కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Tags

, , ,

డాక్టర్ కొల్లా రాజమోహన్,

 ‘ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం’గా పేరుపొందిన కృష్ణా డెల్టా నేడు తీవ్రమైన సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో (El Niño) ప్రభావం మరియు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో “ఈ సీజన్‌లో వరి పంట వేయవద్దు” అని ప్రభుత్వం జారీ చేసే సూచనలు డెల్టా రైతాంగాన్ని తీవ్రమైన దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి.2003 సంవత్సరంలో కృష్ణా డెల్టా లో రైతులు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొన్నారు.సాగు నీటి కోసం ఉద్యమం సాగించారు.ప్రకాశం బ్యారేజి పైన అతి పెద్ద ధర్నా నిర్వహంచారు.అతి తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధించారు. అప్పటికి పులిచింతల నిర్మించలేదు. పులిచింతల నిర్మించిన తరువాత కూడా కృష్ణా డెల్టా లో వరి పంట సాగుచేయవద్దనటం విచిత్రం గా వుంది.

1. కృష్ణా డెల్టా ప్రత్యేక పరిస్ధితులు – వరి వైపే రైతుల మొగ్గు ఎందుకు?

డెల్టా ప్రాంతంలో ప్రత్యామ్నాయ పంటలు వేయమని ప్రభుత్వం చెప్పడం కాగితం మీద సులువుగానే కనిపించినా, క్షేత్రస్థాయిలో ఉన్న భౌగోళిక పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి:

డెల్టా నేలలు ఎక్కువగా నల్లరేగడి నేలలు మరియు బంకమన్నునేలలు. ఈ ప్రత్యేక స్వభావం  వలన  భూమి నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుంటుంది. వరిపొలాలలో  నీరు నిల్వ వుండటంకోసం, పొలాలను గట్టులతో మడిగా ఏర్పాటు చేస్తారు., మడి లోనుండి మురుగు నీరు బయటకు మురుగు కాలువ లోనికి పంపటానికి వీలుగా ఏర్పాటు జరుగుతుంది.

 డ్రెయినేజ్ (మురుగు నీటి పారుదల) వ్యవస్ధ నిర్వహణ లోపం కారణంగా, కాలక్రమేణా కాలువలు, డ్రెయిన్లు పూడిపోవడం వల్ల సరైన నీటి పారుదల వ్యవస్థ లేదు. చిన్న వర్షం పడినా లేదా చిన్నపాటి తుఫాను వచ్చినా మాగాణి పొలాల్లో నీరు నిలిచిపోతుంది.

ప్రభుత్వం సూచించినట్లుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయటంవలన  నష్టం అపారంగా వుంటుంది. మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము వంటి ఆరుతడి పంటలు వేసినప్పుడు పొలంలో నీరు నిలిస్తే, వేరు కుళ్ళు తెగులు వచ్చి పంట క్షణాల్లో నాశనమవుతుంది. అందుకే రైతులు నీటిని తట్టుకునే వరి పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది.

2. ప్రభుత్వాల వద్ద ఉన్న అవకాశాలు & నీటి మేనేజ్మెంట్

ఎల్ నీనో ప్రభావం వలన తీవ్రమయిన వర్షాభావ పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కొన్నిచోట్ల అసలు వర్షాలు పడవు. మరి కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి. క్రిష్ణానది పరీవాహక ప్రాంతం చాలా పెద్దది. పరీవాహక ప్రాంతంలో కురుసిన వర్షపు నీటిని సద్వినియోగ పరచటంలోనే నిపుణుల యొక్క నైపుణ్యం, పరిపాలకుల సామర్ధ్యం ఇమిడి వుంటుది.

ఎగువన వర్షాలు లేకపోయినా, డెల్టాను ఆదుకోవడానికి అందుబాటులో ఉన్న ఇతర వనరులను సమర్థవంతంగా నిర్వహించాలనేది రైతుల ప్రధాన డిమాండ్:

పులిచింతల ప్రాజెక్టులో  లో 45 టీ యమ్ సీ ల నీటిని నిల్వచేయవచ్చని ప్రభుత్వం  చెప్తున్నది. పులిచింతల నిర్మాణం చేసేది, కృష్ణా డెల్టాలోని పంటల రక్షణ కోసమన్నారు. అదే ఉద్దేశ్యంతో కృష్ణా డెల్టాలోని ప్రజలు, రైతు నాయకులు పులిచింతల కోసం పోరాడి సాధించుకున్నారు. ప్రతికూల పరిస్ధితులలో, పులిచింతల నీటిని క్రిష్ణా డెల్టా పంటల రక్షణకుయోగిస్తామని పులిచింతల నిర్మాణం సమయంలో ప్రభుత్వాధినేతలు శెలవిచ్చారు. ఇపుడు మాటమార్చి, తాగునీటికోసం పులిచింతల అంటున్నారు. గతంలో లాగానే, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువులు నింపాలి.  మొట్టమొదట కట్టిన ప్రాజెక్టులకు వున్న (RIPARIAN RIGHTS ని ఉపయోగించుకోవాలి.  ఫైనుండి ప్రవహించినపుడు, నదీ తీర వాసులకు నీటిని వాడుకోవటానికి వున్న హక్కును ఉపయోగించుకోవాలి.  పూర్తి నీటి సామర్ధ్యం వరకు పులిచింతలలో నీటిని నింపి, అవసరమయినపుడు  క్రిష్ణా డెల్టా పంటల రక్షణకు ఉపయోగించుకోవాలి.అవసరమైతే వారబందీ పధతి ద్వారా లేక రేషన్ పధతి ద్వారా నీటిని అందించవచ్చు.

 గోదావరి నీటి సమర్థవంతంగా వినియోగించాలి. పట్టిసీమ ద్వారా గోదావరి నదిలో వరద నీరు ఉధృతంగా ఉన్నప్పుడు కృష్ణా డెల్టాకు నీటిని మళ్ళించి ప్రకాశం బ్యారేజీ ఆయకట్టును స్థిరీకరించవచ్చు.

 ఎగువ ప్రవాహాల సమన్వయం (Inflow Forecasting): మహారాష్ట్ర, కర్ణాటక (ఆల్మట్టి, నారాయణపూర్) ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినప్పుడు వచ్చే వరద నీటిని అంచనా వేసి, సాగర్ నుండి నీటి పంపిణీని ముందే ప్రణాళికాబద్ధంగా (Water Budgeting) నిర్వహించాలి.

 మౌలిక వసతుల పునరుద్ధరణ: ఇప్పటికిప్పుడు డ్రెయినేజ్ వ్యవస్థ మొత్తాన్ని ఆధునీకరించడం కష్టమే అయినా, ప్రధాన కాలువల్లో పూడికతీత, అడ్డంకుల తొలగింపు తక్షణమే చేపట్టడం ద్వారా మురుగు నీటి ముప్పును తగ్గించవచ్చు.

3). క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక మార్గాలు (మధ్యంతర పరిష్కారాలు)

ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకోవడానికి మరియు రైతులు పూర్తిగా నష్టపోకుండా ఉండటానికి సాంకేతిక, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న కొన్ని మార్గాలు:

1. వరి నేరుగా విత్తుట (Direct Seeded Rice – DSR):

 నారు పోసి, నీరు నిలబెట్టే సాంప్రదాయ పద్ధతికి స్వస్తి చెప్పి, డ్రమ్ సీడర్ లేదా గొర్రుతో నేరుగా విత్తుకోవడం.

 దీనివల్ల 30% వరకు నీరు, పెట్టుబడి వ్యయం ఆదా అవుతాయి.

2. స్వల్పకాలిక రకాల ఎంపిక:

 110-120 రోజుల్లో చేతికి వచ్చే తక్కువ నీటితో పండే వరి రకాలను సాగు చేయడం.

3. ఆరుతడి పంటలకు ఎత్తైన మడులు (Raised Bed Cultivation):

 మురుగు నీటి సౌకర్యం సరిగా లేని మాగాణుల్లో ఆరుతడి పంటలు వేయాల్సి వస్తే, బోదెలు (Raised Beds) చేసి పంటలు వేయడం ద్వారా నీరు నిలవకుండా కాపాడుకోవచ్చు.

4. సబ్సిడీ విత్తనాలు:& భీమా (Crop Insurance) అంశం

 రిస్క్ అనే ఆలోచన ఉన్నప్పటికీ, నీటి లభ్యత పై అనిశ్చితి స్ధితి కొనసాగుతున్నా వరి నారును సిధం చేస్తున్న రైతులను అభినందించాలి. ప్రోత్సహించాలి.అవసరమయిన అన్ని సహాయాలూ ప్రభుత్వం అందించాలి. .  భారీ రిస్క్ తీసుకుని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రీమియం కట్టి భీమా సౌకర్యాన్ని కలిగించాలి.. రైతులకు ఆర్థికంగా ఆ మాత్రం సహాయాన్ని ప్రభుత్వం చేయాలి. రైతు సేవా కేంద్రాల (RSK) ద్వారా డెల్టా భూములకు తగిన ఉచిత/సబ్సిడీ ప్రత్యామ్నాయ విత్తనాలను, సాంకేతిక సలహాలను ఉచితంగా అందించాలి.

5. దీర్ఘకాల ప్రణాలిక గా, వరద నీటిని  నిల్వ చేసుకునే ప్రయత్నాలను ముమ్మరంచేయాలి.అవనిగడ్డ ప్రాంతంలో రెండు చెక్ డామ్ లు కట్టటం ద్వారా 6.75 టీ.ఎమ్. సీ ల నీటిని నిల్వచేయటానికి అనుమతులు , ప్రణాళికలు సిధంగావున్నా ఆచణకు నోచుకోలేదు. పాలేరు, మున్నేరు పై రిజర్వాయర్ ల ద్వారా 5 టీ.ఎమ్. సీ ల నీటిని నిల్వచేయవచ్చని నిపుణులు సూచించినా ఆచరించలేదు.

ముగింపు

 పులిచింతల నీటిని క్రిష్ణా డెల్టా పంటల రక్షణకు వినియోగించాలి. మురుగు నీటి పారుదల వ్యవస్థ లోపాలు ఉన్నాయని తెలిసి పంట వద్దనడం కంటే,తక్షణ కాలువల పూడికతీత, మరియు తక్కువ నీటితో పండే నూతన సాగు పద్ధతులను ప్రోత్సహించడమే సరైన పరిష్కారం. గోదావరి–కృష్ణా జలాలను సరైన వాటర్ మేనేజ్ మెంట్ చేసి,సమన్వయంచేసి నీటిని రైతులకు అందించాలి. కృష్ణా డెల్టా రైతుకు సాగునీరు అనేది కేవలం వరి  పంట వేయాలా వద్దా అనే ప్రశ్న మాత్రమే కాదు, అది వారి జీవనాధారం. ఆంధ్ర ప్రజల ఆర్ధిక ప్రగతికి మూలాధారం. ప్రభుత్వం, రైతాంగం, రైతుసంఘాలు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే డెల్టాలో ఈ నీటి సంక్షోభాన్ని అధిగమించవచ్చు.

‘మక్కా రక్షణ ఒప్పందం’ వెనుక మతలబేమిటి?

Tags

, , , , , ,

కోటేశ్వరరావు

పెద్ద ఆర్భాటం, ముందస్తు హడావుడి లేకుండా సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఆగస్టు ఏడున సౌదీ, టర్కీ, పాకిస్తాన్ దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీన్ని ‘మక్కా ఒప్పందం’ అని కూడా పిలుస్తున్నారు. దీని పరిణామాలు, పర్యవసానాల గురించి ప్రపంచంలో చర్చ మొదలైంది. రక్షణ కోసం అమెరికాను ఆశ్రయిస్తే ప్రయోజనం లేదనే భావం తాజా పరిణామాలతో బలపడటంతో ఈ కొత్త కూటమి పురుడు పోసుకున్నట్లు తొలి స్పందనలొచ్చాయి. నమ్ముకున్న దేశాలను నట్టేట ముంచి స్వంత ప్రయోజనాల కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుందన్న విషయం తెలిసిందే. ఇజ్రాయిల్‌తో కలసి ఇరాన్‌పై దాడులు చేయించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అటు అమెరికా ఇటు యావత్ ప్రపంచంలో అపహాస్యం పాలైనా బుద్ది మారలేదు. అలాంటి వాడిని మన ప్రధాని నరేంద్రమోడీ వంటివారు ఇంకా జిగినీ దోస్తుగానే పరిగణిస్తున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తే మన వస్తువుల దిగుమతిపై వందశాతం అపరాధ సుంకాలు విధించేందుకు అమెరికా పార్లమెంటు ఎగువసభ సెనేట్ ఇప్పటికే తీర్మానించింది, ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదం పొందితే అమల్లోకి రానుంది. అయినా మోడీ నుంచి ఉలుకూపలుకూ లేదు.

అదేమిటంటే మౌనం కూడా ఒక దౌత్యమే, అది మోడీకే స్వంతం అని భజనపరులు కీర్తిస్తున్నారు. ఇరాన్ మీద తాము దాడులు చేసినపుడు అనేకమంది మరణించారని, గాయపడ్డారని వారందరికీ ఇరాన్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తాజాగా డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దాడులతో తమకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని టెహరాన్ పట్టుబడుతున్న పూర్వరంగంలో ట్రంప్ ఎదురుదాడికి దిగాడు. నవంబరు మూడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల గడువు సమీపిస్తున్నది. ఓటర్లకు ఏం చెప్పాలో తెలియక, ఏం మాట్లాడితే పరువు మరింత దిగజారుతుందో అర్ధంగాక ఎరక్కపోయి ఇరుక్కు పోయినట్లుగా ట్రంప్ జుట్టుపీక్కుంటున్నాడంటే అతిశయోక్తి కాదు. గాజాలో శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని, అమెరికా ప్రతిపాదించిన పదిహేను అంశాలను అమలు చేస్తామని, అక్కడ అధికారంలో ఉన్న హమాస్ సాయుధశక్తి చెబుతుండగా… అంగీకరించేది లేదని, గాజా నుంచి వైదొలగబోమని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. ఎందుకంటే అక్టోబరు 27న ఇజ్రాయిల్‌ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు స్వే‌చ్ఛగా జరుగుతాయా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. నెతన్యాహు అనుకూల మూకలు ఓటర్లను బెదిరిస్తున్నాయి.

ఓటర్లుగా ఉన్న పాలస్తీనియన్లను ఓటింగ్‌కు రాకుండా అని ప్రయత్నాలూ చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారు వచ్చి నెతన్యాహుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతో ముందు, ఓటింగ్ రోజు అనేక విమానాలను కూడా రద్దు చేశారు. యూదు దురహంకారులను సంతుష్టీకరిం చేందుకు ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో పాలస్తీనియన్లపై దాడులను ఉధృతం చేశారు, వామపక్షాలను పోటీలో లేకుండా చేసేందుకు కూడా చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగా టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులు మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. మూడింటిలో ఏ ఒక్కదేశం మీదైనా ఎవరైనా దాడిచేస్తే అందరి మీద చేసినట్లుగా పరిగణించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కూటమిని “ముస్లిం నాటో-సున్నీ నాటో” అని కొందరు వర్ణించారు. మూడూ ఇస్లామిక్ దేశాలు కావటం, మతరీత్యా ఆ దేశాల్లో సున్నీలు అత్యధికులుగా ఉన్నందున అలా చెప్పారు. ఈ ఒప్పందం ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. దీనివలన ఎలాంటి ఫలితం ఉండదని చెబుతున్నవారూ లేకపోలేదు. దీర్ఘకాలం సాగుతున్న విబేధాలు, ప్రాంతీయ యుద్ధాల పూర్వరంగంలో అమెరికా రక్షణను నమ్ముకోకూడదన్నది ఒక ప్రధాన అంశంగా చెబుతున్నారు.

తాజా పశ్చిమాసియా సంక్షోభంలో గల్ఫ్, మధ్య ప్రాచ్య ప్రాంతంలోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ చేస్తున్న దాడులతో ఆయా దేశాల్లో తలెత్తిన ఆందోళన, అనిశ్చితి వాషింగ్టన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు అనే భయం పట్టుకుంది. దీంతో యుద్ధాన్ని నిలిపివేయాలని ఆ దేశాలు ట్రంప్ యంత్రాంగం మీద వత్తిడి తెస్తున్న సంగతి కూడా తెలిసిందే. అత్యాధునిక ఆయుధాలున్న అమెరికా దాడుల్లో ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ అనేక విధాలుగా దెబ్బతిన్నది వాస్తవమే అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ప్రతిదాడులు చేయటం వెనుక ఉన్న మర్మం పండితులకు అంతుబట్టటం లేదు. తిరుగులేని నిఘా వ్యవస్థలుగా పేరున్న ఇజ్రాయిల్‌ మొసాద్, అమెరికా సిఐఏకు సైతం ఇరాన్ ఆయుధాలు, వాటిని ప్రయోగిస్తున్న కేంద్రాలు ఎక్క‌డున్నాయో తెలియటం లేదు. గతేడాది అణుకేంద్రాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించినా అదంతా ఉత్త ప్రచారమే అని తరువాత తేలిపోయింది. అందుకే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనకు మక్కా ఒప్పందం ఒక ప్రతిరూపం అంటున్నారు. దీనిలో వెంటనే ఈజిప్టు చేరనుందని, తరువాత మరికొన్ని దేశాలు కూడా భాగస్వాములుగా చేరవచ్చని చెబుతున్నారు. దీని ఏర్పాటు వెనుక అమెరికా హస్తం ఉందని కూడా అను మానాలు వెల్లడవుతున్నాయి.తమ చేతికి మట్టి అంటకుండా ఇరాన్‌‌ను దెబ్బతీసేందుకు మరో ప్రయత్నంగా ఇది ఉన్నట్లు చెబుతున్నారు.

అది నిజమా కాదా అన్నది వెంటనే చెప్పలేము గానీ ఏం జరిగినా పోయేది అమెరికా ప్రతిష్ట, పెత్తనం అన్నది స్పష్టం. అమెరికా మీద అనేక దేశాలకు ఎందుకు విశ్వాసం సన్నగిల్లుతున్నది? ఇరాన్ అణుబాంబు తయారీ, క్షిపణి, నౌకాదళ సామర్ధ్యాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయిల్‌తో కలసి దాడులు చేస్తున్నట్లు తొలుత అమెరికా చెప్పింది. వాటన్నింటినీ నాశనం చేసినట్లు ఏప్రిల్ ఎనిమిది పెంటగన్ ప్రకటించింది. వైమానిక రక్షణ వ్యవస్థలను సంవత్సరాల తరబడి పనికిరాకుండా చేయటంతో పాటు మిలిటరీ పారిశ్రామిక సామర్ద్యాన్ని కూడా దెబ్బతీసినట్లు చెప్పింది. ఇన్ని కబుర్ల తరువాత వెల్లడైన వివరాల మేరకు అమెరికా 113 బిలియన్ డాలర్ల మేర ఆర్థికంగా నష్టపోయింది. దాని విలువైన 42 విమానాలు కూడా కూలిపోయాయి. మరణించిన లేదా గాయపడిన అమెరికా సైనికుల సంఖ్య తొమ్మిది వందలు దాటింది. ఆ ప్రాంతంలో యాభై వేల మంది తమ సైనికులు ఉన్నట్లు వెల్లడించటమే గాక ఆ తరువాత కూడా దాడులు కొనసాగించింది. ఫిబ్రవరి 28కి కొన్ని వారాల ముందు కతార్‌లో బహుళజాతి గగనతల, క్షిపణి రక్షణ విభాగాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రారంభించింది. దాని ద్వారా ముప్పు గురించి ముందే హెచ్చరించటం, ఎదుర్కొనేందుకు తాత్కాలిక పథకాల రచన, సమాచార అందచేత వంటి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు.

