before

నివేదికలో వెనెజులాలో నిర్వహించాల్సిన అంశాలను కూడా అనుబంధాలలో పొందుపరిచారు. ఏప్రిల్‌ ఆరవ తేదీన ఆపరేషన్‌ ఫ్రీడమ్‌ లేదా లిబర్టీ ప్రారంభమౌతుందని వాటిలో పేర్కొన్నారు. కాన్వాస్‌ అనే సంస్ధ అమెరికా నిధులతో వెనెజులాలో ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించాలో జువాన్‌ గుయ్‌డోకు శిక్షణ ఇచ్చింది. దేశంలోని కీలకమైన వ్యవస్ధలను ధ్వంసం చేయటం ద్వారా మదురో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తిని రెచ్చగొట్టటం వాటిలో ఒకటి. దానికి అనుగుణంగానే కొద్ది వారాల క్రితం వెనెజులా విద్యుత్‌ వ్యవస్ధను దెబ్బతీసి అంధకారం గావించిన విషయం తెలిసిందే. ఇలాంటి సలహాలు, ఎత్తుగడలు అమెరికా జోక్యం చేసుకొనే అన్నిదేశాలకూ సూచించారు. చిత్రం ఏమిటంటే వుదాహరణకు అని చెప్పినట్లుగా వెనెజులాలోని గౌరి డామ్‌ వద్ద వున్న సైమన్‌ బోలివర్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీస్తే పర్యవసానాలు ఎలా వుంటాయో వివరించారు.

ఆపరేషన్‌ లిబర్టీలో ఒక అంశం నిర్ణయాత్మక దశ అని పేరు పెట్టారు. దాన్ని ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీల్లో అమలు జరపాలని చూశారు. దాని ప్రకారం ఏం జరిగిందో కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరణ సారాంశం ఇలావుంది.ఆపరేషన్‌ లిబర్టీలో భాగంగా ఏప్రిల్‌ 30వ తేదీ తెల్లవారు ఝామున 5.46 నిమిషాలకు కొంత మంది సైనికుల రక్షణగా కెమెరా ముందు నిలబడిన లియోపాల్డ్‌ లోపెజ్‌ మాట్లాడుతూ పౌరులు వీధుల్లో ప్రదర్శనలుగా రావాలని, జువాన్‌ గుయ్‌డో వేచి వున్న లా కార్లోటా వైమానిక స్ధావరం వద్ద అందరం కలసి అక్కడి నుంచి మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కదులుదామని చెప్పాడు. ఆ తరువాత అర్ధగంటకు తాను నిర్బంధం నుంచి విముక్తి అయ్యానని, గుయ్‌డోకు విధేయులుగా వున్న సైనికులు తనను విడిపించారని ఇది నిర్ణయాత్మక దశ అని విజయానికి ఇదే తరుణం అన్నాడు. కొద్ది సేపటికి తాను వైమానిక స్ధావరం వద్దకు వచ్చానని చెప్పాడు. అయితే పంపిన ఫొటోలు దాని వెలుపల రోడ్డుమీదివి తప్ప మరొకటి కాదు. వుదయం 8.30కు తుపాకి కాల్పులు వినిపించాయి. ఎవరు ఎవరి మీద కాల్చారో తెలియని స్ధితి. మధ్యాహ్నానికి రోడ్ల మీద కొన్ని వుందల మందే వున్నారు. అక్కడి నుంచి ప్రదర్శన జరుపుదామని గుయ్‌డో, లోపెజ్‌ జనంతో చెప్పారు. ఆ సమీపంలోనే అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌, తదితర ప్రభుత్వ భవనాలు వున్నాయి. అటువైపు ప్రదర్శన సాగాలని చెప్పిన తరువాత భద్రతా దళాలు ప్రదర్శకులను అడ్డుకున్నాయి. రెండు గంటల సమయంలో నేషనల్‌గార్డ్స్‌, బొలివేరియన్‌ పోలీస్‌లు ప్రదర్శకులపై కాల్పులు జరిపారు. కొద్ది మంది గాయపడటం తప్ప ఎవరూ మరణించలేదు. సాయంత్రానికి కొద్ది మంది నిరసనకారులు అక్కడే వున్నారు.ఎక్కువ మంది వెళ్లిపోయారు.

తన ప్రయత్నం విఫలమైందని అర్ధం కాగానే గుయ్‌డో మే ఒకటవ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చాడు. మరోవైపు లోపెజ్‌ కారకాస్‌లోని చిలీ రాయబార కార్యాలయంలో వున్న తన భార్యాబిడ్డలను తీసుకొని స్పానిష్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి ఆశ్రయం కోరాడు. అయితే వారు కార్యాలయానికి బదులు రాయబారి ఇంట్లో రక్షణ ఇచ్చారు. వారం రోజులుగా ఇప్పటికి అక్కడే వున్నాడు. ఇరవై అయిదు మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. గుయ్‌డో గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయాడు. తొలి రోజు ఒకడు మరణించినట్లు,59 మంది గాయపడినట్లు వార్తలు వచ్చాయి. రెండవ రోజు మే డే నాడు కొన్ని చోట్ల గుయ్‌డో మద్దతుదార్లు ఘర్షణలకు దిగారు. పోలీసు కాల్పుల్లో ఒక యువతి గాయపడి తరువాత ఆసుపత్రిలో మరణించింది. అంతకు ముందు రోజు రాత్రే తిరుగుబాటును అణచివేసినట్లు మదురో ప్రకటించాడు. మే డే రోజున పెద్ద ఎత్తున ఆయన మద్దతుదార్లు వీధుల్లో అనేక చోట్ల ప్రదర్శనలు జరిపారు. తిరుగుబాటుదార్లు, వారి నేతలు గుయ్‌డో, లోపెజ్‌ల పట్ల మదురో సర్కార్‌ ఎంతో సంయమనం పాటించిందన్నది స్పష్టం. లేకుంటే వారు అంత స్వేచ్చగా కారకాస్‌ శివార్లలో తిరిగే వారు కాదు. తప్పుదారి పట్టిన పౌరుల పట్ల కూడా భద్రతా దళాలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. భారీ ఎత్తున కాల్పులు జరిగాయని పశ్చిమ దేశాల మీడియా వార్తలు ఇచ్చింది. అయితే తరువాత అందుకు తగిన ఆధారాలు లేకపోవటంతో గప్‌చుప్‌ అయ్యాయి. తరువాత ఏమిటి అంటూ సమస్యను పక్కదారి పట్టించే కధనాలను ఇస్తున్నాయి. మచ్చుకు ఒకదాన్ని చూస్తే చాలు.

Image result for operation liberty coup

వెనెజులా పౌరులు పోగొట్టుకున్న తమ స్వాతంత్య్రం కోసం వీధుల్లోకి పెద్ద ఎత్తున వచ్చివుంటే ఎందరో మరణించి వుండేవారు. ఛావెజ్‌ను ఎన్నుకొని వారు పెద్ద తప్పు చేశారు. ఇరవై ఏండ్ల సోషలిజపు వినాశకర ప్రభావాలను చూస్తున్నారు. దశాబ్దకాలంగా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. ప్రజాస్వామిక స్వేచ్చలను అణచివేశారు. భావ ప్రకటనా స్వేచ్చ, స్వతంత్ర మీడియా అదృశ్యమైంది. సమాజంలోని ప్రతి స్ధాయిలో క్యూబా గూఢచారులను నింపివేశారు. దేశాన్ని ఒక పోలీసు రాజ్యంగా మార్చివేశారు. చివరకు మదురో వ్యక్తిగత అంగరక్షకులుగా భారీ సంఖ్యలో రష్యన్‌ సాయుధులు వచ్చారు. వెనెజులా మిలిటరీ ప్రస్తుత నాయకత్వాన్ని బలపరచి ప్రయోజనం లేదని గ్రహించి తిరుగుబాటు చేసే వరకు రష్యా, చైనా మదురోకు మద్దతు ఇస్తూనే వుంటాయి. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పటం తొందరపాటు అవుతుంది.

ఇలా చెత్త రాతలన్నీ రాస్తున్నాయి. వాటన్నింటినీ దేవదూతల సందేశాలుగా భావించిన వారు ప్రచారంలో పెడుతున్నారు. ఆపరేషన్‌ లిబర్టీ కుట్ర ముందే వెల్లడి కావటంతో మదురో సర్కార్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవటం కూడా జయప్రదంగా దాన్ని తిప్పి కొట్టటానికి దోహదం చేసిందనవచ్చు. వాస్తవం ఏమిటో అనుభవించిన వారికి స్పష్టంగా తెలుసు, ప్రతిపక్ష నాయకుల గురించి కూడా వారికి చెప్పనవసరం లేదు. అయితే అమెరికన్లు తెగించి ప్రత్యక్ష సైనిక చర్యకు పాల్పడతారా, మరోసారి మిగతా దేశాలలో మాదిరి చేతులు కాల్చుకుంటారా అన్నది వచ్చే ఎన్నికలలో లబ్ది కోసం డోనాల్ట్‌ ట్రంప్‌ చేసే పిచ్చి ఆలోచనలను బట్టి వుంటుంది. ఒక వేల ప్రత్యక్ష జోక్యం చేసుకుంటే అది లాటిన్‌ అమెరికాలో, ప్రపంచంలో మరో కొత్త పరిణామాలకు నాంది అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘కుట్ర విఫలంపై మీడియా మూగనోము !

