• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

నరేంద్రమోడీ నిజం చెప్పినా నమ్మని రోజులు వస్తున్నాయా !

26 Sunday Jul 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Indian Economy, India economy slowdown, Indian economy, Indian GDP paradox, Narendra Modi government credibility


ఎం కోటేశ్వరరావు


” రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో ” అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు మరీ అంత పచ్చిగా నిజం మాట్లాడతావా, అవి మా నేతను ఉద్దేశించే కదా అంటూ దాడులకు దిగేవారు ఒక వైపు. మరోవైపు రెండు రెళ్లు ఎంతో తెలుసుకొనేందుకు కాలుక్యులేటర్‌ను ఆశ్రయించే వారు పెరిగిపోతున్న తరుణమిది.
ఇలాంటి స్ధితిలో దేశ ఆర్ధిక విషయాల గురించి నిజాలు మాట్లాడితే మోడీ అభిమానులు లేదా భక్తులు భరిస్తారా ? మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దెబ్బలాటలకు రారా ? మరోవైపు ఏమి జరుగుతోందో తెలియక జనం అర్ధం చేసుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు. కాలుక్యులేటర్లు రెండు రెళ్లు నాలుగు, మూడు మూళ్లు తొమ్మిది అని చూపగలవు తప్ప వివరణ ఇవ్వలేవు. రాజకీయ నాయకులు మసి పూసి మారేడు కాయలను చేయగలరు తప్ప వాస్తవాలను కనపడనివ్వరు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేయనున్నట్లు ప్రకటించారు. శంకుస్ధాపనకు ఎంచుకున్న సమయం అశుభ గడియ అని, సరైన సమయం కాదని శంకరాచార్య స్వరూపానంద అభ్యంతరం చెప్పారు.చాలా చోట్ల అమావాస్య రోజును అశుభంగా పరిగణిస్తే తమిళియన్లు ఆరోజును పరమ పవిత్రమైనదిగా చూస్తారు. ఇవి విశ్వాసాలకు సంబంధించిన సమస్యలు గనుక అవునని, కాదని చెప్పేవారు ఉంటారు.
కానీ దేశ ఆర్ధిక విషయాలకు సంబంధించి చెప్పాల్సిన వారు నోరు విప్పరు. అంకెలు ఒకటే అయినా కొందరు భిన్నమైన టీకా తాత్పర్యాలు, భాష్యాలతో మన మెదళ్లను తినేస్తున్నార్రా బాబూ అని అనేక మంది భావిస్తున్నారు. తమ సిబ్బంది సేకరించిన గణాంకాలు తప్పని ఏకంగా పాలకులే నిరుద్యోగంపై నివేదిక గురించి చెప్పిన విషయం తెలిసిందే. పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధికిందకే వస్తుంది, అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోవటం లేదని సాక్షాత్తూ మోడీ మహాశయుడే చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కరోనా వైరస్‌ పుణ్యమా అని ఎవరైనా పకోడి బండి పెట్టినా డబ్బుల్లేక ఆ వైపు వెళ్లేందుకు కొందరు విముఖత చూపుతుంటే, కరోనాను కావిలించుకోవటం ఎందుకురా బాబూ అని మరికొందరు వెళ్లటం లేదు. అంతిమంగా పకోడి బండ్లు చాలా మూతపడ్డాయి. ఎప్పుడు పూర్వపు స్ధాయికి వస్తాయో తెలియదు.
దేశ ఆర్ధిక స్ధితి గురించి జనానికి నిజం తెలియటం లేదు. కరోనా కారణంగా వివరాలను సేకరించే సిబ్బందే ఆ ఛాయలకు పోలేదని తెలిసిందే. బయటకు వస్తున్న సమాచారం మాత్రం ఆల్జీబ్రా మాదిరి గుండెను గాబరా పెడుతోంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గినా, వినియోగదారులను వీర బాదుడు బాది వసూలు చేస్తున్న మొత్తం మంగళగిరి పానకాల స్వామికి పోసే పానకం మాదిరి ఎటుపోతోందో తెలియటం లేదు.

ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యలోటు !
ఉగాది పంచాంగ శ్రవణంలో ఆదాయాలు, వ్యయాల గురించి ఏమి చెప్పారో తెలియదు గానీ ఈ ఏడాది బడ్జెట్‌లో పేర్కొన్నదాని కంటే లోటు రెట్టింపుకు పైగా పెరిగి 7.6శాతం ఉంటుందని అంచనా. ఇది తొలి రెండు నెలల తీరుతెన్నులను చూసి చెప్పిన జోశ్యం కనుక వాస్తవంగా ఎంత ఉంటుందో తెలియదు. కేంద్ర బడ్జెట్‌లోటు 7.6శాతం అయితే దానికి రాష్ట్రాలు 4.5శాతం జోడిస్తే వెరసి 12.1శాతం అవుతుందని అంచనా. ఈ లోటును పూడ్చుకొనేందుకు జనం కోసమే కదా అర్ధం చేసుకోరూ అంటూ కేంద్రం, రాష్ట్రాలూ పెట్రోలు, డీజిలు వంటి వాటి ధరలను మరింతగా పెంచినా ఆశ్చర్యం లేదు.
లోటు పెరగటం అంటే ప్రభుత్వాలకు ఆదాయం తగ్గటం, దానికి కారణం జనం వస్తువులు, సేవలను కొనుగోలు తగ్గించటం, అందుకు వారికి తగిన ఉపాధి, ఆదాయం లేకపోవటం, దాని పర్యవసానం వస్తువినియోగం తగ్గించటం, దాంతో పరిశ్రమలు, వ్యాపారాల మూత, ఫలితంగా నిరుద్యోగం పెరుగుదల ఇలా ఒకదానికి ఒకటి తోడై ఏం జరగనుందో తెలియని స్ధితి.
కరోనాకు ముందే పరిస్దితి దిగజారింది, తరువాత పరిస్ధితి మరింత ఘోరంగా తయారైంది. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ గారు చప్పట్లు, దీపాలతో జనాల చేత సంకల్పం చెప్పించారు. ఇరవై ఒక్క లక్షల కోట్ల ఉద్దీపన పధకం అంటూ ఆర్భాటంగా ప్రకటింపచేశారు. అదేమిటో జనానికి తెలియని బ్రహ్మపదార్ధంగా మారింది. ఎవరూ దాని గురించి పెద్దగా చర్చించటం లేదంటే అది మూసినా-తెరిచినా ప్రయోజనం లేని గుడ్డికన్ను వంటిది అని అర్ధం అయినట్లుగా భావించాలి.
ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అన్నట్లుగా ప్రభుత్వాల ద్రవ్యలోటు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా లబ్ది పొందేది కార్పొరేట్లు, ధనికులే అన్నది సామాన్యులకు అర్ధంగాని అంశం.లోటు తక్కువగా ఉంటే ఏదో ఒక పేరుతో ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు పొందేది వారే. లోటు ఎక్కువగా ఉంటే ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా లేనపుడు పెట్టుబడిదారులు ఎవరూ కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రారు. తమ వద్ద ఉన్న డబ్బును ప్రభుత్వానికి బాండ్ల పేరుతో వడ్డీకి ఇచ్చి లబ్ది పొందుతారు.లోటు పూడ్చే పేరుతో విలువైన భూములు, ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలు లేదా ఆస్ధులను కారుచౌకగా అమ్మినపుడు వాటిని కొనుగోలు చేసి లబ్ది పొందేదీ వారే.

వినియోగదారుల ధరలు మరింతగా పెరుగుతాయా ?
ఉత్పత్తిలో స్థబ్దత ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ను సడలించినా ఫ్యాక్టరీలు పూర్తి స్ధాయిలో పని చేయటం లేదు. దీని వలన గిరాకీ మేరకు వస్తువుల సరఫరా లేకపోతే ధరలు పెంచుతారు. మామూలుగానే వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గింది, కరోనాతో అది పెరిగింది. అయినా జూన్‌ నెలలో వినియోగదారుల ధరల సూచి పాక్షిక సమాచారం మేరకే 6.09శాతం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంచనాల కంటే వాస్తవంలో ఎక్కువ ఉంటుందన్నది తెలిసిందే. టోకు ధరల ద్రవ్యోల్బణ సూచి మే నెలలో మైనస్‌ 3.21శాతం అయితే అది జూన్‌ నాటికి 1.81కి చేరింది. అయితే రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 7 నుంచి 7.5శాతానికి పెరగవచ్చని ఆర్ధికవేత్త డాక్టర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి అంచనా వేశారు. ప్రభుత్వం తీసుకున్న ఆర్ధిక మద్దతు చర్యల వలన గిరాకీ పెరగవచ్చని, దానికి అనుగుణ్యంగా ఉత్పత్తి పెరగకపోతే ద్రవ్యోల్బణం-ధరలు- పెరగవచ్చని, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్బోల్బణం ఎనిమిదిశాతానికి చేరవచ్చని భానుమూర్తి అన్నారు.
ద్రవ్యోల్బణం ఏడుశాతానికంటే తగ్గే అవకాశాలు లేవని అనిల్‌ కుమార్‌ సూద్‌ అనే మరో ఆర్ధికవేత్త చెబుతున్నారు.చమురు ధరలను పెంచారు, పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులు పెరుగుతున్నాయి, రూపాయి విలువ తక్కువగా ఉంది. రవాణా, టెలికాం ఖర్చులు పెరిగాయి, సరఫరా గొలుసు పూర్తిగా వెనుకటి స్ధితికి రాలేదు అన్నారు. వ్యవసాయ రంగం వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ ఫ్యాక్టరీలు సామర్ధ్యంలో 50 నుంచి 55శాతమే పని చేస్తున్నాయని ఎస్‌పి శర్మ అనే మరో ఆర్ధికవేత్త చెప్పారు.

జిడిపి ఎంత మేరకు తగ్గవచ్చు ?
మన దేశంలోని రేటింగ్‌ సంస్ధ ‘ ఇక్రా ‘ అంచనా ప్రకారం వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి 9.5శాతం తిరోగమనంలో ఉండవచ్చు. తొలి త్రైమాస కాలంలో 25శాతం, రెండు, మూడులలో 12, 2.5శాతం వరకు లోటు ఉండవచ్చని, దాని అర్ధం సాధారణ కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయని, ఈ కారణంగా ద్రవ్యోల్బణం ఆరుశాతం అని జోశ్యం చెబుతున్నారు.

భారత్‌లో పెట్టుబడులకు ఇదే తరుణమా ?
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన ప్రసంగ భావం అదే. ఒక వైపు చైనా సంస్ధల పెట్టుబడులకు దారులు మూసిన సమయంలో అమెరికా-భారత్‌ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించిన మోడీ అమెరికన్‌ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణం అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు భారత్‌ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు 30శాతం లబ్ది పొందినట్లు ఒక అంచనా. విదేశీ ద్రవ్య పెట్టుబడిదారులు మన స్టాక్‌మార్కెట్‌ మంచి లాభాలను తెచ్చిపెట్టేదిగా భావిస్తున్నారు. ఆ మేరకు వారి పెట్టుబడులు పెరుగుతాయి, మన దగ్గర డాలర్ల నిల్వలు గణనీయంగా ఉండవచ్చుగానీ, మన దేశంలో ఉపాధి పెరిగే అవకాశాలు లేవు. మన సంపద లాభాల రూపంలో విదేశాలకు తరలిపోతుంది. మన స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు రావటానికి ఒక ప్రధాన కారణం కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించటమే. కంపెనీల దివాళా నిబంధనలను సరళంగా ఉంచాలని ప్రభుత్వం వత్తిడి తేవటాన్ని అంగీకరించని తాను బాధ్యతల నుంచి వైదొలిగినట్లు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు.
అంటే కంపెనీలు నిధులను, తీసుకున్న రుణాలను పక్కదారి పట్టించి దివాలా పేరుతో బిచాణా ఎత్తివేసేందుకు, సులభంగా తప్పించుకొనేందుకు అవకాశం ఇవ్వటం తప్ప మరొకటి కాదు. ఇది కూడా విదేశీ మదుపుదార్లను ఆకర్షిస్తున్నదని చెప్పవచ్చు. గూగుల్‌తో సహా అనేక కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెడతామని ముందుకు రావటానికి కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ఒక ప్రధాన కారణం. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఇప్పటికే తమిళనాడులో సెల్‌ఫోన్ల తయారీ యూనిట్‌ను నడుపుతున్నది. కొత్తగా పెట్టే సంస్ధలకు 15శాతమే పన్ను అన్న రాయితీని ఉపయోగించుకొనేందుకు అది మరో కొత్త పేరుతో విస్తరణకు పూనుకుంది. గూగుల్‌ వంటి కంపెనీలూ అందుకే ముందుకు వస్తున్నాయి. వీటి వలన మనకు కలిగే ప్రయోజనం కంటే వాటికి వచ్చే లాభం ఎక్కువ కనుకనే పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నాయి.

నిరర్ధక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి !
ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎన్‌పిఏ పాలకులు దివాలా తీయించారని బిజెపి చేసిన ప్రచారం గురించి తెలిసినదే. రాజకీయనేతలు బ్యాంకులకు ఫోన్లు చేసి వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇప్పించి కమిషన్లు దండుకున్నారని చెప్పింది. దాన్లో అతిశయోక్తి ఉన్నా వాస్తవ పాలు కూడా ఉంది. కానీ ఆరేండ్ల బిజెపి ఏలుబడి తరువాత బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రికార్డు స్థాయిలో పెరగనున్నట్లు ఆర్‌బిఐ స్వయంగా హెచ్చరించింది. దీనికి కరోనా కారణం అంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించారు. కరోనా కొన్ని సంస్దలను ఇబ్బందుల పాలు చేసిన మాట వాస్తవం. ఈ మాత్రానికే గణనీయంగా, ఆకస్మికంగా ఎలా పెరుగుతాయి ? మొత్తంగా చూసినపుడు స్టాక్‌ మార్కెట్‌లో పెరుగుదల ఆగలేదు. కంపెనీల లాభాల శాతం పెద్దగా పడిపోయిన దాఖలాలు లేవు. మోడీ సర్కార్‌ రుణ నిబంధనలను కఠినతరం గావించినట్లు చెప్పింది. ఇన్ని చేసినా నిరర్దక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నట్లు ? కాంగ్రెస్‌ నేతల మాదిరే బిజెపి పెద్దలు కూడా దందా ప్రారంభించారా ? 2020 మార్చినాటికి 8.5శాతంగా ఉన్న నిరర్దక ఆస్తులు 2021 మార్చినాటికి 12.5 లేదూ పరిస్ధితి మరింత దిగజారి వత్తిడి పెరిగితే 14.7శాతానికి పెరగవచ్చని స్వయంగా రిజర్వుబ్యాంకు హెచ్చరించింది.

కావలసింది నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీయా ? బలమైన దేశమా !
చరిత్రలో ఎందరో రాజుల ఏలుబడిలోని సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. వారి బలం వాటిని కాపాడలేకపోయింది. వర్తమాన చరిత్రలో నరేంద్రమోడీ నాయకత్వంలో గత ఆరు సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వం ఉంది. దాన్ని ఎవరూ కదిలించలేరన్నది అందరికీ తెలిసిందే. కానీ ఐదేండ్లు తిరిగే సరికి దేశం ఆర్ధికంగా దిగజారిపోయింది. నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీ లేదా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం, ఆయన మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో లాఠీలు పట్టుకొని వీధుల్లోకి వచ్చే ప్రచారకులు, స్వదేశీ జాగరణ మంచ్‌ వారు గానీ ఆర్ధిక దిగజారుడును ఆపలేకపోయారన్నది తిరుగులేని నిజం.
అనేక అంశాలు పరస్పర విరుద్దంగా కనిపిస్తున్నాయి.అది భాష్యం చెప్పేవారి చాతుర్యమా లేక వాస్తవ పరిస్ధితుల నిజాలను ధైర్యంగా నివేదించే సలహాదారులు మోడీ గడీలో లేరా ? దేశ ఆర్ధిక వ్యవస్దలోని అనేక సూచీలు తిరోగమనాన్ని సూచిస్తున్నాయి, వాటి మీద ఆధారపడే జిడిపి మాత్రం పురోగమనం చూపుతున్నది. దేశంలో నేడున్న అసహన పరిస్ధితుల నేపధ్యంలో అనేక మంది ఆర్ధికవేత్తలు బహిరంగంగా, సూటిగా పాలకుల వైఖరిని ప్రస్తుతానికి ప్రశ్నించలేకపోవచ్చు. అయినా కొందరు ధైర్యం చేసి వేస్తున్న ప్రశ్నలు, లేవనెత్తుతున్న సందేహాలను తీర్చేవారు లేరు.

గణాంకాల తిరకాసేమిటో సంతృప్తికరంగా తేల్చేయాలి: సి. రంగరాజన్‌
ఇటీవలి కాలంలో దేశ గణంకాలు, సమాచారానికి సంబంధించిన వివాదాలకు సంతృప్తికరంగా ముగింపు పలకాల్సి ఉందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ సి. రంగరాజన్‌ జాతీయ గణాంకాల దినోత్సవం సందర్భంగా జూన్‌ 30వ తేదీన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటించిన జీవన సాఫల్య అవార్డును అందుకుంటూ ఈ సూచన చేశారు. జాతీయ గణాంకాల కమిషన్‌కు గుర్తింపు ఇవ్వాలని, అలా చేస్తే దాని విధులు, బాధ్యతలేమిటో స్పష్టం అవుతాయని కూడా ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో ఈశాఖ విడుదల చేసిన గణాంకాలు, వాటికి అనుసరిస్తున్న పద్దతి వివాదాస్పదమై అనేక మందిలో అనుమానాలు తలెత్తాయి. జిడిపి సజావుగా ఉంటే దేశం ఎందుకు దిగజారుతోందనే ప్రశ్నలు వచ్చాయి. మన పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే మన సమాచార, గణాంకాల నాణ్యతను మెరుగుపరుచుకొనేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సిన స్ధితిలో ఉన్నాము. అలాంటి రుణం ఒకటి మంజూరైందని ప్రధాన గణకుడు ప్రవీణ్‌ శ్రీవాత్సవ చెప్పారు.

అడుగడుగునా అంకెల గారడీ !
2012-18కాలంలో మన జిడిపి సగటున ఏడుశాతం అభివృద్ధి చెందినట్లు లెక్కలు చూపుతున్నాయి.2011 నుంచి 2018వరకు ప్రతి ఏటా జిడిపి వృద్ధి రేటును వాస్తవమైన దాని కంటే 2.5శాతం అదనంగా చూపుతున్నారని 2014 అక్టోబరు నుంచి 2018 జూన్‌వరకు ప్రధాన మంత్రి ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద సుబ్రమణ్యం పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల పేరుతో సలహాదారు పదవి నుంచి తప్పుకున్న ఏడాది తరువాత సుబ్రమణ్యం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విమర్శను ప్రభుత్వ 2020-21ఆర్ధిక సర్వే తిరస్కరించింది. అయితే గత ఆర్ధిక సంవత్సరంలో దిగజారిన ఆర్ధిక స్దితి ప్రభుత్వం వెల్లడిస్తున్న అంకెల గారడీని నిర్ధారించింది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికీ నిజాలు చెప్పటం లేదు, ఇదే తీరు కొనసాగితే రేపు నిజం చెప్పినా నమ్మని స్ధితి కనిపిస్తోంది. మన ప్రభుత్వం జిడిపిని లెక్కిస్తున్న తీరు గురించి ఐఎంఎఫ్‌ ఆర్ధికవేత్తలు కూడా సందేహాలను వెలిబుచ్చారు.


నాడూ నేడూ ఒకటే ప్రచారం అదే దేశం వెలిగిపోతోంది !
2004వరకు అధికారంలో ఉన్న వాజ్‌పేయి హయాంలో దేశం వెలిగిపోయిందనే ప్రచారంతో బిజెపి ఆ ఏడాది ఎన్నికలకు పోయి బొక్కబోర్లా పడిన విషయం తెలిసినదే.2005-11 సంవత్సరాల మధ్యలో బ్యాంకుల రుణాల జారీ రేటు ఏటా 15శాతం చొప్పున అభివృద్ధి చెందిందని, తరువాత కాలంలో అది నాలుగుశాతానికి పడిపోయిందని సిఎంఐయి అధ్యయనం తెలిపింది. అంటే పెట్టుబడి ప్రాజెక్టులు మందగించాయనేందుకు అదొక సూచిక. పారిశ్రామిక ఉత్పత్తి 2011కు ముందు సగటున తొమ్మిదిశాతం వృద్ధి చెందినట్లు పరిశ్రమల వార్షిక సర్వే వెల్లడిస్తే తరువాత కాలంలో రెండుశాతానికి పడిపోయింది.ఇదే కాలంలో పెట్టుబడుల వార్షిక వృద్ధి రేటు 23.9 నుంచి మైనస్‌ 1.8శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో వినియోగం వృద్ధి రేటు వేగం మూడు నుంచి మైనస్‌ 1.5శాతానికి తగ్గింది, పట్టణ రేటు 3.4 నుంచి 0.3కు తగ్గింది ఇలా అనేక సూచికలు పడిపోగా జిడిపి వృద్ధి రేటును మాత్రం 7.2-7.1శాతంగా చూపారు. వేతనాల బిల్లుల శాతాలు కూడా ఇదే కాలంలో గణనీయంగా పడిపోయాయి, దేశం మొత్తంగా వినియోగం తగ్గటానికి ఇదొక కారణం. వీటన్నింటిని చూసిన తరువాత అంకెలు పొంతన కుదరటం లేదని జిడిపి రేటు గురించి అనేక మంది సందేహాలు లేవనెత్తారు. ఈ నేపధ్యంలోనే పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధి కల్పన కిందికే వస్తుందని, అలాంటి వాటిని గణాంకాలు పరిగణనలోకి తీసుకోకుండా నిరుద్యోగం పెరిగినట్లు చూపారని నరేంద్రమోడీ రుసురుసలాడారు. ఒక వేళ అదే నిజమైతే మోడీ ఏలుబడికి ముందు కూడా పకోడీల తయారీని లెక్కలోకి తీసుకోలేదు.

కరోనా తరువాత పరిస్దితి బాగుపడుతుందా ?
అనేక మంది కరోనా వచ్చింది కనుక తాత్కాలిక ఇబ్బందులు తప్పవని మోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోతారనటంలో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికీ భావిస్తున్నారు. అదే ప్రచారం చేస్తున్నారు. అంతా బాగుంది, మరోసారి దేశం వెలిగిపోతోంది, 2024 తరువాత కూడా మోడీయే ప్రధాని అని విపరీత ప్రచారం చేస్తున్నారు. అలాంటి గుడ్డి విశ్వాసం ఉన్న వారి బుర్రలకు ఇప్పటివరకు ఎక్కించింది ఒక పట్టాన దిగదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు రేపు తప్పనిసరై నరేంద్రమోడీ నిజాలు చెప్పినా జనాలు నమ్మని పరిస్ధితి వస్తుంది. అందుకే ఇప్పటికైనా జరుగుతోందేమిటో చెబుతారా ? బలమైన ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఫలితం లేదని తేలిపోయింది. వీటన్నింటినీ చూసినపుడు ఇప్పుడు కావలసింది దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి అన్న మహాకవి గురజాడ చెప్పిన అలాంటి జనంతో కూడిన బలమైన దేశమా లేక శ్రీశ్రీ చెప్పినట్లుగా చట్టసభల్లో తిరుగులేని మెజారిటీ ఉన్న ప్రభుత్వమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వందేళ్లలో ఎరగని, అంతుబట్టని ఆర్ధిక సంక్షోభం- పర్యవసానాలు !