ఏడు దేశాల మిలిటరీ ప్రతినిధులు దానిలో భాగస్వాములన్నారు. తీరాచూస్తే ఇరాన్ చేసిన దాడులతో అది పనికిరాకుండా పోయింది. అమెరికా మరోచోటుకు తన కమాండ్ కేంద్రాన్ని మార్చుకుంది. నిజానికి కతార్‌లో అంతకుముందున్న కమాండ్ కేంద్రం నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా ఇతర దేశాలలో అమెరికా అనేక కార్యకలాపాలు నిర్వహించింది. ఇరాన్ దాడులతో ఆ ప్రాంతంలోని 15 అమెరికా మిలిటరీ కేంద్రాలలో కనీసం 228 మిలిటరీ నిర్మాణాలు, వాటిలో ఉన్న విమానాలు, రాడార్, సమాచార పరికరాలు, చమురు సంబంధిత ఏర్పాట్లు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఎంతో ఖరీదైన పేట్రియాట్, థాడ్, తోమహాక్ రక్షణ వ్యవస్థలన్నీ ఇరాన్ దెబ్బతో కరిగిపోయాయి. చివరకు దక్షిణ కొరియాలో ఉంచిన వాటిని కూడా పశ్చిమాసియాకు తరలించాల్సి వచ్చింది. వెంటనే అలాంటి వాటిని ఉత్పత్తి చేయాలని రక్షణ కాంట్రాక్టర్లను పెంటగన్ కోరిందని, వెంటనే సరఫరా చేయటం సాధ్యం కాదని వారు చేతులు ఎత్తివేసినట్లు వార్తలొచ్చాయి. కొన్నేండ్ల పాటు ఉత్పత్తికి సమయం తీసుకోవచ్చని కూడా నిపుణులు చెప్పారు. వీటన్నింటిని చూసిన తరువాత అమెరికాను నమ్ముకొని ఏ దేశమైనా నిశ్చింతగా ఉండగలదా? నాటో కూటమిలో సభ్య దేశమైన టర్కీ రెండవ పెద్ద మిలిటరీని కలిగి ఉంది.

గల్ఫ్‌లో చమురుతో సౌదీ అరేబియా ఆపార సంపద, పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఈ మూడూ కలిస్తే ఒక బలమైన శక్తిగా రూపొందే అవకాశం ఉందనే ఆలోచన మక్కా ఒప్పందం వెనుక ఉందన్నది ఒక అభిప్రాయం. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అయితే నాటో కూటమి లక్షణాలు దీనికి ఉన్నాయా అంటే లేవు. అందుకే కొందరు ఇది సంతకాలకే పరిమితం అంటున్నారు. నాటో మాదిరి ఒక ఏకీకృత మిలిటరీ కమాండ్, ఒక ప్రణాళిక, నిర్దిష్ట లక్ష్యం లేదు. తక్షణమే అలాంటి వాటిని ఏర్పాటు చేసే అవకాశాలూ కనిపించటం లేదు. ఐక్యరాజ్యసమితి ఆర్టికల్ 51 ప్రకారం ఉమ్మడి ఆత్మరక్షణ ఒప్పందంగా టర్కీ వర్ణించింది. గతేడాది సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దానిలో చేరే అవకాశం గురించి చర్చిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ జనవరి 29న చెప్పాడు. రక్షణ అవసరాల కోసం వెలుపలి దేశాల మీద ఆధారపడుతూ కొనసాగటం కంటే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవటం మంచిదన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రపంచ మిలిటరీ బలా బలాలను చూసినపుడు టర్కీ 9, పాకిస్తాన్ 14, సౌదీ 25వ స్థానాల్లో ఉన్నాయి. పందొమ్మిద వదిగా ఉన్న ఈజిప్టు కూడా కలిసే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలూ భిన్నదారుల్లో ప్రయాణిస్తున్నాయి.

అష్ట దరిద్రాలతో అల్లాడుతున్నప్పటికీ పాకిస్తాన్ అణుబాంబు లను తయారు చేసుకుంది తప్ప అన్న వస్త్రాలను జనాలకు సమకూర్చలేకపోతోంది. కీలకమైన ప్రాంతంలో ఉన్నందున భారత్, చైనాలకు వ్యతిరేకంగా ఒక స్థావరంగా ఉపయోగపడ నుందనే కుట్రలో భాగంగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలు దానికి అండగా ఉన్నాయి. ఇప్పుడు దాని ఆర్థిక ఇబ్బందులను సౌదీ తీరుస్తున్నది. పాకిస్తాన్ తన మిలిటరీ అవసరాల కోసం అత్యధికంగా చైనా మీద ఆధారపడుతున్నది. టర్కీ స్వంత మిలిటరీ పరిశ్రమలను కలిగి ఉంది. సౌదీ విషయానికి వస్తే అది పూర్తిగా అమెరికా మిలిటరీ ఉత్పత్తులపై ఆధార పడుతున్నది. ఐరోపా కేంద్రంగా పనిచేసే నాటో దేశాలు కొన్ని స్వయంగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తుండగా మరికొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. నాటో రక్షణ బడ్జెట్ పెంచాలని ఇటీవలి కాలంలో అమెరికా వత్తిడి తెస్తున్నది. ఇస్లామిక్ నాటోగా వర్ణితమౌతున్న కూటమిలో రక్షణ బడ్జెట్‌ను పెంచేందుకు పాకిస్తాన్‌కు అవకాశం లేదు. ఒక వైపు నాటోలో కొనసాగుతూ మరోవైపు మక్కా కూటమిలో చేరిన టర్కీ ఎంతమేరకు బడ్జెట్ కేటాయిస్తుందన్నది అనుమానమే.ఈ కూటమి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున మన దేశం పెద్దగా స్పందించలేదు, వేచి చూస్తున్నట్లు మాత్రమే ముక్తసరిగా వ్యాఖ్యానించింది.

హైకోర్టు వ్యాఖ్య చెంపపెట్టు : గుజరాత్‌లో ఒక తల్లి విపరీత చర్య – మోడీ ఆదర్శ పాలన బండారం !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

“ ఆకలి ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడేట్లు చేసింది, ఇది సామÖహిక వైఫల్యం ” ఈ వ్యాఖ్య చేసింది గుజరాత్ హైకోర్టు న్యాయమÖర్తి హెచ్‌డి సుతార్. ఆ తల్లిది పన్నెండు సంవత్సరాల క్రితం ఒక ఆదర్శంగా వర్ణించి, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని అదే విధంగా మారుస్తానని వాగ్దానం చేసిన ప్రధాని నరేంద్రమోడీ స్వంతగడ్డ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 15 నుంచి 2014 మే 22వ తేదీ వరకు పని చేశారు. ఆ కాలాన్ని గుజరాత్ స్వర్ణయుగంగా కొందరు పరిగణిస్తారు. భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో మోడీ రాకతో వచ్చిందన్న బిజెపి ఎంపీ కంగన రనౌత్ చెప్పిందాని ప్రకారం గుజరాత్‌కు 2001లోనే వచ్చింది. మోడీ తరువాత అదే బిజెపి నేతల ఏలుబడిలో ఉంది. మోడీ కేంద్రంలో ప్రధానిగా రెండింజన్ల పాలన సాగిస్తున్నారు. అలాంటి చోట ఒక తల్లి తన రెండు సంవత్సరాల కుమార్తె (బేటీ పడావో, బేటీ బచావో నినాదం ఇచ్చిన తరువాత) ఆకలి తీర్చలేక పోయింది. అసహాయతకు లోనై ఏడుస్తున్న పసికందు నోరు మÖయించేందుకు ఒక దెబ్బవేసింది. అపస్మారకంలోకి పోవటంతో స్వయంగా ఆసుపత్రికి తీసుకుపోయింది.ఫలితం లేక ఆ బేటీ మరణించింది. కూతుర్ని చంపిన నేరానికి ఏడు నెలల గర్భిణిగా ఉన్న తల్లిని జైల్లో పెట్టారు. బెయిలు కోసం దరఖాస్తు చేస్తే గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. ఆ కేసులో హైకోర్టు విచారణలో న్యాయమÖర్తి ఆ తల్లికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు మీడియాలో పెద్దగా ప్రచారంలోకి రాలేదు, ఎందుకంటే అవి మోడీకే తగులుతాయి గనుక మÖసిపెట్టారు.

తనను దూషించిన జెన్ జి తరం యువతీ యువకులను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ గనుక అంత ఉదారత ప్రదర్శించారని దాన్ని కూడా ఆయన ప్రతిష్ట పెంచేందుకు ఉపయోగించిన వారిని దేశం చూసింది. అసలు క్షమాపణ చెప్పాల్సిన ప్రధానే క్షమించటం అనే విడ్డూరపు చర్యకు పాల్పడటం ఏమిటని కొందరు విమర్శించారు.కాసేపు దాని మంచి చెడ్డలను పక్కన పెడదాం. తన రాష్ట్రంలో ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడిన పరిస్థితులను కల్పించిన తన పాలనతీరు తెన్నులకు ఆ తల్లి ఉదంతం మీద మోడీ ఎందుకు స్పందించలేదు అన్నది అసలు సమస్య. సామÖహిక వైఫల్యం అన్న న్యాయమÖర్తి వ్యాఖ్య ప్రకారం దానిలో నరేంద్రమోడీ భాగం లేదా ? ఫ్రధాని లేదా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర బిజెపి నేతలెవరూ ఏ మాత్రం స్పందించలేదు. జూలై 20న ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేసిన వారు నరేంద్రమోడీని వ్యక్తిగా దూషించటం తనను ఎంతో కలచివేసిందని చెప్పిన జనసేనాని పవన్ కల్యాణ్‌లో సైతం ఎలాంటి స్పందన లేదు. అవునులే మోడీ వేరు, సామాన్యులు వేరు. అసలు ఆ తల్లి అలాంటి చర్యకు ఎందుకు పాల్పడినట్లు ? మన సమాజంలో భార్య, తలిదండ్రులను గాలికి వదిలేసే పెద్ద మనుషులను, అసలు తమకు వివాహమైనట్లే తెలియకుండా దాచేవారిని చూస్తున్నాము. సూరత్ ప్రాంతానికి చెందిన లఖీ సోలంకి ఇద్దరు బిడ్డల తల్లి, ఏడు నెలల గర్భంతో ఉంది. భర్త సముద్రం మీద పని చేసేందుకంటూ ఆరునెలల క్రితం ఆమెకు ఎలాంటి ఆదరువు చూపకుండా వెళ్లిపోయాడు. అతడు తిరిగి వస్తాడో రాడో తెలియదు,కడుపుతో ఉన్న ఆమెకు అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు కూడా లేవు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఇలాంటి స్థితిలో వివాహ బంధం లేకుండా మైత్రీ ఖరారు ఒప్పందంతో ఆమె ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఈ క్రమంలో ఆకలికి తాళలేక బిడ్డ ఈషా ఏడ్పులను తట్టుకోలేక 2026, మార్చినెల 19 తేదీన చేయిచేసుకుంది. ఈ ఉదంతం న్యాయమÖర్తి వ్యాఖ్యానించినట్లుగా దిక్కులేని కుటుంబాలు, వ్యక్తులు, వారి దారిద్య్రం, ఆకలి పట్ల సమాజ, ప్రభుత్వ చేతలు ఏమిటనే ప్రశ్నలను ముందుకు తెచ్చింది. ఏ ఇథియోపియానో, మరో ఆఫ్రికన్ దేశంలో ఈ ఉదంతం జరిగిందంటే అర్ధం చేసుకోవచ్చు.దేశం మొత్తం మీద సంపదలు కలిగిన ధనికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం గుజరాత్. విలువలు, వలువలు ఉన్నాయని చెప్పుకొనే సంఘపరివార్‌కు ఎంతో పట్టున్న ప్రాంతం.

లఖీ సోలంకి ఉదంతాన్ని ఒక వ్యక్తి విషాదంగా చూడటానికి లేదు. దుర్భరదారిద్య్రంలో నివసిస్తున్న వారి రక్షణకు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాల వ్యవస్థ వైఫల్యానికి ప్రతిబింబం అని కోర్టు వ్యాఖ్యానించింది. బిజెపి చెప్పే రెండింజన్ల పాలనలో ఉన్న గుజరాత్ ప్రభుత్వానికి ఈ వ్యాఖ్య చెంపపెట్టు. తల్లి కొట్టిన దెబ్బలకే రెండేండ్ల కూతురు మరణించినట్లు పోస్టు మార్టం నివేదికలో చెప్పినందున ఇది చాలా తీవ్రమైన నేరం అంటూ పోలీసులు లఖీకి బెయిలు ఇవ్వరాదని వాదించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆమే స్వయంగా అపస్మారకంతో ఉన్న తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లిందని, చంపాలనే ఉద్దేశ్యం ఆమెకు లేదని కోర్టు చెప్పింది. తన కుమార్తె ఆకలిని తీర్చలేక వత్తిడికిలోనై బాధ్యతారహితంగా వ్యవహరించిందని కూడా వ్యాఖ్యానించింది. ఆ కుటుంబం దీర్ఘకాలం పాటు దారిద్య్రం, ఆకలికి లోనైందని పేర్కొన్నది. ఇంకా ఇలా చెప్పింది. ఈ కేసును కేవలం ఒక నేర అంశంగా చూడకూడదు. పేదల పట్ల సమాజ బాధ్యతను గుర్తు చేసింది. పుట్టుకతోనే ఎవరూ నేరగాండ్లు కాదు.దారిద్య్రం, ఆకలి అలాంటి తీవ్ర పరిస్థితులవైపు నెట్టేధంగా పరిస్థితిని కల్పిస్తాయి.ఇది కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదు సమాజ వైఫల్యం. సంక్షేమ పథకాల యంత్రాంగాల లోపాలు మరియు తీవ్ర కష్టాల్లో ఉన్న మహిళలు, పిల్లలను ఆదుకోవాల్సిన రాజ్యం యొక్క రాజ్యాంగ బాధ్యతలను కూడా ఎత్తి చూపింది.

ఈ సందర్భంగా న్యాయమÖర్తి సుతార్ ఆకలి, దారిద్య్రం, న్యాయం మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేందుకు అనేక సాహిత్య, తత్వశాస్త్రాలు,మత గ్రంధాలు చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ఆకలి తప్ప మానవుడు దుర్మార్గుడు కాదు అని సందేశమిచ్చిన గ్పుురాతీ రచయిత పన్నాలాల్ పటేల్ నవల, తన కుటుంబ ఆకలి తీర్చేందుకు ఒక వ్యక్తి రొట్టెను అపహరించిన ఇతివృత్తంతో రచన చేసిన విక్టర్ హ్యూగో, దుర్భర దారిద్య్రం జనాలను నేరాలవైపు ఎలా నెడుతుందో చెప్పిన చార్లెస్ డికెన్స్ రచనలను ప్రస్తావించారు. విప్లవాలు, నేరాలకు జన్మనిచ్చేది దారిద్య్రం అన్న గ్రీకు తత్వవేత్త అరిస్టోటిల్ చెప్పిన అంశాన్ని ఉటంకించారు.వివిధ మత గ్రంధాలు ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాలనే నీతి బోధనలను కూడా ప్రస్తావించారు. తినే ముందు ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటే పాపాల నుంచి విముక్తి అవుతారని భగవద్ గీత, ఆకలితో ఉన్న నాకు ఆహారాన్ని ఇవ్వు అన్న బైబిల్‌లోని ఏసుక్రీస్తు మాటలు, పొరుగువారు ఆకలితో ఉండగా కడుపునిండా తిని పడుకుంటే అలాంటి వారు నిజమైన విశ్వాసులు కాదన్న ఇస్లామిక్ బోధనలను ఉటంకించారు. కొంత మంది ఆకలితో ఇబ్బంది పడుతుంటే అది కేవలం సామాజిక వైఫల్యం మాత్రమే కాదు నైతిక, ఆధ్యాత్మిక వైఫల్యం కూడా అవుతుందని జస్టిస్ సుతార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45లో పేర్కొన్నట్లుగా పసితనంలో పిల్లల సంరక్షణ, విద్య రాజ్యం బాధ్యత అని కూడా న్యాయమÖర్తి చెప్పారు. అవి పిల్లల ప్రాధమిక హక్కులన్నారు. పౌష్టికాహారం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటం రాజ్యాంగ బాధ్యత అని వాటిని నెరవేర్చటంలో వైఫల్యం చెందినట్లు లఖీ సోలంకి కేసు వెల్లడించిందన్నారు. ఆకలిగొన్న వ్యక్తి ముందు రొట్టెను కోరతారు తప్ప వేదాంతాన్ని కాదనే మాటతో న్యాయమÖర్తి బెయిల్ ఉత్తరువును ముగించారు.

ఈ కేసు రెండింజన్ల పాలన, గుజరాత్ ఆదర్శ రాష్ట్రం అనే ప్రచార బండారాన్ని బట్టబయలు చేసింది.బిజెపి ఏలుబడిలో నెలకొన్న పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అవసరం.ప్రతి ఏటా దేశాల ఆకలి సూచికలను ప్రకటిస్తున్నారు.మన దేశానికి ఇస్తున్న సూచికలను మేం అంగీకరించం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది, పోనీ స్వంత సూచికలను వెల్లడిస్తున్నదా అదీ లేదు. ప్రపంచ ఆకలి సూచిక 2022లో మనదేశం 121 దేశాలలో 107వదిగా ఉంది. మనకంటే ఎగువన నైజీరియా 103, పాకిస్తాన్ 99వ స్థానంలో ఉంది. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్న నరేంద్రమోడీ సర్కార్ అంటూ డబ్బా కొట్టుకుంటున్న తరుణలో ఈ సూచిక వెలువడింది. తరువాత 2025లో 123 దేశాల్లో 102వదిగా ఉంది. అతల్ బిహారీ వాజ్‌పేయి ఏలుబడి 2000 సంవత్సరంలో నూటికి మన మార్కులు 38.1, తరువాత 2008లో 34.6, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2016లో 29.3, పదకొండు సంవత్సరాల పాలన తరువాత 2025లో 25.8 పాయింట్లు వచ్చాయి. ప్రపంచ సూచికల ప్రకారం 10 పాయింట్లలోపు ఉన్న దేశాల్లో తక్కువ ఆకలి, పది నుంచి ఇరవై పాయింట్ల మధ్య ఉంటే కాస్త మెరుగు, ఇరవై నుంచి 35 పాయింట్ల మధ్య ఉంటే తీవ్రం, 3550 మధ్య ఉంటే ఆందోళనకరం, అంతకు మించి ఉంటే మరింత ఆందోళనకర జాబితాలుగా దేశాలను వర్గీకరించారు. పన్నేండ్ల స్వర్ణయుగ పాలన తరువాత మనదేశం మÖడవ తరగతిలో అంటే తీవ్ర ఆకలి ఉన్న దేశంగా ఉంది.


హరిత విప్లవం తరువాత విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థితి నుంచి ఎగుమతి చేస్తున్నాం. అయితే జనం కడుపునిండా మÖడుపూటలా తింటే ఎగుమతికి అవకాశం ఉండదు. అలాంటి స్థితి లేని కారణంగానే మన దేశంలో “ కనిపించని ఆకలి ” ఉందని అనేక మంది వర్ణిస్తున్నారు. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నప్పటికీ, పోషకాహార లేమిని అంగీకరిస్తూ పోషణ్ అభియాన్ పేరుతో కేంద్రం ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. అయినప్పటికీ మన దేశం 2025 ప్రపంచ ఆకలి సూచికలో 123 దేశాలకు గాను 102వదిగా ఉంది, మనకంటే మరో 21 ఇంకా దరిద్రంలో ఉన్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యటానికి వచ్చేసరికి ఎద్దుల్లో అన్నట్లుగా బిజెపి వ్యవహారం ఉంది. రాజకీయంగా మాకు తిరుగులేదు అని చెప్పుకొనేందుకు మెజారిటీ రాష్ట్రాలలో తాము లేదా మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయని, తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమదే ఆధిపత్యం అని బిజెపి చెప్పుకుంటుంది.మరి దాని పాలిత రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచికల్లో అధోగతిలో ఎందుకు ఉన్నట్లు ? పన్నేండేండ్ల మోడీ స్వర్ణయుగ పాలన తరువాత దేశంలో ఉన్న పరిస్థితుల గురించి చూద్దాం.