05 Sunday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, Juan Guaidó, Media’s Propaganda Campaign Against Venezuela’s Government, Nicolás Maduro, Nicolás Maduro Moros, Propaganda War, Venezuela

Image result for venezuela 1: mainstream media ignores failed coup

వెనెజులా పరిణామాలు -1

ఎం కోటేశ్వరరావు

ఏప్రియల్‌ 30వ తేదీన వెనెజులా వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘ (స్వేచ్చా ప్రక్రియ) పేరుతో అమలు జరపతలచిన కుట్రను మొగ్గలోనే నికోలస్‌ మదురో సర్కార్‌ తుంచివేసింది. ఇదెంత ప్రాధాన్యత కలిగిన అంశమో అమెరికా మరోసారి పచ్చి అబద్దాల కోరు అని ప్రపంచముందు బహిర్గతం కావటం కూడా అంతే ప్రాధాన్యత కలిగి వుంది. కూల్చివేత ప్రయత్నాల వార్తలకు అంతర్జాతీయ మీడియా ఇచ్చిన ప్రాధాన్యత దాని తుంచివేతకు ఎందుకు ఇవ్వలేదో నిజాయితీగా ఆలోచించే వారు అర్ధం చేసుకుంటారు. వెనెజులా మీద ఇప్పుడు బహుముఖ దాడి జరుగుతోంది. దానిలో ఆర్ధిక దిగ్బంధనం, ప్రచారదాడి, మతాన్ని వినియోగించటం, మిలిటరీని, జనాన్ని అంతర్గత తిరుగుబాట్లకు రెచ్చగొట్టటం ఇలా అనేక రకాలుగా సాగుతోంది. ఇది ఈ నాటిది కాదు, ఇప్పటితో అంతమయ్యేది కాదు. ఇది ఒక్క వెనెజులాకే పరిమితం కాదు. తనను రాజకీయంగా వ్యతిరేకించే వారు ఎక్కడ అధికారానికి వస్తే అక్కడ వారిని కూల్చివేయటం, ఆయా దేశాలు, ప్రాంతాలను ఆక్రమించకోవటం లేదా తన ఆధిపత్యం కిందకు తెచ్చుకోవటం అమెరికాకు నిత్యకృత్యం.

ఐరోపో నుంచి వలస వెళ్లిన వివిధ దేశాలకు చెందిన వారు స్ధానిక రెడ్‌ ఇండియన్లను అణచివేసి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పరిగణించబడుతున్న, ఇతర అమెరికా ఖండ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అవి వివిధ ఐరోపా దేశాల వలస ప్రాంతాలుగా మారాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మెజారిటీ ప్రాంతాలు(అమెరికా) బ్రిటీష్‌ పాలనలో వున్నాయి. తమకు తామే పరిపాలించుకొనే శక్తి వచ్చింది కనుక బ్రిటీష్‌ పెత్తనం ఏమిటంటూ వలస వచ్చిన వారు చేసిన తిరుగుబాటు కారణంగానే 1776లో అమెరికాకు స్వాతంత్య్రం వచ్చింది. అంతర్యుద్ధం ముగిసి కుదుట పడిన తరువాత వారే తొలుత తమ పరిసరాలను, తరువాత ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకొని మరోబ్రిటన్‌ మాదిరి తయారయ్యేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్‌ వారు మన దేశంలో ముందు రాజులు, రాజ్యాల మీద యుద్దాలు చేయలేదు. ప్రలోభాలు, కొన్ని ప్రాంతాల మీద హక్కులు సంపాదించుకున్నారు. అమెరికా విషయానికి వస్తే ప్రస్తుతం అమెరికాలోని పదిహేను రాష్ట్రాలలో, కెనడాలో కొంత భాగం, హైతీగా వున్న దేశంతో కూడిన ఫ్రెంచి ఆధీనంలోని లూసియానా ప్రాంతాన్ని 1803లో అమెరికా కొనుగోలు చేసింది. 1699 నుంచి 1762 వరకు తన ఆధీనంలో వున్న లూసియానా ప్రాంతాన్ని ఫ్రెంచి పాలకులు స్పెయిన్‌కు దత్తత ఇచ్చారు. 1800 సంవత్సరంలో తిరిగి వుత్తర అమెరికా ఖండంలో తమ పాలనను విస్తరించేందుకు లూసియానాను తిరిగి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే హైతీ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటును ఫ్రెంచి సేనలు అణచివేయలేకపోయాయి. దానికి తోడు బ్రిటన్‌తో తలపడేందుకు సన్నాహాలలో భాగంగా లూసియానా ప్రాంతాన్ని విక్రయించేందుకు ఫ్రాన్స్‌ ప్రయత్నించింది. తనకు రేవు పట్టణమైన న్యూ ఆర్లినియన్స్‌ పరిసరాలను కొనుగోలు చేయాలని ముందుగా భావించిన అమెరికా సర్కార్‌ ఫ్రాన్స్‌ బలహీనతను సాకుగా తీసుకొని మొత్తం ప్రాంతాన్ని కొనుగోలు చేసింది.కోటీ 80లక్షల ఫ్రాంకుల అప్పురద్దు రద్దు చేసి మరో ఐదు కోట్ల ఫ్రాంకులను అందుకుగాను చెల్లించింది.(2017 విలువ ప్రకారం 600బిలియన్‌ డాలర్లకు అది సమానం) ఇలా ఇతర దేశాల ప్రాంతాలను కొనుగోలు చేయటం అమెరికా రాజ్యాంగానికి విరుద్దం అని ప్రతిపక్ష ఫెడరలిస్టు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తే అధ్యక్షుడిగా తనకున్న అధికారాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకొని కొత్త ప్రాంతాలను సేకరించవచ్చని థామస్‌ జఫర్సన్‌ సమర్ధించుకున్నాడు. అలా అమెరికా విస్తరణ తొలుత ఒప్పందాలతో ప్రారంభమైతే తరువాత సామ్రాజ్యవాదిగా మారి 1846లో మెక్సికో నుంచి నేటి టెక్సాస్‌ ప్రాంతాన్ని యుద్దంలో ఆక్రమించుకున్న అమెరికా నాటి నుంచి నేటి వెనెజులా వరకు అనేక ప్రభుత్వాలను అదిరించటం,బెదిరించటం, లొంగని వారిని అడ్డుతొలగించుకోవటం, వలసలు చేసుకోవటం, అది సాధ్యం కానపుడు తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం వరకు అన్ని ఖండాలలో అమెరికా పాల్పడని అప్రజాస్వామిక చర్య లేదు. అంతర్జాతీయ చట్టాలకు వక్ర భాష్యం చెప్పటం ఒకటైతే తన పధకాల అమలుకు ఇతర దేశాల మీద స్వంత చట్టాలను రుద్దటం మరొక దుశ్చర్య.

స్పానిష్‌ వలస పాలన నుంచి విముక్తి పొందిన లాటిన్‌ అమెరికా లేదా దక్షిణ అమెరికా దేశాలలో వెనెజులా ఒకటి. గత వంద సంవత్సరాలలో సామ్రాజ్యవాదుల జోక్యం, మిలిటరీ నియంతలు, ఆర్ధిక పతనాలు ఇలా ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్న దాని చరిత్రను మూసి పెట్టి వామపక్షాల పాలనలోనోనే దేశమంతా పాచిపోయిందనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో వున్న మదురో, అంతకు ముందున్న ఛావెజ్‌లనే కాదు,తనను వ్యతిరేకించిన వామపక్ష వాదులు కాని అనేక మందిని అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో కూల్చివేసేందుకు, గద్దెల నెక్కించేందుకు ప్రయత్నించిన అమెరికా చరిత్ర దాస్తే దాగేది కాదు. వెనెజులా విషయానికి వస్తే 1951-58 మధ్య అధికారంలో వున్న నియంత పెరెజ్‌ జిమెంజ్‌ను అమెరికా బలపరిచింది.1958లో వామపక్ష, మధ్యేవాదులుగా వున్న వారు తిరుగబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. మరో నియంతను బలపరిచే అవకాశాలు లేక తరువాత కాలంలోే ఏ నినాదంతో ధికారంలోకి వచ్చినప్పటికీ పాలకులందరినీ తన బుట్టలో వేసుకొని తన అజెండాను అమలు జరపటంలో అమెరికా జయప్రదమైంది. వామపక్ష వాది ఛావెజ్‌ విషయంలో కూడా అమెరికా అదే అంచనాతో వుంది. అది వేసుకున్న తప్పుడు అంచానాల్లో అదొకటిగా చరిత్రలో నమోదైంది. ఆయన వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురో విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఆయనను తొలగించేందుకు ఆపరేషన్‌ లిబర్టీ పేరుతో విఫలయత్నం చేసింది. దానికి ముందుగా, ఆ సమయంలోనూ, తరువాత ప్రచార దాడిని కొనసాగిస్తోంది. ఈ దాడి తీరుతెన్నులను ముందుగా పరిశీలిద్దాం,( తరువాయి భాగాల్లో మిగతా అంశాలు)

దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమనే వాట్సాప్‌, లైక్స్‌ కొట్టే ఫేస్‌బుక్‌ మరుగుజ్జులు చెలరేగిపోతున్న తరుణమిది. సామ్రాజ్యవాదం తన ప్రచార దాడికి వుపయోగించే ఆయుధాలలో సాంప్రదాయక మీడియాతో పాటు ప్రస్తుతానికి సామాజిక మీడియాలో ఇవెంతో శక్తివంతగా పని చేస్తున్నాయి. అనేక మంది వాటి దాడికి మానసికంగా బలి అవుతున్నారు. వామపక్ష ప్రభుత్వాలు అమలు జరిపిన అనేక పధకాల వలన వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దివాలా దీసింది, జనాన్ని సోమరులను గావించింది, మన దేశాన్ని లేదా తెలుగు రాష్ట్రాలను ఇలా కానివ్వ వద్దు అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిలో పేరు మోసిన ఒక రచయిత కూడా స్టార్‌ కాంపెయినర్‌గా మారటంతో అనేక మంది దృష్టిని ఆకర్షించింది. చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు.