12 Sunday Jul 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Economic Crisis In India, Indian economy, worst economic crisis


ఎం కోటేశ్వరరావు
భారత ఆర్ధిక వ్యవస్ధ పురోగమనం గురించి ఏ సంస్ధ ఏ రోజు ఏ జోశ్యం చెబుతుందో తెలియని అయోమయంలో దేశ ప్రజలు ఉన్నారు. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమంటే అసలు విషయాలు తెలిసిన పాలకులు వాస్తవాలను మూసి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి మీద గుడ్డి నమ్మకంతో ఉన్న జనం అది పాచిపోతే ఏమౌతుందో ఆలోచించే స్ధితిలో లేరు. ఏ మంత్రదండమో తమను ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందనే భ్రమల్లో ఉన్నారు. ఈ పరిస్దితికి కారణం నయా ఉదారవాద విధానాలు జనంలో కల్పించిన భ్రమలు అని ప్రపంచ పరిణామాలను చూసిన వారు చెబుతున్నారు. భిన్న ఆలోచనలు-అభిప్రాయాల చర్చకు మీడియాలో చోటు దొరకటం లేదు. ఏకపక్ష సమాచారం జనం మెదళ్లలోకి ఎక్కుతోంది. ఎందుకు అనే ప్రశ్న మన మస్థిష్కాల సాప్ట్‌వేర్‌ నుంచి అంతర్దానమైందా ? చెడిపోయిందా ?
కోవిడ్‌-19 మహమ్మారి గత వంద సంవత్సరాలలో సాధారణ సమయాల్లో ఎరగనంత ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని భారత రిజర్వుబ్యాంకు గవర్నరు శక్తికాంత దాసు శనివారం నాడు చెప్పారు. ఎస్‌బిఐ బ్యాంకింగ్‌ మరియు ఆర్ధిక సమావేశంలో గవర్నరు మాట్లాడారు. ఈ సంక్షోభం వలన ఉత్పత్తి, ఉద్యోగాలు, సంక్షేమ రంగాలలో అసాధారణ ప్రతికూలతలు చోటు చేసుకుంటాయని, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతాయని హెచ్చరించారు.
ఆల్ఫా ఇన్వెస్కో అనే వార పత్రిక శనివారం నాడే ఒక విశ్లేషణను వెలువరించింది. ముందే చెప్పుకున్నట్లు ఎప్పుడు ఏ జోశ్యం వెలువడుతుందో తెలియదు. అలాంటి వాటిలో మచ్చుకు ఈ విశ్లేషణలోని ముఖ్యాంశాలను చూద్దాం. ” మదుపుదార్లు రెండు అంశాల మీద అంచనా, ఆశలతో ఉన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత క్రమం ప్రారంభమైంది గనుక ఏడాదిలోపు సాధారణ పరిస్ధితిలు నెలకొని 2020 జనవరి స్ధాయికి చేరుకుంటాయి. ఆదాయాల పునర్దురణ జరిగి వినియోగదారులు డబ్బు ఖర్చు పెడతారు. ఇవి అత్యంత ప్రమాదకరమైన అంచనాలు. ఆర్ధిక స్ధితి అస్తవ్యస్దంగా అదుపు తప్పి ఉంది. అంచనావేస్తున్నదాని కంటే కోలుకోవటం ఆలస్యం కావచ్చు. పూర్వపు స్ధితికి రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కరోనా వైరస్‌ ప్రారంభ దినాలలో తాత్కాలిక మైన ఎదురు దెబ్బ, పరిణామం అనే అభిప్రాయం ఉండేది. అయితే అందరం అనుకున్నదాని కంటే నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. మూడు దృశ్యాలను ఊహించుకోవచ్చు.
1.ఆశావహ దృశ్యం: ఆర్ధిక వ్యవస్ధ రానున్న ఏడాది కాలంలో సాధారణ స్ధితికి చేరుకోవచ్చు.భారత్‌లో నష్టం ప్రస్తుత పరిస్దితిని బట్టి తక్కువగా ఉండవచ్చు.
2.వాస్తవిక దృశ్యం : భారత ఆర్ధిక వ్యవస్ధ భారీ ఆర్ధిక మూల్యాన్ని చెల్లించవచ్చు. అయితే రెండు మూడు సంవత్సరాలలో పునరుద్దరణ అవుతుంది.ఈ మూల్యాన్ని ప్రయివేటు రంగమా, ప్రభుత్వమా, సాధారణ జనమా లేక ద్రవ్య వ్యవస్ధా ఎవరు చెల్లించాలన్నది పెద్ద అనిశ్చితంగా ఉంటుంది.
3.అత్యంత చెడు దృశ్యం : రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యాక్సిన్‌ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు వైరస్‌ ఉండవచ్చు. తలసరి ఆదాయం పడిపోయి, నిరుద్యోగం పెరిగిపోయి భారత్‌ కొన్ని సంవత్సరాలు వెనక్కు పోవచ్చు. కోలుకోవటానికి ఐదు సంవత్సరాల వరకు పట్టవచ్చు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ దాదాపు 20బిలియన్‌ డాలర్ల మేరకు నిధులు పెంచుకుంది. అన్ని ప్రధాన ప్రయివేటు బ్యాంకులు మరింత నగదును పెంచుకొనేందుకు చూస్తున్నాయి. జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా నుంచి విద్యుత్‌ ఆస్ధులను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను జెఎస్‌డబ్ల్యు రద్దు చేసుకుంది. స్నోమాన్‌ లాజిస్టిక్సును తీసుకోవాలనుకున్న అదానీ కూడా వెనక్కు తగ్గారు. ఇవన్నీ అదనపు జాగ్రత్తలు, ఆర్ధిక వ్యవస్ధకు తాకబోయే దెబ్బలను సూచిస్తున్నాయి. ప్రమోటర్ల కంటే మదుపుదార్లు ఎక్కువ ఆశాభావంతో ఉన్నారు” ఇవి ఆల్ఫా ఇన్వెస్కో విశ్లేషణలోని కొన్ని అంశాలు.
2008లో ధనిక దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభమే ఇంకా పూర్తిగా తొలగకపోగా ప్రభావం చూపుతుండగానే అంతకు ఎన్నో రెట్లు పెద్దదని భావిస్తున్న సంక్షోభం ఇప్పుడు మన ముందున్నది. ఈ నేపధ్యంలో మన నేతలు జనానికి వాస్తవాలు చెబుతున్నారా ? అసలు వాస్తవ పరిస్ధితి ఏమిటో ఒక్కసారి చూద్దాం.
వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2020-21)లో తొలి మూడు మాసాలు గడచి పోయాయి. ఆర్ధిక వ్యవస్ద పురోగతికి కొలమానంగా పరిగణించే జిడిపి ఎంతశాతం పడిపోయిందో ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 4.5శాతం తిరోగమనంలో ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) వేసిన అంచనాను మన ఆర్ధిక మంత్రిత్వశాఖ జూన్‌ నెలవారీ నివేదికలో ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో ఐఎంఎఫ్‌ వేసిన అంచనాలు అనేకం తప్పాయి. ఈ వార్త వెలువడక ముందే తిరోగమనం 6.4శాతం వరకు ఉండవచ్చని కేర్‌ రేటింగ్స్‌ సంస్ధ పేర్కొనగా మరికొన్ని అంచానాలు ఐదుశాతానికి ఎక్కువే ఉండవచ్చని జోశ్యం చెప్పాయి.ప్రపంచ సగటు తిరోగమనం 4.9శాతంగా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది.
ఒక ప్రామాణిక సంస్దగా పేరున్న సిఎంఐయి(సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) జూలై ఎనిమిది నాటి వెబ్‌ సైట్‌ సమాచారం ప్రకారం 2019 సెప్టెంబరుతో ముగిసిన మూడు మాసాల కాలంలో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనల విలువ రూ.2.3లక్షల కోట్లు కాగా డిసెంబరునాటికి అవి 5.15, మార్చినాటికి 3.37 లక్షల కోట్లుగా ఉండగా 2020 జూన్‌ నాటికి అది కేవలం 56వేల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇక పూర్తయిన ప్రాజెక్టుల పరిస్ధితిని చూస్తే పైన పేర్కొన్న మాసాలలో వరుసగా 0.85, 1.65, 1.70, 0.17 లక్షల కోట్లుగా ఉన్నాయి. అన్నింటి కంటే మార్చినెలతో ముగిసిన మూడు మాసాలలో నిలిపివేసిన ప్రాజెక్టుల విలువ రూ.9.24 లక్షల కోట్లంటే కరోనాతో నిమిత్తం లేకుండానే దేశంలో ఆర్ధిక దిగజారుడు ఎలా ఉందో సూచిస్తోంది. అందువలన ఎవరైనా కరోనాను సాకుగా చూపుతున్నారంటే వాస్తవ పరిస్ధితిని మరుగుపరుస్తున్నట్లే ! మూసిపెడితే పాచి పోతుందన్న సామెత తెలిసిందే. దేశంలో ఇప్పుడు అదే జరుగుతోందా ?
దేశంలో వలస కార్మికుల సంఖ్య ఎంతో మన ప్రభుత్వాల దగ్గర సమాచారం లేదన్నది కరోనా బయట పెట్టిన ఒక చేదు నిజం. అంటే ఎందరికి ఉపాధికల్పించారో కూడా అనుమానమే, కాకి లెక్కలు లేదా అంచనాలు తప్ప వాస్తవ పరిస్ధితిని అవి ప్రతిబింబించవు. సిఎంఐయి సమాచారం ప్రకారం ఏప్రిల్‌, మే నెలలో 23.5శాతానికి చేరిన నిరుద్యోగం జూన్‌ మాసంలో 11శాతం ఉంది. ఇది కరోనాకు ముందు అక్టోబరునెలలో ఉన్న గరిష్ట 8.2శాతానికి ఎక్కువ అన్నది తెలిసిందే. నిరుద్యోగం పెరిగినపుడు వేతనాలు తగ్గిపోవటం అన్నది సాధారణ సూత్రీకరణ. అసలు సమాచారమే సేకరించే యంత్రాంగమే అస్తవ్యస్తం అయిన స్ధితిలో సరైన గణాంకాలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు.ఎలక్ట్రానిక్‌ వే బిల్లుల విలువ మొత్తం జూన్‌ నెలలో రూ.11.4 లక్షల కోట్లని ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకుంటోందని కొన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజంగా కోలుకుంటే సంతోషించని వారెవరు ? అంతకు ముందు పూర్తి లాక్‌డౌన్‌ విధించటం, జూన్‌లో గణనీయంగా సడలించిన కారణంగా ఈ పెరుగుదల ఉండవచ్చు. సాధారణ స్ధితి నెలకొన్న తరువాత గతంతో పోల్చినపుడు వాస్తవాలు వెల్లడి అవుతాయి.
చరిత్రలో తొలిసారిగా ప్రపంచమంతటా 2020లో ఆర్ధిక పురోగతి తిరోగమనంలో ఉండబోతున్నదని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది. ఇదే సమయంలో చైనాలో ఒకశాతం అభివృద్ధి ఉంటుందని చెప్పింది. చైనా ప్రభుత్వం ఈ ఏడాది జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించటం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న చైనాను విస్మరించటం సాధ్యం కాదు. అందువలన ప్రతి సంస్ద లేదా ప్రధాన దేశాలన్నీ దాని అభివృద్ధి గురించి తమ తమ అంచనాలను వెల్లడిస్తూనే ఉన్నాయి.చైనా ఆర్ధిక సంవత్సరం జనవరితో ప్రారంభమౌతుంది. తొలి మూడుమాసాల్లో 6.8శాతం తిరోగమనంలో ఉన్నది కాస్తా ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 1.1శాతం పురోగమనంలోకి వచ్చినట్లు జపాన్‌ నికీ తెలిపింది. ఏడాది సగటు 3.3శాతం ఉండవచ్చని తొలుత అంచనా వేసినప్పటికీ దాన్ని ఇప్పుడు 1.6శాతానికి తగ్గించారు. మరో ఆరు నెలల్లో ఏమి జరగనుందో చూడాల్సి వుంది. లాక్‌డౌన్‌ తరువాత పూర్తి స్ధాయిలో అక్కడ ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి గనుకనే తిరోగమనం నుంచి పురోగమనంలోకి వచ్చింది. మన వ్యవస్ద లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత పురోగమనం నుంచి తిరోగమనంలో జారనున్నట్లు జోశ్యాలు వెలువడుతున్నాయి, ఎంత తేడా !
మన ఆర్ధిక వ్యవస్ధ విషయానికి వస్తే కరోనా ఉద్దీపనగా ప్రకటించిన 21లక్షల కోట్ల పాకేజి ఏమైందో తెలియదు. లడఖ్‌ లడాయితో పాలకులు, వారి కనుసన్నలలో మెలిగే ప్రధాన స్రవంతి మీడియా రోజుకో కొత్త కథతో కాలక్షేపం చేస్తోంది. జనంలో ప్రమాదకరమైన జాతీయ భావనలను రెచ్చగొడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పడిపోనందున మిగులు ఏమైందో తెలియదు, జనం మీద మోపిన చమురు పన్నులు, ధరల పెంపు రాబడి ఎటుపోయిందో తెలియదు.గత ఏడాదితో పోలిస్తే తొలి మూడునెలల్లో తెచ్చిన అప్పులు 51శాతం పెరిగాయి, రాష్ట్రాలూ అదే బాటలో ఉన్నాయి.
నిరుద్యోగ సమస్య విషయానికి వస్తే మూడుపదుల లోపు యువతీ యువకులు పెద్ద ఎత్తున కరోనా కారణంగా తలెత్తే నిరుద్యోగ బాధితులుగా ఉంటారని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అనేక మంది పట్టణాల్లో ఉండే ఖర్చులను భరించలేక, ఉపాధి లేక గ్రామాలకు తరలి పోయారు. మూడు పదుల లోపు యువతీ యువకులు నైపుణ్యం తక్కువగా ఉండే ఉపాధివైపు ముందుగా మొగ్గుచూపుతారు,పనిలో కొంత నైపుణ్యం సాధించిన తరువాత మెరుగైన ఉపాధిని చూసుకుంటారు. అర్ధిక తిరోగమన, కరోనా మహమ్మారుల వంటి సమయాల్లో యజమానులు ఇలాంటి వారితో ప్రయోగాలు చేసేందుకు సిద్ధ పడరు.కరోనా వైరస్‌ ఎంతకాలం ప్రభావం చూపుతుందో ఎందరిని బలిగొంటుందో తెలియదు గానీ దాని సంక్రమిత సమస్యలు దశాబ్దాల పాటు ఉంటాయని అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) హెచ్చరించింది. వంతుకు విరుద్ధంగా ప్రతి ఆరుగురిలో ఒకరు లేదా 17శాతం మంది యువత మహమ్మారికి ప్రభావితులై ఉపాధి కోల్పోయారని తన తాజా నివేదికలో పేర్కొన్నది. మన దేశంలో అది ఇంకా ఎక్కువగా ఉన్నట్లు అంచనా.2018-19లో 15-29 సంవత్సరాల వయస్సులోని వారు 17.3శాతం మంది నిరుద్యోగులుగా ఉంటే ఈ ఏడాది మేనెలలో వారు 41శాతం ఉన్నట్లు, 2.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయినట్లు సిఎంఐయి తెలిపింది. యువతరం పొదుపు చేయలేనట్లయితే అది తరువాతి తరం మీద కూడా ప్రభావం చూపుతుందని సంస్ధ అధికారి మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ప్రతి నెలా 13లక్షల మంది పని కావాల్సిన వారిలో చేరుతున్నారు. ప్రస్తుతం దేశంలోని జనాభా తీరుతెన్నులను చూసినపుడు 2040 వరకు పని చేసే వయస్సు వారు తమ మీద ఆధారపడే పిల్లలు, వృద్ధుల కంటే ఎక్కువగా ఉంటారని అయితే కరోనా కారణంగా ఈ పరిస్ధితి వలన కలిగే లబ్దిని కోల్పోతారని, వారికి ఉపాధి కల్పించకపోతే లబ్ది కాస్తా నష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనాకు ముందే యువతకు ఉపాధి కష్టంగా మారిన దేశాల్లో ఒకటిగా మన దేశం మారిన విషయం తెలిసిందే. నాలుగుదశాబ్దాల నాటి నిరుద్యోగ రికార్డును బద్దలు కొట్టటం, లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టటం, బయటకు వచ్చినా తప్పుడు లెక్కలని బుకాయించి తరువాత అవి సరైనవే అని చెప్పిన విషయం తెలిసిందే. నిరుద్యోగం పెరిగినపుడు జీతం ఎంతని కాదు ముందు ఏదో ఒక పని చేయాలనే యావతతో తక్కువ వేతనాలకు యువత సిద్దపడే విషయం తెలిసిందే. తమ తలిదండ్రుల కంటే తక్కువ సంపాదించే దుస్ధితికి లోనవుతారు.
ఏదో ఒక డిగ్రీ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వారు 2018లో ఆరుశాతం ఉంటే ప్రస్తుతం 12.7శాతం ఉన్నారు. మన వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు పారిశ్రామిక ఉత్పాదక, నిర్మాణ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు.2012 నుంచి అటువంటి పెట్టుబడులు తగ్గిపోతున్నాయని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనంలో తెలిపింది.2016 నుంచి చూసినపుడు మన దేశంలో 40.5 కోట్ల ఉద్యోగాలకు అటూ ఇటూగా ఉండటం తప్ప పెరుగుదల లేదు. పెద్ద నోట్ల రద్దు, నాన్‌ బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభం, కంపెనీలు కొత్త సామర్ధ్యాన్ని పెంచేందుకు వీలుగా పెట్టుబడులు పెట్టే పరిస్ధితి లేకపోవటం, దాంతో కొత్త ఉద్యోగాలు లేకపోవటాన్ని చూస్తున్నాము. సులభతర వాణిజ్య సూచికను ఏటేటా మెరుగు పరుస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పటం తప్ప 2019 జూన్‌ నాటికే వాణిజ్యం చేయాలన్న సంకల్పం పదేండ్ల నాటి కంటే తక్కువ స్ధాయికి పడిపోయినట్లు ఒక సంస్ధ సర్వే వెల్లడించింది. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, బ్యాంకుల్లో నగదు లభ్యత పెంపు వంటి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జనంలో కొనుగోలు శక్తి ఎంతగానో క్షీణించిందన్న అంశం తెలిసిందే. సరైన ఉద్యోగాలు, సరైన వేతనాలు లేకపోతే జనం కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మన జనాభా గణనీయంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం వారి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది.
దేశ ఆర్ధిక విషయాలకు వస్తే కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్ధితిని దాచేందుకు ప్రయత్నిస్తోంది.2019-20 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 19.6లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని అంచనా వేశారు. తరువాత దాన్ని 18.5లక్షల కోట్లకు సవరించారు. కానీ వాస్తవంగా వచ్చింది 16.8లక్షల కోట్లేనని తేలింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకు ముందు సంవత్సరం కంటే వాస్తవ ఆదాయం తగ్గింది. అంటే అసలు జబ్బు కరోనా వైరస్‌ కంటే ముందే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం చమురు పన్ను, ధరలను పెంచుతున్నది. ఈ అడ్డగోలు చర్యల గురించి ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పరు. ఏ విధాన ప్రాతిపదికన ధరలను పెంచుతున్నారో చెప్పని ఒక నిరంకుశ వైఖరి తప్ప మరొకటి కాదు. ఎలాంటి కసరత్తు లేదా సరైన అంచనాలు లేకుండా ప్రారంభించిన జిఎస్‌టితో తలెత్తిన సమస్యలు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అవి జనం చావుకు తెచ్చాయంటే అతిశయోక్తి కాదు. చమురు ఉత్పత్తుల మీద పెంచిన అదనపు పన్ను లేదా ధర ద్వారా వచ్చిన ఆదాయం దేనికి ఖర్చు చేస్తారో చెప్పరు.
కార్పొరేట్‌ శక్తులకు ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా ప్రత్యక్ష పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. పోనీ ఈ మేరకు లబ్ది పొందిన కార్పొరేట్లు తిరిగి ఆ సొమ్మును పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పించే ప్రాజెక్టులను చేపడుతున్నాయా అంటే అదీ లేదు.2018-19లో వసూలైన రూ.11.36లక్షల కోట్ల పన్ను మొత్తం 2019-20కి రూ.10.49 లక్షల కోట్లకు తగ్గింది. ఉద్దీపన పేరుతో కార్పొరేట్‌ పన్ను, దానికి సెస్‌, సర్‌ఛార్జి 34.61శాతంగా ఉన్నదానిని 25.17కు తగ్గించారు. 2019 అక్టోబరు ఒకటి తరువాత ఉనికిలోకి వచ్చే సంస్ధలకు ఆ పన్నును 17.01శాతంగా నిర్ణయించారు. ఇక పరోక్ష పన్ను అయిన జిఎస్‌టి విషయానికి వస్తే అంచనా వేసిన విధంగా లేదా కోరుకున్న విధంగా ఏటా 14శాతం పెరగటం లేదు. పధకం ప్రారంభంలో ఉన్న ఆదాయాల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఏటా 14శాతం వంతున పన్ను ఆదాయం పెరగకపోతే తగ్గిన మేరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెస్‌ మొత్తం నుంచి చెల్లిస్తామన్నది రాష్ట్రాలకు చేసిన వాగ్దానం. అంటే కనీసం ఏటా 14శాతం పెరుగుతుందనే అంచనాతో దీన్ని ప్రారంభించారని అనుకోవాలి.2019-20లో ఎనిమిది శాతమే పెరిగాయి. జిఎస్‌టిని 2017జూలైలో ప్రారంభించారు. దేనికైనా కొన్ని ప్రారంభ సమస్యలు ఉంటాయని సరిపెట్టుకుందాం.అలాంటివి 2017-18 ఆర్ధిక సంవవత్సరంలోనే బయట పడ్డాయి. తరువాత సంవత్సరాలలో ఆదాయం తగ్గటానికి ఇంకా ప్రారంభ సమస్యలే అని చెప్పటం సమర్ధనీయం ఎలా అవుతుంది. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే వైఫల్యం అనాలి. ఈ విధానం కారణంగా మద్యం, చమురు ఉత్పత్తుల వంటి కొన్నింటి మీద తప్ప మిగతా అంశాల మీద రాష్ట్రాలు పన్నులు విధించే లేదా తగ్గించే అవకాశాలు లేవు.
దీని పర్యవసానాలు ఇంకా పూర్తిగా ప్రభావం చూపటం లేదు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు,జిఎస్‌టి వైఫల్యం, దేశంలో తలెత్తిన ఆర్ధిక మాంద్యం కారణంగా బడ్జెట్లలో భారీ లోటు ఏర్పడుతోంది. దాంతో కేటాయింపులకు కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక సబ్సిడీలను ఎత్తివేశారు. ఎరువుల సబ్సిడీలను పరిమితం చేశారు. కొన్ని సంక్షేమ పధకాలకు కోతలు పెట్టారు, మిగిలిన వాటికి రానున్న రోజుల్లో కోతలు పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ లోటు బడ్జెట్‌లను పూడ్చుకొనేందుకు భారాలు మోపటం పెట్రోలియం ఉత్పత్తులతో ప్రారంభమైంది. అంతకు ముందే అనేక రాష్ట్రాలు ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మి లోటును పూడ్చుకున్నాయి. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి పెట్టుబడి పెడితే ఉపాధి పెరుగుతుందని సరిపెట్టుకోవచ్చు దానికి బదులు కేంద్ర ప్రభుత్వం లాభాలు రానివాటినే కాదు వచ్చే వాటిని కూడా వదలించుకొని లోటును పూడ్చుకొనేందుకు నిర్ణయించింది.
కేంద్రం లేదా రాష్ట్రాలు చమురు ఉత్పత్తులపై పన్నులను పెంచుతున్నాయి. ఇది ఆర్ధిక వ్యవస్దను మరింతగా దెబ్బతీయనుంది. అత్యధికంగా వినియోగమయ్యే డీజిల్‌ మీద గతంలో సబ్సిడీ ఇచ్చిన కారణంగా ధరలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేశారు. ధరలు కూడా పెట్రోలు కంటే డీజిల్‌ మీద ఎక్కువ పెంచారు. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు, ఎక్కువ ఆదాయం రావాలంటే ఎక్కువ వినియోగంలో ఉన్నదాని మీద పిండుకోవాలంతే ! ఆదాయపన్ను రేటు పెంచితే ధనికులకు ఆగ్రహం వస్తుంది కనుక దాని జోలికి పోరు. చమురు ధరలు పెంచితే అధిక భారం మోసేది సామాన్య, మధ్యతరగతి వారే. నిత్యావసర వస్తువుగా ఉన్న చమురు ధర పెరిగితే వినియోగం పెద్దగా తగ్గే అవకాశాలు లేవు. పరోక్షంగా దానికి చెల్లింపుల కారణంగా ఇతర వస్తువినియోగం మీద పడి, డిమాండ్‌ తగ్గుదలకు దోహదం చేస్తుంది. అది ఉత్పాదకత తగ్గేందుకు, ఉపాధి పరిమితం, నిరుద్యోగం అపరిమితం అయ్యేందుకు తోడ్పడుతుంది.ధరలు పెరుగుతాయి. ఈ విషయాలను దాచిపెట్టి జనం దృష్టిని మళ్లించేందుకు పాలకులు రకరకాల జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో వివాదాలు, అంతుబట్టని ఉగ్రవాద ఉదంతాలు వాటిలో భాగమే అని అనేక మంది నమ్ముతున్నారు. ఏతా వాతా చెప్పవచ్చేదేమంటే ప్రభుత్వాలు లోటుబడ్జెట్‌లను పూడ్చుకొనేందుకు ధనికుల మీద, కార్పొరేట్‌ పన్నుల ద్వారా పూడ్చుకోవాలి తప్ప జనం మీద భారాలు మోపితే అది మొత్తం ఆర్ధిక వ్యవస్ధనే దెబ్బతీస్తుంది. దేశంలో ఇప్పుడు జరుగుతోంది అదే. ఈ దివాలా కోరు, ప్రజావ్యతిరేక విధానాలకు ఇప్పుడు కరోనా మహమ్మారి తోడైంది. గతంలో విధానాల వైఫల్యం ధరలు, నిరుద్యోగం, దారిద్య్రం పెరుగుదల వంటి సమస్యలను ముందుకు తెచ్చింది. ఇప్పుడు ఈ రెండూ జమిలిగా జనాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఊహించటం కష్టం !
గమనిక : ఈ విశ్లేషణ తొలుత 2020 జూలై 12వ తేదీ నవతెలంగాణా దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతి ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో ప్రచురితమైంది. దాని నవీకరణలో భాగంగా తాజా అంశాలు జోడించటమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విత్తన స్వాతంత్య్రం- అధిక దిగుబడుల ఆవశ్యకత !

