• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

పేనుకు పెత్తనం – నరేంద్రమోడీకి అధికారం !

14 Saturday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Excise Duty & VAT on Oil, Narendra Modi 2.0, Price Build-up of Petrol

Image result for narendra modi authoritarian

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా ఒక్కసారిగా చమురు ధరలు 30శాతం వరకు పతనమయ్యాయి. ఒక్క మంత్రి లేదా సామాజిక మాధ్యమంలో ఒక్క బిజెపి కార్యకర్తగానీ ఈ మేరకు వినియోగదారులకు ధరలు తగ్గుతాయి అని చెప్పటం లేదు. గతంలో చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్దం ప్రారంభం కాగానే దాన్ని మనకు అనుకూలంగా మలచుకుంటామని కబుర్లు చెప్పారు. అదేమిటో ఎక్కడా చెప్పరు. కానీ జరుగుతున్నదేమిటి ? ధరలను మరింతగా పెంచారు. దానిలోకి వెళ్లే ముందు అసలేం జరుగుతోందో చూద్దాం.
2013 సెప్టెంబరు 16న మనం దిగుమతి చేసుకొనే రకం చమురు ధరలు, పన్నుల వివరాలు ఇలా ఉన్నాయి
పీపా ధర రూ. 117.58 డాలర్లు.
డాలరుకు రూపాయి విలువ 66.02.
చమురు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రూ.50.02
డీలర్లకు విక్రయించిన ధర              రూ.52.15
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ   .9.48
డీలర్‌ కమిషన్‌                             రూ. 1.79
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం            రూ.12.68
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ. 76.10
2020 మార్చి 14న వివరాలు
డీలర్లకు విక్రయించిన ధర              రూ.28.50
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ.22.98
డీలర్‌ కమిషన్‌                              రూ. 3.54
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం           రూ.14.85
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ.69.87
నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా రూపాయి విలువ ఎలా పతనమైందో దిగువ వివరాలు ఉన్నాయి.ఇప్పుడు 74 రూపాయలకు పతనమైంది. అదే పతనం కానట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పడిపోయిన కారణంగా డీలర్లకు విక్రయించే ధర ఇంకా తగ్గి ఉండేది. వినియోగదారులకు ఇంకా చవకగా అంది వుండేది. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పన్ను మొత్తాన్ని రూ.9.48 నుంచి రూ.22.98కి పెంచింది. అదే లేనట్లయితే డీలరు కమిషన్‌ పెంచినా పెట్రోలు రూ.56.37కు వచ్చి ఉండేది.
చమురు ధరలను గణనీయంగా తగ్గించాల్సిన పెద్ద మనిషి శనివారం నాడు పెట్రోలు మీద రూ.19.98గా ఉన్న ఎక్సయిజ్‌ పన్నును రూ.22.98కి పెంచారు. ఈ పెంపుదల దూరదృష్టితో చేసినదని, ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న ద్రవ్య స్ధితిలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వనరులు అవసరమని ఒక అధికారి సన్నాయి నొక్కులు నొక్కారు. గడచిన నాలుగు మాసాల్లో చమురు ధరలు తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకే గణనీయంగా పోయిందని సమర్ధించుకున్నారు. అంటే తగ్గిన మొత్తాన్ని వినియోగదారులకు బదలాయించకూడదన్నది మోడీ సర్కార్‌ విధానం అన్నది స్పష్టమైంది.పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికేసిందన్నది సామెత. మంచి రోజులను తెస్తానని చెప్పిన నరేంద్రమోడీకి అధికారమిస్తే చేసినదాన్ని ఏమనాలి?
మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము. 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు, 2020 మార్చి 13వ తేదీన పీపా ముడి చమురు ధర రూ.2,342 గా ఉంది. ఇదే రోజు రూపాయి విలువ 73.74గా ఉంది.నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఆయన సమర్ధత కారణంగా ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు మన కరెన్సీ విలువ పెరిగి వుంటే చాలా చవకగా పెట్రోలు, డీజిలు అందుబాటులోకి వచ్చి ఉండేది. ఒక పీపాలో ముడి చమురు 159 లీటర్లు ఉంటుంది. దాన్నుంచి 73 లీటర్ల పెట్రోలు, 36 లీటర్ల డీజిల్‌,20 లీటర్ల కిరోసిన్‌ లేదా విమాన ఇంథనం, ఆరు లీటర్ల ప్రొపేన్‌, 24 లీటర్ల ఇతర ఉత్పత్తులు వస్తాయి. ఇవి రావటానికి ముడి చమురుకు ఇతర ఉత్పత్తులను జత చేయాల్సి ఉంటుంది. ఒక పీపా నుంచి ఒక వంద లీటర్లు పెట్రోలు, డీజిల్‌ అనుకుంటే ఇతర ఉత్పత్తుల మీద వచ్చే ఆదాయం శుద్ధి చేసిన ఖర్చుకు పోతుంది అనుకుంటే మోడీ గారి పన్ను బాదుడు లేనట్లయితే చాలా తక్కువకు జనం పొంది ఉండేవారు. అది మిగతా వస్తువుల ధరలను కూడా తగ్గించేందుకు దోహదం చేసి ఉండేది.
మోడీ సర్కార్‌ ఇతర అన్ని రంగాలలో విఫలమైందని అనేక అంశాలు నిరూపించాయి. మన ఎగుమతులతో జనానికి కలిగిన లబ్ది ఏమిటో తెలియదు గానీ దిగుమతుల్లో సింహభాగమైన ముడిచమురును ఒక ఆదాయవనరుగా మార్చుకొని వినియోగదారులను ఎలా లూటీ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ లూటీ అనే పెద్దమాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మోపిన పన్ను భారాన్ని జన సంక్షేమానికి ఖర్చు చేయలేదన్న కారణంగానే.
పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వానికి పదకొండు రకాల ఖాతాల నుంచి గణనీయ మొత్తంలో ఆదాయం వస్తోంది.2014-15లో అంటే మోడీ సర్కార్‌ తొలి ఏడాదిలో వచ్చిన ఆదాయ మొత్తం రూ.1,72,065 కోట్లు, అది 2018-19 నాటికి రూ. 3,48,041 కోట్లకు పెరిగింది, రెట్టింపైంది. ఇదే కాలంలో ఈ మొత్తంలో ఎక్సైజ్‌ పన్ను రూ.99,068 కోట్ల నుంచి రూ 2,14, 369 కోట్లకు పెరిగింది( ఒక ఏడాది రూ 2,42,691 కోట్లు వచ్చింది), అంటే దీని పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.Image result for narendra modi authoritarian
బిజెపి మరుగుజ్జులు ఈ లూటీని తక్కువ చేసి చూపేందుకు చమురు ధరల పెరుగుదలకు రాష్ట్రాలు విధించే వ్యాట్‌ (పన్ను) కారణమని తప్పుడు ప్రచారం చేస్తారు. రాష్ట్రాలు కూడా పన్ను వేస్తున్నాయి, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్‌టిలోకి తెచ్చి తమ ఆదాయాన్ని పూడ్చాలని రాష్ట్రాలు చేస్తున్న వినతిని కేంద్రం పట్టించుకోవటం లేదు. దీని వెనుక రెండు కారణాలు ఒకటి జిఎస్‌టి పద్దతిని అమలు జరిపితే రాష్ట్రాలకు పంచకుండా దొడ్డిదారిన పన్నులు వేసి తన బొక్కసానికి చేర్చుతున్న మొత్తాన్ని కేంద్రం కోల్పోవాల్సి ఉంటుంది. రెండవది రాష్ట్రాలకు తగ్గిన మేరకు ఆదాయాన్ని పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలు వ్యాట్‌తో సహా ఆరు రకాల ఖాతాల ద్వారా పొందిన ఆదాయం రూ.1,60,554 నుంచి రూ.2,27,591 కోట్లు ఉంది, దీనిలో వ్యాట్‌ పెరుగుదల రూ.1,37,157 నుంచి రూ.2,01,265 కోట్లు మాత్రమే. కేంద్రం మోపిన భారం ఎక్కువన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మామాా అల్లుళ్ల బడ్జెట్ల మతలబు ఏమిటి !

08 Sunday Mar 2020

Posted by raomk in Current Affairs, Economics, History, Opinion, Others, Telangana

≈ Leave a comment

Tags

T Harish Rao, Telangana Budget 20-21, Telangana CM

Image result for harish rao budget

ఎం కోటేశ్వరరావు
రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత గత బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రవేశపెడితే వచ్చే ఏడాది బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి టి హరీష్‌ రావు ప్రవేశపెట్టారు. వారిద్దరూ మేనమామ-మేన అల్లుళ్లన్న సంగతి తెలిసిందే. ఇద్దరి బడ్జెట్లకు ఏమైనా తేడా ఉందా ? రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అన్నది ఒక్కసారి విహంగ వీక్షణం చేద్దాం.
ఆర్ధిక మంత్రులు అంటేనే అంకెల గారడీ ఆటగాళ్లు. ఈ వర్ణనలో కొత్త దనం ఏమీ లేదు గానీ గారడీ జరిగిందనే చెప్పాలి. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేయాల్సి వస్తే బడ్జెట్‌లో పెరుగుదల పెద్దగా లేదు. ఖర్చు చూస్తే గతం కంటే తగ్గిందన్న పచ్చినిజాన్ని చెప్పకతప్పదు. గతేడాది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో 1,82,017 కోట్ల రూపాయలను ప్రతిపాదిన కెసిఆర్‌ తరువాత వాస్తవ బడ్జెట్‌ పేరుతో 1,46,492 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ఆ మొత్తాన్ని 1,42,152 కోట్లుగా సవరించిన అంచనాగా పేర్కొన్న హరీష్‌ రావు తన బడ్జెట్‌ 1,82,914 కోట్లుగా ప్రతిపాదించారు. దీనిలో వాస్తవంగా ఎంత ఖర్చు చేస్తారో ఏడాది తరువాత గానీ తెలియదు.2018-19 సంవత్సర బడ్జెట్‌ను 1,74,454 కోట్లుగా ప్రతిపాదించి దాన్ని 1,61,223 కోట్లకు సవరించారు, దాన్నింకా సవరించి తాజా తాత్కాలిక లెక్కల ప్రకారం ఖర్చు చేసిన మొత్తం 1,57,150 కోట్ల రూపాయలు. అందువలన మార్చినెలతో ముగిసే బడ్జెట్‌ ఖర్చు 1,42,152 కోట్ల కంటే తక్కువే ఉంటుంది తప్ప పెరిగే అవకాశం లేదు. అంటే అంతకు ముందు ఏడాది కంటే కనీసం 20వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గిపోయినట్లే. ఇది అభివృద్ధి అని పాలకులకు అనుగుణ్యంగా ఎవరైనా పొగడకపోతే సన్నాసుల భాష రంగంలోకి వస్తుంది.
తగ్గింపు, కోతలు దేనికి ఉంటాయంటే సంక్షేమ కార్యక్రమాలకు పెడితే జనం ఓట్లు వేయరు గనుక ఆస్ధుల సృష్టికి తోడ్పడే పెట్టుబడి వ్యయాలకు కోత పెడుతున్నారు. అది ఎంతకాలం అంటే ఎంతకాలం సాగితే అంతకాలం .2017-18లో పెట్టుబడి వ్యయం ఖరారైన లెక్కల ప్రకారం రూ.57,768 కోట్ల రూపాయలైతే, తరువాత అది గణనీయంగా పడిపోయింది. 2018-19 బడ్జెట్‌ అంచనా రూ.48,999 కోట్లు కాగా సవరించిన మొత్తం రూ.42,196 కోట్లు, 2019-20 బడ్జెట్‌ ప్రతిపాదన రూ.35,436 కోట్లు కాగా సవరించిన ఖర్చు రూ.13,165 కోట్లు మాత్రమే. అయినా వచ్చే ఏడాది దాన్ని రూ.22,061 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే రాబోయే సంవత్సరం కూడా కాంట్రాక్లర్ల నుంచి ప్రజాప్రతినిధులు కమిషన్లు పొందే అవకాశాలు మరింత తగ్గిపోతాయనే చెప్పాలి. ఎన్నికల్లో వారు పెట్టిన పెట్టుబడులను రాబట్టుకొనేందుకు ఏ ఇతర మార్గాలు వెతుక్కుంటారో చూడాలి. నిధులు లేకపోతే పనులు జరగవు, కాంట్రాక్టర్లు ఉండరు, కమిషన్లు ఉండవు. సంక్షేమ పధకాలకు కేటాయిస్తున్నందుకు సంతోషించాలా, ఆస్ధుల కల్పన నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసించాలా ?
రాబడులు పరిమితం అయి, పెట్టుబడి వ్యయాన్ని మరింతగా కుదించిన తరువాత సంక్షేమ పధకాలకే కోత. రెండు పడక గదుల ఇండ్ల గురించి కొండంత రాగం తీసిన కెసిఆర్‌ ఆచరణలో వైఫల్యం కావటానికి కారణమిదే. అందుకే ఈ బడ్జెట్‌లో కూడా స్వంత ఇంటి స్ధలం ఉన్నవారిని కట్టుకొనేందుకు ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. లేని వారికి ఇండ్ల స్ధలం ఎందుకు ఇవ్వరు ? అయితే పెట్టుబడి వ్యయం బడ్జెట్‌ కేటాయింపుల్లో తగ్గుతున్నప్పటికీ నీటి పారుదల మరికొన్ని రంగాలలో అప్పులు తెచ్చి పెట్టుబడి వ్యయంగా ఖర్చు పెడుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులకు వడ్డీ చెల్లింపు ఉండదు, బయటి నుంచి తెచ్చే అప్పులకు వడ్డీ అదనం. ఇది వినియోగదారుల మీద లేదా అంతిమంగా ప్రభుత్వం మీద భారంగా మారనుంది. ఈ ధోరణి పెరిగితే రాబోయే రోజుల్లో వినియోగ చార్జీల మోత మోగటం లేదా ఎత్తి పోతల వంటి పధకాలు నామమాత్రం కావటం లేదా మూతపడటం తప్ప మరొక మార్గం ఉండదు.
స్వంత డబ్బా కొట్టుకోవటంలో పాలకులకు మించిన వారు మరొకరు ఉండరు. తెలంగాణా అందుకు మినహాయింపు కాదు, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామంటారు. కొన్ని కీలక రంగాలలో కేటాయింపులే తక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు గ్రామీణాభివృద్ధిని తీసుకుంటే 2019-20 బడ్జెట్‌లో కేటాయింపు 3.5శాతం అయితే అంతకు ముందు సంవత్సరంలో వివిధ రాష్ట్రాల సగటు 6.1శాతంగా ఉంది.ఇదే విధంగా విద్యకు 7.5 అయితే రాష్ట్రాల సగటు 15.9, ఆరోగ్యానికి 4శాతం అయితే రాష్ట్రాల సగటు 4.5శాతంగా ఉంది. పెన్షన్ల వంటి వాటికి అదనంగా ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణా ఒకటి.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. హరీష్‌ రావు ప్రసంగంలో చెప్పినదాని ప్రకారం గత ఐదు సంవత్సరాలలో స్వంత రాబడి సగటు పెరుగుదల రేటు 21.5శాతం ఉంటే ఫిబ్రవరి నెలలో 6.3శాతానికి పడిపోయింది. ఈ పూర్వరంగంలో వచ్చే ఏడాది బడ్జెట్‌ లోటును రూ.33,191 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని పూడ్చుకోవాలంటే ఉన్న అవకాశాలేమిటి? అప్పులు తీసుకురావటం, కెసిఆర్‌ చెప్పినట్లు విద్యుత్‌ ఛార్జీలు, మరోసారి ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపు, ఇంకా తన పొదిలో ఏమున్నాయో తెలియదు. మరో మార్గం ప్రభుత్వ ఆస్తులు అవి భూములు లేదా మిగిలిన ప్రభుత్వరంగ సంస్దల అమ్మకం వలన గానీ రాబట్టుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాని ప్రకారం పన్ను ఆదాయాన్ని 71వేల కోట్ల నుంచి 85వేల కోట్లుగానూ, పన్నేతర ఆదాయం 12 నుంచి 30వేల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఈ మొత్తాలను పైన పేర్కొన్న వనరుల నుంచి సేకరిస్తారు. ఇప్పటికే తెలంగాణాలో జనం తప్పతాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వారి నుంచి ఈ ఏడాది రూ.12,600 కోట్లను రూ.16,000 కోట్లకు పెంచనున్నారు. ఇది తాగుడును మరింతగా పెంచటం లేదా మద్యం రేట్లను పెంచటంద్వారాగానీ రాబడతారు.
ఇక వృద్ది విషయానికి వస్తే ప్రభుత్వం చెబుతున్న సీన్‌ కనిపించటం లేదు. 2016 మార్చి నుంచి 2019 మార్చినెల వరకు మూడు సంవత్సరాలలో జిఎస్‌డిపి వృద్ధి రేటు వ్యవసాయం, వస్తూత్పత్తి, సేవారంగాలలో 14,2,14.3,15శాతాల చొప్పున ఉంది. వ్యవసాయ రంగంలో 17.3 నుంచి 10.9శాతానికి పడిపోయింది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ఆ రంగంలో దిగజారుడు ఆందోళన కలిగించేదే.