Image result for media war on venezuela

వెనెజులా గురించిన ఈ ప్రచారం 2001లో ప్రారంభమైంది.1999లో వామపక్ష వాది హ్యూగో ఛావెజ్‌ తొలిసారి అధికారానికి వచ్చారు. అప్పటికే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ ఘోరవైఫల్యం చెందిన కారణంగానే ఆయనను జనం అందలం ఎక్కించారు. కానీ మీడియా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం గురించి ఏమాత్రం తెలియనట్లే వుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా జరిపిన దుశ్చర్యలు, అది బలపరిచిన పాలకులు జరిపిన మారణకాండ, పర్యవసానాలలో రెండు కోట్ల మంది మరణించారని, లిబియా, ఎమెన్‌, లెబనాన్‌, సిరియాలలో జరిగిన మానవ నష్టం దీనికి అదనమని జేమ్స్‌ ఏ లూకాస్‌ అంచనా వేశారు. వెనెజులాలో అత్యవసర ఔషధాలు లేక 40వేల మంది మరణించారని చెబుతున్నా, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అంటున్నా, మిలియన్ల మంది పొరుగుదేశాలకు వలసపోయారంటూ అతిశయోక్తులు చెబుతున్నా, అవన్నీ అమెరికా, దాని కనుసన్నలలో వ్యవహరించే పొరుగుదేశాలు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, అమెరికా విధించిన ఆంక్షలే కారణం తప్ప వామపక్ష పాలకులు కాదు. ఇవన్నీ మీడియాకు, పరిశీలకులకు కనిపించవా?

వెనెజులా ఎంతో ధనిక దేశం వామపక్ష పాలనలో దివాలా తీసిందన్నది మరొక ప్రచారం.1999లో ఛావెజ్‌ అధికారానికి వచ్చినపుడు అక్కడ జనాభాలో సగం మంది దారిద్య్రరేఖకు దిగువన, పొరుగు దేశాలతో పోల్చితే శిశు మరణాలు రెండు రెట్లు ఎక్కువ. మరి ధనిక దేశం అయితే అలా ఎందుకున్నట్లు ? అంతకు ముందున్న పాలకులందరూ అమెరికాతో మిత్రులుగా వున్నవారే కదా ! అనేక దేశాలలో వామపక్ష, వుదారవాదులుగా వుంటూ అధికారంలోకి వచ్చిన వారిని అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంది. చిలీలో అందుకు వ్యతిరేకించిన సాల్వెడార్‌ అలెండీని హతమార్చింది. వెనెజులాలో కూడా ఛావెజ్‌ను తమ వాడిగా మార్చుకోవచ్చని ఆశించిన అమెరికాను 2001లో ఆయన తొలి దెబ్బతీశాడు. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించి ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంతో అప్పటి నుంచి కుట్రలు మొదలు.2002లో మిలిటరీ తిరుగుబాటు చేసి వాణిజ్యవేత్త పెడ్రో కార్‌మోనాకు అదికారం అప్పగించారు. అప్పుడు జార్జి బుష్‌ ఆ తిరుగుబాటను సమర్ధించాడు. వెంటనే ఐఎంఎఫ్‌ రంగంలోకి దిగి సాయం చేస్తామని ప్రకటించింది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆ తిరుగుబాటు విఫలం కాకుండా చూడాలని సంపాదకీయం రాసింది.’కాబోయే నియంత’ ను తొలగించారని ఛావెజ్‌ను వర్ణించింది, ఆయన స్ధానంలో గౌరవనీయుడైన వాణిజ్యవేత్తను ప్రతిష్టించారని ప్రశంసించింది. ఈ కుట్ర వెనుక అమెరికా వుందని ఛావెజ్‌ అబద్దాలు చెబుతున్నారని గార్డియన్‌ పత్రిక ప్రకటించింది. .అయితే ఆ కుట్ర విఫలమై తిరిగి ఛావెజ్‌ అధికారానికి వచ్చాడు. వెంటనే ప్రభుత్వ చమురు కంపెనీలో విద్రోహ చర్యలకు పాల్పడి పెద్ద నష్టం కలిగించారు. అప్పటికే వున్న ఆర్ధిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. నిరుద్యోగం, దారిద్య్రం పెరిగింది. దానికి కారకులు ఎవరు?

Image result for media war on venezuela

దాన్నుంచి బయట పడేందుకు ఛావెజ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా వ్యాపారవేత్తలు తమకు అనువుగా మార్చుకొని మరిన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టారు.ఛావెజ్‌ మరణించిన తరువాత 2014లో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పతనమయ్యాయి. దాంతో ఇబ్బందులు పెరిగాయి. అయినా నికొలస్‌ మదురో స్వల్పమెజారిటీతో విజయం సాధించటంతో తిరిగి కుట్రలు మరో దశకు చేరాయి. బరాక్‌ ఒబామా 2015లో ఆంక్షలను ప్రకటించాడు. ఏ సాకూ దొరక్క మదురో సర్కార్‌ వుండటం తమ జాతీయభద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగిస్తున్నాడు.మరిన్ని కొత్త ఆంక్షలు విధించాడు. వీటన్నింటిని విస్మరించిన మీడియా వెనెజులా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అతిగా చూపుతూ మొసలి కన్నీరు కారుస్తోంది. కెనడాకు చెందిన స్టెఫానీ నోలెన్‌ అనే జర్నలిస్టు వెనెజులా గురించి వాస్తవాలనే పేరుతో అనేక అవాస్తవాలను రాస్తూ ముగింపులో ఇలా పేర్కొన్నారు.’మదురో సర్కార్‌ అంతిమంగా పతనం అవుతుందని ప్రతిపక్ష నేత ఆశాభావంతో వున్నాడు. ఆహారం మొత్తం ఖాళీ అయింది, జనాన్ని వీధుల్లో దింపాలని, మదురో గద్దె దిగే వరకు వారు ఇండ్లకు వెళ్లకూడదనేవిధంగా ఆలోచనలు సాగుతున్నాయని రాశారు. దీనికి అమెరికా, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయని ఎలాంటి బెరకు లేకుండా ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. అంటే ఏం చేయాలో కూడా జర్నలిస్టులు నిర్ణయిస్తారు, అవన్నీ అమెరికా ఆలోచనలకు అనుకూలంగా వుంటాయి.

Image result for media war on venezuela

తాజా పరిణామాల విషయానికి వస్తే మదురో సర్కార్‌ కూలిపోనుందనే రీతిలో ఏప్రిల్‌ చివరివారంలో మీడియా వార్తలున్నాయి. తానే అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న గుయ్‌డో రాజధాని శివార్లలోని ఒక వైమానిక స్ధావరం సమీపంలో మకాం వేశాడు. గృహనిర్బంధంలో వున్న అతగాడి గురువు లియోపాల్డో లోపెజ్‌ను తప్పించి గుయ్‌డో వద్దకు చేర్చారు. తిరుగుబాటులో భాగంగా ఆ స్దావరాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది పధకం. అయితే అంతా పదిగంటల వ్యవధిలోనే ముగిసిపోయింది. తిరుగుబాటుదార్లు వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలో వున్నారు. లక్షల మందిగా వస్తారనుకున్న జనం ఎక్కడా జాడలేదు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి సిఎన్‌ఎన్‌ ఛానల్లో మాట్లాడుతూ మదురో క్యూబాకు పారిపోతున్నాడంటూ చేసిన అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున మీడియా జనం ముందు కుమ్మరించింది. ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన అంతర్జాతీయ మీడియాలో మొత్తంగా అక్కడ తిరుగుబాటు జరుగుతున్నట్లే వార్తలు వచ్చాయి. మదురోకు మద్దతుగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన జనం మీడియాకు కనిపించలేదు.బిబిసి అలాంటి వార్తనే రోజంతా ఇచ్చి చివరకు సాయంత్రానికి దాన్ని కొద్దిగా మార్చుకోవాల్సి వచ్చింది. కొద్ది మంది కిరాయి మనుషులను, గుయ్‌డోను పదే పదే చూపాయి. కుట్రలో భాగంగా కొన్ని చోట్ల సాగించిన దహనకాండను తిరుగుబాటుగా వర్ణించాయి. అయితే ఇంత జరిగినా మీడియాను వెనెజులా జనం విశ్వసించలేదు. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా జరుగుతున్న అసత్య ప్రచారం ప్రపంచం కంటే వారికి ఎక్కువగా తెలుసు. వాస్తవం ఏమిటో, కట్టుకధలేమిటో ఎరిగిన వారు. 2002లో తిరుగుబాటు సమయంలో నిరాయధుల మీద ఛావెజ్‌ సర్కార్‌ కాల్పులు జరిపిందని, మారణకాండ జరిపినట్లు కొన్ని మీడియా సంస్ధలు ప్రసారం చేసిన వీడియోలు నకిలీవని తేలింది. అందువలన విశ్వసనీయత కోల్పోయిన మీడియా వార్తలను వారు విస్మరించారు. వాస్తవాలు తెలియదు కనుక మన జనాల్లో కొంత మంది అలాంటి వాటిని నిజమే అని నమ్ముతున్నారు. సమాచార సామ్రాజ్యవాదానికి కావాల్సింది అదే.అయితే అందరినీ ఎల్లకాలం నమ్మించలేమనే వాస్తవం వారికి తెలిసినా, ఇదొక యుద్ధం కనుక అస్త్రాలను ప్రయోగిస్తూనే వుంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులాలో మంగళవారం నాటి తిరుగుబాటును అణచివేసిన వామపక్ష ప్రభుత్వం !