జనాభాయే మనకు పెద్ద పెట్టుబడి అని నేతలు కబుర్లు చెబుతారు.దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ ఎప్పుడో చెప్పారు. మన మనుషులు ఎలా ఉన్నారు ? ఉన్న సమాచారం, అంచనాల ప్రకారం పైన చెప్పిన ఉచిత ధాన్యం, పోషణ్ కార్యక్రమం అమలు తరువాత కూడా దేశంలో 12శాతం మంది అంటే 17.2 కోట్ల మందికి పోషకాహారం లేదు. భావి భారత పౌరులుగా ఉండాల్సిన పిల్లల్లో ఐదేండ్ల లోపువారిలో 35శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు పెరగటం లేదు, అంటే వారికి పోషకాహారం లేదు. ఎత్తుకు తగ్గ బరువులేని వారు 18.7శాతం మంది ఉన్నారు, ఇలాంటి వారు ఎక్కువగా ఉన్న దేశాలలో మనది ఒకటి. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు అధిక బరువు, ఊబకాయం సమస్య కూడా పెరుగుతున్నది. ఆకలి జబ్బు కొందరికైతే అధిక తిండి మరో జబ్బు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే5 ప్రకారం పిల్లలు 67.1శాతం, 59.1శాతం మంది తరుణ వయస్సులో ఉన్న బాలికలు రక్తహీనతతో ఉన్నారు. పిల్లలను కనే వయస్సులో ఉన్న మహిళల్లో సగం మంది రక్తహీనతతో ఉన్నారు.ఇది కనిపించని ఆకలికి ఒక సూచిక అని చెప్పవచ్చు. ప్రపంచ ఆహార మరియు పోషకాహార ప్రపంచ స్థితి నివేదిక 2025లో చెప్పినదాని ప్రకారం మన దేశంలో 40.4శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి లేదు.అరవై శాతం మంది పట్టణ జనాభాకు ప్రొటీన్ల లోపం ఉంది. రెండు భారతాల దృశ్యం కనిపిస్తున్నది. ఒకటి పోషకాహారం లేని వారు, ఊబకాయం, అవసరానికి మించి బరువు పెరుగుల ఒక విచిత్రమైన స్థితి. మొత్తం మరణాల్లో అంటు వ్యాధులు కాని గుండె,మధుమేహం, కాన్సర్, శ్వాసకోశ సమస్యలతో మరణిస్తున్నవారు 6365శాతం మంది ఉన్నట్లు అంచనా.


నరేంద్రమోడీ ప్రత్యక్ష పాలనలో, ప్రధానిగా పని చేస్తున్న కాలంలోనే పైన చెప్పుకున్న లఖీ సోలంకి ఉదంతం జరిగింది. ఆమెకు సంక్షేమ పథకాలు అంది ఉంటే ఇంట్లో ఆహార సమస్య వచ్చి ఉండేది కాదు, బిడ్డను చేతులారా పొగొట్టుకొనేది కాదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర వనరుల నుంచి సేకరించిన సమాచారం మేరకు రాష్ట్రాల ఆకలి సూచికలను కూడా తయారు చేశారు. దేశాల సూచికల మాదిరే వంద మార్కులకు వచ్చిన వాటిని బట్టి వర్గీకరణ అదే మాదిరి చేశారు. దేశ జాతీయ సగటు మార్కులు 29 తీవ్ర ఆందోళనకరంగా ఆకలి ఉన్న రాష్ట్రాలు అంటే 35 కంటే ఎక్కువగా ఉన్నవాటిలో బీహార్,ఝార్కండ్, చత్తీస్‌ఘర్ ఉన్నాయి. ఇవి బిజెపి లేదా వారి మిత్రుడైన నితీష్ కుమార్ ఏలుబడిలో ఉన్నవే అని వేరే చెప్పనవసరం లేదు. దేశ సగటు 29 కంటే ఎక్కువ ఆకలి ఉన్నవాటిని ఆందోళనకర వర్గీకరణలో చేర్చారు, అవి గుజరాత్, ఉత్తర ప్రదేశ్, అసోం, ఒడిషా, మధ్య ప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్. ఒక మాదిరి అంటే 16 కంటే తక్కువ మార్కులు వచ్చిన సిక్కిం, పుదుచ్చేరి, కేరళ వంటివి ఉన్నాయి. తక్కువ ఆకలి ఉన్నది పన్నెండు కంటే తక్కువ వచ్చింది ఒక చండీఘర్ కేంద్ర పాలిత ప్రాంతమే. ఇలాంటి పరిస్థితి ఉన్నపుడు బిజెపి లేదా మోడీ దేశాన్ని పరుగులు పెట్టిస్తామంటే నమ్మేదెలా !

సోషలిజం దిశగా అమెరికన్ యువత, కార్మికవర్గం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


“ దేశభక్తి యుతంగా పెట్టుబడిదారీ విధానం పని చేస్తున్నదని సగం మంది కంటే తక్కువ మంది అమెరికన్లు అనుకుంటున్నారు, ప్రజాస్వామ్యానికి మద్దతు పడిపోయింది ” న్యూయార్క్ పోస్ట్.“ హౌస్ ప్రైమరీస్ (పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ అభ్యర్ధిత్వం కోసం పార్టీలో జరిగే పోటీ)లో ఆకస్మికంగా డెమోక్రటిక్ సోషలిస్టులు ఎందుకు దూసుకుపోతున్నారు ” న్యూస్ వీక్. “ అంకెలు అబద్దాలు చెప్పవు. యువ అమెరికన్లు సోషలిజం ప్రేమలో పడుతున్నారు ” ఫాక్స్ న్యూస్. “ సోషలిజానికి పెరుగుతున్న యువత మద్దతు తొలి రోజుల అమెరికా పాఠాలను గుర్తుకు తెస్తున్నది ” కరోలినా జర్నల్. “ అమెరికాలో పెట్టుబడిదారీ విధానపు ప్రతిష్ట 54శాతానికి పడిపోయింది ” గాలప్ న్యూస్. “ యువ అమెరికన్లు సోషలిజాన్ని మరీ అతిగా అభిమానిస్తున్నారు.స్వేచ్చా వాదులు విధిగా అడ్డుకోవాల్సిన సమస్య ఇది” కాటో ఇనిస్టిట్యూట్. “ ముఫ్పైతొమ్మిది శాతం మంది అమెరికన్లు సోషలిజాన్ని ఆమోదిస్తున్నారన్న స్కాట్ బెసెంట్. వారు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టలేదు ” ఫార్చ్యూన్.పైన పేర్కొన్నవి అమెరికన్ మీడియాలో గత ఏడాది కాలంలో, ఇటీవల వచ్చిన కొన్ని వార్తా వ్యాఖ్యల శీర్షికలు. అక్కడి సమాజంలో వస్తున్న ఆలోచనా ధోరణులను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. వీటిని చూసి డోనాల్డ్ ట్రంప్ వంటి నయా ఫాసిస్టులు తమ ఆందోళన, అక్కసులను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. దీన్ని బట్టి వెంటనే అమెరికాలో సోషలిస్టు వ్యవస్థ ఏర్పాటు కానుందని ఎవరూ నిర్దారణకు రానవసరం లేదు.అక్కడి పాలకవర్గం అంత తేలికగా తన అధికారాన్ని వదులుకోదు.


గత గురువారం నాడు వాషింగ్టన్ పోస్టు పత్రిక ఐసోస్ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు అభ్యర్ధి రంగంలో ఉంటే ఓటు వేయటం గురించి ఆలోచిస్తామని నమోదైన ఓటర్లలో 40శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారు మÖడు పదుల వయస్సులోపు వారు 46శాతం మంది, డెమోక్రటిక్ పార్టీ మద్దతుదార్లలో 64శాతం ఉన్నట్లు కూడా సర్వే పేర్కొన్నది. ఈ పత్రిక అమెజాన్ కంపెనీ అధిపతి జెఫ్ బెజోస్ యాజమాన్యంలో నడుస్తున్నది. అలాంటి కార్పొరేట్ల పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో తెలిసిందే. అయితే సర్వేలను తిమ్మిని బమ్మిని చేస్తే కుదరదు గనుక ఇష్టం ఉన్నా లేకున్నా వివరాలను వెల్లడించకతప్పటం లేదు. అయితే ఈ సర్వే వార్తలోనే ఎక్కువ మంది అమెరికన్లు డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ(డిఎస్‌పి) అభ్యర్ధికి మద్దతు ఇవ్వటం లేదని కూడా రాసింది. సిఎనఎన్ మీడియా సంస్థ కోసం ఎసఎసఆరఎస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో డెమోక్రాట్లు, ప్రజాస్వామిక భావాలకు మద్దతు ఇచ్చే వారిలో మÖడో వంతు మంది తాము డెమోక్రటిక్ సోషలిస్టులమని చెప్పుకున్నారని,వారిలో 45 ఏండ్ల లోపువారు 59శాతం మంది ఉన్నట్లు తేలింది. మÖడింట రెండు వంతుల మంది నవంబరు మÖడున జరిగే ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తామని కూడా చెప్పారు. డెమోక్రటిక్ పార్టీలో తెల్లవారితో పోల్చితే ఆఫ్రోఅమెరికన్లు బాహాటంగా తాము డెమోక్రటిక్ సోషలిస్టుకే ఓటు వేస్తామని చెప్పారు. డెమోక్రటిక్ సోషలిస్టులుగా చెప్పుకున్న వారిలో 66 నుంచి 54శాతం మందికి డిగ్రీలు లేవు, వారి వార్షిక ఆదాయం 76 నుంచి 65శాతం మందికి లక్ష డాలర్ల లోపే ఉంది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే మన దేశంలో చెప్పుకొనే బడుగు బలహీన వర్గాలు అమెరికాలో సోషలిజానికి అనుకూలంగా ఉన్నాయి. డెమోక్రటిక్ సోషలిస్టుల్లో 48శాతం మంది గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం నిలిపివేయాలనే అభ్యర్ధికే మద్దతు ఇస్తామని చెప్పటం కూడా గమనించాల్సిన అంశం. అమెరికా సమాజం మొత్తంగానే ఇరాన్‌పై జరుపుతున్న యుద్దాన్ని వ్యతిరేకిస్తున్నారు. శ్వేత జాతీయుల్లో ఎగువ మధ్య తరగతి మాత్రమే సోషలిజానికి అనుకూలంగా ఉన్నట్లు మీడియాలో వచ్చే విశ్లేషణలు వాస్తవం కాదని కూడా సిఎనఎన్ సర్వే తేల్చింది. జీవిత అనుభవాల నుంచే జనాలు సోషలిజానికి మద్దతు ఇస్తారని ప్రపంచ వ్యాపితంగా వెల్లడైన సత్యం. దీనికి అమెరికన్లు మినహాయింపు ఎలా అవుతారు ! దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం ఎంత ఎక్కువగా కనిపిస్తే అంతగా ప్రత్యామ్నాయ విధానాలవైపు జనాలు చూస్తారు.


పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్టులకు పెరుగుతున్న మద్దతు గురించి ఆ పార్టీలోని మితవాదులు కూడా ఆందోళన చెందుతున్నారు. జూలై నెలలో న్యూయార్క్, కొలరాడోలో అభ్యర్ధిత్వాలకు డెమోక్రటిక్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో నాలుగు ప్రజాప్రతినిధుల స్థానాల్లో డిఎస్‌పి మద్దతు ఉన్న అభ్యర్ధులే గెలిచారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓడించారు. మిచిగాన్ రాష్ట్ర సెనెట్ స్థానానికి అబ్దుల్ ఎల్ సsTÖద్ అనే వామపక్షవాది పోటీ పడుతున్నాడు. డెమోక్రటిక్ సోషలిస్టులందరూ మద్దతు ఇస్తుండగా ఇజ్రాయెల్ అనుకూల వాది అయిన ప్రస్తుత డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ హాలే స్టీవెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్,ఇతరులు ప్రచారం చేస్తున్నారు. విస్కాన్సిన్ రాష్ట్ర గవర్నర్ పదవికి డిఎస్‌పి అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఈ పరిణామాన్ని చూసిన తరువాత రిపబ్లికన్లు ఆందోళనపడుతున్నారు. ఉదారవాదులు కమÖ్యనిజం గురించి ఆలోచించకుండా చూడాలంటూ ఆ పార్టీకి చెందిన వారు ఒక సమావేశంలో కోరారు. ఒక కార్యాచరణ పథకాన్ని కూడా రూపొందించారు. జూలై 20వ తేదీన రూపొందించిన ఒక పత్రంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. “ సోషలిజం, మార్క్సిజం కంటే కమÖ్యనిజం మరింత ప్రమాదకరమని అమెరికన్లు ఇప్పటికీ భావిస్తున్నారు. ఈ మÖడు భావాలు తలెత్తటానికి ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ యొక్క విషపూరిత చెట్టు ఫలాలే అవి గనుక, వారందరితో సంబంధాలు పెట్టుకొని వారిని దూరం చేయటం రిపబ్లికన్లకు ముఖ్యమైనది.” ఇటీవల సిఎన్‌బిసి చేసిన సర్వేలో డోనాల్డ్ నినాదమైన మాగా(అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలి) కంటే డెమోక్రటిక్ సోషలిజం నినాదమే బహళ ఆదరణ కలిగి ఉందని తేలింది. డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ అభ్యర్ధులను చూపి భయపెట్టటాన్ని డెమోక్రటిక్ పార్టీ మానుకోవాలని కొందరు సలహా ఇచ్చారట. ఎందుకంటే ఎంతగా వ్యతిరేకిస్తే అంతగా ఆదరణ పొందుతున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలో జోహ్రాన్ మందానీ విజయం వెల్లడించింది. ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులు కూడా రంగంలో ఉండి మందానిని ఓడించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్రమోడీ విధానాలను విమర్శించిన లేదా వ్యతిరేకించినవారినందరినీ దేశద్రోహులుగా, అర్బన్ నక్సల్స్, తుకడేతుకడే గ్యాంగ్ అని ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో తనను వ్యతిరేకించేవారందరికీ డోనాల్డ్ ట్రంప్ “ కమÖ్యనిస్టు ” ముద్రవేస్తున్నాడు. ఇది నష్టదాయకమని రిపబ్లికన్ మేథావులు వాపోతున్నారు. ప్రతివారినీ కమÖ్యనిస్టులని ముద్రవేస్తే సభల్లో చప్పట్లు కొట్టవచ్చు, ఈలలు వేయవచ్చు, ఒకటి రెండు సార్లు మధ్యంతర ఎన్నికల్లో ఓట్లు కూడా పడవచ్చు గానీ పదే పదే ప్రతివారినీ కమÖ్యనిస్టు అంటే అవును అయితే ఏమిటి అని యువతరం ప్రశ్నించే పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా అదే జరుగుతున్నది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని ఒకవైపు దాని సమర్ధకులే చెబుతుండగా మరోవైపు సోషలిస్టు చైనా సాధిస్తున్న అద్భుత విజయాలు, అమెరికాను సవాలు చేస్తున్న తీరును చూసి యువత సోషలిజం పట్ల సానుకూల వైఖరిని పెంచుకుంటున్నది. ట్రంప్ సర్కార్ కొన్ని స్వతంత్ర వాణిజ్య సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తున్నదని, కమÖ్యనిస్టులు అదే చేస్తారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినందున ఇప్పుడు ట్రంప్ చేస్తున్న చర్యలను “ మాగా మావోయిజం ” అని వర్ణిస్తున్నారని, కమÖ్యనిస్టులను భూతాలుగా చూపి భయపెట్టే క్రమంలో ఉదారవాదులకు సైతం అలాంటి ముద్రవేస్తూ ట్రంప్ నష్టం చేస్తున్నారని, ఎన్నికల ముందు తెలివైన అమెరికన్ ఓటర్లు వీటన్నింటినీ గుర్తు చేసుకుంటారని రిపబిక్లన్ మేథావులు హెచ్చరిస్తున్నారు.


ఇదే సమయంలో కాల చక్రాన్ని వెనక్కు తిప్పాలని చూస్తున్న పచ్చి మితవాద రిపబ్లికన్లు కూడా ఉన్నారు.1950 దశకంలో మాదిరి కమÖ్యనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం తప్ప మరొక మార్గం లేదని భావిస్తున్నారు. వారి బుర్రలకు ఎక్కనిదేమంటే అప్పుడూ ఇప్పుడూ పరిస్థితి ఒకే విధంగా లేదు.నాడు సోషలిస్టు, కమÖ్యనిస్టు భావనలు యావత్ ప్రపంచాన్ని ఊపివేశాయి.ఇప్పుడు అలా లేదు. కమÖ్యనిజాన్ని అంతం చేశామని చెప్పుకున్నవారే ఇప్పుడు కమÖ్యనిస్టు బొమ్మ భూతాన్ని వీధుల్లోకి తీసుకువచ్చి గుండెలు బాదుకుంటూ భయాన్ని నటిస్త్తే జనాలు నవ్వుతారు తప్ప నమ్మరు.“ మాలాంటి తరం ప్రచ్చన్న యుద్దంలో కమÖ్యనిజం వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది.ఇప్పుడు మన గడ్డ మీద కమÖ్యనిజం పునరాగమనంలో ఉంది.అమెరికా ఉనికికే ముప్పుగా మారింది” అని జూలై మÖడవ తేదీన మౌంట్ రష్‌మోర్ సభలో ట్రంప్ చెప్పాడు.“ వాషింగ్టన్ లేదా మాస్కో, ఏదో ఒకటే రాజధానిగా ఉండాలి. స్వచ్చమైన,శుద్దమైన, తాజా గాలివీచే స్వేచ్చాయుత అమెరికా వాతావరణమే ఉండాలి లేదా చెడువాసనలు వచ్చే కమÖ్యనిస్టు రష్యా అయినా ఉండాలి ” అంటూ న్యూయార్క్ మాజీ గవర్నర్ అల్ స్మిత్ 1936లో కమÖ్యనిస్టు ఉన్మాదిగా చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ కూడా అలాంటి ఉపన్యాసాలే చేస్తున్నాడు. జూలై 21వ తేదీన అమెరికా విదేశాంగశాఖ “ క్యూబా : ఇరవై ఒకటవ శతాబ్దపు కమÖ్యనిజం రాజధాని ” అనే శీర్షికతో ఒక నివేదిక విడుదల చేసింది. దానిలో అనేక అవాకులు చవాకులు, వక్రీకరణల గురించి మనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. దానిలో కమÖ్యనిజం కంటే అమెరికాలో డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ నేతలుగా ఉన్న జోహ్రాన్ మందానీ, జర్నలిస్టు ఆమీ గుడ్‌మాన్ వంటి ఎందరిమీదనో క్యూబా ప్రయాణీకులంటూ వక్రీకరణ దాడి చేశారు.