Image result for harish rao budget
రుణభారం ఏటేటా పెరుగుతున్నది. 2017-18లో అన్ని రకాల ప్రభుత్వ రుణాల మొత్తం రూ. 1,52,190 కోట్లు కాగా 2020-21నాటికి ఆ మొత్తం 2,29,205 కోట్లుగా చూపారు. ఇవి గాక మిషన్‌ కాకతీయ, భగీరధ వంటి పధకాలకు తీసుకున్న అప్పులు మరో 40వేల కోట్లు అదనం. ఇతర సంస్దలు తీసుకున్నవాటిని కూడా చేర్చితే ఇంకా పెరుగుతాయి. దీనికి అనుగుణ్యంగానే చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా పెరుగుతుంది. వివిధ పధకాలకు కేటాయింపులు ఘనంగా జరిపినా చివరికి వాటిలో ఖర్చు చేసేదెంత అన్నది ప్రతి బడ్జెట్‌లోనూ ప్రధానమైన ప్రశ్నగా ముందుకు వస్తున్నది. ఆదాయరాబడి గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు గనుక ఈ బడ్జెట్‌కు అదే ప్రశ్నను మరింత గట్టిగా వేయాల్సి ఉంటుంది.
భజన చేయు విధము తెలియండీ భక్తులారా అన్నట్లుగా రెండు బడ్జెట్లకు కొట్టచ్చినట్లు కనిపించే మార్పు ఏమంటే కెసిఆర్‌ భజన. గత బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మామ తన గురించి తాను పొగడుకోలేరు. దాన్ని భర్తీ చేయాలి, గనుక ఈ ఏడాది గవర్నర్‌ ప్రసంగంలో , ఆర్ధిక మంత్రి ప్రసంగంలోనూ అసలు, వడ్డీతో సహా భజన చేయించుకున్నారు. బడ్జెట్‌ ప్రసంగ పాఠం 79 పేజీల్లోనూ అంతకంటే ఎక్కువగానే కెసిఆర్‌ను ఆకాశానికి ఎత్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ -ట్రంప్‌ ఉల్లాసాన్ని దెబ్బతీసిన ఢిల్లీ ‘పధకం’ !

01 Sunday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Delhi violence, Donald trump, Donald Trump India tour, Narendra Modi

Image result for delhi planned violence spoils modi-trump party

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ అనుకున్నదొకటీ, అయింది ఒకటి. కొన్ని సందర్భాలలో ఎవరి పథకాలు, ఎత్తుగడలు వారినే దెబ్బతీస్తాయి. మోడీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా రెండు రోజుల పర్యటన జరిపి వెళ్లారు. ఆ పెద్దమనిషి ఢిల్లీలో ఉండగానే జరిపించిన, జరిగిన ఘటనలతో కాషాయ దళాల ముసుగు మరింతగా తొలిగింది, చాలా దగ్గరగా అనేక మంది వారిని చూడగలిగారు. దొంగకే తాళాలు ఇస్తే దొంగతనాలు ఆగిపోతాయని అనేక మంది భ్రమపడినట్లే మతోన్మాదులకే అధికారమిస్తే మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా బతకవచ్చు అనుకున్నవారికి కూడా ఢిల్లీ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మత ఘర్షణల చరిత్రను చూసినపుడు అవి ఎన్నడూ వాటంతట అవి పుట్టలేదు, ఎక్కడో ఒక దగ్గర రూపొందించిన పథకాలతోనే జరిగాయి. లేదా ఎక్కడైనా అనుకోకుండా జరిగిన ఘటనలను ఉపయోగించుకొనేందుకు సిద్దంగా ఉన్న వారు చెలరేగిపోయినపుడు తలెత్తాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందునుంచీ బిజెపి నేతల రెచ్చగొట్టుడు తీరు తెన్నులు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో అని అనేక మంది భయపడ్డారు. దానికి అనుగుణ్యంగానే అనేక మంది అనుమానిస్తున్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన అపర ‘జాతీయ వాదులు లేదా దేశ భక్తులు ‘ ఈశాన్య, తూర్పు ఢిల్లీలో జరిపిన హింసాకాండను చూశాము. దాన్ని ప్రతిఘటించే క్రమంలో కూడా కొందరు బలై ఉంటారు. హింసాకాండ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి మురళీధర్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేసిన తీరుతో హింసాత్మక శక్తులను రక్షించేందుకు కేంద్ర పాలకులు ఎంతకైనా తెగిస్తారని అనేక మందికి ఎవరూ చెప్పకుండానే అర్ధం అయింది. దీన్నుంచి తేరుకోక ముందే శుక్రవారం నాడు రికార్డు స్ధాయిలో స్టాక్‌ మార్కెట్‌ పతనం, వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మూడవ త్రైమాసిక అభివృద్ధి అంచనా 4.7శాతంగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి పొందిన ప్రశంసలతో కొద్ది రోజులు కాలక్షేపం చేద్దామని సంబరపడిన మోడీ పరివారాన్ని వెంట వెంటనే జరిగిన ఈ ఘటనలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలు దేశాన్ని ఎటు తీసుకుపోనున్నాయో, ఆర్ధిక సమస్యల నుంచి ఎలా బయటపడతామో తెలియని అయోమయంలో దేశం ఉంది.
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు భారతమాతాకి జై అనే పేరుతో వ్యాపింప చేస్తున్న ఒక పోస్టులోని అంశాలు ఇలా ఉన్నాయి.” బీజేపీ దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ఇప్పటి వరకు కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నాము, 1. జిఎస్‌టి,2.ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు 3. రామ మందిర్‌ 4.370ఆర్టికల్‌ రద్దు-5.( సిఎఎ)పౌరసత్వ సవరణ చట్టం,నోట్ల రద్దు.6. బినామీ చట్టం 7.కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం,8.త్రివిధ దళాల అధిపతి నియామకం (సీడీఎస్‌),ఇవన్నీ కేవలం సాంపిల్స్‌,మాత్రమే. ఇప్పటి నుంచి అసలు కథ . ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ 2020. రాబోయే రోజులో ఇంకా చాలా ఉన్నాయి.1. ఎన్‌ఆర్‌సి,2. యుసిసి(ఉమ్మడి పౌరస్మృతి), 3.ఆక్రమిత కాశ్మీర్‌,4. కుటుంబ నియంత్రణ చట్టం,5. జమిలి ఎన్నికలు,6. మత మార్పిడి నిరోధక చట్టం. ఇలా చాలా చాలా చేస్తాము, చేస్తూనే ఉంటాము .. దేశ క్షేమమే మా లక్ష్యం..దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం, సనాతన భారతీయత ధర్మ పరి రక్షణ కోసం చేయవలసినది చేస్తాము .. తనకు ….సంపదన మీద ఆశ లేదు …. అవినీతి సంపాదన పోతుందీ అన్న బెంగా లేదు, తన ప్రాణం మీద ప్రీతీ లేదు,ఉన్నది ఒకటే, ఇదీ..మన దేశం… నా దేశం.అంతే..ఉంటే ఉంటాం పోతే పోతాం..దేశానికి మేలు చేసే పోతాం.”
పైన పేర్కొన్న అంశాలలో ఏ ఒక్కటీ దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితిని మెరుగుపరచేది కాదు, ఉపాధిని పెంచేది కాదు, ఉద్యోగాలు ఇచ్చేదీ, ధరలు తగ్గించేదీ కాదు. వివాదాస్పద అంశాలతో సామాజికంగా అశాంతిని, విభజనను మరింతగా పెంచే భావోద్వేగ అంశాలు తప్ప దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచే చర్యలేవీ వాటిలో లేవు. గత ఆరు సంవత్సరాలలో కూడా చేసింది ఇదే. దేశ వృద్ధి రేటు గరిష్టంగా ఉన్న ఏడున్నరశాతం నుంచి ఏడేండ్ల కనిష్టానికి( ఐదుశాతానికి ) దిగజారింది. సామాజికంగా పరస్పరం అపనమ్మకాలు, విద్వేషాలు పెరిగాయి. అయినా ఇప్పటి వరకు నమూనా మాత్రమే, అసలైన అజెండా ముందుంది అంటూ కాషాయ దళాలు దేశాన్ని మరింతగా ఇబ్బందుల పాలు చేసే అజెండాను అమలు జరుపుతామని రెచ్చిపోతున్నాయి. భావోద్వేగాలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచే అంశాలేమీ వాటిలో ఉండవు.
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) దేశంలో చిచ్చు రేపింది. దీని వలన ఎవరికీ పౌరసత్వం పోదు కదా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంటూ కాషాయ దళాలు అమాయకంగా అడుగుతున్నాయి. దానివలన పౌరసత్వం పోతుందని ఎవరూ చెప్పటం లేదు. ఎన్‌ఆర్‌సి పేరుతో పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలన్న అంశంతో అసలు ఆందోళన ప్రారంభమైంది.సిఎఎ తరువాత ఎన్‌ఆర్‌సి అని చెప్పింది బిజెపి వారే. సిఎఎ ద్వారా ఎందరికి పౌరసత్వం కల్పించనున్నారో చెప్పండని బిజెపి వారిని ఎవరినైనా అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. పౌరసత్వం ఒకరు ఇచ్చేది కాదు, విదేశీయులకు ఏ గడ్డమీద అయినా పిల్లలు పుడితే అక్కడి పౌరులు కావటం అనేక దేశాలలో జన్మతహ: ఇస్తున్న హక్కు. మన దేశంలో పుట్టిన వారినే ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఈ విపరీత పోకడ ప్రపంచంలో ఎక్కడా లేదు. గత 70సంవత్సరాలుగా పౌరసత్వం రాని లక్షలు, కోట్లాది మందికి మందికి పౌరసత్వం ఇవ్వనున్నామని కాషాయ దళాలు చెప్పటం మోసకారితనమే.
తాము మత ప్రాతిపదికన దాడులకు గురయ్యామంటూ మన దేశ పౌరసత్వాన్ని కోరుకున్న విదేశీయుల సంఖ్య కేవలం 31,313 మంది మాత్రమే అని వారిలో హిందువులు 25,447, సిక్కులు 5,807, క్రైస్తవులు 55, బౌద్దులు ఇద్దరు మాత్రమే అని ఇంటెలిజెన్స్‌ బ్యూరో గతేడాది వెల్లడించింది. వీరందరూ నిజంగా మత పరమైన దాడులకు గురయ్యారా లేక మన దేశం రావటానికి ఆ మార్గం అయితే సులువుగా వుంటుందని ఆ కారణాలు చెబుతున్నారో అన్నది కూడా అనుమానమే. అంటే సిఎఎ ద్వారా లబ్ది పొందేది వీరు మాత్రమే. సిఎఎ దీనికి మాత్రమే పరిమితం అయితే సమస్య లేదు, దాని కొనసాగింపుగా జాతీయ పౌరసత్వ జాబితా తయారు చేస్తామని దానిలో పౌరసత్వాన్ని నిరూపించుకొనే పత్రాలు ఇవ్వాలని చెప్పటమే అసలు అందోళనకు మూలం. నిజానికి సిఎఎ ద్వారా పొరుగుదేశాల్లో ఉన్న హిందువులు, ఇతర ముస్లిమేతర మైనారిటీల మీద దాడులకు, ఆయా దేశాల నుంచి తరిమి వేయాలని అక్కడి మతోన్మాదులను ప్రోత్సహించటమే. ఇక్కడి మతోన్మాదులను మైనారిటీల మీదకు ఉసిగొల్పే దుష్ట ఆలోచనే. ఒక వేళ ఎక్కడైనా అలాంటి దాడులు జరిగితే ఆయా ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి వాటిని ఆపాలి తప్ప మతం పేరుతో రాజకీయాలు చేయటం, ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొట్టటం అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు జరపటమే. దానికోసం దేశాన్ని బలిపెట్టాలా ?