01 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Caracas, Juan Guaidó, Leopoldo Lopez, Nicolás Maduro, Venezuela, Venezuelan Military Putsch, Venezuelan Opposition

ఎం కోటేశ్వరరావు

తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనికులు, ఇతర భద్రతా దళాలకు చెందిన కొద్ది మంది చేసిన తిరుగుబాటు ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచివేసినట్లు వెనెజులా అధ్య క్షుడు నికోలస్‌ మదురో మంగళవారం రాత్రి ప్రకటించారు. సైనిక అధికారులు, ఇతర ప్రముఖులతో కలసి గంటసేపు టీవీలో చేసిన ప్రసంగంలో వుదయం నుంచి జరిగిన పరిణామాలను దేశ ప్రజలకు వివరించారు. సాయుధ తిరుగుబాటును సాకుగా చూపి అమెరికా మిలిటరీ జోక్యానికి పాల్పడాలని కుట్ర చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్న సమాయానికి కొంత మంది విద్రోహులు బయటపడ్డారని వారిని వదిలేదని చెప్పారు. తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జువాన్‌ గుయ్‌డో అజ్ఞాతం నుంచి తిరుగుబాటుకు పిలుపునిస్తూ వీడియోలను విడుదల చేయటం , అక్కడక్కడా బారికేడ్ల ఏర్పాటు, దహనకాండ వుదంతాలు తప్ప ఎక్కడా తిరుగుబాటు సూచనలు లేవని వార్తలు వెల్లడించాయి. మదురోకు మిలిటరీ మద్దతు ఇవ్వటం లేదని గుయ్‌డో చెప్పుకున్నాడు. తమ నాయకుడికి పధకం ప్రకారం అమెరికా నుంచి రావాల్సిన సాయం అందలేదని అనుచరులు చెప్పినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే సైనిక తిరుగుబాటుకు బదులు బుధవారం నాడు శాంతియుత తిరుగుబాటులో భాగంగా లక్షల మంది వీధుల్లోకి వచ్చి తనకు మద్దతుగా ప్రదర్శనలు చేయాలని గుయ్‌డో విడుదల చేసిన వీడియోల్లో వుందని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక పేర్కొన్నది. బుధవారం నాడు వీధుల్లోకి వచ్చి ప్రతిపక్షాల కుట్రను విఫలం చేయాలని, మేడేను జరుపుకోవాలని మదురో కూడా తన మద్దతుదార్లకు పిలుపునిచ్చాడు. తాను మంగళవారం వుదయం రష్యన్ల మద్దతుతో వెనిజులా నుంచి క్యూబాకు పారిపోనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పటాన్ని మదురో అపహాస్యం చేశాడు. వెనెజులాలో వున్న క్యూబన్‌ సైనికులు అక్కడ ఏదైనా మరణాలు, నష్టానికి కారకులైతే క్యూబా మీద మరిన్ని కఠిన ఆంక్షలు అమలు జరుపుతామని, కనుక వెంటనే స్వదేశానికి వెళ్లాలని మంగళవారం సాయంత్రం ట్విటర్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. వెనెజులాలో పరిస్ధితి క్లిష్ట దశకు చేరుకుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ అన్నాడు.ముగ్గురు సీనియర్‌ అధికారులతో తాము సంప్రదించామని, మదురోను తప్పించేందుకు వారు అంగీకరించారని చెప్పుకున్నాడు. అయితే బోల్టన్‌ ఇలాంటి ఇలాంటి కలలు కనటం కొత్త కాదని వెనెజులా విదేశాంగ మంత్రి జార్జ్‌ అరియా వ్యాఖ్యానించాడు.

మంగళవారం తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయంలో గుయ్‌డోకు గురువు, గృహనిర్బంధంలో వున్న ప్రతిపక్ష నేత లియోపోల్డో లోపెజ్‌ను కొంత మంది సాయుధులు తప్పించి వెలుపలకి తీసుకువచ్చారు. రాజధాని కారకాస్‌లో ఒక రహదారిని మూసివేశారు. నగరశివార్లలోని ఒక చోట లోపెజ్‌, గుయ్‌డో కలుసుకున్నారు. అక్కడి నుంచి వీడియోలు విడుదల చేశారు. రాజ్యాంగపరిషత్‌ అధ్యక్షుడు డియోసడాడో కాబెల్లో టీవీలో మాట్లాడుతూ కుట్రదారుల గురించి వివరించి బలివేరియన్‌ మిలిషియా వీధుల్లోకి వచ్చి అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన జరిపారు. తామనుకున్న విధంగా ఎలాంటి తిరుగుబాటు లేకపోవటంతో గుయ్‌డో కొంత మంది అనుచురులతో కలసి గుర్తు తెలియని ప్రాంతానికి తప్పించుకోగా లోపెజ్‌ తొలుత చిలీ రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడ వున్న కుటుంబసభ్యులతో కలసి తరువాత స్పెయిన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి శరణువేడినట్లు,25 మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారని వార్తలు వచ్చాయి.

రాజధాని కారకాస్‌, ఇతర పట్టణాల్లో గుయ్‌డో అనుచరులు బారికేడ్లు ఏర్పాటు చేసి కొన్ని చోట్ల దహనకాండకు పాల్పడ్డారని, కారకాస్‌ శివార్ల నుంచి ప్రదర్శన జరిపేందుకు ప్రయత్నించిన గుయ్‌డోను భద్రతాదళాలు చెదరగొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఏడు గంటల పాటు గుయ్‌డో సామాజిక మాధ్యమానికి అందుబాటులో లేకుండా పోయాడు. ప్రతిపక్షం రెచ్చగొట్టే చర్యల పట్ల సంయమనం పాటించాలని మదురో మిలిటరీ, ఇతర భద్రతా దళాలను కోరాడు.తిరుగుబాటు యత్నాలను బలీవియా అధ్యక్షుడు ఇవోమొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ తీవ్రంగా ఖండించారు. ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేస్తూ హింస ఏరూపంలో వున్నా ఖండించాలని, సంయమనం పాటించాలని కోరగా, ఐరోపా పార్లమెంట్‌ అధ్యక్షుడు అంటోనియో టజని మాత్రం తిరుగుబాటును సమర్ధించాడు.

నాడు క్యూబా, నేడు వెనెజులాలో చరిత్ర పునరావృతం !

అమెరికా దేశాల సంస్ధ (ఒఎఎస్‌) నుంచి తప్పుకొనే ప్రక్రియను పూర్తి కావటంతో సంతోషం ప్రకటిస్తూ వెనిజులాలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఆ సంస్ధ అమెరికా కీలబొమ్మగా మారిందని ఇప్పుడు తాము మరింత స్వతంత్రంగా వున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో ఆ సంస్ధ చేసే నిర్ణయాలకు కట్టుబడనవసరం లేదు. అది అమెరికా వలస దేశాల మంత్రిత్వశాఖ అని గతంలో కాస్ట్రో చేసిన విమర్శను మదురో పునరుద్ఘాటించారు.అమెరికా ఆంక్షలకు గురైన వెనెజులా విదేశాంగ మంత్రి జార్జి అరియా విదేశాంగశాఖ భవనంపై నుంచి శనివారం నాడు ప్రదర్శకులతో మాట్లాడుతూ మనం నిన్నటి కంటే నేడు మరింత స్వతంత్రుల మయ్యామని ప్రకటించారు. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి లూయీస్‌ మగారో అమెరికాకు వంతపాడుతూ అవసరమైతే మానవతా పూర్వకంగా మిలిటరీ జోక్యం చేసుకున్నాతప్పు లేదని గతంలో ప్రకటించాడు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో సభ్యదేశాలన్నీ గుయ్‌డో సర్కార్‌ను గుర్తించాలని తీర్మానించటమేగాక మదురో సర్కార్‌ ప్రతినిధి బదులు గుయ్‌డో మనిషిని సమావేశానికి ఆహ్వానించింది. ఈ పూర్వరంగంలో వెనిజులా రెండు సంవత్సరాల గడువు నిబంధనను పూర్తి చేసి ఆ సంస్ధ నుంచి వైదొలిగింది. వెనిజులా మీద దాడికి పాల్పడితే సహించేది లేదని రష్యా, చైనా హెచ్చరికలు చేశాయి. యాభై ఏడు సంవత్సరాల క్రితం క్యూబాలో క్షిపణుల మోహరింపు, నేడు వెనెజులాలో అదే పునరావృతం అయింది. నాడు అమెరికా తోక ముడిచి రాజీకి దిగి వచ్చింది.నేడు వుక్రోషంతో హూంకరింపులు చేస్తోంది. ముగింపు కూడా గతమే పునరావృతం అవుతుందా? ఆరు దశాబ్దాల నాటికి నేటికీ ప్రపంచం, రాజకీయాల్లో వచ్చిన మార్పులేమిటి? కొత్త వుద్రిక్తతలకు నాందీ వాచకం పలుకుతుందా, అంతర్జాతీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా వుంటాయి? వీటి మంచి చెడ్డలను ఎలా చూడాలి? రెండింటి మధ్య వున్న సామ్యాలు ఏమిటి ?

నాడు క్యూబాలో జరిగిందానికి, నేడు వెనెజులాలో జరుగుతున్నదానికి అమెరికా సామ్రాజ్యవాదులే కారణం. తమ గుమ్మం ఎదుట ఒక సోషలిస్టు రాజ్యం అవతరించటమా అని నాడు ఆగ్రహం వస్తే, అంతరించిపోయిందనుకు కున్న వామపక్ష శక్తి తన పెరటితోటలోనే పెరగటమా అని నేడు అమెరికా వూగిపోతోంది. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన 1959లో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కాస్ట్రో వ్యతిరేకులకు ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన అమెరికా 1961లో జరిపిన తిరుగుబాటు కుట్రను బే ఆఫ్‌ పిగ్స్‌ అని పిలిచారు. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌ దృష్టిని క్యూబా నుంచి మళ్లించేందుకు ఐరోపాలోని టర్కీ, ఇటలీలో ఖండాంతర క్షిపణులను మోహరించి రెచ్చగొట్టారు. అమెరికన్ల మద్దతుతో జరిగిన తిరుగుబాటును అణచివేసిన క్యూబా సర్కార్‌ తమకు రక్షణ కల్పించాలని కోరగా 1962 అక్టోబరులో క్యూబా గడ్డమీద సోవియట్‌ తన క్షిపణులను మోహరించింది. ఈ చర్య అమెరికా సమాజంలో ప్రభుత్వం మీద ఆగ్రహం కలిగించింది. తమకు అణ్వాయుధాల ముప్పు తెచ్చారంటూ తీవ్ర నిరసనలు, విమర్శలు చెలరేగాయి. రెండవది అదే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దానికే ఎదురు తిరగటంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముదు అంటే 1962 అక్టోబరు రెండవ పక్షంలో జరిగిన ఈ పరిణామంతో అమెరికా వెనక్కు తగ్గి సోవియట్‌ యూనియన్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టర్కీ, ఇటలీ నుంచి అమెరికా అణ్వాయుధాలను తొలగించాలి, దానికి ప్రతిగా క్యూబా నుంచి సోవియట్‌ తొలగిస్తుంది. క్యూబా వైపు నుంచి ప్రత్యక్షంగా రెచ్చగొట్టే చర్యలు వుంటే తప్ప తాముగా క్యూబాలో జోక్యం చేసుకోబోమని, సోవియట్‌తో న్యూక్లియర్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకుంటామని అమెరికన్లు దిగివచ్చారు.