08 Wednesday Jul 2020

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Telangana

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, farmers seeds rights


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

రైతాంగం పూర్తి స్ధాయిలో వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగమయ్యారు. విత్తన స్వాతంత్య్రం కోల్పోయిన రైతాంగం విదేశీ కంపెనీల మీదనే ప్రధానంగా పత్తి విత్తనాల కోసం ఆధారపడక తప్పటం లేదు. బీటీ విత్తనాలు పురుగును రాకుండా చేస్తాయని మార్కెట్‌ లోకి 2002లో ప్రవేశించి ఇపుడు మార్కెట్‌ ను పూర్తిగా శాసిస్తున్నాయి. పత్తి రైతులు 95 శాతం బీటీ విత్తనాలనే వాడుతున్నారు. విదేశీ ఎంఎన్‌సీలతో కాంట్రాక్టు కుదుర్చుకున్న జాతీయ కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. 2019లో 354 లక్షల బేళ్ళ పత్తిని పండించారు.
ప్రపంచంలో హెక్టారుకు 109 కిలోలకు మించి దిగుబడులతో పత్తి పండించే దేశాలు 77 ఉన్నాయి. మరికొన్నింటిలో పండించినప్పటికీ దిగుబడి అతి తక్కువగా ఉన్నందున పరిగణనలోకి తీసుకోవటం లేదు. వాటిలో ఆస్ట్రేలియా 2,056 కిలోలతో దిగుబడిలో ప్రధమ, 1,905 కిలోలతో ఇజ్రాయెల్‌, 1,748 కిలోలతో చైనా ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నాయి. 623కిలోలతో పాకిస్ధాన్‌ 32వ, 496కిలోలతో మన దేశం 36వ స్ధానంలో ఉంది. ప్రపంచ సగటు 765 కిలోలు. దీని కంటే ఎక్కువ దిగుబడులు 17దేశాలలో వస్తున్నాయి.
అనేక దేశాల మాదిరి హై డెన్సిటీ ప్లాంటింగ్‌ చేసి సూటిరకాల విత్తనాలను వాడుతూవుంటే పత్తి సగటు ఉత్పత్తిలో ప్రపంచంలోనే ముందుండేవాళ్ళం. రైతుల ఆదాయం పెరిగేది. మన దేశ శాస్త్రజ్ఞులు, పాలకులు , రైతులు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒక్క భారతదేశంలోనే హైబ్రిడ్‌ విత్తనాలతో వ్యవసాయం చేస్తున్నారు. అమెరికా , బ్రెజిల్‌, చైనా తో సహా ప్రపంచంలో పత్తి పండించే దేశాలన్నీ హైబ్రిడ్‌ విత్తనాలతో పత్తి పండించటంలేదు. జన్యుమార్పిడి బీటీ విత్తనాలతో సహా వెరైటీలను అంటే సూటి రకాల విత్తనాలను అంటే పంటనుండి తీసిన విత్తనాలనే కంపెనీలు పేటెంట్‌ చట్టం పేరున రైతులకు అమ్ముతున్నాయి.
మన దేశంలో హైబ్రిడ్‌ విత్తనాల తయారీని మోన్సాంటో, బేయర్స్‌ లాంటి కంపెనీలు ప్రోత్సహించాయి. అపార లాభాలను పొందాయి. ప్రతి సంవత్సరం తన విత్తనాలను అమ్ముకోవటానికి కంపెనీల దుష్ట ప్రణాలిక వలన రైతులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. 1.విత్తనాల ఖర్చు ఎక్కువ అవుతున్నది,2. పత్తి దిగుబడులు తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నారు.
తన పంటలో మంచి గింజలను గుర్తించి తరువాత విత్తనాలుగా వాడే అలవాటును మెల్లగా మాన్పించి హైబ్రిడ్‌ విత్తనాలను అలవాటు చేశారు. నాణ్యమైన హైబ్రిడ్‌ విత్తనాలను తయారుచేసిస్తామన్నారు. ఆ టెక్నాలజీ వేరన్నారు. 50 పత్తి గింజలను తెచ్చి మన దేశంలో మన చేతనే మల్టిప్లై చేయించి, మన మొక్కలతో సంకరం చేసి, అందమైన పాకింగ్‌ చేయించి, ప్రచారార్భాటాలతో రైతులచే కొనిపిస్తున్నారు. ఆడ మొగ మొక్కలను వేరుగా పెంచి , మొగచెట్ల పుప్పొడిని ఆడ మొక్కల పూవులపై అంటించి క్రాస్‌ (సంపర్కం) చేయాలి. మన దేశంలో చౌకగా వున్న బాల కార్మికులతో క్రాసింగ్‌ జరిపించి హైబ్రిడ్‌ విత్తనాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. విత్తన ఉత్పత్తికి కర్నూలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాల వాతావరణం అనుకూలంగా ఉండటంతో అక్కడనుండే హైబ్రిడ్‌ విత్తనాలు తయారీ అవుతున్నాయి.. అనుకూల వాతావరణం, చౌకగా అందుతున్న బాలకార్మికుల శ్రమ కంపెనీలకు అనూహ్యమైన లాభాలను తెచ్చిపెట్టాయి. దీనికి తోడుగా పేటెంట్‌ చట్టం పేరుచెప్పి తమ అనుమతి లేనిదే మరెవ్వరూ ఆ విత్తనాలను తయారు చేయరాదని కట్టడి చేశారు. పంటకు పురుగులు, చీడ పీడ విరగడౌతుందనీ దిగుబడి పెరుగుతుందనే ఆశతో రైతులు మోన్శాంటో బీటీ విత్తనాలను ఆశ్రయించారు. బీటీ జన్యవును మన పత్తి మొక్కలలోని దేశీయవిత్తనాలలో పెట్టవచ్చని తెలుసుకోలేకపోయారు. తెలుసుకున్నవారు ధైర్యంచేయలేకపోయారు. మన దేశీయ విత్తనాలు పురుగులను బాగా తట్టుకుంటాయని గ్రహించలేకపోయారు. మోన్సాంటో కంపెనీ గుత్తాధిపత్యాన్నిపొందింది. ఇష్టమొచ్చిన రేటును వసూలు చేసింది. విత్తనాలు తయారుచేసే రైతుకి 250 రూ. ఇచ్చి 750 గ్రాములవిత్తనాలను మోన్శాంటో కంపెనీ తీసుకున్నది. పత్తి పండించే రైతుకి 450 గ్రాముల విత్తనాలను 1850 రూ. కి మించి అమ్మింది. ఇది దారుణమని నల్లమడ రైతుసంఘం ప్రచారం చేసింది. 2005 జూన్‌ నెల లో లామ్‌ ఫార్మ్‌ సభ లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి విత్తనాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఈ వ్యాస రచయిత, తేళ్ళ క్రిష్ణమూర్తి, దండా వీరాంజనేయులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆందోళన ప్రారంభించి సదస్సులు, సభలు. ధర్నాలు చేశారు. జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి, కొల్లా రాజమోహన్‌ ఊరూరు తిరిగి రైతులను చైతన్య పరిచారు. రైతునాయకులు కొల్లి నాగేశ్వరరావు, యలమంచిలి శివాజీ, జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి , కొండా శివరామిరెడ్డి లాంటివారు కదిలారు. ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై యసే రాజశేఖరరెడ్డి గారు స్పందించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఎమ్‌ఆర్పీటీయస్‌ లో కేసు వేశారు. మోన్శాంటో కంపెనీ 1850 రూ. పత్తి విత్తనాల పాకెట్‌ ను 750 రూ.కి. తగ్గించకతప్పలేదు. మన దేశంలో బీటీ విత్తనాలపై పేటెంట్‌ లేకపోయినా పేటెంట్‌ వున్నదని దబాయించి రౌడీ మామూలుగా టెక్నాలజీ ఫీజు-రాయల్టీ పేరున వందల వేల కోట్ల రూపాయలను వసూలు చేసుకుంటున్నారు. బీటీ 1 అనీ, బీటీ 2 అనీ, బీటీ 3 అనీ రైతులకు ఆశలు కల్పంచి సొమ్ము చేసుకుంటున్నారు. సూటిరకాల విత్తనాలను సాంద్రతను పెంచి సాగుచేసి అధికదిగుబడులను సాధించటమే దీనికి పరిష్కారం ,
అనేకదేశాలలో, ప్రయోగాలు, పరిశోధనల తర్వాత హై డెన్సిటీ ప్లాంటింగ్‌ అంటే మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. ఎక్కువ మొక్కల వలన ఎక్కువ దిగుబడి వస్తుందనీ, దేశీయ సూటిరకాల విత్తనాలకు పురుగును తట్టుకునే శక్తి ఎక్కువనికూడా అధ్యయనాలు నిరూపించాయి. బలాలు కూడా సగంపెట్టినా దిగుబడి తగ్గదంటున్నారు. బ్రెజిల్‌ లాంటి దేశాలు లాభపడ్తూఉండగా మనం మోన్సంటో, బేయర్‌ కంపెనీల మాటలు విని వారికి లాభాలు చేకూర్చేవిధంగా హైబ్రిడ్‌ విత్తనాలనే ఎందుకు వాడుతున్నామో ఆలోచించాలి.
బ్రెజిల్‌, చైనా, అమెరికా, భారతదేశాలలో ప్రయోగాలు చేశారు. ఒక ప్రయోగంలో హెక్టరుకు 1500 నుండి 1,05,000 మొక్కల వరకూ 6 ప్లాట్లుగా పెంచారు. మెపిక్వాట్‌ క్లోరైడ్‌ అనే గ్రోత్‌ రెగ్యులేటర్‌ మందును ఉపయోగించి పెరుగుదలను నియంత్రించారు. తక్కువ మొక్కలున్న ప్లాటు తక్కువ దిగుబబడి నిచ్చింది. బాగా ఎక్కువ మొక్కలున్న ప్లాటు లోకి సూర్యరశ్మి, గాలి అందక మరీ ఎక్కువ పత్తినివ్వలేదు. మధ్యస్ధంగా 87,000 మొక్కలున్న ప్లాటు హెక్టారుకు 1682కేజీల లింటు కాటన్‌( 4546కేజీల సీడ్‌ కాటన్‌) వచ్చింది. నేలను బట్టి, భూసారాన్నిబట్టి, నీటి లభ్యతను బట్టి మొక్కల సంఖ్యను సైంటిస్టులు, అనుభవజ్నులైన రైతులు నిర్ణయించుకుని ఎక్కువ మొక్కలను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు.
మన దేశ కాటన్‌ సైంటిస్టులు ఆ దేశాలకు వెళ్ళి హై డెన్సిటీ ప్లాంటేషన్‌ సాగు విధానాన్ని పరిశీలించారు. నాగపూర్‌ కాటన్‌ రీసర్చ్‌ సెంటర్‌ వారు సూరజ్‌ అనే సూటి రకాల వెరైటీని, నంద్యాల కాటన్‌ పరిశోధనా సంస్ధ, దేశీయ 1938 వెరైటీలను అభివధిచేసి రైతులకు ఇచ్చారు. హై డెన్సిటీ ప్లాంటేషన్‌ తో మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వ సంస్ధలు ప్రదర్శనాక్షేత్రాలు ఏర్పాటుచేసారు. ప్రత్యమ్నాయంగా దేశీ విత్తనాల సాంద్రతను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని చూపారు. మన దేశరైతులు మోన్సాంటో, బేయర్స్‌ లాంటికంపెనీల మాటలువిని హైబ్రిడ్‌ విత్తనాలనే వాడుతున్నారు. మన పొలంలో మన పంట విత్తనాలను ఎక్కువగా నాటి ఎక్కువ మొక్కలను పెంచి పత్తి దిగుబడిని అంతర్జాతీయస్ధాయికి తేవచ్చని నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధవారు ప్రయోగాలు చేసి నిర్ధారించారు. ప్రదర్శనాక్షేత్రాలను ఏర్పాటు చేశారు. వారు సరఫరా చేసిన సూరజ్‌ వెరైటీని , నంద్యాల పత్తి పరిశోధనా సంస్ధ ఇచ్చిన వెరైటీలను రైతు రక్షణ వేదిక ప్రొఫెసర్‌ యన్‌ వేణుగోపారావు గారి నాయకత్వాన గుంటూరు జిల్లాలో ప్రచారం చేసింది. వెయ్యికన్నా ఎక్కువ సభ్యులతో సహకార సంస్ధగా ఏర్పడి సూటిరకాల అభివధికి దాదాపు 10 సం.కు పైగా కషిచేసింది. బీటీ వున్న సూటిరకాలుకూడా రైతు రక్షణ వేదిక రైతులు అభివద్దిóచేశారు. తక్కువ వనరులతో విషేషమయిన కషి జరిగింది. కార్పోరేట్‌ కంపెనీల హైబ్రిడ్‌ అనుకూల ప్రచారాల ముందు కొద్దిమంది కషి రైతులను ఉత్తేజపరచలేక పోయింది. నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధ, నంద్యాల పరిశోధనాసంస్ధలకు తోడుగా వ్యవసాయశాఖ, వ్యవసాయ విద్యాలయం కదలలేదు. ప్రయోగాలను, పరిశోధనలను కొనసాగించలేదు. రైతు సమాజాన్ని ప్రభావితం చేయగల్గిన నాయకులు సూటి రకాలగురించి, హై డెన్సిటీ ప్లాంటేషన్‌ గురించి పట్టించుకోలేదు. ఫలితంగా మన రైతులు అదిక దిగుబడులద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవటమేకాదు. దేశప్రజల విత్తన స్వాతంత్య్రాన్ని మోన్సాంటో లాంటి కోర్పోరేట్‌ శక్తులకు ధారపోసి దేశసార్వభౌమాధికారానికే ప్రమాదం తెచ్చి పెట్టారు. అంతర్జాతీయ అనుభవాలను మన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. చిన్న రైతులను ఆర్ధికంగా నిలబెట్టినపుడే వ్యవసాయం రక్షించబడతుంది.
రైతు తన పొలంలోనుండి విత్తనాలను తీసుకొని కనీసం మూడు నాలుగు సంవత్సరాలు విత్తుకోవచ్చు. మొక్కల సాంద్రతను పెంచి అధిక దిగుబడిని పొంది , అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సగటు దిగుబడులలో అంతర్జాతీయ స్ధాయిని అందుకోవచ్చు. ఎమ్‌ యన్‌ సీ ల దోపిడీ ని ఎదుర్కొని విత్తన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవచ్చు.
ఈ వ్యాస రచయిత నల్లమడ రైతు సంఘం, రైతు రక్షణ వేదిక నేత, గుంటూరు, ఫోన్‌ 9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా కాఠిన్యం -కర్షకులకు కష్టకాలం, అనిశ్చితి !

06 Monday Jul 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Agriculture, Corona Virus impact on farmers, Fuel Price in India, Pandemic Corona Virus, WTO


ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విజృంభణ తగ్గలేదు.రానున్న రోజుల్లో ఏ రంగంపై ఎలాంటి దుష్ట ప్రభావం చూపనుందో అంతుచిక్కటం లేదు. రానున్నది రాకమానదు-కానున్నది కాకమానదు-కాడి పట్టుకోక తప్పదు అన్నట్లుగా రైతాంగ ఏరువాక ప్రారంభమై దేశంలోని అనేక ప్రాంతాలలో ఖరీఫ్‌ సాగు ముమ్మరంగా సాగుతున్నట్లు వార్తలు. ఇప్పటి వరకు వర్షాలు సకాలంలో, తగిన మోతాదులో పడిన కారణంగా కొన్ని చోట్ల విత్తనాల కొరత ఏర్పడిందని జార్ఖండ్‌, బీహార్‌ వంటి చోట్ల 15 నుంచి 25శాతం మేరకు విత్తన ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఎక్కడైనా పెద్ద రైతులు ముందే కొనుగోలు చేస్తారు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది, భారమూ ఉండదు, అప్పటి కప్పుడు కొనుగోలు చేసే చిన్న రైతుల మీద ఇది అదనపు ఖర్చు. కరోనా కారణంగా వలస కార్మికులు తమ స్వస్ధలాలకు వెళ్లిపోయిన కారణంగా పంజాబ్‌, హర్యానా వంటి ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల కొరత ఏర్పడితే, మరికొన్ని చోట్ల మిగులుగా మారారు. దీనివలన కొన్ని చోట్ల వేతనాలు పెరిగితే, మరికొన్ని చోట్ల పడిపోయే పరిస్ధితి. ప్రపంచీకరణ యుగం కనుక రైతాంగాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్న కొన్ని జాతీయ, అంతర్జాతీయ అంశాలను చూద్దాం.
నరేంద్రమోడీ సర్కార్‌ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే సంగతి నోరు లేని గోమాత కెరుక. చమురు పన్ను, ధరల పెంపుదల ద్వారా వ్యవసాయ పెట్టుబడుల భారాన్ని మాత్రం గణనీయంగా పెంచుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణతో పాటు డీజిల్‌ వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది. గతంలో డీజిల్‌ మీద ఉన్న సబ్సిడీలను తొలగించారు, కొంతకాలం డీజిల్‌ మీద పన్ను తక్కువగా ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా దాదాపు సమం చేసి పెట్రోలు కంటే డీజిల్‌ రేటు ఎక్కువ ఉండేట్లు చేశారు. ఎందుకంటే ఎక్కువగా అమ్ముడు పోతున్నది డీజిలు కనుక కంపెనీలకు బాగా లాభాలు రావాలంటే డీజిల్‌ ధరలు పెంచాలి మరి. దీని ధర పెరిగితే వ్యవసాయం, పంటల రవాణా, పురుగుమందులు, ఎరువులు ఇలా అన్ని రకాల వ్యవసాయ పెట్టుబడుల ధరలూ గణనీయంగా పెరుగుతాయి. ఉదాహరణకు పంట వేసేందుకు ఎకరం పొలాన్ని సిద్దం చేయాలంటే ఇంతకు ముందు అవుతున్న రెండున్నర వేల రూపాయల ఖర్చు కాస్తా మూడున్నరవేలు అవుతుందని ఒక అంచనా. చేపలు పట్టేందుకు డీజిల్‌ సబ్సిడీ ఇస్తున్నట్లుగానే రైతాంగానికి కూడా సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవటం లేదు. దేశంలోని డీజిల్‌ వినియోగంలో 2013లోనే ట్రాక్టర్లు, నాటు, కోత యంత్రాల వంటి వాటికి 10.8శాతం అయితే పంపుసెట్లకు 3.3శాతంగా అంచనా మొత్తంగా చూసినపుడు 14.1శాతం ఉంది. ఇప్పుడు యాంత్రీకరణ ఇంకా పెరిగినందున వినియోగ వాటా గణనీయంగా పెరుగుతుంది. రవాణా రంగం, అది ప్రయివేటు అయినా, ప్రభుత్వరంగమైనా చమురు ధరలను వినియోగదారుల మీద వెంటనే మోపుతాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచి, అమలు జరిపితే తప్ప రైతాంగానికి అలాంటి అవకాశం లేదు.
లాక్‌డౌన్‌ సమయంలో మొత్తంగా మూతపడటంతో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది. తమ ఉత్పత్తులను ముఖ్యంగా నిలవ ఉంచటానికి అవకాశం లేని కూరగాయలు, పండ్లు, పూల వంటి వాటిని రవాణా చేయటానికి, విక్రయించటానికి కూడా అవకాశం లేకపోయింది. ఈ నష్టాన్ని ఏ ప్రభుత్వమూ చెల్లించలేదు. కరోనా వైరస్‌ కారణంగా తలెత్తిన పరిస్ధితిని అధిగమించేందుకు ప్రకటించిన ఉద్దీపన పధకం 21లక్షల కోట్ల రూపాయలలో కేవలం ఒక లక్ష కోట్ల రూపాయలను వ్యవసాయ మౌలిస సదుపాయాల నిధిగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా ఆహార తయారీ సంస్ధలకు పెట్టుబడి అని ఒక ముక్తాయింపు. వ్యాపారుల ఉల్లి, బంగాళా దుంపలు, ధాన్య నిల్వలపై ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులుగా ఉన్న ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. దీని వలన వ్యాపారులంతా వాటిని ఎగబడి కొంటారు, రైతులకు ధరలు పెరుగుతాయి అని మనల్ని నమ్మమంటారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ సంస్ధల పట్టును మరింత పెంచేందుకు తోడ్పడే చర్య ఇది.
ప్రభుత్వం ఒక వైపు చైనాతో పోల్చుతూ ఆర్ధిక సర్వే, బడ్జెట్‌ పత్రాలలో పుంఖాను పుంఖాలుగా రాస్తుంది. కానీ అదే ఎవరైనా చైనాతో పోల్చితే చూడండి అని చైనా మద్దతుదారులు అంటూ సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ మరుగుజ్జులు దాడి చేస్తారు. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవటానికి ఒక కారణం పెట్టుబడులు తగ్గిపోవటం. నాలుగు దశాబ్దాల క్రితం గ్రాస్‌ కాపిటల్‌ ఫార్మేషన్‌లో 18శాతం వ్యవసాయ రంగానికి వస్తే ఇప్పుడు ఎనిమిదిశాతానికి పడిపోయింది. అది కూడా అనుత్పాదక సబ్సిడీల రూపంలో ఎక్కువ భాగం ఉంటున్నందున పెద్ద రైతులకే ఎక్కువ లబ్ది కలుగుతున్నదని ఆ రంగ నిపుణులు చెబుతున్నమాట. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సర్వే 2019-20లో చైనాను ఉదహరిస్తూ కార్మికులు ఎక్కువగా పని చేసే వస్తు ఎగుమతుల కారణంగా కేవలం ప్రాధమిక విద్య మాత్రమే ఉన్న వారికి 2001-06 మధ్య 70లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని, మన దేశంలో ఎగుమతుల కారణంగా 1999-2011 మధ్య కేవలం పది లక్షల లోపే అసంఘటిత రంగ ఉద్యోగాలు పెరిగాయని, మనం కూడా చైనా మాదిరి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కానీ గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పని తీరులో అలాంటి చిత్తశుద్ది ఎక్కడా కనపడదు. మేకిన్‌ ఇండియా పిలుపు ద్వారా ఎన్ని కొత్త ఉద్యోగాలు ఆరేండ్లు గడిచినా చెప్పటం లేదు. మన దేశంలో ఒక కమతం సగటు విస్తీర్ణం 1.4హెక్టార్లు కాగా చైనాలో 0.6 మాత్రమే. అయినా ఉత్పాదకత ఎక్కువగా ఉంది. వ్యవసాయరంగంలో కేంద్ర పెట్టుబడులే కాదు, దిగుబడులు, నాణ్యత పెంచేందుకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, వ్యవసాయ విస్తరణను గాలికి వదలివేశారు. అన్ని పంటల ఉత్పాదకత, దిగుబడులు చైనాలో గణనీయంగా పెరిగేందుకు తీసుకున్న చర్యల కారణంగా ప్రపంచ మార్కెట్లో వచ్చే ఎగుడుదిగుడులు అక్కడి రైతాంగాన్ని పెద్దగా ప్రభావితం చేయటం లేదు. రైతాంగానికి ప్రభుత్వం అందచేసే రాయితీలు కూడా మన కంటే ఎంతో ఎక్కువ.
2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ఎన్‌డిఏ ప్రభుత్వం చెప్పింది. కరోనా వైరస్‌ మహమ్మారి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర భారత పధకాన్ని అమలు జరపనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలంటే 2022 నాటికి 30 బిలియన్‌ డాలర్లుగా వున్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను 60బిలియన్‌ డాలర్లకు పెంచాలని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం మన దేశం వాణిజ్యంలో చైనాతో బాగాలోటులో ఉంది. కానీ వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మిగుల్లో ఉంది. వాటి దిగుమతులను ఇంకా పెంచుకోవాలని వత్తిడి చేస్తోంది, కొంత మేరకు చేసుకుంటామని చైనా కూడా చెప్పింది. 2018-19లో మన దేశం చైనాకు 190 కోట్ల డాలర్ల మేరకు ఎగుమతులు చేస్తే మన దేశం 28.2 కోట్ల మేరకే చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ముడిపత్తి, రొయ్యల వంటి ఎగుమతులు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 117 శాతం ఎక్కువ. అయితే తాజాగా లడఖ్‌ సరిహద్దు వివాదం కారణంగా మన దేశం చైనా వస్తువుల దిగుమతులపై నిషేధాలను విధిస్తామని ప్రకటించింది. అదే జరిగితే మొక్కజొన్న, చింతపండు, కాఫీ, పొగాకు, జీడిపప్పు, నూకల బియ్యం వంటి మన వ్యవసాయ దిగుమతులను చైనా కూడా ఏదో ఒక పేరుతో నిలిపివేయటం లేదా నామమాత్రం చేయటం ఖాయం. యుపిఏ ప్రభుత్వ చివరి ఏడాది మన దేశం గరిష్టంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. గత ఆరు సంవత్సరాలుగా మధ్యలో కొంత మేరకు తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే అంతకు తగ్గలేదు, అయితే దిగుమతులు గణనీయంగా తగ్గిన కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఇప్పుడు మిగుల్లోనే ఉన్నాము. ఆర్ధిక సర్వే ప్రకారం 2018-19లో మన వ్యవసాయ ఎగుమతులు 2.7లక్షల కోట్ల రూపాయల మేర ఉంటే దిగుమతులు 1.37లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. అయితే ధనిక దేశాలు సబ్సిడీలు ఇచ్చినా, చైనా వంటివి మన దిగుమతులను నిలిపివేసినా ఈ మిగులు హరించిపోతుంది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌ దేశాలు తమ రైతాంగానికి పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నాయి. కానీ ఆ దేశాలు మాత్రం మన వంటి దేశాలు ఇచ్చే సబ్సిడీల మీద ధ్వజమెత్తుతాయి. ఉదాహరణకు అంబర్‌ బాక్స్‌ వర్గీకరణ కిందకు వచ్చే, ఇతరంగా మొత్తం సబ్సిడీల గురించి మన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ డబ్ల్యుటిఓ స్టడీస్‌ అనే సంస్ధ ఒక పత్రాన్ని ప్రచురించింది. దానిలో దిగువ వివరాలు ఉన్నాయి. ఒక్కో రైతుకు సగటున ఆ ఏడాదిలో సబ్సిడీ మొత్తాన్ని డాలర్లుగా పరిగణించాలి. ఉపాధి పొందుతున్నవారిని మిలియన్లలో సూచించారు.
దేశం == సంవత్సరం ==ఉపాధి పొం సంఖ్య == అంబర్‌బాక్సు == స్ధానిక మద్దతు
ఆస్ట్రేలియా == 2017-18 ==== 0.3 ==== 222 ==== 5357
కెనడా == == 2016 ==== 0.3 ==== 7414 ==== 13010
ఇయు ==== 2016 ==== 9.8 ==== 1068 ==== 8589
జపాన్‌ ==== 2016 ==== 2.3 ==== 3492 ==== 11437
నార్వే ==== 2018 ==== 0.1 ==== 22509 ==== 53697
రష్యా ==== 2017 ==== 4.2 ==== 855 ==== 1378
స్విడ్జర్లాండ్‌==== 2018 ==== 0.1 ==== 9716 ==== 57820
అమెరికా ==== 2016 ==== 2.2 ==== 7253 ==== 61286
బంగ్లాదేశ్‌ ==== 2006 ==== 24.6 ==== 8 ==== 11
బ్రెజిల్‌ ==== 2018 ==== 8.6 ==== 134 ==== 332
చైనా ==== 2016 ==== 212.9 ==== 109 ==== 1065
ఈజిప్టు ==== 2016 ==== 6.7 ==== 0 ==== 9
భారత్‌ ==== 2018-19 ==== 200 ==== 49 ==== 282
ఇండోనేషియా ==== 2018 ==== 37.6 ==== 7 ==== 139
ఫిలిప్పీన్స్‌ ==== 2018 ==== 10.4 ==== 0 ==== 125
ద.కొరియా ==== 2015 ==== 1.4 ==== 547 ==== 5369
థాయలాండ్‌ ==== 2016 ==== 12 ==== 11 ==== 367
ప్రపంచంలోని భారత్‌, చైనాలతో సహా 54 ప్రధాన దేశాలు వ్యవసాయంలో వచ్చే మొత్తం ఆదాయంలో పన్నెండుశాతానికి సమానమైన 700 బిలియన్‌ డాలర్లను ఏడాదికి సబ్సిడీ ఇస్తున్నట్లు ఓయిసిడి తాజా నివేదిక ఒకటి పేర్కొన్నది. వర్ధమాన దేశాల కంటే ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీల రెట్టింపు ఉంటున్నాయి. వర్దమాన దేశాలు 8.5శాతం ఇస్తుంటే ఓయిసిడి దేశాలు 17.6శాతం ఇస్తున్నాయి. జపాన్‌, దక్షిణ కొరియా 40శాతం ఇస్తుండగా, చైనా, ఇండోనేషియా, ఐరోపా యూనియన్‌ ఇస్తున్న సబ్సిడీలు 54దేశాల సగటు 12 నుంచి 30శాతం వరకు ఇస్తున్నాయి.అమెరికాలో ఈ ఏడాది సబ్సిడీలు 33 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని, అవి వ్యవసాయ ఆదాయంలో నేరుగా రైతులకు అందచేసే మొత్తం 36శాతమని కొన్ని వార్తలు సూచించాయి. మన ప్రభుత్వం చైనా స్దాయిలో అయినా రైతాంగానికి రాయితీలు ఇస్తుందా ? నల్లధనం వెలికితీత, దేశమంతటా గుజరాత్‌ నమూనా అమలు, అచ్చేదిన్‌ వంటి అనేక వాగ్దానాలకు ఏ గతి పట్టించారో ఇప్పుడు రైతుల ఆదాయాల రెట్టింపు వాగ్దానానికి కూడా అదే గతి పట్టిస్తున్నారు.
ప్రపంచంలో ధనిక దేశాలు రైతాంగానికి ఎలా సబ్సిడీలు ఇస్తున్నాయో ముందు చూశాము. వాటిని నియంత్రించాల్సిన ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను పని చేయనివ్వకుండా అమెరికా ఆటంకాలు కల్పిస్తున్నది. దానిని నిరసగా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్ట్‌ అజెవీడో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే నెలలో బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 2013లో ఈ బాధ్యతలను చేపట్టిన బ్రెజిలియన్‌ దౌత్యవేత్త అమెరికా, మరికొన్ని దేశాల వైఖరితో విసిగి పోయారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వాణిజ్య సంస్దను ఖాతరు చేయకుండా సభ్యదేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకోవటం ఒకటైతే వివాదాల పరిష్కారానికి అమెరికా మోకాలడ్డుతుండటం సంస్ధ పని తీరు, విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. డబ్ల్యుటిఓ సమగ్రమైనది కాకపోవచ్చు గానీ అందరికీ అవసరమైనదే, ప్రపంచమంతటా ఆటవిక న్యాయం అమలుజరుగుతున్న తరుణంలో కనీసం వాణిజ్యానికి ఇది అవసరం అని అజెవీడో రాజీనామా ప్రకటన సమయంలో వ్యాఖ్యానించాడు.
2015లో దోహాదఫా చర్చలను అర్ధంతరంగా వదలి వేసిన తరువాత 164 సభ్యదేశాలు గల ఈ సంస్ధ ఒక పెద్ద అంతర్జాతీయ ఒప్పందాన్ని కూడా కుదర్చలేకపోయింది. అమెరికా-చైనా మధ్య 2018లో ప్రారంభమైన దెబ్బకు దెబ్బ వాణిజ్యపోరు మూడో ఏడాదిలో ప్రవేశించింది. దీనికి కరోనా మహమ్మారి సంక్షోభం తోడైంది. తమ పెత్తనం, తన సరకులను ఇతర దేశాల మీద రుద్దాలనే లక్ష్యంతో ప్రపంచ వాణిజ్య సంస్దను ముందుకు తెచ్చింది అమెరికా. అయితే అనుకున్నదొకటీ అయింది ఒకటీ కావటంతో చివరకు ఆ సంస్దనే పని చేయకుండా అడ్డుకోవటం ప్రారంభించింది. సంస్ధలో సభ్య దేశాలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినపుడు ఫిర్యాదులను పరిష్కరించటం ఒక ప్రధాన విధి. అందుకుగాను ఏడుగురు సభ్యులతో ఒక ట్రిబ్యునల్‌ ఉంది. దానిలో న్యాయమూర్తుల నియామకం ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. వారి పదవీ కాలం ముగియగానే కొత్తవారిని నియమించాల్సి ఉండగా కుంటి సాకులతో అమెరికా అంగీకరించటం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ వలన చైనాకే ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది కనుక నిబంధనలను మార్చాలని అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు ఒక పల్లవి అందుకున్నాయి. చైనాను తమతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలన్నది వాటి డిమాండ్‌. మన దేశం కూడా వరి, గోధుమల వంటి వాటికి కనీస మద్దతు ధరలను అనుచితంగా పెంచుతున్నదని, పత్తికి కనీస మద్దతు ధర పేరుతో రాయితీలు ఇస్తున్నదని అమెరికా, మరికొన్ని దేశాలు ఫిర్యాదు చేశాయి. అన్నింటికీ మించి వివాదాలు దీర్ఘకాలం కొనసాగటం ఒకటైతే అనేక కేసులలో తీర్పులు తమకు వ్యతిరేకంగా రావటాన్ని అవి సహించలేకపోతున్నాయి. తీర్పులన్నీ నిబంధనలు ఏవి ఉంటే వాటికి అనుగుణ్యంగానే వస్తాయి తప్ప అడ్డగోలుగా ఇవ్వలేరు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం చైనా వర్దమాన దేశ తరగతిలోకే వస్తుంది. అందువలన సబ్సిడీలు, ఇతర అంశాలలో దానికి వెసులు బాటు ఉంది. అది ధనిక దేశాల లాభాలకు గండికొడుతోంది. చైనాను ధనిక దేశంగా తీర్పు చెప్పాలన్నది అమెరికా డిమాండ్‌. అమెరికాకే అగ్రస్ధానం అనే నినాదంతో అధికారానికి వచ్చిన ట్రంప్‌ సర్కార్‌ మరింత అడ్డంగా వ్యవహరించింది. ఏడుగురికి గాను కనీసం ముగ్గురు ఉంటే కేసులను విచారించవచ్చు. ఇటీవలి వరకు అదే జరిగింది. ఆరునెలల క్రితం ముగ్గురిలో ఇద్దరి పదవీ కాలం ముగియటంతో వారు తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేసులు దాఖలైనా విచారించే వారు లేరు. ప్రపంచ వాణిజ్య సంస్దలో సంస్కరణలు తేవాలి గానీ అవి తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగా ఉండకూడదని, అంటే తాము చేసిన దాన్ని ప్రశ్నించే అధికారం ఆ సంస్ధకు ఉండకూడదని అమెరికా పరోక్షంగా చెబుతోంది. ఈ నేపధ్యంలో న్యాయమూర్తుల నియామకం జరగదు, సంస్కరణలకు అవకాశం లేదు. అమెరికా అడ్డగోలు కోరికలు, ఆకాంక్షలను మిగిలిన దేశాలు అంగీకరించే ప్రసక్తే లేదు.
ప్రపంచ వాణిజ్య సంస్ధను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అమెరికా చూస్తుంటే, స్వేచ్చా వాణిజ్య సూత్రాలను పరిరక్షించాలని చైనా వాదిస్తోంది. ఈ సంస్దలో చేరిన 164 దేశాలు ఏడాదికి తమ జిడిపిని 855 బిలియన్‌ డాలర్లు పెంచుకున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. వీటిలో అమెరికా 87, చైనా 86, జర్మనీ 66 బిలియన్‌ డాలర్ల చొప్పున లబ్ది పొందాయని తేలింది. అగ్రరాజ్యాలకే అధిక ఫలం అన్నది స్పష్టం. అయితే ఈ సంస్ద నిబంధనలలో పెద్ద మార్పులు లేకపోయినా అనేక అంశాలలో మార్పులకు ఒక్కో దఫా చర్చలు దోహదం చేస్తున్నాయి. వాణిజ్యంలో ఉన్న ఆటంకాలను మరింతగా తొలగించేందుకు, సబ్సిడీల తగ్గింపు తదితర అంశాలపై 2001లో దోహాలో మంత్రుల చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ముగియలేదు, 2015లో విసుగుపుట్టి వదలివేశారు. అమెరికా-ఐరోపా యూనియన్‌ ధనిక దేశాల మధ్య తలెత్తిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సబ్సిడీ ఒక పెద్ద పీఠముడి. జరుగుతున్న పరిణామాలను చూస్తే న్యాయమూర్తుల నియామకాన్ని ఇలాగే అడ్డుకుంటే చివరకు ప్రపంచ వాణిజ్య సంస్ధ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది.
వ్యవసాయ దిగుమతులపై పన్నుల గురించి అమెరికాాఐరోపా యూనియన్‌ తమకు అనుకూలమైన పద్దతుల్లో ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ధనిక దేశాలు వ్యవసాయ సబ్సిడీలను గణనీయంగా తగ్గించకుండా ప్రయోజనం లేదని, వాటి సంగతి తేల్చాలని చైనా, భారత్‌, బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలు పట్టుబట్టటంతో 2005 నుంచి ప్రతిష్ఠంభన ఏర్పడింది. అంతకు ముందు ఉరుగ్వే దఫా చర్చలలో కొన్ని దేశాలు తమలో తాము ఒక ఒప్పందం చేసుకొని ఇతర దేశాలను క్రమంగా వాటిలో చేర్చుకున్నాయి. అయితే దోహా చర్చలలో వర్ధమాన దేశాలు మొత్తంగా ఒప్పందం జరగాలి తప్ప ప్రయివేటు వ్యవహారాలు కుదరవని తేల్చి చెప్పాయి. ఉరుగ్వే దఫా చర్చల నాటికి చైనా ప్రపంచ వాణిజ్యంలో భాగస్వామి కాదు, దోహా చర్చల సమయంలోనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరింది. చర్చల సమయంలోనే చైనా అమెరికా తరువాత రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వృద్ధి చెందింది. దీంతో వర్దమాన దేశాల పట్టు పెరిగింది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకుంటున్నది. మనకు మిత్ర దేశం,సహ భాగస్వామి అని ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి చెబుతున్న అమెరికాతో లడాయిలో మన దేశం చైనాతో కలసి వ్యవహరిస్తోంది. ఇప్పుడు లడఖ్‌ లడాయితో చైనా మీది కోపంతో అమెరికా పంచన చేరుతుందా ? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎరువులు, ఇతర రాయితీలను పెంచకుండా పరిమితం చేసి ధనిక దేశాలను సంతృప్తి పరుస్తోంది. ఇప్పుడు మరింతగా వాటికి లొంగిపోనుందా ?
ప్రపంచమంతటా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఆహార ధాన్య నిల్వల గురించి ఎలాంటి ఆందోళన లేదు. అనేక చోట్ల పంటలు బాగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా ఆహార జాతీయవాదం ప్రబలి కొన్ని దేశాలలో ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆంక్షల వంటి రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా, కెనడా,బ్రెజిల్‌, ఐరోపా దేశాలలో కరోనా కారణంగా మాంస పరిశ్రమలు మూతపడ్డాయి. మన దేశం మాదిరే అనేక చోట్ల వలస కార్మికుల సమస్యలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆందోళన చెందాల్సిన పరిస్ధితి లేదు గానీ కరోనా మరింత ముదిరితే ఆహార ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ధరలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుండగా చైనాలో కట్టడి చేసి సాధారణ ఆర్ధిక కార్యకలాపాలను ప్రారంభించారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా డోనాల్డ్‌ ట్రంప్‌ తన విజయావకాశాల కోసం పిచ్చి పనులకు పూనుకుంటే రెండు దేశాల మధ్య సాగుతున్న వాణిజ్యం యుద్ధం ఏ రూపం తీసుకుంటుందో, వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

” దేశభక్తి ” ట్రంప్‌ ఆకాశంలో…. మోడీ పాతాళంలోనా ! హతవిధీ !!

27 Saturday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#India-China border, China, Donald trump, INDIA, Narendra Modi, Trade Protectionism