Image result for delhi violence
ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలను వ్యతిరేకిస్తున్నది ఒక్క ముస్లింలే కాదు, హిందువులతో సహా అన్ని మతాల వారు వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఎన్‌ఆర్‌సితో తమను ఇబ్బందులు పెట్టాలన్న ఎత్తుగడ ఉందని భయపడుతున్న ముస్లింలు గత కొద్ది నెలలుగా బహిరంగంగానే ఆందోళన చేస్తున్నారు. బిజెపి అజెండాలో తొలి దాడి ముస్లింల మీద ఉంది కనుక వారు ముందుగా మేలుకొని వీధుల్లోకి వచ్చారు తప్ప ఆధారాలు సమర్పించలేని కోట్లాది మంది ఇతర సామాజిక తరగతుల్లో కూడా అలాంటి ఆందోళన లేకపోలేదు. దేశ విభజన సమయంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేక మంది మారిపోయారు గనుక వెంటనే ఒక పౌరజాబితాను తయారు చేయాల్సి వచ్చింది. తరువాత బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారి సమస్య కారణంగా అసోంలో జాబితాను తయారు చేయాల్సి వచ్చింది తప్ప మిగతా దేశానికి అవసరం ఏమిటి? అక్రమంగా వచ్చే వారిని నిరోధిస్తున్నారు లేదా శరణార్ధులుగా వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వాలా లేదా లేక వారిని పౌరసత్వం లేని పౌరులుగా గుర్తించి అనుమతించాలా అనేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. అలాగాక తలిదండ్రులు, తాతలతో సహా పుట్టిన ఆధారాలు సమర్పించి పౌరులని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనకు లేదు. కానీ పౌరజాబితా తయారీని అమలు జరపాలని ఆందోళన చేస్తున్నవారెవరు ? దాని వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి అమలు జరపాలనటానికి, జై శ్రీరామ్‌ నినాదాలతో పనేముంది ? ఈశాన్య ఢిల్లీలో జై శ్రీరాం పేరుతో చెలరేగిపోవటం, సిఎఎ వ్యతిరేక ఆందోళనను మత ఘర్షణలుగా మార్చటం వెనుక ఉన్నది ఎవరు ? వారు కూడా షాహిన్‌బాగ్‌ లేదా మరొక చోటో కూర్చొని శాంతియుత ఆందోళన చేసేందుకు అవకాశం ఉంది కదా ? లేదూ సిఎఎ వ్యతిరేకుల కుట్రే ఇది అని చెబుతున్న బిజెపి పెద్దలే ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న రాష్ట్రాలన్నింటా అధికారంలో ఉన్నారు. వారి పోలీసు, గూఢచార, కేంద్ర గూఢచార వ్యవస్ధలన్నీ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అందునా ట్రంప్‌ పర్యటనకు వస్తున్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ? అయినా స్వేచ్చగా అల్లరి మూకలు చెలరేగటం, ఢిల్లీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటాన్ని బట్టి సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేకులు, ప్రతిపక్షాల మీద నిందమోపే ఒక కుట్రలో భాగంగానే ఢిల్లీ పరిణామాలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు. అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ల నుంచి నేర్చుకున్న ఇలాంటి చావు తెలివి తేటలను ప్రయోగించి చూస్తున్నారు. ఒక ఆప్‌ కౌన్సిలర్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతను నిజంగా అల్లర్లను ప్రేరేపించాడా లేక రాజకీయంగా ఆప్‌ను దెబ్బతీసేందుకు తప్పుడు కేసు బనాయించారా అన్నది చెప్పలేము. పేలని తుపాకులు, కమ్యూనిస్టు సాహిత్యాన్ని పక్కన పడవేసి బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం లేదా విప్లవ సాహిత్యం పేరుతో కేసులు నమోదు చేయటాన్ని చూస్తున్న మనకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే.
గతేడాది అక్టోబరు రెండవ వారంలో చైనా అధిపతి గ్జీ జింపింగ్‌ మహాబలిపురం పర్యటనకు వచ్చారు, ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వచ్చారు. ఇద్దరినీ నరేంద్రమోడీ ఆహ్వానించారు. వారి పర్యటనల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాము. గ్జీ పర్యటన సాదాసీదాగా సాగింది, ట్రంప్‌ పరస్పర పొగడ్తలు, కౌగిలింతలు, అదిరింపులు, బెదిరింపులను యావత్‌ ప్రపంచం చూసింది. ఈ పర్యటనల్లో ఉన్న తేడాలు ఏమిటి ? అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. చైనాతో లోటులో ఉంది. మనకు గతంలో ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది అమెరికా, మనలను అభివృద్ది చెందిన దేశంగా పరిగణించి మరికొన్ని రాయితీలను రద్దు చేసింది. మనం ప్రతిగా విధించిన పన్నులను చూపి మన మీద బెదిరింపులకు దిగింది. తమ వస్తువుల మీద పన్నులు తగ్గించాలని, ఎక్కువగా కొనుగోలు చేయాలంటూ ట్రంప్‌ వత్తిడి తెచ్చారు, మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తమ దగ్గర నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను మరింతగా పెంచాలని, కోళ్ల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయకపోతే ఆలోచించాల్సి వస్తుందని బెదిరింపులతో కూడిన హెచ్చరికలు చేసి వెళ్లారు. అదే జింపింగ్‌ విషయానికి వస్తే నిర్దిష్ట అజెండా లేకుండానే వచ్చారు. రాబోయే రోజుల్లో మా వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ నరేంద్రమోడీ సర్కార్‌ సాధారణపద్దతుల్లోనే కోరింది తప్ప వత్తిడి, డిమాండ్ల రూపంలో వ్యవహరించలేదు. చైనా నేత బెదిరింపులకు దిగలేదు.
2018-19లో అమెరికాతో మన వాణిజ్య మిగులు 16.85 బిలియన్‌ డాలర్లు, తరువాత సంవత్సరంలో కూడా అదే ధోరణి కొనసాగింది. నిజానికి అమెరికాతో మన మిగులు నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ఘనత కాదు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో కూడా మన దేశం మిగుల్లోనే ఉంది. కొద్ది పాటి హెచ్చు తగ్గులు తప్ప దాదాపు గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఒకే మోస్తరులో ఉంది. ఇదే సమయంలో సంఘపరివార్‌ చైనాను ఎంతగా ద్వేషిస్తుందో దాని నేతగా ఉన్న నరేంద్రమోడీ హయాంలో వాణిజ్యంతో పాటు లోటు కూడా గణనీయంగా పెరిగిందన్నది చాలా మంది జీర్ణించుకోలేని అంశం. 2012లో మన దేశ వాణిజ్య లోటు చైనాతో 39.4 బిలియన్‌ డాలర్లు ఉంటే గతేడాది 74 బిలియన్‌ డాలర్లకు చేరింది.
ఈ కారణంగానే మన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని మనం చైనాను డిమాండ్‌ చేస్తుంటే తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయాలని అమెరికా మనలను డిమాండ్‌ చేస్తోంది. అమెరికా నుంచి కొన్ని వస్తువులను కొనుగోలు మన మీద అధిక భారం పడుతుంది. కోళ్లు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే వాటి మీద అమెరికా ఇచ్చే రాయితీలు, తక్కువ ధరల కారణంగా మన కోళ్ల, పాడిపరిశ్రమ మీద ఆధారపడిన దాదాపు పది కోట్ల మంది రైతాంగం, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఈ రంగాలలో మనం సాధించిన స్వయం పోషకత్వం పోయి పరాయి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ఈ రంగాలలో అమెరికా లేదా మరొక దేశ వస్తువుల దిగుమతుల అనుమతికి జంకుతున్నారు తప్ప నేతల గొప్పతనం లేదా ట్రంప్‌ చెప్పినట్లు మోడీ కఠినంగా వ్యవహరించటమూ కాదు. ఇదే నరేంద్రమోడీ గారు కొన్ని విషయాల్లో బాంచన్‌ దొరా మీరు అనుకున్నట్లే చేస్తా అని ఎలా లొంగిపోతున్నారో మరోచోట చూద్దాం.
ఇక డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించి నరేంద్రమోడీ తన పలుకుబడితో భారత్‌కు ఎంతో మేలు చేకూర్చుతారని ఎందరో ఆశించారు. అదే విధంగా ఎన్నికల సంవత్సరంలో తమ ట్రంప్‌ ప్రతి దేశంతోనూ గీచి గీచి బేరాలాడి లేదా బెదిరించి తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని అమెరికన్లు కూడా ఆశించారు. అక్కడ కార్పొరేట్లు ఆశలు పెట్టుకుంటే దిగజారుతున్న దేశ ఆర్ధిక పరిస్ధితిని మోడీ చక్కదిద్ది తమ జీవితాలను మరింతగా దిగజారకుండా చూస్తారా అని సామాన్యులు ప్రధానంగా ఇక్కడ ఎదురు చూశారు. జరిగిన పరిణామాలను బట్టి అక్కడ ట్రంప్‌, ఇక్కడ నరేంద్రమోడీ కూడా నిరాశపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తేడా అల్లా అక్కడ కొన్ని కార్పొరేట్లు తాత్కాలికంగా నిరాశచెందితే ఇక్కడ సామాన్యులు ఆశాభంగం పొంది ఇక మన బతుకులింతే అనే నిర్వేదానికి గురవుతున్నారు.
ట్రంప్‌ పర్యటన సమయంలోనే ఒక వార్త వెలువడింది. ట్రంప్‌ భజనలో మీడియాలో దానికి అంత ప్రాచుర్యం రాలేదని చెప్పాలి. ఇటీవలి వాణిజ్య లావాదేవీలలో మన వాణిజ్యం చైనాను అధిగమించి అమెరికాతో ఎక్కువ జరిగింది అన్నది వార్త సారాంశం. చైనా వ్యతిరేకులకు ఇది వీనుల వింపైన సంగీతం వంటిదే. అదే దేశభక్తి అని భావించేవారు కూడా లేకపోలేదు. ఇక్కడ ప్రశ్న ఏ దేశంతో అయినా వాణిజ్యం జరిపేది కార్పొరేట్‌ సంస్ధలే, సామాన్యులు కాదు అన్నది పచ్చినిజం. ఎవరి కోసం తొలి రోజు గుజరాత్‌ పర్యటనలో ట్రంప్‌-నరేంద్రమోడీ ఆరుసార్లు కౌగలించుకున్నట్లు ? నాటకంలో ప్రతి పాత్రధారి తన పాత్రను రక్తి కట్టించేందుకు ప్రయత్నించారు అని సమీక్షకులు రాస్తారు.ఈ కౌగిలింతల పర్వం కూడా అదే. దేశం కోసమే ఇదంతా అన్నట్లుగా ఎవరికి వారు నటించారని చెప్పవచ్చు. ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ట్రంప్‌ తాపత్రయ పడుతుంటే రెండవ సారి గెలిచి రాజకీయంతో సహా అన్ని రంగాలలో వైఫల్యాలను ఎదుర్కొంటున్న నరేంద్రమోడీ తన పరపతి ఎలాంటిదో ఒక అగ్రరాజ్యనేత నోట వినిపించాలని తహతహలాడారు. ఆర్ధిక పరిస్ధితి, ఢిల్లీ పరిణామాలతో ట్రంప్‌ పొగడ్తలను నెమరు వేసుకొని ఆనందించే అవకాశం లేకుండా పోయింది. ట్రంప్‌ నోట కాశ్మీర్‌, సిఎఎ వంటి అంశాలపై ఎక్కడ ప్రతికూల వ్యాఖ్యలు వస్తాయో, రాకుండా చూడు గోమాతా అన్నట్లుగా బిజెపి నేతలు ఉగ్గపట్టుకు కూర్చున్నారు. భవిష్యత్‌లో మరింత పెద్ద అవసరానికి లేదా ప్రయోజనానికి తురుపు ముక్కగా ప్రయోగించుదాం అన్నట్లుగా విలేకర్లు అడిగినా ట్రంప్‌ తప్పించుకోవటానికి అర్దం ఇదే.

Image result for delhi planned violence spoils modi-trump party
మీ ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గట్టిగా వ్యవహరిస్తారబ్బా అని ట్రంప్‌ పొగిడారు. ఇది మోడీని ఉబ్బవేయటానికి చెప్పిన మాటలు మాత్రమే. ఏ దేశంతో స్నేహం చేసినా మన దేశ ప్రయోజనాలను సదా గమనంలో ఉంచుకోవాలి.ఎదుటి వారి పొగడ్తల కోసం మనల్ని మనం మరిచిపోకూడదు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా యూనియన్‌ కలసి ఇరాన్‌తో ఒక అణు ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అంతేకాదు, ఇరాన్‌తో వాణిజ్యలావాదేవీలు జరిపే దేశాల మీద ఆంక్షలు పెట్టింది. చిత్రం ఏమిటంటే ఒప్పందంలోని ఏ ఒక్కదేశ మూ అమెరికా వైఖరిని సమర్ధించలేదు, ఆంక్షలను ఖాతరు చేయలేదు. కానీ అమెరికాతో మనం సమాన భాగస్వాములుగా ఉన్నాం, ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్‌ మాత్రం ఆంక్షలను అమలు జరిపేందుకు అమెరికాకు సాగిల పడింది. మన రూపాయలు ప్రపంచ మార్కెట్లో దేనికీ పనికి రావు, అయినా ఎప్పటి నుంచో ఉన్న స్నేహం కారణంగా వాటిని తీసుకొని చమురు విక్రయిస్తున్న ఇరాన్‌ దగ్గర కొనుగోలు చేయటం నిలిపివేసి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అమెరికా నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు కరాచీ రేవుతో పని లేకుండా ఇరాన్‌లోని చాబహార్‌ రేవును అభివృద్ధి చేయటం ద్వారా మన వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. అమెరికా బెదిరింపుల కారణంగా ఇప్పుడు ఆ పధకాన్ని పక్కన పడేసింది. ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయతీ తలెత్తటం ఏమిటి? అమెరికాకు కోపం రాగానే మన ప్రయోజనాలకోసం నిర్మించే రేవును మధ్యలో వదలి వేసి రావటం ఏమిటి ? ఈ పరిణామం మన దేశం అమెరికాకు లొంగిపోవటాన్ని సూచిస్తున్నదా? లేక స్వతంత్ర వైఖరి, సమాన భాగస్వామిగా మన దేశ ప్రతిష్ట,మాన మర్యాదలను నిలబెట్టేదిగా ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పాలనలో ఈ వాస్తవాలను కాదనే ధైర్యం ఉందా !

16 Sunday Feb 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra Modi governance, RBI

Image result for modi governance cartoons
ఎం కోటేశ్వరరావు
దేశమంతటా ఎన్‌ఆర్‌సి గురించి అబ్బే అసలు ఆలోచన కూడా చేయలేదని నరేంద్రమోడీ-అమిత్‌ షా పలికిన ‘సత్య’ వ్యాక్యాలతో వారు అపర సత్యహరిశ్చంద్రులని నమ్మే వారిలో చాలా మందికి దూల తీరింది. వారు కాదన్నా ఎన్‌ఆర్‌సి పెట్టాలంటూ వీరంగం వేసే వారు ఉన్నారు. మోడీ గారి పాలనలో అప్పులు చేయలేదని చెప్పటం కూడా ‘సత్యవాక్పరిపాలన’లో భాగమే. నేతలు అబద్దాలు చెప్పవచ్చు, అంకెలు, అందునా రిజర్వుబ్యాంకు చెప్పదు కదా (ఏమో ఇప్పుడు దాని మీద కూడా అనుమానాలు రావచ్చు)
రిజర్వుబ్యాంకు నివేదికల్లో చెప్పిన దాని ప్రకారం 2014 మన్మోహన్‌ సింగ్‌ గారు దిగిపోయే నాటికి మన స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం :64,11,200 కోట్లు. దీనిలో స్వదేశీ 60,45,007 కోట్లు కాగా విదేశీ 3,66,193 కోట్లు.
నేను గానీ వస్తే మంత్ర దండం వేసి అప్పులు తీర్చివేస్తా, కొత్త అప్పులు చేయను, విదేశాల నుంచి నల్లధనపు నిల్వలు తెస్తా అని ఊరూ వాడా టాంటాం వేసిన నరేంద్రమోడీగారు ఎంత నల్లధనం తెచ్చారో మనకైతే తెలవదు. కానీ అప్పులు మాత్రం 2019 సెప్టెంబరు 15న ఆర్‌బిఐ ప్రచురించిన సమాచారం ప్రకారం 2019 మార్చినెల నాటికి మొత్తం అప్పును 1,02,55,099 (అరవైనాలుగు లక్షల కోట్ల నుంచి అక్షరాలా ఒక కోటీ రెండు లక్షల యాభైఐదు వేల తొంభై తొమ్మిది కోట్లకు) పెంచారు. పోనీ ఇంతా చేసి అభివృద్ధి సాధించారా అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు కూడా ఉంచకపోగా ఐదుశాతానికి లోపుగా దిగజార్చారు.
ఎడా పెడా విదేశాలకు ఎందుకు తిరుగుతున్నారు ప్రధాని గారూ అంటే దేశ పలుకుబడి పెంచటానికి అని చెప్పారు. ఆయన భక్తులైతే మోడీ పలుకుబడితో రాయితీలతో కూడిన అప్పులను పెద్ద మొత్తంలో తెస్తున్నారని భజన చేశారు. ఇది కూడా అబద్దమే. మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో విదేశీ రుణాల(అన్ని రకాలు కలిపి)లో రాయితీలతో ఉన్న మొత్తం 35.8శాతం నుంచి 10.4శాతానికి పడిపోయింది. విదేశాల్లో పలుకు బడి పెంచి, విశ్వసనీయతను పెంచామని చెప్పిన మోడీ గారి ఏలుబడిలో 2019 నాటికి ఆ మొత్తం 8.7శాతానికి పడిపోయింది. విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతామని చెప్పారు.
2014-15లో (మోడీగారి తొలి ఏడాది) రూపాయల్లో అన్ని రకాల విదేశీ పెట్టుబడుల ప్రవాహ విలువ రూ.4,49,072 (డాలర్లలో 73456 మిలియన్స్‌) ఉండగా 2019 మార్చినాటికి ఆ మొత్తాలు రూ.2,12,179 కోట్లకు(30094 మిలియన్‌ డాలర్లు) పడిపోయింది. ట్రంప్‌తో సహా విదేశీ నేతలందరినీ కౌగలించుకోవటం, ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఫొటోలకు ఫోజులివ్వటం తప్ప ఎందుకు విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయో ఎవరైనా చెప్పగలరా ? మన ఆర్ధిక వ్యవస్ధ మీద, దాన్ని నడిపించే నరేంద్రమోడీ మీద విశ్వాసం తగ్గటానికి ఇది సూచిక కాదా ? గత ఆరు సంవత్సరాలలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీల వ్యతిరేకతను రెచ్చగొట్టటం, భావోద్వేగాలను రేకెత్తించటం మీద పెట్టిన శ్రద్ద ఆర్ధిక వ్యవస్ధను బాగు చేసేందుకు పెట్టి ఉంటే ఇలా జరిగేదా ? మోడీ అభిమానులు వెనక్కు తిరిగి ఆలోచిస్తారా ?