ఇప్పుడు వెనిజులా విషయంలో అమెరికన్లు ఎత్తుగడను మార్చారు. సైన్యంలో తిరుగుబాట్లను రెచ్చగొట్టి విఫలమయ్యారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షానికి వచ్చిన మెజారిటీని ఆసరా చేసుకొని వామపక్ష మదురో సర్కార్‌ను కూలదోసేందుకు తెరతీశారు.ఈ ఏడాది జనవరి 23న పార్లమెంట్‌ స్పీకర్‌ జువాన్‌ గుయ్‌డో తనకు తానే దేశాధ్యక్షుడనని ప్రకటించుకున్నాడు. బయట ప్రమాణస్వీకార తతంగం కూడా జరిపాడు. దాన్ని అమెరికాతో సహా దాని అనుంగు దేశాలు గుర్తించాయి. గుయ్‌డోకు విధేయులై వుండాలని మిలిటరీ, అధికార యంత్రానికి చేసిన వినతికి స్పందన లేదు. వాస్తవానికి అంతకు ముందే అధ్యక్షుడు మదురో పార్లమెంట్‌ను రద్దు చేసి నూతన రాజ్యాంగ రచనకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. అందువలన గుయ్‌డో అధ్యక్షుడిగా అతను చేసిన ప్రమాణస్వీకారం చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే విదేశాలలో ఏర్పాటు అయినట్లు చెప్పుకున్న గుయ్‌డో అనుకూల సుప్రీం కోర్టు అతన్ని సమర్ధించింది. తన పధకానికి అనుగుణంగా పరిణామాలు లేకపోవటంతో కంగు తిన్న అమెరికన్లు వెనెజులా మీద మరింత కఠినంగా ఆంక్షలు పెట్టటమే కాదు, దేశంలోని విద్యుత్‌ వ్యవస్ధను చిన్నాభిన్నం చేశారు. ప్రాణావసర ఔషధాలను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మానవతా పూర్వక సాయం పేరుతో ట్రక్కుల్లో ఆయుధాలు చేరవేసేందుకు పన్నిన ఎత్తుగడను మదురో సర్కార్‌ విఫలం చేసింది.

దీనికి ప్రతిగా వెనెజులా కోరిక మీద అమెరికన్ల అధునాతన ఆయుధాల దాడిని ఎదుర్కొనే వుపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే ఎస్‌300క్షిపణులను, వాటిని ప్రయోగించే మిలిటరీ నిపుణుల రష్యా తరలించింది. వాటిని దాపరికం లేకుండా వెనిజులా ప్రత్యక్షంగా ప్రదర్శించింది కూడా. దీనికి తోడు యాంగ్జీఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌లైన్స్‌ చైనా నుంచి బోయింగ్‌ 747 సరకు రవాణా విమానంలో ఔషధాలు, పరికరాలను చైనా పంపింది. నికొలస్‌ మదురో వుద్వాసనకు గురి కాబోతున్నాడంటూ సోమవారం నాడు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. లక్ష కోట్ల డాలర్ల సిల్కు రహదారి(దీన్నే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు) పారిశ్రామిక, వాణిజ్య పధకం గురించి 150దేశాలకు, 90సంస్ధలకు చెందిన ప్రతినిధులతో గతవారంలో బీజింగ్‌లో చైనా పెద్ద సమావేశం నిర్వహించింది. దానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా 37దేశాధినేతలు కూడా హాజరయ్యారు.( ఈ సమావేశాన్ని అమెరికా,దానితో కౌగిలింతల దౌత్యం నడుపుతున్న మన దేశం కూడా బహిష్కరించింది) ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు గ్జీ గింపింగ్‌తో సమావేశమైనపుడు వెనిజులా ప్రస్తావన వచ్చిందని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలు ఆమోదయోగ్యం కాదని, ఇరుదేశాలు దానికి బాసటగా నిలవాలని, అమెరికా వైఖరిని ఖండిస్తూ వారు మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఇది అమెరికన్లకు ఆగ్రహం తెప్పించింది. క్యూబా మీద మరిన్ని ఆంక్షలు విధించటాన్ని గుర్తు చేస్తూ మదురో మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్ధితి ఎంతో మెరుగ్గా వుండేదని చెప్పేందుకే తామీ పని చేశామని, మదురోను సమర్ధించే దేశాలన్నింటికీ ఇదే చెప్పదలచుకున్నామని రష్యా, చైనాలను బెదిరిస్తూ పాంపియో మాట్లాడాడు. వెనెజులా పౌరులు, మిలిటరీకి, క్యూబన్లకు, రష్యన్లకు, మీరు గనుక వార్తలు చూస్తే వెనిజులాకు సాయం చేస్తున్న ఇరాన్‌కు, అదే విధంగా ఎంతో చేస్తున్న చైనాకూ ఇదే హెచ్చరిక అన్నాడు. మదురోకు మద్దతుదారుల్లో ఒకరు తిరుగుబాటుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. క్యూబా నుంచి వందల మంది అధికారులు, 20వేల మంది సనికులు వెనెజులా వెళ్లినట్లు అమెరికా చేసిన ఆరోపణలను క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌ తోసి పుచ్చారు. ప్రపంచంలో 800చోట్ల సైనిక స్ధావరాలు, లక్షల మంది సైన్యాన్ని దింపిన అమెరికా తమ గురించి మాట్లాడుతోందని,అబద్దాలు చెబుతోందని అన్నారు.

సర్వసత్తాక దేశాల్లో జోక్యం చేసుకొనే అమెరికా వైఖరిని రష్యా, చైనా ఖండించాయి. వెనిజులాపై చర్య తీసుకొనే అంశంలో తమ అధికారులు సిద్ధంగా వున్నారని అమెరికా దక్షిణ కమాండ్‌ నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ క్రెయిగ్‌ ఫాలర్‌ వెల్లడించాడు. ఈ ప్రకటన మిలిటరీ జోక్యం వూహకాదు వాస్తవమే అని రష్యా వ్యాఖ్యానించింది.అమెరికా అంతర్గత చట్టాల పేరుతో భద్రతా మండలి వెలుపల ఆం్షలు విధించటాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా పేర్కొన్నది.చైనా, ఇరాన్‌ మానవతా పూర్వక సాయాన్ని అందించేందుకు ప్రతినిధులతో పాటు విమానాల్లో సాయాన్ని కూడా పంపాయి. అమెరికా దాడికి సిద్ధం అవుతున్నదనే వార్తల పూర్వరంగంలో భద్రతా దళాలకు మద్దతుగా పది లక్షల మందిని సిద్ధం చేయాలని గతవారం మదురో ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

గత నెల చివరి వారంలో రష్యా నుంచి యుద్ధనిపుణులు వెనిజులా చేరుకున్నారు. అమెరికా నుంచి ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఎత్తుగడలను వారు రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మిలిటరీ కేంద్రాల సంరక్షణకు రష్యా తయారీ ఎస్‌-300 క్షిపణులను ప్రయోగించే నాలుగు సంచార వాహనాలను ఏర్పాటు చేశారు. ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే బ్రహ్మూెస్‌ క్షిపణులను మోసుకుపోగల సుఖోయ్‌ ఎస్‌యు-30 జట్‌ యుద్ధ విమానాలను, టి-72 టాంకులు, వేగంగా ప్రయాణించే పడవలు, ఎకె-103 తుపాకులను తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వుపరితలం నుంచి గగనతలంలోకి సైనికులు భుజాలపై వెంట తీసుకుపోగల క్షిపణి ప్రయోగ పరికరాలను పెద్ద సంఖ్యలో రష్యా సరఫరా చేసింది. అమెరికా తొత్తు గుయ్‌డోకు మద్దతు ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్ళిన గూఢచారశాఖ మాజీ అధిపతి కార్వాజల్‌ను స్పెయిన్‌లో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు.

Crowds gathered outside Miraflores Palace on Tuesday morning. (Cira Pascual Marquina)

అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని  మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన

అమెరికా విధించిన ఆర్ధిక, వస్తు సరఫరాలపై ఆంక్షలు, విద్యుత్‌ కేంద్రాలలో విద్రోహ చర్యల వంటి సమస్యల కారణంగా వెనిజులా పౌరులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారు గత నిరంకుశపాలనతో పోల్చుకొని మదురోకు బాసటగా నిలుస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకొనేందుకు వీలుగా కార్మికుల, వుద్యోగుల వేతనాలను మదురో సర్కార్‌ ఎప్పటికప్పుడు సవరిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి పరిస్ధితి మరింత దిగజారింది. ఆర్ధికంగా జనాన్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటం అమెరికా ఎత్తుగడగా వుంది.ఇప్పటికే చమురుపై ఆంక్షల కారణంగా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయింది. 2017-18లో 40వేల మంది చావులకు అమెరికా ఔషధాలపై విధించిన దుర్మార్గ ఆంక్షలే కారణం. మరో మూడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 2013లో 11.2బిలియన్‌ డాలర్ల మేరకు ఆహారం దిగుమతి చేసుకుంటే ఆంక్షల కారణంగా 2018లో అది 2.46బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఇన్ని ఇబ్బందులను భరిస్తున్నప్పటికీ అమెరికా వ్యతిరేక వైఖరిలో ఇంతవరకు జనంలో పట్టుసడల లేదు. అమెరికాకు చెందిన గాలప్‌ సంస్ధ ఇటీవల జరిపిన సర్వేలో వెనిజులా పౌరుల కంటే ప్రపంచంలో అత్యంత ధనికులు, శక్తివంతులైన అమెరికన్లే ఎక్కువ వత్తిడికి లోనవుతున్నట్లు 2019 ప్రపంచ మనోద్వేగ నివేదికలో గాలప్‌ సంస్ధ తెలిపింది. పగలు తాము అత్యంత వత్తిడికి లోనవుతున్నట్లు 55శాతం మంది అమెరికన్లు చెప్పారట. ఇరాన్‌, శ్రీలంక,అల్బేనియా, అమెరికా నాలుగవ స్ధానంలో వున్నాయి. మొదటి మూడు స్ధానాల్లో గ్రీస్‌, ఫిలిప్పయిన్స్‌, టాంజానియా వున్నాయి.అనేక ఇబ్బందులున్నప్పటికీ వెనెజులా 12వ స్ధానంలో వుంది.