ఎం కోటేశ్వరరావు
అవును ! శీర్షికను చూసి కొంత మందికి ఆగ్రహం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడైనా వ్యక్తి పూజ ముదిరితే వారి మీద ఏ చిన్న వ్యాఖ్యను కూడా సహించలేరు. ఉద్రేకాలను తగ్గించుకొని ఆలోచించాలని మనవి. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందో వాడే పండుగాడు. ఇక్కడ ఎవరు, ఎవరిని కొట్టారు ? ఎవరి మైండ్‌ బ్లాంక్‌ అయింది? పండుగాడు ఎవడో తెలియదు గానీ సంఘపరివారం మొత్తానికి మైండ్‌ బ్లాక్‌ అయినట్లుగా వారి మాటలను బట్టి కనిపిస్తోంది. ఎవరేమి మాట్లాడుతారో తెలియని స్ధితి. అఖిలపక్ష సమావేశం ప్రధాని మాట్లాడిన అంశాలు టీవీలలో ప్రసారం అయ్యాయి.” ఎవరూ చొరబడలేదు లేదా ఎవరూ చొరబడటం లేదు, కొంత మంది ఏ పోస్టునూ పట్టుకోలేదు ” అన్నారు. అంతకు ముందు వరకు మాట్లాడిన ప్రతి కేంద్ర మంత్రి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న బిజెపి మరికొన్ని పార్టీల నేతలందరూ, మీడియా కూడా మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది, మన మిలిటరీ పోస్టులను కూల్చివేసింది అని ఊదరగొట్టిన వారందరి మైండ్లు నరేంద్రమోడీ మాటలతో బ్లాంక్‌ అయ్యాయి. పోనీ ఆయన ఆంగ్లంలో మాట్లాడారా అంటే అదేమీ కాదు, ఆయనకు బాగా తెలిసిన హిందీలోనే కదా చెప్పారు. ఈ మాటల ప్రభావం, పర్యవసానాలేమిటో గ్రహించిన తరువాత కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా మోడీ గారి మాటల అర్ధం ఇది తిరుమలేశా అన్నట్లుగా ఒక వివరణ ఇచ్చింది.
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి) మన ప్రాంతంలో చైనీయులెవరూ లేరు, గాల్వాన్‌ లోయ ప్రాంతంలో ఆతిక్రమణకు పాల్పడేందుకు చేసిన మన ప్రయత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు అన్నది ప్రధాని అభిప్రాయం అన్నది వివరణ. దానికి ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతరులతో మాట్లాడిన తరువాత జూన్‌ 17న రాతపూర్వక పత్రికా ప్రకటన విడుదల చేశారు. యథాతధ స్ధితిని మార్చేందుకు ఎవరూ ప్రయత్నించరాదన్న ఒప్పందాలను అతిక్రమించి వాస్తవ పరిస్ధితిని మార్చేందుకు చేసిన యత్నం కారణంగానే హింస, మరణాలు సంభవించాయని దానిలో పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి ? మన సైనికులు ఎందుకు మరణించారు అన్న ప్రశ్నకు చెప్పిందేమిటి ? సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడిన చైనా మన ప్రాంతంలో పోస్టులను ఏర్పాటు చేసిందని, వాటిని తొలగించాలని ఉభయ దేశాల మిలిటరీ అధికారులు చేసిన నిర్ణయాన్ని చైనా అమలు జరపలేదని, ఆ కారణంగానే చైనా పోస్టును తొలగించేందుకు మన సైనికులు ప్రయత్నించినపుడు చైనీయులు పధకం ప్రకారం దాడి చేసి మన వారిని చంపారని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ఉదంతం మన ప్రాంతంలో జరిగినట్లా మరొక చోట జరిగినట్లా ? ఇదే నిజమా లేక చైనా వారు చెబుతున్నట్లు తమ ప్రాంతంలోకి మన సైనికులు వెళ్లి దాడికి పాల్పడ్డారన్నది వాస్తవమా ? మన ప్రధాని మరి అలా ఎందుకు మాట్లాడినట్లు, విదేశాంగ, రక్షణ శాఖల నుంచి సమాచారం తీసుకోరా ? అసలేం జరిగింది ? ఇప్పటికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రహస్యమే కదా ! ఇంత జరిగిన తరువాత అయినా మోడీ ప్రత్యక్షంగా విలేకర్లతో మాట్లాడి వివరణ ఎందుకు ఇవ్వరు ?
లడఖ్‌ లడాయితో మోడీ గణానికి ఏదో జరిగింది. జనంలో తలెత్తిన మనోభావాల నేపధ్యంలో ఎవరేం మాట్లాడుతున్నారో, అసలు వారి మధ్య సమన్వయం ఉందో లేదో కూడా తెలియటం లేదు. ఒక నోటితో చైనా వస్తువులను బహిష్కరించాలంటారు. అదే నోటితో ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశం భాగస్వామి గనుక అధికారయుతంగా చైనా వస్తువులను నిషేధించలేము, ప్రజలే ఆ పని చేయాలంటారు. వారు చెప్పే ఈ మాటల్లో నిజాయితీ ఉందా ?
బిజెపి, విశ్వహిందూపరిషత్‌, ఎబివిపి, బిఎంఎస్‌, భజరంగదళ్‌, ఎస్‌జెఎం వంటి అనేక సంస్దలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసింది అనే విషయం తెలిసిందే. అంటే ఈ సంస్ధలన్నీ తెరమీది తోలుబొమ్మలైతే వాటిని తెరవెనుక నుంచి ఆడించేది, మాట్లాడించేది ఆర్‌ఎస్‌ఎస్‌.1991లో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచారు. ఆ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెట్టేందుకు స్వదేశీ జాగరణ మంచ్‌(ఎస్‌జెఎం)ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మాత్రమే అవసరమైనపుడు నాటకాలాడుతుంది. నాటి నుంచి నేటి వరకు వాజ్‌పేయి, నరేంద్రమోడీ ఎవరు అధికారంలో ఉన్నా మార్కెట్లను మరింతగా తెరిచారు తప్ప స్వదేశీ వస్తువులకు రక్షణ లేదా దేశంలో చౌకగా వస్తువుల తయారీకి వారు చేసిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కారణంగా చైనా వస్తువుల మీద అధికారికంగా చర్యలు తీసుకోలేము అని చెబుతారు. ఇది జనం చెవుల్లో పూలు పెట్టే యత్నమే. ప్రపంచ వాణిజ్య సంస్ధలోని దేశాలన్నీ అలాగే ఉన్నాయా ?
స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) మాట్లాడుతూ మన దేశం గత రెండు సంవత్సరాలలో అనేక చర్యలు తీసుకున్నా చైనా మీద కేవలం 350 పన్నేతర ఆంక్షలను మాత్రమే విధిస్తే అమెరికా 6,500 విధించిందని, మనం ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అమెరికాకు అగ్రతాంబూలం అని ట్రంప్‌ పదే పదే చెబుతాడు, దానికి అనుగుణ్యంగానే ప్రపంచ దేశాల మీద దాడులకు దిగుతాడు. మనం మరో దేశం మీద దాడికి దిగకపోయినా మనల్ని మనం రక్షించుకోవాలి కదా! అదే దేశభక్తి అని అనుకుంటే ట్రంప్‌కు ఉన్న అమెరికా భక్తితో పోలిస్తే మన నరేంద్రమోడీ భారత్‌ భక్తి ఎక్కడ ఉన్నట్లు ? 2016లో పేటియంకు అనుమతి ఇచ్చినపుడు తాము వ్యతిరేకించామని, అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదని, జనం దాన్ని వినియోగించకూడదని కూడా ఆ పెద్దమనిషి చెప్పారు. అమెరికాకు లేని ప్రపంచ వాణిజ్య అభ్యంతరాలు మనకేనా ? చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకొనేందుకు చెప్పే సొల్లు కబుర్లు తప్ప మరేమైనా ఉందా ? 2014 నుంచి మన దేశం చైనాతో సహా వివిధ దేశాలకు చెందిన 3,600 వస్తువులపై దిగుమతి పన్నుల పెంపు లేదా ఇతర ఆంక్షలను విధించింది (ఎకనమిక్‌ టైమ్స్‌ జూన్‌ 19). పోనీ దేశమంతా తమకే మద్దతు ఇచ్చిందని, రెండోసారి పెద్ద మెజారిటీతో గెలిపించారని చెప్పుకుంటున్న పెద్దలు మరి తమ జనం చేత అయినా పేటిఎం లేదా చైనా వస్తువులను ఎందుకు బహిష్కరించేట్లు చేయలేకపోయారు ? వినియోగం కనీసం ఆగలేదు, రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నట్లు ? అంటే కబుర్లు తప్ప వాటిని చెప్పేవారు కార్యాచరణకు పూనుకోవటం లేదు. మరో వైపు కమ్యూనిస్టుల మీద పడి ఏడుస్తారు. ఎన్నడైనా, ఎక్కడైనా కమ్యూనిస్టులు చైనా వస్తువులనే వాడమని గానీ, రక్షణాత్మక చర్యలు తీసుకోవద్దని చెప్పారా ?
ప్రపంచ దేశాలన్నీ ఇటీవలి కాలంలో రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుతున్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో అగ్రస్ధానంలో ఉన్న చైనా సైతం అలాంటి చర్యలకు పాల్పడుతున్నపుడు మన దేశం ఎందుకు తీసుకోకూడదు ? ఏ కమ్యూనిస్టులు వద్దన్నారు ? 2020 జనవరి ఆరవ తేదీ ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషకుడు బనికర్‌ పట్నాయక్‌ అందచేసిన వివరాల ప్రకారం ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో దేశాలు భారత్‌తో సహా 5,909 సాంకేతిక పరమైన ఆటంకాలను (టిబిటి) విధించినట్లు పేర్కొన్నారు. ఆ ఒప్పందం నుంచి మన దేశం ఉపసంహరణకు ముందు మన వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన అంతర్గత విశ్లేషణలో ఈ వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం పన్నేతర ఆటంకాలు (ఎన్‌టిబి) ఇతర ఆటంకాలు ఉన్నాయి. వివిధ దేశాలు విధించిన సాంకేతిక పరమైన ఆటంకాలలో చైనా 1,516, దక్షిణ కొరియా 1,036, జపాన్‌ 917, థాయలాండ్‌ 809 విధించగా మన దేశం కేవలం 172 మాత్రమే విధించింది. ఈ బృంద దేశాలలో సగటు పన్ను విధింపులో మన దేశం 17.1శాతంతో అగ్రస్ధానంలో ఉండగా దక్షిణ కొరియా 13.7, చైనా 9.8, జపాన్‌ 4.4శాతం విధించాయి. శానిటరీ మరియు ఫైటోశానిటరీ(ఎస్‌పిఎస్‌) ఆంక్షలను చైనా 1,332ప్రకటించగా దక్షిణ కొరియా 777, జపాన్‌ 754 విధించగా మన దేశం కేవలం 261 మాత్రమే ప్రకటించింది. ఇలా ప్రతి దేశంలో అనేక ఆంక్షలను విధిస్తూనే ఉండగా మనం ప్రపంచ వాణిజ్య సంస్ద ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం కనుక విధించటం లేదు అని చెప్పటాన్ని వంచన అనాలా మరొకటని చెప్పాలా ? పన్నేతర ఆంక్షలకు చెప్పే రక్షణ, పర్యావరణం, నాణ్యత వంటివన్నీ ఎక్కువ భాగం దిగుమతుల నిరోధానికి పరోక్షంగా చెప్పే సాకులే అన్నది అందరికీ తెలిసిందే. కొన్ని వాస్తవాలు కూడా ఉండవచ్చు. రాజకీయ పరమైన వివాదాలు తలెత్తినపుడు ఇలాంటి పరోక్ష దాడులకు దిగటం మరింత ఎక్కువగా ఉంటుంది.
చైనా వస్తువుల నాణ్యత గురించి అనేక మంది చెబుతారు, చైనా పేరుతో వచ్చే వస్తువులన్నీ అక్కడివి కాదు, ఆ పేరుతో మన దేశంలో తయారైన వాటిని కూడా విక్రయిస్తున్నారు. ఏ వస్తువైనా మన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిందే. రోజు రోజుకూ చైనాతో విదేశీ వస్తువులు కుప్పలు తెప్పలుగా వస్తున్నపుడు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పోనీ అత్యవసరం గాని వస్తువుల దిగుమతులను అయినా నిరోధించిందా అంటే అదీ లేదు.
” చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను చేసుకొనేందుకు రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ అనేక అధ్యయనాలు చేసింది. ఒప్పందాలు చైనా కంటే భారత్‌కే ఎక్కువ అవసరమని పేర్కొన్నది. చైనా నుంచి మూడులక్షల డాలర్లు లేదా నాటి విలువలో 90లక్షల రూపాయలను విరాళంగా పొందింది.” కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌, బిజెపి తాజాగా ముందుకు తెచ్చిన ఆరోపణ ఇది. నిజమనే అంగీకరిద్దాం, చైనా నుంచి వచ్చిన విరాళం సంగతి ఫౌండేషన్‌ తన వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది.
పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్న విరాళం గురించి, రాజీవ్‌ ఫౌండేషన్‌ చేసిన అధ్యయనాలు, సిఫార్సుల గురించి ఇంతకాలం తరువాత బిజెపికి ఎందుకు గుర్తుకు వచ్చినట్లు ? వాటిలో తప్పుంటే ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు. అంటే, ” నా గురించి నువ్వు మూసుకుంటే నీ గురించి నేను మూసుకుంటా, నన్ను లడక్‌ విషయంలో వేలెత్తి చూపుతున్నావ్‌ గనుక నీ పాత బాగోతాలన్నీ బయటకు తీస్తా ! ఇది బిజెపి తీరు.” బయటకు తీయండి, పోయిన సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత. బిజెపి -కాంగ్రెస్‌ వారు ఇలా వివాదపడుతుంటేనే కదా వారిద్దరి బండారం జనానికి తెలిసేది.
బిజెపి వారు ఎదుటి వారి మీద ఎదురు దాడికి దిగితే ఇంకేమాత్రం కుదరదు. ఆ రోజులు గతించాయి. ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లు, కొద్ది క్షణం క్రితమే అధికారాన్ని స్వీకరించినట్లు కబుర్లు చెబితే చెల్లవు. గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తే రాజకీయాల్లో కుదరదు.రాహుల్‌ గాంధీ చైనా నేతలతో జరిపిన భేటీలో ఏమి చర్చించారో చెప్పాలని కూడా బిజెపి వారు సవాళ్లు విసురుఉన్నారు. సూదులు దూరే కంతల గురించి గుండెలు బాదుకుంటూ పదిహేనేండ్ల క్రితం చైనానుంచి తీసుకున్న 90లక్షల రూపాయలను ఏమి చేశారో చెప్పమని కాంగ్రెస్‌ వారిని ఇప్పుడు సవాల్‌ చేస్తున్నారు. దాన్ని వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఖర్చుల గురించి కూడా చెప్పి ఉంటారు కదా ! ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత పెద్ద కార్యాలయాన్ని ఏడువందల కోట్ల రూపాయలు పెట్టి బిజెపి ఢిల్లీలో కట్టింది. దానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్‌తో సహా అనేక మంది అడిగారు, ఇంతవరకు ఎవరైనా చెప్పారా ?
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ నాలుగుసార్లు, ప్రధానిగా ఐదుసార్లు చైనా వెళ్లారని, చైనా అధ్యక్షు గ్జీ జింపింగ్‌ను మూడుసార్లు మన దేశం ఆహ్వానించారని, గత ఆరు సంవత్సరాలలో వివిధ సందర్భాలలో జింపింగ్‌తో మోడీ 18సార్లు కలిశారని కాంగ్రెస్‌ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు.2009లో బిజెపి అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా కమ్యూ నిస్టు పార్టీతో సంప్రదింపులు జరిపిందని,2011లో నాటి బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం చైనా పర్యటన జరిపిందని అక్కడ భారత వ్యతిరేక చర్చలు జరిపారా అని కూడా సూర్జేవాలా ప్రశ్నించారు. చైనా రాజకీయ వ్యవస్ధను అధ్యయనం చేసేందుకు 2014లో బిజెపి 13 మంది ఎంపీలు, ఎంఎల్‌ఏల బృందాన్ని చైనా పంపిందని ఇవన్నీ భారత వ్యతిరేక కార్యకలాపాలా అని కాంగ్రెస్‌ వేస్తున్న ప్రశ్నలకు బిజెపికి మైండ్‌ బ్లాంక్‌ కావటం తప్ప సమాధానం ఏమి చెబుతుంది ?
ప్రపంచంలోనే చైనా అత్యంత విశ్వాస ఘాతుక దేశమని విశ్వహిందూ పరిషత్‌ నేత సురేంద్ర జైన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) ఎకనమిక్‌ టైమ్స్‌తో చెప్పారు. అలాంటి దేశంతో అంటీముట్టనట్లుగా ఉండాల్సింది పోయి ఎందుకు రాసుకుపూసుకు తిరుగుతున్నారని తమ సహచరుడు నరేంద్రమోడీని ఎందుకు అడగరు? చైనాతో వ్యవహరించేటపుడు చైనాది హంతక భావజాలమని, దాని ఆధారంగా పని చేసే ఆ దేశ నాయకత్వంతో వ్యవహరించేటపుడు ఆ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని 2020 జూన్‌ నాలుగవ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెలిబుచ్చిన అభిప్రాయం ఈ రోజు కొత్తది కాదు, ఎప్పటి నుంచో చెబుతున్నదే మరి బిజెపి నాయకత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది ? వెనుక నుంచి ఆడించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు అనుమతించినట్లు ? ప్రశ్నించకుండా అనుసరించే జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయాలని గాకపోతే ఏమిటీ నాటకాలు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా వీసాల రద్దుపై మౌనమేల మోడీ మహాశయా !

24 Wednesday Jun 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 2 Comments

Tags

Donald trump, H1B Visa issue, Narendra modi and BJP silent on H1B visa issue


ఎం కోటేశ్వరరావు
లక్షలాది మంది యువత ఆశల మీద నీళ్లు చల్లుతూ తమ దేశంలోకి విదేశీ కార్మికులు రావద్దంటూ వీసాల జారీపై నిషేధం విధించిన ట్రంప్‌ తాజా చర్య గురించి మోడీ లేదా ఆయన పరివారం ఇంతవరకు నోరు మెదపలేదు. పచ్చిగా చెప్పాలంటే కరోనాతో సహజీవనం చేయాలంటూ కనీస చర్యలకు సైతం తిలోదాకాలు ఇస్తున్న పాలకులు ట్రంప్‌ చర్యపై మౌనానికి అర్ధం మీ చావు చావండి అనటమే. అమెరికన్లు ఎందరో నిరుద్యోగంతో ఉన్నందున కొన్ని మినహాయింపులలో తప్ప విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో మా దేశంలో ప్రవేశించటానికి లేదు అని మన ప్రధాని జిగినీ దోస్త్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించేశాడు. ఆ నిషేధం ఈ ఏడాది చివరి వరకు ఉంటుందని చెప్పాడు. ట్రంప్‌ ప్రకటనను గూగుల్‌ సిఇఓ సుందర పిచ్చయ్యతో సహా అనేక దిగ్గజ కంపెనీల ప్రతినిధులందరూ తప్పు పట్టారు.
డాలర్‌ కలలు కంటున్న అనేక మంది లబోదిబో మంటున్నారు. డాలర్‌ దేవుడు చిలుకూరు బాలాజీ ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. ఇక్కడ ఉద్యోగాలు లేక అమెరికా పోలేక మన యువత తీవ్ర నిరాశకు గురవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గత చర్యల కొనసాగింపుగా డోనాల్డ్‌ ట్రంప్‌ విజయాన్ని కోరుతూ మన ప్రధాని నరేంద్రమోడీ చప్పుట్లు కొట్టిస్తారో, వీసాల నిషేధంపై మనసు మార్పించాలని ప్రార్ధిస్తూ దీపాలు ఆర్పించి కొవ్వొత్తులు వెలిగించమని చెబుతారో లేక మరేదైనా ఖర్చులేని వినూత్న కార్యక్రమం ఏమైనా ప్రకటిస్తారో తెలియదు.
ట్రంప్‌ నిర్ణయం వెలువడగానే సామాజిక మాధ్యమంలో ఎలాంటి స్పందన వచ్చిందో ఒక్కసారి చూద్దాం.
అమెరికా కలలు కంటున్నవారికి రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం.భారత అభివృద్ధి కథ ఇప్పుడే ప్రారంభమైంది-తిరిగి రండి దేశాన్ని నిర్మిద్దాం. నమస్తే ట్రంప్‌కు భారత ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేసింది-దానికి బదులుగా డిసెంబరు వరకు హెచ్‌1బి వీసాలను ట్రంప్‌ రద్దుచేశాడు. మచ్చుకు కొన్ని ఇవి, యువతలో ఉన్న నిరాశను, మన పాలకులపై ఉన్న ఆశ-భ్రమలు, అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి.
అసలెందుకు ట్రంప్‌ ఈ పని చేశాడు ? అమెరికా ఎన్నికలు 133 రోజులు ఉన్నాయనగా ఎన్నికల ఫలితాలను తారు మారు చేసేందుకు విదేశాలు మిలియన్ల కొద్దీ బ్యాలట్‌ పత్రాలను ముద్రిస్తాయని, వర్తమానంలో ఇది పెద్ద కుంభకోణమని సోమవారం నాడు ప్రకటించిన ట్రంప్‌ మంగళవారం నాడు వీసాల రద్దు నిర్ణయాన్ని వెలువరించాడు. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలో గత వారాంతంలో జరిగిన ఎన్నికల సభకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని కలలు కన్న ట్రంప్‌కు ఖాళీ కుర్చీలు దర్శనమివ్వటంతో హతాశుడయ్యాడు.మన దేశంలో పోస్టల్‌ బ్యాలట్ల మాదిరి విదేశాలలో ఉన్న అమెరికన్లకు ఇమెయిల్‌ ద్వారా అటువంటి సౌకర్యం ఉంది. గతంలో ఎవరు అధికారంలో ఉంటే వారు అలాంటి నకిలీ బ్యాలట్లను తమకు అనుకూలంగా తెప్పించుకున్న ఉదంతాలేమైనా జరిగి ఉన్న కారణంగానేే ట్రంప్‌ ముందే ఎదురుదాడికి దిగారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఓడిపోతే నేను ముందే దొంగ ఓట్ల గురించి చెప్పాను అని చెప్పేందుకు ఒక సాకును వెతుక్కుంటున్నారా ? అమెరికా దేశాధ్యక్ష ఎన్నికలలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా బ్యాలట్‌ పత్రాలను ముద్రించే విధానం ఉన్నందున ఏవి నకిలీవో ఏవి కాదో గుర్తించటం అంత సులభం కాదని వార్తలు వచ్చాయి.
ఇక గూగుల్‌,ఇతర బడా కంపెనీల ప్రతినిధులు ట్రంప్‌ నిర్ణయంపై ఆశాభంగం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిసెంబరు వరకే అని చెప్పినా వారి నుంచి అలాంటి స్పందన వెలువడిందంటే ఒక వేళ ట్రంప్‌ ఓడిపోయి డెమోక్రాట్లు గెలిచినా ఒక వేళ అనూహ్యంగా ట్రంపే గెలిచినా అమెరికా యువతను సంతృప్తి పరచేందుకు ఆ నిర్ణయాన్ని కొనసాగిస్తే తమ పరిస్ధితి ఏమిటనే ఆందోళన వారిలో కలిగిందా ? ప్రస్తుతం తలెత్తిన సంక్షోభం ఎప్పుడు తొలుగుతుందో, ఇంకెంతగా దిగజారుతుందో ఎవరి ఊహకూ అందటం లేదు. అసలే ఆర్ధిక సంక్షోభం దానికి తోడు గోరు చుట్టు మీద రోకటి పోటులా కరోనా వైరస్‌ జమిలిగా ప్రపంచ ధనిక దేశాలను ఊపివేస్తున్నాయి.
గత ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటు వేసిన భారతీయులు తక్కువ మందే అయినప్పటికీ తాజా పరిణామంతో తాము ట్రంప్‌ చేతిలో మోసపోయినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తగినంత మంది నిపుణులు ఉన్పప్పటికీ భారత్‌, ఇతర దేశాల నుంచి వచ్చే వారు తక్కువ వేతనాలకు పని చేసేందుకు ముందుకు వస్తారు. ఆ విధంగా వారి శ్రమదోపిడీని కొనసాగించేందుకు తప్ప అమెరికన్‌ కార్పొరేట్‌లకు విదేశీయుల మీద ప్రేమ, అనురాగాలు ఉండి కాదు. వీసాల మీద ఆంక్షలు విధించి విదేశీ కార్మికులను అడ్డుకుంటే కంపెనీలే కెనడా వంటి దేశాల్లో దుకాణాలు తెరిచి అక్కడి నుంచి పని చేయించుకుంటాయి.
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం 2019లో తాత్కాలికంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు గరిష్టంగా పని చేసేందుకు వీలు కల్పించే 1,33,000 హెచ్‌1బి వీసాలను, ఆయా దేశాలను బట్టి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు పని చేసేందుకు ఇచ్చే పన్నెండువేల ఎల్‌1 వీసాలను, విదేశీ కార్మికులను పనిలో పెట్టుకొనేందుకు యజమానులకు వీలు కల్పించే 98వేల హెచ్‌2బి వీసాలను అమెరికా జారీ చేసింది. కరోనా పేరుతో ఇలాంటి వీసాలను నిలిపివేయాలని ట్రంప్‌ నిర్ణయించాడు.
అమెరికా సంపదల సృష్టిలో విదేశీ కార్మికుల శ్రమ భాగం తక్కువేమీ కాదు. స్ధానిక కార్మికులకు ఇచ్చే వేతనం కంటే బయటి దేశాల వారికి తక్కువ ఇస్తారు. అనేక దేశాల నుంచి అనుమతులు లేకుండా వచ్చే కార్మికులను చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. వారికి వేతనాలు తక్కువే కాదు, అసలు ఎక్కడా వారి నమోదు ఉండదు, యజమానులకు కార్మిక చట్టాలను అమలు జరపాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. అయితే అక్కడ స్ధానికుల్లో అసంతృప్తి తలెత్తినపుడు విదేశీ కార్మికుల మీద ఆంక్షల చర్యల వంటి హడావుడి చేస్తారు. అమెరికాలో పని చేసే కార్మికుల్లో హెచ్‌1బి వీసాలతో వచ్చి పని చేసే వారు 0.05శాతమే అని చెబుతున్నారు. ఆ మేరకు కూడా అనుమతించే పరిస్ధితి లేదంటే స్ధానికుల్లో ఉన్న అసంతృప్తి లేదా నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులకు వీసాలు నిరాకరించటం లేదా గడువు తీరిన వీసాలను పొడిగించకుండా తిరస్కరించటం ద్వారా నవంబరు ఎన్నికలలోపు కనీసం ఐదు లక్షల ఉద్యోగాలను స్ధానికులకు కల్పించాలన్నది ట్రంప్‌ లక్ష్యంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన సమయం, అమెరికాలో ఆర్ధిక సమస్యలు తీవ్రతరం అవుతున్న కారణంగా ప్రాజెక్టులు లేక అక్కడి కంపెనీలు(ఇన్ఫోసిస్‌, విప్రో వంటి మనదేశానివి కూడా) గత కొద్ది సంవత్సరాలుగా విదేశీ కార్మికుల నియామకాలను గణనీయంగా తగ్గించాయి. ఇన్ఫోసిస్‌ 2017లో హెచ్‌1 బి వీసాలున్న వారిని 14,586 మందిని నియమిస్తే 2019 నాటికి 60శాతం తగ్గించి 5,496 మందినే నియమించింది. అలాగే విప్రో 56, టిసిఎస్‌ 52, హెసిఎల్‌ 46, కాగ్నిజంట్‌ 56శాతం మందిని తగ్గించాయి. 2016-2019 మధ్య ఈ కంపెనీల నియామకాలు 59,478 నుంచి 32,350కి తగ్గాయి.
అమెరికా వీసాల నిరాకరణ కారణంగా కంపెనీలు ఎక్కడ ఖర్చు తక్కువ ఉంటే అక్కడకు తరలిపోతాయి.ఈ రీత్యా కొన్ని విదేశీ కంపెనీలు మన వంటి దేశాలకు రావచ్చు.అయితే అది పరిమితంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. గూగుల్‌ సుందర పిచ్చయ్య, ఇతర అమెరికన్‌ కంపెనీల ప్రతినిధుల అసంతృప్తికి కారణం లేకపోలేదు.హెచ్‌1బి వీసాల మీద పని చేసే కార్మికుల మీద ఆధారపడటం భారతీయ కంపెనీలు 50శాతానికి పైగా తగ్గిస్తే, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌ వంటి కంపెనీల ఆధారం 43శాతం పెరిగింది. అందువలన ట్రంప్‌ చర్యతో వెంటనే ఈ కంపెనీల మీద ప్రభావం పడుతుంది కనుకనే స్పందించాయి. ఈ కంపెనీలు 2016లో17,810 మంది విదేశీ కార్మికులను పెట్టుకోగా 2019కి 25,441కి పెరిగారు. ఈ నేపధ్యంలో అధ్యక్ష ఎన్నికల తరువాత తిరిగి గెలిస్తే ట్రంప్‌ లేదా అధికారానికి వచ్చే డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి జో బిడెన్‌ మీద ఈ కంపెనీలు వత్తిడి తీసుకు వచ్చి ఆంక్షలను ఎత్తివేయించే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి భారతీయుల మీద ప్రేమ కాదు స్ధానిక కార్మికుల కంటే విదేశీ కార్మికులకు ఇచ్చే వేతనాలు తక్కువ, పని ఎక్కువ చేయించుకొనే వీలు ఉండటమే అసలు రహస్యం.
అమెరికా వెళ్లి డోనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించమని చెప్పి వచ్చారు-మన దేశానికి పిలిపించి పెద్ద పీట వేసి మేము మీ వెంటే అని మరోసారి చెప్పి పంపారు మన ప్రధాని మోడీ గారు. గత మూడు సంవత్సరాలుగా ఈ సమస్య గురించి ట్రంప్‌ ప్రతి సారీ బహిరంగంగానే తన మనసులోని మాట చెబుతున్నాడు. అలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ మోడీ, ప్రభుత్వం కూడా అమెరికాతో చర్చిస్తున్నది అనే లీకు వార్తలు తప్ప ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారైనా నరేంద్రమోడీ బహిరంగంగా అభ్యంతరాల వెల్లడి సంగతి గోమాత ఎరుగు అసంతృప్తి అయినా వ్యక్తం చేసిన ఉదంతం ఉందా ? పోనీ మౌనంగా ఉండి సాధించిందేమిటి ? గతంలో దీని గురించి వార్తలు వచ్చినపుడు మై హూనా అన్నట్లు ఫోజు పెట్టిన వారు ఇప్పుడేమయ్యారని యువత ప్రశ్నిస్తోంది. వారికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పటానికి కూడా నోరు రావటం లేదా అంటున్న వారికి ఏమి చెబుతారు ? మన దేశంలో ఏమి జరిగినా కారకులు మోడీయే అని చెబుతున్నారు కనుక దీన్ని గురించి కూడా అడగాల్సింది మోడీనే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వస్తు బహిష్కరణ : ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు !

21 Sunday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Boycott china goods, Ladakh border clash, Narendra Modi, swadeshi jagran manch


ఎం కోటేశ్వరరావు
మన ప్రధాని నరేంద్రమోడీ గారేమో చైనా మన భూభాగాన్ని అక్రమించలేదు, పోస్టులను స్వాధీనం చేసుకోలేదు అని అఖిలపక్ష సమావేశంలో అధికారికంగా చెబుతారు. మరోవైపు ఆయన తెగకు చెందిన వారు ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు, దానిలో భాగంగానే చైనా వస్తు బహిష్కరణ పిలుపులతో కాషాయ దళాలు ఒక నాటకాన్ని ప్రారంభించాయి. రెండు దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య జరిగిన విచారకర ఘర్షణలో మన వారు 20 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. చైనా తమ వారు ఎందరు మరణించిందీ చెప్పకపోయినా మన బిజెపి నేత, మాజీ సైనిక అధికారి 45 మంది చైనీయులను మన వారు చంపినట్లు చెబుతున్నారు. దాన్ని నమ్ముతున్న వారే ఎక్కువ మందిని మనమే చంపినా చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.
ఏ దేశంలో అయినా పాలకులే మనోభావాలను రెచ్చగొట్టి ముందుకు తెచ్చినపుడు దానికి మీడియా మసాలా కూడా తోడైతే రెచ్చిపోవటం సహజం. రేటింగ్‌లు పెంచుకొనేందుకు అలా చేస్తాయని మనకు తెలిసిందే. ఉద్రేకాలు బాగా ఉన్నపుడు మంచి చెడ్డల విచక్షణ ఉండదు కనుక అది తప్పా ఒప్పా అన్నది పక్కన పెడదాం. ఈ పిలుపులు ఇస్తున్న వారు, దానికి అనుగుణ్యంగా వీధుల్లో దృశ్యాలను సృష్టిస్తున్నవారిలో అసలు నిజాయితీ, విశ్వసనీయత ఎంత?
ఢిల్లీ-మీరట్‌ ఆర్‌ఆర్‌టిఎస్‌ ( మెట్రో రైల్‌) పధకంలో కొంత మేరకు భూగర్భమార్గాన్ని నిర్మించేందుకు షాంఘై టన్నెల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ(ఎస్‌టిఇసి)కి కేంద్ర ప్రభుత్వ టెండర్‌ దక్కింది. దాన్ని రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం) ఆందోళనకు దిగింది. ఆ టెండర్‌ను పిలిచేటపుడు, అర్హతలను కోరినపుడు, తెరిచినపుడు అభ్యంతరం వ్యక్తం చేయని వారు ఇప్పుడు వీరంగానికి దిగటం ఏమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబ సభ్యుడైన నరేంద్రమోడీ మిగతా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోరా ? క్రమశిక్షణకు మారు పేరు, పద్దతిగా ఉంటాం అని చెప్పుకొనే వారు అంతా అయిపోయాక ఆందోళనకు దిగటం ఏమిటి ?
ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు(ఏడిబి) నుంచి అప్పు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ( మా మోడీ ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్ధల నుంచి అప్పులు తీసుకోవటం నిలిపివేశారు, అప్పులను తగ్గిస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారు దీని గురించి తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు) మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నది.నిబంధనలు అవకాశం ఇచ్చిన మేరకు టెండర్లలో మూడు విదేశీ, రెండు స్వదేశీ కంపెనీలు పోటీ పడ్డాయి. 2019 నవంబరులో టెండర్లు పిలిచి ఈ ఏడాది మార్చి 16న తెరిచారు. చైనా కంపెనీ రూ.1,126.9 కోట్లకు చేస్తామని పేర్కొనగా మన ఎల్‌అండ్‌ టి కంపెనీ రూ.1,170 కోట్లతో రెండవదిగా నిలిచింది. ఈ టెండర్‌ను లాంఛనంగా ఖరారు చేయాల్సి ఉంది. ఈ లోగా సరిహద్దు వివాదం చెలరేగింది. జూన్‌15న గాల్వాన్‌లోయ సరిహద్దు ఘర్షణల తరువాత స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఆందోళనకు దిగి ఆ టెండర్‌ను రద్దు చేయమంది. ఇప్పుడు తమ కాషాయ దళాన్ని సంతృప్తి పరచేందుకు కేంద్రం ఈ టెండరును రద్దు చేస్తుందా ? చేస్తే ఎడిబికి ఏ సంజాయిషీ ఇస్తుంది ? అది అంగీకరిస్తుందా ? సరిహద్దువివాదం సద్దు మణిగిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా మోడీ సర్కార్‌ చైనా కంపెనీకి అప్పగిస్తుందా ?
ప్రభుత్వ రంగ సంస్ధ బిఎన్‌ఎన్‌ఎల్‌ వ్యవస్ధను మెరుగుపరచేందుకు రూ.8,640 కోట్ల టెండర్‌లో చైనా కంపెనీలు పాల్గొనకుండా చూసేందుకు మార్పులు చేస్తామని టెలికమ్యూనికేషన్స్‌ శాఖ ప్రకటించింది. దీని వెనుక వేరే శక్తుల హస్తం ఉందా ? ఎందుకంటే ప్రపంచం 5జి ఫోన్లకు మారేందుకు, 6జి ఫోన్ల అభివృద్దికి పరుగులు పెడుతున్నది. ప్రయివేటు జియో, ఎయిర్‌టెల్‌ వంటి వారికి మార్కెట్‌ను అప్పగించేందుకు మన బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌లను ఇంకా 3జిలోనే ఉంచి దెబ్బతీశారు. ఇప్పుడు 4జి కూడా లేకుండా చేసేందుకు చైనా పేరుతో దెబ్బతీస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.దీంతో ఉన్న కనెక్షన్లు కూడా పోతాయి. ఆర్ధిక, బ్యాంకింగ్‌, రక్షణ, టెలికామ్‌ రంగాలలో పిపిఇ మార్గంలో వచ్చే పెట్టుబడులలో చైనా కంపెనీల నుంచి వచ్చే వాటిని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
అలాంటి ఆలోచన గాల్వాన్‌ ఘటనకు ముందే ఎందుకు లేదు ? మిగతా దేశాల నుంచి పెట్టుబడులు ముద్దు-చైనా పెట్టుబడులు వద్దు అంటున్నారని భావిద్దాం ! చైనాకు పోయే లాభాలు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు పోతాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పిచ్చివారిని సంతృప్తి పరచటం తప్ప దీని వలన మన దేశానికి ఒరిగేదేమిటి ? చైనా కంపెనీలు అనేక దేశాలలో స్దాపించిన అనుబంధ లేదా సోదర కంపెనీల ద్వారా పలు దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి, వాటిని కూడా అడ్డుకుంటారా ?
మేకిన్‌ ఇండియా అంటూ నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలకు ఓట్లేసిన జనం, బిజెపికి మద్దతుదార్లుగా ఉన్న వ్యాపారులు మేడిన్‌ చైనా వస్తుమయంగా దేశ మార్కెట్‌ను మార్చివేశారు. అంటే వారిలో దేశభక్తిని పెంపొందించటంలో మోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందనుకోవాలా ? నరేంద్రమోడీ తీరుతెన్నులను నిత్యం పర్యవేక్షించే, చాపకింద నీరులా భలే పని చేస్తుంది అని కొందరు అనుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమి చేస్తున్నట్లు ? స్వదేశీ అంటూ బయలు దేరిన తమ నేతలు విదేశీగా మారిపోవటాన్ని ఆ సంస్ధ ఎలా అనుమతించింది? అదియును సూనృతమే ఇదియును సూనృతమే అంటుందా ? పరిణామాలను చూస్తుంటే దాని తీరుతెన్నులపై అనుమానాలు కలగటం లేదా ? ఎవరైనా ఎందుకిలా సందేహించాల్సి వస్తోంది?
” 2014వరకు మన దేశంలో చైనా పెట్టుబడులు కేవలం 160 కోట్ల డాలర్లు మాత్రమే. ఇప్పుటి వరకు ప్రకటించిన పెట్టుబడులు, వచ్చినవి మొత్తం 2,600 కోట్ల డాలర్లు, మరో 1500 కోట్ల డాలర్లను వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెడతామని చైనా సంస్దలు వాగ్దానం చేశాయి. ఇవిగాక ప్రభుత్వ నివేదికల్లో చైనా నుంచి వచ్చిన పెట్టుబడుల జాబితాలో చేరనివి ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు గ్జియోమీ టెలికాం సంస్ధ సింగపూర్‌ అనుబంధ కంపెనీ ద్వారా 50.4 కోట్ల డాలర్ల పెట్టుబడి ఒకటి. పశ్చిమ దేశాల్లో మాదిరి భారత్‌లో చైనా సంస్ధలు తనిఖీని తప్పించుకున్నాయి టెలికాం రంగంలో 5జి ప్రయోగాల్లో అనేక దేశాలల్లో చైనా సంస్ధ హువెయిపై ఆంక్షలు విధించగా భారత్‌లో ఒక నిర్ణయం తీసుకోకపోయినా తొలి ప్రయోగాల్లో పాల్గొనేందుకు అనుమతించారు. ( మార్చి 31వ తేదీ ది ప్రింట్‌ వ్యాసం).” ఇప్పుడు ఈ పెట్టుబడులన్నింటినీ నష్టపరిహారం ఇచ్చి రద్దు చేస్తారా ? పరిహారం ఎవరు చెల్లిస్తారు ? పరిహారమేమీ లేకుండా నెత్తిన చెంగేసుకొని పొమ్మంటే పోవటానికి చైనా అంత బలహీనంగా ఉందా ? మనం చేసుకున్న ఎగుమతి ఒప్పందాలను చైనా రద్దు చేయకుండా ఉంటుందా ?
చైనాతో లడాయి ఎవరికి లాభం, ఎవరికి నష్టం ? వీధుల్లో చైనా ఉన్మాదంతో వీరంగం వేస్తున్న వారు కమ్యూనిస్టులు చెబుతున్నది ఎలాగూ వినిపించుకోరు. కమ్యూనిస్టేతరులు చెబుతున్నదైనా పట్టించుకుంటారా ? జూన్‌ 20న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విలేకరి అతుల్‌ ఠాకూర్‌ ఒక విశ్లేషణ చేశారు. ఆయనేమీ కమ్యూనిస్టు పార్టీ నేత కాదు.చైనాతో విరోధం ఆదేశం కంటే భారత్‌కే ఎక్కువ నష్టం అన్నది దాని సారం. మన దేశం అమెరికాకు ఎంతశాతం వస్తువులను ఎగుమతి చేస్తున్నదో కాస్త అటూ ఇటూగా రెండవ స్ధానంలో చైనాకు ఎగుమతి చేస్తున్నాం. మన ఎగుమతులు చైనాకు పదకొండుశాతం వరకు ఉంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకొనేది 2.1శాతంతో పన్నెండవ స్దానంలో ఉన్నామని అతుల్‌ చెప్పారు. మన దేశం నుంచి ఏటా చైనాకు ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తుంటే చైనా నుంచి వస్తున్నవారు రెండున్నరలక్షలు మాత్రమే అని కూడా పేర్కొన్నారు.
చైనా వస్తువులు మన దేశంలో విస్తరించటానికి కచ్చితంగా కమ్యూనిస్టులైతే కారణం కాదు. ఉదాహరణకు ఢిల్లీ సాదర్‌ బజార్‌లో దాదాపు 40వేల మంది రిటైల్‌ వర్తకులు చైనా వస్తువులను అమ్ముతున్నారు. ఆ దుకాణాల్లో ఒక్కటి కూడా సీతారామ్‌ ఏచూరి లేదా ప్రకాష్‌ కారత్‌కు గానీ లేవు. అక్కడ అమ్మేవారు చెప్పేది ఒక్కటే చైనా ధరలకు భారతీయ తయారీ వస్తువులను సరఫరా చేయండి చైనా వస్తువులను నిలిపివేస్తాం అంటే , తాము కూడా కొనటం మానేస్తామని వినియోగదారులు అంటున్నారు.పాలకులు లేదా చైనా వస్తు బహిష్కరణ వాదులు అందుకు సిద్దమేనా ? భారతీయ వస్తువులను తమకు ఇస్తే తమ దగ్గర ఉన్న చైనా వస్తువులను నాశనం చేస్తామని వినియోగదారులు అంటున్నారు, మరి ఆ పని చేస్తారా ? ఎంతసేపూ నిరసనకారులు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ధ్వంసం చేయటం చూపుతున్నారు. చైనా ముడి వస్తువులతో మన దేశంలో తయారు చేస్తున్న ఔషధాల మాటేమిటి ? వాటిని కూడా రోడ్ల మీద పోస్తారా ? జబ్బు చేస్తే జనం దిక్కులేని చావు చావాలా ? అంతే కాదు, చైనా రసాయనాలతో ఔషధాలను తయారు చేసి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మరి ఆ ఎగుమతులు నిలిచిపోవాలని కాషాయ తాలిబాన్లు కోరుకుంటున్నారా ?
ఈ మధ్య కాషాయ దళాలు కొత్త వాదనను ముందుకు తెస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలకు కట్టుబడి ఉంది కనుక చైనా వస్తువుల మీద చర్య తీసుకుంటే దాని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అందువలన దాన్ని తప్పించుకోవాలంటే జనమే స్వచ్చందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని చెబుతూ తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. అంతే కాదు, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మీద అమెరికా వాడు అణుబాంబులు వేసినప్పటి నుంచి జపనీయులు అమెరికా వస్తువులు కొనటం లేదని, మనం కూడా ఆపని ఎందుకు చేయకూడదనే ప్రచారం చేస్తున్నారు. ఉద్రేకంలో ఉన్నవారు ఇలాంటి అంశాలను నిర్ధారించుకొనేందుకు ప్రయత్నించరు.2019లో జపాన్‌ 23శాతం వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఐరోపా యూనియన్‌ నుంచి 12, అమెరికా నుంచి 11శాతం దిగుమతి చేసుకుంది. అణుబాంబులు వేసిన అమెరికా సైనిక స్ధావరాన్ని జపనీయులు సహించారు, అమెరికా రక్షణలో ఉంటామని ఒప్పందం చేసుకున్నారు. అందువలన తప్పుడు ప్రచారంతో జనాన్ని మభ్యపెట్టలేరు.
మన ఆర్ధిక వ్యవస్ధ మొత్తాన్ని చైనా వస్తువులు దెబ్బతీస్తున్నాయంటూ బహిష్కరణ పిలుపు ఇచ్చేదీ పాలకపార్టీ వారే. చైనా ప్రాణం మనం దిగుమతులనే చిలకలో ఉందని, వస్తువుల దిగుమతులను ఆపివేస్తే చైనా ప్రాణం పోతుందని చెబుతున్నారు. దీనిలో వాస్తవం ఎంత ? 2019లో మనం చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 13.7శాతమే. వాటితోనే మన ఆర్ధిక వ్యవస్ధ నాశనం అవుతుందా ? చైనా ఎగుమతుల్లో మన వాటా రెండు-మూడుశాతం మధ్యనే అన్నది తెలుసా ? ఆమేరకు దిగుమతులు ఆపివేస్తేనే చైనా దెబ్బతింటుందా ? మతి ఉండే మాట్లాడుతున్నారా ? అదే నిజమైతే మోడీగారు ఏం చేస్తున్నట్లు ? చైనా వస్తువుల మీద అధికపన్నులు వేసి దిగుమతులను నిరుత్సాహపరిస్తే ప్రధాని మోడీ లేదా ఆయన మంత్రి వర్గ సభ్యులను డబ్ల్యుటిఓ లేదా ప్రపంచ నేర న్యాయస్ధానంలో విచారణ జరిపి శిక్షలు వేస్తారా ? వేస్తే వేయనివ్వండి ఎలాగూ వారి పూర్వీకులకు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న లేదా త్యాగాలు చేసిన చరిత్ర ఎలాగూ లేదు. ఇప్పుడు దేశం కోసం పోరాడి శిక్షలకు గురైన వారిగా చెప్పుకోవచ్చు కదా ! అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారికి దేశం, జనం ముఖ్యమా ! మనకు హానికరమైన ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు ముఖ్యమా ?
ప్రపంచ వాణిజ్య సంస్ధ వివాదాల ట్రిబ్యునల్‌ ముందు వేలాది కేసులు దాఖలయ్యాయి. ఏ ఒక్కదానిలో కూడా ఒక్క దేశాన్ని లేదా దేశాధినేతను శిక్షించిన దాఖలా లేదు. కేసులు అలాసాగుతూనే ఉంటాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు పూర్తి కాలేదు, అసలు పూర్తవుతాయో లేదో తెలియదు. దాన్ని అవకాశంగా తీసుకొని ధనిక దేశాలు వ్యవసాయరంగంలో దొడ్డిదారిన సబ్సిడీలు ఇస్తూనే ఉన్నాయి.
అంతెందుకు మన మోడీగారి జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇక్కడకు వచ్చి కౌగిలింతలతో ముంచెత్తుతాడు. ఒకే కంచం ఒకే మంచం అంటాడు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన మీద కేసులు వేస్తాడు. ఏమిటా కేసులు ? మన ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర ప్రపంచ వాణిజ్య నిబంధనలకు విరుద్దమని 2018లో ప్రపంచ వాణిజ్య సంస్ధకు అమెరికా ఫిర్యాదు చేసింది. అదేమిటటా ! సంస్ధ నిబంధనల ప్రకారం పదిశాతంలోపు సబ్సిడీ మాత్రమే ఇవ్వాల్సిన భారత్‌ తన వరి, గోధుమ రైతాంగానికి కనీస మద్దతు ధరల రూపంలో 60-70శాతం ఎక్కువగా సబ్సిడీ ఇస్తున్నట్లు చిత్రించింది. పత్తి మీద కూడా ఇలాంటి ఫిర్యాదులే చేసింది. ఎంతైనా ” మిత్ర ” దేశం కదా !
అమెరికాలో ఏటా ప్రతి రైతు సగటున 50వేల డాలర్ల మేర సబ్సిడీ పొందుతుంటే మన దేశంలో 200 డాలర్లు మాత్రమే అని నిపుణులు చెప్పారు. అమెరికాను అడ్డుకోలేని ప్రపంచ వాణిజ్య సంస్ధ మనం చైనా, లేదా మరొక దేశ వస్తువుల మీద పన్నులు వేస్తే ఎలా అడ్డుకోగలదు ? మరి ఎందుకు చేయటం లేదంటే మన బలహీనత, చేతగాని తనం, దాన్ని దాచుకొనేందుకు కుంటి సాకులు ? అసలు విషయం ఏమంటే మనకు విదేశీ పెట్టుబడులు కావాలి, అవి పెట్టే దేశాల వస్తువుల మీద పన్నులు వేస్తే అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి ? నరేంద్రమోడీ హయాంలో ముందే చెప్పుకున్నట్లు లెక్కల్లో చూపిన మేరకే 160 నుంచి 2600 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెరగటంతో పాటు వస్తువుల దిగుమతులు కూడా అదే విధంగా పెరిగాయి. వస్తువులను నిలిపివేస్తే పెట్టుబడులు నిలిచిపోతాయి.
తాజా వివాదం గురించి అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చెప్పిందేమిటి? చైనా వారు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, మన మిలిటరీ పోస్టులను ఆక్రమించ లేదని చెప్పారు. ఈ ప్రకటన తరువాత అయినా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే వారు, వస్తు బహిష్కరణ పిలుపు ఇచ్చి వీధులకు ఎక్కే వారు తమ నాటకాలను ఆపుతారా ? కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు తలెత్తాయి. మన వారి విలువైన ప్రాణాలను ఫణంగా పెట్టాము. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఇన్ని తిప్పలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ?
చౌకగా వస్తున్న చైనా వస్తువుల కొనుగోలుతో మన వినియోగదారులు లబ్దిపొందారే తప్ప నష్టపోలేదు. చైనావి లేకపోతే అధిక ధరలకు ఇతర దేశాల వస్తువులను కొని జేబులు గుల్ల చేసుకోవాల్సి వచ్చేది. మిగతా దేశాల ధరలతో పోలిస్తే చైనా టెలికాం పరికరాల ధరలు 20శాతం తక్కువ. ప్రభుత్వ రంగ సంస్ధలైన బిఎస్‌ఎన్‌ఎల్‌ చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు చైనాను రంగం నుంచి తప్పించేందుకు పూనుకుంది అంటే అర్ధం ఏమిటి ?అంత మొత్తం ఎక్కువకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుందనే కదా ! ప్రయివేటు కంపెనీలు కూడా అదే పని చేస్తాయా ? ప్రభుత్వం వాటికి అలాంటి షరతు విధించి అమలు జరపగలదా ? కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాస్వాన్‌ మాటల్లో చెప్పాలంటే వినాయక విగ్రహాలను కూడా మనం చౌకగా తయారు చేసుకోలేని దుస్ధితిలో ఉన్నాం. చైనా కమ్యూనిస్టులు తయారు చేసిన విగ్రహాలను మన భక్తులు వినియోగిస్తున్నారు. చైనా వస్తువుల నాణ్యత గురించి గట్టి మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని పాస్వాన్‌ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరు అడ్డుకున్నారు? ఇప్పటి వరకు నాశిరకం వస్తువులను అనుమతించి మన జనాన్ని ఎందుకు నష్టపెట్టారు ?
చైనా వస్తువుల మీద లేదా కమ్యూనిస్టు చైనా మీద ఒక సంఘపరివార్‌ కార్యకర్తగా నరేంద్రమోడీకి ప్రేమ, అభిమానం ఉంటాయని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. ఒక వ్యాపారి మాదిరే ఆలోచిస్తారు, వ్యాపారుల వత్తిడికి లొంగిపోతారు. అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరులో లాభపడాలన్నది మన దేశ వాణిజ్య, పారిశ్రామిక సంస్ధల ఆశ, ఎత్తుగడ. ఉదాహరణకు అమెరికా పత్తి దిగుమతుల మీద చైనా 25శాతం పన్ను విధించటంతో అది అమెరికా ఎగుమతిదార్లకు గిట్టుబాటు కాలేదు. అదే సమయంలో మన పత్తి ఎగుమతిదార్లకు వరమైంది. పర్యవసానంగా మన పత్తికి ఆమేరకు డిమాండ్‌ పెరిగి రైతులు కూడా పరిమితంగా అయినా లాభపడ్డారు. చైనాకు పెద్ద ఎత్తున పత్తి దిగుమతులు పెరిగాయి. అయితే పరిస్ధితులెప్పుడూ ఇలాగే ఉండవు. అంతర్జాతీయ రాజకీయాల్లో తీసుకొనే వైఖరులను బట్టి మిగతాదేశాల వైఖరులు మారుతుంటాయి.
గత ఏడాది చైనా వైఖరి కారణంగా మన దేశం నుంచి చైనాకు నూలు ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఒకటి ప్రపంచ వ్యాపితంగా డిమాండ్‌ పడిపోవటం ఒక కారణం అయితే, రెండవది పాకిస్ధాన్‌, వియత్నాం. ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పన్నులు లేని నూలు దిగుమతులను చైనా అనుమతించటంతో మన ఎగుమతులు పెద్ద ఎత్తున పడిపోయాయి. దాని ప్రభావం మన రైతుల మీద కూడా పడిందా లేదా ! చైనాకు వ్యతిరేకంగా అమెరికాను కౌగిలించుకొని అది చెప్పినట్లు చేయటమే దీనికి కారణం అన్నది లోగుట్టు.మనం డబ్ల్యుటిఓ సూత్రాలకు కట్టుబడి ఉన్నాం కనుక చైనా వస్తువుల మీద పన్నులు విధించలేమని అంటున్నవారు అమెరికా వస్తువుల మీద ఎలా విధించారు? మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని వస్తువుల మీద గతంలో ఇచ్చిన పన్నురాయితీలను ”మన అపర స్నేహితుడు ” డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేశాడు. మన ఉక్కుపై 25శాతం, అల్యూమినియంపై పదిశాతం పన్నులు పెంచలేదా దానికి ప్రతిగా మన మోడీ 28 అమెరికా ఉత్పత్తుల మీద దిగుమతి పన్ను పెంచలేదా ? కొన్నింటి మీద 120శాతం వేశారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ మనమీదేమీ చర్య తీసుకోలేదే? మన దేశం పన్నులను ఎక్కువగా విధిస్తున్నట్లు ట్రంప్‌ మనలను ఆడిపోసుకోలేదా ? తమ వస్తువులను మరిన్ని దిగుమతి చేసుకోవాలని మన మీద వత్తిడి తేవటం లేదా ? సరే దీని మీద కూడా ఇప్పుడు కేసు వేశారనుకోండి. ప్రతి దేశం వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా వాడుకొంటుంది. ఆ విషయంలో ఎవరైనా ఒకటే. పాకిస్ధాన్‌తో ఉన్న వైరం కారణంగా పంచదార దిగుమతులను అడ్డుకొనేందుకు 2018లో మన దేశం 50శాతంగా ఉన్న దిగుమతి పన్నును వందశాతానికి పెంచింది. ఈనెలలోనే మలేసియా నుంచి కాలిక్యులేటర్ల మీద ఒక్కోదానిపై 92సెంట్ల చొప్పున ఐదేండ్ల పాటు వసూలు చేసే విధంగా మన దేశం పన్ను పెంచింది. ఇదే పని చైనా వస్తువుల మీద ఎందుకు తీసుకోకూడదు ? ఎందుకంటే పాకిస్ధాన్‌, మలేషియాలు చైనా వంటివి కాదు గనుక. ఆడలేక మద్దెల ఓడు లేదా ఈ రోజు మంగళవారం కాబట్టి సరిపోయింది అన్నట్లుగా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. ఏ దేశమైనా తన మౌలిక ప్రయోజనాలకు భంగం కలిగినపుడు చర్యలు తీసుకొనేందుకు ఆ సంస్ధ నిబంధనలు అవకాశం కలిగిస్తున్నాయి. లేదూ అవి మనకు నష్టదాయకం అనుకుంటే బయటకు వచ్చేయటమే. ఈ రోజు అమెరికా ప్రయోజనాలకే అగ్రస్ధానం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక అంతర్జాతీయ సంస్ధల నుంచి బయటకు రావటం లేదా ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగటం లేదా ? డోనాల్డ్‌ ట్రంప్‌కు ఉన్న మాదిరి 56 అంగుళాల ఛాతీ మన నరేంద్రమోడీకి లేదా ? ఆయనకు మన ప్రయోజనాలు పట్టవా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జగనాంధ్రప్రదేశ్‌లో అప్పు చేసి పప్పుకూడు !