Image result for modi governance cartoons
మోడీ ఏలుబడిలో ఉపాధి తగ్గిందా పెరిగిందా ! ఆర్‌బిఐ సమాచారం ఏమి చెబుతోంది !
భజన బృందం అంటే చెవుల్లో పూలు పెట్టుకొని ఎలా చేయమంటే అలా భజన చేస్తుంది. కానీ అందరికీ కుదరదే. దేశంలో ఎందరికీ ఉపాధి కల్పించారన్నది ఒక బ్రహ్మపదార్ధం. రిజర్వుబ్యాంకు కమ్యూనిస్టు సంస్ధ కాదు, దానిలో పని చేసే వారు తుకడే తుకడే గ్యాంగ్‌ కాదు. 2019 సెప్టెంబరు మాసాంతానికి ఆర్‌బిఐ అందించిన సమాచారంలో ఉపాధి గురించి ఈ అంశాలున్నాయి.
1996-97లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య దేశ చరిత్రలో గరిష్టం : 195.6లక్షలు
2011-12 నాటికి ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :176.1లక్షలు
1996-97లో ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 86.9లక్షలు
2011-12 నాటికి ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :119.7లక్షలు
1996-97లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 374.3లక్షలు
2011-12 లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 401.7లక్షలు
2011-12 తరువాత ప్రభుత్వ రంగం, ప్రయివేటు రంగంలో ఎంతెంత మంది ఉన్నారో విడివిడిగా లెక్కలు లభ్యం కాలేదని ఆర్‌బిఐ పేర్కొన్నది. అయితే మొత్తంగా రిజిస్టర్లలో ఉన్న సంఖ్య సంవత్సరాల వారీ దిగువ విధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సమాచారాన్ని ఉటంకిస్తూ ఆర్‌బిఐ తన గణాంక పుస్తకంలో పేర్కొన్నది.
2012-13లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 447.9లక్షలు
2013-14లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 468 లక్షలు
2014-15లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 482.6 లక్షలు
2015-16లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 435 లక్షలు
తరువాతి సంవత్సరాల సమాచారాన్ని ఆర్‌బిఐ ఇవ్వలేదు.

Image result for modi governance cartoons
ధరల పెరుగుదల లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, దానికి రుజువుగా ద్రవ్యోల్బణం ఎంత తక్కువ ఉందో చూసుకోమంటారు. 2014 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో వినియోగదారుల ధరల సూచిక 112.2 కాగా 2019 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో అది 139.6కు పెరిగింది. తరువాత 2020జనవరి నాటికి 145.7కు పెరిగింది. దీన్నేమంటారు ? ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు, కొంత మేరకు చెల్లించే యాజమాన్యాలుంటే కార్మికులకు కరవు భత్యం పెరుగుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు, ఇతరులు, నిరుద్యోగల పరిస్దితి ఏమిటి ? కాబట్టి భక్తులారా గుడ్డి అభిమానం లేదా దురభిమానంతో మీరు ఎలాగైనా రెచ్చిపోవచ్చు, సామాన్యులారా మోడీ ఏలుబడి గురించి మీకై మీరు నిర్ణయించుకోవచ్చు. దీనిలో పేర్కొన్న అంకెలు వాస్తవం కాదని ఎవరైనా నిరూపిస్తే సంతోషం, లేకపోతే స్వంత బుర్రలతో ఆలోచించటం ప్రారంభించండి, ఇంతకంటే దేశభక్తి మరొకటి లేదు. నేనైతే రాసిన దానికి కట్టుబడి ఉన్నా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: నూతన రాజకీయ సమీకరణలకు నాంది కానున్నాయా ?

09 Sunday Feb 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Arvind Kejriwal, BJP, BJP motor mouths, Delhi election result, Delhi Polls, political polarization

Image result for delhi election result

ఎం కోటేశ్వరరావు
నోటి తుత్తర గాళ్లు మీడియా ముందు నోరు మూసుకొంటే మంచిదని రెండు సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. అదంతా జుమ్లా అని రుజువైంది. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తారని చేసిన నరేంద్రమోడీ వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తే అది జుమ్లా పట్టించుకోవద్దు అని మోడీ ఆత్మ అమిత్‌ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏదో చెబుతుంటాం, జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవద్దు అన్నది జుమ్లా అనే ఉర్దూపదానికి భాష్యం. ఢిల్లీ ఎన్నికల సమయంలో బిజెపి నేతల నోటితుత్తరను యావత్‌ ప్రపంచమూ చూసింది.
మోడీ భజన టీవీ ఛానళ్లతో సహా అన్నీ ఢిల్లీ గద్దె మీద తిరిగి అరవింద్‌ కేజరీవాల్‌నే ప్రతిష్టించేందుకు జనం నిర్ణయించుకున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌లో స్పష్టం చేశాయి. ఏ పార్టీకి ఓటు వేసినా అది కమలం గుర్తుకే పడేట్లుగా ఓటింగ్‌ యంత్రాల్లో మార్పులు చేస్తారనే ప్రచారాన్ని నేను విశ్వసించను గానీ, అనేక మంది అనుమానిస్తున్నట్లుగా అసలు యంత్రాలనే మార్చివేసి కొత్తవాటిని పెట్టి తీర్పును వమ్ము చేస్తే తప్ప ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు తధ్యం. ఎందుకంటే బిజెపి వారు ఎంతకైనా తెగిస్తారని అనేకసార్లు స్పష్టమైంది.
దేశమంతటా తమకు ఎదురులేదని విర్రవీగుతున్న వారికి దేశపాలనా కేంద్రంలో అధికారం లేకపోతే తలకొట్టేసినట్లు అవుతుంది. అందుకే ప్రధాని మొదలు గల్లీ నేతల వరకు ఎన్ని పాట్లు పడ్డారో చూశాము. జాత్యంహంకార ఉన్మాదాన్ని రెచ్చగొట్టినపుడు అనేక దేశాల్లో ఎలాంటి ప్రమాదకర ధోరణులు వ్యక్తమయ్యాయో, గత కొన్ని దశాబ్దాలుగా రెచ్చగొట్టిన మతోన్మాదం ఎలాంటి వెర్రితలలు వేస్తుందో ఢిల్లీ ఎన్నికలు చూపాయి. ఈ ఉన్మాదం కేవలం ముస్లింలకే పరిమితం అని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడినట్లే. మతం, కులం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా తమతో విబేధించే అంశాలన్నింటినీ శాసించేందుకు మతోన్మాదం పూనుకుంటుంది.
తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటుంది.బిజెపినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్‌ వర్మ పుత్రరత్నమైన పరవేష్‌ వర్మ పశ్చిమ ఢిల్లీ బిజెపి ఎంపీ. ఎన్నికల సమయంలో కేజరీవాల్‌ను ఉగ్రవాది అని నిందించాడు, షాహిన్‌బాగ్‌లో గుడారాలు వేసిన వారు మీ ఇండ్లలోకి ప్రవేశించి మీ కూతుళ్లను, అక్కచెళ్లళ్ల మీద అత్యాచారాలు చేస్తారు, వారిని చంపేయండి, అక్కడ నిరసన తెలుపుతున్న వారికి కేజరీవాల్‌ బిర్యానీలు పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారని నోరు పారవేసుకున్నందుకు ప్రచారంలో పాల్గనకుండా రెండు సార్లు ఎన్నికల సంఘం నిషేధం విధించింది. చివరికి ఓటింగ్‌ జరుగుతున్న సమయంలో సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను విడుదల చేస్తూ షాహిన్‌బాగ్‌ జనం పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచారు, ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టిన బిర్యానీ తిని, ఇచ్చిన డబ్బులు తీసుకొన్న వారందరూ రుణం తీర్చుకొనేందుకు ఆ పార్టీకే ఓటు వేస్తామని నినదిస్తున్నారు. దానికి ప్రతిగా ఇండ్లలో ఉన్న జాతీయవాదులంతా బయటకు రావాలి. మీరు దేశానికి ఎంతో రుణపడి ఉన్నారు. పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలిచి జాతీయ పార్టీకి ఓటు వేయాలి, అది మాత్రమే చాలదు తమ గుర్తింపు కార్డులను చూపుతూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేయాలి, దేశభక్తియుత పార్టీకే ఓటు వేస్తామని చెప్పాలి అని దానిలో పేర్కొన్నాడు. మత విద్వేషాన్ని, ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం గాక దీన్నేమనాలి.
అంతే కాదు కర్ణాటక బిజెపి కూడా రెచ్చగొట్టే ట్వీట్లు చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలు కాగితాలను (ఆధారాలను) చూపబోము అనే నినాదాన్ని ప్రదర్శిస్తు నిలుచున్న ఫొటోలను చూపుతూ మీ వద్ద ఉన్న గుర్తింపు పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి, రేపు ఎన్‌పిఆర్‌ సందర్భంగా ఇవ్వాల్సి వస్తుందంటూ ట్వీట్లు చేశారు. ఇది మతదురభిమానం తప్ప మరొకటి కాదు. ఒక వైపు ఎన్‌పిఆర్‌కు ఎలాంటి ఆధారాలూ చూపనవసరం లేదని మోడీ సర్కార్‌ చెప్పేదానికి ఇది విరుద్దం. ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ గురించి బిజెపి ఏమి చెప్పినప్పటికీ ఆధారాలు లేవనే పేరుతో తమను ఇబ్బందులు పెడతారని ముస్లింలు, సంచార జాతులు, గిరిజనులు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల వారు ఆందోళన చెందుతున్న తరుణంలో అధికార పార్టీ నుంచి ఇలాంటి ట్వీట్లు వెలువడటం వారి కడుపులో ఏముందో వెల్లడి చేస్తున్నది.
ఢిల్లీ ఎన్నికల సమయంలో, అంతకు ముందు బిజెపి నేతలు రెచ్చగొట్టుడు ప్రచారానికి ప్రభావితులైన వారు ఎలా ప్రవర్తిస్తారో చూశాము. అలాంటి పరిస్ధితినే బిజెపి కోరుకుంటోందని అనేక మంది భయపడుతున్నది నిజమే అని వెల్లడి అయింది. ఈనెల ఐదవ తేదీ రాత్రి రాజస్ధాన్‌కు చెందిన కవి,రచయిత బప్పతీయ సర్కార్‌ ముంబైలో తన స్నేహితుడిని కలుసుకొనేందుకు ఉబెర్‌ కాబ్‌ను బుక్‌ చేసుకున్నాడు. ప్రయాణ సమయంలో తన స్నేహితుడితో ఫోన్‌లో దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల గురించి, జైపూర్‌లో ఎలా నిర్వహించాలో చర్చించాడు. కారు డ్రైవర్‌ రోహిత్‌ సింగ్‌ ఆ మాటలు విన్నాడు. గమ్యస్ధానం బదులు శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆపాడు. కొద్ది సేపటిలో వస్తానని చెప్పి ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటబెట్టుకు వచ్చాడు. తన కారులో ఒక కమ్యూనిస్టు ఎక్కాడని, దేశాన్ని ఎలా తగులబెట్టాలో ఇతరులతో చర్చించాడని,దేశం మొత్తాన్ని షాహిన్‌బాగ్‌గా మార్చేందుకు చూస్తున్నాడని, తాను ఆ మాటలన్నింటినీ రికార్డు చేశానని కాబ్‌ డ్రైవర్‌ పోలీసులకు చెప్పాడు. ఇదెక్కడి విడ్డూరమయ్యా బాబూ అని డ్రైవర్‌ను ప్రశ్నిస్తే మీరు దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ? నేను గాబట్టి వేరే చోట్లకు తీసుకుపోకుండా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వచ్చాను సంతోషించండి అని డ్రైవర్‌ సమాధానమిచ్చినట్లు సర్కార్‌ తెలిపాడు. పోలీసులు రెండున్నర గంటల పాటు రచయితను స్టేషన్‌లో కూర్చోబెట్టి ఆయన రచనలు,ఇ తర విషయాల గురించి అనేక రకాలుగా ప్రశ్నించి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో వదలి పెట్టారు.
భిన్నాభిప్రాయం కలిగి ఉండటం, వ్యక్తం చేయటం దాని ప్రాతిపదికన నిరసన వ్యక్తం చేయటాన్ని దేశద్రోహంగా బిజెపి, ఇతర సంఘపరివార్‌ శక్తులు చేస్తున్న ప్రచారం ఎలాంటి ప్రభావం కలిగిస్తోందో ఈ ఉదంతం తెలియ చేస్తోంది. అదే డ్రైవర్‌కు ఉన్మాద స్దాయి మరింత పెరిగి ఉంటే రచయిత సర్కార్‌ పరిస్ధితి ఏమై ఉండేదో ఊహించుకోవటానికే భయమేస్తోంది.
ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ శిబిరం వద్దకు వచ్చిన యువకుడు కపిల్‌ గుజ్జార్‌ నిరసన కారులను దూషిస్తూ చంపివేస్తానంటూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేస్తూ గాలిలోకి కాల్పులు జరిపిన ఉదంతం తెలిసిందే. అతడు ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్త అంటూ వెంటనే పోలీసులు ఒక ఫొటోను విడుదల చేసి బిజెపి ఎన్నికల ప్రచారానికి తోడ్పడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీయే అతని చేత అలా చేయించిందని చెప్పటంలో పోలీసులు బిజెపితో కుమ్మక్కయ్యారు. అలా ప్రకటించటం నిబంధనావళికి విరుద్దం. తీరా చూస్తే తమ కుమారుడు నరేంద్రమోడీ భక్తుడు, అమిత్‌ షా అభిమాని తప్ప అరవింద కేజరీవాల్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కపిల్‌ తండ్రి, సోదరుడు మీడియాతో చెప్పారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అందరికీ తమ టోపీలు పెట్టి ఓట్లు అడిగిందని, ఆ సందర్భంగా తీసిన ఫొటోను పోలీసులు విడుదల చేశారని, తమ కుటుంబానికి ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ కుమారుడు ఎప్పుడూ హిందుస్తాన్‌, హిందుత్వ గురించి మాట్లాడుతూ ఉంటాడని కూడా తెలిపారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిజెపి ఎలాంటి చౌకబారు చర్యలకు పాల్పడుతుందో ఈ ఉదంతం వెల్లడించింది.
మనకు గిరిరాజ్‌ సింగ్‌ అనే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. నోటి నుంచి ఒక్కటీ సరైన మాట రాదు. బహుశా ఆయన నోట్లో పుట్టే విద్వేష వైరస్‌లు అలా మాట్లాడిస్తూ ఉండి ఉండాలి. షాహిన్‌బాగ్‌ ఆత్మహత్యా దళాలను తయారు చేసే కేంద్రంగా మారిందని ఢిల్లీ ఎన్నికల సమయంలో నోరు పారవేసుకున్నాడు. షాహిన్‌బాగ్‌లో ఒక మహిళ మరణించిన తన కుమారుడు అమరజీవి అంటోంది, ఆత్మహాత్యాబాంబరు కాకపోతే ఏమిటిది అని కూడా ప్రశ్నించాడా పెద్ద మనిషి.
షాహిన్‌ బాగ్‌లో పాకిస్ధాన్‌ ప్రవేశించిందని, ఎన్నికలు భారత్‌-పాకిస్దాన్‌ మధ్య పోటీగా జరగాలని కపిల్‌ మిశ్రా అనే బిజెపి అభ్యర్ధి ప్రకటించారు. అలాంటి వారందరికీ ఉపదళపతి అమిత్‌ షా ఎన్నికల్లో మాట్లాడినదేమిటి ? ఢిల్లీ ఎన్నికలు రెండు పార్టీల మధ్య పోటీ కాదు. షాహిన్‌బాగ్‌కు మద్దతు ఇస్తున్న రాహుల్‌ బాబా-కేజరీవాల్‌ మరియు దేశాన్ని రక్షిస్తున్న ప్రధాని మోడీ మధ్య పోటీ అని చెప్పారు.
మతోన్మాద భావజాలం తలకెక్కిన గుంజా కపూర్‌ అనే ఒక జర్నలిస్టు తానెవరో బయట పడకుండా ఉండేందుకు బుర్ఖా తగిలించుకొని షాహిన్‌ బాగ్‌ శిబిరంలో ప్రవేశించింది. నిజానికి ఆ శిబిరానికి ఎందరో ఆందోళనతో విబేధించే వారు కూడా సందర్శనకు వచ్చారు గానీ ఎవరూ ఇలాంటి ముసుగులతో రాలేదు. బహుశా అంతకు ముందు జెఎన్‌యులో ముసుగులు వేసుకొని దాడులు జరిపిన ఎబివిపి, వారి మద్దతు దారులనుంచి స్ఫూర్తి పొంది ఉండాలి. అనుమానం వచ్చిన షాహిన్‌బాగ్‌ మహిళలు అడిగిన ప్రశ్నలకు తడబడటంతో సదరు కాషాయ జర్నలిస్టు అసలు రూపాన్ని బహిర్గతం చేసి మర్యాదగా పోలీసులకు అప్పగించారు. అంతకు ముందు తుపాకి ధరించిన ఒక వ్యక్తిని శిబిరంలోని వారు పట్టుకున్న విషయం, మరో సందర్భంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ మీద వెళుతూ శిబిరం సమీపంలో గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయిన సంగతి తెలిసిందే.
జరియాను షరియాగా చిత్రించిన బిజెపి నేత
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అమంతుల్లా ఖాన్‌ షరియా చట్టాన్ని అమలు జరపాలని కోరాడంటూ బిజెపి నేత సంబిత్‌ పాత్ర వక్రీకరించారు.హమ్‌ జరియా బనాయేంగే(మనం ఒక మార్గాన్ని కనుగొనాలి) అని వాడిన పదజాలాన్ని షరియా(ఇస్లామిక్‌ చట్టం)గా పేర్కొని సంబిత్‌ పాత్ర వక్రీకరించారు.ఇలాంటి పనులు చేయటం పాత్రకు అలవాటే. ఉత్తర ప్రదే శ్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు కేసు కూడా నమోదు చేశారు.
భావోద్వేగాలను ముందుకు తేవటంలో, వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవటం మీద ఉన్న శ్రద్ద దేశ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపచటం,జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద లేదని ఆరేండ్ల పాలన రుజువు చేసింది. సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేసి ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని, అన్ని అంశాలను వివరించేందుకు తప్పలేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె స్వయంగా ఇబ్బంది పడి చివరి పేజీలను చదవకుండా వదలి వేశారు. అన్నింటికంటే ఆ బడ్జెట్‌ అసలు సమస్యల జోలికిపోలేదు.