క్యూబాపై అమెరికా కుట్ర చేసిన సమయంలో క్షిపణులను మోహరించిన సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు రాజ్యం. సోదర దేశాన్ని రక్షించటం తన బాధ్యతగా ఎంచుకుంది. ఆ సమయం చైనా కూడా సోషలిస్టు దేశమే అయినప్పటికీ సోవియట్‌ మాదిరి శక్తి కలిగినది కాదు, అంతర్గత ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇప్పుడు రష్యాకు అలాంటి బాధ్యత లేనప్పటికీ ఐరోపాలో తనకు ఎసరు పెడుతున్న అమెరికాను అడ్డుకోవాలంటే దాని పెరటితోటలోనే తాను పాగా వేయగలమన్న హెచ్చరిక దాని చర్యలో కనిపిస్తోంది. మరోవైపున క్యూబా, వెనిజులా, తదితర సోషలిస్టు, వామపక్ష ప్రభుత్వపాలనలో వున్న దేశాల పట్ల చైనా ఇటీవలి కాలంలో బాసటగా నిలవటం మరింత ఎక్కువగా చేస్తున్నది. మాటల కంటే చేతల్లో చూపుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తిరోగామి-పురోగామి పోరు గడ్డ బెగుసరాయ్‌ !

28 Sunday Apr 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

a regressive vs progressive electoral battle battlefield, Begusarai, Kanhaiya Kumar

Image result for Kanhaiya Kumar

ఎం కోటేశ్వరరావు

బీహార్‌లో రైతాంగ వుద్యమ నిర్మాత ! ఆలిండియా కిసాన్‌ సభ తొలి అధ్యక్షుడు !! స్వామి సహజానంద సరస్వతి కలియ తిరిగిన నేల, వుద్యమాల పురుటి గడ్డ బెగుసరాయ్‌. స్వాతంత్య్ర వుద్యమంలో పరిచయం అవసరం లేని ప్రాంతం. మరోసారి జాతీయంగా జనం నోళ్లలో నానుతోంది. అటు పచ్చి మితవాదులు, ఇటు పురోగామి వాదులు ఇప్పుడు కేంద్రీకరించిన ఎన్నికల పోరుగడ్డ. సోమవారం నాడు జరిగే ఎన్నికల ఫలితం ఏమౌతుందన్నది ప్రశ్నే కాదు.

ఏ మతానికి చెందిన వారైనా పిల్లల్ని కనే సంఖ్య ఒకటిగానే వుండాలి. హిందువులు మరింత ఎక్కువ మంది పిల్లల్ని కని జనాభా సంఖ్యను పెంచాలని ప్రబోధించిన మిత, మతవాది అయిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ బిజెపి అభ్యర్ధి. దేశానికి మిత, మతవాదుల నుంచి పొంచి వున్న ముప్పును చిత్తు చెయ్యాలన్న పురోగమన వాది కన్నయ్య కుమార్‌ వామపక్షాలన్నీ బలపరిచిన సిపిఐ అభ్యర్ధిగా పోటీలో వున్నారు. బిజెపిని ఓడించాలన్న వామపక్షాల పిలుపును విస్మరించిన ఆర్‌జెడి, కాంగ్రెస్‌ కూటమి తరఫున ఆర్‌జెడి అభ్యర్ధిగా తన్వీర్‌ హసన్‌ పోటీలో వున్నారు.

ఆ నియోజకవర్గంలో భూమిహార్‌లు గణనీయ సంఖ్యలో వున్నారు. గిరిరాజ్‌ సింగ్‌, కన్నయ్య ఇద్దరూ అదే సామాజిక వర్గానికి చెందిన వారు. భూమిహార్లు తాము వ్యవసాయం చేసే బ్రాహ్మణులమని, తాము యాచక తరగతికి చెందిన వారం కాదని చెప్పుకుంటారు. కర్మకాండలు చేసే తరగతి బ్రాహ్మణులు వారు అసలు సిసలు బ్రాహ్మలు కాదంటూ తమతో సమంగా గుర్తించేందుకు నిరాకరిస్తారు. భూమిహార్లలో పెద్ద పెద్ద జమిందార్లు వున్నారు. వారికి వ్యతిరేకంగా పోరాడిన పేద భూమిహార్లు వున్నారు. స్వామి సహజనాంద తరగతి నాడు రెండవ కోవకు చెందితే నేడు ఆ వారసత్వాన్ని కన్నయ్య కుమార్‌ కొనసాగిస్తున్నాడు.

Image result for Kanhaiya Kumar

కన్నయ్యకు మద్దతుగా అనేక ప్రాంతాల నుంచి కుల, మత, భాషా, ప్రాంత భేదంలేకుండా చురుకుగా పాల్గొంటున్నవారితో బెగుసరాయ్‌ ఓ ‘మినీ భారత్‌’ను తలపిస్తున్నదని న్యూస్‌ క్లిక్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధి నివేదించాడు. అక్కడ ఉన్నవారిలో కొందరు చర్చల్లో నిమగమై ఉండగా.. మరికొందరు తమ తమ మొబైల్‌ ఫోన్లతో బిజీగా ఉన్నారు. మరికొందరు మండుతున్న వేడి నుంచి సేదతీరేందుకు చెట్ల నీడన తలదాచుకున్నారు. ఇదంతా బేగసరాయ్‌ లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత నివాసం వెలుపల ద శ్యం. అక్కడ ఉన్నవారంతా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు. వారి లక్ష్యం ఒక్కటే. బేగుసరారు లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేస్తున్న కన్నయ్యకుమార్‌కు ప్రచారంలో సహాయ పడటం. బిహత్‌ గ్రామంలోని కన్నయ్యకుమార్‌ ఇంటికి చేరుకునేసరికి వారిలో చాలామందికి ఒకరితో ఒకరికి పరిచయంలేదు. యువకులు, మధ్యవయస్కులు, వ ద్దులు, మహిళలు ఇలా అందరూ ఇప్పుడు మంచి స్నేహితులు. ‘ఉదయం ప్రచారానికి బయలుదేరే ముందు వరకూ.. అలాగే ప్రచారాన్ని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత… వారంతా కన్నయ్యకుమార్‌ ఇంటివెలుపల బహిరంగ ప్రదేశంలో గడుపుతున్నారు..’ అని సీపీఐ అభ్యర్థి ప్రచార సమన్వయకర్త ధనుంజరుకుమార్‌ చెప్పారు. ప్రత్యేకమేమంటే.. అక్కడ విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారులు, కళాకారులు, పర్యావరణ ఉద్యమ కారులు, విద్యావేత్తలు.. ఇలా విభిన్నవర్గాలకు చెందినవారే కాదు, వివిధ భాషలు, కులాలు, సంస్క తులకు చెందిన వారూ ఉన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు, సాంస్క తిక గ్రూపు, వీధి నాటకాలకు, సోషల్‌ మీడియా నిర్వహణ ఇలా… అందరినీ ప్రత్యేక గ్రూపులుగా విభజించారు. ముమ్మర ప్రచారం నిర్వహించారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొని మరీ వీరంతా అక్కడకు చేరుకొని ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురితో సహా విదేశీయులు కూడా ఉండటం ప్రత్యేకం. పన్నెండు అంతర్జాతీయ మీడియాసంస్థలు ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించాయి. నివాసం వెనుక ఖాళీ స్థలంలో భోజనశాలను ఏర్పాటుచేశారు. కన్నయ్యకుమార్‌ తల్లి సహా పలువురు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లుచూస్తున్నారు. ‘నా సొంత ఖర్చులు పెట్టుకొని ఇక్కడకు వచ్చాను. నేను సీసీఐ కార్యకర్తనుకాను. అలాగని ఏ పార్టీకి చెందినవాడిని కాదు. కానీ, కన్నయ్య విజయం కోసం నా వంతు సహాయం చేయాలన్న తపనతో ఇక్కడకువచ్చాను. చీకటిలో కాంతిరేఖలా కన్నయ్యకుమార్‌ కనిపించారు నాలాగే వివిధ రాష్ట్రాల నుంచి కన్నయ్యకు సహాయపడేందుకు వందలాది మంది బేగుసరారు వచ్చారు..’ అని పంజాబ్‌లోని భటిధర్‌ నుంచి వచ్చిన జబర్‌ జంగ్‌ సింగ్‌ చెప్పారు.