కమÖ్యనిజం వ్యతిరేకత అధికారిక మతం మాదిరి ఉన్న అమెరికాలో నిజంగానే యువత, కార్మికవర్గంలో సోషలిజం పట్ల, వామపక్ష భావజాలం వైపు మొగ్గటం అనేక మందికి మింగుడు పడటం లేదు. ప్రధాన స్రవంతి మీడియాలో గత కొన్ని దశాబ్దాలుగా చిలవలు పలవలుగా కమÖ్యనిస్టు, సోషలిస్టు వ్యతిరేక ప్రచారం తప్ప అనుకూల వ్యాఖ్యానాలు ఎక్కడా కనపడలేదు. అయినప్పటికీ అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అన్నట్లుగా ఎందుకిలా జరుగుతోందనే ఆలోచన వేధిస్తున్నది. మరోవైపు సోషలిజం భావజాలానికి జనం దూరమయ్యారని భావిస్తున్న అనేక మందికి ఎంతో ఊరట కలిగిస్తున్న పరిణామం. కొంత మంది డిఎస్‌పి నిజమైన సోషలిస్టు భావనలను ముందుకు తీసుకురావటం లేదని, సంస్కరణవాదంతో ఉందని విమర్శిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అసలు సోషలిజమంటేనే ఆమడదూరం వెళ్లే వాతావరణం నుంచి సానుకూలతవైపు మళ్లటమే పెద్ద మార్పు. సంస్కరణ వాదం వరకు వచ్చిన వారు అది పని చేయదు అనుకుంటే శాస్త్రీయ సోషలిస్టు భావనకు మారటం తధ్యం, అయితే దానికి ఎంత కాలం పడుతుందన్నది ఎవరూ చెప్పలేరు. సోవియట్, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్థలు కూలిపోయింతరువాత ఇలాంటి మార్పు వస్తుందని ఎవరైనా ఊహించారా ? ఏదైనా అంతే, పరిస్థితులే జనాలను ఎటువైపు నడింపించాలో నిర్దేశిస్తాయి !

ట్రంప్ ఉత్సాహాన్ని నీరుగార్చిన అమెరికా మిలిటరీ !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అరవై రోజుల పాటు దాడుల విరమణకు ఒప్పందం చేసుకొని శాశ్వత అవగాహనకు రావాలని నిర్ణయించిన డోనాల్డ్ ట్రంప్ మరోమారు ఉల్లంఘనకు పాల్పడ్డాడు. జూలై నెలలో పదమÖడు రోజుల పాటు ఇరాన్‌పై భీకరదాడులు జరిపాడు.శుక్రవారం నుంచి నిలిపివేశాడు. ఇరాన్‌తో “ మంచి స్నేహపూర్వక మాటలు ” మాట్లాడుతున్నట్లు సోమవారం నాడు చెప్పాడు. అయితే సంప్రదింపులు దీర్ఘకాలం సాగటం తనకు ఇష్టం లేదన్నాడు. పోరు నుంచి బయట పడేందుకు అమెరికా నానా తిప్పలు పడుతోందని టెహరాన్ వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం నాడు వాషింగ్టన్ చేరుకున్నాడు. నెతన్యాహు సోమవారం నాడు ఇజ్రాయెల్ యుద్ధ మంత్రుల కమిటీతో సమావేశం జరుపుతాడని, అమెరికాతో కలసి ఇరాన్‌పై దాడులు చేయటంలో కీలక పాత్రపోషించాడని, ఇరాన్ అణు, ఖండాంతర క్షిపణుల కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పట్టుబడతాడని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆదివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇరాన్‌తో సాగుతున్న పోరే ట్రంప్‌తో ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న ఎమెన్‌లోని హౌతీలు`సౌదీ అరేబియా మధ్య దాడులు జరుగుతున్నాయి. తమ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు జరిగినట్లు రియాద్ ప్రకటించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల గురించి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ వివరాలు నమోదు చేసింది.అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘించినట్లు, వాటిలో కొన్ని యుద్ద నేరాలతో సమానమని మానవహక్కుల కమిషనర్ వాకర్ టర్క్ వర్ణించాడు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా సంక్షోభంలో మరణించిన, గాయపడిన అమెరికన్ సైనికులు ఎందరన్నది వివాదంగా మారింది. గత మంగళవారం నాడు ట్రంప్ చేసిన ప్రకటనలో 18 మంది మరణించినట్లు పేర్కొనగా మరుసటి రోజు రక్షణ శాఖ 14గా పేర్కొన్నది, అదే విధంగా గాయపడిన వారి సంఖ్యను కూడా తగ్గించి చూపింది. దీని గురించి అడిగితే పొంతనలేని సమాధానాలు వచ్చాయి. ఇరాన్ మీద దాడులు ఆపకూడదు, కొనసాగించాలంటూ వత్తిడి తెస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంగళవారం నాడు అమెరికా పర్యటనకు వచ్చాడు. ఈ పర్యటన ఖరారైన తరువాతే దాడులకు అమెరికా విరామం ఇచ్చింది. ట్రంప్ ఎన్నెన్నో ప్రగల్భాలు పలికాడు, ఇంక మాటల్లేవ్ చేతలే సమాధానం అన్నాడు. సలహదారుల నివేదికల తరువాత గురువారం నుంచే ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చి శుక్రవారం నుంచి దాడులు ఆపివేయించాడు. ఎందుకు అంటే చర్చలకు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు.చర్చించేదేమీ లేదు, అమెరికా ఎన్ని రోజులు దాడులు అపితే మేం కూడా అదే విధంగా స్పందిస్తామని ఇరాన్ కూడా ప్రకటించింది. ఈ విరామం ఎన్ని రోజులు ఉంటుందో, ఏమి చర్చలు చేస్తారో ఇది రాసిన సమయానికి ఎలాంటి స్పష్టత లేదు.


ఇరాన్‌పై దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ ఏమి సాధించాయో ఊకదంపుడు ప్రకటనలు తప్ప నిర్దిష్టంగా ఎవరూ ఏమీ చెప్పటం లేదు. అయితే ఆర్థిక భారాలకు సంబంధించి కొన్ని తాత్కాలిక అంచనాలు, వివరాలు మాత్రమే ఇప్పటివరకు వెల్లడయ్యాయి.అమెరికాకు 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. అదనంగా అత్యవసర నిధులు 67 నుంచి 90 బిలియన్ డాలర్ల వరకు కావాలని ట్రంప్ యంత్రాంగం పార్లమెంటును కోరింది.అయితే రోజుకు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అవుతున్నట్లు స్వతంత్ర విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, దీర్ఘకాలంలో మొత్తం ఖర్చు లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. అమెరికా 56వేల మంది సైనికులను ఇరాన్‌పై దాడులు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నదని, ఆయుధాలు, ఇతర మిలిటరీ సంబంధ వస్తువులను పెద్ద ఎత్తున కొత్తగా చేర్చినట్లు చెబుతున్నారు. అమెరికాలో నెలవారీ వినియోగదారుల ఇంథన ఖర్చు 21.2శాతం పెరిగింది.దీంతో వినియోగదారుల ధరల సూచీ 3.3శాతానికి పెరిగింది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఐరోపా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి.అరబ్ గల్ఫ్ దేశాల్లో ఆహార ధరలు 40 నుంచి 120శాతం పెరిగాయి. చమురు నౌకలు సుదూరం ప్రయాణించాల్సి రావటంతో దిగుమతి దేశాలకు రవాణా, బీమా ఖర్చులు పెరిగాయి.ఇరాన్ చమురు ఎగుమతుల పతనం, ఇతర దేశాల్లో జనాల మీద పడిన భారాలు ఎంతో ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేని స్థితి.


అయితే వాషింగ్టన్ మరోసారి ఎందుకు దాడులకు తెగబడింది, తిరిగి చర్చలంటూ ఎందుకు నిలిపివేసిందన్నదే అసలు సమస్య. ఇరాన్ చేస్తున్నది ఆత్మరక్షణ ఎదురుదాడులు తప్ప మరొకటి కాదు గనుక అది ఎందుకు ఆపిందో అందరికీ విదితమే. అమెరికాకు ఏమైంది ! వస్తున్న వార్తలను బట్టి చెప్పుకోరాని చోట తగులుతున్న దెబ్బలే అనిచెప్పవచ్చు. టెహరాన్ మీద ఎన్ని దాడులు చేసినా చేతి చమురు వదలటం తప్ప సాధించేదేమీ లేదు అని పెంటగన్ అధికారులు కుండబద్దలు కొట్టి చెబుతున్నట్లు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మరోవైపు మిలిటరీ సిబ్బంది మరణాలు, గాయపడిన వారి సంఖ్య పెరగటం, గల్ఫ్ దేశాలు తెస్తున్న వత్తిడి కూడా ట్రంప్‌కు ఏం చేయాలో దిక్కుతోచకుండా చేస్తున్నాయి. ఇరాన్ దాడుల్లో గాయపడిన అనేక మందిని జర్మనీలోని అమెరికా మిలిటరీ ఆసుపత్రిలో చికిత్సకోసం తరలించినట్లు ఒక అధికారి చెప్పటాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఉటంకించింది. జూలై నెలలో జరిగిన దాడుల్లో దాదాపు వంద మంది గాయపడ్డారని వారిలో ఒక్క జోర్డాన్ సైనిక స్థావరాల్లోనే 50 మంది ఉన్నట్లు అధికారి చెప్పాడట.మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరంలో ముగ్గురు సైనికులు మరణించారు.కేవలం ఆరునెలల క్రితమే పని చేయటం ప్రారంభించిన కువాయిట్‌లోని అహమద్ అల్ జబర్ వైమానిక స్థావర రాడార్ వ్యవస్థ నాశనమైంది. ఇలా అనేక చోట్ల అమెరికా నష్టపోయినట్లు వార్తలు. ఎంత మంది అమెరికా సైనికులు గాయపడిందీ, మరణించిందీ కూడా వివరాలను వెల్లడించేందుకు సిద్దపడటం లేదనే వార్తలు రావటాన్ని బట్టి ఈ పరిణామం కూడా దాడుల నిలిపివేతకు కారణం కావచ్చు. సమాచారాన్ని దాచిపెడుతున్నారన్న విమర్శల నేపధ్యంలో రక్షణ శాఖ సమాచార వ్యవస్థలో శుక్రవారం నాటికి వెల్లడించిన వివరాల ప్రకారం అంతకు ముందువారంలో అదనంగా 140 మంది సైనికులు గాయపడినట్లు, నలుగురు మరణించినట్లు పేర్కొన్నారు. డిఫెన్స్ కాజువాలిటీ అనాలసిస్ సిస్టమ్(డిసిఎఎస్) అంటే మిలిటరీ మరణాల విశ్లేషణ వ్యవస్థలో జూలై ఏడు నుంచి విదేశీ కార్యకలాపాల్లో మరణించిన లేదా గాయపడిన వారి గురించి విశ్లేషించారు. పెంటగన్ తాజా సమాచారం ప్రకారం ఇరాన్ మీద ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫురీలో 18 మంది అమెరికా సైనికులు మరణించగా 624 మంది గాయపడ్డారు.సిఎనఎన్ విశ్లేషణ ప్రకారం గతవారంలోనే గరిష్టంగా 482 మంది గాయపడ్డారు. రక్షణశాఖ మీడియాకు అందచేస్తున్న వివరాలు, డిసిఎఎస్ వ్యవస్థలో గాయపడిన లేదా మరణించిన వారి సంఖ్యను తగ్గించి చూపుతున్నారని దీనికి కారణాలు ఏమిటని పార్లమెంట్‌లోని సెనెట్ సాయుధ దళాల కమిటీలోని 12 మంది ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్‌కు ఒక లేఖ రాశారు. సమాచారానికి సంబంధించి తాత్కాలికంగా తలెత్తిన సమస్యల కారణంగా డిసిఎఎస్ వెబ్‌సైట్‌లో తేడాలు కనిపిస్తున్నాయని రక్షణ శాఖ మీడియా ప్రతినిధి జోయల్ వాల్‌డెజ్ సమర్ధించుకున్నాడు. తాజా వివరాలు కావాలని సిఎనఎన్ ఛానల్ రక్షణశాఖను కోరగా శనివారం నాటికి కూడా ఉలుకూలేదు పలుకూలేదు. నిమిష నిమిషానికీ సమాచారాన్ని సవరించే డిసిఏఎస్ జూలై ఏడు నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. అదే రోజున ఇరాన్‌తో నూతన పోరు ప్రారంభమౌతుందని ట్రంప్ ప్రకటించాడు.


అధ్యక్షుడికి ఉన్న అసాధారణ అధికారాల ప్రకారం పార్లమెంటు అనుమతి లేకుండా 60 రోజుల పాటు మిలిటరీ చర్యకు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ విధంగా ఫిబ్రవరి 28నాటి ఆదేశాలు మే ఒకటవ తేదీతో ముగిశాయి. దీన్ని సాకుగా చూపి మరోసారి కొత్తగా ఆదేశాలు జారీ చేసినట్లు, దానికీ దీనికీ సంబంధం లేదని ట్రంప్ యంత్రాంగం భాష్యం చెబుతోంది. ట్రంప్ చర్యలు రాజ్యాంగవిరుద్దమని అధికార, ప్రతిపక్షానికి చెందిన ఎంపీలు కొందరు విమర్శించారు. ఇరాన్‌పై దాడుల ప్రభావం పరిమితమే, ఇంతకు మించి చేసేదేమీ లేదని, ఆయుధాలు కూడా నిండుకుంటున్నాయని అమెరికా ఉన్నత మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌పై జరుపుతున్న దాడుల ప్రభావానికి పరిమితులు ఏర్పడ్డాయని,హార్ముజ్ ప్రాంతంలో ప్రత్యేకించి వైమానిక దాడుల కొనసాగింపువలన ఫలితం లేదని మధ్య ప్రాచ్యంలో అమెరికా మిలిటరీ అధికారి అడ్మిరల్ బ్రాడ్లే కూపర్ సిఫార్సు చేసినట్లు ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. ట్రంప్ పౌర, మిలిటరీ సలహాదారులు కూడా దీన్ని బలపరిచినట్లు చెబుతున్నకారణంగానే ట్రంప్ దాడులు నిలిపివేయించాడు.రెండువారాల దాడుల తరువాత నౌకల మీద దాడి చేసే శక్తిని ఇరాన్ కోల్పోయిందని అందువలన దాని లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తే కొత్తగా వచ్చే ప్రయోజనం లేదని కూపర్ నివేదించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు సెంట్రల్ కమాండ్ ప్రతినిధి తిరస్కరించాడు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాప్ చైర్మన్ జనరల్ డాన్ కెయినె కూడా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్, ట్రంప్‌తో మాట్లాడుతూ ఇరాన్‌వైపు నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకొనే పేట్రియాట్, తోమహాక్ క్షిపణుల వంటి వాయు రక్షణ ఆయుధాలకు కొరత ఏర్పడితే అమెరికా సైనికులు, ఆ ప్రాంతంలోని మద్దతుదారులైన గల్ఫ్ దేశాలను రక్షించటం కష్టం అవుతుందని చెప్పారని సమాచారం. కెయినే హెచ్చరికల గురించి సాక్షాత్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రికే ప్రకటించింది. దాని మీద వివరణ కోరగా అధ్యక్షుడికి ఇచ్చిన సలహా రహస్యం గనుక వ్యాఖ్యానించేది లేదని అధికార ప్రతినిధి స్పందించాడు. మరోసారి ఇరాన్‌పై దాడులు జరుపుతారా అన్న ప్రశ్నకు ఒక టీవీ కార్యక్రమంలో ఐరాసలో అమెరికా ప్రతినిధి మైక్ వాల్జ్ మాట్లాడుతూ దాని గురించి తాను ఎక్కువగా చెప్పలేనని, అధ్యక్షుడి ముందు అనిప్రతిపాదనలూ ఉన్నాయన్నాడు. ఇరాన్‌పై నిర్ణయించిన లక్ష్యాలలో 80శాతం సాధించామని, మిగిలిన 20శాతం కోసం ఇప్పటివరకు చేసినవాటి కంటే మరింత భారీ దాడులు చేయాల్సి ఉంటుందని, దీర్ఘకాలంతోపాటు, ముప్పు ఖర్చు కూడా ఎక్కువే గనుక కొనసాగించటం వలన ప్రయోజనం లేదన్నది ట్రంప్ సలహాదారులు చెప్పిన అంశాల సారం.అధికారికంగా ధృవీకరించనప్పటికీ తెరవెనుక అమెరికా ప్రతినిధులు ఇరాన్‌తో సంబంధాల్లో ఉన్నారు. మరోవైపు హార్ముజ్ జలసంధిపై అదుపు తమదేనని, రాకపోకలు సాగించే నౌకలు పన్ను చెల్లించాలని కోరుతున్న ఇరాన్ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నది. ఒప్పందం చేసుకొనేందుకు ఇరాన్ సిద్దంగా ఉందని తాను అనుకోవటం లేదని అయితే తాను వింటానని వైట్ హౌస్ విలేకర్ల విందులో ట్రంప్ వ్యాఖ్యానించాడు.అణు, క్షిపణుల నియంత్రణ మీద కేంద్రీకరించాలని ఇజ్రాయెల్ వత్తిడి చేస్తుండగా తమకు హార్ముజ్ జలసంధిని తెరిపించటమే ముఖ్యమని అమెరికా చెబుతోంది.మరోవైపున బ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర్నహన్ అమెరికాతో ఉన్నత స్థాయి చర్చలు జరిపి జలసంధిలో నౌకల రక్షణకు సంబంధించి ఒక కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. ఇరాన్‌పై దాడులు చేసేందుకు తమ వైమానిక స్థావరాన్ని వినియోగించుకొనేందుకు ఇప్పటివరకు అమెరికాకు బ్రిటన్ అనుమతి ఇవ్వలేదు.


గత నాలుగు దశాబ్దాలుగా ఇరాన్ను దెబ్బతీసి తమ అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా చేయని యత్నం లేదు.దానికి గల్ఫ్ దేశాలు, ఐరోపాలోని పెద్ద దేశాలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాయి. అమెరికా ప్రకటించిన ఆంక్షలను అవి అమలు చేశాయి.తమ మిలిటరీ శక్తి, ఆంక్షలు, ఒంటరిపాటుతో టెహరాన్‌పై పట్టు సాధించాలన్న అమెరికా పథకం పారలేదు.ఇటీవలి దాడులతో దాని బలహీనతలు ఏమిటో ప్రపంచానికి వెల్లడయ్యాయి.అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులతో తమ పౌరులు, ఆస్తులు కూడా ప్రభావితం అవుతున్నప్పటికీ ఏ ఒక్క గల్ఫ్ దేశమÖ యుద్దంలోకి దిగలేదు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా సాగించిన అన్ని దుర్మార్గ చర్యలకూ మద్దతు లేదా స్వయంగా భాగస్వాములైన ఐరోపా, ఇతర మిత్రదేశాలు కూడా తాజా పరిణామాల్లో అమెరికాకు బాసటగా నిలిచేందుకు నిరాకరించటం ఒక పెద్ద పరిణామం.రానున్న రోజుల్లో ఇది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే !

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!

Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


“ వీరు సోషల్ డెమోక్రాట్లు (సామాజిక ప్రజాస్వామిక వాదులు) కాదు, కరుడు గట్టిన దేవుడులేని కమÖ్యనిస్టులు, వారు అన్ని మతాల మీద దాడులు చేస్తారు, ప్రత్యేకించి క్రైస్తవం మీద, వారెప్పుడూ అదే చేస్తారు,అదొక పిచ్చి వంటిది, ఈ దేశంలో మీ చర్చీలన్నింటినీ మÖసివేస్తారు. మీ వారిని చంపివేస్తారు, ఏదనుకుంటే అది చేస్తారు. వారు మతాన్ని అంతం చేయాలనుకుంటున్నారు.మీకు బలమైన మతం ఉంటే వారి సిద్దాంతం పనిచేయదు గనుక వారు మతాన్ని అంతం చేయాలనుకుంటారు.రెండువందల యాభై సంవత్సరాల క్రితం మన దేశ స్థాపన జరిగిన తరువాత నా అభిప్రాయం ప్రకారం మనదేశానికి వచ్చిన ముప్పు ఇది.” ఈ మాటలు మాట్లాడింది అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్‌ట్రంప్ అనే ఒక కమÖ్యనిస్టు వ్యతిరేక ఉన్మాది. గతవారంలో దేశ ప్రజల నుద్దేశించి ఇరవై నిమిషాలపాటు టీవీలో చేసిన ప్రసంగంలో ఇలాంటి పాటు అనేక చెత్త మాటలు అతని నోటి నుంచి వచ్చాయి. ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కమÖ్యనిస్టులు గతంలో జోక్యం చేసుకున్నారని ఇప్పుడు మధ్యంతర ఎన్నికల్లో అదే పని చేస్తున్నారని ఆరోపించాడు. ఐతే ఐదు రోజుల తరువాత మంగళవారం నాడు మాట మార్చాడు. చైనా జోక్యం ఎంతో కాలం క్రితం జరిగింది, అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. అయినా చైనా వారు ఏది చేస్తే మేమÖ అదే చేస్తున్నాం, ఇదేదో ఏకపక్షంగా జరుగుతున్నది కాదు అని ట్రంప్ అన్నాడు. ఆధారాలు లేని తీవ్ర ఆరోపణలు చేసినందున చైనా నుంచి వచ్చే ప్రతిస్పందనకు భయపడి ఈ పెద్దమనిషి వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. నోటికి ఏది వస్తే అది వాగటం తరువాత మరోవిధంగా మాట్లాడటంలో ప్రపంచ నేతల్లో ట్రంప్‌కు మరొకరు సాటి రారని ఇప్పటికే నిరూపించుకున్నాడు. నవంబరు మÖడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో జనం ఏ తీర్పు ఇస్తారో తెలియదుగానీ, అధికార రిపబ్లిన్లకు ఎదురుదెబ్బ తగిలి ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోతే దానికి కారణం చైనీయులే అని చెప్పేందుకు ముందుగానే ఒక సాకు సిద్దం చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ ఎప్పటికైనా చైనాలో విలీనం కావాల్సిందే. అక్కడ ప్రత్యేక దేశమా, విలీనానికి అనుకూలమా అనే ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయి. ఒకే భాష, ఒకే జాతి అయిన అక్కడే అలాంటి పని చేయని చైనా ఎక్కడో సుదూరంగా ఉండి, తమ భాష అర్ధంగానీ అమెరికాలో డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏ భాషలో ప్రచారం చేస్తుంది ? అయినా చైనా చెప్పగానే అమెరికన్లు మారేట్లయితే ఏకంగా కమÖ్యనిస్టులనే ఎన్నుకోవాలని ప్రచారం చేయవచ్చు కదా ! చరిత్రలో మతోన్మాదులు తమ వ్యతిరేక మత కేంద్రాల మీద దాడులు చేశారు, కూలగొట్టిన చరిత్రను మÖటగట్టుకున్నారు.మన కళ్ల ముందే బాబరీ మసీదును కూల్చి అక్కడే రామాలయాన్ని నిర్మించారు. కమÖ్యనిస్టులు వస్తే ప్రార్ధనా మందిరాలను కూల్చివేస్తారన్నది తప్పుడు ప్రచారం. రష్యా, చైనా, తూర్పు ఐరోపా దేశాలలో ఒక్క చర్చీని కూడా కూల్చివేయలేదు. గతంలో, వర్తమానంలో చైనా అలాంటి జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. భవిష్యత్‌లో జరిగేందుకు ఆస్కారమÖ లేదు. అయినప్పటికీ ట్రంప్ అలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు !


అమెరికా ఎన్నికల్లో కమÖ్యనిస్టులు లేదా ఇతర పురోగామివాదులు ఒక పార్టీగా అక్కడ పాతుకుపోయిన రెండు ప్రధాన పార్టీలను దెబ్బకొట్టగలిగిన స్థితిలో లేరు అన్నది ఒక వాస్తవం.రెండవది, గత కొన్ని దశాబ్దాలుగా కమÖ్యనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టి జనాల బుర్రలను ఖరాబు చేసిన సంగతి కూడా తెలిసిందే. గతంతో పోలిస్తే కొంత మార్పు వచ్చిన్పటికీ అది చాలదు.మన దేశ స్వాతంత్య్ర ఉద్యమ దశ, దిశను మార్చేందుకు పురోగామి వాదులు అనేక మంది కాంగ్రెస్ సోషలిస్టులుగా ప్రత్యేకతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌లో అంతర్బాగంగానే పని చేసిన చరిత్ర తెలిసిందే.అమెరికాలో కూడా అదే జరుగుతున్నట్లు చెప్పవచ్చు. అయితే అక్కడి డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీలో ఉన్నవారందరూ సోషలిజానికి, కమÖ్యనిజానికి అనుకూలురని చెప్పలేము. ఆ భావజాలానికి కట్టుబడి పని చేయాలని కోరుకొనే వారు కూడా గణనీయంగా ఉన్నారు. చివరి వరకు ఎంత మంది నిఖరంగా నిలుస్తారు, నిలవరు అనేది చరిత్ర చెప్పాల్సిందే.సోషలిస్టు భావాలను కలిగిన రెండు సంస్థలు, కొందరు వ్యక్తులు 1982లో డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీగా(డిఎస్‌పి) ఏర్పడి డెమోక్రటిక్ పార్టీలోనే పని చేయటం ప్రారంభించారు.నాడు కొన్ని వందల మంది మాత్రమే సభ్యులుగా ఉండగా నేడు లక్షా పదివేల మంది వరకు ఉన్నట్లు అంచనా. సోషలిస్టులమని చెప్పుకొనేందుకే భయపడిన రోజుల నుంచి నేడు లక్షలాది మంది తామÖ అదే ఇస్టులమని గర్వంగా చెప్పుకొనేంతంగా ఆ ఉద్యమం ఎదిగింది. బెర్నీ శాండర్స్ సెనెటర్‌గా ఎన్నికతో ప్రారంభమైన ఆ పురోగమనం 2028ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల కోసం, మరో రెండు చోట్ల గట్టి పోటీ ఇచ్చేందుకు, అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున తమ భావజాలం ఉన్న వ్యక్తిని నిలిపేందుకు అడుగులు వేయటమే ట్రంప్ ఆందోళనకు అసలు కారణంగా చెప్పవచ్చు. అమెరికా కార్పొరేట్ల రాజధాని న్యూయార్క్ పీఠంపై ఇప్పటికే ట్రంప్ దృష్టిలో కమÖ్యనిస్టుగా ముద్రపడిన డిఎస్‌పి నేత జోహ్రాన్ మందానీ మేయర్‌గా ఉండగా, రాజకీయ అధికార కేంద్రం ఉన్న వాషింగ్టన్ డిసిలో అదే భావజాలం కలిగిన మహిళ మేయర్ కాబోతున్నారనే వార్తలు వచ్చాయి. న్యూయార్క్ నగరంలో మÖడు ఎంపీ స్థానాలుండగా వాటికి డెమోక్రాట్లలో డిఎస్‌పి అభ్యర్ధులే ముందువరుసలో ఉన్నారు. రాజకీయ సర్వే జరపాలని, సెప్టెంబరు 15 నాటికి నివేదిక సమర్పించాలని డిఎస్‌పి తన 250శాఖలకు పత్రాలను పంపింది. ఇదంతా అధ్యక్ష ఎన్నికలకు సన్నాహమే. ఆ పార్టీ సెనెటర్ బెర్నీ శాండర్స్ వయస్సు 84 సంవత్సరాలు కావటంతో వేరే వారిని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. కార్మిక నాయకురాలు, ప్రజాప్రతినిధుల సభ సభ్యురాలిగా ఉన్న అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం పోటీపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున తానే పోటీ చేయాలని డోనాల్డ్ ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.


జూలై 16న టీవీ ప్రసంగం తీరు చూసిన తరువాత తన పదవికోసం ట్రంప్ ఎంతకైనా తెగిస్తాడని అనేక మంది భావిస్తున్నారు.నవంబరు మÖడు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను బెదిరించేందుకు మిలిటరీని దించటంతో పాటు(ఇప్పటికే చికాగో, లాస్ ఏంజల్స్, వాషింగ్టన్ డిసి, తదితర నగరాల్లో ఉన్నాయి), ఓట్ల పెట్టెలను అపహరించటంతో సహా ఏ అక్రమానికైనా పాల్పడవచ్చని చెబుతున్నారు.రిపబ్లికన్లు ఓడిపోతే ఫలితాలను తిరస్కరించే అవకాశం కూడా ఉంది.2020 అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోతున్నట్లు గ్రహించి బ్యాలట్ బాక్సులను తారుమారు చేయాలని చూస్తే అతగాడి అధికార యంత్రాంగంలోని వారే అడ్డుపడటంతో వెనక్కు తగ్గాడు. తరువాత జోబైడెన్ ఎన్నికను గుర్తించకుండా తన అనుచరులతో అమెరికా అధ్యక్ష కేంద్రం మీద దాడి చేయించిన సంగతి తెలిసిందే.తన ప్రసంగంలో రహస్య పత్రాలంటూ కొన్నింటిని పేర్కొంటూ రష్యా, చైనా,ఇరాన్, ఉత్తర కొరియా దేశాల నుంచి, కొన్ని సంస్థలు ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు చూస్తున్నాయని ట్రంప్ ఆరోపించాడు.అయితే ఎలా అన్నది మాత్రం చెప్పలేదు.తెలుగునాట ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ల పట్ల వ్యవహరించిన తీరును చూశాము.ప్రజాస్వామ్యానికి, భావప్రకటనా స్వేచ్చకు నిలయమని ఊదరగొట్టే అమెరికాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఎవరి అజెండా వారికి వుంది.తనకు వ్యతిరేకంగా ఎబిసి మరియు ఎన్‌బిసి మీడియా సంస్థలు కుట్రలో భాగస్వాములని,తన ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయటం లేదని ట్రంప్ ఆరోపించాడు.వాటి లైసన్సు రద్దు చేస్తామని బెదిరించాడు. మధ్యంతర ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ ఇరాన్ను ఒక అంశంగా ఎంచుకున్నాడు. సోవియట్‌తో జరిగిన ప్రచ్చన్న యుద్దంలో అణుబూచిని చూపి ఓటర్లను ఆకట్టుకోవటం నాటి అజెండాలలో ఒకటి. టెహరాన్ విషయంలో అది తిరగబడింది.దాని బదుదలు అనూహ్యంగా హార్ముజ్ జలసంధిపై అదుపు ప్రతిష్టాత్మకంగా మార్చుకొని ఇరుక్కు పోయాడు.రెండవది పాతబడిన రోత ప్రచారం కమÖ్యనిస్టు వ్యతిరేకత, సోవియట్ లేదు గనుక దాని స్థానంలో చైనా కుట్ర అంటూ రెచ్చగొట్టటం.చిత్రం ఏమిటంటే అమెరికాలో కమÖ్యనిస్టు పార్టీ ఉన్నప్పటికీ అది అక్కడి పాలకపార్టీలను సవాలు చేసే స్థితిలో లేదు. అందుకే డెమోక్రటిక్ సోషలిస్టులను కమÖ్యనిస్టులుగా చిత్రించి ట్రంప్ దాడి చేస్తున్నాడు.అయితే వారంతా తమ కళ్ల ముందు కనిపించేవారు గనుక వారి నుంచి ముప్పు ఎలా వస్తుందో నమ్మించలేకపోతున్నాడు. నిజానికి సాధారణ అమెరికన్లకు ముప్పుగా మారింది “ దేవుడు లేని కమÖ్యనిస్టులు ” కాదు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ దళం(ఐసివి). వారిని చూస్తే జనాలు వణికిపోతారు.ఎవరిని అరెస్టు చేస్తారో, ఎవరిని చంపుతారో తెలియదు. హిట్లర్ నాటి రహస్య హంతక దళాలను అవి గుర్తుకు తెస్తాయి.రెండవసారి ట్రంప్ అధికారానికి వచ్చిన తరువాత ఐసిఇ లేదా సరిహద్దు నిఘా దళానికి చెందిన వారు బూటకపు ఎన్‌కౌంటర్లు చేసి పదకొండు మందిని చంపారు.వీరుగాక వలస వచ్చిన వారిని బంధించిన శిబిరాల్లో మరో 21మంది మరణించారు.


అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్లు చేసిన ఆరోపణలను చైనా గట్టిగా తిరస్కరించింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల చేతిలో ఓటమిని ఎదుర్కోలేక గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు తిప్పి కొట్టింది.ఇరవై రెండు కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా సంపాదించిందని, గతంలో అధికారానికి వచ్చినప్పటి నుంచీ అమెరికా మీడియాలో తనకు వ్యతిరేకంగా రాసేందుకు జర్నలిస్టులకు డబ్బు ఇస్తున్నదని, వాణిజ్యవేత్తలను తనకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నదని ట్రంప్ తాజా ప్రసంగంలో ఆరోపించాడు.చైనా వాణిజ్యాన్ని సవాలు చేసిన తొలి అధ్యక్షుడిగా తాను ఉన్నందుకు గాను 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా చైనా జోక్యం చేసుకున్నదని అదే ఏడాది భద్రతా మండలికి ట్రంప్ ఫిర్యాదు చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న చైనా ప్రతినిధి రుజువులు చూపాలంటూ సవాలు చేశాడు, ఎలాంటి ఆధారాలను అమెరికా చూపలేకపోయింది. మే నెలలో బీజింగ్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ ఆహ్వానం మేరకు సెప్టెంబరులో చైనా నేత షీ జింపింగ్ అమెరికా పర్యటనకు వస్తారని చెబుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు ట్రంప్ నోటి నుంచి వెలువడటం అతగాడి సంస్కారాన్ని వెల్లడిస్తున్నది.


వామపక్షవాదాన్ని, దాన్ని అనుసరించేవారిని అణచివేసేందుకు అమెరికా పాలకులు ఎన్ని పద్దతులను అనుసరించారో దానికి ప్రతిగా వామపక్ష వాదులు కూడా పద్దతులను మార్చుకొని తమ భావజాలాన్ని విస్తరింప చేస్తున్నారు.దాన్ని అడ్డుకోవటం సాధ్యం కావటం లేదు. దేనికైనా పరిస్థితులు అనుకూలించాలి. సైద్దాంతిక విబేధాలు, భిన్నమైన భాష్యాలు చెప్పి ఉండవచ్చు తప్ప కమÖ్యనిజం విఫలమైందని గతంలో ఏ కమÖ్యనిస్టూ పార్టీ కూడా చెప్పలేదు. ఆ ఉద్యమం నుంచి దూరమైనవారు చెప్పేదాన్ని పట్టించుకోవనవసరం లేదు. దానికి భిన్నంగా పెట్టుబడిదారీ విధానం విఫలమైందని ఆ విధానాన్ని సమర్ధించేవారే చెప్పటం ఇటీవలి కాలంలో వచ్చిన మార్పు. ఇది మరోచర్చకు నాంది పలికింది. అనేక మంది కారల్ మార్క్స్`ఫ్రెడరిక్ ఎంగెల్స్ చేసిన కమÖ్యనిస్టు రచనలు, భాష్యాల గురించి అధ్యయనం చేసేందుకు పూనుకున్నారు. అమెరికాలో గతం మాదిరి కరడు గట్టిన సోషలిస్టు వ్యతిరేక భావనలు ఇప్పుడు లేవు. సోషలిజం, కమÖ్యనిజాలను సానుకూలంగా చూసే ఏ వాదమైనా వామపక్షభావజాలమే అవుతుంది.దాన్నే కమÖ్యనిజం అని ట్రంప్ వంటి వారు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. పుంఖాను పుంఖాలుగా రచనలు చేస్తూ భావజాల దాడులు చేస్తున్నారు.ఇటీవల ఒక అమెరికా పత్రిక “ సోషలిస్టులను చూసి భయపడవద్దు.వారిని తయారు చేసే పరిస్థితులను చూసి భయపడాలి ” అంటూ ఒక విశ్లేషణకు శీర్షిక పెట్టింది.చరిత్ర చెప్పిన సారం, కమÖ్యనిస్టులు చెప్పేది కూడా అదే.కమÖ్యనిస్టు వ్యతిరేకులు రకరకాల ముసుగులు వేసుకువస్తున్నారు.అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి ఆంధ్రా అల్లుడు, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ రెండు సంవత్సరాల క్రితం ఒక వ్యాఖ్య చేశాడు.“ గతంలో కమÖ్యనిస్టులు వీధుల్లో ఎర్రజెండాలు పట్టుకొని ప్రదర్శనలు చేశారు.ఈ రోజు వారు హెచ్ ఆర్, కళాశాలల ప్రాంగణాలలో ప్రదర్శనలు చేస్తున్నారు, మంచివారు, నిజాయితీపరులకు వ్యతిరేకంగా కోర్టు హాళ్లలో న్యాయపోరాటం చేస్తున్నారు.” అన్నాడు.తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము కాదు, కమÖ్యనిస్టులు కూడా నూతన పద్దతులను నేర్చుకోవాల్సిన పరిస్థితులను దోపిడీ వర్గమే కల్పించింది !

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోంది గనుక నిరోధించేందుకు తాము దాడులకు దిగినట్లు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చినెల ప్రారంభంలో ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశాడు. అంతకు ముందు 2025లో కూడా దాడులు చేసి అణు స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరోసారి ఎనిమిది నెలలకే దాడులకు దిగాడు. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఇరాన్‌పై దాడులతో ట్రంప్ రేపిన చిచ్చును ఆరనివ్వకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు.జూలై 11న మరోసారి ప్రారంభమైన దాడులుప్రతిదాడులు గురువారం నాడు కూడా కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు. బుధవారం నాడు పరిస్థితిని సమీక్షించిన ట్రంప్, మంత్రులు, ఉన్నతాధికారులు దాడులను మరింత పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించారు. మిత్రదేశాల వినతి మేరకు హార్ముజ్ జలసంధిలో రాకపోకలు జరిపే నౌకల్లోని వస్తువుల విలువలో 20శాతం పన్ను వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ట్రంప్ చెప్పాడని వార్తలు వచ్చాయి.అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి కుట్రలకు వ్యతిరేకంగా 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఇంకా ముగియలేదు. ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చి పశ్చిమదేశాలు ఇంకా ఎగదోస్తూనే ఉన్నాయి.గత శతాబ్దిలో ఎనిమిది సంవత్సరాల పాటు ఇరాన్ఇరాక్ యుద్దం జరిగింది.అమెరికా తీరుతెన్నులు చూస్తుంటే ప్రస్తుత సంక్షోభం కూడా వాటి సరసన చేరుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కనీసంగా అమెరికా పార్లమెంటుకు నవంబరు మÖడవ తేదీన జరిగే ఎన్నికలు ముగిసేవరకైనా రిపబ్లికన్ పార్టీ ఓట్ల కోసం ట్రంప్, అక్టోబరు నెలలో ఇజ్రాయెల్‌లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీని గెలిపించేందుకు నెతన్యాహు లెబనాన్ మీద దాడులను కొనసాగించే వైఖరి కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతల దుర్మార్గాలకు ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు పడుతూ లేస్తూ మనవంటి దేశాలలో సామాన్యులను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. ఎప్పుడు స్టాక్‌మార్కెట్ కుప్పకూలుతుందో ఎందరు ఎంత సొమ్ము పోగొట్టుకుంటారో తెలియని అయోమయం నెలకొన్నది. సంక్షోభాలు, యుద్దాలు కొనసాగితే అమెరికా కార్పొరేట్లకు కాసుల పంట పండుతుంది. అందుకే అవి నిత్యం ఎక్కడో ఒక చోట చిచ్చు పెట్టేందుకు చూస్తుంటాయి.

అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకా ప్రయాణానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇరాన్‌కు అప్పగించారు. జూన్ 17న కుదిరిన ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు వాణిజ్య నౌకల రవాణా మీద ఎలాంటి సుంకాలు విధించకూడదు.దాన్లో భాగంగా ఏ నౌక అయినా తమకు వివరాలు తెలిపి, తాము సూచించిన మార్గంలో ప్రయాణించాలని ఇరాన్ ప్రకటించింది. అయితే కొన్ని నౌకలు దీనికి భిన్నంగా ఎటువైపు వెళ్లేదీ తెలియనివ్వకుండా సంకేతాలను పంపే వ్యవస్థలను కట్టివేసి ప్రయాణిస్తుండటంతో అలాంటి నౌకలు హెచ్చరికలను ఖాతరు చేయకపోవటంతో ఇప్పటికి మÖడు సార్లు కొన్ని నౌకల మీద ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. వాటిని సాకుగా చూపి అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దానికి ప్రతిగా గల్ఫ్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ కూడా ధీటుగా ప్రతిదాడులు చేస్తున్నది. ఈ క్రమంలో ఇరాన్‌తో ఇంక చర్చలేవీ లేవన్న ట్రంప్ వెంటనే మాట మార్చి సాంకేతిక అంశాలపై ఉంటాయని చెప్పాడు, పాకిస్తాన్, కతార్, ఈజిప్టు రంగంలోకి దిగి మరోసారి చర్చల కోసం రావాలని ఇరు పక్షాలనూ కోరుతున్నాయి. అదేమీ తేలకుండానే అమెరికా రెచ్చగొట్టుడు కారణంగా హార్ముజ్ జలసంధిని మరోసారి మÖసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.తాము కూడా దిగ్బంధనాన్ని తిరిగి కానసాగించి ఇరాన్‌కు నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించాడు. అంతే కాదు హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల మీద వాటిలోని సరకు విలువలో 20శాతం పన్ను విధిస్తానని ప్రకటించాడు. అంతకు ఇరాన్ పన్ను వసూలు చేస్తానని చెబితే వ్యతిరేకించిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆపని చేస్తానని చెప్పాడు. దాన్ని అమలు చేస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడి వెనక్కు తగ్గాడు తప్ప మరొకటి కాదు. న్పుింగా అమలు జరిగితే పరిస్థితి ఏమిటి ?ఉదాహరణకు ముడి చమురు ధర పీపా సగటున 80 డాలర్లకు కొనుగోలు చేశారనుకుందాం. ఒక టాంకరులో పట్టే చమురు విలువ 16 కోట్ల డాలర్లు. దీనిలో ఇరవై శాతం పన్ను అంటే 3.2 కోట్ల డాలర్లు చెల్లించాలి. అదే అంతకు ముందు ఇరాన్ చెప్పినదాని ప్రకారం పన్ను మొత్తం 20లక్షల డాలర్లు మాత్రమే.హార్ముజ్ జలసంధి అమెరికా చేతుల్లోకి పోతే మనం దిగుమతి చేసుకొనే చమురుకు 20శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఎంత ఖర్చు పెరిగినా జనం మీద మోపేదే గనుక మన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులెవరూ ట్రంప్ ప్రకటన మీద నోరెత్తలేదు.

తమ దుష్ట చర్యలను సమర్ధించుకొనేందుకు అమెరికాఇజ్రాయెల్ కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయి.వాటిలో తాజాగా చెప్పిందేమిటంటే డోనాల్డ్ ట్రంప్‌ను అంతం చేసేందుకు ఇరాన్ కుట్ర చేసింది.తనను చంపేందుకు చూస్తున్నట్లు అంకారాలో జరిగిన నాటో సమావేశాల్లో డోనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పాడు.ఆ కుట్రను ఇజ్రాయెల్ నిఘావర్గాలు కనిపెట్టి ట్రంప్‌కు తెలియచేశాయట, మరి అమెరికా సిఐఏ ఏం చేస్తున్నట్లు ? జనం చేత ఇలాంటి పిట్టకతలను నమ్మించటం కూడా సులభమే, ఎందుకంటే తమ సుప్రీమ్ నేత, ఇతర ఉన్నత సైనికాధికారులను అకారణంగా చంపి, దాడులు చేస్తున్న తరువాత ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా ! బదులు తీర్చుకుంటామని నేతలు ప్రకటించిన నేపధ్యంలో అలాంటిదేదో జరిగి ఉంటుంది లెమ్మని సామాన్యులు అనుకోవటం సహజం. ఇరాన్ మీద అమెరికా దాడులు,దాని అధినేతలను లేపేస్తామని పదే పదే చెప్పటం, ఆంక్షలతో ఆర్థికంగా ఇబ్బుందులు పెట్టటం ఈ రోజు కొత్తగా ప్రారంభించినవి కాదు, 1979 నుంచి కొనసాగుతున్నాయి. అందువలన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు గనుక, జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలు తీసేందుకు ఇరాన్ ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘావర్గాలు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా ఇంతవరకు ఇరాన్ అలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.


రోజువారీ దాడులు, ప్రతిదాడులు ఎదుటి పక్షాన్ని ఏ విధంగా దెబ్బతీసిందీ ఆయా దేశాలు చేస్తున్న ప్రకటనల వార్తలు తెలిసిందే. ఇరాన్ అణు, మిలిటరీ సామర్ధ్యాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు ట్రంప్ ఇప్పటి వరకు నలభై నుంచి యాభైసార్ల వరకు చెప్పి ఉంటాడు. అయినా అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడులు ఎలా చేయగలుకుతున్నదన్న అంశం అనేక మందికి అంతుబట్టటం లేదు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు పుట్టుకు వస్తాడన్న లోకోక్తి తెలిసిందే. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు.మానవుడి పరిణామ క్రమంలో అవసరాలే అనేక నూతన ఆవిష్కరణలకు దోహదం చేశాయి. ఇది ఇరాన్‌కూ వర్తిస్తుంది. వియత్నాంపై రెండున్నర దశాబ్దాల పాటు జపాన్, ఫ్రాన్సు, అమెరికా సామ్రాజ్యవాదులు భీకరదాడులు చేశారు. వారి మిలిటరీ, ఆయుధ సామర్థ్యాన్ని గెరిల్లా పోరాటపద్దతులను అనుసరించి కమÖ్యనిస్టులు ఎదిరించి నిలవటమే కాదు, 1975లో అమెరికన్లు దొరికిన విమానాలు, హెలికాప్టర్లను పట్టుకొని పారిపోయేట్లు చేశారు.ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల చేతిలోనూ అమెరికాకు అదే పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇరాన్‌లో కూడా అమెరికాకు అదే జరుగుతోంది. అడవులు, కొండలు గుట్టల్లో గెరిల్లా పద్దతివేరు. సముద్రంలో కూడా ఇరాన్ ఆ విధానాన్ని అనుసరిస్తున్నది. ఆత్మరక్షణ`ప్రతిఘటన దాడి పద్దతులను అభివృద్ది చేసుకొన్నది.దీనికి ఇతర దేశాల అనుభవాలు నేర్పిన పాఠాలతో పాటు చైనా, రష్యా అందచేస్తున్న సహకారం కూడా తోడు కావటం, ఈ పరిణామాలను అమెరికా, ఇజ్రాయెల్ పసికట్టలేకపోవటం కనిపిస్తున్నది. గూఢచర్యంలో ఈ రెండు దేశాల తరువాతే మిగతావి అన్నట్లు అనేక మంది కీర్తించటం తెలిసిందే. అలాంటి తోపులనే ఇరాన్ తప్పుదారి పట్టించి తనను తాను కాపాడుకుంటున్నది, ప్రతిదాడులు చేయగలుకుతున్నది.తన డ్రోన్లు, క్షిపణులు ఎక్కడ ఉన్నదీ తెలియకుండా కాపాడుకోవటమే కాదు, ప్రయోగ కేంద్రాలను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ శత్రుల నిఘాను ఏమారుస్తున్నది.


ఇరాన్ నౌకా దళాన్ని రెండవ ప్రపంచ యుద్దానికి ముందు ఒకసారి నాశనం చేశారు, తరువాత మరోసారి విధ్వంసం కావించారు.తాజాగా మÖడవసారి అమెరికా మరికొంత నష్టం కలిగించింది. అయినా స్వల్ప ఖర్చుతో చిన్న పడవలతో హార్ముజ్ జలసంధిలో అమెరికాను ముప్పుతిప్పలు పెట్టటంలో ఇప్పటి వరకు ఇరాన్ జయప్రదమైంది. ఇరాక్‌తో ఎనిమిది సంవత్సరాలు జరిగిన యుద్ద సమయంలో చమురు టాంకర్లపై జరిగిన దాడులు ఒక పాఠాన్ని నేర్పాయి. శ్రీలంక మిలిటరీపై ఎల్‌టిటి తీవ్రవాదులు పడవలతో సాగించిన పోరు నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు రష్యా దాడులను ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్, పీపుల్స్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మారిటైమ్ మిలీషియా పేరుతో ఒక దళాన్ని ,చైనా నిర్వహిస్తున్నది.ఈ దళ సభ్యులు దక్షిణ చైనా సముద్రంలో రోజువారీ చేపలు పట్టేవారిగా, శత్రుదేశాల ఓడల కదలికల మీద నిఘావేసేవారిగా, అవసరమైతే చిన్న చిన్నదాడులు చేసేందుకు చైనా మిలిటరీ సహకారంతో నడిపిస్తున్న చిన్న చిన్న పడవల అనుభవమÖ ఇరాన్‌కు పనికి వచ్చింది. ఈ దళంలోని పడవలు చైనా తనవిగా చెబుతున్న సముద్ర జలాల్లో ప్రవేశించి చేపలు పడుతూ చైనా సార్వభౌమత్వాన్ని పదే పదే ఇతర దేశాలకు గుర్తు చేస్తుంటాయి,విదేశీ నౌకలకు చికాకులు కలిగిస్తుంటాయి. చైనా నౌకాదళం, తీరరక్షణ దళంతో పాటు దీన్ని చైనా మÖడవ సముద్ర శక్తిగా ఇతర దేశాలు వర్ణిస్తాయి.
1979లో తమ తొత్తు షాను గద్దె దించి అధికారానికి వచ్చిన ఇస్లామిక్ శక్తులను దెబ్బతీసేందుకు 1980లో ఇరాక్‌ను రెచ్చగొట్టిన అమెరికన్లు ఇరాన్ మీద దాడులు చేయించారు. అవి 1988 వరకు కొనసాగాయి. ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బతీయటం ఆ పోరు లక్ష్యాలలో ఒకటి. దానిలో భాగంగా టాంకర్ల మీద దాడులు,ప్రతిదాడులు జరగటంతో టాంకర్ల పోరుగా దాన్ని పిలిచారు. నాలుగు వందల చమురు టాంకర్ల మీద దాడులు జరగ్గా కొందరు సాధారణ పౌరులతో సహా రెండు వందల మందికి పైగా నావికులు మరణించారు. అప్పుడు కూడా హార్ముజ్ జలసంధిని దిగ్భంధనం చేసేట్లు ఇరాన్ను రెచ్చగొట్టినా ఆ నాడున్న పరిస్థితిలో అది జరగలేదు.ఇలా ఎన్నింటినో అధ్యయనం చేసిన ఇరాన్ హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారైంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డులకు ఒక అధినాయకత్వం ఉన్నప్పటికీ ప్రాంతీయ విభాగాలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసి శత్రువులను దెబ్బతీసేందుకు ఏ పద్దతి వీలైతే దాన్ని అమలు చేస్తే స్వేచ్చ ఇచ్చారు.శత్రువును దెబ్బతీయటమే అంతిమ లక్ష్యం. ప్రపంచ రవాణాలో పర్షియన్ గల్ఫ్ లేదా హార్ముజ్ జలసంధితో పాటు సూయజ్ కాలువ ద్వారా తూర్పు మధ్యధరా సముద్రంతో హిందూమహాసముద్రాన్ని కలిపే ఎర్ర సముద్రం కీలక పాత్ర పోషిస్తున్నది.హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం కావించేందుకు గతంలో ఇరాక్ ఎంతగానో రెచ్చగొట్టింది.అలా జరిగితే పశ్చిమ దేశాలన్నింటినీ రంగంలోకి దించాలన్నది అసలైన ఎత్తుగడ. అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు, మిత్రదేశాలు అమెరికా కోసం చేతులు కాల్పుకొనేందుకు సిద్దంగా లేవని ఉక్రెయిన్ నేర్పిన అనుభవం, అదే హార్ముజ్ విషయంలో పునరావృతం అవుతుందని వేసిన అంచనా ఇలా ఎన్నో పరిణామాల పూర్వరంగంలో ఇరాన్ ముందుకు వచ్చి జలసంధిని దిగ్బంధనం కావించింది, అది టెహరాన్ ముందు చూపుకు నిదర్శనమైతే వాస్తవాలను గ్రహించలేక అహంకారానికి లోను కావటానికి అమెరికా తార్కాణంగా నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం ముగియటం అనివార్యం, అయితే ఎలా అన్నది ఊహించలేము !

మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !

Tags

, , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

తన సొమ్మును తన భక్తులే కాజేస్తుంటే దేవుడు, దేవతలు, దేవదూతలు ఎందుకు నిరోధించటం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే.....అది కూడా దైవలీý తప్ప మరొకటి కాదు, ఏ లడ్డులో ఏ కల్తీ జరపాలో, దేవుడి పేరుతో ఎలా మోసం చేయాలో, ఏ సొమ్ము ఎలా కొల్లగొట్టాలో ముందేరాసి పెట్టి ఉంటుంది, దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి, ఇది ఈ నాటిదా ! నిజాయితీపరులు వారి పని వారు చేయాలి, దొంగలు దొంగతనాలు చేయాలి, బ్రహ్మరాతను ఎవరూ మార్చలేరు. గుడినీ గుడిలో లింగాన్ని మింగేవారు వస్తారని పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.పాపం చేసిన వారు ఫలితాన్ని అనుభవించకతప్పదు. ఇదీ కర్మసిద్దాంతాన్ని నమ్ముతున్న భక్తుల స్పందన. అందరి తలరాత రాసిన పెద్దమనిషి కొందరికి దొంగతనం చేయాలని రాసిపెట్టిన వివక్ష ఎందుకు అన్నది హేతువాదుల ప్రశ్న. గుర్రాన్ని తొట్టి దగ్గరకు తీసుకువెళ్లగలం తప్ప దానిలో నీరు తాగించగలమా ! రాముడి సొమ్ము కొట్టేసిన ఉదంతం అనేక మందితో మాట్లాడిస్తున్నప్పటికీ దేవుడి అంశగా జన్మించినట్లు చెప్పుకున్న కారణంగానే నరేంద్రమోడీ నోరు తెరిపించటంలో సాక్షాత్తూ ఆ రాముడే ఏం చేయలేక కళ్లప్పగించి “మౌనం ”గా ఉండిపోయాడు. దేవుళ్ల మధ్య కూడా శాఖల వారీ విభజన జరిగి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదేమో ! ఓట్ల కోసం రాముడు కావాల్సి వచ్చింది,ఎన్నికల ప్రచారం కోసం సాష్టాంగ ప్రమాణం చేస్తున్న ఫొటోల నిమిత్తం అయోధ్య రామాలయం అవసరమైంది.కానీ దానిలో జరిగిన కుంభకోణం గురించి స్పందించటానికి నోరు రావటం లేదు. ఇలాంటి వారిని ఏం చేయాలో రాముడే ఆలోచించుకోవాలి. అక్రమాలపై ఎందుకు దేవుళ్లు, దేవతలు స్పందించటం లేదన్నది తరతరాలుగా నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదులు వేస్తున్న సమాధానం లేని ప్రశ్న. దేవతల లీలలు, మహిమల గురించి కథకథలుగా చెప్పుకుంటాం.దరిద్రం ఏమంటే ఇప్పుడు వారికి వచ్చిన కానుకల చోరీ గురించి అయోధ్య దర్యాప్తులో వెలువడుతున్న కథలుకతలు ఎన్నో వెలువడుతున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే మతం, దేవుళ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే తమ మనోభావాలను గాయపరిచారంటూ వీధుల్లో వీరంగానికి దిగే బాపతు తిరుపతి లడ్డు కేసు, రామాలయ కానుకల చోరీ గురించి ఎక్కడా కనిపించరేం. ఇది కూడా బ్రహ్మరాసిన రాతల పర్యవసానమే అని చెప్పేవారు ఉండవచ్చు. వారు రెండు రకాలు. ఒకటి దొంగలను సమర్ధించే మోసగాళ్లు, రెండవ రకం అమాయకులు.


ఇంకా గూగులమ్మ తల్లికి ఏ మతం, కులాన్ని అంటగట్టలేదు.అఫ్ కోర్సు తమ కంపెనీ ప్రయోజనాలు, వాటిని పరిరక్షించే నేతలు, పార్టీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ తల్లికూడా అలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధిస్తున్నదని చెబుతున్నారు.అయినా తనకు ఇబ్బందిలేని వాటిని అందిస్తున్నది.ప్రార్ధనా స్థలాల్లో భక్తులు, విశ్వాసులు ఇచ్చే కానుకలను కొట్టి వేయటం అన్ని చోట్లా జరుగుతున్నదని ఎవరు అడిగినా చెబుతుంది, కావాలంటే తెలుసుకోవచ్చు. మందిరాలు, మసీదులు, చర్చ్‌లు ఏవీ ఇలాంటి అక్రమాలకు దూరంగా లేవు.పేరు భిన్నంగా ఉండవచ్చు తప్ప ప్రతి చోటా కానుకల స్వీకరణ, వాటి అపహరణ జరుగుతూనే ఉంది. కనిపించని సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత.అయోధ్య ఉదంతంతో ఇప్పుడు జనాలకు పాత దొంగతనాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ మతం, దేవుళ్లను రాజకీయ అవసరాలకోసం వినియోగించుకొనే సంఘపరివార్ సంస్థలన్నింటినీ జనం అనుమానంతో చూసేందుకు దోహదం చేస్తున్నాయి. భక్తులందరూ దొంగలు కాదు గానీ దొంగలందరూ భక్తులే కావటం గమనించాల్సిన అంశం.ప్రతి మత ప్రార్ధనా మందిరంలో జరుగుతున్నది ఇదే.ఎందుకంటే విశ్వాసులు కానివారిని నియమించరు కదా ! దేవాలయాలను ప్రభుత్వ అదుపు నుంచి తొలగించాలని కోరుతున్న వారికి ఇప్పుడు నోట్లో పచ్చివెలక్కాయపడింది.ట్రస్టుల పేరుతో వాటిని నడిపే తమవారి నిర్వాకాలు వెలుగులోకి రావటంతో మింగా కక్కలేకుండా ఉన్నారు. ఇప్పుడు సంఘపరివార్ పెద్దల ఆందోళన దేవుడి సొమ్ము, నగలను కొట్టేయటం కాదు,కోట్లాది మంది భక్తుల్లో బిజెపి, విశ్వహిందూపరిషత్ వంటి తమ సంస్థల పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకాలు సడలిపోతే తమ హిందూత్వ అజెండాకే ముప్పు అన్నదే అసలు భయం. కొందరిని కొంతకాలం మోసం చేయగలం, అందరినీ ఎల్లాకాలం మభ్యపెట్టలేము కదా !