17 Wednesday Jun 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Andhra Pradesh budget 2020-21, Andhra Pradesh Debt, YS jagan, YS Jagan first year regime


ఎం కోటేశ్వరరావు
అవును జగన్మోహనరెడ్డే ఆంధ్రప్రదేశ్‌-ఆంధ్రప్రదేశ్‌ అంటేనే జగన్మోహనరెడ్డి అన్నట్లుగా అధికారపక్షం భజన చేస్తున్నపుడు అన్నింటికీ బాధ్యుడు జగనే కదా ! మంగళవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తన రెండవ బడ్జెట్‌ విన్యాసాలు ప్రదర్శించారు. ఆయన బడ్జెట్‌ ప్రసంగంలో అడుగడుగునా జగన్నామ స్పరణం చేశారు మరి. గతేడాది రెండు లక్షల 27వేల 975 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దాన్ని రూ.1,74,757 కోట్లకు సవరించారు. అంటే 53వేల కోట్ల రూపాయల కోత పెట్టారు. ఇది కూడా జగన్‌ అనుమతి లేకుండా చేసేంత స్వతంత్ర ప్రతిపత్తి ఆర్ధిక మంత్రికి ఉందనుకోవటం లేదు. గత ఏడాది కాలంలో నవరత్నాలకు, మరికొన్ని మరకతాలు తోడయ్యాయి తప్ప తగ్గలేదు. మరి అన్ని వేల కోట్ల రూపాయలను ఏ రంగాలకు తగ్గించినట్లు ? నవరత్నాలకు తగ్గించిన దాఖల్లాలవు కనుక కచ్చితంగా అభివృద్ధి పనులకే అని వేరే చెప్పాల్సిన పనేముంది. మరో విధంగా చెప్పాలంటే గతేడాది కాలంలో ఎంత అప్పయితే చేశారో అంతమేరకు అభివృద్ది పనులకు కోతలు పెట్టారు. తెచ్చిన అప్పును నవరత్నాలకు వినియోగించారు. కొందరు దీన్నే అప్పుచేసి పప్పుకూడు అంటున్నారు.
చంద్రబాబు సర్కార్‌ దిగిపోయే ముందు ఏడాది లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు (29వేల కోట్లు) కుదించింది. జగన్‌ ప్రభుత్వం తొలి ఏడాది దాన్నే రెండులక్షల 28వేల కోట్లకు పెంచి లక్షా 74వేల కోట్లకు(53వేల కోట్లు) కుదించింది. ఇది చంద్రబాబు కంటే ఎక్కువా తక్కువా ? జగన్‌ గారి ఇంగ్లీషు మీడియం పిల్లలు కూడా మోర్‌ దేన్‌ చంద్రబాబు సర్‌ (చంద్రబాబు కంటే ఎక్కువే అండీ) అని కచ్చితంగా చెబుతారు. వారిని పచ్చ పిల్లలు అనకండి, చాల బాగోదు.
చంద్రబాబు నాయుడు బిజెపితో అంటకాగారు కనుక రాష్ట్రానికి జరిగిన అన్యాయాల గురించి మాట్లాడలేని బలహీనతకు లోనయ్యారు. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబట్టలేకపోయారు. ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల గురించి అడిగేందుకు ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. చివరి క్షణంలో మంత్రుల చెయ్యి ఖాళీ లేదు రావద్దు అని వర్తమానం పంపారని వార్తలు. అసలు రమ్మనటమెందుకు ? ఖాళీగా లేమని వద్దనటమెందుకు ? తమాషాగా ఉందా ? ఇది వ్యక్తిగతంగా జగన్‌కు ఏమిటన్నది ప్రధానం కాదు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రికి జరిగిన అవమానంగానే పరిగణించాలి.
తెలుగుదేశం సర్కార్‌ చివరి బడ్జెట్‌లో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటుల మొత్తం 50,695 కోట్లుగా చూపితే సవరించిన దాని ప్రకారం వచ్చిన మొత్తం 19,456 కోట్లు మాత్రమే. జగన్‌ సర్కార్‌ వస్తుందని చూపిన మొత్తం 61,071 కోట్లు కాగా వచ్చిందని చూపిన మొత్తం 21,876 కోట్లు మాత్రమే. వర్తమాన సంవత్సరంలో వస్తుందని చూపిన మొత్తం 53,175 కోట్లు. రెండేళ్ల తీరు తెన్నులు చూస్తే రాష్ట్రం రావాలంటున్న మొత్తం రాదని తేలిపోయింది. అసలు ఆ మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలా లేదా ? బిజెపి నేతలు తమ పలుకుబడిని ఉపయోగించలేరా ? వారికి బాధ్యత లేదా ? జగన్‌ ఎలాగూ గట్టిగా అడగలేరు. చంద్రబాబు నాయుడి సంగతి సరే సరి. అలాంటపుడు అంత మొత్తాలను బడ్జెట్‌లో చూపటమెందుకు ? వస్తుందో రాదో ఖరారు చేసుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకీ దోబూచులాట ?
కీలకమైన సాగునీటి రంగానికి జగన్‌ తొలి బడ్జెట్‌లో 13,139 కోట్లు కేటాయించి చివరకు ఖర్చు చేసింది 5,345 కోట్లు మాత్రమే. రెండవ బడ్జెట్లో కేటాయింపు రూ. 11,805 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మారటం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్న పూర్వరంగంలో దానికి జీవ ధార అయిన నీటి పారుదల రంగానికి కేటాయింపుల మేరకైనా ఖర్చు చేయకుండా, పెంచకుండా పోలవరం లేదా నిర్మాణంలో వున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి రైతులకు ఎలా వుపయోగపడతాయో తెలియదు. మరికొన్ని ముఖ్యమైన రంగాల కేటాయింపుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూడండి.( కేటాయింపులు కోట్ల రూపాయల్లో )
శాఖ 2019-20 ప్రతిపాదన —సవరణ —–2020-21ప్రతిపాదన——- శాతాలలో కోత
గ్రామీణాభివృద్ది 31,564 —- 11,661 — 16,710 —– 47.10
వ్య-సహకారం 18,327 — 5,986 —- 11,891 —- 35.12
పశు సంవర్ధక 1912 —- 720 — 1,279 —– 33.08
పరిశ్రమలు, వాణి 3,416 —- 852 —- 2,705 —- 20.82
సెకండరీ విద్య 29,772—- 17,971 — 22,604 —– 24.08
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య జీవనాధారం వ్యవసాయం, గ్రామీణ రంగాలు వాటికి కేటాయింపులు ఎంత పెద్దమొత్తంలో కోత పెట్టారో చూస్తే రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారో అర్ధం అవుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. సంక్షేమ చర్యలను ఎవరూ తప్పుపట్టటం లేదు. అవి ఉపశమనం కలిగించే చర్యలే తప్ప సంపదలను ఉత్పత్తి చేసేవి కాదు. అందువలన సమతూకం తప్పితే సంక్షేమ పధకాలను పొందిన పేదల జీవితాలు కూడా ఎక్కడ వేసిన గొంగళి మాదిరి అక్కడే ఉంటాయి తప్ప సంక్షేమ చర్యలతో మెరుగుపడిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.
ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో విజయం గమనంలో ఉంచుకొని గానీ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది 7,271 కోట్లు కేటాయించి 18,986 కోట్లు ఖర్చు చేసి ఈ బడ్జెట్‌లో 26,934 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా మైనారిటీల సంక్షేమానికి 952 కోట్ల కేటాయింపు, 1,562 కోట్ల ఖర్చు, కొత్తగా 2,055 కోట్లు ప్రతిపాదించారు.
కరోనా వైరస్‌ దేశంలో ఒక అంశాన్ని ముందుకు తెచ్చింది. ప్రజారోగ్య వ్యవస్ధను నిర్లక్ష్యం చేస్తే అలాంటి మహమ్మారులు వచ్చినపుడు ప్రయివేటు రంగం చేతులెత్తివేస్తుందని తేలిపోయింది. అందువలన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు తగినన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ ఆసుపత్రుల స్ధాయిని మెరుగుపరచాల్సి ఉంది. గతేడాది రూ.11,399 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 7,408 కోట్లు మాత్రమే ఈ ఏడాది కేటాయింపు 11,419 కోట్లు మాత్రమే చూపారు.
వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి వంటి ఆర్ధిక సేవల రంగాలకు గత బడ్జెట్‌లో 37.8 శాతం కేటాయిస్తే తాజా బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని 27.39కి కోత పెట్టారు. ఇదే సమయంలో విద్య, వైద్యం, గృహనిర్మాణం వంటి సామాజిక సేవలకు 33 నుంచి 43శాతానికి పెంచారు. వీటిలో సాధారణ విద్యకు 14.38శాతంగా ఉన్న మొత్తాన్ని 11.21శాతానికి కోత పెట్టారు. సంక్షేమ చర్యల వాటాను 6.2 నుంచి 18.44శాతానికి పెంచారు. కరోనా వైరస్‌ కారణంగా పారిశుధ్య కార్మికుల సేవల గురించి పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. బడ్జెట్‌లో మంచినీటి సరఫరా, పారిశుధ్య బడ్జెట్‌ను 2234కోట్ల నుంచి 1644 కోట్లకు తగ్గించటాన్ని ఏమనాలి ?
తెలుగుదేశం సర్కార్‌ చివరి ఏడాది రూ. 38,151 కోట్ల మేర అప్పులు తెచ్చింది. దాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌ తొలి ఏడాది ఆ మొత్తాన్ని 52వేల కోట్లకు పెంచారు. వర్తమాన సంవత్సరానికి 60 వేల కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అల్లుడికి బుద్ధి చెప్పి మామ తప్పు చేసినట్లుగా లేదూ ఇది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 54వేల 250 కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 11వేల కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌, 3,02,202, 67,171 చొప్పున మొత్తం 3,69,373 కోట్లకు పెంచారు. వచ్చే ఏడాదికి 3,48,998 అప్పు పెరుగుతుందని పేర్కొన్నది, వీటికి అదనంగా హామీగా ఉన్న అప్పును కలుపుకోవాల్సి ఉంది. అంటే మొత్తం నాలుగు లక్షల కోట్లు దాటటం ఖాయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గత నాలుగు సంవత్సరాలుగా 27.92శాతంగా ఉన్న అప్పు వచ్చే ఏడాదికి చివరికి 34.55 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. అందుకే జగనాంధ్ర అప్పుచేసి పప్పు కూడు ఆంధ్రగా మారబోతోందని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయ్యా నరేంద్రమోడీ గారూ మీ ఏలుబడిలో చమురు ధరలింకా ఏమేరకు పెరుగుతాయో తెలుసుకోవచ్చా ?

15 Monday Jun 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

Fuel Price in India, Fuel tax hike in India, Global Crude oil price of Indian Basket, oil price in India

ఎం కోటేశ్వరరావు
అబ్బో ఆరోజులే వేరు. మన జనం ఎంత త్యాగశీలురు, సహనమూర్తులుగా ఉండేవారు. జేబులను కొల్లగొడుతున్నా స్వేచ్చా వాయువులను పీలుస్తూ మైమరచి పోయే వారు. అప్పటి వరకు సహనంలో మనకు మనమే సాటి అని ఒకదాని నొకటి వెనుక కాళ్లతో తన్నుకొని పరస్పరం అభినందించుకున్న గాడిదలు కూడా విస్తుపోయేలా జనం సహనశీలురుగా ఉండేవారు అని చరిత్ర గురించి కొత్త తరాలకు తాతయ్యలు, తాతమ్మలు చెప్పే రోజు వస్తుందా ?
చూస్తుంటే అదే అనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయిన మేరకు వినియోగదారులకు ధర తగ్గించకపోయినా నోరెత్తలేదు. వరుసగా పెట్రోలు, డీజిలు ధరలు (ఇది రాసే సమయానికి తొమ్మిది రోజులు) పెంచుతున్నా ఇదేమిటి అన్నట్లుగా కూడా చూడటం లేదు. మన మెదళ్లలో ఎందుకు అని ప్రశ్నించే సాప్ట్‌వేర్‌ పని చేయటం లేదా లేక హార్డ్‌వేర్‌ చెడిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. అసలు ఏదీ పట్టించుకోని వారికి అంధులకు ఇంధ్రధనుస్సును చూపించినట్లు ఎన్ని వివరాలు చెప్పినా ప్రయోజనం ఏముంది ! ఉండబట్టలేక వామపక్షాలు పిలుపులు ఇచ్చినా జనం పట్టించుకోనపుడు మిగులుతున్నది కంఠశోష మాత్రమే.
2019 మే నెలలో మనం సగటున ఒక పీపా ముడి చమురును రూ.4,664కు, జూన్‌ నెలలో రూ.4,149కి కొనుగోలు చేస్తే ఈ ఏడాది జూన్‌ 15 ధర రూ.2,642 ఉంది. అంతకు ముందు పదిహేను రోజులుగా దీనికి కాస్త అటూ ఇటూగా ఉంది తప్ప మిన్ను విరిగి మీద పడినట్లు పెరగలేదు. లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.69.59గా ఉన్నదానిని మార్చి 16 నుంచి 82 రోజుల పాటు ఎలాంటి మార్పు చేయలేదు. తొమ్మిది రోజులుగా పెంచిన ఫలితంగా అది రూ.76.26కు పెరిగింది.
గతేడాది డిసెంబరు నెలలో సగటున ఒక పీపాను 66 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడు ధర వినియోగదారుడికి లీటరు పెట్రోలు ఢిల్లీలో 75.14 ఉండేది. 2015లో ఇదే సర్కార్‌ ఏలుబడిలో పీపా 35.68 డాలర్లకు కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ.59.98కి విక్రయించారు. ఇంకాస్త ముందుకు పోతే 2004లో పీపా ధర 34.22 డాలర్లు ఉన్నపుడు రూ.35.71కి దొరికింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక మరియు విశ్లేషణ విభాగం 2020 జూన్‌ 11వ తేదీన నవీకరించిన ప్రకారం మార్చినెలలో ఒక పీపా చమురు సగటున మన దేశం 33.36 డాలర్లకు దిగుమతి చేసుకుంది. అది ఏప్రిల్‌ నెలలో 19.9డాలర్లకు పడిపోయింది. మే నెలలో 30.60 డాలర్లకు పెరిగింది. జూన్‌ 15న ధర 40.66 డాలర్లు ఉంది తప్ప వెనుకటి అరవై డాలర్ల స్ధాయికి చేరకపోయినా తొమ్మిది రోజులుగా ఎందుకు పెంచుతున్నట్లు ? 2020 జూన్‌ తొమ్మిదవ తేదీన హిందూస్దాన్‌ పెట్రోలియం వెల్లడించిన సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.73.04 ఉంటే దానిలో డీలరుకు విక్రయించిన ధర రూ.19.63 అయితే కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌ పన్ను రూ.32.98, డీలర్లకు కమిషన్‌ రూ.3.57, ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ రూ.16.86లు ఉంది.
ఈ అన్యాయం గురించి వామపక్షాలు, ఇతర పార్టీలు బిజెపి దృష్టిలో జాతి వ్యతిరేకులు కనుక మాట్లాడటం లేదు అనుకుందాం. మరి అసలు సిసలు జాతీయ వాదులుగా పిలుచుకొనే బిజెపి ఈ ధరల దోపిడీ గురించి మాట్లాడదేం ? లీటరుకు ఒక రూపాయి పన్ను పెంచితే కేంద్రానికి ఏడాదికి 14వేల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. ధర పెంచితే పెట్రోలియం కంపెనీలకు లాభం వస్తుంది. వినియోగదారు జేబుకు చిల్లిపడుతుంది.
గొప్పలు చెప్పుకోవటంలో బిజెపి తరువాతే . కానీ అది తమకు ప్రయోజనం అనుకున్నవాటి విషయంలోనే సుమా ! సిగ్గుపడాల్సిన వాటిని ప్రస్తావించేందుకు సైతం భయపడతారు. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌ కామ్‌ ప్రతి వారం అధికారిక సమాచారం అధారంగా ధరలను సమీక్షిస్తుంది. ఈ మేరకు జూన్‌ ఎనిమిది నాటి సమాచారం ప్రకారం ప్రపంచంలో పెట్రోలు లీటరు సగటు ధర 95 సెంట్లు(డాలరుకు వంద సెంట్లు). మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌లో 46,మయన్మార్‌లో 48, భూటాన్‌లో 66,నేపాల్లో 80, చైనాలో 83, శ్రీలంకలో 87, మన దేశంలో 101 సెంట్లు కాగా బంగ్లాదేశ్‌లో 105 సెంట్లు ఉంది. బంగ్లా మినహా మిగిలిన దేశాలలో రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం చెప్పగలదా ? బిజెపి మరుగుజ్జులు ఈ వాస్తవాలను కాదనగలరా ?
మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే ఆరు సంవత్సరాల తరువాత ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు.
వరుసగా చమురు ధరలను ఎందుకు పెంచుతున్నారు అన్నది ప్రశ్న. కనిష్టానికి పడిపోయిన ముడి చమురు ధరలు పూర్వపు స్ధితికి చేరకపోయినా తిరిగి పెరుగుతున్నాయి. మన దేశంలో 2019-20 సంవత్సరంలో చమురు కంపెనీలకు ఒక లీటరుకు లాభం సగటున రూ.2.20 ఉంది. చమురు ధరలు భారీగా తగ్గిన కారణంగా కేంద్ర ప్రభుత్వం పన్ను భారాన్ని మోపినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో రూ.13 నుంచి 19 వరకు లాభాలు వచ్చాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ సమాచారం ప్రకారం మే నెల 1-5 తేదీల మధ్య లీటరుకు రూ.16.10 ఉన్న లాభం కాస్తా కేంద్ర ప్రభుత్వం మే ఆరు నుంచి పెట్రోలు మీద 10 డీజిలు మీద 13 రూపాయల పన్ను పెంచిన కారణంగా చమురు మార్కెటింగ్‌ కంపెనీల లాభం రెండింటి సగటు లాభం రూ.3.90కి పడిపోయింది. తరువాత ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగినందున మే మధ్య నాటికి కంపెనీలకు ఒక లీటరుకు రూ.1.84, మే ఆఖరు నాటికి 1.56 తరుగు వచ్చిందట. దాంతో తిరిగి ధరలను పెంచటం ప్రారంభించాయి, ఒక్క రోజులో పెంచితే సంచలనాత్మకంగా ఉంటుంది కనుక రోజూ కాస్త కాస్త పెంచుతున్నాయి. అంటే తరుగుపోయి మిగుల్లోకి వచ్చేంత వరకు పెంచుతూనే ఉంటాయి. ఏప్రిల్‌-జూన్‌ మాసాలలో సగటున లీటరుకు రూ.7.9 మిగులు ఉంటుందనుకుంటే అది తరుగులోకి వచ్చింది. అందు వలన కనీసం రూ.5.10 మిగులు ఉండేట్లు చూడాలని నిర్ణయించారని వార్తలు. అంటే ఆ మేరకు లాభాలు వచ్చే వరకు పెంచుతూనే ఉంటారు. చమురు వినియోగం పడిపోయిన సమయంలో చమురు శుద్ధి కర్మాగారాలు కూడా ఆమేరకు తగ్గించాల్సి వచ్చింది. ఆ సమయంలో వాటికి వచ్చిన నష్టాలను కూడా ఇప్పుడు పూడ్చుకుంటున్నాయి. అందువలన ఇప్పుడున్న ముడి చమురు ధర ఇంకా పెరిగితే వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేయటం తప్ప కేంద్రం పన్ను తగ్గించదు. ధరలూ తగ్గవు.
మన దేశంలో ఉన్న చమురు పన్ను ప్రపంచంలో మరెక్కడా లేదంటే మోడీ గారి మంచి రోజులకు, ఇంత పన్ను భరించటం మన జనాల సహనానికి చిహ్నం. కేర్‌ రేటింగ్స్‌ సంస్ధ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం ఫిబ్రవరి 2020 నాటికి కేంద్రం, రాష్ట్రాలు విధిస్తున్న పన్ను సగటున పెట్రోలుపై 107, డీజిల్‌పై 69శాతం ఉంది. మార్చి 16వ తేదీన ఆ పన్నులు 134,88శాతాలకు పెరిగాయి. మే మొదటి వారంలో అవి 260,256 శాతాలకు చేరాయి. జర్మనీ, ఇటలీ దేశాల్లో 65శాతం, బ్రిటన్‌లో 62, జపాన్‌లో 45, మోడీ దోస్తు ట్రంప్‌ ఏలుబడిలో 20శాతం వరకు పన్నులు ఉన్నాయి. నరేంద్రమోడీ ఎంత గొప్పవ్యక్తో ఇతర ప్రపంచ నేతలతో పోల్చితే అది దేశభక్తి, ప్రజలపై భారాలను పోల్చితే అది దేశద్రోహం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతాంగ ఆదాయాల రెట్టింపు ఓ ప్రహసనం !