Image result for delhi election
ముందే చెప్పుకున్నట్లు బ్యాలట్‌ బాక్సుల తారుమారుకు పాల్పడకపోతే ఎన్నికలకు ముందు, తరువాత సర్వేల ప్రకారం ప్రకారం ఆమ్‌ ఆద్మీ అధికారానికి వస్తే దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయం. 2014లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం తరువాత మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోరపరాజయం పాలైంది.తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అన్ని స్ధానాలను తిరిగి గెలుచుకుంది.ఆమ్‌ ఆద్మీ పద్దెనిమిదిశాతం ఓట్లతో మూడవ స్ధానంలో కాంగ్రెస్‌ 22శాతం, బిజెపి 56శాతం ఓట్లతో ముందంజలో ఉంది.ఎనిమిది నెలల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైతే తమకు ఎదురులేదని అని ఛాతీ విరుచుకొనే వారు వెనక్కు తగ్గాల్సి ఉంటుంది. ఇప్పటికే మోడీ మీద అనేక మందిలో భ్రమలు తొలిగాయి, భావోద్రేకాలు లేదా భావోద్వేగాలతో ఓటు వేసిన వారిలో కూడా ఢిల్లీ ఎన్నికలు పునరాలోచనకు, నూతన రాజకీయ సమీకరణలకు నాంది పలుకుతాయి. ఒక వేళ ఎన్నికలను తారు మారు చేస్తే ఆ పరిణామం కూడా కొత్త సమీకరణలకు మరో రూపంలో నాంది పలుకుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి రాజధాని ‘తర్కం’ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు వర్తించదా ?

06 Thursday Feb 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravathi capital, Amaravati capital controversy, ap special status, BJP's capital logic, CM YS Jagan

Image result for why not bjp's  capital logic apply to ap special status too
ఎం కోటేశ్వరరావు
మూడు రాజధానుల రాజకీయం మరో మలుపు తిరిగింది. కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జనంలో గందరగోళం మరింత పెరిగింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. దీని గురించి ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. నిజానికి ఇది రాజధాని మార్పును ఆమోదించటమూ కాదు, తిరస్కరించటమూ కాదు. ప్రస్తుతం ఉన్న స్ధితిని తెలియచేయటమే అన్నది ఒక అభిప్రాయం. రాష్ట్ర రాజధానికి కేంద్రానికి సంబంధం లేదని చెప్పటం వెనుక రాజకీయం లేకపోలేదు.
కేంద్ర బడ్జెట్‌ వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఒకవైపు చెబుతారు, మరోవైపు మంచి బడ్జెట్‌ అని కితాబు, ప్రత్యేక హౌదా గురించి మరచిపొమ్మని మరోసారి పార్లమెంట్‌లో చెప్పిన తరువాత దాన్ని పరిశీలించాలని లేఖ రాయటం నక్కపోయిన తరువాత బక్క కొట్టుకున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. రాజధాని రాజకీయంలో జనసేన-బిజెపి ఏమి చేయనున్నాయన్నది ఆసక్తి కరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ఆ నిధులను ఎలా ఖర్చు చేశారన్నది ఒక ప్రశ్న. జనానికి కూడా అర్ధం కావటం లేదు. తాము ఇచ్చిన నిధుల ప్రకారం వాటిని నిర్మించిందీ లేనిదీ నిర్ధారించాలని, ఏ దశలో ఉన్నాయో తెలపాలని గానీ కేంద్రం ఇంతవరకు రాష్ట్రాన్ని కోరినట్లు జనానికి తెలియదు. చంద్రబాబు కొన్ని భవనాలను నిర్మించి వాటిలో తాత్కాలికంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దాని ప్రకారం వాటిలో కార్యాలయాలు తాత్కాలికం తప్ప భవనాలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించినవే.
ఇక రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు జనానికి చెప్పటమే తప్ప కేంద్రానికి అధికారికంగా ఇంతవరకు తెలియచేయలేదు. అందుకే వాటి గురించి మీడియాలో మాత్రమే చూశామని కేంద్రం చెప్పాల్సి వచ్చింది. అసెంబ్లీలో పెట్టిన బిల్లులో కూడా పాలనా వికేంద్రీకరణలో భాగంగా కొని చర్యలను ప్రతిపాదించింది తప్ప రాజధానుల ఏర్పాటుగా వాటిని పేర్కొనలేదు. విజిలెన్స్‌ కమిషన్‌, ఎంక్వైరీస్‌ కమిషన్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో తరలించకూడదని ఎక్కడ ఉందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. తన కార్యాలయాలను ఎక్కడైనా ఏర్పాటు చేసుకొనే స్వేచ్చ ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ వెసులుబాటును ఉపయోగించుకొనే సచివాలయాన్ని, హైకోర్టును తరలిస్తామని జగన్‌ ప్రభుత్వం చెబుతున్నది. న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. అందుకే బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో పెద్ద తెలివితేటలేమీ లేవు.
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో ఎందుకు చెప్పలేదన్నది ప్రశ్న. కేంద్ర వైఖరి గురించి ఆయనకు ఉన్న సాధికారత ఏమిటి ? లేకపోతే బిజెపి-వైసిపి మధ్య కుదిరిన తెరవెనుక ఒప్పందానికి సూచికా, ఎలా అర్ధం చేసుకోవాలి. మొత్తం మీద రాజకీయ దోబూచులాట నడుస్తోంది.

బిజెపి నేతలను ఇక్కడ ఒక సూటి ప్రశ్న అడగాలి. జివిఎల్‌ తర్కం ఒక్క అమరావతికేనా దేనికైనా వర్తిస్తుందా ? ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని గతంలోనే పలుమార్లు చెప్పామని జీవీఎల్‌ నరసింహారావు అంటున్నారు. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని, ముగిసిన అనేక అధ్యాయాలను తిరిగి తెరుస్తున్నది బిజెపి, జరిగిన తప్పిదాలను సరిచేస్తామని చెబుతున్నది ఆ పార్టీ, అలాంటపుడు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చేతులు రావటం లేదా ? ప్రత్యేక హోదా కొనసాగించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురవుతుందనే సరికొత్త వాదనను బిజెపి నేత ముందుకు తెచ్చారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే కార్పొరేట్లకు లక్షా 45వేల కోట్ల రూపాయల మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలోనే కేంద్రం ఎలా కట్టబెట్టగలిగింది? తాజా బడ్జెట్‌లో డివిడెండ్‌ పన్ను చెల్లింపు పన్నుతో సహా అనేక రాయితీలను తాజా బడ్జెట్‌లో ఎలా ప్రకటించారు. వాటికి లేని ఆర్ధిక ఇబ్బందులు ఆంధ్రప్రదే శ్‌ ప్రత్యేక హోదాకే వస్తాయా ? ప్రత్యేక హోదా డిమాండ్‌ చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్లే పదేపదే ఈ డిమాండ్‌ లేవనెత్తితే జగన్‌ కూడా ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జివిఎల్‌ అనటం బెదిరింపా మరోసారి అడగవద్దని హెచ్చరించటమా ?

చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారు. తేడా ఏమిటంటే చంద్రబాబు విదేశీ బూట్లు వేసుకుంటే జగన్‌ స్వదేశీ తగిలించుకున్నారు. చంద్రబాబు కార్పొరేట్‌ పరిభాషలో గతంలో తనను సిఇఓగా వర్ణించుకుంటే జగన్‌ ఫ్యూడల్‌ పద్దతిలో రాష్ట్రానికి తండ్రినని చెప్పుకున్నారు. విజయవాడ గేట్‌వే హౌటల్‌లో నిర్వహించిన హిందూ పత్రిక కార్యక్రమంలో మాట్లాడుతూ అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే పదేళ్లలో విశాఖ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివ అద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు.
ఆరువందల సంవత్సరాల నాటి విజయనగర సామ్రాజ్యంలో చెన్నై ఒక రేవు పట్టణంగా ఎదిగింది, దానిని 1639లో బ్రిటీష్‌ వారు తీసుకున్నట్లు చరిత్ర, అదే విధంగా బెంగలూరు నగరం 1535లో, హైదరాబాద్‌ 1591లో ప్రారంభమైంది. స్వాతంత్య్రం రాకముందే అక్కడ పరిశ్రమలు అభివృద్ధి అయ్యాయి. తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి అనేక సంస్ధలను నెలకొల్పారు. వాటి అభివృద్ధిలో అవి పధాన పాత్ర పోషించాయి. అమరావతిలో మౌలిక సదుపాయలకే లక్ష కోట్ల రూపాయలకు పైగా అవుతుందని, అంతసొమ్ము తాము అక్కడ వెచ్చించలేమని చెబుతున్న జగన్‌ దానిలో పదోవంతు పదివేల కోట్లతో విశాఖలో సచివాలయం నెలకొల్పితే ఆ మూడు నగరాలతో పోటీబడి అభివృద్ధి చెందుతుందని చెప్పటం అంటే భ్రమలు కొల్పటం గాక మరేమిటి ? ప్రభుత్వ రంగంలో కేంద్రం, లేదా రాష్ట్రం పెట్టుబడులు పెట్టటాన్ని ఎప్పుడో నిలిపివేశాయి. ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభం ఉంటే అక్కడకు పోతాయి తప్ప మూడు రాజధానులు పెడితే పదమూడు జిల్లాలకు ఎలా చేరతాయి. ఎవరూ పెద్దగా ప్రయత్నం చేయకుండానే, రాజధానిగాక ముందే విశాఖలో ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటు కారణంగా, దానికి ఉన్న రేవు, ఇతర కారణాలతో అభివృద్ధి అయింది. రాబోయే రోజుల్లో కూడా అది కొనసాగుతుంది. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు విశాఖను తామే అభివృద్ధి చేశామని చెప్పుకొనే ఎత్తుగడ తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. ఒక సైబర్‌టవర్‌ నిర్మించి మొత్తం సైబరాబాద్‌ను, ఐటి పరిశ్రమను తానే తెచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. గొప్పలు చెప్పుకోవటంలో ఆయనతో జగన్‌ పోటీ పడదలచుకున్నారా ?