Image result for Kanhaiya Kumar

‘దాదాపు వెయ్యి కిలో మీటర్ల దూరం నుంచి నేను ఇక్కడకు వచ్చాను. గత ఐదేండ్లుగా గోవాలోనూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యావరణంపై మోడీ ప్రభుత్వ రాజీపడిన ధోరణిని ఇక్కడ ప్రజలకు వివరిస్తున్నాను’ అని పర్యావరణ కార్యకర్త సుదీప్‌ దాల్వీ చెప్పారు. ‘కన్నయ్యకు మద్దతివ్వాల్సిందిగా గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నాను. అసంఘటిత రంగ, బలహీనవర్గాలు, మైనార్టీల, పేదల గొంతుక కన్నయ్య. ఆయన కోసం నేను ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ వచ్చాను’ అని ఒడిషాలోని జగత్‌సింగ్‌పుర్‌ నుంచి వచ్చిన మిర్జా లుక్మన్‌ చెప్పారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ నుంచి సందీప్‌ గుప్తా, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ విద్యార్థి జైన్‌ మొహమ్మద్‌ సులేమన్‌, అలహాబాద్‌ వర్సిటీ నుంచి ఆరిఫ్‌ సిద్ధికి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మహేశ్‌ కుమార్‌, జేఎన్‌యూ నుంచి పలువురు విద్యార్థులు, తెలంగాణ నుంచి సల్మాన్‌ అలీ, క్రిష్ణరామ్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాగేశ్వర్‌రెడ్డి.. ఇలా అన్ని ప్రాంతాలవారూ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటువేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘దేశంలోని మతవాద, నియంతత్వ దళాలను ఓడించేందుకే నా పోరాటం., బేగుసరారు ప్రజలు నాకు ఓటు వేస్తారన్న నమ్మకం ఉంది’ అని కన్నయ్యకుమార్‌ చెప్పారు.

Image result for Kanhaiya Kumar

వామపక్షాలకు బెగుసరాయ్‌ ఒకప్పుడు గట్టి పట్టున్న ప్రాంతం. లెనిన్‌గ్రాడ్‌గానూ దీనికి పేరు. 1967లో యోగేంద్ర శర్మ సీపీఐ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లోనూ సీపీఐ అభ్యర్థికి 11.87్న ఓట్లు వచ్చాయి. మరోవైపు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ మళ్లీ సత్తా చాటాలనే ఉద్దేశంతో నవడా స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను రంగంలో దించింది. ఆయన అయిష్టంగానే బరిలో దిగారని వార్తలు వచ్చాయి. ఆర్జేడీ గత ఎన్నికల్లో 3.69 లక్షల ఓట్లు దక్కించుకున్న తన్వీర్‌ హసన్‌ను అభ్యర్థిగా ప్రకటించి త్రిముఖ పోరుకు తెరతీసింది. బిజెపి-సిపిఐ మధ్య భూమిహార్‌ ఓట్లు చీలితే తమకు లాభమని ఆర్జేడీ భావిస్తోంది. పైగా తన్వీర్‌ ముస్లిం కావడం, యాదవ్‌ల ఓట్లు తమకే పడతాయని అంచనా వేస్తోంది. కన్నయ్యకు మద్దతుగా గెలిపించేందుకు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి డి.రాజా, కె నారాయణ, సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటి ఉద్దంఢులు రంగంలోకి దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజాగొంతుకను గెలిపించాలని కోరారు.

Image result for Kanhaiya Kumar, sitaram

షబానా ఆజ్మీ, జావేద్‌ అక్తర్‌, స్వరభాస్కర్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు కన్నయ్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని, నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా స్వయంగా బెగుసరాయ్‌లో ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని గిరిరాజ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన తరఫున ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి కన్నయ్య కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల ఘర్షణలకు కూడా ప్రయత్నించారు. నితీశ్‌ కుమార్‌ నేత త్వంలోని జేడీ(యూ) మద్దతు కూడా తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు తన్వీర్‌ హసన్‌ స్థానికంగా అందుబాటులో ఉండటం, ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడంతో తామే గెలుస్తామని ఆర్జేడీ అంచనాలు వేసుకుంటోంది.

మొత్తం ఓటర్లు 17.78 లక్షలు

పురుషులు 9.49 లక్షలు

మహిళలు 8.28 లక్షలు

Share this:

  • Tweet
  • More
Like Loading...

వర్తమానంలో మేడే ప్రాధాన్యత !

26 Friday Apr 2019

Posted by raomk in Current Affairs, employees, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

International Workers' Day, may day, May Day 2019, May Day significance, May day significance in the contemporary period

Image result for may day haymarket

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అభివృద్ధి రేటు గతేడాది వున్న 3.6శాతం నుంచి ఈ ఏడాది 3.3కి తగ్గుతుందని, వచ్చే ఏడాది తిరిగి 3.6శాతం వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) ప్రకటించింది. ఏడాదిలో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధల మంచి చెడ్డల గురించి తన అంచనాలను వెల్లడిస్తుంది. ఈ సంస్ధ వునికిలోకి వచ్చిన ఏడు దశాబ్దాలలో ప్రపంచంలో ముఖ్యంగా ధనిక దేశాలలో తలెత్తిన ఆర్దిక సంక్షోభం గురించి ఎన్నడూ జోస్యం చెప్పలేకపోయింది. అందువలన అది చెప్పే అంచనాలకూ అదే పరిస్ధితి. ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ 3.5శాతం రేటుతో అభివృద్ధి చెందనుందని చెప్పింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ చెప్పే అంకెల విశ్వసనీయత సమస్యను కాసేపు పక్కన పెడదాం. వాటినే పరిగణనలోకి తీసుకుంటే కార్మికవర్గానికి అర్దం అయ్యేదేమిటి? గతేడాది కంటే ఈ ఏడాది పరిస్ధితి దిగజారుతుంది, వచ్చే ఏడాది గతేడాది మాదిరే వుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వున్నాం. మనకు ఆమోదం వున్నా లేకపోయినా మన పాలకులు మన దేశాన్ని ప్రపంచీకరణ రైలు ఇంజనుకు బోగీగా తగిలించారు. అందువలన దాని నడతను బట్టే మన పరిస్ధితీ వుంటుంది. గీతా గోపీనాధ్‌ చెప్పినట్లు రాబోయే రోజుల్లో పరిస్ధితిలో పెద్దగా మార్పు వుండదంటే మూడు సంవత్సరాలలో కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే ఈ మే డే సందేశం.

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. మిగతా చోట్ల మిగిలిన దశ ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్‌ ముగిసిన చోట ఓటరు తీర్పు రిజర్వు అయింది. అందువలన భావోద్వేగాలను పక్కన పెట్టి వుద్యోగులు, కార్మికులు ఆలోచించటం అవసరం. ఈ ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో వుపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరిగాయి. చిత్రం ఏమిటంటే రెండు చోట్లా అధికారపార్టీతో అంటకాగిన వుపాధ్యాయ నేతలు మట్టి కరిచారు. గత ఐదు సంవత్సరాలుగా వారు ఆయా ప్రభుత్వాల మీద కల్పించిన భ్రమలు టీచర్లు, గ్రాడ్యుయేట్లలో తొలగిపోతున్నాయనేందుకు ఇదొక సంకేతం. వుద్యోగులు, వుపాధ్యాయుల్లో ఏడాది కేడాది నూతన పెన్షన్‌ స్కీం అమలయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పధకాన్ని ప్రవేశపెట్టి, అమలు జరిపిన పార్టీలు కూడా దానిని రద్దు చేస్తామని ఎన్నికల ఆపదమొక్కులు మొక్కుతున్నాయి. వాగ్దానాలు చేసిన పార్టీలు లేదా వాటికి మద్దతు పలికిన వుద్యోగ సంఘాల నేతలు గానీ అధికారంలో వున్నపుడు కొత్త పెన్షన్‌ స్కీము రద్దు చేసి పాతదానిని ఎందుకు పునరుద్దరించలేదో సంజాయిషీ ఇవ్వాలి, వుద్యోగులు నిలదీయాలి.

ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతున్న నయా వుదారవాద విధానాలు మొత్తంగా జనాన్ని భ్రమలకు గురి చేస్తాయి. అలాంటపుడు శ్రమ జీవులు దానికి అతీతంగా ఎలా వుంటారు. అందుకే ఆశల పల్లకిలో వున్న వారు కుదుపుకు గురైతే తట్టుకోలేరు. ఎప్పుడు వుద్యోగాలు వూడతాయో తెలియదు. ఏటా రెండు కోట్ల వుద్యోగాలను కల్పిస్తాన్న నరేంద్రమోడీ వాగ్దానాన్ని జనం నమ్మారు. కొత్తవాటి సంగతి దేవుడెరుగు వున్న వుద్యోగాలే వూడుతున్నాయన్నది వాస్తవం. ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త , మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

Image result for may day india citu

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన వృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న. వుపాధి రహిత అభివృద్ధి వుద్యోగుల, కార్మికుల బేరసారాలాడే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించే డిఏను వుద్యోగులకు నష్టదాయకంగా ఆరునెలలకు చేస్తే సంఘాలేమీ చేయలేకపోయాయి. కారుచౌకగా పనిచేసేందుకు సిద్దం సుమతీ అంటున్నవారు క్యూకడుతున్న కారణంగానే పర్మనెంటు వుద్యోగాల స్ధానంలో కాంట్రాక్టు, పొరుగు సేవల పేరుతో తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటున్నారు. ఒకే పనికి ఒకే వేతనం అన్న సహజన్యాయం అన్యాయమై పోతోంది. దీనికి వ్యతిరేకంగా వుద్యో గులు, నిరుద్యో గులూ ఐక్యంగా పోరాడకపోతే రేపు వుద్యోగుల మీద జరిగే దాడిని అన్యాయం అనేవారు కూడా మిగలరు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును ప్రవేశపెట్టినపుడు అప్పటికే వుద్యోగాల్లో వున్న తమకు అది వర్తించదు కదా అని వుద్యో గులు పట్టించుకోలేదు, అసలు వుద్యోగాలు లేనపుడు ఏదో ఒకటి అని నిరుద్యోగులు ఆలోచించలేదు. తీరా కొత్త పెన్షన్‌ స్కీములో చేరిన కొత్తవుద్యో గులకు రోజులు గడిచే కొద్దీ జరిగే నష్టం ఏమిటో అర్ధం అయింది. ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.