13 Saturday Jun 2020

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

doubling the farmers income, doubling the farmers income in India a farce, Farmers in India


ఎం కోటేశ్వరరావు
తమ ప్రభుత్వం నిర్ణయించిన వ్యవసాయ పంటల కనీస మద్దతు ధర ప్రపంచ మార్కెట్‌కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్గరీ చెప్పారు. అరవై లక్షల టన్నుల పంచదార ఎగుమతికి కేంద్రం మరో ఆరువేల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల వరకు మనకు బియ్యం, గోధుమ మిగులు ఉంటుందని వాటిని నిల్వ చేసుకొనేందుకు స్దలం కూడా లేదని అన్నారు. ప్రస్తుతం ఆరు- ఏడులక్షల కోట్ల రూపాయల మేరకు చమురు దిగుమతి చేసుకుంటున్నామని, ప్రస్తుతం ఇరవై వేల కోట్ల రూపాయల విలువగల ఇథనాల్‌ తయారు చేస్తున్నామని దాన్ని లక్ష కోట్ల రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. ఏటా 90వేల కోట్ల రూపాయల విలువగల ఖాద్య తైలాలను దిగుమతి చేసుకుంటున్నామని, అందువలన చమురు గింజల ఉత్పత్తి కూడా పెంచాలన్నారు. అమెరికా, బ్రెజిల్‌ దేశాలలో 30, 27-28 క్వింటాళ్ల మేరకు సోయా బీన్స్‌ దిగుబడి ఒక ఎకరానికి వస్తుండగా మన దేశంలో 4.5క్వింటాళ్లకు మించి లేదన్నారు.
దీనిలో మొదటిది అతిశయోక్తి లేదా ఆధారం లేని అంశం. ఏ దేశంలో ఎంత ఇస్తున్నారో మంత్రి చెప్పి వుంటే దానికి విశ్వసననీయత ఉండేది.రెండవది రైతాంగానికి మద్దతు ధర వేరు, గిట్టుబాటు ధర వేరు. మంత్రి చెప్పినట్లుగానే సోయా విషయాన్నే తీసుకుంటే అమెరికా కంటే మన రైతాంగానికి మద్దతు ధర ఎక్కువ ఇచ్చినా గిట్టుబాటు కాదు,ఎందుకంటే అమెరికాలో ఆరు రెట్లు దిగుబడి ఎక్కువ. అందువలన అక్కడ ధర తక్కువ ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చే ఇతర సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటే మన రైతుకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మూడు సంవత్సరాల వరకు బియ్యం, గోధుమలు మిగుల్లో ఉంటాయని చెప్పినందుననే ఈ ఏడాది రైతాంగానికి క్వింటాలు ధాన్యానికి కేవలం 53 రూపాయలు మాత్రమే మద్దతు ధర పెంచారు.రానున్న మూడు సంవత్సరాలలో కూడా ఇంతకు మించి ఎక్కువ పెంచే అవకాశం ఉండదనేందుకు ఈ వ్యాఖ్యలు ఒక సూచిక అని చెప్పవచ్చు. ఒక వేళ అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలు వస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కరోనా వైరస్‌ ఆర్ధిక రంగంలో కలిగించే విపత్కర పరిస్ధితి ఆ వైపు నెట్టదని చెప్పలేము.
కుండలో కూడు కుండలోనే ఉండాలిాపిల్లాడు మాత్రం లడ్డులా తయారు కావాలన్నట్లుగా రైతుల పరిస్ధితి ప్రస్తుతం తయారైంది. గత ఆరు సంవత్సరాలుగా పెరుగుదల లేని ఒకే మొత్తం సబ్సిడీ. యూరియాకు మాత్రమే సబ్సిడీ ఇస్తాం. మిశ్రమ ఎరువుల ధరలు పెరిగితే ఉన్నదాన్నే సర్దుతాం తప్ప మాకు సంబంధం లేదు, మేము ఇవ్వాలనుకున్న మేరకే సబ్సిడీ ఇస్తాం లేదా తగ్గిస్తాం తప్ప పెంచేది లేదు. కనీస మద్దతు ధరలను ముష్టి మాదిరి విదిలించి 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తాం. స్ధూలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలివి.
డిఏపి, ఎంఓపి, ఎన్‌పికె వంటి ఎరువులకు సబ్సిడీని తగ్గిస్తున్నాం, మంచం పొట్టిదైతే కాళ్లు నరుక్కోవాల్సిందే తప్ప వేరే ఏర్పాటు చేయలేం, వర్తమాన ఆర్ధిక సంవత్సరానికి మిశ్రమ ఎరువులకు రూ.22,186 కోట్ల రూపాయలనే సబ్సిడీగా ఇస్తాం, దాంతో సర్దుకోవాల్సిందే ఈ విషయం మీకు ముందే చెబుతున్నాం అన్నట్లుగా ఏప్రిల్‌ మూడవ వారంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా మీడియా పెద్దగా వార్తలివ్వలేదు, జనం కూడా పట్టించుకోలేదు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కాబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం చేసింది.
వ్యవసాయంలో ఎరువుల ప్రాధాన్యత గురించి పదే పదే చెప్పుకోనవసరం లేదు. అయితే ఏ పంటకు, ఏనేలలో ఏ ఎరువు ఎంత వేయాలనేది మాత్రం నిరంతరం చెప్పుకుంటూ ఉండాల్సిందే. లేనట్లయితే, నేల ఆరోగ్యం దెబ్బతింటుంది, పంట దిగుబడుల మీద ప్రతికూల ప్రభావాలు పడతాయి. గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూస్తే మన వంటి వర్ధమాన దేశాల సాగులో ఎరువుల సబ్సిడీ ఒక ప్రధాన పాత్ర వహించింది. దాన్ని తగ్గిస్తే అది చిన్న,సన్నకారు రైతుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ధనిక దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించేందుకు వాటి సాధనాలుగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్ధలు వర్దమాన దేశాలకు రుణాలు కావాలంటే వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేయాలనే ఒక షరతును 1980దశకంలో ముందుకు తెచ్చాయి. దొడ్డిదారిన ధనిక దేశాలు ఇచ్చే సబ్సిడీల గురించి మాట్లాడవు.
కరోనా వైరస్‌ నేపధ్యంలో వ్యవసాయ రంగం ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితి ఏర్పడింది.ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలోకి జారిపోతోందని ప్రపంచ బ్యాంకుతో సహా అన్ని సంస్ధలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కరోనాకు ముందే దేశ వ్యవసాయరంగం కుదేలైంది. గత ఆరు సంవత్సరాలుగా వ్యవసాయ రంగ అభివృద్ధిలో మెరుగుదల లేదు, గిడసబారిపోయింది, ఈ ఏడాది కూడా అంతకు మించి పెరుగుదల ఉండదు, మూడుశాతం ఉంటుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. యుపిఏ పాలనా కాలంలో దాదాపు పన్నెండుశాతం కనీస మద్దతు ధరలు పెరిగితే బిజెపి ఏలుబడిలో నాలుగున్నరశాతానికి మించి లేవు.
వివిధ దేశాలలో వ్యవసాయానికి పెద్ద ఎత్తున సబ్సిడీలను కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ధనిక దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు ముగియ లేదు, ఒక కొలిక్కి వస్తాయనే ఆశలేదు. వ్యవసాయ సబ్సిడీలపై ధనిక దేశాల మధ్య పడిన చిక్కుముడే దీనికి కారణం. ప్రపంచం మరోసారి తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి గురైతే అసలు ప్రపంచ వాణిజ్య సంస్దే కుప్పకూలినా ఆశ్చర్యం లేదు. దోహా చర్చలు ఇంకా ముగియ లేదు కనుక అటు ధనిక దేశాలు తమ రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాయి. మరోవైపు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ సంస్దల ద్వారా వర్ధమాన దేశాల్లో సబ్సిడీల రద్దు లేదా నామమాత్రం చేయటానికి వత్తిడి పెంచుతున్నాయి. ఈ పూర్వరంగంలో చైనా నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అన్నది చూద్దాం. ఎందుకంటే రెండు దేశాలు తమ జనాభాకు అవసరమైన ఆహార భద్రతను సమకూర్చాల్సి ఉంది.
మన దేశంలో సాగుకు అనుకూలమైన భూమి 156మి.హె ఉంటే చైనాలో 120 మి.హె మాత్రమే ఉంది. సాగునీరు మన దేశంలో 48శాతం సాగుభూమికి ఉంటే చైనాలో 41శాతానికి ఉంది. దీని కారణంగా మొత్తం పంటలు సాగు చేసే ప్రాంతం చైనాలో 166 మి.హె, మన దేశంలో 198మి.హెక్టార్లు ఉంటుంది. చైనాలో సాగు భూమి తక్కువగా ఉన్నప్పటికీ అక్కడి వ్యవసాయ ఉత్పత్తుల విలువ 1,367 బిలియన్‌ డాలర్లు కాగా మన విలువ కేవలం 407 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ విషయంలో చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా ?
రెండు దేశాలూ పురాతన నాగరికత కలిగినవే, రెండూ స్వాతంత్య్రం వచ్చే నాటికి వ్యవసాయాధారిత దేశాలుగానే ఉన్నాయి. వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి, వినూత్న పద్దతులను కనుగొనేందుకు 2018-19లో మన దేశం 140 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనాలో 780 కోట్ల డాలర్లు ఉంది. మన దేశంలో జరిపిన విశ్లేషణ ప్రకారం వ్యవసాయ పరిశోధన-విస్తరణ పధకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ జిడిపిలో రూ.11.20 పెరుగుదల ఉంటుంది. వీటి మీద చేసే ప్రతి పది లక్షల రూపాయల ఖర్చుతో 328 మంది దారిద్య్రం నుంచి బయట పడవేయవచ్చు. దేశ జివిఏ(గ్రాస్‌వాల్యూయాడెడ్‌- ఒక ప్రాంతం లేదా ఒక పరిశ్రమలో ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల విలువ)లో మనం కేవలం 0.35శాతమే ఖర్చు చేస్తుండగా చైనా 0.8శాతం ఉంది. అందువలన పరిశోధన, అభివృద్ధి, విస్తరణకు మన దేశం చేయాల్సిన ఖర్చు పెరగాల్సి ఉంది. ఈ ఖర్చు పెంచితే రైతాంగ ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ దిశగా నరేంద్రమోడీ సర్కార్‌ చర్యలు లేవు.
నాణ్యమైన విత్తన తయారీతో పాటు ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది.2016లో ఒక హెక్టారుకు చైనాలో 503కిలోల ఎరువులు వినియోగిస్తే మన దేశంలో 166కేజీలు మాత్రమే ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇక పంటల ఉత్పాదన విషయానికి వస్తే మన దేశంతో పోల్చితే చైనాలో 50 నుంచి వందశాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. రైతాంగానికి వివిధ రూపాలలో ఇచ్చే సబ్సిడీని ఇప్పుడు ఆంగ్లంలో ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ ఎస్టిమేట్స్‌(పిఎస్‌ఇ) అంటున్నారు. అనేక దేశాల్లో ఈ భావనతో రైతాంగానికి ఇచ్చే పెట్టుబడి సబ్సిడీ లేదా దానికి సమానమైన వాటిని గణిస్తున్నారు. చైనాలో 2018-19కి మూడు సంవత్సరాలలో దేశ మొత్తం వ్యవసాయ ఆదాయంలో 15.3శాతం రైతాంగానికి సబ్సిడీ రూపంలో అందింది. ఇదే కాలంలో మన దేశంలో 5.7శాతం ప్రతికూలత ఉంది. అంటే రైతాంగానికి ఇచ్చే సబ్సిడీల కన్నా వారి మీద మోపిన పన్ను తదితర భారం పెరిగింది. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవటానికి ఇదొక కారణం అన్నది స్పష్టం. దీన్ని సరిదిద్దటానికి బదులు 23 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను పెంచటం ద్వారా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నది. పోనీ ఇదైనా స్వామినాధన్‌ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణ్యంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నదా అంటే అదీ లేదు. పెరిగిన వ్యవసాయ పెట్టుబడులను కూడా పూర్తిగా మద్దతు ధరలకు ప్రాతిపాదికగా తీసుకోవటం లేదు. కనీస మద్దతు ధరల గురించి బిజెపి ఎన్నికబుర్లైనా చెప్పవచ్చు, అంకెలు నిజాలే చెబుతాయి. 2004-14 పదేండ్ల కాలంలో యుపిఏ హయాంలో సాధారణ ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ.560 నుంచి 1310కి (750) పెరిగింది. అదే ఎన్‌డిఏ హయాంలో ఏడు సంవత్సరాల కాలంలో (2014-15 నుంచి 2020-21) 1310 నుంచి రూ.1868కి (558) మాత్రమే పెరిగింది. శాతాల్లో చూస్తే మొత్తంగా యుపిఏ కాలంలో 133శాతం,ఎన్‌డిఏ కాలంలో 42.5శాతమే పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరలకంటే ఎంతో ఎక్కువ మొత్తాలను చెల్లించి చైనాలో రైతుల వద్ద పంటలను కొనుగోలు చేయటంతో ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చాయి. తెలంగాణాలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్దేశించిన పంటలను సాగు చేస్తేనే రైతు బంధు నిధులు ఇస్తామని ఒక షరతును పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా అందచేస్తున్న నగదుకు ఎలాంటి షరతులు లేవు. చైనాలో కూడా ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రైతులకు నిధులను బదిలీ చేస్తున్న పధకాన్ని అమలు జరుపుతున్నారు. అయితే చైనాలో రైతులకు, యావత్‌ ప్రజానీకానీకానికి అమలు జరుపుతున్న ఇతర సంక్షేమ పధకాలు, అన్నింటికీ మించి రైతులకు మనకంటే రెట్టింపు దిగుబడుల కారణంగా అక్కడ వ్యవసాయ రంగంలో ఎలాంటి సంక్షోభాలు రాలేదు. అందువలన చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన అంశం పరిశోధన, అభివృద్ధి, విస్తరణ ఖర్చు గణనీయంగా పెంచటమే. అది కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా చేయాల్సి ఉంది.
2022 నాటికి అంటే మన స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచే నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016లో నరేంద్రమోడీ ప్రకటించారు. అంటే ఆ రోజుకు ఉన్న ఆదాయాలు రెట్టింపు అని మనం అర్ధం చేసుకోవాలి. మోడీ అవగాహన ప్రకారం కనీస మద్దతు ధరలను రెట్టింపు చేస్తే ఆదాయం రెట్టింపు అవుతుందనా లేక ఖర్చులన్నీ పోను వచ్చే మిగులు రెట్టింపు అవుతుందా అన్నది స్పష్టత లేదు. వ్యవసాయ ఖర్చులు ఒక రాష్ట్రంలోనే ప్రాంతానికి ప్రాంతానికి మారుతున్నాయి. కాలువల ద్వారా నీరు పారే ప్రాంతానికి బోర్ల ద్వారా నీటిని అందించే లేదా వర్షాధారిత చోట్లకు ఎంత తేడా ఉంటుందో తెలిసిందే. మన వ్యవసాయ వృద్ధి రేటు నిలకడగా ఉండటం లేదు. ఒక రంగంలో ఉండే జివిఏకు మరో రంగానికి పోలిక ఉండటం లేదు. ఉదాహరణకు మత్స్యరంగంలో ఏడుశాతం, హార్టీ కల్చర్‌లో 4.5, పశుసంపదలో 6శాతం ఉంది.2019 వ్యవసాయంపై క్రిసిల్‌ అధ్యయన నివేదికలో ఖరీఫ్‌ దిగుబడి మూడున్నర శాతం తగ్గుతుందని అంచనా వేసింది. అంటే రైతుల లాభం 10-12శాతం తగ్గిపోతుంది. నీతి అయోగ్‌ 2017లో రూపొందించిన పత్రంలో వార్షిక వృద్ధి రేటు 10.4శాతం ఉండాలని పేర్కొన్నది. కానీ మన సగటు మూడుశాతానికి మించటం లేదు. రైతుల ఆదాయాలను ఐదు సంవత్సరాలలో రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం తీరిగ్గా రెండు సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రులతో ఒక ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసిందంటే ఆ వాగ్దాన అమలు తీరు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశ్రద్ధ వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు తిలోదకాలు ఇస్తున్న కారణంగా గత పాతిక సంవత్సరాలలో సగం రాష్ట్రాలలో ఒక్క ఎకరానికి కూడా నీటి పారుదల సౌకర్యం అదనంగా కలిగించలేదంటే అతిశయోక్తి కాదు. కొత్త ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం లేదా పాత ప్రాజెక్టులలో పూడిక పెరిగిపోవటం, కాలువల చివరి భూములకు నీరందకపోవటం వంటి కారణాలతో కొన్ని చోట్ల వాస్తవ సాగు భూమి తగ్గిందనే వార్తలు కూడా వచ్చాయి.
ప్రపంచంలోనే మన మద్దతు ధరలు ఎక్కువగా ఉన్నాయనే గొప్ప గురించి చూద్దాం. ప్రపంచ దేశాలలో ధాన్యం ధరల గురించి మనకు సమాచారం అందుబాటులో లేదు. బియ్యం ధరలను ప్రాతిపదికగా తీసుకొని పరిశీలిద్దాం. ప్రపంచంలో బియ్యాన్ని ఎగుమతి చేయటంలో మనమే ప్రధమ స్ధానంలో ఉన్నాం. మన తరువాత స్ధానాల్లో థారులాండ్‌, వియత్నాం, పాకిస్ధాన్‌ ఉన్నాయి. బియ్యాన్ని దిగుమతి చేసుకోవటంలో చైనా తొలి స్ధానంలో ఉంది. చైనా జనాభా 140 కోట్లయితే మనం 135 కోట్లు ఉన్నాం. మన దేశంలో 2019-20లో 1,17,939 వేల టన్నుల బియ్యం ఉత్పత్తి చేయగా చైనా 1,46,730 వేల టన్నులని అంచనా. మన దేశంలో ఈ మొత్తమే మూడేండ్లకు మిగుల్లో ఉండగా మన కంటే జనాభా, ఉత్పత్తి ఎక్కువగా ఉన్న చైనా దిగుమతి చేసుకుంటోంది అంటే అక్కడ కొనుగోలు శక్తి ఎక్కువ, జనం మన కంటే ఎక్కువ తింటున్నారని అర్ధం.
ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలోని ప్రపంచ వ్యవసాయ మరియు ఆహార సంస్ద (ఎఫ్‌ఏఓ) నిర్వహించే వివరాల ప్రకారం 2015 నుంచి 2019 సంవత్సరాలలో ఒక టన్ను ఎగుమతి చేసిన బియ్యానికి మన రకాలకు వచ్చిన ధర 337 నుంచి 361 డాలర్ల మధ్య ఉంది. ఏడాది సగటు 353 డాలర్లు. ఇదే కాలంలో థారులాండ్‌ బియ్యానికి వచ్చిన సగటు ధర 392 డాలర్లు, వియత్నాం బియ్యానికి 346, పాకిస్ధాన్‌ బియ్యానికి 336 డాలర్లు ఉంది. మనం పోల్చుకోవాల్సింది మన కంటే ఎక్కువ ధర వచ్చిన థారులాండ్‌తోనా తక్కువ వచ్చిన దేశాలతోనా ? అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టే దేశీయ మార్కెట్‌ ధరలు కూడా ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.
ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఆ ఏడాది పంటలకు మద్దతు ధరలను అంతకు ముందు-తరువాత సంవత్సరాల కంటే కాస్త ఎక్కువగా పెంచిన తీరు కాంగ్రెస్‌-బిజెపి పాలన రెండింటిలోనూ గమనించవచ్చు. ఉదాహరణకు ధాన్యం, పత్తి విషయాలు తీసుకుందాం. గడచిన ఐదు సంవత్సరాలలో 2019లో ఎన్నికలకు ముందు 2015-16 నుంచి 2017-18 వరకు మూడు సంవత్సరాలలో సాధారణ రకం ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1410 నుంచి 1550కి(240) పెరగ్గా 2018-19లో రూ. 1750(200) పెరిగింది. తరువాత గత ఏడాది, ఈ సంవత్సరం రెండు సంవత్సరాలకు కలిపి పెంచింది రూ. 1868కి అంటే 118 మాత్రమే. పెరుగుదల రేటు తగ్గిపోయింది. పత్తి విషయం తీసుకున్నా ఇదే ధోరణి కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పొడవు పింజ పత్తి ధర 2016-17కు రూ.4,160 నుంచి 2017-18లో రూ.4,320(120)కి పెరగ్గా 2018-19లో రూ.5,450(230) గత ఏడాది రూ100, ఈ ఏడాది రూ. 275 పెంచారు. నాలుగేండ్లలో ఏడాది సగటు 180 మాత్రమే ఉంది. ఈ తీరును గమనించినపుడు దిగుబడులు తక్కువగానూ పెట్టుబడులు ఎక్కువగా ఉన్న సమయంలో అన్ని రకాల ఖర్చులు, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా పెంచుతున్న మద్దతు ధరలు రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయంటే నమ్మే దెలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d