కేంద్ర బడ్జెట్‌పై ప్రజల అసంతృప్తిాజగన్‌ అభినందనలా ?
” ఏపీని ఆదుకునేందుకు తాజా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ అసంత అప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని” సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు.
విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దఅష్టికి తెస్తున్నానని, ప్రత్యేక హౌదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరారు. బడ్జెట్‌ మీద జనం అసంతృప్తి సరే ముఖ్యమంత్రి జగన్‌ సంగతేమిటి?
”ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సంక్లిష్ట తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా, వఅద్ధి రేటును పెంచేదిగా విశ్వాసాన్ని కలిగించి,నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.” అని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఒక వైపు రాష్ట్రానికి తండ్రినని చెప్పుకుంటారు. మరో వైపు మీ చర్యల కారణంగా మా పిల్లలు అసంతృప్తి చెందారు గానీ నేనైతే అభినందనలు చెబుతున్నా అన్నట్లు లేఖ ఉంది. పిల్లలకు జరిగిన అన్యాయానికి కనీసం నిరసన కూడా తెలపకుండా వేరే విషయాలకు అభినందనలు తెలిపే తండ్రిని ఏమనుకోవాలి? మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే ఉందే అని వెనకటికి ఎవరో అన్నట్లుగా లేదూ !
2020ా-21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హౌదా కల్పించాలని విజ్ఞప్తి చేశాయని, కానీ ఆ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని జగన్‌ కోరారు. 2018 అక్టోబర్‌లో మీడియా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను ప్రశ్నించిన సందర్భంలోనూ ప్రత్యేక హౌదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేదని కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక హౌదాపై 15వ ఆర్థిక సంఘం వెల్లడిస్తున్న దానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికీ పొంతన లేదనేది స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తీవ్ర అసంత అప్తికి గురి చేస్తోంది. దయచేసి ఈ అంశంపై మీరు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు.
బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి కనీసం నిరసన తెలపరు, ఆర్ధిక సంఘం పరిధిలో ప్రత్యేక హోదా అంశం లేదని ముందే తెలిసి కూడా బడ్జెట్‌కు హారతులు పడుతూ ప్రత్యేక హోదా కల్పించాలని కోరటం భలే ఉందిలే ! ఇప్పటికే బిజెపి జనం చెవుల్లో పూలు పెట్టింది, ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ కూడా అంతకు మించి మరొకటి కాదు. మోడీగారికి పంపేందుకు పోస్టల్‌ ఖర్చు దండగ తప్ప లేఖలతో రాష్ట్రానికి ఒరిగేదేముంది ?
రాజధాని అమరావతి విషయమై జనసేన-బిజెపి ప్రకటించిన విజయవాడ లాంగ్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు లేదా వాయిదా వేశాం అంటారు. మూడు రాజధానులకు పార్టీగా వ్యతిరేకం తప్ప తమ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుకూలం అంటుంది బిజెపి, ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేసేందుకు ఈ ద్వంద్వ మాటలు ? జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కేంద్రం తోలు వలుస్తారా ? తాట తీస్తారా? పార్టీ నిర్వహణ నిధుల కోసమనే పేరుతో హీరోయిన్లతో తైతక్కలాడుతూ సినిమాలు తీస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్‌ఆర్‌సి : నరేంద్రమోడీని నిలువరించే సమయం ఆసన్నం !

30 Thursday Jan 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#CAA Protest, CAA, Narendra Modi, NPR, NRC, Shaheen Bagh, Shaheen Bagh protest

Image result for shaheen bagh"
స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌
జనవరి 26,రిపబ్లిక్‌ దినోత్సవం రోజున రాజ్యాంగం ప్రసిద్దికెక్కుతుంది. కానీ న్యూఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో డిసెంబరు 15నే ఆ ఉత్సవం ప్రారంభమైంది. పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధుల ప్రదర్శనను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రదర్శించిన క్రూరత్వానికి నిరసనగా ముస్లిం మహిళలు ఒక ముఖ్యమైన రోడ్డు మీద ధర్నా ప్రారంభించారు. అయితే అది వెంటనే తాము కూడా రాజ్యాంగానికి బద్దులమైన దేశభక్తులమే అని, దాన్ని ఉల్లంఘిస్తున్న అధికారంలోని వారికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామంటూ ముస్లింల ఉద్రేకపూరితమైన దేశవ్యాపిత ఆందోళనకు మొగ్గ తొడిగింది.
షాహీన్‌బాగ్‌ను సందర్శించిన వారు ఐదువందల మంది మహిళలు ఎంతో కాలం నిలవలేరు లేదా పెద్ద ప్రభావం చూపలేరు అనుకోవచ్చు. వాస్తవానికి షాహీన్‌బాగ్‌ భారత్‌ను మార్చింది. ఒకనాడు నిర్నినిరోధక శక్తి అనుకున్న నరేంద్రమోడీని నిలువరించే సమయం ఆసన్నమైందంటోంది.
పార్లమెంట్‌లో సిఎఎ గురించి చర్చ జరిగినపుడు ప్రతిపక్ష పార్టీలు దానికి వ్యతిరేకంగా గట్టిగా అభ్యంతరం చెబితే తమను ఎక్కడ దేశవ్యతిరేకులు అంటారోనని పిరికిబారినట్లు కనిపించింది. కానీ తరువాత అనేక నగరాలలో విద్యార్ధుల నిరసనలు చెలరేగాయి. తొలుత షాహీన్‌బాగ్‌లో ముస్లిం మహిళల ప్రదర్శన తరువాత బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటా ప్రారంభమయ్యాయి. సిఏఏ రాజ్యాంగవ్యతిరేకమని తిరస్కరిస్తూ గళం విప్పేందుకు ప్రతిపక్షాలను ఇది ఉద్యుక్తులను గావించింది. బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో జాతీయ పౌర చిట్టా(ఎన్‌ఆర్‌సి)ను అమలు జరిపేందుకు తిరస్కరించేట్లు చేసింది. దీన్ని అమలు జరపబోమనే దాని అర్ధం సిఎఎ అమలు సాధ్యం కానిదని చెప్పటమే. ఇది షాహీన్‌బాగ్‌లోని మహిళలకు ఒక అపూర్వ విజయమే.
రిపబ్లిక్‌ దినోత్సవం రోజు కేరళలో 620కిలోమీటర్ల పొడవున నిర్వహించిన మానవహారంలో మిలియన్ల మంది పాల్గొన్నారు, కొల్‌కతాలో పదకొండు కిలోమీటర్ల హారాన్ని నిర్వహించారు. ఇంతటి ఉద్రేకపూరితమైన, విస్తృత నిరసనను గతంలో ఎన్నడూ ప్రభుత్వం ఎదుర్కోలేదు.హింసకు గురైన హిందువులకు హానిలేని పద్దతిలో సాయం చేసేందుకే సిఎఎ అని చెప్పుకోవటాన్ని ప్రపంచవ్యాపితంగా అపహాస్యం చేస్తూ కొట్టివేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు భారత్‌ పాల్పడిందని మీడియా, అమెరికా, ఐరోపా యూనియన్‌, ఆసియాలోని అగ్ర రాజకీయవేత్తల నిందకు దేశం గురైంది.
భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని మలేసియా ప్రధాని విమర్శించినందుకు ఆ దేశం నుంచి పామ్‌ ఆయిల్‌ దిగుమతుల నిలిపివేత ద్వారా బిజెపి దెబ్బతీసింది. మిలియన్ల మంది భారత ముస్లింల వద్ద సరైన పత్రాలు లేవనే పేరుతో ఎన్‌ఆర్‌సి, సిఎఎ అనే పట్టకారులతో అదుపు చేయటం మరియు పౌరసత్వ రద్దుకు పూనుకున్నారని భావిస్తున్న విమర్శకులను ఒప్పించటానికి ఇది మార్గం కాదు.అసోంలో ఎన్‌ఆర్‌సి ప్రక్రియ పన్నెండులక్షల మంది హిందువులు, ఏడు లక్షల మంది ముస్లింలతో సహా 19లక్షల మంది దగ్గర సరైన పత్రాలు లేవని వెల్లడించింది. బంగ్లాదేశ్‌ నుంచి ”అక్రమంగా ప్రవేశించిన వారు మరియు చెదలు ”గా వర్ణించిన వారిని ఏరివేసేందుకు ఉద్దేశించిన ప్రక్రియలో ఆధారాలు లేని పేదలు దొరికిపోయారు. నమోదు తక్కువగా ఉండే దేశంలో ఇది సాధారణం.
అసోం అనుభవాన్ని బట్టి జాతీయ స్ధాయిలో ఎన్‌ఆర్‌సి ఖర్చు యాభైవేల కోట్ల రూపాయలు కాగలదు, ఎనిమిది కోట్ల మంది నమోదు పత్రాలు లేని వారిని తేల్చుతుంది. మిలియన్ల మంది ముస్లింలను ఖైదు చేయవచ్చనే ఆలోచనతో కొంతమంది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు సభ్యులు ఉప్పొంగిపోవచ్చు, అది సరైనదే అనుకోవచ్చుగానీ ప్రపంచంలో దేశ గౌరవం మట్టి కొట్టుకుపోతుంది.


జరుగుతున్న ఆందోళన దేశ వ్యతిరేక విద్రోహం అని బిజెపి చిత్రిస్తున్నది. ఆ ప్రాంతానికి వెళ్లిన వారికి రాజ్యాంగ పీఠికలోని అంశాలను పెద్ద ఎత్తున ప్రదర్శించే బ్యానర్లు,చిత్రాలు, బోర్టులు కనిపిస్తాయి. దేశ భక్తియుతమైన జాతి పౌరులుగా వాటిని పరిరక్షిస్తామంటూ ముస్లింలు ” భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాత్వత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబరు 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ” అనే పీఠికను, రాజ్యాంగాన్ని పారాయణం చేయటం చూస్తారు.
ఈ 85పదాలను నిరసన కేంద్రాలలో కేవలం బ్యానర్ల మీద పెద్దగా ప్రదర్శించటమే కాదు, వాటిని ముద్రించిన దాదాపు పదిలక్షల టీషర్టులు పెద్ద ప్రయత్నం చేయకుండానే అమ్ముడు పోయాయి. షాహీన్‌ బాగ్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదుల సొమ్ముతో ఏర్పడిన ఒక చిన్న పాకిస్ధాన్‌ అని బిజెపి ప్రతినిధి చిత్రించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న ఉద్యమానికి పాకిస్ధాన్‌ నిధులు అందచేస్తున్నదని బిజెపి నిజంగానే అనుకుంటున్నదా ? ముస్లింలు నిబద్దులైన దేశభక్త భారతీయులని షాహిన్‌బాగ్‌ చెప్పటం లేదా ? మహాత్మా గాంధీ, బిఆర్‌ అంబేద్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌, సరోజిని నాయుడు బోధనలకు కట్టుబడి లేదా ? షాహీన్‌బాగ్‌ వేదికమీద అలంకరించిన ఈ దిగ్గజాల పెద్ద చిత్రాలు మాట్లాడుతున్నాయి. మహిళలు వంతుల వారీగా ప్రతి రెండు మూడు గంటలకు వచ్చిపోతున్నారు, కాబట్టి గుడారం ఎప్పుడూ నిండుగా ఉంటోంది. ఆందోళన నిరంతరం కొనసాగనున్నట్లు సూచిస్తున్నది. ‘నేను భారత్‌ను ప్రేమిస్తున్నాను ‘ అని మహిళలు ధరించిన తల నాడాలు(హెడ్‌బాండ్స్‌) చెబుతున్నాయి, జాతీయ పతాకాలను ప్రదర్శిస్తున్నారు, జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. బిజెపి పర్యవేక్షణలో ఉన్న దేశ భక్తిని వారు అపహరించారు.
ప్యాసా సినిమాలో గురుదత్‌ పాటను తెలివిగా మలచి ఏర్పాటు చేసిన బ్యానర్‌ నాకు నచ్చింది. ” జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై… కహా హై….కహా హై…( ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి?) దానిని షాహిన్‌ బాగ్‌లో ఇలా రాశారు. జిన్హే నాజ్‌ హై హింద్‌ పార్‌, ఓ కహా హై…యహా హై…యహా హై….యహా హై….( ‘ ఆ భారత స్వాభిమానాలు ఎక్కడ ? అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి).

Image result for shaheen bagh"
ఇటీవలి కాలంలో అనేక తీర్పుల విషయానికి వస్తే సుప్రీం కోర్టు బిజెపి వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది.రాజకీయ వాతావరణానికి కోర్టులు ప్రభావితమౌతాయని ప్రపంచ అనుభవం చూపుతోంది. 2019 సాధారణ ఎన్నికల్లో బిజెపి ఒక పెనుగాలి మాదిరి సులభంగా విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలు తమ గాయాలను మాన్చుకుంటూ పార్లమెంట్‌లో సిఎఎను దాదాపు ప్రతిఘటించలేదు. కానీ ప్రతి పక్షాలు మరోసారి గళమెత్తటానికి విద్యార్ధులు, షాహిన్‌బాగ్‌ మహిళలు సాయం చేశారు. రాజ్యాంగ హక్కుల రక్షణ పట్ల తల ఒగ్గని సుప్రీం కోర్టు కూడా తన గళాన్ని విప్పుతుందని ఆశిస్తున్నాను.

గమనిక: స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ ప్రముఖ జర్నలిస్టు. ఎకనమిక్‌ టైమ్స్‌, టైమ్స్‌ఆఫ్‌ ఇండియా కన్సల్టింగ్‌ ఎడిటర్‌గా పని చేశారు. ఆయన రాసిన ఈ వ్యాసం తొలుత ఎకనమిక్‌ టైమ్స్‌ వెబ్‌సైట్‌లో జనవరి 28వ తేదీన ప్రచురితమైనది,దానికి ఇది అనువాదం, శీర్షిక మార్చటమైనది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తగ్గిన కారు వేగం – వేగిరంగా కెటిఆర్‌ పట్టాభిషేకం !

26 Sunday Jan 2020

Posted by raomk in Current Affairs, History, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KTR, Telagana politics, Telangana CM, Telangana Municipal Election Results

Image result for kcr, ktr
ఎం కోటేశ్వరరావు ,
తెలంగాణాలో పట్టణ స్ధానిక సంస్ధల ఎన్నికలలో ప్రధాన అధ్యాయం ముగిసింది. ఎన్నికల చట్టం లేదా నిబంధనావళిలో ఉన్న లొసుగును ఆధారం చేసుకొని ఓటింగ్‌ హక్కు ఉన్న ఎక్స్‌ అఫిసియో సభ్యులైన ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలు ఫలితాలు వెలువడిన తరువాత అధికార పార్టీకి అవసరమైన చోట ఓటు వేసేందుకు వీలుగా తాము ఎక్కడ ఓటు వేయబోయేది తెలియ చేశారు. సరే క్యాంపు రాజకీయాల గురించి చెప్పనవసరం లేదు. అధికార పార్టీలో ముఠా తగాదాలను సర్దుబాటు (అది ఎలా అన్నది అందరికీ తెలిసిందే) కోసం క్యాంపులను నిర్వహిస్తే తమ వారిని లేదా తమకు మద్దతు ఇచ్చే వారిని ఎక్కడ పాలకపార్టీ తన్నుకుపోతుందో అన్న భయంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా పరిమితంగా అయినా క్యాంపులను నిర్వహించకతప్పలేదు.
ఇప్పుడు అధికార తెరాస సాధించిన విజయం కంటే యువరాజు కెటిఆర్‌ పట్టాభిషేకం ఎప్పుడు జరగనుందా అన్న అంశమే ఎక్కువగా రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారా ? హంగ్‌ ఏర్పడిన చోట ఏమి జరగనుందో అన్న స్ధానిక ఉత్సుకత తప్ప మున్సిపల్‌ చైర్మన్లు, చైర్‌ పర్సన్స్‌, కార్పొరేషన్ల మేయర్‌ ఎన్నికల అనంతరం అసలైన చర్చ కెటిఆర్‌ ముఖ్యమంత్రిగా ఎప్పుడు కానున్నారో అన్నదే అసలైన ఆసక్తి అనటం అతిశయోక్తి కాదు. ఆయనకు బ్రహ్మరధం పట్టటం అప్పుడే ఆరంభమైంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోపే ఆ పని చేస్తారా లేక తరువాతనా అన్నది తప్ప పట్టాభిషేకం ఖాయం అన్నది స్పష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.
దవోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య వేదిక సమావేశాల్లొ కెటిఆర్‌ పాల్గొని అక్కడ పలువురు కార్పొరేట్ల ప్రతినిధులను కలసి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు మీడియా పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చింది. దేశంలో ఆర్ధిక మాంద్యం ఏర్పడిన స్ధితిలో ప్రతి కార్పొరేట్‌ సంస్ద ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. రెండవది కేంద్రంలోని బిజెపి సర్కార్‌ సామాజిక విభజన, అశాంతికి కారణమయ్యే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతోంది. ఈ పూర్వరంగంలో పెట్టుబడులు ఏమేరకు వస్తాయన్నది ప్రశ్నార్ధకమే. పక్కనే ఉన్న ఆంధ్రప్రదే శ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా దవోస్‌ వెళ్లి ఆర్భాటం చేసి వచ్చే వారు. అయినా ఆంధ్రప్రదే శ్‌కు వచ్చింది వట్టిస్తరి, మంచినీళ్లు మాత్రమే.
గత చరిత్రలో ఒక రాజు లేదా యువరాజు పట్టాభిషేకం సమయంలో దేశ పరిస్ధితులు, ఇరుగు పొరుగు రాజుల కదలికలు తదితర అంశాల గురించి మదింపు వేసేవారు. ఇప్పుడు రాజులు, రాజ్యాలు లేకపోయినా రాజకీయ పార్టీలలో వారసత్వాలు ప్రారంభమై కొనసాగుతున్న విషయం దాస్తే దాగేది కాదు. ప్రాంతీయ పార్టీలలో అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రారంభంలో ఏ లక్ష్యంతో, ఏ వాగ్దానాలతో ప్రారంభమైనా కొంత కాలం తరువాత అవి కుటుంబ పార్టీలుగా మారిపోవటం అన్ని రాష్ట్రాలలో చూస్తున్నదే. ఈ కారణంగానే కెటిఆర్‌ పట్టాభిషేకం గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఒక విజయాన్ని పోల్చవలసి వచ్చినపుడు ఏదో ఒక ప్రాతిపదికను తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఎవరైనా విబేధిస్తే చేయగలిగిందేమీ లేదు.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులను టిఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్‌ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్‌ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్‌ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్‌ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్‌ 431, కాంగ్రెస్‌ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్‌ పార్టీ 99 స్థానాలు, తన మిత్రపక్షమైన ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్‌ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు మాత్రమే పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్‌ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్‌ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. అయితే అది తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా గ్రామీణ ఎన్నికల్లో దానికి సీట్లు రాలేదు.