ఏడాది క్రితం అమెరికన్లు చైనా, ఇతర దేశాలతో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కారణంగా గతేడాది అక్టోబరు నుంచి ఐఎంఎఫ్‌ మూడు సార్లు ప్రపంచ అభివృద్ధి అంచనాలను తగ్గించింది. అమెరికన్లు వాణిజ్య యుద్ధాన్ని ఒక్క చైనాకే పరిమితం చేయటం లేదు. ఐరోపా యూనియన్‌ నెదర్లాండ్స్‌లోని ఎయిర్‌ బస్‌ విమాన కంపెనీకి అనుచితంగా సబ్సిడీలు ఇస్తున్నందున తమ దేశంలోని బోయింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చాలా కాలంగా అమెరికన్‌ కార్పొరేట్లు గుర్రుగా వున్నాయి. ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై 11బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి పన్నులు విధిస్తాంటూ ఏప్రిల్‌ పదిన డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్దంలో కొత్త రంగాన్ని తెరిచాడు. బోయింగ్‌ కంపెనీకి ఇస్తున్న సబ్సిడీల సంగతి తాము తేలుస్తామంటూ ఐరోపా యూనియన్‌ ప్రతిసవాల్‌ చేసింది. ట్రంప్‌ జపాన్‌ మీద కూడా దాడి ప్రారంభించేందుకు పూనుకున్నాడు. భారత్‌తో సహా వాణిజ్య లోటు వున్న ప్రతిదేశం మీద అమెరికా దాడి చేసేందుకు పూనుకుంది. అంటే బలవంతంగా తన వస్తువులను కొనిపించే గూండాయిజానికి పాల్పడుతోంది. ఇది ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలకు పూనుకొనేట్లు చేస్తోంది, కొత్త వివాదాలను ముందుకు తెస్తోంది. ముందే చెప్పుకున్నట్లు ఏ దేశానికి ఆదేశం తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు పూనుకోవటం అంటే జనం మీద భారాలు మోపటం, వున్న సంక్షేమ చర్యలకు మంగళం పాడటమే. ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల వుద్యమం ప్రతి శనివారం ఏదో ఒక రూపంలో జరుగుతోంది, ఇలాగే అనేక దేశాల్లో కార్మికవర్గం నిరసన తెలుపుతోంది. వేగంగా పెరుగుతున్న సంపద అంతరాలు వుద్యమాలు, విప్లవాలకు దారి తీస్తాయన్న హెచ్చరికలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు.

ప్రపంచంలో ప్రస్తుతం 66దేశాల్లో మేడే రోజున ప్రభుత్వాలు సెలవులు ఇస్తున్నాయి. ఇది కార్మికవర్గ విజయం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే మెజారిటీ దేశాలలో సెలవు లేదంటే దాన్నే సంపాదించలేని కార్మికవర్గం దోపిడీని అంతం చేయాలంటే ఇంకా ఎంతో చేయాల్సి వుందన్నది స్పష్టం. సెలవు వున్న దేశాల్లో కూడా కార్మికవర్గంలో కొన్ని అపోహలు, అవాంఛనీయ ధోరణులు వున్నాయి.

Image result for may day

ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, బ్యాంకు, మార్కెటింగు, విత్త కంపెనీల కార్యకలపాలు నిర్వహించే వుద్యోగులు ఇప్పటికే తాము కార్మికులని అనుకోవటం మానేశారు. కంపెనీ క్యాబుల్లో పని ప్రదేశాలకు వెళుతూ మహానగరాలలో పని చేసే ఐటి కంపెనీలు, వాటి అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే వారు తమది ప్రత్యేక తరగతి అనుకుంటున్నారు. ఆ లెక్కన సంప్రదాయ భాష్యం ప్రకారం అసలు కార్మికులు ఎందరు ? ఎవరు? ఇప్పటికీ కార్మికులం అని భావించే అనేక మందికి మేడే ఒక వుత్సవం. మరి కొంత మందికి ఆ రోజు దీక్షా దినం. వుత్సవానికి, దీక్షా దినానికి తేడా ఏమిటి ?

మేడేను వుత్సవంగా జరిపినా, దీక్షా దినంగా పాటించినా కార్మికుల బతుకులు ఆదివారం నాడు అరటి మొలచింది…. శనివారం నాడు పాపాయి చేతికి పండు వచ్చిందన్నంత సులభంగా మారటం లేదు, మారవు అని గమనించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి.

Image result for may day haymarket

ప్రతి ఏడాదీ చెప్పుకొనేదే అయినప్పటికీ కొత్త తరాలు వస్తుంటాయి గనుక ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. చాలా మంది మే డే అంటే ఎర్రజెండా పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. మన దేశంతో సహా అనేక చోట్ల కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. అనేక డిమాండ్లను యజమానుల ముందుంచాయి. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటిపై స్పందన లేకపోవటంతో కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచేందుకు పూనుకుంది.దానిపై చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు మే నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. సంఖ్య ఇప్పటికీ తెలియదు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మినేతలను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో శిక్షలను ఖరారు చేశారు. 1887 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for may day haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని, ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ముఖ్య అనుచరుడైన నారాయణ్‌ మేఘాజీ లోఖాండే. ఒక జర్నలిస్టు, ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, అప్పటికి కమ్యూనిస్టు వాసనలు మన దేశంలో లేవు. బొంబాయి వస్త్ర మిల్లు కార్మికుల పని పరిస్థితులను చూసి చలించిపోయిన ఆ జర్నలిస్టు జ్యోతిబా పూలే సహకారంతో 1880 నుంచీ కార్మికులను సంఘటిత పరిచేందుకు పూనుకున్నాడు.1884లో మిల్లు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. యజమానుల ముందుంచిన వారి ప్రధాన కోరికలు ఇలా వున్నాయి. కార్మికులకు వారానికి ఒకరోజు ఆదివారం నాడు సెలవు ఇవ్వాలి.ప్రతి రోజు మధ్యాహ్నం అరగంట పాటు విరామం కల్పించాలి. మిల్లులను వుదయం ఆరున్నర గంటలకు ప్రారంభించి సూర్యాస్తమయానికి మూసివేయాలి.కార్మికుల వేతనాలు ప్రతినెల పదిహేనవ తేదీన చెల్లించాలి. ఇదే సమయంలో చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని కోసం డిమాండ్‌ చేస్తే బొంబాయి కార్మికులు పన్నెండు గంటల పని డిమాండ్‌ చేశారంటే ఇంకా ఎక్కువ గంటలు పని చేసే వారన్నది స్పష్టం.

ప్రపంచాన్ని వూపి వేస్తున్న ఐటి, దాని అనుబంధ కార్యకలాపాలు, వివిధ టెక్నాలజీలలో శిక్షణ పొంది పరిశ్రమలలో పని చేస్తున్న ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కార్మికులు కారా? యజమానులైతే కాదు, కనుక వారిని ఏ పేరుతో పిలవాలి. తెల్లచొక్కాల వారు కార్మికులు కాదా ? వారిని ఎలా సమీకరించాలి? ఇలాంటి ప్రశ్నలు వారినే కాదు, కార్మికవర్గాన్ని సమీకరించి దోపిడీ లేని నూతన సమాజాన్ని స్ధాపించాలని పని చేస్తున్న కమ్యూనిస్టు, సోషలిస్టు శక్తులన్నీ పరిష్కరించాల్సినవే. యాజమాన్యం తరఫు విధులు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా వుత్పాదన, సేవలలో నిమగ్నం కాని సిఇఓ, డైరెక్టర్‌ వంటి వున్నత పదవులలో వున్నవారు తప్ప, ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని ఏదైనా ఒక వుత్పత్తి, సేవలలో భాగస్వామి అయిన ప్రతి వారూ కార్మికులే. వారు ఐటి నిపుణుడు, బ్యాంకు అధికారి, గుమస్తా, ఫ్యాక్టరీ ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, జర్నలిస్టు, ప్రతిఫలం తీసుకొనే రచయిత ఇలా ఎవరైనా కావచ్చు. కొంత మంది వుత్పాదక, సేవల విలువ ఎక్కువ మొత్తంలో వుంటుంది కనుక ఆ రంగాలలో పని చేసే వారు పెద్ద మొత్తంలో వేతనంలో పొందినంత మాత్రాన కార్మికులు కాకుండా పోరు. ఆచరణలో అలాంటి వారంతా తాము కార్మికులం కాదనుకుంటున్నారు. వారిని ఆ భావజాలం నుంచి బయటకు తెచ్చి సమీకరించకుండా కార్మికవర్గ పార్టీలు ఎలా ముందుకు పోతాయన్నది ప్రశ్న. దోపిడీ వర్గం సంపదల సృష్టితో పాటు తమను అంతం చేసే కార్మికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేస్తుందన్నది చరిత్ర సారమని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పారు. బానిస యజమానులను బానిసలు, భూస్వాములను వ్యవసాయ కార్మికులు అంతం చేయటం గత చరిత్ర. పెట్టుబడిదారులను పారిశ్రామిక కార్మికులు అంతం చేయటం భవిష్యత్‌ చరిత్ర. అందుకే దోపిడీదారులు తమ హక్కులను అడగని కార్మికులను ప్రోత్సహిస్తారు, అడిగేవారిని అంతం చేసేందుకు చూస్తారు. తాగి తందనాలాడేందుకు డబ్బిచ్చి మరీ ప్రోత్సహించే యజమానులు, కార్మిక సంఘాన్ని పెట్టుకుంటే తొలగించటం, వేధించటం అందుకే.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోషలిస్టు శక్తులు సాధించిన విజయాలతో మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయి. పాలకపార్టీ ఒక కార్మిక సంఘాన్ని ప్రోత్సహించింది. మరోవైపున 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీ పద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం. అందుకే మే డేను వుత్సవంగా జరుపుకోవటం గాక దీక్షా దినంగా పాటించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d