కానుకల చోరీ పూర్వరంగంలో అయోధ్య రామాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోరాదని విశ్వహిందూపరిషత్ చెబుతోంది. ఎందుకంటే అది తమ చేతుల్లోంచి పోతుందనే భయం. మా హిందూ దేవాలయం, కానుకలు ఇచ్చిందీ, దొంగతనం చేసిందీ మా హిందువులే కదా, మేం మేం చూసుకుంటాం అన్నట్లుగా దాని వైఖరి ఉంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రామాలయ ట్రస్టును తీసుకురాకూడదని చెబుతున్నారు.దీని అర్ధం ఏమిటి ? భవిష్యత్‌లో కూడా ఏం జరిగినా ఎవరూ ప్రశ్నించకూడదు, ఎంత పారదర్శకత ! తప్పనిసరై రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా చేయగా ఆహ్వానితుడు ఉడిపి ీVAటల్స్ గోపాలరావును ఆ జాబితా నుంచి తొలగించారు.వీరు ముగ్గరూ సంఘపరివార్ గుంపులోని వారే. నరేంద్రమోడీ ప్రవచించిన జవాబుదారీతనం,నేను తినను ఇతరులను తిననివ్వను అన్న చౌకీదార్ సంగతేమిటి ? యావత్ దేశాన్నీ కదలించిన ఈ ఉదంతం అసలు పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. సాగినంత కాలం సాగుతుంది తప్పదు. రామాలయంలో జరిగింది కుంభకోణం కాదు, చిన్న చోరీ మాత్రమే, అలాంటివి ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి గనుక పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.గోడీ మీడియా తప్పనిసరై ఈ కేసు గురించి వార్తలను ఇవ్వకతప్పటం లేదు. గతంలో ఆరోపణలు వచ్చినపుడు వాటన్నింటినీ మÖసిపెట్టింది, ఇప్పుడు సాధ్యం కావటం లేదు. నిజమే ప్రతి చిన్న చోరీ విచారణకు పోలీసులు కేసులు పెడతారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయవు కదా ! అయోధ్యలో జరిగింది చిన్న దొంగతనమే అయితే యోగి సర్కార్ సిట్‌ను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? అనేక మంది సంఘపరివార్ ప్రముఖులు తీవ్ర ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు ? చిన్న చోరీ అయితే అయోధ్య బార్ అసోసియేషన్ నిందితుల తరఫున వాదించకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ? ఆరోపణలకు గురైన ట్రస్టు సభ్యులు పట్టణం విడిచి వెళ్లాలని ఎందుకు డిమాండ్ చేసినట్లు ? కొందరు చెబుతున్న ఈ “ చిన్న ” ఉదంతం గురించి సమాధానం లేని “ పెద్ద ” ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.


దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తే అక్రమాలకు తావుండదని అర్ధం కాదు.పాలక మండళ్లు,అధికారులను ప్రశ్నించటానికి అవకాశం ఉంటుంది. సరైన సమాధానం చెబుతారా లేదా అన్నది పక్కన పెడితే కనీసం సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. అదే ప్రైవేటు ట్రస్టులైతే రామాలయం గతే ! కాశీ విశ్వనాధుడి ఆలయంలోని శివలింగం వద్ద 1983 జనవరి ఐదున 2.55కిలోల బంగారం మాయమైంది.దాని దర్యాప్తులో బయటపడిన లోపాల తరువాత మహంతుల(పూజారుల) అదుపు నుంచి తప్పించేందుకు కాశీ విశ్వనాధ ఆలయ చట్టం 1983చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ట్రస్టుకు అప్పగించారు. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆలయంలో చోరీ వార్తలు వెలువడగానే వారణాసిలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆయోధ్యలో అలాంటిదేమీ కనిపించటం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది బిజెపి గనుక, వీధుల్లోకి వచ్చేవారెవరుంటారు. కాశీ ఆలయచోరీ కేసులో నిందితులకు పదిహేడేళ్ల తరువాత 2000 సెప్టెంబరు ఏడున కోర్టు శిక్షలు విధించింది. గట్టి ఇనుప ఊచల కవచం మధ్య గర్భగుడిలో ఉన్న ఆ బంగారం చోరీ జరిగిన తీరు చూస్తే ఇంటి దొంగలపనే అని విచారణలో తేలింది. కవచ ద్వారాలను తెరిచినట్లు తప్ప పగలగొట్టిన ఆనవాళ్లు లేవు. ఆ సమయంలో గుడిలో ఉన్న ఇద్దరు పూజారులు తాము నిద్రించి ఉన్నట్లు చెప్పారు. పూజారుల ఏలుబడిలో గుడిలో నగదు,ఆస్తుల వివరాలు సక్రమంగా లేవని తేలింది.అంతా అడ్డగోలు వ్యవహారాలు నడిచాయి.ఆలయంపై వారసత్వ అధికారం ఎవరిదన్న కీచులాటలు కోర్టుకు ఎక్కగా వివాదం తేలేంతవరకు రోజువారీ రాబడిని కేసుల్లో ఉన్న పూజారులకు సమంగా పంచాలని 1950 దశకంలో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది.1983 చోరీతో పూజారుల హక్కులకు తెరపడింది.నాలుగు వందల సంవత్సరాల పాటు ఒక పూజారి కుటుంబం ఆలయాన్ని ఏలింది.వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుడు ప్రారంభించినట్లు చెబుతున్న వారసత్వ అర్చకత్వానికి లేదా మిరాసీదార్ల వ్యవస్థకు 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్థిపలికింది. లడ్డూ కల్తీ అంశం వెలుగులోకి వచ్చిన తరువాత కొందరు దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అయోధ్యలో జరిగిందాన్ని సమర్ధించుకొనేందుకు కాషాయ గుంపు నానా పాట్లు పడుతోంది.


నాలుగుదశాబ్దాలకు పైగా రామాలయం చుట్టూ రాజకీయాలను తిప్పి లబ్దిపొందిన కాషాయ దళాలకు తొలిసారిగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచిన ఉదంతం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియని స్థితి. రాముడిని, రామాలయాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు కానుకల కుంభకోణం నుంచి పెద్దగా లబ్దిపొందలేవని కొందరు వెంటనే ముక్తాయింపులు ఇవ్వటం ప్రారంభించారు.రామాలయ ఆందోళన ప్రారంభించిన వెంటనే బిజెపికి లబ్ది చేకూరలేదు. అదే విధంగా తమ మనోభావాలను బిజెపి పెద్దలు ఎలా దెబ్బతీశారో గ్రహించటానికి కూడా జనానికి సమయం పడుతుంది. దానికి నాంది పడింది.రాముడిని వీధుల్లోకి లాగింది మతవాదులు. వారి ప్రభావానికి లోనైన జనాన్ని దాన్నుంచి బయటపడవేసేందుకు ఎవరు ప్రయత్నించాలి ? మరింత మÖఢత్వంవైపు నెట్టేందుకు కాషాయ దళాలు చూస్తాయి.మతోన్మాద శక్తులు పెరగటానికి లౌకిక శక్తులే అవకాశం ఇచ్చాయంటూ కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారు.కొందరు నిజమే అనుకుంటున్నారు, ఇది ఆత్మన్యూనత తప్ప మరొకటి కాదు. దాని వలన ఉపయోగం లేదు. ప్రపంచంలో మత,వేర్పాటువాద, జాత్యహంకార, మితవాద శక్తులు పెరగటానికి అనువైన పరిస్థితులు ఉన్న కారణంగానే అవి రెచ్చిపోతున్నాయని గ్రహించటం అవసరం. రాముడు(అయోధ్య), కృష్ణుడు(మధుర),శివుడి(వారణాసి) ఆలయాల పేరుతో ప్రారంభించిన క్రీడను దాన్ని వ్యతిరేకించే శక్తులందరూ ముల్లును ముల్లుతోనే తీసినట్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కేరళ, తమిళనాడు వంటి చోట్ల కులవివక్షకు వ్యతిరేకంగా దేవాలయ ప్రవేశ ఉద్యమం ముందుకు వచ్చింది.దాని అర్ధం దానిలో పొల్గ్గొన్నవారు మతవాదులు కాదు, వివక్షను వ్యతిరేకించటం అసలు విషయం. ఆ ఉద్యమంలో ఉన్న ఏకె గోపాలన్ వంటి వారు ఎందరో తరువాత కమÖ్యనిస్టునేతలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో కులవివక్ష వ్యతిరేకపోరాట సంఘం నాయకత్వంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని సాగించిన యాంత్రల్లో సిపిఐ(ఎం) నేతలు పాల్గ్గొన్నారు. దీని అర్ధం మతపరమైన భావాలను ప్రోత్సహిస్తున్నట్లు కాదు. బిజెపి దేవుళ్లతో రాజకీయం చేసి లబ్ది పొందినట్లు భావించిన పవన్ కల్యాణ్ సనాతనవాది అవతారమెత్తి లబ్దిపొందేందుకు చూస్తున్నారు.తిరుమల లడ్డూ కల్తీ గురించి వెల్లడించటం ద్వారా తానే పెద్ద హిందూత్వవాదినని జనం ముందుకు వచ్చేందుకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం ఏమిటో తెలిసిందే.సున్నిత మనోభావాలతో కూడు కున్న అంశాల పట్ల మొరటుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు.అలా ప్రయత్నించిన కొందరు నాస్తికులు, హేతువాదులు, ఇతరులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో చూస్తున్నాము. ఏ ఇతిహాసాలు, పురాణాల నుంచి తిరోగమన భావాలను ముందుకు తెస్తున్నారో, వాటి నుంచే ఎదుర్కొనే ఆయుధాలను వెలికి తీయాల్సిన తరుణమిది.హిందూత్వ భావజాలం ఒక్క రోజులో ఎలా పెరగలేదో దాన్ని ఎదుర్కొనే భావాలు జనంలోకి వెళ్లటానికి సమయం పడుతుంది.మొక్కనాటగానే కాయలు కాయవు.


సుప్రీం కోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుతో బాబరీ మసీదు భూమి రామాలయానికి వచ్చింది.రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. అప్పటి నుంచి నరేంద్రమోడీ పురాతన “ పూజారి మహరాజు ” అవతారమెత్తి గత లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించుకొనేందుకు చూసినా భంగపడ్డారు. సంపూర్ణ మెజారిటీకి అవసరమైన సీట్లను బిజెపికి సంపాదించలేకపోయారు. చివరకు సదరు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఓడింది. వారణాసిలో మోడీ మెజారిటీ గణనీయంగా తగ్గింది.ఎవరెన్ని చెప్పినా అయోధ్య ఆలయ నిధులు, ఆభరణాల కుంభకోణం గురించి నోరు విప్పాల్సిన బాధ్యత మోడీ మీద ఉంది.తాను తినను ఇతరులను తిననివ్వను, చౌకీదారునని చెప్పిన పెద్ద మనిషి నోరు విప్పకపోతే ఎలా ! తిరుమల తిరుపతి అనుభవాన్ని చూసిన తరువాత ప్రముఖ దేవాలయాలన్నింటినీ లాభార్జనకోసం మతపరమైన విహార యాత్రల కేంద్రాలుగా(అఫ్ కోర్సు హిందూత్వశక్తులు తాము వ్యతిరేకించే మక్కా, మదీనా, జెరూసలెంలను చూసి కూడా స్ఫూర్తి పొందారు) మార్చాలని చూస్తున్నారు.అయోధ్యలో అవినీతి గురించి ఆరోపణలు రావటం ఇదే ప్రధమం కాదు, గతంలో అయోధ్య వివాదంలో అసలు పిటీషన్‌దార్లలో ఒకటైన నిర్మోహి అఖారా అనేక ఆరోపణలు చేసింది. రామాలయం పేరుతో దేశంలో, విదేశాల నుంచి విశ్వహిందూపరిషత్ వసూలు చేసిన నిధుల్లో పద్నాలుగు వందల కోట్లకు పైగా దుర్వినియోగం, స్వాహా చేసిందని మహంత్ సీతారామ్ ఆరోపించారు. తాజాగా రామాలయం కోసం రెండు కోట్లతో భూమి కొని దానికి రు.18.5 కోట్లు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని మÖసిపెట్టిన ఆరఎసఎస్`బిజెపికి ఇప్పుడు అది సాధ్యం కాదు. ఇంతకాలం కాషాయ దళాలు తప్పుడు ప్రచారం, అవాస్తవాలను ప్రచారం చేశాయి. ఇప్పుడు వాటిని వ్యతిరేకించే వారు అసలు విషయాలను జనంలోకి తీసుకుపోవాలి.నిజాలు నిలకడ మీద బుర్రల్లోకి ఎక్కుతాయి ! తొందరేమీ లేదు !!

మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో ఏం జరుగుతోంది ? రోజువారీ పరిణామాలను చూస్తే సామాన్యులకు అనేక విషయాలు అంతుపట్టటం లేదంటే అతిశయోక్తి కాదు.ఫిబ్రవరి 28న అమెరికా‘ఇజ్రాయెల్ జరిపిన ఏకపక్ష దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేని మరణించారు. తరువాత దాడులు కొనసాగిన కారణంగా అంత్యక్రియలను వాయిదా వేసి జూలై నాలుగు నుంచి తొమ్మిదవ తేదీ మధ్య పూర్తి చేశారు. రెండు కోట్ల మంది పౌరులు ఈ క్రతువులో పాల్గొన్నారు. ఇరాన్ బలప్రదర్శనగా దీన్ని టైమ్ పత్రిక వర్ణించింది. అంత్యక్రియల్లో వందకుపైగా దేశాల నేతలు, ఉన్నతస్థాయి ప్రతినిధి వర్గాలు పాల్గ్గొంటున్నట్లు వార్తలు.ఖమేని అంత్యక్రియల్లో పాల్గ్గొనేదేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా బెదిరించటంతో 13దేశాలు వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు.తొలుత సంతాపం కూడా ప్రకటించటానికి తటపటాయించిన మనదేశం తరఫున విదేశాంగశాఖ ఉపమంత్రి పవిత్ర మార్గరిటా నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం హాజరైంది. ఖమేనీ మరణానికి అధికారికంగా సంతాపం తెలిపితే ఎక్కడ అమెరికాకు కోపం వస్తుందో అని తటపటాయించిన మన కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల తరువాత సంతాప ప్రకటన చేసింది తప్ప అమెరికా చేసిన హత్యను ఇంతవరకు ఖండించలేదు. ఇరాన్ నేతలు, మిలిటరీ అధికారులు అందరూ ఒకేచోట దొరికినా తాము వారిని మట్టుబెట్టేందుకు పూనుకోలేదంటూ డోనాల్డ్ ట్రంప్ పిచ్చివాగుడుతో మరోసారి అమెరికా పరువు తీశాడు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మాట్లాడిన ట్రంప్ దేశానికి అతిపెద్ద ముప్పు కమÖ్యనిజం అని చెప్పాడు. ఇలాంటి వారందరినీ చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది. ఇండో‘పసిఫిక్ ప్రాంతం నిబంధనల ప్రాతిపదికన స్వేచ్చగా ఉండాలంటూ జపాన్ ప్రధాని సానే తకాచీతో కలసి ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.తన మిలిటరీ వ్యూహంలో భాగంగా మన భుజం మీద తుపాకిపెట్టి చైనాను కాల్చాలనుకున్నది అమెరికా .1947లో ప్రారంభించిన అమెరికా పసిఫిక్ కమండ్ పేరును 2018లో ట్రంప్ నాయకత్వంలో యంత్రాంగం అమెరికన్ ఇండోపసిఫిక్ కమాండ్‌గా మార్చింది. ఇపుడు అదే ట్రంప్ జూన్ నెలలో మనదేశం పేరును తొలగించి పాతపేరును పునరుద్దరించాడు.మన చిత్రపటాన్ని మార్చి ఆక్రమిత్ కాశ్మీరును పాక్ ప్రాంతంగా దానిలో ముద్రించాడు.ఏ రెండు దేశాలైనా జతకట్టవచ్చని అది మÖడో దేశానికి వ్యతిరేకంగా ఉండకూడదని మోడీతకాచీ భేటీ గురించి చైనా ప్రకటించింది. ఆ తరువాత తమకు వ్యతిరేకంగా ఎవరైనా పిచ్చివేషాలు వేస్తే సంగతి తేలుస్తామనే హెచ్చరికగా జూలై ఆరవ తేదీన చైనా జలాంతర్గామి నుంచి అణుక్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది.మార్చి నెల ఒకటవ తేదీ నుంచి మీడియాలో పశ్చిమాసియా సంక్షోభానికి పెద్ద పీటవేసి ఉక్రెయిన్ పరిణామాలను దాదాపుగా విస్మరించారు. తిరిగి ఈ వారంలో ఆ వార్తలు చోటు చేసుకున్నాయి. తాము నిర్దేశించిన మార్గానికి బదులు వేరుగా ప్రయాణించిన మÖడు నౌకలపై హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేయటంతో బుధవారం నుంచి తిరిగి అమెరికాఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఒప్పందం రద్దయిందని చెప్పిన ట్రంప్ సాంకేతిక చర్చలు కొనసాగుతాయంటూ మరోముక్తాయింపు ఇచ్చాడు. తిరిగి చర్చలంటూ వార్తలు. నవంబరు మÖడున జరిగే అమెరికా మధ్యంతర పార్లమెంటరీ ఎన్నికల వరకు ఇలాగే అమెరికా ఉల్లంఘనలు, ఇరాన్ ప్రతిస్పందనలతో గడిచే అవకాశం కనిపిస్తోంది.టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో వార్షిక సమావేశం వచ్చే ఏడాది సమావేశం గురించి ఎటూ తేల్చుకోకుండానే ముగిసింది. ఇది ఒక పెద్ద వైఫల్యం. ఇలా అనేక పరిణామాలు జరిగినప్పటికీ స్థలాభావం రీత్యా కొన్నింటిని మాత్రమే ఈ సందర్భంగా చూద్దాం.


గ్లోబల్ ఫైర్ పవర్ 2026 సూచిక ప్రకారం పది అగ్రశ్రేణి దేశాల్లో 0. 0741 (897)పాయింట్లతో అమెరికా ముందుండగా రష్యా 0.0791(964), చైనా 0.919(988), భారత్ 0.1346(1461), ఐదవ స్థానంలో 0.1642(2198)లో దక్షిణ కొరియా ఉంది. బ్రాకెట్లలో ఉన్న అంకెలు 2016నాటివి, ఆ ఏడాది పదవ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా తాజాగా ఐదుకు ఎగబాకింది గత విశ్లేషణల్లో చెప్పినట్లుగా ఇరాన్‌పై అమెరికా దాడి ప్రపంచంలో నూతన పరిణామాలకు నాంది పలికింది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్నుంచి చమురు కొనుగోలును చైనా నిలిపివేయలేదు. అనేక విధాలుగా ఆదుకుంది. ఈ పూర్వరంగంలోనే అనేక దేశాలు ఇప్పుడు విశ్వసనీయమైన దేశం ఏది అంటే అమెరికా బదులు చైనాను ఎంచుకుంటున్నాయి. కమÖ్యనిస్టు, బీజింగ్ వ్యతిరేకులకు ఇది మింగుడుపడని వ్యవహారం గనుక ఈ పరిణామాన్ని గుర్తించనట్లే వ్యవహరిస్తారు. గల్ఫ్‌లోని తన స్థావరాలనే దాడుల నుంచి కాపాడుకోలేని అమెరికా ఎంతో శక్తివంతమైన చైనా ఒక వేళ బలవంతంగా తైవాన్ విలీనానికి పాల్పడితే పరిస్థితి ఏమిటని అక్కడి వేర్పాటు వాదుల్లో ఆందోళన మొదలైంది.పెంటగాన్ తిరుగులేనిదని ఇప్పటి వరకు కన్న కలలు అమెరికా పరిమితులను వాస్తవంలోకి తెచ్చాయి.ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుందని కాదు గానీ ఒకవేళ జరిగితే చైనాను నివారించే సత్తా ఉందా అన్న ఆలోచనలో పడ్డారు. అమెరికా రక్షణపై ఆధారపడిన గల్ఫ్ దేశాలు ఇటీవలి పరిణామాల తరువాత దానితో సంబంధాల గురించి వెంటనే బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ పునరాలోచనలో పడ్డాయి. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలోని అమెరికా మిలిటరీ స్థావరాల గురించి చైనా, రష్యాలు అందించిన నిర్దిష్ట సమాచారం కారణంగానే ఇరాన్ వాటి మీద చావుదెబ్బతీసిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. ఈ పరిణామాన్ని అమెరికా ఊహించలేదు. ఇదే విధంగా అమెరికా కనుసన్నలలో నడిచే నాటో కూటమిలోని ఐరోపా దేశాల పరిస్థితీ అదే. తమ రక్షణకు తామే ఆయుధాలు కొనుగోలు చేసి ఏర్పాట్లు చేసుకుంటున్నపుడు అమెరికా పెత్తనం ఏమిటన్నది గతంలోనే కొందరు నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు మరింతగా మధనం జరగనుంది.

పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో అనే పదాన్ని చేర్చటంతొలగించటం ఒక సాధారణ వ్యవహారం కాదు. పేరు మార్పు చారిత్రాత్మక గుర్తింపును పునరుద్దరించటం తప్ప వేరు కాదని అమెరికా బుకాయిస్తున్నది.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచించనవసరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పియÖష్ గోయల్ వ్యాఖ్యానించారు.అసలు విషయం ఏమంటే చైనాకు వ్యతిరేకంగా మనదేశాన్ని నిలిపేందుకు 2018లో అమెరికా వేసిన బిస్కెట్ ఇండో అనే పదాన్ని చేర్చటం. గత ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన పరిణామాల్లో ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించిన అమెరికా కుంటిసాకుతో ఆ పేరును తొలగించింది.ఒక విధంగా ఇది మనలను బెదిరించటమే. మనదేశ పాలకవర్గానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సీతగీత దాటితే ఏమైందో తెలుసుగనుక చైనా వ్యవహారంలో కూడా అదే మాదిరి ప్రస్తుతం పరిధి దాటేందుకు సిద్దం కాదు. తరువాత ఎలా మారేదీ ఊహాజనితమే. అమెరికన్ ఏజన్సీల తప్పుడు సమాచారం, ప్రోత్సాహంతో గాల్వన్ లోయ ఉదంతం జరిగిందన్నది ఒక అభిప్రాయం. ఐదు సంవత్సరాల తరువాత అదే చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవటం వెనుక పాలకవర్గ ప్రయోజనాలు దాగున్నాయి.సైద్దాంతికంగా ఆరఎసఎస్ వైఖరి చైనా, కమÖ్యనిస్టు వ్యతిరేకం అయినప్పటికీ అది కూడా తెగేదాకా లాగకూడదని గ్రహించి పాలకవర్గ వాంఛలను ఆమోదించకతప్పలేదు.ఒక వైపు చైనాను వ్యతిరేకిస్తున్న జపాన్‌తో జట్టుకడుతూనే బీజింగ్ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఇది దేశంలో డ్రాగన్ దేశ వ్యతిరేక శక్తులకు చెంపదెబ్బవంటిది. గతంలో మాదిరి భారత పాలకవర్గం సోషలిస్టువ్యతిరేక శిబిరాల నుంచి లబ్ది పొందేందుకు ప్రయత్నించినట్లే ఇప్పుడు కూడా అదే గేమ్ ఆడుతున్నది.విద్యుత్ రంగంలో చైనాతో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శాశ్వతంగా అనుమతి ఇచ్చినట్లు కాదని పైకి బింకాలు పోతున్నప్పటికీ చైనా పెట్టుబడుల కోసం మనదేశం ఎంతగా తహతహలాడుతున్నది తెలుస్తోంది. గాల్వన్‌లోయ ఉదంతాల సమయంలో చైనా వ్యతిరేక మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు అన్నీ మÖసుకు కూర్చున్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలేవీ కూడా సైద్దాంతికంగా కమÖ్యనిస్టు అనుకూలమైనవి కాదు. కానీ వాటికి చైనా వస్తువులు కావాలి.కార్పొరేట్లకు లాభాలు సంపాదించి పెట్టాలనటంలో ఏకాభిప్రాయం ఉంది.ఈ కారణంగానే చైనా దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం మనదేశం చెబుతున్న లెక్కల ప్రకారం ఇరుదేశాల వాణిజ్యలావాదేవీల విలువ 151 బిలియన్ డాలర్లు కాగా చైనా లెక్కలు 156బి.డాలర్లు అంటున్నాయి. ఇది పెద్ద సమస్య కాదు గానీ చైనాతో మన వాణిజ్యలోటు 112 బిలియన్ డాలర్లు దాటింది, ఇదొక రికార్డు. మన మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత నినాదాలు, ఆచరణ వైఫల్యానికి ఇది నిదర్శనం.


కమÖ్యనిస్టు చైనా విషయంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు కారణంగానే పసిఫిక్ కమాండ్ పేరు మార్చారన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత పసిఫిక్ ప్రాంతంపై అదుపుకోసం కమÖ్యనిస్టు చైనా ఆవిర్భవించక ముందే 1947 జనవరి ఒకటిన అమెరికా కమాండ్ ఏర్పడింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి మనదేశ పశ్చిమ(అరేబియా) తీరం వరకు మిలిటరీతో సహా అనేక కార్యకలాపాల నిర్వహణ దాని లక్ష్యం.కొరియా, వియత్నాంపై దాడులు, ఇతర అనేక దేశాల్లో జోక్యం ఈ కమాండ్ పుణ్యమే. ఎనిమిది సంవత్సరాల క్రితం పేరు మార్చేందుకు సందర్భమేమీ లేనట్లే ఇప్పుడు పూర్వపు నామాన్ని తెరమీదకు తెచ్చేందుకూ సరైన కారణమేమీ లేదు. అమెరికా తన ప్రయోజనానికి ఏది మంచిదనుకుంటే అదే చేస్తుంది.మన దేశ పటాన్ని పాకిస్తాన్‌కు అనుకూలంగా మార్చినా అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే మన పాలకులకు చీమకుట్టినట్లు లేదు. జై భజరంగభళీ అంటూ చైనా, పాకిస్తాన్‌ల మీద వీధుల్లో వీరంగం వేసేవారెవరూ కిక్కురు మనలేదు. లెటర్‌హెడ్ మీద పేరు మార్చినంత మాత్రాన అంతా మారిపోయినట్లు కాదని అమెరికా రాయబారి వ్యాఖ్యానించాడు. అమెరికా మిలిటరీతో మన బంధం పూర్తి అయింది గనుక దాన్నుంచి బయటపడలేని స్థితి ఏర్పడిందని భావించిన తరువాత అమెరికా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది.చిత్రం ఏమిటంటే ఇప్పుడు లేని ఇండో`పసిఫిక్ కమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నట్లు మనదేశం, జపాన్ చెబుతున్నాయి.జపాన్ అంటే అమెరికా తొత్తు గనుక అదేమైనా చెప్పుకోవచ్చు, మనం కూడా అంతేనా !


రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ చేతులెత్తేసిన తరువాత అమెరికా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయపెట్టింది. దాంతో నాటి సోవియట్ యÖనియన్,బ్రిటన్,ఫ్రాన్సు,చైనా, పాకిస్తాన్,మనదేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయాల్సి వచ్చింది.ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నట్లు చెబుతున్నారు.అణ్వాయుధాలేగాక ఆధునిక క్షిపణులతో అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. తద్వారా ఆయుధపోటీకి తెరలేపింది. ఆ క్రమంలో ప్రతిదేశం తన రక్షణ కోసం ఆయుధాలను తయారు చేసుకోక తప్పటం లేదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తాను అణ్వాయుధ క్షిపణి ప్రయోగం జరపనున్నట్లు అనేక దేశాలకు ముందుగానే సమయం, నిర్దేశిత లక్ష్యం గురించి చైనా తెలియచేసింది.సోమవారం నాడు మధ్యాహ్నం 12.01నిమిషాలకు అణునియంత్రిత జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం జరపగా 59 నిమిషాల్లో జయప్రదంగా ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. పసిఫిక్ సముద్రంలో నిజమైన బాంబులకు బదులు డమ్మీలతో ఆ ప్రయోగం జరిగింది. ఇలాంటి ప్రయోగాలు జరిపిన దేశాలలో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు మనది కూడా ఒకటి.వార్షిక మిలిటరీ శిక్షణలో భాగంగా తామీ పరీక్ష జరిపినట్లు చైనా చెప్పినప్పటికీ జపాన్ వంటి దేశాలు భిన్నంగా స్పందించాయి. జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా ప్రజాయుద్ధ ప్రతిఘటన 80వ వార్షికోత్సవం సందర్భంగా జులాంగ్(జెఎల్) జలాంతర్గామి ప్రయోగించిన క్షిపణిని చైనా తొలిసారిగా 2025 సెప్టెంబరు 3న ప్రదర్శించింది. ఎనిమిది నుంచి పదివేల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత ýక్ష్యాన్ని ఛేదించగల ఈ ఖండాంతర క్షిపణిని ఇప్పుడు పరీక్షించింది. గత రెండు సంవత్సరాలలో ఇలాంటి ప్రయోగాలు చేయటం రెండవసారి. సోవియట్, తరువాత రష్యా వద్ద కూడా ఇలాంటి అధునాతన వ్యూహాత్మక క్షిపణులు ఉన్న కారణంగానే అమెరికా అదుపులో ఉంది.ఇప్పుడు రష్యాకు చైనా కూడా తోడైంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్షిపణులను ప్రయోగించే జలాంతర్గాములు అమెరికా 14, రష్యా 13, చైనా 6, ఫ్రాన్సు 4, బ్రిటన్ 4, మనదేశం వద్ద మÖడు ఉన్నాయి. అన్ని దేశాలూ కొత్తగా మరికొన్నింటిని నిర్మించేక్రమంలో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆత్మరక్షణకు తప్ప ఎదుటి దేశాలపై దాడులు చేసేందుకు అవసరమైన మిలిటరీని కలిగి ఉండకూడదని ఆమోదించిన రాజ్యాంగాన్ని ఇప్పుడు జపాన్ మార్చుకొని తిరిగి ఆసియాలో ఒక సైనిక శక్తిగా మారేందుకు చూస్తున్నది. అలాంటి దేశంతో మనం చేతులు కలిపి చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటాన్ని గమనించాలి.ఈ పరిణామాలను చూస్తున్నపుడు అటు చైనా, ఇటు దాని వ్యతిరేక కూటమి దేశాలనూ సంతుష్టీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తున్నది !

కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Tags

, , , , ,


డాక్టర్ కొల్లా రాజమోహన్



భారతదేశానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సహజ వనరులలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, ముఖ్యంగా కృష్ణా-గోదావరి (KG) బేసిన్ అత్యంత కీలకమైనవి. దేశ ఇంధన భద్రతలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇటీవల కాలంలో ఈ ప్రజా సంపదను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అడ్డగోలుగా ధారాదత్తం చేయడానికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను, పర్యావరణాన్ని విస్మరించి కేవలం రిలయన్స్, వేదాంత వంటి ప్రైవేటు సంస్థల లాభార్జనే ధ్యేయంగా చట్టాలను సవరించడం దేశీయ ఆర్థిక సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టుగా మారింది.  

1. ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024: కార్పొరేట్ అనుకూల చట్టం

దేశీయ చమురు, గ్యాస్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ది ఆయిల్ ఫీల్డ్స్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) సవరణ బిల్లు, 2024’ను తీసుకువచ్చింది. ఈ బిల్లు 2024 డిసెంబరు 3న రాజ్యసభలోనూ, 2025 మార్చి 12న లోక్‌సభలోనూ ఆమోదించబడింది. ఈ చట్టం పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు సాగిలపడే విధంగా రూపొందించబడింది.  

 క్రిమినల్ శిక్షల రద్దు – నేరరహితీకరణ (Ease of Doing Business): 1948 నాటి పాత చట్టం ప్రకారం, పర్యావరణానికి ముప్పు తెచ్చినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా నిందితులకు 6 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధనలు ఉండేవి. తప్పు చేసిన వారు సమాజంలో తలదించుకునేలా, భయం కలిగి ఉండేలా ఆ శిక్షలు ఉండేవి. కానీ, ప్రస్తుత సవరణ బిల్లు వ్యాపార వాతావరణాన్ని సులభతరం చేయడం (Ease of Doing Business) అనే పేరుతో జైలు శిక్షను పూర్తిగా రద్దు చేసింది. దీని స్థానంలో కేవలం ₹25 లక్షల జరిమానాను ప్రవేశపెట్టింది. వందల, వేల కోట్లు అక్రమంగా సంపాదించే కార్పొరేట్ శక్తులకు ఈ ₹25 లక్షల జరిమానా అత్యంత స్వల్పమైన మొత్తం. డబ్బుతో శిక్షను కొనుక్కునేందుకు, ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వమే ఈ చట్టం ద్వారా దారి చూపిస్తోంది.  

 ప్రభుత్వ మౌలిక సదుపాయాల లూటీ (Infrastructure Sharing): ఈ బిల్లు ప్రకారం, మన దేశ అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ONGC దశాబ్దాలుగా ఎంతో కష్టపడి, భారీ పెట్టుబడులతో ఏర్పాటు చేసుకున్న రిగ్గులు, పైప్‌లైన్లు, ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ సౌకర్యాలను ప్రైవేటు ఆపరేటర్లు చట్టబద్ధంగా ఉచితంగా వాడుకోవచ్చు. ఇది ప్రైవేట్ సంస్థల పెట్టుబడి, నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. అంటే, కష్టమంతా ప్రభుత్వ సంస్థది, లాభమంతా ప్రైవేట్ కంపెనీలది అన్నట్లుగా ఈ విధానం ఉంది.  

2. కృష్ణా జిల్లా కాజా బ్లాక్ వ్యవహారం – వేదాంతకు అయాచిత లబ్ధి

కృష్ణా జిల్లాలోని పామర్రు, కాజా బ్లాక్ పరిధిలో ONGC సంస్థ తన సొంత ఖర్చుతో విస్తృతంగా అన్వేషణ జరిపి, భారీగా హైడ్రోకార్బన్ నిల్వలను గుర్తించింది. ఆన్-షోర్‌లో 115 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ విలువైన బ్లాక్‌ను వెలికితీసేందుకు, ప్రభుత్వం ONGCని కాదని వేదాంత కంపెనీకి అనుమతులు మంజూరు చేసింది.  

₹650 కోట్ల పెట్టుబడితో 30,000 బారల్స్ క్రూడ్ ఆయిల్, 30 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తామని వేదాంత చెబుతోంది. ఒకవేళ అక్కడ చమురు దొరకకపోతే ఆ నష్టాన్ని భరించేది ONGC, కానీ నిక్షేపాలు దొరికిన తర్వాత అయాచితంగా లాభాలు పొందేది మాత్రం వేదాంత. దీనినే “ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్” (లాభాలు ప్రైవేటుకు, నష్టాలు జాతీయీకరణకు) అంటారు.  

3. స్థానిక ప్రజలకు, పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు

ఈ సవరణ బిల్లు మరియు ప్రైవేట్ సంస్థల ప్రవేశం వల్ల ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి, స్థానిక ప్రజల జీవనోపాధికి తీవ్రమైన నష్టం వాటిల్లనుంది:

 పర్యావరణ క్షీణత మరియు ఫ్రాకింగ్ (Fracking): ఈ బిల్లు ద్వారా సాంప్రదాయ గ్యాస్, ఆయిల్‌తో పాటు ‘షేల్ గ్యాస్’ (Shale Gas) వెలికితీతను సులభతరం చేశారు. షేల్ గ్యాస్ తీయడానికి వాడే ‘ఫ్రాకింగ్’ పద్ధతి వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతాయి, అంతేకాక భూమి కంపించే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఒకే అనుమతి (Single-Window) విధానం ద్వారా పర్యావరణ అనుమతులు వేగంగా ఇవ్వడం వల్ల పర్యావరణ రక్షణకు ఎటువంటి గ్యారంటీ లేకుండా పోయింది.  

 జీవనోపాధి దెబ్బతినడం: కాజా, కేజీ బేసిన్ లాంటి తీర ప్రాంతాలలో పైప్‌లైన్లు వేయడం, రిగ్గులు పెట్టడం వల్ల స్థానిక మత్స్యకారుల వేట దెబ్బతింటుంది. అలాగే బందరు కాలువ ద్వారా పొలాలకు నీరు పెట్టుకుంటున్న వ్యవసాయ భూములు కలుషితమై రైతులు తీవ్రంగా నష్టపోతారు.  

 వేదాంత కంపెనీ వివాదాల చరిత్ర: వేదాంత సంస్థకు పర్యావరణ విధ్వంసం చేసిన నల్లని చరిత్ర ఉంది. తమిళనాడు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ కాలుష్యానికి వ్యతిరేకంగా 2018లో స్థానికులు నిరసన చేసినప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించారు. ఒడిశాలోని నియంగిరి కొండల్లో బాక్సైట్ తవ్వకాల కోసం గిరిజనుల హక్కులను కాలరాచినందుకు 2013లో సుప్రీమ్ కోర్ట్ అక్కడ మైనింగ్‌ను నిషేధించింది. ఒడిశా ఝార్సుగూడ ప్లాంట్ టాక్సిక్ వ్యర్థాలు పొలాల్లోకి వదలడం, సెబీ (SEBI) చేత షేర్ల అవకతవకలపై నిషేధానికి గురికావడం, జంబియా దేశంలో పన్ను ఎగవేత, పర్యావరణ నష్టం కారణంగా గనుల జప్తును ఎదుర్కోవడం వంటి ఎన్నో వివాదాలు వేదాంత చుట్టూ ఉన్నాయి. అటువంటి సంస్థకు మన బందరు కాలువ, కాజా ప్రాంత పర్యావరణాన్ని అప్పగించడం అత్యంత ప్రమాదకరం.  

4. నార్వే దేశ నమూనా – మనకెందుకు సాధ్యం కాదు?

ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలలో ఒకటైన నార్వేలో సహజ వనరులు ప్రజల ఉమ్మడి ఆస్తిగా ఉన్నాయి. అక్కడ చమురు, గ్యాస్ ద్వారా వచ్చే లాభాలను ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా ప్రభుత్వ ఆధీనంలోని సార్వభౌమ నిధిలో జమ చేసి, ప్రజల ఉచిత విద్య, వైద్యం, సామాజిక భద్రతకు వాడుతున్నారు.

కానీ మన దేశంలో రిలయన్స్ వంటి కంపెనీలు కేజీ బేసిన్ లోని వనరులను వెలికితీసి ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాయి. రష్యా నుండి చౌకగా చమురు దిగుమతి చేసుకుని యూరప్‌కు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్న రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలకు మాత్రం గ్యాస్ కేటాయించడం లేదు. డబ్బులు తీసుకుని కూడా ఇవ్వకుండా, ఇక్కడి గ్యాస్‌ను 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు.  

5. న్యాయవ్యవస్థ నిర్వీర్యం – వివాదాల పరిష్కారం

ఈ కొత్త బిల్లు ప్రకారం వివాదాల పరిష్కారానికి కోర్టులకు ఎటువంటి అధికారమూ లేదు. కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ లేదా అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ఒక అధికారి మాత్రమే వివాదాలను పరిష్కరిస్తారు. అవినీతి వ్యవస్థలో ఇటువంటి అధికారులు ప్రజానుకూలంగా తీర్పులు ఇస్తారని భావించలేము. గతంలో ONGC వెలికితీసిన గ్యాస్‌ను రిలయన్స్ దొంగతనం చేసి అమ్ముకున్న వ్యవహారంలో ప్రభుత్వం, కోర్టులు ఏమీ చేయలేక చివరకు రాజీ పడమని సలహా ఇవ్వడమే దీనికి నిదర్శనం.  

సహజ వనరులు ప్రజల సొత్తు. ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాలు ఎప్పుడైనా ప్రజల ప్రయోజనాలకు లోబడి ఉన్నప్పుడే సమాజం పురోగమిస్తుంది. విలువైన ప్రజల సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడం వల్ల ప్రజలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోతారు. పాలకవర్గ పార్టీలు ఈ అన్యాయాన్ని విమర్శించకపోవడం శోచనీయం. మన ప్రయోజనాలను, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా చైతన్యవంతులై, కే జీ బేసిన్ గ్యాస్ ఆయిల్ సాధన సమితి వంటి వేదికల ద్వారా ఐక్యంగా, పోరాడవలసిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త: కన్వీనర్, కే జీ బేసిన్ గ్యాస్ ఆయిల్ సాధన సమితి, గుంటూరు.