Image result for kcr, ktr
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల తీరు తెన్నులతో పోల్చితే కారు వేగం బాగా తగ్గింది. ఇది యువరాజుకు రుచించని వ్యవహారమే. వంది మాగధులకు వాస్తవాలతో పని ఉండదు కనుక భజన చేస్తారు, ఒక కోణాన్ని చూపి బొమ్మ మొత్తం అదే విధంగా ఉందని మనల్ని నమ్మమంటారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.

మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ         50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస          28            71      20       0       1          1
కాంగ్రెస్‌         1             10      35     30     26         18
బిజెపి            0              3        4     14     40         59
మజ్లిస్‌           0              0        2       1      2          40
ఇతరులు       1              2       11     17     48        41
పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్‌ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్‌ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్‌ 41(12.61) మజ్లిస్‌ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్‌, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్‌ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. ఆ పార్టీ తాము గెలుస్తామని ఆశలు పెట్టుకున్న ప్రాంతాలకు బదులు ఇతర చోట్ల అనూహ్య ఫలితాలను పొందింది. పార్టీ ఎంపీలు ఉన్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లలో దానికి ఆశించిన ఫలితాలు రాలేదు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ లేదా కాంగ్రెస్‌ అభ్యర్ధులతో కుమ్మక్కు అయిన కారణంగానే కాస్త మెరుగైన సీట్లు సీట్లు వచ్చినట్లు చెబుతున్నారు. నిజాంపేట కార్పొరేషన్‌లోని 33 స్ధానాలకు గాను, తెరాస 26 గెలుచుకుంది. గతంలో సిపిఎం ప్రతినిధులు సర్పంచ్‌లుగా ఉన్న ప్రగతి నగర్‌ ప్రస్తుతం నిజాంపేట కార్పొరేషన్‌లో భాగం. అక్కడ ప్రగతి నగర్‌ అభివృద్ధి కమిటీ పేరుతో పోటీ చేసిన వారు ఆరుగురు విజయం సాధించారు, ఆ ప్రాంతంలోని మరొక వార్డులో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు.
ఆర్‌టిసి సిబ్బంది సమ్మెను అవకాశంగా తీసుకొని ప్రయాణీకులపై ప్రభుత్వం భారం మోపింది. ఇప్పుడు పురపాలక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విలేకర్లతో మాట్లాడుతూ త్వరలో పన్నులు పెంచనున్నట్లు ప్రకటించారు. హైదరాబాదు, ఇతర కార్పొరేషన్లలో కొనసాగుతున్న అనారోగ్యం, అద్వాన్న పరిస్ధితులను చూసిన తరువాత మిగతా ప్రాంతాలలో కూడా పన్నుల బాదుడు తప్ప జనానికి ప్రయోజనాలు అనుమానమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనం సొమ్ము పొదుపు- వైఎస్‌ జగన్‌ ఆత్మవంచన, పరవంచన !

24 Friday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravati capital controversy, CM YS Jagan

Image result for ys jagan hypocrisy on people's money
ఎం కోటేశ్వరరావు
శాసన మండలిలో అనూహ్యంగా తగిలిన ఎదురు దెబ్బతో అధికార వైసిపి నాయకత్వం ఒక విధంగా చెప్పాలంటే కకావికలైంది. మూడు రాజధానులు, సిఆర్‌డిఏ రద్దు బిల్లులను సెలెక్టు కమిటికీ పంపే ప్రకటనకు దారి తీసిన చర్చలను శాసనమండలి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసి ఉంటే జనానికి అనేక విషయాలు తెలిసి ఉండేవి. సాధారణంగా ప్రతిపక్ష సభ్యులు పోడియం ముందుకు పోవటం, మైకులు విరగ్గొట్టటం వంటి తీవ్ర నిరసనలను వ్యక్తం చేయటం తెలిసిందే. కానీ శాసనమండలిలో ఏకంగా కొందరు మంత్రులే కుర్చీలు, బల్లలు ఎక్కి శాసనమండలి అధ్యక్షుడికి నిరసన తెలపటం బహుశా ఎక్కడా జరిగి ఉండదు. శాసనమండలి పరిణామాలతో గురువారం నాడు శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను చూస్తే ఆత్మవంచన, పరవంచన గుర్తుకు వస్తోంది.
” శాసనమండలి చైర్మన్‌.. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న (బుధవారం) చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని జారీ చేసిన ఆదేశాల వల్ల ఎవరికైనా అర్థమవుతోంది. అక్కడ డైరెక్షన్‌ ఇవ్వడానికి తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూర్చున్నది అందరం చూశాం. ”
చట్ట సభల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం సభా కార్యక్రమాలకే తప్ప గ్యాలరీల్లో కూర్చున్న వారిని చూపించటానికి కాదు. అయినా చంద్రబాబు కూర్చోవటాన్ని అందరం చూశాం అని సిఎం చెబుతున్నారు. అసలు మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలే లేనపుడు అదెలా సాధ్యం . అయినా చట్ట సభల లాబీలు, గ్యాలరీల్లో అనుమతి ఉన్నవారెవరైనా కూర్చోవచ్చు, తిరగవచ్చు. చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రి తరువాత వరసలో ఉండే వైసిపి నాయకత్వం కూడా గ్యాలరీలో కూర్చున్నది. లాబీల్లో పచార్లు చేసింది. సభలో కనుసైగలు, ఇతర పద్దతుల ద్వారా స్పీకర్‌, మండలి అధ్యక్షులకు సూచనలు, ఇతర అంశాలను పంపటం ముఖ్యమంత్రులు, అధికారపక్షం చేస్తున్నది బహిరంగ రహస్యం. గ్యాలరీలో కూర్చొని కూడా మండలి చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వారు ఆరోపించటం వైపరీత్యం తప్ప మరొకటి కాదు. అదే సాధ్యమైతే మంత్రులను పోడియం వద్దకు వెళ్లమని, కుర్చీలు, బల్లలు ఎక్కాలని, మండలి చైర్మన్‌ ముందు నిరసన తెలపాలని లేదా ఆల్లరి చేయాలని గ్యాలరీల్లో ఉన్నవైసిపి నాయకులు ఆదేశాలు జారీ చేశారని అనుకోవాలా ?

” దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలి. మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 60 రోజులు సభ జరుగుతుందనుకుంటే రోజుకు రూ.కోటి ఖర్చు పెడుతున్నాం.అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం. ఇంత ఖర్చు అవసరమా? మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా, ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా ఆపాలి.. ఎలా డిలే చేయాలి.. అని రూల్స్‌ను సైతం ధిక్కరిస్తున్న ఇలాంటి మండలిని కొనసాగించాలా.. వద్దా.. అన్నది సీరియస్‌గా ఆలోచించాలి.”
ముందుగా ఆలోచించాల్సింది, ఇంత పేద రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు అవసరమా అన్నది. ఒక వైపు ఎలాంటి ఖర్చు లేకుండా హైదరాబాదులో పది సంవత్సరాల పాటు రాజధానిగా పాలన సాగించే అవకాశాన్ని వదులు కున్నారని తెలుగుదేశం మీద విమర్శలు చేస్తారు. అమరావతిని ఖరారు చేశాక అక్కడ నిర్మించిన భవనాల్లోనే సచివాలయం, ఉభయ సభలు, హైకోర్టు పని చేస్తున్నది. మంత్రులు, ఎంఎల్‌ఏలు, సిబ్బందికి అవసరమైన నివాసాలు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ అర్ధంతరంగా వదలి వేసి విశాఖకు సచివాలయం, కర్నూలుకు హైకోర్టును తరలించాలనటం పొదుపు చర్య అవుతుందా ? దుబారానా ? ప్రజల సొమ్ముకు జవాబుదారీ వహించాల్సిన వారు చేయాల్సిన పనేనా ఇది.
శాసనమండళ్లు అవసరం లేదని, డబ్బు దండగ, అవి రాజకీయ నిరుద్యోగులు, ప్రజాక్షేత్రంలో గెలవలేని వారికి నిలయాలుగా మారాయన్నది సాధారణ విమర్శ. ఆ విషయం జగన్‌మోహనరెడ్డి గారికి ఆకస్మికంగా గుర్తుకు రావటమే చర్చనీయాంశం. ఆకస్మికంగా జ్ఞానోదయం అయిందా ? నిజంగా పేద రాష్ట్రం, ఖర్చు అనవసరం అనుకుంటే తాము గెలిస్తే మండలిని రద్దు చేస్తామని మానిఫెస్టోలోనే పెట్టవచ్చు. అలాంటిదేమీ లేదు. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా తన రాజకీయ అజెండాకు ఎదురు దెబ్బతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు తప్ప గతంలో కనీసం చర్చ జరగాలని కూడా చెప్పిన దాఖలాలు లేవు.
ఇక్కడ మరొక అంశం, కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మండలి అన్నవారికి దేశంలో అసలు ఎక్కడా లేని, ఇంతవరకు ఎవరికీ రాని ఆలోచన మూడు రాజధానులు ఎలా బుర్రలోకి వచ్చినట్లు ? అది అదనపు ఖర్చు కాదా ? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ వారానికి ఒకసారి కేసుల విచారణకు హైదరాబాదు రావటానికి కొన్ని లక్షల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పిన ముఖ్యమంత్రికి మూడు రాజధానులకు తిరగటానికి తనకు తన పరివారానికి రోజూ అయ్యే అదనపు ఖర్చు గురించి ఆలోచన రాలేదా ? ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మంచినీటి సీసాల విషయంలో పాటించిన పొదుపు గురించి ఎంతగానో ప్రచారం చేస్తే జనమంతా నిజమే అనుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి గుడివాడ వెళ్లటానికి హెలికాప్టర్‌ ప్రయాణం పొదుపు చర్య అవుతుందా ?
” రాజ్యాంగంలో క్యాపిటల్‌ అనే పదమే లేదు. పరిపాలన కోసం వికేంద్రీకరణ చేయవచ్చు. ప్రజలు ఇచ్చిన అధికారం మేరకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా మంత్రులు, సెక్రటరీలకు సూచనలు ఇస్తూ పాలన సాగించవచ్చు. ఇందుకు ఏ చట్టం అవసరం లేదు. ఏ బిల్లూ అవసరం లేదు. ఒక తీర్మానం చేసి ఈ పని చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ పెట్టొచ్చు. ఆర్టికల్‌ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చట్టాలు చేయవచ్చని రాజ్యాంగం చెబుతోంది. ”
పూర్వం కొందరు రాజులు విలాసాలకు అలవాటు పడి రాజనర్తకి, ఇతర రంగసానుల దగ్గర చేరి ఆస్ధానాలకు రాకుండా పాలన సాగించినట్లు చెప్పే కథలు మనకు తెలిసిందే. సచివాలయానికి రాకుండా తన నివాసం లేదా వ్యవసాయ క్షేత్రం నుంచి పాలన సాగిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నుంచి స్పూర్తి పొంది ఇలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అలాంటపుడు రాజధానికి 30వేల ఎకరాలు కావాలని(ప్రభుత్వ భూములు కావాలని అన్నారని ఇప్పుడు వైసిపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు), అమరావతిలో పెట్టాలని 2014లో అసెంబ్లీలో చెప్పినపుడు జగన్‌గారికి ఈ విషయాలు తెలియవా ? అసలు రాజధానే అవసరం లేదని చెప్పే వారు మూడు రాజధానులు కావాలని ఇంత రచ్చ, గందరగోళం సృష్టించటం ఎందుకు ? రాజధానితో నిమిత్తం లేకుండా పాలన సాగించగలిగిన వారికి పదమూడు జిల్లాలను అభివృద్ధి చేయటం ఒక లెక్కా ! ఆ మాత్రం దానికి ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టటం, ప్రాంతాల మధ్య పోటీ పెట్టటం ఎందుకు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జగన్‌ అభివృద్ధి ప్రణాళిక గుట్టు విప్పాలి-చేసేదేమిటో చెప్పాలి !

23 Thursday Jan 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, Aandhra Pradesh three Capitals, YS jagan, ys jagan development plan

Image result for now ys jagan should reveal his development plan

ఎం కోటేశ్వరరావు
నీతులు ఉన్నదెందుకు అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే అన్నట్లుగా ఆంధ్రపదేశ్‌ రాజకీయాలు ఉన్నాయి. రాష్ట్ర శాసనసభ మరియు శాసనమండలిలో జరిగిన పరిణామాలను చూస్తే ఇలా జరుగుతుందని పోతులూరి వీరబ్రహ్మం లేదా ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రోడామస్‌ లేదా తామే చెప్పామనో బతికున్న జ్యోతిష్కులు ఎవరైనా చెబుతారేమో చూడాలి. అధికారపక్షానికి మెజారిటీ ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పొడియంలోకి దూసుకువస్తే తప్పు పట్టిన వారు, తాము మైనారిటీగా ఉన్న శాసనమండలిలో సభ్యులుగాని మంత్రులే ఏకంగా మండలి అధ్యక్షుడి పోడియంను, అధ్యక్షుడినే చుట్టుముట్టారు. ఇదొక వైపరీత్యం. అసెంబ్లీలో ప్రతిపక్షచర్యలను జనానికి చూపేందుకు టీవీల్లో ప్రసారం చే శారు. అదే తమ చర్యలను జనం చూడకుండా చేసేందుకు సాంకేతిక కారణాల పేరుతో మండలి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. అక్కడ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వ్యవహరించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. స్పీకర్లు ఎలా అధికారపక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తున్నారో విచక్షణ అధికారాన్ని ఎలా ఉపయోగించుతున్నారో గత అసెంబ్లీలోనూ, ఇప్పుడూ చూస్తున్నాము. ఇప్పుడు మండలి చైర్మన్‌ కూడా అదే విచక్షణ అధికారంతో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టారు. అందువలన విచక్షణ అధికారాల వినియోగానికి సంబంధించి నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. దేశ రాజ్యాంగ వ్యవస్ధలను నీరుగార్చుతున్న నేపధ్యంలో ఈ పరిణామాలను చూడాల్సి ఉంది.
మూడు రాజధానుల రాజకీయం ఎటు తిరుగుతుందో, ఎవరి దగ్గర ఎలాంటి తురుపు ముక్కలున్నాయో, వాటిని ఎప్పుడు ఎలా ప్రయోగిస్తారో ఊహించి చెప్పలేము. సామాన్య జనం కోసం, ప్రాంతీయ మనోభావాలను రేకెత్తించటానికి మూడు రాజధానులు అని చెప్పినప్పటికీ చట్టపరంగా అది పాలనా వికేంద్రీకరణ పేరుతో జరుగుతోంది. వాణిజ్య కంపెనీలు లేదా పారిశ్రామిక సంస్ధల నమోదు(రిజిస్టర్డ్‌) కార్యాలయాలు ఒక చోట, కార్యకలాపాల నిర్వహణ పలు చోట్ల ఉండటం తెలిసిందే. రిజిస్టర్డ్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు పరిమితమే. రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దానిని అలాగే కొనసాగిస్తూ కార్యకలాపాలను పరిమితం చేస్తూ సచివాలయాన్ని విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలించాలని పాలకపార్టీ తలపెట్టింది. అందుకు అవసరమైన బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అనూహ్యంగా శాసనమండలిలో ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బలు తగిలితే వాటి తీవ్రతను బట్టి విరామం ఉంటుంది తప్ప ప్రయాణం ఆగదు. తమ మూడు రాజధానుల అజెండా కూడా అలాంటిదే అని అధికారపార్టీ చెబుతోంది. దాన్ని సాధ్యమైనంత మేరకు ఆలస్యం కావించేందుకు తెలుగుదేశం పార్టీ తాను చేయగలిగిందంతా చేస్తోంది.
పాలన వికేంద్రీకరణను ఒక విధానంగా జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం ముందుకు తెస్తోంది గనుక కోర్టులు అభ్యంతర పెట్టే అవకాశాలు పరిమితం అని చెప్పవచ్చు. రాజ్యాంగానికి అనుగుణ్యంగా ఉన్న విధానాలను అభ్యంతర పెట్టే అధికారం కోర్టులకు లేదు. కేంద్రం కూడా అడ్డుకొనే అవకాశాలు అంతంత మాత్రమే. సమస్య హైకోర్టు తరలింపు దగ్గరే ఎదురు కానుంది.అన్ని పార్టీలు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని చెబుతున్నాయి. అది మాత్రమే చాలదు. రాజధాని ఖరారు సమయంలోనే కర్నూలులోనో మరొక చోటో హైకోర్టును ప్రతిపాదించి కేంద్రానికి పంపి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. దేశ విభజన తరువాత తలెత్తిన పరిస్ధితులలో ఏర్పడిన తూర్పు పంజాబ్‌ హైకోర్టు, తరువాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల నూతన హైకోర్టులు లేదా ఉన్న బెంచ్‌లను హైకోర్టులుగా మార్చటం తప్ప ఒక రాష్ట్రంలో ఒకసారి ఖరారు అయిన హైకోర్టును మరొక చోటికి తరలించిన ఉదంతం మన దేశంలో ఇంతవరకు లేదు. రాష్ట్ర పునర్వ్యస్దీకరణ చట్టం, ఇతర విధి, విధానాల ప్రకారం హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించటం సాధ్యం కాదని కొందరు నిపుణుల తాత్పర్యం. చట్టంలో ఏ అడ్డంకులు ఉన్నా సుప్రీం కోర్టు, రాష్ట్రపతి అనుమతి ఇస్తే మరొక నోటిఫికేషన్‌ ద్వారా తరలించవచ్చన్నది మరొక భాష్యం. తరలింపును వ్యతిరేకిస్తున్నదీ, కోరుకుంటున్న వారిలో న్యాయవాదులు సహజంగానే ముందున్నారు కనుక రెండు వైపులా ఉద్దండులనే న్యాయపోరాటంలో రంగంలోకి దించుతారు.
హైకోర్టు విషయంలో న్యాయ పోరాటం అవసరం లేకపోతే సమస్యే లేదు, రణం తప్పనిసరైతే అదెలా జరుగుతుందో, ఎలా ముగుస్తుందో చూద్దాం. దానిలో జగన్‌ సర్కార్‌ గెలిస్తే హైకోర్టు కర్నూలుకు వెళుతుంది. ఓడిపోతే అమరావతిలోనే ఉండిపోతుంది. పర్యవసానాలకు జగన్‌మోహనరెడ్డి ఇప్పటి నుంచే సిద్దం కావాల్సి ఉంటుంది. వెలువడుతున్న అభిప్రాయాల మేరకు సెలెక్టు కమిటీ పేరుతో గరిష్టంగా ఆరునెలల పాటు అడ్డుకోవటం తప్ప మండలి చేసేదేమీ లేదు. ఆమోదించినా ఆమోదించకపోయినా అసెంబ్లీ తీర్మానం ఖరారు అవుతుంది. ఆ తరువాతే హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభం. దానికి కేంద్రం నుంచి అనుమతి ఎంతకాలానికి వస్తుందో, అసలు రాదో కూడా తెలియదు. హైకోర్టు తరలింపు తక్షణమే జరగదని తెలిసినా దానితో నిమిత్తం లేకుండానే విశాఖకు సచివాలయాన్ని తరలించాలని మౌఖింగా ఆదేశాలు, ఏర్పాట్ల గురించి సూచనలు వెళ్లాయి గనుక హైకోర్టు విషయం తేలేవరకు బండి గుర్రం కళ్ల ముందు గడ్డి ఉంచి పరుగెత్తించినట్లుగా రాయలసీమ వాసులకు కేంద్రాన్ని చూపుతూ కాలక్షేపం చేయవచ్చు. అది ఆలస్యమయ్యే కొద్దీ అధికారపక్షానికి సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. తరలింపు సాధ్యం కాదని తేలితే రాయలసీమలో వైసిపి భవిష్యత్‌ ఏమిటి? రాయలసీమ జనాన్ని సంతృప్తి పరచటం ఎలా అనే సమస్య తిరిగి ముందుకు వస్తుంది. అధికారపక్షానికి అది ఇరకాటమే.
మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకోకుండా ఉండేందుకు అవసరమైతే అసలు మండలినే రద్దు చేస్తామనే సూచనలు అధికారపక్షం నుంచి వెలువడ్డాయి. అవి బెదిరింపులా, ప్రలోభాలా మరొకటా అన్నది అన్నది ఎవరికి వారే భాష్యం చెప్పుకోవచ్చు. తరువాత అలాంటిదేమీ లేదని వైసిపి నేతలు చెబుతున్నప్పటికీ ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. ఒకవేళ నిబంధనలు అంగీకరించి రద్దుకు సిఫార్సు చేస్తే వెంటనే రద్దవుతుందా ? కేంద్రంలోని అధికారపార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఒకే రాజధాని అని చెబుతోంది కనుక ఆ సిఫార్సును వెంటనే ఆమోదించటానికి ఎందుకు చర్య తీసుకుంటుంది? ఆమోదించాలని కోరే పార్టీ వైసిపి తప్ప మరొకటి ఉండదు. రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ ప్రకారం రాజ్యసభ సీట్లకోసం బిజెపి నాయకత్వం ఒక వేళ రాజీపడి శాసన మండలిని వెంటనే రద్దు చేస్తే నష్టపోయే వాటిలో వైసిపి కూడా ఉంటుంది. తక్షణమే మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రి ఉద్యోగాలు ఊడతాయి. తెలుగుదేశం సభ్యుల పదవీ కాలం ముగియగానే తలెత్తే ఖాళీల కోసం ఎదురు చూస్తున్న వైసిపి రాజకీయ నిరుద్యోగుల ఆశలకు నీళ్లొదులు కోవాల్సిందే. వారిని సంతృప్తిపరచేందుకు పాలకపార్టీ ఆయాసపడాల్సిందే. రెండవది ఇప్పటికే రివర్సు(తిరగదోడే) సర్కార్‌ అని తెలుగుదేశం చేస్తున్న రాజకీయ దాడికి మరొక అస్త్రాన్ని అందించినట్లు అవుతుంది. రాజశేఖరరెడ్డి కార్యక్రమాలన్నింటినీ సమర్ధవంతంగా అమలు జరుపుతామన్న వైసిపి ఆయన హయాంలో పునరుద్దరణ జరిగిన మండలిని రద్దు చేశారనే సెంటిమెంటును కూడా తెలుగుదేశం ముందుకు తెస్తుంది.
మూడు రాజధానుల ప్రక్రియతో పాటు స్ధానిక సంస్ధలకు ఎన్నికలకు కూడా వైసిపి సిద్దపడింది. రిజర్వేషన్ల అంశంపై కోర్టుకు ఎక్కిన కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పుడు బిల్లు సెలక్టు కమిటీకి వెళ్లటంతో దాని ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అంతవరకు స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తారా? వేయకపోతే మూడు రాజధానుల అంశంతో ఎన్నికలు కూడా జరగవచ్చు, సహజంగానే కొన్ని చోట్ల ఎదురుదెబ్బలు తగిలినా ఎక్కువ చోట్ల లబ్ది పొందవచ్చన్న అంచనాతోనే వైసిపి ముందుకు పోవచ్చు. పెద్ద మెజారిటీతో అనుకూల ఫలితాలు వస్తే వాటిని చూపి మరింతగా రెచ్చిపోవటం ఖాయం. ఒక వేళ ప్రతిపక్షాలకు తగినన్ని స్ధానాలు వస్తే ఒకే రాజధాని గురించి సమీకరణలు మరింతగా పెరుగుతాయి.
అధికార వికేంద్రీకరణ ఎత్తుగడతో సచివాలయ తరలింపును సాంకేతికంగా అడ్డుకొనే అవకాశాలు లేవు గనుకనే బిజెపి రాజకీయ పార్టీగా వ్యతిరేకతకు పరిమితమైంది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెబుతోంది. లేదా అడ్డుకొనేందుకు ఉన్న నిబంధనా పరమైన అంశాల పరిశీలన, అధ్యయనం కోసం సమయం తీసుకుంటోందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. వైసిపి అజెండాను జయప్రదంగా అమలు జరిగేందుకు సహకరిస్తే లోపాయికారిగా ప్రయోజనాలు పొందవచ్చేమోగానీ రాజకీయంగా బిజెపి దానితో ముడివేసుకున్న జనసేన పని ముగిసినట్లే. అన్ని చోట్లా తన దుకాణామే ఉండాలి, మిగిలిన పార్టీల దుకాణాలు మూతపడాలని కోరుకుంటున్న, అందుకోసం దేనికైనా తెగించే బిజెపి అలాంటి ఆత్మహత్యా సదృశ్యమైన చర్యలకు పాల్పడుతుందా ? ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో దాని మెజారిటికి ఢోకా లేదు. స్వయంగా దానికే సంపూర్ణ మెజారిటీ వుండే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందువలన రాజకీయ కోణంలోనే బిజెపి ఆలోచించే అవకాశాలు ఎక్కువ. ఇటీవల బిజెపి-జనసేన సంయుక్త మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలను తామే దిగమింగుకోవటం కష్టం.
అనుకోని ఇబ్బందుల్లో పడిన వైసిపి ఇప్పుడేం చేస్తోంది? అసలేం చేయాలి? ఆస్ద్ధులన్నీ కరిగి పోయినా ఫర్వాలేదు, కేసు గెలవటం ముఖ్యం అని ఫ్యూడల్‌ ప్రభువులు వ్యవహరించినట్లుగా తాను తలపెట్టినదాన్ని నెగ్గించుకొనేందుకు ఎంతదాకా అయినా పోతాను అన్నట్లుగా వుంది ప్రభుత్వ తీరు. ఎందరో ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నప్పటికీ అమరావతి కేసుల్లో వాదనలకు ఐదు కోట్ల రూపాయల ఫీజుతో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహతగిని నియమించుకున్న విషయం తెలిసిందే. అవసరమైతే అలాంటి వారిని మరికొందరిని నియమించుకున్నా ఆశ్చర్యం లేదు, జనం సొమ్ము కదా ! మండలిని పూర్వపక్షం చేసేందుకు ఆర్డినెన్స్‌ తెస్తారా, దానికి గవర్నర్‌ రబ్బరు స్టాంపు వేస్తారా ? వంటి అనేక అంశాలు ఉన్నాయి.
సెలక్టు కమిటీ, ఇతర ఆటంకాల పర్యవసానాలు ఎలా ఉన్నా వైసిపి సర్కార్‌ రోజువారీ పాలన సాగించక తప్పదు. ఎన్నికలకు ముందే ముందుకు తెచ్చిన సంక్షేమ పధకాలను అమలు జరపాల్సి ఉంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన లక్షకోట్ల రూపాయలను దాని ఒక్కదానికే ఖర్చు చేసేది లేదని తేల్చి చెప్పింది కనుక ఇప్పుడు ఆ సొమ్మును, ఇతర అభివృద్ధి పధకాల సొమ్ముతో కలిపి పదమూడు జిల్లాల అభివృద్ధికి ఎంత మొత్తాన్ని, ఎలా ఖర్చు చేయనుందో ప్రణాళికను వెల్లడించాలి. నవరత్నాలను ఎలా అమలు జరుపుతామో వివరంగా చెప్పిన వారికి రాష్ట్ర అభివృద్ది పధకాలు రూపొందించటం ఒక లెక్క కాదు. సెలక్టు కమిటీ తీసుకొనే వ్యవధిని ప్రభుత్వం దీనికి ఉపయోగించుకొని మూడు రాజధానులు అయితే, ఒక వేళ కాకున్నా పదమూడు జిల్లాల అభివృద్ధి సూచికలు ఎంతెంత ఉన్నాయో, రానున్న నాలుగు సంవత్సరాలలో వాటిని ఎంత మేరకు, ఎలా పెంచుతారో జనానికి వెల్లడిస్తూ శ్వేత పత్రం ప్రకటించాలి. ప్రభుత్వం తానుగా అభివృద్ధికి పెట్టుబడుల సంగతి తేల్చాలి. మూడు రాజధానులతో నిమిత్తం లేకుండానే ఇప్పటికే అమలు జరుపుతున్న అభివృద్ధి పధకాలు ఎలాగూ కొనసాగుతాయి గనుక నిమిత్తం వాటితో లేకుండా వాటిని ప్రత్యేకంగా చేసే అభివృద్ధి ఏమిటో వెల్లడించాలి. అప్పుడే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ పేదలు తమ వలసలను విరమించుకొని ఇక్కడే ఉపాధి పొందేందుకు పూనుకుంటారు. అమరావతితో సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జిఎన్‌ రావు కమిటీ, లేదా బోస్టన్‌ కన్సల్టెన్సీ బృందం సమర్పించిన నివేదికలను మధించిన మంత్రుల ఉన్నత సా ్ధయి కమిటీ చేసిన సూచనలేమిటో, పూర్తి నివేదిక ఏమిటో జనానికి అందుబాటులో ఉంచాలి. ఇదేమీ రహస్యం కాదు, పారదర్శకతకు పక్కా నిదర్శనం అవుతుంది. అలాగాక మూడు రాజధానుల అంశం తేలిన తరువాతే మా గుప్పెట తెరుస్తాము లేదా మనసులో ఉన్నది చెబుతాము అంటే అందులో ఏమీ లేదనే అనుకోవాల్సి వస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d